Ratan Tata
-
రతన్ టాటా వీలునామా: ఎవరికి ఎంత కేటాయించారంటే?
ఒక మనిషి చనిపోయినా.. అతడు చేసిన మంచి ఎప్పుడూ బతికే ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి, దివంగత పారిశ్రామికవేత్త 'రతన్ టాటా' (Ratan Tata) ఒకరు. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ.. లెక్కకు మించిన డబ్బును అనేక సేవా కార్యక్రమాల కోసం ఉదారంగా వెచ్చించారు. రతన్ టాటా మరణించిన తరువాత.. ఆయన ఆస్తులు, సంపద ఎవరికి చెందుతాయి? అనే ప్రశ్న.. ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. దానికి ఇప్పుడు సమాధానం లభించింది.టాటా సామ్రాజ్యాన్ని ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించిన రతన్ టాటా ఆస్తి సుమారు రూ. 10వేలకోట్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సుమారు రూ.3800 కోట్ల సంపదను.. తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ వంటి వాటికి కేటాయించారు.తన సవతి సోదరీమణులైన శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ పేరుమీద రూ.800 కోట్లు రాసినట్లు తెలుస్తోంది. వీటికి కేటాయించిన ఆస్తులలో ఫిక్డ్స్ డిపాజిట్లు, ఖరీదైన పెయింటింగ్స్, వాచ్‌లు వంటివి ఉన్నాయి. రతన్ టాటాకు సన్నిహితుడైన.. మోహిన్ ఎం దత్తాకు కూడా రూ.800 కోట్లు రాశారు.జిమ్నీ నావల్ టాటాకు.. రతన్ టాటాకు చెందిన జుహూలోని బంగ్లాలో కొంత షేర్, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కేటాయించారు. మెహిల్ మిస్త్రీ పేరు మీద అలీబాగ్‌లోని బంగ్లా, మూడు పిస్టోళ్లను కేటాయించారు.ఇదీ చదవండి: EPFO విత్‌డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!రతన్ టాటాకు కుక్కలంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే శునకాల సంరక్షణ కోసం కూడా రూ. 12 లక్షల ఫండ్ కేటాయించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 30వేలు చొప్పున వాటికి ఖర్చుచేసే విధంగా నిధులను కేటాయించారు. రతన్ టాటాకు విదేశాల్లో కూడా రూ. 40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రముఖ కంపెనీలలో షేర్స్, ఖరీదైన 65 వాచీలు కూడా ఉన్నాయి.ఇక అందరూ తెలుసుకోవాలనుకునే విషయం.. రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు ఏమి కేటాయించారు అని. అయితే శంతను నాయుడుకు తనవంతు సాయం చేసినట్లు తెలుస్తోంది. అది కాకుండా.. స్టూడెంట్ లోన్ మాఫీ చేశారు. ఇది కాకుండా రతన్ టాటా పక్కింట్లో ఉండే జేక్ మాలిటే అనే వ్యక్తికి అప్పుగా ఇచ్చిన రూ. 23 లక్షలు కూడా మాఫీ చేశారు. -
కోహ్లీ లేకపోతే.. టీసీఎస్ లేదు
ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటి.. 6,00,000 మంది ఉద్యోగులు.. దాదాపు 46 దేశాల్లో కార్యకలాపాలు.. సృజనాత్మక పనితనానికి పెట్టింది పేరు.. ఐటీ పరిశ్రమలో దిగ్గజ కంపెనీగా వెలుగొందుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గురించి తెలియనివారుండరు. టాటా గ్రూప్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రతన్ టాటా, జేఆర్డీ టాటాలు. టీసీఎస్‌ను స్థాపించడం కూడా వారిలో ఒకరి ఆలోచనే అని చాలామంది అనుకుంటారు. కానీ భారతదేశాన్ని ఐటీ రంగంలో ప్రపంచంలో ముందుంచేలా చేసిన టీసీఎస్ స్థాపన ఆలోచన ఒక పాకిస్థానీదని తక్కువ మందికే తెలిసుంటుంది. ఆ విశేషాలు ఏమిటో చూసేద్దాం.భారత ఐటీ పితామహుడుమార్చి 2025 నాటికి రూ.12.92 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన ప్రపంచ ఐటీ పరిశ్రమలో టాప్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పుట్టుకకు ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన ‘భారత ఐటీ పితామహుడు’గా పిలువబడే ఫకీర్ చంద్ కోహ్లీ అనే వ్యక్తి. ఆయన చేసిన కృషి టీసీఎస్‌ను ఇండియాలో ఐటీ పవర్ హౌజ్‌గా మార్చేందుకు కారణమైంది. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భారత్ కేంద్రంగా మారేందుకు తోడ్పడింది.అప్పటి భారత్.. ఇప్పటి పాకిస్థాన్‌లో పుట్టి..భారత్-పాకిస్థాన్ విభజనకు ముందు 1924లో (అప్పుడు పాకిస్థాన్ భారత్‌లోనే ఉండేది) ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఫకీర్ చంద్ కోహ్లీ జన్మించారు. అతని విద్యాభ్యాసం లాహోర్‌లో జరిగింది. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో డిగ్రీలు పొందారు. కెనడాలో క్వీన్స్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి సిస్టమ్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు.టీసీఎస్ పుట్టిందిలా..కోహ్లీ 1951లో భారతదేశానికి తిరిగి వచ్చి టాటా ఎలక్ట్రిక్ కంపెనీలో చేరారు. తాను కంప్యూటర్ ఆధారిత ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలను ఆధునీకరించడంలో నిష్ణాతుడు. దాంతో త్వరగా సంస్థలో ఎదిగారు. అతడి వినూత్న విధానాలు అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ జేఆర్డీ టాటా దృష్టిని ఆకర్షించాయి. ఆయన కొత్త వెంచర్‌కు నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కోహ్లీలో చూశారు. ఒకరోజు భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందనే ఆలోచనను జేఆర్డీతో పంచుకుంటూ.. అందుకుగల కారణాలను కోహ్లీ విశ్లేషించారు. దాంతో 1968లో టీసీఎస్ ఆవిర్భవించింది. కోహ్లీ దాని సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కంపెనీకి తొలి సీఈఓగా నియామకం అయ్యారు.కొత్త శిఖరాలకు టీసీఎస్భారత సాంకేతిక మౌలిక సదుపాయాలు అంతగా లేని సమయంలో సాఫ్ట్వేర్ సర్వీసుల్లో దేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని కోహ్లీ ఊహించారు. ఆయన నాయకత్వంలో టీసీఎస్ ఒక మోస్తరు కార్యకలాపాల నుంచి దేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా అభివృద్ధి చెందింది. సాఫ్ట్వేర్ ఎగుమతులకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రపంచ వేదికపై దేశాన్ని విశ్వసనీయ సంస్థగా నిలిపింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి దిగ్గజ సంస్థలతో అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కోహ్లీ వ్యూహాత్మక దూరదృష్టి ఎంతో తోడ్పడింది. ఇది టీసీఎస్‌ను కొత్త శిఖరాలకు చేర్చింది. 2003 నాటికి కంపెనీ బిలియన్ డాలర్ల(రూ.8,300 కోట్లు) ఆదాయాన్ని సాధించడంలో సహాయపడింది.నాస్కామ్కు అధ్యక్షుడు, ఛైర్మన్‌గా..భారతదేశం అభివృద్ధి చెందాలంటే బలమైన ఐటీ ఎకోసిస్టమ్ అవసరమని ఆయన అర్థం చేసుకున్నారు. భారతదేశపు ప్రముఖ ఐటీ అడ్వకసీ సంస్థ(న్యాయ కార్యకలాపాలు నిర్వహణ) నాస్కామ్కు 1995-1996 కాలంలో అధ్యక్షుడిగా, ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ ఐటీ విధానాలను రూపొందించడంలో, పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.ఇదీ చదవండి: ఆర్థిక తారతమ్యాల భారతం!పద్మభూషణ్‌తో సత్కారంకోహ్లీ ప్రభావం కార్పొరేట్ విజయాలకే పరిమితం కాలేదు. టాటా సన్స్ ప్రస్తుత ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సహా భావి నాయకులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. 1999లో పదవీ విరమణ చేసిన తరువాత కూడా వయోజన అక్షరాస్యత, ప్రాంతీయ ల్యాంగ్వేజీ కంప్యూటింగ్ వంటి సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైలైట్ చేశారు. 2002లో భారతదేశపు మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నారు. వినియోగదారుల హక్కుల కార్యకర్త, న్యాయవాది స్వర్ణ్ కోహ్లీని వివాహం చేసుకున్న ఆయనకు ముగ్గురు సంతానం. తరతరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వాన్ని మిగిల్చిన ఆయన 2020 నవంబర్ 26న తన 96వ ఏట కన్నుమూశారు. -
రతన్ టాటా వీలునామా: ఇప్పటి వరకు ఎవరికి ఎంత ఆస్తి రాసిచ్చారంటే?
ఢిల్లీ : దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా. ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు.గొప్ప మహోన్నత వ్యక్తి.మానవతా మూర్తి.సమాజ సేవకుడు. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. తన లక్షల కోట్ల ఆస్తుల్లో ఎవరికి ఎంత చేరాలో మరణానికి ముందే ఆయన వీలునామా రూపంలో సూచించారు. తాజాగా ఓ రహస్య వ్యక్తికి రూ.500 కోట్లు ఇచ్చేలా వీలునామా రాసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. రతన్ టాటా తన వీలునామాలో ఇప్పటివరకు ఎవరికి ఎంత రాసిచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.గతేడాది అక్టోబర్ 9న రతన్ టాటా మరణించారు. మరణానికి ముందే తన ఆస్తిలో ఎవరికి ఎంత చెందాలనేది వివరంగా తన వీలునామాలో రాశారు.రతన్ టాటా రాసిన రూ.10,000 కోట్ల వీలునామాలో తన పెంపుడు జర్మన్ షెపర్డ్ శునకం ‘టిటో’ను చేర్చారు. ఈ శునకానికి అపరిమిత సంరక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించినట్లు సమాచారం. టాటాతో మూడు దశాబ్ధాలుగా ఉంటున్న పనిమనిషి సుబ్బయ్యకు సంబంధించిన నిబంధనలను కూడా వీలునామాలో చేర్చారు.తాజాగా,తన ఆస్తిలో మరో రూ.500కోట్లు టాటా కుటుంబానికి, సన్నిహితులకు ఏమాత్రం పరిచయం లేని మోహిని మోహన్ దత్తాకు రూ.500కోట్లు రాసిచ్చారు. మోహిని మోహన్ దత్తా ఎవరా? అని ఆరా తీస్తే.. వ్యాపార వ్యవహారాల్లో రతన్ టాటాకు చేదోడు వాదోడుగా ఉన్నట్లు సమాచారం.మోహినీ మోహన్ దత్తా ఎవరు?జంషెడ్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్తే మోహిని మోహన్ దత్తా. స్టాలియన్ అనే సంస్థ పేరుతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు. స్టాలియన్‌లో మోహినీ మోహన్ దత్తాకు 80శాతం, టాటా సర్వీసెస్‌కు 20 శాతం వాటా ఉంది. ఆ తర్వాత స్టాలియన్ సంస్థను టాటాలో విలీనం చేశారు మోహన్ దత్తా. మోహన్ దత్త రతన్ టాటా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో టాటాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేను 24 ఏళ్ల వయస్సులో ఉండగా.. జంషెడ్‌పూర్‌లోని డీలర్స్ హాస్టల్లో తొలిసారి రతన్ టాటాను కలిశాను. అప్పటి నుంచి ఆయనతో పరిచయం కొనసాగుతూ వచ్చింది. నన్ను తన ఇంటి కుటుంబ సభ్యుడిలానే చూసుకునేవారని గుర్తు చేసుకున్నారు. ఫార్చ్యూన్లో ఒక నివేదిక ప్రకారం.. దత్తా కుమార్తె సైతం టాటాగ్రూప్‌తో కలిసి పనిచేశారు. మొదట 2015 వరకు తాజ్ హోటల్స్‌లో, 2024 వరకు టాటా ట్రస్ట్స్‌లో పనిచేసినట్లు పేర్కొంది. కాగా, రతన్ టాటా తన వీలునామా ప్రకారం.. మోహినీ మోహన్ దత్తాకు రూ.500కోట్లు చెందాలంటే న్యాయ స్థానం ధృవీకరించాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ భారీ మొత్తం దత్తాకు అందనుంది. ఇందుకోసం సుమారు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. -
రతన్ టాటా ఆస్తిలో రూ.500 కోట్లు ఈయనకే.. వీలునామాలో ఊహించని వ్యక్తి..
దేశ పారిశ్రామిక ప్రగతికి ఎనలేని కృషి చేసిన రతన్ టాటా (Ratan Tata) గతేడాది అక్టోబర్‌లో కన్ను మూశారు. కాగా ఇటీవల తెరిచిన రతన్ టాటా వీలునామా చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే అందులో జంషెడ్‌పూర్‌కు చెందిన ట్రావెల్ రంగ ఎంట్రాప్రెన్యూర్ మోహినీ మోహన్ దత్తా (Mohini Mohan Dutta) అనే వ్యక్తికి ఆస్తిలో రూ. 500 కోట్లు (రతన్ టాటా మిగిలిన ఆస్తులలో దాదాపు మూడో వంతు) కేటాయించాలనే నిబంధన ఉంది. ఇది టాటా కుటుంబాన్ని మాత్రమే కాకుండా ఆయన సన్నిహితులను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే మోహినీ మోహన్ దత్తా అనే వ్యక్తి గురించి అంతర్గతంగా కూడా ఎవరికీ పెద్దగా తెలీదు.ఎవరీ మోహినీ మోహన్ దత్తా?మోహినీ మోహన్ దత్తా జంషెడ్‌పూర్‌లో బాగా స్థిరపడిన వ్యాపారమైన స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని కలిగి ఉన్న కుటుంబం నుండి వచ్చారు. 2013లో స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన తాజ్ సర్వీసెస్‌తో విలీనం చేశారు. స్టాలియన్‌లో దత్తా కుటుంబానికి 80% వాటా ఉండగా, మిగిలిన 20% వాటా టాటా ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంది. మరో విషయం ఏమిటంటే మోహినీ దత్తా థామస్ కుక్ మాజీ అసోసియేట్ కంపెనీ అయిన టీసీ ట్రావెల్ సర్వీసెస్‌కు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.టాటా-దత్తా సంబంధంమీడియా నివేదికల ప్రకారం.. మోహినీ మోహన్ దత్తా రతన్ టాటాతో దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగించారు. టాటా వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సంబంధాల గురించి బహిరంగ చర్చలలో ఆయన పేరు ప్రముఖంగా లేకపోయినా, టాటా కుటుంబంతోపాటు ప్రైవేట్ సర్కిల్లోని ఎంపికచేయదగ్గ వ్యక్తులలో మోహినీ మోహన్ దత్తా ఒకరుగా ఉన్నారు.వీలునామా సందేహాస్పదం?టాటా ట్రస్ట్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణం తర్వాత తాజాగా ఈ వీలునామా బయటకు వచ్చింది. ఊహించని విధంగా మోహన్ దత్తాకు రూ.500 కోట్లు కేటాయించడంతో పాటు, మిగిలిన సంపదను ప్రధానంగా దాతృత్వ కార్యక్రమాల కోసం వినియోగించాలని అందులో పేర్కొన్నారు. వీలునామాను అమలు చేసే నలుగురు వ్యక్తులలో (డారియస్ ఖంబటా, మెహ్లి మిస్త్రీతో పాటు) ఉన్న ఆయన సవతి సోదరీమణులు షిరిన్, దినా జస్జీభోయ్ కూడా తమ వాటాలను దాతృత్వ కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు.కాగా ఈ పరిణామం గురించి వ్యాఖ్యానించడానికి మోహిన్ దత్తా నిరాకరించారు. అదేవిధంగా వీలునామా అమలు చేసేవారు వారు కూడా ఎటువంటి బహిరంగ ప్రకటనలూ జారీ చేయలేదు. ఆస్తి పంపిణీకి సంబంధించి ఆశ్చర్యకరమైన స్వభావం కారణంగా, ముఖ్యంగా బయటి వ్యక్తికి భారీ ఆస్తి కేటాయింపును పరిగణనలోకి తీసుకుంటే, వీలునామా పరిశీలనకు గురికావచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. -
రతన్ టాటా ఫ్రెండ్.. శంతనుకు టాటా మోటార్స్‌లో కీలక బాధ్యతలు
దివంగత వ్యాపార దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) మిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న 'శంతను నాయుడు' (Shantanu Naidu)కు టాటా మోటార్స్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈయన కంపెనీలో జనరల్ మేనేజర్ & స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని తానె స్వయంగా తన లింక్డ్ఇన్లో వెల్లడించారు.''టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్ & జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నా తండ్రి తన తెల్లటి చొక్కా, నేవీ ప్యాంటుతో టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి ఇంటికి నడిచి వచ్చేవారు. ఆయన కోసం నేను కిటికీలో చూస్తూ ఉండేవాడిని. ఆ సంఘటన నాకు ఇంకా గుర్తుంది'' అని శంతను నాయుడు తన లింక్డ్ఇన్లో రాశారు.ఎవరీ శంతను నాయుడు?శంతను నాయుడు ఒక ఆటోమొబైల్ డిజైన్ ఇంజినీర్. ఇతడు ఒక రోజు రోడ్డు మధ్యలో వీధి కుక్క చనిపోయి ఉండటాన్ని గమనించిన చలించిపోయాడు. ఆ తరువాత వీధి కుక్కుల సంరక్షణకు ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో పడ్డాడు. తన స్నేహితులతో కలిసి వీధి కుక్కల కోసం రేడియం స్టిక్కర్లతో తయారు చేసిన కాలర్స్‌ని తయారు చేశాడు. తన ఇంటి పరిసరాల్లోని కుక్కలకు వాటిని అమర్చాడు. ఆ పనికి మరుసటి రోజే స్థానికుల నుంచి మెప్పు పొందాడు.ముంబైలో ఉన్న వీధి కుక్కలన్నింటికీ ఈ రేడియం కాలర్ అమర్చాలని నిర్ణయించారు. కానీ అది డబ్బుతో కూడకున్న వ్యవహారం కావడంతో విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. ఆయన ‘వీధి కుక్కలను కాపాడేందుకు సాయం చేయాల్సిందిగా రతన్ టాటాని అడుగు. ఆయనకు కుక్కలంటే ఇష్టం’ అని సలహా ఇచ్చాడు.మోటోపాస్ పేరుతో స్టార్టప్వీధి కుక్కలను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు ‘మోటోపాస్’ పేరుతో స్టార్టప్ ఏర్పాటు చేశానని, దానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ పూర్తి వివరాలు కలిగిన ఈ మెయిల్‌ను ఏకంగా రతన్‌టాటాకే పంపాడు. రోజులు గడుస్తున్నా ఎలాంటి రిప్లై లేకపోవడంతో తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.చివరకు రెండు నెలల తర్వాత నేరుగా తనని కలవాలంటూ రతన్‌టాటా నుంచి ఆహ్వానం అందింది. అదే రతన్‌టాటాతో శంతన్ నాయుడికి తొలి పరిచయం ఏర్పడేలా చేసింది. వ్యక్తిగతంగా రతన్ టాటాను కలిసి తన ప్రాజెక్టు గురించి వివరించాడు. వీధి కుక్కల పట్ల అతను చూపించే ప్రేమకు రతన్‌టాటా ఫిదా అయ్యారు. వెంటనే సాయం చేసేందుకు అంగీకరించారు. అలా మోటోపాస్ స్టార్టప్‌నకు ఆర్థికసాయం అందింది.కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు రావడంతో శంతను అమెరికా బయల్దేరాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత టాటా గ్రూపులో పని చేయాలని శంతను నిర్ణయించుకున్నాడు. MBA పూర్తి చేసి ఇండియాకు వచ్చిన తర్వాత టాటా ట్రస్టులో డిప్యూటీ జనరల్ మేనేజర్(డిజీఎం) హోదాలో చేరారు. అయితే కొద్ది కాలానికే శంతను నాయుడును పిలిపించుకున్న రతన్ టాటా..తనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉండాలని కోరారు. దాంతో 2018 నుంచి టాటా తుది శ్వాస వరకు వెన్నంటి ఉన్నాడు.ఇదీ చదవండి: కొత్త టోల్ విధానం.. ముందుగా చెప్పిన నితిన్ గడ్కరీగుడ్ఫెలోస్సాటి జీవుల పట్ల శంతను నాయుడికి ఉన్న ప్రేమ రతన్‌టాటాను ఆకట్టుకున్నాయి. శంతన్ నాయుడి ఆలోచణ సరళి టాటాను ఆకర్షించింది. మోటోపాస్‌తోపాటు శంతన్ సెప్టెంబర్ 2022లో ‘గుడ్‌ఫెలోస్’ను స్థాపించారు. ఇది యువకులను మమేకం చేసి సీనియర్ సిటిజన్ల ఒంటరితనం పోగొట్టేందుకు పనిచేస్తోంది. అతను ‘ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్’ పేరుతో రతన్ టాటాతో ఉన్న జ్ఞాపకాలు, తన నుంచి నేర్చుకున్న విషయాలపై పుస్తకం రాశారు. -
రతన్ టాటా సాధించిన అతిపెద్ద విజయాలు ఇవే!
అందరూ పుడతారు.. కానీ కొందరే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి యుగ పురుషుడు, భరతమాత ముద్దుబిడ్డ.. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం మన 'రతన్ టాటా' (Ratan Tata). ఈయన ప్రస్తుతం దేహంతో లేకపోయినా.. దేశం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అంతటి గొప్ప మహనీయుడు ఎందరికో ఆదర్శనీయం.. మరెందరికో పూజ్యనీయం. నేడు రతన్ టాటా జయంతి. ఈ కథనంలో ఆయన సాధించిన ఘనతలు, ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.రతన్ టాటా: ఎ విజనరీ లీడర్1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా.. నాయకత్వానికి, సమగ్రతకు పర్యాయపదం. టాటా సన్స్ మాజీ ఛైర్మన్‌గా, నాణ్యత, సామాజిక బాధ్యత.. నైతిక అభ్యాసాల వంటి విలువలకు కట్టుబడి ఉంటూనే, టాటా గ్రూప్‌ను గ్లోబల్ బిజినెస్ పవర్‌హౌస్‌గా మార్చిన ఘనుడు. తన తల్లితండ్రులు విడిపోయిన తర్వాత, అమ్మమ్మ సంరక్షణలో పెరిగిన రతన్ టాటా యొక్క ప్రయాణం సంకల్పం & ప్రేరణతో కూడుకున్నది.టాటా గ్రూప్‌లో తొలి అడుగులుకార్నెల్ యూనివర్సిటిలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌లో జూనియర్ మేనేజ్మెంట్ ట్రైనీగా తన వృత్తిని ప్రారంభించారు. ఆ సమయంలోనే అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అయిన 'ఐబీఎమ్' (IBM) నుంచి జాబ్ వచ్చింది. తన ప్రతిభను వేరొక కంపెనీ వృద్ధికి ఉపయోగించడానికి రతన్ టాటా మనసు ఒప్పుకోలేదు. ఐబీఎమ్ కంపెనీలో వచ్చిన ఆఫర్ వదులుకుని టాటా స్టీల్‌కు నాయకత్వం వహించారు. ఈయన నాయకత్వంలో కంపెనీ అపారమైన వృద్ధి సాధించగలిగింది.NELCO డైరెక్టర్1971లో టాటా అనుబంధ సంస్థ అయిన 'నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్' (NELCO)కి రతన్ టాటా డైరెక్టర్ అయ్యారు. అతని నాయకత్వంలో.. NELCO వ్యాపారాలు గణనీయమైన పురోగతివైపు అడుగులు వేసాయి.టాటా గ్రూప్ చైర్మన్1991లో JRD టాటా తర్వాత 'రతన్ టాటా'.. టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అతని పదవీకాలంలోనే టెట్లీ (2000), కోరస్ స్టీల్ (2007), జాగ్వార్ ల్యాండ్ రోవర్ (2008)ల కొనుగోళ్ల వంటి వాటితో పాటు ప్రపంచ విస్తరణలు కూడా జరిగాయి.ఈ సమయంలో టాటా గ్రూప్ ఉనికి ప్రపంచ దేశాలకు వ్యాపించింది.మొదటి స్వదేశీ కారురతన్ టాటా 1998లో టాటా ఇండికాను లాంచ్ చేయడం ద్వారా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇది దేశంలో మొట్టమొదటి స్వదేశీ కారు. ఆ తరువాత 2008లో అందరికీ అందుబాటు ధరలో ఓ కారు ఉండాలనే ఉద్దేశ్యంతోనే 'టాటా నానో' ప్రారంభించారు. ఈయన ప్రయత్నాలు వల్ల నాణ్యమైన వాహనాలను ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.పురస్కారాలు & పదవీ విరమణరతన్ టాటా 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ వంటి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. అయితే ఈయన 2012లో టాటా సన్స్ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేశారు. -
విలువలు నేర్పిన అజరామరుడు.. రతన్ టాటా జయంతి నేడు (ఫొటోలు)
-
Christmas 2024 నింగికెగిసిన తారలు, కళ్లు చెమర్చే AI ఫోటోలు
-
Year ender 2024: రతన్ టాటా మొదలుకొని శారదా సిన్హా వరకూ.. ఈ ఏడాది కన్నుమూసిన ప్రముఖులు
2024 కొద్దిరోజుల్లో ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది కొందరికి సవ్యంగానే సాగిపోగా, మరికొందరికి భారంగా గడిచింది. ఈ ఏడాది ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, బీహార్ నైటింగేల్ శారదా సిన్హా తదితర ప్రముఖులు ఈ లోకాన్ని విడిచివెళ్లారు. 2024 ముగుస్తున్న తరుణంలో ఈ ఏడాదిలో కన్నుమూసిన ప్రముఖులను ఒకసారి స్మరించుకుందాం.రతన్ టాటాప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా 2024 అక్టోబర్ 9న తన 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రతన్ టాటా 30 ఏళ్ల పాటు టాటా గ్రూప్‌కు సారధ్యం వహించారు. టాటా సన్స్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ పలు విజయాలు సాధించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. రతన్ టాటా భారతదేశానికి చేసిన సేవలు, ఆయన అందించిన విలువలను రాబోయే తరాలు కూడా గుర్తుచేసుకుంటాయి.బాబా సిద్ధిఖీమహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని 2024, అక్టోబర్ 12న ముంబైలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చిచంపింది. ఈ కేసులో పోలీసులు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం ముంబైలో భయాందోళనకర వాతావరణం నెలకొంది.సీతారాం ఏచూరి సీపీఎం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ లెఫ్ట్ ఫ్రంట్ నేత సీతారాం ఏచూరి 2024, సెప్టెంబర్ 12న కన్నుమూశారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన చాలా కాలం పాటు ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. శ్వాసకోశ వ్యాధితో ఆయన తుది శ్వాస విడిచారు. ఏచూరి మరణానంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు దానం చేశారు.శారదా సిన్హా బీహార్ నైటింగేల్‌గా పేరొందిన జానపద గాయని శారదా సిన్హా 2024లో కన్నుమూశారు. ఆమె మల్టిపుల్ మైలోమా అనే అరుదైన రక్త క్యాన్సర్‌తో బాధపడ్డారు. శారదా సిన్హా 2024 నవంబర్ 5న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. భారతీయ జానపద సంగీతానికి శారదా సిన్హా అమోఘమైన సేవలు అందించారు.అతుల్ పర్చురే ప్రముఖ మరాఠీ హాస్యనటుడు అతుల్ పర్చురే తన 57 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కాలేయంలో 5 సెంటీమీటర్ల కణితి ఉందని తెలిపారు. చికిత్స సమయంలో, అది ప్రమాదవశాత్తూ ప్యాంక్రియాస్‌కు వ్యాపించిందని, ఫలితంగా తాను నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితిలో ఉన్నానని తెలిపాడు. అతుల్ పర్చురే 2024లో ఈ లోకాన్ని విడిచివెళ్లారు.పంకజ్ ఉధాస్ ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ 2024, ఫిబ్రవరి 26న తన 72 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. పంకజ్ ఉదాస్ గజల్స్ శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. పంకజ్ ఉదాస్కు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సోకింది. ఆయన మృతికి నాలుగు నెలల ముందుగానే ఆయనకు ఈ విషయం తెలిసింది.సుహానీ భట్నాగర్అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’లో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహానీ భట్నాగర్ 2024, ఫిబ్రవరి 17న తన 19 ఏళ్ల వయసులో ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. సుహానీ డెర్మటోమయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడినట్లు ఆమె తండ్రి తెలిపారు.రితురాజ్ సింగ్ టీవీ, సినీ నటుడు రితురాజ్ సింగ్ తన 59 సంవత్సరాల వయస్సులో 2024, ఫిబ్రవరి 19న ముంబైలో గుండెపోటుతో మృతిచెందారు. చిన్న తెరపై తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన తదనంతరకాలంలో పలు ప్రధాన పాత్రలలోనూ కనిపించారు.రోహిత్ బాల్ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ 2024 నవంబర్ 2న తన 63 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన చాలా కాలంపాటు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడ్డారు. 2010లో గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ కూడా చేయించుకున్నారు. అక్టోబర్ 13న ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్లో లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్‌లో తన చివరి ప్రదర్శన ఇచ్చారు. ఇది కూడా చదవండి: అగ్నికి ఆహుతై.. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న అందమైన చర్చి -
రతన్ టాటా ఫ్రెండ్.. శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?
రతన్ టాటా చివరి రోజుల్లో నీడగా.. ఎప్పుడూ వెన్నంటే ఉన్న శంతను నాయుడు తన కొత్త ప్యాషన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. నాయుడు స్థాపించిన రీడింగ్ కమ్యూనిటీ 'బుకీలు'.. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నిశ్శబ్దంగా చదవడానికి ప్రజలను ఒకచోట చేర్చింది. మొదటి ముంబైలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్.. తరువాత పూణే, బెంగళూరులకు విస్తరించింది. ఇప్పుడు జైపూర్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం.డిసెంబర్ 8న శంతను నాయుడు జైపూర్ బుకీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం జరగబోయే ఈవెంట్లో చేరమని పాఠకులను ఆహ్వానిస్తున్నట్లు ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జైపూర్‌లో ప్రారంభించిన తరువాత.. ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్, సూరత్‌తో సహా ఇతర భారతీయ నగరాలకు బుకీలను విస్తరించాలని నాయుడు యోచిస్తున్నారు. గత నెలలో అతను బెంగళూరులో విజయవంతమైన రీడింగ్ సెషన్‌ను నిర్వహించారు. పఠనాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా బుకీలను ప్రారంభించారు. మనిషికి చదువు లేదా చదవడం చాలా ప్రధానమైనదని.. బుకీస్ ఈవెంట్లో శంతను నాయుడు పేర్కొన్నారు.రతన్ టాటా & శంతను నాయుడు స్నేహంరతన్ టాటా తన వీలునామాలో శంతను నాయుడుని చేర్చారు. దూరదృష్టి గల నాయకుడితో 30-ఏళ్ల ప్రత్యేక బంధాన్ని నొక్కి చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. నాయుడు వెంచర్ గుడ్‌ఫెలోస్‌లో టాటా తన వాటాను వదులుకున్నారని, అతని విద్యా రుణాలను మాఫీ చేశారని సమాచారం. రతన్ టాటా మరణించిన తరువాత తన బాధను వ్యక్తం చేస్తూ.. వీడ్కోలు, నా ప్రియమైన లైట్‌హౌస్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Mumbai Bookies (@mumbaibookies) -
వ్యక్తిగా టాటా ఎలా ఉండేవారు?
అత్యంత ప్రభావవంతుల జీవితాలు ఎలా ఉంటాయో మనకు ఎప్పుడూ తెలీదు. కేవలం వారి కంపెనీల గురించిన ఉత్థాన పతనాలే తప్ప వ్యక్తిగతజీవితంలోని ఎగుడుదిగుళ్లు బయటికి రావు. ఇటీవల మరణించిన దేశంలోని అతి పెద్ద పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్ టాటా చిన్నతనంలో తల్లితండ్రులు విడాకులు తీసుకున్న కారణంగా అభద్రతకు గురయ్యారు. దానివల్లే పాఠశాలలో హేళన ఎదుర్కొన్నారు. ప్రేమించినప్పటికీ పెళ్లికి దూరంగా ఉండిపోయిన రతన్‌కు తన చివరి జీవితంలో తోడుగా ఉన్నది టిటో అనే కుక్క. టిటోతో గడిపే సమయమే ఆయనకు రోజులో అత్యుత్తమంగా ఉండేదట.ఇలాంటి ఎన్నో అంశాలను ‘రతన్ టాటా: ఎ లైఫ్’ పుస్తకం వెల్లడిస్తుంది.మనందరికీ పారిశ్రామికవేత్త రతన్ టాటా తెలుసు. ఒక పారిశ్రామికవేత్తగా ఆయన ప్రత్యేకత కలిగివున్నారు. కానీ ఒక వ్యక్తిగా ఆయన ఎలా ఉండేవారు? ఆయనకు ఎలాంటి బాల్యం ఉండేది? ఆయన ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకోని స్త్రీలు ఉన్నారా? ఆయన వ్యక్తిగత జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఇలాంటి అంశాలను సాధారణంగా మనం ఎప్పటికీ తెలుసుకోలేం. కానీ థామస్ మాథ్యూ ఇటీవల ప్రచురించిన పుస్తకం ‘రతన్ టాటా: ఎ లైఫ్’ కలిగించే మహదానందం ఏమిటంటే, ఆయన ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను వెల్లడించారు.రతన్ టాటా పదేళ్ల వయసులో ఉండగా ఆయన తల్లితండ్రులు విడాకులు తీసుకున్నారు. అందువల్ల వాళ్ల నానమ్మ (నవాజ్‌బాయి టాటా) వద్ద పెరిగాడు. లేడీ టాటా వైభవంగా ఒక పెద్ద భవంతిలో యూనిఫారం ధరించిన పనివాళ్లతో నివసించారు. ఆమెకు రోల్స్ రాయిస్ కారు ఉండేది. నేను ‘బీబీసీ’ కోసం రతన్ టాటానుఇంటర్వ్యూ చేసినప్పుడు, తాను చెడిపోలేదని టాటా నొక్కి చెప్పారు; కాకపోతే ఎంతో గారాబంగా పెరిగానని ఒప్పుకున్నారు. అయితేఆ విషయాన్ని కనుగీటి మరీ చిరునవ్వుతో చెప్పారు.తమ తల్లితండ్రుల విడాకులురతన్ పై, ఆయన సోదరుడు జిమ్మీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని థామస్ మాథ్యూ మనకు చెబు తారు. అది వారిలో అభద్రతా భావాన్ని కలిగించింది. వారు పాఠ శాలలో చదువుతున్నప్పుడు ర్యాగింగ్‌కు గురయ్యారు, హేళనకు గురయ్యారు. ఈ సమయంలో టాటా తన నాన్నమ్మకు మరింత దగ్గర య్యారు. నిజం చెప్పాలంటే, ఆమెను ఆరాధించారు.సీనియర్ కేంబ్రిడ్జ్ విద్య పూర్తి చేసిన తర్వాత టాటా అమెరికా వెళ్లారు. కుమారుడు చార్టర్డ్ అకౌంటెన్సీ చదవడానికి బ్రిటన్ వెళ్లాలని ఆయన తండ్రి కోరుకున్నారు. కానీ రతన్ ఆర్కిటెక్చర్‌పై మనసు పడ్డారు. చివరికి ఆయన నిర్ణయమే గెలిచింది. చాలా ఏళ్ల తర్వాత రతన్ టాటా బొంబాయిలో హలేకై (సముద్రం పక్కని ఇల్లు అనిఅర్థం) అని పిలిచే తన సొంత ఇంటిని తానే డిజైన్ చేసుకున్నారు.అయితే టాటా అమెరికాతో ప్రేమలో పడ్డారు. వృద్ధురాలైన నానమ్మ ఆయన్ని తిరిగి రమ్మని గట్టిగా కోరుకోకపోతే, ‘‘ఆయన అమెరికాలోనే ఉండి పని చేస్తూ తన జీవితాన్ని అక్కడే గడిపేవారు. దానిని ఆయన తన రెండవ ఇల్లు అని పిలుస్తారు’’ అని మాథ్యూ వెల్లడించారు.లాస్ ఏంజిల్స్‌లో ఆయన తన మొదటి ప్రియురాలు కరోలిన్ ఎమ్మన్స్ను కలుసు కున్నారు. ఆమె తండ్రి ఫ్రాంక్ ఆయన మొదటి బాస్. ఆయనే వారిని పరస్పరం పరిచయం చేశారు. రతన్ జీవితంలో మరో మూడు ప్రేమలు ఉన్నాయి కానీ ఎవరినీ పెళ్లి చేసు కోలేదు. ‘బీబీసీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను ఇతర విషయాలకు ప్రాధాన్యంఇచ్చాను గానీ ఎన్నడూ పెళ్లిపై దృష్టి పెట్టలేదని చెప్పారు. అయినప్పటికీ, కరోలిన్ తో టాటా టచ్‌లో ఉండేవారు. 2017లో జరిగిన ఆయన 80వ పుట్టినరోజుకు ఆమె హాజరయ్యారు. రతన్ అమెరికాలో ఉన్న ప్రతిసారీ కరోలిన్‌ను డిన్నర్‌కి తీసుకువెళ్లేవారని మాథ్యూ పేర్కొన్నారు. అందుకే దీన్ని చేదైన తీపి కథగా నేనుభావించడంలో పొరబడలేదు కదా? ఇది కచ్చితంగా నిజమని కూడా అనిపిస్తుంది.టాటా వ్యక్తిత్వంలోని ఆకర్షణీయమైన అంశాలను థామస్ పుస్తకం వెల్లడిస్తుంది. ఉదాహరణకు, ఆయన చెక్స్ షర్టులను ఇష్టపడే వారు. ‘‘ఆయన బాలుడిగా లేదా పెద్ద వయస్సులో ఉన్నప్పుడు తీసిన ఫొటోలలో దాదాపు 90 శాతం వరకు ఆయన ఫార్మల్ దుస్తులుకాకుండా చెక్స్ షర్టు ధరించి ఉన్నట్లు చూపుతాయి.’’ ఆయనకుకార్లంటే కూడా మోజు ఉండేది. వాటిని హాలెకైలో ప్రత్యేకంగా నిర్మించిన నేలమాళిగలో భద్రపరిచారు. అమెరికన్ ‘మజిల్ కార్లు’ అంటే ఆయనకు ఎంతో ఇష్టం.టీవీలో రతన్ టాటా అంత్యక్రియలను చూసిన మీకు, ఆయన పెంచిన కుక్క గోవా ఎలా దూకి శవపేటిక పక్కన కూర్చుందోగుర్తుకు వస్తుంది. టాటా తన కుక్కలకు ఎంత సన్నిహితంగాఉండేవారో ఇది తెలియజేస్తుంది. మాథ్యూ దీనిపై పూర్తి కథను వెల్లడించారు.ఆయన కుక్కలను తనకు లేని పిల్లలుగా చూసుకున్నారన్న భావన మీకు వస్తుంది. వీటిలో చాలా కుక్కలను టిటో, ట్యాంగోఅనిపిలిచేవారు. మాథ్యూ అదే పేరుతో ఉన్న మూడు తరాలకుక్కల గురించి చెబుతారు.2008లో ట్యాంగోలలో ఒకదానికి కాలు విరిగింది. అప్పుడు టాటా ఆ కాలిని రక్షించగల పశువైద్యుని కోసం ప్రపంచాన్ని జల్లెడ పట్టారు. చివరికి ట్యాంగోను చికిత్స కోసం మిన్నెసోటా (యూఎస్ నగరం) తీసుకెళ్లారు.తన చివరి జీవితంలో టిటో ఆయన ప్రధాన సహచరుడు. ‘‘ఇప్పుడు టాటాకు టిటో మాత్రమే ఉంది’’ అని మాథ్యూ రాశారు. ‘‘ప్రతి సాయంత్రం టిటో కోసం ఏ అవాంతరం లేకుండా ఒక సమయం రిజర్వ్ చేయబడేది. ఆ షెడ్యూల్‌కు ఎవరైనా, లేదా ఏ కార్య క్రమమైనా భంగం కలిగించడం టాటాకు ఇష్టం ఉండేది కాదు. టిటోతో గడిపే సమయమే ఆయనకు రోజులో అత్యుత్తమ సమయం’’ అని మాథ్యూ వివరిస్తారు.బహుశా నమ్మశక్యం కాని విధంగా, టాటాలో చిలిపిగుణం కూడా ఉండేది. బోర్డ్ మీటింగ్‌లలో వృద్ధ డైరెక్టర్లు తమ బూట్లను తీసేస్తారని గమనించిన తర్వాత, ఆయన నిశ్శబ్దంగా వాటిని వీలైనంత దూరంలోకి తన్నేవారు. ఆ బూట్లు ఎక్కడ ఉన్నాయో వారికి కనిపించనప్పుడు అల్లరిగా నవ్వుతూ ఉండేవారు. మాథ్యూ పుస్తకంలోని అన్ని విశేషా ల్లోకీ ఇది నాకు రసవత్తరమైన సంగతిగా అనిపించింది.అయితే, సైరస్ మిస్త్రీ, టెట్లీ టీ, కోరస్, జాగ్వార్ అధ్యాయాలతో సహా ఇంకా చాలానే ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆ వివరాలు ఉండకుండా ఎలా ఉంటాయి? కానీ వ్యక్తిగత వివరాలే నా దృష్టిని ఆకర్షించాయి. అవి మిమ్మల్ని కూడా ఆకర్షిస్తాయని నేను ఆశించవచ్చా?- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- కరణ్ థాపర్ -
రతన్ టాటా చేసిన పని నాకింకా గుర్తుంది.. ఆ రోజు: ప్రధాని మోదీ
'రతన్ టాటా' మనల్ని విడిచిపెట్టి నేటికి నెల రోజులు అవుతోంది. సమాజంలోని ప్రతి రంగంలోనూ ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ పరిశ్రమకు ఆయన సహకారం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగానే ఉంటుందని.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.ఎంతోమంది అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలు, వర్ధమాన వ్యాపారవేత్తలు, కష్టపడి పనిచేసే నిపుణులు కూడా రతన్ టాటా మృతికి సంతాపం తెలిపారు. ఆయన లేరనే మాట భారతదేశాన్ని మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలను బాధించింది. ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచిన రతన్ టాటా.. నాయకత్వంలో టాటా గ్రూప్ కొత్త శిఖరాలకు చేరుకుందని మోదీ పేర్కొన్నారు.రతన్ టాటా అంటే.. మొదట గుర్తొచ్చేది కరుణ మాత్రమే కాదు. ఇతరుల కలలను నిజం చేసుకోవడానికి.. ఆయన ఇచ్చే మద్దతు కూడా అని తెలుస్తోంది. భారతదేశ స్టార్టప్ వ్యవస్థకు మార్గదర్శకత్వం వహించిన ఆయన, యువ పారిశ్రామికవేత్తల ఆశలు, ఆకాంక్షలను అర్థం చేసుకున్నారు. దేశ భవిష్యత్తును రూపొందించడానికి వారిలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించారు.రతన్ టాటా స్ఫూర్తితో ఎంతోమంది భావి నాయకులు పుట్టుకొస్తారు. ఇది దేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా ఉండటానికి సహకరిస్తుంది. ఆయన గొప్పతనం బోర్డ్‌రూమ్‌కు లేదా తోటి మానవులకు సహాయం చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రతి జీవరాశిమీద ఆయన కరుణ పొంగిపొర్లింది.జంతు సంక్షేమంపై దృష్టి సారించే ప్రతి ప్రయత్నానికి రతన్ టాటా మద్దతు ఇచ్చారు. ఎప్పుడూ కుక్కలతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉండేవారు. కోట్లాది మంది భారతీయులకు.. రతన్ టాటా దేశభక్తి సంక్షోభ సమయంలో స్పష్టంగా కనిపించిందని మోదీ వెల్లడించారు.వ్యక్తిగతంగా చెప్పాలంటే.. గుజరాత్లో కొన్నేళ్లు ఆయనతో కలిసి సన్నిహితంగా కలిసి పనిచేశాను. అక్కడ అతను చాలా ఇష్టంతో అనేక ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టారు. కొన్ని వారాల క్రితం, నేను స్పెయిన్ ప్రభుత్వ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో కలిసి C-295 విమానాలను తయారు చేసే ఒక ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించాము. ఇది ప్రారంభం కావడానికి రతన్ టాటా కృషి చాలా ఉందని మోదీ పేర్కొన్నారు.Its been a month since we bid farewell to Shri Ratan Tata Ji. His contribution to Indian industry will forever continue to inspire. Here’s an OpEd I wrote which pays tribute to his extraordinary life and work. https://t.co/lt7RwVZEqe— Narendra Modi (@narendramodi) November 9, 2024నేను ఎప్పటికీ రతన్ టాటాను మర్చిపోను. పాలనకు సంబంధించిన విషయాలపైన, అయన ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతు.. ఎన్నికల విజయాల తర్వాత తెలియజేసిన అభినందనలు.. ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయని పీఎం మోదీ వెల్లడించారు.ఇదీ చదవండి: రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలుస్వచ్చ్ భారత్ మిషన్‌కు రతన్ టాటా ఇచ్చిన మద్దతు నా హృదయానికి దగ్గరగా ఉంది. భారతదేశ పురోగతికి పరిశుభ్రత చాలా ముఖ్యమని ఆయన భావించారు. అక్టోబరు ప్రారంభంలో స్వచ్ఛ భారత్ మిషన్ పదవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన చేసిన వీడియో సందేశం నాకు ఇప్పటికీ గుర్తుందని మోదీ అన్నారు. -
మోదీ.. విమానాల ఫ్యాక్టరీని గుజరాత్ తరలించారు: శరద్ పవార్
ముంబై: గుజరాత్‌లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎయిర్‌బస్ ఫ్యాక్టరీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయవల్సి ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌కు తరలించుకుపోయారని కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపణలు చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. ‘‘రతన్ టాటా మహారాష్ట్రలో టాటా ఎయిర్‌బస్ ప్రాజెక్ట్ రావాలని భావించారు. సంప్రదింపులు జరిపిన అనంతరం.. నాగ్‌పూర్ ఎంఐడీసీ ప్రాంతంలో 500 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించటం జరిగింది. ఇది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో జరిగింది. ఇందులో నేను కూడా భాగమయ్యాను. తర్వాత మా ప్రభుత్వం మారిపోయింది. ..అనంతరం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక.. రతన్ టాటాకు ఫోన్ చేసి ఒప్పించి గుజరాత్లో ఫ్యాక్టరీని స్థాపించాలని చెప్పారు. ఆ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో వేల మందికి ఉద్యోగాలు లభించేవి. మహారాష్ట్ర కోసం ఉద్దేశించిన (సెమీకండక్టర్) ఫ్యాక్టరీని గుజరాత్లో ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్‌ను మోదీ కోరడంతో మహారాష్ట్రలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రధానమంత్రి ఏ ఒక్క రాష్ట్రానికి చెందినవారు కాదు.. దేశం మొత్తం గురించి ఆలోచించాలి’’ అని అన్నారు. అయితే ప్రస్తుతానికి శరద్ పవార్ ఆరోపణలపై బీజేపీ స్పందించలేదు.చదవండి: ఢిల్లీ.. 72 గంటలు డేంజర్ -
లండన్‌లో రతన్‌టాటాతో బిగ్‌బీకి ఎదురైన అనూహ్య అనుభవం
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కేవలం వ్యాపార దిగ్గజంగానే కాదు ప్రముఖ దాతగా, అతి సాధారణ జీవితం గడిపే వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితం. 86 సంవత్సరాల వయస్సులో, రతన్ టాటా ఇటీవల (అక్టోబర్ 9, 2024) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఒక శకం ముగిసిందంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆయన మృతిపై సంతాపం వ్యక్తమైంది. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి 16 షోలో రతన్ టాటాతో తనకున్న ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.కౌన్ బనేగా కరోడ్‌పతి లేటెస్ట్ ఎపిసోడ్లో ఫరా ఖాన్, బోమన్ ఇరానీ హాట్ సీట్లో కూర్చున్నారు. ఈ సమయంలో అమితాబ్ రతన్ టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒక సందర్భంలో తనను డబ్బులు అడిగిన వైనం గురించి చెప్పుకొచ్చారు. ‘‘ఆయన గురించి నేనేం చెప్పగలను? సాదాసీదాగా జీవనంతో సాధారణ వ్యక్తిలా కనిపించే అసాధారణ వ్యక్తి. ఒకసారి ఇద్దరం ఒకే విమానంలో లండన్‌కు ప్రయాణిస్తూ, చివరకు హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. లండన్ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనను పికప్ చేసుకు నేందుకు వచ్చిన వారు కనిపించ లేదేమో బహుశా. అక్కడే ఉన్న టెలిఫోన్ బూత్ కెళ్లి, బయటకు వచ్చిన టాటా కొద్దిగా మనీ ఉంటే ఇస్తారా అని నన్ను అడిగారు. అంటే ఫోన్ చేయడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవా! అని చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత అసామాన్యంగా జీవించిన వ్యక్తి అని బిగ్‌బీ పేర్కొన్నారు. అంతేకాదు మరో విషయాన్ని కూడా బిగ్‌బీ ప్రస్తావించారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) ‘‘ఒకసారి స్నేహితులతో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్లాం ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత బయలు దేరుతుంటే . టాటా వచ్చి నన్ను మా ఇంటికి దగ్గర డ్రాప్ చేయగలరా? నేను మీ ఇంటి వెనుక ఉంటున్నా’’ అన్నారు. అసల రతన్ టాటా తనకంటూ ఒక కారు కూడా ఉంచుకోరు అంటే ఎవరమైనా నమ్మగలమా అంటూ వ్యాఖ్యానించిన అమితాబ్ రతన్ టాటా అంతటి గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. రతన్జీ జీవితం ఎప్పటికీ గర్వకారణమని, గొప్ప సంకల్పంతో ఆయన జాతికి అందించిన సేవలు, విలువలు మరువలేని వన్నారు బిగ్‌బీ.కాగా రతన్ టాటా అస్తమించిన రోజు ఆయనకు నివాళి అర్పించిన బిగ్‌బీ, మరో విషయాన్ని కూడా పంచుకున్నారు. ఇకసారి ఇద్దరూ విమానంలో కలుసుకున్నపుడు పరస్పరం గుర్తించకపోవడం, చివరికి తాను అమితాబ్ బచ్చన్‌ను అనిచెప్పగానే, నా పేరు రతన్ టాటా అంటూ ఆయన పరిచయంచేసుకోవడం, దీంతో తాను ఆశ్చర్యపోవడం తనవంతైంది అంటూ సోషల్ మీడియాలో ఒక నోట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..
