Top Stories
ప్రధాన వార్తలు
వెంకన్న సన్నిధిలో విషాదం.. ఎప్పుడేం జరిగిందంటే..
నిన్న(బుధవారం) రాత్రి 8:35 గంటలకు ఒక్కసారిగా గేట్లు తెరవడంతో భక్తజనం దూసుకెళ్లారు.క్యూలెన్ల నిర్వహణలో అధికారులు చేతులెత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం
గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యు ఘోష వినిపించింది.. ఏడుకొండలవాడి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో ఆధ్యాత్మిక నగరి దద్దరిల్లింది.. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో తిరుపతి భీతిల్లింది.. చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు.. మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. కిందపడ్డ వాళ్లను తొక్కుకుంటూ వెళ్తున్న వారు కొందరు.. ప్రాణ భీతితో తోసుకొచ్చేసిన వారు మరికొందరు.. వెరసి కనీవినీ ఎరుగని రీతిలో తొక్కిసలాటకు కారణమైంది.. పడిపోయిన వారిని బతికించు కోవాలని ఆయా కుటుంబాల తాపత్రయం గుండెలు పిండేసింది.. ఆ దృశ్యాలు చూపరుల కంట తడిపెట్టించాయి.గతంలో గోదావరి పుష్కరాలు.. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి..! నాడు పబ్లిసిటీ పిచ్చి.. నేడు అలవిమాలిన అలసత్వం!సందర్భం ఏదైనప్పటికీ ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యానికి అమాయకులు బలి అవుతున్నారు! కోట్లాది మంది తమ జీవిత కాలంలో ఒక్క అవకాశం కోసం ఆరాట పడే వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ ఏర్పాట్లలో సర్కారు వైఫల్యం కారణంగా పెను తొక్కిసలాట చోటు చేసుకుని ఏడుగురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.సాక్షి తిరుపతి నెట్వర్క్: చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది. పవిత్ర తిరుమల–తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఆరుగురు భక్తుల ప్రాణాలను హరించింది. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడేలా చేసింది. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల ప్రాణాలతో చలగాటమాడింది. చెల్లాచెదురుగా పడిన అమాయక భక్తుల మృతదేహాలు.. తీవ్రగాయాలపాలైన భక్తుల ఆర్తనాదాలు.. వేలాది మంది భక్తుల హాహాకారాలతో తిరుపతి నగరం హృదయ విదారకంగా మారిపోయింది. రాజకీయ ప్రచారం కోసం, నిరాధార ఆరోపణలతో ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం చంద్రబాబు తిరుమల–తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) వ్యవస్థను భ్రష్టు పట్టించడమే ఇంతటి పెను విషాదానికి దారితీసింది. ఏటా భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కనీస మార్గదర్శకాలను గాలికొదిలేయడంతో భక్తులు బలైపోయారు. రోజుకు 75 వేల మందికిపైగా భక్తులు తరలివస్తున్నా.. ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు ఆరేడు లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నా.. ఏనాడూ ఇటువంటి విషాదం సంభవించ లేదు. కేవలం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారహిత్యంతోనే తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట సంభవించి మాటలకందని పెను విషాదానికి దారితీసింది. ముమ్మాటికీ ఇది నిర్లక్ష్యమేవైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించటం ఆనవాయితీ. పది రోజుల పాటు కొనసాగనున్న వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియ ఏర్పాటు చేసింది. తిరుపతిలో తొమ్మిది, తిరుమలలో ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. పది రోజుల పాటు ఈ టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగనుంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం నుంచి 10 రోజుల పాటు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో బైరాగిపట్టెడ ఎంజీఎం స్కూల్, ఎంఆర్‌పల్లి, శ్రీనివాసం, విష్ణునివాసం, రెండో చౌల్ట్రీ, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, సత్యనారాయణపురం (జీవకోన) ప్రాంతాల్లో టీటీడీ టోకన్ల కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయాన్ని భక్తులకు చేరవేయంలో టీటీడీ విఫలమైంది. దీంతో భక్తులు మంగళవారం రాత్రే తిరుపతికి పయనమయ్యారు. బుధవారం ఉదయం నుంచే తండోపతండాలుగా టోకెన్లు జారీ చేసే కేంద్రాలకు చేరుకున్నారు. ముఖ్యంగా తిరుపతి బైరాగిపట్టెడ ప్రాంతంలోని ఎంజీఎం స్కూల్‌కు చేరుకున్న భక్తులను క్యూలైన్లోకి అనుమతించలేదు. దీంతో సాయంత్రానికి భారీగా భక్తులు పెరిగిపోయారు. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి పంపమని సూచించినా, డీఎస్పీ ఒకరు నిరాకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. రాత్రి 8.35 గంటల ప్రాంతంలో అందరినీ ఒకేసారి విడిచి పెట్టమని డీఎస్పీ ఆదేశించటంతో పోలీసులు గేట్లు తెరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లోకి ప్రవేశించటంతో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో కింద పడిపోయిన వారిని పైకి లేపే అవకాశం లేక.. ఊపిరి ఆడక ఆరుగురు మృతి చెందారు. కింద పడిపోయిన వారిని బతికించేందుకు భక్తులు, పోలీసులు కొందరు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అదే విధంగా శ్రీనివాసం, ఇందిరా మైదానం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ కేంద్రాలకు వచ్చిన వారిని వచ్చినట్లే క్యూలైన్లోకి అనుమతించారు. సాయంత్రం అయ్యే సరికి ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట ప్రారంభమైంది. శ్రీనివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. మరి కొందరు గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిని, తీవ్ర గాయాలపాలైన వారిని రుయా, సిమ్స్ ఆస్పత్రులకు తరలించారు. మరణించిన వారు, తీవ్ర గాయాలైన వారిలో ఎక్కువ మంది మదనపల్లి, తమిళనాడుకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.అన్ని కౌంటర్ల వద్ద తొక్కిసలాటఅలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద బుధవారం ఉదయం నుంచి భక్తులు పడిగాపులు కాశారు. రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద భక్తులను క్యూలైన్లోకి అనుమతించే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు భక్తులపై లాఠీ చార్జ్ చేశారు. క్యూ లైన్లోకి వెళ్లే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది భక్తులు కిందపడిపోయారు. ఈ తోపులాటలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నారులు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. తోపులాట చోటు చేసుకోవటంతో భక్తుల అరుపులు, రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. టీటీడీ వైఫల్యం..వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భారీగా భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వం, టీటీడీ పూర్తిగా విఫలమైంది. క్యూలైన్ల వద్ద టాయిలెట్లు లేవు. దీంతో మహిళలు, చిన్నారులు నరకం అనుభవించారు. అనేక ప్రాంతాల్లో కనీసం తాగు నీరు కూడా ఏర్పాటు చేయలేదు. అన్న ప్రసాద వితరణ ఎక్కడా కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మంచి నీరు అందించి చేతులు దులుపుకున్నారు. తిరుపతిలోని రామానాయుడు స్కూల్లో ఒకసారిగా గేట్లు తెరవడంతో జనాలు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి 40 మంది స్పృహ తప్పి పడిపోయారు. ఇందులో అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం నరసాపురం నుంచి 360 మంది గోవిందమాల భక్తులు కాలి నడకన తిరుపతికి చేరుకున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. వీరితో పాటు వచ్చిన బంధువులు బాధితులకు ఏమి జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. ఎటు వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక స్కూల్‌కు దగ్గరలో ఉన్న పద్మావతి పార్కులో వేచి చూస్తున్నారు. ఈ స్కూల్లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. దారుణం జరిగిపోయాక పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అప్పుడు, ఇప్పుడు ప్రచారార్భాటమే2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచారార్భాటం కోసం చేసిన షూటింగ్ గిమ్మిక్కుతో 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చంద్రబాబు తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు టీటీడీ వ్యవస్థను భ్రష్టు పట్టించడం అడుగడుగునా కనిపిస్తోంది. బాబుకు తోడుగా అభినవ సనాతన ధర్మ పరిరక్షకుడిగా బ్రాండ్ ఇమేజ్ కోసం తిరుపతిలో సినీ తరహాలో గిమ్మిక్కులు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా టీడీడీ వ్యవస్థను దెబ్బ తీయడంలో తానో చేయి వేశారు. దీంతో అధికార టీడీపీ కూటమి సేవలో తరిస్తే చాలు.. సామాన్య భక్తులు ఏమైపోయినా పర్వాలేదన్నట్లుగా టీటీడీ యంత్రాంగం నిర్లిప్తంగా మారిపోయింది. టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల అదనపు జేఈవో వైఖరి భక్తుల పాలిట యమపాశమైంది. వైకుంఠ ఏకాదశినాడు తిరుమలలో శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఆశించిన భక్తుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఈ ఘోరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులను కలచివేస్తోంది. రామానాయుడు స్కూల్లో దారుణంఅక్కడే 40 మంది వరకు అపస్మారక స్థితిలోకి.. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంతిరుపతి అర్బన్: తిరుపతిలోని రామానాయుడు స్కూల్లో బుధవారం రాత్రి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట సంభవించి 40 మంది వరకు స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 360 మంది గోవిందమాల భక్తులు మూడ్రోజులపాటు నడిచి తిరుపతికి చేరుకున్నారు. వీరంతా అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండల నరసాపురం నుంచి వచ్చారు. వీరితో పాటు వచ్చిన బంధువులు తమ వారికి ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. ఎటు వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక స్కూల్‌కు దగ్గరలో ఉన్న పద్మావతి పార్కులో తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా ఈ స్కూల్లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారున్నట్లు సమాచారం. భక్తజ నాన్ని అదుపుచేయడంలో అధికార యంత్రాంగం పూర్తి గా విఫలమైంది. అయితే, ఈ చీకట్లోనే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. పెద్దఎత్తున పర్సులు, సెల్ఫోన్లు, జేబులు కొల్లగొట్టారు. దారుణం జరిగిపో యాక పోలీసు రావడంతో భక్తులు మండిపడుతున్నారు.నాడు కట్టుదిట్టంగా.. నేడు నిర్లక్ష్యంగా..తిరుపతి సిటీ: వైకుంఠ ఏకాదశి రోజు నుంచి పదిరోజుల పాటు సామాన్య భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీటీడీ పటిష్ట ఏర్పాట్లుచేసింది. కానీ, నేడు కూటమి ప్రభుత్వంగానీ, టీటీడీ గానీ సామాన్య భక్తులను పట్టించుకోలేదని శ్రీవారి భక్తులు దుమ్మెత్తిపోస్తూ గత ప్రభుత్వంలో చేపట్టిన చర్యలను గుర్తుచేస్తున్నారు.నాడు2023 డిసెంబరు 23వ తేదీ వైకుంఠ ఏకాదశి, 2024 జనవరి 1వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. 22వ తేదీ వేకువజాము 5 గంటల నుంచి టోకెన్ల జారీ ప్రారంభించారు. తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాల్లో వీటిని జారీచేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 10వేల చొప్పున పంపిణీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. మొత్తం పది రోజుల్లో లక్ష టోకెన్లు జారీచేశారు. ప్రతి కౌంటర్ దగ్గర సింగిల్ లైన్ క్యూలు ఏర్పాటుచేశారు. కౌంటర్ వద్ద ఒకే వ్యక్తి టోకెన్ తీసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు కౌంటర్ల వద్ద రద్దీలేకుండా చర్యలు చేపట్టారు. అలాగే.. జారీచేసిన టోకెన్లు, మిగిలినవి పారదర్శకంగా తెలిసేలా డిస్ప్లే బోర్డులు పెట్టారు. దీంతో భక్తులకు సక్రమంగా సమాచారం అందేది. అలాగే.. ఒక్కో కౌంటర్ వద్ద టీటీడీ సెక్యూరిటీతోపాటు పోలీసులు సుమారు 25 మంది భద్రతా విధులు నిర్వర్తించేవారు. గంట గంటకూ టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే వారు.నేడు..వైకుంఠ ద్వార దర్శన టోకెన్లకు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాలు ఏర్పాటుచేశారు. గురువారం వేకువజాము 5 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించాల్సి ఉంది. అయితే, భక్తుల రద్దీ కారణంగా బుధవారం రాత్రి 9 గంటలకే పంపిణీ మొదలుపెట్టారు. దీనికితోడు అపరిమితంగా టోకెన్ల జారీకి టీటీడీ సన్నద్ధం కావడంతో కౌంటర్ల వద్దకు పెద్దసంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అదుపు చేయలేని పరిస్థితుల్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో భక్తుల మధ్య తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. శ్రీనివాసం దగ్గర ఏర్పాటుచేసిన కౌంటర్ల వద్దకు భక్తులను ఒక్కసారి గుంపులుగా వదలడమే తొక్కిసలాటకు కారణంగా భావిస్తున్నారు. ఒక్కో కౌంటర్ వద్ద కేవలం ఇద్దరు ముగ్గురు పోలీసులు మాత్రమే విధులు నిర్వర్తించారు. తొక్కిసలాట జరిగాక అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. చనిపోయిన వారు వీరే..లావణ్య స్వాతి(37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం శాంతి (35) కంచరపాలెం, విశాఖపట్నం రజని (47), మద్దెలపాలెం, విశాఖపట్నం మల్లిగ(50), మేచారి గ్రామం. సేలం జిల్లా, తమిళనాడు బాబు నాయుడు(51), రామచంద్రపురం, నరసరావుపేట నిర్మల (45), పొల్లచ్చి, తమిళనాడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతా పం తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితు లను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.తిరుపతి ఘటనపై సీఎం రేవంత్ విచారం సాక్షి, హైదరాబాద్: తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు సాను భూతి ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన సాయం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచి్చన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఒకే ఒరలో రెండు కత్తులు!
