Top Stories
ప్రధాన వార్తలు
‘ఈ వైరస్ ఇప్పటిది కాదు.. 2001లోనే కనుగొన్నారు’
హైదరాబాద్: హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) వైరస్‌పై పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha). హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్త వైరస్ కాదని, 2001లోనే ఈ వైరస్ ఉనికిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. నాటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందన్నారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి ఈ వైరస్ వ్యాపిస్తుందన్నారు. చైనాలో ఈ ఏడాది హెచ్ఎంపీవీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదుతువున్నట్లు తెలుస్తోందని, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో దీని తీవ్రత ఎలా ఉందనే పరిస్థితిని సమీక్షిస్తున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో మన రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు రెగ్యులర్‌గా కో-ఆర్డినేట్ చేసుకుంటున్నారని, ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి పరిస్థితిని అయినా ఎదర్కొనేందుకు ప్రభ/త్వం వైద్య పరంగా సంసిద్ధంగా ఉందన్నారు.డిసీజ్ సర్వైలైన్స్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని, అన్నిరకాల వనరులతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, జిల్లా అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసేలా నిరాధార తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణిస్తోందని హెచ్చరించారు దామోదర.కాగా, భారత్‌లో HMPV ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. భారత్‌లో ఒక్కరోజే హెచ్‌ఎమ్‌పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్‌కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ వచ్చింది. కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ వైరస్‌ను గుర్తించారు.ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్‌ఎమ్‌పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
కెనడా ప్రధాని ట్రుడో రాజీనామా
ఒట్టావా: కెనడా (canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) రాజీనామా చేశారు. ప్రధాని పదవితో పాటు లిబరల్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. బుధవారం జరిగే కీలక జాతీయ కాకస్ సమావేశానికి ముందు ట్రూడో తన పదవికి రాజీనామా చేయడం గమానార్హం.ఈ ఏడాది అక్టోబర్‌లో కెనడాలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార లిబరల్స్ పార్టీ ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ల చేతిలో ఘోరంగా ఓడిపోనుందంటూ పలు సర్వేలు స్పష్టం చేశాయి. దీనికి తోడు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై కవ్వింపు చర్యలకు దిగారు.ఇటీవల, ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా అవతరించడం గొప్ప ఆలోచనని వ్యాఖ్యానించారు. కెనడాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా చాలా మంది కెనడియన్లు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై ట్రూడోతో ప్రస్తావించారు. కానీ ట్రూడో మాత్రం ట్రంప్‌కు ధీటుగా బదులివ్వలేకపోయారు. ఈ వరుస పరిణామాలు ట్రూడో ఉక్కిరిబిక్కిరి అయ్యారని, ఫలితంగా బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వెలుగు చూశాయి. ట్రుడో రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోచర్చనీయాంశమైంది.
కేవీరావుపై పరువు నష్టం దావా వేస్తా: విజయసాయిరెడ్డి
సాక్షి,హైదరాబాద్:కాకినాడ సీ పోర్టు అమ్మకం విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఈడీ ఆఫీసు నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘నన్ను మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. కర్నాటి వెంకటేశ్వర్ రావు(కేవీరావు) ఫిర్యాదు మీద విచారణ చేశారు. ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. విక్రాంత్ రెడ్డికి కాకినాడ సీ పోర్ట్ గురించి కేవీ రావుతో మాట్లాడాలని నేను చెప్పినట్లు ఆరోపించారు. కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.కానీ కాకినాడ సీ పోర్ట్ విషయంలో నేను ఎవరికి ఫోన్ చేయలేదు. కేవీరావు తిరుమలకు వచ్చి దేవుడి ముందే నిజాలు చెప్పాలి. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కాకినాడ పోర్ట్ షేర్ ట్రాన్స్‌ఫర్‌కు నాకు సంబంధం లేదు. కేవీరావు మీద సివిల్ డిఫమేషన్ వేస్తాను. నాకు సంబంధం లేని విషయంలో నా పై ఆరోపణలు చేశారు.సండూరు పవర్ పెట్టుబడులపై వెరిఫై చేసి మళ్లీ పిలిస్తే సమాధానం చెప్తానని చెప్పను. విక్రాంత్‌రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగానే తెలుసు ఆయనతో నాకేం సంబంధం’అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ విచారించిందినా స్టేట్మెంట్ ఈడి అధికారులు రికార్డ్ చేశారుడిడి అధికారులు నన్ను 25 ప్రశ్నలు అడిగారుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసిందికేవీ రావు నాకు తెలియదు అని చెప్పానుఅతనికి నాకు ఎలాంటి సంబంధం లేదుకాకినాడ సీ పోర్ట్ విషయం లో కేవీ రావు కు ఎక్కడ నేను ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను తిరుమల కు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పానునేను తప్పు చేస్తే ఏ శిక్ష కైనా నేను సిద్ధంమే నెల 2020 లో నేను ఫోన్ చేసానని కేవి రావు చెపుతున్నాడుకాల్ డేటా తీసి నేను కాల్ చేశాను లేదో చూసుకోవచ్చునేను ఎక్కడ కూడా కేవీ రావు కు ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను ఈడీ విచారణ కు పిలవండి అని కోరానురంగనాధ్ కంపెనీ నీ ప్రభుత్వం కి ఎవ్వరు పరిచయం చేసారని ఈడీ ప్రశ్నించిందినాకు సంబంధం లేదు అని చెప్పానునేను ఒక సాధారణ మైన ఎంపీ నీ మాత్రమేశ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవ్వరు ఆపాయింట్ చేసారో నాకు తెలియదు అని చెప్పానుశరత్ చంద్ర రెడ్డి తో ఉన్న సంబంధాలు కూడా అడిగారుకుటుంబ రీలేషన్ అని చెప్పానుకాకినాడ సీ పోర్ట్ విషయం లో నాకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారులుక్ ఔట్ నోటీసుల ఫై నేను ఢిల్లీ హైకోర్టు కు వెళ్ళానుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీ కి చెప్పానువిక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారువిక్రాంత్ రెడ్డి తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుపలేదుసండుర్ పవర్ కంపెనిలో 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారుకొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అని చెప్పాను
ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ.50 వేల లోన్
బ్యాంకులలో రుణాలు పొందడం అంత సులువు కాదు. హామీగా ఆస్తులు తాకట్టు పెట్టాలి.. సవాలక్ష డాక్యుమెంట్లు సమర్పించాలి. అయితే ఇవన్నీ లేకుండా కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు.. ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.50 వేలు లోన్ పొందే అవకాశం ఉంది. అదే పీఎం స్వనిధి యోజన పథకం.కోవిడ్ (COVID-19) మహమ్మారి బారిన పడిన వ్యాపారాలకు మద్దతుగా ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి యోజన (PM Svanidhi Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టింది. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారుల స్వావలంబన కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు ఎటువంటి గ్యారెంటీ లేకుండా ఆధార్ కార్డుతో రుణాన్ని పొందవచ్చు.ఇది ఎలా పని చేస్తుందంటే..చిరు వ్యాపారులకు ప్రారంభంలో రూ.10,000 వరకు రుణం ఇస్తారు. వారు ఈ లోన్ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే, తదుపరిసారి రూ.20,000 రుణం పొందవచ్చు. దీన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత రూ.50,000 లోన్ అందుకోవచ్చు.ఆధార్ కార్డు తప్పనిసరిపీఎం స్వనిధి పథకం కింద రుణం పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. వ్యాపారులు తమ ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాన్ని 12 నెలల్లో వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలి.ఎలా దరఖాస్తు చేయాలి?పీఎం స్వనిధి వెబ్సైట్ ప్రకారం.. రుణగ్రహీతలు తప్పనిసరిగా లోన్ అప్లికేషన్ ఫారమ్ (LAF)ని పూరించడానికి అవసరమైన సమాచార పత్రాలను అర్థం చేసుకోవాలి.ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఈ-కేవైసీ/ఆధార్ ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్‌ను ఆధార్ నంబర్‌కు లింక్ చేయడం తప్పనిసరి. దీంతోపాటు రుణగ్రహీతలు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి భవిష్యత్తు ప్రయోజనాల కోసం పట్టణ స్థానిక సంస్థల (ULB) నుండి సిఫార్సు లేఖను పొందవలసి ఉంటుంది.మొబైల్ నంబర్లను అప్డేట్ చేయడానికి ఫారమ్‌ను తప్పనిసరిగా పూరించాలి. ఇతర పత్రాలు అవసరం లేదు.ఈ పథకంలో రుణం పొందడానికి అర్హులైన నాలుగు రకాల విక్రేతలు ఉన్నారు. అర్హత ప్రమాణాలను సరిచూసుకుని తదనుగుణంగా దరఖాస్తు చేసుకోండి.ఈ మూడు దశలను అనుసరించిన తర్వాత పోర్టల్‌లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. రుణగ్రహీతలు నేరుగా పోర్టల్‌లో లేదా వారి ప్రాంతానికి సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.మరి వడ్డీ రేటు ప్రధాన మంత్రి స్వనిధి యోజన పథకానికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRB), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (SFB), సహకార బ్యాంకుల వడ్డీ రేట్లు ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం ఉంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు (NBFC) వడ్డీ రేట్లు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఉంటాయి. ఎంఎంఫ్ఐలు (non NBFC) ఆర్బీఐ మార్గదర్శకాల పరిధిలోకి రాని ఇతర కేటగిరి సంస్థలకు ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పథకం కింద వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
హలో.. హెచ్ఎంపీవీ వైరస్‌తో జాగ్రత్త
బెంగళూరు: : భారత్‌లో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. కర్ణాటకలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి కరోనా రూల్స్ మాదిరిగానే ఉన్నాయి. నిబంధనలు ఇలా జనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్‌తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలని అందులో తెలిపారు. వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కీలక సూచన చేసింది.ఉమ్మివేరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి డిసెంబర్లో సాధారణ జలుబు, దగ్గు సులుపెరగలేదన్నారు.మెల్లగా విస్తరిస్తున్న హెచ్ఎమ్పీవీదేశంలో హెచ్‌ఎమ్‌పీవీ మెల్లగా విస్తరిస్తోంది. భారత్‌లో ఒక్కరోజే హెచ్‌ఎమ్‌పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్‌కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ వచ్చింది.ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ రాగా, అహ్మదాబాద్‌లో ఓ చిన్నారికి ఈ వైరస్ సోకింది. దాంతో దేశంలోని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.భయం వద్దు.. జాగ్రత్తగా ఉండండిచిన్నారుల్లో వైరస్ వ్యాప్తికి హెచ్ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, తమ వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవన్నారు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండూరావుఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు.చైనాలో అధికం..ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్‌ఎమ్‌పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
‘పుష్ప’కేనా నీతులు.. గేమ్ చేంజర్‌కి పాటించరా?
అమరావతి: ‘పుష్ప’ కేమో నీతులు చెప్తారా!, గేమ్ చేంజర్‌కి(Game Changer) పాటించరా! అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్.. ఈ సంక్రాతి బరిలో నిలవడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ఈవెంట్ రాజమండ్రిలో శనివారం సాయంత్రం జరిగింది. ఆ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠగా గుర్తించారు. ఇదే విషయంపై అంబటి రాంబాబు(Ambati Rambabu) ‘ ఎక్స్’ వేదికగా స్పందించారు. "పుష్ప" కేమో నీతులు చెప్తారా !"గేమ్ చేంజర్' కి పాటించరా !@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 6, 2025 గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు ఇద్దరు యువకులు. ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తాము ఆధారాన్ని కోల్పోయమంటూ బోరున విలపిస్తున్నారు.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తోంది,. తనతో కలిసి పండ్ల వ్యాపారం చేసుకుంటున్న చరణ్‌ను కోల్పోవడంతో తాము అన్నీ కోల్పోయినట్లే ఉందని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.అల్లు అర్జున్ టార్గెట్‌గా వ్యవహారం నడిపారా?పుష్ప-2(Pushpa-2) బెనిఫిట్ షో సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. ఆ సినిమా బెనిఫిట్ షోలో భాగంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందింది. అదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఫలితంగా దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. పుష్ప-2 హీరో అల్లు అర్జున్... సంధ్య థియేటర్‌కు బెనిఫిట్ షోకు రావడంతోనే ఇదంతా జరిగిందని అతనిపై కేసు కూడా నమోదైంది. ఒకవైపు ఈ కేసులో A-11గా ఉన్న అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొంటున్నాడు. అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ లభించినా ఈ కేసు వివాదం ఇంకా చల్లారలేదు. ప్రధానంగా అల్లు అర్జున్ టార్గెట్‌గా వ్యవహారం అంతా నడిచిందనే విమర్శలు కూడా వినిపించాయి.మరి గేమ్ ఛేంజర్ సంగతి ఏంటి?పుష్ప సినిమాకు సంబంధించి తెలంగాణలో ఒకరు ప్రాణాలు కోల్పోతే, గేమ్ ఛేంజర్ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఇద్దరు అసువులు బాసారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు ‘పుష్ప’ రచ్చ ఇంకా హాట్ హాట్‌గా ఉండగానే, గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా జరపడాన్నిప్రశ్నిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఈవెంట్ సాయంత్రం సమయంలో జరగడంతో పాటు దానికి భారీగా ఫ్యాన్స్ సేకరణ జరిగిందనే అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు పలువురు విశ్లేషకులు.పుష్ప ఘటన.. పవన్ మాటల్లో కొన్ని.. అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపించిందన్నాడు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘటన జరిగిన వెంటనే రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది చేయకపోవడం వల్లే ఇంత జరిగింది. ఒకవేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే ఆయనపై కూడా ప్రజల్లో విమర్శలు వచ్చేవి. సీఎం హోదాలో రేవంత్ స్పందించారనే అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడే కాదు.. కింద స్థాయి నుంచి ఎదిగారు’ అని పవన్ అన్నారు.‘‘గేమ్ ఛేంజర్’ పరామర్శిస్తాడా?ఇ క్కడ కూడా విషాదమే చోటు చేసుకుంది. గేమ్ ఛేంజర్ ఆయా కుటుంబాల్ని పరామర్శిస్తాడా అనే ప్రశ్న తలెత్తోంది. ఆరోజు పవన్ మాటల్ని బట్టి చూస్తే.. రేవతి కుటుంబాన్ని అల్జు అర్జున్ పరామర్శించకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ వివాదం పెద్ద అవడానికి కూడా అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం కూడా ఒక కారణంగా చూపారు. మరి ఇప్పుడు రామ్ చరణ్ వెళ్లి. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల్సి పరామర్శించాలి కదా. వారి కుటుంబాలకైతే తక్షణ సాయం అయితే అందించారు కానీ వారి కుటుంబాల్ని వెళ్లి పరామర్శించాల్సిన బాధ్యత రామ్ చరణ్‌పై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ‘‘ఒరేయ్ పిచ్చోడా .. పవనన్న చెప్తాడంతే రా
20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!
ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే...జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లి స్పర్శకోసం మనసు ఆరాట పడుతుంది. అలా చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమైన యువతి ఇపుడు జన్మనిచ్చిన తల్లికోసం అన్వేషిస్తోంది. రెండు దశాబ్దాలక్రితం అనుకోని పరిస్థితుల్లో అమ్మకు దూరమైన, పిల్లల విద్యలో పరిశోధకురాలు స్నేహ భారతదేశానికి తిరిగి వచ్చింది. అసలేంటీ స్నేహ స్టోరీ తెలుసుకుందాం పదండి!స్నేహకు సుమారు ఏడాదిన్నర వయసుండగా ఆమె తల్లి వదిలేసివెళ్లిపోయింది. ఈమెతోపాటు నెలల పసిబిడ్డ సోము కూడా అనాధలైపోయారు. ఇది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇద్దర్నీ స్థానిక అనాథ ఆశ్రమంలో చేర్పించారు. ఐదేళ్లపాటు అక్కడే పెరిగారు.అయితే స్పెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన ఒక జంట వీరి పాలిట దైవాలుగా మారారు. అనాధ ఆశ్రమంలో ఉన్న ఐదేళ్ల స్నేహ , నాలుగేళ్ల సోము ఇద్దర్నీ స్పానిష్ జంట జెమా వైదర్, జువాన్ జోష్ 2010లో దత్తత తీసుకుని తమ దేశానికి తీసుకువెళ్లి పోయారు. వీరిని సొంత బిడ్డల్లా పెంచుకుని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం స్నేహ వయసు 21 ఏళ్లు కాగా, చిన్నారుల విద్యలో పరిశోధనలు చేస్తోంది.అయితే, ఇటీవలే వారి మూలాలు ఒడిశాలో ఉన్నాయని జెమా దంపతులు స్నేహకు తెలిపారు. దీంతో తనకు జన్మనిచ్చిన తల్లి ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలని స్నేహ పెంపుడు తల్లి జెమాతో కలిసి గత నెల 19న భారత్ (భువనేశ్వర్)కు చేరుకుంది. స్థానిక హోటల్లో ఉంటూ నయాపల్లిలోని ఇంటి యజమాని వద్దకు వెళ్లి అక్కడ తల్లిదండ్రుల పేర్లను తెలుసుకుంది. తల్లి పేరు బనలతాదాస్, తండ్రి సంతోష్ అని తెలిసింది. ఈ వివరాలతో పోలీసుల సాయంతో అమ్మకోసం వెదుకులాట ప్రారంభించింది. అలాగే అనాధాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని దృవీకరించుకుంది. ఈ విషయంలో మహిళా విశ్వవిద్యాలయం రిటైర్డ్ టీచర్ సుధా మిశ్రా ఆమెకు సాయం అందించారు.ఈ విషయాన్ని స్థానిక పోలీస్ కమిషనర్ దేవ్ దత్తా సింగ్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసులు విచారణ చేయగా, బానాలత కటక్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే జనవరి 6న స్నేహ తిరిగి స్పెయిన్ కు వెళ్లాల్సి ఉండటంతో తల్లిని కలుసుకోవడం సాధ్యం కాలేదు. అయితే తాను మార్చిలో తిరిగి ఇండియాకు వచ్చి తల్లి ఆచూకీ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తానని చెప్పింది స్నేహ. స్నేహ తల్లిదండ్రులను గుర్తించడానికి పోలీసులు , పంచాయతీ కార్యకర్తల సహాయం తీసుకుంటామని ఇన్స్పెక్టర్ అంజలి ఛోట్రే చెప్పారు.స్నేహ అసలు తల్లిదండ్రులు ఎవరు?ఒడిశాకు చెందిన బనలతా దాస్, సంతోష్ స్నేహ తల్లిదండ్రులు. వీరు నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్‌లోని నయాపల్లిలో అద్దె ఇంటిలో ఉండేవారు. వంట మనిషిగా పని చేసే ఆమె భర్త, ఏమైందో తెలియదు గానీ పిల్లలు సహా భార్యను వదిలివేసి వెళ్లిపోయాడు. దీంతో బానాలత ఒంటరిదైపోయింది. అటు నలుగురు పిల్లలతో, కుటుంబ పోషణా భారమైంది. దీంతో ఇద్దరి పిల్లల్ని వదిలేసి మరో కొడుకు, కూతుర్ని తీసుకొని ఎటో వెళ్లిపోయింది. స్నేహ మా ఇంటి వెలుగుస్నేహ చాలా బాధ్యతగల కుమార్తె. మంచి విద్యావంతురాలు. ఆమె మా ఇంటి వెలుగు,ఆమెమా జీవితం అంటూ స్నేహ గురించి ప్రేమగా చెప్పుకొచ్చింది దత్తత తల్లి జెమా. అంతేకాదు జీవసంబంధమైన తల్లిని తెలుకోవాలన్న ఆరాటపడుతున్న కుమార్తెతోపాటు ఒడిశాలోని భువనేశ్వర్ రావడం విశేషం. ప్రస్తుతం స్నేహ చేస్తున్న ప్రయత్నం నెట్టింట వైరల్‌వుతోంది. త్వరలోనే తల్లీబిడ్డలిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు
CT 2025: శుబ్‌మన్ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్?
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది టీమిండియా. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగా దాదాపు దశాబ్దం తర్వాత ఈ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి పయనమైంది.బౌలర్‌గా, కెప్టెన్‌గా రాణించిఇక ఆసీస్‌తో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచిందంటే అందుకు కారణం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)నే. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గైర్హాజరీలో ఈ ఫాస్ట్‌బౌలర్ భారత జట్టును ముందుకు నడిపించాడు. పేసర్‌గా, కెప్టెన్‌గా రాణించి ఆసీస్ గడ్డపై టీమిండియాకు అతిపెద్ద టెస్టు విజయం(295 పరుగుల తేడాతో) అందించాడు.వెన్నునొప్పి వేధించినాఅయితే, ఆ తర్వాత రోహిత్ శర్మ తిరిగి వచ్చినా టీమిండియా ఇదే జోరును కొనసాగించలేకపోయింది. బ్యాటర్‌గా, సారథిగా రోహిత్ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి అతడు స్వచ్చందంగా తప్పుకోగా.. బుమ్రా మరోసారి పగ్గాలు చేపట్టాడు. వెన్నునొప్పి వేధించినా జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు.కానీ సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ ఓటమిని చవిచూసింది. బుమ్రా లేకపోయి ఉంటే.. టీమిండియా ఆసీస్ చేతిలో 5-0తో వైట్‌వాష్‌కు గురయ్యేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడంటే.. ఈ సిరీస్‌లో అతడి ప్రాధాన్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా?ఈ నేపథ్యంలో ఇప్పటికే పేస్ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. త్వరలోనే పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. వన్డేల్లోనూ రోహిత్ వారసుడిగా బుమ్రా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గిల్‌పై వేటు.. బుమ్రాకు ప్రమోషన్?ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా రోహిత్ శర్మకు బుమ్రా డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా శ్రీలంక పర్యటన 2024 సందర్భంగా వన్డే, టీ20లలో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). అయితే, ఏదేని కారణాల వల్ల రోహిత్ దూరమైతే.. గిల్ ఇప్పటికప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించే పరిణతి సాధించలేదని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకొన్న తర్వాత.. వన్డే కెప్టెన్సీకి అతడు దూరం కానున్నాడనే వదంతులు వచ్చాయి. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాలు వినిపించాయి.ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్లుకాగా చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా దూరంగా ఉండనున్నట్లు సమాచారం. వెన్నునొప్పి కారణంగా అతడు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. పాకిస్తాన్ ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో జరుగుతాయి. హైవోల్టేజీ పోరు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.చదవండి: 13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర
నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు
హీరోయిన్ హన్సిక (Hansika Motwani) వేధింపులు తాళలేకపోతున్నానంటూ బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ పోలీసులను ఆశ్రయించింది. భర్త ప్రశాంత్ మోత్వానీ, అత్త జ్యోతి, ఆడపడుచు హన్సిక మోత్వానీలు తనను మానసికంగా హింసిస్తున్నారని వాపోయింది. ఈ మానసిక ఒత్తిడి వల్ల తన ముఖంలో కొంతభాగం పక్షవాతానికి గురైందని పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు గృహ హింస కింద కేసు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 18న నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఖరీదైన గిఫ్టులు తెమ్మని..పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముస్కాన్ (Muskaan Nancy James), ప్రశాంత్ 2020లో పెళ్లి చేసుకున్నారు. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని నటి అత్త, ఆడపడుచు హన్సిక డిమాండ్ చేశారట! అంతేకాకుండా ఆస్తిలోనూ ఏవో కుట్రలకు పాల్పడ్డారని నటి ఆరోపించింది. తన వైవాహిక బంధంలోనూ హన్సిక పదేపదే జోక్యం చేసుకుని గొడవలకు కారణమయ్యేదని పేర్కొంది. వీరు పెట్టిన టార్చర్ వల్ల తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై హన్సిక, ప్రశాంత్ ఇంతవరకు స్పందించలేదు. కాగా ముస్కాన్ దంపతులు 2022 నుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. ప్రశాంత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: అప్పట్లో ఐరన్ లెగ్ అని పేరొస్తుందని భయపడ్డా: చిరంజీవిపాక్షిక పక్షవాతం2022లో నటి తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైనట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం అస్సలు ఊహించలేం. కొంతకాలంగా నేనేమైపోయానని అనుకుంటున్నారా? నా జీవితంలో ఏం జరుగుతుందనేది కొందరికి మాత్రమే తెలుసు. నేను ముఖ పక్షవాతంతో బాధపడుతున్నాను. అధిక ఒత్తిడి వల్ల నాకీ పరిస్థితి వచ్చింది. గతంలో ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు కోలుకున్నాను. కానీ ఇప్పుడు మరోసారి ఆ వ్యాధి నా జీవితంలోకి ప్రవేశించింది.ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది?గత కొద్ది నెలలనుంచి నేను, నా తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. ముఖం ఉబ్బిపోయి ఆ బాధ భరించరాకుండా ఉంది. ఒక నటికి ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది? నాముందున్న సమస్యలతో పోరాడే శక్తినిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు సపోర్ట్‌గా నిలబడే పేరెంట్స్ ఉండటం నా అదృష్టం. జీవితం అంత ఈజీ కాదు.. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా అన్నీ మారిపోతాయి అని రాసుకొచ్చింది.సీరియల్స్..ముస్కాన్ నాన్సీ.. తొడి ఖుషి తొడె ఘమ్ సీరియల్లో సహాయక నటిగా యాక్ట్ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్ ఆఫర్ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్ షోలలో కొన్ని ఎపిసోడ్స్‌లో మెరిసింది. భారత్ కా వీర్ పుత్ర: మహారాణ ప్రతాప్, ఏజెంట్ రాఘవ్- క్రైమ్ బ్రాంచ్ షోలలో నటించింది. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది.చదవండి: అన్నీ ఒకేసారి.. నా వల్ల కావట్లేదంటూ ఏడ్చేసిన మాధవీలత
ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర.. తొమ్మిది మంది జవాన్ల దుర్మరణం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెట్టన మందుపాతర పేలి తొమ్మిది మంది జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. మొత్తం పదిహేను మంది జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని అంబోలి వంతెన వద్ద సోమవారం(జనవరి6) మావోయిస్టులు పేల్చివేశారు. గాయపడ్డ జవాన్లను బీజాపూర్ జిల్లాలోని ఆస్పత్రిలో చేర్చించి చికిత్సనందిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతోంది. దీంతో ఇక్కడ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఏకంగా భద్రతా బలగాల వాహనాన్ని మందుపాతర పెట్టి పేల్చివేయడం సంచలనంగా మారింది. కాగా, ఆదివారమే ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులతో పాటు ఒక జవాను మృతి చెందారు. భద్రతా బలగాలపై పైచేయి సాధించేందుకే..?మావోయిస్టుల దాడుల్లో భద్రతా సిబ్బంది, పౌర మరణాలు 70 శాతం తగ్గాయని, పోలీసుల చేతిలో మావోయిస్టులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. నక్సలిజంపై చివరిదెబ్బ కొట్టడానికి కేంద్ర, రాష్ట్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జమ్ముకశ్మీర్ కంటే బస్తర్ అందమైన ప్రాంతమని,నక్సలిజం అంతమైతే ఇక్కడికి పర్యాటకులు భారీగా వస్తారని పేర్కొన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ఇంతలోనే భద్రతా బలగాలపై మావోయిస్టులు మందుపాతరతో పెద్ద ఎత్తున దాడి చేయడం గమనార్హం.ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్టు హత్య..హైదరాబాద్‌లో నిందితుడి అరెస్టు
కెనడా ప్రధాని ట్రుడో రాజీనామా
టేబుల్ స్పేస్ సీఈవో అమిత్ బెనర్జీ కన్నుమూత
‘ఈ వైరస్ ఇప్పటిది కాదు.. 2001లోనే కనుగొన్నారు’
పెద్దోడి ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది: మహేశ్ బాబు
ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ.50 వేల లోన్
కేటీఆర్ పిటిషన్..రేపే హైకోర్టు తుది తీర్పు
ఘోర పరాభవాన్ని తప్పించుకున్న పాకిస్తాన్
కన్నప్ప మూవీ.. కాజల్ అగర్వాల్ ఏ పాత్ర చేయనుందంటే?
హెచ్ఎంపీవీ వైరస్..జేపీ నడ్డా కీలక ప్రకటన
‘ఈనెల 9న న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటన’
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!?
గేమ్ ఛేంజర్ ఈవెంట్: మృతుల కుటుంబాలకు రామ్‌చరణ్ ఆర్థిక సాయం
ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు..
నేనూ మనిషినే.. ఏడ్చేసిన మాధవీలత
CT 2025: శుబ్‌మన్ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్?
విశాల్‌కు తీవ్ర అస్వస్థత.. డాక్టర్లు ఏమన్నారంటే?
నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు
రిటైర్మెంట్ను వెనక్కు తీసుకున్నాడు.. ఇరగదీశాడు..!
13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర
రైలులో లోయర్ బెర్త్.. రైల్వే కొత్త రూల్
కెనడా ప్రధాని ట్రుడో రాజీనామా
టేబుల్ స్పేస్ సీఈవో అమిత్ బెనర్జీ కన్నుమూత
‘ఈ వైరస్ ఇప్పటిది కాదు.. 2001లోనే కనుగొన్నారు’
పెద్దోడి ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది: మహేశ్ బాబు
ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ.50 వేల లోన్
కేటీఆర్ పిటిషన్..రేపే హైకోర్టు తుది తీర్పు
ఘోర పరాభవాన్ని తప్పించుకున్న పాకిస్తాన్
కన్నప్ప మూవీ.. కాజల్ అగర్వాల్ ఏ పాత్ర చేయనుందంటే?
హెచ్ఎంపీవీ వైరస్..జేపీ నడ్డా కీలక ప్రకటన
‘ఈనెల 9న న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటన’
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!?
గేమ్ ఛేంజర్ ఈవెంట్: మృతుల కుటుంబాలకు రామ్‌చరణ్ ఆర్థిక సాయం
ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు..
నేనూ మనిషినే.. ఏడ్చేసిన మాధవీలత
CT 2025: శుబ్‌మన్ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్?
విశాల్‌కు తీవ్ర అస్వస్థత.. డాక్టర్లు ఏమన్నారంటే?
నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు
రిటైర్మెంట్ను వెనక్కు తీసుకున్నాడు.. ఇరగదీశాడు..!
13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర
రైలులో లోయర్ బెర్త్.. రైల్వే కొత్త రూల్
సినిమా
బాలకృష్ణ హీరోయిన్‌కు వేధింపులు.. మద్దతుగా నిలిచిన అమ్మ!
ప్రముఖ నటి హనీ రోజ్ (Honey Rose) పోలీసులను ఆశ్రయించింది. తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఆధారంగా కేరళలోని ఏర్నాకుళం పోలీసులు చర్యలు చేపట్టారు. హనీ రోజ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలోని కుంబళంకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు.అసభ్యకరమైన పోస్టులు..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. ఈ పోస్ట్ కింద తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో ద్వారా వెల్లడించింది. దీనిపై ఇప్పటికే హనీ రోజ్ ఎర్నాకులం సెంట్రల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దాదాపు 30 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.అసలేం జరిగిందంటే..:ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని ఆదివారం సాయంత్రం హనీరోజ్ విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని రాసుకొచ్చింది. ఈ కామెంట్స్ గురించిన నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఇలాంటి వాటిని మీరు స్వాగతిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారని తెలిపింది. ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను పిలిచాడు. వ్యక్తిగత కారణాల వల్ల చాలాసార్లు నిరాకరించాను. అందుకు ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్‌కు రావడం.. వీలు కుదిరినప్పుడల్లా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆమె తెలిపింది.హనీకి మద్దతుగా అమ్మ..నటి హనీరోజ్‌పై సోషల్‌మీడియాలో వస్తున్న పోస్టులపై చట్టపరమైన చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మలయాళ నటీనటుల సంస్థ(AMMA)అమ్మ తెలిపింది. ఈ విషయంలో హనీ రోజ్ చేస్తున్న న్యాయ పోరాటానికి అమ్మ సహకారం, పూర్తి మద్దతు ఉంటుందని లేఖ విడుదల చేసింది. అవసరమైతే న్యాయ సహాయం అందజేస్తామని అమ్మ అడ్ హాక్ కమిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేసింది. హనీ రోజ్‌ను సోషల్ మీడియా ద్వారా పరువు తీయడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నాలను అమ్మ సంఘం ఖండించింది.చులకన వ్యాఖ్యలుఒకసారి అతడి షాప్‌కు వెళ్లినప్పుడు కూడా మీడియా ముందు నాపై చులకన వ్యాఖ్యలు చేశాడు. అవి నన్నెంతో అసౌకర్యానికి గురి చేశాయి. అప్పుడు నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇంటికి వెళ్లాక ప్రోగ్రామ్ నిర్వాహకులకు కాల్ చేసి నాపై చీప్ కామెంట్లు చేస్తే సహించేది లేదని చెప్పాను. అప్పటినుంచి తన ప్రోగ్రామ్స్‌కు వెళ్లడమే మానేశాను.మరోసారి దిగజారుడు వ్యాఖ్యలుఅయితే నేను హాజరైన ఓ ప్రోగ్రామ్‌కు అతడు గెస్టుగా వచ్చాడు. అతడు వస్తున్నాడన్న విషయం నాకు తెలియదు. అక్కడికి వెళ్లాక నాతో డైరెక్ట్‌గా మాట్లాడలేదు కానీ అందరిముందు మళ్లీ నాపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. తర్వాత మరోసారి తన బిజినెస్ ప్రమోషన్స్‌లో పాల్గొనమని ఆఫర్ ఇచ్చాడు. నేను కుదరదన్నాను. అతడి మేనేజర్.. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను వారి ఆఫర్‌ను తిరస్కరించాను.హనీ రోజ్ సినిమాలు..కాగా వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ పేరు టాలీవుడ్ (Tollywood)లో మార్మోగిపోయింది. ఈ మలయాళ భామ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇందులో హనీ ఊరమాస్ లుక్‌లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta)
మరోసారి వివాదంలో నయనతార.. చంద్రముఖి నిర్మాతల నోటీసులు
హీరోయిన్ నయనతార (Nayanthara) మరోసారి వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు నయనతారకు నోటీసులు పంపించారు. హీరోయిన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తమకు రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పగతోనే నోటీసులు పంపాడన్న నయన్కాగా తమ అనుమతి లేకుండా నానుమ్ రౌడీ దాన్ (నేనూ రౌడీనే) సినిమాలోని మూడు సెకన్ల క్లిప్స్‌ను తన డాక్యుమెంటరీ బియాండ్ ద ఫెయిరీ టేల్‌కు వాడుకున్నారంటూ ధనుష్ (Dhanush).. నయనతారకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే! తమపై కక్షగట్టే ధనుష్ నోటీసులు పంపించాడన్న నయనతార మరి ఇప్పుడెలా స్పందిస్తుందో చూడాలి!వివాదం ఎలా మొదలైందంటే?నయనతార జీవితంపై నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఇందుకుగానూ కొన్ని సినిమా క్లిప్స్ వాడుకున్నారు. అందులో భాగంగా నేనూ రౌడీనే చిత్రంలోని మూడు సెకన్ల సన్నివేశం ఉపయోగించుకున్నారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకుడు కాగా ధనుష్ నిర్మాత. ఈ సినిమా చేస్తున్న సమయంలో విఘ్నేశ్- నయన్ లవ్‌లో పడ్డారు. చాలాకాలంపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2022లో పెళ్లి చేసుకున్నారు.(చదవండి: నేనూ మనిషినే.. ఏడ్చేసిన మాధవీలత)ధనుష్‌పై నయనతార ఆగ్రహంఈ విశేషాలను తన డాక్యుమెంటరీలో పొందుపరిచారు. అయితే నేనూ రౌడీనే సినిమా క్లిప్స్ తన అనుమతి లేకుండా వాడేయడంతో ధనుష్ రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. దీనిపై నయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. తండ్రి, అన్నయ్య అండతో నువ్వు నటుడిగా ఎదిగావు. నేనూ ఏ బ్యాక్‌గ్రౌండ్‌లో లేకుండా ఈ సినీప్రపంచంలో పోరాడి ఈ స్థాయిలో ఉన్నాను. నా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నాతోపాటు నా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నా మనసు ముక్కలైందినీకు మాపై పగ ఉండొచ్చు. కానీ దానివల్ల ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డవారి జీవితాలపైనే అది ప్రభావం చూపిస్తుంది. నా ఇతర సినిమా క్లిప్స్ వాడాం.. కానీ ఎంతో ప్రత్యేకమైన నేనూ రౌడీనే చిత్ర సన్నివేశాలు మాత్రం ఉపయోగించలేకపోయాం. ఈ సినిమా పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్టవుతాయి. కానీ ఎన్నిసార్లు అభ్యర్థించినా నువ్వు వాటిని వాడుకోవడానికి వీల్లేదనడం నా మనసును ముక్కలు చేసింది. బిజినెస్ లెక్కల పరంగా కాపీ రైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావ్ అనుకోవచ్చు.ఇంత దిగజారుతావనుకోలేదుకానీ చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్లే మేం బాధపడాల్సి వస్తోంది. నేనూ రౌడీనే షూటింగ్ టైంలో మేం మా ఫోన్లో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాల్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.చదవండి: నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు
అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లాలనుకుంటే తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవలే చిక్కడపల్లి పీఎస్‌కు వెళ్లే సమయంలోనూ అల్లు అర్జున్ మేనేజర్‌కు రాంగోపాల్ పేట్ పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై మరోసారి నోటీసులు అందజేశారు.అసలేం జరిగిందంటే..కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప 2 విడుదలకు ముందు రోజు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede) జరిగింది. అక్కడకు వచ్చిన అల్లు అర్జున్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.(ఇది చదవండి: అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు)అల్లు అర్జున్ అరెస్ట్..ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయాన్నే జూబ్లీహిల్స్‌లోని ఐకాన్ స్టార్ ఇంటికి వెళ్లిన పోలీసులు చిక్కడపల్లి పీఎస్‌కు తీసుకొచ్చారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత బన్నీని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రిమాండ్ విధించింది.మధ్యంతర బెయిల్‌పై విడుదల..అయితే అరెస్ట్ అయిన రోజే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్ న్యాయవాదులు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అల్లు అర్జున్‌కు నాలుగువారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ అరెస్ట్ అయిన రోజు బెయిల్‌కు సంబంధించిన ప్రక్రియ ఆలస్యం కావడంతో బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆ రోజు రాత్రి అల్లు అర్జున్ జైలులోనే గడిపారు.(ఇది చదవండి: తొక్కిసలాట ఘటన: నాంపల్లి కోర్టుకు సంధ్య థియేటర్ యాజమాన్యం)ఉదయం రిలీజ్..బెయిల్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరుసటి రోజు ఉదయం బన్నీ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ప్రముఖులంతా బన్నీని కలిసి పరామర్శించారు. ఆ తర్వాత అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ కేసు నమోదైన తర్వాత తొలిసారి చిరుతో భేటీ అయ్యారు.రేవతి కుటుంబానికి ఆర్థియసాయం..ఈ ఘటన తర్వాత రేవతి కుటుంబానికి పుష్ప టీమ్ ఆర్థిక సాయం అందించింది. అల్లు అర్జున్ తరఫున అల్లు అరవింద్ కోటీ రూపాయల చెక్ అందజేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు సైతం రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.పరామర్శించిన దిల్‌రాజు..సినీ ఇండస్ట్రీ తరఫున తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఆస్పత్రి వెళ్లి ఆరా తీశారు. శ్రీతేజ్ ఫ్యామిలీకి అన్ని విధాలా సాయం చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని దిల్ రాజు వెల్లడించారు.
తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. బాహుబలి -2 రికార్డ్ బ్రేక్
బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ దాడి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ సినిమా రిలీజై నెల రోజులు దాటినప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు పుష్పరాజ్. ఇప్పటికే ఇండియన్ సినీ చరిత్రలోని మునుపెన్నడు లేని రికార్డులు సృష్టించింది. అత్యంత వేగంగా రూ.1000 కోట్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 ది రూల్(pushpa 2 the rule) నిలిచిన సంగతి తెలిసిందే.తాజాగా పుష్ప-2 మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ విడుదలైన 32 రోజుల్లోనే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2(bahubali-2) రికార్డ్‌ను అధిగమించింది. ప్రస్తుతం రూ.1831 కోట్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో మొదటిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత బాహుబలి-2 (రూ.1810) కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రికార్డ్‌ను పుష్ప-2 బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లతో సెకండ్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. దీంతో రాజమౌళి బాహుబలి-2ను వెనక్కి నెట్టింది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ ట్విటర్ ద్వారా వెల్లడించింది.ఇండియాలో టాప్-8 చిత్రాలివే..ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు అమిర్ ఖాన్ దంగల్ మాత్రమే రూ.2 వేల కోట్ల మార్కును దాటింది. ఆ తర్వాత ప్లేస్‌లో అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప- 2 ది రూల్ నిలిచింది. ఇక రాజమౌళి చిత్రం బాహుబలి -2 మూడో స్థానానికి పరిమితమైంది. తర్వాత వరుసగా ఆర్ఆర్ఆర్ (రూ.1387 కోట్లు), కన్నడ మూవీ కేజీయఫ్ -2 (రూ.1250 కోట్లు), ప్రభాస్ కల్కి 2898 ఏడీ (రూ.1153 కోట్లు), షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ (రూ.1148 కోట్లు), పఠాన్ (రూ.1050 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. వీటిలో టాలీవుడ్‌కు చెందిన నాలుగు సినిమాలు ఉండడం మరో విశేషం.(ఇది చదవండి: అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు)హిందీలో పుష్ప-2 సరికొత్త రికార్డ్..అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో తెరకెక్కించిన పుష్ప- 2 హిందీలో తిరుగులేని వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు నెట్ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచే నార్త్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నార్త్‌లో అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూళ్లు చేసిన మూవీగా పుష్ప-2 రికార్డ్ క్రియేట్ చేసింది. వందేళ్ల ఏళ్ల హిందీ సినీ పరిశ్రమ చరిత్రలో కేవలం 15 రోజుల్లోనే రూ. 632 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.పుష్ప-2 ఓటీటీకి ఎప్పుడంటే..బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పుష్ప-2 ఓటీటీపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. రిలీజ్‌కు ముందే దాదాపు రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలొచ్చాయి. గతంలోనే ఓటీటీ విడుదల తేదీపై పుష్ప టీమ్ క్లారిటీ ఇచ్చింది. పుష్ప-2 రిలీజైన 56 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీకి రానుందని పుష్ప మేకర్స్ ప్రకటించారు.కాగా..2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ విజయంతో పుష్పకు సీక్వెల్‌గా పుష్ప-2 ది రూల్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి కీలక పాత్ర పోషించాడు.(ఇది చదవండి: గేమ్ ఛేంజర్‌తో పోటీ పడనున్న మూవీ.. మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్)#Pushpa2TheRule is now Indian Cinema's INDUSTRY HIT with THE HIGHEST EVER COLLECTION FOR A MOVIE IN INDIA 🔥The WILDFIRE BLOCKBUSTER crosses a gross of 1831 CRORES in 32 days worldwide 💥💥#HistoricIndustryHitPUSHPA2Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/sh7UN5RXLE— Pushpa (@PushpaMovie) January 6, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
బాబర్పైకి బంతి విసిరిన ముల్దర్.. పాక్ బ్యాటర్ రియాక్షన్ వైరల్
సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు సందర్భంగా వియాన్ ముల్దర్(Wiaan Mulder)- బాబర్ ఆజం(Babar Azam) మధ్య వాగ్వాదం జరిగింది. తన పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు బాబర్ వియాన్ ముల్దర్ వైపునకు దూసుకువచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ ముదరగా.. ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకుని ఇరువురికి నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మిశ్రమ ఫలితాలుకాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య జట్టు 2-0తో నెగ్గింది. అనంతరం వన్డే సిరీస్‌లో మాత్రం పర్యాటక పాకిస్తాన్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. చరిత్రలోనూ ఎన్నడూ లేనివిధంగా.. సౌతాఫ్రికా గడ్డపై 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.అరుదైన ఘనతతద్వారా ప్రొటిస్ దేశంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి జట్టుగా మహ్మద్ రిజ్వాన్ బృందం నిలిచింది. అయితే, టెస్టు సిరీస్‌లో మాత్రం పాకిస్తాన్ జట్టు తడబడుతోంది. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో రెండు వికెట్ల తేడాతో షాన్ మసూద్ బృందం ఓటమిపాలైంది. ఇక శుక్రవారం మొదలైన రెండో టెస్టులోనూ కష్టాల్లో కూరుకుపోయింది.రెకెల్టన్ భారీ డబుల్ సెంచరీకేప్టౌన్లో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రియాన్ రెకెల్టన్ భారీ డబుల్ సెంచరీ(259)తో విరుచుకుపడగా.. కెప్టెన్ తెంబా బవుమా(106), వికెట్ కీపర్ బ్యాటర్ వెరియెన్నె(100) కూడా శతక్కొట్టారు. మార్కో జాన్సెన్(62) అర్ధ శతకంతో రాణించగా.. కేశవ్ మహరాజ్ తన వంతుగా 40 పరుగులు సాధించాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఏకంగా 615 పరుగులు స్కోరు చేసింది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 194 పరుగులకే కుప్పకూలింది. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేశాడు. ప్రొటిస్ బౌలర్లలో రబడ మూడు వికెట్లు తీయగా.. క్వెనా మఫాకా, కేశవ్ మహరాజ్ చెరో రెండు, మార్కో జాన్సెన్, వియాన్ ముల్దర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.షాన్ మసూద్ శతకం.. సెంచరీ మిస్ అయిన బాబర్ ఆజంఈ నేపథ్యంలో.. మొదటి ఇన్నింగ్స్‌లో 200కు పైగా ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను ఫాలో ఆన్ ఆడిస్తోంది. దీంతో వెంటనే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ జట్టు శుభారంభం చేయగలిగింది. కెప్టెన్ షాన్ మసూద్ సెంచరీ(145)తో చెలరేగగా.. బాబర్ ఆజం కూడా శతకం దిశగా పయనించాడు. అయితే, సోమవారం నాటి ఆటలో భాగంగా 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. జాన్సెన్ బౌలింగ్‌లో బెడింగ్హామ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, అంతకంటే ముందు అంటే.. ఆదివారం నాటి ఆటలో భాగంగా బాబర్ ఆజం- ప్రొటిస్ పేసర్ వియాన్ ముల్దర్ మధ్య గొడవ జరింది. తన బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి బాబర్ విఫలం కాగా.. ముల్దర్ బంతిని చేజిక్కించుకుని బ్యాటర్ వైపు బలంగా విసిరాడు.సౌతాఫ్రికా పేసర్ దూకుడు.. ఉరిమి చూసిన బాబర్ ఆజంఅప్పటికే ప్రమాదాన్ని పసిగట్టిన బాబర్ ఆజం వికెట్లకు కాస్త దూరంగానే ఉన్నా బంతి అతడికి తాకింది. దీంతో బాబర్ కోపోద్రిక్తుడై.. చూసుకోవా అన్నట్లుగా ముల్దర్వైపు ఉరిమి చూశాడు. అయితే, అతడు కూడా ఏమాత్రం తగ్గకుండా బాబర్‌ను చూస్తూ దూకుడుగా మాట్లాడాడు. దీంతో గొడవ పెద్దదయ్యే సూచన కనిపించగా అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరినీ సముదాయించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 352 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది.Fight moment between Babar Azam and Wiaan Mulder. 🥵Wiaan Mulder unnecessary throws the ball at Babar Azam & showing him verbal aggression. #BabarAzam𓃵 #PAKvsSA #SAvPAK pic.twitter.com/PZnPNTWELZ— Ahtasham Riaz (@ahtashamriaz22) January 5, 2025
కమిన్స్ డబుల్ సెంచరీ.. చరిత్రలో తొలి ప్లేయర్
ఆస్ట్రేలియా సారధి పాట్ కమిన్స్ (Pat Cummins) ఎవరికీ సాధ్యం కానీ మైలురాయిని అందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో కమిన్స్ ఈ ఫీట్‌ను సాధించాడు. వాషింగ్టన్ సుందర్ డబ్ల్యూటీసీలో కమిన్స్‌కు 200వ వికెట్.డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ తర్వాతి స్థానాల్లో నాథన్ లియోన్ (196 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (195), మిచెల్ స్టార్క్ (165), జస్ప్రీత్ బుమ్రా (156) ఉన్నారు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన ఆసీస్.. రెండు, నాలుగు, ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. తాజాగా ముగిసిన ఐదో టెస్ట్‌లో (సిడ్నీ) ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ సిరీస్ ఆధ్యాంతం అద్బుతంగా రాణించిన కమిన్స్ 25 వికెట్లు తీసి ఆసీస్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 32 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కమిన్స్ ఈ సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 19.88 సగటున 159 పరుగులు చేశాడు.బ్యాటింగ్‌లో హెడ్ టాప్తాజాగా ముగిసిన బీజీటీలో ఆసీస్ చిచ్చరపిడుగు ట్రవిస్ హెడ్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన హెడ్ 56 సగటున 448 పరుగులు చేశాడు. భారత యువ కెరటం యశస్వి జైస్వాల్ 10 ఇన్నింగ్స్‌ల్లో 43.44 సగటున 391 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.బీజీటీ 2024-25లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆటగాళ్లు..ట్రవిస్ హెడ్-448యశస్వి జైస్వాల్-391స్టీవ్ స్మిత్-314నితీశ్ కుమార్ రెడ్డి-298కేఎల్ రాహుల్-276రిషబ్ పంత్-255మార్నస్ లబూషేన్-232అలెక్స్ క్యారీ-216విరాట్ కోహ్లి-190ఉస్మాన్ ఖ్వాజా-184బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు..బుమ్రా-32కమిన్స్-25బోలాండ్-21సిరాజ్-20స్టార్క్-18నాథన్ లియోన్-9జోష్ హాజిల్‌వుడ్-6ప్రసిద్ద్ కృష్ణ-6ఆకాశ్‌దీప్-5నితీశ్ కుమార్ రెడ్డి-5చెలరేగిన బోలాండ్ఐదో టెస్ట్‌లో ఆసీస్ స్పీడ్‌స్టర్ స్కాట్ బోలాండ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో బోలాండ్ 10 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన బోలాండ్, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 10 వికెట్ల ప్రదర్శనకు గానూ బోలాండ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన బుమ్రాను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది.డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్భారత్పై ఐదో టెస్ట్ గెలుపుతో ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆసీస్ రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడతాయి. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్‌లు (శ్రీలంకతో) ఆడాల్సి ఉంది.
ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు..
టీమిండియా వరుస వైఫల్యాలపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) హెడ్‌కోచ్‌గా ఉన్నంతకాలం అంతా బాగానే ఉందని.. కానీ గత ఆరునెలల కాలంలో జట్టు ఇంతగా దిగజారిపోవడం ఏమిటని ప్రశ్నించాడు. మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణిస్తూ జట్టుకు భారమైనా కొంతమందిని ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు.ట్రోఫీ గెలిచిన తర్వాత ద్రవిడ్ గుడ్బైఇప్పటికైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలని భజ్జీ సూచించాడు. సూపర్‌స్టార్ ఆటిట్యూడ్ ఉన్నవారిని నిర్మొహమాటంగా పక్కనపెట్టాలని సలహా ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. ద్రవిడ్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ బ్యాటర్ గౌతం గంభీర్ హెడ్‌కోచ్ పదవిని చేపట్టాడు.ఘోర పరాభవాలుఅయితే, గౌతీ మార్గదర్శనంలో టీమిండియా ఇప్పటి వరకు చెప్పుకోగదగ్గ విజయాలేమీ సాధించకపోగా.. ఘోర పరాభవాలు చవిచూసింది. శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు కోల్పోవడంతో పాటు.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది.కంగారూల చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ఆసీస్‌కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంటా.. బయటా వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్న టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ‘స్టార్ల’ కోసం అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Easwaran) వంటి వాళ్లను బలిచేయవద్దని హితవు పలికాడు.ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేదిఈ మేరకు.. ‘‘గత ఆరు నెలల్లో.. టీమిండియా శ్రీలంక చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై 3-1తో సిరీస్ ఓటమిని చవిచూసింది. రాహుల్ ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేది.అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. కానీ... ఆ తర్వాత అకస్మాత్తుగా ఏమైంది? ప్రతి ఒక్క ఆటగాడికి తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఒకవేళ కొంతమందిని మ్యాచ్ విన్నర్లుగా భావిస్తూ తప్పక ఆడించాలనుకుంటే.. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలను కూడా జట్టులోకి తీసుకోండి. ఎందుకంటే.. భారత క్రికెట్లో వాళ్ల కంటే పెద్ద మ్యాచ్ విన్నర్లు ఎవరూ లేరు.అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడించాల్సిందిఇప్పటికైనా బీసీసీఐ సెలక్టర్లు కఠిన వైఖరి అవలంభించాలి. సూపర్‌స్టార్ ఆటిట్యూడ్‌ను పక్కనపెట్టండి. అభిమన్యు ఈశ్వరన్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లారు. కానీ.. ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. ఒకవేళ అతడికి అవకాశం ఇచ్చి ఉంటే.. కచ్చితంగా సత్తా చాటేవాడు.సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. తదుపరి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడాల్సి ఉంది. అప్పుడు మాత్రం ప్రదర్శన బాగున్న ఆటగాళ్లనే ఎంపిక చేయండి. కీర్తిప్రతిష్టల ఆధారంగా సెలక్షన్ వద్దు’’ అంటూ హర్భజన్ సింగ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా ఆసీస్‌తో సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టులో ఓడిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. తదుపరి 2025-27 సీజన్లో తొలుత ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.చదవండి: CT 2025: శుబ్‌మన్ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్?
క్రికెట్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టిన బాలీవుడ్ సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) క్రికెట్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టాడు. క్రీడా ఔత్సాహికుడైన బచ్చన్ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) సహ యజమానిగా వ్యవహరించనున్నాడు. ఇటీవలే ఐసీసీ అమోదం పొందిన ETPL ఈ ఏడాది లాంచ్ కానుంది. ఈ లీగ్‌లో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ దేశాలకు చెందిన క్రికెటర్లతో పాటు అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారు. డబ్లిన్, బెల్ఫాస్ట్, ఆమ్స్టర్డామ్, రోట్టర్‌డామ్, ఎడిన్బర్గ్, గ్లాస్గో నగరాలకు చెందిన ప్రాంచైజీలు బరిలో ఉంటాయి. ఈ లీగ్ జులై 15 నుంచి ఆగస్ట్ 3 మధ్యలో జరుగుతుంది. ఫ్రాంచైజీ పేర్లు, ఓనర్ల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.కాగా, అభిషేక్ బచ్చన్ ప్రో కబడ్డీ లీగ్ మరియు ఇండియన్ సూపర్ లీగ్‌లో (ఫుట్‌బల్) పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు లీగ్‌ల్లో బచ్చన్ ఫ్రాంచైజీలు కలిగి ఉన్నాడు. ETPLలో పెట్టుబడులు పెట్టిన సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ.. ఈ లీగ్ మూడు దేశాల (ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్) క్రికెట్ బోర్డుల సహకారంతో ముందుకు వస్తుందని అన్నాడు. ETPL ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తుందని తెలిపాడు. క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు, ఇది సరిహద్దులను అధిగమించే ఏకీకృత శక్తి అని బచ్చన్ చెప్పుకొచ్చాడు. ETPLలో అభిషేక్ చేరిక ప్రధాన పెట్టుబడులను ఆకర్శిస్తుంది. ETPL యూరోపియన్లకు క్రికెట్‌ను మరింత చేరువ చేస్తుంది.ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్రాంచైజీ క్రికెట్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ క్రికెట్ లీగ్‌ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు ఉంది. ఈ లీగ్ భారత్ వేదికగా జరుగుతుంది. ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), బిగ్ బాష్ లీగ్(BBL) ఎక్కువ ప్రజాధరణ ఉంది. వివిధ దేశాల్లో జరిగే క్రికెట్ లీగ్‌లు..ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్బిగ్బాష్ లీగ్ (ఆస్ట్రేలియా)కరీబియన్ ప్రీమియర్ లీగ్ (వెస్టిండీస్)గ్లోబల్ టీ20 కెనడా (కెనడా)ఇండియన్ ప్రీమియర్ లీగ్ (భారత్)ఇంటర్నేషన్ లీగ్ టీ20 (దుబాయ్)లంక ప్రీమియర్ లీగ్మేజర్ లీగ్ క్రికెట్ (యూఎస్ఏ)నేపాల్ ప్రీమియర్ లీగ్పాకిస్తాన్ సూపర్ లీగ్SA20 (సౌతాఫ్రికా)సూపర్ స్మాష్ (న్యూజిలాండ్)టీ20 బ్లాస్ట్ (ఇంగ్లండ్)
బిజినెస్
తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?
అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈ వారం విషయంలోకి వెళ్తే.. తాళి కట్టు శుభవేళ.. అంతా మంచే జరగాలని కోరుకుంటాం. వధూవరులను ఆశీర్వదిస్తాం. అంతా మంగళప్రదంగా జరగాలని.. కలకాలం కొత్త జంట చల్లగా ఉండాలని కోరుకుంటాం. పెళ్లి సందర్భంలో వధూవరులకు వచ్చే బహుమతులపై పన్ను భారం లేదు. అటువంటి వాటిని ఆదాయంగా పరిగణించరు. ఇప్పుడు ముందు రిసెప్షన్.. తర్వాత పెళ్లి... కాబోయే జంట పందిరిలో నిలబడటం.. మిగతా అందరూ లైన్లో వెళ్లి, వారికి బహుమతులివ్వడం.. తాళి కట్టిన తర్వాత కూడా కొందరు ఇస్తారు. ఏది ఏమైనా సందర్భం ‘పెళ్లి’ ఒక రోజు అటూ ఇటూ.. పెళ్లి పేరు చెప్పి ఎప్పుడు ఇచ్చినా ఏ ఇబ్బందీ లేదు.ఎటువంటి బహుమతులు ఇవ్వొచ్చు..నగదు ఇవ్వొచ్చు. దగ్గరి బంధువైతే ఎటువంటి ఆంక్షలు లేవు. బీరకాయ .. బెండకాయ సంబంధం కాదండి. బాదరాయణ సంబంధమూ కాదు. చట్టంలో పొందుపర్చిన నిర్వచనాన్ని గుర్తు పెట్టుకోండి. అలా అని రూ.2,00,000 దాటకండి. పేటీఎంలు, గూగుల్ పేమెంట్లు, చెక్కులు, డీడీలు, ఆర్టీజీఎస్, బదిలీలు, నగ, నట్రా, వెండి, బంగారం, ఆభరణాలు, కుక్కర్లు, వంట సామగ్రి, టీవీలు, ఫ్రిజ్జులు, భూములు, ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, స్థిరాస్తి, షేర్లు, బాండ్లు.. ఎలాగైనా మీ ప్రేమ, అభిమానాన్ని ప్రకటించుకోండి. పుచ్చుకున్న వారికి ఆదాయంగా పరిగణించరు. పన్నుభారం పడదు. పన్ను చెల్లించనక్కర్లేదు. అయితే, కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి.వధూవరులకు వచ్చే వాటిని ఆదాయంగా పరిగణించరు.అత్తగారి లాంఛనం, ఆడపడుచు కట్నం మొదలైన వాటి మీద ఎటువంటి మినహాయింపు లేదు. కొన్ని పెళ్లిళ్లలో ఈ లాంఛనాలు భారీగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త.పూర్వకాలంలో పురోహితుడు నలుగురికి వినపడేలా అరిచేవారు. ఫలానా వారింత కట్నం అని.. కొంత మంది తమ పేరు నలుగురికి వినబడేలా చదివించుకునే వారు.ఇప్పుడు బాహాటంగా చదివింపులు లేవు. కవర్లో ఎంతో కొంత పెట్టి.. అది వారి చేతిలో పెట్టి, ఫొటోగ్రాఫర్ వైపు మొగం చూపెట్టి.. భోజనం దిశగా అడుగెట్టి.. ఇంటి దారి పట్టి.. వెళ్లిపోతున్నారు.ఇవి చిన్న మొత్తాలయితేనేం.. అధిక విలువగలవైతేనేం.. పంతులు గారికి ఒక వెయ్యి నూటపదహార్లు ఇచ్చి ఒక పుస్తకం.. పెళ్లి పుస్తకం తెరిపించండి.ఆ పుస్తకానికి పసుపు, కుంకుమ బాగా దట్టించండి. తారీఖు, టైం వేసి.. అందరి పేర్లూ రాయండి. పింకీ, సుబ్బు, పక్కింటి ఆంటీ అని కాకుండా వీలైతే పూర్తి పేరు రాయండి. అలాగే ఫోన్ పేమెంట్లు, గూగుల్ పేమెంట్లు, బ్యాంకులో జమలు, ప్రత్యేక జాబితా రాయండి. బ్యాంకు స్టేట్మెంట్లో ఈ ‘జవాబు’ను హైలైట్ చేయండి. మీరు మీ పెళ్లి పుస్తకంలో వారి పేరు, వీలైతే, సెల్ నంబరు రాయండి. బ్యాంకు స్టేట్మెంట్లు భద్రపరచండి.ఇదీ చదవండి: ‘ఐదు శాతం’తో రూ.1.8 కోట్లు సంపాదననగదు చదివింపులను వీలైతే బ్యాంకులో జమ చేయండి. ఆ పేయింగ్ స్లిప్‌ను మీ పుస్తకంలో అతికించండి.ఇలా రాయటం వల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి మున్ముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ వారికి ‘సోర్స్’ వివరణ రెడీగా ఉంటుంది. రెండోది మీరు అటువంటి వారికి కట్నం ఇచ్చేటప్పుడు ఇదొక కొలబద్దగా ఉంటుంది.నగదు ఖర్చుపెట్టే అవసరం అయితే.. దేని నిమిత్తం ఖర్చు పెట్టారో రాయండి.భారీ కంచాలు, ప్లేట్లు, సీనరీలు, దేవుడి బొమ్మలు మొదలైనవి రాయకపోయినా ‘విలువైనవి’ అనిపించిన వస్తువుల జాబితా రాయండి.స్థిరాస్తులు మొదలైన అన్ని కాగితాలు తీసుకోండి. బదిలీ పత్రాలు తీసుకోండి. మరీ చాదస్తం అని కొట్టిపడేయకండి. దేనికైనా దస్త్రం కావాలి. అదీ మనమే సమకూర్చుకోవాలి. సకాలంలో సర్దుకోండి.-కే.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి-కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు
‘ఐదు శాతం’తో రూ.1.8 కోట్లు సంపాదన
కొత్త ఏడాదిలోకి ప్రవేశించాం. ఆర్థికంగా మరింత డబ్బు పోగు చేసుకోవాలని అందరూ అనుకుంటారు. కొత్త సంవత్సరంలో కొన్ని మార్గాలు పాటిస్తే సులువుగా ఆర్థిక లక్ష్యాలు(Financial Targets) చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తాము చేస్తున్న కొలువు(Job)లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో అదనంగా సంపాదన అందుకుంటారు. దాన్ని వైవిధ్యంగా ఇన్వెస్ట్ చేస్తే సంపాదనను పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్ల వల్ల సమకూరే డబ్బును దీర్ఘకాలికంగా పొదుపు చేస్తే మదుపు ఖాతాలో ఇంకొంత సొమ్ము పోగవుతుందని చెబుతున్నారు.ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల సమయంలో కంపెనీలు అదనంగా అందించే సుమారు ఐదు శాతం(సంస్థను బట్టి ఇది మారుతుంది) డబ్బు భవిష్యత్తులో భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు మీకు నెలకు లక్ష రూపాయల జీతం అనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణిలోకి తీసుకుందాం. మీరు ఇప్పటికే చేసిన పెట్టుబడులు ఏటా పది శాతంమేర రాబడిని ఇస్తున్నట్లు భావిద్దాం. ఇప్పటి దాకా చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ను 15 శాతం నుంచి అదనంగా ఐదు శాతం కలిపి 20 శాతానికి పెంచడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. కానీ దీర్ఘకాలంలో మీరు చేస్తున్న పెట్టుబడి భారీగా పెరిగి ముప్పై ఏళ్ల తర్వాత కనీసం రూ.5.3 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.7.1 కోట్లకు పెరుగుతుంది. అంటే కేవలం ఐదు శాతం అదనంగా ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు దాదాపు రూ.1.8 కోట్లు పెరుగుతుంది.ఇదీ చదవండి: మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..ముందు పొదుపు తర్వాతే ఖర్చుఖర్చు చేసిన తర్వాత మిగిలిన డబ్బును పొదుపు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ముందు పొదుపు తర్వాతే ఖర్చు అనే సూత్రాన్ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తప్పకుండా ఆరోగ్య బీమా(Health Insurance)తోపాటు జీవిత బీమాను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థతుల్లో ఉద్యోగం పోయినా ఇంటి ఖర్చులు భరించేలా కనీసం ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ నిధిని వెంటనే నగదుగా మార్చుకునే ఫండ్స్‌ల్లో పెట్టుబడి పెట్టాలని, ఈక్వీటీల జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు.
స్థిరంగా బంగారం ధరలు.. తులం ఎంతంటే..
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే 2025 సోమవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు(Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,150 (22 క్యారెట్స్), రూ.78,710 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఆదివారం ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధర స్థిరంగానే కొనసాగుతుంది. చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.72,150 రూ.78,710గా ఉంది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి(Gold) ధర రూ.72,300గా ఉండగా, 24 క్యారెట్ బంగారం ధర రూ.78,860గా ఉంది. సోమవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేనట్లే వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు వెండి ధర(Silver Price) కేజీకి రూ.99,000గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..
డిజిటల్ ఇండియా(Digital India) యుగంలో చాలామంది ఆన్లైన్ నగదు లావాదేవీలు జరుపుతున్నారు. చిన్నమొత్తంలో జరిపే లావాదేవీల సంగతి అటుంచితే, పెద్దమొత్తంలో చేసే నగదు బదిలీలపై ప్రభుత్వం నిఘా వేస్తోంది. ఈ నగదు బదిలీల విషయంలో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు ప్రభుత్వ పన్నుల యంత్రాంగం గుర్తిస్తే వారికి ఆదాయ పన్నుశాఖ నోటీసులు(IT Notices) తప్పవు. అయితే ఎలాంటి సందర్భాల్లో నోటీసులు అందుతాయో కొన్నింటి గురించి తెలుసుకుందాం.బ్యాంకు ఖాతాలో నగదు జమసెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం, ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఈ డబ్బు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జమ చేసినా కొన్నిసార్లు నోటీసులు అందుకునే అవకాశం ఉంది. నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేయడంఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసినప్పుడు నోటీసులు అందుతున్నట్లే, ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposite)ల విషయంలోనూ అదే జరుగుతుంది. ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్డీలలో రూ.10 లక్షల కంటే అధికంగా డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందవచ్చు.ఆస్తి లావాదేవీలుస్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినట్లయితే రిజిస్ట్రార్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. అటువంటి పరిస్థితిలో భారీ లావాదేవీలు జరిపారు కాబట్టి, ఆ డబ్బు మీకు ఎలా సమకూరిందనే వివరాలు అడుగుతూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపవచ్చు.క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులుక్రెడిట్ కార్డ్ బిల్లు(Credit card Bill) రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని నగదు రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ఎలా సమకూరిందో ప్రభుత్వం అడగొచ్చు. మరోవైపు, ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా మొత్తం కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చెల్లించినట్లయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమాషేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్ల కొనుగోలుషేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో నగదు ఉపయోగించినట్లయితే ఇది ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఒక వ్యక్తి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద నమోదు అవుతుంది. ఆ సందర్భంలోనూ నోటీసులు అందవచ్చు.
ఫ్యామిలీ
నా నుదుటి రాతలోనే నృత్యం ఉంది..!
శాస్త్రీయ నృత్యానికి అమితమైన ఆరాధకురాలు రామా వైద్యనాథన్. ఢిల్లీ వాసి అయిన ఈ నృత్యకారిణి భారతీయ శాస్త్రీయ కళా ప్రపంచంలో ట్రెండ్‌సెటర్‌గా నిలిచిన కళాకారులలో ఒకరు. రామా వైద్యనాథన్ గురువు సరోజ్ వైద్యనాథన్. ‘నా నుదుటిరాతలోనే నాట్యం రాసి ఉంది..’ అంటారు ఈ నృత్యకారిణి. యామినీ కృష్ణమూర్తి వేదికపైన నృత్యాన్ని ప్రదర్శిస్తుంటే తల్లి పొట్టలో ఉన్నప్పుడే అమితంగా స్పందించేదానినట అని గర్వంగా చెబుతారు ఈ నృత్యకారిణి. ఈ మాటలతో నాట్యంపై ఉండే మక్కువను మన కళ్లకు కడతారు. రామా వైద్యనాథన్ తల్లికి నృత్యం అంటే ఎంతో మక్కువగా ఉండేది. బాల్యంలో వేసే రామా తొలి అడుగులే నృత్యపు అడుగులుగా మారాయి. తల్లే తన తొలి గురువుగా నృత్య అడుగులను ప్రారంభించింది. అలా ఆమె తన మొదటి మాటలను ఉచ్చరించకముందే గురువు ఎంపిక జరిగింది. తల్లి మార్గదర్శకత్వంలో రామా భరత నాట్య ప్రయాణాన్ని ్ర΄ారంభించింది. అలా డ్యాన్స్ స్టూడియో ఆమెకు రెండవ ఇల్లుగా మారింది. తన నైపుణ్యంతో తల్లి రామాను అద్భుతమైన నర్తకిగా తీర్చిదిద్దింది. ఎదిరిస్తూ నిలుస్తూ..పశ్చిమ ఢిల్లీలో నివసిస్తూ, డ్యాన్స్ క్లాసుల కోసం సెంట్రల్ ఢిల్లీలోని చాణక్యపురికి చేరుకోవడం అంటే సంక్లిష్టమైన ప్రయాణాన్ని కొనసాగించడమే. ఆ రోజుల్లో వాహన సదుపియం లేకపోవడంతో రామ, ఆమె తల్లి ప్రతి రోజూ సవాల్‌ను ఎదుర్కొనేవారు. ఇంటి నుంచి నృత్య అకాడమీకి చేరుకోవడానికి రోజూ రెండు మూడు బస్సులు, రిక్షాలు మారుతూ ప్రయాణించేవారు. యువ నర్తకిగా రామా ప్రదర్శనలు సంప్రదాయం, ఆవిష్కరణల సామరస్య సమ్మేళనానికి నిదర్శనగా మారాయి. సామాజిక కుల అడ్డంకులను తొలగించిన నృత్యకారిణిగా కూడా రామా తన విశిష్టతను ప్రదర్శించింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నృత్యం, కులం అడ్డంకులుగా నిలిచాయి. నర్తకితో తన కుమారుడి వివాహం కుల హద్దులు దాటిందని అత్తగారు, ఆమె బంధుగణం అడ్డంకిగా నిలిచింది. ఆమె దృష్టిలో నృత్యం దైవిక భాష. కళాకారులందరిదీ ఒకే ’కులం’గా ఐక్యపరిచింది. సామాజిక అడ్డంకులను ఎదిరించడంలోనే కాదు, దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇస్తూ భారతీయ ప్రముఖ నృత్యకారిణిగా నిలిచింది. --రామా వైద్యనాథన్(చదవండి: రుమాలీ రోటీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!)
దృఢ సంకల్పమే మీ బలం
ఎత్తైన పర్వతాల నడుమ ఒక సుందరమైన లోయ వద్ద ఒక చిన్న ప్రవాహం ఉండేది. అది మహా సముద్రాన్ని చేరాలని కలలు కంటూ ఉండేది. తన ప్రయాణాన్నిప్రారంభించిన ప్రతిసారీ దారిలో రాళ్లు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండచరియలు ఎదురవడంతో ఆ చిన్న ప్రవాహం వెనుదిరిగి వెనకకు వెళ్లిపోయేది.‘‘నీకు ఇది సాధ్యం కాదు,’’ అని దారిలోని పెద్ద రాళ్లు చెప్పేవి.‘‘నువ్వు చాలా చిన్నగా, బలహీనంగా ఉన్నావు నువ్వు చేయలేవు’’ అని ఆ చిట్టి ప్రవాహాన్ని నిరుత్సాహ పరిచేవి. ఒకనాడు చిట్టి ప్రవాహం చాలా దిగులుగా, ఇక ఎప్పటికీ తన కలను నెరవేర్చుకోలేనన్న బాధతో, సందేహంతో ఉండటాన్ని వృక్షమాత గమనించింది. వృక్ష మాత ప్రవాహంతో ఇలా చెప్పింది, ‘‘ఇలా బాధ పడినంత మాత్రాన నీ లక్ష్యాన్ని నీవు చేరగలవా..?? నువ్వు బాధ పడటం వల్ల ఏ ఉపయోగం లేదు! మహా సముద్రాన్ని చేరాలనే నీ తపననే నీ శక్తిగా మలుచుకో..నీ సంకల్పాన్ని బలపరుచుకో.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుదిరగననే వజ్ర సంకల్పం చేసుకో!’’ అని చిట్టి ప్రవాహానికి కొండంత ధైర్యమిచ్చి, విజయోస్తు! అని దీవించి పంపింది వృక్ష మాత. ఆ ధైర్యంతో, ప్రవాహం తన ప్రయాణాన్నిప్రారంభించింది. అది ముందుకు వెళ్లాలని సంకల్పించుకుంది. పెద్ద రాళ్ళు ఎదురైనప్పుడు వాటి మధ్యనున్న చిన్న సందులనే మార్గంగా చేసుకుంది. ఎండ తీవ్రతకు ఆవిరైపోయే పరిస్థితి వచ్చినప్పుడు, మేఘాలకెగసి అక్కడి నుండి నదిగా భువికి తిరిగి వచ్చింది. ఒకప్పటి చిట్టి ప్రవాహమే ఇప్పుడు మహా ప్రవాహమై చివరికి మహాసముద్రంలో లీనమైంది. ‘‘నీ లక్ష్యాన్ని నీవు సంకల్ప శక్తితో సాధించావు’’ అని వృక్ష మాత హర్షించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా చెదరని సంకల్ప బలంతో ముందుకు సాగండి. లక్ష్యాన్ని సాధించడంలో ఇటువంటి మనఃస్థితి ఉంటే ఏ పనిలోనైనా నిస్సందేహంగా విజయాన్ని సాధించవచ్చు. ఈ యావత్ విశ్వంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు! నూతన సంవత్సరంలో చాలా మంది ఎన్నో గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ ఆ లక్ష్యాలను సాధించేందుకు కావాల్సినంత సంకల్ప బలం వారిలో ఉండదు. అందుకే మధ్యలోనే ఆ లక్ష్యాలను వదిలిపెడతారు. కొన్నిసార్లు మీ మనసే ఎన్నో సాకులను వెతుకుతుంది. మీ లక్ష్యాన్ని ఓడించాలని చూస్తుంది. అందుకే మీ మనసును చెదరని సంకల్ప బలంతో నింపండి. నేను ఎన్ని అడ్డంకులు ఉన్నా విజయాన్ని సాధిస్తాను! నేను లక్ష్యాన్ని చేరతాను అని పదే పదే మనసులో అనుకోండి! అనుకుందే ఆచరణలో పెట్టండి. మీరు చేయాల్సిన కృషితో పాటు దృఢమైన సంకల్ప శక్తి కూడా ఉండాలి. – మాతా ఆత్మానందమయిఆధ్యాత్మిక గురువు
త్రికరణశుద్ధితో జీవనసిద్ధి
మనం ఏ కార్యాన్ని ఆచరించినా త్రికరణశుద్ధితో ఆచరించాలి. మనస్సుకు, మాటకు, చేతకు తేడా లేకుండా ఉండటమనే నిజాయితీనే త్రికరణశుద్ధిగా వ్యవహరించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మనోవాక్కాయాల శుద్ధి. కార్యాన్ని మనసావాచా, కర్మణా అన్నిటా ఏకీభావ స్థితిలో మలచుకోవడమే త్రికరణశుద్ధి. మనసులో ఏ విధంగా కార్యాన్ని చేయాలని మనం సంకల్పిస్తామో, వచస్సులో, అంటే మన మాటల్లోనూ అదే ప్రతిఫలించాలి. కర్మణా అంటే కార్యాన్ని ఆచరించే విధానమూ మనం తలచిన విధంలో, చెప్పిన సంవిధానంలో పూర్తి చేయాలి. అప్పుడే ఆ కార్యం త్రికరణశుద్ధి కలిగినదై, లోకాన రాణింపుకు వస్తుంది.మనం ఎన్నో గొప్ప కార్యాలను మదిలో సంకల్పిస్తాం. తీరా, ఆ పనులను గురించి నలుగురిలో విడమరచి చెప్పాలంటే ఎందుకో బిడియం, ఎవరు ఏమనుకుంటారో..? అనే సందేహం. మనం సాధించగలమో లేదో అని అనుమానం. ఒకవేళ, మరీ సాహసం చేసి కొంతవరకు చెప్పగలిగినా, మళ్ళీ ఆచరించే సమయంలో మనకున్న సందేహాలతో ముందుకు సాగకుండా ఆగిపోతాం, దానికితోడు అనుకోకుండా ఎదురయ్యే అవాంతరాలు..!! ఈ విధంగా చేసే కార్యాలు నిరర్ధకమైన రీతిలోనే సాగుతాయి.మన మనసు అత్యంత పవిత్రమైనదనీ, సమస్త పుణ్యాలు అగణ్యమైన రీతిలో ఈ ధరిత్రిలో జరిగింది కేవలం మనసువల్లనేనని పెద్దల ఉవాచ. ఇహ వాక్కు సాక్షాత్తూ సర్వాంతర్యామి మనకు ప్రసాదించిందే. అందుకని తలచిన పనులు సఫలం అవాలంటే, మనం భావించిన విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచగలగాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏ పనిలోనైనా కార్యసిద్ధి అనేది ఒక్కరి వల్ల జరగదు. అది సమిష్టిగా, నలుగురితో కలిసి కృషి చేయడం వల్ల జరుగుతుంది లేదా కొంతమంది వ్యక్తుల సమన్వయంతో జరుగుతుంది. అధికశాతం పనులు రకరకాల వ్యక్తుల సమన్వయంతోనే జరుగుతాయి. ఈ కార్యక్రమంలో కొంతమంది విద్యాధికులు, కొంతమంది ఎక్కువగా చదువుకోనివారు కూడా భాగం కావచ్చు. వీరందరి మధ్యా జరిగే సమన్వయమే త్రికరణాలతో కూడుకుని తలపెట్టిన పనిలో కార్యసిద్ధిని కలిగిస్తుంది.త్రికరణశుద్ధిగా చరించే మనిషి తనను తాను మూర్తిమంతంగా నడుపుకుంటూ, విజయాలను అవలీలగా సొంతం చేసుకోవడం జరుగుతుంది.త్రికరణశుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!!త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరంద భరితమైన జీవనం అమితంగా లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరిగా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడం ప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి.‘‘త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును.. లోకము మెచ్చును’’ అన్న సంకీర్తనాచార్యుని వాక్కులు అక్షరసత్యం. త్రికరణశుద్ధితోనే జీవనానికి నిజమైన సత్వం, పసకలిగిన పటుత్వం కలుగుతాయి.బుద్ధిమతుల ఆలోచనా సరళికి ఆధారమూలం జీవనగమనంలో వారు కలిగి ఉండే త్రికరణశుద్ధి..!! ఈ లక్షణం కలిగిన వారికి తప్పక ఒనగూడుతుంది అన్నిటా కార్యసిద్ధి..– వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి
రుమాలీ రోటీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
రుమాలీ రోటీ ఎంత ఫేమస్ అనేది తెలిసిందే. ప్రస్తుతం మెనూలో నుంచి కనుమరుగవ్వుతోంది. ఒకప్పుడు పెళ్లిళ్లలోనూ, ఫంక్షన్లోనూ తప్పనిసరిగా ఉండే ఈ రుమాలీ రోటీ ఎందువల్ల మన నుంచి దూరంగా వెళ్తుంది, అలాగే జనాదరణ కూడా ఎందుకు తగ్గుతుందో తెలియడం లేదు. అస్సలు ఈ రుమాలీ రోటీ ఎలా భారతీయ ఆహార సంస్కృతిలోకి వచ్చింది. దాని కథా కమామీషు గురించి సవివరంగా చూద్దాం.!మొఘలుల కారణంగా మన దేశంలోకి ఈ వంటకం వచ్చింది. డిల్లీలో బాగా చేసే వంటకం క్రమంగా భారత్‌లోని అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాప్తి చెందింది. అలాగే ప్రజలు కూడా ఎంతో ఇష్టంగా తినేవారు. దీంతో భారతదేశమంతా ఈ రోటీల డాబాలు, రెస్టారెంట్లు వెలిశాయి. ఒకప్పుడూ ఈ రోటీలకు క్యూ కట్టిన జనం..ఇప్పుడు క్రమక్రమంగా ఆర్డర్ చేసేవాళ్ల సంఖ్య తగ్గుతుంది. దీన్ని ఆలు కుర్మా, మటన్ లేదా చికెన్ కుర్మాలతో ఇష్టంగా తినేవారు. ఒక్కొక్కరూ ఐదు లేదా పది లాగించే ఈ పలుచని రోటీలను ప్రజలు ఇష్టపడటం లేదు. అలాగే రెస్టారెంట్లలోని మెనూల్లో కూడా చోటు ఉండటం లేదు. ఎక్కడో గానీ లభ్యంకావడం లేదు. ఇలా ఎందుకంటే ఈ రుమాలి రోటీలను ఎక్కువగా మెత్తటి మైదాపిండితో తయారు చేస్తారు. ప్రస్తుతం ఆరోగ్య స్ప్రుహ ఎక్కవ అవ్వడంతో జనాలు వాటి జోలికి వెళ్లడం లేదు. ముఖ్యంగా మైదాతో చేసిన పదార్థాల జోలికిపోకపోవడంతో దీన్ని తినే వాళ్ల సంఖ్య తగ్గింది. మరో కారణం ఏంంటే..దీని తయారీ కారణంగా కనుమరుగవ్వుతుంది. తలకిందులుగా ఉండే ఒక కుండపై దీన్ని కాలుస్తారు. అలాగే దీని తయారీకి చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే పలుచగా ఈ రోటీలను చేయాలి. అందుకు మంచి నైపుణ్యం ఉన్న చెఫ్‌లు కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న వాళ్ల దగ్గర అంత నైపుణ్యం కొరవడం కూడా ఈ రోటీలు అదృశ్యం కావడానికి ఒక కారణమని చెబుతున్నారు కొందరు. ఒక్కప్పుడు హైదరాబాద్‌లో రుమాలి రోటీలను కబాబ్, తడ్కా వంటి కర్రీల గ్రేవ్తో చక్కగా తినేవారు, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో చికెన్ 65తో తినేవారు. ప్రస్తుతం వీటి బదులు నాన్లు, తాండూర్-కాల్చిన రొట్టెలు, కుల్చాలు, ఖమీరీ రోటీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రాను రాను తరువాత తరాలకు అస్సలు ఈ వంటకం గురించి తెలియకపోవచ్చు కూడా. If you're going to eat a Rumali Roti then eat this one, or don't eat at all. Incredible skill and what a roll this roti will make pic.twitter.com/qVqIovJbLR— Rocky Singh 🇮🇳 (@RockyEatsX) March 31, 2017 (చదవండి: ఈ డివైజ్‌తో అందమైన ముఖాకృతి సొంతం..!)
ఫొటోలు
International View all
కెనడా ప్రధాని ట్రుడో రాజీనామా
ఒట్టావా: కెనడా (canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trude
రాజీనామా చేయనున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో?
ఒట్టావా: కెనడా (canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trude
అమెరికా, యూరప్‌లను... హడలెత్తిస్తున్న మంచు
వాషింగ్టన్/లండన్: కనీవినీ ఎరగనంతటి భారీ మంచు అమెరికా, యూరప
సోరోస్‌కు మెడల్ హాస్యాస్పదం: మస్క్
వాషింగ్టన్ : బిలియనీర్ జార్జ్ సోరోస్‌కు అమెరికా అత్యున్నత
సమష్టి తత్వంలో...చీమలే మిన్న
మనుషులను తలదన్నే సమిష్టి నిర్ణయ శక్తి చిట్టి చీమల సొంతమట!
National View all
హెచ్ఎంపీవీ వైరస్..జేపీ నడ్డా కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ
హలో.. హెచ్ఎంపీవీ వైరస్‌తో జాగ్రత్త
బెంగళూరు: : భారత్‌లో హ్యూమన్ మెటా న్
‘ఇంత దిగజారాలా?..’ ఢిల్లీ సీఎం కంటతడి
ఢిల్లీ: మీడియాతో మాట్లాడుతూ..
రైనో కళ్లలో పడ్డారు, ఆపై.. కజిరంగా పార్క్‌లో భయానక ఘటన
Viral Video మృత్యువు..
ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర.. తొమ్మిది మంది జవాన్ల దుర్మరణం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డా
NRI View all
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసా?
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసు ఎలా పెడ
భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనా గానంపై నాట్స్ వెబినార్
అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’
‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేం
న్యూ ఇయర్ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమ
క్రైమ్
వివాహేతర సంబంధం: క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య
మేడిపల్లి: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ క్యాబ్ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. పీర్జాదిగూడలోని మల్లికార్జున నగర్లో పద్మ(40) అనే మహిళ అనురాగ్ రెడ్డి బాయిస్ హాస్టల్ నిర్వహిస్తోంది. ఈ హాస్టల్లో జనగామ జిల్లా బండ్లగూడెం గ్రామానికి చెందిన క్యాబ్ డ్రైవర్ మహేందర్ రెడ్డి (38) ఉండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతుండటంతో మహేందర్ రెడ్డి హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. అయితే అప్పుడప్పుడు హాస్టల్‌కు వచ్చేవాడు. ఈ క్రమంలో శుక్రవారం హాస్టల్‌కు రావాలని పద్మ పిలువగా శనివారం రాత్రి వెళ్లాడు. ఆ సమయంలో హాస్టల్ గదిలో సూర్యాపేటకు చెందిన కిరణ్ రెడ్డి(35),పద్మ కలిసి ఉన్నారు. దీంతో ముగ్గురికీ మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ గొడవలో కిరణ్ రెడ్డి, పద్మలు వంటకు ఉపయోగించే గంటె, కూరగాయలు కోసే కత్తితో మహేందర్ రెడ్డి పై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ మహేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
రెండు రోజులుగా గదిలోనే మృతదేహాలు
అడ్డగుట్ట: కన్నతల్లి మృతిని తట్టుకోలేక ఓ కుమారుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన లాలాగూడలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రఘు బాబు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేటలోని వినోభానగర్‌కు చెందిన లక్ష్మి (52), అభినయ్ (20) తల్లీకొడుకులు. వీరిద్దరు ఎనిమిదేళ్లుగా అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. లక్ష్మి కేన్సర్ పేషెంట్ కావడంతో ఇంట్లోనే ఉంటోంది. అభినయ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తల్లి మందుల ఖర్చు, కాలేజీ ఫీజు కోసం అభినయ్ ఏదో ఒక పని చేస్తుండేవాడు. శనివారం మధ్యాహ్నం వీరు నివాసముంటున్న ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి యజమాని బ్రహ్మాజీ సదరు తలుపులు ఎంత కొట్టినా తెరవకపోవడంతో లాలాగూడ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు బద్దలుగొట్టి చూడగా హాల్లో అభినయ్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. లోపలికి వెళ్లి చూడగా బెడ్రూంలో తల్లి లక్ష్మి సైతం మృతి చెంది ఉంది. లక్ష్మీకి సంబంధించిన మెడికల్ రిపోర్ట్‌తో పాటు అభినయ్ రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు కనిపించింది. అందులో ‘నాకు మా అమ్మకు ఆరోగ్య సమస్యలున్నాయి. నాకు తండ్రి కూడా లేడు. మా బంధువుల కోసం వెతక్కండి. ఐ యామ్ సారీ’ అని ఇంగ్లి‹Ùలో రాసి ఉంది. తల్లి లక్ష్మి అనారోగ్యంతో చనిపోవడంతో తట్టుకోలేక కుమారుడు అభినయ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వీరు మృతి చెంది రెండ్రోజులు అవుతోందని చెబుతున్నారు. తల్లీకొడుకుల మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
పరిగిలో బెట్టింగ్ పావురాల కలకలం
పరిగి: బెట్టింగ్ కోసం తీసుకువచ్చిన రేసింగ్ పావురాలు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో హాట్ టాపిక్‌గా మారాయి. వీటిని గాల్లోకి వదులుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం 7.30 గంటలకు పట్టణ కేంద్రంలోని లక్ష్మీనగర్‌కు ఇద్దరు వ్యక్తులు గూడ్స్ వాహనంలో వచ్చి రెండు బాక్స్‌లలో తెచ్చిన పావురాలను బయటకు వదిలారు. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు వారిని ప్రశ్నించగా.. తాము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని, ఇక్కడ వదిలిన పావురాలు తమతమ యజమానుల వద్దకు వెళ్తాయని చెప్పారు.పావురాల కాళ్లకు కోడ్ నంబర్లు ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఘటన స్థలానికి రావడానికి ఆలస్యం కావడంతో స్థానికులే పావురాలు ఉన్న వాహనాన్ని పీఎస్‌కు తరలించి, పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన మునావర్, బాబుజానీలుగా తెలిపారు.పది మంది యజమానులు తమ పావురాలను ఈ పోటీలో పెట్టారని, ఇక్కడ వదిలిన పావురాల్లో ముందుగా చేరుకున్న దాన్ని చిప్ సాయంతో విజేతగా గుర్తిస్తారని చెప్పారు. గోరంట్లకు చెందిన ప్రేంకుమార్ తమను పంపించారని, ఉదయం పావురాలను వదిలితే సాయంత్రం వరకు అక్కడికి వెళ్తాయని వివరించారు. మొత్తం 20 బాక్స్‌లలో 400 పావురాలను తీసుకువచ్చామని, ఇందులో రెండు బాక్స్‌లలోని పావురాలను వదిలామని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రూ. వేలల్లో ధర.. ప్రత్యేక శిక్షణ సాధారణంగా పావురాలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోటీల్లో వినియోగిస్తారు. ట్రైనింగ్ పొందిన కపోతాలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఎక్కడ వదిలినా గమ్య స్థానానికి చేరుకునేలా తరీ్ఫదునిస్తారు. ఉదయం వదిలితే సాయంత్రం వరకు గమ్యాన్ని చేరుకుంటాయి.ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పావురాల బెట్టింగ్‌లను అధికంగా నిర్వహిస్తారు. పోటీల్లో పాల్గొనే ఒక్కో పావురాన్ని కొనుగోలు చేసేందుకు వేలాది రూపాయలు వెచ్చిస్తారు. అనంతరం వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, బెట్టింగ్‌లలో పాల్గొంటారు. బెట్టింగ్ కాసిన ప్రదేశం నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లి వదులుతారు. వీటిలో ఎవరి పావురం ముందుగా అక్కడకు చేరుకుంటే వారే గెలిచినట్లు ప్రకటించి బహుమతులు అందజేస్తారు.
ఓటీపీ లేకుండానే నగదు మాయం చేశారు!
సాక్షి, హైదరాబాద్: ఇదో చిత్రమైన సైబర్ కేసు. బాధితురాలి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు ఎలా మాయమైందో ఆమెకే కాదు... సైబర్ క్రైమ్ పోలీసులకూ అంతుచిక్కట్లేదు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. అసలేం జరిగిందంటే.. నగరానికి చెందిన ఓ గృహిణిని (59) ఫేస్‌బుక్‌లోని ప్రకటన ఆకర్షించింది. మహిళలకు సంబంధించిన వస్త్రాలను తక్కువ ధరలకు విక్రయిస్తున్నామనేది దాని సారాంశం. ఆ వ్రస్తాలు ఖరీదు చేయడానికి ఆసక్తిచూపిన ఆమె, ప్రకటన ఇచ్చిన వారిని సంప్రదించారు. తన కావాల్సినవి ఆర్డర్ ఇవ్వడంతో పాటు రూ.1.5 లక్షలు చెల్లించారు. ఆపై ఆ గృహిణికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు డెలివరీ చేయాల్సిన బాయ్ అనారోగ్యానికి గురయ్యాడని, ఫలితంగా సరుకు అందించలేకపోతున్నామని వివరణ ఇచ్చారు. ఈ కారణంగా మీరు చెల్లించిన మొత్తం రిఫండ్ చేస్తున్నామని అన్నారు. దానికోసం బ్యాంకు ఖాతాను సరిచూసుకోవాల్సి ఉందంటూ రెండు దఫాల్లో రూ.1, రూ.10 బదిలీ చేశారు. ఆ మొత్తం చేరిందా? లేదా? అనేది ఆమెను సంప్రదించి ఖరారు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా... ఆ తరువాత బాధితురాలి ఖాతాలో ఉండాల్సిన రూ.1,38,171 మాయమయ్యాయి. తనకు ఎలాంటి ఓటీపీ రాలేదని, అయినప్పటికీ డబ్బు పోయిందంటూ ఆమె శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. ఈ స్కామ్ ఎలా జరిగిందో అర్థంకాక తలలు పట్టుకుంటున్న పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. సైబర్ నేరాల అవగాహనకు ‘మూడు కోతులు’సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ‘డిజిటల్ ఏజ్ త్రీ మంకీస్’ను తెరపైకి తెచ్చారు. నాటి మూడు కోతులు ‘చెడు మాట్లాడ వద్దు–చెడు చూడవద్దు–చెడు వినవద్దు’అంటే.. నేటి ఈ ‘డిజిటల్ కోతులు ‘ఎవరికీ ఓటీపీ చెప్పవద్దు–తెలియని లింకులు తెరవద్దు–నకిలీ ఫోన్ కాల్స్ వినవద్దు’అంటున్నట్లుగా రూపొందించారు. దీన్ని తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా విçస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.