Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

KSR Comments On Chandrababu's Behavior Regarding The Attacks Of TDP Leaders In AP
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్‌ అవుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ గురించి చేసిన ట్వీట్ ఏ మాత్రం పద్ధతిగా ఉన్నట్లు అనిపించదు. వందల గ్రామాలు, పట్టణాలలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు చెలరేగి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లపై దాడులు చేస్తుంటే ఖండించకపోతే మానే, పరోక్షంగా వాటిని సమర్థిస్తున్నట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.కౌంటింగ్ జరుగుతున్న రోజే వైఎస్సార్‌సీపీ ఓడిపోతోందని తెలిసిన క్షణం నుంచే టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. గత నాలుగు రోజులుగా కత్తులు, కర్రలతో యథేచ్ఛగా తిరుగుతుంటే, ఎక్కడో ఒకటి, అరచోట తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాలలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. హింసాకాండకు ఎవరూ పాల్పడవద్దని చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు ఏమని అంటున్నారో చూడండి. "రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైఎస్సార్‌సీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి" అని అన్నారు.ఎక్కడైనా ఓడిపోయినవారు కవ్వింపు చర్యలకు దిగే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ ఎక్కడైనా జరిగితే వెంటనే టీడీపీ మీడియా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టి ఉండేది కాదా! ఒకపక్క అంతగా టీడీపీ వారు చెలరేగిపోతున్న సమయంలో ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ కవ్వింపు చర్యలు అనడం ఏమిటి? ఆ పేరుతో దాడులు చేసుకోండని చెప్పినట్లు శ్రేణులు అర్థం చేసుకోవా! ఈ నెల పన్నెండున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పదకుండు రాత్రివరకు ఇలాంటి దాడులు జరుగుతాయన్న ప్రచారం ఉంది. ఈలోగా అనూహ్యంగా ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూశారు కనుక ఈ దాడులను ఏమైనా ఆపుతారేమో చూడాలి.టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం అంటే, వారు దాడులు చేసినప్పుడు వైఎస్సార్‌సీపీవారు ఏమైనా ప్రతిదాడికి దిగుతారేమో జాగ్రత్త అని చెప్పినట్లు అనిపిస్తుంది తప్ప శాంతిభద్రతలను కాపాడాలని కోరుకున్నట్లుగా లేదు. వైఎస్సార్‌సీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలర్ట్ గా ఉండి.. ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలి అని ఆయన అన్నారు. దీనిని బట్టి టీడీపీ నేతలు ఏమి చేయాలో అర్థం చేసుకోవాలన్నమాట. వైఎస్సార్‌సీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించాలి అని ఆయన సూచించారు. అంతే తప్ప టీడీపీ కార్యకర్తలు దాడులు చేయవద్దని అనడానికి ఇష్టపడడం లేదనుకోవాలి. పోలీసులు సైతం ఇంతవరకు జరిగిన హింసాకాండను వైఎస్సార్‌సీపీ వారి చర్యగానే చూడాలి తప్ప, టీడీపీ దాడులుగా చూడకూడదని అనుకునే అవకాశం కనిపించడం లేదా?వందల చోట్ల ఈ దాడులు జరిగితే పోలీసులు ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఇదేనా రాజ్యాంగం, చట్టబద్ధపాలన అంటే! పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని ముక్తాయింపుగా చివరిలో ఒక మాట అన్నారు. అసలు ఇది ట్విటర్ లో చెప్పవలసిన విషయమా! పోలీసు డీజీపీ తదితర ఉన్నతాధికారులను పిలిచి సమీక్షించి, లేదా వారికి ఫోన్ చేసి వెంటనే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఏపీకి చెడ్డపేరు రాకుండా చూడాలని చెప్పవలసిన చంద్రబాబు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వచ్చే రోజులు ఇంకెంత భయానకంగా ఉంటాయో అనే సందేహం వస్తుంది.అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు హింసాయుత చర్యలకు దిగినా తప్పే. గ్రామాలలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలపై దాడులు చేస్తే అది వైఎస్సార్‌సీపీ మూకల చర్యలు అని అనుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లుగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడం, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది పనుల శిలాఫలకాలు ధ్వంసం చేయడం వైఎస్సార్‌సీపీవారి పనేనని టీడీపీ చెప్పేలా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశి, కొడాలి నాని, తదితరుల ఇళ్లపైకి దాడి చేసింది వైఎస్సార్‌సీపీ మూకలని చెప్పదలిచారా? ఒక పక్క టీడీపీ జెండాలతో కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు, అసాంఘీక శక్తులు స్వైర విహారం చేస్తుంటే, వైఎస్సార్‌సీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డా సంయమనంగా ఉండాలని టీడీపీ వారిని కోరుతున్నానని చంద్రబాబు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. రాజ్యాంగ విధులను కాలరాయడమే.గతంలో ఏ ఒక్క చిన్న ఘటన జరిగినా నానా హడావుడి చేసిన చంద్రబాబు ఇప్పుడు తాపీగా ఒక కామెంట్ ను అది కూడా ట్విటర్ లో చేసి ఊరుకున్నారు. ఇది సమంజసమేనా? కానీ దీని గురించి ఆయనను అడిగేదెవ్వరు. ప్రశ్నిస్తానని చెబుతూ రాజకీయాలలోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా గెలిచానన్న ఆనందంలో ఇలాంటివాటిపై కనీసం స్పందించలేకపోతున్నారు. జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను కూడా ఆయన నిరోధించడం లేదు. ఈ నేపధ్యంలోనే టీడీపీ నేత వర్మ కారుపై జనసేన కార్యకర్తలు చేసిన దాడిని కూడా ఆయన ఖండించినట్లు అనిపించడం లేదు. ఇక లోకేష్ ఎర్రబుక్ సిద్ధం అంటూ ఆయా చోట్ల టీడీపీ వారు ప్లెక్సీలు పెడుతున్నారని కొందరు చెబుతున్నారు. అది మరింత రెచ్చగొట్టే చర్య అవుతుంది. అధికారంలోకి వచ్చాక కూడా అలాంటివాటిని ప్రోత్సహిస్తే విపరిణామాలు ఎదురవుతాయి.వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలు దాదాపు జరగలేదు. అయినా హింసాకాండ అంటూ తమకు మద్దతు ఇచ్చే మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేయించారు. ఇప్పుడు ఆ మీడియాలో ప్రస్తుత హింసకు సంబంధించి కథనాలేవీ ప్రముఖంగా రావడం లేదు. ఈ పరిస్థితిలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన పార్టీ నేతలతో జిల్లాలవారీగా కమిటీలు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పే యత్నం చేస్తున్నారు. బహుశా ఆయన కూడా కొద్ది రోజులలో టీడీపీ దాడులవల్ల తీవ్రంగా గాయపడిన, ఆస్తులు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పవచ్చు.కొద్ది మంది ఈ దాడులలో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ఓటమి భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మస్థైర్యంతో ఉండవలసిన సమయం ఇది. ఏ పార్టీకి అయినా గెలుపు, ఓటములు ఉంటాయి. జగన్‌ అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం కొలువు తీరకముందే ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలను కుప్పకూల్చారనిపిస్తుంది. చంద్రబాబు కక్షలకు ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందని ఆయన అన్నారు. చివరికి యూనివర్సిటీలలో కూడా టీడీపీ శక్తులు అరాచకం సృష్టిస్తుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయితే ఎవరికి చెప్పుకోవాలి.ప్రధానమంత్రి మోదీ కూడా ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియదు. దేశంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా మాట్లాడే ప్రధాని ఏపీని మాత్రం విస్మరించడం బాధాకరం. ఈ హింసాకాండలో బాధితులైన కార్యకర్తలకు అండగా ఉంటానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కచ్చితంగా బాధితులకు ధైర్యం చెప్పవలసిన సమయం ఇది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారి బయటకు వచ్చి ఆయా ప్రదేశాలకు వెళ్లి పరిశీలన చేస్తే వైఎస్సార్‌సీపీ క్యాడర్ కు నైతికబలం వస్తుంది. అలాగే రెచ్చిపోయే టీడీపీ మద్దతుదారులు కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలు చేస్తున్న అరాచకాలకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోకపోతే ఆయన మళ్లీ 2014నాటి పాలనను పునరావృతం చేయడానికే సిద్ధపడుతున్నారన్న సంకేతాలు వెళతాయని అర్థం చేసుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

