Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Farmers Worry About Crop investment assistance in Chandrababu Govt1
అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి

సాక్షి, అమరావతి: తెలుగింట సంక్రాంతి పెద్ద పండుగ.. మరీ ముఖ్యంగా ఇది రైతన్న పండుగ. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు సంబరాలు చేసుకోవలసిన తరుణం. కానీ అన్నదాత లోగిలి కళతప్పింది. పల్లెల్లో సంక్రాంతి సందడి కానరావడం లేదు. అన్ని విధాలుగా మోసపోయిన రైతన్న దిగాలుగా కనిపిస్తున్నాడు. కొత్త సర్కారు వచ్చి ఏడు నెలలు గడిచాయి. ఖరీఫ్, రబీ రెండు సీజన్లు పూర్తయ్యాయి. పెంచి ఇస్తామన్న పెట్టుబడిసాయం ఒక్క విడత కూడా అందలేదు. పంటలబీమా పరిహారం లేదు.. పైగా ప్రీమియం కట్టాల్సిరావడం.. కరువు సాయానికి ఎగనామం.. ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరకలేదు. తుపానులు, వరదలు దారుణంగా దెబ్బతీశాయి. దిగుబడులు ఆశించినట్లులేవు.. వాటికీ కనీస మద్దతు ధర రాలేదు. అన్ని విధాలుగా దగా పడిన రైతన్న ఏడు నెలలుగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తానన్న పెట్టుబడి సాయం లేదు. ఈ సాయం కోసం రాష్ట్రంలోని 54 లక్షల మందికి రూ.10వేల కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇంతమోసం చేస్తారా.. అని అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఖరీఫ్‌–2023 సీజన్‌కు సంబంధించి రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వలన రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్‌లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. ఇలా రైతులకు ఈ ఏడు నెలల్లో అందించాల్సిన రూ.12,563 కోట్లు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. వీటి కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని రైతులు ఎదురు చూస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక ఈసారి పండుగకు దూరమవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. దీంతో విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడ్డారు. రోడ్డునపడిన అన్నదాత..ఇంటికొచ్చే కొత్త పంటతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికే రైతన్నల ఇంట ఈసారి ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు. ప్రభుత్వ నిర్వాకానికి తోడు వరుస వైపరీత్యాల ప్రభావంతో ఓ వైపు పంటలు దెబ్బతినగా, చేతికొచ్చిన అరకొర పంటకు మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గడిచిన ఐదేళ్లుగా విత్తనాలు, ఎరువులకు ఏరోజు ఇబ్బందిపడని రైతులు గడిచిన ఖరీఫ్‌ సీజన్‌లో వాటి కోసం నానా అవస్థలు పడ్డారు. మళ్లీ, మళ్లీ పెట్టుబడులు పెట్టి పండించిన వరి, పత్తి, ఉల్లి, టమోటా, మిర్చి వంటి పంటలకు మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో తుపానులు, వరదలతో అధికారికంగా 6 లక్షల ఎకరాలలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో మరో 2 లక్షల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో 80కి పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారే తప్ప పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. పంటల బీమా రక్షణేది?గతేడాది ఇదే రబీ సీజన్‌లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య అక్షరాల 43.82 లక్షల మంది. మరిప్పుడూ.. కేవలం 7.64 లక్షల మంది. అంటే ఆరో వంతు మందికి కూడా పంటల బీమా రక్షణ దక్కలేదు. గత ఐదేళ్లూ అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. ఈ–క్రాప్‌ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు నూరు శాతం యూనివర్శల్‌ కవరేజ్‌ కల్పిస్తూ పంటల బీమా రక్షణ లభించేది. ఈ బీమాతో ఎలాంటి విపత్తు ఎదురైనా రైతన్నలు నిశ్చింతగా ఉండే వారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో వివిధ విపత్తుల కారణంగా పంటలు దెబ్బతిన్న 54.55 లక్షల మంది రైతులకు రికార్డు స్థాయిలో రూ.7,802.05 కోట్లు పరిహారంగా అందించింది. వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు బుధవారంతో ముగుస్తుంది. మిగతా పంటలకు గత నెల 31వ తేదీనే ముగిసింది. అయినా 50.67 లక్షల ఎకరాలకు రైతులు బీమా చేయించలేదు. చంద్రబాబు ప్రభుత్వం బీమా ప్రీమియం భారాన్ని రైతులపైనే వేయడమే ఇందుకు కారణం. ఈ భారం భరించలేక లక్షలాది రైతులు పంటల బీమా చేయించుకోలేకపో­యారు. పైగా, బీమాకు అవసరమైన సర్టిఫికెట్లు, నమోదు వంటి వాటి కోసం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితి. దీంతో పంటల బీమా అంటేనే రైతులు భయపడిపోయారు.17న విజయవాడలో ధర్నాకు పిలుపుప్రతీ రైతుకు రూ.20వేల పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలన్నీ అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఇచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం. రైతులకు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీ ముఖ్యమంత్రికి గుర్తులేదా? గుర్తు ఉన్నా రైతులకు ఇవ్వటం ఇష్టం లేక అమలు చేయటం లేదా? స్పష్టం చేయాలి. రైతులకు ఇచ్చిన హామీల అమలు, పెండింగ్‌ బకాయిలు చెల్లింపుతోపాటు రైతులపై భారం వేయకుండా ఉచిత పంటల బీమా పథకం కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద మహాధర్నా చేయబోతున్నాం. – కె.ప్రభాకరరెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Brs Mla Padi Kaushikreddy Arrest Updates2
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు

సాక్షి,హైదరాబాద్‌:బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy)ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం సాయంత్రం (జనవరి13) కౌశిక్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌(Sanjaykumar)ను నెట్టివేసిన కేసులో కౌశిక్‌రెడ్డిని కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులు(Karimnagar police) అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం కౌశిక్‌రెడ్డిని పోలీసులు కరీంనగర్‌కు తరలించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆదివారం తనను కౌశిక్‌రెడ్డి దుర్భాషలాడుతూ నెట్టివేసిన వ్యవహారంలో పోలీసులకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. కాగా, కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌ మధ్య వాగ్వాదం జరిగింది. సంజయ్‌కుమార్‌ మాట్లాడుతుండగా కౌశిక్‌రెడ్డి కల్పించుకుని ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావని ప్రశ్నించడంతో గొడవ పెద్దదైంది. ఈ క్రమంలోనే కౌశిక్‌రెడ్డి సంజయ్‌కుమార్‌పై చేయి వేసి ఆయను నెట్టివేశారు. అనంతరం సమావేశ మందిరం నుంచి కౌశిక్‌రెడ్డిని పోలీసులు లాక్కెల్లారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఈ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్‌ పోలీసులతో పాటు తన హక్కులకు భంగం కలిగించారని స్పీకర్‌కు కూడా రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే కౌశిక్‌రెడ్డిని కరీంనగర్‌ పోలీసులు ప్రస్తుతం కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. కౌశిక్‌ రెడ్డి అరెస్టు దారుణం:కేటీఆర్హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యపూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారిందిముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారుపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం

Earth Quake In Japan Tsunami Warning Issued3
జపాన్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరిక జారీ

టోక్యో:జపాన్‌(Japan)లో సోమవారం(జనవరి13) భారీ భూకంపం(EarthQuake) సంభవించింది. క్యుషు ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.9గా నమోదైంది. 37 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యురోపియన్‌ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది. ఈ భూకంపం ధాటికి ఎలాంటి పప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని సమాచారం. అయితే ముందు జాగ్రత్తగా కొన్ని తీర ప్రాంతాలకు సునామీ(Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. గతేడాది ఆగస్టు 8న క్యుషు ప్రాంతంలో రెండు భారీ భూకంపాలు రాగా జనవరి 1 2024న 7.6 తీవ్రతతో సుజు,వజీమాలో భారీ భూకంపం సంభవించింది.ఈ భూకంపం ధాటికి ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు టెక్టానిక్‌ ప్లేట్లు కలిసే రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ప్రాంతంలో జపాన్‌ ఉండడంతో ఇక్కడ తరచు భూకంపాలు వస్తుంటాయి.

Heroine Anshu Responds on Director Nakkina Trinadha Rao Comments4
డైరెక్టర్‌ అసభ్యకర వ్యాఖ్యలు.. స్పందించిన మన్మథుడు హీరోయిన్‌

మన్మథుడు హీరోయిన్‌ అన్షు (Anshu)పై దర్శకుడు నక్కిన త్రినాధరావు (Trinadha Rao Nakkina) అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆమె శరీరాకృతి గురించి అభ్యంతరకరంగా మాట్లాడటంతో మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు సోషల్‌ మీడియాలోనూ నెటిజన్లు దర్శకుడి తీరును ఎండగడుతున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న త్రినాధరావు హీరోయిన్‌ అన్షుతో పాటు మహిళందరికీ క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే!నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారుతాజాగా ఈ వివాదంపై అన్షు స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ముందుగా మజాకా సినిమా టీజర్‌ (Mazaka Movie)ను ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలాకాలం తర్వాత మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు వస్తున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. త్రినాధరావు చేసిన వ్యాఖ్యల గురించి చాలా కథనాలు వస్తున్నాయి. నాకెన్నో సలహాలు, సూచనలిచ్చారుమీ అందరికీ చెప్పాలనుకుంటున్నదేంటంటే.. ఈ ప్రపంచంలోనే ఆయన చాలా మంచి వ్యక్తి. నన్ను తన ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు. తనపై నాకు చాలా గౌరవం ఉంది. మజాకా సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. త్రినాధ్‌ సర్‌తో కలిసి పని చేసినందుకు హ్యాపీగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వడానికి నాకు ఇంతకంటే మంచి దర్శకుడు దొరకరేమో! ఆయన నాకెన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. తనపై నాకు ప్రేమ, గౌరవం తప్ప ఎలాంటి కోపం లేదు. దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితే ఆపేయండి' అని కోరింది.(చదవండి: త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్‌.. ఘనంగా సీమంతం)రెండు దశాబ్దాల తర్వాత రీఎంట్రీహీరోయిన్‌ అన్షు అప్పట్లో వచ్చిన మన్మథుడు సినిమాలో అందంతో, అమాయకత్వంతో ఆకట్టుకుంది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమా చేసింది. పెళ్లి తర్వాత లండన్‌లోనే సెటిలైపోయి సినిమాలకు దూరంగా ఉంటోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మజాకా మూవీతో అన్షు రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో అన్షుతో పాటు సందీప్‌ కిషన్‌, రీతూ వర్మ, రావు రమేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ, డైలాగ్స్‌ ప్రసన్న కుమార్‌ బెజవాడ అందించగా త్రినాధ రావు దర్శకత్వం వహించాడు.టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అసభ్యకర వ్యాఖ్యలుఆదివారం (జనవరి 12న) మజాకా సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్‌ అన్షుపై నోరు జారాడు. మొదటగా ఆమెకు పెద్ద అభిమానిని అన్నట్లుగా ప్రసంగం మొదలుపెట్టిన ఈయన చివరకు వచ్చేసరికి మాత్రం ఆమె శరీరాకృతి గురించి అసభ్య వ్యాఖ్యలు చేశాడు. అన్షు సన్నగా ఉందని.. ఇలా ఉంటే సరిపోదు.. లావెక్కాలి.. అంటూ అసహ్యకరంగా మాట్లాడాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్‌ త్రినాధరావు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది. ఇక ఇదే ఈవెంట్‌లో హీరోయిన్‌ రీతూ వర్మ పేరు మర్చిపోయినట్లు నాటకం ఆడాడు త్రినాధరావు. దీనిపై కూడా నెట్టింట విమర్శలు వచ్చాయి. మజాకా సినిమా విషయానికి వస్తే ఇది వచ్చే నెల 21న విడుదల కానుంది.చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్‌ ఆగ్రహం

Centre Appoints Palle Gangareddy As National Turmeric Board Chairman5
జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి

సాక్షి,న్యూఢిల్లీ:జాతీయ పసుపు బోర్డు(Turmeric Board) ఛైర్మన్‌గా తెలంగాణ వాసి పల్లె గంగారెడ్డి(Palle Gangareddy) నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం(Central Government) సోమవారం(జనవరి 13) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పల్లె గంగారెడ్డి నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ వాసి. సంకక్రాంతి వేళ పసుపు రైతులకు శుభవార్త చెప్పేందుకే కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును నోటిఫై చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించడంపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ స్పందించారు. ఇది చాలా గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్‌ కేంద్రంగా మంగళవారం నుంచే పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అర్వింద్‌ తెలిపారు. గతంలో పసుపుబోర్డుపై నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ రాజకీయాలు నడిచాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పసుపు బోర్డు హామీతోనే బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల వరకు పసుపు బోర్డు కాకపోయినప్పటికీ స్పైసెస్‌ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ తిరిగి ధర్మపురి అర్వింద్‌ బీజేపీ తరపున ఎంపీగా గెలిచారు. ఎట్టకేలకు 2025లో సంక్రాంతి సందర్భంగా పసుపు బోర్డును కేంద్రం నోటిఫై చేసింది.

Madhya Pradesh Parashuram Board Interesting Announcement On Fertility6
నలుగురిని కంటే రూ.లక్ష బహుమతి: పరశురాం బోర్డు

భోపాల్‌:మధ్యప్రదేశ్‌(MadhyaPradesh)లో పరశురామ్‌ కల్యాణ్‌ బోర్డు(Parashuram Kalyan Board) ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. తమ సామాజికవర్గాన్ని పెంచుకునేందుకు బ్రాహ్మణులు ఎక్కువ మంది పిల్లలను కనాలిని పిలుపునిచ్చింది. సోమవారం(జనవరి13) జరిగిన ఓ కార్యక్రమంలో పరశురామ్‌ కల్యాణ్‌ బోర్డు అధ్యక్షుడు పండిత్‌ విష్ణు రాజోరియా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.మనం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం లేదని,ఈ మధ్య యువత ఒక బిడ్డతో సరిపెడుతున్నారన్నారు. ఇది చాలా సమస్యాత్మకంగా మారిందన్నారు. భవిష్యత్‌ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదేనన్నారు. అందుకే కనీసం నలుగురు సంతానం ఉండాలని పిలుపునిచ్చారు.నలుగురు పిల్లల్ని కనే మహిళలకు బోర్డు తరఫున రూ.లక్ష నజరానా అందిస్తామని ప్రకటించారు.తాను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగుతుందని రాజోరియా స్పష్టం చేశారు.రాజోరియా చేసిన ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఇంటి నుంచే కుంభమేళా స్నానం..ఎలాగంటే..

Will Black Boxes Of New Technology Solve Problems Over Plane Crashes7
‘నల్ల పెట్టె’ మౌనరాగం!

బ్లాక్ బాక్స్... చూసేందుకు నల్ల రంగులో ఉండదు. ‘డెత్ కోడ్’ను రహస్యంగా తనలో దాచుకుంటుంది. ఈ బాక్స్ ఒకటి కూడా కాదు. నిజానికి రెండు పెట్టెలు! విమానం కూలిపోతే అందరి కళ్లూ దానికోసమే చూస్తాయి. రికవరీ బృందాలు దాని వేటలో నిమగ్నమవుతాయి. అది దొరికితే చాలు... ప్రమాద కారణాలు తెలిసినట్టే. ఆ తప్పులు, లోపాలు పునరావృతమవకుండా జాగ్రత్తపడితే భవిష్యత్ ప్రమాదాలను నివారించవచ్చు. విమానయానాన్ని అందరికీ సురక్షితం చేయవచ్చు.గాలిలో ప్రయాణం గాలిలో దీపం. రన్ వే మీది నుంచి పైకి ఎగిరిన విమానం మళ్లీ క్షేమంగా కిందికి దిగేదాకా టెన్షనే. వైమానిక దుర్ఘటనలకు కారణాలు తెలియాలంటే, కచ్చితమైన ఆధారాలు కనుగొనాలంటే తొలుత దాని బ్లాక్ బాక్స్ పరిశోధకుల చేతికి చిక్కాలి. అందుకే దర్యాప్తు సంస్థలు ముందుగా దాని అన్వేషణ కోసం రంగంలోకి దిగుతాయి. బ్లాక్ బాక్స్ వాస్తవానికి రెండు భాగాలు. అవి ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్). వీటిని ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. బ్లాక్ బాక్స్ పేరుకు తగ్గట్టుగా ఇవి నల్ల రంగులో ఉండవు! ప్రమాద స్థలిలో సులభంగా గుర్తుపట్టగలిగేలా ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగులో ఉంటాయి.విమానం కూలిపోయినప్పుడు ఆ నష్ట ప్రభావం దాని తోకభాగంపై స్వల్పంగా పడుతుంది. అందుకే కీలక డేటా నిక్షిప్తమైన బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా దాన్ని విమానం తోక భాగంలో అమర్చుతారు. సెకన్ల వ్యవధిలో ఎఫ్డీఆర్ దాదాపు వెయ్యి పరామితులను నమోదు చేస్తుంది. ప్రమాద సమయంలో విమానం ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ఎగురుతోంది? ఇంజిన్ పనితీరు ఎలా ఉంది? ప్రయాణ మార్గం, దిశ వంటి వివరాలను అది నమోదు చేస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రానికి పైలట్లు పంపిన, స్వీకరించిన సమాచారమేంటి? పైలట్ల సంభాషణలు, విమానంలోని కాక్పిట్ శబ్దాలు వంటి వివరాలను సీవీఆర్ రికార్డు చేస్తుంది.విమాన ప్రమాదాలకు దారితీసిన కారణాలేమిటి? దుర్ఘటన చివరి నిమిషాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయి? అనే వివరాలను బ్లాక్ బాక్స్ మాత్రమే వెల్లడించగలదు. ఫ్లైట్ రికార్డర్ల డేటాను విశ్లేషించి ప్రమాద హేతువులపై పరిశోధకులు ఓ అంచనాకు వస్తారు. మరి దర్యాప్తులో ఇంత కీలకమైన ఈ ‘నల్ల పెట్టె’… తాను మాట్లాడబోనంటూ అప్పుడప్పుడు మొండికేస్తుంది. కావాల్సిన డేటా ఇవ్వకుండా మొరాయించి ఇన్వెస్టిగేటర్లను ముప్పుతిప్పలు పెడుతుంది. క్లిష్ట సమయాల్లో రహస్యాలు బయటికి చెప్పకుండా మూగనోము పడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘జెజు ఎయిర్’ విమానం గత నెల 29న కూలిపోయి ఇద్దరు మినహా 179 మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమానం కూలడానికి నాలుగు నిమిషాల ముందు నుంచే అందులోని ఫ్లైట్ రికార్డర్లు పనిచేయడం మానివేశాయి. దాంతో ఆ దుర్ఘటన దర్యాప్తు ప్రస్తుతం క్లిష్టంగా మారింది. దక్షిణ కొరియా విమానంలోని బ్లాక్ బాక్స్ ఎందుకు విఫలమైంది? బ్లాక్ బాక్సులు ఇలా విఫలమైన సందర్భాలు గతంలో ఉన్నాయా? అందుకు దారితీసే కారణాలేంటి? ఈ సమస్యను అధిగమించేదేలా? వివరాలు మీకోసం... వైఫల్యానికి కారణాలివీ...బ్లాక్ బాక్సులో భాగమైన రెండు ఫ్లైట్ రికార్డర్ల బరువు సుమారు 4.5 కిలోల దాకా ఉంటుంది. గురుత్వశక్తి కంటే 3,400 రెట్ల అధిక శక్తితో విమానం కూలుడు సంభవించినా బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతనూ కొంతసేపు భరించగలదు. విమానం సముద్రంలో కూలినా తానెక్కడున్నదీ తెలిపేలా హై పిచ్ శబ్దాలతో బ్లాక్ బాక్స్ 90 రోజులపాటు సంకేతాలు పంపగలదు. నీటిలో 20 వేల అడుగుల లోతులోనూ 30 రోజులు పనిచేయగలదు. దానిలోని కీలక డేటా, ఆడియో చెరిగిపోకుండా టెక్నీషియన్లు జాగ్రత్తగా వివరాలు సేకరిస్తారు. డేటాను డౌన్లోడ్ చేసుకుని కాపీ చేస్తారు. అనంతరం డేటాను డీకోడ్ చేసి గ్రాఫ్స్ రూపొందిస్తారు. సర్క్యూట్ పాడవటం, సెన్సర్లు విఫలమవడం తదితర సాంకేతిక అవరోధాలు, సాఫ్ట్వేర్ (Software) లోపాలు తలెత్తినప్పుడు బ్లాక్ బాక్సులు పనిచేయవు.ప్రమాద తీవ్రత విపరీతంగా ఉండి భౌతికంగా ధ్వంసమైనప్పుడు వాటిపై ఆశ వదిలేసుకోవాల్సిందే. విమాన సిబ్బంది ఉద్దేశపూర్వకంగా డీ-యాక్టివేట్ చేసినప్పుడు అవి పనిచేయడం మానివేస్తాయి. డేటా ఓవర్ లోడ్ (Overload) అయినప్పుడు కూడా అవి మొరాయిస్తాయి. కొన్ని పాత బ్లాక్ బాక్సుల్లో నిర్ణీత కాలం తర్వాత డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. ఫలితంగా వాటి నుంచి ఎలాంటి సమాచారం లభించదు. నిరుడు జనవరిలో అలస్కా ఎయిర్లైన్స్ (airlines) బోయింగ్ విమానం ప్రయాణ సమయంలో దాని తలుపు ఊడినప్పుడు (డోర్ ప్లగ్ బ్లో-అవుట్) సీవీఆర్ పూర్తిగా ఓవర్ రైట్ అయింది. దాని నుంచి డేటా లభ్యం కాలేదు. అత్యుష్ణ లేదా అత్యల్ప ఉష్ణోగ్రతలు, నీటిలో ఎక్కువ కాలం నానడం వల్ల కూడా ఫ్లైట్ రికార్డర్లు పాడవుతాయి. తేమ చేరుకుని సున్నిత భాగాల్లోని ఎక్విప్మెంట్ దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ కావడం, అత్యధిక ఎత్తుల్లోని పీడనం, పక్షులు ఢీకొనడం, పిడుగుపాట్లు వంటి వాటి వల్ల కూడా బ్లాక్ బాక్సులు పనిచేయకపోవచ్చు. పదేళ్లుగా జాడ లేని మలేసియా విమానం!ఫ్లైట్ రికార్డర్ల సామర్థ్యంపై కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. ఆవశ్యకత ఎంతో ఉన్నా ఖర్చు, పరిమితుల దృష్ట్యా వాటి సామర్థ్యం పెంపు అంశంలో కొంత జాప్యం సంభవిస్తోంది. అత్యవసర సందర్భాల్లో ఫ్లైట్ రికార్డర్లు పనిచేయాలంటే వాటికి విమానంలోని సాధారణ సిస్టమ్స్ నుంచి కాకుండా వేరే వ్యవస్థల నుంచి పవర్ సరఫరా తప్పనిసరి. విమానంలోని రెండు ఇంజిన్లూ విఫలమైనప్పుడు విమానం అంతటా ఎలక్ట్రికల్ పవర్ నిలిచిపోతుంది. 1999లో న్యూయార్క్ నుంచి కైరో వెళుతున్న ‘ఈజిప్ట్ ఎయిర్’ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి అందులోని 217 మంది మరణించారు. ఈ విమానంలో ఆన్బోర్డ్ (onboard) ఎలక్ట్రికల్ పవర్ ఆగిపోగానే ఫ్లైట్ రికార్డర్లు పనిచేయడం మానివేశాయి.విమానం లోపల సాధారణ అవసరాలకు సరఫరా అయ్యే కరెంటుపై ఆధారపడకుండా ఫ్లైట్ రికార్డర్లు మరో 10 నిమిషాలపాటు అదనంగా రికార్డింగ్ చేయడానికి వీలుగా ప్రత్యామ్నాయ బ్యాకప్ పవర్ ఏర్పాట్లు ఉండాలని సదరు ప్రమాదం దరిమిలా అమెరికా జాతీయ రవాణా సేఫ్టీ బోర్డు సిఫార్సు చేసింది. బ్లాక్ బాక్సులకు బ్యాకప్ బ్యాటరీలున్నా వాటి జీవితకాలం తక్కువ. ఆ బ్యాటరీలు కొన్ని సందర్భాల్లో పనిచేయవు. దక్షిణ కొరియా ‘జెజు ఎయిర్’ విమానంలోనూ విద్యుత్ వ్యవస్థ విఫలమవడంతో ఫ్లైట్ రికార్డర్లకు పవర్ అందక అవి పనిచేయడం మానివేసి ఉంటాయని భావిస్తున్నారు.ఇక సీవీఆర్ విషయానికొస్తే అది సాధారణంగా ఒక విడతలో గరిష్ఠంగా రెండు గంటలపాటు మాత్రమే రికార్డు చేయగలదు. ఆ రెండు గంటల్లో రికార్డయిన డేటానే అది రిపీట్ చేస్తుంది. ఈ రికార్డింగ్ నిడివిని 25 గంటలకు పెంచాలనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న డిమాండ్. ఇది ప్రస్తుతం కార్యరూపం దాలుస్తోంది. 2009లో ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 రియో డి జెనీరో (బ్రెజిల్) నుంచి ప్యారిస్ వెళుతూ నడి అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి విమానంలోని 228 మంది చనిపోయారు. ఇక మలేసియా ఎయిర్లైన్స్ (airlines) ఎంహెచ్ 370 ఫ్లైట్ వ్యధ... ఇప్పటికీ అంతు లేని కథ! 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ ప్రయాణిస్తూ అకస్మాత్తుగా రాడార్ తెర మీది నుంచి ఆ విమానం అదృశ్యమైంది.అందులోని 239 మందీ మరణించారని భావిస్తున్నారు. విమానం అలా ఎందుకు అదృశ్యమైందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. వైమానిక చరిత్రలో అదొక పెద్ద మిస్టరీ. ఆ విమానం ఏమైపోయిందో కనుక్కోవడానికి బోలెడు వ్యయమైంది. ఆ అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. ఆ విమానం దక్షిణ హిందూమహాసముద్రంలో కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దాని జాడ కనుగొనేందుకు అన్వేషణ పునః ప్రారంభించాలని మలేసియా తాజాగా నిర్ణయించింది. ‘ఎయిర్ ఫ్రాన్స్’ విమానం దుర్ఘటన దరిమిలా... మహాసముద్రాలను దాటి దూర ప్రయాణాలు చేసే ట్రాన్స్-ఓషనిక్ ఫ్లైట్స్ విషయంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల వాయిస్ డేటా రికార్డింగ్ ఉండాల్సిందేనని ఫ్రాన్స్ సిఫార్సు చేసింది.మలేసియా ఎయిర్లైన్స్ విమానం అదృశ్యంతో ఆ సిఫార్సుకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ దిశగా అమెరికా కూడా ముందడుగు వేసింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల రికార్డింగును తమ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రీ-ఆథరైజేషన్ చట్టంలో చేర్చింది అమెరికా. అయితే కొత్తగా తయారయ్యే విమానాల్లోనే ఈ మార్పులకు వీలవుతోంది. ఇప్పుడు తిరుగుతున్న చాలా విమానాల జీవిత కాలం 40-50 ఏళ్లు. పాత విమానాల్లో సీవీఆర్ రికార్డింగ్ వ్యవధి పెంపు సాధ్యపడటం లేదు.కొత్త టెక్నాలజీతో బ్లాక్ బాక్సులు!తాజా సవాళ్లు, మారిన సాంకేతికత నేపథ్యంలో అధునాతన రీతిలో సరికొత్త బ్లాక్ బాక్సులకు రూపకల్పన జరుగుతోంది. ఎక్కువ గంటల రికార్డింగ్, అధిక డేటా స్టోరేజి, బ్యాకప్ బ్యాటరీల జీవిత కాలం పెంపు వంటివి ఇందులోని ప్రధానాంశాలు. విమానాల కూలుళ్ల తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సమర్థంగా పనిచేసే బ్లాక్ బాక్సులూ రాబోతున్నాయి. విమానాలు సముద్రాల్లో కూలిపోయే మెరైన్ ప్రమాదాల్లో రికవరీ బృందాలు తక్కువ శ్రమతో సత్వరం బ్లాక్ బాక్సును గుర్తించేలా మెరుగుపరచిన ‘అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. దీంతోపాటు అతి ముఖ్యమైన రియల్ టైమ్ డేటాను గ్రౌండ్ స్టేషన్లకు ప్రసారం చేసే కొత్త డిజైన్లతో బ్లాక్ బాక్సులు రూపుదిద్దుకుంటున్నాయి. విమానానికి సంబంధించిన కీలక సమాచారం ఎప్పటికప్పుడు గ్రౌండ్ స్టేషనుకు చేరుతుంది కనుక ఒకవేళ ప్రమాదంలో బ్లాక్ బాక్స్ భౌతికంగా నాశనమైనా పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. - జమ్ముల శ్రీకాంత్

Brs Leader Harishrao Pressmeet On Telangana Government Schemes8
భట్టి విక్రమార్కకు హరీశ్‌రావు ఛాలెంజ్‌

సాక్షి,సంగారెడ్డి: కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ ఏమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం.రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని మోసం​ చేశారు. రుణమాఫీకి నవంబర్‌ 30న సీఎం రేవంత్‌ ఇచ్చిన చెక్కు ఏమైంది.వ్యవసాయ కూలీలకు రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సెంటు భూమి ఉన్నా ఇవ్వబోమంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తోందో పండుగకు ఊళ్లకు వెళ్లేవారు రైతులకు చెప్పాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వ పథకాలన్నీ మోసాలే. కాంగ్రెస్‌ మోసాలపై పోరాడాల్సిన సమయం వచ్చింది’అని హరీశ్‌రావు అన్నారు. భట్టి గోబెల్స్‌ను మించి పోతున్నారు: ఆయనకిదే నా ఛాలెంజ్‌..రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ రైతులను దగా చేస్తోందిసీఎం మాటలు కోటలు దాటుతున్నాయికానీ చేతలు గడప దాటడం లేదు2750 కోట్ల రూపాయలు చెక్కుని రుణమాఫీ కోసం నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చారుసీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు డమ్మీది కావచ్చు..లేదా దారి తప్పిపోయిందా..?రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దగాని ప్రజలు గమనించాలికేసీఆర్ రైతుల కడుపులో సల్ల కదలకుండా చూసుకుంటే 13 నెలల్లో సీఎం రేవంత్ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాడుకాంగ్రెస్ పథకాల తీరు అయితే ఎగవేతలు లేకపోతే కోతలురైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలికాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి... మనకి రావాల్సిన పథకాలు తీసుకుందాంఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే దళిత గిరిజన రైతుల పొట్ట కొట్టుడేనా..?కోటి మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికే పథకాన్ని ఇస్తామని చెబుతున్నారుమాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు, కూలీలకు క్షమాపణ చెప్పాలిగ్రామసభలు పెడితే మీపై కూలీలు తిరగబడతారు జాగ్రత్తఎకరం లోపు భూమి ఉన్నవారిని కూడా కూలీలుగా గుర్తించి వారికి రూ. 12 వేలు ఇవ్వాల్సిందేఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క గోబెల్స్ ని మించిపోతున్నారుపూటకో తీరుగా ఆయన మాట్లాడుతున్నారునిన్న నాగర్ కర్నూల్ లో బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు అని అంటున్నారుమేము మహబూబ్నగర్ జిల్లాలోనే 600 లక్షల ఎకరాలకు నిరిచ్చాంభట్టి వ్యాఖ్యలపై నేను బహిరంగ చర్చకు సిద్ధం...ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు

YS Jagan Extends Wishes To Sankranti Festival9
తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండుగ అంద‌రి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ తెలిపారు.వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌.. తెలుగువారి సంస్కృతి సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక సంక్రాంతి. ఈ పండుగ అంద‌రి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు చెప్పారు. తెలుగువారి సంస్కృతి సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక సంక్రాంతి. ఈ పండుగ అంద‌రి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 13, 2025

‘When will you add Delhis Jats to Centres OBC list Arvind Kejriwal asks10
మోదీ జీ.. వారిని ఎప్పుడు ఓబీసీల్లో చేరుస్తారో చెప్పండి?

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అటు ఆప్‌ ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీలు ఎక్కడా కూడా తగ్గడం లేదు. కౌంటర్‌కు రీ కౌంటర్‌ అన్నట్లు వారి ప్రచారం సాగుతోంది. రోజూ ఏదో కొత్త అంశంపై వీరి ప్రచారం జోరు సాగుతోంది. అయితే దీనిలో భాగంగా ప్రధాని మోదీకి లేఖాస్త్రం సంధించారు ఢిల్లీ మాజీ సీఎం, ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal). ఇందులో ఢిల్లీలోని జాట్‌ కమ్యూనిటీని కేంద్రం ఎప్పుడుఓబీసీ జాబితాలో చేరుస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు కేజ్రీవాల్‌,ఈ మేరకు ఒక సుదీర్ఘనమైన లేఖను ప్రధాని మోదీకి రాసినట్లు కేజ్రీవాల్‌ తెలిపారు. కేజ్రీవాల్‌ ‘ జాట్స్‌ కమ్యూనిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాం. కానీ కేంద్ర ప్రభుత్వం జాబితాలో వారిని ఇంకా ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఒకవేళ ఇలా చేస్తే రాజస్తాన్‌ నుంచే వచ్చే జాట్స్‌ ఢిల్లీ యూనివర్శటీల్లో అడ్మిషన్లు పొందడంతో పాటు, ఎయిమ్స్‌లో జాబ్స్‌కూ పొందవచ్చు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్మి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. కేవలం ఇది ఢిల్లీలోని జాట్స్‌కు మాత్రమే ఇలా ఉండకూడదు కదా? అని డిమాండ్‌ చేశారుమీరు ప్రామిస్‌ చేశారు.. మరిచిపోయారా?దేశంలోని జాట్స్‌ కమ్యూనిటీని ఓబీసీల్లో చేర్చుతామని మీరే ప్రామిస్‌ చేశారు. బీజేపీలో ఇద్దరు అగ్రనేతలు హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah), జాట్స్‌కు ప్రామిస్‌ చేశారు. వారిని కేంద్ర స్థాయిలో ఓబీసీల్లో చేర్చుతామని హామీలు అయితే ఇచ్చారు కానీ దాన్ని ఇంకా అమలు చేయలేదు. ఆ హామీ ఇంకా అసంపూర్ణంగానే ఉండిపోయింది’ అని ఆరోపించారు కేజ్రీవాల్‌మోదీ జీ, అమిత్‌ షాలను అడుగుతున్నా..ఈ హామీ ఇచ్చిన ప్రధాని మోదీని, అమిత్‌ షాలను అడుగుతున్నాను. జాట్స్‌ కమ్యూనిటీని ఎప్పుడు కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చుతారో చెప్పండి. ఈ విషయంలో జాట్‌ నాయకులు నన్ను కలిశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకూ నోరు మెదపకపోవడం వారు ఆగ్రహంతో ఉన్నారు. గత పదేళ్ల నుంచి తమకు అన్యాయం జరుగుతూనే ఉందని వారు ఆరోపిస్తున్నారు’ అని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.మీరు మురికివాడలను బాగు చేయండి..ఢిల్లీలో అన్ని మురికివాడల కంటే.. కేజ్రీవాల్‌ సీఎంగా ఉన్న సమయంలో నివసించిన శీష్‌ మహల్‌ టాయిలెట్ల ఖరీదే ఎక్కవంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్‌ తిప్పికొట్టారు. మీరు మురికివాడ(Delhi Slums)లను బాగు చేస్తే, తాను ఎన్నికల్ల్లో పోటీచేయనంటూ సవాల్‌ విసిరారు. ఢిల్లీలోని మురికివాడల కూల్చివేతలపై కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విరమించుకుంటానన్నారు.‘మీరు మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోండి. దీనిపై కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయండి. ఇళ్లు కోల్పోయిన మురికివాడ ప్రజలందరికీ అదే స్థలంలో ఇళ్లు నిర్మించండి. అప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ నా చాలెంజ్‌ మీరు స్వీకరిస్తారా? అని ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
NRI View all
title
Sankranti 2025 : జపాన్‌లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి వచ్చిందంటే ఊరా వాడా అంతా సంబరంగా జరుపుకుంటారు.

title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

Advertisement

వీడియోలు

Advertisement