Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Plane Crashes Near Aktau City In Kazakhstan1
కజకిస్థాన్‌లో కూలిన విమానం.. ప్రయాణికులు మృతి!

అజర్‌బైజాన్‌: కజకిస్థాన్‌లో ప్యాసింజర్‌ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు మృతిచెందినట్టు సమాచారం. కాగా, విమానం ప్రమాదానికి గురైన సమయంలో 72(విమాన సిబ్బంది, ప్రయాణికులు) మంది విమానంలో ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కజకిస్థాన్‌లోని అక్తౌ నగరానికి సమీపంలో విమాన ప్రమాదం జరిగింది. అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం(J2-8243) బాకూ నుంచి రష్యా వెళ్లున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు మృతిచెందినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురికాక ముందు విమానం విమానాశ్రయం చుట్టూ చక్కర్లు కొట్టినట్లు సమాచారం.BREAKING: Passenger plane crashes near Aktau Airport in Kazakhstan pic.twitter.com/M2DtYe6nZU— BNO News (@BNONews) December 25, 2024అక్తౌ నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. విమానం భూమి ఢీకొనడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. విమాన ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెలుస్తున్నారు. ఘటన స్థలంలో 52 ఫైర్‌ టెండర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీరిలో 12 మందిని ప్రాణాలతో కాపాడినట్టు రష్యాకు చెందిన మీడియా ప్రకటనలు వెలువడుతున్నాయి. What just happened to Azerbaijan Airlines Flight 8243?? Flight Radar showed it having an emergency squawk 7700. The flight was erratic in altitude. #azerbaijan #planewatchers #avgeek #flightemergency pic.twitter.com/K6ApRsaPvK— Zach Shapiro (@zrs70) December 25, 2024మరోవైపు.. ప్రయాణికుల గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ప్రమాదానికి ముందు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం పైలట్‌.. ఏటీసీకి రిక్వెస్ట్‌ పంపినట్టు సమాచారం. ఇక, ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ⚠️#BREAKING: #Azerbaijan Airlines E190 Crashes in #Kazakhstan, Survivors ReportedA tragic aviation incident unfolded today as Azerbaijan Airlines Flight #J28243, an Embraer E190AR registered (4K-AZ65)carrying 72 people, crashed near Aktau, Kazakhstan. The flight was en route… pic.twitter.com/QZG3yBcSBh— Abdul khabir jamily (@JamilKhabir396) December 25, 2024Emergency services work on the scene of the Azerbaijan Airlines plane crash in #Kazakhstan#Aktau pic.twitter.com/1ruCG6mlQL— ℂ𝕙𝕖 𝔾𝕦𝕖𝕧𝕒𝕣𝕒 ★ (@cheguwera) December 25, 2024

YS Jagan Participated In Christmas Celebrations At CSI Church2
క్రిస్టమస్‌ వేడుకల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

సాక్షి, పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్రిస్టమస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో వైఎస్‌ జగన్‌ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటనలో ఉన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా నేడు క్రిస్టమస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎస్‌ఐ చర్చిల్లో ​ప్రార్థనలు చేశారు.

Srikakulam Sherlockholmes Movie Review And Rating In Telugu3
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ రివ్యూ

