Virender Sehwag
-
సౌథీ అరుదైన ఘనత.. సెహ్వాగ్ సిక్సర్ల రికార్డు బ్రేక్
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ టిమ్ సౌథీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్‌ను సాధించడంలో సౌథీ కీలక పాత్ర పోషించాడు. రచిన్ రవీంద్రతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.73 బంతులు ఎదుర్కొన్న సౌథీ 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. ఈ ఇక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన సౌథీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జాబితాలో సౌథీ ఆరో స్ధానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు 147 టెస్టు ఇన్నింగ్స్‌లలో సౌథీ 92 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్(91) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సెహ్వాగ్‌ను ఈ కివీ వెటరన్ అధిగమించాడు. ఇక అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో బెన్ స్టోక్స్(131) అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IND vs PAK 2nd Test: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. -
అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తన అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ జట్టుకు విజయం అందించాడు. దీంతో వీరూ భాయ్ వారసుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా వినూ మన్కడ్ ట్రోఫీ-2024 సందర్భంగా ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ తరఫున ఎంట్రీ ఇచ్చాడు.బౌలర్లు పడగొట్టారుపాండిచ్చేరి వేదికగా మణిపూర్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో మణిపూర్ 49.1 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో లక్ష్మణ్(24/3), దేవాన్ష్ రావత్(44/2), అమన్ చౌదరి(29/2) అదరగొట్టారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు ఆర్యవీర్ సెహ్వాగ్- సార్థక్ రే శుభారంభం అందించారు.ఇద్దరూ కలిసి 4.5 ఓవర్లలో 33 పరుగులు చేశారు. సార్థక్ 17 బంతుల్లో 25 పరుగులు చేసి తొలి వికెట్‌గా నిష్క్రమించగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య కుమార్ ఎనిమిది పరుగులకే అవుటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ ప్రణవ్ పంత్‌తో కలిసి ఆర్యవీర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా ఢిల్లీ 20 ఓవర్లలోనే వంద పరుగుల మార్కు అందుకుంది.మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్ 49 పరుగుల వద్ద అవుటయ్యాడు. తృటిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరోవైపు.. ప్రణవ్ పంత్ కూడా 45 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో ఏకంగా 75 రన్స్ సాధించాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ కారణంగా ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో మణిపూర్‌పై గెలుపొందింది.కాగా ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ట్రయల్ మ్యాచ్‌లో ఆర్యవీర్ దుమ్ములేపాడు. 136 బంతుల్లోనే ఏకంగా 183 రన్స్ చేశాడు. ఈ క్రమంలో వినూ మన్కడ్ వన్డే టోర్నీకి ఢిల్లీ సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇలా సత్తా చాటి వారి నమ్మకాన్ని ఆర్యవీర్ నిలబెట్టాడు. ఇద్దరు కుమారులు2004లో ఆర్తీ అహ్లావత్‌ను పెళ్లాడిన వీరేంద్ర సెహ్వాగ్‌కు ఇద్దరు కుమారులు జన్మించారు. పెద్దవాడు ఆర్యవీర్(2007), చిన్నోడు వేదాంత్(2010). ఇద్దరూ క్రికెటర్లుగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. చదవండి: అంపైర్ల తీరుపై హర్మన్‌ప్రీత్ అసహనం.. తప్పెవరిది? -
సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. సంప్రదాయ క్రికెట్లో ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన ఈ లెఫ్టాండర్.. తాజాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు సందర్భంగా మరో రికార్డు నమోదు చేశాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా అర్ధ శతకం బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు.ఈ క్రమంలో భారత డాషింగ్ ఓపెనర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను జైస్వాల్ అధిగమించాడు. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై టెస్టులో 280 పరుగులతో గెలిచిన టీమిండియా.. కాన్పూర్ వేదికగా రెండో మ్యాచ్ ఆడుతోంది. గ్రీన్‌పార్క్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌కు తొలిరోజు నుంచే వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో రెండు, మూడో రోజు ఆట రద్దు కాగా.. సోమవారం మ్యాచ్ మళ్లీ మొదలైంది.ఆది నుంచే దూకుడుగాఈ నేపథ్యంలో 107/3 స్కోరుతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 11 బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. 209కి పైగా స్ట్రైక్‌రేటుతో ఆకట్టుకున్నాడు.టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం ‘బజ్‌బాల్’ తరహా ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. తద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో 51 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై బ్యాటర్.. 12 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 72 పరుగులు రాబట్టాడు.టీమిండియా తరఫున టెస్టుల్లో వేగవంతమైన అర్ధ శతకం సాధించినది వీరే👉రిషభ్ పంత్- బెంగళూరులో 2022 నాటి శ్రీలంకతో మ్యాచ్‌లో 28 బంతుల్లోనే 50 రన్స్👉కపిల్ దేవ్- కరాచిలో 1982 నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 30 బంతుల్లోనే 50 రన్స్👉శార్దూల్ ఠాకూర్- ఓవల్‌లో 2021 నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ మీద 31 బంతుల్లోనే 50 రన్స్👉యశస్వి జైస్వాల్- కాన్పూర్‌లో 2024 నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మీద 31 బంతుల్లోనే 50 రన్స్👉వీరేంద్ర సెహ్వాగ్- చెన్నైలో 2008 నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ మీద 32 బంతుల్లో 50 రన్స్.ప్రపంచ రికార్డుఇక ధనాధన ఇన్నింగ్స్‌తో అలరించిన రోహిత్ శర్మ- యశస్వి జైస్వాల్ జోడి టెస్టుల్లో హయ్యస్ట్ స్కోరింగ్ రేటు(14.34) పార్ట్నర్షిప్ సాధించిన తొలి జంటగా అరుదైన ఘనత సాధించింది. ఇద్దరూ కలిసి 23 బంతుల్లోనే 55 పరుగులు సాధించి ఈ ఫీట్ నమోదు చేశారు. వీరి తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ జోడీ బెన్ స్టోక్స్- బెన్ డకెట్(44 బంతుల్లో 87 నాటౌట్), వాగ్నర్- ట్రెంట్ బౌల్ట్(27 బంతుల్లో 52) ఉన్నారు. చదవండి: రాహుల్ ద్రవిడ్ కుమారుడికి షాక్.. ఇకపై ఆ జట్టుకు ఆడలేడు! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డుపై కన్ను