అమెరికా రిపబ్లికన్ పార్టీలో టెక్ మితవాదులు, జాతీయ మితవాదులు వేర్వేరు వర్గాలు. ఇరువురూ ఒక్కటై డోనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు తోడ్పడ్డారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రంప్ విజయం తర్వాత మొదటిసారి ఈ రెండు వర్గాలూ పరస్పరం కత్తులు దూసుకున్నాయి. అమెరికా జనాభాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతేతరులతో భర్తీ చేయడానికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది జాతీయవాద మితవాదుల ఆరోపణ. అందివచ్చే ఎలాంటి అవకాశాలైనా సరే వాడుకుని అమెరికా యావత్ ప్రపంచాన్ని జయించాలని టెక్ రైటిస్టులు అనుకుంటారు. అయితే ట్రంప్ దగ్గర టెక్ రైటిస్టులకే ప్రాధాన్యత లభిస్తోంది. కలసికట్టుగా ఎన్నికలు గెలిచినా, ఇప్పుడు ఒక వర్గం ఓడిపోబోతోంది.మొన్న క్రిస్మస్ రోజు అమెరికా సోషల్ మీడియా భగ్గుమంది. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కేంద్రబిందువుగా సంస్కృతి పరమైన విష పోరాటం మొదలైంది. విమర్శకులు ఆయనపై విద్వేషంతో బుసలు కోట్టారు. అసభ్య వ్యాఖ్యలతో దాడి చేశారు. మస్క్ కూడా వారితో ఢీ అంటే ఢీ అన్నాడు. అసలేమిటి ఈ వివాదం? వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‌ను డోనాల్డ్ ట్రంప్ తన ఏఐ–పాలసీ సీనియర్ సలహాదారుగా నియమించుకోడంతో అమెరికాలో అగ్గి రాజుకుంది. ‘మాగా’ (ఎంఏజీఏ– మేక్ అమెరికా గ్రేట్ అగైన్) వాదానికి గట్టి మద్దతుదారు, ఇంటర్నెట్ ట్రోలింగ్ సుప్రసిద్ధుడు అయిన లారా లూమర్ పెట్టిన పోస్టు తీవ్ర మితవాదులను అట్టుడికించింది. ‘అమెరికా ఫస్ట్’ ఉద్యమానికి ట్రంప్ వెన్నుపోటు పొడిచాడంటూ రగిలిపోయారు. కృష్ణన్ భారతీయ వలసదారు. అమెరికా పౌరుడు. ఆయన భారతీయ మూలాలను ‘మాగా’ మితవాద శిబిరం సహించలేక పోయింది. హెచ్–1బి వీసా విధానంపై మండిపడింది. అమెరికన్ కంపెనీలు నిపుణులైన వలసదారులను నియమించుకోడానికి ఇది వీలు కల్పిస్తోంది. ఇలా వచ్చి పనిచేస్తున్న వారిలో మూడొంతుల మంది ఇండియన్లే. ఈ నేపథ్యంలో శ్రీరామ్ కృష్ణన్ నియామకానికి స్పందనగా ఇంటర్నెట్లో జాత్యహంకారం జడలు విప్పింది. జాతీయ వాదులు భారతీయ టెక్ వర్కర్లపై విద్వేషపూరితమైన మీమ్స్‌తో సోషల్ మీడియాను ముంచెత్తారు. వారిని ‘మూడో ప్రపంచ ఆక్రమణ దారులు’గా లూమర్ అభివర్ణించాడు. అంతేకాదు, అతడో సిద్ధాంతం లేవనెత్తాడు. దాని పేరు ‘గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీ’. అమెరికా జనా భాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతే తరులతో భర్తీ చేయడా నికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది లూమర్ సిద్ధాంతం. హెచ్–1బి వీసా విధానానికి మస్క్ మద్దతునిజానికి శ్వేత ఆధిక్యానికి మస్క్ వ్వతిరేకం ఏమీ కాదు. తన సొంతమైన ‘ఎక్స్’ వేదిక మీద దాన్ని సమర్థించినట్లే కనిపించేవాడు. అయినా, తనకు విశేషమైన అవకాశాలు అందించిన, అపార సంపద కట్టబెట్టిన ప్రభుత్వ విధానం (హెచ్–1బి) మీద ఇప్పుడు జరుగు తున్న దాడిని సహించలేక పోయాడు. అమెరికా పౌరుడిగా మారక ముందు మస్క్ కూడా వలస వచ్చినవాడే. దక్షిణాఫ్రికా నుంచి హెచ్–1బి వీసా మీద వచ్చి స్థిరపడ్డాడు. ఆయన కూడా తన కంపెనీల్లో అలాంటి వారిని నియమించుకున్నాడు. ఈ హెచ్–1బి వీసా విధానానికి మద్దతు ఇస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టాడు. ఈ విధానం వల్ల అమెరికా గొప్ప ప్రతిభావంతులను సమకూర్చుకుంది అని అతడి వాదన. ఐటీ కేంద్రమైన సిలికాన్ వ్యాలీకి ఈ దృక్పథం ఇబ్బందికరమైంది కానప్పటికీ, రిపబ్లికన్ పార్టీలోని తిరోగమన, జాతీయ వాద వర్గాలకు మస్క్ అభిప్రాయం అసంతృప్తి కలిగించింది ‘అమెరికా ప్రజలు ఎప్పటికీ అమెరికాను ఒక స్పోర్ట్స్ టీమ్ లేదా కంపెనీ అనుకోరు’ అంటూ జాక్ పొసొబిక్ బదులిచ్చాడు. వీటన్నిటికీ బదు లిస్తూ, ‘ఈ అంశం మీద నేను యుద్ధానికి సిద్ధం, దాని పర్యవ సానాలు మీ ఊహక్కూడా అందవు’ అంటూ మస్క్ తన విమర్శకు లను హెచ్చరించాడు. దీంతో ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ రంగంలోకి దిగాడు. హెచ్–1బి వీసాలు పెద్ద స్కామ్ అనీ, వాటిని సమర్థించి మస్క్ తన ‘నిజ స్వరూపం’ బయట పెట్టుకున్నాడని ప్రతి దాడికి దిగాడు.నిజానికి హెచ్–1బి వీసాలను వ్యతిరేకించడం ‘మాగా’ పంథా కాదు. ఈ విధానంలో లోపాలు ఉన్నాయి కాబట్టి దీని పట్ల వ్యతిరేకత వచ్చింది. ఇండిపెండెంట్ సెనెటర్ బెర్నీ శాండర్స్ గతంలో మాట్లా డిన ప్రకారం, వ్యాపారవేత్తలు అత్యంత నిపుణులైన వలస ఉద్యోగులను నియమించుకుని సిబ్బంది వ్యయాలు గణనీయంగా తగ్గించు కోడానికి హెచ్–1బి పదునైన ఆయుధంలా ఉపకరిస్తుంది. మస్క్ సమ్మిళిత వలసవాదంగా పేర్కొంటూ అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులకు ఇప్పుడు మద్దతు ఇస్తున్నాడు. అయితే, ఎక్స్ వేదిక మీద జాతివివక్ష అంశంలో దొంగాటలు ఆడాడు. నియో నాజీలతో సంబంధాలు నెరిపే జర్మన్ తీవ్ర మితవాద పార్టీకి గట్టి మద్దతు ఇచ్చాడు. సయోధ్య కుదిరేనా?రిపబ్లికన్ పార్టీలోని ఈ రెండు మితవాద వర్గాల ఐక్యత ప్రశ్నా ర్థకంగా మారింది. ఏమైనా ఇవి తమ విభేదాలు పరిష్కరించుకున్నా యని ఒక దశలో అనిపించింది. జాతీయ మితవాదులకు, టెక్ మిత వాదులకు మధ్య సయోధ్యకు కాబోయే ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ ఒక ఉదాహరణ. పీటర్ థియల్ అనే మితవాద టెక్ బిలియనీర్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న కంపెనీలో వాన్స్ పనిచేశాడు. అడ్డూ ఆపూ లేని స్వేచ్ఛావిపణులను ఈ కాబోయే ఉపాధ్యక్షుడు విమర్శించాడు. తద్వారా మంచి పలుకుబడి ఉన్న జాతీయ మితవాద నేతలను ఆకట్టుకున్నాడు. హెచ్–1బి వీసా ఉద్యోగులను నియమించుకునే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నప్పటికీ వాన్స్ హెచ్–1బి వీసాలను వ్యతిరేకించాడు. పార్టీని ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా సమైక్యం చేయడం ఆయన బాధ్యత కావడం ఇందుకు కారణం కావచ్చు. అయితే ఎన్నికల తరువాత దాన్ని పక్కన పెట్టారు.ట్రంప్ పదవి చేపట్టిన తర్వాత టెక్ రైట్–నేషనలిస్ట్ రైట్ మధ్య ఉద్రిక్తతలు ఎలా ఉండబోతున్నాయన్న దానికి తాజా ఘర్షణ ఒక ప్రివ్యూ లాంటిది. జాతీయవాదులు వారు కోరుకున్నది చాలావరకు సాధించుకుంటారు. మూకుమ్మడి దేశ బహిష్కరణలు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు. ఇది వారికి ఆనందం కలిగించి తీరు తుంది. సిలికాన్ వ్యాలీతో వారి పోరు విషయాన్ని ప్రస్తుతానికి ఆయన పట్టించుకోడు. ట్రంప్ గత హయాంలోనూ ఇదే జరిగింది. బడా కార్పొరేట్ల ప్రయోజనాలు పక్కన పెట్టి సామాన్యులకు మేలు చేసే ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని 2016లో చేసిన వాగ్దానాన్ని ఆయన పూర్తిగా విస్మరించాడు. ఇది జాతీయ మితవాదులు కోరుకున్నదానికి విరుద్ధం. భారీ వ్యాపార సంస్థలకు, ధనికులకు ట్రంప్ అప్పట్లో పన్నులు తగ్గించాడు. మరోవంక, ‘ముస్లిం బ్యాన్’, అక్రమ వలస దారుల పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం వంటి కఠిన చర్యలను టెక్ అధిపతులు, సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకించారు. టెక్ రైట్‌కే ప్రాధాన్యం?ఈసారి టెక్ మితవాద వర్గానికి పాలనలో ప్రాధాన్యం లభిస్తోంది. మస్క్, టెక్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కొత్తగా ఏర్పా టైన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్–డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న మెంట్ ఎఫిషియన్సీ) నిర్వహించబోతున్నారు. బిలియనీర్ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ ఈ విభాగం సిబ్బంది నియామకంలో తోడ్పడతాడు. ఇక శ్రీరామ్ కృష్ణన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధాన రూపకల్పనలో అధ్యక్షుడికి సలహాలు ఇస్తాడు. ట్రంప్ ఇతర నియా మకాల్లో సైతం ధనికవర్గాలకు, శక్తిమంతులకు ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రభుత్వం వారితో స్నేహపూర్వకంగా ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక జాతీయ మితవాదుల్లోని కొద్దిమంది ముఖ్యులకూ ట్రంప్ క్యాబినెట్లో చోటు లభించనుంది.ట్రంప్ ‘న్యూయార్క్ పోస్ట్’తో మాట్లాడుతూ, ‘నేనెప్పుడూ వీసా లను ఇష్టపడ్డాను. వీసాలకు నేను ఎప్పుడూ అనుకూలమే. అందుకే వాటిని అమలు చేశాను’’ అన్నాడు. ఈ ప్రకటన ద్వారా మస్క్‌కు ఆయన పూర్తి మద్దతు పలికాడు. చిట్టచివరిగా ఇంకో విషయం ప్రస్తా వించాలి. సంపన్నుల చేతిలో ముఖ్యంగా క్రితంసారి కంటే ఈసారి మరింత ఎక్కువ అధికారం ఉంటుంది. అలీ బ్రెలాండ్ వ్యాసకర్త సీనియర్ పత్రికా రచయిత(‘ది అట్లాంటిక్’ సౌజన్యంతో)
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి.
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: శు.దశమి ఉ.11.54 వరకు, తదుపరి ఏకాదశి,నక్షత్రం: భరణి ప.3.08 వరకు, తదుపరి కృత్తిక,వర్జ్యం: రా.2.25 నుండి 3.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.16 నుండి 11.02 వరకు, తదుపరి ప.2.42 నుండి 3.26 వరకు,అమృతఘడియలు: ఉ10.40 నుండి 12.10 వరకు.సూర్యోదయం : 6.37సూర్యాస్తమయం : 5.37రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం...ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.వృషభం...వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.మిథునం....కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. చర్చలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన మార్పులు.కర్కాటకం...కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి.సింహం....సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.కన్య....ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.తుల...వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.వృశ్చికం...పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ధనలాభం. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.ధనుస్సు...కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.మకరం....వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు పరిపరివి«ధాలుగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.కుంభం..సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.మీనం..మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
IND vs AUS: సిడ్నీ పిచ్‌పై ఐసీసీ రేటింగ్..
భారత్, ఆ్రస్టేలియా మధ్య ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’(Border Gavaskar Trophy)లో భాగంగా చివరి టెస్టు జరిగిన సిడ్నీ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సానుకూల నివేదిక ఇచ్చింది. ఈ పిచ్‌ను ‘సంతృప్తికరం’ అనే రేటింగ్‌ను ఇచ్చింది. సీమ్ బౌలింగ్‌కు విపరీతంగా స్పందించడంతో పాటు అనూహ్య బౌన్స్‌తో కనిపించిన ఈ పిచ్‌పై పేస్ బౌలర్లు చెలరేగారు. గ్రౌండ్స్‌మన్ ఈ టెస్టు కోసం కొత్త తరహా పచ్చికను ఉపయోగించారు. ఫలితంగా సిడ్నీలో తక్కువ సమయంలో ముగిసిన టెస్టుల జాబితాలో (బంతుల పరంగా) ఈ మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. మ్యాచ్‌లో రెండు అర్ధసెంచరీలు మాత్రమే నమోదయ్యాయి.ఐసీసీ ఇచ్చిన నివేదిక వల్ల మున్ముందు ఇలాంటి ‘సంతృప్తికర’ పిచ్‌లను రూపొందించేందుకు తాము సిద్ధమవుతామని ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు (సీఏ) స్పందించింది. మరో వైపు తొలి నాలుగు టెస్టులు జరిగిన పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ మైదానాలు ‘చాలా బాగున్నాయి’ అనే రేటింగ్‌తో ఐసీసీ కితాబునిచ్చింది.సిడ్నీలో ఘోర ఓటమి.. కాగా ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. ఈ సిరీస్‌తో పాటు భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు కూడా గల్లంతయ్యాయి.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ తర్వాతి మ్యాచ్‌ల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో భారత్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది.ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లి సైతం ఈసారి సత్తాచాటలేకపోయాడు. ఇక సిరీస్ ఓటమి అనంతరం భారత జట్టు గురువారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. అనంతరం జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లకు టీమిండియా సిద్దం కానుంది.చదవండి: ‘అమెరికన్ల ఆటగా మార్చడమే లక్ష్యం’
ఆగని రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం జపోరిఝియా ప్రాంతంలోని పట్టణంపై రష్యా ప్రయోగించిన మిస్సైల్ దాడిలో 13 మంది ఉక్రేనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 30 మంది గాయాలపాలయ్యారని రీజనల్ గవర్నర్ ఇవాన్ ఫెడరోవ్ తెలిపారు. రక్తమోడుతున్న పౌరులను నగర వీధిలో రోడ్డుపైనే ప్రథమ చికిత్సనందిస్తున్న దృశ్యాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన టెలిగ్రామ్ సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘కేవలం సాధారణ పౌరులున్న సిటీపై దాడి చేస్తే అమాయకులు చనిపోతారని తెలిసీ రష్యా దారుణాలకు ఒడిగడుతోంది’’అని జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గత మూడేళ్లుగా తరచూ రష్యా గగనతల దాడులతో ఉక్రేనియన్ల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత యూరప్‌లో అతిపెద్ద సంక్షోభంగా మారిన ఈ యుద్ధంలో ఇప్పటిదాకా వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు.