టైటిల్‌: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ్ మహేష్, మచ్చ రవి తదితరులునిర్మాణ సంస్థ: శ్రీగణపతి సినిమాస్‌నిర్మాత: వెన్నపూస రమణారెడ్డిదర్శకత్వం: రైటర్‌ మోహన్‌సంగీతం: సునీల్‌ కశ్యప్‌సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్‌ ఎన్‌ఎడిటర్‌: అవినాష్‌ గుర్లింక్‌విడుదల తేది: డిసెంబర్‌ 25, 2024కథేంటంటే..ఈ సినిమా కథ 1991లో సాగుతుంది. రాజీవ్‌ గాంధీ హత్య(1991 మే 21)జరిగిన రోజు శ్రీకాకుళం బీచ్‌లో మేరీ అనే యువతి కూడా దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీఐ భాస్కర్‌(అనీష్‌ కురివెళ్ల) సీరియస్‌గా తీసుకుంటాడు. వారం రోజుల్లో హంతకులను పట్టుకుంటానని, లేదంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని మీడియా ముఖంగా శపథం చేస్తాడు. అదే సమయంలో రాజీవ్‌ గాంధీ హత్య కేసు విషయంలో ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ భాస్కర్‌ స్టేషన్‌లోనే ఉండాల్సి వస్తోంది. వారంలో హంతకుడిని పట్టుకోకపోతే పరువు పోతుందని.. ఈ కేసు విచారణను ప్రైవేట్‌ డిటెక్టివ్‌ షెర్లాక్‌ హోమ్స్‌(వెన్నెల కిశోర్‌)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనుక మేరి స్నేహితురాలు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్‌ అయిన పోలీసు అధికారి పట్నాయక్‌(బాహుబలి ప్రభాకర్‌)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు డిటెక్టివ్‌ షెర్లాక్‌ అనుమానిస్తాడు. వీరందరిని పిలిపించి తనదైన శైలీలో విచారణ ప్రారంభిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెబుతారు. వీరిలో మేరిని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? అసలు డిటెక్టివ్‌ షెర్లాక్‌ నేపథ్యం ఏంటి? అతను డిటెక్టివ్‌ వృత్తినే ఎందుకు ఎంచుకున్నాడు? మేరి హత్య కేసుతో షెర్లాక్‌కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..డిటెక్టివ్‌ కథలు టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. చిరంజీవి ‘చంటబ్బాయ్‌’ మొదలు నవీన్‌ పొలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వరకు చాలా సినిమాలు ఈ కాన్సెప్ట్‌తో వచ్చాయి. కొన్ని కథలు సీరియస్‌గా సాగితే..మరికొన్ని కామెడీగా సాగుతూనే థ్రిల్లింగ్‌ గురి చేస్తాయి. కానీ అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన వచ్చిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ చిత్రం మాత్రం అటు కామెడీ పండించలేదు..ఇటు థ్రిల్లింగ్‌కు గురి చేయలేదు. హాలీవుడ్ రేంజ్‌ టైటిల్‌..దానికి జస్టిఫికేషన్‌ ఇచ్చే కథ ఎంచుకున్న దర్శకుడు మోహన్‌.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడం మాత్రం విఫలం అయ్యాడు. డిటెక్టివ్‌ చేసే ఇన్వెస్టిగేషన్‌ మొదలు.. హత్య జరిగిన తీరు వరకు ఏది ఆసక్తికరంగా ఉండదు. రాజీవ్‌ గాంధీ హత్య జరిగిన రోజే ఈ హత్య జరిగినట్లు చూపించడానికి సరైన కారణం కూడా ఉండదు. సీఐ భాస్కర్‌ బిజీ కావడంతోనే ఈ కేసును ప్రైవేట్‌ డిటెక్టివ్‌కి ఇచ్చినట్లుగా మొదట్లో చూపిస్తారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు సీఐ భాస్కర్‌ ఇంత ఖాలీగా ఉన్నాడేంటి అనిపిస్తుంది. ఇక డిటెక్టివ్‌ చేసే ఇన్వెస్టిగేషన్‌ ఆసక్తికరంగా లేకపోయినా.. కనీసం నవ్వుకునే విధంగా కూడా ఉండదు. మధ్యలో వచ్చే ఉప కథలు కూడా చాలా రొటీన్‌గా ఉంటాయి. రాజీవ్‌ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసి శ్రీకాకుళం సీఐ అలర్ట్‌ అవ్వడంతో సినిమా ప్రారంభం అవుతుంది. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా అర్థరాత్రంతా పోలీసులు పెట్రోలింగ్‌ చేయడం, ఘర్షనకు దిగిన ఇద్దరిని అరెస్ట్‌ చేయడం.. పోలీసులను చూసి ఓ కారు వెనక్కి వెళ్లడంతో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక హత్య జరగడం.. విచారణ కోసం డిటెక్టివ్‌ షేర్లక్‌ రంగంలోకి దిగడం వరకు కథపై ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత విచారణ భాగంగా వచ్చే ఉప కథలు బోరింగ్‌గా సాగుతాయి. ఒక్కోక్కరు చెప్పే స్టోరీ.. తెరపై చూడడం భారంగా ఉంటుంది. అలాగే ఝాన్సీ అనే పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే హంతకులు ఎవరనే విషయం చివరి వరకు ప్రేక్షకుడు కనిపెట్టకుండా చేయడం దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ కాస్త బెటర్‌. మేరిని ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనేది ఆసక్తికరంగా ఉంటుంది. షెర్లాక్‌ ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీ కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే అప్పటికే విసిగిపోయిన ప్రేక్షకుడు.. ఆ ఎమోషనల్‌ సీన్‌కి కూడా అంతగా కనెక్ట్‌ కాలేకపోతాడు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్‌ షెర్లాక్‌ హోమ్స్‌ పాత్రకు వెన్నెల కిశోర్‌ కొంతవరకు న్యాయం చేశాడు. అయితే శ్రీకాకుళం యాసలో ఆయన పలికే సంభాషణలలో సహజత్వం కలిపించదు. కామెడీ కూడా అంతగా పండించలేకపోయాడు. అనన్య నాగళ్లకు ఓ మంచి పాత్ర లభించింది. భ్రమరాంభ పాత్రలో ఆమె చక్కగా నటించింది. ఆ పాత్రలోని వేరియేషన్స్‌ ఆకట్టుకుంటాయి. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టునే తిరుగుతుంది. అనీష్ కురివెళ్ల పాత్రకి వేరే వాళ్లతో డబ్బింగ్‌ చెప్పించడం ఆ క్యారెక్టర్‌ స్థాయిని తగ్గించింది. రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, నాగ్ మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సునీల్‌ కశ్యప్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ అవినాష్‌ గుర్లింక్‌ తన కత్తెరకు ఇకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Allu Arjun Issue: KSR Comment On Telangana Govt Decisions4
సంక్షోభం.. సినీ రంగానికా? రాజకీయానికా?

ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప -2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన విషయం చిలికి,చిలికి గాలివానగా మార్చడానికి రాజకీయ నేతలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. సినీ పరిశ్రమపైనే తీవ్ర ప్రభావం చూపించేలా పరిస్థితులు ఏర్పడుతుండడం దురదృష్టకరం. వేలాది మందికి ఆధారంగా ఉన్న ఈ పరిశ్రమ ఇప్పుడు సంక్షోభంలో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి.. కొత్త సంవత్సరంలో సంక్రాంతి(Sankranti) సందర్భంగా విడుదల కావల్సి ఉన్న సినిమాలపై ఈ ఉదంతం.. పరిణామాల ప్రభావం పడుతుందని నిర్మాతలు భయపడుతున్నారు. దానికి కారణం వీరిలో కొందరు భారీ వ్యయంతో సినిమాలు తీయగా, ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షో లు, టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతించం అని ప్రకటించడమే అని చెబుతున్నారు. వినోద మాద్యమ రంగంలో వచ్చిన అనేక మార్పుల ప్రభావం ఆ పరిశ్రమను అతలాకుతలం చేస్తోందని చెప్పవచ్చు. ఆ దశలో అల్లు అర్జున్ ఘటన వ్యవహారాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒక రకంగా ఇది రేవంత్ ఈగో సమస్యగా మారినట్లుగా ఉంది. శాసనసభలో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ ప్రముఖులను తప్పుపట్టారు. అర్జున్ ఒక రాత్రి జైలులో ఉండి ఇంటికి వస్తే సినీ ప్రముఖులు, ఇతరులు క్యూ కట్టి పరామర్శిస్తారా అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. తొక్కిసాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు ఆస్పత్రిలో ఉంటే ఎందుకు పరామర్శించ లేదని ఆయన అన్నారు. నిజమే!ఆ బాలుడిని పరామర్శించాలని చెప్పడం తప్పు లేదు.కాని ఆ కారణంగా అర్జున్ ఇంటి వద్దకు వెళ్లడం తప్పన్నట్లుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం అంత సముచితంగా లేదు.పైగా కాలు పోయిందా?చేయి పోయిందా? కిడ్నీ పోయిందా?ఏమి జరిగిందని అర్జున్ వద్దకు వెళ్లారని ప్రశ్నించడం మరీ తప్పు అని చెప్పకతప్పదు. తమకు సంబంధించిన వ్యక్తి తప్పు చేసినా, చేయకపోయినా, ఏదైనా ఇబ్బందిలో ఉన్నాడని తెలిసినప్పుడు ఆయన సన్నిహితులు,అదే రంగానికి చెందినవారు వెళ్లి పలకరించి వస్తుంటారు.అంతెందుకు! ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అయి బెయిల్ పై జైలు నుంచి విడుదల అయినప్పుడు జైలువద్దకు వచ్చినవారితో కలిసి ఆయన ర్యాలీనే తీశారు కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్‌ పై పలువురు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేసి పశ్చాత్తాప్తం ప్రకటించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నోరు పారేసుకోవడం తీవ్ర అభ్యంతరకరం. అల్లు అర్జున్ ఆంధ్రా వెళ్లిపోవాలట..! ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యాపారాలు చేయాలట!. ఇలాంటి వ్యాఖ్యలను రేవంత్ సమర్దిస్తారా? సమర్దించరు. ఎందుకంటే స్వయానా ఆయన అల్లుడు ఆంధ్రకు చెందినవారన్న సంగతి తెలిసిందే. ఈ మాత్రం సోయ లేకుండా భూపాల్ రెడ్డి వంటి వారు వ్యర్ద ప్రసంగాలు చేస్తే అది కాంగ్రెస్ కు మరింత చేటు తెస్తుంది. మంత్రి సీతక్క అయితే.. పుష్ప సినిమాకుగానూ అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. అది తప్పయితే.. రేవంత్ ప్రభుత్వం ఆ సినిమాకు బెనిఫిట్ షోలు, ధరల పెంపుదలకు ఎందుకు అనుమతి ఇచ్చింది?. ఆ మాటకు వస్తే నక్సల్స్ కు సానుభూతిగా కొన్ని సినిమాలు వచ్చాయి.వాటిలో కొన్నిటికి అవార్డులు కూడా లభించాయి. కాని నక్సల్స్ ను ఏ ప్రభుత్వం అయినా అంగీకరిస్తుందా?. సీతక్క(Seethakka) ఎందుకు ఆ భావజాలం నుంచి బయటకు వచ్చారు?. ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడితే సరిపోదని గుర్తించాలి. ఇదే టైంలో.. 👉బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు డీకే అరుణ, రఘునందన్‌ తదితరులు అల్లు అర్జున్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందని ధ్వజమెత్తారు. సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ తీస్తోందని,పగ పట్టినట్లు వ్యవహరిస్తోందని కూడా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ కూడా ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నా.. బీజేపీ వాళ్లే దీనిని బాగా సీరియస్‌గా తీసుకున్నట్లు కస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బిజెపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యత్నిస్తోంది. భవిష్యత్తులో అల్లు కుటుంబాన్ని తమ పార్టీలోకి తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అనేది చూడాలి. ఇక.. అర్జున్ పై కాంగ్రెస్ కాక తగ్గించకపోతే.. ఆ దిశగా అడుగులు పడ్డా ఆశ్చర్యం ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనకు అర్జున్ దానికి సమాధానం ఇవ్వడం ప్రభుత్వానికి మంటపుట్టించింది. అది అర్జున్ కు ఉన్న స్వేచ్చ అని ప్రభుత్వం భావించలేదు. పోలీసు ఉన్నతాధికారులంతా రంగంలో దిగి అర్జున్ ఏదో ఘోరమైన నేరం చేశారని చెప్పడానికి యత్నించారు. లేకుంటే ఈ కేసులో పదివేల వీడియోలు సేకరించవలసినంత అవసరం ఏముంది?. ఎక్కడో చోట అర్జున్ తప్పు దొరకకపోదా? అని వెతికారన్నమాట. దీనిని ప్రభుత్వ పెద్దలు వ్యక్తిగత ప్రతిష్టగా భావించారన్నమాట!. ఇదే సందర్భంలో.. 👉పోలీసులు సంధ్య థియేటర్ వద్ద అర్జున్ కు స్వాగతం చెప్పిన రీతిలో వ్యవహరించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఒక సస్పెండెడ్ పోలీస్ అధికారి అయితే మరీ రెచ్చిపోయి ఆంధ్ర-తెలంగాణ అంశాన్ని తెరపైకి తేవడం, అర్జున్ నటన గురించి వ్యాఖ్యలు చేయడం, సినీ పరిశ్రమవారికి ఇచ్చిన భూముల ప్రస్తావన తేవడం, ఏకంగా తాటతీస్తాం,తోలు తీస్తాం అని హెచ్చరించడం శోచనీయంగా ఉంది. అర్జున్ కు పోలీసులు నోటీసు ఇచ్చి మూడున్నర గంటలు విచారించడం కూడా వేధింపులో భాగమే అనే అభిప్రాయం కలుగుతుంది. పైగా అర్జున్ ‘‘అలా జవాబిచ్చారు..ఇలా సమాధానం ఇచ్చారు..’’ అంటూ లీకులు ఇచ్చిన తీరు కూడా దీనిని ధృవపరుస్తుంది. ఏపీలో రెడ్ బుక్(Red Book) రాజ్యాంగం మాదిరి తెలంగాణలో కూడా పోలీసులు ప్రజల తోలు తీసే రాజ్యాంగం వచ్చిందేమో తెలియదు.మరో వైపు కొందరు ఓయూ జేఏసీ పేరుతో అర్జున్ ఇంటిపై దాడి చేయడం మరింత దారుణం. పేరుకు జేఏసీ అయినా.. అక్కడకు వెళ్లినవారంతా కాంగ్రెస్ వారేనని సోషల్ మీడియాలో ఆధార సహితంగా వీడియోలు వచ్చాయి. దీనిని ఖండించి , ఏకోన్ముఖంగా నిరసన చెప్పవలసిన సినిమా పరిశ్రమ పెద్దలు జడిసిపోయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రేవంత్ శాసనసభలో చేసిన విమర్శలతో వీరంతా భయపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే.. 👉అర్జున్ ఇంటిపై దాడి చేసినవారు అరాచకంగా రాళ్లు వేసి,పూలకుండీలు మొదలైనవాటిని ధ్వంసం చేసినా ఇంటిలో పనిచేసేవారిపై దౌర్జన్యానికి దిగినా సినీ ప్రముఖులు మాత్రం నోరు మెదపలేదు. అర్జున్ కు ,ఆయన తండ్రి అరవింద్ కు సంఘీబావం తెలపలేదు. ఇది పరిశ్రమ బలహీనతగా ఉంది. రేవంత్ కూడా అర్జున్ ఇంటిపై దాడిని నేరుగా ఖండించకుండా, సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నానని ప్రకటన ఇవ్వడం ద్వారా ఆయనలో ఇంకా కోపం తగ్గలేదని చెప్పకనే చెప్పారనుకోవాలి.. ఇదే సందర్భంలో సడన్ గా బెనిఫిట్ షో లు రద్దు చేస్తామని సీఎం చెప్పడం సినీ పరిశ్రమ ప్రముఖులలో గుబులు రేపుతోంది. వచ్చే నెలలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మరో ప్రముఖ నటుడు వెంకటేష్ తదితరుల సినిమాలు విడుదల కావల్సి ఉంది. వీటిలో ఒక సినిమాకు ఐదువందల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయిందట!. అలాగే మరో సినిమాకు 150 కోట్లు ఖర్చు పెట్టారట!. ఈ భారీ బడ్జెట్ సినిమాలకు స్పెషల్ షో లు, ధరల పెంపు,బెనిఫిట్ షో లు వంటివి లేకపోతే.. సత్వరమే వారు పెట్టిన పెట్టుబడి రావడం కష్టం అయిపోతుంది. 👉ప్రముఖ నిర్మాత ,తెలంగాణ చలనచిత్రాభివృద్ది సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు తనకు ఉన్న సన్నిహిత సంబంధాలతో రేవంత్ ను ఒప్పించి మళ్లీ బెనిఫిట్ షో లు, ధరల పెంపుదలకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకువస్తారన్న ఆశతో ఉన్నారట!. అందుకే ఇప్పుడు అర్జున్ తప్పుచేసినా, చేయకపోయినా.. ఆ ఘటన జోలికి వెళ్లకపోవడం బెటర్ అని భావిస్తున్నారట!. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిక్కెట్ ధరల గురించి చర్చించి, షూటింగ్ లు కూడా జరిపేలా షరతులు పెడితే.. ఇంకేముంది సినిమావారిపై దాడి చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ వంటివారు కాని, ఇటు ఎల్లో మీడియా కాని ఇప్పుడు నోరు మెదపడం లేదు. మెగాస్టార్ చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించి విందు ఇచ్చి పంపితే, ఆయనకు ఏదో అవమానం జరిగిందంటూ కూడా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు స్వయానా చిరంజీవి మేనల్లుడు ఇంటిపైనే దాడి జరిగితే పవన్‌ కల్యాణ్‌తో సహా ఎవరూ నోరు విప్పడం లేదు. ఎందుకంటే.. పవన్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే ఉంటాయి కాబట్టి.👉నిజంగానే రేవంత్ తననిర్ణయానికి కట్టుబడి ఉంటే ఒకరకంగా ప్రయోజనం, మరో రకంగా నష్టం వాటిల్లవచ్చు. నిర్మాతలు చిన్న బడ్జెట్ తో సినిమాలు తీయడానికి సిద్దం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు సినిమా టిక్కెట్ల ధరలు కూడా పెంచాలని కోరవలసిన అవసరం ఉండదు. కానీ అగ్ర నిర్మాతలు ఇందుకు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ ఇది ముదిరితే సినీ పెద్దలు రేవంత్ ప్రభుత్వంపై ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదులు చేయవచ్చు!. అంతేకాక తాము ఇక్కడ షూటింగ్ లు చేయలేమని,వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నామని ప్రకటించినా, రేవంత్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. అందువల్ల పరిశ్రమకు ఇబ్బంది రాకుండా, అలాగే ప్రేక్షకులకు సౌలభ్యంగా రాజీ కుదుర్చుకోవడం మంచిదని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Rohit Sharma to open, Shubman Gill And Nitish Kumar Reddy likely to be dropped for Boxing Day Test: Report5
ఆసీస్‌తో నాలుగో టెస్టు.. గిల్‌, నితీశ్ రెడ్డిపై వేటు! వారికి ఛాన్స్‌?

