Top Stories
ప్రధాన వార్తలు
ప్రభుత్వ విద్య మిథ్యే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. సర్కారు పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో ప్రమాణాలు క్షీణించేలా చేసి.. వాటిలో చదువుతున్న పిల్లలను ప్రైవేట్ బాట పట్టించడమే ధ్యేయంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయా ల్సింది పోయి అక్కడ ప్రైవేట్‌కు అవకాశం ఇస్తోంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కొత్తగా దాదాపు 80 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులిచ్చింది. అంతేగాక విద్యను కార్పొరేట్ వ్యాపారం చేసిన నారాయణ విద్యా సంస్థల ప్రతినిధికి తాజాగా ఇంటర్మీడియట్ బోర్డులో స్థానం కల్పించింది. గత ప్రభుత్వంలో మండలానికి రెండు ప్రభుత్వ కాలేజీలు.. వాటిలో ఒకటి బాలికలకు తప్పనిసరి చేస్తూ ఏర్పాటు చేసిన 502 హైస్కూల్ ప్లస్‌లను సైతం రద్దు చేసేందుకు కంకణం కట్టుకుంది. పిల్లల సంఖ్య అధికంగా ఉన్న చోట ప్రభుత్వమే పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. కానీ అందుకు భిన్నంగా 37 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఏకంగా జీవో ఇస్తూ.. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారులకు అప్పగించింది. ‘ప్రభుత్వ విద్య వద్దు.. ప్రైవేటు చదువులే ముద్దు’ అని గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బహిరంగంగానే ప్రకటించారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో సదుపాయాలు ఉండవని, ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవాలని సెలవిచ్చిన ఆయన.. ఇప్పుడూ సీఎంగా అదే పంధాను కొనసాగిస్తున్నారు. మొత్తంగా విద్య రంగం అంతటినీ ప్రయివేట్ చేతుల్లో పెట్టే కుట్రకు ఈ సర్కారు తెర లేపింది. ఇందులో భాగంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ అమలు చేసిన పలు పథకాలు, కార్యక్రమాలను అటకెక్కిస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అన్ని దశల్లో ప్రైవేటుకే ప్రాధాన్యం ⇒ దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇస్తాయి. కేరళ, ఢిల్లీలో అక్కడి ప్రభుత్వాలు అద్భుతమైన ప్రభుత్వ విద్యను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 మే వరకు గత ప్రభుత్వ పాలనలో సర్కారు విద్యకే ప్రాధాన్యం ఇచ్చి పాఠశాల, జూనియర్ విద్యను పటిష్టం చేసింది. ⇒ రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల నిర్వహిచిన కలెక్టర్ల సదస్సులోనూ సీఎం చంద్రబాబు.. ప్రైవేటు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యలో ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలని ప్రకటించారు. ⇒ ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే నారాయణ జూనియర్ కాలేజీకి చెందిన ప్రిన్సిపల్‌ను ఇంటర్ బోర్డులో సభ్యుడిగా నియమించారు. వాస్తవానికి ఈ స్థానాన్ని లాభాపేక్ష లేని ట్రస్ట్ బోర్డు యాజమాన్యాలకు లేదా చిన్న ప్రైవేటు కాలేజీలకు కల్పించాలి. అందుకు విరుద్దంగా విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ సంస్థకు అప్పగించారు. ⇒ ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా దాదాపు 80 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుమతులిచ్చారు. 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 37 మండలాల్లో 47, రెండు మున్సిపాలిటీల్లో 6 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వమే ప్రైవేటు యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇటీవల జీవో 496ను సైతం విడుదల చేసింది. ⇒ ఈ 53 ప్రాంతాల్లో విద్యార్థులున్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసు కాబట్టి, ఆ మేరకు ఇంటర్ కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులివ్వడం విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను విస్తుపోయేలా చేసింది. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో సుమారు 800 జూనియర్ కాలేజీలు ఉంటే.. 2,200 వరకు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో అధికంగా నారాయణ, చైతన్యవే కావడం గమనార్హం. ప్రభుత్వ లెక్చరర్లకు బోధన సామర్థ్యం లేదట! ⇒ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత విద్యా సంవత్సరం అప్పటి ప్రభుత్వం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణను పైలట్‌గా ప్రారంభించింది. ఎంపిక చేసిన కాలేజీల్లో ఆసక్తి ఉన్న సీనియర్ లెక్చరర్లతో ప్రత్యేక తరగతులు నిర్వహించింది. అయితే, ఈ విధానాన్ని మరింత మెరుగ్గా కొనసాగించాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చే సామర్థ్యం ప్రభుత్వ లెక్చరర్లకు లేదని చెప్పి.. నారాయణ విద్యా సంస్థల సిబ్బందితో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ⇒ తొలి దశలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆ నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆయా నగరాలకు ఐదు నుంచి పది కి.మీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను అక్కడకు చేర్చారు. వారికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, శిక్షణ ఇస్తున్నారు. ⇒ ఒక్కో నగరం పరిధిలో నాలుగు నుంచి 10 కళాశాలల వరకు ఉండగా, అన్ని కళాశాలల్లోనూ ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ నిర్వహించి ఒక్కో (ఎంపీసీ, బైపీసీ) గ్రూప్ నుంచి 25 నుంచి 40 మందిని ఎంపిక చేశారు. అంటే ప్రతిభ గల ప్రభుత్వ విద్యార్థులకు మాత్రమే నారాయణ సిబ్బంది శిక్షణ ఇస్తారు. వారు విజయం సాధిస్తే అది నారాయణ విజయంగా జమకట్టి.. మిగిలిన ప్రభుత్వ కాలేజీలను కార్పొరేట్ యాజమాన్యాలకే కట్టబెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక వేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఇదే పంధాను అనుసరించారు. ⇒ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని చెప్పి, వారికి నారాయణ స్కూళ్ల సిబ్బంది శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. నాడు ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వచ్చినా నిర్బంధంగా అమలు చేశారు. ఇప్పుడు జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లను పక్కనబెట్టి.. అదే విధానంలో విద్యార్థులను టార్గెట్ చేయడం గమనార్హం. అధికారంలోకి రాగానే మొదలు.. ⇒ రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది మొదలు విద్య రంగంపై శీతకన్ను వేసింది. గత సర్కారు ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాల్సిందిపోయి.. వాటి పునాదులు పెకిలిస్తూ నీరుగారుస్తోంది. తొలుత ‘అమ్మ ఒడి’ పథకంపై కక్ష కట్టింది. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ‘అమ్మకు వందనం’ కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేతులెత్తేశారు. ఫలితంగా 45 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ⇒ స్కూళ్ల రూపురేఖలు మార్చేసిన నాడు–నేడు పనులను మధ్యలో నిలిపేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం.. జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చి ఏజెన్సీలను రాజకీయ కక్షతో తొలగించారు. గతంలో దాదాపు 95 శాతం మంది పిల్లలు గోరుముద్దను తీసుకోగా ఇప్పుడు నాణ్యత కొరవడటంతో 50 శాతం మంది కూడా తినడం లేదు. రోజుకో మెనూ గాలికి పోయింది. నీళ్ల పప్పు రోజులను మళ్లీ తీసుకొచ్చింది. ⇒ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో మెరుగ్గా రాణించేందుకు గత ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు అందించింది. రూ.1,305.74 కోట్లతో 9,52,925 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ట్యాబ్‌ల మాటే ఎత్తడం లేదు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను నీరుగారుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదవలేకపోతున్నారంటూ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలుగు మీడియంలో రాసేలా నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ బోధనను రద్దు చేసింది. ఆంగ్ల భాషా నైపుణ్యాల కోసం మూడో తరగతి నుంచే ప్రారంభమైన ‘టోఫెల్’ శిక్షణను కూడా రద్దు చేసింది. ⇒ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలన్న వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనపై కూడా చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. విద్యార్థుల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను సైతం పక్కనపెట్టింది. టెన్త్, ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించే కార్యక్రమానికీ తిలోదకాలిచ్చింది. యూనిఫాంతో కూడిన కిట్లు కూడా సరిగా పంపిణీ చేయలేకపోయింది. ⇒ ఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీలతో డిజిటల్ బోధన.. ఇలా ఒక్కోదాన్ని అటకెక్కిస్తూ వస్తోంది. నిర్వహణపై చేతులెత్తేసి తాగునీరు, మరుగుదొడ్ల సమస్యను గతానికి తీసుకెళ్లింది. విద్య దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా పిల్లలను ఉన్నత చదువులకు దూరం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో విద్యా వేత్తలను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇది విద్యా రంగాన్ని ప్రమాదంలోకి నెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా మండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా విచిత్రమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆశ్చర్యకరంగా కార్పొరేట్ విద్యా సంస్థ అయిన నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌ను మండలిలో నామినేటెడ్ సభ్యుడిగా నియమించింది. ప్రభుత్వమే విద్య వ్యాపారీకరణను ప్రోత్సహిస్తుందనేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి అవసరం లేదు. నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి కోట్ల రూపాయల ఫీజులను వసూలు చేస్తూ ఇంటర్ విద్యను భ్రష్టు పట్టించాయి. ఈ సంస్థలు ఏ విషయంలోనూ ప్రభుత్వ నిబంధనలు అమలు చేసింది లేదు. తమ వ్యాపారం కోసం విద్యార్థుల మధ్య మార్కులు, ర్యాంకుల పోటీ పెట్టి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ కాలేజీల్లో చదువులు కేవలం మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల కసరత్తుగా తయారయ్యాయి. దీంతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి విద్యా సంస్థలతో సలహాలు తీసుకొని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలలో విద్యా బోధనను మెరుగు పరుస్తామని ప్రభుత్వం చెప్పడం విద్యా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టడమే అవుతుంది. ఇది విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా కాకుండా, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అని స్పష్టమవుతోంది. - ఇ.మహేష్, ఆలిండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శి
దరఖాస్తుల జోరు.. పరీక్షకు రారు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగానే దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. వందల్లో పోస్టులు ఉంటే లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ పెద్ద సంఖ్యలో అర్హత పరీక్షలకు గైర్హాజరవుతున్నారు. ఏళ్లుగా ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తూ, సన్నద్ధమవుతున్నవారు కూడా ఇందులో ఉంటున్నారు. కనీసం హాల్‌టికెట్లు కూడా డౌన్‌లోడ్ చేసుకోనివారూ ఉన్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పోటీ విపరీతంగా ఉందనే ఆందోళనతో కొందరు పరీక్షలకు దూరమవుతుండగా.. నోటిఫికేషన్ నాటి నుంచి అర్హత పరీక్షలు పూర్తయ్యే నాటికి సుదీర్ఘకాలం పడుతుండటం.. కొన్ని సందర్భాల్లో పరీక్షలు వాయిదా పడుతుండటం.. ఆలోగా దరఖాస్తుదారులు ఏదో ఓ ఉద్యోగంలో చేరి బిజీ అయిపోవడం వంటివి దీనికి కారణంగా నిలుస్తున్నాయి. అత్యంత కీలకమైన కొలువులుగా భావించే గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగాల విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉండటం గమనార్హం. సాగదీతలు.. వాయిదాలతో.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 11 వేల గ్రూప్ ఉద్యోగాల భర్తీ కోసం 2022లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీకాగా.. రెండు సార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించాక ఆ నోటిఫికేషన్ రద్దయింది. దాని స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 563 పోస్టులతో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిని కొనసాగిస్తూనే... కొత్త అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు సాగిన ఈ గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇప్పుడు చివరిదశకు చేరింది. ఇక గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా 2022 డిసెంబర్‌లో వెలువడ్డాయి. గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇటీవలే పూర్తికాగా.. గ్రూప్–2, 3 పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో గ్రూప్–2 అర్హత పరీక్షలు మూడుసార్లు వాయిదా పడగా.. గ్రూప్–3 పరీక్షలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏళ్ల తరబడి సాగుతుండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం తగ్గిపోతుందని.. వాటికోసం వేచి చూసే బదులుగా ప్రత్నామ్నాయ ఉద్యోగాల వైపు చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. హాజరుశాతం.. క్రమంగా పతనం.. గత ఏడాది జూలైలో గ్రూప్–4 పరీక్షలు జరిగాయి. ఒకే రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. హాజరైనవారు సుమారు ఏడున్నర లక్షల మంది మాత్రమే. అంటే 80 శాతం మందే పరీక్షలు రాశారు. ఇక గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరైనవారు 74 శాతమే. ప్రిలిమినరీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిలో నుంచి.. ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున మెయిన్స్‌కు 31,403 మందిని కమిషన్ ఎంపిక చేసింది. బాగా ప్రిపేరైన వారే మెయిన్స్‌కు ఎంపికవుతారు. అలాంటి మెయిన్స్‌కు కూడా 67.17శాతం మందే హాజరవడం గమనార్హం. గ్రూప్–3 పరీక్షలకు కేవలం 50.24 శాతం మంది, గ్రూప్–2 పరీక్షలకు మరీ తక్కువగా 45.57 శాతమే హాజరయ్యారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మారాలి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ఆశాజనకంగా ఉండటం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉంటున్నా క్రమం తప్పకుండా భర్తీ చేయడం లేదు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు నిరాశలో కూరుకుపోతున్నారు. పైగా నోటిఫికేషన్లు జారీ చేశాక పరీక్షల నిర్వహణ, వాయిదాలతో సుదీర్ఘ జాప్యం జరుగుతోంది. దరఖాస్తు చేసినవారు పరీక్షల నాటికి ఇతర ఉద్యోగాల వైపు వెళ్తున్నారు. దీనితో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుండగా.. హాజరు అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తూ.. భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలి. – అబ్దుల్ కరీం, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ కాలయాపన వల్లే ఆసక్తి చూపడం లేదు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర కాలయాపన జరుగుతోంది. గతంలో ప్రైవేటు సెక్టార్‌లో అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకుని సన్నద్ధమయ్యేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక ఉద్యోగం కాకుంటే మరో ఉద్యోగం వైపు పరుగెత్తాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడినప్పుడు వస్తున్న దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే.. పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య భారీగా తగ్గుతోంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ప్రభుత్వ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షల నాటికి వారి లక్ష్యాలు మారిపోతున్నాయి. – భవాని శంకర్ కోడాలి, నిపుణులు, కెరీర్ గైడ్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సందేశం.