దేశం కోసం వేలకోట్లు ఉదారంగా దానం చేసిన దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను ప్రపంచ దేశాలు సైతం గౌరవిస్తాయి. ఈ గౌరవంతోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్మించనున్న భవనానికి 'రతన్ టాటా' పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ భవన నిర్మాణ పనులు 2025లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ భవనాన్ని రాడ్‌క్లిఫ్ అబ్జర్వేటరీ క్వార్టర్లో.. టాటా గ్రూప్, సోమర్విల్లే కాలేజ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్మించనున్నాయి. దీని ద్వారా బోధన, విద్యాకార్యకలాపాల నాణ్యతను మెరుగుపరుస్తారు. ఇది అవసరమైన పరిశోధనలకు నిలయంగా ఉంటుంది.సోమర్విల్లే కాలేజ్, రతన్ టాటా మధ్య దశాబ్ద కాలంగా ఉన్న స్నేహం వల్ల ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. దీనిని లండన్‌కు చెందిన ఆర్కిటెక్ట్ మోరిస్ కో డిజైన్ చేయనున్నట్లు సమాచారం. రతన్ టాటా పేరుతో భవనాన్ని నిర్మించానికి లండన్ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం ఎంతోమంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది.రతన్ టాటా పేరుతో భవన నిర్మాణం ప్రకటన తరువాత, సోమర్విల్లే కళాశాల ప్రిన్సిపాల్ బారోనెస్ రాయల్ మాట్లాడుతూ.. ఈ భవనం గత దశాబ్దంలో అనేక సంభాషణలు, ఆశలు, కలల ఫలం. టాటాతో మా సుదీర్ఘ అనుబంధానికి చిహ్నం అని అన్నారు. ఇది ఒక గొప్ప వ్యక్తి, సోమర్విల్లే ప్రియమైన స్నేహితుడి జీవితానికి శాశ్వత వారసత్వంగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. సోమర్విల్లే కళాశాలతో ఈ సహకారం రతన్ టాటా విలువలకు నివాళి అని అన్నారు. -
రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
వడోదర: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని వడోదరలో స్పానిష్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్‌తో కలిసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) క్యాంపస్‌లో టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాను గుర్తుచేసుకుంటూ రతన్ టాటా ఈ రోజు మన మధ్య ఉండివుంటే, మరింత సంతోషించేవారన్నారు. సీ 295 ఫ్యాక్టరీ కొత్త భారతదేశానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు.టీఏఎస్ఎల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తన స్నేహితుడు పెడ్రో శాంచెజ్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. నేటి నుంచి భారత్, స్పెయిన్ మధ్య భాగస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం ఏర్పడనుంది. సీ 295 రవాణా విమానాల తయారీ కోసం ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నాం. ఈ ఫ్యాక్టరీ భారతదేశం- స్పెయిన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ మిషన్‌ను బలోపేతం చేయనుందన్నారు.ఈ సందర్భంగా స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్ మాట్లాడుతూ నేడు మనం ఆధునిక పరిశ్రమను మాత్రమే ప్రారంభించడం లేదని, రెండు ప్రముఖ కంపెనీల మధ్య ఒక అసాధారణ ప్రాజెక్ట్ ప్రారంభమవడాన్ని చూస్తున్నామన్నారు. భారతదేశానికి, ప్రధాని మోదీ విజన్‌కు ఇది మరో విజయం అని అన్నారు. భారతదేశాన్ని పారిశ్రామిక శక్తిగా మార్చడం, పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెంచడంపై మోదీ దృష్టి సారించారన్నారు. ఇది కూడా చదవండి: స్పెయిన్ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్ షో -
క్విక్ కామర్స్‌లోకి టాటా గ్రూప్?
టాటా గ్రూప్ క్విక్ కామర్స్ రంగంలో వేగంగా విస్తరిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు ధీటుగా టాటా గ్రూప్ ‘న్యూఫ్లాష్’ పేరుతో ఈ సేవలు ప్రారంభించనుంది. ఈ సర్వీసును ముందుగా మెట్రో నగరాల్లో అందించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇప్పటికే టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బిగ్‌బాస్కెట్ ద్వారా వినియోగదారులకు ఈ-కామర్స్ సేవలు అందిస్తోంది.క్విక్ కామర్స్ బిజినెస్‌కు వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది. దాంతో ప్రముఖ కంపెనీలు ఈ రంగంలో సేవలందించేందుకు పూనుకుంటున్నాయి. ఇప్పటికే జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో ఈ క్విక్ కామర్స్ సేవలందిస్తున్నాయి. మొత్తంగా ఈ కంపెనీలు 85% మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పేరుతో ఈ సేవలందిస్తోంది. రిలయన్స్ జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ముంబయిలో ఈ సర్వీసు అందుబాటులో ఉంచింది. ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం రిలయన్స్ రిటైల్, డీమార్ట్, స్పెన్సర్స్ వంటి రిటైల్ బిజినెస్ కంటే క్విక్ కామర్స్ కంపెనీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దాంతో ఇప్పటికే కొన్ని రిటైల్ సర్వీసులు అందించే కంపెనీలు ఈ బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నాయి. టాటా గ్రూప్ కూడా వినియోగదారులను పెంచుకుని ఈ విభాగంలో సేవలందించాలని భావిస్తోంది.ఇదీ చదవండి: పన్ను ఎగవేతను పట్టించే చట్టాలివే..టాటా గ్రూప్ బిగ్‌బాస్కెట్ ద్వారా ఈ-కామర్స్, క్రోమా ద్వారా ఎలక్ట్రానిక్స్, టాటా క్లిక్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ సేవలు, టాటా 1ఎంజీ ద్వారా ఫార్మసీ సేవలు అందిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాపారాల్లో సంస్థకు వినియోగదారులు ఉండడంతో కొత్తగా రాబోయే టాటా న్యూ ఫ్లాష్ బిజినెస్‌కు కూడా వీరి సహకారం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. -
రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త, పరోపకారి 'రతన్ టాటా' మరణించిన తరువాత.. థామస్ మాథ్యూ రచించిన 'రతన్ టాటా: ఏ లైఫ్' (Ratan Tata: A Life) అనే పుస్తకం విడుదలైంది. 100 పేజీల కంటే ఎక్కువ ఉన్న ఈ పుస్తకం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ.. ప్రచురణకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఆ బుక్ లాంచ్ చేశారు. దీని ద్వారా అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.డిసెంబర్ 2012లో టాటా సన్స్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుని, రతన్ టాటా పదవీ విరమణ చేసిన తరువాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరన్ మిస్త్రీ పూర్తి బాధ్యతలను అధికారికంగా చేపట్టడానికి ముందే.. ఆ పదవికి మిస్త్రీ అర్హుడేనా అనే ఆలోచన రతన్ టాటాకు వచ్చినట్లు థామస్ మాథ్యూ పుస్తకం ఆధారంగా తెలుస్తోంది.నిజానికి రతన్ టాటా తన చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి ముందే.. ఎంపిక కమిటీ 2011లోనే సైరన్ మిస్త్రీని ఎంపిక చేసింది. ఆ తరువాత మిస్త్రీ సంస్థ నిర్వహణ విషయంలో మెళుకువలను తెలుసుకోవడానికి రతన్ టాటా కింద అప్రెంటిస్‌షిప్‌గా ఉన్నారు. ఈ సమయంలోనే ఏడాది తరువాత కంపెనీ బాధ్యతలను తీసుకోవడానికి మిస్త్రీ సరైన వ్యక్తేనా అని రతన్ టాటా పునరాలోచన చేశారు.2016లో సైరన్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్‌గా తొలగించవలసి వచ్చింది. ఆ సమయంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి రతన్ టాటాకు ఎంతో కష్టంగా అనిపించిందని.. హార్వర్డ్ బిజినినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియా ద్వారా తెలిసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. టాటా సన్స్ డైరెక్టర్‌గా ఉన్న వేణు శ్రీనివాసన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు పుస్తకంలో వివరించినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇషా ఆడపడుచు పెద్ద బిజినెస్ ఉమెన్.. తన గురించి ఈ విషయాలు తెలుసా?సైరన్ మిస్త్రీ మీద సంస్థ సంస్థ డైరెక్టర్లకు విశ్వాసం లేదని తెలుసుకున్నప్పుడే చైర్మన్ బాధ్యతల నుంచి స్వయంగా బయటకు వెళ్లి ఉంటే బాగుండేదని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. కానీ రతన్ టాటా అనుకున్నట్లు జరగలేదు. దీంతో బోర్డు సభ్యులందరూ కలిసి సైరన్ మిస్త్రీ తొలగించడం జరిగింది. ఆ తరువాత జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ కన్నుమూశారు. -
Ratan Tata: పెంపుడు కుక్క టిటో, పనిమనిషికి కూడా..
ముంబై: పారిశ్రామికవేత్త రతన్ టాటా తన దాతృత్వాన్ని చనిపోయాక కూడా చాటుకున్నారు. తన రూ.10 వేల కోట్ల ఆస్తుల్లో తోబుట్టువులకే కాదు, పెంపుడు శునకం టిటో, పనిమనిషి సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు కూడా వాటాలు పంచుతూ వీలునామా రాశారు. టాటా గ్రూప్ చైర్మన్ మాతృసంస్థ టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఈ నెల 9వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. తనకెంతో ప్రీతిపాత్రమైన జర్మన్ షెపర్డ్ శునకం టిటో సంరక్షణ బాధ్యతలను జీవితకాలం పాటు వంట మనిషి రజన్ షా చూసుకోవాలని కోరారు. ఆస్తుల్లో సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరీమణులు షిరీన్, డియానా జీజాభాయ్లకు కొంత కేటాయించారు. టాటా సన్స్‌లో వాటాను రతన్ టాటా ధార్మిక ఫౌండేషన్‌కు బదిలీ చేయాలని కోరారు. విల్లుపై బాంబే హైకోర్టు విచారణ జరపనుందని అధికారులు తెలిపారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు చెందిన గుడ్‌ఫెలోస్‌లో పెట్టిన పెట్టుబడిని వదిలేయాలని, విదేశాల్లో చదువుకునేందుకు నాయుడుకిచ్చిన రుణం మాఫీ చేయాలని వీలునామాలో తెలిపారు. -
10 వేల కోట్ల ఆస్తి..వీలునామాలో.. బయటపడ్డ షాకింగ్ సీక్రెట్
-
రతన్ టాటా వీలునామా.. పెంపుడు శునకం ‘టిటో’కు వాటా!
రతన్ టాటా మూగజీవాలపై ఎంత ప్రేమ చూపించేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన చివరి శ్వాస వరకూ తన పెంపుడు జంతువుల సంరక్షణకు శ్రద్ధ చూపిన రతన్ టాటా తన మరణం తర్వాత కూడా వాటి సంరక్షణకు లోటు రాకుండా ఏర్పాట్లు చేశారు.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. రతన్ టాటా రాసిన రూ.10,000 కోట్ల వీలునామాలో తన పెంపుడు జర్మన్ షెపర్డ్ శునకం ‘టిటో’ను చేర్చారు. ఈ శునకానికి "అపరిమిత" సంరక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించినట్లు సమాచారం. ఐదారేళ్ల క్రితం ఇదే పేరుతో ఇంతకు ముందున్న శునకం చనిపోయిన తర్వాత ఇప్పుడున్న ‘టిటో’ను ఆయన తెచ్చుకుని సంరక్షణ బాధ్యతలు చూసేవారు.రతన్ టాటా దగ్గర చాలా ఏళ్లుగా వంటమనిషిగా పని చేస్తున్న రాజన్ షా ఇకపై ‘టిటో’ సంరక్షణ బాధ్యతలు చూసుకుంటారు. నివేదిక ప్రకారం.. టాటాతో మూడు దశాబ్ధాలుగా ఉంటున్న పనిమనిషి సుబ్బయ్యకు సంబంధించిన నిబంధనలను కూడా వీలునామాలో చేర్చారు.రూ. 10,000 కోట్లకు పైగా ఉన్న రతన్ టాటా ఆస్తులలో అలీబాగ్‌లోని 2,000 చదరపు అడుగుల బీచ్ బంగ్లా, ముంబైలోని జుహు తారా రోడ్‌లోని 2-అంతస్తుల ఇల్లు, రూ. 350 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు, టాటా సన్స్‌లో 0.83% వాటా ఉన్నాయి. దీన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ (RTEF)కి బదిలీ చేయనున్నారు. -
టాటా ట్రస్టుల కీలక నిర్ణయం!
రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్టుల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘మింట్’ కథనం ప్రకారం.. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌లలో నిర్ధిష్ట-కాల పరిమితి నియామకాల వ్యవస్థకు ముగింపు పలికారు. అంటే ట్రస్టీలు శాశ్వత సభ్యులుగా మారుతారు.గురువారం జరిగిన రెండు ట్రస్టుల బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తా నివేదిక పేర్కొంది. ఈ మార్పు తర్వాత ఇకపై బోర్డు సభ్యులు తామంతట తాము రాజీనామా చేసేంత వరకు కొనసాగుతారు. అదే సమయంలో కొత్త సభ్యుల నియామకానికి ఇకపై బోర్డు ఏకగ్రీవ సమ్మతి కావాల్సి ఉంటుంది. అక్టోబర్ 11న టాటా ట్రస్ట్‌లకు అధిపతిగా నోయెల్ టాటా నియమితులైన తర్వాత ట్రస్టులు నిర్వహించిన రెండో బోర్డు సమావేశం ఇది.ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?రెండు ట్రస్టులు సమిష్టిగా టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో సగానికి పైగా వాటాలను కలిగి ఉన్నాయి. టాటా గ్రూప్ తరఫున అన్ని దాతృత్వ కార్యకలాపాలను ఈ రెండు ట్రస్టుల ద్వారానే నిర్వహిస్తున్నారు. నివేదిక ప్రకారం.. టాటా సన్స్‌లో సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు 27.98 శాతం, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 23.56 శాతం వాటాలు ఉన్నాయి. -
భారత రత్న ఇవ్వాల్సిన మనిషి
ఇటీవల మరణించిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’కు అన్ని విధాలుగా అర్హుడు. ఆయన సమర్థుడైన వ్యాపారవేత్త. దార్శనిక దృక్పథమున్న పారిశ్రామివేత్త మాత్రమే కాదు... మనుషుల పట్ల సహానుభూతి, ఆప్యాయతలు కలిగిన మంచి మనిషి. రతన్ టాటాను చాలామంది కేవలం ఆరాధించలేదు; హీరోగా భావించారు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. మరణానంతరమైనా ఆయనకు భారత రత్న ఇవ్వడం ద్వారా మనల్ని మనం గౌరవించుకునే పని మొదలు కావాలి. వేర్వేరు రంగాల్లో అర్హులైన వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లకూ ఈ పుర స్కారం దక్కి ఉంటే బాగుండేది. భారత రత్న విషయంలో రాజకీయ అనుకూలతల కంటే, అర్హతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ‘భారత రత్న’కు అన్ని విధాలుగా అర్హుడే. అయితే బతికున్న రోజుల్లోనే అవార్డు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇటీవలే రతన్ టాటా మరణించిన నేపథ్యంలో మరణానంతరం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇస్తారా?మరణానంతరమైనా సరే... రతన్ టాటాకు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలి అనేందుకు బోలెడు కారణాలు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి, ఆయన సమర్థుడైన వ్యాపారవేత్త. దార్శనిక దృక్ప థమున్న పారిశ్రామివేత్త కూడా. మనుషుల పట్ల సహానుభూతి, ఆప్యాయతలు కలిగిన మంచి మనిషి. అయితే ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్లు చాలామందే ఉన్నారు. టాటాను వీరందరి నుంచి వేరు చేసే లక్షణం ఏదైనా ఉందీ అంటే... అది ఆయన అందరి నుండి పొందిన గౌరవం, మర్యాద, మన్ననలు. రతన్ టాటాను చాలా మంది కేవలం ఆరాధించలేదు; హీరోగా భావించారు. ఒకరకంగా చెప్పాలంటే పూజించారు అనాలి! ఇలాంటి వాళ్లు కొందరే కొందరు ఉంటారు. వారిలో రతన్ టాటా ఒకరు!రెండో విషయం... మనం ఆదర్శంగా భావించే వ్యక్తికి లభించే గుర్తింపు కూడా ఆ స్థాయిలోనే ఉండాలని ఆశిస్తాం. ఎందుకంటే వీళ్లు కేవలం సాధకులు మాత్రమే కాదు... చాలా ప్రత్యేకమైన వాళ్లు. అందుకే దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం అలాంటి వారికి దక్కడం ఎంతైనా ఆహ్వానించదగ్గ విషయం.దేశంలో ఇప్పటివరకూ 53 మందికి భారత రత్న పురస్కారం లభించింది. టాటా వీరందరిలోనూ ఉన్నతుడిగానే నిలుస్తారు. బి.సి. రాయ్, పి.డి. టండన్ , కె. కామరాజ్, వి.వి. గిరి, ఎం.జి. రామచంద్రన్ , రాజీవ్ గాంధీ, అరుణా అసఫ్ అలీ, గుల్జారీలాల్ నందా, గోపీనాథ్ బోర్డోలోయి, కర్పూరీ ఠాకూర్, చౌధురీ చరణ్‌సింగ్... లాంటి రాజకీయ నాయకుల విషయంలో అది నిజం కాదా?ఇంకోలా చెబుతాను. మదర్ థెరీసా, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, అమర్త్య సేన్ , పండిట్ రవిశంకర్, లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్ , భీమ్సేన్ జోషీ, సచిన్ టెండూల్కర్... అందరూ భారత రత్నకు అర్హుల నుకుంటే, రతన్ టాటాకు ఎలా కాదనగలం?వాస్తవం ఏమిటంటే... ఈ అవార్డు ఇచ్చేది రాజకీయ నాయకులు. వాళ్లు ఎక్కువగా రాజకీయ నాయకులకే ఇస్తూంటారు. ఇప్పటివరకూ అందుకున్న 53 మందిలో 18 మంది మాత్రమే ఇతర రంగాల్లో అత్యు న్నత ప్రతిభను కనబరిచినవారు. 1954 నుంచి తొలిసారిగా భారత రత్న పురస్కారం ప్రదానం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఒకే ఒక్క పారిశ్రామిక వేత్త, అత్యంత అర్హుడైన జేఆర్డీ టాటాకు మాత్రమే ఆ అవార్డు దక్కింది. అంతే!వేర్వేరు రంగాల్లో అర్హులైన వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లకూ ఈ పురస్కారం దక్కి ఉంటే బాగుండేదని నేను అనుకుంటూంటాను. బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్, అమితాబ్ బచ్చన్ , ఫీల్డ్ మార్షల్ మానెక్‌శా, సల్మాన్ రుష్దీ, జూబిన్ మెహతా వంటి వాళ్లు ఒక్కొక్కరూ తమ వైయక్తిక ప్రతిభతో ఆ యా రంగాల్లో అత్యున్నత శిఖరాలను అందుకున్న వారే. ప్రపంచం వీరి ప్రతిభను గుర్తించింది, కీర్తించింది. దురదృష్టవశాత్తూ మనం ఆ పని చేయలేకపోయాం.ఇప్పటికీ సమయం మించిపోలేదు. రతన్ టాటాకు భారత రత్న ఇవ్వడం ద్వారా మనల్ని మనం గౌరవించుకునే పని మొదలు కావాలి. బి.ఆర్.అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, అబుల్ కలావ్‌ు ఆజాద్, మదన్ మోహన్ మాలవీయా వంటి వారికి మరణానంతరం దశాబ్దాల తరువాత భారత రత్న ఇవ్వగలిగినప్పుడు... 2008లో మరణించిన ఫీల్డ్ మార్షల్ మానెక్శాకు, 2021లోనే కన్ను మూసిన దిలీప్‌కుమార్‌తోపాటు మనతోనే ఉన్న అమితాబ్ బచ్చన్,సల్మాన్ రుష్దీ, జూబిన్ మెహతా వంటి వారిని భారత రత్నతో సత్కరించడం సాధ్యమే! అయితే ఇక్కడ మనం ఇంకో నిష్ఠుర సత్యాన్ని అర్థం చేసు కోవాలి. భారత రత్న విషయంలో రాజకీయ అనుకూలతల కంటే అర్హతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పేర్లు అవసరం లేదు. వారి భేషజాలను దెబ్బతీయాలన్న ఆలోచన కూడా నాకు లేదు. కానీ, వారందరూ రాజకీయ నేతలే. జవహర్లాల్ నెహ్రూతో మొదలుపెట్టి... నరేంద్ర మోదీ వరకూ అన్ని ప్రభుత్వాలూ ఈ పని చేశాయి.విషాదం ఏమిటంటే... మనం తరచూ కొంతమంది అనర్హులకు భారత రత్న ఇచ్చాం. ఇంకోలా చెప్పాలంటే అర్హులకు నిరాకరించాం. ఎలాగైతేనేం, ఆ అవార్డు గౌరవమైతే మసకబారింది. అర్హులకు ఇవ్వలేదు, అనర్హులకు ఇచ్చారన్న వాదాన్ని కాసేపు పక్కనపెట్టి... జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సమయం ఇదే. దేశమాత అసలు ఆణిముత్యాలను ప్రజలెప్పుడూ గుర్తుంచుకుంటారు. సందేహం ఏమీ లేదు. రతన్ టాటా అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది సామాన్యులు ఈ విషయాన్ని మరోసారి నిర్ధ్ధరించారు. వార్తాపత్రికల్లో పేజీలకు పేజీ కథనాలు, టెలివిజన్ ఛానళ్లలో గంటల లైవ్ కవరేజీలన్నీ రతన్ టాటాపై ఈ దేశ ప్రజలకు ఉన్న అభిమానాన్ని చాటేవే! ఎవరూ కాదనలేని సత్యమిది. అలాగని రాజ్యం ఆయనను గుర్తించదంటే మాత్రం సరికాదు. నన్నడిగితే అలా చేయడం క్షమించలేనిది.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటా: ఎందుకంటే..
రతన్ టాటా తన 86వ ఏట అక్టోబర్ 9న ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనేక గొప్ప విజయాలు, దాతృత్వ కార్యక్రమాలతో నిండిన ఈయన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శప్రాయం. టాటా స్టీల్ కంపెనీ కోసం ఒక అమెరికన్ సంస్థలో జాబ్ ఆఫర్‌ను సైతం రతన్ టాటా అవలీలగా వదులుకున్న సంగతి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా చూసేద్దాం..ఐబీఎమ్ కంపెనీ ఆఫర్1961లో రతన్ టాటాకు అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అయిన 'ఐబీఎమ్' నుంచి జాబ్ వచ్చింది. తన ప్రతిభను వేరొక కంపెనీ వృద్ధికి ఉపయోగించడానికి రతన్ టాటా మనసు ఒప్పుకోలేదు. ఐబీఎమ్ కంపెనీలో వచ్చిన ఆఫర్ వదులుకుని టాటా స్టీల్‌కు నాయకత్వం వహించారు. ఈయన నాయకత్వంలో కంపెనీ అపారమైన వృద్ధి సాధించగలిగింది.ఉక్కు ఉత్పత్తికి వెన్నెముకగా టాటా స్టీల్దశాబ్దాల చరిత్ర కలిగిన టాటా స్టీల్ కంపెనీను జంషెడ్జీ టాటా 1907లో ప్రారంభించారు. ఇదే భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ స్టీల్ కంపెనీగా అవతరించింది. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు, ఆ తరువాత ఈ సంస్థ పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషించింది. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో అభివృద్ధి పనుల కోసం దేశానికి ఉక్కు చాలా అవసరం అయినప్పుడు, టాటా స్టీల్ దేశాభివృద్ధికి భుజం భుజం కలిపి నిలబడింది. ఈ కంపెనీ దేశ ఉక్కు ఉత్పత్తికి వెన్నెముకగా నిలిచింది.ప్రస్తుతం టాటా స్టీల్ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీ షేరు ప్రస్తుత విలువ రూ.159. అయితే రతన్ టాటా జాబ్ ఆఫర్ వద్దనుకున్న కంపెనీ.. ఐబీఎమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 18 లక్షల కోట్లుగా ఉంది. ఇది టాటా స్టీల్ కంటే దాదాపు తొమ్మిది రెట్లు పెద్దది.ఇదీ చదవండి: వీటిపై జీఎస్టీ తగ్గింపు.. భారీగా తగ్గనున్న ధరలుటాటా స్టీల్‌తో రతన్ టాటా సంబంధం చాలా ప్రత్యేకమైనది. ఈ కంపెనీ ఆయన కెరీర్‌ను ప్రారంభించడమే కాకుండా.. నాయకత్వ నైపుణ్యాలు, వ్యాపార నిర్వహణ వంటి విలువైన పాఠాలను కూడా నేర్పింది. టాటా స్టీల్ భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. దేశాభివృద్ధికి మాత్రమే.. సమాజ శ్రేయస్సును మెరుగుపరచడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. -
‘ఆయన దేవుడు’ వీరాభిమాని గుండెలపై శాశ్వతంగా రతన్ టాటా
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్తమయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని దుఃఖసాగరంలో ముంచేసింది. పారిశ్రామిక వేత్తగానే కాకుండా, ప్రముఖ దాతగా మానవతావాదిగా నిలిచిన ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ అభిమానులు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. అయితే ఈ విషయంలో మరో అడుగు ముందు కేశాడు రతన్ టాటా అభిమాని ఒకరు. ఏకంగా ఆయన టాటూను గుండెలపై ముద్రించుకుని అపారమైన ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విశేషంగా మారింది.రతన్ టటా ఫొటోను ఒక అభిమాని గుండెపై టాటూగా ముద్రించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను టాటూ ఆర్టిస్ట్ మహేష్ చవాన్, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను నెటిజనులను ఆకట్టుకుంటోంది. రతన్ టాటాను తమ దేవుడిగా భావిస్తున్నట్లు వీడియోలో ఆ యువకుడు తెలిపాడు. ఈ సందర్భంగా హృదయాన్ని హత్తుకునే ఒక విషయాన్ని కూడా వెల్లడించాడు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన స్నేహితడు వైద్యం కోసం ఎంతో కష్టపడ్డాడని ఆ సమయంలో టాటా ట్రస్ట్ ఆదుకుని, వైద్యం అందించి అతడి ప్రాణాలను కాపాడిందని గుర్తు చేసుకున్నాడు. అందుకే తాను రతన్ టాటా ఫొటోను గుండెలపై టాటూ వేయించుకున్నానని తెలిపాడు.దీంతో ‘‘దేశం ఒక తన రతన్ (రత్నం)ని కోల్పోయింది అని ఒకరు, నిజంగానే ఆయన చాలా గ్రేట్, నిజమైన కోహినూర్‌ను కోల్పోయాం’’ అంటూ నెటిజన్లు ఆయనకు నివాళి అర్పించారు. ఈ వీడియో లక్షలకొద్దీ లైక్స్‌ను 80 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది. కాగా గతవారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో 86 ఏళ్ల రతన్ టాటా కన్నుమూశారు. భారతీయ వ్యాపారరంగంలో ఒక శకం ముగిసింది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇంకా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Mahesh Chavan (@themustache_tattoo) -
గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా.. రతన్ టాటాకు అంబానీ ఫ్యామిలీ నివాళి
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక దీపావళి విందులో 'రతన్ టాటా'కు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ, వేలాది మంది ఉద్యోగులు నివాళులర్పించారు. నీతా అంబానీ 'గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా' అని రతన్ టాటాను కొనియాడారు. దూరదృష్టి కలిగిన పారిశ్రామికవేత్త, పరోపకారి, ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి అని అన్నారు.దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా.. మా మామయ్య ధీరూభాయ్ అంబానీకి, నా భర్త ముకేశ్ అంబానీకి, మా కుటుంబానికి మంచి స్నేహితులు. ఆకాష్ అంబానీకి మార్గదర్శి అని నీతా అంబానీ అన్నారు. మహనీయుడు రతన్ టాటాకు నివాళిగా అందరూ మౌనం పాటించాలని పేర్కొన్నారు. ఈ సమయంలో ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. -
రతన్ టాటా శునకం ‘గోవా’పై అసత్య ప్రచారం
ఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, స్వర్గీయ టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86)మరణం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. కొద్ది రోజుల కిందట అనారోగ్యం వార్తలపై స్పందించిన ఆయన.. బాగున్నానంటూ పోస్టు పెట్టారు. అయితే, గత బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికీ రతన్ టాటా మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.ఈ నేపథ్యంలో ‘రతన్ టాటా మరణాన్ని తట్టుకోలేక ఆయన పెంపుడు శునకం ‘గోవా’ చనిపోయింది. అందుకే మనుషుల కంటే మూగు జీవాలే నయం అంటూ’ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ముంబై యానిమల్ హీరోగా ప్రశంసలందుకుంటున్న సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుడాల్కర్ అప్రమత్తమయ్యారు. శునకం గోవా మరణంపై వాట్సప్‌లో జరుగుతున్న ప్రచారంపై టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడైన అసిస్టెంట్‌గా వ్యవహరించిన శంతను నాయుడుతో సంప్రదింపులు జరిపారు. శంతను సైతం శునం గోవా క్షేమంగా ఉందని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారని ఎస్సై సుధీర్ కుడాల్కర్ తెలిపారు. శునకం గోవాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు. ముంబై యానిమల్ హీరో ఎస్సై సుధీర్ కుడాల్కర్బోరివలిలోని ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సుధీర్ కుడాల్కర్ జంతు ప్రేమికుడు. ఓ వైపు పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ .. మరోవైపు స్టేషన్‌తో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో శునకాలు, పిల్లులకు క్రమం తప్పకుండా ఆహారంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. జంతువుల పట్ల ఆయనకున్న పట్ల ప్రేమ, కరుణపై జంతు హక్కుల ఉద్యమ సంస్థ ‘పెటా’ గుర్తింపు తెచ్చి పెట్టింది.👉చదవండి : ఒక టాటా.. ఒక గోవా! -
Ratan TATA: డాలస్‌లో రతన్ టాటాకు ఘన నివాళి
డాలస్, టెక్సాస్: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన ప్రవాస భారతీయులు. రతన్ టాటా దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త అని, ఆయన మరణం తీరనిలోటని మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన టి.సి.ఎస్ లో రతన్ టాటాతో కలసి పనిచేసి, ఆ తర్వాత విప్రో సంస్థలోచేరి సీఈఓ స్థాయికి ఎదిగిన అబిద్ఆలీ నీముచ్ వాలా రతన్ టాటాకున్న దూరదృష్టి, సాటి ఉద్యోగులతో కలసి పనిచేసిన తీరు, హాస్యపూర్వక సంభాషణలు, టాటా కంపెనీని అభివృద్ధిపధంలో నడిపినతీరు మొదలైన ఎన్నో వివరాలను సోదాహరణంగా వివరించి రతన్ టాటాకు శ్రద్ధాంజలి ఘటించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “రతన్ టాటా కంపెనీ ఛైర్మన్ గా తన రెండు దశాబ్దాలకు పైగా సాగిన ప్రస్థానంలో కేవలం భారతీయకంపెనీగా ఉన్న టాటా కంపెనీని అంతర్జాతీయకంపెనీ స్థాయికి తీసుకువెళ్ళిన తీరు, కంపెనీ లాభాలను 50 రెట్లు పెంచిన విధానం, లాభాలలో 60 శాతానికి పైగా సమాజాభివృద్ధికి వెచ్చించిన సామాజికస్పృహ అందరికీ ఆదర్శప్రాయం” అంటూ పుష్పాంజలి ఘటించారు. రతన్ టాటా ప్రతి అడుగులోనూ దేశభక్తి కొట్టొచ్చినట్లు కన్పిస్తుందని, భౌతికంగా రతన్ టాటా మనకు దూరం అయినప్పటికీ ఆయనచేసిన సేవలు చిరస్మరణీయం అంటూ మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు రాజీవ్ కామత్, మురళీ వెన్నం, రన్నా జానీ, రజనీ జానీ, రాంకీ చేబ్రోలు, తాయాబ్ కుండావాలా, ఫాతిమా కుండావాల, తిరుమల్ రెడ్డి కుంభం, సతీష్ బండారు, చినసత్యం వీర్నపు, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, లెనిన్ వేముల, విజయ్ బొర్రా, వాసు గూడవల్లి, జిగర్ సోనీ, రాజేశ్వరి ఉదయగిరి, కిశోర్, షోవిన్ మొదలైనవారు రతన్ టాటా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. -
'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'
భారత దేశ పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, పరోపకారి 'రతన్ టాటా' ఇటీవలే కన్నుమూశారు. ఈయన మరణం ప్రతి ఒక్కరినీ బాధించింది. తాజాగా టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ లింక్డ్ఇన్లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.రతన్ టాటాతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయనను కలిసిన ప్రతి ఒక్కరూ భారతదేశం పట్ల అతని దయ, ఆప్యాయతను తప్పకుండా తెలుసుకుంటారు. ప్రారంభంలో వ్యాపార అంశాలను గురించి ప్రారంభమైన మా పరిచయం.. కొంతకాలానికి వ్యక్తిగత పరిచయంగా మారిపోయింది. కార్లు, హోటల్స్ గురించి చర్చ ప్రారంభమైనప్పటికీ.. ఆ తరువాత ఇతర విషయాల గురించి చర్చించేవాళ్ళం. అయితే రతన్ టాటా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించేవారు.2017లో టాటా మోటార్స్, దాని ఎంప్లాయీస్ యూనియన్ మధ్య చాలా కాలంగా ఉన్న వేతన వివాదం పరిష్కరించే సమయంలో చంద్రశేఖరన్ కూడా పాల్గొన్నట్లు వెల్లడించారు. సమస్యలను పరిష్కరించడంలో జరిగిన ఆలస్యానికి చింతిస్తూ.. దానిని వెంటనే పరిష్కరించనున్నట్లు రతన్ టాటా హామీ ఇచ్చారు. ఉద్యోగుల కుటుంబ శ్రేయస్సు గురించి కూడా ఆయన ఆలోచించేవారని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బాంబే హౌస్ పునరుద్దరణ అంశం గురించి కూడా చంద్రశేఖరన్ ప్రస్తావించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ భవనానికి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఇందులోని ప్రతి వస్తువును దగ్గరలో ఉండే కార్యాలయానికి తరలిస్తామని రతన్ టాటాతో చెప్పాము. అప్పుడు అక్కడున్న కుక్కల పరిస్థితిపై ఆరా తీశారు. వాటికోసం కెన్నెల్ తయారు చేస్తామని చెప్పాము. ఆ తరువాత రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది.బాంబే హౌస్ రేనోవేషన్ పూర్తయిన తరువాత నేను మొదటి కెన్నెల్ చూస్తానని రతన్ టాటా చెప్పారు. ఆ తరువాత కుక్కల కోసం కెన్నెల్ తయారు చేశాము. రతన్ టాటా ఎంతగానో సంతోషించారు. ఇలా ఎప్పుడూ కుక్కల శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ ఉండేవారని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: మస్క్.. టికెట్ ఎక్కడ కొనాలి?: ఆనంద్ మహీంద్రారతన్ టాటాకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఏదైనా ప్రదేశాన్ని సందర్శిస్తే.. ఏళ్ళు గడిచినా అక్కడున్న ప్రతిదాన్ని గుర్తుంచుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే రతన్ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఇప్పుడు లేరు అన్న విషయం జీర్ణించుకోలేని అంశం. కానీ పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగటానికి ప్రయత్నిస్తున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. -
11 వేల వజ్రాలతో రతన్ టాటా చిత్రం
సూరత్: రతన్ టాటా తన 86వ ఏట ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మన దేశానికి అమూల్యమైన రత్నం మాదిరిగా నిలిచిన రతన్ టాటాకు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఒక వ్యాపారి వజ్రాలతో రతన్ టాటాకు నివాళులు అర్పించారు.ఉన్నత వ్యక్తిత్వం కలిగిన రతన్ టాటాను దేశంలోని ఏ ఒక్కరూ మరచిపోలేరు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి విపుల్భాయ్ 11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం రూపకల్పనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వతహాగా కళాకారుడైన విపుల్.. రతన్ టాటా చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అమెరికన్ డైమండ్స్ వినియోగించారు. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో పలువురు షేర్ చేస్తున్నారు. सूरत में एक व्यापारी ने 11000 अमेरिकन डायमंड की मदद से बनाया रतन टाटा जी का डायमंड पोट्रेट💎 pic.twitter.com/2Q8QMJJfwy— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) October 12, 2024ఇది కూడా చదవండి: డెంగ్యూకు టీకా.. బీహార్‌లో తుది ట్రయల్స్ -
టీసీఎస్.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. తనకు, దివంగత రతన్ టాటాకు మధ్య 2004లో జరిగిన ఆసక్తికరమైన సంఘటన గుర్తు చేసుకున్నారు. ఇన్ఫోసిస్‌లో జంషెడ్జీ టాటా రూమ్‌ను ప్రారంభించేందుకు ఇన్ఫోసిస్ ఆహ్వానించినప్పుడు రతన్ టాటా ఆశ్చర్యపోయారని మూర్తి చెప్పారు.ఇన్ఫోసిస్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పోటీదారుగా ఉన్నప్పటికీ తనను ఎందుకు ఆహ్వానించారని రతన్ టాటా అడిగారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రతన్ టాటా టీసీఎస్ సంస్థకు నాయకత్వం వహించేశారు. టాటా సందేహానికి మూర్తి మర్యాదపూర్వకంగా బదులిస్తూ, జంషెడ్జీ టాటా కంపెనీలకు అతీతమైనవారని, గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌కు టాటా గ్రూప్‌ను పోటీదారుగా తాను ఎన్నడూ భావించలేదని, రతన్ టాటా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందున రూమ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించామని రతన్ టాటాకు చెప్పారు.ఇదీ చదవండి: రతన్ టాటా మళ్లీ బతికొస్తే..తర్వాత టాటా ఆహ్వానాన్ని మన్నించారని, ఈ కార్యక్రమం తనకు జ్ఞాపకంగా మారిందని నారాయణమూర్తి పేర్కొన్నారు. రతన్ టాటాకు కాస్త సిగ్గుపడే స్వభావం ఉందని, దీంతో అప్పడు సుదీర్ఘ ప్రసంగం చేసే మూడ్‌లో లేరని చెప్పుకొచ్చారు. అయితే రతన్ టాటా పర్యటన తమ టీమ్‌పై చాలా ప్రభావం చూపిందని, ఇన్ఫోసిస్ సిబ్బందితో సమయం గడిపారని మూర్తి గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా వినయం, దయ, దేశభక్తి ఉన్న గొప్ప వ్యక్తి అని నారాయణమూర్తి కొనియాడారు. -
రతన్ టాటా మళ్లీ బతికొస్తే..!
రతన టాటాను ఒక పారిశ్రామికవేత్తగా కంటే కూడా ఒక గొప్ప మానవతావాదిగా, అనుక్షణం దేశ శ్రేయస్సు కోసం కాంక్షించిన వ్యక్తిగా అందరూ గుర్తుంచుకుంటారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ లోకాన్ని విడిచి మనందరికీ దూరమయ్యారు. ఆయన మళ్లీ బతికొస్తే బావుండు అని అనుకోనివారుండరు.అలా భావించిన ఒక వ్యక్తి రతన్ టాటాపై ఏఐ సహాయంతో ఓ అద్భుతమైన వీడియో రూపొందించారు. తన సారథ్యంలోని టాటా గ్రూపు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో దేశ ప్రజల శ్రేయస్సు గురించే రతన్ టాటా ఆలోచించేవారు. అలా ఆయన అభివృద్ధి చేసిన పలు వ్యాపారాలను గుర్తు చేస్తున్నట్టుగా రతన్ టాటా ఈ వీడియోలో కనిపించారు.రతన్ టాటా దూరమయ్యారని దేశమంతా బాధాతప్తులైన వేళ టాటా మళ్లీ బతికొచ్చి ‘చింతించకండి.. నేను లేకపోయినా నా జ్ఞాపకాలు మీతోనే ఉంటాయి‘ అని అంటున్న విధంగా రూపొందించిన ఈ ఏఐ వీడియో సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.Best use of ‘AI’ ❤️ pic.twitter.com/FLreHPZr0I— Yash Gowda (@yash_gowdaa) October 11, 2024 -
గాల్లో ఎగిరిన ‘టాటా సుమో’.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..