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో త‌ల‌ప‌డేందుకు ఆస్ట్రేలియా, భార‌త్ జ‌ట్లు సిద్ద‌మ‌య్యాయి. డిసెంబ‌ర్ 26 నుంచి ప్రారంభ‌మయ్యే ఈ బాక్సింగ్ డే టెస్టు కోసం ఇరు జ‌ట్లు తీవ్రంగా శ్ర‌మించాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాల‌ని అటు ఆస్ట్రేలియా, ఇటు భార‌త్ రెండూ భావిస్తున్నాయి. అయితే ఈ నాలుగో టెస్టులో టీమిండియా భారీ మార్పుల‌తో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.ఓపెన‌ర్‌గా రోహిత్‌.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ తిరిగి భార‌త ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. కేఎల్ రాహుల్ ఓపెన‌ర్‌గా రాణిస్తుండ‌డంతో గ‌త రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ హిట్‌మ్యాన్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని త‌న రెగ్యూల‌ర్ బ్యాటింగ్ పొజిషేన్‌లోనే పంపాల‌ని జ‌ట్టు మెనెజ్‌మెంట్ నిర్ణ‌యించుకున్న‌ట్లు వినికిడి. కాగా కేఎల్ రాహుల్ మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు రానున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.ఈ నేపథ్యంలో ఫ‌స్ట్ డౌన్ బ్యాట‌ర్‌ శుబ్‌మ‌న్ గిల్‌పై వేటు ప‌డే అవ‌కాశం ఉంది.. ఎందుకంటే రోహిత్ ఓపెన‌ర్‌గా, రాహుల్ ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్ వ‌స్తే.. గిల్ ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు రాక త‌ప్ప‌దు. అత‌డు ఎప్పుడూ టాప‌ర్డర్‌లో త‌ప్ప లోయార్డ‌ర్‌లో బ్యాటింగ్ చేసిన అనుభ‌వం లేదు. దీంతో గిల్ స్దానంలో ధ్రువ్ జురెల్‌కు చోటు ఇవ్వాల‌ని భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్ యోచిస్తున్న‌ట్లు క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మ‌రోవైపు టైమ్స్ ఇండియా క‌థ‌నం ప్ర‌కారం.. బ్యాక్సింగ్ డే టెస్టులో భార‌త్ ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సందర్‌లు బ్యాక్సింగ్‌ డే టెస్టులో స్పిన్నర్లగా ఆడున్నట్లు సమాచారం. యువ ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డిని ప‌క్క‌న పెట్టాల‌ని రోహిత్ శ‌ర్మ‌, హెడ్ కోచ్ గంభీర్ భావిస్తున్నరంట. నితీశ్‌ బ్యాటింగ్‌ పరంగా అద్బుతంగా రాణిస్తున్నప్పటికి, బౌలింగ్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడి స్ధానంలో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సుందర్‌కు అవకాశమివ్వనున్నారంట.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్‌), KL రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), ధృవ్ జురెల్‌, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్‌), మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్చదవండి: IND vs AUS: భారత్‌తో నాలుగో టెస్టు.. ఆసీస్‌ తుది జట్టు ప్రకటన! 19 ఏళ్ల కుర్రాడికి చోటు