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి: బ.అష్టమి సా.5.14 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఉత్తర ఉ.10.03 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: రా.7.21 నుండి 9.05 వరకు, దుర్ముహూర్తం: çప.12.24 నుండి 1.12 వరకు, తదుపరి ప.2.36 నుండి 3.24 వరకు, అమృతఘడియలు: తె.5.51 నుండి 7.36 వరకు (తెల్లవారితే మంగళవారం)సూర్యోదయం : 6.30సూర్యాస్తమయం : 5.27రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం...అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృషభం.....వ్యవహారాలలో ఆటంకాలు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబసమస్యలు. చర్చలలో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. దైవదర్శనాలు.మిథునం..బంధువుల నుంచి ఒత్తిళ్లు. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.కర్కాటకం....నూతనోత్సాహంతో పనులు పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బాకీలు వసూలవుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.సింహం....కుటుంబసమస్యలు. వ్యవహారాలలో అవాంతరాలు. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. విద్యార్థులకు కొద్దిపాటి ఇబ్బందులు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.కన్య....దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. ఆకస్మిక ధనలాభం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.తుల....వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.వృశ్చికం...ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.ధనుస్సు...కొత్త విషయాలు తెలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.మకరం....పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పడ్డా పనులు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.కుంభం..కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.మీనం...కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
భారత్, కువైట్ మధ్య... సుదృఢ బంధం
కువైట్ సిటీ: మిత్రదేశాలైన భారత్, కువైట్ మధ్య బంధం మరింత దృఢపడింది. రెండు దేశాల నడుమ సంబంధాలు కీలక వ్యూహాత్మక భాగస్వా మ్యంగా మారాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కువైట్ సిటీలోని మెజెస్టిక్ బయన్ ప్యాలెస్‌లో కువైట్ రాజు, ప్రధాని షేక్ మెషల్ అల్–అహ్మద్ అల్–జబేర్ అల్–సబాతో సమావేశమయ్యారు. మోదీకి రాజు సాదర స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖరాలకు చేర్చే దిశగా చర్చలు జరిపారు. ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఫిన్‌టెక్, మౌలిక సదుపాయాలు, భద్రత తదితర కీలక రంగాల్లో పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపారు.రెండు దేశాల మధ్య ద్వైపాకిక్ష సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయానికొచ్చారు. కువైట్‌లో నివసిస్తున్న 10 లక్షల మంది భారతీయుల సంక్షేమానికి సహకరిస్తున్నందుకు కువైట్ రాజుకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తమదేశ అభివృద్ధి ప్రయాణంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వెలకట్టలేని సేవలు అందిస్తున్నారని రాజు ప్రశంసించారు. భారత్‌లో పర్యటించాలని కువైట్ రాజును మోదీ ఆహా్వనించారు. షేక్ మెషల్ అల్–అహ్మద్ అల్–జబేర్ అల్–సబాతో అద్భుతమైన భేటీ జరిగిందని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని తెలిపారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లామని ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో భారత్, కువైట్ సంబంధాలు ఉన్నతంగా పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శనివారం కువైట్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.తొలి రోజు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కువైట్‌లోని భారతీయులతో సమావేశమయ్యారు. రెండో రోజు ఆదివారం కువైట్ రాజుతో చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం పర్యటన ముగించుకుని మోదీ భారత్ చేరుకున్నారు. 43 ఏళ్ల తర్వాత కువైట్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని ఆయనే కావడం విశేషం. అవగాహన ఒప్పందాలు ప్రధాని మోదీ, కువైట్ రాజు చర్చల సందర్భంగా భారత్, కువైట్ మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, క్రీడలు, సంస్కృతి, సోలార్ ఎనర్జీ విషయంలో ఒప్పందాలు కుదిరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రక్షణపై కుదిరిన ఒప్పందంలో రక్షణ పరిశ్రమలు, రక్షణ పరికరాల సరఫరా, ఉమ్మడిగా సైనిక విన్యాసాలు, శిక్షణ, నిపుణులు, జవాన్ల మారి్పడి, పరిశోధన–అభివృద్ధిలో పరస్పర సహకారం వంటి అంశాలను చేర్చారు. ప్రస్తుతం కువైట్ నాయకత్వం వహిస్తున్న గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)తో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి భారత్ ఆసక్తి చూపింది.మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం ప్రధాని నరేంద్రమోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్–కబీర్’ లభించింది. కువైట్ రాజు షేక్ మెషల్ అల్–అహ్మద్ అల్–జబేర్ అల్–సబా ఆదివారం ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఇది మోదీకి దక్కిన 20వ అంతర్జాతీయ గౌరవం. స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలు, విదేశీ దౌత్యవేత్తలు, విదేశీ రాజకుటుంబ సభ్యులకు కువైట్ ఇచ్చే అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ అవార్డు. గతంలో బిల్ క్లింటన్, ప్రిన్స్ చార్లెస్, జార్జ్ బుష్ వంటి విదేశీ నేతలు ఈ పురస్కారం అందుకున్నారు.ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొందాం ఉగ్రవాద భూతాన్ని ఉమ్మడి ఎదిరించాలని మోదీ, కువైట్ రాజు నిర్ణయించుకున్నారు. పెనుముప్పుగా ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని తీర్మానించుకున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇరువురు నేతలు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న అంతం చేయాల్సిందేనని తేలి్చచెప్పారు. ఉగ్రమూకలకు ఆర్థిక సాయం అందే మార్గాలను మూసివేయడంతోపాటు ఉగ్రవాదానికి స్వర్గధామంగా మారిన దేశాలపై కఠిన ఆంక్షలు విధిస్తే పరిస్థితిలో కచి్చతంగా మార్పు వస్తుందని మోదీ, కువైట్ రాజు అభిప్రాయపడ్డారు. ఇద్దరు నాయకుల భేటీపై ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదలైంది.
రేపు సూర్యుడి సమీపానికి ‘నాసా’ పార్కర్
న్యూయార్క్: సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌గా ‘నాసా’ పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు సృష్టించబోతోంది. సూర్యగోళంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 2018లో అంతరిక్ష నౌకను ప్రయోగించింది. అప్పటినుంచి సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తూనే ఉంది. మంగళవారం ఇది లోకబాంధవుడికి అత్యంత సమీపంలోకి వెళ్లనుంది. అంటే భాస్కరుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్ల(6 మిలియన్ కిలోమీటర్లు) దూరానికి చేరుకుంటుంది. ఒక ఫుట్‌బాల్ మైదానాన్ని ఊహించుకుంటే ఒకవైపు సూర్యుడు, మరోవైపు భూమి ఉంటాయని, 4–యార్డ్ లైన్ వద్ద పార్కర్ ఉంటుందని నాసా సైంటిస్టు జో వెస్ట్‌లేక్ చెప్పారు.సూర్య భగవానుడికి ఇంత సమీపంలోకి వెళ్లిన అంతరిక్ష నౌక ఇప్పటిదాకా ఏదీ లేదు. సూర్యుడికి దగ్గరిగా వెళ్లిన తర్వాత పార్కర్ నుంచి సమాచారం నిలిచిపోనుంది. అప్పుడు దాని పరిస్థితి ఏమటన్నది అంచనా వేయలేకపోతున్నారు. క్షేమంగా వెనక్కి వస్తుందా? లేక ఏదైనా జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో పార్కర్ అత్యంత వేగవంతమైనది. ఇది గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణానికి దెబ్బతినకుండా బలమైన హీట్ షీల్డ్ అమర్చారు. ఇది 1,371 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు. సూర్యుడికి దగ్గరగా వెళ్లిన తర్వాత వచ్చే ఏడాది సెపె్టంబర్ దాకా అదే కక్ష్యలోకి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యుడి ఉపరితలం కంటే కరోనా ఎందుకు వందల రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుందన్న సంగతి తెలుసుకోవడానికి పార్కర్ తగిన సమాచారం ఇస్తుందని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు.
అమరావతి పేరుతో మళ్లీ అదే తప్పు
కడప సెవెన్‌రోడ్స్: ‘నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో తెలంగాణ విడిపోయినప్పుడు రాజధానిని కోల్పోవాల్సి వచి్చంది. ఆ తర్వాత అమరావతిలోనే రాజధాని ఉండాలనే ఆ ప్రాంత వాసుల ఆకాంక్షల మేరకే చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేశారు. అయితే అమరావతిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడమంటే తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్లీ చేయడం. అభివృద్ధి అంతా ఒకేచోట పోగు వేయడం సరైంది కాదు. అభివృద్ధి కేంద్రీకరణ విషయంలో గతంలో ఉన్న న్యాయ భావన ఇప్పుడు లేదు. నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక ఆ భావనకు తావు లేకుండాపోయింది. ఇప్పుడు అంతా సంపద సృష్టే తప్ప ప్రజలను పట్టించుకునే పరిస్థితులు లేవు’ అని ప్రొఫెసర్ జి.హరగోపాల్ కుండబద్దలు కొట్టారు. పౌరహక్కుల ఉద్యమ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రొఫెసర్ హరగోపాల్ ఓ సదస్సులో పాల్గొనేందుకు వైఎస్సార్ జిల్లా కడపకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వెనుకబడ్డ రాయలసీమ సమగ్రాభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం కూడా బాగా వెనుకబడి ఉంటుందని, ఆ ప్రాంత అభివృద్ధి కోసం బడ్జెట్ అనుమతులు, నిర్వహణ వంటివి గవర్నరే చేపడతారని చెప్పారు. రాయలసీమకు కూడా అలాంటి పరిపాలనా ఏర్పాటు జరగాలన్నారు. ఒకప్పుడు తెలంగాణ అభివృద్ధి బోర్డు ఉండేదని, ఆ తర్వాత దాన్ని రద్దు చేశారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ డిమాండుకు ఇది కూడా ఓ కారణమైందని చెప్పారు. అలాంటివి పునరావృతం కాకుండా రాయలసీమ సమగ్రాభివృద్ధికి నీటి పారుదల, పరిశ్రమలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలు తెలియజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి అవసరం ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి లేకుండా, సామాజిక న్యాయం జరగకుండా భాష ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేదన్న విషయం తెలంగాణ అనుభవం రుజువు చేసింది. అమరావతిలోనే అభివృద్ధి మొత్తం కేంద్రీకరించడం ద్వారా తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో వెనుకబడిన రాయలసీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ దిశగా కొంతమేరకు కృషి చేశారు. విదర్భ తరహాలో ఈ ప్రాంతానికి బడ్జెట్ కేటాయింపు కోసం ఒక పరిపాలనా ఏర్పాటు జరగాలి. అభివృద్ధినంతా ఒకే చోట పోగేయడం సరికాదు. ఒకసారి రాష్ట్ర విభజన జరిగినా, ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకోకుండా మళ్లీ అదే తప్పు చేయడం సమంజసం కాదు. ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అసమానతలు ఉన్నప్పుడు భావ సమైక్యత ఎలా ఉంటుంది? సామాజిక న్యాయం జరగకుండా భాష ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేదు. అందువల్లే ప్రాంతీయ అసమానతలు ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ కరువు పీడిత ప్రాంతం. ఉత్తరాంధ్రలో నీళ్లు ఉన్నా వెనుకబడి ఉంది. కోస్తాలో కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నా ఒకప్పుడు అది కరువు ప్రాంతంగా ఉండేది. కరువును పారదోలడం, వరదల ముప్పు తప్పించడం కోసం 1852లో సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టలు నిర్మించడంతో ఆ ప్రాంతం సస్యశ్యామలమైంది.అక్కడి రైతులు వ్యవసాయంలో వచ్చిన అదనపు ఉత్పత్తిని మద్రాసులోని సినిమా రంగం, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టారు. అలా సంపద పెరుగుతూ ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. నదీ జలాల్లో వెనుకబడ్డ ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ అలా జరగకపోవడం ప్రాంతీయ అసమానతలను పెంచింది. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు ఉన్న రాజకీయ ప్రాబల్యం వెనుకబడ్డ ప్రాంతాలకు ఉండదు. అందుకే రాయలసీమకు చెందిన వారు ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ కోస్తాంధ్రుల ప్రాబల్యం వల్ల ఆ ప్రాంతానికే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. విభజన అనుభవాలు మరువకముందే.. రాజకీయ ప్రాబల్యాన్ని అనుసరించే అభివృద్ధి నమూనా ఉంటోంది. రాష్ట్ర విభజన అనుభవాలు ఇంకా మరిచిపోకమునుపే మళ్లీ అవే తప్పులు మళ్లీ చేస్తున్నారు. ఇక్కడి నాయకులు కూడా ఈ ప్రాంత సమస్యలు పట్టించుకోవడం లేదు. వివిధ చారిత్రక, రాజకీయ కారణాలతో రాయలసీమలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.గతంతో పోలిస్తే ఫ్యాక్షన్ ప్రభావం చాలా మేరకు తగ్గినప్పటికీ రక్షణ ఉండదని భావిస్తున్న ప్రజలు నేటికీ ఏదో ఒక నాయకుడి ప్రాబల్యం కింద ఉన్నారు. వీటి నుంచి బయట పడాల్సిన అవసరం ఉంది. చైతన్యవంతమైన ప్రజా ఉద్యమం ద్వారానే రాయలసీమకు న్యాయం జరుగుతుంది. సీమకు నదీ జలాల విషయంలో వైఎస్సార్ శ్రద్ధ రాయలసీమకు నదీ జలాలను మళ్లించే విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కొంతమేర కృషి చేయగలిగారనేదానిని కాదనలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు పనులు చేపట్టడంతో పాటు సీమ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. అయితే ఆయనపై కూడా అనేక ఒత్తిళ్లు వచ్చాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 290 కిలోమీటర్ల పరివాహక ప్రాంతమున్న కృష్ణా నీటిలో మా తెలంగాణ వాటా ఏమిటని మేము కూడా అడిగాం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా జరుగుతున్న సందర్భంలో కృష్ణా జలాలు పునః పంపిణీ చేయాలని కోరారు. పునః పంపిణీకి కోస్తాంధ్ర వాళ్లు ససేమిరా ఒప్పుకోరన్న విషయం రాజకీయ పరిణితి చెందిన వైఎస్‌కు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల పంపిణీ అయిపోయిందని ఆయన మాతో అన్నారు. ఏది ఎలా ఉన్నా సీమకు నదీ జలాలు ఇచ్చే విషయంలో ఆయన శ్రద్ధ తీసుకున్నారు. కొన్ని త్యాగాలు తప్పవు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉన్నాయి. వీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతైనా సముచితం. అన్ని ప్రాంతాలు కలిసి ఉండాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు. కోస్తాంధ్రులు తమ నీటి వినియోగాన్ని కొంతమేర తగ్గించుకోవడానికి ఇష్టపడరు. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న విజన్ ఇప్పుడు ఎవరికి ఉంది? ఒక ప్రాంతం వెనుకబడి ఉండటానికి చారిత్రక, రాజకీయ కారణాలు ఉంటాయి. విధాన పరంగా, ఒత్తిడి లేకుండా ఒక ప్రాంత అభివృద్ధిని పట్టించుకునే పరిస్థితులు లేవు.
