Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jaganmohan Reddy Fires On Chandrababu About Tirupati Stampede1
బాబే మొదటి ముద్దాయి: వైఎస్‌ జగన్‌

వైష్ణవులందరికీ మార్గదర్శకంగా నిలిచే ఆలయం తిరుమల. గతంలో లక్షలాది మంది భక్తులు వచ్చినా సంతోషంగా దర్శనం చేయించి పంపించగలిగాం. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శాస్త్రం తెలియదు. ఆచరణలు తెలియవు. దేవుడిపై భయం లేదు. భక్తీ లేదు. భయమూ, భక్తి ఉన్న వాడెవడైనా తిరుమల శ్రీవారి ప్రసాదంపై ఇష్టమొచ్చి­నట్టుగా అబద్ధాలు చెప్పగలుగుతాడా? టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం ముఖ్యమంత్రి అనే­వాడు చేస్తాడా? ఈ ఘటనలో ముమ్మా­టికీ చంద్రబాబే మొదటి ముద్దాయి.తొక్కిసలాట ఒక ప్రాంతంలో జరగలేదు. రకరకాల ప్రదేశాల్లో జరిగింది. ఆయా ప్రాంతాల్లో పోలీస్‌ ఫోర్స్‌ లేకపోవడం, కనీస ఏర్పాట్లు లేకపోవడం స్పష్టంగా కన్పిస్తోంది. ఆయా ప్రాంతాల్లో అంబులెన్స్‌లను ప్రోటోకాల్‌ ప్రకారం పెట్టాలన్న బాధ్యత కూడా లేదు. తొక్కిసలాట తర్వాత అంబులెన్స్‌ రావడానికి, క్షతగాత్రులను తీసుకెళ్లడానికి ముక్కాలు గంట (45 నిమిషాలు) పట్టిందని బాధితులు చెబుతున్నారు. అది కూడా అప్పుడొకటి.. అప్పుడొకటి వచ్చాయని చెప్పారు. కొంత మంది వాళ్లంతట వాళ్లే కిందా మీద పడి వచ్చామని చెప్పారు. మరికొంత మంది రోడ్డున పోయే వారి సాయంతో వచ్చామని చెబుతున్నారు. ఈ రకమైన పరిస్థితులుండడం ఎంత దారుణం? ఈ ఘటనకు చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, ఎస్పీ, కలెక్టర్‌.. బాధ్యత వహించాలి. ఇందులో వీరందరి తప్పు ఉంది. చంద్రబాబు నాయుడుకు ఈ పాపం తగలక మానదు. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశానంటూ దేవుడికి, భక్తులకు క్షమాపణ చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. సిన్సియార్టీ లేదు. చిత్తశుద్ధి అంతకంటే లేదు. తాను చేసిన తప్పును ఇంకొకరి మీద మోపడమే ఆయనకు తెలుసు. – వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో చనిపోవడం దురదృష్టకరమని వైఎ­స్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చరిత్రలో ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు. టీటీడీ చరిత్రలో ఇది మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. ఈ ఘటనలో ముమ్మాటికీ మొదటి ముద్దాయి చంద్రబాబేనని స్పష్టం చేశారు. తొక్కిస­లా­టలో గాయపడి, పద్మావతి మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రి (స్విమ్స్‌)లో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం రాత్రి ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర టీటీడీలో ఇలాంటి పరిస్థితులకు దారితీసిన కారణాలను అందరూ ఆలోచించాలన్నారు. తొక్కిసలాట ఘటనలో ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వచ్చా­యని చెప్పారు. ‘మనం వైకుంఠ ఏకాదశిని ప్రతి ఏటా జరుపుకుంటాం. ఆ రోజు లక్షలాది మంది భక్తులు వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తారు. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని తరలివస్తారు. 10వ తేదీన వైకుంఠ ఏకాదశి. ఈ విషయాలన్నీ తెలిసీ.. ప్రభుత్వం ఎందుకు టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర భద్రత చర్యలు, ప్రొటోకాల్స్‌ పాటించలేదు? అసలు చంద్రబాబుకు 10న వైకుంఠ ఏకాదశి అని తెలుసు కదా? అయినా కూడా కుప్పంలో తన ప్రోగ్రాం పెట్టుకున్నాడు. 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పంలోనే ఉన్నారు. పోలీసు శాఖ మొత్తం ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు కుప్పం తరలిపోయింది. 8వ తేదీ రాత్రి 8.30 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమంలో తొక్కిసలాట ఘటన జరిగింది. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు, కుప్పం­లో చంద్రబాబు పర్యటన ఉందని తెలిసినప్పుడు పోలీ­సులు ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు? అందరూ చంద్రబాబు పర్యటనలో మునిగి పోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క సారిగా గేట్లు తెరవడంతో.. బైరాగిపట్టెడ కౌంటర్‌కు ఎదురుగా ఉన్న పార్కులో ఉదయం 8 గంటల నుంచి భక్తులను గుంపుగా నిలబెట్టారు. రాత్రి 8.30 గంటలకు కౌంటర్‌ వద్దకు తీసుకొచ్చి గేట్లు తెరిచారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెబుతున్నారు. చీకట్లో.. పార్కులో నిలబెట్టిన భక్తులకు ఉదయం నుంచి ఏమైనా ఇచ్చారా? వచ్చిన భక్తులను వచ్చినట్టు ఎందుకు క్యూలైన్లలోకి పంపించలేదు? అన్ని సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. ఆయా సెంటర్లలో లైన్లలోకి పంపించడానికి పోలీసులు ఎక్కడా లేరు. అందుకే గుంపుగా నిలబెట్టి ఒకేసారి విడిచిపెట్టే కార్యక్రమం చేశారు. ఇప్పుడు పోలీసులు.. చంద్రబాబు దిక్కమాలిన అబద్ధాలు అడుతున్నారు. ఈ తొక్కిసలాట ఘటన ఒక చోటే జరిగినట్టు చెబుతున్నారు. విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయినట్టు, బైరాగిపట్టెడలో ఐదు మంది చనిపోనట్టు ఎఫ్‌ఐఆర్‌లలో నమోదైంది. ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడినప్పుడు వివిధ కౌంటర్ల దగ్గర తొక్కిసలాటల్లో గాయపడినట్టు చెబుతున్నారు. చంద్రబాబుకు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కుప్పంలో 6,7,8 తేదీల్లో ప్రోగ్రామ్స్‌ పెట్టుకున్నారు. పోలీసులు మొత్తాన్ని తన దగ్గరకే పిలిపించుకున్నారు. తిరుపతిలో మాత్రం భక్తుల కోసం ప్రత్యా­మ్నాయ భద్రత ఏర్పాట్లను గాలికి వది­లేశారు. ఫలితంగా భారీ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దేవుడి దయతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి ప్రాణపాయం లేదు. రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులను కలుపుకుంటే దాదాపు 50 నుంచి 60 మంది భక్తులు తొక్కిసలాటలో గాయపడినట్టు సమాచారం. ఒక్క స్విమ్స్‌లోనే 35 మంది ఉన్నట్టు తెలుస్తోంది. భక్తుల భద్రత, వసతులపై చిత్తశుద్ధి ఏదీ? మొట్టమొదటి సారిగా తిరుపతిలో ఇలాంటి దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. దారుణమైన పరిస్థితుల్లో వ్యవస్థను నడిపిస్తున్నారు. ఇక్కడి కలెక్టర్, ఎస్పీ, పోలీసులు, టీటీడీ పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టత తెలియకుండా ప్రవర్తించారు. దశాబ్దాలుగా టీటీడీలో ప్రొటోకాల్స్‌ ఉన్నా, వీళ్లెవ్వరూ పట్టించుకోలేదు. తిరుపతికి లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి భద్రత, వసతుల కల్పన గురించి ఆలోచించలేదు. ఉదయం 9 గంటలకు వస్తే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. అక్కడ మనుషులు ఉన్నారని వీళ్లు పట్టించుకుంటే కదా! మా ప్రభుత్వంలో ఐదేళ్లలో గొప్పగా భక్తులకు దైవ దర్శన సేవలందించాం. అలాంటిది ఈ రోజు భక్తులను క్యూలో నిలబెట్టేవారు లేరు. వారి ఆకలి, దప్పికలను కూడా గాలికి వదిలేశారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల నష్టప­రిహారం ఇవ్వాలి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి.. ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ ఉచిత వైద్యం అందించాలి. వారు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేటప్పుడు కనీసం రూ.5 లక్షలు అందించాలని చంద్రబాబును డిమాండ్‌ చేస్తున్నాం. ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి, దేవదాయ శాఖ మంత్రి, టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్‌ ఈవో, ఎస్పీ, కలెక్టర్, రెవెన్యూ అధికా­రులు అందరూ బాధ్యత వహించాల్సిందే. మొత్తం పోలీసు శాఖను తిరుపతిలో లేకుండా చేసి.. పలచ­గా అక్కడక్కడా బందోబస్తు పెట్టి, భక్తుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నారు⇒ గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టన పెట్టుకున్న ఘతన ఈ చంద్రబాబుది కాదా? తన షూటింగ్‌ కోసం అందర్నీ ఒకచోట పెట్టాడు. షూటింగ్‌ బాగా రావాలని చెప్పి గేట్లు ఒకేసారి ఎత్తాడు. తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. ⇒ తిరుపతి ఘటనలో జరిగిన వాస్తవాలు ప్రజలకు చెప్పకూడదని చంద్రబాబు నాయుడు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయాడంటే.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను నేను రాకముందే ఇక్కడ నుంచి షిప్ట్‌ చేసే కార్యక్రమం చేశారు. దీనికి మీరే సాక్ష్యం. గాయపడిన వారు చాలా మంది మేము పోము.. మా పరిస్థితి ఇంకా బాగోలేదు.. మమ్మల్ని ఎక్కడకు పంపిస్తారు.. మేము ఎందుకు పోవాలని బీష్మించుకొని ఆస్పత్రిలో ఉండిపోయారు.⇒ వారిని ఇక్కడి నుంచి బలవంతంగా పంపించేందుకు నా కాన్వా­య్‌ని పోలీసులు అడ్డగించారు. ట్రాఫిక్‌ పేరుతో నా కాన్వాయ్‌ ముందుకు కదలకుండా చేశారు. ఎస్పీకి ఒక మాట చెబుతున్నా.. చంద్రబాబుతో మీరంతా కుమ్మక్కై దారుణంగా వ్యవహ­రిస్తున్నారు. దేవుని విషయంలో కూడా ఎంత దారుణంగా ప్రవర్తించారో పైనున్న దేవుడు చూస్తున్నాడు. ఎస్పీ నుంచి చంద్రబాబు వరకు ఆ దేవుడే గట్టిగా మొట్టికాయలు వేస్తాడు.చిన్న కేసుగా పక్కన పడేసే కుట్రభక్తులు మృతి చెందిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో పేలవమైన సెక్షన్లు నమోదు చేశారు. ఇందులో 194 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ కింద కేసు పెట్టారు. దొమ్మీ జరిగి ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లతో కేసు నమోదు చేస్తారా? ఇది ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఘటనా? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగితే.. 105 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ పెట్టాల్సింది పోయి.. కావాలని కేసును నీరు గార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇంత పెద్ద ఘటనను ఒక చిన్న కేసుగా.. తీసి పక్కన పడేసేందుకు దారుణంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారంటే.. వీళ్లకు అసలు మానవత్వం లేదు. చిత్తశుద్ధి కూడా లేదు. బాగా చేయాలనే ఆలోచన అసలే లేదు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేసి టీటీడీ లడ్డూ విషయంలో ఒక అబద్ధాన్ని సృష్టించారు. దానికి రెక్కలు కట్టి తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్టపాలు చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇదే పెద్ద మనిషి తన చర్యలతో మరో­సారి టీటీడీలో బ్లాక్‌ మార్కుగా నిలిచిపోయే ఘట­నకు కారణమయ్యాడు. దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు సురక్షితంగా భగవంతుడి దర్శనం కల్పించడం. అందుకే క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌లో టీటీ­డీకి ఉన్న విశిష్టత ఎక్కడా లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు టీటీడీలోకి అడుగుపెట్టాలంటే.. అది కూడా చంద్రబాబు లాంటి పాలకుడు ఉన్నప్పుడు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయోనని చూపించారు.తప్పంతా చంద్రబాబుదే ⇒ చంద్రబాబు.. ఓ షో పుటప్‌ చేసి, చిన్న స్థాయి అధికారులను బాధ్యులను చేస్తూ వారిని బదిలీ, సస్పెండ్‌ చేసే శిక్షలతో సరిపెట్టే కార్యక్రమం చేస్తుండటం బాధాకరం. ఈ ఘటనలో చంద్రబాబు చేసిన తప్పు కన్పించడం లేదా? 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పంలో పర్యటించ లేదా? పోలీసులందరినీ తన చుట్టూ పెట్టుకో­లేదా? భక్తుల కోసం పోలీసుల కేటా­యింపు లేకపోవడం వాస్తవం కాదా? జిల్లా ఎస్పీ.. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకే తాపత్రయ పడ్డారే తప్ప, లక్షల మంది భక్తులకు సెక్యు­రిటీ కల్పించాలని ఆలోచించ లేదు. ఈ విషయంలో ఎస్పీది తప్పు కాదా? ⇒ కలెక్టర్‌ది కూడా తప్పు ఉంది. కనీసం అక్కడున్న వారిని క్యూలైన్‌లలో నిలబెట్టే కార్యక్రమంపై ప్రొటోకాల్‌ ప్రకారం ఆదేశాలు ఇచ్చేందుకు రివ్యూలు కూడా చేయక పోవడం తప్పు కాదా? కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు కూడా ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. అక్కడకు వచ్చిన భక్తులకు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. తినడానికి తిండి లేదు. ఇలా గంటల తరబడి భక్తులు పార్కుల్లో ఉండేలా చేశారు. అన్ని కౌంటర్ల వద్ద పోలీసులు లేకుండా చేయడంలో కలెక్టర్‌ది తప్పు కాదా?⇒ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఎంత మందిని ప్రవేశింప చేయాలనే నిర్ణయం తీసుకున్నది ఈవో, అదనపు ఈవో. వీరందరినీ అజమాయిషీ చేసేది టీటీడీ చైర్మన్‌. వీరందరిదీ తప్పు కాదా? టోకెన్ల జారీపై రివ్యూలు తీసుకోకుండా ఇంత మంది చావులకు కారణం మీరు కాదా? మొత్తానికి ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబే.