దాదాపు నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు తిరిగి మైదానంలో అడుగుపెట్టనుంది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్దమవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే చెన్నైకు చేరుకున్న టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. కొత్త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ సైతం భారత జట్టుతో చేరాడు. బంగ్లా క్రికెట్ జట్టు కూడా సోమవారం(సెప్టెంబర్ 16)న భారత గడ్డపై అడుగుపెట్టే అవకాశముంది. కాగా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరాలంటే భారత్ కు ఈ సిరీస్ చాలా కీలకం. అందుకు తగ్గట్టే భారత్ తమ వ్యూహాలు రచిస్తోంది.సెహ్వాగ్ రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్..బంగ్లాతో తొలి టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. చెపాక్ టెస్టులో హిట్‌మ్యాన్ మరో 7 సిక్సర్లు బాదితే టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.సెహ్వాగ్ 103 టెస్టుల్లో 90 సిక్స్‌లు బాదగా.. రోహిత్ శర్మ 59 టెస్టు మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు 84 సిక్స్‌లు కొట్టాడు. ప్రస్తుతం ఈ జాబితాలో రోహిత్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. హిట్‌మ్యాన్ తర్వాతి స్ధానాల్లో 78 సిక్స్‌లతో ధోనీ, 69 సిక్స్‌లతో సచిన్, 64 సిక్స్‌లతో రవీంద్ర జడేజా వరుసగా కొనసాగుతున్నారు.చదవండి: ఒకవేళ టీమిండియా మా దేశానికి రాకపోతే: పాక్ మాజీ క్రికెటర్ -
ఆల్‌టైమ్ రికార్డుకు ఏడు సిక్సర్ల దూరంలో ఉన్న రోహిత్
టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు సాధించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం ఏడు సిక్సర్లు దూరంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే సిరీస్‌లో మరో ఏడు సిక్సర్లు బాదితే టీమిండియా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేందర్ సెహ్వాగ్ రికార్డును అధిగమిస్తాడు. వీరూ 103 టెస్ట్‌ల్లో 90 సిక్సర్లు బాదగా.. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 84 సిక్సర్లు (59 టెస్ట్‌ల్లో) ఉన్నాయి. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వీరూ, రోహిత్ తర్వాత ధోని (78), సచిన్ (69), రవీంద్ర జడేజా (64) టాప్-5లో ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కేవలం 26 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. మూడు ఫార్మాట్ల విషయానికొస్తే.. రోహిత్ ప్రపంచంలోనే అందరి కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఉన్నాడు. హిట్‌మ్యాన్ తన కెరీర్లో 483 మ్యాచ్‌లు ఆడి 620 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (553), షాహిద్ అఫ్రిది (476) టాప్-3లో ఉన్నారు.బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ విషయానికొస్తే.. రెండు టెస్ట్‌లు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు ఈ నెల 19 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. తొలి టెస్ట్ సెప్టెంబర్ 19, రెండో టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయి. టీ20 సిరీస్ అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగుతుంది. -
టీమిండియాకు కాదు.. ఐపీఎల్ కోచ్‌గా ఉండటం బెటర్: సెహ్వాగ్
టీమిండియా హెడ్‌కోచ్ పదవి గురించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాతీయ జట్టు శిక్షకుడిగా ఉండటం కంటే.. ఐపీఎల్ కోచ్‌గా ఉండటమే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. భారత విధ్వంసకర ఓపెనర్‌గా గుర్తింపు పొందిన వీరూ భాయ్.. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అదే ఏడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు చివరిసారిగా ప్రాతినిథ్యం వహించాడు.అనంతరం అదే జట్టుకు 2016లో మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పంజాబ్ ఫ్రాంఛైజీ క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు సెహ్వాగ్. 2018 వరకు అదే పదవిలో కొనసాగాడు. అయితే, 2017లోనే టీమిండియా హెడ్‌కోచ్ రేసులో నిలిచినా.. రవిశాస్త్రికి అవకాశం దక్కగా.. సెహ్వాగ్‌కు మొండిచేయి ఎదురైంది. అప్పటి నుంచి మళ్లీ అతడు ఎన్నడూ జాతీయ జట్టు కోచ్‌గా వెళ్లాలన్న ప్రయత్నం చేయలేదు.టీమిండియాకు కాదు.. ఐపీఎల్ కోచ్‌గా ఉండటం బెటర్‌ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్ అందుకు గల కారణం వెల్లడించాడు. ‘‘టీమిండియా కోచ్‌గా ఉండటం కంటే ఐపీఎల్ జట్టు కోచ్‌గా ఉండటానికే నేను మొగ్గుచూపుతాను. నిజానికి నేను గనుక భారత జట్టు కోచ్‌ని అయితే.. మళ్లీ పాతరోజుల్లాగే గడుస్తుంది. సిరీస్‌లు ఉన్నపుడు ఇంటికి ఏడెనిమిది నెలలపాటు దూరంగా ఉండాల్సి వస్తుంది.నా కుమారులూ క్రికెటర్లేఇప్పుడు నా పిల్లల వయసు 14, 16 ఏళ్లు. వాళ్లకు నా అవసరం ఉంది. వాళ్లిద్దరు క్రికెటర్లే. ఒకరు ఆఫ్ స్పిన్నర్ అయితే.. మరొకరు ఓపెనింగ్ బ్యాటర్. నా కుమారులకు దిక్సూచిలా ఉంటూ.. వారికి తగినంత సమయం కేటాయించడమే నా ముందున్న కర్తవ్యం’’ అని సెహ్వాగ్ అమర్ ఉజాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ కోచ్‌గా మారితే స్వల్పకాలం మాత్రమే కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని.. అందుకే తన ఓటు అటు వేశానని పేర్కొన్నాడు.చదవండి: అందుకు నువ్వే కారణమవుతావని కోహ్లితో చెప్పా.. ఆ తర్వాత: భజ్జీ -
’మిగతా సెలక్టర్లు అతడిని వద్దన్నారు... అయినా నేను వినలేదు’
ఫామ్‌లో ఉన్న యువ క్రికెటర్లకు అవకాశం ఇస్తేనే వారి సత్తా బయటపడుతుందని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అన్నాడు. ప్రతిభను గుర్తించడం ఎంత ముఖ్యమో.. సరైన సమయంలో జట్టుకు ఎంపిక చేయడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నాడు. అప్పుడే సెలక్టర్లు తమ పాత్రకు న్యాయం చేసిన వాళ్లవుతారని అభిప్రాయపడ్డాడు.సెహ్వాగ్‌ను కాదని ధావన్‌ను ఆడించాశిఖర్ ధావన్ అరంగేట్రం విషయంలో తన అంచనా తప్పలేదని.. తన నిర్ణయం సరైందేనని గబ్బర్ నిరూపించాడని సందీప్ పాటిల్ ఈ సందర్భంగా వెల్లడించాడు. సహచర నలుగురు సెలక్టర్లు వ్యతిరేకించినా.. నాడు వీరేంద్ర సెహ్వాగ్‌ను కాదని ధావన్‌ను తుదిజట్టుకు ఎంపిక చేసిన విషయాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు. కాగా 2013లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ వరుసగా తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు.అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డుఈ క్రమంలో మూడో టెస్టులో వీరూ భాయ్‌పై వేటు వేసిన సెలక్టర్లు ధావన్‌కు టెస్టు అరంగేట్రం అవకాశం కల్పించారు. అయితే, వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కేవలం 85 బంతుల్లోనే శతకం బాదాడు. తద్వారా టెస్టు అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆసీస్‌తో మూడో టెస్టులో మొత్తంగా 174 బంతులు ఎదుర్కొన్న గబ్బర్.. 187 పరుగులతో అదరగొట్టాడు. ఆ తర్వాత టీమిండియాలో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ మొహాలీ హ్యారికేన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘యువ క్రికెటర్లు ఫామ్‌లో ఉన్నపుడే వారికి అవకాశాలు ఇవ్వాలి.నన్ను కాపాడాడుసరైన సమయంలో పిలుపునిస్తేనే వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆ సమయంలో శిఖర్ సౌతాఫ్రికా టూర్లో ఇండియా-ఏ తరఫున డబుల్ సెంచరీ, సెంచరీ బాదాడు. అప్పుడు అతడిని జాతీయ జట్టుకు ఆడించాలని నేను భావించాను. సెహ్వాగ్‌ను కాదని.. ధావన్‌ను ఆడించాలనే నా నిర్ణయాన్ని నా సహచర సెలక్టర్లు వ్యతిరేకించారు.అయితే, ఆ తర్వాత వారిని ఒప్పించగలిగాను. అలా శిఖర్ జట్టులోకి వచ్చి తొలి టెస్టులోనే రికార్డు సెంచరీ బాదాడు. నా నిర్ణయం సరైందని నిరూపించాడు. అయినా.. నేనేమీ క్రెడిట్ తీసుకోవాలనుకోలేదు. నిజానికి శిఖర్ శతకం చేసి ఒకరకంగా నన్ను రక్షించాడనుకోండి(నవ్వుతూ)’’ అంటూ గత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాడు. కాగా సందీప్ పాటిల్ టీమిండియా తరఫున 29 టెస్టులు, 45 వన్డేలు ఆడాడు. 2012- 2016 మధ్య బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా పనిచేశాడు. చదవండి: Duleep Trophy: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లపైనే! -
ఓపెనర్లుగా వీరూ, రోహిత్.. మిడిలార్డర్లో సచిన్, విరాట్: డీకే
టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ కామెంటేటర్‌గా మరింత బిజీ అయ్యాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శనను తనదైన శైలిలో విశ్లేషిస్తూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గానూ చరిత్ర సృష్టించిన డీకే తాజాగా.. తన ఆల్‌టైమ్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు.ఓపెనర్లుగా వీరూ, రోహిత్మూడు ఫార్మాట్లలో కలిపి టీమిండియా తరఫున అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లకు తన జట్టులో దినేశ్ కార్తిక్ చోటిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు సింహస్వప్నంగా మారి.. విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు డీకే.మిడిల్ ఆర్డర్లో సచిన్, విరాట్పరిమిత ఓవర్ల క్రికెట్లో 100కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన వీరూతో పాటు.. ఇటీవలి టీ20 ప్రపంచకప్-2024లో 257 పరుగులతో రెండో హయ్యస్ట్ రన్‌స్కోరర్‌గా నిలిచిన రోహిత్‌కు ఇన్నింగ్స్ ఓపెన్ చేసే అవకాశమిస్తానన్నాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్‌గా మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ఎంచుకున్న డీకే.. వంద సెంచరీల దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్‌ను నాలుగో స్థానానికి ఎంచుకున్నాడు.ఇక ఆ తర్వాతి స్థానంలో రన్‌మెషీన్, 80 శతకాల వీరుడు విరాట్ కోహ్లికి చోటిచ్చిన దినేశ్ కార్తిక్.. ఆల్‌రౌండర్ల జాబితాలో వరల్డ్‌కప్ విన్నర్స్ యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేసుకున్నాడు. అదే విధంగా బౌలింగ్ విభాగంలో.. సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, లెజెండ్ అనిల్ కుంబ్లేలకు స్థానం కల్పించాడు డీకే. పన్నెండో ఆటగాడిగా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్‌ను ఎంచుకున్నాడు ఈ తమిళనాడు మాజీ బ్యాటర్. క్రిక్‌బజ్ షోలో ఈ మేరకువ్యాఖ్యలు చేశాడు.వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో డీకే ఎంచుకున్న భారత అత్యుత్తమ జట్టువీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖన్.12th మ్యాన్: హర్భజన్ సింగ్. -
DPL 2024: వీరేంద్ర సెహ్వాగ్‌కు కీలక బాధ్యతలు...
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్‌కు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఈ తొట్టతొలి ఎడిషన్ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనుంది. ఈ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ లీగ్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లతో భారత స్టార్ క్రికెటర్లు రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ భాగం కానున్నారు.డీపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా సెహ్వాగ్..ఇక ఇది ఇలా ఉండగా.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను డీడీసీఎ నియమించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో డీడీసీఎ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రామానికి సెహ్వాగ్ సైతం హాజరయ్యాడు. కాగా ఢిల్లీ నుంచే భారత జట్టుకు సెహ్వాగ్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఢిల్లీలోని అత్యుత్తమ ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని డీడీసీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ను డీడీసీఎ ప్రారంభించనుంది. లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో ఆరు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, పురాణి డిల్లీ 6, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ జట్లు మొత్తం రూ. 49.65 కోట్ల రూపాయలకు విక్రయించబడ్డాయి. -
వన్డే ప్రపంచకప్ ఆల్‌టైమ్ అత్యుత్తమ జట్టు.. కోహ్లికి నో ఛాన్స్!
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ 2012లో అంతర్జాతీయ క్రికెట్లో వందో సెంచరీ కొట్టి.. శతక శతకాల ధీరుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. సమకాలీన క్రికెటర్లు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి.. శిఖరాగ్రాన నిలిచాడు. వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలయ్యే అవకాశమే లేదని భావిస్తున్న తరుణంలో.. విరాట్ కోహ్లి అనే కుర్రాడు తెరమీదకు వచ్చాడు.ఇప్పటికే వన్డేల్లో 50 శతకాలు బాదిన ఈ రన్‌మెషీన్.. సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. టెస్టుల్లో 29, టీ20లలో ఒక సెంచరీ బాది.. ఆల్‌టైమ్ రికార్డుకు ఎసరుపెట్టాడు. 35 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌కు మారుపేరుగా కొనసాగుతున్న కోహ్లి వరల్డ్‌కప్ టోర్నీల్లోనూ సత్తా చాటుతున్నాడు. వన్డే రారాజుగా కొనసాగుతున్నాడు. అయితే, ఇలాంటి రికార్డుల వీరుడికి తన ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డే వరల్డ్‌కప్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లేదంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ మాథ్యూ హెడెన్.భారత్ నుంచి ఇద్దరు లెజెండ్స్ మాత్రమే ఈ టీమ్‌లో స్థానం సంపాదించడానికి అర్హులు అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ జట్టులో ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా నలుగురిని ఎంపిక చేసుకున్న ఈ కంగారూ బ్యాటర్.. పాకిస్తాన్ నుంచి ఇద్దరి చోటు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. గౌతం గంభీర్ గైడెన్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.మాథ్యూ హెడెన్ ఎంచుకున్న గ్రేటెస్ట్ వన్డే వరల్డ్‌కప్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ఆడం గిల్‌క్రిస్ట్(ఆస్ట్రేలియా), వీరేంద్ర సెహ్వాగ్(ఇండియా), రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా- కెప్టెన్), సచిన్ టెండుల్కర్(ఇండియా), బ్రియన్ లారా(వెస్టిండీస్), జాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా), వకాన్ యూనిస్(పాకిస్తాన్), వసీం అక్రం(పాకిస్తాన్), షేన్ వార్న్(ఆస్ట్రేలియా), ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక), గ్లెన్ మెగ్రాత్(ఆస్ట్రేలియా).చదవండి: SA20 2025: సౌతాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్.. జట్టు నుంచి ఔట్ -
