Top Stories
ప్రధాన వార్తలు
చంద్రబాబు పాత కేసులు..ఐఏఎస్‌లపై ఒత్తిళ్లు..?
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు పాత కేసుల్లో సాక్షులైన ఐఏఎస్ అధికారులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాబు అవినీతి కేసుల్లో ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారులను మళ్లీ స్టేట్మెంట్ ఇవ్వాలని సీఐడీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.స్కిల్ డెవలప్మెంట్,ఫైబర్ నెట్,అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్,సిహెచ్ శ్రీధర్ గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తాజాగా వీరిని ఫైబర్ నెట్ స్కామ్,అమరావతి అసైన్డ్ భూముల కేసుల్లో మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఐఏఎస్‌లపై సీఐడీ ఒత్తిడి చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. సీఆర్పీసీ 164 సెక్షన్ కింద స్టేట్మెంట్ రికార్డ్ చెయ్యడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం.ఇదీ చదవండి: సూపర్‌సిక్స్‌కు ఎగనామం
టీ బ్రేక్‌కు భారత్ స్కోర్: 107/4
India vs Aus 5th test day 1 live updates and highlights: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.టీ బ్రేక్‌కు భారత్ స్కోర్: 107/4టీ విరామానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(10), రిషబ్ పంత్(26) ఉన్నారు.48 ఓవర్లకు భారత్ స్కోర్: 100/4రవీంద్ర జడేజా(10), రిషబ్ పంత్(26) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 28 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 48 ఓవర్లకు భారత్ 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న రిషబ్ పంత్..విరాట్ కోహ్లి ఔటయ్యాక టీమిండియా బ్యాటర్లు రిషబ్ పంత్(19 నాటౌట్), రవీంద్ర జడేజా(4 నాటౌట్) ఆచితూచి ఆడుతున్నారు. 44 ఓవర్లకు భారత్ స్కోర్: 87/4టీమిండియా నాలుగో వికెట్ డౌన్..విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వెబ్‌స్టర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి(17) ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 35 ఓవర్లకు భారత్ స్కోర్: 76/4నిలకడగా ఆడుతున్న కోహ్లి, పంత్లంచ్ అనంతరం తొలి రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. 30 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 67/3. క్రీజులో పంత్(7)తో పాటు విరాట్ కోహ్లి(14) పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్.. గిల్ ఔట్‌శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. లంచ్ విరామానికి ముందు లియోన్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ ఔటయ్యాడు. లంచ్ బ్రేక్‌కు భారత్ స్కోర్: 57/3నిలకడగా ఆడుతున్న కోహ్లి, గిల్..శుబ్‌మన్ గిల్, కోహ్లి నిలకడగా ఆడుతున్నారు. ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 50/2జైశ్వాల్ ఔట్..టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అద్బుతమైన ఫామ్‌లో ఉన్న జైశ్వాల్ ఈ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు.రాహుల్ ఔట్..కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రాహుల్.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శుబ్‌మన్ గిల్ వచ్చాడు. 7 ఓవర్లకు భారత్ స్కోర్: 14/1రోహిత్ ఔట్.. గిల్ ఇన్సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు భారత జట్టు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఆఖరి టెస్టులో టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు.రోహిత్‌తో పాటు గాయం కారణంగా ఆకాష్ దీప్ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. రోహిత్ స్ధానంలో శుబ్‌మన్ గిల్ తుది జట్టులోకి రాగా.. ఆకాష్ స్ధానంలో ప్రసిద్ద్ కృష్ణ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. మిచెల్ మార్ష్ స్ధానంలో వెబ్‌స్టర్‌కు చోటు దక్కింది.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్
అమెరికాలో భవనంపై కూలిన విమానం
కాలిఫోర్నియా:వరుస విమాన ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలోని ఫులర్టన్లో ఓ వాణిజ్య భవనంపై చిన్న విమానం కూలిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలవ్వగా 18 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నట్లు ఫులర్టన్ పోలీసులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం(జనవరి2) మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.గాయపడ్డవారిలో ఎనిమిది మందిని అప్పటికప్పుడే డిశ్చార్చ్ చేశారన్నారు. కూలిన విమానం సింగిల్ ఇంజిన్ విమానమని ఫెడరల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ తెలిపింది. విమానం కూలిన భవనంలో మంటలు చెలరేగాయి. ఘటన తర్వాత విమాన శకలాలు భవనంలోపల ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు.కాగా, ఇటీవలే దక్షిణకొరియా, కజకిస్తాన్‌లలో భారీ విమాన ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో వందల మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఇవి కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మరికొన్ని పెద్ద విమాన ప్రమాదాలు తృటిలో తప్పాయి.ఇదీ చదవండి: ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన
ఫార్ములా కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసులో పలు ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి మరింత సమయం కోరారు. దీంతో, ఈనెల 8, 9 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు.ఫార్ములా ఈ-కారు రేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిన్న బీఎల్ఎన్ రెడ్డి, నేడు అరవింద్ కుమార్‌ను ఈడీ విచారించాల్సి ఉండగా.. హాజరయ్యేందుకు సమయం కావాలని వీరిద్దరూ కోరారు. మూడు వారాల సమయం కావాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. దీంతో, స్పందించిన ఈడీ.. రెండు వారాల సమయం కుదరదని చెప్పింది. ఈనెల 8వ తేదీన విచారణకు రావాలని బీఎల్ఎన్ రెడ్డికి మరోసారి ఈడీ.. నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈనెల 9న అరవింద్ కుమార్ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో, వీరిద్దరూ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తకరంగా మారింది.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈనెల 7వ తేదీన ఈడీ అధికారులు విచారించనున్నారు. అయితే, కేటీఆర్.. ఈడీ వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక, కారు రేసులో విదేశీ కంపెనీకి నిధులు మళ్ళించడంపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ స్టేట్మెంట్ను కూడా ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. ఈ స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు.ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ కంటే ముందే ఏ2, ఏ3 అయిన అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. కానీ, అనూహ్యంగా వారిద్దరూ తమకు సమయం కావాలని కోరారు. దీంతో, ఈడీ అధికారులు ముందుగా కేటీఆర్‌నే విచారించాల్సి వస్తోంది.
బాబు ఎఫెక్ట్.. కళ తప్పిన పండగ మార్కెట్!
రాష్ట్రంలో దసరా.. దీపావళి.. నూతన సంవత్సరం తరువాత మరో పెద్ద పండగ వస్తోంది. పిల్లాపాపలతో.. కొడుకులు.. కోడళ్ళు.. కూతుళ్లు.. అల్లుళ్లతో సందడిగా జరుపుకోవాల్సిన పెద్ద పండగ సంక్రాంతి వస్తోంది. పండుగ నేపథ్యంలో ఈపాటికే మార్కెట్లో కొనుగోళ్లు మొదలవ్వాలి. కొత్త బట్టలు.. చెప్పులు.. ఆడపిల్లల రిబ్బన్లు.. గాజులు.. పూసలు.. బట్టలు.. ఒకటా రెండా.. ఇంటిల్లిపాదికీ కొత్త వస్తువులు కొనాల్సిన పండగ.. అవి ధరించి ఇదిగో.. మా నాన్న కొత్తవి కొన్నాడు అంటూ మెరిసే కళ్లతో ఊళ్ళో తిరుగుతూ అందరికి చెప్పుకొనే చిన్నారి చిన్నబోయింది.. ఎందుకంటే నాన్న జేబులో పైసల్లేవు.. ప్రభుత్వం నుంచి పైసా రాలేదు..ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయాక ప్రజల చేతుల్లో ఒక్క పైసా కూడా కానరావడం లేదు. పేదల ఇళ్లలో కొనుగోళ్ల జాడ లేదు.. పండగ వస్తే ఏంది.. వెళ్తే ఏంది అన్నట్లుగా నిస్తేజంగా ఉంది మార్కెట్ మొత్తం. వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలో ప్రతీ పండుగకు ఏదో ఒక పథకం కింద వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి వెళ్లేవి. సంక్రాంతికి అమ్మఒడి, ఇంకోసారి ఫీజు రీయింబర్స్మెంట్.. ఆసరా... ఇలా నిత్యం డబ్బు చేతిలోకి వస్తుండడంతో ఆ డబ్బుతో పండగ గడిచిపోయేది. పేదవాడి చేతిలోకి వచ్చిన రూపాయి మార్కెట్లోకి పరుగులు తీసేది.. బట్టలు.. చెప్పులు.. ఫోన్లు.. టీవీలు.. ఇలా రకరకాల గృహోపకరణాలు కొనేవాళ్ళు.ఆ డబ్బుతో కొంత డౌన్ పేమెంట్ కట్టి.. మిగతా నెలవారీ కిస్తీలు కట్టేలా వస్తువులు తీసుకునేవాళ్ళు. దీంతో పండగ వస్తే చాలు మార్కెట్లు జనంతో కళకళలాడేవి. ఒక పేదవాడి వద్దకు వచ్చిన పదివేలు రిటైల్ షాపులకు చేరితే అక్కడి నుంచి హోల్ సేల్ డీలర్ వద్దకు.. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకూ ఆ పదివేలు ప్రవహించేది. కానీ గత ఆర్నెల్లుగా ఎక్కడా రూపాయి వచ్చింది లేదు.. పైగా కరెంటు బిల్లుల మోత మొదలైంది. రానున్న సంక్రాంతి పండగ సైతం ఉస్సూరుమంటుంది తప్ప ఏమాత్రం జోష్ ఉండదు అని ఇప్పటికే జనాలకు అర్థమైంది.. ఈ క్రమంలోనే పల్లెల్లోని చిన్న చిన్న దుకాణాలు సైతం నడవని పరిస్థితి నెలకొంది. పండగ నాడు చేతిలోకి డబ్బులు రాగానే బట్టలు.. ఇంటి నిత్యావసరాలు.. చెప్పులు.. వాచీలు.. ఇలా రకరకాల వస్తువుల కొనుగోళ్లు భారీగా జరిగేది.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.వీధి వ్యాపారులు.. చిరు వ్యాపారాలు కుదేలు..పండగ పూట పల్లెల్లో చిన్నచిన్న సామాన్లు.. బట్టలు.. దుప్పట్లు.. గాజులు.. పూసలు.. గౌన్లు .. కొత్త గిన్నెలు.. అమ్మేవారు కోకొల్లలుగా తిరిగేవారు. అంతేకాకుండా పట్టణాల్లోనూ అలంటి చిరువ్యాపారులు సరుకులను వీధుల్లో పోసి అమ్మేవారు. కానీ ఇప్పుడు ప్రజల చేతుల్లో పైసల్లేకపోవడంతో ఆ వ్యాపారులు సైతం అమ్మకాలు మానేశారు. భారీగా పెట్టుబడులు పెట్టి.. అప్పు చేసి మోపెడ్ మీద రోజంతా తిరిగినా జనాలు కొనడం లేదని అంటున్నారు.భారీగా తగ్గిన జీఎస్టీ వసూళ్లు..వాస్తవానికి మధ్యతరగతి, పేదల వద్దకు చేరిన డబ్బు వెనువెంటనే మార్కెట్లోకి ప్రవహిస్తుంది. ఈ క్రమంలో దానిమీద కనీసం 18 శాతం వరకు జీఎస్టీ రూపేణా ప్రభుత్వానికి వస్తుంది. అందులో సగమైనా రాష్ట్రప్రభుత్వం వాటా ఉంటుంది. అంటే పదివేలు ఖర్చు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి రమారమి వెయ్యి ఆదాయం వస్తుంది. ఆయా పదివేలు ఇంకో చెయ్యి మారితే అందులోనూ మళ్ళీ జీఎస్టీ వాటా.. ఇంకో లావాదేవీ జరిగితే మళ్ళీ జీఎస్టీ.. అంటే ప్రజలనుంచి డబ్బు ఎన్ని చేతులు మారితే అన్నిసార్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నమాట. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ప్రస్తావనే లేదు. దీంతో అంతిమంగా చిన్న వ్యాపారాలు తగ్గిపోయాయి. బట్టలు.. ఇతర మామూలు సరుకులు అమ్మే వ్యాపారాలు దివాళా తీశాయి. ఇక, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జీఎస్టీ వసూళ్లు బ్రహ్మాండంగా ఉండేవి. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం పడుతూ ఏకంగా మైనస్ లోకి వెళ్ళిపోయింది. నవంబర్ నెలకు సంబంధించి ఏపీ రాష్ట్రం దేశ సగటు జీఎస్టీ వసూళ్లలో -10% (మైనస్ పదిశాతం) నమోదు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అక్టోబర్ మినహా ఎప్పుడు వృద్ది నమోదు కాలేదు. మొత్తం మీద చూసుకుంటే జనం కొనుగోలు శక్తి తగ్గుముఖం పట్టింది అని ఈ జీఎస్టీ వసూళ్ల లెక్కలు చెబుతున్నాయిఏపీలో ఈ ఆర్థిక సంవత్సరం వివరాలు ఇలా.. 2024 ఏప్రిల్.. +12%మే +15%జూన్ వివరాలు జీఎస్టీ వెబ్ సైట్లో అందుబాటు లో కనిపించలేదు.జూలై -7%ఆగష్టు -5%సెప్టెంబర్ -4%నవంబర్ -10%డిసెంబర్ - 6%.-సిమ్మాదిరప్పన్న
పుష్ప 'జాతర'తో పూనకాలు.. ఈ వీడియోలో చూసేయండి
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ తన బ్రాండ్ ఏంటో చూపిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప2 నాలుగు వారాల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పటివరకూ రూ.1799 కోట్లకు (గ్రాస్) పైగా ఈ చిత్రం రాబట్టిందని అధికారికంగా ప్రకటించారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి ఎంతో బలాన్ని చేకూర్చిన 'గంగమ్మతల్లి జాతర' సాంగ్ వీడియోను మేకర్స్ యూబ్యూబ్‌లో విడుదల చేశారు.పుష్ప2 చిత్రంలో గంగమ్మ జాతర ఎపిసోడ్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ సీన్ ప్రారంభంలో అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడు థియేటర్ దద్దరిల్లిపోయింది. జాతర ఎపిసోడ్లో వచ్చే సాంగ్‌లో ఆయన హీరోయిజం, భావోద్వేగాలు పతాక స్థాయికి చేరుతాయి. దీంతో అందరూ ఆ పాటకు అభిమానులు అయిపోయారు. ఈ పాటకు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించగా మహాలింగం ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అదరిపోయే రేంజ్లో ఉంటుంది. ఇలా అన్ని అంశాల్లో మెప్పించిన ఈ సాంగ్ వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు.
శబరిమలలో హైదరాబాద్ స్వాముల బస్సు బోల్తా.. ఒకరు మృతి
తిరువనంతపురం: హైదరాబాద్ నుండి కేరళ వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బస్సు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. స్వాములు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. పంబా వెళ్తున్న క్రమంలో ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా పడిపోవడంతో ప్రమాదం జరిగింది. పంపా నదికి 15 కిలోమీటర్ల దూరంలో బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నారు.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. స్వాములు గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది స్వాములు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయ్యప్ప స్వాములను ఉప్పర్గూడకు చెందిన వారిగా గుర్తించారు.
భారత్ తయారీ రంగం డీలా
భారత్ తయారీ రంగం(manufacturing sector) డిసెంబర్లో డీలా పడింది. హెచ్ఎస్బీసీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డిసెంబర్లో 56.4కు పడిపోయింది. గడచిన 12 నెలల్లో ఇంత తక్కువ స్థాయికి సూచీ పడిపోవడం ఇదే తొలిసారి. కొత్త బిజినెస్ ఆర్డర్లు, ఉత్పత్తిలో మందగమనం(slowdown) కనిపించిందని ఈ మేరకు వెలువడిన సర్వే పేర్కొంది. అయితే సూచీ 50పైన ఉంటే దీన్ని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. అంతకంటే తక్కువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీర్ఘకాలికంగా తయారీ సూచీ 54.1గా ఉండడం గమనార్హం. 2025లో ఉత్పత్తిలో భారీ పెరుగుదల నమోదవుతుందన్న విశ్వాసంలో తయారీదారులు ఉన్నట్లు సర్వే పేర్కొంది.ఇదీ చదవండి: ‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్ నోటీసులుపేఇన్స్టాకార్డ్ కార్యకలాపాల విస్తరణఫిన్టెక్ కంపెనీ పేఇన్‌స్టాకార్డ్ తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కొత్త కార్యాలయాలన్ని ప్రారంభించింది. బ్రాండిక్స్ ఇండియా అపారెల్ సిటీ (BIAC) ఇండియా పార్ట్నర్, పేఇన్‌స్టాకార్డ్ ఛైర్మన్ పచ్చిపాల దొరస్వామి, వ్యవస్థాపక సీఈవో సాయికృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది సంఖ్యను 100కు పెంచుకోనున్నట్లు ఈ సందర్భంగా సాయికృష్ణ తెలిపారు. తక్కువ లావాదేవీ వ్యయాలతో బిల్లులు, అద్దెలు, ఫీజులు మొదలైనవి చెల్లించేందుకు అనువైన సాధనంగా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 1,00,000 మంది పైగా యూజర్లకు చేరువైనట్లు వివరించారు.
USA:ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన
వాషింగ్టన్:న్యూ ఆర్లియన్స్ దాడిలో విదేశీ శక్తుల కుట్ర లేదని అమెరికా అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) తేల్చింది. దాడికి పాల్పడ్డ జబ్బార్ ఒంటరిగానే ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడని తెలిపింది. దాడికి ముందు జబ్బార్ ఫేస్బుక్లో ఐదు వీడియోలు పోస్ట్ చేసినట్లు పేర్కొంది.దాడి దర్యాప్తు పురోగతిని అధ్యక్షుడు బైడెన్‌కు ఎఫ్‌బీఐ వివరించింది.సుమారు గంట సేపు అధికారులతో చర్చించి దర్యాప్తు వివరాలను బైడెన్ తెలుసుకున్నారు. దాడిపై స్వదేశీ,విదేశీ కుట్ర కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి. ఈ దాడి కోసం జబ్బార్ విదేశీ సంస్థలతో కలిసి పనిచేయలేదు. అయితే అతను ఐసిస్ నుంచి స్ఫూర్తి పొందాడు. ఇది వంద శాతం ఉగ్రవాద చర్యనే’అని ఎఫ్‌బీఐ కౌంటర్ టెర్రరిజం విభాగానికి చెందిన అధికారి క్రిస్టఫర్ తెలిపారు. ఐసిస్ మళ్లీ పుంజుకోకుండా సిరియాలోని అమెరికా బలగాలు ఉగ్రవాద సంస్థ నేతలపై వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నూతన ఏడాది వేడుకల వేళ అమెరికా ఆర్మీ మాజీ ఉద్యోగి జబ్బార్ పికప్ ట్రక్కుతో జనంపైకి దూసుకొచ్చిన ఘటనలో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసుల కాల్పుల్లో జబ్బర్ మృతి చెందాడు.
పిగ్మెంటేషన్ సమస్యా?!
చర్మంపై బ్లాక్ స్పాట్స్, మచ్చలు కనిపించడం అన్ని వయసుల వారిలోనూ వచ్చే సమస్యే. కానీ, ఇటీవల యువతలో ఈ సమస్యను ఎక్కువ చూస్తున్నాం. ఎవరిలో అధికం అంటే...అధిక బరువు ఉన్నవారిలో మెడపైన, వీపు పైన మచ్చలు కనిపిస్తుంటాయి. నేరుగా ఎండ బారిన పడేవారికి చేతులు, ముఖం, పాదాలపై ట్యాన్ ఏర్పడుతుంది. కొంతమందిలో విటమిన్ల లోపం వల్ల మంగు మచ్చలు కూడా వస్తున్నాయి. సాధారణంగా యుక్తవయసులో మొటిమలు వస్తుంటాయి. మొటిమలను గిల్లడం, వాటిలో ఉండే పస్ తీయడం.. వంటి వాటి వల్ల మచ్చలు, ఇంకొందరిలో చర్మంపై గుంటలు ఏర్పడవచ్చు. కొందరికి సరైన అవగాహన లేక బ్యూటీ ప్రొడక్ట్స్‌ని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతిని మచ్చలు ఏర్పడతాయి. ఇంకొందరిలో చర్మం రకరకాల ఇన్ఫెక్షన్లకు లోనవుతుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మచ్చలు ఏర్పడి, అది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది.త్వరగా గుర్తించి...ముందుగానే సమస్యను గుర్తించి చికిత్స తీసుకుంటే ఇబ్బంది ఉండదు. థైరాయిడ్, ఒబేసిటీ, పీసీఓడీ సమస్యలు ఉంటే వాటికి చికిత్స తీసుకోవాలి. ఎండ నేరుగా తాకకుండా సన్ స్క్రీన్ వాడటం ముఖ్యం. వీటిలో బ్లూ లైట్ కాంపొనెంట్ ఉండే సన్‌స్క్రీన్స్ బెటర్.మంగు మచ్చలు వస్తున్నాయనుకునేవారు వారి వంశంలో ఈ సమస్య ఉంటే, ముందే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మొటిమలు, యాక్నె వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని గిల్లకూడదు. పింపుల్స్ తగ్గే ఆయిట్మెంట్స్ను నిపుణుల సూచనల మేరకు వాడాలి. పింపుల్స్ ఉండేవారు పింపుల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏజ్‌తోపాటు వస్తాయి అవే పోతాయి అనుకోకూడదు. ఒకసారి చెక్ చేసుకొని, చికిత్స తీసుకోవాలి. విటమిన్ బి12 లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి. క్యారట్, టొమాటో, విటమిన్– సి ఉన్న పండ్లు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఆన్లైన్లో చూసి, ఇష్టం వచ్చిన ప్రోడక్ట్స్ వాడకూడదు. అవి మీ చర్మతత్త్వానికి సరిపడతాయా లేదా అని చూడాలి. ఇంట్లో సౌందర్య లేపనాలను ఉపయోగిస్తూ, పార్లర్ ఫేసియల్స్ చేయకూడదు. ఏదైనా ఒకదాని మీద మాత్రమే ఆధారపడాలి. (చదవండి: సక్సెస్‌ని ఒడిసిపట్టడం అంటే ఇదే..!)
పిగ్మెంటేషన్ సమస్యా?!
చంద్రబాబు పాత కేసులు..ఐఏఎస్‌లపై ఒత్తిళ్లు..?
భారత్ తయారీ రంగం డీలా
పుష్ప 'జాతర'తో పూనకాలు.. ఈ వీడియోలో చూసేయండి
బాబు ఎఫెక్ట్.. కళ తప్పిన పండగ మార్కెట్!
మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
అమెరికాలో భవనంపై కూలిన విమానం
ఫార్ములా కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్..
‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్ నోటీసులు
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్‌లో భార్య ఎంట్రీ.. రొమాన్స్ వీడియో వైరల్
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ
న్యూ ఇయర్ వేళ తప్పతాగిన ప్రముఖ బుల్లితెర నటి.. నడవలేని స్థితిలో!
నేటి సాక్షి కార్టూన్
స్వదేశానికి గుడ్ బై
ఈ రాశి వారి పనులలో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.
New Year 2025 : నీతా అంబానీ న్యూ ఇయర్ లుక్, ధర ఎంతో తెలుసా?
నా ‘పథకం’ అమలయింది.. నీ పథకం సంగతి తర్వాత చూద్దాం!!
అయ్యప్ప మాలలో ఉండి.. భార్యను
మారిన బంగారం ధరలు: తులం ఎంతంటే?
వావ్! సూపర్ గ్రాఫిక్స్ చేసుకోవచ్చు సార్!
పిగ్మెంటేషన్ సమస్యా?!
చంద్రబాబు పాత కేసులు..ఐఏఎస్‌లపై ఒత్తిళ్లు..?
భారత్ తయారీ రంగం డీలా
పుష్ప 'జాతర'తో పూనకాలు.. ఈ వీడియోలో చూసేయండి
బాబు ఎఫెక్ట్.. కళ తప్పిన పండగ మార్కెట్!
మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
అమెరికాలో భవనంపై కూలిన విమానం
ఫార్ములా కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్..
‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్ నోటీసులు
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్‌లో భార్య ఎంట్రీ.. రొమాన్స్ వీడియో వైరల్
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ
న్యూ ఇయర్ వేళ తప్పతాగిన ప్రముఖ బుల్లితెర నటి.. నడవలేని స్థితిలో!
నేటి సాక్షి కార్టూన్
స్వదేశానికి గుడ్ బై
ఈ రాశి వారి పనులలో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.
New Year 2025 : నీతా అంబానీ న్యూ ఇయర్ లుక్, ధర ఎంతో తెలుసా?
నా ‘పథకం’ అమలయింది.. నీ పథకం సంగతి తర్వాత చూద్దాం!!
అయ్యప్ప మాలలో ఉండి.. భార్యను
మారిన బంగారం ధరలు: తులం ఎంతంటే?
వావ్! సూపర్ గ్రాఫిక్స్ చేసుకోవచ్చు సార్!
సినిమా
ప్రేమ కోసం ప్రతీకారం
విరాజ్ రెడ్డి చీలం హీరోగా, మిమి లియోనార్డో, శిల్పా బాలకృష్ణన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గార్డ్’. ‘రివెంజ్ ఫర్ లవ్’ (ప్రేమ కోసం ప్రతీకారం) అన్నది ట్యాగ్‌లైన్ . జగా పెద్ది దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనుప్రొడక్షన్స్ పై అనసూయ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ప్రేమ, వినోదం, యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘గార్డ్’. మెల్బోర్న్లో నివసించే పాతికేళ్ల కుర్రాడైన సుశాంత్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుంటాడు. తను కష్టపడి సొంతంగా ఓ సెక్యూరిటీ ఏజెన్సీని ఆరంభించాలనుకుంటాడు.ఆ క్రమంలో సామ్ అనే సైకాలజిస్ట్‌తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు సుశాంత్. అనుకోని పరిస్థితుల్లో అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? ప్రేమ కోసం ఊహించని శక్తులతో సుశాంత్ ఎలాంటి పోరాటం చేశాడు? అనే కథాంశంతో ఈ మూవీ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లిష్, చైనీస్ భాషల్లోనూ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: మార్క్ కె.న్‌ఫీల్డ్, సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని.
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్‌లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్‌పై ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్‌బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్‌బాబు. రాజమౌళి డైరెక్షన్‌లోని కొత్త సినిమా కోసమే మహేశ్‌బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్‌తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్‌లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్‌తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్‌తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్‌తో మరో గెటప్‌లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్‌చరణ్ క్లీన్ షేవ్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్‌తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్‌చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్‌తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్‌చరణ్ హెయిర్ స్టైల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్‌కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్‌లో ఫుల్ వైట్ హెయిర్‌తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్‌తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్‌లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్‌స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్‌లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్‌లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్‌కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్‌తో, కరెక్ట్ ఫిజిక్‌తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్‌లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్‌గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా హార్డ్‌వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్‌ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్‌లో.. మాసీ లుక్స్‌తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్‌లో నటించాలంటే స్పెషల్‌గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్‌గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్‌నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్‌తో, స్ట్రాంగ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు
ఫ్యామిలీ ట్రిప్‌లో అనసూయ చిల్.. న్యూ ఇయర్ విషెస్ చెప్పిన బిగ్‌బాస్ బ్యూటీ
తమిళనాడు ఫ్యామిలీ ట్రిప్‌లో అనసూయ చిల్..గోవా ట్రైబల్ ఫెస్టివల్లో శ్రద్ధాదాస్ డ్యాన్స్..న్యూ ఇయర్ విషెస్ చెబుతోన్న బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని..2024 జ్ఞాపకాలు షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్..మలేషియాలో శివం భజే హీరోయిన్ దిగాంగన సూర్యవన్షి...న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న ఆలియా భట్.. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Susank Bharadwaj (@susank.bharadwaj)
'గేమ్ ఛేంజర్ ఈవెంట్లో ఆసక్తికర సన్నివేశం'.. యాంకర్ సుమపై శంకర్ ప్రశంసలు!
గేమ్ ఛేంజర్ ఈవెంట్లో డైరెక్టర్ శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారని కొనియాడారు. రామ్ చరణ్ ఆర్టిస్ట్ కంటే ఆయన క్యారెక్టర్ మాత్రమే ఇందులో కనపడుతుందని ప్రశంసలు కురిపించారు. నా నుంచి ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో అన్నీ కూడా గేమ్ ఛేంజర్‌లో ఉంటాయన్నారు. తమన్ బీజీఎం ఏఆర్ రెహమాన్‌ను తలపించేలా చేశారని కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరి నటనను శంకర్ ప్రశంసించారు. తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కథతోనే గేమ్ ఛేంజర్ మూవీని తెరకెక్కించినట్లు శంకర్ తెలిపారు. అయితే ఈ ఈవెంట్లో యాంకర్ సుమ, డైరెక్టర్ శంకర్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అదేంటో చూసేద్దాం.గేమ్ ఛేంజర్‌లో రాజీవ్ కనకాల అద్భుతమైన నటనతో మెప్పించారని శంకర్ అన్నారు. అదే సమయంలో సుమ కనకాల మధ్యలో వచ్చిన ఆయన నా భర్త సార్ అని అన్నారు. దీనికి బదులిస్తూ ఆ విషయం నాకు తెలుసు.. మిమ్మల్ని చాలా ఏళ్లుగా చూస్తున్నాని అన్నారు. స్టేజ్‌పై వేల మంది ఆడియన్స్ ఉన్నప్పటికీ అందరినీ కంట్రోల్ చేసే సత్తా మీకుందని సుమను పొగిడారు. కానీ నా భర్త మీద మాత్రమే కంట్రోల్ లేదు సార్ సుమ నవ్వుతూ సమాధానమిచ్చింది. ఈ ఫన్నీ సంభాషణతో అక్కడున్నవారంతా ముసిముసి నవ్వులు చిందించారు.కాగా.. శంకర్- రామ్ చరణ్ డైరెక్షన్లో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, జయరాం కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
అదానీతో గుకేశ్ భేటీ
న్యూఢిల్లీ: టీనేజ్లోనే ప్రపంచ క్లాసికల్ చెస్ చాంపియన్‌గా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ గురువారం ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో భేటీ అయ్యాడు. తల్లిదండ్రులు పద్మావతి, డాక్టర్ రజనీకాంత్‌లతో కలిసి గుకేశ్ అహ్మదాబాద్‌లో అదానీని కలిశాడు. ‘ప్రపంచ చెస్ చాంపియన్‌ను ఇలా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అతని విజయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. అలాంటి వారితో నాకు ఈ భేటీ చాలా ప్రత్యేకమైంది. 18 ఏళ్ల భారత కుర్రాడు ప్రపంచ చెస్‌లో సత్తా చాటుకున్నాడు. మన యువతరానికి ప్రేరణగా నిలిచాడు. దశాబ్దాలపాటు చెస్‌లో భారత ఆధిపత్యం కొనసాగేందుకు గట్టి పునాది వేశాడు. అతని ఆత్మవిశ్వాసం, విజయం అద్భుతం. జై హింద్’ అని ‘ఎక్స్’లో గౌతమ్ అదానీ పోస్ట్ చేశారు. సింగపూర్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షి ప్ మ్యాచ్‌లో గుకేశ్... చైనాకు చెందిన డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించాడు. అప్పుడు సోషల్ మీడియా వేదికగా గుకేశ్‌ను అదానీ ప్రశంసించారు. అదానీకి చెందిన స్పోర్ట్స్ ఫౌండేషన్ భారత గ్రాండ్‌మాస్టర్స్ ప్రజ్ఞానంద, అతని సోదరి వైశాలిలను స్పాన్సర్ చేస్తోంది. 1985లో 22 ఏళ్ల వయసులో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన గ్యారీ కాస్పరోవ్ రికార్డును తాజాగా గుకేశ్ చెరిపేశాడు. చెస్ ఒలింపియాడ్‌లోనూ భారత్ స్వర్ణం గెలిచేందుకు కీలకపాత్ర పోషించిన అతని ప్రదర్శనను గుర్తించిన భారత ప్రభుత్వం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపిక చేసింది.
అండర్–9 జాతీయ చెస్ విజేత నిధీశ్
పుణే: జాతీయ అండర్–9 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ చిన్నారులు నిదీశ్ శ్యామల్, అదుళ్ల దివిత్ రెడ్డి అదరగొట్టారు. గురువారం ముగిసిన ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో నిధీశ్ చాంపియన్‌గా అవతరించగా... దివిత్ రెడ్డి మూడో స్థానాన్ని సంపాదించాడు. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో నిదీశ్, ఆరిత్ కపిల్ (ఢిల్లీ) 9.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... నిదీశ్‌కు టైటిల్ ఖరారైంది. ఆరిత్ రన్నరప్‌గా నిలిచాడు. 9 పాయింట్లతో దివిత్ రెడ్డి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది వరల్డ్ క్యాడెట్ అండర్–8 చాంపియన్‌షిప్‌లో దివిత్ రెడ్డి స్వర్ణ పతకం గెలిచాడు. విజేతగా నిలిచిన ని«దీశ్కు విన్నర్స్ ట్రోఫీతోపాటు రూ. 50 వేలు ప్రైజ్‌మనీ లభించింది. హైదరాబాద్‌లోని మ్యాస్ట్రో చెస్ అకాడమీలో క్యాండిడేట్ మాస్టర్ (సీఎం) అమిత్‌పాల్ సింగ్ వద్ద నిదీశ్ శిక్షణ తీసుకుంటున్నాడు. జాతీయ చాంపియన్ హోదాలో నిదీశ్ ఈ ఏడాది జరిగే ప్రపంచ, ఆసియా అండర్–9 చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు.
భారత్ 11 మాల్దీవులు 1
బెంగళూరు: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) స్నేహపూర్వక మ్యాచ్‌లో మరోసారి భారత మహిళల జట్టు అదరగొట్టింది. తొలి పోరులో 14–0తో మాల్దీవులును చిత్తు చేసిన భారత్... గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో 11–1 గోల్స్ తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్ ద్వారానే జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన ఫార్వర్డ్ ప్లేయర్ లింగ్డైకిమ్ (12వ, 16వ, 56వ, 59వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో విజృంభించింది. సిమ్రన్ గురుంగ్ (62వ, 68వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తా చాటింది. మరో అరంగేట్ర ప్లేయర్ సిబాని దేవి (45+1వ నిమిషంలో)తో పాటు కాజల్ డిసౌజా (15వ ని.లో), పూజ (41వ ని.లో), భూమిక దేవి (71వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మాల్దీవుల తరఫున మరియం రిఫా (27వ ని.లో) ఏకైక గోల్ సాధించగా... ఆ జట్టు కెప్టెన్ హనీఫా (17వ నిమిషంలో) సెల్ఫ్ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 6–1తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు... ద్వితీయార్ధంలో కూడా అదే జోరు కొనసాగిస్తూ ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తిరుగులేని విజయం సాధించింది.
లంక పర్యటనకు కమిన్స్ దూరం
సిడ్నీ: ఆ్రస్టేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ శ్రీలంక పర్యటనకు దూరం కానున్నాడు. అతని భార్య రెండో కాన్పు సమయంలోనే ఆ టూర్ ఉండటంతో ద్వైపాక్షిక సిరీస్ నుంచి తప్పుకునే అవకాశముందని చెప్పాడు. గతేడాది భారత్ పర్యటనలో ఉండగా కమిన్స్ మాతృమూర్తి మృతి చెందడంతో టూర్ మధ్యలోనే అతను తిరుగుముఖం పట్టాడు. అప్పటి నుంచి తన జీవితంలో కుటుంబ ప్రాధామ్యాలు మారాయని కమిన్స్ చెప్పుకొచ్చాడు.కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఈ నెలాఖర్లో లంక పర్యటనకు బయలుదేరనున్న ఆసీస్ అక్కడ రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరే రెండో జట్టు ఈ సిరీస్ ఫలితంతోనే ఖరారవుతుంది. జనవరి 29 నుంచి తొలి టెస్టు, ఫిబ్రవరి 6 నుంచి రెండో టెస్టు జరగనున్నాయి. కమిన్స్ గైర్హాజరీలోని ఆ్రస్టేలియాకు అనుభవజు్ఞడైన స్టీవ్ స్మిత్ లేదంటే హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్లలో ఒకరు నాయకత్వం వహించే అవకాశాలున్నాయి.
బిజినెస్
పెట్రోల్, డీజిల్‌కు అధిక డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వినియోగం డిసెంబర్ నెలలో గణనీయంగా పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలోని వినియోగంతో పోల్చి చూస్తే, పెట్రోల్ అమ్మకాలు (ప్రభుత్వరంగ సంస్థల) 10 శాతం పెరిగి 2.99 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్ ద్వారా 90 శాతం ఇంధన విక్రయాలు నడుస్తుంటాయి. క్రితం ఏడాది డిసెంబర్ నెలలో పెట్రోల్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ అమ్మకాలు సైతం 4.9 శాతం పెరిగి 7.07 మిలియన్ టన్నులకు చేరాయి. నవంబర్ నెలలోనూ పెట్రోల్, డీజిల్ వినియోగం క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 8.3 శాతం, 5.9 శాతం చొప్పున పెరగడం గమనార్హం. వరుసగా రెండో నెలలోనూ వృద్ధి నమోదైంది. డిసెంబర్లో క్రిస్మస్ సెలవుల సందర్భంగా పర్యటనలు పెరగడం, ఖరీఫ్ సాగు సందర్భంగా యంత్రాలకు ఇంధన వినియోగం పెరగడం వినియోగంలో వృద్ధికి దారితీసింది. ఇక ఈ ఏడాది నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే డిసెంబర్లో పెట్రోల్ అమ్మకాలు 3.6 శాతం, డీజిల్ అమ్మకాలు 1.7 శాతం చొప్పున తక్కువగా ఉండడం గమనార్హం. దేశ ఇంధన మార్కెట్లో 40 శాతం డీజిల్ రూపంలోనే వినియోగం అవుతుంటుంది. ముఖ్యంగా 70 శాతం డీజిల్‌ను రవాణా రంగం వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు డిసెంబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 6.8 శాతం పెరిగి 6,96,400 టన్నులుగా ఉన్నాయి. వంటగ్యాస్ (ఎల్పీజీ) వినియోగం 5 శాతానికి పైగా పెరిగి 2.87 మిలియన్ టన్నులకు చేరింది.
దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించండి
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించేలా బడ్జెట్లో ప్రతిపాదనలు చేయాలని కేంద్రాన్ని ఆర్థిక రంగం విజ్ఞప్తి చేసింది. ఫిక్సిడ్ డిపాజిట్లపై పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఏడో ప్రీ–బడ్జెట్ సమావేశంలో ఆర్థిక రంగం ప్రతినిధులు ఈ మేరకు వినతులు ఇచ్చారు. క్యాపిటల్ మార్కెట్లను మరింత మెరుగుపర్చేందుకు తీసుకోతగిన చర్యలను కూడా తెలియజేసినట్లు ఎడెల్విస్ మ్యుచువల్ ఫండ్ ఎండీ రాధికా గుప్తా వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు, పర్యావరణహిత ప్రాజెక్టులకు రుణాలకు సంబంధించి రీఫైనాన్స్ విండోను ఏర్పాటు చేయాలని నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం కోరినట్లు ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఐడీసీ) డైరెక్టర్ రమణ్ అగర్వాల్ వివరించారు. గృహ రుణాల కంపెనీల తరహాలోనే ఎలక్ట్రిక్ వాహనాలు మొదలైన వాటికి రీఫైనాన్సింగ్ చేసేందుకు సిడ్బి, నాబార్డ్‌ల కోసం నిర్దిష్ట ఫండ్‌ను ఏర్పాటు చేయొచ్చని సూచించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రధాన ఆర్థిక సలహాదారు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది.
భర్త నుంచి.. వామ్మో ఇవేం కోరికలు.. కానుకలు!
దుబాయ్‌కి (Dubai) చెందిన ఒక మిలియనీర్ భార్య తాను గర్భిణిగా ఉన్నప్పుడు తన భర్తను కోరిన కోరికలను వింటే మతిపోతుంది. తన సంపన్నమైన, విలావంతమైన జీవనశైలిని తెలియజెప్పేలా ఫొటోలను, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేరే లిండా ఆండ్రేడ్ (Linda Andrade) అనే మహిళ గర్భిణిగా ఉన్నప్పుడు తన భర్త నుంచి తాను ఏమేమి కోరిందో పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ లిస్ట్ విని వామ్మో ఇవేం డిమాండ్లు అని ముక్కున వేలేసుకోవడం నెటిజన్ల వంతైంది.ఎప్పుడూ షాపింగ్ చేస్తూ విలాసాల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసే లిండా, తనను తాను "అసలైన దుబాయ్ గృహిణి" అని అభివర్ణించుకుంటుంది. ఆమె రికీ అనే మిలియనీర్‌ను వివాహం చేసుకుంది. “ఇవి సరిపోతాయా?” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన వీడియోలో లిండా తన భర్త నుంచి ఖరీదైన లంబోర్గిని కారు (Lamborghini), 9 క్యారెట్ల డైమండ్ రింగ్, కేజీలకొద్దీ బంగారం (gold), ఇతర వస్తువులను కానుకలుగా అడిగినట్లు వెల్లడించింది."దుబాయ్‌లో హాట్ మామ్స్ మాత్రమే ఉంటారు" అంటూ భర్త తన కోసం కొన్న సరికొత్త విల్లాను పరిచయం చేసింది. అలాగే ఇటీవల భర్త కొనిచ్చిన ఖరీదైన హీర్మేస్ క్రోకోడైల్ హ్యాండ్‌బ్యాగ్‌ను కూడా ఫాలోవర్లకు చూపించింది. అంతేకాదు భర్త నుంచి సరికొత్త లంబోర్ఘిని కారును బహుమతిగా పొందినట్లు పేర్కొంది. ఆమె డిమాండ్లు ఇక్కడితో ఆగలేదు. తొమ్మిది నెలల గర్భానికి సంకేతంగా 9 క్యారెట్ డైమండ్ రింగ్.. ప్రసవించే ముందు తన బిడ్డ బరువుకు సమానమైన బంగారం కూడా కానుకల జాబితాలో ఉన్నాయి.ఈ వీడియోకు 1.16 లక్షల లైక్‌లు, 2,700 పైగా కామెంట్లు వచ్చాయి. చాలా మంది ఆమె వీడియోకు ప్రతిస్పందించారు. లిండా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఇటువంటివి అనేక వీడియోలను పోస్ట్ చేస్తూ ఆమె కొనుగోలు చేసిన కొత్త ఉత్పత్తులను చూపుతుంటుంది. కొత్త సంవత్సరానికి ఒక రోజు ముందు షేర్ చేసిన వీడియోలో 2 లక్షల డాలర్ల వాచ్, 67,000 డాలర్ల విలువైన వైవ్స్ సెయింట్ లారెంట్ ఆర్కైవల్ పీస్తో సహా తాను కొన్న ఖరీదైన వస్తువులను పంచుకుంది. View this post on Instagram A post shared by Linda Andrade (@lionlindaa)
విమానాల్లో వైఫై.. ఫ్రీగా ఇంటర్నెట్
విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) దేశీ, విదేశీ రూట్లలో నడిపే ఫ్లయిట్స్‌లో వైఫై (Wi-Fi) ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఎయిర్‌బస్ ఏ350, బోయింగ్ 787–9 రకం విమానాలతో పాటు నిర్దిష్ట ఎయిర్‌బస్ ఏ321నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.దేశీయంగా ఫ్లయిట్స్‌లో వైఫై సర్వీసులను ప్రవేశపెట్టిన తొలి విమానయాన సంస్థ తమదేనని ఈ సందర్భంగా కంపెనీ తెలిపింది. దేశీ రూట్లలో ప్రస్తుతానికి వీటిని కాంప్లిమెంటరీగా అందిస్తున్నట్లు వివరించింది. క్రమంగా అన్ని విమానాల్లోనూ ఈ సేవలు ప్రవేశపెడతామని పేర్కొంది.విమానాలు 10,000 అడుగుల ఎత్తు దాటాకా ప్రయాణికులు తమ ల్యాప్ టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను వైఫైకి కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ సేవలు ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించించింది.ఎయిర్ ఇండియా అంతర్జాతీయ రూట్లలో పైలట్ ప్రోగ్రామ్‌గా గతంలో ఈ సర్వీసును ప్రారంభించింది. వీటిలో న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి ప్రధాన గమ్యస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు దేశీయ రూట్లలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు. వై-ఫై సేవలను క్రమంగా ఇతర విమానాలకు కూడా విస్తరిస్తారు.
ఫ్యామిలీ
పల్లెటూరి కుర్రాడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..!: మోదీ
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బడిలో పాఠాలు చదువుకునే రోజుల్లో గురుద్వారలో కీర్తనలు పాడేవాడు దిల్జిత్ దోసాంజ్. తర్వాత ఆ గొంతే అతడికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. పంజాబీ, హిందీ ఇండస్ట్రీలో సింగర్‌గా, నటుడిగానూ రాణిస్తున్నాడు. అంతేగాదు ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'లో 'భైరవ ఏంథమ్' పాటని కూడా పాడారు. ఆయన పాటలకు సాధారణ ప్రజలే కాదు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభిమానే. ఇటీవల ఆయనకు దిల్జిత్ దోసాంజ్‌ని కలుసుకునే అవకాశం లభించింది. ఆ మధర క్షణానికి సంబంధించిన వీడియోని న్యూ ఇయర్ రోజున పోస్ట్ చేస్తూ తమ మధ్య జరిగిన సంభాషణను పంచుకున్నారు. ఆ వీడియోలో..గాయకుడు దిల్జిత్ ప్రధాని మోదీని ప్రశంసించారు. మోదీ తన తల్లి గంగానది గురించి మాట్లాడిన విధానం అందరినీ కదిలించింది అని దోసాంజ్ అన్నారు. ఆ తర్వాత మోదీ దోసాంజ్‌ని "మీ తల్లిదండ్రులు పెట్టిన దిల్జిత్(హృదయాల విజేత) అనే పేరుని సార్థకం చేసుకునేలా జీవస్తున్నారని అభినందించారు. ఒక పల్లెటూరు కుర్రాడు నేడు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చకున్నాడు". అని ప్రశంసించారు. అంతేగాదు దోసాంజ్‌ని సదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మనసులను గెలుచుకుంటూనే ఉన్నారని అన్నారు. ఇక ఆ సంభాషణలో దోసాంజ్ చిన్నప్పుడు పుస్తకాల్లో భారతదేశం ఎంతో గొప్పదని మాత్రమే చదువకున్నాను, కానీ అలా ఎందుకంటారనేది తాను దేశమంత పర్యటించినప్పుడే తెలిసిందన్నారు. అందుకు ప్రతిస్పందనగా ప్రధాని మోదీ అతి పెద్ద భారతవని మనకొక బలం, పైగా ఇది అత్యంత శక్తిమంతమైన సమాజం అని అన్నారు. ఆ సమావేశంలో ఇరువురు సంగీతం, యోగా ప్రయోజనాలు గురించి మాట్లాడారు. అనంతరం గాయకుడు గురునానక్‌పై భక్తి గీతాన్ని ఆలపించారు. A great interaction with Diljit Dosanjh! He’s truly multifaceted, blending talent and tradition. We connected over music, culture and more… @diljitdosanjh https://t.co/X768l08CY1— Narendra Modi (@narendramodi) January 1, 2025 ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ మారింది. కాగా,మోదీ, దోసాంజ్‌లు సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ సమావేశం గురించి రాశారు. మోదీ దోసాంజ్‌ని ప్రతిభను, సంస్కృతిని మిళితం చేశాడని రాయగా, దోసాంజ్ ఇది మరుపురాని సమావేశం అని, సంగీతం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నామని రాశారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) (చదవండి: ఇంతులు ధరించడం వల్లే వెయిట్ పెరిగేది..!)
మహిళలు వెయిట్ పెంచండి..!
ఒంటి పైన బంగారం ఉన్న మహిళ వరలక్ష్మిలా ఉంటుంది. అదేంటి! ధన లక్ష్మిలా కదా ఉండాలి? అవుననుకోండి. బంగారం.. ధనానికి (సంపదకు) ఒక రూపం మాత్రమే. బంగారానికి పూర్తి స్వరూపం మాత్రం స్త్రీమూర్తే.భారతీయ స్త్రీ బంగారానికి ప్రాణం ఇస్తుంది అంటారు కానీ, నిజానికి అనవలసింది.. బంగారానికే ఆమె ప్రాణం పోస్తుందని. గనుల్లో ఉండే బంగారానికి ఏం ‘వెయిట్’ ఉంటుందని! ఇంతులు ధరిస్తేనే కదా తులాలకు విలువ!బంగారం ప్రతి దేశంలోనూ ఉంటుంది. బంగారాన్ని ఇష్టంగా, అదొక నిష్ఠగా, వేడుకగా, అందంగా, ఆచారంగా.. వాటన్నిటినీ కలిపి నిండుగా ధరించే మహిళలు మాత్రం మన దేశంలోనే ఉంటారు. ఎంత నిండుగానో తెలుసా? ‘వరల్డ్ గోల్డ్ కౌన్సిల్’ తాజా సర్వే ప్రకారం భారతీయ మహిళల దగ్గరున్న బంగారం 24 వేల టన్నులు!అత్యధికంగా బంగారం ఉన్న మొదటి ఐదు దేశాల కంటే కూడా మన మహిళల దగ్గర ఉన్న బంగారమే ఎక్కువ. అమెరికా ఎంత తవ్వి తలకెత్తుకున్నా ఆ దేశంలో ఉన్నది 8,000 టన్నుల బంగారం మాత్రమే. ఆ తర్వాతి స్థానం జర్మనీది. అక్కడున్నది 3,300 టన్నులు. ఇటలీ 2,450 టన్నుల బంగారంతో మూడో స్థానంలో ఉంది. నాలుగు, ఐదు స్థానాల్లో ఫ్రాన్స్ (2,400 టన్నులు), రష్యా (1,900) ఉన్నాయి. మొత్తం కలిపినా భారతీయ మహిళల దగ్గర ఉన్న బంగారం కంటే తక్కువే. మన దగ్గర కూడా దక్షిణాది మహిళల దగ్గరే ఎక్కువ (40 శాతం వరకు) బంగారం ఉంది. ఆ నలభైలో 28 శాతం తమిళనాడు మహిళలదే.బంగారం ధరించిన మహిళల్ని వరలక్ష్ములు అనటం ఎందుకంటే ప్రభుత్వం దగ్గర్నుంచి కూడా వారు ‘వరాలు’ పొందారు. వివాహిత స్త్రీలు ఎలాంటి పన్నూ చెల్లించకుండానే అరకిలో వరకు బంగారాన్ని కొనుక్కోవచ్చు. అవివాహిత మహిళలకు పావు కిలో వరకు పన్నులుండవు. మరి పురుషులకు? వంద గ్రాములు దాటితే వారిపై కన్ను, పన్ను రెండూ పడతాయి. కనుక, ఈ కొత్త సంవత్సరంలో బంగారం వెయిట్ పెంచే బాధ్యత మహిళలదే. ఒంటిపైన బంగారం ఉన్న మహిళ మాత్రమే కాదు, మహిళ ఒంటిపై ఉన్న బంగారం కూడా వరలక్ష్మీ అమ్మవారే! (చదవండి: 'జీరో వేస్ట్ వెడ్డింగ్'! పర్యావరణమే మురిసే..)
మా వారి ప్రవర్తనతో విసిగిపోయాను...
మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తన పనిలో నిత్యం బిజీగా ఉంటారు. తన ఉద్యోగం చాలా ఒత్తిడితో కూడుకుని ఉండటం, ఇంటిదగ్గర ఉన్నప్పుడు కూడా ఏదో ఒక మీటింగ్‌కు అటెండ్ అవాల్సి రావడం, వర్క్ ఫ్రమ్ హోం, రాత్రుళ్లు లేటుగా పడుకోవడం వంటివి కోవిడ్ సమయం నుంచి ఎక్కువయ్యాయి. పడుకున్న కొన్ని గంటలు సరిగా నిద్ర పోకపోవడం, పొద్దున్నే చిరాకుగా ఉండటం చీటికీ మాటికీ కోపం తెచ్చుకోవడం ఈ మధ్య ఎక్కువయ్యాయి. పిల్లల మీద ఉట్టిపుణ్యానికి అరుస్తున్నారు. నా భర్త వేరే ఏ దురలవాట్లు లేని మంచి వ్యక్తి అని ఎంతో ఆనందించే నేను ఈ మధ్య ఆయన ప్రవర్తనతో విసిగిపోయాను. మీ సలహా కోసం ఎదురు చూస్తూ...– ఓ సోదరి, హైదరాబాద్ప్రియమైన చెల్లెమ్మా! మీ భర్త దీర్ఘకాలిక వత్తిడి వలన కొన్ని మానసిక లక్షణాలకు లోనవుతున్నట్లు కనిపిస్తుంది. కోవిడ్ తర్వాత పని సంస్కృతిలోని మార్పుల వలన ఈ రోజులలో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఇంటికి, ఆఫీస్‌కి తేడా కనుమరుగవుతోంది. మీ వారి లక్షణాలను ‘బర్న్ అవుట్’ అని అంటాము. మీ ఆయనకు ఎలాంటి వ్యసనాలు లేవన్నారు. కాని వారు తన ఉద్యోగాన్ని, ఫ్యామిలీ లైఫ్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. నిద్ర సరిగా లేకపోవడం, అతి కోపం, చిరాకు ఇవి తన పనిలో సామర్థ్యాన్ని తగ్గించడమే గాక, తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటిని ఇలాగే వదిలేస్తే మున్ముందు శారీరక సమస్యలు కూడా రావచ్చు. పనివేళలపై ముఖ్యంగా ఇంటి వద్ద పని వేళలపై సరిహద్దులు పెట్టడం, సరైన సమయపాలన చేయడం ద్వారా వృత్తి, జీవిత సమతుల్యం మెరుగుపరుచుకోవాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కొంతపని ఇతరులకు అప్పగించడం లేదా నిరాకరించడం చేయగలగాలి. మీ కుటుంబ సమయం, విశ్రాంతి సమయాన్ని కూడా మీ మీటింగుల లాగే, అనివార్యమైనవిగా మీ కేలండర్లో రాసుకోవాలి. సరైన నిద్ర, వ్యాయామం, సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడిని చాలా వరకు నియంత్రించవచ్చు. మీ వారి ప్రవర్తన ఎలా కుటుంబాన్ని ప్రభావితం చేస్తుందో వారితో సానుభూతితో చర్చించండి. ఒక జీవిత భాగస్వామిగా మీ మద్దతు తనకు ఉందని తెలిసినప్పుడు వారు కూడా మార్పునకు గట్టిగా కృషి చేస్తారు. మీరు కూడా ఈ పరిస్థితుల వలన ఒత్తిడికి లోనవకుండా మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అప్పటికీ మార్పు రాకపోతే ఒక సైకియాట్రిస్ట్‌ను కలిసి థెరపీ ద్వారా, మందుల ద్వారా వారి ఒత్తిడిని తగ్గించి మీ కుటుంబ జీవన నాణ్యతను ఖచ్చితంగా మెరుగు పరుచుకోవచ్చును.
జల్లికట్టు చిన్నారి పట్టు
‘జల్లికట్టు’ అంటే ఎద్దును లొంగదీసుకుని దాని కొమ్ములకున్న అలంకరణలను సొంతం చేసుకోవడం. జల్లికట్టు ఎద్దులకు ΄పౌరుషం ఎక్కువ. కొమ్ములకు వాడి ఎక్కువ. తమ మూపురాలను తాకనివ్వవు. అందుకే ఈ మనిషి–పశువు క్రీడ తరాలుగా తమిళనాడులో ఉంది. జల్లికట్టులో దించబోయే ఎద్దుకు తర్ఫీదు ఇస్తూ పదేళ్ల యజిని వార్తల్లోకి ఎక్కింది. రాబోయే సంక్రాంతికి యజిని.. ఎద్దు‘నన్బన్’ చాలా పెద్ద వార్తలనే సృష్టించనున్నాయి.రాబోయే‘΄పొంగల్’కి తమిళనాడులో జల్లికట్టు ధూమ్‌ధామ్‌గా జరగనుంది. మదురై, తంజావూరు, తిరుచిరాపల్లి తదితర ప్రాంతాల్లో ΄పొంగల్ నుంచి మొదలై వేసవి వరకు జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉంటాయి. అక్కడి పల్లెవాసులు కూడా వేలాదిగా వీటిలో పాల్గొంటారు. తమ ఎడ్లను తెచ్చి పాల్గొనేలా చేస్తారు. మన కోళ్ల పందేలకు కోడిపుంజులను తీర్చిదిద్దినట్టే ఇందుకై ఎడ్లనూ తీర్చిదిద్దుతారు. రైతు కుటుంబాల్లో తండ్రులు వారికి తోడు పిల్లలు ఈ పనిలో నిమగ్నమవుతారు. అలాంటి రైతు కూతురే పదేళ్ల వయసున్న యజిని.ఎద్దు– మనిషిమదురైలోని మంగులం అనే గ్రామంలో శ్రీనివాసన్ అనే రైతుకు రెండు ఎడ్లు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని జల్లికట్టులో పాల్గొనేలా చేస్తున్నాడు. ‘జల్లికట్టు’లో ‘జల్లి అంటే రెండు కొమ్ములకు అలంకరణ వస్త్రాలు ‘కట్టు’ అంటే కట్టడం. రెండు కొమ్ముల మధ్య వెండి లేదా బంగారు నాణేలు కూడా కడతారు. ఆటగాళ్లు పరిగెడుతున్న ఎద్దును తాకి, మూపురం పట్టి నెమ్మదించేలా చేసి ఆ అలంకరణలను, నాణేలను సొంతం చేసుకుంటారు. ఎన్ని సొంతం చేసుకుంటే అంత వీరుడిగా గుర్తింపు. అలాగే ఈ వీరులకు చిక్కకుండా వారి మీద కొమ్ము విసిరి తరిమికొడితే ఆ ఎద్దుకు అంతటి ఘనత. ‘మా ఎద్దు కూడా అంతటి గొప్పదే. చాలా మెడల్స్ సాధించింది’ అంటుంది యజిని.పాపకు స్నేహితుడుయజినికి ఐదేళ్లుండగా తండ్రి ఎద్దులను కొన్నాడు. వాటిలో ఒకదానికి యజిని‘నన్బన్’ (స్నేహితుడు) అనే పేరు పెట్టింది. రోజూ దానికి మేత వేయడం, నీళ్లు పెట్టడం, కబుర్లు చెప్పడం ఇదే పని. ‘నేను దగ్గరికి వెళితే ఏమీ చేయదు. పిలవగానే వచ్చేస్తుంది’ అంటుంది యజిని. గత మూడేళ్లుగా జల్లికట్టులో తండ్రితో పాటు నన్బన్ను తీసుకొని వెళుతోంది యజిని. ‘వాడివాసల్ (స్టార్టింగ్ పాయింట్) నుంచి మా నన్బన్ పరుగు అందుకోగానే చాలామంది ఆటగాళ్లు దాని మూపురం పట్టుకోవాలని, కొమ్ములు అందుకోవాలని ట్రై చేస్తారు. కాని మా నన్బన్ అందరి మీదా బుసకొట్టి దూరం పోయేలా చేస్తుంది. ఆట గెలిచాక బుద్ధిగా నా వెంట ఇంటికి వస్తుంది. ఆ ఎద్దు – ఈ ఎద్దు ఒకటేనా అన్నంత డౌట్ వస్తుంది’ అంటుంది యజిని.ట్రైనింగ్జల్లికట్టు కోసం ట్రైనింగ్ యజిని ఇస్తోంది తండ్రితో పాటు. జల్లికట్టులో పాల్గొనే ఎద్దును రోజూ వాకింగ్‌కి, స్విమ్మింగ్‌కి తీసుకెళ్లాలి. తడి నేలలో, మెత్తటి నేలలో కొమ్ములు గుచ్చి కొమ్ములు బలపడేలా చేయాలి. దీనిని ‘మన్ కుథల్’ అంటారు. ఇక మంచి తిండి పెట్టాలి. ఇవన్నీ యజిని చేస్తోంది. ‘నేను ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటున్నా. గవర్నమెంట్ జల్లికట్టు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎద్దుకు ఎటువంటి అపాయం కలక్కుండా రూల్స్ పెట్టింది. అందుకే నన్బన్ను నేను ధైర్యంగా పోటీకి తీసుకెళ్తా’ అంటోంది యజిని.
ఫొటోలు
International View all
అమెరికాలో భవనంపై కూలిన విమానం
కాలిఫోర్నియా:వరుస విమాన ప్రమాదాల పరంపర కొనసాగుతోంది.
చిలీలో భూకంపం..6.2 తీవ్రత నమోదు
శాంటియాగో:చిలీలో భారీ భూకంపం వచ్చింది.
USA:ట్రక్కు దాడి.. ఎఫ్‌బీఐ కీలక ప్రకటన
వాషింగ్టన్:న్యూ ఆర్లియన్స్ దాడిలో విదేశీ శక్తుల కుట్ర లేదన
ఇజ్రాయెల్ ప్లాన్ సక్సెస్.. హమాస్‌కు కోలుకులేని ఎదురుదెబ్బ
జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.
చైనాలో కొత్త వైరస్ కలకలం
బీజింగ్: విశ్వవ్యాప్తంగా మానవాళి మనుగడను ఒక్కసారిగా ప్రశ్నా
National View all
ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది.
చొరబాటుదార్లకు బీఎస్ఎఫ్ దన్ను
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం సరిహద్దు
కీచక భర్త హత్య .. ఆపై ముక్కలు
దొడ్డబళ్లాపురం: భార్యను పరుల పడకలోకి వెళ్లాలని వేధించడమే కా
హిమాచల్ పోలీసుల అకృత్యం
బనీఖేత్(హిమాచల్ ప్రదేశ్): నూతన సంవత్సర వేడుకల వేళ అర్ధరాత
సుప్రీంకోర్టుపైనే దుష్ప్రచారమా?
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు
NRI View all
అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’
‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేం
న్యూ ఇయర్ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమ
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్ఆర్ఐకు జైలు, జరిమానా
మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన 27 ఏళ్ల వ్యక్తికి సింగపూర్ కోర్టు జైలు
సుచీర్ బాలాజీ కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఓపెన్ఏఐ విజిల్‌బ్లోయర్
యూకే స్టూడెంట్ వీసా.. మరింత భారం!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో భారత విద్యార్థులకు యూఎస్ వీసాలు కష్టమేనన్న ప్రచారం జోరందుకుంది.
క్రైమ్
ఉద్యోగ పరుగులో ఆగిన ఊపిరి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఉద్యోగ పరుగులో ఓ యువకుడి ఊపిరి ఆగిపోయింది. కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో భాగంగా 1,600 పరుగులో పాల్గొన్న ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం జీలగొండి గ్రామానికి చెందిన దరావతు చంద్రశేఖరరావు (21) డిగ్రీ, డీఈడీ పూర్తి చేశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రశేఖరరావు తండ్రి చనిపోవటంతో తల్లి కష్టపడి చదివించింది. అతను ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో డీఎస్సీ(పీఈటీ) కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలోనే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష పాసయ్యాడు. ఈ క్రమంలో మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)కు హాజరయ్యాడు. ఇందులో భాగంగా 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని గ్రౌండ్లో మూడు రౌండ్లు పూర్తి చేసిన చంద్రశేఖరరావు... నాలుగో రౌండ్ పూర్తి చేయడానికి కొద్ది దూరంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై పక్కకు పడిపోయాడు. పోలీసు అధికారులు వెంటనే అతన్ని పక్కకు తప్పించి అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే చంద్రశేఖరరావు మృతిచెందాడు. ఆస్పత్రిలో విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి ‘నాకింక దిక్కెవరయ్యా...’ అంటూ చంద్రశేఖరరావు తల్లి రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న అందరినీ కలచివేసింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
మీరు ఇళ్లల్లో కూర్చోక రోడ్లపై ఎందుకు తిరుగుతున్నారంటూ..
తాడేపల్లి రూరల్: బతుకు దెరువు కోసం వచ్చిన కుటుంబంపై ఓ వ్యక్తి రాడ్‌తో విచక్షణారహితంగా బుధవారం సాయంత్రం దాడి చేయడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితులు, వారి బంధువుల కథనం ప్రకారం.. యూపీ నుంచి వచ్చిన వీరేంద్ర ప్రసాద్ మౌర్య, గీతా మౌర్య దంపతులు పట్టాభిరామయ్య కాలనీలో ఉంటున్నారు. వీరేంద్ర ప్రసాద్ మౌర్య సీలింగ్ పనులు చేస్తుంటాడు. నూతన సంవత్సరం కావడంతో సాయంత్రం సమయంలో సరదాగా బయటకు వెళ్లేందుకు ఇంట్లో నుంచి దంపతులు బయటకు వచ్చారు. అదే సమయంలో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ‘మీరు ఇళ్లల్లో కూర్చోక రోడ్లపై ఎందుకు తిరుగుతున్నారంటూ‘ రాడ్ తీసుకుని గీతా మౌర్యపై దాడికి పాల్పడ్డాడు. వీరేంద్ర ఆపేందుకు ప్రయత్నించగా అతడిపైనా దాడికి యత్నించాడు. వీరేంద్ర పారిపోయాడు. గీతా మౌర్యను కాళ్లపై వెనుక నుండి రాడ్‌తో కొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. తర్వాత విచక్షణరహితరంగా పలుమార్లు రాడ్‌తో కొట్టి అక్కడి నుండి పరారయ్యాడు. నిందితుడి బంధువులు మాత్రం అతడికి మతిస్థిమితం లేదని, దాడి గురించి పట్టించుకోవద్దని, ఆసుపత్రికి వెళ్లండని ఉచిత సలహాలు ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన గీత మౌర్యను వైద్య నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రెండు కాళ్లు, తుంటి భాగం, రెండు చేతులపై తీవ్ర గాయాలు అయ్యా యి. మతిస్థిమితం లేని వ్యక్తిని ఇంట్లో ఉంచకుండా మద్యం తాగించి రోడ్లపై తిరగనివ్వడమేంటని బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక నాయకుడు ఒకరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోకుండా అడ్డుపడుతున్నట్లు తెలిసింది. నిందితుడికి మతిస్థిమితం లేదని, పొరపాటు జరిగిందని అంటూ బాధిత కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నాడు.
భార్య చేతిలో భర్త మృతి
నిజాంపట్నం: మద్యం ఓ పండంటి కాపురంలో చిచ్చు రేపింది. భార్యాభర్తల మధ్య గొడవలకు ఆజ్యం పోసింది. ఒకరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పెద్దూరులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్రకు కొత్తపాలెం పంచాయతీ పెద్దూరుకు చెందిన అరుణతో 12 సంవత్సరాల కిందట వివాహమైంది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతంలో హోంగార్డుగా పనిచేసిన అమరేంద్ర మద్యానికి బానిసై ఉద్యోగాన్ని కోల్పోయాడు. తాగి తరచూ భార్యతో గొడవలు పడుతుండేవాడు. ఇద్దరి మధ్యా గొడవలు ఎక్కువవ్వడంతో ఏడాది కిందట అరుణ పిల్లలతో స్వగ్రామమైన పెద్దూరుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మద్యం తాగిన అమరేంద్ర భార్యపై దాడికి తెగబడ్డాడు. ప్రతిఘటించిన అరుణ అమరేంద్రను అడ్డుకునే క్రమంలో ఆమె చేతిలోని కర్ర అతని తలకు బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ సురేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, శవపంచనామా నిర్వహించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామరు.
వీధి కుక్కలు రాసిన మరణ శాసనం
జైపూర్ : ‘తల్లి మీరిక్కడే ఆడుకోండి. నేను బజారుకెళ్లి వస్తానంటూ ఓ తాత తన మనువరాలికి జాగ్రత్త చెప్పి వెళ్లాడు. కానీ ఆ చూపే తన మనువరాలిని చూసే చివరి చూపవుతుందనుకోలేదు.’ ఇంతకి ఏం జరిగిందంటే..రాజస్థాన్(rajastan)లోని అల్వార్ జిల్లాలో ఇక్రానా తన తాత, ఐదుగురు స్నేహితులతో కలిసి పొలానికి వెళ్లింది. పొలం పనిచేసిన అంనతరం తాత స్థానికంగా ఉండే మార్కెట్‌కు వెళ్లాడు. వెళ్లే సమయంలో మనువరాలికి జాగ్రత్త చెప్పి వెళ్లాడు.తాత మాట విన్న ఆ మనువరాలు తన స్నేహితులతో పొలంలోనే ఆడుకుని సాయంత్రం ఇంటికి బయలు దేరింది. మార్గం మధ్యంలో 7-8 వీధి కుక్కలు (street dogs) ఇక్రానా,ఆమె స్నేహితులపై దాడి చేశాయి. కుక్కుల దాడితో భయాందోళనకు గురైన చిన్నారులు బిగ్గరుగా కేకలు వేశారు. చిన్నారుల కేకల విన్న పక్కనే పొలం పనులు చేస్తున్న రైతులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పిల్లల్ని కుక్కల దాడి నుంచి కాపాడారు. అత్యవసర చికిత్స నిమిత్తం ట్రాక్టర్లో తరలించారు.అయితే, ఆ వీధి కుక్కల్లోని ఓ కుక్క మాత్రం ఇక్రానాను వదిలి పెట్టలేదు. వెంటపడి మరీ కరిచింది. ట్రాక్టర్లో తరలిస్తున్నా ఇంకా కరించేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకే కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారుల్ని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఈ దుర్ఘటనలో ఇక్రానా మరణించింది. ఇక్రానాపై దాడి చేసిన కుక్క గతంలో ఇతర జంతువులపై దాడి చేసిందని, అందువల్లే బాలిక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 👉చదవండి : వృద్ధురాలిపై వీధి కుక్కల దాడి, వైరల్ వీడియో