తెలుగు ఫ్యాక్షన్ సినిమాలో కార్లు గాల్లో ఎగరడం చూసుంటాం కదా. హీరో ఒక విజిల్ వేసినా లేదా తొడ కొట్టినా అప్పటి సినిమాల్లో ‘టాటా సుమో’లు గాల్లో ఎగిరిన సన్నివేశాలు కోకొల్లలు. ఆ సీన్లతో మాస్ ప్రేక్షకులను ఆకర్షించిన దర్శకులు ఎందరో ఉన్నారు. అయితే అప్పట్లో టాటా అంటే వెంటనే గుర్తొచ్చేది టాటా సుమో.. అంతలా ప్రజాదరణ పొందిందీ కారు. అప్పట్లో కారంటే విలాసం. ఇప్పుడు అవసరం. అనతికాలంలోనే మూడేళ్లలో లక్షకుపైగా ఈ కార్లు అమ్ముడయ్యాయి. అసలు ఆ కారుకు సుమో అని ఎందుకు పేరు పెట్టారో తెలుసుకుందాం.‘సుమో’ అంటే ఇదేదో జపనీస్ రెజ్లర్ల పేరులా ఉందని చాలామంది భావిస్తారు. కానీ దీని పేరు వెనక పెద్ద కథే ఉంది. టాటా సుమో తయారీ యూనిట్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సాధారణంగా ప్రతి రోజు అందరూ కలిసి భోజనం చేసే వారు. కానీ ఆ సంస్థ ఎండీ మోల్గావ్కర్ మాత్రం రోజూ ఏదో ఒక సాకు చెప్పి బయటకు వెళ్లేవారు. కొన్ని గంటల తర్వాత తిరిగి ఆఫీస్‌కు వచ్చేవారు. ఆ తర్వాత రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్‌తో సమావేశమయ్యేవారు.నిత్యం అలా ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్తున్న మోల్గావ్కర్ను ఒకరోజు టీమ్‌లోని ఎగ్జిక్యూటివ్ సిబ్బంది ఫాలో అయ్యారు. మోల్గావ్కర్ తమ ఆఫీస్ సమీపంలోని ట్రక్కు డ్రైవర్ల వద్దకు వెళ్లడం గమనించారు. వారితో కలిసి ఆయన భోజనం చేయడం చూశారు. టాటా వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకునేవారు. తిరిగి ఆఫీస్‌కు వచ్చాక ఈ సమస్యలను ఆర్ అండ్ డీ టీమ్‌తో కలిసి చర్చించి అందుకు పరిష్కారాన్ని కనిపెట్టేవారు. ఆ సమస్యలు టాటా సుమో తయారీలో పునరావృతం కాకుండా జాగ్రత్తపడేవారు.ఇదీ చదవండి: టోల్ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!మోల్గావ్కర్ నిత్యం రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బృందానికి అవసరమైన ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా టాటా మోటార్స్ అభివృద్దికి ఆయన ఎంతో కృషి చేశారు. దాంతో టాటా యాజమాన్యం ఆయన పేరు మీద ఐకానిక్ కారును లాంచ్ చేయాలని నిర్ణయించింది. మోల్గావ్వర్ అసలు పేరు..సు-మంత్ మో-ల్గావ్కర్. తన పేరు మొదటి అక్షరాలతో ‘టాటా సుమో’ను లాంచ్ చేశారు. టాటా సంస్థలో కష్టపడిన వారికి ఎలాంటి స్థానం కల్పించారో ఈ సంఘటనతో అర్థం చేసుకోవచ్చు. -
టాటాకు సంతాపం తెలుపుతూ ట్వీట్.. కాసేపటికే డిలిట్!
రతన్ టాటా మృతిపట్ల సంతాపం తెలుపుతూ పేటీఎం సీఈఓ విజయ్‌శేఖర్ శర్మ చేసిన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు. టాటా మరణవార్త విని పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. పేటీఎం సీఈఓ విజయ్‌శేఖర్ శర్మ తన ఎక్స్ ఖాతా ద్వారా టాటాకు సంతాపం ప్రకటించారు. అయితే తన ట్వీట్లోని చివరి లైన్లపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవడంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు.‘భవిష్యత్తు తరం వ్యాపారులు టాటా ఇచ్చే సలహాలు, సూచనలను మిస్ అవుతారు. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్ టాటా. సెల్యూట్ సర్.. ఓకే టాటా బైబై’ అని విజయ్‌శేఖర్ శర్మ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ చివరి లైన్ ‘ఓకే టాటా బైబై’పై నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో కాసేపటికే శర్మ ఆ పోస్ట్‌ను తొలగించారు.wtf is the last line pic.twitter.com/dOrIeMQH7c— Shivam Sourav Jha (@ShivamSouravJha) October 10, 2024ఇదీ చదవండి: టోల్ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!రతన్ టాటా మరణ వార్త తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, టీవీఎస్ మోటార్స్ గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఆర్పీఎస్జీ గ్రూప్ చైర్మన్, సంజీవ్ గోయెంకా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, కుమారమంగళం బిర్లా, హిందుజా గ్రూప్ చైర్మన్. జీపీ హిందుజా, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (ఇండిగో) ఎండీ రాహుల్ భాటియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ ఉన్సూకిమ్..వంటి ఎందరో ప్రముఖులు నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. -
నేనూ టాటా ‘ఉప్పు’ తిన్నా!
సాక్షి, హైదరాబాద్: టాటా ‘ఉప్పు’ తిన్న ప్రముఖుల్లో రాష్ట్ర అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేష్ మురళీధర్ భగవత్ కూడా ఉన్నారు. అదెలా అనే అంశాన్ని ఆయన శుక్రవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన భగవత్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం పుణెలోని టాటా మోటార్స్‌లో 1993–94లలో ఉద్యోగిగా పని చేశారు. ఆ తర్వాత 1995లో ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉద్యోగిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రతన్ టాటాను కలిసే అవకాశం మహేష్ భగవత్‌కు రాలేదు. అయితే.. టాటా ఏరోస్పేస్ సెంటర్‌ను ప్రారంభించడానికి 2018లో టాటా ఆదిభట్లకు వచ్చారు. ఆ సమయంలో మహేష్ భగవత్ రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదిభట్ల రాచకొండ పరి«ధిలోకే రావడంతో తన విధి నిర్వహణలో భాగంగా ప్రారం¿ోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ రతన్ టాటాను కలిసిన మహేష్ భగవత్ వాణిజ్య ప్రకటనను ఉటంకిస్తూ ‘హమ్నే భీ టాటా కా నమక్ ఖాయా హై’ (నేను కూడా టాటా ఉప్పు తిన్నాను.. వారిచి్చన జీతం) అంటూ వ్యాఖ్యానించారు. అదేంటని టాటా ఆరా తీయగా... అసలు విషయం ఆయనకు వివరించారు. దీంతో నవ్వుతూ భగవత్ భుజం తట్టిన రతన్ టాటా.. ఇప్పుడు నాకు భద్రత కల్పిస్తున్నావు అని పేర్కొన్నారని మహేష్ భగవత్ తెలిపారు. -
లేవద్దు.. ఇది నీ సింహాసనం!
ఈ ఫొటోలో కూర్చుని ఉన్న అమ్మాయి జోయా అగర్వాల్. ఎయిర్ ఇండియా కెప్టెన్. ఆమె పక్కనే నిలబడి ఉన్నది రతన్ టాటా. న్యూయార్క్ నుండి ఢిల్లీ వస్తున్న బోయింగ్ 777 విమానాన్ని అప్పుడు ఆమె నడుపుతున్నారు. అదే ఫ్లయిట్ లో రతన్ టాటా ఉన్నారు. ఫ్లయిట్ ఢిల్లీ లో దిగగానే ఆయనతో ఒక ఫొటో కావాలని అడిగారు జోయా. ఆయన అంగీకరించారు. ఫొటో కోసం ఆమె లేవబోతుంటే ఆయన వారించారు. ‘ఇది నీ సింహాసనం కెప్టెన్. నువ్వు సంపాదించుకున్నది‘ అని అన్నారు. అలా ఆమె కూర్చొని ఉండగా, ఆమె పక్కన ఆయన నిలబడి ఉన్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఈ అపురూపమైన జ్ఞాపకాన్ని జోయా ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. ఆ సంఘటన తనను ఎలా ఇన్స్పైర్ చేసిందో రాశారు. -
సొంత హోటల్లో టాటా చేసిన పనికి ఫిదా!
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఐబీఎస్ సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ వీకే మాథ్యూస్.. టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర సంఘటలను పంచుకున్నారు.రతన్ టాటా వ్యక్తిత్వంలో తనకు బాగా నచ్చేది ఆయన మానవత్వం అని, దీంతోపాటు ఆయనలో హాస్య చతురత కూడా ఉందని మాథ్యూస్ చెప్పారు. రతన్ టాటా ఉన్నారంటే ఎంతటి సీరియస్ వాతావరణాన్ని అయినా తన హాస్యంతో తేలికపరచగలరని పేర్కొన్నారు.తానెవరో తెలియకుండా..“యూఎస్ పర్యటనలో రతన్ టాటాతో కొంత సమయం గడిపే అవకాశం నాకు దొరికింది. ఆ సందర్భంగా జరిగిన రెండు సంఘటనలు నాకు ఎప్పుడూ గుర్తంటాయి” అని వాటి గురించి వెల్లడించారు మాథ్యూస్.ఒక రోజు న్యూయార్క్‌లోని టాటా సొంత హోటల్లో వీరిద్దరూ అల్పాహారం చేశారు. అయితే రతన్ టాటా ఓనర్‌గా తన దర్పం ప్రదర్శించలేదని, అసలు తానెవరో అక్కడి సిబ్బందికి చెప్పలేదని మాథ్యూస్ గుర్తుచేసున్నారు. ఇదే ఆయన నిరాడంబరతకు నిదర్శనమని చెప్పారు.“అదే రోజు తరువాత నేను, నా కుటుంబం మరొక రెస్టారెంట్‌కి వెళ్లగా అక్కడ రతన్ టాటా కనిపించారు. ఆయన బిల్లును స్వయంగా తన క్రెడిట్ కార్డ్‌తో చెల్లించడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. అది ఆయన ఎంత సింపుల్‌గా ఉంటారో తెలియజేసింది” అని మాథ్యూస్ గుర్తుచేసున్నారు.మరో కోణంఇక రతన్ టాటాలో ఉన్న మరో కోణం ఆయన హాస్య చతురత. "తన ట్రేడ్‌మార్క్ హాస్యంతో రతన్ టాటా నన్ను, 'నేను నిన్ను వెంటాడుతున్నానా, లేక నువ్వు నన్ను వెంటాడుతున్నావా?' అన్నారు. ఆ తేలికైన వ్యాఖ్య పరిస్థితితో సంబంధం లేకుండా ఇతరులతో కనెక్ట్ అయ్యే ఆయన స్వభావాన్ని తెలియజేసింది” అని మాథ్యూస్ వివరించారు. -
వారసుడొచ్చాడు.. టాటా ట్రస్ట్ ఛైర్మన్ నియామకం
టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. టాటా సామ్రాజ్యానికి కీలకమైన దాతృత్వ సంస్థలను నిర్వహిస్తున్న టాటా ట్రస్టుకు అధిపతిని నియమించేందుకు శుక్రవారం సభ్యులు సమావేశమయ్యారు. అందులో రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.టాటా స్వచ్ఛంద సంస్థలకు బోర్డు ట్రస్టీగా ఉన్న మెహ్లీ మిస్త్రీ కూడా కీలక పదవిని పొందేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు టాటా ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఉన్న రతన్‌టాటా(86) ఆరోగ్య సమస్యలతో మరణించడంతో తన స్థానంలో తదుపరి ట్రస్ట్ పగ్గాలు చేపట్టేది ఎవరనే చర్చసాగింది. బోర్డు సభ్యులు నోయెల్ టాటాను ఎకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఈ చర్చలకు తెరపడినట్లయింది.రతన్ టాటా వివాహం చేసుకోలేదు. వారసులు లేకపోవడంతో తన సోదరుడు నోయెల్ టాటా ట్రస్ట్ పగ్గాలు చేపట్టాల్సి వచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నవల్ టాటా, సిమోన్ టాటా దంపతులకు 1957లో నోయెల్ టాటా జన్మించారు. అతను ససెక్స్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఫ్రాన్స్‌లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారు. నోయెల్ టాటా గ్రూప్‌లో వివిధ నాయకత్వ హోదాల్లో విధులు నిర్వహించారు.ఇదీ చదవండి: టెస్లా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్ ఆవిష్కరణట్రెంట్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్ వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 2010-2021 మధ్య అతని నాయకత్వంలో ఉన్న టాటా ఇంటర్నేషనల్ ఆదాయాన్ని 500 మిలియన్ డాలర్లు(రూ.4200 కోట్లు) నుంచి మూడు బిలియన్ డాలర్లు(రూ.25 వేలకోట్లు)కు చేర్చారు. 1998లో ట్రెంట్ కంపెనీ ఆధ్వర్యంలో ఒకే రిటైల్ స్టోర్ ఉండేది. దాన్ని దేశంవ్యాప్తంగా వ్యాపింపజేసి 700 స్టోర్లకు పెంచారు. -
టాటా జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం
రతన్ టాటా మరణంపట్ల వ్యాపార, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన నుంచి నేర్చుకున్న విషయాలు, భవిష్యత్తు తరాలు తన జీవితం నుంచి గ్రహించాల్సిన అంశాల గురించి చెప్పారు.చెరగని ముద్రరతన్టాటా మరణం బాధాకరం. అత్యుత్తమ నాయకత్వం, దార్శనికత కలిగిన వ్యాపారవేత్త, దాతృత్వవాదిగా ఆయన సేవలు మన సమాజంపై చెరగని ముద్ర వేశాయి. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆయన ప్రభావితం చేసిన వ్యక్తులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రిఆయన సేవలు అజరామరంరతన్టాటాజీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. గొప్ప జాతీయవాది, దార్శనిక వ్యాపారవేత్త, టాటా గ్రూప్ చైర్‌పర్సన్‌గా తన అసాధారణ విజయాలతో భారత్‌కు గొప్ప పేరు తీసుకొచ్చారు. చివరి శ్వాస వరకు సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మక పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు ఆయన్ను వరించాయి – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి (రోబో కారును ఆవిష్కరించిన టెస్లా)శతాబ్దానికి ఒక్కరు..టాటా ఓ గొప్ప వ్యాపార నాయకుడు. దేశాలు ఇలాంటి నేతలను శతాబ్దానికి ఒక్కరినే పొందుతాయి. టాటా గ్రూపు వృద్ధికి మించి ఆయన అభిరుచి కొనసాగింది. దాతృత్వ కార్యక్రమాల ద్వారా లక్షలాది భారతీయులకు సేవలు అందించారు – వేణు శ్రీనివాసన్, టీవీఎస్ మోటార్స్ గౌరవ చైర్మన్ ఆయన సేవలు అసమానం..ప్రపంచం అచ్చమైన దార్శనికుడు, మానవతావాదిని కోల్పోయింది. వ్యాపారం, సమాజానికి ఆయన అందించిన అసమానమైన సేవలు ఆయన వారసత్వంగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి. – సంజీవ్ గోయెంకా, ఆర్పీఎస్జీ గ్రూప్ చైర్మన్ పరిశ్రమలు, ప్రజా జీవితాలపై ముద్రవ్యాపారాలన్నవి ఆర్థికాభివృద్ధికే కాదు, సామాజిక పురోగతికి ఉ్రత్పేరకాలూ అని నిరూపించారు. ఆయన నిర్ణయాలు ఆర్థిక అంశాలకు మించి పరిశ్రమలు, ప్రజా జీవితాలను ప్రభావితం చేశాయి. ఆయన వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. – కుమారమంగళం బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ (ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటా)ఒక వ్యక్తి కాదు సంస్థరతన్ టాటా భారత్‌కు చెందిన ప్రముఖ, గొప్ప వ్యాపారవేత్తే కాదు, ఆయనొక సంస్థ. టాటాను అంతర్జాతీయంగా విస్తరించడం ద్వారా టాటా వారసత్వంలో ఎన్నో శాశ్వత అధ్యాయాలు లిఖించారు. భారతీయుల్లో ఆయన ఎప్పుడూ జీవించే ఉంటారు. – జీపీ హిందుజా, హిందుజా గ్రూప్ చైర్మన్ఎయిర్ఇండియాతో కలసి నడుస్తాంమిస్టర్ టాటాకు విమానయానం పట్ల ఉన్న ప్రేమ, భారత విమానయాన భవిష్యత్తు పట్ల ఆయన దూరదృష్టికి నివాళిగా, అంతర్జాతీయ విమానయాన రంగంలో భారత్‌కు సముచిత స్థానం కోసం ఎయిర్ ఇండియాతో కలసి నడుస్తాం. – రాహుల్ భాటియా, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (ఇండిగో) ఎండీ ఆయన వారసత్వం శాశ్వతంరతన్ టాటా మరణం పట్ల మేము ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆయన దార్శనిక నాయకత్వం, భారత పరిశ్రమలకు అందించిన సేవలతో ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది. – ఉన్సూకిమ్, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీప్రపంచ శక్తిగా టాటా గ్రూప్‌ను నిలబెట్టారురతన్ టాటా అందించిన నాయక త్వం కార్పొరేట్ బాధ్యత, ఆవిష్కరణలను పునర్నిర్వచించింది. నైతిక విలువలే పునాదిగా టాటా గ్రూప్‌ను ప్రపంచశక్తిగా నిలిపింది. ఆయణ మరణం పట్ల చింతిస్తున ఈ వేళ.. భారత్ నిర్మాణానికి గణనీయంగా దోహదపడిన ఆయన వారసత్వం, విలువలను గౌరవిస్తున్నాం. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ భారత ప్రగతిలో గొప్ప పాత్రభారత ఆర్థిక వ్యవస్థ చరిత్రాత్మకంగా ముందుకు దూసుకుపోతున్న స్థితిలో ఉంది. టాటా జీవితం, పని ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండడంలో గొప్ప పాత్ర పోషించాయి. – ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆధునిక వ్యాపార మార్గదర్శి అసాధారణమైన వ్యాపార, దాతృత్వ వారసత్వాన్ని ఆయన వదిలి వెళ్లారు. భారత్‌లో ఆధునిక వ్యాపారాలకు మార్గదర్శకత్వం, అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం. – సుందర్ పిచాయ్, గూగుల్ సీఈవో(చరిత్ర మరువదు.. మీ ఘనత)భారత స్ఫూర్తి ప్రదాత రతన్ టాటా కేవలం వ్యాపార నాయకుడే కాదు. భారత స్ఫూర్తి, సమగ్రత, కరుణ, గొప్ప మేలు కోసం తిరుగులేని నిబద్ధత మూర్తీ భవించిన నేత – గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ అధినేత రోల్ మోడల్ ప్రియమైన స్నేహితుడిని కోల్పోవడం ఎంతో బాధిస్తోంది. విలువలతో కూడిన నాయకత్వం విషయంలో రతన్‌టాటా నాకు రోల్ మోడల్. నైతిక సమస్యల విషయంలో సందిగ్ధత ఎదుర్కొన్నప్పుడు ఆయన నాకు దిక్సూచిగా నిలిచారు. – నారాయణ మూర్తి, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ ప్రతీ భారతీయుడికి చిహ్నం రతన్‌టాటా మరణంతో భారత పరిశ్రమ తన కిరీటంలో ఆభరణాన్ని మాత్రమే కోల్పోలేదు, ఆయన దార్శనికత మరియు అత్యుత్తమ వ్యక్తిగత లక్షణాలు ప్రతి భారతీయుడికి చిహ్నంగా మారాయి. విలువను సృష్టించడం ఒకరి కోసం కాదు, దేశ పురోగతికి, గొప్ప ప్రయోజనం కోసం అన్న ఆయన ఆచరణ నాకు స్ఫూర్తినిచ్చింది. – అనిల్ అగర్వాల్, వేదాంత చైర్మన్ సమాజానికి తిరిగిచ్చారు.. గౌరవనీయ వ్యాపారవేత్త. సమాజానికి తిరిగిస్తానన్న హామీకి అనుణంగా జీవించారు. యువతరానికి ఆయన స్ఫూర్తి. – ప్రియా అగర్వాల్ హెబ్బర్, హిందుస్థాన్ జింక్ చైర్పర్సన్ చిరకాల ముద్ర.. మిస్టర్ టాటా మరణం ఒక శకానికి ముగింపు. టాటా గ్రూప్ ప్రస్థానంపై చిరకాల ముద్ర వేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. టాటా గ్రూప్, రతన్‌టాటాతో మిస్త్రీ కుటుంబానికి దీర్ఘకాల అనుబంధం ఉంది. – షాపూర్జీ మిస్త్రీ, ఎస్పీ గ్రూప్ చైర్మన్ -
ఐదేళ్లలో ఏయే టాటా షేరు ఎంత పెరిగిందంటే..
టాటా గ్రూప్ విలువను రతన్ టాటా సారథ్య పగ్గాలు చేపట్టిన తర్వాత పరుగు పెట్టించారు. రూ.10 వేలకోట్లుగా ఉన్న సంస్థల విలువను ఏకంగా రూ.30 లక్షల కోట్లకు చేర్చారు. అంతకుమించి ప్రజల్లో తన సేవానిరతితో చేరిగిపోని చోటు సంపాదించారు. గత ఐదేళ్లలో కంపెనీ షేర్లు ఎంత శాతం పెరిగాయో తెలుసుకుందాం.ఇదీ చదవండి: రోబో కారును ఆవిష్కరించిన టెస్లాటాటా గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల పరుగు..కంపెనీ పేరు షేరు ర్యాలీ(%)టాటా టెలీసర్వీసెస్ 3002 ఆటోమోటివ్ స్టాంపింగ్స్ 2211 ట్రెంట్ 1499 టాటా ఎలక్సీ 1109 టాటా ఇన్వెస్ట్మెంట్ 820 టాటా పవర్ 686 టాటా మోటార్స్ 628 టీఆర్ఎఫ్ 489 టాటా కమ్యూనికేషన్స్ 453 ఓరియంటల్ హోటల్స్ 391 ఇండియన్ హోటల్స్ 376 టాటా స్టీల్ 362 టాటా కెమికల్స్ 347 నెల్కో 333 టాటా కన్జూమర్ 304 టైటన్ కంపెనీ 176 వోల్టాస్ 165 టీసీఎస్ 111 ర్యాలీస్ ఇండియా 81 -
రతన్ టాటాకు స్ఫూర్తి ఎవరో తెలుసా..!
రతన్ టాటా మన దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త. పారిశ్రామిక విజయాలలోనే కాదు, వదాన్యతలోనూ ఆయన ఎందరికో స్ఫూర్తి ప్రదాత. అంతటి రతన్ టాటాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందనే నానుడి రతన్ టాటా విషయంలోనూ నిజమే! చిన్ననాటి నుంచి రతన్ టాటాకు స్ఫూర్తి ఆయన నాయనమ్మే! రతన్ టాటా నాయనమ్మ నవాజ్‌బాయి టాటా సన్స్ కంపెనీకి మొదటి మహిళా డైరెక్టర్. టాటా ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా కూడా ఆమె సేవలందించారు.రతన్ టాటాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన తల్లిదండ్రులు విడాకులు పొంది విడిపోయారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో రతన్ టాటా, ఆయన తమ్ముడు జిమ్మీ టాటాల బాధ్యతను నాయనమ్మ నవాజ్‌బాయి చేపట్టారు. వారిద్దరినీ అల్లారుముద్దుగా పెంచారు. సాటి మనుషులతో మెలగాల్సిన తీరును, జీవితంలో పాటించాల్సిన విలువలను నేర్పించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన నాయనమ్మే తనకు స్ఫూర్తి ప్రదాత అని, తాను సాధించిన విజయాల ఘనత ఆమెకే చెందుతుందని రతన్ టాటా ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. నాయనమ్మ పెంపకంలో పెరగకపోయి ఉంటే, తాను ఇంతటివాణ్ణి కాగలిగేవాణ్ణి కాదని రతన్ టాటా తరచుగా చెబుతుండేవారు. ఇక్కడ చదువు పూర్తయ్యాక ఉన్నతవిద్య కోసం రతన్ టాటా అమెరికా వెళ్లారు. కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లాస్ ఏంజెలిస్‌లోని ఒక ఆర్కిటెక్చర్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. అక్కడే స్థిరపడిపోవాలనుకున్న దశలో నాయనమ్మ నవాజ్‌బాయి అనారోగ్యానికి లోనయ్యారు. స్వదేశానికి తిరిగి వచ్చేయమని ఆమె కోరడంతో రతన్ టాటా అమెరికా జీవితానికి స్వస్తిచెప్పి, బాంబేకు వచ్చేసి, టాటా సంస్థల బాధ్యతల్లో పాలుపంచుకోవడం మొదలుపెట్టారు. (చదవండి: నాలుగుసార్లు ప్రేమలో పడినా..!) -
నాలుగుసార్లు ప్రేమలో పడినా..!
రతన్ టాటా పారిశ్రామికవేత్తగా ఘనవిజయాలు సాధించినా, అవివాహితుడిగానే మిగిలిపోయారు. ఆయన తన జీవితంలో నలుగురు మహిళలతో ప్రేమలో పడ్డారు. కొన్నిసార్లు దాదాపు పెళ్లి వరకు వెళ్లినా, పెళ్లి మాత్రం చేసుకోకుండానే మిగిలిపోయారు. ఈ సంగతిని రతన్ టాటా స్వయంగా వెల్లడించారు.దాదాపు పుష్కరం కిందటి ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఇంటర్వ్యూలో రతన్ టాటా తన ఆంతరంగికమైన సంగతులను ప్రస్తావించారు. ‘నాలుగుసార్లు ప్రేమలో పడ్డాను. కొన్నిసార్లు దాదాపు పెళ్లి వరకు వెళ్లాను. పరిస్థితుల ప్రభావంతో పెళ్లి మాత్రం జరగలేదు. పెళ్లి చేసుకోవలసిన పనుల్లో తీరికలేకుండా మునిగిపోవడం సహా అనేక కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయాను’ అని చెప్పారు. లాస్ ఏంజెలెస్‌లో ఉన్నప్పుడే తొలిసారి ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని, కొన్ని పరిస్థితుల వల్ల భారత్‌కు తిరిగి వచ్చేయాల్సి వచ్చిందని తెలిపారు.సిమీ గరేవాల్‌తో ప్రేమాయణంబాలీవుడ్ నటి సిమీ గరేవాల్‌తో రతన్ టాటా ప్రేమాయణం గురించి చాలా కథనాలే వెలువడ్డాయి. సిమీ గరేవాల్ ఒక టీవీ చానెల్ కోసం నిర్వహించిన ‘రెండెజ్వూస్ విత్ సిమీ గరేవాల్’ కార్యక్రమంలో ఒకసారి రతన్ టాటాను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆమె కూడా తన ఇంటర్వ్యూలో ‘ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండి;yయారు?’ అని రతన్ టాటాను అడిగారు. ఇదిలా ఉంటే, సిమీ గరేవాల్ వేరే ఇంటర్వ్యూలో రతన్ టాటాతో కొంతకాలం తానే డేటింగ్ చేసినట్లు చెప్పారు. తాను సినిమాల్లో బిజీగా ఉంటున్నా, ఇద్దరమూ తరచు కలుసుకునేవాళ్లమని తెలిపారు. రతన్ టాటా మరణం పట్ల సంతానాన్ని వ్యక్తం చేస్తూ ‘నువ్వు వెళ్లిపోయావని అంటున్నారు. నువ్వు లేని లోటును భరించడం చాలా కష్టం.. వీడ్కోలు మిత్రుడా!’ అని గురువారం ఉదయం సిమీ గరేవాల్ ఒక పోస్ట్ పెట్టారు. (చదవండి: రతన్ టాటా నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలివే..!) -
ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటా
రతన్ టాటా సమాజానికి చేసిన సేవ ఎనలేనిది. టాటా గ్రూప్ సంపదలో సగానికిపైగా టాటా ట్రస్ట్‌కు విరాళంగా అందజేస్తున్నారు. దాని ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. రాజకీయాలు, అవినీతికి దూరంగా ఉండే రతన్ టాటా జీవితం ఎంతో మందికి అనుసరణీయం. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పెద్ద వయసులో తాను ఎలా సమయం గడిపారో తెలిపారు. ఎవరైనా తనను మంచి సలహా ఇవ్వమని అడిగితే ఏం చెబుతారో వివరించారు.ఇంటర్వ్యూలో టాటా మాట్లాడుతూ..‘చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా స్నేహితులతో సమయాన్ని గడుపుతున్నా. వారి నుంచి నిత్యం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. ఎనిమిది పదుల వయసు దాటాక కూడా విద్యార్థిగానే ఉన్నాను. ప్రపంచంలో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎవరూ సంపూర్ణ విజ్ఞానం కలిగి ఉండరు. ఎవరైనా మంచి సలహా ఇవ్వాలని అడిగితే..మంచిసలహా అనేది సమయాన్ని బట్టి మారుతుంటుంది. కానీ మంచి పని చేయాలన్న తపన మాత్రం ఎప్పటికీ మారకుండా ఉంటుంది. అందుకే..సలహాల సంగతి ఆపేసి కష్టమైనా సరే సరైన పని చేయడంపై దృష్టి సారించాలని చెబుతుంటా! ఎందుకంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే..సరైన పని చేయడమే కీలకమైందని అర్థమవుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’వివిధ సందర్భాల్లో రతన్ టాటా చెప్పిన మాటలు కొన్ని..జీవితంలో విజయం సాధించాలంటే ఒడిదొడుకులు ఉండటం చాలా ముఖ్యం. ఈసీజీలో సరళ రేఖ ఉన్నదంటే ప్రాణం లేదనే అర్థం.కేవలం భౌతిక విషయాలతోనే జీవితం ముడిపడిలేదని ప్రతివాళ్లూ ఎప్పుడో ఒకప్పుడు గ్రహిస్తారు. మనం ప్రేమించే వారిని ఆనందంగా ఉంచడంలోనే మన సంతోషమూ ఉంది.తన కోసం పని చేస్తున్న వారి మేలు కోరే వాడే ఉత్తమ నాయకుడు.వృత్తిని – జీవితాన్ని సమతులం చేయడంపై నాకు నమ్మకంలేదు. వృత్తిని – జీవితాన్ని మమేకం చేయాలి. మీ వృత్తిని, జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దుకోవాలి.ఏ ఇబ్బందినీ స్వీకరించకపోవడమే పెద్ద ప్రమాదం. అతి వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఏ సవాల్‌నూ స్వీకరించలేకపోతే అపజయం తప్పదు.ఎన్ని కష్టాలనైనా పట్టుదలతో ఎదుర్కోండి. అవే మీ విజయానికి పునాది రాళ్లు.ఎదుటివాళ్ల దయా గుణాన్ని, ప్రేమను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకండి.మీ జీవితం సాఫీగా ఉండకపోవచ్చు. సమాజంలోని సమస్యలను పరిష్కరించ లేకపోవచ్చు. అలాగని సమాజంలో మీ ప్రాముఖ్యాన్ని తక్కువగా అంచనావేయొద్దు. ధైర్యం, నమ్మకం మనకో దారి చూపిస్తాయి.అవకాశాల కోసం ఎదురు చూడకూడదు. అవకాశాల్ని సృష్టించుకోవాలి.నాయకత్వమంటే బాధ్యత తీసుకోవడం.సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు దృష్టి లేదు. నిర్ణయం తీసుకొని దానిని విజయవంతం చేయడమే నా పని.విజయం అనేది నీవు చేపట్టిన పదవిపై ఆధారపడి ఉండదు. నీవు ఇతరులను ఎంతగా ప్రభావితం చేస్తున్నావన్న దానిపై ఆధారపడి ఉంటుంది. -
రతన్‌టాటాకు మోదీ ఎస్ఎంఎస్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ‘వెల్కమ్’ అంటూ రతన్ టాటాకు పంపించిన ఒక ఎస్ఎంఎస్.. సామాన్యుల కారు ‘నానో’ ప్లాంట్‌ను పశి్చమబెంగాల్‌లోని సింగూర్ నుంచి గుజరాత్‌లోని సనంద్‌కు తరలేలా చేసింది. పశి్చమబెంగాల్‌లోని సింగూర్‌లో టాటా నానో ప్లాంట్ కోసం భూసమీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుత సీఎం, నాటి ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ రైతులతో కలసి 2006లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అది ఎంతకీ పరిష్కారమయ్యేలా కనిపించకపోవడంతో రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు రతన్‌టాటా ప్రకటించారు. ఆ సమయంలో తాను పంపిన ఎస్ఎంఎస్ ఎలాంటి ఫలితాన్నిచ్చందన్నది నాటి సీఎం మోదీ తర్వాత స్వయంగా ప్రకటించారు. ‘‘తాము పశి్చమబెంగాల్ను వీడుతున్నట్టు కోల్‌కతాలో రతన్‌టాటా మీడియా సమావేశంలో ప్రకటిస్తున్న వేళ, ‘వెల్కమ్’ అంటూ నేను ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపాను. రూపాయి ఖర్చుతో పంపించిన ఎస్ఎంఎస్ ఏమి చేయగలదో మీరు ఇప్పుడు చూస్తున్నారు’’అంటూ గుజరాత్‌లోని సనంద్‌లో రూ.2,000 కోట్లతో టాటా ఏర్పాటు చేసిన నానో ప్లాంట్‌ను 2010లో ప్రారంభిస్తున్న వేళ నాటి సీఎం మోదీ ప్రకటించారు. దేశ పారిశ్రామిక చరిత్రలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. -
చరిత్ర మరువదు.. మీ ఘనత
ముంబై: ‘‘ఈ స్నేహంలో అగాధం ఇప్పుడు నాతో ఉండిపోయింది. నా మిగిలిన జీవిత కాలంలో దీన్ని పూరించేందుకు కృషి చేస్తాను’’అంటూ శంతను నాయుడు తన స్పందనను వ్యక్తం చేశారు. 31ఏళ్ల ఈ యువకుడు రతన్‌టాటాకు అత్యంత విశ్వసనీయ సహచరుడు. వృద్ధాప్యంలో ఆయన బాగోగులు చూసుకున్న ఆప్త మిత్రుడు. రతన్‌టాటా అంతిమయాత్ర వాహనం ముందు యెజ్డీ మోటారుసైకిల్ నడుపుతున్న శంతనునాయుడిని చూసే ఉంటారు. ‘‘దుఃఖం అనేది ప్రేమకు చెల్లించాల్సిన మూల్యం. గుడ్‌బై, నా ప్రియమైన దీపస్తంభం’’అంటూ చిన్న పోస్ట్ పెట్టాడు. టాటా గ్రూప్‌లో ఐదవ తరం ఉద్యోగి శంతనునాయుడు. 2014లో రతన్‌టాటా, శంతను కలుసుకున్నారు. వీధి శునకాల పట్ల ప్రేమ వీరిద్దరినీ కలిపిందని చెప్పుకోవాలి. వీధి శునకాలు రాత్రి వేళల్లో వాహన ప్రమాదాలకు గురి కాకుండా, వాటి కోసం మెరిసే కాలర్లను శంతను డిజైన్ చేశాడు. కుక్కల మెడలో ఈ కాలర్‌ను ఉంచితే, రాత్రివేళ వాహన వెలుగులకు మెరవడంతో డ్రైవర్లు వాటిని గుర్తిస్తారన్నది అతడి యోచన. ఇందుకు నిధుల సాయం కావాలంటూ రతన్‌టాటాకు లేఖ రాశాడు. ముంబైలోని తన కార్యాలయానికి రావాలని, తనతో కలసి పనిచేయాలంటూ రతన్ టాటా నుంచి శంతనుకు పిలుపు వచి్చంది. రతన్‌టాటా సహకారంతో మోటోపాస్ అనే కంపెనీని శంతను స్థాపించాడు. వృద్ధులకు తోడుగా యువ సహచరులను కలిపే స్టార్టప్ ‘గుడ్ ఫెలోస్’ను సైతం స్థాపించాడు. ఆ తర్వాత ఎంబీఏ కోసం యూఎస్ వెళుతూ. తిరిగి వచి్చన తర్వాత కలసి పనిచేస్తానని రతన్‌టాటాకు శంతను హామీఇచ్చాడు. తిరిగొచి్చన తర్వాత రతన్‌టాటా అసిస్టెంట్‌గా, టాటా ట్రస్ట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. రతన్‌టాటా తుదిశ్వాస విడిచే వరకు ఆయన వెన్నంటి ఉన్నాడు. -
టాటా వారసులెవరు..
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అస్తమించిన నేపథ్యంలో ఇక 365 బిలియన్ డాలర్ల టాటా మహాసామ్రాజ్యానికి వారసులెవరనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా పలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీటిలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటాతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మెహ్లీ మిస్త్రీ పేర్లు కూడా ఉన్నాయి. వాస్తవానికి రతన్ టాటాకు తోడబుట్టిన సోదరుడైన జిమ్మీ టాటా పేరు కూడా పరిశీలించాల్సినప్పటికీ ఆయన వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, రతన్ టాటా తండ్రి నావల్ టాటా, మారుతల్లి సిమోన్ టాటా కుమారుడైన నోయెల్ పేరు ప్రముఖంగా తెరపైకి వచి్చంది. టాటా కుటుంబసభ్యుడు కావడంతో పాటు పలు గ్రూప్ కంపెనీలను నడిపించిన అనుభవం కూడా ఉండటమనేది నోయెల్‌కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ సంస్థలకు చైర్మన్‌గా ఉన్నారు. అలాగే రతన్ టాటా ట్రస్టు బోర్డులో కూడా ఉన్నారు. టాటా సన్స్‌ను పర్యవేక్షించే టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా అయ్యేందుకు ఇది ఆయనకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. రతన్ టాటా వివాహం చేసుకోకపోవడం, ఆయనకు సంతానం లేకపోవడంతో నోయెల్ సంతానానికి భవిష్యత్తులో టాటా గ్రూప్‌లో మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. నోయెల్‌కు మాయా, నెవిల్, లియా... ఈ ముగ్గురు సంతానం ఉన్నారు. టాటా మెడికల్ సెంటర్‌కి మాయా ట్రస్టీగా వ్యవహరిస్తుండగా, హైపర్‌మార్కెట్ స్టార్ బజార్‌కి నెవిల్ సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు. జుడియో బ్రాండ్ విస్తరించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. టాటా గ్రూప్‌లో భాగమైన ఇండియన్ హోటల్ కంపెనీలో లియా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సన్నిహితుడు మెహ్లీ..: మెహర్జీ పల్లోంజీ గ్రూప్ డైరెక్టర్ అయిన మెహ్లీ మిస్త్రీ, రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు టాటా గ్రూప్‌తో చాలాకాలంగా అనుబంధం ఉంది. 2022లో కారు ప్రమాదంలో మరణించిన టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి మెహ్లీ కజిన్ అవుతారు. వాస్తవానికి టాటా సన్స్‌లో పల్లోంజీ మిస్త్రీ గ్రూప్‌నకు 18.4 శాతం వాటా ఉన్నందున ఆ గ్రూప్ అధినేత షాపూర్ మిస్త్రీ పేరు కూడా పరిశీలనకు రావాలి. కానీ టాటాలతో మిస్త్రీలకు విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఆయనకు టాటా సామ్రాజ్యం బాధ్యతలు లభించకపోవచ్చనే అభిప్రాయం నెలకొంది. నోయెల్, మెహ్లీతో పాటు గ్రూప్‌లో ఉన్నవారే కాకుండా బైటి వ్యక్తుల పేర్లు కూడా అకస్మాత్తుగా తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. -
భారత‘రతన్’కు ఘన వీడ్కోలు..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం, దాతృత్వ శిఖరం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో బుధవారం రాత్రి తుది శ్వాస విడిచిన రతన్ టాటా అంత్యక్రియలు గురువారం ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. రతన్ టాటా పార్శీ అయినప్పటికీ విద్యుత్ దహనవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. తరలివచ్చిన అభిమానగణంముంబైలోని కొలాబాలో ఉన్న రతన్ టాటా స్వగృహానికి ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఆయన పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత అధికారిక లాంఛనాల్లో భాగంగా ఆయన భౌతికకాయంపై జాతీయ జెండాను ఉంచి ప్రత్యేకంగా అలకరించిన వాహనంలో ఇరువైపులా పోలీసులు వెంటరాగా దక్షిణ ముంబైలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫామింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ) మైదానానికి తీసుకొచ్చారు. దారి పొడవునా ఆయన అభిమానులు వాహనం వెంట నడిచారు.పోలీసు బ్యాండ్ ప్రత్యేక ట్యూన్‌ను వాయించింది. ఎన్సీపీఏ మైదానంలో మధ్యాహ్నం దాకా ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. అనంతరం అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని వర్లీలో ఉన్న మున్సిపల్ శ్మశానవాటికకు అంతిమయాత్ర కొనసాగింది. దారిపొడవునా జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్మశానవాటికకు తరలించాక అక్కడ ముంబై పోలీసులు టాటాకు గౌరవసూచికగా గన్ సెల్యూట్ చేశారు.తరలివచ్చిన ప్రముఖులువర్లీ శ్మశానవాటికలో సవతి సోదరుడు నోయల్ టాటా, టాటాల కుటుంబ సభ్యులు సహా సినీ, పారిశ్రామిక, సామాజిక, క్రీడా, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, స్థానికులు, టాటా గ్రూప్ సంస్థల ఉద్యోగులు, పోలీసు ఉన్నతాధికారులు, ఎన్సీపీఏ విద్యార్థులు, అంత్యక్రియలకు హాజరయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, పియూశ్ గోయల్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవిస్, మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్‌ఠాక్రే, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, ఆర్థికరంగ దిగ్గజం దీపక్ పరేక్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం, ఏపీ సీఎం చంద్రబాబు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, నటుడు అమీర్‌ఖాన్, దర్శకుడు మధు భండార్కర్, నటుడు రాజ్‌పాల్ యాదవ్, తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. రతన్ టాటాకు నివాళిగా గురువారం మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు సంతాప దినంగా పాటించాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను అవనతం చేశాయి.పాత సంప్రదాయానికి భిన్నంగా..టాటాలు జొరాస్ట్రియన్ మతంలోని పార్శీ వర్గానికి చెందిన వాళ్లు. సాధారణంగా పార్శీల అంత్యక్రియల తర్వాత పార్థివదేహాన్ని దహనం, ఖననం చేయరు. రాబందులకు ఆహారంగా ఒక కొండ శిఖరంపై వదిలేస్తారు. ప్రకృతి వరప్రసాదంగా శరీరంతో భువి మీదకు వచ్చిన మనిషి తిరిగి స్వర్గస్తులైనప్పుడు ఆ శరీరాన్ని మళ్లీ ప్రకృతికే విడిచిపెట్టాలని జొరాస్ట్రియన్లు విశ్వసిస్తారు. దహనం చేసి గాలిని, ఖననం చేసి నేల, నీటిని కలుషితం చేయడాన్ని వాళ్లు పాపంగా భావిస్తారు. టవర్ ఆఫ్ సైలెన్స్‌గా పిలిచే ప్రాంతంలో పార్థివదేహాన్ని వదిలేస్తారు. అక్కడ రాబందులు శరీరాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అయితే కాలక్రమంలో రాబందుల సంఖ్య తగ్గిపోవడంతో కొందరు ఆధునిక పార్శీలు ఈ ప్రాచీన సంప్రదాయం నుంచి ‘ఎలక్ట్రిక్ దహనం’ విధానానికి మళ్లారు. టాటా గ్రూప్ మాజీ చైర్మన్, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుడు, పార్శీ అయిన సైరస్ మిస్త్రీ అంత్యక్రియలూ ‘టవర్ ఆఫ్ సైలెన్స్’కు బదులు 2022లో వర్లీలోని అదే ఎలక్ట్రిక్ దహనవాటికలో జరిగాయి. గురువారం రతన్ టాటా అంత్యక్రియలనూ అలాగే పూర్తిచేసినట్లు అక్కడి క్రతువుకు సాయపడిన మతాధికారుల్లో ఒకరైన పెరీ కంబట్ట వెల్లడించారు. అయితే మరో మూడు రోజులపాటు రతన్ టాటా ఇంట్లో పార్శి సంప్రదాయ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఒక టాటా.. ఒక గోవా!ముంబై: రతన్ టాటా అంత్యక్రియల వద్ద గంభీరమైన వాతావరణంలో అక్కడికి పరుగెత్తుకొచ్చిన ఒక శునకం రతన్ పార్థివదేహాన్ని చూసి మౌనంగా ఉండిపోయింది. తన నేస్తం, యజమాని ఇక లేరని తెల్సి మౌనంగా రోదించింది. అక్కడే ఉంటూ ఆయన భౌతికకాయం నుంచి దూరం జరగబోనని భీషి్మంచుకుని అక్కడే ఉండిపోయింది. ఒకప్పుడు వీధి కుక్కగా పెరిగి తదనంతరకాలంలో రతన్‌టాటాకు మంచి నేస్తంగా మారిన ‘గోవా’ శునకం అది. ఒకప్పుడు గాయపడి గోవాలో ఒంటరిగా తిరుగుతున్న చిన్న కుక్క పిల్ల అది. పదేళ్ల క్రితం రతన్ గోవాకు వెళ్లినపుడు ఇది ఆయన కంట పడింది. జంతు ప్రేమికుడైన రతన్ దానిని చేరదీశారు. దాని బాగోగులు చూసుకున్నారు. టాటా గ్రూప్ కేంద్రకార్యాలయం బాంబే హౌస్‌కూ రతన్‌తోపాటు ఇది కూడా వస్తుండేది. గురువారం ఎన్సీపీఏ ప్రాంగణంలో రతన్ భౌతికకాయం వద్దకు దీనిని తీసుకొచ్చారు. ‘‘రతన్‌కు ఇది అత్యంత ఆప్తమైన నేస్తం. ఆయన అలా శాశ్వత నిద్రలోకి వెళ్లాక ఇది ఉదయం నుంచి ఇంతవరకు ఏమీ తినలేదు’’ అని దాని సంరక్షకుడు చెప్పారు. ‘‘ రతన్ టాటాకు శునకాలంటే ప్రేమ. తాజ్‌మహల్ హోటల్ కావొచ్చు, బాంబే హౌస్ కావచ్చు, టాటా సంస్థల ప్రాంగణాల్లో మనకు ఒకప్పుటి వీధి శునకాలే మనకు మంచి నేస్తాలుగా స్వాగతం పలుకుతాయి’’ అని మహారాష్ట్ర నవని ర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే గుర్తుచేసుకున్నారు. 2018లో బ్రిటన్ యువరాజు ఛార్లెస్ నుంచి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ తీసుకునేందుకు వెళ్లాల్సి ఉంది. సరిగ్గా అప్పుడు ఆయన పెంపుడు శునకం ఒకటి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ స్థితిలో వీటిని ఇలా వదిలేసి వెళ్లబోనని అవార్డ్ కార్యక్రమాన్ని టాటా రద్దుచేసుకున్నారని ఆయన స్నేహతుడు సుహేల్ సేథ్ చెప్పారు. -
రతన్ టాటా మృతికి మంత్రిమండలి నివాళి
సాక్షి, అమరావతి: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతికి ఏపీ మంత్రి మండలి సంతాపం తెలిపింది. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమైంది. రతన్ టాటా చిత్రపటానికి ముఖ్యమంత్రి, మంత్రులు పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగానే కాకుండా గొప్ప దాతృత్వ సేవలు అందించడంతో కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌తో రతన్ టాటాను సత్కరించిందని కొనియాడారు. విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్‌ను సృష్టించారన్నారు. రతన్ టాటా మృతి నేపథ్యంలో మంత్రి మండలి సమావేశంలో చర్చించాల్సిన అజెండాను వాయిదా వేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముంబై బయలుదేరి వెళ్లారు. దేశానికి తీరని లోటు: పరిశ్రమల శాఖ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఘన నివాళి అర్పించింది. మంగళగిరిలోని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యాలయంతోపాటు ప్రతి జిల్లాలోనూ పరిశ్రమల శాఖ కార్యాలయాల్లో రతన్ టాటాకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ రతన్ టాటా తన జీవితం చివరి వరకు విలువలు పాటించి ఎంతో సాధారణ జీవితం గడిపారన్నారు. రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అడిషనల్ ఏవీ పటేల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అక్షరాలా భారత రత్నమే!