Congress Passes Resolution For Rahul Gandhi To Be Leader Of Opposition
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. సీడ‌బ్ల్యూసీ తీర్మానం

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీని నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఈ మేర‌కు ప్రతిపక్ష నేత ఎంపిక‌పై నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శ‌నివారం సమావేశమమైంది. ఈ సంద‌ర్భంగా లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని రాహుల్ గాంధీని కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ ఏక‌గ్రీవంగా ప్ర‌తిపాదించిన‌ట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, అలప్పుజా నుంచి ఎంపీగా ఎన్నికైన కేసీ కెసి వేణుగోపాల్ తెలిపారు. అలాగే ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడింది. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడింది. ‘రాహుల్ న‌డిపించిన భార‌త్ జోడో యాత్ర‌, భార‌త్ జోడో న్యాయ్ యాత్ర ఎంతో చురుకుగా సాగింది. ఈ రెండు యాత్ర‌లకు ప్ర‌జ‌ల్లో విశేష ఆద‌ర‌ణ ల‌భించాయి. ఆయన ఆలోచన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ రెండు యాత్రలు మన దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపులు, ఆశలను రేకెత్తించాయి. లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ఓటర్లపై కాంగ్రెస్‌పై విశ్వాసం క‌ల్పించాయి. పంచన్యాయ్-పచ్చీస్ హామీ కార్యక్రమం ఎన్నిక‌ల ప్ర‌చారంలో అత్యంత శ‌క్తివంతంగా మారింది’ అని తెలిపిందికాగా దేశ రాజధాని ఢిల్లీలో జ‌రిగిన‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ విస్తృత సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్‌ నుంచి ఎంపీగా విజయం సాధించారు.

TDP Attacks: Perni Nani Alleges CBN Lokesh Behind It
ఏపీలో దాడుల వెనుక ఆ ఇద్దరు: పేర్ని నాని

సాక్షి, కృష్ణా: ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ.. మారణ హోమం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదవ వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలలా టీడీపీ శ్రేణులు కొనసాగిస్తున్న అరాచకాలపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుడారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సంచలన ఆరోపణలు చేశారాయన. కౌంటింగ్ రోజు నుంచే వైఎస్సార్‌సీపీ నాయకుల పై దాడులు చేస్తున్నారు. టీడీపీ , జనసేన పార్టీ రౌడీ మూకలు అధికారమదంతో రెచ్చిపోతున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు. డీజీపీ, పోలీసులు ఉద్యోగం చేయకుండా చంద్రబాబు వాళ్ల చేతులు కట్టేశారు. బీహార్, యూపీ మాదిరి ఏపీలో హింసా రాజ్యం రచిస్తున్నారు. చంద్రబాబు , ఆయన కుమారుడే ఇదంతా చేయిస్తున్నారు.... పోలీసులను టీడీపీ రౌడీలు , రౌడీషీటర్లు బెదిరిస్తున్నారు. దాడులు చేస్తున్న టీడీపీ రౌడీలను ఆపే ప్రయత్నం కూడా పోలీసులు చేయడం లేదు. మా ఇళ్ల పై పడి దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం కేసు కూడా పెట్టడం లేదు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు పతనావస్థకు తీసుకొచ్చాడు. టీడీపీ రౌడీ షీటర్లు మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా ఎస్పీ ఏమైపోయారు. .. చంద్రబాబు సీఎం అయ్యాక రౌడీలు సీఐలు,డీఎస్పీలు , ఎస్పీలు అయిపోయారు.మేం మీటింగ్ పెట్టుకుంటే మా నాయకులను రాకుండా అడ్డుకున్నారు. దాడులు చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉంటే.. మేం కూడా తిరగబడక తప్పదుచంద్రబాబు చేయిస్తున్న దౌర్జన్యాల పై చర్యలు తీసుకోనందుకు కోర్టుకు వెళ్తాం. రెండు రోజుల్లో జిల్లా ఎస్పీని మా నాయకులమంతా కలుస్తాం’’ అని పేర్ని నాని అన్నారు.

Sofia Firdous, Odisha's First-Ever Woman Muslim MLA
సెన్సేషన్‌ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌

ఒడిశా రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ముస్లిం మైనారిటీకి చెందిన మహిళ ఎన్నికైంది. ఆమె పేరు సోఫియా ఫిర్దౌస్‌.. వయసు 32 ఏళ్లు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బారాబతి-కటక్‌ స్థానం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి బీజేపికి చెందిన పూర్ణ చంద్ర మహాపాత్రను ఎనిమిది వేల మెజార్టీ ఓట్ల తేడాతో ఓడించారు. ఇంతకీ ఈ సోఫియాకున్న ఆసక్తికర నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఫిర్దౌస్‌ ఒడిశా సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మహమ్మద్‌ మోకిమ్‌ కుమార్తె. తండ్రిపై అవినీతి ఆరోపణలు ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. దీంతో ఆయన స్థానంలో కూతురు ఫిర్దౌస్‌ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే తండ్రి అవినీతి మరక.. ఈ యువ నేత గెలుపును ఆపలేకపోయింది. అంతేగాదు స్వాతంత్యం వచ్చిన తర్వాత ఒడిశాలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె విజయం ఒడిషా రాజకీయ పుటల్లోకి ఎక్కింది.కెరీర్‌..ఫిర్దౌస్‌ కళింగ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీని పూర్తి చూశారు. ఆ తర్వాత 2022లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎంబీ) నుంచి ఎగ్జిక్యూటిబవ్‌ జనరల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంను కూడా పూర్తి చేశారు.2023లో కాన్ఫెడరేషన్‌ ఆప్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసీయేషిన్‌ ఆఫ్‌ ఇండియా(సీఆర్‌ఈడీఏఐ) అధ్యక్షురాలిగా ఫిర్దౌస్‌ ఎన్నికయ్యారు. అలాగే సీఆర్‌ఈడీఏఐ మహిళా విభాగానికి ఈస్ట్‌ జోన్‌ కో ఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ)కి కో చైర్మన్‌గా కూడా చేశారు. అంతేగాదు మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఐఎన్‌డబ్ల్యూఈసీ సభ్యురాలు కూడా. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త షేక్‌ మెరాజ్‌ ఉల్‌ హక్‌ను వివాహం చేసుకున్నారు. రాజకీయాల్లో ఒడిషా తొలి మహిళా ముఖ్యమంత్రి నందిని సత్పతి, ఫిర్దౌస్‌కు ఆదర్శమట. విశేషం ఏంటంటే.. 1972లో బారాబతి-కటక్‌ నియోజకవర్గం నుంచే నందిని సత్పతి గెలుపొందారు. కాగా, ఈ 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు గణనీయమైన రాజకీయ మార్పును చవిచూశాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 147 సీట్లలో 78 స్థానాలను గెలుచుకోని విజయం సాధించింది. దీంతో 24 ఏళ్ల పాటు ఏకధాటిగా పాలించిన బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ నాయకుడు నవీన్‌ పట్నాయక్‌ పాలనకు తెరపడింది. (చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..)

JDU leader KC Tyagi claims Nitish Kumar was offered PM post by INDIA bloc
నితీశ్‌కు ప్రధాని పదవి ఆఫర్‌ చేసిన ఇండియా కూటమి!

పట్నా: ఎన్డీయే సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో బిహార్‌లోని నితీష్‌కుమార్‌ జేడీ(యూ) కీలకంగా మారింది. బీజేపీ సొంతంగా మెజార్టి సీట్లు దక్కించుకోని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నితీష్‌ కుమార్‌కి డిప్యూటీ పీఎం పదవి ఆఫర్‌ చేసి.. తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జేడి(యూ) నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ జేడీ(యూ) చీఫ్‌ నితీష్‌ కుమార్‌కి ఇండియా కూటమి నుంచి ఏకంగా ప్రధాన మంత్రి పదవి ఆఫర్‌ వచ్చింది. ఇండియా కూటమికి కన్వీనర్‌గా అంగీకరించని వాళ్లు.. ఏకంగా నితీష్‌కు ప్రధానమంత్రి పదవి ఆఫర్‌ చేశారు. అందుకే నితీష్‌ వాళ్ల ఆఫర్‌ను తిరస్కరిచారు. తాము ఎన్డీయేతోనే ఉన్నాం. మళ్లీ ఇండియా కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు. మా మద్దలు ఎన్డీయే ఉంటుంది’’ అని అన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టి సొంతంగా బీజేపీ, కాంగ్రెస్‌ కూటమికి లేకపోవటంతో నితీష్‌ కుమార్‌పై మద్దతును కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి ఆయన మద్దతు కోరినట్లు త్యాగి తెలిపారు. తరచూ కూటములు మారుతారనే పేరు నితీష్‌ కుమార్‌ ఉ‍న్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి ఏర్పాటులో మొదటిగా నితీష్‌ కుమారే కీలకంగా వ్యవహరించారు. పట్నాలో జరిగిన మొదటి సమావేశానికి సైతం అధ్యక్షత వహించారు. అయితే.. ఎన్నికల ముందు ఈ ఏడాది జనవరిలో సీఎం పదవి రాజీనామా చేసి మరీ ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. ఇక.. లోక్‌సభ ఎ‍న్నికల్లో నితీష్‌ కుమార్‌ జేడీ(యూ) 12 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉంది. శుక్రవారం భాగస్వామ్య పార్టీలు ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కోలువుదీరనుంది. రేపు (ఆదివారం) 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.స్పందించిన కాంగ్రెస్‌తమ పార్టీ చీఫ్‌కు నితీశ్‌కుమార్‌కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి అఫర్ చేసిందని జేడీ(యూ) నేత త్యాగి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ‘‘ జేడీ(యూ) నేత త్యాగి చెప్పినటువంటి సమాచారం మా వద్ద లేదు’’ అని కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ అన్నారు. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

Paparazzo Takes Dig At Vijay Deverakonda, Mahesh Babu, Jr NTR
సౌత్‌ హీరోలు ఫేక్‌.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్‌ ఫోటోగ్రాఫర్‌

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో హిందీ చిత్రపరిశ్రమపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. స్టార్‌ హీరోల సినిమాలను బహిష్కరించాలన్న డిమాండ్స్‌ కూడా తెరపైకి వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో దక్షిణాది చిత్రాలు మంచి కంటెంట్‌తో వచ్చి క్లిక్‌ అవడంతో అందరి కళ్లు సౌత్‌పై పడ్డాయి. పాన్‌ ఇండియా లెవల్‌లో సౌత్‌ సినిమాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి.సౌత్‌ వర్సెస్‌ బాలీవుడ్‌దీంతో అప్పటినుంచి బాలీవుడ్‌ను సౌత్‌ ఇండస్ట్రీతో పోల్చడం మొదలుపెట్టారు. దక్షిణాది తారలు ఎంతో సింపుల్‌గా ఉంటారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని.. కానీ హిందీ హీరోలు ఎక్కువ పోజులు కొడతారని విమర్శించారు. అయితే సౌత్‌ స్టార్స్‌ బయటకు కనిపించేంత విధేయతగా మెసులుకోరని బాలీవుడ్‌ కెమెరామన్‌ (ఫోటోగ్రాఫర్‌) వీరేందర్‌ చావ్లా అంటున్నాడు. వీరేందర్‌ చావ్లా, ఫోటోగ్రాఫర్‌చెప్పులేసుకుని..అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌత్‌ సెలబ్రిటీలు ఫేక్‌గా కనిపిస్తారు. ఏదో పైకి మాత్రం ఒదిగి ఉన్నట్లు నటిస్తారు. ఒక హీరో (విజయ్‌ దేవరకొండ) అయితే తన సినిమా ప్రమోషన్స్‌కు చెప్పులు వేసుకుని వచ్చాడు. సింపుల్‌గా ఉన్నట్లు చూపించుకోవడానికే కెమెరా ముందు అలా యాక్ట్‌ చేశాడు. సౌత్‌లో మరో బిగ్‌ స్టార్‌ (జూనియర్‌ ఎన్టీఆర్‌) సాధారణంగా ఎప్పుడూ సైలెంట్‌గానే ఉంటాడు. ఫోటో తీసిందొకరైతే కోప్పడింది మాత్రం..అతడు హోటల్‌కు వెళ్తుండగా ఓ ఫోటోగ్రాఫర్‌ ఆయన్ను క్లిక్‌మనిపించాడు. అందుకాయన నా టీమ్‌ మెంబర్‌పై కోప్పడ్డాడు. నిజానికి ఫోటో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది వేరే వ్యక్తి. కోప్పడింది మాత్రం మా వాళ్లపై! మహేశ్‌బాబు అయితే బాలీవుడ్‌ తనకు అవసరం లేదని చెప్పాడు. ఈయన ఇలా యాటిట్యూడ్‌ చూపిస్తున్నారేంటని అనుకున్నాను. అసలు ఫేక్‌గా ఉండేది సౌత్‌ హీరోలే.. బాలీవుడ్‌లో ఉన్నవాళ్లు లోపల, బయట ఒకేలా ఉంటారు' అని వీరేందర్‌ చెప్పుకొచ్చాడు.చదవండి: ఎయిడ్స్‌ ఉందని ప్రచారం.. దశాబ్దాల తర్వాత నోరు విప్పిన హీరో

All Most In All Matches Sensational Wins Happening In T20 World Cup 2024
సంచలనాల వరల్డ్‌ కప్‌.. పెద్ద జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న పసికూనలు

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో బడా జట్లకు పసికూనలు షాకిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్‌ల్లో పెద్ద జట్లపై చిన్న జట్లు హవా చూపాయి.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం..టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే ఓ మోస్తరు సంచలనం నమోదైంది. తమకంటే పటిష్టమైన కెనడాకు తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న యూఎస్‌ఏ ఊహించని షాకిచ్చింది. రెండో మ్యాచ్‌లో మరో పసికూన పపువా న్యూ గినియా.. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన వెస్టిండీస్‌ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ బతుకు జీవుడా అన్నట్లు చివరి ఓవర్‌లో విజయం సాధించింది.పసికూనల మధ్య జరిగిన మూడో మ్యాచ్‌ సైతం నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. ఈ లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో ఒమన్‌పై నమీబియా సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది.శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య జరిగిన నాలుగో మ్యాచ్‌.. ఆఫ్ఘనిస్తాన్‌-ఉగాండ మధ్య జరిగిన ఐదో మ్యాచ్‌ అందరూ ఊహించినట్లుగానే జరిగాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. స్కాట్లాండ్‌-ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన ఆతర్వాతి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌ రద్దు కాకుండా ఉండి ఉంటే ఇందులోనూ సంచలనానికి ఆస్కారం ఉండేది.నేపాల్‌-నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన ఏడో మ్యాచ్‌.. భారత్‌-ఐర్లాండ్‌ మధ్య జరిగిన ఎనిమిదో మ్యాచ్‌.. ఆస్ట్రేలియా-ఒమన్‌ మధ్య జరిగిన తొమ్మిదో మ్యాచ్‌ అందరూ ఊహించినట్లుగానే ఏకపక్షంగా సాగాయి.అనంతరం పపువా న్యూ గినియా-ఉగాండ మధ్య జరిగిన పదో మ్యాచ్‌లో ఓ మోస్తరు సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న ఉగాండ.. పొట్టి ప్రపంచకప్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.పదకొండో మ్యాచ్‌ నుంచి పొట్టి ప్రపంచకప్‌ మరింత రసవత్తరంగా మారింది. తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న యూఎస్‌ఏ.. తమకంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌ను ఐసీసీ పొట్టి ప్రపంచకప్‌ టోర్నీల్లో ఘోరమైన అప్‌సెట్‌గా అభివర్ణించింది.నమీబియా-స్కాట్లాండ్‌ మధ్య జరిగిన 12వ మ్యాచ్‌ ఏ హడావుడి లేకుండా సజావుగా సాగగా.. కెనడా-ఐర్లాండ్‌ మధ్య జరిగిన 13వ మ్యాచ్‌లో మరో సంచలనం నమోదైంది. కెనడా.. తమకంటే పటిష్టమైన ఐర్లాండ్‌కు ఊహించని షాకిచ్చి ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి విజయం నమోదు చేసుకుంది.నిన్న జరిగిన 14వ మ్యాచ్‌లో మరోసారి సంచలనం నమోదైంది. ఓ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన శ్రీలంకను ఇప్పటివరకు ఒక్కసారి ‍కూడా టైటిల్‌ గెలవని బంగ్లాదేశ్‌ మట్టికరిపించింది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో క్రికెట్‌ ప్రపంచం ఊహించని మరో పెను సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌.. తమకంటే చాలా రెట్లు పటిష్టమైన న్యూజిలాండ్‌కు ఊహించని షాకిచ్చింది.ఇలా ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్‌ల్లో ఒకటి అరా మినహా దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లో సంచలనాలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. మెగా టోర్నీ ఇలాగే కొనసాగాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

7000 zombie companies face collapse worldwide
ప్రపంచంలో 7000 ‘జాంబీ కంపెనీలు’.. ఏంటివి?

అప్పుల ఊబిలో కూరుకుపోయి మనుగడ అంచున కొట్టుమిట్టాడుతూ రుణాలపై వడ్డీని కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న కంపెనీలను జాంబీ కంపెనీలుగా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి జాంబీ కంపెనీల సంఖ్య గత పదేళ్లలో గణనీయంగా పెరిగింది.అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణలో జాంబీ కంపెనీల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,000 పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీలకు పెరిగింది. ఒక్క యునైటెడ్ స్టేట్స్‌లోనే ఇలాంటి కంపెనీలు 2,000 లకు చేరాయి. ఏళ్ల తరబడి చౌక రుణాలు పేరుకుపోవడం, మొండి ద్రవ్యోల్బణం రుణ వ్యయాలను దశాబ్ద గరిష్టాలకు నెట్టింది.వీటిలో అనేక చిన్న, మధ్య తరహా కంపెనీలు త్వరలోనే తమ లెక్కల రోజును ఎదుర్కోవలసి రావచ్చు. వందల బిలియన్ డాలర్ల రుణాలను వారు తిరిగి చెల్లించలేకపోవచ్చు. గత మూడేళ్లలో కార్యకలాపాల ద్వారా తమ రుణాలపై వడ్డీని కూడా చెల్లించడానికి తగినంత డబ్బు సంపాదించడంలో విఫలమైన కంపెనీలను సాధారణంగా జాంబీలుగా నిర్వచిస్తారు.కార్నివాల్ క్రూయిజ్ లైన్, జెట్ బ్లూ ఎయిర్ వేస్, వేఫేర్, పెలోటన్, ఇటలీకి చెందిన టెలికాం ఇటాలియా, బ్రిటిష్ సాకర్ దిగ్గజం మాంచెస్టర్ యునైటెడ్ లను నడుపుతున్న కంపెనీలతో సహా ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, యూఎస్‌లలో గత దశాబ్దంలో ఇలాంటి కంపెనీల సంఖ్య 30 శాతం పెరిగిందని అసోసియేటెడ్‌ ప్రెస్‌ విశ్లేషణలో తేలింది.మార్చిలో ఫెడరల్ రిజర్వ్ కోత ప్రారంభిస్తుందనే అంచనాతో రుణదాతలు తమ వాలెట్లను తెరవడంతో ఈ ఏడాది మొదటి కొన్ని నెలల్లో వందలాది జాంబీ కంపెనీలు తమ రుణాలను రీఫైనాన్స్ చేసుకున్నాయి. దీంతో గత ఆరు నెలల్లో 1,000 కి పైగా జాంబీ కంపెనీల స్టాక్స్ 20 శాతానికి పైగా పెరగడానికి సహాయపడింది. కానీ చాలా కంపెనీలు రీఫైనాన్స్ పొందలేకపోయాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మొదటి, ఏకైక ఫెడ్ కోతను ఆశిస్తున్న నేపథ్యంలో జాంబీ కంపెనీలు 1.1 ట్రిలియన్ డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది.

Ramoji Rao Passes Away
ఈనాడు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూత

సాక్షి, హైదరాబాద్‌: ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.మూడురోజుల క్రితం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్స్‌ వేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌ అమర్చారు. వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు.రామోజీరావు మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా సీఎం ఆదేశాలు జారీ చేశారు.రేపు రామోజీరావు అంత్యక్రియలురామోజీరావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీరావు భౌతికకాయానికి ప్రముఖులు నివాళులర్పించారు. వెంకయ్యనాయుడు, కేటీఆర్‌, సబితా, జానారెడ్డి,హరీశ్‌రావు రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.రేపు సినిమా షూటింగ్‌లకు సెలవురామోజీరావు మృతికి సంతాపంగా రేపు(ఆదివారం) సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించినట్లు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు.రామోజీ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 1936 నవంబర్‌ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈనాడుతో పాటు ‘సితార’ సినీ పత్రిక నడిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీని నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం రామోజీని పద్మవిభూషణ్‌తో సత్కరించింది.ఇదీ చదవండి: రామోజీరావు మృతిపట్ల ప్రముఖుల సంతాపం

Ys Jagan Condoles Ramoji Rao Death
రామోజీరావు మరణం దిగ్భ్రాంతి కలిగించింది: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: రామోజీరావు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ‘‘రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2024గవర్నర్‌ సంతాపం..రామోజీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మీడియా, వినోద రంగంలో నిష్ణాతుడని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారని, జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో ఎనలేని సేవలందించినందుకు గాను రామోజీరావును పద్మవిభూషణ్‌తో సత్కరించినట్లు తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement