Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AP Farmer Nagendra and His Family Take Their Lives Due to Debt1
రైతు కుటుంబం బలవన్మరణం.. కూటమి సర్కార్‌ అవహేళన

వైఎస్సార్‌ జిల్లా: అప్పుల బాధ తాళలేక వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దెకుంటలో రైతు నాగేంద్ర కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఈ విషాదాన్ని కూటమి ప్రభుత్వం అవహేళన చేసింది. నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. పవన్‌ వ్యాఖ్యలపై రైతులు, రైతుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలుకు వేసిన పంటలు పండక రైతు నాగేంద్ర రూ. 15 లక్షల అప్పుల్లో కూరుకుపోయారు. దీంతో ఇటీవలే లోన్ ద్వారా తీసుకున్న ట్రాక్టర్ జప్తుకు గురి కావడం, కౌలు యజమాని డబ్బు అడిగితే ఏం చెప్పాలోనని ఆవేదన, అప్పు ఇచ్చిన వాళ్ళ ఒత్తడితో నాగేంద్ర తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భార్య, కుమార్తె, కుమారుడికి ఉరి వేసి తానూ ఆత్మహత్య పాల్పడ్డారు.అయితే, ఇంతటి విషాదంలో రైతు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవహేళన చేస్తూ మాట్లాడారు. రైతు నాగేంద్ర మరణంపై పోలీసుల విచారణ పూర్తిగాక ముందే పవన్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘రైతు నాగేంద్ర వద్ద డబ్బులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే కారణాలతో బలవన్మరణానికి పాల్పడి ఉంటారంటూ’ బుకాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతు నాగేంద్ర, అతని కుటుంబ సభ్యుల ఆత్మహత్యలపై డీఎస్పీ విచారణ చేపట్టారు. విచారణలో అప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ రైతు కుటుంబానికి డబ్బు సమస్య కాదంటూ అవహేళనగా కూటమి నేతలు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.

What is the highest successful chase at MCG in Test cricket?2
మెల్‌బోర్న్‌ టెస్టు.. భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు బద్దలు!