Government not allowing issuance of tickets in Tirumala2
బాబు పాపాలే యమపాశాలై!

సాక్షి, అమరావతి: కలియుగ వైకుంఠం తిరుమల–తిరుపతిని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలే అమాయక భక్తుల పాలిట యమపాశాలుగా మారాయి! కక్ష సాధింపు చర్యలతో తిరుమల పవిత్రతకు కళంకం తేవాలన్న కుట్రతో సమర్థ టీటీడీ వ్యవస్థను దిగజార్చారు. ఇక తిరుమల–తిరుపతిని వేదికగా చేసుకుని ఉప ముఖ్యమంత్రి సాగించిన సనాతన డ్రామా శ్రీవారి దివ్యక్షేత్రం పవిత్రతకు భంగం కలిగించి పటిష్ట వ్యవస్థను దెబ్బతీసింది. తన వందిమాగదులను రాజ్యాంగేతర శక్తులుగా మార్చి తిరుమల–తిరుపతిలో తిష్ట వేయించిన సీఎం చంద్రబాబు నిర్వాకాలే అమాయకుల అకాల మరణానికి కారణ భూతమ య్యా యి. లక్షలాది మంది తరలి వస్తారని తెలిసినా సరే కనీస ఏర్పాట్లలో తీవ్ర అల సత్వమే తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారి తొక్కిసలాటకు దారితీసి పెను విషాదాన్ని మిగిల్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. తిరుపతిలో ఆరుగురు భక్తుల దుర్మరణం పూర్తిగా చంద్రబాబు సర్కారు చేసిన హత్యలేనన్నది స్పష్టం! దీన్ని దురదృష్టకర ఘటనగా ముద్ర వేసి తన వైఫల్యాలను కప్పిపుచ్చుతూ పక్కదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఈ ఉదంతంలో ప్రధాన ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబేనన్నది యావత్‌ భక్త కోటి ఏకాభిప్రాయం. ఓ ప్రణాళిక లేదు.. సమీక్షలూ లేవుతిరుమలకు రోజూ 80 వేల మంది భక్తులు వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఏటా 7 లక్షల మంది శ్రీవారి దర్శనం చేసుకుంటారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి టీటీడీ ఏటా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తుంది. తిరుమల జేఈవో నేతృత్వంలో టీటీడీ విజిలెన్స్, రెవెన్యూ, తిరుపతి పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. క్యూలైన్లలో భద్రత, ఇతర సౌకర్యాలను ఈవో, జేఈవో, ఎస్పీ, కలెక్టర్‌ పర్యవేక్షిస్తారు. అదనపు ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీ­లు, తహశీల్దార్లు, భారీ సంఖ్యలో టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు 24 గంటలూ అక్కడే ఉంటూ ప్రణాళిక కచ్చితంగా అమలయ్యేలా చూస్తారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుత పాలక మండలి వీటిపై దృష్టి పెట్టలేదు. టికెట్ల జారీకి కనీస మార్గదర్శకాలను పాటించలేదు. టికెట్ల జారీ ప్రణాళిక, ఏర్పాట్లను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సమీక్షించ లేదు. కనీసం అధికారులను ఆరా కూడా తీయలేదు.సర్కారు వైఫల్యాలకు రుజువులివిగో..వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లను జనవరి 9వ తేదీ తెల్లవారుజాము నుంచి జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. టోకెన్ల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుపతి చేరుకుని ముందు రోజు మధ్యాహ్నం నుంచే క్యూ లైన్లలో వేచి చూస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు చేయలేదు. శ్రీనివాసం, బైరాగిపట్టెడలోని ఎంజీవో పాఠశాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకోగా టీటీడీ వారిని క్యూ లైన్లలోకి అనుమతించకుండా రోడ్లపైనే నిలబెట్టేసింది. వచ్చినవారిని వచ్చినట్టుగా క్యూలైన్లలోకి పంపించి టికెట్లు జారీ చేసి ఉంటే భక్తులు సులభంగా ముందుకు కదులుతూ టికెట్లు తీసుకుని బయటకు వచ్చేవారు. కానీ క్యూ లైన్లలోకి అనుమతించకుండా ప్రవేశ ద్వారం వద్దే గంటల తరబడి పడిగాపులు కాసేలా చేశారు. మరోవైపు ఎముకలు కొరికే చలిలో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు.భోజనం, ఇతరత్రా అవసరాలకు బయటకు వెళితే మళ్లీ రద్దీలో రాలేమన్న ఆందోళనతో గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. టీటీడీ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంతమంది వచ్చారనే అంచనా కూడా వేయలేదు. ఆహారం, తాగు నీటి పంపిణీ గురించి పట్టించుకోలేదు. పోలీసు అధికారులు పత్తా లేకుండా పోయారు. ఉన్న కొద్ది మంది భక్తులతో అత్యంత దురుసుగా ప్రవర్తించారు. లక్షలాది మంది భక్తులు గంటల తరబడి రోడ్ల మీద నిరీక్షించిన తరువాత.. తాపీగా బుధవారం రాత్రి 8 గంటల సమయంలో క్యూలైన్లలోకి అనుమతిస్తామని ప్రకటించి గేట్లు తెరిచారు. అప్పటికే గంటల తరబడి నిరీక్షించిన భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లలోకి ప్రవేశించడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఉపద్రవాన్ని గుర్తించిన తరువాత కూడా టీటీడీ, పోలీసు అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించ లేదు. అసలు అక్కడ తగినంత మంది పోలీసు, టీటీడీ విజిలెన్స్‌ అధికారులు, సిబ్బంది అందుబాటులో లేరు. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో (తిరుమల) వెంకయ్య చౌదరి నుంచి తక్షణ స్పందన కొరవడి విషాదం చోటు చేసుకుంది.తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయమే ఇంతటి పెను విషాదానికి ప్రధాన కారణం. లక్ష మందికిపైగా భక్తులు వచ్చినా టికెట్ల జారీ కోసం పటిష్ట క్యూలైన్లు, ఇతర వ్యవస్థలు తిరుమలలో మాత్రమే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా తిరుపతిలోనే టికెట్లు జారీ చేస్తామని ప్రకటించాయి. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఉన్నవారినే తిరుమల వెళ్లేందుకు అలిపిరి వద్ద అనుమతిస్తామని ప్రభుత్వం, టీటీడీ ప్రకటించాయి. తిరుపతిలోని కౌంటర్లలో టోకెన్లు పొందితే కానీ అలిపిరి దాటి వెళ్లలేరు. దాంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన భక్తులు తిరుపతిలోనే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఎంతమంది భక్తులు వస్తారనే అంశాన్ని ప్రభుత్వం, టీటీడీ కనీసం అంచనా వేయలేదు. పది రోజులపాటు దర్శనం ఏర్పాటు చేశామని చెబుతూ అతి ధీమాతో కళ్లు మూసుకుపోయి వ్యవహరించాయి. ఎన్ని రోజులు ఉత్తర ద్వార దర్శనం కల్పించినా వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనానికే లక్షలాది భక్తులు మొదటి ప్రాధాన్యమిస్తారనే విషయాన్ని పట్టించుకోలేదు.బాబు విధేయుడు బదిలీతో సరిసాక్షి, అమరావతి: తిరుపతిలో చోటు చేసుకున్న విషాదానికి బాధ్యుడైన తన అస్మదీయ అధికారిని కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యమివ్వడం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఓ డీఎస్పీ, గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి జేఈవో గౌతమిని బదిలీ చేశారు. ఆశ్చర్యకరమేమిటంటే.. భక్తుల భద్రతకు ఎస్పీ ప్రధాన బాధ్యత వహించాలి. కానీ ఎస్పీ సుబ్బారాయుడు చంద్రబాబుకు వీర విధేయుడు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయన్ను వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించేందుకే డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చి తిరుపతి ఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే కొద్ది నెలలుగా ఆయన అక్రమ కేసులతో అరాచకానికి పాల్పడుతున్నారు. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు అయినప్పటికీ సుబ్బారాయుడిని సస్పెండ్‌ చేయకుండా బదిలీతో సరిపెట్టారు. కొద్ది రోజుల్లో ఆయనకు మరో ప్రధాన పోస్టింగు ఇవ్వాలనే ఉద్దేశంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.