టీమిండియా కెప్టెన్‌గా అతడే సరైనోడు: సెహ్వాగ్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది.జూలై 6, 7, 10, 13, 14వ తేదీల్లో హరారే వేదికగా జరుగనున్న ఈ సిరీస్‌కు టీమిండియా సీనియర్లంతా దూరంగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గైర్హాజరీ కారణంగా.. తొలిసారిగా ఈ పంజాబీ బ్యాటర్‌కు టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించే సువర్ణావకాశం లభించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ శర్మ తర్వాత అతడేరోహిత్ శర్మ వారసుడిగా శుబ్‌మన్ గిల్ సరైన ఎంపిక అంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించాడు. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘శుబ్‌మన్ గిల్‌కు ఎంతో భవిష్యత్తు ఉంది.మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడగల సత్తా అతడికి ఉంది. గతేడాది తనకు గొప్పగా గడిచింది. అయితే, దురదృష్టవశాత్తూ టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.సరైన నిర్ణయంనా అభిప్రాయం ప్రకారం.. గిల్‌ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం. రోహిత్ శర్మ వెళ్లిన తర్వాత శుబ్‌మన్ గిల్ మాత్రమే కెప్టెన్సీకి పూర్తి న్యాయం చేయగలుగుతాడు’’ అని వీరేంద్ర సెహ్వాగ్ గిల్ నైపుణ్యాలపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు.అదే విధంగా.. జింబాబ్వేతో సిరీస్‌కు అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, తుషార్ దేశ్‌పాండే, రియాన్ పరాగ్ వంటి ఐపీఎల్ హీరోలను ఎంపిక చేయడం పట్ల సెహ్వాగ్ స్పందించాడు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయడంలో తనకు తప్పేమీ కనిపించడం లేదన్నాడు.జింబాబ్వే టూర్‌కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్‌పాండే. -
నాకు నచ్చినవాళ్లను సెలక్ట్ చేస్తా అంటావా?: సెహ్వాగ్ ఫైర్
పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్ తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. జట్టు ఎంపిక విషయంలో తనకు నచ్చినట్లుగా వ్యవహరించి.. పాక్ భారీ మూల్యం చెల్లించేలా చేశాడని అభిప్రాయపడ్డాడు.అధికారం చేతుల్లో ఉంది కదా అని ఇష్టారీతిన ప్రవర్తిస్తే ఇలాంటి ఫలితాలే చూడాల్సి వస్తుందని ఘాటుగా విమర్శించాడు. గతంలో పాక్ జట్టును విమర్శించిన రియాజ్.. ఇప్పుడు తన పనితనాన్ని ఎలా సమర్థించుకుంటాడోనంటూ సెహ్వాగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ కనీసం సూపర్-8 కూడా చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జట్టు ఎంపిక విషయంలో ఫేవరెటిజం, బంధుప్రీతి చూపడం వల్లే కొంపమునిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ పాక్ చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్ తీరును తప్పుబట్టాడు. ‘‘వహాబ్ రియాజ్, మహ్మద్ ఆమిర్... ఇద్దరూ పాకిస్తాన్ జట్టును విమర్శించిన వాళ్లే.ఏ టీవీ చానెల్లో అయితే వీళ్లిద్దరూ ఈ పని చేశారో.. ఇప్పుడు అదే చానెల్లో వీళ్లను విమర్శిస్తున్నారు. ఆనాడు అలా మాట్లాడిన వాళ్లలో ఒకరు ఇప్పుడు చీఫ్ సెలక్టర్(రియాజ్).. మరొకరు తుదిజట్టులో చోటు దక్కించుకున్న ఆటగాడు(ఆమిర్).మహ్మద్ ఆమిర్ అప్పుడు నాతో ఉన్నాడు కాబట్టి.. అతడిని జట్టుకు ఎంపిక చేస్తాననుకోవడం సరైందేనా?! ఇప్పుడు అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా ఉన్నాడు.కాబట్టి తను నా దగ్గరికి వచ్చి.. ‘వీరూ, జాక్(జహీర్ ఖాన్).. మీరిద్దరూ రండి. రీఎంట్రీ ఇచ్చేందుకు నేను అవకాశం కల్పిస్తా’ అంటే ఎలా ఉంటుంది. ఆమిర్ పట్ల రియాజ్ చేసింది కూడా ఇలాగే ఉంది’’ అని క్రిక్‌బజ్ షోలో సెహ్వాగ్ తీవ్ర విమర్శలు చేశాడు.కాగా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన మహ్మద్ ఆమిర్ టీ20 ప్రపంచకప్-2024కు ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అనూహ్య రీతిలో అతడు వరల్డ్‌కప్ జట్టుకు కూడా ఎంపికయ్యాడు.ఇమాద్ వసీం సైతం ఇలాగే ఆఖరి నిమిషంలో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరి ఎంపికకు వహాబ్ రియాజే కారణమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.కాగా మహ్మద్ ఆమిర్ వరల్డ్‌కప్-2024లో ఏడు వికెట్లు తీయగలిగాడు. అయితే, అమెరికాతో సూపర్‌లో పద్దెనిమిది పరుగులు సమర్పించుకుని పాక్ ఓటమికి కారణమయ్యాడు ఈ లెఫ్టార్మ్ పేస్ బౌలర్.చదవండి: కోట్లకు కోట్లు తీసుకుంటారు.. భార్యల్ని తీసుకెళ్లడం బాగా అలవాటైంది! -
అతడికి టీ20 జట్టులో ఉండే అర్హతే లేదు: సెహ్వాగ్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆట తీరును టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. అసలు అతడికి టీ20 జట్టులో ఉండే అర్హతే లేదని అభిప్రాయపడ్డాడు.టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ సూపర్-8కు కూడా అర్హత సాధించకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. గత ప్రపంచకప్ టోర్నీ(2022)లో రన్నరప్‌గా నిలిచిన బాబర్ బృందం.. ఈసారి చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ, బ్యాటింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే అతడిని కెప్టెన్‌గా తొలగించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.టాపార్డర్‌లో సిక్సర్లు బాదే ఆటగాళ్లు ఉండాలిబాబర్ ఆజం టీ20 ఫార్మాట్‌కు తగడని.. అతడికి జట్టులో చోటే అనవసరం అని పేర్కొన్నాడు. క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘టాపార్డర్‌లో సిక్సర్లు బాదే ఆటగాళ్లు ఉండాలి. బాబర్ ఆజం అలాంటి ప్లేయర్ కాదు.కేవలం స్పిన్నర్ల బౌలింగ్‌లోనే అతడు హిట్టింగ్ ఆడగలడు. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో అతడు ఇలాంటి సాహసం చేయడం నేనెప్పుడూ చూడలేదు.అతడు ఆచితూచి నెమ్మదిగా ఆడటమే మనకు కనబడుతుంది. బాబర్ పరుగులు సాధిస్తున్న మాట నిజమే. కానీ అతడి స్ట్రైక్‌రేటును కూడా గమనించాలి కదా!అసలు టీ20 జట్టులో ఉండే అర్హతే అతడికి లేదునాయకుడిగా ఉన్నపుడు మన ఆట వల్ల జట్టుకు ప్రయోజనం కలుగుతుందా లేదో చూసుకోవాలి. అవసరమైతే బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ అయి.. తన స్థానాన్ని హిట్టింగ్ ఆడగల ప్లేయర్ల కోసం త్యాగం చేయగలగాలి.ఒకవేళ అతడు గనుక కెప్టెన్ కాకపోయి ఉంటే.. అసలు టీ20 జట్టులో ఉండే అర్హతే అతడికి లేదు. నేను కఠినంగా మాట్లాడుతున్నానని మీకు అనిపించవచ్చు.. కానీ ఇదే నిజం. ఎందుకంటే నేటి టీ20 క్రికెట్ ప్రమాణాలకు తగ్గట్లు అతడి ఆట లేనేలేదు’’ అని సెహ్వాగ్ నిక్కచ్చిగా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి బాబర్ ఆజం 122 పరుగులు చేశాడు. అయితే అతడి స్ట్రైక్‌రేటు మాత్రం కేవలం 101.66 కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. గ్రూప్-ఏ నుంచి టీమిండియాతో పాటు అమెరికా సూపర్-8కు చేరగా.. పాక్, కెనడా, ఐర్లాండ్ ఇంటిబాట పట్టాయి.చదవండి: T20 WC: కెప్టెన్సీకి గుడ్ బై?.. బాబర్ ఆజం ఘాటు స్పందన -
సెహ్వాగా?.. అతడెవరు? షకీబ్ అల్ హసన్ కామెంట్స్ వైరల్
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు సెహ్వాగ్ ఎవరో తనకు తెలియదంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆడే బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికైన షకీబ్ అల్ హసన్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అరుదైన రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ కప్ ఆరంభ ఎడిషన్ నుంచి ఇప్పటిదాకా కొనసాగిన ఆటగాడిగా రోహిత్‌తో పాటు అతడు నిలిచాడు.అయితే, గ్రూప్ దశలోని తొలి రెండు మ్యాచ్‌లలో ఈ వెటరన్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. శ్రీలంక, సౌతాఫ్రికా మ్యాచ్‌లలో వరుసగా ఎనిమిది, మూడు పరుగులు చేసిన షకీబ్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.ముఖ్యంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అతడు అవుటైన తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. అనవసర షాట్లకు అవుట్ కావడం ఏమిటని, ఎప్పుడో రిటైర్ అవ్వాల్సిన క్రికెటర్ ఇంకా ఆడితే ఇలాగే ఉంటుందని విమర్శించాడు.అంతేకాకుండా నువ్వేమీ మాథ్యూ హెడ్న్, ఆడం గిల్‌క్రిస్ట్ కాదని.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్‌వి అని వీరూ భాయ్ షకీబ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, తాజాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలుపొంది సూపర్-8కు చేరువైంది.ఈ విజయంలో షకీబ్ అల్ హసన్ కీలక పాత్ర పోషించాడు. 46 బంతుల్లో 64 పరుగులతో రాణించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. కీలక సమయంలో రాణించి.. జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా సెహ్వాగ్ విమర్శల గురించి ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘సెహ్వాగ్? అతడెవరు?’’ అంటూ షకీబ్ అల్ హసన్ ఎదురు ప్రశ్నించాడు. ‘‘విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.జట్టుకు ఏ విధంగా ఉపయోగపడగలం అని మాత్రమే మనం ఆలోచించాలి. అలా ఆలోచించని వాళ్లే అనవసరపు విషయాల గురించి పట్టించుకుంటారు.బ్యాటర్ బ్యాటింగ్ గురించి.. బౌలర్ బౌలింగ్ గురించి.. ఫీల్డింగ్ చేసే సమయంలో క్యాచ్‌లు లేదంటే పరుగులు సేవ్ చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అంతేగానీ ఇలాంటి వాటికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఆటగాళ్లకు ఏమాత్రం ఉండదు’’ అని షకీబ్ అల్ హసన్ సెహ్వాగ్‌ను ఉద్దేశించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.చదవండి: అందరికీ పది నిమిషాలు.. అతడికి ఇరవై: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలుShakib Al Hasan, the most arrogant cricketer in the his history.Journalist: There has been lot of discussions about your performance especially criticize by Virendra Sehwag"Shakib: Who is Sehwag?pic.twitter.com/wtqlGrdeX3— Farrago Abdullah Parody (@abdullah_0mar) June 14, 2024 -
నువ్వేమీ హెడెన్ కాదు.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్‌వి: సెహ్వాగ్
‘‘అనుభవమే ప్రాతిపదికగా అతడిని జట్టులోకి తీసుకుని ఉంటే మాత్రం.. అతడు అందుకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు. కనీసం కొంతసేపైనా క్రీజులో నిలబడాలి కదా.షార్ట్ బాల్‌ను కూడా పుల్ షాట్ ఆడటానికి నువ్వేమీ మాథ్యూ హెడెన్వో లేదంటే ఆడం గిల్క్రిస్ట్వో కాదు. కేవలం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆటగాడివి అంతే. నీ స్థాయి, ప్రమాణాలకు తగ్గట్లు ఆడాలి.హుక్ లేదంటే పుల్ షాట్ ఆడే నైపుణ్యం నీకు లేనట్లయితే.. నీకు తెలిసిన షాట్లు మాత్రమే ఆడవచ్చు కదా!’’ అంటూ బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో షకీబ్ పూర్తిగా విఫలం కావడంతో ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా గ్రూప్-డిలో భాగమైన బంగ్లాదేశ్ సోమవారం నాటి మ్యాచ్‌లో ప్రొటిస్ జట్టు చేతిలో ఓటమిపాలైంది.ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలుపునకు దూరమైంది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 113 పరుగులు చేసింది.స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా ఆది నుంచే తడబడింది. టాపార్డర్ చేతులెత్తేయగా.. నాలుగో స్థానంలో వచ్చిన షకీబ్ అల్ హసన్ కేవలం మూడు పరుగులే చేశాడు. అనవసరపు షాట్‌కు యత్నించి అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో ఐడెన్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.జట్టులో సీనియర్ ఆటగాడైన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇలా పూర్తిగా నిరాశపరచడంతో సెహ్వాగ్ పైవిధంగా స్పందించాడు. ఆస్ట్రేలియా దిగ్గజాలు మాథ్యూ హెడెన్, ఆడం గిల్‌క్రిస్ట్‌ల పేర్లు ప్రస్తావిస్తూ విమర్శించాడు. తెలిసిన షాట్లు మాత్రమే ఆడుతూ తెలివిగా వ్యవహరించే బాగుండి ఉండేదని క్రిక్‌బజ్ షోలో షకీబ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.కాగా ఈ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ ఒక ఓవర్ బౌలింగ్ చేసి ఆరు పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీ20 ప్రపంచకప్ మొదటి ఎడిషన్(2007) నుంచి ఇప్పటిదాకా ఈ మెగా టోర్నీలో ఆడుతున్న ప్లేయర్ షకీబ్ అల్ హసన్ మాత్రమే! ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024 గ్రూప్-డిలో ఉన్న బంగ్లాదేశ్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి.. ఒకటి మాత్రమే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు.. బంగ్లాపై విజయంతో మూడో గెలుపు నమోదు చేసిన సౌతాఫ్రికా సూపర్-8లో అడుగుపెట్టింది.చదవండి: SA vs Ban: నరాలు తెగే ఉత్కంఠ: ఆ క్యాచ్ గనుక వదిలేసి ఉంటే.. -
MI: రోహిత్, హార్దిక్ వద్దు.. వాళ్లిద్దరినే రిటైన్ చేసుకోండి: సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ‘స్టార్’ క్రికెటర్ల ఆట తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. వచ్చే ఏడాది వేలంలో సోకాల్డ్ ‘స్టార్ల’ను వదిలేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.కాగా ముంబై ఇండియన్స్‌లో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, టీ20 వరల్డ్ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తదితరులు ఉన్నారు.ఇక రోహిత్ శర్మ ఈ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించినా.. ఐపీఎల్-2024 సీజన్లో కెప్టెన్‌గా అతడిని తప్పించింది యాజమాన్యం. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.రెండు వర్గాలుగా విడిపోయిన జట్టు?ఈ నేపథ్యంలో వేదనకు గురైన రోహిత్ శర్మతో పాటు బుమ్రా, సూర్య తదితరులు ఒక బృందంగా.. పాండ్యా, ఇషాన్‌లతో కూడిన మరికొందరు మరో బృందంగా ఏర్పడ్డారని.. జట్టులో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపిస్తున్నాయి.జట్టు ప్రదర్శనపై ఇది ప్రభావం చూపిందని.. అందుకే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలిచిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఎడిషన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా ముంబై శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ముంబై మేనేజ్మెంట్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025 వేలానికి ముందే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లను వదిలేయాలని సూచించాడు.షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఉంటే సరిపోదుఇందుకు సినిమాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఈ మేరకు ‘‘షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి ఒకే సినిమాలో నటించినా.. అది హిట్టవుతుందనే గ్యారెంటీ లేదు. సినిమాలో స్టార్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.మంచి స్క్రిప్టు ఉండాలి. అందరూ బాగా నటించగలగాలి. ఇలా ఇంకెన్నో అంశాలు కలిసిరావాలి. అలాగే జట్టులో పేరున్న ఆటగాళ్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.అసలు రోహిత్ శర్మ ఏం చేశాడు?మైదానంలో వాళ్లు సరిగ్గా ఆడితేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. మరి మిగతా మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన మాటేమిటి?ఇక ఇషాన్ కిషన్.. ఈ సీజన్ మొత్తంలో ఒక్కసారి కూడా కనీసం పవర్ ప్లే ముగిసే వరకైనా ఉన్నాడా?.. నా దృష్టిలో ముంబై ఇండియన్స్ కేవలం జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లనే నమ్ముకోవాలిక! వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోవాలివచ్చే సీజన్ కోసం వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. మిగతా వాళ్లు అసలు అవసరమే లేదు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ సీజన్లో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ 349, ఇషాన్ కిషన్ 306 పరుగులు చేశారు. మరోవైపు గాయం కారణంగా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ 345 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా 20 వికెట్లు తీయగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 11 వికెట్లు తీయడంతో పాటు 200 పరుగులు చేశాడు. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్ -
కోహ్లి కాదు!.. అతడు 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో ఏదీ కలిసి రావడం లేదు. టీ20 ప్రపంచకప్-2022 సెమీస్‌లోనే భారత జట్టు నిష్క్రమించిన తర్వాత.. సుదీర్ఘకాలం అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్నాడు హిట్‌మ్యాన్.ప్లే ఆఫ్స్ చేర్చినాగతేడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్ బ్యాటర్‌గా స్థాయికి తగ్గట్లు రాణించలేదు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 16 మ్యాచ్‌లలో కలిపి 332 పరుగులు మాత్రమే చేశాడు. ఇక జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సారథిగా సఫలమైనా.. ముంబై ఫ్రాంఛైజీ అతడిపై ఈసారి వేటు వేసింది.గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఫ్రాంఛైజీని వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఫోకస్ చేయలేకఇక పాండ్యా ప్రవర్తనతో విసిగిపోయిన రోహిత్ బ్యాటింగ్‌పై కూడా ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నాడని గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఐపీఎల్-2024లో ఇప్పటి దాకా 13 మ్యాచ్‌లు ఆడి 349 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తర్వాత టీమిండియా జూన్ 1నుంచి మొదలుకానున్న ప్రపంచకప్-2024కు సన్నద్ధంకానుంది. ఇందుకోసం ఇప్పటికే రోహిత్ శర్మ సారథ్యంలో బీసీసీఐ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది.అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత 37 ఏళ్ల రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. వయసు, ఫిట్నెస్ రీత్యా రెండు ఫార్మాట్లకు కూడా గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజం కాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ రోహిత్ శర్మ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. "అసలు వయసు గురించి ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.40, 42.. 45 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్తో ఉండి.. బాగా ఆడుతుంటే.. ఆ ఆటగాడి రిటైర్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మన దేశంలో చాలా మంది 40 ఏళ్ల వయసు వచ్చిందంటే.. పిల్లల పెంపకం గురించి ఆలోచిస్తూ కాలం గడిపేయాలనే ఆలోచనతో ఉంటారు. వయసు అయిపోయిందని.. ఆటకు పనికిరామని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడుటీమిండియా తొలిసారి వరల్డ్ కప్ గెలిచినపుడు మొహిందర్ అమర్నాథ్ వయసు 38 ఏళ్లు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే. అసలు ఏజ్ గురించి టీమిండియాలో చర్చ అనవసరం అంటాను.రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి గొప్ప ప్లేయర్లు ఫిట్నెస్ గురించి పెద్దగా అవసరం లేదు. ఒకవేళ రోహిత్ ఆడాలనుకుంటే 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడు" అని యోగ్రాజ్ సింగ్ అని స్పోర్ట్స్18తో చెప్పుకొచ్చాడు.కాగా ఫిట్‌నెస్‌కు మారుపేరైన విరాట్ కోహ్లి కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగించగలడన్న విశ్లేషణల నేపథ్యంలో అతడి పేరు ఎత్తకుండా యోగ్రాజ్ కేవలం రోహిత్, వీరూ పేర్లు చెప్పడం విశేషం.చదవండి: T20 WC: హార్దిక్‌ను సెలక్ట్ చేయడం రోహిత్‌కు ఇష్టం లేదు.. కానీ! -
రూ. 400 కోట్ల లాభం వస్తోంది.. చాలదా?: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానులను ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు, కోచ్‌లే జట్టును ముందుకు నడిపిస్తారని.. ఈ విషయంలో ఓనర్ల జోక్యం అనవసమా అంటూ ఘాటుగా విమర్శించాడు.వ్యాపారవేత్తలు కేవలం లాభనష్టాల గురించే ఆలోచిస్తారని.. అయితే, మైదానంలోనే ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికాడు. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కేఎల రాహుల్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమయ్యాడు. ఫలితంగా రైజర్స్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో సంజీవ్ గోయెంకా మైదానంలోనే రాహుల్‌తో వాదనకు దిగాడు.అతడు సర్దిచెప్తున్నా వినిపించుకోకుండా ఆగ్రహం ప్రదర్శించాడు. అదే విధంగా కోచ్ జస్టిన్ లాంగర్ పట్ల కూడా ఇదే తరహాలో వ్యవహరించాడు గోయెంకా. ఈ విషయంపై స్పందించిన సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘డ్రెస్సింగ్ రూం లేదంటే ప్రెస్ మీట్ సమయంలోనే ఓనర్లు ఆటగాళ్లతో మాట్లాడాలి. అది కూడా వాళ్లలో స్ఫూర్తి నింపేలా వ్యవహరించాలి గానీ.. ‘‘సమస్య ఏంటి? ఏం జరుగుతోంది?’’ అంటూ మైదానంలోనే ఇలా వ్యవహరించకూడదు.కోచ్‌లు, కెప్టెన్ జట్టును నడిపిస్తారు. కాబట్టి ఓనర్లు ఆటగాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే బెటర్. వాళ్లంతా వ్యాపారవేత్తలు. వాళ్లకు కేవలం లాభం, నష్టం గురించి మాత్రమే తెలుసు.అయినా ఇక్కడ వారికి ఎలాంటి లాస్ లేదు. 400 కోట్ల రూపాయల వరకు లాభం ఆర్జిస్తున్నారు. అంటే.. ఇక్కడ వాళ్లకు నష్టమేమీ ఉండదు కదా అని అంటున్నా! లాభాలు తీసుకోవడం తప్ప జట్టులో ఏం జరిగినా పట్టించుకునే అవసరం పెద్దగా లేదనే అనుకుంటున్నా. మీరేమైనా చెప్పాలనుకుంటే ఆటగాళ్లను మోటివేట్ చేసేలా ఉండాలి.ఐపీఎల్లో చాలా ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ఆటగాడు ఓ జట్టును వీడితే మరో జట్టు అతడిని తీసుకుంటుంది. కీలకమైన ఆటగాడిని కోల్పోతే మీ విజయాల శాతం సున్నా అవుతుంది. నేను పంజాబ్ జట్టును వీడినపుడు వాళ్లు ఐదో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడూ కనీసం ఐదో స్థానంతో ముగించలేకపోయారు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. -
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తమ జట్టుకు సంబంధించి అభిమానులు వేస్తున్న ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తూ వారిని ఖుషీ చేస్తున్నారు.ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘‘పంజాబ్ కింగ్స్‌లో మీకిష్టమైన ఆటగాడు ఎవరు?’’ అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా.. ప్రీతి జింటా వీరేంద్ర సెహ్వాగ్, ఆడం గిల్‌క్రిస్ట్ పేర్లను చెప్పారు.ఈ మేరకు.. ‘‘డేంజరస్ వీరూగా ఉన్నందుకు వీరేంద్ర సెహ్వాగ్’’ అంటూ హార్ట్ సింబల్ జత చేసిన ప్రీతి జింటా.. ఆడం గిల్‌క్రిస్ట్ అంటే కూడా తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. నాయకుడిగా, ఆటగాడిగా అతడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.కాగా 2014, 2015 సీజన్లలో పంజాబ్ జట్టు తరఫున టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దుమ్ములేపాడు. 30 మ్యాచ్‌లలో కలిపి 660 పరుగులు సాధించాడు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్‌తో క్వాలిఫయర్ మ్యాచ్‌లో అతడు 122 పరుగులు సాధించడం హైలైట్‌గా నిలిచింది.ఇక ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆడం గిల్‌క్రిస్ట్ సైతం 2011- 2103 మధ్య పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 34 మ్యాచ్‌లలో కలిపి 849 రన్స్ చేశాడు. నిలకడైన ఫామ్‌తో జట్టుకు విజయాలు అందించాడు. కెప్టెన్‌గానూ రాణించాడు.గిల్‌క్రిస్ట్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ 2011లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. 2012, 2013లో ఆరో స్థానం సంపాదించింది.ఇక ఫేవరెట్ ప్లేయర్ ప్రశ్న తర్వాత.. ‘‘పంజాబ్ కింగ్స్ జట్టు కోసం మీరింకా ఆలూ పరాఠాలు చేస్తున్నారా?’’ అని ఓ నెటిజన్ అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘లేదు.. అప్పట్లో సౌతాఫ్రికాలో ఓసారి మా జట్టు గెలిచిన తర్వాత పరాఠాలు చేసిచ్చాను. ఆ తర్వాత అలాంటివేమీ చేయలేదు’’ అని ప్రీతి జింటా పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ మరోసారి పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన పదకొండు మ్యాచ్‌లలో కేవలం నాలుగు గెలిచి పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో తాను జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా లేనంటూ ప్రీతి జింటా ఇటీవల పేర్కొన్నారు. ఇక పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. కాగా టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ గతంలో పంజాబ్ జట్టుకు ఆడాడు. అదే విధంగా.. శిఖర్ ధావన్ ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, గాయం కారణంగా అతడు మ్యాచ్‌లకు దూరం కాగా సామ్ కరన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. -
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అనుసరించిన వ్యూహాలను భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా అంటూ మేనేజ్మెంట్కు చురకలు అంటించాడు.ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా కేకేఆర్‌తో తలపడిన ముంబై ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో 24 పరుగుల తేడాతో ఓటమి ఈ సీజన్లో ఎనిమిదో పరాజయాన్ని నమోదు చేసింది.ఛేదనలో తడ‘బ్యా’టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. కేకేఆర్‌ను 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ చేసి ఫర్వాలేదనిపించింది. కానీ లక్ష్య ఛేదనలో మాత్రం తడ‘బ్యాటు’కు గురైంది. 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది.టాపార్డర్ మొత్తం చేతులెత్తేయగా.. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56) ఒక్కడే రాణించాడు. మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇలాంటి తరుణంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(1) ఏడు, టిమ్ డేవిడ్(24) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. తర్వాత టెయిలెండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ముంబై కథ ముగిసింది.మరీ అంత చెత్తగా ఆడతారా?ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌ను ఎందుకు దాచిపెట్టిందో తెలియదు. అలా చేయడం వల్ల మీకు ఏం ప్రయోజనం చేకూరింది?ఇంకా బంతులు మిగిలే ఉన్నాయి. జట్టు మొత్తం ఆలౌట్ అయింది. నిజానికి హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపాల్సింది.కానీ ఛేజ్ చేస్తున్న సమయంలో వరుసగా వికెట్లు పడుతున్నా హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లను ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఎందుకు ఆడించారో అర్థం కాలేదు.లోయర్ ఆర్డర్లో వీళ్లు ఇంకాస్త ముందుగా వస్తే మరీ అంత చెత్తగా ఆడతారని అనుకున్నారా?’’ అని ముంబై మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఉన్నపుడు పాండ్యా నాలుగో స్థానంలో నిలకడగా రాణించిన విషయాన్ని సెహ్వాగ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.చదవండి: T20 WC: హార్దిక్ బదులు అతడిని సెలక్ట్ చేయాల్సింది: పాక్ దిగ్గజం -
T20 WC: సచినే ఓపెనర్‌గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధంగా ఉండాలని సూచించాడు. అంతటి సచిన్ టెండుల్కరే 2007 వరల్డ్‌కప్ టోర్నీలో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడని సెహ్వాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓపెనింగ్ జోడీ గురించి మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.మూడో స్థానంలో ఆడిస్తాను‘‘నాకు గనుక అవకాశం ఉంటే.. అతడి(కోహ్లి)ని ఓపెనింగ్‌కు పంపించను. అతడిని మూడో స్థానంలో ఆడిస్తాను. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా నా ఆప్షన్. కోహ్లి వన్‌డౌన్‌లోనే రావాలి.మిడిల్ ఓవర్లలో ఎలా ఆడాలి అనేది అతడి తలనొప్పి. ఒకవేళ ఆరంభంలోనే వికెట్ పడితే కోహ్లి బ్యాటింగ్‌కు వస్తాడు. కాబట్టి పవర్ ప్లేలో తను ఇన్నింగ్స్ చక్కదిద్దగలడు.ఒకవేళ వికెట్ తొందరగా పడకపోతే.. ఎలా ఆడాలో కెప్టెన్, కోచ్‌ల సూచనలకు అనుగుణంగా అతడు ఆడాలి. జట్టులో ఒక ఆటగాడిగా అతడు తప్పక ఇది చేయాల్సిందే’’ అని క్రిక్‌బజ్ షోలో అతడు వ్యాఖ్యానించాడు.మిడిలార్డర్లో ఆడటం సచిన్‌కు అస్సలు ఇష్టం లేదుఇందుకు ఉదాహరణగా సచిన్ టెండుల్కర్ పేరును ప్రస్తావించిన సెహ్వాగ్.. ‘‘2007 ప్రపంచకప్ టోర్నీలో సచిన్ టెండుల్కర్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేశాడు.మిడిలార్డర్లో ఆడటం సచిన్‌కు అస్సలు ఇష్టం లేదు. అయినా.. జట్టు ప్రయోజనాల కోసం ఒప్పుకొన్నాడు. మీ జట్టులో ఇద్దరు మంచి ఓపెనర్లు ఉండి.. నిన్ను(కోహ్లిని ఉద్దేశించి) మూడో స్థానంలో ఆడమన్నపుడు.. కచ్చితంగా అలాగే చేయాలి.ఓపెనర్లు సెట్ చేసిన మూమెంటమ్‌ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వన్‌డౌన్ బ్యాటర్‌కు ఉంటుంది. నాకు తెలిసి ఈ విషయంలో విరాట్ కోహ్లికి ఎలాంటి అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నా’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.ఓపెనర్లుగా వాళ్లేకాగా ఈసారి పొట్టి ప్రపంచకప్ ఈవెంట్లో కోహ్లి రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడిగా దిగనున్నాడని.. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ లేదంటే.. శుబ్‌మన్ గిల్‌పై వేటు పడనుందన్న వార్తల నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా జూన్ 5న వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
ఐపీఎల్-2024లో టీమిండియా వెటరన్, రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే సాధించాడు. వికెట్లు విషయం పక్కన పెడితే తన బౌలింగ్‌లో భారీగా పరుగులు కూడా సమర్పించుకుంటున్నాడు.8 మ్యాచ్‌ల్లో 9.00 ఏకానమీతో 278 పరుగులిచ్చాడు. ఈ క్రమంలో అశ్విన్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. తనే రాజస్తాన్ కోచ్‌గా గానీ మెంటార్ ఉండి ఉంటే అశ్విన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇచ్చేవాడిని కాదని సెహ్వాగ్ మండిపడ్డాడు."అశ్విన్ వైట్‌బాల్ క్రికెట్‌కు సెట్ కాడు. అశ్విన్‌కు మిడిల్ ఓవర్లలలో వికెట్లు తీసే సత్తా లేదు. గతంలో ఓసారి కేఎల్ రాహుల్ తన స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమనుకున్న పట్టించుకోని వ్యాఖ్యనించాడు. ఇప్పుడు అదే తరహాలో అశ్విన్ కూడా వికెట్లు తీయకపోతేనేం బాగానే బౌలింగ్ చేస్తున్నా కాదా అన్నట్లు మాట్లాడుతున్నాడు. అశ్విన్ ఈ ఏడాది సీజన్లో ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. వచ్చే ఏడాది మెగా వేలంలో కచ్చితంగా అమ్ముడుపోడు. ఏ జట్టు అయినా బౌలర్‌ను సొంతం చేసుకున్నప్పుడు అతడి నుంచి వికెట్లు ఆశిస్తోంది. అంతేతప్ప 4 ఓవర్లలో 25 నుంచి 30 పరుగులు ఇస్తే చాలు అని ఏ జట్టు అనుకోదు . రెండు లేదా మూడుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవాలని ఏ ప్రాంఛైజీనా భావిస్తోంది. అతడి సహచరలు చాహల్, కుల్దీప్ యాదవ్ ఈ ఏడాది సీజన్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. అశ్విన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తే బ్యాటర్లు టార్గెట్ చేస్తారని, క్యారమ్ బాల్స్ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే అతడికి వికెట్లు పడడం లేదు. అతడు తన ఆఫ్ స్పిన్‌ను నమ్ముకుంటే వికెట్లు పడే ఛాన్స్ ఉంది. కానీ నేను రాజస్తాన్ ఫ్రాంచైజీకి మెంటార్ లేదా కోచ్‌గా ఉండి ఉంటే అతడి తుది జట్టులో చోటు దక్కేది కాదని క్రిక్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
అప్పుడు సెహ్వాగ్‌కు ఏడేళ్లు.. ఆర్తికి ఐదేళ్లు.. 20 ఏళ్ల పెళ్లి బంధం! (ఫొటోలు)
-
IPL: సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన స్టొయినిస్..
లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగిన 34 ఏళ్ల ఈ ఆసీస్ స్టార్.. పదేళ్లుగా వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై- లక్నో మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సేన విజయం సాధించింది. సొంతమైదానంలోనే చెన్నైని ఆరు వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. లక్నో గెలుపులో స్టొయినిస్దే కీలక పాత్ర.Have a look at those emotions 🥳The Lucknow Super Giants make it 2/2 this season against #CSK 👏👏Scorecard ▶️ https://t.co/MWcsF5FGoc#TATAIPL | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/khDHwXXJoF— IndianPremierLeague (@IPL) April 23, 2024సీఎస్కే విధించిన 211 లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలోనే ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), కేఎల్ రాహుల్(16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. తానున్నానంటూ స్టొయినిస్ బ్యాటెత్తాడు.మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు 26 బంతుల్లోనే అర్ధ శతకం, 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొని 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక స్టొయినిస్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉండటం విశేషం.Maiden #TATAIPL century ✅Highest T20 chase at Chepauk ✅Double over #CSK ✅Highest individual score in an IPL chase ✅#CSKvLSG #TATAIPL #IPLonJioCinema #MarcusStoinis pic.twitter.com/imjZQcLXa7— JioCinema (@JioCinema) April 23, 2024కాగా ఐపీఎల్ 17 ఏళ్ల చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌పై నమోదైన వ్యక్తిగత స్కోరు స్టొయినిస్దే. అంతకు ముందు 2014లో వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై మీద 122 పరుగులు సాధించాడు. నాడు పంజాబ్ కింగ్స్ తరఫున ముంబైలోని వాంఖడే వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సెహ్వాగ్ ఈ మేరకు పరుగులు రాబట్టాడు.అయితే, చెపాక్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో స్టొయినిస్.. సెహ్వాగ్ పేరిట ఉన్న ఈ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు.. నికోలస్ పూరన్(34), దీపక్ హుడా(6 బంతుల్లో 17 నాటౌట్)తో కలిసి లక్నోను విజయతీరాలకు చేర్చి మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ రన్ ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(124*) సాధించిన ఆటగాడిగా స్టొయినిస్ చరిత్రకెక్కాడు. చదవండి: CSK vs LSG: అతడు అద్భుతం.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం: గైక్వాడ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రోహిత్ కూడా విఫలం.. ట్రోఫీ గెలవలేదు కదా!
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో ఆ జట్టుకు తెలుసునని.. అయితే, సమిష్టిగా రాణిస్తేనే అది సాధ్యపడుతుందని పేర్కొన్నాడు. అదే విధంగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్లో తనను తాను ప్రమోట్ చేసుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని సూచించాడు. అతడు గనుక బ్యాట్ ఝులిపించగలిగితే ఆత్మవిశ్వాసం పెరిగి.. బౌలర్‌గా, కెప్టెన్‌గానూ రాణించగలడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.కాగా ఐపీఎల్-2024లో రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఒత్తిడిలో చిత్తవుతున్న హార్దిక్ సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లలో ముంబై ఓడింది.ఆ తర్వాత గెలుపుబాట పట్టినా నిలకడ ఉండటం లేదు. రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లోనూ పరాజయం పాలై ఎనిమిదింట ఐదో ఓటమిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. గత రెండు- మూడు సీజన్లలో రోహిత్ శర్మ కూడా టైటిల్ సాధించలేకపోయాడని.. స్థాయికి తగ్గట్లు పరుగులు కూడా రాబట్టలేకపోయాడని పేర్కొన్నాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా ఇవన్నీ పట్టించుకోకుండా.. ఆట మీద మాత్రమే దృష్టి పెట్టాలని సూచించాడు.‘‘తన వ్యక్తిగత ప్రదర్శన గురించి హార్దిక్ పెద్దగా ఆందోళన చెందడం లేదనే అనుకుంటున్నా. కానీ తనపై ఉన్న భారీ అంచనాల కారణంగా ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇక జట్టుగా ముంబై ఇండియన్స్ విషయానికొస్తే.. గతేడాది కూడా వాళ్ల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. వాళ్లకు ఇదేం కొత్త కాదు. ఆరంభంలో తడబడ్డా నిలదొక్కుకోగలరు. గతంలో కెప్టెన్‌గా ఉన్నపుడు రోహిత్ శర్మ కూడా పరుగులు చేయలేదు. గత రెండు- మూడేళ్లుగా టైటిల్ కూడా గెలవలేదు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. సమిష్టిగా రాణిస్తే ముందుకు వెళ్లగలరు. అయితే, హార్దిక్ పాండ్యా మాత్రం ఒత్తిడికి లోనుకాకూడదు. ముఖ్యంగా కెప్టెన్సీని భారంగా భావించకూడదు. బ్యాటింగ్ ఆర్డర్లో తనను ప్రమోట్ చేసుకున్నా తప్పేం లేదు. కానీ లోయర్ ఆర్డర్లో వచ్చినా అతడు పరుగులు చేయడం లేదంటూ విమర్శించడం సరికాదు. తను కాస్త ముందుగా వస్తే బాగుంటుంది. బ్యాటింగ్ మెరుగుపడిందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. బౌలింగ్ కూడా చేయగలడు. కెప్టెన్‌గానూ తనను తాను నిరూపించుకోగలడు’’ అని సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.