నిదానంగా కదులుతూ... ముక్కుసూటిగా మాట్లాడుతూ... విలువలను ఎత్తిపడుతూ కూడా అన్యులకు అసాధ్యమైన సమున్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆరు దశాబ్దాల తన ఆచరణతో దేశానికి చాటిచెప్పిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన అక్షరాలా రత్నం. సార్థక నామధేయుడు. చెదరని వినమ్రత, సడలని దృఢ సంకల్పం, లక్ష్యసాధనకు ఎంత దూరమైనా వెళ్లే లక్షణం... విశాల టాటా సామ్రాజ్యంలో ఆయనను విలక్షణ వ్యక్తిగా నిల బెట్టాయి. కనుకనే మూడు దశాబ్దాల పాటు ఆ సామ్రాజ్యానికి ఆయన అక్షరాలా చక్రవర్తిగానే వ్యవహరించారు. నిజమే... ఆయన 1962లో సాధారణ ఉద్యోగిగా చేరిననాటికే దేశంలో అదొక అత్యున్నత శ్రేణి సంస్థ కావొచ్చుగాక. పైగా సంస్థ సారథులకు ఆయన అతి దగ్గరివాడు, బంధు వర్గంలో ఒకడు కూడా! కానీ ఆయన ఎదుగుదలకు తోడ్పడినవి అవి కాదు. ఆయన అంకితభావం, దీక్షాదక్షతలు, నిరంతర తపన ఆయనను అంచెలంచెలుగా పైపైకి చేర్చాయి. పేరుకు ఒక సంఘటిత సంస్థే అయినా, అప్పటికే లక్షలమంది సిబ్బందికి చల్లని నీడనిచ్చే కల్పవృక్షంగా పేరుతెచ్చుకున్నా... టాటాల సామ్రాజ్యం విభిన్న సంస్థల సమాహారం మాత్రమే! అందులో సమష్టితత్వం, దిశ, దశా నిర్దేశించే ఉమ్మడి తాత్విక భూమిక శూన్యం. జమ్షెడ్జీ టాటా, జేఆర్డీ టాటా వంటివారు నేతృత్వం వహించిన ఆ సంస్థలో నాయకత్వ స్థానం దక్కాలంటే అడుగడుగునా అవరోధాలు తప్పలేదు. నెత్తురు చిందకపోవచ్చు... గాయాల జాడ లేకపోవచ్చు, కానీ రోమన్ సామ్రాజ్యకాలం నాటి కలోసియంలను తలపించే బోర్డు రూంలో తన ఆలోచనలనూ, తన భావనలనూ బలంగా వినిపించి ప్రత్యర్థుల వాదనలను పూర్వపక్షం చేయటం మాటలు కాదు. తన ప్రతి పలుకూ, ప్రతి వివరణా నిశితంగా గమనించే, ప్రశ్నించే ఆ బోర్డు రూంలో గెలవటం సాధారణం కానే కాదు. కానీ రతన్ అవన్నీ అవలీలగా చేయగలిగారు. నిష్క్రమిస్తున్న చైర్మన్జేఆర్డీ టాటా ఆశీర్వాదం పుష్కలంగా ఉన్నా అప్పటికే భిన్న సంస్థలకు సారథులైనవారు సామాన్యులు కాదు. అప్పటికింకా టిస్కోగానే ఉన్న టాటా స్టీల్‌కు రూసీ మోదీ సారథి. పారిశ్రామిక రంగంలో ఆయన మోత మోగిస్తున్నాడు. జమ్షెడ్ఫూర్లో కొలువుదీరిన ఆ సంస్థకాయన మకుటంలేని మహారాజు. అజిత్ కేర్కర్ ఇండియన్ హోటల్స్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. దర్బారీ సేల్ టాటా కెమికల్స్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వీళ్లెవరూ రతన్ టాటాను సీరియస్‌గా తీసుకోలేదు. అతన్ని అవలీలగా అధిగమించవచ్చనుకున్నారు. రతన్ తన పేరులో చివరున్నరెండక్షరాల పుణ్యమా అని ఇంత దూరం వచ్చాడు తప్ప ‘సరుకు’ లేదనుకున్నారు. ఆయన రాకపై ఆలోచించటం సమయాన్ని వృథా చేసుకోవడమే అనుకున్నారు. కానీ రతన్ పరిశీలనాశక్తి అమోఘ మైనది, అనితర సాధ్యమైనది. ఈ మహాసామ్రాజ్యంలో ఏం జరుగుతున్నదో, లోపాలేమిటో అచిర కాలంలోనే పసిగట్టాడు. తళుకుబెళుకులకు తక్కువేం లేదు. మదుపుపరులకు ఎప్పటికప్పుడు లాభాల పంటా పండుతోంది. కానీ అట్టడుగున అవాంఛనీయమైన పోకడలు కనబడుతున్నాయి. వాటిని చక్కదిద్దితేసంస్థను మరిన్ని రెట్లు పెంచి ఘనతరమైనదిగా తీర్చిదిద్దటం అసాధ్యమేమీ కాదని ఆయన నిర్ణయించుకున్నాడు. 1991 నాటికే దేశంలో అడుగుపెట్టిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పాత పద్ధతిలోనే టిస్కోను కొనసాగిస్తే త్వరలోనే అది గ్రూపు చేజారటం ఖాయమన్న నిర్ణయానికొచ్చాడు.జేఆర్డీ మంచితనమో, గమనించలేని తత్వమో గానీ... టాటా స్టీల్‌లో అప్పటికి టాటాలకున్న ప్రమోటర్ వాటా కేవలం అయిదు శాతం మాత్రమే. ఇదే కొనసాగితే ఏదోనాటికి అది ఎవరి చేతుల్లోకైనా పోవచ్చని రతన్ గ్రహించారు. అదొక్కటే కాదు... గ్రూపు సంస్థల్లో ఏ ఒక్కటీ చేజారకుండా ప్రమోటర్ వాటాను గణనీయంగా పెంచారు. సొంత సంస్థలను పదిలపరచుకోవటమే కాదు, ఖండాంతర ఆంగ్లో–డచ్ స్టీల్ సంస్థ కోరస్‌ను వశపరుచుకున్నారు. ఒకప్పుడు తనకు అవరోధంగా నిలిచిన అమెరికన్ దిగ్గజ సంస్థ ఫోర్డ్ నుంచి జాగ్వార్ ల్యాండ్రోవర్ను టాటాల తీరానికి చేర్చారు.వర్తమానంలో పారిశ్రామికవేత్తల ఎదుగుదల ఎలా సాధ్యమవుతున్నదో బాహాటంగానే కనబడుతోంది. కానీ రతన్ టాటా ఇందుకు భిన్నం. టాటా సంస్థలపై మచ్చపడకుండా, వక్రమార్గాల జోలికిపోకుండా నిదానంగా తన ప్రస్థానం సాగించారు. ఆయన పట్టిందల్లా బంగారమేనని చెప్పడానికి లేదు. కోరస్ టేకోవర్ అయినా, నానో కారు ఉత్పత్తి ఉబలాటమైనా, టాటా గ్రూప్ సంస్థల చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ ఆగమన, నిష్క్రమణల్లో అయినా రతన్ వైఫల్యాలు స్పష్టంగా కనబడతాయి. అందుకాయన విమర్శలను ఎదుర్కొనక తప్పలేదు. అలాగే టాటా స్టీల్‌ను దాదాపు 1,200 కోట్ల డాలర్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దినప్పుడూ, దేశీయ విద్యుత్ ఆధారిత వాహన రంగంలో టాటా మోటార్స్‌ను మార్కెట్ లీడర్‌గా ముందుకు ఉరికించినప్పుడూ ఆయన గర్వం తలకెక్కించుకోలేదు. ఇవాళ్టి రోజున బహుళజాతి సంస్థల సమాహారంగా ఖండాంతరాల్లో వెలుగు లీనుతున్న టాటా గ్రూప్ నిరుటి రెవెన్యూ 16,500 కోట్ల డాలర్లు. ఆయన వ్యక్తిగత ఆదాయమే కొన్ని వందల కోట్లు. అయినా చివరి వరకూ అతి సాధారణ జీవితం గడిపి, అసహాయులకు అండదండలందించి జీవితాన్ని ధన్యం చేసుకున్న రతన్‌కు కొందరు కోరుకుంటున్నట్టు ‘భారతరత్న’ ప్రకటిస్తే అది ఆ అత్యున్నత పురస్కారానికి మరింత వన్నె తెస్తుంది. ఆ మహామనీషికి ‘సాక్షి’ వినమ్రంగా నివాళులర్పిస్తున్నది. -
క్రీడల్లోనూ రతన్ ముద్ర
న్యూఢిల్లీ/ముంబై: భారత పారిశ్రామిక రంగంలోనే కాదు... క్రీడారంగంలోనూ ‘టాటా’ చెరగని ముద్ర వేసింది. స్వాతం్రత్యానికి పూర్వంలో భారత్ 1920లో అంట్వర్ప్ ఒలింపిక్స్‌కు టాటా గ్రూపే స్పాన్సర్‌గా వ్యవహరించింది. అప్పటి నుంచి క్రీడలపై కూడా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తూనే వచ్చింది. రతన్ టాటా వచ్చాక ఇది మరింతగా పెరిగింది. జీవనశైలిలో క్రీడలు భాగమేనని రతన్ అనే వారు. ‘టాటా’ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), టాటా స్టీల్ చెస్ ఇలా ఒకటేమిటి ఆర్చరీ, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్ ఫుట్‌బాల్), అథ్లెటిక్స్‌లలో రతన్ ఉదారత, దార్శనీయత, నిబద్ధత నిరుపమానమని పలువురు క్రీడా విశ్లేషకులు అభివర్ణించారు. » 1991లో జేఆర్డీ టాటా స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పిన నాటి నుంచి ఫుట్‌బాల్, హాకీ, ఆర్చరీ, ఈక్వె్రస్టియన్, బాక్సింగ్, కరాటే, రాకెట్ స్పోర్ట్స్ ఇలా 19 క్రీడాంశాలకు ప్రసిద్ధ శిక్షణ సంస్థగా టాటా స్పోర్ట్స్ అకాడమీ ఎదిగిందని ఇందులో రతన్ పాత్ర చాలా కీలకమని అకాడమీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు అన్నారు. » 1924లో ఏర్పాటైన భారత ఒలింపిక్ సంఘానికి తొలి అధ్యక్షుడు సర్ దోరబ్జి టాటా కావడం విశేషం. నెదర్లాండ్స్‌లో జరిగే టాటా స్టీల్ చెస్‌ను కొందరు చెస్ దిగ్గజాలు ‘వింబుల్డన్ ఆఫ్ చెస్’గా అభివర్ణిస్తారు. 2007 నుంచి టాటా స్టీల్ సంస్థ స్పాన్సర్షిప్లోనే ఈ టోర్నీ జరుగుతోంది. స్వాతం్రత్యానంతరం పది మంది గొప్ప వాళ్ల జాబితాను తయారు చేస్తే అందులో రతన్ అగ్రస్థానంలో ఉంటారు. తన కోసం కాకుండా దేశం కోసం ఒక వ్యక్తి ఓ వ్యవస్థను ఎలా మార్చగలడో, ఓ పరిశ్రమను ఎలా సృష్టించగలడో నిరూపించిన దిగ్గజం రతన్ టాటా. గొప్ప మానవతావాది. మూగజీవాల పట్ల కారుణ్యం, సమాజం పట్ల బాధ్యత ఉన్న మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. నేను ఆయన్ని చాలాసార్లు కలిశాను. ఆయన చాతుర్యం అపారం. ఆయనెప్పుడు మన మనస్సుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. దేశం కోసం ఆయనేం చేశాడో, భారత పారిశ్రామిక రంగాన్ని దశదిశలా వ్యాప్తిచేసిన ఆయన గురించి ఎంత చెప్పినా... వర్ణించినా తక్కువే –కపిల్‌దేవ్, భారత క్రికెట్ దిగ్గజం పారిశ్రామిక దిగ్గజం, దాతృత్వానికి నిలువెత్తు రూపం రతన్ టాటా ఇక లేరనే వార్త అత్యంత విచారకరం. చెస్ టోర్నీ ఆయన ఎంతో చేశారు. టాటా స్టీల్ చెస్‌లో ఆడటమే గొప్ప గౌరవంగా భావించేలా ఆ టోర్నీని మార్చేశారు. –చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ శ్రీ రతన్ టాటా మరణవార్త నన్ను దుఃఖంలో ముంచేసింది. ఆయన దూరదృష్టి అద్భుతం. ఆయనతో నేను గడిపిన క్షణాలు, సంభాషణ జీవితంలో మరచిపోలేను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్థస్తున్నా. –ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా రతన్ టాటా చూపిన మార్గం, చేసిన దిశానిర్దేశం దేశం ఎప్పటికి మరచిపోదు. మేమంతా మిమ్మల్ని అనుసరిస్తాం. –బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రతన్ ఒక్క పారిశ్రామిక రంగానికే కాదు... భారత సమాజానికి ఎనలేని సేవలందించారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. –దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే -
టేకోవర్ స్టోరీ: రతన్.. ఇక టాటా గ్రూప్ పగ్గాలు తీసుకుంటావా?
టాటా గ్రూప్ గౌరవ్ చైర్మన్ రతన్ టాటా అస్తమించారు. 86 ఏళ్ల వయసులో ఆయన లోకాన్ని వీడారు. జేఆర్డీ టాటా 1991 మార్చిలో టాటా గ్రూప్ పగ్గాలను రతన్ టాటాకు అప్పగించారు. ఆయన నాయకత్వంలో కంపెనీ మరింత పెద్దదైంది. అయితే టాటా గ్రూప్ బాధ్యతలను రతన్ టాటా తీసుకోవాలని జేఆర్డీ టాటా ఎలా కోరారో తెలుసా?టాటా గ్రూప్‌నకు అధినేతగా వ్యవహరించిన ఆయన అసలు టాటా గ్రూప్ పగ్గాలను ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిలో చేపట్టారో ఒకసారి ఓ షోలో రతన్ టాటా వివరించారు. గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరిన తర్వాత జేఆర్డీ టాటా తనకు కంపెనీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు.“మేము ఒక ఫంక్షన్ కోసం జంషెడ్‌పూర్‌లో ఉన్నాం. నేను వేరే పని మీద స్టుట్‌గార్ట్‌కు వెళ్లవలసి వచ్చింది. నేను తిరిగి వచ్చినప్పుడు ఆయనకు(జేఆర్డీ టాటా) గుండె సమస్య వచ్చిందని, బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఉన్నారని విన్నాను. ఆయన ఒక వారంపాటు అక్కడే ఉన్నారు. నేను రోజూ వెళ్లి చూసొచ్చేవాడిని. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు రోజులకు ఆఫీస్‌కి వెళ్లి కలిశాను” అంటూ రతన్ టాటా చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: టాటా ప్రతీకారం అలా తీరింది..!"ఆయన్ను(జేఆర్డీ టాటా) ఎప్పుడు కలిసినా 'సరే, ఇంకేంటి?' అని అడిగేవారు. జే (జేఆర్డీ టాటా) నేను నిన్ను రోజూ చూస్తున్నాను. కొత్తగా ఏముంటుంది? అని నేను చెప్పావాడిని. 'సరే, నేను నీకు కొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను. కూర్చో. జంషెడ్‌పూర్‌లో నాకు జరిగిన సంఘటన (అనారోగ్యం) తర్వాత నేను తప్పుకోవాలనుకుంటున్నాను. (టాటా గ్రూప్ చైర్మన్‌గా) నా స్థానం నువ్వే తీసుకోవాలి' అన్నారు. అదే ప్రతిపాదనను బోర్డుకి తీసుకెళ్లారు(కొన్ని రోజుల తర్వాత)” అని టాటా గుర్తుచేసుకున్నారు. -
కడసారి వీడ్కోలు.. రతన్ టాటా అంతిమ యాత్ర (ఫోటోలు)
-
రతన్ టాటా సక్సెస్ స్టోరీ
-
రతన్ టాటా నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలివే..!
బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మన మధ్య లేకున్నా..తన మంచితనంతో అందరి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి. భావితరాలకు స్ఫూర్తి. వ్యాపారా సామ్రాజ్యంలో పారిశ్రామిక వేత్తలకు గురువు. వ్యక్తిత్వ పరంగా విద్యార్థులకు, యువతకు ఆదర్శం ఆయన. అలాంటి వ్యక్తి నుంచి ప్రతి చిన్నారి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలెంటో చూద్దామా..!నిరాడంబరత..టాటా గ్రూప్‌నే కాకుండా మన దేశం స్వరూపాన్నే తీర్చిదిద్దిన.. ఆ మహనీయుడి జీవన విధానం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆయన అంత పెద్ద వ్యాపార దిగ్గజమే అయినా సాధారణ జీవన విధానాన్నే ఇష్టపడతారట. అందుకు ఉదాహరణ ఈ కథ..ఒకరోజు ఎల్ఈడీ టీవీ బిగించటానికి రతన్ టాటా ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లూ అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్, పైన ఒక బనీనుతో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్‌లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదాసీదాగా, పాతకాలం నాటి ఫర్నిచర్‌తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ!సమస్యలను స్వీకరించే గుణం..రతన్ టాటా పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటారు. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్ స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్‌లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్‌నకు వ్యతిరేకంగా, ఓ యూనియన్ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు. అల్లరిమూకలతో టాటా మోట్సార్లో దాడులకు తెగపడ్డాడు. ఆఖరికి ప్లాంట్‌లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేశాడు. అయినా రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. దీంతో గ్యాంగ్‌స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో..దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. అయితే కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్‌లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.నైతిక విలువలు..టాటా వ్యాపారంలో నైతిక విలువలకు పెద్దపీట వేశారు. కష్టమైన వ్యాపార నిర్ణయాలను ఎదుర్కొన్నప్పుడు కూడా నిజాయితీ విషయంలో రాజీ పడేందుకు నిరాకరించారు. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. కఠిన పరిస్థితులు ఎదురైన మన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకుండా వ్యవహరించడం అనేది అత్యంత గొప్ప విషయం. ఇది విశ్వసనీయతకు నిదర్శనం. అదే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది అనేందుకు టాటానే నిదర్శనం. దానగుణం..ముఖ్యంగా టాటా ట్రస్ట్‌ల ద్వారా చేసిన రతన్ టాటా దాతృత్వ ప్రయత్నాలు.. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే అతని నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. అతను ఆరోగ్య సంరక్షణ, విద్య , సామాజిక కారణాలపై అధికంగా పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ ఒక వ్యక్తి విజయం అనేది వ్యక్తిగత లాభం మాత్రమే కాదని, దాంతో ఇతరుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావచ్చని.. తన ఆచరణతో చూపించారు.పట్టుదల..టాటా తన పదవీ కాలంలో ఆర్థిక మాంద్యం నుంచి వ్యాపార వైఫల్యాల వరకు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎక్కడ పట్టు సడలించక.. విజయం దక్కేవరకు పట్టు వదలని విక్రమార్కుడిలా కష్టపడి ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఎదురు దెబ్బలనేవి జీవితంలో భాగమని, వాటికే కుదేలవ్వకూడదని చాటిచెప్పారు. ఇన్నోవేషన్, విజన్ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు అయిన టాటా నానో లాంచ్ వంటి వినూత్న ఆలోచనలకు రతన్ టాటా పేరుగాంచారు. మధ్యతరగతి భారతీయులు కూడా కారు కొనుక్కో గలిగేలా చేయడమే ఈ కారు లక్ష్యం. ఇక్కడ టాటా ఫార్వర్డ్-థింకింగ్, రిస్క్ తీసుకేనే ధైర్యం మనకు కనిపిస్తున్నాయి. అవసరమనుకుంటే రిస్క్ తీసుకోవాలి. ఒకవేళ ఫెయిలైన ఒక మంచి అనుభవం లభించడమే గాక సృజనాత్మకంగా ఆలోచించేందకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే అందులో ఎదురయ్యే లాభ నష్టాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్లే సామార్థ్యం పెరుగుతుంది. చివరి వరకు ఆయన జీవితాన్ని చాలా అపరూపంగా తీర్చిదిద్దుకున్నారు. అంతేగాదు మరణం సమీపించే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండేవారని సన్నిహిత వర్గాల సమాచారం. కెరీర్‌ని, వ్యక్తిగత జీవితాన్ని ఎలా మమేకం చేసుకోవాలో ఆచరించి చూపిన వ్యక్తి. వయసు అనేది శరీరానికే గానీ మనసుకు గాదు అంటూ ఆరు పదుల వయసులోనూ యువకుడిలా చురుకుగా పనిచేస్తూ యువతకు, ఎందరో వ్యాపారా దిగ్గజాలకు స్ఫూర్తిగా నిలిచారు. పైగా ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా బతికే ఉండటం అంటే ఏంటో చేసి చూపించారు టాటా. (చదవండి: రతన్ టాటా ఎలాంటి వంటకాలు ఇష్టపడేవారంటే..!) -
టాటా ప్రతీకారం అలా తీరింది..!
దేశం అత్యంత ఎత్తైన పారిశ్రామిక శిఖారాన్ని కోల్పోయింది. టాటా గ్రూప్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. అనేక రకాల వ్యాపారాల్లో చరిత్ర సృష్టించిన టాటా గ్రూప్‌నకు వైఫల్యాలు, వాటి నుంచి అద్భుతంగా పునరాగమనం చేసిన చరిత్ర కూడా ఉంది.టాటా కలను ఎగతాళి చేశారు..కార్పొరేట్ చరిత్రలో టాటా వర్సెస్ ఫోర్డ్ ఉదంతానికి ప్రత్యేక స్థానం ఉంది.90 దశకం చివరలో అప్పుడు టాటా మోటర్స్ టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కో అనే పేరుతో ఉండేది. అప్పట్లో టాటా ఇండికా అనే కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. టాటా ఇండికాతో టాటా మోటర్స్‌ను దేశ ఆటోమొబైల్ రంగంలో కీలక సంస్థగా తీర్చిదిద్దాలన్నది స్వయంగా రతన్ టాటా కలగా ఉండేది. అయితే దేశంలోని కార్ల పరిశ్రమ సవాలుగా ఉన్న సమయంలో ఇండికాకు పెద్దగా ఆదరణ లభించలేదు.అసలే టాటా గ్రూప్‌నకు కార్ల కొత్త. దీంతో టాటామోటర్స్ ప్యాసింజర్ కార్ల విభాగాన్ని అమ్మేద్దాం అనుకున్నారు. అమెరికా ఆటోమొబైల్స్ సంస్థ ఫోర్డ్.. ఈ విభాగాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. అలా 1999లో టాటా తన బృందంతో కలిసి టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ విభాగం విక్రయంపై చర్చించేందుకు ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశం కోసం డెట్రాయిట్కు వెళ్లారు.అయితే సమావేశం అనుకున్న విధంగా జరగలేదు. ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లు టాటాను ఎగతాళి చేశారు. "మీరు కార్ల వ్యాపారంలోకి ఎందుకు వచ్చారు? దాని గురించి మీకు ఏమీ తెలియదు. మేము మీ కార్ల విభాగాన్ని కొనుగోలు చేస్తే అది మీకు చాలా మేలు చేసినట్లవుతుంది" అని వారిలో ఒకరు చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఇది టాటాను, వారి బృందాన్ని తీవ్రంగా బాధించింది. దీంతో ఒప్పందాన్ని వద్దనుకుని భారత్‌కి తిరిగొచ్చేశారు.ప్రతీకారం ఇలా తీరింది..తరువాత టాటా మోటర్స్ పుంజుకుంది. టాటా ఇండికాకు క్రమంగా ఆదరణ పెరిగింది. భారతీయ కార్ మార్కెట్లో మొట్టమొదటి డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌గా విజయవంతమైంది. తొమ్మిదేళ్ల తర్వాత 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఫోర్డ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దాని లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను విక్రయానికి పెట్టింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను ఫోర్డ్ నుండి 2.3 బిలియన్ డాలర్లకు టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. టాటాకు ఫోర్డ్ చేసిన అవమానానికి ఇలా ప్రతీకారం తీరింది. -
శ్రీ రతన్ టాటా గారికి గౌరవ వందనం
-
LIVE: కాసేపట్లో రతన్ టాటా అంతిమయాత్ర
-
'మన దేశ కుమారుడిని కోల్పోయాం'.. రజినీకాంత్ ఎమోషనల్ ట్వీట్
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా మరణం పట్ల సూపర్ స్టార్ రజినీకాంత్ సంతాపం వ్యక్తం చేశారు. తన విజన్, అభిరుచితో మనదేశాన్ని ప్రపంచపటంలో నిలిపారని కొనియాడారు. దేశంలోని వేలాది మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో తరాలుగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తిని కోల్పోవడం తీరని లోటన్నారు. ఈ మేరకు ఆయనతో ఉన్న ఫోటోను రజినీకాంత్ ట్వీట్ చేశారు. రజినీకాంత్ తన ట్వీట్లో.. 'తన విజన్, అభిరుచితో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిచారు. వేలాది మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చి, ఎన్నో తరాలుగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తి. అందరి అభిమానం, గౌరవం పొందిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తితో గడిపిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గౌరవిస్తాను. భారతదేశానికి నిజమైన కుమారుడు ఇక లేడు. .. మీ ఆత్మకు శాంతి కలగాలి' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.A great legendary icon who put India on the global map with his vision and passion ..The man who inspired thousands of industrialist .. The man who created lakhs and lakhs of jobs for many generations ..The man who was loved and respected by all .. My deepest salutations to… pic.twitter.com/S3yG1G7QtK— Rajinikanth (@rajinikanth) October 10, 2024 -
రతన్ టాటాపై డాక్యుమెంటరీ ఈ ఓటీటీలో స్ట్రీమింగ్
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి పేరు గడించారు. తన సంపదలో దాదాపు 65 శాతం భాగాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. ఆపై యువకులు స్థాపించే పలు స్టార్టప్ కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. అందుకే ఆయన్ను దేశ ప్రజలందరూ అభిమానిస్తారు.ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుడైన పారిశ్రామికవేత్త ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లడంతో రతన్ టాటా గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆయన అభిమానులు అందరూ సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. ఆయనకు సంబంధించిన బయోపిక్, డాక్యుమెంటరీలు ఏమైనా ఉన్నాయా..? అంటూ పోస్టులు పెడుతున్నారు.ఆయన గురించి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఒక ఎపిసోడ్‌ను చేసింది. 'మెగా ఐకాన్స్' పేరుతో ఆ ఓటీటీ సంస్థ గతంలోనే పంచుకుంది. సీజన్2 నుంచి ఎపిసోడ్2లో రతన్ ప్రయాణానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అందులో అరుదైన ఫోటోలతో పాటు.. ఆయన గురించి పూర్తి విషయాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, బెంగాలీ, ఇంగ్లిష్ వంటి భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. డాక్యుమెంటరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఈ డాక్యుమెంటరీ ఆసియా టెలివిజన్ వేదికపై ఉత్తమ డాక్యుమెంటరీగా టైటిల్‌ను అందుకుంది. అయితే, రతన్ టాటా బయోపిక్‌ను ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర తీయనున్నట్లు రెండేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తల్లో నిజం లేదని ఆమె పేర్కొంది. -
రతన్‌టాటాకు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి (ఫొటోలు)
-
రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. స్టార్ హీరోతో సినిమా
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ దిగ్గజం రతన్ నావల్ టాటా నింగికేగిశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. మనదేశంలో దిగ్గజ వ్యాపారవేత్తగా పేరు గడించారు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు కూడా నివాళులర్పిస్తున్నారు.అయితే రతన్ నావల్ టాటా కేవలం వ్యాపారవేత్త అని మనందరికీ తెలుసు. కానీ ఆయన కళాపోషణ కూడా ఉందన్నది చాలామందికి తెలియదు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా.. రతన్ టాటాకు సినిమాలంటే అమితమైన ఆసక్తి. గతంలో అంటే 2004లో ఒక బాలీవుడ్ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు నటించిన ఏట్బార్ అనే మూవీ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. రతన్ టాటా ఈ చిత్రాన్ని జతిన్ కుమార్‌తో కలిసి టాటా బీఎస్ఎస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. బాలీవుడ్ స్టార్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో పడింది. ఈ సినిమాను రూ. 9.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. కేవలం రూ.7.96 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రతన్ టాటా నిర్మించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. -
రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు
Updatesముగిసిన రతన్ టాటా అంత్యక్రియలువర్లి శ్మశానవాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలురతన్ టాటాకు పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు తుపాకీలు పేల్చి గౌరవ వందనం సమర్పించారు.#WATCH | Last rites of veteran industrialist Ratan Tata, being performed with state honour at Worli crematorium in Mumbai pic.twitter.com/08G7gnahyS— ANI (@ANI) October 10, 2024 ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర నేతలు నివాళులర్పించారు.#WATCH | Union Home Minister Amit Shah, Maharashtra CM Eknath Shinde, Gujarat CM Bhupendra Patel, Maharashtra Deputy CM Devendra Fadnavis and other leaders pay tribute to veteran industrialist Ratan Tata, at Worli crematorium in Mumbai. pic.twitter.com/GRzHMn2B7E— ANI (@ANI) October 10, 2024 రతన్ టాటా పార్థీవదేహానికి పోలీసుల గౌరవ వందనంవర్లి శ్మశానవాటికకు చేరుకున్న రతన్ టాటా పార్థివదేహం#WATCH | Mumbai, Maharashtra: Mortal remains of veteran industrialist Ratan Tata brought to Worli crematorium for his last rites, which will be carried out with full state honour. pic.twitter.com/8lB2F2AmFH— ANI (@ANI) October 10, 2024 కేంద్రం తరఫున కేంద్ర మంత్రి అమిత్ షా రతన్ టాటా అంత్యక్రియలకు హాజరయ్యారు.ఎన్సీపీఏ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన రతన్ టాటా అంతిమ యాత్ర కొనసాగుతోంది. ఎన్సీపీఏ గ్రౌండ్ నుంచి రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభమైంది.కాసేపట్లో వర్లి శ్మశానవాటికలో రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి.అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు జరుగుతాయి. రతన్ టాటా అంతిమ యాత్ర ప్రారంభం అయింది.ఎన్సీపీఏ గ్రౌండ్ రతన్ టాటా పార్థివదేహానికి రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖలు నివాళులు ఆర్పించారు.ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అధికారిక లాంఛనాలతో రతన్‌టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మృతిని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు.టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి.. పేదవాడి కారు కలను తీర్చాలని ‘నానో’ తెచ్చిన టాటా గొప్ప వితరణశీలి. యువతకు ఆదర్శప్రాయుడు. విలువలపై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన దార్శనికుడు. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆయన వయసు 86 ఏళ్లు. -
ఇకపై టాటా గ్రూప్ సారథులు వీరేనా..?
దేశంలో టాటా గ్రూప్ లెగసీ చాలా పెద్దది. రతన్‌టాటాకు పెళ్లి కాకపోవడంతో తన వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించేవారు లేకుండాపోయారు. దాంతో రతన్ టాటా తర్వాత దాదాపు రూ.30 లక్షల కోట్ల టాటా గ్రూప్ సంస్థలను ఎవరు ముందుకు తీసుకెళతారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ సామర్థ్యం ఎవరికి ఉందనే చర్చ కొనసాగుతుంది.అయితే తన ఫ్యామిలీకే చెందిన తన సోదరుడు నోయెల్‌టాటా కుమార్తెలు లేహ్, మాయా, కుమారుడు నెవిల్లీలకు రతన్ టాటా వ్యాపార మెలకువలు నేర్పినట్లు పలు సంస్థలు నివేదించాయి. టాటాగ్రూప్ను ముందుకు నడిపే సత్తా వారికి ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. కానీ సంస్థతో వారికున్న అనుబంధం, వారి నైపుణ్యాలు, విద్యా ప్రమాణాలు తెలిస్తే టాటా నాయకత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలరని తెలుస్తోంది.లేహ్ టాటానోయెల్ టాటా పెద్ద కుమార్తె.మాడ్రిడ్‌లోని ఐఈ బిజినెస్ స్కూల్లో తన ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. తాజ్ హోటల్స్ రిసార్ట్స్ & ప్యాలెస్‌లలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా తన కెరియర్ ప్రారంభించారు. సేల్స్ విభాగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్ హోటల్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.మాయా టాటాలేహ్ టాటా సోదరి మాయా టాటా.మాయా టాటా రతన్ టాటా మార్గదర్శకత్వంలో టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో తన కెరియర్‌కు మొదలుపెట్టారు. ఆమె పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా, ఇన్వెస్టర్ రిలేషన్స్ రిప్రజంటేటివ్‌గా పని చేశారు.యూనివర్శిటీ ఆఫ్ వార్విక్, బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. టాటా క్యాపిటల్, ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో రూ.1,000 కోట్లు కేటాయించిన టాటా డిజిటల్ కంపెనీలో కీలకస్థానంలో పనిచేశారు.టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ ఆరుగురు బోర్డు సభ్యుల్లో ఒకరిగా మాయా ఉన్నారు.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడునెవిల్లే టాటానోయెల్ టాటా చిన్న కుమారుడు.నెవిల్లే టాటా కూడా బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. ట్రెంట్ హైపర్‌మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సారథ్యం వహిస్తున్నారు. ఇది టాటా గ్రూప్ బ్రాండ్లైన వెస్ట్‌సైడ్ , స్టార్ బజార్లకు మాతృసంస్థగా ఉంది. -
రతన్ టాటా ఎలాంటి వంటకాలు ఇష్టపడేవారంటే..!
టాటా సన్స్ మాజీ చైర్మన్, భారతీయ పారిశ్రామికవేత్త రతన్ నావల్ టాటా (86) బుధవారం కన్నుమూశారు. ఆయన మృతి వార్త విని వ్యాపార దిగ్గజాలే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు. పరోపకారి, మూగజీవాల ప్రేమికుడు కూడా. కేవలం సంపదను సృష్టించడమే కాకుండా ఎన్నో దాతృత్వ సేవలతో అందరి మనుసులను దోచుకున్న మహనీయుడు. నానో కారుతో మధ్య తరగతి కుటుంబాల కారు కలను తీర్చేందుకు ముందుకు వచ్చిన గొప్ప పారిశ్రామిక వేత్త. అలాంటి గొప్ప వ్యక్తి ఇక మనముందు లేరనే విషయం కలిచివేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.రతన్ టాటా పార్సీ కమ్యూనిటీకి చెందిన వారు. అందువల్ల తన కమ్యూనిటీ సంబంధించిన ఆహారాన్నే ఇష్టంగా తినేవారు. ఇంట్లో వండిన ఆహారానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాగే ఆయన తన సోదరి చేసే సంప్రదాయ వంటకాలను అమితంగా ఇష్టపడేవారు. అయితే రతన్ టాటాను తన వంటకాలతో ఆకట్టుకున్న మరో వ్యక్తి కూడా ఉన్నారు. అయనే ప్రముఖ పార్సీ చెఫ్ పర్వేజ్ పటేల్.పర్వేజ్‌కు టాటా పరిశ్రమలతో దీర్థకాల అనుబంధం ఉంది. అంతలా పర్వేజ్ రతన్‌టాటాకు ఇష్టమైన చెఫ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముంబైలో పుట్టి పెరగిన పర్వేజ్ ప్రస్థానం గ్యారెజీ రెస్టారెంట్ నుంచి మొదలయ్యింది. తొలుత టీ, స్నాక్స్‌తో ప్రారంభమైన అతని పాక నైపుణ్యం త్వరిగతిలోనే విశేష ప్రజాధరణ పొందింది. మొదట్లో అతడి రెస్టారెంట్ మోటార్ సైకిల్ గ్యారెజ్ వాళ్లకు పేరుగాంచింది.కాలక్రమేణ పార్సీ ఆహార ప్రియులకు హాట్‌స్పాట్‌గా మారింది. సాంప్రదాయ పార్సీ వంటకాలపై పర్వేజ్‌కి ఉన్న ప్రావీణ్యం టాటా గ్రూప్‌తో సహా పలువురిని ఆకర్షించింది. అలా ఆయన టాటా స్టీల్ వార్షిక ఫంక్షన్లో వంటలు చేసే స్థాయికి చేరుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన వ్యక్తిగత చెఫ్‌గా మారాడు. అంతేగాదు ఒక ఇంటర్వ్యూలో పర్వేజ్ రతన్ టాటాకు హోమ్‌స్టైల్ పార్సీ వంటకాలంటే మహా ఇష్టమని తెలిపాడు. ఆయనకి ఖట్టా-మీఠా మసూర్ దాల్ (వెల్లుల్లితో వండిన తీపి పప్పు వంటకం), మటన్ పులావ్ పప్ప, ఐకానిక్ నట్-రిచ్ బేక్డ్ సీతాఫలం తదితారాలంటే ఫేవరెట్ ఫుడ్స్ అని చెప్పుకొచ్చాడు. ఇక పర్వేజ్ వివిధ నగరాల్లో పార్సీ వంటకాలను అందించారు. అలాగే ఐటీసీ ఫుడ్ ఫెస్టివల్స్‌లో భాగంగా చాలామందికి పార్శీ సంప్రదాయ ఆహారాన్ని పరిచయం చేశారు. (చదవండి: ఈసారి దసరా వెకేషన్‌కి కుట్రాలం టూర్..!) -
రతన్ టాటాకు భారత రత్న!.. మహారాష్ట్ర కేబినెట్ ప్రతిపాదన
ముంబైలో మరణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయాలని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. వ్యాపార, సేవా రంగాల్లో అతని సేవలు అనితరమైనవవి అని పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పద్మవిభూషణ్ రతన్ టాటాకు నివాళులు అర్పించారు. రతన్ టాటా మృతిపై సంతాప ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించింది.కాగా పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా.. 86 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు ప్రపంచ దేశాల ప్రముఖుల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్నాయి. రతన్ టాటా మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.రతన్ టాటా మృతికి గౌరవ సూచికంగా మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. నేడు జరగాల్సిన అన్ని వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేశారు. ముంబైలోని ఎన్సిపిఎలో రతన్ టాటా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. పార్టీలకు అతీతంగా నాయకులు ఆయనకు నివాళులు అర్పించడానికి తరలివస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వర్లీలో జరగబోయే ఆయన అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవ్వనున్నారు. -
‘తాజ్ తునాతునకలైనా.. ఏ ఉగ్రవాదినీ వదలొద్దు’
ముంబై: ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా రతన్ టాటా అక్టోబర్ 9న కన్నుమూశారు. మంచి వ్యక్తిగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న రతన్ టాటా విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి అంశాలలో దేశానికి పలు సేవలు అందించారు. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడిలో, ఉగ్రవాదులు హోటల్ తాజ్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఘటనపై రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.2008లో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్రం మీదుగా దక్షిణ ముంబైలోకి ప్రవేశించి, తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌తో సహా నగరంలోని పలు ప్రదేశాలలో దాడులకు పాల్పడి, భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ 26/11 దాడుల సమయంలో ఎవరో తనకు ఫోన్ చేసి, హోటల్ లోపల కాల్పులు జరుగుతున్నాయని చెప్పారని, దీంతో తాను వెంటనే తాజ్ హోటల్ సిబ్బందికి ఫోన్ చేశానని, అయితే తన కాల్ ఎవరూ స్వీకరించలేదని అన్నారు.ఆ తర్వాత తాను కారులో తాజ్ హోటల్‌కు వెళ్లానని, అయితే లోపల కాల్పులు జరుగుతున్నందున తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నానని రతన్ టాటా తెలిపారు. ఆ సమయంలో తాను ‘ఒక్క ఉగ్రవాదిని కూడా ప్రాణాలతో విడిచిపెట్టకూడదని, అవసరమైతే తాజ్ ఆస్తులను పేల్చివేయండి’ అని భద్రతా సిబ్బందికి చెప్పానని రతన్ టాటా పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు ముంబైలో 26/11 దాడికి పాల్పడ్డారు. ఇందులో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా జనం గాయపడ్డారు. ఇది కూడా చదవండి: టాటా వెన్నంటే ఉన్న ఈ కుర్రాడి గురించి తెలుసా..? -
టాటా వెన్నంటే ఉన్న ఈ కుర్రాడి గురించి తెలుసా..?
రతన్ టాటా దేశంలో పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రియలిస్టుగా ఆయన గొప్పపేరు తెచ్చుకోవడమే కాదు, మానవతావాదిగా దేశప్రజల గుండెల్లో చోటు సంపాదించిన ఘనత ఆయన సొంతం. 86 ఏళ్ల రతన్‌టాటాకి చివరి వరకు అన్ని వేళల్లో సహాయకుడిగా తోడున్న వ్యక్తి శంతన్ నాయుడు(31). టాటా కుటుంబంతో ఎటువంటి సంబంధంలేని ఈయన రతన్ టాటాకి ఎలా చేరువయ్యాడో.. ఇద్దరికి కామన్‌గా ఉన్న అభిరుచేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.శంతన్ నాయుడు 1993లో పుణెలో జన్మించారు. పుణె యూనివర్సిటీ నుంచి 2014లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత టాటా గ్రూపులో డీజీఎం హోదాలో చేరారు. రతన్ టాటాకు మలి వయసులో ఈ యువ ఇంజినీర్ చేదోడు వాదోడుగా నిలిచారు.మూగజీవులకు సాయం చేసే గుణంఓ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుంటే రోడ్డు మధ్యలో వీధి కుక్క చనిపోయి కనిపించింది. ఆ కుక్క మృతదేహం మీదుగానే వాహనాలు పోతుండడం గమనించాడు. ఈ దృశ్యం చూసి శంతన్ చలించిపోయాడు. వీధి కుక్కుల సంరక్షణకు ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో పడ్డాడు. తన స్నేహితులతో కలిసి వీధి కుక్కల కోసం రేడియం స్టిక్కర్లతో తయారు చేసిన కాలర్స్‌ని తయారు చేశాడు. తన ఇంటి పరిసరాల్లోని కుక్కలకు వాటిని అమర్చాడు. ఆ పనికి మరుసటి రోజే స్థానికుల నుంచి మెప్పు పొందాడు. ఈ క్రమంలో ముంబైలో ఉన్న వీధి కుక్కలన్నింటికీ ఈ రేడియం కాలర్ అమర్చాలని నిర్ణయించారు. కానీ అది డబ్బుతో కూడకున్న వ్యవహారం కావడంతో విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. ఆయన ‘వీధి కుక్కలను కాపాడేందుకు సాయం చేయాల్సిందిగా రతన్ టాటాని అడుగు. ఆయనకు కుక్కలంటే ఇష్టం’ అని సలహా ఇచ్చాడు.టాటాతో పరిచయం ఇలా..వీధి కుక్కలను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు ‘మోటోపాస్’ పేరుతో స్టార్టప్ ఏర్పాటు చేశానని, దానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ పూర్తి వివరాలు కలిగిన ఈ మెయిల్‌ను ఏకంగా రతన్‌టాటాకే పంపాడు. రోజులు గడుస్తున్నా ఎలాంటి రిప్లై లేకపోవడంతో తన రెగ్యులర్ పనిలో నిమగ్నమయ్యాడు. చివరకు రెండు నెలల తర్వాత నేరుగా తనని కలవాలంటూ రతన్‌టాటా నుంచి ఆహ్వానం అందింది. అదే రతన్‌టాటాతో శంతన్ నాయుడికి తొలి పరిచయం ఏర్పడేలా చేసింది. వ్యక్తిగతంగా రతన్ టాటాను కలిసి తన ప్రాజెక్టు గురించి వివరించాడు. వీధి కుక్కల పట్ల అతను చూపించే ప్రేమకు రతన్‌టాటా ఫిదా అయ్యారు. వెంటనే సాయం చేసేందుకు అంగీకరించారు. అలా మోటోపాస్ స్టార్టప్‌నకు ఆర్థికసాయం అందింది.ఇదీ చదవండి: వర్షంలో తడిసిన ఆ నలుగురే ‘నానో’కు పునాదిచివరి వరకు తనతోనే..కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు రావడంతో శంతన్ అమెరికా బయల్దేరాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత టాటా గ్రూపులో పని చేయాలని శంతను నిర్ణయించుకున్నాడు. ఎంబీఏ పూర్తయి తిరిగి వచ్చిన ఇండియా తర్వాత టాటా ట్రస్టులో డిప్యూటీ జనరల్ మేనేజర్(డిజీఎం) హోదాలో చేరారు. అయితే కొద్ది కాలానికే శంతన్‌ను పిలిపించుకున్న రతన్ టాటా..తనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉండాలని కోరారు. దాంతో 2018 నుంచి టాటా తుది శ్వాస వరకు వెన్నంటి ఉన్నాడు.ఒంటరితనం పోగొట్టేందుకు స్టార్టప్సాటి జీవుల పట్ల శంతను నాయుడికి ఉన్న ప్రేమ రతన్‌టాటాను ఆకట్టుకున్నాయి. శంతన్ నాయుడి ఆలోచణ సరళి టాటాను ఆకర్షించింది. మోటోపాస్‌తోపాటు శంతన్ సెప్టెంబర్ 2022లో ‘గుడ్‌ఫెలోస్’ను స్థాపించారు. ఇది యువకులను మమేకం చేసి సీనియర్ సిటిజన్ల ఒంటరితనం పోగొట్టేందుకు పనిచేస్తోంది. అతను ‘ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్’ పేరుతో రతన్ టాటాతో ఉన్న జ్ఞాపకాలు, తన నుంచి నేర్చుకున్న విషయాలపై పుస్తకం రాశారు. -
నువ్వు లేవంటున్నారు..కష్టంగా ఉంది.. రతన్ టాటా మాజీ ప్రేయసి భావోద్వేగం
-
Tata Family Tree: టాటా వంశవృక్షం ఇదే..
టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థగా గుర్తింపు పొందింది. టాటా గ్రూప్‌లో దాదాపు 100 కంపెనీలు ఉన్నాయి. టాటా గ్రూప్ ఉత్పత్తులు ప్రపంచంలోని దాదాపు 150 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. టాటా గ్రూప్ 1868లో ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమైంది. ఈ కంపెనీ అధిపతి రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేరు.టాటా గ్రూప్ వంశవృక్షాన్ని పరిశీలిస్తే ఈ కుటుంబంలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. టాటా కుటుంబ వ్యాపారానికి రతన్ దొరబ్ టాటా పునాది వేశారు. ఆయనకు ఇద్దరు సంతానం. వారు బాయి నవాజ్‌బాయి రతన్ టాటా, నుస్సర్వాన్జీ రతన్ టాటా. నుస్సర్వాన్జీ ఒక పార్సీ పండితుడు. ఈ కుటుంబం నుంచి వ్యాపారంలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. అతను 1822లో జన్మించి 1886లో మరణించారు. జంషెడ్జీ టాటానుస్సర్వాన్జీ టాటాకు ఐదుగురు సంతానం. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త జంషెడ్జీ టాటా ఒకరు. అతను టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు. టాటా గ్రూప్‌లోని స్టీల్ (టాటా స్టీల్), హోటళ్లు (తాజ్ మహల్) వంటి ప్రధాన వ్యాపారాలకు పునాది వేశారు. ఆయనను భారతీయ పరిశ్రమ పితామహునిగా పిలుస్తారు. అతని జీవిత కాలం 1839 నుండి 1904.దొరాబ్జీ టాటాదొరాబ్జీ టాటా జంషెడ్జీ టాటా పెద్ద కుమారుడు. జంషెడ్జీ టాటా తర్వాత టాటా గ్రూప్ వ్యాపారాన్ని ఆయనే చేపట్టారు. అతని జీవిత కాలం 1859-1932. టాటా పవర్ వంటి వ్యాపారాలను నెలకొల్పడంలో దొరాబ్జీ కీలక పాత్ర పోషించారు.రతన్ జీ టాటారతన్జీ టాటా జంషెడ్జీ టాటా చిన్న కుమారుడు. అతని జీవితకాలం 1871 నుండి 1918. అతను టాటా గ్రూప్‌నకు పత్తి- వస్త్ర పరిశ్రమల వంటి వ్యాపారాలను జోడించారు.జేఆర్డీ టాటాజేఆర్డీ టాటా పూర్తి పేరు జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా. అతని జీవితకాలం 1904-1993. ఇతను రతన్జీ టాటా, సుజానే బ్రియర్ల కుమారుడు. 50 ఏళ్లకు పైగా టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా ఎయిర్‌లైన్స్‌ను జెఆర్‌డి టాటా స్థాపించారు. ఈ విమానయాన సంస్థ పేరు ఎయిర్ ఇండియా.నావల్ టాటానావల్ టాటా జీవిత కాలం 1904- 1989. ఇతను రతన్జీ టాటా దత్తపుత్రుడు. రతన్ నావల్ టాటా 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా, 2016-17మధ్యలో తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ , టెట్లీ వంటి అంతర్జాతీయ బ్రాండ్ల కొనుగోలులో నావల్ టాటా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన టాటా ఇంటర్నేషనల్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నారు.రతన్ టాటారతన్ టాటా జీవిత కాలం 1937 నుండి 2024. ఈయన నావల్ టాటా, సునీ కమిషరియట్ల కుమారుడు. రతన్ టాటా భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు.నోయల్ టాటాకు ముగ్గురు కుమారులురతన్ టాటా వరుస సోదరుడు నోయెల్ టాటా ముగ్గురు సంతానం. వారు మాయా టాటా, నెవిల్లే టాటా, లియా టాటా. ఈ ముగ్గురూ టాటా గ్రూప్‌లో వేర్వేరు వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా చదవండి: టాటా గ్రూప్ వ్యాపార వివరాలు తెలిపే వీడియో -
భవిష్యత్ తరాలకు రతన్ టాటా రతనాల మాటలు
-
వర్షంలో తడిసిన ఆ నలుగురే ‘నానో’కు పునాది
రతన్ టాటాతోపాటు గతంలో సంస్థ పగ్గాలు చేపట్టిన సారథులు ఇండియాను ఒక ఎకనామిక్ సూపర్ పవర్‌గా చూడాలనుకున్నారు. అందుకే పేద, మధ్య తరగతి ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎక్కువగా కృషి చేశారు. అందులో భాగంగానే రతన్ టాటా ‘నానో’ కారును విడుదల చేశారు. అయితే ఈ కారు ఆవిష్కరణకు పునాది ఎలా పడిందో ఈ కథనంలో తెలుసుకుందాం.ఒకసారి రతన్‌టాటా తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక దంపతులిద్దరు, ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. అంతే..వెంటనే ఆయన పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా దాదాపు రూ.ఒక లక్ష ధర ఉండేలా ఒక కారుని తయారు చేయాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు. లక్ష రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారు? అని భయపెట్టారు. కొంత మంది వెటకారం చేశారు. కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజినీర్లను పిలిపించారు. కానీ వారు లక్ష రూపాయల్లో కారుని తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా అంతటితో ఆగిపోలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు ‘నానో’ను ఆవిష్కరించారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల నానో కారు విఫలమైంది. నానో కారు తయారుచేయడం వల్ల వేల కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల.ఇదీ చదవండి: ‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తరువాత స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. దాంతో మొత్తం ప్లాంట్‌ను పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్‌కు తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. -
మీరు దేశం కోసమే పుట్టారు.. రతన్ టాటాకు సినీ లోకం ఘన నివాళి
-
పార్సీ అయిన టాటాకు హిందూ పద్ధతిలో అంత్యక్రియలు?
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. దీనికి ముందు ముంబైలోని నారిమన్ మైదానంలో గల ఎన్సీపీఏలాన్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.రతన్ టాటా పార్సీ సమాజానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ అతని అంత్యక్రియలు హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ముంబైలోని వర్లీలోగల విద్యుత్ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఇక్కడ దాదాపు 45 నిమిషాల పాటు ప్రార్థనలు జరుగుతాయి. అనంతరం అంత్యక్రియల ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నేపధ్యంలో పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియల పద్ధతి ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది.There’s a Hindu pujari, Christian priest, Muslim Imam and a Sikh sant standing behind. Sanghis may not like this, but this is truly secular …..!!Rest in peace Sir Ratan Tata ….. 🙏 pic.twitter.com/DjiYNOPR7C— Mayank Saxena (@mayank_sxn) October 10, 2024 పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియల నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరిలో అంత్యక్రియల సంప్రదాయం మూడు వేల సంవత్సరాల నాటిది. పార్సీలు అనుసరించే జొరాస్ట్రియనిజంలో మనిషి మృతి చెందాక ఆ మృతదేహాన్ని రాబందులు తినేందుకు అనువుగా బహిరంగ ప్రదేశంలో ఉంచుతారు. దీనిని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని పిలుస్తారు. అయితే రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి. గతంలో అంటే 2022 సెప్టెంబర్‌లో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా హిందూ ఆచారాల ప్రకారం జరిగాయి. కరోనా మహమ్మారి సమయంలో మృతదేహాలను దహనం చేసే పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. ఆ సమయంలో పార్సీ సమాజంవారు అనుసరించే అంత్యక్రియల ఆచారాలను వివిధ ప్రభుత్వాలు నిషేధించాయి. ఇది కూడా చదవండి: టాటా గ్రూప్ వ్యాపార వివరాలు తెలిపే వీడియో -
‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’
రతన్ టాటా మృతిపట్ల ప్రముఖులు వివిధ మాధ్యమాల ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ రతన్ టాటాతో చివరిసారిగా గడిపిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆ వివరాలు పంచుకుంటూ టాటా మృతికి సంతాపం తెలియజేశారు.‘గూగుల్ క్యాంపస్‌లో రతన్ టాటాను చివరిసారి కలిసినప్పుడు ‘వేమో’(అధునాతన అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ) పురోగతి గురించి మాట్లాడాం. ఈ విభాగంలో ఆయన ఆలోచన విధానాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అసాధారణమైన వ్యాపార, దాతృత్వ వారసత్వం ఆయన సొంతం. భారతదేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వానికి మార్గదర్శకత్వం చేయడంలో రతన్ టాటా కీలకపాత్ర పోషించారు. భారత్‌ను ఆర్థికంగా మరింత మెరుగుపరిచేందుకు ఆయన ఎంతో శ్రద్ధ చూపారు. అతని మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని సుందర్ తెలిపారు.My last meeting with Ratan Tata at Google, we talked about the progress of Waymo and his vision was inspiring to hear. He leaves an extraordinary business and philanthropic legacy and was instrumental in mentoring and developing the modern business leadership in India. He deeply…— Sundar Pichai (@sundarpichai) October 9, 2024రతన్ టాటాపై ఇలోన్మస్క్టాటా ప్రపంచ ప్రఖ్యాత సంస్థల సారథులకు స్ఫూర్తిగా నిలిచారు. అమెరికన్ జర్నలిస్ట్ చార్లీ రోస్తో 2009లో ఇలోన్మస్క్తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా దూరదృష్టిని మస్క్ ప్రశంసించారు. ఇంటర్వ్యూలో భాగంగా భారతీయ మార్కెట్లో టాటా తక్కువ ధరకే కారు(నానో) అందిస్తున్నారని మస్క్ దృష్టికి తీసుకొచ్చారు. ‘రతన్ టాటా ఇండియాలో విప్లవాత్మక మార్పునకు తెరతీశారు. కేవలం రూ.ఒక లక్షకు కారు అందించడం గొప్ప విషయం. కారు సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే దూరదృష్టి టాటాది’ అని మస్క్ బదులిచ్చారు.He fulfilled his promise to build the world's cheapest car.- Ratan Tata wanted to build a car, which the middle class of India could afford and so he delivered on his promise and launched Tata Nano for just $1,200 (₹1 lakh) in 2008.- @ElonMusk also shared his views on the… pic.twitter.com/QqTY5KuQLK— Nico Garcia (@nicogarcia) August 26, 2024రతన్ టాటాపై బిల్ గేట్స్‘రతన్ టాటా దూరదృష్టి కలిగిన నాయకుడు, సామాన్యుల జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం ఎనలేనిది. అతడి వ్యక్తిత్వం భారతదేశం, ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. ప్రజలకు సేవ చేసేందుకు రతన్ టాటాతో కలిసి అనే సందర్భాల్లో వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. అతడి మరణం రాబోయే తరాలకులోటు. కానీ అతడు అనుసరించిన విలువలు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’ అని బిల్‌గేట్స్ తెలిపారు.ఇదీ చదవండి: సినీనటి సంతాపం.. అప్పట్లో ఇద్దరి మధ్య ప్రేమ?మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా, ముఖేష్ అంబానీ వంటి వ్యాపార ప్రముఖులు, రాజకీయ, సినీ దిగ్గజాలు ఆయనకు సంతాపం తెలిపారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో టాటా తుది శ్వాస విడిచారు. -
Ratan Tata: వ్యాపారవేత్తే కాదు.. యుద్ద విమానాలు నడిపిన పైలట్ కూడా!
దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా వ్యాపారవేత్తగానే కాకుండా, గొప్ప మానవతావాదిగా.. ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే రతన్‌కు వైమానిక రంగంపై కూడా ఆసక్తి ఎక్కువే. ఆయన హెలికాప్టర్లు, విమానాలు నడిపే ఓ మంచి పైలట్ కూడా. వీటిని నడిపేందుకు లైసెన్స్ కూడా ఉంది.2007లో ఆయనకు ఏకంగా యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం వచ్చింది. 69 ఏళ్ల వయసులో ఫైటర్ జెట్‌ను నడిపి రికార్డు సృష్టించారు. 2007లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో అమెరికా రక్షణ రంగ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ F-16 ఫైటర్ జెట్‌ను నడిపేందుకు ఆహ్వానం వచ్చింది. దీంతో రతన్ టాటా తొలిసారిగా యుద్ధ విమానాన్ని నడిపారు. అనుభవజ్ఞుడైన అమెరికా పైలట్ మార్గదర్శకత్వంలో కోపైలట్ రతన్ టాటా ఎఫ్-16లో గాల్లో దూసుకుపోయారు. దాదాపు అరగంట పాటు పూర్తిస్థాయిలో పైలట్‌గా విమానాన్ని నియంత్రిస్తూ ఎంజాయ్ చేశారు.ఈ సమయంలో పైలట్ సాయంతో కొన్ని విన్యాసాలు కూడా చేశారు. ఓ సందర్భంలో వీరి విమానం భూమికి కేవలం 500 అడుగుల ఎత్తులో 600 నాట్స్ వేగంతో దూసుకుపోయింది. ఆయనకు ఓ రెప్లికాను కూడా లాక్హిడ్ గిఫ్ట్‌గా ఇచ్చింది. యుద్ధ విమానం నడపడం ఒళ్లు గగుర్పొడిచే అనుభవం అని ఆయన ఆ తరువాత మీడియాకు తెలిపారు. అంతేగాక యుద్ధ విమానం నడుపుతూ రతన్ టాటా ఎంతో థ్రిల్ అయ్యారని ఆయనను గైడ చేసిన లాక్‌హీడ్ మార్టిన్ పైలట్ కూడా చెప్పుకొచ్చారు.అయితే, ఎఫ్-16ను నడిపిన మరుసటి రోజే రతన్ టాటా మరో యుద్ధ విమానంలో విహరించారు. ఎఫ్-16 కంటే శక్తిమంతమైన బోయింగ్ సంస్థకు చెందిన ఎఫ్ -18 హార్నెట్ యుద్ధ విమానంలో ఆయన గగనతలంలో విహరించారు. అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ కార్యకలాపాలకు ఎఫ్ - 18 అప్పట్లో కీలకంగా ఉండేది. వైమానిక రంగంపై విశేషాసక్తి కనబరిచే రతన్ టాటాకు వరుసగా రెండుసార్లు యుద్ధ విమానాల్లో విహరించే అవకాశం రావడంతో తన కల నేరవేరినట్టు భావించారట. ఇదిలా ఉండగా దాదాపు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిరిండియా తిరిగి రతన్ టాటా హయాంలోనే మాతృ సంస్థకు చేరుకొన్న విషయం తెలిసిందే. -
టాటాకు భారతరత్న ఇవ్వాలని పిటిషన్ దాఖలు.. కోర్టు ఏం చెప్పిందంటే?
బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా యావత్ ప్రపంచం రతన్ టాటా దేశానికి చేసిన సేవల్ని, సాధించిన విజయాల్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే పలువురు టాటాను భారతరత్నతో భారతరత్నతో సత్కరించాలని కోరుకుంటున్నారు.అదే సమయంలో గతంలో రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు, ఆ పిటిషన్లపై జరిగిన చర్చ గురించి ప్రస్తావిస్తున్నారు.2022లో టాటాకు భారతరత్న ఇవ్వాలని కోర్టులో పిల్రతన్ టాటా 2000 సంవత్సరంలో దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ను, 2008లో భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. కానీ అన్నీ రంగాల్లో అసమాన్య సేవలు చేసినప్పటికీ భారతరత్న అవార్డ్‌ను ఆయన్ని వరించలేకపోయింది.కోర్టు ఏం చెప్పిందంటే? ఇదే విషయంపై విచారణ చేపట్టాలంటూ పిటిషనర్ 2022లో ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) దాఖలు చేశారు. ఆ పిల్లో రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని కోరారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను.. రతన్ టాటాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై అప్పటి ఢిల్లీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం పిల్‌ను కొట్టివేసింది, కోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని పేర్కొంది.పిటిషనర్ స్పందిస్తూదీనిపై పిటిషనర్ స్పందిస్తూ రతన్ టాటా సేవలు అమోఘం. అద్భుతం. అనిర్వచనీయం. అలాంటి మచ్చలేని వ్యక్తికి భారతరత్న అవార్డ్‌ను అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి అని అన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషనరే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొచ్చని సూచించింది. అనంతరం పిటిషనర్.. దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని లేదంటే జరిమానా విధించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.దీనిపై నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో #BharatRatnaForRatanTata అనే హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేయగా.. నెటిజన్ల డిమాండ్‌పై రతన్ టాటా స్పందించారు. While I appreciate the sentiments expressed by a section of the social media in terms of an award, I would humbly like to request that such campaigns be discontinued. Instead, I consider myself fortunate to be an Indian and to try and contribute to India’s growth and prosperity pic.twitter.com/CzEimjJPp5— Ratan N. Tata (@RNTata2000) February 6, 2021రతన్ టాటా ట్వీట్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై రతన్ టాటా ట్వీట్ చేశారు. మీ మనోభావాలను నేను అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రచారాలను వెంటనే నిలిపివేయండి. దేశాభివృద్ధి, శ్రేయస్సు కోసం నావంతు సహకారం అందించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తానంటూ ట్వీట్లో పేర్కొన్నారు. భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నానని, దేశ ప్రగతికి సహకరించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానన్నారు.కాగా, రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా, శివసేన (ఏక్నాథ్ షిండే) నేత మహరాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే సన్నిహితుడు రాహుల్ కునాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కునాల్ షిండేకి లేఖరాశారు. -
ఎన్‌సీపీఏకు రతన్ టాటా పార్దివదేహాం తరలింపు (ఫొటోలు)
-
టాటా అంటే పేరు కాదు.. బ్రాండ్.. రతన్ టాటాకు ప్రముఖుల నివాళి
-
రతన్ టాటాతో చివరి మీటింగ్ గుర్తు చేసుకున్న గూగుల్ సీఈఓ
ముంబై: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన 86వ ఏట కన్నుమూశారు. ఆయన మృతిపై పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు రాజకీయ నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నివాళులు అర్పించిన వారిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు.భారతీయ సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వ్యాపార దిగ్గజం రతన్ టాటాతో తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. గూగుల్‌లో రతన్ టాటాతో తమ చివరి సమావేశంలో తాము అనేక అంశాలపై చర్చించామని సుందర్ పిచాయ్ తెలిపారు. ఆయన విజన్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆయన తన దాతృత్వ విలువలను మనకు అందించారు. మన దేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వానికి మార్గదర్శకత్వం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పిచాయ్ ఎక్స్ వేదికగా ఒక పోస్టులో పేర్కొన్నారు.భారతదేశాన్ని అభివృద్ధిపథంలో నడపడంలో టాటా ఎంతో శ్రద్ధ వహించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రతన్ జీ.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటున్నాను అంటూ సుందర్ పిచాయ్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. టాటా గ్రూప్‌నకు రతన్ టాటా 20 ఏళ్లు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు.ఇది కూడా చదవండి: రతన్ టాటా..రతనాల మాటలు -
ప్రజల సందర్శనార్థం ఎన్సీపీఏ గ్రౌండ్లో రతన్ టాటా పార్థివ దేహం
-
ముంబై NCPAకి రతన్ టాటా పార్థివ దేహం
-
నోయెల్ టాటాకు మోదీ ఫోన్.. అంత్యక్రియలకు అమిత్‌షా
రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పి.. విలువలు, దాతృత్వానికి పెట్టింది పేరు. విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలవడంతోపాటు మంచి స్వభావం గల వ్యక్తిగా కూడా పేరు సంపాదించారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇక మన మధ్యలేరనే నిజాన్ని అంగీకరించడం ఎవరి వల్ల అవ్వడం లేదు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో కన్నుమూసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు భారత్ నుంచే కాకుండా ప్రపంచ దేశాల ప్రముఖుల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్నాయి. రతన్ టాటా మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటాతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. ముంబైలో జరగబోయే ఆయన అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని నోయెల్‌కు మోదీ తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం రెండు రోజుల లావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో రతన్ టాటా అంత్యక్రియలను అమిత్ షా పర్యవేక్షిస్తారని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. కాగా రతన్ టాటా మృతికి గౌరవ సూచికంగా మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. నేడు జరగాల్సిన అన్ని వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేశారు.#WATCH | Mumbai | Mortal remains of veteran industrialist Ratan N Tata being taken to NCPA lawns for the public to pay their last respectsHe will be accorded state funeral this evening. pic.twitter.com/6JUgirUqkG— ANI (@ANI) October 10, 2024మరోవైపు టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పార్దివదేహాన్ని కోల్బాలోని నివాసానికి తరలించారు. అనంతరం ఉదయం ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ) గ్రౌండ్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 4 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అధికారిక లాంఛనాలతో సాయంత్రం వర్లీ ప్రాంతంలో రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. వ్యాపార దిగ్గజానికి కడసారి వీడ్కోలు పలికేందుకు సామాన్య ప్రజలు, ప్రముఖులు బారులు తీరనున్నారు.అంతకముందు రతన్ టాటా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త అని, ఎంతో దయగల అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. భారత్‌లోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు రతన్ టాటా స్థిరమైన నాయకత్వం అందించారని, మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారని పేర్కొన్నారు.ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆయన ధోరణి ఆచరణాత్మకమని, దయార్ద్ర హృదయంతో మెరుగైన సమాజం కోసం అనుక్షణం తపించే వారిని ప్రధాని కొనియాడారు. -
రతన్ టాటాను చంపాలనుకున్నారట!
మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం.. వంటి లక్షణాలు రతన్ టాటాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్ టాటా పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటారు. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్ స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ ఆ గ్యాంగ్ స్టర్ ఎవరు? ఎందుకు చంపాలని అనుకున్నాడు?టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్‌గా రతన్ టాటా ఎన్నో సేవలందించారు. గతంలో తాను సామాజిక మధ్యమంలో పంచుకున్న వివరాల ప్రకారం..కెరియర్ ప్రారంభంలో తనని ఓ ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్ బెదిరించాడని, వేరే వాళ్లతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తనని చంపేందుకు కుట్రకు పాల్పడ్డారని అన్నారు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్‌లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్‌నకు వ్యతిరేకంగా, ఓ యూనియన్ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు. అల్లరిమూకలతో టాటా మోట్సార్లో దాడులకు తెగపడ్డాడు. రతన్ టాటా అందుకు భిన్నంగా సదరు గ్యాంగ్ స్టర్‌ను బుజ్జగించి శాంతి యుతంగా చర్చలకు పిలవాలని కార్మికులను, తోటి సహచరులను కోరారు. కానీ గ్యాంగ్ స్టర్ మరోలా ఆలోచించాడు. టాటా మోటార్స్ ప్లాంట్‌లోని కార్మికుల్ని బెదిరించిన గ్యాంగ్‌స్టర్ ముఠా.. కత్తులతో దాడికి దిగింది. హెచ్చరికలు జారీ చేసేందుకు ప్లాంట్‌లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేసింది. తలవంచని నైజంలేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండేందుకు గ్యాంగ్‌స్టర్ నిరంతరం బెదిరింపులు పాల్పడ్డాడు. ఆ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. గ్యాంగ్‌స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో..దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. దీంతో, కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్‌లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడుచంపేందుకు పోటీదారులతో ఒప్పందంజైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్యాంగ్‌స్టర్ రతన్ టాటాను చంపేందుకు తన పోటీదారులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అంతేకాదు, తాను చెప్పినట్లుగా చేయాల్సిందేనంటూ టాటా గ్రూప్ కార్మికులకు ఆదేశాలు జారీ చేశాడు. టాటా మాత్రం గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు తలవంచకుండా ముందుకు సాగారు. నేడు రూ.లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. -
'అసలైన రతనాన్ని కోల్పోయాం'..రతన్ టాటా మృతిపై క్రీడా లోకం సంతాపం
పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఆయన ఇక లేరన్న వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. రతన్ టాటా మరణంపై ప్రముఖల నుంచి సామాన్యుల వరకు సంతాపం తెలుపుతున్నారు.ఈ క్రమంలో బిజినెస్ టైకూన్ టాటాకు క్రీడా ప్రముఖలు సైతం తమ నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశాడు."బంగారు హృదయం కలిగిన వ్యక్తి. ఎంతో మంది జీవితాలను మార్చిన గొప్ప వ్యక్తి మీరు. సర్ మీరు ఎప్పటకీ ప్రతీ ఒక్కరి గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారు": రోహిత్ శర్మ"మనం అసలైన భారత రతనాన్ని కోల్పోయాం. రతన్ టాటా జీ లేరన్న వార్త ను తట్టుకోలేకపోతున్నాం. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తి. మన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతారు. ఓం శాంతి": వీరేంద్ర సెహ్వాగ్ "రతన్ టాటా జీ మరణ వార్త విని షాక్ అయ్యాను. ఆయన చాలా దూరదృష్టి గల వ్యక్తి. ఆయనతో గడిపిన క్షణాలను నేను ఎప్పటకి మర్చిపోలేను. ఆయన ఈ జాతి మొత్తానికి స్పూర్తినిచ్చాడు. ఆయనను అభిమానించే వారందరికీ బలం చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి": నీరజ్ చోప్రా"రతన్ టాటా జీ వంటి దిగ్గజాన్ని కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరు ఎప్పటకీ మా గుండెల్లో నిలిచిపోతారు సర్": శిఖర్ ధావన్ I’m very sorry to hear about the passing of Shri Ratan Tata ji. He was a visionary, and I’ll never forget the conversation I had with him. He inspired this entire nation. I pray that his loved ones find strength. Om Shanti. 🙏— Neeraj Chopra (@Neeraj_chopra1) October 9, 2024 We have lost a true Ratan of Bharat, Shri Ratan Tata ji.His life will be an inspiration for us all and he will continue to live in our hearts. Om Shanti 🙏🏼🌸 pic.twitter.com/CvTRS3VYXp— Virender Sehwag (@virendersehwag) October 9, 2024 Saddened by the loss of a great leader. Rest in peace, Mr. @RNTata2000. Your kindness and contributions will always be remembered. 🙏— Shikhar Dhawan (@SDhawan25) October 9, 2024 I’m deeply saddened to hear about the passing of Shri Ratan Tata. His vision and leadership have profoundly shaped not only the Tata Group but also the landscape of Indian industry. His commitment to innovation and philanthropy has left a lasting legacy that will continue to… pic.twitter.com/cIKqZ9jFjO— Pragyan Ojha (@pragyanojha) October 9, 2024 -
‘లేరని ఊహించుకోవడం చాలా కష్టం’
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. టాటా అస్తమయం ఆత్మీయులకు తీరనిలోటు. టాటా కన్నుమూశారనే వార్త విని ఒకప్పటి సినీనటి సిమి గరేవాల్ తన ఎక్స్ ఖాతా ద్వారా నివాళులు అర్పించారు. గతంలో ఈమెతో రతన్‌టాటా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత కాలంలో ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.సిమీ గరేవాల్ స్పందిస్తూ..‘మీరు వెళ్లిపోయారనే వార్త విన్నాను. మీ లేరని ఊహించుకోవడం చాలా చాలా కష్టం. వీడ్కోలు మిత్రమా’ అంటూ ఆమె తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ద్వారా సంతాపం తెలిపారు. ఒక సమావేశంలో టాటా మాట్లాడుతూ తాను నాలుగు సార్లు ప్రేమలో పడ్డానని, పెళ్లికి దగ్గరగా వచ్చానని తెలిపారు. కానీ కొన్ని సంఘటనల వల్ల పెళ్లి చేసుకోలేదని చెప్పారు. ‘భార్య, కుటుంబం లేకపోవడంతో చాలాసార్లు ఒంటరిగా గడిపాను. కొన్నిసార్లు అందిరిలాగే భార్య, పిల్లలు, కుటుంబం ఉండాలని ఆశపడ్డాను. మరికొన్నిసార్లు వేరొకరిపై ఆధారపడడంతో వచ్చే ఆందోళనల గురించి చింతించకుండా స్వేచ్ఛగా ఉండాలని అనుకున్నాను’ అని చెప్పారు.They say you have gone ..It's too hard to bear your loss..too hard.. Farewell my friend..#RatanTata pic.twitter.com/FTC4wzkFoV— Simi_Garewal (@Simi_Garewal) October 9, 2024రతన్ టాటా అమెరికాలో ఉన్నపుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తైన తరువాత టాటా అమెరికా నుంచి ఇండియాకు రావలసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియా రావడానికి సిధ్ధ పడింది. కానీ, అదే సమయంలో ఇండియా-చైనాకు యుద్ధం జరుగుతుండడంతో ఆమె భయపడి ఇండియా రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి తనను కలవలేదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడుప్రజల సందర్శన కోసం టాటా భౌతికకాయంరతన్ టాటా భౌతికకాయానికి ప్రజలు నివాళులర్పించేందుకు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దక్షిణ ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ)లో ఉంచనున్నారు . -
రతన్ టాటా మృతిపట్ల వైఎస్ జగన్ నివాళి
-
విలువలతో కూడిన వ్యాపారావేత్త 10 వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు
-
ఎందరికో స్ఫూర్తిదాత రతన్ టాటా మృతిపట్ల ప్రముఖుల సంతాపం
-
దాతృత్వ శిఖరం కన్నుమూత
-
రతన్ టాటా విశిష్టతలు ఎన్నో... (ఫొటోలు)
-
బనీను ధరించి తలుపు తీసిన టాటా
రతన్‌టాటా చాలా సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడుతారు. టాటా నానో కారునే ఎక్కువగా వాడేవారట. ఆయన జీవితాన్ని చూసిన ప్రతిఒక్కరూ నిరాడంబరత నేర్చుకోవాల్సిందేనని పలువురు చెబుతారు. ఒకరోజు ఎల్ఈడీ టీవీ బిగించటానికి రతన్ టాటా ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లూ అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్, పైన ఒక బనీనుతో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్‌లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదాసీదాగా, పాతకాలం నాటి ఫర్నిచర్‌తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ!రతన్ ఒకానొక సమయంలో మాట్లాడుతూ..‘సరైన నిర్ణయాలు’ తీసుకోవడంలో నాకు నమ్మకం లేదు. నేనొక నిర్ణయం తీసుకుంటాను. అది సరైనదే అయ్యేలా చేస్తాను. అంతే...’ అని అన్నారు. అందుకే కావొచ్చు, ఆయన హయాంలో టాటా గ్రూపు ఆదాయం 50 రెట్లు మించి పెరిగింది. ఇవాళ టాటా గ్రూపు విలువ దాదాపు రూ.30 లక్షల కోట్లకు చేరుకుంది.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడురాజకీయాలకు దూరంగా..రాజకీయ రణరంగంలో రతన్ టాటా గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఆయనపై అస్త్రాలు సంధిస్తూ పార్టీలు పరస్పరం ఎన్నడైనా ఆరోపణలు చేసుకోవటం చూశామా? లేదుకదా. అదీ రతన్ టాటా ప్రత్యేకత. సంస్థ ఎదగడమే కాదు..అనేకమంది జీవితాల్లో వెలుగులు పంచాలన్నది ఆయన సిద్ధాంతం. టాటా గ్రూపు సంస్థలకు సామాజిక సేవంటే చాటింపు వేసుకుని మీడియాకు పోజులిచ్చే సందర్భం కాదు. నెరవేర్చి తీరాల్సిన పవిత్ర కర్తవ్యం. అందుకే ‘టాటా సన్స్’ ఈక్విటీల్లో 66 శాతం టాటా ట్రస్టుల చేతుల్లో ఉంటుంది. వాటిపై వచ్చే డివిడెండ్లు నేరుగా ట్రస్టులు నిర్వహించే సేవాకార్యక్రమాలకు తోడ్పడతాయి. -
పెంపుడు శునకాలు అనారోగ్యంతో ఉన్నాయని..
న్యూఢిల్లీ: రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేరు. అయితే అతని జ్ఞాపకాలు, రచనలు నిత్యం మనతోనే ఉంటాయి. రతన్ టాటా చూపిన దాతృత్వానికి సంబంధించిన అనేక ఉదాహణలు మనకు కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్త సుహైల్ సేథ్.. రతన్ టాటా చాటిన మానవత్వానికి సంబంధించిన ఒక ఘటనను పంచుకున్నారు.ఫిబ్రవరి 2018లో బ్రిటీష్ రాజకుటుంబం రతన్ టాటాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాలనుకుంటున్నట్లు సుహైల్ సేథ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రిన్స్ చార్లెస్ స్వయంగా రతన్ టాటాకు ఈ బిరుదును ఇవ్వాలనుకున్నారు. అయితే రతన్ టాటా బ్రిటన్ వచ్చేందుకు నిరాకరించారు. అయితే దీని వెనుకగల కారణాన్ని తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్ రతన్ టాటాను మానవతావాదిగా కొనియాడారు.ఈ ఆసక్తికరమైన కథనాన్ని సుహైల్ సేథ్ వివరించారు. 2018, ఫిబ్రవరి 6న ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్‌లో రతన్ టాటాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాలనుకున్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలని భావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుహైల్ సేథ్ ఫిబ్రవరి 3న లండన్ విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ సమయంలో సుహైల్ సేథ్ తన ఫోన్‌ని చూసుకున్నప్పుడు అతని మొబైల్ ఫోన్లో రతన్ టాటా నుండి 11 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వీటిని చూసిన సుహైల్ సేథ్ వెంటనే రతన్ టాటాకు ఫోన్ చేయగా, రతన్ టాటా తాను ఆ అవార్డుల ఫంక్షన్‌కి రాలేనని చెప్పారు. తన పెంపుడు శునకాలు టాంగో, టిటోలు అనారోగ్యంతో ఉన్నాయని వాటిని విడిచిపెట్టి, ఈ అవార్డుల ఫంక్షన్‌కి రాలేనని చెప్పారు. ఈ సమాధానం విన్న సుహైల్ సేథ్ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్.. రతన్ టాటాను మానవత్వం కలిగిన మహనీయునిగా జంతు ప్రేమికునిగా పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నా స్నేహితుడు, మంచి మనిషి: మోదీపై ట్రంప్ ప్రశంసలు -
టాటా గ్రూప్ వ్యాపార వివరాలు తెలిపే వీడియో
టాటా గ్రూప్ విస్తరణ ఎలా జరిగింది..? దాదాపు 100 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టాటా గ్రూప్ ఎలాంటి వ్యాపారం చేస్తోంది..? స్టీల్ నుంచి టీ వరకు, ఉక్కు నుంచి సాఫ్ట్వేర్ సేవల వరకు టాటా సంస్థలు ఎలాంటి వ్యాపారాలు సాగిస్తున్నాయో తెలియజేస్తూ ‘దిప్యామిలీకట్’ అనే యూట్యూబ్ ఛానల్ గతంలో ఒక వీడియోను విడుదల చేసింది. 2018లో విడుదల చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 15 లక్షల కంటే ఎక్కువ వ్యూసే వచ్చాయి. కంపెనీ వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించి సమగ్ర వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడు -
దిగ్గజ రతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళి
మన దేశం మరో దిగ్గజాన్ని కోల్పోయింది. దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా.. బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన ఇకలేరు అనే విషయాన్ని ఏ ఒక్కరూ తట్టుకోలేకపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, రాజమౌళి, నానితో పాటు బాలీవుడ్ వాళ్లు కూడా తమ బాధని ఆయన చేసి సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు.భారతీయ సినీ ప్రముఖుల ట్వీట్స్It’s a sad day for all Indians. For generations together there is not a single Indian whose life hasn’t been touched by his services one way or the other. One of the greatest visionaries our country has ever seen, a truly legendary industrialist, a philanthropist… pic.twitter.com/YHBiX00dNv— Chiranjeevi Konidela (@KChiruTweets) October 10, 2024Legends are born, and they live forever. It’s hard to imagine a day without using a TATA product… Ratan Tata’s legacy is woven into everyday life. If anyone will stand the test of time alongside the Panchabhootas, it’s him. 🙏🏻Thank you Sir for everything you’ve done for India…— rajamouli ss (@ssrajamouli) October 10, 2024End of an era. But the legacy is forever. Farewell sir 🙏🏼#RatanTata— Nani (@NameisNani) October 10, 2024India’s most valuable man, not necessarily for his vast wealth, but for his values.. largest being Integrity !! Never a show off but always the star ⭐️ The life #RatanTata ji led will always be an inspiration🙏 pic.twitter.com/yqbNTGWrT9— Randeep Hooda (@RandeepHooda) October 9, 2024Deeply saddened by the demise of Shri #RatanTata , a true icon of Indian industry. His remarkable vision, leadership, and compassion have inspired generations. As we bid farewell, his invaluable contributions to nation-building and philanthropy will be remembered forever. pic.twitter.com/bnpzPV4yax— Bobby (@dirbobby) October 10, 2024Deepest condolences for the 'Bharat Ratna' in true sense, finest human being, philanthropist business tycoon our very own #RatanTata is no more. His contributions to society/nation are enormous. Thoughts & prayers are with the family & friends in their hour of grief for their… pic.twitter.com/0g13H5QiOG— Shatrughan Sinha (@ShatruganSinha) October 10, 2024An icon. A legend. Thank you for inspiring us sir. You will be remembered forever 🙏🏻#RatanTata pic.twitter.com/1t7tBYuW4k— Anjali (@yoursanjali) October 10, 2024A inspiration to many of us🙏🏻 You will be greatly missed sir😇#RatanTata pic.twitter.com/XPIt6LVsHG— Nayanthara✨ (@NayantharaU) October 9, 2024Sad to hear that #RatanTata is no more. A legendary leader, visionary & philanthropist passes on, leaving behind a legacy of excellence & compassion. My deepest condolences to the Tata group & family. May his legacy continue to inspire us. #RIPRatanTataSir pic.twitter.com/snmejOwnjN— Sudheer Babu (@isudheerbabu) October 10, 2024It is with immense sorrow that we say goodbye to one of the most visionary leaders of our time, Ratan Tata. His extraordinary contributions to business, philanthropy, and society will leave a lasting legacy. May his soul rest in eternal peace.#RatanTata pic.twitter.com/JjCl8ZFiMa— Varun Tej Konidela (@IAmVarunTej) October 10, 2024Shri #RatanTata ji 🙏🏻You will be remembered for Ever sir..Thank You for the Inspiration 🙏🏻❤️A True Legend.. A True Icon 🙏🏻 pic.twitter.com/AVUkZmnGvB— DEVI SRI PRASAD (@ThisIsDSP) October 9, 2024असा माणूस पुन्हा होणे नाही. Deeply saddened to know that Shri #RatanTata ji is no more. Condolences to the family and loved ones. Rest In Glory Sir. 🙏🏽 pic.twitter.com/ldThYxUwJz— Riteish Deshmukh (@Riteishd) October 9, 2024The Icon of leadership, philanthropy, and ethics!! His legacy will continue to inspire generations. India has lost a giant today. #RIPRatanTata #RatanTata pic.twitter.com/c6qaZ75ykh— Rana Daggubati (@RanaDaggubati) October 9, 2024India bows in silence tonight. #RatanTata 🙏🏻🙏🏻 pic.twitter.com/hD3ACoB3iJ— DVV Entertainment (@DVVMovies) October 9, 2024A man who inspired and touched many lives.. Thank you #RatanTata sir 🙏🏿🙏🏿🙏🏿 will miss you RIP 💔💔💔💔 pic.twitter.com/ngAtEau9MR— Prakash Raj (@prakashraaj) October 10, 2024One Sun.One Moon.One Ratan Tata.The eternal. 🙏🏻🙏🏻#RatanTata pic.twitter.com/Kah9kGgnzQ— Sri Venkateswara Creations (@SVC_official) October 9, 2024The Titan and true icon, #RatanTata garu passing on . It's truly saddening.Your impact on me and the rest of the world will never be forgotten. History will remember you. Your words of wisdom have inspired and touched me deeply, Thank you for inspiring us with your humility… pic.twitter.com/0V8wImPeCE— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 9, 2024Om Shanti.. 🥺😢#RatanTata https://t.co/Y3LeM7204f— Shirley Setia (@ShirleySetia) October 9, 2024 -
మంచితనంలో అపరకుబేరుడు
వ్యాపార దార్శనికుడుమనసున్న మారాజుసహనశీలి.. మూగ జీవాల ప్రేమికుడుఎందరో వ్యాపారులకు గురువుఅవమానాలను సైతం తట్టుకుని నిలబడిన సృష్టికర్తప్రేమ విఫలమైనా కుంగిపోని ఉక్కు మనిషికంపెనీలో 66 శాతం దాతృత్వానికే కేటాయించిన మేరునగంధనవంతుల జాబితాలో పేరు లేకపోయినా మంచితనంలో అపరకుబేరుడుఒక శకం ముగిసింది. వ్యాపారం సామ్రాజ్యంలో అంచెంలంచెలుగా ఎదుగుతూ రూ.10 వేలకోట్ల వ్యాపారాన్ని రూ.లక్షల కోట్లకు చేర్చిన దూరదృష్టి కలిగిన అజరామరుడు రతన్ టాటా ఇకలేరు. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ నావల్ టాటా(86) బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.టాటా గ్రూప్ పేరు తెలియని భారతీయుడు దాదాపు ఉండరు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే జీవితకాలంలో చాలాసార్లు టాటా ఉత్పత్తులు వాడుతుంటాం. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినిపిస్తోంది. దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపించిన వ్యక్తి రతన్ టాటా. ఆయన గతకొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో సోమవారం ముంబయిలో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్త తెలిసిన వెంటనే దేశవ్యాప్తంగా చాలామంది తన ఆరోగ్యం గురించి పెద్ద సంఖ్యలో ఆరా తీశారు. వెంటనే సామాజిక మాధ్యమాల్లో స్పందించిన రతన్‌టాటా జనరల్ చెక్-ఆప్ కోసం ఆసుపత్రికి వచ్చినట్లు చెప్పారు. కాగా, బుధవారం రాత్రి ఆయన కన్నుముశారు.దేశంలోనే అతి పెద్ద కంపెనీలుగా పేరున్న రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాగ్ ఈ మూడు కలిపినా కూడా టాటా గ్రూప్ విలువతో సరితూగవు. అంత పెద్ద కంపెనీ అయినా ఏనాడూ ఆ సంస్థకు చెందిన ప్రముఖులు అత్యంత ధనవంతుల జాబితాలో లేరు. సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ గురించి, దాన్ని నడిపించిన రతన్ టాటా గురించి తెలుసుకుందాం.టాటా కంపెనీ మొదట ఒక టెక్స్టైల్ మిల్గా ప్రారంభమైంది. జంషెడ్జీ టాటా ఈ గ్రూప్‌ను 1868లో ప్రారంభించారు. ఈ కంపెనీ తరతరాలుగా తమ వారసుల చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్‌లైన్స్ కంపెనీని ప్రారంభించింది టాటా సంస్థే. రెండో ప్రపంచ యుద్ధం తరువాత దాన్ని ఎయిరిండియా పేరుతో జాతీయం చేశారు. 2022లో ఎయిరిండియా సంస్థను టాటా తిరిగి దక్కించుకుంది. ఇదొక్కటే కాదు ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, దేశంలోనే మొదటగా తాజ్ హోటల్‌ను స్థాపించింది కూడా టాటా కంపెనీయే. ఇలా మన దేశానికి ఈ సంస్థ ఎన్నో కొత్త వ్యాపారాలను పరిచయం చేసింది. దేశ నిర్మాణం, అభివృద్ధిలో టాటాల పాత్ర ఎంతగానో ఉంది. టాటా గ్రూప్ సంస్థకు చాలా మంది సారథ్యం వహించినా రతన్ టాటాకు ప్రత్యేక స్థానం ఉంది.ఇదీ చదవండి: వ్యాపార దిగ్గజం 'రతన్ టాటా' అస్తమయంరతన్ టాటా డిసెంబర్ 28, 1937లో అప్పటికే దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి పదేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడంతో నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వెంటనే ఐబీఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్డీ టాటా రతన్ టాటాను ఇండియాకు వచ్చి టాటా స్టీల్‌లో చేరమని సలహా ఇచ్చారు. దాంతో అమెరికా నుంచి ఇండియాకు వచ్చి జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.1991లో జేఆర్డీ టాటా రతన్ టాటాను టాటా గ్రూప్ ఛైర్మన్‌గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డు అఫ్ మెంబెర్స్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఎటువంటి అనుభవంలేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్లందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. రూ.10 వేలకోట్లుగా ఉండే వ్యాపారాన్ని దాదాపు రూ.30 లక్షల కోట్లకు చేర్చారు.ఇంత పెద్ద కంపెనీకి సారథ్యం వహిస్తున్నప్పటికీ రతన్ టాటా ప్రపంచంలో, భారతదేశంలోని ధనవంతుల జాబితాలో ఏనాడూ స్థానం సంపాదించలేదు. ఎందుకంటే టాటా కంపెనీకి వచ్చే లాభాల్లో దాదాపు 66% శాతం టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవ సంస్థలకే విరాళం ఇస్తున్నారు. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవ సంస్థలకు కాకుండా రతన్ టాటాకు చెందితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉండేవారు.బ్రిటిష్ వారికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి..రతన్‌టాటా తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొన్నారు. ఉదాహరణకు..1998లో రతన్ టాటా, టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదట సంవత్సరం ఆశించినమేర విక్రయాలు జరగలేదు. దాంతో అందరూ టాటా ఇండికా విభాగాన్ని అమ్మేయాలని సలహా ఇచ్చారు. దాంతో ఫోర్డ్ కంపెనీని ఆశ్రయించారు. కార్ల తయారు చేయడం తెలయనప్పుడు ఎందుకు సాహసం చేయడమని అవమానించారు. క్రమంలో ఇండికాను లాభాలబాట పట్టించారు. యూరప్‌కు చెందిన కోరస్ స్టీల్ కంపెనీను కొనుగోలు చేశారు. అలాగే ఇంగ్లాండ్‌కు చెందిన టెట్లీ టీ కంపెనీను కొని ‘టాటా టీ’లో విలీనం చేశారు. దాంతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టీ కంపెనీగా టాటా ఎదిగింది. ఇవే కాదు ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్‌లో కలుపుకుని టాటాను ఒక అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చారు రతన్ టాటా. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్లైతే భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వారికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు.పెళ్లికి దూరంగా టాటా..రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ఆయన అమెరికాలో ఉన్నప్ప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తైన తరువాత టాటా అమెరికా నుంచి ఇండియాకు రావలసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియా రావడానికి సిధ్ధ పడింది. కానీ, అదే సమయంలో ఇండియా-చైనాకు యుద్ధం జరుగుతుండడంతో ఆ అమ్మాయి భయపడి ఇండియా రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.యువతంటే నమ్మకం..రతన్ టాటాకు యువత, వారి వినూత్న ఆలోచనలు, శక్తిని అమితంగా నమ్మేవారు. అందుకే స్నాప్‌డీల్, పేటీఎం, కార్దేఖో, బ్లూస్టోన్, ఓలా, షావోమీ..వంటి దాదాపు 39కి పైగా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు. టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడపెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు. కంపెనీకి వచ్చిన లాభాల్లో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటే. అందుకే భారతీయుల్లో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్‌గా స్థిరపడిపోయింది.ప్రాణాలు కోల్పోయిన టాటా ఉద్యోగులు..నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ సొంతం. తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువే దానికి నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఏ ఉద్యోగి తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ హోటల్లోని సుమారు 1500 మందికి పైగా అతిథులను కాపాడారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏంతో మంది ఉద్యోగులు ప్రాణాలను సైతం కోల్పోయారు. దీన్ని బట్టి టాటా గ్రూప్ విలువలకు ఎంత ప్రాధాన్యమిస్తుందో ప్రపంచానికి అర్థమైంది.విద్యార్థులకు స్కాలర్షిప్లు..టాటా ట్రస్ట్..దేశంలోని మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తోంది. ఇప్పటికి మన దేశంతో పాటుగా విదేశాల్లో చదువుకుంటున్న ఎన్నో వేల మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందిస్తున్నారు. తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడిలో గాయపడిన, చనిపోయిన కుటుంబాలకు రతన్‌టాటా ప్రత్యేకంగా సేవలందించారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకు రూ.300 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. అందుకుగాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్‌లో ఒక భవనానికి గౌరవంగా ‘టాటా హాల్’ అని పేరు పెట్టింది. ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ పేషంట్ల కోసం ఏకంగా రూ.1000 కోట్లు దానం చేశారు. కుక్కులు వంటి మూగ జీవాలపై అమిత ప్రేమను చూపించేవారు.ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో సత్కరంచింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను వివిధ డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావటం గర్వించదగిన విషయం.వీటన్నిటికి మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనసులో నిలపడంలో 100 శాతం విజయాన్ని సాధించారు. డబ్బుపరంగా ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు. కానీ మంచితనంలో ఆయన అపరకుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరు ఇష్టపడే గౌరవించే బిజినెస్ మాన్‌గా రతన్ టాటా నిలిచిపోయారు. ఆయనకు ఇదే అశ్రునివాళి. -
రతన్ టాటా..రతనాల మాటలు
ఢిల్లీ : బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా యావత్ భారతం ఘన నివాళులర్పిస్తుండగా.. రతన్ టాటా పలు సందర్భాలలో జీవితాల్ని మార్చేసే స్పూర్తిదాయకమైన ప్రసంగాల్ని గుర్తు చేసుకుంటున్నారు. 👉‘జీవితంలో విజయం సాధించాలంటే ఒడిదొడుకులు ఉండటం చాలా ముఖ్యం. ఈసీజీలో సరళ రేఖ ఉన్నదంటే ప్రాణం లేదనే అర్థం’👉కేవలం భౌతిక విషయాలతోనే జీవితం ముడిపడిలేదని ప్రతివాళ్లూ ఎప్పుడో ఒకప్పుడు గ్రహిస్తారు. మనం ప్రేమించే వారిని ఆనందంగా ఉంచడంలోనే మన సంతోషమూ ఉంది.👉తన కోసం పని చేస్తున్న వారి మేలు కోరే వాడే ఉత్తమ నాయకుడు👉వృత్తిని – జీవితాన్ని సమతులం చేయడంపై నాకు నమ్మకంలేదు. వృత్తిని – జీవితాన్ని మమేకం చేయాలి. మీ వృత్తిని, జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దుకోవాలి.👉ఏ ఇబ్బందినీ స్వీకరించకపోవడమే పెద్ద ప్రమాదం. అతి వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఏ సవాల్‌నూ స్వీకరించ లేకపోతే అపజయం తప్పదు.👉ఎన్ని కష్టాలనైనా పట్టుదలతో ఎదుర్కోండి. అవే మీ విజయానికి పునాది రాళ్లు👉ఎదుటివాళ్ల దయా గుణాన్ని, ప్రేమను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకండి👉మీ జీవితం సాఫీగా ఉండకపోవచ్చు. సమాజంలోని సమస్యలను పరిష్కరించ లేకపోవచ్చు. అలాగని సమాజంలో మీ ప్రాముఖ్యాన్ని తక్కువగా అంచనావేయొద్దు. ధైర్యం, నమ్మకం మనకో దారి చూపిస్తాయి.👉అవకాశాల కోసం ఎదురు చూడకూడదు. అవకాశాల్ని సృష్టించుకోవాలి.👉నాయకత్వమంటే బాధ్యత తీసుకోవడం👉సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు దృష్టి లేదు. నిర్ణయం తీసుకొని దానిని విజయవంతం చేయడమే నా పని.👉విజయం అనేది నీవు చేపట్టిన పదవిపై ఆధారపడి ఉండదు. నీవు ఇతరులను ఎంతగా ప్రభావితం చేస్తున్నావన్న దానిపై ఆధారపడి ఉంటుంది. -
రతన్ టాటా లవ్ స్టోరీ
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరొందారు. అయితే రతన్ టాటా ఏనాడూ తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడలేదు. కానీ 1997లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా అసంపూర్ణంగా మిగిలిపోయిన తన ప్రేమకథ గురించి ప్రస్తావించారు.తాను 1960లలో అమెరికాలో చదువుకున్న తర్వాత అక్కడే ఉద్యోగం చేయడం ప్రారంభించానని రతన్ టాటా నాటి ప్రముఖ నటి సిమి గ్రేవాల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమయంలో రతన్ టాటా తాను ప్రేమలో పడిన అమ్మాయిని కలుసుకున్నారు. అయితే ఇంతలోనే అతనిని నాన్నమ్మ అతనిని ఇండియాకు తిరిగి రావాలని కోరారు.దీంతో రతన్ తాను లాస్ ఏంజెల్స్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి భారత్‌కు తిరిగి వచ్చేశారు. రతన్‌టాటా భారత్‌కు తిరిగి రావడానికి ప్రధాన కారణం అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం. ఆ సమయంలో రతన్ టాటా సోదరుడు చాలా చిన్నవాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆయన నాన్నమ్మ మాటను కాదనలేక భారత్ తిరిగి వచ్చారు.తాను భారత్‌కు వచ్చిన తర్వాత తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కూడా ఇక్కడికి వస్తుందని భావించానని రతన్ టాటా ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే 1962లో భారత్-చైనా యుద్ధం కారణంగా రతన్ టాటా భావించినట్లు జరగలేదు. భారత్-చైనా యుద్ధం కారణంగా, రతన్ టాటా ప్రేమించిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు భారతదేశానికి పంపడానికి ఇష్టపడలేదు. ఈ వివాహానికి వారు సమ్మతించలేదు. ఫలితంగా రతన్ టాటా ప్రేమ కథ అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఇది కూడా చదవండి: రతన్ టాటాకు ప్రధాని మోదీతో పాటు ప్రముఖుల నివాళులు -
సినీనటితో ప్రేమలో పడిన రతన్‌టాటా..? (ఫోటో గ్యాలరీ)
-
రతన్ టాటా కన్నుమూత.. నేడు సంతాప దినంగా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం
ముంబై: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు.కాగా రతన్ టాటా అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేప్రకటించారు. దివంగత పారిశ్రామికవేత్తకు గౌరవసూచికంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్రలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం వెల్లడించారు. అలాగే నేడు జరగాల్సిన అన్నీ వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.ఇక రతన్ టాటా భౌతికకాయాన్ని ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీసీఏ)లో ఈరోజు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంచుతారు. అక్కడ ప్రజలు ఆయనకు చివరి నివాళులు అర్పించనున్నారు. ఈజు సాయంత్రం వర్లీ ప్రాంతంలో రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి.చదవండి: వ్యాపార దిగ్గజం.. దాతృత్వ శిఖరం 'రతన్ టాటా' అస్తమయంరతన్ టాటా మరణ వార్తతో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోమవారం రతన్ టాటా ఆస్పత్రికి వెళ్లడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఐసీయూలో చేరారని వార్తలొచ్చాయి. వాటిపై స్పందించిన ఆయన.. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన రెండ్రోజులకే ఆయన దివంగతులయ్యారు. -
Ratan Tata Photos: దివికేగిన వ్యాపార సామ్రాజ్యాధిపతి రతన్ టాటా...(ఫొటోలు)
-
రతన్ టాటా మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ చావల్ టాటా మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్ రతన్ టాటా అని వైఎస్ జగన్ కొనియాడారు. సమాజం కోసం రతన్ టాటా పనిచేశారు. దేశ నిర్మాణానికి రతన్ టాటా సహకారం అందించడంతో పాటు, దేశానికి రతన్ టాటా సేవలు స్పూర్తిదాయకమన్నారు వైఎస్ జగన్.Deeply saddened by the loss of Shri Ratan Tata Ji. A true visionary whose kindness, integrity, and leadership will continue to inspire us and generations to come. My condolences to the Tata family .— YS Jagan Mohan Reddy (@ysjagan) October 10, 2024 -
రతన్ టాటాకు రాష్ట్రపతి, ప్రధానిలతో పాటు ప్రముఖుల నివాళులు
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. ఆయనకు 86 ఏళ్లు. ఆయన మృతిపై ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. దేశంలో అతిపెద్ద బిజినెస్ ట్రస్ట్ టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దాంతో రాష్ట్రపతి, ప్రధానిలతో పాటు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారుభారత్ పారిశ్రామిక దిగ్గజాన్నికోల్పోయింది: రాష్ట్రపతిరతన్ టాటా మృతిపట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘రతన్ టాటా మృతి నిజంగా బాధాకరం. పారిశ్రామిక దిగ్గజాన్ని భారత్ కోల్పోయింది. మంచి విలువులున్న వ్యక్తి రతన్ టాటా’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు.In the sad demise of Shri Ratan Tata, India has lost an icon who blended corporate growth with nation building, and excellence with ethics. A recipient of Padma Vibhushan and Padma Bhushan, he took forward the great Tata legacy and gave it a more impressive global presence. He…— President of India (@rashtrapatibhvn) October 9, 2024 రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార దిగ్గజం: ప్రధాని మోదీప్రధాని మోదీ ట్విట్టర్లో ఇలా రాశారు - రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార దిగ్గజం. దయాహృదయం కలిగిన వ్యక్తి. అసాధారణమైన వ్యక్తి. అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. సమాజాన్ని మెరుగుపరచడంలో అతనికున్న అచంచలమైన నిబద్ధత స్ఫూర్తిదాయకమైనవి. Shri Ratan Tata Ji was a visionary business leader, a compassionate soul and an extraordinary human being. He provided stable leadership to one of India’s oldest and most prestigious business houses. At the same time, his contribution went far beyond the boardroom. He endeared… pic.twitter.com/p5NPcpBbBD— Narendra Modi (@narendramodi) October 9, 2024 మంచి స్నేహితుడిని కోల్పోయా: ముఖేష్ అంబానీరతన్ టాటా మృతిపట్ల ముఖేష్ అంబానీ సంతాపం వ్యక్తం చేశారు. మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు: సుధామూర్తిరతన్ టాటా మరణం దేశానికి తీరని లోటన్నారు రాజ్యసభ ఎంపీ సుధామూర్తి. ఇతరుల పట్ల కరుణ చూపే వ్యక్తి రతన్ టాటా అని ఆమె కొనియాడారు.ఆయనొక వెలకట్టలేని వజ్రం: ఆర్ఎస్ఎస్రతన్ టాటా మృతిపట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం వ్యక్తం చేసింది. రతన్ టాటా మృతి భారతీయులందరికీ బాధాకరమని ఆర్ఎస్ఎస్ తెలిపింది. రతన్ టాటా వెలకట్టలేని వజ్రమని కొనియాడింది.పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్: వైఎస్ జగన్ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ చావల్ టాటా మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్ రతన్ టాటా అని వైఎస్ జగన్ కొనియాడారు. సమాజం కోసం రతన్ టాటా పనిచేశారు. దేశ నిర్మాణానికి రతన్ టాటా సహకారం అందించడంతో పాటు, దేశానికి రతన్ టాటా సేవలు స్పూర్తిదాయకమన్నారు వైఎస్ జగన్.Deeply saddened by the loss of Shri Ratan Tata Ji. A true visionary whose kindness, integrity, and leadership will continue to inspire us and generations to come. My condolences to the Tata family .— YS Jagan Mohan Reddy (@ysjagan) October 10, 2024గొప్ప మానవతావాది: మానవతావాది: వెంకయ్య నాయుడురతన్టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. గొప్ప మానవతావాది అని వెంకయ్యనాయుడు కొనియాడారు. రతన్ టాటా జీవితం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమన్న వెంకయ్య నాయుడు.. అత్యున్నత వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. పరోపకారి రతన్ టాటా: కేసీఆర్రతన్ టాటా మృతికి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని కేసీఆర్ పేర్కొన్నారు. దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు, పరోపకారి రతన్ టాటా అని కేసీఆర్ కొనియాడారు.రతన్ టాటా నిజమైన ఆవిష్కర్త: కేటీఆర్రతన్ టాటా మృతిపట్ల కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.రతన్ టాటా నిజమైన ఆవిష్కర్త అని కొనియాడారు. రతన్ టాటా మరణం వ్యాపార ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చిందన్న కేటీఆర్.. ఆయన అందరి హృదయాల్లో ఉంటారన్నారు.రతన్ టాటా మృతిపట్ల జేపీ నడ్డా సంతాపంరతన్ టాటా సేవలు దేశం, ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయినిజమైన మానవతావాది రతన్ టాటా: సీఎం చంద్రబాబురతన్ టాటా మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. నిజమైన మానవతావాదిని కోల్పోయామన్నారు సీఎం చంద్రబాబు.రతన్ టాటా దాతృత్వానికి ప్రతీక: సీఎం రేవంత్రెడ్డిరతన్ టాటా దాతృత్వానికి ప్రతీక అన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఆయన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్ కొనియాడారు.టాటా విజన్ కలిగిన వ్యక్తి: రాహుల్ గాంధీకాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. రతన్ టాటా విజన్ కలిగిన వ్యక్తి. వ్యాపారం, దాతృత్వం రెండింటిలోనూ చెరగని ముద్ర వేశారు.Ratan Tata was a man with a vision. He has left a lasting mark on both business and philanthropy.My condolences to his family and the Tata community.— Rahul Gandhi (@RahulGandhi) October 9, 2024ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన రతన్ టాటారక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన సంతాప సందేశంలో.. రతన్ టాటా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని రాశారు.దూరదృష్టి గల వ్యక్తిని భారత్ కోల్పోయిందిపారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ట్వీట్లో.. ఆధునిక భారతదేశ మార్గాన్ని పునర్నిర్వచించిన, దూరదృష్టి గల వ్యక్తిని భారత్ కోల్పోయింది. రతన్ టాటా కేవలం వ్యాపార నాయకుడే కాదు.. అతను తిరుగులేని నిబద్ధతతో భారతదేశ స్ఫూర్తిని మూర్తీభవించారు.India has lost a giant, a visionary who redefined modern India's path. Ratan Tata wasn’t just a business leader - he embodied the spirit of India with integrity, compassion and an unwavering commitment to the greater good. Legends like him never fade away. Om Shanti 🙏 pic.twitter.com/mANuvwX8wV— Gautam Adani (@gautam_adani) October 9, 2024టాటా జీ మరణం చాలా బాధాకరంఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలా ట్వీట్ చేశారు.. భారతదేశ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, 'పద్మ విభూషణ్' రతన్ టాటా జీ మరణం చాలా బాధాకరం. అతను భారతీయ పరిశ్రమకు తిరుగులేని దిగ్గజం. ఆయన మృతి తీరని లోటు. అతని జీవితమంతా దేశ పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి అంకితం అయ్యింది. రతన్ టాటా దేశానికి నిజమైన రత్నం.Saddened by the passing away of Shri Ratan Tata. He was a Titan of the Indian industry known for his monumental contributions to our economy, trade and industry. My deepest condolences to his family, friends and admirers. May his soul rest in peace.— Rajnath Singh (@rajnathsingh) October 9, 2024రతన్ టాటా సహకారం చారిత్రాత్మకంఆనంద్ మహీంద్రా తన ట్వీట్లో - దేశ అభివృద్ధికి రతన్ టాటా చేసిన సహకారం చారిత్రాత్మకమైనది. దేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు.भारत के प्रख्यात उद्योगपति, 'पद्म विभूषण' श्री रतन टाटा जी का निधन अत्यंत दुःखद है।वह भारतीय उद्योग जगत के महानायक थे। उनका जाना उद्योग जगत के लिए अपूरणीय क्षति है। उनका सम्पूर्ण जीवन देश के औद्योगिक और सामाजिक विकास को समर्पित था। वे सच्चे अर्थों में देश के रत्न थे।प्रभु…— Yogi Adityanath (@myogiadityanath) October 9, 20241991లో టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలుకాగా, రతన్ టాటా 1991లో టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. 2012 వరకు ఈ పదవిలో కొనసాగారు. అతను 1996లో టాటా సర్వీసెస్, 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తదితర కంపెనీలను స్థాపించారు.నేడు అంత్యక్రియలుటాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి కన్నుమూశారు. కొల్బాలోని నివాసానికి రతన్ టాటా పార్ధివ దేహాన్ని తరలించారు. ఉదయం 10.30 గంటలకు పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ మైదానంలో ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం 4గంటల తరువాత అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఇది కూడా చదవండి: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత -
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా అస్తమయం... అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
-
వ్యాపార దిగ్గజం.. దాతృత్వ శిఖరం 'రతన్ టాటా' అస్తమయం
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి.. పేదవాడి కారు కలను తీర్చాలని ‘నానో’ తెచ్చిన టాటా గొప్ప వితరణశీలి. యువతకు ఆదర్శప్రాయుడు. విలువలపై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన దార్శనికుడు. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. రతన్ టాటా మృతిని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. ఆయన తనకు గొప్ప మిత్రుడు, గురువు, మార్గదర్శకుడు అని చెప్పారు. రతన్ టాటా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించారు. ఆయనొక విజనరీ బిజినెస్ లీడర్, అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు సుస్థిరమైన నాయకత్వాన్ని అందించారని చెప్పారు. మెరుగైన సమాజం కోసం కృషి చేశారని, ఎన్నో సేవా కార్యక్రమాలకు చేయూత అందించారని గుర్తుచేశారు. విద్యా, వైద్యం, పారిశుధ్యం, జంతు సంరక్షణ తదితర రంగాల్లో విశేషమైన సేవలు అందించారని పేర్కొన్నారు. విశిష్టమైన వ్యక్తిత్వంతో ఎంతోమందికి ఆప్తుడైన రతన్ టాటా దూరం కావడం చాలా బాధాకరమని ఉద్ఘాటించారు. రతన్ టాటా కుటుంబానికి ప్రధాని మోదీ సానుభూతి ప్రకటించారు. ‘రతన్ టాటా ఒక టైటాన్’ అని ప్రశంసిస్తూ వ్యాపారవేత్త హర్‡్ష గోయెంకా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రతన్ టాటా ఇక లేరు అనే నిజాన్ని తాను అంగీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. వివిధ రంగాలలో రతన్ టాటా సంస్థలు సంపదలో 65% విరాళం రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నావల్ టాటా, సూనూ టాటా. ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. అవివాహితుడైన రతన్ టాటా 1962లో టాటా సన్స్‌లో చేరారు. 1991 నుంచి 2012 దాకా, తర్వాత 2016 నుంచి 2017 టాటా సంస్థ చైర్మన్‌గా సేవలందించారు. పారిశ్రామిక రంగానికి అందించిన సేవలకు గాను రతన్ టాటాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రతన్ టాటా వితరణశీలిగా పేరుగాంచారు. తన సంపదలో దాదాపు 65 శాతం భాగాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. పలు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అనితరసాధ్యుడు..బాల్యం..విద్యాభ్యాసం.. పారిశ్రామిక దిగ్గజం, వితరణ శీలి రతన్ టాటా చాలా సాధారణ జీవితం గడిపేవారు. ఆయన 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా కుమారుడు రతన్ జీ టాటా, దత్తత తీసుకున్న నవల్ టాటా, సూనూ టాటా ఆయన తల్లి దండ్రులు. 1948లో ఆయన తల్లిదండ్రులు విడిపోవడంతో రతన్జీ టాటా సతీమణి అయిన నవాజ్‌బాయ్ టాటా సంరక్షణలో పెరిగారు. జిమ్మీ టాటా ఆయనకు సోదరుడు కాగా, నోయెల్ టాటా సవతి సోదరుడు. రతన్ టాటా ముంబై, సిమ్లాలో విద్యాభ్యాసం చేశారు. అటుపైన అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. 100 బిలియన్ డాలర్లకు టాటా గ్రూప్..రతన్ టాటా 1962లో టాటా సన్స్‌లో చేరారు. సాధారణ ఉద్యోగి తరహాలోనే పని చేస్తూ కుటుంబ వ్యాపార మెళకువలు తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న నేషనల్ రేడియో అండ్ ఎల్రక్టానిక్స్ కంపెనీ (నెల్కో)కి డైరెక్టర్ ఇంచార్జ్‌గా 1971లో ఆయన నియమితులయ్యారు. కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఆర్థిక మందగమనం, కార్మిక సంఘాలపరమైన సమస్యల కారణంగా ఆ ప్రయత్నాలు అంతగా సఫలం కాలేదు. 1977లో సంక్షోభంలో ఉన్న మరో గ్రూప్ సంస్థ ఎంప్రెస్ మిల్స్‌కి ఆయన బదిలీ అయ్యారు. మిల్లును పునరుద్ధరించేందుకు ఆయన ప్రణాళికలు వేసినప్పటికీ మిగతా అధికారులు కలిసి రాకపోవడంతో సంస్థను అంతిమంగా మూసివేయాల్సి వచ్చింది. మొత్తానికి 1991లో జేఆర్డీ టాటా ఆయన్ను టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమించారు. భారీ బాధ్యతలను మోయడంలో ఆయనకున్న సామర్థ్యాలపై సందేహాల కారణంగా మిగతా అధికారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ రతన్ టాటా వాటన్నింటినీ తోసిరాజని తన సత్తా నిరూపించుకున్నారు. గ్రూప్‌ను అగ్రగామిగా నిలిపారు. తన హయాంలో మేనేజ్మెంట్ తీరుతెన్నులను పూర్తిగా మార్చేసి గ్రూప్ కంపెనీలను పరుగులు తీయించారు. 2012లో ఆయన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చైర్మన్‌గా నియమితులైన సైరస్ మిస్త్రీతో విభేదాలు రావడంతో తిరిగి 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు మరోసారి చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అటు తర్వాత ఎన్.చంద్రశేఖరన్‌కు పగ్గాలు అప్పగించారు. 21 ఏళ్ల పాటు సాగిన రతన్ టాటా హయాంలో గ్రూప్ ఆదాయాలు 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయి. టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయిలో భారీగా విస్తరించారు రతన్ టాటా. ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. సాఫ్ట్వేర్, టెలికం, ఫైనాన్స్, రిటైల్ తదితర రంగాల్లోకి గ్రూప్ విస్తరించింది. రతన్ టాటా బాధ్యతలు చేపట్టినప్పుడు 1991లో రూ. 10,000 కోట్లుగా ఉన్న గ్రూప్ టర్నోవరు 2011–12లో ఆయన తప్పుకునే సమయానికి 100 బిలియన్ డాలర్లకు ఎగిసింది. సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్ని విభాగాల్లోకి విస్తరించింది. పలు విదేశీ కంపెనీలను కొనుగోలు చేయడంతో గ్రూప్ ఆదాయాల్లో దాదాపు సగ భాగం విదేశాల నుంచే ఉంటోంది. ఆయన సాహసోపేత నిర్ణయాల కారణంగా కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు టాటా గ్రూప్‌లోకి చేరాయి. నానో, ఇండికా కార్లు ఆయన విజనే. వితరణశీలి.. ఇన్వెస్టరు.. రతన్ టాటా గొప్ప వితరణశీలి. తన సంపదలో దాదాపు 60–65% భాగాన్ని ఆయన వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళమిచ్చారు. 2008లో కార్నెల్ వర్సిటీకి 50 మిలియన్ డాలర్ల విరాళమిచ్చారు. ప్రధానంగా విద్య, ఔషధాలు, గ్రామీణాభివృద్ధి మొదలైన వి భాగాలపై దృష్టి పెట్టారు. ఆయన పలు అంకుర సంస్థల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టారు. వ్యక్తిగత హోదాలో అలాగే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా 30కి పైగా స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. శ్నాప్‌డీల్, షావోమీ, ఓలా క్యాబ్స్, మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టారు. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన గుడ్‌ఫెలోస్ అనే స్టార్టప్‌కు తోడ్పాటు అందించారు. కరోనా నియంత్రణ కోసం రూ.1,500 కోట్లు అందించారు.పురస్కారాలుపారిశ్రామిక దిగ్గజంగానే కాకుండా వితరణశీలిగా కూడా పేరొందిన రతన్ టాటాను పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో పాటు ఆయన మహారాష్ట్ర భూషణ్, అస్సాం వైభవ్ వంటి అవార్డులను కూడా అందుకున్నారు. సిమీ గ్రేవాల్‌తో అనుబంధం..రతన్ టాటా వివాహం చేసుకోవాలనుకున్నా సాధ్యపడలేదని ఆయనే పలు సందర్భాల్లో తెలిపారు. నాలుగు సార్లు వివాహానికి దగ్గరగా వచ్చినా పలు కారణాల వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. అప్పట్లో బాలీవుడ్ నటి సిమీ గ్రేవాల్‌తో ఆయన ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆమె ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకున్నారు.మిస్త్రీతో వివాదం..టాటా గ్రూప్ చైర్మన్‌గా రతన్ టాటా ఏరి కోరి సైరస్ మిస్త్రీని తన వారసుడిగా నియమించారు. కానీ మిస్త్రీ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి. చివరికి 2016లో మిస్త్రీ ఉద్వాసనకు దారి తీశాయి. దీనిపై ఇరువర్గాల మధ్య సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది. ఆయన మార్గదర్శకత్వం అమూల్యం ఆనంద్ మహీంద్రా రతన్ టాటా లేరన్నది నేను అంగీకరించలేక పోతున్నా. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ ముందడుగులో ఉంది. మనం ఈ స్థానంలో ఉండటానికి రతన్ జీవితం, పని తీరుతో చాలా సంబంధం కలిగి ఉంది. ఈ సమయంలో అతని మార్గదర్శకత్వం అమూల్యం. మన ఆర్ధిక సంపద, విజయాలకు ఆయన సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. లెజెండ్స్‌కి మరణం లేదు.దూరదృష్టి కలిగిన దిగ్గజ వ్యాపార వేత్త ప్రధాని నరేంద్ర మోదీ రతన్ టాటా దూరదృష్టి కలిగిన దిగ్గజ వ్యాపార వేత్త. దయార్ధ్ర హృదయం కలిగిన అసాధారణ వ్యక్తి. భారత దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఇదే సమయంలో ఇతని సహకారం బోర్డు రూమ్‌ను మించిపోయింది. ఎంతో మందికి ఆప్తుడయ్యారు.లక్షలాది మంది జీవితాలను తాకిన దాతృత్వంరతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నాము. ఎంతో మందికి అమూల్యమైన సహకారం అందించిన నిజమైన అసాధారణ నాయకుడు. టాటా గ్రూప్ మాత్రమే కాదు.. మన దేశం స్వరూపం కూడా. టాటా గ్రూప్‌కు.. ఆయన చైర్పర్సన్ కంటే ఎక్కువ. వ్యాపార వేత్తలందరికీ ఆయన ఓ దిక్సూచి. టాటా దాతృత్వం లక్షలాది మంది జీవితాలను తాకింది. విద్య నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు రాబోయే తరాలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. ఆయన్ని ఇష్టపడే వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – ఎన్.చంద్రశేఖరన్, చైర్మన్, టాటా సన్స్ -
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్రముక పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా(86) ఇక లేరు. అనారోగ్యం కారణంగా ముంబైలోని బ్రీచ్‌కాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుదవారం రాత్రి ఆయన మరణించారు.1937 డిసెంబరు 28న ముంబైలో రతన్ టాటా జన్మించారు. గత కొంత కాలంగా రతన్ టాటా అనారోగ్యంతో బాదపడుతున్నారు. రతన్ టాటా మరణించినట్టు టాటా సన్స్ గ్రూప్ ప్రకటించింది. -
రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం
ముంబై: టాటా సన్స్ అధినేత రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయన్ను ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ విభాగంలో చికిత్స పొందుతున్నారు.LET'S PRAY AND Send HEALING THOUGHTS AND WARM WISHES TO SHRI RATAN TATA Ji.Get well soon Legend 🙏 pic.twitter.com/cHAq66ziAB— Bhushan Mittal 🇮🇳 (@bhushan8360) October 9, 2024ఇటీవల దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వదంతులు వెల్లువెత్తాయి. దీంతో ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి రతన్ టాటా వెళ్లారు. దీంతో 86 ఏళ్ల రతన్ ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చేరారని జాతీయ మీడియాలో వెంటనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఆయన తన సామాజిక మాధ్యమం ఖాతా ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా. నేను బాగానే ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. -
Ratan Tata: నేను బాగానే ఉన్నా
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వెల్లువెత్తిన వదంతులపై ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి రతన్ టాటా వెళ్లారు. దీంతో 86 ఏళ్ల రతన్ ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చేరారని జాతీయ మీడియాలో వెంటనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఆయన తన సామాజిక మాధ్యమం ఖాతా ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా. నేను బాగానే ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. టాటా సన్స్‌కు 1991 మార్చి నుంచి 2012 డిసెంబర్ 28దాకా రతన్ చైర్మన్‌గా కొనసాగారు. 1991లో రూ.10వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థను మహా సామ్రాజ్యంగా విస్తరించారు. ఈయన సారథ్యంలో 2011–12 ఆర్థికసంవత్సరం నాటికే 100.09 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించే స్థాయికి సంస్థ ఎదిగింది. టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ఇలా భిన్నరంగాల పలు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలను టేకోవర్ చేశారు. వ్యాపారాలను విస్తరించడంతో ఇప్పుడు సంస్థ ఆదాయంలో సగభాగం విదేశాల నుంచే వస్తోంది. -
రతన్‌టాటా ప్రేమ విఫలం.. పెళ్లికి దూరం
టాటా సన్స్ ఛైర్మన్ రతన్‌టాటా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తీవ్ర ఆనారోగ్య పరిస్థితుల వల్ల రతన్‌టాటా ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో రతన్ టాటా స్పందించారు. తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. జనరల్ చెక్-అప్ల కోసం హాస్పటల్‌కు వచ్చానని చెప్పారు. ప్రేమ విఫలం అయ్యాక పెళ్లికి దూరంగా ఉన్న టాటాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) టాటా గ్రూప్‌ను 1868లో 'జమ్సెట్జీ నుస్సర్వాన్జీ టాటా' (జంషెడ్జీ) ప్రారంభించారు. ఈ కంపెనీ 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులను, సేవలను అందిస్తూ.. ఆరు ఖండాల్లోని 100 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు రూ.30 లక్షల కోట్ల పైమాటే.రతన్ టాటా 1937 డిసెంబరు 28న జన్మించారు.ఆయనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు.రతన్ టాటా క్యాంపియన్ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌కు వెళ్లారు.ఆయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా.రతన్ టాటా ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా అనే పుస్తకాలు రాశారు.86 సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడు. ప్రేమలో విఫలం అయ్యాక ఆయన పెళ్లికి దూరంగా ఉన్నారు.పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశ్యంతో.. తక్కువ ధరకు లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు.తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను నిర్మించడానికి టాటా గ్రూప్ 2010లో 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు.టాటాకు సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ (ట్విటర్) ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు.రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు.ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. దాంతో ధనవంతుల జాబితాలో ఉండలేకపోతున్నారు.ఇదీ చదవండి: ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!టాటా గ్రూప్ పేరు తెలియని భారతీయుడు దాదాపు ఉండరు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే జీవితకాలంలో చాలాసార్లు టాటా ఉత్పత్తులు వాడుతుంటాం. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినిపిస్తోంది. దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. ఆయన గతకొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో సోమవారం ముంబయిలో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో అందుకు సంబంధించిన వార్తలుకాస్తా వైరల్‌గా మారాయి. -
‘నేను బాగానే ఉన్నా.. ఆందోళన అవసరం లేదు’
ఢిల్లీ : తాను అస్వస్థతకు గురయ్యానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా ఖండించారు. ఈమేరకు ఆయన ఓ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం తాను ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి రతన్ టాటా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ప్రకారం.. రతన్ టాటా రక్తపోటు తగ్గడంతో ఆదివారం అర్థరాత్రి 12:30 నుండి 1:00 గంటల మధ్య టాటాను ఆయన కుటుంబ సభ్యులు బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారని జాతీయ మీడియా కథనాలు, ట్వీట్లు వెలుగులోకి వచ్చాయి. Thank you for thinking of me 🤍 pic.twitter.com/MICi6zVH99— Ratan N. Tata (@RNTata2000) October 7, 2024 ఆస్పత్రికి వచ్చిన వెంటనే టాటాను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స అందిస్తున్నారని,ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ ఆస్పి గోల్వాలా నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారంటూ ప్రచారం జరగడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ తరుణంలో ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని రతన్ టాటా ఖండించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం తాను ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. దీంతో టాటా ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడినట్లైంది. -
ఇక BSNLను ఆపడం ఎవరి తరమూ కాదు..!
-
నిజమవుతున్న రతన్ టాటా కల.. ఇక చైనా అవసరం లేనట్లే!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన తరువాత చాలా దేశాలు సెమీకండక్టర్ చిప్ కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కొంత డీలా పడ్డాయి. ఈ తరుణంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' స్వదేశీ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు నిజం కాబోతోంది.భారతదేశంలో సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేస్తే.. మన దేశం చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. రతన్ టాటా అనుకున్న విధంగానే చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మోరిగావ్ జిల్లాలోని జాగిరోడ్‌లో ప్లాంట్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ భూమి పూజ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమక్షంలో జరిగింది.అస్సాంలో నిర్మించనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికి రూ. 27 వేలకోట్లు ఖర్చవుతుందని సమాచారం. నిర్మాణం పూర్తయిన తరువాత సుమారు 27000 కంటే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. సెమీకండక్టర్ తయారీలో అగ్రగామిగా ఉన్న చైనా మీద.. భారత్ ఆధారపడటం తగ్గుతుంది. దీనికోసం టాటా కంపెనీ కోట్లాది సెమీకండక్టర్లను తయారు చేయడానికి సిద్ధమైంది. రాబోయే రోజుల్లో భారత్ సెమికండక్టర్ చిప్ ఎగుమతిదారుగా కూడా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: తులం బంగారం కేవలం రూ.63.. మరి ఇప్పుడో..!టాటా సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ 2025 నాటికి సిద్ధమవుతుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. 2024 ఫిబ్రవరి 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఆమోదం పొందిన ఐదు నెలల వ్యవధిలోనే ప్లాంట్ నిర్మాణం ప్రారంభించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. -
టాటా కలల ఆస్పత్రి ప్రారంభం.. ఇక్కడ వైద్యం ఎవరికో తెలుసా?
దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన బిలియనీర్ వ్యాపార వేత్తలలో రతన్ టాటా ఒకరు. దాతృత్వం, జ్ఞాన సంపద, వ్యాపార నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన రతన్ టాటాకు సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. మూగ జీవాలను ప్రేమించే ఆయన వాటి కోసం నిర్మించిన ప్రత్యేక ఆస్పత్రిని తాజాగా ప్రారంభించారు.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెంపుడు జంతువుల ఆసుపత్రిని ప్రారంభిస్తున్నట్లు టాటా ట్రస్ట్‌ల చీఫ్ రతన్ టాటా ప్రకటించారు. 'వుయ్ ఆర్ ఓపెన్' అనే క్యాప్షన్‌తో పాటు వైద్యులతో తాను ముచ్చటిస్తున్న ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. జంతువుల పట్ల సానుభూతితో ఉండే టాటా గ్రూప్ దాని గురించి అవగాహన పెంచడానికి అనేక ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. అదే బాటలో కొనసాగుతూ దేశంలోనే అతిపెద్ద జంతు వైద్యశాలలలో ఒకదాన్ని ప్రారంభించింది.టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ను ముంబైలో 2.2 ఎకరాలలో రూ. 165 కోట్ల ఖర్చుతో నిర్మించారు. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, ఇతర చిన్న జంతువులకు ఇక్కడ వైద్యం అందిస్తారు. ఇది 24x7 పని చేస్తుంది. “నేడు మూగ జీవాలు కుటుంబ సభ్యుల మాదిరిగా మారిపోయాయి. జీవితాంతం అనేక పెంపుడు జంతువుల సంరక్షకుడిగా ఈ ఆసుపత్రి అవసరాన్ని నేను గుర్తించాను" అని రతన్ టాటా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ చెప్పారు.జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఈ కొత్త ఆసుపత్రి రాయల్ వెటర్నరీ కాలేజ్ లండన్‌తో సహా ఐదు యూకే వెటర్నరీ స్కూల్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. మల్టీడిసిప్లినరీ కేర్‌తో పాటు సర్జికల్, డయాగ్నోస్టిక్, ఫార్మసీ సేవలను ఆసుపత్రి అందిస్తుంది. నాలుగు అంతస్తులు ఉండే ఆసుపత్రి భవనంలో 200 జీవులకు వైద్యం అందించే సదుపాయం ఉంది. దీనికి బ్రిటిష్ పశువైద్యుడు థామస్ హీత్కోట్ నాయకత్వం వహిస్తున్నారు.We are open https://t.co/Dh4ndSMo7A— Ratan N. Tata (@RNTata2000) July 1, 2024 -
కుక్క కోసం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్.. రతన్ టాటా మంచి మనసు
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఒక కుక్కకు రక్తదానం చేసేందుకు మరో ఆరోగ్యకరమైన కుక్కను కనుగొనాలని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబయి ప్రజలను కోరారు. రక్తదానం చేసే శునకానికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉండాలో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. తన కోసం ఏదీ కోరని ఆయన ఒక కుక్క కోసం ఈ పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ముంబయిలో యానిమల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో ఇటీవల ఏడు నెలల కుక్కను అడ్మిట్ చేశారు. అది తీవ్ర జ్వరంతో, ప్రాణాంతక రక్తహీనతతో బాధపడుతోంది. ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి వెంటనే రక్తం కావాలని కోరారు. ఆ విషయం రతన్ టాటా దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.‘ముంబయి..నాకు మీ సహాయం కావాలి. మా యానిమల్ ఆసుపత్రిలో ఉన్న ఏడు నెలల కుక్కకు అత్యవసరంగా రక్తమార్పిడి చేయాల్సి ఉంది. అది తీవ్ర జ్వరంతో, ప్రాణాంతక రక్తహీనతతో బాధపడుతోంది. మాకు అత్యవసరంగా ముంబయిలో డాగ్ బ్లడ్ డోనర్ కావాలి. రక్తం ఇచ్చే కుక్క వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలి. 1 నుంచి 8 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 25 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉండాలి. కనీసం గత ఆరు నెలలుగా కుక్కకు పూర్తిగా టీకాలు వేయాలి. డీవార్మింగ్(నులిపురుగులు) చేయాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండకూడదు’ అంటూ పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్‌కు స్పందిస్తూ చాలా మంది వ్యక్తులు కుక్క కోసం సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఆయన మంచి మనసును ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. ‘దేని కోసం పోస్ట్ చేయని లెజెండ్, తనది కాని కుక్క కోసం సహాయం కోరుతున్నారు. వినయం గురించి తెలిపే గొప్పపాఠం ఇది’ అని ఒకరు కామెంట్ చేశారు. అయితే రతన్ టాటా పోస్ట్ చూసి చాలామంది డాగ్ బ్లడ్ డోనార్లు సంప్రదించారని తెలిసింది. ‘సహాయం చేసిన వారికి నా అభినందనలు’ అంటూ రతన్ టాటా పోస్ట్‌లో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata)రతన్ టాటాకు మూగజీవులపై ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే. వీలైతే ప్రతిఒక్కరు ఒక కుక్కను దత్తత తీసుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూంటారు. టాటా గ్రూప్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ప్రాంతం చుట్టూ నివసించే వీధికుక్కల కోసం ప్రత్యేక కెన్నెల్‌ను(సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేశారు. రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావించే స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ను టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 200 కంటే ఎక్కువ జీవులకు వైద్యం అందించేలా 5 అంతస్తుల్లో విస్తరించి ఉంది. -
మీకు తెలుసా? ప్రముఖ వ్యాపారవేత్తల ఫస్ట్ జాబ్స్ ఇవే..