హెల్త్ ఇన్సూరెన్స్ ‘పోర్టింగ్’.. తొందరొద్దు!
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైన ఆర్థిక సాధనం. రక్షణ కవచం కూడా. ఎప్పుడు ఏ రూపంలో అనారోగ్యం లేదా ప్రమాదం ఎదురవుతుందో ఊహించలేం. ఖరీదైన వైద్య వ్యయాల భారాన్ని మోయలేం. జీవితకాల కష్టార్జితాన్ని ఒకేసారి ఎత్తుకుపోయే కరోనా మాదిరి విపత్తులు ఎప్పుడు వస్తాయో తెలియదు. వీటన్నింటికీ పరిష్కారమే హెల్త్ ఇన్సూరెన్స్. విస్తృత ప్రచారం నేపథ్యంలో నేడు చాలా మంది ఆరోగ్య బీమా ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ప్రీమియం కష్టమైనా తీసుకుంటున్నారు. తీరా ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత.. కంపెనీ సేవలు నచ్చకపోవచ్చు. మంచి ఫీచర్లతో తక్కువ ప్రీమియానికే మరో బీమా కంపెనీ హెల్త్‌ప్లాన్ ఆకర్షించొచ్చు. అటువంటి సందర్భంలో కనిపించే ఏకైక ఆప్షన్ పోర్టింగ్. ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మొబైల్ నంబర్ మార్చుకున్నంత సులభంగానే.. హెల్త్ ఇన్సూరెన్స్‌ను సైతం పోర్ట్ పెట్టుకుని మరో కంపెనీ ప్లాన్‌లో చేరిపోవచ్చు. పోర్టింగ్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటి గురించి అవగాహన తప్పనిసరి. బలమైన కారణాలుంటేనే, అది కూడా సమగ్రమైన సమాచారం తెలుసుకున్న తర్వాతే ‘పోర్టింగ్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిపుణుల సూచన. – సాక్షి, బిజినెస్ డెస్క్‌తమ కంపెనీ ప్లాన్‌లోకి ‘పోర్ట్’ పెట్టుకోవాలంటూ ఇటీవలి కాలంలో మార్కెటింగ్ కాల్స్ రావడం కొందరికి అనుభవమే. బీమా మార్కెట్లో పోటీ పెరిగిపోవడంతో ఈ ధోరణి ఏర్పడింది. కొత్త కస్టమర్ల కోసం మార్కెటింగ్ బృందాలు అన్ని మార్గాల్లోనూ జల్లెడ పడుతున్నాయి. అప్పటి వరకు అసలు ఆరోగ్య బీమా రక్షణ పరిధిలో లేని కస్టమర్లకు హెల్త్ ప్లాన్ ఇవ్వడం మంచిదే. కానీ, ఇతర బీమా కంపెనీల కస్టమర్లను సైతం ఆకర్షించేందుకు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి.‘‘పోర్ట్ పెట్టేసుకుని, మా కంపెనీ ప్లాన్‌లోకి మారిపోండి. మంచి ఫీచర్లు, మెరుగైన కవరేజీతో బీమా రక్షణ పొందండి’’ అంటూ ఆఫర్లు ఇస్తున్న ధోరణి కనిపిస్తోంది. వ్యాపార వృద్ధి లక్ష్యాల్లో భాగంగా కొత్త కస్టమర్లను సంపాదించేందుకు కొందరు అనైతికంగానూ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సహేతుక కారణాలు ఉన్నప్పుడే పోర్టింగ్ ఆప్షన్‌ను పరిశీలించాలి. చేదు అనుభవం..కేరళ రాష్ట్రానికి చెందిన అజిత్ కుమార్ (53)కు ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అప్పటికే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో కానీ, బీమా కంపెనీతో కానీ అతడికి ఎలాంటి సమస్యల్లేవు. కానీ, ప్రముఖ ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి ఒకరోజు కాల్ వచ్చింది. పాలసీని పోర్ట్ పెట్టుకోవాలంటూ మార్కెటింగ్ సిబ్బంది సూచించారు. మెరుగైన సదుపాయాలున్న ప్లాన్‌ను పోర్టింగ్‌తో పొందొచ్చంటూ ఆయన్ను ప్రోత్సహించారు. ‘‘11 ఏళ్ల నుంచి నాకు హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లాన్ ఉంది. అన్నేళ్లలో ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయలేదు.అయినా కానీ, పాలసీ ప్రీమియాన్ని గణనీయంగా పెంచేశారు. దీంతో మంచి ఫీచర్లున్న కొత్త పాలసీకి పోర్ట్ పెట్టుకోవాలంటూ పాలసీబజార్ కస్టమర్ కేర్ ప్రతినిధి నాకు సూచించారు’’అని కుమార్ తన అనుభవాన్ని పంచుకున్నారు. కానీ, జరిగిన నష్టం ఏంటో ఆ తర్వాత కానీ తెలియలేదు. పోర్టింగ్ నిర్ణయం పట్ల కుమార్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కుమార్ పూర్వపు పాలసీలో రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్ ఉంది. మరో రూ.10 లక్షలకు నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సీబీ) కూడా ఉంది. అంటే మొత్తం రూ.20 లక్షల బీమా రక్షణ ఉన్నట్టు. పాలసీ తీసుకుని 10–11 ఏళ్లు కావడంతో అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్ నిబంధనలను కుమార్ అధిగమించేశారు. పాత పాలసీలోనే కొనసాగి ఉంటే ఎలాంటి క్లెయిమ్‌కు అయినా అర్హత కొనసాగేది. కానీ, పోర్టింగ్‌తో నో క్లెయిమ్ బోనస్ కొత్త పాలసీలోకి బదిలీ కాలేదు. పైగా ఒకే విడత మూడేళ్ల ప్రీమియంలను కుమార్‌తో కట్టించారు సదరు మార్కెటింగ్ సిబ్బంది. వారి సూచనతో సూపర్ టాపప్ ప్లాన్ కూడా కొనుగోలు చేశారు. పాలసీ కొనుగోలు తర్వాత సేవలు దారుణంగా ఉన్నాయని కుమార్ విచారించడం మినహా మరో మార్గం లేకపోయింది. నో క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాలు అన్ని పోర్టింగ్ కేసుల్లోనూ తప్పనిసరిగా బదిలీ కావాలని లేదు. ఈ విషయంలో బీమా సంస్థల షరతులను అర్థం చేసుకోవాలి. పోర్టింగ్ ప్రక్రియ ఇలా..పోర్టింగ్ పెట్టుకోవాలంటే ప్రస్తుత పాలసీ రెన్యువల్ ఇంకా కనిష్టంగా 30 రోజులు, గరిష్టంగా 60 రోజుల గడువు ఉందనగా ప్రక్రియ ప్రారంభించాలి. ఉదాహరణకు ఫిబ్రవరి 28న తదుపరి ప్రీమియం చెల్లించాల్సిన గడువు అనుకుంటే, మీరు రెండు నెలల ముందుగా డిసెంబర్ 31నుంచి ప్రారంభించొచ్చు. రెన్యువల్‌కు 30 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉన్నా కానీ, బీమా సంస్థ తన విచక్షణ మేరకు పోర్టింగ్ దరఖాస్తును ఆమోదించొచ్చని ఐఆర్‌డీఏఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత బీమా కంపెనీకి ఎలాంటి సమాచారం ఇవ్వక్కర్లేదు. పోర్టింగ్‌తో ఏ కంపెనీ ప్లాన్‌లోకి వెళ్లాలనుకుంటున్నారో, ఆ కంపెనీని సంప్రదించాలి. పోర్టబులిటీ, ప్రపోజల్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.పోర్టింగ్ సమయంలో తాజా ఆరోగ్య సమాచారం మొత్తాన్ని వివరంగా వెల్లడించాల్సిందే. అప్పటి వరకు ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనా, లోగడ హెల్త్ క్లెయిమ్‌ల గురించి కూడా వెల్లడించాల్సి రావచ్చు. ఈ వివరాల ఆధారంగా రిస్క్‌ను మదింపు వేసి బీమా సంస్థ ప్రీమియంను నిర్ణయిస్తుంది. అవసరమైతే అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రీమియంను పెంచొచ్చు.పోర్టింగ్ దరఖాస్తును కొత్త సంస్థ ఆమోదించి, పాలసీ జారీ చేసే వరకు పాత పాలసీని రద్దు చేసుకోవద్దు. ఎందుకంటే పాలసీదారు ఆరోగ్య చరిత్ర, రిస్క్, ఇతర అంశాల ఆధారంగా కొత్త సంస్థ ప్రీమియంను గణనీయంగా పెంచేస్తే అది అంగీకారం కాకపోవచ్చు. నో క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాల విషయంలోనూ కొత్త సంస్థ నిబంధనలు నచ్చకపోతే, పోర్టింగ్ అభ్యర్థనను ఉపసంహరించుకుని పాత సంస్థలో కొనసాగొచ్చు. ఆచరణ వేరు..ప్రస్తుత హెల్త్ ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్ ఉందనుకోండి. దీనికి మరో రూ.10 లక్షలు నో క్లెయిమ్ బోనస్ తోడయ్యింది. అప్పుడు సదరు పాలసీదారు రూ.20 లక్షల క్లెయిమ్‌కు అర్హులు. పోర్టింగ్‌తో వేరే కంపెనీ ప్లాన్‌లోకి మారాలనుకుంటే.. అప్పుడు రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ పాత ప్లాన్‌లో మాదిరే రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్‌ను కొత్త సంస్థలోనూ ఎంపిక చేసుకుంటే.. రూ.10 లక్షల నో క్లెయిమ్ బోనస్ కోల్పోయినట్టు అవుతుంది.పోర్టింగ్‌తో రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్ ఎంపిక చేసుకుంటే అంత మొత్తానికి తాజా వెయిటింగ్ నిబంధన కొత్త సంస్థలోనూ అమలు కాదు. ముందస్తు వ్యాధులకు (పాలసీ తీసుకునే నాటికి) 3–4 ఏళ్ల పాటు వెయిటింగ్ పీరియడ్ క్లాజ్ ఉంటుంది. పాలసీ తీసుకుని అన్నేళ్ల పాటు రెన్యువల్ చేసుకున్న తర్వాతే, ఆయా వ్యాధుల తాలూకూ క్లెయిమ్‌లకు అర్హత లభిస్తుంది. కనుక ఒక ప్లాన్‌లో వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత, మరో కంపెనీకి పోర్ట్ పెట్టుకునే ముందు సమ్ అష్యూరెన్స్ ఎంపికలో వివేకంతో వ్యవహరించాలి.ఐఆర్‌డీఏఐ ఉత్తర్వులు ఉన్నా...సమ్ అష్యూరెన్స్, నో క్లెయిమ్ బోనస్, నిర్దేశిత వెయిటింగ్ పీరియడ్, మారటోరియం పీరియడ్‌కు సంబంధించిన అర్హతలను పోర్టింగ్‌తోపాటు బదిలీ చేయాలంటూ ఈ ఏడాది ఆరంభంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ)తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. కానీ, బీమా సంస్థలు తెలివిగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఉదాహరణకు.. ప్రస్తుత ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్‌తో, అన్ని వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు అధిగమించేసి ఉన్నారని అనుకుందాం.పోర్టింగ్ సమయంలో కొత్త సంస్థలో రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్ ఎంపిక చేసుకుంటే, అప్పుడు పాత ప్లాన్‌లో రూ.10 లక్షలకే వెయిటింగ్ పీరియడ్‌ను పూర్తి చేశారు కనుక, కొత్త సంస్థ కూడా అంతే మొత్తానికి ఆ ప్రయోజనాన్ని కొనసాగిస్తుంది. మరో రూ.10 లక్షల మొ త్తానికి అన్ని వెయిటింగ్ పీరియడ్‌లు తాజాగా అమల్లోకి వస్తాయని తెలుసుకోవాలి. దీనర్థం.. అప్పటికే ఉన్న వ్యాధులకు సంబంధించి క్లెయిమ్ మొత్తం రూ.10 లక్షలు మించిన సందర్భాల్లో రూ.10 లక్షలకే పరిహారం పరిమితమవుతుంది.కుమార్ విషయంలో ఈ తప్పిదమే చోటుచేసుకుంది. పాత ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్, రూ.10 లక్షల నో క్లెయిమ్ బోనస్ ఉన్నప్పటికీ.. పోర్ట్ తర్వాత రూ.10 లక్షలకే సమ్ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. దీంతో నో క్లెయిమ్ బోనస్ కోల్పోవడమే కాకుండా, ఆ మొత్తానికి వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాన్ని కోల్పోయినట్టు అయింది. పోర్టింగ్ ఏ సందర్భాల్లో..?ముఖ్యమైన కారణాలుంటేనే పోర్టింగ్‌ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఏజెంట్ల సూచన మేరకు పోర్టింగ్ చేసుకుంటే, ఇన్సూరెన్స్ పాలసీ ప్రపోజల్ పత్రంలో అన్ని వివరాలు సమగ్రంగా ఉన్నాయేమో ఒక్కసారి ధ్రువీకరించుకోవాలి. చాలా సందర్భాల్లో ఏజెంట్లు అధిక కమీషన్ కోసం పోర్టింగ్ పేరుతో, తాజాగా పాలసీలు అంటగడుతుంటారు’’ అని హోలిస్టిక్ వెల్త్ సహ వ్యవస్థాపకుడు నిషాంత్ బాత్రా తెలిపారు. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ప్రీమియం తగ్గుతుందన్న ఆశతో పోర్టింగ్ పెట్టుకునే తప్పిదం చేయవద్దన్నది బాత్రా సూచన. పోర్టింగ్ ద్వారా వచి్చన పాలసీదారులను కొత్తవారిగానే బీమా సంస్థలు పరిగణిస్తాయి. పోర్టింగ్ చేసుకున్న తర్వాత తొలినాళ్లలో క్లెయిమ్‌కు వెళితే, అందులోని వాస్తవికతను అవి సందేహించే అవకాశం లేకపోలేదు. మరి పోర్టింగ్ ఏ సందర్భాల్లో పరిశీలించాలన్న సందేహం రావచ్చు. ప్రస్తుత ప్లాన్‌లో లేని మెరుగైన ఫీచర్లు కొత్త ప్లాన్‌లో వస్తుంటే, మరిన్ని వ్యాధులకు కవరేజీ లభిస్తుంటే, అవి తమకు ఎంతో ప్రయోజనకరమని భావిస్తే అప్పుడు పోర్టింగ్‌ను పరిశీలించొచ్చు.అలాగే, ప్రస్తుత ప్లాన్‌లో రూమ్ రెంట్ విషయంలో పరిమితులు ఉండి, పోర్టింగ్‌తో వెళ్లే ప్లాన్‌లో ఎలాంటి రూమ్ రెంట్ పరిమితులు లేనట్టయితే అప్పుడు కూడా ఈ ఆప్షన్ వినియోగించుకోవడం సరైనదేనని బాత్రా సూచించారు. ఇక ప్రస్తుత బీమా సంస్థ క్లెయిమ్‌ల పరంగా ఇబ్బందులు పెడుతుంటే, క్లెయిమ్ మొత్తంలో కోతలు పెడుతుంటే లేదా క్లెయిమ్ ఆమోదంలో చాలా జాప్యం చేస్తుంటే, కస్టమర్ సర్వీస్ విషయంలో సంతోషంగా లేకపోయినా కానీ పోర్టింగ్ సహేతుకమే. ఇవి తెలుసుకోవాలి..⇒ పోర్టింగ్‌తో పాత పాలసీలో పొందిన నో క్లెయిమ్, వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్ ప్రయోజనాలను కొత్త సంస్థ కూడా నిబంధనల మేరకు అందిస్తుందా? లేదా అన్నది ముందే ధ్రువీకరించుకోవాలి. ⇒ పాత కంపెనీలో ముందస్తు వ్యాధులకు 3 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ నిబంధనను పూర్తి చేశారని అనుకుందాం. పోర్టింగ్ తర్వాత కొత్త సంస్థ ప్లాన్‌లో వెయిటింగ్ పీరియడ్ 4 ఏళ్లుగా ఉంటే.. అప్పుడు మరో ఏడాది తర్వాతే క్లెయిమ్ ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. ఒకవేళ పాత కంపెనీలో వెయిటింగ్ పీరియడ్‌ను సగమే పూర్తి చేసి ఉంటే, అప్పుడు కొత్త సంస్థలో నిబంధనల మేరకు మిగిలిన కాలానికి వెయిటింగ్ పీరియడ్ కొసాగుతుంది. ⇒ పోర్టింగ్‌కు ప్రీమియం ఒక్కదానినే ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే వయసు, ఆరోగ్య చరిత్ర వివరాల ఆధారంగా ఈ ప్రీమియం మారిపోవచ్చు. అధిక రిస్‌్కలో ఉన్నారని భావిస్తే బీమా సంస్థలు అధిక ప్రీమియంను నిర్ణయిస్తాయి. ⇒ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను నేరుగా బీమా సంస్థ నుంచి తీసుకున్నా, ఏజెంట్ సాయంతో తీసుకున్నా ప్రీమియంలో పెద్ద వ్యత్యాసం ఉండదు. కొన్ని కంపెనీలు ఏ రూపంలో పాలసీ తీసుకుంటున్నప్పటికీ ఒక్కటే ప్రీమియం అమలు చేస్తున్నాయి. ⇒ పోర్టింగ్ తర్వాత అధిక సమ్ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మరింత సమ్ అష్యూరెన్స్ ఇవ్వడమా? లేదా అన్న దానిని అండర్‌రైటింగ్ నిబంధనల మేరకు బీమా కంపెనీలు నిర్ణయిస్తాయి. ⇒ అన్ని వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ ఇండెమ్నిటీ పాలసీలకు పోర్టింగ్ అర్హత ఉంటుంది. ఇక గ్రూప్ హెల్త్ పాలసీల్లో కవరేజీ ఉన్న వ్యక్తులు, కుటుంబాలకు మాత్రం.. ఆ గ్రూప్ నుంచి తప్పుకున్నప్పుడు లేదా గ్రూప్ పాలసీలో మార్పులు చేసినప్పుడు (ప్రీమియం పెంపు సహా) లేదా గ్రూప్ పాలసీని ఉపసంహరించుకున్న సందర్భాల్లో పోర్టింగ్‌కు వీలు కల్పించాల్సి ఉంటుంది. ⇒ పోర్టింగ్ దరఖాస్తుపై 15 రోజుల్లో బీమా సంస్థ తన నిర్ణయాన్ని పాలసీదారునకు తెలియజేయాల్సి ఉంటుంది. పాత పాలసీలో ఉన్న కవరేజీకి తక్కువ కాకుండా బీమా రక్షణను కొత్త సంస్థ అందించాలి.
మోదీ చర్యలతో ఈసీ సమగ్రతకు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో మార్పులు తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్నికల నిర్వహణ నిబంధనలు–1961లోని రూల్ 93(2)(ఏ)ను ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు శుక్రవారం కేంద్ర న్యాయశాఖ సవరించడం తెలిసిందే. ఈ చర్య ఈసీ సమగ్రతను దెబ్బతీసేందుకు చేసిన కుట్రగా ఖర్గే అభివర్ణిస్తూ ఆదివారం ‘ఎక్స్’లో పలు వ్యాఖ్యలు చేశారు.‘మోదీ ప్రభుత్వం ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో చేసిన మార్పులు ఈసీ సమగ్రతకు భంగం కలిగించే ప్రణాళిక బద్ధమైన కుట్రలో భాగమే. ఈసీని నిరీ్వర్యం చేసేందుకు మోదీ గతంలో ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఎన్నికల సమాచారాన్ని దాచిపెడుతున్నారు.ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపు, ఈవీఎంల్లో పారదర్శకత లోపించండం వంటి అవకతవకలపై కాంగ్రెస్ ఈసీకి లేఖలు రాసిన ప్రతీసారీ కించపరిచే ధోరణితో స్పందించింది. తీవ్రమైన ఫిర్యాదులను కనీసం స్వీకరించనూలేదు. ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. ఈసీ సమగ్రతను దెబ్బ తీయడమంటే, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై మోదీ ప్రభుత్వం ప్రత్యక్షంగా దాడి చేయడమే. దీన్ని అడ్డుకుని తీరతాం’’ అన్నారు.
ఇంటి ముందు లెటర్..యమడేంజర్
పలమనేరు: ఇప్పటిదాకా స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌కు లింకులు, ఫేస్‌బుక్ హ్యాకింగ్స్, బ్యాంకు అధికారుల పేరిట ఫేక్ కాల్స్, ఓటీపీలు, మన ఫోన్ ఎవరికైనా కాల్ కోసం ఇస్తే దాంట్లో సెట్టింగ్స్ మార్చేయడం, ఫేక్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్, ఫోన్ హ్యాకింగ్, ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలు, తాజాగా బయటి ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న లేదా ఉద్యోగాల చేస్తున్న వారి నంబర్ల ఆధారంగా వారి కుటుంబీకులకు డిజిటల్ అరెస్ట్‌లు సర్వసాధారణంగా మారాయి. ఈ సైబర్ నేరాలకు సంబంధించి పోలీసులు, వారు ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్లు సైతం బాధితులను రక్షించలేకపోతున్నాయి. తాజాగా మరోకొత్త మోసం వెలుగులోకి వచ్చింది. దీన్ని ఎలాంటి వారైనా నమ్మి మోసపోవాల్సిందే. మీ ఇంటి ముందు ఓ లెటర్‌ను పడేసి.. ఇంటిముందు ఓ లెటర్ లేదా కొరియర్ ఫామ్ పడి ఉంటుంది. దానిపై డేట్, వేబిల్ నంబరు, కొరియర్ లేదా పార్సిల్ కంపెనీ పేరు ఉంటుంది. అందులోని స్కానర్‌ను స్కాన్ చేసి చేంజ్ యువర్ డెలివరీ డేట్, ఆల్టర్‌నేట్ అడ్రస్ తదితర వివరాలు ఉంటాయి. దీన్ని నమ్మి మనకేమైనా పార్సిల్ లేదా లెటర్, వస్తువులు వచ్చాయేమోనని భావించి మన స్మార్ట్‌ఫోన్ ద్వారా దానిపై ఉన్న క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేశామో ఇక అంతే సంగతులు. వెంటనే మన ఫోన్ హ్యాకర్ల గుప్పెట్లోకి పోతుంది. మనఫోన్‌లో జరిగే అన్ని లావాదేవీలను హ్యాకర్స్ డార్క్‌నెట్ ద్వారా గమనిస్తుంటారు. ఇందుకోసం పెద్ద నెట్‌వర్క్ ఉంటుంది. చాలామంది సాఫ్ట్‌వేర్లు ఇందులో పనిచేస్తూ మనం సెల్‌లో చేసే పనులను గమనిస్తుంటారు. బహుశా మనం ఫోన్‌పే, గూగుల్‌పే నుంచి ఎవరికైనా డబ్బు పంపి మన పిన్‌ను ఎంటర్ చేశామంటే ఆ పిన్‌ను వారు గుర్తిస్తారు. ఆపై మన ఖాతాలో ఉన్న డబ్బును మనకు తెలియకుండానే కాజేస్తారు. మన సెల్‌కు డబ్బులు కట్ అయినట్లు ఓ ఎస్‌ఎంఎస్ మాత్రం వస్తుంది. ఆపై మనం ఏమీ చేయాలన్నా మన సెల్ హ్యాకర్ల అదుపులో ఉన్నందున మనం ఏం చేసినా లాభం ఉండదు. నెల రోజులుగా ఈ మోసాలు.. బెంగళూరులో గత నెల రోజులుగా ఇలాంటి ఫేక్ లెటర్లు ఇంటి ముందు పడి ఉండడం, వాటిని స్మార్ట్‌ఫోన్‌లో స్కాన్ చేసిన వారి ఖాతాల్లో డబ్బు మాయం కావడం ఎక్కువగా జరుగుతోంది. దీంతో ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీలో ఇప్పుడు జరుగుతున్న ఇలాంటి సైబర్ మోసాలు మన చెంతకు చేరడం ఎన్నో రోజులు పట్టదు. మన ఇళ్ల వద్ద ఏదైనా స్కానింగ్ ఉన్న లెటర్ వస్తే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గుంటూరులో టీడీపీ నేత దాష్టీకం
లక్ష్మీపురం: టీడీపీ దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. గుంటూరు డిప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వనమాల వజ్రబాబు (డైమండ్ బాబు) సోదరి నివాసం ఉంటున్న ఇంటిని ఆక్రమించేందుకు యత్నించిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిబాబారోడ్డు శాంతినగర్ 2వ లైన్‌లో డైమండ్ బాబు సోదరి పతకమూరి వజ్రకుమారి 2008 నుంచి నివాసం ఉంటున్నారు. ఆమె భర్త సీతారామయ్య 2012లో అనారోగ్యంతో మృతి చెందారు. వజ్రకుమారి పక్షవాతం బారినపడి చికిత్స పొందుతోంది. ఆమె ఉంటున్న ఇంటి స్థలానికి సంబంధించి పాములూరి రామయ్య, పత్రి ఆనంద్‌మోహన్ అనే వారిమధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. కాగా.. యనమల విజయ్‌కిరణ్ అనే వ్యక్తి అధికార పార్టీ అండదండలతో పేరం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద ఆ స్థలాన్ని కొనుగోలు చేశానంటూ నకిలీ దస్తావేజులను సృష్టించి ఆదివారం మధ్యాహ్నం వజ్రకుమారి, కొడుకు కిరణ్‌కుమార్, కుమార్తె రాణి, కోడలు రమ్య భోజనం చేస్తున్న సమయంలో మాస్క్‌లు ధరించిన మహిళలు నాలుగు ఆటోల్లో వచ్చి ఆ ఇంట్లోకి చొరబడ్డారు. వజ్రకుమారి కుటుంబ సభ్యుల నుంచి తినే కంచాలను లాగేసుకుని అందరినీ ఇంటినుంచి లాక్కొచ్చి బయటకు గెంటేశారు. గృహోపకరణాలు సైతం బయట పడేసి దాడిచేసి గాయపరిచారు. దీంతో బాధితురాలు వజ్రమ్మ, కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం టీడీపీ నేత విజయ్‌కిరణ్ అనుచరులైన ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులు ఆ ఇంట్లోకి చొరబడి తలుపులు వేసుకున్నారు. ఈవిషయం తెలుసుకున్న నగర డిప్యూటీ మేయర్ డైమండ్‌బాబు పట్టాభిపురం సీఐ, వెస్ట్ డీఎస్పీ, జిల్లా ఎస్పీలకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి బాధితురాలు కుటుంబ సభ్యులు రోడ్డుపై కన్నీటి పర్యంతమై జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో పోలీసులు విజయ్‌కిరణ్ అనుచరులను అక్కడినుంచి పంపించేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న డిప్యూటీ మేయర్ డైమండ్‌బాబును సీఐ వీరేంద్ర వెళ్లిపోవాలని బలవంతం చేశారు. దీంతో డైమండ్‌బాబు తన సోదరి ఇంటిని కబ్జా చేసిన వారికి పోలీసులు బందోబస్తు కల్పించడం సరికాదని, వారందరినీ బయటకు పంపించాలని సీఐ వీరేంద్రను కోరా>రు. తామే ఆ ఇంటిని ఖాళీ చేయించామని, మీరు ఇక్కడ ఉండటం కుదరదన్నారు. తన సోదరి కుటుంబాన్ని రోడ్డుపై కూర్చోబెట్టడం సరికాదని డైమండ్‌బాబు అనటంతో సీఐ వీరేంద్ర ఆయనను బలవంతంగా జీప్ ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న మేయర్ కావటి మనోహర్‌నాయుడు, ఈస్ట్ ఇన్‌చార్జి నూరిఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ ఇన్‌చార్జి అంబటి మురళీకృష్ణ, పలువురు కార్పొరేటర్లు పట్టాభిపురం స్టేషన్‌కు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ జోక్యంతో డైమండ్‌బాబును విడిచి పెట్టారు. కబ్జాదారుడికి పోలీసులు వత్తాసు పలకడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
భారత్, కువైట్ మధ్య... సుదృఢ బంధం
మరో మూడు నెలల్లో ‘నిసార్’ ప్రయోగం
రేపు సూర్యుడి సమీపానికి ‘నాసా’ పార్కర్
ప్రభుత్వ విద్య మిథ్యే!
న్యూ ఫండ్ ఆఫర్లకు కాల పరిమితులు
ఇంటి ముందు లెటర్..యమడేంజర్
దరఖాస్తుల జోరు.. పరీక్షకు రారు!
మిడ్‌క్యాప్‌లో మెరుగైన రాబడులు
కడుపు నింపుతున్న.. 'దోసెడు బియ్యం'
అదేమోగానీ.. మీ మేనిఫెస్టో అమలుపై ప్రజలు సున్నా మార్కులిచ్చార్సార్!!
అల్లు అర్జున్‌పై నటి పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్
'పుష్ప 2' పీలింగ్స్ సాంగ్.. ఇబ్బందిగా ఫీలయ్యా.. కానీ.. : రష్మిక మందన్నా
అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన తెలంగాణ డీజీపీ
భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా
'స్టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్'.. సోషల్‌మీడియాలో వైరల్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
సోనియా పెళ్లిలో పెద్దోడు మిస్సింగ్.. కానీ పుష్ప లెవల్లో రైతుబిడ్డ ఎంట్రీ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
అయ్యర్ సెంచరీ వృథా.. 383 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేసిన కర్ణాటక
తులం బంగారం ధర ఎలా ఉందంటే..
భారత్, కువైట్ మధ్య... సుదృఢ బంధం
మరో మూడు నెలల్లో ‘నిసార్’ ప్రయోగం
రేపు సూర్యుడి సమీపానికి ‘నాసా’ పార్కర్
ప్రభుత్వ విద్య మిథ్యే!
న్యూ ఫండ్ ఆఫర్లకు కాల పరిమితులు
ఇంటి ముందు లెటర్..యమడేంజర్
దరఖాస్తుల జోరు.. పరీక్షకు రారు!
మిడ్‌క్యాప్‌లో మెరుగైన రాబడులు
కడుపు నింపుతున్న.. 'దోసెడు బియ్యం'
అదేమోగానీ.. మీ మేనిఫెస్టో అమలుపై ప్రజలు సున్నా మార్కులిచ్చార్సార్!!
అల్లు అర్జున్‌పై నటి పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్
'పుష్ప 2' పీలింగ్స్ సాంగ్.. ఇబ్బందిగా ఫీలయ్యా.. కానీ.. : రష్మిక మందన్నా
అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన తెలంగాణ డీజీపీ
భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా
'స్టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్'.. సోషల్‌మీడియాలో వైరల్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
సోనియా పెళ్లిలో పెద్దోడు మిస్సింగ్.. కానీ పుష్ప లెవల్లో రైతుబిడ్డ ఎంట్రీ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
అయ్యర్ సెంచరీ వృథా.. 383 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేసిన కర్ణాటక
తులం బంగారం ధర ఎలా ఉందంటే..
సినిమా
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి
హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద OU జేఏసీ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు నిరసనకు దిగారు. వారందరూ ఒక్కసారిగా బన్నీ ఇంటిలోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ నినాదాలు చేశారు. ఆమె కుటుంబానికి రూ. కోటి పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే, అదే సమయంలో కొందరు అత్యుత్సాహం చూపారు. బన్నీ ఇంటిపైకి రాళ్లు విసరడంతో అక్కడి వాతావరణం ఒక్కసారి ఆందోళనకు గురైంది. వాళ్లు విసిరన రాళ్ల వల్ల అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. పోలీసలకు సమాచారం అందడంతో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
రేవతి కుటుంబం కోసం వెళ్లాను.. జగపతి బాబు ఫస్ట్ రియాక్షన్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలో కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు చాలామంది నేతలు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్లు ఎవరూ వెళ్లలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయం గురించి పుష్ప2లో కీలకపాత్రలో నటించిన జగపతి బాబు రియాక్ట్ అయ్యారు. తన సోషల్‌మీడియా ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు.'సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక నేను ఊరి నుంచి రాగానే.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడి కోసం వెళ్లాను. కష్ట సమయంలో శ్రీతేజ తండ్రి, సోదరిని పలకరించాలని అనిపించి అక్కడకు వెళ్లా. అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోల్పోయింది రేవతి కుటుంబం కాబట్టి నా వంతు సపోర్ట్ ఇద్దామని వెళ్లాను. అయితే, మానవత్వంతో మాత్రమే వెళ్లాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెబుతున్నాను.' అని జగపతి బాబు అన్నారు.సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించారు. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతుంటే వెంటనే అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎందుకు పరామర్శించలేదని సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్ చేశారు. కానీ, అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టిందని సీఎం అన్నారు. వీరిలో ఒక్కరైన బాధిత కుటుంబాన్ని పరామర్శించారా..? అని ఆయన ప్రశ్నించారు. పుష్ప సినిమా నిర్మాతలు, నటీనటులు ఎవరూ కూడా ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజను చూడలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు. pic.twitter.com/GrJCCUjMv5— Jaggu Bhai (@IamJagguBhai) December 22, 2024
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
సంధ్య థియేటర్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. తొక్కిసలాట ఘటన గురించి తనకు పోలీసులు సమాచారం అందించలేదని అల్లు అర్జున్ చెప్తోంటే.. ఒక మహిళ చనిపోయిందన్న విషయం కూడా హీరోకు తెలియజేశామని పోలీసులు అంటున్నారు. అయినా సరే పట్టించుకోకుండా తన సినిమా పూర్తయ్యేవరకు అల్లు అర్జున్ అక్కడే ఉంటానన్నాడని తెలిపారు.బౌన్సర్లకు వార్నింగ్పదిహేను నిమిషాల తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడన్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పది నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం సంధ్య థియేటర్ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేనన్నారు. అలాగే బౌన్సర్లకు, బౌన్సర్ల ఏజెన్సీలకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులనే తోసుకుని వెళ్తున్న బౌన్సర్లకు అడ్డుకట్ట వేసే అవసరం ఉందన్నారు.(చదవండి: ఒకరు చనిపోయారని చెప్పినా అల్లు అర్జున్ సినిమా చూశాకే వెళ్తానన్నారు: ఏసీపీ)వారిదే పూర్తి బాధ్యతపోలీసులపై, పబ్లిక్పై చేయి వేసినా, ముట్టుకున్నా వారిని వదిలిపెట్టమన్నారు. జనాలను తోసేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా ఓవరాక్షన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లను పెట్టుకున్న వారిదే పూర్తి భాధ్యత అని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. చదవండి: ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ రిక్వెస్ట్.. అప్రమత్తంగా ఉండాలని ట్వీట్
అల్లు అర్జున్ మేనేజర్‌కు ముందే చెప్పాం: ఏసీపీ
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన 10 నిమిషాల సీసీటీవి ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. పుష్ప2 ప్రీమియర్స్ సమయంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ గురించి సీఎం పలు వ్యాఖ్యలు చేశారు. వాటికి కౌంటర్‌గా అల్లు అర్జున్ కూడా సంఘటన జరిగిన రోజు సంధ్య థియేటర్ వద్ద ఏమైంది అనేది తన వర్షన్‌ను పంచుకున్నారు. అయితే, తాజాగా పోలీసులు కూడా ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ క్రమంలో చిక్కడపల్లి ఏసిపీ రమేష్ కుమార్ ఘటనరోజు జరిగిన విషయాలను మీడియాతో పంచుకున్నారు.థియేటర వద్దకు భారీగా ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగిందని, అక్కడ రేవతి అనే మహిళ చనిపోవడమే కాకుండా బాబు పరిస్థితి కూడా సివియర్‌గా ఉందని అల్లు అర్జున్ మేనేజర్‌కు చెప్పాం. ఇదే విషయాన్ని అల్లు అర్జున్‌కు చెప్పాలని మేము ప్రయిత్నం చేశాం. కానీ సంతోష్ మమ్మల్ని కలవనివ్వలేదు. నాకు చెప్పండి నేను అల్లు అర్జున్‌కు చెబుతా అని సంతోష్ చెప్పారు. ఆ సమయంలో నేను ఇదే విషయాన్ని మా డీసీపీకి తెలియజేశాను. ఆ సమయంలో డీసీపీ ఆదేశాలు మేరకు నేను క్రౌడ్‌ను నెట్టుకుంటూ అల్లు అర్జున్ వద్దకు వెళ్లి విషయం చెప్పాను. మీరు థియేటర్ నుండి వెళ్లి పోవాలి అని ఆయనకు సూచన చేశాను. కానీ, సినిమా చూసి వెళ్తాను అని అల్లు అర్జున్ చెప్పారు. డీసీపీ, నేను వెళ్లి గట్టిగా చెప్పడంతో సుమారు 15 నిమిషాల తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చారు.' అని ఏసిపీ పేర్కొన్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
వివాహబంధంలోకి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
ఉదయ్‌పూర్: కోర్టుల్లో రాకెట్ పట్టి ప్రత్యర్థులతో పోటీపడి సెమీస్, ఫైనల్స్ ప్రవేశించే తెలుగింటి ఆడపడుచు సింధు ఇప్పుడు నవవధువుగా ముస్తాబై మూడుముళ్ల బంధంలోకి ప్రవేశించింది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రాజమహల్లాంటి వేదికపై ఆదివారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో ఆమె తమ ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకట దత్తసాయిని వివాహమాడింది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహానికి ఇరు కుటుంబాల బంధుమిత్రులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల 24న (మంగళవారం) హైదరాబాద్‌లో వీరి వివాహా రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి తెలుగు సినీ, క్రీడా రంగ ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ, ప్రభుత్వ పెద్దలు హాజరయ్యే అవకాశముంది.
విధ్వంసం సృస్టించిన సురేశ్ రైనా
బిగ్ క్రికెట్ లీగ్-2024 ఎడిషన్‌లో ఇవాళ (డిసెంబర్ 22) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సథరన్ స్పార్టన్స్‌తో జరుగుతున్న అంతిమ పోరులో ముంబై మెరైన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సథరన్ స్పార్టన్స్‌కు టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా సారథ్యం వహిస్తుండగా.. ముంబై మెరైన్స్కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఫిల్ మస్టర్డ్ ఊచకోత.. సురేశ్ రైనా విధ్వంసంతొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ స్పార్టన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఫిల్ మస్టర్డ్ (39 బంతుల్లో 78; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోయగా.. సురేశ్ రైనా (26 బంతుల్లో 51; 9 ఫోర్లు, సిక్సర్) విధ్వంసం సృష్టించాడు. స్పార్టన్స్ ఇన్నింగ్స్‌లో సోలొమన్ మైర్ 7, అభిమన్యు మిధున్ 25, ఫయాజ్ ఫజల్ 30, అమాన్ ఖాన్ 10 పరుగులు చేశారు. మెరైన్స్ బౌలర్లలో మన్‌ప్రీత్ గోని, మనన్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్.. తొలి వన్డేలో విండీస్ ఘోర పరాజయం
వడోదరా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 211 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.సెంచరీ చేజార్చుకున్న మంధనఓపెనర్ స్మృతి మంధన (91) తృటిలో సెంచరీ చేజార్చుకుంది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (40), హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగెజ్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ స్పిన్నర్ జైదా జేమ్స్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటింది. హేలీ మాథ్యూస్ 2, డియోండ్రా డొట్టిన్ ఓ వికెట్ పడగొట్టింది.నిప్పులు చెరిగిన రేణుకా సింగ్.. తొలి ఐదు వికెట్ల ఘనత315 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. రేణుకా సింగ్ (10-1-29-5) ధాటికి 26.2 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. రేణుకా సింగ్‌కు కెరీర్లో ఇది తొలి ఐదు వికెట్ల ఘనత. భారత్ బౌలర్లలో రేణుకా సింగ్‌తో పాటు టైటాస్ సాధు (7-2-24-1), ప్రియా మిశ్రా (4.2-0-22-2), దీప్తి శర్మ (3-0-19-1) కూడా రాణించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో క్యాంప్‌బెల్ (21), అఫీ ఫ్లెచర్ (24 నాటౌట్), ఆలియా ఎలెన్ (13), కరిష్మా (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.తొలి వన్డేలో గెలుపుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే డిసెంబర్ 24న వడోదరా వేదికగానే జరుగనుంది.
హ్యాట్రిక్ డకౌట్స్.. పాక్ ఓపెనర్ చెత్త రికార్డులు
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ దారుణ ప్రదర్శన కొనసాగుతుంది. షఫీక్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో ఏడు సార్లు డకౌట్లు అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో సింగిల్ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక డకౌట్లు అయిన ఓపెనర్ల జాబితాలో షఫీక్ క్రిస్ గేల్, ఉపుల్ తరంగతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక డకౌట్లు అయిన చెత్త రికార్డు హెర్షల్ గిబ్స్ (2002, 8 సార్లు), తిలకరత్నే దిల్షన్ (2012, 8 సార్లు) పేరిట ఉంది.హ్యాట్రిక్ డకౌట్స్సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో అబుల్లా షఫీక్ గోల్డన్ డకౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో షఫీక్ తానెదుర్కొన్న తొలి బంతికే వికెట్ పారేసుకున్నాడు. వన్డేల్లో షఫీక్ ఇది వరుసగా మూడో డకౌట్. సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో కూడా షఫీక్ డకౌటయ్యాడు.చరిత్రలో మొదటి ఓపెనర్‌గా చెత్త రికార్డుతాజా డకౌట్‌తో షఫీక్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ డకౌట్లను నమోదు చేసిన మొదటి ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు. న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్తిల్ కూడా ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ డకౌట్లు నమోదు చేశాడు. అయితే శ్రీలంకతో జరిగిన ఆ సిరీస్ ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్. టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా వన్డేల్లో హ్యాట్రిక్ డకౌట్లు నమోదు చేశాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో స్కై ఈ అపప్రదను మూటగట్టుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా టాస్ అలస్యమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచకుంది. ఇన్నింగ్స్ రెండో బంతికే షఫీక్ ఔటయ్యాడు. 3.1 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 10/1గా ఉంది. ఈ దశలో వర్షం మళ్లీ మొదలుకావడంతో మ్యాచ్‌కు అంతర్జాయం కలిగింది. వర్షం ముగిసిన మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. 4 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 16/1గా ఉంది. సైమ్ అయూబ్ (6), బాబర్ ఆజమ్ (10) క్రీజ్‌లో ఉన్నారు. షఫీక్ వికెట్ రబాడకు దక్కింది.కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుంది. 3 టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి తొలి టెస్ట్ మొదలవుతుంది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి రెండో టెస్ట్ జరుగుతుంది.
బిజినెస్
గుండెపోటుతో ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి
ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు 'రోహన్ మిర్చందానీ' (Rohan Mirchandani) డిసెంబర్ 21 రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఎపిగామియా మాతృ సంస్థ డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరించింది.అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన తన ప్రియతమ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ అకాల మరణం చెందారని డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రోహన్ లేకపోయినప్పటికీ.. ఆయన విలువలు మాకు మార్గదర్శకంగా కొనసాగుతాయి. అయన కలలను నిజం చేయడానికి, సంస్థను అభివృద్ధి చేయడానికి మేము కలిసి పని చేస్తామని కంపెనీ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.అంకుర్ గోయెల్ (సీఓఓ & వ్యవస్థాపక సభ్యుడు), ఉదయ్ థాక్కర్ (కో-ఫౌండర్ & డైరెక్టర్) నేతృత్వంలో కంపెనీ రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఇందులో రోహన్ కుటుంబం కూడా ఉంటుంది. రోహన్ మా గురువు, స్నేహితుడు.. నాయకుడు. అతని విజన్‌ని ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నామని అంకుర్ గోయెల్ & ఉదయ్ థాక్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
70 గంటల పని: ప్రముఖ సీఈఓ ఏమన్నారంటే?
భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే.. యువత వారానికి 70 గంటలు పని చేయాలని, ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' గతంలో పేర్కొన్నారు. దీనిపైన పలువురు పారిశ్రామిక వేత్తలు మిశ్రమంగా స్పందించారు. కాగా ఇప్పుడు ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' వ్యాఖ్యానించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిమితా థాపర్ మాట్లాడుతూ.. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల లాభం పొందేది యజమానులే.. కానీ ఉద్యోగులు కాదని వెల్లడించారు. ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే యజమానులు.. ఎక్కువ గంటలు పనిచేయండని వివరించారు. అయితే అభివృద్ధి పేరుతో ఉద్యోగులపైన పనిభారాన్ని మోపకూడని అన్నారు.ఈ విషయం మీద షాదీ.కామ్ వ్యవస్థాపకుడు 'అనుపమ్ మిట్టల్' మీద స్పందిస్తూ.. నారాయణ మూర్తి మాటలతో ఏకీభవించారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే.. తప్పకుండా కస్టపడి పనిచేయాలి. నేను అమెరికాలో ఉన్నప్పుడు రోజుకు 16 గంటల చొప్పున పని చేశానని పేర్కొన్నారు. మనిషి ఎదగాలంటే.. పనిగంటలతో సంబంధం లేకుండా అంకితభావంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ప్రపంచంలో అతిచిన్న కెమెరా ఇదే
ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఇమేజ్ సెన్సర్ చిప్. అమెరికన్ కెమెరాల తయారీ కంపెనీ ‘ఓమ్నివిజన్’ కెమెరాల్లో ఉపయోగించే ఈ ఇమేజ్ సెన్సర్ చిప్‌ను ‘ఓవీఎం 6948’ పేరుతో ఇటీవల రూపొందించింది.‘చిప్ ఆన్ టిప్’ అనే ప్రచారంతో అందుబాటులోకి తెచ్చిన ఈ చిప్ ప్రపంచంలోనే అత్యంత చిన్న ఇమేజ్ సెన్సర్ చిప్‌గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. దీని పొడవు 0.65 మి.మీ., వెడల్పు 0.65 మి.మీ., మందం 1.158 మి.మీ. అంటే, దాదాపు ఒక పంచదార రేణువంత పరిమాణంలో ఉంటుంది.ఇది 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఫొటోలు తీయడానికి ఉపయోగపడుతుంది. ఎండోస్కోప్ సహా వివిధ వైద్య పరికరాల కెమెరాల్లో ఉపయోగించడానికి ఇది అత్యంత అనువుగా ఉంటుంది. ఇది సెకనుకు 30 ఫ్రేముల సామర్థ్యంతో వీడియోలు కూడా తీయగలదు.
ప్రియురాలితో బెజోస్ పెళ్లి.. ఖర్చు అన్ని వేలకొట్లా?
అమెజాన్ ఫౌండర్, ప్రపంచ ధనవంతులలో రెండో వ్యక్తి 'జెఫ్ బెజోస్' మళ్ళీ పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రేయసి 'లారెన్ శాంచెజ్'ను త్వరలోనే పెళ్లిచేసుకోనున్నారు. ఈ పెళ్ళికి ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.జెఫ్ బెజోస్ డిసెంబర్ 28న ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్నారు. కాగా 2023 మేలో బెజోస్, లారెన్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సమయంలో ఈమెకు బెజోస్ సుమారు రూ.21 కోట్ల ఖరీదైన పింక్ డైమండ్ రింగ్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో జరగనున్న వీరి పెళ్ళికి.. పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.2018 నుంచి బెజోస్, లారెన్ డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయం 2019లో నిజమని తెలిసింది. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన 55 ఏళ్ల లారెన్ అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంది. 60 ఏళ్ల జెఫ్ బెజోస్ తన భార్య 'మెకంజీ స్కాట్'కు 2019లోని విడాకులు ఇచ్చారు. అప్పటికే వీరిద్దరికి నలుగురు సంతానం ఉన్నారు. ఈ విడాకుల తరువాత బెజోస్, లారెన్ బంధం బయటపడింది. లారెన్‌కు కూడా గతంలో పెళ్లైంది. ఈమెకు ముగ్గురు సంతానం ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఇల్లు ఇంద్రభవనం.. కుబేరుడిలాంటి భర్త: ఎవరీ ఫ్యాషన్ ఐకాన్?జెఫ్ బెజోస్ నికర విలువప్రపంచ కుబేరుడైన ఇలాన్ మస్క్ తరువాత, రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ నికర విలువ 244 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. దీని విలువ భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 20 లక్షల కోట్ల కంటే ఎక్కువ.
ఫ్యామిలీ
బంధాలను ప్రభావితం చేసే బాల్యానుభవాలు
రాహుల్, పూజ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. ఇద్దరికీ ఆఫీసులో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లపాటు వాళ్ల కాపురం అందంగా, ఆనందంగా సాగింది. ఆ తర్వాత అవగాహనలో సమస్యలు ఏర్పడ్డాయి, విభేదాలు పెరిగాయి. రాహుల్ తనకు తగినంత సమయం ఇవ్వడం లేదని పూజ భావిస్తోంది. ఆమె అవసరాలు తీర్చడాన్ని ఒత్తిడిగా రాహుల్ భావిస్తున్నాడు. ఈ విషయమై తరచూ గొడవలు పడుతున్నారు. ఆ గొడవలను వారికి వారు పరిష్కరించుకోలేక కౌన్సెలింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.మూలాలు బాల్యానుభవాల్లో..మొదటి సెషన్లో విడివిడిగా రాహుల్, పూజలు తమ చిన్ననాటి అనుభవాలను వివరించారు. రాహుల్ చిన్నప్పుడు తన తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా ఎమోషనల్ సపోర్ట్ పొందలేకపోయాడు. ఫలితంగా అతనిలో అవాయిడెంట్ అటాచ్మెంట్ ఏర్పడింది. దీంతో బంధాలలో సాన్నిహిత్యం కంటే స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటున్నాడు. పూజ బాల్యంలో తల్లిదండ్రుల నుంచి అనిశ్చితమైన ప్రేమను పొందింది. పూజ తల్లిదండ్రులు ఆమె ఎమోషనల్ అవసరాలను కొన్నిసార్లు తీర్చేవారు, మరికొన్నిసార్లు విస్మరించేవారు. ఫలితంగా ఆమెలో యాంగ్షియస్ అటాచ్మెంట్ ఏర్పడింది. తన భాగస్వామి కాస్త దూరంగా ఉంటే చాలు అభద్రతను, భయాన్ని అనుభవిస్తోంది. దాంతో నిత్యం తనతోనే ఉండాలని రాహుల్ పై ఒత్తిడి పెంచుతోంది. ఈ వ్యత్యాసాల కారణంగా చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారాయి. ఒకరినొకరు తీవ్రంగా ప్రేమిస్తున్నప్పటికీ అపార్థాలకు దారితీశాయి.రెండు నెలల్లో సమస్యలు దూరం.. ఇద్దరితో మాట్లాడి, వారి అటాచ్మెంట్ స్టయిల్స్ గురించి, వాటివల్ల ఏర్పడుతున్న సమస్యల గురించి అర్థం చేసుకున్నాక, వాటిని బ్యాలెన్స్ చేయడానికి వారికి సూచించిన వ్యూహాలు కొన్ని..1. రాహుల్ తన స్వేచ్ఛ కోసం చేసే పనులు ప్రేమను తిరస్కరించడం కాదని పూజ గుర్తించాలి. అలాగే తన నిరంతర ధ్రువీకరణ అవసరాన్ని పరిమితం చేసుకోవాలి. 2. ఇద్దరూ తమ భావోద్వేగాలను, అవసరాలను స్పష్టంగా, నిర్మాణాత్మకంగా కమ్యూనికేట్ చేయడం ప్రారంభించారు. ఉదాహరణకు, పూజకు ధ్రువీకరణ అవసరం ఉన్నప్పుడు, ఆమె ప్రశ్నల ద్వారా కాకుండా తన భావాలను చెప్పడం నేర్చుకుంది.3. పూజకు ఇవ్వాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ప్రాధాన్యాన్ని గుర్తించి రాహుల్.. ఆమెకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు. అదే సమయంలో పూజ కూడా రాహుల్ స్వేచ్ఛకు గౌరవం ఇవ్వడం తెలుసుకుంది.4. ఇరువురూ తమ రోజువారీ జీవనంలో పరస్పర సహకారం, చిన్నచిన్న ఆనందాలను ఆస్వాదించేందుకు సమయం కేటాయించటం మొదలుపెట్టారు. ఉదాహరణకు, వారాంతాల్లో కలిసి వాకింగ్ చేయడం లేదా ఒక కొత్త హాబీని ఆరంభించడం లాంటివి.రెండు నెలల కౌన్సెలింగ్ తర్వాత వారి సంబంధంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. దాంతో, వారి మధ్య గొడవలు తగ్గి, ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ పెరిగాయి.అటాచ్మెంట్ థియరీ మన చిన్ననాటి అనుభవాలు, పెంపకం విధానాలు మన ప్రస్తుత సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే సిద్ధాంతమే అటాచ్మెంట్ థియరీ. బాల్యంలో తల్లిదండ్రులతో ఏర్పడే అనుబంధం, మన వ్యక్తిత్వానికి, భావోద్వేగ వ్యవహారానికి, ముఖ్యంగా ప్రేమ సంబంధాలకు మూలస్తంభం అవుతుంది. అయితే, ఈ అటాచ్మెంట్ శైలులు స్థిరమైనవి కావు, వాటిని మార్చుకోవచ్చు. ఇందులో మూడు రకాలున్నాయి. సెక్యూర్ అటాచ్మెంట్సెక్యూర్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు ప్రేమ, నమ్మకం, అనుబంధానికి ప్రాధాన్యమిస్తారు. ఇతరులతో సంబంధాలను బలంగా, స్వతంత్రంగా, అనురాగపూర్వకంగా నిర్వహించగలుగుతారు. ఉదాహరణకు ఒక సెక్యూర్ వ్యక్తి తన భాగస్వామి కొంత సమయం స్వతంత్రంగా గడపాలని కోరితే, దాన్ని సానుకూలంగా అర్థం చేసుకుంటాడు.యాంగ్షియస్ అటాచ్మెంట్యాంగ్షియస్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు సంబంధాల్లో ఎక్కువ భయాన్ని, అస్థిరతను అనుభవిస్తారు. వీరు ఎక్కువగా భావోద్వేగ ధ్రువీకరణ కోసం భాగస్వామిపై ఆధారపడతారు. ఉదాహరణకు భాగస్వామి తక్షణమే ఫోన్ కాల్కి ప్రతిస్పందించకపోతే, తనపై ప్రేమ లేదా శ్రద్ధ తగ్గిందని అనుమానపడతారు.అవాయిడెంట్ అటాచ్మెంట్అవాయిడెంట్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యమిస్తారు. అనుబంధం, సాన్నిహిత్యాన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు ఈ అటాచ్మెంట్ శైలి ఉన్న వ్యక్తి.. భాగస్వామి తనతో ఎక్కువ సమయం గడపాలని కోరితే.. తన స్వేచ్ఛను లాగేసుకుంటున్నట్లు భావిస్తాడు, ప్రతిఘటిస్తాడు.
ఫ్రెండ్లీ స్టయిలిస్ట్ శరణ్యారావు
ఫ్యాషన్ వరల్డ్‌లో తెలుగువాళ్లు తక్కువగా కనిపిస్తారు.కానీ క్రియేటివ్ స్కిల్స్‌తో గట్టిగా నిలబడతారు!వాళ్లలో శరణ్యారావు పేరును చెప్పుకోవచ్చు గొప్పగా!శరణ్య స్వస్థలం విశాఖపట్నం. ముస్తాబు చేయడంలో ముందుండేది చిన్నప్పటి నుంచీ! శరణ్య అలంకరణ, స్టయిలింగ్కి తొలి మోడల్ ఆమె చెల్లెలే! ఇంటి పనుల్లో అమ్మ బిజీగా ఉండి, చెల్లిని రెడీ చేయలేకపోతే ఆ బాధ్యత తను తీసుకునేది! అది క్రమంగా అభిరుచిగా మారింది. తన పాకెట్ మనీతో మేకప్ వస్తువులు కొనేది. ఏ చిన్న ఫంక్షన్ అయినా చెల్లిని చక్కగా ముస్తాబు చేసి మురిసిపోయేది. ఆ అలంకరణను కొన్నిసార్లు అందరూ మెచ్చుకున్నా, చెల్లికి నచ్చేది కాదు. మరికొన్నిసార్లు ఎవ్వరికీ నచ్చకపోయినా, చెల్లికి మాత్రం తెగ నచ్చేది. ఇష్టాయిష్టాల్లో ఒకొక్కరిదీ ఒక్కో టేస్ట్ అని అర్థంచేసుకుంది శరణ్య. వాటిని బ్యాలెన్స్ చేస్తూ అందరూ మెచ్చే స్టయిలింగ్‌ని చూపించొచ్చు అని తెలుసుకుంది. రానురాను అదే ఆమె సిగ్నేచర్ స్టయిలింగ్ అయింది. ఫ్యాషన్ మీదున్న మక్కువతో బెంగళూరులో ఫ్యాషన్ కోర్సుచేసి, పేరున్న డిజైనర్ దగ్గర కొంతకాలం పనిచేసింది. తర్వాత హైదరాబాద్ వచ్చి స్టయిలింగ్ స్టార్ట్ చేసింది. పర్ఫెక్ట్ బాడీ, బ్రాండెడ్ దుస్తులతోనే స్టయిలింగ్ అనే ప్రాక్టీస్‌ని మార్చేసింది. పర్సనాలిటీ, బాడీ టైప్, బాడీ టోన్, కంఫర్ట్ వంటివాటిని దృష్టిలో పెట్టుకుని స్ట్రీట్ షాపింగ్ దుస్తులతో స్టయిలింVŠ చేస్తూ పర్ఫెక్ట్ అనిపించుకోవడం మొదలుపెట్టింది. అలా శరణ్య స్టయిలింగ్కి ఫిదా అయ్యి, ఆమె స్టయిలింగ్‌తో గార్జస్ అనిపించుకున్న వారిలో శ్రీలీల, ఐశ్వర్యా మీనన్, కావ్యా థాపర్, దక్షా నాగర్కర్, అదితీ గౌతమి, మాళవికా నాయర్, మిర్నా మీనన్ ఉన్నారు. రామ్ పోతినేని, సుశాంత్, సత్యదేవ్ లాంటి మేల్ యాక్టర్స్‌కూ శరణ్య స్టయిలింగ్ చేసింది. ‘తిమ్మరుసు’, ‘స్కంద’, ‘భోళా శంకర్’ వంటి సినిమాలకు స్టయిలిస్ట్‌గా పనిచేసింది. సినిమా కలర్ పాలెట్‌ను ఫాలో అవుతూ.. లెవెన్త్ అవర్‌లో కూడా కూల్‌గా స్టయిలింగ్ అందించే డైరెక్టర్స్ ఫ్రెండ్లీ స్టయిలిస్ట్‌గా శరణ్యకు మంచి పేరుంది. అలా బోయపాటి, మెహర్ రమేశ్ వంటి డైరెక్టర్లకు ఆమె ఫేవరిట్ స్టయిలిస్ట్ అయింది.
రుక్మాంగద చరిత్ర
సూర్యవంశానికి చెందిన ఋతధ్వజుడు విదిశా మహారాజు. ఆయన కొడుకు రుక్మాంగదుడు. ఋతధ్వజుడి తదనంతరం రుక్మాంగదుడు రాజ్యభారాన్ని చేపట్టాడు. రుక్మాంగదుడి భార్య సంధ్యావళి. విష్ణుభక్తుడైన రుక్మాంగదుడికి సంధ్యావళి అన్ని విధాలా అనుకూలమైన భార్య. వారికి కొడుకు పుట్టాడు. అతడికి ధర్మాంగదుడు అని నామకరణం చేసి, అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. విష్ణుభక్తి తత్పరులైన తల్లిదండ్రుల పెంపకంలో ధర్మాంగదుడు కూడా బాల్యం నుంచి విష్ణుభక్తుడయ్యాడు.విష్ణుభక్తులలో అగ్రగణ్యుడైన అంబరీషుని ద్వాదశీ నియమం మాదిరిగానే, రుక్మాంగదుడికి ఏకాదశి నియమం ఉండేది. దశమి, ద్వాదశి తిథులలో ఏకభుక్తం పాటిస్తూ, ఏకాదశి తిథినాడు ఉపవాసం చేసేవాడు. తాను మాత్రమే కాకుండా, తన రాజ్యంలోని ప్రజలందరూ ఈ వ్రత నియమాన్ని పాటించాలని చాటింపు వేయించాడు. రాజభక్తులైన ప్రజలు తు.చ. తప్పకుండా ఏకాదశి వ్రత నియమాన్ని నియమం తప్పకుండా పాటించేవారు. రుక్మాంగదుడి పాలనలోని ప్రజలందరూ ఏకాదశీ వ్రత పరాయణులు కావడంతో వారందరూ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్లసాగారు. రుక్మాంగదుడి విదిశా రాజ్యంలో యమదూతలకు అడుగుపెట్టే అవకాశం లేకుండాపోయింది. యముడికి పనిలేకుండా పోయింది. ఈ పరిస్థితికి యముడు కలత చెందాడు. వెంటనే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు. ‘కమలసంభవా! విదిశారాజ్యంలో నాకు పనిలేకుండా పోయింది. ఆ రాజ్యంలో నేను శిక్షించదగిన వారెవరూ లేరు. ఎలాగైనా, వారి ఏకాదశీ వ్రతానికి భంగం కలిగించు’ అని కోరాడు.యముడి ద్వారా రుక్మాంగదుడి వ్రతదీక్షను, అతడి ప్రజల భక్తితత్పరతలను తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారి వ్రతదీక్షను పరీక్షించదలచాడు. అప్పటికప్పుడే తన సంకల్పంతో మోహిని అనే అప్సరసను సృష్టించాడు. ‘మోహినీ! నువ్వు భూలోకానికి వెళ్లు. అక్కడ రుక్మాంగదుడి ఏకాదశి వ్రతానికి భంగం కలిగించు’ అని ఆదేశించాడు.బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు మోహిని భూలోకానికి చేరుకుంది.విదిశా రాజధాని వెలుపల అరణ్యప్రాంతంలో ఉన్న శివాలయంలో కూర్చుని, వీణ వాయించసాగింది.అదే సమయానికి రుక్మాంగదుడు మృగయా వినోదం కోసం అరణ్యానికి వచ్చాడు.కీకారణ్యంలో సంచరిస్తూ, ఎన్నో క్రూరమృగాలను వేటాడాడు. వేట ముగించుకుని, రాజధాని వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. కొంత దూరం వచ్చాక, శ్రావ్యమైన వీణానాదం వినిపించింది. అరణ్యంలో వీణానాదం ఎక్కడిదని రుక్మాంగదుడు ఆశ్చర్యపోయాడు. వీణానాదం వస్తున్న దిశగా ముందుకు సాగుతూ, శివాలయం వద్దకు వెళ్లాడు. ఆలయంలోకి అడుగు పెడుతూనే, ఆలయ మండపంలో వీణ వాయిస్తూ ఉన్న ముగ్ధమోహన సుందరాంగి మోహిని కనిపించింది. ఆమె రూపలావణ్యాలను చూడగానే రుక్మాంగదుడు మోహపరవశుడయ్యాడు.‘సుందరాంగీ! నిన్ను చూడగానే వలచాను. నీకు సమ్మతమైతే క్షత్రియోచితంగా గాంధర్వ వివాహం చేసుకుంటాను’ అన్నాడు.‘రాజా! అనుదిన సుఖభోగాలను అందించగలవంటే, నేను నీకు భార్యను కాగలను’ అందామె.ఆమెను ఆ ఆలయంలోనే గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుని, ఆమెను వెంటపెట్టుకుని రాజధానికి చేరుకున్నాడు రుక్మాంగదుడు.కొన్నాళ్లకు యథావిధిగా ఏకాదశి వచ్చింది. రుక్మాంగదుడు నియమానుసారం దశమినాడు ఏకభుక్తుడై, ఏకాదశి రోజున ఉపవాసం ప్రారంభించాడు.‘నన్ను అనుదినం సుఖభోగాలలో ముంచెత్తుతానని చెప్పి, ఉపవాసాలు, వ్రతాలు అంటూ నన్ను ఉపేక్షించడం తగునా? ఉపవాసం చాలించి, నాతో విహరించు, పద’ అంది మోహిని. ‘సూర్యుడు పడమరన ఉదయించినా, మేరు మంధర పర్వతాలు భూమిలోకి కుంగిపోయినా, అగ్నిహోత్రం చల్లబడిపోయినా నా వ్రత నియమాన్ని మాత్రం నేను తప్పను’ అని బదులిచ్చాడు రుక్మాంగదుడు.అతడి సమాధానానికి ఆగ్రహించిన మోహిని, అతడిని నానా దుర్భాషలాడింది. ‘ఏకాదశి వ్రత నియమాన్ని విడిచిపెట్టడం తప్ప నీకు ఇష్టమయినది ఇంకేం చేయమన్నా చేస్తాను, చెప్పు’ అనునయంగా అన్నాడు రుక్మాంగదుడు.‘అలాగైతే, నీ కొడుకు తల నరికి ఇవ్వు’ అందామె.రుక్మాంగదుడి కొడుకు ధర్మాంగదుడు ఆ మాట విన్నాడు. తన తండ్రి వ్రతనియమానికి భంగం కలగకుండా ఉండటమే ముఖ్యమని తలచాడు. వెంటనే ఖడ్గం తీసుకుని, మోహిని ఎదుట నిలిచి, తన కంఠాన్ని తానే నరికేసుకున్నాడు.ఇది చూసి మోహిని భయభ్రాంతురాలైంది.బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమయ్యారు.‘రుక్మాంగదా! నీ వ్రతనియమం సాటిలేనిది. ఇహపరాలలో అనంత సౌఖ్యాలను అనుభవించు. ఇప్పుడే నీ కొడుకును బతికిస్తున్నాం’ అని పలికి, ధర్మాంగదుడిని బతికించి, అంతర్ధానమయ్యారు. మోహిని సత్యలోకానికి వెళ్లిపోయింది. ∙సాంఖ్యాయన
ఫిట్.. బాడీ సెట్..
కండలు తిరిగే దేహం అంటే యువతకు యమ క్రేజ్ ఉంటుంది. దీనికోసం జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తూ చెమటలు చిందిస్తుంటారు. కొందరు రెగ్యులర్‌గా వెళ్లి సిక్స్ ప్యాక్ వచ్చేంత వరకూ కష్టపడుతుంటారు. కండలు పెరిగేందుకు ప్రొటీన్ పౌడర్ వంటివి తీసుకుంటుంటారు. వీటివల్ల దుష్పరిణామాలు చాలానే ఉంటాయి. అయితే అథ్లెటిక్ బాడీ అంటే గత కొంతకాలంగా యువతలో క్రేజ్ పెరిగిపోతోంది. విల్లులా దేహాన్ని మలుచుకునేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ దేహాన్నే మీసోమార్ఫ్ దేహం అని అంటుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రౌండ్స్‌లో పరుగులు పెడుతూ.. వ్యాయామాలు చేస్తున్నారు. దీంతో ఫిట్నెస్తో పాటు మానసిక ఉల్లాసం, చక్కటి దేహాన్ని సొంతం చేసుకుంటున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లోని గ్రౌండ్స్‌లో యువత ఇటీవల ఫిట్నెస్ కోసం వ్యాయామాలు, కసరత్తులు చేస్తూ కనిపిస్తున్నారు. దీనికి పోటీ పరీక్షలైన ఆర్మీ, పోలీసులు, ఆరీ్పఎఫ్ వంటి నియామకాలు ఒక కారణమైతే.. స్పోర్ట్స్‌పై ఇంట్రెస్ట్‌తో కొందరు.. ఫిట్నెస్ మీద పెరిగిన అవగాహనతో మరికొందరు వ్యాయామాల భాటపడుతున్నారు. దీంతో ఉదయాన్నే లేచి గ్రౌండ్లో పరుగులు పెడుతున్నారు. అయితే గ్రౌండ్లో కసరత్తుల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి..? ఎలాంటి కసరత్తులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి..? ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం..శరీర భాగాలపై సమానంగా.. జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం కన్నా రోజూ రన్నింగ్ చేయడం వల్ల శరీరం ఎదుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. జిమ్‌లో ఒకే శరీర అవయవంపై మాత్రమే వర్క్‌లోడ్ పడుతుంటుంది. అదే గ్రౌండ్లో వర్కవుట్స్ వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ఒకే విధంగా పనిచేస్తుంది. హెవీ వర్కవుట్స్ చేయడం వల్ల కండరాలకు గాయమయ్యే ప్రమాదం ఉంటుంది. అది దీర్ఘకాలికంగా ఉండే అవకాశాలూ ఎక్కువే. అయితే గ్రౌండ్లో వర్కవుట్స్ ద్వారా వచ్చిన ఫలితాలు చాలా కాలం వరకూ ఉంటాయి. అంటే కొంత కాలం కసరత్తులు ఆపేసినా కూడా పెద్దగా శరీరంలో మార్పులు రావు. అదే జిమ్ మధ్యలో ఆపేస్తే శరీరం మొత్తం మారిపోతుంది.ట్రైనింగ్ పద్ధతులు.. గ్రౌండ్లో చేసేందుకు సాధారణంగా పలు రకాల ట్రైనింగ్ పద్ధతులు ఉంటాయి. వెయిట్ ట్రైనింగ్, సర్క్యూట్ ట్రైనింగ్, ఇంటర్వెల్ ట్రైనింగ్, రెప్యుటేషన్ ట్రైనింగ్, క్రాస్ కంట్రీ ట్రైనింగ్ అనే రకరకాల పద్ధతులు ఉంటాయి. ఎలాంటి ఖర్చూ లేకుండా చక్కటి శరీరాకృతి పొందవచ్చు. బర్ఫీ, జంపింగ్ జాక్స్ వంటి ఎక్సర్సైజ్ల ద్వారా శరీరం మొత్తంపై ప్రభావం పడుతుంది. వీటి వల్ల కొవ్వు తగ్గి బరువు తగ్గుతుంది. రన్నింగ్‌తో జీవక్రియలు మెరుగుపడటమే కాకుండా, శ్వాసవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్రౌండ్లో వర్కవుట్స్ చేసే వాళ్లు తప్పనిసరిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం తప్పనిసరి. దీంతో రన్నింగ్ చేసే స్టామినా పెరుగుతుంది.ఎత్తు పెరిగే అవకాశం.. గ్రౌండ్లో కసరత్తులు, రన్నింగ్ చేయడం వల్ల 18 ఏళ్ల లోపు పిల్లల్లో ఎత్తు పెరుగుతారని చెబుతున్నారు. అదే ఆ వయసులో ఉన్న వారు జిమ్ చేస్తే ఎత్తు పెరగడం ఆగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిమ్‌లో ఉండే పరికరాలు అందరూ వాడటం వల్ల కొన్ని చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కూల్‌డౌన్ పద్ధతులు తప్పనిసరి.. గ్రౌండ్లో రన్నింగ్ లేదా కసరత్తులు చేసిన తర్వాత బాడీ కూల్‌డౌన్, స్ట్రెచ్ ఎక్సర్సైజులు తప్పనిసరిగా చేయాలి. ఇది అలసిపోయిన కండరాలను యథాస్థితికి తీసుకొచ్చేందుకు పనికొస్తుంది. 30 ఏళ్లు దాటిన వాళ్లు ఎక్కువ కఠినమైన ఎక్సర్సైజులు చేయకపోవడం మంచిది. కండరాలపై స్ట్రెస్ పడకుండా చూసుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలోనే కసరత్తులు చేయడం మంచిది. – కె.ధర్మేందర్, ఫిజికల్ డైరెక్టర్డైట్ చాలా ముఖ్యం.. గ్రౌండ్లో వర్కవుట్ చేసే వారికి డైట్ చాలా ముఖ్యం. శరీర తీరు, బరువు, చేసే వర్కవుట్‌ను బట్టి ఆహారం తీసుకోవాలి. కార్బొహైడ్రేట్స్ఉన్న ఆహారపదార్థాలు తగ్గించాలి. ప్రొటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే కండరాలు పెరుగుతాయి. ఫైబర్ ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరిగి, బరువు పెరగదు. నీరు కూడా అధికంగా తీసుకుంటుండాలి. వర్కవుట్ కన్నా ముందు కనీసం ఒక లీటర్ నీళ్లు (గోరు వెచ్చటి నీరు) తాగాలి. – వసుధ, క్లినికల్ న్యూట్రిషనిస్టు
ఫొటోలు
International View all
గాజాపై దాడులు... 22 మంది దుర్మరణం
డెయిర్ అల్–బలాహ్: గాజాలోని పాలస్తీనియన్లు కనీసం తాగునీరు
భారత్, కువైట్ మధ్య... సుదృఢ బంధం
కువైట్ సిటీ: మిత్రదేశాలైన భారత్, కువైట్ మధ్య బంధం మర
రేపు సూర్యుడి సమీపానికి ‘నాసా’ పార్కర్
న్యూయార్క్: సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిన స్పేస
ట్రంప్ కలం నుంచి జాలువారిన అక్షరాలు
డొనాల్డ్ ట్రంప్ అనగానే వెంటనే గుర్తొచ్చేది అమెరికా అధ్యక్షుడిగానే కదా. ఆయన మంచి రచయితని చాలామందికి తెలియకపోవచ్చు.
