Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Updates on YSRCP Agitation Poster Against Power Tariff Hike in AP1
‘హామీలు ఇచ్చి మర్చిపోవడం చంద్రబాబుకి అలవాటే’

సాక్షి,గుంటూరు : కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్‌ చార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.15,485 కోట్ల భారాన్ని మోపింది. ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పార్టీ నేతలు వైఎస్సార్‌సీపీ పోరుబాట పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం గుంటూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ‘విద్యుత్‌ చార్జీల బాదుడుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట’ పేరుతో పోస్టర్‌ను ఆవిష్కరించింది. పోస్టర్‌ ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, నూరి ఫాతిమాలు పాల్గొన్నారు. పోస్టర్‌ ఆవిష్కరణ అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాం. ఆరు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారని తాము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచమని చెప్పారు. ఛార్జీలు తగ్గిస్తామన్నారు. కానీ భారీ మొత్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచారు. రెండు నెలల్లో రూ. 15484 కోట్ల భారం మోపారు. కూటమి నేతలకు రాష్ట్ర ప్రజలకు శఠగోపం పెట్టారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం, ఎన్నికలకు ముందు హమీలివ్వడం.. ఆ తర్వాత వాటిని మర్చిపోవడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు.ప్రజలు అండగా వైఎస్సార్‌సీపీ పోరు బాట : భూమన వైఎస్సార్‌సీపీ పోరు బాట పోస్టర్‌ను ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. చంద్రబాబు ,పవన్ కళ్యాణలు ఎన్నికలకు ముందు విద్యుత్ భారాన్ని మోపమని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. రెండు విడతలగా 15 వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారం మోపారు. సూపర్ సిక్స్‌లో ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రతి నెలా డైవర్ట్ చేస్తున్నారు.ప్రతి పేదవాడి ఇంటికి 200యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపి, ధరలు పెంచి వారి నడ్డివిరుస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ ఉంటుంది. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ విధంగా పోరాటాలు చేశారో.. అదే విధంగా మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం.మూడు లక్షల కోట్లు రూపాయలు ప్రజలకు నేరుగా అందించిన ఘనత వైఎస్ జగన్‌దే. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపడతాం. డిసెంబర్ 27వ తేదీ విద్యుత్ కార్యాలయాల్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై వినతి పత్రాన్ని ఇస్తాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు.

Director Shyam Benegal Passed Away at age of 902
సినీ ఇండస్ట్రీలో విషాదం.. డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధుపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.శ్యామ్ బెనగల్ సినీ ప్రస్థానం1934 డిసెంబర్‌ 14న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ విద్యను అభ్యసించారు. ఆయన దర్శకత్వ ప్రతిభకుగానూ దాదాసాహెబ్ ఫాల్కే పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సినీ అత్యున్నత అవార్డులు అందుకున్నారు. 1976లో పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. అంకుర్ (1974) అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నిశాంత్ (1975), మంథన్ (1976), భూమిక, జునూన్ (1978), మండి (1983, త్రికాల్ (1985), అంతర్నాద్ (1991) లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.అనేక అవార్డులు- ప్రశంసలుదాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్-2005పద్మశ్రీ -1976పద్మ భూషణ్-1991ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం- 2003ఏఎన్నార్ జాతీయ ‍అవార్డ్-2013నిశాంత్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు -1976మంథన్ సినిమాకు ఉత్తమ జాతీయ చలనచిత్ర అవార్డు- 1977జునూన్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు -1980

Bangladesh Requests India to Send Sheikh Hasina Back to Dhaka3
‘షేక్‌ హసీనాను మాకు అప్పగించండి’

ఢాకా : మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్‌ యూనస్‌ నేృత్వంలోని బంగ్లాదేశ్‌ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. దీంతో ఇప్పటికే ఉన్న ఒప్పందం ప్రకారం షేక్‌ హసీనాను కేంద్రం బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా? లేదా అనేది చర్చాంశనీయంగా మారింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా షేక్‌ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోవడమే గాక.. దేశాన్ని వీడారు. ఆగస్టు 5 నుండి భారత్‌లోనే నివాసం ఉంటుంన్నారు. ఈ తరుణంలో హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్‌ యూనస్‌ నేృత్వంలోని బంగ్లాదేశ్‌ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. Bangladesh's foreign adviser #TouhidHossain says #Dhaka has sent #DiplomaticNote to New Delhi for extradition of deposed PM @SheikhHasinaW. @MEAIndia pic.twitter.com/30mm1EvVra— Upendrra Rai (@UpendrraRai) December 23, 2024 ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మాజీ ప్రధాని షేక్‌ హసీనాతో పాటు పలువురు మాజీ కేబినెట్‌ మంత్రులు, సలహాదారులుపై మారణ హోమం కేసులు నమోదు చేసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతుంది. తాజాగా, షేక్‌ హసీనాను విచారించేందుకు సిద్ధమైంది. భారత్‌లో ఉన్న ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించే దిశాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా ‘షేక్‌ హసీనాను తమకు అప్పగించాలని భారత్‌కు లేఖ రాసినట్లు బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. తౌహిద్‌ హుస్సేన్‌ ప్రకటనకు ముందు.. మద్యంతర ప్రభుత్వ సలహాదారు జహంగీర్‌ అలం మాట్లాడుతూ.. హసీనాను ఇక్కడికి(బంగ్లాదేశ్‌) తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తన కార్యాలయం లేఖ పంపిందని అన్నారు. ప్రస్తుతం, ప్రక్రియ కొనసాగుతుందని సూచించారు. అంతేకాదు బంగ్లాదేశ్‌,భారత్‌ల మధ్య అప్పగింత ఒప్పందం ఇప్పటికే ఉందని, ఆ ఒప్పందం ప్రకారం హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు తీసుకురావచ్చని ఆలం చెప్పారు. మహ్మద్‌ యూనిస్‌ హెచ్చరికలు బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశం వీడడంతో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వం వహిస్తున్నారు. తన నేతృత్వంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహ్మద్‌ యూనిస్‌.. మాజీ ప్రధాని షేక్‌ హసీనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జూలై-ఆగస్ట్‌లో జరిగిన ప్రతి హత్యకు మేము న్యాయం చేస్తాము. హత్యకు బాధ్యులైన వారిని విచారిస్తాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేశం వీడి భారత్‌కి వెళ్లిన హసీనా తిరిగి ఇక్కడికి రావాల్సిందే. శిక్షను అనుభవించాల్సిందేనని హెచ్చరించారు.

 Travis Head To Miss Boxing Day Test Due To Injury?4
ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. విధ్వంస‌క‌ర వీరుడు దూరం!?

మెల్‌బోర్న్ వేదిక‌గా డిసెంబ‌ర్ 26 నుంచి భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ త‌గిలే అవ‌కాశ‌ముంది. బాక్సింగ్ డే టెస్టుకు ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు ట్రావిస్ హెడ్ గాయం కార‌ణంగా దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది.హెడ్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. బ్రిస్బేన్‌​ వేదికగా జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ కుంటుతూ కన్పించాడు. అతడు భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్‌కు కూడా రాలేదు.అయితే కాసేపటికే వర్షం కారణంగా మ్యాచ్ డ్రా కావడంతో అతడు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. కాగా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. 30 ఏళ్ల హెడ్ నాలుగో టెస్టు కోసం ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్‌లో కూడా కన్పించలేదంట.అతడు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మంగళవారం ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గోనున్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తమ కథనంలో పేర్కొం‍ది. కాగా హెడ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి మూడు టెస్టుల్లో హెడ్ రెండు సెంచరీలు నమోదు చేశాడు.ఒకవేళ బాక్సింగ్‌​ డే టెస్టుకు హెడ్ దూరమైతే అసీస్‌కు నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మరోవైపు జోషల్ హాజిల్‌వుడ్ సైతం గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాక్‌ ఓపెనర్‌.. ప్రపం‍చంలోనే తొలి ప్లేయర్‌గా

Young Girl Falls Unconscious During Pawan kalyan Visit5
పవన్‌ పర్యటనలో అపశృతి!

సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన​్‌ కళ్యాణ్‌ పర్యటన సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. పవన్‌ రాకతో తోపులాట సందర్భంగా ఓ బాలిక సొమ్మసిల్లి కింద పడిపోయింది. దీంతో, వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సోమవారం కృష్ణా జిల్లాలోని గొడవర్రులో పర్యటించారు. ఈ సందర్బంగా గొడవర్రులో రోడ్డు నిర్మాణ పనులను పవన్‌ పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. తోపులాట కారణంగా అక్కడికి వచ్చిన ఓ బాలిక సొమ్మసిల్లి కింద పడిపోయింది. దీంతో, వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

BSNL launched three new services in Puducherry to enhance digital and entertainment access for its customers6
బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత సర్వీసులు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) పుదుచ్చేరిలోని తన వినియోగదారులకు ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. తన యూజర్లకు డిజిటల్, వినోద సేవలను మరింత చేరువ చేసేందుకు మూడు కొత్త సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపింది.మొబైల్ కోసం ఇంట్రానెట్ టీవీ (బీఐ టీవీ)ఓటీటీప్లే సహకారంతో బీఎస్ఎన్ఎల్ ప్రీమియం కంటెంట్‌తో సహా 300 లైవ్ టీవీ ఛానళ్లను మొబైల్ వినియోగదారులకు ఉచితంగా అందిస్తుంది. ఈ సర్వీసు స్థిరంగా స్ట్రీమింగ్ అయ్యేందుకు, ఎలాంటి అవాంతరాలు కలుగకుండా ఉండేందుకు బీఎస్ఎన్ఎల్ మొబైల్ ఇంట్రానెట్‌ను ఉపయోగిస్తుంది.నేషనల్ వై-ఫై రోమింగ్బీఎస్ఎన్ఎల్ మనడిపట్టు గ్రామంలో వై-ఫై రోమింగ్‌ను ప్రారంభించింది. ఈ గ్రామం భారతదేశంలో రెండో పూర్తి వై-ఫై వినియోగిస్తున్న గ్రామంగా ప్రసిద్ధి. బీఎస్ఎన్ఎల్ ఎఫ్‌టీటీహెచ్‌ చందాదారులు దేశవ్యాప్తంగా ఏదైనా బీఎస్ఎన్ఎల్ వై-ఫై హాట్‌స్పాట్‌ లేదా ఎఫ్‌టీటీహెచ్‌ కనెక్షన్ నుంచి ఇంటర్నెట్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్‌ పని చేయదు! కారణం..ఫైబర్ ఆధారిత ఇంట్రానెట్ టీవీ (ఐఎఫ్‌ టీవీ)బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ఐఎఫ్‌ టీవీ సర్వీస్‌ను పుదుచ్చేరిలో అందిస్తుంది. ఎఫ్‌టీటీహెచ్‌ చందాదారులకు 500కి పైగా లైవ్ టెలివిజన్ ఛానళ్లను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ ఛానళ్లు నిరంతరంగా, హై క్వాలిటీలో స్ట్రీమింగ్‌ అయ్యేలా సంస్థ చర్యలు తీసుకుంటుంది.

Sakshi Editorial On Central Election Commission7
పారదర్శకతకు పాతర

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహారశైలిపై, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియపై అనేక అనుమానాలు తలెత్తుతున్న వేళ... అవి మరింత పెరిగే ప్రమాదం తాజాగా తలెత్తింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్ని మారుస్తున్నట్టు కేంద్ర సర్కార్‌ శుక్రవారం ప్రకటించింది. నిబంధనల్లో సరికొత్త సవరణ వల్ల ఇకపై ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలనూ పరిశీలించే అవకాశం ప్రజలకు ఉండదు. సీసీ టీవీ, వెబ్‌కాస్టింగ్‌ ఫుటేజ్, అభ్యర్థుల వీడియో రికార్డింగుల లాంటి ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్లు ఇకపై అందుబాటులో ఉండవు. అదేమంటే, అలాంటివన్నిటినీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచితే వాటిని దుర్వినియోగం చేస్తారనీ, అసలు ఓటరు భద్రతకే ప్రమాదకరమనీ పాలక వర్గాల వాదన. సోషల్‌ మీడియా యుగంలో, పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్ల దృశ్యాలు విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అది వట్టి డొల్ల వాదనే. ఎన్నికల నిబంధనల్లో మార్పుపై దేశ వ్యాప్తంగా అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నది అందుకే!‘‘ఎన్నికకు సంబంధించిన మిగిలిన అన్ని పత్రాలనూ ప్రజాక్షేత్రంలో పరిశీలించేందుకు వీలుండాలి’’ అని 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్‌ 93(2)(ఎ) చెబుతోంది. దానికే ఇప్పుడు సవరణ చేశారు. ఈసీ సిఫార్సు మేరకు, కేంద్ర న్యాయశాఖ ఈ మార్పును నోటిఫై చేసింది. దాంతో, ఇప్పుడిక నిబంధనల్లో ప్రత్యేకంగా పేర్కొన్న పత్రాలను మాత్రమే జనం పరిశీలించవచ్చన్న మాట. అంతేకాదు... ఎన్నికల పత్రాలన్నిటినీ కోరినవారికి ఇవ్వాలంటూ ఈసీని ఇక కోర్టులు ఆదేశించడానికి వీలుండదు. చిత్రమేమంటే, ఇటీవలి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పోలింగ్‌ కేంద్రంలో పోలైన ఓట్లకు సంబంధించిన పత్రాల కాపీలు, సెక్యూరిటీ కెమెరాలోని ఫుటేజ్, వీడియోలను ఓ పిటిషనర్‌కు అందించాల్సిందిగా పంజాబ్‌ – హర్యానా హైకోర్ట్‌ సరిగ్గా ఈ నెల 9వ తేదీనే ఆదేశా లిచ్చింది. అక్టోబర్‌ నాటి ఎన్నికల్లో అభ్యర్థి కాదు గనక సదరు పిటిషనర్‌ ఆ పత్రాలు కోరరాదని ఈసీ వాదించింది. హైకోర్ట్‌ మాత్రం అభ్యర్థికైతే ఉచితంగా, ఇతరులకైతే రుసుముపై పత్రాలివ్వాలన్న పిటిషనర్‌ వాదనతో ఏకీభవించింది. కోర్టు ఆదేశాన్ని తప్పక పాటించాల్సిన పరిస్థితి. కానీ, తద్భిన్నంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని సవరించడం సహజంగానే చర్చనీయాంశమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తున్నప్పుడే, సామాన్య ఓటర్లకున్న తిరుగులేని సమాచార హక్కును సుప్రీమ్‌ కోర్ట్‌ నొక్కి వక్కాణించింది. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే వ్యక్తుల, సంస్థల వివరాలు తెలుసుకొనే హక్కు ప్రజలకుందని తేల్చి చెప్పింది. వివాదాస్పద బాండ్ల పథకాన్ని సమర్థించిన సర్కారుకు అది ఎదురుదెబ్బ. నిజానికి, ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, నిజాయతీలో రాజీకి తావు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అప్పుడే స్పష్టం చేసినట్టయింది. అయినా సరే, ప్రభుత్వం చెవికెక్కించుకోకుండా ఇప్పుడు ఈసీ సిఫార్సు పేరు చెబుతూ, నిబంధనల సవరణకు దిగడం ప్రజాస్వామ్యవాదులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఓటర్లే స్వయంగా తమ ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియా సాక్షిగా పంచుకుంటున్న రోజుల్లో సీసీ టీవీ దృశ్యాల పట్ల ఈసీ ఇంత హంగామా ఎందుకు చేస్తోందో అంతుపట్టదు. సీసీ టీవీ ఫుటేజ్‌ అందుబాటులో ఉంటే కృత్రిమ మేధతో దుర్వినియోగం చేసే ముప్పుందన్న ఈసీ వాదన కొంత నిజమైనా, డిజిటల్‌ యుగంలో అన్ని వీడియోలపై నిషేధం పెడతామా? సవాలుకు అది పరిష్కారం కాదు కదా!ఎన్నికల సంఘం సారథ్యంలో నిఖర్సుగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియ తాలూకు నైతిక నిష్ఠ శరవేగంగా హరించుకుపోతోందంటూ ప్రతిపక్షాలు అసలే గొంతు చించుకుంటున్న సమయంలో నిబంధనల్లో ఈ కొత్త సవరణలు చేయ డాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎన్నికల రికార్డులనూ, డేటాను ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంచాలన్న జ్ఞానోదయం హఠాత్తుగా పాలకులకూ, ఈసీకీ ఎందుకు కలిగినట్టు? జనం దృష్టి నుంచి ఏం దాచాలని చూస్తున్నారు? ప్రతిపక్షాలనే కాదు... పౌరులనూ వేధిస్తున్న ప్రశ్నలివి. పైగా విస్తృత స్థాయి చర్చ జరగకుండానే చేపట్టిన ఈ తొందరపాటు చర్య ఎన్నికల ప్రక్రియపై మరిన్ని అనుమానాలు పెంచేలా పరిణమిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో అది మరింత విషాదం. వాస్తవానికి భిన్న భౌగోళిక పరిస్థితులు, భాషలు, సంస్కృతులు, సమస్యలున్న సువిశాల దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియగా ఇన్నేళ్ళుగా విజయవంతంగా ఎన్నికలను నిర్వహిస్తూ రావడం గొప్పే. అందుకు మన రాజ్యాంగం ఏర్పరచిన సుస్థిర వ్యవస్థనూ, గత దశాబ్దాల్లో ఈసీ పాత్రనూ తప్పక ప్రశంసించాల్సిందే. కానీ ఏ ఎన్నికల ప్రక్రియకైనా పారదర్శకత ప్రాణాధారం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికీ అదే కీలకం. తీరా ఆ పారదర్శకతే ఇప్పుడు రానురానూ తగ్గుతూ పోతుంటే ఏమనాలి? ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకొనే మనం ఎటువైపు ప్రయాణిస్తున్నట్టు? అందులోనూ ఆంధ్రప్రదేశ్, హర్యానా సహా అనేక చోట్ల ఎన్నికల్లో ఈవీఎంలపై, వీవీప్యాట్లపై నీలినీడలు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో... ఈ తరహా కొత్త నిబంధనతో పాలకులు ఏ రకమైన సూచన ఇవ్వదలిచినట్టు? ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసం పాదుకొనాలంటే, ఈ సరికొత్త నిబంధనల మార్పును పునఃపరిశీలించాలి. స్వతంత్రంగా సాగాల్సిన ఈసీ పాలకుల చేతిలో మరబొమ్మగా మారిపోతున్నట్టు విమర్శలు పెల్లుబుకుతున్న సందర్భంలో అది అత్యవసరం.

Police Given Notices To Tollywood Hero Allu Arjun In Sandhya Theatre Tragedy8
అల్లు అర్జున్‌కు షాక్.. పోలీసుల నోటీసులు

సంధ్య థియేటర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులిచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ అరెస్ట్.. విడుదల..అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచల్‌ గూడ జైలుకు తరలించారు.మధ్యంతర బెయిల్..అయితే అల్లు అర్జున్‌ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ బన్నీ హైకోర్టును ఆశ్రయించారు. బన్నీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అరెస్ట్ అయిన రోజే నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మరుసటి ఉదయమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.(ఇది చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల సాయం)‍అసలే జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 చిత్రం విడుదలైంది. అయితే అంతకుముందు రోజే ఈ మూవీకి సంబంధించిన బెనిఫిట్ షోను ప్రదర్శించారు. ఈ షోను వీక్షించేందుకు అల్లు అర్జున్‌ తన భార్యతో కలిసి ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అదే సమయంలో అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు.

KCR and Harish Rao File Quash Petition in High Court9
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్‌ రావు క్వాష్ పిటిషన్లు

సాక్షి,హైదరాబాద్‌ : మాజీ సీఎం కేసీఆర్‌,మాజీ మంత్రి హరీష్‌ రావులు తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు పంపిన నోటీసుల్ని కొట్టివేయాలని కోరారు.మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలైంది. విచారణ చేపట్టిన కోర్టు ఈ ఏడాది జులై 10న కేసీఆర్‌, హరీశ్‌రావుకు నోటీసులు పంపింది. అయితే, ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో కేసీఆర్‌, హరీష్‌రావు తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.

 CISF Key Announcement On Parliament BJP MPs Issue10
పార్లమెంట్‌ వద్ద తోపులాటలో ఎంపీలకు గాయాలు.. CISF కీలక ప్రకటన

సాక్షి, ఢిల్లీ: ఇటీవల పార్లమెంట్‌ వద్ద బీజేపీ, కాంగ్రెస్‌ నిరసనల వేళ తోపులాట కారణంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఈ వ్యవహారంపై సీఐఎస్‌ఎఫ్‌(CISF) కీలక ప్రకటన చేసింది. ఆరోజున తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదని వెల్లడించింది. ఈ మేరకు సీఐఎస్‌ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీకాంత్ కిషోర్‌ తెలిపారు.పార్లమెంట్‌ వద్ద తోపులాట వ్యవహారంపై సీఐఎస్‌ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీకాంత్ కిషోర్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనలో సీఐఎస్‌ఎఫ్‌ నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదన్నారు. సెక్యూరిటీలో భాగంగా ఎలాంటి ఆయుధాల కూడా పార్లమెంట్‌ లోపలికి వెళ్లలేదు. ఈ ఘటనపై సీఐఎస్‌ఎఫ్‌ ఎలాంటి విచారణ జరపడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, పార్లమెంటు హౌస్‌ కాంప్లెక్స్‌ భద్రత బాధ్యతలు సీఐఎస్‌ఎఫ్‌ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. ఇటీవల బీఆర్‌ అంబేద్కర్‌పై అమిత్‌ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్‌ వద్ద కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ప్రతాప్‌ చంద్ర సారంగి మెట్లపై పడిపోయారు. దీంతో, ఆయనకు గాయమైంది. అనంతరం, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, తనను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ(Rahul gandhi) తోసేయడం వల్లే గాయపడ్డినట్టు ఆరోపించారు. ఈ ఘటన సందర్బంగా మరో బీజేపీ ఎంపీ ముకేశ్‌ రాజ్‌పుత్‌ కూడా గాయపడ్డారు.పరస్పరం పోలీసులకు ఫిర్యాదుపార్లమెంటు ఘటనలపై బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ ఎంపీలపై బీజేపీ బృందం డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా రాహుల్‌పై కేసు నమోదైంది. బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్‌ బృందం ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.ఉభయ సభల్లోనూ వాగ్వాదంఅంతకుముందు.. అంబేద్కర్‌పై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ఉభయ సభల్లో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇరు సభల్లో ప్రతిపక్ష సభ్యులు అమిత్‌ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
‘షేక్‌ హసీనాను మాకు అప్పగించండి’

ఢాకా : మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్‌

title
రష్యాలో సిరియా మాజీ అధ్యక్షుడికి బిగ్‌ షాక్‌

మాస్కో: తిరుబాటుదారులు సిరియాను స్వాధీనం చేసుకోవడంతో కుటుంబం

title
ఎయిర్‌ఇండియా విమానంలో ప్రయాణికుల బాహాబాహీ

న్యూఢిల్లీ:ఎయిర్‌ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్‌ర

title
‘అతడు ఏనాటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడు!’

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం వెనుక టెక్‌ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చ

title
బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. పది మంది దుర్మరణం

రియో డిజనీరో: బ్రెజిల్‌లో క్రిస్మస్‌ వేళ విషాద ఘటన జరిగింది.

NRI View all
title
ట్రంప్‌ ప్రభుత్వంలో మరో భారతీయ అమెరికన్‌కు చోటు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్..

title
విదేశాల్లోనూ ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మా­జీ ముఖ్యమంత

title
అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి

కమలాపూర్‌: హనుమకొండ జిల్లా కమలాప

title
యూఎస్‌ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..

చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

title
దేశ, విదేశాల్లో ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి

Advertisement

వీడియోలు

Advertisement