Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ap Government Set Up SIT To Investigate Tirumala Laddu Issue1
తిరుపతి లడ్డూ వివాదంపై సిట్‌ ఏర్పాటు

సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేసింది. సిట్‌ చీఫ్‌గా గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్‌లో విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్‌ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉండనున్నారు. ఈ సిట్‌ బృందం శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరపనుంది. కాగా ఏపీ ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులను ప్రోత్సహించినట్లు సర్వశ్రేష్ట త్రిపాఠిపై ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో త్రిపాఠిపై వైఎస్సార్‌సీపీ గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేసింది.పల్నాడులో అల్లర్లు సమయంలో త్రిపాఠి గుంటూరు ఐజీగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పల్నాడులో ఎన్నికల నిర్వహణ జరిగింది. ఎన్నికల సమయంలో దేశంలో ఎక్కడా లేని అల్లర్లు త్రిపాఠి హయాంలో జరిగాయని ఈసీ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే అలాంటి వివాదాస్పద అధికారితో సిట్‌ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందే: అంబటి

VHP Secretary Surendra Jain about Chandrababu Comments on Tirumala Laddu2
అక్కడుంది చంద్రబాబు.. SIT ఏర్పాటుపై వీహెచ్‌పీ సురేంద్ర జైన్‌ ఆగ్రహం

సాక్షి,న్యూఢిల్లీ : చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి లడ్డు వివాదాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని, లడ్డూ వివాదంలో నిజానిజాలు బయటకు రావాలంటే సిట్‌ సరిపోదని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. సిట్‌ ఏర్పాటుపై సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.‘చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నాయకుడు. తన రాజకీయ స్వార్థం కోసం లడ్డు వివాదం అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. లడ్డుపై వివాదంపై నిజా నిజాలు బయటికి రావాలంటే ఆయన నియమించిన సిట్ సరిపోదు. న్యాయ విచారణ జరగాలి’ అని డిమాండ్‌ చేశారు.రాజకీయ ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలు బయటికి రావాలంటే న్యాయ విచారణే శరణ్యం’ అని సురేంద్ర జైన్‌ తెలిపారు. ఈ సందర్భంగా లడ్డూ వివాదంపై తిరుమల శ్రీవారి భక్తులు ఆందోళన చెందవద్దని, ఈ అంశంపై త్వరలోనే మేం న్యాయపరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దేశంలో అన్ని దేవాలయాలు నిర్వాహణ నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి. దేవాలయాల పరిరక్షణపై వీహెచ్‌పీ త్వరలో ఉద్యమం చేపడుతుంది’ అని సురేంద్ర జైన్‌ హెచ్చరించారు. సిట్‌లో చంద్రబాబు మనిషితిరుమల లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కూలంగా వ్యవహరించిన గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్‌ చీఫ్‌గా నియమించారు. సిట్‌లో విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్‌ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉండనున్నారు.

Yogi Adityanath Introduces Strict Food Regulations In Uttar Pradesh3
ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. యూపీ సర్కార్‌ కొత్త నిబంధనల మేరకు.. విధి నిర్వహణలో చెఫ్‌లు, వెయిటర్‌లు మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలి. హోటళ్లు, రెస్టారెంట్‌లలో సీసీ టీవీ కెమెరాలు తప్పని సరిగా ఇన్‌ స్టాల్‌ చేయాలి. నిర్వాహకులు, మెనూ బోర్డ్‌లపై నిర్వాహకుల పేర్లు, అడ్రస్‌ వివరాలు తప్పని సరిగా ఉండాలని సీఎం యోగి ఆధిత్యనాథ్‌ స్పష్టం చేశారు. ఫ్రూట్‌జ్యూస్‌లో మూత్రంకొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లో ఖుషీ జ్యూస్ కార్నర్ షాపు యజమాని పండ్ల రసాల్లో మూత్రం కలిపి అమ్ముతూ పట్టుబడ్డాడు. జ్యూస్‌లో మూత్రం కలుపుతుండగా..అక్కడే ఉన్న వినియోగదారుడు నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.Uttar Pradesh : In Loni of Ghaziabad, locals caught Mohd. Aamir and Md Kaif mixing Human URINE in juice at their juice shop and selling it to people. Police even recovered a plastic can filled with Urine at the shop named Khushi Juice Corner. Case has been registered and both… pic.twitter.com/jkC8poGuVn— Amitabh Chaudhary (@MithilaWaala) September 14, 2024 రాష్ట్రంలో కొత్త నిబంధనలుఈ నేపథ్యంలో సీఎం యోగి ఆధిత్యనాథ్‌ ఆద్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోటల్స్‌లో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు.సమావేశం అనంతరం ఆధిత్యనాథ్‌ మాట్లాడుతూ.. తినే ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న ఘటనల నేపథ్యంలో ఆహార పదార్థాలలో మానవ వ్యర్థాలను కలపడం అసహ్యకరమైంది. ఆమోదయోగ్యం కాదు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా ఉండేందుకు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త నిబంధనల్ని అమలు చేస్తున్నారా? లేదా అని పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు, స్థానిక అధికారులు తనిఖీ చేస్తారని అన్నారు.ప్రజారోగ్యం విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు. ఆహారం కలుషితం లేదా అపరిశుభ్రమైన పద్ధతుల్ని అవలంభించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

Police Case On Youtuber Harsha Sai4
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి

యూట్యూబర్ హర్షసాయిపై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‪‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనని మోసం చేసి రూ.2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదు చేసింది. హర్షసాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణపైన కూడా కంప్లైంట్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.పేదలకు డబ్బు సాయం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసే చాలా పాపులర్ అయ్యాడు. అయితే బెట్టింగ్ యాప్స్‌ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడని కొన్నాళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మోసం చేశాడని యువతి ఫిర్యాదు చేయడంతో హర్షసాయి బండారం కాస్త బట్టబయలైంది.

Israeli Strike Kills Hezbollah Commander Ibrahim Qubaisi5
ఇజ్రాయెల్‌ దాడిలో హిజ్బుల్లా కమాండర్‌ ఇబ్రహీం ఖుబైసీ హతం

బీరూట్‌ : హిజ్బుల్లాను ఇజ్రాయెల్‌ ఆర్మీ చావుదెబ్బ తీసింది. ఇప్పటికే సోమవారం హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వార్‌ హత మార్చగా.. మంగళవారం హిజ్బుల్లా కమాండర్‌ ఇబ్రహీం ఖుబైసీ ప్రాణాలు తీసినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) లెబనాన్ రాజధాని బీరూట్‌లో దక్షిణ శివారు ప్రాంతమైన దహియే జిల్లాలో హిజ్బుల్లా కమాండర్‌ ఇబ్రహీం ఖుబైసీ లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇబ్రహీం ఖుబైసీ మరణించారని తెలుస్తోంది. ఆయన మరణంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.హిజ్బుల్లా రాకెట్,క్షిపణి విభాగానికి కమాండర్ ఇబ్రహీం ఖుబైసీపై దాడి జరిగిన సమయంలో ఆయనతో పాటు మరో ఐదుమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా,లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో సోమవారం మరణించిన వారి సంఖ్య 558కి పెరిగింది. అదే సమయంలో, 1835 మంది తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్‌ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్‌ తెలిపారు.🔴LEBANON 🇱🇧-ISRAEL 🇮🇱| Several sources claim that one of the Hezbollah Commander, Ibrahim #Qubaisi, was killed during an Israeli airstrike on Tuesday 09/24 in Dahiya, #Beirut. Ibrahim Qubaisi was until then the commander of #Hezbollah's rocket division. #MiddleEastTensions pic.twitter.com/iKJpGaNZ6c— Nanana365 (@nanana365media) September 24, 2024

Ruturaj Gaikwad To Lead Rest Of India In Irani Trophy, Samson Excluded6
జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్‌! సంజూకు నో ఛాన్స్‌

ఇరానీ ట్రోఫీ-2024లో భాగంగా లక్నో వేదికగా ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. తాజాగా ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఈ జట్టుకు టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. అత‌డి డిప్యూటీగా బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ జ‌ట్టులో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్‌, ఇషాన్ కిష‌న్ వంటి స్టార్ ఆట‌గాళ్ల‌కు చోటు ద‌క్కింది. అయితే దులీప్ ట్రోఫీలో సెంచ‌రీతో చెల‌రేగిన సంజూ శాంస‌న్‌కు మాత్రం బీసీసీఐ సెల‌క్ట‌ర్లు మొండి చేయిచూపించింది. అత‌డికి ఇరానీ ట్రోఫీ జ‌ట్టులో చోటు ఇవ్వ‌లేదు. అదే విధంగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన భార‌త క్రికెట‌ర్లు ధ్రువ్ జురెల్‌, యష్ దయాల్‌ను ఈ జ‌ట్టులో సెలెక్ట‌ర్లు చేర్చారు. దీంతో వీరిద్దరూ రెండు టెస్టుకు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది. మ‌రోవైపు ఈ ఇరానీ కప్‌లో ముంబై జ‌ట్టుకు సీనియ‌ర్ ఆట‌గాడు అజింక్యా ర‌హానే సార‌థ్యం వ‌హించ‌నున్నాడు.ఇరానీ ట్రోఫీకి రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్‌), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్‌)*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), మానవ్ సుతార్, సరాంశ్ జైన్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, యష్ దయాల్*, రికీ భుయ్, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్చదవండి: ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడుతున్నాం.. ట్రోఫీ మాదే: హర్మన్

Rs.45 Lakh Per Day Do You Know IBM CEO Arvind Krishna7
రోజుకు రూ.45 లక్షల జీతం.. అగ్రరాజ్యంలో తెలుగు తేజం

ప్రపంచంలో అత్యధిక జీతం తీసుకుంటున్న అతి కొద్దిమంది సీఈఓలలో ఒకరు ఐబీఎమ్ సీఈఓ 'అరవింద్ కృష్ణ'. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన వేతనం ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓలలో ఒకరుగా మాత్రమే తెలిసిన అరవింద్ కృష్ణ.. మన భారతీయుడు అని బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఈయన 1962 నవంబర్ 23 పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన తెలుగు బిడ్డ. తండ్రి భారత సైన్యంలో పనిచేసిన ఆర్మీ అధికారి.అరవింద్ కృష్ణ తమిళనాడులోని కూనూర్‌లోని స్టాన్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో, డెహ్రాడూన్‌లోని సెయింట్ జోసెఫ్స్ అకాడమీలో చదువుకున్నారు. ఆ తరువాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని.. 1991లో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా - ఛాంపెయిన్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్‌డీ పట్టా పొందారు.అరవింద్ కృష్ణ 1990లోనే ఐబీఎంకు సంబంధించిన థామస్ జే. వాట్సాన్ రీసెర్చ్ సెంటర్‌లో చేరారు. 2009 వరకు అక్కడే కొనసాగారు. ఆ తరువాత ఐబీఎం ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్, సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్‌లో జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2015లో ఐబీఎం రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. ఆ తరువాత ఐబీఎం క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాఫ్ట్‌వేర్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2020లో ఐబీఎం సీఈఓ అయ్యారు. కంపెనీలో ఈయన దాదాపు 34 ఏళ్ళు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్‌ ఆల్ట్‌మన్‌ఐబీఎం సీఈఓ అయిన తరువాత అరవింద్ కృష్ణ.. కంపెనీ ఉన్నతికి ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన వార్షిక వేతనం ఇప్పుడు రూ.165 కోట్లు. అంటే రోజుకు రూ.45 లక్షల జీతం అన్న మాట. 2023లో ఈయన జీతం పెరగడంతో వార్షిక వేతనం భారీగా పెరిగింది.

Kommineni Comments On Chandrababu Politics On Tirumala Laddu8
‘లడ్డూ’ వెనుక బాబు మతలబు ఇదేనా?.. ఏదో తేడా కొడుతోంది

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజులుగా రెచ్చిపోతూ ఉన్నవి లేనివి అన్నీ కలిపి విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో తన గురించి తాను పొగుడుకుంటూ ఏకంగా తాను దేవుడి ప్రతినిధిని అన్నట్టుగా మాట్లాడుతుండడం సంచలనంగా ఉంది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ నెయ్యితో తయారవుతోందని దారుణంగా వ్యాఖ్యానించారు. విశేషమేమిటంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ కల్తీ వ్యవహారం జరిగినప్పటికీ ఆయన వ్యూహాత్మకంగా వైఎస్సార్‌సీపీపైనా, మాజీ సీఎం వైఎస్ జగన్‌పైనా ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వరస్వామే తనతో నిజాలు చెప్పించారని ఆయన వెల్లడించడం పరాకాష్టగా భావించాలి. మామూలుగా కొంతమంది అతితో ఉండే భక్తులు, పూనకం వచ్చినవారు, భవిష్యత్తు వాణి చెబుతామనేవారు.. అటువంటివాళ్లే తాము దేవునికి ప్రతినిధులుగా, దేవుడే మాట్లాడిస్తున్నామని చెబుతుంటారు. చంద్రబాబును ఆ మాట అనలేముగానీ, ఆయన మాట్లాడిన తీరు చూస్తే అలా అనిపించే అవకాశముంది.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలన్న తాపత్రయంలో తానేమి మాట్లాడుతన్నారో ఆయన తెలుసుకోలేకపోతున్నారు. అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న ఈయన, తిరుమలకు అపచారం కలిగించేలా తిరుమలేశుడిపై అపనమ్మకం పెరిగేలా దుష్ప్రచారం చేశారు. పైగా ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతున్నదని ఇంత పెద్ద అపచారం జరిగిన నేపథ్యంలో సంప్రోక్షణ గురించి మఠాధిపతులతో మాట్లాడతానని చెబుతున్నారు. హిందువులను రెచ్చగొట్టడంతో పాటు, తిరుమల ప్రసాదం లడ్డూ వివాదాన్ని మరి కొంతకాలం కొనసాగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది ఆయన దురుద్దేశంగా కనిపిస్తోంది.జూన్ 4న ఆయన అధికారంలోకి వచ్చారు. జూన్‌ 12న ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మొత్తం అధికార యంత్రాంగమంతా 4వ తేదీ నుంచే ఆయన అధీనంలోకి వెళ్లింది. జులై నెలలో నాణ్యతలేని ట్యాంకర్లను వెనక్కి పంపించడం ఆ తర్వాత నివేదిక తెప్పించడంవంటివి జరిగాయి. నాణ్యత లేని టాంకర్లను వెనక్కి పంపించామని, ఈఓ చెబితే, అబ్బేబ్బే.. లేదు.. ఆ నెయ్యిని లడ్డూలలో వాడారని చంద్రబాబు అంటున్నారు. అది నిజమే అయితే ఇలాంటి చర్యకు పాల్పడ్డ ఈఓని, ఇతర సంబంధిత అధికారులను చంద్రబాబు సస్పెండ్ చేయాలి కదా?. కేసులు పెట్టాలి కదా? ఏదో మతలబు లేనిదే చెన్నైలో ల్యాబ్‌లు అందుబాటులో వుంటే గుజరాత్‌కు పనిగట్టుకొని ఎందుకు పంపించారు? ఎన్డీడీబీ ఎండీ తిరుమల ఈవోను, మరికొంత మంది ప్రముఖులను ఎందుకు కలిశారు? ఆ తర్వాతనే ఈ టెస్టుల తతంగం జరగడంలోని ఆంతర్యం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.విశేషమేమిటంటే చంద్రబాబు నిజాలు చెబుతారా లేదా అన్నదానిపై గత మూడున్నరదశాబ్దాలుగా ప్రజల్లోగానీ, రాజకీయవర్గాల్లో గానీ చర్చజరుగుతోంది. చంద్రబాబుతో స్వామివారు సైతం నిజం చెప్పించలేరని కొంతమంది చమత్కరిస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో, విభజిత ఏపీ అసెంబ్లీలోగానీ పలువురు ఈ అంశం గురించి మాట్లాడుతూ చంద్రబాబు అలవోకగా అబద్ధాలు ఆడుతుంటారని వ్యాఖ్యానిస్తుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో శాసనసభలో మాట్లాడుతూ చంద్రబాబు కన్నార్పకుండా అబద్ధాలు చెప్పగలరని, నిజం మాట్లాడితే తల వక్కలవుతుందనే మునిశాపం ఆయనకు వుందని ఎద్దేవా చేసేవారు. అప్పటినుంచీ ఈ డైలాగు బాగా ప్రసిద్ధిగాంచింది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు రాజకీయంగా గానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల విషయంలోగాన మాట మార్చడం, అబద్ధాలు చెప్పడం సర్వసాధారణం అన్న అభిప్రాయం నెలకొంది.ఉదాహరణకు ఉమ్మడి అసెంబ్లీలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టెండర్‌కు సంబంధించి వైఎస్సార్ హయాంలో ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. చర్చకు నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులో మొదట వేయికోట్లని రాసి, పదమూడు వందల కోట్లుగా మార్చారు. ఆ విషయాన్ని చీఫ్‌ విప్‌గా వున్న కిరణ్‌ కుమార్‌రెడ్డి లేవనెత్తారు. దానికి చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఇచ్చిన ఏంటంటే తాము కావాలనే సంఖ్యను మార్చామని చెప్పారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా చంద్రబాబుపై విరుచుకుపడి ఆయన గుణమే అంత అని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బాగా రభస అయింది. చంద్రబాబు చేసిన తప్పునకు టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం పక్షాల సభ్యులు తల పట్టుకున్నారు.డెయిరీ రంగంలో సొంతంగా హెరిటేజ్‌ పరిశ్రమను కలిగిన చంద్రబాబు 320కే నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పాల నుంచి కేవలం నెయ్యే కాకుండా పాలను ఇతర ఉత్పత్తుల అమ్మకం ద్వారా లోటును కవర్ చేసుకుంటారన్న సంగతి ఈయనకు తెలియదా? పోనీ ఇది తక్కువ ధర అనుకున్నా ఆయన పాలించిన 2014-19 మధ్య కిలో నెయ్యి 276కే మహారాష్ట్రలోని గోవిందా పాల ఉత్పత్తుల కంపెనీకి ఎలా టెండర్‌ ఖరారు చేశారు? అంటే అప్పుడు కూడా కల్తీ జరిగిందని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా!ఆనాడు కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌కు ( నందిని) ఎందుకు టెండర్‌ను ఇవ్వలేదు. ఇలాంటివాటికి ఏమీ సమాధానం ఇవ్వకుండా తనతో వెంకటేశ్వరస్వామి నిజాలు చెప్పించారని బుకాయిస్తే సరిపోతుందా?. తీరా చూస్తే ఆయన చెప్పినవి అసత్యాలేనని తేలుతోంది. ఆయన కుమారుడు లోకేషే కల్తీ నెయ్యితో ఉన్న టాంకర్లలోని సరుకు వాడలేదని ట్వీట్ చేశారు. దీంతో చంద్రబాబు నిజం చెప్పలేదా అన్న ప్రశ్న వస్తుంది. ఆనాడు టిటిడి ఏర్పాటు చేసిన ధరల కమిటీలో ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా వున్న పార్థసారథి, టీడీపీ శాసన సభ్యురాలు ప్రశాంతి రెడ్డి వున్నారు. వీరిద్దరూ ఆ రోజుల్లో వైఎస్సార్‌సీపీకి చెందినవారు. తదుపరి అంటే 2024లో టీడీపీలోకి వచ్చారు. మరి వీరిని ఇప్పుడు టీటీడీలో అవకతవకలకు బాధ్యులని చెప్పి తప్పించగలరా?అలాగే బీజేపీకి చెందని నేత వైద్యనాధన్ కూడా కమిటీలో వున్నారు. టీటీడీలో బీజేపీ సభ్యులుకూడా వున్నారని వైఎస్సార్‌సీపీ ప్రస్తావిస్తే దాన్ని బ్లాక్‌ మెయిల్ అని ఎల్లో మీడియా భాష్యం చెప్పడం విచిత్రంగా వుంది. అసలు విశేషం ఏమిటంటే నెయ్యి కన్నా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ చెబుతున్న పిష్ ఆయిల్, పిగ్ ఫాట్ వంటివాటి ఖరీదు చాలా ఎక్కువట. ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి ఆ వివరాలు చెబుతూ జంతు కొవ్వు వెయ్యి నుంచి 1400 రూపాయలు ఉంటే 320 రూపాయల ఖరీదుఉన్న నేతిలో ఎవరైనా కలుపుతారా? అని ప్రశ్నించారు. రాగిలో బంగారం కలుపుతారా?. బంగారంలో రాగి కలుపుతారా? పాలలో నీళ్లు కలుపుతారా . నీళ్లలో పాలు కలుపుతారా? అన్న అర్ధవంతమైన ప్రశ్న వేశారు. దీనికి చంద్రబాబు అండ్ కో ఏమి చెబుతారో చూడాలి.ఆ విషయానికి వస్తే 1995లో ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్ని రకాలుగా మాటలు మార్చారో అందరికీ తెలిసిందే. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మసీదులు కూల్చేపార్టీగా అభివర్ణించారు. 2004లో ఓటమి తర్వాత జీవితంలో బిజెపితో పొత్తుపెట్టుకోనని అన్నారు. నరేంద్ర మోదీని నర హంతకునిగా ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోదీని హైదరాబాద్ రానీయనని హెచ్చరించేవారు. అయినా మళ్లీ 2014లో మోదీ ఎక్కడుంటే అక్కడకు వెళ్లి బతిమలాడుకొని మరీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. 2018లో బీజేపీ నుంచి విడిపోయి మోదీని టెర్రరిస్టు, ముస్లింలను బతకనీయడు, పెళ్లాన్ని ఏలుకోలేనివాడు దేశాన్ని ఎలా ఏలుతాడు అని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. తిరిగి 2024 నాటికి మోదీ అంతటి గొప్పవాడు లేడని ప్రకటించాడు. మరి వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం అంటే ఏం చెప్పగలం.సోనియా గాంధీని దెయ్యం , భూతం అని తిట్టారు. కానీ ఆ తర్వాత ఆమెతో కలిసి రాజకీయ సభల్లో పాల్గొని పొగిడారు. లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తామని వాగ్ధానం చేసి ఆ తర్వాత దాన్ని నెరవేర్చకపోగా మొత్తం రుణమాఫీ చేశామని దబాయించేవారు. తమ రాజకీయ అవసరాల కోసం మాట్లాడే చంద్రబాబు మాటలు నిజాలా అబద్ధాలా అనేది పక్కన పెడితే, ఎలాగైనా మాట మార్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పుడు వైఎస్ జగన్ పై ఎదురు దాడి చేస్తూ ప్రధానికి లేఖ రాయడానికి ఎంత ధైర్యమని ప్రశ్నించడం చిత్రంగా వుంది. వైవీ సుబ్బారెడ్డి భార్య పక్కా హిందువు అయితే ఆమెకు క్రైస్తవ మతం అంటగట్టి స్టేట్మెంట్ ఇచ్చారు.మరో వైపు తన క్యాబినెట్‌లోనే హోంమంత్రిగా వున్న వ్యక్తి ఒకసారి తను క్రిస్టియన్‌ అని, మరొకసారి హిందూమతం అని చెప్పుకున్నారు. భూమన కరుణాకర్‌ రెడ్డి తన కుమార్తె పెళ్లిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశారని చంద్రబాబు ఆరోపిస్తారు. మరో వైపు ఒక క్రిస్టియన్‌ను వివాహమాడి, పిల్లలకు సైతం క్రిస్టియన్ పేర్లనే పెట్టిన పవన్‌ కల్యాణ్‌ చాలా గొప్ప హిందువు అని సర్టిఫికెట్ ఇస్తుంటారు. చంద్రబాబు స్వయంగా క్రైస్తవ సమావేశానికి వెళ్లి ఏసుక్రీస్తును నమ్మినవారికి అపజయం లేదని సూక్తులు చెప్పారు. కానీ ఇప్పుడేమో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నిజానికి మతమన్నది వ్యక్తిగతం. కానీ చంద్రబాబు లాంటివారు తమ స్వార్ధ రాజకీయాల కోసం కులం, మతం, నిజాలతో సంబంధం లేకుండా వాడేసుకోగలరని అనిపిస్తుంది.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Prakash Raj Comments On Pawan Kalyan Tweet9
పవన్‌కు ప్రకాష్‌ రాజ్‌ కౌంటర్‌

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నటుడు ప్రకాష్‌ రాజ్‌ కౌంటర్‌ ఇచ్చారు. తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పవన్‌.. ప్రకాష్‌ రాజ్‌పై విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ప్రకాష్‌ రాజ్‌ స్పందిస్తూ.. పవన్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ‘పవన్‌ .. నేను చేసిన ట్వీట్‌ ఏంటి? నా ట్వీట్‌పై మీరు మాట్లాడుతుందంటేంటి. మరోసారి నా ట్వీట్‌ను చదవి అర్థం చేసుకోండి. నేను షూటింగ్ నిమిత్తం విదేశాల్లో వున్నాను 30 తేదీ తరువాత వస్తాను. మీ ప్రతి మాటకు సమాధానం చెపుతాను. మీకు వీలైతే నా ట్వీట్‌ని మళ్లీ చదివి అర్థం చేసుకోండి’ అంటూ వీడియోని విడుదల చేశారు. Dear ⁦@PawanKalyan⁩ garu..i saw your press meet.. what i have said and what you have misinterpreted is surprising.. im shooting abroad. Will come back to reply your questions.. meanwhile i would appreciate if you can go through my tweet earlier and understand #justasking pic.twitter.com/zP3Z5EfqDa— Prakash Raj (@prakashraaj) September 24, 2024 ట్వీట్‌లో ప్రకాష్‌ రాజ్‌ ఏమన్నారంటేపవన్ కల్యాణ్... మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, జాతీయ స్థాయిలో దీనిపై చర్చించుకునేలా చేస్తున్నారు? ఇప్పటికే మన దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l— Prakash Raj (@prakashraaj) September 20, 2024 ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌పై పవన్‌ ఇలా మాట్లాడారుసున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.చదవండి: పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే

Origin Of Tirupati Laddu According To Historians10
తిరుపతికి లడ్డూ ఎలా వచ్చింది?

తిరుపతి లడ్డూపై వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అసలు లడ్డూ ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో కలుగుతోంది. అసలు తిరుమల శ్రీ వేంకటేశుని ప్రసాదంగా లడ్డూ ఎప్పటి నుంచి ఉంది..అసలు లడ్డూయే ప్రసాదంగా ఎందుకు ఉంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు అనిరు‌ధ్‌ కనిశెట్టి అనే చరిత్రకారుడు ‘ది ప్రింట్‌’లో రాసిన సమగ్ర కథనంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తొమ్మిదో శతాబ్దం నుంచి ఇప్పటివరకు తిరుపతి చరిత్రను వివరిస్తూ కాలగమనంతో పాటు శ్రీ వేంకటేశుని ప్రసాదం ఎలా మారుతూ వచ్చిందన్నది అనిరుధ్‌ తన కథనంలో రాసుకొచ్చారు.వేల ఏళ్ల క్రితం తిరుపతి ప్రసాదం ఏంటి..?నిజానికి తిరుమల-తిరుపతి అనగానే లడ్డూ టక్కున గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే తిరుపతి వెళ్లినపుడు ఏడుకొండలవాడిని దర్శించుకోవడం ఎంత ముఖ్యమైన ఘట్టమో లడ్డూ ప్రసాదం తినడమూ భక్తులకు అంతే ముఖ్యం. ఏడుకొండలకు వెళ్లి లడ్డూ ప్రసాదం ఆరగించడమే కాదు..క్యూలో నిల్చొని కష్టపడి తీసుకున్న లడ్డూను ఇతరులకు పంచి పెట్టడం కూడా భక్తిలో భాగమైపోయాయి. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన లడ్డూ నిజానికి తొలి ఉంచి ఏడు కొండలవాడి ప్రసాదం కాదని అనిరు‌ధ్‌ చెబుతున్నారు. తొమ్మిదో శతాబ్దం నుంచి 1900 సంవత్సరం వరకు శ్రీవారి ప్రసాదం అన్నం,నెయ్యితో తయారు చేసిన పొంగల్‌ అని తెలిపారు. లడ్డూ ప్రసాదంగా ఎలా మారింది..?తొమ్మిదో శతాబ్దంలో తిరుపతి పుణ్యక్షేత్రం బ్రాహ్మణుల ఆధీనంలో చిన్న పల్లెటూరుగా ఉండేది.ఆ తర్వాతి కాలంలో చోళులు, విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు, బ్రిటీషర్ల పాలనలో తిరుపతి క్షేత్రంలో చాలా మార్పులు జరిగాయి. శ్రీ వేంకటేశుడి మహిమతో తిరుపతి ప్రభ రోజురోజు పెరుగుతూ వచ్చింది.తొలుత అక్కడ పొంగల్‌గా ఉన్న ప్రసాదం ఉత్తర భారతీయుల కారణంగా లడ్డూగా మారిందని అనిరు‌ధ్‌ తన కథనంలో రాశారు. ‘బాలాజీ’ అనే పిలుపు కూడా వారిదే..బ్రిటీషర్ల పాలనలో ఉత్తర భారతీయులు ఎక్కువగా తిరుపతి సందర్శనకు వచ్చేవారని, వీరు వెంకటేశుడిని బాలాజీగా పిలుచుకునే వారని తెలిపారు. వీరే పొంగల్‌గా ఉన్న తిరుపతి ప్రసాదాన్ని తీయనైన లడ్డూగా మార్చారని అనిరుథ్‌ రాసుకొచ్చారు.తొలుత బ్రాహ్మణుల ఆధీనంలో తిరుపతి ఉన్నపుడు వెంకటేశునికి స్వచ్చమైన మంచి నీటితో అభిషేకాలు అక్కడ నెయ్యితో వెలిగించిన దీపాలు తప్ప ఎలాంటి నైవేద్యాలు ఉండేవి కాదని కథనంలో అనిరుధ్‌ పేర్కొనడం విశేషం. ఇదీచదవండి: లడ్డూ వెనుక ‘బాబు’ మతలబు ఇదేనా..

Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
International View all
title
ఇజ్రాయెల్‌ దాడిలో హిజ్బుల్లా కమాండర్‌ ఇబ్రహీం ఖుబైసీ హతం

బీరూట్‌ : హిజ్బుల్లాను ఇ

title
న్యూస్‌ చదువుతుండగా లెబనాన్‌ జర్నలిస్ట్‌పై ఇజ్రాయెల్‌ మిస్సైల్ దాడి

బీరూట్ : లెబనాన్‌ దేశంలో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీక

title
శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య

కొలంబో: శ్రీలకం నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య అధికారికంగా ని

title
సునీత విలియమ్స్ కోసం 26న క్రూ–9 ప్రయోగం.. అయినా 5 నెలలు పడుతుందా!

కేప్‌ కెనవెరల్‌ (అమెరికా):  హమ్మయ్యా... సునీతా విలియమ్స్‌ త్వరలోనే భూమిని చేరుకోనున్నారు.

title
భారత్‌, చైనాల మధ్య నలిగిపోము: శ్రీలంక అధ్యక్షుడు

కొలంబో: భారత్‌, చైనా దేశాలతో విదేశాంగ విధానంలో శ్రీలంక సమానమ

National View all
title
ఆటోను ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

title
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు మావోయిస్టులు మృతి

రాయ్‌పూర్‌:ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు,పోలీసులకు మధ్య మరోసా

title
ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ రాష్ట్రంలో కఠిన

title
వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలన్న కంగనా.. కాంగ్రెస్‌ కౌంటర్‌

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ తన దురుస

title
అక్కడుంది చంద్రబాబు.. SIT ఏర్పాటుపై వీహెచ్‌పీ సురేంద్ర జైన్‌ ఆగ్రహం

సాక్షి,న్యూఢిల్లీ : చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం తిరు

NRI View all
title
అమెరికాలో గుండెపోటుతో తెలుగు విద్యార్థి హఠాన్మరణం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు డల్లాస్‌లో గుండెపోటుతో మరణించాడు.

title
న్యూజెర్సీలో విజయవంతంగా నాట్స్ పికిల్‌బాల్ టోర్నీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు న్యూజెర్సీలో తాజాగా పికిల్ బాల్ టోర్న

title
ఎన్‌ఆర్‌ఐలే భారత్‌ అంబాసిడర్లు: ప్రధాని మోదీ

న్యూయార్క్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న

title
అమెరికాలో ఇండియన్‌ ఎంబసీ అధికారి అనుమానాస్పద మృతి

వాషింగ్టన్: అమెరికాలోని ఇండియన్‌ ఎంబసీ (దౌత్య కార్యాలయం)లో వ

title
లెబనాన్‌ పేజర్ల పేలుళ్లలో కేరళ టెక్కీ ప్రమేయం?

హెజ్‌బొల్లా లక్ష్యంగా జరిగిన పేజర్ల పేలుళ్ల కేసులో..

Advertisement
Advertisement