Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Land Allegations On Sajjjala: YSRCP Fire On Yellow Media Kutami Govt1
టార్గెట్‌ సజ్జల.. భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ

గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వ(Kutami Prabhutvam) ప్రతీకార పాలన కొనసాగుతోంది. నిత్యం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, ఆరోపణలు, తప్పుడు కేసులతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో తాజాగా.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్‌ చేసుకుని ఎల్లో మీడియాతో అడ్డగోలు కథనాలను అచ్చేయిస్తోంది.సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కడప జిల్లా సీకేదిన్నె మండల పరిధిలోని అటవీ భూములు ఆక్రమించిందనే ఆరోపణలను కూటమి అనుకూల మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. అయితే ఈ కథనాలపై వైఎస్సార్‌సీపీ భగ్గుమంది. కబ్జా కథనాలను తీవ్రంగా ఖండించింది. ‘‘అసలు కబ్జా ఆరోపణలకు ఆస్కారమే లేదు. ఆ మీడియా చానెల్స్‌ చెప్తున్నట్టుగా కడప సమీపంలోని మామిడి తోటల్లో ఒక్క సెంటు భూమికూడా సజ్జల రామకృష్షారెడ్డికి లేదు. అలాంటప్పుడు కబ్జా అన్న ప్రశ్నే తలెత్తదు. 1995 ప్రాంతంలోనే అంటే ఇప్పటి చంద్రబాబు(Chandrababu) అప్పుడు సీఎంగా ఉన్న సమయంలోనే ఇక్కడ పనికిరాని భూములను సజ్జల, ఆయన సోదరులు కొనుగోలుచేశారు. మామిడితోటలు వేశారు. దీనికి దాదాపు పదేళ్ల తర్వాత సజ్జల రామకృష్షారెడ్డి తన వాటా భూములను సోదరులకు విడిచిపెట్టారు. అప్పటినుంచీ ఆయనకు ఆ భూములతో ఆయనకు సంబంధం లేదు. ఇది జరిగినప్పుడు ఆయన రాజకీయాల్లోకూడా లేరు.2014లో ఫారెస్ట్‌, రెవిన్యూ విభాగాల మధ్య ఈ ప్రాంతంలో మొత్తం భూముల విషయమై వివాదం నెలకొంది. ఫారెస్ట్‌ కిందకు వస్తుందని అటవీశాఖ, ఆ ప్రసక్తే లేదని రెవిన్యూశాఖలు తలోరకంగా చెప్తున్నాయి. ఇరుశాఖలకు మొత్తం రికార్డులు కూడా సజ్జల సోదరులు అప్పగించారు. సంయుక్తంగా సర్వే చేసి ఏదో విషయం తేల్చాలని సజ్జల సోదరులే పలుమార్లు అర్జీలు పెట్టుకున్నారు.కేవలం సజ్జల రామకృష్షారెడ్డి(Sajjala Ramakrishna Reddy) పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డమే లక్ష్యంగా ఎల్లోమీడియా ప్రయత్నిస్తోంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై సజ్జల న్యాయపరమైన చర్యలకు దిగుతున్నారు’’ అని వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటనలో తెలిపింది.

China Confirmed HMPV Virus Spreads Check Full Details Here2
హెచ్‌ఎంపీవీ విభృంభణ.. ధృవీకరించిన చైనా!

చైనాలో HMPV పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్‌ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేశాయి. అయితే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది. ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికించడం ఖాయమని పరిశోధకుల హెచ్చరికల వేళ.. డ్రాగన్‌ కంట్రీ కొత్త వైరస్‌ విజృంభణను ధృవీకరించినట్లు కథనాలు వెలువడుతుండడం గమనార్హం. అయితే..కేవలం చైనా ఉత్తర భాగంలోనే హెచ్‌ఎంపీవీ విజృంభణ కొనసాగుతోందని అటు చైనా ఆరోగ్య శాఖ.. ఇటు చైనా అంటువ్యాధుల నియంత్రణ మండలి(China CDC) ప్రకటించాయి. అన్ని వయసులవాళ్లపై ఈ వైరస్‌ ప్రభావం చూపుతోందని.. ముఖ్యంగా పిల్లల్లో, వయసు పైబడినవాళ్లలో త్వరగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం కేసులను ట్రేస్‌ చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నాయి. అలాగే మాస్కులు ధరించాలని, శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలిపాయి. అయితే.. ఇది ప్రాణాంతకమేనా? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.👉ఒకవైపు చైనాలో నిజంగానే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అత్యవసర పరిస్థితి(Emergency) విధించారా? అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే వాటిల్లో వాస్తవమెంత? అనేది తేలాల్సి ఉంది.👉మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ పరిణామంపై స్పందించాల్సి ఉంది. 👉ఇంకోవైపు.. చైనా చుట్టుపక్కల దేశాల్లో కొత్త వైరస్‌ టెన్షన్‌ మొదలైంది. ఇప్పటికే జపాన్‌లో ఫ్లూ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండగా.. HMPV కేసులేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హంకాంగ్‌లోనూ ఈ వైరస్‌ కేసులు నమోదు అయినట్లు సమాచారం.ఏమిటీ హెచ్‌ఎంపీవీ వైరస్‌?హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌.. ఆర్‌ఎన్‌ఏ వైరస్‌. క్షీరదాలు, పక్షుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్ని కలగజేసే Pneumoviridae Metapneumovirusకి చెందింది. అయితే హెచ్‌ఎంపీవీ కొత్తదేం కాదు. చైనాకు 20 ఏళ్లుగా పరిచయం ఉన్న వైరస్సే. 2021లో తొలిసారిగా ఈ వైరస్‌ ఆనవాళ్లను శ్వాసకోశ సంబంధిత సమ్యలతో బాధపడుతున్న చిన్నపిల్లల్లో డచ్‌ పరిశోధకులు గుర్తించారు. అయితే ఎలా సోకుతుందని(వ్యాధికారకం) విషయం గుర్తించలేకపోగా.. ఇప్పటిదాకా దీనికి వ్యాక్సిన్‌, మందులు సైతం కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. సెరోలాజికల్‌ అధ్యయనాల ప్రకారం ఈ వైరస్‌ 60 ఏళ్లు భూమ్మీద సజీవంగానే ఉండి తన ప్రభావం చూపిస్తుందని తేలింది. లక్షణాలు, చికిత్సకరోనా తరహాలోనే వేగంగా వ్యాపించే ఈ వైరస్‌.. పిల్లలు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లపై ప్రభావం చూపెడుతుందని తెలుస్తోంది. జలుబుతో పాటు దగ్గు, ముక్కు దిబ్బడ, జ్వరం ఈ వైరస్‌ లక్షణాలు. అయితే పరిస్థితి తీవ్రమైతే గనుక న్యూమోనియా, బ్రాంకైటిస్‌కు దారి తీయొచ్చు. వ్యాక్సిన్‌, మందులు లేకపోవడంతో లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నారు.ఇక హెచ్‌ఎంపీవీతో మరణాలు సంభవిస్తాయా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. 2021లో ఈ వైరస్‌ డాటా ఆధారంగా లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఓ కథనం ప్రచురించింది. అందులో.. ఐదేండ్ల లోపు పిల్లల్లో ఒక శాతం మరణాలు సంభవించిన విషయాన్ని ప్రస్తావించింది.

KSR Comments On CBN And Yellow Media In AP3
బాబు వైఫల్యాలు.. ఒప్పేసుకున్న ఎల్లో మీడియా!

ఏడంటే ఏడు నెలలు.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనకు మధ్య వ్యత్యాసం ఏపీ ప్రజలకు అర్థమయ్యేందుకు పట్టిన సమయం ఇది!. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం పెట్టేస్తామన్నట్టుగా సాగిన కూటమి నేతల ప్రచారం ఆచరణకు వచ్చేసరికి పాతాళానికి చేరిన సంగతి తెలిసిందే. ఇదేదో వైసీపీ అనుకూల మీడియా చెబుతున్న విషయం కాదు.. అక్షరాలా టీడీపీ అనుకూల పచ్చ పత్రిక ‘ఈనాడు’ నిగ్గుదేల్చిన వాస్తవం. ఈ కథనంలోనే వైఎస్‌ జగన్‌ సమర్థత ఏమిటన్నది స్పష్టమవుతున్నా.. ఆ మాట నేరుగా చెప్పేందుకు మాత్రం ఈనాడు వారికి నోరు రాకపోయింది!వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని.. మరో శ్రీలంక అవుతోందని ఈనాడు తన కథనాల ద్వారా గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. మా బాబు అధికారంలోకి వస్తే జగన్‌ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తారని కూడా ఈ మీడియా ఊదరగొట్టింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతోంది. సంక్షేమ పథకాల అమలు సంగతి అలా ఉంచండి.. చేసిన అప్పులే కొండంతయ్యాయి!. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత మేరకు ఆదాయం రాకపోవడం వల్లనే అని కలరింగ్‌ ఇచ్చేందుకు ఈనాడు ప్రయత్నించి ఉండవచ్చు కానీ.. బాబు నిర్వాకాల పుణ్యమా అని ఏపీ ఇప్పుడు నిజంగానే శ్రీలంక స్థాయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుందా? అన్న అనుమానాలైతే చాలామందిలో వ్యక్తమవుతున్నాయి.వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయానికి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకు ఆదాయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కూటమి హయాంలో ఆదాయం తగ్గడమే కాకుండా.. బడ్జెట్‌ అంచనాలకు, వాస్తవ అంకెలకు మధ్య తేడా కూడా ఎక్కువైంది. అయితే, ఈనాడు తన కథనంలో వైఎస్‌ జగన్‌ హయంలోని అంకెలను ప్రస్తావించకుండా బాబుకు జాకీలేసే ప్రయత్నం చేసింది. టీడీపీ, జనసేనలు రెండూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు. రాష్ట్రంలోనూ బీజేపీ పార్టీ అధికార భాగస్వామి. ఇన్ని అనుకూలతలున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు జగన్‌ కాలం కంటే (రూ.22,213 కోట్లు) తక్కువగా (రూ.9703 కోట్లు) ఉండటం గమనార్హం. దీన్ని బట్టే బాబు కేంద్రంలో తిప్పుతున్న చక్రం వేగం ఏపాటిదో అర్థమైపోతుంది.రాష్ట్రంలో భూముల విలువలు తగిపోయాయని, రియల్ ఎస్టేట్ దెబ్బతిందని, తాను అధికారంలోకి వస్తే భూముల విలువలు అమాంతం పెరిగిపోతాయని బాబు ఎన్నికలకు ముందు చెప్పేవారు. టీడీపీ మీడియా, పార్టీ నేతలు ఇదే విషయాన్ని ప్రచారం చేశారు. జనం చాలా వరకూ నమ్మారు కూడా. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత చూస్తే.. ఈ ఏడు నెలల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల అమ్మకాల ద్వారా వచ్చిన రాబడి రూ.5,438 కోట్లు మాత్రమే. గత ఏడాది ఇదే కాలానికి ఈ మొత్తం రూ.6306 కోట్లుగా ఉంది.చంద్రబాబు కలల రాజధాని అమరావతిలోనూ భూమి ధరలు పెరగలేదు. దాంతో కంగారుపడుతున్న చంద్రబాబు అండ్ కో.. హైప్ క్రియేట్ చేయడానికి ఏకంగా రూ.31 వేల కోట్ల మేర అప్పులు తెచ్చి ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం అప్పులు కూడా సమీకరిస్తున్నారు. అమ్మకం పన్ను రాబడి కూడా గత ఏడాది కన్నా సుమారు వెయ్యి కోట్లు తగ్గింది. తాజాగా వచ్చిన జీఎస్టీ లెక్కలు చూస్తే 2023 డిసెంబర్‌లో 12 శాతం వృద్ధి ఉంటే, 2024 డిసెంబర్‌లో అంటే కూటమి ప్రభుత్వంలో జీఎస్టీ మైనస్ ఆరు శాతంగా ఉంది. వైఎస్‌ జగన్ ప్రభుత్వం సమయంలో మూలధన వ్యయం నవంబర్ నాటికి రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే, చంద్రబాబు పాలనలో అది కేవలం రూ.8329 కోట్లు ఉంది. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఏం సంపద సృష్టించారో అర్థం కాదు.ఇలా ఏ రంగం చూసుకున్నా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంతో పోల్చితే చంద్రబాబు హయంలో ఆర్థిక నిర్వహణ నాసిరకంగా ఉందని అంకెలు చెబుతున్నాయి. అయినా జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని టీడీపీ కూటమి ప్రచారం చేస్తోంది. ఎల్లో మీడియా అవే అబద్దాలను వల్లె వేస్తుంటుంది. ఈనాడు కథనంలో ఇచ్చిన బడ్జెట్ అంకెలను పరిశీలిద్దాం.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.13,500 కోట్ల రాబడి అంచనా వేస్తే కేవలం రూ.5438 కోట్లే వచ్చాయి. మిగిలిన నాలుగు నెలల్లో రూ.8వేల కోట్ల ఆదాయం రావడం కష్టమే. అమ్మకం పన్ను ద్వారా రూ.24,500 కోట్లు వస్తాయని లెక్కేస్తే ఇప్పటివరకూ వచ్చింది ఇందులో సగం కంటే తక్కువగా రూ.11303 కోట్లే మాత్రమే. అలాగే ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.25,587 కోట్ల ఆదాయాన్ని బడ్జెట్‌ అంచనాగా చూపారు. ఇప్పటివరకూ వసూలైంది రూ.13154 కోట్లు!. కేంద్ర పన్నులలో వాటా రూ.35 వేల కోట్లని చెప్పారు. వాస్తవంగా అందింది.. రూ.22వేల కోట్లు. ఇతర పన్నులు, సుంకాలు రూ.8645 కోట్లు అంచనా ఆదాయమైతే, నికరంగా లభించింది రూ.3483 కోట్లు మాత్రమే. భూమి శిస్తు మాత్రం రూ.57 కోట్ల అంచనాలకు రూ.194 కోట్లు వచ్చాయి. ఈ కథనం ప్రకారం రాష్ట్ర రెవెన్యూ లోటు భారీగా పెరిగింది. అప్పట్లో రూ.47 వేల కోట్లు ఉంటే, అది 2024 నవంబర్ నాటికి రూ.56 వేల కోట్లకు చేరుకుంది. ఇదన్నమాట చంద్రబాబు సృష్టించిన సంపద.రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికి రూ.1.12 లక్షల కోట్ల అప్పులు చేసిందని వివరించారు. పెన్షన్ రూ.వెయ్యి పెంచడం మినహా సూపర్ సిక్స్ హామీల జోలికి వెళ్లకపోయినా, ఈ ప్రభుత్వం ఎందుకింత అప్పులు చేసిందీ ఇంతవరకు వివరించ లేదు. నిజానికి ఇలాంటి వాటిపై శ్వేతపత్రాలు వేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి.మరో వైపు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం రూ.15 వేలు కోట్లు వేశారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వం నిర్దిష్టంగా స్కీములు అమలు చేయడమే కాకుండా, పోర్టులు, మెడికల్ కాలేజీలు, తదితర అభివృద్ది పనులు చేపట్టింది. ముఖ్యంగా కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంది. అలాంటి సమస్యలు ఏమీ లేకపోయినా, స్కీములు అమలు చేయకపోయినా, అభివృద్ది ప్రాజెక్టులు లేకపోయినా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళుతున్న కూటమి సర్కార్‌ను ఏమనాలి? ఆర్ధిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్తూ, తమది ‘విజన్‌-2047’ అని ప్రచారం చేసుకోవడం చంద్రబాబు అండ్ కో వారికే చెల్లిందని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Bumrah Stares Down Konstas Sydney Day 1 Ends Dramatically Video Viral4
కొన్‌స్టాస్‌ ఓవరాక్షన్‌.. వైల్డ్‌ ఫైర్‌లా బుమ్రా!.. నాతోనే పెట్టుకుంటావా..?

టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు తొలిరోజు ఆట రసవత్తరంగా సాగింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఇరుజట్ల క్రికెటర్లు పోటీపడ్డారు. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతికి చోటు చేసుకున్న పరిణామాలు టీమిండియా అభిమానులకు మాంచి కిక్కిచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?!బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border- Gavaskar Trophy) 2024-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్‌లో బుమ్రా కెప్టెన్సీలో గెలిచిన టీమిండియా.. అనంతరం రోహిత్‌ శర్మ సారథ్యంలో అడిలైడ్‌లో ఓడిపోయి.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకుంది.రోహిత్‌ లేకుండానేఅయితే, మెల్‌బోర్న్‌ టెస్టులో కనీసం డ్రా చేసుకునే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేక ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విఫలమైన రోహిత్‌ శర్మ(ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 31 రన్స్‌) ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah) తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఆసీస్‌తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, టాపార్డర్‌ విఫలమైన కారణంగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌(10), కేఎల్‌ రాహుల్‌(4)తో పాటు శుబ్‌మన్‌ గిల్‌(20), విరాట్‌ కోహ్లి(17) నిరాశపరిచారు.పంత్‌ పోరాటం.. బుమ్రా మెరుపులుమిడిలార్డర్‌లో రిషభ్‌ పంత్‌(40), రవీంద్ర జడేజా(26) రాణించగా.. నితీశ్‌ రెడ్డి(0) పూర్తిగా విఫలమయ్యాడు. ఇక వాషింగ్టన్‌ సుందర్‌(14), ప్రసిద్‌ కృష్ణ(3) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. పదో స్థానంలో వచ్చిన బుమ్రా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 22 పరుగులు సాధించాడు.185 పరుగులకు ఆలౌట్‌ఇక బుమ్రా మెరుపుల కారణంగానే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ బౌలర్లలో స్కాట్‌ బోలాండ్‌ నాలుగు, మిచెల్‌ స్టార్క్‌ మూడు, ప్యాట్‌ కమిన్స్‌ రెండేసి వికెట్లు కూల్చగా.. నాథన్‌ లియాన్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.కొన్‌స్టాస్‌ ఓవరాక్షన్‌ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే తమ తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు షాక్‌ తగిలింది. సిడ్నీలో శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి మూడు ఓవర్లలో వికెట్‌ నష్టానికి తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతి పడటానికి ముందు ఆసీస్‌ యువ ఓపెనర్‌ సామ్‌ కొన్‌స్టాస్‌(Sam Konstas) ఓవరాక్షన్‌ చేశాడు.బుమ్రా బౌలింగ్‌కు వస్తున్న సమయంలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా కాస్త ఆగమన్నట్లుగా సైగ చేయగా.. బుమ్రా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. దీంతో నాన్‌- స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న కొన్‌స్టాస్‌ బుమ్రాను చూస్తూ ఏదో అనగా అతడు సీరియస్‌ అయ్యాడు. వైల్డ్‌ ఫైర్‌లా బుమ్రా.. ఓ రేంజ్‌లో టీమిండియా సంబరాలుఈ క్రమంలో కొన్‌స్టాస్‌ అతి చేస్తూ బుమ్రా వైపు రాగా.. బుమ్రా కూడా అంతే ధీటుగా బదులిచ్చాడు. దీంతో అంపైర్‌ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు. అయితే, ఈ సంఘటన జరిగిన వెంటనే తన అద్భుత బంతితో ఖవాజా(2)ను అవుట్‌ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో ఖవాజా ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ క్యాచ్‌ పట్టగానే టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ‘‘నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది’’ అన్నట్లుగా బుమ్రా కొన్‌స్టాస్‌ వైపునకు రాగా.. అక్కడే ఉన్న యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ కూడా కొన్‌స్టాస్‌కు కౌంటర్‌ ఇచ్చాడు. దీంతో ముఖం మాడ్చుకున్న 19 ఏళ్ల ఈ టీనేజర్‌ ఆట ముగిసిన నేపథ్యంలో నిరాశగా మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆఖరి బంతికి అద్భుతం చేశావు భయ్యా అంటూ టీమిండియా ఫ్యాన్స్‌ బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కొన్‌స్టాస్‌కు ఇలాంటి ఓవరాక్షన్‌ కొత్తేం కాదు. మెల్‌బోర్న్‌లో తన అరంగేట్ర టెస్టులో కోహ్లితో గొడవ పెట్టుకున్న కొన్‌స్టాస్‌కు.. బుమ్రా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈసారి తనతో నేరుగా పెట్టుకున్నందుకు.. ఆసీస్‌ను దెబ్బతీసేలా వికెట్‌తో బదులిచ్చాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ అవుట్‌!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!Fiery scenes in the final over at the SCG! How's that for a finish to Day One 👀#AUSvIND pic.twitter.com/BAAjrFKvnQ— cricket.com.au (@cricketcomau) January 3, 2025

Sanjay Raut Praises Cm Devendra Fadnavis5
‘మహా’ పాలిటిక్స్‌లో ట్విస్ట్‌..!ఫడ్నవీస్‌పై రౌత్‌ ప్రశంసలు

ముంబయి:అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు చల్లబడినట్లు కనిపిస్తోంది. ఓ వైపు నిట్టనిలువున చీలిపోయిన శరద్‌ పవార్‌ కుటుంబం మళ్లీ కలిసే అవకాశముందని ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఇండియా కూటమిలో భాగమైన శివసేన(ఉద్ధవ్‌)పార్టీ కీలక నేత సంజయ్‌ రౌత్‌ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై తాజాగా ప్రశంసలు కురిపించడం హాట్‌టాపిక్‌గా మారింది.గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు కోసం ఫడ్నవిస్‌ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని రౌత్‌ అన్నారు. ఈ విషయమై రౌత్‌ శుక్రవారం(జనవరి3) మీడియాతో మాట్లాడారు.’గతంలో మేం ఫడ్నవీస్‌తో కలిసి పనిచేశాం. మా సంబంధాలు కొనసాగుతాయి. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి విషయంలో ఫడ్నవీస్‌ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి’అని రౌత్‌ ప్రశంసించారు. ఇటీవల కోట్ల రూపాయల రివార్డులన్న మావోయిస్టు అగ్రనేతలు స్వయంగా సీఎం ఫడ్నవిస్‌ ముందే లొంగిపోయిన విషయం తెలిసిందే. కాగా, గతేడాది నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన(ఉద్ధవ్‌)ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేయగా బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్‌పవార్‌)పార్టీలతో కలిసి మహాయుతి కూటమిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించి ఫడ్నవీస్‌ సీఎం పదవి చేపట్టగా ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌లు డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. ఇండియా కూటమిలో శివసేన(ఉద్ధవ్‌) పార్టీ కాంగ్రెస్‌, ఎన్సీపీ(శరద్‌పవార్‌) పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించడం గమనార్హం. ఇదీ చదవండి: చొరబాటుదారులకు బీఎస్‌ఎఫ్‌ దన్ను

Political Counters Between BJP and TDP JC Prabhakar Reddy6
కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్‌ కౌంటర్‌

సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. నేడు ప్రభాకర్‌ రెడ్డికి కాషాయ పార్టీ నేతలు కౌంటరిచ్చారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డిని టీడీపీ పార్టీ కంట్రోల్‌ చేయాలని బీజేపీ నేత హితవు పలికారు.తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ సీరియస్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీనటి మాధవీలతపై జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరం. ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. బీజేపీ నేతలను హిజ్రాలతో పోల్చటం జేసీ ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి వీరంగం చేస్తారు. అధికారం లేకపోతే పలాయనం.. జేసీ విధానం. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని టీడీపీ కంట్రోల్ చేయాలి. ఆయన ఇలాంటి వైఖరితో టీడీపీ ప్రభుత్వానికే చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇక, అంతకుముందు ‍ప్రభాకర్‌ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్‌ చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.అలాగే, అనంతపురంలో నా బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు లేదా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో జరిగి ఉంటుందని ట్రావెల్స్‌ మేనేజర్‌ అనంతపురం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, గురువారం రాత్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం బస్సు ప్రమాదం కుట్రపూరితంగా జరిగినట్లు ఆరోపించడం సంచలనంగా మారింది. ఫ్లైయాష్‌ వివాదమే కారణమా? నిజానికి.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీపీలో ఫ్లైయాష్‌ రవాణా విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జేసీ ప్రభాకర్‌రెడ్డికి మధ్య ఇటీవల తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో వీళ్లిద్దరి పంచాయతీ సీఎం వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలను ఉద్దేశించి ప్రభాకర్‌రెడ్డి విమర్శించి ఉండవచ్చునని తెలుస్తోంది.

Sandhya Theatre Stampede: Theatre Owners Applied for Bail7
తొక్కిసలాట ఘటన: నాంపల్లి కోర్టుకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం

సాక్షి, హైదరాబాద్‌: పుష్ప 2 ప్రీమియర్స్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede)పై సంధ్య థియేటర్‌ యాజమాన్యం నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. తొక్కిసలాట ఘటనలో A1, A2గా ఉన్న థియేటర్‌ యజమానులు పెద్దరామిరెడ్డి, చిన్న రామిరెడ్డి బెయిల్‌ కోసం శుక్రవారం నాడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం చిక్కడపల్లి పోలీసులను ఆదేశించింది.తమకు గంట సమయం కావాలని కోరిన పోలీసులు మరికాసేపట్లో కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. అనంతరం సంధ్య థియేటర్‌ యజమానుల తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. మరోవైపు అల్లు అర్జున్‌ (Allu Arjun) కూడా రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ఇదే కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్న న్యాయస్థానం మరికాసేపట్లో తీర్పు వెల్లడించనుంది.ఏం జరిగింది?డిసెంబర్‌ 4న హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో పుష్ప 2 (Pushpa 2 Movie) ప్రీమియర్స్‌ ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగ్గా ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు అటు అల్లు అర్జున్‌, అతడి టీమ్‌తో పాటు సంధ్య థియేటర్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేయగా మధ్యంతర బెయిల్‌పై అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.చదవండి: అల్లు అర్జున్‌కు నేడు బెయిల్‌ లభించనుందా.. ?

Electric Two Wheeler Sales in December 20248
ఈ టూవీలర్స్‌ అమ్మకాలు.. వీటిదే ఆధిపత్యం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన రంగంలో డిసెంబర్‌ నెలలో 'బజాజ్‌ చేతక్‌' (Bajaj Chetak) తొలి స్థానంలోకి దూసుకొచ్చింది. గత నెలలో 18,276 యూనిట్లతో బజాజ్‌ ఆటో 25 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకుంది. 2020 జనవరిలో ఎలక్ట్రిక్‌ చేతక్‌ ద్వారా స్కూటర్స్‌ రంగంలోకి బజాజ్‌ రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఈ-టూ వీలర్స్‌ విభాగంలో దేశంలో ఒక నెల అమ్మకాల్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం సంస్థకు ఇదే తొలిసారి. డిసెంబర్‌ నెలలో 17,212 యూనిట్లతో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ రెండవ స్థానంలో నిలిచింది.నవంబర్‌ వరకు తొలి స్థానంలో కొనసాగిన ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) గత నెలలో అతి తక్కువగా 13,769 యూనిట్లతో 19 శాతం వాటాతో మూడవ స్థానానికి పరిమితమైంది. 2024లో కంపెనీకి అతి తక్కువ విక్రయాలు నమోదైంది డిసెంబర్‌ నెలలోనే కావడం గమనార్హం. అక్టోబర్‌లో 41,817 యూనిట్ల అమ్మకాలు సాధించిన ఓలా ఎలక్ట్రిక్‌ నవంబర్‌లో 29,252 యూనిట్లను నమోదు చేసింది.హోండా ఎలక్ట్రిక్‌ (Honda Electric) టూ వీలర్లు రోడ్డెక్కితే ఈ ఏడాది మార్కెట్‌ మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనపడుతోంది. సంప్రదాయ ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ (ఐసీఈ) ఆధారత టూవీలర్‌ రంగాన్ని ఏలుతున్న దిగ్గజాలే ఎలక్ట్రిక్‌ విభాగాన్ని శాసిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి నెల నమోదవుతున్న అమ్మకాలే ఇందుకు నిదర్శనం.రెండింటిలో ఒకటి ఈవీ..భారత త్రిచక్ర వాహన రంగంలో ఎలక్ట్రిక్‌ త్రీవీలర్లు దూకుడుమీదున్నాయి. భారత ఈవీ రంగంలో టూవీలర్ల తర్వాత త్రీవీలర్లు రెండవ స్థానంలో నిలిచాయి. 2024లో దేశవ్యాప్తంగా మొత్తం 6,91,011 యూనిట్ల ఈ-త్రీవీలర్స్‌ రోడ్డెక్కాయి. భారత్‌లో గతేడాది ఎలక్ట్రిక్, ఐసీఈ, సీఎన్‌జీ, ఎల్‌పీజీ విభాగాల్లో కలిపి మొత్తం 12,20,925 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ఎలక్ట్రిక్‌ వాటా ఏకంగా 56 శాతం ఉంది. అంటే అమ్ముడవుతున్న ప్రతి రెండింటిలో ఒకటి ఎలక్ట్రిక్‌ కావడం విశేషం.ఎలక్ట్రిక్ త్రీవీలర్స్‌లో నాయకత్వ స్థానాన్ని కొనసాగిస్తున్న మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ 10 శాతం వాటా సాధించింది. వేగంగా దూసుకొచ్చిన బజాజ్‌ ఆటో 6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023లో అమ్ముడైన 5,83,697 యూనిట్ల ఎలక్ట్రిక్‌ త్రీవీలర్లతో పోలిస్తే 2024 విక్రయాల్లో 18 శాతం వృద్ధి నమోదైంది.2023లో సగటున ఒక నెలలో 48,633 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళితే గతేడాది ఈ సంఖ్య నెలకు 57,584 యూనిట్లకు ఎగసింది. ఐసీఈ, సీఎన్‌జీ, ఎల్‌పీజీ ఆప్షన్స్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం వల్లే ఎలక్ట్రిక్‌ త్రీ-వీలర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. మెరుగైన రుణ లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అందుబాటులోకి విభిన్న మోడళ్లు, సరుకు రవాణాకై లాజిస్టిక్స్‌ కంపెనీల నుంచి డిమాండ్‌ ఇందుకు మరింత ఆజ్యం పోస్తోంది. త్రీవీలర్స్‌లో సీఎన్‌జీ విభాగానికి 28 శాతం వాటా కాగా, డీజిల్‌కు 11, ఎల్‌పీజీ 3, పెట్రోల్‌కు ఒక శాతం వాటా ఉంది.

AP Janasena Leader Conduct Rave Party At Konaseema District9
AP: జనసేన నేత రేవ్‌ పార్టీ.. యువతులతో అసభ్యకర డ్యాన్స్‌!

సాక్షి, కోనసీమ: న్యూ ఇయర్‌ వేడుకల్లో జనసేన నేతలు రెచ్చిపోయారు. వేడుకల కోసం జనసేన పార్టీకి చెందిన నాయకుడు ఏకంగా రేవ్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో యువతులతో అసభ్యకర నృత్యాలు చేస్తూ అర్థరాత్రి హంగామా చేశారు. కోనసీమ జిల్లాలో డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి జరిగిన రేవ్‌ పార్టీ వీడియోలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.వివరాల ప్రకారం.. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ నాయకుడు వేలుపూరి ముత్యాలరావు అలియాస్‌ ముత్తు ఆధ్వర్యంలో డిసెంబర్‌ 31వ తేదీన అర్థరాత్రా రేవ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. గొల్లపుంత రోడ్‌లో ఉన్న బుద్ధా స్టాచ్యూ ఓం సిటీ లేఅవుట్‌లో రేవ్‌ పార్టీ జరిపారు. సమాజం తలదించుకునేలా అసభ్యకర నృత్య ప్రదర్శనలతో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. రేవ్‌ పార్టీలో యువతులతో అసభ్యకరంగా డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ రేవ్‌ పార్టీకి జనసేన నాయకులు సహా మరికొందరు హాజరైనట్టు తెలుస్తోంది. ఇక, రేవ్‌ పార్టీలో జనసేన నాయకుడు సహా అక్కడున్న వారంతా హంగామా క్రియేట్‌ చేశారు. ఈ నేపథ్యంలో రేవ్‌ పార్టీపై ఆరాతీసిన పోలీసులు.. జనసేన నాయకుడితో సహా నలుగురిపై మండపేట పీఎస్‌లో కేసు నమోదు చేశారు. అయితే, జనసేన నేతలపై కేసు నమోదు చేయవద్దంటూ పోలీసులపై కొందరు నేతలు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ కేసుపై పోలీసులకు హెచ్చరికలు సైతం వెళ్లినట్టు తెలుస్తోంది.

Zookeeper Enters Lion's Den To Impress Girlfriend10
గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్‌ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది

కొందరు వెర్రితో చేసే పిచ్చి స్టంట్‌లు భయానకంగానూ, ప్రాణాంతకంగానూ ఉంటాయి. కనీసం ఇలాంటివి చేసే ముందు వికటిస్తే ఏమవుతుందో అనే ధ్యాస లేకుండా అనాలోచితంగా చేసేస్తారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే వాళ్ల కథ విషాదాంతంగా ముగిసిపోతుంటుంది. అలాంటి ఘటనే ఇది.ఓ జూ సంరక్షకుడు గర్ల్‌ఫ్రెండ్‌(Girlfriend)ని ఇంప్రెస్‌ చేద్దాం అనుకుని చేసిన పనికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఉజ్బెకిస్తాన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..44 ఏళ్ల జూకీపర్(zookeeper) తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్‌ చేద్దామన్న ఉద్దేశ్యంతో ఓ స్టంట్‌ చేయాలనుకున్నాడు. అందుకోసం తెల్లవారుజామున 5 గంటలకు సింహాల గుహ(Lion Den)కు చేరుకుని సెల్ఫీ వీడియో(Selfie Video) తీసుకుంటున్నాడు. ముందుగా మూడు పెద్ద సింహాలు ఉన్న బోనులోకి వెళ్లాడు. వాటిని నిశబ్దంగా ఉండండి అని సైగ చేస్తూ సెల్ఫీ వీడియో చిత్రీకరిస్తున్నాడు..ఇంతలో ఓ సింహం అనుహ్యంగా అతడి చేతిపై దాడిచేయడంతో.. జరగకూడని ఘోరం జరిగిపోయింది. చివరికీ ఆ సింహాల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. అతడు సరదాగా చేసిన స్టంట్‌ కాస్తా తన చివరి క్షణాలను బంధించిన వీడియోగా మిగిలిందని పోలీసులు వెల్లడించారు. ఏదీ ఏమైనా క్రూర జంతువులతో చేసే స్టంట్‌ల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాల్సిందే.(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
అమెరికాలోనూ ‘చాయ్‌.. సమోసా’

‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేం

title
న్యూ ఇయర్‌ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్,  రాస్ అల్ ఖైమాలో  జరిగిన చిన్న ప్రైవేట్  విమాన ప్రమ

title
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్‌ఆర్‌ఐకు జైలు, జరిమానా

మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన  27 ఏళ్ల వ్యక్తికి  సింగపూర్‌  కోర్టు జైలు

title
సుచీర్‌ బాలాజీ కేసులో షాకింగ్ ‌ట్విస్ట్‌!

ఓపెన్‌ఏఐ విజిల్‌బ్లోయర్‌

title
యూకే స్టూడెంట్ వీసా.. మ‌రింత భారం!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో భారత విద్యార్థులకు యూఎస్‌ వీసాలు కష్టమేనన్న ప్రచారం జోరందుకుంది.

Advertisement

వీడియోలు

Advertisement