Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Centre Has Issued Orders Imposing President Rule In Manipur1
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

ఢిల్లీ: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో కేంద్రం.. రాష్ట్రపతి పాలన విధించింది మణిపూర్‌లో గిరిజన జాతుల మధ్య హింస నేపథ్యంలో శాంతిభద్రతలు దిగజారాయి. దీంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది. రెండు జాతుల మధ్య రేగిన వైరం.. ఎంతటి హింసకు దారి తీసిందో తెలిసిందే.. ఇప్పటికీ ఇదే విషయంలో మణిపూర్‌ రగులుతూనే ఉంది. ఈ హింసకు మూల కారణమైన కుకీ, మైతేయ్ తెగల మధ్య వైరం ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి నిలిపేలా చేసింది. అయితే, ఈ అల్లర్ల వెనుక బీరేన్‌ సింగ్‌ ఉన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎట్టకేలకు మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు.దాదాపు రెండేళ్లనాడు హత్యలూ, అత్యాచారాలూ, గృహదహనాలతో అట్టుడికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్ఠలను మంటగలిపిన ఆ రాష్ట్రం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. 2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయితీలకూ, కుకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండ గానే కార్చిచ్చులా వ్యాపించగా అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయారు.60,000 మంది ఇప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాల పహారా కొనసాగుతున్నా మెయితీలు, కుకీలు ఒకరి ప్రాబల్య ప్రాంతాల్లోకి మరొకరు ప్రవేశించే సాహసం చేయటం లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. మణిపూర్‌ హింసాకాండ సాధారణమైనది కాదు. అనేకచోట్ల మహిళలను వివస్త్రలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి.ఇదీ చదవండి: మణిపూర్‌ శాంతిస్తుందా?

Ex MLA vallabhaneni vamsi Arrest Live Updates2
వంశీ అరెస్ట్‌..కృష్ణలంక పీఎస్‌ వద్ద హైడ్రామా

