Top Stories
ప్రధాన వార్తలు
కూటమిలో ‘లోకేష్’ రాగం.. మరోసారి బాబు మైండ్ గేమ్?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి రాజకీయం మారుతోందా? టీడీపీ వర్గాల్లో కొందరు మంత్రి లోకేష్ భావి సీఎం అంటుంటే.. డిప్యూటీ సీఎం అని మరికొందరు వ్యాఖ్యలు చేయడం దీనికి కారణంగా కనిపిస్తోంది. ఈ రెండు పదవుల్లో ఏది దక్కినా.. ఇప్పటివరకూ కూటమి భాగస్వామి, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోదాకు భంగం కలిగినట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. టీడీపీతో కొనసాగితే పవన్ ఎప్పటికీ సీఎం కాలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ నేతను అడ్డుకునేందుకే టీడీపీ లోకేష్‌ను తెరపైకి తెచ్చిందన్న ఆలోచన కూడా జనసేనలో ఉన్నట్లు చెబుతున్నారు.తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పదోన్నతిపై దావోస్ పర్యటన సందర్భంగా చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అయితే లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే చాలని టీడీపీ నేతలు పలువురు బహిరంగంగా కోరుతూంటే.. వీలైనంత తొందరగా సీఎంను చేయాలని చంద్రబాబు నాయుడిపై ఆయన కుటుంబం నుంచే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. దావోస్ పర్యటనలో మంత్రి టీజీ భరత్ చాలా స్పష్టంగా భావి ముఖ్యమంత్రి లోకేష్ అని ప్రకటించగా టీడీపీ నేతలు మాత్రం ఏదైనా ఉంటే కూటమి పక్షాలతో కలిసి మాట్లాడుకుంటామని అంటున్నారు. భరత్ ప్రకటన ఏదో మొక్కుబడి వ్యవహారమని అంటున్నారే కానీ.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసే ప్రతిపాదన ఏదీ లేదని మాత్రం వారు ఖండించకపోవడం గమనార్హం.కొద్దికాలం క్రితం పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడుతూ మరో పదేళ్లపాటు చంద్రబాబే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. లోకేష్‌కు చెక్ పెట్టేందుకు ఆయన ఆ మాట మాట్లాడారా? లేక చంద్రబాబే కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడిని తగ్గించేందుకు పవన్ చేత అలా మాట్లాడించారా? అన్నది చెప్పలేము. ఎందుకంటే.. సీఎం పదవిని ఇప్పుడిప్పుడే వదులుకునే ఆలోచన బాబు చేయరు. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తే జనసేన నుంచి సమస్యలు రావచ్చునని కూడా బాబుకు తెలుసు. అందుకే ఆయన మధ్యే మార్గంగా ప్రస్తుతానికి లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనకు వచ్చి ఉండవచ్చు. కాకపోతే ఈ ప్రతిపాదనకు లోకేష్ మద్దతుదారులు, బాబుగారి కుటుంబం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది చూడాలి.నారా లోకేష్‌కు పదోన్నతిపై ప్రచారం మొదలుపెట్టడం ఒక రకంగా రాజకీయ వ్యూహం. ఇతరుల ద్వారా కొన్ని అంశాలను ప్రచారంలో పెట్టడం.. వ్యతిరేకించే వారిని మానసికంగా సిద్ధం చేయడం దీని వెనుక ఉన్న ఉద్దేశం. అంగీకరించేవారు ఉండవచ్చు లేనివారు వారి దోవన వారు వెళ్లవచ్చునని సంకేతం ఇవ్వడం కూడా. ఇలాంటి విషయాలలో చంద్రబాబుది ఘనాపాటే. గతంలో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేయడానికి ముందు కూడా ఇలాంటి వ్యూహాన్నే ఆయన అమలు చేశారు. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతిపై దుష్ప్రచారం చేయించడం, ఆమె పెత్తనం పెరిగిపోవడం వల్ల పార్టీకి నష్టమంటూ వంత మీడియా ఈనాడులో కథనాలు రాయించడం చేసేవారు. ఆ టైమ్‌లోనే అప్పటి మంత్రి దాడి వీరభద్రరావు రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష్మీపార్వతిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు.దీంతో, చంద్రబాబు వర్గం ఈ పాయింట్‌ను అడ్డం పెట్టుకుని కథ నడిపింది. అదే జరిగితే మీ పరిస్థితి ఏమిటన్న ఆందోళనను ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో కల్పించడంతోపాటు వారిని తనవైపు తిప్పుకునేందుకు వరాల జల్లు కురిపించారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశ చూపారు. పార్టీ అధ్యక్ష పదవిని ఎన్టీఆర్ పెద్దకుమారుడు హరికృష్ణకు ఎరవేశారు. మొత్తమ్మీద ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేశారు. ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే వర్గపోరు వస్తుందని, కుటుంబ పెత్తనం అంటారని ప్రచారం చేయించారు. దగ్గుబాటికి డిప్యూటీ సీఎం, హరికృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి రెండూ దక్కకుండా చూశారు. హరికృష్ణకు మంత్రి పదవి మాత్రమే విదిల్చారు.అయితే మంత్రి పదవి వచ్చేటప్పటికి హరికృష్ణ ఎమ్మెల్యే కాదు. ఆరునెలల్లోపు ఎన్నికై ఉంటే పదవి దక్కేది కానీ.. కాలేకపోయారు. దీంతో మంత్రి పదవి కూడా పోయింది. తరువాతి కాలంలో జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైనా హరికృష్ణకు మంత్రి పదవి ఇవ్వకపోవడం బాబు మార్కు రాజకీయం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గాన్ని నడిపిన చంద్రబాబు, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం వర్గాలను సహించనంటూ హెచ్చరికలు చేస్తుండే వారు. ఇప్పటికీ అదే తరహా రాజకీయం చేస్తున్నారు. నిజంగానే లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సుముఖంగా లేకపోతే, ప్రకటనలు చేస్తున్న టీడీపీ నేతలను వారించే వారు. కానీ, పార్టీ నేత శ్రీనివాసరెడ్డి ఆయన సమక్షంలోనే లోకేష్ పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారని, ఎన్నికలలో చాలా కష్టపడ్డారని, అందువల్ల ఆయనను ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. చంద్రబాబు దీన్ని వారించలేదు.ఇదే సమయంలో మరికొందరు టీడీపీ నేతలు దాన్ని ఒక డిమాండ్‌గా మార్చారు. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ లోకేష్ అన్ని విధాలుగా అర్హుడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో టీడీపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేయడం కూడా గమనించాలి. పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య సంబంధాలు అంత సజావుగా లేవని తేలుతుంది. లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గించినట్లవుతుందని తెలిసినా కూడా వీరంతా ఇలా మాట్లాడుతున్నారంటే అందులో మతలబు అర్థమవుతూనే ఉంది.మరోవైపు లోకేష్ కూడా తన పార్టీ నేతల ప్రకటనలను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆయనే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నా, పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో అతిగా వ్యవహరిస్తున్నారన్న భావనతో ఉప ముఖ్యమంత్రి పదవి కోరుకుంటుండవచ్చు. లోకేష్, పవన్ కళ్యాణ్‌ల మధ్య ప్రచ్ఛన్న పోటీకి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సందర్భంలోనూ ఇరువురి మధ్య సంబంధాలు గొప్పగా ఏమీ లేవని స్పష్టం చేశాయి. తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఉన్నతాధికారులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ చెబితే లోకేష్ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తోసిపుచ్చడం.. ఎన్నికలకు ముందు కూడా సీఎం పదవిని జనసేన అధినేతతో పంచుకోవాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చడం మచ్చుకు రెండు ఉదాహరణలు.ఎన్నికల్లో పొత్తు కావాలని టీడీపీ కోరుకుంటూంటే జనసేనకు యాభై సీట్లు ఇవ్వాలని తమకు పాతికి సీట్లు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పవన్ కళ్యాణ్ ఈ మాట అనేందుకు కూడా జంకారు. ఇలాంటి షరతులే పెట్టి ఉంటే రాజకీయం ఇంకోలా ఉండేది. పవన్ కళ్యాణ్, బీజేపీలకు కూటమిలో ఎంతో కొంత పట్టు దొరికేది. ఎన్నికలకు ముందు తాను, చంద్రబాబు సమానం అనుకుని పవన్ మాట్లాడేవారు. కొంతకాలం అలాగే నడిచింది. చంద్రబాబు కూడా పవన్‌ను అదే భ్రమలో ఉంచుతూ వచ్చారు. కానీ, కాలం మారుతుంది కదా.. ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుతో సమానంగా పవన్ ఎలా ఉంటారన్న ప్రశ్న టీడీపీలో వచ్చింది.ఇక, సీఎం పదవి లోకేష్‌కు ఇవ్వాలన్న వాదన కూడా వస్తుండడంతో లాభం లేదని ఉప ముఖ్యమంత్రి పదవికి ఆయనను తీసుకురావడానికి వ్యూహరచన మొదలైంది. అందులో భాగంగా ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చంద్రబాబుకు చెరో వైపు పవన్ కళ్యాణ్, లోకేష్‌ల బొమ్మలు కూడా ప్రభుత్వ ప్రచార ప్రకటనలలో ముద్రించారు. నిబంధనలకు విరుద్ధమైనా లోకేష్ ఫోటో వేయడం చంద్రబాబు మనసులో మాటను చెప్పడమే అవుతుంది. ఆ తర్వాత స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ ప్రకటనలో కూడా పవన్, లోకేష్‌ల ఫోటోలు వేశారు. దీని ద్వారా పవన్‌కు స్పష్టమైన సందేశం పంపించారు. తద్వారా చంద్రబాబుతో సమానం అనుకుంటున్న పవన్ స్థాయిని సక్సెస్ ఫుల్‌గా తగ్గించారు. ఇక లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేస్తే, పూర్తి ఆధిపత్యం వచ్చేసినట్లే అవుతుంది. తనకు సీఎం పదవి రాకుండా అడ్డుకుంటున్న పవన్‌కు చెక్ పెట్టినట్లు కూడా ఉంటుంది.ఈ వ్యవహారంలో బీజేపీ నేరుగా వేలు పెట్టకుండా వేచి చూస్తోంది. తెలుగుదేశంలో మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్‌ను బహిరంగంగా లేవనెత్తడం గమనార్హం. దానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు, నేతలు పవన్‌ను ముఖ్యమంత్రిని చేసి, లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో రెండు పార్టీల వారు తీవ్ర వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఎవరి వల్ల ఎవరు పవర్లోకి వచ్చారన్నదానిపై చర్చిస్తున్నారు. అది శ్రుతి మించి బూతులు తిట్టుకునే దశకు వెళ్లారు. అయినా పవన్, లోకేష్‌లు నోరు విప్పలేదు. ఇది పవన్, లోకేష్‌ల మధ్య రాజకీయ వార్‌గా మారింది. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గం కాపులు ఎక్కువ మంది ఉన్నచోట పోటీచేసి గెలిచారని, లోకేష్ మాత్రం ఇటీవలి కాలంలో ఎన్నడూ గెలవని మంగళగిరి నుంచి విజయం సాధించారని, పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమే ఎక్కువ అని టీడీపీ అభిమాని ఒకరు పోస్టు పెట్టారు. పవన్ లేకపోతే టీడీపీకి అధికారం ఎక్కడ వచ్చేది.. ఇలాగే చేయండి. మళ్లీ జగన్ సీఎం అవుతారు.. అప్పుడు మీ సంగతి చూస్తారు.. అంటూ కొన్ని అభ్యంతర పదాలతో జనసేన కార్యకర్త ఒకరు పోస్టు పెట్టారు.ఇలా ఇరువైపులా పలువురు విమర్శలు, తిట్ల పురాణం సాగిస్తున్నారు. చంద్రబాబుకు వయసు పెద్దదైందని, అందువల్ల పవన్‌ను సీఎంగా చేసి, లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని జనసేన వారు కోరుతున్నారు. విశేషం ఏమిటంటే చంద్రబాబుకు వయసు మళ్లిందని జనసేన అంటుంటే, దానిని టీడీపీ వారు కూడా ధృవీకరిస్తున్నట్లుగా మాట్లాడుతూ లోకేష్‌ను సీఎం చేయాలని చెబుతున్నారు. మంత్రి టీజీ భరత్ సీఎం సమక్షంలోనే లోకేష్ ముఖ్యమంత్రి కావాలని అన్నారంటే అర్ధం అదే అన్న భావన కలుగుతుంది. లోకేష్, పవన్‌ల మధ్య సాగుతున్న ఈ గొడవతో చంద్రబాబు నిస్సహాయంగా మిగిలిపోతున్నట్లుగా ఉంది. అటు కొడుకు ఇటు పవన్ కళ్యాణ్ అయిపోయారు మరి. దానికితోడు ఈ మధ్య కాలంలో ఆయన చేసిన వివిధ వ్యాఖ్యలలో అసంబద్ధత ఎక్కువగా ఉంటుండటంతో అంతా వయసును గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్నది ఒప్పందం అని, దానిని ఎలా కాదంటారన్నది జనసేన బాధగా ఉంది. కానీ అధికారం రుచి చూసిన పవన్ కళ్యాణ్ అవమానాలనైనా భరిస్తారు కానీ ఇప్పటికైతే టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే కొనసాగుతారన్నది ఎక్కువమంది భావన. నిజంగానే లోకేష్ ఈ టర్మ్‌లోనే ముఖ్యమంత్రి అయితే పవన్ తగ్గి ఉంటారా? లేక ఎదిరిస్తారా? అన్నది అప్పుడే చెప్పలేం. ఏది ఏమైనా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవడానికి రంగం సిద్ధం అవుతున్నట్లే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవం వంటి డైలాగుల జోలికి వెళ్లకుండా సర్దుకుపోక తప్పదేమో!. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఎంపీ ఈటల, అనుచరుల దాడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దాడి చేశారు. పేదల భూములు కబ్జా చేశారనే ఆరోపణల నేపథ్యంలో రియల్ వ్యాపారిపై ఈటల చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.పేదలను భూములను కబ్జా చేస్తున్నారని బాధితులు ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈటల నేడు.. మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో ఉన్న ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పేదల భూములను రియల్ వ్యాపారులు ఆక్రమించుకోవడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు తెలియక కబ్జా స్థలాలను కొంటున్నారు. పేదల భూములకు కబ్జా చేయడం నేరం. పేదల భూములను కబ్జా చేసి వ్యాపారం చేసుకుంటున్న బ్రోకర్లు. పేదల భూములను కబ్జా చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి. బ్రోకర్లకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ. అనేక పేదల కాలనీలకు రూపశిల్పి బీజేపీనే. పేదలు కొనుక్కున్న భూములకు బీజేపీ సంపూర్ణంగా అండగా ఉంటుంది. బీజేపీ తాటాకు చప్పుళ్లకు భయపడదు. అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు.1985లో నారపల్లి, కొర్రెముల గ్రామాల్లో పేదవారు కంచెలు, జంగల్ భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కి, సీపీకి, మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ వివరాలతో ఉత్తరాలు రాస్తాను. తప్పు భూములు కొనుక్కున్న వారిది కాదు.. దొంగ కాగితాలు సృష్టించిన అధికారులది, వాళ్ళని జైల్లో పెట్టాలి. తప్పు బ్రోకర్లది. ఎవరైనా పేదల మీద దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నా. చిన్న జిల్లాలు ఏర్పాటు చెస్తే పాలన సులభం అవుతుంది. కలెక్టర్లు అందుబాటులో ఉంటారు అనుకున్నాం. కానీ కలెక్టర్లు దొరకడం లేదు. పోలీస్ కమిషనర్‌కి మనకు కలవడానికి సమయం ఉండదు కానీ బ్రోకర్లను కలవడానికి మాత్రం సమయం ఉంటుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా ట్వీట్
సాక్షి, ఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. నక్సలిజం చివరి దశలో ఉందన్న అమిత్.. మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. త్వరలోనే మనం మావోయిస్టులు లేని ఇండియాను చూస్తామంటూ ట్వీట్లో పేర్కొన్నారు.మన భద్రతాదళాలు సాధించిన గొప్ప విజయంగా పేర్కొన్న అమిత్‌షా.. నక్సలిజానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అన్నారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక అడుగని.. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు.ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల కీలక నేతలు కూడా మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్ ఉన్నారు. గతంలో వారిపై ప్రభుత్వం కోటి రూపాయలు రివార్డ్ ప్రకటించింది. ఇదీ చదవండి: భారీ ఎన్కౌంటర్.. మావోయిస్ట్ కీలక నేత చలపతి మృతిమావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. తెల్లవారుజామున జరిపిన గాలింపులో మరో 14 మంది మృతదేహాలు లభ్యం కాగా, ఇవాళ మధ్యాహ్నానికి 19కి పెరిగింది. భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.Another mighty blow to Naxalism. Our security forces achieved major success towards building a Naxal-free Bharat. The CRPF, SoG Odisha, and Chhattisgarh Police neutralised 14 Naxalites in a joint operation along the Odisha-Chhattisgarh border. With our resolve for a Naxal-free…— Amit Shah (@AmitShah) January 21, 2025
T20 World Cup 2025: టీమిండియా బౌలర్ హ్యాట్రిక్.. 17 బంతుల్లోనే ముగిసిన ఆట
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భారత్ రెండో విజయం సాధించింది. మలేసియాతో ఇవాళ (జనవరి 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మలేసియాను భారత బౌలర్లు 31 పరుగులకే (14.3 ఓవర్లలో) కుప్పకూల్చారు. భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో (4-1-5-5) చెలరేగింది. మరో స్పిన్నర్ ఆయుషి శుక్లా (3.3-1-8-3) మూడు వికెట్లు తీసింది. వీజే జోషిత్ (2-1-5-1) ఓ వికెట్ పడగొట్టింది. మలేసియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో లభించిన 11 పరుగులే ఆ జట్టు తరఫున అత్యధికం. నలుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. ఇద్దరు 5 పరుగులు, ఇద్దరు 3 పరుగులు, ఒకరు 2, ఇద్దరు ఒక్క పరుగు చేశారు.అనంతరం అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కేవలం 17 బంతుల్లోనే ఆట ముగించేసింది. ఓపెనర్లు గొంగడి త్రిష, జి కమలిని కళ్లు మూసి తెరిచే లోగా ఖేల్ ఖతం చేశారు. త్రిష పూనకాలు వచ్చినట్లు ఊగిపోయి 12 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 27 పరుగులు చేసింది. కమలిని 5 బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు చేసింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో తిరుగులేని రన్‌రేట్‌తో (+9.148) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. గ్రూప్-ఏలో భారత్ సహా శ్రీలంక (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో రెండో స్థానం), వెస్టిండీస్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో మూడో స్థానం), మలేసియా (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో నాలుగో స్థానం) జట్లు ఉన్నాయి.కాగా, భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు చెలరేగి వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం టీమిండియా వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రత్యర్థి నిర్ధేశించిన 45 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలనే ఛేదించింది. గొంగడి త్రిష 4 పరుగులకే ఔటైనా.. కమలిని (16 నాటౌట్), సనికా ఛల్కే (18 నాటౌట్) భారత్‌ను గెలుపు తీరాలు దాటించారు. అంతకుముందు భారత బౌలర్లు పరుణిక సిసోడియా (2.2-0-7-3), ఆయూషి శుక్లా (4-1-6-2), వీజే జోషిత్ (2-0-5-2) విజృంభించడంతో వెస్టిండీస్ 44 పరుగులకే ఆలౌటైంది.
ఢిల్లీలో గెలుపే టార్గెట్.. బీజేపీ రెండో మేనిఫెస్టో విడుదల
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే క్రమంలో ఓటర్లకు కీలక హామీలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ హామీలు ఇవ్వగా తాజాగా బీజేపీ మరో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు.. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు పార్టీలు పలు హామీలు ఇస్తున్నాయి. ఇక, తాజాగా బీజేపీ రెండో మేనిఫెస్టోలను విడుదల చేసింది. ఈ క్రమంలో బీజేపీ అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ‘సంకల్ప పత్రం’ విడుదల చేశారు ఎంపీ అనురాగ్ ఠాకూర్. అలాగే, ఢిల్లీలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటనలో తెలిపారు. దీంతో, విద్యార్థులకు బీజేపీ భారీ ఆఫర్ ప్రకటించింది.#WATCH | Delhi | Launching BJP's 'Sankalp Patra' for Delhi Assembly polls, BJP MP Anurag Thakur says," We will provide to the youth of Delhi one-time financial assistance of Rs 15,000 for preparation of competitive examinations and reimburse two-time travel and application fees.… pic.twitter.com/muyCpF8SJ7— ANI (@ANI) January 21, 2025 ఇదిలా ఉండగా.. అంతకుముందు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మొదటి మేనిఫెస్టోను ప్రకటించింది. ‘సంకల్ప పత్రం’ పార్ట్-1 పేరుతో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ (LPG subsidy) సిలిండర్లను రూ.500కే ఇస్తామని పేర్కొన్నారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.మేనిఫెస్టో ఇలా.. గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం. ఆరు పౌష్టికాహార కిట్లు. ప్రస్తుతం ఇస్తున్న మొదటి సంతానం సమయంలో రూ.5వేలు, రెండో సంతానానికి రూ.6వేలకు ఇవి అదనం‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయంఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు. దీనికి అదనంగా రూ.5లక్షల ఆరోగ్య కవరేజీపేద కుటుంబీలకు రూ.500లకే ఎల్పీజీ సిలిండర్, ప్రతి హోలీ, దీపావళి (ఒకటి చొప్పున) పండగల సమయంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్60-70ఏళ్ల వయోవృద్ధులకు రూ.2500 పెన్షన్, 70ఏళ్ల పైబడిన వారికి రూ.3000జేజే క్లస్టర్లలో అటల్ క్యాంటీన్ల ఏర్పాటు. రూ.5కే భోజనంసంక్షేమ పథకాల అమల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు
ఆర్జీకర్ ఘటన అందుకే ‘అరుదైన కేసు’ కాలేకపోయింది!
యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది కోల్‌కతా యువ వైద్యురాలి హత్యాచారం కేసులో.. సంజయ్ రాయ్‌కి మరణశిక్ష పడకపోవడంపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత అరుదైన కేసు కాదనే ఉద్దేశంతోనే అంతటి శిక్ష వేయడం లేదని సీల్దా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ కేసులో కంటికి కన్నులాగా.. ప్రాణానికి ప్రాణం తీయడమే సరైందని.. న్యాయస్థానం ఆ అంశాల్ని పరిశీలించి ఉండాలనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో బెంగాల్లోనే చర్చనీయాంశమైన కేసుల్ని ప్రస్తావిస్తున్నారు.కిందటి ఏడాది ఆగష్టులో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారోదంతం.. తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన బాట చేపట్టడంతో వైద్య సేవలపైనా ప్రభావం పడడమే అందుకు ప్రధాన కారణం. అదే సమయంలో మహిళలపై అఘాయిత్యాలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందనే వాదనను ఈ కేసు తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే బెంగాల్ సర్కార్ అపరాజిత పేరుతో ప్రత్యేక చట్టం చేసుకుంది కూడా. కానీ, దోషికి సరైన శిక్ష పడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఆర్జీకర్ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఐదు కేసుల్లో మరణశిక్షలు విధించాయి పశ్చిమ బెంగాల్ న్యాయస్థానాలు.1. ఆగష్టు 2023లో మతిగరలో 16 ఏళ్ల అమ్మాయిపై హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. అతనికి సిలిగూరి కోర్టు కిందటి ఏడాది సెప్టెంబర్ 21న మరణశిక్ష విధించింది.2. 2023 ఏప్రిల్‌లో.. తిల్జల ప్రాంతంలో ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం జరిగింది. సెప్టెంబర్ 26వ తేదీన ఆ మానవమృగానికి మరణశిక్ష విధించింది కోల్కత్తా కోర్టు.3. కిందటి ఏడాది అక్టోబర్‌లో కుల్తలి ఏరియాలో తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారానికి తెగబడ్డ వ్యక్తికి.. డిసెంబర్ 6వ తేదీన కోర్టు మరణశిక్ష విధించింది.4. డిసెంబర్ 13వ తేదీన.. తొమ్మిదేళ్ల చిన్నారిని చిదిమేసిన కామాంధుడికి మరణశిక్ష విధించింది ఫరక్కా కోర్టు.5. కిందటి ఏడాది నవంబర్‌లో ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి తెగబడి ప్రాణం తీసిన కిరాతకుడికి ఆదివారం(జనవరి 20న) హూగ్లీ కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది.ఈ ఐదు కేసుల్లో మరణశిక్షలు విధించిన న్యాయస్థానాలు.. ఆర్జీకర్ కేసు, ఆ కేసులో చోటుచేసుకున్న పరిణామాలను ఎందుకు అంతతీవ్రమైనవిగా పరిగణించలేకపోయిందనేది పలువురి ప్రశ్న. అయితే దీనికి న్యాయ నిపుణులు వివరణ ఇస్తున్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ మాట్లాడుతూ.. ఈ తరహా శిక్షలు కేవలం బాధితురాలికో, ఆమె కుటుంబానికో మాత్రమే కాదు.. యావత్ సమాజానికి న్యాయం జరుగుతుందనే సందేశాన్ని పంపిస్తాయి. మహిళలు, మరీ ముఖ్యంగా మైనర్ల విషయంలో కలిగే అభద్రతాభావాన్ని తొలగించే అడుగు అని అన్నారు. అయితే.. పైన చెప్పుకున్న అన్ని కేసులు మైనర్లపై జరిగిన అఘాయిత్యాలే. తీర్పులు ఇచ్చిన అన్ని కోర్టులు.. పోక్సో న్యాయస్థానాలే. పైగా ఈ కేసులన్నింటిలో బాధిత చిన్నారులకు.. వాళ్ల కుటుంబ సభ్యులతో నేరానికి పాల్పడిన వాళ్లకు పరిచయాలు ఉన్నాయి. నమ్మి వెంట వెళ్లిన చిన్నారులను చిధిమేశాయి ఆ మానవమృగాలు. పైగా ఈ కేసుల్లో బలమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే అత్యంత అరుదైన కేసులుగా ఆయా న్యాయస్థానాలు గుర్తించాయి అని చెబుతున్నారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివాస్ ఛటర్జీ. మతిగర, కుల్తలి, ఫరక్కా కేసుల్లో స్వయంగా ఈయనే వాదనలు వినిపించారు. పై ఐదు కేసుల్లో మరణశిక్షలను, అలాగే ఆర్జీకర్ కేసుల్లో యావజ్జీవ కాగారార శిక్షను న్యాయనిపుణులు సమర్థిస్తున్నారు. భావోద్వేగాలు, ప్రజాభిప్రాయాలు.. న్యాయవ్యవస్థలను ఎంతమాత్రం ప్రభావితం చేయబోవని చెబుతున్నారు. అలాగని.. ఆ ఆందోళనలను గనుక పరిగణనలోకి తీసుకుని కోర్టులు సత్వర న్యాయానికి ప్రయత్నించడం ఎంతమాత్రం మంచిదికాదని అంటున్నారు.అత్యంత అరుదైన కేసంటే.. మన దేశంలో అంత్యంత అరుదైన కేసుల్లోనే మరణశిక్షలు విధిస్థాయి న్యాయస్థానాలు. బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఆధారంగా సుప్రీం కోర్టు తొలిసారి ఈ తరహా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు ముగ్గురిని హతమార్చాడనే అభియోగాల కింద బచ్చన్ సింగ్ అనే వ్యక్తికి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించగా.. హైకోర్టు ఆ శిక్షను సమర్థించింది. ఆ తర్వాత కేసు సుప్రీం కోర్టుకు చేరింది.ఐపీసీ సెక్షన్ 302 రాజ్యాంగబద్ధతతో పాటు సీఆర్పీసీలోని సెక్షన్ 354(3) ప్రకారం మరణశిక్షలకు ప్రత్యేక కారణాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలను ఈ కేసు సవాల్ చేసింది. అయితే ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ వైసీ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. 1980 ఆగష్టు 16వ తేదీన తీర్పు వెల్లడించింది. కింది కోర్టులు విధించిన మరణశిక్షను సమర్థించింది.భారతీయ న్యాయవ్యవస్థకు ‘‘అత్యంత అరుదైన కేసు’’ సిద్ధాంతాన్ని తెచ్చిపెట్టింది ఈ తీర్పు. నేర తీవ్రత, ప్రత్యేక పరిస్థితులను, మానవ హక్కులను గౌరవించడంలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే.. అంతిమ మార్గంగా మరణశిక్షలు విధించాలని తీర్పు సమయంలో రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసు తర్వాతి కాలంలో భారతీయ కోర్టులకు మార్గదర్శకంగా మారింది.అంత్యత అరుదైన కేసులకు వర్తించేవి ఇవే..నేర తీవ్రతనేరానికి పాల్పడ్డ తీరు, ఉద్దేశాలుఆ నేరం.. సమాజంపై చూపించే ప్రభావంనేరస్తుడి వయసు, కుటుంబ నేపథ్యం.. ప్రస్తుత పరిస్థితులునేరస్థుడిలో జైలు జీవితం పరివర్తన తీసుకొచ్చే అంశాల పరిశీలనమన దేశంలో అత్యంత అరుదైన కేసుల్లో మరణశిక్షలు పడ్డవెన్నో. వాటిల్లో కోల్‌కతాలో స్కూల్ చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ ధనంజయ్ ఛటర్జీ(1990)కి, నిర్భయ ఘటన(2012)లో, 2008లో ముంబై ఉగ్రదాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్‌లకు అత్యంత ప్రముఖమైన కేసులుగా నిలిచాయి.అయితే.. అత్యంత అరుదైన కేసుల్లో సాధారణంగా కింది కోర్టులు మరణశిక్షలు విధిస్తుంటాయి. వాళ్లు పైకోర్టులకు వెళ్లినప్పుడు.. ఊరట లభించిన సందర్భాలే అధికంగా ఉన్నాయి అని బెంగాల్ మాజీ అడ్వొకేట్ జనరల్ జయంత మిత్రా అంటున్నారు. ఆర్జీకర్ కేసులోనూ నిందితుడు పైకోర్టులో తనకు పడ్డ జీవితఖైదు శిక్షనూ సవాల్ చేసే అవకాశం లేకపోదని చెబుతున్నారాయన.
జవాన్ కార్తీక్ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ఆర్మీ జవాన్ కార్తీక్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) సంతాపం తెలిపారు. కార్తీక్ చూపిన ధైర్యసాహసాలు, త్యాగానికి సెల్యూట్ అని ప్రశంసించారు. ఈ కష్ట సమయంలో కార్తీక్(Jawan Karthik) కుటుంబానికి అండగా నిలుద్దామని చెప్పారు.ఉత్తర జమ్మూలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో కార్తీక్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్తీక్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్. అలాగే, కార్తీక్ చూపిన ధైర్యసాహసాలు, త్యాగానికి సెల్యూట్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ కష్ట సమయంలో కార్తీక్ కుటుంబానికి అందరం అండగా నిలుద్దాం అని వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్‌లోని సొపోర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లా, ఎగువరాగిమాను పెంట గ్రామానికి చెందిన కార్తిక్ వీర మరణం పొందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కార్తిక్ కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని… pic.twitter.com/9P1axvHTi9— YS Jagan Mohan Reddy (@ysjagan) January 21, 2025
AP: కలెక్టరేట్లో డీఆర్వో అలసత్వం.. ఫోన్లో గేమ్ ఆడుతూ..
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అధికారులు రిలాక్స్ అవుతున్నారు. తమ బాధ్యతలు మరచి.. కీలక సమావేశంలో సైతం సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ కీలక సమావేశంలో రెవెన్యూ అధికారి రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలా నిర్వాకం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ క్రమంలో అధికారులందరూ బిజీగా ఉన్నారు. కానీ, డీఆర్వో మలోలా మాత్రం ఈ సమావేశంతో తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా వ్యవహరించారు. కీలకమైన సమావేశంలో డీఆర్వో మలోలా తన సెల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఓవైపు సమావేశం జరుగుతున్నా డీఆర్వో మాత్రం కాలక్షేపం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో, సదరు అధికారి తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
ఆ డాక్టర్ డేరింగ్‌కి మతిపోవాల్సిందే..! వామ్మో మరీ ఇలానా..
ఓ డాక్టర్ తన భార్యకు భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు ఓ భయానక సాహసానికి ఒడిగట్టాడు. పైగా తన భార్య కోరికను తీర్చేందుకే ఇలా చేశానని చెబుతున్నాడు. ఆ ఘనకార్యం వింటే..అమ్మబాబోయే ఏం డాక్టర్‌వయ్యా బాబు అని మండిపడతారు.ఈ వింత ఘటన చైనా(China)లో చోటుచేసుకుంది. తైవాన్‌లోని తైపీకి చెందిన డాక్టర్ చెన్ వీ నోంగ్(Dr Chen Wei-nong) అనే సర్జన్ తనకు తానుగా వేసక్టమీ ఆపరేషన్(Dr Chen Wei-nong) చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోని డాక్యుమెంట్ రూపంలో నెట్టింట షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ సర్జన్(surgeon) నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాడు. భవిష్యత్తులో ఇంక పిల్లలు పుట్టకూడదనే తన భార్య కోరికను నెరవేర్చేందుకు ఇలా చేశానని తెలిపాడు. అదే తాను తన భార్యకు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని చెబుతుండటం విశేషం. ఆయన ఆ వీడియోలో తనకు తానుగా ఎలా వేసెక్టమీ ఆపరేషన్ చేసుకుంటున్నాడో కనిపిస్తుంది. నిజానికి ఈ సర్జరీ జస్ట్ 15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. కానీ ఆయన స్వయంగా చేసుకోవడంతో ఒక గంట వ్యవధి తీసుకుని విజయవంతంగా తన సర్జరీని పూర్తి చేసుకున్నాడు. అంతేగాదు ఆ సర్జరీ చేసిన ప్రదేశంలో ఎంత పెయిన్ ఉంటుందో కూడా వివరించాడు. డాక్టర్ చెన్ వేసెక్టమీ ఆపరేషన్ పదకొండు దశలు గురించి ఆ వీడియోలో వివరంగా వెల్లడించారు. అంతేగాదు ఆ వీడియోలో మరసటి రోజు తాను పూర్తిగా కోలుకున్నట్లు కూడా తెలిపాడు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి ఆ డాక్టర్ డేరింగ్‌కి విస్తుపోయారు. ఎంత డాక్టర్ అయినా తనకు తాను స్వయంగా సర్జరీ చేసుకోవడం అంటే మాటలు కాదు. కచ్చితంగా ఈయన మంచి నైపుణ్యం గల సర్జన్ అయ్యి ఉండాలి అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఆ డాక్టర్ చెన్ దంపతులకు ఎంతమంది పిల్లలు అనేది తెలియాల్సి ఉంది. కానీ పిలల్లు పుట్టకుండా మహిళలే కాదు భర్తలు కూడా ఇలాంటి విషయంలో కాస్త ముందుకువచ్చి వారి బాధను తగ్గించే యత్నం చేయాలనే అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉంది ఇతడి సాహసం. వాస్తవానికి చాలామటుకు మహిళలే పిల్లలు పుట్టకుండా(ట్యూబెక్టమీ) ఆపరేషన్ చేయిచుకుంటున్నారు. View this post on Instagram A post shared by 陳瑋農 整形外科 醫師。晶華診所院長。 (@docchen3) (చదవండి: అనారోగ్యానికి ‘ఆహారం’ కావద్దు!)
ప్రియురాలిని పెళ్లి చేసుకున్న హిట్ సినిమాల దర్శకుడు
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు వివాహ బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి షిమోనా రాజ్‌కుమార్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. వారి పెళ్లి వేడుకులో కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఎలాంటి ప్రచారం లేకుండా అతికొద్దిమంది సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. అయితే, ఆయన సతీమణి షిమోనా గురించి వివరాలు ప్రకటించలేదు. కొత్త దంపతులను స్టార్ హీరో విక్రమ్ ఆశీర్వదించారు.విభిన్నమైన హారర్ థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించిన ‘డిమోంటి కాలనీ’ చిత్రానికి ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. 2015లో వచ్చిన ఈ చిత్రానికి కొనసాగింపుగా గతేడాదిలో ‘డిమోంటి కాలనీ-2’ కూడా విడుదలైంది. హారర్ థ్రిల్లర్ సినిమాలు బాగా ఇష్టపడే వారికి ఆయన పరిచయమేనని చెప్పవచ్చు. విక్రమ్(Vikram) కథా నాయకుడిగా జ్ఞానముత్తు(Ajay Gnanamuthu) తెరకెక్కించిన చిత్రం ‘కోబ్రా’. 2022లో విడుదలైన ఈ మూవీ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే అందుకుంది. ఇందులో విక్రమ్ గెటప్పుల విషయంలో డైరెక్టర్ క్రియేట్ చేసిన విధానం ప్రేక్షకులను ఫిదా చేసింది.(ఇదీ చదవండి: డబ్బుల కోసం కోర్టుకు వెళ్లిన నటుడు దర్శన్)జ్ఞానముత్తు 2010లో షార్ట్ ఫిల్మ్ మేకింగ్ షో, నాలయ అయ్యకునార్ సీజన్-1 లో పోటీలో పాల్గొన్నాడు. అందులో ఫైనలిస్టులలో ఒకరిగా జ్ఞానముత్తు నిలవడంతో గుర్తింపు పొందాడు. తరువాత అతను ప్రముఖ దర్శకుడు మురుగదాస్ వద్ద సహాయ దర్శకుడిగా చేరాడు. 7th సెన్స్, తుపాకి, వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన పనిచేశాడు. View this post on Instagram A post shared by Ajay R Gnanamuthu (@ajaygnanamuthu)
ఆస్పత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
ఇంగ్లండ్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో సూర్య
భారత్‌కు చెందిన మొదటి సోలార్ ఈవీ
మీ ఆశకు అంతుండాలి.. స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఫైర్
తప్పతాగిన నటుడు.. అర్ధనగ్నంగా కేకలు వేస్తూ.. వీడియో వైరల్!
హైదరాబాద్‌లో పెరిగిన రిజిస్ట్రేషన్లు.. ఏ ప్రాంతంలో ఎక్కువంటే..
ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా యువ క్రికెటర్.. ప్రకటించిన ఈసీబీ
T20 World Cup 2025: టీమిండియా బౌలర్ హ్యాట్రిక్.. 17 బంతుల్లోనే ముగిసిన ఆట
ఇద్దరు పిల్లలున్నా ఫర్వాలేదు!
టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి
సైఫ్ అలీఖాన్‌కు తెలీకుండా భార్యనే నిద్రమాత్రలిచ్చింది: చిత్రనిర్మాత
2014-19 మధ్య నాలుగు సార్లు చంద్రబాబు దావోస్ పర్యటన
భార్య పేరు మీద డిపాజిట్.. రూ.32వేలు వడ్డీ
రఘురామ కృష్ణంరాజు లాయర్‌కు సుప్రీంకోర్టు అక్షింతలు
అమెరికాలో టిక్ టాక్ నిలిపివేత.. నిషేధానికి ముందే చైనా కంపెనీ నిర్ణయం
విరాట్ కోహ్లి కీలక ప్రకటన
‘ప్రైవేటు’ చేతికి ఆర్టీసీ డిపోలు!
10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్‌కప్-2025లో సంచలనం
ఈ రాశి వారికి కొత్త ఉద్యోగాలు దక్కుతాయి.. ప్రముఖులతో పరిచయాలు.
నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు
ఆస్పత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
ఇంగ్లండ్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో సూర్య
భారత్‌కు చెందిన మొదటి సోలార్ ఈవీ
మీ ఆశకు అంతుండాలి.. స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఫైర్
తప్పతాగిన నటుడు.. అర్ధనగ్నంగా కేకలు వేస్తూ.. వీడియో వైరల్!
హైదరాబాద్‌లో పెరిగిన రిజిస్ట్రేషన్లు.. ఏ ప్రాంతంలో ఎక్కువంటే..
ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా యువ క్రికెటర్.. ప్రకటించిన ఈసీబీ
T20 World Cup 2025: టీమిండియా బౌలర్ హ్యాట్రిక్.. 17 బంతుల్లోనే ముగిసిన ఆట
ఇద్దరు పిల్లలున్నా ఫర్వాలేదు!
టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి
సైఫ్ అలీఖాన్‌కు తెలీకుండా భార్యనే నిద్రమాత్రలిచ్చింది: చిత్రనిర్మాత
2014-19 మధ్య నాలుగు సార్లు చంద్రబాబు దావోస్ పర్యటన
భార్య పేరు మీద డిపాజిట్.. రూ.32వేలు వడ్డీ
రఘురామ కృష్ణంరాజు లాయర్‌కు సుప్రీంకోర్టు అక్షింతలు
అమెరికాలో టిక్ టాక్ నిలిపివేత.. నిషేధానికి ముందే చైనా కంపెనీ నిర్ణయం
విరాట్ కోహ్లి కీలక ప్రకటన
‘ప్రైవేటు’ చేతికి ఆర్టీసీ డిపోలు!
10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్‌కప్-2025లో సంచలనం
ఈ రాశి వారికి కొత్త ఉద్యోగాలు దక్కుతాయి.. ప్రముఖులతో పరిచయాలు.
నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు
సినిమా
కాంతారగడ
యశవంతపుర: హిట్ మూవీ, జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన కాంతారకు, అలాగే నటుడు రిషభ్ శెట్టి, దర్శక నిర్మాతలకు చిక్కొచ్చిపడింది. నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార–2 (చాప్టర్ 1) సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా గవిగుడ్డలో కాంతార–2 యూనిట్ సినిమా షూటింగ్ చేస్తోంది. అటవీ ప్రాంతంలో పెద్ద మంటలు వేసి షూటింగ్ చేస్తున్నారని స్థానిక నాయకులు కొందరు యసలూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పేలుళ్లు కూడా జరుపుతున్నారని, దీని వల్ల ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని ఆరోపించారు. ప్రశి్నస్తే షూటింగ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు చెప్పారు. కావాలంటే మరోచోటుకు వెళ్లి చిత్రీకరణ చేసుకోవాలని, ఇక్కడ మాత్రం వద్దని గ్రామస్తులు కూడా గళమెత్తారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే తాను కోర్టులకైనా వెళతామని చెప్పడం గమనార్హం. షూటింగ్ అనుమతులు ఇలా జిల్లా యసళూరు విభాగం శనివార సంత అనే చోట హేరూరు గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో జనవరి 3 నుంచి 15 వరకు తాత్కాలిక సెట్టింగ్‌ల నిర్మాణానికి, 15 నుంచి 25 వరకు షూటింగ్ చిత్రీకరణకు నియమాలతో అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హాసన్ ఎసీఎఫ్ మధు, ఆర్ఎఫ్ఒ కృష్ణలు పరిశీలించా. గత 10 రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. అటవీ ప్రాంతంలోకి వందలాది మంది వస్తూ పోతూ ఉన్నారు. అనుమతులు తీసుకున్న ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతోందని కూడా ఆరోపణలు రావడంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నిజమైతే రద్దు చేయాలి: మంత్రి ఖండ్రేఈ నేపథ్యంలో అక్కడ కాంతార సినిమా షూటింగ్‌ను రద్దు చేయాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె అధికారులను ఆదేశించారు. వన్యజీవులు, ప్రకృతికి హాని జరుగుతుంటే తక్షణం షూటింగ్‌ను బంద్ చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రకృతి పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి ఈశ్వరఖండ్రె లేఖ రాశారు. చిత్ర నిర్వాహకులు అడవిలో ఉవ్వెత్తున మంటలను వేసి షూటింగ్ చేయడం, పేలుళ్లు జరిపినట్లు తెలిసిందని మంత్రి ఖండ్రే లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల అక్కడ వన్యజీవులు, చెట్లుచేమలకు ముప్పు వస్తుందని పత్రికలలో వార్తలు వచ్చాయని, ఇదే నిజమైతే తక్షణం షూటింగ్‌ను రద్దు చేయాలని సూచించారు. ఈ పరిణామాలతో షూటింగ్ కొనసాగడం అనుమానంగా ఉంది.
గుడ్ న్యూస్ చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaraam), నటి రహస్య(Rahasya) తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈమేరకు ఆయన సోషల్‌మీడియాలో అధికారికంగా పోస్ట్ చేశాడు. తమ ప్రేమ మరో రెండు అడుగులు ముందుకు పడింది అంటూ తన సతీమణితో దిగిన ఫోటోను పంచుకున్నాడు. తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌తో గతేడాది ఆగష్టులో ఏడడుగులు వేశాడు. కర్ణాటక కూర్గ్‌లోని ఓ రిసార్ట్‌లో వారి పెళ్లి ఘనంగా జరిగింది. ప్రేమ వివాహమే అయినప్పటికీ పెద్దలను ఒప్పించి ఇరువురు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య ఒక్కటి అయ్యారు.ఇన్స్టాగ్రామ్, ఎక్స్ పేజీలో రహస్యతో దిగిన ఫోటోలను కిరణ్ అబ్బవరం షేర్ చేశాడు. బేబీ బంప్‌తో ఉన్న రహస్యకు పలు సూచనలు ఇస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకోబోతున్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన 'బిగిల్' సినిమా నటి)'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య.. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు. గత ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు. 2024 ఆగష్టు నెలలో పెళ్లితో ఒక్కటయ్యారు. ఇకపోతే కిరణ్ అబ్బవరం 'క' అనే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని రహస్య దగ్గరుండి చూసుకుంది. 'క' తర్వాత కిరణ్ 'దిల్రూబా'(Dil Ruba) అనే చిత్రంలో నటిస్తున్నాడు. రుక్సర్ ధిల్లన్ కథానాయిక. ఈ మూవీతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మనసుని హత్తుకునే ప్రేమ కథతో ఇది తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే నెలలో ఈ మూవీని విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)
బిడ్డకు జన్మనిచ్చిన 'బిగిల్' సినిమా నటి
కోలీవుడ్ ప్రముఖ లేడీ కమెడియన్ ఇంద్రజకు (Indraja) కుమారుడు జన్మించాడు. గతేడాదిలో తన స్నేహితుడు డైరెక్టర్ కార్తీక్‌తో ఆమె ఏడడుగులు వేసింది. ఇంద్రజ తండ్రి రోబో శంకర్(Robo Shankar) తమిళ్ చిత్ర సీమలో కమెడియన్‌గా రాణించారు. రోబో డ్యాన్స్‌తో ఫేమస్ అయినందున శంకర్ కాస్తా రోబో శంకర్ అయ్యాడు. కోలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలతోనూ నటించాడు.నటి ఇంద్రజ తమిళ్‌తో పాటు తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించింది. దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో 'విజిల్') సినిమాతో నటిగా మారిన ఈమె.. బాగానే గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత విశ్వక్ సేన్ 'పాగల్', కార్తీ 'విరుమాన్' చిత్రంలోనూ హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలి పాత్రలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్ ఆవేదన)తమిళ్లో ప్రసారం అవుతున్న`మిస్టర్ అండ్ మిస్సిస్` షో చేస్తున్నప్పుడు ఇంద్రజ గర్భవతి అయింది. ఈ విషయం ఆమె చెబుతూ ఆ షో నుంచి మధ్యలోనే తప్పుకుంది. ఇప్పుడు ఆమెకు పండంటి మగబిడ్డ జన్మించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని బంధువులు తెలుపుతున్నారు. మనవడు పుట్టడంతో రోబో శంకర్ కుటుంబం ఆనందంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.కార్తీక్‌ను దత్తత తీసుకున్న రోబో శంకర్,ప్రియాంక దంపతులుఇంద్రజ పెళ్లి తర్వాత అందరూ తన మేనమామనే ఆమె పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంద్రజ తల్లి ప్రియాంకకు కార్తీక్ సొంత సోదరుడు అని చాలామంది అనుకున్నారు. ఇంద్రజకు కార్తీక్ మేనమామ అవుతాడని అనుకున్నారు. ఈ క్రమంలో కార్తీక్ మాట్లాడుతూ.. తాను ఇంద్రజకు మేనమామను కాదని గతంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తనను సోదరుడిగా ప్రియాంక దత్తత తీసుకున్నారని కార్తీక్ వెల్లడించారు. తాను ఇంద్రజ అమ్మ ప్రియాంకకు సొంత తమ్ముడిని కాదు. రోబో శంకర్, ప్రియాంక ఇద్దరూ చాలారోజులుగా తెలుసు. ప్రియాంకకు సోదరులు లేకపోవడంతో ఆమె తనను దత్తత తీసుకున్నారని ఆయన తెలిపారు.
దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్ ఆవేదన
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో ఆయన సతీమణి కరీనా కపూర్(Kareena Kapoor Khan) ఆవేదనతో ఒక పోస్ట్ చేశారు. ఈ ఘటనలో చాలామంది పూర్తి విషయాలు తెలుసుకోకుండానే అసత్యప్రచారాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన గురించి ప్రధాన మీడియాతో పాటు సోషల్‌మీడియాలో క్రియేట్ చేసిన వీడియోను ఓ బాలీవుడ్ నటుడు షేర్ చేయడంతో కరీనా తాజాగా రియాక్ట్ అయ్యారు.బాలీవుడ్ మీడియాలో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) గురించి చాలా కథనాలతో పాటు పలు వీడియోలు ప్రసారం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సైఫ్ ఇంటి చుట్టూ నిత్యం కెమెరాలతో తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబం గురించి ఉన్నవీలేనివి కల్పించి ప్రచారాలు చేస్తున్నారు. తన కుమారులు తైమూర్, జెహ్ కోసం ఆయన కొత్త బొమ్మలు తెచ్చారని, చాలా సంతోషంగా పిల్లలతో సైఫ్ అలీఖాన్ ఆడుకుంటున్న ఫోటోలు ఇవిగో అంటూ షేర్ చేశారు. (ఇదీ చదవండి: త్రిష,టొవినో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులో విడుదల)ఈ వార్తలు చూసిన కరీనా కపూర్ ఆవేదనతో ఒక పోస్ట్ చేసింది. 'దయచేసి ఇలాంటివి ఆపండి. మమ్మల్ని వదిలేయండి' అంటూ వేడుకుంది. అయితే, కొన్ని క్షణాల్లోనే ఆమె దాన్ని డిలీట్ చేయడం గమనార్హం. ఇప్పటికే మీడియా వర్గాలు, ఫ్రీలాన్సర్లు సంయమనం పాటించాలని కరీనా కోరింది. తమ ప్రకటన లేకుండా ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని ఆమె కోరింది. ప్రస్తుతం తామె ఎంతో కఠినమైన రోజులను ఎదుర్కొంటున్నామని పరిస్థితిని అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్ చేసింది. ఆ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా తమ కుటుంబానికి కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరింది.ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన అతను తమ దేశానికి పారిపోయే ప్లాన్‌లో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
Ind vs Eng 1st T20: భారత తుదిజట్టులో వీరే!
ఇంగ్లండ్‌తో టీ20 సమరానికి(India vs England T20 Series) టీమిండియా సన్నద్ధమైంది. కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం(జనవరి 22) బట్లర్ బృందంతో తొలి టీ20లో తలపడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో 3-1తో ఓటమి తర్వాత భారత జట్టు ఆడుతున్న మొదటి సిరీస్ ఇది.ఈ నేపథ్యంలో తిరిగి విజయాల బాట పట్టాలని.. ఇంగ్లండ్‌తో టీ20లతో పాటు వన్డేల్లోనూ అదరగొట్టాలని టీమిండియా భావిస్తోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ముందు జరిగే ఈ పరిమిత సిరీస్‌లలో విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది.ఓపెనింగ్ జోడీ అదేకాగా ఇంగ్లండ్‌తో తొలుత ఐదు టీ20లు, అనంతరం మూడు వన్డేల సిరీస్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి టీ20లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ జోడీనే ఓపెనర్లుగా కొనసాగనున్నారు. నిజానికి సంజూ ఓపెనింగ్ బ్యాటర్‌గా ప్రమోట్ అయిన తర్వాతే నిలకడగా రాణిస్తున్నాడు.ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్‌లో రెండు శతకాలతో చెలరేగిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ఓపెనింగ్ స్థానంలో వచ్చి ఇప్పటి వరకు 366 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేటు 198.91 కావడం గమనార్హం. ఇక అంతర్జాతీయ టీ20లలో సంజూ ఇప్పటికే మూడు సెంచరీలు తన పేరిట లిఖించుకున్నాడు.మరోవైపు.. అభిషేక్ శర్మ మాత్రం ఐపీఎల్ మాదిరి టీమిండియా తరఫున బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ తర్వాత అతడి సగటు కేవలం 18.85 కావడం గమనార్హం. అయితే, దేశీ టీ20 టోర్నీలో మాత్రం మంచి ఫామ్ కనబరిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించిన అభిషేక్.. 255 పరుగులు చేశాడు.వరుసగా మూడు శతకాలుఇక మూడో స్థానంలో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ దిగడం ఖాయమే. సౌతాఫ్రికాతో టీ20లలో వరుస శతకాలు బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సెంచరీతో చెలరేగాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్‌గా వరుసగా మూడు శతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.మరోవైపు.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రాగా.. ఈసారి కూడా టీమిండియా ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై శతకం(టెస్టు) బాదిన నితీశ్ రెడ్డి.. తనకు గుర్తింపు తెచ్చిన టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్‌పై ఏ మేరకు రాణిస్తాడో చూడాలి! వీరితో పాటు ఫినిషర్ రింకూ జట్టులో ఉండనే ఉంటాడు.షమీ రాక.. రాణాకు నో ఛాన్స్ఇక బౌలర్ల విషయంలో.. ముఖ్యంగా పేసర్ల విషయంలో కాస్త సందిగ్దం నెలకొనే అవకాశం ఉంది. దాదాపు పద్నాలుగు నెలల తర్వాత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. కాబట్టి అతడు పూర్తి ఫిట్‌గా ఉంటే యాక్షన్‌లోకి దిగడం లాంఛనమే. అయితే, అతడితో పాటు పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడికే ఛాన్స్ దక్కనుంది.చాంపియన్స్ ట్రోఫీకి ముందు అర్ష్ కూడా వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడతాడు. దీంతో హర్షిత్ రాణా బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇక స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుదిజట్టులో ఆడనుండగా.. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయిని మేనేజ్మెంట్ పక్కనపెట్టనున్నట్లు సమాచారం. ఇక వికెట్ కీపర్‌గా సంజూ అందుబాటులో ఉంటాడు కాబట్టి ధ్రువ్ జురెల్ కూడా బెంచ్‌కే పరిమితమవ్వాల్సిన పరిస్థితి.ఇంగ్లండ్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే
‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్(Sanju Samson) తండ్రి శాంసన్ విశ్వనాథ్ మరోసారి తీవ్ర ఆరోపణలతో తెరమీదకు వచ్చారు. తన కుమారుడి ఎదుగులను ఓర్వలేక.. కావాలనే తొక్కేస్తున్నారంటూ కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ)పై మండిపడ్డారు. అసోసియేషన్‌లోని ‘పెద్ద తలకాయల’పై తనకేమీ కోపం లేదని.. సమస్యంతా అబద్దాలను కూడా నిజంలా ప్రచారం చేసే ‘చిన్నవాళ్ల’ గురించేనని పేర్కొన్నారు.కాగా ఇటీవల అంతర్జాతీయ టీ20లలో మూడు శతకాలతో చెలరేగాడు కేరళ స్టార్ సంజూ శాంసన్. ఈ క్రమంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) జట్టులో చోటు దక్కడం ఖాయమని సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం అభిప్రాయపడ్డారు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో సంజూ సత్తా చాటగలడని మద్దతు పలికారు.సంజూ శాంసన్‌కు మొండిచేయిఅయితే, ఈ మెగా టోర్నీలో సంజూ శాంసన్‌కు టీమిండియా సెలక్టర్లు మొండిచేయి చూపారు. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్(KL Rahul)తో పాటు రిషభ్ పంత్(Rishabh Pant)ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ ఆడకపోవడం కూడా ఇందుకు ఓ కారణం అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కాగా దేశీ క్రికెట్ టోర్నీల్లో కేరళ జట్టుకు సంజూ కెప్టెన్‌గా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఈసారి మాత్రం కేసీఏ అతడి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించింది. తాము నిర్వహించిన మూడు రోజుల శిక్షణా శిబిరానికి హాజరుకానుందున సంజూకు విజయ్ హజారే ట్రోఫీ ఆడే జట్టులో చోటివ్వలేదని తెలిపింది.అదే విధంగా.. సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడో.. లేదో కూడా తమకు సమాచారం ఇవ్వలేదని సంజూపై ఆరోపణలు చేసింది. తనకు నచ్చినపుడు వచ్చి ఆడతామంటే కుదరదని.. అందరి ఆటగాళ్లలాగే అతడు కూడా అని స్పష్టం చేసింది.నా కుమారుడిపై పగబట్టారునిజానికి విజయ్ హజారే ట్రోఫీలో గనుక తనను తాను నిరూపించుకుంటే సంజూ కచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీ రేసులో ఉండేవాడే! ఈ పరిణామాల నేపథ్యంలో సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ స్పందించారు. ‘‘కేసీఏలో ఉన్న కొద్ది మంది వ్యక్తులు నా కుమారుడికి వ్యతిరేకంగా పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పగ సాధిస్తున్నారు.ఇంతవరకు మేము అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈసారి వారి చేష్టలు శ్రుతిమించాయి. సంజూ ఒక్కడే క్యాంపునకు హాజరు కాలేదన్నట్లు మాట్లాడుతున్నారు. చాలా మంది శిక్షణా శిబిరంలో పాల్గొనకపోయినా వాళ్లను ఎంపిక చేశారు.వారి ప్రమేయం లేదుకేసీఏ అధ్యక్షుడు జయేశ్ జార్జ్, కార్యదర్శి వినోద్‌కు ఈ విషయంలో ప్రమేయం లేదని అనుకుంటున్నా. అయితే, కొంతమంది కిందిస్థాయి వ్యక్తులు సంజూ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ వారి మనసులలో విషాన్ని నింపుతున్నారు’’ అని విశ్వనాథ్ మాతృభూమికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు ఆరోపణలు చేశారు.కాగా గతంలోనూ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ వల్ల తన కుమారుడి కెరీర్ నాశనం అయిందని.. పదేళ్ల పాటు అతడి సమయం వృథా అయిందని పేర్కొన్నారు. ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన కొడుకుకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. కాగా సంజూ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే
ఆసీస్‌దే యాషెస్
మహిళల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా తిరిగి సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 20) జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆసీస్ మరో రెండు టీ20లు, ఓ టెస్ట్ మ్యాచ్ మిగిలుండగానే 8-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్ట్ మ్యాచ్ కలిగిన మల్టీ ఫార్మాట్ యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న జరిగిన తొలి టీ20లోనూ ఆసీస్ విజయం సాధించింది. తద్వారా ఆసీస్ ఖాతాలో 8 పాయింట్లు (ఒక్కో గెలుపుకు రెండు పాయింట్లు) చేరాయి.ఈ సిరీస్‌లో ఇంకా రెండు టీ20లు, ఓ టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ గెలిచినా ఇంగ్లండ్ కనీసం సిరీస్‌ను సమం కూడా చేసుకోలేదు. తదుపరి మ్యాచ్‌లన్నీ గెలిస్తే ఇంగ్లండ్ ఖాతాలో 6 పాయింట్లు మాత్రమే ఉంటాయి.తొలి టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (51 బంతుల్లో 75; 11 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటింది. మరో ఓపెనర్ జార్జియా వాల్ (21), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (25), కెప్టెన్ తహిల మెక్‌గ్రాత్ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ (7), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (3) తక్కుక స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా.. గ్రేస్ హ్యారిస్ 8 బంతుల్లో 14, జార్జియా వేర్హమ్ 10 బంతుల్లో 11 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఫ్రేయా కెంప్, చార్లీ డీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 16 ఓవర్లలో 141 పరుగులకే టపా కట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సోఫీ డంక్లీ (59) ఒక్కరే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. నాట్ సీవర్ బ్రంట్ (20), కెప్టెన్ హీథర్ నైట్ (18), ఆమీ జోన్స్ (12), సోఫీ ఎక్లెస్టోన్ (13), ఫ్రేయా కెంప్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో జార్జియా వేర్హమ్ 3 వికెట్లు పడగొట్టగా.. అలానా కింగ్ 2, మెగాన్ షట్, కిమ్ గార్త్, సదర్‌ల్యాండ్, తహిల మెక్‌గ్రాత్ తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్‌కు ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ఆలైస్సా హీలీ దూరమైంది. గాయం కారణంగా ఆమె ఈ మ్యాచ్‌లో ఆడలేదు. హీలీ స్థానంలో తహిల మెక్‌గ్రాత్ ఆసీస్‌కు సారథ్యం వహించింది. హీలీ తదుపరి సిరీస్‌లో కొనసాగడం కూడా అనుమానమే అని తెలుస్తుంది. ఈ సిరీస్‌లో రెండో టీ20 జనవరి 23న కాన్బెర్రాలో జరుగనుంది. అనంతరం జనవరి 25న మూడో టీ20 అడిలైడ్‌లో.. ఏకైక టెస్ట్ మ్యాచ్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు మెల్బోర్న్లో జరుగనున్నాయి.
ఎంత కాలం విదేశీ కోచ్‌లను తెచ్చుకుంటారు?.. జీతాలు పెంచుతాం!
భారత బ్యాడ్మింటన్ మాజీ నంబర్‌వన్, కామన్వెల్త్ క్రీడల కాంస్య పతక విజేత అనూప్ శ్రీధర్ రిటైర్మెంట్ తర్వాత.. దాదాపు దశాబ్ద కాలంగా కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇన్నేళ్లలో కోచ్‌గా అతడికి మంచి పేరు ఉంది. ఇటీవలి కాలంలో పీవీ సింధు, లక్ష్య సేన్లతో కూడా కలిసి అనూప్ పని చేశాడు. ఇప్పుడు అనూప్ సింగపూర్ జాతీయ జట్టు కోచింగ్ బృందంలో భాగం అవుతున్నాడు. సింగపూర్ టీమ్‌కు అదనపు సింగిల్స్ కోచ్‌గా అనూప్ శ్రీధర్ నియమితుడయ్యాడు. ఇక వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సాయిప్రణీత్ కూడా ఏడాది క్రితం ఆటకు రిటైర్మెంట్ పలికి అమెరికాలోని ఒక క్లబ్‌కు కోచ్‌గా వెళ్లాడు. కోచ్‌గా వ్యక్తిగతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్‌లకు మెంటార్‌గా ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీ విజయాల్లో భాగంగా ఉన్న మొహమ్మద్ సియాదతుల్లా కూడా ఇదే బాటలో నడిచారు.సంవత్సరం క్రితమే అమెరికాలోని ఒరెగాన్ అకాడమీలో కోచ్‌గా చేరాడు. శ్రీధర్, సియాదత్ భారత్‌కు చెందిన అగ్రశ్రేణి ఆటగాళ్లతో పని చేసిన వారే. అయితే ఆర్థికపరంగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి వీరికి తగినంత మద్దతు లభించలేదు. కోచ్‌లకు ‘బాయ్’ ఇచ్చే తక్కువ ఫీజుతో పని చేస్తూ వచ్చిన వీరు తగిన అవకాశాల కోసం వలస వెళ్లారు. పారుపల్లి కశ్యప్, గురుసాయిదత్ కూడా కోచింగ్ వైపుఇప్పుడు పారుపల్లి కశ్యప్, గురుసాయిదత్ కూడా ఆడటాన్ని పక్కన పెట్టి కోచింగ్ వైపు వచ్చారు. ఇప్పటికే శ్రీకాంత్, ప్రణయ్, ప్రియాన్షు రజావత్‌లకు ట్రైనర్లుగా వ్యవహరిస్తున్న వీరు... చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మార్గనిర్దేశనంలో యువ ఆటగాళ్లు తరుణ్ మన్నేపల్లి, అన్మోల్ ఖర్బ్, అనుపమ ఉపాధ్యాయ, రక్షితలకు శిక్షణ ఇస్తున్నారు.మరోవైపు మాజీ ఆటగాళ్లు మను అత్రి, సుమీత్ రెడ్డి కూడా కోచింగ్ వైపు వచ్చేయగా... సీనియర్ కోచ్ అరుణ్ విష్ణు భారత జట్టును వీడి నాగపూర్‌లోని సొంత అకాడమీకి వెళ్లిపోయాడు. ప్రస్తుత స్థితిలో శిక్షణకు భారత కోచ్‌లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నా... ‘బాయ్’ ఇచ్చే స్వల్ప జీతాల కారణంగా వారు ముందుకు వచ్చి భారత జట్టులో కలిసి పని చేయలేకపోతున్నారు. మాజీ ఆటగాళ్లను చూస్తే అరవింద్ భట్, చేతన్ ఆనంద్, గుత్తా జ్వాల సొంత అకాడమీలు నిర్వహించుకుంటున్నారు. ‘భారత కోచ్‌లకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎవరూ ఎక్కువ కాలం సాగలేరు. దాదాపు 10 వేల డాలర్ల నెల జీతానికి విదేశీ కోచ్‌లను తీసుకోవడంలో తప్పు లేదు.బాగా సంపాదించుకోవచ్చుఅయితే వారిలో నాలుగో వంతు కూడా భారత కోచ్‌లకు ఇవ్వడం లేదు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ సమయంలోనే జీతాలు పెంచి రూ.50 వేలు చేశారు. ఇది చాలా తక్కువ మొత్తం. అందుకే భారత జట్టుతో కలిసి పని చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భారత కోచ్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవమే. కానీ ఏ అమెరికాలాంటి దేశానికి వెళితే బాగా సంపాదించుకోవచ్చు. సొంత అకాడమీ పెట్టినా మంచి అవకాశాలుంటాయి’ అని అరుణ్ విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల భారత మహిళల సింగిల్స్ కోచ్‌గా ఇర్వాస్యా ఆది ప్రతమ (ఇండోనేసియా), డబుల్స్ కోచ్‌గా టాన్ కిమ్ హర్ (మలేసియా)లను ‘బాయ్’ నియమించింది. ఎంత కాలం విదేశీ కోచ్‌లను తెచ్చుకుంటారు?‘సాంకేతిక అంశాలు నేర్పించడం మాత్రమే కోచ్ పని కాదు. టోర్నీలకు సంబంధించి సరైన మార్గనిర్దేశనం, గాయాల విషయంలో జాగ్రత్తలు వంటి అన్ని అంశాలు చూడాల్సి ఉంటుంది. ఇప్పుడైనా మన భారత కోచ్‌లపై విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. రిటైర్డ్ ఆటగాళ్లకు సరైన గుర్తింపు, జీతాలు, అవకాశాలు ఇస్తే మనమూ అత్యుత్తమ ప్లేయర్లను తయారు చేయవచ్చు. ఎంత కాలం విదేశీ కోచ్‌లను తెచ్చుకుంటారు’ అని పారుపల్లి కశ్యప్ ప్రశ్నించాడు.జీతాలు పెంచుతాంతాజా పరిస్థితి వాస్తవమేనని అంగీకరించిన ‘బాయ్’ కార్యదర్శి సంజయ్ మిశ్రా... దీనిని చక్కదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ‘నాలుగు నెలల క్రితం భారత జట్టు సహాయక సిబ్బంది జీతాలు పెంచాం. ట్రైనర్లు, ఫిజియోథెరపిస్ట్‌లు అప్పటి వరకు తీసుకుంటున్న మొత్తంతో పోలిస్తే 50–75 శాతం పెంచాం. ఇక తర్వాతి వంతు కోచ్‌లదే. జాతీయ క్యాంప్‌లో ఉన్న కోచ్‌ల జీతాలను త్వరలోనే సవరిస్తాం’ అని ఆయన చెప్పారు. చదవండి: విరాట్ కోహ్లి కీలక ప్రకటన
బిజినెస్
‘బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తాం’
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్ దేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా డాలర్‌కు నష్టం కలిగించేలా డీ-డాలరైజేషన్(యూఎస్ డాలర్ విలువ తగ్గించేలా) ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఓవల్ కార్యాలయంలో జరిగిన అధ్యక్ష పత్రాలపై సంతకాల కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్యంలో యూఎస్ డాలర్ వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నించే ఏ బ్రిక్స్ దేశంపైనైనా 100 శాతం సుంకాన్ని విధిస్తామని హెచ్చరించారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ దేశాలు ద్వైపాక్షిక, బహుపాక్షిక వాణిజ్యాల్లో స్థానిక కరెన్సీల వాడకాన్ని పెంచాలని యోచిస్తున్నాయి. ఈమేరకు ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ దేశాలు అనుసరిస్తున్న విధానాలను ట్రంప్ అమెరికా ఆర్థిక పరపతికి ప్రత్యక్ష సవాలుగా భావిస్తున్నారు. అందుకే ఆయన అమెరికాతో వాణిజ్యం చేసే బ్రిక్స్ దేశాలపై భవిష్యత్తులో 100 సుంకాలు విధిస్తామని స్పష్టం చేసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇది హెచ్చరిక కాదు.. స్పష్టతట్రంప్ ఈమేరకు చేసిన ప్రకటలో తన హెచ్చరికను ముప్పుగా చూడరాదని తెలిపారు. ఈ అంశంపై స్పష్టమైన వైఖరిగా మాత్రమే చూడాలని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ డీ-డాలరైజేషన్ విషయంలో అమెరికా బలహీనమైన స్థితిలో ఉందని బైడెన్ సూచించినట్లు చెప్పారు. అయితే బ్రిక్స్ దేశాలతో అమెరికా వాణిజ్యం గణీనీయంగా ఉందని, వారు తమ ప్రణాళికలను(డీ-డాలరైజేషన్‌కు సంబంధించి) ముందుకు సాగలేరని ట్రంప్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘చాలా చెడ్డ దేశం’.. రాగానే ట్రంప్ చర్యలు షురూఆర్థిక స్థిరత్వానికి విఘాతంట్రంప్ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి దూకుడు సుంకాల విధానాలు వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయని, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి విఘాతం కలిగిస్తాయని విమర్శకులు వాదిస్తున్నారు. మరోవైపు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, అమెరికా ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి ట్రంప్ దృఢమైన వైఖరి అవసరమని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు లాభపడి 23,416కు చేరింది. సెన్సెక్స్(Sensex) 92 పాయింట్లు ఎగబాకి 77,164 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 80.07 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.54 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే ఎలాంటి మార్పు చెందలేదు. నాస్డాక్ 1 శాతం ఎగబాకింది.క్యూ3 ఫలితాలతోపాటు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదాయపన్నుసహా పలు రంగాల నుంచి సంస్కరణలకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతులు అందుతున్న విషయం విదితమే. ద్రవ్య విధానాలు, ఆర్థిక వృద్ధి చర్యలు, పెట్టుబడుల కేటాయింపు, కీలక రంగాలలో సంస్కరణలు వంటి పలు అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. ఇదేవిధంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు సైతం మార్కెట్లలో సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
కార్పొరేట్ వ్యవహారాలపై సెబీ నిర్ణయం
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ వినిర్ ఇంజినీరింగ్ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి ముసాయిదా ప్రాస్పెక్టస్ సమర్పించింది. దీని ప్రకారం ఐపీవోలో భాగంగా 5,33,00,000 షేర్లను కంపెనీ ఆఫర్ చేయనుంది. ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్ నితేష్ గుప్తా వీటిని ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద విక్రయించనున్నారు. షేర్ల ముఖవిలువ రూ.2గా ఉంటుంది.ఇదీ చదవండి: మరిన్ని సంస్థలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలుఆనంద్ రాఠీకి సెబీ చెక్ఐపీవో ప్రాస్పెక్టస్ వెనక్కిన్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా బ్రోకింగ్ కంపెనీ ఆనంద్ రాఠీ(Anand Rati) గ్రూప్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలకు చెక్ పెట్టింది. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ 2024 డిసెంబర్లో దాఖలు చేసిన ఐపీవో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తిప్పి పంపింది. వీటి ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ ద్వారా ఆనంద్ రాఠీ షేర్ రూ. 745 కోట్లు సమీకరించాలని భావించింది. ఇందుకు ఈక్విటీని తాజాగా జారీ చేయాలని ప్రతిపాదించింది. అయితే కారణాలు వెల్లడించకుండా సెబీ ప్రాస్పెక్టస్‌ను రిటర్న్ చేసింది.
బీమా పరిశ్రమకు ధీమా
భారత జీడీపీ 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడిస్(Moody's) అంచనా వేసింది. 2025–26లో 6.6 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ బలమైన విస్తరణతో బీమా రంగం ప్రయోజనం పొందనున్నట్టు పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance)కు పెరుగుతున్న డిమాండ్‌తో బీమా కంపెనీలు ప్రీమియంలో స్థిరమైన వృద్ధిని చూడనున్నాయని వివరించింది. అధిక ప్రీమియం ఆదాయం, పెరుగుతున్న ప్రీమియం ధరలు, ప్రభుత్వ సంస్కరణలతో బీమా రంగం లాభదాయకత మెరుగుపడనున్నట్టు అంచనా వేసింది.‘భారత ప్రైవేటు బీమా కంపెనీలు తమ వినియోగదారుల బేస్‌ను పటిష్టం చేసుకోవడం కొనసాగనుంది. కాకపోతే అండర్‌రైటింగ్ ఎక్స్పోజర్, నియంత్రణపరమైన మార్పులతో వాటి క్యాపిటల్ అడెక్వెసీపై ఒత్తిళ్లు కొనసాగనున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ 2024–25లో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. ముందటి సంవత్సరంలో వృద్ధి 8.2 శాతం కంటే కొంత తక్కువ. భారత తలసరి ఆదాయం–కొనుగోలు శక్తి సమానత్వం సైతం వృద్ధి చెందుతోంది. 11 శాతం వృద్ధితో 2024 మార్చి నాటికి ఇది 10,233 డాలర్లకు చేరింది’ అని మూడిస్ పేర్కొంది. భారత జాతీయ గణాంక కార్యాలయం (NSO) 2024–25 సంవత్సరానికి జీడీపీ 6.4 శాతం వృద్ధి సాధిస్తుందన్న అంచనా కంటే మూడిస్ అంచనాలు బలంగా ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: మరిన్ని సంస్థలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలుభారీ అవకాశాలు..అధిక సగటు ఆదాయం, వినియోగదారుల రిస్క్ ధోరణి బీమాకు, ముఖ్యంగా ఆరోగ్య బీమాకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు మూడిస్ పేర్కొంది. 2024 మొదటి ఎనిమిది నెలల్లో బీమా ప్రీమియం ఆదాయం 16 శాతం పెరిగినట్టు తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రీమియంలో 8 శాతం వృద్ధిని అధిగమించినట్టు వివరించింది. ‘భారత్‌లో బీమా విస్తరణ రేటు (జీడీపీలో బీమా ప్రీమియంల వాటా) 2024 మార్చి నాటికి 3.7 శాతంగానే ఉంది. యూకే 9.7 శాతం, యూఎస్ 11.9 శాతంతో పోల్చి చూస్తే చాలా తక్కువ. అందుకే భారత బీమా రంగం బలమైన విస్తరణకు పుష్కల అవకాశాలున్నాయి’ అని పేర్కొంది.
ఫ్యామిలీ
సేఫ్ లడకీ దేశాన్ని చుట్టేస్తోంది!
కాళ్లకు చక్రాలుంటే బావుణ్ణు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దేశమంతా చుట్టేయవచ్చు. ఈ కోరిక చాలామందికే ఉంటుంది. తమిళనాడుకి చెందిన సరస్వతి అయ్యర్ మాత్రం ఈ మాటను నిజం చేస్తోంది. నిజం చేయడమంటే కాళ్లకు చక్రాలు కట్టుకోలేదు కానీ కాళ్లకు పని చెబుతోంది, చక్రాలున్న వాహనాల్లో హిచ్‌హైకింగ్ (ఆ దారిలో వెళ్లే వాహనాల్లో లిఫ్ట్ అడుగుతూ వెళ్లడం) చేస్తూ పర్యటిస్తోంది. దేశంలో ఆ మూల నుంచి ఈ మూలకు ఈ మూల నుంచి ఆ మూలకు అటూ ఇటూ పర్యటించేసింది. ఉమన్ సోలో ట్రావెల్ ఒక ట్రెండ్‌గా మారిన ఈ రోజుల్లో సోలో ట్రావెల్‌తోపాటు జీరో బడ్జెట్ ట్రావెల్ కూడా సాధ్యమేనని నిరూపించింది సరస్వతి అయ్యర్.జీవితాన్ని చదివేస్తోంది!సరస్వతి అయ్యర్ రెండేళ్ల కిందట ఉద్యోగం నుంచి విరామం తీసుకుంది. ఉద్యోగం చేయడానికి పుట్టలేదు, ఇంకా ఏదో సాధించాలనుకుంది. దేశమంతా చుట్టి వచ్చిన తర్వాత తన గురించి తాను సమీక్షించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ప్రయాణం కట్టింది. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆమె దగ్గర ఉన్నది రెండు జతల దుస్తులు, ఒక గుడారం, ఫోన్ చార్జింగ్ కోసం ఒక పవర్ బ్యాంక్. ఈ మాత్రం పరిమితమైన వనరులతో ఆమె పర్వత శిఖరాలను చూసింది. మారుమూల గ్రామాలను పలకరించింది. దేవాలయాల్లో ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించింది. బస కోసం ఆలయ్ర ప్రాంగణాలు, ఆశ్రమాలు, ధర్మశాలలను ఎంచుకుంది. భోజనం కూడా అక్కడే. ఎక్కడైనా శ్రామికులు పని చేస్తూ కనిపిస్తే వారితో కలిసి పని చేస్తోంది. వారితో కలిసి భోజనం చేస్తోంది. పొలంలోనే గుడారం వేసుకుని విశ్రమిస్తోంది. ఈ పర్యటన ద్వారా ఆమె ఇస్తున్న సందేశం మహిళలు సోలో ట్రావెల్ చేయగలరని నిరూపించడం మాత్రమే కాదు. మనదేశంలో మహిళలకు ఉన్న భద్రతను చాటుతోంది. ఒక సాహసం చేయాలంటే అది అంత ఖరీదైనదేమీ కాదని. అలాగే... ఒక పర్యటన జీవిత దృక్పథాన్ని మార్చేస్తుందనే జీవిత సత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది సరస్వతి అయ్యర్.(చదవండి: నృత్యం చిత్తరువు అయితే..!)
నృత్యం చిత్తరువు అయితే..!
ఒక ఆర్ట్ షోను సందర్శించినప్పుడు మన మనస్సులో కొన్ని ప్రశ్నలు మెదలుతాయి. అవేంటంటే... ‘నేనేం చూస్తున్నాను? ఈ ఆర్ట్ నాకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది? నేను ఏ సందేశాన్ని నాతోపాటు ఇంటికి తీసుకువెళుతున్నాను? ఆర్ట్‌వర్క్ నాతో మాట్లాడుతుందా లేదా నన్ను ఆకర్షిస్తుందా?’ ఇలాంటి ప్రశ్నల సముదాయానికి ‘గ్రేస్‌ఫుల్ స్ట్రోక్స్’ సరైన సమాధానం చెబుతుంది.అక్కడ మనం ఏ మూల నుండి చూసినా ప్రతి పెయింటింగ్ మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. నృత్యకారుల కళారూపాన్ని పెయింటింగ్స్ చూపి, వాటితో చెన్నయ్‌లో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. భరతనాట్యకారులు వారాంతంలో వివిధ కళాకృతులలో, భంగిమల ద్వారా భావోద్వేగాలను తిరిగి సృష్టించడానికి ప్రయత్నించారు. చెన్నయ్‌లోని ‘గ్రేస్‌ఫుల్ స్ట్రోక్స్’ అనే ఆర్ట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన పెయింటింగ్స్ జాకీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి నమోదయ్యాయి. ఈ రికార్డు కోసం మొత్తం 170 మంది కళాకారులు కలిసి వచ్చారు. వీరికి ప్రముఖ కళాకారుడు – చిత్రకారుడు మణియం సెల్వం, కళాకారుడు–నటుడు–ఫ్యాషన్ ఎక్స్పర్ట్ శ్యామ్, సెయింట్ పాల్స్ మహాజన హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మార్టిన్ సగాయార్జ్ సర్టిఫికేట్ ప్రదానం చేశారు.పెయింటింగ్ భంగిమలుఇండియన్ ఆర్ట్ ఫ్యాక్టరీ సీఇవో సెల్వకన్నన్ ‘యువతను కళలోకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామ’ని చెప్పారు. సెల్వకన్నన్ మాట్లాడుతూ ‘భారతీయ కళారూపాలు ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. చాలా మంది ఆర్టిస్టులు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఒక నృత్యకారుడి భంగిమను చిత్రించి ఉండాలి. ఈ ప్రదర్శనల ద్వారా రెండు నేపథ్యాల నుండి ప్రేక్షకులు వస్తారు. ఒకరు నృత్యకారులు, రెండు చిత్రకారులు. దీని వల్ల సంబంధిత కళారూపాలు వృద్ధి చెందుతాయి. ప్రేక్షకులలో మూడేళ్ల నుండి 80 ఏళ్ల వయస్సు గలవారుంటే ఎనిమిది నుంచి 70 ఏళ్ల మధ్యలో కళాకారులు ఉన్నారు. ఇక్కడ ప్రదర్శనలో పాల్గొన్న ఆర్టిస్ట్ గౌరి, ఒక ఉపాధ్యాయురాలు నుండి కళాకారిణిగా మారింది. కేవలం మూడు నెలల్లో ఆమె 36గీ36 కాన్వాస్‌పై తన కళను చిత్రించింది. నేను నృత్య రూపంలో మూడు ముఖ కవళికలను చూపించాను. కథాకళికి వేర్వేరు రంగులు, ఆకారాలు, అల్లికలు ఉన్నాయి కాబట్టి నేను ఈ పెయింటింగ్‌ను ఒక నెల కంటే తక్కువ సమయంలోనే సృష్టించాను’ అని వివరించారు. అమూల్యమైన ఆస్తిఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశ్యం లక్ష్యం వైపు వేసే మొదటి అడుగు. ‘ప్రజలు కళను పెట్టుబడిగా చూస్తున్నారు. ప్రతి ఇంటì లోనూ ఒక కళాకృతి ఉండటం గుర్తించదగింది. ‘‘ఒక ఇంట్లో ఒక చెట్టు లాగా, ఇంటి ఇంటిలో మా పెయింట్ ఉండాలని కలలు కంటున్నాను. ఇది ఒక భారీ పెట్టుబడి. బంగారం తర్వాత, పెయింటింగ్ అనేది అత్యున్నతమైన పెట్టుబడి మార్కెట్. సాధారణ ప్రజలు ఇంకా దానిని అర్థం చేసుకోలేదు‘ అని సెల్వకన్నన్ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. పాఠాలు నేర్చుకోవాలికళాకారుడు రామలింగం మాటల్లో.. ‘‘ఏదైనా కళారూపంలో, ప్రసిద్ధి చెందిన వారిచే కళను వివరించకుండా, సృష్టించకుండా సృజనాత్మకంగా మారలేరు. సాధారణంగా మనం ‘ఫలానా వారు నా కళను కాపీ చేశారు లేదా దానిని నాశనం చేసారు’ అని నిందిస్తుంటారు. కానీ ఇప్పటికే ఉన్నదానిని చూడకుండా, కాపీ చేయకుండా, సాధన చేయకుండా ఉండటం అసాధ్యం. మీరు ఒక ప్రత్యేక కళాకారుడిగా ఉండాలనుకుంటే, ఇతర రచనల అందాన్ని నేర్చుకోవాలి. అప్పుడే అభినందించేలా మీ భావాలను ప్రకటిస్తారు.’గ్రేస్‌ఫుల్ స్ట్రోక్స్’ అంతా నేర్చుకోవడం గురించే. సీనియర్ల నుండి అనుభవాన్ని సమతుల్యం చేసుకోవాలి, సృజనాత్మకంగా ఉండాలి, వర్ధమాన కళాకారుల నుండి కొత్తవాటిని అన్వేషించాలి. అందుకు కొత్త పాఠాలు నేర్చుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనది ‘కళ అందంగా ఉండాలి. విమర్శకులు మాత్రమే అర్థం చేసుకునేలా సంక్లిష్టంగా ఉండి, సామాన్యులు భయపడేలా అసాధారణంగా ఉండనవసరం లేదు‘ అని సెల్వకన్నన్ ఈ సందర్బంగా తెలియజేశారు. (చదవండి: మన ఇంటి గోడలకు భారతీయ కళాత్మక వారసత్వం..)
మన ఇంటి గోడలకు భారతీయ కళాత్మక వారసత్వం..
ఇటీవల కాలంలో వివిధ సాంప్రదాయ భారతీయ కళారూపాలు గృహాలంకరణ ద్వారా కొత్త వ్యక్తీకరణ, గుర్తింపును పొందాయి. ఇవి మన దేశీయ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘లైఫ్ ఎన్ కలర్స్’ దేశం గుర్తింపుతో రూపొందించిన విభిన్న కళారూపాలను అందిస్తోంది. భారతదేశ కళాత్మక వారసత్వాన్ని తిరిగి ఊహించుకోవడానికి ప్రసిద్ధి చెందిన ఈ బ్రాండ్స్ బెస్పోక్ వాల్పేపర్లు, వాల్ ఆర్ట్, ప్రాచీన వారసత్వ కట్టడాలు కళ్లకు కడతాయి. గతాన్ని వర్తమానంతో అనుసంధానిస్తాయి. భారతీయ కళాత్మకతకు ప్రపంచవ్యాప్త ప్రశంసను అందిస్తున్నాయి. రాజస్థాన్ రాజభవన కుడ్యచిత్రాలు, క్లిష్టమైన పెయింటింగ్స్ చాలా కాలంగా మన దేశీయ సంపదకు పర్యాయపదంగా ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ గంభీరమైన కోట గోడలను అలంకరించాయి. శౌర్యం, శృంగారం, ఆధ్యాత్మికత కథలను కళ్లకు కడుతున్నాయి. ఉదాహరణకు.. మేవార్ ఇండియన్ ఎంబ్రాయిడరీ వాల్ ఆర్ట్ తీసుకుంటే ఇది రాజ్‌పుత్ పెయింటింగ్స్ శైలిలో పచ్చని ప్రకృతి దృశ్యాల మధ్య రాజ ఊరేగింపుల స్పష్టమైన చిత్రణతో ఉంటుంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, సాంప్రదాయ రాజస్థానీ కళాత్మకత కాలాతీత ఆకర్షణను కలిగిస్తుంది. ఇవి ఏ ఇంటికి అయినా అందమైన వెలుగును నింపుతున్నాయి.పహారీ కళ.. ప్రతి స్ట్రోక్‌లో ప్రశాంతతపహారీ (కాంగ్రా) మినియేచర్ పెయింటింగ్ స్కూల్ వివరణాత్మక ప్రకృతి దృశ్యాలు, రాధా–కృష్ణ ఇతివృత్తాల భావోద్వేగ చిత్రణలకు ప్రసిద్ధి చెందింది. ఈ సున్నితమైన కళాత్మకత లైఫ్ ఎన్ కలర్స్ సృష్టిలో సజీవంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ లో ప్రకృతి, పహారీ కళ ప్రశాంతత ఏ గదినైనా స్వర్గధామంగా మారుస్తుంది.సంప్రదాయాల కోల్లెజ్భారతీయ మినియేచర్ పెయింటింగ్‌లు, వాటి శక్తివంతమైన రంగులు, సంక్లిష్టమైన వివరాలతో, చాలా కాలంగా రాజ న్యాయస్థానాలు, దైవిక ప్రేమ, ప్రకృతి సౌందర్యం కథలను చెబుతున్నాయి. మొఘల్, రాజ్‌పుత్, ఇత ప్రాంతీయ కళా పాఠశాలల నుండి ఉద్భవించిన ఈ మినియేచర్ కళాఖండాలు, వాటి గొప్ప షేడ్స్‌తో ఆధునిక డిజైన్‌ను ప్రేరేపిస్తాయి. లైఫ్ ఎన్ కలర్స్ ఈ గొప్ప సంప్రదాయాలను దాని శుద్ధి చేసిన సేకరణల ద్వారా జీవం ΄ోస్తున్నాయి. షాన్, ఇండియన్ సీనిక్ డిజైన్ కస్టమైజ్డ్ వాల్‌పేపర్ మొఘల్ మినియేచర్ల సున్నితమైన ఆకర్షణ నుండి తీసిన పచ్చని ప్రకృతి దృశ్యాల మధ్య రాజ ఊరేగింపు చిత్రణను అద్భుతంగా అందిస్తుంది. (చదవండి: ఫిట్నెస్ ఎలాస్టిక్ రోప్: దెబ్బకు కొవ్వు మాయం..!)
సంస్కృతి సంప్రదాయం మహాసమ్మేళనం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం...సాంస్కృతిక–సామాజిక మేలుకలయికదాదాపుగా 40కోట్లమంది పుణ్యస్నానాలు...నాగసాధువుల ప్రత్యేక ఆకర్షణ.ప్రయాగ ప్రత్యేకతమకరే యే దివానాథే వృషగే చ బృహస్పతౌ ‘కుంభయోగో భవేత్తత్ర ప్రయాగే చాతిదుర్లభః ‘‘అంటే మాఘ అమావాస్యనాడు బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో కుంభపర్వం జరుగుతుంది. (prayaga)ప్రయాగలో మూడు కుంభస్నానాలు ఉన్నాయి. ఇక్కడ మొదటి కుంభస్నానం (makara sankranti)మకర సంక్రాంతి నుండిప్రారంభమవుతుంది. రెండవ స్నానం మౌని అమావాస్య నాడు జరుగుతుంది. మూడవ స్నానం వసంత పంచమి రోజున జరుగుతుంది. ఈ మూడింటి కలయికే (kumbh mela)’కుంభమేళా’.నీటి నుంచే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడట సృష్టికర్త. అందుకేప్రాణులన్నింటికీ నీరు తల్లిలాంటిదని చెబుతున్నాయి పురాణాలు. ఆ నీరే గలగలా పారే నదులుగా దర్శనమిస్తోంది. నదుల వల్లనే నాగరికతలు ఏర్పడ్డాయి. మనిషి మనుగడకు, సంస్కతి సాంప్రదాయాలకు, వైభవానికి నదులు సాక్షిభూతంగా నిలిచాయి. వేదభూమిగా పిలిచే ఈదేశంలో ప్రవహించే నదులు తీర్థము అనే పేరుతో దైవస్వరూపాలుగా వర్ణించబడి, గంగా గోదావరి నర్మదా కావేరి మొదలైన పేర్లతో గౌరవింపబడుతున్నాయి. అలాంటి తీర్థాలెన్నో ఈ భూమిపై ప్రవహిస్తూ ఈ భూమిని దివ్యభూమిగా మారుస్తున్నాయి.తీర్థం అంటే పుణ్యమైన, లేదా పవిత్రమైన నీరు అని అర్థం. అటువంటి తీర్థాలని సేవించి వాటిలో స్నానం చేస్తే పాలు తొలగి అంతఃకరణ శుద్ధి కూడా కలుగుతుంది. తీర్థాలన్నింటిలోకీ ప్రధానమైనది గంగానది. గంగానదిని తలిచినా చాలు... సకల పాలు తొలగుతాయని మనకి పురాణాలు చెబుతున్నాయి. నదీజలాల్లో అమతత్వం ఉందని అవి రోగాలను నివారించి దీర్ఘాయుష్షును కలిగిస్తాయని యజుర్వేదంలో చెప్పబడింది. ‘ఓ జలమా! పవిత్రమైన నీటితో మాకు తప్తి కలిగించు’’ ‘‘అఫ్స్వంతరమత మఫ్సుభేషజం’’ అంటూ ప్రార్థించడం ఈ వేదంలోని పవిత్రభావన. నదీ స్నానంవల్ల శారీరక శుద్ధి, ఆయుర్వృద్ధి కలుగుతాయి.మహాకుంభమేళా అంటే?దేవతలు–రాక్షసులు క్షీరసాగరాన్ని చిలుకగా అందులోనుంచి అమతం పుట్టింది. శ్రీమహావిష్ణువు మోహినీ అవతారం ధరించి దేవతలకు అమతాన్ని పంచుతున్నప్పుడు దానినుంచి నాలుగు చుక్కలు హరిద్వార్‌లోని గంగానదిలో, ఉజ్జయినిలోని క్షి్రపా నదిలో, నాసిక్‌లోని గోదావరిలో, ప్రయాగలోని త్రివేణి సంగమంలో పడ్డాయి. జ్యోతిష్యశాస్త్రం సూచించిన కొన్ని ప్రత్యేకమైన రోజులలో, ఆయా ప్రదేశాలలోని నదుల్లో స్నానం చేయడం వల్ల మనం కూడా అలా పడ్డ ఆ అమతత్వాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు. ఆ ప్రత్యేకమైన రోజులకే కుంభమేళ అని పేరు. కుంభమేళా సమయంలో అమృతస్నానం చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఋగ్వేదంలో దీని ప్రస్తావన కనిపిస్తుంది.దాస్యవిముక్తికి...అమృతబిందువులు నేలపై పడటం వెనుక మరో పురాణకథనం కూడా ఉంది. గరుత్మంతుడు తన తల్లి దాస్యవిముక్తికోసం అమృతాన్ని తేవలసిన అవసరం ఏర్పడింది. అలా అమృతాన్ని తెస్తున్న మార్గంలో నాలుగుచుక్కలు ఆ అమృతభాండం నుంచి నేలజారి నాలుగు పుణ్యతీర్థాలలో పడ్డాయి. ఆ ప్రదేశాలలోనే కుంభమేళాలను ఆచరిస్తున్నారు.విస్తృత ఏర్పాట్లు– స్థానికులకు ఉపాధిప్రపంచం వ్యాప్తంగా కుంభమేళాకు తరలివస్తున్న ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరినీ దష్టిలో పెట్టుకొని ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. తాత్కాలిక వసతులతో ఏకంగా ఒక టెంట్ గ్రామాన్ని ఏర్పాటు చేసింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. అందులోకి ప్రవేశిస్తే చాలు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి కళ్ళ ముందర నిలబడుతుంది. అనేక ఆధ్యాత్మిక సంస్థలు అక్కడికి వచ్చినటువంటి వారందరికీ లోటు లేకుండా ఉచితంగా అన్న ప్రసాదాలను అందజేస్తూ భక్తుల ఆకలిని తీరుస్తున్నాయి. ఆధ్యాత్మికతోపాటు ఆర్థిక పరిపుష్టిని కూడా కలిగించనుంది కుంభమేళ. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా కోసం సుమారుగా 7,500 కోట్లతో ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా కుంభమేళా జరిగినన్ని రోజులు సుమారు 2లక్షల కోట్ల మేర వ్యాపారం జరగనుందని ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ అంచనా వేస్తోంది. దీని ద్వారా 30 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.కుంభమేళా టెంట్ గ్రామంలోకి ప్రవేశించినప్పటి నుండి వయోవద్ధులను, నడవలేని వారిని స్నాన ఘాట్ ల వరకు చేర్చేందుకు, నదీ మధ్యలోకి వెళ్లి వద్దకు వెళ్లి స్నానం చేయడానికి పడవ వారికి, తినుబండారాల దుకాణాల వారికి యాత్రికులద్వారా ఆదాయం కూడా బాగా సమకూరుతోంది.యాత్రికుల భద్రత –పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. కోట్ల కొద్ది జనం వస్తోన్నా పరిశుభ్రత విషయంలో ఇబ్బందులేమీ లేవని కుంభమేళాకు వెళ్లి స్నానం చేసిన వారు చెబుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ విషయంలో పర్యవేక్షణ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని వారంతా సంతోషం వెలిబుచ్చుతున్నారు.జలమార్గాన్నీ క్రమబద్ధీకరిస్తోందిసంగమ స్థలం వరకు ప్రయాణించే పడవల విషయంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. బోట్లతో నిరంతరం పోలీసులు నదిలో పహార కాస్తు నదిలో పడవలు బోట్లు జామ్ ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రైన్లు విమానాలు బస్సులు అన్నింటిలోనూ టికెట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో సొంత ఏర్పాట్లతో కుంభమేళాకి వెళుతున్న వారికి తగినట్టుగా పార్కింగ్ వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఆనందకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక అనుభూతితో కొత్త విషయాలను తెలుసుకున్నామన్న సంతప్తితో భక్తులు తిరుగు ప్రయాణమవుతున్నారు → కుంభమేళాలో స్నానం ఎందుకు చేయాలి?కార్తీకమాసంలో వెయ్యిసార్లు గంగాస్నానం, మాఘమాసంలో వందసార్లు గంగాస్నానం, వైశాఖంలో నర్మదానదిలో కోటిసార్లు స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ప్రయాగలో కుంభమేళా జరిగే సమయంలో ఒక్కసారి స్నానంచేస్తే ఆ పుణ్యఫలాన్ని పొందవచ్చని స్కాందపురాణం చెబుతోంది.→ నాగసాధువులుఆది శంకరాచార్యులవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధు,సంతు సమాజమును ఒక్క చోటికి చేర్చి,13 అఖారాలను ఏర్పరిచి సనాతన ధర్మరక్షక వ్యవస్థను ఏర్పరిచారు. తరువాత కాలములో అనేక ధర్మాచార్యులు ఈ వ్యవస్థను దశదిశలా విస్తరింపజేసారు. అటువంటి సాధువులలో కొందరిని నాగసాధువులని పిలుస్తారు. వీరు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వీరికి శరీరంతో తాదాత్మ్యం ఉండదు. మనం జీవిస్తున్న సమాజానికి అతీతంగా ఉండే ఆ యోగుల తత్త్వం మనకు అంతుపట్టదు. అందుకే వారు మనకు సాధారణ సామాజిక జీవితంలో ఎదురుపడరు.→ స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి?భక్తితో గంగను తలచుకుంటూ నదిలో మూడు మునకలు వేయాలి. పవిత్రమైన నదిని అపరిశుభ్రం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్నానం తరువాత దగ్గరలో ఉన్న ఆలయాలను దర్శించుకోవాలి.→ కుంభమేళాకి పోలేనివారికి...పురాణాలు, జ్యోతిష్యశాస్త్రం కుంభమేళాలో చేసే పవిత్ర స్నానవిశిష్టతను ఎంతో కీర్తించాయి. అయితే ఆరోగ్యరీత్యా, వయోభారంవల్ల అక్కడికి పోలేనివారు అక్కడినుంచి తెచ్చిన నీటిని తాము స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. అదీ కుదరకపోతే తామున్న చోటే గంగానదీ పేరును తలచుకుని స్నానం చేయవచ్చు.ఐక్యత మరియు ఏకత్వాల పండుగ కుంభమేళా. శాశ్వతమైన, అనంతమైన దివ్య స్వభావాన్ని కుంభమేళాలో అనుభవించగలం. నదీ ప్రవాహంలాగే జనప్రవాహం కూడా కుంభమేళా వైపు సాగి సముద్రంలో నదులు సంగమించినట్టు వివిధ ప్రదేశాలవారు ఏకమయ్యే సంగమస్థలం కుంభమేళా.→ అందరి చూపు–కుంభమేళా వైపుగత కొద్ది రోజులుగా ప్రయాగలో జరుగుతున్న మహాకుంభమేళా భారతదేశంలోని ప్రజలనే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజల దష్టిని ఆకర్షిస్తోంది. పలు మతాలకు చెందినవారు కుంభమేళా కోసమే ఇక్కడికి వచ్చి, పవిత్ర స్నానం చేసి ఆనందపరవశులవుతున్నారు. భారతీయ ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులవుతున్నారు.స్టీవ్ జాబ్స్ భార్య కుంభమేళాపై ఆసక్తితో కుంభమేళాలో ఉండే గురువులు సాధువుల వద్ద సనాతన ధర్మంలోని పలు అంశాలనుతెలుసుకుంటూ మోక్షమార్గాన్ని అన్వేషిస్తున్నారు. ఎంతోమంది విదేశీ పరిశోధకులు ఈ కుంభమేళాను ఆసక్తితో గమనిస్తున్నారు.→ ఆధ్యాత్మిక ప్రపంచంప్రపంచం నలుమూలల నుంచి చేరుతున్న జన సందోహంతో అక్కడ నూతన ప్రపంచం ఏర్పడింది. కుంభమేళా కి వచ్చినవారు ముఖ్యంగా యువతరం ఈ వాతావరణాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. ఆధ్యాత్మిక గురువుల నుంచి ఆసక్తిగా అనేక అంశాలను తెలుసుకుంటున్నారు యువత.నాలుగు రకాల కుంభమేళాలు4 సం.ల కొకసారి జరిగేది – కుంభమేళా6 సం.ల కొకసారి జరిగేది – అర్ధ కుంభమేళా12 సం.ల కొకసారి జరిగేది – పూర్ణ కుంభమేళా12 సం.ల కొకసారి జరిగే పూర్ణ కుంభమేళాలు 12 సార్లు పూర్తయితే (144 సం.లకు) – మహా కుంభమేళా.ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలలో ఈ నాలుగు కుంభమేళాలు జరుగుతాయి. బహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో, కుంభ రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో, సింహ రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని మరియు నాసిక్‌లో కుంభమేళాలు జరుపుకుంటారు.– అప్పాల శ్యాంప్రణీత్ శర్మ వేద పండితులు
ఫొటోలు
International View all
టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి
టర్కీలోని ఒక రిసార్ట్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపద
ప్రపంచ కుబేరుల సంపద అనూహ్యంగా 2024లో 2 ట్రిలియన్ డాలర్ల(రూ.170 లక్షల కోట్లు)కు పెరిగి 15 లక్షల కోట్ల డాలర్ల (రూ.1275 లక్
ట్రంప్ నిర్ణయాలు.. అంతర్జాతీయంగా అమెరికాకు దెబ్బ?
అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోమారు అధిరోహించిన ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసు
కెనడా, మెక్సికోలపై సుంకాలు.. ప్రభావితమయ్యే వస్తువులు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
‘బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తాం’
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్ దేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
National View all
ఢిల్లీలో గెలుపే టార్గెట్.. బీజేపీ రెండో మేనిఫెస్టో విడుదల
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీల
డుం.. డుం.. డుం..
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ యువతి.
రాహుల్ గాంధీపై పాలవ్యాపారి కేసు
కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్‌గాంధీపై బీహార్‌లో ఓ కేసు నమోదు అయ్యింది.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా ట్వీట్
సాక్షి, ఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి
గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేసియా అధ్యక్షుడు
ఢిల్లీ: రిపబ్లిక్ డే-2025 వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇండోనేషియా అ
NRI View all
డుం.. డుం.. డుం..
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ యువతి.
ట్రంప్, జేడీ వాన్స్ ప్రమాణం.. ప్రత్యేక ఆకర్షణగా ఉషా చిలుకూరి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప
డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడు.. అంతలోనే ఇలా..
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్)/చౌటుప్పల్ రూరల్: ఉన్నత చదువు
ట్రంప్ ఇచ్చిన బాధ్యతల నుంచి వైదొలగిన వివేక్ రామస్వామి.. కారణం?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Tr
ఆ్రస్టేలియాలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
సాక్షి, హైదరాబాద్: ఆ్రస్టేలియా దేశంలో నివసిస్తున్న తెలుగు ప
క్రైమ్
దుండగుల గమ్యం గజ్వేల్!
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకతో పాటు నగరంలో తుపాకీతో కాల్పులకు తెగబడిన దుండగులు అఫ్జల్‌గంజ్ ఫైరింగ్ తర్వాత గజ్వేల్ వెళ్లాలని భావించారు. సికింద్రాబాద్ నుంచి ఆటోను ఆ ప్రాంతానికే మాట్లాడుకున్నారు. అయితే మార్గమధ్యంలో డ్రైవర్ వ్యవహారశైలిపై వారికి అనుమానం రావడంతో తిరుమలగిరిలో దిగిపోయారని పోలీసుల తాజా దర్యాప్తులో తేలింది. రోషన్ ట్రావెల్స్‌కు చెందిన మేనేజర్ జహంగీర్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు చేస్తున్న నగర పోలీసులు వివిధ కోణాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తున్నారు. బీదర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సైతం దర్యాప్తులో పాలు పంచుకుంటోంది. ఆటో దిగి బ్యాగులు, వస్త్రాలు కొని... ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనంపై బీదర్‌లో దాడి చేసి, ఒకరిని కాల్చి పంపిన దుండగులు నగదుతో హైదరాబాద్ చేరుకున్న విషయం విదితమే. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి రాయ్‌పూర్‌కు టిక్కెట్లు బుక్ చేసుకోవడం, మినీ బస్సులో బ్యాగుల తనిఖీ, జహంగీర్‌పై కాల్పులు తర్వాత దుండుగల గమ్యం మారింది. అఫ్జల్‌గంజ్ నుంచి ఆటో ఎక్కిన ఇద్దరూ రైలు మిస్ అవుతుందని, తొందరగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్లాలని డ్రైవర్‌ను కంగారు పెట్టారు. సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వరకు వెళ్లిన ఈ ద్వయం అక్కడ కొత్త బ్యాగ్‌లు, వస్త్రాలు ఖరీదు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో లాడ్జిల్లో గదులు ఇప్పించే దళారులు తిరుగుతూ ఉంటారు. అలాంటి ఓ వ్యక్తి వీరి వద్దకు వచ్చి రూమ్ కావాలా అంటూ ప్రశి్నంచాడు. గజ్వేల్‌లో మకాం వేయాలని ప్లాన్... తాము ఉండటానికి రూమ్ కావాలని చెప్పిన దుండగులు అయితే ఇక్కడ వద్దని, గజ్వేల్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాల్సి ఉందని చెప్పారు. అక్కడ అద్దె ఇల్లు దొరికే వరకు హోటల్లో రూమ్ కావాలని చెప్పారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దళారి తనకు పరిచయస్తుడైన గజ్వేల్‌లోని దళారితో మాట్లాడాడు. అతడు రోజుకు రూ.1500 అద్దెకు రూమ్ సిద్ధంగా ఉందని చెప్పడంతో ఇరువురినీ గజ్వేల్ వెళ్లమని ఇక్కడి దళారి సూచించాడు. అలా వెళ్లడానికి ఆటో మాట్లాడి పెట్టమని దుండగులు కోరడంతో సికింద్రాబాద్ దళారి రూ.1500 కిరాయికి ఆటో సైతం మాట్లాడి పెట్టాడు. గజ్వేల్ దళారి నెంబర్ ఆటోడ్రైవర్‌కు ఇచ్చి, ఇద్దరినీ అతడి వద్ద దింపి రమ్మని చెప్పాడు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతూనే ఆటోడ్రైవర్ ఓసారి దళారితో మాట్లాడాడు.పదేపదే దళారీతో మాట్లాడుతుండటంతో... వీరి ఆటో బయలుదేరిన తర్వాత గజ్వేల్ దళారి రెండుసార్లు డ్రైవర్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆటో తిరుమలగిరి వరకు వెళ్లిన తర్వాత మరోసారి కాల్ చేయడంతో దుండగులకు అనుమానం వచి్చంది. అక్కడ ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆటో ఆపమని చెప్పిన ఇరువురూ బ్యాగ్‌లతో సహా ఆటో దిగి రూ.500 చెల్లించి వెళ్లిపోయారు. అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో నగదును ట్రాలీ బ్యాగ్‌ల నుంచి మరో బ్యాగుల్లోకి మార్చుకున్నారు. ఆపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత వ్రస్తాలు సైతం మార్చేశారు. అక్కడ నుంచి మళ్లీ తిరుమలగిరి ప్రధాన రహదారి మీదికి వచ్చి బోయిన్పల్లి వైపు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఈ విషయాలు గుర్తించిన పోలీసులు ఇప్పటికే ఆటోడ్రైవర్లు, దళారుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేశారు.బీ–క్లాస్ పట్టణాలనే ఎంచుకుని... ఈ నేరాలు జరిగిన తీరు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు దుండగులు బీ–క్లాస్ సిటీలు, పట్టణాలనే ఎంపిక చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. పోలీసుల అప్రమత్తత, హడావుడి తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే దుండగులు ఇలా చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలోని ఈ తరహాకు చెందిన పట్టణం బీదర్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లో ఫైరింగ్ తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లకుండా ఇలాంటి పట్టణమే అయిన గజ్వేల్ వెళ్లడానికి ప్రయతి్నంచారు. ఈ కీలకాంశాన్ని సైతం పరిగణలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. మరోపక్క బీదర్‌లో నేరం చేయడానికి, అక్కడ నుంచి సిటీ రావడానికి నిందితులు వినియోగించిన వాహనాన్ని సైతం హైదరాబాద్ పోలీసులు స్వాదీనం చేసుకున్నారని తెలిసింది.
ప్రేమ పెళ్లి.. ఆపై అనుమానంతో భార్యను..
కుషాయిగూడ: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్, నాగార్జుననగర్ కాలనీ రోడ్డు నెంబరు–5లో గత శనివారం వెలుగుచూసిన మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భార్యపై అనుమానంతోనే హతమార్చి సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించి పరారయ్యాడు. సోమవారం ఎస్సై వెంకన్న కేసు వివరాలను వెల్లడించారు. కాచిగూడకు చెందిన సచిన్ సత్యనారాయణ, టూగూర్ స్నేహలు 2021లో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమై 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బాబు పుట్టి చనిపోయాడు. ఈ క్రమంలో వారి మధ్య గొడవల కారణంగా కొద్ది రోజుల పాటు వేరుగా ఉండి నెల రోజుల క్రితమే తిరిగి నాగార్జుననగర్ కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్య 7 నెలల గర్భవతి అని తెలుసుకున్న భర్త ఆమెను అనుమానించాడు. శారీరకంగా దూరంగా ఉన్నా గర్భం రావడంపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 16న తెల్లవారు జామున 5 గంటల సమయంలో మంచంపై పడుకున్న భార్య ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఘటన స్థలంలో సిలిండర్ ఆన్‌చేసి సహజమరణంగా చిత్రీకరించేందుకు యత్నించి పరారయ్యాడు. ఆమె మృతిపై అనుమానం వచ్చిన పోలీసులు సోమవారం మృతురాలి భర్తను కాచిగూడలోని అతడి ఇంట్లో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. తానే హతమార్చినట్లు నేరం అంగీకరించినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు.
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. పారిపోవాలనుకున్నాడు
ముంబై: దొంగతనం కోసం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి పెనుగులాటలో ఆయనను పొడిచి పారిపోయిన బంగ్లాదేశ్‌కు చెందిన నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీక్ దాడి తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోవాలని భావించాడు. పోలీసులు విచారణలో ఇలాంటి పలు అంశాలు తాజాగా వెల్లడయ్యాయి. గత గురువారం దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. విదేశీయులు, పాస్‌పోర్ట్ చట్టాల కింద కేసు నమోదు తాను ఏడు నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్లు షరీఫుల్ ఒప్పుకున్నాడు. అతని ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్‌నూ పోలీసులు సంపాదించారు. దాంతో అతని బంగ్లాదేశ్‌లోని ఘలోకతి జిల్లావాసిగా రూఢీఅయింది. అక్రమంగా భారత్‌లో చొరబడ్డ నేరానికి అతనిపై విదేశీయుల చట్టం, పాస్‌పోర్ట్ చట్టం కింద సైతం కేసు నమోదుచేశారు. భారతీయ పాస్‌పోర్ట్ సంపాదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఎలాగైనా డబ్బు బాగా సంపాదించి స్వదేశం వెళ్లిపోవాలని ప్లాన్ వేశాడు. అందుకే ఐదునెలలు ముంబైలో హౌస్‌కీపింగ్ వంటి చిన్నాచితకా పనులు చేసిన అతను వాటిని పక్కనబెట్టి దొంగతనాలకు సిద్ధమయ్యాడు. ఇందులోభాగంగానే సైఫ్ ఇంట్లో చొరబడ్డాడు. అయితే తాను దాడి చేసింది బాలీవుడ్ నటుడిపై అనే విషయం తనకు టీవీల్లో వార్తల్లో చూసేదాకా తెలియదని పోలీసు విచారణలో ఫరీఫుల్ చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీలోని తన ఫొటో న్యూస్‌ఛానెళ్లలో ప్రసారం కావడంతో భయపడిపోయాడు. సెలబ్రిటీపై దాడి నేపథ్యంలో పోలీసులు ఎలాగైనా తనను పట్టుకుంటారని భయపడి మళ్లీ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈలోపే పోలీసులు పట్టుకోగలిగారు.ఎలా పట్టుకోగలిగారు? వర్లీలో గతంలో తాను పనిచేసిన పబ్ ప్రాంగణంలో జనవరి 16న నిద్రించిన నిందితుడు ఆరాత్రి హఠాత్తుగా మాయమై నేరుగా సైఫ్ ఇంట్లోకి వచ్చి దాడి చేసి తర్వాత బాంద్రా రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. తర్వాత దాదర్‌కు, ఆ తర్వాత వర్లీకి వెళ్లాడు. చివరకు థానే ప్రాంతంలో ఉన్నప్పుడు పోలీసులకు పట్టుబట్టాడు. సైఫ్ ఇంటి సమీప ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ కెమెరాలను చూసినా ఇతను ఏ దిశగా వెళ్లాడనే బలమైన క్లూ పోలీసులకు దొరకలేదు. దీంతో పాత సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా జనవరి 9వ తేదీన అంధేరీ వద్ద బైక్‌పై వెళ్తున్న వీడియోలో ఇతడిని గుర్తించారు. బైక్ యజమానిని ప్రశ్నించగా బైక్‌పై వెళ్లింది తనకు తెల్సిన ఒక నిర్మాణరంగ మేస్త్రీ దగ్గర పనిచేసిన కూలీ అని సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులు ఆ మేస్త్రీని విచారించారు. గతంలో చిన్నాచితకా పనుల కోసం వర్లీ ప్రాంతంలోని మేస్త్రీ దగ్గరకు వచ్చి పని ఉంటే చెప్పాలని తన ఫోన్‌నంబర్ ఇచ్చి ఫరీఫుల్ తర్వాత థానె వెళ్లిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెల్సి మేస్త్రీని విచారించగా షరీఫుల్ మొబైల్ నంబర్‌ను అందజేశాడు. తాజాగా శనివారం షరీఫుల్ వర్లీ సెంచురీ మిల్ వద్ద బుర్జీపావ్, వాటర్ బాటిల్ కొన్నప్పుడు ఈ నంబర్‌తో చేసిన గూగుల్‌పే లావాదేవీతో ఫోన్ లొకేషన్‌ను పోలీసులు పసిగట్టారు. అయితే అప్పటికే అతను థానెలోని దట్టమైన మడ అడవుల్లోకి పారిపోయాడని తెల్సి వేట మొదలెట్టారు. చిట్టచివరకు ఆదివారం తెల్లవారుజామున హీరానందానీ ఎస్టేట్ దగ్గరి లేబర్క్యాంప్ సమీప అడవిలో పట్టుకోగలిగారు. ఆరోజు ఘటన తర్వాత దొరక్కుండా తప్పించుకునేందుకు షరీఫుల్ వెంటనే దుస్తులు మార్చేశాడు. అయితే వెంట తెచ్చుకున్న బ్యాక్‌ప్యాక్ సైతం ఒకరకంగా ఇతడిని పట్టించింది. ఆ ప్రాంతంలో అదే బ్యాక్‌ప్యాక్ వేసుకున్న, అదే పోలికలున్న వ్యక్తులను విచారించి షరీఫుల్‌ను పోల్చుకోగలిగారు. దాడి రోజున ఏం జరిగిందో తెల్సుకునేందుకు నిందితుడిని సద్గురుశరణ్ బిల్డింగ్‌లోని సైఫ్ ఫ్లాట్‌కు తీసుకెళ్లి పోలీసులు అతనితో సీన్ రీక్రియేషన్ చేయించే వీలుంది.
ప్రియుడితో కొన్నాళ్లు సహజీవనం.. భర్తను నమ్మించి..
పలమనేరు: పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన దళిత నేత శివకుమార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంవాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పలమనేరు మండలంలోని ముసలిమొడుగుకు చెందిన శివకుమార్ భార్య ఉషారాణి గత 8 నెలల నుంచి పలమనేరులోని షామీర్ బిరియాని హోటల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు షామీర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త శివకుమార్ పలుమార్లు భార్యను ప్రశ్నించాడు. ఆమె కొన్నాళ్లు ప్రియుడితో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ తన భార్య కనిపించలేదని వేలూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇకపై తాను భర్తతోనే కాపురం చేస్తానని ఉషారాణి అందరినీ నమ్మించింది. షామీర్ కూడా తాను ఉషారాణి విషయంలో జోక్యం చేసుకోనని చెప్పాడు. స్నేహితులుగా ఉందామని శివకుమార్‌ను నమ్మించి ఈ నెల 13న పలమనేరు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు పక్కనున్న వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి చాతీపై బండరాయితో కొట్టి హత్య చేశారు. ఈ కేసును మూడు రోజుల్లో ఛేదించిన సీఐ నరసింహరాజు, ఎస్ఐ స్వర్ణతేజను డీఎస్పీ అభినందించారు.