Game Changer Movie Review And Rating In Telugu3
‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ రివ్యూ

టైటిల్‌ : గేమ్‌ ఛేంజర్‌నటీనటులు: రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, అంజలి, నవీన్‌ చంద్ర, నాజర్‌ తదితరులునిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్కథ: కార్తీక్‌ సుబ్బరాజ్‌దర్శకత్వం-స్క్రీన్‌ప్లే: ఎస్‌. శంకర్‌సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: తిరువిడుదల: జనవరి 10, 2025సంక్రాంతి టాలీవుడ్‌కి చాలా పెద్ద పండగ. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా పండక్కి మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడుతున్నాయి. వాటిలో రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’(Game Chnager Review) నేడు(జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘గేమ్‌ ఛేంజర్‌’పై మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శంకర్‌, చరణ్‌ ఖాతాలో బిగ్‌ హిట్‌ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్‌ మినిస్టర్‌ బొబ్బిలి మోపిదేవి(ఎస్‌జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్‌ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్‌ అయిన రామ్‌ నందన్‌(రామ్‌ చరణ్‌).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్‌ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్‌ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్‌ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్‌ చరణ్‌) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్‌ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్‌ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్‌ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్‌ ప్రేమాయణం ఎలా సాంగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..శంకర్‌(Shankar) అద్భుతమైన ఫిల్మ్‌ డైరెక్టర్‌. అందులో డౌటే లేదు. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం ఇచ్చేలా ఆయన సినిమాలు ఉంటాయి. జెంటిల్‌మెన్‌, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, అపరిచితుడు, రోబో లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలను అందించాడు. అయితే భారతీయుడు 2 రిలీజ్‌ తర్వాత శంకర్‌ మేకింగ్‌పై విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. బలమైన కథలు రాసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. ఆ ఎఫెక్ట్‌ గేమ్‌ ఛేంజర్‌(Game Changer Review)పై కూడా పడింది. కానీ మెగా ఫ్యాన్స్‌తో పాటు శంకర్‌ అభిమానులు కూడా ఈ చిత్రం ఆయనకు కమ్‌బ్యాక్‌ అవుతుందని ఆశ పడ్డారు. కానీ వారి ఆశ పూర్తిగా నెరవేరలేదనే చెప్పాలి. కార్తీక్‌ సుబ్బరాజ్‌ అందించిన రొటీన్‌ కథను అంతే రొటీన్‌గా తెరపై చూపించాడు. ఈ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సయిన ఏఏఎస్‌ అధికారికి మధ్య జరిగే ఘర్షణ అని ట్రైలర్‌లోనే చూపించారు. అయితే ఆ ఘర్షణను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. శంకర్‌ గత సినిమాలను గుర్తు చేసేలా కథనం సాగుతుంది. అలా అని బోర్‌ కొట్టదు. మదర్‌ సెంటిమెంట్‌, తండ్రి ఎపిసోడ్‌ సినిమాకు ప్లస్‌ అయిందనే చెప్పాలి.ఎలాంటి సాగదీతలు లేకుండా కథను చాలా సింపుల్‌గా ప్రారంభించాడు. హీరో పరిచయానికి మంచి సీన్‌ రాసుకున్నాడు. ఇక హీరో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రామ్‌ చరణ్‌, ఎస్‌జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హీరోయిన్‌తో వచ్చే లవ్‌ట్రాక్‌ ఆకట్టుకోకపోగా.. కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్‌ వర్కౌట్‌ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌కి ప్రేక్షకులు కనెక్ట్‌ కాకపోవడంతో ఆ సీన్స్‌ సాగదీతగా అనిపిస్తాయి. కలెక్టర్‌, మంత్రి మోపిదేవి మధ్య సాగే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. సీఎం సీటు కోసం మోపిదేవి వేసే రాజకీయ ఎత్తులను ఐఏఎస్‌ అధికారిగా తనకున్న అధికారాలతో హీరో చెక్‌ పెట్టడం ఆకట్టుకుంటుంది.ఇంటర్వెల్‌ సీన్‌ మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. విరామం ముందు వచ్చే ఓ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే అప్పన్న ఎపిసోడ్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథనం మళ్లీ ఊహకందేలా రొటీన్‌గా సాగుతుంది. మోపిదేవి, రామ్‌ నందన్‌ మధ్య సాగే టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ బాగానే ఉన్నా.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ బెటర్‌. ఎన్నికల అధికారి తనకున్న పవర్స్‌ని నిజాయితీగా వాడితే ఎలా ఉంటుందనేది తెరపై చక్కగా చూపించారు. క్లైమాక్స్‌ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా ఎన్నికల వ్యవస్థకు, రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లకు దర్శకుడు ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది. అయితే ఆ సందేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా బలంగా చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు.ఎవరెలా చేశారంటే..రామ్‌ చరణ్‌(Ram Charan) నటన ఏంటో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. మరోసారి ఆ రేంజ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. అప్పన్న, రామ్‌ నందన్‌ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన చరణ్‌.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్‌ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్‌ అద్భుతంగా నటించేశాడు. యాక్షన్‌, ఎమోషన్‌ సీన్లలో అదరగొట్టేశాడు. చరణ్‌ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర ఎస్‌జే సూర్యది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పొలిటిషీయన్‌ బొబ్బిలి మోపిదేవిగా సూర్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సూర్యకు, చరణ్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అప్పన్న భార్య పార్వతిగా అంజలి అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ భావోధ్వేగానికి గురి చేస్తుంది. రామ్‌ నందన్‌ ప్రియురాలు దీపికగా కియరా అద్వానీ మెప్పించింది. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్‌, సైడ్‌ సత్యంగా సునీల్‌ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే సునీల్‌తో పాటు వెన్నెల కిశోర్‌ల కామెడీ మాత్రం సరిగ్గా పండలేదు. బ్రహ్మానందం ఒక్క సీన్‌లో కనిపిస్తారు. జయరాం, నవీన్‌ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తమన్‌ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు వినడం కంటే తెరపై చూస్తే ఇంకా బాగా ఆకట్టుకుంటాయి. శంకర్‌ మార్క్‌ గ్రాండ్‌నెస్‌ ప్రతి పాటలోనూ కనిపించింది. సినిమాటోగ్రఫీ పని తీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్‌ తెరపై చాలా అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో దిల్‌ రాజు ఎక్కడా వెనకడుగు వేయలేదని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