చంద్రయాన్–4, గగన్‌యాన్‌పై ప్రత్యేక దృష్టి
తిరువనంతపురం/చెన్నై: చంద్రయాన్–4, గగన్‌యాన్ వంటి ప్రయోగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ రాకెట్ సైంటిస్టు డాక్టర్ వి.నారాయణన్ చెప్పారు. ఇస్రో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. రాబోయే కాలంలో ఎన్నో ముఖ్యమైన మిషన్లు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను ఇస్రో చైర్మన్‌గా, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్’ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ఇస్రోకు గతంలో ఎంతోమంది ప్రఖ్యాత సైంటిస్టులు నేతృత్వం వహించారని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో తాను భాగస్వామి కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇదొక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇస్రో చైర్మన్‌గా తన నియామకంపై తొలుత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి తనకు సమాచారం అందిందని తెలిపారు. అన్ని విషయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయిస్తారని, పీఎంఓ సమాచారం చేరవేస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో ఇస్రో చేపడుతున్న ప్రయోగాలన్నీ విజయవంతం అవుతున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇస్రో ముందున్న అతిపెద్ద ప్రయోగం గగన్‌యాన్ అని వెల్లడించారు. శ్రీహరికోట నుంచి నావిగేషన్ శాటిలైట్ ఎన్వీఎస్–02ను ప్రయోగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అమెరికాకు చెందిన వాణిజ్యపరమైన ఉపగ్రహాన్ని ఇస్రో మార్క్–3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నామని, అలాగే గగన్‌యాన్‌లో భాగంగా రాకెట్ తయారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. చంద్రయాన్–4లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి నమూనాలు సేకరించి తీసుకురావాలని సంకల్పించామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ మొదలైందని తెలిపారు. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం మన లక్ష్యమని, ఇందుకు ప్రధాని మోదీ ఇప్పటికే అనుమతి మంజూరు చేశారని వి.నారాయణన్ చెప్పారు. ఈ స్పేస్ స్టేషన్లో ఐదు మాడ్యూల్స్ ఉంటాయని, ఇందులో మొదటి మాడ్యూల్‌ను 2028లో ప్రయోగించడానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు. నారాయణన్‌కు అభినందనల వెల్లువ ఇస్రో చైర్మన్‌గా నియమితులైన వి.నారాయణన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఆయన నియామకం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. తమిళనాడులో సాధారణ కుటుంబంలో జన్మించిన నారాయణన్ ఇస్రోకు చైర్మన్ కావడం సంతోషంగా ఉందన్నారు. నారాయణన్ నేతృత్వంలో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నాలుగు దశాబ్దాల అనుభవం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని మేలకట్టు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో వి.నారాయణన్ జన్మించారు. తొమ్మిదో తరగతి వరకు ఆయనకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. ఇబ్బందులు ఎదుర్కొంటూనే చదువులో రాణించారు. తమిళనాడులో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. డిప్లొమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్ సాధించారు. ఏఎంఐఈ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 1989లో ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో క్రయోజెనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చదివారు. 2021లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ పొందారు. 1984లో ఇస్రోలో అడుగుపెట్టారు. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లో సేవలందించారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ అభివృద్ధికి కృషి చేశారు. ఎన్నో రాకెట్ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ రంగంలో నారాయణన్‌కు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రయాన్–3 విజయానికి దోహదపడిన జాతీయస్థాయి నిపుణుల కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. ద్రవ, ఘన ఇంధన మోటార్లను రూపొందించడంలో నిపుణుడిగా పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్పీఎస్సీ) డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 14న ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. జనవరి 10వ తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్‌కు అనుమతి. మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150 రూపాయలు పెంపుకు అనుమతి. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100రూపాయలు పెంపు. అలానే జనవరి 11 నుంచి 5 షోస్‌కు అనుమతి. జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు. సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు పెంపు. టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణా ప్రభుత్వం బెనిఫిట్ షోస్‌కు మాత్రం అనుమతి నిరాకరించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'గేమ్ చేంజర్' (Game Changer Movie). జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో కేవలం ఐదు పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. ఓ నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే గేమ్ ఛేంజర్ కథ.
బాబోయ్ రూపాయ్
కీలక కరెన్సీగా చలామణీ అవుతున్న డాలర్ మారకంలో రూపాయి విలువ నానాటికీ తగ్గిపోతోంది. తాజాగా బుధవారం 17 పైసలు పతనమై మరో కొత్త కనిష్ట స్థాయి 85.91కి క్షీణించి 86 స్థాయికి మరింత చేరువైంది. గతేడాది మొత్తం మీద చూస్తే రూపాయి విలువ 3 శాతం కరిగిపోయింది. అంతర్జాతీయంగా భౌగోళిక .. రాజకీయ అనిశ్చితి, మన మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడుతుండటం, పెరుగుతున్న వాణిజ్య లోటు .. ముడి చమురు రేట్లులాంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. ఇలా రూపాయి రోజురోజుకూ సెంచరీకి దగ్గరవుతుండటం పలు వర్గాలను కలవరపెడుతోంది. రూపాయి పడిపోవడం కొన్ని ఎగుమతుల ఆధారిత రంగాలకు లాభించేదే అయినా.. దిగుమతుల ఆధారిత రంగాలకు మాత్రం బిల్లుల మోత మోగిపోతోంది. విదేశీ విద్య కూడా భారమవుతోంది. ఈ నేపథ్యంలోనే రూపాయి పతనంతో ప్రభావితమయ్యే అంశాలపై ప్రత్యేక కథనం. ఎగుమతి చేసే ఆటో కంపెనీలకు ఓకే.. వాహనాలను ఎగుమతి చేస్తున్న బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ వంటి దేశీ ఆటోమొబైల్ కంపెనీలకు రూపాయి క్షీణత లాభించనుంది. అలాగే, ఆటో విడిభాగాల తయారీ సంస్థల ఆదాయాల్లో కూడా ఎక్కువ భాగం ఎగుమతుల నుంచి వస్తుండటంతో వాటికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. భారత ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 33 శాతంగా ఉంటోంది. మరోవైపు, దిగుమతుల ఆధారిత లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, వోల్వోలాంటి కంపెనీలకు మాత్రం రూపాయి పతనం ప్రతికూలమే అవుతుంది. ఐటీ, ఫార్మా హ్యాపీస్... దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి రూపాయి క్షీణత బాగా లాభిస్తుంది. చాలామటుకు సంస్థల ఆదాయాలు డాలర్లలోనే ఉండటం వల్ల రూపాయి 1 శాతం క్షీణిస్తే ఐటీ కంపెనీల ఆదాయం సుమారు 0.5 శాతం, లాభం దాదాపు 1.5 శాతం పెరుగుతుందని అంచనా. మూడో త్రైమాసికంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 125 పైసలు పైగా పతనమైంది. దీంతో ఐటీ సంస్థల మార్జిన్లు 30–50 బేసిస్ పాయింట్లు (0.30–0.50 శాతం) వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో చైనా యువాన్, జపనీస్ యెన్, మెక్సికన్ పెసోలాంటివి కూడా పతనం కావడం వల్ల ఆకర్షణీయమైన రేటుకు సేవలు అందించడంలో మన సంస్థలకు పోటీ పెరిగిపోతోంది. ఇక ఫార్మా విషయానికొస్తే.. మన ఫార్మా ఎగుమతుల్లో మూడో వంతు వాటా అమెరికా మార్కెట్‌దే ఉంటోంది కాబట్టి ఎగుమతి కంపెనీలకు రూపాయి పతనం సానుకూలంగా ఉంటుంది. అయితే, రూపాయి క్షీణత వల్ల.. దేశీ మార్కెట్‌పై ఫోకస్ పెట్టే సంస్థలకు వ్యయాలు పెరుగుతాయి.దిగుమతులకు భారం.. చమురు, పసిడి మొదలైన వాటి కోసం భారత్ ప్రధానంగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. పెట్రోల్‌తో మొదలెడితే ప్లాస్టిక్, ఎరువుల వరకు మనకు నిత్యం అవసరమయ్యే అనేక ఉత్పత్తులు, సర్వీసుల్లో క్రూడాయిల్ కీలకపాత్ర పోషిస్తోంది. ఆయిల్ రేటు పెరిగిందంటే.. దానికి సంబంధమున్న వాటన్నింటి రేట్లూ పెరుగుతాయి. రూపాయి మారకం విలువ వచ్చే ఏడాది వ్యవధిలో సగటున ప్రస్తుత స్థాయిలోనే ఉంటే దిగుమతుల బిల్లు భారం ఏకంగా 15 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 1.27 లక్షల కోట్లు) పెరగవచ్చని అంచనా. కరెన్సీ బలహీనపడటం వల్ల వంటనూనెలు, పప్పులు, యూరియా, డీఏపీలు మొదలైన దిగుమతులపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ప్రస్తుతం భారత్‌లో అసెంబుల్ చేసే స్మార్ట్ఫోన్లలో 80–90 శాతం వరకు దిగుమతి చేసుకున్న విడిభాగాలు ఉంటున్నాయని, ఫలితంగా రూపా యి క్షీణత వల్ల స్మార్ట్ఫోన్లతో పాటు ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులు ప్రియమవుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎల్రక్టానిక్స్‌కు సంబంధించి కరెన్సీ విలువ 5 శాతం క్షీణిస్తే వ్యయాలు 2 శాతం పెరుగుతాయని అంచనా. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును కూడా వాడుతుంటారు. మారకం విలువ ఒక్క రూపాయి మారినా.. దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే పవర్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి చేసే విద్యుత్ వ్యయాలు యూనిట్‌కి 4 పైసల మేర మారిపోతాయి. విదేశాల్లో చదువు.. తడిసిమోపెడు.. చాలామటుకు అంతర్జాతీయ యూనివర్సిటీలు విదేశీ కరెన్సీల్లోనే (డాలరు, పౌండ్లు, యూరోల్లాంటివి) ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తాయి. దీంతో రూపాయి బలహీనపడే కొద్దీ ఫీజుల భారం పెరుగుతుంటుంది. అలాగే విద్యాభ్యాసం కోసం అక్కడ నివసించే భారతీయ విద్యార్థుల రోజువారీ ఖర్చులు (ఇంటద్దె, ఆహారం, రవాణా మొదలైనవి) మన మారకంలో చూసుకుంటే పెరిగిపోతాయి. ఉదాహరణకు సగటున 50,000 డాలర్ల ట్యూషన్ ఫీజును పరిగణనలోకి తీసుకుంటే, గతేడాది రూపాయి విలువ 3 శాతం పడిపోవడంతో, జనవరిలో సుమారు రూ. 41.39 లక్షలుగా ఉన్న ట్యూషన్ ఫీజు .. డిసెంబర్ నాటికి రూ. 42.90 లక్షలకు పెరిగింది. అంటే డాలరు రూపంలో ఫీజు అంతే ఉన్నా.. రూపాయి విలువ పడిపోవడంతో కేవలం పన్నెండు నెలల్లో ఏకంగా రూ. 1.51 లక్షలకు పైగా భారం పెరిగినట్లయింది. సానుకూలం→ ఎగుమతి ఆధారిత రంగాలు → ఫార్మా→ ఐటీ సర్విసులు→ జౌళి→ ఉక్కు → రెమిటెన్సులు ప్రతికూలం → విదేశీ ప్రయాణాలు → విదేశీ చదువులు→ ధరల సెగ: ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, కార్లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైనవి → వ్యాపారాలు: కంపెనీలకు మార్జిన్ల ఒత్తిళ్లు. విస్తరణ ప్రణాళికలకు బ్రేక్. ఉద్యోగావకాశాలపై ప్రభావం, విదేశీ రుణాలు ప్రియం.– సాక్షి, బిజినెస్‌డెస్క్
మీ పిల్లలకు ఇలాగే వండి పెడుతున్నారా?
వివాహమైన 3 వారాలకే సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం
'రోహిత్ నిర్ణయం సరైనది కాదు.. ఇక విడ్కోలు పలికితే బెటర్'
ఒక్క మ్యాథ్స్ సూత్రం చాలు.. ఏఐ స్వరూపమే మారిపోతుంది..
'పుష్ప2' మేకింగ్ వీడియో.. బెంగాల్లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్
బార్లో అమ్మాయిలతో అసభ్య నృత్యాలు
నాలుగేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి
ప్రాణాలతో చెలగాటం.. తిరుమల ఘటనపై భక్తుల రియాక్షన్
కుర్రాడిగా అదృశ్యమై.. 23 ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో ప్రత్యక్షమై.. వింత ఘటన
Budget 2025: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు!
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం
ఎన్ని ఫిర్యాదులొచ్చినా మిమ్మల్ని వెతకడానికి ఎవరూ సాహసించరు సార్!!
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి.
నా బండి ఫొటో ఎందుకు తీశావురా?
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
రేపటి నుంచి (జనవరి 9) మరో క్రికెట్ పండుగ.. అభిమానులకు జాతరే..!
తిరుపతి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మీ పిల్లలకు ఇలాగే వండి పెడుతున్నారా?
వివాహమైన 3 వారాలకే సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం
'రోహిత్ నిర్ణయం సరైనది కాదు.. ఇక విడ్కోలు పలికితే బెటర్'
ఒక్క మ్యాథ్స్ సూత్రం చాలు.. ఏఐ స్వరూపమే మారిపోతుంది..
'పుష్ప2' మేకింగ్ వీడియో.. బెంగాల్లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్
బార్లో అమ్మాయిలతో అసభ్య నృత్యాలు
నాలుగేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి
ప్రాణాలతో చెలగాటం.. తిరుమల ఘటనపై భక్తుల రియాక్షన్
కుర్రాడిగా అదృశ్యమై.. 23 ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో ప్రత్యక్షమై.. వింత ఘటన
Budget 2025: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు!
క్షమాపణలు చెప్పిన యాంకర్ శ్రీముఖి.. అసలేం జరిగిందంటే?
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం
ఎన్ని ఫిర్యాదులొచ్చినా మిమ్మల్ని వెతకడానికి ఎవరూ సాహసించరు సార్!!
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి.
నా బండి ఫొటో ఎందుకు తీశావురా?
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
రేపటి నుంచి (జనవరి 9) మరో క్రికెట్ పండుగ.. అభిమానులకు జాతరే..!
తిరుపతి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
సినిమా
బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. సంక్రాంతికి మిస్ 'ఫైర్' !
నెల రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, బాహుబలి-2 రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ చిత్రం దంగల్ వసూళ్ల రికార్డ్‌పై పుష్పరాజ్ కన్నుపడింది. రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో దంగల్ కొనసాగుతోంది. ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు పుష్ప మేకర్స్ సరికొత్త ప్లాన్‌తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈనెల 11 నుంచి దాదాపు 20 నిమిషాల పాటు అదనంగా సీన్స్ జోడించనున్నట్లు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.అయితే తాజాగా ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. పుష్ప-2 ది రూల్ రీ లోడింగ్ వర్షన్ తేదీని మార్చారు. ముందుగా ప్రకటించిన డేట్ కాకుండా జనవరి 17న తీసుకు రానున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ నెల 11న పుష్ప-2 ఎక్స్ట్రా ఫైర్ చూడాలనుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. అందుకోసమేనా?..అయితే పుష్ప-2 రీ లోడింగ్ తేదీని మార్చడంపై నెట్టింట చర్చ మొదలైంది. ఈనెల 10న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీపడుతోంది. బాలయ్య డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో గేమ్ ఛేంజర్ కూడా బరిలో నిలిచింది. ఈ నేపథ్యంలో పుష్ప-2 రీ లోడింగ్ వర్షన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించి సంక్రాంతి సినిమాలకు షాకిచ్చారు మైత్రి మూవీ మేకర్స్.దీంతో పొంగల్‌కు రిలీజ్ అవుతోన్న సినిమాలకు పుష్ప-2 వల్ల పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.1831 కోట్లకు పైగా వసూళ్లతో బాహుబలి-2ను వెనక్కి నెట్టిన పుష్పరాజ్.. సంక్రాంతి చిత్రాలతో పోటీ పడితే వాటి పరిస్థితి ఏంటన్నది గమనార్హం. అందువల్లే మైత్రి మూవీ మేకర్స్ తమ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సినిమాలకు పోటీ ఉండకూడదనే రీ లోడింగ్ వర్షన్ తేదీని జనవరి 17 వరకు పొడిగించారు. దీంతో ఈ ఏడాది పొంగల్ బరిలో నిలిచిన నిర్మాతలకు ఊరట లభించింది. ఏదేమైనా మరో 20 నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేయడం రూ.2 వేల కోట్ల వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.ఇండియన్ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్ రూల్ ..అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేృవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. దీంతో జనవరి 11 నుంచి పుష్ప-2 రీ లోడెడ్ వెర్షన్ వస్తుందని చెప్పడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్..పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది. కేవలం 32 రోజుల్లో రూ.1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. #Pushpa2Reloaded in cinemas from January 17th. 🔥#Pushpa2 #Pushpa2TheRule#WildFirePushpa https://t.co/zBHbNJpZKD pic.twitter.com/ItZRonNWJt— Pushpa (@PushpaMovie) January 8, 2025
పుష్ప-2 హీరోపై కామెంట్స్.. స్పందించిన రాజేంద్ర ప్రసాద్
పుష్ప-2 సినిమాపై టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేశారు. హరికథ వెబ్ సిరీస్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఎర్రచందనం దొంగ కూడా హీరో అయిపోయాడు.. ఈరోజుల్లో హీరో అనే పదానికి అర్థాలే మారిపోయాయని అన్నారు. అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.ఆ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..'త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకు వచ్చేశాం. ఈ కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న వాడెవడో చందనం దొంగ హీరో.. సరే, ఈరోజుల్లో హీరో అనే పదానికి అర్థాలే మారిపోయాయి.' అని అన్నారు.అయితే తాజాగా తన కామెంట్స్‌పై రాజేంద్రప్రసాద్ స్పందించారు. పుష్ప -2 చిత్రంలో హీరో పాత్రపై ఆ రోజు నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. తాజాగా షష్టిపూర్తి అనే మూవీ ప్రెస్ మీట్‌కు హాజరైన ఆయన తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల అల్లు అర్జున్ను కలిసినప్పుడు ఇదే విషయంపై మాట్లాడుకున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చూసి ఇద్దరం నవ్వుకున్నామని వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని నెగెటివ్‌గా చూడకూడదు. సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలనే తెరపై చూపిస్తామని ఆయన అన్నారు.హీరో అనే పదానికి అర్థాలు మారిపోయాయి. సద్గుణాలు, విలువలు కలిగినవారే ఒకప్పుడు హీరోలు. కానీ ఇప్పుడు జులాయిగా, చెడు అలవాట్లు ఉండి.. అడ్డదారులు తొక్కేవారిని కూడా హీరో పాత్రలుగా చిత్రీకరిస్తున్నారు. జనాలు కూడా ఈ నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోలనే ఇష్టపడుతున్నారు. అయితే పుష్ప -2 సినిమాను కూడా ఈ జాబితాలోనే వేసేశాడు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్.కాగా.. రాజేంద్రప్రసాద్, నటి అర్చన చాలా ఏళ్ల తర్వాత కలిసిన నటిస్తోన్న తాజా చిత్రం షష్టిపూర్తి. ఈ చిత్రానికి పవన్ ప్రభాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రుపేశ్ చౌదరిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈసినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన రాజేంద్ర ప్రసాద్ పుష్ప-2 సినిమాపై చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు.పుష్ప వసూళ్ల సునామీ.. కాగా.. అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్‌లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.పుష్ప రీ లోడెడ్..తాజాగా పుష్ప-2 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతోన్న పుష్ప-2 మూవీకి అదనంగా మరో 20 నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేయనున్నారు. ఈ అప్డేట్ వర్షన్ సంక్రాంతి కానుకగా ఈనెల 11 నుంచి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 రీ లోడెడ్ పేరుతో మరిన్నీ సన్నివేశాలు యాడ్ చేస్తున్నారు. ది వైల్డ్ ఫైర్ గెట్స్ ఎక్స్ట్రా ఫైరీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పొంగల్‌కు మరోసారి పుష్ప-2 లేటేస్ట్ వర్షన్ చూసి ఎంజాయ్ చేయండి.
నిన్న జరిగింది మర్చిపోను.. రేపటి గురించి ఆలోచించను: మోహన్ బాబు
తిరుపతి రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో (Mohan Babu University) బుధవారం నాడు సంక్రాంతి (Sankranthi) వేడుకలు ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ విద్యార్థులు ముగ్గుల పోటీలతో పాటు ఆటల పోటీలు నిర్వహించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అయితే, ఈ సంక్రాంతి వేడుకల్లో యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు సినీ డైలాగ్స్‌తో అక్కడి విద్యార్థులను ఆనందపరిచారు. వేదికపై ఆయన మాట్లాడాతూ.. గతం గతః అనే వ్యాఖ్యలు చేశారు.యూనివర్సిటీ వేదికపై మోహన్‌బాబు (Mohan Babu) మాట్లాడుతూ.. తాను నటించిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఓ డైలాగ్ చెప్పారు. 'నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వెయ్యను, రేపటి గురించి ఆలోచించను' అని మెప్పించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి ఏడాది విద్యార్థులతో కలిసి బోగి, సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామని మోహన్ బాబు అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని పక్కన పెట్టి యువత భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. సంక్రాంతి అంటే రైతు అని, రైతు బాగుంటేనే మనంందరం బాగుంటామని ఆయన గుర్తుచేశారు. కాబట్టి సంక్రాంతి అనేది మనందరి పండుగ అన్నారు.ఈ క్రమంలో మోహన్‌బాబును కన్నప్ప సినిమా పనుల గురించి మీడియా వారు ప్రశ్నించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉన్నట్లు ఆయన తెలిపారు. 'ఏఫ్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. సినిమాపై నమ్మకంతో మేము ముందుగా అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాం. శ్రీకాళహస్తీశ్వరుడిపై ఇప్పటివరకూ విడుదలైన సినిమాలన్నీ భారీ విజయాన్ని అందుకున్నాయి. పరమశివుడి వరంతో నేను జన్మించాను.(ఇదీ చదవండి: హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్ ) అందుకే నా పేరు భక్తవత్సలం అని మా తల్లిదండ్రుల పెట్టారు. కాబట్టి ఆయనే మమ్మల్ని ఆదుకుంటాడు. సినిమా పరిశ్రమలో జయాపజయాలు సహజం. కానీ, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ప్రకృతిని కూడా కోరుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్‌పై నా బిడ్డ విష్ణు ఎన్నో కలల కన్నాడు. ఒకరకంగా ఇది అతనికి డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెబుతాను. కాబట్టి అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.' అని ఆయన అన్నారు.మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.అయితే తాజాగా కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ చేసిన నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవల ఆస్కార్ ఎంపికైన చిత్రాల జాబితాపై హాట్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆస్కార్ సినిమాల జాబితాపై కాస్తా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మనదేశాన్ని వ్యతిరేకంగా తీసిన సినిమాలకే స్థానం దక్కిందని కంగనా ఆరోపించింది. అలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతోందని మండిపడింది.(ఇది చదవండి: సినిమాల్లో నటించనంటూ రిటైర్మెంట్ ప్రకటించిన పాపులర్ హీరో)కంగనా రనౌత్ మాట్లాడుతూ..'మనదేశానికి వ్యతిరేకంగా చిత్రీకరించే సినిమాలు తరచుగా ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక చేస్తున్నారు. సాధారణంగా మనదేశం కోసం.. వారు ముందుకు తెచ్చే ఎజెండా చాలా భిన్నంగా ఉంటుంది. ఆస్కార్ ఎంపికైన చిత్రాలు భారతదేశానికి వ్యతిరేకం. ఇప్పుడు ఆ చిత్రాలకే ప్రశంసలు వస్తున్నాయి. మన దేశంలో ఆస్కార్ అవార్డుల కోసం స్లమ్‌డాగ్ మిల్లియనీర్ లాంటి సినిమా అయి ఉండాలి. అంటే మనదేశాన్ని తక్కువగా చూపించే సినిమాలకే నామిషన్స్లో చోటు ఉంటుంది.'అని అన్నారు.కంగనా మాట్లాడుతూ..'ఎమర్జెన్సీ అలాంటి చిత్రం కాదు. ఈ రోజు భారతదేశం ఎలా ఉందో చూడటానికి పాశ్చాత్య దేశాలు సిద్ధంగా ఉన్నాయి. నేను ఈ అవార్డుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను భారతీయ అవార్డులు, విదేశీ అవార్డుల గురించి పట్టించుకోను. ఇది అద్భుతంగా రూపొందించిన చిత్రం. అంతర్జాతీయ చలన చిత్రం కంటే బాగుటుంది. అదే సమయంలో మన రాజకీయాలు ఎలా పనిచేస్తాయో నాకు తెలుసు. ఒక జాతీయవాదిగా నాకు అవార్డు ఫంక్షన్లపై మాకు పెద్దగా ఆశ లేదు' అని తెలిపింది.ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.(ఇది చదవండి: Oscar 2025: ఆస్కార్ బరిలో ‘కంగువా’)మొదటి నుంచి వివాదాలు..ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది.
న్యూస్ పాడ్‌కాస్ట్
తిరుమల శ్రీవారి ఉత్తర ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట... ఆరుగురు భక్తులు మృతి, 40 మందికి గాయాలు
ఆరోగ్యశ్రీ పథకంపై ఎందుకింత కక్ష?... చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
పింఛన్ పొందుతున్న లబ్ధిదారుడు చనిపోతే భార్యకు మాత్రమే ప్రయోజనం వర్తింపు. భార్యను పోగొట్టుకుని ఇప్పటికీ పెన్షన్ రాకున్నా భర్తకు మొండిచెయ్యే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అడుగడుగునా కమీషన్లు... సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ టెండర్లలో విచ్చలవిడిగా అక్రమాలు
తెలంగాణలో రైతు భరోసా సాయం ఎకరానికి ఏడాదికి 12 వేల రూపాయలు... సాగు యోగ్యమైన భూములన్నింటికీ పెట్టుబడి సాయం... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
సుప్రీంకోర్టు రిఫర్ చేసిన కేసులో ఇంత నిర్లక్ష్యమా? మార్గదర్శి’ వ్యవహారంపై ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారు?
ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ పథకాల్లో అన్నీ కోతలు, ఎగనామాలే... కూటమి సర్కారు తీరుపై మండిపడుతున్న ప్రజలు
అన్నదాతలకు అండగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు... డీఏపీపై వన్-టైమ్ స్పెషల్ ప్యాకేజీ పొడిగింపు
నయా సాల్.. నయా జోష్. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు
ఇస్రో పీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం. కక్ష్యలోకి స్పాడెక్స్ జంట ఉపగ్రహాలు. జనవరి 7న డాకింగ్ ప్రక్రియ
క్రీడలు
‘అమెరికన్ల ఆటగా మార్చడమే లక్ష్యం’
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలోనే క్రికెట్ కొత్తగా అభివృద్ధి చెందుతోంది. 2024 టి20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణతో స్థానికుల దృష్టి దీనిపై పడగా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా భాగం కావడంతో మరింత ఎక్కువ మందికి ఆసక్తి పెరుగుతోంది. అయితే అమెరికన్లు పెద్దగా పట్టించుకోని సమయంలో ఆటను వారికి చేరువ చేయడంలో యూఎస్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, తెలుగు వ్యక్తి వేణుకుమార్ రెడ్డి పిసికె పాత్ర ఎంతో ఉంది. నల్లగొండకు చెందిన వేణు గత ఆరేళ్లుగా యూఎస్‌లో క్రికెట్‌ను విస్తృతం చేయడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆటను అమెరికన్లు తమదిగా భావించి ఇతర క్రీడల్లాగే ప్రాధాన్యత ఇచ్చేలా చేయడమే తన లక్ష్యమని వేణు ‘సాక్షి’తో చెప్పారు. ఇటీవలే భారత్‌కు వచ్చిన ఆయన బీసీసీఐ ఉన్నతాధికారులను కలిసి అమెరికా క్రికెట్ అభివృద్ధి కోసం సహకారాన్ని కూడా కోరారు. ‘టి20 వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించగలిగాం. భారత్, పాకిస్తాన్లతో అమెరికా తలపడిన మ్యాచ్‌లకు స్థానిక అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. పాక్‌పై గెలుపుతో అమెరికన్లు కూడా ఫలితాలపై ఆసక్తి చూపించారు. ఇప్పుడు మా ముందు ఒలింపిక్స్ రూపంలో పెద్ద లక్ష్యం ఉంది. వచ్చే రెండేళ్లలో క్రికెట్ వారికి మరింత చేరువ చేయడమే మా లక్ష్యం’ అని వేణు రెడ్డి అన్నారు. 1998లో ఐటీ నిపుణుడిగా యూఎస్‌కు వెళ్లి ఆపై సగటు భారత క్రికెట్ అభిమాని తరహాలో అక్కడ క్రికెట్ టోర్నీలు, క్యాంప్‌లు నిర్వహిస్తూ వేణు ఆటకు ప్రాచుర్యం పెంచారు. ముఖ్యంగా స్కూల్, కాలేజీలలో టీమ్‌లను తయారు చేయడం ద్వారా ప్రతిభను గుర్తించే అవకాశం దక్కింది. ‘సహజంగానే భారత్ నుంచి వచ్చిన వారు, భారత మూలాల ఉన్నవారే క్రికెట్ వైపు వచ్చారు. అందరూ ఇతర ఉద్యోగాల్లో ఉంటూ క్రికెట్ ఆడేందుకు వచ్చేవారే. వేర్వేరు రాష్ట్రాల్లో కూడా ఆటకు ప్రాచుర్యం కల్పించేందుకు వాలంటీర్లు ముందుకు వచ్చారు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు యూఎస్ జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులు ఇస్తున్నాం. ఇదంతా ఇన్నేళ్లలో అమెరికా క్రికెట్లో వచి్చన మార్పు గురించి చెబుతుంది’ అని వేణు వివరించారు.అయితే ఇప్పటికీ అసలైన అమెరికన్లు కాకుండా ఇతర దేశాల నుంచి వస్తున్న వారే యూఎస్ క్రికెట్ జట్లలో ఎక్కువగా ఉండటం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. దీనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అలా జరిగితే క్రికెట్ కూడా యూఎస్‌లో ఇతర క్రీడల్లా దూసుకుపోతుందని వేణు అభిప్రాయపడ్డారు. ‘టి20 వరల్డ్ కప్ సమయంలో పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రతిష్టాత్మక మీడియా కంపెనీలు క్రికెట్‌పై బాగా దృష్టి పెట్టాయి. అండర్–11 స్థాయి నుంచి అండర్–23 వరకు ఇప్పుడు వరుసగా టోర్నీలు నిర్వహిస్తున్నాం. ఈ దశలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు భాగమవుతున్నారు. జాతీయ జట్టుకు ఎంపిక చేసే ముందుకు జరిగే సెలక్షన్స్‌లో వీరంతా పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో యూఎస్ టీమ్‌లో మనవారు మాత్రమే కాకుండా అమెరికన్లను కూడా చూడవచ్చు. అయితే భారతీయుల్లో మన తెలుగువారు కూడా యూఎస్ క్రికెటర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరం. సీనియర్ మహిళల క్రికెట్లో పగడ్యాల చేతనా రెడ్డి ఇటీవల 136 పరుగులు చేసి అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచింది’ అని వేణు గుర్తు చేశారు. ఐసీసీ టోర్నీల్లో మినహా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశం అమెరికాకు ఎక్కువగా రావడం లేదని... భారత్‌లోని రంజీ టీమ్‌లతో మ్యాచ్‌లు ఏర్పాటు చేసి తమ ఆటను మెరుగుపర్చుకునే అవకాశం ఇవ్వాలని ఇటీవల ఐసీసీ చైర్మన్ జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలకు విజ్ఞప్తి చేసినట్లు వేణు వెల్లడించారు. ఆసియా కప్ తరహాలో ‘నార్త్ అమెరికన్ చాంపియన్‌షిప్’ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామని, త్వరలోనే ఈ టోర్నీ జరుగుతుందని ఆయన చెప్పారు. 2018 నుంచి యూఎస్సీఏలో డైరెక్టర్‌గా అడుగు పెట్టిన వేణు 2023లో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తన పదవీ కాలంలో యూఎస్ జట్టు 2024 టి20 టోర్నీ (ఆతిథ్య జట్టు హోదాలో), 2026 టి20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిందని... 2027 వన్డే వరల్డ్ కప్‌కు క్వాలిఫై కావాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వేణు రెడ్డి స్పష్టం చేశారు.
డిఫెండింగ్ చాంపియన్‌పై నిశేష్ సంచలన విజయం
ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల నిశేష్ 6–4, 5–7, 6–4తో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ 23వ ర్యాంకర్ అలెజాంద్రో టబిలో (చిలీ)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిశేష్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. గత నెలలో ప్రొఫెషనల్‌గా మారిన నిశేష్ ఈ టోర్నీ తొలి రౌండ్లో 6–2, 6–2తో 85వ ర్యాంకర్ కమ్సానా (అర్జెంటీనా)పై గెలిచాడు. మరోవైపు అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–3, 3–6, 11–13తో నాలుగో సీడ్ హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది.
ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి 21–10, 16–21, 21–5తో మింగ్ చె లు–టాంగ్ కాయ్ వె (చైనీస్ తైపీ)లపై గెలుపొందారు. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌ను నెగ్గినా... రెండో గేమ్‌లో తడబడింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సాతి్వక్–చిరాగ్ చెలరేగి ప్రత్యర్థి జోడీ ఆట కట్టించారు. సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... ప్రియాన్షు రజావత్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రణయ్ 21–12, 17–21, 21–15తో బ్రియాన్ యాంగ్ (కెనడా)పై నెగ్గగా... ప్రియాన్షు 11–21, 16–21తో ఏడో సీడ్ షి ఫెంగ్ లీ (చైనా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... అనుపమా , ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. మాళవిక 21–15, 21–16తో గో జిన్ వె (మలేసియా)పై విజయం సాధించగా... ఆకర్షి 14–21, 12–21తో జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో, అనుపమ 17–21, 21–18, 8–21తో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు.
విరాట్ కోహ్లికి అవమానం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో దారుణంగా విఫలమై ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి మరో అవమానం ఎదురైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ 27వ స్థానానికి పడిపోయాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ టాప్-25 లోనుంచి బయటికి రావడం 12 ఏళ్ల తర్వాత ఇది మొదటిసారి. కెరీర్ ఆరంభంలో మాత్రమే విరాట్ టాప్-25 బ్యాటర్ల జాబితాలో లేడు. 2011లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విరాట్.. 2012లో ఓసారి 36వ స్థానానికి పడిపోయాడు.బీజీటీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్‌లో విరాట్ కేవలం 23 పరుగులు (17, 6) మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శన అనంతరం విరాట్ మూడు స్థానాలు కోల్పోయి ర్యాంకింగ్‌ను మరింత దిగజార్చుకున్నాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 614 రేటింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. బీజీటీ ఆధ్యాంతం దారుణంగా విఫలమైన విరాట్ ఈ సిరీస్ మొత్తంలో (9 ఇన్నింగ్స్‌ల్లో) 190 పరుగులు మాత్రమే చేశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్ తన సమకాలీకులైన జో రూట్ (నంబర్ వన్ ర్యాంక్), కేన్ విలియమ్సన్ (మూడో ర్యాంక్), స్టీవ్ స్మిత్ (ఎనిమిదో ర్యాంక్), బాబర్ ఆజమ్ (12వ ర్యాంక్) కంటే చాలా వెనుకపడ్డాడు.2018 ఆగస్ట్‌లో కెరీర్ అత్యధిక రేటింగ్ పాయింట్లు (937) సాధించి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న విరాట్.. 2020 ఫిబ్రవరిలో తొలిసారి అగ్రస్థానాన్ని కోల్పోయాడు. కెరీర్ పీక్స్‌లో (2016-2020) ఉండగా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగిన విరాట్ ప్రస్తుతం గుడ్డకాలం ఎదుర్కొంటున్నాడు.2024లో ఒకే ఒక టెస్ట్ సెంచరీ చేసిన విరాట్.. గతేడాది మూడు ఫార్మాట్లలో చెత్త ప్రదర్శనలు చేశాడు. 32 ఇన్నింగ్స్‌ల్లో 21.83 సగటున 655 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కెరీర్ మొత్తంలో ఓ క్యాలెండర్ ఇయర్లో ఇంత దారుణమైన ప్రదర్శనలు ఎప్పుడూ లేవు.తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, నితీశ్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్ కూడా పడిపోయారు. గిల్ మూడు స్థానాలు కోల్పోయి 23వ స్థానానికి పడిపోగా.. రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 42వ ప్లేస్‌కు దిగజారాడు. ఆసీస్‌తో చివరి టెస్ట్‌లో కోహ్లి, రోహిత్‌తో పాటు విఫలమైన రాహుల్ 11 స్థానాలు కోల్పోయి 52వ స్థానానికి పడిపోయాడు. మెల్బోర్న్ టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసి రాత్రికిరాత్రి హీరో అయిపోయిన నితీశ్ కుమార్.. సిడ్నీ టెస్ట్‌లో పేలవ ప్రదర్శనలు చేసి 19 స్థానాలు కోల్పోయాడు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో నితీశ్ 72వ స్థానానికి పడిపోయాడు.తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా.. సిడ్నీ టెస్ట్‌లో మెరుపు అర్ద శతకం చేసిన రిషబ్ పంత్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత్ తరఫున టాప్-10 బ్యాటర్లలో జైస్వాల్, పంత్ మాత్రమే ఉన్నారు.ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ మూడు, ఐదు స్థానాల్లో నిలిచారు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. లంక ప్లేయర్ కమిందు మెండిస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు. భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో ఆశించినంతగా రాణించిన లేకపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించి (908) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. ఆస్ట్రేలియా సారధి కమిన్స్, సౌతాఫ్రికా పేసర్ రబాడ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు చేరారు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా ఆటగాడు మార్కో జన్సెన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు.
బిజినెస్
తగ్గనున్న ఈఎంఐ.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్‌న్యూస్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన లోన్ కాలపరిమితి కోసం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)లో 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు తగ్గింపును ప్రకటించింది. జనవరి 7 నుండి అమలులోకి వచ్చిన సవరించిన రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉంటాయి.ఎంసీఎల్ఆర్ తగ్గింపు ద్వారా రుణగ్రహీతలకు వారి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఫలితంగా ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన వ్యక్తిగత, వ్యాపార రుణాల వంటి ఫ్లోటింగ్ రేటు రుణాలపై సమానమైన నెలవారీ వాయిదాలు (EMI) కూడా తగ్గుతాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్ఆర్ రేట్లుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ని 9.20 శాతం నుండి 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.15 శాతానికి సవరించింది. ఇక ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు ఎటువంటి మార్పు లేకుండా వరుసగా 9.20 శాతం, 9.30 శాతంగా ఉన్నాయి.అదే విధంగా ఆరు నెలలు, ఏడాది, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ రేట్లు ఒక్కొక్కటి 5 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గి 9.45 శాతంగా ఉన్నాయి. అయితే రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 9.45 శాతం వద్ద యథాతథంగా ఉంది.ఎంసీఎల్ఆర్ అంటే?"ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణానికి ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటు. ఇది రుణంపై వడ్డీ రేటు కనీస పరిమితిని నిర్ణయిస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చెప్తే తప్ప తప్ప ఇందులో మార్పు ఉండదు" అని ఎంసీఎల్ఆర్ భావనను వివరిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది.పీఎల్ఆర్ ఇలా..ఎంసీఎల్ఆర్తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (PLR) సంవత్సరానికి 17.95 శాతం ఉంది. ఇది 2024 సెప్టెంబర్ 9 నుండి అమలులోకి వచ్చింది. నిర్దిష్ట రుణాలకు వర్తించే బేస్ రేటును అదే తేదీ నాటికి 9.45 శాతంగా నిర్ణయించారు.ఈబీఎల్ఆర్ గృహ రుణాల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR)ని అనుసరిస్తుంది. ఇది పాలసీ రెపో రేటుతో అనుసంధానమై ఉంటుంది. ప్రస్తుత రెపో రేటు 6.50 శాతంగా ఉంది. ఇక అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్ (ARHL) వడ్డీ రేట్లు లోన్ వ్యవధిలో మారుతూ ఉంటాయి.హోమ్ లోన్ రేట్లుఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే రుణగ్రహీతలు తీసుకునే ప్రత్యేక గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.75 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంటాయి. రెపో రేటుతో పాటు 2.25 శాతం నుండి 3.15 శాతం అదనపు మార్జిన్ ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. ఇక ఇదే కేటగిరీకి చెందిన రుణగ్రహీతలకు ప్రామాణిక గృహ రుణ రేట్లు 9.40 శాతం నుండి 9.95 శాతం వరకు ఉంటాయి. వీటిలో రెపో రేటుతో పాటు 2.90 శాతం నుండి 3.45 శాతం మార్జిన్ కలిసి ఉంటాయి.
భారత్ బయోటెక్ అధినేత డా.కృష్ణ ఎల్లాకు ప్రతిష్టాత్మక గుర్తింపు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ (Bharat Biotech) సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా (Dr Krishna Ella) ప్రతిష్టాత్మక గుర్తింపు పొందారు. 2025 సంవత్సరానికి గాను ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (INSA) ప్రతిష్టాత్మకమైన ఇండియా ఫెలోషిప్ ప్రకటించింది.కొత్త విజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త వ్యాక్సిన్ టెక్నాలజీల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న సాంకేతికతల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఐఎన్ఎస్ఏ ఆయనకు ఈ ఫెలోషిప్ ప్రదానం చేసింది. దీంతో ఈ గౌరవం అందుకున్న విశిష్ట శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రముఖుల జాబితాలో డాక్టర్ ఎల్లా కూడా చేరారు.ఇందులో భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ అనిల్ కకోద్కర్, డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వీకే సరస్వత్, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, డీడీఆర్&డీ కార్యదర్శి సమీర్ వి కామత్, డీఆర్డీఓ చైర్మన్ డా. కేఎన్ శివరాజన్ వంటివారు ఉన్నారు.ఈ సంవత్సరం మొత్తం 61 ఫెలోషిప్‌లు అందించగా మొట్టమొదటిసారిగా పరిశ్రమ నాయకులకు ఫెలోషిప్‌లు అందించారు. ఎంపికైన సభ్యులు ఐఎన్ఎస్ఏ సాధారణ సమావేశాలకు హాజరై ఓటు వేయవచ్చు. ఫెలోషిప్‌లు లేదా ఐఎన్ఎస్ఏ అవార్డుల కోసం ఇతర వ్యక్తులను ప్రతిపాదించవచ్చు.“వ్యాక్సిన్లు, బయోటెక్నాలజీ రంగంలో నా సహకారాన్ని గుర్తించినందుకు ఐఎన్ఎస్ఏకు కృతజ్ఞతలు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, కొత్త వ్యాక్సిన్లను కనుగొనడంలో భారత్ ఆధిపత్య శక్తిగా ఎదగడానికి నా మద్దతును మరింత కొనసాగిస్తాను” అని డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు.
ఈ క్రెడిట్ కార్డులు కనిపించవు! కానీ ఖర్చు చేయొచ్చు..
దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, చెల్లింపు వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రెడిట్ కార్డులు విస్తృతంగా పెరిగిపోయాయి. వీటికితోడు అనుకూలమైన, సురక్షితమైన చెల్లింపు ఎంపికగా వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు ఉద్భవించాయి. సాంప్రదాయ భౌతిక క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగా చోరీకి గురవ్వడం, పోగొట్టుకోవడం వంటి సమస్యలు వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లతో ఉండవు.ఏమిటీ వర్చువల్ క్రెడిట్ కార్డ్?వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది భౌతిక క్రెడిట్ కార్డుకు డిజిటల్ రూపం. 16-అంకెల కార్డ్ నంబర్, సీవీవీ (CVV), గడువు తేదీతో సహా భౌతిక కార్డుకు ఉన్న అన్ని ముఖ్యమైన వివరాలూ దీనికీ ఉంటాయి. సాధారణంగా వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది స్వల్పకాలిక కార్డ్. ఇది మీ ప్రస్తుత క్రెడిట్ కార్డ్‌కి యాడ్-ఆన్‌గా పనిచేస్తుంది. పరిమిత సంఖ్యలో లావాదేవీలను అనుమతిస్తుంది.ఎలా పని చేస్తుంది?వర్చువల్ క్రెడిట్ కార్డ్ ఫిజికల్ క్రెడిట్ కార్డ్ లాగానే పని చేస్తుంది. అయితే మెరుగైన భద్రతా లక్షణాలను అందిస్తుంది. వర్చువల్ కార్డ్‌ని ఉపయోగించి చెల్లింపు చేసినప్పుడు, వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. మోసం ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.ఉపయోగించండిలా..» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం సూటిగా ఉంటుంది. ఫిజికల్ కార్డ్‌ని స్వైప్ చేయాల్సిన అవసరం లేదు.» మీరు చెల్లింపు చేయాలనుకుంటున్న వెబ్‌సైట్‌కు వెళ్ళండి. » వర్చువల్ క్రెడిట్ కార్డ్ చెల్లింపు ఎంపికను ఎంచుకోండి.» మీ వర్చువల్ క్రెడిట్ కార్డ్ నంబర్, గడువు తేదీ, సీవీవీని నమోదు చేయండి.» తర్వాత, మీ రిజిస్టర్డ్ ఫోన్‌కు ఓటీపీ వస్తుతంది. ఇది కొన్ని నిమిషాలే చెల్లుబాటు అవుతుంది.» ఓటీపీని ఎంటర్ చేసి చెక్అవుట్ ప్రక్రియను పూర్తి చేయండి.వర్చువల్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను మీ ఫోన్ లేదా ఆన్లైన్ ఖాతాల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. భౌతిక కార్డ్‌ని తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.» భౌతిక కార్డ్‌ని కోల్పోయే ప్రమాదం ఉండదు. మోసపూరిత లావాదేవీల నుండి వినియోగదారులను రక్షించడానికి అనేక ప్లాట్‌ఫామ్‌లు అంతర్నిర్మిత డిజిటల్ మోస నివారణ సాధనాలను కూడా అందిస్తాయి.» వర్చువల్ క్రెడిట్ కార్డ్ కోసం ఖర్చు పరిమితులు, గడువు తేదీలను సెట్ చేయవచ్చు. ఇది మెరుగైన ఆర్థిక నిర్వహణకు అధిక వ్యయం చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.వర్చువల్ క్రెడిట్ కార్డ్ పరిమితులు» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను ప్రధానంగా ఆన్లైన్ చెల్లింపుల కోసం రూపొందించారు. భౌతిక కార్డ్‌ల వంటి ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం వీటిని ఉపయోగించలేరు.» ఆన్లైన్ రిటైలర్లందరూ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను అంగీకరించరు. దీంతో ఆన్లైన్ కొనుగోళ్లకు ఇబ్బంది కలుగుతుంది.» వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు సాధారణంగా తాత్కాలిక చెల్లుబాటును కలిగి ఉంటాయి. సాధారణంగా ఇది 24 నుండి 48 గంటల వరకు ఉంటుంది. అయితే ఇది జారీ చేసే సంస్థను బట్టి మారవచ్చు.టాప్ ఫ్రీ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లు ఇవే..దేశంలో వర్చువల్ క్రెడిట్ కార్డ్‌లను బ్యాంకులు అలాగే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) అందిస్తాయి. దేశంలోని ప్రధాన బ్యాంకులు అందించే కొన్ని టాప్ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ హెచ్డీఎఫ్సీ నెట్సేఫ్ వర్చువల్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ఫ్రీఛార్జ్ క్రెడిట్ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) నెట్ కార్డ్ (Netc@rd), హెచ్ఎస్బీసీ (HSBC) బ్యాంక్ అడ్వాంటేజ్ వర్చువల్ కార్డ్, ఎస్బీఐ (SBI) కార్పొరేట్ వర్చువల్ కార్డ్ పేరుతో వర్చువల్ కార్డులు అందిస్తున్నాయి.
2025లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు.. వివిధ ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ. 30,000 కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది వివరంగా తెలుసుకుందాం.మోటరోలా ఎడ్జ్ 50 నియోమోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo) ధర రూ. 20,000 నుంచి రూ. 23,000 మధ్య ఉంది. ఇది 256 జీబీ స్టోరేజితో ఒకే వేరియంట్ రూపంలో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, లెదర్ బ్యాక్ ప్యానెల్ వంటివన్నీ ఇందులో ఉంటాయి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ68 రేటింగ్ పొందింది. కెమెరా సెటప్ కూడా అద్భుతంగా ఉంది.వన్‌ప్లస్ నార్డ్ 4వన్‌ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4) ధర రూ. 29,999. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3, 120హెచ్‌జెడ్ అమోలెడ్ డిస్ప్లే, 256 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ వంటి వాటితో పాటు 5500 యాంపియర్ బ్యాటరీతో 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తాయి.వన్‌ప్లస్ నార్డ్ సీఈ4వన్‌ప్లస్ (OnePlus) కంపెనీకి చెందిన నార్డ్ సీఈ4 కూడా రూ. 30,000 కంటే తక్కువ ధర వద్ద లభించే ఓ బెస్ట్ స్మార్ట్‌ఫోన్. ఇది ఇప్పుడు రూ. 23,000 వద్ద అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి.. 256 జీబీ వరకు స్టోరేజ్ కెపాసిటీ పొందుతుంది.ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ మొబైల్ బేస్ వేరియంట్ ధర మార్కెట్లో రూ. 28,000 (8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్). ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ కలిగి, 5000 యాంపియర్ బ్యాటరీ పొందుతుంది. ఇది 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన ఈ ఫోన్ లెదర్ ఫినిషింగ్ పొందుతుంది. కాబట్టి ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. కాబట్టి ఇది ఇతర వేరియంట్ల కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది.నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ మొబైల్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,000 వద్ద అందుబాటులో ఉంది. ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ 7350 ప్రో చిప్సెట్, డ్యూయెల్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. మంచి డిజైన్ కలిగిన ఈ ఫోన్ ట్రాన్స్పరెంట్ బ్యాక్, గ్లిఫ్ లైటింగ్ ఇంటర్ఫేస్ కూడా పొందుతుంది.పైన చెప్పిన ఇది మొబైల్స్ మాత్రమే కాకుండా 30వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో గూగుల్ పిక్సెల్ 7ఏ, రెడ్మీ నోట్ 14 ప్రో 5జీ, ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ, ఐకూ జెడ్9ఎస్ ప్రో 5జీ, హానర్ 200 వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!మొబైల్ ధరలు మీరు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్, స్టోరేజ్ ఆప్షన్ వంటి వాటిమీద మాత్రమే కాకుండా.. కొనుగోలు చేసే ప్లాట్‌ఫామ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధరలలో కొంత వ్యత్యాసం గమనించవచ్చు. అంతే కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీకు మరింత తగ్గింపులను కూడా పొందే అవకాశం ఉంటుంది.
ఫ్యామిలీ
దీపికా స్టైలిష్ డ్రెస్, చూడ్డానికి చాలా సింపుల్ : కానీ ధర తెలిస్తే షాక్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా భర్తతో రణ్వీర్తో కలిసి విమానాశ్రయంలో తళుక్కున మెరిసింది. ఈ సందర్బంగా లవబుల్ కపుల్ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్‌లో ఫ్యాన్స్‌ను మురిపించారు. ఎప్పటిలాగానే నవ్వుతూ మీడియాకు ఫోజులిచ్చారు.కుమార్తె దువాకు జన్మనిచ్చిన తరువాత తల్లిదండ్రులుగా జంటగా కనిపించారు. ట్రెండింగ్ వైడ్ లెగ్ జీన్స్, పాప్లిన్ స్లిట్ షర్ట్‌లో చాలా సింపుల్‌గా కనిపించింది. కానీ ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?ఎయిర్‌పోర్ట్‌లో నల్ల చారల చొక్కా, ప్యాంట్ చాలా సింపుల్‌గా కంఫర్టబుల్‌గా చిక్ స్టైల్‌తో మెప్పించింది గ్లోబల్ ఐకాన్. లీ మిల్ కలెక్షన్‌కు చెందిన ఈ డ్రెస్ ధర 79,100. దీనికి జతగా సిటిజన్స్ ఆఫ్ హ్యుమానిటీ హై రైజ్ వైడ్ లెగ్ జీన్స్‌ను ధరించింది. దీని ధర సుమారు రూ. 39వేలే. (యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!)అంతేనా లగ్జరీ ఎలిమెంట్‌ను జోడిస్తూ లూయిస్ విట్టన్ సన్ గ్లాసెస్‌తో తన లుక్‌కి మోడ్రన్ టచ్ ఇచ్చింది. ఇంకా అద్భుతమైన కార్టియర్ శాంటాస్ డి కార్టియర్ వాచ్‌తో రూపాన్ని పూర్తి చేసింది, దీని ధర రూ.3,080,000. ఇదీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం Power couple Ranveer Singh and Deepika Padukone turn heads at the Mumbai airport with their effortless style and charm 💕#RanveerSingh #DeepikaPadukone #deepveer #Bollywood #iwmbuzz @RanveerOfficial @deepikapadukone pic.twitter.com/TE2Al4PK7J— IWMBuzz (@iwmbuzz) January 7, 2025 ఇక రణవీర్ సింగ్ తన జుట్టును పోనీ టైల్లో కట్టి, తన క్యాజువల్ బెస్ట్ డ్రెస్‌లో అందరికీ హాయ్ చెప్పాడు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూతురు దువాతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఇటీవల దీపిక 39వ పుట్టినరోజు (జనవరి,5)కు ఈ జంట మాల్దీవుల్లో సెల్రబేషన్స్ ముగించుకొని తిరిగి ముంబై చేరుకున్నారు. కాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)తో కలిసి దీపికా కల్కి( Kalki ) సినిమాలో నటించింది. గర్భంతో ఉన్న మహిళగా నటనతో విమర్శకులను సైతం మెప్పించింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నపుడే ఈ సినిమాలో నటించడం మాత్రమే కాదు, నిండు గర్భంతో ప్రమోషన్స్‌లో పాల్గొని అందర్నీ మెస్మరైజ్ చేసింది.ఈ ప్రమోషన్స్‌లో రూ.1.14 లక్షల విలువైన బ్లాక్ డ్రెస్‌తో ఆకట్టుకుంది. Magda రూ.41.500 విలువైన Butrym బ్రాండ్ స్టైలీష్ చెప్పులు ధరించింది. కోటి రూపాయల విలువచేసే బ్రేస్ లేట్ కూడా ధరించిన విషయం తెలిసిందే.
మిద్దె తోట : షేడ్‌నెట్ అవసరమా? కాదా?
మేడపైన ఖాళీ ఉంచకుండా పచ్చని పంటలతో కళకళలాడేలా చూసుకుంటే ఏడాది పొడవునా ఆ కుటుంబం అంతటికీ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కొంతవరకైనా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు మేడపైన, పెరట్లో ఖాళీ లేకుండా ఇంటిపంటలు సాగు చేసుకోవటం అర్బన్ ప్రాంతాల్లో సొంతి ఇంటి యజమానులకు చాలా వరకు అలవాటైపోయింది. అయితే, వేసవిలో తమ పంటలను రక్షించుకోవటానికి సేంద్రియ మిద్దెతోట / ఇంటిపంటల సాగుదారులు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. షేడ్నెట్లు కట్టడం, గాలిదుమ్ములకు అవి చిరిగి΄ోవటం, ఎగిరి΄ోవటం పరి΄ాటి. అయితే, మండు వేసవిలోనూ షేడ్‌నెట్ అవసరం లేకుండానే పంటల ప్రణాళిక ద్వారా మిద్దె తోటలను సంరక్షించుకోవచ్చు అంటున్నారు సీనియర్ మిద్దెతోట నిపుణులు ‘లతా కృష్ణమూర్తి’.. ‘సాక్షి సాగుబడి’కి ఆమె తెలిపిన వివరాలు.. వచ్చేది ఎండాకాలం. షేడ్‌నెట్‌కు బదులుగా సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చే పండ్ల మొక్కలను మిద్దెతోటలో పది అడుగులకు ఒకటి చొప్పున పెద్ద కుండీల్లో పెంచుకుంటే.. వాటి పక్కన చిన్న మొక్కలకు ఎండ నుంచి రక్షణ ఉంటుంది. మిద్దెతోట ఏర్పాటు చేసుకునేటప్పుడే కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలతోపాటు పండ్ల మొక్కలు కూడా పెట్టుకోవాలి.పండ్ల మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు (మొదటి సంవత్సరం) ఎండాకాలం ఉష్ణోగ్రతలకు మొక్కలు తట్టుకోలేకపోయినా రెండో సంవత్సరం నుంచి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మా మిద్దెతోటలో నిర్మించిన ఎత్తుమడుల్లో ప్రతి పది అడుగులకు ఒక పండ్ల చెట్లు పెంచుతున్నాం. మిద్దెతోట వల్ల ఇంటి లోపల చల్లగా ఉంటుంది. బయటి ఉష్ణోగ్రతల కంటే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మండువేసవిలోనూ ఇంట్లో ఏ.సి. అవసరం ఉండదు. అందువల్ల కరెంట్ వాడకం తగ్గుతుంది. ఖర్చు కలిసి వస్తుంది. అలాగే, ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందటంతోపాటు తేమ కూడా రిలీజ్ అయి, గదిలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇవీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే... రోజుకు నాలుగు కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే!గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్ సర్వే: మహిళలూ ఇది విన్నారా?
సేద్యంలో మహిళా సైన్యం!
దేవతల స్వంత దేశంగా భావించే భూమిపై తమకంటూ సొంతమైన కుంచెడు భూమి లేని నిరుపేద మహిళలు వారు. కేరళ ప్రభుత్వం ఇచ్చిన చిన్న ఆసరాతో సాగునే నమ్ముకోని వేరే ఉపాధికి నోచుకోని ఆ మహిళలు చేయి.. చేయి కలిపారు. సాగుబాటలో వేల అడుగులు జతకూడాయి. మహిళల నుదుటి చెమట చుక్కలు చిందిన బీడు భూములు విరగపండాయి. పైరు పరవళ్లు తొక్కాయి. వ్యవసాయం లాభసాటి కాదనే మాటలు నీటిమీది రాతలుగా తేలాయి. కేరళలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ సేద్యం జరుగుతోంది. వ్యవసాయంలో మాదే పైచేయి సుమా అంటున్నారు కేరళ మహిళా రైతులు.భూమిలేని మహిళల ఆర్థిక స్వావలంభన కల్పించే దిశగా కేరళ ప్రభుత్వం ప్రారంభించిన వినూత్న కార్యక్రమం కుడుంబశ్రీ. కేరళ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ 1998లో ఊపిరి΄ోసుకున్న ‘కుడుంబ శ్రీ’ కేరళ గడ్డపై మహిళా సంఘటిత శక్తికి ప్రతీకగా ఎదిగింది. ఆ రాష్ట్రం మొత్తం ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఉపాధి. ముఖ్యంగా తమకంటూ సొంత వ్యవసాయ భూములు లేని కుటుంబాలే ఎక్కువ. స్థానిక సాగు భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించటం వల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండేది. వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎక్కువగా మహిళలే కావటంతో పనులు దొరక్క తీవ్ర ఒడిదుడుకులకు లోనవ్వాల్సివచ్చేది. రాష్ట్ర భూ సంస్కరణల చట్టం కౌలుపై నిషేధం విధించింది. అనధికారికంగా కౌలుకు ఇస్తే తమ భూమిపై అధికారం శాశ్వతంగా కోల్పోతామనే భయం యజమానుల్లో ఉండేది. కూలి పనులు మానుకొని సొంత వ్యవసాయం చేయాలనుకునేవారికి అది అందని ద్రాక్ష అయింది. సంఘటిత శక్తే తారక మంత్రం.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోను కేరళ ప్రభుత్వం వెనుకడుగేయలేదు. సామూహిక వ్యవసాయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూమిలేని మహిళలకు ΄÷లం, పంటతో అనుబంధం కల్పించటమే లక్ష్య సాధనలో తొలి అడుగుగా కొంతమంది భూమిలేని మహిళలను కలిపి 15–40 మంది మహిళలను కలిపి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, వ్యక్తిగత వ్యవసాయ భూములను గుర్తించి సంఘాలకు దఖలు పరిచారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు సాగులో సేంద్రియ పద్ధతులకు పెద్ద పీట వేశారు. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు మహిళా రైతుల కోసం ఏర్పాటు చేశారు. మంచి దిగుబడులను సాధించిన సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించేవారు. అన్ని జిల్లాల్లో 201 క్లస్టర్లలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ / ప్రకృతి సేద్యం జరుగుతోంది. నాబార్డు సహకారంతో కుడుంబశ్రీ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. రుణాలు తీసుకోవటం తిరిగి చెల్లించటంలో ఆయా సంఘాల్లోని మహిళా సభ్యులందరిది ఉమ్మడి బాధ్యత. ఒక్క తిరువనంతపురం జిల్లాలోనే ఆరువేల గ్రూపులు ఏర్పాటయ్యాయి. వీటిలో సుమారు 30 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఆదునిక పద్ధతుల్లో అరటి సాగుపై కేర ళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన శిక్షణతో తక్కువ కాలంలోనే రెండింతల దిగుబడులు సాధించారు. వనితా కర్మసేన పేరుతో కుడుంబశ్రీ కోసం వ్యవసాయ పరికాలను, యంత్రాలను ఉపయోగించటంలో మహిళలకు శిక్షణ ఇచ్చారు. కొనుగోలుకు రుణాలు ఇచ్చారు. ప్రతి సంఘానికి తమ సొంత పరికరాలు ఉన్నాయి. దీంతో వారే శ్రామికులుగా మారటంతో ఖర్చును ఆదా చేయగలిగారు. పంటను నష్ట΄ోయిన సందార్భాల్లో నాబార్డ్ మహిళా రైతులకు అండగా నిలిచింది. 47 వేల పై చిలుకు సంఘాలు, లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నాయి. జీడిమామిడి, కొబ్బరి, వరి, అరటి, పైనాపిల్ పండ్లతోటలు, ఆకుకూరలు, గుమ్మడి, బఠాణీ, సొర, అల్లం, బెండ, మిరప, వంటి పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. తాము పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి విక్రయించటంతో మంచి లాభాలు కళ్లజూశారు. ఆరు నెలలు తిరగకుండానే రుణాలు తిరిగి చెల్లించారు. ఒక్కో సీజన్లోనే ఈ సంఘాలు రూ. లక్ష వరకు నికరాదాయం ఆర్జించేవి. దీంతో తమకంటూ సొంత ఇళ్లను నిర్మించుకున్నారు. చిన్న వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంకులు గతంలో మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవి కాదు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. 10543 స్వయం సహాయక సంఘాలకు రూ. 123 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకుల దృష్టిలో మహిళారైతులు అంటే మంచి పరపతిగల మహిళలు. (చదవండి: కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..)
కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..
గులాబీ ఎంత అందమైనదో అంత సున్నితమైనది. కామెల్లియా పువ్వు కూడా చూడటానికి గులాబీ పువ్వంత అందంగానే ఉంటుంది. అయితే, ఇది అంత సున్నితమైనది కాదు. ఈ పువ్వు రేకులు దృఢంగా ఉంటాయి. అందుకే, కామెల్లియా పంటను గులాబీ పంటకు చక్కని ప్రత్యామ్నాయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.కామెల్లియా ఆకర్షణీయమైన, అద్భుతమైన పువ్వులు. కామెల్లియా సొగసైన పుష్పించే మొక్క. తూర్పు ఆసియాకు చెందినది. ముఖ్యంగా జపాన్, చైనా, కొరియా దేశాల్లో సాగులో ఉంది. థియేసి కుటుంబానికి చెందినది. కామెల్లియా పూజాతిలో వైవిధ్యపూరితమైన అనేక వంగడాలతో పాటు సంకరజాతులు ఉన్నాయి.నిగనిగలాడే సతత హరిత ఆకులతో ఈ చెట్టు అన్ని కాలాల్లోనూ నిండుగా ఉంటుంది. అందానికి, అలంకారానికి ప్రతీకగా అద్భుతమైన తెలుపు, గులాబీ, ఎరుపు, ఊదా రంగుల్లో కామెల్లియా మొక్క పూస్తుంది. అందమైన నున్నని రేకులు, సున్నితమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన కామెల్లియాను తరచుగా గులాబీతో పోల్చుతూ ఉంటారు. గులాబీలు సాంప్రదాయకంగా ప్రేమ ప్రతీకలైతే.. కామెల్లియా పూలు స్వచ్ఛత, అభిరుచి, పరివర్తనలకు ప్రతీకగా చెబుతుంటారు.నీడలోనూ పెరుగుతుందిగులాబీ చెట్టు చల్లదనాన్ని, నీడను తట్టుకోలేదు. అయితే, కామెల్లియా అందంగా కనిపించటమే కాదు ఇటువంటి విభిన్న వాతావరణాన్ని కూడా తట్టుకుంటుంది. పదగా, చిన్నపాటి చెట్టుగా పెంచినా ముదురు ఆకుపచ్చని ఆకులతో కామెల్లియా మొక్క పూలు లేనప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల గార్డెన్లో గాని, అలంకరణలో గానీ కామెల్లియా పూలు గులాబీలకు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి. కామెల్లియా పూలు గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో పూస్తాయి కాబట్టి ఆయా సందర్భాలకు తగిన రంగు పూలను ఉపయోగపెట్టుకోవచ్చు. పూరేకులు మృదువుగా, గుండ్రంగా, మందంగా ఉంటాయి కాబట్టి ఇన్డోర్ బొకేల్లో పెట్టినా, గార్డెన్లో పెంచినా ఈ పూలు ఏడాది పొడవునా చూడముచ్చటగా ఒదిగిపోతాయి. గులాబీలు ఇలా కాదు. గులాబీ రేకులు బాగా సున్నితమైనవి, పల్చటివి కాబట్టి త్వరగా వాడిపోతాయి. కామెల్లియా పూలు రంగు, రూపు, నిర్మాణం, పరిమాణం విషయంలో ఇతర పూజాతుల మధ్య వైవిధ్యంగా నిలబడుతుంది. ఈ పువ్వులోనే ఆడ (పిస్టిల్), మగ (స్టేమెన్స్) భాగాలు అమరి ఉండటం వల్ల పరాగ సంపర్కానికి అనువుగా ఉంటుంది. ఈ పువ్వులో వంగడాన్ని బట్టి 5 నుంచి 9 రేకులు ఉంటాయి. ఇవి సాధారణంగా గుడ్డు ఆకారంలో స్పైరల్ పద్ధతిలో కూడుకొని ఉంటాయి. కామెల్లియా పూలలో రేకుల వరుసలు సింగిల్ (కొద్ది రేకులతో) లేదా సెమీ డబుల్ నుంచి డబుల్ (అనేక వరుసలు కలిసి) ఉంటాయి. పూల రంగులు... ప్రతీకలుపూలు లేత గులాబీ నుంచి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. కొన్ని రకాల్లో ఊదా రంగులో, అనేక రంగులతో కూడిన రేకులతోనూ కామెల్లియా పూలు పూస్తాయి. తెల్ల కామెల్లియా పూలు స్వచ్ఛతకు, అమాయకత్వానికి, అనురాగానికి ప్రతీకలు. గులాబీ రంగు కామెల్లియా పూలుఇష్టానికి, ప్రేమకు ప్రతీకలు. ఎర్ర కామెల్లియా పూలు అభినివేశానికి, గాఢమైన ప్రేమకు ప్రతీకలు. ఊదా రంగు కామెల్లియా పూలు ఆరాధనకు, పరివర్తనకు ప్రతీకలుగా చెబుతారు. ఈ పువ్వు 5–10 సెం.మీ. (2–4 అంగుళాలు) వ్యాసార్థంతో ఉంటుంది. కొన్ని కామెల్లియా రకాల పూలు 12 సెం.మీ. (4.7 అంగుళాల) వరకు ΄÷డవుగా, గుండ్రంగా అద్భుతమైన ఆకర్షణీయంగా పెరుగుతాయి. ఈ చెట్టు ఏ సీజన్లో అయిన నిగనిగలాడే ముదురు ఆకుపచ్చని ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆకులు 5–10 సెం.మీ.ల ΄÷డవున, 2–5 సెం.మీ. (0.8 నుంచి 2 అంగుళాల) వెడల్పున ఉంటాయి.2 నుంచి 12 మీటర్ల ఎత్తు కామెల్లియా మొక్కను పొద మాదిరిగా పెంచుకోవచ్చు లేదా చిన్నపాటి నుంచి మధ్యస్థ ఎత్తు ఉండే చెట్టుగానూ పెంచుకోవచ్చు. రకాన్ని, పరిస్థితులను బట్టి 2 నుంచి 12 మీటర్ల (6.5 నుంచి 40 అడుగుల) ఎత్తు వరకు పెరుగుతుంది. కాయ ఆకుపచ్చగా లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. విత్తనాలు ఓవల్ షేపులో చిన్నగా, గట్టిగా ఉంటాయి. వీటి నూనెను సౌందర్యసాధనాల్లో వాడతారు. వంటకు కూడా వాడుతుంటారు. కామెల్లియా జాతిలో చాలా రకాల చెట్లు శీతాకాలంలో పూతకొస్తాయి. ఇవి పెరిగే వాతావరణ స్థితిగతులు, నేలలను బట్టి పూత కాలం మారుతూ ఉంటుంది.పూలు.. అనేక వారాలు! కామెల్లియా మొండి జాతి. చల్లని ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గులున్న ప్రాంతాల్లోనూ తట్టుకుంటుంది. గులాబీ చెట్లతో పోల్చితే కామెల్లియా చెట్లు పెద్దవి, చాలా కాలం మనుగడసాగిస్తాయి. దీర్ఘకాలం ఆధారపడదగిన పూల చెట్ల జాతి ఇది. దీని పూలు అనేక వారాల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈ చెట్లకు ఆకులు ఏడాది పొడవునా నిండుగా, ముచ్చటగొలుపుతుంటాయి.ఆమ్ల నేలల్లో పెరుగుతుందిగులాబీ మొక్కను జాగ్రత్తగా పెంచాలి. తరచూ కొమ్మలు కత్తిరించాలి. చీడపీడల నుంచి జాగ్రత్తగా రక్షించుకోవాలి. తరచూ మట్టిలో ఎరువులు వేస్తూ ఉండాలి. కానీ, కామెల్లియా చెట్లు అలాకాదు. వీటి మెయింటెనెన్స్ చాలా సులభం. మొక్క నాటిన తర్వాత నిలదొక్కుకుంటే చాలు. నీరు నిలవని ఆమ్ల నేలల్లో పెరుగుతుంది. ఏడాదిలో చాలా తక్కువ రోజులు మాత్రమే ఎండ తగిలే ప్రాంతాల్లో పూల తోటను పెంచాలంటే కామెల్లియాను ఎంచుకోవాలి. చిన్న పొదగా పెంచుకోవచ్చు. తరచూ కత్తిరిస్తూ హెడ్జ్లుగా అనేక రకాలుగా, అనేక సైజుల్లో దీన్ని పెంచుకోవచ్చు. గులాబీ మొక్కల్ని పొదలుగా, తీగలుగా మాత్రమే పెంచగలం. గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో అందంగా పూస్తుంది. ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండే పూలు కావటం కూడా ముఖ్యమైన విషయం. ఇన్ని ప్రత్యేకతలున్నందునే గులాబీకి కామెల్లియాను చక్కని ప్రత్యామ్నాయంగా చెబుతారు. ఆకులతో టీ, గింజలతో నూనెకామెల్లియా జాతిలో 100–250 వైవిధ్యపూరితమైన రకాలు ఉండటం విశేషం. పువ్వు రూపు, రంగును బట్టి అది ఏ రకమో గుర్తించవచ్చు. ‘కామెల్లియా జ΄ోనికా (జూన్ కామెల్లియా) రకం ఎక్కువగా సాగులో ఉంది. దీని పూలు పొడవుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. తెలుపు నుంచి ముదురు ఎరుపు, గులాబీ రంగుల పూలు జూన్ కామెల్లియా చెట్టు పూస్తుంది. కామెల్లియా సినెన్సిస్ (టీ కామెల్లియా) రకం చెట్టు ఆకులతో టీ కాచుకొని తాగుతారు. అందువల్ల దీని ఆకుల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.దీని తెల్లని పూలు చిన్నగాను, తక్కువ ఆకర్షణీయంగానూ ఉంటాయి. కామెల్లియా ససన్కువ రకం పూలు చిన్న, అతి సున్నితంగా ఉన్నా సువాసనను వెదజల్లుతాయి. జూన్ కామెల్లియా రకం కన్నా చాలా ముందుగానే ఈ రకం చెట్టు పూస్తుంది. కామెల్లియా రెటిక్యులాట జాతి చెట్లకు పొడవాటి పూలు పూస్తాయి. అందరినీ ఆకర్షించగల ఈ రకం చెట్లు చైనాలో విస్తారంగా కనిపిస్తాయి. కామెల్లియా ఒలీఫెరా రకం కూడా చైనాలో విస్తారంగా కనిపిస్తుంది. దీని విత్తనాల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నూనెను వంటకాల్లో, సౌందర్య సాధనాల తయారీకి కూడా వాడుతున్నారు. చిన్న, తెల్లని పూలు పూస్తుంది. వాణిజ్యపరంగా చూస్తే మంచి ఆదాయాన్నిచ్చే రకం ఇది.
ఫొటోలు
విజయవాడ మొగల్రాజపురంలో నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు (ఫొటోలు)
కొత్త వైరస్ వచ్చేసింది.. మాస్క్ ఈజ్ బ్యాక్ (ఫొటోలు)
తిరుపతి తొక్కిసలాట : హృదయ విదారక దృశ్యాలు (ఫొటోలు)
మూసాపేటలో ‘సాక్షి’ సంక్రాంతి ముగ్గుల పోటీలు (ఫొటోలు)
కూతురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సురేఖవాణి (ఫొటోలు)
‘పర్ఫెక్ట్ సెట్టింగ్’: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ
జగనే కరెక్ట్ అంటున్నారు.. (ఫొటోలు)
ముగ్గుల పండుగ : ఏ ముగ్గు వేయాలా అని ఆలోచిస్తున్నారా? (ఫొటోలు)
సందర్భం ఏదైనా చీర ఉండాల్సిందే.. వెర్సటైల్ సింగర్ లుక్
‘‘వావ్.. బ్యూటీఫుల్!’’.. థాయ్‌లాండ్‌లో అత్యంత అందమైన ప్రాంతాలివిగో (చిత్రాలు)
National View all
కుర్రాడిగా అదృశ్యమై.. 23 ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో ప్రత్యక్షమై.. వింత ఘటన
సరిగ్గా 23 ఏళ్ల క్రితం మాయమైన కుర్రాడు ఇప్పుడు వివాహితునిగా భార్య, ఇద్దరు ప
ఐఏఎస్ కల నుంచి సాధ్వీ గౌరీ గిరి దాకా...
ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబం అది.
హోం వర్క్ చేయకుంటే గోడకుర్చీ వేయిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘సార్..
మీది శీష్ మహల్.. మీది రాజమహల్
న్యూఢిల్లీ: అద్దాల మేడ(శీష్ మహల్)లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్
శరీరాకృతిపై వ్యాఖ్యలూ లైంగిక వేధింపులే
కొచ్చి: మహిళ రూపురేఖలను వర్ణిస్తూ ద్వంద్వార్థం ధ్వనించేలా వ్
International View all
హసీనా వీసా గడువు పెంపు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఉద్యమం, ఎగసిన అల్లర్లతో స్వదేశం వీడి
ఆగని రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడులు కొనసాగుతున్నాయి.
Viral: హిజాబ్ ధరించమన్నందుకు ఏం చేసిందంటే..
వైరల్ వీడియో: హిజాబ్ విషయంలో ఇస్లాం దేశాలు ఎంత కఠినంగా వ్య
డబ్బు కోసం అన్నపైనే లైంగిక ఆరోపణలు!?
సొంత సోదరి చేస్తున్న సంచలన ఆరోపణలపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్పందించాడు.
కార్చిచ్చు గుప్పిట్లో లాస్ ఏంజెలెస్
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో కార్చిచ్
NRI View all
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను త
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసా?
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసు ఎలా పెడ
క్రైమ్
ఏస్ నెక్ట్స్ జెన్, గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
(మచిలీపట్నం): ఫార్ములా –ఈ రేసు కేసులో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఇప్పటివరకు రేసు నిర్వహణ, నిధుల మళ్లింపులో నిబంధనల అతిక్రమణ, హెచ్ఎండీఏ అధికారిక ఖాతాల నుంచి విదేశీ కంపెనీలకు నిధుల మళ్లించడంపై ఫోకస్ పెట్టిన అధికారులు, తాజాగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. తాజాగా తెరపైకి వచ్చిన క్విడ్ ప్రోకో కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలకు కొద్ది నెలల ముందే బీఆర్ఎస్కు గ్రీన్కో అనుబంధ సంస్థల నుంచి ఎలక్టొరల్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు వచ్చాయనే సమాచారంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఫార్ములా ఈ రేసుకు మొదట్లో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు దాని అనుబంధ సంస్థ గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో సైబర్ టవర్స్‌లో, మచిలీపట్నంలోని గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. సహకరించని సిబ్బంది! ఏసీబీ అధికారుల తనిఖీలకు ఆయా సంస్థల సిబ్బంది ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. మాదాపూర్ సైబర్ టవర్స్‌లోని గ్రీన్కో కార్యాలయంలో సోదాలకు ఆ సంస్థ సిబ్బంది మొదట అనుమతించలేదు. అధికారులు సెర్చ్ వారెంట్ వారెంట్ చూపడంతో వెనక్కి తగ్గారు. ఇక అదే ప్రాంతంలోని ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపారు. పలు కీలక పత్రాలు, పైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న గ్రీన్ కో అనుబంధ సంస్థలైన ఏస్ అర్బన్ రేస్, ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లోనూ మంగళవారం రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. పలు ఫైళ్లతో పాటు హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మచిలీపట్నంలో కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న గ్రీన్ కో కంపెనీకి చెందిన గెస్ట్‌హౌస్‌లో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కేటీఆర్‌కు తాజాగా ఈడీ సమన్లు ఫార్ములా–ఈ కారు రేస్ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌కు ఈడీ అధికారులు మరోమారు సమన్లు జారీ చేశారు. వాస్తవానికి కేటీఆర్ మంగళవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉన్నా..తనకు మరికొంత సమయం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 16న విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు మంగళవారం మరోమారు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కాగా ఈడీ అధికారులు ఇప్పటికే ఇచ్చిన సమన్ల ప్రకారం..ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డి బుధవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
విధుల్లో ఉండగా.. కానిస్టేబుల్‌కు గుండెపోటు
మహబూబ్‌నగర్ క్రైం: విధుల్లో ఉన్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ గుండెపోటు రాగా.. ఆస్పత్రితో చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని మర్లులో నివాసం ఉంటూ హెడ్‌క్వార్టర్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్(50)కు సోమవారం ఎస్కాట్ డ్యూటీ పడింది. ఈక్రమంలో సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా జైలుకు వెళ్లి అక్కడ ఖైదీలను వాహనంలో తీసుకుని కోర్టులో హాజరుపరిచి మళ్లీ మధ్యాహ్నం సమయంలో జైలులో ఖైదీలను అప్పగించి తిరిగి బయట వచ్చాడు. ఆ సమయంలో చాతీలో నొప్పి వస్తున్నట్లు వెంకటేష్ తోటి కానిస్టేబుల్స్‌కు చెప్పి కింద కూర్చుకున్నాడు. వెంటనే వారు చికిత్స కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు సీపీఆర్ చేయడంతో పాటు చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతి చెందాడు. క్యాజువాలిటీలో ఉన్న వెంకటేష్ మృతదేహన్ని ఎస్పీ డి.జానకి పరిశీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడు వెంకటేష్‌కు భార్య వనీత, ఇద్దరూ కొడుకులు అభినవ్, వర్షవర్ధన్లు ఉన్నారు. మృతదేహన్ని అతని స్వస్థలం సీసీకుంటకు తరలించారు.
బాలిక ప్రాణం తీసిన సెంట్రింగ్ కట్టె
దొడ్డబళ్లాపురం: నిర్మాణదారుల నిర్లక్ష్యం తల్లిదండ్రుల కంటి దీపాన్ని బలిగొంది. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలిక తలపై సెంట్రింగ్‌కు వాడిన వెదురు కట్టె పడి చనిపోయిన బెంగళూరు వీవీ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక తేజస్విని (15) రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం ఇంటికి తిగిరి వెళ్తుండగా రోడ్డుపక్కన కొత్తగా నిర్మిస్తున్న కట్టడంపై నుండి సెంట్రింగ్ కట్టె తలమీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం మరణించింది. బాలిక తండ్రి సుధాకర్ రావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీవీ పురం పోలీసులు భవన ఇంజినీర్‌ను అరెస్టు చేసారు. కట్టడం యజమాని, అనుమతులు ఇచ్చిన బీబీఎంపీ అధికారులు, కాంట్రాక్టర్లపై కూడా కేసు నమోదు చేశారు.
ఇద్దరు పిల్లలను చంపి ఐటీ ఉద్యోగుల ఆత్మహత్య!
సాక్షి బెంగళూరు: అపత్కాలంలో నమ్మించిన వాళ్లే మోసం చేశారు. ఆ మోసాన్ని తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఇద్దరు బిడ్డలకు విషం ఇచ్చి చంపడమే కాకుండా.. ఆ తర్వాత దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఆర్‌ఎంవీ ఎక్స్టెన్షన్ రెండో లేఅవుట్లో రెండేళ్లుగా ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌కు చెందిన అనూప్‌కుమార్ (38), ఆయన భార్య రాఖీ (35) నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల అనుప్రియా అనే కుమార్తె, రెండేళ్ల ప్రియాంక్ అనే కుమారుడున్నారు. అనూప్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన కుమార్తె అనుప్రియాకు మానసికంగా సరిగా లేకపోవడంతో ఇంటి పనికోసం, తన పాపను చూసుకునేందుకు ఇద్దరు పనివారిని పెట్టుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ సోమవారం ఉదయం ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి చంపేసి ఆ తర్వాత దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం పనివారు ఉదయాన్నే వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వెంటనే తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్లి చూడగా వారి హత్యోదంతం బయటపడింది. అనూప్ కుమార్‌కు ఉద్యోగం లేకపోవడంతో దంపతులు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు తనని ఆపత్కాలంలో ఆదుకుంటాయని ఉద్దేశ్యంతో తెలిసిన బంధువు ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టారు. బంధువులు మోసం చేశారు. పిల్లలకు చుట్టుముడుతున్న అనారోగ్య సమస్యలకు తట్టుకోలేక తనువు చాలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.👉ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
వీడియోలు
టీటీడీ, చంద్రబాబుపై మల్లాది విష్ణు ఫైర్
దొడ్లో పశువులు వేసినట్లు వేశారు.. ఈ పాపం టీటీడీదే!
తిరుపతిలోని 2 ప్రాంతాల్లో భక్తుల మధ్య తోపులాట
టీటీడీ నిర్లక్ష్యం.. ఏడుగురు మృతి.. 40మందికి పైగా గాయాలు
తిండి లేదు, నీళ్లు లేవు.. సంచలన నిజాలు బయట పెట్టిన తిరుపతి భక్తులు
Big Question: మోదీ సభలో బాబు బిల్డప్ స్పీచ్.. క్లియర్ కట్.. విశాఖపై బాబు, పవన్ కుట్ర
తిరుపతిలో తొక్కిసలాటకు కారణం అదే..
భక్తుల మధ్య తోపులాటలో ఆరుగురు మృతి
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
పుష్ప 2 చైనాలో రిలీజ్ అయితే దంగల్ రికార్డ్స్ అవుట్..