Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Cm Jagan Speech At Rajampet Campaign Meeting
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్‌

అన్నమయ్య జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని.. పొరపాటున బాబుకు ఓటస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రోడ్డులో ప్రచార సభలో మాట్లాడుతూ చంద్రబాబు.. మోదీ, అమిత్‌షాను తీసుకొచ్చి సభలు పెట్టించారు. ప్రత్యేక హోదా హామీ వస్తుందేమోనని ప్రజలు ఎదురుచూశారు.. వాళ్లు ప్రత్యేక హోదా హామీ ఇవ్వకుండా.. విమర్శించి వెళ్లిపోయారు’’ అంటూ సీఎం జగన్‌ మండిపడ్డారు.‘‘చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారు. కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఏం కావాల్లో అది మాత్రమే మాట్లాడారు. పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి’’ అంటూ సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.‘‘2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?. చంద్రబాబు కూటమి.. పెత్తందార్ల కూటమి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొస్తే.. వ్యతిరేకించారు. పెత్తందార్ల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకోవాలా? 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. అక్క చెల్లెమ్మలకు నేరుగా రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం’’ అని సీఎం వివరించారు.గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లు. ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్‌ బోధన. ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీలతో సర్టిఫైడ్‌ కోర్సులు. పిల్లల చదువు కోసం తల్లులను పోత్సహిస్తూ అమ్మఒడి. విద్యారంగంలో జరిగిన విప్లవాలు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. మహిళా సాధికారతకు అర్థం చెప్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. మొదటిసారి మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.⇒రాజంపేటలో అక్కచెల్లెమ్మల పేరిట 4వేల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఇళ్ల నిర్మాణం..⇒మరో 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది..⇒జరగబోయే ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయించేవి..⇒మీ జగన్ తీసుకొచ్చినన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?⇒ఈ తరహాలో పేదవాడి మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో చూశారా? ⇒ప్రత్యేకహోదాను అమ్మేశారు, పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి..⇒చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని జిల్లా కేంద్రం చేస్తా అంటున్నాడు..⇒రాజంపేట, మదనపల్లి, రాయచోటిలను జిల్లా కేంద్రం చేస్తానంటున్నాడు నమ్ముతారా?⇒రాజంపేటలో పింఛా డ్యాం ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం⇒అన్నమయ్య ప్రాజెక్ట్, గాలేరు-నగరి కాల్వ పనులు పూర్తి చేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి⇒రాజంపేట కేంద్రంగా అన్నమయ్య కాలేజ్‌ను యూనివర్శిటీగా తీర్చిదిద్దాం⇒మీ బిడ్డ తీసుకున్న నిర్ణయం రాజంపేట చరిత్రలో నిలిచిపోతుంది⇒అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు             

CM YS Jagan Interview Created Sensation
ఇది క‌దా క్రేజ్ అంటే.. సీఎం జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూకి మిలియన్ల వ్యూస్

సచిన్ టెండూల్కర్ స్టేడియంలో జూలు విదిలిస్తే ఎలా ఉంటుంది.. ప్రతి బాలు బౌండరీ దాటుతుంది.. స్టేడియం మొత్తం హోరెత్తుతోంది.. తుపానొచ్చినపుడు సముద్రానికి పోటు వస్తే ఎలా ఉంటుంది? కెరటాటు తీరం వైపు పోటెత్తుతాయి.. అడ్డం వచ్చిన వాటిని ఊడ్చి పడేస్తాయి.అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజైతే ఏమవుతుంది... ఏమీ కాదు... భారత్ మొత్తం స్థంభించిపోతుంది... కోట్లాదిమంది అమితాబ్ క్రేజ్ గురించి మాట్లాడుకుంటారు.. ఏ రచ్చబండ దగ్గరైనా అదే చర్చ నడుస్తుంది.. అచ్చం.. అలాగే... పైన చెప్పిన మాదిరిగానే... సీఎం వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ఒక సంచలనం సృష్టించింది. టీవీ-9 లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూ లక్షల్లో వ్యూస్ సాధించింది.. దాంతో బాటు యు ట్యూబ్ లో యువత లక్షల్లో ఆ ఇంటర్వ్యూ చూసింది..అందులో అభివృద్ధి, సంక్షేమం... వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ప్రజల మనస్సులో ఉన్న సందేహాలను టీవీ-9 యాంకర్ రజనీకాంత్ జగన్ ముందు లేవనెత్తారు.. భూ సర్వే గురించి... టైట్లింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు... సంధించిన ప్రశ్నలకు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. అసలు తన విజన్ ఏమిటి... తన పాలనా విధానం ఏమిటి అనేదాని మీద స్పష్టంగా తాను వివరణ ఇచ్చారు. దాంతోబాటు పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన పంచ్ జనంలో బాగా పేలింది... ఒకసారి తప్పు చేస్తే పొరపాటు... రెండో సారి చేస్తే గ్రహపాటు... మూడు నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయి. దాంతోబాటు ఆ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన కొన్ని అంశాలు..పాయింట్స్ కట్ చేసి వీడియోలను ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్హును లక్షల్లో ప్రజలు తమ ఫోన్లలో చూసారని లెక్కలు కనిపిస్తున్నాయి. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది... ఆ ఇంటర్యూ ను ఫోన్లలో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు.. ఈ ఇంటర్వ్హు తమకు బాగా మైలేజి ఇస్తుందని క్యాడర్ సంతోషిస్తోంది.మరోవైపు అదే సమయంలో ఏబీఎన్ ఛానెల్లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదు..చూసేవాళ్ళు కరువయ్యారు... అటు జగన్ ఇంటర్వ్యూను లక్షల్లో చూడగా చంద్రబాబు మాటలు వేలల్లోనే ఉన్నాయ్.. దీంతో బాబు మాటలు గాలిమూటలు అని ప్రజలు నిర్ణయానికి వచ్చారని.. అందుకే చూడడం లేదని ఒక అంచనాకు వచ్చారు.  బాబు గత ముప్పయ్యేళ్లుగా చెప్పినవే చెబుతున్నారని... వాటిల్లో నిబద్ధత లేదని.. అందుకే ఆ గాలిమాటలు వినడానికి ప్రజలు ఇష్టపడడం లేదని అంటున్నారు.ఒక పక్క మోదీ రోడ్ షో జరుగుతున్నా.. లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి. అదే సమయంలో సీబిఎన్ ఇంటర్వ్యూ ఏబీఎన్ లో ప్రసారమైతే కనీసం వ్యూస్ కూడా రాలేదు. ఇది సీఎం వైయస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్. వైయస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి ప్రజలకు తెలిసింది. ఇదే ఇమేజ్ మరోసారి జగన్‌ను సీఎం పీఠం ఎక్కించబోతుందనే సంకేతాలు ముందుగానే తెలుస్తోంది.-సిమ్మాదిరప్పన్న

No Fundamental Right To Campaign: ED Opposes Arvind Kejriwal Bail
కేజ్రీవాల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్‌ దాఖలు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. తనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెల్లడించనుంది. ఈ క్రమంలో తాజాగా కేజ్రీవాల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎన్నికల్లో ప్రచారం చేయడమనేది ప్రాథమిక హక్కు కాదని ఈడీ పేర్కొంది. కనీసం రాజ్యాంగపరమైన లేదా చట్టబద్దమైన హక్కు కూడా కాదని వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రచారం కోసం ఏ రాజకీయ నాయకుడికి బెయిల్‌ మంజూరు కాలేదని తెలిపింది. తన పార్టీ అభ్యర్థుల కోసం కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు పంపడం జనాల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని అభిప్రాయ పడింది.అయితే కేజ్రీవాల్‌ పిటిషన్‌ను మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు.. కేజ్రీవాల్‌ రాష్ట్ర ప్రజలచేత ఎన్నికైన ముఖ్యమంత్రి అని, ఆయన అలవాటు పడిన నేరస్థుడు కాదని పేర్కొంది.  త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని, ఆయనకు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వద్దని ప్రశ్నించింది. అంతేగాక ఒకవేళ ఈ కేసులో కేజ్రీవాల్‌  మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తే.. సీఎం బాధ్యతల్లో అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని ధర్మాసనం పేర్కొంది. బెయిల్‌పై విడుదలైతే  ఫైళ్లపై సంతకాలు చేయొద్దని తెలిపింది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి 21న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్‌ జైల్లో ఉన్నారు. 

Rohit Sharma Wont Be At MI Imagine He Open At: Pace Legend Massive Prediction
రోహిత్‌ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో!

ఐపీఎల్‌-2024లో కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి.. హార్దిక్‌ పాండ్యాను సారథి చేసినందుకు భారీ మూల్యమే చెల్లించింది.తాజా ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. కాగా రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా తప్పించిన నాటి నుంచే అభిమానులు మేనేజ్‌మెంట్‌పై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యాను మైదానం లోపల, వెలుపలా పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు. అందుకు తగ్గట్లుగానే అతడు ఏమాత్రం రాణించలేకపోతున్నాడు. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానేపాండ్యా సారథ్యంలో ఇ‍ప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకొంది.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ డ్రెస్సింగ్‌ వాతావరణం అస్సలు బాగా లేదని.. రోహిత్‌, హార్దిక్‌లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోహిత్‌ శర్మ కన్నీళ్లుస్టార్‌ ఆటగాళ్ల మధ్య విభేదాల వల్లే ముంబై పరిస్థితి ఇలా మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో వైఫల్యం తర్వాత రోహిత్‌ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా ఉన్న వీడియో వీటికి మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌లో హిట్‌మ్యాన్‌ ముంబై ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ పేస్‌ లెజెండ్‌ వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ ముంబైని వీడతాడువచ్చే ఏడాది రోహిత్‌ శర్మ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఆడితే చూడాలని ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి వచ్చే ఏడాది రోహిత్‌ శర్మ ముంబైతో కొనసాగకపోవచ్చు.అతడు కేకేఆర్‌లోకి రావాలని కోరుకుంటున్నాను. అక్కడ గౌతీ(గంభీర్‌) మెంటార్షిప్‌లో.. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది.గొప్ప ఆటగాడుఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ మీద రోహిత్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేయగలడు. అతడొక గొప్ప ప్లేయర్‌. అతడు కేకేఆర్‌లోకి వస్తే చాలా చాలా బాగుంటుంది’’ అని వసీం అక్రం తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటికే పదకొండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కేకేఆర్‌ ప్రదర్శను ఈ సందర్భంగా కొనియాడాడు కూడా!చదవండి: SRH: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్‌.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా.. 

KSR Comments On Chandrababu, Janasena And BJP Main Leaders Changing Their Words For Votes
అచ్చం బాబు స్టైల్‌లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!

తెలుగుదేశం కూటమి డబుల్ గేమ్ అనాలా? లేక దొంగ నాటకాలని అనలా? అమరావతి రాజధాని అంటే ఇతర ప్రాంతాల ప్రజలలో వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారా? బుధవారం నాడు తెలుగుదేశం కూటమి వివిధ పత్రికలలో ప్రచార ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ, కలికిరి రాక సందర్భంలో ఈ అడ్వైర్టైజ్ మెంట్‌ ఇచ్చారు. కేవలం విజయవాడ ప్రాంత ఎడిషన్‌లలో మాత్రం అమరావతి రాజధాని అని ప్రస్తావించి, ఇతర ప్రాంత ఎడిషన్‌లలో మాత్రం రాష్ట్ర వికాసానికి అని పేర్కొన్నారు. అంటే దీని అర్ధం ఏమిటి? అమరావతి రాజధాని అంటే ఉత్తరాంధ్రలో, రాయలసీమలలో ప్రజలలో వ్యతిరేకత బహిర్గతమై, ఓట్ల రూపంలో ప్రభావితం చేస్తుందని భయపడడమే కదా!విజయవాడ పత్రికలలో ఇచ్చిన ప్రకటన ఇలా ఉంది. 'మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీగారు పాల్గొంటున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు లక్షలాదిగా తరలిరండి' అని ఉంది. అదే విశాఖపట్నం ఏరియాలో ఇచ్చిన ప్రకటనలో మాత్రం అందుకు భిన్నంగా 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోదీ గ్యారంటీ...' అని రాశారు. అంటే విజయవాడకు మోదీ వస్తున్నది కేవలం అమరావతి గురించేనని అనుకోవాలా? రాష్ట్ర వికాసం కోసం కాదా? విశాఖకు అమరావతి కలల రాజధాని కాదని చెప్పడమే కదా! ఒకపక్క అమరావతితోనే అభివృద్ది అంటూ సొల్లు పురాణం చెప్పే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎందుకు ఇలా డ్రామా ఆడుతున్నారంటే వారికి తమపై తమకే నమ్మకం లేదనే కదా?ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్కడకు వెళ్లినా స్పష్టంగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, తద్వారా వికేంద్రీకరణ జరిగి అభివృద్దికి బాటలు వేస్తుందని చెబుతున్నారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అని ఆయన మానిఫెస్టోలో కూడా చెప్పారు. విశాఖ ఎక్జిక్యూటివ్ కాపిటల్ అయితే లక్షల కోట్లు ఖర్చు పెట్టనవసరం లేదని, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.విశేషం ఏమిటంటే ప్రముఖ నటుడు, చంద్రబాబు వియ్యంకుడు అయిన బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ కూడా విశాఖ రాజధాని అయితే బెటర్ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. శ్రీభరత్ విశాఖ నుంచి టీడీపీ పక్షాన పార్లమెంటుకు పోటీచేస్తున్నారు. ఆయన అమరావతి ఇప్పటికిప్పుడు అభివృద్ది కాదని, ఇరవై ఏళ్లయినా పడుతుందని, విశాఖ అయితే ఆ ఇబ్బంది ఉండదని అన్నారు. అంటే తెలుగుదేశం కూటమి అభ్యర్ధులు ఒక్కోచోట ఒక్కోరకంగా ప్రచారం చేస్తున్నారని తేలిపోతోంది. నిజానికి అమరావతి రాజధాని అని గతంలో హడావుడి చేసినా తెలుగుదేశంను ప్రజలు ఓడించారు. చివరికి అమరావతి గ్రామాలు ఉన్న తాడికొండ నియోజకవర్గంలోను, మంగళగిరి నియోజకవర్గంలోను టీడీపీ ఓడిపోయింది.స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ మంగళగిరిలో ఓటమిపాలయ్యారు. దానికి కారణం అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు జరిపిన భూదందానే. ఈ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం పలు కేసులు కూడా పెట్టింది. ఇదంతా ఒక కులం వారికోసం, ముందస్తు సమాచారం ఆధారంగా భూములు కొని లాభపడ్డవారి కోసమేనని ఇక్కడి ప్రజలు కూడా అనుమానించారు. దాంతో అమరావతి రాజధాని అన్న కాన్సెప్ట్‌కు ప్రజామోదం లేకుండా పోయింది. అయినా 2019 తర్వాత కూడా రాజధాని రైతుల పేరుతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అండతో కల్పిత ఉద్యమాలను టీడీపీ నడిపింది. అయినా ఇప్పుడు అమరావతి అంటే జనం నమ్మడం లేదని గ్రహించి ఈ రకంగా డబుల్ గేమ్ ఆరంభించారని భావించాలి.అమరావతికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రచారం చేసేవారు. బీజేపీతో చెడ్డాక ప్రధాని మోదీ అమరావతికి ఏమీ ఇవ్వలేదని, చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చి వెళ్లారని కూడా ఆయన విమర్శించేవారు. అలాంటిది ఇప్పుడు కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి గాను ప్రజలు మోదీ రోడ్‌షో కు రావాలని కోరారు. గతంలో బీజేపీ నేతలు కూడా అమరావతి భూ స్కామ్ చాలా పెద్దదని విమర్శించేవారు. ఇప్పుడు మోదీ అమరావతికి ఏమైనా లక్ష కోట్ల నిధులు ఇస్తానని కూటమి నేతలకు హామీ ఇచ్చారా? అసలు ఏపీలో ఫలానా అభివృద్ది చేస్తానని మోదీ గ్యారంటీ ఇవ్వడం లేదు. అయినా వీరు మాత్రం ప్రజలను రకరకాలుగా మోసం చేయడానికి యత్నిస్తున్నారు.రాజమండ్రి, అనకాపల్లిలలో జరిగిన ప్రధాని సభలలో ఎక్కడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఆయనపై నేరుగా అనివీతి ఆరోపణలు చేయలేదు. కాకపోతే జనరల్‌గా ఏవో కొన్ని విమర్శలు చేయాలి కాబట్టి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అవినీతి అంటూ ఇంతకాలం టీడీపీ ఏమి ఆరోపిస్తుందో వాటినే ఆయన కూడా చెప్పి వెళ్లారు. విశేషం ఏమిటంటే మోదీ కానీ, అమిత్ షా కానీ చంద్రబాబు ఉపన్యాసం వినకుండానే నిష్క్రమించడం. బహుశా చంద్రబాబు మాటల మీద వీరికి నమ్మకం పోయిందేమో తెలియదు. మోదీని ఏపీకి తీసుకు రావడం ద్వారా తమకు పలుకుబడి ఉందని, ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తోంది.కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను సహేతుక కారణాలు చూపకుండానే బదిలీ చేయడం, నాలుగేళ్లుగా అమలు అవుతున్న స్కీముల ద్వారా లబ్ది దారులకు డబ్బు విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వడం, వలంటీర్ల వ్యవస్థను నిలుపుదల చేయడం, చంద్రబాబు ఎంత నీచంగా ఉపన్యాసాలు చేస్తున్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. బీజేపీకి ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా గత ఎన్నికలలో రాలేదు. అయినా జనసేన అధినేత పవన్  కల్యాణ్‌ ద్వారా రాయబేరాలు సాగించి కాళ్లా, వేళ్ల పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ద్వారా తమ పనులు చక్కబెట్టుకోవడానికే అని అర్దం అవుతుంది.తమపై ఉన్న కేసులు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు జాగ్రత్తపడడానికే అని ప్రజలంతా భావిస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలోనే కాదు. పలు విషయాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల అంతా వినాశనమేనని గతంలో ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్  కల్యాణ్‌ దారుణమైన ఆరోపణలు ఆ చిన్నస్థాయి వలంటీర్లపై గుప్పించారు. తదుపరి ఎన్నికల సమయానికి తాము కూడా వలంటీర్లను కొనసాగిస్తామని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తామని ప్రకటించారు.వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం శ్రీలంక అవుతోందని చంద్రబాబు, పవన్ లు విమర్శించేవారు. కానీ వారి ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇస్తున్న వాటికన్నా మూడు రెట్ల వ్యయంతో సంక్షేమ స్కీములు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అసెంబ్లీలో మద్దతు ప్రకటించారు. ఎన్నికల వేళ మాత్రం అదేదో ప్రమాదకరమైనదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రానికి సంబంధించిన ఈ చట్టం గురించి మోదీ, అమిత్ షా సభలలో మాత్రం నోరు విప్పరు.ఇన్ని రకాలుగా డ్రామాలు ఆడుతున్న, అబద్దాలు చెబుతున్న టీడీపీ కూటమికి ఎవరైనా ఓటు వేస్తే, వారి అబద్దాలకు ఆమోద ముద్ర వేసినట్లే అవుతుంది. చివరిగా ఒక మాట. పవన్  కల్యాణ్‌ పెద్ద కవి మాదిరిగా పర్వతం ఎవరికి తలవంచదు. సముద్రం ఎవరి కాళ్ల వద్దకు వెళ్లదు.. అంటూ సినిమా డైలాగులు చెబుతుంటారు. కానీ మోదీ పాల్గొన్న సభలో ఈయన వంగి, వంగి ప్రవర్తించిన తీరు మాత్రం అందరిని విస్తుపరిచింది. ఈయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అచ్చం చంద్రబాబు స్టైల్ లోనే పవన్ ఉన్నారని ప్రజలకు క్లారిటీ వచ్చింది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Anchor Ravi Says He Forgot His Daughter's Face
జీవితాలు ఖరాబ్‌.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్‌ రవి