New Twist In Telangana Formula-E Race Case6
ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో కీలక పరిణామం

హైదరాబాద్‌, సాక్షి: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ(ACB) అధికారులకు హైకోర్టు ​ఉత్తర్వులు అందాయి. దీంతో ఫిర్యాదుదారుడు దాన కిషోర్‌ను ఏడు గంటలపాటు ఏసీబీ ప్రశ్నించి..స్టేట్‌మెంట్‌ నమోదు చేసింది. ఇక.. స్టేట్‌మెంట్‌ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానకిషోర్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఏసీబీ ఈ కేసులో విచారణ మొదలుపెట్టనుంది. త్వరలో కేటీఆర్‌(KTR), అరవింద్‌ కుమార్‌లకు నోటీసులు జారీ చేయనుంది. దానకిషోర్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగానే ఈ ఇద్దరినీ ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ఆయన నుంచి తీసుకున్నన్న డాక్యుమెంట్లను వాళ్ల ముందు ఉంచే అవకాశం ఉంది. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే దానకిషోర్‌ తెలంగాణ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకే.. హెచ్‌ఎండీఏ నుంచి డబ్బు బదిలీ అయినట్లు ప్రభుత్వానికి తెలిపారాయన. ఏ1గా కేటీఆర్‌ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ఇప్పటికే కేసు నమోదైంది. ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా-ఈ కార్‌ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాల్సిందిగా అవినీతి నిరోధక శాఖ(ACB)కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) శాంతికుమారి లేఖ రాశారు.ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్‌ఎండీఏ(HMDA) ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్‌కు ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేటీఆర్‌తోపాటు పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, చీఫ్‌ ఇంజినీర్‌ను బాధ్యులుగా పేర్కొన్నారు.ప్రధాన అభియోగం ఇదే.. ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌, ఎస్‌ నెక్ట్స్‌ జెన్‌, పురపాలకశాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్‌ రేస్‌లు నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులో తొమ్మిదో సీజన్‌ రేసింగ్‌ నిర్వహించారు. ‘‘అప్పటి మంత్రి కేటీఆర్‌ ఆమోదంతోనే ఒప్పందం కుదిరింది. శాఖాధిపతిగా ఎంవోయూ చేశా’’ అని ఒప్పందంపై ఐఏఎస్‌ అర్వింద్‌ కుమార్‌ సీఎస్‌కు సమాధానమిచ్చారు. ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం.నెక్స్ట్‌ ఏంటంటే.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావించిన, అనుమానించిన వారందరికీ ఏసీబీ నోటీసులు ఇవ్వనుంది. వారిని విచారించి, వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత ఆధారాలను సేకరిస్తుంది. ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా...? అనే అంశంపై ఎక్కువ దృష్టి సారించనుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన రూ.55 కోట్లు ఎక్కడెక్కడి నుంచి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే కోణంలోనూ పరిశీలించే అవకాశముంది. అధికార దుర్వినియోగంపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే... అందుకు బాధ్యులైన వారి అరెస్టు తప్పకపోవచ్చు. అదే జరిగితే ఆ వ్యవహారం సంచలనాత్మకంగా మారడం ఖాయం.ఇదీ చదవండి: విభజన సమస్యల పరిష్కారం మరింత జఠిలం!

Kejriwal Said Delhi CM To Be Arrested Soon7
త్వరలో ఢిల్లీ సీఎం అరెస్టు: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(DelhiElections) సమీపిస్తున్న కొద్ది అక్కడ రాజకీయం వేడెక్కుతోంది. క్రమంలోనే ఢిల్లీ మాజీ సీఎం,ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvindkejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అతిషి(Atishi)ని త్వరలోనే ఏదో తప్పుడు కేసులో అరెస్టు చేస్తారన్నారు. ఈ మేరకు బుధవారం(డిసెంబర్‌25) ఎక్స్‌(ట్విటర్‌)లో కేజ్రీవాల్‌ ఒక పోస్టు చేశారు.సీఎం అతిషి ఇటీవల ముఖ్యమంత్రి సంజీవని యోజన,మహిళా సమ్మాన్‌ యోజన పథకాలు ప్రకటించడంతో కొందరు వణుకుతున్నారని అందుకే ఆమెను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంతకంటే ముందే పలువురు ఆమ్‌ఆద్మీ పార్టీ కీలక నేతల ఇళ్లలో సోదాలు జరగవచ్చని కేజ్రీవాల్‌ తెలిపారు.కాగా, ఢిల్లీలో మహిళలకు నెల నెలా రూ.2100 నగదు ఇచ్చే మహిళా సమ్మాన్‌ యోజన స్కీమ్‌ ఏదీ లేదని, స్కీమ్‌ పేరుతో ఎవరైనా ప్రజల సమాచారం సేకరించడం నేరమని ఢిల్లీ మహిళా,శిశు సంక్షేమ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. ఓ వైపు ఆమ్‌ఆద్మీపార్టీ ఈ స్కీమ్‌ కింద అర్హుల వివరాలు సేకరిస్తున్న వేళ మహిళా,శిశు సంక్షేమ శాఖ చేసిన ప్రకటన రాజకీయ వివాదానికి కారణమైంది. దీనిపై బీజేపీ మరో విధంగా స్పందించింది. కేజ్రీవాల్‌ అతిషి మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్లే ఆప్‌ స్కీమ్‌పై ప్రభుత్వం చర్యలకు దిగిందని ఆరోపించింది.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ మళ్లీ గెలిస్తే మహిళా సమ్మాన్‌యోజనతో పాటు సంజీవని స్కీమ్‌ అమలు చేస్తామని తదితర హామీలిచ్చింది. ఈ స్కీమ్‌లపై బీజేపీ,ఆప్‌ల మధ్య రాజకీయ మాటల తూటాలు పేలుతున్నాయి.

Hyderabad City Police Warn To Netizens For Spread Wrong News In Sandhya Theater Incident8
సంధ్య థియేటర్ ఘటనపై 'హైదరాబాద్‌ పోలీసుల' హెచ్చరిక

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందని పోలీసులు గుర్తించారు. దీంతో వారు అధికారికంగా ఒక హెచ్చరిక చేశారు. పుష్ప2 సినిమా ప్రీమియర్‌ సమయంలో రేవతి మరణం గురించి ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ సిటీ పోలీసులు తెలిపారు.అల్లు అర్జున్ రాకముందే థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగినట్టుగా కొందరు తప్పుడు వీడియోలతో పోస్టులు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారు తెలిపారు. ఈ అంశంపై వారు ఇలా చెప్పుకొచ్చారు ' ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినా, కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేస్తున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేస్తే.. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.ఈ విషయంలో పోలీసు శాఖ కీర్తిని తక్కువ చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్‌గా పరిగణిస్తాం. ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోంది. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చు. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.' అని హైదరాబాద్‌ సిటీ పోలీసులు తెలిపారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు …. కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం మా దృష్టికి వచ్చింది. ఈ ఘటన పై విచారణ…— Hyderabad City Police (@hydcitypolice) December 25, 2024

Mohanlal's Barroz 3D Movie Review In Telugu9
మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ

స్వతహాగా మలయాళీ హీరో అయిన్ మోహన్ లాల్ (Mohanlal).. 'దృశ్యం' సినిమాలతో మంచి పాపులరిటీ సొంతం చేసుకున్నారు. తెలుగులో 'జనతా గ్యారేజ్' మూవీలోనూ చేశారు. అలా తెలుగు ప్రేక్షకులకు ఈయన సుపరిచితుడే. 400కి సినిమాల్లో నటించిన ఈయన తొలిసారి 'బరోజ్' (Barroz Movie) అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఇందులో ఈయనే హీరోగానూ నటించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? మోహన్ లాల్ డైరెక్టర్‌గా హిట్ కొట్టారా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా డి గామా వంశంలోని 13వ జనరేషన్‌కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్‌ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అ‍ప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?మనలో చాలామంది చిన్నప్పుడు చందమామ కథలు చదివే ఉంటారు. హాలీవుడ్ కార్టూన్ డబ్బింగ్ మూవీస్ కూడా చూసే ఉంటారు. అయితే అవి డబ్బింగ్ మూవీస్ కాబట్టి ఆ మైండ్ సెట్‌తోనే చూస్తాం. అర్థం కాకపోయినా సరే ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి సినిమానే మన దగ్గర తీస్తే.. మనకు రిలేట్ అవుతుందా లేదా అనేది మాత్రం అబ్జర్వ్ చేస్తాం. కానీ 'బరోజ్' మాత్రం పేరుకే మలయాళ మూవీ కానీ.. ఏదో ఇంగ్లీష్ మూవీ చూస్తున్నామా అనిపిస్తుంది. రెండున్నర గంటల నిడివి అయినప్పటికీ నాలుగు గంటల మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది.మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‍‌తో 'బరోజ్' మొదలవుతుంది. ఫాదో గీతంతో ఈ మూవీని ప్రారంభిద్దామని అంటారు. అసలు ఫాదో గీతం అంటే ఏంటి అనుకునేలోపు.. సడన్‌గా పోర్చుగీస్ పాట ప్లే అవుతుంది. దీని మీనింగ్ ఏంటో అర్థం కాదు. ఇదొక్కటే కాదు మూవీ అంతా దాదాపు ఇదే కన్ఫ్యూజన్. నిధిని కాపాడే భూతంగా బరోజ్ ఎంట్రీ.. అసలు ఈ నిధి సంగతేంటి? దెయ్యంగా ఎందుకు మారాడు? ఈ నిధిని ఎవరికి అప్పగించాలి అనే అంశాలే సినిమా కథ.నిధికి కాపలాగా భూతం ఉండటం.. 400 ఏళ్లుగా ఒకే గదిలో ఈ భూతం ఉండిపోవడం.. లైన్ చూస్తుంటే మంచి హాస్యం పుట్టించొచ్చు. నిధిని ఎవరైనా కొట్టేయడానికి వస్తే ఆ సీన్లని అడ్వెంరెస్‌గా తీయొచ్చు. కానీ 'బరోజ్'లో అలాంటి సన్నివేశాలే ఉండవు. హీరోగా నటించి దర్శకత్వం వహించింది మోహన్ లాల్ కదా. అంతా ఆయన కనిపిస్తాడనుకుంటే.. అడపాదడపా కనిపిస్తాడు. ఈయన పాత్ర భూతం కదా. జీనీలా అద్భుతాలు చేయొచ్చు. తర్వాత ఏం జరుగుతుందో అనే ఆత్రుతని కలిగించొచ్చు. కానీ మోహన్ లాల్ అలా చేయలేకపోయారు. సినిమా ప్రారంభం నుంచి ఈయన మార్క్ చూపించే, అరె భలే ఉందే అనిపించే సీన్ ఒక్కటీ ఉండదు. మోహన్ లాల్ కాకుండా మిగిలిన సీన్లలో మనకు ఏ మాత్రం పరిచయం లేని విదేశీ నటులు వచ్చిపోతుంటారు. ఒకరు తెలుగులో మాట్లాడితే మరొకరు పోర్చుగీస్‌లో మాట్లాడుతుంటారు. ఇది ఇబ్బందిగా అనిపించింది.హాలీవుడ్ సినిమాలని చూసిన మోహన్ లాల్.. వాటి స్ఫూర్తితో సినిమా చేద్దామని ఫిక్సయ్యారు. కానీ ప్రాంతీయ ప్రేక్షకులని ఆకట్టుకునేలా తీయలేకపోయారు. నేటివిటీ లేక ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయ్యారు. ఇలాంటి పాయింట్ కోసం పోర్చుగీస్ కథల వరకే వెళ్లాల్సిన అవసరం లేదు. మన జానపదాలు వెతికితే ఎన్నో అద్భుతమైన కథలు కనిపిస్తాయి. ఆ దిశగా మోహన్ లాల్ ఆలోచించి ఉంటే లోకల్ ఆడియెన్స్‌కి సినిమా ఇంకా నచ్చి ఉండేది. దర్శకుడిగా త్రీడీ మూవీ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని తపించిన మోహన్ లాల్.. కంటెంట్‌పై సరిగా దృష్టి పెట్టలేదు. దీంతో మూవీ అటోఇటో అన్నట్లు సాగుతూ వెళ్తుంది.ఎవరెలా చేశారు?బరోజ్‌గా టైటిల్ రోల్ చేసిన మోహన్ లాల్.. పాత్రలో సరిగ్గా సరిపోయారు. హీరో కమ్ డైరెక్టర్ నేనే కదా అని అనవసర ఎలివేషన్ల జోలికి పోలేదు. పాత్రకు ఎంత కావాలో అంత ఇచ్చారు. కానీ ఇంకాస్త థ్రిల్లింగ్, ఎంటర్‌టైనింగ్‌గా బరోజ్ పాత్రని రాసుకుని ఉంటే బాగుండేది. ఇషా పాత్ర చేసిన మాయారావు చూడటానికి బాగుంది. యాక్టింగ్ ఓకే ఓకే. మిగిలిన విదేశీ నటీనటులు బాగానే చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫీ బాగుంది. అండర్ వాటర్ త్రీడీ విజువల్స్ ఔట్‌పుట్ మాత్రం అనుకున్నంతగా రాలేదు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలే గుర్తొస్తాయి. నిర్మాణ విలువల మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. ఖర్చు విషయంలో అసలు వెనుకాడలేదు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ బాగుంది.ఓవరాల్‌గా చెప్పుకొంటే మోహన్ లాల్ 'బరోజ్'తో కష్టపడ్డారు గానీ కంటెంట్ పరంగా తడబడ్డారు. దీంతో సగటు ప్రేక్షకుడు.. ఇది మా కోసం తీశారా? పోర్చుగీసు వాళ్ల కోసం తీశారా అని సందేహపడటం గ్యారంటీ.-చందు డొంకాన

New Couple Fashion Goals PV Sindhu-Venkata Datta Sai Matching Wedding Jewels10
ఆటలోనే కాదు..ఫ్యాషన్‌లోనూ ట్రెండ్‌ సెట్‌ చేసిన పీవీ సింధు

పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ,రెండుసార్లు ఒలింపియన్‌ పీవీ సింధు వివాహ వేడుక అంగరంగ వైభంగా ముగిసింది. పెళ్లి కూతురులుక్‌లో ముగ్ధమనోహరంగా అందర్నీ మెస్మరైజ్‌ చేసింది.హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో ఆదివారం, (డిసెంబర్ 22,2024న) ఉదయపూర్‌లో వివాహం చేసుకుంది పీసీ సిందు. ఈ సందర్భంగా పీవీ సిందు డిజైనర్‌ సారీ, పెళ్లి కూతురి ముసుగు, వరుడు బ్రోకేడ్ షేర్వాని ఇలా ప్రతీదీ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఒక్కో వేడుకకు, ఒక్కో డిజైనర్‌ రూపొందించిన ఫ్యాషన్‌ ఔట్‌ఫిట్స్‌తో తన వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ చాలా గ్రాండ్‌గా ఉండేలా జాగ్రత్త పడింది పీవీ సింధు. ముఖ్యంగా వధూవరుల మ్యాచింగ్‌ ఆభరణాలు కొత్త ట్రెండ్‌కు అద్దం పట్టాయి. ఫ్యాషన్ అభిమానులు, ముఖ్యంగా కాబోయే వధువుల మనసు దోచేశాయి. ఆటలోనూ కాదు, ఫ్యాషన్‌లోనూ ట్రెండ్‌ చేసిందంటూ మురిసిపోతున్నారు అభిమానులు.పీవీ సింధు, సాయి మ్యాచింగ్‌ ఆభరణాలుప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా జ్యువెలరీ కలెక్షన్లోని పచ్చలు పొదిగిన డైమండ్‌ నెక్లెస్‌ ధరించగా, వరుడు దత్త సాయి ఆభరణాలు అందరి దృష్టినీ కట్టిపడేశాయి. సింధు జాంబియన్ పచ్చలు ఒపదిగిన మల్టీ -లేయర్డ్ నెక్లెస్,పట్టీ, మ్యాచింగ్ చెవిపోగులు డబుల్‌ లేయర్‌ నెక్లోస్‌ ధరించాడు. ఇంకా వజ్రాలు పొదిగిన కడాల , బంగారు గొలుసు సింధు బ్రైడల్‌ లుక్‌నుమరింత ఎలివేట్‌ చేశాయి. కాబోయే వధూవరులకు కొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేశారు అంటున్నారు ఫ్యాషన్‌ ప్రియులు,

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
‘ఎన్నారై’ కుటుంబం వేధింపులకు ఒకరి బలి

అల్వాల్‌ (సికింద్రాబాద్‌): ఎన్నారై అల్లుడు, అతని కుటుంబీకుల

title
సింగపూర్‌లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  జన్మదిన వేడుకలు సింగపూర్ లో ఘనంగా జరిగాయి.

title
ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-28 ఎన్నికల ఫలితాలు : సరికొత్త చరిత్ర

అమెరికన్ తెలుగు అసోసియేషన్ -బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-2028 పదవీ కాలానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు  రికార్డ్‌ సృష్ట

title
అట్లాంటాలో వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా

అమెరికాలోని అట్లాంటాలో వైయస్సార్‌సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి

title
మెల్‌బోర్న్‌లో ఘనంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు

 వైయస్సార్‌ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం  వై.ఎస్.

Advertisement

వీడియోలు

Advertisement