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా భార‌త్-ఆస్ట్రేలియా మ‌ధ్య నాలుగో టెస్టు తుది అంకానికి చేరుకుంది. హోరా హోరీగా సాగుతున్న ఈ బాక్సింగ్ డే టెస్టు ఫలితం సోమవారం తేలిపోనుంది. నాలుగో రోజు ఆట‌లో తొలి రెండు సెష‌న్స్‌లో భార‌త్ పై చేయి సాధించిన‌ప్ప‌టికి.. ఆఖ‌రి సెష‌న్‌లో మాత్రం కంగారులు అద్బుత‌మైన పోరాట ప‌టిమ క‌న‌బ‌రిచారు.ముఖ్యంగా టెయిలాండ‌ర్లు నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్ భార‌త బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించారు. వీరిద్దరూ ప‌దో వికెట్‌కు 55 ప‌రుగుల ఆజేయ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. మొత్తంగా ఈ వెట‌ర‌న్ జోడీ 110 బంతులు ఎదుర్కొని త‌మ జ‌ట్టుకు అడ్డుగోడ‌గా నిలిచారు. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. క్రీజ్‌లో నాథన్ లైయన్ (41 నాటౌట్‌), స్కాట్ బోలాండ్ (10 నాటౌట్‌) ఉన్నారు. ఆస్ట్రేలియా ప్ర‌స్తుతం 333 పరుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది. దీంతో ఆసీస్ భార‌త్ ముందు 333 నుంచి 350 ప‌రుగుల మ‌ధ్య టార్గెట్‌ను నిర్దేశించే అవ‌కాశ‌ముంది. ఈ క్ర‌మంలో భార‌త్ ఈ టార్గెట్‌ను చేధిస్తే 96 ఏళ్ల ఇంగ్లండ్ ఆల్‌టైమ్ బ‌ద్ద‌లు కానుంది.మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో టెస్టుల్లో అత్య‌ధిక రన్ ఛేజింగ్ 322 పరుగులగా ఉంది. 1928లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్టులో ఇంగ్లండ్ 322 ల‌క్ష్యాన్ని చేధించింది. ఆ త‌ర్వాత ఈ వేదిక‌గా 300పైగా టార్గెట్‌ను ఏ జ‌ట్టు కూడా చేధించలేక‌పోయింది. ఇప్పుడు భార‌త్‌కు చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసే అవ‌కాశం ల‌భించింది.మెల్‌బోర్న్‌లో అత్య‌ధిక ర‌న్ ఛేజ్‌లు ఇవే..322- ఇంగ్లండ్‌- ప్ర‌త్య‌ర్ధి(ఆస్ట్రేలియా)-1928297-ఇంగ్లండ్‌- ప్ర‌త్య‌ర్ధి(ఆస్ట్రేలియా)-1895295-ద‌క్షిణాఫ్రికా-ప్ర‌త్య‌ర్ధి(ఆస్ట్రేలియా)-1953286-ఆస్ట్రేలియా-ప్ర‌త్య‌ర్ధి(ఇంగ్లండ్‌)-1929282-ఇంగ్లండ్‌-ప్ర‌త్య‌ర్ధి(ఇంగ్లండ్‌)-1908ఎంసీజీలో భారత్ రికార్డు ఎలా ఉందంటే?కాగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భార‌త్ కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే ల‌క్ష్యాన్ని చేధించిగ‌ల్గింది. 2020 డిసెంబర్‌లో ఆసీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 70 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా చేధించింది. అంతక‌మించి ల‌క్ష్యాన్ని భార‌త్ ఛేజ్ చేయ‌లేక‌పోయింది. అయితే 2018/19 ఆసీస్ పర్యటనలో భాగంగా ఇదే మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్బుతవిజయం సాధించింది. 137 పరుగుల తేడాతో ఆసీస్‌ను టీమిండియా చిత్తు చేసింది. టీమిండియా పేస్‌​ గుర్రం జస్ప్రీత్ బుమ్రా 9 వికెట్లు పడగొట్టి కంగారులను దెబ్బ తీశాడు. కాగా ఆస్ట్రేలియాలో భారత్ అత్యధిక టెస్టు ఛేజింగ్ 329గా ఉంది. 2021లో బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ ఈ ఫీట్ సాధించింది.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన బుమ్రా.. కపిల్‌ దేవ్‌ అల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

IT CEO Salary Rise By 160 pc In 5 Years Freshers only 4 pc3
ఐటీ ఉద్యోగుల జీతాలు ఇంత దారుణమా?

సాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్‌ (TCS), ఇన్ఫోసిస్‌ (Infosys), హెచ్‌సీఎల్‌ టెక్‌ (HCLTech), విప్రో (Wipro), టెక్‌ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్‌లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్‌దాస్‌ పాయ్ ఎత్తిచూపారు.ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్‌ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే.అధిక అట్రిషన్ రేట్లు, తక్కువ ఆన్-సైట్ అవకాశాలు వంటి సవాళ్లను ఐటీ (IT) రంగం ఎదుర్కొంటోంది. ఇది వేతన పరిహారాలపై ప్రభావం చూపుతోంది. సీఈవోల జీతాలు గ్లోబల్ బెంచ్‌మార్క్‌లకు అనుగుణంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న వ్యత్యాసం అసమానతలను మరింత పెంచుతోందని, పెరుగుతున్న జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ఉద్యోగులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెషర్ల జీతాలను కనీసం రూ. 5 లక్షలకు పెంచాలని, ఈ లాభదాయక సంస్థలకు ఇది సాధ్యమేనని విమర్శకులు పేర్కొంటున్నారు.

Delhi Transport Department Responds to Arvind Kejriwal and Atishi Arrest Comments4
అరెస్ట్‌ ఖాయమంటూ కేజ్రీవాల్‌ కామెంట్స్‌ .. ఢిల్లీ సీఎం అతిశీకి అధికారిక లేఖ

ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. తప్పక గెలవాల్సిన ఎన్నికల్లో ఫలితం తారు మారైతే మాజీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) భవితవ్యం కూడా గందరగోళంలో పడనుండగా.. తాజాగా, కేజ్రీవాల్‌ ( Arvind Kejriwal) చేసిన ఆరోపణలతో అక్కడి రాజకీయం రంజుగా మారింది.సీఎం అతిశీ (Atishi Marlena) త్వరలోనే అరెస్ట్‌ కానున్నారంటూ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్ని ఢిల్లీ రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌ గోయల్‌ (Prashant Goyal) ఖండించారు. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం,తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. గత బుధవారం ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ప్రస్తుత సీఎం అతిశీలు సంయుక్తంగా మీడియా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ..ఆ ట్వీట్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్రం (బీజేపీ పెద్దలు) సమావేశమైంది. సమావేశంలో తమ ప్రభుత్వం ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుంది. ఆ పథకాన్ని ఆపేందుకు కుట్ర పన్నింది. సీఎం అతిశీపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు అతిశీ ఇవ్వాళో, రేపో అరెస్ట్‌ కావొచ్చనే’ సమాచారం మాకు అందింది అని అన్నారు. ఆ మేరకు ట్వీట్‌ కూడా చేశారు.महिला सम्मान योजना और संजीवनी योजना से ये लोग बुरी तरह से बौखला गए हैं।अगले कुछ दिनों में फ़र्ज़ी केस बनाकर आतिशी जी को गिरफ्तार करने का इन्होंने प्लान बनाया हैउसके पहले “आप” के सीनियर नेताओं पर रेड की जायेंगी आज 12 बजे इस पर प्रेस कांफ्रेंस करूँगा।— Arvind Kejriwal (@ArvindKejriwal) December 25, 2024కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్‌ గోయల్‌ (Prashant Goyal) స్పందించారు. ఆయన వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం,తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఢిల్లీ సీఎం అతిశీకి లేఖ రాశారు. ఆ లేఖలో ఉచిత బస్సు సర్వీసు పథకంపై విచారణ చేపట్టాలని ‘ది గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ’ (gnctd),విజిలెన్స్ విభాగం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. కాబట్టే కేజ్రీవాల్‌ పేర్కొన్న దావా పూర్తిగా తప్పుగా, తప్పుదారి పట్టించేది’అని గోయల్ తన లేఖలో పేర్కొన్నారు.కేజ్రీవాల్‌తో పాటు సీఎం అతిశీ మాట్లాడారు. నేను గట్టి నమ్మకంతో చెబుతున్నా. ఒక వేళ దర్యాప్తు సంస్థలు నాపై తప్పుడు కేసులు పెట్టినా, అరెస్ట్‌ చేసినా చివరికి నిజమే గెలుస్తోంది. దేశ న్యాయ వ్యవస్థపై గట్టి నమ్మకం ఉంది. అరెస్టయినా బెయిల్‌పై బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Dgp Jitender Releases Telangana Annual Crime Report5
తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్‌ స్పందించారు. ఈ ఏడాదే కాదు, ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణంతో సూసైడ్ చేసుకుంటున్నారని డీజీపీ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులు, ఫ్యామిలీ సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కొన్ని కేసుల్లో పని ఒత్తిడి వలన కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని డీజీపీ వెల్లడించారు. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అల్లు అర్జున్ కేసు కోర్టు పరిధిలో ఉందని.. సమగ్ర విచారణ జరుగుతుందని డీజీపీ పేర్కొన్నారు.క్రైమ్‌ రేట్‌పై వార్షిక నివేదికను విడుదల చేస్తూ.. ఈ ఏడాది కేసుల నమోదు పెరిగిందని డీజీపీ తెలిపారు. డ్రగ్స్‌ లేని తెలంగాణ సాధనే పోలీసు శాఖ లక్ష్యమని.. మోసాలకు పాల్పడుతున్న 1800 వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌లను బ్లాక్‌ చేసినట్లు ఆయన చెప్పారు. కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్న డీజీపీ.. డిజిటల్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు.ఈ ఏడాది 33,618 సైబర్‌ క్రైమ్‌ కేసులను నమోదయ్యాయి.703 చోరీ, 58 దోపిడీ, 1,525 కిడ్నాప్‌, 856 హత్య, 2,945 లైంగిక దాడుల కేసులు నమోదు చేశాం. డయల్ 100కు 16,92,173 పిర్యాదులు వచ్చాయి. కొత్త చట్టం వచ్చిన తర్వాత 85,190 కేసులను నమోదు చేశాం. కొత్త చట్టం ప్రకారం సైబరాబాద్ పరిధిలో 15,360, హైదరాబాద్‌లో 10,501, రాచకొండలో 10,251 కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైం కేసుల్లో రూ.180 కోట్లను తిరిగి బాధితులకు అప్పగించాం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 142.95 కోట్లు మాద్రకద్రవ్యాలను సీజ్ చేశాం. డ్రగ్స్ కేసుల్లో 4,682 మంది నిందితులను అరెస్టు చేశాం’’ అని డీజీపీ జితేందర్‌ వివరించారు.‘‘ఇల్లిగల్‌ ప్రైవేట్‌ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాపై ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేశాం. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో సోషల్ మీడియా ప్రచారాలపై దర్యాప్తు చేస్తాం.. కేసులు పోలీసులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు.. ప్రైవేట్‌ వ్యక్తులకు ఎవరికి సంబంధం ఉండదు’’ అని డీజీపీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేరాల్లో మరో కోణం!

YSRCP Buggana Rajendranath Serious Comments On CBN Govt6
చంద్రబాబూ.. విజన్‌ అంటే అప్పులేనా?: బుగ్గన

సాక్షి, హైదరాబాద్‌: అప్పుడు చేయడంలో కూటమి సర్కార్‌ దూసుకెళ్తోందని ఎద్దేవా చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు.. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్‌ చేశారు. అలాగే, ఈ అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు.మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు 1998లో కూడా విజన్‌-2020 అన్నారు. చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు. ప్రజలు ఐదేళ్ల కోసం గెలిపించుకుంటారా? వచ్చే 20 ఏళ్ల కోసం గెలిపించుకుంటారా?. మన మేనిఫెస్టోనే మన విజన్‌. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి నీకు 15వేలు, నీకు 18వేలు అంటూ లెక్కలేసి హామీలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణం చంద్రబాబు మేనిఫెస్టోనే కదా. ఆరు నెలలు అయ్యింది. చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది?.పథకాల అమలేదీ..యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా.. నిరుద్యోగ భృతి అన్నారు.. ఇవ్వలేదు. తల్లికి వందనం అన్నారు.. అది కూడా ఇవ్వడం లేదు. ప్రతీ మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. అదీ లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు.. అది ఏమైంది?. తల్లికి వందనం అమలు చేయాలంటే రూ.12,450 కోట్లు అవసరం. కానీ, కేవలం రూ.5,386కోట్లు కేటాయించారు. అంటే, తల్లికి వందనం లేనట్టే. దీపం పథకానికి రూ.3,955 కోట్లు అవసరం ఉంటే.. కేవలం రూ.895 కోట్లు కేటాయించారు. అంటే ఈ ఏడాది దీపం పథకం కూడా లేనట్టే. ఆడబిడ్డ నిధికి రూ.37,313 కోట్లు అవసరం.. కానీ, కేటాయింపులు మాత్రం సున్నా. దీంతో, అది కూడా లేనట్టే.ప్రశ్నిస్తానన్న నేత ఎక్కడ?కూటమిలో​ ఒక వ్యక్తి ప్రశ్నిస్తా అన్నాడు.. కాన్నీ, ప్రశ్నించడం లేదు. కూటమి మేనిఫెస్టో రిలీజ్‌ చేసినప్పుడు కూడా ఓ నేత పక్కకు వెళ్లిపోయారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన మహిళల బంగారం బయటకు తెస్తామన్నారు. అలాగే, బెల్టు షాపులు రద్దు అన్నారు.. ఇప్పుడు విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టారు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు ఇస్తామన్నారు.. ఒక్కరికైనా ఇచ్చారా?.అప్పుల్లో బాబుదే రికార్డ్‌..2014-19 మధ్యలో కాపులకు ఐదేళ్లలో 5వేల కోట్లు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. చేనేత రుణాలకు మాఫీ అన్నాడు. ఏమీ చేయలేదు. పుట్టిన ప్రతీ బిడ్డకు మహాలక్ష్మీ పథకం కింద డబ్బులు ఇస్తామన్నాడు.. ఇచ్చాడా?. హామీలు అమలు చేయకుండా ఇప్పుడు విజన్‌ డ్యాకుమెంట్‌ రిలీజ్‌ చేస్తున్నాడు. జూన్‌లో రూ.6వేల కోట్ల అప్పు. జూలైలో రూ.10వేల కోట్లు, ఆగస్టులో రూ.3వేల కోట్లు, సెప్టెంబర్‌లో రూ.4వేల కోట్లు, అక్టోబర్‌లో రూ.6వేల కోట్లు, నవంబర్‌లో రూ.4వేల కోట్లు, డిసెంబర్‌లో రూ.9వేల కోట్లు అప్పులు చేశారు. ఒకేసారి రూ.5వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర టీడీపీదే. కేవలం అమరావతి పేరుతో రూ.31వేల కోట్లు అప్పులు చేశారు. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలి. అప్పులు ఎవరు కడతారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కేవలం 13 శాతం మాత్రమే అప్పు.. మీరు ఏకంగా 22.6 శాతం అప్పులు చేశారు’ అని చెప్పారు.

YS Jagan Congratulates chess grandmaster Koneru Humpy7
కోనేరు హంపికి వైఎస్‌ జగన్‌ అభినందనలు

సాక్షి, తాడేపల్లి: భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. కోనేరు హంపికి అభినందనలు తెలిపారు. ఈ అపూర్వ విజయంతో ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు.తెలుగు తేజం కోనేరు హంపి విజయంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌..‘ప్రతిష్టాత్మకమైన 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత విజయం సాధించటం అందరికీ గర్వకారణం. ఈ అపూర్వ విజయం ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచింది. ఆమె విజయం యువ ప్రతిభావంతులకు, ముఖ్యంగా బాలికలకు స్ఫూర్తిదాయకం. హంపీ నిరంతర కృషి, నిబద్ధతతో ప్రపంచ అత్యుత్తమ చెస్ క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ అభినందనలు తెలిపారు. The pride of India, @humpy_koneru, has won the 2024 FIDE Women's World Rapid Championship for the second time! She is an inspiration to many, particularly those balancing professional and personal life. Wishing her many more victories! pic.twitter.com/v0sv5eE5qM— YS Jagan Mohan Reddy (@ysjagan) December 29, 2024

BRS MLC Kavitha Sensational Comments On Congress And Bjp8
తులం బంగారం ఇచ్చారా?.. కాంగ్రెస్‌ నేతలను నిలదీయండి: కవిత

సాక్షి, నిజామాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కోలేక కేటీఆర్‌, తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయితే, తాము భయపడే వాళ్లం కాదు.. భయపెట్టే రకం అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో అభివృద్ధి చేయలేక తమపై కేసులు పెడుతున్నారని కామెంట్స్‌ చేశారు.ఎమ్మెల్సీ కవిత ఆదివారం నిజామాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలతో సమావేశవహయ్యారు. అనంతరం కవిత మాట్లాడుతూ..‘దేశంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక కేటీఆర్, నాపై కేసులు పెడుతున్నారు. అయినా భయపడేది లేదు. నేను, కేటీఆర్‌ ఏ తప్పు చేయలేదు. మాపై కేసులు పెట్టినా, ఇంకా ఎవరి మీద అయినా అక్రమ కేసులు బనాయించినా.. నిప్పు కణికల్లాగా బయటకు వస్తాం.పరిస్థితి ఎలా ఉందంటే.. కేంద్రాన్ని ఎదురించినా కేసు.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిదన్నా కేసు. సీఎం పేరు మర్చిపోతే కేసు.. హీరో పేరు మర్చిపోతే కేసు. రైతులు భూమి ఇవ్వకపోతే కేసు. సోషల్‌ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే కేసులే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడినా కేసులే పెడుతున్నారు. అయినా మేము భయపడేది లేదు.. గట్టిగా నిలబడతాం. పోరాటం మాకేమీ కొత్త కాదు..ఎవరికైనా స్కూటీలు వచ్చాయా?. తులం బంగారం వచ్చిందా.. మహాలక్ష్మి వచ్చిందా?. ఎన్నెన్నో హామీలు ఇచ్చారు.. బీరాలు పలికారు. హామీలు నెరవేరాయా?. కాంగ్రెస్ వాళ్లను నిలదీయండి.. ప్రశ్నించండి. రుణమాఫీ అన్నారు.. పూర్తిగా చేయలేదు.. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు.. దరఖాస్తులు చెత్త కుప్పలో పడేశారు. 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారు. ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారు. నిరుద్యోగులు మహిళలు ఉద్యోగులు విద్యార్థులు అందరినీ కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీసుల రాజ్యం నడుస్తోంది. ఇటు నుంచి సూర్యుడు అటు ఉదయించినా నిజామాబాద్‌లో రాబోయే రోజుల్లో గులాబీ జెండానే ఎగురుతుంది. రాబోయే లోకల్ ఎలక్షన్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ ఎగరడం ఖాయం’ అంటూ కామెంట్స్‌ చేశారు.

China Unveils High Speed Bullet Train9
హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలును పరీక్షించిన చైనా

బీజింగ్‌:ఆవిష్కరణల్లో చైనా తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్‌ రైలు నమూనాను చైనా రైల్వే సంస్థ తాజాగా ఆవిష్కరించింది. దీనికి సీఆర్‌450గా పేరుపెట్టింది. ఆదివారం(డిసెంబర్‌29) బీజింగ్‌లో ఈ రైలును పరీక్షించారు. ట్రయల్‌రన్‌లో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్‌ రైలు దూసుకుపోయింది. ఇది అత్యధికంగా గంటకు 450 కిమీ వేగాన్ని అందుకోగలదని చైనా రైల్వే తెలిపింది. ఇది ప్రయాణాలకు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్యాసింజర్‌ రైలుగా రికార్డు సృష్టిస్తుందని పేర్కొంది.ఈ బుల్లెట్‌ రైలు చైనా రాజధాని బీజింగ్‌ నుంచి షాంఘై నగరానికి కేవలం రెండున్నర గంటల్లోనే ప్రయాణించగలదు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతమున్న సీఆర్‌400 మోడల్‌ కంటే ఇది 12 శాతం బరువు తక్కువ. ఇంధనాన్ని కూడా 20 శాతం తక్కువగానే వాడుతుందని చైనా రైల్వే అధికారులు తెలిపారు.ఇక గత బుల్లెట్‌ రైలు మోడల్‌ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్‌ పరీక్షల్లో ఇది అత్యధికంగా గంటకు 453 కిమీ వేగాన్ని అందుకోవడం గమనార్హం. చైనా హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌ ప్రపంచలోనే అతిపెద్దది కావడం గమనార్హం. చైనాలో ఇప్పుడున్న బుల్లెట్‌ రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు.

Actor Venkatesh Comments About Arunachalam10
లైఫ్‌లో చాలా డిస్టర్బ్‌ అయ్యా.. ఆ గుడికి వెళ్లాక జీవితమే మారింది: వెంకటేష్‌

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు విక్టరీ వెంకటేష్‌. అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. సరికొత్తగా ప్రమోషన్‌ కార్యక్రమాలను చిత్ర యూనిట్‌ ఇప్పటికే ప్రారంభించింది. ఈ క్రమంలో బాలకృష్ణతో వెంకటేష్‌ ఒక వేదికపై మెరిశారు. సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్న వెంకీ తన జీవితంలో బాగా డిస్ట్రబ్‌ అయిన సమయంలో 'అరుణాచలం' ఆలయాన్ని సందర్శించాక ఏం జరిగిందో పంచుకున్నారు.అరుణాచలం ఆలయం సందర్శించిన తర్వాత తనకు కలిగిన అనుభూతిని వెంకటేష్‌ ఇలా పంచుకున్నారు. 'ప్రపంచంలో చాలా ప్రదేశాలు తిరిగాను. ఈ క్రమంలో చాలామందిని కలిశాను. ఈ క్రమంలో జీవితంలో కూడా చాలా డిస్ట్రబ్‌ అయ్యాను కూడా. ఫైనల్లీ అరుణాచలం వెళ్లి స్వామి దర్శనం అనంతరం స్కందాశ్రమంలో మెడిటేషన్‌ చేశాను. అక్కడ ఏదో తెలియని శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అసలైన హ్యూమన్‌ ఎనర్జీ ఎంటో అక్కడే తెలుస్తోంది. నేను అలాంటి శక్తిని అక్కడి నుంచే పొందాను. ఆ తర్వాత నా జీవితంలో ఎలాంటి సంఘటన కూడా నున్ను డిస్ట్రబ్‌ చేయలేకపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న వెంకీలోని మార్పులు అరుణాచలం నుంచి వచ్చినవే. ఎక్కడ దొరకని ప్రశాంతత అక్కడ ఉంటుంది. అలానే నేను అన్నది మర్చిపోయి , ఏది శాశ్వతము కాదు అని తెలుసుకుంటాము ' అని ఆయన భక్తితో ఎమోషనల్‌గా చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.తమిళనాడులో తిరువణ్ణామలై జిల్లాలోని పచ్చని కొండ పక్కన అరుణాచలేశ్వరాలయం ఉంటుంది. జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునేవాళ్లు ఈ ఆలయాన్ని తప్పక దర్శిస్తుంటారు. అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు... ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శివుడు అగ్నిలింగంగా అక్కడ అవతరించాడు. పంచ భూత పవిత్ర స్థలాల్లో ఒకటిగానూ ప్రపంచంలోని అతిపెద్ద ఎనిమిదో హిందూ దేవాలయంగానూ పేరుంది. అరుణాచలంలో పరమశివుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు వెళ్తారు. ముఖ్యంగా ప్రతి పౌర్ణమి నాడు అక్కడకు భక్తులు భారీగా చేరుకుంటారు. View this post on Instagram A post shared by Niharika Reddy (@yours_niharikareddy)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
హైదరాబాద్‌లో గెహిస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభం

అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఇమ్మిగ్రేషన్ సర్వీస్ అందిస్తోన్న గెహిస్ ఇమ్మిగ్రేషన్ మరియు ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్..

title
రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్‌

దుబాయ్‌లో పనిచేస్తున్న హైదరాబాదీ వాచ్‌మెన్‌ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు.

title
Laura Loomer: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు

లారా లూమర్..

title
ఈ తెలుగాయన ఆఫ్రికాని జయించాడు!

విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దాన్ని అందుకోవాలి అనే అనుకుంటారు.

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవం

లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో వందేండ్ల  క్రితం ప్రారంభమైన సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ

Advertisement
Advertisement