Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Three Decisions Were Approved By The Union Cabinet1
ఇంటర్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌!

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ మూడు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బయో ఈ-3 విధానం, విజ్ఞాన్‌ ధార, ఇంటర్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌నకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనియన్ పెన్షన్ స్కీమ్న్(యుపిఎస్) అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. విజ్ఞాన్‌ ధార పేరుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్‌ పథకాన్ని తీసుకురానుంది. సర్వీస్‌లో 25 ఏళ్లు పూర్తయిన వారికి పూర్తి పెన్షన్‌ ఇవ్వనుంది. ఈ పథకం కింద 15వ ఆర్థిక సంఘంలో 10,579 కోట్ల రూపాయల ఖర్చు చేయనుంది. సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమలు కానుంది.రిటైర్మెంట్‌కు ఏడాది ముందు ఉన్న సగటు జీతంలో సగం మొత్తం పెన్షన్‌గా అందజేసేలా కొత్త విధానం తీసుకువచ్చింది. పెన్షనర్ మరణిస్తే 60 శాతం కుటుంబానికి వచ్చేలా అమలు చేయనున్నారు.బయో ఈ-3 విధానం ద్వారా త్వరలో బయో విప్లవం రాబోతోందని.. బయో టెక్నాలజీ, బయో సైన్స్‌ రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయిమెంట్ ఆధారంగా బయో మనుఫ్యాక్చరింగ్ విధానం ఉంటుందన్నారు.

Private Helicopter From Mumbai To AP: Crashes In Pune2
సీఎం చంద్రబాబు కోసం రప్పిస్తున్న హెలికాప్టర్‌ క్రాష్‌

సాక్షి, అమరావతి: ముంబై నుంచి బయల్దేరిన ఓ ప్రైవేట్‌ హెలికాప్టర్‌ పుణేలోని పౌద్‌ సమీపంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై నుంచి విజయవాడ వస్తుండగా హెలికాప్టర్‌ క్రాష్‌ అయ్యింది. అయితే, హెలికాప్టర్‌ కూలిన అనంతరం కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసమే హెలికాప్టర్‌ను ముంబై నుంచి విజయవాడకు రప్పిస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల రోజుల నుంచి మెయింటెన్స్‌లో ఉన్న హెలికాప్టర్‌ను ఆగమేఘాల మీద విజయవాడకు రప్పించే యత్నం చేశారు అధికారులు.ఏవియేషన్‌ కో-ఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ నరసింహారావు ఒత్తిడితోనే హెలికాప్టర్‌ విజయవాడకు బయలుదేరినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి హెలికాప్టర్‌ను రప్పించే యత్నాలు చేసినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్‌ క్రాష్‌ కావడంతో ఏపీ అధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. హెలికాప్టర్‌ క్రాష్‌పై పోలీసులు, ఇంటెలిజెన్స్‌ ఆరా తీస్తున్నాయి.

Ngt Is Serious About Atchutapuram Sez Incident3
అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై ఎన్‌జీటీ సీరియస్‌

సాక్షి, ఢిల్లీ: అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై ఎన్‌జీటీ సీరియస్‌ అయ్యింది. ప్రమాదాన్ని సుమోటోగా తీసుకున్న ఎన్‌జీటీ.. 17 మంది కార్మికుల మృతిచెందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అనకాపల్లి కలెక్టర్‌, ఏపీ పొల్యూషన్‌ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ పరిశ్రమల శాఖ,సీపీసీబీలతో పాటు కేంద్ర పర్యావరణ శాఖకు కూడా నోటీసులు ఇచ్చింది.అలాగే, రెండు రోజుల వ్యవధిలో ఏపీలో జరిగిన మూడు ఘోరమైన ప్రమాదాలను జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా పరిగణించింది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.కాగా, చిత్తూరు సమీపంలోని మురకంబట్టు ప్రాంతంలోని అపొలో మెడికల్‌ కాలేజీలో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి 70 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్‌.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాపట్నంలోని ఓ అనాథాశ్రమంలో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి ముగ్గురు విద్యార్థులు మృతిచెందడం, 37మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంపై అసహనం వ్యక్తం చేసింది.ఈ 3 ఘటనలపై పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ ఘటనల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ ఆరోపించింది. 2 వారాల్లో ఈ 3 ఘటనలపై సమగ్రమైన నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ శుక్రవారం చీఫ్‌ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.అచ్యుతాపురం ఘటనలో ఎఫ్‌ఐఆర్‌ స్టేటస్‌ రిపోర్ట్, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, నష్టపరిహారం వంటి విషయాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా సాయం అందిందా లేదా అనే సమాచారాన్ని అందజేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను కూడా తమకు తెలపాలని పేర్కొంది.

Shami Funny Take On Rohit Sharma On Field Antics Captain Gives Reply4
రోహిత్‌ చెప్పినట్టు మేము వినాల్సిందే.. లేదంటే: షమీ

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మైదానంలో సహచర ఆటగాళ్లతో ఎంత సరదాగా ఉంటాడో.. పరిస్థితిని బట్టి అంతే సీరియస్‌ అవుతాడు కూడా!.. ఒక్కోసారి సహనం కోల్పోయి భావోద్వేగాలను నియంత్రించుకోలేక ట్రోల్స్‌కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఆటలో భాగంగానే రోహిత్‌ ఇలా చేస్తాడని.. కెప్టెన్‌గా అతడు రచించిన వ్యూహాలు అమలు చేయడంలో తాము విఫలమైతే మాత్రం ఆగ్రహానికి గురికాకతప్పదంటున్నాడు టీమిండియా సీనియర్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ.ఇటీవల జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రోహిత్‌ శర్మకు మెన్స్‌ ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023-24 పురస్కారం లభించింది. ఈ వేడుకలో రోహిత్‌తో పాటు పేసర్‌ షమీ, మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తదితర టీమిండియా క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా మైదానంలో రోహిత్‌ శర్మ ఎలా ఉంటాడన్న ప్రశ్న ఎదురుకాగా షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అప్పుడు అతడి రియాక్షన్‌ చూశామంటే‘‘జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి రోహిత్‌ స్వేచ్ఛనిస్తాడు. తనలోని ఉత్తమ గుణం అది. అయితే, ఎప్పుడైతే మేము అతడి అంచనాలు అందుకోలేకపోతామో.. అప్పుడు అతడు భావోద్వేగాలను ప్రదర్శించడం మొదలుపెడతాడు. నువ్విలా చేయాలి లేదంటే చేసి ఉండాల్సిందని ఆటగాళ్లకు చెబుతాడు.అయినప్పటికీ మన ఆట తీరులో మార్పు లేదంటే.. ఇక అతడి రియాక్షన్స్‌ స్క్రీన్‌ మీద చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే.. తను కోపంగా ఉన్నాడని మాకు అర్థమైపోతుంది. ఇక ఆపై తను ఒక్క మాట చెప్పకుండానే మాకు ఏం చేయాలో తెలిసిపోతుంది’’ అని షమీ చెప్పుకొచ్చాడు.అవును.. నా పని నేను చేస్తా!ఇక ఇందుకు బదులిస్తూ.. ‘‘మైదానంలో ఎవరి పనులు వారు సరిగ్గా చేయాలని వాళ్లకు చెప్తాను. మరి నేను కూడా నా పని చేయాలి కదా. అందుకే నేను ఫీల్డ్‌లో ఒక్కోసారి అలా ప్రవర్తిస్తా’’ అంటూ రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా తన పనిని తాను చేస్తానంటూ చమత్కరించాడు. ఇక టీ20 ప్రపంచకప్‌-2024 ట్రోఫీ గెలిచిన అనంతరం సెలవులు తీసుకున్న రోహిత్‌ శర్మ శ్రీలంక పర్యటన సందర్భంగా మళ్లీ జట్టుతో కలిశాడు. అయితే, అతడి సార థ్యంలోని భారత జట్టు 27 ఏ ళ్ల తర్వాత తొలిసారి న్డే సిరీస్‌ను లంకకు కోల్పోయింది. మరోవైపు.. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్న షమీ ఇంకా పునరాగమనం చేయలేదు. Shreyas Iyer and Mohammed Shami talking about their captain Rohit Sharma.🥹The Captain, the leader, the legend @ImRo45 🐐 pic.twitter.com/DmXJ7YaegC— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 21, 2024

Pakistan to Experiment New polymer Plastic Currency Notes5
డిసెంబర్‌ నాటికి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు: జమీల్ అహ్మద్

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన పాకిస్తాన్ నెమ్మదిగా కోలుకుంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అక్కడి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మెరుగైన భద్రత, హోలోగ్రామ్ ఫీచర్‌ల కోసం ఇప్పటికే ఉన్న అన్ని కరెన్సీ నోట్లను రీడిజైన్ చేస్తూనే పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీ నోటుతో ప్రయోగాలు చేస్తుంది.ఇస్లామాబాద్‌లోని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌ సెనేట్ కమిటీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రస్తుతమున్న అన్ని పేపర్ కరెన్సీ నోట్లను కొత్త భద్రతా ఫీచర్లతో రీడిజైన్ చేయనున్నట్లు తెలిపారు. రూ.10, 50, 100, 500, 1000, 5000 డినామినేషన్లలో కొత్తగా రీడిజైన్ చేసిన నోట్లను డిసెంబర్‌లో విడుదల చేస్తామని ఆయన అన్నారు.కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చిన తరువాత, పాత నోట్లు ఐదు సంవత్సరాలు చెలామణిలో ఉంటాయని చెబుతున్నారు. మొదట్లో ప్రజల కోసం ఒక డినామినేషన్‌ పాలిమర్ ప్లాస్టిక్ నోట్‌ను విడుదల చేస్తామని.. ఆ తరువాత వచ్చే స్పందనను బట్టి ఇతర డినామినేషన్లలో ప్లాస్టిక్ కరెన్సీని అందిస్తామని స్టేట్ బ్యాంక్ గవర్నర్ సెనేట్ కమిటీ సభ్యులకు తెలియజేశారు.పాలిమర్ ప్లాస్టిక్ నోట్లు కొత్త కాదుపాలిమర్ ప్లాస్టిక్ నోట్లను ఇప్పటికే 40 దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఈ నోట్లను డూప్లికేట్ చేయడం అసాధ్యం. నిజానికి పాలిమర్ ప్లాస్టిక్ నోట్లను 1998లో ఆస్ట్రేలియా మొదటిసారి ప్రవేశపెట్టింది. ఆ తరువాత ఇతర దేశాలు ప్లాస్టిక్ కరెన్సీ విడుదల చేయడం మొదలుపెట్టాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు పాకిస్తాన్ చేరనుంది. అయితే ఇండియాలో ప్లాస్టిక్ కరెన్సీ ఎప్పుడు మొదలవుతుందనే విషయం మీద ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు.

Hydra Responded To The Demolition Of The N Convention6
అందుకే కూల్చేశాం.. ఎన్ కన్వెన్షన్‌పై హైడ్రా రియాక్షన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా స్పందించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమ్మిడికుంట చెరువు, ఎఫ్‌టిఎల్‌, బంఫర్‌ జోన్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాం. ఈ రోజు కూల్చిన నిర్మాణాల్లో ఎన్‌ కన్వెన్షన్‌ ఒకటి. నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు జరిపారు’’ అని హైడ్రా స్పష్టం చేసింది.తుమ్మిడికుంట, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌పై 2014లోనే హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2016లో హెచ్‌ఎండీఏ ఫైనల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2014లో హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ జారీ చేశాక ఎన్‌ కన్వెన్షన్‌ హైకోర్టును ఆశ్రయించింది. నిబంధనలు ప్రకారం ఎఫ్‌టీఎల్‌ పరిధిని నిర్థారించమని హైకోర్టు సూచించింది. ఎన్‌ కన్వెన్షన్‌ ప్రతినిధుల సమక్షంలోనే ఎఫ్‌టీఎల్‌ సర్వే చేసి నివేదిక అందించాం. మేమిచ్చిన నివేదికపై ఎన్‌ కన్వెన్షన్‌ ప్రతినిధులు మియాపూర్‌ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు.’’ అని హైడ్రా పేర్కొంది.‘‘ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఎలాంటి స్టే ఇవ్వలేదు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ.. ఎన్‌ కన్వెన్షన్‌ వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఒక ఎకరం 12 గుంటలు, బఫర్‌ జోన్‌లో 2 ఎకరాల 18 గుంటలను ఎన్‌ కన్వెన్షన్‌ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది. గత ప్రభుత్వంలో ఆక్రమణలను రెగ్యులర్‌ చేయించుకునేందుకు ఎన్‌ కన్వెన్షన్‌ ప్రయత్నించింది.. కానీ అధికారులు తిరస్కరించారు. తమ్మిడికుంట చెరువు ఆక్రమణల వల్ల హైటెక్స్‌ పరిధిలోని నాలాలు మూసుకుపోయి వరద వస్తుంది. ఆక్రమణల వల్ల తమ్మిడికుంట చెరువు 50 నుంచి 60 శాతం వరకు కూచించుకుపోయింది.’’ అని హైడ్రా వెల్లడించింది.