TTD Officials Allegations On Chairman BR Naidu Over Incident4
బీఆర్ నాయుడే ముంచేశారు: అధికారుల సంచలన ఆరోపణలు

సాక్షి, తిరుమల: తిరుమల విషాదకర ఘటనకు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఒంటెద్దు పోకడలే కారణమని అధికారులు చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ కనీసం పట్టించుకోలేదని తాజాగా అధికారులు ఆరోపించారు. సీఎం చంద్రబాబు ముందే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును అధికారులు ఏకిపారేశారు. దీంతో, బీఆర్‌ నాయుడు వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది.తిరుమలలో భక్తుల తొక్కిసలాట అంశంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై అధికారులు పలు విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు ఒంటెద్దు పోకడలే ఈ దుస్థితికి కారణమన్నారు. ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలను టీటీడీ చైర్మన్ తీసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై బీఆర్‌ నాయుడు కనీసం పట్టించుకోలేదన్నారు. అలాగే, శ్రీవాణి ట్రస్ట్‌ విషయంలో ఆయన ఇష్టానుసారం మాట్లాడారు. అధికారులతో చెప్పకుండానే టీటీడీ చైర్మన్ నియంతలా వ్యవహరించారని ఆరోపించారు.సీఎం చంద్రబాబు సాక్షిగా టీటీడీ చైర్మన్ బండారం బట్టబయలైంది. ఈ ఘటన అనంతరం.. బీఆర్‌ నాయుడు వ్యవహార శైలిపై సీఎంకు ఫిర్యాదు చేసిన ఈవో, ఇతర అధికారులు. ఈ సందర్బంగా సీఎం ముందే టీటీడీ చైర్మన్‌ను అధికారులు ఏకిపారేసినట్టు సమాచారం. ఇదే సమయంలో బీఆర్ నాయుడు.. టీటీడీ చైర్మన్‌గా ఉంటే టీటీడీ ప్రతిష్ట మరింత దిగజారిపోతుందని అధికారుల ఫిర్యాదు చేశారు.ఇది కూడా చదవండి: వీళ్లా టీటీడీ పాలకులు?అ​యితే, తనకు భజన చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీటీడీ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. టీటీడీ సేవలో కాకుండా టీడీపీ సేవలో బీఆర్ నాయుడు తరలిస్తున్నారు. భక్తుల భద్రత, సౌకర్యాలను పూర్తిగా గాలికొదిలేశారు. తిరుమలలో ఆరుగురు మరణించిన తర్వాత దైవాదీనం అంటూ బీఆర్‌ నాయుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన సంగతి విధితమే. భక్తులకు కనీసం మంచి నీళ్లు, ఆహారం కూడా ఏర్పాటు చేయించలేదు. ఇదే సమయంలో చైర్మన్‌ బీఆర్‌ నాయుడు.. వీఐపీ సేవలో పూర్తిగా తరించారు.ఇది కూడా చదవండి: వైఎస్‌ జగన్‌ వస్తున్నారని.. బాధితుల డిశ్చార్జ్‌!ఇదిలా ఉండగా.. తొక్కిసలాట ఘటనలో చర్యలకు సీఎం చంద్రబాబు మీన మేషాలు లెక్కిస్తున్నారు. మొత్తం పెత్తనం చేసే టీటీడీ చైర్మన్, వెంకయ్య చౌదరిపై చర్యలు తీసుకోలేదు. ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన ఎస్పీ సుబ్బరాయుడుని కూడా సస్పెండ్‌ చేయలేదు. మరోవైపు.. ఈ ఘటనకు బీఆర్‌ నాయుడు, వెంకయ్య చౌదరి, శ్యామలరావులే బాధ్యులని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అయినా కూడా వారిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో భక్తుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై హిందూ భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కూటమి సర్కార్‌ పాలనలో ప్రజలు మండిపడుతున్నారు. ఇది కూడా చదవండి: తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తలోమాట

Hydra Demolition Targets Illegal Construction in Neknampur5
మణికొండలో హైడ్రా కూల్చివేతలు

సాక్షి,హైదరాబాద్‌: మణికొండలో హైడ్రా(​hydera) కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. నెక్నాంపూర్‌లో కూల్చివేతలు చేపట్టనుంది. హైడ్రా కమీషనర్ రంగనాథ్‌ అదేశాల‌ మేరకు నెక్నాంపూర్ (Neknampur Lake)చెరువులో అక్రమంగా వెలసిన నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగనున్నాయి. హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు, చెరువల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమార్క్‌ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. చెరువులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన కబ్జారాయుళ్ల నుంచి గడిచిన కొన్ని నెలల వ్యవధిలో వందల ఎకరాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమణ నిర్మాణాల్ని కూల్చివేసింది. తాజాగా, కబ్జా కోరల్లో చిక్కుకున్న నెక్నాంపురా చెరువులో అక్రమ నిర్మాణాల్ని తొలగించనుంది. హైడ్రా పోలీసు స్టేషన్‌..ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్‌ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్‌లో బీ–బ్లాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా (ఎస్‌హెచ్‌ఓ) ఉండనున్నారు. ఓఆర్‌ఆర్‌ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిప్యూటేషన్‌ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్‌ కసరత్తు చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు.. జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ (hydra commissioner ranganath) ప్రత్యేక పోలీసు స్టేషన్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.పీడీపీపీ కింద కేసులు! జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది.

Potgieter, Brevis Demolished Sunrisers Eastern Cape On First Match Of SA20 20256
జూనియర్‌ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చిత్తు

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025(SA20) ను డిఫెండిండ్‌ ఛాంపియన్స్‌ సన్‌రైజర్స్‌ ఈస్టర్న్ కేప్‌ ఘోర ఓటమితో ఆరంభించింది. సెయింట్‌ జార్జ్‌ పార్క్ వేదికగా ఏంఐ కేప్‌ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ పరాజయం పాలైంది. 175 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ ఈస్టర్న్ కేప్‌.. ఎంఐ బౌలర్ల దాటికి 15 ఓవర్లలో కేవలం 77 పరుగులకే కుప్పకూలింది.ఎంఐ ఆల్‌రౌండర్‌ డెలానో పోట్‌గీటర్ 5 వికెట్లతో ఈస్టర్న్ కేప్‌ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన పోట్‌గీటర్‌ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు ట్రెంట్‌ బౌల్ట్‌ రెండు, లిండే, ఒమర్జాయ్‌ తలా వికెట్‌ సాధించారు. సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ ఐడైన్‌ మార్‌క్రమ్‌(19) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా పూర్తిగా తేలిపోయారు.బ్రెవిస్‌ విధ్వంసం..అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ కేప్‌టౌన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌లోనే సన్‌రైజర్స్‌ పేసర్‌​ మార్కో జానెసన్.. రీజా హెండ్రిక్స్‌ను ఔట్‌ చేసిన కేప్‌టౌన్‌ జట్టుకు బిగిషాకిచ్చాడు. ఆ తర్వాత రాస్సీ వాన్ డెర్ డస్సెన్(16), కానర్ ఎస్టెర్‌హజెన్(22) ఎంఐ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.Marco rocked, and Reeza was left shocked! 🤯☝️Jansen picks up the 1st wicket of the new season of the #SA20! 🔥Catch all the action LIVE on Disney+Hotstar, Star Sports 2 & Sports18-2!#SECvMICT pic.twitter.com/kA4kgI5wuK— JioCinema (@JioCinema) January 9, 2025అయితే వీరిద్దరూ వరుస క్రమంలో ఔట్‌ కావడంతో కేప్‌టౌన్‌ జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు డెవాల్డ్‌ బ్రెవిస్‌(Dewald Brevis) విధ్వంసం సృష్టించాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు.Dewald Brevis 🔛🔥Keep watching the #SA20 LIVE on Disney + Hotstar, Star Sports 2 & Sports18-2!#DewaldBrevis #SECvMICT pic.twitter.com/58X2QHetea— JioCinema (@JioCinema) January 9, 2025 కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న 'జూనియర్‌ ఏబీడీ' 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు పోట్‌గీటర్ ఆఖరిలో(12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 25 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో మార్కో జానెసన్‌, గ్లీసన్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. బేయర్స్ స్వాన్‌పోయెల్, లైమ్‌ డాసన్‌, హర్మర్‌ తలా వికెట్‌ సాధించారు.ఇదే తొలి విజయం..కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్ కేప్‌ జట్టుపై ఎంఐకేప్‌టౌన్‌కు ఇదే తొలి విజయం కావడం​ గమనార్హం. గత రెండు సీజన్లలో ఒక్కసారి కూడా సన్‌రైజర్స్‌పై కేప్‌టౌన్ విజయం సాధించలేదు. ఇక ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన పోట్‌గీటర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.చదవండి: CT 2025: 'అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడొద్దు'.. సౌతాఫ్రికాకు ఆ దేశ ప్రజల పిలుపు

RG Kar Verdict on January 18: CBI Seeks Death Penalty for Accused Sanjay Roy7
ఆర్‌జీ కార్‌ ఆస్పత్రి ఘటన.. నిందితుడు సంజయ్‌ రాయ్‌కు ఉరిశిక్ష?

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ఆర్జీకార్‌ ఆస్పత్రి (rg kar hospital) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతాను వణికించిన జూనియర్‌ డాక్టర్‌ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) గురువారం సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. ఈ కేసులో జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది.ఆర్జీకార్‌ ఆస్పత్రి జూనియర్‌ వైద్యురాలి ఘటనలో నిందితుడు సంజయ్‌ రాయ్‌ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దర్యాప్తు సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని సీల్దా సెషన్స్ (Sealdah sessions court) కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్‌ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్‌, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్‌ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్‌ రాయ్‌కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సంజయ్‌ రాయ్‌కు ఉరే సరినిందితుడు సంజయ్‌ రాయ్‌పై హత్య, అత్యాచారం, మరణానికి కారణమైనందుకు, బాధితురాలు కోలుకోలేని విధంగా హింసించినట్లు తేలింది. కోర్టు తీర్పుతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 103(1), 64, 66 కింద ఉరిశిక్ష,లేదంటే జీవిత కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉండనుంది. సంజయ్‌ రాయ్‌ నిర్దోషి సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సౌత్ 24 పరగణాలకు చెందిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సర్వీస్ చీఫ్, డిఫెన్స్ లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన తుది వాదనలలో తన క్లయింట్ సంజయ్‌ రాయ్‌ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని వాదించారు. ఆ రోజు రాత్రి ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలో ఏం జరిగిందంటేగతేడాది ఆగస్ట్‌లో కోల్‌కతా ఆర్‌జీకర్‌ మెడికల్‌ ఆసుపత్రిలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్‌ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్‌ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్‌కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది.సుమారు ఐదు నెలల పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ఆధారాల్ని జనవరి 9న కోర్టుకు అందించింది. జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది.

Donald Trump In Hush Money Case USA Supreme Court Denies Request8
హష్‌మనీ కేసు..సుప్రీంకోర్టులో ట్రంప్‌కు నిరాశ

వాషింగ్టన్‌: హష్‌మనీ కేసులో అమెరికా(USA)కు కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌(Donald Trump)నకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఈ కేసులో జనవరి 20వ తేదీ వరకు తనకు శిక్ష విధింపును ఆపాలని ట్రంప్‌ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ట్రంప్‌ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.న్యూయార్క్‌ హష్‌మనీ(Hushmoney Case) కేసులో తనకు జడ్జి శిక్ష విధించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని.. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్బంగా ముగ్గురు లిబరల్ న్యాయమూర్తులు ధర్మసనం.. ట్రంప్‌ అభ్యర్థనలను తిరస్కరించింది. ఇదే సమయంలో అధ్యక్షుడిగా ఎన్నికైన వారి బాధ్యతలపై శిక్ష విధించే భారం సాపేక్షంగా అసంబద్ధమైనది అంటూ ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. దీంతో, ట్రంప్‌కు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో శిక్ష ఖరారై శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్‌ స్పందించారు. తాజాగా మార్-ఎ-లాగోలో ట్రంప్‌ మాట్లాడుతూ.. కోర్టు తీర్పును నేను గౌరవిస్తున్నాను. ఇది రికార్డు స్థాయిలో ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ అభ్యర్థిపై జరిగిన దాడి. డెమోక్రాట్స్‌ ఎన్నికలు జరగకుండా ఆపడానికి చేసిన ప్లాన్‌ ఇది. వారు గెలిచే అవకాశం లేకపోవడంతో ఎదుటి వారిని తీవ్రంగా హింసించడానికి ప్రయత్నించారు అంటూ కామెంట్స్‌ చేశారు.🚨🇺🇸 TRUMP RESPONDS TO SUPREME COURT RULING: I RESPECT THE COURTTrump vows to appeal after Supreme Court allows Friday sentencing to proceed, calling justices' opinion "very good for us" as they "invited the appeal."Speaking at Mar-a-Lago: "This was an attack on the… pic.twitter.com/c0xX1Zf5Cu— Mario Nawfal (@MarioNawfal) January 10, 2025ఇదిలా ఉండగా.. స్టార్మీ డానియల్స్‌తో ట్రంప్‌ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్‌ తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్‌మనీని ఇచ్చారంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని ట్రంప్‌ అభియోగాలు కూడా ఉన్నాయి. అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇటీవల న్యూయార్క్‌ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో విచారణ అనంతరం.. న్యాయమూర్తి జస్టిస్ హవాన్‌ మర్చన్‌.. ట్రంప్‌నకు జనవరి 10న శిక్ష విధిస్తానని ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో ట్రంప్‌ జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ‘అన్‌కండిషనల్‌ డిశ్చార్జ్‌’ని అమలు చేస్తామన్నారు. శిక్ష విధించే రోజు ఆయన వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టులో హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో​, నేడు ఉదయం 9:30 గంటలకు ట్రంప్‌.. కోర్టుకు వర్చువల్‌గా హాజరుకానున్నారు.

Justice B.N. Srikrishna appointed as the Chairman of the Advisory Board for Equal and its strategic investee OneMoney9
ఫైనాన్స్‌ కంపెనీ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్‌గా జస్టిస్‌ శ్రీకృష్ణ

డేటా షేరింగ్‌ ప్లాట్‌ఫాం ఈక్వల్, అలాగే ఆ సంస్థ పెట్టుబడులున్న అకౌంట్‌ అగ్రిగేటర్‌ వన్‌మనీ ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డు ఛైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ(Justice B.N. Srikrishna) నియమితులయ్యారు. న్యాయశాస్త్ర, ఆర్థిక(Finance), టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు జగదీష్‌ కపూర్, రాకేష్‌ మోహన్‌ .. యూఐడీఏఐ మాజీ చైర్మన్‌ జె సత్యనారాయణ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.డేటా షేరింగ్‌కి సంబంధించి భద్రత, నైతికతకు ప్రాధాన్యమిస్తూ అత్యున్నత ప్రమాణాలు పాటించడంలో ఇరు కంపెనీలకు ఈ బోర్డు మార్గనిర్దేశం చేస్తుంది. వ్యక్తుల హక్కులు, ఆకాంక్షలు, ఆర్థిక వృద్ధి తదితర అంశాల్లో సమతౌల్యత పాటించేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్లు జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ తెలిపారు. రుణాలు, ఉద్యోగాలు(Jobs), ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత మందికి అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నామని ఈక్వల్‌ వ్యవస్థాపకుడు కేశవ్‌ రెడ్డి తెలిపారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధన దిశగా కృషి చేస్తున్నట్లు వన్‌మనీ వ్యవస్థాపకుడు కృష్ణ ప్రసాద్‌ చెప్పారు.ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేతబ్రిగేడ్‌ గ్రూప్‌ కొత్త ప్రాజెక్ట్‌రియల్టీ సంస్థ బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కోకాపేటలో బ్రిగేడ్‌ గేట్‌వే పేరుతో 10 ఎకరాల విస్తీర్ణంలో హౌసింగ్, కమర్షియల్‌ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందుకు రూ.4,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్న ఈ ప్రాజెక్టులో లగ్జరీ గృహాలను 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, మైసూరు, చెన్నై, కొచ్చిలో కంపెనీ పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది.

Tit for Tat is an evocative play written and directed by Anchor Jhansi10
‘పురుషసూక్తం': పురుషాధిపత్యాన్ని కాపాడటానికి మహిళలే..

‘పురుషసూక్తం’.. ‘టిట్‌ ఫర్‌ టాట్‌.. కన్వర్జేషన్స్‌ బిట్వీన్‌ ఎ బ్రా అండ్‌ ఎ బ్రీఫ్‌’.. రెండు నాటకాలు. ఇవి పురుష భావజాలంపై నటి ఝాన్సీ రూపొందించిన సంవాదాలు. ఆలోచనావీచికలు... మార్పుకై నివేదనలు. ఝాన్సీ తన టీమ్‌తో రవీంద్రభారతిలో జనవరి 12న ప్రదర్శించనున్న సందర్భంగా...‘తెలంగాణ థియేటర్‌ రీసెర్చ్‌ కౌన్సెల్‌ వాళ్లు 2019లో విమెన్స్‌ డేకి ‘విమెన్‌ డైరెక్టర్స్‌ ఫెస్టివల్‌’ను కండక్ట్‌ చేస్తూ నన్ను కూడా అడిగారు ఒక నాటకం ఇస్తాం.. డైరెక్ట్‌ చేయమని. వాళ్లిచ్చిన నాటకం కంటే నేను నా ఐడియాలజీని నాటకంగా ప్రెజెంట్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. దాన్నొక చాలెంజ్‌గా తీసుకున్నాను. నేను చదివిన, చూసిన, నేర్చుకున్న, ఏర్పర్చుకున్న దృక్పథాన్ని పేపర్‌ మీద పెట్టాను. అదే నా ఫస్ట్‌ ప్లే.. ‘పురుషసూక్తం.’ జెండర్‌ కళ్లద్దాలతో మాస్క్యులినిటీని మనమెలా చూస్తున్నాం, దాన్నెలా పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల పురుషుడు తాను మనిషినన్న విషయాన్ని మరచిపోయి, అనవసరపు బరువు బాధ్యతలను ఎలా మోస్తున్నాడు, ఆ పురుషాధిపత్యాన్ని కాపాడటానికి మహిళ ఎలా కోటగోడగా మారిందనే అంశాల మీద సీరియస్‌ చర్చే ఆ నాటకం’ అన్నారు ఝాన్సీ.రవీంద్రభారతిలో తన రెండు నాటకాలను ప్రదర్శించడానికి ఒకవైపు రిహార్సల్స్‌ చేస్తూ మరోవైపు సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ‘పురుషసూక్తం నాటకానికి 18 రోజు ల్లోనే స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకున్నాను. డైరెక్ట్‌ చేయడమే కాక నటించాను కూడా. అంత సీరియస్‌ నాటకాన్ని రెండు పాత్రలతో ఎంతవరకు మెప్పించగలను అనుకున్నా! కానీ ఆశ్చర్యం.. కె. విశ్వనాథ్‌ లాంటి వారి మహామహుల ప్రశంసలు అందాయి. అది నాటక రచయితగా, దర్శకురాలిగా నా ప్రయాణాన్ని ఖరారు చేసుకునేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. థియేటరే నా మీడియమనీ అర్థమైంది’ అన్నారామె.టిట్‌ ఫర్‌ టాట్‌.. కన్వర్జేషన్స్‌ బిట్వీన్‌ ఎ బ్రా అండ్‌ బ్రీఫ్‌ ‘కిందటేడు (2024) అక్టోబర్‌ 4న వరల్డ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ డే సందర్భంగా స్త్రీల ఆరోగ్యం, పురుషుల బాధ్యత లాంటి విషయాలెన్నో చర్చకు వచ్చి.. అసలిలాంటి వాటి మీద మనమెందుకు అవసరమైనంతగా మాట్లాడట్లేదు, ఏదో ఒకటి చేయాలి అనిపించి ‘టిట్‌ ఫర్‌ టాట్‌.. ’ మొదలుపెట్టాను’ అన్నారు ఝాన్సీ. ఇది ‘పురుషసూక్తం’ తర్వాత ఆమె రాసి నటించి దర్శకత్వం వహించనున్న రెండోనాటకం.‘రెండు రోజులకే ఏం రాయాలో తెలిసింది గాని మొదట సగం స్క్రిప్టే రాయగలిగాను. దానికే ఇంకొన్ని ఆలోచనలు జోడించి ఇంట్లో పిల్లలనే చేర్చి, క్లోజ్‌ సర్కిల్‌ ముందు వేసి చూపించాను. అలా వర్క్‌ చేసుకుంటూ నాటకం రాసుకుంటూ వచ్చాను. పార్ట్స్‌ పార్ట్స్‌గా రాస్తూ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసి ప్రదర్శించి ఫ్రెండ్స్‌కు చూపించాను. అందరికీ నచ్చింది. మెయిన్‌ షో ఎప్పుడని అడగడం మొదలుపెట్టారు. ‘టిట్‌ ఫర్‌ టాట్‌ ఎ కన్వర్జేషన్‌ బిట్వీన్‌ బ్రా అండ్‌ బ్రీఫ్‌’కి కూడా మూలం పురుషాధిపత్య విషతుల్య భావజాలమే. కాకపోతే అప్రోచ్‌ వేరు. ఇదొక సోషల్‌ సెటైర్‌. దీనికి టార్గెట్‌ ఆడియన్స్‌ 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వాళ్లు. వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. అందుకే హ్యూమర్‌ని, వ్యంగ్యాన్ని ఎంచుకున్నాను. సీరియస్‌ను పండించడం తేలికే. వ్యంగ్యం చాలా కష్టం. భాష కూడా జెన్‌ జీ జార్గాన్స్‌తో ఉంటుంది. వాళ్ల తాలూకు మీమ్స్‌ ఉంటాయి. పురుషసూక్తం.. మగవాడు మీదేసుకున్న బాధ్యతల బరువు మీద ఫోకస్‌ చేసింది. ఇదేమో ఆ బాధ్యతలను ఇంకా వేసుకోని వాళ్లకు వేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతుంది’ అన్నారామె.డిబేట్‌.. ‘రవీంద్రభారతి ప్రదర్శనలో ఈ రెండూ నాటకాలు మరింత మార్పు చేర్పులతో వస్తున్నాయి. పురుషసూక్తంలో కోరస్‌ యాడ్‌ అవుతోంది. ‘టిట్‌ ఫర్‌ టాట్‌.. ’ లో ట్రాన్స్‌ ఉమన్, ట్రాన్స్‌ మన్‌ ఇలా అన్ని వర్గాల వాళ్లు నటిస్తున్నారు. ప్రతివాళ్లు వాళ్ల వాళ్ల శరీర ధర్మాలను రిప్రెజెంట్‌ చేస్తూ తమ సహజమైన పాత్రలనే పోషిస్తున్నారు. అంటే ప్రకృతిలో ఇంత వైవిధ్యం ఉంటుంది.. దాన్ని మనం గౌరవించాలి.. వాళ్ల వల్నరబులిటీని అర్థం చేసుకోవాలని తెలిపే ప్రయత్నం చేస్తున్నాం.. ప్రేక్షకులకే కాదు.. అందులో నటించిన నటీనటులకు కూడా! ఇందులో మా అమ్మాయి ధన్య పరిచయం అవుతోంది. నాటకాల ప్రదర్శన తర్వాత ఓపెన్‌ డిబేట్‌ ఉంటుంది’ అన్నారామె.రంగయాత్ర.. సామాజిక చైతన్యాన్ని తీసుకురావడంలో నాటకానిదే ప్రధాన పాత్ర మొదటి నుంచీ! ఆ బాధ్యతను కొనసాగించాలనుకుంటున్నాం.. ‘రంగయాత్ర.. థియేటర్‌ ఫర్‌ సోషల్‌ డిబేట్‌’ పేరుతో! అందులో భాగంగానే రవీంద్రభారతిలో ప్రదర్శన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని కాలేజెస్‌కి వెళ్లి అక్కడ ఈ నాటకాలను ప్రదర్శించబోతున్నాం స్ట్రీట్‌ ప్లే తరహాలో. ప్రదర్శన తర్వాత విద్యార్థులతో డిబేట్‌ పెడతాం. జెండర్‌ మీద అవగాహన కల్పించే ప్రయత్నమే ఇదంతా!’ అంటూ ముగించారామె.– సరస్వతి రమకొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది ‘పురుషసూక్తం నన్ను థియేటర్‌ ఆర్టిస్ట్‌ని చేసింది. ఈ నాటకాన్ని మగవాడిని అర్థంచేసుకునే ప్రయత్నంగా చెప్పొచ్చు. ఆ దిశగా .. పురుషాధిపత్య భావజాలంతో కండిషనింగ్‌ అయి ఉన్న మొత్తం సమాజాన్నే ఆత్మవిమర్శకు గురిచేస్తుంది ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది! రిహార్సల్స్‌లో ఎన్నిసార్లు నన్ను నేను తరచి చూసుకున్నానో! ఇది నాకొక లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌!’– వంశీ చాగంటి, హ్యాపీడేస్‌ ఫేమ్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement
Advertisement