ముంచుకొస్తున్న మిస్టరీ వ్యాధి ’డింగా డింగా’.. బాధితుల్లో వింత లక్షణాలు!
ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక్కడి ప్రజలను వణికిస్తోంది.
National View all
మోదీ చర్యలతో ఈసీ సమగ్రతకు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్య
భారత్, కువైట్ మధ్య... సుదృఢ బంధం
కువైట్ సిటీ: మిత్రదేశాలైన భారత్, కువైట్ మధ్య బంధం మర
మరో మూడు నెలల్లో ‘నిసార్’ ప్రయోగం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరిక
Jaipur Tanker Blast: మానవత్వమా.. నీవెక్కడ..?
జైపూర్ : మానవత్వానికి మాయని మచ్చ వంటి ఘటన రాజస్థాన్ జ
వెంకన్నకు కూడా దయ లేదాయె!
వెంకన్న దర్శనం చేసుకుని తిరిగివస్తున్న వారిని మృత్యువు కాటేసింది.
NRI View all
దేశ, విదేశాల్లో ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు..
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి
షార్లెట్‌లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు.
బంధించేశారు, ఒక్కపూటే భోజనం..రక్షించండి: కువైట్‌లో ఏపీ మహిళ ఆవేదన
ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్నమహిళ తనను కాపాడ్సాలిందిగా వేడుకుంటున్న సెల్ఫీ వీడియో ఒకటి
సిడ్నీలో ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి.
ఆస్ట్రేలియాలో ఘనంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించ
క్రైమ్
హైదరాబాద్‌లో హత్య.. కోదాడలో శవం
కోదాడ: సామాజిక మాధ్యమంలో చురుగ్గా ఉండే ఓ బాలిక చేసిన తప్పిదం ఆమె తల్లిదండ్రులను హంతకులుగా మార్చగా, మరో యువకుడు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ ఏడాది మార్చి నెలలో హైదరాబాద్‌లో హత్యకు గురై.. నాగార్జునసాగర్ కాలువలో శవంగా తేలిన యువకుడి కేసును పోలీసులు తొమ్మిది నెలల తర్వాత ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన ఓ కారు డ్రైవర్ తన భార్యతో కలిసి బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలసవచ్చి జగద్గిరిగుట్ట సమీపంలో నివాసముంటున్నారు. వీరికి 10వ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే సదరు బాలిక తరచూ రీల్స్ చేస్తూ పోస్ట్ చేసేది. ఈ పోస్టులను బోరబండకు చెందిన వివాహితుడైన ఆటో డ్రైవర్ కుమార్ గమనించి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం పెంచుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో కుమార్ బాలికకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి ఒక దగ్గర బంధించాడు. ట్యాబ్ సాయంతో కనిపెట్టి.. తమ కుమార్తె కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించారు. ఈ క్రమంలో బాలిక ట్యాబ్‌ను ఓపెన్ చేసి కుమార్‌తో చేసిన చాటింగ్‌ను గుర్తించారు. దీంతో బాలిక తల్లి మరో స్త్రీగా సామాజిక మాధ్యమంలో ఆటో డ్రైవర్ కుమార్‌తో పరిచయం పెంచుకుని తమ ఇంటికి ఆహ్వానించింది. ఆటోలో కుమార్ జగద్గిరిగుట్టకు వచ్చాడు. కుమార్ రాగానే అతడిని బంధించి తమ కుమార్తె ఆచూకీ చెప్పాలని ప్రాధేయపడ్డారు. ఎంత బతిమిలాడినా కుమార్ ఆచూకీ చెప్పకపోవడంతో అతడిపై తీవ్రంగా దాడి చేశారు. ఆ దాడిలో కుమార్ అపస్మారకస్థితికి చేరడంతో అతడి కాళ్లు, చేతులు కట్టేసి కారులో విజయవాడ వైపు తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో మునగాల వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ముక్త్యాల మేజర్ కాలువలో కుమార్‌ను పడేసి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. కుమార్ మృతదేహం కోదాడ సమీపంలోని బాలాజీనగర్ వద్ద కాలువ ఒడ్డుకు చేరింది. పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి స్థానిక కొమరబండ చెరువు అంచున ఖననం చేశారు. టెక్నాలజీ పట్టించింది.. మార్చిలో జరిగిన ఈ ఘటన తర్వాత బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్ చేరుకుని తమకు ఏమీ తెలియనట్లు వారి పనులు వారు చేసుకోసాగారు. సదరు బాలిక కూడా హైదరాబాద్‌లోని నింబోలిఅడ్డాలోని ఓ అనాథశరణాలయంలో ఉందని తెలుసుకొని ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. కుమార్ కనిపించకపోవడం, ఆటో కూడా దొరక్కపోవడంతో కుమార్ భార్య బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కుమార్ ఆటోకు ఉన్న నంబర్ ప్లేట్ మార్చి సదరు బాలిక తండ్రి ఉపయోగిస్తున్నాడు. దానిపై ఉన్న పేటీఎం క్యూఆర్ కోడ్‌ను మాత్రం తొలగించలేదు. ఆటోకు ఉన్న ప్రత్యేకమైన బంపర్‌ను కూడా అలాగే ఉంచారు. ఈ ఆనవాళ్లతో 10 రోజుల క్రితం పోలీసులు ఆటోను పట్టుకొని దానిని ఉపయోగిస్తున్న బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయం బయటపడింది. బోరబండ పోలీసులు రెండు రోజుల క్రితం కోదాడకు వచ్చి మృతదేహాన్ని జేసీబీ సాయంతో తవ్వించారు. ఎముకలను డీఎన్ఏ పరీక్షలకు పంపి అది కుమార్ మృతదేహమా.. కాదా అని నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం బాలిక ఒంటరిగా మారగా, కుమార్ భార్య భర్తను కోల్పోయి రోడ్డున పడింది.
Jaipur Tanker Blast: మానవత్వమా.. నీవెక్కడ..?
జైపూర్ : మానవత్వానికి మాయని మచ్చ వంటి ఘటన రాజస్థాన్ జైపుర్‌లో చోటు చేసుకుంది. ఈ శుక్రవారం ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్ ఢీకొట్టి మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న బాధితులు తమని కాపాడాలని వేడుకుంటూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తారు. స్థానికులు బాధితుల్ని రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారు జామున 5:30 గంటలకు రాజస్థాన్‌లోని జైపుర్‌లో జైపుర్-అజ్మీర్ హైవేపై ఓ పెట్రోల్ బంకులో ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు వ్యాపించాయి. ఆ సమయంలో బంకు వద్ద ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. దాదాపు 40 మంది గాయపడ్డారు.గాయపడిన వారిలో రాధేశ్యామ్ చౌదరి (32) ఒకరు. మంటల్లో చిక్కుకున్న రాధేశ్యామ్ తనని కాపాడాలని కోరుతూ 600 మీటర్లు పరిగెత్తారు. అక్కడే ఉన్న వారు రాధేశ్యామ్‌ను రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.రాధేశ్యామ్ చౌదరి నేషనల్ బేరింగ్స్ కంపెనీ లిమిటెడ్‌లో మోటార్ మెకానిక్. శుక్రవారం తెల్లవారు జామున విధులు నిమిత్తం ఇంటి నుంచి కంపెనీకి తన బైక్‌పై బయలు దేరాడు. ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్ ఢీకొట్టే సమయంలో రాధేశ్యామ్ అక్కడే ఉన్నారు. మంటల్లో చిక్కుకున్నారు. తనని తాను రక్షించుకునేందుకు 600 మీటర్లు పరుగులు తీశారు. అనంతరం కుప్పుకూలాడు. కొద్ది సేపటికి స్థానికులు రాధేశ్యామ్ చౌదరి సోదరుడు అఖేరామ్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రాధేశ్యామ్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడని, వెంటనే హీరాపురా బస్ టెర్మినల్‌కు రావాలని కోరాడు. దీంతో భయాందోళనకు గురైన అఖేరామ్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు మీడియాకు వివరించారు. ‘నా సోదరుడు తీవ్రంగా కాలిన గాయాలతో రోడ్డుపై ఆపస్మారస్థితిలో కనిపించాడు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సుమారు 600 మీటర్లు పరిగెత్తినట్లు స్థానికులు చెప్పారు. తనని కాపాడాలని ఆర్తనాదాలు చేశారని, సాయం కోసం అర్దిస్తే ఒక్కరూ ముందుకు రాలేదని,బదులుగా చాలా మంది వీడియోలు తీశాడని విలపించారు. రాధేశ్యామ్‌ను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ రాకకోసం ఎదురు చూశాం. కానీ రాలేదు. దీంతో కారులో నా సోదరుణ్ని జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రికి తరలించాం. అతను బ్రతుకుతాడనే నమ్మకం ఉంది. కానీ 85 శాతం కాలిన గాయాలు మరింత ఇబ్బంది పడుతున్నట్లు అఖేరామ్ కన్నీటి పర్యంతరమయ్యారు.
చిన్నారిని చిదిమేసిన సర్కారు నిర్లక్ష్యం
కొత్తపల్లి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై టీడీపీ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీవ్ర నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారి బలైంది. 108 అంబులెన్సుల నిర్వహణలో ప్రభుత్వం చేస్తున్న అనవసర రాజకీయాలు ఈ దారుణానికి పరోక్ష కారణం. అందుబాటులో 108 అంబులెన్స్ లేకపోవడంతో జరిగిన జాప్యంవల్ల సకాలంలో సరైన చికిత్స అందక తమ కుమార్తె మరణించిందని చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఏమిటంటే.. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో ప్రముఖ ప్రార్థనాలయానికి చెందిన పాస్టర్ కుమార్తె రత్నప్రకాశకు పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన జోగి షారోన్కుమార్తో వివాహమైంది. వీరు ప్రస్తుతం కృష్టా జిల్లా పామర్రు నియోజకవర్గం వీరంకిలాకు గ్రామంలో ఉంటున్నారు. వీరి కుమార్తె బెట్సీ జయకీర్తన (3) కొద్దిరోజులుగా ఉప్పాడలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద తల్లితో కలిసి ఉంటోంది. క్రిస్మస్ వేడుకలు సమీపించడంతో శనివారం ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మేడపై ఉన్న పాత చెక్క బీరువాను కిందకు దింపి, పైన గదులు శుభ్రపరుస్తున్నారు. కింద ఆడుకుంటున్న జయకీర్తన చెక్క బీరువా గెడను పట్టుకుని వేలాడింది. అంతే.. ఒక్కసారిగా బీరువా ఆమె మీద పడింది. చిన్నారి ఏడుపు విని పరుగున వెళ్లిన కుటుంబ సభ్యులు ఆమెను బయటకుతీసి కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించడంతో 108 అంబులెన్సుకు ఫోన్‌చేశారు. అయితే, అది అందుబాటులో లేకపోవడంతో కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆ చిన్నారిని బతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ 108 రాకపోవడంతో చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని కుటుంబ సభ్యులు ప్రైవేటు అంబులెన్సులో కాకినాడకు తరలించారు. మార్గంమధ్యలోనే జయకీర్తన ప్రాణాలు విడిచింది. అప్పటివరకూ ఆడుకుంటూ కేరింతలు కొట్టిన ఆ చిన్నారి అంతలోనే మరణించడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆనందంగా పండగ జరుపుకోవాల్సిన సమయంలో పండంటి బిడ్డను పోగొట్టుకున్నామంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి మృతదేహాన్ని వీరంకిలాకులకు తరలించారు. సకాలంలో 108 అంబులెన్సు వచ్చి ఉంటే తమ పాప బతికేదని తల్లి రత్నప్రకాశ విలపించింది.
పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో సైబర్ మోసగాళ్ల వల
గోదావరిఖని: పార్ట్‌టైం ఉద్యోగం ఎరచూపి సైబర్ మోసగాళ్లు ఓ గృహిణి నుంచి రూ.31.60 లక్షలు కాజేశారు. గోదావరిఖని సైబర్ క్రైం ఏసీపీ వెంకటరమణ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ గృహిణికి ఇన్‌స్ట్రాగామ్‌లో సైబర్ మోసగాళ్లు పరిచయమయ్యారు. మాటల్లో పెట్టి పార్ట్‌టైం ఉద్యోగం ఇప్పిస్తామని, దీనిద్వారా ఆదాయం వస్తుందని నమ్మించారు. ఇందుకోసం తొలుత తమకు రూ.10 వేలు డిపాజిట్‌గా పంపించాలని చెప్పారు. ఆ తర్వాత ఆమె అకౌంట్‌కు రూ.13 వేలు పంపించారు. మరోసారి రూ.10 వేలు పంపిస్తే రూ.18 వేలు ఖాతాలో జమచేశారు. ఇలా రూ.లక్ష వరకు పంపించగా.. ఇక టాస్క్ ప్రారంభమైందని, అది పూర్తయ్యే వరకూ సొమ్ము పంపించాలని చెప్పగానే.. విడతల వారీగా రూ.31.60 లక్షలను ఆమె అవతలి వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు పంపించింది. ఆ తర్వాత ఉద్యోగం రాకపోగా, వారి నుంచి సమాచారం కూడా లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం సీఐ కృష్ణకుమార్.. హైదరాబాద్ మలక్‌పేట్‌కు చెందిన సోహెల్ రెస్టారెంట్లో పనిచేస్తున్న మహమ్మద్ అవాద్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన పేరిట బ్యాంకుల్లో మూడు ఖాతాలు తెరిచి ఇలియాస్ అనే వ్యక్తికి ఇచ్చానని, ఇందులో డబ్బు జమచేస్తామని, ఆ తర్వాత తమ బ్యాంకులోకి మళ్లించుకుంటారని చెప్పాడు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అసలు సైబర్ మోసగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.