Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan Mohan Reddy direction to MPs at YSRCP Parliamentary meeting
యావత్‌ దేశం దృష్టికి 'ఆటవిక పాలన': వైఎస్‌ జగన్‌

ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఈ పోరాటంలో మనతో వచ్చే అన్ని పార్టీలను కలుపుకుని పోదాం. ధర్నాలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులంతా పాల్గొంటారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణకాండను యావత్‌ దేశం దృష్టికి తీసుకెళ్దాం. రాష్ట్రంలో గత 45 రోజులుగా ఏం జరుగుతోందో వివరిద్దాం. ధర్నా అనంతరం పార్టీ ఎంపీలు పార్లమెంట్‌కు హాజరవ్వాలి. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసంపై ఉభయ సభల్లో గట్టిగా మాట్లాడాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దురాగతాలను అందరి దృష్టికి తీసుకెళ్లాలి. – వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హత్యలు, హత్యా­యత్నాలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణకాండను యావత్‌ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఈ నెల 24వ తేదీ బుధవారం నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో వివరించి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోదామని ఎంపీలకు సూచించారు. ధర్నా అనంతరం పార్లమెంట్‌కు హాజరై రాష్ట్రంలో సాగుతున్న ఆటవిక పాలనపై గళమెత్తాలని దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్న దురాగతాలను తమ సభల్లోని సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్భోధించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ఆయన తాడే పల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో అనునరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ‘ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రి అపాయింట్‌మెంట్లు కోరాం. అపాయింట్‌మెంట్లు రాగానే.. వారికీ ఇక్కడి పరిస్థితిని వివరిస్తాం. ఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీ ఒక్కో బాధ్యత తీసుకోవాలి. వెంటనే ఢిల్లీ వెళ్లి ఆ పనుల్లో నిమగ్నం కావాలి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. అందుకే మనం రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేస్తున్నాం. అలా చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలి. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన వ్యక్తం చేస్తాం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించే సమయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్రంలో దారుణాలు, అరాచకాలు, ఇక్కడ జరుగుతున్న ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..ప్రజాస్వామ్య మనుగడకే పెను ప్రమాదం రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. అవి ప్రజాస్వామ్య మనుగడకు పెద్ద దెబ్బ. అందుకే అన్ని పార్టీలకూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి వివరించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల మీద దారుణంగా దాడులు జరగుతున్నాయి. వినుకొండలో రషీద్‌ హత్యే ఇందుకు పరాకాష్ట. ఆ హత్య వీడియో దృశ్యాలు.. రాష్ట్రంలో దారుణంగా ఉన్న శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డు మీద కత్తితో నరికి చంపిన తీరు అత్యంత అమానుషం. తమ రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్‌ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది.రషీద్‌ హత్యపై వక్రీకరణకు యత్నం వినుకొండలో దారుణ హత్యకు గురైన పార్టీ కార్యకర్త రషీద్‌ ఒక వైన్‌ షాపులో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఆ రాజకీయ హత్య ఘటనను వక్రీకరించడానికి ఎల్లో మీడియా సహాయంతో ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఏదో బైక్‌ కాల్చిన ఘటనకు, ఇప్పుడు జరిగిన దారుణ హత్యకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఆ కాలిన బైక్‌.. వైఎస్సార్‌సీపీ వాళ్లది. ఇందుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. దాన్ని కూడా ట్విస్ట్‌ చేసి, నానా తప్పుడు రాతలు రాస్తున్నారు. అసలు తమ కొడుకు ఏం తప్పు చేశాడని రషీద్‌ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ‘సీఎంగా వైఎస్‌ జగన్‌ ఉంటే.. అంతా మంచి జరుగుతుందని నమ్మడం మా తప్పు అవుతుందా?’ అని వారు ప్రశ్నిస్తున్నారు. హంతకుడైన జిలానీ.. లోకేశ్‌ పుట్టిన రోజున, స్థానిక ఎమ్మెల్యే భార్యకు స్వయంగా కేక్‌ తినిపించిన ఫొటోలను రషీద్‌ తల్లిదండ్రులు చూపారు. స్థానిక ఎమ్మెల్యేతో కూడా కలిసి దిగిన హంతకుడి ఫొటోలను వారు చూపించారు.హత్యలు.. హత్యాయత్నాలు.. వేధింపులు.. విధ్వంసాలు పల్నాడు జిల్లాకు కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజుల్లోనే హత్యతో సహా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. అంతకు ముందు మల్లికా గార్గ్‌ జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఆమె సమర్థురాలు. అందుకే ఆమెను ఉద్దేశ పూర్వకంగా బదిలీ చేశారు. తమకు అనుకూలంగా ఉండే ఎస్పీని నియమించుకుని ఈ దారుణాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ వారి వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. షాపులను కాల్చేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులకు చెందిన చీనీ చెట్లు నరికేస్తున్నారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు సైతం ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్‌ ఇచ్చినట్టుగా ఉంది.ఎంపీపైనా యథేచ్ఛగా దాడి మరోవైపు తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడులు చేశారు. కావాలనే అక్కడ టీడీపీ మనుషులు ఉండేలా, పోలీసులతో ప్లాన్‌ చేసి మరీ దాడులు చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఒక న్యాయవాది. ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరులో ఆయన ఇంటికి వెళ్తే, రాళ్లతో దాడి చేసి.. వాహనాలు కూడా ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్పకు చెందిన వాహనాన్ని దగ్ధం చేశారు. అన్ని తప్పులు చేసిన వారే, తిరిగి మన పార్టీ వాళ్ల మీద కేసులు పెడుతున్నారు.ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందా?రాష్ట్రంలో 15 ఏళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రస్థానం సాగుతోంది. చంద్రబాబు ఆశించినట్టుగా వైఎస్సార్‌సీపీని అణగదొక్కలేరు. ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివి కావు. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ మీద దాడులు చేయడం ధర్మమా? ఇలాగైతే ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుంది? ప్రభుత్వాలు చేసే మంచి పనుల ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయి. గత ఎన్నికల్లో మనం 86 శాతం సీట్లను గెలిచాం. అయినా ఇలాంటి ఘటనలు జరగలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఓటు వేయని వారికి కూడా ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇచ్చాం. దాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. ప్రజలందరినీ సమానంగా చూశాం. అందరికీ పారదర్శకంగా సేవలు అందించాం. ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు కాకపోవడంపై ఎవ్వరూ ప్రశ్నించకూడదన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై ఎవరూ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేయకూడదన్నదే ప్రభుత్వ ఆలోచన. అందుకే దగ్గరుండి విధ్వంసకాండను ప్రోత్సహిస్తున్నారు. పార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యం. ఎక్కడ కార్యకర్తలకు నష్టం జరిగినా వెంటనే స్పందించడం, వారిని కాపాడుకోవడం మన బాధ్యత. ఆయా కుటుంబాలకు తోడుగా నిలవాలి. కార్యకర్తలందరి తరఫున గట్టిగా నిలబడాలి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.

Sakshi Editorial On AP TDP Chandrababu Govt and President rule
రాష్ట్రపతి పాలనే శరణ్యం!

‘‘మేం అధికారంలోకి వస్తున్నాం, రాగానే ‘అకౌంట్స్‌’ సెటిల్‌ చేస్తాం. ఒక ఆరు నెలలపాటు మాలో కొందరం ఇదే పని మీద ఉంటాం. అందరి అకౌంట్లూ సెటిల్‌ చేస్తాం’’. ఎన్నికలకు ముందు ఒక తెలుగుదేశం నాయకురాలు టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. ఇప్పుడా నాయకురాలు హోం మంత్రిగా పని చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ యువనేత అనేక సభల్లో తన చేతుల్లోని ‘రెడ్‌ బుక్‌’ను ప్రజలకు చూపెట్టారు. ఈ ‘రెడ్‌ బుక్‌’లో ప్రత్యర్థుల పేర్లను రాసుకుంటున్నాననీ, అధికారంలోకి రాగానే వారి సంగతి తేల్చేస్తాననీ హెచ్చరికలు జారీ చేశారు. తమ మాట వినని అధికారులకు కూడా ఈ హెచ్చరికలు వర్తిస్తాయనే బెదిరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌ అంతటా యువనేత, ‘రెడ్‌ బుక్‌’ బొమ్మలతో కూడిన హోర్డింగులు ప్రత్యక్షమయ్యాయి. ఆ యువనేత ఇప్పుడు క్యాబినెట్‌లో ఉన్నారు. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారని సమాచారం. ఈ రెండు ఉదాహరణలు మచ్చుకు మాత్రమే! తెలుగుదేశం ప్రభుత్వం కక్షపూరిత పాలనా విధానానికి దిగజారిందని చెప్పడానికి ఇటువంటి డజన్లకొద్దీ ఉదాహరణలు ఇవ్వవచ్చు. రాజ్యాంగ వ్యవస్థల్లోని అతి ప్రధాన విభాగమైన ఎగ్జిక్యూటివ్‌ వ్యవస్థ బాహాటంగానే రాజ్యాంగేతర పాలనా పద్ధతులను ఎంచుకుంటున్నది. పర్యవసానాలు జనజీవితాన్ని భయ కంపితం చేస్తున్నాయి.అధికార పార్టీ కక్షలకూ, కార్పణ్యాలకూ ఆరు వారాల స్వల్పకాలంలోనే 32 మంది వైసీపీ అభిమానులు హతమైనట్టు వార్తలందుతున్నాయి. వినుకొండలోని ఒక ప్రధానమైన సెంటర్‌లో వేలాది మంది ప్రజల సమక్షంలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను నరికి చంపిన దృశ్యం రాష్ట్ర ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టింది. వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక దళిత మహిళా రైతును తెలుగుదేశం కార్యకర్త అత్యంత పాశవికంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన దారుణం జరిగిన వారం రోజుల్లోనే రషీద్‌ దారుణ హత్య జరగడం రాష్ట్ర ప్రజలను కలవరపరుస్తున్నది.వైసీపీ కార్యకర్తలూ, అభిమానులపై ఈ ఆరు వారాల్లో 305 హత్యాయత్నాలు జరిగినట్టు వివరాలు అందుతున్నాయి. తిరువూరులో ఒక మునిసిపల్‌ కౌన్సిలర్‌నే రోడ్లపై పరుగెత్తిస్తూ కత్తులతో పొడిచిన వీడియో చిత్రం కూడా కలకలం సృష్టించింది. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు వైసీపీ చెబుతున్నది. దాదాపు నాలుగు వేల కుటుంబాలు సొంత ఊరును వదిలి దూరంగా శరణార్థుల మాదిరిగా తలదాచుకుంటున్నాయి.వైసీపీ పార్లమెంట్‌ సభ్యుడు, లోక్‌సభలో ఆ పార్టీ నాయకుడైన మిథున్‌రెడ్డిపై దాడి చేశారు. ఆయన సొంత నియోజక వర్గంలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారం రౌడీ మూకల్ని తరలించి రాళ్ల దాడి చేశారు. ఎంపీ వాహనంతో సహా డజనుకు పైగా వాహనాలకు నిప్పుపెట్టారు. 560 కుటుంబాల ఆస్తులను అధికార పార్టీ మూకలు ధ్వంసం చేశాయి. పరిపాలనా వికేంద్రీకరణకు ఆయువుపట్టు వంటి గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకే సెంటర్లపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. వైఎస్‌ జగన్‌ ఆనవాళ్లు కనిపించకూడదన్న కక్షతో వేలాది శిలాఫలకాలను పగుల గొట్టారు.జరిగిన సంఘటనలనూ, వాటి తీవ్రతనూ గమనంలోకి తీసుకుంటే ఈ ఆరు వారాల కాలాన్ని ‘బీభత్స పాలన’ (reign of terror) గా పరిగణించాలి. ఈ నేపథ్యంలోనే నిన్న రషీద్‌ కుటుంబ పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర భంగం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బెంగాల్, తమిళనాడుల్లో ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై జరిగిన స్వల్ప దాడులకే ఆ రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపిన మోదీ సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తమ కూటమి ప్రభుత్వం బీభత్సపాలన చేస్తున్నా మిన్నకుండటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.ఒకపక్క తెలుగునాట మెజారిటీ మీడియా సంస్థలపై తెలుగుదేశం అనుకూలవర్గ గుత్తాధిపత్యం కొనసాగుతున్నది. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య మద్దతుదారులందరి దృష్టికీ జరుగుతున్న ఆగడాలను తీసుకురావడం కోసం ఈ బుధవారం ఢిల్లీలో ధర్నా చేయాలని వైసీపీ సంకల్పించింది. రాష్ట్రపతి పాలన అంశాన్ని గత కేంద్ర ప్రభుత్వాలు ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నందు వల్ల దానిపై ప్రజాస్వామికవాదుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొని ఉన్న యథార్థ పరిస్థితులను జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లడం వైసీపీకి అవసరం.భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 355 ప్రకారం ‘విదేశీ దాడుల నుంచీ, అంతర్గత కల్లోలం నుంచీ రాష్ట్రాలను కాపాడే బాధ్యత యూనియన్‌ ప్రభుత్వానిదే. ఆ రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం కూడా కేంద్రం బాధ్యత’. ఈ ఆర్టికల్‌ను మరింత విశదీకరిస్తే ‘రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగానే రాష్ట్రాల ప్రభుత్వాలు పరిపాలించాలి. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ భద్రత కల్పించడంతోపాటు, అతని ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడటం కూడా రాష్ట్ర ప్రభుత్వం విధి’. రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడం కోసం అవసరాన్ని బట్టి రాష్ట్రపతి పాలన విధించే విశేషాధికారాన్ని ఆర్టికల్‌ 356 ద్వారా రాష్ట్రపతికి రాజ్యాంగం కట్టబెట్టింది.రాష్ట్రాల్లో రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పరిపాలించడం కుదరని పరిస్థితులు ఏర్పడినట్లయితే ఆర్టికల్‌ 356 (1) ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆంధప్రదేశ్‌లో ఇప్పుడు శాంతిభద్రతల పరిస్థితికి ఏర్పడిన విఘాతం సాధారణమైనది కాదు. జరుగుతున్నవి చెదురుమదురు సంఘటనలు అసలే కావు. సీనియర్‌ జర్నలిస్టు కృష్ణంరాజు లెక్కగట్టిన వివరాల ప్రకారం శుక్రవారం నాటికే రోజుకు సగటున 130 హింసాత్మక సంఘటనలు జరిగాయి. నెలరోజుల్లో 22 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఇందులో నలుగురిని చంపేశారు. అభం శుభం తెలియని చిన్నారులను కూడా చిదిమేశారు. ఒక బాలిక చనిపోయిందని చెబుతున్న పోలీసు యంత్రాంగం ఆమె శవాన్ని కూడా రెండు వారాలు దాటినా గుర్తించలేక పోయింది.‘ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును చెప్పింది. రాజకీయ కారణాలతో ఎడాపెడా రాష్ట్రపతి పాలన విధించే సంప్రదాయాలకు చెక్‌ పెడుతూనే, ఏయే సందర్భాల్లో విధించడం సమర్థనీయమో కూడా రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తీర్పు (1994) చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చని అభిప్రాయపడింది. ఉదాహరణకు సెక్యులరిజం అనే అంశం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సెక్యులరిజాన్ని బలహీనపరిచేవిగా ఉంటే ఆ రాష్ట్ర పరిస్థితులు 356వ అధికరణంలో పేర్కొన్నట్టుగా ఉన్నాయనే భావించాలి.రాజ్యాంగ పీఠికను రాజ్యాంగ మౌలిక స్వరూపానికి గుర్తుగా భావిస్తారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజంతోపాటు ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం – ఆలోచనా, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ – అవకాశాల్లో, హోదాల్లో సమానత్వం – వ్యక్తిగత గౌరవం వంటి అంశాలకు కూడా పీఠిక ప్రాధాన్యమిచ్చింది. ఇందులో దేనికి భంగం కలిగినా రాజ్యాంగ మౌలిక స్వరూపంపై జరిగిన దాడిగానే పరిగణించాలి. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటాన్ని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తున్నది. ప్రతిపక్ష కార్యకర్తలను మోకాళ్లపై కూర్చోబెట్టి చేతులు జోడింపజేసి అధికారపక్షీయులు తమ నాయకునికి జైకొట్టించుకుంటున్నారు. ఇటువంటి వీడియోలు అసంఖ్యాకంగా యూట్యూబ్‌లో కనిపిస్తున్నాయి. ఈ చర్యలు అనైతికమే కాదు రాజ్యాంగ విరుద్ధం కూడా!రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడడం, హింసను రెచ్చగొట్టడం కూడా రాష్ట్రపతి పాలన విధించడానికి అనువైన చర్యలుగా బొమ్మై కేసులోనే సుప్రీంకోర్టు తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే తమ ప్రత్యర్థులపై దాడులు చేస్తామని, ‘అకౌంట్లు’ సెటిల్‌ చేస్తామని ఎన్నికల ముందునుంచే తెలుగుదేశం నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధించడమే ధ్యేయంగా ‘ఉద్దేశపూర్వకంగా’ రెడ్‌బుక్‌ హోర్డింగులను రాష్ట్రవ్యాపితంగా నెలకొల్పి, తమ పార్టీ కార్యకర్తల హింసాప్రవృత్తిని రెచ్చగొడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన రాజ్యాంగ విధులను, బాధ్యతలను విస్మరించడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీయాల్సిన పరిస్థితిగానే సర్వోన్నత న్యాయస్థానం పరిగణించింది. ఈ నలభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఐదువేల పైచిలుకు హింసాయుత ఘటనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరించింది. ఏ సందర్భంలోనూ పోలీసు యంత్రాంగం స్పందించకపోవడానికి వెనుకనున్న కారణం – రాష్ట్ర ప్రభుత్వ మౌఖిక ఆదేశాలే! ఎంపీ మిథున్‌రెడ్డిని తన నియోజకవర్గంలో పర్యటించకుండా రౌడీ మూకలు అడ్డుకున్న సందర్భంలో గానీ, వినుకొండ నడిబజారులో రషీద్‌ను తెగనరుకుతున్న సందర్భంలో గానీ పోలీసులు ప్రేక్షకపాత్రనే పోషించారు.ఈ హింసాకాండ – నరమేధం ఆరు మాసాలపాటు కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. తన కూటమి భాగస్వామ్య పక్షం పట్ల మోదీ ప్రభుత్వం ఒలకబోస్తున్న ధృతరాష్ట్ర ప్రేమకు వారు కూడా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఈ ఆటవిక పాలనను ఇంకా కొనసాగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవసరంగా మారింది. తమ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలను అమలు చేయడం సాధ్యం కాదు. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు, ప్రజలు భయపడాలి. అందుకోసం ఈ బీభత్స పాలన కొనసాగాలి. రేపటి బడ్జెట్‌లో తమ ’సూపర్‌ సిక్స్‌’ హామీల అమలుకు అదనంగా లక్ష కోట్ల పైచిలుకు కావాలి. అందువల్ల పూర్తి బడ్జెట్‌ను మరోసారి వాయిదా వేసి, మళ్లీ ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ పెట్టే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే ఇది కూడా అసాధారణ చర్యే!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

Israel-Hamas war: Israeli air strikes hit Yemen’s port city of Hodeidah after Houthi attacks
Israel-Hamas war: మృత్యుంజయుడు!

దెయిర్‌ అల్‌ బలా: మాటలకందని గాజా విషాదం కొన్ని అవాంఛిత అద్భుతాలకూ వేదికగా మారుతోంది. సెంట్రల్‌ గాజాలోని నజరేత్‌ సమీపంలో హమాస్‌ అ«దీనంలో ఉన్న ప్రాంతాలపై శనివారం రాత్రి ఇజ్రాయెల్‌ భారీగా దాడుల్లో 24 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఓలా అద్నాన్‌ హర్బ్‌ అల్‌కుర్ద్‌ అనే 9 నెలల నిండు గర్భిణి కుటుంబమూ ఉంది. ఆ ఇంట్లో ఆరుగురు దాడికి బలవగా ఆమె తీవ్రంగా గాయపడింది. దాంతో హుటాహుటిన అల్‌ అవ్దా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయతి్నంచినా గాయాల తీవ్రతకు తాళలేక అద్నాన్‌ కన్నుమూసింది. కానీ కడుపులోని బిడ్డ మాత్రం బతికే ఉన్నట్టు వైద్యులకు అనుమానం వచి్చంది. అల్ట్రా సౌండ్‌ చేసి చూడగా చిన్నారి గుండె కొట్టుకుంటున్నట్టు తేలింది. దాంతో హుటాహుటిన సిజేరియన్‌ చేశారు. పండంటి మగ బిడ్డను విజయవంతంగా కాపాడారు. మృత్యుంజయునిగా నిలిచిన అతనికి మలేక్‌ యాసిన్‌ అని పేరు పెట్టినట్టు సర్జన్‌ అక్రం హుసేన్‌ తెలిపారు. చిన్నారి శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్‌ అందించారు. పరిస్థితి కాస్త మెరుగు పడగానే ఇంక్యుబేటర్‌లో ఉంచి హుటాహుటిన దెయిర్‌ అల్‌ బలాలోని అల్‌ అక్సా ఆస్పత్రికి తరలించారు.

Heavy to very heavy rains were recorded across Telangana
Telangana: కరువుతీరా వర్షాలు

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌: కరువుతీరేలా.. వరుణుడు కరుణించాడు. వానాకాలం ప్రారంభమైన నలభై రోజుల అనంతరం ఒకేసారి రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు వాగులు, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. పలుచోట్ల పంట పొలాల్లోకి నీరు చేరింది. శనివారం జిల్లాల వారీ గణాంకాలు పరిశీ­లిస్తే.. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో సగటున 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత ములుగు జిల్లాలో 4.19 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4.0 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో 12.15 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా అంతటా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా రెండురోజులుగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కాగా, ఇంకొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా ఖమ్మం ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్‌ ప్రాంతంలో 2.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ముసురు వాన ఉండడంతో పలుచోట్ల వరి నారుమడులు, పత్తి చేన్లలో వరద నీరు నిలిచింది. పలుచోట్ల చెరువులు నిండి అలుగు పోస్తుండగా అక్కడక్కడా రహదారులు, లోలెవల్‌ బ్రిడ్జిలపైకి వరద చేరింది. ఉధృతంగా జంపన్న, ముసలమ్మ వాగులు ములుగు జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో ఏజెన్సీలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఏటూరునాగారం మండలంలోని కొండాయి, ఎలిశెట్టి గ్రామాల సమీపంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మర పడవలను ఏర్పాటు చేశారు. ఎలిశెట్టిపల్లి సమీపంలో జంపన్న వాగు ఉధృతి ఎక్కువ కావడం, దబ్బగట్ల శైలజ, పులిసె అనూష అనే గర్భిణులు పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో వారిని పడవల్లో వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. రామన్నగూడెం పుష్కరఘాట్‌కు 6 కిలోమీటర్ల దూరంలో కరకట్ట కోతకు గురవుతుండటంతో ఇరిగేషన్‌ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. మంగపేట మండలంలోని రాజుపేట ముసలమ్మవాగు వరద ఉధృతికి ఒడ్డు కోతకు గురవుతుండటంతో ఒడ్డు వెంట నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాజేడు మండల పరిధిలోని కొప్పుసూరు గుట్టల వద్ద ఉన్న గుండ్లవాగు ప్రాజెక్టు కట్ట ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు పరిస్థితిని సమీక్షించారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోతుల్వాయి సమీపంలోని బొర్రవాగు, గుండ్రాత్‌పల్లి సమీపంలోని అలుగువాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద కాజ్‌వేల పైనుంచి వెళ్తుండడంతో పలు గ్రామాలకు మండలం మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పత్తి చేలల్లోకి వరద నీరు చేరింది. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వర్షాలతో మల్హర్‌ మండలం తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని ఏఎమ్మార్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌రెడ్డి, మైన్‌ మేనేజర్‌ కేఎస్‌ఎన్‌ మూర్తిలు తెలిపారు. వర్షాల కారణంగా 1.30 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీ, 6 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. గోదావరిలో కలెక్టర్, ఎస్పీ బోటు ప్రయాణం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్, పలిమెల మండలాల్లో కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే పర్యటించారు. గోదావరిలో బోటులో ప్రయాణించి వరద ఉధృతిని పరిశీలించారు. అక్కడి నుండి ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు మారుమూల గ్రామమైన దమ్మూరుకు చేరుకొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్రి–సాంగిడి దారి మూసివేత ఎడతెరిపిలేని వర్షాలతో వరద నీరు పోటెత్తడంతో ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని ఉమ్రి వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో ఉమ్రి–సాంగిడి దారిని పోలీసులు మూసి వేశారు. రెండు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగుపై కొత్త బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో, తాత్కాలిక వంతెన గుండానే రాకపోకలు కొనసాగుతున్నాయి. 60 గ్రామాలకు నిలిచిన రాకపోకలు మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. జిల్లాలోని ఎల్లంపల్లి, ర్యాలీవాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు మండలాల్లో 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణి ప్రాంతాల్లోని శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కైరిగూడ, డొర్లి ఏరియాల్లోని ఓపెన్‌ కాస్టుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడి రూ.కోట్ల నష్టం వాటిల్లింది. నిర్మల్‌ జిల్లా కడెం మండలంలో అత్యధికంగా 65.5మి.మీ వర్షపాతం నమోదైంది. ఖానాపూర్‌ మండలంలోని దిలావర్‌పూర్‌ వెళ్లే మార్గంలో రెంకోనివాగుపై వేసిన తాత్కాలిక రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు జిల్లాలో 13.9 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సింగరేణి ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శనివారం రోజంతా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కమ్మర్‌పల్లిలో 34.3 మిల్లీమీటర్లు, మెండోరాలో 28.0, నవీపేట్‌లో 27.5, బాల్కొండలో 24.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పాలమూరులో ముసురు వాన వనపర్తి జిల్లాలో 2.7 సెంటీమీటర్లు, నారాయణపేట జిల్లాలో 2.69, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2.49, జోగుళాంబ గద్వాల జిల్లాలో 2.04, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 1.42 సెంమీటర్ల వర్షపాతం నమోదైంది.ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా మహమ్మదాబాద్‌ మండలంలో 4.9 సెంమీ వర్షపాతం నమోదైంది. కొత్తకోట, జడ్చర్ల, ఆత్మకూరులో ముసురు వర్షానికి తడిసిన మట్టి ఇళ్లు కూలిపోయాయి. వీడని ముసురు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులుగా ముసురు కొనసాగుతోంది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో శనివారం 1.43 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదవగా కడ్తాలలో అత్యల్పంగా 0.95 సెంటీమీటర్లు నమోదైంది. వికారాబాద్‌ జిల్లాలోని పలు వాగులు ఉరకలెత్తుతున్నాయి. సగటు వర్షపాతం కంటే ఎక్కువగా.. శనివారం రాష్ట్రంలో 1.79 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోంది. శనివారం 0.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా రెట్టింపు వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్‌లో భాగంగా జూన్‌1 నుంచి ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతం 26.46 సెంటీమీటర్లు కాగా, ఇప్పటివరకు 33.11 సెంటీమీటర్ల వర్షపాతం (25 శాతం అధికం) నమోదైంది. గతేడాది ఇదే సీజన్‌లో 32.84 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత నైరుతి సీజన్‌లో శనివారం నాటికి రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం, నాగర్‌కర్నూల్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ములుగు, కరీంనగర్, సూర్యాపేట, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షం కురిసింది. మిగిలిన జిల్లాలో గడిచిన నాలుగు రోజుల క్రితం వరకు సాధారణం కంటే తక్కువ నమోదైనా.. శుక్ర, శనివారాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ శనివారం రాత్రి ప్రకటించింది. వాయుగుండానికి తోడు ఉపరితల ద్రోణి పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం మరింత ముందుకు సాగి ఒడిశాలోని చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైంది. రానున్న ఆరు గంటల్లో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టంపై 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండురోజులు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. నేడు అతిభారీ, అత్యంత భారీ వర్షాలు!ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. ఆ మేరకు పది జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.

IS CM Chandrababu Really Insult Senior IAS Piyush Kumar
సీఎంవోలో సీనియర్‌ ఐఏఎస్‌కు అవమానమా?

అమరావతి, సాక్షి: ఆయనో సమర్థవంతమైన ఐఏఎస్‌ అధికారి. డిప్యూటేషన్‌ మీద కేంద్రంలో కీలక శాఖల్లో పని చేసిన అనుభవమూ ఉంది. అయితే ఆయన సేవలు వాడుకుంటామంటూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆఘమేఘాల మీద ఆయన్ని కేంద్ర సర్వీసుల నుంచి రప్పించుకుంది. ఇప్పుడు సీఎంవోలో ఎలాంటి శాఖలు అప్పగించకుండా ఇప్పుడు ఖాళీగా కూర్చోబెట్టింది. ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన పీయూష్ కుమార్ కేంద్రంలో డెప్యూటేషన్ పై పని చేసేవారు. ఆయన కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగంలోని అదనపు కార్యదర్శిగా విధులు న్విహించారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. సీఎం చంద్రబాబు కేంద్రానికి రిక్వెస్ట్‌ పెట్టారు. దీంతో.. కేంద్రం ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసింది. వచ్చిరాగానే సీఎం ప్రిన్సిపాల్‌ సెక్రటరీగా, ఆ వెంటనే ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఆ వెంటనే రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ సీఈవోగా ఏపీ ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు హడావిడి చేశారు. అయితే.. తాజాగా సీఎంవోలోని అధికారులకు శాఖలు కేటాయిస్తూ సీఎం ముఖ్యకార్యదర్శి రవిచంద్ర ముద్దాడా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ముద్దాడా రవిచంద్ర, ప్రద్యుమ్న, రాజమౌళి, కార్తికేయ మిశ్రాలకే శాఖల కేటాయింపు ఉంది. కానీ, పీయూష్‌ కుమార్‌కు మాత్రం ఏ శాఖను చంద్రబాబు కేటాయించలేదు. దీంతో ఏ శాఖా కేటాయింపు లేకుండానే ఆయన సీఎంవోలో కూర్చుకున్నారు. మరోవైపు.. కావాలనే ఆయన్ని అవమానిస్తున్నారేమో? అని సీఎంవో అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.

KSR Comments On TDP-Janasena-BJP Alliance Politics
కళ్లెదుటే అరాచకాలు.. దాస్తే దాగుతాయా?

ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక పాలన సాగుతున్న తీరు, పైశాచికంగా రాజకీయ ప్రత్యర్ధులను నరుకుతున్న వైనం, ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తిపై సైతం దాడులు చేసి ఆయన వాహనాలను ధ్వంసం చేసిన ఘట్టాలు గమనిస్తుంటే నలభైఆరేళ్ల సీనియర్ చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా ఉందా? అనే భావన కలగక మానదు. పైకి ఎప్పుడూ నీతులు వల్లిస్తూ, రౌడీయిజంను అణచివేస్తా.. అంటూ కబుర్లు చెప్పడం, దారుణమైన అకృత్యాలు జరుగుతుంటూ మాత్రం చూస్తూ ఊరుకోవడమే కాకుండా ఆ నేరాలు చేసేవారిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏపీ ప్రజలు ఇలాంటి పాలననా కోరుకుంది అనిపిస్తుంది.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చిన రీతిలో అరాచకంగా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌, తదితర టీడీపీ, జనసేన నేతలు అదే అరాచకాన్ని నిజం చేసి చూపుతున్నారు. వారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా మద్దతు ఇస్తున్న పద్దతి నీచాతినీచంగా ఉంది. చివరికి హత్యలు చేసినవారిని, దాడులు చేసి వాహనాలను నాశనం చేసినవారిని సైతం ఈ మీడియా సంస్థలు వెనుకేసుకు వస్తూ జర్నలిజం స్థాయిని పాతాళానికి తీసుకువెళ్లాయి. అందుకు ఆ మీడియా యజమానులు ఏ మాత్రం సిగ్గుపడడకపోవడం విషాదం.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు ఇంతవరకు సాగిన విధ్వంసకాండ ప్రజలను భయబ్రాంతులను చేస్తోంది. వారేదో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల అంతు చూస్తున్నామని టీడీపీ వారు భావిస్తున్నారేమో తెలియదు కాని, చివరికి జరిగేది ప్రజలే టీడీపీ వారి అంతు చూసే పరిస్థితి వస్తుంది. వినుకొండలో నడిరోడ్డులో కత్తితో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను బహిరంగంగా, పాశవికంగా నరికిన ఘటన చంద్రబాబు రాక్షస పాలనకు అద్దం పడుతుంది.గతంలో జగన్ ప్రభుత్వంపై సైకో పాలన అంటూ ఏది పడితే అది మాట్లాడే ఆయన ఇప్పుడు నిజంగానే సైకో అంటే ఎలా ఉంటారో, శాడిజం అంటే ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపిస్తున్నారు. టీడీపీకి ఓట్లు వేసినవారు తమను తాము నిందించుకునే దశకు తీసుకువెళుతున్నారు. వినుకొండలో పాతపగల కారణంగా హత్య జరిగిందని టీడీపీ వారు, పోలీసులు, వారికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ప్రచారం చేశాయి. ఒకే అదే కరెక్టు అనుకుందాం. పాత పగలు ఎప్పటి నుంచో ఉంటే ఇప్పుడే కూటమి అధికారంలోకి వచ్చాకే ఎందుకు కత్తితో నరికాడు.31 మందిని రాష్ట్రంలో టీడీపీ వారు హత్య చేసినా ఏమీ కాలేదు కనుక.. ఇప్పుడు తనకు ఏమీ కాదులే.. తమ ప్రభుత్వమే ఉందిలే అనే ధీమాతో కాదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా? పైగా మంత్రి లోకేష్ విపక్షంలో ఉన్నప్పుడు యువగళం యాత్రలో తిరుగుతూ ఒక్కొక్క టీడీపీ కార్యకర్త కనీసం పన్నెండు కేసులు పెట్టించుకోవాలని బహిరంగంగానే చెబుతూ వచ్చారు. అలా అయితేనే తనను కలవవచ్చని, పదవులు ఇస్తామని ఆయన అనేవారు. దానిని స్పూర్తిగా తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది వాస్తవం అనిపిస్తుంది.ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తామని లోకేష్ ఆఫర్ ఇచ్చేవారు. ఆ ప్రకారం ఇప్పుడు మర్డర్లు చేసినవారికి మంత్రి హోదా ఏమైనా కల్పిస్తారేమో చూడాలి. పుంగనూరులో అరాచకం నానాటికి పెట్రేగిపోతూనే ఉంది. దళిత నేత, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఉన్న రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన తీరు ఏపీలో పోలీసు యంత్రాంగం ఎంత అసర్ధంగా ఉన్నదీ తెలియచేస్తుంది. దీనికి ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా కవరింగ్ ఇవ్వడం గమనిస్తే వీరు ఇంతగా దిగజారారా? అనేది తెలియచేస్తుంది.తాడిచెట్టు ఎందుకు ఎక్కారంటే దూడమేతకు అన్నట్లుగా వీరు ఒక వాదన తయారు చేశారు. కొందరు రైతులతో కలిసి టీడీపీ కార్యకర్తలు పుంగనూరు వచ్చిన రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని కలిసి ఆ ప్రాంతంలో నిర్మించిన రిజర్వాయిర్ల నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరడానికి వెళ్లారట. అక్కడ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారట. ఈ కట్టుకధ అల్లడానికి సిగ్గుండాలి. అసలు ఒక ఎంపీ తన కార్యకర్తలతో సమావేశం అవుతుంటే వేరే పార్టీవారు వెళ్లడం ఏమిటి? ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ది కానప్పుడు మిధున్ రెడ్డి వారి సమస్యను ఎలా తీర్చుతారు.ప్రభుత్వంలో ఉన్నదే టీడీపీ అయితే, ఆ పార్టీవారు వైఎస్సార్‌సీపీ వారిని కోరడం ఏమిటి? అంటే టీడీపీ ప్రభుత్వం అంత అసమర్దంగా ఉందని వారు అనుకున్నారా? పైగా రెడ్డప్ప ఇంటి వద్ద ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, వాహనాలపై రాళ్లు వేయడం, ఒక వాహనాన్ని తగులపెట్టడం.. ఇలా చేసినవారిని రౌడీలు అంటారా? లేక రైతులు అంటారా? టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచే ఈ దాడుల సంస్కృతి తీవ్రంగా మారిందా అన్న డౌటు వచ్చేలా పాలన సాగుతోందనిపిస్తుంది.1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద పాదిరికుప్పం అనే గ్రామంలో కాంగ్రెస్‌కు ఓటేశారన్న కారణంగా దళితులు కొందరిని, బహుశా ఐదుగురిని అనుకుంటా.. టీడీపీ వారు దహనం చేసిన ఘటన తీవ్ర సంచలనం అయింది. 1987 ప్రాంతంలో ప్రకాశం జిల్లా కారంచేడు వద్ద దళితులకు ఒక అగ్రవర్ణ సామాజికవర్గానికి మద్య గొడవలలో దళితులు పాతిక మందికిపైగా హత్యకు గురయ్యారు. 1988లో టీడీపీకి చెందినవారు విజయవాడలో నడిరోడ్డులో నిరాహార దీక్షలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాను కత్తులు, గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. ఇలా బహిరంగంగా చంపడం అన్నది టీడీపీ గత చరిత్రలో కూడా ఉందన్నమాట.ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. ఆ సందర్భంలో ఒక సామాజికవర్గంవారితో పాటు టీడీపీ వారు కూడా నష్టపోయారు. వ్యక్తిగత కక్షలతో టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన గొడవలు చాలానే ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు మారినప్పుడు గొడవలు, హింసాకాండ జరగడం మాత్రం ఇదే అని చెప్పాలి. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి ఘర్షణలు దాదాపు లేవనే చెప్పాలి. ఆ తర్వాత కాలంలో అక్కడక్కడా జరిగినా ఈ స్థాయిలో లేవన్నది వాస్తవం. కాకపోతే ఏ చిన్న గొడవ జరిగినా ఈనాడు వంటి మీడియా బూతద్దంలో చూపడం, తెలుగుదేశం పెద్ద ఎత్తున హడావుడి చేయడం జరిగేది. అలాంటిది ఇప్పుడు ఇంత దారుణంగా హత్యాకాండ జరుగుతుంటే సంబంధిత వార్తల వాస్తవాలను ఇవ్వకపోగా, ఎదురు బాధితులపైనే నెపం నెడుతూ ఎల్లో మీడియా కధనాలు ఇవ్వడం శోచనీయం.బాధ్యతాయుతంగా ఉండవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సరైన రీతిలో స్పందించకపోవడం సమాజానికి చెడ్డ సంకేతం పంపిస్తోంది. గతంలో లోకేష్ నేరాలు ఎక్కువ చేసినవారికి పెద్ద పదవులు అన్నట్లుగా ఇప్పుడు మర్డర్ చేయడం మంత్రి హోదా కలిగిన పదవికి టీడీపీలో అర్హత పొందినట్లు అవుతుందేమో తెలియదు. ఇప్పటికే వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు హింసాకాండలో పాల్గొన్నారు. బహుశా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నది కనుక వారిపై కేసులు పెట్టి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వీరికి పదవులలో ప్రాధాన్యత ఇవ్వకపోతే వారిలో వారు గొడవలు పడతారో, ఏమో చూడాలి. తాము ఇంతమందిని చంపామని, లేదా ఇంత ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ వారిని కొట్టామని, ఇంత పెద్ద ఎత్తున ఇళ్లపై దాడులు చేశామని, కనుక తమకే పదవులు రావాలని డిమాండ్ చేసేలా ఉన్నారు.ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలు టీడీపీ వారి ఘాతుకాలను తట్టుకోలేక ఊళ్లు వదలి వెళ్లిపోయారు. సుమారు 500కోట్ల రూపాయల విలువైన ఆస్తులను టీడీపీ వారు ధ్వంసం చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలో చలనం లేకపోవడం. కనీసం ఈ దాడులు జరగకుండా చర్యలు చేపట్టండి అని చంద్రబాబు ప్రభుత్వానికి సలహా ఇవ్వలేని దుస్థితిలో కేంద్రం ఉంది.టీడీపీ ఎంపీల మద్దతు కీలకం కావడంతో బీజేపీ పెద్దలు మౌనం దాల్చారనుకోవాలి. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా గత ప్రభుత్వ టైమ్‌లో తన కార్యకర్తలను రెచ్చగొట్టేవారు. వైఎస్సార్‌సీపీ వారిని మెడలు పిసికాలని, కొట్టాలని.. ఇలా ఏవేవో తీవ్రమైన మాటలు చెప్పిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఇందిరాగాంధీ అంతటి గొప్ప నేతే ఎలా ఓటమిపాలైందో చరిత్ర తెలియచేస్తుంది. ఎమర్జన్సీ విదించి ఆమె వందల మంది విపక్షనేతలను జైళ్లలో పెట్టించింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జైళ్ల నుంచి విడుదల అయిన విపక్ష నేతలంతా ఒక్కటే, ప్రజల మద్దతు కూడగట్టుకుని ఆమెను పరాజయం పాలు చేశారు.రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఆ సంగతులన్నీ తెలిసినా చంద్రబాబు పాలన ఇలా హీనంగా సాగడం వల్ల ఏమి ప్రయోజనం దక్కుతుందో తెలియదు. ఈ ఘటనలతోనే ప్రతిపక్షం లేకుండా పోతుందని భావిస్తే అది భ్రమే అవుతుంది. గత ప్రభుత్వంలో జరిగాయి కనుక ఇప్పుడు ఇంత ఎక్కువ హింస జరుగుతోందని టీడీపీ, లేదా ఎల్లో మీడియా వాదించవచ్చు. అది కరెక్టా? కాదా? అన్నది పక్కనబెడితే , ఒకవేళ అది నిజమే అనుకున్నా, అంతకంటే ఘోరంగా హింసకాండ చేయమని ప్రజలు టీడీపీని ఎన్నుకున్నారా? తమ ప్రభుత్వం వచ్చింది ప్రత్యర్ధులపై కక్ష రాజకీయాలకు పాల్పడడానికే అని బహిరంగంగా చెప్పి చేయడమే మిగిలింది. ఏమి చేస్తాం. ఇలాంటివారిని ఎన్నుకున్నామని ప్రజలు తమ నెత్తి తాము కొట్టుకోవడం తప్ప.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Chief Minister will decide: Udhayanidhi Stalin On speculation on deputy post
ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి.. మంత్రి రియాక్షన్‌ ఇదే!

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆయన శనివారం స్పందించారు. డీఎంకే ఒక కుటుంబమని.. తమ ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలేనని పేర్కొన్నారు. గతంలో కూడా తాను ఇదే చెప్పానని తెలిపారు.‘డీఎంకేలోని మంత్రులందరూ మా ముఖ్యమంత్రికి డిప్యూటీలు. నాకు ఏ పెద్ద పదవి లేదా బాధ్యత ఇచ్చినా.. నా మనసుకు దగ్గరయ్యేది డీఎంకే యువజన విభాగం కార్యదర్శి పదవే. నాకు ఏ పదవి వచ్చినా డీఎంకే యువజన విభాగం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు డిప్యూటీ సీఎం పదవిపై అనేక వార్తలు వచ్చాయి. అది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

BJP slams on Pinarayi Vijayan for  blatant overreach Kerala appoints  foreign secretary
‘కేరళను ప్రత్యేక దేశంగా మారుస్తారా?’.. సీఎం నిర్ణయంపై బీజేపీ విమర్శలు

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం సొంతంగా విదేశాంగ కార్యదర్శిని నియమించటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం పినరయి విజయన్‌ కే. వాసుకి అనే ఐఏఎస్‌ అఫీసర్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించటంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.‘ఐఏఎస్‌ అఫీసర్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించిన కేరళ సీఎం పినరయ విజయన్‌ రాజ్యాంగ నిబంధనలను దారుణంగా ఉల్లంఘించారు. విదేశీ వ్యవహారాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదు. రాజ్యాంగబద్ధం కాని ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం చాలా ప్రమాదకరం. సీఎం పినరయి విజయన్‌ కేరళను ప్రత్యేక దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారా?’ అని కేరళ బీజేపీ యూనిట్‌ చీఫ్‌ కే.సురేంద్రన్ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.The appointment of an IAS officer as 'Foreign Secretary' in Kerala by CM Pinarayi Vijayan is a blatant overreach and a violation of the Union list of our Constitution. The LDF government has no mandate in foreign affairs. This unconstitutional move sets a dangerous precedent. Is…— K Surendran (@surendranbjp) July 20, 2024 లేబర్‌ అండ్‌ స్కిల్స్‌ సెక్రటరీ కే. వాసుకికి విదేవి వ్యవహారాలకు సంబంధించి కేరళ ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. జూలై 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతల్లో భాగంగా విదేశీ వ్యవహారాలక సంబంధించిన అంశాలను సమన్వయం చేయనున్నారు. కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ ఎంబసీ, మిషషన్లతో అనుసంధానం చేయటంలో కొత్త నియమించిన విదేశంగా సెక్రటరీ వాసుకికి సహాయం చేయాలని ఢిల్లీలోని కేరళ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కేరళ ప్రభుత్వం చేసిన ఈ నియామకంపై మాజ కెబినెట్‌ సెక్రటరీ కే. ఎం. చంద్రశేఖర్‌ పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ‘అంతర్జాతీయ సంబంధాలు కేంద్రం చేతిలో ఉంటాయి. దేశంలోని ఏ రాష్ట్రం విదేశాలకు సంబంధించిన సమాచారం, పనులు కావాలన్నా కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తుంది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం కొత్తగా నియమించిన విదేశాంగ కార్యదర్శి.. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ కంటే మించి ఎలాంటి అదనపు పనులను చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి’ అని చంద్రశేఖర్‌ అన్నారు.

Education Department Changes School Timings In Telangana
తెలంగాణలో స్కూల్‌ టైమింగ్స్‌ మార్పు.. విద్యాశాఖ ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పాఠశాల వేళలపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 నుంచి 9గంటలకు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.కాగా, తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9-30 నుంచి తొమ్మిది గంటలకు మార్పు చేశారు. అలాగే, సాయంత్రం 4-45కి బదులుగా 4-15 గంటలకు పని వేళలు ముగుస్తాయని విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో తెలిపింది.అయితే, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలులో ఉన్న పని వేళలు కొనసాగుతాయని పేర్కొంది. జంట నగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. ఈమేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశించారు.

CM Revanth Reddy Attend Kamma Global Federation Summit 2024
కమ్మ అంటే అమ్మ లాంటి ఆలోచన: సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘కమ్మ అంటే అమ్మ లాంటి ఆలోచన. అమ్మ బిడ్డ ఆకలి చూస్తుంది. అలాగే భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసి పది మందిని బతికించే కులం కమ్మ. కమ్మ వారు ఎక్కడున్నారో గుర్తించేందుకు కష్టపడనవసరం లేదు. సారవంతమైన భూమి, సాగునీరు ఎక్కడ ఉంటే అక్కడ కమ్మ సోదరులు ఉంటారు.. కష్టపడాలనే మనస్తత్వం కమ్మ వాళ్లది.సమాజ శ్రేయస్సు కోసం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు చేసే కృషికి ప్రభుత్వం తగిన సహకారాన్ని అందిస్తుంది. పది మందికి సాయం చేయాలనే ఆలోచన ఉన్న కమ్మ సోదరులు తమ డీఎన్‌ఏను వదులుకోకుండా ముందుకు సాగాలి..’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌ (కేజీఎఫ్‌) ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరిగే కమ్మ గ్లోబల్‌ సమిట్‌ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఓ బ్రాండ్‌ ‘కమ్మ సామాజిక వర్గం వారితో నాకున్న సంబంధాల గురించి చెప్పనవసరం లేదు. నన్నెంతో అభిమానంతో చూసుకుంటుంది. నేను అనర్గళంగా మాట్లాడడానికి, తక్షణమే స్పందించడానికి ఎన్టీఆర్‌ లైబ్రరీలో చదువుకున్న చదువు ఎంతో ఉపయోగపడింది. ఎన్టీఆర్‌ రాజకీయాల్లో, నాయకత్వంలో ఒక బ్రాండ్‌ (ఎన్‌టీఆర్‌ ఈజ్‌ ఏ బ్రాండ్‌ ఫర్‌ పాలిటిక్స్, బ్రాండ్‌ ఫర్‌ లీడర్‌షిప్‌). 1982 కన్నా ముందు కమ్మ ఎమ్మెల్యేలు ఎందరు ఉన్నా, ఎన్టీఆర్‌ ఇచి్చన అవకాశాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎందరో నాయకులుగా ఎదిగారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే నేడు దేశానికి మార్గదర్శకం..’రేవంత్‌ అని అన్నారు. గ్లోబల్‌ సిటీగా మార్చడానికి కృషి చేయాలి ‘కమ్మ సామాజిక వర్గం వాళ్లు అన్ని రంగాల్లో ఎదిగారు. ఎన్టీఆర్, ఎన్‌జీ రంగా, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు వంటి వాళ్లు కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. సత్య నాదెళ్ల మొదలు ఎందరో ప్రపంచస్థాయి సీఈవోలుగా రాణిస్తున్నారు. కమ్మ సోదరులకు అవకాశాలు కలి్పంచడంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. సొంత కులం పట్ల అభిమానం ఉంది. అదే సమయంలో ఇతర కులాలను గౌరవిస్తాం. తెలంగాణలో కుల వివక్ష ఉండదు. హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా మార్చడానికి దేశ, విదేశాల్లో ఉన్న కమ్మ సోదరులు కృషి చేయాలి. హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి. అందుకోసం కృషి చేయాలి..’సీఎం కోరారు. ఢిల్లీలో తెలుగువాళ్ల నాయకత్వ కొరత‘ఢిల్లీలో తెలుగువాళ్ల రాజకీయ నాయకత్వం కొరత ఉంది. జైపాల్‌రెడ్డి, వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్‌ వంటి వాళ్లు ఢిల్లీ రాజకీయాల్లో ఉన్నప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. కులానికి, ప్రాంతానికి అతీతంగా తెలుగువారు ఢిల్లీలో రాణించేలా ముందుకు రావాలి. కమ్మ సంఘానికి గత ప్రభుత్వం ఇచి్చన ఐదెకరాల స్థలానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించి, భవన నిర్మాణానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది..’అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.కాగా తమది దార్శనికతతో కూడిన సామాజిక వర్గమని కేజీఎఫ్‌ అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్‌ అన్నారు. కమ్మ వారి దాతృత్వానికి నాగార్జున సాగర్‌ ఉదాహరణ అని, ముత్యాలరాజా 57 లక్షలు విరాళంగా ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేశారని గుర్తుచేశారు. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, తమిళనాడు ఎంపీ కళానిధి వీరాస్వామి, కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు, మాజీ ఎంపీ మురళీమోహన్, తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు, సత్యవాణి ప్రసంగించారు.రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తమిళనాడు మాజీ గవర్నర్‌ రామ్మోహన్‌రావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, మాజీ మంత్రులు వసంత నాగేశ్వర్‌రావు, వడ్డే శోభనాద్రీశ్వర్‌ రావు, క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement
National View all
title
2020లో భారత్‌లో కరోనాతో... 11లక్షల అధిక మరణాలు

న్యూఢిల్లీ:  కరోనా వల్ల 2020లో భారత్‌లో కేంద్రం చెప్పిన

title
Apollo 11 Mission: జెండా రెపరెపల వెనుక...

అది 1969. జూలై 20. అంతరిక్ష రేసులో యూఎస్‌ఎస్‌ఆర్‌పై అమెరికా తిరుగులేని ఆధిక్యం సాధించిన రోజు. అంతేకాదు.

title
నీట్‌ పేపర్‌ లీక్‌ కేసు.. ఇద్దరు ఎంబీబీఎస్‌ విద్యార్థుల అరెస్ట్‌

వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్‌ కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)-యుజీ పేపర్ లీక్ కేసు

title
ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి.. మంత్రి రియాక్షన్‌ ఇదే!

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, యువజన సంక

title
రాహుల్‌కు ఎందుకింత అహంకారం?: అమిత్‌ షా ధ్వజం

రాంచీ: కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీప

International View all
title
2020లో భారత్‌లో కరోనాతో... 11లక్షల అధిక మరణాలు

న్యూఢిల్లీ:  కరోనా వల్ల 2020లో భారత్‌లో కేంద్రం చెప్పిన

title
Israel-Hamas war: మృత్యుంజయుడు!

దెయిర్‌ అల్‌ బలా: మాటలకందని గాజా విషాదం కొన్ని అవాంఛిత అద్భు

title
Apollo 11 Mission: జెండా రెపరెపల వెనుక...

అది 1969. జూలై 20. అంతరిక్ష రేసులో యూఎస్‌ఎస్‌ఆర్‌పై అమెరికా తిరుగులేని ఆధిక్యం సాధించిన రోజు. అంతేకాదు.

title
హృదయ విదారకం.. ఆ తల్లికి పురిటినొప్పి బాధల్లేవ్‌!

ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి.. పురిటినొప్పులు పడని స్థితిలో ఉన్న తన తల్లి గర్భం చీల్చుకుని బయటకు వచ్చాడు.

title
పాలస్తీనాకు ఫేవర్‌గా అంతర్జాతీయ కోర్టు.. చరిత్ర ఇదీ అంటూ నెతన్యాహు..

దిహేగ్‌: పాలస్తీనా, ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమి

NRI View all
title
అమెరికాలో తెనాలి యువకుడి దుర్మరణం

ఆస్టిన్‌: ప్రమాదవశాత్తూ మరో భారతీయుడు అమెరికాలో ప్రాణాలు పొగొట్టుకున్నాడు.

title
కువైట్‌లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం

గల్ఫ్‌​ దేశం కువైట్‌లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

title
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు

న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా

title
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.

title
న్యూజెర్సీలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ట్రెంటన్‌: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు అమెరికాలోని

Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all