Vamsi Arrest Live Updates.. కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలను ఒక్కొక్కరిగా టార్గెట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీ(vallabhaneni vamsi)ని అక్రమ కేసులో ఇవాళ హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. విజయవాడకు ఆయన్ని తరలించే క్రమంలో నాటకీయ పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. విజయవాడ జీజీహెచ్‌లో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు👉ఏ7 శివరామకృష్ణ, ఏ8 లక్ష్మీపతికి సైతం వైద్య పరీక్షలు👉వైద్య పరీక్షలు అనంతరం కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులువిజయవాడ జీజీహెచ్‌కు వల్లభనేని వంశీ తరలింపు👉కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో 8 గంటలుగా కొనసాగిన వంశీ విచారణ👉కాసేపట్లో వంశీకి వైద్య పరీక్షలు👉వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులుస్లేషన్‌ బయటే వంశీ భార్య పంకజశ్రీ👉కృష్ణలంక పీఎస్‌కు చేరుకున్న వల్లభనేని వంశీ భార్య👉స్టేషన్‌లోకి అనుమతించని పోలీసులు👉పోలీసులు, వంశీ భార్య మధ్య వాగ్వాదం👉స్టేషన్‌ బయటే ఎదురుచూస్తున్న వంశీ భార్య పంకజశ్రీ వల్లభనేని వంశీ అరెస్ట్‌ చెల్లదు: అడ్వకేట్ చిరంజీవి👉కావాలనే వంశీని అరెస్ట్‌చేశారు👉ఏం కేసులు పెట్టారో తెలీదు👉పోలీస్ స్టేషన్ లో వంశీ లేరని అబద్దాలు చెపుతున్నారు👉ఎవరు ఫిర్యాదు చేశారు? కేసు ఎందుకు పెట్టారో చెప్పడం లేదు👉వంశీ లాయర్‌నని చెప్పినా లోపలకి అనుమతించడం లేదు..👉పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోంది.👉విజయవాడ: వల్లభనేని వంశీ వద్దకు ఎవ్వరిని అనుమతించని పోలీసులుఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ని స్టేషన్ బయటే ఉంచేసిన పోలీసులువంశీ భార్య ను నందిగామ లోనే అడ్డుకున్న పోలీసులు👉 వల్లభనేని వంశీని ప్రశ్నిస్తున్న కృష్ణ లంక పోలీసులు. టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్న వంశీ. అయినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసంటూ అక్రమంగా నిర్భంధించి మరీ వేధిస్తున్న పోలీసులు👉వల్లభనేని వంశీని కృష్ణ లంక పీఎస్‌కు తరలించిన పోలీసులు..👉విజయవాడ చేరుకున్న వంశీ పోలీసుల ఎస్కార్ట్‌ వాహనం. ముందుగా భవానీపురం పోలీసు స్టేషన్‌కు వంశీని తరలించిన పోలీసులు. 👉అనంతరం, వాహనాన్ని మార్చి మరో చోటుకి తరలిస్తున్న పోలీసులు. కాసేపట్లో జడ్జీ మందు వంశీని హాజరుపర్చనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కృష్ణా జిల్లావ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. పోలీసు యాక్ట్‌ 30 అమలు చేసున్నట్టు తెలిపారు. ర్యాలీలు, నిరసనలపై నిషేధం విధించారు. 👉మరికాసేపట్లో వల్లభనేని వంశీని పటమట పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురానున్న పోలీసులు. ఇప్పటికే పడమట పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు, ఎస్‌బీ, ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు. 👉పటమట పోలీస్ స్టేషన్ ఇరువైపులా బారికేడ్స్‌ను ఏర్పాటు చేస్తున్న పోలీసులు. డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీ, సీఐలు. వంశీ అనుచరులు, వైఎ‍స్సార్‌సీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటారనే అనుమానంతో భారీ ఎర్పాట్లు. మూడు గంటల నుండే పటమట స్టేషన్‌లోనే ఉన్న పోలీసు అధికారులు👉వంశీ అరెస్ట్‌ నేపథ్యంలో గన్నవరంలో పోలీసులు హై అలర్ట్‌ విధించారు. వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. పార్టీ శ్రేణులను బయటకు రానివ్వడం లేదు. ప్రధాన ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. 👉చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ(YSRCP) నేతలను టార్గెట్‌ చేసి అక్రమ కేసులు బనాయించింది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా కేసులు పెట్టింది. దీంతో, ఆయనను అరెస్ట్‌ చేసేందుకు విజయవాడ పడమట పోలీసులు ప్లాన్‌ ప్రకారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గచ్చిబౌలిలోని వంశీ ఇంటికి చేరుకుని నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్‌ చేశారు. 👉ఈ సందర్భంగా బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 140(1), 308, 351(3) రెడ్‌విత్‌ 3(5) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం పోలీసులు నమోదు చేశారు. ఇదే సమయంలో కిడ్నాప్‌, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్ట్‌ చేస్తున్నట్టు వంశీ భార్యకు పోలీసులు నోటీసుల్లో తెలిపారు. అనంతరం, వంశీని అరెస్ట్‌ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. 👉అయితే, గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్‌ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల కుట్రను మేజిస్ట్రేట్ ముందు సత్యవర్ధన్ బట్టబయలు చేశారు. ఈ నేపథ్యంలో వంశీని పోలీసులు టార్గెట్‌ చేశారు. కక్ష గట్టి మరో కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకున్న అనంతరం మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు చీటర్‌ కాదా?: వైఎస్‌ జగన్‌

Nirmala Sitharaman Comments on Telangana Debt in Parliament3
‘అప్పుల కుప్పగా తెలంగాణ’.. పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (nirmala sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం .. ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చారు’అని రాజ్యసభలో బడ్జెట్‌పై (parliament budget session) చర్చ సందర్భంగా మాట్లాడారు. నిర్మల సీతారామన్ ఇంకా ఏమన్నారంటే? ‘ఏపీ విభజన సమయంలో తెలంగాణ (telangana debt) మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైంది. నేను ఏ పార్టీని తప్పుబట్టడం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్‌ను మోదీ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది మోదీ ప్రభుత్వమే.ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచాం. నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత ప్రధానిదే. అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్. తెలంగాణకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్‌లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.వరంగల్‌లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్ట్స్‌ టైల్‌ పార్కు, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, బీబీనగర్‌లో ఎయిమ్స్, 2605 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం, భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు, రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు రూ.5337 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు, ఏరుపాలెం నంబూరు మధ్య , మల్కాన్ గిరి పాండురంగాపురం మధ్య 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం,ఐదు కొత్త వందేభారత్ ట్రైన్ల కేటాయింపు, 40రైల్వే స్టేషన్స్ రీడెవలప్, పీఎం ఆవాస్ అర్బన్ కింద రెండు లక్షల ఇళ్ల నిర్మాణం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31 లక్షల టాయిలెట్ల నిర్మాణం, జల్‌జీవన్‌ మిషన్ కింద 38 లక్షల నల్ల కనెక్షన్లు, 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల మంజూరు, 199 జనఔషది కేంద్రాలను ఏర్పాటు..ఇలా చెప్పుకుంటూ పోతే అనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము’ అని వ్యాఖ్యానించారు. 👉చదవండి : కమల్‌ హాసన్‌తో డీసీఎం భేటీ!

