Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sajjala Ramakrishna Reddy Comments On Tdp
ఈసీ అంఫైర్‌లా వ్యవహరించలేదు: సజ్జల

సాక్షి, తాడేపల్లి: ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి? అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు.‘‘10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్‌ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంఫైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.‘‘బాధితులు రీపోలింగ్‌ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్‌ఫెక్ట్‌ అయ్యింది’’ అని సజ్జల పేర్కొన్నారు.

MLC Kavitha Bail Petition Hearing Delhi High Court ED CBI Cases
కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు. నిన్న(సోమావారం) కవిత తరపున ముగిసిన వాదనలు విపించారు. . సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.నేడు ఈడీ, సీబీఐ వాదనలు వినిపించింది. ఈడీ, సీబీఐ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని ఇంతకముందే న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు ఈడీ తరపు న్యాయవాది జోహెబ్‌ హుసేన్‌ వాదనలు వినిపిస్తూ.. లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత కింగ్‌ పిన్‌ అని పేర్కొన్నారు. లిక్కర్‌ కేసులో అక్రమ సొమ్ము ఆమెకు చేరిందని, దీనికి సంబంధించిన వాట్సాప్‌ చాట్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.ఈడీ వాదనలుఇండియా ఎహెడ్ ఛానల్‌లో పెట్టుబడి పెట్టారు.ఫోన్లో డేటాను ధ్వంసం చేశారు.విచారణకు ముందే ఫోన్ సాక్షాలు ధ్వంసం చేశారు.ఈడీకి ఇచ్చిన ఫోన్లో డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది.డిజిటల్ డేటా ధ్వంసంపై 19 పొంతనలేని సమాధానాలు ఇచ్చారు.కవితకు బెయిల్ ఇవ్వొద్దు.సూర్యాస్తమయానికి ముందే కవితను అరెస్టు చేశాం.ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు.గోప్యత హక్కును భంగపరచలేదుసీబీఐ వాదనలు:మద్యం విధానంపై కవితిను కలవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్యం వ్యాపారికి చెప్పారు.భూములు, హవాలా మార్గం ద్వారా అక్రమ సొమ్ము రవాణా జరిగింది.ఈ కేసులో కవిత పాత్రపై అనేక సాక్షాలు, వాంగ్మూలాలు ఉన్నాయి.అందుకే కవిత అరెస్టు తప్పనిసరి.మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు.ఈ లిక్కర్ కేసులో కవితనే ప్రధాన లబ్ధిదారు.ఆమె సాక్షాలు ధ్వంసం చేస్తుందిసాక్షులను ప్రభావితం చేస్తుందికవితకు కొత్త ఆరోగ్య సమస్యలు ఏవీ లేవుకవిత తరపు న్యాయవాది నితీష్ రానా కౌంటర్ వాదనలు👇ఈడీ కేసులో బుచ్చి బాబును నిందితుడిగా చేర్చక పోవడం, అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.బుచ్చి బాబు స్టేట్మెంట్లు కోర్టు పట్టించు కోవద్దు.ఆగస్టు 2023 తర్వాత ఎలాంటి కొత్త సాక్షాలు ఈడీ చూపలేదు.సాక్షాల ధ్వంసం చేసిన సమయంలో ఎందుకు అరెస్టు చేయలేదు.కవిత తన ఫోన్లు పనిమనుషులకు ఇచ్చారు.190 కోట్ల అక్రమ సొమ్ము చేరిందన్న ఈడి వాదనలో.. ఒక్క పైసా కవిత ఖాతాకు చేరలేదు.దీనిపై ఎలాంటి సాక్షాలు ఈడీ చూపలేదు.కవిత అరెస్టులో సీబీఐ చట్ట ప్రకారం నడుచుకోలేదు.సీబీఐ కవిత అరెస్టుకు కారణాలు చెప్పలేదు. ముగిసిన ఈడి, సీబీఐ వాదనలు, తీర్పు రిజ ర్వ్‌లిక్కర్ కేసులో కవిత బెయిల్‌పై ముగిసిన ఈడీ, సీబీఐ వాదనలుకవితకు బెయిల్ ఇవ్వద్దని వాదనలు వినిపించిన ఈడీ, సీబీఐఆమెకు బెయిల్ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని వాదనలులిక్కర్ స్కామ్ లో అక్రమ సొమ్ము నేరుగా కవితకు చేరిందని వాదించిన ఈడికవిత కేసులో కీలక పాత్రధారి దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్, ఇతర ఎవిడెన్స్ ఉందన్న ఈడీ.తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ..

Rbi Imposes Rs 91 Lakh Penalty On Yes Bank
అకౌంట్లపై అదనపు వసూళ్లు.. బ్యాంక్‌లకు ఆర్‌బీఐ వార్నింగ్‌..

ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు విధిస్తున్న బ్యాంక్‌లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కఠిన చర్యలు తీసుకుంటోంది.బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎస్‌ బ్యాంక్‌కు రూ. 91 లక్షల జరిమానా విధించింది. జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపైజీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై ఛార్జీలు విధించడం, ఫండ్స్‌ పార్కింగ్‌, రూటింగ్ ట్రాన్సాక్షన్‌ వంటి అనధికారిక ప్రయోజనాల కోసం బ్యాంక్‌ ఖాతాదారుల పేరిట ఇంటర్నల్‌ అకౌంట్లను ఓపెన్‌ చేసి ఎస్‌ బ్యాంక్‌ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం..ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. కస్టమర్లు జీరో బ్యాంక్‌ అకౌంట్‌ను ఉపయోగిస్తూ.. మినిమం బ్యాలెన్స్‌ లేకపోతే బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అకౌంట్‌ బ్యాలెన్స్‌ జీరోకి పడిపోయి.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయలేదని ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. సంబంధిత బ్యాంక్‌లు.. బ్యాంక్‌ అకౌంట్‌ సేవల్ని నిలిపివేయాలి. ఈ నిబంధనల్ని 2014 నుంచి ఆర్‌బీఐ అమలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.కోటి జరిమానామరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌కు సైతం ఆర్‌బీఐ రూ.కోటి జరిమానా విధించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పలు సంస్థలకు ప్రాజెక్ట్‌ లోన్స్‌ పేరిట లాంగ్‌ టర్మ్‌ రుణాల మంజూరులో ఐసీఐసీఐ అవకతవకలకు పాల్పడినందుకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది.

Ksr Comments On The Way Buddha Venkanna Spoke About Nara Lokesh
జాకీలు పెట్టి లేపినా.. లోకేష్‌కు అంత సీను లేదబ్బా!

తెలుగుదేశం పార్టీలో ఏదో అంతర్మథనం ఆరంభమైనట్లుగా ఉంది. శాసనసభ ఎన్నికలలో వచ్చే ఫలితాలపై టీడీపీలో టెన్షన్ ఏర్పడిన నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత పార్టీలో ఏమి జరిగే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో గెలుస్తామని చెబుతూనే ఆయన ఈ వ్యాఖ్య చేయడంతో పార్టీ క్యాడర్‌లో కన్ప్యూజన్ ఏర్పడింది. టీడీపీ గెలిచే అవకాశం ఉంటే లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయవలసిన వెంకన్న ఇలా అనడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. వెంకన్న ప్రకటనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నా, ఇది అంత చిన్న విషయం కాదన్న భావన ఉంది.చంద్రబాబు జాతీయ అద్యక్షుడు అని చెప్పుకుంటున్నా, అది నామమాత్రమే అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కింజారపు అచ్చన్నాయుడు ఉన్నారు. ఆయన పట్ల లోకేష్‌కు అంత సదభిప్రాయం లేదు. అచ్చెన్నను తప్పించాలని గతంలో కూడా ఆలోచన చేశారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఏమైనా మాట్లాడారా? అనే సంశయం వస్తుంది. చంద్రబాబు వయసు రీత్యా ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడికి అప్పగించాలని ఏమైనా అనుకుంటున్నారా? ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే చంద్రబాబుపై పార్టీలో నమ్మకం బాగా తగ్గుతుంది. అలాగని లోకేష్ నాయకత్వ పటిమపై కూడా క్యాడర్‌లో ఇంకా విశ్వాసం ఏర్పడలేదు.ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను ఎదుర్కోగల సత్తా లోకేష్ కు ఉందా అనే సంశయం ఉంది. లోకేష్ స్వయం ప్రకాశిత నేత కాదు. తండ్రిచాటు బిడ్డగానే రాజకీయంలోకి వచ్చారు. అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నారు., అప్పడప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తున్నా, వాటికి గ్యారంటీ లేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కొన్నిచోట్ల చంద్రబాబు నాయుడు కొందరికి టిక్కెట్ హామీ ఇస్తే, లోకేష్ మరికొందరికి టిక్కెట్ హామీ ఇచ్చారట. వారి నుంచి డిపాజిట్ కూడా తీసుకున్నారని చెబుతారు. కానీ టిక్కెట్ పొందలేకపోయిన వారికి కొందరికి లోకేష్ డబ్బు తిరిగి ఇవ్వలేదని ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఇవి గొడవలుగా మారే అవకాశం ఉంటుంది.లోకేష్ ప్రసంగాలలోకానీ, పార్టీ నిర్వహణలో కానీ అంత సమర్థత చూపలేకపోతున్నారని చెబుతారు. అందుకే చంద్రబాబు ఇప్పటికీ పార్టీ పగ్గాలు వదలి పెట్టలేకపోతున్నారన్నది వారి అభిప్రాయం. మరో సంగతి ఏమిటంటే పోలవరం కాంట్రాక్టర్‌గా గతంలో వ్యవహరించిన రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఒక ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్ లు తమ వద్ద పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని అనేవారు. దీనిపై ఇంతవరకు వీరు నోరు విప్పలేదు. డబ్బు లావాదేవీల సంగతి పక్కనబెడితే లోకేష్ గట్టివాడైతే 2014 ఎన్నికలలో పోటీచేసి ఉండేవారు. అప్పట్లో అధికారం రావడంతో పెత్తనం చేయడం ఆరంభించారు. తదుపరి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిల ద్వారా తండ్రి చంద్రబాబుపై ఒత్తిడి చేసి ఎమ్మెల్సీ పొంది, ఆ వెంటనే మంత్రి కూడా అయిపోయారు. అయినా తన శాఖలను నిర్వహణలో అంత పేరు తెచ్చుకోలేకపోయారు.కానీ అన్నీ శాఖలపై ఆధిపత్యాన్ని చెలాయించడం వివాదాస్పదం అయింది. చంద్రబాబు కూడా ఆయా సందర్భాలలో లోకేష్ ను కలిసి వచ్చారా అని అడిగేవారట. అంటే దాని అర్ధం ఏమిటో తెలుసు కదా! అంత అధికారం ఎంజాయ్ చేసినా, 2019 శాసనసభ ఎన్నికలలో ఆయన ఓటమి చెందడం బాగా అప్రతిష్ట అయింది. అయినా ఎమ్మెల్సీగా ఉండడంతో కౌన్సిల్ లో కొన్నిసార్లు అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ప్రజల దృష్టి ఆకర్షించాలని ప్రయత్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియావారు ఆయనకు భారీ ఎలివేషన్ ఇచ్చి ప్రచారం చేశారు. అయినా ఆశించిన రీతిలో పార్టీలో నమ్మకం కలిగించలేకపోయారు.ఉపన్యాసాలలో తడబడడం, భాష సరిగా రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇవేమీ పెద్ద సమస్యలు కావు. కానీ ఒక విధానం లేకపోవడం, తండ్రి మాదిరి అబద్ధాలు చెప్పడం, అధికారులను బెదిరించడం, రెడ్ బుక్ అంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం, కార్యకర్తలు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పోస్టు ఇస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి చేయడంతో ఈయనలో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయన్న భావన ఏర్పడింది. తన తండ్రి చంద్రబాబు బాటలోనే నడిచి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, తానేదో చాలా గొప్పనాడిని అయిపోయినట్లు మాట్లాడడం చేస్తుడడంతో విశ్వసనీయత తెచ్చుకోలేకపోయారు. యువగళం పేరుతో పాదయాత్ర చేసినా, అందులో ఒక చిత్తశుద్ది కనిపించలేదు. పేద ప్రజలతో పూర్తిగా కలవలేకపోయారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పోల్చి చూస్తే ఈయన దరిదాపులో కనిపించలేకపోయారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్వయం ప్రకాశిత నేతగా ఎదిగితే, లోకేష్ ఏమో ఇంకా చంద్రబాబు కుట్ర రాజకీయాలపైనే ఆధారపడవలసి వస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండతోనే రాజకీయాలలోకి వచ్చినా, ఆ తర్వాతకాలంలో ఒంటరిగా ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కున్నారు. పోరాటాలు చేశారు. సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలను ఎదుర్కున్నారు. 2014 ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాకపోయినా, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జనంలోకి వెళ్లి పాదయాత్ర చేసి, పేద ప్రజలకు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చారు.చంద్రబాబు, లోకేష్ లు మాత్రం ఎంతసేపు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను దూషించడం, అసభ్య భాష వాడడం చేశారు. ఆ తేడాను జనం గమనించి 2019 ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడించారు. లోకేష్ మంగళగిరిలోనే ఓటమిచెందారు. ఆ తర్వాత ఆయన అక్కడ కేంద్రీకరించి భారీ వ్యయం చేస్తూ, ఈసారి ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు రాయలసీమకు చెందినవారు. ఆయన చంద్రగిరి వదలి కుప్పం నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా పోటీచేస్తున్నారు. లోకేష్ ధైర్యవంతుడు అయి ఉంటే తన తండ్రి పుట్టిన ప్రాంతమైన చంద్రగిరి నుంచి పోటీచేసి ఉంటే ఆయనపై టీడీపీలో విశ్వాసం పెరిగేది. కానీ ఆ పని చేయలేకపోయారు.ఈ పరిస్థితిలో లోకేష్ పార్టీ అధ్యక్షుడు కావాలని వెంకన్న వంటివారు కోరుకున్నారంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఇంకా అర్హత సంపాదించలేకపోయారని అనుకోవాలా? యూపీలో సమాజవాది పార్టీ నేత మూలాయం సింగ్ జీవించి ఉన్న రోజులలో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికలలో అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలంతా ఓపెన్ గానే చెప్పారు. ఆ స్థితి లోకేష్ కు లేకపోవడం ఒక బలహీనతగా కనిపిస్తుంది.టీడీపీలో 2009 లో జూనియర్ ఎన్.టీ.ఆర్ సేవలను చంద్రబాబు వాడుకుని ఆ తర్వాత వదిలివేశారు. ఆయనను కనీసం మహానాడుకు కూడా ఆహ్వానించలేదు. జూనియర్ ఎన్.టీ.ఆర్ పార్టీలో ఉంటే లోకేష్ అవకాశాలు పోతాయని చంద్రబాబు భయపడ్డారు. నిజానికి లోకేష్ రాజకీయాలలోకి వస్తారా అని అంతకుముందు రోజుల్లో ఎవరైనా చంద్రబాబును అడిగితే ఆ ప్రశ్న వేసినవారిపై రుసరుసలాడేవారు. ఆ దశ నుంచి ఇప్పుడు కుమారుడిని జాకీలుపెట్టి లేపే పనిలో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా యజమానులు పడ్డారు. పార్టీని నడపడం తప్పుకాదు. ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ రాజకీయాలను ఒక స్టాండర్డ్‌లో చేయలేకపోతే ప్రజలలో విశ్వసనీయత రాదు. ఇప్పుడు అదే సమస్యను లోకేష్ ఎదుర్కుంటున్నారు.ఏతావాతా చెప్పేదేమిటంటే వెంకన్న వంటివారికి టీడీపీ గెలుపు మీద సంశయాలు ఉండి ఉండాలి. అంతేకాక లోకేష్ సమర్థత మీద అనుమానాలు ఉండాలి. అందుకే ఆయనను పార్టీకి పరిమితం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. కానీ లోకేష్‌ను ఒక్కసారి పార్టీ అధ్యక్షుడిగా చేస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పలేం. అప్పుడు కూడా చంద్రబాబు చాటు మనిషిగానే ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. స్వతంత్రంగా పనిచేసేంత శక్తి ఉందా అనే భయం పార్టీలో ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే ఒకరకంగా, రాకపోతే మరోరకంగా ఈ పరిణామాలు ఉంటాయి. వివిధ సర్వేలను గమనిస్తే టీడీపీ శాసనసభ ఎన్నికలలో గెలిచే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల ఫలితాల తర్వాత టీడీపీ సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Ap High Court Granted Anticipatory Bail To Pinnelli Ramakrishna Reddy In 3 Cases
ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట

సాక్షి, గుంటూరు: ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. జూన్‌ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది.కాగా, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈవీఎంకు సంబంధించి ఒక కేసు నమోదయింది. దీనిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు ఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరట ఇచ్చింది. అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ఉన్నందున కేసులోకి వెళ్లట్లేదని, పిన్నెల్లిని జూన్ 5 వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు తేల్చిచెప్పింది.హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇవ్వడంతో కొందరు పోలీసు అధికారులు ప్లాన్‌ మార్చారు. డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, పల్నాడు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పిన్నెల్లిపై వరుస కేసులు పెట్టారు. కౌంటింగ్‌ తేదీ కంటే ముందే పిన్నెల్లిని అరెస్ట్‌ చేయాలని, అసలు ఆ సమయంలో పిన్నెల్లి లేకుండా చూడాలని.. ఇదే సమయంలో పిన్నెల్లిని అరెస్ట్‌ చేస్తారంటూ ఎల్లో మీడియాకు లీకులిచ్చారు.ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతుండడంతో.. పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనల సందర్భంగా పోలీసులకు సంబంధించి ఓ కీలకమైన కుట్ర బయటపడింది. ఈ కేసులను ఎప్పుడు పెట్టారంటూ హైకోర్టు ప్రశ్నించగా.. మే 22న నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పిన్నెల్లి తరపున లాయర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో ఈ విషయంలో మొత్తం రికార్డులు తెప్పించమని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ముందు రికార్డులు సమర్పించగా.. వాటిని హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడిస్తూ.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది.ఇదీ చదవండి: AP High Court : పిన్నెల్లి కేసులో రికార్డులు మార్చిందెవరు?

Link Pan With Aadhaar By May 31 To Avoid Higher Tds
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్‌.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు

ట్యాక్స్‌ పేయర్స్‌ను ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అలెర్ట్‌ చేసింది. మే 31,2024 గడువులోపు పాన్‌ కార్డ్‌కు ఆధార్‌ కార్డ్‌ను జత చేయాలని సూచించింది. తద్వారా హైయ్యర్‌ ట్యాక్స్‌ డిడక్ట్‌ నుంచి ఉపశమనం పొందవచ్చని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది.పన్ను చెల్లింపుదారులు మీ పాన్‌ను మే 31, 2024లోపు ఆధార్‌తో లింక్ చేయండి. మే 31లోపు మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూలు నుంచి మినహాయింపు పొందవచ్చు. పాన్‌కు ఆధార్‌ లింక్‌ చేయకపోతే నిర్ణీత తేదీలోపు పాన్‌కు ఆధార్‌ జత చేయకపోతే పన్ను చెల్లింపుదారులు గణనీయమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి, వారు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్లు 206ఏఏ, 206సీసీ ప్రకారం అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. Kind Attention Taxpayers, Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024. pic.twitter.com/L4UfP436aI— Income Tax India (@IncomeTaxIndia) May 28, 2024

Rashmika Mandanna Deepfake Video In Bikini Near Waterfall Goes Viral
మరోసారి డీప్ ఫేక్‌ బారిన రష్మిక.. వీడియో వైరల్‌..!

డీప్ ఫేక్‌ టెక్నాలజీతో సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా మారింది. కొందరు దుండగులు ఆధునిక టెక్నాలజీతో దుర్వినియోదగానికి పాల్పడుతున్నారు. మొదట రష్మిక మందన్నా డీప్‌ ఫేక్ రావడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలువురు ప్రముఖ తారలు సైతం ఈ డీప్ ఫేక్‌ బారిన పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం సైతం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.ఇదిలా ఉండగా మరోసారి రష్మిక డీప్‌ ఫేక్ బారిన పడింది. ఆమె ఫేస్‌ను మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ కొలంబియా మోడల్ డానియెలా విల్లారియల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను ఎడిట్ చేసిన ఈ వీడియోను రూపొందించారు. అందులో రష్మిక ఫేస్‌ వచ్చేలా మార్చిన వీడియో కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోపై రష్మిక ఇంకా స్పందించలేదు. కాగా.. గతేడాది నవంబర్‌లోనూ రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరలైన సందడి తెలిసిందే. ఆ వీడియోను రూపొందించిన ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అలియా భట్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ వంటి ప్రముఖులు డీప్ ఫేక్ బాధితులుగా నిలిచారు. సినిమాల విషయానికొస్తే పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్‌లో సికందర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటించనుంది. View this post on Instagram A post shared by DANIELA VILLARREAL (@danielavillarreal_a)

AAP Minister Atishi Summoned Over MLAs Poaching Claim Against BJP
‘ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర’.. ఆప్‌ మంత్రి అతిషికి ఢిల్లీ హైకోర్టు సమన్లు

దేశ రాజధాని ఢిల్లీలో మంత్రుల కొనుగోలుకు కుట్ర జరుగుతుందంటూ ఆప్‌ మంత్రి అతిషి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూన్‌ 29న తమ ఎదుట హాజరు కావాలని అతిషిని ఆదేశించింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై స్పందనలో భాగంగా కోార్టు ఈ విధంగా స్పందించింది.కాగా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తర్వాత మంత్రి అతిషి ఆప్‌ర్టీని, ప్రభుత్వాన్ని ఢిల్లీలో సమర్ధవంతంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల బీజేపీ ఆరోపణలు గుప్పించారు. ఆప్‌ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు వలగా వేస్తూ వారిని కొనేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనికి తోడు తన రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారకుండా ఉండేందుకు పార్టీ మారాలని బీజేపీ తనకు ఆఫర్‌ చేసిందని అతిషి ఆరోపించారు. ‘బీజేపీ సన్నిహితుల ద్వారా నన్ను సంపద్రించింది. వారు నన్ను బీజేపీలో చేరమని అడిగారు. ఇది నా రాజకీయ జీవితాన్ని కాపాడుతుందని చెప్పారు. ఒకవేళ నేను సానకటీ మారకపోతే, నెల రజుల లోపల ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నన్ను అరెస్టు చేస్తుందని బెదిరించారు వారు బెదిరించారు’ అని పేర్కొంది.అతిషితో పాటు, ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నించిందని కేజ్రీవాల్ సైతం ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. వీటిని తప్పుడు, నిరాధారమైనవిగాపేర్కొంది. ఒకవేళ కేజ్రీవాల్‌, అతిషి ఆరోపణలు నిజమైతే వాటికి సాక్షాలు చూపించాలని డిమాండ్‌ చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే బీజేపీ పోలీసులను ఆశ్రయించగా.. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై ఢిల్లీ పోలాసులు నోటీసులు జారీ చేశారు.ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసింది. అతిషి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ.. అతిషికి నోటీసులు జారీ చేసింది. జూన్‌ 29న మ ఎదుట హాజరు కావాలని తెలిపింది.

Semi Final Predictions By Cricket Experts On Star Sports For T20I World Cup 2024
T20 World Cup 2024: సెమీస్‌కు చేరే జట్లు ఇవే..!

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ముగిసి రెండు రోజులైనా పూర్తి కాకముందే క్రికెట్‌ సర్కిల్స్‌ను పొట్టి ప్రపంచకప్‌ ఫీవర్‌ పట్టుకుంది. ప్రపంచకప్‌ ప్రారంభానికి మరో మూడు రోజులు ఉండగానే అభిమానులతో పాటు విశ్లేషకులు వరల్డ్‌కప్‌ మోడ్‌లోకి వచ్చారు. ఈసారి తమ టీమ్‌ గెలుస్తుందంటే తమ టీమ్‌ గెలుస్తుందని అభిమానులు నెట్టింట డిబేట్లకు దిగుతున్నారు. విశ్లేషకులు, మాజీలు గెలుపు గుర్రాలపై అంచనాలు వెల్లడిస్తున్నారు. తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు మాజీ క్రికెటర్లు వరల్డ్‌కప్‌ సెమీస్‌కు చేరే జట్లపై తమ అంచనాలను వెల్లడించారు. వీరిలో అందరూ భారత్‌ తప్పక సెమీస్‌కు చేరుతుందని చెప్పడం విశేషం.టీ20 వరల్డ్‌కప్‌ 2024 సెమీఫైనలిస్ట్‌ల విషయంలో మాజీల అంచనాలు ఇలా..అంబటి రాయుడు- భారత్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికాబ్రియాన్‌ లారా- భారత్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, ఆఫ్ఘనిస్తాన్‌పాల్‌ కాలింగ్‌వుడ్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌సునీల్‌ గవాస్కర్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌క్రిస్‌ మోరిస్‌- భారత్‌, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియామాథ్యూ హేడెన్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాఆరోన్‌ ఫించ్‌- భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌మొహమ్మద్‌ కైఫ్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌టామ్‌ మూడీ- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాశ్రీశాంత్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌కాగా, టీ20 వరల్డ్‌కప్‌ 2024 జూన్‌ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడనున్నాయి. గ్రూప్‌-ఏలో భారత్‌, పాక్‌, ఐర్లాండ్‌, యూఎస్‌ఏ, కెనడా దేశాలు.. గ్రూప్‌-బిలో నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా.. గ్రూప్‌-సిలో ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, ఆఫ్ఘనిస్తాన్‌.. గ్రూప్‌-డిలో నెదర్లాండ్స్‌, నేపాల్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు పోటీ పడుతున్నాయి.

AP Elections 2024 May 28th Political Updates In Telugu
May 28th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 28th AP Elections 2024 News Political Updates.. 2:00 PM, May 28th, 2024సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లు..ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి?పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్‌ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంపైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుంది.బాధితులు రీపోలింగ్‌ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్‌ఫెక్ట్‌ అయ్యింది1:30 PM, May 28th, 2024ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుందిపేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది. పేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది.#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/YvbPmfC2sj— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 12:30 PM, May 28th, 2024సచివాలయంమాజీమంత్రి పేర్ని నాని కామెంట్లు..ఈసీ అధికారులును కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశాంఅన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారుపోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారుగెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలి అని గతంలో చెప్పారుస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారుకానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అన్నారుదేశంలో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారుఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందిఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదుఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందిఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలుచేస్తారు అని ఆడిగాంఈ నిబంధనలపై పునరాలోచించాలి అని కోరాం11:57 AM, May 28th, 2024తిరుమలఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కామెంట్లు..వైఎస్సార్‌సీపీకి 175/175 సీట్లు రావడం ఖాయంఈవీఎం ట్యాంపరింగ్ అనేది టీడీపీ అభూత కల్పితం మాత్రమే2019లో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేక పోయాడుగెలిస్తే ప్రజల మద్దతు.. ఓడితే ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ మాటలు మారుస్తాడు చంద్రబాబుప్రజా మద్దతు ఉన్నట్లు కేవలం టీడీపీ భ్రమ కల్పించే ప్రయత్నం చేసిందిఅనేక ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం జరిగింది.. ఒక ప్లాన్ ప్రకారం వైఎస్సార్‌సీపీ నాయకులను ఇరికించడానికి చేసిన కుట్రతెలుగుదేశం పార్టీ చేసిన దౌర్జన్యాలు ప్రజలు గమనించారుఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి దౌర్జన్యాలు చేయండని చంద్రబాబు పార్టీ కేడర్‌కు ఆదేశాలు ఇచ్చారుమహిళా ఓటింగ్ అధికంగా ఉండటం వల్ల చంద్రబాబుకు భయం.. జగన్‌కు ధైర్యం వచ్చింది 11:44 AM, May 28th, 2024ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరటమూడు కేసుల్లో మందస్తు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టుఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయన్న హైకోర్టుకండీషన్లతో బెయిల్ మంజూరు 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదన్న హైకోర్టు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి11:27 AM, May 28th, 2024తిరుమల:వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్లు.. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే.. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎంగా రావడం ఖాయంఅశాంతి కిషోర్‌ మాటలకు, మంత్రాలకు చింతకాయలు రాలవుఓ పార్టీలో చేరి సక్సెస్ అవ్వాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ భవితవ్యం, శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టు మారిందిప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారు2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయిఎన్నికలు సజావుగా సాగాయి.. ఎన్నికల ప్రక్రియకు వైఎస్సార్‌సీపీ ఎక్కడ విఘాతం కలిగించలేదుటీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసిందిమా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా.. ప్రమాణస్వీకారానికి డేట్, టైం ఫిక్స్ చేశారుప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదుఅసెంబ్లీలో 151కి పైగా, పార్లమెంట్‌లో 22కు పైగా సీట్లు వైఎస్సార్‌సీపీ గెలవబోతుందిపెట్టుకున్న ముహూర్తంలో ప్రమాణ స్వీకారం సీఎం జగన్ చేయడం ఖాయం 10:30 AM, May 28th, 2024నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజంనమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!Remembering Shri. Nandamuri Taraka Rama Rao Garu on his Jayanthi Today.నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!#CBNKilledNTR pic.twitter.com/A5PJ6b4NAQ— YSR Congress Party (@YSRCParty) May 28, 20249:34 AM, May 28th, 2024విజయవాడపిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పునిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలుపిన్నెల్లి విషయంలో రోజురోజుకి దిగజారుతున్న పోలీసుల తీరుపిన్నెల్లి కౌంటింగ్ లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్రఇవిఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23 న హైకోర్టు ఆదేశంహైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లి పై మరో మూడు కేసులు నమోదు చేసిన పోలీసులుఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కి హైకోర్టుని మరోసారి ఆశ్రయించిన పిన్నెల్లిహైకోర్టు విచారణలో మూడు కేసులని 22 న‌ నమోదు చేసినట్లుగా పోలీసుల వెల్లడిహైకోర్టు తీర్పు తర్వాతే 23 న తప్పుడు కేసులు నమోదు చేశారన్న పిన్నెల్లి న్యాయవాదిరికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడ్డ వైనం23 న కేసులు నమోదు చేసి 24 న స్ధానిక మేజిస్డ్రేట్ కి తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదుహైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయంమరోవైపు ప్రభుత్వ జిఓ లేకుండా పోలీసుల తరపున వాదించిన ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి గైర్హాజరైన అశ్వినీకుమార్ఆసక్తికరంగా బాదితుల తరపున ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లుతీర్పు నేటికి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి 8:09 AM, May 28th, 2024మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో డీజీపీ, పోలీసుల కుట్ర బట్టబయలుహైకోర్టు సాక్షిగా దొరికి పోయిన డీజీపీ, పల్నాడు పోలీసులుపిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్టుగా వెల్లడిపోలీసుల తీరుపై హైకోర్టులో వాదనల సందర్భంగా తీవ్ర విస్మయంపిన్నెల్లికి ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు నేటికి వాయిదామరోవైపు ప్రభుత్వం జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా పోలీసుల తరఫున వాదనలకు దిగిన లాయర్ అశ్వనీకుమార్పోలీసుల తరపున ప్రైవేట్ లాయర్ అశ్వనీకుమార్ హాజరుకావడం చర్చనీయాంశం కావడంతో నిన్నటి వాదనలకి గైర్హాజరుటీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని ఇంప్లీడ్ పిటిషన్దిగ్భ్రాంతి కలిగిస్తున్న పోలీసులు తీరుపిన్నెల్లి విషయంలో రోజురోజుకూ దిగజారుతున్న డీజీపీ, పల్నాడు పోలీసులుపోలీసు రాజ్యాన్ని తలపిస్తోందన్న చర్చఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరటజూన్ 5 వరకూ ఎలాంటి అరెస్టులు వద్దని తేల్చిచెప్పిన హైకోర్టుకౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి పచ్చముఠాలతో పోలీసుల కుట్రహత్యాయత్నం సహా మూడు కేసులను ఎమ్మెల్యే పిన్నెల్లిపై నమోదు చేసిన పోలీసులువాస్తవంగా ఈకేసులను హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23నే నమోదు చేసిన పోలీసులుకాని హైకోర్టు విచారణలో మే 22న నమోదుచేసినట్టుగా హైకోర్టుకు చెప్పిన పోలీసులుపోలీసులు వాదనలపై పిన్నెల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరంఏకంగా ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అభ్యంతరంవెంటనే రికార్డులు పరిశీలించిన హైకోర్టుపిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న నమోదు చేసినట్టుగా వెల్లడిఆతర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో వెల్లడి వాస్తవాలు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థంకాలేదన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిపీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్ను కూడా పెట్టారన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిహైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపిన పిన్నెల్లి తరఫు న్యాయవాదిరికార్డులను పరిశీలించిన తర్వాత కోర్టులో తీవ్ర విస్మయంకోర్టులో ప్రొసీడింగ్స్ తర్వాత ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర చర్చఈ వ్యవహారం వెనుక ఎవరున్నారన్నదానిపై చర్చఎవరి వెన్నుదన్నుతో డీజీపీ, ఎస్సీలు ఇలా బరితెగింపునకు దిగుతున్నారన్నదానిపై చర్చచివరకు తీర్పును నేటికి వాయిదా వేసిన హైకోర్టుమరోవైపు ప్రభుత్వం నియమించిన పీపీ కాకుండా పోలీసుల తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ హాజరుపైనా తీవ్ర చర్చప్రభుత్వ జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా అశ్వనీకుమార్ హాజరుపై సర్వత్రా విస్మయంకనీసం తమ తరఫున వాదనలు వినిపిస్తున్న పీపీకి కూడా సమాచారం ఇవ్వని డీజీపీ, పోలీసులుతొలిరోజు హాజరైన అశ్వనీకుమార్ నిన్న హాజరు కాని వైనంఆసక్తికరంగా టీడీపీ లీగల్ సెల్ నుంచి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరుబాధితుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేసి వాదనలు వినిపించిన పోసాని వెంకటేశ్వర్లు.ఈ వ్యవహారాలపై న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ. 7:15 AM, May 28th, 2024హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టుముందస్తు బెయిల్‌ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారంఈమేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులుసంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులుపిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. నేడు హైకోర్టు నిర్ణయంకౌంటింగ్‌లో పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉందన్న సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి 6:45 AM, May 28th, 2024రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలుకౌంటింగ్‌ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు పోలింగ్‌ అనంతర ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనా 6:30 AM, May 28th, 2024పెత్తందారులకు, పేదలకు యుద్ధం: సీఎం జగన్‌మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. మేము చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.-సీఎం @ysjagan… pic.twitter.com/BvDgxcKYWO— YSR Congress Party (@YSRCParty) May 27, 2024

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement