tmc
-
మహిళలకు బీజేపీ మాజీ ఎంపీ వార్నింగ్.. మీ గొంతు నులిమేస్తా అంటూ..
కోల్కత్తా: బెంగాల్లో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. బీజేపీ మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ సహనం కోల్పోయి స్థానిక మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో, బెంగాల్ మహిళలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బెంగాల్‌కు చెందిన బీజేపీ మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ శుక్రవారం ఖరగ్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా ఖరగ్‌పూర్‌లోని వార్డు నంబర్-6లో జరిగిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్థానికులు హాజరయ్యారు. అయితే, రోడ్డు ప్రారంభోత్సం సందర్బంగా దిలీప్ ఘోష్‌ను అక్కడున్న మహిళలు అడ్డగించారు. మేం ఇప్పుడు గుర్తొచ్చామా?. మీరు ఎంపీగా ఉన్నప్పుడు మా ఏరియాకు ఎందుకు ఒక్కసారి కూడా రాలేదని నిలదీశారు. రోడ్డును మా కౌన్సిలర్ ప్రదీప్ సర్కార్ నిర్మిస్తే మీరు వచ్చి ప్రారంభిస్తారా? అని ప్రశ్నించారు.మహిళల ప్రశ్నలకు దిలీప్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. వారితో వాదిస్తూ..‘ఈ రోడ్డు నిర్మాణానికి నేనే డబ్బులు ఇచ్చాను. మీ తండ్రి డబ్బులతో రోడ్డు వేయలేదు. కావాలంటే వెళ్లి ప్రదీప్ సర్కార్‌ను అడగండి’ అంటూ మండిపడ్డారు. ఆయన సమాధానానికి సదరు మహిళలు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. మరోసారి మహిళలు కల్పించుకుని.. మా నాన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?. ఎంపీ మీరు కదా.. రోడ్డు వేయాల్సింది కూడా మీరే అని అని నిలదీశారు. ఈ క్రమంలో పూర్తిగా సంయమనం కోల్పోయిన దిలీప్ ఘోష్ బెదిరింపులకు దిగారు. వెంటనే..‘అలా అరవకండి. అలా అరిస్తే మీ గొంతు నులిమేస్తా’ అని మహిళకు వార్నింగ్ ఇచ్చారు.ছিঃ! একজন মহিলাকে বিজেপি নেতা দিলীপ ঘোষ কিভাবে হুমকি দিচ্ছে, শুনে নিন! বিজেপির থেকে এর বেশি আর কিই বা আশা করা যায়? ধিক্কার বিজেপিকে!#ShameOnBJP #DilipGhosh #bjpwestbangal pic.twitter.com/JdGL4guhJc— Banglar Gorbo Mamata (@BanglarGorboMB) March 21, 2025అనంతరం, మహిళలకు, దిలీప్ ఘోష్ మధ్య తీవ్ర వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో.. భద్రతా సిబ్బంది, బీజేపీ కార్యకర్తలు దిలీప్ ఘోష్‌ను వెంటనే కారు ఎక్కించగా.. మహిళలు వాహనాన్ని చుట్టుముట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల మధ్యే ఘోష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. తాను పార్లమెంటేరియన్‌గా ఉన్న సమయంలోనే ఎంపీ లాడ్ ఫండ్ నుంచి ఈ రోడ్డుకు డబ్బు ఇచ్చానని వివరణ ఇచ్చారు. అయితే, మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై టీంఎసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. দিলিপ ঘোষেরা বাংলার মা বোনেদের কনো দিন সম্মান করেনি আর করবেও না, দেখুন ভিডিও টা, #DilipGhosh #BJPLeader #WestBengal #Kharagpur #exmp #foryoupage #banglaviral #highlighteveryone pic.twitter.com/EWSvjXjvTf— Belal Hossen🇮🇳 (@BelalHossen786) March 22, 2025 -
‘ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు’.. దీదీతోనే నా ప్రయాణం
కోల్‌కతా: ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు తన ప్రయాణం తన మేనత్త, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనేనని ఆమె మేనల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు. సీఎం మమతతో విభేదాలున్నాయన్న ప్రచారాన్ని ఖండించారు. గొంతు కోసినా బీజేపీలో చేరని పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తాను బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. నా మెడలు విరిచినా సరే ఆ పని చేయను’ అని స్పష్టం చేశారు.కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో గురువారం టీఎంసీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ అభిషేక్ బెనర్జీ తన రాజకీయ భవిష్యత్తు గురించి జరుగుతున్న ప్రచారంపై మాట్లాడారు.VIDEO | TMC MP Abhishek Banerjee (@abhishekaitc) addresses party workers at Netaji Indoor Stadium, Kolkata. He says, "Till the time all of you are with us, we will continue to demolish BJP's 'chakravyuh'... Those who spoke ill about the party have been identified. I was the one… pic.twitter.com/4HeVzVAZVY— Press Trust of India (@PTI_News) February 27, 2025 కొంతమంది నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్లెవరో నాకు తెలుసంటూ.. టీఎంసీ మాజీ నేతలు ముకుల్ రాయ్,సువేందు అధికారి పేర్లను ప్రస్తావించారు. నేను మోసగాణ్ని కాదు. నా మెడలు విరిచినా, నా నాలుక చీల్చినా బీజేపీలో చేరను. మమతా బెనర్జీ జిందాబాద్ అంటూ.. తనకు తన మేనత్త సీఎం మమతా బెనర్జీకి మధ్య విబేధాలున్నాయన్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు నేను టీఎంసీలోనే కొనసాగుతా. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు స్వార్థ ప్రయోజనాల కోసం స్వార్థరాజకీయాలు చేస్తున్న ముకుల్ రాయ్, సువేందు అధికారి ద్రోహులుగా అభివర్ణించారు. అనంతరం,టీచర్ రిక్రూట్మెంట్ స్కాంలో తనని విచారణ చేపట్టేందుకు సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ గురించి ప్రస్తావించారు. ప్రతిపక్ష నేతలతో సీబీఐ ఎలా వ్యవహరించిందో నాతో అలాగే వ్యవహరిస్తోంది. పాపం సీబీఐ ఏం చేస్తోంది? చెప్పండి. దాని రాజకీయ గురువుల ఆదేశానుసారం వ్యవహరిస్తోంది.టీచర్ స్కాంలో తన గురించి ఒక్క ఆధారం బయటపెట్టలేదు. ఇదే విషయం గురించి సీబీఐని అడుగుతుంటే ఒక్క సమాధానం చెప్పడం లేదు. చెప్పడానికి సంకోచిస్తోంది. ఒక్కోసారి సీబీఐ తీరు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఐదేళ్ల క్రితం ఇదే విషయం చెప్పా. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. టీచర్ స్కాంలో నేను నేరస్తుడిని అని నిరూపిస్తూ సీబీఐ కోర్టుకు ఆధారాల్ని అందిస్తే నాకు నేనుగా ఉరివేసుకుంటాను’ అని వ్యాఖ్యానించారు. -
‘‘అలాగైతే ఇండియా కూటమిని రద్దు చేయండి’’
ఒకవైపు విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు నడుస్తుండగా.. భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం మాత్రమే కూటమి మనుగడ కొనసాగాలనుకుంటే.. వెంటనే దానిని రద్దు చేయాలని సూచించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్‌లు తలపడుతుండడమే అందుకు కారణం. ఎన్సీ అధినేత, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో నేను మాట్లాడదల్చుకోలేదు. ఎందుకంటే ఆ ఎన్నికలతో మాకు సంబంధం లేదు కాబట్టి. కానీ, మా ఇండియా కూటమికి ఓ కాలపరిమితి అంటూ లేకుండా పోయింది.దురదృష్టవశాత్తూ.. ఇండియా కూటమి సమావేశాలు జరిగినా నాయకత్వం, ఎజెండా, దాని మనుగడ గురించి స్పష్టత లేకుండా పోయింది. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే కూటమి అనుకుంటే గనుక దానిని రద్దు చేస్తేనే మంచిది అని అభిప్రాయపడ్డారాయన.#WATCH | Jammu: J&K CM Omar Abdullah says, "... I cannot say anything about what's going on in Delhi because we have nothing to do with Delhi Elections... As far as I remember, there was no time limit to the INDIA alliance. Unfortunately, no INDIA alliance meeting is being… pic.twitter.com/u9w9FazeJG— ANI (@ANI) January 9, 2025ఇదిలా ఉంటే.. కిందటి ఏడాదిలో జరిగిన జమ్ము కశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, ఎన్సీ కలిసే పోటీ చేసి విజయం సాధించాయి. అయితే.. మొన్నీమధ్య ఈవీఎంల వ్యవహారంలో ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీతో విబేధించారు. ఈవీఎంలను నిందించడం ఆపేసి గెలుపోటములను అంగీకరించాలని సలహా కూడా ఇచ్చారు. అయితే సీఎం అయ్యాక ఆయన ధోరణి మారిందంటూ కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఈ మధ్యలో..బీజేపీపైనా ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు గుప్పించడంతో ఆయన విపక్ష కూటమికి దూరం అవుతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ వెంటనే ఆయన అమిత్ షాను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. అయితే.. జమ్మూకశ్మీర్‌కు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రహోదా పునరుద్దరణ కోసమే కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసినట్లు స్పష్టత ఇచ్చారు.తేజస్వి కామెంట్లతో.. ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమి రద్దు వ్యాఖ్యలు ఊరికనే చేయలేదు. ఇండియా కూటమిలో గత కొంతకాలంగా నాయకత్వం విషయంలో బేధాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియా కూటమిని కాంగ్రెస్ ముందుండి నడిపించాలని భావిస్తుండగా.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎస్పీ, ఆర్జేడీ లాంటి కొన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మొన్నటి పార్లమెంట్ సమావేశాల సమయంలోనూ కాంగ్రెస్ వెంట ‘బీజేపీ వ్యతిరేక నిరసనల్లో’’ ఈ రెండు పార్టీలు కలిసి రాలేదు. దీంతో ఇండియా కూటమి మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయనన్న చర్చ నడిచింది. ఈ తరుణంలో.. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ ఫైట్ ఈ గ్యాప్‌ను మరింతగా పెంచాయి. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, దానిని ఇండియా కూటమి నుంచి దూరం పెట్టాలని ఆప్ డిమాండ్ సైతం చేసింది. ఈ పోటీని ఉద్దేశించి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన కామెంట్లపైనే ఆయన అలా స్పందించాల్సి వచ్చింది. ఇంతకీ తేజస్వి ఏమన్నారంటే.. ‘‘2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ఇండియా కూటమి లక్ష్యం. కాబట్టి కూటమి ఆ లక్ష్యం వరకే కట్టుబడి ఉంటుంది. అలాంటప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఆప్‌లు తలబడడం అసాధారణమైనదేం కాదు’’ అని తేజస్వి యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ పరిణామంపై బీజేపీ సైతం స్పందించింది. ‘‘దేశీయంగా, అంతర్జాతీయంగా కుంభకోణాలు చేసినవాళ్లు, కేసులు ఉన్నవాళ్లు.. నిజాయితీపరుడైన మోదీకి వ్యతిరేకంగా ఒక్కతాటి మీదకు వచ్చాయి’’ అని ఎద్దేవా చేసింది. -
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు ‘దీదీ’ మద్దతు
న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతు ప్రకటించింది. తమకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు ప్రకటించినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘థాంక్యూ దీదీ’ అంటూ బుధవారం(జనవరి 8) ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.‘ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌నకు టీఎంసీ మద్దతు ప్రకటించింది. ఇందుకు మమతా దీదీకి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. థాంక్యూ దీదీ. మీరు మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు’అని కేజ్రీవాల్ ట్వీట్లో పేర్కొన్నారు. తృణమూల్ ప్రకటనతో ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌నకు మద్దతుగా నిలిచిన ‘ఇండియా’ కూటమి పార్టీలో జాబితాలో తాజాగా ఆప్ చేరడం గమనార్హం. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించాయి.గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆప్ ఆ తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసింది. ఢిల్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు లేదని ప్రకటించింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. 8న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇదీ చదవండి: రమేష్ బిదూరిపై బీజేపీ చర్యలు -
సందేశ్‌ఖాలీ ఘటన .. విపక్షాలపై దుమ్మెత్తిపోసిన దీదీ
కోల్‌కతా : బీజేపీ,ఇతర ప్రతిపక్ష పార్టీలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (mamata banerjee) దుమ్మెత్తి పోశారు. సందేశ్‌ఖాలీపై తప్పుడు కథనాల్ని ప్రచారం చేసేందుకు పెద్దమొత్తంలో నిధుల్ని ఖర్చు చేశారని ఆరోపించారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్(trinamool congress)కు చెందిన నేతలు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా వారి భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో సోమవారం తొలిసారి మమతా బెనర్జీ సందేశ్‌ఖాలీలో పర్యటించారు.ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ..‘నిందితుల్ని ప్రోత్సహించవద్దు. నకిలీ వార్తలను వ్యాప్తి చేసేలా ఇక్కడ (సందేశ్‌ఖాలీ) పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశారని నాకు తెలుసు. కానీ దాని గురించి నేను పెద్దగా మాట్లడదలుచుకోలేదు. అబద్ధానికి అందం ఎక్కువ. నిజానికి సహనం తక్కువ. ఆ అందమైన అబద్ధాన్ని ఎక్కువ కాలం ఉండనివ్వదు. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది’ అని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో దీదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సందేశ్‌ఖాలీ (sandeshkhali) స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. అయినప్పటికీ తాజా పర్యటనలో ఆ ఆందోళనల్ని ప్రస్తావించలేదు. పరోక్షంగా వాటిని నేను ఎప్పుడో మరిచి పోయా. ఇక్కడి మహిళలు మోసగాళ్లను నమ్మకండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారేమో అలాంటి వారిపట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.సందేశ్‌ఖాలీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించా. ప్రచారంలో ఎన్నికల ఫలితాల తర్వాత సందేశ్ ఖాలీని పర్యటిస్తారా? అని స్థానికులు నన్ను ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పర్యటనకు వస్తానని మాట ఇచ్చా. మాట ప్రకారం మీ ముందుకు వచ్చా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో స్థానికులు ప్రయోజనం పొందుతున్నారా? లేదా? ఏదైనా సమస్యలు ఉంటే వాటిని ఇప్పుడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సందేశ్‌ఖాలీ ప్రాంత మహిళలు, పురుషులు ప్రపంచంలో నెంబర్‌వన్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నాను’అంటూ మమతా బెనర్జీ ఆకాంక్షించారు.సందేశ్‌ఖాలీ వివాదం ఏంటి?పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీ అనే ప్రాంతంలో టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు తమపై లైంగిక దాడులు చేసేందుకు, తమ భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడి మహిళలు ఈ ఏడాది ప్రారంభంలో ఆందోళన చేపట్టారు. మహిళల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ ఆందోళనల నేపథ్యంలో షాజహాన్‌ఖాన్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు కూడా జరిపింది. దాడులు జరుపుతున్న సమయంలో షాజహాన్‌ఖాన్ మనుషులు ఈడీ సిబ్బందిపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి షాజహాన్‌ఖాన్ పరారీలో ఉన్నాడు. కొద్ది రోజులకే షాజహాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు. -
రాజకీయ వారసులపై మమత ఆసక్తికర కామెంట్స్
కోల్‌కతా:తన రాజకీయ వారసులెవరన్న దానిపై పశ్చిమబెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడారు. ‘నా రాజకీయ వారసులెవరన్నదానిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అంటే నేనొక్కదాన్నే కాదు.మా పార్టీ నేతలు, కార్యకర్తలంతా క్రమశిక్షణ కలిగిన సైనికులు. మాకు ఎమ్మెల్యులు,ఎంపీలు,బూత్ వర్కర్లున్నారు. ఇంతమంది కలిస్తేనే పార్టీ అవుతుంది. నా రాజకీయ వారసులపై పార్టీలో ఉన్నవారంతా కలిసి నిర్ణయం తీసుకుంటారు. పార్టీలోకి ఈరోజు కొత్తగా వచ్చినవారు రేపు సీనియర్లవుతారు’అని మమత వ్యాఖ్యానించారు.తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీనియర్లు,జూనియర్ల మధ్య గ్రూపు తగాదాలు జరుగుతున్న వేళ మమత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, తృణమూల్ కాంగ్రెస్‌లో మమత తర్వాత ఆమె మేనల్లుడు అభిషేక్‌బెనర్జీ పార్టీ పగ్గాలు తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఢిల్లీలో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్ -
ఇండియా కూటమిలో లుకలుకలు!, ఈసారి..
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికలు మరోసారి బయటపడ్డాయి. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు దరంగా ఉండటమే కారణం. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగిన ఇండియా కూటమి భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టగా.. నేడు కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు టీఎంసీతోపాటుసమాజ్వాదీ పార్టీ కూడా గైర్హాజరవ్వడం గమనార్హం.మంగళవారం ఉదయం ఉభ సభలు ప్రారంభమయ్యాక.. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. అదానీ అంశం, సంభాల్ హింసపై తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, శివసేన (ఉద్దవ్), ఎన్సీపీ(శరద్చంద్ర) పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.అనంతరం అదానీ అంశంలో జేపీసీ వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలతో పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లకార్డులు చేతబట్టి భారీ ప్రదర్శన చేపట్టారు. అయితే ఆ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ మిత్రపక్షాలు సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మిస్సయ్యాయి. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొనడంచర్చనీయాంశంగా మారింది.చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలుఇక సోమవారం జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశాన్ని తృణమూల్ కాంగ్రెస్ దాటవేసింది. కాంగ్రెస్‌కు ఒకే ఎజెండా ఉందని, అది తమది కాదని సూచించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ అశాంతి వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని తాము భావిస్తున్నామని, అయితే కాంగ్రెస్ అదానీ అంశాన్ని మాత్రమే ఒత్తిడి చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్లో జరిగిన సమావేశానికి ఆ పార్టీ నేతలు దూరంగా ఉన్నారని వారు తెలిపారు.ఇదిలా ఉండగా అదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా, మణిపూర్ హింస సహా పలు అంశాలపై పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్నాయి. వీటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సమావేశాలు ప్రారంభ రోజు నుంచి ఉభయ సభలు కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడుతున్నాయి.దీనికి తెరదించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష బేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించినట్లు సమాచారం. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కార్ ఎట్టకేలకు అంగీకరించింది -
ఉప ఎన్నికల్లో అధికార పార్టీల హవా
న్యూఢిల్లీ: పదమూడు రాష్ట్రాల్లో 46 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే కైవసం చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్‌లో బీజేపీ, దాని మిత్రపక్షాలు తమ స్థానాలను మళ్లీ గెల్చుకున్నాయి. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. అత్యధికంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు 26 చోట్ల గెలిచాయి. ఇవి గతంలో పోలిస్తే అదనంగా తొమ్మిది స్థానాల్లో గెలవడం విశేషం. కాంగ్రెస్ ఏడు చోట్ల గెలిచింది. గతంలో గెలిచిన స్థానాల్లో ఆరింటిని చేజార్చుకుంది. పశ్చిమబెంగాల్లో ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. ఐదు స్థానాలను నిలబెట్టుకున్న టీఎంసీ ఈసారి మదారిహాట్ను బీజేపీ నుంచి లాగేసుకుంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో జూనియర్ వైద్యురాలి రేప్, హత్యోదంతం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైనాసరే ఆ అంశం రాష్ట్రంలో టీఎంసీ హవాను ఆపలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ మూడు చోట్ల, సమాజ్‌వాదీ పార్టీ రెండు చోట్ల గెలిచాయి. కేరళలో ఎల్డీఎఫ్ కూటమిలోని సీపీఐ(ఎం) పార్టీ, రాజస్థాన్‌లో భారత్ ఆదివాసీ పార్టీ(బీఏపీ) పార్టీ ఒక్కో స్థానంలో జయకేతనం ఎగరేశాయి. యూపీలో బీజేపీ హవా ఉత్తరప్రదేశ్‌లో 9 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా అధికార బీజేపీ ఆరు చోట్ల విజయం సాధించింది. రాష్ట్రంలోని కుందార్కీ, ఘజియాబాద్, ఖేర్, ఫూల్పూర్, ఖతేహరీ, మఝావాన్లో బీజేపీ గెలిచింది. కర్హాల్, సిషామావూలలో సమాజ్‌వాదీ పార్టీ, మీరాపూర్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్ విజయం సాధించాయి. కుందార్కీ స్థానంలో 12 మంది పోటీచేస్తే అందులో 11 మంది ముస్లిం అభ్యర్థులే. ఈ 11 మంది అభ్యర్థుల్ని వెనక్కి నెట్టి ఏకైక హిందూ అభ్యరి్థ, బీజేపీ నేత రామ్‌వీర్ సింగ్ ఏకంగా 1,44,791 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం విశేషం. 1993 నుంచి చూస్తే ఈ స్థానంలో బీజేపీ గెలవడం ఇదే తొలిసారి. ఖతేహరీలోనూ 1991 తర్వాత బీజేపీకి తొలిసారిగా విజయం దక్కింది. రెండూ క్రాంతికారీకే సిక్కింలోని రెండు స్థానాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకగ్రీవంగా గెల్చుకుంది. రాజస్థాన్‌లో అధికార బీజేపీ ఏడింటికిగాను ఐదు చోట్ల జయపతాకం ఎగరేసింది. అస్సాంలోని ఐదు స్థానాలనూ బీజేపీ, దాని మిత్రపక్షాలే గెల్చుకున్నాయి. బీజేపీ మూడు చోట్ల, అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ(యునైటెడ్) ఒక్క స్థానంలో గెలిచాయి. పంజాబ్‌లోని నాలుగు స్థానాల్లో మూడింటిని ఆమ్ ఆద్మీ పార్టీ తన వశంచేసుకుంది. బిహార్‌లోని నాలుగు స్థానాలకుగాను రెండు చోట్ల బీజేపీ, ఒక చోట హిందుస్తానీ ఆవామ్ మోర్చా, మరో చోట జనతాదళ్(యునైటెడ్) గెలిచాయి. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్‌కిశోర్‌కు చెందిన జన్‌సురాజ్ పార్టీ అభ్యర్థులు దాదాపు అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు. కర్ణాటకలోని మొత్తం మూడు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ అభ్యర్థి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ గిద్దెర్బహాలో ఓడారు, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ సతీమణి అమృత, గుర్దాస్పూర్ ఎంపీ సుఖ్జీందర్ రంధావా భార్య జతీందర్ కౌర్ సైతం ఓడారు. ఇది కూడా చదవండి: By Election Results: ఆసక్తికరంగా ఉప ఎన్నికల ఫలితాలు -
టీఎంసీ నేత దారుణ హత్య.. ఐదుగురు అరెస్ట్
బీర్భూమ్: పశ్చిమ బెంగాల్లో మరోదారుణం చోటుచేసుకుంది. బీర్భూమ్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి చెందిన నేత హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోల్పూర్ పట్టణ సమీపంలోని పరుల్‌దంగా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.టీఎంసీ నేత సమీర్ తాండర్ (40) తన ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. సమీర్ తాండర్ కంకలితల పంచాయతీ సభ్యునిగా ఉన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన బుర్ద్వాన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ, మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమీర్ తాండార్ కుమారుడు ప్రతీక్ తాండర్ మాట్లాడుతూ గ్రామస్తులు కొందరు తన తండ్రిపై దాడి చేశారని, వెంటనే తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించినా ప్రయోజనం లేకపోయిందన్నారు.గ్రామంలో తలెత్తిన గొడవల కారణంగానే తాండర్పై దాడి జరిగివుండవచ్చని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వికాస్ రాయ్ చౌదరి పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఈ దాడిలో ప్రమేయం ఉన్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: అమెరికా నుంచి లారెన్స్‌బిష్ణోయ్ తమ్ముడి బెదిరింపులు -
ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలపై దాడి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి జరిగింది. వీరిపై వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మింఖాకు చెందిన టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్పైన, సందేశ్‌ఖాలీకి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే సుకుమార్ మహతాపైన దాడి జరిగింది. పోలీసులు ఈ రెండు కేసులను నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.ఎమ్మెల్యే ఉషారాణి మండల్ కాళీపూజ మండపానికి వెళ్లి, పూజలు నిర్వహించి, తిరిగి వస్తుండగా ఆమెపై దాడి జరిగింది. హరోవా ప్రాంతంలో 150 మంది ఆమెను చుట్టుముట్టారు. తనను కారులోంచి బయటకు లాగి తుపాకీతో కాల్పులు జరిపారని టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అక్రమ కార్యకలాపాలకు పాల్పడి, పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేత తనపై దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు.ఇదేవిధంగా సందేశ్‌ఖాలీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుకుమార్ మహతాపై దాడి జరిగింది. నజత్‌లో జరిగిన కాళీ పూజకు వెళ్లి, తిరిగి వస్తుండగా ఎమ్మెల్యే సుకుమార్ మహతాపై దాడి జరిగింది. దాడి అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తాను కాళీ పూజ పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, కొందరు దుండగులు తన వాహనంపై దాడి చేశారన్నారు. అలాగే తనతో పాటు వస్తున్న పార్టీ కార్యకర్తలపైనా దాడి చేశారన్నారు. తీవ్రంగా గాయపడిన ఒక కార్యకర్తను ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. ప్రత్యర్థి వర్గం వారే ఈ దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే సుకుమార్ మహతా ఆరోపించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసుల్లో కొందరిని అరెస్టు చేయగా, మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇది కూడా చదవండి: అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం -
‘మానవత్వం లేదు’.. బెంగాల్, ఢిల్లీపై ప్రధాని మోదీ ధ్వజం
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయనందుకు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లను లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అనారోగ్యంతో ఉన్న ప్రజలను పట్టించుకోకపోవటం అమానుషమని మండిపడ్డారు. ప్రధాని మోదీ మంగళవారం వృద్ధుల కోసం ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య రక్షణ పొందుతారు. దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూర్చడమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు.‘‘ ఒకప్పుడు వైద్యం కోసం ఇళ్లు, భూములు, నగలు అమ్మేసేవారు. తీవ్రమైన వ్యాధికి చికిత్సకు అయ్యే ఖర్చు విని పేదలు వణికిపోయేవారు. డబ్బు లేకపోవడంతో వైద్యం చేయించుకోలేని నిస్సహాయతలో ఉండేవారు. ఈ నిస్సహాయతలో ఉన్న పేద ప్రజలను నేను చూడలేకపోయా. అందుకే ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ప్రవేశపెట్టాం. ఈ పథకం ద్వారా దేశంలోని 4 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందారు. .. కానీ ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని వృద్ధులకు సేవ చేయలేక పోతున్నందుకు క్షమాపణలు కోరుతున్నా. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను మీకు సహాయం చేయలేకపోతున్నా. ఎందుకంటే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వాలు ఈ పథకంలో చేరటం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా రాష్ట్రంలోని జబ్బుపడిన ప్రజలను అణచివేసే ధోరణి అమానుషం. నేను దేశ ప్రజలకు సేవ చేయగలను. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం.. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని వృద్ధులకు సేవ చేయకుండా నన్ను అక్కడి ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి’’ అని మోదీ అన్నారు.చదవండి: రాణి రాంపాల్‌పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ -
‘శ్రీశైలం’ పూడిక నష్టం 102.11 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణానది పరీవాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయంలో పూడిక పేరుకుపోవడంతో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గింది. లైవ్ స్టోరేజీ సామర్థ్యం 72.77 టీఎంసీలు.. డెడ్ స్టోరేజీ సామర్థ్యం 29.33 టీఎంసీలు తగ్గిందన్నది రాష్ట్ర జలవనరులశాఖ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సంయుక్తంగా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్ సర్వేలో వెల్లడైంది. బేసిన్లో పెద్దఎత్తున అడవులను నరికివేస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు వరదతోపాటు భూమి కోతకు గురవడం వల్ల మట్టి కలిసి ప్రవహిస్తూ జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. దేశంలో జలాశయాల్లో పేరుకుపోతున్న పూడికపై 1991, 2001, 2015, 2020లలో సీడబ్ల్యూసీ సర్వే చేసి.. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఏడాది దేశంలో 548 జలాశయాలలో నీటినిల్వ సామర్థ్యంపై సర్వే చేసింది. పెద్దఎత్తున పూడిక పేరుకుపోవడం వల్ల నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిన జలాశయాల్లో శ్రీశైలం మొదటిస్థానంలో నిలిచింది. 45 ఏళ్లలో కొండలా పూడిక కృష్ణానదిపై నంద్యాల జిల్లాలో శ్రీశైలం సమీపంలో 1960లో జలాశయ నిర్మాణాన్ని ప్రారంభించి, 1976 నాటికి పూర్తి చేశారు. జలాశయంలో నీటినిల్వను 1976 నుంచే ప్రారంభించారు. అప్పట్లో రాష్ట్ర జలవనరుల శాఖ నిర్వహించిన సర్వేలో జలాశయంలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు.. సాగు, తాగునీటి అవసరాలకు ఏటా 253.05 టీఎంసీలను వినియోగించుకోవచ్చునని తేల్చింది. జలాశయంలో పూడిక పేరుకుపోతుండటం వల్ల ఏటా నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 205.95 టీఎంసీలుగా తేలింది. అంటే.. 45 ఏళ్లలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గినట్టు స్పష్టమవుతోంది. జలాశయంలో పూడిక కొండలా పేరుకుపోవడం వల్లే ఆ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందన్నది స్పష్టమవుతోంది.ఆయకట్టుకు నీళ్లందించడం సవాలే..శ్రీశైలం జలాశయంపై తెలంగాణలో ఎస్ఎల్బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతలు, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుగంగ, ఎస్సార్బీసీ(శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి, హంద్రీ–నీవా ఆధారపడ్డాయి. పూడిక వల్ల శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం.. లైవ్ స్టోరేజీ సామర్థ్యం భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని నీటిపారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలా మారిన పూడికను తొలగించడం భారీ ఎత్తున వ్యయంతో కూడిన పని.. పూడిక తొలగింపు అసాధ్యమని తేల్చిచెబుతున్నారు. తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం మేరకు కొత్తగా రిజర్వాయర్ నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇదీ శ్రీశైలం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం👉తొలిసారి రిజర్వాయర్‌ను నింపింది: 1976👉 కనీస నీటిమట్టం: 854 అడుగులు👉 గరిష్ట నీటిమట్టం: 885 అడుగులు👉 క్యాచ్మెంట్ ఏరియా: 60,350 చదరపు కిలోమీటర్లు👉 గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు నీరు నిల్వ ఉండే ప్రాంతం: 615.18 చదరపు కిలోమీటర్లు -
కోల్‌కతా ఘటన.. సీబీఐ విచారణకు టీఎంసీ ఎమ్మెల్యే
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ సోమవారం సీబీఐ ఎందుట హాజరయ్యారు. పానిహతి ఎమ్మెల్యేఘోష్ ఈ ఉదయం 10.30 గంటలకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.అయితే ఆర్జి కర్ ఆసుపత్రి ఘటనపై విచారణకు ఆయన్ను పిలిపించామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. వైద్యురాలి మరణం తర్వాత అంత్రక్రియలను తొందరపాటుగా ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా వైద్యురాలిపై హత్యాచారం అనంతరం మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిర్మల్ ఘోష్ జోక్యం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు సమన్లు జారీ చేయగా.. నేడు విచారణకు హాజరయ్యారు.చదవండి: మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో రాదో కానీ..: నితిన్ గడ్కరీ -
మమతా బెనర్జీ ప్రభుత్వంలో కోట్లలో అవినీతి: బీజేపీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీకి సిర్కార్ రాసిన లేఖ ద్వారా.. అంతర్గతంగా టీఎంసీలో సీఎం మమత అవినీతి, నియంతృత్వ విధానాన్ని తెలియాజేస్తోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.సిర్కార్ లేఖ ద్వారా పశ్చిమ బెంగాల్లో అన్ని సంస్థల్లో కోట్లాది అవినీతి జరిగినట్లు తెలుస్తోందని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా సీఎం దీదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదేవిధంగా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై సీఎం మమత ప్రాధాన్యత ఏంటో తెలియజేస్తోందని అన్నారు. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగదని స్పష్టమవుతోందని తెలిపారు.‘‘జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు విషయంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం సీఎం మమత ప్రభుత్వంలో లేదు. అయినా ఇంకా టీఎంసీ నేతలు నిరసనకారులను వేధిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంకా మమతా బెనర్జీ సీఎంగా ఎందుకు కొనసాగుతున్నారు? ఆమె ఇంకా ఎందుకు సీఎం పదవికి రాజీనామా చేయటం లేదు? ఆమె రాజీనామా చేయకుండా కోల్‌కతా సీపీని, ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్‌ను ఎందుకు రక్షిస్తున్నారు?’ అని అన్నారు.#WATCH | On TMC Rajya Sabha MP Jawhar Sircar resigning as party MP, BJP leader Shehzad Poonawalla says, "If someone should give the resignation it should be West Bengal CM Mamata Banerjee...TMC government and Mamata Banerjee institutionalised corruption and in his letter, he… pic.twitter.com/tY1d4E59Nu— ANI (@ANI) September 8, 2024మరోవైపు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. -
‘ఆమె తల్లిదండ్రుల్ని అనవసరంగా లాగొద్దు’
కోల్‌కతా: ఆర్జీ కర్ హాస్పిటర్ జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ప్రతిపక్ష బీజేపీ నకిలీ ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) మండిపడింది. ఎంతో సున్నితమైన ఈ ఘటనపై బీజేపీ చెత్త రాజకీయం చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి శశీ పంజ వ్యాఖ్యానించారు. ‘ఈ కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు యత్నించారని, హడావుడిగా తమ కూతురు అంత్యక్రియలు పూర్తి చేయించారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని బాధితురాలి తల్లిండ్రులు ఆరోపించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. తాము అలా అనలేదని.. అసత్య ఆరోపణలని ఖండించినట్లు మరో వీడియో వైరల్‌గా మారింది. అందులో వారు తమ కూతురికి జరిగిన దారుణానికి న్యాయం కావాలని కోరారు. .. ఇప్పటికే బాధితురాలి తల్లిదండ్రుల హృదయం ముక్కలైంది. ఇక్కడ రాజకీయాలు చేయటం సరికాదు. రాజకీయాలతో బాధితురాలి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు. వాళ్లను అలా ఒంటరిగా వదిలేయండి’ అని అన్నారామె. అంతేకాదు ఉద్దేశపూర్వకంగా బీజేపీ, బీజేపీ ఐటీ సెల్ కేసును తప్పుదోవ పట్టించేందుకు నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తోందని మంత్రి ఆరోపించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు విషయంలో సైతం బీజేపీ అసత్య ఆరోపణలు చేసిందని అన్నారామె. ‘కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి కేసు బదిలీ అయి 23 రోజులు గడిచాయి. ఇంతవరకు సీబీఐ నుంచి ఎటువంటి పురోగతి నివేదిక వెల్లడికాలేదు. సీబీఐ ఈ కేసు పురోగతిపై నివేదికను అందించాలని కోరుతున్నా. కోల్‌కతా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసినప్పుడు.. రెగ్యులర్ అప్డేట్లు ప్రెస్‌మీట్ ద్వారా బయటపెట్టారు’ అని మరో మంత్రి బ్రత్యా బసు అన్నారు. -
నిందితులను శిక్షించేందుకు 10 రోజుల్లో చట్టం: సీఎం మమత
Updates బెంగాల్లో బీజీపీ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘‘వచ్చే వారం అసెంబ్లీ సమావేశాన్ని జరిపించి నిందితులకు ఉరిశిక్షను నిర్ధారించడానికి 10 రోజుల్లో బిల్లును ఆమోదిస్తాం. ఆ బిల్లును గవర్నర్‌కు పంపుతాము. ఆయన ఆమోదించకపోతే మేము రాజ్‌భవన్ ముందు కూర్చొని నిరసన తెలుపుతాం. ఈ బిల్లు తప్పక ఆమోదించబడుతుంది. గవర్నర్ ఈసారి తన జవాబుదారీతనం నుంచి తప్పించులేరు’అని మమత స్పష్టం చేశారు.Kolkata | West Bengal CM Mamata Banerjee says, "Next week, we will call an Assembly session and pass a Bill within 10 days to ensure capital punishment for rapists. We will send this Bill to the Governor. If he doesn't pass, we will sit outside Raj Bhavan. This Bill must be… pic.twitter.com/GQFPvTStZX— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్‌లో భాగంగా బీజేపీ కార్యకర్తలు అసన్సోల్ రైల్వే స్టేషన్ పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు.#WATCH | Asansol, West Bengal: BJP workers stage a protest demanding justice for woman doctor who was raped and murdered at RG Kar Medical College and Hospital pic.twitter.com/ZBKJzdOYuG— ANI (@ANI) August 28, 2024 బెంగాల్ బీజేపీ బంద్ నిరసనలో కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. ‘‘ఏడు రోజుల పాటుచేసే ధర్నాకు కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ధర్నా ప్రారంభిస్తాం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. పోలీసులు కాల్పులు ఆపలేరు. బీజేపీ నిరసనను అడ్డుకుంటారు. హత్యాచార ఘటన నిందితును అరెస్ట్ చేయరు. కానీ బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తారు’’ అని అన్నారు. #WATCH | Union Minister and West Bengal BJP President Sukanta Majumdar says, "Kolkata HC has given us the permission for seven-day Dharna. We will start it from tomorrow...We welcome their verdict...There is no democracy here, police cannot stop firing but only stop BJP's… https://t.co/5ASm6Tg990 pic.twitter.com/zfzKuGmIK1— ANI (@ANI) August 28, 2024 కోల్‌కతాలో 12 గంటల బీజేపీ బంద్‌లో బీజేపీ నేత కారుపై జరిగిన కాల్పుల్లో డ్రైవర్ మృతి చెందాడు.#WATCH | West Bengal: Arjun Singh, BJP leader says, "Priyangu Pandey is our party leader. Today his car was attacked...and firing was done...The driver has been shot...7 round firing was done...This was done in the presence of the ACP...Planning was done to kill Priyangu… https://t.co/WRreN8Hfiu pic.twitter.com/ZA7laPZDi3— ANI (@ANI) August 28, 2024 కోల్‌కతాలో 12 గంటల బీజేపీ బంద్ కొనసాగుతోంది. బంద్ సందర్భంగా పోలీసుల తీరు నిరసిస్తూ.. బీజేపీ చేపట్టిన ర్యాలీలో బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ పాల్గొన్నారు.#WATCH | Kolkata: Union Minister and West Bengal BJP President Sukanta Majumdar joins the protest. BJP has called for a 12-hour 'Bengal Bandh'. (Visuals from Baguiati Mor) pic.twitter.com/n4uXjilIQE— ANI (@ANI) August 28, 2024 బెంగాల్ ఉత్తర 24 పరగణాలులో భాట్పరా ప్రాంతంలో బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై కాల్పులు, దాడి ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.West Bengal | Two people got injured in the attack and firing incident on the BJP leader Priyangu Pandey's car, earlier today, in Bhatpara of North 24 Parganas pic.twitter.com/MO2x3vxabB— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్ హింసాత్మకంగా మారింది. తమ పార్టీ నేత ప్రియాంగు పాండే కారుపై కాల్పులు జరిగాయని బీజేపీ నేత అర్జున్ సింగ్ తెలిపారు. ‘ప్రియాంగు కారుపై ఏడు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఏసీపీ సమక్షంలోనే జరిగాయి. ప్రియాంగు పాండేని చంపేందుకు ప్లాన్ చేశారు. టీఎంసీ ఇలాంటి పనులు చేస్తోంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి’అని అన్నారు.#WATCH | West Bengal: Arjun Singh, BJP leader says, "Priyangu Pandey is our party leader. Today his car was attacked...and firing was done...The driver has been shot...7 round firing was done...This was done in the presence of the ACP...Planning was done to kill Priyangu… https://t.co/WRreN8Hfiu pic.twitter.com/ZA7laPZDi3— ANI (@ANI) August 28, 2024 "Bombs thrown, vehicle fired on": BJP's Priyangu Pandey claims TMC workers attacked him during Bengal BandhRead @ANI Story | https://t.co/GUPWv28WrO#BJP #TMC #BengalBandh #PriyanguPandey pic.twitter.com/TGlNUNugOg— ANI Digital (@ani_digital) August 28, 2024 పశ్చిమ బెంగాల్లో బీజేపీ పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా నందిగ్రామ్‌లో పార్టీ కార్యకర్తలతో సువేందు అధికారి నిరసనలో పాల్గొన్నారు. #WATCH | Nandigram | West Bengal LoP Suvendu Adhikari joins BJP's protest, call for 12-hour 'Bengal Bandh'.12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna… pic.twitter.com/iLDff6ra2H— ANI (@ANI) August 28, 2024 కోల్‌కతా బాటా చౌక్‌లో బంద్ చేపట్టిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. బంద్‌లో పాల్గొన్న బీజేపీ నేత లాకెట్ ఛటర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు.#WATCH | West Bengal | Police detains protesting BJP party workers at Kolkata's Bata Chowk12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/vt7MaQjZCv— ANI (@ANI) August 28, 2024 #WATCH | West Bengal | Police detains BJP leader Locket Chatterjee who joined protest after BJP's call for 12-hour 'Bharat Bandh' at Kolkata's Bata Chowk pic.twitter.com/Zd8eAiH0mF— ANI (@ANI) August 28, 2024 బంద్ కొనసాగుతోందని పోలీసులు ఏమీ చేయలేకపోయారని బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కీర్తానియా అన్నారు. ‘టీఎంసీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు.వారిని సీఎం మమత ఇక్కడి పంపారు. కానీ, మేం ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లము. మేము చేపట్టిన బెంగాల్ బంద్‌ను కొనసాగిస్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం’ అని ఆయన అన్నారు.#WATCH | West Bengal: BJP MLA Ashok Kirtania says, "Bandh is going on...Police were not able to do anything, therefore, the workers of TMC are here, Mamata sent them...We will not move from here, we will continue the fight..." pic.twitter.com/z4YubShK3h— ANI (@ANI) August 28, 2024సిలిగురిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల 'బెంగాల్ బంద్’ కొనసాగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు మోహరించారు.#WATCH | Siliguri, West Bengal: 12-hour 'Bengal Bandh' called by the BJP to protest against the state government; security deployed in the area The bandh has been called after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/K8oIGYs5tx— ANI (@ANI) August 28, 2024 బీజేపీ చేపట్టిన బంద్‌ను వ్యతిరేకిస్తూ అధికార టీఎంసీ కార్యకర్తలు ఉత్తర పరగణాల రైల్వే స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. రైలు పట్టాల మీద పెద్దఎత్తున నిరసన తెలపటంతో బంగాన్-సీల్దా మధ్య రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. తర్వాత మళ్లీ రైలు సేవలను అధికారులు పునరుద్దరించారు.#WATCH | North 24 Parganas | TMC Party workers protest against BJP's 12-hour 'Bengal Bandh' call for today.Train services were disrupted between Bangaon-Sealdah which is now being reinstated pic.twitter.com/ISyiQqBlv6— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్ నేపథ్యంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్లు హెల్మెట్స్ ధరించారు. ‘‘ఈ రోజు బంద్ ఉంది. కావున తాను హెల్మెట్ ధరించాను’’ అని బస్ డ్రైవర్ తెలిపారు.#WATCH | BJP's 12-hour 'Bengal Bandh': Drivers of Government bus in Howrah seen wearing helmetsA bus driver says, "Today is bandh, so we are wearing helmets..." pic.twitter.com/b5GHHD4Ocq— ANI (@ANI) August 28, 2024 కోల్‌కతాలో బీజేపీ బంద్‌ను పోలీసులు అడ్డుకుంటున్నారు. అలీపుర్దువార్ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది#WATCH | West Bengal | Police detains protesting BJP workers at Alipurduar.12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/tJuKKgMGum— ANI (@ANI) August 28, 2024పోలీసు తీరుపై బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల బంద్ బెంగాల్లో కొనసాగుతోంది.పోలీసులు అణచివేయాలనే వైఖరితో తిరుగుతున్నారని బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్ మాట్లాడారు. కార్యకర్తలతో కలిసి రోడ్డు మీద వచ్చిన ఆమె బీజేపీ బంద్‌కు సహరించాలని కోరుతున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు రద్దు చేశారు.ఆందోళనకారులపై రసాయనాలు కలిపిన వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పోలీసులు రాష్ట్రంలోని మహిళలకు భద్రత కల్పించలేకపోతున్నారు’ అని అన్నారు. బంద్‌ను విజయవంతంగా కొనసాగిస్తామని అన్నారు.#WATCH | Kolkata, West Bengal: BJP leader Agnimitra Paul says, "They are going around with a disgusting attitude. They have all become spineless. Police have invalidated the orders of the Supreme Court... They used water canons mixed with chemicals on the protestors... They are… https://t.co/MP0SU69Wwc pic.twitter.com/Dkhj7g5e2Y— ANI (@ANI) August 28, 2024 పశ్చిమ బెంగాల్‌ల్లో ఇవాళ(బుధవారం) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ పిలుపుచ్చిన బంద్ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. సుమారు 5 వేల మంది పోలీసులను పలు కీలకమైన చోట్ల మోహరించారు. 15 మంది సీడీపీ ర్యాంక్ పోలీసు అధికారులను పలు కీలకమైన ప్రాంతాల్లో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.#WATCH | Kolkata: BJP leader Agnimitra Paul reviews the 12-hour 'Bengal Bandh' called by BJP to protest against the state government. pic.twitter.com/AAvoFWrjuj— ANI (@ANI) August 28, 2024ఈ బంద్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఏసీపీ ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్‌ను పర్యవేక్షిస్తారని పోలీసులు పేర్కొన్నారు. బంద్‌ను పరిశీలించడానికి పలు ప్రాంతాలో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.बंगाल कल बंद है#KolkataDoctorDeathCase #bengal_band_haipic.twitter.com/IIUK0rMY0Q— Rastra Janmat (@Rastrajanmat360) August 27, 2024 కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జానియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారింది. నగరవ్యాప్తంగానే గాక సమీపంలోని హౌరాలో కూడా విద్యార్థులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడి, లాఠీచార్జి ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. ఇక.. శాంతియుత ర్యాలీపై ఇదెక్కడి అమానుషత్వమంటూ పోలీసులు, సీఎం మమతా ప్రభుత్వంపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. బంధవారం 12 గంటల పాటు బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీన్ని అధికార తృణ మూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. బంద్ జరగనిచ్చే ప్రసక్తే లేదని మమత ముఖ్య సలహాదారు ఆలాపన్ బంధోపాధ్యాయ్ అనటం గమనార్హం. -
ఆర్జీ కార్ కేసు : సీఎం మమత బెనర్జీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
కోల్‌కతా: ఆర్జీకార్ ఆస్పత్రి ఉదంతం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చుట్టు ఉచ్చు బిగుస్తుంది. వైద్యురాలిపై జరిగిన దారుణానికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రజలు, వైద్యులు, న్యాయవాదులు చేస్తున్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రతిపక్షాలు సైతం దీదీ రాజీనామాకు పట్టుబడుతున్నాయి. ఆ డిమాండ్‌పై టీఎంసీ నేతలు బీజేపీది పితృస్వామ్య పాలన అంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీదీకి మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దారుణాలు జరిగినప్పుడు ఇలాంటి డిమాండ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ‘ బీజేపీ నేతలు ముఖ్య మంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో చాలా దారుణాలే జరిగాయి. కానీ పశ్చిమబెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీనే ఎందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు’ అని పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య ప్రశ్నించారు. బీజేపీదీ పితృస్వామ్య పాలన ఇలాగే ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ-ఏబీవీపీ పన్నాగం పన్నాయి. పోలీసు యూనిఫాంలో ఉన్న అనుమానితులు కాల్పులు జరిపేందుకు కుట్రపన్నారు. పరీక్షల సమయంలో ఇలాంటి ఆందోళనలు చేయమంటే చేస్తారా? అని భట్టాచార్య ప్రశ్నించారు. రాబందు రాజకీయాలతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతుంది’ అని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టీఎంసీ నేతల వ్యాఖ్యల్ని బీజేపీ స్పందించింది. ర్యాలీలో ఎటువంటి ప్రమేయం లేదని ఖండించింది. తమ పార్టీ సభ్యులు ఏదైనా నిరసనలకు హాజరైతే, అది వారి వ్యక్తిగతంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. -
దీదీ.. రాజీనామా చేయండి: నిర్భయ తల్లి డిమాండ్
ఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. ఈ సందర్బంగా హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారామె.ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. ఈ దారుణ ఘటనపై 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయ తల్లి ఆశాదేవి స్పందిస్తూ.. అఘాయిత్యాలను నిలువరించడంలో సీఎం మమతా బెనర్జీ విఫలమైనట్లు విమర్శించారు. నిందితులను శిక్షించడానికి బదులుగా.. నిరసన ప్రదర్శనలతో డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రజలను ఆమె తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆమె కూడా మహిళే అని, రాష్ట్ర సీఎంగా ఉన్న ఆమె నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.ఇదే సమయంలో అత్యాచారాలకు పాల్పడుతున్న వారి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన శిక్షను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు. కోల్‌కతా మెడికల్ కాలేజీలో అమ్మాయిలకు రక్షణ లేకుంటే, అప్పుడు దేశంలోని మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు.మరోవైపు.. ఆగస్టు 9వ తేదీన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ రేప్, హత్యకు గురైంది. ఈ ఘటనకు నిరసనగా వైద్యులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. వైద్యసేవలను నిలిపివేశారు. ఇక, కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. -
అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు.. కానీ!: బెంగాల్ మంత్రి
కోల్‌కతా: అటవీశాఖ మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి ఎట్టకేలకు దిగివచ్చరు. జైళ్లశాఖ మంత్రి పదవికి ఆయన సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం మమతా బెనర్జీకి పంపించారు. అయితే తాను సీఎం మమతా బెనర్జీకి తప్ప మరో అధికారికి(అటవీ అధికారిణికి) క్షమాపణలు చెప్పేది లేదని తేల్చి చెప్పారు.‘నేను ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రధాన కార్యదర్శి ద్వారా నా రాజీనామాను సమర్పించాను. కానీ నేను ఏ అధికారికి క్షమాపణ చెప్పను. కేవలం నేను ముఖ్యమంత్రికి క్షమాపణలు చెబుతాను. ఆ రోజు ప్రజల కష్టాలు చూసి, అటవీ శాఖ వాళ్ళు ఎలా హింసిస్తున్నారో చూసి చలించిపోయాను. నేను ఒక అనుచిత పదాన్ని ఉపయోగించినందుకు క్షమించండి. కానీ నేను చెప్పిన దాని కోసం క్షమాపణలు చెప్పలేను. నేను ఏం చేసినా ప్రజల కోసమే’ అని గిరి అన్నారు. అయితే పుర్బా మేదినీపూర్ జిల్లాలోని తాజ్పూర్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో దుకాణాలు ప్రారంభించేందుకు చిన్నతరహా వ్యాపారుల నుంచి అటవీ శాఖ అధికారులు లంచం డిమాండ్ చేశారని మంత్రి ఆరోపించారు.కాగా రామ్‌నగర్ నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా గెలుపొందిన అఖిల్ గిరి మమతా మంత్రివర్గంలో జైళ్లశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన 1998లో టీఎంసీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తాను సహనం కోల్పోవడానికి దారీతిసన పరిణామాలను సీఎంకు వివరంగాచెబుతానని అన్నారు. అయితే బీజేపీలో చేరుతున్నారా అని గిరి మీడియా అడగ్గా.. 2026 వరకు తన పదవీకాల ఉందని, అప్పటి వరకు పార్టీ కోసం ఎమ్మెల్యేగా పనిచేస్తానని తెలిపారుఇదిలా ఉండగా మంత్రి అఖిల్ గిరి అదివారం అటవీ శాఖ మహిళా అధికారి మనీషా సాహుపై బెదిరింపులకు పాల్పడ్డారు. తేజ్‌పుర్ బీచ్ సమీపంలోని అటవీ శాఖ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఫారెస్ట్ రేంజర్ మనీషా సాహు తొలగించారు. దీంతో మంత్రి గిరి స్థానికుల సమక్షంలో మహిళా అధికారిపై మాటల దూషణలకు దిగారు. మనీషా సాహు పదవీకాలన్ని తగ్గించాలని హెచ్చరించారు. అధికారిని బెదిరించిన వీడియో వైరల్‌గా మారడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి ఈ వ్యవహారం సీఎం మమతా వరకు చేరింది. దీంతో ఆమె మహిళా అధికారికి క్షమాపణలు చెప్పాడలని, అంతేగాక మంత్రివర్గం నుంచి వైదొలగాలని ఆదేశించారు. -
కూటమిలో కీలకమైనా.. దీదీపై కాంగ్రెస్ నేత విమర్శలు
కోల్‌కతా: నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్‌ను ఆఫ్ చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అబద్దమని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘‘నీతి ఆయోగ్ సమావేశం గురించి సీఎం మమత చెసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటారని మమత చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సీఎంలను మాట్లాన్వికుండా చేస్తారని నేను నమ్మటం లేదు. మమత బెనర్జీకి అక్కడ ఏం జరుగుతుందో ముందే తెలుసు. ఆమె పక్కా స్క్రిప్ట్ ప్రకారమే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లారు’’ అని అన్నారు. మరోవైపు.. సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించి.. నీతి ఆయోగ్ సమావేశంలో ఆమె పట్ల ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుపట్టింది. అయితే కాంగ్రెస్ స్పందనకు భిన్నంగా అధీర్ రంజన్ చౌదరీ విమర్శలు చేయటం గమనార్హం.దీనికంటే ముందు పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రలు క్షీణిస్తూ.. అరాచక పరిస్థితులు కొనసాగుతున్నాయని అధీర్ రంజన్ చౌదరీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతల పునరుద్ధరించడానికి జోక్యం చేసుకోసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, శనివారం ప్రధానిమోదీ అధ్యక్షత జరిగిన నీతి ఆయోగ్ సమాశానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. అనంతరం తానను మాట్లాడనివ్వకుండా మైక్ ఆఫ్ చేశారని ఆమె ఆరోపలు చేశారు. తర్వాత ఆమె నీతి ఆయోగ్ భేటీ నుంచి వాకౌట్ చేశారు. మరోపైపు.. లోక్‌సభ ఎన్నికల్లో అధీర్ రంజన్ చౌదరీ టీఎంసీ అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. సీఎం మమత ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ అధీర్ రంజన్ ఆమెపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. -
టీఎంసీ కార్యకర్తపై కౌన్సిలర్ దాడి.. వీడియో వైరల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ సొంత పార్టీ కార్యకర్తపైనే దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ 18వ వార్డు టీఎంసీ కౌన్సిలర్ సునందా సర్కార్ అదే వార్డుకు చెందిన పార్టీ కార్యకర్త(18వార్డ్ టీఎంసీ యూత్ ప్రెసిడెంట్)పై దాడి చేశారు. పలు అవినీతి కేసుల్లో సునందాకు ప్రమేయం ఉందని సదరు కార్యకర్త కొంత కాలం నుంచి ఆమెపై ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం అతను కనిపించగానే కోపం పట్టలేక కౌన్సిల్ సునందా కార్యకర్తపై దాడి చేశారు.This is one of the “finest” examples of the “Joy Bangla” model currently being implemented across West Bengal by TMC “luminaries”. Ms Sunanda Sarkar, TMC Councillor of Ward 18 is seen here administering a dose of “Joy Bangla” to TMC youth wing president of Ward 18 Mr Kedar… pic.twitter.com/R8rpZ5YIru— Dr. Anirban Ganguly (অনির্বাণ গঙ্গোপাধ্যায়) (@anirbanganguly) July 16, 2024 కార్యకర్తపై కౌన్సిల్ దాడి చేయటంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందించారు. ‘ఇది చాలా దురదృష్టకరమైన ఘటన, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు చాలా జగ్రత్తగా ఉండాలి. ఇది చాలా హాస్యాస్పదమైనది’ అని అన్నారు. అయితే టీఎంసీ కౌన్సిల్ సొంతపార్టీ కార్యకర్తపై చేసిన దాడి ప్రతిపక్ష బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ ఘటన బెంగాల్ టీఎంసీ పార్టీ అంతర్గత గందరగోళం, నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణలను నిదర్శనమని పేర్కొంది. సీపీఐ(ఎం) రాష్ట్ర సెక్రటరీ మహ్మద్ సాలిమ్ ఖండించారు. ఈ ఘటనను చూస్తే.. ‘వీధి న్యాయం’లా కనిపిస్తోందన్నారు. -
చంపేస్తామని బెదిరిస్తున్నారు: టీఎంసీ ఎంపీ
తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ సౌగతా రాయ్ బుధవారం తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పేర్కొన్నారు. అరెస్టయిన పార్టీ నాయకుడు జయంత్ సింగ్‌ను త్వరగా విడుదల చేయకపోతే తనను చంపేస్తానని ఫోన్లో బెదిరించారని తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించడమే కాకుండా.. తనను అసభ్య పదజాలంతో దుర్భాషలాడాడని సౌగతా రాయ్ పేర్కొన్నారు.కాగా పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని అరియాదాహా ప్రాంతానికి చెందిన టీఎంసీ నాయకుడు జయంత్ సింగ్‌ను జూన్ 30న జరిగిన ఓ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గత వారం అరెస్టు చేశారు. అరియాదాహ.. డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం కిందకు వస్తుంది. ఈ స్థానానికి సౌగతా రాయ్ గత నాలుగు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే గుర్తు తెలియని నెంబర్ నుంచి రెండు ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు రాయ్ పేర్కొన్నారు. అరియాదాహకు వెళితే చంపేస్తానని కూడా కాల్ చేసిన వ్యక్తి చెప్పాడని తెలిపారు. తర్వాత తాను బరాక్‌పూర్ పోలీస్ కమిషనర్‌ను సంప్రదించి నంబర్‌ను ట్రాక్ చేయమని కోరినట్లు చెప్పారు. అనంతరం తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.టీఎంసీ నేత జయంత్ సింగ్‌పై కేసు ఏంటి?జూన్ 30న కళాశాల విద్యార్థిని, అతని తల్లిపై దాడి చేసిన కేసులో జయంత్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఇందులో కొంతమంది వ్యక్తులు ఇద్దరు వ్యక్తులను కొట్టడం కనిపించింది.అరియాదాహాలో ఒక బాలికపై కొంతమంది వ్యక్తులు దాడి చేసినట్లు చూపుతున్న పాత వీడియో ఆధారంగా పోలీసులు సింగ్‌పై సుమోటో కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ ఘటనకు సంబంధించి సింగ్ సన్నిహితుడు పట్టుబడ్డాడు. , ఈ కేసులో ఇప్పటి ముగ్గురిని అరెస్ట్ చేశారు.2023లో మరో కేసులో అరెస్టయి, ఇకపై ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా హామీ ఇచ్చి బాండ్‌తో బెయిల్‌పై బయటకు వచ్చాడు జయంత్. ఆ షరతును ఇప్పుడు ఉల్లంఘించినందుకు ఆయన తాజా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. -
ఎంపీ మహువా మొయిత్రాపై మళ్లీ కేసు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై తాజాగా మరో క్రిమినల్ కేసు నమోదైంది. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) చీఫ్ రేఖాశర్మపై దూషణపూర్వక వ్యాఖ్యలు చేసినందుకుగాను మహువా మొయిత్రాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్స్(ట్విటర్)లో తమపై చేసిన వ్యాఖ్యలకుగాను మహువా మీద మహిళా కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల హత్రాస్ తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని రేఖాశర్మ సందర్శించిన వీడియోపై మహువా మొయిత్రా ఎక్స్(ట్విటర్)లో వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆ వీడియోలో రేఖాశర్మకు ఆమె సహాయకుడు గొడుగు పట్టడంపై ఓ నెటిజన్ స్పందించారు. రేఖాశర్మ ఆమె గొడుగు ఆమె సొంతగా ఎందుకు పట్టుకోలేపోతున్నారని ఆ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి రేఖాశర్మ ఆమె బాస్ పైజామా ఊడిపోకుండా పట్టుకునే పనిలో బిజీగా ఉండటం వల్లే గొడుగు పట్టుకోలేకపోతుందని మహువా వివాదాస్పద కామెంట్స్ పోస్ట్ చేశారు. మహువా మొయిత్రా గత లోక్‌సభలో తన ఎంపీ పదవి నుంచి సస్పెన్షన్‌కు గురై ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
హాస్పిటల్లో చేరిన టీఎంసీ సీనియర్ నేత
కోల్‌కతా: టీఎంసీ సీనియర్‌నేత ముకుల్ రాయ్ గురువారం ఆస్పత్రిలో చేరారు. తన నివాసంలోని బాత్రూంలో జారిపడి స్పృహ కోల్పోవటంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 70 ఏళ్ల ముకుల్ స్పృహ కోల్పోయే ముందు వాంతులు చేసుకున్నారని కుటంబసభ్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన బాత్రూంలో జారిపడటంతో తలకు గాయం అయింది. దీంతో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ పలు టెస్ట్‌ల రిపోర్టుల కోసం ఎదురు చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు.టీఎంసీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్.. 2017లో బీజేపీలో చేరిన ఆయన 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ కృష్ణానగర్‌లో గెలుపొందారు.అనంతరం ఆయన మళ్లీ టీఎంసీలో చేరారు. -
వాషింగ్ మిషన్ మోదీ బాబు అవినీతి మర్చిపోయారా సారూ..
-
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి? ఎన్డీయే ఆలోచన అదేనా!
న్యూఢిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు.. ఆ పదవిని తమ కూటమి సభ్యుడికే ఇవ్వాలని బీజేపీ యోచిస్తుండగా... మరోవైపు విపక్ష కూటమిలో భాగమైన తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఫైజాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన అవధేశ్ ప్రసాద్‌కు ఆ సీటు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు పలికింది.అయితే డిప్యూటీ స్పీకర్ నియామకంపై ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ.. ఈ విషయంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య చర్చలు జరిగే అవకాశాలు లేనట్లు సమాచారం, డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విమర్శిస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా 2019 నుంచి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. గతంలో ఎక్కువ శాతం ప్రతిపక్షమే ఈ పదవిని కేటాయించారు. అయితే ఇది ఎల్లప్పుడూ కొనసాగదని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష హోదా ఉండటంతో.. తమ ఎంపీలలో ఒకరికి డిప్యూటీ పదవి దక్కాలని డిమాండ్ చేస్తోంది. కాగా 16వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని అన్నాడీఎంకేకు ఇవ్వగా, 17వ లోక్ సభ పదవీ కాలం మొత్తం ఈ పోస్టు ఖాళీగానే ఉంది. భారత పార్లమెంట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈసారి కూడా . అయితే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇంకా అధికారిక షెడ్యూల్ విడుదల కాకపోవడంతో ఆ పదవిపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది.. ఇక స్పీకర్ పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా విజయం సాధించి రెండవసారి స్పీకర్ పదవిని చేపట్టారు. -
‘అయోధ్య ఎంపీకే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి!’
ఢిల్లీ: 18వ లోక్‌సభ స్పీకర్ పదవికి 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరగ్గా అధికార ఎన్డీయే కోటా ఎంపీ ఓం బిర్లా తిరిగి ఎన్నిక అయ్యారు. అయితే అధికార ఎన్డీయే ఏకగ్రీవానికి ప్రయత్నించినా.. ఆనవాయితీ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పట్టుపట్టడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. స్పీకర్ ఎన్నిక పూర్తికావడంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో అనే చర్చ మొదలైంది.అయితే తాజాగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. డిప్యూటీ స్పీకర్ పదవిని ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్‌కు కేటాయించాలని టీఎంసీ కేంద్రాన్ని కోరుతోంది. ఆయోధ్య ఉన్న ఫైజాబాద్ సెగ్మెంట్లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేసిన అవధేష్ ప్రసాద్ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఎటువంటి షెడ్యూల్ విడుదలచేయలేదు. గతంలో 17వ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీయేలోని ఏ మిత్రక్షానికి కూడా ఇవ్వకుండా బీజేపీ ఖాళీగా ఉంచిన ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవికి బలమైన నాయకున్ని ఇండియా కూటమి పోటీలోకి దింపాలనుకుంటున్న నేపథ్యంలో ఎంపీ అవధేష్ ప్రసాద్‌ను ఎన్నుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అవధేష్ ప్రసాద్ దళిత సమాజిక వర్గానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ. ఫైజాబాద్‌లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌పై 50వేల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం నేపథ్యంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థే గెలుస్తారని అంతా భావించారు. అదే విధంగా జనరల్ స్థానమైన ఫైజాబాద్‌లో అవధేష్ ప్రసాద్ గెలిచి అందిరనీ ఆశ్చర్యపరిచారు.ఇక.. డిప్యూటీ స్పీకర్‌సైతం లోక్స్పీకర్కు ఉండే అన్ని అధికారాలు ఉంటాయి. స్పీకర్ అందుబాటులో లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ లోక్‌సభ సమావేశాలను నడిస్తారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని ఆనవాయితీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజులగ్యాప్ తర్వాత.. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానుంది. -
18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ స్పీకర్ ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్నికలో.. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టా.. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు.విపక్ష కూటమి ఓటింగ్‌కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరస్పర కరచలనం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్ చెయిర్లో కూర్చోబెట్టారు. #WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభను నడిపించడంలో స్పీకర్ పాత్ర ఎంతో కీలకం. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్పీకర్ స్ఫూర్తిగా నిలుస్తారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా సభను నడిపించారు. ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్‌సభను నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలోనే కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టాం. జీ-20 సమ్మిట్ ఆయన సలహాలు, సూచనలు అవసరం. మరో ఐదేళ్లు కూడా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నా. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సభలో విపక్షాల సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇవ్వలి. మా గొంతు నొక్కితే సభ సజావుగా నిర్వహించినట్లు కాదు. ప్రజల గొంతుక ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యం. ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ అభినందనలులోక్ సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ అభినందనలు తెలిపింది. లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గడిచిన లోక్‌సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాలి’’ అని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారాయన. స్పీకర్‌గా ఓం బిర్లా ట్రాక్ రికార్డు.. లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా(61) రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ పదవి చేపట్టారు. ఇప్పుడు.. తొలి నుంచి జరుగుతున్న ప్రచారం నడుమే రెండోసారి స్పీకర్ పదవి చేపట్టబోతున్నారు. లోక్‌సభ స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం ఝాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. -
స్పీకర్ ఎన్నిక.. ‘ఇండియా’ కూటమిలో చిచ్చు !
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థి ఎంపిక ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది. ప్రతిపక్షాల తరపున స్పీకర్ పదవికి కె.సురేష్‌ను కాంగ్రెస్ ఏకపక్షంగా ఎంపిక చేసిందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపిస్తోంది. స్పీకర్ పదవికి కె.సురేష్‌ను పోటీపెట్టేముందు తమను సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌బెనర్జీ పార్లమెంటు బయట మంగళవారం(జూన్25) మీడియాకు తెలిపారు. ‘మమల్ని ఎవరూ సంప్రదించలేదు. చర్చ జరగలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఏకపక్షంగా కె.సురేష్‌ను స్పీకర్ పదవికి పోటీలో నిలబెట్టింది’అని అభిషేక్ బెనర్జీ మీడియాకు చెప్పారు. ఈ పరిణామంతో తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్ ఎన్నికలో పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.కాగా, 18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక బుధవారం(జూన్26) జరగనుంది. స్పీకర్ ఎన్నికకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలను బీజేపీ కోరినప్పటికీ అవి అంగీకరించలేదు. సాంప్రదాయానికి విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ప్రతిపక్షానికి ఆఫర్ చేయకపోవడంతో స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు అభ్యర్థిని పోటీ పెట్టాయి. -
వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ తరఫున సీఎం మమత ప్రచారం!
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ వదలుకున్న వయనాడ్ లోక్‌సభ స్థానంలో.. ఉపఎన్నికలో భాగంగా ప్రియాంకా గాంధీ వాద్రా పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా గాంధీకి ఇదే మొదటి లోక్‌సభ ఎన్నిక కావటం గమనార్హం. అయితే ప్రియాంకా గాంధీ బరిలోకి దిగే వయనాడ్‌లో టీఎంసీ సుప్రీం నేత, సీఎం మమత ప్రచారం చేయనున్నట్లు కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది.లోక్‌సభ ఎన్నికలకు ముందు పొత్తు, సీట్ల పంపకం విషయాల్లో బెంగాల్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న అధీర్ రంజన్ చౌధరీకి మమతా బెనర్జీ మధ్య విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు బాధ్యతగా బెంగాల్ పీసీసీ చీఫ్ పదవికి శుక్రవారం అధీర్ రంజన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల అంతర్గత సమావేశాల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. మమతా బెనర్జీకి తనకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని, కేవలం రాజకీయంగా మాత్రమే తాను విభేదించినట్లు చూడాలని అధీర్ రంజన్ స్పష్టం చేశారు.కాగా, బెంగాల్లో సీఎం మమతను విభేదించే అధీర్ రంజన్ రాజీనామా చేయటంతో దీదీ.. ప్రియాంకా గాంధీ ప్రచారానికి సిద్ధమైనట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇరు పార్టీల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. ఇక.. లోక్‌సభలో ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీఎంసీ మొత్తం 42 స్థానాలకు గాను 29 సీట్లును గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటుకే పరిమితమైంది. ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అధీర్ రంజన్ సైతం ఈసారి టీఎంసీ అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారీ కాంగ్రెస్.. లెఫ్ట్ పార్టీలతో కలసి బరిలోకి దిగినప్పటికీ ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేకపోయింది. -
ధ్యానం చేస్తూ ఎవరైనా కెమెరా తీసుకెళ్తారా?: మమత
బారూయ్‌పూర్(పశి్చమబెంగాల్): వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధాని మోదీ చేయబోయే ధ్యానంపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అనుమానం వ్యక్తంచేశారు. మంగళవారం పశి్చమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ నియోజకవర్గంలో టీఎంసీ ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత ప్రసంగించారు. ‘‘ మేం ఖచి్చతంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. ఆయన ధ్యానం చేసుకోవాలనుకుంటే చేసుకోమనండి. కానీ ఆయన మెడిటేషన్ చేస్తున్నపుడు టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే ఒప్పుకోం. ధ్యానం చేసేందుకు వెళ్తూ ఎవరైనా కెమెరా వెంట తీసుకెళ్తారా?’’ అని అన్నారు. -
మమత మనసులో ఏముంది? ‘ఇండియా’ భేటీకి ఎందుకు వెళ్లరు?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష ఇండియా కూటమితో జత కడతారా లేదా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగిన మమత ఎన్నికల తర్వాత విపక్షాల కూటమి ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కాబోనని ముందుగానే ప్రకటించారు.టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి సమావేశంపై తాను తీసుకున్న నిర్ణయానికి లోక్‌సభ ఎన్నికలు, రెమాల్ తుపాను కారణాలని పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడిన ఆమె లోక్‌సభ ఎన్నికల చివరి విడత ఓటింగ్, రెమాల్ తుపాను అనంతరం చేపడుతున్న సహాయక చర్యల కారణంగా జూన్ ఒకటిన జరిగే కూటమి మీటింగ్‌కు హాజరు కాలేనన్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జూన్ ఒకటిన ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, దీనికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఆహ్వానించారు. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ ఒకవైపు తుఫాన్, మరోవైపు ఎన్నికలు ఈ నేపధ్యంలో తాను వీటిని విస్మరించి, సమావేశానికి ఎలా హాజరుకాగలను అని అని ప్రశ్నించారు.మమత సమాధానంపై స్పందించిన బీజేపీ నేతలు.. కూటమి నుంచి తప్పించుకునేందుకే మమత ఇలాంటి సాకులు చూపుతున్నారని ఆరోపించారు. కాగా ఎన్నికల ఫలితాలకు ముందు మమతా బెనర్జీ బహిరంగంగా ప్రతిపక్ష శిబిరంతో సహవాసం చేయకూడదని భావించివుంటారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక, అప్పటి సీట్ల సంఖ్యను అనుసరించి ఆమె ఇండియా కూటమిలో చేరాలని అనుకుంటున్నారని సమాచారం. లోక్‌సభ ఎన్నికల చివరి దశలో అంటే జూన్ ఒకటిన పశ్చిమ బెంగాల్‌లోని తొమ్మిది స్థానాలకు ఓటింగ్ జరగనుంది. -
ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
కోల్‌కతా: ఆరో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా బెంగాల్‌లోని ఝర్గ్రామ్లో బీజేపీ అభ్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గర్బెటాలోని పోలింగ్ బూత్‌లో కొందరు దుండగులు ఓటర్లను బెదిరిస్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ అభ్యర్థి ప్రణత్‌టుడు ఆయన అనుచరులతో పోలింగ్ బూత్‌కు వెళ్లారు.వారు అక్కడికి చేరుకోగానే కొందరు వ్యక్తులు ఆయనపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ప్రణత్ టుడు, పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రణత్‌ను అక్కడినుంచి సురక్షితంగా తప్పించారు. ఈ ఘటనలో బీజేపీ నేత కారు ధ్వంసమైంది. కాగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ప్రణత్ సెక్యూరిటీ గార్డు పోలింగ్ బూత్ వెలుపల ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న మహిళపై దాడి చేశాడని టీఎంసీ నేతలు కౌంటర్ ఆరోపణలు చేశారు. -
ఈవీఎం ట్యాంపరింగ్‌పై స్పందించిన ఈసీ
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యలో శనివారం టీఎంసీ బీజేపీపై ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేసింది. బెంగాల్ రఘునాథపూర్లోని బంకురాలో బీజేపీ ఈవీఎం ట్యాపరింగ్‌కు పాల్పడినట్లు టీఎంసీ మండిపడింది. దీనికి సంబంధించిన ఫోటోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఐదు ఈవీఎం మిషన్లకు బీజేపీ ట్యాగ్లు ఉండటం ఆ ఫోటో గమనించవచ్చు. ఈ వ్యవహరంలో బీజేపీపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం మమత నేతృత్వంలోని టీఎంసీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది.Smt. @MamataOfficial has repeatedly flagged how @BJP4India was trying to rig votes by tampering with EVMs.And today, in Bankura's Raghunathpur, 5 EVMs were found with BJP tags on them.@ECISVEEP should immediately look into it and take corrective action! pic.twitter.com/aJwIotHAbX— All India Trinamool Congress (@AITCofficial) May 25, 2024 ‘‘బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగి చేసి రిగ్గింగ్‌కు పాల్పడుతోంది. ఈ రోజు రఘునాథ్‌పూర్‌లో ఐదు ఈవీఎంకు బీజేపీ ట్యాగ్లు ఉండటం మా దృష్టకి వచ్చింది. ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలి’’ అని టీఎంసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం బీజేపీకి ఇది తొలిసారి కాదని టీఎంసీ విమర్శలు చేసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో కూడా బీజేపీ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని, ఒట్లర్లపై సైతం దాడి చేశారని సీఎం మమతా తీవ్ర విమర్శలు చేశారు.స్పందించిన బెంగాల్ ఎన్నికల సంఘం:టీఎంసీ ఆరోపణలపై బెంగాల్ ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను పెట్టినప్పుడు కామన్ అడ్రస్ ట్యాగ్‌లను ఇస్తుంటాం. వాటిపై అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటాం. టీఎంసీ పేర్కొన్న కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్లను పెట్టిన సమయంలో కేవలం బీజేపీ అభ్యర్థికి చెందిన ఏజెంట్ మాత్రమే అందుబాటులో ఉన్నారు.(2/1) While commissioning, common address tags were signed by the Candidates and their agents present. And since only BJP Candidate's representative was present during that time in the commissioning hall, his signature was taken during commissioning of that EVM and VVPAT. pic.twitter.com/54p78J2jUe— CEO West Bengal (@CEOWestBengal) May 25, 2024 .. అందుకే ఆ ఏజెంట్ సంతకం మాత్రమే తీసుకున్నాం. ఇక.. ఆ తర్వాత పోలింగ్ జరుగుతున్న సమయంలో మిగతా ఏజెంట్ల సంతకాలు కూడా వాటిపై పెట్టించాం. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ఏర్పాటు సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాం. ఈ ప్రక్రియనంతా వీడియో తీశాం. సీసీటీవీల్లోనూ రికార్డ్ అవుతుంది’’ అని ఈసీ స్పష్టం చేసింది. -
సందేశ్‌ఖాళీ ఓ కట్టుకథ.. మాజీ బీజేపీ నేత సంచలన కామెంట్స్
కోల్కత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ జనరల్ సెక్రటరీ, సీనియర్ నాయకురాలు సిరియా పర్విన్.. కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం పర్విన్.. అధికార టీఎంసీలో చేరారు. ఈ సందర్భంగా బెంగాల్లో బీజేపీ నేతలపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.ఇక, బీజేపీకి రాజీనామా సందర్భంగా సిరియా పర్విన్ మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్లో సందేశ్‌ఖాళీ ఘటన అంతా బీజేపీ నేతల ప్లాన్ ప్రకారం జరిగింది. అదంతా ఓ కట్టుకథ(పొలిటికల్ డ్రామా). సందేశ్‌ఖాళీలో మహిళలతో మాట్లాడేందుకు బీజేపీ నేతలు వేరు వేరు సిమ్ కార్డ్స్, ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే రేఖా పాత్రకు బీజేపీ నేతలు డబ్బులు ఇచ్చి డ్రామా నడిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. త్వరలోనే వాటిని బహిర్గతం చేస్తాను అంటూ సంచలన కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో టీఎంసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తృణముల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ అనేక ఆరోపణలు చేస్తోంది. అవేవీ నిజం కాదు. టీఎంసీ నేతలు ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే నేను టీఎంసీలో చేరుతున్నానని కామెంట్స్ చేశారు. ఇక, సందేశ్‌ఖాళీ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చిన వారిలో సిరియా పర్విన్ కూడా ఒకరు కావడం గమనార్హం.ఇదిలా ఉండగా.. సందేశ్‌ఖాళీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సందేశ్‌ఖాళీలో భూముల కబ్జాలకు పాల్పడి మహిళలపై లైంగిక దాడులు చేశారన్న కేసులో టీఎంసీ మాజీ నేత షేక్ షాజాహాన్ అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీఎంసీ షాజహాన్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. మరోవైపు.. సందేశ్‌ఖాళీ ఘటనపై ఉద్యమించిన కారణంగా రేఖా పాత్ర అనే మహిళకు బీజేపీ లోక్‌సభ టికెట్‌ను ఇచ్చింది. బసిర్హత్ లోక్‌సభ స్థానంలో టీఎంసీకి చెందిన హాజీ నూరుల్ ఇస్లాం, బీజేపీ అభ్యర్థి రేఖా పాత్ర మధ్య ద్వైపాక్షిక పోరు నెలకొంది. -
బెంగాల్ గవర్నర్‌పై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రాష్ట్ర గవర్నర్ సీఏ ఆనంద బోస్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో గవర్నర్ బీజేపీకి కోసం ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఆరోపణలు చేసింది. ఆయన కోల్‌కతాలోని ఓ రామాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో గవర్నర్ తన ఛాతికి ‘బీజేపీ లోగో’ ధరించారని టీఎంసీ పేర్కొంది. ఇలా గవర్నర్ బీజేపీ లోగో ధరించటం వల్ల ఓటర్లు ప్రభావితం అవుతారని తెలిపింది.లోక్‌సభ ఎన్నికల కోసం గవర్నర్ బీజేపీ ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాష్ట్రపతి నియమించిన గవర్నర్‌కు రాజకీయ సిద్ధాంతాలు, ఆలోచనలు ఉండకూడదని టీఎంసీ ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం మానేయాలని గవర్నర్‌కు ఆదేశించాలని పోల్ ప్యానెల్‌కు విజ్ఞప్తి చేసింది. తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని గవర్నర్పరై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. -
ఓట్ల కోసమే సాధువులపై దాడి: ప్రధాని మోదీ
కోల్‌కతా: బుజ్జగింపు రాజకీయాల కోసమే పశ్చిమబెంగాల్ తృణమూల్ (టీఎంసీ) గూండాలు సాధువులపై దాడులు చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం(మే20) పశ్చిమ బెంగాల్‌లోని జార్గ్రామ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు.‘టీఎంసీ గూండాలు రామకృష్ణ మిషన్‌పై దాడి చేశారు. ఇది చేసింది తామేనని టీఎంసీ ప్రకటించడం సిగ్గుచేటు. సీఎం రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ మఠాల సాధువులను బెదిరిస్తున్నారు. ఆదివారం రాత్రి జల్పాయ్గురిలోని రామకృష్ణ మిషన్‌పై దాడి చేశారు.ఇలాంటి వాటిని బెంగాల్ ప్రజలు సహించరు. ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ్ సంస్థలు సేవ, విలువలకు నిదర్శనం, కానీ సీఎం మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బహిరంగంగా వారిని బెదిరిస్తున్నారు’అని మోదీ మండిపడ్డారు.కాగా, ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంస్థలకు చెందిన సాధువులు బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. అయితే మమత వ్యాఖ్యలను రెండు సంస్థలకు చెందిన సాధువులు ఖండించారు. -
టీఎంసీకి బూత్ ఏజెంట్ ప్రచారం.. పట్టుకున్న బీజేపీ ఎంపీ
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నేడు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. హుగ్లీలో టీఎంసీ అభ్యర్థి రచనా బెనర్జీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న బూత్ ఏజెంట్‌ను బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.టీఎంసీ అభ్యర్థి రచనా బెనర్జీ బూత్ ఏజెంట్‌కు డబ్బులు ఇచ్చి, ఒక ఆశా వర్కర్‌ను బూత్‌లో కూర్చోబెట్టారని లాకెట్ ఛటర్జీ ఆరోపించారు. ఆ ఆశా వర్కర్ బూత్‌లోకి వచ్చిన ఓటర్లతో టీఎంసీకి అనుకూలంగా ఓటువేయాలని కోరుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఆ మహిళ తృణమూల్ ఏజెంట్ అని లాకెట్ చటర్జీ పేర్కొన్నారు.ఆ మహిళను పట్టుకుని ప్రశ్నించగా ఎటువంటి సమాధానం రాలేదని ఆమె అన్నారు. దీనిపై బూత్ ఏజెంట్‌ను ప్రశ్నించగా, ఆమె ఓటర్లు క్యూలో నిలుచునేలా చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో బూత్ వద్ద ఎక్కువ మంది ఓటర్లు లేరని లాకెట్ చటర్జీ తెలిపారు. ఈ ఉదంతంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని లాకెట్ ఛటర్జీ పేర్కొన్నారు. -
‘ఖర్గే చెప్పినా.. నా పోరాటం ఆగదు’
కోల్‌కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మరోసారి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ విమర్శలు చేశారు. తనను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న సీఎం మమతా బెనర్జీ గురించి తాను సానుకూలంగా మాట్లాడనని అన్నారు. ‘‘నన్ను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న వారికి తాను సానుకూలంగా మాట్లాడాను. ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాటం. కాంగ్రెస్ కార్యకర్తల తరఫునే నేను సానుకూలంగా మాట్లాడుతాను. సీఎం మమతపై నాకు ఎటువంటి వ్యక్తిగతమైన పగ లేదు. ..ఆమె అవలంబిస్తున్న రాజకీయ విలువలను ప్రశ్నిస్తాను. ఆమె వ్యక్తిగత అజెండా కోసం కాంగ్రెస్‌ను ఉపయోగపడాలని నేను అనుకోవటం లేదు. నా వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యతిరేకించినా.. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలోని కార్యకర్తల కోసం ఒక కాంగ్రెస్ నేతగా సీఎం మమతకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా’’అని అధీర్ రంజన్ స్పష్టం చేశారు.అంతకు ముందు అధీర్ రంజస్ సీఎం మమాతపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉంటారన్న నమ్మకం లేదు. బీజేపీ చేరువ కానున్నారు. బెంగాల్‌లోని పురూలియా, బంకురా, ఝార్గ్రామ్ జిల్లాల్లో లెఫ్ట్ పార్టీలను అప్రతిష్టపాలు చేసేందుకు సీఎం మమతా మావోయిస్టుల సహాయాన్ని కోరారు’’ అని అధీర్ రంజన్ ఆరోపణలు చేశారు.అయితే ఆధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘‘మమతా బెనర్జీ కూటమిలోనే ఉన్నారు. ఇటీవల ఆమె కూటమిలో నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరుతానని తెలిపారు. ఆధీర్ రంజన్ పార్టీ కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. కీలకమైన నిర్ణయాలను పార్టీ అధ్యక్షుడిగా నేను, పార్టీ హైకమాండ్ మాత్రమే తీసుకుంటుంది. తమ నిర్ణయాలను పాటించని వారు బయటకు వెళ్లిపోతారు’’ అని ఖర్గే స్పష్టం చేశారు. మరోవైపు.. అధీర్ రంజన్ బహరాంపూర్ నుంచి పోటీ చేయగా.. టీఎంసీ ఈ స్థానంలో మాజీ క్రికెట్ క్రీడాకారుడు యూసుఫ్ పఠాన్‌ను బరిలోకి దించింది. -
200 లోక్‌సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. అదే సమయంలో ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 మార్కును కూడా దాటలేదని అన్నారు.లోక్‌సభ ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్, సీపీఐ(ఎం)లు రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. అయితే బీజేపీకి లబ్ధి చేకూర్చే టీఎంసీయేతర పార్టీలకు ఓటు వేయొద్దని మమతా బెనర్జీ ఓటర్లను కోరారు. ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని గోఘాట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి పేరు పెట్టింది నేనే. బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమి నేతలు పనిచేస్తున్నారు. అదే ఇండియా కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు టీఎంసీ తన వంతు ప్రయత్నాలు చేస్తోందన్నారు. మోదీ 400 పై చీలూకు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అవన్నీ సాధ్యమయ్యేవి కావు. 200 సీట్లు దాటడం గగనమేనని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. -
పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని వర్ధమాన్ - దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి నాలుగో దశ పోలింగ్ సోమవారం ప్రారంభం కాగానే, ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్.. టీఎంసీ గూండాలు పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదని ఆరోపించారు.నిన్న రాత్రి ప్రిసైడింగ్ అధికారితో సహా పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదని, పరిస్థితి చక్కబడేలా.. ఓటింగ్ సజావుగా జరిగేలా చూడాలని దిలీప్ ఘోష్ అన్నారు. ప్రతి బూత్ దగ్గర పోలీస్ బలగాలు ఉన్నప్పటికీ టీఎంసీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు.వర్ధమాన్-దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కీర్తి ఆజాద్, సీపీఐ(ఎం)కి చెందిన సుకృతి ఘోషల్ పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.2014 లోక్‌సభ ఎన్నికలలో, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 34 స్థానాల్లో గెలిచింది. అయితే అప్పుడు బీజేపీ కేవలం 2 సీట్లను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. సీపీఐ(ఎం) 2, కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ సారి బీజేపీ మరిన్ని స్థానాల్లో గెలుపొందటానికి ప్రయత్నిస్తోంది. -
మమతా బెనర్జీ: రాజ్‌భవన్‌లో అడుగుపెట్టను
సప్తాగ్రామ్: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోసుపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్ ఇంకా పదవిలో కొనసాగుతున్నారని మండిపడ్డారు. ఆయన ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం సప్తాగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం మమతా బెనర్జీ మాట్లాడారు. గవర్నర్ పదవిలో ఆనంద బోసు కొనసాగినంత కాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టబోనని తేలి్చచెప్పారు. ఒకవేళ గవర్నర్‌ను కలవాలనుకుంటే వీధుల్లోనే కలుస్తానని అన్నారు. మహిళలపై వేధింపులకు గవర్నర్ సమాధానం చెప్పాలన్నారు. గత నెల 24న, ఈ నెల 2న గవర్నర్ ఆనంద బోసు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి గతవారం కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తప్పు చేయలేదని గవర్నర్ అన్నారు. పూర్తి వీడియోలను గవర్నర్ బహిర్గతం చేయలేదని మమత ఆరోపించారు. -
గవర్నర్ మారేవరకు రాజ్‌భవన్‌లో అడుగుపెట్టను: మమతా బెనర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ రాజ్‌భవన్‌లో ఓ కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని వేధించినట్లు గత వారం పోలీసులకు ఫిర్యాదు అందింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. తనపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఎందుకు రాజీనామా చేయకూడదో బోస్ వివరించాలి కోరారు.టీఎంసీ హుగ్లీ అభ్యర్థి రచనా బెనర్జీకి మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. గవర్నర్ సివి ఆనంద బోస్‌ను నిందించారు. బోస్ గవర్నర్‌గా కొనసాగే వరకు రాజ్‌భవన్‌లోకి అడుగు పెట్టనని కూడా ఆమె తేల్చిచెప్పారు. గవర్నర్ దాదాగిరి ఇక చెల్లదని పేర్కొన్నారు.గవర్నర్ మీద ఆరోపణలు వచ్చిన తరువాత రాజ్‌భవన్‌లోని పలు సీసీటీవీ ఫుటేజీలను పరీక్షించారు. అవన్నీ గవర్నర్ ఎడిట్ చేసిన వీడియోను విడుదల చేశారని, నేను మొత్తం ఫుటేజీని చూశాను. అవన్నీ షాకింగ్‌గా ఉన్నాయని అన్నారు. మీ ప్రవర్తన సిగ్గుచేటు అని ముఖ్యమంత్రి అన్నారు. -
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
ఆసన్సోల్. పశ్చిమ బెంగాల్లో కీలక లోక్‌సభ స్థానం. గత ఉప ఎన్నికలో బీజేపీని ఓడించిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ‘షాట్‌గన్’, ‘బిహారీ బాబు’గా ప్రసిద్ధుడైన బాలీవుడ్ దిగ్గజం, సిట్టింగ్ ఎంపీ శత్రుఘ్న సిన్హా టీఎంసీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. సీనియర్ నేత సురేంద్రజీత్‌సింగ్ అహ్లువాలియాను బీజేపీ బరిలో నిలిపింది. ఈ హాట్ సీట్లో నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది... ఆసన్సోల్లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీ హై ప్రొఫైల్ లోక్‌సభ స్థానమైన ఆసన్సోల్లో హిందీ మాట్లాడేవారు ఎక్కువ. జార్ఖండ్ సరిహద్దు కావడమే అందుకు కారణం. ఇక్కడ పరిశ్రమలు అధికం. రాణిగంజ్, పాండవేశ్వర్, జమురియాల్లో బొగ్గు గనులున్నాయి. దాంతో బిహార్, యూపీ వలస కారి్మకులు ఎక్కువ. తాగునీటి ఎద్దడి, అక్రమ మైనింగ్ ఇక్కడి ప్రధాన సమస్యలు. ఒకప్పుడు సీపీఎం కంచుకోట. 2014లో దానికి బీటలు వారాయి. బీజేపీ నుంచి బాబుల్ సుప్రియో బరాల్ గెలుపొందారు. 2019లోనూ ఆ పరంపరను కొనసాగించారు. 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సుప్రియో తృణమూల్‌లో చేరడంతో ఉప ఎన్నిక జరిగింది. టీఎంసీ నుంచి శత్రుఘ్న సిన్హా గెలుపొందారు. అహ్లూవాలియాపైనే బీజేపీ ఆశలు... ఈసారి బీజేపీ తమ తొలి జాబితాలోనే భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్‌కు ఆసన్సోల్ టికెటిచ్చింది. తన పాటల్లో మహిళలను అగౌరవపరిచే వ్యక్తికి టికెటిచ్చారంటూ టీఎంసీ తదితర పక్షాలు విమర్శలు గుప్పించాయి. దాంతో పవన్ స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అనంతరం ‘సర్దార్జీ’గా పిలుచుకునే ఎస్.ఎస్. అహ్లువాలియాకు బీజేపీ టికెట్ దక్కింది. ఆయన రాజ్యసభ మాజీ సభ్యుడు. 2014లో డార్జిలింగ్, 2019లో బర్ధమాన్–దుర్గాపూర్ లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందారు. ఆయన కచి్చతంగా నెగ్గుతారని బీజేపీ అంటోంది. ఎంపీగా పార్లమెంటు ముఖమే చూడని వ్యక్తి ప్రజా సమస్యలను ఏం పట్టించుకుంటారన్న టీఎంసీ విమర్శలను అహ్లూవాలియా తిప్పికొడుతున్నారు. ‘‘నేను సర్దార్‌ను. ఆసన్సోల్ బిడ్డను. ఇక్కడే పుట్టి పెరిగా. నా మూలాలిక్కడే ఉన్నాయి. నా ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షే నన్నిక్కడికి నడిపించింది’’ అంటున్నారు.భారీ మెజారిటీపై శత్రుఘ్న కన్ను శత్రుఘ్న సిన్హా పూర్వాశ్రమంలో బీజేపీ నాయకుడే కావడం విశేషం! పట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. 2022లో టీఎంసీకి మారారు. అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తన బలమంటున్నారాయన. ‘‘ఎంపీగా రెండేళ్లలో చేసిన కృషే నా తరఫున మాట్లాడుతుంది. పైగా ఆసన్సోల్లో యూపీ, బిహార్ కారి్మకుల సంఖ్య చాలా ఎక్కువ. ఈసారి మరింత భారీ మెజారిటీతో గెలుస్తా’’ అని ధీమాగా చెబుతున్నారు. సీపీఎం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జహనారా ఖాన్ బరిలో ఉన్నారు. లోక్‌సభకు పోటీ చేయడం ఆమెకిదే తొలిసారి. 55 ఏళ్ల జహనారాది దిగువ మధ్యతరగతి నేపథ్యం. రెండుసార్లు జమురియా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ‘‘ఆసన్సోల్ పదేళ్లుగా ప్రాభవాన్ని కోల్పోయింది. ఈ సుప్రియోలు, సిన్హాలు నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదు. గ్రామీణ గిరిజనులు, మైనారిటీలు తాగునీటి కొరతతో అల్లాడుతున్నారు. పదేళ్లలో ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ కేబుల్స్ సహా ఎన్నో కర్మాగారాలు మూతపడ్డాయి’’ అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి: మండిపడ్డ మమతా బెనర్జీ
కోల్‌కతా: రాజ్‌భవన్‌లోని మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించారని గవర్నర్ సీవీ ఆనంద బోస్పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీనిపైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం 'మమతా బెనర్జీ' మండిపడ్డారు.పుర్బా బర్ధమాన్ జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రాజ్‌భవన్‌లో మహిళ వేధింపుకు గురికావడం సిగ్గు చేటు అని అన్నారు. రాజ్‌భవన్‌లో పనిచేసిన ఓ యువతి బయటకు వచ్చి గవర్నర్ వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ మహిళ కన్నీళ్లకు నా గుండె పగిలింది. సందేశ్‌ఖలీ గురించి మాట్లాడే ముందు బీజేపీ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై ఎందుకు మాట్లాడలేదు? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. స్కూల్ సర్వీస్ కమిషన్ కేసులో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడానికి కూడా బీజేపీయే కారణమని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న ఒక మహిళ తనపై వేధింపుల ఆరోపణలు చేసిన తరువాత టీఎంసీ నేతలు మండిపడ్డారు. ఇలాంటి కథనాలకు భయపడబోమని.. సత్యం గెలుస్తుందని గవర్నర్ ఆనంద బోస్ అన్నారు.Smt. @mamataofficial strongly condemned the appalling incident in Raj Bhavan!It's deeply disturbing that the same Governor who showed great urgency in reaching Sandeshkhali now stands accused of molesting a female staff member.PM @narendramodi's spent the night there and his… pic.twitter.com/b07DXs1LNp— All India Trinamool Congress (@AITCofficial) May 3, 2024 -
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
కోల్‌కాతా: పశ్చిమబెంగాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఓ కాంగ్రెస్ నేత 'టీఎంసీకు ఓటు వేయడం కంటే బీజేపీకి ఓటు వేయడం ఉత్తమం' అని అన్నారని ఓ వార్త నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపైన సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీకి లేదా కాంగ్రెస్‌కు ఓటు వేయండి అని కాంగ్రెస్ నేత చెబుతున్నారు. ఆలోచించండి వీరికి సిద్ధాంతాలు, ఆదర్శాలు ఉన్నాయా?. ఇలాంటి కొందరు స్వార్థపరులే దేశాన్ని అమ్మేస్తారని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.మంగళవారం బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.గతంలో బెంగాల్లో బీజేపీ సంఖ్యను తగ్గించడమే పార్టీ లక్ష్యమని, తృణమూల్ ఇండియా కూటమిలో భాగమేనని జైరాం రమేష్ అన్నారు. కానీ ఈ రెండు చివరకు పొత్తు పెట్టుకోలేదు. కానీ అధీర్ చౌదరి ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు. అయితే పశ్చిమ బెంగాల్లో బీజేపీ సంఖ్యను గణనీయంగా తగ్గించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అని జైరాం రమేష్ అన్నారు.A doctored video has been surfaced in the Social Media, perhaps either by the TMC or BJP IT Cell ( both are same notorious in the way they perform), wherein it’s being shown as if the @INCWestBengal President @adhirrcinc is asking the voters in a public meeting, to vote for BJP… pic.twitter.com/ZeTrp7SInB— West Bengal Congress (@INCWestBengal) May 1, 2024 -
ప్రధాని మోదీ సినిమా ఫ్లాప్.. కల్యాణ్ బెనర్జీ విమర్శలు
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పాలనను ట్రైలర్ అంటున్నారని కానీ సినిమా అంతా ఫ్లాప్ అయిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఎద్దేవా చేశారు. ప్రజలకు హామీలు ఇచ్చి.. నెరవేర్చకుండా కేవలం అబద్ధాలు చెప్పే వ్యక్తి ప్రధాని మోదీ అని మండిపడ్డారు. కల్యాణ్ బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘బేటీ బచావో, బేటీ పడావో ప్రచారంలో భాగంగా వేల కోట్ల రూపాయల నిధులను కేంద్ర కేటాయిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రచారం పేరుతో ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారో మాకు జాబితా అందించండి. 2014 నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు. గత పదేళ్ల పాలనలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. మోదీ అబద్ధాలు చెప్పే వ్యక్తి. ఆయన ఒక నకిలీ నటుడు. ప్రజలు నకిలీ నటుడు మోదీకి, బీజేపీ ఓటు వేయొద్దు. ప్రధాని మోదీ ట్రైలర్లో ఫెయిల్ అయ్యారు. సినిమా కూడా సక్సెస్ కాబోదు. మోదీ ఇక గుజరాత్ వెళ్లిపోతారు. మార్కెట్లో మోదీ సినిమా ఎక్కవ కాలం పని చేయదు. విదేశాలకు వెళ్లి కరచాలనాలు చేసే నకిలీ నటుడికి ప్రజలు అస్సలు ఓటువేయొద్దు’ అని ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు. ఇక.. జనవరిలో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భారీగా ఎంపీలను సస్పెండ్ చేసిన విషయంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మణ్ జగదీప్ ధన్‌ఖడ్ తీరును ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరించి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. -
రామ్‌నవమి వేడుకలపై ‘తృణమూల్’ కుట్ర: ప్రధాని
కలకత్తా:శ్రీరామనవమి వేడుకలను అడ్డుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కుట్ర పన్నిందని ప్రధాని మోదీ ఆరోపించారు. మంగళవారం(ఏప్రిల్ 16) పశ్చిమబెంగాల్లోని బలూర్‌ఘాట్‌లో జరిగిన ఎన్నికల సభలో మోదీ ప్రసంగించారు. ‘అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి రామనవమి వేడుక ఇది, రామ్‌నవమి వేడుకలను ఆపేందుకు టీఎంసీ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. ఎన్నో కుట్రలు చేస్తుంది. కానీ చివరికి నిజమే గెలుస్తుంది. ఈసారి రామ్‌నవమి వేడుకలు జరుపుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. రామ్‌నవమి ఊరేగింపు అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగి తీరుతుంది. ఇందుకుగాను బెంగాల్ సోదరులు, సోదరీమణులకు నేను అభినందనలు తెలుపుతున్నాను’అని మోదీ అన్నారు. ఇదీ చదవండి.. ఈడీ, సీబీఐల దర్యాప్తు.. శ్వేతపత్రం విడుదల చేయండి: దీదీ -
అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్లో ఐటీ సోదాలు
కలకత్తా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రధాన కార్యదర్శి, సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్‌ను ఆదివారం(ఏప్రిల్14) ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) అధికారులు తనిఖీ చేశారు. కలకత్తాలోని బెహలా ఫ్లైయింగ్ క్లబ్లో ఈ తనిఖీలు జరిగాయి. హెలికాప్టర్ వెళ్లకుండా ఐటీ అధికారులు చాలా సేపు అడ్డుకున్నారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. తనిఖీల సందర్భంగా అభిషేక్ బెనర్జీ సెక్యూరిటీ సిబ్బందికి ఐటీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. తనిఖీలపై అభిషేక్‌బెనర్జీ ట్విటర్(ఎక్స్)లో స్పందించారు.‘ఇటీవల ప్రజల ఆగ్రహానికి గురైన ఎన్ఐఏ స్థానిక డీజీ, ఎస్పీలను తొలగించకుండా నా హెలికాప్టర్లో తనిఖీలకు ఐటీ అధికారులను పంపించారు. వారికి తనిఖీల్లో ఏం దొరకలేదు. జమీందార్లు ఎన్నిరకాల ఒత్తిళ్లు పెట్టినా బెంగాల్ తలవంచదు’ అని పోస్టులో బెనర్జీ పేర్కొన్నారు. అభిషేక్ బెనర్జీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే విమర్శలు -
టీఎంసీ ఎంపీల ఆందోళన.. ఈడ్చుకెళ్లిన పోలీసులు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఈడ్చుకెళ్తూ పోలీసు వాహనంలోకి ఎక్కించుకుని వెళ్తున్న దుశ్యాలు వైరల్‌గా మారాయి. ఢిల్లీలోని ఎన్నికల ప్రధాన కార్యాలయంలో టీఎంసీ ఎంపీలు హల్చల్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తుందంటూ, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు దర్యాప్తు సంస్థలకు నేతృత్వం వహించే చీఫ్‌లను ఎన్నికల సంఘం తొలగించాలని నినాదాలు చేశారు. ఎంపీల ఆందోళనతో సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మాట వినకపోవడంతో వారిని నెట్టడం, లాగడం, ఎత్తుకెళ్లి పోలీస్ వాహనం ఎక్కించారు. అయితే, ఎన్నికల కమీషనర్లను కలిసిన తర్వాత వెళ్లిపోవాలని అధికారులు పలుమార్లు చెప్పినప్పటికి వినకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని బలవంతంగా పోలీస్ వాహనంలోకి తరలించాల్సి వచ్చిందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రధాని మోదీ హెచ్చరిక పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గురిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో అధికార పార్టీ టీఎంసీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న జూన్ 4 తర్వాత అవినీతిపై చర్యలు వేగవంతం అవుతాయని హెచ్చరించారు. అవినీతిని అంతం చేయకూడదా? అవినీతిపరులను జైలుకు పంపకూడదా? టీఎంసీ అవినీతిని వదిలించుకోకూడదా? ఇది మోదీ హామీ అని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం టీఎంసీ ఎంపీలు ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఆందోళన చేపట్టడం గమనార్హం. ఆందోళన చేపట్టిన టీఎంసీ అంతకుముందు తమ పార్టీకి భయం లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కానీ బీజేపీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ఏజెన్సీలను వాడుకుంటోందని ఆమె ఆరోపించారు. మోడీ కా గ్యారెంటీ అంటున్నారు.. మోడీ గ్యారెంటీ ఏమిటి.. జూన్ 4 తర్వాత అందరినీ జైల్లో పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రచార హోరు.. ‘తృణమూల్’పై ప్రధాని మోదీ ఫైర్
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. తూర్పు మిడ్నపూర్‌లో ఎన్ఐఏ అధికారులపై టీఎంసీ కార్యకర్తల దాడిని ప్రధాని ఖండించారు. ఆదివారం జల్పాయ్గురిలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.‘వారి పార్టీ అవినీతి నేతలను స్వేచ్ఛగా వదిలేయాలని తృణమూల్ భావిస్తోంది. దర్యాప్తు సంస్థలు వస్తే వారిపైనే దాడి చేస్తారు. శాంతిభద్రతలను నాశనం చేయడానికి టీఎంసీ కంకణం కట్టుకుంది. వారికి రాజ్యాంగంతో పని లేదు’ అని విమర్శలు గుప్పించారు. తూర్పు మిడ్నపూర్‌లో ఎన్ఐఏ అధికారులపై దాడులు జరిగిన మరునాడే ప్రధాని స్పందించడం చర్చనీయంశమైంది.కాగా, ఇది ఎన్ఐఏ అధికారులపై జరిగిన దాడి కాదని వాళ్లు తూర్పు మిడ్నపూర్లోని భూపతినగర్ గ్రామ వాసులపై చేసిన దాడి అని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. ఇదీ చదవండి.. మరో పదేళ్లు హేమమాలినీనే ఎంపీ -
ఎన్ఐఏ అధికారులపై దాడి.. గవర్నర్ ఆగ్రహం
కోల్‌కతా : యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులపై జరిగిన దాడిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఖండించారు. ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలను బెదిరించే ఇటువంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని, వాటిని పరిష్కరించాలని బోస్ పేర్కొన్నారు. పరిస్థితులను ఎదుర్కోవడంలో వేగంగా, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఈ రకమైన ‘గూండాయిజం’ సరైంది కాదని పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2022లో బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు మరణించడంపై ఎన్ఐఏ అధికారులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా బాంబు పేలుడు ఘటనకు సంబంధం ఉన్న మిడ్నాపూర్ జిల్లా భూపతినగర్ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు మోనోబ్రోటో జానా, అతని సహచరులను అదుపులోకి తీసుకున్నారు. తిరిగి వస్తున్న ఎన్ఐఏ అధికారులపై స్థానికులు దాడి చేశారు.అధికారుల వినియోగించిన కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒక అధికారి గాయపడ్డారు. Another example of lawlessness in West Bengal under Mamata Banerjee government A team of NIA officers, which went to Bhupatinagar in East Medinipur District of West Bengal, to arrest two TMC leaders, were targeted More than 100 villagers, not only stopped the NIA team from… pic.twitter.com/aJWWSEOsh2 — Organiser Weekly (@eOrganiser) April 6, 2024 -
బీజేపీకి అభ్యర్థులు కావలెను. ఆసక్తి రేపుతున్న ‘టీఎంసీ’ పోస్టర్లు
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మధ్య జరుగుతున్న పోస్టర్ వార్ ఆసక్తిరేపుతోంది. బీజేపీ ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించని అసన్సోల్, డైమండ్ హార్బర్ లోక్‌సభ సీట్ల విషయంలో టీఎంసీ గోడలపై పోస్టర్లు వేసింది. క్యాండిడేట్ వాంటెడ్ అని షాడో ఫేస్ ఉన్న పోస్టర్లను వీధుల్లో అంటించారు. దమ్ముంటే బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత సువేందు అధికారి డైమండ్ హార్బర్ సీటు నుంచి పోటీ చేయాలని టీఎంసీ సవాల్ విసురుతోంది. ఇక్కడి నుంచి ప్రస్తుతం టీఎంసీ జనరల్ సెక్రటరీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అసన్సోల్ నుంచి బీజేపీ క్యాండిడేట్‌గా ప్రకటించిన పవన్‌సింగ్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కొనితెచ్చుకున్నారు. దీంతో బీజేపీ ఇక్కడ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అసన్సోల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులే లేరని టీఎంసీ ఎద్దేవా చేస్తోంది. కాగా, పశ్చిమ బెంగాల్లో ఈ నెల 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీకి షాక్ శివసేన(ఉద్ధవ్)లోకి సిట్టింగ్ ఎంపీ -
‘ఇండియా’ ర్యాలీలో టీఎంసీ ఎంపీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉందని ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ప్రకటించారు. లిక్కర్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆదివారం(మార్చ్ 31) ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో ఒబ్రెయిన్ పాల్గొని మాట్లాడారు.‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(ఏఐటీసీ) ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉంది. ఇది బీజేపీకి ప్రజాస్వామ్యానికి మద్దతుగా జరుగుతున్న పోరాటం’అని ఆయన స్పష్టం చేశారు. మరోపక్క ర్యాలీలో ఒబ్రెయిన్ ప్రసంగించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేయడం విశేషం. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు కొలిక్కిరాకపోవడంతో వెస్ట్‌బెంగాల్‌లో సొంతగా పోటీ చేస్తున్నట్లు టీఎంసీ మార్చ్ నెల మొదట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్ ముఖ్య నేత, ఆ పార్టీ లోక్‌సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పై క్రికెటర్ యూసఫ్ పటాన్‌ను రంగంలోకి దింపింది. ఏక పక్షంగా అభ్యర్థుల జాబితా ప్రకటించడంపై అధిర్ రంజన్ తీవ్ర విమర్శలు చేశారు. మమతాబెనర్జీని ఇక ముందు ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు నమ్మడని మండిపడ్డారు. తమ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రధాని కార్యాలయానికి కూడా టీఎంసీ పంపిందని, తాము ఇండియా కూటమిలో లేము అని చెప్పేందుకే ప్రధానికి కూడా అభ్యర్థుల జాబితా పంపారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్, టీఎంసీలు ఒక పార్టీపై మరొకటి సాఫ్ట్ కార్నర్ చూపిస్తుండటం చర్చనీయాంశమైంది. Modi's guarantee has zero warranty! Zero warranty when it comes to price rise, jobs and protecting India's institutions. After the Pulwama tragedy, former Governor Satya Pal Malik ji publicly said that Narendra Modi ji did not even want the truth to come out. What did Narendra… pic.twitter.com/qeb0fgA5xS — Congress (@INCIndia) March 31, 2024 ఇదీ చదవండి.. దేశ ఆర్థిక మంత్రికి అప్పులు.. మరి ఆస్తులెంతో తెలుసా -
బీజేపీ ‘వాషింగ్‌మెషిన్’ను ప్రదర్శించిన తృణమూల్ నేతలు
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ సెటైర్లు వేసింది. బీజేపీ ఒక వాషింగ్‌మెషిన్ పార్టీ అని శనివారం(మార్చ్ 30) నిర్వహించిన ప్రెస్మీట్లో తృణమూల్ నేతలు వ్యాఖ్యానించారు. ఈ ప్రెస్మీట్లో తృణమూల్ నేతలు బీజేపీ వాషింగ్ మెషిన్ అని స్టిక్కర్లు అతికించిన వాషింగ్ మెషిన్‌ను ప్రదర్శించడం ఆసక్తి రేపింది. దీనికి తోడు ‘వాషింగ్ పౌడర్ బీజేపీ’ అనే టైటిల్‌తో వీడియోను కూడా తృణమూల్ నేతలు రిలీజ్ చేశారు. అవినీతి కేసులున్న పక్క పార్టీల నేతలు బీజేపీలో చేరగానే క్లీన్చిట్ పొందుతున్నారనేది ఈ వీడియోలో సెటైరికల్‌గా చూపించారు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్పటేల్పై ఉన్న విమానాల లీజు కేసులో సీబీఐ ఆయనకు క్లీన్చిట్ ఎందుకిచ్చిందని తృణమూల్ నేత రితబ్రతా బెనర్జీ ప్రశ్నించారు. తమకు లొంగనందునే అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరేన్లను బీజేపీ అరెస్టు చేయించిందని తృణమూల్ నేతలు మండిపడ్డారు. శరద్‌పవార్ ఎన్సీపీని చీల్చి మేనల్లుడు అజిత్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఇది జరిగి సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత ఎయిర్ ఇండియా విమానాల లీజు కేసులో ప్రఫుల్ పటేల్‌కు సీబీఐ తాజాగా క్లీన్ చిట్ ఇస్తూ దర్యాప్తును ముగిస్తున్నట్లు ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల వేళ దీనిపై ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతోంది. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. ఢిల్లీ మంత్రిని 5 గంటలు విచారించిన ఈడీ -
దిలీప్ ఘోష్‌పై కేసు నమోదు - కారణం ఇదే..
కలకత్తా: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ సీనియర్ నేత 'దిలీప్ ఘోష్' చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘోష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండి పడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 504, 509 సెక్షన్ల కింద దుర్గాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు (ఎఫ్ఐఆర్) నమోదైంది. ఘోష్ వ్యాఖ్యలు వైరల్ అయిన తరువాత ముఖ్యమంత్రి పట్ల తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదని క్షమాపణలు చెప్పారు. ''మమత బెనర్జీ గోవా వెళ్లి గోవా బిడ్డను అంటుంది, త్రిపుర వెళ్లి త్రిపుర బిడ్డనంటుంది, బెంగాల్లో బెంగాల్ బిడ్డను అంటుంది. అసలు తన తండ్రి ఎవరో ముందు మమత నిర్ణయించుకోవాలి'’ అని ఘోష్ వ్యాఖ్యానించడం వల్ల ఈ రోజు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతే కాకుండా టీఎంసీ ఫిర్యాదు మేరకు దిలీప్ ఘోష్‌కు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసి మార్చి 29 సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. Case registered against West Bengal BJP MP Dilip Ghosh in Durgapur PS under sections 504 and 509 of the Indian Penal Code over his remarks on CM Mamata Banerjee. — ANI (@ANI) March 28, 2024 -
రెండో దశ ఎన్నికలు: 12 రాష్ట్రాల్లో నేటి నుంచి నామినేష్లన స్వీకరణ
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండో దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక 12 రాష్ట్రాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లో ఏప్రిల్ 26న రెండోదశ పోలింగ్ జరుగుతుందని ఈసీ పేర్కొంది. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. రెండో దశలో అసోం, బీహార్, చత్తీస్‌గఢ్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ నాలుగో తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన అన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ ఐదో తేదీన జరగనుండగా, జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ ఆరో తేదీన జరుగుతుంది. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించేందుకు చివరి తేదీ ఏప్రిల్ 8. ఇక, ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ జరుగనుంది. జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక రెండో దశలోనే హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లోని ఔటర్ మణిపూర్ స్థానంలో రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఎన్నికలు మొదటి దశలోనే పూర్తి కానుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 19న ఇన్నర్ మణిపూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. 2024 आम चुनाव के दूसरे चरण का शेड्यूल👇#Elections2024 #ChunavKaParv #DeshKaGarv #IVote4Sure #ECI pic.twitter.com/Ied0YMcgXd — Election Commission of India (@ECISVEEP) March 27, 2024 ఇక, రెండో దశలోనే బెంగాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో, అందరి దృష్టి బెంగాల్ రాజకీయాలపైనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగాల్లో అధికార టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ టీఎంసీ, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. కేరళలో కూడా త్రిముఖ పోటీ ఉండనుంది. -
Cash for Query : మరోసారి ‘మహువా మొయిత్రా’ కు ఈడీ నోటీసులు
పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ లోక్‌సభ అభ్యర్ధి, తృణముల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు సమన్లు పంపిన ఈడీ.. తాజాగా మరోసారి పంపింది. విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై ఆమెను ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. మహువా మొయిత్రాను ఈడీ అధికారులు నాన్ రెసిడెన్షియల్ ఎక్స్‌ట్రనల్ (ఎన్ఆర్ఈ), అకౌంట్స్, ఒక దేశం నుంచి మరో దేశానికి చెందిన అకౌంట్లకు నగదు (foreign remittance)చెల్లింపులు, ఇతర లావాదేవీల గురించి ప్రశ్నించనున్నారు. గతంలో రెండు సార్లు గత ఏడాది మహువా మొయిత్రా స్నేహితుడు, న్యాయవాది జై అనంత్ దెహాద్రాయ్ ఆమెపై ఆరోపణలు చేశారు. వ్యాపారవేత్త హీరానందానీకి మహువా తన పార్లమెంట్ పాస్‌వర్డ్‌ను ఇచ్చారని అనంత్ ఆరోపించారు. దీనివల్ల హీరానందానీ అవసరమైనప్పుడు నేరుగా పార్లమెంట్లో తనకు కావాల్సిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందని అనంత్ అన్నారు. అంతేకాకుండా, డబ్బులు తీసుకొని హీరానందానీ గ్రూప్ తరఫున పార్లమెంట్లో మహువా ప్రశ్నలు అడిగారని కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో వివాదం మొదలైంది. ఈ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మహువా మొయిత్రాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించారు. కొద్ది రోజులకే ఆమె పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. రూ.2 కోట్ల వరకు తాజాగా, పార్లమెంట్లో ప్రభుత్వాన్ని విమర్శించేలా ప్రశ్నలను అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి మహువా మొయిత్రా రూ.2 కోట్ల నగదు, అలాగే లగ్జరీ ఐటమ్స్ తీసుకున్నారని, ప్రతిఫలంగా ఆమె తన పార్లమెంటు వెబ్సైట్ లాగిన్ వివరాలను దర్శన్ హీరానందానీకి షేర్ చేశారని, ఇదే అంశంపై ఈడీ హీరానందనీని సైతం విచారణ కోసం పిలిపించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. కాగా, క్యాష్ ఫర్ క్వైరీ ఆరోపణల్ని మోయిత్రా ఖండించారు (కానీ ఆమె వెబ్సైట్ ఆధారాలను పంచుకున్నారని, ఇది ఎంపీలలో సాధారణ పద్ధతి అని వాదించారు). మేలో ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. -
‘రాజమాత కుటుంబం బ్రిటిష్ వాళ్లకి సహాయం చేసింది’
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలో భాగంగా బీజేపీ పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణా నగర స్థానంలో రాజమాత అమ్రితా రాయ్‌ని బరిలోకి దించింది. దీంతో ఆమె ఎవరూ అని సోషల్‌మీడియాలో చర్చ జరిగింది. అయితే అదే స్థానంలో గతేడాది ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నేత మహువా మొయిత్రా పోటిలో ఉంది. దీంతో టీఎంసీ అమ్రితా రాయ్‌పై విమర్శలకు తెరలేపింది. ఆమె రాజకుటుంబం భారత దేశాన్ని పాలించిన బ్రిటిష్‌వారి పక్షమని మండిపడింది. కృష్ణానగర్‌ను పరిపాలించిన రాజు రాజా కృష్ణచంద్ర రాయ్.. బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో బ్రిటీష్ వారికి సాయం చేసి అనుకూలంగా పనిచేశారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ విమర్శించారు. ‘బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా బ్రిటిష్‌వారి వ్యతిరేకంగా పోరాడుతున్నసమయంలో కృష్ణా నగర్ రాజకుటుంబం బ్రిటీష్వారికి సాయం చేసిందని చరిత్ర చెబుతోంది. అనాడు రాజా కృష్ణచంద్ర రాయ్.. బ్రిటీష్ బలగాలు సాయం చేశారు. బీజేపీ వీర్‌సావర్కర్ పార్టీ. ఈ పార్టీ మహాత్మ గాంధీ హత్యకు బాధ్యత వహించాలి. బ్రిటీష్వారికే సాయం చేసిన కుటుంబాన్ని ఎన్నికల బరిలో దించింది బీజేపీ. మహువా మొయిత్రా దేశంలోని అవినీతిపై పోరాటం చేస్తోంది’ అని కునాల్ ఆరోపణలు చేశారు. టీఎంసీ విమర్శలపై రాజమాత అమ్రితా రాయ్ స్పందించారు. తన కుటుంబంపై చేస్తున్నఆరోపణలు అసత్యాలని తెలిపారు. ‘టీఎంసీ చేసే ఆరోపణలను భారత్, బెంగాల్లో ఎవరూ నమ్మరు. నా కుటుంబంపై చేస్తున్న విమర్శలు అసత్యం. మహారాజా కృష్ణ చంద్ర రాయ్ బ్రిటిష్ పక్షమన్న ఆరోపణ నిజం కాదు. ఆయన అలా ఎందుకు చేశాడు?. ఆయన అలా చేసిఉంటే ఇక్కడ హిందుత్వం ఉండేదా? సనాతన ధర్మం ఉండేదా? ఆయన బెంగాల్‌కు మరో గుర్తింపు తీసుకువచ్చారు. మత వ్యతిరేకత నుంచి రాజా కృష్ణచంద్ర రాయ్ మనల్నీ కాపాడారని ఎందుకు అనుకోకుడదు?’అని ఆమె టీఎంసీ కౌంటర్ ఇచ్చారు. -
పొలిటికల్ సర్కిళ్లలో ఒకటే చర్చ.. ఎవరీ ‘రాజమాత’
కోల్‌కతా: పార్లమెంటులో డబ్బులకు ప్రశ్నలడిగిన వ్యవహారంలో ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత మహువా మొయిత్రా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణా నగర్ లోక్‌సభ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. మరి ఈసారి మహువా గెలుస్తారా? లేదా? అనే సంగతి పక్కన పెడితే.. ఆమెపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి రాజమాత అమ్రితా రాయ్‌కి గురించి పొలిటికల్ సర్కిళ్లలో ఒకటే చర్చ మొదలైంది. ఇంతకీ ఈ రాజమాత ఎవరు? కృష్ణా నగర్ లోక్‌సభ నియోజవర్గంలో మొత్తం 14 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా.. ఆ ఎన్నికల్లో బీజేపీ 1999 ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. నాటి నుంచి ఆ నియోజకవర్గంలో కమలం గెలుపు కత్తిమీద సాములా మారింది. అయితే ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్న కమలం.. మహువా మొయిత్రా మీద ఏరికోరి అమ్రితా రాయ్‌ని నిలబెట్టింది. బీజేపీ 111 అభ్యర్ధులతో ఐదువ జాబితాను విడుదల చేసింది. అందులో కృష్ణా నగర్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్ధిగా రాజమాత అమ్రితా రాయ్‌ని ఖరారు చేసింది. అమ్రితా రాయ్ ఎవరు? అమ్రితా రాయ్ కృష్ణానగర్ రాజకుటుంబానికి చెందినవారు. నియోజకవర్గానికి చెందిన 'రాజ్‌బరీ రాజమాత' (రాచరికపు రాణి తల్లి) గా ప్రసిద్ధి మొయిత్రాకు పోటీగా బీజేపీ రాజ మహారాజా కృష్ణచంద్ర కుటుంబ సభ్యులను పోటీకి దించవచ్చని ఊహాగానాలు ఊపందుకున్న తర్వాత బీజేపీ ఢిల్లీ అధిష్టానం అమ్రితారాయ్ని కృష్ణానగర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 20న పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, సువేందు అధికారి సమక్షంలో రాయ్ అధికారికంగా బీజేపీలో చేరారు. పలు నివేదికల ప్రకారం.. కృష్ణా నగర్ జిల్లా నాయకత్వమే మొదట అమ్రితా రాయ్‌ను లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దించేతే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఆ తర్వాతే కమలం పెద్దలు రంగంలోకి దిగారు. ముఖ్యంగా, కృష్ణనగర్ లోక్‌సభ అభ్యర్థిగా మహారాజా కృష్ణ చంద్ర రాయ్ రాజమహల్ నుంచి తొలిసారి రాజకీయాలతో అనుసంధానించారు. రాష్ట్రంలో వీరి వారసత్వం హవా నేటికీ కొనసాగుతుంది. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత రాయ్ మాట్లాడుతూ “నాడియా చరిత్రకు రాజు కృష్ణచంద్ర చేసిన కృషి గురించి అందరికి తెలుసు. చరిత్రలో కృష్ణానగర్ రాజకుటుంబం పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. నేను ఎన్నికల రంగంలోకి రాచరికపు కోడలుగా కాకుండా సాధారణ ప్రజల గొంతుకగా నిలిచాను. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. వెస్ట్ బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు బీజేపీ మొత్తం 38 మధ్య అభ్యర్ధులను ఖరారు చేసింది. ఐదవ జాబితాలో 19 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. -
‘సువేందును పోటీకి దింపాలి’.. బీజేపీకి టీఎంసీ సవాల్
కోల్‌కతా: లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, జాబితా విడుదల చేయటంలో బిజీగా ఉంటున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీ.. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పోటాపోటీగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నేత కునాల్ ఘోష్ బీజేపీకి సవాల్ విసిరారు. బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించటంలో జాప్యం చేస్తుందని అన్నారు. ఆ స్థానంలో పోటీకి నిలపడానికి బీజేపీకి అభ్యర్థులే దొరకటం లేదని ఎద్దేవా చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారిని పోటీకి దింపాలని టీఎంసీ నేత కునాల్ ఘోష్ సవాల్ విసిరారు. ‘బీజేపీ నేత సువేందు అధికారికి నేను బహిరంగ వివాల్ విసురుతున్నా. ఆయిన డైమండ్ హార్బర్ సెగ్మెంట్లో మా నేత అభిషేక్ బెనర్జీపై పోటీ చేయలి’ అని కునాల్ అన్నారు. ఇప్పటికీ డైమండ్ హార్బర్ సెగ్మెంట్లో బీజేపీ ఎవరినీ పోటీకి దింపలేదు. ఇక.. ఈ సీటులో పోటీ చేయాలని బీజేపీ తమ అభ్యర్థులను కోరుతోందని ఎద్దేవా చేశారు. అయితే టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీకి కంచుకోట అయిన డైమండ్ హార్బర్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజర్టీతో గెలుపొందారు. ఆదివారం బీజేపీ ఐదో జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులు ప్రకటించింది. అందులో బెంగాల్ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీకి దింపింది. ఇప్పటి వరకు మొత్తం 38 మంది అభ్యర్థులను బీజేప ప్రకటించింది. ఇక.. పశ్చిమ బెంగాల్లో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. చదవండి: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే మంత్రిపై కేసు -
West Bengal: ‘ఖేలా హొబే’ సృష్టికర్తపై హైకోర్టు మాజీ జడ్జి పోటీ
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఐదో జాబితాలో భాగంగా బీజేపీ ప్రకటించిన పశ్చిమబెంగాల్ అభ్యర్థుల పేర్లు ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవలే జడ్జి పదవికి రాజీనామా చేసిన కలకత్తా హై కోర్టు మాజీ జడ్జి అభిజత్ గంగోపాధ్యాయ్ మేదినీపూర్ జిల్లా టమ్లుక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈయన మీద తృణమూల్ కాంగ్రెస్ తరపున స్టూడెంట్ నేత, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గెలుపునకు కారణమైన ‘ఖేలాహొబే’ క్యాంపెయిన్ సృష్టికర్త దేబాన్షు భట్టాచార్య పోటీచేస్తున్నారు. బెంగాల్లో 2021లో జరిగిన టీచర్ల నియామకంలో పెద్ద కుంభకోణం జరిగిందని పేర్కొంటూ అప్పట్లో హైకోర్టు జడ్జిగా ఉన్న గంగోపాధ్యాయ్ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఈ ఆదేశాలపై టీఎంసీ అధినేత మమతాబెనర్జీ గంగోపాధ్యాయ్పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ తరపున ఆ జడ్జి ఎక్కడినుంచి పోటీచేసినా ఓడిస్తానని, ఇందుకోసం ఉద్యోగాలు కోల్పోయిన విద్యార్థులనే అక్కడికి పంపుతానని ప్రకటించారు. తాజాగా గంగోపాధ్యాయ్‌కి బీజేపీ టికెట్ ఇవ్వడంతో టీఎంసీ ఆరోపణలకు బలం చేకూరింది. రానున్న ఎన్నికల్లో టీఎంసీ స్టూడెంట్ నేతపై మాజీ జడ్జి గెలుస్తారా లేదా అన్నది తెలియాలంటే ఫలితాల దాకా వేచి చూడాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఖేలాహొబే పాట జనాల్లో నాని టీఎంసీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఇదీ చదవండి.. మహువా మళ్లీ గెలిచేనా -
Loksabha Elections 2024: ‘మహువా’ మళ్లీ గెలిచేనా !
కలకత్తా: పార్లమెంటులో డబ్బులకు ప్రశ్నలడిగిన వ్యవహారంలో ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత మహువామొయిత్రా రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలుస్తారా అంటే కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఈసారి ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లోని మహువా నియోజకవర్గం కృష్ణానగర్ నుంచి బీజేపీ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపింది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఇక్కడి నుంచి మహువా అభ్యర్థిత్వాన్ని టీఎంసీ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఆదివారం(మార్చ్ 24) ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితాలో కృష్ణానగర్ సీటును స్థానిక రాజవంశానికి చెందిన రాజమాత అమ్రితా రాయ్‌కి కేటాయించింది. ఈమె గత వారమే బీజేపీలో చేరడం గమనార్హం. 18వ శతాబ్దంలో బెంగాల్‌ను పరపాలించిన మహారాజ కృష్ణ చంద్ర రాయ్ చేసిన సేవలను ప్రజలు ఈ రోజుకు కూడా గుర్తు చేసుకుంటారు. కృష్ణా నగర్ బీజేపీ టికెట్ దక్కించుకున్న రాజమాత అమ్రితా రాయ్ కృష్ణచంద్రరాయ్ వంశానికి చెందినవారే. నడియా జిల్లా బీజేపీ నాయకత్వం ఏరికోరి రాజమాత అమ్రితా రాయ్‌కి కృష్ణానగర్ టికెట్ ఇప్పించారని, పార్టీ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆమెతో పలుమార్లు చర్చలు జరిపి ఒప్పించారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కళ్యాణ్‌చౌబే స్వల్పంగా 63,218 ఓట్ల తేడాతో మహువా విజయం సాధించారు. మహువా గెలుపులో టీఎంసీకి అప్పట్లో గట్టి పట్టున్న కాలీగంజ్, చోప్రా, పలాషిపర అసెంబ్లీ నియోజకవర్గాలు కీలక పాత్ర పోషించాయి. అయితే వీటిలో కాలీగంజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో గత కొన్ని నెలల్లో బీజేపీ బలపడినట్లు చెబుతున్నారు. దీనికి తోడు నడియా జిల్లా వ్యాప్తంగా టీఎంసీ గతంతో పోలిస్తే బలహీనపడినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో డబ్బుకు ప్రశ్నలడిగిన కేసులో ఇప్పటికే ఈ టర్ములో ఎంపీ సభ్యత్వం కోల్పోయి సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న మహువా కృష్ణానగర్ నుంచి పార్లమెంటులో మళ్లీ అడుగుపెట్టడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదీ చదవండి.. కంగనకు బీజేపీ టికెట్.. నటి పాత ట్వీట్ వైరల్ -
మొదలైన యూసఫ్ పఠాన్ ప్రచారం: అధీర్ చౌదరి కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రకటించిన 42 మంది అభ్యర్థులలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ 'యూసఫ్ పఠాన్' (Yusuf Pathan) పేరు కూడా ఉంది. ఈయన బహరంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. 'అధీర్ రంజన్ చౌదరి'కి కాంగ్రెస్ కంచుకోట అయిన బహరంపూర్ నియోజకవర్గంలో యూసఫ్ పఠాన్ నిలబడటం సర్వత్రా చర్చలకు దారి తీసింది. నిజానికి ఇప్పటికే చౌదరి బహరంపూర్ నుంచి ఐదుసార్లు గెలిచారు. అలాంటి చోట నుంచి ఇప్పుడు యూసఫ్ పఠాన్ పోటీ చేయనున్నారు. #WATCH | West Bengal: Former cricketer and Trinamool Congress (TMC) candidate from Berhampore Yusuf Pathan says, "The field is very different but the expectations of the people remain the same- that I work for them, and carry forward the work done by my team (TMC)... I am as… pic.twitter.com/1XGmyrKhTW — ANI (@ANI) March 21, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి యూసఫ్ పఠాన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారాన్ని ప్రారంభించిన సమయంలో యూసుఫ్ పఠాన్ మాట్లాడుతూ.. తాను క్రికెట్ ఆడేటప్పుడు ప్రజల ప్రేమను పొందానని, ఇప్పుడు లోక్‌సభ పోటీదారుగా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. 'అధీర్ రంజన్ చౌదరి' యూసుఫ్ పఠాన్ బెర్హంపూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంపై వ్యాఖ్యానిస్తూ.. రాజకీయాలు & క్రికెట్ ఒకేలా ఉండవని అన్నారు. అయితే చౌదరిని బెర్హంపూర్ స్థానం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్ అధికారికంగా నామినేట్ చేయలేదు. బెర్హంపూర్ లోక్‌సభ స్థానానికి మే 13న నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. #WATCH | Murshidabad, West Bengal: Yusuf Pathan, former cricketer and Trinamool Congress (TMC) candidate from Berhampore says, "I am grateful to Mamata Didi (CM Mamata Banerjee) for giving me the opportunity to serve you. I hope that the way you people have given me love for the… pic.twitter.com/N7ihjlPXhU — ANI (@ANI) March 21, 2024 -
ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన: టీఎంసీ ఆరోపణలు
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపణలు చేసింది. అక్కడితో ఆగకుండా పీఎం మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీఎంసీ. కేంద్ర ప్రభుత్వ నిధులతో మోదీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారని ఆరోపణలు చేసింది. తాజాగా టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీ మార్చి 15 తేదీన ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పథకాల సంబంధించి ఓటర్లకు ఫోన్ సందేశం పంపారని మండిపడ్డారు. బీజేపీ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని అడ్డుపెట్టుకొని ఓటర్లను ప్రలోభపెడుతోందని దుయ్యబట్టారు. ‘ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఉపయోగించుకొని.. బీజేపీ ప్రభుత్వ ధనంతో ఓటర్లకు ఫోన్లో సందేశాలు పంపింది. మోదీకి అనకూలంగా ప్రభుత్వ పథకాల ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ చర్యలకు పాల్పడి మోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు’అని డెరెక్ ఓబ్రియన్ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రధానిమోదీ, బీజేపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి అందించిన లేఖలో డెరెక్ కోరారు. ఈ సందేశాలు పంపడాకి అయ్యే ఖర్చును కూడా బీజేపీ, నరేంద్రమోదీ ఎన్నికల ఖర్చులో భాగం చేయాలని డెరెక్ ఓబ్రియన్ ఈసీకి విజ్ఞప్తి చేశారు. అయితే డెరెక్ ఆరోపణలు బీజేపీ తీవ్రంగా ఖండించింది. డెరెక్ ఈసీ, సుప్రీంకోర్టు వద్దకు వెళ్లిన అవి అసత్య ఆరోపణలని మండిపడింది. ఇలా చేయటం వల్ల టీఎంసీ వాళ్లు బెంగాల్ ప్రజల హృదయాలను గెలుచుకోలేరని ఎద్దేవా చేసింది. మోదీ పేరుతో పంపిన వాట్సాప్ సందేశంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. -
బీజేపీలో చేరిన ఇద్దరు టీఎంసీ ఎంపీలు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు దిబ్యేందు అధికారి, అర్జున్ సింగ్ నేడు (శుక్రవారం) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. దిబ్యేందు అధికారి 2021లో బీజేపీ పార్టీలో చేరిన సీనియర్ బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు. కాగా అర్జున్ సింగ్ కూడా గత కొన్ని రోజులుగా బీజేపీలో చేరనున్నట్లు చెబుతూనే ఉన్నారు. నేడు పార్టీ కండువా కప్పుకున్నారు. ఇటీవల టీఎంసీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పుడు.. జాబితాలో తన పేరు లేదని అర్జున్ సింగ్ పేర్కొన్నారు. బరాక్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర మంత్రి పార్థ భౌమిక్‌ను నామినేట్ చేశారు. అర్జున్ సింగ్ 2019లో బీజేపీలో చేరి అప్పటి టీఎంసీ అభ్యర్థిని బరాక్‌పూర్‌లో ఓడించారు. కాగా ఇప్పుడు టీఎంసీ సీటు ఇవ్వకపోవడంతో సొంత గూటికే చేరనున్నట్లు ప్రకటించారు. బీజేపీలో చేరిన తర్వాత దిబ్యేందు అధికారి సంతోషం వ్యక్తం చేస్తూ, సందేశ్‌ఖాలీ ఘటనలో బాధితులను ముందుగా ఆదుకున్నందుకు పార్టీని కొనియాడారు. అంతే కాకుండా బెంగాల్లో మహిళలకు ఉండాల్సిన గౌరవం లేదు, అక్కడ చట్టబద్ధమైన పాలన లేదని వెల్లడించారు. #WATCH | Barrackpore MP Arjun Singh and TMC's Tamluk MP Dibyendu Adhikari join the BJP, in Delhi. Arjun Singh quit the TMC and rejoined the BJP today. Dibyendu Adhikari, who is also the brother of West Bengal LoP Suvendu Adhikari, quit TMC today. pic.twitter.com/anU42p59u7 — ANI (@ANI) March 15, 2024 -
టీఎంసీ నాకు ద్రోహం చేసింది.. బీజేపీలో చేరుతా : అర్జున్ సింగ్
లోక్‌సభ ఎన్నికల జరగటానికి ముందే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బరాక్‌పూర్ నియోజకవర్గానికి చెందిన నుంచి ఎంపీ అర్జున్ సింగ్.. బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే ఎప్పుడు చేరుతారనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. 'ఇది ఫిక్స్.. నేను బీజేపీలో చేరతాను' నేను ఇక్కడ లేదా ఢిల్లీలో ఎక్కడైనా బీజేపీ పార్టీలో చేరవచ్చు. పార్టీ నాకు ఏ పని ఇస్తే అది చేస్తానని విలేకర్ల సమావేశంలో అర్జున్ సింగ్ అన్నారు. 2022లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినప్పుడు, నన్ను బరాక్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా నామినేట్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పార్టీ ఇప్పుడు తమ హామీని నిలబెట్టుకోలేదు, నాకు ద్రోహం చేసిందని అన్నారు. ఆదివారం టీఎంసీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పుడు.. జాబితాలో తన పేరు లేదని అర్జున్ సింగ్ పేర్కొన్నారు. బరాక్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర మంత్రి పార్థ భౌమిక్‌ను నామినేట్ చేశారు. అర్జున్ సింగ్ 2019లో బీజేపీలో చేరి అప్పటి టీఎంసీ అభ్యర్థిని బరాక్‌పూర్‌లో ఓడించారు. కాగా ఇప్పుడు టీఎంసీ సీటు ఇవ్వకపోవడంతో సొంత గూటికే చేరనున్నట్లు ప్రకటించారు. -
‘సోదరుడిపై సీఎం మమత ఫైర్.. అన్ని బంధాలు తెంచుకున్నా’
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకేసారి మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్తున్నారు. అయితే అభ్యర్థుల ఎంపికపై సొంతపార్టీ నాయకులే ఆమెపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎం మమతా.. సోదరుడు బాబున్ బెనర్జీ కీలకమైన హౌరా లోక్‌సభకు ప్రకటించిన అభ్యర్థిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎంపీ ప్రసూన్ బెనర్జీకి సీఎం మమతా మరోసారి హౌరా స్థానం నుంచి అవకావం కల్పించారు. దీనిపై దీదీ సోదరుడు బాబున్ బెనర్జీ విమర్శించారు. ‘హౌరాకు ఎంపిక చేసిన అభ్యర్థి విషయంలో నేను సంతోషంగా లేను. ఆయన ఎంపిక సరైంది కాదు. అక్కడ చాలా సమర్థులైన నేతలు ఉన్నారు. వారందిరినీ కాదని ప్రసూన్ తిరిగి అభ్యర్థిగా ఎంపిక చేయటం సరికాదు’ అని బాబున్ అన్నారు. మరోవైపు బాబున్ బెనర్జీ బీజేపీలో చేరుతున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాను ఏ పార్టీలో చేరనని.. మమాతా బెనర్జీతో ఉన్నానని, దీదీతోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎంపిక చేసిన అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అడ్డం తిరుగుతున్న బాబున్ బెనర్జీపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘నేను, నా కుటుంబం.. బాబున్ బెనర్జీతో సంబంధాలను వదులుకున్నాం. ప్రతి ఎన్నికల ముందు బాబున్ ఏదో ఒక సమస్యను తెరపైకి తీసుకువస్తాడు. అత్యాశ గల వ్యక్తులను నేను ఇష్టపడను.. కుటుంబ రాజకీయాలను నేను ప్రోత్సహించను. అందుకే నేను హౌరా స్థానంలో ప్రసూన్‌కు టికెట్ కేటాయించా. సోదరుడు బాబున్తో అన్ని సంబంధాలు తెంచుకున్నా’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. బాబున్ బెనర్జీ ఎప్పుడూ తన సోదరి సీఎం మమత బెనర్జీని విభేదిస్తూనే ఉంటారని తెలుస్తోంది. ఇక.. కరోనా సమయంలో కూడా బాబున్ బెనర్జీ కోవిడ్ నింబంధనలు ఉల్లంఘించటంతో సీఎం మమతా ఆగ్రహానికి గురయ్యారు. చదవండి: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఢిల్లీలో మరో రెండు మెట్రో కారిడార్లు -
సీఏఏ అమలుపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' తీవ్రంగా విమర్శించారు. ఇది బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన 'లూడో మూవ్' అని ఆరోపించారు. దేశంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న చర్య అని మండిపడ్డారు. బెంగాల్‌లోని హబ్రాలో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పౌరసత్వ హక్కులను హరించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సీఏఏ చట్టబద్ధతపై తనకు అనుమానం ఉందని, దీనిపై ఎలాంటి క్లారిటీ లేదని, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రచారమని వ్యాఖ్యానించారు. సీఏఏ మీకు హక్కులు కల్పిస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ మీరు పౌరసత్వం కోసం అప్లై చేసుకున్న మరుక్షణం అక్రమ వలసదారులుగా మారి మీ హక్కులను కోల్పోతారు. దయచేసి దరఖాస్తు చేసే ముందు ఆలోచించండి అని మమతా బెనర్జీ అన్నారు. సీఏఏ బెంగాల్లో జరగడానికి నేను అనుమతించను. మతం ఆధారంగా పౌరసత్వం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? బెంగాల్‌ను విభజించడానికి ఇది బీజేపీ మరో గేమ్ అని మమతా వెల్లడించారు. మనమంతా భారత పౌరులమేనని నొక్కి చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టడానికే ఈ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు. -
తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి ఝలక్
తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఝలక్. త్వరలో పశ్చిమ బెంగాల్ బారక్పూర్ లోక్‌సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ అర్జున్ సింగ్ పార్టీని వీడనున్నారు. 2019లో అర్జున్ సింగ్ టీఎంసీ నుండి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి బరాక్‌పూర్ లోక్‌సభ సీటును దక్కించుకున్నారు. ఎన్నికల్లో గెలిచారు. అయితే 2022లో బీజేపీని వీడి మళ్లీ టీఎంసీకి వచ్చారు. ఇప్పుడు ఆయనే తిరిగి బీజేపీలో చేరనున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా టీఎంసీ అధినేత్రి దీదీ సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తుంటే బారక్పూర్ ఎంపీ మాత్రం స్వాగతించారు. సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై కేంద్రం తీసుకున్న నిర్ణయం తనకు సంతోషంగా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అమలుతో 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలే మళ్లీ రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. దీంతో ఆయన టీఎంసీ నుంచి బీజేపీలోకి చేరడం ఖాయమని ఆ రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలం అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 41 శాతం ఓటింగ్‌తో 42 స్థానాల్లో 18 స్థానాల్ని కైవసం చేసుకుంది. అధికార పార్టీ టీఎంసీ అదే ఎన్నికల్లో 42 శాతం ఓటింగ్‌తో 22 స్థానాల్లో గెలుపొందింది. అర్జున్ సింగ్‌కు నో టికెట్ టీఎంసీ ఇటీవల మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ బరాక్‌పూర్ నుండి అర్జున్ సింగ్‌కు టికెట్ నిరాకరించింది. పార్లమెంటరీ ఎన్నికల నుంచి తప్పుకున్న వారికి అసెంబ్లీ ఎన్నికల్లో స్థానం కల్పిస్తామని పార్టీ పేర్కొంది. అయితే, బలమైన వ్యక్తిగా పరిగణించబడుతున్న అర్జున్ సింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని సూచించాడు. మీరు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది కాలమే చెబుతుంది అని అన్నారు. -
మనీలాండరింగ్ కేసు: టీఎంసీ ఆస్తులు ఈడీ అటాచ్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. రూ.10.29 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ సోమవారం పేర్కొంది. ఆల్కెమిస్ట్ గ్రూప్, ఇతరులు చేసిన మనీలాండరింగ్ నేరంపై విచారణ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రూ. 10.29 కోట్లను ఈడీ టెండర్ చేసిన డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) రూపంలో అటాచ్ చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లు ఉపయోగించిన విమాన/హెలికాప్టర్ సేవలకు పలు విమానయాన కంపెనీలకు ఆల్కెమిస్ట్ గ్రూప్ దాదాపు రూ.10.29 కోట్లు చెల్లించినట్లు ఈడీ పేర్కొంది. ఇక.. అప్పటి ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు అయిన.. సీఎం మమతా బెనర్జీ, పార్టీ ఎమ్మెల్యే, మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్, నటుడు మూన్‌మూన్ సేన్, ఎంపీ నుస్రత్ జహాన్ కోసం టీఎంసీ విమాన సేవలు ఉపయోగించినట్లు ఈడీ తెలిపింది. ప్రజల డబ్బులో కొంత సొమ్మును టీఎంసీ ప్రచారంలో విమానయాన కంపెనీలకు చెల్లించేందుకు సదరు ఆల్కెమిస్ట్ గ్రూప్‌ను ఉపయోగించుకున్నట్లు ఈడీ విచారణలో నిర్ధారణ అయింది. ఈ ఆల్కెమిస్ట్ గ్రూప్.. టీఎంసీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కేడీ సింగ్‌ది కావటం గమనార్హం. -
పార్టీ మారగానే విడాకులు.. ఇప్పుడు ప్రత్యర్థిగా వచ్చింది!
రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. టీఎంసీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో అనేక విశేషాలు చోటు చేసుకున్నాయి. బహరంపూర్ నుంచి పార్టీ అభ్యర్థిగా టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ (Yusuf Pathan), కృష్ణానగర్ నుంచి మాజీ ఎంపీ మహువా మొయిత్రా బరిలో నిలిచారు. మమత బెనర్జీ మేనల్లుడు, వారసుడు అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నుంచి పోటీ చేయనున్నారు. నటుడు శత్రుఘ్న సిన్హా అసన్సోల్ నుంచి పోటీలో దిగనున్నారు. అయితే సందేశ్‌ఖాలీ వివాదం కారణంగా నుస్రత్ జహాన్‌ను బసిర్హాట్ స్థానం నుంచి తప్పించి ఆ స్థానంలో హాజీ నూరుల్ ఇస్లామ్‌ను బరిలోకి దింపారు. మాజీ భర్తపై పోటీ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో మరో ఆసక్తికర పరిణామం ఏంటంటే.. బిష్ణుపూర్ స్థానం నుండి సుజాత మోండల్ ఖాన్ (Sujata Mondal Khan) తన మాజీ భర్త, సిట్టింగ్ బీజేపీ ఎంపి సౌమిత్ర ఖాన్‌పై పోటీ చేస్తున్నారు. మొదట్లో వీరిద్దరూ బీజేపీలోనే ఉండేవారు. సుజాత మోండల్ ఖాన్ 2020లో బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. అలా పార్టీలో చేరిన కొన్ని గంటలకే సౌమిత్రా ఖాన్ ఆమెకు విడాకుల నోటీసు పంపారు. ఈ ఘటనతో అప్పట్లో ఆమె పేరు వార్తల్లో ప్రముఖంగా వచ్చింది. 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సుజాత మోండల్ తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఆరాంబాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. -
‘మోదీ కలత చెందొద్దని.. భయపడ్డ మమతా’ టీఎంసీపై కాంగ్రెస్ విమర్శలు
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గతంలో ఇండియా కూటమి నుంచి వైదొలిగిన టీఎంసీ.. బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో టీఎంసీతో పొత్తు.. సీట్ల సర్దుబాటుపై ఆశలు పెట్టుకుంది. ఒంటరిగా పోటీచేస్తామని అన్నట్లుగానే.. తాజాగా మొత్తం అభ్యర్థుల జాబితాను టీఎంసీ విడుదల చేయటం గమనార్హం. టీఎంసీ అభ్యర్థులు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. బీజేపీతో పోరాడాలని ఎప్పటినుంచో భావిస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ టీఎంసీకి కౌంటర్ వేశారు. ‘పశ్చిమబెంగాల్లో టీఎంసీతో గౌరవప్రదమైన సీట్ల భాగస్వామ్య ఒప్పందం కలిగి ఉండాలని కాంగ్రెస్ పార్టీ పదేపదే ప్రకటిస్తూ వచ్చింది. అటువంటి ఒప్పందాన్ని చర్చల ద్వారానే ఖరారు చేయాలని.. ఏకపక్ష ప్రకటనల ద్వారా కాదని కాంగ్రెస్ ఎప్పుడూ చెబుతోంది. కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఇండియా కూటమిగి బీజేపీపై పోరాడాలని భావిస్తోంది’ అని జైరాం రమేష్ అన్నారు. The Indian National Congress has repeatedly declared its desire to have a respectable seat-sharing agreement with the TMC in West Bengal. The Indian National Congress has always maintained that such an agreement has to be finalised through negotiations and not by unilateral… — Jairam Ramesh (@Jairam_Ramesh) March 10, 2024 పీఎంవోకు సమాచారం... టీఎంసీ ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. ‘భారతదేశంలో ఆమె వంటి ఓ నేతను నమ్మవద్దని సీఎం మమతా బెనర్జీ ఈ రోజు నిరూపించారు. మమతా బెనర్జీ భయపడుతోంది. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉంటే ప్రధాని మోదీ బాధపడతారు. ఆమె ఇండియా కూటమి నుంచి వైదొలిగిన సమయంలో పీఎంఓకు సమచారం ఇచ్చారు. తన(మమతా) వల్ల మోదీ బాధపడకూడదని.. బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉండి పోరాటం చేయవద్దని ఆమె ఈ నిర్ణయం తీసుకుంది’ అని అధిర్ రంజన్ ఆరోపణలు చేశారు. ఇక.. టీఎంసీ 9మంది సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టడం గమనార్హం. అదే విధంగా ఎంపీ అభ్యర్థులుగా ఏడుగురు కొత్తవారికి అవకాశం కల్పించారు. ఇక.. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ ప్రాతినిధ్యం వహిసస్తున్న బహరాంపూర్ సెగ్మెంట్లో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను బరిలోకి దించింది టీఎంసీ. ఇక్కడ అధిర్ రంజన్ ఐదు సార్లు విజయం సాధించారు. ఇండియా కూటమిలో భాగంగా పశ్చిమ బెంగాల్ సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ మూడు సిట్లను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సిట్ల సర్దుబాటు సరిగా లేదని మమతా బెనర్జీ తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించటం గమనార్హం. చదవండి: అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ.. బరిలో మాజీ క్రికెటర్ -
కాంగ్రెస్ కంచుకోటలో యూసఫ్ పఠాన్.. టీఎంసీ గెలుపు సాధ్యమేనా?
తృణమూల్ కాంగ్రెస్ (TMC) పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ (Yusuf Pathan) బహరంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. నిజానికి బహరంపూర్ నియోజకవర్గం లోక్‌సభ నాయకుడు 'అధీర్ రంజన్ చౌదరి'కి కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటికి కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పటికీ.. చౌదరి లోక్‌సభలో ఐదుసార్లు గెలిచిన బహరంపూర్ నుంచి తిరిగి ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. కాబట్టి చౌదరికే ఎంపీ సీటు ఖరారు చేసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీయేతర పార్టీలతో అధికారికంగా పొత్తు ఉండదని నిర్దారించుకున్న నేపథ్యంలో టీఎంసీ అభ్యర్థుల జాబితా వెల్లడించింది. కాంగ్రెస్, టీఎంసీ మధ్య సీట్ల నిర్ణయంలో సరైన పొత్తు కుదరకపోవడంతోనే మమతా బెనర్జీ స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఈ రోజు 42 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను కూడా అధికారికంగా ప్రకటించింది. -
టీఎంసీ అభ్యర్థులను జాబితాలో కనిపించని 'నుస్రత్ జహాన్' పేరు
మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఈరోజు పశ్చిమ బెంగాల్ నుంచి రాబోయితే లోక్‌సభ ఎన్నికలకు మొత్తం 42 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో బహరంపూర్ స్థానం నుండి మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, అసన్సోల్ నుంచి శత్రుఘ్న సిన్హా, దుర్గాపూర్ నుంచి కీర్తి ఆజాద్ వంటి కొన్ని ప్రముఖ పేర్లు ఉన్నాయి. టీఎంసీ పార్టీ 16 మంది సిట్టింగ్ ఎంపీల పేర్లతో పాటు, 12 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే కృష్ణానగర్ స్థానం నుంచి బహిష్కరణకు గురైన లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాను పార్టీ వరుసగా రెండోసారి మళ్లీ నామినేట్ చేసింది. సందేశ్‌ఖాలీ వివాదం కారణంగా 'నుస్రత్ జహాన్'ను బసిర్హాట్ స్థానం నుంచి తొలగించి.. ఆ స్థానంలో హాజీ నూరుల్ ఇస్లామ్‌ను బరిలోకి దింపారు. కాగా ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. -
అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ.. బరిలో మాజీ క్రికెటర్
కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మెగా ర్యాలీలో 'మమతా బెనర్జీ' రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 42 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బహరంపూర్ నుంచి పార్టీ అభ్యర్థిగా టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ (Yusuf Pathan), కృష్ణానగర్ నుంచి మాజీ ఎంపీ మహువా మొయిత్రా బరిలో నిలిచారు. మమత బెనర్జీ మేనల్లుడు, వారసుడు 'అభిషేక్ బెనర్జీ' డైమండ్ హార్బర్ నుంచి పోటీ చేయనున్నారు. నటుడు శత్రుఘ్న సిన్హా అసన్సోల్ నుంచి పోటీ చేయనున్నారు. అయితే సందేశ్‌ఖాలీ వివాదం కారణంగా 'నుస్రత్ జహాన్'ను బసిర్హాట్ స్థానం నుంచి తొలగించి.. ఆ స్థానంలో హాజీ నూరుల్ ఇస్లామ్‌ను బరిలోకి దింపారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితా కూచ్‌బెహార్: జగదీష్ చంద్ర బసునియా అలీపుర్దువార్: ప్రకాష్ చిక్ బరైక్ జల్పాయ్గురి: నిర్మల్ చంద్ర రాయ్ డార్జిలింగ్: గోపాల్ లామా రాయ్‌గంజ్: కృష్ణ కళ్యాణి బాలూర్ఘాట్: బిప్లబ్ మిత్ర మాల్డా నార్త్: ప్రసూన్ బెనర్జీ మాల్డా సౌత్: షానవాజ్ అలీ రెహాన్ జంగీపూర్: ఖలుయిలుర్ రెహమాన్ బెర్హంపూర్: యూసుఫ్ పఠాన్ ముర్షిదాబాద్: అబూ తాహెర్ ఖాన్ కృష్ణానగర్: మహువా మోయిత్రా రణఘాట్: ముకుట్ మణి అధికారి బొంగావ్: బిస్వజిత్ దాస్ బర్రా క్పూర్: పార్థ భౌమిక్ దుండం: సౌగత రాయ్ బరాసత్: కకోలి ఘోష్ దస్తిదార్ బసిర్హత్: హాజీ నూరుల్ ఇస్లాం జాయ్నగర్: ప్రతిమ మండల్ మధురాపూర్: బాపి హల్దర్ డైమండ్ హార్బర్: అభిషేక్ బెనర్జీ జాదవ్‌పూర్: సయోని ఘోష్ కోల్‌కతా సౌత్: మాలా రాయ్ డబ్ల్యూ కోల్జాత నార్త్: సుదీప్ బంద్యోపాధ్య హౌరా: ప్రసూన్ బెనర్జీ ఉకుబెర్రా: సజ్దా అహ్మద్ సెరాంపూర్: కళ్యాణ్ బెనర్జీ హుగ్లీ: రచనా బెనర్జీ ఆరంబాగ్: మిటాలి బాగ్ తమ్లుక్: దేబాంగ్షు భట్టాచార్య కాంతి: ఉత్తమ్ బారిక్ ఘటల్: దేవ్ దీపక్ అధికారి ఝర్గ్రామ్: కలిపాడా సోరెన్ మిడ్నాపూర్: జూన్ మాలియా పురూలియా: శాంతిరామ్ మహతో బుర్ద్వాన్ వెస్ట్: అరూప్ చల్రనోర్తి బర్డ్వాన్ ఈస్ట్: డాక్టర్ షర్మిలా సర్కార్ దుర్గాపూర్ బుర్ద్వాన్: కీర్తి ఆజాద్ అసన్సోల్: శత్రుఘ్న సిన్హా బోల్పూర్: అసిత్ మాల్ బీర్భం: సతాబ్ది రాయ్ బిష్ణుపూర్: సుజాత మోండల్ ఖాన్ -
మోదీ గ్యారెంటీలకు 'జీరో వారంటీ'.. టీఎంసీ నేత కీలక వ్యాఖ్యలు
మోదీ గ్యారెంటీలకు జీరో వారంటీ ఉందని 'జన గర్జన్ సభ' ర్యాలీ సందర్భంగా టీఎంసీ నాయకుడు 'అభిషేక్ బెనర్జీ' అన్నారు. బీజేపీ నాయకులు బయటి వ్యక్తులని, బెంగాల్ వ్యతిరేకులని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్రాన్ని సందర్శిస్తారని అభిషేక్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో మాత్రమే వారికి రాష్ట్రం గుర్తొస్తుంది, వారందరికీ రాష్ట్ర ప్రజలు తగిన సమాధానం చెబుతారని అభిషేక్ బెనర్జీ వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న టీఎంసీ మాత్రమే.. హామీలను నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. బీజేపీ ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపేశారని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ తన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు (ఆదివారం) గ్రాండ్ ర్యాలీ నుంచి ప్రారంభించింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి 'మమతా బెనర్జీ' పశ్చిమ బెంగాల్లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు మొత్తం 42 మంది అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించనుంది. -
టీఎంసీ మెగా ర్యాలీ.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్న మమతా బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి 'మమతా బెనర్జీ' పశ్చిమ బెంగాల్లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు మొత్తం 42 మంది అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించనుంది. కోల్‌కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్లో జరగనున్న పార్టీ మెగా ర్యాలీ 'జన గర్జన్ సభ'లో అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ర్యాలీకి పార్టీ ప్రధాన కార్యదర్శి 'అభిషేక్ బెనర్జీ' నాయకత్వం వహిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ 22 సీట్లు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 18 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ 42 స్థానాలకు గాను 34 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాగా ఈ రోజు 42 సీట్లకు అభ్యర్థులను పార్టీ అధినేత అధికారికంగా ప్రకటించనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎన్నుకునేటప్పుడు అభ్యర్థుల పనితీరును పరిగణలోకి తీసుకోడంతో పాటు, కొత్త వారికి, ఎస్సీ, ఎస్టీ ఆదివాసీలు, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని సమాచారం. ఈ జాబితాలో పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) సహా చాలా మంది పాత పేర్లు ఉండే అవకాశం ఉంది. ఈసారి కొంతమంది యువ నేతలను రంగంలోకి దింపాలని కూడా పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో చాలా మంది రాజకీయ నేతలు పార్టీలు మారుతున్న తరుణంలో 'జన గర్జన్ సభ' ర్యాలీకి దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది మద్దతుదారులు హాజరవుతారని భావిస్తున్నారు. కాగా ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. -
Lok Sabha elections 2024: టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్లో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. కాషాయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముకుట్ మణి అధికారి గురువారం అధికార టీఎంసీలో చేరారు. నడియా జిల్లా రాణాఘాట్ దక్షిణ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన అధికారి గురువారం కోల్‌కతాలో జరిగిన టీఎంసీ ర్యాలీలో సీఎం మమతా బెనర్జీతోపాటు పాల్గొన్నారు. సిట్టింగ్ ఎంపీ జగన్నాథ్ సర్కారుకే మళ్లీ రాణాఘాట్ టిక్కెట్ ఇవ్వాలన్న బీజేపీ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తితో పార్టీ మారారు. ప్రజల కోసమే పనిచేసే పార్టీ టీఎంసీ, అందుకే పార్టీలో చేరానని చెప్పారు. ముకుట్ మణి అధికారి తమ పార్టీలో చేరారని టీఎంసీ తెలిపింది. దీంతో, 2021లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక టీఎంసీలో చేరిన బీజేపీల సంఖ్య ఎనిమిదికి చేరింది. -
అభిజిత్‌పై 'దీదీ' ఫైర్.. రాబోయే ఎన్నికల్లో..
కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి 'అభిజిత్ గంగోపాధ్యాయ' ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. దీనిపైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆయనను 'బెంచ్‌పై కూర్చున్న బీజేపీ బాబు' అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలవకుండా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. అభిజిత్ గురించి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ ప్రమాదకరమైన పాములు బెంగాల్ ప్రజలకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నాయని, రాజకీయ పక్షపాతంతో పశ్చిమ బెంగాల్‌కు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. బీజేపీ బాబు అప్పుడు బెంచ్‌లో కూర్చున్నారు, ఇప్పుడు పార్టీలో చేరారు. అలాంటి వారి దగ్గర నుంచి న్యాయం ఎలా ఆశించాలి? ఇప్పుడు ముసుగు తొలగిపోయిందని, అసలు నిజాలు బయటపడుతున్నాయని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన అభిజిత్ గంగోపాధ్యాయ.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర నాయకులు ఉన్న కొత్త ప్రపంచంలోకి నేను ప్రవేశించాను, పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా నా వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈయనను (అభిజిత్ గంగోపాధ్యాయ) బీజేపీ తమ్లుక్ నియోజకవర్గం నుంచి పోటీకి దించే అవకాశం ఉందని సమాచారం. దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
సందేశ్‌ఖాలీ ర్యాలీలో 'మమతా బెనర్జీ' ఘాటు వ్యాఖ్యలు
రగులుతున్న సందేశ్‌ఖాలీ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన తర్వాత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' ఈ రోజు కోల్‌కతాలో మహిళలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సందేశ్‌ఖాలీ ద్వీపానికి చెందిన కొందరు మహిళలు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. మహిలాడర్ అధికార్, అమదర్ అంగీకార్ (మహిళల హక్కులు, మా నిబద్ధత) అనే అంశంతో ర్యాలీ సాగింది. దీనికి సంబంధించిన ఓకే వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో మమతా బెనర్జీ ముందు నడుస్తుంటే.. ప్రముఖ మహిళా తృణమూల్ నాయకులలైన సుస్మితా దేవ్, శశి పంజా, కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ & పాత్రికేయురాలు సాగరిక ఘోష్ వెనుక నడిచారు. ఈ ర్యాలీలో బీజేపీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీను కూడా మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్లో మహిళలను హింసిస్తున్నట్లు బీజేపీ నేతలు ఆరోపించడాన్ని ఖండించారు. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు, హత్రాస్‌లో మహిళపై అత్యాచారం చేసి, ఆమె మృతదేహాన్ని బలవంతంగా దహనం చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని బీజేపీని ఉద్దేశించి అన్నారు. బెంగాల్లోనే మహిళలు అత్యంత సురక్షితమని, దీనిని తాను నిరూపించగలనని సవాల్ చేశారు. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ బీజేపీలో చేరడంపై కూడా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఒక బీజేపీ బాబు గద్దె మీద కూర్చున్నాడు, అతను ఇప్పుడు బీజేపీలో చేరాడు, అలాంటి వారి నుంచి మీరు న్యాయం ఎలా ఆశించగలరని అన్నారు. ప్రతి ఏడాది మమతా బెనర్జీ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల మార్చ్‌కు నాయకత్వం వహిస్తారు. అయితే ఈ సారి అంతకంటే ముందే ర్యాలీ నిర్వహించారు. మహిళా ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్‌కు కీలకమైన మద్దతు. పార్టీ అధికారంలో కొనసాగిన 13 సంవత్సరాలుగా.. కన్యాశ్రీ, రూపశ్రీ, లక్ష్మీర్ భండార్ వంటి పథకాల ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం తప్పకుండా దోహదపడుతుందని అన్నారు. -
Sandeshkhali: షాజహాన్‌ను సీబీఐకి అప్పగించిన బెంగాల్ పోలీసులు
పశ్చిమ బెంగాల్‌లోని ‘సందేశ్‌ఖాలీ’ అరాచకాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన సస్పెండెడ్ టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను కస్టడీకి అప్పగించే విషయంలో బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ మధ్య రసవత్తర రాజీకీయం నడుస్తోంది. తాజాగా షాజహాన్‌ను సీబీఐకి అప్పగించేందుకు బెంగాల్ పోలీసులకు కలకత్తా హైకోర్టు కొత్త డెడ్‌లైన్ విధించింది సందేశ్‌ఖాలీ కేసుపై జస్టిస్లను హరీష్ టండన్, హిరన్మయి భట్టాచర్యాలతో కూడా ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా షాజహాన్‌ను నేటి సాయంత్రం 4.15 నిమిషాల వరకు సీబీఐకి అప్పగించాల్సిందేనని ఆదేశించింది. సీఐడీపై కోర్టు ధిక్కారం నమోదు చేయాలని సీబీఐ కోరిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో సీబీఐ అధికారులు బెంగాల్ పోలీసు హెడ్‌క్వార్టర్‌కు చేరుకున్నారు. ఎట్టకేలకు షాజహాన్‌ను పోలీసులు సీబీఐకి అప్పజెప్పారు. ఇక ఈ కేసులో షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టు మంగళవారమే ఆదేశాలు ఇచ్చింది. కానీ దీనిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లెక్కచేయలేదు. అతడిని అప్పగించబోమని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారులు కోల్‌కతాలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా.. షాజహాన్‌ను అప్పగించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో సీబీఐ అధికారులు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు. చదవండి: Rajasthan : డబుల్ జీరో! కాంగ్రెస్ ‘సున్నా’ రాత మారేనా? అనంతరం సీబీఐ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం నాటి ఆదేశాలపై సుప్రీం ఎటువంటి స్టే ఇవ్వలేదని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం షాజహాన్ షేక్‌ను అప్పగించడం లేదని ఈడీ చెప్పడంతో నేటి సాయంత్రానికి నిందితుడు షాజహాన్ షేక్‌ను అప్పగించి తీరాల్సిందేనని హైకోర్టు డెడ్‌లైన్ విధించింది. కాగా గత కొంతకాలంగా సందేశ్‌ఖాలీ పేరు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై అతడి అనుచరులు దాడి చేశారు. అనంతరం అతడు స్థానికుల నుంచి భూములు లాక్కోవడం, ఇవ్వని పక్షంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆకృత్యాలపై, టీఎంసీ గుండాలకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు రోడ్డెక్కారు. ఈ ఉద్యమానికి బీజేపీతో సహా ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో జనవరి 5 నుంచి షేక్ షాజహాన్ పరారీలో ఉన్నాడు. దాదాపు 55 రోజుల తర్వాత గవర్నర్, హైకోర్టు అల్టిమేటంతో బెంగాల్ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వమే షాజహాన్ని కాపాడుతోందని బీజేపీ విమర్శిస్తోంది. ఈ వివాదం పెద్దది కావడంతో టీఎంసీ అతడిని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇతడికి బెయిల్ ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరిస్తూ.. అతడిపై తమక సానుభూతి లేదని ప్రకటించింది. -
West Bengal: ‘సందేశ్ ఖాలీ’పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
కలకత్తా: బెంగాల్ పర్యటనలో ప్రధాని మోదీ అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై నిప్పులు చెరిగారు. బుధవారం రాజధాని కలకత్తాలో దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో ప్రారంభించిన అనంతరం ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన మహిళాశక్తి ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘బెంగాల్లో టీఎంసీ హయాంలో మహిళలు వేధింపులకు గురయ్యారు. చిత్రవధ అనుభవించారు. అధికార పార్టీ టీఎంసీ నేతలే స్వయంగా మహిళలను వేధించారు. టీఎంసీ మహిళలను ఎన్నడూ రక్షించలేదు. సందేశ్‌ఖాళీ ప్రాంతంలో జరిగిన దానికి ప్రతి ఒక్కరు సిగ్గు పడాలి. కానీ టీఎంసీ మాత్రం ఇవేవీ పట్టించుకోవడవం లేదు. బెంగాల్ ప్రజలను వేధించిన నిందితులను కాపాడాడానికి టీఎంసీ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి చివాట్లు తిన్నది. సందేశ్‌ఖాలీ తుపాను బెంగాల్లో ప్రారంభమైంది. ఈ తుపాను బెంగాల్‌లోని ప్రతి మూలకు చేరనుంది. టీఎంసీ నేతలకు తమ అధినేత్రిపై పూర్తి నమ్మకం ఉంది కానీ బెంగాల్ మహిళలపై మాత్రం లేదు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం లైంగికదాడులకు పాల్పడే వారికి జీవిత ఖైదు శిక్షలు పడేలా చట్టం తీసుకువచ్చింది. మహిళల ఫిర్యాదులను సులభంగా నమోదు చేసేందుకు కేంద్రం తీసుకువచ్చిన వుమెన్ హెల్ప్‌లైన్‌ను టీఎంసీ ప్రభుత్వం పనిచేయనివ్వడం లేదు. మహిళల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ పనిచేయలేదు’అని మోదీ మండిపడ్డారు. #WATCH | West Bengal: At the women's rally in Barasat, North 24 Parganas district, PM Modi says "TMC govt can never provide protection to women. Whereas, the BJP govt has decided to award life imprisonment for heinous crimes like rape. For easy registration of women's… pic.twitter.com/mHXkqiy30F — ANI (@ANI) March 6, 2024 ‘మోదీ పరివార్’ లాలూ వ్యాఖ్యలకు కౌంటర్ కాదు.. ‘ఒక రాజకీయ నాయకుడు నాకు కుటుంబం లేదని అన్నందుకే నేను దేశమంతా నా కుటుంబమే అని నినాదమిస్తున్నాని కొందరు అనుకుంటున్నారు. వాళ్లకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. నేను నా చిన్నతనంలోనే ఇళ్లు వదిలిపెట్టాను. నా దగ్గర అప్పుడు డబ్బులేదు. అయినా నేను ఏ రోజు ఖాళీ కడుపుతో పడుకోలేదు. ఆ సమయంలో పేద ప్రజలే నన్ను ఆదుకున్నారు. నా జీవితం దేశ ప్రజలకు అంకితం. నా శరీరంలోని ప్రతి అణువణువు, ప్రతి నిమిషం నా దేశ ప్రజల కోసమే. మోదీకి ఎప్పుడైనా సమస్య వస్తే ఈ తల్లులు, సోదరీమణులే రక్షణ కవచంలా నిలిచారు’ అని మోదీ తెలిపారు. ఇదీ చదవండి.. ప్రధాని పర్యటన వేళ బీజేపీపై దీదీ ఫైర్ -
Kolkata: ప్రధాని పర్యటన వేళ.. బీజేపీపై ‘దీదీ’ ఫైర్
కలకత్తా: పశ్చిమబెంగాల్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు, తమ పార్టీ నేతలను అరెస్టు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. బుధవారం కలకత్తాలో ప్రధాని పర్యటన నేపథ్యంలో మమత చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి. ‘టీఎంసీ నేతలను అరెస్టు చేయాల్సిందిగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు వచ్చినట్లు మాకు తెలిసింది. మాకు న్యాయమైన లోక్‌సభ ఎన్నికలు కావాలి. బీజేపీ ఎన్నికలు వద్దు. బెంగాల్ గురించి మాట్లాడేవాళ్లు ఉత్తరప్రదేశ్ రావాలి. గత రెండు రోజుల్లో అక్కడ ఇద్దరు మైనర్లను కట్టేసి హత్య చేశారు. యూపీ కంటే బెంగాల్ చాలా బెటర్. బీజేపీ రెచ్చగొట్టే చర్యలను బెంగాల్ మహిళలు తిప్పికొట్టారు. వారంతా మాతోనే ఉన్నారు’అని మమత తెలిపారు. కాగా, ప్రధాని మోదీ బుధవారం కలకత్తాలో దేశంలతోనే తొలి అండర్ వాటర్ మెట్రో లైన్ ఈస్ట్ వెస్ట్ కారిడార్‌ను ప్రారంభిస్తారు. ఇదీ చదవండి.. కాసేపట్లో మళ్లీ రైతుల ఢిల్లీ ఛలో -
టీఎంసీలో కీలక పరిణామం.. కునాల్ ఘోష్‌కు షోకాజ్ నోటీస్
లోక్‌సభ ఎన్నికలకు ముందే పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామానాలు చోటు చేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత తపస్ రాయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. మరో నేత కునాల్ ఘోష్‌కు టీఎంసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. కోల్‌కతా ఎంపీ సుదీప్ బందోపాధ్యపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు కునాల్ ఘోష్‌కు టీఎంసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. అంతకు ముందే ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవులలో కొనసాగడం ఇష్టం లేదని ప్రకటించారు. కునాల్ ఘోష్ శనివారం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎంపీ సుదీప్ బెనర్జీ బ్యాంకు ఖాతాలు, ఆయన తరపున అపోలో, భువనేశ్వర్‌కు జరిగిన చెల్లింపులపై విచారణ జరపాలి. అతను కస్టడీలో ఉన్నప్పుడు, అతనికి పెద్ద మొత్తం చెల్లించారా లేదా అతని తరపున ఆసుపత్రికి చెల్లించారా లేదా అనే దానిపై విచారణ జరగాలని పోస్ట్ చేశారు. -
తృణమూల్ కాంగ్రెస్‌కు 'తపస్ రాయ్' గుడ్ బై - కారణం ఇదే..
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత 'తపస్ రాయ్' (Tapas Roy) ఈ రోజు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జనవరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన నివాసంపై దాడి చేసినప్పుడు పార్టీ నాయకత్వం తనకు అండగా నిలవలేదని, పార్టీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తపస్ రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్‌కు సమర్పించానని, ఇప్పుడు నేను 'ఫ్రీ బర్డ్' అని అన్నారు. తపస్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన బీజేపీలో చేరతారా? లేదా మరేదైనా ప్రతిపక్ష పార్టీలో చేరతారా అనే దానిపై తీవ్రమైన ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇతర పార్టీలలో చేరే విషయం మీద తన అభిప్రాయాన్ని రాయ్ వెల్లడించలేదు, రానున్న రోజుల్లో వెల్లడించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. -
బెంగాల్ బీజేపీ చీఫ్‌కు రోడ్డు ప్రమాదం.. వారిపైనే ఆరోపణలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మజుందార్ కాన్వాయ్‌లోని పోలీస్ పైలట్ కారు ఆయన ప్రయాణిస్తున్న కారును అతి వేగంగా ఢీకొట్టింది. నదియా జిల్లాలో జరిగిన ఈ ఘటనపై బీజేపీ వెంటనే స్పందించింది. ఇది అధికార టీఎంసీ కావాలని చేయించిన పనేనని, వారి ఆధ్వర్యంలోని పోలీసులు కావాలని మజుందార్ కారును ఢీకొట్టారని ఆరోపించింది. ఈ ఆరోపణలను టీఎంసీ నేతలతో పాటు పోలీసులు ఖండించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ‘నేషనల్ హైవే 34పై మజుందార్ కృష్ణానగర్ వైపు వెళుతున్నారు. ఆయన వాహనానికి ఎస్కార్ట్‌గా ఉన్న సీఐఎస్ఎఫ్ వాహనం గోబిందాపూర్ సమీపంలో మజుందార్ ఉన్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొట్టిన వాహనంతో బెంగాల్ పోలీసులకు సంబంధమే లేదు. అయినా కొందరు కావాలని వేరే ఉద్దేశాలతో మాపై ఆరోపణలు చేస్తున్నారు’అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బలూర్ఘాట్ వనుంచి ఎంపీగా ఉన్న మజుందార్‌కు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ టికెట్ ప్రకటించింది. తనకు జరిగిన రోడ్డు ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో విచారణ చేయాలని మజుందార్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి.. రేపు నా రాజీనమా జస్టిస్ అభిజిత్ -
టీఎంసీతో పొత్తుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి - జైరాం రమేష్
పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించుకున్నప్పటికీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో పొత్తుకు ఇంకా తలుపులు తెరిచి ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది. పాట్నాలో ప్రతిపక్షాల ర్యాలీకి ముందు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి & కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేష్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ఏకపక్షంగా 42 స్థానాలకు (పశ్చిమ బెంగాల్లో) పోటీ చేస్తానని ప్రకటించింది, కానీ మాకు సంబంధించినంతవరకు, చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి, వారి కోసం తలుపులు తెరిచి ఉన్నాయని.. ఆఖరి మాట చెప్పేంత ఈ అవకాశం ఉంటుందని అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రదానం చేసిన వారం రోజుల తర్వాత రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి) NDA కూటమిలో చేరింది. అలీఘర్‌లో యాత్రలో రాహుల్ గాంధీకి లోక్ దళ్ స్వాగతం పలికిందని రమేష్ అన్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం (కేరళలోని) నుంచి పోటీ చేస్తారా అనే ప్రశ్నకు జవాబిస్తూ.. ఆ విషయం ప్రస్తుతం చర్చలో ఉందని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు. -
‘మోదీకి రెండు నిమిషాల పని..’ బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో గుండాలు, అత్యాచార నేరస్తులు అధికార పార్టీ టీఎంసీ జెండా కింద రక్షింపబడుతున్నారని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. ‘బెంగాల్లో గుండాలు, అత్యాచారానికి పాల్పడే వ్యక్తులు ఎక్కువ అయ్యారు. వారంతా కూడా టీఎంసీ జెండా కింద రక్షణ పొందుతున్నారు. టీఎంసీ నేరస్తులను, అత్యాచార నిందితులను రెండు నెలల నుంచి కాపాడుతోంది. బీజేపీ, మీడియా నిరసనల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ... తర్వాతే ఆయన్ను టీఎంసీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీఎంసీ పార్టీ బెంగాల్ మొత్తాన్ని నాశనం చేస్తోంది. మహిళల నుంచి భూములు లాక్కుంటున్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించిన ప్రధానమంత్రి మోదీకి.. బెంగాల్లో పరిస్థితులను శాంతింప చేయటం కేవలం రెండు నిమిషాల పని’ అని ఎంపీ దిలీప్ ఘోష్ అన్నారు. #WATCH | Medinipur, West Bengal: BJP MP Dilip Ghosh says, "Goons and rapists are present in every nook and corner of the state, protected under the flag of TMC. TMC protected a criminal, a rapist for two months... After being pressured by our protests and the media, the state… pic.twitter.com/szqaLyhalp — ANI (@ANI) March 3, 2024 శనివారం బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో బెంగాల్ నుంచి మొత్తం 42 స్థానాలకు 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లను గెలుచేకున్న విషయం తెలిసిందే. ఈసారి బెంగాల్ 35 స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. -
టీఎంసీ అంటేనే అవినీతి: ప్రధాని మోదీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విమర్శలు చేశారు. బెంగాల్లో మొత్తం 42 సిట్లతో బీజేపీ విజయం సాధించాలనే లక్ష్యంతో టీఎంసీని ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. ఆయన శనివారం బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ‘టీఎంసీ అంటేనే అవినీతి. ఇక్కడికి వచ్చిన ప్రజలు ఇచ్చిన విశ్వాసంతో చెబుతున్నా.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే సర్కార్ 400 స్థానాల్లో విజయం సాధింస్తుంది. టీఎంసీ అంటే దౌర్జన్యాలు, కుటుంబ రాజకీయం, దోహానికి ప్రతిరూపం. బెంగాల్ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పట్ల విసుగు చెందారు. సందేశ్‌ఖాలీ మహిళల విషయాన్ని ప్రస్తావిస్తూ... టీఎంసీ నేతలు సందేశ్‌ఖాలీ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని అన్నారు. బాధలో ఉన్న తల్లులు సోదరీమణులకు మద్దతు ఇవ్వాల్సింది పోయి టీఎంసీ ప్రభుత్వం నిందితుల పక్షాన నిలబడుతోందని మోదీ విమర్శించారు. న్యాయం కోసం సందేశ్‌ఖాలీ మహిళలు ఎంత వేడుకుంటున్నా, నిరసనలు తెలిపినా టీఎంసీ ప్రభుత్వం మాత్రం వినిపించుకోలేదని మోదీ మండిపడ్డారు. -
టీఎంసీలో వర్గపోరు.. కీలక నేత రాజీనామా?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో కీలక నేత కునాల్ ఘోష్ రాజీనామా చేశారు. కునాల్‌కు అదే పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ మధ్య గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. దాని పరిణామం ఇప్పుడు బయటపడింది. మార్చి 10న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మమతా బెనర్జీ మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సన్నాహాలు చేసేందుకు సుదీప్ ఇటీవల కోల్‌కతాలో టీఎంసీ నేతలతో సమావేశమయ్యారు. అయితే దీనికి ఆయన కునాల్ ఘోష్‌ను ఆహ్వానించలేదు. దీంతో కునాల్ ఘోష్.. సుదీప్ పేరు ప్రస్తవించకుండా ట్విట్టర్లో ఆయనపై విమర్శల దాడి చేసారు. ‘ఆ నేత అసమర్థుడు. గ్రూపులను నడిపే నేత, స్వార్థపరుడు. ఏడాది పొడుగునా చిల్లర రాజకీయాలు చేసి, ఎన్నికలకు ముందు ‘దీదీ అభిషేకం’ పేరుతో, పార్టీ కార్యకర్తల సహకారంతో ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాలకే ఉపయోగపడుతుంది. మరెలాంటి ప్రయోజనం ఉండదు’ అని పేర్కొన్నారు. 2017లో రోజ్ వ్యాలీ యజమాని నుంచి రూ.27 లక్షలు తీసుకున్న ఆరోపణలపై సీబీఐ సుదీప్‌ను అరెస్ట్ చేసి భువనేశ్వర్ జైలుకు పంపింది. నెలరోజుల పాటు జైలులో ఉన్నాక అతనికి బెయిల్ వచ్చింది. 2018లో జరిగిన ఈ కుంభకోణంలో ఈడీ రూ.130 కోట్లను స్వాధీనం చేసుకుని, సుదీప్‌ను విచారించింది. కాగా కునాల్ ఘోష్ తన రాజీనామాకు ముందే తన ట్విట్టర్ ప్రొఫైల్ నుండి టీఎంసీ అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ తదితర పోస్ట్‌లను తొలగించి, జర్నలిస్టు, సామాజిక కార్యకర్త అని రాశారు. -
సందేశ్‌ఖాలీపై ఇండియా కూటమి మాట్లాడదేం: ప్రధాని మోదీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం బెంగాల్‌లోని ఆరమ్‌బాగ్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. సందేశ్‌ఖాలీలోని మహిళల బాధల కంటే కొంతమంది ఓట్లు సీఎం మమతకు ముఖ్యమా? అని బెంగాల్ ప్రజలు అడుగుతున్నారని మోదీ అన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’పై విమర్శలు చేశారు. సందేశ్‌ఖాలీ మహిళల విషయంలో ఇండియా కూటమి మౌనం వహిస్తుందని మండిపడ్డారు. బెంగాల్లో టీఎంసీ (మాత, భూమి, ప్రజలు) అనే నినాదాన్ని పలుకుతుంది. అలాంటిది సందేశ్‌ఖాలీ మహిళల విషయంలో టీఎంసీ ఏం చేసింది.? అని మోదీ ప్రశ్నించారు. సందేశ్‌ఖాలీ ఘటనపై దేశం మొత్తం కోపంగా ఉందని తెలిపారు. ఈ వ్యక్తులు చేసే పనులు చేసి సంఘ సంస్కర్త రాజా రామోహన్‌రాయ్ ఆత్మ శోకిస్తుందని మోదీ మండిపడ్డారు. ఇక.. సందేశ్‌ఖాలీ మహిళలపై లైంగిక దాడులు, వారి భూములును లాక్కోవడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలు ఉన్న టీఎంసీ నేత షాజహాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అయిన షాజహన్ ఖాన్‌పై టీఎంసీ.. ఆరేళ్ల పాటు సస్పెన్షన్ విధించింది. -
సందేశ్‌ఖాలీ కేసు: షాజహాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చిన టీఎంసీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సందేశ్‌ఖాలీ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ షాజహన్ ఖాన్‌పై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వేటు వేసింది. టీఎంసీ పార్టీకి సంబంధించిన అన్ని పదువుల నుంచి షాజహన్ ఖాన్‌ను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఆరేళ్లు కొనసాగుతుందని టీఎంసీ పార్టీ వెల్లడించింది. సందేశ్‌ఖాలీ కేసులో షాజహన్ ఖాన్ పోలీసులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లో టీఎంసీ ఆయన్ను సస్పెండ్ చేసింది. గత ఎన్నిరోజులుగా పరారీలో ఉన్న షాజహన్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. సందేశ్‌ఖాలీలోని భూములు లాక్కొని.. అక్కడి మహిళలపై లైగింక దాడులకు పాల్పడినట్లు షాజహన్ ఖాన్‌తో ఆయన అనుచరులపై ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజులు సందేశ్ ఖాలీ గిరిజన మహిళలు షాజహన్ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమయంలో ఈ నిరసనలు పశ్చిమ బెంగాల్లో రాజకీయల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటి వరకు స్పందించని టీఎంసీ.. నిన్న ప్రధానిమోదీ బెంగాల్ పర్యటన అనంతరం తమ నేత అరెస్ట్ కావటం ఆవెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయటం గమనార్హం. ఇక.. టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్, మంత్రి బ్రత్య బసు మీడియా సమావేశంలో తమ పార్టీ నేత షాజహన్ ఖాన్‌పై సస్పెన్షన్ విధించినట్లు మీడియాకు తెలిపారు. ‘సందేశ్‌ఖాలీ కేసు విషయంలో మేం చట్టప్రకారం నడుచుంటాం. కానీ.. ఈ విషయంలో బీజేపీ కావాలని మాకు అడుగడుగునా అడ్డుపడుతోంది. బీజేపీకి మేము సవాల్ విసురుతున్నాం. మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం సందేశ్‌ఖాలీ విషయం మాకు కేంద్రానికి మధ్య.. బీజేపీకి టీఎంసీ మధ్య విషయం. ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి మాటలు చెప్పేదైతే.. టీఎంసీ చెప్పిన మాటలను ఆచరిస్తుంది’అని డెరెక్ ఓబ్రియన్ అన్నారు. -
‘సందేశ్‌ఖాలీ’ ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ అరెస్ట్!
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటుచేసుకున్న హింసాకాండ ఘటన ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత షాజహాన్ షేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో షాజహాన్ షేక్‌ను ప్రత్యేక పోలీసు బృందం బుధవారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్ 55 రోజులుగా పరారీలో ఉన్నాడు. ఈ నేపధ్యంలో షాజహాన్ షేక్ కార్యకలాపాలపై పోలీసుల బృందం నిఘా పెట్టిందని అధికారులు తెలిపారు. షాజహాన్ షేక్‌ను పోలీసులు బసిర్హత్ కోర్టుకు తరలించారు. జనవరి 5న సందేశ్‌ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిపింది. రేషన్ పంపిణీ కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు షేక్ ఇంటిపై దాడి చేశారు. ఆ తరువాత షాజహాన్ షేక్ పరారయ్యాడు. ఈ నేపధ్యంలో షేక్‌తోపాటు అతని మద్దతుదారులు స్థానికుల భూమిని ఆక్రమించారని, మహిళలను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వెంటనే షేక్‌ను అరెస్టు చేయాలంటూ సందేశ్‌ఖాలీ ప్రాంతంలో పలువురు నిరసనలు చేపట్టారు. -
‘బైనాక్యూలర్లో చూసినా కాంగ్రెస్‌కు మూడో సీటు కనిపించటం లేదు’
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించటమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష ఇండియా కూటమీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకంలో విషయంలో చర్చల వేగం పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆప్‌తో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో శివసేన( యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రేతో కూడా కాంగ్రెస్ చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లో కూడా సీట్ల పంపకం గురించి మరోసారి సీఎం మమతా బెనర్జీ టీఎంసీతో చర్చలు జరుపుతారన్న వార్తలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లను కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల నేపథ్యంలో టీఎంసీకి చెందిన ఓ కీలక నేత స్పందించారు. ‘బైనాక్యూలర్లో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్ల కంటే ఎక్కువ కనిపించటం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి మూడో సీటును మేము గుర్తించలేకపోతున్నాం. ఏదేమైనా కాంగ్రెస్, టీఎంసీ మధ్య సీట్ల సర్దుబాటు జరిగితే త్వరలోనే ప్రకటిస్తాం’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి రెండు సీట్లను మాత్రమే కేటాయిస్తామని మమతా బెనర్జీ చెప్పిన విషయం తెలిసిందే. ఇక.. కాంగ్రెస్ పార్టీ మరిన్ని సీట్ల కేటాయింపుకు పట్టుపట్టినా మమతా బెనర్జీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాము కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే బెంగాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే పలుమార్లు రాహుల్ గాంధీ.. సీఎం మమతా బెనర్జీకి అనుకూలంగా మాట్లాడటంతో మళ్లీ సీట్ల పంపకంపై ఆశలు చిగురించాయి. తాజాగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో చోటు చేసుకుంటున్న సీట్ల పంపకాల పరిణామాలతో బెంగాల్ కూడా సీట్ల పంపకం చర్చకు వచ్చింది. ఇక.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన పంతం తగ్గించుకుని కాంగ్రెస్‌తో చర్చకు రెడీ అయినట్టు రాజకీయా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్లో దాదాపు ఆరు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. చదవండి: కాంగ్రెస్‌కు రిలీఫ్.. సీఎం మమత కీలక నిర్ణయం! -
పోలీసు అధికారిపై అనుచిత వ్యాఖ్యలు.. సీఎం మమతా ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓ పోలీసు ఉన్నతాధికారిపై బీజేపీ నిరసనకారుడు కార్యకర్త చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేత సువేందు అధికారి సందేశ్‌ఖాలీలో పర్యటించటం కోసం బీజేపీ కార్యకర్తలతో బయలుదేరారు. దీంతో అక్కడ నిషేదాజ్ఞలు ఉన్నాయని పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసుల్లో.. ఉన్నతాధికారిగా ఒక సిక్కు అధికారి ఉన్నాడు. దీంతో బీజేపీ కార్యకర్తల్లో ఒకరు ఆయన్ను ‘ఖలిస్థానీ’ అంటూ అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Today, the BJP's divisive politics has shamelessly overstepped constitutional boundaries. As per @BJP4India every person wearing a TURBAN is a KHALISTANI. I VEHEMENTLY CONDEMN this audacious attempt to undermine the reputation of our SIKH BROTHERS & SISTERS, revered for their… pic.twitter.com/toYs8LhiuU — Mamata Banerjee (@MamataOfficial) February 20, 2024 ఈ వీడియోపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్స్ (ట్విటర్) వేదికగా మండిపడ్డారు. ‘ఈ రోజు బీజేపీ పార్టీ వేర్పాటువాద రాజకీయాలకు తెరలేపటం సిగ్గుచేటు. ఈ ఘటనతో బీజేపీ రాజ్యాంగంలోని అన్ని పరిధిలు దాటింది. బీజేపీ వాళ్ల దృష్టితో టర్బన్ ధరించిన ప్రతి సిక్కు వ్యక్తి.. ‘ఖలిస్థానీ’. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. బీజేపీ వాళ్లు సిక్కు సోదరసోదరీమనులను అవమానపరిచారు. వారి త్యాగాలను కించపరిచారు. తాము బెంగాల్ సామాజిక శ్రేయస్సుకు కట్టుబడి ఉంటాం. బెంగాల్ సామాజిక సామరస్యాన్ని భంగం కలిగించేవారిపై చట్టబద్దమైన కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ ఘటనపై సదరు పోలీసు ఉన్నతాధికారి మీడియాతో మాట్లాడారు. ‘నేను టర్బన్ ధరించింనందుకు నన్ను ‘ఖలిస్థానీ’ అని బీజేపీ కార్యకర్తలు అన్నారు. నేను వారిపై చర్యలు తీసుకుంటా. తన మతంపై ఎవరూ దాడి చేయడానికి వీలు లేదు. నేను ఇతరుల వారి మతంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు’ అని పేర్కొన్నారు. చదవండి: Sandeshkhali: బెంగాల్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్ -
Sandeshkhali: బెంగాల్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటు చేసుకున్న అశాంతి విషయంలో కోల్‌కతా హైకోర్టు సీరియస్ అయింది. సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన కేసును మంగళవారం కోల్‌కతా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సందేశ్‌కాలీ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజాహాన్ షేక్ పరారీలోనే ఉండటానికి వీలులేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన్ను సమర్థించకూడదని పేర్కొంది. సందేశ్‌ఖాలీని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని బీజేపీ నేత సువేందు అధికారి అభ్యర్థించారు. ఆయన విజ్ఞప్తిపై ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం స్పదించారు. సందేశ్‌కాళీ ప్రాంతంలోని మహిళలు చేసిన ఆరోపణలను హైకోర్టు గుర్తించిందని తెలిపారు. ‘మేము అక్కడి మహిళలకు సంబంధించి బాధలను చూశాం. ఆ ప్రాంతంలోని మహిళలు సమస్యలపై నిరసన తెలిపారు. అక్కడ కొంత భూమి ఆక్రమణకు గురైంది. ఈ కేసులో ప్రాథమికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షాజాహాన్ షేక్ పరారీలోనే ఉండటానికి వీలులేదు. రాష్ట్రం ప్రభుత్వం కూడా విషయాన్ని సమర్ధించదు. ఆయన లొంగిపోవాలి. ఆయన చట్టాన్ని ధిక్కరించడం సాధ్యం కాదు’అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ‘నేరాలకు పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆయన రక్షించబడుతున్నాడో? లేదో? మాకు తెలియదు. రాష్ట్ర పోలీసులు మాత్రం పలు ఘటనల్లో కీలకంగా ఉన్న షాజాహాన్ షేక్‌ను అరెస్ట్ చేయలేకపోయారు’ అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. చదవండి: Sandeshkhali: సువేందు అధికారిని మరోసారి అడ్డుకున్న పోలీసులు -
Sandeshkhali: సువేందు అధికారిని మరోసారి అడ్డుకున్న పోలీసులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సందేశ్‌ఖాలీ వ్యవహారం రోజురోజుకీ రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సందేశ్‌ఖాలీని సందర్శించడానికి వెళ్లిన రాష్ట్ర ప్రతిపక్ష నేత, బీజేపీ నేత సువేందు అధికారి, సీపీఎం బృందా కారత్ను పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. సువేందు అధికారి తన మద్దతు దారులతో కలిసి సందేశ్ ఖాలీకి వెళ్తుండగా ధమాఖలి వద్ద పోలీసులు, అల్లర్ల నియంత్రణ దళం సిబ్బంది బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, సీపీఎం మద్దతుదారులు ధమాఖలీలో వేర్వేరుగా నిరసనలు చేపట్టారు. కాగా నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్శాలీలో కొందరు టీఎంసీ నేతలు భూఆక్రమణలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే బీజేపీ ఆరోపణలతో ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వెళ్లువెత్తుతున్న విషయం తెలిసిందే. టీఎంసీ నేతలపై ఆరోపణల అనంతరం నందిగావ్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు సందేశ్ ఖాలీని సందర్శించడం ఇది మూడోసారి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన అంతకముందు రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. చదవండి: 2018 పరువునష్టం కేసులో రాహుల్‌కు ఊరట.. అయితే సందేశ్‌కాలీ గ్రామంలో పర్యటించేందుకు బీజేపీ నేత సువేందు అధికారితోపాటు ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌కు కోల్‌కతా హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. తన మద్దతుదారులతో కలిసి వెళ్లవద్దని పేర్కొంది. భద్రతా సిబ్బందితో వెళ్లొచ్చని తెలిపింది. అలాగే రెచ్చగొట్టే ప్రసంగాలేవీ చేయవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలగనీయరాదని హెచ్చరించింది. అదే విధంగా బీజేపీ నేత సందేశ్‌ఖాలీని సందర్శించడంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మంగళవారం ఉదయం హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది, సందేశ్ కాలీ వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా కూడా తనను అడ్డుకుంటున్నారని సువేందు అధికారి అసహనం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని కోల్‌కతా హైకోర్టు దృష్టికి ఈసుకెళ్తానని తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, రాష్ట పోలీసులు కలకత్తా హైకోర్టు ఆదేశాలను పాటించడం లేదని మండిపడ్డారు. -
16,000 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ విక్రయం.. ఏ పార్టీకి ఎన్ని నిధులు?
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని, భావప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కుకు ఉల్లంఘన అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రధాన రాజకీయ పార్టీలపై పెను ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని సర్వోన్నత న్యాయస్ధానం రద్దు చేయడం బీజేపీకి గట్టి దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే 2016 నుంచి 2022 మధ్య ఈ స్కీమ్ కింద పార్టీలకు సమకూరిన విరాళాల్లో 60 శాతం పైగా కాషాయ పార్టీకే లభించాయి. 2017-18 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీనిని ప్రవేశ పెట్టారు. ఈ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. అయితే.. ఎవరైతే విరాళాలు ఇస్తారో వారి వివరాల్ని బ్యాంక్, రాజకీయ పార్టీలు గోప్యంగానే ఉంచుతాయి. చదవండి: లంచాలు, కమీషన్ల కోసమే ఎన్నికల బాండ్లు.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్ కాగా ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. 2016 నుంచి 2022 మధ్య రూ. 16,437. కోట్ల విలువైన 28,030 ఎలక్టోరల్ బాండ్లు ఎస్బీఐ విక్రయించింది. మొత్తం విరాళాల్లో బీజేపీకి 60 శాతం పైగా రూ. 10,122 కోట్లు సమకూరాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొత్తం విరాళాల్లో 10 శాతం రూ. 1547 కోట్ల విరాళాలను స్వీకరించింది. పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ 8 శాతంతో రూ. 823 కోట్ల విరాళాలను స్వీకరించింది. ఈ జాబితాలో 30 పార్టీలకు అందిన విరాళాలతో పోలిస్తే బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. ఇంకా ఈ జాబితాను పరిశీలిస్తే సీపీఎం రూ. 367 కోట్లు, ఎన్సీపీ రూ. 231 కోట్లు, బీఎస్పీ రూ. 85 కోట్లు, సీపీఐ రూ 13 కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా సమీకరించాయి. 2017 నుంచి 2022 వరకు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ పొందిన విరాళాల కంటే బీజేపీఐదు రెట్లు ఎక్కువ విరాళాలను పొందింది. -
‘సందేశ్‌ఖాలీ నిరసన: ఒక్క మహిళా ఫిర్యాదు చేయలేదు’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీ ప్రాంతంలోని మహిళలు తమపై టీఎంసీకి చెందిన నాయకులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని నిరసన తెలపుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలు బెంగాల్లో దుమారం రేపుతున్నాయి. సందేశ్‌ఖాలీ ఘటనపై పోలీసులు బుధవారం కీలక వివరాలు వెల్లడించారు. సందేశ్‌ఖాలీ ప్రాంతంలో పలు పోలీసులు బృందాలతో విచారణలు జరిపించామని పోలీసు ఉన్నతధికారులు వెల్లడించారు. అయితే పోలీసులు చేపట్టిన విచారణలో ఎక్కడ కూడా ఒక మహిళ తనపై లైంగిక వేధింపులు జరినట్లు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. సందేశ్‌ఖాలీలో చోటుచేసుకున్న నిరసనలకు కారణం తప్పడు సమాచారమని తెలిపారు. ‘రాష్ట్ర మహిళా కమిషన్, పది మంది నిజనిర్ధారణ బృందం, జిల్లా పోలిసు యాంత్రాంగం నిర్వహించిన విచారణలో మహిళలపై టీఎంసీ నాయకులు లైంగికంగా వేధించినట్లు చెప్పడానికి ఒక్క మహిళ కూడా ఫిర్యాదు చేయలేదు’ అని బెంగాల్ పోలీసులు ‘ఎక్స్’ (ట్విటర్)లో వెల్లడించారు. అదేవిధంగా నేషనల్ మహిళా కమిషన్ ప్రతినిధులు ఇటీవల సందేశ్‌ఖాలీ పర్యటించారు. వారి విచారణలో స్థానిక మహిళల నుంచి లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు రాలేదన్నారు. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులపై సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బుధవారం కూడా పెద్ద ఎత్తున సందేశ్‌ఖాలీలో మహిళలు నిరసన తెలిపారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్, తన అనుచరులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు తమ భూములు లాక్కోడానికి బెదిరింపులగు దిగుతున్నారని, తమ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రేషన్ కుంభకోణానికి సంబంధించిన కేసులో షాజహాన్ షేక్ ఇంటిపై ఈడీ అధికారులు సోదాలకు ప్రయత్నించగా.. అతని అనుచరులు ఈడీ అధికారుల కారు అద్దాలు పగులగొట్టి దాడికి యత్నించారు. ఈ ఘటన జరినప్పటి నుంచి టీఎంసీ నేత షాజహాన్ షేక్ పరారీలో ఉన్నట్లు సమాచారం. చదవండి: బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ.. రాష్ట్ర అధ్యక్షుడికి గాయాలు -
సీఎం మమతాకు మద్దతుగా! ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల సమస్యను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాశారు. కేంద్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై అవలంభిస్తున్న తీరును నిరసిస్తూ.. సీఎం మమతా బెనర్జీ గతంలో చేసిన డిమాండ్‌కు మద్దతుగా రాహుల్ గాంధీ ప్రధానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘నేను పశ్చిమ బెంగాల్లో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల దుస్థితి తెలపాడానికి లేఖ రాస్తున్నా. నేను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సందర్భంగా బెంగాల్‌లోని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కార్మికుల పరిస్థితి స్వయంగా గమనించారు. వారు కూడా పెద్ద ఎత్తున నా యాత్రలో పాల్గోని తమ సమస్యలపై వినతిపత్రం అందించారు కూడా. ..పశ్చిమ బెంగాల్లో ఉపాధి హామి కార్మికుల ఇబ్బందులను తెలుపుతూ పశ్చిమ్ బంగా ఖేత్ మజ్దూర్ సమితి నాయకులు నాకు వినతిపత్రం అందజేశారు. వారు రాసిన లేఖ ప్రతిని కూడా మీకు జత చేశాను. 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ పథకం కింద విడుదల చేసే నిధులను నిలిపివేయటంతో లక్షలాది పశ్చిమ బెంగాల్ సోదరీ సోదరీమణులు వేతనాలు అందక ఆర్థికంగా చితికి పోతున్నారు.’అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. ఇక.. మమతా బేనర్జీ టీఎంసీ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రం నిధులు విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేశాయి. అఖరికి ఫిబ్రవరి 21 వరకు పెండింగ్‌లో ఉన్న సుమారు 21 లక్షల ఉపాధిహామీ పథకం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు అందజేస్తుందని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. గత ఏదాడి డిసెంబర్లో కూడా సీఎం మమతా.. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించి ప్రధాని మోదీతో భేటీ అయి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’తో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ టీఎంసీ పార్టీ ఒంటిరిగా పోటీ చేస్తుందని సీఎం మమతా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతాను బుజ్జగించే పనిలో భాగంగా తాజాగా అక్కడి గ్రామీణ ఉపాథి హామీ పథకం కార్మికుల నిధులకు విడుదలకు కేంద్రం చేస్తున్న జాప్యం గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. -
‘ప్రజలు ప్రేక్షకులుగా ఉండరు’.. మమతాపై స్మృతి ఇరానీ ఫైర్
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లా సందేశ్ కాళీ ప్రాంతంలో టీఎంసీ నాయకులకు వ్యతిరేకంగా గిరిజన మహిళలు నిరసన తెలుపుతున్నారు. టీఎంసీ సంబంధించిన ఓ నేత తమ ప్రాంతపు మహిళలను తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నాడని అక్కడి గిరిజన మహిళుల రోడ్లెక్కి మరీ తమకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. మమతా తన పార్టీ కార్యకర్తలతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలని ప్రోత్సహిస్తూ.. హిందూ మారణహోమానికి తెరలేపుతోందని ఆరోపించారు. ‘మమతా బెనర్జీకి కేవలం హిందూ మారణహోహమమే తెలుసు. తన పార్టీ కార్యకర్తలు హిందూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలని అనుమతిస్తున్నారు. సందేశ్ కాళీ ప్రాంతంలో హిందూ మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి ఎవరూ? ఇప్పటి వరకు షేక్ షాజాహాన్ ఎవరనీ చర్చించుకుంటున్నారు?. షేక్ షాజాహాన్ ఎక్కడ ఉన్నాడో? సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలి’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. #WATCH | On Sandeshkhali violence, Union Minister Smriti Irani says, "In Sandeshkhali, some women narrated their ordeals to the media... They said TMC goons visited door to door to identify the most beautiful woman in every house. Who is young. The husbands of identified women… pic.twitter.com/hXARkKp1sj — ANI (@ANI) February 12, 2024 టీఎంసీ ఆఫిసులోనే టీఎంసీ కార్యకర్తలు మహిళలపై రాత్రికి రాత్రి అఘాయిత్యాలకు పాల్పడటానికి అనుమతించటం మాటల్లో చెప్పలేనిదని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇలాంటీ దారుణాలు జరుగుతుంటే పౌరులు ఎట్టిపరిస్థితుల్లో మూగ ప్రేక్షకుల వలె ఉండరని టీఎంసీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం మమతా బెనర్జీ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే గిరిజన కూలాలు, తెగలను వాడుకుంటోందని దుయ్యబట్టారు. ఇక.. మమతా బెనర్జీ రాష్ట్ర హోం డిపార్టుమెంట్‌ను తన గుప్పెట్లో పెట్టుకోవటంపై దేశంలో న్యాయం కోసం యాత్ర చేసేవారు కూడా స్పందించకపోవటం దారుణమని కాంగ్రెస్‌ను విమర్శించారు. హిందూవులపై దాడిల విషయంలో ప్రభుత్వం ప్రమేయం ఉందని స్మృతి ఇరానీ ఆరోపించారు. మరోవైపు.. సందేశ్ కాళీ ప్రాంతంలో టీఎంసీ నాయకులపై అక్కడి ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహానికి కారణాలు తెలుసుకొని, పరిస్థితి చక్కదిద్దటానికి టీఎంసీ సీనియర్ నేత పార్థ భౌమిక్ రేపు(మంగళవారం) ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు సమాచారం. చదవండి: ‘బుల్డోజర్ చర్య ఫ్యాషన్ అయింది’.. హైకోర్టు సీరియస్ -
మమతా వర్సెస్ మోదీ: బెంగాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు!
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలు అధిక సీట్ల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ గతంతో పోల్చితే ఈసారి కొంత మెరుగైన ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ‘ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేషన్’ ఎన్నికల ఫలితాల అంచనాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 19 సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. 2019లో ఊహించని విధంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి దాని కంటే ఒక సీటు అదనంగా గెలుస్తుందని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. ఇక.. బెంగాల్లో అధికారంలో టీఎంసీ ఈసారి కూడా 22 స్థానాలకే పరిమితమవుందని వెల్లడించింది. గత పార్లమెంట్లో టీఎంసీ 22 ఎంపీ సీట్లలో విజయం సాధించింది. అయితే 2024 పార్లమెంగ్ ఎన్నికల్లో సైతం 22 స్థానాలు గెలుస్తుందని పేర్కొంది. ఇక.. కాంగ్రెస్ ఈసారిగా కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచి.. మూడు స్థానంలో నిలవనున్నట్లు తెలిపింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఓటు షేరు విషయంలో కూడా ఎన్డీయే కూటమి గతం పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన 40 శాతం.. ఈసారి కూడా సాధిస్తుందని సర్వే స్పష్టం చేసింది. అయితే ఓటు షేరు విషయంతో ఇండియా కూటమి బెంగాల్లో 2019 పార్లమెంట్ ఎన్నికల సాధించిన 57 శాతానికి 4 శాతం తగ్గి.. 53 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. ఈ సర్వే ఫలితాలు గమనిస్తే.. ప్రతిపక్షాల ఇండియా కూటమిపై బెంగాల్ ప్రజలు నమ్మకం కలిగి ఉండరని తెలుసుస్తోంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలక వ్యవహరించే టీఎంసీ అధినేత్రి.. బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 42 పార్లమెంట్ స్థానాలు ఉన్న బెంగాల్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కీలకంగా మారనున్న విషయం తెలిసిందే. -
బిహార్‌లో కూటమిగా పోటీ.. టీఎంసీ మిత్ర పక్షమే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్‌లో కూటమి, సీఎం మమతా బెనర్జీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ఇండియా కూటమి బీజేపీపై పోరాడుతుందని తెలిపారు. బిహార్‌లో ఇండియా కూటమిలో భాగంగా బీజేపీపై పోటీ చేస్తామని అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో కీలకమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్లు తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు గమనిస్తే.. ఆమె ఇండియా కుటమిలో కీలకమైన భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తుందని తెలిపారు. మమతా బెనర్జీ ఇండియా కూటమికి కీలకమైన మిత్రపక్షమని తెలిపారు. ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలిగినప్పటికీ తాము బిహార్‌లో మిగిలిన పార్టీలతో ఇండియా కూటమిలో భాగంగానే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ దిగుతామని వెల్లడించారు. తమ భాగస్వామ్య పార్టీలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగం కాదంటే.. తాను ఎప్పటికీ అంగీకరించలేనని రాహుల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీని ఒంటరిగా ఎదుర్కొంటామని.. లోక్‌సభ ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకుంటామని మమతా బెనర్జీ చెప్పటమే రాహుల్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది. బెంగాల్ మమతా కాంగ్రెస్‌కు ఐదు లోక్ సభ స్థానాలు కేటాయించడానికి సిద్ధపడినా సీపీఎంతో పొత్తు కారణం ఇది సాధ్యం పడదని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలిగిప్పటికీ.. ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల భాగస్వామ్యంతో బలంగానే ఉంది. 40 లోక్‌సభ స్థానాలు ఉన్న బిహార్‌లో ఇండియా కూటమి సాధ్యమైనన్ని సీట్లు గెలవడానికి కాంగ్రెస్ ప్రణళికలు రచిస్తోంది. -
కేంద్రానిది ఆర్థిక ఉగ్రవాదం: టీఎంసీ
కోల్‌కతా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ అధికార పార్టీ టీఎంసీ విరుచుకుపడింది. కేంద్రం ఆర్థిక సమాఖ్య ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ ఆదివారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. తామిచ్చే నిధుల వినియోగానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను బెంగాల్ ప్రభుత్వం అందజేయలేదంటూ కేంద్రం చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీ అధికారంలో ఉన్నందునే రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి విమర్శలు చేస్తోందని ఎంపీ ఒబ్రియాన్ అన్నారు. కాగ్ నివేదికలోని అంశాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ వ్యతిరేక ప్రచారానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుందని పేర్కొన్నారు. -
‘బీజేపీకి మమతా బెనర్జీ భయపడుతున్నారు’
టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు బెంగాల్ రాష్ట పీసీసీ చీఫ్, ఎంపీ అధీర్ రంజన్ చౌధరీ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు పార్లమెంట్లో ఎన్నికల్లో కనీసం 40 సీట్లు కూడా వసస్తాయో? రావో? అనుమానమని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ‘బీజేపీ, మమతా బెనర్జీకి కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడం ఇష్టం లేదు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ టీఎంసీకి అధినేత్రి అయి ఉండి ఇలా ఉండటం దురదృష్టకరం. మమతా బెనర్జీ తనకు తానుగా ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరారు. మమతా బీజేపీకి భయడుతోంది. మరీ ఎందుకు ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు’ అని అధీర్ రంజన్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుంది. కాంగ్రెస్‌తో ఏం కాదని బీజేపీ అంటోంది. మమతా బెనర్జీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు గెలవటం అనుమానం అంటున్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకియాలు చేస్తోందని బీజేపీ, మోదీ అంటున్నారు. మమతా కూడా అవే మాటాలు వ్యాఖ్యాస్తున్నారు’అని దుయ్యబట్టారు. బీజేపీ, మమతా ఎందుకు ఒకే రాగం పడుతున్నారో? చెప్పాలని నిలదీశారు. మమతాకు ఎప్పుడూ రాష్ట్రం తరువాతేనని విమర్శించారు. కానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ముందు దేశం ప్రాధాన్యత అని.. ఆ తర్వాతే ఏదైనా అని తెలిపారు. చదవండి: కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ సవాల్.. అక్కడ గెలిచే దమ్ముందా! -
కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ సవాల్.. అక్కడ గెలిచే దమ్ముందా!
కోల్‌కతా: పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 స్థానాలకు కనీసం 40 సీట్లు అయినా గెలుస్తుందో? లేదో? అనే అనుమానం కలుగుతోందని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ శుక్రవారం ముర్షిదాబాద్‌లో నిర్వహించిన ఓ సభలో పాల్గొని మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ 300 సీట్లకు కనీసం 40 సీట్లలో అయినా గెలుస్తుందో? లేదో? అనుమానం కలుగుతోంది. ఎందుకు కాంగ్రెస్‌కు అంత అహంకాంరం? మీరు బెంగాల్ రండి. అప్పుడు మనమంతా ‘ఇండియా కూటమి’. మీకు దమ్ముంటే బీజేపీని వారణాసిలో ఓడించండి. మీరు గతంలో గెలిచిన స్థానాల్లో ఈసారి ఓడిపోవటం ఖాయం!’ అని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘మేము యూపీలో గెలవము. మీరు రాజస్థాన్‌లో గెలవరు. ముందు రాజస్థాన్‌కు వెళ్లి అక్కడ గెలవండి. మీరు వారణాసి, అలహాబాద్‌లో గెలిచి మీ ధైర్యం చూపండి. మీ పార్టీ శక్తి, సామర్థ్యాలు ఏంటో నిరూపించుకోండి!’ అని సవాల్ విసిరారు మమతా బెనర్జీ. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రపై మమతా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ బెంగాల్ బీడీ కార్మికులతో మాట్లాడిన విషయంపై ప్రస్తుతం కొత్త స్టైల్ నడుస్తోందని.. అది ఫొటోషూట్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు కానీసం చాయ్ దుకాణం దగ్గరు వెళ్లని వారు.. నేడు మాత్రం బీడీ కార్మికుల వద్దకు వెళ్లారని అటువంటివారు బెంగాల్లో వలస పక్షులని మండిపడ్డారామె. ఇండియా కూటమి నుంచి వైదొలిగిన మమతా బెనర్జీ.. బెంగాల్లో తాము ఒంటరి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ రెండు సీట్లు కేటాయిస్తామని తెలిపిన మమతా.. తర్వాత ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపింది. -
'హేమంత్ సొరెన్‌కు అండగా నేనున్నా'
కోల్‌కతా: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ అరెస్టును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. హేమంత్ సొరెన్ శక్తివంతమైన గిరిజన నాయకుడని అన్నారు. సొరెన్ తన సన్నిహిత మిత్రుడని చెప్పారు. సొరెన్‌కు మద్దతుగా నిలుస్తానని ట్వీట్ చేశారు. "శక్తివంతమైన ఆదివాసీ నాయకుడైన హేమంత్ సొరెన్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. బీజేపీ మద్దతు ఉన్న కేంద్ర ఏజెన్సీల ప్రతీకార చర్య. ప్రజాభిప్రాయంతో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అణగదొక్కడానికి కుట్ర జరుగుతోంది. ఈ క్లిష్ట సమయాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి సొరెన్ పక్షాన నిలబడతానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఈ యుద్ధంలో ప్రజలు అద్భుతమైన స్పందన అందజేస్తారు. విజయం సాధిస్తారు." అని మమతా బెనర్జీ ట్వీట్టర్(ఎక్స్) లో పేర్కొన్నారు. హేమంత్ సొరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు పార్లమెంట్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి నిరసన వ్యక్తం చేసింది. సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. టీఎంసీకి చెందిన ఎంపీలు కూడా పార్లమెంట్ రెండు సభల నుంచి వాకౌట్ చేశామని ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. రాష్ట్ర మాజీ హేమంత్ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. అలాగే సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును హేమంత్ సొరెన్ ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. ఇదీ చదవండి: హేమంత్ సొరెన్‌కు ఐదు రోజుల కస్టడీ -
ఒక్క సీటు కూడా ఇవ్వను.. కాంగ్రెస్‌పై మమత ఫైర్
కోల్‌కతా: ఇండియా కూటమిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. టీఎంసీతో పొత్తు కావాలంటే సీపీఎంతో తెగదెంపులు చేసుకోవాలని అన్నారు. సీట్ల పంపకాల్లో రెండు సీట్ల ప్రతిపాదనను కాంగ్రెస్ తీరస్కరించింది.. కానీ ఇప్పుడు ఒక్క సీటు కూడా ఇవ్వనని తెగేసి చెప్పారు. 'గతంలోనూ పలు సందర్భాల్లో సీపీఎం నాపై భౌతిక దాడి చేసింది. నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టారు. నా శ్రేయోభిలాషుల ఆశీస్సుల వల్లే బతికి ఉన్నాను. వామపక్షాలను ఎప్పటికీ క్షమించలేను. సీపీఎంను క్షమించలేను. కాబట్టి ఈరోజు సీపీఎంతో ఉన్నవాళ్లు బీజేపీతో కూడా ఉండొచ్చు. నేను వారిని క్షమించను.' అని మమతా బెనర్జీ మాల్డాలో ఏర్పాటు చేసిన సభలో అన్నారు. 'అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని కాంగ్రెస్‌కు చెప్పాను. రెండు పార్లమెంట్ స్థానాలు ఇస్తాం. మీ అభ్యర్థులను మేమే గెలిపించుకుంటాం అని చెప్పాం. కానీ వారికి ఎక్కువ సీట్లు కావాలి. నేను కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వను. మీరు వామపక్షాలను విడిచిపెట్టే వరకు మా వద్దకు రాకండి" అని మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్‌తో పొత్తు ఉండబోదని సీపీఎం గతంలోనే తేల్చి చెప్పింది. బెంగాల్లో బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీపీఎం ఉంటాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. అటు.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధరి కూడా మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీఎంసీతో పొత్తు ఉండబోదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, టీఎంసీ మధ్య పొత్తు కుదిరే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇదీ చదవండి: భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కారు అద్దాలు ధ్వంసం -
‘రాహుల్ యాత్రకు బెంగాల్లో కూడా అడ్డంకులు’
కోల్‌కతా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు సంబంధించిన మీటింగ్‌లకు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) ప్రభుత్వం అనుమతి ఇవ్వటంలేదని రాష్ట్ర కాంగెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ‘కొన్నిచోట్ల ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ కావాలని రోడ్డు అడ్డగింపు వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. బహిరంగ సమావేశాలకు కొన్ని ప్రాంతాల్లో అనుమతి లభించటం లేదు. అస్సాంతో సహా.. ఈశాన్య భారతంలో ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ పలు సమస్యలను ఎదుర్కొటోంది. ప్రస్తుతం టీఎంసీ ప్రభుత్వం ఉన్న పశ్చిమ బెంగాల్లో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాం’ అని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి అన్నారు. అయితే తాము పశ్చిమ బెంగాల్ కొన్ని చోట్ల రాహుల్ యాత్రకు మినహాయింపులు లభిస్తాయని భావిస్తున్నామని తెలిపారు. అయితే అధికార యంత్రాంగం మాత్రం అనుమతి ఇవ్వటం లేదని విమర్శించారు. అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను టీఎంసీ ఎంపీ శంతను సేన్ తీవ్రంగా ఖండించారు. పశ్చిమ బెంగాల్‌లోని అధికార యంత్రాంగం రాజకీయ ప్రలోభాలకు లోనుకాకుండా వ్యవహరిస్తోందని కౌంటర్ ఇచ్చారు. ‘బెంగాల్లో ‘ఇండియా కూటమి’ ఉనికి కోల్పోవటానికి అధీర్ రంజన్ బాధ్యత వహించాలి. అన్ని ప్రతిపక్ష పార్టీలు బెంగాల్లో సమావేశాలు నిర్వహించుకున్నా..ఎవరికీ ఇబ్బందులు కలగవు. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది’ అని శంతను సేన్ అన్నారు. ఇక.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేయటానికి కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ కారణమని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అధీర్ రంజన్.. బీజేపీ వారిలా మాట్లాడేవారని మండిపడ్డారు. రాహుల్ యాత్ర గురువారం అస్సాం నుంచి బెంగాల్‌లోని కూచ్‌బెహర్ జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడి కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అయితే రోడ్డు షోలో పాల్గొన్న అనంతరం ఆయన మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం, శనివారం ఆయన తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక.. 28వ తేదీన మళ్లీ యాత్ర ప్రారంభంకానుంది. మరుసటి రోజు రాహుల్ యాత్ర బిహార్‌లో ప్రవేశించనుంది. అటుపై 31న పశ్చిమ బెంగాల్లోకి వెళ్లనుంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్.. పశ్చిమ బెంగాల్ వెళ్లటం ఇదే తొలిసారి. అందుకే రాహుల్ యాత్రపై టీఎంసీ అడ్డంకులు సృష్టించనుందని అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చదవండి: ‘ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమారే ప్రధాని!’ -
కాంగ్రెస్‌తో పొత్తుకు టీఎంసీ చెల్లు.. అసలు కారణాలేంటి?
కోల్‌కతా: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. సీట్ల పంపకంలో ప్రతిపాదనలన్నింటినీ కాంగ్రెస్ తిరస్కరించిందని పేర్కొన్న దీది.. బెంగాల్‌లోని 42 స్థానాల్లో తృణమూల్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు ఈ ప్రకటన వచ్చింది. దీంతో కొద్దిరోజులుగా మమతా బెనర్జీ, కాంగ్రెస్ మధ్య స్నేహం బీటలు వారినట్లయింది. పరస్పర ఆరోపణలు.. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్, తృణమూల్ మధ్య విభేదం ఇదే మొదటిసారి కాదు. గత రెండు నెలలుగా జరుగుతున్న పరస్పర ఆరోపణల తర్వాత మమతా బెనర్జీ నుంచి నేడు ఈ ప్రకటన వచ్చింది. ఇండియా కూటమితో సీట్ల పంపకంపై విభేదాలు అప్పుడప్పుడు బహిరంగంగానే బయటకొచ్చాయి. మమతా బెనర్జీని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి తీవ్రంగా విమర్శించేవారు. ఆమెపై ఈ మధ్య విమర్శల స్థాయిని పెంచారు. ఒకానొక సందర్భంలో ఆమెను అవకాశవాది, దలాల్ అని దుయ్యబట్టారు. నిజానికి, జాతీయ స్థాయిలో మమతా బెనర్జీతో కాంగ్రెస్ పొత్తు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఎప్పుడూ కలవరపెడుతోంది. సోనియా గాంధీతో మమతా బెనర్జీ మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉండగా.. అధిర్ చౌదరి, అబ్దుల్ మన్నన్ నేతృత్వంలోని బెంగాల్ కాంగ్రెస్ వర్గం.. మమతపై విమర్శలకు దిగేది. తృణమూల్ తమ నాయకులను దూరం చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వర్గం ఎప్పుడూ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి తృణమూల్ ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. నిజానికి తృణమూల్‌తో పొత్తు పెట్టుకోవడానికి అధిర్ రంజన్ చౌదరి మొదట్లో సానుకూలంగా లేరు, వామపక్షాలతో కలిసి వెళ్లాలని భావించారు. గతంలో చేతులు కలిపారు.. కానీ.. గతంలోనే కాంగ్రెస్, టీఎంసీ చేతులు కలిపారు. ఈ రెండు పార్టీలు గతంలో 2001 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, 2009 లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. ముఖ్యంగా 2011లో టీఎంసీ, కాంగ్రెస్ కూటమి.. బెంగాల్లో 34 సంవత్సరాల తర్వాత సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి దారితీసింది. అయితే, ఈసారి లోక్‌సభ ఎన్నికలకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అసమ్మతికి మొదటి సంకేతం.. బెంగాల్‌లోని 42 సీట్లలో రెండింటిలో పోటీ చేయాలని కాంగ్రెస్‌ను తృణమూల్ కాంగ్రెస్ కోరింది. కనీసం 8-10 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడింది. తృణమూల్ అభ్యర్థనను తిరస్కరించడం రెండు పార్టీల మధ్య అసమ్మతికి మొదటి సంకేతం. ఈ రెండు స్థానాల్లో.. అధిర్ రంజన్ కంచుకోట బెర్హంపూర్, 2019లో కాంగ్రెస్ గెలిచిన మాల్దా సౌత్‌లు ఉన్నాయి. టీఎంసీ సీట్ల షేరింగ్ ఫార్ములా 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పార్టీల పనితీరు ఆధారంగా సీట్ల షేరింగ్ ఫార్ములా ఉండాలని మమతా బెనర్జీ కోరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు శాతం కంటే తక్కువ ఓట్లను సాధించిందని, ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని తృణమూల్ పేర్కొంది. కాంగ్రెస్ "పెద్దన్న" అధికారాన్ని విడనాడాలని, ప్రాంతీయ పార్టీలు తమ బలమైన స్థానాల్లో ఎన్నికలను ఎదుర్కోవాలని టీఎంసీ అధిష్టానం ప్రతిపాదించింది. మోగిన ప్రమాద ఘంటికలు.. అయితే.. గత వారం తృణమూల్ నేతలతో జరిగిన సమావేశం అనంతరం అధిర్ రంజన్ చౌదరి బెర్హంపూర్తో సహా మొత్తం 42 స్థానాల్లో పార్టీ పోటీ చేయాలని నిర్ణయించారు. ఇది కాంగ్రెస్‌లో ప్రమాద ఘంటికలు మోగించింది. మమతా బెనర్జీ సహాయం లేకుండానే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ పరిణామాల తర్వాత మమతా బెనర్జీని రాహుల్ గాంధీ శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కొన్ని సార్లు స్థానిక నాయకులు తెలియక ఏదో మాట్లాడుతారు.. అవన్ని పట్టించుకోవద్దు అని చెప్పారు. మమతా బెనర్జీ తనకు మంచి సన్నిహితురాలని చెప్పుకొచ్చారు. మళ్లీ చిగురించలేని స్థాయికి.. అయితే.. ఈ పరిణామాల అనంతరం ఇండియా కూటమికి మమతా బెనర్జీ స్వస్తి పలికారు. దీంతో జనవరి 25న పశ్చిమ బెంగాల్లో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో తృణమూల్ కాంగ్రెస్ చేరే అవకాశం లేదు. మమతా బెనర్జీ ప్రకటన తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ స్పందించారు. టీఎంసీ లేని ఇండియా కూటమిని ఊహించలేమని చెప్పారు. అయితే.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, తృణమూల్ స్నేహం మళ్లీ చిగురించలేని స్థితికి చేరిందని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇండియా కూటమికి డబుల్ షాక్! -
మహువా అవినీతి కేసు: జై అనంత్ దేహద్రాయ్కు సీబీఐ సమన్లు
న్యూఢిల్లీ: టీఎంసీ నేత, బహిష్కృత లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా అనివీతి కేసులో వాదనలు వినిపిస్తున్న సుప్రీం కోర్టు లాయర్ జై అనంత్ దేహద్రాయ్కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం సమన్లు జారీ చేసింది. మహువా అవినీతి కేసుకు సంబంధించి గురువారం విచారణకు హాజరు కావాలని సీబీఐ పేర్కొంది. పార్లమెంట్లో అడిగే ప్రశ్నలకు డబ్బులు తీసుకున్న కేసులో మహువా డిసెంబర్లో లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. కేంద్రం, అదానీ సంస్థలపై విమర్శలు చేయడానికి మహువా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పదం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై పార్లమెంట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. చివరకు ఎథిక్స్ కమిటీ నిర్ణయం మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరించారు. ఎంపీ హోదాలో ఆమెకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ (DEO) కూడా ఇటీవలే నోటీసులు పంపింది. అయితే తనకు ఆ బంగ్లాను కొనసాగించాలని మహువా కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆమె ఎదురుదెబ్బ తగలటంతో తన కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. చదవండి: రాహుల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు.. అస్సాంలో ఉద్రిక్తత -
కాంగ్రెస్‌కు షాక్.. అన్ని స్థానాల్లో టీఎంసీ అభ్యర్థుల పోటీ!
కోల్‌కతా: కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి కూటమిలో కీలకమైన భాగస్వామ్య పార్టీగా వ్యవహరిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 2019లో కాంగ్రెస్ పార్టీ తరఫున బెర్హంపూర్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అధీర్ రంజన్ చౌదరీ గెలుపొందిన విషయం తెలిసిందే. బెర్హంపూర్ సెగ్మెంట్లో కూడా టీఎంసీ తమ పార్టీ అభ్యర్థిని పోటీలో నిలబెడుతామని యోచిస్తున్నట్లు సమాచారం. ‘ఇండియా కూటమీ’ లో భాగస్వామ్య పార్టీ అయిన టీఎంసీ.. మొదటి నుంచి పశ్చిమ బెంగాల్లో సీట్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లను ఇవ్వడానికి సిద్ధమని పేర్కొంది. అయితే అనూహ్యంగా అన్ని స్థానాల్లో(42) టీఎంసీ తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎంసీ తీసుకోబోయే నిర్ణయంపై కాంగ్రెస్, ‘ఇండియా కూటమి’లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఎంసీ 22, బీజేపీ18, కాంగ్రెస్ పార్టీ 2 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: ‘జమిలి ఎన్నికలు.. సమాఖ్య విధానానికి, రాజ్యాంగ మూలాలకు వ్యతిరేకం’ -
TMC: నేతల్లో అంతరాలు లేవు.. మమతా నాయకత్వంలోనే..
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలో తమ పార్టీ నేతలందరూ ఐకమత్యంతో ఉన్నారని ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఇటీవల టీఎంసీలో సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అటువంటి అంతరాలు తమ పార్టీ నేతల్లో లేవని సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలో తామంతా పనిచేస్తున్నామని అభిషేక్ స్పష్టం చేశారు. ఆయన 24 పరగణాల నియోజవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను పార్టీలో క్రియాశీలకంగా ఉండటం లేదని వస్తున్న వార్తలు కూడా అసత్యమని, పూర్తిగా ఆధారాలు లేనివని అన్నారు. తమ పార్టీలో సీనియర్, జూనియర్ నాయకులు అనే అంతరాలు ఎక్కడా లేవని తెలిపారు. తాము అంతా కలిసికట్టుగా సీఎం మమతా నాయకత్వంలోనే పని చేస్తున్నామని అభిషేక్ పేర్కొన్నాము. ఇక.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న సమయంలో తన నియోజకవర్గంలో ప్రచారంపై దృష్టి పెట్టానని తెలిపారు. అంతే కానీ, తాను పార్టీ కార్యకలాపాలకు ఎప్పుడూ దూరంగా లేనని వెల్లడించారు. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ.. తనకు అప్పగించే ఏ బాధత్యనైనా పార్టీ కోసం తప్పకుండా పాటిస్తానని అన్నారు. చదవండి: దుండగుల కాల్పుల్లో టీఎంసీ నేత దారుణ హత్య -
దుండగుల కాల్పుల్లో టీఎంసీ నేత దారుణ హత్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC)నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆదివారం మధ్యాహ్నం జరిపిన కాల్పుల్లో టీఎంసీ నేత స్థాయన్ చౌదరి మృతి చెందారు. గుర్తు తెలియని దుండగులు గుంపుగా బైకులపై వచ్చి స్థాయిన్ చౌదరిపై కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ను స్థానిక అస్పత్రికి తరలించగా.. అప్పటకే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన బెంగాల్‌లోని బహారామ్‌పూర్‌లో జరిగింది. ప్రస్తుతం ఆయన టీఎంసీలో ముర్షిదాబాద్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: జార్ఖండ్ సీఎంకు ఏడోసారి ఈడీ నోటీసులు.. ఆయన సోదరి ఫైర్ -
ఈడీ అధికారులపై దాడి.. బెంగాల్ గవర్నర్ ఫైర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులపై జరిగిన దాడిని ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందా బోస్ తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ఘటనతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీ బీపీ గోపాలికాను వివరణ ఇవ్వాలన్నారు. ఉత్తర 24 పరగణాలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత షాజహాన్ షేక్ నివాసంపై ఈడీ అధికారులు సోదాలు చేయడినికి వెళ్లగా.. ఆయన మద్దతుదారులు ఈడీ అధికారులపైకి దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. రేషన్ పంపిణీ కుంభకోణంలో షాజహాన్‌కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో శుక్రవారం ఈడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేపట్టాలనుకున్నారు. ఈడీ సోదాలు.. షాజహాన్ మద్దతుదారులతో దాడులతో ఆందోళనకంగా మారాయి. ఈడీ అధికారులపై జరిగిన దాడిపై రాష్ట్రం గవర్నర్ ఆనందా బోస్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ దాడులకు మమతా బెనర్జీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ హింస బాధ్యత మొత్తం ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించాలని లేకపోతే తీవ్రమైన పరిణామాను ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు. ఈడీ అధికారులపై జరిగిన దాడి ఘోరమైన చర్య అని మండిపడ్డారు. ఈ ఘటన దుర్భరమైన పరిస్థితులకు దారి తీస్తోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని అనాగరిక విధ్వంసం నుంచి కాపాడాలని అన్నారు. ఇటువంటి విధ్వంసాలనను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలైమైతే.. రాజ్యాంగబద్దంగా తనకు ఉండే అధికారలతో తాను చర్యలు తీసుకుంటానని అన్నారు. West Bengal Governor CV Ananda Bose says, "It is a ghastly incident. It is alarming and deplorable. It is the duty of a civilised government to stop barbarism and vandalism in a democracy. If a govt fails in its basic duty, then the Constitution of India will take its course. I… pic.twitter.com/CH7Q12Qx7R — ANI (@ANI) January 5, 2024 అయితే ఈడీ అధికారులపై జరిగిన దాడులను ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులపై దాడు చేయటం అనేది సిగ్గుపడవల్సిన ఘటన అని దుయ్యబట్టారు. నెలరోజుల నుంచి ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS)లో పంపిణీ చేయాల్సిన సరుకులను సుమారు 30 శాతం దాకా లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రేషన్ పంపిణీని పక్కదారి పట్టించడంలో మిల్లర్లు, పజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారులు కుమ్మకైనట్లు ఈడీ ఆరోపిస్తుంది. చదవండి: రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం: మాజీ పిటిషనర్ ఇక్బాల్‌కు ఆహ్వానం -
మమతా బెనర్జీపై అధీర్ రంజన్ చౌధరి కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: ఇండియా కూటమిలో చీలిక మరోసారి బయటపడింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సేవ చేయడంలో మమతా బెనర్జీ బిజీగా ఉన్నారని ఆరోపించారు. మమతా బెనర్జీతో కాంగ్రెస్ పొత్తు కోరుకోవడం లేదని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయగలదని చెప్పారు. "మేము భిక్ష అడగలేదు. మమతా బెనర్జీ స్వయంగా తనకు పొత్తు కావాలని చెప్పారు. మమతా బెనర్జీ దయ మాకు అవసరం లేదు. మేము సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ప్రధాని మోదీకి మమతా బెనర్జీ సేవ చేయడంలో బిజీగా ఉన్నందున ఆమెతో పొత్తులు కోరుకోవడం లేదు.' అని అధీర్ రంజన్ చౌధరి అన్నారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఎంసీ పొత్తు గురించి అడినప్పుడు అధీర్ రంజన్ చౌధరి ఈ మేరకు స్పందించారు. వివరాల ప్రకారం.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌కు టీఎంసీ రెండు సీట్లను ఆఫర్ చేస్తోంది. ఇండియా కూటమిలో ఉన్న ఈ రెండు పార్టీలు సీట్ల పంపకాల్లో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధీర్ రంజన్ చౌధరి వివాదాస్పద వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీని గద్దె దింపే ధ్యేయంతో ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమిలో టీఎంసీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును టీఎంసీనే మొదట సూచించింది. అటు.. కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇదీ చదవండి: 'నెహ్రూ అలా చేసి ఉంటే..' చైనాతో బంధంపై జైశంకర్ వ్యాఖ్యలు -
మహువా పిటిషన్: లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సుప్రీం కోర్టు నోటీసు
ఢిల్లీ: పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరించబడిన విషయం తెలిసందే. లోక్‌సభ నుంచి తనను బహిష్కరించిన విషయంలో ఆమె సూప్రీం కోర్టును ఆశ్రయించారు. బుధవారం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా .. లోక్ సభ మహువా మొయిత్రిపై వేసిన సస్పెన్షన్ వేటుకు సంబంధించి స్టే ఇవ్వాలన్న ఆమె పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. మహువా మోయిత్రా వేసిన పిటిషన్‌పై రెండు వారాల్లోగా పూర్తి సమాధానం అందించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటిసు ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మార్చి మూడో వారానికి వాయిదా చేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. డిసెంబర్లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రాను ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఎంపీగా కొనసాగకూడదని లోక్ సభ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో ఆమె ప్రవర్తన అనైతికమని ఎథిక్స్ కమిటీ తేల్చి చేప్పింది. కాగా.. తనను ఎంపీగా సస్పెండ్‌పై చేయడంపై మహువా సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: మీతోనే ఉంటానంటూ శివరాజ్ సింగ్ భావోద్వేగం -
Derek O'Brien: ‘పార్లమెంట్ చీకటి గదిలా మారింది’
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రయిన్‌పై కేంద్ర ప్రభుత్వం విమర్మలు గుప్పించారు. పార్లమెంట్ భద్రత వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం మౌనం దాల్చడం వల్ల పార్లమెంట్ భవనం.. లోతైన ఒక చికటి గదిలా మారిందని అన్నారు. 2001లో పార్లమెంట్ భద్రత వైఫల్యం చోటుచేసుకున్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన మంత్రి లోక్‌సభలో, హోం మంత్రి రాజ్యసభలో సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. అదే విధంగా అప్పటి ప్రభుత్వం మూడు రోజుల పాటు సూదీర్ఘంగా చర్చ జరిగిపిందని లెలిపారు. కానీ.. 2023లో చోటు చేసుకున్న పార్లమెంట్ అలజడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మౌనం వీడలేదని మండిపడ్డారు. అదీకాక, ఈ ఘటనపై చర్చ జరగాలని కోరినందుకు ఏకంగా ఉభయ సభలల్లో 146 మంది ఎంపీని సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. దీనిపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయలేదని మండిపడ్డారు. దీంతో పార్లమెంట్ భవనం లోతైన చీకటి గదిగా మారిందని అన్నారు. 2001 Parliament attack: In 3 working days, a full discussion in Parliament. PM gave statement in Rajya Sabha, Home Minister in Lok Sabha 2023 breach: GOVT SILENT. 146 MPs suspended for demanding discussion & statement from Home Min Parliament turned into a deep, dark chamber — Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) December 27, 2023 డిసెంబర్ 13న ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ లోపల, మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల రంగు గొట్టాలతో పొగ విడుదల చేసి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై హోం మంత్రి సమాధానం చెప్పాలని ప్రతిక్షాలు పట్టుబట్టగా.. లోక్ సభలో 100, రాజ్య సభలో 46 మంది సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. -
రామ మందిర వేడుకకు మమతా బెనర్జీ దూరం?
కోల్‌కతా: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూరంగా ఉండనున్నట్లు సమచారం. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి ప్రతినిధిని పంపే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2024లో లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు బీజేపీ ఇప్పటికే ఆహ్వానాలను పంపించింది. దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో సహా దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతలకు కేంద్రం ఆహ్వానాలు పంపించింది. ఈ క్రమంలో రామమందిర కార్యక్రమాన్ని లోక్‌సభ ఎన్నికల ప్రచారంగా బీజేపీ వాడుకోనుందని టీఎంసీ ఆరోపిస్తోంది. అటు.. రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని సీతారాం ఏచూరి తిరస్కరించారు. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ లు హాజరు కానున్నారు. వీరితో పాటు దాదాపు 6,000 మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇదీ చదవండి: మోదీ యూట్యూబ్ సబ్స్రైబర్లు 2 కోట్లు -
‘మమతా కంటే.. లెఫ్ట్ పార్టీల పాలన మేలు’
కోల్‌కతా: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. బెంగాల్ మమతా బెనర్జీ పాలన కంటే గతంలో పాలించిన కమ్యూనిస్టు పార్టీల పాలనే బాగుండేదని ఎద్దేవా చేశారు. మంగవారం కోల్‌కతాలో బీజేపీ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తృణమూళ్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. బెంగాల్లో మమతా పాలనలో అక్రమ వలసలు, గోవుల ఆక్రమ రవాణా పెరిగిపోయని మండిపడ్డారు. బెంగాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు మమతా బెనర్జీ ఆగడాలకు స్వస్తి పలుకుతామని అన్నారు. దీదీ పాలన కంటే 34 ఏళ్లు పాలించిన కమ్యూనిస్టుల పాలన బాగుండేదని అమిత్ షా అన్నారు. ఇదే విషయాన్ని బెంగాల్ ప్రజలు సైతం అనుకుంటున్నారని తెలిపారు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయడం బీజేపీ నిబద్దతకు నిదర్శనమని తెలిపారు. ఎట్టిపరిస్థిల్లో సీఏఏను అమలు చేసి తీరుతామని తెలిపారు. బెంగాల్ మమతా బెనర్జీ సీఏఏ విషయంలో ప్రజలను మరింత గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లు-2019.. పాకిస్తాన్, బంగ్లాదేశ్,ఆఫ్గానిస్తాన్ల్లో మతపరమైన వేధింపులు ఎందుర్కొని భారత్‌కు వచ్చే ముస్లియేతరలకు భారత పౌరసత్వం కల్పించనున్న విషయం తెలిసిందే. -
‘వెయ్యి సార్లు చేస్తా.. జైల్లో వేసిన వెనకాడ’
కోల్‌కతా: అనుకరించడం ఓ కళ అని, అనుకరించడాన్ని తాను అలాగే కొనసాగిస్తూ ఉంటానని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బేనర్జీ అన్నారు. అయితే పార్లమెంట్ భద్రత వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి మాట్లాడాలని విపక్ష ఎంపీలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పలవురు ప్రతిపక్ష ఎంపీలు కూడా సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్‌పై విపక్ష ఎంపీలు పార్లమెంట్ బయట నిరసన తెలిపాయి. నిరసనలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ హావభావాలను టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వ్యంగ్యంగా అనుకరించిన తెలిసిందే. ఈ వ్యవహారంపై మరోసారి ఎంపీ కల్యాణ్ బేనర్జీ స్పందింస్తూ.. మరోసారి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను అనుకరించారు. తాను ఇలాగే అనుకరించడం కొనసాగిస్తానని అన్నారు. అది ఒక కళారూపమని తెలిపారు. అవరమైతే వెయ్యిసార్లు అయినా ఇలానే అనుకరిస్తానని పేర్కొన్నారు. తన భావాలను వ్యక్తం చేయడానికి అన్ని రకాలుగా ప్రాథమిక హక్కులు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో జైలులో వేసినా తాను వెనకడుగు వెయనని తేల్చి చెప్పారు. ఎటువంటి ప్రాధాన్యత లేని ఈ విషయాన్ని ధన్‌ఖడ్ పెద్దది చేస్తున్నాడని విమర్శించారు. చదవండి: వికసిత్ భారత్‌ను నిజం చేయండి: మోదీ కల్యాణ్ బెనర్జీ చేసిన అనుకరణ తనను ఎంతగానో బాధించిందని, ఇలా చేయడం తనను, తన కులాన్ని అవమానించడమేనని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు ధన్‌ఖడ్‌ను అనుకరించినందుకు అదే రోజు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై కేసు నమోదైంది. అభిషేక్ గౌతమ్ అనే ఓ న్యాయవాది ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. कल्याण बनर्जी ने फिर की जगदीप धनखड़ की मिमिक्री ◆ संसदीय क्षेत्र श्रीरामपुर में एक सभा के आयोजन के दौरान की मिमिक्री ◆ कहा-"उपराष्ट्रपति धनखड़ अपने पद की संवैधानिक गरिमा को नष्ट कर रहे" TMC MP Kalyan Banerjee | #JagdeepDhankar #KalyanBanerjee pic.twitter.com/fkl79gxiUu — News24 (@news24tvchannel) December 24, 2023 -
మమతా బెనర్జీ, కేజ్రీవాల్ కీలక భేటీ
ఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి సమావేశానికి ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి మీటింగ్‌కు గంటల ముందు ఈ సమావేశం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. డిసెంబర్ 19 (మంగళవారం)న న్యూఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతిపక్ష కూటమి మొదటిసారి సమావేశం కానుంది. డిసెంబర్ 20న బుధవారం ఉదయం 11 గంటలకు ప్రధానితో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ భేటీ కానున్నారు. కేంద్రం నుంచి పశ్చిమ బెంగాల్‌కు పెండింగ్‌లో ఉన్న నిధుల అంశంపై ఆమె చర్చించనున్నారు. ఇండియా కూటమి భేటీ మొదట డిసెంబర్ 6న నిర్ణయించారు. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా కీలక నేతలు గౌర్హాజరు కారణంగా డిసెంబర్ 17కు వాయిదా వేశారు. డిసెంబర్ 17న కూడా వివిధ కారణాలతో మరోమారు ఇండియా కూటమి భేటీ వాయిదా పడింది. డిసెంబర్ 19న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కావునా రేపు ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు భేటీ అవుతున్నారు. ఇదీ చదవండి: Delhi Liquor Scam Case: కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు -
మహువా మెయిత్రా పిటిషన్‌పై సుప్రీంలో నేడు విచారణ
ఢీల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. క్యాష్ ఫర్ క్వారీ ఆరోపణలతో తన ఎంపీ సభ్యత్వం రద్దును సుప్రీంకోర్టులో ఆమె సవాల్ చేశారు. కేంద్రంపై విమర్శలు చేయడానికి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పందం చేసుకున్నట్లు మెయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. కేంద్రం, అదానీ సంస్థలపై విమర్శలు చేయడానికి టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మొదటిసారి పార్లమెంట్లో ఈ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో పెద్ద చర్చే జరిగింది. ఈ అంశం చివరికి ఎథిక్స్ కమిటీకి చేరింది. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడగడానికి మహువా అనైతిక చర్యకు పాల్పడినట్లు ఎథిక్స్ కమిటీ నిర్దారిచింది. మెయిత్రా తన లోక్‌సభ పోర్టల్ లాగిన్ వివరాలను వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో పంచుకున్నట్లు ఎథిక్స్ కమిటీ గుర్తించింది. ఈ 'క్యాష్-ఫర్-క్వారీ' కుంభకోణంలో ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ నివేదిక సిఫార్సు చేసింది. దీంతో డిసెంబర్ 8న ఆమె తన ఎంపీ పదవిని రద్దు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆమె మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. ఎథిక్స్ కమిటీ తన వాదనను వినిపించుకోలేదని మహువా ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ఎంపీ పదవి రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసు సూత్రధారి లలిత్ ఝా అరెస్టు -
Parliament : టీఎంసీ ఎంపీ సస్పెండ్
ఢిల్లీ: పార్లమెంట్ భద్రత వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్లోగన్స్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పార్లమెంట్లో బుధవారం చోటచేసుకున్న ఘటనపై కేంద్ర మంత్రి ఆమిత్ షా స్పందించాలని రాజ్యసభలో టీఎంసీ ఎంపీలు పట్టుబాట్టారు. ఈ క్రమంలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రయిన్‌పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేసినట్లు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. రాజ్యసభలో ‘వికృతమైన ప్రవర్తన’కు గాను ఎంపీ డెరెక్‌ను ఈ పార్లమెంట్ శీతాకాల సమాశాలకు సస్పెన్షన్ విధించినట్లు వెల్లడించారు. అమిత్ షా జవాబు ఇవ్వాలని.. ఆందోళన చేపట్టిన డెరెక్ ఓబ్రెయిన్ వెంటనే రాజ్యసభను వదిలి వెళ్లాలని రాజ్యసభ ఛైర్మన్ ఆదేశించారు. ఎంపీ డెరెక్... రాజ్యసభ చైర్‌ను ధిక్కరించారని, సభ నియమ నిబంధనలు ఉల్లంగించారని అన్నారు. ఇది తీవ్రమైన దుష్ప్రవర్తన కిందకు వస్తుందని.. సిగ్గు పడాల్సిన ఘటన అని ఆయన్ను సెస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తెలిపారు. ఈ సస్పెన్షన్ వేటు.. శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతోందని తెలిపారు. Rajya Sabha adopts motion for suspension of TMC MP Derek O' Brien for the remainder part of the winter session for "ignoble misconduct" pic.twitter.com/A3MVk0Top9 — ANI (@ANI) December 14, 2023 మరోవైపు.. పార్లమెంటులో అడుగడుగునా ఆంక్షలు విధించారు. లోక్‌సభలో పార్లమెంట్ భద్రత వైఫల్యంతో సిబ్బంది.. ప్రతిబంధకాలు విధించింది. పార్లమెంటుకు వెళ్లే అన్ని మార్గాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పోలీస్, ప్యారా మిలిటరీ, పార్లమెంటు స్పెషల్ సెక్యూరిటీ గార్డులతో పహార ఏర్పాటు చేశారు. సందర్శకుల అన్ని రకాల పాసులు రద్దు చేశారు. ఎంపీలు ప్రవేశించే మకర ద్వారం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలని మీడియాపై ఆంక్షలు విధించారు. ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు ఎనిమిది మందిని పార్లమెంట్ సెక్రటేరియట్ సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. చదవండి: Parliament: నీలం ఆజాద్ ‘ఆందోళన జీవీ’: బీజేపీ ఎంపీ -
‘బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేసింది.. ఆమె గెలిచి వస్తుంది’
ఢిల్లీ: పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై వేటు పడిన విషయం తెలిసిందే. ఆమెను లోక్ సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్లమెంట్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ క్రమంలో సభలో ఉన్న ప్రతిపక్ష ఎంపీలందరూ ఆమెకు మద్దతుగా సభ నుంచి వాకౌట్ చేశారు. #WATCH | "This is vendetta politics of BJP. They killed democracy....It is injustice. Mahua will win the battle. The people will give justice. They (BJP) will be defeated in the next election," says TMC chairperson Mamata Banerjee. pic.twitter.com/Y88F8YhNwK — ANI (@ANI) December 8, 2023 ఇక ఈ వ్యహారంపై టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీవి ప్రతీకార రాజకీయాలని మండిపడ్డారు. బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని దుయ్యబట్టారు. బీజేపీ తమ పార్టీ ఎంపీపై వ్యవహరించిన తీరు చాలా అన్యాయమని అన్నారు. మహువా మెయిత్రా మళ్లీ గెలిచి వస్తుందని తెలిపారు. ఎన్నికల్లో తనకు ప్రజలు న్యాయం చేస్తారని చెప్పారు. బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చవి చూస్తుందని మండిపడ్డారు. -
‘దిగజారుడు వ్యాఖ్యలంటూ.. టీఎంసీ కౌంటర్’
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలకు టీఎంసీ గట్టి కౌంటర్ ఇచ్చింది. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ.. ‘తమ అధికారానికి సవాలు విసురుతున్న మహిళను బీజేపీ ఓర్చుకోలేకపోతుందని తెలిపడానికి ఇలాంటి వ్యాఖ్యలే నిదర్శం. లింగ పక్షవాతంతో కూడిన పాతకాలపు మనస్తత్వాన్ని బీజేపీ బహిరంగంగా వ్యక్త పరుస్తోంది’ అని ‘ఎక్స్’లో విరుచుకుపడింది. After PM @narendramodi's "didi o didi" catcall, Union Minister @girirajsinghbjp now joins the list of @BJP4India leaders who made degrading comments about Smt. @MamataOfficial. It's evident that the BJP leaders find it incredibly hard to fathom a woman in power challenging their… pic.twitter.com/ZCM8GehdIC — All India Trinamool Congress (@AITCofficial) December 6, 2023 కాగా, 29వ విడత కోల్‌కత్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న సీఎం మమతా.. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, మహేష్ భట్ల కోరిక మేరకు వేదికపై కాలు కదిపారు. దీనిపై బీజేపీ కేంద్రమంత్రి గిరిరాజ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘మమతా డాన్స్ చేస్తూ.. వేడుక చేసుకుంటోంది. ఫిల్మ్ ఫెస్టివల్లో డాన్స్ చేయాల్సిన అవసరం ఏముంది’ అని విమర్శించారు. దీంతో ఆయన మాటాలు.. దిగజారుడు తనానికి ప్రతీక అని టీఎంసీ మండిపడింది. ఇదికూడా చదవండి: వారి తర్వాత.. కాంగ్రెస్‌లో బీసీ సీఎం లేరు: నిశికాంత్ దుబే -
కాల్పుల్లో టీఎంసీ నేత మృతి.. మూక దాడిలో నిందితుడు హతం
జోయ్‌నగర్: పశి్చమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా జోయ్‌నగర్‌లో సోమవారం టీఎంసీకి చెందిన స్థానిక నేత ఒకరు దుండగుల కాల్పుల్లో చనిపోయారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి మూకదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. బమున్‌గాచి ఏరియా టీఎంసీ అధ్యక్షుడు సైఫుద్దీన్ లస్కర్(47) సోమవారం ఉదయం ప్రార్థనలకు బయటకు వచ్చారు. మాటువేసిన దుండగులు దగ్గర్నుంచి జరిపిన తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో కోపోద్రిక్తులైన ఆయన మద్దతుదారులు నిందితులుగా భావిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారి దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రెండో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లస్కర్ మద్దతుదారులు పొరుగునే ఉన్న దలువాఖలి గ్రామంలో లూటీకి పాల్పడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. లస్కర్ హత్యతో తమకెలాంటి సంబంధం లేదని సీపీఎం పేర్కొంది. అధికార యంత్రాంగం, పోలీసులు టీఎంసీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించింది. -
టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు కీలక బాధ్యతలు
ముడుపులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు కీలక బాధ్యతలు అప్పగించింది పార్టీ. కృష్ణానగర్ (నాడియా నార్త్) పార్టీ జిల్లా అధ్యక్షురాలి నియమించింది. ఈరోజు బెంగాల్లో అధికార పార్టీ ప్రకటించిన 15 మంది కొత్త జిల్లాల చీఫ్‌లలో మోయిత్రా కూడా ఒకరు. లోక్‌సభ నుంచి మొయిత్రాను బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసిన తరువాత జరిగిన ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై టీఎంసీ ఎంపీ మొయిత్రా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. తన నియామకంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ పార్టీకి, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణానగర్ ప్రజల కోసం తాను ఎప్పుడూ పార్టీతో కలిసి పనిచేస్తానంటూ ట్వీట్ చేశారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీని ఆశ్రయించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు పెను దుమారాన్ని రేపాయి. దీనిపై ఏర్పాటైన లోక్‌సభ ఎథిక్స్ కమిటీ మొయిత్రాను బహిష్కరించాలని సిఫారసు చేసింది. ఆమె చర్యలు అత్యంత అభ్యంతరకరం, అనైతికం, నేరపూరితం, హేయమైనవి, నేరపూరితమైనవని అని పేర్కొంటూ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ 500 పేజీల నివేదికను రూపొందించింది. అయితే ఇది విడుదలకు ముందే మీడియాకు లీక్ అయింది. ఇది ఇలా ఉంటే ఎథిక్స్ ఆరోపణలను మొయిత్రా తోసిపుచ్చారు. బీజేపీ సర్కార్‌కు గట్టిగా ఎదురు నిలబడిన కారణంగానే తనను టార్గెట్‌ని చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. Thank you @MamataOfficial and @AITCofficial for appointing me District President of Krishnanagar (Nadia North) . Will always work with the party for the people of Krishnanagar. — Mahua Moitra (@MahuaMoitra) November 13, 2023 -
మహువా లోక్‌సభ సభ్యత్వం రద్దుకు ఎథిక్స్ కమిటీ సిఫార్సు
సాక్షి, ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగేందుకు అర్హత లేదని, ఆమెను సభ నుంచి బహిష్కరించాలని పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ తేల్చి చెప్పింది. ఆమెపై వచ్చిన ఆరోపణల ఆధారంగా ఆమెను లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బుధవారం సిఫార్సు చేసింది. మహువాపై వచ్చిన నగదు సంబంధిత ఆరోపణలపై ఎథిక్స్ ప్యానెల్ పరిశీలన జరిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. మొత్తం 500 పేజీలతో కూడిన నివేదికను ప్యానెల్ సిద్ధం చేసింది. ఆమె నివేదిక ఆమె ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ సిఫారసు చేసింది. అంతేకాదు.. ఈ మొత్తం వ్యవహారంలో ఆమెపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొన్న ప్యానెల్.. కేంద్రం ఆధ్వర్యంలో కాలపరిమితితో కూడిన చట్టపరమైన దర్యాప్తునకు సిఫార్సు చేసింది. రాజకీయంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. పార్లమెంటులో ప్రశ్నలడగటానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువాకు డబ్బులు చెల్లించినట్లు ఓ వ్యాపారవేత్త చేసిన ఆరోపణలతో పెను దుమారం రేగింది. అయితే ఈ వ్యవహారం అంతా ప్రధాని కార్యాలయం నుంచే నడుస్తోందని, తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె ఖండిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమెపై నమోదు అయిన ఫిర్యాదుల ఆధారంగా.. పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ విచారణ చేపట్టింది. నవంబర్ 2వ తేదీన ఎథిక్స్ కమిటీ ముందు ఆమె హాజరయ్యారు కూడా. అయితే విచారణ మధ్యలోనే ఆమె వెళ్లిపోవడం, ఆ సమయంలో ఎథిక్స్ కమిటీపై ఆమె చేసిన ఆరోపణలు.. తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
దర్శన్ అఫిడవిట్ పీఎంవో పనే: మహువా మొయిత్రా
ఢిల్లీ: మీడియాలో బహిర్గతమైన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ అఫిడవిట్ వ్యవహారంపై ఎంపీ మహువా మొయిత్రా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం దర్శన్‌పై ఒత్తిడి చేసి తెల్లకాగితంపై సంతకం చేయించారని ఆరోపించారు. పీంవోనే ఓ తెల్లకాగితంపై రాసి మీడియాకు లీక్ చేశారని అన్నారు. పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి సమర్పించిన అఫిడవిట్ విశ్వసనీయతపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అఫిడవిట్ లెటర్ హెడ్ లేని తెల్ల కాగితంపై ఉందని అన్నారు. అధికారికంగా విడుదల చేయలేదని చెప్పారు. 'వ్యాపార వేత్తగా కొనసాగుతున్న దర్శన్‌కు పీఎంతో పాటు మంత్రులందర్ని కలవగల సమర్ధత ఉంది. అలాంటప్పుడు పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి మొదటిసారి ప్రతిపక్ష ఎంపీగా కొనసాగుతున్న నాకు ఎందుకు లంచం ఇస్తారు? ఇది పూర్తిగా అసత్యం. ఈ లేఖను దర్శన్ కాకుండా పీఎంవోనే రాసింది. దర్శన్, ఆయన తండ్రిపై పీఎంవో బెదిరింపులకు పాల్పడింది. లేఖపై సంతకం చేయడానికి 20 నిమిషాలు సమయం ఇచ్చారు.' అని పేర్కొంటూ తాను దర్శన్ నుంచి లంచం తీసుకున్నాననే ఆరోపణలను మహువా మొయిత్రా ఖండించారు. అదానీ వ్యవహారాన్ని లేవనెత్తకుండా తన నోరు మూయించడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధపడిందని మహువా మెుయిత్రా ఆరోపించారు. అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు హాస్యాస్పదమైన అంశాలుగా పేర్కొన్నారు. బీజేపీ ఐటీ సెల్లో మంచి రచనా నైపుణ్యం కలిగిన మందబుద్ధిగల వ్యక్తిచే ఈ లేఖను రాయించారని దుయ్యబట్టారు. దర్శన్ తనపై నిజంగా ఆరోపణలు చేయాలనుకుంటే మీడియా ముందుకు వస్తారు కానీ ఇలా ఏదో ఒక ఛానల్‌కు లీక్ చేయరని అన్నారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, ఆదానీ గ్రూప్‌ను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా టీఎంసీ నేత మొయిత్రా కుట్ర పన్నారని దర్శన్ ఆరోపించారు. ఈ మేరకు దర్శన్ సంతకం చేసిన అఫిడవిట్ ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. దర్శన్ అఫిడవిట్లో ఏముందంటే..? ► నాకు అనుకూలమైన ప్రశ్నలు అడిగేందుకు ఎంపీ అయిన మొయిత్రా నుంచి పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను తీసుకున్నాను ► ఇందుకుగాను ఆమె చాలా విలాసవంతమైన ప్రతిఫలాలు పొందారు. లగ్జరీ ఐటెమ్ అడిగేవారు. ఢిల్లీలోని ఆమె తన అధికారిక బంగ్లా ఆధునీకరణ పనులు చేయించుకున్నారు. దేశ, విదేశాల్లో ప్రయాణ ఖర్చులను భరించాలని డిమాండ్‌చేశారు. ► జాతీయస్థాయి నేతగా ఎదగాలని మొయిత్రాకు ఆశ. అందుకే ప్రధాని మోదీ, గౌతమ్ అదానీలను అప్రతిష్టపాలు చేసి ప్రతిష్ట పెంచుకుందామని స్నేహితులను ఉపాయాలు అడిగేవారు. ► పార్లమెంట్లో ఆమె ప్రశ్నలు అడిగేందుకు తగిన సమాచారాన్ని ఆమె పార్లమెంటరీ మెయిల్ ఐడీకి పంపేవాడిని. తర్వాత నేనే నేరుగా ప్రశ్నలు అప్లోడ్ చేసేవాడిని. ► ఆమెకు రాహుల్ గాందీ, శశి థరూర్, పినాకీ మిశ్రా వంటి నేతలతో సత్సంబంధాలు ఉండటంతో నాకూ లాభం ఉంటుందని భావించా. ► ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, బీబీసీ ఇలా ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థలకు చెందిన జర్నలిస్టులతో ఆమె మాట్లాడేవారు ► సుచేతా దలాల్, శార్దూల్ ష్రాఫ్‌లతోపాటు మాజీ అదానీ ఉద్యోగులు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ప్రశ్నలు అడిగేవాళ్లం. ఇలా ఉండగా, తన పరువుకు భంగం కలిగేలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించకుండా అడ్డుకోవాలంటూ మొయిత్రా వేసిన పిటిషన్ నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. లేఖ ఇంకా అందలేదు.: ఎథిక్స్ కమిటీ చీఫ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ లేఖ తనకు ఇంకా అందలేదని ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ సోంకర్ శుక్రవారం తెలిపారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే అంశం తీవ్రమైనదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో సాక్ష్యాలను కమిటీ పరిశీలిస్తోందని సోంకర్ చెప్పారు. ఆధారాలు సమర్పించాలని ఇరువర్గాలను కోరామని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: ప్రయోజనం పొంది ప్రశ్నలడిగారు -
జీ20 నిర్వహణకు రూ.4,100 కోట్లా
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర భేటీని కేంద్ర ప్రభుత్వం విజయవతంగా నిర్వహించింది. అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచదేశాలు భారత్‌పై ప్రశంసలు కురిపించాయి. ప్రపంచ స్థాయి నేతగా ప్రధాని మోదీ మరోమారు తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇదే సమయంలో, జీ20 భేటీ కోసం బడ్జెట్ కేటాయింపులకు ఏకంగా 300 శాతం ఎక్కువగా రూ.4,100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయడంపై కాంగ్రెస్, టీఎంసీ వంటి ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇంత డబ్బు ఎక్కడికి పోయింది? మోదీ వ్యక్తిగత ప్రచారం కోసమే ప్రభుత్వం ఇన్ని కోట్లను ఖర్చుచేసింది. ఈ సొమ్మును బీజేపీ ఎందుకు చెల్లించకూడదు? అని పేర్కొన్నాయి. జీ20 భేటీ నిర్వహణ ఖర్చుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఈ నెల 4న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కొన్ని వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఉంచారు. జీ20 సదస్సు జరిగిన ప్రాంతంలో అభివృద్ధి పనులకు రూ.4,110.75 కోట్లు ఖర్చయినట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా రూ.3,600 కోట్లను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీవో) పేరుతో ఖర్చయ్యాయి. మొత్తం ఖర్చులో ఇది 88 శాతం. ప్రగతి మైదాన్‌లోని ఐటీపీవో సముదాయం నిర్మాణానికైన వాస్తవ వ్యయం రూ.3,600 కోట్లు. దీనికే జీ20 శిఖరాగ్రం సందర్భంగా భారత్ మండపం అనే పేరు పెట్టారు. ఇది శాశ్వత నిర్మాణం, జీ20 బడ్జెట్‌తో దీనికి సంబంధం లేదు. 2017లో ఈ భవనం నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులు రూ.2,254 కోట్లు కాగా, రహదారులు, టన్నెళ్ల నిర్మాణానికి మరో వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా.ఈ రెండింటిని కలుపుకుంటే భారత్ మండపం అభివృద్ధి వ్యయం రూ.3,200 కోట్లు దాటింది. రహదారులు, టన్నెళ్లు పోను భారత్ మండపం కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.2,700 కోట్లు వెచ్చించినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) జూలై 26న ప్రకటించింది. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటూ జీ20 నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.4,100 కోట్లు దుబారా ఖర్చు చేసిందంటూ ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఈ విమర్శలపై చార్టెర్డ్ అకౌంటెంట్ గోపాల్ కేడియా ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ శాశ్వత మౌలిక వసతుల కల్పనకైన ఖర్చును జీ20 నిర్వహణ వ్యయంతో కలిపి చెప్పడం సరికాదన్నారు. ఈ నిర్మాణాలు భవిష్యత్తులో జరిగే మరెన్నో కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు వీలుందన్నారు. జీ20 షెర్పా అమితాబ్ కాంత్ ప్రతిపక్షాల విమర్శలకు స్పందిస్తూ.. బడ్జెట్లో కేటాయించిన రూ.990 కోట్ల కంటే చాలా తక్కువగా జీ20 శిఖరాగ్రానికి ఖర్చు చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందన్నారు. -
'జూరాల' కు 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
మహబూబ్‌నగర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో మరింత తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 16,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 10వేలకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి లిఫ్టు–1 వద్ద ఒక పంపు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఆవిరి రూపంలో 94, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 738, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 60, సమాంతర కాల్వకు 850, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 8,737 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.929 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 115.058 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 11వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 25.77 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10,899 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఎలాంటి అవుట్ ఫ్లో లేదని అధికారులు తెలిపారు. స్వల్పంగా విద్యుదుత్పత్తి.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో స్వల్పంగా ఉత్పత్తి కొనసాగుతుంది. ఆదివారం 2 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ రామసుబ్బారెడ్డి, డీఈ పవన్‌కుమార్ తెలిపారు. ఎగువలో ఒక యూనిద్ ద్వారా 39 మెగావాట్లు, 80.437 ఎం.యూ దిగువలో ఒక యూనిట్ ద్వారా 40 మెగావాట్లు, 86.813 ఎం.యూ విద్యుదుత్పత్తిని చేపడుతున్నామన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 167.250 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు. మదనాపురం మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు వచ్చి చేరింది. శ్రీశైలంలో 854.7 అడుగుల నీటిమట్టం.. శ్రీశైలం జలాశయంలో ఆదివారం 854.7 అడుగుల వద్ద 91.1 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 5,385 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంకు వదులుతున్నారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 1,583, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు 1,455, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 800 క్యూసెక్కుల నీటిని వదిలారు. జలాశయంలో 197 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. -
సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో సీబీఐ, ఈడీ విచారణలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి మధ్యంతర ఉపశమనం కల్పించకూడదన్న కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. టీఎంసీ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మానసం.. టీచర్ రిక్రూట్మెంట్, మున్సిపల్ రిక్రూట్మెంట్ స్కాంలు లింక్ అయి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు స్కాంలలో అభ్యర్థుల ఓఎమ్ఆర్లు తయారు చేసిన వ్యక్తి ఒకరేనని గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో సీబీఐ దర్యాప్తు పూర్తి అయినందున, హైకోర్టు వద్ద సమాచారం తక్కువ ఉందని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. ఈ మేరకు తీర్పును వెల్లడించారు. వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. అర్హత లేని వ్యక్తులకు టీచర్ పోస్టులను ఇచ్చినట్లు గుర్తించిన వ్యవహారంలో రూ.350 కోట్లు చేతులు మారినట్లు ధర్మాసనానికి చెప్పారు. చాలా ఓఎమ్ఆర్ పత్రాలు ధ్వంసమైనట్లు వెల్లడించారు. రూ.5 కోట్ల డబ్బు, నగలు గుర్తించినట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిని కూడా అరెస్టు చేసినట్లు ధర్మాసనానికి చెప్పారు. ప్రతిపవాదనలు వినిపించిన సీనియర్ లాయర్ కపిల్ సిబల్.. ఇక్కడ ఈడీ దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరగలేదని న్యాయమూర్తికి విన్నవించారు. ఇదీ చదవండి: పార్కుకు 'వాజ్‌పేయీ' పేరు మార్పు.. బీజేపీ ఆందోళనలు.. -
బెంగాల్ స్థానిక ఎన్నికల్లో టీఎంసీ ఆధిక్యం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ స్థానిక ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. మంగళవారం రాత్రి 11:30కి ప్రకటించిన ఫలితాల్లో 30,391 సీట్లను కైవసం చేసుకుంది. ఓట్ల లెక్కింపులో మరో 1,767 పంచాయతీ స్థానాల్లో ముందంజలో కొనసాగు తోంది. టీఎంసీ ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ 8,239 పంచాయతీ సీట్లను తన ఖాతాలో వేసుకుంది. మరో 447 సీట్లలో ముందంజలో ఉంది. లెఫ్ట్ ఫ్రంట్ 2,534 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ 2,158 సీట్లను సొంతం చేసుకుంది. సీపీఎంకు 2,409 సీట్లు లభించాయి. ఇతర పార్టీలు 725 సీట్లు దక్కించుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 1,656 స్థానాలు సాధించడం విశేషం. రాష్ట్రంలో మొత్తం 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక 9,728 పంచాయతీ సమితి స్థానాలకు ఎన్నికలు జరగ్గా, టీఎంసీ 2,155 స్థానాలను గెలుచుకుంది. 493 సీట్లలో లీడింగ్‌లో ఉంది. బీజేపీ 214 స్థానాలను గెలిచింది. 113 చోట్ల లీడింగ్‌లో ఉంది. 928 జిల్లా పరిషత్ సీట్లకు టీఎంసీ ఇప్పటివరకు 77 స్థానాల్లో విజయం సొంతం చేసుకుంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. బెంగాల్లో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భారీగా హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ హింసాకాండలో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది అధికార టీఎంసీకి చెందినవారే ఉన్నారు. -
పంచాయతీ ఎన్నికల్లో అల్లర్లు.. బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుని హత్య
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యున్ని దుండగులు హత్య చేశారు. ఇది అధికార టీఎంసీ పనేనని బాధితులు ఆరోపిస్తున్నారు. కూచ్ బిహార్ జిల్లాలోని దిన్హంతా ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి బామ్మర్థి శంభు దాస్ ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. శంభు దాస్ కోడలు విసాఖా దాస్ కిస్మాత్ దాస్‌గ్రామ్ గ్రామంలో బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. శంభుదాస్‌ను రాత్రి సమయంలో దుండగులు ఇంటి నుంచి బయటకు పిలిచి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మాల్డా జిల్లాలో టీఎంసీ కార్యకర్తను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనకు కారకులు కాంగ్రెస్ కార్యకర్తలేనని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతున్ని ముస్తఫా షేక్‌గా గుర్తించారు. ఈ ఘటన మరవక ముందే దిన్హంతా ప్రాంతంలో తాజాగా బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుని హత్య జరగడం గమనార్హం. కూచ్ బిహార్ జిల్లాలోని దిన్హంతాలో బీజేపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు టీఎంసీ మద్దతుదారులు చించేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి నితీష్ ప్రమాణిక్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. టీఎంసీ గుండాలు బీజేపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారని ప్రమాణిక్ ఆరోపించారు. నామినేషన్‌కు వచ్చిన అభ్యర్థులపైన రాళ్లు రువ్వారని, బాంబులు వేశారని చెప్పారు. నామినేషన్ వేళ అల్లర్లు.. జులై 8న బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల నామినేషన్‌కు గురువారం చివరి తేదీ నాడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. నామినేషన్ ప్రారంభమైన వారం రోజుల్లోనే అల్లర్లలో ఆరుగురు మృతి చెందారు. ఆందోళనకారులు బాంబులు విసురుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదీ చదవండి:బోస్ ఉంటే దేశ విభజన జరిగేది కాదు -
ఒడిశా రైలు ప్రమాదం: బాధితులకు రూ. 2000 నోట్లు!
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున పరిహారం ప్రకటించారు. దీనికితోడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ టీఎంసీ తరపున బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజూమ్దార్ మాట్లాడుతూ బెంగాల్‌కు చెందిన ఒక మంత్రి మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు పంపిణీ చేశారని, అయితే అవన్నీ రూ. 2000 నోట్లు అని ఆరోపించారు. ఆయన ఒక వీడియోను ట్వీట్ చేశారు. దానిలో ఇద్దరు మహిళలు చాపమీద కూర్చుని ఉండగా, ఒక మహిళ కుర్చీలో కూర్చున్న దృశ్యం కనిపిస్తోంది. ఆ ముగ్గురు మహిళలు రూ. 2000 నోట్లతో కూడిన బండిల్ పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన సదరు బీజేపీ నేత... బ్లాక్ మనీని వైట్ మనీ చేసేందుకు టీఎంసీ ఈ పని చేయడం లేదు కదా? అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ఆదేశాలకు అనుగుణంగా తృణమూల్ పార్టీ తరపున రూ. 2 లక్షల సాయం అందిస్తున్నారు. ఇది మంచి విషయమే. కానీ ఈ రూ. 2000 నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. ప్రస్తుతం మార్కెట్లో రూ. 2000 నోట్ల చలామణి తక్కువగా ఉన్నదని, బ్యాంకులలో వీటిని మార్చుకునే ప్రక్రియ జరుగుతున్నదని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు రూ. 2000 నోట్లు ఇవ్వడం వలన వారికి ఇబ్బందిగా మారుతుందన్నారు. నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చేందుకే ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అయితే దీనిపై వెంటనే స్పందించిన టీఎంసీ నేత కుణాల్ ఘోష్ మాట్లాడుతూ బీజేపీ నేత సుకాంత్ మజూమ్దార్ చేసిన ఆరోపణలు నిరాధారమన్నారు. రూ. 2000 నోటు మారకంలో లేనిదా? అని ప్రశ్నస్తూ, వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇదేమీ అక్రమం కాదు. ఎవరైనా రూ. 2000 నోటు ఇస్తే అదేమీ నల్ల ధనం అయిపోదని అన్నారు. రైలు ప్రమాద బాధితులకు రూ. 2000 నోటు పంపిణీ చేసిన ఉదంతం పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలోని బసంతీలో చోటుచేసుకుంది. టీఏంసీ నేత బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా అందరినీ కలచివేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 288 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: 40 మృతదేహాలపై కనిపించని గాయాలు মমতা বন্দ্যোপাধ্যায়ের নির্দেশে তৃণমূল দলের পক্ষ থেকে নিহতদের পরিবারকে 2 লক্ষ টাকার আর্থিক সাহায্য করছেন রাজ্যের একজন মন্ত্রী। সাধুবাদ জানাই। কিন্তু এপ্রসঙ্গে এই প্রশ্নটাও রাখছি, একসাথে 2000 টাকার নোটে 2 লক্ষ টাকার বান্ডিলের উৎস কি? pic.twitter.com/TlisMituGG — Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) June 6, 2023 -
ఇది వేధించడం గాక ఇంకేంటి?.. ఆమెను అడ్డుకోవడంపై మమత ఫైర్
బొగ్గు కేసులో విచారణలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు చెందని అభిషేక్ బెనర్జీ భార్య రుజీరాను అధికారులు కోల్‌కతా విమానాశ్రయంలో అడ్డుకోవడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుపట్టారు. ఆమె తన ప్రయాణ ప్రణాళికలు గురించి ఈడికి తెలియజేసినప్పటకీ అడుకున్నారని సీరియస్ అయ్యారు. ఇది వేధించడం గాక ఇంకేమిటి అని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం అని అన్నారు. అభిషేక్ బెనర్జీ అత్తగారికి అనారోగ్యంగా ఉంది. అందువల్ల అతడి భార్య తన తల్లిని కలిసేందుకు వెళ్లింది. ఆమె కోల్‌కతాను విడిచి వెళ్లాలంటే ముందుగానే ఈడీకి తెలియజేయాలని సుపప్రీం కోర్టు పేర్కొంది. ఆ ప్రకారమే ఆమె ఈడీకి సమాచారం అందించినప్పటికి అలా ఎలా చేసింది ఈడీ అని ప్రశ్నించారు. ఆమెనున విమానాశ్రయంలో అడ్డుకోవడం పిలిపించడం ఇవన్నీ వేధింపులు గాక మరొకటి కాదని అన్నారు మమతా. ఇదిలా ఉండగా, అభిషేక్ బెనర్జీ ఈ విషయమై మాట్లాడుతూ..తన భార్య ప్రయాణం ప్రణాళిక గురించి ముందుగానే ఈడీకి తెలియజేశామని అన్నారు. దుర్మార్గపు ఉద్దేశాలు ఉంటే వారికి తెలియజేయాల్సిన అవసరం ఉండదు కదా అని అనఆనరు. తాను చేస్తున్న తృణమూలే నబో జోవర్ ప్రచారానికి వచ్చిన ప్రతిస్పందనతో బీజేపీ ఉలిక్కిపడుతోందన్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ దానిని అడ్డుకోవాలని చూస్తుంది. మమ్మల్ని వేధించడానికి మార్గాలు వెతుకుతోందని ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ..నా భార్యను, నా పిల్లలను లేదా నన్ను ఈడీ అరెస్టు చేసినా తాను తల వంచేదే లేదని తేల్చి చెప్పారు. ప్రధాని కుర్చిపై ఉన్న గౌరవంతో ఆయనకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నానని అన్నారు. నావయసు ఆయన రాజకీయ అనుభవం అంత కాకపోవచ్చు..కానీ మీరు నాతో రాజకీయంగా ప్రజాకోర్టులో పోరాడలేకపోతున్నారని విమర్శించారు అభిషేక్ బెనర్జీ. అభిషేక్ ఆరోపణలపై బీజేపీ స్పందిస్తూ..ఈడీ స్వతంత్ర సంస్థ అని, బీజేపీకి ఈడీ లేదా సీబీఐతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, ఏవైన ఫిర్యాదులు ఉంటే ఎప్పుడైన వారు కోర్టుని ఆశ్రయించవచ్చు అని బీజేపీ నాయకుడు రాహుల్ సిన్హా అన్నారు. (చదవండి: ఆ దుర్ఘటన తర్వాత టికెట్లు రద్దయ్యాయి!..వివరణ ఇచ్చిన రైల్వేస్) -
టాటా మెమోరియల్ సెంటర్‌కు ఐసీఐసీఐ రూ.1,200 కోట్ల నిధులు
ముంబై: టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) క్యాన్సర్ పేషంట్ల చికిత్సా సామర్థ్యాలను పెంచే దిశగా తలపెట్టిన మూడు సెంటర్స్ విస్తరణకు రూ.1,200 కోట్లు అందించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌తో పాటు పంజాబ్‌లోని ములాన్‌పూర్, మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాలు నిర్వహించే తమ అనుబంధ విభాగం ఐసీఐసీఐ ఫౌండేషన్ .. నాలుగేళ్ల వ్యవధిలో రూ. 1,200 కోట్లు వెచ్చించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది తెలిపారు. దీనితో టీఎంసీ ఏటా మరో 25,000 మంది పేషంట్లకు చికిత్సను అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత 1.2 లక్షల పేషంట్ల వార్షిక సామర్ధ్యంతో పోలిస్తే ఇది 25 శాతం అధికమని వివరించారు. మూడు ప్రాంతాల్లోనూ హాస్పిటల్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి లభించే నిధులు కొత్త బ్లాక్‌ల ఏర్పాటు కోసం ఉపయోగపడతాయని టీఎంసీ డైరెక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు. -
మాదాపూర్ కొత్తగూడెం TCS ఆఫీసుకు బాంబు బెదిరింపు
-
టీఎంసీ ర్యాలీపై పిడుగు.. కార్యకర్త మృతి.. 25 మందికి గాయాలు..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బంకుర జిల్లా ఇందాస్లో టీఎంసీ ఆదివారం నిర్వహించిన ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. ర్యాలీ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో దాని కింద ఉన్న ఓ కార్యకర్త అక్కడికక్కడే కుప్పకూలాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వర్షం పడుతుండటంతో సభ పక్కనే ఉన్న ఈ చెట్టుకిందకు వెళ్లి కార్యకర్తలు తలదాచుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు పిడుగుపడి చెట్టుకూలిపోవడంతో దాని కింద ఉన్న 25 మంది గాయపడ్డారు. వీరందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం: పాక్ నుంచి మెసేజ్‌లు.. ఆ 14 యాప్స్ బ్లాక్) కాగా.. ఈ ఘటనపై టీఎంసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపింది. తప్పకుండా సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. గాడపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పింది. ఈమేరకు ట్వీట్ చేసింది. ఈ ర్యాలీకి సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఎంసీ యుత్ లీడర్ దేవాన్షు భట్టాచార్య ప్రసంగిస్తుండగా పిడుగు ఘటన జరిగింది. దీంతో వేదికపైనే ఉన్న అభిషేక్.. క్షతగాత్రులకు సాయం చేయాలని ఇతర కార్యకర్తలను కోరారు. చదవండి: మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వడగళ్ల వానలు: వాతావరణ శాఖ -
‘పులిచింతల’ చకచకా
సాక్షి, నరసరావుపేట/అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు మరమ్మతు పనులు చకచకా సాగుతు న్నాయి. ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.22.04 కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 45.77 టీఎంసీలు నిల్వ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పులిచింతలలో 2019–20లో 45.77 టీఎంసీలు, 2020–21లో 45.77 టీఎంసీలు, 2021–22లో 44.53 టీఎంసీలు, 2022–23లో 45.77 టీఎంసీలు నీటిని నిల్వ చేశారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం ప్రారంభించిన నాటినుంచి కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం విశేషం. 16వ గేట్ స్థానంలో రేడియల్ గేట్ నిర్మాణం గత ప్రభుత్వాలు నిర్మాణం, నిర్వహణలో అలసత్వం వల్ల డ్యామ్ 16వ గేట్ 2021 ఆగస్ట్ 5న వరద ఉధృతికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 16వ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ గేట్‌ను యుద్ధప్రాతిపదికన అమర్చి నీటిని నింపి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంది. తర్వాత 40 టీఎంసీలకు పైగా నీటితో ప్రాజెక్టు కళకళలాడింది. ఈ గేటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం రూ.7.54 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో రేడియల్ గేట్ ఏర్పాటు, దాన్ని అమర్చేందుకు అవసరమైన కాంక్రీటు దిమ్మెలు, క్రేన్స్ నిర్మాణాలు చేపడుతున్నారు. మే చివరి నాటికి అన్ని పనులు పూర్తి పులిచింతల ప్రాజెక్టు 16వ రేడియల్ గేట్ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గేట్ల అమరికకు అవసరమైన పనులు పూర్తయ్యాయి. ఇక గేట్లను ఆ స్థానంలో అమర్చి ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉంది. అన్ని పనులు మే చివరి నాటికి పూర్తి చేస్తాం. రానున్న వర్షాకాలంలో ప్రాజెక్టులో నీటి నిల్వకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం – రామకృష్ణ, ఎస్ఈ, పులిచింతల ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణకు రూ.9.57 కోట్లు పులిచింతల ప్రాజెక్టుకు మొత్తం 24 రేడియల్ గేట్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు తరచూ వివిధ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తుండటం, వందలాది టీఎంసీల నీరు ప్రాజెక్టు నుంచి కిందకు వెళుతున్న నేపథ్యంలో కొన్ని మరమ్మతులు చేయాల్సి వస్తోంది. వీటన్నింటికి ప్రభుత్వం రూ.9.57 కోట్లు ఖర్చు చేస్తోంది. రేడియల్, స్లూయిజ్ గేట్లు, క్రేన్లకు గ్రీజు, పెయింట్, గడ్డర్ల పటిష్టం వంటి పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా డ్యామ్ గేట్ల పిల్లర్ల పటిష్టానికి రూ.1.73 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పనులు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. డ్యామ్ రేడియల్ గేట్లకు చేరుకునే నడక దారి పునరుద్ధరణకు రూ.3.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రాజెక్టు పైనుంచి వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. గతంలో ఈ మార్గం నుంచి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు నుంచి తెలంగాణ రాష్ట్రానికి రాకపోకలు కొనసాగేవి. (చదవండి: బ్యాంకుల నుంచి పింఛన్ డబ్బు విత్‌డ్రా.. ఇకపై ఒక్కరు కాదు ఇద్దరు.. ) -
Kaliyaganj: మళ్లీ హింస.. ఆ వీడియోపై దుమారం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కలియాగంజ్ హింసతో అట్టుడికి పోయింది. ఓ మైనర్ గిరిజన బాలిక హత్యాచారానికి గురికావడంపై రగిలిపోయారు స్థానికులు. ఆందోళనకు దిగి పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించేందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో బాడీని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడం, గ్రామస్తులు అడ్డుకునే యత్నాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి హింసకు దారి తీసింది. గురువారం సాయంత్రం.. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని గంగువా గ్రామానికి చెందిన ఓ బాలిక ట్యూషన్‌కని చెప్పి ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆ రాత్రంతా ఆమె కోసం గాలించింది ఆమె కుటుంబం. శుక్రవారం ఆమె శవాన్ని స్థానికులు ఊరి శివారులో ఉన్న ఓ కొలను పక్కన పొదల్లో గుర్తించారు. ఈ క్రమంలో ఆమె హత్యాచారానికి గురైందన్న విషయం తెలిసి గ్రామస్తులు రగిలిపోయారు. రోడ్లను దిగ్భంధించి.. నిరసనలు చేపట్టారు. పరిస్థితి హింసాత్మకంగా మారే సూచనలు కనిపించడంతో.. పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. శనివారం ఒక్కరోజే.. ఆందోళనకారులపై రెండుసార్లు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు పోలీసులు. మరోవైపు పోలీస్ సిబ్బంది బాధితురాలి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన వీడియో ఒకటి రాజకీయ విమర్శలకు దారి తీసింది. అయితే.. గ్రామస్తుల నుంచి బాలిక మృతదేహాన్ని పోలీస్ సిబ్బంది సాయంతో స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు పంపించామని, ఆలస్యమైతే కీలక ఆధారాలు చెరిగిపోయే అవకాశం ఉన్నందునే కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని ఉత్తర దినాజ్‌పూర్ ఎస్పీ సనా అక్తర్ మీడియాకు వెల్లడించారు. బాలిక డెడ్‌బాడీ పక్కనే ఓ సీసా దొరికింది. బహుశా అది విషం బాటిల్ అయ్యి ఉండొచ్చు. ఆమె ఒంటిపైనా ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘోరంతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నాం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు అని ఎస్పీ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన ఆధారంగా టీఎంసీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బెంగాల్లో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని, పోలీసులు సైతం నేరాల కట్టడిలో ఘోరంగా విఫలం అవుతున్నారని మండిపడుతోంది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా ఓ వీడియో పోస్ట్ చేశారు. బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు ఈడ్చుకెళ్తున్న దృశ్యం అది. అంతేకాదు.. ఆ మైనర్ రాజ్బోంగ్షి కమ్యూనిటీకి చెందిందని అమిత్ మాలవియా పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ చీఫ్, ఎంపీ సుకాంత మజుందార్ శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటన ఆధారంగా మమతా బెనర్జీ సర్కార్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అయితే.. పోలీసులు ఆ గ్రామంలోకి రాజకీయ నేతలు రాకుండా ఆంక్షలు విధించారు. কালিয়াগঞ্জে নাবালিকা রাজবংশী মেয়েকে গণধর্ষণ করে নৃশংসভাবে হত্যা করা হয়। ধর্ষিতা পরিবারের সঙ্গে দেখা করলেন রাজ্য সভাপতি ডঃ @DrSukantaBJP, সাংসদ @DebasreeBJP ও @khagen_murmu বিধায়ক গোপাল চন্দ্র সাহা, সত্যেন্দ্রনাথ রায়, চিন্ময়দেব বর্মন ও শ্রীরূপা মিত্র চৌধুরী। pic.twitter.com/S19YFNucha — BJP Bengal (@BJP4Bengal) April 22, 2023 బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు ఈడ్చుకెళ్తున్నట్లు ట్విటర్లో షేర్ చేసిన వీడియోను జాతీయ మహిళా కమిషన్ కూడా పరిగణనలోకి తీసుకుంది. వివరణ ఇవ్వాలంటూ బెంగాల్ డీజీపీని ఆదేశించింది. In this video, the body West Bengal Police is insensitively dragging is that of a minor rape and murder victim from the Rajbongshi community in Uttar Dinajpur’s Kaliaganj. Such haste is often seen when the purpose is to eliminate or dilute evidence and cover up the crime… pic.twitter.com/zgz2Rxlik1 — Amit Malviya (@amitmalviya) April 22, 2023 ఇంకోవైపు ఎన్సీపీసీఆర్(జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం) సైతం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. నిజనిర్ధారణకమిటీ ద్వారా కేసును పర్యవేక్షించబోతోంది. అంతేకాదు ఈ ఘటనపై తమకు సమాచారం అందింటలేదంటూ.. బెంగాల్ సీఎస్‌తో పాటు ఉత్తర దినాజ్‌పూర్ కలెక్టర్‌పైనా ఆరోపణలు గుప్పించింది. పోలీసులు మాత్రం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. -
సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కూల్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి ఆయనను సీబీఐ, ఈడీ ప్రశ్నించవచ్చంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేసింది. దీంతో అప్పటివరకు దర్యాప్తు సంస్థలు ఆయనను ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. అలాగే బెంగాల్ పోలీసులు.. సీబీఐ, ఈడీ అధికారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సీజేఐ జస్డిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధించింది. ఫలితంగా టీఎంసీ సర్కార్‌కు ఊరట లభించినట్లయింది. బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి మాజీ మంత్రి పార్థ చటర్జీ, మాణిక్ భట్టాచార్యలను ఇదివరకే అరెస్టు చేసింది సీబీఐ. తాజాగా ఇవాళ మరో ఎమ్మెల్యే జీవన్ కృష్ణ సాహాను కూడా అదుపులోకి తీసుకుంది. అయితే ఈ స్కాంతో అభిషేక్ బెనర్జీకి కూడా సంబంధంముందని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనను ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తోంది. చదవండి: కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం.. బీజేపీపై కీలక వ్యాఖ్యలు.. -
మమతా బెనర్జీకి మరోసారి షాకిచ్చిన సీబీఐ.. ఎమ్మెల్యే అరెస్ట్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో మరోసారి రాజకీయం వేడెక్కింది. బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో సీబీఐ విచారణలో భాగంగా టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహాను అరెస్ట్ చేశారు. దీంతో, ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు టీఎంసీ నేతలు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరెస్ట్ ఘటన రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్కు సంబంధించి కోల్కత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో బుర్వాన్‌లోని టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా నివాసాలపై సీబీఐ ప్రత్యేక బృందం దాడులు చేసింది. అనంతరం, జిబాన్‌ను సీబీఐ స్పెషల్ టీమ్ దాదాపు 65(ఏప్రిల్ 14 నుంచి దాదాపు మూడు రోజులు) గంటల పాటు విచారించింది. విచారణ తర్వాత.. జిబాన్ కృష్ణను అరెస్ట్ చేస్తున్నట్టు సీబీఐ స్పష్టం చేసింది. అయితే, విచారణ సందర్భంగా జిబాన్.. తమకు సహకరించలేదని అధికారులు తెలిపారు. అంతకుముందు.. కేంద్ర భద్రతా బలగాలతో పాటు సీబీఐ బృందం ముర్షిదాబాద్ జిల్లాలోని ఆయన నివాసానికి చేరుకుంది. అభ్యర్థుల రిక్రూట్మెంట్కు సంబంధించిన అనేక నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ దాడిలో, ప్రభుత్వ పాఠశాలల్లో రెండు సెక్షన్ల రిక్రూట్మెంట్ కోసం రాత పరీక్షల అడ్మిట్ కార్డులతో సహా అనేక నేరారోపణ పత్రాలను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించిన రికార్డులను కలిగి ఉన్న డైరీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, సీబీఐ దాడుల సందర్బంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన ఇంట్లో విచారణ సందర్భంగా, జిబాన్ వాష్‌రూమ్‌కు వెళ్లడానికి అనుమతి తీసుకున్నాడు. తరువాత అతను అకస్మాత్తుగా తన నివాసం పక్కనే ఉన్న చెరువు వైపునకు వెళ్లి తన ఫోన్లను అందులోకి విసిరేసాడు. దీంతో, అధికారులు షాకయ్యారు. ఇక, బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో ఇప్పటికే సీఎం మమతా బెనర్జీకి షాక్ తగిలింది. టీఎంసీ నేతలు సాహా మాణిక్ భట్టాచార్య, పార్థా చటర్జీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్టులోకి మరో ఎమ్మెల్యే జిజాన్ కూడా చేరారు. -
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఓ పార్టీకి ఎలాంటి అర్హతలుండాలి?
న్యూఢిల్లీ: సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీలకు జాతీయ పార్టీల గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసీ జాతీయ హోదా ఇచ్చింది. అయితే ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలవాలి? ఎన్ని రాష్ట్రాల్లో ఉనికి ఉండాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ గుర్తింపు పొంది ఉండాలి. అసెంబ్లీ లేదా సార్వత్రిక ఎన్నికల్లో(లోక్‌సభ) నాలుగు రాష్ట్రాల్లో కనీసం 6శాతం ఓట్లు పొంది ఉండాలి. లేదా నాలుగు ఎంపీ సీట్లైనా గెలవాలి. లేదా లోక్‌సభలో రెండు శాతం సీట్లు కలిగిఉండాలి. కనీసం మూడు రాష్ట్రాల నుంచి ఆ పార్టీ ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఉండాలి. వీటిలో ఏ అర్హత ఉన్నా ఎన్నికల సంఘం ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తుంది. ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలకు జాతీయ హోదా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ,ఆమ్ ఆద్మీ పార్టీ ఈ జాబితాలో ఉన్నాయి. కొత్తగా జాతీయ హోదా పొందిన ఆప్‌ను అరవింద్ కేజ్రీవాల్ 2012లో స్థాపించారు. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజ యం సాధించింది. 1925లో ఏర్పాటైన సీపీఐ 1989లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడం, దేశవ్యాప్తంగా కూడా తగిన సంఖ్యలో లోక్‌సభ సీట్లను సాధించలేకపోవడంతో జాతీయ హోదాను కోల్పోయింది. జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీని 1998లో మమతా బెనర్జీ స్థాపించారు. టీఎంసీ 2004లో రాష్ట్ర పార్టీ హోదా పొందింది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురకూ విస్తరించగా.. 2016లో జాతీయ పార్టీ హోదా వచ్చింది. కానీ తర్వాత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో హోదా కోల్పోవాల్సి వచ్చింది. శరద్‌పవార్ 1999 లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి ఎన్సీపీని స్థాపించారు. వివిధ ఎన్నికల్లో విజయం సాధించడంతో 2000 సంవత్స రంలో జాతీయ హోదా లభించింది. చదవండి: రెండో గండం దాటేస్తారా!? 38 ఏళ్ల సంప్రదాయం.. బీజేపీ ఏం చేస్తుందో? -
EC: ఆప్‌కు జాతీయ హోదా.. ఆ మూడు పార్టీలకు షాక్
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశంలో జాతీయ పార్టీల గుర్తింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆప్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదాను కల్పించింది. ఇదే సమయంలో మరో మూడు జాతీయ హోదా కలిగిన పార్టీలకు షాకిచ్చింది. తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ), నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), సీపీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూడు పార్టీలు జాతీయ హోదాను కోల్పోయాయి. ఇక, ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును ఈసీ తొలగించింది. అయితే, 2012లో స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మొదట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. అనంతరం.. పలు రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో దిగుతూ పంజాబ్‌లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ క్రమంలో గుజరాత్లో ఐదు అసెంబ్లీ స్థానాలు, 12 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీకి కావాల్సిన అర్హత సాధించింది. Election Commission of India recognises Aam Aadmi Party (AAP) as a national party. Election Commission of India derecognises CPI and TMC as national parties. pic.twitter.com/9ACJvofqj6 — ANI (@ANI) April 10, 2023 -
విపక్షాల భేటీలో ఊహించని పరిణామం
ఢిల్లీ: కేంద్రాన్ని తీరును ఎండగట్టేందుకు ఇవాళ విపక్షాలు ఏకమయ్యాయి. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ఇవాళ జరిగిన భేటీకి హాజరై.. ఆపై నిరసనల్లో సంఘటితంగా మోదీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాయి. రాహుల్ గాంధీ అనర్హత వేటును వ్యతిరేకిస్తూ సాగిన నల్ల దుస్తుల నిరసనలో విపక్షాలు ఒక్కటిగా ముందుకు సాగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఖర్గే నేతృత్వంలో విపక్షాల వ్యూహత్మాక సమావేశం జరిగింది. ఆయన కార్యాలయంలో జరిగిన భేటీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌యేతర ఫ్రంట్ కావాలని బలంగా కోరుకుంటున్న టీఎంసీ సైతం ఈ భేటీకి హాజరైంది. తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రసూన్ బెనర్జీ, జవహార్ సిర్కార్‌లు విపక్షాల వ్యూహత్మాక సమావేశానికి హాజరయ్యారు. రాహుల్ గాంధీ విషయంలో విపక్షాలన్నీ ఏకతాటిపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టమవుతున్నా.. టీఎంసీ తన మద్దతును ఈ అంశానికే పరిమితం చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక.. కాంగ్రెస్ ఈ పరిణామాన్ని స్వాగతించింది. మొత్తం పదిహేడు పార్టీలు హాజరయ్యాయి ఈ భేటీకి. నల్ల దుస్తుల నిరసనలు కేసీఆర్ బీఆర్ఎస్ సైతం పాల్గొంది. దీనికి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకే, నిన్న అందరికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను, ఈరోజు కూడా కృతజ్ఞతలు చెప్పాను. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు, ప్రజలను కాపాడేందుకు ఎవరైనా ముందుకు వచ్చినా స్వాగతిస్తున్నాం. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని ఖర్గే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
Congress: ఇక కాంగ్రెస్ లేకుండానే ముందుకు..
ఢిల్లీ: దేశంలోని విపక్షాలు ఒక్కొక్కటిగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు హస్తం పార్టీకి దూరంగా జరగాలని నిర్ణయించుకున్నాయి. బీజేపీ-కాంగ్రెస్‌లను దొందూ దొందుగానే భావిస్తున్న విపక్షాల్లోని కొన్ని పార్టీలు.. 2024 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ రహిత కొత్త ఫ్రంట్‌తో వెళ్లాలని భావిస్తున్నాయి. తాజాగా.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భేటీ ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది కూడా. విపక్షాల్లోని మూడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు.. టీఎంసీ, ఎస్పీ, బీజేడీ(బీజూ జనతా దళ్)లు కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు కోల్‌కతాలో ఇవాళ(శుక్రవారం) అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీలు భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు.. వచ్చే వారంలో దీదీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తోనూ భేటీ కానున్నట్లు స్పష్టత వచ్చింది. బీజేపీ స్ట్రాటజీకి కౌంటర్‌గా? లండన్ ప్రసంగంపై విమర్శల వంకతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని విపక్షాల నాయకుడిగా చూపించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఈ పరిణామం విపక్షాల్లోని కొన్ని పార్టీలకు ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు పూర్తి దూరంగా జరగాలని భావిస్తున్నాయి. ఒకవైపు మమతా బెనర్జీ, మరోవైపు అఖిలేష్ యాదవ్.. ఇద్దరూ కూడా బీజేపీ, కాంగ్రెస్‌ను సమానంగా చూడాలని, రెండింటినీ దూరంగానే పెట్టాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై టీఎంసీ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ మరింత స్పష్టత ఇచ్చారు. ‘‘రాహుల్ గాంధీ ఎక్కడో విదేశాల్లో వ్యాఖ్యలు చేశారు. కానీ, బీజేపీ క్షమాపణలు కోరుతూ పార్లమెంట్‌ను అడ్డుకుంటోంది. కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకోవాలని బీజేపీ యత్నిస్తోందన్న విషయం స్పష్టమవుతోంది. రాహుల్‌ను విపక్షాల ప్రతినిధిగా చూపించడం ద్వారా.. లాభపడొచ్చని బీజేపీ భావిస్తోంది. కానీ, 2024 ఎన్నికలకు ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిర్ణయించే అవసరం లేదు కదా.. అని సుదీప్ వ్యాఖ్యానించారు. విపక్షాలను కాంగ్రెస్ ఒక బిగ్ బాస్ లాంటిదన్నది భ్రాంతేనన్న టీఎంసీ ఎంపీ.. బీజేపీ, కాంగ్రెస్‌లతో సంబంధం లేకుండా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు మొదలైనట్లు స్పష్టత ఇచ్చారు. అయితే.. దీనిని థర్డ్ ఫ్రంట్ అని చెప్పలేమని, కానీ, బీజేపీని ఢీ కొట్టడానికి ప్రాంతీయ పార్టీల్ని బలపడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी ने पार्टी के वरिष्ठ नेताओं के साथ पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी जी के आवास पर की शिष्टाचार भेंट। pic.twitter.com/i0cv6GqOTZ — Samajwadi Party (@samajwadiparty) March 17, 2023 బెంగాల్లో మేం మమతా దీదీతోనే ఉన్నాం. ప్రస్తుతానికి బీజేపీ, కాంగ్రెస్‌లను సమానంగా చూడాలనే ఉద్దేశంలో మేం ఉన్నాం అంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చెప్పుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్‌తో దోస్తీ, బీజేపీ జట్టు కంటే ప్రమాదకరమైందని వ్యాఖ్యానించిన దీదీ.. ఇకపై రెండు పార్టీలను సమానంగానే చూస్తామంటూ వ్యాఖ్యానించడం విశేషం. -
రాళ్ల దాడి.. కేంద్ర మంత్రికి నిరసన సెగ!
కోల్‌కతా: కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై శనివారం పశ్చిమ బెంగాల్లో దాడి జరిగింది. ఈ దాడిలో కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న వాహనం ముందు అద్దం ధ్వంసమైంది. ఆయన మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణలోనే.. ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిసిత్ ప్రమాణిక్.. స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఆ సమయంలో దిన్హటాలోని బురిర్‌హాట్‌లో టీఎంసీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసనకు సిద్ధమయ్యారు. వాళ్లను బీజేపీ కార్యకర్తలు నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా.. రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ముందు అద్దం ధ్వంసమైంది. ఈ తరుణంలో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఇది టీఎంసీ మద్దతుదారుల పనేనని ఆయన ఆరోపించారు. ఒక మంత్రికే రక్షణ కరువైనప్పడు సామాన్యుల పరిస్థితి ఏంటని.. బెంగాల్లో ప్రజాస్వామ్యం పరిస్థితి ఇదని దాడిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. బీఎస్ఎఫ్ కాల్పుల్లో ఓ గిరిజనుడి మృతిపై.. మంత్రి నిసిత్ హోంశాఖకు సమర్పించిన నివేదికపై ఆగ్రహంతోనే ఈ దాడికి పాల్పడినట్లు స్థానికమీడియా కథనాలు ప్రచురిస్తోంది. అంతేకాదు.. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం తాజాగా నిసిత్ ప్రమాణిక్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని, ఎక్కడికి వెళ్లినా నల్లజెండాలతో నిరసనలు చెబుతామని హెచ్చరించారు కూడా. Clashes broke out between #TMC & #BJP workers in Coochbehar #Bengal. This as MoSHome #NisithPramanik was on his way to a program & TMC workers had assembled to show him back flags.BJP workers challenged them & clashes erupted.Stones hit Nisith Pramanik’s car too but MoS is unhurt pic.twitter.com/ku3T66fYun — Tamal Saha (@Tamal0401) February 25, 2023