Top Stories
ప్రధాన వార్తలు
#HBDYSJAGAN: మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది: వైఎస్ జగన్
నమ్మినవారికి అండగా నిలిచే జన హృదయ నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తోంది ఆ పార్టీ..
సీఎం రేవంత్‌రెడ్డికి అల్లు అర్జున్ కౌంటర్
పుష్ప2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మరణించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సినీ హీరో అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా బన్నీ మీడియాతో మాట్లాడారు. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించకుండా పరోక్షంగా బన్నీ కౌంటర్ ఇచ్చారు. 'సంధ్య థియేటర్ ఘటన ప్రమాదవశాత్తుగా మాత్రమే జరిగింది. కానీ, నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే. నేను ఎలాంటి ర్యాలీ చేయలేదు. థియేటర్ లోపలికి నేను వెళ్లిన తర్వాత ఏ పోలీస్ లోపలికి వచ్చిన జరిగిన సంఘటన గురించి చెప్పలేదు. థియేటర్ యాజమాన్యం వచ్చి, జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పడంతో బయటకు వచ్చేశాను. తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం ఆ క్షణంలో నాకు తెలియదు. మరుసటి రోజు రేవతి విషయం తెలిసింది. నా సినిమా కోసం వచ్చిన ఒక మహిళ చనిపోయిన విషయం తెలిసి కూడా ఎలా వెళ్లిపోతాను..? నాకూ పిల్లలు ఉన్నారు కదా. మరుసటి రోజు నా టీమ్ వారికి ఫోన్ చేసి వెంటనే ఆస్పత్రికి వెళ్లమని చెప్పాను. సినిమాకు వచ్చేవారిని ఆనందపరచాలనేది మా ఉద్దేశం.నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు. ఇంతవరకు నేను ఎవరినీ ఒకమాట అనలేదు. అనుమతి లేకుండా థియేటర్‌కు వెళ్లాను అనడంలో ఎలాంటి నిజం లేదు. రేవతి కుటుంబం విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించానని చెప్పడం చాలా దారుణం. నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు చాలా బాధను కలిగిస్తున్నాయి. నేను రోడ్ షో, ఊరేగింపు చేయలేదు. మూడేళ్లుగా సినిమా కోసం చాలా కష్టపడ్డాను. అభిమానులతో సినిమా చూడాలని ఆశతో వెళ్లాను. గతంలో ఇతర హీరోల అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది నా అభిమానులు చనిపోతే.. ఆ కుటుంబాన్ని వెళ్లి కలవకుండా ఎలా ఉంటాను. లాయర్ల సూచనలతో నేను శ్రీతేజను చూసేందుకు వెళ్లలేదు. అయితే, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి స్పెషల్ అనుమతి తీసుకుని, మా నాన్నను వెళ్లమని చెప్పాను. కానీ, అదీ కుదరదన్నారు. అయితే, సుకుమార్‌ను అయినా వెళ్లమని చెప్పాను. అదీ కాదన్నారు. నేను ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని చెప్పడం చాలా దారుణం. నా క్యారెక్టర్‌ను చాలామంది తక్కువ చేసి మాట్లాడుతుంటే మాత్రం మనసుకు తీసుకోలేకపోతున్నా. అంతటి ఘోరం జరిగిందని నాకు తెలిస్తే.. నా బిడ్డలను థియేటర్ వద్దే వదిలి ఎలా వెళ్తాను. పూర్తి విషయాలు తెలుసుకోకుండా నాపైన నిందలు వేస్తున్నారు. నేను కూడా ఒక తండ్రినే.. నాకు శ్రీతేజ వయసు ఉన్న అబ్బాయి ఉన్నాడు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు.తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని.. థియేటర్ నుంచి వెళ్లిపోవాలని ఏసీపీ చెప్పినా కూడా సినిమా చూసే వెళ్తానని అల్లు అర్జున్ అన్నట్టు తెలిసిందని రేవంత్‌రెడ్డి అన్నారు. పోలీసులు ఎదోరకంగా అల్లు అర్జున్ను అక్కడి నుంచి పంపిస్తే.. అయినప్పటికీ, మరోసారి రూఫ్‌టాప్ ద్వారా చేతులు ఊపుతూ వెళ్లారని కామెంట్ చేశారు. ఒక మహిళ చనిపోయిందని తెలిసి ఆపై ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా కూడా అల్లు అర్జున్ అదే పద్ధతి కొనసాగించారనే సంచలన ఆరోపణ రేవంత్‌రెడ్డి చేశారు. ఒక మహిళ చనిపోయాన కూడా ఆయన సినిమా చూసే వెళ్తానని అనడం ఏంటి అంటూ బన్నీ తీరుపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే..! భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఖారారు చేసిటనట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'రెవ్‌స్పోర్ట్జ్' అనే స్పోర్ట్స్ వెబ్ సైట్ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.రెవ్‌స్పోర్ట్జ్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. అయితే టీమిండియా తమ మొదటి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ తటస్ధ వేదికపై జరుగుతాయి అని సదరు వెబ్సైట్ పేర్కొంది.దాయాదుల పోరు ఎప్పుడంటే?రెవ్‌స్పోర్ట్జ్ ప్రకారం.. ఈ మెగా టోర్నీలో ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్ధిలు పాకిస్తాన్-భారత్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. కాగా లీగ్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్‌లను ఆడనుంది. న్యూజిలాండ్‌తో చివరి లీగ్ మ్యాచ్‌ను మార్చి 2న ఆడనుంది.మార్చి 4న సెమీఫైనల్-1, మార్చి 5న సెమీఫైనల్-2 జరగనుండగా.. మార్చి 9న ఫైనల్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. టీమిండియా తమ మ్యాచ్‌లను శ్రీలంక లేదా దుబాయ్ వేదికలగా ఆడే అవకాశముంది.కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. భారత మ్యాచ్‌లు మినహా మిగితా అన్నీ పాక్‌లోనే జరగనున్నాయి. టీమిండియా ఒకవేళ నాకౌట్స్‌కు చేరితే ఆ మ్యాచ్‌లు కూడా తటస్థవేదిక గానే జరగనున్నాయి.చదవండి: VHT 2024: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ.. 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో
ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు
గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ప్రముఖ టెక్ కంపెనీ 'టీసీఎస్' కీలక ప్రకటన చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో భారీ రిక్రూట్మెంట్స్ ఉంటాయని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'మిలింద్ లక్కడ్' పేర్కొన్నారు.వచ్చే ఏడాది సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందని.. మిలింద్ లక్కడ్ అన్నారు. అంతే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ ఏఐ (GenAI)తో సహా అత్యాధునిక సాంకేతికతలలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.కేవలం ఫ్రెషర్లను మాత్రమే కాకుండా.. హయ్యర్ క్యాడర్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకోకున్నట్లు సమాచారం. సుమారు ఏడాది తరువాత కంపెనీ నియమాలను గురించి వెల్లడించింది. కరోనా మహమ్మారి తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడ్డారు.ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీలు పెరుగుతున్న క్రమంలో ఐటీ కంపెనీలు.. ఈ రంగంలో అభివృద్ధి చెందడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే తమ ఉద్యోగులకు ఈ టెక్నాలజీలలో శిక్షణ ఇవ్వడానికి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నాయి.ఇదీ చదవండి: టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: 10 శాతం ఉద్యోగులు బయటకువారానికి ఐదు రోజులుకరోనా తరువాత ఉద్యోగులందరూ ఆఫీసు నుంచే పనిచేయాలని, వారానికి ఐదు రోజులు ఆఫీసులో ఉండాలని పలు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో టీసీఎస్ కూడా ఉంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి.. కంపెనీ ప్రోత్సాహకాలతో ముడిపెట్టింది. కార్యాలయ సంస్కృతిని బలోపేతం చేయడానికి, సహకారాన్ని మెరుగుపరచడానికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మళ్ళీ మొదలుపెట్టింది.
రాజ్యాంగమే సాక్షి.. ఛత్తీస్‌గఢ్‌లో ఆదర్శ వివాహం చేసుకున్న జంట
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లో ఓ జంట ఆదర్శ వివాహం చేసుకుంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు,ఆచారాలు పక్కనపెట్టి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నారు. ఏడడుగులు నడవడం, తాళి కట్టడం, సింధూరం పెట్టడం లాంటి అన్ని ఆచారాలను దూరంగా పెట్టారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేయడమే కాకుండా దండలు మార్చుకుని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇంతటితో ఆగకుండా పెళ్లికి అనవసర ఖర్చు కూడా చేయకుండా సింపుల్‌గా కానిచ్చేశారు. పెళ్లికయ్యే ఖర్చులతో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయవచ్చనే ఆలోచనతోనే ఇలాచేసినట్లు పెళ్లికొడుకు ఇమాన్ లాహ్రె చెప్పారు. తమకు ఆచారాలు,సంప్రదాయాల మీద కన్నా రాజ్యాంగం మీదనే తమకు నమ్మకం ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్పూర్ జిల్లాలోని కాపు గ్రామంలో డిసెంబర్ 18న ఈ పెళ్లి జరిగింది. ఈ జంట చేసుకున్న ఆదర్శ వివాహంపై వారి బంధువులు, గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు.
‘విజన్’ల పేరుతో ఏం సాధించారో కాస్త చెప్పండి చంద్రబాబు..!
ఏపీలో ఎవరు విజనరి? తాను విజనరీని అని నిత్యం ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న విజన్ ఏమిటి? ఎలాంటి పబ్లిసిటీ లేకుండా పలు వ్యవస్థలను తీసుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు ఉన్న విజన్ ఏమిటి అన్నది పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది. విజన్ -2047 డాక్యుమెంట్ ను ఒక డొల్ల పత్రంగా, చంద్రబాబుది మోసపూరిత విజన్‌గా జగన్ అభివర్ణించారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని గమనించి ఆలోచించవలసిన అవసరం ఏపీ ప్రజలపై ఉంటుంది.ఆయన ప్రకటన చూస్తే ఎవరు ఏపీకి మేలు చేసే విధంగా విజన్ తో పనిచేశారో తెలుస్తోంది.చంద్రబాబు మొత్తం విజన్ల పేరుతో కథ నడపడమే కాని, చరిత్రలో నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా?అని జగన్ ప్రశ్నించారు. ఇది అర్దవంతమైన ప్రశ్నే. ఎందుకంటే విభజిత ఏపీలో ఐదేళ్లు, అంతకుముందు ఉమ్మడి ఏపీకి సుమారు ఎనిమిదిన్నరేళ్లు సీఎంగా ఉన్న ఆయన మళ్లీ గత ఆరు నెలలుగా ఆ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.విజన్ 2020 అని ,విజన్ 2029 అని, విజన్ 2047 లని ఇలా రకరకాల విజన్లు పెట్టడమే తప్ప,వాటి ద్వారా ఏమి సాధించింది చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. ఎంతసేపు హైదరాబాద్ లో అది చేశా..ఇది చేశా..అని అనడమేకాని ,విభజిత ఏపీలో తన హయాంలో ఫలానా గొప్ప పని చేశానని వివరించలేకపోతున్నారు.నిజంగానే ఆయనకు అంత మంచి విజన్ ఉంటే,హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం అయిన విశాఖపట్నానికి ఐటి రంగాన్ని ఎందుకు తీసుకు రాలేకపోయారు?హైదరాబాద్‌లో ఒక హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం నిర్మించిన మాట నిజం.కాని అంతకుముందే నేదురుమల్లి జనార్ధనరెడ్డి హయాంలో రాజీవ్ గాంధీ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేశారు.మరి ఆయనది విజన్ కాదా?చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే హైటెక్ సిటీ ప్రాంతంకాని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంగాని అబివృద్ది చెందాయి ఆ రోజుల్లో దానికి ఎలా అడ్డుపడాలా అన్న ఆలోచనతో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ పనిచేసింది. ఈ విధంగా తాము అధికారంలో లేనప్పుడు పలు అభివృద్ది పనులకు ఆటంకాలు కల్పించడంలో మాత్రం చంద్రబాబు టీమ్ కు చాలా విజన్ ఉందని చెప్పవచ్చు.మరో సంగతి కూడా చెప్పాలి. రాజకీయాలలో వైఎస్ కుమారుడు జగన్ దూసుకు వస్తారని ఊహించిన చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి అక్రమ కేసులలో ఇరికించి జైలుపాలు చేశారు.ఈ విజన్ మాత్రం బాగానే ఉందని చెప్పాలి.జగన్ పై ద్వేషంతో చీరాల ప్రాంతంలో అప్పట్లో తీసుకురాదలిచిన వాన్ పిక్ కు అడ్డుపడ్డారు.ఆ పారిశ్రామికవాడ వచ్చి ఉంటే ,ఇప్పుడుతడ వద్ద ఉన్న శ్రీసిటీ మాదిరి అభివృద్ది చెంది ఉండేది.విభజిత ఏపీకి అది పెద్ద ఆభరణంగా ఉండేది. వైఎస్ టైమ్ లో శ్రీసిటీ భూమి సేకరణకు కూడా టీడీపీ,అలాగే ఈనాడు వంటి ఎల్లో మీడియా వ్యతిరేక ప్రచారం చేశాయి. అయినా వైఎస్ ఆగలేదు కనుక అది ఒక రూపానికి వచ్చింది. ఇప్పుడేమో శ్రీ సిటీ అభివృద్దిలో తమకు వాటా ఉన్నట్లుగా చంద్రబాబు పిక్చర్ ఇస్తుంటారు.విభజిత ఏపీలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఎంతసేపు సోనియాగాంధీని దూషించడం ,తదుపరి ప్రధాని నరేంద్ర మోడీని తిట్టిపోయడం, వీటికోసం నవనిర్మాణ దీక్షలని, ధర్మపోరాట దీక్షలని డ్రామాలు ఆడారు. ఆ తర్వాత కాలంలో సోనియాను, మోడీని పొగుడుతూ వారితోనే రాజకీయంగా జత కట్టారు.అది ఆయన విజన్.తన పాలనలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు.ఆ కమిటీలలో టీడీపీ నేతలను పెట్టి గ్రామాలలో అరాచకం సృష్టించారు.అది అప్పటి విజన్ అనుకోవాలి.అదే జగన్ అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థను తెచ్చి, గ్రామ,వార్డు సచివాలయాలను పెట్టి పాలనను ప్రజల చెంతకు చేర్చారు.దీనిని కదా విజన్ అనాల్సింది.చంద్రబాబు తన టైమ్ లో ఒక్క మెడికల్ కాలేజీ అయినా ప్రభుత్వరంగంలో తీసుకురాలేదు. జగన్ తన టైమ్‌లో పదిహేడు మెడికల్ కాలేజీలను తెచ్చి, వాటిలో ఐదు నిర్మాణం పూర్తి చేశారు.అది విజన్ కాదా? చంద్రబాబు ఏమి చేశారు. కూటమి అదికారంలోకి రాగానే పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం మంజూరు చేసిన మెడికల్ సీట్లను అక్కర్లేదని లేఖ రాశారు. కొత్త మెడికల్ కాలేజీలను ప్రవేటు రంగంలోకి మళ్లించాలని చూస్తున్నారు.జగన్ నాలుగుపోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మించడానికి చర్యలు తీసుకున్నారు.వాటిలో కొన్ని ఇప్పటికే పూర్తి అయ్యాయి.చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో ఒక్క ఓడరేవు అయినా నిర్మించారా?ఇప్పుడేమో జగన్ తీసుకు వచ్చిన పోర్టులను ప్రైవటైజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది చంద్రబాబు విజన్.వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి ,వారికి తాము నెలకు పదివేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక అసలుకే ఎసరు పెట్టారు.అది చంద్రబాబు విజన్ అనుకోవాలి. గత జగన్ పాలనలో ఇళ్ల వద్దకే ఏ సర్టిఫికెట్ అయినా తెచ్చి ఇచ్చేవారు.చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే ఆ పద్దతి ఆగిపోయింది.మళ్లీ ఆఫీస్ ల చుట్టూ తిరిగేలా చేసిన విజన్ కూటమిది.వృద్దులకు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచింది నిజమే అయినా,ఇప్పుడు అర్హత పేరుతో లక్షల సంఖ్యలో తొలగిస్తున్నారు.స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెన్షన్ దారులలో దొంగలున్నారని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తాము పెన్షన్ దారులలో అనర్హులను ఏరివేస్తామని చెప్పకపోగా, ఎక్కడైనా ఒకటి,అరా పెన్షన్ దారులలో కోత పడితే జగన్ పై విరుచుకుపడేవారు. ఇప్పుడేమో గెలిచాక టీడీపీ వారు కొత్త రాగం అందుకున్నారు. జగన్ స్కూళ్లు బాగు చేసి ,అందులో ఆంగ్ల మీడియంతో సహా పలు అంతర్జాతీయ కోర్సులను తీసుకు వస్తే చంద్రబాబు సర్కార్ వాటిని నిర్వీర్యం చేస్తోంది.వీరిద్దరిలో ఎవరు విజనరీ అనుకోవాలి.పిల్లలకు టాబ్ లు ఇచ్చి వారి చదువులకు జగన్ ఉపయోగపడితే, వాటిపై దుష్ప్రచారం చేసినవిజన్ టీడీపీది,ఎల్లో మీడియా ఈనాడు ది.ప్రస్తుతం పిల్లలకు టాబ్ లు ఎప్పుడు ఇచ్చేది చెప్పడం లేదు. జగన్ పిల్లలకు విద్యే సంపద అని పదే,పదే చెప్పేవారు.చంద్రబాబు గతంలో అసలు విద్య అన్నది ప్రభుత్వ బాధ్యతే కాదని అనేవారు.చంద్రబాబు తన హయాంలో మిగులు రెవెన్యూ చూపారా? అని జగన్ ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టించడం అంటే ప్రభుత్వానికి ఆదాయం పెంచడమే కదా!ఆ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడూ రెవెన్యూలోటే ఎందుకు ఉందని ఆయన అడుగుతున్నారు.జగన్ పాలనలో పేదల చేతిలో డబ్బులు ఉండేవి. దాని ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ కరోనా వంటి సంక్షోభంలో కూడా సజావుగా సాగింది.తత్ఫలితంగా జిఎస్టి దేశంలోనే అత్యధికంగా వచ్చిన రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం రాగానే అది ఎందుకు తగ్గిపోయింది. గత నెలలో ఏకంగా ఐదువందల కోట్ల జిఎస్టి తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. జగన్ గ్రీన్ ఎనర్జీమీద కేంద్రీకరించి, రైతులకు మంచి కౌలు వచ్చేలా పారిశ్రామికవేత్తలకు భూములు ఇప్పిస్తే చంద్రబాబుకాని, ఎల్లో మీడియాకాని తీవ్రమైన విమర్శలు చేసేవారు.కాని ఇప్పుడు అదే పద్దతిని కూటమి ప్రభుత్వం చేపడుతోంది.జగన్ టైమ్ లో రైతులకు కేంద్రం సూచన మేరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలుగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని ఉరితాళ్లుగా ప్రచారం చేసిన విజన్ చంద్రబాబుది. తాము అధికారంలోకి రాగానే యధాప్రకారం స్మార్ట్ మీటర్లను పెడుతున్న విజన్ కూటమి ప్రభుత్వానిది అని చెప్పాలి.జగన్ ప్రజల ఇళ్లవద్దకే వైద్య సదుపాయం కల్పించడానికి ఇంటింటికి డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చారు.అది ఆయనవిజన్ అయితే,ఇప్పుడు ఆస్పత్రులలో దూది కూడా లభించకుండా చేసిన విజన్ ఈ ప్రభుత్వానిదని అనుకోవాలి.కరెంటు చార్జీలు పెంచబోనని,తగ్గిస్తామని పదే,పదే ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిరాగానే పదిహేనువేల కోట్ల మేర భారం వేసిన విజన్ ఆయన సొంతం అని చెప్పాలి.ఇసుక, మద్యం వంటి వాటి ద్వారా కూటమి నేతలు బాగా సంపాదించుకునేలా మాత్రం చంద్రబాబు ప్రభుత్వం విజన్ తో పనిచేసిందని చెప్పాలి.పేదలకు ప్రభుత్వమే అండగా ఉండాలన్నది జగన్ విజన్ అయితే, పేదలను ధనికులు దత్తత తీసుకోవాలన్న ఆచరణ సాధ్యం కాని విజన్ చంద్రబాబుది. అయితే అమరావతిలో ఒక రూపాయి కూడా ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టనక్కర్లలేదని చెప్పి, పవర్ లోకి రాగానే ఏభైవేల కోట్ల అప్పు తీసుకువస్తున్న చంద్రబాబుది ఏమి విజన్ అని అడిగితే ఏమి చెబుతాం. ఆయనది రియల్ ఎస్టేట్ విజన్ మాత్రం చెప్పక తప్పదు. జగన్ ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంభించి ప్రజలకు ఉపయోగపడేలా ప్రయత్నించారు.కాకపోతే తనది విజన్ అని ,వంకాయ అని ప్రచారం చేసుకోలేదు.అదే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ వంటివారు ఎల్లో మీడియా అండతో స్వర్ణాంధ్ర-2047 అంటూ ప్రచారం చేసుకుంటూ ప్రజలకు తామిచ్చిన హామీల నుంచి డైవర్ట్ చేయడానికి విజన్ తో పని చేస్తున్నారని చెప్పవచ్చేమో! ఇచ్చిన వాగ్దానాలను ఎలా అమలు చేయాలా అన్నవిజన్ తో జగన్ పనిచేస్తే, చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లు తాము చేసిన ప్రామిస్‌లను ఎలా ఎగవేయాలా అన్న విజన్ తో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ అటు సంక్షేమ రంగంలో కాని,ఇటు అభివృద్ది, పారిశ్రామిక రంగలో కాని, లేదా పరిపాలనను ప్రజల ఇళ్ల వద్దకు చేర్చడంలో కాని కచ్చితంగా విజన్ తో పనిచేశారని సోదాహరణంగా చెప్పవచ్చు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
అరబిక్‌లో రామాయణ భారతాలు..అనువాదకులతో ప్రధాని భేటీ
కువైట్సిటీ: ప్రధాని మోదీ కువైట్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం(డిసెంబర్21) రామాయణ మహాభారతాలను అరబిక్‌లో అనువదించిన అబ్దుల్లా అల్ బరూన్,ఈ ఇతిహాసాల అరబిక్ వెర్షన్లను ప్రచురించిన అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్‌లను కలిశారు. తనకు రామాయణమహాభారతాలను అరబిక్‌లో అనువదించేందుకు రెండు సంవత్సరాల 8 నెలలు పట్టిందని అల్ బరూన్ అన్నారు. తాము ప్రచురించిన అరబిక్ రామాయణ మహాభారత పుస్తకాలను ప్రధాని మోదీ చూసి సంతోషించారని,రెండు పుస్తకాలపై ఆయన సంతకం చేశారని ప్రచురణకర్త అబ్దుల్లతీఫ్ అల్నెసెఫ్ చెప్పారు. అల్బరూన్,అల్నెసెఫ్ ప్రపంచంలోని ముప్పై దాకా గొప్ప కావ్యాలను అరబిక్‌లో ప్రచురించారు. 43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. కువైట్‌లో ప్రధాని రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో ప్రధాని మన్‌కీబాత్‌లో కూడా అరబిక్‌లో రామాయణ మహాభారతాలను అనువదించిన ఇద్దరి గురించి ప్రస్తావించడం గమనార్హం. #WATCH | Kuwait | Ramayana and Mahabharata published in Arabic language; Abdullateef Alnesef, the book publisher and Abdullah Baron, the translator of Ramayana and Mahabharata in the Arabic language, met PM Narendra Modi in Kuwait CityAbdullateef Alnesef, the book publisher… pic.twitter.com/jO3EqcflXJ— ANI (@ANI) December 21, 2024 మా తాతను కలవండని ఓ నెటిజన్ విజ్ఞప్తి.. కలిసిన ప్రధాని ప్రధాని మోదీ కువైట్ పర్యటన నేపథ్యంలో కువైట్‌లో ఉంటున్న తన తాత,రిటైర్డ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉద్యోగి మంగళ్ సేన్ హండా (101)ను కలవండని ఎక్స్(ట్విటర్)లో ఓ నెటిజన్ ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. ఆయనను తప్పకుండా కలుస్తానని బదులిచచ్చిన మోదీ కువైట్ చేరుకున్న అనంతరం మంగల్‌సేన్‌హండాను కలిశారు. — Narendra Modi (@narendramodi) December 21, 2024
సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డి అక్కసుతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.శనివారం(డిసెంబర్21) అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై ఫైర్ అయ్యారు.‘రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్ మాట తప్పారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదు. వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు. సీఎం వంద శాతం రుణమాఫీ అయ్యింది అంటున్నారు. వారి ఎమ్మెల్యేలు మాత్రం 70,80 శాతం రుణమాఫీ అయ్యింది అంటున్నారు. రేవంత్ మాటల్లో చిత్త శుద్ధి లేదు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేయలేదు. రైతులను మోసం చేశారవు. రాష్ట్రంలో 25 శాతం మాత్రమే రుణమాఫీ అయ్యింది. ఓటు నోటుకు దొంగ రేవంత్‌రెడ్డి సభలో అన్ని అబద్ధాలు చెబుతున్నాడు.పత్తి, కంది సాగు చేసే రైతులకు రెండో పంటకు రైతు బంధు వేయరా. రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలు ఇవ్వండని మేము అడిగితే ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదు.రైతు ఆత్మహత్యల మీద అబద్ధాలు చెప్పింది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం రైతు బంధు ఇచ్చిన తరువాత రైతు ఆత్మహత్యలు తగ్గాయి. రేవంత్‌రెడ్డికి చరిత్ర తెలియదు. తెలంగాణ ఎప్పటికీ సర్ ప్లస్ స్టేట్.పదేండ్లలో లక్ష కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ,రైతు బంధు ద్వారా ఇచ్చాము.పాన్ కార్డులు, ఐటీ ఉద్యోగులు ,ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇవ్వం అంటే ఎలా.ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు.రైతు భరోసా మీద వేసిన కమిటీలు అన్ని కాలయాపన కోసమే. ప్రజలు కోరుకున్నది పేరు మార్పిడి కాదు. గుణాత్మకమైన మార్పు కోరుకున్నారు. కేసీఆర్ చెప్పినట్టుగా జరుగుతోంది.కాంగ్రెస్ వస్తే రైతు బంధు కట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు రైతు బంధు కట్ అయ్యింది.స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రైతులు నిలదీయాలి.సంక్రాంతి తరువాత ఎన్నికలు అంటున్నారు ఏ సంక్రాంతి అనేది చెప్పడం లేదు. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్‌రెడ్డిని ఎర్రగడ్డకు తీసుకువెళ్లి చూపించండి. 420 హామీలు,ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు నిన్ను వదలం.ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం.ఈడీకి,మోడీకి మేము భయపడం’అని కేటీఆర్ అన్నారు.
#HBDYSJAGAN: ట్రెండ్ సెట్ చేసిన అభిమానం
Jagan Birthday Shakes Social Media: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం నేడు. అయితే.. ముందు నుంచే ఈ కోలాహలం నడిచింది. మొన్నా.. నిన్నంతా.. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ సోషల్ మీడియా హోరెత్తగా.. ఇవాళ హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్ తో ఊగిపోతోంది. ఇవాళ జననేత పుట్టిన రోజు సందర్భంగా.. వైఎస్సార్సీపీ తరఫున, అలాగే అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. కానీ, ఈలోపే సోషల్ మీడియా దద్దరిల్లడం మొదలైంది. జగన్ బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ దుమ్మురేపేస్తోంది. ఎక్స్(మాజీ ట్విటర్)లో ఇండియా వైడ్‌గా టాప్ ట్రెండింగ్‌లో వైయస్ జగన్ బర్త్‌డే కొనసాగుతోంది.#HBDYSJagan#HBDYSJagananna#HbdysJagansir200K Tweets Done & Dusted✅🔥#HBDYSJagan pic.twitter.com/mrLVHcdqTr— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) December 21, 2024తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలలా, విదేశాల నుంచి కూడా #HBDYSJagan తో పాటు అనుబంధ హ్యాష్ ట్యాగ్‌తో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ దెబ్బకు హేటర్స్ సైతం పోటాపోటీ పోస్టులు వేయలేక చల్లబడ్డారు. ఇంకోపక్క.. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ జగన్.. వైఎస్సార్సీపీ అభిమానులు రాత్రి నుంచే సంబురాలు చేస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌లో కూకట్పల్లి, పంజాగుట్టలో వేడుకలు అంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. శివమెత్తి లేచిన అభిమానం 🔥🔥@ysjagan #HBDYSJagan #YSJagan pic.twitter.com/5gl8NZwhUT— 𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐚𝐫𝐚𝐦 (@karnareddy4512) December 20, 2024ఏ యేడు కాయేడు సోషల్ మీడియాలో వైఎస్ జగన్ బర్త్‌డే పోస్టుల రూపంలో సరికొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఎక్స్‌లో టాప్ త్రీ పొజిషన్లోనే సుమారు 10 గంటలకు పైగా కొనసాగడం.. మామూలు విషయం కాదు. తెల్లవారుజాము నుంచి పోస్ట్ చేసేవాళ్ల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఒక్క ఎక్స్‌లోనే కాదు.. ఇటు వాట్సాప్ స్టేటస్‌ల రూపంలో, మరోవైపు ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ఫేస్‌బుక్‌లోనూ జగన్ బర్త్ డే సందర్భంగా అభిమానం ఉప్పొంగుతోంది.ఇదీ చదవండి: ఎవరేమన్నా.. జగన్ విషయంలో ఇదే అక్షర సత్యం!
అయ్యారే... లేడీస్ టైలర్..ఈ డిజైన్స్‌కి మగువలు ఫిదా!
ఈ బుజ్జిగాణ్ణి మన రాజేంద్ర ప్రసాద్‌ని పిలిచినట్టు ‘లేడిస్ టైలర్’ అనంటే ఊరుకోడు. ‘ఐ యామ్ ఏ ఫ్యాషన్ డిజైనర్’ అంటాడు. ఎనిమిదేళ్ల వయసులో పిల్లలు ఆటపాటల్లో మునిగిపోయి ఉంటారు కానీ అమెరికాకు చెందిన మాక్స్ అలెగ్జాండర్ మాత్రం కొత్త బట్టలు, సరికొత్త ఫ్యాషన్లు, నూతన ఆలోచనలు అంటూ హడావిడిగా ఉంటాడు. అతి చిన్న ఫ్యాషన్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్న మాక్స్ రూపొందించే దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కీలకమైన వేడుకల్లో అతను తయారు చేసే బట్టలే వేసుకుంటామని కొందరు సెలబ్రెటీలు హటం చేస్తారు. అనగా మంకుపట్టు పడతారు.మాక్స్‌కి నాలుగేళ్ల వయసున్నప్పుడు అతని తల్లి షెర్రీ మాడిసన్స్ అతనికో బొమ్మ ఇచ్చింది. దాని కోసం కస్టమ్ కోచర్ గౌన్ కుట్టాడు మాక్స్. అప్పటి నుండి ఇప్పటిదాకా 100 కంటే ఎక్కువ కస్టమ్ కోచర్ గౌన్లు కుట్టాడు. అతని ఆస్తకిని గమనించి తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. తాను తయారుచేసిన దుస్తులతో అనేక రన్‌వే షోలను నిర్వహించి, ప్రపంచంలో అతి చిన్న వయస్కుడైన రన్ వే ఫ్యాషన్ డిజైనర్‌గా మాక్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. అతను తయారు చేసిన దుస్తుల్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించారు. బట్టలు కుట్టేసి ఇచ్చేయడం మాత్రమే మాక్స్ పని కాదు. అవి వేసుకునేవారు ఏం కోరుతున్నారు, వారి ఇష్టాయిష్టాలు ఏమిటి, ఎలాంటి దుస్తులు సౌకర్యంగా అనిపిస్తాయి, ఎలాంటి రంగులు వారి ఒంటికి నప్పుతాయి వంటి అంశాలన్నీ ఆలోచించి డిజైన్ చేస్తాడు. ఈ కారణంగానే అతను రూ΄÷ందించే బట్టలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతోపాటు పనికిరాని వస్తువులతో కూడా కొత్త రకమైన బట్టలు తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇన్‌స్ట్రాగామ్‌లో మాక్స్‌కి మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మరిన్ని కొత్త ఫ్యాషన్లు రూపొందించాలని, అందుకోసం మరింత సాధన చేయాలని అతను అంటున్నాడు.
భారత్‌లో రూ.13.49 లక్షల బైక్ లాంచ్: బుకింగ్స్ షురూ
బన్నీ 22 ఏళ్లుగా కష్టపడుతున్నాడు.. ఎక్కడైనా తప్పు చేశాడా..?: అల్లు అరవింద్
అయ్యర్ సెంచరీ వృథా.. 383 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేసిన కర్ణాటక
రాజ్యాంగమే సాక్షి.. ఛత్తీస్‌గఢ్‌లో ఆదర్శ వివాహం చేసుకున్న జంట
బంతి తిప్పిన జీవితాలెన్నో.. వాలీబాల్ ఎట్ ఇనుగుర్తి
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం: ఆ లావాదేవీలపై జీఎస్టీ లేదు
ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వ కానుక
ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు
నయనతారకు అహంకారం.. అందుకే అలాంటి కామెంట్ చేసింది: సింగర్
‘విజన్’ల పేరుతో ఏం సాధించారో కాస్త చెప్పండి చంద్రబాబు..!
శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. వన్డేలో విధ్వంసకర శతకం
ముగ్గురు స్టార్స్, పరమ చెత్త సినిమాగా రికార్డ్.. థియేటర్లలో నో రిలీజ్!
పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్
శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
... ద్వారాల వద్ద వద్దన్నారని..!
టైటాన్స్ గెలుపు
తెలంగాణ శ్రీరంగం
అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఓ రోజు వాళ్ల కంపెనీ బ్యాగును కూడా మీ వెంట తీసుకెళ్లితే వాళ్లకు ప్రచారం చేసినట్లు అవుతుందట మేడం!
భారత్‌లో రూ.13.49 లక్షల బైక్ లాంచ్: బుకింగ్స్ షురూ
బన్నీ 22 ఏళ్లుగా కష్టపడుతున్నాడు.. ఎక్కడైనా తప్పు చేశాడా..?: అల్లు అరవింద్
అయ్యర్ సెంచరీ వృథా.. 383 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేసిన కర్ణాటక
రాజ్యాంగమే సాక్షి.. ఛత్తీస్‌గఢ్‌లో ఆదర్శ వివాహం చేసుకున్న జంట
బంతి తిప్పిన జీవితాలెన్నో.. వాలీబాల్ ఎట్ ఇనుగుర్తి
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం: ఆ లావాదేవీలపై జీఎస్టీ లేదు
ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వ కానుక
ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు
నయనతారకు అహంకారం.. అందుకే అలాంటి కామెంట్ చేసింది: సింగర్
‘విజన్’ల పేరుతో ఏం సాధించారో కాస్త చెప్పండి చంద్రబాబు..!
శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. వన్డేలో విధ్వంసకర శతకం
ముగ్గురు స్టార్స్, పరమ చెత్త సినిమాగా రికార్డ్.. థియేటర్లలో నో రిలీజ్!
పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్
శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
... ద్వారాల వద్ద వద్దన్నారని..!
టైటాన్స్ గెలుపు
తెలంగాణ శ్రీరంగం
అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఓ రోజు వాళ్ల కంపెనీ బ్యాగును కూడా మీ వెంట తీసుకెళ్లితే వాళ్లకు ప్రచారం చేసినట్లు అవుతుందట మేడం!
సినిమా
'బరోజ్ 3డీ’లో కొత్త ప్రపంచాన్ని చూస్తారు: మోహన్ లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ టైటిల్ రోల్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఎపిక్ ఫాంటసీ అడ్వంచర్ 'బరోజ్ 3డీ'. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మోహన్ లాల్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.→బరోజ్ త్రీడీ ఫాంటసీ ఫిల్మ్. ఇప్పటివరకూ మలయాళం నుంచి మూడు త్రీడీ సినిమాలే వచ్చాయి. అయితే బరోజ్ లో ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని చాలా యూనిక్ గా సినిమాని రూపొందించాం. సినిమా అద్భుతంగా వచ్చింది. విజువల్ వండర్ తో పాటు స్టొరీ టెల్లింగ్ ని రీడిస్కవర్ చేసేలా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చేలా ఉంటుంది. గత నలభై ఏళ్ళుగా ఇలాంటి సినిమా రాలేదు. దర్శకుడిగా ఇది నాకు కొత్త అనుభూతి. దర్శకుడిగా తొలి సినిమానే త్రీడీలో చేయడం సవాలుగా అనిపించింది. టీం అందరూ చాలా సపోర్ట్ చేశారు.→గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్ నవలను ఆధారంగా చేసుకొని ఒక ఇమాజనరీ అడ్వంచర్ కథని రూపొందించాం. వాస్కో డి గామాలో దాగి ఉన్న రహస్య నిధిని కాపాడుతూ వచ్చే బరోజ్, ఆ సంపదను దాని నిజమైన వారసుడికి అందించడానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా ఉంటాయి. స్టొరీ టెల్లింగ్ చాలా కొత్త ఉంటుంది. ప్రేక్షకులు ఓపెన్ మైండ్ తో వచ్చి ఈ ఇమాజినరీ వరల్డ్ ని ఎక్స్ పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను.→ త్రీడీ సినిమా చేయడం అంత ఈజీ కాదు. ప్రత్యేకమైన కెమరాలు అవసరం పడతాయి. అన్ని కెమరాల విజన్ పర్ఫెక్ట్ గా సింక్ అవ్వాలి. ప్రేక్షకడికి గొప్ప త్రీడీ అనుభూతి ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.→ ఈ సినిమాకి ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పని చేశారు. హాలీవుడ్ పాపులర్ కంపోజర్ మార్క్ కిల్లియన్ బీజీఎం ఇచ్చారు. ఆడియన్స్ కి చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. 12 ఏళ్ల లిడియన్ నాదస్వరం ఈ సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేయడం మరో విశేషం. → టాప్ లెన్స్ మ్యాన్ సంతోష్ శివన్ కెమరా వర్క్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుంది. విజువల్స్ ప్రేక్షకుడికి చాలా కొత్త అనుభూతిని పంచుతాయి. అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది. దీని కోసం యానిమేటెడ్ క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేశాం. చాలా మంది హాలీవుడ్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేశారు→ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా కేర్ తీసుకొని చేశాం.ఆడియన్స్ థియేటర్స్ లో ఓ న్యూ వరల్డ్ ని ఎక్స్ పీరియన్స్ చేస్తారనే నమ్మకం వుంది. తప్పకుండా సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
యూట్యూబ్‌లో తప్పుడు థంబ్‌నెయిల్స్ ఇచ్చే వారికి హెచ్చరిక
యూట్యూబ్.. ప్రపంచంలో ఎక్కువమంది ఇందులో సమయం గడుపుతుంటారు. వారికి నచ్చిన కంటెంట్ కోసం వెతుకుతుంటారు కూడా. అయితే, ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకోవాలని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ యూజర్లను తప్పుదారి పట్టిస్తుంటాయి. వీడియోలో ఉన్న కంటెంట్‌తో యూట్యూబర్స్ పెట్టే థంబ్‌నైల్స్, టైటిల్స్ ఎలాంటి సంబంధం ఉండదు. ఇలా వ్యూస్ కోసం వారిని తప్పుదోవ పట్టించడం వంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపై కంటెంట్‌కి వ్యతిరేకంగా తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్స్ పెడితే ఖాతాలను తొలగించనున్నట్లు ప్రకటించింది.థంబ్‌నైల్‌లో ఒక సినిమా పేరు ఉంచి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తారు. దానిని క్లిక్ చేస్తే మరో సినిమా ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫోటోలు ఉంచి ఎలాంటి సంబంధంలేని అడ్డమైన థంబ్‌నైల్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి చర్యల వల్ల యూజర్లు బాగా విసిగెత్తిపోతున్నారని యూట్యూబ్ గుర్తించింది. ఇలాంటి సందర్భాలలో యూజర్ల సమయం వృథా అవుతుంది. ఆపై ఆ ఫ్లాట్‌ఫామ్‌పై విశ్వాసం తగ్గిపోతుంది. దీంతో యూట్యూబ్ పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.యూజర్లను తప్పుదోవ పట్టించేలా క్లిక్‌బైట్ థంబ్‌నెయిల్స్‌ను ఎవరైనా ఉపయోగిస్తే.. ఆ యూట్యూబ్ అకౌంట్లపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ హెచ్చరిక తర్వాత కూడా వారిలో మార్పులు రాకుంటే రానున్న రోజుల్లో ఇలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతల గురించి వీడియోలు పోస్ట్ చేస్తున్న క్రమంలో వారికి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్ క్రియేట్ చేస్తుంటారు. కంటెంట్ నిజమే అనుకొని యూజర్లు లోపలికి వెళ్తే.. అక్కడ ఏమీ ఉండదు. ఇలా లెక్కలేనన్ని వీడియోలు యూజర్లను తప్పుదోవ పట్టించడంతో వారిని విసిగిస్తున్నారు. దీంతో అలాంటి యూట్యూబ్ ఛానళ్లపై చర్యలకు సిద్ధమైంది.
అల్లు అర్జున్ ప్రచార యావే ప్రాణం తీసింది: ‘రాచాల’
సాక్షి, న్యూఢిల్లీ: పుష్ప–2 చిత్రం ప్రచార మోజులో మహిళ ప్రాణాలు తీసిన అల్లు అర్జున్, ప్రొడక్షన్ టీం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్య థియేటర్లో పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగా మానవ హక్కులకు తీవ్ర భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రేక్షకులను నియంత్రించలేమని పోలీసులు హెచ్చరించినా.. లెక్కలేనితనంతో నటుడు అల్లు అర్జున్ వచ్చారని ఆరోపించారు. దానివల్ల ఒక నిండు ప్రాణం బలైందని, ఆమె కుమారుడు శ్రీతేజ చావు బతుకుల మధ్య ఉన్నాడని పేర్కొన్నారు.
కార్తీ చిత్ర దర్శకుడు కన్నుమూత.. మూవీ ప్రమోషన్‌కు వెళ్తూ ఘటన
ప్రముఖుల మరణాలు కోలీవుడ్‌లో దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. గురువారం ఉదయం ఫైట్ మాస్టర్ నటుడు కోదండరామన్ అనారోగ్యంతో మృతిచెందారు. అయితే ఇప్పుడు దర్శకుడు శంకర్‌దయాళ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈయ నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన శకుని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. 2012లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. చాలా గ్యాప్ తరువాత తాజాగా శంకర్‌దయాళ్ కుళందైగళ్ మున్నేట్ర కళగం పేరుతో చిత్రం చేశారు. హాస్యనటుడు సెంథిల్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రా న్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులోభాగంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కారులో బయలుదేరిన దర్శకుడు శంకర్‌దయాళ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే యూనిట్ వర్గాలు స్థానిక కొళత్తూర్ ప్రాంతంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శంకర్‌దయాళ్‌ను పరిక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. దర్శకుడు శంకర్‌దయాళ్ మరణం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
న్యూస్ పాడ్‌కాస్ట్
‘ఫార్ములా-ఈ’ కార్ల రేసింగ్ వ్యవహారంపై చర్చకు సిద్ధంగా ఉన్నాం.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
చంద్రబాబుది 420 విజన్, అది మేనిఫెస్టో హామీలను ఎగ్గొట్టే రంగు రంగుల కథల పుస్తకం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
ఆంధ్రప్రదేశ్‌లో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై భారీగా బాదుడు... నిర్మాణాల విలువలు సైతం పెంచుతున్న కూటమి ప్రభుత్వం
విపక్షాల వ్యతిరేకత మధ్యే జమిలి బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
కూటమి సర్కారు నిర్ణయం.. ముఖ్య నేత ఆదేశాలతో రంగంలోకి ఢిల్లీ సీనియర్ న్యాయవాది
నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం
సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు... మధ్యంతర బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో నేడు రైతు పోరు... కూటమి సర్కార్ మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాసట
చంద్రబాబు అబద్ధాలు, మోసాలపై ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం కనిపిస్తోంది... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ
క్రీడలు
‘అతడికి దూకుడు ఎక్కువ.. సూపర్ బ్యాటర్’
యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మైక్ హస్సీ ప్రశంసలు కురిపించాడు. బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తూ అతడు బ్యాటింగ్ చేసే విధానం చూడముచ్చటగా ఉంటుందని కొనియాడాడు. ఇక టీమిండియా వంటి పటిష్ట జట్టుపై ఓపెనర్‌గా అరంగేట్రం చేసే అవకాశం రావడం గొప్ప విషయం అని పేర్కొన్నాడు.ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం భారత్‌తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడుతున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో ఓడిపోయిన కంగారూలు.. అడిలైడ్‌లో గెలుపొందారు. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేశారు. అయితే, ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ టెస్టు ‘డ్రా’ గా ముగిసింది. ఈ క్రమంలో భారత్- ఆసీస్ మధ్య మెల్బోర్న్లో నాలుగు, సిడ్నీలో ఐదో టెస్టు జరుగనున్నాయి.కొత్త కుర్రాడికి చోటుఇందుకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం జట్టును ప్రకటించింది. పెర్త్ టెస్టుతో అరంగేట్రం చేసిన ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీని తప్పించి.. సామ్ కొన్‌స్టాస్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. ఒకవేళ డిసెంబరు 26 నుంచి జరిగే ‘బాక్సింగ్ టెస్టు’ (నాలుగో మ్యాచ్)లో తుది జట్టు తరఫున కొత్త కుర్రాడు బరిలోకి దిగితే చరిత్రే.వారిద్దరి తర్వాతడెబ్బై ఏళ్ల తర్వాత.. అంతర్జాతీయ టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న ఆసీస్ టీనేజ్ బ్యాటర్‌గా కొన్‌స్టాస్ ఘనత వహిస్తాడు. 1953లో ఇయాన్ క్రెయిగ్ 17 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ తరఫున స్పెషలిస్ట్ బ్యాటర్‌గా అరంగేట్రం చేశాడు. అయితే 2011లో ప్యాట్ కమిన్స్ (ప్రస్తుత కెప్టెన్) 18 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసినప్పటికీ అతను స్పెషలిస్టు బౌలర్(పేసర్)!ఈ నేపథ్యంలో మైక్ హస్సీ ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ.. ‘‘మెక్‌స్వీనీ పట్ల కాస్త కఠినంగానే వ్యవహరించారన్న మాట వాస్తవం. అతడిపై నాకు సానుభూతి ఉంది. అయితే, కొన్‌స్టాస్ తక్కువేమీ కాదు. బిగ్‌బాష్ లీగ్‌లో అతడి ఆట నన్ను ఆకట్టుకుంది.ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదుఅద్భుతమైన సందర్భంలో కొన్‌స్టాస్ అరంగేట్రం చేయబోతున్నాడు. 19 ఏళ్ల వయసులోనే టీమిండియా మీద.. అది కూడా బాక్సింగ్ డే టెస్టులో ఓపెనింగ్ బ్యాటర్‌గా అవకాశం. వావ్.. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేం ఉంటుంది’’ అని కొన్‌స్టాస్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.కాగా ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలతో పాటు ఆసీస్ ‘ఎ’, బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లలో కొన్‌స్టాస్ నిలకడగా రాణిస్తున్నాడు. భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టులో అజేయ అర్ధ శతకం (73 నాటౌట్) బాదాడు కొన్‌స్టాస్.అదే విధంగా.. అడిలైడ్‌లో డే-నైట్ టెస్టుకు ముందు భారత్‌తో జరిగిన సన్నాహక పింక్ బాల్ (రెండు రోజుల మ్యాచ్) పోరులో ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తరఫున శతకం (107) సాధించాడు. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కుర్ర బ్యాటర్.. శనివారం సిడ్నీ సిక్సర్‌తో మ్యాచ్ పూర్తయ్యాక ఆసీస్ టెస్టు జట్టుతో కలుస్తాడు.చదవండి: BGT: అతడిపైనే వేటు వేస్తారా?.. సెలక్టర్లపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఫైర్
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం!?
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం.. భారత జట్టు ఇప్పటికే మెల్బోర్న్కు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని భారత జట్టు భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత్ భారీ షాక్ తగిలింది.ప్రాక్టీస్ సెషన్లో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా రాహుల్ చేతి మణికట్టుకు గామైంది. వెంటనే ఫిజియో వచ్చి రాహుల్ మణి కట్టుకు టేప్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే రాహుల్ గాయంపై మాత్రం బీసీసీఐ నుంచి ఎటువంటి ఆధికారిక ప్రకటన రాలేదు.పెర్త్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టుకు ముందు కూడా రాహుల్ కుడి చేతి మణికట్టుకు గాయమైంది. దీంతో అతడు తొలి టెస్టుకు దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో పెర్త్ టెస్టులో భారత జట్టులో భాగమయ్యాడు. మళ్లీ ఇప్పుడు అదే చేతి మణికట్టుకు గాయం కావడంతో భారత అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు.సూపర్ ఫామ్‌లో రాహుల్.. కాగా రాహుల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత తరపున లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో మూడు టెస్టులు ఆడిన రాహుల్ 235 పరుగులు చేశాడు. బ్రిస్బేన్ టెస్టు డ్రా కావడంలో రాహుల్ ది కీలక పాత్ర పోషించాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్ KL Rahul suffered a hand injury at the MCG nets today during practice session. #INDvAUS pic.twitter.com/XH8sPiG8Gi— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 21, 2024
ఫాస్టెస్ట్ సెంచరీ.. కసిదీరా కొట్టేశాడు!
పంజాబ్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. కేవలం 35 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా అన్మోల్ప్రీత్ సింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు.దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు.. అరుణాచల్‌ప్రదేశ్ తలపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ‘ఎ’ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.164 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ 164 పరుగులకే కుప్పకూలింది. తెచి నెరి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్ వర్మ 38, ప్రిన్స్ యాదవ్ 23, దేవాన్ష్ గుప్త 22 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. పంజాబ్ బౌలర్లలో మయాంక్ మార్కండే, అశ్వని కుమార్ మూడేసి వికెట్లు తీయగా.. బల్జీత్ సింగ్ రెండు, సన్వీర్ సింగ్, రఘు శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అభిషేక్ శర్మ విఫలంఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(25 బంతుల్లో 35 నాటౌట్)కు తోడైన వన్‌డౌన్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.45 బంతుల్లో 115 పరుగులుసుడిగాలి ఇన్నింగ్స్‌తో కేవలం 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అన్మోల్.. మొత్తంగా 45 బంతుల్లో 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా పన్నెండు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో 12.5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 167 పరుగులు చేసింది పంజాబ్.కసిదీరా కొట్టేశాడుతద్వారా అరుణాచల్ ప్రదేశ్‌పై ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి టోర్నీని విజయంతో ఆరంభించింది. తుఫాన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించిన అన్మోల్ప్రీత్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ పంజాబీ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వన్డేల్లో టీ20 తరహాలో ఊచకోత కోసి తన కసినంతా ఇక్కడ ప్రదర్శించాడంటూ అభిమానులు అన్మోల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ముంబై తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్.. చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన అన్మోల్.. 139 పరుగులు సాధించాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్A majestic counter-attacking 58-ball 💯 from Anmolpreet Singh 👏👏#SMAT | @IDFCFIRSTBank | #FinalFollow the match ▶️ https://t.co/1Kfqzc7qTr pic.twitter.com/3sdqD7CJvj— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023
రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప చిక్కుల్లో పడ్డాడు. ఎంప్లాయి ప్రొవిడెంట్ ఫంఢ్(EPF) నిధుల మళ్లింపు కేసులో ఇరుక్కున్నాడు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బెంగళూరులో ఉన్న సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఊతప్ప డైరెక్టర్‌గా ఉన్నాడు.రూ. 23 లక్షల మేర మోసం?అయితే, ఈ కంపెనీ ఉద్యోగుల జీతం నుంచి పీఎఫ్ రూపంలో కట్ చేసిన రూ. 23 లక్షలను తిరిగి డిపాజిట్ చేయలేదు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్, రికవరీ ఆఫీసర్ అయిన శదక్షర గోపాలరెడ్డి చర్యలు చేపట్టారు. ఊతప్పపై అరెంస్ట్ వారెంట్ జారీ చేయాల్సిందిగా డిసెంబరు 4న తూర్పు బెంగళూరులోని పులకేశ్నగర్ పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు.అయితే, ప్రస్తుతం రాబిన్ ఊతప్ప తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేఎర్ పురం చిరునామాలో అతడు లేకపోవడంతో తాము ఊతప్పను అరెస్ట్ చేయలేకపోయినట్లు సంబంధిత పోలీస్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం అతడు తమ స్టేషన్ పరిధిలో లేడన్న విషయాన్ని పీఎఫ్ ఆఫీస్ వర్గాలకు తెలియజేశామన్నారు.దుబాయ్‌కు మకాం మార్చిన ఊతప్పకాగా రాబిన్ ఊతప్ప పులకేశినగర్‌లోని వీలర్ రోడ్లో గల అపార్టుమెంట్లో నివాసం ఉండేవాడు. అయితే, ఏడాది క్రితమే ఆ ఫ్లాట్‌ను ఖాళీ చేసినట్లు సమాచారం. ఇక పీఎఫ్ ఫ్రాడ్ కేసులో రాబిన్ ఊతప్పపై ఇంతవరకు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది.కర్ణాటకకు చెందిన రాబిన్ ఊతప్ప 2006- 2015 మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన అంతర్జాతీయ కెరీర్లో 46 వన్డేలు, 13 టీ20 ఆడి.. ఆయా ఫార్మాట్లలో 934, 249 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 205 మ్యాచ్‌లు ఆడి 4952 రన్స్ సాధించాడు. కాగా రాబిన్ ఊతప్ప ఇటీవల జరిగిన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్
బిజినెస్
విదేశీ మారకద్రవ్య నిల్వలు: భారత్‌లో ఇంత తగ్గాయా?
భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గిపోయాయి. డిసెంబర్ 13తో ముగిసిన వారానికి ఇండియన్ ఫారెక్స్ నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి 652.869 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. అంతకు ముందువారంలో.. మొత్తం నిల్వలు 3.235 బిలియన్ల డాలర్లు తగ్గి 654.857 బిలియన్ల వద్ద నిలిచాయి.విదేశీ మారకద్రవ్య నిల్వలు గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. డాలర్ విలువతో పోలిస్తే.. ఇతర కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. విదేశీ కరెన్సీ ఆస్తులలో మార్పులు ఫారెక్స్ మార్కెట్లో సెంట్రల్ బ్యాంక్ జోక్యంతో పాటు నిల్వలలో ఉన్న విదేశీ ఆస్తుల విలువ పెరగడం లేదా తరుగుదల కారణంగా సంభవిస్తాయి.రూపాయిలో అస్థిరతలను తగ్గించడంలో సహాయపడటానికి ఆర్బీఐ చేసిన ఫారెక్స్ మార్కెట్ జోక్యాలతో పాటు రీవాల్యుయేషన్ కూడా తగ్గుముఖం పట్టింది. సెప్టెంబరులో ఫారెక్స్ నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 704.885 బిలియన్ డాలర్లకు పెరిగాయి.మారక ద్రవ్య నిల్వలు తగ్గినప్పటికీ.. బంగారం నిల్వలు 1.121 బిలియన్ డాలర్లు పెరిగి 68.056 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs) 35 మిలియన్ డాలర్లు తగ్గి 17.997 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు సమాచారం.
నెలకు ₹10 వేలు.. రూ.7 కోట్ల ఆదాయం - ఎలాగంటే?
డబ్బు ఆదా చేయాలనుకుంటే.. అనేక మార్గాలు కనిపిస్తాయి. కొందరు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే, మరికొందరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జిస్తారు. ఈ కథనంలో నెలకు 10,000 రూపాయలు పెట్టుబడి పెడుతూ రూ. 7కోట్లు సంపాదించడం ఎలా? అనే విషయాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం.ఒక వ్యక్తి సిప్‌లో నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే.. సంవత్సరానికి అతని పెట్టుబడి రూ.1.2 లక్షలు అవుతుంది. ఇలా 30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం రూ.36 లక్షలు అవుతాయి. మార్కెట్ ఆధారంగా 15 శాతం వార్షిక రాబడి వస్తే.. పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. దీంతో ఆ వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి అదనంగా రూ. 66 లక్షల కంటే ఎక్కువ డబ్బు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్, అదనంగా వచ్చిన మొత్తం డబ్బు కలిపితే రూ.7 కోట్ల కంటే ఎక్కువ డబ్బు వస్తుంది.ఇన్వెస్ట్ చేయాలనుకునే వ్యక్తి ముందుగానే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి. ఉదాహరణకు 20 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే.. 50 ఏళ్ల నాటికి రూ.7 కోట్లు పొందవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రమే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉండ్తుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటినోట్: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఖచ్చితంగా ఇంత డబ్బు వస్తుందని చెప్పలేము. ఎందుకంటే వచ్చే డబ్బు రాబడుల మీద ఆధారపడి ఉంటుంది.
సోలారే సోబెటరూ..
సాక్షి, సిటీబ్యూరో: ఈ మధ్య కాలంలో వచ్చిన అధునాతన సాంకేతిక మార్పుగా అవతరించి, సామాజికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న వాటిలో ‘సోలార్ విద్యుత్ శక్తి, ఈ–వాహనాలు’ హవా కొనసాగిస్తున్నాయి. ఈ రెండు అంశాలు సామాజిక జీవన వైవిధ్యంలో పెను మార్పులకు నాంది పలికాయి. ఒక వైపు విపరీతంగా పెరిగిపోతున్న కరెంట్ వాడకం, దానికి అనుగుణంగానే పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీలు. వెరసీ అందరి చూపూ సోలార్ విద్యుత్ వైపునకు మళ్లింది.దశాబ్ద కాలంగానే సోలార్కు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ అది నగరాల వరకే పరిమితమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ సోలార్ సెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు సోలార్ వ్యవస్థను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రత్యేక సబ్సిడీలను సైతం అందిస్తున్నారు. కొన్నేళ్లుగా సోలార్ వ్యవస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యాపార సంస్థలు సైతం ఈ సందర్భంగా వారి సేవలు పెంచుతున్నాయి. కొన్ని సంస్థలైతే వివిధ జిల్లాల్లోని టౌన్లలో ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఆవిష్కరించి ఈ సోలార్ సెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు.సూర్య ఘర్ స్కీంతో సబ్సిడీ..హైదరాబాద్ వంటి నగరాల్లో సోలార్ వాడకంపై అవగాహన మెరుగ్గానే ఉంది. సోలార్ విద్యుత్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ విధానానికి అలవాటు పడుతున్నారు. ఈ సోలార్ పద్ధతులు వ్యక్తిగత ఇళ్లతో పాటు చిన్న–పెద్ద తరహా పరిశ్రమల్లోనూ విరివిగా వాడుతున్నారు. వారి వారి విద్యుత్ వాడకానికి అనుగుణంగానే పీఎం సూర్య ఘర్ స్కీంలో ఒక కిలో వాట్ నుంచి వినియోగాన్ని బట్టి అవసరమైనన్ని కిలో వాట్ల సోలార్సెట్లను, వాటికి సబ్సిడీని అందిస్తుంది. ఈ సోలార్ విధానాన్ని రెసిడెన్షియల్ ఏరియాలో, స్కూల్స్, ఫామ్ హౌజ్‌లు, రైస్‌మిల్స్ వంటి చిన్న తరహా పరిశ్రమల్లోనూ ఎక్కువగా వాడుతున్నారు. పరిశ్రమలైనా, వ్యక్తిగత వినియోగమైనా.. టెక్నాలజీ పెరగడంతో కరెంట్ వినియోగం సైతం అధికంగా పెరిగిపోయింది. గతంలో ఇళ్లలో రూ.200 నుంచి రూ.500ల కరెంట్ బిల్ అత్యధికం అనుకుంటే.. ఇప్పుడది రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పెరిగిపోయింది. ఇక పరిశ్రమల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిషనరీ, అధునాతన సాంకేతికత వినియోగం పెరగడంతో వాటి చార్జీలు మూడింతల కన్నా పైగానే పెరిగాయని నిపుణులు తెలుపుతున్నారు. పర్యావరణ హితం.. సోలార్ సిస్టం..విద్యుత్ తయారీ కోసం ప్రస్తుతం వాడే పద్ధతులన్నీ ఏదో విధంగా పర్యావరణానికి హాని చేసేవే అని పరిశోధకుల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా థర్మల్, గ్యాస్, విండ్, హైడ్రో తదితర పద్ధతుల్లో విద్యుత్‌ను సేకరిస్తున్నారు. ఈ తరుణంలో కిలో వాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే కొన్ని వందల మొక్కలు పెంచిన దానితో సమానమని, అంతటి కాలుష్యాన్ని తగ్గించే విధానంగా సోలార్ నిలుస్తుందని నిపుణుల మాట. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ పెరగడం, కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు పెరగడం.. తదితర కారణాలతో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం, వెరసీ పర్యావరణ మార్పులతో పెను ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో కాలుష్యరహిత పద్ధతులైన సోలార్ సిస్టమ్ అత్యంత శ్రేయస్కరమని భావిస్తున్నారు. అంతా లాభమే.. – రాధికా చౌదరి, ఫ్రెయర్ ఎనర్జీ కోఫౌండర్రాష్ట్రంలో సోలార్ వినియోగంపై అవగాహన పెరిగింది. ఈ రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ సేవలందిస్తున్నాం. కరోనా అనంతరం సోలార్ ఎనర్జీను వినియోగించేవారి సంఖ్య అధికంగా పెరిగింది. పీఎం సూర్య ఘర్ స్కీం కూడా దీనికి కారణం. ఇందులో భాగంగా రూ.2 లక్షల సోలార్ సెట్ బిగించుకుంటే దాదాపు రూ.78 వేల సబ్సిడీ లభిస్తుంది. మిగతా పెట్టుబడి కూడా రెండు మూడేళ్ల కరెంట్ ఛార్జీలతో సమానం. కాబట్టి మూడేళ్ల తర్వాత వినియోగించే సోలార్ కరెంట్ అంతా లాభమే.
బీమా ప్రీమియంపై జీఎస్టీ నిర్ణయం వాయిదా
బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తారని ఎంతగానో ఎదురుచూస్తున్న పాలసీదారుల ఆశలపై మంత్రుల బృందం నీరు చల్లింది. శనివారం జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే ఈ అంశంపై ఆర్థిక మంత్రుల బృందం చర్చించింది. అయితే కొన్ని కారణాలవల్ల ఈ నిర్ణయం వాయిదా పడినట్లు మండలి తెలిపింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు మరింత పరిశీలన అవసరమని మండలి భావించినట్లు తెలిసింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఇందులో పలు వస్తువులపై జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, శ్లాబుల్లో మార్పులు వంటి వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఆరోగ్య బీమా, టర్మ్ జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించాలనేలా గతంలో మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్‌లో సమావేశమై చర్చించింది. దాంతో పాలసీదారులకు ప్రీమియం తగ్గే అవకాశం ఉందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ 55వ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.ఇదీ చదవండి: ఎస్సీడీఆర్సీ నిర్ణయాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టుఎవరు హాజరయ్యారంటే..కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, గోవా, హరియాణా, జమ్ము కశ్మీర్, మేఘాలయ, ఒడిశా ముఖ్యమంత్రులు, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, రెవెన్యూ శాఖ కార్యదర్శులు, సీబీఐసీ ఛైర్మన్లు, సభ్యులు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న తుది నిర్ణయాలు ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది.
ఫ్యామిలీ
పట్టుదలగా చేస్తే.. గుట్టలాంటి బెల్లీ ఫ్యాట్ దెబ్బకి...!
కొండలాంటి పొట్టను కరిగించుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారా? ఎంత కష్టపడినా బెల్లీ ఫ్యాట్ తగ్గడంలేదని ఆందోళనలో ఉన్నారా? మరి అలాంటివారికి చక్కగా ఉపయోగపడే పురాతన యుద్ధ కళలు, ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరైన జపాన్‌లో ఆచరించే కొన్ని వర్కౌట్స్ గురించి తెలుసు కుందాం రండి!ఆహార అలవాట్లలో మార్పులతోపాటు కొన్ని జపనీస్ వ్యాయామాలు బెల్లీ ఫ్యాట్‌ను కరిగించు కునేందుకు, బాడీ ఫిట్‌గా ఉండేందుకు ఉపకరిస్తాయి.సుమో స్క్వాట్స్జపనీస్ ప్రొఫెషనల్ రెజ్లర్ల మ్యాచ్‌కు ముందు పొట్ట, తొడలపై భారం పడేలా కొన్ని భంగిమలను ప్రదిర్శిస్తారు. దాదాపు అలాంటివే ఈ సుమో స్క్వాట్స్పాదాలను వెడల్పుగా చాచి,నడుముపై భారం వేసి, భుజాలను స్ట్రెచ్ చేసి, రెండు చేతులను దగ్గరగా చేర్చి నమస్కారం పెడుతున్న ఫోజులో నిలబడాలి. ఇపుడు, పొత్తికడుపు, కాలి కండరాలపై భార పడుతుంది. ఈ భంగిమలో కనీసం 30 సెకన్ల పాటు నిలబడి, తిరిగి యథాస్థితిలోకి రావాలి.తెనుగుయ్ టైడో (టవల్ స్వింగ్స్)అత్యంత ప్రభావవంతమైన, సులభంగా నిర్వహించగల జపనీస్ వ్యాయామాలలో ఒకటి, టవల్ స్వింగ్‌లు కడుపు, పొత్తికడుపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. కండరాలను బలపరుస్తాయి.పాదాలను వెడల్పుగా ఉంచి, భుజాలు స్ట్రెచ్అయ్యేలా చేతులను వెడల్పుగా చాచి నిల బడాలి. ఇపుడు రెండు చేతలుతో ఒక టవల్‌ను రెండు వైపులా పట్టుకొని స్వింగ్ చేయాలి. కనీసం 2 నిమిషాలు చేయాలి. సౌలభ్యాన్ని ఈ సమయాన్ని పెంచుకోవచ్చు.రేడియో టైసో..కాళ్లు, చేతులు వేగంగా కదిలిస్తూ, శరీరాన్ని ముందుకు, వెనక్కి వంచుతూ వ్యాయామాలు చేస్తారు. ఇవి వివధ శరీర భాగాల్లోనే కాకుండా పొట్ట, నడుము చుట్టు ఉండే కొవ్వును అద్భుతంగా కరిగిస్తాయి. లంగ్ అంట్ టో టచ్కుడి కాలిని మడిచి, ఎడమ కాలిని సాధ్యమైనంత ముందుకు చాపాలి. కుడిచేత్తో కుడి కాలి తొడమీద సపోర్టు తీసుకుని, నడుమును వంచి ఎడమచేతితో ఎడమ కాలి బొటన వేలి తాకాలి. ఇలా విరామం తీసుకుంటూ ఇలా రెండువైపులా చేయాలి.హూలాహూప్నడుము చుట్టూ ఒక పెద్ద రింగ్ ధరించి హూలాహూప్ వర్కౌవుట్ చేస్తారు. పొట్ట భాగంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. కాళ్లు, చేతులు, కోర్ కండరాలు ధృడంగా తయారవుతాయి.నోట్: క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేయడం కాదు. శరీరం సమతుల్యంగా, ఫిట్‌గా ఉండటానికి కూడా దోహదం చేస్తాయి. ఇండోర్ వర్కౌట్స్, ఔట్‌డోర్ వర్కౌట్స్‌తో కొవ్వులను సులభంగా కరిగించుకోవచ్చు. అయితే కొంత మందికి కొన్ని ఆరోగ్య పరిస్థితులు, వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు, జీవనశైలిగా కారణంగా అనుకున్నంత సులువు కాకపోవచ్చు. దీనికి వైద్య నిపుణుల సలహాలను తీసుకోవాల్సి ఉంటుంది.
'ఉసిరి టీ' గురించి విన్నారా? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
ఇంట్లోనే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉండే టీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎన్నో రకాల హెర్బల్ టీలు విని ఉంటారు. ఈ టీ గురించి అస్సలు విని ఉండరు. గ్రీన్ టీకి మించి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఆ టీ ఏంటనే కదా..మనం ఎంతో ఇష్టంగా పచ్చళ్లు పట్టుకునే తినే ఉసిరితో ఈ టీ తయారు చేస్తారు. దీని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.కావాల్సినవి: ఉసిరి, చూర్ణంపుదీనా ఆకులు-4అల్లం-1 అంగుళం -క్యారమ్ విత్తనాలుతయారు చేయు విధానం..ఒక గ్లాస్ నీటిని మరిగించి..అందులో పైన చెప్పిన పదార్థాన్నీ వేసి కాసేపు తిరగబడనివ్వాలి. ఆ తర్వాత వడకట్టండి అంతే అదే ఉసిరి టీ. ప్రయోజనాలు..గుండె ఆరోగ్యానికి మంచి ఔషధం. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ఇందులో మొత్తం పది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీ కంటే మెరుగైన ప్రయోజనాలను అందిస్తుందట. వివిధవ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. గ్రీన్ టీ కంటే ఇదే మంచిదా..?పులుపు పడని వాళ్లు దీన్ని తీసుకోకపోవడమే మంచిది. ఇది యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్. ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. తీసుకునే మోతాదును బట్టి ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.(చదవండి: మేకప్ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..)
ముంబై పడవ ప్రమాదం: అమ్మను కాపాడుకోలేక పోయా.. గౌతమ్ గుప్తా
సాక్షి, ముంబై: ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో జరిగిన పడవ ప్రమాదం ఘటనలో అనేక మంది తమ ఆతీ్మయులను బంధుమిత్రులను కోల్పోగా మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. పర్యాటకులతో బయల్దేరిన నీల్కమల్ అనే పడవను నేవీ బోట్ ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులతోపాటు మొత్తం 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ముంబైతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బయటపడ్డ కొందరు మీడియాకు తెలిపిన వివరాలు అక్కడి పరిస్థితి ఎంత హృదయవిదారకంగా ఉన్నాయో చెబుతున్నాయి. చావు దగ్గరికి వెళ్లి బయటిపడిన వారు చెప్పిన వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రమాదంలో 14 నెలల చిన్నారి.. పడవ ప్రమాదంలో వైశాలి అడకణేతోపాటు వారి కుటుంబీకులు సురక్షితంగా బయటపడ్డారు. ముంబై కుర్లాలో నివసించే వైశాలి తన 14 నెలల కుమారుడిని రక్షించుకునేందుకు ప్రయతి్నంచింది. అనంతరం ఆమె సోదరుడు అంటే చిన్నారి మేనమామ తన భుజంపై ఆ పాపను సుమారు 30 నిమిషాలపాటు సముద్రం నీటిలో ఈదుతూ బయటపడ్డట్టు తెలిపింది. ‘నాతోపాటు మొత్తం ఎనిమిది మంది పడవలో ఎలిఫెంటా బయల్దేరాం. అయితే పడవలో బయల్దేరిన కొద్ది సేపటికి ఒక్కసారిగా ఓ నేవీ స్పీడ్ బోట్ వేగంగా చక్కర్లు కొడుతూ మా పడవను వేగంగా ఢీ కొట్టింది. ఢీ కొట్టిన తర్వాత అసలేం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాలేదు. పడవ నడిపేవారు వెంటనే వారి వద్ద ఉన్న లైవ్జాకెట్లను అందరికీ అందించారు. కానీ చాలామంది ఉండటంతో కొందరికి మాత్రమే జాకెట్లు అందాయి. ఇది జరిగిన కొంత సమయానికి ఒకవైపు పడవ సముద్రంలోకి ఒరగడం ప్రారంభమైంది. దీంతో పడవ క్రమంగా మునగసాగింది. అరుపులు పెడ»ొబ్బలతో పడవలోని పరిసరాలు భయాందోళనలు రేకేత్తించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే మేమందరం సముద్రంలో పడిపోసాగాం. కొందరు పడవలోనే ఉండిపోయారు. అయితే తాము సముద్రంలో పడిపోగానే పడవను పట్టుకున్నాం. చావు ముందు ఉన్నాం. ఏం చేయాలో తెలియడంలేదు. నా చేతిలో 14 నెలల బాబు ఉన్నాడు. ఎలాగైనా బాబును బతికించుకోవాలని మనసులో అనుకున్నాను. అంతలోనే నా అన్న బాబుని తన భుజం పైకెత్తుకున్నారు. నీళ్లలో ఉండి ఒక చేత్తో పడవను మరో భుజంపై నా బాబును ఇలా సుమారు 30 నిమిషాలపాటు అలాగే ఉన్నాడు. ఇక మా మరణం తప్పదని అనుకునే సమయంలోనే రెండు మూడు పడవలు మావైపు వచ్చాయి. అనంతరం ఆ బోటులోని వారు మమ్మల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇంకా ఐదు నిమిషాలు ఆలస్యమై ఉంటే మేమంతా చనిపోయేవాళ్లం’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు ఈ ఘటనలో ఓ ఇద్దరు విదేశీయులు కూడా తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పలువురిని కాపాడినట్టు వైశాలి మీడియాకు తెలిపారు. అమ్మను కాపాడుకోలేక పోయా: గౌతమ్‌గుప్తా ఈ పడవ సంఘటన సమయంలో అసలేం జరిగిందనేది ఈ ఘటనకు సంబంధించిన వీడియో తీసిన గౌతమ్‌గుప్తా మీడియాకు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఆయన తీసిన వీడియో ద్వారానే అందరికీ ప్రమాదం విషయం తెలిసింది. ముంబైలో నివసించే గౌతమ్ గుప్తా తన తల్లి రామాజీదేవి, చెల్లి రీతాలతో కలిసి ఎలిఫెంటా వెళ్లేందుకు నీల్కమల్ పడవలో బయల్దేరారు. పడవ పైభాగంలో కూర్చున్న గౌతమ్ పడవలో నుంచి సముద్ర ప్రయాణం దృశ్యాలని వీడియోతోపాటు ఫొటోలు తీశారు. అంతలోనే ఓ స్పీడ్ బోట్ సముద్రంలో చక్కర్లు కొట్టడం గమనించారు. ఆ స్పీడ్ బోటును వీడియో తీయసాగారు. ‘ఒక్కసారిగా వేగంగా ఆ పడవవైపు బోట్ రావడం చూశాను. కానీ అసలు ఊహించలేదు. ఆ స్పీడ్ బోటు వేగంగా మేమున్న పడవనే వేగంగా ఢీ కొడుతుందను కోలేదు. ఈ సంఘటన అనంతరం మేం ముగ్గురం నీటిలో పడిపోయాం. అనంతరం ఇతర బోటులోని కొందరు నన్ను మా చెల్లి రీతాను సురక్షితంగా బయటికి తీశారు. కానీ మా అమ్మ గురించి మాత్రం తెలియరాలేదు’ అంటూ బోరుమన్నారు. ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి పడవ ప్రమాదంలో కొందరు తెలుగువారు కూడా ఉన్నారని తెలిసింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అందించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌కు చెందిన నేవీ ఉద్యోగి ప్రవీణ్‌కుమార్ శర్మ (34) మృతి చెందారు. ప్రవీణ్ కుమార్ శర్మ నేవీలో బోట్ మెకానిక్‌గా 14 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జీవితంలో పడవ ఎక్కను ఘటనలో పలువురు తెలుగువారు మరణం అంచుల దాకా వెళ్లొచ్చి..ఎలిఫెంటా గుహలకు వెళ్లడానికి బోట్ ఎక్కాను. కానీ అదృష్టవశాత్తు బయటపడ్డానని అనిల్‌కుమార్ (35) ఓ మరాఠీ పత్రికకు తెలిపారు. ముంబైలో ఓ పని ఉండటంతో వచ్చానని, ఈ సందర్భంగా ఎలిఫెంటా కేవ్స్ చూద్దామని బయల్దేరినట్లు చెప్పారు. పడవ బయల్దేరిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగిందని, అయితే అదృష్టం కొద్దీ బయటపడ్డానన్నారు. ఇక భవిష్యత్‌లో తానెప్పుడూ పడవ ఎక్కనని చెప్పారు.
సినిమాని తలపించే ప్రేమకథ..వింటే కన్నీళ్లు ఆగవు..!
ఎన్నో ప్రేమ కథలు చూశాం. వాటిలో కొన్ని మాత్రం విషాదంగా ముగిసిపోతే..మరికొన్ని కన్నీళ్లు తెప్పించేస్తాయి. అలాంటి భావోద్వేగపు గాథే ఈ ప్రేమ జంట కథ. సుఖాల్లో ఉన్నప్పుడు ఉండే ప్రేమ.. కష్టాల్లో కనుమరుగైపోతుందంటారు పెద్దలు. కానీ ఈ జంట మాత్రం కష్టాల్లో అంతకు మించి..ప్రేమ ఉందని ప్రూవ్ చేసింది. విధికే కన్నుకుట్టి వారి ప్రేమను పరీక్షించాలనుకుందో, కబళించాలనుకుందో గానీ కేన్సర్ మహమ్మారి వారి ప్రేమను దూరం చేయాలనుకుంది. కానీ ఈ నేపాలీ జంట తమ ప్రేమ అత్యంత గొప్పదని నిరూపించుకుని కష్టమే కుంగిపోయేలా చేశారు.సృజన, బిబేక్ సుబేదిలు తమ జీవితాన్ని డాక్యుమెంట్ రూపంలో ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఆ జంట ప్రేమకథ అందరి దృష్టిని ఆకర్షించింది. బిబేక్ కేన్సర్‌తో భాదపడుతున్నాడు. కేన్సర్ ఫస్ట్ స్టేజ్ నుంచి ఫోర్త్స్టేజ్ వరకు తామెలా కష్టాలు పడుతుంది తెలియజేసింది. చెప్పాలంటే నెటిజన్లంతా సృజన కోసమైనా.. అతడు మృత్యవుని జయిస్తే బావుండనని కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. బిబేక్ ఆ మహమ్మారి కారణంగా తనకెంతో ఇష్టమైన భార్యను కూడా గుర్తించలేని స్థాయికి వచ్చేశాడు సృజన పోస్ట్ చేసిన చివరి రీల్లో. అంతేగాదు ఇన్‌స్టాలో బిబెక్ 32వ పుట్టిన రోజుని సెలబ్రెట్ చేసిన విధానం అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. ఎందుకంటే అప్పటికే అతడి పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. ఏ పరిస్థితిలోనూ అతడి చేతిని వీడక ఎంతో ప్రేమగా చూసుకున్న సృజన తీరు అందరి మనసులను తాకింది. సృజన అధికారికంగా అతడు చనిపోయాడని ప్రకటించనప్పటికీ..నిశబ్ద వాతావరణంతో పరోక్షంగా బిబేక్ ఇక లేరనే విషయం వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి సృజన నుంచి ఎలాంటి వీడియో పోస్ట్ కాకపోయినా.. నెటిజన్లంతా సృజనకు ధైర్యం చెప్పడమేగాక, బిబేక్ లేకపోయినా.. మీప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇలాంటి కాలంలో ఇంత గొప్ప ప్రేమలు కూడా ఉన్నాయని చూపించారంటూ సృజనను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Crzana Subedi (@crzana_subedi_) (చదవండి: చిట్టి రచయితలు.. అందమైన కథలతో అలరిస్తున్నారు..)
ఫొటోలు
భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)
రూ.750 కోట్ల ఇంట్లో నివాసం.. బిలియనీర్‌తో వివాహం: ఎవరో గుర్తుపట్టారా? (ఫోటోలు)
#AnasuyaBharadwaj : వావ్.. వాట్ ఏ లుక్.. అనసూయ (ఫోటోలు)
World Saree Day 2024: సెలబ్రిటీల బ్యూటిఫుల్ శారీ లుక్స్
కియా కొత్త కారు 'సిరోస్' ఇదే.. ఫోటోలు చూశారా?
శ్రీకాకుళం : జోరువానలో శ్రీలీల చూసేందుకు అభిమానుల ఉత్సాహం (ఫొటోలు)
భార్యకు రోహిత్ శర్మ బర్త్ డే విషెస్.. పోస్ట్ వైరల్
ఏపీ అంతటా ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
పసుపు చీరలో ప్రగ్యా.. చూస్తే ఆహా అంటారేమో! (ఫొటోలు)
సోనియా పెళ్లిలో బిగ్‌బాస్ 8 సెలబ్రిటీస్.. మొత్తం రచ్చ రచ్చ (ఫొటోలు)
National View all
రాజ్యాంగమే సాక్షి.. ఛత్తీస్‌గఢ్‌లో ఆదర్శ వివాహం చేసుకున్న జంట
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లో ఓ జంట ఆదర్శ వివాహం చేసుకుంది.
అరబిక్‌లో రామాయణ భారతాలు..అనువాదకులతో ప్రధాని భేటీ
కువైట్సిటీ: ప్రధాని మోదీ కువైట్ పర్యటనకు వెళ్లారు.
కంటెయినర్ ట్రక్కు కింద నలిగిన కారు.. ఆరుగురి దుర్మరణం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం(డిసెంబర్21) ఉద
కేజ్రీవాల్‌కు షాక్..! లిక్కర్ కేసుపై ఎల్జీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ఆద్మీపార్టీ(ఆప
అయ్యయ్యో! నా ఐఫోన్ మురుగా..
సేలం(తమిళనాడు): ఆలయ హుండీలో పొరపాటుగా ఏది పడినా అది దేవుడికే సొంతమని పలు సినిమాల్లో సన్నివేశాలు మనం చూస
International View all
అరబిక్‌లో రామాయణ భారతాలు..అనువాదకులతో ప్రధాని భేటీ
కువైట్సిటీ: ప్రధాని మోదీ కువైట్ పర్యటనకు వెళ్లారు.
గూగుల్ స్ట్రీట్ ఫొటోతో మర్డర్ మిస్టరీ వీడింది!
గూగుల్ మ్యాప్ ఫొటో ఓ హంతకుడిని పట్టించిన ఘటన స్పెయిన్‌లో జరిగింది.
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి..విమానాశ్రయం మూసివేత
కీవ్ : రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది.
Year Ender 2024: వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. చాటింగ్ స్టైలే మారిపోయిందే..
వాట్సాప్.. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్.
కెనడాలో బిగ్ ట్విస్ట్.. ప్రధాని ట్రూడోకు షాకిచ్చిన ఎన్డీపీ
అట్టావా: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోతున్న వేళ కెనడా ప్రధాని
NRI View all
షార్లెట్‌లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు.
బంధించేశారు, ఒక్కపూటే భోజనం..రక్షించండి: కువైట్‌లో ఏపీ మహిళ ఆవేదన
ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్నమహిళ తనను కాపాడ్సాలిందిగా వేడుకుంటున్న సెల్ఫీ వీడియో ఒకటి
సిడ్నీలో ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి.
ఆస్ట్రేలియాలో ఘనంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించ
గడ్డకట్టే చలిలోనూ... లెహంగాలో స్నాతకోత్సవానికి!
ఎలాంటి పరిస్థితుల్లోనైనా తగ్గేదేలే అంటారు కొందరు. ఆ విద్యార్థిని సరిగ్గా అలాంటి వారిలో కోవలోకే వస్తుంది.
క్రైమ్
హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష
కాచిగూడ: నలుగురిని పెట్రోల్ పోసి చంపిన కేసులో ఒకరికి మరణ శిక్ష, మరో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ నాంపల్లి అడిషనల్ సెషన్స్ జడ్జి వినోద్ కుమార్ తీర్పు వెలువరించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 2022లో రాగుల సాయి అనే వ్యక్తి తన మాజీ భార్య ఆర్తికి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. రాగుల సాయి స్నేహితుడైన నాగరాజును ఆర్తి రెండో వివాహం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత నాగరాజు ఆర్తిని వేధింపులకు గురి చేసేవాడు. ఆర్తిని చెల్లిగా పిలవాలని నాగరాజు స్నేహితుడైన రాగుల సాయికి తెలపడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిని మనసులో పెట్టుకున్న రాగుల సాయి తన స్నేహితుడు ఎ.రాహుల్ ఇద్దరూ కలిసి గర్భంతో ఉన్న ఆర్తిని, నాగరాజును, వీరి ఏడాది కుమారుడు విష్ణుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల స్టేట్మెంట్స్ నారాయణగూడ పోలీసులు రికార్డ్ చేసుకొని కేసు నమోదు చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆర్తి, నాగరాజు, వీరి ఏడాది కుమారుడు విష్ణు, ఆర్తి కడుపులోని బిడ్డతో సహా నలుగురూ మృతి చెందారు. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న నారాయగూడ పోలీసులు దర్యాప్తు సాగించారు. మొదటి ప్రాధాన్యతగా ఈ కేసుగా తీసుకున్న నాంపల్లి క్రిమినల్ కోర్టు జడ్జి వినోద్ కుమార్ శుక్రవారం నిందితుడైన రాగుల సాయికి మరణశిక్ష, అతని స్నేహితుడైన రాహుల్‌కు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు నారాయణగూడ ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ తెలిపారు.
హిట్ అండ్ రన్.. బీటెక్ విద్యార్థి దుర్మరణం
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదయ్యింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీటెక్ విద్యార్థి వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన పున్నం లోకేష్ (21) బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి కాలేజీకి స్నేహితుడితో కలిసి వెళ్తున్నాడు. పంజగుట్ట– అమీర్‌పేట మార్గంలోని బిగ్‌బజార్ ఎదురుగా గుర్తు తెలియని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంతో వచ్చి వెనక నుంచి లోకేష్ బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లి పోయింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న లోకేష్ తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి స్వల్ప గాయాల య్యాయి. ప్రమాద స్థలికి వచి్చన పోలీసులు లోకేష్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ప్రవీణ్‌కుమార్ ఫిర్యాదు మేర కు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. యథేచ్ఛగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు ఈ ప్రాంతంలో నిత్యకృత్యమయాయి. ట్రావెల్స్ బస్సులు ఉదయం 7.30 గంటల్లోపే నగరంలోని రోడ్లల్లో తిరగాలనే నిబంధనలు ఉండడంతో సమయంలోపు నగర శివారు దాటాలన్న ఉద్దేశంతో అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్థానికులు అంటున్నారు. పోలీసులు సమయం దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవని వారు పేర్కొంటున్నారు.
ఆటోను ఢీకొన్న మోటార్ బైక్.. ఇద్దరు విద్యార్థులు మృత్యువాత
తవణంపల్లె: చిత్తూరు, కాణిపాకం రోడ్డు సత్తారు బావి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని ముత్తరపల్లె గ్రామానికి చెందిన గోవిందు కుమారుడు సాయితేజ (19), మైనగుండ్లపల్లెకు చెందిన ప్రసాద్‌రెడ్డి కుమారుడు హర్ష (19) ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం సాయితేజ తన మోటార్ సైకిల్లో తన స్నేహితుడు హర్షను వెనుక కూర్చోబెట్టుకుని పరీక్ష రాయడానికి కాలేజ్‌కు బయలుదేరారు. ఈ తరుణంలో సత్తారు బావి సమీపంలో ముందు వెళ్తున్న బస్సును అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొన్నారు. ప్రమాదంలో సాయితేజ, హర్షకు బలమైన గాయాలు కావడంతో తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.
బాలుడి కిడ్నాప్ విషాదాంతం
కేటీదొడ్డి: చేతబడి చేసి తన అన్నను చంపారని కక్ష పెంచుకున్న ఓ తమ్ముడు.. అందుకు కారణమైన కుటుంబంలోని బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ఆ తర్వాత తాను సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డె మచ్చప్ప, వడ్డె నర్సింహులు సొంత అన్నదమ్ములు. వడ్డె మచ్చప్ప–లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు రాజు(28), గోవిందు. కాగా, రాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వడ్డె నర్సింహులుకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. నర్సింహులు కుమారుడు పవన్‌కుమార్(7) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతు న్నాడు. గురువారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన పవన్ సాయంత్రం తిరిగి ఇంటికి రాకపోవడంతో నర్సింహులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోవింద్ బైక్‌పై పవన్‌ను చూసినట్టు గ్రామస్తులు చెప్పా రు. అదే సమయంలో గోవిందు సైతం కనిపించలేదు. దీంతో పోలీసులు మచ్చ ప్ప కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించారు. శుక్రవారం కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా యాపల్‌దిన్నె పోలీస్‌స్టేషన్ పరిధిలో గాలింపు చేపట్టారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా.. సోలార్ పవర్ ప్రాజెక్ట్ వద్ద గోవిందు బైక్ పార్కు చేసి ఉండటం గుర్తించారు. పోలీసులు సెల్‌నంబర్ ట్రేస్ చేయగా, సిగ్నల్స్ ఆధారంగా ఓ పాడు పడిన బావి వద్ద చివరి లొకేషన్ చూపించింది. దీంతో అనుమానంతో పోలీసులు బావిలో వెతకగా గోవిందు మృతదేహం లభ్యమైంది. గజ ఈతగాళ్ల సాయంతో మళ్లీ వెతకగా బాలుడి మృతదేహం సైతం లభ్యమైంది.ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు. కాగా, తన అన్న రాజును నర్సింహులు కుటుంబ సభ్యులు చేతబడి(బాణామతి) చేసి చంపేశారనే కోపంతో గోవింద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.
వీడియోలు
హీరో అల్లు అర్జున్ కీలక ప్రెస్ మీట్
సంకల్పంతో... సముద్రాన్నే వంచిన వీరుడి కథ..!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు: Harish Rao
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో జగన్ బర్త్ డే
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
ఫ్యాన్స్‌కు భారీ షాక్ నితీశ్రీ రెడ్డి ఔట్?
వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
జనరంజక పాలనకు కేరాఫ్ వైఎస్ జగన్