Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jaganmohan Reddy Fires On Chandrababu About Tirupati Stampede1
బాబే మొదటి ముద్దాయి: వైఎస్‌ జగన్‌

వైష్ణవులందరికీ మార్గదర్శకంగా నిలిచే ఆలయం తిరుమల. గతంలో లక్షలాది మంది భక్తులు వచ్చినా సంతోషంగా దర్శనం చేయించి పంపించగలిగాం. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శాస్త్రం తెలియదు. ఆచరణలు తెలియవు. దేవుడిపై భయం లేదు. భక్తీ లేదు. భయమూ, భక్తి ఉన్న వాడెవడైనా తిరుమల శ్రీవారి ప్రసాదంపై ఇష్టమొచ్చి­నట్టుగా అబద్ధాలు చెప్పగలుగుతాడా? టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం ముఖ్యమంత్రి అనే­వాడు చేస్తాడా? ఈ ఘటనలో ముమ్మా­టికీ చంద్రబాబే మొదటి ముద్దాయి.తొక్కిసలాట ఒక ప్రాంతంలో జరగలేదు. రకరకాల ప్రదేశాల్లో జరిగింది. ఆయా ప్రాంతాల్లో పోలీస్‌ ఫోర్స్‌ లేకపోవడం, కనీస ఏర్పాట్లు లేకపోవడం స్పష్టంగా కన్పిస్తోంది. ఆయా ప్రాంతాల్లో అంబులెన్స్‌లను ప్రోటోకాల్‌ ప్రకారం పెట్టాలన్న బాధ్యత కూడా లేదు. తొక్కిసలాట తర్వాత అంబులెన్స్‌ రావడానికి, క్షతగాత్రులను తీసుకెళ్లడానికి ముక్కాలు గంట (45 నిమిషాలు) పట్టిందని బాధితులు చెబుతున్నారు. అది కూడా అప్పుడొకటి.. అప్పుడొకటి వచ్చాయని చెప్పారు. కొంత మంది వాళ్లంతట వాళ్లే కిందా మీద పడి వచ్చామని చెప్పారు. మరికొంత మంది రోడ్డున పోయే వారి సాయంతో వచ్చామని చెబుతున్నారు. ఈ రకమైన పరిస్థితులుండడం ఎంత దారుణం? ఈ ఘటనకు చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, ఎస్పీ, కలెక్టర్‌.. బాధ్యత వహించాలి. ఇందులో వీరందరి తప్పు ఉంది. చంద్రబాబు నాయుడుకు ఈ పాపం తగలక మానదు. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశానంటూ దేవుడికి, భక్తులకు క్షమాపణ చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. సిన్సియార్టీ లేదు. చిత్తశుద్ధి అంతకంటే లేదు. తాను చేసిన తప్పును ఇంకొకరి మీద మోపడమే ఆయనకు తెలుసు. – వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో చనిపోవడం దురదృష్టకరమని వైఎ­స్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చరిత్రలో ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు. టీటీడీ చరిత్రలో ఇది మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. ఈ ఘటనలో ముమ్మాటికీ మొదటి ముద్దాయి చంద్రబాబేనని స్పష్టం చేశారు. తొక్కిస­లా­టలో గాయపడి, పద్మావతి మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రి (స్విమ్స్‌)లో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం రాత్రి ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర టీటీడీలో ఇలాంటి పరిస్థితులకు దారితీసిన కారణాలను అందరూ ఆలోచించాలన్నారు. తొక్కిసలాట ఘటనలో ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వచ్చా­యని చెప్పారు. ‘మనం వైకుంఠ ఏకాదశిని ప్రతి ఏటా జరుపుకుంటాం. ఆ రోజు లక్షలాది మంది భక్తులు వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తారు. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని తరలివస్తారు. 10వ తేదీన వైకుంఠ ఏకాదశి. ఈ విషయాలన్నీ తెలిసీ.. ప్రభుత్వం ఎందుకు టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర భద్రత చర్యలు, ప్రొటోకాల్స్‌ పాటించలేదు? అసలు చంద్రబాబుకు 10న వైకుంఠ ఏకాదశి అని తెలుసు కదా? అయినా కూడా కుప్పంలో తన ప్రోగ్రాం పెట్టుకున్నాడు. 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పంలోనే ఉన్నారు. పోలీసు శాఖ మొత్తం ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు కుప్పం తరలిపోయింది. 8వ తేదీ రాత్రి 8.30 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమంలో తొక్కిసలాట ఘటన జరిగింది. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు, కుప్పం­లో చంద్రబాబు పర్యటన ఉందని తెలిసినప్పుడు పోలీ­సులు ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు? అందరూ చంద్రబాబు పర్యటనలో మునిగి పోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క సారిగా గేట్లు తెరవడంతో.. బైరాగిపట్టెడ కౌంటర్‌కు ఎదురుగా ఉన్న పార్కులో ఉదయం 8 గంటల నుంచి భక్తులను గుంపుగా నిలబెట్టారు. రాత్రి 8.30 గంటలకు కౌంటర్‌ వద్దకు తీసుకొచ్చి గేట్లు తెరిచారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెబుతున్నారు. చీకట్లో.. పార్కులో నిలబెట్టిన భక్తులకు ఉదయం నుంచి ఏమైనా ఇచ్చారా? వచ్చిన భక్తులను వచ్చినట్టు ఎందుకు క్యూలైన్లలోకి పంపించలేదు? అన్ని సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. ఆయా సెంటర్లలో లైన్లలోకి పంపించడానికి పోలీసులు ఎక్కడా లేరు. అందుకే గుంపుగా నిలబెట్టి ఒకేసారి విడిచిపెట్టే కార్యక్రమం చేశారు. ఇప్పుడు పోలీసులు.. చంద్రబాబు దిక్కమాలిన అబద్ధాలు అడుతున్నారు. ఈ తొక్కిసలాట ఘటన ఒక చోటే జరిగినట్టు చెబుతున్నారు. విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయినట్టు, బైరాగిపట్టెడలో ఐదు మంది చనిపోనట్టు ఎఫ్‌ఐఆర్‌లలో నమోదైంది. ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడినప్పుడు వివిధ కౌంటర్ల దగ్గర తొక్కిసలాటల్లో గాయపడినట్టు చెబుతున్నారు. చంద్రబాబుకు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కుప్పంలో 6,7,8 తేదీల్లో ప్రోగ్రామ్స్‌ పెట్టుకున్నారు. పోలీసులు మొత్తాన్ని తన దగ్గరకే పిలిపించుకున్నారు. తిరుపతిలో మాత్రం భక్తుల కోసం ప్రత్యా­మ్నాయ భద్రత ఏర్పాట్లను గాలికి వది­లేశారు. ఫలితంగా భారీ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దేవుడి దయతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి ప్రాణపాయం లేదు. రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులను కలుపుకుంటే దాదాపు 50 నుంచి 60 మంది భక్తులు తొక్కిసలాటలో గాయపడినట్టు సమాచారం. ఒక్క స్విమ్స్‌లోనే 35 మంది ఉన్నట్టు తెలుస్తోంది. భక్తుల భద్రత, వసతులపై చిత్తశుద్ధి ఏదీ? మొట్టమొదటి సారిగా తిరుపతిలో ఇలాంటి దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. దారుణమైన పరిస్థితుల్లో వ్యవస్థను నడిపిస్తున్నారు. ఇక్కడి కలెక్టర్, ఎస్పీ, పోలీసులు, టీటీడీ పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టత తెలియకుండా ప్రవర్తించారు. దశాబ్దాలుగా టీటీడీలో ప్రొటోకాల్స్‌ ఉన్నా, వీళ్లెవ్వరూ పట్టించుకోలేదు. తిరుపతికి లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి భద్రత, వసతుల కల్పన గురించి ఆలోచించలేదు. ఉదయం 9 గంటలకు వస్తే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. అక్కడ మనుషులు ఉన్నారని వీళ్లు పట్టించుకుంటే కదా! మా ప్రభుత్వంలో ఐదేళ్లలో గొప్పగా భక్తులకు దైవ దర్శన సేవలందించాం. అలాంటిది ఈ రోజు భక్తులను క్యూలో నిలబెట్టేవారు లేరు. వారి ఆకలి, దప్పికలను కూడా గాలికి వదిలేశారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల నష్టప­రిహారం ఇవ్వాలి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి.. ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ ఉచిత వైద్యం అందించాలి. వారు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేటప్పుడు కనీసం రూ.5 లక్షలు అందించాలని చంద్రబాబును డిమాండ్‌ చేస్తున్నాం. ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి, దేవదాయ శాఖ మంత్రి, టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్‌ ఈవో, ఎస్పీ, కలెక్టర్, రెవెన్యూ అధికా­రులు అందరూ బాధ్యత వహించాల్సిందే. మొత్తం పోలీసు శాఖను తిరుపతిలో లేకుండా చేసి.. పలచ­గా అక్కడక్కడా బందోబస్తు పెట్టి, భక్తుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నారు⇒ గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టన పెట్టుకున్న ఘతన ఈ చంద్రబాబుది కాదా? తన షూటింగ్‌ కోసం అందర్నీ ఒకచోట పెట్టాడు. షూటింగ్‌ బాగా రావాలని చెప్పి గేట్లు ఒకేసారి ఎత్తాడు. తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. ⇒ తిరుపతి ఘటనలో జరిగిన వాస్తవాలు ప్రజలకు చెప్పకూడదని చంద్రబాబు నాయుడు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయాడంటే.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను నేను రాకముందే ఇక్కడ నుంచి షిప్ట్‌ చేసే కార్యక్రమం చేశారు. దీనికి మీరే సాక్ష్యం. గాయపడిన వారు చాలా మంది మేము పోము.. మా పరిస్థితి ఇంకా బాగోలేదు.. మమ్మల్ని ఎక్కడకు పంపిస్తారు.. మేము ఎందుకు పోవాలని బీష్మించుకొని ఆస్పత్రిలో ఉండిపోయారు.⇒ వారిని ఇక్కడి నుంచి బలవంతంగా పంపించేందుకు నా కాన్వా­య్‌ని పోలీసులు అడ్డగించారు. ట్రాఫిక్‌ పేరుతో నా కాన్వాయ్‌ ముందుకు కదలకుండా చేశారు. ఎస్పీకి ఒక మాట చెబుతున్నా.. చంద్రబాబుతో మీరంతా కుమ్మక్కై దారుణంగా వ్యవహ­రిస్తున్నారు. దేవుని విషయంలో కూడా ఎంత దారుణంగా ప్రవర్తించారో పైనున్న దేవుడు చూస్తున్నాడు. ఎస్పీ నుంచి చంద్రబాబు వరకు ఆ దేవుడే గట్టిగా మొట్టికాయలు వేస్తాడు.చిన్న కేసుగా పక్కన పడేసే కుట్రభక్తులు మృతి చెందిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో పేలవమైన సెక్షన్లు నమోదు చేశారు. ఇందులో 194 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ కింద కేసు పెట్టారు. దొమ్మీ జరిగి ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లతో కేసు నమోదు చేస్తారా? ఇది ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఘటనా? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగితే.. 105 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ పెట్టాల్సింది పోయి.. కావాలని కేసును నీరు గార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇంత పెద్ద ఘటనను ఒక చిన్న కేసుగా.. తీసి పక్కన పడేసేందుకు దారుణంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారంటే.. వీళ్లకు అసలు మానవత్వం లేదు. చిత్తశుద్ధి కూడా లేదు. బాగా చేయాలనే ఆలోచన అసలే లేదు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేసి టీటీడీ లడ్డూ విషయంలో ఒక అబద్ధాన్ని సృష్టించారు. దానికి రెక్కలు కట్టి తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్టపాలు చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇదే పెద్ద మనిషి తన చర్యలతో మరో­సారి టీటీడీలో బ్లాక్‌ మార్కుగా నిలిచిపోయే ఘట­నకు కారణమయ్యాడు. దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు సురక్షితంగా భగవంతుడి దర్శనం కల్పించడం. అందుకే క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌లో టీటీ­డీకి ఉన్న విశిష్టత ఎక్కడా లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు టీటీడీలోకి అడుగుపెట్టాలంటే.. అది కూడా చంద్రబాబు లాంటి పాలకుడు ఉన్నప్పుడు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయోనని చూపించారు.తప్పంతా చంద్రబాబుదే ⇒ చంద్రబాబు.. ఓ షో పుటప్‌ చేసి, చిన్న స్థాయి అధికారులను బాధ్యులను చేస్తూ వారిని బదిలీ, సస్పెండ్‌ చేసే శిక్షలతో సరిపెట్టే కార్యక్రమం చేస్తుండటం బాధాకరం. ఈ ఘటనలో చంద్రబాబు చేసిన తప్పు కన్పించడం లేదా? 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు కుప్పంలో పర్యటించ లేదా? పోలీసులందరినీ తన చుట్టూ పెట్టుకో­లేదా? భక్తుల కోసం పోలీసుల కేటా­యింపు లేకపోవడం వాస్తవం కాదా? జిల్లా ఎస్పీ.. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకే తాపత్రయ పడ్డారే తప్ప, లక్షల మంది భక్తులకు సెక్యు­రిటీ కల్పించాలని ఆలోచించ లేదు. ఈ విషయంలో ఎస్పీది తప్పు కాదా? ⇒ కలెక్టర్‌ది కూడా తప్పు ఉంది. కనీసం అక్కడున్న వారిని క్యూలైన్‌లలో నిలబెట్టే కార్యక్రమంపై ప్రొటోకాల్‌ ప్రకారం ఆదేశాలు ఇచ్చేందుకు రివ్యూలు కూడా చేయక పోవడం తప్పు కాదా? కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు కూడా ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. అక్కడకు వచ్చిన భక్తులకు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. తినడానికి తిండి లేదు. ఇలా గంటల తరబడి భక్తులు పార్కుల్లో ఉండేలా చేశారు. అన్ని కౌంటర్ల వద్ద పోలీసులు లేకుండా చేయడంలో కలెక్టర్‌ది తప్పు కాదా?⇒ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఎంత మందిని ప్రవేశింప చేయాలనే నిర్ణయం తీసుకున్నది ఈవో, అదనపు ఈవో. వీరందరినీ అజమాయిషీ చేసేది టీటీడీ చైర్మన్‌. వీరందరిదీ తప్పు కాదా? టోకెన్ల జారీపై రివ్యూలు తీసుకోకుండా ఇంత మంది చావులకు కారణం మీరు కాదా? మొత్తానికి ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబే.

Game Changer Movie Twitter Review, Social Media Talk2
‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ

మెగాఫ్యాన్స్‌ మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్‌ చరణ్‌(Ram Charan) సోలో హీరోగా నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’(Game Changer) చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్‌ టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్‌ షో బొమ్మ పడిపోయింది. తెలంగాణలో శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి షోస్‌ పడనున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.గేమ్‌ ఛేంజర్‌ కథేంటి? ఎలా ఉంది? శంకర్‌, చరణ్‌ ఖాతాలో భారీ హిట్‌ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు ఎక్స్‌లో మిక్స్‌డ్‌ టాక్‌ వస్తుంది. సినిమా బాగుందని కొందరు.. ఆశించిన స్థాయిలో సినిమాలేదని మరికొంత మంది కామెంట్‌ చేస్తున్నారు. చరణ్‌ నటన అదిరిపోయింది కానీ.. శంకర్‌ మేకింగ్‌ బాగోలేదని కొంతమంది నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. పాటలు అయితే తెరపై చూస్తే అద్భుతంగా ఉన్నాయట. రా మచ్చా మచ్చా పాట అదిరిపోయిందంటూ చాలా మంచి నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. #GameChanger Strictly Average 1st Half! Follows a predictable commercial pattern so far. A few IAS blocks have came out well along with an interesting interval block. The love story bores and the comedy is over the top and ineffective. Ram Charan is doing well and Thaman’s bgm…— Venky Reviews (@venkyreviews) January 9, 2025ఊహించదగిన కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉంది.కొన్ని ఐఏఎస్‌ బ్లాక్‌లు బాగా వచ్చాయి, అలాగే ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్లాక్ కూడా వచ్చింది. ప్రేమకథ బోరింగ్‌గా ఉంది. కామెడీ కూడా అతిగా ఉంది మరియు అసమర్థంగా ఉంది. రామ్ చరణ్ బాగా చేస్తున్నాడు. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. సెకండాఫ్‌ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఓ నెటిజన్‌ రాసుకొచ్చాడు.#GameChanger#RamCharan𓃵 #GameChangerReviewGood 1st halfAa dhop song kuni scenes teseste inka bagunu Interval scene 🔥🔥Thaman Bgm🔥🎇🎇Raa Macha Macha song🥵🔥🔥🔥#ShankarShanmugham #KiaraAdvani #Thaman https://t.co/l8Gg6IgdfK— Lucky⚡️ (@luckyy2509) January 9, 2025 ఫస్టాఫ్‌ బాగుంది. దోప్‌ సాంగ్‌ ఇంకాస్త బాగా తీయాల్సిది. ఇంటర్వెల్‌ సీన్‌అదిరిపోయింది. తమన్‌ నేపథ్య సంగీతం బాగుంది. రా మచ్చా మచ్చా సాంగ్‌ అద్భుతం అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.#GameChanger First Half Review:Shankar's vintage taking shines as he delivers a gripping first half packed with grandeur, emotional highs, and slick action. Ram Charan impresses with his powerful performance, while Thaman's BGM and song picturization elevate the experience. A…— Censor Reports (@CensorReports) January 9, 2025 ఫస్టాఫ్‌ అదిరిపోయింది. అద్భుతమైన సన్నివేశాలు, భావోద్వేగాలు, యాక్షన్‌తో శంకర్‌ మరోసారి తన టేకింగ్‌ పవర్‌ని చూపించాడు. రామ్‌ చరణ్‌ తన నటనతో ఆకట్టుకున్నాడు. తమన్‌ బీజీఎం అదిరిపోయిది. సెకండాఫ్‌పై హైప్‌ పెంచేలా ఇంటర్వెల్‌ సీన్‌ ఉందని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.Appanna Emotional shot!❤️💥👌#Anjali shared about the same scene & Said that #RamCharan will win National Award for sure🔥🔥#UnstoppableWithNBKS4#UnstoppableWithNBK#GameChanger#GameChanagerpic.twitter.com/a8AjdNpEya— Vishnu Writess (@VWritessss) January 8, 2025#GameChangerReview1st Half - ⭐⭐⭐Entry SongsBuildupthat Traffic Dance 😭🤮Love scenesFlat Screenplay Interval okay #RamCharan is Good#SSThaman Rocked it 💥💥#Shankar Proved he is not back 😭 #GameChanger #KiaraAdvaniHope 2nd Half Will Blast 🤞🏻🤞🏻... pic.twitter.com/oDstZwzvo0— Movie_Gossips (@M_G__369) January 9, 2025Gamechanger 1st half review Poor pacing👎🏻Boring love track 😴Decent performance from RC👍🏻RC looks 🫠Only hope is 2nd half 🙌BGM okaish 👍#GameChangerReview— ✌🏼 (@UGotLazered) January 9, 2025#GameChanger #GameChangerReview ⭐⭐⭐⭐ 4/5!!So far, fun mass, masala, entertainment. Awesome. That’s @shankarshanmugh for us 👌🏼👌🏼👌🏼🔥🔥❤️❤️❤️. What a technical brilliance 👏🏼👏🏼👏🏼 #RamCharan𓃵 #KiaraAdvani #Sankar #kiaraadvanihot #RamCharan #disastergamechanger… pic.twitter.com/NI0hDd9aDO— the it's Cinema (@theitscinemaa) January 9, 2025Appanna Characterization decent but routine n predictable with stammering role Once appanna died, same lag continues ..Very good climax is needed now #GameChanger #GameChangerReview https://t.co/UEpuZ74o1t— German Devara⚓️🌊 (@HemanthTweets39) January 9, 2025#GameChanger Tamil version!Good first half🔥👍Dialogues are good can feel the aura of @karthiksubbaraj in the build up of the story!Already better than @shankarshanmugh ‘s last three movies, Charan and SJS good.@MusicThaman 🔥#Gamechangerreview— Water Bottle🇵🇹 (@waterbotttle_07) January 9, 2025#GameChanger First Half:A Good First Half Thats Filled With Visual Extravaganza. Interval Ends With A Bang & A Great Twist That Keeps You Anticipated For The Second Half. Ram Charan At His Absolute Best In Dual Roles, You Can Witness The Efforts He Has Put In With Each Scene 👏 pic.twitter.com/Q3jrXfWykB— CineCritique (@CineCritique_) January 9, 2025

Sakshi Guest Column On YS Jaganmohan Reddy government3
జగన్‌ హయాం ఆర్థిక ప్రగతికి కితాబు

ప్రపంచ చెస్‌ మాజీ ఛాంపియన్‌ గ్యారీ కాస్పరోవ్‌ రష్యాలో రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్య మిస్తూ, అనేక పుస్తకాలు రచించారు. ప్రస్తుత రష్యా పాలకుల చేత ఉగ్ర వాదిగా కూడా ముద్ర వేయించుకున్నారు. రష్యాలో నిరంతరం జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా ప్రపంచ వేదికలపై తన గళాన్ని తరచుగా వినిపిస్తున్నారు. ఒక సందర్భంలో ఆయన ‘తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారి లక్ష్యం మనల్ని పెడతోవ పట్టించి వారి అజెండాను మనపై రుద్దడమే కాదు, నిజాలను తెలుసుకోవాలన్న మన ఆలోచనలను శాశ్వతంగా నాశనం చేయడం కూడా’ అంటారు. ప్రస్తుత సమాజంలో తప్పుడు కథనాలు, ప్రకటనలు ప్రజల మేధను కలుషితం చేస్తున్నాయి. వారు తప్పుడు నిర్ణయాలు తీసు కునేలా చేస్తున్నాయి. దీనికి ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు. గత జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసినప్పటికీ, ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకొన్నప్పటికీ, అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించినప్పటికీ; ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, వారి అనుకూల మీడియా నిరంతరం చేసిన తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఫలితంగా మంచి చేసే ప్రభుత్వాన్ని చేజేతులా గద్దెదించి, కూటమి నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకున్నారు. దీని దుష్ఫలితా లను ఆంధ్రులు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయలేక చేతులెత్తేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నెలకో వివాదాన్ని సృష్టిస్తోంది. ఆంతేగాక గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది.కూటమి నేతలు నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వృద్ధి కుంటుపడిందనీ, తాము ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నా మనీ అంటున్నారు. అయితే వీరి అవాస్తవ ప్రచారాన్ని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్‌ బ్యాంకు నివేదికలు పటాపంచలు చేశాయి. జగన్‌ హయాంలో కుప్పలు తెప్పలుగా అప్పులు చేశారనీ, అప్పుల భారం రూ. 14 లక్షల కోట్లకు చేరిందనీ... ఎన్నికల సమయంలోనూ, తర్వాత కూడా కూటమి నేతలు ప్రచారం చేశారు. అయితే ఈ అప్పులు రూ. 7.5 లక్షల కోట్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్ధారించాయి. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన తాజా నివేదిక ‘హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆన్‌ ఇండి యన్‌ స్టేట్స్‌’లో పేర్కొంది.కోవిడ్‌ కారణంగా రెండేళ్ళపాటు దేశం ఆర్థిక ఒడు దుడుకులకు లోనయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ మాత్రం జగన్‌ పాలనలో అనేక రంగాల్లో రెండంకెల వృద్ధిలో దూసుకు పోయింది. 2022–23లో దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారు 8 శాతం ఉంటే ఆ ఏడాది ఏపీలో 11.43 శాతం నమోదయ్యింది. జగన్‌ హయాంలో నాలుగేళ్ళ సగటు వృద్ధి 12.70గా నమోదయ్యింది. ఇది దేశంలోనే అత్యధిక వృద్ధి రేట్లలో ఒకటి. 2018–19 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ 2018–31 మార్చి 2019) చంద్రబాబు నాయుడు హయాంలో రూ. 7.90 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) విలువ జగన్‌ ప్రభుత్వ హయాంలో రూ. 13.17 లక్షల కోట్లకు పెరిగినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తాజా నివేదికలో తెలిపింది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2018–19లో రూ. 1,54,031 కాగా, 2023–24లో అది రూ. 2,42,479 పెరిగింది. తయారీ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సమ కూరిన నికర స్థూల విలువ 2018–19లో రూ. 67.30 వేల కోట్లు కాగా, 2023–24లో జగన్‌ ప్రభుత్వ హయాం నాటికి రూ. 1.29 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ఆహార పంటల సాగు విస్తీర్ణం తగ్గి, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఫలితంగా రైతుల ఆదాయాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. 2018–19లో రూ. 9.97 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ రంగం నికర విలువ 2023–24లో రూ. 16.82 లక్షల కోట్లకు పెరిగింది. 2018–19లో రూ. 56.10 వేల కోట్లుగా ఉన్న నిర్మాణ రంగం నికర విలువ 2023–24లో రూ. 95.74 వేల కోట్లకు పెరిగింది.జగన్‌ పాలనలో పారిశ్రామిక వేత్తలు పారిపోయారంటూ విష ప్రచారం చేశారు. అయితే పారిశ్రామిక రంగం నికర విలువ 2018–19లో రూ. 1.57 లక్షల కోట్లు కాగా,అది 2023–24లో రూ. 2.82 లక్షల కోట్లకు పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ రంగాల నికర విలువ 2018–19లో రూ. 32.43 వేల కోట్లు కాగా, 2023–24 నాటికి రూ. 56.59 వేల కోట్లకు పెరిగింది. సేవా రంగం నికర విలువ 2018–19లో రూ. 2.96 లక్షల కోట్లు కాగా, అది 2023–24లో రూ. 4.67 లక్షల కోట్లకు పెరిగింది. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ రంగం గత ప్రభుత్వ హయాంలో 38.41 శాతం, నిర్మాణ రంగంలో 26.75 శాతం, మత్స్య రంగంలో 25.92 శాతం, పారిశ్రామిక రంగంలో 25.58 శాతం, తయారీ రంగంలో 24.84 శాతం, ఆతిథ్య రంగంలో 22.70 శాతం, సర్వీస్‌ సెక్టార్‌లో 18.91 శాతం, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 14.50 శాతం వృద్ధి సాధించి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ నివేదిక ప్రకారం జగన్‌ ప్రభుత్వ హయాంలో యేటా 50 లక్షల టన్నుల చేపలు – రొయ్యల ఉత్పత్తులతో, 1.76 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఆయిల్‌ పామ్‌ సాగులో కూడా ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశ ఎగుమతుల్లో సుమారు 11 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే జరిగాయి. ఏపీ నుంచి సుమారు రెండువేల రకాల ఉత్పత్తులు దేశ విదే శాలకు ఎగుమతి అయ్యాయి. జగన్‌ పాలనలో మహిళలు, పేదలు కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ ఫలాలు అనుభవించారు. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల్లో రాష్ట్రం దేశానికే దిశానిర్దేశం చేసింది. కాని జగన్‌ రాజకీయ ప్రత్యర్థుల అబద్ధపు ప్రచారం ప్రజలను ప్రభావితం చేసింది. ఇప్పుడు ప్రజలు తాము మోసపోయామని వాపోతున్నారు. అధికారం కోసం వెంప ర్లాడే వారు, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా వర్గాలు నిజాన్ని ఫణంగా పెట్టి చెప్పే ప్రతి అబద్ధానికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించ వలసి ఉంటుంది.వి.వి.ఆర్‌. కృష్ణంరాజు వ్యాసకర్త ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌మొబైల్‌: 89859 41411

PM Narendra Modi addressed 18th Pravasi Bharatiya Divas in Odisha4
యుద్ధంలో కాదు.. బుద్ధుడిలోనే భవిష్యత్తు 

భువనేశ్వర్‌: ఘనమైన వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన భారత్‌ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని, నేడు మనం చెప్పే మాట వింటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భవిష్యత్తు అనేది యుద్ధంలో లేదు, బుద్ధుడిలో ఉందని ప్రపంచానికి చెప్పగల శక్తి భారత్‌కు ఉందని తెలిపారు. గురువారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్‌ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని, మనందరి జీవితాల్లో ప్రజాస్వామ్యం ఒక అంతర్భాగమని స్పష్టంచేశారు. ప్రపంచ స్థాయిలో మన దేశ ప్రతిష్ట ఎంతగానో పెరిగిందని అన్నారు. కేవలం మన మనోగతమే కాకుండా గ్లోబల్‌ సౌత్‌ దేశాల అభిప్రాయాలను సైతం ప్రపంచ వేదికపై బలంగా వినిపించగలుగుతున్నామని వెల్లడించారు. ఆయుధ బలంతో సామ్రాజ్యాలు విస్తరిస్తున్న కాలంలో అశోక చక్రవర్తి శాంతి మార్గంలో నడిచారని గుర్తుచేశారు. మన వారసత్వ బలానికి ఇదొక ప్రతీక అని వెల్లడించారు. యుద్ధంలో కాకుండా బుద్ధుడి బోధనల్లోనే భవిష్యత్తు ఉందని భారత్‌ నమ్ముతున్నట్లు స్పష్టంచేశారు. ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... మీ వల్లే తలెత్తుకొని ఉండగలుగుతున్నా.. ‘‘ప్రవాస భారతీయులను మన దేశానికి రాయబారులుగా పరిగణిస్తున్నాం. వైవిధ్యం గురించి మనకు ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యంపై మన జీవితాలు నడుస్తున్నాయి. భారతీయులు ఎక్కడికి వెళ్లినా అక్కడి సమాజంతో హృదయపూర్వకంగా మమేకమవుతూ ఉంటారు. ఇతర దేశాల నియమ నిబంధనలు మనం చక్కగా గౌరవిస్తాం. మనకు ఉద్యోగం, ఉపాధి కల్పించిన దేశానికి నిజాయితీగా సేవ చేయడం, ఆ దేశ ప్రగతిలో పాలుపంచుకోవడం మనకు అలవాటు. విదేశాల్లో ఉన్నప్పటికీ మన హృదయం భారతీయతతో నిండి ఉంటుంది. భారత్‌ కోసమే మన గుండె చప్పుడు వినిపిస్తుంది. ప్రవాస భారతీయులు మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారు. వారి వల్లే విదేశాలకు వెళ్లినప్పుడు నేను తలెత్తుకొని ఉండగలుగుతున్నా. మనది యువ భారత్‌: 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రావడంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్య సాధనకు సహకరించాలని మిమ్మల్ని కోరుతున్నా. మనది యువ భారత్‌. ఇక్కడ యువ జనాభా అధికం. అంతేకాదు నైపుణ్యం కలిగిన యువత మన దగ్గర ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాల డిమాండ్‌ను తీర్చగల సత్తా ఇండియాకు ఉంది. డిజిటల్‌ టెక్నాలజీలో మనం ముందంజలో ఉన్నాం. ఆధునిక యుద్ధ విమానాలు, రవాణా విమానాలను మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాం. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ విమానాల్లో మీరంతా ప్రవాసీ భారతీయ దివస్‌కు వచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. భారతదేశ ఆసలైన చరిత్రను విదేశాల్లో చాటి చెప్పండి’’ అని ప్రధాని మోదీ సూచించారు. ప్రపంచానికి ఆయుర్వేదం ఇచ్చిన భారత్‌: క్రిస్టినా క్లారా ప్రపంచ నాగరికత అభివృద్ధిలో భారత్‌ వెలకట్టలేని అత్యున్నత పాత్ర పోషించిందని ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో దేశాధ్యక్షురాలు క్రిస్టిన్‌ కార్లా ప్రశంసించారు. ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె గురువారం మాట్లాడారు. గణితం, వైద్యం, సముద్రయానం వంటి రంగాల అభివృద్ధికి భారత్‌ దోహదపడిందని చెప్పారు. భారత్‌ అందించిన ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందని అన్నారు. క్రిస్టిన్‌ క్లారాకు భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డు ప్రకటించింది.

Sakshi Editorial On Tirupati Stampede5
క్షమార్హం కాని నేరం!

కోరి కొల్చినవారికి కొంగు బంగారమై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం చెంత తిరుపతిలో బుధవారం ఒక మహాపరాధం జరిగిపోయింది. కేవలం పాలకుల చేతగానితనంవల్ల ఆరు నిండు ప్రాణాలు బలికావటం, 43 మందికి పైగా గాయపడటం చరిత్ర ఎరుగని విషాదం. శతాబ్దాలుగా ఏడుకొండలవాడి సన్నిధిలో ఎన్నడూ ఇటువంటి దారుణ ఉదంతం చోటుచేసుకున్నట్టు నమోదు కాలేదు. రాచరికం మొదలు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ వరకూ ఎందరెందరో పాలకులొచ్చారు. కానీ ఎప్పుడూ ఎవరూ ఇంత చేటు నిర్లక్ష్యం ప్రదర్శించిన దాఖలా లేదు. ఇదే దారుణమనుకుంటే... దుర్ఘటన జరిగింది మొదలుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరసబెట్టి బాహాటంగా ప్రదర్శిస్తున్న అతి తెలివితేటలు ప్రజలను దిగ్భ్రాంతి పరుస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా గురువారం బైరాగిపట్టెడ దగ్గర కెమెరాల కోసం ‘ప్రజాకోర్టు’ నిర్వహించి అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడటమైనా... మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శకు వస్తున్నారని తెలిసి క్షతగాత్రులు కోలుకోకుండానే ఆదరాబాదరాగా ఆస్పత్రినుంచి వారిని పంపటానికి ప్రయత్నించిన తీరైనా బాబు వంచనాత్మక విన్యాసాలకు పరాకాష్ట. ఇవే కాదు... జరిగిన ఘోరంపై టీటీడీ చైర్మన్‌ మొదలుకొని మంత్రుల వరకూ ఒక్కొక్కరు వినిపిస్తున్న కథలు విస్తు గొలుపుతున్నాయి. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే సమాచారం ఉన్నదని చైర్మన్‌గిరీ వెలగ బెడుతున్న బీఆర్‌ నాయుడు చెబుతున్నారు. మరి వీరంతా కలిసి చేసిందేమిటి?అసలు ఏమైంది ఈ ప్రభుత్వానికి? ఎందుకింత చేష్టలుడిగిపోయింది? వైకుంఠ ఏకాదశి పర్వ దినం మొదలు వరసగా పదిరోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి మాత్రమేకాదు... దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారని తెలుసు. అందుకోసం సీఎం కార్యాలయం మొదలుకొని టీటీడీలో అట్టడుగు సిబ్బందివరకూ పకడ్బందీ సమన్వయంతో ముందుకు సాగాలనీ తెలుసు. అంతక్రితం కేవలం రెండురోజులు మాత్రమే ఉండే వైకుంఠద్వార దర్శనాన్ని భక్తుల సంఖ్య నానాటికీ పెరగటాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పదిరోజులకు పెంచింది. భక్తులు సజావుగా దర్శనం చేసుకుని తరించటానికి వీలుగా 9 కేంద్రాల్లో పదేసి కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించింది. 24 గంటలముందే తెల్లారుజామున అయిదు గంటలకు టోకెన్ల జారీ మొదలయ్యేది. కానీ దీన్నంతటినీ తలకిందులు చేసి ముందురోజు అర్ధరాత్రి నుంచీ వేచి వున్న భక్తులను ఒకచోట చేర్చి రాత్రి ఎప్పుడో టోకెన్లు ఇవ్వటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తెల్లారుజాము నుంచి రాత్రి వరకూ సిబ్బంది ఏం చేసినట్టు? కనీసం టోకెన్ల కోసం ఆరుబయట పడిగాపులు పడుతున్న భక్తుల్లో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకూ ఉన్నారన్న స్పృహ... వారికి తిండీ నీళ్లూ అందించాలన్న ఇంగితజ్ఞానం ఉండొద్దా? వచ్చిన వారిని వచ్చినట్టుగా క్యూలైన్లలో పంపి, వెంటవెంటనే టోకెన్లు జారీ చేయొద్దా? ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకొచ్చాయి గనుక జిల్లాల్లోనే ఆన్‌లైన్‌లో టోకెన్లు అందించే ప్రక్రియ అమలుచేయొచ్చు. అదే జరిగితే భక్తులందరూ స్వామివారిని తనివితీరా వీక్షించి, సురక్షితంగా తమ తమ ఇళ్లకు చేరుకునేవారు. కానీ పక్షవాతం వచ్చిన చందంగా ఎవరికివారు చేష్టలుడిగి ఈ ఘోర ఉదంతానికి కారకులయ్యారు.దీన్నంతటినీ కప్పిపుచ్చుకోవటానికి జిల్లా ఎస్సీని బదిలీ చేశారు. ఒక డీఎస్పీని సస్పెండ్‌ చేశారు. ఈవో, జేఈవోను వదిలేశారు. మరి శాంతిభద్రతల విభాగం దగ్గరుంచుకుని బాబు చేసిందేమిటి? ప్రమాణస్వీకారానికి ముందే తమ కనుసైగలతో ఊరూ వాడా దాడులూ, దౌర్జన్యాలూ, సామాన్య పౌరుల ఇళ్లు నేలమట్టం చేయించి మాఫియాలను తలపించే పాలనకు శ్రీకారం చుట్టిన పర్యవసానం కాదా ఈ ఉదంతం? తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని తప్పుడు ప్రచా రానికి పాల్పడలేదా? ఈ నేపథ్యంలో ఏ జిల్లాలోనైనా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చిత్తశుద్ధితో, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించగలుగుతున్నారా? ఎన్ని కేసులుంటే అంత గొప్పగా నెత్తెక్కించుకుంటామని అధికారంలోకి రాకముందు టీడీపీ శ్రేణుల్లో నేరస్వభావాన్ని పెంచిన ఘనత వీరిది. ఇప్పుడు పోలీసులకూ అదే రంధి పట్టుకుంది. ఎంతమందిపై అక్రమ కేసులు పెడితే అంతగా నజరానాలు పొందొచ్చన్న దురాశ పుట్టింది. అందుకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలతోపాటు, సోషల్‌ మీడియా కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో ఈమూలనుంచి ఆ మూలకు తిప్పుతున్నారు. ఇక శాంతిభద్రతలు ఎటుపోతేనేం... పర్వదినాలకు వచ్చే భక్తులు ఏమై పోతేనేం! దేవుడంటే భయ భక్తుల్లేవు... ప్రజలంటే వెరపు లేదు! ఈ దుఃస్థితికి ఎన్డీయే కూటమి పాలకులు సామూహికంగా సిగ్గుపడాలి. విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ భవిష్యత్తుపై ఒక్క మాటైనా మాట్లాడని ప్రధాని మెప్పు పొంద టానికి బాబు, పవన్, లోకేశ్‌లు అగచాట్లు పడితే... అక్రమ కేసుల పరంపరతో ఆ ముగ్గురి దగ్గరా మార్కులు కొట్టేద్దామని అధికార యంత్రాంగం పాట్లు పడుతోంది. వెరసి ఇలాంటి దారుణాలు రివాజయ్యాయి. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడినవారి కుటుంబ సభ్యులు చెబుతున్న విషయాలు వింటే గుండె తరుక్కుపోతుంది. 2015లో తన ఏలుబడిలో, తన వల్ల, తన సమక్షంలో గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తుల మరణానికి దారితీసిన ఉదంతాన్ని బాబు సోమయాజులు కమిషన్‌తో కప్పెట్టటాన్ని ఎవరూ మరిచిపోరు. కనుక తిరుపతి ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. టీటీడీ చైర్మన్‌తో సహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Los Angeles wildfires burn thousands of homes and five killed6
ఆరని అగ్నికీలలు

లాస్‌ ఏంజెలెస్‌: ప్రకృతి రమణీయతకు పట్టుగొమ్మలైన లాస్‌ ఏంజెలెస్‌ అటవీప్రాంతాలు ఇప్పుడు అగ్నికీలల్లో మాడి మసైపోతున్నాయి. వర్షాలు పడక ఎండిపోయిన అటవీప్రాంతంలో అంటుకున్న అగ్గిరవ్వ దావానంలా వ్యాపించి ఇప్పుడు వేల ఎకరాల్లో అడవిని కాల్చిబూడిద చేస్తోంది. పసిఫిక్‌ తీరప్రాంతం మొదలు పాసడేనా వరకు మొత్తం ఐదు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని రాజుకుని వేల ఎకరాలకు వేగంగా వ్యాపించి వందల ఇళ్లు, ఆఫీస్‌ కార్యాలయాలు, దుకాణాలు, పాఠశాలలను భస్మీపటం చేసింది. ఈ ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పసిఫిక్‌ పాలిసాడ్స్, అల్టాడేనా ప్రాంతాల్లో దావాగ్ని భీకరంగా ఎగసిపడుతూ 17,234 ఎకరాల అటవీప్రాంతాన్ని ఇప్పటికే కాల్చేసింది. ఈటన్‌ ప్రాంతంలో 10,600 ఎకరాలకుపైగా అటవీభూములు దగ్ధమయ్యాయి. హర్స్‌ట్‌ ప్రాంతంలో 855 ఎకరాలు, లిడియా ప్రాంతంలో 348 ఎకరాల మేర అడవి ఇప్పటికే అగ్నికి ఆహుతైంది. పసిఫిక్‌ పాలిసాడ్స్‌ ప్రాంతంలోని మలీబూ తీరం వెంటే హాలీవుడ్‌ సినీ దిగ్గజాల విలాసవంత నివాసాలున్నాయి. ఇందులో ఇప్పటికే చాలామటుకు కాలిబూడిదయ్యాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌కు చెందిన ఇంటినీ కార్చిచ్చు దహించివేసింది. దావాగ్నిలో దహనమైన నివాసాల్లో చాలా మంది హాలీవుడ్‌ ప్రముఖుల ఇళ్లు ఉన్నాయి. లాస్‌ ఏంజెలెస్‌ చరిత్రలో ఎన్నడూలేనంతటి భీకర అగ్నిజ్వాలల ధాటికి 1,79,700 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికార యంత్రాంగం సూచించింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి రాత్రిళ్లు లక్షలాది కుటుంబాలు అంధకారంలో గడిపాయి. దాదాపు 3,10,000 మంది కరెంట్‌ కష్టాలను ఎదుర్కొంటున్నారు. పెనుగాలులతో వినాశకర స్థాయిలో విజృంభిస్తున్న మంటలను అదుపులోకి తేవడం అగ్నిమాపక సిబ్బందికి చాలా కష్టంగా మారింది. మంటలను అదుపుచేయడం మా వల్ల కాదని కొందరు అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే చేతులెత్తేశారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఉన్న మంటలకు తోడు కొత్తగా బుధవారం సాయంత్రం హాలీవుడ్‌ హిల్స్‌లో కొత్తగా అగ్గిరాజుకుని స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సన్‌సెట్‌ ఫైర్‌గా పిలుస్తున్న ఈ దావాగ్ని మాత్రమే అత్యల్పంగా 43 ఎకరాలను దహించింది. టీసీఎల్‌ చైనీస్‌ థియేటర్‌ మొదలు ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం ఉన్న వీధులనూ అగ్నికీలలు ఆక్రమించాయి. ఎన్నో సినిమాల్లో కనిపించిన ఫేమస్‌ పాలిసాడ్స్‌ చార్టర్‌ హైస్కూల్‌ భవనం కాలిపోయింది. సన్‌సెట్‌ బోల్‌వార్డ్‌సహా ఎన్నో కొండ అంచు కాలనీల్లో ఖరీదైన ఇళ్లను మంటలు నేలమట్టంచేశాయి. ప్రముఖుల ఇళ్లు నేలమట్టం హాలీవుడ్‌ సినీరంగ ప్రముఖుల ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయి. మ్యాండీ మూర్, క్యారీ ఎల్విస్, ప్యారిస్‌ హిల్టన్, స్టీవెన్‌ స్పీల్‌బర్గ్, టామ్‌ హ్యాంక్స్, బెన్‌ ఎఫ్లేక్, ఆడమ్‌ శాండ్లర్, యూజిన్‌ లేవీ, బిల్లి క్రిస్టల్, జాన్‌ గుడ్‌మాన్, విల్‌ రోజరెస్, జేమ్స్‌ లీ కర్టిస్, జేమ్స్‌ ఉడ్స్‌ సహా చాలా మంది ప్రముఖుల ఇళ్లు తగలబడ్డాయి. ‘‘వీధుల్లో ఎక్కడ చూసినా కాలిన చెక్క ఇళ్ల చెత్తతో నిండిన స్విమ్మింగ్‌ ఫూల్స్‌ కనిపిస్తున్నాయి. యుద్ధంలో బాంబు దాడుల్లో దగ్దమైన జనావాసాల్లా ఉన్నాయి’’అని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశాయి. దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో మే నెల నుంచి చూస్తే కేవలం 0.1 అంగుళాల వర్షపాతమే నమోదైంది. ఎండిపోయిన పర్వత సానువుల అడవీ ప్రాంతం గుండా గంటకు 80 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులు ఈ మంటలను మరింత ఎగదోస్తున్నాయి. ఇప్పట్లో వర్షాలు పడకపోతే శీతాకాలమంతా దావానలం దారుణ పరిస్థితులను ఎదుర్కోక తప్పదని వెస్టర్న్‌ ఫైర్‌ చీఫ్‌ అసోసియేషన్‌ హెచ్చరించింది. పాసడీనా, పసిఫిక్‌ పాలిసాడ్స్‌లో భీకర మంటల భయంతో పలు హాలీవుడ్‌ స్టూడియోలు మూతపడ్డాయి. యూనివర్సల్‌ స్టూడియోస్‌ తమ థీమ్‌ పార్క్‌ను మూసేసింది. ‘‘ వింతవింత కుందేలు బొమ్మలతో బన్నీ హౌజ్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న మా మ్యూజియం బుగ్గిపాలైంది. గిన్నిస్‌ ప్రపంచరికార్డు సృష్టిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద బన్నీ భవనం నెలకొల్పడానికి మాకు 40 ఏళ్లు పట్టింది. అది ఇప్పుడు నిమిషాల్లో కాలిపోయింది’’ అని ఆల్టాడేనాలోని సీŠట్‌వ్‌ లుబాన్‌స్కీ, కాండేస్‌ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ కార్లు, వస్తువులకు ఏమాత్రం ఇన్సూరెన్స్‌ వస్తుందోనని చాలా మంది దిగాలుగా కనిపించారు.ఆస్కార్‌కూ సెగ కార్చిచ్చు సెగ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డులనూ తాకింది. దీంతో అకాడమీలో నామినేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. వాస్తవానికి బుధవారం నుంచి 14వ తేదీదాకా నామినేషన్‌ ప్రక్రియ కొనసాగాలి. అగ్నికీలలు వ్యాపించడంతో ఓటింగ్‌ ఆలస్యమైంది. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 17వ తేదీన ప్రకటించాల్సిన ఆస్కార్‌ నామినేషన్లను జనవరి 19కు వాయిదా వేశారు.చేతివాటం చూపిన దొంగలు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు ఇళ్లు వదిలిపోతుండటంతో దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దగ్ధ్దమవుతున్న ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు. ఇలా లూటీ చేస్తున్న 20 మందిని అరెస్ట్‌చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్చిచ్చు ఘటనల్లో ఇప్పటిదాకా 4 లక్షల కోట్ల రూపాయల సంపద అగ్నికి ఆహుతైందని బైడెన్‌ సర్కార్‌ ప్రాథమిక అంచనావేసింది. తన చిట్టచివరి అధికారిక పర్యటనలో భాగంగా ఇటలీకి వెళ్దామనుకున్న బైడెన్‌ ఈ అనూహ్య ఘటనతో పర్యటనను అర్ధంతరంగా రద్దుచేసుకున్నారు. పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. మరోవైపు కార్చిచ్చు ఉదంతంలో సరిగా స్పందించని కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తున్న అగ్నికీలలు ప్రైవేట్‌ శాటిలైట్‌ ఛాయాచిత్రాల సేవలందించే మ్యాక్సర్‌ టెక్నాలజీస్‌ తదితర ఉపగ్రహ సేవా సంస్థలు తీసిన ఫొటోలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి. ఫొటోల్లో.. కాలిఫోర్నియాలోని మాలిబు తీరపట్టణ ప్రాంత శాటిలైట్‌ ఫొటోల్లో ఇప్పుడంతా కాలిబూడిదైన ఇళ్లే కనిపిస్తున్నాయి. ఆకాశమంతా దట్టంగా కమ్ముకున్న పొగలతో నిండిపోయింది. ఈస్ట్‌ ఆల్టాడీనా డ్రైవ్‌ ప్రాంతమంతా బూడిదతో నిండిపోయింది. శక్తివంతమైన శాంటా ఆనా వేడి పవనాలు తూర్పులోని ఎడారి గాలిని తీరప్రాంత పర్వతాలపైకి ఎగదోస్తూ మంటలను మరింత ప్రజ్వరిల్లేలా చేస్తున్నాయి. ఉచితాలు.. సాయాలు సర్వం కోల్పోయిన స్థానికులను ఆదుకునేందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్కువ ధరకే వాహనాల్లో రైడ్‌ అందిస్తామని ఉబర్, లిఫ్ట్‌ సంస్థలు తెలిపాయి. ఉచితంగా స్నానాల గదులు, లాకర్‌ రూమ్, వై–ఫై సౌకర్యాలు అందిస్తామని ప్లానెట్‌ ఫిట్‌నెస్‌ తెలిపింది. తమ గదుల్లో ఉచితంగా ఉండొచ్చని ఎయిర్‌బీఎన్‌బీ పేర్కొంది. హోటళ్లలో డిస్కౌంట్‌కే గదులిస్తామని విసిట్‌ అనహీమ్‌ వెల్లడించింది. అపరిమిత డేటా, కాల్, టెక్సŠస్ట్‌ ఆఫర్‌ ఉచితంగా ఇస్తామని ఏటీ అండ్‌ టీ, వెరిజాన్‌ సంస్థలు ప్రకటించాయి.

ACB officials questions to KTR On Formula E car race Issue7
అనుమతులు లేకుండా చెల్లింపులా?.. కేటీఆర్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా–ఈ కార్‌ రేసు నిర్వహణకు ఎలా బీజం పడింది?, నిబంధనలు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది?, ఒప్పందాలతో పాటు నగదు చెల్లింపులకు సంబంధించిన ఫైళ్ల నిర్వ హణ ఎలా జరిగింది?, హెచ్‌ఎండీఏ పాలకమండలి అనుమతి లేకుండా, విదేశీ మారకద్రవ్య నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేటు సంస్థకు పెద్దమొత్తం ఎలా చెల్లిస్తారు?, కేబినెట్, ఆర్థికశాఖ అనుమతి లేకుండా నిధుల మళ్లింపు ఎలా చేశారు?, ఫార్ములా–ఈ కార్‌ రేసు నిర్వహణతో రాష్ట్రానికి రూ.700 కోట్ల లాభం వచ్చినట్టు మీరు చెప్తున్నారు.. వాటి లెక్కలేవి?, రేసుకు సంబంధించిన ప్రకటనలతో ప్రభుత్వ సంస్థలకు ఏం లాభాలు వచ్చాయి?, టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం ఎంత?..తదితర అంశాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావుపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రిగా కేటీఆర్‌ తీసుకున్న నిర్ణయం, దాని తాలూకు కేబినెట్‌ ఆమోదం ఫైళ్ల సర్క్యులేషన్‌కు సంబంధించిన ప్రక్రియ, నిధుల బదిలీ..వంటి అంశాల కేంద్రంగా ఏసీబీ విచారణ కొనసాగినట్టు తెలిసింది. సుమారు 7 గంటల విచారణ సందర్భంగా అధికారులు పదేపదే ఒకే అంశంపై ప్రశ్నిస్తుండడంతో ‘మీరు ఎన్ని గంటలు ఈ కార్యాలయంలో కూర్చోమన్నా కూర్చుంటా..మీకు కావాలి అంటే బ్రేక్‌ తీసుకోండి.. కానీ అడిగిన ప్రశ్నలే పలు రకాలుగా అడగడం వలన లాభం లేదు. ప్రభుత్వం ఒకవేళ నన్ను అరెస్టు చేయమని మీకు ఆదేశాలు ఇస్తే..ఈ ప్రశ్నలు అడగడం అనే వృధా ప్రయాస మానేసి ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసుకోవచ్చు..’ అని కేటీఆర్‌ అన్నట్టు తెలిసింది. ఏసీబీ జేడీ ఆధ్వర్యంలో స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ ఫార్ములా–ఈ కార్‌ రేసు నిర్వహణకు సంబంధించిన కేసులో ఏసీబీ అధికారులు నోటీసు ఇవ్వడంతో కేటీఆర్‌ గురువారం ఉదయం వారి ఎదుట విచారణకు హాజరయ్యారు. కోర్టు అనుమతి నేపథ్యంలో న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌రావుతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కోర్టు ఆదేశం ప్రకారం..విచారణ సమయంలో న్యాయవాదికి కేటీఆర్‌ కనిపించేలా ఏర్పాటు చేశారు. జాయింట్‌ డైరెక్టర్‌ రితిరాజ్‌ ఆధ్వర్యంలో మొత్తం ఐదుగురు సభ్యుల బృందం ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసింది. బిజినెస్‌ రూల్స్‌ అధికారులు చూసుకుంటారు.. రేసు నిర్వహణ ఫైల్‌ కేబినెట్‌ ఆమోదానికి ఎందుకు పంపలేదు? అన్న అంశంపై ఏసీబీ అధికారులు పలుమార్లు ప్రశ్నించగా.. బిజినెస్‌ రూల్స్‌ గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులే చూసుకుంటారని కేటీఆర్‌ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఏసీబీకి లేదని ఆయన పేర్కొన్నారు. రేసు కొనసాగించకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లిందని.. ఒప్పందం రద్దుచేసి ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఈ కేసులో ఎందుకు భాగస్వామిగా చేర్చలేదని కేటీఆర్‌ ప్రశ్నించినట్లు సమాచారం. రేసు నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం గురించి ఏసీబీ ప్రశ్నించినప్పుడు.. కేబినెట్‌ ఆమోదం లేకుండా రేసు రద్దు చేసినందుకు ముఖ్యమంత్రిని కూడా బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని కేటీఆర్‌ అన్నట్టు తెలిసింది. ఈ రేసుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ, రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు తనకు ప్రభుత్వం కేటాయించిన అధికారిక ఈ–మెయిల్లో ఉన్నాయని.. ప్రస్తుతం ఆ అకౌంట్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉందని స్పష్టం చేశారు. మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వంలో భాగమైన తనకు ముమ్మాటికీ ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మీరు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన జీవోను ఏమైనా ఇచ్చిందా? అని ప్రశ్నించినప్పుడు.. సచివాలయ బిజినెస్‌ రూల్స్‌ అన్నీ సీఎస్‌ పరిధిలో ఉంటాయని, ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్నే అడగాలని కేటీఆర్‌ చెప్పినట్టు తెలిసింది. ఏస్‌ నెక్సŠట్‌ జెన్‌ సంస్థ మొదటిసారి రేసు నిర్వహించినప్పుడు పూర్తిగా డబ్బులు చెల్లించలేదంటూ.. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాల గురించి ప్రశ్నించినప్పుడు... ప్రైవేటు సంస్థ వివరాలు తనకు తెలియదని, ఆ అంశం తన పరిధిలోనిది కాదని కేటీఆర్‌ చెప్పినట్లు తెలిసింది. పత్రాలతో హాజరు..రేసుతో లబ్ధిపై వివరణ ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్‌.. ఏసీబీ ప్రశ్నించేందుకు అవకాశం ఉన్న పలు అంశాలకు సంబంధించిన కొన్ని పత్రాలను తన వెంట తెచ్చుకున్నారు. ముందు ఏసీబీ సీఐయూ డీఎస్పీ, ఈ కేసు దర్యాప్తు అధికారి మాజిద్‌ అలీని కలిసి, దర్యాప్తునకు సంబంధించి నోటీసులు తీసుకున్నారు. అప్పటికే కేటీఆర్‌ను విచారించేందుకు సిద్ధంగా ఉన్న ఏసీబీ జేడీ బృందం.. ప్రత్యేక గదిలో కేటీఆర్‌ను ప్రశ్నించింది. కాగా ఫార్ములా ఈ రేసు నిర్వహించడానికి గల కారణాలు..రేసు నిర్వహణతో రాష్ట్రానికి ఎలాంటి లబ్ధి జరిగిందన్న అంశాలను కేటీఆర్‌ వివరించినట్టు తెలిసింది. రేసు నిర్వహణతో రాష్ట్రానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగిన లబ్ధికి సంబంధించి కొన్ని పత్రాలు కూడా అందజేసినట్లు సమాచారం. విచారణ మధ్యలో కాసేపు భోజన విరామం ఇచ్చారు. ఒకవైపు కేటీఆర్‌ను ప్రశ్నిస్తూనే, మరోవైపు దర్యాప్తులో భాగంగా సేకరించిన అంశాలను ఏసీబీ అధికారులు పరిశీలించినట్టు తెలిసింది. సాయంత్రం 5 గంటల వరకు కేటీఆర్‌ను ప్రశ్నించిన అధికారులు, దర్యాప్తులో భాగంగా అవసరమైతే మళ్లీ హాజరుకావాల్సి ఉంటుందని సూచించినట్టు తెలిసింది. కాగా సాయంత్రం 5.06 గంటల సమయంలో కేటీఆర్‌ ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అక్కడ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు: మీడియాతో కేటీఆర్‌ ‘ఏసీబీ పెట్టింది చెత్త కేసు..ఇందులో విషయమే లేదు. నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగిందేమీ లేదు. రేవంత్‌ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే అటూ ఇటూ తిప్పి అడిగారు. నాపై కేసు పెట్టి రేవంత్‌రెడ్డి ఏదైనా సాధించాలనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. పైసలు పంపాను అని నేనే చెబుతున్నా. డబ్బులు వచ్చాయని వాళ్లు (ఎఫ్‌ఈఓ) చెబుతున్నారు. ఇందులో అవినీతి ఎక్కడుందని ప్రశ్నిస్తే అధికారుల దగ్గర సమాధానమే లేదు. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకున్న అవగాహన మేరకు సమాధానమిచ్చా. ఎన్నిసార్లు పిలిచినా తప్పక వస్తానని చెప్పా..’ అని కేటీఆర్‌ తెలిపారు. అభ్యంతరం తెలిపిన డీసీపీ కేటీఆర్‌ మీడియాతో మాట్లాడడంపై డీసీపీ విజయ్‌కుమార్‌ అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ‘ట్రాఫిక్‌ ఇబ్బంది అవుతోంది.. ఇది మీడియా పాయింట్‌ కాదు..ఇక్కడ మీడియా సమావేశం పెట్టొద్దు..’ అని డీసీపీ అనడంతో కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ‘నేను ఇక్కడ మాట్లాడితే ఏం నొచ్చింది. ఏం ఇబ్బంది అయ్యింది. మీడియాపై మీ దాడి ఏంది..? మీకు ఇంత భయం ఎందుకు?..’ అంటూ నిలదీశారు. అయితే మీడియా ప్రతినిధులను పోలీసులు పక్కకు నెట్టేయడంతో కేటీఆర్‌ అక్కడి నుంచి నిష్క్రమించారు.

India will need to deliver 24. 3 lakh blue-collar jobs amid rapid qcomm rise8
ఉపాధికి కిక్‌ కామర్స్‌!

న్యూఢిల్లీ: క్విక్‌ కామర్స్‌ జోరుతో బ్లూకాలర్‌ ఉద్యోగాలకు (కార్మికులకు) పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. 2027 నాటికి వివిధ రంగాల్లో 24 లక్షల మంది కార్మికులకు డిమాండ్‌ ఉంటుందని హైరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఇండీడ్‌’ వెల్లడించింది. ఇందులో ఒక్క క్విక్‌ కామర్స్‌ రంగమే 5 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్టు పేర్కొంది. డిసెంబర్‌ త్రైమాసికంలో క్విక్‌కామర్స్‌ కంపెనీలు 40,000 మందిని నియమించుకున్నట్టు ఇండీడ్‌ ఇండియా సేల్స్‌ హెడ్‌ సతీష్‌ కుమార్‌ తెలిపారు. ‘‘ఈ రంగం విస్తరించే కొద్దీ, నైపుణ్య, పాక్షిక నైపుణ్య కార్మికులకు డిమాండ్‌ వృద్ధి చెందుతూనే ఉంటుంది. వేగవంతమైన, టెక్నాలజీ ఆధారిత ప్రపంచానికి అనుగుణంగా నడుచుకునే నైపుణ్యాల కోసం యాజమాన్యాల అన్వేషణ పెరిగింది’’ అని వివరించారు. బ్లూ కాలర్‌ ఉద్యోగులు అంటే విద్యతో పెద్దగా అవసరం లేకుండా శారీరక శ్రమతో, నైపుణ్యాలతో పనులు నిర్వహించే వారు. డెలివరీ డ్రైవర్లు, రిటైల్‌ సిబ్బంది ఈ విభాగం కిందకే వస్తా రు. ఇండీడ్‌ నిర్వహించిన సర్వేలో వీరికి బేసిక్‌ వేతనం రూ. 22,600గా ఉన్నట్టు తెలిసింది. పండుగల సీజన్‌లో క్విక్‌కామర్స్‌ కంపెనీలు డెలివరీ డ్రైవర్లు, వేర్‌హౌస్‌ అసోసియేట్‌ లు, మార్కెటింగ్, ప్రమోషనల్, ప్యాకేజింగ్‌ సిబ్బంది, లాజిస్టిక్స్‌ కోఆర్డినేటర్లను నియమించుకోనున్నట్టు ఇండీడ్‌ నివేదిక తెలిపింది. దీంతో ఇలాంటి డిమాండ్‌ సీజన్లలో కార్మికులకు బోనస్‌లు, నగదేతర ప్రయోజనాలు అధికంగా అధించనున్నట్టు వివరించింది. వీరికి డిమాండ్‌.. : నేవిగేషన్‌ అండ్‌ డ్రైవింగ్, డిజిటల్‌ లిటరసీ, డేటా అనలిటిక్స్, మేనేజ్‌మెంట్, టెక్‌ సపోర్ట్‌ నైపుణ్యాలున్న వారికి ఎక్కువ డిమాండ్‌ ఉన్నట్టు ఇండీస్‌ నివేదిక వెల్లడించింది. ఆటోమేషన్, డిజిటల్‌ టూల్స్‌ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తెలిపింది. కస్టమర్లు నిమిషాల వ్యవధిలో గ్రోసరీ, నిత్యావసరాలను కోరుకుంటున్నారని.. దీంతో వేగవంతమైన డెలివరీలకు డిమాండ్‌ పెరుగుతున్నట్టు పేర్కొంది. క్విక్‌కామర్స్‌ సంస్థల మధ్య పోటీ పెరిగిపోవడంతో అవి మరింత వేగంగా డెలివరీకి, మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఇది ఈ రంగంలో ఉపాధి అవకాశాల విస్తరణకు దారితీస్తోందని వివరించింది. చెన్నై, పుణె, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో బ్లూకాలర్‌ ఉద్యోగ నియామకాలు చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగినట్టు తెలిపింది. టైర్‌–2 నగరాలైన చండీగఢ్, అహ్మదాబాద్‌లోనూ ఇదే ధోరణి నెలకొన్నట్టు వివరించింది.

India first odi match against Ireland womens team today9
వన్డే సమరం!

భారత్, ఐర్లాండ్‌ మహిళా క్రికెట్‌ జట్ల మధ్య 1993 నుంచి ఇప్పటి వరకు 12 వన్డేలు జరిగాయి. వీటన్నింటిలోనూ భారతే గెలవగా, ఐర్లాండ్‌కు ఒక్క గెలుపు కూడా దక్కలేదు. ఈ మ్యాచ్‌లన్నీ ఐసీసీ టోర్నీల్లో భాగంగానే నిర్వహించారు ఒక్కసారి కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరగలేదు. ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో ద్వైపాక్షిక పోరుకు రంగం సిద్ధమైంది. అద్భుత ఫామ్‌లో ఉన్న భారత జట్టు సొంతగడ్డపై మరో సిరీస్‌ను గెలుచుకోవాలని పట్టుదలగా ఉండగా... ఐర్లాండ్‌ ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం. రాజ్‌కోట్‌: స్వదేశంలో ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ సన్నాహాల్లో భాగంగా భారత మహిళల జట్టు దేశంలోని వేర్వేరు వేదికలపై సిరీస్‌లు ఆడుతోంది. దక్షిణాఫ్రికాతో బెంగళూరులో, న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్‌లో, వెస్టిండీస్‌తో వడోదరలో ఆడిన జట్టు ఇప్పుడు మరో కొత్త వేదిక రాజ్‌కోట్‌లో ఐర్లాండ్‌తో తలపడుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి వన్డేలో ఐర్లాండ్‌తో భారత మహిళల జట్టు ఆడనుంది. ప్రస్తుతం ఇరు జట్ల బలబలాలు చూస్తే భారత్‌ సంపూర్ణ ఆధిక్యంలో కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌ గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని జట్టు పట్టుదలగా ఉంది. కొత్త ప్లేయర్లకు అవకాశం... రెగ్యులర్‌ కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌కు విశ్రాంతినివ్వడంతో స్మృతి మంధాన నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. స్మృతి వన్డేల్లో గతంలో ఒకే ఒక మ్యాచ్‌లో కెపె్టన్‌గా వ్యవహరించింది. టాప్‌ పేసర్‌ రేణుకా సింగ్‌ లేకపోవడంతో కాస్త అనుభవం తక్కువ ఉన్న ప్లేయర్లతోనే ఆమె ఫలితాలు రాబట్టాల్సి ఉంది. అయితే కొత్త ప్లేయర్లను మరింతగా పరీక్షించేందుకు ఈ సిరీస్‌ ఉపయోగపడనుంది. హర్మన్‌ స్థానంలో రాఘ్వీ బిస్త్‌ వన్డేల్లో అరంగేట్రం చేయనుంది. మహిళల దేశవాళీ వన్డే టోర్నీలో ఉత్తరాఖండ్‌ ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించిన రాఘ్వీ భారత్‌ ‘ఎ’ తరఫున ఆసీస్‌ ‘ఎ’ తో జరిగిన మూడు వన్డేల్లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు చేసింది. రేణుక, పూజ వస్త్రకర్‌తో పాటు అరుంధతి రెడ్డి కూడా జట్టులో లేకపోవడంతో టిటాస్‌ సాధు, సైమా ఠాకూర్‌లపై పేస్‌ బౌలింగ్‌ భారం ఉంది. ఆల్‌రౌండర్‌ కావాలంటే సయాలీ సత్‌ఘరే అందుబాటులో ఉండగా... దీప్తి శర్మ, ప్రియా మిశ్రాకు తోడుగా తుది జట్టులో మరో స్పిన్నర్‌ కావాలంటే తనూజ కన్వర్‌కు అవకాశం దక్కవచ్చు. అయితే సైమా, సాధు, ప్రియా కలిపి మొత్తం 20 వన్డేలు కూడా ఆడలేదు. ఓపెనర్‌గా తన స్థానం సుస్ధిరం చేసుకునేందుకు ప్రతీక రావల్‌కు ఇది మంచి అవకాశం. ఎందుకంటే జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత షఫాలీ వర్మ మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో చెలరేగిపోతోంది. సీనియర్‌ వన్డే ట్రోఫీలో 527 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఆమె వన్డే చాలెంజర్‌ ట్రోఫీలో కూడా ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లలో మెరుపు వేగంతో రెండు అర్ధసెంచరీలు సాధించింది. ఈ నేపథ్యంలో ప్రతీక ఆ స్థాయి దూకుడును చూపించాల్సి ఉంది. మరో ఓపెనర్‌గా స్మృతి సూపర్‌ ఫామ్‌లో ఉండటం భారత్‌కు సానుకూలాంశం. హర్లీన్‌ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లపై భారత బ్యాటింగ్‌ బలం ఆధారపడి ఉంది. ఆల్‌రౌండర్లే బలం... గాబీ లూయిస్‌ సారథ్యంలో ఐర్లాండ్‌ ఈ సిరీస్‌కు సన్నద్ధమైంది. ఈ టీమ్‌లో కూడా కొందరు అనుభవజు్ఞలతో పాటు ఎక్కువ మంది యువ ప్లేయర్లు ఉన్నారు. 2024లో జింబాబ్వే, శ్రీలంకలపై వన్డే సిరీస్‌లు నెగ్గిన ఐర్లాండ్‌... ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ చేతిలో సిరీస్‌లు కోల్పోయింది. అయితే ఇంగ్లండ్‌పై 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక వన్డే మ్యాచ్‌లో గెలవగలిగింది. ఐర్లాండ్‌ టీమ్‌లో ఒర్లా ప్రెండర్‌ఘాస్ట్‌ కీలక ప్లేయర్‌గా ఎదిగింది. ఆల్‌రౌండర్‌గా గత ఏడాది జట్టు తరఫున అత్యధిక పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టింది. శ్రీలంకపై చేసిన సెంచరీ ఆమె సత్తాను చూపించింది. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆమెకు మంచి అనుభవం ఉంది. మరో ఆల్‌రౌండర్‌ లౌరా డెలానీ, లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఎయిమీ మగ్వైర్, జొవానా లాఫ్‌రన్‌ టీమ్‌లో ఇతర ప్రధాన ప్లేయర్లు. అయితే గత కొంతకాలంగా సంచలన ఆటతో 19 ఏళ్ల ఐర్లాండ్‌ స్టార్‌గా ఎదిగిన ఎమీ హంటర్‌ గాయంతో ఈ సిరీస్‌కు దూరం కావడం జట్టును కాస్త బలహీనపర్చింది.

Bharatpol checks foreign criminals10
‘బయటి నేరగాళ్ల’కు చెక్‌ భారత్‌పోల్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఆ విభాగం మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు కీలకపాత్ర పోషించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అమెరికాలో ఉన్న ఆయన్ను రప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇంటర్‌పోల్‌ సాయంతో రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయించడానికి 8 నెలలుగా ప్రయత్నాలు చేస్తోంది. కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు, పోలీసు విభాగాలు అనునిత్యం ఏదో ఒక కేసులో నిందితుల ఆచూకీ కనుగొనడం, వారిని రప్పించే క్రమంలో ఇంటర్‌పోల్‌ సాయం కోరుతుంటాయి. ఇంటర్‌ పోల్‌గా పిలిచే ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్‌ ప్రపంచ వ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారానికి, నేరాల నియంత్రణకు కృషి చేస్తుంది. అయితే ఏదైనా పోలీసు విభాగం దీన్ని ఆశ్రయించడం అనేది ప్రస్తుతం ఓ సుదీర్ఘ, క్లిష్టతరమైన ప్రక్రియగా ఉంది. దీన్ని సులభతరం చేయడానికి సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టి గేషన్‌ (సీబీఐ) అధీనంలోని నేషనల్‌ సెంట్రల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఫర్‌ ఇంటర్‌పోల్‌ ఓ పోర్టల్‌ను రూపొందించింది. అదే భారత్‌పోల్‌. ఈ పోర్టల్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రెండురోజుల క్రితం ఢిల్లీలో ఆవిష్కరించారు.అనేక కేసుల్లో విదేశీ లింకులుఒకప్పుడు దేశ వ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో విదేశాలతో లింకు ఉన్నవి అత్యంత అరుదుగా తెరపైకి వచ్చేవి. కానీ ప్రస్తుతం సైబర్‌ నేరాలు, భారీ ఆర్థిక నేరాలు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా తదితర కేసులతో పాటు వ్యవస్థీకృత నేరాల్లో ‘విదేశీ లింకులు’ సర్వసాధార ణం అయ్యా యి. సూత్ర ధారులు విదేశాల్లో ఉండి ఇక్కడ నేరాలు చేయించడమో, ఇక్కడ నేరం చేసిన వారు విదేశాలకు పారిపోవడమో జరుగుతోంది. దీంతో పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీలు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించడం అనివార్యంగా మారుతోంది. 195 దేశాల సభ్యత్వం కలిగిన ఇంటర్‌పోల్‌ ద్వారానే రెడ్‌ కార్నర్‌ సహా వివిధ రకాలైన నోటీసుల జారీ సాధ్యమవుతుంది.అంత ఈజీ కాదు..అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి హైదరాబాద్‌ పంజగుట్ట పోలీసుల వ్యయప్రయాసలు ఇంటర్‌పోల్‌ వ్యవహారానికి ఓ తాజా ఉదాహరణ. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వినతి తొలుత వెస్ట్‌జోన్‌ డీసీపీ ద్వారా నగర పోలీసు కమిషనర్‌కు వెళ్లింది. పోలీసు కమిషనర్‌ రాష్ట్ర నోడల్‌ ఏజెన్సీ సీఐడీకి సిఫారసు చేశారు. అక్కడి నుంచి దేశంలో ఇంటర్‌పోల్‌కు నోడల్‌ ఏజెన్సీగా ఉన్న సీబీఐకి చేరింది. అక్కడి నుంచి ఇంటర్‌పోల్‌కు సదరు విజ్ఞప్తి చేరాల్సి ఉండగా.. అనేక వివరణలు, సందేహాలు, సమస్యలు ప్రక్రియ ముందుకు సాగేందుకు ఆటంకంగా మారాయి. ఈ కారణంగానే కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసినా, 8 నెలలుగా హైదరాబాద్‌ పోలీసులు రకరకాలుగా ప్రయ త్నాలు చేస్తున్నా ఇప్పటికీ ప్రభాకర్‌రావుపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయించే ప్రయత్నం సఫలం కాలేదు. దేశంలోని అనేక ఏజెన్సీలు, పోలీసు విభాగాలు ఈ సమస్య ఎదుర్కొంటున్నాయి. దీనికి పరిష్కారంలో భాగంగానే భారత్‌పోల్‌ తెరపైకి వచ్చింది.ఇకపై సులభంగా..ఈ పోర్టల్‌ ద్వారా దేశంలోని అన్ని పోలీసు విభాగాలు, ఏజెన్సీలకు ఇంటర్‌పోల్‌తో సంప్రదింపులు సులువు అయ్యేందుకు అవకాశం ఏర్పడింది. వివిధ రకాలైన కార్నర్‌ నోటీసుల జారీ ప్రక్రియ, అందుకు అవసరమైన పత్రాలు, నమూనాలను ఈ పోర్టల్‌లో పొందుపరిచారు. అధికారులకు వచ్చే సందేహాలు, వాటికి సమాధానాలను ఆన్‌లైన్‌లో పొందేలా డిజైన్‌ చేశారు. ఈ పోర్టల్‌ వినియోగంపై త్వరలో సీబీఐ దేశ వ్యాప్తంగా పోలీసులు, ఏజెన్సీలకు సమగ్ర శిక్షణ ఇవ్వనుంది.భారత్‌పోల్‌.. 5 ఉపయోగాలు1 దేశంలోని అన్ని ఏజెన్సీలు, పోలీసు విభాగాలతో పాటు కొన్ని విదేశీ ఏజెన్సీలు సైతం ఈ పోర్టల్‌ ద్వారాసంప్రదింపులు జరిపే అవకాశం ఉంది.2 వివిధ వ్యవస్థీకృత నేరాలు,నేరగాళ్లకు సంబంధించిన వివరాల్ని ఇందులో పొందుపరిచారు.3 బ్రాడ్‌ కాస్ట్‌ విధానంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వాంటెడ్‌ నేరగాళ్ల వివరాలను తేలిగ్గా ఇచ్చిపుచ్చుకునే ఆస్కారం ఏర్పడింది.4 వ్యవస్థీకృత నేరాలు, నేరగాళ్ల సమా చారం, నేరం చేసే విధానం, ప్రభావం ఉన్న ప్రాంతాలు తదితరాలను తేలిగ్గా గుర్తించేలా ఈ పోర్టల్‌ రూపొందింది.5 క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టం కంటే సమర్థంగా నేరగాళ్ల కదలికలు, వివరాలు తెలుసుకునేందుకు భారత్‌పోల్‌ ఉపయోగపడనుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement

వీడియోలు

Advertisement