5 Spinners In Dubai: Ashwin Questions India Strategy For CT 2025 Squad4
తుదిజట్టులో ఆ ఇద్దరు పక్కా.. మరీ అంతమంది ఎందుకు?: అశ్విన్‌

టీమిండియా సెలక్టర్ల తీరును భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) విమర్శించాడు. చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ఎంపిక చేసిన జట్టులో ఐదుగురు స్పిన్నర్లకు చోటు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డాడు.యశస్వి జైస్వాల్‌ను తప్పించికాగా ఈ ఐసీసీ టోర్నీకి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(BCCI) మంగళవారం తమ పూర్తిస్థాయి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాథమిక జట్టులో ఉన్న బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ను తప్పించి.. అతడి స్థానంలో కొత్తగా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని చేర్చింది. అదే విధంగా.. జస్‌ప్రీత్‌ బుమ్రా గాయం కారణంగా దూరం కాగా.. హర్షిత్‌ రాణాకు పిలుపునిచ్చింది.ఇదిలా ఉంటే.. ఇప్పటికే జట్టులో కుల్దీప్‌ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ల రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. వరుణ్‌ రాకతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.నాకు అర్థం కావడం లేదు‘‘దుబాయ్‌కు ఇంతమంది స్పిన్నర్లను తీసుకువెళ్లడంలో మర్మమేమిటో నాకు అర్థం కావడం లేదు. యశస్వి జైస్వాల్‌పై వేటు వేసి స్పిన్నర్ల సంఖ్య ఐదుకు పెంచారు. ఈ పర్యటనలో ముగ్గురు లేదంటే నలుగురు స్పిన్నర్లు ఉంటారని ముందుగానే ఊహించాం.కానీ దుబాయ్‌కు ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో వెళ్తున్నామా? ఒకరు.. లేదంటే ఇద్దరు అదనంగా ఉన్నారని అనిపించడం లేదా?.. అందులో ఇద్దరు లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు(రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌). ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే.పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు జడేజా, అక్షర్‌ తుదిజట్టులో ఉంటారు. కుల్దీప్‌ కూడా ఆడతాడు. ఇలాంటపుడు ఒకవేళ మీరు వరుణ్‌ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకోవాలనుకుంటే.. ఓ పేసర్‌ను పక్కనపెట్టాల్సి ఉంటుంది.అప్పుడు హార్దిక్‌ పాండ్యాను రెండో పేసర్‌గా ఉపయోగించుకోవాలి. లేదంటే.. స్పిన్నర్‌ను తప్పించి మూడో సీమర్‌ను తుదిజట్టులోకి తెచ్చుకోవాలి. నాకు తెలిసి కుల్దీప్‌ యాదవ్‌ నేరుగా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. మరి అప్పుడు వరుణ్‌కు ఎలా చోటిస్తారు?ఒకవేళ కుల్దీప్‌తో పాటు వరుణ్‌ కూడా తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ దుబాయ్‌లో బంతి అంతగా టర్న్‌ అవుతుందని మీరు భావిస్తున్నారా? నేనైతే ఈ జట్టు ఎంపిక తీరు పట్ల సంతృప్తిగా లేను’’ అని అశ్విన్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.3-0తో క్లీన్‌స్వీప్‌కాగా చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సొంతగడ్డపై బట్లర్‌ బృందాన్ని 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్‌ ట్రోఫీ ఆడే భారత తుదిజట్టులో జడేజాతో పాటు అక్షర్‌ పటేల్‌ ఉండటం ఖాయం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వీలుగా వీరికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఇద్దరు స్పెషలిస్టు పేసర్లను ఆడించాలనుకుంటే కుల్దీప్‌ యాదవ్‌ లేదంటే వరుణ్‌ చక్రవర్తిలలో ఒక్కరికే స్థానం దక్కుతుంది. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడుతుంది.ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి భారత జట్టు:రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌(వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, మహ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి. చదవండి: CT 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్‌ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్‌ కెప్టెన్‌

Chiranjeevi Faces Backlash Over Controversial Remarks On Legacy5
‘దంగల్‌’ చూడండి ‘మాస్టారు’

‘మగ పిల్లాడు అయితేనే కుస్తీ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ తెస్తాడని ఆలోచిస్తూ ఉండేవాడిని..కానీ ఒక్క విషయం అర్థం కాలేదు. కొడుకు తెచ్చిన, కూతురు తెచ్చిన గోల్డ్‌ గోల్డే కదా’.. దంగల్‌ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌ చెప్పే డైలాగ్‌ ఇది. ఈ ఒక్క డైలాగ్‌తోనే అసలు కథంతా జరుగుతుంది. చివ‌రికి త‌న కూతుర్ల ద్వారా మ‌ల్ల యుద్ధంలో బంగారు ప‌తాకాలు సాధిస్తాడు. ఇది రియల్‌గా జరిగిన కథ. ఇలాంటి కథలు ప్రస్తుత సమాజంలో చాలా జరుగుతున్నాయి. అన్ని రంగాల్లోనూ మగవాళ్లతో సమానంగా రాణిస్తున్నారు. నిజం చెప్పాలంటే కొన్ని రంగాల్లో మగవాళ్లను మించి పోతున్నారు కూడా. అయినా కూడా కొన్ని చోట్ల లింగ వివక్ష కొనసాగుతుంది. వారసత్వం అంటే మగవాళ్లే అనే అపోహలు ఇంకా కొందరిలో ఉన్నాయి. అలాంటి వారికి బుద్ది చెప్పాల్సిన సినీ ‘పెద్ద’ చిరంజీవి(Chiranjeevi) కూడా ఇప్పుడు వారసత్వం కొనసాగించేందుకు కొడుకు కావాలంటున్నారు.కొడుకు ఉంటేనే వారసత్వమా? కూతురు లెగసీని కంటిన్యూ చేయలేదా? చిరంజీవికి సైతం ఈ వివక్ష ఎందుకు? ప్రపంచాన్ని పక్కకి పెట్టినా సరే.. ఆయన ఇంట్లోనే లెజండరీ లేడీస్‌ ఉన్నారు. కోడలు ఉపాసన వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది. పెద్ద కూతురు నిర్మాతగా రాణిస్తోంది. తమ్ముడు కూతురు నిహారిక అటు యాక్టింగ్‌తో పాటు నిర్మాతగానూ దూసుకెళ్తోంది. సొంత ఇంట్లోనే ఇంతమంది సక్సెస్‌ సాధించిన ఆడవాళ్లు ఉంటే.. ‘ఒక్క మగపిల్లాడిని కనరా?’ అని చరణ్‌ని కోరాల్సిన అవసరమేంటి?ఆచి తూచి మాట్లాడాల్సిందే..సెలెబ్రిటీలు చేసే పనులు, మాట్లాడే మాటలను సామాన్యులు అనుసరిస్తారు. మంచి చేస్తే మెచ్చుకోవడం..చెడు చేస్తే ‘ఛీ’అని తిట్టడం కామన్‌. అందుకే సెలెబ్రిటీలు ఆకర్షనీయంగా మాట్లాడడం కాదు ఆచితూచి మాట్లాడాలి. లేదంటే చిరంజీవి లాగే అందరూ ట్రోల్‌ అవుతారు. వాస్తవానికి చిరంజీవి సరదగానే ఆ మాటలు అన్నాడు. అక్కడ విన్నవాళ్లు ఎవరీకి తప్పుగా అనిపించలేదు. కానీ నేషనల్‌ మీడియాలో సైతం చిరు వ్యాఖ్యలను తప్పుపట్టింది. పురుషాహంకారంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ నెటిజన్స్‌ మెగాస్టార్‌పై ఫైర్‌ అయ్యారు. ఇక్కడ మీడియాను తప్పపట్టలేం. ఆయన అన్న మాటలనే వార్త రూపంలో ఇచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలే సామాన్యులు అంటే పెద్దగా పట్టించుకోరు. చిరంజీవి లాంటి ప్రముఖుల నోట ఇలాంటి మాటలు రావడం నిజంగా బాధాకరమే.మనవరాళ్లే మాణిక్యాలైతారేమో!చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు చరణ్‌ ఉన్నాడు. పెద్ద కూతురుకు సుష్మితాకు, చిన్న కూతురు శ్రీజకు ఇద్దరేసి చొప్పున కుమార్తెలు ఉన్నారు. ఇక చరణ్‌-ఉపాసన దంపతులకు కూడా కూతురే పుట్టింది. ఇంట్లో చరణ్‌ మినహా మిగతావాళ్లంతా ఆడ పిల్లలేకావడంతో చిరంజీవి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇక్కడ మెగాస్టార్‌ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మనవారాళ్లు కూడా ఆయనను మించి రాణిస్తారేమో. దంగల్‌ సినిమా మాదిరే వివిధ రంగాల్లో చరిత్ర సృష్టిస్తారేమో. కొడుకు ఉంటే లెగసీ కంటిన్యూ అవుతుందనే అపోహ నుంచి ‘మాస్టారు’ బయటకు రావాలి.

RBI Cancels March 31 Bank Holiday6
పండుగైన బ్యాంకులు పనిచేయాల్సిందే: ఆర్‌బీఐ నిర్ణయం

మార్చి 31, 2025 (సోమవారం) ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ.. అన్ని బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు కాబట్టి.. అన్ని లావాదేవాలను అదే రోజు నమోదయ్యేలా చూసేందుకు సెలవు రద్దు చేయడం జరిగింది.2025 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కాబట్టి అప్పటికే పన్ను చెల్లింపులు (ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు), పెన్షన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీలు, ప్రభుత్వ జీతభత్యాల చెల్లింపు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రజా లావాదేవీలను ముగించాల్సి ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.నిజానికి మార్చి 31 రంజాన్ పండుగ, ఈ కారణంగానే.. దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆ రోజు బ్యాంకులన్నీ పనిచేయాలని.. ఆర్ధిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలనీ ఆర్‌బీఐ ఆదేశించింది. అంతే కాకుండా ఏప్రిల్ 1న సెలవు దినంగా ప్రకటించింది. ఆన్‌లైన్ సేవలు అన్ని సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆన్‌లైన్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు.

YSRCP Leader Ambati Rambabu Slams TDP Govt Over Vallabhanen Vamsi Arrest7
‘డీజీపీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.. కానీ వచ్చాక కలవలేదు’

మంగళగిరి: వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్‌ చేశారని, ఇది కూటమి ప్రభుత్వం కుట్రపూరిత చర్య అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అసలు వంశీని ఎందుకు అరెస్ట్‌ చేశారో సరైన కారణం చెప్పలేదని, ఓ తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయ త్నం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. వంశీ అరెస్టుపై డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన అంబటి మీడియాతో మాట్టాడారు. ‘వంశీని అ‍క్రమంగా అరెస్ట్ చేశారు.. ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు. తప్పుడు కేసు పెట్టి ఇరికించారు. వంశీ టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు కక్ష గట్టారు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలిన ప్రయత్నించినా కోర్టుకు వెళ్లి ప్రొటక్షన్ తెచ్చుకున్నాడు వంశీ. ఇది తప్పుడు కేసు అని అందరికీ తెలుసు కనీసం వంశీని భార్య కలవడానికి కూడా ఎన్నో ఆంక్షలు పెట్టారు పోలీసులు.దీనిపై డీజీపీకి రిప్రజెంటేషన్‌ ఇవ్వడానికి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాం. డీజీపీ ఆఫీస్ కు అపాయింట్ మెంట్ ఇస్తే వచ్చాం.. అయినా వారిని కలవలేదు. రిప్రజెంటేషన్ఇ వ్వడానికి ఈరోజు(గురువారం) సాయంత్రం 4.35కి అపాయింట్ మెంట్ ఇచ్చారు. మేము 4.30కే డీజీపీ ఆఫీస్ కి వచ్చాం. అప్పుడు డీజీపీ ఉన్నారు.. కానీ కాసేపటికి వెళ్లిపోయారని చెప్పారు. మరి మా రిప్రంజటేషన్ ఎవ్వరూ తీసుకోలేదు. ఇదేంటో అర్థం కావడం లేదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. మేము ఇచ్చే రిప్రజెంటేషన్‌ తీసుకోవడానికి డీజీపీ ఎవరినైనా పంపిస్తారా? లేక మేమే మళ్లీ వచ్చి కలవాలా? అని అంబటి మీడియా ముఖంగా ప్రశ్నించారు.

Vallabhaneni Vamsi Wife Comments On Police8
నా భర్తను ఎందుకు అరెస్ట్‌ చేశారో చెప్పడం లేదు: వంశీ భార్య

సాక్షి, విజయవాడ: తన భర్తను ఎందుకు అరెస్ట్‌ చేశారో చెప్పడం లేదని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. పోలీసులు వివరాలు ఏమీ చెప్పడంలేదని.. లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. ఏ కేసులో అరెస్ట్‌ చేశారో చెప్పడం లేదని.. ఎఫ్‌ఆర్‌ కాపీ కూడా ఇవ్వడం లేదని వంశీ భార్య ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావుతో కలిసి వల్లభనేని వంశీ సతీమణి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్‌లోకి పోలీసులు అనుమతించకపోవడంతో వంశీ భార్య, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందన్నారు. తమను పోలీస్‌స్టేషన్‌ లోపలికి రానివ్వడం లేదని.. తన భర్తను చూసేందుకు లోపలికి పంపాలని పంకజశ్రీ కోరారు. చివరికి వంశీ భార్యను మాత్రమే స్టేషన్‌ లోపలికి పోలీసులు పంపించారు.వంశీని టీడీపీ నేతలు టార్గెట్‌ చేశారు: జగన్మోహన్‌రావువైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు మాట్లాడుతూ.. వంశీని టీడీపీ నేతలు టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. లోకేష్‌ చెప్పడం వల్లే అక్రమ కేసులు బనాయించారని.. ఇలాంటి విష సంస్కృతిని అందరూ ఖండించాల్సిందేనన్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టులన్నారు. రాజ్యాంగ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని జగన్మోహన్‌రావు అన్నారు.వల్లభనేని వంశీ అరెస్ట్‌ చెల్లదు: లాయర్‌ చిరంజీవిసుప్రీంకోర్టు నిబంధనలను పోలీసులు పాటించడం లేదని వంశీ తరఫు లాయర్‌ చిరంజీవి అన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్‌ చెల్లదని.. ఆయనను కావాలనే అరెస్ట్‌ చేశారన్నారు. ఏం కేసులు పెట్టారో తెలీదు. పోలీస్ స్టేషన్‌లో వంశీ లేరని అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు ఫిర్యాదు చేశారు? కేసు ఎందుకు పెట్టారో చెప్పడం లేదు. వంశీ లాయర్‌నని చెప్పినా లోపలకి అనుమతించడం లేదు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోంది. వంశీ చాలా ధైర్యంగా ఉన్నారు. తప్పుడు కేసులతో వంశీని ఎవరూ ఏం చేయలేరు’’ అని అడ్వకేట్‌ చిరంజీవి అన్నారు.

Discounts On iPhone 16 15 And 14 Models Of Valentines Day9
ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం: భారీగా తగ్గిన ధరలు

ప్రేమికుల రోజు(Valentine's Day)ను పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ తన 'వాలెంటైన్స్ డే సేల్ 2025'ని ప్రారంభించింది. ఇందులో యాపిల్ ఐఫోన్‌ల మీద గొప్ప డిస్కౌంట్స్ ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి మొదలైన ఈ సేల్స్ 14 వరకు కొనసాగుతుంది.ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ 2025లో.. డిస్కౌంట్స్ లభిస్తున్న ఐఫోన్‌లలో.. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14 వంటివి ఉన్నాయి.ఐఫోన్ 16 ప్లస్ ఇప్పుడు రూ. 11,000 తగ్గింపుతో.. రూ. 78,999 వద్ద లభిస్తుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ. 5,000 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. అంటే రూ. 74000కు లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ఇంకా తగ్గింపు లభిస్తుంది.ఐఫోన్ 15 ధర రూ.64,999 నుంచి ప్రారంభమవుతుంది.. ఐఫోన్ 15 ప్లస్ రూ.68,999 కు లభిస్తుంది. ఐఫోన్ 14 మోడల్ రూ.53,999 ధరకు లభిస్తుంది. కేవలం ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాకుండా.. వివిధ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లు కూడా కొన్ని ప్రత్యేకమైన ఉత్పత్తుల మీద మంచి ఆఫర్స్ అందిస్తాయి. ఇందులో కేవలం మొబైల్ ఫోన్స్ మాత్రమే కాకుండా.. ఇతర ఎలక్ట్రానిక్స్, బట్టలు, ఇతర వస్తువులు ఉంటాయి.

Great Artist Keki Moose 50 Years Of His life Waiting For His Love10
'అంతులేని ప్రేమ కథ': 50 ఏళ్లు గర్ల్‌ఫ్రెండ్ కోసం నిరీక్షించాడు..!

యధార్థ ప్రేమ కథ ఇది. ప్రియురాలు ఇచ్చిన మాటను నమ్మి పది, పన్నేండేళ్లు కాదు ఏకంగా జీవితాంతం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆఖరి శ్వాస వరకు అలానే ఉండిపోరు. ఆమె వస్తుందని చివరి శ్వాస వరకు ఎదరుచూసిన గొప్ప ప్రేమ పిపాసి.ఆ వ్యక్తే మహరాష్ట్రలోని ఖందేశ్‌కు చెందిన కళాతపస్వీ కెకీ మూస్. ఆయన తనకు ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీ కోసం చాలీస్‌గావ్‌ అనే ఊరిలో మూస్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించారు. ఈ ఆర్ట్ గ్యాలరీ ట్రస్టీ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమలాకర్ సామంత్ ఆయన అంతులేని ప్రేమ కథను వివరించారు. ఆయనిచ్చిన సమాచారం ‍ప్రకారం..1912 అక్టోబర్ 2న ముంబైలోని మలబార్ హిల్‌లో పిరోజా, మానెక్జీ ఫ్రాంజీ మూస్ అనే పార్సీ దంపతులకు కెకీ జన్మించారు. కెకీ పూర్తి పేరు కైకుసారో మానెక్జీ మూస్. వాళ్ల అమ్మ ఆయన్ను కెకీ అని పిలిచేవారు. ఆ తర్వాత ఆ పేరే ఆయన ఐడెంటిటీగా మారింది. చాలిస్‌గావ్ స్టేషన్‌కు సమీపంలో రాతితో నిర్మించిన ఒక బంగ్లాలో ఆయన నివసించారు.ముంబైలోని విల్సన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు. కానీ, తన సోడా వాటర్ ఫ్యాక్టరీ, లిక్కర్ షాపు బాధ్యతలను కెకీయే చూసుకోవాలని మానెక్జీ భావించారు. 1934-35 మధ్యలో మానెక్జీ చనిపోయిన తర్వాత, షాపు నిర్వహణ బాధ్యతలను కెకీ తల్లి పిరోజా తీసుకున్నారు. కొడుకు ఇంగ్లండ్ వెళ్లి ఉన్నత చదువులు చదివేందుకు ఒప్పుకున్నారు. 1935లో లండన్‌లోని బెన్నెట్ కాలేజ్ ఆఫ్ షెఫీల్డ్‌లో చేరారు. నాలుగేళ్ల కమర్షియల్ ఆర్ట్‌ కోర్సులో డిప్లొమా పూర్తి చేశారు. ఈ కోర్సులో ఫోటోగ్రఫీ కూడా ఒక సబ్జెట్. అది కూడా చదువుకున్నారు కెకీ. ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్‌కు చెందిన రాయల్ సొసైటీ‌లో గౌరవ సభ్యత్వం పొందారు. అమెరికా, జపాన్, రష్యా, స్విట్జర్లాండ్‌లను సందర్శించారు. అక్కడ చాలా ఫోటోగ్రఫీ ప్రదర్శనలను చూశారు. చాలామంది కళాకారులను కలిశారు. 1938లో భారత్‌కు తిరిగి వచ్చారు.ప్రేమ చిగురించింది..ఆయన ముంబైలో చదువుతుండగా నీలోఫర్ మోదీ అనే యువతితో ఆయనకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తర్వాత చాలిస్‌గావ్‌లో ఉంటున్న తన తల్లిదండ్రులతో కలిసి ఉండాలని కెకీ మూస్ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఆయనకు, నీలోఫర్‌కు మధ్య విభేదాలకు కారణమయింది.కెకీ కుటుంబం ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ, నీలోఫర్ సంపన్న కుటుంబానికి చెందిన వారు. దీంతో నీలోఫర్ తల్లిదండ్రులకు వారి ప్రేమ విషయం అంత నచ్చలేదు. అయినప్పటికీ వారిద్దరూ పెళ్లిచేసుకోవడానికి వారు అంగీకరించారు.అయితే, నీలోఫర్‌ ముంబై వదిలి చాలిస్‌గావ్‌లాంటి గ్రామీణ ప్రాంతానికి వెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. కెకీతో కలిసి చాలిస్‌గావ్‌ వెళ్లేందుకు నీలోఫర్ సిద్ధమైనప్పటికీ, ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కెకీ ముంబై నుంచి చాలిస్‌గావ్‌ వెళ్లేటప్పుడు నీలోఫర్ ఆయనకు వీడ్కోలు పలికేందుకు విక్టోరియా స్టేషన్‌కు వచ్చారు. అది ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌ మార్చారు. నీలోఫర్‌ కైకీకి వీడ్కోలు పలుకుతూ..ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని ఏదో ఒక రోజు తాను కచ్చితంగా పంజాబ్ మెయిల్‌లో చాలిస్‌గావ్ వస్తానని, తనతో కలిసి డిన్నర్ చేస్తానని మాటిచ్చారు. ఆ ఒక్క మాట కోసం ఆయన తన చివరి శ్వాస వరకు ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఎంతలా ఎదురు చూశారంటే..ప్రియురాలి మాటలపై నమ్మకం ఉంచిన కెకీ మూస్, ఆ రైలు వచ్చినప్పుడు తన బంగ్లా కిటికీలు, తలుపులు అన్నీ తెరిచి ఉంచేవారు. రోజులో మిగిలిన భాగమంతా అవన్నీ మూసేసి ఉండేవి. రైలు వచ్చే సమయానికి దీపాలు వెలిగించేవారు. తోటలోని తాజా పూలతో బొకే తయారుచేసేవారు. తర్వాత తోటలో పువ్వులు లేని సమయంలో వాడిపోని అలంకరణ పూలతో పూలగుత్తులు తయారుచేశారు. ప్రతిరాత్రీ ఆయన ఇద్దరి కోసం భోజనం తయారుచేసేవారు. ఈ పద్ధతిలో ఆయన ప్రతిరోజూ తన ప్రియురాలికి స్వాగతం చెప్పేందుకు రెడీగా ఉండేవారు. అలా చివరి వరకూ ఆయన తన ప్రియురాలికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలా పంజాబ్ మెయిల్ వచ్చి వెళ్లిపోయిన తర్వాతే ఆయన ప్రతిరోజూ డిన్నర్ చేసేవారు. తన చివరి డిన్నర్‌ డిసెంబరు 31, 1989 వరకు అలానే చేశారు. ఆ రోజూ కూడా పంజాబ్ మెయిల్ రైలు వెళ్లిపోయిన తర్వాతే భోజనం చేసి పడుకున్నారని, ఇక లేవలేదని సావంత్‌ చెప్పుకొచ్చారు.చిన్న ట్వీస్ట్‌ ఏంటంటే..కెకీ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో తాను రెండు లేఖలను చూశానని సామంత్ తెలిపారు. వాటిలో ఒకటి ఆయన ప్రియురాలి నుంచి వచ్చింది. రెండోది కేకీ బంధువు హథిఖాన్‌వాలా నుంచి వచ్చిందని ఆర్ట్‌ గ్యాలీరీ ట్రస్టీ ఎగ్జిక్యూటివ్ సామంత్ తెలిపారు.ఆయన ప్రియురాలిని లండన్ పంపించివేశారని, అక్కడ ఆమె వివాహం చేసుకున్నారని లేఖలో హథిఖాన్‌వాలా కేకీకి తెలిపారు. అయితే కేకీ ఆ ఉత్తరాలను ఎప్పుడూ చదవలేదని సామంత్ చెప్పారు. ఎన్నింటిలో ప్రావిణ్యం ఉందంటే..కెకీ మూస్ ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్. పెయింటర్, సంగీత ప్రేమికుడు, గొప్ప శిల్పి. ఆయనకు పేపర్‌ను అనేక రకాలుగా మడిచి కళాకృతులుగా మార్చే ‘ఒరిగామి’ అనే ఆర్ట్ కూడా తెలుసు. అంతేగాదు మంచి రచయిత, అనువాదకుడు, తత్త్వవేత్త కూడా. అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేశారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, గుజరాతీ, ఉర్దు, మరాఠీ భాషలు వచ్చు. సొంత లైబ్రరీ నిర్మించాలన్న ఉద్దేశంతో దాదాపు 4వేల పుస్తకాలు సేకరించారు. ఉర్దూ కవిత్వమంటే ఆయనకు ఎంతో ఇష్టం. అలాగే ఇతర ఆర్టిస్టుల చెక్కశిల్పాలు, విగ్రహాలు, పురాతన వస్తువులు, పాత అరుదైన పాత్రలు, బొమ్మలు, పాత ఫర్నీచర్, నాణేలను ఆయన సేకరించారు. అనేక రకాల సంగీతానికి సంబంధించిన క్యాసెట్లు, గ్రామ్‌ఫోన్ రికార్డులు సేకరించడం కెకీకి ఒక హాబీ. హిందీ, మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ, అలాగే పిల్లల పాటలకు సంబంధించి ఆయన దగ్గర పెద్ద కలెక్షనే ఉంది. View this post on Instagram A post shared by Yatin Pandit (@sculptor.yatinpandit) (చదవండి: చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన ప్రేమకథలు..!)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
పడి.. లేచి.. బబుల్‌ టీతో వేల కోట్లకు పగడలెత్తాడు

మీరు ఏదైనా కొత్త బిజినెస్‌ ఐడియా (business ideas in telugu) కోసం చూస్తున్నారా?

title
Munich: జనంపైకి దూసుకెళ్లిన కారు.. పలువురికి తీవ్ర గాయాలు

బెర్లిన్‌: జర్మనీ ప్రముఖ నగరం మ్యూనిచ్‌లో ఘోరం చోటు చేసుకుంద

title
జేడీ వాన్స్‌ పిల్లలకు ‘మోదీ మార్క్‌’ గిఫ్ట్‌లు

ప్రధాని నరేంద్ర మోదీ ఏఐ యాక్షన్‌ సమ్మిట్‌ కోసం ఫ్రాన్స్‌ వెళ్లిన సంగతి తెలి

title
పుతిన్‌తో ఫోన్‌ కాల్‌ ఎఫెక్ట్‌.. ఉక్రెయిన్‌కు షాకిచ్చిన ట్రంప్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..

title
Bangladesh: ‘అవన్నీ ప్రభుత్వ హత్యలే’.. దడపుట్టిస్తున్న ఐక్యరాజ్యసమితి రిపోర్టు

బంగ్లాదేశ్‌లో గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఎగసిపడిం

Advertisement

వీడియోలు

Advertisement