భారతదేశంలో అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఇంద్రా నూయీ, అర్దేషిర్ గోద్రెజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే వీరందరూ ప్రారంభంలో ఎలాంటి ఉద్యోగాలు చేశారనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను వివరంగా తెలుసుకుందాం.రతన్ టాటాప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా.. భారతదేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. దేశం కోసం ఎంతో కృషి చేసిన ఈయన 1961లో టాటా స్టీల్ కంపెనీలో చేరారు. ఇదే ఆయన మొదటి ఉద్యోగం. ఆ తరువాత క్రమంగా ఎదిగి టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.గౌతమ్ అదానీభారతదేశంలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ 1978లో మహేంద్ర బ్రదర్స్ అనే వజ్రాల దుకాణంలో పనిచేసినట్లు సమాచారం. ఇదే అదానీ మొదటి ఉద్యోగం. అక్కడే మూడు సంవత్సరాలు పనిచేసి ముంబయిలోని సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించి నేడు బిలినీయర్ల జాబితాలోకి చేరారు.ఇంద్రా నూయీ1955లో జన్మించిన ఇంద్రా నూయీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో ఒకటైన పెప్సికోకు 12 ఏళ్లపాటు సీఈఓగా పనిచేశారు. ఈమె 18 సంవత్సరాల వయసులో ఓ బ్రిటీష్ టెక్స్టైల్ కంపెనీలో పనిచేసినట్లు సమాచారం. ఆ తరువాత ముంబయిలోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు.అర్దేషిర్ గోద్రెజ్గోద్రెజ్ గ్రూప్ సంస్థల అధినేత అర్దేషిర్ గోద్రెజ్ మొదట్లో ఓ కెమిస్ట్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తరువాత ఓ చిన్న షెడ్లో తాళాలు తయారు చేసే వ్యాపారం ప్రారంభించి క్రమంగా ఎదిగారు. ప్రస్తుతం దిగ్గజ వ్యాపారసంస్థల సరసన గోద్రెజ్ గ్రూప్ నిలిచింది. -
టాటా కారుకి ‘సుమో’ అనే పేరు ఎలా వచ్చింది ? ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే..
విలాసం కోసం కాకుండా కారు అవసరం అనే యుగంలో ఉన్నాం మనం. అందుకే కాబోలు ప్రతి నగరం, పట్టణం, గ్రాముల్లో కార్ల వినియోగం పెరిగిపోయింది. అయితే నైన్టీస్లో అలా కాదు. మారుతి 800, 1000 తర్వాత 1990లలో టాటా కంపెనీ ‘టాటా సుమో ఎంయూవీ’ని మార్కెటికి పరిచయం చేసింది. నాటి నుంచి టాటా కార్లలో టాటా సుమో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాల్లో ఒకటిగా నిలిచింది. ఎంతలా అంటే కేవలం మూడేళ్లలో లక్షకుపైగా అమ్ముడు పోయింది. అదే సమయంలో టాలీవుడ్ వెండితెరపై సుమోలు ఎగిరించి.. కథానాయకులతో తొడలు కొట్టించి.. మాస్ ప్రేక్షకుల్ని మురిపించిన దర్శకులు వెలుగులోకి వచ్చారు.అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన టాటా సుమో కారు వెనుక కథ ఏంటో తెలుసా? ఈ కారుకు సుమో అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటి ? ఈ పేరు జపనీస్ రెజ్లర్ల నుండి ప్రేరణ పొందిందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది తప్పు. టాటాలో కష్టపడి పనిచేసి, టాటా సంస్థ విజయంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగి పేరు మీద టాటా సుమో అని కారుకి పేరు పెట్టారు.పుకార్లు షికార్లుసాధారణంగా ప్రతి రోజు టాటా మోటార్స్ టాప్ ఎగ్జిక్యూటీవ్‌లు అందరూ కలిసి భోజనం చేసే వారు. కానీ ఆ సంస్థ ఎండీ మూల్గావ్కర్ అలా కాదు రోజు ఏదో ఒక సాకు చెప్పి బయటకు వెళ్లేవారు. కొన్ని గంటల తర్వాత వచ్చేవారు. ఆ తర్వాత టాటా డీలర్లు మూల్గావకర్కు ఫైవ్‌స్టార్ హోటళ్లలో లంచ్ ట్రీట్ ఇచ్చారని, అందుకే తమతో భోజనానికి రావడం లేదనే పుకార్లు వ్యాపించాయి.ట్రక్ డ్రైవర్లతో రోడ్ సైడ్ దాబాలో ఇంతకీ ఎండీ తమతో భోజనానికి ఎందుకు రావడం లేదా అనే ప్రశ్నే ఉన్నత ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రశ్నార్ధకంగా మారేది. అయితే దీన్ని చేదించేందుకు కొంతమంది ఉద్యోగులు మూల్గావ్కర్ మధ్యాహ్న దినచర్య గురించి తెలుసుకునేందుకు రహస్యంగా ఆయన్ను వెంబడించారు. వారు ఆశ్చర్యానికి గురి చేసేలా మూల్గావ్కర్ ట్రక్ డ్రైవర్లతో కలిసి రోడ్డు పక్కన దాబాలో ఆహారం తింటూ కనిపించారు. భోజన సమయంలో టాటా వాహనాలు వినియోగిస్తున్న డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అడ్డంకులు గురించి చర్చించేవారు.లోపాల్ని సరిదిద్దే ప్రయత్నంఏ అంశాలు బాగున్నాయో, లోపాల్ని గుర్తించిన తర్వాత కార్యాలయానికి వచ్చేవారు. అందులో పనిచేస్తున్న రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బృందానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా టాటా మోటార్స్ అభివృద్దికి మూల్గావ్కర్ కృషి చేశారు.టాటా సుమో పేరు అలా వచ్చిందికాబట్టే టాటా ఆయన పేరు మీద ఐకానిక్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. సు-మంత్ మో-ఓల్గాకర్ పేరు మొదటి అక్షరాలతో టాటా సుమో పేరును మార్కెట్‌కి పరిచయం చేసింది. చివరగా టాటా సుమో గోల్డ్ 10 సీట్ల ఎస్యూవీ ధరరూ.5.26లక్షల నుంచి రూ.8.93లక్షల మధ్య ఉంది. -
ఆ సమయంలో కూడా 'రతన్ టాటా' భయపడలేదు: శివశంకరన్
మీరు 30 నిమిషాల్లో చనిపోతారని ఎవరైనా చెబితే మీరు ఎలా స్పందిస్తారు? కొందరు షాక్‌కు గురవుతారు. మరికొందరు భయాందోళనలకు గురవుతారు, కొందరు కన్నీళ్లు పెట్టుకుంటారు. మరణం అంచుదాకా వెళ్ళినప్పుడు కూడా రతన్ టాటా ఎలా ఉన్నారో ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు సీ శివశంకరన్ వివరించారు.'ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమణి' అనే పోడ్కాస్ట్లో ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు సీ శివశంకరన్ మాట్లాడుతూ.. నేను (శివశంకరన్), రతన్ టాటా సింగపూర్ నుంచి సీషెల్స్‌కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో, ఓ భయంకరమైన వార్త వినపడింది. విమానంలోని రెండు ఇంజిన్లలో ఒకటి ఫెయిల్ అయింది. రెండోది కూడా విఫలమైతే 30 నిమిషాల్లో క్రాష్ అయ్యే అవకాశం ఉందని టాటా సెక్రటరీ ఒకరు వెల్లడించారు.ఈ వార్త వినగానే మరణం చాలా దగ్గరగా ఉందని తెలియగానే నా మనసులో ఆలోచన వచ్చింది. వెంటనే నా జీ మెయిల్ పాస్‌వర్డ్‌ను నా కొడుకుకు ఈ-మెయిల్ ద్వారా షేర్ చేస్తూ.. నేను ఇంకా ఎక్కువ రోజులు జీవించాలని అనుకుంటున్నానని చెప్పాను. అయితే నేను చనిపోతున్నానని ఆ సమయంలో రాజీ పడ్డాను అని శివశంకరన్ పేర్కొన్నారు.ఆ సమయంలో రతన్ టాటా మాత్రం నిశ్శబ్దంగా.. ఏ మాత్రం కలవరపడకుండా కనిపించరు. పైలట్లను వారి పనిని చేయనివ్వండి అని అతను చెప్పారు. అదృష్టవశాత్తూ రెండో ఇంజన్ ఫెయిల్ కాకపోవడంతో మేమిద్దరం ప్రమాదం నుంచి బయటపడ్డామని అన్నారు.విమానం ల్యాండ్ అవ్వడానికి ఒక్క నిమిషం ముందుగానే విమానాశ్రయంలో అంబులెన్స్‌లు అగ్నిమాపక సిబ్బంది నిలబడి ఉండడం చూశాను. ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగిన తర్వాత మంటలు చెలరేగకుండా రక్షించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించినట్లు శివశంకరన్ వివరించారు. -
టాటా గ్రూప్‌లో ఆశా కిరణం లియా టాటా!
పెదనాన్న రతన్ టాటా బాటలో టాటా గ్రూప్ లో తనదైన ముద్ర వేస్తున్నారు లియా టాటా. రతన్ టాటా సోదరుడు నోయల్ టాటా పెద్ద కుమార్తె ఈ లియా టాటా. మంచి విద్యా నేపథ్యం, బిజినెస్ కెరియర్‌తో దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపార కుటుంబంలో కీలకమైన వ్యక్తిగా నిలిచే దిశగా దూసుకెళ్తోంది.విద్యా నేపథ్యంటాటా గ్రూప్‌లో తనదైన అద్భుత కెరీర్‌ను ఏర్పరుచుకుంటున్న లియా టాటాకు బలమైన విద్యా నేపథ్యం ఉంది. స్పెయిన్ లోని మాడ్రిడ్ లోని ప్రతిష్ఠాత్మక ఐఈ బిజినెస్ స్కూల్ లో మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె కార్పొరేట్ ప్రపంచంలో రాణించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను సమకూర్చుకున్నారు.తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్ లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ గా 2006లో తన ప్రొఫెషనల్ జర్నీని ప్రారంభించారు లియా టాటా. కొన్నేళ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం తాజ్ హోటల్స్ లో డెవలప్ మెంట్ అండ్ ఎక్స్ టెన్షన్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ హోటల్ కంపెనీలో భాగమైన లగ్జరీ హోటల్ చైన్ వృద్ధి, వ్యూహాత్మక కార్యక్రమాలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు.టాటా గ్రూప్‌లో కీలక పాత్రఇండియన్ హోటల్ కంపెనీలో అంతర్భాగమై, దాని కార్యకలాపాలు, విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు లియా టాటా. ఈ ఇండియన్ హోటల్ కంపెనీ ప్రఖ్యాత తాజ్ హోటల్స్‌తో సహా టాటా గ్రూప్ హోటళ్ళ విస్తృతమైన నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుంది. బ్రాండ్ శ్రేష్ఠత, ఆతిథ్యం వారసత్వాన్ని కొనసాగించడంలో లియా టాటా కృషి గణనీయంగా ఉంది.తాజ్ హోటల్స్ లో బాధ్యతలతో పాటు, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధనకు అంకితమైన టాటా గ్రూప్ విభాగమైన టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో కూడా లియా టాటా కొనసాగుతున్నారు. 2022 నవంబర్‌లో జరిగిన ఈ నియామకం ఆమె కెరీర్లో ఒక ముఖ్యమైన దశ. సంస్థలో క్రమంగా తన ప్రభావాన్ని పెంచుకుంటున్న లియా టాటాకు ఆమె వృత్తిపరమైన ప్రయాణానికి రతన్ టాటా మార్గనిర్దేశం చేస్తున్నారు. -
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలకు సోమవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. ముంబైలో పలువురు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, వారి కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి ముంబైలోని మలబార్ హిల్‌లో ఓటు వేశారు. #WATCH | Reliance Industries Chairman Mukesh Ambani, Founder and Chairperson of Reliance Foundation Nita Ambani along with their son arrive at a voting centre in Mumbai to cast their vote for #LokSabhaElections2024 pic.twitter.com/R97TSDysam— ANI (@ANI) May 20, 2024 ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన సహాయకుడు శంతను నాయుడుతో కలిసి ముంబైలోని కోల్బాలోని పోలింగ్ బూత్ వచ్చి ఓటు వేశారు. అనిల్ అంబానీ ముంబైలోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి ఓటింగ్ ప్రారంభమయ్యే వరకు ఎదురు చూసి మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | Industrialist Anil Ambani stands in a queue at a polling booth in Mumbai, as he waits for the voting to begin.#LokSabhaElections2024 pic.twitter.com/UUCC9iOmyu— ANI (@ANI) May 20, 2024 ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పెద్దార్ రోడ్‌లోని పోలింగ్ బూత్‌లో కూతురు అనన్య బిర్లాతో కలిసి ఓటు వేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. The privilege of deciding who will govern us…It’s a blessing. Never turn your back on a blessing… pic.twitter.com/rkSAr2CQMh— anand mahindra (@anandmahindra) May 20, 2024 ముంబైలోని పెద్దార్ రోడ్డు సమీపంలో తన కుటుంబంతో కలిసి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓటు వేశారు. జెట్ ఎయిర్వేస్ మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్, హెచ్డీఎఫ్సీ మాజీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ ముంబైలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు.VIDEO | Lok Sabha Elections 2024: "I, along with my family cast our votes together. It is a very proud moment for every Indian and it is a moment of pride to participate in an election of 140 crore people," says RBI governor Shaktikanta Das (@DasShaktikanta) after casting his… pic.twitter.com/YEPMHmKCqn— Press Trust of India (@PTI_News) May 20, 2024 -
రతన్‌టాటా.. అణువణువూ ఆదర్శమే..!
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలకు సోమవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబైలోని కోల్బాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.అణువణువూ ఆదర్శమే..వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ ఈసారి 85 ఏళ్లు పైబడిన వారికి పోలింగ్ కేంద్రానికి వచ్చే పని లేకుండా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. కానీ 86 ఏళ్ల రతన్ టాటా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. తన సహాయకుడు శంతను నాయుడుతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన రతన్‌టాటా అక్కడి పోలింగ్ సిబ్బందితో హుషారుగా ముచ్చటిస్తూ కనిపించారు.అందరూ ఓటేయాలని పిలుపుముంబైలో ఓటు వేయడానికి రెండు రోజుల ముందే రతన్ టాటా నగరంలోని ఓటర్లందరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. “ముంబయిలో సోమవారం ఓటింగ్ రోజు. ముంబైవాసులందరూ బయటలకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని నేను కోరుతున్నాను” అని ఆయన శనివారం ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. Monday is voting day in Mumbai. I urge all Mumbaikars to go out and vote responsibly.— Ratan N. Tata (@RNTata2000) May 18, 2024 -
లోక్‌సభ ఎలక్షన్స్.. రతన్ టాటా సందేశం
భారతదేశంలో ఇప్పటికే నాలుగు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓటర్లను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.మే 20న ముంబైలో (ఫేజ్ 5) ఓటింగ్ జరగనుంది. ముంబై వాసులందరూ బయటకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని నేను కోరుతున్నాను.. అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.. తప్పకుండా ఓటు వేస్తామన్నట్లు చెబుతున్నారు.ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ముంబై సిటీ, ముంబై సబర్బన్‌లోని ఆరు లోక్‌సభ స్థానాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి.Monday is voting day in Mumbai. I urge all Mumbaikars to go out and vote responsibly.— Ratan N. Tata (@RNTata2000) May 18, 2024 -
'రతన్ టాటా'కు ప్రతిష్టాత్మక అవార్డు
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా.. దాతృత్వంలో కూడా తనకు తానే సాటి. ఈయన చేసిన సేవలకుగానూ ఇటీవల ప్రతిష్టాత్మకమైన 'పీవీ నరసింహారావు స్మారక అవార్డు' లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలను టాటా మోటార్స్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు మీద అందించే ఈ స్మారక పురస్కారం.. సామాజిక సంక్షేమం, మానవతా దృక్పథం పట్ల అసాధారణమైన అంకితభావాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు అందిస్తారు. ఈ అవార్డు మార్చి 15న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో రతన్ టాటా పొందారు. బిలియన్ల కొద్దీ విరాళాలు ఇచ్చిన పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. టాటా ట్రస్ట్‌ల కింద వ్యక్తిగత స్థాయిలో లక్షల రూపాయల విరాళాలు అందించారు. రతన్ టాటా ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి సహా వివిధ రంగాలకు విరివిగా విరాళాలు అందించారు. కాగా తాజాగా ఈయన పెంపుడు జంతువుల కోసం రూ. 165 కోట్లు వెచ్చించి టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ పేరుతో హాస్పిటల్ నిర్మించారు. ప్రస్తుతం రతన్ టాటా.. టాటా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్‌గా ఉన్నారు. ఇప్పటికే ఈయన భారతదేశ అత్యుత్తమ పురస్కారాలైన పద్మవిభూషణ్ (2008), పద్మభూషణ్ (2000) పొందారు. కాగా ఇప్పుడు పీవీ నరసింహారావు స్మారక అవార్డును సొంతం చేసుకున్నారు. Our Chairman Emeritus Mr. Ratan Tata was honoured with the prestigious PV Narasimha Rao Memorial award for his immense contributions in the field of philanthropy. pic.twitter.com/uow3Qv0XOG — Tata Group (@TataCompanies) March 19, 2024 -
Ratan Tata Photos: ప్రేమ విఫలం అయ్యాక పెళ్లికి దూరంగా టాటా.. మరెన్నో ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
రతన్ టాటా వెనుకుండి నడిపిస్తున్న కంపెనీ..!
-
రతన్ టాటా బయోగ్రఫీ బుక్ లాంచ్ ఎప్పుడంటే..
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పారిశ్రామికవేత్తలలో ఒకరైన 'రతన్ టాటా' జీవిత చరిత్ర పుస్తకం రూపంలో రానున్నట్లు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. పుస్తక రచయిత 'మాథ్యూ' (Mathew) నవంబర్ 2022లో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 2022లో రతన్ టాటా బయోగ్రఫీ బుక్ విడుదలవుతుందని ఎదురుచూసే అభిమానులకు అప్పుడు నిరాశే ఎదురైంది. ఆ తరువాత బుక్ లాంచ్ తేదీని 2023 మార్చి నెలకు మార్చారు, మళ్ళీ ఓసారి 2024 ఫిబ్రవరి అన్నారు. ఈ నెలలో కూడా బుక్ లాంచ్ సాధ్యంకాదని తేలిపోయింది. మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కానీ మార్చి 30 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగి.. దాతృత్వానికి మారుపేరుగా నిలిచినా రతన్ టాటాకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా ఉంది. ఇటీవలే రతన్ టాటా ఏకంగా 165 కోట్ల రూపాయలతో పెంపుడు జంతువుల కోసం హాస్పిటల్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఇదీ చదవండి: అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా.. జంతు ప్రేమికులు తమ కుక్కలకు లేదా పిల్లులకు చికిత్స కావాలనుకున్నప్పుడు వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా.. వాటికి మెరుగైన చికిత్స ఆంచించడానికి ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసుపత్రి ముంబైలో నిర్మించనున్నారు. టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ పేరుతో రానున్న ఈ ఆసుపత్రి వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. -
హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి
ఇక్కడ ఫొటోలో చూడగానే ఎక్కడో చూసామనే భావన చాలా మందికి కలుగుతుంది. పుస్తకం చేతపట్టిన సరస్వతీ పుత్రుడుగా కనిపించే ఈయన దేశం గరించదగ్గ మహానుభావుడు, ఉన్నదాంట్లో అంతా దానం చేయగల విశాలమైన హృదయం ఉన్న వ్యక్తి. ఇప్పటికే ఈయనవరో దాదాపు అర్థమైపోయి ఉంటుంది. ఆయనే మన 'రతన్ టాటా'. ప్రముఖ పారిశ్రామిక వేత్త, పరోపకారి, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ 'రతన్ టాటా' గురించి భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు తెలుసు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన ఈయన 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు కంపెనీ కంపెనీ తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. 1937 డిసెంబర్ 28న పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించిన రతన్ టాటాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని తల్లిదండ్రులు విడిపోయారు, ఆ తరువాత ఆయన్ను అమ్మమ్మ నవాజ్‌బాయి పెంచారు. చదువు పూర్తయిన తరువాత టాటా గ్రూప్‌లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. రతన్ టాటా చాలా వరకు ఎక్కువ మొత్తంలో డబ్బును సమాజ సేవకు వెచ్చిస్తారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి వంటి వాటికి ఎక్కువ ఖర్చు చేసి వాటి పురోగతికి పాటు పడ్డారు, భారతదేశంలో కరోనా విజృంభించిన సమయంలో వేలకోట్లను విరాళంగా ఇచ్చి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఇదీ చదవండి: యూపీఐ పేమెంట్స్ ఏ దేశాల్లో చేయొచ్చో తెలుసా.. పారిశ్రామిక రంగంలో రతన్ టాటా చేసిన కృషి అనన్య సామాన్యం.. ఆయన దాతృత్వం అపారం. ఇవన్నీ గుర్తించిన భారత ప్రభుత్వం రతన్ టాటాకు 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇవి మాత్రమే కాకుండా ఈయనకు 2006 మహారాష్ట్ర భూషణ్, దశాబ్దపు పరివర్తన నాయకుడు, ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు వంటి లెక్కకు మించిన అవార్డులు ఆయన్ను వరించాయి. -
ట్రాన్స్జెండర్లకు ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగాలు
ట్రాన్స్జెండర్లకు ప్రతిష్టాత్మక టాటా కంపెనీలో ఉద్యోగాలు రానున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పలు రకాల ఉద్యోగాల కోసం ట్రాన్స్‌జెండర్ అభ్యర్థుల నుంచి టాటా స్టీల్ దరఖాస్తులు కోరుతోంది. ఇంగ్లిష్‌లో మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ లేదా గ్రాడ్యుయేషన్ లేదా ఏఐసీటీఈ/ యూజీసీ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లో, ఏదైనా విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని సంస్థ వెల్లడించింది. ఇదీ చదవండి: భారత్‌లో టాప్ బిజినెస్ స్కూల్ ఇదే.. 2022 ఫిబ్రవరిలో కూడా టాటా స్టీల్ 12 మంది క్రేన్ ఆపరేటర్ ట్రైనీలుగా ట్రాన్స్జెండర్లను ఒడిశాలోని కళింగనగర్ ప్లాంటు కోసం నియమించుకుంది. దీనికి ముందు గనుల్లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (హెచ్ఈఎంఎం) కార్యకలాపాల కోసం, ఝార్ఖండ్‌లోని వెస్ట్ బొకారో కోసం 14 మంది ట్రాన్స్జెండర్లను ఎంపిక చేసింది. 2025 నాటికి 25శాతం లింగవైవిధ్యం కలిగిన ఉద్యోగులు ఉండేలా చూడాలని టాటా స్టీల్ లక్ష్యంగా పెట్టుకుంది. -
జంతువుల కోసం టాటా హాస్పిటల్ - ఎక్కడో తెలుసా?
ప్రముఖ వ్యాపారవేత్త, పరోపకారి 'రతన్ టాటా' ముంబైలో జంతువుల కోసం అత్యాధునిక హాస్పిటల్ నిర్మించడానికి సంకల్పించారు. సుమారు 2.2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ఆసుపత్రిలో కుక్కలు, పిల్లులు, కుందేళ్ళు వంటి ఇతర చిన్న జంతువులను 24x7 సేవలు అందించనున్నట్లు సమాచారం. రతన్ టాటా నిర్మించనున్న ఈ జంతువుల హాస్పిటల్ కోసం ఏకంగా రూ. 165 కోట్లు వెచ్చించినట్లు, టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ పేరుతో రానున్న ఈ ఆసుపత్రి వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావిస్తారని, నా జీవిత కాలంలో అనేక పెంపుడు జంతువులను చూసాను, కాబట్టి పెంపుడు జంతువుల కోసం ఆధునిక పరికరాలతో ఒక హాస్పిటల్ కావాలనే ఆవశ్యకతను అర్థం చేసుకున్నానని రతన్ టాటా ప్రస్తావించారు. జంతు ప్రేమికులు తమ కుక్కలకు లేదా పిల్లులకు చికిత్స కావాలనుకున్నప్పుడు వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా.. వాటికి మెరుగైన చికిత్స ఆంచించడానికి ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసుపత్రి ముంబైలో నిర్మించనున్నారు. ఇదీ చదవండి: ఖరీదైన వస్తువులు పోతున్నాయ్.. ఆందోళనలో భారతీయ సీఈఓలు నిజానికి రతన్ టాటాకు జంతువుల మీద ఉన్న ప్రేమ ఎటువంటిదో అందరికి తెలుసు. జంతువుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించిన 'శంతను నాయుడు' రతన్ టాటాకు దగ్గరవడానికి ప్రధాన కారణం ఇద్దరికీ జంతువుల మీద ఉన్న ప్రేమ అని గతంలో చాలా సందర్భాల్లో చాలా మంది వెల్లడించారు. -
అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ..
అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి సుమారు 7000 మంది అతిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులో పారిశ్రామిక వేత్తలు, సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఉన్నారు. బాలరాముని ప్రాణప్రతిష్టకు హాజరయ్యే పారిశ్రామిక వేత్తలు రతన్ టాటా ముఖేష్ అంబానీ నీతా అంబానీ కుమార్ మంగళం బిర్లా అజయ్ పిరమల్ ఆనంద్ మహీంద్రా అజయ్ శ్రీరామ్ కె కృతివాసన్ కె సతీష్ రెడ్డి పునీత్ గోయెంకా SN సుబ్రహ్మణ్యన్ మురళి దివి ఎన్ఆర్ నారాయణ మూర్తి నవీన్ జిందాల్ నరేష్ ట్రెహాన్ అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎయిరిండియాకు ఏమైంది? ‘వెజ్ మీల్స్‌లో చికెన్ ముక్కలు’!
టాటా సన్స్ గ్రూప్ ఆధీనంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందా? ఫలితంగా ప్రయాణికులకు ఎయిరిండియా సంస్థపై నమ్మకం సన్నగిల్లుతుందా? అంటే అవుననే అంటున్నాయి ఎయిరిండియా సంస్థలోని వరుస సంఘటనలు. టాటా సన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేసిన ఆరంభం నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇప్పటికే ప్రయాణికులపై మూత్ర విసర్జన,దుబాయ్- ఢిల్లీ ఎయిరిండియా విమానం కాక్‌పిట్‌లోకి ప్రియురాలు, మహిళ భోజనంలో రాయి వంటి వరుస వివాదాలతో ఆ సంస్థ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తాజాగా, మరో మహిళ వెజ్‌మీల్స్‌లో చికెన్ ముక్కలు కనిపించడంతో కంగుతినడం ఆమె వంతైంది. వీర్‌జైన్ అనే మహిళ ప్రయాణికురాలు కాలికట్ టూ ముంబై ఏఐ582 ఎయిరిండియా విమానం ఎక్కింది. సాయంత్రం 6.40 బయలుదేరాల్సిన విమానం 7.40కి ప్రారంభమైంది. కొన్ని సార్లు రాకపోకల కారణంగా ఫ్లైట్ జర్నీ కొంచెం ఆలస్యం అవుతుందిలే అని సర్ది చెప్పుకుంది. వీర్‌జైన్‌కు జర్నీ ప్రారంభమైంది. కొద్దిసేపటికి బాగా ఆకలివేసిన వీర్‌జైన్ వెజ్మీల్స్ ఆర్డర్ చేసింది. సిబ్బంది వెజ్మీల్స్ తెచ్చారు. అసలే ఆకలి..పైగా ప్లేట్లో మీల్స్ వేడివేడిగా ఉండడంతో ఆతృతగా ఆరగించే ప్రయత్నం చేసింది. క్రూ సిబ్బంది సర్వ్ చేసిన ఆహార ప్యాకెట్‌పై ‘వెజ్ మెయిన్ మీల్’ అని స్పష్టంగా రాసిఉన్నా.. అందులో చికెన్ పీసెస్ రావడం పట్ల ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇలా ఎందుకు జరిగిందని ఎయిరిండియా కేబిన్ సూపర్వైజర్ సోనాని ప్రశ్నించింది. వీర్‌జైన్‌తో పాటు తన స్నేహితురాలు సైతం తన వెజ్ ప్లేట్లో చికెన్ ముక్కలు వచ్చాయంటూ ఫిర్యాదు చేసింది. పట్టించుకోని ఎయిరిండియా సిబ్బంది? అయితే జరిగిన తప్పిందంపై ఎయిరిండియా సిబ్బంది సరిగ్గా స్పందించ లేదని.. సంబంధిత సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దిగొచ్చిన ఎయిరిండియా.. ఆపై క్షమాపణలు ప్రస్తుతం ఆఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా..ఇలాగే పునరావృతమైతే ఎయిరిండియాపై ప్రయాణికులకు నమ్మకాన్ని పోగొట్టుకుంటుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎయిరిండియాకు ఏమైందని, ఆ సంస్థ సీఈఓ కాంప్‌బెల్ విల్సన్, మాతృ సంస్థ టాటా గ్రూప్ చర్యలు తీసుకుంటే బాగుంటుదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోనాజైన్ ఫోటోలపై ఎయిరిండియా స్పందిస్తూ క్షమాణలు చెప్పింది. చదవండి👉 అంబానీతో పోటీపడి.. ఆపై అడ్డంగా దొరికిపోయిన గౌతమ్ సింఘానియా! -
‘రతన్ టాటా గూండాగిరి’
ఉప్పు నుంచి ఉక్కు వరకు. టీ నుంచి ట్రక్ వరకు.. వాచెస్ నుంచి హోటెల్స్ వరకు.. కెమికల్స్ నుంచి కార్స్ వరకు.. ఇలా పదుల సంఖ్యలో కంపెనీల్ని ముందుండి నడిపించిన గొప్ప లీడర్. వందల ఏళ్ల చరిత్ర.. 150 కి పైగా దేశాల్లో కంపెనీలు.. 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు.. 28 కి పైగా లిస్టెడ్ కంపెనీలు.. రూ.27.61 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ (డిసెంబర్ 26,2023 నాటికి) భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ కంపెనీని నడిపిస్తూ ఇసుమంతైనా గర్వం లేని పద్మ విభూషణుడు టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా. డిసెంబర్ 28న రతన్ టాటా 86వ జన్మదినం సందర్భంగా కోట్లాది మంది అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో రతన్ టాటా కోట్లాది మంది ప్రజల హృదయాల్ని గెలుచుకున్న సందర్భాల్ని గుర్తు చేసుకుంటున్నారు. అవేంటంటే ఈ కుక్క మీదేనా రతన్ టాటాకి మూగజీవాలంటే ప్రాణం. ఓ సారి ముంబై వీధుల్లో గాయాల పాలైన ఓ కుక్కను గమనించారు. వెంటనే దానికి చికిత్స చేయించారు. అనంతరం ఆ కుక్క గురించి వివరాలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ముంబైలోని నా ఆఫీస్ సమీపంలో గాయాలపైన ఓ కుక్కను గుర్తించాం. అత్యవసర చికిత్స కోసం సియాన్ ఆస్పత్రికి తరలించాం. మీరు ఆ కుక్క సంరక్షకులైతే కొన్ని ఆధారాలతో reportlostdog@gmail.comకు ఇమెయిల్ చేయండి” అని పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ కుక్క ప్రస్తుతం మా సంరక్షణలోనే ఉంది. చికిత్సను చేయిస్తున్నాం అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒకే ఒక్కడు.. గ్యాంగస్టర్, అతని 200 గూండాలతో రతన్ టాటా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే 1980వ సంవత్సరంలో టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టిన 15 రోజుల తర్వాత ఓ గ్యాంగ్‌స్టర్‌కు వ్యతిరేకంగా నిలబడ్డారు. వాస్తవానికి అప్పట్లో టాటా మోటార్స్ కంపెనీలో లేబర్ ఎన్నికలు జరిగేవి. ఆ సమయంలో అసంతృప్తితో ఉన్న కొంత మంది కార్మికులను ఒక గ్యాంగ్‌స్టర్ ప్రేరేపించాడు. లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. గ్యాంగ్‌స్టర్ తన అనచరులైన 200 మంది గూండాలతో కలిసి ప్లాంట్‌లోని 4000 మంది ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డాడు. సిబ్బంది విధులు నిర్వహించకుండా సమ్మె చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో భయబ్రాంతులైన ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు బయపడి పోయారు. దీంతో ‘‘ నాన్న పందులు గుంపులుగా..గుంపులుగా వస్తే సింహం సింగిల్ వస్తుందంటూ’’ రతన్ టాటా నేరుగా రంగంలోకి దిగి గ్యాంగ్‌స్టర్‌ను ఎదుర్కొన్నారు. రతన్ టాటా తన ఇంటిని వదిలేసి స్వయంగా ప్లాంట్‌లోనే కొద్దిరోజులపాటు ఉన్నారు. కార్మికులకు ధైర్యం చెబుతూ వారితో పనిచేయించారు. అయితే కొద్ది రోజుల తర్వాత గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇలా ఓ గ్యాంగ్‌స్టర్‌ను రతన్ టాటా చాలా ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. 16 ఏళ్ల యువకుడికి సాయం.. మహరాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన అర్జున్ దేశ్ పాండే 16 ఏళ్ల వయస్సులో ఉండగా తనకు ఓ హృదయ విదారకరమైన సంఘటన ఎదురైంది. దేశ్ పాండే ఓ రోజు ఫివర్ ట్యాబ్లెట్ తెచ్చుకునేందుకు స్థానికంగా ఉన్న ఓ మెడికల్ షాపుకి వెళ్లాడు. అయితే ఆ షాప్ వద్ద 70 ఏళ్ల వృద్దుడు క్యాన్సర్‌తో బాధపడుతూ తన భార్యకు కావాల్సిన మెడిసిన్ కోసం అదే షాపుకు వచ్చాడు. తన కావాల్సిన మెడిసిన్ ఈ షాప్‌లో ఉన్నా.. అత్యధిక ధర కావడంతో తాను ఆ మెడిసిన్‌ను కొనలేకపోతున్నానంటూ బాధపడటాన్ని గమనించాడు. కానీ ఏం చేయలేకపోయాడు. ఆ బాధలో నుంచి జనరిక్ ఆధార్ అనే స్టార్టప్ పుట్టింది. అర్జున్ దేశ్ పాండే దీనిని స్థాపించాడు. ఈ స్టార్టప్ ముఖ్య ఉద్దేశ్యం దేశ వ్యాప్తంగా ఉన్న 80 - 90 శాతం తగ్గింపుతో జనరిక్ మెడిసిన్ అందిస్తుంది. ఓ రోజు తనకు ఎదురైన సంఘటన, స్టార్టప్ ప్రారంభం వంటి అంశాలను అర్జున్ టెడెక్స్‌లో మాట్లాడారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన రతన్ టాటా సైతం వెంటనే జనరిక్ ఆధార్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆ కంపెనీ టర్నోవర్ అక్షరాల రూ.500 కోట్లు. ఒక్క ఫోన్ కాల్‌తో భారత్‌లో స్టార్టప్ జపం నడుస్తోంది. ఏదైనా బిజినెస్ చేయాలంటే జనాన్ని ఆకట్టుకోవాలి. అలాంటి బిజినెస్ ఐడియా ఉంటే చాలు. పర్ఫెక్ట్ ప్లాన్‌తో ఆ బిజినెస్ ఐడియాను అప్లయ్ చేస్తే చాలు కోట్లు కొల్లగొట్టొచ్చు. ఇలాగే ‘రెపోస్ ఎనర్జీ’ ఫౌండర్లు, భార్య భర్తలైన చేతన్ వాలుంజ్, అతిధి బోస్లే వాలుంజ్‌లు అనుకున్నారు. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, నిత్యవసర వస్తువులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే క్షణాల్లో వచ్చేస్తున్నాయి. అదే వినియోగదారులకు కావాల్సిన పెట్రోల్‌ను మనం ఎందుకు డెలివరీ చేయకూడదు అని అనుకున్నారు. ఐడియా బాగుంది. చేతిలో తగినన్ని నిధులు లేవు. పైగా ప్రజల్లోకి కంపెనీ పేరును బలంగా తీసుకెళ్లాలని అనుకున్నారు. అందుకే సాయం కోసం రతన్ టాటా ఆఫీస్ డోర్ తట్టారు. ఓ లెటర్‌ను రతన్ టాటాకు పంపారు. ప్రయత్నం అయితే చేశారు కానీ మనసులో ఎక్కడో చిన్న అనుమానం. టాటాకు పంపిన లెటర్ అందుతుందా? ఆ లెటర్ చదివి టాటా తమకు సాయం చేస్తారా? ఇలా ఎన్నో రకాలుగా అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఆ అనుమానాన్ని పటాపంచలు చేశారు రతన్ టాటా. ‘మీ లెటర్ నేను చదివాను. ఒక్కసారి మనం కలుసుకోగలమా? అంటూ రతన్ టాటానే స్వయంగా చేతన్, అతిధిలకు ఫోన్ చేశారు. కట్ చేస్తే రెపోస్ ఎనర్జీ రూ.200 కోట్ల విలువైన కంపెనీ ప్రసిద్ధి కెక్కింది. మనసున్న మారాజు.. అతడే రతన్ టాటా అంటూ రతన్ టాటా తన పెంపుడు కుక్కలు టాంగో, టిటో అంటే మహా ఇష్టం. ఆ ఇష్టం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఈ సంఘటనే అందుకు ఉదాహరణ. టాటాకు యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్‌తో సత్కరించేందుకు సిద్ధమైంది. అవార్డ్ ఇస్తున్నట్లు ప్రిన్స్ చార్లెస్ టాటాకు సమాచారం అందించారు. అ తర్వాత ముందుస్తు ప్లాన్ ప్రకారం.. లండన్ రాయల్ రెసిడెన్సీ బంకింగ్ హోమ్ ప్యాలెస్‌లో అవార్డ్‌ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ అవార్డ్‌ల ప్రధానోత్సవానికి రతన్ టాటా హాజరు కాలేదు. ఎందుకో తెలుసా? టాంగో, టిటోల వల్లే. తాను లండన్ బయలు దేరే ముందు టాంగో, టిటోలు అనారోగ్యానికి గురయ్యాయని, వేడుకకు తాను రాలేకపోతున్నాననే సమాచారాన్ని తనతో పాటు లండన్ వచ్చేందుకు సిద్ధమైన వ్యాపార వేత్త సుహెల్ సేథ్‌కి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇదే విషయం ప్రిన్స్ చార్లెస్‌కు చెప్పగా.. మనసున్న మారాజు.. అతడే రతన్ టాటా అంటూ ప్రశంసలు కురిపించారంటూ నాటి సంఘటనను గుర్తు చేశారు. అందుకే రతన్ టాటా కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తిగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. -
రతన్ టాటా గురించి ఐదు ఆసక్తికర విషయాలు
భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, టాటా గ్రూప్ మాజీ చైర్పర్సన్ 'రతన్ టాటా' (Ratan Tata) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ (ట్విటర్) ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన ఈయన నేటితో 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. రతన్ టాటా జన్మదినం సందర్భంగా ఈ కథనంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. రతన్ టాటా గురించిన 5 ఆసక్తికరమైన విషయాలు 👉రతన్ టాటా క్యాంపియన్ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌కు వెళ్లారు. ఈయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా. 👉రతన్ టాటా "ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా' అనే పుస్తకారు రాశారు. 👉86 సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడు. గతంలో ఈయన నాలుగు సార్లు పెళ్లికి దగ్గరగా వచ్చినట్లు సమాచారం, కానీ ప్రతి సారీ ఏదో ఒక భయం, లేదా ఇతర కారణాల వల్ల వెనక్కి తగ్గారు. 👉పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశ్యంతో.. తక్కువ ధరకే లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధర వద్ద లభించే కారు కావడంనా గమనార్హం. చిన్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారుని లాంచ్ చేసినట్లు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 👉తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS)లో ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను నిర్మించడానికి టాటా గ్రూప్ 2010లో 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు. భారతదేశంలోని అనేక మంచి కార్యక్రమాల కోసం రతన్ టాటా లెక్కకు మించిన డబ్బును విరాళంగా ఇచ్చిన సంఘటనలు కోకొల్లలు. -
రతన్ టాటాకు ప్రాణ హాని
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ప్రాణ హాని ఉందంటూ వచ్చి న ఫోన్ కాల్ శనివారం ముంబై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రతన్ టాటాకు తక్షణం భద్రత పెంచాలని, లేదంటే టాటా సన్స్ మరో మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీకి పట్టిన గతే పడుతుందని కాలర్ హెచ్చరించాడు. సైరస్ మిస్త్రీ 2022 సెప్టెంబర్ నాలుగో తేదీన కారు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే. దాంతో పోలీసులు ఆగమేఘాల మీద రతన్ టాటా భద్రతను పెంచారు. కాల్ కర్ణాటక నుంచి వచ్చినట్టు తేల్చారు. కాల్ చేసిన వ్యక్తిని పుణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, అతను ఐదు రోజులుగా ఆచూకీ లేడంటూ భార్య అప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం పోలీసుల దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బంధుమిత్రులను విచారించగా ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన అతనికి కొంతకాలంగా మతిస్థిమితం లేదని తేలింది. కర్ణాటకలో వేరొకరి ఇంట్లోంచి ఫోన్ తీసుకుని వారికి చెప్పకుండానే ముంబై కంట్రోల్ రూమ్‌కు ఇతను ఫోన్ చేసి హెచ్చరించినట్లు దర్యాప్తులో తేలింది. మనోవైకల్య బాధితుడు కావడంతో కేసు నమోదు, విచారణ వంటి చర్యలు చేపట్టకూడదని పోలీసులు నిర్ణయించారు. -
రతన్ టాటాకు బెదిరింపులు
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు బెదిరింపులు వచ్చాయి. రతన్ టాటా ప్రాణానికి ముప్పు పొంచి ఉందని దుండగుడు హెచ్చరించాడు. ముంబయి పోలీస్ కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించాడని పోలీసులు తెలిపారు. టాటా భద్రతను పెంచాలని లేదంటే ఆయనకు సైరస్ మిస్త్రీ లాగే అవుతుందని బెదిరించినట్లు వెల్లడించారు. బెదిరింపులు రావడంతో రతన్ టాటా భద్రతను పెంచడంతో పాటు ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బెదిరింపు కాల్స్ కర్ణాటక నుంచి వచ్చినట్లు గుర్తించి.. వెంటనే అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు పుణెకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన నిందితుడు పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు దర్యాప్తులో తేల్చారు. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్తీ గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మిస్తీతో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
ఎయిరిండియా సిబ్బందికి కొత్త యూనిఫాం.. ఎలా ఉందో చూశారా?
డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ ఆధీనంలో ఉన్న ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఎయిరిండియాని ప్రపంచ స్థాయి విమానయాన సంస్థ తీర్చిదిద్దేలా ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఆ సంస్థ లోగోని మార్చిన యాజమాన్యం.. తాజాగా అందులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ధరించేందుకు కొత్త యూనిఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. తన క్యాబిన్ సిబ్బంది, పైలట్లకు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో యూనిఫాంను డిజైన్ చేయించింది. మహిళా క్యాబిన్ సిబ్బందికి మోడ్రన్ లుక్‌లో ఓంబ్రే చీరలు, పురుషులకు బ్యాండ్గ్లస్, కాక్‌పిట్‌లో విధులు నిర్వహించే ఉద్యోగులు క్లాసిక్ బ్లాక్ సూట్స్ ఉన్నాయి. ఈ కొత్త యూనిఫామ్‌ను దశల వారీగా పూర్తిస్థాయిలో పరిచయం చేసేలా ఎయిరిండియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న నెలల్లో ఎయిరిండియా తొలి ఎయిర్ బస్ ఏ350 సర్వీసుల్ని ప్రారంభించనుంది. ఆ సమయంలో ఈ కొత్త యూనిఫామ్‌ను ధరించి సిబ్బంది విధులకు హాజరవుతారని సమాచారం. మహిళా సిబ్బంది యూనిఫాం ఎలా ఉండబోతుందంటే? మహిళా సిబ్బందికి ఈజీగా, స్టైలిష్‌గా, యూనిక్ లుక్‌లో సంప్రదాయాన్ని మేళవించేలా ఈ కొత్త యూనిఫాం ఆకట్టుకుంటుందని ఎయిరిండియా ఓ ప్రకటనలో పేర్కొంది. సీనియర్ మహిళా క్యాబిన్ సిబ్బంది కోసం ఓంబ్రే చీరలు, వంకాయ బ్లేజర్లతో కలిపి ఎరుపు-గోధుమ రంగులో ఉంటాయి. జూనియర్ మహిళా క్యాబిన్ సిబ్బంది ఎరుపు రంగు బ్లేజర్లతో కలిపి ఎరుపు - ఊదా రంగు చీరలను ధరిస్తారు. కాక్‌పిట్ సిబ్బంది యూనిఫారం క్లాసిక్ బ్లాక్ డబుల్ బ్రెస్ట్డ్ సూట్‌ను అందంగా డిజైన్ చేశారు మల్హోత్రా. ఈ సందర్భంగా మనీష్ మల్హోత్రా మాట్లాడుతూ “ఎయిరిండియా కోసం యూనిఫాం డిజైన్ చేసే అవకాశం నాకు లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. జాతీయ జెండాను మోసే (రతన్ టాటాను ఉద్దేశిస్తూ) వ్యక్తికి ఫ్యాషన్ విభాగం నుంచి దోహదపడటం ఆనందంగా ఉంది. నా లక్ష్యం దేశ విభిన్న సంస్కృతి, సంప్రదాయాల సారాంశం ఉట్టిపడేలా యూనిఫారాలను రూపొందించడం, ఆధునిక అధునాతన డిజైన్లను అందించడమేనని అన్నారు. -
దిగ్గజ వ్యాపారవేత్తల రైట్ హ్యాండ్స్.. వీళ్లు ఎంత చెప్తే అంతే!
ప్రతి వ్యక్తి గొప్ప స్థాయికి చేరటానికి లేదా జీవితంలో సక్సెస్ సాధించడానికి అతిని కృషి మాత్రమే కాకుండా.. మంచి సలహాలు, సూచనలు ఇవ్వడానికి కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వారు స్నేహితులు కావొచ్చు లేదా ఉద్యోగులు కావొచ్చు. ఇది సాధారణ వ్యక్తుల కంటే దిగ్గజ వ్యాపార వేత్తల విషయంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ కథనంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తల విజయం వెనుక ఉన్న కొంతమంది వ్యక్తులు (రైట్ హ్యాండ్స్) గురించి తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ & మనోజ్ మోదీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా.. భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా నిలిచిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ.. ఈ రోజు ఇంత సక్సెస్ సాధించాడంటే దాని వెనుక ఎంతోమంది సన్నిహితుల కృషి కూడా ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి 'మనోజ్ మోదీ'. నిజానికి మనోజ్ మోదీ కేవలం ఉద్యోగి మాత్రమే కాదు. ముఖేష్ అంబానీ బ్యాచ్ మేట్, వారిద్దరూ ముంబైలోని యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చదువుకున్నారు. ఆ తరువాత 1980లో ధీరూభాయ్ అంబానీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు మనోజ్ మోదీ రిలయన్స్‌లో చేరారు. ఆ తరువాత కంపెనీ ఉన్నతికి అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాడు. మనోజ్ మోదీ అంకిత భావానికి మెచ్చిన ముఖేష్ అంబానీ అతనికి ముంబైలోని నేపియన్ సీ రోడ్లో ఒక విలాసవంతమైన భవంతిని గిఫ్ట్ ఇచ్చాడు. ఇది 22 అంతస్తులు కలిగి 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీని ధర రూ. 1,500 కోట్ల కంటే ఎక్కువే. ఇషా అంబానీ & భక్తి మోదీ ముఖేష్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ కూడా వ్యాపార రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తోంది. ఈమె ఉన్నతికి కారణమైన కొంతమంది వ్యక్తులలో ఒకరు భక్తి మోదీ. ఈమె మనోజ్ మోదీ కుమార్తె. మనోజ్ మోదీ కుమార్తె భక్తి మోదీ.. ఇషా అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్‌లో కీలక కార్యనిర్వాహకురాలుగా పనిచేస్తోంది. కంపెనీ ఈ రోజు వేలకోట్లు సంపాదిస్తోంది అంటే దాని వెనుక భక్తి మోదీ పాత్ర కూడా ప్రధానమనే చెప్పాలి. ఈమెను ఇషా అంబానీ రైట్ హ్యాండ్ అని పిలుస్తారు. ఇషా అంబానీ కంపెనీ ప్రధాన వ్యవహారాలను చూస్తున్న వారిలో భక్తి మోదీ కాకుండా.. 'దర్శన్ మెహతా' కూడా ఉన్నారు. ఈయన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ (RBL) మొదటి ఉద్యోగి. మెహతా ప్రస్తుతం RBL ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రతన్ టాటా & శంతను నాయుడు రతన్ టాటా గురించి తెలిసిన చాలామందికి 'శంతను నాయుడు' గురించి కూడా తెలిసే ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఏర్పడ్డ వీరి బంధం చాలా మందికి ఆదర్శం. శంతను నాయుడు.. రతన్ టాటా వ్యక్తిగత సహాయకుడు. అంతే కాకుండా అతని కంపెనీలో జనరల్ మేనేజర్. 2018 నుంచి రతన్ టాటా కోసం పనిచేయడం ప్రారంభించిన శంతను నాయుడు ప్రస్తుతం కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇదీ చదవండి: సుధామూర్తి రాజకీయాల్లోకి వస్తుందా? ఇదిగో క్లారిటీ.. శంతను నాయుడు.. రతన్ టాటాకు ఎంత సన్నిహితుడిఫైనప్పటికీ, వ్యాపార కార్యకలాపాల్లో తనదైన సలహాలు ఇస్తున్నప్పటికీ.. కంపెనీ ఉన్నతికి దోహపడిన వారితో చెప్పగోదగ్గ వ్యక్తి 'ఎన్ చంద్రశేఖరన్'. ఈయనే రతన్ టాటా రైట్ హ్యాండ్ అని పిలుస్తారు. తమిళనాడుకి చెందిన చంద్రశేఖరన్.. కోయంబత్తూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ సైన్సెస్, తిరుచిరాపల్లిలోని ఎన్ఐటీలో ఎంసీఏ పూర్తి చేసి 1987లో టీసీఎస్‌లో చేరాడు. ఆ తరువాత ఈయన 2009లో సీఈవో అయ్యారు. -
రతన్ టాటా పేరిట మోసం.. వైరల్ అవుతున్న పోస్ట్
గత కొన్ని రోజులుగా 'డీప్ ఫేక్' (Deep Fake) అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సినీ తారల దగ్గర నుంచి రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు సైతం ఈ డీప్ ఫేక్ ప్రభావానికి గురవుతున్నారు. రష్మిక మందన్న, ప్రియాంక చోప్రా సంఘటనకు మరువక ముందే.. దేశీయ వ్యాపార దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) పేరిట ఓ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఒక పోస్ట్‌లో, సోన అగర్వాల్ పేరుతో టాటా మేనేజర్‌గా చెప్పుకుంటూ.. దేశ ప్రజలకు ఇదే నా సిఫార్సు. 100 శాతం గ్యారెంటీతో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి అవకాశం, దీని కోసం ఈ ఛానెల్లోకి వెళ్లండి అంటూ.. రతన్ టాటా చెప్పినట్లు ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ వీడియోపై రతన్ టాటా స్పందిస్తూ.. అదంతా ఫేక్ అని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇలాంటి వాటి భారిన పడకుండా ఉండాలంటే ప్రజలు కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదీ చదవండి: యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్.. రోజు రోజుకి పెరుగుతున్న డీప్ ఫేక్ సమస్యను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ సమస్యను పూర్తిగా అరికట్టడానికి కేంద్ర మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' కూడా సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని భావించవచ్చు. -
రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా!
Shantanu Naidu New Tata Safari Facelift: దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే భారతీయ మార్కెట్లో హారియర్, సఫారీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేసింది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ల మాదిరిగానే అద్భుతంగా ఉన్న ఈ మోడల్స్ చాలా మంది కొనుగోలుదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. ఇటీవల రతన్ టాటా మేనేజర్, గుడ్‌ఫెలోస్ వ్యవస్థాపకుడు 'టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్' (Tata Safari Facelift) కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గతంలో టాటా నానో కారుని ఉపయోగించే రతన్ టాటా మేనేజర్ 'శంతను నాయుడు' (Shantanu Naidu) తాజాగా ఖరీదైన సఫారీ ఫేస్‌లిఫ్ట్ సొంతం చేసుకున్నారు. వైట్ కలర్లో ఆకర్షణీయంగా ఉన్న ఈ కారులో ఇప్పటికే 1000 కిమీ ప్రయాణించినట్లు, దానికి 'యుకీ' అని పేరు కూడా పెట్టుకున్నట్లు సమాచారం. టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ రూ. 16.19 లక్షల ప్రారంభ ధరలో దేశీయ విఫణిలో లాంచ్ అయిన సఫారీ ఫేస్‌లిఫ్ట్ మొత్తం 10 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 27.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. సఫారీ ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 170 హార్స్ పవర్, 350 న్యూటన్ మాటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. కాస్మిక్ గోల్డ్, గెలాక్సీ సఫైర్, లూనార్ స్లేట్, స్టార్‌డస్ట్ యాష్, స్టెల్లార్ ఫ్రాస్ట్, సూపర్నోవా కాపర్ వంటి ఆరు కలర్ ఆప్సన్లలో లభించే ఈ కారు ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. -
రతన్ టాటా తర్వాత గ్రూప్ సారథులు వీరే..?
దేశంలో టాటా గ్రూప్ లెగసీ చాలా పెద్దది. రతన్‌టాటాకు పెళ్లి కాకపోవడంతో తన వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించేవారు లేకుండాపోయారు. దాంతో దాదాపు రూ.20 లక్షల కోట్ల టాటా గ్రూప్ సంస్థలను ఎవరు ముందుకు తీసుకెళతారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ సామర్థ్యం ఎవరికి ఉందనే చర్చ కొనసాగుతోంది. అయితే తన ఫ్యామిలీకే చెందిన తన సోదరుడు నోయెల్‌టాటా కుమార్తెలు లేహ్, మాయా, కుమారుడు నెవిల్లీలకు రతన్ టాటా వ్యాపార మెలకువలు నేర్పుతున్నట్లు జీక్యూ ఇండియా ప్రచురించింది. టాటాగ్రూప్ను ముందుకు నడిపే సత్తా వారికి ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. కానీ సంస్థతో వారికున్న అనుబంధం, వారి నైపుణ్యాలు, విద్యా ప్రమాణాలు తెలిస్తే టాటా నాయకత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలరని తెలుస్తోంది. లేహ్ టాటా నోయెల్ టాటా పెద్ద కుమార్తె. మాడ్రిడ్‌లోని ఐఈ బిజినెస్ స్కూల్లో తన ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. తాజ్ హోటల్స్ రిసార్ట్స్ & ప్యాలెస్‌లలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా తన కెరియర్ ప్రారంభించారు. సేల్స్ విభాగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్ హోటల్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాయా టాటా లేహ్ టాటా సోదరి మాయా టాటా. మాయా టాటా రతన్ టాటా మార్గదర్శకత్వంలో టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో తన కెరియర్‌కు మొదలుపెట్టారు. ఆమె పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా, ఇన్వెస్టర్ రిలేషన్స్ రిప్రజంటేటివ్‌గా పని చేశారు. యూనివర్శిటీ ఆఫ్ వార్విక్, బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. టాటా క్యాపిటల్, ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో రూ.1,000 కోట్లు కేటాయించిన టాటా డిజిటల్ కంపెనీలో కీలకస్థానంలో పనిచేశారు. టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ ఆరుగురు బోర్డు సభ్యుల్లో ఒకరిగా మాయా ఉన్నారు. నెవిల్లీ టాటా నోయెల్ టాటా చిన్న కుమారుడు. నెవిల్లే టాటా కూడా బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. ట్రెంట్ హైపర్‌మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సారథ్యం వహిస్తున్నారు. ఇది టాటా గ్రూప్ బ్రాండ్లైన వెస్ట్‌సైడ్ , స్టార్ బజార్లకు మాతృసంస్థగా ఉంది. ఇదీ చదవండి: ఇకపై 83 షాపులు 24 గంటలు ఓపెన్! టాటా గ్రూప్ సంస్థల స్వరూపం టాటా గ్రూప్ సంస్థలను 1868లో జెమ్షేడ్జీ టాటా స్థాపించారు. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో 30 కంపెనీలు ఉన్నాయి. ఆరు ఖండాల్లోని 100 కంటే ఎక్కువ దేశాలలో సేవలందిస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐటీ, డిజిటల్ వ్యాపార సేవలందిస్తోంది. టాటా స్టీల్ సంవత్సరానికి 33 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. టాటా మోటార్స్ కార్లు, యుటిలిటీ వెహికల్స్, బస్సులు, ట్రక్కులు, డిఫెన్స్ వాహనాలను తయారుచేస్తోంది. టాటా కెమికల్స్ బేసిక్, స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తి చేస్తోంది. టాటా పవర్ దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ. ఇండియన్ హోటల్స్ టూరిజం, ట్రావెల్ ఇండస్ట్రీలో ప్రపంచస్థాయి సేవలందిస్తోంది. టైటాన్ కంపెనీ ద్వారా ఆభరణాలు, కళ్లద్దాలు తయారుచేస్తున్నారు. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇటీవల రూ.3 లక్షల కోట్లు దాటింది. టాటా ఎలెక్సీ ఇంజినీరింగ్ డిజైన్, సాంకేతిక సేవలు అందిస్తోంది. టాటా డిజిటల్ ద్వారా వినియోగదారుల అవసరాలు తెలుసుకుని మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. టాటా సన్స్ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి 31, 2023 నాటికి టాటా గ్రూపు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,71,467 కోట్లుగా ఉంది. -
వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు భారీ ఊరట!
సింగూర్ నానో ఫ్లాంట్ వ్యవహారంలో సుదీర్ఘ పోరాటం చేస్తున్న ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్‌కు ప్రతిఫలం దక్కింది. మధ్యవర్తిత్వ అవార్డు (arbitral award) కింద అసలు, వడ్డీ మొత్తం రూ.766 కోట్లు పొందనుంది. వెస్ట్‌బెంగాల్ సింగూర్‌లో ‘టాటా మోటార్స్ లిమిటెడ్ (టీఎంఎల్) ఆటోమొబైల్ మ్యానిఫ్యాక్చరింగ్ ఏర్పాటు కోసం కేటాయించిన కేపిటల్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో నష్టపోయాం. ఈ వ్యవహారంలో ఎట్టకేలకు ఊరట లభించింది. వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యూబీఐడీసీ)..టీఎంఎల్కు అసలు, వడ్డీ చెల్లించేలా ముగ్గురు సభ్యుల ఆర్బిట్రల్ ట్రిబ్యూనల్స్ బృందం తీర్పు వెల్లడించారు’ అని టాటా మోటార్స్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ట్రిబ్యునల్ నిర్ణయంతో.. టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా సెప్టెంబర్ 1, 2016 నుంచి అసలు, ఏడాదికి 11 శాతం వడ్డీతో రూ.765.78 కోట్ల మొత్తాన్ని అందుకోనున్నారు. టాటాకు వెయ్యి ఎకరాల భూమి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం టాటా మోటార్స్‌కు నానో కార్లను తయారు చేసుకునేందుకు సుమారు 1,000 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది. అయితే, ఆ ప్రాంతంలోని రాజకీయ నాయకులు, రైతుల నుండి తీవ్ర నిరసనతో టాటా మోటార్స్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్‌కు అప్పటికే టాటా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. దీంతో పెట్టుబడులు విషయంలో తమకు నష్టం వాటిల్లిందని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని న్యాయ పోరాటం చేస్తుంది. ఎట్టకేలకు ఈరోజు ట్రిబ్యూనల్ టాటా మోటార్స్‌కు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇక నాటి పరిస్థితుల దృష్ట్యా టాటా మోటార్స్ నానో కార్ల తయారీ ప్లాంట్‌ను పశ్చిమ బెంగాల్ నుంచి తయారీ యూనిట్‌ను గుజరాత్‌లోని సనంద్‌కు మార్చింది. అక్కడే టాటా నానో తయారైంది. -
రషీద్ ఖాన్‌కు రతన్ టాటా రూ.10 కోట్లు రివార్డు ఇచ్చారా?
ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషిద్ ఖాన్‌కు రూ.10 కోట్ల వరకు ఆర్ధిక సహాయం చేసినట్లు సోషల్ మీడియాలోని పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వార్తల్ని రతన్ టాటా కొట్టిపారేశారు. గత వారం ప్రపంచకప్‌లో ఆఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆ జట్టు.. పాక్‌పై పంజా విసిరింది. పాకిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఆఫ్గాన్ రెండే వికెట్లు కోల్పోయి ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్ విజయంతో ఆఫ్గాన్ క్రికెటర్ రషిద్ ఖాన్ ఇండియన్ ఫ్లాగ్‌ను ప్రదర్శించారని, ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. రషిద్ ఖాన్‌కు ఐసీసీ రూ.55 లక్షల జరిమానా విధించిందనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన రతన్ టాటా..రషిద్ ఖాన్‌కు భారీ మొత్తంలో ఆర్ధిక సహాయం చేసేలా హామీ ఇచ్చారంటూ’ సోషల్ మీడియాలో పోస్టులు వెలుగులోకి వచ్చాయి. I have made no suggestions to the ICC or any cricket faculty about any cricket member regarding a fine or reward to any players. I have no connection to cricket whatsoever Please do not believe WhatsApp forwards and videos of such nature unless they come from my official… — Ratan N. Tata (@RNTata2000) October 30, 2023 ఆ కథనాల్ని రతన్ టాటా ఖండించారు. తనకు క్రికెట్‌తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తాను ఏ క్రికెటర్‌కి రివార్డ్ ఇవ్వలేదని, అలా ఇచ్చేలా ఐసీసీకి సైతం ఎలాంటి సూచనలు చేయలేదని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తన అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల నుండి వస్తే తప్ప వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్‌లు, తప్పుడు వీడియో కథనాల్ని నమ్మొద్దని రతన్ టాటా నెటిజన్లను కోరారు. చదవండి👉 అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై.. -
రతన్ టాటా కలల కారు ‘నానో’ ఈవీ కారుగా వచ్చేస్తుందా? అందులో నిజమెంత?
రతన్ టాటా ! పరిచయం అక్కర్లేని పేరు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న ధీశాలి. పద్మ అవార్డుల గ్రహీత. మంచితనం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శం. నమ్మకంతో కూడిన నాయకత్వం, నైతిక విలువలు, ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగి ఉండే గుణం. రూ. వేల కోట్ల సంపద ఉన్నా కూడా సాధారణ జీవితం గడుపుతున్న అసామన్యుడు. అలాంటి రతన్ టాటాకు ‘నానో’ కారంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ కారే భారత మార్కెట్లో తిరిగి ఎలక్ట్రిక్ వెహికల్‌గా విడుదలవుతుందుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నానో ఎలక్ట్రిక్ కారుగా రాబోతుందా? సోషల్ మీడియా పోస్టుల్లో నిజమెంత? త్వరలో, టాటా గ్రూప్ నానో ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తుందంటూ నానో’ పోలికతో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అంతేకాదు, టాటా నానో న్యూ అవతార్. కారు ధర రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటుందనే ఆ ఫేక్ సోషల్ మీడియా ఫోటో సారాశం. ఇంతకీ నానో తరహాలో ఉన్న ఆ కారును ఏ ఆటోమొబైల్ కంపెనీ తయారు చేస్తుందనే అనుమానం రావొచ్చు. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా 998 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో ‘టయోటా ఐగో’ హ్యాచ్‌బ్యాక్ కారును అమ్ముతుంది. కానీ ఈ కారు భారత్‌లో మాత్రం అందుబాటులో లేదు. గత కొన్నేళ్లుగా భారత్‌లో ఈవీ కార్ల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. వాటి బడ్జెట్ ఎక్కువ కావడంతో వాహనదారులు టాటా గ్రూప్ బడ్జెట్ ధరలో ఈవీ కారును అందుబాటులోకి తెస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అదిగో అప్పటి నుంచి టాటా సంస్థ నానో ఈవీ కారు వస్తుందనే ప్రచారం జోరందుకుంది. తాజాగా, టాయోటా ఐగో కారు ఫోటోల్ని చూపిస్తూ.. ఇదే టాటా నానో ఈవీ కారు అంటూ ఫోటోలు విడుదలయ్యాయి. అయితే, ఆ ఫోటోలు ఫేక్ అని తేలింది. నానో కారు ఇలా పుట్టిందే నానో కారు.. 15 ఏళ్ల క్రితం ఆటోమొబైల్ రంగంలో అదో పెను సంచలనం. రతన్ టాటా ప్రతి రోజు తన కారులో వెళ్లే సమయంలో స్కూటర్లపై వెళ్లుతున్న తల్లిదండ్రుల మధ్యలో కూర్చొవడం గమనించాను. తల్లీతండ్రి మధ్యలో కూర్చున్న పిల్లలు నలిగిపోతున్నారేమో అని నాకు అనిపించింది. గుంతలుగా ఉండే రోడ్లపైనా వారు అలాగే ప్రయాణించడం చూసి నాకో ఆలోచన తట్టింది. అలా పురుడు పోసుకుందే నానో కారు. ప్రపంచంలో అత్యంత చౌకైన కారు.. కానీ 2008 జనవరి 10న టాటా మోటార్స్ ‘నానో’ కారును విడుదల చేసింది. సామాన్యుల కోసం టాటా కంపెనీ అతి తక్కువ ధర అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కారు ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా గుర్తింపు పొందింది. అయితే క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోయి పూర్తిగా కనుమరుగైంది. చదవండి👉ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు, ప్రిన్స్ ఛార్లెస్ అవార్డు కార్యక్రమానికి ‘రతన్ టాటా’ డుమ్మా! -
ఆనంద్ మహీంద్రను దాటేసి మరీ టాప్‌లోకి రతన్ టాటా
పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. వ్యాపార దక్షతతో మాత్రమే కాదు, తనదైన వ్యక్తిత్వం, దాతృత్వంతో ఆయన ప్రత్యేకతే వేరు. అందుకే సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఇదే విషయాన్నిమరోసారి నిరూపించుకున్నారు రతన్ టాటా. మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్రను అధిగమించి మరీ నెటిజన్లు అభిమానాన్ని దోచుకున్నారు. భారతీయ సోషల్ మీడియాలో 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 జాబితాలో టాప్‌లో ప్లేస్ కొట్టేశారు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం మైక్రోబ్లాగింగ్ సైట్లో ఎక్స్( ట్విటర్) ఎక్కువ మంది ఫాలోవర్లతో వార్తల్లో నిలిచారు. 12.6 మిలియన్లతో భారతీయ సోషల్ మీడియాలో అత్యంత విస్తృతంగా అనుసరించే వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందారు. ఒక ఏడాదిలో ఆయన ఫాలోవర్లు సంఖ్య 8 లక్షలకు పైగా పెరిగారు. ఆ తరువాతి స్థానంలో 10.8 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఆనంద్ మహీంద్రా నిలిచారు. ( కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక) ఈ జాబితాలో టాప్ టెన్‌లో పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, గూగుల్ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ సత్య నాదెళ్ల, వ్యాపార వేత్తలు నందన్ నీలేకని, రోణీ స్క్రూవాలా, హర్ష వర్థన్ గోయింగా, కిరణ్ మజుందార్ షా, ఉదయకోటక్ నిలిచారు. దీంతో పాటు, భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల 12వ వార్షిక లిస్ట్‌ను కూడా హురున్ వెల్లడించింది. వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా సంపదలో గణనీయమైన క్షీణతను ఎదుర్కొన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని అధిగమించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ టాప్‌లోకి దూసుకొచ్చారు. గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. అంబానీ సంపద ఈ కాలంలో భారీగా పుంజుకుని దాదాపు రూ.8,08,700 కోట్లకు చేరింది. గౌతమ్ అదానీ రూ.474,800 కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయారు. సీరం ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావల్లా రూ. 2,78,500 కోట్ల మొత్తం సంపదతో మూడో స్థానంలోఉన్నారు.ఈ జాబితాలో రూ.2,28,900 కోట్ల సంపదతో శివ నాడార్ నాల్గవ స్థానంలో ఉన్నారు, గోపీచంద్ హిందూజా , అతని కుటుంబం రూ.1,76,500 కోట్లతో 5వ స్థానంలో ఉన్నారు. 1,64,300 కోట్ల సంపదతో దిలీప్ షాంఘ్వీ ఆరో స్థానంలో ఉన్నారు. -
ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్!
ఆధునిక కాలంలో ఫుడ్, కూరగాయలు వంటి వస్తువులను డోర్ డెలివరీ పొందుతున్నారు. వీటి కోసం ప్రస్తుతం అనేక సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఫ్యూయెల్ (పెట్రోల్ అండ్ డీజిల్) కూడా డోర్ డెలివరీ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ప్రస్తుతం దేశంలో స్టార్టప్ కల్చర్ పెరిగిపోతోంది. కొత్త ఆలోచనలతో సరికొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. స్విగ్గి, జొమాటో తరహాలోనే వాహన వినియోగదారులకు అవసరమైన పెట్రోల్ డోర్ డెలివరీ చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఒక భార్యాభర్తల జంట (చేతన్ వాలుంజ్ & అదితి భోసలే) రెపోస్ ఎనర్జీ (Repos Energy) ప్రారంభించారు. రెపోస్ ఎనర్జీ పెళ్లి తరువాత ఎలాగైనా స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనతో అదితి, చేతన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తరువాత అనుకున్నట్లుగానే సంస్థను పూణేలో ప్రారంభించారు. ప్రస్తుతం ఇది భారతదేశం మొత్తం మీదే సుమారు 65 నగరాల్లో విస్తరించి ఉంది. డోర్ టు డోర్ పెట్రోల్ డెలివరీ చేసి బాగా ఆర్జిస్తున్నారు. రెపోస్ ఎనర్జీ ద్వారా వినియోగదారులకు, కంపెనీలకు పెట్రోల్ సరఫరా చేసి నెలకు రూ. 2.2 కోట్లు వరకు సంపాదిస్తున్నారు. ప్రారంభంలో వీరి ఆదాయం నెలకు రూ. 70,000 మాత్రమే. ఈ జంట చేస్తున్న బిజినెస్ చాలామంది పెద్ద పారిశ్రామిక వేత్తలను కూడా ఆకర్శించింది. వీరి కొత్త ఆలోచనకు ముగ్దుడైన రతన్ టాటా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడు. దీంతో వారి బిజినెస్ మరింత వేగంగా ముందుకు వెళ్లడం ప్రారంభించింది. గతేడాది వీరి ఆదాయం రూ. 65 కోట్లకు చేరింది. ప్రస్తుతం కంపెనీ విలువ రూ. 200 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. రెపోస్ ఎనర్జీ ప్రస్తుతం టాటా గ్రూప్‌తో మాత్రమే కాకుండా.. మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ ఎలక్ట్రికల్, లార్సెన్ & టబ్రో, షిండ్లర్, జేడబ్ల్యు మారియట్ హోటల్, ఫీనిక్స్ మాల్, ది వెస్టిన్ హోటల్ వంటి సంస్థలతో కూడా ఒప్పందాలను కుదుర్చుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి.. మరింత లాభాలు పొందటానికి సంస్థ సన్నద్ధమవుతోంది. -
రతన్ టాటా జీవితంలో మరిచిపోలేని వ్యక్తి.. ఎవరీ నవాజ్‌బాయి టాటా!
దేశీయ దిగ్గజ సంస్థ టాటా (TATA) గురించి ఈ రోజు అందరికి తెలుసు. అయితే ఈ కంపెనీ 1868లో 'జమ్సెట్జీ నుస్సర్వాన్జీ టాటా' (జంషెడ్జీ) ప్రారంభించారు. నేడు ఈ కంపెనీ 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులను, సేవలను అందిస్తూ.. ఆరు ఖండాల్లోని 100 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ మార్కెట్ విలువ నేడు సుమారు రూ. 24 లక్షల కోట్లు. ఇంత పెద్ద సామ్రాజ్యానికి ఒకప్పుడు మహిళ డైరెక్టర్‌గా పనిచేసిందని చాలామందికి తెలియకపోవచ్చు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా సన్స్ మొదటి మహిళా డైరెక్టర్ 1925లో టాటా సన్స్ మొదటి మహిళా డైరెక్టర్‌గా 'నవాజ్‌బాయి' పనిచేసింది. ఆమె తన భర్త రతన్జీ టాటా మరణానంతరం కంపెనీకి సారథ్యం వహించి 1965లో మరణించే వరకు దానిని నడిపించింది. కంపెనీని నడిపించడమే కాకుండా ఈమె తన జీవితకాలంలో ఎన్నో దానధర్మాలు చేసింది. దీనికోసం 1928లో ఒక సంస్థను స్థాపించించింది. ఈ సంస్థ ప్రస్తుతం సర్ రతన్ టాటా ఇన్స్టిట్యూట్ (RTI) అనే పేరుతో పేద మహిళలకు ఉపాధి కల్పిస్తూ.. కుకరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ అండ్ లాండ్రీ విభాగాలలో వారి స్వంత జీవనోపాధికి శిక్షణ ఇస్తుంది. నవాజ్‌బాయి టాటా స్వయంగా రతన్ టాటా గ్రాండ్ మదర్. రతన్ టాటా చిన్నప్పుడు ఈమెతో చాలా సన్నిహితంగా ఉండేవాడినని గతంలో చాలాసార్లు వెల్లడించాడు. రతన్ & నవాజ్‌బాయి టాటా ఇద్దరూ కొన్నేళ్లు ఇంగ్లాండ్‌లో నివసించారు. వీరికి కింగ్ జార్జ్ V అండ్ క్వీన్ మేరీ వ్యక్తిగత స్నేహితులు. ఇదీ చదవండి: 19 ఏళ్లనాటి కల.. ఇప్పుడు నిజమైంది.. ఈజ్‌మైట్రిప్ కో-ఫౌండర్ టాటా సంస్థ పురోగతికి నవాజ్‌బాయి ఎంతో కృషి చేసింది. జమ్సెట్జీ టాటా నిర్దేశించిన సూత్రాలు, ఆదర్శాలకు అనుగుణంగా కంపెనీ పనిచేస్తుందని ఆమె నిర్ధారించేవారు. ఈ సంఘటనలు రతన్ టాటా గతంలో కూడా చాలా గొప్పగా వెల్లడించారు. -
ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే!
ప్రపంచం కుబేరుల జాబితాలోనే కాదు, భారతదేశంలోని టాప్ 10 ధనవంతుల లిస్ట్‌లో కూడా దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) పేరు ఎందుకు లేదనే సందేహం ఇప్పటికే చాలామంది మనసులో ఒక ప్రశ్నగా మిగిలి ఉంటుంది. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఉప్పు నుంచి కార్లు, విమానం, బంగారం, ఐటీ వంటి అన్ని రంగాల్లోనూ తమదైన రీతిలో దూసుకెళ్తున్న టాటా సన్స్ కంపెనీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఈయన సంపద వేల కోట్లలో ఉంటుంది. అయినప్పటికీ ధనవంతుల జాబితాలో ఈయన పేరు లేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కువ డబ్బుని దాతృత్వానికి వినియోగించడమే. అపారమైన వ్యాపార సామ్రాజ్యం, అంతకు మించిన పేరు ప్రతిష్టతలు కలిగిన రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు. కంపెనీ నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ కారణంగానే టాప్ 10 ధనవంతుల జాబితాలో కూడా ఉండలేకపోతున్నారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. కారణం ఇదే! 2021 - 22లో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లు అని నివేదికలు చెబుతున్నాయి. టాటా సంస్థల్లో ఏకంగా 9,35,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కాగా రతన్ టాటా 2012లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. -
వ్యక్తిగా వినమ్రుడు... వ్యవస్థగా త్రివిక్రముడు
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎనభై ఆరేళ్ల రతన్ నావల్ టాటాను పరి చయడం చేయడమంటే సూర్యుణ్ణి దివిటీతో చూపే ప్రయత్నం చేయటం. టాటా గురించి మళ్లీ మళ్లీ చెప్పుకోవడం ఎందుకంటే క్యాలెండర్ మారిన ప్రతిసారీ ఆయన కొత్తగా కనిపిస్తారు. పారిశ్రామిక రంగాన్ని సమస్యలు చుట్టిముట్టిన ప్పుడల్లా ఆయన సరికొత్తగా వెలుగులీనుతారు. తోటి పారి శ్రామికవేత్తలకు మాత్రమే కాదు, సమాజం మొత్తానికి భరోసాగా నిలుస్తారు. బడా పారిశ్రామికవేత్తగానే కాదు... వ్యక్తిగా కూడా రతన్ టాటా సమున్నతుడు. చదువయ్యాక అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒకమ్మాయిపై రతన్ మనసు పారేసుకున్నారు. ఆమె కూడా ఆయన్ను ప్రేమించింది. ఈలోగా 1962లో భారత–చైనా యుద్ధం వచ్చింది. అంతే! ఈ వివాహానికి తొలుత అంగీకరించిన ఆమె తల్లిదండ్రులు భయంతో మీమాంసలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో నాయనమ్మ నవాజ్ బాయ్ టాటాకు ఒంట్లో బాగోలేదని కబురంది రతన్ భారత్ వెళ్లాల్సి వచ్చింది (రతన్‌కు పదేళ్ల వయసున్నప్పుడే తల్లితండ్రులు నావల్ టాటా, సూనీ టాటా విడాకులు తీసుకున్నారు. అందుకే రతన్ నాయనమ్మ పెంపకంలో పెరిగారు). అంతా సవ్యంగా పూర్తయి అమెరికా వెళ్లేసరికి ప్రియురాలు తల్లితండ్రుల మాట విని వేరే పెళ్లి చేసుకుంది. పర్యవసానంగా రతన్ బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఒకరోజు ఎల్ఈడీ టీవీ బిగించటానికి రతన్ టాటా ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లూ అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్, పైన ఒక బనీనుతో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్‌లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదాసీదాగా, పాతకాలం నాటి ఫర్నిచర్‌తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ! ‘సరైన నిర్ణయాలు’ తీసుకోవడంలో నాకు నమ్మకం లేదు. నేనొక నిర్ణయం తీసుకుంటాను. అది సరైనది అయ్యేలా చేస్తాను. అంతే...’ అని అన్నాడాయన ఒకసారి. అందుకే కావొచ్చు, ఆయన హయాంలో టాటా గ్రూపు ఆదాయం 40 రెట్లు మించి పెరిగింది. ఇవాళ టాటా గ్రూపు బ్రాండ్ విలువ 2,600 కోట్ల డాలర్లు. మొన్న మార్చి నాటికి ఆ గ్రూపు మార్కెట్ వ్యాల్యూ 21.1 లక్షల కోట్లు. ఆయన నెట్‌వర్త్ అక్షరాలా రూ. 8,250 కోట్లు! ఇది ముఖేశ్ అంబానీ నెట్‌వర్త్ రూ. 9,610 కోట్లతో పోలిస్తే కాస్త తక్కువే కావొచ్చు. మరో పారిశ్రామికవేత్త అదానీ నెట్‌వర్త్ 5,510 కోట్లతో పోలిస్తే కొంచెం ఎక్కువే కావొచ్చు. కానీ రాజకీయ రణరంగంలో ఆ ఇద్దరి పేర్లూ తప్ప రతన్ టాటా గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఆయనపై అస్త్రాలు సంధిస్తూ పార్టీలు పరస్పరం ఎన్నడైనా ఆరోపణలు చేసుకోవటం చూశామా? లేదు. అదీ రతన్ టాటా ప్రత్యేకత. సంస్థ ఎదగడమే కాదు... అనేకమంది జీవితాల్లో వెలుగులు పంచాలన్నది ఆయన సిద్ధాంతం. అందుకే ఇద్దరు పిల్లలున్న మధ్యతరగతి కుటుంబం ఒక స్కూటర్‌పై ఇరుక్కుని కూర్చుని హోరు వానలో ప్రయాణిస్తుండగా చూసి తనకు ‘నానో’ కారు ఐడియా వచ్చిందని రతన్ చెబితే దేశం విశ్వసించింది. టాటా గ్రూపు సంస్థలకు సామాజిక సేవంటే చాటింపు వేసుకుని మీడియాకు పోజులిచ్చే సందర్భం కాదు. నెరవేర్చి తీరాల్సిన పవిత్ర కర్తవ్యం. అందుకే ‘టాటా సన్స్’ ఈక్విటీల్లో 66 శాతం టాటా ట్రస్టుల చేతుల్లో ఉంటుంది. వాటిపై వచ్చే డివిడెండ్లు నేరుగా ట్రస్టులు నిర్వహించే సేవాకార్యక్రమాలకు తోడ్పడతాయి. ఇంకో సంగతి ప్రత్యేకించి చెప్పుకోవాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఈ మధ్య ఒక అంటువ్యాధిలా మారిన లే–ఆఫ్లకు టాటా గ్రూపు అనుబంధ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టీసీఎస్ పూర్తి వ్యతిరేకం. టాటా గ్రూప్‌లో సాల్ట్ నుంచి స్టీల్ వరకూ ఉన్న సంస్థల్లో సైతం ఎక్కడా సిబ్బందిని అన్యాయంగా తొలగించారన్న నింద ఏనాడూ రాలేదు. దేశ నిర్మాణంలో, మరీ ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో చేసిన గణనీయమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రతన్ టాటాకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించి గౌరవించింది. బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
రతన్ టాటా తొలి రెజ్యూమ్, ఎలా సిద్ధం చేశారంటే..
155 ఏళ్ల టాటా గ్రూప్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన రతన్ టాటా ప్రపంచంలోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. చాలామంది మాదిరిగానే రతన్ టాటా కూడా ఉద్యోగిగా తన కెరీర్‌ను ప్రారంభించారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన సారధ్యంలో టాటా గ్రూప్ ట్రిలియన్ డాలర్ల వ్యాపార సంస్థగా ఎదిగింది. రతన్ టాటా తొలినాళ్లలో ఉద్యోగం కోసం రెజ్యూమ్‌ను ఎలా సిద్ధం చేశారు? ఉద్యోగం ఎలా దక్కించుకున్నారు? ఈ ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రతన్ టాటా మొదటి రెజ్యూమ్ అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన రతన్ టాటాకు ఐబీఎంలో ఉద్యోగం వచ్చింది. అయితే అతని గురువు, బంధువు అయిన జేఆర్డీ టాటాకు ఇది సంతృప్తి కలిగించలేదు. నాటి రోజులను రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు, ‘అతను(జేఆర్డీ టాటా) ఒక రోజు నాకు ఫోన్ చేశారు. మీరు భారతదేశంలో ఉంటూ, ఐబీఎంలోనే ఎందుకు ఉద్యోగం చేయడం?’ అని అడిగారు. దీంతో టాటా గ్రూప్‌లో ఉద్యోగం చేసేందుకు రతన్ టాటా తన రెజ్యూమ్‌ను జేఆర్డీ టాటాకు అందజేయాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో అతని వద్ద రెజ్యూమ్ లేదు. వెంటనే రతన్ టాటా తాను పనిచేస్తున్న ఐబీఎం కార్యాలయంలోని ఎలక్ట్రిక్ టైప్‌రైటర్ సాయంతో తన రెజ్యూమ్‌ను రూపొందించారు. తాను ఐబీఎం ఆఫీస్‌లో ఉన్నానని, తనను జేఆర్డీ టాటా రెజ్యూమ్ అడిగారనే విషయం తనకు గుర్తుందని ఆయన మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తాను పనిచేస్తున్న ఆఫీసులో ఎలక్ట్రిక్ టైప్ రైటర్లు ఉండటంతో ఒక రోజు సాయంత్రం ఆ టైప్ రైటర్ సాయంతో రెజ్యూమ్ టైప్ చేసి అతనికి ఇచ్చానని తెలిపారు. 1962లో మొదటి ఉద్యోగం రెజ్యూమెను అందించిన తర్వాత రతన్ టాటాకు 1962లో టాటా ఇండస్ట్రీస్‌లో ఉద్యోగం వచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల ఉద్యోగ జీవితం తర్వాత, 1991లో జేఆర్డీ టాటా మరణానంతరం రతన్ టాటా టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలోని ప్రముఖ బిలియనీర్లలో రతన్ టాటా ఒకరు. రతన్ టాటా కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. నాటిరోజుల్లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడాలని రతన్‌టాటా భావించారు. అయితే తమ అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో రతన్ టాటా భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి: తేలు విషం ఖరీదు ఎంతో తెలుసా? -
లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా?
టాటా గ్రూప్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు 'రతన్ టాటా' (Ratan Tata). భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా దేశాలకు ఈయన పేరు సుపరిచయమే. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ పారిశ్రామిక దిగ్గజం కంపెనీ బాధ్యతలను త్వరలోనే తమ తరువాతి తరం టాటాలకు అప్పగించనున్నట్లు సమాచారం. అయితే ఈ బాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారు? వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా గ్రూప్ సంస్థ బాధ్యతలను 'మాయా టాటా' (Maya Tata)కు అప్పగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు రూ. 20,71,467 కోట్ల విలువైన కంపెనీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారా.. అని ఇప్పటికే చాలామందిలో తెలుసుకోవలసిన ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి ఇప్పుడు సమాధానంగా మాయా టాటా పేరు వినిపిస్తోంది. నిజానికి ఇటీవల కాలంలోనే 'మాయా టాటా' మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించింది. ఈమె మాత్రమే కాకుండా ఆమె సోదరుడు నెవిల్లే, సోదరి లేహ్ కూడా కంపెనీలలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ కూడా రతన్ టాటా ఆధ్వర్యంలో వ్యాపార పాఠాలు నేర్చుకున్న వారే. ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. రెండేళ్లు జీతంతో కూడిన సెలవులు - వారికి మాత్రమే! రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా & అలూ మిస్త్రీ దంపతుల కుమార్తె ఈ 'మాయా టాటా'. ఈమె యూకేలోని బేయెస్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో చదువుకున్నట్లు సమాచారం. ఆ తరువాత కాలంలో టాటా క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టింది. ఆ తరువాత టాటా డిజిటల్ కంపెనీలో పనిచేసింది. ప్రస్తుతం టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు మెంబరుగా ఉన్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్ బాధ్యతలను మాయా టాటా స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే 34 సంవత్సరాలకే అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్వీకరించనున్న మహిళగా రికార్డ్ సృష్టించనుంది. అయితే ప్రస్తుతానికి కంపెనీ ఇంకా దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు టాటా గ్రూప్ సామ్రాజ్యాధినేత ఎవరనేది తెలిసిపోతుంది. -
రతన్ టాటాను చంపాలనుకుంది ఎవరు?
మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం.. ఈ నాలుగు లక్షణాలు రతన్ టాటాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్‌ను పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటాం. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్ స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ ఆ గ్యాంగ్ స్టర్ ఎవరు? ఎందుకు చంపాలని అనుకున్నాడు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో టాటా గ్రూప్ ఛైర్మన్‌గా రతన్ టాటా తన తొలి రోజులను గుర్తుచేసుకున్నారు. కెరియర్ ప్రారంభంలో తనని ఓ ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్ బెదిరించాడని, ఒప్పందంలో భాగంగా తనని చంపేందుకు కుట్రకు పాల్పడ్డారని అన్నారు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్‌లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్‌కు వ్యతిరేకంగా, ఓ యూనియన్ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు. శాంతి మంత్రమే అల్లరిమూకలతో టాటా మోట్సార్లో దాడులకు తెగపడ్డాడు.రతన్ టాటా అందుకు భిన్నంగా సదరు గ్యాంగ్ స్టర్‌ను బుజ్జగించి శాంతి యుతంగా చర్చలకు పిలవాలని కార్మికులను, తోటి సహచరులను కోరారు. కానీ గ్యాంగ్ స్టర్ మరోలా ఆలోచించాడు. టాటా మోటార్స్ ప్లాంట్‌లోని కార్మికుల్ని బెదిరించిన గ్యాంగ్‌స్టర్ ముఠా.. కత్తులతో దాడికి దిగింది. హెచ్చరికలు జారీ చేసేందుకు ప్లాంట్‌లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేసింది. ఎక్కడా తలవంచలేదు ఇలా, లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండేందుకు గ్యాంగ్‌స్టర్ నిరంతరం బెదిరింపులు పాల్పడ్డాడు. ఆ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. గ్యాంగ్‌స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో.. దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. దీంతో, కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్‌లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. టాటాను చంపేందుకు కుట్ర జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత గ్యాంగ్‌స్టర్ రతన్ టాటాను చంపేందుకు తన కాంపిటీటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అంతేకాదు, తాను చెప్పినట్లుగా చేయాల్సిందేనంటూ టాటా గ్రూప్ కార్మికులకు ఆదేశాలు జారీ చేశాడు. టాటా మాత్రం గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు తలవంచకుండా ముందుకు సాగారు. నేడు లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. టాటా మోటార్స్ లేబర్ ఎన్నికలు సజావుగా జరిగేలా గ్యాంగ్‌స్టర్‌తో వ్యవహరించేటప్పుడు రతన్ టాటా కఠినమైన సమయాన్ని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఉన్నా..శాంతి యుతంగా తాను ఆ సమస్య నుంచి బయటపడిన విధానం, తీసుకున్న నిర్ణయాల పట్ల తానెప్పుడు చింతించలేదని రతన్ టాటా ఆ వీడియోలో మాట్లాడారు. చదవండి👉 మహీంద్రాతో పాక్ ఆర్థిక మంత్రికి సంబంధమేంటి? -
ఎయిరిండియా లుక్ మారింది.. అదరగొడుతుంది
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చేతికి చేరిన విమానయాన సంస్థ ఎయిరిండియా సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఇందుకు సంబంధించి కొత్త బ్రాండ్ గుర్తింపుని, విమానాల లుక్, లోగోను గురువారం ఆవిష్కరించింది. ది విస్టా పేరిట తీర్చిదిద్దిన కొత్త లోగో.. అపరిమిత అవకాశాలు, పురోగతి, భవిష్యత్‌పై సాహసోపేత అంచనాలను ప్రతిబింబిస్తుందని కంపెనీ పేర్కొంది. బ్రాండ్స్‌కి ప్రత్యేక రూపునిచ్చే ఫ్యూచర్‌బ్రాండ్ కంపెనీతో కలిసి దీన్ని రూపొందించినట్లు వివరించింది. ఈ ఏడాది డిసెంబర్లో వినూత్న హంగులతో ఏ350 విమానం అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి ప్రయాణికులు కొత్త లోగోను చూడవచ్చని ఎయిరిడియా వివరించింది. మరోవైపు, ఎయిరిండియా అనేది తమకు మరో సాధారణ వ్యాపారంలాంటిది కాదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. మానవ వనరులతో పాటు ఎయిర్‌లైన్‌ని అన్ని విధాలుగా అప్‌గ్రేడ్ చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.