Ysrcp Financial Assistance To Atchutapuram Sez Victims7
అచ్యుతాపురం సెజ్‌ బాధితులకు వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం: బొత్స

సాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌ బాధితులకు వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాధితులను కలిసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతతో మాట్లాడాలని బొత్స హితవు పలికారు. ప్రమాదం జరిగితే అధికారంలో ఉన్నవాళ్లు పట్టించుకోలేదన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పలేదని ఆయన దుయ్యబట్టారు. ‘‘విషాదం వేళ.. రాజకీయం ఎందుకు?. వెంటనే సేఫ్టీ ఆడిట్‌ జరపాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాము. తెల్లవారు జామున జరిగిన కూడా ఎక్కడ సహాయక చర్యలు ఆగలేదు. కరోనా సమయంలో కూడా సహాయక చర్యలు ఆగలేదు. స్థాయి మరిచి కొంతమంది నేతలు విమర్శలు చేస్తున్నారు. వాటిని ప్రజలు గమనిస్తున్నారు. గత ఐదేళ్లలో ఏమి జరగలేదని మాట్లాడుతున్నారు. బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు ఎందుకు రాలేదని మేము అడిగిన తర్వాత సీఎం కేజీహెచ్‌కు వచ్చారు. ఒక మంచి నీళ్లు బాటిల్ కూడా బాధితులకు ఇవ్వలేదు. ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదం జరిగిన వెంటనే మృతిచెందిన వారికి కోటి రూపాయల చెక్కు అందించాము. అప్పటికప్పుడు 30 కోట్లు సిద్ధం చేశాము.’’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Nagarjuna Akkineni First Reaction on N Convention Centre Demolition8
ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదు: నాగార్జున ఎమోషనల్‌

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు. కోర్టు కేసులు, స్టే ఆర్డర్‌లకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. చట్టానికి వ్యతిరేకంగా తాము ఏ పనులూ చేయలేదని చెప్పడానికే ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు వివరించారు. పట్టా భూమిలోనే కన్వెన్షన్‌ హాల్‌ ఉందని, ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదని స్పష్టం చేశారు. ఇది ప్రైవేట్‌ స్థలంలో నిర్మించిన భవనం అని, కూల్చివేత కోసం గతంలో ఇచ్చిక అక్రమ నోటీసుపై కోర్టు స్టే కూడా ఇచ్చిందని గుర్తు చేశారు.ఇది కరెక్ట్‌ కాదునేడు చట్టవిరుద్ధంగా తమ భవనాన్ని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు కూడా తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని తెలిపారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కచ్చితంగా తానే దగ్గరుండి నేలమట్టం చేసేవాడినని తెలిపారు.తప్పుడు సంకేతాలుఇప్పుడు జరిగిన పరిణామాల వల్ల, మేమేదో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందన్నారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కాగా తమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్‌ కన్వెన్షన్‌ కట్టారని ఆరోపణలు రావడంతో హైడ్రా దాన్ని నేలమట్టం చేసింది. స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. చదవండి: నాగార్జున N కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేత

Ksr Comments On Chandrababus Immoral Rule In Andhra Pradesh9
చంద్రబాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అనైతిక ప్రభుత్వం అని, అన్యాయ పాలన చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఉదాహరణలు గమనించదగిన అంశాలే. గత రెండున్నర నెలల తన పాలనపై వస్తున్న విమర్శలకు చంద్రబాబు సూటిగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. మరో వైపు ఎంత సేపు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు.ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అన్న అనుమానం కలిగేలా పరిస్థితి ఏర్పడడం అత్యంత శోచనీయం. చంద్రబాబు పాలన ఏ ఏ రకాలుగా అనైతికంగా ఉందన్నది పరిశీలిస్తే పలు విషయాలు బోధపడతాయి. తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాని, ఎన్నికల ప్రణాళికలోని ఇతర వాగ్దానాల గురించి కాని ప్రస్తావించలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు, ఆయన పార్టనర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఉన్నారు. తమ వాగ్దానాలు తమనే భయపెడుతున్నాయని చంద్రబాబు అంటున్నారు. అదేమంటే గత ప్రభుత్వం చేసిన పాలన అని ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఇప్పుడు కొత్తగా ఆరోపణలు చేయడం లేదు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే విమర్శలు చేశారో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే అభియోగాలు కొనసాగిస్తున్నారు. దానిని బట్టే చంద్రబాబు అనైతిక పాలన సాగిస్తున్నారన్న విషయం అర్ధం అవుతుంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించేవారు. అది పచ్చి అబద్దం. అంత అప్పు నిజంగా ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏమి చేయాలి. దానికి తగ్గటుగా చేయగలిగిన హామీలనే ఇవ్వాలి. అలాకాకుండా టీడీపీ, జనసేనలు ఆకాశమే హద్దుగా ఎన్నికల వరాలు కురిపించాయి. అదేమని అడిగితే, తాము సంపద సృష్టిస్తామని, తద్వారా హామీలు నెరవేర్చుతామని బడాయి కబుర్లు చెప్పేవారు. ఎలాగైతేనేం అధికారంలోకి వచ్చారు. అది ఈవిఎమ్‌ల మహిమా? లేక ప్రజలు నిజంగా ఈ వాగ్దానాలకు ఆకర్షితులయ్యారా అన్నది వేరే సంగతి.. పవర్ చేతికి రాగానే చంద్రబాబు, పవన్‌లు స్వరం మార్చేశారు.హామీలు అమలు చేయాలని ఉంది కాని, డబ్బులు లేవని చెప్పడం ఆరంభించారు. అలాంటప్పుడు చంద్రబాబుది అనైతిక పాలన కాక ఏమవుతుంది? జగన్ చేసిన ఆరోపణ వాస్తవికంగానే ఉందని అనుకోవల్సిందే కదా! టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో హింస, రాజకీయ ప్రత్యర్ధులపై దమనకాండ, హత్యలు గతంలో ఎన్నడూ చూడనివి. ఈ హింసాకాండను చంద్రబాబు నేరుగా ఇంతవరకు ఖండించలేదు. తన కుమారుడి రెడ్‌బుక్ రాజ్యాంగం గురించి ఆయనే మాట్లాడలేకపోతున్నారు. పైగా పోలీసు అధికారుల సమావేశంలో మాత్రం నేరం చేయాలంటే ఎవరైనా సరే భయపడాల్సిందేనని చంద్రబాబు అన్నారట.తెలుగుదేశం అధికార పత్రిక ఈనాడు ఈ హెడింగ్ పెట్టి ఆనందపడింది. చంద్రబాబు వాస్తవంగా అలాంటి ఉద్దేశంతో ఉంటే ఏమి చేయాలి! టీడీపీ కార్యకర్తలు ఎవరూ హింసాకాండకు దిగరాదని పిలుపు ఇవ్వాలి. టీడీపీ వాళ్లు తప్పు చేసినా చర్య తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వాలి. విశేషం ఏమిటంటే ఆయన ఈ కబుర్లు చెప్పిన ముందు రోజే తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలు దారుణమైన హింసకు తెగబడ్డారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వబోమంటూ నానా రచ్చ చేశారు. మాజీ ఎమ్మెల్యేనే ఆయన ఇంటికి ఆయన వెళ్లలేని పరిస్థితి ఉంటే సామాన్యుల గతి ఏమిటి? కేవలం తన అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవడానికి డైలాగులు చెబుతూ, లోపల మాత్రం హింస, దౌర్జన్యాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరించడం అనైతికం కాదా! అందువల్ల జగన్ చెప్పినట్లు చంద్రబాబు పాలన అనైతికమే అవుతుంది.గతంలో చంద్రబాబు అనపర్తి వద్ద టూర్‌కు వెళ్లారు. అక్కడి శాంతిభద్రతల రీత్యా పోలీసు అధికారులు ఆయనను వద్దని సూచించారు. కాని చంద్రబాబు వినకుండా, తాను నడిచి వెళతానని అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ వెళ్లారు. పోలీసులు ఆయన భద్రత కల్పించారు తప్ప, అడ్డుకోలేదు. కుప్పం నియోజకవర్గంలో కూడా ఒకసారి ఇలాంటి సమస్య వస్తే పోలీసుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా చంద్రబాబు వ్యవహరించారు. అప్పుడు కూడా పోలీసులు ఆయనకు రక్షణ కల్పించారు. మరి ఇప్పుడేమో మాజీ ఎమ్మెల్యే తన ఇంటికి వెళ్లడానికి వీలు లేదని టీడీపీ వారు అరాచకంగా వ్యవహరించడం, పోలీసులు ఆయనను అక్కడ నుంచి అనంతపురం తరలించడం చేశారు.అల్లర్లు చేసేవారిని కట్టడి చేయడంలో పోలీసులు విఫలం అయ్యారు. అందువల్ల చంద్రబాబుది అనైతిక పాలనే అవుతుంది కదా! సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్టు చూడడం జరిగింది. అందులో పలు విషయాలు గుర్తు చేశారు..'ఈ ఏడాది తల్లికి వందనం ఇవ్వలేం అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ఖజానాలో డబ్బు లేదు.. అమరావతి కట్టలేం.. మంత్రి నారాయణ, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు - మంత్రి నాదెండ్ల మనోహర్, ఆరోగ్యశ్రీ ఇవ్వలేం.. ఆయుష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి.. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తమ వద్ద మంత్ర దండం లేదు.. పవన్ కల్యాణ్‌, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తేనే భయం వేస్తోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .. ఇలా ఆయా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే ఏపీలో సాగుతున్నది అనైతిక పాలనే అన్న భావన కలుగుతుంది.ఇక ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీ ఊసే లేదు. ఏపీలో ఇటీవలికాలంలో అనేక హత్యలు, అత్యాచారాలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. జగన్ ప్రభుత్వం చేపట్టిన ఓడరేవుల నిర్మాణం ఎలా సాగుతుందో తెలియదు. మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది. పైగా వాటిని ప్రైవేటు పరం చేయాలని తలపెట్టారు. గతంలో కొన్ని మెడికల్ సీట్లనే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగా మార్చాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తే విరుచుకుపడ్డ చంద్రబాబు, లోకేష్‌లు ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలనే ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల ప్రణాళికలో ఏమి చెప్పారు? ఇప్పుడు ఏమి చేస్తున్నారు? పదివేల రూపాయల గౌరవ వేతనం హుష కాకి అయింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలు గందరగోళంలో పడ్డాయి. ఇళ్ల వద్దకు పౌర సేవలను జగన్ ప్రభుత్వం అందిస్తే, ఇప్పుడు మళ్లీ యధాప్రకారం ఆఫీస్‌ల చుట్టూ తిరిగే వాతావరణాన్ని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది.గతంలో రేషన్ సరుకులను కూడా ఇళ్లకే చేర్చితే, ఆ వాహనాలన్నిటిని తొలగించారు. భారీ ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు, అదికారంలోకి వచ్చిన తర్వాత లక్షల మంది వలంటీర్లు, రేషన్ వాహనాల యజమానులు, కొన్ని శాఖలలోని చిరుద్యోగులు మొదలైనవారందరిని వీధుల పాలు చేశారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని హోరెత్తించిన కూటమి నేతలు, ఇప్పుడు ఆ ప్రస్తావనే తేకుండా గడుపుతున్నారు. పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం, అన్నా క్యాంటిన్లు మినహా ఒక్క హామీ అమలు చేయని ప్రభుత్వం అనైతిక ప్రభుత్వం కాక మరేమి అవుతుంది.అన్ని హామీలు ఒక్కసారే అమలు చేయలేకపోవచ్చు. కాని ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా మాట్లాడడం అనైతికమే. కనీసం ఏ హామీ ఎప్పుడు అమలు చేస్తామో చెప్పకపోగా, వాటిని చూస్తేనే భయం వేస్తోందని, గత ప్రభుత్వ వైఫల్యం అంటూ వైఎస్సార్సీపీపై తమ తప్పులను నెట్టివేయడం చూస్తే ఇదేనా చంద్రబాబు అనుభవం అన్నప్రశ్న వస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా అమరావతి నిర్మిస్తామని, సంపద సృష్టించి సూపర్ సిక్స్ అమలు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాదించిన చంద్రబాబు ప్రస్తుతం అమరావతి పేరుతో ఏకంగా పదిహేనువేల కోట్ల రూపాయల అప్పు తీసుకురాబోతుండడం అనైతికమా? కాదా? మొత్తం అంత డబ్బు మళ్లీ ఒకే చోట ఖర్చు చేసి, ప్రాంతీయ అసమానలతకు బీజం వేయడం కూడా విమర్శలకు దారి తీస్తోంది.జగన్ 2019లో తాను ఇచ్చిన హామీలకు ఒక ప్రణాళిక రూపొందించి వాటిని అమలు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అసలు వాగ్దానాలను పట్టించుకోవడం లేదు. పైగా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ వాగ్దానాలను నెరవేర్చవలసిన అవసరం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ వాగ్దానాలను అమలు చేయకపోయినా, నిత్యం వచ్చే ఆదాయం ఏమవుతోందో తెలియదు కాని, అప్పులు మాత్రం వేల కోట్లు చేస్తున్నారు. ఇవన్ని గమనిస్తే, జగన్ చెప్పినట్లు చంద్రబాబుది అనైతిక పాలనే అన్న భావన ప్రజలలో కూడా ఏర్పడుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Deputy CM Mallu Bhatti Vikramarka Respond On Demolition Of N Convention10
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి స్పందన..

ఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్‌ కన్వెన్షన్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చివేతలు చేసినట్లు మల్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చట్టబద్ధంగానే వ్యవహరించిందని ఆయన స్పష్టం చేశారు.2014కు ముందు హైదరాబాద్‌లో ఉన్న చెరువులు ఎన్ని ఉన్నాయో.. ఇప్పుడు ఉన్న చెరువు ఎన్నో చూస్తే ఆక్రమణలు బయటపడతాయన్నారు. రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ మ్యాపులతో అన్ని లెక్కలు బయటపెడతామన్నారు. కబ్జా అయిన చెరువులను కాపాడవద్దని అంటారా? అని మీడియా సమావేశంలో విలేకర్లను ఎదురు ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి. ‘హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్ అండ్ రాక్స్. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా. దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటున్నారు. బఫర్ జోన్ లో కాదు, నేరుగా చెరువులోనే కఠిన నిర్మాణాలను కూల్చేస్తున్నారు. సాటిలైట్ ఫోటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసుకుంటున్నాం. రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఫోటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రజల ముందు పెడతాం.చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడతున్నాం. అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతాం. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత’ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
International View all
title
డిసెంబర్‌ నాటికి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు: జమీల్ అహ్మద్

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన పాకిస్తాన్ నెమ్మదిగా కోలుకుంటోంది.

title
భారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు మాజీ జడ్జి అరెస్ట్

బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని భారతదేశ సరిహద్దుల్లో ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు.

title
మోదీ ఉక్రెయిన్‌ పర్యటనపై అమెరికా స్పందన ఇదే

వాషింగ్టన్‌: యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌లో భారత ప్రధాని

title
అల్‌ ఖైదా అనుబంధ గ్రూప్‌ కీలక నేత హతం

న్యూయార్క్‌: సిరియాలో జరిగిన దాడుల్లో అల్-ఖైదా అనుబంధ సంస్థ

title
ట్రంప్‌ గెలిస్తే ఉక్రెయిన్‌కు లాభమా?: జెలెన్‌ స్కీ ఆసక్తికర కామెంట్‌

కీవ్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపుపై ఉక్రెయిన్

NRI View all
title
కమలా హారీస్ ఓ‌ కీలుబొమ్మ: వివేక్‌ రామస్వామి

చికాగో: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మ

title
అమెరికాలో వ్యభిచారం.. ఏడుగురు భారతీయుల అరెస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీ

title
అమెరికాలో తెలుగు తేజం వర్షిణి నాగం భరతనాట్య రంగప్రవేశం

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో హారిస్ సెంటర్ థియేటర్లో ఆగస్టు 18, 2024 న ప్రవాసాంధ్ర వర్ష

title
అమెరికాలో తెలుగు యువకుల అరెస్ట్‌

ఆస్టిన్‌: అమెరికా టెక్సాస్‌ స్టేట్‌లో వ్యభిచార ముఠాను అక్కడి పోలీసులు రహస్య ఆపరేషన్‌ ని

title
వైద్యుడి రూపంలోని రాక్షసుడు

వాషింగ్టన్‌: చికిత్స కోసం వచ్చే రోగుల పట్ల అభిమానం, వాత్సల్యం ప్రదర్శిస్తూ సాంత్వన చేకూర్చాల్సిన వైద్యు

Advertisement
Advertisement