Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Serious On Chandrababu Govt Over Negligence Of Public Health1
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, ఫ్యామిలీ డాక్టర్‌ ఊసేలేదు: వైఎస్‌ జగన్‌ ధ్వజం

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని ప్రజారోగ్యం మీద చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ఇందుకు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఘటనలో 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడంలేదని మండిపడ్డారు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నాయని, అయినా సరే స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణమని అన్నారు.నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్‌ జగన్‌. లిక్కర్‌, ఇసుక స్కామ్‌లో నిండా మునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారని విమర్శించారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయని, బాబు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని, దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చినుంచి పెండింగ్‌లో పెట్టారని దుయ్యబట్టారు.చదవండి: ప్రజలు ‘సూపర్‌సిక్స్‌’ కోసం చూస్తున్నారు: బొత్స‘ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారు. విలేజ్‌క్లినిక్స్‌, పీహెచ్‌సీలను నిర్వీర్యంచేశారు. ఫ్యామిలీ డాక్టర్‌ ఊసేలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. కొత్త మెడికల్‌ కాలేజీలను అస్తవ్యస్తం చేశారు. స్కాంలు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారు. తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబుగారి ప్రభుత్వం నిద్ర వీడడంలేదు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 19, 2024

Ind vs NZ 1st Test Day 4: Kohli, Rohit Argue With Umpires Bad Light Controversy2
Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్‌ ఆగ్రహం.. కోహ్లి ఆన్‌ ఫైర్‌!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ విరాట్‌ కోహ్లి అంపైర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆటను ఎలా నిలిపివేస్తారంటూ ఫీల్డ్‌ అంపైర్లతో వాదనకు దిగారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో శనివారం నాటి ఆట సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా భారత్‌ స్వదేశంలో కివీస్‌ జట్టుతో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్టు జరుగుతోంది. వర్షం వల్ల బుధవారం నాటి తొలిరోజు ఆట రద్దు కాగా.. గురువారం మ్యాచ్‌ మొదలైంది.462 పరుగులకు ఆలౌట్‌ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకే కుప్పకూలగా.. న్యూజిలాండ్‌ 402 పరుగులు చేసింది. రోహిత్‌ సేన కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో 462 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.విజయంపై ఆశలుఅయితే, భారత్‌కు కేవలం 106 పరుగుల లీడ్‌ మాత్రమే లభించింది. ఈ స్కోరును డిఫెండ్‌ చేసుకుని మ్యాచ్‌ గెలవాలంటే భారత బౌలర్లు అద్భుతం చేయాల్సిందే. కాగా శనివారం ఆట చరమాంకానికి చేరుకునే సమయంలో కొత్త బంతితో కివీస్‌ పేసర్లు రాణించారు. దీంతో టీమిండియాలో విజయంపై ఆశలు మొదలయ్యాయి. వీలైనంత త్వరగా వికెట్లు పడగొట్టాలనే తొందర కనిపించింది.ఈ క్రమంలో కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టగా.. భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించాడు. ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ క్రీజులో ఉండగా.. రెండో బంతికే బుమ్రా ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేశాడు. అయితే, అంపైర్లు నాటౌట్‌ ఇచ్చారు. దీంతో చిరాకెత్తిపోయిన రోహిత్‌ సేనకు అంపైర్ల మరో నిర్ణయం ఆగ్రహం తెప్పించింది.అంపైర్ల నిర్ణయం.. మండిపడ్డ రోహిత్‌, కోహ్లివెలుతురులేమి కారణంగా దాదాపు అరగంట ముందుగానే ఆటను నిలిపివేయాలని అంపైర్లు నిర్ణయించారు. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వారి దగ్గరకు వెళ్లి వాదనకు దిగగా.. కోహ్లి కూడా అతడికి జత కలిశాడు. ఆట నిలిపే ప్రసక్తే లేదంటూ రోహిత్‌ కంటే ఎక్కువగా కోహ్లినే గట్టిగా వాదించినట్లు కనిపించింది. వీరిలా అంపైర్లతో వాగ్వాదానికి దిగిన కాసేపటికే మబ్బులు కమ్ముకువచ్చాయి. అంపైర్లు తమ నిర్ణయం ఫైనల్‌ చేస్తూ ఆట నిలిపివేయగానే.. గ్రౌండ్స్‌మెన్‌ కవర్లతో మైదానాన్ని కప్పేశారు. ఇక శనివారం ఆట పూర్తయ్యే సరికి కివీస్‌ నాలుగు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయలేదు. టామ్‌ లాథమ్‌ 0, డెవాన్‌ కాన్వే 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు ఆట ఆదివారం ఉదయం 9.15 నిమిషాలకు ఆరంభం కానున్నట్లు బీసీసీఐ తెలిపింది.టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ తొలి టెస్టు👉టీమిండియా తొలి ఇన్నింగ్స్‌- 46 రన్స్‌ ఆలౌట్‌👉న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌- 402 రన్స్‌ ఆలౌట్‌👉టీమిండియా రెండో ఇన్నింగ్స్‌- 462 రన్స్‌ ఆలౌట్‌👉న్యూజిలాండ్‌ లక్ష్యం- 107 పరుగులు👉విజయానికి పది వికెట్ల దూరంలో టీమిండియాచదవండి: IND vs NZ: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!Ind vs NZ: అయ్యో పంత్‌! .. నీకే ఎందుకిలా?The umpire is asking the players to go off due to bad light. Rohit Sharma & Virat Kohli are not happy 😭😭😭#INDvNZ #tapmad #DontStopStreaming pic.twitter.com/vkn2oq93OE— Mubashir hassan (@Mubashirha88911) October 19, 2024

Prabhas Birthday Celebrations: Dispute Between Fans At Bhimavaram3
ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వివాదం

ప్రభాస్‌ బర్త్‌డే ఈవెంట్‌ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వివాదంగా మారింది. ప్రభాస్‌ పుట్టిన రోజు (అక్టోబర్‌ 23)సందర్భంగా కొంతమంది ఫేక్‌ ఫ్యాన్స్‌తో కలిసి ప్రసన్న సాహో డబ్బులు వసూలు చేసి కమర్షియల్ ఈవెంట్స్ చేస్తున్నారని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఉండి వాసు ఆరోపించారు. ఆ ఈవెంట్‌ని కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే తాను ఎలాంటి కమర్షియల్‌ ఈవెంట్‌ చేయడం లేదని ప్రసన్న సాహో వర్గం వివరణ ఇచ్చింది. (చదవండి: రేణు దేశాయ్‌ ఇంట చండీ హోమం)ఎవరి దగ్గర తాను డబ్బులు తీసుకోలేదని, కావాలనే తనను టార్గెట్‌ చేశారంటూ ప్రసన్న మండి పడ్డారు. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా మెగా బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వహిస్తామని ప్రసన్న సాహో వర్గం వెల్లడించింది.(చదవండి: టాప్‌ హీరో ఫ్యామిలీ నుంచి పూరీ జగన్నాథ్‌కు ఆఫర్‌)కాగా, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్‌ చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్‌ 23న ఆయన కొత్త సినిమాల అప్‌డేట్స్‌ రావడంతో పాటు ఆయన నటించిన ఆరు సినిమాలు రీరిలీజ్‌ అవుతుండడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బర్త్‌డే రోజు మిస్టర్‌ పర్ఫెక్ట్‌, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్‌, రెబల్‌, సలార్‌ చిత్రాలు రీరిలీజ్‌ చేస్తున్నారు.

Telangana CM Revanth Reddy Comments On Group 1 Protests4
గ్రూప్‌-1 ఆందోళనలపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

సాక్షి,హైదరాబాద్‌: గ్రూప్‌ వన్‌ అభ్యర్థుల ఆందోళనలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. శనివారం(అక్టోబర్‌19) సాయంత్రం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని పోలీస్‌ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. గ్రూప్‌ వన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినపుడే జీవో నెంబర్‌ 29 ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి గ్రూప్‌ 1 నియామకాలు జరగలేదన్నారు. కొంత మంది ఉద్యోగాలు పోవడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లు గ్రూప్‌ వన్‌ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఉచ్చులో విద్యార్థులు పడొద్దని హితవు పలికారు. కాగా గ్రూప్‌ వన్‌ రద్దు చేయాలని శనివారం ఉదయం గ్రూప్‌ వన్‌ అభ్యర్థులు హైదరాబాద్‌ అశోక్‌నగర్‌తో పాటు సచివాలయం వద్ద ఆందోళనలు చేశారు. వీరి ఆందోళనలకు బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు మద్దతు పలికారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ చదవండి: గ్రూప్‌-1 రగడ..సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

Nikhil Kamath Takes U-Turn, Buys New House5
మనసు మార్చుకున్న నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని..

సొంతిల్లు కొనడం మంచిదా? అద్దె ఇంట్లోనే ఉండటం మంచిదా? అంటే.. ఇప్పటి వరకు అద్దె ఇల్లే బెస్ట్ అని బిలియనీర్ & జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను సొంత ఇల్లు కొనుగోలు చేశాను అంటూ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామత్ వెల్లడించారు.డబ్ల్యుటీఎఫ్ ఈజ్ విత్ నిఖిల్ కామత్.. లేటెస్ట్ ఎపిసోడ్‌లో కామత్, ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ ఇర్ఫాన్ రజాక్, బ్రిగేడ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరూపా శంకర్, వీవర్క్ ఇండియా సీఈఓ కరణ్ విర్వానీ అద్దె ఇల్లు vs కొనుగోలు చేసిన ఇల్లు అంశం మీద చర్చ మొదలు పెట్టారు.అద్దె ఇల్లు అన్ని విధాలుగా బాగానే ఉన్నపటికీ.. ఒక సమస్య ఉంది. అద్దె ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామనేది ఖచ్చితంగా తెలియదు. ఎక్కువకాలం అద్దె ఇంట్లోనే ఉండాలనుకుంటే కుదరదు. నేను అద్దె ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ కారణంగానే ఇల్లు కొనుగోలు చేశానని నిఖిల్ కామత్ వెల్లడించారు.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనేను ఒకే ఇంట్లో చాలా కాలం ఉండటానికి ఇష్టపడతాను. అయితే రియల్ ఎస్టేట్ అనేది ఇల్లిక్విడ్ అని, అది తనకు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. బంగారం మీద నాకు ఆసక్తి ఉంది. కానీ రియల్ ఎస్టేట్ విషయంలో అమ్మకాలు, కొనుగోలు కొంత కష్టమని అన్నారు. అంతే కాకుండా స్టాంప్ డ్యూటీ చెల్లించడం మీద కూడా నిఖిల్ కామత్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలను కొనుగోలు చేయడం, అద్దెకు ఇవ్వడంలో ఎవరూ ఎక్కువ డబ్బు సంపాదించలేరని ఆయన అన్నారు. దీనికంటే స్టాక్ మార్కెట్ చాలా ఉత్తమమని పేర్కొన్నారు.

Molested On Woman At Gopavaram YSR District6
దారుణం: యువతిపై అత్యాచారం.. ఆపై పెట్రోల్ పోసి

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌ జిల్లా గోపవరం అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా తనకు మాయ మాటలు చెప్పి తన ఇంటి సమీపంలో ఉన్న విగ్నేష్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మూడు నెలల క్రితమే విఘ్నేష్‌కు వివాహం జరిగిందని, అతని భార్య గర్భిణీగా పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడు విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Group 1 Issue: Bandi Sanjay Takes On Telangana Govt7
‘తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర’

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. అందుకు జీవో నంబర్‌ 29 ఓ సంకేతమన్నారు బండి సంజయ్‌. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ..‘ తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోంది. సోనియా జన్మదినం... నిరుద్యోగుల బలిదినం కాబోతోంది.ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాల్సిందే. నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా?, నిరుద్యోగ ర్యాలీలో విధ్వంసం చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర, కేటీఆర్ ఓ యూజ్ లెస్ ఫెలో. నేను పేపర్ లీకేజీ చేసినట్లు ప్యామిలీతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా?. డ్రగ్స్ తీసుకుని చీకటి దందాలు సాగించిన బతుకు నీది. నా జోలికొస్తే... నీ చీకటి బతుకులను బయటపెడతా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు బిడ్డా. కాంగ్రెస్‌తో కుమ్కక్కు రాజకీయాలు చేస్తోంది మీరు కాదా?, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, కాళేశ్వరం కేసులు రాకుండా చీకటి రాజకీయాలు చేస్తోంది మీరే. కాంగ్రెస్ తో పగలు ఫైటింగ్... రాత్రిళ్లు లవ్వింగ్ బతుకు మీది. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది. జేసీబీ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేచే పరిస్థితి లేదు. 2028లో తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. సికింద్రాబాద్ లో భజరంగ్ దళ్ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నా. ప్రశాంతంగా జరుగుతున్న ప్రదర్శనను అడ్డుకుని హింసను సృష్టించడం దారుణం.. పోలీసుల తీరు దుర్మార్గం’ అని ధ్వజమెత్తారు.చదవండి: TG గ్రూప్‌-1 రగడ: సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత

KSR Comments Over Nara Lokesh Red Book8
ఏపీలో రెడ్ బుక్‌ రాజ్యాంగం కొత్త పుంతలు

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల రెడ్ బుక్‌ రాజ్యాంగం కొత్తపుంతలు తొక్కుతోంది. అధికారంలోకి వచ్చింది మొదలు.. స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలపై కక్షసాధింపులతో మొదలైన ఈ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం.. క్రమేపీ పార్టీ అభిమానుల ఇళ్లు, ఆస్తుల విధ్వంసం, అక్రమ కేసుల బనాయింపులకు విస్తరించింది. ఆపై రాష్ట్రంలోని ఓ మోస్తరు అధికారి నుంచి ఐఏఎస్‌, ఐపీఎస్‌లనూ వేధించడం మొదలుపెట్టారు. ఓ మోసకారి నటితో ఫిర్యాదు చేయించి.. దాని ఆధారంగా ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్‌ చేయడం, ఇంకో పాతిక మంది సీనియర్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా సతాయించడం చేశారు.ఇప్పుడు.. తాజాగా ఈ రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని మీడియాకూ, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలకూ అమలు చేయాలని బాబు, లోకేష్‌లు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. సాక్షి మీడియాపై కేసులు పెట్టడం, ఎడిటర్ మురళిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, అలాగే టీడీపీ ఆఫీసుపై దాడి అంటూ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని వేధించడం వంటి చర్యలకు దిగారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారంటూ ఆరోపణలు గుప్పించడం, ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లతో ఢీకొట్టారన్న ఆరోపణలను కూడా వైఎస్సార్‌సీపీపై నెట్టి రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని ఉపయోగించాలని చూశారు. కానీ, ఆ ప్రయత్నాలు కాస్తా బెడిసికొట్టాయి. ఇక లాభం లేదనుకున్నారేమో.. వరద ముంపులో అవినీతి కంపుపై వార్తలు ఇస్తారా అంటూ చంద్రబాబు ప్రభుత్వం కన్నెర్ర చేసింది.మీడియాను ప్రభావితం చేయడం, తనకు గిట్టకపోతే అణచివేసే యత్నం చేయడం చంద్రబాబుకు కొత్తకాదు. 1995లో తన మామ ఎన్టీఆర్‌ను కూలదోసి అధికారంలో వచ్చిందే మీడియా అండతో కదా. అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటికి పెద్దగా పోటీ లేకపోవడంతో వాళ్లు రాసిందే వేదం అన్నట్టుగా ఉండేది. ఆ తర్వాత రోజుల్లో ‘వార్త’ మీడియా వచ్చినా అంత ప్రభావం చూపలేదు. అయినా దాన్ని తమ వ్యతిరేకిగా భావించి చంద్రబాబు దూరంగా పెట్టారు. ఆ తర్వాత కాలంలో టీవీ ఛానెళ్లు మొదలయ్యాయి. వాటిని కూడా ఆయన చాలావరకు ప్రభావితం చేయగలిగారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టారీతిలో కథనాలు ఇచ్చేవి. సంపాదకీయాలు రాసేవి. వైఎస్ ఆ రెండు పత్రికలు అంటూ విమర్శలు చేస్తుండేవారు. అయినా పెద్దగా ఫలితం వుండడం లేదని భావించి సాక్షి మీడియాను తేవడానికి సహకరించారు.అప్పట్లో వ్యాపారరంగంలో ఉన్న ఆయన కుమారుడు వైఎస్‌ జగన్.. సాక్షి పత్రికను, ఆ తర్వాత సాక్షి ఛానెల్‌ను తీసుకొచ్చి ప్రజల్లో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యారు. వైఎస్‌ జగన్ భవిష్యత్తులో కీలక నాయకుడు అవుతారనే భావనతో చంద్రబాబు, తమ మీడియా వ్యాపారానికి గట్టి పోటీదారుడు అవుతారన్న భయంతో రామోజీరావు వంటి వారు కాంగ్రెస్‌తో కుమ్మకై అక్రమ కేసులు పెట్టించి వైఎస్‌ జగన్‌ను జైలుకు కూడా పంపారు. అయినా ఆయన పట్టు వీడకుండా ఇటు సాక్షి మీడియాను, అటు రాజకీయాన్ని కొనసాగించి ప్రజల్లో తనదైన ముద్రను వేసుకున్నారు.ఈనాడు, ఆంధ్రజ్యోతివంటి ఎల్లో మీడియా వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా ఎన్ని దారుణమైన అసత్య కథనాలు రాసినా ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మలేదు. అలాగని అసలు ప్రభావం పడలేదని చెప్పలేం. అందువల్లే 2014లో ఆయన అధికారానికి కొద్దిలో దూరమయ్యారు. ఐనా ఆయన జనంలో తిరగడం మానలేదు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను 23 మందిని టీడీపీ కొనుగోలు చేసినా వెనక్కి తగ్గకుండా పాదయాత్ర చేశారు. ప్రజల్లో విశ్వసనీయత తెచ్చుకున్నారు. ఆ టైమ్‌లో సైతం ఎల్లో మీడియా జగన్‌పై ఏదో రకంగా విరుచుకుపడుతుండేది. జనం వాటిని నమ్మలేదు. 2019లో జగన్ అధికారంలోకి రాగలిగారు.రాజకీయ పార్టీగా తెలుగుదేశానికి అది సహజంగానే నచ్చదు. ఎల్లో మీడియాకు గిట్టలేదు. దాంతో మళ్లీ చంద్రబాబు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు కుమ్మకై ఉన్నవి లేనివి కలిపి సృష్టించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. వారికి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోడయ్యారు. వారు ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా వైఎస్‌ జగన్ వారిపై కేసులు పెట్టలేదు. ఒక వేళ కేసులు పెట్టాల్సి వచ్చినా అబద్దపు వార్తలపై ఖండన ఇచ్చి, ప్రచురించకపోతే లేదా ప్రసారం చేయకపోతేనే చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్‌ టైట్లింగ్ యాక్ట్ అమలు చేస్తే రైతుల భూములన్నీ జగన్ లాగేసుకుంటారంటూ ఘోరమైన అబద్ధాన్ని రాసి, అసత్య ప్రచారాన్ని ఎల్లో మీడియా పతాక స్థాయికి తీసుకెళ్లింది.జగన్ ఏ పని చేసినా ఏదో రకంగా వంకలు పెట్టడం, జనంలో అపోహలు సృష్టించడం వంటివి భారీ ఎత్తున చేసేవారు. వాటికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవడానికి యత్నిస్తే చంద్రబాబు నానా యాగీ చేసేవారు. జగన్ పాలనలో పత్రికా స్వేచ్ఛ దెబ్బతినిపోయిందని గోల గోలగా ఆరోపించేవారు. ఆ తర్వాత ఎలాగైతేనేం ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అంతే తనకు నచ్చని మీడియాపై, అలాగే సోషల్ మీడియాపై తన అసలు స్వరూపం చూపించడం ప్రారంభించారు.సాక్షి టీవీతోపాటు ఎన్టీవీ, టీవీ 9 ఛానెల్‌ను ఏపీలో పలు చోట్ల రాకుండా కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. మంత్రి గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో ఇందుకోసం ఒక ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారట. ఇక సాక్షి పత్రికకు అయితే ఎలాగూ ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం లేదు. తమకు బాకాలు ఊదే మీడియాతోటి మాత్రమే సఖ్యతగా ఉంటూ మిగిలిన మీడియాను తొక్కేయాలని, తద్వారా తమకు ఎదురు లేకుండా చేసుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా సాక్షి ఎడిటర్‌పై కేసు పెట్టారు.విజయవాడ వరదల్లో బాధితులను ఆదుకునే క్రమంలో స్కామ్‌లు జరిగాయన్న కథనం ఇచ్చినందుకు, ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తి కేసు పెడితే దాన్ని విజయవాడ పోలీసులు నమోదు చేశారు. ఆ వార్తలో నిజం లేకపోతే ప్రభుత్వం ఖండన ఇవ్వొచ్చు. లేదా వివరణ చెప్పవచ్చు. వాటిని కవర్ చేయకపోతే అప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోవడం సహజంగా జరగాలి. కానీ, అవేమీ లేకుండా ఒక ప్రధాన పత్రిక ఎడిటర్‌పైనే కేసు పెట్టడమంటే పత్రికాస్వామ్యాన్ని హరించి వేయడమనేది వేరే చెప్పనవసరం లేదు. విశేషమేమిటంటే వరద సహాయంలో 5నుంచి 10శాతం అవకతవకలు జరిగి ఉండవచ్చని చంద్రబాబే చెప్పారు. మరి దానివల్ల ప్రభుత్వ ప్రతిష్ట పోలేదా?. ఆయనపై కూడా కేసు పెట్టాలి కదా.సీపీఎం నేత బాబూరావు మొదట ఈ స్కాంను బయట పెట్టారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు ఖర్చు పెట్టారని ప్రభుత్వ లెక్కల్లో రాసిన సంగతిని ఆయన బయట పెడితే ప్రజల్లో అది సంచలనం అయింది. సంబంధిత మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ లు కూడా దీనిపై గందరగోళంగా మాట్లాడారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక ప్రభుత్వ పరపతిని పునరుద్ధరించుకునేందుకుగాను సాక్షి ఎడిటర్ పై తప్పుడు కేసు పెట్టారని అర్థమవుతోంది. వచ్చే నాలుగేళ్లు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఎటూ తమది రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అన్నారు కాబట్టి టీడీపీ వారు దేశ రాజ్యాంగాన్ని వదిలి రెడ్ బుక్‌నే ఫాలో అవుతారు.ఇక వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విదేశాల నుంచి తిరిగి వస్తున్నప్పుడు లుక్‌ అవుట్ నోటీసులు ఇచ్చి ఏపీ ప్రభుత్వం తన డొల్లతనాన్ని ప్రదర్శించుకుంది. అంతటితో ఆగకుండా ఆయన్ను పోలీసు విచారణకు పిలిచారు. ఇంతకు కేసు ఏంటయ్యా అంటే టీడీపీ ఆఫీసుపై కొందరు దాడి చేయడం. దాడిని ఎవరూ సమర్థించరు. జగన్ ప్రభుత్వంలోనే దీనిపై కేసు పెట్టారు. అసలు ఈ దాడికి కారణం ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు జగన్‌ను నోటికొచ్చినట్టు దూషించడం. ఆ సంగతిని మాత్రం బయటకు చెప్పరు. ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి అలాగే సజ్జల వంటి వారిని ఇరికించి కక్ష తీర్చుకోవాలనేది వాళ్ల లక్ష్యంగా కనిపిస్తోంది. పైకి నీతులు చెబుతూ లోపల మాత్రం ఇలా పగ ప్రతీకారాలకు పాల్పడడం చంద్రబాబు నైజమే.ఇదేమీ కొత్త కాదు. 2014-19 మధ్య కూడా సాక్షి మీడియాతో పాటు మరికొన్ని మీడియా సంస్థలపై టీడీపీ ప్రభుత్వం దాడి చేసింది. కాపుల ఆందోళన వార్తలు కవర్ కాకుండా చూడాలని ప్రయత్నించింది. తమ చెప్పు చేతల్లో ఉండని జర్నలిస్టులను వేధించారు. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటివి కొత్త కాదు. వీటిని ఎదుర్కోవడం జర్నలిస్టులకు కొత్త కాదు. కాకపోతే మీడియాను అణచివేయడం ద్వారానే తాము అధికారంలోకి కొనసాగగలమని చంద్రబాబు వంటి సీనియర్ నేత ఇప్పటికీ భ్రమ పడుతుండడం ఓ చారిత్రక విషాదం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎదుర్కొన్న జర్నలిస్టులు చంద్రబాబును ఎదుర్కోలేరా?. - కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Indore College girls demands clean shaved men Rally Video goes Viral9
గడ్డం కావాలా? గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలా? రోడ్డెక్కిన కాలేజీ అమ్మాయిలు

ఎలాంటి భర్త కావాలి? లేదా ఎలాంటి భార్య కావాలి? అని పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెద్దలు అడగడం సాధారణం. అలాగే నాకు ఎర్రగా, బుర్రగా ఉన్న అమ్మాయి కావాలి అని అబ్బాయిలు, ఆరడుగులుంటాడా? ఆరెంకెల జీతం ఉందా? అని అమ్మాయిలు ఆశపడటం చాలా కామన్‌. కానీ ఇపుడు ట్రెండ్‌మారింది అంటున్నారు ఇండోర్‌ యువతులు. అంతేకాదు ఏకంగా ‘మాకొద్దీ గడ్డం బూచోళ్లు’,‘నో క్లీన్ షేవ్‌.. నో గ‌ర్ల్‌ఫ్రెండ్' అంటూ రోడ్డుమీద కొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడమే కాదు. ఫ్యాషన్‌గా గెడ్డం పెంచుకుంటున్న పెళ్లి కాని ప్రసాదుల గుండెల్లో బాంబు పేల్చింది.ఇండోర్‌లో కొంద‌రు కాలేజీ యువ‌తులు 'గ‌డ్డం తొలిగించండి.. ప్రేమ‌ను కాపాడండి' అనే నినాదంతో యువ‌తులు ర్యాలీ తీశారు. ముఖాల‌కు గ‌డ్డం మేక‌ప్‌ వేసుకొని మరీ అబ్బాయిల గ‌డ్డం విష‌య‌మై ర్యాలీ తీయడం హాట్‌ టాపిక్‌గా నిలిచింది., ‘గడ్డం రఖో యా జిఎఫ్ రఖో’(గడ్డం కావాలా? గర్ల్‌ఫ్రెండ్‌కావాలా), 'గడ్డం హటావో ప్యార్ బచావో' నినాదాలతో వీధుల్లోకి వచ్చారు. 'నో క్లీన్ షేవ్.. నో ల‌వ్‌', 'నో క్లీన్ షేవ్‌.. నో గ‌ర్ల్‌ఫ్రెండ్' అనే ప్లకార్డులతో తీసిన ర్యాలీ నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఈ వీడియోను ఓ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.వారి డిమాండ్ క‌రెక్టేగా కనీసం వారానికి ఒక‌సారైనా క్లీన్ షేవ్ కాకున్నా క‌నీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మ‌నం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్‌మెన్‌లా ఉంటాం అంటూ కామెంట్‌ చేయడం విశేషం. మరికొందరు దీని వెనుకున్న మతలబు ఏంటి భయ్యా అంటూ దీర్ఘాలోచనలో పడిపోయారు.ఇదీ చదవండి: నిద్రపోనివ్వని కల అంటే ఇదే! శభాష్‌ మల్లవ్వ! కాగా పురుషులు గడ్డాలతో అందంగా కనిపిస్తారా లేదా గడ్డం లేకపోతే అందంగా కనిపిస్తారా? అనేది పెద్ద చర్చే. గడ్డాలున్న పురుషులనే మహిళలు ఇష్టపడతారని అనేక అధ్యయనాలు చెబుతున్నప్పటికీ, క్లీన్ షేవ్‌ మెన్‌ మరింత ఆకర్షణీయంగా ఉంటారని మరికొందరి వాదన.Clean shave ke liye ladkiyon ne kiya kalesh🤯 pic.twitter.com/QkmIROdDyk— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2024

Historic first in 147 years! Team India shatters Test cricket record10
చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!

టెస్టు క్రికెట్‌లో టీమిండియా అరుదైన ఘ‌న‌త సాధించింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్ట్‌ ఫార్మాట్‌లో 100 సిక్స్‌లు బాదిన తొలి జట్టుగా భారత్‌ రికార్డుల‌కెక్కింది. బెంగ‌ళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ ఈ అరుదైన రికార్డును త‌మ పేరిట లిఖించుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి బాదిన సిక్స‌ర్‌తో టీమిండియా 100 సిక్స్‌ల మైలురాయిని అందుకుంది. తద్వారా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ జ‌ట్టుకు సాధ్యం కాని రికార్డును టీమిండియా త‌మ ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 17 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ సేన‌.. 105 సిక్స్‌లు న‌మోదు చేసింది. ఈ జాబితాలో భార‌త్‌ తర్వాత ఇంగ్లండ్‌ (2022) 89 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉండగా, 87 సిక్స్​లతో టీమిండియానే మూడో స్ధానంలో ఉంది. 2021 ఏడాదిలో భార‌త్ టెస్టుల్లో 87 సిక్స్‌లు బాదింది. ప్ర‌స్తుత మ్యాచ్‌లో భార‌త్ ఇప్ప‌టివ‌ర‌కు 8 సిక్స్‌లు కొట్టింది. పంత్‌, స‌ర్ఫ‌రాజ్ త‌లా 3 సిక్స్‌లు బాద‌గా.. రోహిత్‌, విరాట్ చెరో సిక్స్ కొట్టారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. నాలుగో రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ తమ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 13 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్‌ ఖాన్‌(125), పంత్‌(53) పరుగులతో ఉన్నారు.చదవండి: IND vs NZ: 'స‌ర్ఫ‌రాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గ‌జాన్ని గుర్తు చేస్తున్నాడు'

Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
జార్ఖండ్ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అధికార ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి.

title
వయనాడ్‌ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..

న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే

title
మహిళ కడుపులో కత్తెర, 12 ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే..

సిక్కింలో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. గతంలో కడుపు నొప్పితో అపెండిక్స్‌ ఆపరేషన్‌ చేయించుకుంటే.. నొప్పి తగ్గకపోగా..

title
Jharkhand: కుదిరిన పొత్తు.. 70 స్థానాల్లో కాంగ్రెస్‌, జేఎంఎం పోటీ

రాంచీ: త్వరలో జరగబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇండియా క

title
జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్రహోదా !

సాక్షి,న్యూఢిల్లీ: త్వరలో జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోద

International View all
title
ఇజ్రాయెల్‌ ప్రధాని ఇంటిపై డ్రోన్‌ దాడి.. తప్పిన ప్రమాదం

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణవాతావరణం నెలకొంది.

title
హమాస్ ఉనికి ఎప్పటికీ సజీవమే: ఇరాన్‌ సుప్రీం నేత

టెహ్రాన్‌: ఇజ్రాయెల్ దాడిలో హమాస్‌ నేత యాహ్యా సిన్వర్‌ మృతి

title
గరిష్టాలను చేరిన అమెరికా ఆర్థిక లోటు!

అమెరికా దేశ బడ్జెట్ లోటు గరిష్ఠాలను చేరుకుంది. సెప్టెంబర్‌ 30 నాటికి ఇది రూ.1,538 లక్షల కోట్లను చేరింది.

title
భారత దౌత్యవేత్తలపై నిఘా: కెనడా

ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి ఒట్టావాలోని భారత హైకమిషన్‌ర్‌ను కెనడా అనుమానితునిగా పేర్

title
హమాస్‌ సిన్వర్‌ పోస్టుమార్టం రిపోర్టు.. తలలో బుల్లెట్‌, చేతి వేలు కత్తిరించి..

జెరూసలేం: ఇజ్రాయెల్‌ సైన్యం చేతిలో హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వ

NRI View all
title
డల్లాస్‌లో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్ టోర్నీ

అమెరికాలో తెలుగు వారిని ఒక్కటి చేసే విధంగా నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

title
అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు

అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్‌ని డాలస్‌లో స్థాపించి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా మహాత్మాగాంధీ మెమ

title
కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్‌ అవగాహన సదస్సు

title
కెనడా, భారత్‌ గొడవ.. మనోళ్ల పరిస్థితి ఏంటి?

Indians in Canada: ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య నేపథ్యంలో భారత్‌, కెనడా దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్

title
లండన్‌లో ఘనంగా దసరా అలాయి బలాయి

హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డపై అలాయి బలాయి సాంస్కృతికి నాంది పలికారు.

Advertisement
Advertisement