యాంకర్‌ రవి.. ఒకప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూ ఉండేవాడు. గతంలో అతడు యాంకర్‌ లాస్యతో జోడీగా షోలు చేయడంతో జనాలు వీరిద్దరినీ జంటగా ఊహించుకునేవారు. ఎంతో క్రేజ్‌ ఉన్న ఈ జంట మధ్య సడన్‌గా ఏదో గొడవలు వచ్చి మాట్లాడుకోవడం మానేశారు, కలిసి షోలు చేయడం కూడా ఆపేశారు. నిత్యతో పెళ్లితర్వాత ఎన్నో ఏండ్లకు కలిసిపోయారు. కానీ అప్పటికే ఇద్దరూ చెరో దారి చూసుకున్నారు. లాస్య.. మంజునాథ్‌ను పెళ్లి చేసుకోగా యాంకర్‌ రవి.. నిత్య మెడలో తాళి కట్టాడు. తమకు పెళ్లైన విషయాలను ఇద్దరూ ఆలస్యంగానే బయటపెట్టారు. తాజాగా ఓ షోకి హాజరైన రవి తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్‌ అయ్యాడు. డబ్బు కోసమే పని'నేను పక్కా కమర్షియల్‌.. నేను డబ్బు కోసమే పని చేస్తున్నాను. నేనసలు కొరియోగ్రాఫర్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కొంతమంది హీరోల దగ్గరికి వెళ్లి నా ఆసక్తిని బయటపెట్టాను. నాగార్జున గారు ముందు పని నేర్చుకుని తర్వాత ప్రయత్నించమన్నారు. ఓ ఛానల్‌లో కూడా పెట్టించాడు. అక్కడ సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనే షో చేశాను. అలా నా జర్నీ మొదలైంది.కో యాంకర్‌తో కనెక్షన్‌నాకు పెళ్లయిందన్న విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదంటే.. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు అక్కడున్నవారు నిత్యతో.. నన్ను చూపిస్తూ ఫలానా తెలుగు యాంకర్‌ హజ్బెండ్‌ కదా అనేవారు. నన్ను నా కో యాంకర్‌తో ముడిపెట్టేవారు. కాదని చెప్తే.. ఆమె భర్తను పట్టుకుని నీ భర్త అంటావేంటి? అని నిత్యనే నిలదీశారు. పాపం.. తను ఎలా ఫీలవుతుందోనని నేను తల దించుకునేవాడిని. అందుకే తనను లేటుగా పరిచయం చేశాను.నా కూతుర్ని మర్చిపోయాబిగ్‌బాస్‌ షో విషయానికి వస్తే.. ఈ రియాలిటీ షో వల్ల చాలామంది జీవితాలు ఖరాబయ్యాయి. అక్కడ జరిగేవాటిని జడ్జ్‌ చేయొద్దు. నేను బిగ్‌బాస్‌కు వెళ్లిన 15 రోజులకు నా కూతురి ముఖం ఎలా ఉంటుందో మర్చిపోయాను. తనెలా ఉంటుందో గుర్తురాలేదు.. బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగేదంతా మీకు చూపించరు' అని రవి చెప్పుకొచ్చాడు.చదవండి: 'చివరి స్టేజీలో ఉన్నా.. నా భర్త ముఖం మాడిపోయింది'

మే 9: ఏపీ ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు

ఏపీలో ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌..

 Indian student missing in Chicago family in Hyderabad worried
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు

అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం  కావడం కలకల రేపుతోంది. ఉన్నత విద్య కోసం చికాగో వెళ్లిన తెలంగాణకు చెందిన  25 ఏళ్ల రూపేష్‌ చంద్ర చింతకింది అదృశ్యం అయ్యాడు. అతని అచూకీ కోసం కుటుంబ సభ్యులు భారత రాయబార వర్గాలను సంప్రదించారు. చికాగోలోని ఎన్ షెరిడాన్ రోడ్  4300 బ్లాక్ నుంచి అతను తప్పిపోయినట్లు  తెలుస్తోంది. టెక్సాస్ నుండి కలవడానికి వచ్చిన ఒకరిని కలవబోతున్నాడని చెప్పినట్లు సమాచారం.‘‘మే 2 మధ్యాహ్నం వాట్సాప్‌లో మాట్లాడాను. ఏదో పని మీద ఉన్నా అని చెప్పాడు. అంతే అప్పటినుంచి ఆఫ్‌లైన్‌లో ఉన్నాడు"  రూపేష్‌ తండ్రి సదానందం  తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేశ్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులుగా రూపేశ్ ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాద్‌లోఉంటున్న అతని తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి  ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగా శాఖను కోరింది. త్వరలోనే రూపేశ్ అచూకీ తెలుస్తుందని ఆశిస్తున్నామని చికాగోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.The Consulate is deeply concerned learning that Indian student Rupesh Chandra Chintakindi is incommunicado since 2nd May. Consulate is in touch with the police and the Indian diaspora hoping to locate/reestablish contact with Rupesh.@IndianEmbassyUS @MEAIndia— India in Chicago (@IndiainChicago) May 8, 2024మే 2 నుంచి రూపేశ్ మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అతడి ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. రూపేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని  స్థానిక పోలీసులు ప్రకటన విడుదల చేశారు.    

AirIndia terminated 25 employees for their failure to report to work after sick leave
సిక్‌ లీవ్‌ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు

టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగులపై కొరడా ఝుళిపించింది. ముకుమ్మడిగా సిక్‌ లీవ్‌ తీసుకున్న ఉద్యోగులను తొలగించింది. సెలవు అనంతరం తిరిగి ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్‌ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇటీవల ఉద్యోగులు విధులకు రాకపోవడంతో బుధవారం సంస్థ దాదాపు 80కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ చర్యకు కారణమైన 25 మంది క్యాబిన్‌ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.‘సిక్‌లీవ్‌ అనంతరం 25 మంది ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్‌ చేయడంలో విఫలయ్యారు. వారితీరు వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌ ఎంప్లాయిస్‌ సర్వీస్‌ రూల్స్‌ను పాటించనందుకు వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే వారి ఉద్యోగాలు తొలగించాం’ అని టర్మినేషన్‌ లేటర్‌లో కంపెనీ తెలిపింది.బుధవారం విమాన సర్వీసుల్లో కలిగిన అంతరాయం తర్వాత సంస్థ సీఈఓ అలోక్ సింగ్ స్పందించారు. ఉద్యోగులకు ఏదైనా సమస్యలుంటే క్యాబిన్ సిబ్బందితో చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎయిర్‌లైన్ రాబోయే కొద్ది రోజుల పాటు విమానాలను తగ్గిస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..ఇదిలాఉండగా, ఎయిరిండియా వైఖరిపట్ల సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్‌ఏషియా ఇండియాతో విలీనం చేయడం వల్ల సిబ్బంది జీతాలు దాదాపు 20 శాతం తగ్గాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కెకె విజయ్‌కుమార్ మాట్లాడుతూ..ఎయిరేషియాతో విలీనానికి ముందు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిహారంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విలీనంతో ఉద్యోగులకు రావాల్సిన అలవెన్సులు పూర్తిగా తొలగించబడ్డాయన్నారు. దాంతో భారీగా జీతాలు తగ్గాయని చెప్పారు. సంస్థ నిర్వహణలో లోపాలున్నాయని, సిబ్బంది పట్ల సమానత్వం కరవైందని యూనియన్ గతంలో దిల్లీలోని రీజినల్ లేబర్ కమిషనర్‌కు, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all