Kane Williamson
-
పాక్ బౌలర్ సూపర్ బాల్.. పాపం కేన్ మామ! ఐదేళ్ల తర్వాత?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్నతొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్( Kane Williamson) తీవ్ర నిరాశపరిచాడు. పాక్ పేసర్ నసీమ్ షా అద్బుతమైన బంతితో విలియమ్సన్‌ను బోల్తా కొట్టించాడు. అతడి దెబ్బకు కేన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. కివీస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన నసీమ్ షా.. తొలి బంతిని కేన్ మామకు బ్యాక్ ఆఫ్ ఎ-లెంగ్త్ డెలివరీగా ఆఫ్‌సైడ్ సంధించాడు. ఆ బంతిని విలియమ్సన్ బ్యాక్‌ఫుట్ నుండి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి పిచ్ అయిన వెంటనే అతడి బ్యాట్ ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ రిజ్వాన్ చేతికి వెళ్లింది. దీంతో కేన్ మామ హెడ్‌ను షేక్ చేస్తూ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా విలియమ్సన్ సింగిల్ డిజిట్ స్కోర్‌కు అవుట్ కావడం 2019 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.రవీంద్ర దూరం..కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్.. న్యూజిలాండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ ఓపెనర్ విల్ యంగ్(88 నాటౌట్) మాత్రం తన అద్బుతమైన ఆటతీరుతో కివీ స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.29 ఓవర్లకు న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఇక ఈ టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన ట్రైసిరీస్‌లో గాయపడిన కివీస్ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర ఇంక పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.దీంతో అతడు తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఫఖార్ జమాన్ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో అతడి తొడ కండరాలు పట్టేశాడు. దీంతో అతడు ఆట మధ్యలోనే ఫీల్డ్‌ను వీడి బయటకు వెళ్లిపోయాడు.తుదిజట్లుపాకిస్తాన్ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీ WHAT A BALL FROM NASEEM SHAH ⚡⚡ pic.twitter.com/ghHOFkiSlU— Johns. (@CricCrazyJohns) February 19, 2025 -
కౌంటీల్లో ఆడనున్న కేన్ మామ
లండన్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కౌంటీ జట్టు మిడిలెసెక్స్‌తో జతకట్టాడు. ఇంగ్లండ్ దేశవాళీ టి20 కౌంటీ చాంపియన్‌షిప్ ఆడేందుకు రెండేళ్ల పాటు మిడిలెసెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌లో జరిగే ఫ్రాంచైజీ లీగ్ ‘ది హండ్రెడ్ టోర్నీలో లండన్ స్పిరిట్‌కు కివీస్ దిగ్గజం సారథ్యం వహిస్తున్నాడు. గతంలో టి20 కౌంటీ చాంపియన్‌షిప్‌లో గ్లూసెస్టర్‌షైర్ (2011–12), యార్క్‌షైర్ (2013–2018)కు ప్రాతినిధ్యం వహించాడు. తాజా సీజన్లో బ్లాస్ట్ గ్రూప్‌లో మిడిలెసెక్స్ తరఫున కనీసం పది మ్యాచ్‌లు ఆడనున్నాడు. అనంతరం మరో ఐదు కౌంటీ చాంపియన్‌షిప్ మ్యాచ్‌ల్లోనూ విలియమ్సన్ బరిలోకి దిగుతాడు.‘గతంలో అడపాదడపా కౌంటీలు ఆడాను. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో సీజన్‌కు అందుబాటులో ఉంటాను’ అని అన్నాడు. ఈ వెటరన్ బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 18,000 పైచిలుకు పరుగులు చేశాడు. 47 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 54.88, వన్డేల్లో 49.65, టి20ల్లో 33.44 సగటు నమోదు చేశాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్ ప్రాతినిధ్యం వహించిన విలియమ్సన్ కరీబియన్ లీగ్‌లో బార్బడోస్ ట్రిడెంట్స్, ఎస్ఏ–20 (సఫారీ లీగ్)లో డర్బన్ సూపర్‌జెయింట్స్ తరఫున బరిలోకి దిగాడు. ఈ సీజన్లో కరాచీ కింగ్స్ జట్టుతో జతకట్టిన కేన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ ఆడనున్నాడు. -
విలియమ్సన్ వీరోచితం
లాహోర్: ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో రెండు వరుస విజయాలతో న్యూజిలాండ్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి పోరులో ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ను చిత్తు చేసిన కివీస్ రెండో లీగ్ మ్యాచ్‌లో సఫారీలను ఓడించింది. సోమవారం జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తోనే వన్డేల్లో అరంగేట్రం చేసిన మాథ్యూ బ్రీజ్కీ (148 బంతుల్లో 150; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకంతో చెలరేగాడు. కెరీర్ తొలి వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా బ్రీజ్కీ ఘనత సాధించాడు. వియాన్ ముల్డర్ (60 బంతుల్లో 64; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, జేసన్ స్మిత్ (51 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 308 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేన్ విలియమ్సన్ (113 బంతుల్లో 133 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు సెంచరీ సాధించగా... ఓపెనర్ డెవాన్ కాన్వే (107 బంతుల్లో 97; 9 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో చేజార్చుకున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 187 పరుగులు జోడించారు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత విలియమ్సన్కు ఇదే మొదటి శతకం కావడం విశేషం. దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు వన్డేల్లో ఇది వరుసగా ఐదో ఓటమి. బ్రీజ్కీతో పాటు మరో ముగ్గురు బౌలర్లు ఈథన్ బాష్, సెనురాన్ ముత్తుసామి, మిహ్లాలి ఎంపొంగ్వానా ఇదే వన్డేతో అరంగేట్రం చేశారు. దాంతో జట్టు బౌలింగ్ బలహీనంగా మారిపోయింది. బుధవారం పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ ఫలితం తర్వాత న్యూజిలాండ్‌తో ఫైనల్లో తలపడే జట్టేదో తేలుతుంది. 150: దక్షిణాఫ్రికా క్రికెటర్ మాథ్యూ బ్రీజ్కీ అరంగేట్రం వన్డేలో చేసిన స్కోరు. ఆడిన తొలి వన్డేలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా బ్రీజ్కీ నిలిచాడు. 47 ఏళ్లుగా వెస్టిండీస్ ప్లేయర్ డెస్మండ్ హేన్స్ పేరిట ఉన్న రికార్డును బ్రీజ్కీ బద్దలు కొట్టాడు. 1978లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో హేన్స్ 148 పరుగులు సాధించాడు. 4: బరిలో దిగిన తొలి వన్డేలోనే సెంచరీ చేసిన నాలుగో దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా బ్రీజ్కీ గుర్తింపు పొందాడు. గతంలో కొలిన్ ఇంగ్రామ్ (124; జింబాబ్వేపై 2010లో), తెంబా బవూమా (113; ఐర్లాండ్‌పై 2016లో), రీజా హెన్డ్రిక్స్ (102; శ్రీలంకపై 2018లో) ఈ ఘనత సాధించారు. 2: దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన క్రమంలో న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్‌లలో 7 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా విలియమ్సన్ (159 ఇన్నింగ్స్) నిలిచాడు. ఈ జాబితాలో హాషిమ్ ఆమ్లా (150 ఇన్నింగ్స్) తొలి స్థానంలో ఉన్నాడు. -
SA Vs NZ: చరిత్ర సృష్టించిన విలియమ్సన్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్(Kane Williamson) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కివీస్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా మక్కోణపు సిరీస్‌లో తలపడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన కేన్ మామ.. సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.టీ20 తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విలియమ్సన్ కేవలం 72 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇది విలియమ్సన్కు ఐదేళ్ల తర్వాత వచ్చిన వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా 113 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్.. 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డెవాన్ కాన్వే(97) కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో 305 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.4 ఓవర్లలో చేధించింది.అంతకుమందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. అతడితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఓ రూర్క్ తలా రెండు వికెట్లు పడగొట్టగా..బ్రాస్‌వెల్ ఓ వికెట్ సాధించాడు.చరిత్ర సృష్టించిన విలియమ్సన్..ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు అందుకున్న రెండో బ్యాటర్‌గా విలియమ్సన్ రికార్డులకెక్కాడు. 159 ఇన్నింగ్స్‌లలో కేన్ ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విరాట్ కోహ్లి(161 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును విలియమ్సన్ బ్రేక్ చేశాడు. అయితే కివీస్ తరపున ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్ మాత్రం కేన్ మామనే కావడం విశేషం.వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు1. హషీమ్ ఆమ్లా: 150 ఇన్నింగ్స్‌లు2. కేన్ విలియమ్సన్: 159 ఇన్నింగ్స్‌లు3. విరాట్ కోహ్లీ: 161 ఇన్నింగ్స్‌లు4. ఏబీ డివిలియర్స్: 166 ఇన్నింగ్స్‌లు5. సౌరవ్ గంగూలీ: 174 ఇన్నింగ్స్‌లు -
విలియమ్సన్ విధ్వంసం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముంగిట పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ అదరగొడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా లహోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.305 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.4 ఓవర్లలో చేధించింది. ఈ భారీ లక్ష్య చేధనలో బ్లాక్ క్యాప్స్ ఆరంభంలోనే ఓపెనర్ విల్ యంగ్(19) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్(Kane Williamson) కాన్వేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.వీరిద్దరూ రెండో వికెట్‌కు 187 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విలియమ్సన్(113 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. డెవాన్ కాన్వే(97) తృటిలో శతకం సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సేనురన్ ముత్తుసామి రెండు వికెట్లు పడగొట్టగా.. బాష్, ముల్డర్ తలా వికెట్ సాధించారు.మాథ్యూ బ్రీట్జ్కే విధ్వంసకర సెంచరీఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు.తద్వారా అరంగేట్రంలో 150 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతడితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఓ రూర్క్ తలా రెండు వికెట్లు పడగొట్టగా..బ్రాస్‌వెల్ ఓ వికెట్ సాధించాడు. కాగా ఈ సిరీస్‌లో కివీస్‌కు ఇదే రెండో విజయం. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 78 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది.చదవండి: ఆసీస్, భారత్, ఇంగ్లండ్ కాదు.. ఆ జట్టు చాలా డేంజరస్: రవి శాస్త్రి -
సౌతాఫ్రికాతో మ్యాచ్.. కేన్ మామ సూపర్ సెంచరీ! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు పాకిస్తాన్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాక్ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా సోమవారం రెండో మ్యాచ్‌లో లహోర్ వేదికగా న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన విలియమ్సన్ టీ20 తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. కేన్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచే తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఈ క్రమంలో కేవలం 72 బంతుల్లోనే తన 14వ వన్డే సెంచరీని కేన్ మామ అందుకున్నాడు.అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 11 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాకుండా 305 పరుగుల లక్ష్య చేధనలో డెవాన్ కాన్వేతో కలిసి 187 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని విలియమ్సన్ నెలకొల్పాడు. ప్రస్తుతం కేన్ 103 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. బ్లాక్ క్యాప్స్ విజయానికి 85 బంతుల్లో 68 పరుగులు కావాలి.విలియమ్సన్ అరుదైన రికార్డు..ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన విలియమ్సన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డును విలియమ్సన్ సమం చేశాడు. ఏబీడీ తన కెరీర్లో 420 మ్యాచ్‌లు ఆడి 47 సెంచరీలు నమోదు చేయగా.. విలియమ్సన్ కూడా ఇప్పటివరకు 47 శతకాలు నమోదు చేశాడు.కేన్ మరో సెంచరీ సాధిస్తే డివిలియర్స్‌ను అధిగమిస్తాడు. అదే విధంగా విదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో న్యూజిలాండ్ ప్లేయర్‌గా కేన్ నిలిచాడు. విలియమ్సన్ ఇప్పటివరకు విదేశాల్లో 6 వన్డే సెంచరీలు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ గప్టిల్(7) ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా కివీస్ తరపున అత్యధిక వన్డే సెంచరీలు జాబితాలో విలియమ్సన్ నాలుగో స్ధానంలో నిలిచాడు. ఈ లిస్ట్‌లో కివీ దిగ్గజం రాస్ టేలర్(21) ఉన్నాడు.మాథ్యూ బ్రీట్జ్కే విధ్వంసం.. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. తద్వారా అరంగేట్రంలో 150 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతడితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. Kane Williamson gets to his 14th ODI century off 72 balls! 💯#3Nations1Trophy | #NZvSA pic.twitter.com/e90S4QNieI— Pakistan Cricket (@TheRealPCB) February 10, 2025 -
తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే!.. టీమిండియా నుంచి ఎవరంటే?
క్రికెట్ ప్రపంచంలో ‘ఫ్యాబ్ ఫోర్’గా విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు పేరుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ నలుగురు బ్యాటర్లు తమదైన ముద్ర వేశారు. టీమిండియా ముఖ చిత్రమైన కోహ్లి ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించడంతో పాటు.. శతకాల విషయంలో సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.సెంచరీల మెషీన్వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు సాధించిన రన్‌మెషీన్.. ఇప్పటికే సచిన్ టెండుల్కర్(49) రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధికసార్లు వంద పరుగులు అందుకున్న క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో 30, టీ20లలో ఒక శతకం సాధించాడు కోహ్లి. కెప్టెన్‌గా భారత్‌కు టెస్టు ఫార్మాట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అద్భుతమైన గణాంకాలుమరోవైపు.. ఆస్ట్రేలియా సారథిగా పనిచేసిన స్టీవ్ స్మిత్.. బ్యాటర్‌గా అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. 114 టెస్టుల్లో 34 సెంచరీల సాయంతో 9999, 165 వన్డేల్లో పన్నెండుసార్లు శతక్కొట్టి 5662, 67 టీ20లలో 1094 పరుగులు సాధించాడు.టెస్టుల్లో తనకు తానే సాటి ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో తనకు తానే సాటి అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు 152 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రూట్.. 36 సెంచరీల సాయంతో 12972 పరుగులు సాధించాడు. అదే విధంగా 171 వన్డేల్లో 16 శతకాలు నమోదు చేసి 6522 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. 32 అంతర్జాతీయ టీ20లలో 893 రన్స్ చేశాడు.తొలిసారి ఆ ఐసీసీ ట్రోఫీ అందుకున్న నాయకుడుఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌కు తొలిసారి ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత కేన్ విలియమ్సన్‌కే దక్కుతుంది. అతడి కెప్టెన్సీలో 2019-21 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్‌ను కివీస్ జట్టు సొంతం చేసుకుంది. ఇక కేన్ మామ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటిదాకా 105 టెస్టుల్లో 33 శతకాలు బాది 9276 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 165 వన్డేల్లో 13 సెంచరీలు చేసి 6811 పరుగులు సాధించాడు. 93 టీ20లు ఆడి 2575 రన్స్ చేశాడు.నవతరం ఫ్యాబ్ ఫోర్ వీరేఇలా ఈ నలుగురు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని 2013లోనే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రోవే ఊహించాడు. అందుకే పుష్కరకాలం క్రితమే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు ‘ఫ్యాబ్ ఫోర్’(ఫ్యాబ్యులస్ ఫోర్)గా నామకరణం చేశాడు. క్రోవే ఉపయోగించిన ఈ పదం తర్వాతి కాలంలో బాగా పాపులర్ అయింది.తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుసేన్, మైకేల్ ఆర్థర్టన్ నవతరం ‘ఫ్యాబ్ ఫోర్’గా ఓ నలుగురు యువ క్రికెటర్ల పేర్లను చెప్పారు. అయితే, ఇందులో ఇద్దరి విషయంలో మాత్రమే నాసిర్ హుసేన్, ఆర్థర్టన్ ఏకాభిప్రాయానికి వచ్చారు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌తో పాటు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌లకు ఈ ఇద్దరూ ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చారు.నా దృష్టిలో ఆ నలుగురే..యశస్వి జైస్వాల్‌తో పాటు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్, పాకిస్తాన్ యువ తరంగం సయీమ్ ఆయుబ్ ఉంటాడని నాసిర్ హుసేన్ పేర్కొన్నాడు. అయితే, ఆర్థర్టన్ మాత్రం యశస్వి, హ్యారీ బ్రూక్‌లతో పాటు శ్రీలంక సంచలన క్రికెటర్ కమిందు మెండిస్, న్యూజిలాండ్ యంగ్ స్టార్ రచిన్ రవీంద్రలకు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చాడు.సూపర్ ఫామ్‌లో ఆ ఆరుగురుకాగా ఈ గతేడాది యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 1771 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలతో పాటు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక హ్యారీ బ్రూక్ 2024లో ఐదు సెంచరీలు, ఆరు ఫిఫ్టీల సాయంతో 1575 పరుగలు చేశాడు.ఇక కమిందు మెండిస్ 1458 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. ట్రవిస్ హెడ్ 1399, సయీమ్ ఆయుబ్ 1254 పరుగులు సాధించారు. ఇక రచిన్ రవీంద్ర రెండు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 1079 పరుగులు చేశాడు. టీమిండియాను న్యూజిలాండ్ టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీస్ చేసి చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. -
కేన్ విలియమ్సన్కు అవమానం
దిగ్గజ బ్యాటర్, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్కు అవమానం జరిగింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) డ్రాఫ్ట్‌లో కేన్ మామను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ప్లాటినమ్ డ్రాఫ్ట్‌లో కేన్ మరో 43 మంది స్టార్ ఆటగాళ్లతో కలిసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన కేన్‌ను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా ఎవరూ పట్టించుకోలేదు. కేన్ బరిలో నిలిచిన ప్లాటినమ్ డ్రాఫ్ట్ నుంచి 10 మంది ఆటగాళ్లను ఎంపిక చేసున్నాయి ఫ్రాంచైజీలు.అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో వార్నర్ అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో వార్నర్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 63.20 సగటున 142.34 స్ట్రయిక్‌రేట్‌తో 316 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత ఫామ్ కారణంగానే పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో వార్నర్‌కు మాంచి గిరాకీ ఉండింది.విలియమ్సన్ విషయానికొస్తే.. ఈ కివీస్ లెజెండ్ ఇటీవలి కాలంలో పెద్దగా టీ20లు ఆడింది లేదు. 2023లో ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడని కేన్.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ (2024) కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్, పీఎస్ఎల్లో కేన్ ఎంపిక కాకపోవడానికి అతని ఫిట్నెస్ కూడా ఓ కారణమే. ఇటీవలి కాలంలో కేన్ తరుచూ గాయాల బారిన పడుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉండి కూడా కేన్ పొట్టి ఫార్మాట్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో వేగం లేకపోవడం, భారీ షాట్లు ఆడలేకపోవడం కేన్‌కు ప్రధాన సమస్యలు.కేన్ ప్రైవేట్ లీగ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయినా అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పర్వాలేదనిపించాడు. కేన్ తన దేశం తరఫున 93 టీ20లు ఆడి 33.44 సగటున 2575 పరుగులు చేశాడు. కేన్‌ను ప్రైవేట్ లీగ్‌ల్లో ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోకపోవడానికి అతని వయసు మరో ప్రధాన కారణం. ప్రస్తుతం కేన్ మామ వయసు 34 ఏళ్లు.కేన్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో కేన్ డర్బన్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కేన్ అదరగొట్టాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్న పలువురు స్టార్ ఆటగాళ్లు..డేవిడ్ వార్నర్ (కరాచీ కింగ్స్)డారిల్ మిచెల్ (లాహోర్ ఖలందర్స్)మార్క్ చాప్మన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)మైఖేల్ బ్రేస్‌వెల్ (ముల్తాన్ సుల్తాన్స్)ఆడమ్ మిల్నే (కరాచీ కింగ్స్)ఫిన్ అలెన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)జేసన్ హోల్డర్ (ఇస్లామాబాద్ యునైటెడ్)ఆమెర్ జమాల్ (కరాచీ కింగ్స్) -
ఐపీఎల్ వద్దంది.. కట్ చేస్తే! అక్కడ కేన్ మామ విధ్వంసం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో డర్బన్ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. శుక్రవారం కింగ్స్‌మీడ్ వేదికగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో డర్బన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది.డర్బన్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్( 40 బంతుల్లో 60 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ బ్రైస్ పార్సన్స్ (28 బంతుల్లో 47), ఫినిషర్ వియాన్ మల్డర్ (19 బంతుల్లో 45 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.విధ్వంసకర ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. క్లాసెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.ప్రిటోరియా బౌలర్లలో ముత్తుసామి 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ ఒక్క వికెట్ సాధించారు.గుర్బాజ్ పోరాటం వృథా..అనంతరం 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ఓపెనర్లు రెహ్మానుల్లా గుర్బాజ్, విల్ జాక్స్అద్బుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 12 ఓవర్లలోనే 154 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.గుర్బాజ్(43 బంతుల్లో 89 పరుగులు, 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సెటిల్ అయిన విల్ జాక్స్(35 బంతుల్లో 64 పరుగులు, 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాచ్ డర్బన్ వైపు మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్లో ప్రిటోరియా విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా.. నవీన్ ఉల్హాక్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో క్యాపిటల్స్ లక్ష్య చేధనలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులకు పరిమితమైంది. డర్బన్ బౌలర్లలో నూర్ ఆహ్మద్, క్రిస్ వోక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. మహారాజ్, నవీన్ ఉల్హాక్ చెరో వికెట్ సాధించారు.ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్..కాగా ఈ మ్యాచ్‌తోనే న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అరంగేట్రం చేశాడు. కేన్ మామ డర్బన్ సూపర్ జెయింట్స్ తరపున తన అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే ఈ కివీస్టార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన విలియమ్సన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపలేదు.చదవండి: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..! హింట్ ఇచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ -
న్యూజిలాండ్ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్
న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల జట్ల (వన్డే, టీ20) ఫుల్ టైమ్ కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ న్యూజిలాండ్ అధికారికంగా ప్రకటించింది. సాంట్నర్.. కేన్ విలియమ్సన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడు. కేన్ మామ ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 32 ఏళ్ల సాంట్నర్ న్యూజిలాండ్ తరఫున 100కు పైగా వన్డేలు, టీ20లు ఆడాడు. సాంట్నర్ ఇప్పటికే 24 టీ20లు, 4 వన్డేల్లో న్యూజిలాండ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. న్యూజిలాండ్ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్ ప్రస్తానం ఈ నెలాఖరులో జరిగే శ్రీలంక సిరీస్‌తో మొదలవుతుంది. సమీప భవిష్యత్తులో న్యూజిలాండ్ బిజీ షెడ్యూల్ (పరిమిత ఓవర్ల సిరీస్‌లు) కలిగి ఉంది. శ్రీలంకతో సిరీస్‌ల అనంతరం పాక్‌తో కలిసి ట్రయాంగులర్ సిరీస్‌లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. దీని తర్వాత స్వదేశంలో పాక్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉంది.న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్‌గా ఎంపిక కావడంపై సాంట్నర్ స్పందిస్తూ.. ఇది చాలా గొప్ప గౌరవమని అన్నాడు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు న్యూజిలాండ్‌కు ఆడాలనేది తన కల అని చెప్పాడు. అలాంటిది ఏకంగా తన జట్టును ముందుండి నడిపించే అవకాశం రావడం అదృష్టమని తెలిపాడు. కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టడం సవాలుగా భావిస్తున్నానని అన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ రెడ్ బాల్ (టెస్ట్) కెప్టెన్‌గా టామ్ లాథమ్ కొనసాగనున్నాడు. -
ఇంగ్లండ్‌ను చిత్తు.. 423 పరుగుల తేడాతో కివీస్ భారీ విజయం
హామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 423 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ వైట్ వాష్ నుంచి కివీస్ తప్పించుకుంది. తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఇంగ్లండ్ 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.కాగా 658 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 234 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 4 వికెట్లు పడగొట్టగా.. మాట్ హెన్రీ, టిమ్ సౌథీ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాకబ్ బెతల్(76) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జో రూట్(54), అట్కినిసన్(43) పర్వాలేదన్పించారు.కేన్ మామ భారీ సెంచరీ.. అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 453 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన అధిక్యాన్ని జోడించి 657 పరుగుల భారీ లక్ష్యాన్ని పర్యాటక జట్టు ముందు కివీస్ ఉంచింది. కివీ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (204 బంతుల్లో 156; 20 ఫోర్లు, 1 సిక్స్) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.విలియమ్సన్తో పాటు రచిన్ రవీంద్ర (90 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్),డరైల్ మిచెల్ (84 బంతుల్లో 60; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), టామ్ బ్లండెల్ (55 బంతుల్లో 44; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాంట్నెర్ (38 బంతుల్లో 49; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెథెల్ 3 వికెట్లు తీయగా... బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. పాట్స్, అట్కిన్సన్, రూట్లకు ఒక్కో వికెట్ దక్కింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 143 పరుగుకే కుప్పకూలింది. కాగా ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ టిమ్ సౌథీ టెస్టు క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. -
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
హ్యామిల్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ ముందు న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. కేన్ విలియమ్సన్ (156) సెంచరీతో కదంతొక్కడంతో న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 453 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 658 పరుగులు చేయాలి.న్యూజిలాండ్ భారీ స్కోర్కేన్ విలియమ్సన్తో పాటు విల్ యంగ్ (60), డారిల్ మిచెల్ (60), రచిన్ రవీంద్ర (44), టామ్ బ్లండెల్ (44 నాటౌట్), మిచెల్ సాంట్నర్ (49) రాణించడంతో సెకెండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. విలియమ్సన్ ఔటైన తర్వాత న్యూజిలాండ్ టెయిలెండర్లు వేగంగా పరుగులు రాబట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేకబ్ బేతెల్ 3, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ చెరో 2, పాట్స్, అట్కిన్సన్, రూట్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ (4/48), విలియమ్ ఓరూర్కీ (3/33), మిచెల్ సాంట్నర్ (3/7) ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జాక్ క్రాలే (21), బెన్ డకెట్ (11), జేకబ్ బేతెల్ (12), ఓలీ పోప్ (24), బెన్ స్టోక్స్ (27) రెండంకెల స్కోర్లు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు ఆలౌటైంది. టామ్ లాథమ్ (63), సాంట్నర్ (76) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ (42), కేన్ విలియమ్సన్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో పాట్స్ 4, అట్కిన్సన్ 3, బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
NZ Vs ENG 3rd Test: చరిత్ర సృష్టించిన కేన్ మామ
హ్యామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. కేన్‌కు టెస్ట్‌ల్లో ఇది 33వ సెంచరీ. జేకబ్ బేతెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేన్ తన సెంచరీ మార్కును 137 బంతుల్లో అందుకున్నాడు. కేన్ సెంచరీలో 14 బౌండరీలు, ఓ సిక్సర్ ఉన్నాయి. కేన్ తన కెరీర్లో 105 టెస్ట్‌లు ఆడి 54.91 సగటున 33 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీల సాయంతో 9225 పరుగులు చేశాడు.చరిత్ర సృష్టించిన కేన్ మామఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో సెంచరీ చేసిన అనంతరం కేన్ మామ చరిత్ర సృష్టించాడు. ఒకే వేదికపై ఐదు వరుస సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేన్ హ్యామిల్టన్ గడ్డపై వరుసగా ఐదు టెస్ట్ సెంచరీలు చేశాడు. హ్యామిల్టన్‌లో కేన్ సగటు 97.69గా ఉంది. ఇక్కడ కేన్ 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1563 పరుగులు చేశాడు.ఒకే వేదికపై అత్యధిక సగటు కలిగిన రికార్డు క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. బ్రాడ్‌మన్ మెల్బోర్న్లో 128.53 సగటు కలిగి ఉన్నాడు. బ్రాడ్‌మన్ తర్వాత ఒకే వేదికపై అత్యధిక సగటు కలిగి రికార్డు వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో లక్ష్యణ్ సగటు 110.63గా ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. కేన్ మామ సెంచరీతో కదంతొక్కడంతో మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. మూడో రోజు టీ విరామం సమయానికి న్యూజిలాండ్ 478 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్కోర్ 274/4గా ఉంది. కేన్ విలియమ్సన్ (123), డారిల్ మిచెల్ (18) క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. రచిన్ రవీంద్ర (44) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. పాట్స్, అట్కిన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ (4/48), విలియమ్ ఓరూర్కీ (3/33), మిచెల్ సాంట్నర్ (3/7) ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.దీనికి ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (63), సాంట్నర్ (76) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ (42), కేన్ విలియమ్సన్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
చరిత్ర సృష్టించిన స్మిత్.. విలియమ్సన్, మార్క్‌వా రికార్డులు బద్దలు
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. స్మిత్‌కు ఇది 25 ఇన్నింగ్స్‌ల తర్వాత వచ్చిన టెస్టు సెంచరీ కావడం గమనార్హం.స్మిత్ చివరగా 2023 జూన్‌లో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై చివరి సెంచరీ సాధించాడు. మళ్లీ ఇప్పుడు దాదాపు ఏడాదిన్నర తర్వాత మూడెంకెల స్కోర్‌ను స్మిత్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 190 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 12 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. స్మిత్‌కు ఇది భారత్‌పై 10వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 33వ టెస్టు సెంచరీ. ఈ క్రమంలో స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.స్మిత్ అరుదైన రికార్డులు..టెస్టుల్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ స్టార్ జోరూట్ రికార్డును స్మిత్ సమం చేశాడు. రూట్ 55 ఇన్నింగ్స్‌లలో 10 సెంచరీలు నమోదు చేయగా... స్మిత్ 41 ఇన్నింగ్స్‌లలో పది శతకాలు సాధించాడు. అదే విధంగా ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో స్ధానానికి స్మిత్(33) ఎగబాకాడు. ఈ క్రమంలో మార్క్ వా(32)ను వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(41) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పదకుండో స్ధానంలో స్మిత్(33) కొనసాగుతున్నాడు. ఈ సెంచరీతో కేన్ విలియమ్సన్(32)ను స్మిత్ వెనక్కి నెట్టాడు. -
బ్యాడ్ లక్ అంటే కేన్ మామదే.. విచిత్రకర రీతిలో ఔట్! వీడియో
హామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విచిత్రకర రీతిలో విలియమ్సన్ తన వికెట్‌ను కోల్పోయాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత న్యూజిలాండ్‌ను బ్యాటింగ్ ఆహ్హనించింది. ఈ క్రమంలో ఓపెనర్లు విల్ యంగ్, టామ్ లాథమ్ తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం యంగ్ ఔటయ్యాక విలియమ్సన్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చాడు.కేన్ మామ ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. సరిగ్గా ఇదే సమయంలో ఇంగ్లండ్ పేసర్ మాథ్యూ పోట్స్ బౌలింగ్‌లో విలియమ్సన్ ఊహించని విధంగా ఔటయ్యాడు.ఏమి జరిగిందంటే?కివీస్ ఇన్నింగ్స్ 59 ఓవర్ వేసిన పోట్స్ చివరి బంతిని విలియమ్సన్కు ఇన్‌స్వింగర్‌గా సంధించాడు. ఆ బంతిని కేన్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బౌన్స్ అయ్యి స్టంప్స్ వైపు వెళ్తుండగా.. విలియమ్సన్ కాలితో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో కేన్ మామ అనుకోకుడా ఆ బంతిని స్టంప్స్‌పై కి నెట్టాడు. దీంతో స్టంప్స్ కిందపడిపోయి క్లీన్ బౌల్డ్‌గా విలియమ్సన్(44 పరుగులు) ఔటయ్యాడు. ఒక వేళ బంతిని విలియమ్సన్ కాలితో హిట్ చేయకపోయింటే, అది స్టంప్‌ల మీదుగా బౌన్స్ అయ్యి ఉండే అవకాశముంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసింది Bizarre dismissal of Kane Williamson.pic.twitter.com/OUbISifFj7— CricketGully (@thecricketgully) December 14, 2024 -
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. పట్టు బిగించిన ఇంగ్లండ్
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి కేవలం 155 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో డార్లీ మిచెల్(31 బ్యాటింగ్), నాథన్ స్మిత్(1) ఉన్నారు.కివీస్ ప్రస్తుతం 4 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. డార్లీ మిచెల్ ఏదైనా అద్బుతం చేస్తే తప్ప కివీస్ ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించలేదు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్(64) మరోసారి హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే, క్రిస్ వోక్స్ తలా మూడు వికెట్లు సాధించారు.అంతకుముందు అదేవిధంగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 499 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(171) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్(80), ఓలీ పోప్(77) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో ఇంగ్లండ్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 151 పరుగుల ఆధిక్యం లభించింది.చదవండి: IPL 2025: '23 ఏళ్లకే రూ. 40 కోట్లు సంపాదన.. అదే అతడిని దెబ్బతీసింది' -
చరిత్ర సృష్టించిన కేన్ విలియమ్సన్.. తొలి న్యూజిలాండ్ క్రికెటర్‌గా
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తన రీఎంట్రీలో సత్తా చాటాడు. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ విలియమ్సన్ అద్బుత ప్రదర్శన చేశాడు.తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేసిన కేన్ మామ.. రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేశాడు. ఈ క్రమంలో విలియమ్సన్ టెస్టు క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కేన్ సాధించిన రికార్డులు ఇవే..👉టెస్టుల్లో 9000 పరుగుల మార్క్‌ను దాటిన తొలి కివీ ఆటగాడిగా విలియమ్సన్ నిలిచాడు. ఇప్పటివరకు 103 టెస్టులు ఆడిన విలియమ్సన్.. 54.76 సగటుతో 9035* పరుగులు చేశాడు.👉టెస్టు క్రికెట్లో అత్యంతవేగంగా 9000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో క్రికెటర్‌గా యూనిస్ ఖాన్, కుమార్ సంగర్కర రికార్డును విలియమ్సన్ సమం చేశాడు. ఈ జాబితాలో ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్(99) తొలి స్ధానంలో ఉన్నాడు.ఆ తర్వాత స్ధానంలో బ్రియన్ లారా(101 మ్యాచ్‌లు) కొనసాగుతున్నాడు. అదేవిధంగా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి(116 మ్యాచ్‌లు), జోరూట్(106)లు కంటే విలియమ్సన్ ముందున్నాడు.చదవండి: IND vs AUS: టీమిండియాతో రెండు టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్ -
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్.. సెంచరీ చేజార్చుకున్న కేన్ మామ
క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో 33వ సెంచరీ మిస్ అయ్యాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టామ్ లాథమ్ 47, డెవాన్ కాన్వే 2, రచిన్ రవీంద్ర 34, డారిల్ మిచెల్ 19, టామ్ బ్లండెల్ 17, నాథన్ స్మిత్ 3, మ్యాట్ హెన్రీ 18 పరుగులు చేసి ఔట్ కాగా.. గ్లెన్ ఫిలిప్స్ (41), టిమ్ సౌథీ (10) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్, రచిన్ రవీంద్ర క్రీజ్‌లో ఉండగా న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే షోయబ్ బషీర్ స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను దెబ్బకొట్టాడు. కాగా, గాయం కారణంగా కేన్ విలియమ్సన్ భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను భారత్ 0-3 తేడాతో న్యూజిలాండ్‌కు కోల్పోయింది.ఆరేళ్లలో తొలిసారి..ఈ మ్యాచ్‌లో కేన్ సెంచరీ సాధిస్తాడని అంతా అనుకున్నారు. అయితే కేన్ అట్కిన్సన్ బౌలింగ్‌లో టెంప్టింగ్ షాట్ ఆడి జాక్ క్రాలే చేతికి చిక్కాడు. కేన్ 90ల్లో ఔట్ కావడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. విలియమ్సన్ తన చివరి టెస్ట్ సెంచరీని ఇదే ఏడాది ఫిబ్రవరిలో సౌతాఫ్రికాపై సాధించాడు. -
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కేన్ మామ వచ్చేశాడు! స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు టామ్ లాథమ్ సారథ్యం వహించనున్నాడు. ఇక స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.గజ్జ గాయం కారణంగా ఈ కివీ స్టార్ క్రికెటర్ భారత్ టెస్టులకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు గాయం నుంచి విలియమ్సన్ పూర్తిగా కోలుకోవడంతో ఇంగ్లీష్ జట్టుతో సిరీస్‌కు కివీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు.అదేవిధంగా బౌలింగ్ ఆల్‌రౌండర్ నాథన్ స్మిత్‌కు తొలిసారి కివీస్ టెస్టు జట్టులో చోటు దక్కింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడికి అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. స్మిత్ 114 ఫస్ట్-క్లాస్ వికెట్లతో పాటు 1919 పరుగులు కూడా సాధించాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.అజాజ్ పటేల్, సోధి దూరం!ఇక ఈ సిరీస్‌కు న్యూజిలాండ్ స్పిన్ ద్వయం అజాజ్ పటేల్, ఇష్ సోధిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. న్యూజిలాండ్‌లోని పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. దీంతో అక్కడి పరిస్థితులకు తగ్గట్టు ఐదుగురు ఫాస్ట్ బౌలర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు.జాకబ్ డఫీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. నవంబర్ 28 నుంచి క్రైస్ట్ చర్చ్ వేదికగా ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. కాగా భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.ఇంగ్లండ్ టెస్టులకు న్యూజిలాండ్ జట్టుటామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ (అన్ క్యాప్డ్), మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ , నాథన్ స్మిత్, టిమ్ సౌతీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్చదవండి: IND vs AUS: ఆసీస్‌తో టెస్టు సిరీస్.. టీమిండియాకు మరో భారీ షాక్ -
మూడో టెస్టుకు హర్షిత్
ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టెస్టు కోసం పేస్ బౌలర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. బుధవారం అతను జట్టుతో చేరతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ట్రావెలింగ్ రిజర్వ్‌లలో ఢిల్లీకి చెందిన హర్షిత్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రధాన జట్టులోకి రానున్నాడని సమాచారం. నవంబర్ 1 నుంచి భారత్, కివీస్ మధ్య మూడో టెస్టు వాంఖెడే మైదానంలో జరుగుతుంది. హర్షిత్‌కు ఇప్పటికే బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ఆ్రస్టేలియాకు వెళ్లే భారత టెస్టు టీమ్‌లో చోటు లభించింది. దానికి ముందు ఒక టెస్టులో అతడిని ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.కివీస్‌తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో మూడో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే హర్షిత్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టవచ్చు. బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లకు ఎంపికైనా... హర్షిత్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మంగళవారం అస్సాంతో ముగిసిన రంజీ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన హర్షిత్...ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 10 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 24.00 సగటుతో రాణా 43 వికెట్లు పడగొట్టాడు. విలియమ్సన్ దూరం వెలింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భారత్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేని అతను ఇప్పుడు మూడో టెస్టునుంచి తప్పుకున్నాడు. విలియమ్సన్ భారత్‌కు రావడం లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గాయం నుంచి కోలుకొని అతను ప్రస్తుతం రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అయితే ముందు జాగ్రత్తగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.సంచలన ప్రదర్శనతో కివీస్ ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో హడావిడిగా విలియమ్సన్‌ను బరిలోకి దించరాదని బోర్డు భావించింది. ఈ సిరీస్ తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. దాని కోసం విలియమ్సన్ పూర్తి స్థాయిలో ఫిట్‌గా అందుబాటులో ఉండాలనేదే ప్రధాన కారణం. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన తర్వాత స్వదేశానికి వెళ్లిన విలియమ్సన్ గాయం కారణంగా భారత గడ్డపై అడుగు పెట్టనే లేదు. -
టీమిండియాతో మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్
టీమిండియాతో మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. గాయం కారణంగానే విలియమ్సన్ తొలి రెండు టెస్ట్‌లకు కూడా దూరమయ్యాడు. వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ దృష్ట్యా విలియమ్సన్‌ను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంచామని కివీస్ మేనేజ్మెంట్ తెలిపింది. ప్రస్తుతం విలియమ్సన్ న్యూజిలాండ్‌లోనే రిహాబ్‌లో ఉన్నాడు. అతను మూడో టెస్ట్ కోసం భారత్‌కు రావడం లేదని కివీస్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోకి తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టెస్ట్ ముంబై వేదికగా నవంబర్ 1న ప్రారంభం కానుంది. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ విన్నర్ -
టీమిండియాతో రెండో టెస్టు.. న్యూజిలాండ్‌కు భారీ షాక్
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమైంది. ఆక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా జరగనున్న రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించి సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోవాలని కివీస్ భావిస్తోంది. అయితే సెకెండ్ టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ కేన్ విలియమన్స్ పుణే టెస్టుకు కూడా దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న విలియమ్సన్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. గత నెలలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో విలియమ్సన్కు తొడ కండరాలు పట్టేశాయి. అప్పటి నుంచి కేన్ మామ ఆటకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న ఈ కివీ స్టార్ బ్యాటర్ శరవేగంగా కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని బ్లాక్ క్యాప్స్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు."కేన్ విలియమ్సన్ ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అతడు బాగానే కోలుకుంటున్నాడు. కానీ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. కేన్ మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాను" అని స్టెడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఇక కివీస్ తొలి టెస్టులో ఆడిన జట్టునే పుణే టెస్టుకూ కొనసాగించే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs NZ: తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్ -
Ind vs NZ 2024: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరడమే లక్ష్యంగా టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన.. తదుపరి న్యూజిలాండ్‌తో పోరులోనూ ఇదే తరహా ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది.ఇక స్వదేశంలో ఈ టెస్టు సిరీస్ జరుగనుండటం టీమిండియాకు సానుకూలాంశం. మరోవైపు.. శ్రీలంక గడ్డపై టెస్టుల్లో 0-2తో వైట్‌వాష్ అయిన కివీస్ జట్టు.. భారత్‌లోనైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కివీస్ ఆరో స్థానంలో ఉంది.మరి ఇరుజట్లకు కీలకమైన ఈ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్, ఇరు జట్లు తదితర వివరాల గురించి తెలుసుకుందామా?!టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ 2024 టెస్టు సిరీస్👉తొలి టెస్టు: అక్టోబరు 16(బుధవారం)- అక్టోబరు 20(ఆదివారం), ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉రెండో టెస్టు: అక్టోబరు 24(గురువారం)- అక్టోబరు 28(సోమవారం), మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణె👉మూడో టెస్టు: నవంబరు 1(శుక్రవారం)- నవంబరు 5(మంగళవారం), వాంఖడే స్టేడియం, ముంబై.మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం.. మూడు టెస్టులు ఉదయం 9.30 - సాయంత్రం 5 గంటల వరకు.ఎక్కడ చూడవచ్చు?👉టీవీ: స్పోర్ట్స్ 18లో లైవ్ టెలికాస్ట్👉డిజిటల్ మీడియా: జియో సినిమా, వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం.న్యూజిలాండ్‌తో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.రిజర్వ్ ఆటగాళ్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.భారత్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ టీమ్డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, బెన్ సియర్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.చదవండి: W T20 WC: కథ మళ్లీ మొదటికి...𝗜𝗻𝗱𝗶𝗮 𝘃𝘀 𝗡𝗲𝘄 𝗭𝗲𝗮𝗹𝗮𝗻𝗱𝘛𝘩𝘦 𝘗𝘳𝘦𝘭𝘶𝘥𝘦 𝘣𝘺 𝘙 𝘈𝘴𝘩𝘸𝘪𝘯#TeamIndia 🇮🇳 is back in whites 🤍One sleep away from Test No.1#INDvNZ | @IDFCFIRSTBank | @ashwinravi99 pic.twitter.com/lzVQCrtaLh— BCCI (@BCCI) October 15, 2024 -
కోహ్లి కేవలం రెండు సెంచరీలు చేస్తే రూట్ ఏకంగా 18 సెంచరీలు బాదాడు..!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్లో తన డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తున్నాడు. రూట్ గత మూడేళ్ల కాలంలో 16 హాఫ్ సెంచరీలు, 18 సెంచరీల సాయంతో 4600 పైచిలుకు పరుగులు చేశాడు. 2021 నుంచి టెస్ట్‌ల్లో ఇన్ని సెంచరీలు కాని, ఇన్ని పరుగులు కాని ఏ ఆటగాడూ చేయలేదు.ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా చెప్పుకునే కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్ సైతం రూట్ చేసినన్ని సెంచరీలు కాని, పరుగులు కాని చేయలేకపోయారు. రూట్ తాజాగా పాక్‌పై సెంచరీ చేసి తన సెంచరీల సంఖ్యను 35కు పెంచుకున్నాడు.ఈ సెంచరీ అనంతరం సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర గణాంకం చక్కర్లు కొడుతుంది. 2021 ఆరంభంలో రూట్ కేవలం 17 సెంచరీలు మాత్రమే చేస్తే.. అప్పుడు కోహ్లి సెంచరీల సంఖ్య 27గా ఉండింది. అదే ఇప్పుడు (2024లో) టెస్ట్‌ల్లో కోహ్లి సెంచరీల సంఖ్య 29గా ఉంటే.. రూట్ సెంచరీల సంఖ్య ఏకంగా 35కు చేరుకుంది.ఈ ఫిగర్స్‌ను సగటు టీమిండియా అభిమాని జీర్ణించుకోలేనప్పటికీ ఇది నిజం. ఈ గణాంకాలను బట్టి చూస్తే రూట్ ఏ రేంజ్లో సెంచరీల మోత మోగిస్తున్నాడో ఇట్టే అర్దమవుతుంది. రూట్ ఈ మధ్యకాలంలో కోహ్లి ఒక్కడికే కాదు ఫాబ్లో మిగతా ఇద్దరికి (విలియమ్సన్, స్టీవ్ స్మిత్) కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.2021లో స్టీవ్ సెంచరీల సంఖ్య 26గా ఉంటే ప్రస్తుతం అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. 2021లో విలియమ్సన్ సెంచరీల సంఖ్య 24గా ఉంటే ఇప్పుడు అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. కోహ్లితో పోలిస్తే సెంచరీల విషయంలో విలియమ్సన్, స్టీవ్ స్మిత్ కాస్త మెగ్గానే కనిపిస్తున్నా, రూట్ ఈ ఇద్దరికి కూడా అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు.2021లో రూట్ సెంచరీలు-172024లో రూట్ సెంచరీలు-352021లో విలియమ్సన్ సెంచరీలు-242024లో విలియమ్సన్ సెంచరీలు-322021లో స్టీవ్ స్మిత్ సెంచరీలు-262024లో స్టీవ్ స్మిత్ సెంచరీలు-322021లో కోహ్లి సెంచరీలు-272024లో కోహ్లి సెంచరీలు-29చదవండి: PAK VS ENG 1st Test: అరివీర భయంకర ఫామ్‌లో జో రూట్.. మరో సెంచరీ -
IND Vs NZ: భారత్‌తో టెస్టు సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ దూరం
భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌లో కివీస్ జట్టు స్టార్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ నాయకత్వం వహించనున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఘోర ఓటమి అనంతరం టిమ్ సౌథీ బ్లాక్ క్యాప్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.అతడి స్ధానంలో లాథమ్ బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు బెంగళూరు వేదికగా జరిగే తొలి టెస్టుకు కివీ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా దూరమయ్యాడు. శ్రీలంక సిరీస్‌లో గజ్జ గాయానికి గురైన కేన్ మామ.. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. రెండో టెస్టు సమయానికి అతడు కోలుకునే ఛాన్స్ ఉంది. అదే విధంగా ఈ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ మార్క్ చాప్‌మన్‌కు సెలక్టర్లు చోటిచ్చారు. బ్లాక్ క్యాప్స్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తాచాటుతున్న చాప్మన్.. ఇప్పుడు టెస్టుల్లో అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ మైఖల్ బ్రేస్‌వెల్ కేవలం తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. తన భార్య బిడ్డకు జన్మనివ్వనుండడంతో బ్రేస్‌వెల్ తొలి టెస్టు అనంతరం న్యూజిలాండ్‌కు పయనం కానున్నాడు. ఆక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్-భారత మధ్య ఈ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (తొలి టెస్టుకు టెస్టు మాత్రమే), మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్చదవండి: PAK VS ENG 1st Test: చరిత్ర సృష్టించిన జో రూట్ -
శ్రీలంకతో తొలి టెస్టు.. పటిష్ట స్థితిలో న్యూజిలాండ్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ అదరగొడుతోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో లంక కంటే ఇంకా 50 పరుగులు వెనకంజలో ఉంది.క్రీజులో డార్లీ మిచెల్(41), బ్లాండెల్(18) పరుగులతో ఉన్నారు. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ టామ్ లాథమ్(70), కేన్ విలియమ్స్(55) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో దనుంజయ డి సిల్వా 2 వికెట్లు పడగొట్టగా.. మెండిస్, జయసూర్య తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 302/7 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మరో మూడు పరుగులు మాత్రమే జోడించి 305 పరుగులకు ఆలౌటైంది. లంక తొలి ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ (114) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 5 వికెట్లు పడగొట్టగా.. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ తలో రెండు, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు.చదవండి: IND vs BAN: చెపాక్‌లో చితక్కొట్టుడు.. అశ్విన్ సూపర్ సెంచరీ -
ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్.. కేన్ మామ ముందున్న భారీ రికార్డు
ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఇవాల్టి (సెప్టెంబర్ 9) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ క్రికెట్‌కు ఆతిథ్యమిచ్చే పరిస్థితులు లేకపోవడంతో భారత్ వారికి నోయిడా గ్రౌండ్‌ను హోం గ్రౌండ్‌గా ఆఫర్ చేసింది. ఈ వేదికపైనే ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇవాల్టి ఉదయమే ప్రారంభం కావాల్సి ఉన్నా.. తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఆలస్యమైంది. టాస్ కూడా ఇంకా పడలేదు. తుది జట్లను ప్రకటించాల్సి ఉంది.కాగా, ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో కేన్ మామ మరో 72 పరుగులు చేస్తే.. న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు (అన్ని ఫార్మాట్లలో) చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు రాస్ టేలర్ పేరిట ఉంది. రాస్ టేలర్ మూడు ఫార్మాట్లలో 450 మ్యాచ్‌లు ఆడి 18199 పరుగులు చేయగా.. కేన్ మామ 358 మ్యాచ్‌ల్లో 18128 పరుగులు చేశాడు. ప్రస్తుత తరం న్యూజిలాండ్ క్రికెటర్లలో కేన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.ఫాబ్ ఫోర్లో ప్రధముడిగా చెప్పుకునే కేన్ ఇటీవలి కాలంలో టెస్ట్‌ల్లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే 100వ టెస్ట్ ఆడిన కేన్.. తన చివరి 20 టెస్ట్‌ల్లో ఏకంగా 2267 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫాబ్ ఫోర్లో (జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి) ఎవరూ ఇన్ని పరుగులు చేయలేదు. కేన్‌కు మించి ఫామ్‌లో ఉన్న రూట్ సైతం గత 20 టెస్ట్‌ల్లో 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీ సాయంతో 1761 పరుగులే చేశాడు. ప్రస్తుతం కేన్ టెస్ట్‌ల్లో న్యూజిలాండ్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా (8743) ఉన్నాడు. -
Fab Four: ‘కోహ్లి కాదు.. అతడే నంబర్ వన్’
క్రికెట్ నవ యుగంలో తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లలో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ లెజండరీ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ముందు వరుసలో ఉంటారు. కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎనభై శతకాలతో సత్తా చాటగా.. టెస్టుల్లో రూట్ అత్యధిక పరుగుల జాబితాలో మున్ముందుకు దూసుకెళ్తున్నాడు.ఫ్యాబ్ ఫోర్లో బెస్ట్ ఎవరు?మరోవైపు స్మిత్, విలియమ్సన్ సైతం తమ మార్కును చూపిస్తూ తమ తమ జట్లను విజయపథంలో నిలుపుతున్నారు. అందుకే.. ఈ నలుగురిని కలిపి ‘ఫ్యాబ్ ఫోర్’గా పిలుచుకుంటారు క్రికెట్ ప్రేమికులు. అయితే, వీరిలో అత్యుత్తమ క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు మాత్రం ‘ఫ్యాబ్ ఫోర్’ అభిమానులు సైతం ఏకాభిప్రాయానికి రాలేరు.కోహ్లికి ఆఖరి ర్యాంకు ఇస్తాతాను కూడా అందుకు అతీతం కాదంటోంది ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ అలిసా హేలీ.‘ ఫ్యాబ్ ఫోర్’ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వారంతా గొప్ప బ్యాటర్లు. అయితే, వారికి ర్యాంకు ఇవ్వాలంటే మాత్రం నేను కోహ్లిని నాలుగో స్థానానికే పరిమితం చేస్తా. ఇది నేను సరదాకి చెప్తున్న మాట కాదు.మిగతా వాళ్లతో పోలిస్తేఅన్ని రకాలుగా విశ్లేషించిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నా. నిజానికి మిగతా ముగ్గురితో పోలిస్తే కోహ్లి చాలా ఎక్కువగా క్రికెట్ ఆడాడు. అందుకే అతడి గణాంకాలు కూడా ఉత్తమంగా ఉంటాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టి చూస్తే మాత్రం కోహ్లికి నంబర్ 1 రేటింగ్ ఇవ్వాల్సిందే’’ అని అలిసా హేలీ ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.అతడే నంబర్ వన్తన అభిప్రాయం ప్రకారం ఈ నలుగురిలో కేన్ విలియమ్సన్కు అగ్రస్థానం ఉంటుందని.. ఆ తర్వాతి స్థానాల్లో స్మిత్, రూట్, కోహ్లి ఉంటారని తెలిపింది. విలియమ్సన్ కారణంగా కివీస్ జట్టు మొత్తానికి పేరు వచ్చిందని.. అయితే, కోహ్లి ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్ మాత్రమేనని హేలీ పేర్కొంది. ఎనిమిదిసార్లు ప్రపంచకప్‌ను ముద్దాడిందిఅదే విధంగా.. టీమిండియా తరఫున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఆఖరికి రవీంద్ర జడేజా కూడా సెంచరీలు బాదగలరని.. అయితే.. జట్టు భారం మొత్తాన్ని మోయగల విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు కొంతమందే ఉంటారని అభిప్రాయపడింది.కాగా ఆస్ట్రేలియా మేటి బ్యాటర్‌గా ఎదిగిన అలిసా హేలీ ఆరుసార్లు టీ20 ప్రపంచకప్, రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్లలో సభ్యురాలు. అంతేకాదు.. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్లలో ఒకడైన మిచెల్ స్టార్క్ భార్య కూడా! చదవండి: Musheer Khan: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్! -
కేన్ విలియమ్సన్కు షాక్.. వరల్డ్ నంబర్ వన్‌గా రూట్
ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. కేన్ విలియమ్సన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రూట్.. మరోసారి నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్నాడు.సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తంగా 291 పరుగులతో రాణించిన రూట్.. ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో మొత్తంగా 872 రేటింగ్ పాయింట్లు సాధించి ప్రథమ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో మరోసారి వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచాడు.కాగా ఈ 33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ తొలిసారిగా 2015 ఆగష్టులో అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. గతేడాది కూడా మొదటి ర్యాంకు సంపాదించాడు. ఇక తాజా టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజం, డారిల్ మిచెల్, స్టీవెన్ స్మిత్ టాప్-5లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకులో నిలిచాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.ఐసీసీ మెన్స్ టెస్టు తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5 ప్లేయర్లు1. జో రూట్(ఇంగ్లండ్)- 872 రేటింగ్ పాయింట్లు2. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు3. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 768 రేటింగ్ పాయింట్లు4. డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు5. స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా)- 757 రేటింగ్ పాయింట్లు. -
ICC: అగ్రపీఠానికి చేరువైన రూట్.. భారీ జంప్ కొట్టిన బ్రూక్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు సత్తా చాటారు. వెటరన్ క్రికెటర్ జో రూట్ అగ్రస్థానానికి చేరువకాగా.. యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. అదే విధంగా.. బెన్ డకెట్ ఆరు స్థానాలు మెరుగుపరచుకుని టాప్-20(16వ ర్యాంకు)లో అడుగుపెట్టగా.. ఓలీ పోప్ 8 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకులో నిలిచాడు.విండీస్‌ను చిత్తు చేసిమూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడే నిమిత్తం వెస్టిండీస్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తూ 241 పరుగుల తేడాతో మట్టికరిపించింది.ఈ విజయంలో జో రూట్ కీలక పాత్ర పోషించాడు. కెరీర్లో 32వ టెస్టు సెంచరీ(122 రన్స్) నమోదు చేశాడు. ఫలితంగా 12 రేటింగ్ పాయింట్లు మెరుగుపరచుకున్న జో రూట్.. టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.అగ్రపీఠానికి చేరువైన రూట్నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ పీఠంపై కన్నేశాడు. మరో ఏడు రేటింగ్ పాయింట్లు సాధిస్తే రూట్ అగ్రస్థానానికి ఎగబాకుతాడు. విండీస్‌తో మిగిలి ఉన్న మూడో టెస్టులోనూ సత్తా చాటితే ఇదేమంత కష్టం కాదు.భారీ జంప్ కొట్టిన బ్రూక్ఇక 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ సైతం వెస్టిండీస్‌తో రెండో టెస్టులో సెంచరీ(109)తో కదంతొక్కాడు. ఈ క్రమంలో నాలుగు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు అందుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఆస్ట్రేలియా వెటరన్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్‌లను వెనక్కి నెట్టి టాప్-3లోకి దూసుకువచ్చాడు.కాగా ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ(7వ ర్యాంకు), అతడి ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్(8వ ర్యాంకు), విరాట్ కోహ్లి(10వ ర్యాంకు) టాప్-10లో కొనసాగుతున్నారు.ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే1. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు2. జో రూట్(ఇంగ్లండ్)- 852 రేటింగ్ పాయింట్లు3. హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- 771 రేటింగ్ పాయింట్లు4. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 768 రేటింగ్ పాయింట్లు5. డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు. -
లివ్ ఇన్ రిలేషన్.. ముగ్గురు పిల్లల తల్లి.. ప్రముఖ క్రికెటర్ సహచరి (ఫొటోలు)
-
విలియమ్సన్ అనూహ్య ప్రకటన: కెప్టెన్సీకి గుడ్ బై.. ఇకపై..
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకొన్నాడు. ఏడాది కాలానికి(2024-25)గానూ తాను బ్లాక్‌కాప్స్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు.అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు విలియమ్సన్ తెలిపాడు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ధ్రువీకరించింది.గౌరవిస్తున్నాంవిలియమ్సన్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని.. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకొన్నా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ మ్యాచ్‌లకు మాత్రం అందుబాటులోనే ఉంటానని అతడు చెప్పినట్లు తెలిపింది. తమ అత్యుత్తమ బ్యాటర్‌కు ఈ వెసలుబాటు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో న్యూజిలాండ్ చేదు అనుభవం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో నాలుగింట రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన విలియమ్సన్ బృందం.. సూపర్-8కు కూడా చేరకుండానే నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో కెప్టెన్ విలియమ్సన్ టీ20 కెరీర్‌పై నీలినీడలు కమ్ముకోగా.. ఇప్పట్లో రిటైర్ కాబోనని మాత్రం చెప్పాడు. అయితే, అనూహ్యంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు.అందుకే ఈ నిర్ణయం విదేశీ లీగ్(టీ20)లలో అవకాశాలు అందిపుచ్చుకోవడం, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేన్ విలియమ్సన్ కివీస్ బోర్డుకు వెల్లడించాడు. సుదీర్ఘకాలం పాటు న్యూజిలాండ్‌కు సేవలు అందించే క్రమంలో.. తన కెరీర్‌ను పొడిగించుకునేందుకే ఏడాది కాలం పాటు దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు.కాగా 2024-2025 ఏడాదికి గానూ కివీస్‌కు ద్వైపాక్షిక సిరీస్‌లు తక్కువే ఉన్నాయి. అయితే, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరాలంటే మాత్రం కీలక మ్యాచ్‌లలో గెలుపొందాల్సిన అవసరం ఉంది. సరికొత్త ఉత్సాహంతో తిరిగి వస్తాడుఈ నేపథ్యంలో కేన్ విలియమ్సన్ టెస్టులకు మాత్రం అందుబాటులో ఉండేందుకు సమ్మతించడం గమనార్హం. ఈ ఏడాది నవంబరులో సొంతగడ్డపై కివీస్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇక కేన్ విలియమ్సన్ నిర్ణయం గురించి న్యూజిలాండ్ బోర్డు సీఈవో మాట్లాడుతూ.. దిగ్గజ ఆటగాడి అభ్యర్థన పట్ల తాము సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. తమ అత్యుత్తమ బ్యాటర్ త్వరలోనే తిరిగి సరికొత్త ఉత్సాహంతో జట్టుతో చేరతాడని పేర్కొన్నారు.చదవండి: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఐపీఎల్ హీరోలు! -
చివరి మ్యాచ్ ఆడేశాను: ట్రెంట్ బౌల్ట్ భావోద్వేగం
న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్ జట్టు తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడినట్లు ప్రకటించాడు.గత రెండు రోజులుగా ఎన్నో భావోద్వేగాలు తనను చుట్టుముట్టాయని.. ఈ అనుభూతి కొత్తగా ఉందని పేర్కొన్నాడు. ఏదేమైనా తన చివరి మ్యాచ్‌ను పూర్తిగా ఆస్వాదించానని బౌల్ట్ సంతోషం వ్యక్తం చేశాడు.న్యూజిలాండ్ చెత్త ప్రదర్శనటీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో భాగంగా పపువా న్యూగినియాతో మ్యాచ్ అనంతరం బౌల్ట్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. దీంతో న్యూజిలాండ్ క్రికెటర్‌గా బౌల్ట్ పదమూడేళ్ల ప్రయాణానికి తెరపడినట్లయింది.కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్‌కప్-2024లో న్యూజిలాండ్ చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. గ్రూప్-సిలో ఉన్న కివీస్ జట్టు.. తొలి రెండు మ్యాచ్‌లలో అఫ్గనిస్తాన్, వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది.ఫలితంగా సూపర్-8 నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్.. అనంతరం ఉగాండా.. తాజాగా పపువా న్యూగినియాపై గెలుపొంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌లో పపువా న్యూగినియాపై విజయం తర్వాత బౌల్ట్ మాట్లాడుతూ తన రిటైర్మెంట్ గురించి సంకేతాలు ఇచ్చాడు. అయితే, కేవలం అంతర్జాతీయ టీ20లకు మాత్రమే అతడు గుడ్‌బై చెప్పాడా అనే చర్చ నడుస్తోంది.టెస్టుల్లో దుమ్ము లేపి2011లో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ట్రెంట్ బౌల్ట్. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఇప్పటి వరకు న్యూజిలాండ్ తరఫున 78 టెస్టులాడి ఏకంగా 317 వికెట్లు కూల్చాడు.ఇక 114 వన్డేల్లో 211 వికెట్లు తీసిన బౌల్ట్.. 61 టీ20లు ఆడి 83 వికెట్లు పడగొట్టాడు. అయితే, బౌల్ట్ రెండేళ్ల క్రితమే న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్ క్రికెట్లో ఆడే క్రమంలో అంతర్జాతీయ విధులకు కొన్నాళ్లు దూరంగా ఉన్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో తిరిగి కివీస్ జట్టుతో కలిసి బౌల్ట్.. నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా తొమ్మిది వికెట్లు తీశాడు.ఇక బౌల్ట్ వ్యాఖ్యల నేపథ్యంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్కు రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ఇప్పట్లో తాను తన టీ20 కెరీర్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశాడు. చదవండి: BCCI: ద్రవిడ్‌తో పాటు వాళ్లందరూ అవుట్! గంభీర్ కొత్త టీమ్? View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
వెస్టిండీస్‌పై ఓటమి.. టీ20 వరల్డ్‌కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్!
టీ20 వరల్డ్‌కప్-2024లో న్యూజిలాండ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ట్రినిడాడ్ వేదికగా ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో కివీస్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో రూథర్‌ఫర్డ్(68) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా కరేబియన్ బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లతో సత్తాచాటగా.. సౌథీ, ఫెర్గూసన్ తలా రెండు వికెట్లు, నీషమ్, శాంట్నర్ చెరో వికెట్ సాధించారు.నిప్పులు చేరిగిన జోషఫ్..అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితమైంది. విండీస్ పేసర్ అల్జారీ జోషఫ్ 4 వికెట్లతో కివీస్‌ను దెబ్బతీశాడు. జోషఫ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు సాధించాడు. అతడితో పాటు స్పిన్నర్ మోటీ 3 వికెట్లతో చెలరేగాడు. ఇక బ్లాక్‌క్యాప్స్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.సూపర్-8కు విండీస్.. ఇంటికి కివీస్ఇక ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూపు-సి నుంచి సూపర్-8కు అర్హత సాధించగా.. ఓటమిపాలైన కివీస్ తమ సూపర్-8 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. మరో విధంగా చెప్పాలంటే ఈ టోర్నీ నుంచి న్యూజిలాండ్ దాదాపుగా ఇంటిముఖం పట్టినట్లే. రెండు ఓటములతో కివీస్ పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.ఇప్పటికే గ్రూపు-సి నుంచి విండీస్ సూపర్-8కు క్వాలిఫై కాగా.. మరో బెర్త్ కోసం అఫ్గానిస్తాన్ అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయం సాధించిన అఫ్గానిస్తాన్.. గ్రూప్-సి పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో ఉంది. అఫ్గాన్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా చాలు నేరుగా సూపర్-8కు అఫ్గానిస్తాన్ నేరుగా క్వాలిఫై అవుతోంది.చదవండి: Rohit Sharma: ఇక్కడ గెలవడం అంత తేలికేమీ కాదు.. క్రెడిట్ వాళ్లకే -
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)
-
ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వైరల్
ఐపీఎల్- 2021, 2022, 2023లో పాయింట్ల పట్టికలో వరుసగా 8, 8, 10వ స్థానాలు.. పేలవ ప్రదర్శన కారణంగా విమర్శలపాలైన జట్టు.. అయితే, ఈ ఏడాది ఆ జట్టు రాత పూర్తిగా మారింది.కొత్త కెప్టెన్ వచ్చాడు... అదిరిపోయే ఓపెనింగ్ కాంబినేషన్ కుదిరింది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లోనూ మెరుపులు మెరిపించగల ఆటగాళ్లు.. వీరికి తోడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థిని కట్టడి చేయగల బౌలర్లు.. వెరసి లీగ్ దశలో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌నకు అర్హత. అర్థమైంది కదా! అవును ఆరెంజ్ ఆర్మీ గురించే ఇదంతా! సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరిసారిగా 2020లో టాప్-4లో అడుగుపెట్టింది. ఇదిగో మళ్లీ ఇప్పుడే ఈ ఘనత సాధించడం. వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో అభిషేక్ శర్మ- ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ జోడీకి తోడు హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ చెలరేగడం.. అవసరమైన సమయంలో నితీశ్‌కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్.. కమిన్స్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే రాణించడం జట్టుకు సానుకూలాంశాలుగా మారాయి.సమిష్టి కృషితో టాప్-4 వరకుఈ క్రమంలో విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిపోయిన సన్‌రైజర్స్.. ఈసారి ప్లే ఆఫ్స్ చేరడం పక్కా అని అభిమానులు మురిసిపోయారు. అందుకు తగ్గట్లుగానే అన్ని విభాగాల్లో రాణిస్తూ సమిష్టి కృషితో టాప్-4 వరకు చేరింది సన్‌రైజర్స్.గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ రద్దైన నేపథ్యంలో నేరుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. నిజానికి ఫామ్ దృష్ట్యా ఈ మ్యాచ్‌లో రైజర్స్ గెలిచేదే! కానీ వర్షం కారణంగా ఇలా పెద్దగా కష్టపడకుండానే అర్హత సాధించింది.పట్టరాని సంతోషంలో కావ్యా మారన్దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాల్లో మునిగిపోయింది. ఇక ఆ జట్టు సహ యజమాని కావ్యా మారన్ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఐపీఎల్-2024 వేలంలో తాను అనుసరించిన వ్యూహాలు ఇలా ఫలితాలు ఇస్తుండటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు.కేన్ మామను హత్తుకున్న సన్‌రైజర్స్ ఓనర్ఇలా ఆనందంలో ఉన్న కావ్యా మారన్‌కు ‘పాత చుట్టం’ ఎదురయ్యారు. అతడిని ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించడమే గాకుండా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.అతడు మరెవరో కాదు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్. అదేనండీ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ముద్దుగా కేన్ మామగా పిలుచుకునే న్యూజిలాండ్ కెప్టెన్. 2021, 2022లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు విలియమ్సన్. పాత ఓనర్‌ను కలుసుకునిఅయితే, ఆ రెండు సీజన్లలో జట్టు దారుణ వైఫల్యాల నేపథ్యంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని రిలీజ్ చేయగా.. 2023 వేలంలో గుజరాత్ కొనుక్కుంది. ఇప్పుడిలా తన పాత జట్టు.. ప్రస్తుత జట్టుతో మ్యాచ్ రద్దు కావడం వల్ల ప్లే ఆఫ్స్ చేరడం... ఆ సమయంలో పాత ఓనర్‌ను విలియమ్సన్ కలుసుకోవడం విశేషంగా నిలిచింది. చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్ 🧡 pic.twitter.com/QVyGH6KdNP— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024 -
న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టు ప్రకటన.. వినూత్న ప్రయోగం
యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఈ ఏడాది జూన్ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (ఏప్రిల్ 29) ప్రకటించారు. స్టార్లతో నిండిన ఈ జట్టుకు కేన్ విలియమ్సన్ సారథ్యం వహించనున్నాడు. గాయపడిన ఆడమ్ మిల్నే స్థానంలో మ్యాట్ హెన్రీ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్‌లతో కలిసి హెన్రీ కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు. బొటనవేలి గాయంతో బాధపడుతున్న డెవాన్ కాన్వేను సైతం న్యూజిలాండ్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టులో మరో వికెట్‌కీపర్ బ్యాటర్ ఫిన్ అలెన్‌కు స్థానం లభించినప్పటికీ.. వరల్డ్‌కప్‌లో కాన్వేనే కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వికెట్‌కీపర్ బ్యాటర్లైన టిమ్ సీఫర్ట్, టామ్ బ్లండెల్‌లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు లభించలేదు. ఇటీవల పాక్‌తో సిరీస్‌ను (టీ20) డ్రా చేసుకున్న జట్టుకు సారధి అయిన మైఖేల్ బ్రేస్‌వెల్ కూడా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కోటాలో ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఐష్ సోధి, మిచెల్ సాంట్నార్.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్ వ్యవహరించనున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో మూడు శతకాలతో విజృంభించిన రచిన్ తొలిసారి టీ20 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా లూక్ రాంచీ, బౌలింగ్ కోచ్‌గా జేకబ్ ఓరమ్, అసిస్టెంట్ కోచ్‌గా జేమ్స్ ఫోస్టర్ వ్యవహరించనున్నారు. హెడ్ కోచ్‌గా గ్యారీ స్టెడ్ కొనసాగనున్నాడు. వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్ జట్టు మే 23న బయల్దేరనుంది. జూన్ 7న న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ (ఆఫ్ఘనిస్తాన్) ఆడనుంది.న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐష్ సోధీ [ట్రావెలింగ్ రిజర్వ్-బెన్ సియర్స్ ]Join special guests Matilda and Angus at the squad announcement for the upcoming @t20worldcup in the West Indies and USA. #T20WorldCup pic.twitter.com/6lZbAsFlD5— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024 వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్న్యూజిలాండ్ క్రికెట్ తమ టీ20 వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. సెలక్టర్లు, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిథులు కాకుండా ఇద్దరు చిన్నారులు జట్టు సభ్యుల పేర్లను వెల్లడించారు. న్యూజిలాండ్ క్రికెట్ మటిల్డా, ఆంగస్ అనే ఇద్దరు చిన్నారులకు చీఫ్ గెస్ట్లుగా ఆహ్వానించింది. The team's kit for the 2024 @T20WorldCup 🏏Available at the NZC store from tomorrow. #T20WorldCup pic.twitter.com/T4Okjs2JIx— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024 న్యూజిలాండ్ క్రికెట్ చేసిన ఈ వినూత్న ప్రయోగం అందరినీ ఆకట్టుకుంది. వరల్డ్‌కప్ జట్టు ప్రకటన సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ తమ వరల్డ్‌కప్ జెర్సీని కూడా రివీల్ చేసింది. మెగా టోర్నీలో న్యూజిలాండ్ క్రికెటర్లు తాము రెగ్యులర్‌గా ధరించే బ్లాక్ కిట్ కాకుండా వేరే కలర్లో ఉండే కిట్లను ధరించనున్నారు. -
IPL 2024: టీ20ల్లో తొలి డబుల్ సెంచరీ అతడిదే.. కేన్ మామ జోస్యం
బ్యాటర్ల సంపూర్ణ ఆధిపత్యం నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 డబుల్ సెంచరీ అనేది ఎక్కువ దూరం లేదన్న విషయం అర్దమవుతుంది. బ్యాటర్ల ఊచకోత ధాటికి టీ20 డబుల్ ఇప్పుడా అప్పుడా అన్నట్లుంది. అతి త్వరలో ఈ అపురూప ఘట్టాన్ని చూడటం ఖాయమన్న విషయం తేలిపోయినప్పటికీ.. ఎవరు తొలి డబుల్ సాధిస్తారనే విషయంపై మాత్రం ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. జోస్ బట్లర్, రోహిత్ శర్మ సాధిస్తాడని కొందరంటుంటే.. ట్రవిస్ హెడ్, క్లాసెన్‌కు అవకాశం ఉందని మరికొందరంటున్నారు. వీరిద్దరి పేర్లే కాకుండా చాలామంది క్రికెటర్ల పేర్లు తొలి టీ20 డబుల్ రేసులో వినబడుతున్నాయి. ఈ విషయంపై చాలా మంది తరహాలోనే న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టీ20ల్లో తొలి డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉందని అభిప్రాయపడ్డాడు. రోహిత్‌కు వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన అనుభవం ఉంది కాబట్టి టీ20 డబుల్ అతనికి ఈజీ అవుతుందని అన్నాడు. రోహిత్ ఎలాగూ ఓపెనర్‌గానే బరిలోకి దిగుతాడు కాబట్టి ఏ క్షణంలోనైనా అతని బ్యాట్ నుంచి టీ20 డబుల్ జాలు వారే అవకాశం ఉందని తెలిపాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే ఈ ఫీట్ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నాడు. 2024 ఐపీఎల్లో బ్యాటర్ల దూకుడు చూస్తుంటే ఇది ఎంతో దూరం లేదని అనిపిస్తుందని పేర్కొన్నాడు. ఈ సీజన్లో బ్యాటర్ల విధ్వంసం రెట్టింపైందని.. ఈ సీజన్లో నమోదైన జట్టు స్కోర్లే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశాడు. ఇదే సందర్భంగా కేన్ ఎంఎస్ ధోనిని తన ఆల్‌టైమ్ ఉత్తమ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా ఎన్నుకున్నాడు. కాగా, టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉన్న విషయం తెలిసిందే. 2013 ఐపీఎల్లో గేల్ పూణే వారియర్స్‌పై 66 బంతుల్లో 175 (నాటౌట్) పరుగులు చేశాడు. టీ20ల్లో నేటి వరకు ఇదే అత్యుత్తమ స్కోర్‌గా చలామణి అవుతుంది. ప్రస్తుత పరిస్థితులకు చూస్తుంటే గేల్ రికార్డు మూడినట్లు అనిపిస్తుంది. -
ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ .. స్టార్ క్రికెటర్ దూరం?
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ అనుహ్యంగా ఓటమి పాలైంది. సునయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు చెతిలేత్తిశారు. అయితే ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, ఫినిషర్ డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు కూడా మిల్లర్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో తుది జట్టులోకి న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ వచ్చాడు. జట్టులోకి వచ్చిన విలియమ్సన్.. మిల్లర్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. "జట్టులోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ డేవిడ్ మిల్లర్ సేవలు కోల్పోవడం మాకు పెద్ద ఎదురు దెబ్బ. డేవిడ్ గాయం కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడని" విలియమ్సన్ పేర్కొన్నాడు. కాగా రెండు వారాల అంటే దాదాపు గుజరాత్ ఆడే నాలుగు మ్యాచ్‌లకు మిల్లర్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా మిల్లర్ ప్రస్తుతం గుజరాత్ జట్టులో ఫినిషర్‌గా కొనసాగుతున్నాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మిల్లర్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక గుజరాత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. చదవండి: #Shashank Singh: పంజాబ్ హీరో.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించాడు! ఎవరీ శశాంక్ సింగ్? -
IPL 2024: గుజరాత్, పంజాబ్ మ్యాచ్.. విధ్వంసకర ఆటగాళ్లు దూరం
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇవాళ (ఏప్రిల్ 4) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్ల నుంచి ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లు మిస్ అయ్యారు. గాయాల కారణంగా గుజరాత్ హిట్టర్ డేవిడ్ మిల్లర్, పంజాబ్ చిచ్చరపిడుగు లియామ్ లివింగ్‌స్టోన్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్ ఎంట్రీ ఇవ్వగా.. లివింగ్‌స్టోన్ స్థానంలో సికందర్ రజా తుది జట్లలోకి ఎంట్రీ ఇచ్చారు. తుది జట్లు.. గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ సబ్స్: తనయ్ త్యాగరాజన్, నాథన్ ఎల్లిస్, అసుతోష్ శర్మ, రాహుల్ చాహర్, విద్వత్ కవేరప్ప గుజరాత్ టైటాన్స్ సబ్స్: బీఆర్ శరత్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్, అభినవ్ మనోహర్, మానవ్ సుతార్ -
వందో టెస్టులో విఫలం.. కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన విలియమ్సన్
New Zealand vs Australia, 2nd Test: న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తన కెరీర్లో వందో టెస్టు ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో తాజా సిరీస్ రెండో టెస్టు సందర్భంగా ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఈ అరుదైన మైలురాయికి చేరుకున్నాడు. కెరీర్‌లోని ప్రత్యేక మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించి కేన్ మామ సత్తా చాటుతాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కేవలం 17 పరుగులు మాత్రమే చేసి విలియమ్సన్ నిష్క్రమించాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన విలియమ్సన్ ఇలా కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైప్పటికీ.. కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో పదకొండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ క్రికెటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లిని అధిగమించాడు. డబ్ల్యూటీసీలో కేన్ మామ ఇప్పటి వరకు 2238 పరుగులు చేయగా.. కోహ్లి ఖాతాలో 2235 పరుగులు ఉన్నాయి. తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కోహ్లి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రన్‌మెషీన్ పరుగుల విషయంలో కేన్ కంటే వెనుకబడ్డాడు. ఇదిలా ఉంటే.. విలియమ్సన్తో పాటు న్యూజిలాండ్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ సౌతీకి కూడా ఇది వందో టెస్టు కావడం విశేషం. డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు వీరులు టాప్-5 1. జో రూట్- ఇంగ్లండ్- 52* మ్యాచ్‌లు- 4223 పరుగులు 2. మార్నస్ లబుషేన్- ఆస్ట్రేలియా- 45* మ్యాచ్‌లు- 3808 పరుగులు 3. స్టీవ్ స్మిత్- ఆస్ట్రేలియా- 45* మ్యాచ్‌లు- 3466 పరుగులు 4. బెన్ స్టోక్స్- ఇంగ్లండ్- 45* మ్యాచ్‌లు- 2907 పరుగులు 5. బాబర్ ఆజం- పాకిస్తాన్- 29 మ్యాచ్‌లు- 2661 పరుగులు. -
NZ vs AUS: చెలరేగిన హాజిల్‌వుడ్.. కుప్పకూలిన కివీస్! కానీ..
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. కంగారూ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ దెబ్బకు కివీస్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేకపోయారు. కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే ఉద్దేశంతో కివీస్ బరిలోకి దిగింది. అయితే, తొలిరోజే ఆసీస్ చేతిలో ఆతిథ్య జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్లంతా కలిసికట్టుగా విఫలం కావడంతో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ టామ్ లాథమ్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో మ్యాట్ హెన్రీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో వికెట కీపర్ టామ్ బ్లండెల్(22), కెప్టెన్ టిమ్ సౌథీ(26) మాత్రమే 20 పరుగుల మార్కు దాటగలిగారు. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్‌వుడ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాకిచ్చాడు కివీస్ పేసర్ బెన్ సీర్స్. ఓపెనర్ స్టీవ్ స్మిత్(11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని తొలి వికెట్ పడగొట్టాడు. అనంతరం మరో ఫాస్ట్‌బౌలర్ మ్యాట్ హెన్రీ ఉస్మాన్ ఖవాజా(16), కామెరాన్ గ్రీన్(25), ట్రవిస్ హెడ్(21)ల రూపంలో మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 45, నాథన్ లియోన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ న్యూజిలాండ్ స్టార్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీలకు వందో టెస్టు కావడం విశేషం. -
భారత అంపైర్‌కు గొప్ప గౌరవం
భారత అంపైర్ నితిన్ మీనన్‌కు గొప్ప గౌరవం దక్కనుంది. ప్రపంచ క్రికెట్లో ఫాబ్ ఫోర్‌గా పిలువబడే నలుగురు స్టార్ క్రికెటర్ల వందో టెస్ట్ మ్యాచ్‌లో ఇతను అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. ఇదివరకే విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్‌ల వందో టెస్ట్ మ్యాచ్‌కు అంపైర్‌గా పని చేసిన మీనన్.. ఫాబ్ ఫోర్‌లోని మరో ఆటగాడైన కేన్ విలియమ్సన్ వందో టెస్ట్‌లో కూడా అంపైర్‌గా వ్యవహరించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు. ఓ తరంలో నలుగురు గొప్ప క్రికెటర్లకు చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్‌ల్లో అంపైర్‌గా వ్యవహరించే గొప్ప గౌరవం నితిన్ మీనన్ మాత్రమే దక్కనుంది. విలియమ్సన్ వందో టెస్ట్ మ్యాచ్ మార్చి 8న ప్రారంభమవుతుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్ కేన్ మామతో పాటు న్యూజిలాండ్ ప్రస్తుత కెప్టెన్ టిమ్ సౌథీకి కూడా వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. కేన్, సౌథీ వందో టెస్ట్ మ్యాచ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు తమ వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో రేపటి నుంచి ప్రారంభంకాబోయే భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్‌తో వంద టెస్ట్‌ల మైలురాయిని తాకనున్నారు. ధర్మశాల వేదికగా రేపటి నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 0-1తో వెనుకపడి ఉంది. -
రోజు వ్యవధిలో సెంచరీలు కొట్టనున్న నలుగురు స్టార్ క్రికెటర్లు
అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క రోజు వ్యవధిలో నలుగురు స్టార్ క్రికెటర్లు సెంచరీలు కొట్టబోతున్నారు. మార్చి 7, 8 తేదీల్లో టీమిండియాకు చెందిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్‌కు చెందిన జానీ బెయిర్‌స్టో, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలు తమ కెరీర్లలో వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. రోజు వ్యవధిలో నలుగురు స్టార్ క్రికెటర్లు వందో టెస్ట్ మ్యాచ్ ఆడటం క్రికెట్ చరిత్రలో బహుశా జరిగి ఉండకపోవచ్చు. ఈ రికార్డుకు సంబంధించిన సరైన సమాచారం లేదు కానీ, ఇలాంటి సందర్భం రావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మరో విశేషమేమిటంటే.. పై పేర్కొన్న తేదీల కంటే కొద్ది రోజుల ముందు (ఫిబ్రవరి 15న) ఇంగ్లండ్‌కే చెందిన మరో ఆటగాడు వంద టెస్ట్ సెంచరీల మార్కును తాకాడు. ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌తో వంద సెంచరీల అరుదైన మైలురాయిని తాకాడు. ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్‌స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. జానీ బెయిర్‌స్టో- 99 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 5974 పరుగులు రవింద్రన్ అశ్విన్- 99 టెస్ట్‌ల్లో 5 సెంచరీలు, 3309 పరుగులు, 507 వికెట్లు కేన్ విలియమ్సన్- 99 టెస్ట్‌ల్లో 32 సెంచరీలు, 8675 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-99 టెస్ట్‌ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2072 పరుగులు, 378 వికెట్లు టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్‌ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్‌ల మార్కును తాకారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. -
ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..
2024 ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (మార్చి 4) వెల్లడించింది. టీమిండియా యంగ్ గన్ యశస్వి జైస్వాల్, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక గత నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా ఎంపికయ్యారు. ఫిబ్రవరి నెలలో వీరి ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని ఐసీసీ వీరి పేర్లను ప్రకటించింది. యశస్వి గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ల్లో 112 సగటున 560 పరుగులు చేశాడు. ఇందులో వరుస డబుల్ సెంచరీలు ఉన్నాయి. కేన్ మామ ఫిబ్రవరిలో ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో (సౌతాఫ్రికాతో) వరుస సెంచరీల సాయంతో 403 పరుగులు చేశాడు. నిస్సంక విషయానికొస్తే.. ఈ లంక ఓపెనర్ గత నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడిన 3 వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీ సాయంతో 350కిపైగా పరుగులు చేశాడు. మహిళల విభాగంలో యూఏఈకి చెందిన కవిష ఎగోడగే, ఈషా ఓజా, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా ఎంపికయ్యారు. ఈ ముగ్గురు ఆల్‌రౌండర్లు గత నెలలో జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించారు. స్వతంత్ర ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఓటింగ్ పద్దతిన విజేతలను నిర్ణయిస్తారు. విజేతల పేర్లను వచ్చే వారం ప్రకటిస్తారు. icc-cricket.com/awardsలో పేర్లు నమోదు చేసుకున్న అభిమానులు శనివారం వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. -
పాపం కేన్ మామ.. ఎలా ఔటయ్యాడో చూడండి.. 12 ఏళ్లలో..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (0) ఆసక్తికర రీతిలో రనౌటయ్యాడు. కేన్ పరుగు పూర్తి చేసే క్రమంలో మరో ఎండ్ నుంచి వస్తున్న సహచరుడు విల్ యంగ్‌ను గుద్దుకోవడంతో పరుగు పూర్తి చేయలేకపోయాడు. కేన్ క్రీజ్‌కు చేరకునే లోపు లబూషేన్ డైరెక్ట్ త్రోతో వికెట్లకు గిరాటు వేశాడు. కేన్ రనౌట్ కావడానికి ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా పరోక్ష కారకుడయ్యాడు. కేన్ పరుగు తీస్తుండగా.. స్టార్క్ కూడా అడ్డుతగిలాడు (ఉద్దేశపూర్వకంగా కాదు).12 ఏళ్లలో కేన్ రనౌట్ కావడం ఇదే తొలిసారి. చివరిసారిగా అతను 2012లో రనౌటయ్యాడు. కేన్ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. KANE WILLIAMSON IS RUN OUT IN TEST CRICKET FOR THE FIRST TIME IN 12 YEARS...!!! 🤯pic.twitter.com/KRheTm61sg — Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2024 కాగా, ఆసీస్ బౌలర్లు మూకుమ్మడగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకే కుప్పకూలింది. కేన్‌తో పాటు రచిన్ రవీంద్ర, కుగ్గెలిన్ డకౌట్లయ్యారు. టామ్ లాథమ్ (5), విల్ యంగ్ (9), సౌథీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను గ్లెన్ ఫిలిప్స్ (71) మెరుపు అర్దసెంచరీతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. టామ్ బ్లండల్ (33), మ్యాట్ హెన్రీ (42) ఓ మోస్తరు స్కోర్లు చేయగా డారిల్ మిచెల్ 11 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. దీనికి ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. కెమరూన్ గ్రీన్ భారీ శతకం (174) సాధించి అజేయంగా నిలువగా.. స్టీవ్ స్మిత్ 31, ఉస్మాన్ ఖ్వాజా 33, లబూషేన్ 1, హెడ్ 1, మిచెల్ మార్ష్ 40, అలెక్స్ క్యారీ 10, స్టార్క్ 9, కమిన్స్ 16, లయోన్ 5, హాజిల్‌వుడ్ 22 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శనలతో రాణించగా.. విలియమ్ రూర్కీ, కుగ్గెలిన్ తలో 2 వికెట్లు, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టాడు. 204 పరుగుల లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ డకౌట్ కాగా..లబూషేన్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా (5), నైట్ వాచ్మెన్ లయెన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
మూడో బిడ్డ ముఖం చూపించిన కేన్ విలియమ్సన్ - ఫ్యామిలీ ఫొటోస్
-
శుభవార్త చెప్పిన స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను మూడోసారి తండ్రైనట్లు వెల్లడించాడు. తన జీవిత భాగస్వామి సారా రహీం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు విలియమ్సన్ తెలిపాడు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారంటూ.. చిన్నారిని ఎత్తుకుని ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ‘‘ఇప్పుడిక ముగ్గురు.. ఈ ప్రపంచంలోకి వచ్చే క్రమంలో సురక్షితంగా నీ ప్రయాణం సాగినందుకు సంతోషం. అందమైన చిన్నారికి స్వాగతం’’ అని కేన్ విలియమ్సన్ కూతురి ఆగమనాన్ని తెలిపాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహ సహచర క్రికెటర్ల నుంచి విలియమ్సన్- సారాలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2015 నుంచి ప్రేమలో ఉన్న కేన్ విలియమ్సన్- సారా రహీంలకు 2020లో కూతురు మ్యాగీ జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకు ఈ జంట కుమారుడికి జన్మనిచ్చారు. ఇక మూడో సంతానంగా వీరికి తాజాగా మరో కూతురు జన్మించింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు దూరమైన కేన్ విలియమ్సన్ టెస్టు సిరీస్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గురువారం నుంచి ఆసీస్‌తో మొదలుకానున్న తొలి టెస్టుకు అతడు అందుబాటులోకి రానున్నాడు. చదవండి: NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. View this post on Instagram A post shared by Kane Williamson (@kane_s_w) -
సౌతాఫ్రికా క్రికెట్‌కు అవమానం.. 92 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
South Africa tour of New Zealand, 2024- హామిల్టన్: ఎట్టకేలకు టెస్టు ఫార్మాట్లో దక్షిణాఫ్రికా జట్టుపై న్యూజిలాండ్ జట్టు తొలిసారి సిరీస్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదించి సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. 1932 నుంచి రెండు జట్ల మధ్య 18 టెస్టు సిరీస్‌లు జరిగాయి. దక్షిణాఫ్రికా 13 సార్లు నెగ్గగా, నాలుగు సిరీస్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 18వ ప్రయత్నంలో మొదటిసారి న్యూజిలాండ్‌కు సిరీస్ దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 40/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 94.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి గెలిచింది. కేన్ విలియమ్సన్ (133 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. విల్ యంగ్ (60 నాటౌట్; 8 ఫోర్లు)తో కలిసి విలియమ్సన్ నాలుగో వికెట్‌కు 152 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యాన్ని జోడించాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో సీనియర్ ఆటగాళ్లంతా బిజీగా ఉండటంతో.. అనుభవలేమి, యువ ప్లేయర్లతో కూడిన జట్టును కివీస్ పర్యటనకు పంపింది ప్రొటిస్ బోర్డు. తొలి టెస్టు సందర్భంగా ఏకంగా ఐదుగురు సౌతాఫ్రికా క్రికెటర్లు అరంగేట్రం చేయడం విశేషం. ఫలితంగా.. న్యూజిలాండ్‌తో పోటీలో.. 92 ఏళ్ల చరిత్రలో తొలిసారి టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై.. భారీ మూల్యమే చెల్లించింది. న్యూజిలాండ్ చేతిలో క్లీన్‌స్వీప్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. Kane Williamson has reached his 32nd Test Century! With 172 innings, that is the fewest innings to reach 32 test 100's in test history, beating Steve Smith. 🔥🏏@BLACKCAPS v South Africa: 2nd Test | LIVE on DUKE and TVNZ+ pic.twitter.com/pSg5VFP2nS — TVNZ+ (@TVNZ) February 16, 2024 -
వరుస సెంచరీలతో దూసుకుపోతున్న కేన్ మామ.. సెంచరీ నంబర్ 45
టెస్ట్ క్రికెట్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంచరీల దాహం తీరడం లేదు. గత ఆరు మ్యాచ్‌ల్లో ఆరు శతకాలు బాదిన కేన్ మామ.. తాజాగా మరో సెంచరీ చేశాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హ్యామిల్టన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో కేన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఛేదనలో కేన్ అజేయ సెంచరీతో (133 నాటౌట్) చెలరేగి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేన్ టెస్ట్ కెరీర్లో ఇది 32వ శతకం. ఈ సెంచరీతో కేన్ ఫాబ్ ఫోర్లో (కోహ్లి, రూట్, స్మిత్, కేన్) అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కేన్ విలియమ్సన్- 32 (98 మ్యాచ్‌లు) స్టీవ్ స్మిత్- 32 (107 టెస్ట్‌లు) జో రూట్- 30 (138 టెస్ట్‌లు) కోహ్లి- 29 (113 టెస్ట్‌లు) ఫిబ్రవరి 3న ఫాబ్ ఫోర్లో నాలుగో స్థానంలో ఉన్న కేన్.. ఫిబ్రవరి 16 వచ్చే సరికి టాప్ ప్లేస్‌కు చేరాడు. తాజా సెంచరీతో కేన్ సాధించిన మరిన్ని ఘనతలు.. గత ఏడు టెస్ట్‌ల్లో ఏడు సెంచరీలు.. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు 4 & 132 వర్సెస్ఇంగ్లండ్ 1 & 121* వర్సెస్ శ్రీలంక 215 వర్సెస్ శ్రీలంక 104 & 11 వర్సెస్ బంగ్లాదేశ్ 13 & 11 వర్సెస్ బంగ్లాదేశ్ 118 & 109 వర్సెస్ సౌతాఫ్రికా 43 & 133* వర్సెస్ సౌతాఫ్రికా ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు.. విరాట్ కోహ్లీ - 80 డేవిడ్ వార్నర్ - 49 రోహిత్ శర్మ - 47 జో రూట్ - 46 కేన్ విలియమ్సన్ - 45* న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు (32). కేన్ వరుస శతకాలతో (3) విరుచుకుపడటంతో న్యూజిలాండ్ తొలిసారి (92 ఏళ్ల చరిత్రలో) దక్షిణాఫ్రికాపై టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్ట్ స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా 242 (డి స్వార్డ్ట్ 64) & 235 (బెడింగ్హమ్ 110) న్యూజిలాండ్ 211 (కేన్ 43) & 269/3 (కేన్ 133 నాటౌట్) 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ కూడా గెలిచిన న్యూజిలాండ్ 2-0 తేడాతో సఫారీలను క్లీన్ స్వీప్ చేసింది. -
న్యూజిలాండ్‌కు షాకిచ్చిన సౌతాఫ్రికా ‘అనుభలేమి జట్టు’!
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు రెండో రోజు ఆటలో అనూహ్యంగా సౌతాఫ్రికా పైచేయి సాధించింది. మంగళవారం నాటి ఆటను 220/6తో ముగించిన సౌతాఫ్రికా.. బుధవారం తమ స్కోరుకు మరో 22 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది. 242 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. హామిల్టన్ టెస్టులో కివీస్ బౌలర్లలో విలియం రూర్కీ 4 వికెట్లు పడగొట్టగా.. రచిన్ రవీంద్ర 3 వికెట్లు దక్కించుకున్నాడు. కెప్టెన్ టిమ్ సౌతీతో పాటు మ్యాట్ హెన్రీ, వాగ్నర్ తలా ఒక వికెట్ తీశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌కు సౌతాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే డకౌట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ టామ్ లాథమ్ 40 పరుగులు రాబట్టాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 43 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా వాళ్లలో విల్ యంగ్(36), నీల్ వాగ్నర్(33) మాత్రమే ముప్పై పరుగుల మార్కు అందుకున్నారు. ఫలితంగా.. బుధవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి 77.3 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా కంటే.. 31 పరుగులు వెనుకబడి ఉంది. ప్రొటిస్ స్పిన్నర్ డేన్ పీడ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పేసర్ డేన్ పీటర్సన్ 3 వికెట్లు కూల్చాడు. మరో పేసర్ మొరేకికి ఒక వికెట్ దక్కింది. కాగా తొలి టెస్టులో ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర(240) వ్యక్తిగత స్కోరు కంటే కూడా ఈసారి కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు తక్కువ కావడం గమనార్హం. ఇక మొదటి టెస్టులో రచిన్ డబుల్ సెంచరీ, విలియమ్సన్ వరుస సెంచరీల కారణంగా 281 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది న్యూజిలాండ్. అనుభలేమి సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో బిజీగా ఉన్న కారణంగా కీలకమైన కివీస్ పర్యటనకు అనుభవలేమి జట్టును పంపి విమర్శుల మూటగట్టుకుంది సౌతాఫ్రికా. న్యూజిలాండ్‌తో మౌంట్ మాంగనుయ్‌లో జరిగిన తొలి టెస్టు సందర్భంగా ఏకంగా ఆరుగురు ప్రొటిస్ ఆటగాళ్లు అరంగేట్రం చేయడం విశేషం. చదవండి: అరంగేట్ర జట్టును పంపినందుకు సౌతాఫ్రికాకు తగిన శాస్తి! -
మార్చి 7, 8 తేదీల్లో సెంచరీలు కొట్టనున్న నలుగురు క్రికెటర్లు..!
మార్చి 7, 8 తేదీల్లో నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లు సెంచరీలు కొట్టనున్నారు. ఇదేంటని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి. పై పేర్కొన్న తేదీల్లో ఓ భారత ఆటగాడు, ఓ ఇంగ్లండ్ ఆటగాడు, ఇద్దరు న్యూజిలాండ్ ఆటగాళ్లు టెస్ట్‌ల్లో వందో మ్యాచ్ ఆడనున్నారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్‌స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. ఈ తేదీల కంటే ముందు ఫిబ్రవరి 15న మరో ఆటగాడు కూడా సెంచరీ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్‌కు వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. రోజుల వ్యవధిలో ఐదుగురు ఆటగాళ్లు వంద టెస్ట్‌ల మార్కును తాకడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ఆటగాళ్లతో పాటు మరికొందరు శతాధిక టెస్ట్ ప్లేయర్లు ఒకేసారి రిటైరైతే టెస్ట్ క్రికెట్లో ఓ శకం ముగిసినట్లవుతుంది. నేటి వరకు (ఫిబ్రవరి 13) పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్ల గణాంకాలు ఇలా ఉన్నాయి. బెన్ స్టోక్స్- 99 టెస్ట్‌ల్లో 13 సెంచరీలు, 6251 పరుగులు, 197 వికెట్లు జానీ బెయిర్‌స్టో- 97 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 5902 పరుగులు రవింద్రన్ అశ్విన్- 97 టెస్ట్‌ల్లో 5 సెంచరీలు, 3271 పరుగులు, 499 వికెట్లు కేన్ విలియమ్సన్- 98 టెస్ట్‌ల్లో 31 సెంచరీలు, 8490 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-98 టెస్ట్‌ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2059 పరుగులు, 375 వికెట్లు టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్‌ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్‌ల మార్కును తాకారు. -
‘అరంగేట్ర’ జట్టును పంపినందుకు సౌతాఫ్రికాకు తగిన శాస్తి!
New Zealand vs South Africa, 1st Test : సౌతాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అనుభలేమి ప్రొటిస్ జట్టును 281 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. తద్వారా సౌతాఫ్రికాపై రెండో అతి పెద్ద విజయం అందుకుంది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్-2024తో బిజీ కావడంతో నీల్ బ్రాండ్ సారథ్యంలో.. పెద్దగా అనుభవంలేని ప్రొటిస్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఐదుగురు మినహా కెప్టెన్ బ్రాండ్ సహా అంతా అరంగేట్ర ప్లేయర్లే కావడం విశేషం. రచిన్ డబుల్ సెంచరీ ఈ క్రమంలో మౌంట్ మౌంగనుయ్ వేదికగా కివీస్‌తో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన.. సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ విలియమ్సన్(118) సెంచరీతో రాణించగా.. రచిన్ రవీంద్ర డబుల్ సెంచరీ(240)తో చెలరేగాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోరు చేసి.. ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 162 పరుగులకే కుప్పకూలింది. ప్రొటిస్ బ్యాటర్లలో కీగన్ పీటర్సన్(45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ (3/31), సాంట్నర్ (3/34), జేమీసన్ (2/35), రచిన్ రవీంద్ర (2/16) రాణించారు. విలియమ్సన్ వరుస శతకాలతో ఈ నేపథ్యంలో 349 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్ జట్టు.. 179-4 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ (109; 12 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన ఐదో న్యూజిలాండ్ క్రికెటర్‌గా విలియమ్సన్ గుర్తింపు పొందాడు. సౌతాఫ్రికా చిత్తు ఈ మేరకు బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 528 పరుగుల ఆధిక్యం సాధించి.. సౌతాఫ్రికా ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో గురువారం నాటి ఆటలో 247 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా టార్గెట్ పూర్తి చేయలేక భారీ ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ బౌలర్లలో కైలీ జెమీషన్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. ఇక సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 13 నుంచి రెండో మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ప్రొటిస్ ఆటగాళ్లు: 1.ఎడ్వర్డ్ మూరే(ఓపెనర్) 2.నీల్ బ్రాండ్(ఓపెనర్, కెప్టెన్) 3.వాన్ టాండర్(వన్‌డౌన్ బ్యాటర్) 4.రువాన్ డి స్వార్డ్(బౌలింగ్ ఆల్‌రౌండర్) 5.క్లైడ్ ఫార్చూన్(వికెట్ కీపర్ బ్యాటర్) 6. షోపో మొరేకి(పేస్ బౌలర్). చదవండి: అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్ -
తగ్గుతూ వస్తున్న కోహ్లి ప్రభ.. గణనీయంగా పుంజుకుంటున్న విలియమ్సన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 2021 నుంచి రెండేళ్ల పాటు కెరీర్ పరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. 2022 చివర్లో కోహ్లి ఎట్టకేలకు ఫామ్‌ను దొరకబుచ్చుకుని పూర్వవైభవం సాధించగలిగాడు. అయితే కోహ్లి ఫామ్ కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమైంది. గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో గతం కంటే మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్న కోహ్లి.. టెస్ట్‌ల్లో మాత్రం ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు. తాజాగా సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ పోస్ట్ ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏం సూచిస్తుందంటే.. 2021లో కోహ్లి 27 టెస్ట్ సెంచరీలు చేసే నాటికి ఫాబ్ ఫోర్‌గా పిలువబడే వారిలో మిగతా ముగ్గురు కోహ్లి కంటే తక్కువ సెంచరీ కలిగి ఉన్నారు. స్టీవ్ స్మిత్ 26, కేన్ విలియమ్సన్ 23, జో రూట్ 17 సెంచరీలు చేశారు. అయితే నేటి దినం వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. అప్పట్లో సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఫాబ్ ఫోర్లో ప్రథముడిగా పరిగణించబడిన కోహ్లి.. ప్రస్తుతం చివరివాడిగా మారిపోయాడు. Kane Williamson is just one century away from equaling Steve Smith among the Fab 4 for the most Test centuries. pic.twitter.com/ZtFIV45lmE — CricTracker (@Cricketracker) February 6, 2024 టెస్ట్ సెంచరీల సంఖ్యలో కోహ్లి ఫాబ్ ఫోర్లో చివరి స్థానానికి పడిపోయాడు. నేటికి 32 సెంచరీలతో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉండగా.. వరుస సెంచరీలు చేస్తూ పరుగులు వరద పారిస్తున్న విలియమ్సన్ 31 సెంచరీలతో రెండో స్థానానికి దూసుకువచ్చాడు. అప్పట్లో 17 సెంచరీలు చేసిన రూట్.. ఈ మధ్యకాలంలో ఏకంగా 13 సెంచరీలు చేసి 30 సెంచరీలతో మూడో ప్లేస్‌లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేసిన కోహ్లి ఫాబ్ ఫోర్లో చివరివాడిగా కొనసాగుతున్నాడు. ఓ పక్క టెస్ట్‌ల్లో తనకు పోటీదారులుగా పిలువబడే వారు సెంచరీల మీద సెంచరీలు చేస్తూ దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం చల్లబడ్డాడు. కోహ్లికి ప్రధాన పోటీదారుడైన విలియమ్సన్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేయడంతో పాటు చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో ఆరు శతకాలు బాది శతక వేటలో దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం రేసులో వెనుకపడ్డాడు. కోహ్లి టెస్ట్ సెంచరీ సంఖ్య తగ్గడానికి ఓ ప్రధానమైన కారణంగా ఉంది. కోహ్లి ఫాబ్ ఫోర్‌లోని మిగతా సభ్యులతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో టెస్ట్ మ్యాచ్‌లు చాలా తక్కువగా ఆడాడు. ఏదో టెస్ట్ క్రికెట్ అంటే ఆసక్తి లేనట్లు మ్యాచ్‌కు మ్యాచ్‌కు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఓ పక్క స్టీవ్ స్మిత్, కేన్ మామ, రూట్ దాదాపుగా ప్రతి మ్యాచ్ ఆడుతుంటే కోహ్లి ఏ అమవాస్యకో పున్నానికో టెస్ట్‌ల్లో కనిపిస్తున్నాడు. కోహ్లి సెంచరీలు చేయకపోతేనేం పరుగులు సాధిస్తున్నాడు కదా అని అతని అభిమానులు వాదించవచ్చు. అయితే సహచరులతో పోలిస్తే కోహ్లి సాధించిన పరుగులు చాలా తక్కువ అన్న విషయాన్ని వారు మరువకూడదు. అభిమాన ఆటగాడు కదా అని మనం ఎంత సమర్ధించుకు వచ్చినా అంతిమంగా గణాంకాలు మాత్రమే మాట్లాడతాయని గుర్తించాలి. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడో లేదో వేచి చూడాలి. -
వరుస సెంచరీలతో దూసుకుపోతున్న విలియమ్సన్.. పలు రికార్డులు బద్దలు
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లో టాప్ రికార్డులన్నీ బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన కేన్.. తాజాగా మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు (118, 109) చేసిన కేన్.. ఈ ఘనత (ట్విన్ సెంచరీలు) సాధించిన ఐదో న్యూజిలాండ్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సెకెండ్ ఇన్నింగ్స్ సెంచరీతో టెస్ట్ సెంచరీల సంఖ్యను 31కి పెంచుకున్న కేన్.. అత్యధిక సెంచరీలు (అన్ని ఫార్మాట్లలో కలిపి 44 సెంచరీలు) చేసిన యాక్టివ్ ప్లేయర్స్ జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (80 సెంచరీలు) టాప్‌లో ఉండగా.. డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. కేన్ (44).. స్మిత్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. తాజా సెంచరీతో కేన్ మరో రికార్డు కూడా సాధించాడు. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 31 సెంచరీలు (170 ఇన్నింగ్స్‌ల్లో) పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో (165 ఇన్నింగ్స్‌ల్లో) ఉండగా.. స్టీవ్ స్మిత్, విలియమ్సన్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. కేన్ గత 10 ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లు ఇలా ఉన్నాయి. 132, 1, 121*, 215, 104, 11, 13, 11, 118, 109. ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ప్రస్తుతం టెస్ట్‌ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. కాగా, మౌంట్ మాంగనూయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌లో న్యూజిలాండ్ గెలుపు దిశగా పయనిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 528 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మహా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధి సౌతాఫ్రికా గెలవలేదు. కేన్ ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి న్యూజిలాండ్ గెలుపుకు పునాది వేయగా.. యువ ఆటగాడు రచిన్ రవీంద్ర తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (240) చేసి తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 511 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది. భారీ లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న కివీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. -
బ్రాడ్‌మన్, కోహ్లిలను అధిగమించిన విలియమ్సన్
న్యూజిలాండ్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ సాధించడం ద్వారా టెస్ట్‌ల్లో 30 సెంచరీల మార్కును (97 మ్యాచ్‌ల్లో) తాకాడు. ఈ ఘనత సాధించే క్రమంలో దిగ్గజ ఆటగాళ్లు డాన్ బ్రాడ్‌మన్, విరాట్ కోహ్లిల రికార్డులను అధిగమించాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్‌మన్ (52 టెస్ట్‌లు), విరాట్ కోహ్లి (113 టెస్ట్‌లు) 29 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో కేన్ వీరిద్దరిని దాటాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో కేన్, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్‌తో (137 మ్యాచ్‌లు) సమానంగా 30 సెంచరీలు కలిగి ఉన్నాడు. యాక్టివ్ క్రికెటర్లలో అత్యధిక టెస్ట్ సెంచరీ రికార్డు స్టీవ్ స్మిత్ పేరిట ఉంది. స్మిత్ ఇప్పటివరకు 32 సెంచరీలు (107 టెస్ట్‌ల్లో) చేశాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీల రికార్డు (యాక్టివ్ క్రికెటర్లలో) విరాట్ కోహ్లి పేరిట ఉంది. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 80 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44), కేన్ విలియమ్సన్ (43) విరాట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా కొనసాగుతున్న కేన్.. గత 9 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు చేయడం విశేషం. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో కేన్ విలియమ్సన్తో (112) పాటు వన్డే వరల్డ్‌కప్ సెన్సేషన్ రచిన్ రవీంద్ర (118) కూడా సెంచరీతో కదంతొక్కాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ అజేయ శతకాలతో ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. న్యూజిలాండ్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 258 పరుగులుగా ఉంది. ఓపెనర్లు టామ్ లాథమ్ (20), డెవాన్ కాన్వే (1) ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మొరేకీ, ప్యాటర్సన్ తలో వికెట్ పడగొట్టారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసింది. -
సెంచరీలతో చెలరేగిన రవీంద్ర, కేన్ విలియమ్సన్.. తొలి రోజు కివీస్‌దే
మౌంట్ మౌన్గనూయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆటలో న్యూజిలాండ్ అధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీలతో చెలరేగారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే డేవాన్ కాన్వే(1), టామ్ లాథమ్(20) వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు అజేయంగా 221 పరుగులు జోడించారు. రవీంద్ర(118), కేన్ విలియమ్సన్(112) పరుగులతో క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డేన్ ప్యాటర్సన్, మోరెకి తలా వికెట్ సాధించారు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ కారణంగా ఈ సిరీస్‌కు ప్రోటీస్ సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. చదవండి: IND vs ENG: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. ప్రిన్స్ ఈజ్ బ్యాక్! సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్ -
కేన్ మామకు ఏమైంది..? గుజరాత్ టైటాన్స్ ఆందోళన
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయాల కారణంగా ఇటీవలికాలంలో తరుచూ క్రికెట్‌కు దూరమవుతున్నాడు. ఐపీఎల్ 2023 సందర్భంగా కాలు విరగ్గొట్టుకున్న కేన్ మామ.. అష్టకష్టాలు పడి వన్డే వరల్డ్‌కప్‌కు అందుబాటులోకి వస్తే, అక్కడ కూడా గాయపడి పలు కీలక మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా ఆ గాయం నుంచి కూడా కోలుకుని స్వదేశంలో పాక్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వస్తే, ఇక్కడ కూడా గాయపడి మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. హ్యామిల్టన్‌లో జరిగిన రెండో టీ20 సందర్భంగా గాయపడిన కేన్ మామ సిరీస్‌లోని మిగతా మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని క్రికెట్ న్యూజిలాండ్ ప్రకటించింది. రెండో టీ20లో మాంచి టచ్‌లో (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్) ఉన్నప్పుడు కండరాల సమస్య కారణంగా అతను ఉన్నపళంగా మైదానాన్ని వీడాడు. స్కానింగ్ రిపోర్ట్ల్లో చిన్న సమస్యే అని తేలినప్పటికీ, టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా క్రికెట్ న్యూజిలాండ్ పాక్‌తో సిరీస్ మొత్తానికి అతన్ని దూరంగా ఉంచింది. పాక్‌తో మిగిలిన మ్యాచ్‌లకు కివీస్ సెలెక్టర్లు విల్ యంగ్‌ను కేన్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు. కేన్ పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్న గుజరాత్.. కేన్ తాజా పరిస్థితి చూసి అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా ఆందోళన చెందుతుంది. త్వరలో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కేన్ పూర్తిగా కోలుకుంటాడో లేదోనని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతానికి కోలుకున్నా ఆతర్వాత జరిగే సిరీస్‌లు ఆడి దెబ్బలు తగిలించుకుని తమని ఇబ్బంది పెడాతాడేమోనని కలవర పడుతుంది. 33 ఏళ్లకే వయసు పైబడినట్లు కనిపిస్తున్న కేన్ పరిస్థితి గుజరాత్ టైటాన్స్ ఉలిక్కిపడుతుంది. ఇప్పటినుంచి కేన్‌కు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటే మంచిదని ఆలోచిస్తుంది. ఇదిలా ఉంటే, పాక్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో టీ20 జనవరి 17న డునెడిన్ వేదికగా జరుగనుంది. -
డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బాబర్ పోరాటం వృథా
న్యూజిలాండ్ పర్యటనను పాకిస్తాన్ పరాజయంతో ప్రారంభించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. అక్లాండ్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వేను డకౌట్ చేసి శుభారంభం అందుకుంది. అయితే, మరో ఓపెనర్ ఫిన్ అలెన్(35), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ విలియమ్సన్(57) ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. ఇక నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కొరకరాని కొయ్యలా మారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో మార్క్ చాప్మప్ 26(11 బంతుల్లో) రన్స్‌తో రాణించాడు. బ్యాటర్లంతా రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం ఒక్క హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ మొత్తంగా 35 బంతులు ఎదుర్కొని 57 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో ఓపెనర్లు సయీమ్ ఆయుబ్(27), మహ్మద్ రిజ్వాన్(25), ఇఫ్తికర్ అహ్మద్(24) మాత్రమే 20 అంకెల స్కోరు చేశారు. రిజ్వాన్, ఇఫ్తికర్ రూపంలో కీలక వికెట్లు తీసిన టిమ్ సౌతీ.. అబ్బాస్ ఆఫ్రిది(1), హారిస్ రవూఫ్(0)లను త్వరత్వరగా పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకుని పాక్‌ను కోలుకోని దెబ్బకొట్టాడు. మిగతా వాళ్లలో ఆడం మిల్నే రెండు, బెన్ సియర్స్ రెండు, ఇష్ సోధి ఒక వికెట్ దక్కించుకున్నారు. కివీస్ బౌలర్ల విజృంభణతో 18 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయిన పాకిస్తాన్ 46 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక పాకిస్తాన్ కెప్టెన్‌గా ఆ జట్టు ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో అతడు బౌలర్‌గా, సారథిగానూ విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల కోటాలో 46 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన ఆఫ్రిది.. కెప్టెన్‌గా అరంగేట్ర మ్యాచ్‌లో ఓటమిని చవిచూశాడు. మరోవైపు.. కివీస్‌ను గెలిపించిన డారిల్ మిచెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది’ మ్యాచ్ అవార్డు దక్కింది. -
NZ VS PAK 1st T20: డారిల్ మిచెల్ ఊచకోత
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ (27 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి కివీస్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించగా.. 417 రోజుల తర్వాత టీ20 మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (57) రాణించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిన్ అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో మార్క్ చాప్మన్ (11 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే, ఐష్ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్ ఫిలిప్స్ 19, ఆడమ్ మిల్నే 10 పరుగులు చేశారు. మ్యాట్ హెన్రీ 0, టిమ్ సౌథీ 6 పరుగులతో అజేయంగా నిలిచారు. డారిల్ మిచెల్ క్రీజ్‌లో ఉన్న సమయంలో కివీస్ 250కి పైగా పరుగులు చేసేలా కనిపించింది. అయితే అతను ఔటైన తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవ్వరూ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడకపోవడంలో కివీస్ 226 పరుగులతో సరిపెట్టుకుంది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-46-3), ఆమిర్ జమాల్ (4-0-56-0), ఉసామా మిర్‌లను (4-0-51-0) కివీస్ బ్యాటర్లు ఆటాడుకున్నారు. ముఖ్యంగా షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్‌లకు చుక్కలు చూపించారు. కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్.. షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో 2 సిక్స్‌లు, 3 బౌండరీల సాయంతో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. పాకిస్తాన్‌ను అబ్బాస్ అఫ్రిది (4-0-34-3), హరీస్ రౌఫ్ (4-0-34-2) కాపాడారు. వీరిద్దరు కాస్త పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు కూడా తీశారు. -
NZ Vs PAK 1st T20: షాహీన్ అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ ఓపెనర్
పాకిస్తాన్ స్టార్ పేసర్, ఆ జట్టు కొత్త కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చుక్కలు చూపించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అలెన్ ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఆతర్వాత హ్యాట్రిక్ బౌండరీలు, ఆ వెంటనే సిక్సర్ బాదాడు. ఆఖరి బంతి డాట్ బాల్ అయ్యింది. ఆమిర్ జమాల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో రెండో బంతిని సైతం సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టిస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాతి ఓవర్లో మరో అఫ్రిది (అబ్బాస్ అఫ్రిది) అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) జోరుకు అడ్డుకట్ట వేసి అతన్ని పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కివీస్.. 11.2 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అలెన్, డెవాన్ కాన్వే (0) ఔట్ కాగా.. కేన్ విలియమ్సన్ (57), డారిల్ మిచెల్ (31) క్రీజ్‌లో ఉన్నారు. అబ్బాస్ అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిదిలకు తలో వికెట్ దక్కింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 417 రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20ల బరిలోకి దిగి హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. -
న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. జట్టు నుంచి తప్పుకున్న విలియమ్సన్
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్, స్టార్ పేసర్ కైల్ జేమీసన్ బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని శుక్రవారం న్యూజిలాండ్ క్రికెట్ దృవీకరించింది. కాగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ క్రికెట్ తొలుత ప్రకటించిన జట్టులో విలియమ్సన్, జేమీసన్ ఇద్దరూ ఉన్నారు. అయితే మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న విలియమ్సన్కు మరి కొన్ని రోజులు విశ్రాంతి అవరసమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే బంగ్లాతో సిరీస్ నుంచి కేన్ మామ తప్పుకున్నాడు. జేమీసన్ కూడా తన మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇక విలియమ్సన్ స్ధానాన్ని యువ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రతో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసిది. అదే విధంగా జమీసన్ స్ధానంలో పేసర్ ఢఫీ జట్టులో వచ్చాడు. కాగా విలయమ్సన్ తప్పుకోవడంతో మిచెల్ శాంట్నర్‌కు జట్టు పగ్గాలను కివీస్ సెలక్టర్లు అప్పగించారు. డిసెంబర్ 27న నేపియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ టీ20 జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి, టిమ్ సౌథీ -
BAN VS NZ 2nd Test: తొలి రోజు 15 వికెట్లు.. రెండో రోజు వర్షార్పణం
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మిర్పూర్లో జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆటలో ఏకంగా 15 వికెట్లు నేలకూలగా, రెండో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గురువారం భారీ వర్షం వల్ల స్టేడియం చిత్తడిగా మారింది. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే రెండో రోజు ఆట రద్దైంది. కాగా, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ చెరో 3 వికెట్లు, అజాజ్ పటేల్ 2, కెప్టెన్ సౌథీ ఓ వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ రహాం (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన న్యూజిలాండ్ కూడా తడబడింది. బంగ్లా స్పిన్నర్ల ధాటికి ఆ జట్టు 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మెహిది హసన్ మీరజ్ 3, తైజుల్ ఇస్లాం 2 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్ (4), డేవాన్ కాన్వే (11), కేన్ విలియమ్సన్ (13), హెన్రీ నికోల్స్ (1), టామ్ బ్లండెల్ (0) విఫలం కాగా.. డారిల్ మిచెల్ (12), గ్లెన్ ఫిలిప్స్ (5) క్రీజ్‌లో ఉన్నారు. -
బంగ్లాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన! కేన్ మామ దూరం
వన్డే ప్రపంచకప్-2023 తర్వాత తొలి వైట్‌బాల్ సిరీస్‌కు న్యూజిలాండ్ సిద్దమైంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కివీస్ తలపడనుంది. ఈ సిరీస్ కోసం 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్ధానంలో టామ్ లాథమ్‌ను సారధిగా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక దేశీవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న లెగ్ స్పిన్నర్ ఆదిల్ అశోక్, జోష్ క్లార్క్సన్, విల్ ఓ'రూర్క్లకు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా వన్డే వరల్డ్‌ప్‌లో దుమ్మురేపిన యువ సంచలనం రచిన్ రవీంద్ర కూడా బంగ్లా సిరీస్‌కు అందుబాటులో ఉన్నాడు. డిసెంబర్ 17న డునెడిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాతో వన్డేలకు కివీస్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ఆది అశోక్, ఫిన్ అలెన్, టామ్ బ్లండెల్, మార్క్ చాప్మన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, కైల్ జామీసన్, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, రచిన్ రవీంద్ర, ఇష్ సోధి, విల్ యంగ్. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాకు చేరుకున్న భారత జట్టు.. వీడియో వైరల్ -
కేన్ విలియమ్సన్ సెంచరీ
సిల్హెట్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (104; 11 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 84 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఓపెనర్లు లాథమ్ (21; 3 ఫోర్లు), కాన్వే (12) విఫలమవగా, ఆతిథ్య బంగ్లా బౌలర్లు పట్టు బిగించడంతో కివీస్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఈ దశలో విలియమ్సన్... డరైల్ మిచెల్ (41; 3 ఫోర్లు, 1 సిక్స్), గ్లెన్ ఫిలిప్స్ (42; 5 ఫోర్లు, 1 సిక్స్)లతో జట్టును నడిపించాడు. ఈ క్రమంలో అతను టెస్టు కెరీర్లో 29వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం పూర్తయిన కాసేపటికే విలియమ్సన్‌ను తైజుల్ ఇస్లామ్ బౌల్డ్ చేయడంతో 262 పరుగుల వద్ద ఏడో వికెట్‌గా నిష్క్రమించాడు. ఆట ముగిసే సమయానికి జేమీసన్ (7 బ్యాటింగ్), కెప్టెన్ టిమ్ సౌతీ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 4 వికెట్లు పడగొట్టాడు. షోరిఫుల్, మెహదీహసన్ మిరాజ్, నయీమ్ హసన్, మొమినుల్ తలా ఒక వికెట్ తీశారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులకు ఆలౌటైంది. -
కేన్ విలియమ్సన్ అద్భుత సెంచరీ.. విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సమం
సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ వైట్‌బాల్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 189 బంతుల్లో 11 ఫోర్లతో విలియమ్సన్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టెస్టుల్లో విలియమ్సన్కు ఇది 29వ సెంచరీ. తద్వారా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఆసీస్ దిగ్గజం బ్రాడ్‌మన్ రికార్డును విలియమ్సన్ సమం చేశాడు. విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్లో ఇప్పటివరకు 29 సెంచరీలు సాధించగా.. బ్రాడ్‌మన్ పేరిట కూడా 29 టెస్టు సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా మరో అరుదైన రికార్డును కేన్ మామ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి కివీస్ క్రికెటర్‌గా విలియమ్సన్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకపై కూడా కేన్ రెండు టెస్టుల్లో వరుసగా రెండు సార్లు సాధించాడు. కాగా విలియమ్సన్కు ఓవరాల్‌గా ఇది 42వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఇక బంగ్లాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ 104 పరుగులు చేశాడు. 81 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కివీస్ 262 పరుగులు చేసింది. -
IPL 2024: గుజరాత్ కొత్త కెప్టెన్ ఎవరనుకుంటున్నారు..?
2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్‌కు వలస వెళ్లాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ కొత్త కెప్టెన్ ఎవరనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. గుజరాత్ నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అని కొందరంటుంటే, మరికొందరేమో కేన్ విలియమ్సన్ పేరును సూచిస్తున్నారు. డేవిడ్ మిల్లర్, మొహమ్మద్ షమీ, రషీద్ ఖాన్ పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. ఇన్ని ఆప్షన్స్ మధ్య టైటాన్స్ యాజమాన్యం కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే కేన్ విలియమ్సన్ లాంటి విజయవంతమైన సారధిని జట్టులో ఉంచుకుని టైటాన్స్ యాజమాన్యం గిల్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెబుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వీరిద్దరిని కాదని షమీ లేదా రషీద్ ఖాన్‌కు పగ్గాలు అప్పచెబుతారా అంటే పలు సున్నితమైన అంశాలు అడ్డురావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు, విశ్లేషకులు ఎన్ని అనుకున్నా టైటాన్స్ యాజమాన్యానికి కెప్టెన్సీ అంశంపై పూర్తి క్లారిటీ ఉండవచ్చు. వారి నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి. గుజరాత్ కొత్త కెప్టెన్‌గా ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలపండి. కాగా, 2024 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ (నిలుపుకోవడం), రిలీజ్ (వేలానికి వదిలేయడం) ప్రక్రియ నిన్నటితో (నవంబర్ 26) ముగిసిన విషయం తెలిసిందే. అన్ని ఫ్రాంచైజీలు ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించాయి. దుబాయ్ వేదికగా ఈ ఏడాది డిసెంబర్ 19న జరిగే వేలం తర్వాత అన్ని ఫ్రాంచైజీలకు తుది రూపం వస్తుంది. ప్రస్తుతానికి గుజరాత్ ఫ్రాంచైజీ పరిస్థితి ఇలా ఉంది.. ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (76.85 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (23.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2). రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. యశ్ దయాల్ కేఎస్ భరత్ శివమ్ మావి ఉర్విల్ పటేల్ ప్రదీప్ సాంగ్వాన్ ఓడియన్ స్మిత్ అల్జరీ జోసఫ్ దసున్ షనక నిలబెట్టుకున్న ఆటగాళ్లు వీరే.. డేవిడ్ మిల్లర్ శుభ్‌మన్ గిల్ మాథ్యూ వేడ్ వృద్ధిమాన్ సాహా కేన్ విలియమ్సన్ అభినవ్ మనోహర్ సాయి సుదర్శన్ దర్శన్ నల్కండే విజయ్ శంకర్ జయంత్ యాదవ్ రాహుల్ తెవాటియా మొహమ్మద్ షమీ నూర్ అహ్మద్ సాయికిషోర్ రషీద్ ఖాన్ జాషువ లిటిల్ మోహిత్ శర్మ -
IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్?!
IPL 2024: భారత క్రికెట్ వర్గాల్లో హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిత్యంపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఐపీఎల్-2024 వేలానికి ముందే ఈ పేస్ ఆల్‌రౌండర్ తిరిగి ముంబై ఇండియన్స్‌తో చేరనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ వదులుకోవడానికి కూడా అతడు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. ‘‘కెరీర్లో గడ్డు పరిస్థితులో ఉన్న వేళ తనను పిలిచి అవకాశమిచ్చి.. కెప్టెన్‌గా కొత్త హోదా ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ పట్ల హార్దిక్ వైఖరి సరైంది కాదు. నిన్ను కాదనుకున్న ముంబై ఫ్రాంఛైజీతో తిరిగి చేతులు కలపడానికి డబ్బే కారణమా?’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు పాండ్యాను ప్రశ్నిస్తున్నారు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం ద్వారా వ్యాపిస్తున్న ఈ వదంతులపై హార్దిక్ పాండ్యా ఇంతవరకు స్పందించకపోవడం చూస్తుంటే.. ఇదంతా నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర చర్చ కూడా తెరమీదకు వచ్చింది. గుజరాత్ సారథి ఎవరు? ఐపీఎల్-2022 ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్‌ను అరంగేట్రంలోనే విజేతగా నిలిపాడు హార్దిక్ పాండ్యా. అతడి సారథ్యంలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన గుజరాత్ జట్టు ఐపీఎల్-2023 సీజన్లోనూ ఫైనల్‌కు చేరింది. ఈ నేపథ్యంలో విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన పాండ్యా ఒకవేళ నిజంగానే టైటాన్స్‌ను వీడితే.. తదుపరి నాయకుడు ఎవరన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విలియమ్సన్ లేదంటే గిల్? హార్దిక్ వారసుడిగా అనుభవజ్ఞుడైన కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)కు పగ్గాలు అప్పజెప్పుతారని కొంతమంది పేర్కొంటుండగా.. టీమిండియా యువ సంచలనం శుబ్‌మన్ గిల్ ఉండగా.. ఆ ఛాన్సే లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. యాజమాన్యం గిల్ వైపే భారత జట్టు భావి కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్న గిల్.. కచ్చితంగా గుజరాత్ టైటాన్స్ సారథి అవుతాడని తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు. గతంలో టైటాన్స్ యాజమాన్యం కూడా శుబ్‌మన్ గిల్‌కు జట్టును ముందుండి నడిపించగల సత్తా ఉందని పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అటు ఆటగాడిగా.. ఇటు కెప్టెన్‌గానూ సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తించగల సత్తా ఉన్న ఆటగాడంటూ గిల్ రికార్డులను తెరమీదకు తెస్తున్నారు. కాగా.. ఐపీఎల్-2023లో 3 సెంచరీల సాయంతో.. 890 పరుగులు చేసి శుబ్‌మన్ గిల్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. పాపం సన్‌రైజర్స్! ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ మూవ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పెద్ద చిక్కే వచ్చిపడిందని ఆ జట్టు అభిమానులు ఉసూరుమంటున్నారు. ‘‘30 ఏళ్ల హార్దిక్ పాండ్యా కనీసం మరో మూడేళ్లపాటు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా కొనసాగగల సత్తా ఉన్నవాడే! రోహిత్ శర్మ తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల సారథిగా బాధ్యతలు చేపట్టనున్న పాండ్యా వల్ల జట్టుకు మరింత ప్లస్ అవుతుందే తప్ప.. అతడి వల్ల వచ్చే నష్టమేమీ లేదు. కాబట్టి.. గుజరాత్ జట్టుతోనే ఉంటే.. పాండ్యా కారణంగా.. గిల్ ఇప్పట్లో కెప్టెన్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ అతడు ఫ్రాంఛైజీ మారాలనుకుంటే గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ గిల్‌ను కొనుగోలు చేసి కెప్టెన్ చేస్తే బాగుంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి’’ అని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ముంబై ప్రతిపాదనతో గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా విషయంలో వదిలేయాలనే నిర్ణయం తీసుకుంటే.. గిల్‌ను తమ కెప్టెన్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇదొక పెద్ద షాక్ లాంటిదే అని ఫ్యాన్స్ వాపోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. చదవండి: సచిన్, కోహ్లి కాదు! అత్యంత ఖరీదైన భవనంలో నివసిస్తున్న భారత క్రికెటర్? -
IND Vs NZ: అది వాడిన పిచ్.. అయినా సరే: విలియమ్సన్
ICC WC 2023 1st semis- India beat NZ: వన్డే వరల్డ్‌కప్-2023 తొలి సెమీ ఫైనల్ సందర్భంగా ‘పిచ్ మార్పు’పై చెలరేగిన వివాదంపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. అది వాడిన పిచ్ అని పునర్ఘాటించిన కేన్.. తమకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఇప్పటికే వినియోగించిన పిచ్ అయినప్పటికీ చాలా బాగుందని కితాబునిచ్చాడు. కాగా తొలి సెమీస్‌లో టీమిండయా- న్యూజిలాండ్ ముంబైలోని వాంఖడే వేదికగా బుధవారం తలపడిన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. శుబ్‌మన్ గిల్(80-నాటౌట్), విరాట్ కోహ్లి(117), శ్రేయస్ అయ్యర్(105) అద్భుత ఇన్నింగ్స్‌తో మెరవగా.. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడిన న్యూజిలాండ్ 327 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 70 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇదిలా ఉంటే.. వాంఖడే పిచ్‌ను ఆఖరి నిమిషంలో మార్చి భారత జట్టుకు అనుకూలం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి.. ఇలాంటి టోర్నీల్లో పిచ్ మార్పు సర్వసాధారణమని స్పష్టం చేసింది. వాంఖడే క్యూరేటర్ సిఫారసు మేరకు.. ఐసీసీ స్వతంత్ర పిచ్ సలహాదారుతో సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో కేన్ విలియమ్సన్ సైతం ఈ వివాదం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘అది ఇది వరకు వాడిన పిచ్. కానీ చాలా బాగుంది. మ్యాచ్ తొలి అర్ధ భాగంలో టీమిండియా చాలా బాగా బ్యాటింగ్ చేసింది. అయినా.. పరిస్థితులకు అనుగుణంగా పిచ్ మార్పులు జరుగుతూనే ఉంటాయి. అందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. భారత జట్టు చాలా బాగా ఆడింది. అయినా ఆఖరి వరకు మేము పోరాడి ఓడిపోయాం. అయితే, మేటి జట్టుకు మాత్రం గట్టి పోటీనివ్వగలిగాం. ప్రపంచంలోనే టీమిండియా అత్యుత్తమ జట్టు. ప్రస్తుతం వాళ్లు ఉత్తమ దశలో ఉన్నారు’’ అని విలియమ్సన్ పిచ్ మార్పు వివాదాన్ని కొట్టిపారేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
మా వాళ్లు వీరోచితంగా పోరాడారు.. గర్వంగా ఉంది: కేన్ విలియమ్సన్
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో భారత్ నాలుగోసారి ప్రపంచకప్ ఫైనల్లో ప్రవేశించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ కివీస్‌పై పైచేయి సాధించి, గత వరల్డ్‌కప్ సెమీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్‌మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో అద్బుతమైన పోరాటపటిమ కనబర్చిన న్యూజిలాండ్ చివరి వరకు గెలుపు కోసం ప్రయత్నించి విఫలమైంది. డారిల్ మిచెల్ (134), విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరు మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై, మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ముందుగా టీమిండియాకు అభినందనలు. వారు గొప్ప క్రికెట్ ఆడారు. మా వాళ్లు సైతం అద్భుతంగా పోరాడారు. మా పోరాటం పట్ల గర్వంగా ఉంది. మరోసారి నాకౌట్ కావడం నిరాశపరిచింది. శక్తివంచన లేకుండా ప్రయత్నించాం. టీమిండియా మాకంటే బెటర్ గేమ్ ఆడింది. అదో టాప్ క్లాస్ జట్టు. ప్రపంచ స్థాయి బ్యాటర్లంతా ఆ జట్టులోనే ఉన్నారు. వారందరూ మాపై ప్రతాపం చూపారు. 398 పరుగుల స్కోర్‌ను ఛేజ్ చేయడం ఆషామాషీ విషయం కాదు. అయినా మేం అద్భుతంగా పోరాడాం. ఛేజింగ్ చాలా కష్టంగా ఉండింది. భారత బౌలర్లకు క్రెడిట్ దక్కుతుంది. వారు మై పైచేయి సాధించారు. మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. జట్టుగా మాకు ఆట పట్ల నిజమైన నిబద్ధత ఉంది. గెలుపు కోసం చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేశాం. ఈ ఎడిషన్‌లో రచిన్, మిచెల్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. బౌలర్లు కాస్త తడబడ్డారు. అంతిమంగా మా జట్టు ప్రదర్శన సంతృప్తినిచ్చింది. ముంబై ప్రేక్షకులు అద్భుతం. వారు మమ్మల్ని సొంత ఆటగాళ్లలా ఆదరించారు. ఇక్కడికి రావడం ప్రత్యేకం. భారతదేశం ఆతిథ్యం అత్యద్భుతం. చదవండి: ఒత్తిడిలోనూ మా వాళ్లు అద్భుతం.. వాళ్లు కూడా బాగా ఆడారు: రోహిత్ శర్మ -
వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత్...అభిమానులు సంబరాలు (ఫోటోలు)
-
CWC 2023 Ind vs NZ: న్యూజిలాండ్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు చేరిన టీమిండియా
ICC Cricket World Cup 2023 - India vs New Zealand, 1st Semi-Final (1st v 4th) Updates: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ముంబై వేదికగా తొలి సెమీ ఫైనల్ జరుగుతోంది. అజేయ రికార్డుతో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా- నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో పోటీకి దిగింది. వాంఖడేలో జరుగుతున్న ఈ మ్యాచ్ అప్డేట్స్... టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 397 పరుగులు చేసింది. ఫైనల్‌కు చేరిన టీమిండియా వన్డేప్రపంచకప్-2023 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. వాంఖడే వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(134) విరోచిత శతకంంతో పోరాడినప్పటికీ.. తన జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయాడు. మిచెల్‌తో పాటు కెప్టెన్ కేన్ విలియమ్పన్(69) పర్వాలేదన్పించాడు. ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ అద్భుమైన ప్రదర్శన కనబరిచాడు. షమీ ఏకంగా 7 వికెట్లతో చెలరేగాడు. ఓవరాల్‌గా 9.5 ఓవర్లు వేసిన షమీ.. 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ సాధించారు. ఎనిమిదో వికెట్ డౌన్.. వరల్డ్‌కప్ సెమీస్‌లో విజయం దిశగా టీమిండియా కొనసాగుతోంది. 319 పరుగుల వద్ద న్యూజిలాండ్ 8వ వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో శాంట్నర్ ఔటయ్యాడు. ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. మహ్మద్ షమీ మరోసారి ఐదు వికెట్ల హాల్ సాధించాడు. కివీస్‌తో సెమీస్‌లో మిచెల్‌ను ఔట్ చేసిన షమీ.. ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ విజయానికి 24 బంతుల్లో 90 పరుగులు కావాలి. విజయం దిశగా భారత్.. 298 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన చాప్మన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కివీస్ విజయానికి 36 బంతుల్లో 99 పరుగులు కావాలి. బుమ్ బుమ్రా.. కివీస్ ఐదో వికెట్ డౌన్ 295 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన ఫిలిప్స్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. కివీస్ విజయానికి 42 బంతుల్లో 103 పరుగులు కావాలి. పోరాడుతున్న మిచెల్ 39 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. కివీస్ విజయానికి 66 బంతుల్లో 141 పరుగులు కావాలి. క్రీజులో డార్లీ మిచెల్(118), ఫిలిప్స్(18) పరుగులతో ఉన్నారు. సూపర్ షమీ.. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరోసారి అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు పడగొట్టి.. కివీస్ మళ్లీ బ్యాక్ ఫుట్‌లో ఉంచాడు. 33 ఓవర్ వేసిన షమీ.. తొలుత అద్బుతంగా ఆడుతున్న కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపగా, ఆ తర్వాత టామ్ లాథమ్‌ను ఔట్ చేశాడు. 34 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్: 221/4. కివీస్ విజయానికి 96 బంతుల్లో 177 పరుగులు కావాలి. డారిల్ మిచెల్ సెంచరీ న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 85 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసిన విలియమ్సన్.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 58 బంతుల్లో కేన్ మామ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. న్యూజిలాండ్ స్కోరు: 165-2(26) అర్ధ శతకం పూర్తి చేసుకున్న డారిల్ మిచెల్ 22.1: కేన్ విలియమ్సన్తో కలిసి డారిల్ మిచెల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో జడేజా బౌలింగ్‌లో సింగిల్ తీసి 50 పరుగుల మార్కును అందుకున్నాడు. న్యూజిలాండ్ స్కోరు: 148-2(23) 18 ఓవర్లకు కివీస్ స్కోర్: 114/2 న్యూజిలాండ్ బ్యాటర్లు డారిల్ మిచెల్ (33), కేన్ విలియమ్సన్ (30) పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. 18 ఓవర్లకు కివీస్ స్కోర్: 114/2 నిలకడగా ఆడుతున్న కేన్, మిచెల్ డారిల్ మిచెల్ 17, కేన్ విలియమ్సన్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లలో స్కోరు: 87-2 పవర్ ప్లేలో న్యూజిలాండ్ స్కోరు: 46-2(10) 7.4: రచిన్ రవీంద్ర అవుట్ టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరోసారి మాయ చేశాడు. అద్భుత బంతితో రచిన్ రవీంద్ర(13(22) [4s-3])ను బోల్తా కొట్టించి రోహిత్ సేనకు రెండో వికెట్ అందించాడు. కేన్ విలియమ్సన్ (4), డారిల్ మిచెల్ క్రీజులో ఉన్నారు. కివీస్ స్కోరు: 40/2 (8) 5.1: తొలి బంతికే వికెట్ దక్కించుకున్న షమీ కాన్వే రూపంలో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి డెవాన్ కాన్వే 13(15) [4s-3] వెనుదిరిగాడు. 5 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు: 30/0 కాన్వే 13, రచిన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) 2 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు: 12/0 డెవాన్ కాన్వే(8), రచిన్ రవీంద్ర 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కోహ్లి, అయ్యర్ సెంచరీలు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ(47) సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అర్ధ శతకం(80-నాటౌట్)తో రాణించాడు. ఇక విరాట్ కోహ్లి(117) రికార్డు సెంచరీతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించగా.. శ్రేయస్ అయ్యర్(105) తనదైన శైలిలో చెలరేగి శతకం బాదాడు. దీంతో ఈ మేరకు టీమిండియా భారీ స్కోరు నమోదు చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీకి మూడు, ట్రెంట్ బౌల్ట్‌కు ఒక వికెట్ దక్కింది. సెంచరీతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్‌తో సెమీస్‌లో శ్రేయస్ అయ్యర్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 67 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో అయ్యర్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 48 ఓవర్లకు భారత్ స్కోర్: 366/2 విరాట్ కోహ్లి ఔట్.. 327 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 117 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. సౌథీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి చరిత్క సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో విరాట్ తన 50వ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను తన పేరిట కోహ్లి లిఖించుకున్నాడు. 106 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో సెంచరీ(106) సాధించాడు. టీమిండియా స్కోరు: 303-1(42) శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ.. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించాడు. 35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో అయ్యర్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 39 ఓవర్లకు భారత్ స్కోర్: 277/1. క్రీజులో కోహ్లి(93), అయ్యర్(54) పరుగులతో ఉన్నారు. సెంచరీకి చేరువైన కోహ్లి 35.6: కోహ్లి 86 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సెంచరీకి దిశగా కోహ్లి కోహ్లి 78, అయ్యర్ 30 పరుగులతో నిలకడగా ఆడుతూ.. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. 33 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 238/1. నిలకడగా ఆడుతున్న కోహ్లి, అయ్యర్ కోహ్లి 65, అయ్యర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. 30 ఓవర్లలో టీమిండియా స్కోరు: 214-1 28 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 197-1 26.6: విరాట్ కోహ్లి అర్ధ శతకం 26.3: రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో సిక్సర్ బాదిన శ్రేయస్ అయ్యర్ 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 178-1 కోహ్లి 45, అయ్యర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. 23: ఆబ్సెంట్ హర్ట్‌గా వెనుదిరిగిన శుబ్‌మన్ గిల్. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్. టీమిండియా స్కోరు: 164-2 శాంట్నర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఎండ వేడిమికి తట్టుకోలేక ఇబ్బందిగా కదిలిన గిల్.. తొడ కండరాలు పట్టేయడంతో ఆబ్సెంట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. కట్టుదిట్టంగా శాంట్నర్ బౌలింగ్ 21: కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన శాంట్నర్.. కేవలం మూడు పరుగులు రాబట్టిన టీమిండియా. స్కోరు: 153-1 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 150/1 గిల్ 75, కోహ్లి 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) 18 ఓవర్లలో టీమిండియా స్కోరు: 138/1 గిల్ 65, కోహ్లి 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న గిల్, కోహ్లి 16వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు: 121-1 15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 118/1 గిల్ 52, కోహ్లి 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. గిల్ హాఫ్ సెంచరీ 13.3: రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న శుబ్‌మన్ గిల్. అంతర్జాతీయ వన్డేలో అతడికిది 13వ హాఫ్ సెంచరీ. 12 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 92-1 కోహ్లి 4, గిల్ 38 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 11 ఓవర్లలో టీమిండియా స్కోరు: 89-1 పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 84/1 (10) 9 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 75-1 రోహిత్ అవుట్ 8.2: రోహిత్ శర్మ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. గిల్ 21, కోహ్లి క్రీజులో ఉన్నారు. హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ (47) 8 ఓవర్లలో టీమిండియా స్కోరు: 70/0 (8) టీమిండియా ప్రస్తుత స్కోరు: 61/0 (7) రోహిత్ శర్మ 47, గిల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లలో టీమిండియా స్కోరు: 58-0 క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు 27 సిక్స్‌లు తన ఖాతాలో వేసుకుని వెస్టిండీస్ స్టార్ క్రిస్‌గేల్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. టీమిండియా స్కోరు: 47-0(5) View this post on Instagram A post shared by ICC (@icc) 4 ఓవర్లలో టీమిండియా స్కోరు: 38/0 రోహిత్ 27, గిల్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3.4: సౌథీ బౌలింగ్‌లో సిక్స్ బాదిన రోహిత్ 3.3: సౌథీ బౌలింగ్‌లో ఫోర్ బాదిన రోహిత్ View this post on Instagram A post shared by ICC (@icc) 3 ఓవర్లలో టీమిండియా స్కోరు: 25-0 ►2.3: టీమిండియా ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్ నమోదు చేసిన రోహిత్ శర్మ 2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 18-0 1.4: మరోసారి బౌండరీ బాదిన శుబ్‌మన్ గిల్ 1.3: సౌథీ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన శుబ్‌మన్ గిల్ ►తొలి ఓవర్లో టీమిండియా స్కోరు: 10/0 (1) 0.5: రోహిత్ శర్మ ఖాతాలో మరో బౌండరీ 0.4: బౌల్ట్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన రోహిత్ శర్మ టాస్ గెలిచిన టీమిండియా ►టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాంఖడేలో పిచ్ స్వభావాన్ని బట్టి భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేయడం సానుకూలాంశంగా పరిణమించింది. View this post on Instagram A post shared by ICC (@icc) 2019లో కూడా సెమీస్ ఆడాం ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘పిచ్ బాగుంది. కాబట్టి ముందుగా మేము బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. 2019లో కూడా మేము సెమీస్ ఆడాం. న్యూజిలాండ్ నిలకడైన ఆట తీరుకు మారుపేరైన జట్లలో ఒకటి. ఏదేమైనా ఇరు జట్లకు అత్యంత ముఖ్యమైన ఈ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. మా తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు’’ అని పేర్కొన్నాడు. తుది జట్లు: టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్. పిచ్, వాతావరణం ఈ వరల్డ్ కప్‌లో వాంఖడే మైదానంలో పరుగుల వరద పారింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో అన్ని జట్లూ భారీ స్కోర్లు చేశాయి. రెండో అర్ధభాగం ఆరంభంలో పేస్ బౌలింగ్‌కు పిచ్ అనుకూలిస్తోంది. సెమీస్ ఒత్తిడిని కూడా దృష్టిలో ఉంచుకొని చూస్తే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన లేదు. ఒకవేళ అవాంతరం ఎదురైనా సెమీస్‌కు రిజర్వ్ డే కూడా ఉంది. -
CWC 2023 IND VS NZ Semi Final: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే..!
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఇవాళ (నవంబర్ 15) అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారీ అంచనాలు కలిగిన ఈ మ్యాచ్‌లో టాస్ అత్యంత కీలకపాత్ర పోషించనుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు పూర్తిగా సహకరించనుందని అంచనాలు ఉండటంతో ఏ జట్టైనా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలని భావిస్తుంది. ఈ పిచ్‌పై గతంలో పరుగుల వరద పారిన సందర్భాలు కోకొల్లలు. ఇదే టోర్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచినప్పటికీ బౌలింగ్ ఎంచుకుని చేయరాని తప్పు చేసింది. అనంతరం ఫలితం (302 పరుగుల భారీ తేడాతో ఓటమి) అనుభవించింది. ఇది దృస్టిలో ఉంచుకుని ఇరు జట్లు టాస్ గెలిస్తే తప్పక బ్యాటింగ్ ఎంచుకుంటాయి. ఈ మైదానంలో మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. బౌండరీ చిన్నదిగా ఉండటంతో బ్యాటర్లు అవలీలగా ఫోర్లు, సిక్సర్లు బాది భారీ స్కోర్లకు దోహదపడగలరు. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచితే మిగతా పనిని పేస్ బౌలర్లు చూసుకుంటారు. ఈ పిచ్ తొలుత బ్యాటింగ్‌కు ఎంతగా సహకరిస్తుందో, సెకెండాఫ్‌లో పేస్ బౌలింగ్‌కు అంతగానే సహకరిస్తుంది. ఇది కూడా మనం ఇటీవలే చూశాం. లీగ్ దశలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 357 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో భారత పేసర్లు షమీ (5/18), సిరాజ్ (3/16), బుమ్రా (1/8) రెచ్చిపోయి లంకేయులను 55 పరుగులకే కుప్పకూల్చారు. ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో ఉంచుకుని టాస్ గెలిచిన జట్టు తప్పక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటుంది. జట్టు ఏదైనా టాస్ గెలిచిందా.. సగం మ్యాచ్ గెలిచినట్లే. ఇక వాతావరణం విషయానికొస్తే.. వర్ష సూచన లేదు. ఒకవేళ అవాంతరం ఎదురైనా రిజర్వ్ డే ఉంది. కాబట్టి వంద వాతం పూర్తి మ్యాచ్‌కు ఢోకా ఉండదు. మరి ఏ జట్టు గెలిచి ఫైనల్‌కు చేరుతుందో, ఏ జట్టు ఓడి ఇంటిబాట పడుతుందో వేచి చూడాలి. -
ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
వన్డే వరల్డ్‌కప్ 2023లో ఇవాళ (నవంబర్ 15) అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో భారత్,న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మరి ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఓడి ఇంటిబాట పడుతుందో తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాలి. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మ్యాచ్‌కు సంబంధించిన పలు విషయాలు మాట్లాడారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది. మేం ఇప్పుడు పూర్తి నమ్మకంతో, ధైర్యంతో బరిలోకి దిగుతున్నాం. ఇలాంటప్పుడే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. టోర్నీలో తొలి ఐదు మ్యాచ్‌లలో మేం లక్ష్యాన్ని ఛేదించగా, తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేశాం. కాబట్టి అన్ని రకాలుగా మమ్మల్ని మేం పరీక్షించుకున్నట్లే. వాటితో పోలిస్తే ఈ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో మాకు తెలుసు. అయినా సరే మేం ఏమీ కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలా ఆడామో అలా ఆడితే చాలు. ఒత్తిడి కొత్త కాదు. ప్రపంచకప్‌లో సెమీస్ అయినా లీగ్ మ్యాచ్ అయినా ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. భారత క్రికెటర్లపై ఇది మరీ ఎక్కువ. ఆటగాళ్లంతా ఆ స్థితిని దాటుకునే వచ్చారు కాబట్టి బాగా ఆడటమే అన్నింటికంటే ముఖ్యం. న్యూజిలాండ్ ఎంతో తెలివైన, క్రమశిక్షణ కలిగిన జట్టు. ప్రత్యర్ధిని బాగా అర్థం చేసుకొని తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు. 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులో ఎవ్వరూ పుట్టనే లేదు. 2011లో సగం మంది క్రికెట్ మొదలు పెట్టలేదు. కాబట్టి ఈ జట్టు సభ్యులంతా గతం గురించి కాకుండా వర్తమానంపై, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. గతంలో నాకౌట్ మ్యాచ్‌లలో, నాలుగేళ్ల క్రితం ఏం జరిగిందనేది కూడా మాకు అనవసరమని అన్నాడు. చదవండి: భారత్‌తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్.. మేం వాటికి అలవాటుపడిపోయాం: విలియమ్సన్ -
భారత్‌తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్.. మేం వాటికి అలవాటుపడిపోయాం: విలియమ్సన్
వన్డే వరల్డ్‌కప్ 2023 చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్స్, ఫైనల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో విజేత ఎవరో తేలిపోతుంది. ముంబై వేదికగా ఇవాళ (బుధవారం) జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. అండర్ డాగ్స్‌గా పేరున్న న్యూజిలాండ్‌పై ఏమేరకు రాణించగలదో వేచి చూడాలి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే వ్యూహరచనలన్నిటినీ పూర్తి చేసుకున్నాయి. ఇక బరిలోకి దిగడమే తరువాయి. ఈ కీలక సమరానికి ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన వాయిస్‌ను వినిపించాడు. విలియమ్సన్ ఏమన్నాడంటే.. భారత్‌తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్ అనేది వాస్తవం. ఆ టీమ్ చాలా బాగా ఆడుతోంది. అయితే టోర్నీలో ప్రతీ మ్యాచ్ భిన్నమైందే. తమదైన రోజున ఏ జట్టయినా ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. జట్టు బలంతో పాటు అప్పటి పరిస్థితులు, వాటి ప్రభావం కూడా అందుకు కారణమవుతాయి. లీగ్‌లో ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామన్నది ముఖ్యం కాదు. నాకౌట్ దశను మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. వరుసగా గత రెండు వరల్డ్ కప్‌లలో మేం ఫైనల్ చేరినా మమ్మల్ని ఇంకా అండర్‌డాగ్స్‌గానే చూస్తుంటారు. మేం వీటికి అలవాటుపడిపోయాం కాబట్టి ఇబ్బందేమీ లేదు. మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఇక్కడా గెలవగలం కాబట్టి ఏదైనా జరగొచ్చు. 2019లాగే ఈసారి కూడా మైదానంలో అంతా భారత అభిమానులే ఉంటారు. మాకు మద్దతు పలకకపోయినా ఆ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. మా జట్టులో చాలా మందికి ఇది అలవాటే. అయినా భారత గడ్డపై భారత్‌తో సెమీస్‌లో తలపడటమే ఎంతో ప్రత్యేకం. -
NZ VS SL: పెరీరా మ్యాచ్ లాగేసుకున్నాడనుకున్నాం: కేన్ విలియమ్సన్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుపుతో పాక్, ఆఫ్ఘనిస్తాన్లు సెమీస్ ఆశలు వదులుకున్నాయి. ఈ గెలుపుతో పాయింట్లతో పాటు రన్‌రేట్‌ను సైతం భారీగా మెరుగుపర్చుకున్న కివీస్.. పాక్, ఆఫ్ఘన్లు తమ తర్వాతి మ్యాచ్‌ల్లో గెలిచినా కూడా సెమీస్‌కు చేరే అవకాశాలు లేకుండా చేసింది. ఏదో అద్భుతాలు జరిగితే తప్ప పాక్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరలేవు. కివీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు.. కుశాల్ పెరీరా (28 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే అతను ఔటయ్యాక ఏ ఒక్క లంక బ్యాటర్ కూడా రాణించకపోవడంతో శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. ఆఖర్లో తీక్షణ (38 నాటౌట్), మధుషంక (19) పోరాడటంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ట్రెంట్ బౌల్ట్ (10-3-37-3) లంక బ్యాటర్లను గడగడలాడించగా.. రచిన్ రవీంద్ర (2/21), ఫెర్గూసన్ (2/35), సాంట్నర్ (2/22) సత్తా చాటారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు కాన్వే (45), రచిన్ (42) మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరితో పాటు డారిల్ మిచెల్ (43) కూడా రాణించడంతో కివీస్ 23.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మా వాళ్లు అద్భుతంగా ఆడారు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడం సవాలుగా ఉండింది. ఆరంభంలో వికెట్లు కోల్పోవడంతో కాస్త తడబడ్డాం. ఛేదనలో పిచ్ బాగా నెమ్మదించింది. మా బ్యాటర్లు కృత నిశ్చయం కలిగి బ్యాటింగ్ చేశారు. వరుణుడు అడ్డుతగులుతాడేమోనని భయపడ్డాం. పరుగులు అంత ఈజీగా రాలేదు. ఓవరాల్‌గా మంచి బ్యాటింగ్ ప్రదర్శన. బౌలింగ్ విషయానికొస్తే.. మా బౌలర్లు అద్భుతం. ప్రత్యర్ధిని త్వరగా ఆలౌట్ చేసి గెలుపుకు మంచి పునాది వేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీయగలిగినందుకు సంతోషంగా ఉంది. పెరీరా మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడనుకున్నాం. అలాంటి ఆటగాళ్లు నిమిషాల వ్యవధిలో ఫలితాన్ని మార్చేయగలరు. అయితే మా బౌలర్లు అతన్ని త్వరగా సాగనంపి మ్యాచ్‌పై పట్టు సాధించేలా చేశారు. ఓవరాల్‌గా మా ఆటగాళ్ల నుంచి అద్భుత ప్రదర్శన. సెమీస్ బెర్త్‌పై ఇప్పుడే ఏమీ చెప్పలేను. అయితే, ఫైనల్ ఫోర్కు చేరితే బాగుంటుంది. సెమీస్‌లో భారత్ లాంటి పటిష్ట జట్టును ఎదుర్కోవడం సవాలుగా ఉంటుంది. ఇది జట్టుగా మమ్మల్ని పరీక్షిస్తుందని విలియమ్సన్ అన్నాడు. -
వరల్డ్‌కప్‌లో అత్యంత చెత్త రివ్యూ.. నవ్వు ఆపుకోలేకపోయిన కేన్ మామ
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ తీసుకున్న రివ్యూ నవ్వులు పూయించింది. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక కేవలం 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ పేస్ బౌలర్ లూకీ ఫెర్గూసన్‌ను మరోసారి బౌలింగ్ ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. లంక ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన ఫెర్గూసన్ మూడో బంతికి కరుణరత్నేను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చమీరాకు ఫెర్గూసన్.. నాలుగో బంతిని ఫుల్‌టాస్‌గా సంధించాడు. అయితే బంతి ఇన్్సైడ్ ఎడ్జ్ తీసుకుని చమీరా ప్యాడ్‌కు తాకింది. కానీ న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎల్బీకి అప్పీలు చేశారు. ఈ క్రమంలో ఫస్ట్‌స్లిప్‌లో ఉన్న డార్లీ మిచెల్ మాత్రం కాన్ఫిడెన్స్‌తో రివ్యూ తీసుకోమని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను సూచించాడు. దీంతో సీనియర్ ఆటగాడి మీద నమ్మకంతో రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లేలో క్లియర్‌గా బాల్ బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది. ఇది చూసిన కివీస్ ప్లేయర్స్ ఒక్కసారిగా నవ్వుకున్నారు. కివీస్ కెప్టెన్ నవ్వు అపుకోలేక తన చేతులతో ముఖాన్ని దాచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: World cup 2023: శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ View this post on Instagram A post shared by ICC (@icc) pic.twitter.com/xdW1vDR2kv — Cricket Videos Here (@CricketVideos98) November 9, 2023 pic.twitter.com/xdW1vDR2kv — Cricket Videos Here (@CricketVideos98) November 9, 2023 -
సెమీస్ లక్ష్యంగా! న్యూజిలాండ్ బౌలర్ల విజృంభణ.. లంక 171 ఆలౌట్
ICC Cricket World Cup 2023- New Zealand vs Sri Lanka: వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సెమీస్ బెర్తు ఖరారు చేసుకునే క్రమంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టుకు శుభారంభం అందించారు. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో ఆరంభంలో వరుస విజయాలు సాధించిన న్యూజిలాండ్.. ఆ తర్వాత వెనుకబడింది. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరగా.. నాలుగో స్థానం కోసం కివీస్ పోరాడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ నమ్మకాన్ని నిలబెడుతూ కివీస్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఆరంభంలోనే ఓపెనర్ పాతుమ్ నిసాంక(2)ను టిమ్ సౌథీ పెవిలియన్‌కు పంపగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కుశాల్ మెండిస్(6)ను ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. అంతేకాదు.. నాలుగో స్థానంలో వచ్చిన సమరవిక్రమ(1), ఐదో నంబర్ బ్యాటర్ చరిత్ అసలంక(8)ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరో ఓపెనర్ కుశాల్ పెరీరా పట్టుదలగా నిలబడ్డాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో అర్థ శతకం సాధించి.. లంక శిబిరంలో ఉత్సాహం నింపాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగుల మార్కు అందుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి పెరీరాకు సహకారం కరువైంది. దీంతో లంక స్కోరు బోర్డు నత్తనడకన సాగుతుండగా.. పెరీరా వికెట్ తీసి లాకీ ఫెర్గూసన్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పదో ఓవర్ మూడో బంతికి ఫెర్గూసన్ బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెరీరా వెనుదిరిగాడు. దీంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి అడ్డుకట్ట వేసే నాథుడే లేకుండా పోయాడు. పవర్ ప్లే ముగిసే లోపే ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ కుశాల్ పెరీరా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా 74 పరుగులు చేసిన శ్రీలంకను.. ఆ తర్వాత కివీస్ బౌలర్లు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. వరుసగా వికెట్లు పడగొట్టారు. అయితే మహీశ్ తీక్షణ 38 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 46.4 ఓవర్లలో 171 పరుగులకు లంక ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ మూడు, ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు తీయగా.. సౌథీకి ఒక వికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో లంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని వీలైనన్ని తక్కువ బంతుల్లో ఛేదించి రన్‌రేటు మెరుగుపరచుకోవడంపైనే న్యూజిలాండ్ దృష్టి సారించింది. అయితే, ఓవైపు ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండగా.. మరోవైపు.. గత ముఖాముఖి పోరు ఫలితాన్ని పునరావృతం చేయాలని శ్రీలంక పట్టుదలగా ఉంది. దీంతో న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు ప్రస్తుతానికి వరుణుడు, లంక బౌలర్ల ప్రదర్శన తీరుపైనే ఆధారపడి ఉన్నాయి. చదవండి: అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్ View this post on Instagram A post shared by ICC (@icc) -
న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు లంక విలవిల.. నామమాత్రపు స్కోరు
CWC 2023- NZ vs SL Updates: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక 171 పరగులకు ఆలౌట్ అయింది. కివీస్‌తో మ్యాచ్.. కష్టాల్లో శ్రీలంక జట్టు 32.1: రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి చమీర అవుట్(1). 33 ఓవర్లలో లంక స్కోరు: 132-9 ► 25 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక స్కోరు: 114-8 ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 23.3: ఫెర్గూసన్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి కరుణరత్నె అవుట్(6). లంక స్కోరు: 113/8 (23.3) 19 ఓవర్లు ముగిసే సరికి స్కోరు: 105-7 ►18.3: సాంట్నర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన ధనంజయ(19) ►16.4: సాంట్నర్ బౌలింగ్‌లో మథ్యూస్(16) అవుట్.. ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక పవర్ ప్లేలో అతడొక్కడే న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ పాతుమ్ నిసాంక రెండు పరుగులకే అవుట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ 6 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధ శతకం(51) సాధించగా.. నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన సమర విక్రమ 1, చరిత్ అసలంక 8, పరుగులు మాత్రమే చేశారు. దీంతో పవర్‌ప్లే(10 ఓవర్లు) ముగిసే సరికి లంక కేవలం 74 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ మూడు, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ ఒక్కో వికెట్ పడగొట్టారు. వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (నవంబర్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ఇష్ సోధి స్థానంలో లోకీ ఫెర్గూసన్ కివీస్ తుది జట్టులోకి రాగా.. కసున్ రజిత స్థానంలో చమిక కరుణరత్నే లంక ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తుది జట్లు.. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్‌కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, లోకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్ శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్/వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, చమిక కరుణరత్నే, దిల్షన్ మధుశంక -
పాకిస్తాన్ బౌలింగ్‌ను చిత్తు చేసి.. భారీ స్కోరుతో రికార్డులు సృష్టించిన న్యూజిలాండ్
వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. పాక్ పేసర్ల బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న కివీస్ బ్యాటర్లు జట్టుకు రికార్డు స్థాయి స్కోరు అందించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో హసన్ అలీ కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వేను 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మళ్లీ వికెట్ల కోసం ప్రయత్నించిన పాక్ బౌలింగ్ విభాగానికి.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర, కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొరకరాని కొయ్యలా తయారయ్యారు. View this post on Instagram A post shared by ICC (@icc) రచిన్ 108, కేన్ విలియమ్సన్ 95 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ జోడీని ఇఫ్తికార్ అహ్మద్ విడదీసినా అప్పటికే భారీ స్కోరుకు బలమైన పునాది పడింది. ఇక మిగిలిన వాళ్లలో డారిల్ మిచెల్ 29, మార్క్ చాప్మన్ 39, గ్లెన్ ఫిలిప్స్ 41, మిచెల్ శాంట్నర్ 26 పరుగులు(నాటౌట్) సాధించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 401 పరుగులు స్కోరు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) తద్వారా చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక స్కోరు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. అదే విధంగా.. వరల్డ్‌కప్ ఈవెంట్లో సౌతాఫ్రికా(3 సార్లు) తర్వాత టీమిండియా, ఆస్ట్రేలియాతో కలిసి 400+ స్కోరు నమోదు చేసిన నాలుగో జట్టుగా అవతరించింది. అంతేకాదు.. వన్డేల్లో పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు సాధించిన రెండో జట్టుగా కివీస్ చరిత్ర సృష్టించింది. గతంలో ఇంగ్లండ్ పాక్‌తో 2016 నాటి మ్యాచ్‌లో 444/3 స్కోరు నమోదు చేసింది. వీటితో పాటు మరో అరుదైన ఘనతను కూడా న్యూజిలాండ్ జట్టు తమ ఖాతాలో వేసుకుంది. వరల్డ్‌కప్ చరిత్రలో పాకిస్తాన్ మీద అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc)