Top Stories
ప్రధాన వార్తలు
విభాత సంధ్యల ప్రభాత గీతం!
‘తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’ అన్నారు శ్రీశ్రీ. కావచ్చు. కానీ, వాటికి ఉండే ప్రాధాన్యత వాటికున్నది. కొన్ని ముఖ్యమైన తేదీల శతాబ్దులూ, అర్ధ శతాబ్దుల సందర్భాలూ చాలా ప్రత్యేకమైనవి. అవి ఇప్పటి పరిస్థితులనూ, పరిణామాలనూ అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. నేర్చుకోవాలనుకుంటే పాఠాలు కూడా చెబుతాయి. ఇప్పుడు బలంగా ఊడలు దిగి కనిపిస్తున్న భావజాలాలపై అవగాహన కుదరాలంటే నాడు వాటికి నారుపోసి నీరు పెట్టిన తొలి కాపుల లక్ష్యాలేమిటో, స్వప్నాలేమిటో తెలుసుకోవాలి. ఈ సందర్భాలు అందుకు పనికొస్తాయి.కొన్నిసార్లు ఇటువంటి చారిత్రక సందర్భాలు ఒకదాని వెంట ఒకటి వరుసకట్టి వచ్చిపడతాయి. ఈ డిసెంబర్ ఆఖరి వారం కూడా అటువంటి ఓ అరుదైన క్రమాన్ని ఆవిష్కరించింది. జాతిపిత మహాత్మాగాంధీ ఒకే ఒక్కసారి 1924 డిసెంబర్ 24వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. మేధావుల సమ్మేళనంలా ఉండే కాంగ్రెస్ పార్టీని ఆయన జనసామాన్యుల పార్టీగా, ఉద్యమ పార్టీగా పరుగులు పెట్టించారు. ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని అదే బెళగావి (కర్ణా టక)లో నేటి శిథిల కాంగ్రెస్ పార్టీ కూడా దాని వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నది. మీడియా ద్వారా వెల్లడైన సమాచారాన్ని గమనిస్తే ఇది మొక్కుబడి సమావేశంగానే అనిపించింది. దూరమైన ప్రజాశ్రేణుల దరిజేరే ఉపా యాన్ని గాంధీ స్ఫూర్తి నుంచి గ్రహించినట్టు కనిపించలేదు.స్వాతంత్య్రం సిద్ధించిన తొలి దశాబ్దాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ కూడా డిసెంబర్ 26న వందో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అప్పటికే వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఏర్పడిన కమ్యూనిస్టులను ఐక్యం చేసి ఆ రోజున కాన్పూర్‌లో జాతీయ పార్టీగా ప్రకటించారు. అయితే ఈ తేదీపై ఒక డజన్‌కు పైగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. 1920లోనే నాటి సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్ (నేటి ఉజ్బెకిస్తాన్)లో ఎమ్.ఎన్.రాయ్ తదితరులు పార్టీని ప్రకటించారు గనుక ఆ తేదీనే ఆవిర్భావ దినంగా భావించాలని కొందరి అభిప్రాయం. ముఖ్యంగా బిగ్ బ్రదర్ సీపీఎం తాష్కెంట్ తేదీకే కట్టుబడి ఉన్నది. పుట్టిన తేదీ వంటి ఒక సాధారణ సాంకేతిక అంశంపైనే రాజీ పడటానికి సిద్ధంగా లేని కమ్యూనిస్టులు క్లిష్టమైన సైద్ధాంతిక విషయాల్లో ఐక్యత సాధించగలరని ఆశించే వారి సహనాన్ని అభినందించ వలసినదే!ఈ డిసెంబర్ 25నే ఆరెస్సెస్ కూడా తన వందో ఏడాదిలోకి అడుగుపెట్టింది. హిందూ రాష్ట్ర స్థాపన, హిందూ జాతీయ తావాదం లక్ష్యాలుగా కేశవ బలిరామ్ హెడ్గేవార్ ఈ సంస్థను స్థాపించారు. సంస్థను స్థాపించిన తొలి రోజుల నుంచి సాంస్కృతిక రంగంపైనే ప్రధానంగా గురిపెట్టి ఈ సంస్థ పనిచేయడం ప్రారంభించింది. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగు తున్న రోజుల్లో పుట్టినప్పటికీ రాజకీయ రంగంలో అది పరిమిత పాత్రనే పోషించింది. కానీ, ఈరోజున భారత రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకొని ప్రభావితం చేయగలిగే స్థాయికి ఎదిగింది. ఆ సంస్థ స్థాపించిన పలు అనుబంధ సంఘాలు శాఖోపశాఖలుగా విస్తరించి వివిధ రంగాల్లో పనిచేస్తున్నాయి. దాని రాజకీయ వేదికైన భారతీయ జనతా పార్టీ దాదాపు పదికోట్ల మంది సభ్యులతో దేశంలో అతి బలీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. అధికార పార్టీగా ఆ పార్టీ అనుస రిస్తున్న, అనుసరించబోయే విధానాలను ఆరెస్సెస్ వ్యవస్థాప కుల సిద్ధాంతాలు, ఆశయాలు ప్రభావితం చేయడం పెద్దగా ఆశ్చర్యపోయే విషయమైతే కాదు.ఈ సంవత్సరమే అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి పూర్తి కావడం యాదృచ్ఛికమైనప్పటికీ ఆసక్తికరం కూడా! ఆరెస్సెస్ కంటే సరిగ్గా ఒక సంవత్సరం ముందు డిసెంబర్ 25వ తేదీనే అటల్ జీ జన్మించారు. ఆరెస్సెస్ తొలి రాజకీయ వేదిక జనసంఘ్‌లో కూడా ఆయన ప్రముఖ నాయకుడుగా ఉన్నారు. కొంతకాలం అధ్యక్షునిగా పనిచేశారు. జనసంఘ్ పార్టీ భార తీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత పాతికేళ్ల పాటు దాని ముఖపత్ర చిత్రంగా వాజ్‌పేయి ఉన్నారు. మతతత్వ పార్టీగా ముద్రపడి ఉన్న బీజేపీని మధ్యేవాదులకు కూడా ఆమోదయోగ్యం చేయడంలో వాజ్‌పేయి బొమ్మ పనికొచ్చింది. ఆయనకున్న ఉదారవాద టైటిల్ సాయంతో తొలిసారి ఢిల్లీ సర్కార్‌ను ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఏర్పాటు చేయగలిగింది. ఆ కాలానికి వాజ్‌పేయి ఉపయోగపడ్డారు. ఈ కాలానికి కాదు! ఇప్పుడు మోదీయే అవసరమని సంఘ్ అభిప్రాయపడింది. కాలానుగుణంగా కవర్ పేజీ చిత్రాలను ఎంపిక చేయడంలోనే ఆరెస్సెస్ విజయ రహస్యం ఇమిడి ఉన్నది. అంతే తప్ప వాజ్‌పేయి వేరు, మోదీ వేరూ కాదు! ఈ రెండు రూపాల్లోని సారం ఒక్కటే!!డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చేసిన చారిత్రక ఘటనకు కూడా వందేళ్లు కావస్తున్నది. 1927లో సరిగ్గా డిసెంబర్ 25వ తేదీనే అంబేడ్కర్ ఈ పని చేశారు. వర్ణ వ్యవస్థ లేదా నేటి కులవ్యవస్థను మనుస్మృతి బలంగా సమర్థించింది. కుల వ్యవస్థ ముసుగులో జరిగిన దారుణమైన సామాజిక అణచితవేతకు గురైన బలహీన వర్గాల్లోని చైతన్యవంతులైన ప్రజల మనోభావాలకు అంబేడ్కర్ చర్య సాంత్వన కలిగించింది. అప్పటికంటే ఇప్పుడు అంబేడ్కరిజానికి మద్దతు మరింత పెరుగుతున్నది.స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం అనేవి ఆధునికమైన ప్రజాస్వామిక భావనలుగా ప్రపంచవ్యాప్తంగా పరిగణన పొందాయి. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ రచనలో ఈ భావనలకే పెద్దపీట వేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉన్న నాటి రాజ్యాంగ సభ ఈ ముసాయిదాకు ఆమోదముద్ర వేసింది. ఈ దేశంలోని కమ్యూ నిస్టులకు కూడా సిద్ధాంతపరంగా ఈ ఆధునిక భావనలతో పేచీ లేదు. మరి దేశంలోనే పెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ మాటేమిటి?భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను పరిశీలిస్తే కాలాను గుణమైన ఎత్తుగడలను అమలుచేస్తూ ఆరెస్సెస్ మూల సిద్ధాంతాలను హిడెన్ ఎజెండాగా పెట్టుకొని అవసరాన్ని బట్టి ఒక్కొక్కదాన్ని వెలికి తీస్తున్న పద్ధతి కనిపిస్తున్నది. భారత రాజ్యాంగం పట్ల ఆరెస్సెస్ వ్యతిరేకత రహస్యమేమీ కాదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తొలిరోజే దాని అధికార పత్రిక వ్యతిరేక వ్యాసం రాసిన సంగతి అందరికీ తెలిసినదే. సంఘ్ సిద్ధాంతకర్త గురు గోల్వాల్కర్ రాజ్యాంగాన్ని ‘పలు దేశాల నుంచి అరువు తెచ్చుకున్న అతుకుల బొంత’గా వ్యాఖ్యానించడం కూడా రహస్యం కాదు. రాజ్యాంగ సభలో చర్చలు జరుగుతున్న రోజుల్లోనే పలువురు సంఘ్ ప్రముఖులు, హిందూ మహాసభ నాయకులు మనుస్మృతిని మన దేశ రాజ్యాంగంగా మలుచుకోవాలని కోరిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అవసరం.రాజ్యాంగంలో మార్పులు చేయాలనే ఆలోచన బీజేపీకి ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి. పీఠికలో ఉన్న ‘లౌకిక’, ‘సామ్యవాద’ పదాలను తొలగించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు ప్రచారం జరిగింది. తన హిడెన్ ఎజెండాలోని అంశాలనుముందుగా ప్రచారంలోకి వచ్చేలా చూడటం, పెద్దగా వ్యతిరేకత కనిపించకపోతే ఆచరణలో పెట్టడం బీజేపీకి కొత్త వ్యూహమేమీ కాదు. ఆధునిక భావనలైన స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వాలకు మనుస్మృతికి సాపత్యం కుదురుతుందంటే నమ్మడం కుదరదు. బీజేపీ ఎటువైపున నిలబడుతుందో చూడాలి. బీజేపీ తన గమ్యాన్ని చేరే యాత్రలో అడ్వాణీ రథయాత్ర ఒక మజిలీ, వాజ్‌పేయి అధికారం ఒక మజిలీ, నరేంద్ర మోదీ మరో రెండు మూడు మజిలీలు దాటి ఉంటారు. రేపటి జమిలి ఎన్నికలు మరో మజిలీ అని పలువురి భావన. ఈ యాత్ర నిర్నిరోధంగా ఇలాగే సాగుతుందా? దీన్ని నిలువరించే శక్తులున్నాయా? అనేదే నేటి ప్రధాన రాజకీయ చర్చ.సిద్ధాంత పరంగా చూస్తే బీజేపీ హిందూయాత్ర(?)ను ఎదిరించే బలం అంబేడ్కరిజానికి ఉన్నదని కొందరి అభి ప్రాయం. కానీ దానికి ఒక సంస్థాగత రూపం లేదు. అందుకే ‘లాల్–నీల్’æఅనే కొత్త నినాదం ముందుకొచ్చింది. అంబే డ్కరిస్టులు, కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలని దీని భావం. కానీ, చిన్నచిన్న పట్టింపులతోనే చీలికలు పీలికలైన లాల్‌వాలాల్లో ఇంకా ఆ సామర్థ్యం మిగిలి ఉందని నమ్మేవారి సంఖ్య స్వల్పం. ఇక వ్యూహ రాహిత్యం, నాయకత్వ వైఫల్యంతో కాంగ్రెస్ పార్టీ కునారిల్లిపోయిన స్థితి. ‘ఇండియా’ కూటమి పక్షాల దన్నుతో 99 లోక్‌సభ సీట్ల దాకా నెట్టుకొచ్చిన ఆ పార్టీని ఇప్పుడు కూటమి పక్షాలే గెటౌట్ అనే పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి వందేళ్ల నాటి భావాలూ, సంస్థలూ ఇంకా మన రాజకీయ యవనికపై కదలాడుతుండటం ఒక విశేషం. ఈ ప్రయాణంలో బలమైన శక్తులు బలహీనంగా మారడం, బలహీన శక్తులు బలంగా మారడం మరో విశేషం.చారిత్రక ఘటనలు పునరావృతం అవుతున్నట్టు కనిపించడం కూడా మరో ఆసక్తికర పరిణామం. వెన్నుపోటు ఉదంతంతో తొలిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత వాజ్‌పేయి అండతో ‘కార్గిల్ గాలి’లో మరోసారి అధికారంలోకి వచ్చారు. ఇది జరిగి పాతిక సంవత్సరాలు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాది కూడా గడవకముందే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఆయన కొనితెచ్చుకున్నారు. అడ్డగోలుగా బాదిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా మొదలైన ఆందోళనలు ఆయన పదవీకాలమంతా జరుగుతూనే ఉన్నాయి. చివరికి తిరుపతిలో మందుపాతర ప్రమాదం నుంచి బయటపడ్డ సానుభూతి కూడా ఆయన్ను గట్టెక్కించలేకపోయింది.ఇప్పుడూ అదే పరిస్థితి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ను అటకెక్కించడంతోనే తాము మోసపోయామన్న అభిప్రాయం జనంలో వచ్చేసింది. దానికితోడు పరిపాలనా వైఫల్యాలు, కక్షసాధింపు రాజకీయాలు, ప్రజావైద్యం పడకేయడం, నాణ్యమైన ప్రభుత్వ విద్యకు పాతరేయడం, వాడవాడనా పారుతున్న మద్యం కంపు, అంతకుమించి కంపు కొడుతున్న రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలు, వెరసి ఆరు మాసాల్లోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా శుక్రవారం నాడు వైసీపీ పిలుపు మేరకు జరిగిన ప్రదర్శనల్లో పది లక్షలమందికి పైగా పాల్గొనడం ప్రజాగ్రహానికి ఒక శాంపిల్ మాత్రమే! పులివెందుల నియో జకవర్గంలో వైసీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి జరిపిన పర్యటన జనసముద్రాన్ని చీల్చుకొని వెళ్తున్నట్టుగా కనిపించింది. అభిమాన సందోహం నడుమ పాతిక కిలోమీటర్ల ప్రయాణానికి ఏడు గంటల సమయం! పులివెందుల నుంచి బెంగళూరు వరకు ఆయన చేసిన రోడ్డు ప్రయాణం కూడా అంతే! దారి పొడవునా ఊళ్లు కాదు, జన జాతరలే దర్శనమిచ్చాయి. ఈ పరిస్థితి చూస్తుంటే కూడా గతమే గుర్తుకొస్తున్నది. మందుపాతర సాను భూతితో మళ్లీ గెలుస్తామని భావించిన బాబు నాలుగు మాసాలు ముందుగానే ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకున్నారు. ఆయనతోపాటు కేంద్రంలోని ఎన్టీయే సర్కార్‌ను కూడా తీసుకెళ్లి వాజ్‌పేయి పుట్టి ముంచారు. ఇప్పుడు కూడా ముందుగానే జమిలి వార్తలు వస్తున్నాయి. ఈ జమిలిలో మోదీ పుట్టిని కూడా ముంచుతాడేమో!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
ఇది సర్కారు లెక్క.. 95 మంది రైతుల ఆత్మహత్య
రేటు పతనమై.. బతుకు భారమై..గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కౌలు రైతు యనగందుల వీరారావు (54) 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తుండేవాడు. గతేడాది అధిక వర్షాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పత్తి, మిరపకు మంచి ధరలు రావడంతో ఈ ఏడాది రూ.4 లక్షలు అప్పులు చేసి 2.5 ఎకరాల్లో మిరప సాగు చేశాడు. కోతలు ప్రారంభమయ్యే నాటికి క్వింటా రూ.15 వేలు ఉండడంతో, ధరలు పెరుగుతాయన్న ఆశతో కోల్డ్ స్టోరేజీలో పెట్టాడు. వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో క్వింటా రూ.10 వేలకు పడిపోయింది. మరింత పడిపోతాయన్న ఆందోళనతో అమ్ముకోగా, కోల్డ్ స్టోరేజీ ఖర్చులన్నీ పోనూ రూ.70 వేలు మిగిలింది. గతంలో చేసిన వాటితో కలిపి రూ.10 లక్షల అప్పులు తీర్చే దారిలేక, అప్పులోళ్లకు ముఖం చూపించలేక గత నెల 23న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరారావు భార్య కూలీ పనికి వెళ్తోంది. ఉన్న ఇంటిని అమ్మి రేకుల షెడ్‌లో అద్దెకు ఉంటున్నామని, తల్లితో పాటు తన వద్ద ఉన్న బంగారాన్ని కుదవ పెట్టినా అప్పులు తీరలేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమను పట్టించుకోలేదని వీరారావు కుమారుడు సుబ్బారావు కన్నీటి పర్యంతమయ్యాడు.సాగు నిజం.. వ్యవ‘సాయం’ దుర్లభంవైఎస్సార్ జిల్లా రామిరెడ్డిపల్లెకు చెందిన ఎన్.శ్రీనివాసులు రెడ్డి (47) గత నెల 28న, వేంపల్లికి చెందిన ఆశీర్వాదం (63) ఈ నెల 15న ఆత్మహత్యలకు పాల్పడ్డారు. శ్రీనివాసులురెడ్డికి సొంత పొలంతో పాటు 4 ఎకరాల కౌలు భూమి ఉండగా, సొసైటీలో రూ.5 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.20 లక్షల అప్పులున్నాయి. ఆశీర్వాదానికి సొంతంగా 2 ఎకరాలుండగా, 4 ఎకరాలు కౌలుకు చేస్తున్నాడు. ఆయన సొసైటీలో రూ.2 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇద్దరి పంటలు పూర్తిగా దెబ్బ తినడంతో పొలంలో గుళికలు మింగి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి.. వీరిద్దరి ఆత్మహత్యలకు వ్యక్తిగత ఇబ్బందులే కారణమని అధికారులు తేల్చారు. పరిహారం అందక ఈ రెండు కుటుంబాలు రోడ్డునపడ్డాయి.టీడీపీ నేతల బెదిరింపులు తాళలేకబాపట్ల జిల్లా బుల్లికురువ మండలం వెలమవారిపాలెంలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చింతల శ్రీను(41) 25 ఏళ్లుగా సాగు చేస్తున్నాడు. తనకున్న 20 ఎకరాలను గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఆక్రమించుకొని అక్రమంగా ఆన్‌లైన్‌లో వారి పేరిట మార్చుకున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. టీడీపీ నేతల వేధింపులు తాళలేకపోతున్నానని, తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ అధికారులకు సమాచారమిచ్చినా స్పందన లేదు. చనిపోయే ముందు 100కు ఫోన్ చేసినా పట్టించుకోలేదు. చివరికి అద్దంకి సమీపంలోనే పురుగుల మందు తాగి విగతజీవిగా పడి ఉన్న శ్రీనును స్థానిక వైఎస్సార్‌సీపీ కార్తకర్తలు హుటాహుటిన ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గత నెల 28న మృతి చెందాడు. తండ్రి చనిపోయిన తర్వాత కూడా టీడీపీ నేతల వేధింపులు కొనసాగుతున్నాయంటూ శ్రీను కుమారులు భూదేశ్వరరావు, వీరయ్యలు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతి/నెట్‌వర్క్ : ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఇల్లు గడిచే దారిలేక, పిల్లల చదువులు సాగక, పెళ్లిళ్లు ఆగిపోయి ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ‘మేమున్నాం అని ధైర్యం చెప్పి ఆదుకోవాల్సిన ఆపన్న హస్తం కనిపించకపోవడంతో వారంతా రోడ్డున పడి దిక్కులు చూస్తున్నారు. అందలం ఎక్కింది మొదలు అన్నదాతపై కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో పుడమి తల్లి బిడ్డలు విసిగివేసారి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సాగు వేళ తుపానులు, వరదలు, వర్షాభావ పరిస్థితులు ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వైపరీత్యాలు ముప్పేట దాడి చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నల పాలిట ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు మృత్యు పాశాలుగా మారాయి. సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించిన ప్రభుత్వం తమను వంచించడంతో పాటు తమకు న్యాయంగా దక్కాల్సిన పంటల బీమా పరిహారం కూడా అందకుండా చేయడంతో పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వలేక సాగు భారమై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే ఆరున్నర నెలల కూటమి పాలనలో ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య సెంచరీకి చేరువయ్యిందంటే రైతులు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నారో అర్థమవుతోంది. వీరంతా త్రీమెన్ కమిటీ నిర్ధారించిన వారే. ఇక వివిధ కారణాలతో కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులు, తిరస్కరించిన కేసులు కలుపుకుంటే ఆత్మహత్య చేసుకున్న వారు 150కి పైగానే ఉన్నారు. ఆరున్నర నెలల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా పైసా పరిహారం ఇవ్వక పోవడంతో బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి. తాజాగా వైఎస్సార్ జిల్లాకు చెందిన రైతు తన భార్య, కొడుకు, కుమార్తెలకు ఉరి వేసి.. తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల దయనీయ పరిస్థితి కంట నీరు తెప్పిస్తోంది.కూటమి ప్రభుత్వం రాకతో కష్టాలురాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఏటా సీజన్‌కు ముందు అందే పెట్టుబడి సాయం లేదు. పంటల బీమా పరిహారం జాడ లేదు. కరువు సాయం ఊసే లేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. పోనీ రూ.3–5 వడ్డీలకు అప్పులు చేసి మరీ సాగు చేస్తుంటే సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరక్క పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఓ పక్క కల్తీలు రాజ్యమేలుతుంటే మరోపక్క బ్లాక్ మార్కెటింగ్ పెచ్చు మీరింది. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం శ్రమించి సాగు చేస్తే ఓ వైపు వైపరీత్యాలు, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసి పండించిన కొద్దిపాటిæ పంట చేతికొచ్చే సమయంలో ధర లేక అయినకాడకి తెగనమ్ముకుంటూ తమ కష్టాన్ని దళారుల పాల్జేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాలను ఓదార్చే వారు కరువయ్యారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తిచూడడం లేదు.ఆరున్నర నెలల్లోనే సడలిన నమ్మకంప్రభుత్వ నిర్వాకం, అస్తవ్యస్త విధానాల వల్ల అన్నదాతల్లో నమ్మకం పోతోంది. వెరసి జూన్ 12వ తేదీ నుంచి ఇప్పటి దాకా.. కేవలం ఆరున్నర నెలల్లో 95 మంది ఆత్మహత్యకు పాల్పడినట్టుగా త్రీమెన్ కమిటీ ధ్రువీకరించింది. తాజాగా వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో శనివారం ఆత్మహత్య చేసుకున్న వారితో కలుపుకుంటే ఈ సంఖ్య 97కు చేరుకుంది. త్రీమెన్ కమిటీ ధ్రువీకరించకుండా పెండింగ్‌లో ఉన్న కేసులు మరో 10–15 వరకు ఉంటాయని, తిరస్కరించిన కేసులు ఇంకో 50 ఉంటాయని అధికార వర్గాల సమాచారం. ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారిలో రాయలసీమ జిల్లాలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, గుంటూరు జిల్లాల్లోనే 51 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 30 మంది అర్ధాంతరంగా తనువు చాలించారు. దాదాపు ప్రతి జిల్లాలోనూ కనీసం ఇద్దరు ముగ్గురికి తక్కువ కాకుండా ఆత్మహత్యలకు పాల్పడిన రైతులున్నారు. వీరికి ఎంత పరిహారం ఇవ్వాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.2014–19 మధ్య ఎన్నో ఆంక్షలుఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవారు. రూ.లక్ష కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటూ చంద్రబాబు అవహేళనగా మాట్లాడడమే కాదు.. ఆ ఇచ్చే పరిహారాన్ని కూడా 2003లో ఆపేశారు. 2014లో పరిహారం పునరుద్ధరించగా, 2015 ఫిబ్రవరి 18వ తేదీ వరకు రూ.1.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. ఆ తర్వాత రూ.5 లక్షలకు పెంచారు. దాంట్లో రూ.1.50 లక్షలను వన్ టైం సెటిల్‌మెంట్ కింద ఆత్మహత్యకు పాల్పడిన రైతుల అప్పుల ఖాతాకు జమ చేసేవారు. రూ.3.5 లక్షల పరిహారాన్ని విత్ డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునేలా ఆంక్షలు విధించారు. 2014–19 మధ్య ఐదారువేల మంది ఆత్మహత్యలకు పాల్పడితే అధికారికంగా గుర్తించింది కేవలం 1,223 మందిని మాత్రమే. కానీ పరిహారం ఇచ్చింది కేవలం 450 మందికి రూ.20.12 కోట్లే. కౌలు రైతుల ఊసే లేదు.పరామర్శ లేదు.. సాయం ఊసు లేదు ‘రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ వారింటికి వెళ్లి ధైర్యాన్నివ్వాలి. అదేరోజు వీఆర్వో వెళ్లి వివరాలు సేకరించాలి. మండల స్థాయి కమిటీ విచారణ చేపట్టి, 24 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలి. డివిజన్ స్థాయి త్రీమెన్ కమిటి సిఫార్సు మేరకు నిర్దేశిత గడువులోగా పరిహారం అందించేలా జిల్లా ఉన్నతాధికారులు వ్యవసాయ శాఖకు నివేదిక సమర్పించాలి’ అనే విధానాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వంలో రైతు ఆత్మహత్య తర్వాత బాధితులను కలెక్టర్, ఎమ్మెల్యే పరామర్శించిన పాపాన పోలేదు. తుది నివేదిక రూపకల్పనలో ప్రభుత్వ ఒత్తిళ్లు బలంగా పని చేస్తున్నాయి. సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక పొలంలోనే పురుగుల మందుతాగి ఆత్మహత్యలకు పాల్పడినా సరే, వ్యక్తిగత కారణాలతోనే చనిపోతున్నారంటూ నివేదికలు ప్రభుత్వం వద్దకు వెళ్తున్నాయి. బాధిత కుటుంబాలు స్పందనలో అర్జీలు ఇచ్చినా స్పందించడం లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేవనే సాకుతో అన్యాయం చేస్తున్నారు.2019–24 మధ్య ఆదుకున్న ప్రభుత్వంవైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. కారణాలు ఏమైనా సరే ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకతీతంగా ఆదుకుంది. 2014–19 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతు ఘటనలకు సంబంధించి కూడా రీ వెరిఫికేషన్‌లో 474 మంది అర్హత పొందగా, వారికి పరిహారం అందజేసింది. ఈ విధంగా ఐదేళ్లలో 1,794 మందికి రూ.116.10 కోట్ల ఎక్స్‌గ్రేషియా జమ చేసింది. ఇందులో 495 మందిక కౌలు రైతులున్నారు. ఊరూరా ఆర్బీకేల ఏర్పాటు ద్వారా విత్తు నుంచి పంట కొనుగోలు వరకు రైతులను చేయి పట్టుకుని నడిపించింది. ఉచిత పంటల బీమా ద్వారా అండగా నిలిచింది. ఏటా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రూ.13,500 చొప్పున సాయం అందించింది. రూ.12,563 కోట్లు ఎగ్గొట్టిన కూటమి సర్కారుఅధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద గత ఐదేళ్లలో లబ్ధి పొందిన 53.58 లక్షల మందికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలంటే ఏటా రూ.10,718 కోట్లు అవసరం. ఇప్పటికీ దాని ఊసే ఎత్తడం లేదు. 2023–24 సీజన్‌కు రూ.930 కోట్ల రైతుల వాటా ప్రీమియం సొమ్ము చెల్లించక పోవడం వల్ల ఆ సీజన్‌లో కరువు వల్ల పంటలు దెబ్బ తిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిలో పంటల బీమా అమలు చేస్తుండడంతో బీమా ప్రీమియం భరించలేక రైతులు పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌తోపాటు రబీ 2023–24 సీజన్‌లో కరువు ప్రభావంతో దెబ్బతిన్న 3.91 లక్షల మంది రైతులకు రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్ 2023 సీజన్‌కు సంబంధించి 6.31 లక్షల మందికి రూ.132 కోట్ల వరకు జమ చేయలేదు. ఇలా ఆరున్నర నెలల్లో అన్నదాత సుఖీభవ, పంటల బీమా, కరువు సాయం బకాయిలు, సున్నా వడ్డీ రాయితీలు కలిపి రైతులకు ఈ ప్రభుత్వం రూ.12,563 కోట్లు ఎగ్గొట్టింది.పెద్దదిక్కు కోల్పోయి రోడ్డున పడ్డారు..నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రహిమానుపురానికి చెందిన సలీంద్ర మధు (35) సొంతంగా 1.50 ఎకరాలు, మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని కంది, పత్తి, టమాటా, మిరప, ఉల్లి పంటలు సాగు చేసేవాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది కలిసి రాలేదు. సాగు కోసం రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. వీటిని తీర్చే దారిలేక గత నెల 16న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధు మృతితో అతని భార్య సంధ్యాదేవి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ప్రభుత్వం నుంచి పైసా పరిహారం కూడా అందలేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.పరిహారం కోసం ఎదురు చూపుప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సిద్ధినాయునిపల్లికి చెందిన రుద్రపాటి చిన్న వెంకట చన్నయ్య (70) 30 ఏళ్లుగా వ్యవసాయం చేసేవాడు. సొంతంగా ఆరెకరాలు, కౌలుకు 2 ఎకరాలు తీసుకొని టమాటా, పొగాకు సాగు చేశాడు. అప్పులు చేసి మూడు బోర్లు వేసినా నీరందక అవస్థలు పడ్డాడు. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పాటు చీడపీడలు కారణంగా పంటలు దెబ్బతినగా, పెట్టుబడులు కూడా దక్కలేదు. రూ.9 లక్షలకుపైగా చేసిన అప్పులు తీర్చే దారిలేక గత నెల 8న సొంత పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. త్రీమెన్ కమిటీ విచారణలో కూడా ఇదే విషయం నిర్ధారణ అయింది. అయినా పరిహారం ఇవ్వ లేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.అప్పులోళ్ల ఒత్తిళ్లు భరించలేక..పల్నాడు జిల్లా వెల్దురికి చెందిన పల్లపోలు వేణుగోపాల రెడ్డి (68) 1.50 ఎకరాలు కౌలుకు తీసుకొని పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బ తిన్నాయి. సాగు కోసం చేసిన అప్పులు రూ.20 లక్షల వరకు చేరుకున్నాయి. వాటిని తీర్చే దారిలేక, అప్పులోళ్ల ఒత్తిళ్లు భరించలేక గత నెల 22న ఇంట్లోనే ఉరి పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోవడంతో తామంతా రోడ్డున పడ్డామని, తమకు ఆసరా లేకుండాపోయిందని, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కూలి పనికి వెళ్తోన్న భార్య లక్ష్మి వేడుకుంటోంది.స్వాతంత్య్రం వచ్చిన రోజే.. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పందిర్లపల్లెకు చెందిన మహిళా రైతు మాదిగ సువర్ణ (39) తన 7 ఎకరాల భూమిలో ఆముదం, మిరప పంటలు సాగు చేసింది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. చేసిన అప్పులు రూ.8 లక్షలకు పైగా ఉన్నాయి. వాటిని తీర్చే దారిలేక స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న పొలంలోనే బావి వద్ద పురుగుల మందు తాగి తనువు చాలించింది. కుటుంబానికి జీవనాధారమైన సువర్ణ అర్ధాంతరంగా చనిపోవడంతో తనకున్న ముగ్గురు కుమార్తెలు, కుమారుడ్ని పోషించుకునే దారిలేక అనారోగ్యంతో బాధ పడుతున్న భర్త పాండు కన్నీటి పర్యంతమవుతున్నాడు.30 ఏళ్లకే తనువు చాలించి..అనంతపురం జిల్లా కాలువపల్లికి చెందిన యువ రైతు ఎర్రిస్వామి(30) అప్పుల బాధతో జూన్ 17న ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఐదెకరాల్లో సాగు కోసం అప్పులు చేసి మరీ బోరుబావులు తవ్వించాడు. నీరు పడలేదు. మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని కర్బుజా, టమాటా పంటలు సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో కలిసి రాలేదు. అప్పులు రూ.25 లక్షలు తీర్చే దారిలేక పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఇలా 30 ఏళ్లకే మృత్యువాత పడడంతో తల్లి లక్ష్మిదేవి, భార్య ప్రియాంకలు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమ గతేమిటని ప్రశ్నిస్తున్నారు.
రోడ్డెక్కిన ‘ఉత్తర రింగు’
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. ఈ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లను ఆహా్వనించింది. 161.518 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ భాగాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించి విడివిడిగా టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు ఫిబ్రవరి 14వ తేదీని తుది గడువుగా నిర్ధారించింది. ఆలోపు ఫైనాన్షియల్, టెక్నికల్ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 17న టెండర్లను తెరవనుంది. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ రెండేళ్లలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని టెండర్ డాక్యుమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నిర్మాణం పూర్తయిన తర్వాత ఐదేళ్లపాటు ఈ రహదారి నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈపీసీ పద్ధతిలో నిర్మాణ పనులు.. రీజినల్ ఉత్తర భాగాన్ని ఇంజనీరింగ్, ప్రొక్యూ ర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. తొలుత బీఓటీ (బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్), హామ్ వంటి విధానాలను పరిశీలించినా.. ఈ రోడ్డుపై వాహన ట్రాఫిక్ ప్రస్తుతానికి తక్కువగా ఉంటుందన్న అంచనాతో ఈపీసీ వైపు మొగ్గు చూపింది. మిగతా రెండు పద్ధతుల్లో నిర్మాణ సంస్థ తొలుత నిర్మాణ ఖర్చు మొత్తాన్ని భరించి, టోల్ రూపంలో వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గంలో ప్రస్తుతం టోల్ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం లేదని, నిర్మాణ సంస్థలు ముందుకురాకపోవచ్చని భావనకు వచ్చింది. దీంతో నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించేలా ఈపీసీ వైపు మొగ్గు చూపింది. నిర్మాణం పూర్తయ్యాక టోల్‌ను ఎన్‌హెచ్‌ఏఐ సొంతంగా వసూలు చేసుకుంటుంది. మొత్తం వ్యయం రూ.17,080 కోట్లు నెల రోజుల క్రితం కన్సల్టెన్సీ సంస్థ టెండర్ డాక్యుమెంటును సిద్ధం చేసి ఎన్‌హెచ్‌ఏఐకి సమర్పించింది. ఆ వెంటనే ఎన్‌హెచ్‌ఏఐ రీజనల్ ఉత్తర భాగం డీపీఆర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు సమర్పించింది. రీజనల్ ఉత్తర భాగం నిర్మాణ వ్యయం రూ.17,080 కోట్లుగా (రాష్ట్ర ప్రభుత్వ వాటా సహా) ప్రతిపాదించింది. ఇందులో రోడ్డు నిర్మాణ వ్యయం రూ.8,500 కోట్లు, భూసేకరణ వ్యయంలో కేంద్రం వాటా రూ.2,580 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,580 కోట్లు, ఇతర వ్యయం రూ.3,420 కోట్లుగా పేర్కొంది. మొత్తంగా ఎనిమిది లేన్లతో ఈ రోడ్డును ప్రతిపాదించారు. అందుకు సరిపడా భూసేకరణ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నాలుగు లేన్ల రోడ్డును నిర్మించి, భవిష్యత్తులో మిగతా నాలుగు లేన్లను నిర్మించనున్నారు. రెండింతలు అయిన వ్యయం రీజనల్ రింగురోడ్డును ప్రతిపాదించిన సమయంలో ఉత్తర భాగానికి రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రతిపాదించిన ఏడేళ్ల తర్వాత డీపీఆర్ సిద్ధమైంది. ప్రస్తుత ధరలు, పరిస్థితుల మేరకు అంచనా వ్యయం సుమారు రెండింతలై ఏకంగా రూ.17 వేల కోట్లు దాటింది. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం ఐదు ప్యాకేజీలు ఇవే.. రీజనల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ప్యాకేజీ–1: సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కిలోమీటర్లు. దీని నిర్మాణ వ్యయ అంచనా రూ.1,529.19 కోట్లు. ప్యాకేజీ–2: రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1114.80 కోట్లు. ప్యాకేజీ–3: ఇస్లాంపూర్ నుంచి రాజీవ్ రహదారి మీద ఉన్న ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1,184.81 కోట్లు. ప్యాకేజీ–4: ప్రజ్ఞాపూర్ నుంచి హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి మీద ఉన్న రాయగిరి గ్రామం వరకు 43 కిలోమీటర్లు. నిర్మాణ వ్యయం రూ.1,728.22 కోట్లు. ప్యాకేజీ–5: రాయగిరి నుంచి చౌటుప్పల్ సమీపంలోని తంగడపల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్లు. వ్యయ అంచనా రూ.1,547.04 కోట్లు. 11 చోట్ల భారీ ఇంటర్‌చేంజ్ కూడళ్లు రీజనల్ ఉత్తర భాగంలో 11 చోట్ల భారీ ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మించనున్నారు. జాతీయ/రాష్ట్ర రహదారులను ఈ రోడ్డు దాటే ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. మొదటి కూడలి: సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్.. ఇక్కడ ఎక్సె్టండెడ్ డంబెల్ ఆకృతిలో భారీ ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్ ఉంటుంది. దీని నిడివి 3 కిలోమీటర్లు ఉంటుంది. 150 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తారు. రెండో కూడలి: సంగారెడ్డి తర్వాత వచ్చే రెండో కూడలి 161 జాతీయ రహదారిని క్రాస్ చేసే శివంపేట వద్ద నిర్మిస్తారు. ఇక్కడ డబుల్ డంబెల్ డిజైన్‌లో ఉంటుంది. మూడో కూడలి: నర్సాపూర్–మెదక్ రోడ్డుపై నర్సాపూర్ వద్ద నిర్మిస్తారు. అక్కడ డంబెల్ మోడల్‌ను ఎంపిక చేశారు. నాలుగో కూడలి: హైదరాబాద్–నాగ్‌పూర్ రహదారిపై తూప్రాన్ వద్ద. ఇక్కడ క్లీవర్ లీఫ్ డిజైన్ ఎంపిక చేశారు. ఐదో కూడలి: తూప్రాన్–గజ్వేల్ దారిలో మజీద్‌పల్లి వద్ద. ఇక్కడ రోటరీ డిజైన్‌ను ఖరారు చేశారు. ఆరో కూడలి: రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ సమీపంలో ఉంటుంది. ఇక్కడ పాక్షిక క్లీవర్ లీఫ్ (మూడు లూప్‌లు మాత్రమే) డిజైన్ ఎంపిక చేశారు. ఏడో కూడలి: జగదేవ్‌పూర్–తుర్కపల్లి మధ్య పీర్లపల్లి వద్ద నిర్మిస్తారు. ఇక్కడ రోటరీ డిజైన్‌ను ఎంపిక చేశారు. ఎనిమిదో కూడలి: తుర్కపల్లి–యాదగిరిగుట్ట రోడ్డుపై తుర్కపల్లి వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్‌లో నిర్మిస్తారు. తొమ్మిదో కూడలి: హైదరాబాద్–వరంగల్ హైవేపై రాయగిరి వద్ద.. డబుల్ ట్రంపెట్ డిజైన్‌లో నిర్మించనున్నారు. పదో కూడలి: భువనగిరి–వలిగొండ రోడ్డుపై వలిగొండ వద్ద ఉంటుంది. ఇక్కడ రోటరీ డిజైన్‌ను ఖరారు చేశారు. 11వ కూడలి: చౌటుప్పల్ సమీపంలో నిర్మిస్తారు. ఎది ఎక్స్‌టెండెడ్ డంబెల్ నమూనాలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దక్షిణ భాగం డీపీఆర్ కన్సల్టెన్సీ టెండర్లకు కానరాని స్పందన మరోవైపు రీజనల్ రింగురోడ్డు దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంతో.. ఈ భాగాన్ని సొంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రాథమిక అలైన్‌మెంట్‌ను రూపొందించింది. తుది అలైన్‌మెంట్ తయారీ కోసం అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచింది. దాన్ని రోడ్లు భవనాల శాఖ అధికారులు శనివారం తెరిచారు. అయితే ఒక్క సంస్థ కూడా బిడ్లు దాఖలు చేయలేదని తెలిసింది. మరోవైపు రోడ్డు నిర్మాణాన్ని తొలుత ప్రతిపాదించిన మేరకు ఎన్‌హెచ్‌ఏఐతోనే చేపట్టాలని కోరుతూ ఇటీవల రోడ్లు భవనాల శాఖ కేంద్రానికి లేఖ రాసింది. దీంతో ఆ రోడ్డు నిర్మాణంపై సందిగ్ధత చోటు చేసుకుంది.
‘ఫార్ములా–ఈ’ రేసు కేసు: 7న విచారణకు రండి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌కు శనివారం సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 7వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో సహ నిందితు లుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బి.లక్ష్మీనరసింహారెడ్డి (బీఎల్‌ఎన్ రెడ్డి)లకు కూడా సమన్లు జారీ చేసింది. వీరిలో బీఎల్‌ఎన్ రెడ్డిని వచ్చే నెల 2న, అర్వింద్‌కుమార్‌ను 3వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ముగ్గురినీ ఆయా తేదీల్లో శుక్రవారం వేర్వేరుగా సమన్లు జారీ చేసింది. ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఆ సమన్లలో పేర్కొన్నారు. ఏసీబీ కంటే దూకుడుగా.. హైదరాబాద్ నగరంలో ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్‌ఎండీఏ నుంచి విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి హెచ్‌ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఏ2గా, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏ3గా చేర్చింది. ఈ ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఏసీబీ దర్యాప్తు కన్నా ఈడీ మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది. నిందితులను విచారించేందుకు సమన్లు జారీ చేసింది. ఈడీ దర్యాప్తులో గుర్తించే అంశాల ఆధారంగా.. కేసులో ముందుకు వెళ్లనుంది. ఇదే సమయంలో ‘ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)’ కింద కూడా ఈడీ దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిసింది. నిధుల మళ్లింపుపైనే ఈడీ ఫోకస్.. ఫార్ములా–ఈ కార్ రేస్ సీజన్–10 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ విభాగం (ఎంఏయూడీ), ఫార్ములా–ఈ రేసు నిర్వహణ సంస్థ ఎఫ్‌ఈవో (ఫార్ములా–ఈ ఆపరేషన్స్) సంయుక్తంగా సిద్ధమయ్యాయి. రేసు నిర్వహణకు సంబంధించి స్పాన్సర్ ఫీజు, పన్నులు కలిపి మొత్తం రూ.110 కోట్లు (90,00,000 బ్రిటన్ పౌండ్లు)ను ఎఫ్‌ఈవోకు చెల్లించేలా 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం చేసుకున్నారు. కానీ అంతకన్నా ముందే నిధులు చెల్లించాలంటూ సెప్టెంబర్ 25న తొలి వాయిదాగా 22,50,000 పౌండ్లు (మన కరెన్సీలో రూ.22,69,63,125), 29వ తేదీన రెండో వాయిదాగా 22,50,000 పౌండ్లు (అయితే పన్నులు, కమిషన్ కలిపి రూ.23,01,97,500) చెల్లించాలంటూ ఎఫ్‌ఈవో ఇన్వాయిస్‌లు పంపింది. దీనిపై అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్‌ను పూర్తి చేశారు. అక్టోబర్ 3న మొదటి వాయిదా కింద రూ.22,69,63,125, అక్టోబర్ 11న రెండో వాయిదా కింద రూ.23,01,97,500 మంజూరు చేశారు. ఈ మొత్తం హెచ్‌ఎండీఏ బోర్డ్ ఖాతా నుంచే బ్రిటన్‌కు బదిలీ అయినట్టు ఈడీ గుర్తించింది. దీనిపై బీఎల్‌ఎన్ రెడ్డిని విచారించాలని నిర్ణయించింది. హెచ్‌ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ.45.71 కోట్లు, పెనాల్టీగా ఐటీ శాఖకు చెల్లించిన రూ.8 కోట్లు కలిపి మొత్తం రూ.54.89 కోట్లకు సంబంధించిన వివరాలను రాబట్టనుంది. ఎవరి ఆదేశాలతో ఇది చేశారు?ఇందుకు సంబంధించిన పత్రాలు, హెచ్‌ఎండీఏ రికార్డులపై ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా అనుమతుల వ్యవహారాలు, అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందన్న కోణంలో ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ప్రశ్నించనున్నట్టు తెలిసింది. వీరి నుంచి సేకరించే అంశాల ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది.
ఏపీ గర్వపడేలా చేశారు.. క్రికెటర్ నితీష్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: క్రికెటర్ నితీష్ కుమార్‌రెడ్డి(Nitish Kumar Reddy)కి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మెల్‌బోర్న్(Melbourne)లో చిన్నవయసులోనే సెంచరీ సాధించిన నితీష్‌కు అభినందనలు. 21 సంవత్సరాల వయసులోనే ఈఘనత సాధించటం విశేషం. ప్రపంచ స్థాయి ఆస్ట్రేలియన్ జట్టు మీద నితీష్ అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. నితీష్ సాధించిన విజయం దేశం మొత్తానికి గర్వకారణం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గర్వపడేలా చేశారు. నితీష్ విజయం ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తి దాయకం. నితీష్ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత క్రికెటర్, ఆంధ్రా ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీతో మెరిశారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరొ వైపు, వాషింగ్టన్ సుందర్ తో కలిసి రికార్డు నెలకొల్పడం విశేషం. ఇదీ చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు
తండ్రి కోసం హిమాన్షు పాట.. సంబరపడిపోయిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తన పట్ల ప్రేమతో కుమారుడు హిమాన్షు(Himanshu Rao) పాడిన పాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తన తండ్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా యానిమల్(Animal) సినిమాలోని 'నా సూర్యుడివి.. నా చంద్రుడివి' అంటూ స్వయంగా పాట పాడిన హిమాన్షు.. తండ్రితో తనకున్న జ్ఞాపకాల ఫొటోలను కూడా యాడ్ చేసి వీడియోగా రూపొందించారు.దీంతో తన కుమారుడు తన కోసం ఓ పాట పాడటంతో సంబరపడిపోయిన కేటీఆర్.. సోషల్ మీడియా(Social media)లో పోస్టు చేశారు. తన కొడుకు పాట విని ఒక తండ్రిగా తనకు చాలా సంతోషంగా ఉందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్‌కు ఆయన కుమారుడు హిమాన్షు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.జూలైలో నా పుట్టినరోజు కోసం నా కుమారుడు ఈ పాటను రికార్డ్ చేశాడని.. కానీ అది సంతృప్తికరంగా రాలేదని భావించి విడుదల చేయలేదని, తాను ఆ పాటను వారం క్రితం మొదటిసారి విన్నానని, హిమాన్షు పాట సాహిత్యం.. గానం అద్భుతంగా ఉందని కేటీఆర్ ప్రశంసించారు. తాను దీని పట్ల తండ్రిగా ఎంతో గర్వపడుతున్నానన్నారు. కష్టతరమైన సంవత్సరంలో నాకు ఉత్తమ బహుమతి అందించిన బింకు(హిమాన్షు)కు అభినందనలంటూ కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, తన పాటను తండ్రి కేటీఆర్ మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందని హిమాన్షు రీట్వీట్ చేశారు. The best Gift for me in what has been a difficult year Thank you Binku @TheHimanshuRaoK ❤️ Loved the vocalsApparently, my son recorded this for my birthday in July. But shied away from releasing it as he didn’t think it was good enough!!!I’ve only heard it last week for… pic.twitter.com/NTIBgcxQAa— KTR (@KTRBRS) December 28, 2024
మహేశ్‌బాబు - రాజమౌళి సినిమాలో స్టార్ హీరోయిన్
మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వారిద్దరూ కలిసి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2025 మార్చి నుంచి ప్రారంభం కానుంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావించిందట. ఈ కథలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉందని టాక్. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా చోప్రాను డైరెక్టర్ రాజమౌళి పలుమార్లు కలిసినట్లు బాలీవుడ్ మీడియా కూడా వెల్లడించింది. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇండోనేషియా నటి 'చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్' ఈ చిత్రంలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చెల్సియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలు నిజమేనని నమ్మారు. మరి ఆమె పాత్ర ఈ చిత్రంలో ఏ మేరకు ఉంటుందో తెలియాల్సి ఉంది.గ్లోబల్ లెవెల్లో భారీ బడ్జెట్‌తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎక్కువగా విదేశీ నటులు కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ప్లాంట్ల విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల తయారీలో ఉన్న గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ప్లాంట్లలో త్రీ–వీలర్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఆంపియర్, ఈలీ, గ్రీవ్స్, ఈల్ట్రా బ్రాండ్స్‌లో ఎలక్ట్రిక్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) వాహనాలను విక్రయిస్తున్న ఈ సంస్థకు తెలంగాణలోని తూప్రాన్, ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా, తమిళనాడులోని రాణిపేట్ వద్ద తయారీ కేంద్రాలు ఉన్నాయి. గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో త్రిచక్ర వాహనాల తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 21,514 యూనిట్ల నుంచి 45,896 యూనిట్లకు, తూప్రాన్ ప్లాంట్‌లో 13,538 నుంచి 34,800 యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ‘విస్తరిస్తున్న మార్కెట్‌కు అనుగుణంగా అదనంగా ఉత్పత్తి చేయడానికి, అలాగే కొత్త మోడళ్ల తయారీని కూడా ఈ విస్తరణ అనుమతిస్తుంది’ అని కంపెనీ తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.ఐపీవో ద్వారా వచ్చే నిధులతో..గ్రీవ్స్ ఎలక్ట్రిక్ గ్రేటర్ నోయిడాలో ఫెసిలిటీ విస్తరణ కోసం రూ.20 కోట్లు, తూప్రాన్ ప్లాంటుకు రూ.38 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రతిపాదిత ఐపీవో ద్వారా వచ్చే నికర ఆదాయం నుండి ఈ పెట్టుబడులకు నిధులు సమకూర్చనున్నారు. రాణిపేట్ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను, గ్రేటర్ నోయిడా కేంద్రంలో ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లను, తూప్రాన్ ఫెసిలిటీలో ఎలక్ట్రిక్‌తోపాటు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ త్రీ–వీలర్లను సంస్థ తయారు చేస్తోంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ అనుబంధ సంస్థలు బెస్ట్‌వే ఏజెన్సీస్ గ్రేటర్ నోయిడా కేంద్రాన్ని, ఎంఎల్‌ఆర్ ఆటో తూప్రాన్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వార్షికంగా 4.80 లక్షల ద్విచక్ర వాహనాల సామర్థ్యం కలిగిన రాణిపేట ప్లాంట్‌లో తయారీ సామర్థ్యాన్ని పెంచే ఆలోచనలో కంపెనీకి ప్రస్తుతానికి లేదు.త్రీ–వీలర్ల వాటా 28 శాతం..2023–24లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొత్తం ఆదాయంలో త్రీ–వీలర్ల వాటా 28 శాతం కైవసం చేసుకుంది. సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 13,470 యూనిట్ల త్రిచక్ర వాహనాలను విక్రయించింది. 2022–23లో ఈ సంఖ్య 6,870 యూనిట్లు. ఆంపియర్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ టూ–వీలర్ వ్యాపారం దాదాపు 68 శాతం వాటాతో ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఆంపియర్ ద్విచక్ర వాహనాల అమ్మకాల పరిమాణం 2022–23లో 1.09 లక్షల యూనిట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 47,820 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరుకు చెందిన గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ అనుబంధ కంపెనీయే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ లైన్..రాణి పేటలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది 4,00,000 యూనిట్ల వార్షిక స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతిపాదిత నూతన కేంద్రాన్ని 2026 మే నెలలో ప్రారంభించనునన్నారు. 2026 జూలైలో వాణిజ్యపరంగా ఉత్పత్తి కార్యకలాపాలను మొదలు పెట్టాలని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ భావిస్తోంది. ఈల్ట్రా బ్రాండ్ పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం రూ.3.80 లక్షల నుండి ప్రారంభం. ప్యాసింజర్స్ లేదా వస్తువులను రవాణా చేయగల రెండు మీడియం స్పీడ్ త్రీ–వీలర్ మోడళ్లను విక్రయిస్తోంది. డీజిల్, సీఎన్‌జీ త్రీ–వీలర్లు గ్రీవ్స్ బ్రాండ్ ద్వారా రూ.2.90 లక్షల ప్రారంభ ధరకు విక్రయిస్తున్నారు. ఈ బ్రాండ్ కింద నాలుగు మోడళ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ రిక్షా బ్రాండ్ ఈలీ కింద మూడు మోడళ్లు కొలువుదీరాయి. ధరల శ్రేణి రూ.1.30 లక్షల నుండి ప్రారంభం.
టైటిల్ వేటలో...
పుణే: రెండు నెలలకు పైగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)–11వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం పుణేలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా... హరియాణా స్టీలర్స్‌తో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ టైటిల్ కోసం తలపడనుంది. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన హరియాణా స్టీలర్స్... ఇప్పటికే మూడుసార్లు టైటిల్ ముద్దాడిన పట్నా మధ్య రసవత్తర పోరు ఖాయమే. తొలిసారి చాంపియన్‌గా నిలవాలనుకుంటున్న హరియాణా స్టీలర్స్‌కు జైదీప్ సారథ్యం వహిస్తుండగా... మన్‌ప్రీత్ సింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ నేరుగా సెమీఫైనల్‌కు చేరిన స్టీలర్స్... తుదిపోరులోనూ అదే జోరు కనబర్చాలని కృతనిశ్చయంతో ఉంది. స్టీలర్స్ తరఫున శివమ్ పాతరె, వినయ్, జైదీప్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యూపీ యోధాస్‌తో హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో కీలక పాయింట్లు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చిన శివమ్, వినయ్ ఈ మ్యాచ్‌లోనూ రాణించాలని స్టీలర్స్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. డిఫెన్స్‌లో రాహుల్, సంజయ్ కీలకం కానున్నారు. మరోవైపు గతంలో వరుసగా మూడు సార్లు పీకేఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న పట్నా... ఇప్పుడు నాలుగో టైటిల్ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. యువ ఆటగాళ్లు దేవాంక్ దలాల్, అయాన్ లోచాబ్ రాణించడంతో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన పైరేట్స్.. అదే జోష్‌లో టైటిల్ పట్టాలని చూస్తోంది.
‘సోషల్’ ఘోషలో స్నేహమే సమ్మోహనం
‘చరిత్రని మరచిపోని వాళ్ళు.. ఆ పొరపాట్లు కచ్చితంగా మళ్ళీ చేస్తారు’ అని ఎవరో పెద్దమనిషి అన్నాట్ట. గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి మన మనసు సృష్టించే భ్రమలే అనుకున్నా.. గతం గుర్తుంచుకోవడం మంచిదే. కొత్త భ్రమల్ని, అపోహల్ని సృష్టించుకోకుండా అది మనల్ని అదుపులో పెడుతుంది.ప్రతి సంవత్సరాంతంలో ఆ సంవత్సరం మనం ఏం సాధించాం, శోధించాం అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. కొత్త సంవత్సరం కేవలం ఓ తారీఖు మారటమే అని హేతువాదులన్నా.. అదేదో కొత్తప్రారంభం అనుకోవడం మనకో ఉత్సాహాన్నిస్తుంది. అందుకే కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆశయాలు, ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం. వాటిలో ఎన్ని అమలు చేస్తాం? ఎన్ని సాధిస్తాం? అనేది మళ్లీ ఆ సంవత్సరాంతంలో బేరీజు వేసుకుంటాం. ఈ చక్రం కొంత సరదాగా ఉంటుంది. కొంత నిజంగా ఉపయోగపడుతుంది.నా వరకూ నాకు ‘2023’ ఒక విచిత్రమైన సంవత్సరం. 2018లో కోవిడ్‌కి ముందు ‘సమ్మోహనం’ థియేటర్లలో విడుదలై ఘనవిజయాన్ని అందుకున్న తర్వాత, కోవిడ్‌లో 2020లో ఓటీటీలో విడుదలైన ‘వి’, ఆ తర్వాత 2022లో థియేటర్లలో విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నన్ను కొంత గజిబిజికి గురి చేశాయి. ‘వి’ మిశ్రమ ఫలితాలు, ‘ఆ అమ్మాయి..’ వైఫల్యం నా కళా దృక్పథాన్ని గట్టిగా కుదిపాయి. అయితే ఆ సమయంలో సద్విమర్శకులు, శ్రేయోభిలాషులు కొన్ని విషయాలని గట్టిగా విమర్శిస్తూనే, కొన్ని విషయాలలో నాకు అండగా నిలిచి, నా అభిరుచిని బలపర్చారు. 2024లో మళ్లీ ఆత్మస్థైర్యంతో అడుగిడేలా చేశారు. నా 2023 అనుభవాలు 2024 లో నా నిర్ణయాలని గాఢంగా కానీ, ప్రొడక్టివ్ గా కానీ ప్రభావితం చేశాయి అనిపిస్తోంది.గతమైనా, వర్తమానమైనా, భవిష్యత్తైనా మనల్ని నిలబెట్టేది మన స్నేహితులు. నిష్కర్షగా, ద్వేషరహితంగా మన జీవితాన్ని మనకి ప్రతిబింబించగలిగే నిజమైన స్నేహితులు. అందుకే ఈ రోజుల్లో ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఎగసిపడుతున్న అకారణ ద్వేషం, నెగిటివిటీ, సంచలనవాదం, పోటీతత్వం, వేలంవెర్రి సొంతడబ్బాల మధ్య నిజమైన స్నేహితుల్ని వెతుక్కోవడమే కొత్త సంవత్సరంలో మన నిర్ణయం, ఆశయం కావాలి. ఈ యూట్యూబ్ ట్రోల్స్, ఇన్‌స్టా రీల్స్, గొడవలు, అరుపులు, దైనందిన జీవితపు రణగొణధ్వని మధ్య నిజమైన నిష్కల్మషమైన స్నేహాన్ని వెతుక్కుని పట్టుకోవడం కష్టమే. ఉన్న స్నేహితుల్లో ఎవరు హితులో, ఎవరు శత్రువులో తెలుసుకుని, శత్రువుల్ని పాము కుబుసం విడిచినట్టు విడిచి కొత్త సంవత్సరంలో సరికొత్త సహచర్య సౌందర్యంలో ముందుకు వెళ్లడమే ఆశయం కావాలి. నిజానికి ప్రతి సంవత్సరం ఈ నిర్ణయాన్ని మళ్లీ మళ్లీ కొత్తగా తీసుకోవాలి. మన స్నేహసంపదని నలుగురికి పంచి, మన స్నేహిత సంపదని ప్రతి సంవత్సరం పెంచుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, లార్జర్ దాన్ లైఫ్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లాంటి నూతన ఆవిష్కారాలు, భావనలూ, ప్రచారాల నుండి మనల్ని మనం సంరక్షించుకోవాలంటే మంచి స్నేహితులే మనకి దిక్కు.2024లో ప్రతి సినిమాలో దాదాపు హీరో అంటే ఊచకోతకి మారుపేరయ్యాడు. నోట్లోంచి గొప్పగొప్ప ఉదాత్తమైన మానవత్వపు ఉపన్యాసాలిస్తూనే, రెండు చేతుల్తో వందలమందిని చంపుతున్నాడు. సున్నితమైన హాస్యం, ప్రేమ, సన్నిహితమైన సంభాషణలు, మానవ సంబంధాలు ట్రెండ్ కాదనే దుష్ప్రచారం మొదలై, బలం పుంజుకుంటోంది. ఈ సమయంలో ఈ కొత్త సంవత్సరంలో మనం ఆ ఒరవడికి కొంత అడ్డుకట్ట వేసి, మామూలు మనుషుల మానవత్వపు గుబాళింపు, తోటి మనిషి ఆనందాన్ని, అభ్యుదయాన్ని, కోరుకునే కొత్తరకం స్నేహితులని వెతుక్కుందాం. అలాంటి సరికొత్త కథానాయకుల్ని సృష్టిద్దాం, ఆదరిద్దాం. కొత్త సంవత్సరం కేవలం ఓ తారీఖు మారటమే అని హేతువాదులన్నా.. అదేదో కొత్తప్రారంభం అనుకోవడం మనకో ఉత్సాహాన్నిస్తుంది. అందుకే కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆశయాలు, ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం. – ఇంద్రగంటి మోహన కృష్ణ, సినీ దర్శకుడు
పుస్తకం చదివితేనే నిజమైన అనుభూతి
సాగు భూమికే రైతుభరోసా
మహిళలకు టికెట్లు ఉచితం: ధర్మ
వెలవెలబోతున్న పెయింట్స్ పరిశ్రమ
డ్రస్ మార్చుకొని ఆడు... కుదరదు!
యాక్షన్ ఎంటర్టైనర్
రోడ్డెక్కిన ‘ఉత్తర రింగు’
హీరో ఎలక్ట్రిక్‌పై దివాలా చర్యలు
సంయుక్త ఆధిక్యంలో అర్జున్
టైటిల్ వేటలో...
పోస్టాఫీసులో అకౌంట్ ఉంటే ఇన్ని బెనిఫిట్సా?
టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు
తిరుమల వెంకన్నస్వామికి ఘోర అపచారం
సెంచరీ హీరో నితీష్ కుమార్‌కు భారీ నజరానా..
ఎస్సై ఐ ఫోన్ వాట్సాప్ చాటింగ్‌లో ఏముందో..
బ్యాంకులకు కొత్త టైమింగ్స్.. జనవరి 1 నుంచే..
'భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటి సారి'.. రోహిత్‌పై ఎమ్ఎస్కే ఫైర్
IND Vs AUS: 'స్టుపిడ్.. స్టుపిడ్! నీవు భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లొద్దు'
ఏపీ గర్వపడేలా చేశారు.. క్రికెటర్ నితీష్‌కు వైఎస్ జగన్ అభినందనలు
ఓటీటీలో మలయాళ హిట్ సినిమా తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
పుస్తకం చదివితేనే నిజమైన అనుభూతి
సాగు భూమికే రైతుభరోసా
మహిళలకు టికెట్లు ఉచితం: ధర్మ
వెలవెలబోతున్న పెయింట్స్ పరిశ్రమ
డ్రస్ మార్చుకొని ఆడు... కుదరదు!
యాక్షన్ ఎంటర్టైనర్
రోడ్డెక్కిన ‘ఉత్తర రింగు’
హీరో ఎలక్ట్రిక్‌పై దివాలా చర్యలు
సంయుక్త ఆధిక్యంలో అర్జున్
టైటిల్ వేటలో...
పోస్టాఫీసులో అకౌంట్ ఉంటే ఇన్ని బెనిఫిట్సా?
టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు
తిరుమల వెంకన్నస్వామికి ఘోర అపచారం
సెంచరీ హీరో నితీష్ కుమార్‌కు భారీ నజరానా..
ఎస్సై ఐ ఫోన్ వాట్సాప్ చాటింగ్‌లో ఏముందో..
బ్యాంకులకు కొత్త టైమింగ్స్.. జనవరి 1 నుంచే..
'భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటి సారి'.. రోహిత్‌పై ఎమ్ఎస్కే ఫైర్
IND Vs AUS: 'స్టుపిడ్.. స్టుపిడ్! నీవు భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లొద్దు'
ఏపీ గర్వపడేలా చేశారు.. క్రికెటర్ నితీష్‌కు వైఎస్ జగన్ అభినందనలు
ఓటీటీలో మలయాళ హిట్ సినిమా తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
సినిమా
ఇండియా బిగ్గెస్ట్ 'రామ్ చరణ్' కటౌట్.. ఆవిష్కరించనున్న గేమ్ ఛేంజర్ టీమ్
గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను విజయవాడలో ఆయన ఫ్యాన్స్ ఆవిష్కరించనున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా భారీ విజయం సాధించాలని రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో డిసెంబర్ 29న మధ్యాహ్నం 3 గంటలకు చిత్ర యూనిట్ ఆవిష్కరించనుంది.256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ లుక్‌తో కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్ దేశంలోనే అతి పెద్దదని మెగా అభిమానులు చెబుతున్నారు. ఆదివారం నాడు హెలికాప్టర్‌తో కటౌట్‌కి పూలభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గేమ్ ఛేంజర్ చిత్ర బృందంతో పాటు నిర్మాత దిల్ రాజు హాజరు కానున్నారు. ఈ కటౌట్‌ను ఏర్పాటు చేసేందుకు సుమారు ఐదురోజులగా అభిమానులు కష్టపడ్డారు.ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేలకు పైగానే ఫ్యాన్స్ రావచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం పూర్తి అనుమతులు తీసుకున్నట్లు రామ్ చరణ్ అభిమానులు వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగ జనవరి 10న విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది.
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ చూశారా..?
'మ్యాడ్ స్క్వేర్' సినిమా నుంచి యూత్‌ను ఆకట్టుకునే సాంగ్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' పేరుతో సీక్వెల్ రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి' అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. మ్యాడ్ సినిమాతో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోదరి హారిక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు సీక్వెల్‌ను కూడా హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఓటీటీలో మలయాళ హిట్ సినిమా తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
మలయాళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన 'ముర' చిత్రం తెలుగు వర్షన్ ఓటీటీలో విడుదలైంది. రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'ముర' ఒక వర్గం ప్రేక్షకులను భారీగా మెప్పించింది. యాక్షన్ ఎపిసోడ్స్ మరోస్థాయిలో ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డరు. నవంబర్ 8న విడుదలైన ఈ మూవీ రీసెంట్గా 50రోజుల వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.ముహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో తెరకెక్కిన 'ముర' చిత్రంలో హృదు హరూన్, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి,కన్నన్ నాయర్ వంటి వారు నటించారు. క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీ నుంచి మలయాళం వర్షన్లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం.. తెలుగు,తమిళ్,కన్నడ వంటి భాషలలో డిసెంబర్ 28న అమెజాన్ స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది.కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కథతో ఈ చిత్రం ఉంటుంది. నలుగురు యువకులు ఉద్యోగం లేకపోవడంతో ఓ దోపిడీ కోసం ప్రయత్నిస్తారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో దర్శకుడు చాలా ఆసక్తిగా చూపించాడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి 'ముర' ఎంత మాత్రం నిరాశపరచదు.
సంక్రాంతి సాంగ్‌తో దుమ్మురేపిన వెంకటేష్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి మూడో సాంగ్ ప్రోమో వచ్చేసింది. సరికొత్తగా ఈ సాంగ్ పరిచయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఒక వీడియో రూపంలో ఇప్పటికే చూపించారు. అయితే, ఇప్పుడు సాంగ్ ప్రోమో విడుదల కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. సుమారు ఏడేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్ ఆలపించడం. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పూర్తి సాంగ్‌ను డిసెంబరు 30న మేకర్స్ విడుదల చేయనున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్ కానుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
దక్షిణాఫ్రికా లక్ష్యం 148
సెంచూరియన్: పాకిస్తాన్‌తో జరుగుతున్న ‘బాక్సింగ్ డే’ తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా గెలుపుబాటలో 121 పరుగుల దూరంలో ఉంది. అయితే కీలకమైన 3 వికెట్లు కోల్పోవడం వల్ల సఫారీకి నాలుగో రోజు ఛేజింగ్ అంత సులభంగా అయితే లేదు. అంతకుముందు శనివారం 88/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్ 59.4 ఓవర్లలో 237 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు బ్యాటర్లు బాబర్ ఆజమ్ (85 బంతుల్లో 50; 9 ఫోర్లు), సౌద్ షకీల్ (113 బంతుల్లో 84; 10 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరి జోడి నిలబడినంతవరకు బాగానే ఉన్నా... బాబర్ ఫిఫ్టీ తర్వాత నిష్క్రమించడంతో కథ మొదటికొచ్చిoది. జట్టు స్కోరు 153 పరుగుల వద్ద బాబర్‌ను జాన్సెన్ అవుట్ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం ముగియగా, తర్వాత వచ్చిన రిజ్వాన్ (3), సల్మాన్ ఆఘా (1)లను జాన్సెన్ పెవిలియన్ చేర్చడంతో 176 స్కోరు వద్ద ఆరో వికెట్ పడింది. సఫారీ బౌలర్లు ఇదే జోరు సాగిచండంతో పాక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మార్కో జాన్సెన్ 6 వికెట్లు పడగొట్టగా, రబడకు 2 వికెట్లు దక్కాయి. తొలిఇన్నింగ్స్‌లో సఫారీకి 90 పరుగుల ఆధిక్యం దక్కడం వల్ల 148 పరుగుల లక్ష్యమే ఎదురైంది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది.
జింక్ మైదానం నుంచి ఎంసీజీ సెంచరీ వరకు...
సాక్షి, క్రీడావిభాగం : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం...మరో 25 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉంది. కానీ కొడుకు భవిష్యత్తు కోసం దానిని వదిలేసేందుకు ఆయన సిద్ధమయ్యాడు. దానికి ఎంత ధైర్యం కావాలి? తన అబ్బాయి ఆటపై ఎంత నమ్మకం ఉండాలి. విశాఖపట్నానికి చెందిన ముత్యాల రెడ్డి కి ఆ నమ్మకం ఉంది. అందుకే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు.మున్ముందు ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తాయని తెలిసినా అన్నింటినీ తట్టుకునేందుకు రెడీ అన్నాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తన కొడుకు టెస్టు క్రికెటర్‌గా మారి ఎందరో కలలు గనే మెల్‌బోర్న్ మైదానంలో సెంచరీ సాధించిన క్షణం ఆయన ఆనందం కన్నీళ్లుగా మారి కనిపించింది! తన కష్టం ఫలించిన రోజు ఆ పుత్రోత్సాహం గురించి చెప్పేందుకు ఎన్ని విశేషణాలు కూడా సరిపోవేమో. ఆరేళ్ల వయసులో మొదలైన నితీశ్ రెడ్డి క్రికెట్ ఆట 12 ఏళ్లు వచ్చే సరికి పూర్తి స్థాయి క్రికెటర్‌గా మారాలనే కల వైపు అడుగులు వేసింది. ఏసీఏకు చెందిన కడప అకాడమీలో అండర్–14 విభాగంలో శిక్షణకు ఎంపికైన తర్వాత గమ్యంపై మరింత స్పష్టత వచ్చేసింది. ఇదే సమయంలో ముత్యాల రెడ్డి అనూహ్యం నిర్ణయం తీసుకున్నాడు.ఉద్యోగరీత్యా రాజస్తాన్‌కు బదిలీ కాగా...అలా వెళితే తన కొడుకును తీర్చిదిద్దడం కష్టమవుతుందని ఆయన భావించాడు. అందుకే హిందుస్తాన్ జింక్ కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయంలో కొడుకు కోసం కేటాయించేశాడు. బీసీసీఐ అండర్–16 టోర్నీ విజయ్‌మర్చంట్ ట్రోఫీలో ఒకే సీజన్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 1237 పరుగులు చేయడటంతో అతని సత్తా అందరికీ తెలిసింది. 176.71 సగటుతో 4 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో చేసిన ఆ పరుగులు బీసీసీఐ ఉత్తమ ఆటగాడి అవార్డును అందించాయి. నాగాలాండ్‌తో జరిగిన పోరులో 366 బంతుల్లో 60 ఫోర్లు, 7 సిక్స్‌లతో చేసిన 441 పరుగులు నితీశ్ ధాటిని చూపించాయి. అలా మొదలైన ప్రస్థానం అండర్–19 జట్టుతో పాటు ఆ తర్వాత ఆంధ్ర సీనియర్ టీమ్‌లో కూడా అవకాశం కల్పించాయి. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ దూకుడును అభిమానులంతా చూశారు. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆంధ్ర తరఫున 25 వికెట్లు తీయడంతో అతని బౌలింగ్ పదును కూడా సెలక్టర్లకు అర్థమైంది. అందుకే జాతీయ జట్టులో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నితీశ్ తాజా ప్రదర్శన టెస్టు జట్టులో అతని స్థానాన్ని సుస్థిరం చేయడం ఖాయం. ఇదే జోరు కొనసాగిస్తే మూడు ఫార్మాట్లలో కూడా ఈ అబ్బాయి అద్భుతాలు చేయడం ఖాయం.
నితీశ్ రెడ్డి ‘వైల్డ్ ఫైర్’
దేశం తరఫున ఆడుతూ కెరీర్లో తొలి సెంచరీ అంటే ఎలా ఉండాలి...జీవితకాలం ఇలాంటి క్షణాల కోసమే శ్రమించే కష్టాన్ని మరచిపోయేలా ఉండాలి...ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక మైదానంలో ఎందరో కలలు గనే చోట సాధించినట్లుగా ఉండాలి... అన్నీ అనుకూలించినప్పుడు కాదు...జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ తానేంటో చూపించాలి...అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ, శరీరానికి తగిలే దెబ్బలను తట్టుకుంటూ, వేలాది మంది తనకు జేజేలు పలికేలా శతకం బాదాలి...వీటన్నింటికీ ఒక్కటే సమాధానం! మన ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కొట్టినట్లుగా సెంచరీ ఉండాలి. మెల్‌బోర్న్ టెస్టులో భారీ ఆధిక్యంపై కన్నేసి విజయంపై గురి పెట్టిన ఆస్ట్రేలియాను మన నితీశ్, వాషింగ్టన్ సుందర్ సమర్థంగా అడ్డుకున్నారు. శతక భాగస్వామ్యంతో జట్టును గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించారు. ముందుగా ఫాలో ఆన్ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఆపై ఆధిక్యాన్ని తగ్గిస్తూ వచ్చారు. నితీశ్ అద్భుత బ్యాటింగ్‌కు సుందర్ సమన్వయం తోడవడంతో కంగారూలు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. వీరిద్దరు కలిసి 47.3 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లను నిలువరించారు. ఈ ఇద్దరు బ్యాటర్ల పోరు తర్వాత ప్రస్తుతానికి భారత్ ఓటమి ప్రమాదంనుంచి దాదాపుగా తప్పించుకున్నట్లే. మెల్‌బోర్న్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు మ్యాచ్‌ను భారత యువ ఆటగాళ్లు ఆసక్తికరంగా మార్చారు. ఒక దశలో తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం కోల్పోయి ఓటమికి బాటలు వేసుకునేటట్లు కనిపించిన టీమిండియా కోలుకొని మెరుగైన స్థితికి చేరింది. మ్యాచ్ మూడో రోజు వెలుతురులేమితో ఆటను నిర్ణీత సమయానికి ముందే అంపైర్లు నిలిపివేశారు. అప్పటికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి (176 బంతుల్లో 105 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా...వాషింగ్టన్ సుందర్ (162 బంతుల్లో 50; 1 ఫోర్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నితీశ్‌తో పాటు సిరాజ్ (2 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్ మరో 116 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 164/5తో ఆట కొనసాగించిన భారత్ శనివారం 70 ఓవర్లు ఆడి మరో 194 పరుగులు జోడించింది. ప్రస్తుతానికి ఆసీస్‌కు ఆధిక్యం ఉన్నా...నాలుగో రోజు ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు చేసి సవాల్ విసురుతుందనేది ఆసక్తికరం. మిగిలిన సమయం, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే రెండు రోజుల్లో రెండు ఇన్నింగ్స్‌లు పూర్తి కావడం అంత సులువు కాదు. అదే జరిగితే ఈ మ్యాచ్ కూడా ‘డ్రా’గా ముగియవచ్చు. భారీ భాగస్వామ్యం... తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు వెనుకబడి ఉన్న స్థితినుంచి రిషభ్ పంత్ (37 బంతుల్లో 28; 3 ఫోర్లు), రవీంద్ర జడేజా (17) మూడో రోజు ఆటను కొనసాగించారు. వీరిద్దరు మరింత బాధ్యతాయుతంగా ఆడి జట్టును రక్షించాల్సి ఉన్నా...ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ముఖ్యంగా పంత్ చెత్త షాట్‌తో తన వికెట్ సమర్పించుకోగా, జడేజా ఎల్బీగా దొరికిపోయాడు. 30 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. జడేజా అవుటయ్యాక సుందర్ బ్యాటింగ్‌కు రాగా, మరో ఎండ్‌లో నితీశ్ 22 పరుగుల వద్ద ఆడుతున్నాడు. మరో మూడు వికెట్లు తీసి భారత్ ఆట ముగించవచ్చని భావించిన ఆసీస్‌కు ఇక్కడే అసలు ప్రతిఘటన ఎదురైంది. నితీశ్, సుందర్ చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ మెల్లగా స్కోరును పెంచుతూ పోయారు. లంచ్ సమయానికి స్కోరు 244/7 వద్ద నిలిచింది. రెండో సెషన్లో పూర్తిగా వీరిద్దరిదే హవా సాగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా 24 ఓవర్ల పాటు ఈ జోడీని విడదీయడంలో ఆసీస్ బౌలర్లు విఫలమయ్యారు. మూడో సెషన్లో కూడా వీరిద్దరు గట్టిగా నిలబడ్డారు. ఆసీస్ తొలి 15 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చినా వికెట్ మాత్రం తీయలేకపోయింది. ఎట్టకేలకు 127 పరుగుల ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం తర్వాత సుందర్‌ను అవుట్ చేసి లయన్ ఈ జోడీని విడదీశాడు. మరో రెండు పరుగులకే బుమ్రా (0) కూడా వెనుదిరిగాడు. అయితే మరో 15 బంతుల పాటు చివరి వికెట్ చేజార్చుకోకుండా భారత్ మూడో రోజును ముగించింది. స్కోరు వివరాలు: ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్ 474; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) 82; రోహిత్ (సి) బోలండ్ (బి) కమిన్స్ 3; రాహుల్ (బి) కమిన్స్ 24; కోహ్లి (సి) క్యారీ (బి) బోలండ్ 36; ఆకాశ్‌దీప్ (సి) లయన్ (బి) బోలండ్ 0; పంత్ (సి) లయన్ (బి) బోలండ్ 28; జడేజా (ఎల్బీ) (బి) లయన్ 17; నితీశ్ రెడ్డి (బ్యాటింగ్) 105; సుందర్ (సి) స్మిత్ (బి)లయన్ 50; బుమ్రా (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; సిరాజ్ (బ్యాటింగ్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (116 ఓవర్లలో 9 వికెట్లకు) 358. వికెట్ల పతనం: 1–8, 2–51, 3–153, 4–154, 5–159, 6–191, 7–221, 8–348, 9–350. బౌలింగ్: స్టార్క్ 25–2–86–0, కమిన్స్ 27–6–86–3, బోలండ్ 27–7–57–3, లయన్ 27–4–88–2, మార్ష్ 7–1–28–0, హెడ్ 3–0–11–0. సుందర్ సంయమనం...దాదాపు నాలుగేళ్ల క్రితం వాషింగ్టన్ సుందర్ బ్రిస్బేన్ టెస్టుతో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 161/5తో కష్టాల్లో ఉన్న స్థితిలో అతను బ్యాటింగ్‌కు దిగి జట్టును గట్టెక్కించాడు. అతను చేసిన 62 పరుగులు ఆ తర్వాత భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు మరోసారి అతను అలాంటి పాత్రనే పోషించాడు. ఈ టెస్టు కోసం ప్రధాన బ్యాటర్ గిల్‌ను పక్కన పెట్టి ఆల్‌రౌండర్ సుందర్‌ను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ తప్పుడు నిర్ణయం జట్టు ఓటమికి కారణం కావచ్చని విశ్లేషకులు అన్నారు. అయితే సుందర్ తన బ్యాటింగ్‌తో వారి అనుమానాలను పటాపంచలు చేశాడు. ముఖ్యంగా ఏ రెగ్యులర్ బ్యాటర్‌కు తగ్గని రీతిలో అద్భుతమైన డిఫెన్స్‌తో జట్టు ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. సుందర్ పట్టుదల, ఓపికతో అండగా నిలవడం వల్లే మరో వైపు నితీశ్ సెంచరీ సాధ్యమైంది. ఎంతో జాగ్రత్తగా ఆడిన సుందర్ ఏకంగా 162 బంతులు ఎదుర్కొన్నాడు. కమిన్స్ ఓవర్లో అతను కొట్టిన సింగిల్‌తో భారత్ ఫాలో ఆన్ ప్రమాదంనుంచి తప్పించుకుంది. తాను ఎదుర్కొన్న 103వ బంతికి గానీ సుందర్ ఏకైక ఫోర్ కొట్టలేదు. టీ విరామం తర్వాత 146 బంతుల్లో సుందర్ అర్ధసెంచరీ పూర్తయింది. మళ్లీ ఆ్రస్టేలియాను నిలువరించడంలో సఫలమైన తర్వాత చివరకు లయన్ బౌలింగ్‌లో అతను వెనుదిరిగాడు. బ్రిస్బేన్ విజయం తర్వాత తన కుక్క పిల్లకు అక్కడి మైదానం ‘గాబా’ పేరును సుందర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడి ప్రదర్శన తర్వాత రెండో కుక్క పిల్ల ఏమైనా ఉంటే ‘ఎంసీజీ’ అంటాడేమో!ఇక తగ్గేదేలే...పెర్త్ టెస్టులో 73/6 నుంచి జట్టును 150 వరకు అతనే తీసుకెళ్లాడు...అడిలైడ్‌లో 87/5, 105/5 వద్ద ఉన్నప్పుడు 42, 42తో రెండు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడాడు. మెల్బోర్న్లో 191/6 నుంచి స్కోరును 300 దాటించాడు...ఈ సిరీస్‌లో తొలి రోజునుంచి తనదైన ముద్ర వేసిన నితీశ్ కుమార్ రెడ్డి 284 పరుగులతో ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టెస్టుకు ముందు అతని ప్రదర్శన చూస్తే ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నట్లుగా కనిపించింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక ఎంసీజీలో అతను ఆ లోటును తీర్చుకున్నాడు. ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్‌లు, బంగ్లాదేశ్‌తో టి20లో 34 బంతుల్లో 74 పరుగుల ఆటతో తానేంటో చూపించినా...నితీశ్‌ను టెస్టు ఆటగాడిగా ఎవరూ చూడలేదు. 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 674 పరుగులు, బౌలింగ్‌లో 56 వికెట్ల అతని రికార్డు ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి అర్హతగా మారుతుందని, తుది జట్టులో స్థానం దక్కుతుందని ఊహించలేదు. మీడియం పేస్ బౌలింగ్ చేసే బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా తరహాలో గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని నితీశ్ తన గురించి తాను చెప్పుకున్నాడు. కానీ ఈ సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో రెండు డకౌట్లు బ్యాటింగ్‌పై కూడా సందేహాలు రేపాయి. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ నితీశ్‌పై నమ్మకముంచింది. అతడిని తమ ట్రంప్ కార్డ్‌గా వాడి అద్భుత ఫలితాలు సాధించింది. ఇప్పుడు సెంచరీతో నితీశ్ తన స్థాయిని ప్రదర్శించాడు. అతను ఎనిమిదో స్థానంలో క్రీజ్‌లోకి వచ్చే సమయానికి భారత్ మరో 283 పరుగులు వెనుకబడి ఉంది. ఇలాంటి సమయంలోనూ ఎలాంటి తడబాటు లేకుండా అతను స్వేచ్ఛగా ఆడిన తీరు మాజీ క్రికెటర్లు, దిగ్గజాలను సైతం ఆకట్టుకుంది. షాట్ల ఎంపిక మాత్రమే కాదు, అతనిలో కనిపించిన ఆత్మవిశ్వాసం ఎంతో అనుభవం ఉన్నవాడిలా చూపించింది. ముఖ్యంగా క్రీజ్‌లో పట్టుదలగా నిలబడిన తీరు, పోరాటతత్వం ఈ 21 ఏళ్లు కుర్రాడిని మరో మెట్టు ఎక్కించాయి. స్టార్క్ బౌలింగ్‌తో ఆఫ్ డ్రైవ్ బౌండరీతో 81 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం అతను ‘పుష్ప’లా తగ్గేదేలే అంటూ సంకేతం చూపించాడు. ఆ తర్వాత పరిస్థితికి తగినట్లుగా తనను తాను మార్చుకున్నాడు. 85 స్కోరు వద్దనుంచి 97కు చేరేందుకు 48 బంతులు తీసుకున్నాడు. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. సెంచరీ తర్వాత బ్యాట్‌ను మైదానంలో జెండా తరహాలో పాతి ఇది ఆరంభం మాత్రమే అన్నట్లుగా తన రాకను నితీశ్ ఘనంగా చూపించాడు. 21 ఏళ్ల 214 రోజుల వయసులో సెంచరీ బాది ఆ్రస్టేలియా గడ్డపై అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన వారిలో మూడో స్థానంలో అతను నిలవడం విశేషం. కమిన్స్‌తో తలపడి... నిలబడి...నితీశ్ ఇన్నింగ్స్‌లో చూడచక్కటి షాట్లు ఎన్నో ఉన్నాయి. అతని పది ఫోర్లు కూడా ఎంతో నియంత్రణతో, ఎలాంటి తడబాటు లేకుండా పూర్తి సాధికారతతో వచ్చాయి. ఆరంభంలో లయన్ బౌలింగ్‌లో ముందుకు దూసుకొచ్చి కొట్టిన సిక్స్, ఆ తర్వాతి బౌండరీలో చక్కటి ఫుట్‌వర్క్ కనిపించింది. అయితే సెంచరీని అందుకునే క్రమంలో అతను కొన్ని కఠిన క్షణాలను కూడా దాటాడు! ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ , తన సన్‌రైజర్స్ సారథి కమిన్స్ బౌలింగ్‌ను అతను ఎదుర్కొన్న తీరు శనివారం ఆటలో హైలైట్‌గా నిలిచింది. ఎన్ని ప్రమాదకరమైన బంతులు వచ్చినా... నితీశ్ తలవంచి కాడి పడేయలేదు. వాటికి ఎదురొడ్డి నిలబడ్డాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 68వ ఓవర్ అతనిలోని మొండితనాన్ని చూపించింది. ముఖ్యంగా బౌన్సర్‌గా వచ్చిన మూడో బంతిని ఆడలేకపోయిన నితీశ్ అదృష్టవశాత్తూ చివరి క్షణంలో దానినుంచి తప్పించుకోగలిగాడు. ఆఖరి బంతి కూడా దాదాపు ఇదే తరహాలో అతడిని వెంటాడింది. మరికొద్ది సేపటికి కమిన్స్ బౌలింగ్‌లోనే బంతి మోచేయి కింది భాగంలో బలంగా తగలడంతో అతను విలవిల్లాడుతూ బ్యాట్ వదిలేశాడు. ఫిజియో వచ్చి చికిత్స చేయాల్సి వచ్చింది. అయితే ఈ కుర్రాడు ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయి తానేంటో చూపించాడు. ఆ మూడు బంతులు!లయన్ వేసిన ఇన్నింగ్స్ 112వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి నితీశ్ మరో ఎండ్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో అతని స్కోరు 97. అదే ఓవర్ తర్వాత ఐదు బంతులు ఆడిన సుందర్ చివరి బంతికి అవుటయ్యాడు. తర్వాతి ఓవర్ చివరి బంతికి మరో రెండు పరుగులు తీసిన అతను 99 వద్ద నిలిచాడు. అయితే మరుసటి ఓవర్లో ఒక్కసారిగా ఉత్కంఠ చోటు చేసుకుంది. తొలి మూడు బంతులు ఎదుర్కొన్న బుమ్రా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ సమయంలో సిరాజ్ క్రీజ్‌లోకి వచ్చాడు. కమిన్స్ బంతులను అతను ఆడగలడా అని అన్ని వైపులనుంచి సందేహం. మైదానంలో ఫ్యాన్స్ కూడా మునివేళ్లపై నిలిచారు. ఎలాగో అతను ఆ గండాన్ని దాటాడు. ఆఖరి బంతిని సిరాజ్ డిఫెండ్ చేసినప్పుడు ఎంసీజీ మొత్తం ఊగిపోవడం విశేషం! అయితే బోలండ్ తర్వాతి ఓవర్ మూడో బంతిని లాఫ్టెడ్ ఆన్డ్రైవ్గా ఆడటంతో నితీశ్ శతకం పూర్తయింది. అభిమానుల ఉత్సాహంతో ‘జి’ దద్దరిల్లగా...ప్రేక్షకుల మధ్య ఉన్న తండ్రి ముత్యాల రెడ్డి కన్నీళ్లపర్యంతమయ్యాడు. ఆ సమయంలో కామెంటరీలో ఉన్న మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ...‘ఈ భావోద్వేగ క్షణం గురించి ఏం చెప్పినా తక్కువే. అక్కడ ఏడుస్తోంది నితీశ్ తండ్రి మాత్రమే కాదు. మైదానంలో ఉన్న సగటు భారత అభిమానులకు కూడా అదే భావన వచ్చి ఉంటుంది. నా కళ్లల్లో కూడా కన్నీళ్లు తిరిగాయంటే ఆశ్చర్యపోవద్దు’ అని వ్యాఖ్యానించాడు. 5 ఎనిమిది లేదా అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ సాధించిన ఆటగాళ్లలో నితీశ్ ఐదోవాడు. భారత ఆటగాళ్లలో అతనే మొదటివాడు. 8 ఈ సిరీస్‌లో నితీశ్ సిక్సర్ల సంఖ్య. గతంలో ఆ్రస్టేలియా గడ్డపై ఒక సిరీస్‌లో మైకేల్ వాన్ (8; ఇంగ్లండ్), క్రిస్ గేల్ (8;వెస్టిండీస్) మాత్రమే ఎనిమిది సిక్స్‌లు బాదారు.‘విశాఖపట్నం యువకుడు నితీశ్ కుమార్‌రెడ్డికి నా అభినందనలు. అండర్–16 స్థాయిలో, రంజీ ట్రోఫీలో ఎన్నో విజయాలతో అతను సత్తా చాటాడు. ఇలాంటి ఘనతలు మున్ముందు మరిన్ని సాధించాలని, భారత జట్టులో సభ్యుడిగా దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ –నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ సాధించిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి నా అభినందనలు. జట్టు కష్టాల్లో ఉండి ఫాలో ఆన్ ప్రమాదం పొంచి ఉన్న సమయంలో పరిస్థితి చక్కదిద్దడంలో అతను కీలక పాత్ర పోషించాడు. రాబోయే ఎన్నో ఘనతల్లో ఇది మొదటిది కావాలి. మైదానంలో అతని విజయాలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి
డబుల్ సెంచరీతో చెలరేగిన అఫ్గాన్ ఆటగాడు..
బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వేకు అఫ్గానిస్తాన్ ధీటుగా బదులిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి అఫ్గానిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇంకా 161 పరుగులు వెనంజలో ఉంది. 95/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన అఫ్గాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 330 పరుగులు చేసింది.రహ్మత్ షా డబుల్ సెంచరీ..అఫ్గానిస్తాన్ ఫస్ట్ డౌన్ బ్యాటర్ రహ్మత్ షా (416 బంతుల్లో 23 ఫోర్లు, 3 సిక్స్‌లు 231 బ్యాటింగ్) ఆజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీతో కలిసి ఇన్నింగ్స్‌ను అద్బుతంగా నడిపించాడు. రహ్మత్‌కు ఇదే తొలి టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు షాహిదీ(276 బంతుల్లో 16 ఫోర్లు, 141 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 361 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.రహ్మత్ షా అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగిన రహ్మత్ షా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అఫ్గాన్ తరపున అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్‌గా రహ్మత్(231*) నిలిచాడు. గతంలో ఈ రికార్డు హష్మతుల్లా షాహిదీ(200) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో షాహిదీ ఆల్‌టైమ్ రికార్డును షా బ్రేక్ చేశాడు. అదే విధంగా టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు మొత్తం వికెట్ కోల్పోకపోవడం ఇదే తొలిసారి 2019 తర్వాత ఇదే తొలిసారి.చదవండి: VHT 2024-25: పంజాబ్ ఓపెనర్ విధ్వంసం.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో
బిజినెస్
పోస్టాఫీసులో అకౌంట్ ఉంటే ఇన్ని బెనిఫిట్సా?
నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులకు కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. బ్యాంక్ ఖాతాదారులకు సాధారణంగా ఏటీఎం ( ATM ) కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తోపాటు మరిన్ని సౌకర్యాలు ఉంటాయి. అయితే గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది ప్రజలు పోస్టాఫీసులో ( Post Office ) పొదుపు ఖాతాలను తెరవడానికి ఇష్టపడతారు.పోస్టాఫీసులు అందుబాటులో ఉండటంతోపాటు అందులో సరళమైన విధానాలే ఇందుకు కారణం. బ్యాంకు ఖాతాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో దాదాపు అన్ని ప్రయోజనాలు పోస్టాఫీసులో పొదుపు ఖాతాను ( Savings Account ) తెరవడం వల్ల కూడా పొందవచ్చు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఎవరు తెరవగలరు.. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నది ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఎవరు తెరవచ్చు?పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను తెరవడానికి ముందు మీరు అర్హులో కాదో చూసుకోవడం ముఖ్యం. అర్హత కలిగిన వయసున్న భారతీయ పౌరుడెవరైనా పోస్టాఫీసు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇక మైనర్ పిల్లల తరపున తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఖాతా తెరవవచ్చు.పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు» ఏటీఎం కార్డ్ సౌకర్యం» చెక్‌బుక్ సేవలు» ఈ-బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్» కనీస డిపాజిట్ కేవలం రూ. 500. ఇది చాలా బ్యాంకు ఖాతాలతో పోలిస్తే తక్కువపోస్టాఫీసులో అకౌంట్ తెరవండిలా.. » మీ సమీప పోస్టాఫీసును సందర్శించండి. సంబంధిత అధికారిని కలవండి. అకౌంట్ ఓపెనింగ్ ఫారమ్ తీసుకుని అవసరమైన వివరాలను పూరించండి.» పూర్తి చేసిన ఫారమ్‌కు మీ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన డాక్యుమెంట్లను అటాచ్ చేయండి. మీ దరఖాస్తును సమీక్షించే అధికారికి ఫారమ్‌ను సమర్పించండి. మీ వివరాలను ధ్రువీకరించిన తర్వాత మీ సేవింగ్స్ ఖాతా తెరుస్తారు.
హార్లే - హీరో సరికొత్త బైక్: త్వరలో..
మార్కెట్‌లో అప్డేటెడ్ బైకులు పెరుగుతున్న తరుణంలో.. కొత్త వెర్షన్స్‌ను పరిచయం చేసేందుకు అమెరికన్ బ్రాండ్ 'హార్లే డేవిడ్సన్'తో సహకారాన్ని విస్తరించినట్టు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తెలిపింది.హీరో మోటోకార్ప్ & హార్లే డేవిడ్సన్ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగానే.. కొత్త వెర్షన్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 (Harley Davidson X440) బైక్ రానుంది. ఈ రెండు కంపెనీల సహకారంతో తయారైన తొలి మోడల్ 'ఎక్స్ 440'. ఇది గతేడాది మార్కెట్‌లో అడుగుపెట్టింది. మంచి అమ్మకాలను కూడా పొందుతోంది.హీరో మోటోకార్ప్.. హార్లే డేవిడ్సన్ మధ్య భాగస్వామ్యం 2020 అక్టోబరులో జరిగింది. ఆ తరువాత దేశంలో హార్లే డేవిడ్సన్ బ్రాండ్ ప్రీమియం మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేసి హీరో మోటోకార్ప్ విక్రయిస్తుంది. సర్వీస్, విడిభాగాల సరఫరా బాధ్యత కూడా హీరో మోటోకార్ప్ చేపట్టింది.
ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకులు ఇవే!
భారతదేశంలోని అత్యంత సరసమైన బైకుల జాబితాలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్, హోండా షైన్, టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ ప్లాటినా, యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వంటివి ఉన్నాయి. ఈ బైక్స్ ధరలు ఎలా ఉన్నాయి? ఇతర వివరాలు ఏంటి అనేది ఇక్కడ చూసేద్దాం.హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)భారతదేశంలో తక్కువ ధర వద్ద లభిస్తున్న ఉత్తమ బైకులలో 'హీరో హెచ్ఎఫ్ డీలక్స్' ఒకటి. దీని ధర రూ.56,674 (ఎక్స్ షోరూమ్). ఇది మొత్తం ఐదు వేరియంట్లలో, ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైకులోని 97 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.91 Bhp పవర్, 8.05 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.హోండా షైన్ (Honda Shine)రూ.62,990 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న హోండా షైన్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ బైక్ 10.59 Bhp పవర్, 11 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లలో, ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది కూడా భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో ఒకటి.టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్న మోడల్ టీవీఎస్ స్పోర్ట్. దీని ధర రూ.64,410 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 190 సీసీ ఇంజిన్ 8.18 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు వేరియంట్లలో లభించే ఈ బైక్.. మొత్తం ఎనిమిది రంగులలో లభిస్తుంది.బజాజ్ ప్లాటినా (Bajaj Platina)సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ ప్లాటినా. దీని ధర రూ.66,840 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 7.79 Bhp పవర్, 8.34 Nm టార్క్ అందించే 102 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది కేవలం ఒకే వేరియంట్.. నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ఇదీ చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హ్యుందాయ్ కారు ఇదేయమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ (Yamaha FZ Fi)యమహా కంపెనీకి చెందిన ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్నప్పటికీ, మన జాబితాలో కొంత ఎక్కువ ఖరీదైన బైక్ అనే చెప్పాలి. దీని ధర రూ.1.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 12.2 Bhp పవర్, 13.3 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
BSNL Layoffs: 19,000 మంది ఉద్యోగులకు గండం
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL)వేలాది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కొత్త స్వచ్ఛంద పదవీ విరమణ ప్రణాళిక.. వీఆర్ఎస్ 2.0ని (VRS 2.o) ప్రతిపాదించింది. సంస్థ ఆర్థిక సమతుల్యతను మెరుగుపరుచుకోవడానికి ఉద్యోగుల తగ్గింపును (Layoff) ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ తొలగింపులు దాదాపు 18,000 నుండి 19,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని తెలుస్తోంది.దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాలలో 4జీ, 5జీ వంటి అధునాతన నెట్‌వర్క్ టెక్నాలజీలను ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న బీఎస్ఎన్ఎల్ ఖర్చులను తగ్గించుకోవడంపైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగుల కొత్త స్వచ్ఛంద పదవీ విరమణ ప్రణాళిక (VRS)ను ప్రతిపాదించింది ఖర్చులను తగ్గించుకోవడానికి శ్రామిక శక్తి తగ్గింపు కోసం టెలికమ్యూనికేషన్ విభాగం (DoT) ఆమోదాన్ని కోరింది. వీఆర్ఎస్ 2.0 కోసం రూ.1,500 కోట్లను ఆమోదించాలని కోరింది.తాజా తొలగింపులు బీఎస్ఎన్ఎల్ వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్పై ప్రభుత్వ ఖర్చులో 38% వరకు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియలో బ్యాలెన్స్ షీట్ ఆరోగ్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ శ్రామిక శక్తిని నిర్వహణ కోసం సుమారు రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ ప్రతిపాదన కంపెనీ సంవత్సరానికి రూ.5,000 కోట్ల వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీఎస్ఎన్ఎల్ లేఆఫ్ అభ్యర్థనకు కేబినెట్, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి అనుమతి రావాల్సి ఉంది.2024 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎస్ఎల్ ఆదాయం రూ.21,302 కోట్లుగా ఉంది. గత సంవత్సరం రూ.20,699 కోట్లతో పోలిస్తే ఇది కాస్త మెరుగు. ప్రస్తుతం సంస్థలో మొత్తం 55,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 25,000 మంది ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులు కాగా 30,000 మంది నాన్ ఎగ్జిక్యూటివ్‌లు. 2019లో భారత ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ (MTNL) ఉద్యోగుల కోసం రూ.69,000 కోట్ల పునరుద్ధరణ ప్రణాళికను ఆమోదించింది.
ఫ్యామిలీ
టీ బ్యాగ్‌లు ఉపయోగిస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!
ఇటీవల కాలంలో సరికొత్త రెడీమేడ్ పుడ్స్ ప్రిపరేషన్లు వచ్చాయి. అలాంటి వాటిలో టీ బ్యాగ్‌లు కూడా ఒకటి. చక్కగా వీటిని వేడివేడి పాలల్లో లేదా వేడినీళ్లలో ముంచితే చాలు మంచి టీ రెడీ అయిపోతుంది. మనం కూడా హాయిగా సిప్ చేసేస్తున్నాం. ఇలాంటివి ఎక్కువగా జర్నీల్లో లేదా కార్యాలయాల్లో సర్వ్ చేస్తుంటారు. ఐతే ఇలా టీ బ్యాగ్‌లతో రెడీ అయ్యే టీని అస్సలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బార్సిలోనా అటానమస్ యూనివర్సిటి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో టీ బ్యాగ్‌లు(Tea Bags) బిలియన్ల కొద్దీ హానికరమైన మైక్రోప్లాస్టిక్‌లను(Microplastics) విడుదల చేస్తాయి తేలింది. వారి పరిశోధన ప్రకారం..ఆహార ప్యాకేజింగ్(Food Packaging)అనేది సూక్ష్మ నానోప్లాస్టిక్(Mono Plastic)లకు మూలం. ఇది కాలుష్యానికి, మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా టీ బ్యాగ్ బయటి పొరలో ఉపయోగించే పదార్థం ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. "మనం ఈ టీ బ్యాగ్‌లతో తయారైన టీని సిప్ చేయగానే.. అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు లోనికి వెళ్లిపోతాయి. వాటిని శరీరంలోని ప్రేగు కణాలు గ్రహిస్తాయి. అక్కడ నుంచి రక్తప్రవాహంలోకి చేరుకుని శరీరం అంతటా వ్యాపిస్తాయి." అని చెప్పారు. ఈ మోనో ప్లాస్టిక్ కణాలను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా వర్గీకరించారు పరిశోధకులు. అంతేగాదు ఈ టీ బ్యాగ్‌ల ద్వారా నానో పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ అవశేషాలు, దాని తాలుకా కణాలు విడుదలవుతాయని గుర్తించారు. ముఖ్యంగా పాలిమర్-ఆధారిత పదార్థంతో తయారు చేసిన వాణిజ్య టీ బ్యాగ్‌లు మరింత ప్రమాదకరమని అన్నారు. నిజానికి ఈ టీ బ్యాగ్‌లు నైలాన్-6, పాలీప్రొపైలిన్, సెల్యూలోజ్లతో తయారు చేస్తారు. మనం ఎప్పుడైతో ఈ టీ బ్యాగ్‌లను వేడి నీరు లేదా పాల్లో ముంచగానే..ఇందులోని పాలీప్రొఫైలిన్ ఒక మిల్లీలీటర్‌కు సుమారుగా 1.2 బిలియన్ కణాలను విడుదల చేయగా, సెల్యులోజ్ ఒక మిల్లీలీటరుకు 135 మిలియన్ కణాలను, అలాగే నైలాన్-6 ఒక మిల్లీలీటర్‌కు 8.18 మిలియన్ కణాలను విడుదల చేస్తాయని వెల్లడించారు. ఈ పరిశోధన ప్లాస్టిక్ మానవ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగజేస్తాయనే దిశగా చేసే పరిశోధనలకు కీలకంగా ఉంటుందన్నారు. (చదవండి: భారత్‌లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్ విక్టోరియా జోక్యంతో..)
జుట్టుండాలేగానీ.. మతిపోయే స్టైల్స్ ఇదిగో ఇలా!
ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో కాదేది కళకు అనర్హం. కాలి గోటి నుంచి తల వెంట్రుకల ద్వారా ప్రతీదీ స్టైలిష్‌గా ఉండాలి. ఫ్యాషన్‌లో ట్రెండ్ సెట్ చేయాలి. ఈ క్రేజీ ట్రెండ్‌కనుగుణంగా డిజైనర్లు కూడా కొత్త కొత్త డిజైన్లతో ఆకట్టుకుంటున్నారు. అయితేతాజాగా సరికొత్త హెయిర్ ఆర్ట్‌తో వారెవ్వా అనిపించుకున్నారు ఒక స్టైలిస్ట్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. జుట్టు ఉన్న అమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అన్నట్టు ఈ వీడియోలో హెయిర్ ఆర్టిస్ట్ అతేఫ్ కాబిరి జుట్టును రకరకాలుగా కళాత్మకంగా తీర్చిద్దిద్దింది. అద్భుతమైన డిజైన్లతో అబ్బుర పోయేలా చేసింది. @రైన్మేకర్ అనే యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. A compilation of the most extraordinary and complex hair artworks Atefeh Kabiri.[📹 atefe_kabiri_hairstylist]pic.twitter.com/U4IAQ1SLx8— Massimo (@Rainmaker1973) December 27, 2024
భారత్‌లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్ విక్టోరియా జోక్యంతో..
భారత్‌లోని తొలి విడాకులు కేసు లేదా విడాకులు తీసుకున్న మొట్టమొదటి హిందూ మహిళ ఆమె. ఆమె విడాకుల కేసులో ఏకంగా బ్రిటన్ క్వీన్ జోక్యంతో తనకు అనుకూలంగా తీర్పు పొందింది. ఆ రోజుల్లో దీన్ని అందరూ విమర్శించినా..ఒంటరిగానే మహిళల హక్కుల కోసం పోరాడింది. పైగా పాశ్చాత్య వైద్యంలో సర్జన్‌గా ప్రాక్టీస్ చేసిన తొలి వైద్యురాలు కూడా ఈమెనే కావడం విశేషం. ఇంతకీ ఎవరామె..? ఆ కాలంలో అంతటి తెగువను ఎలా పదర్శించ గలిగిందంటే..?ఇది 1885లో జరిగిన ఘటన. చెప్పాలంటే భారత్లొని మొట్టమొదటి విడాకులు కేసు(Divorce Case) లేదా విడాకుల తీసుకున్న తొలి హిందు మహిళగా చెప్పొచ్చు. ఆ మహిళ పేరు రఖ్మాబాయి రౌత్. విడాకులు అనే పదం మన దేశంలో కనిపించే అవకాశం లేని రోజులవి. అలాంటి రోజుల్లో ధైర్యంగా కోర్టులో పోరాడి విడాకులు తీసుకుందామె. రఖ్మాబాయికి కేవలం 11 ఏళ్ల ప్రాయంలోనే దాదాజీ భికాజీ అనే 19 ఏళ్ల అబ్బాయితో వివాహం జరిగింది. అయితే ఆమె మెడిసిన్ చదవాలనే తపనతో తన తల్లిదండ్రుల వద్దే ఉండేది. అక్కడే తన చదువుని కొనసాగించింది కూడా. అయితే ఇది ఆమె భర్తకు నచ్చక తన వద్దే ఉండాలని పట్టుబట్టాడు. అందుకు రుఖ్మాబాయి నిరాకరించింది. దీంతో అతడు ఆమెపై కేసు పెట్టాడు. అయినా ఏ మాత్రం భయపడకుండా కోర్టులో ధైర్యంగా తన వాదన వినిపించింది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాని, అందువల్ల తనతో కలిసి జీవించలేనని నిర్భయంగా చెప్పింది. ఈ విషయం ఊరంతా దావానంలా వ్యాపించడమే గాక, చదువే ఆమెను భ్రష్టుపట్టించిందని ప్రజలంతా ఆమెను ఆడిపోసుకునేవారు. అయితే కోర్టు.. రుఖ్మాబాయిని భర్తతో కలిసి ఉండకపోతే జైలులో ఆరు నెలలు ఉండాల్సి వస్తుందని తీర్పు ఇచ్చింది. అయితే ఆమె ఆశ్చర్యకరంగా జైల్లో ఉండేందుకు మొగ్గు చూపింది. అలా ఆమె జైల్లో శిక్షను అనుభవిస్తూనే 'ఎ హిందూ లేడీ' అనే పేరుతో లింగ సమానత్వం, సామాజిక సంస్కరణలు, మహిళల హక్కులు మొదలైన వాటి గురించి రాశారు. ఆమె రచనలు క్వీన్ విక్టోరియా(Queen Victoria) దృష్టికి రావడమే గాక అవి ఎంతగానో ఆమెను ఆకర్షించాయి. దీంతో ఆమె రఖ్మాబాయి కేసులో జోక్యం చేసుకుని మరీ ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసింది. అలాగే విడాకులు కూడా మంజూరయ్యేలా చేశారామె. మహిళలను హేళనగా చూసే ఆ రోజుల్లో అత్యంత సాధారణ మహిళగా ఆమె సాధించిన మొట్టమొదటి విజయం. అయితే ఆ తర్వాత ఆమె లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్‌లో చదవాలని నిర్ణయించుకుంది. అలా 35 ఏళ్ల పాటు సూరత్‌లోని ఉమెన్స్ హాస్పిటల్ చీఫ్‌గా పనిచేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. చెప్పాలంటే పాశ్చాత్య వైద్యంలో హౌస్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేసిన తొలి మహిళ రుఖ్మాబాయి. అంతేగాదు ఆమె కారణంగానే భారత్‌లో బాల్యవివాహాలపై చర్చలు, వ్యతిరేకించడం ఊపందుకున్నాయి. అలాగే మహిళలు దీనిపై పోరాటం చేసేందుకు ముందుకొచ్చేలా ప్రేరణనిచ్చింది ఆమె గాథ. (చదవండి: స్వతహాగా శాకాహారి కానీ ఆ ఫేమస్ రెసిపీ కోసం..!)
నాలుగు చిట్కాలతో 18 కిలోలు : ఇన్ఫ్లూయెన్సర్ వెయిట్ లాస్ జర్నీ
అధిక బరువు తగ్గించుకోవాలని, స్లిమ్‌గా ఉండాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ప్రణాళికా బద్ధంగా ప్రయత్నించి సక్సెస్ సాధిస్తారు. ఇందులో ఒక్కొక్కరి సక్సెస్ ఒక్కోలా ఉంటుంది. అలా పట్టుదలగా సాధన చేసిన ఇన్ఫ్లూయెన్సర్ తన బరువును తగ్గించుకొని, ఆరోగ్యంగా మారింది. ఎలా? తెలుసుకుందాం...రండి!అనేక రకాల ఆహార, వ్యాయామ నియమాలు ప్రచారంలోఉన్నాయి. వీటిల్లో ఏది పాటించాలో తెలియక, చాలామంది గందరగోళంలో పడి పోతారు. ఇవన్నీ చూశాక బరువు తగ్గడం కష్టం రా బాబూ అని ఊరుకుంటారు. మరికొంత మంది బరువు తగ్గించుకునే క్రమంలో విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు మాడీసే అనే మహిళ. తన విజయాన్ని సోషల్ మీడియాలో పంచుకొని మరో నలుగురికి ప్రేరణగా నిలిచింది. View this post on Instagram A post shared by @madyy_tseyఇన్‌స్టాలో తన వెయిట్ లాస్ జర్నీని షేర్ చేసింది. మేడీ. 4 దశల ఫార్ములా, వర్కౌట్స్, ఆహార నియమాలతో 18 కిలోల బరువు తగ్గించుకున్నట్టు తెలిపింది. అనుకున్న ఫలితం పొందాలంటే.. దీర్ఘకాలిక ఆచరణ, కచ్చితమైన యాక్షన్ ప్లాన్ ఉండాలని చెప్పింది. ఫిట్నెస్ , వెల్నెస్ రెండింటి మేళవింపుతో బరువు తగ్గించుకోవాలని సూచించింది. మాడీ సే పాటించిన నాలుగు సూత్రాలుకంబైన్డ్ స్ట్రెంత్ ట్రైనింగ్ & కార్డియో (వారానికి 4-6 సార్లు)కండరాలు బలంగా ఉండేందుకు జీవక్రియను పెంచుకునేందుకు కార్డియోతో పాటు పవర్ ట్రైనింగ్ఈ కాంబో కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది, మొత్తం ఫిట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది.రోజుకి 2-3లీటర్లు నీళ్లు తాగడంపుష్కలంగా నీరు తాగడ వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఎనర్జీ వస్తుంది. విష పదార్థాలు తొలగిపోతాయిజీర్ణక్రియకు మద్దతు ఇస్తుందిసమతుల్య ఆహారం80 శాతం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, 20 శాతంమాత్రమే ఇష్టమైన అనుకూలమైన ఫుడ్ తీసుకోవాలి. ఫలితంగా అవసరమైన విటమిన్లు , మినరల్స్ శరీరానికి అందుతాయి, అదే సమయంలో స్వల్ప పరిధిలో మిగిలిన ఆహారం, ట్రీట్స్ ఎంజాయ్ చేయొచ్చు.ప్రతి 10 రోజులకు ఫోటోలుసాధారణ ఫోటోలు తీసుకుని చూసుకుంటూ ఉంటే అసలు విషయం తెలుస్తుంది. ఉత్సాహం వస్తుంది. కండరాల బలం, హార్మోన్ల మార్పులను పరిశీలించుకోవాలి. అలాగే కామెంట్లు కూడా చాలా ముఖ్యం.శరీర ఆకృతి, మార్పులను చూసుకోండం తనను సరియైన్ దారిలో నడవటానికి ఉపయోగపడింది అని చెప్పింది. అలాగే ఈ వెయిట్ లాస్ జర్నీలో కఠినంగా ఉండాలని ఓపిగ్గా ఫలితాల కోసం ఎదురు చూడాలని కూడా ఆమె వెల్లడించింది. View this post on Instagram A post shared by @madyy_tsey
ఫొటోలు
National View all
అల్విదా మన్మోహన్జీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలత
మన్మోహన్సింగ్ను ఎన్డీఏ అవమానించింది: రాహుల్
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్(Manmoh
‘సంక్షేమం అమలు చేస్తున్నాం.. మరి దానిపై దర్యాప్తు ఏమిటి?’
న్యూఢిల్లీ: తమ పార్టీని అస్థిర పరిచేందుకు బీజేపీ-కాంగ్రెస్
అలా చేయొద్దు.. రైతు సంఘాల నేతలపై సుప్రీం కోర్టు సీరియస్
ఢిల్లీ: పంజాబ్‌లో రైతు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ
నాస్ ఫెలోగా NIN సైంటిస్ట్ భానుప్రకాష్
జాతీయ వ్యవసాయ అకాడమీ(National Academy of Agricultural Sciences) ఫెలోగా జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) సీనియర్ శాస్త్రవ
NRI View all
రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్
దుబాయ్‌లో పనిచేస్తున్న హైదరాబాదీ వాచ్‌మెన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు.
Laura Loomer: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు
లారా లూమర్..
ఈ తెలుగాయన ఆఫ్రికాని జయించాడు!
విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దాన్ని అందుకోవాలి అనే అనుకుంటారు.
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవం
లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో వందేండ్ల క్రితం ప్రారంభమైన సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ
డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
ఐనవోలు: మండలంలోని జగ్గయ్యగూడెం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గొలమారి క్రాంతికుమార్
International View all
Laura Loomer: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు
లారా లూమర్..
భారతీయులకు 10 లక్షలకు పైగా అమెరికా వీసాలు
భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి అమెరికా అంకిత భావంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే..
టిక్‌టాక్‌పై నిషేధం ఆపండి: ట్రంప్
వాషింగ్టన్:అమెరికాలో అధికారం చేతులు మారనున్న వేళ టిక్‌టాక్
ఉ.కొరియా సైనికుల మృతి..జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు
కీవ్:రష్యా తరపున యుద్ధం చేసేందుకు వచ్చిన ఉత్తరకొరియా(NorthK
అమెరికన్లు పిల్లల్ని తప్పుడు మార్గంలో పెంచుతున్నారు: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: భారత్ వంటి దేశాల నుంచి నిపుణులైన సిబ్బందిని ని
క్రైమ్
టీడీపీ రౌడీల దౌర్జన్యకాండ
సాక్షి ప్రతినిధి, కాకినాడ/శంఖవరం/కళ్యాణదుర్గం: తెలుగుదేశం పార్టీ నేతలు అధికార మదంతో చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీ నేతలపై కత్తులతో మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌కు చెందిన స్కార్పియో వాహనానికి టీడీపీ నేతలు నిప్పుపెట్టారు. పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న మరో ఘటనలో.. వైఎస్సార్‌సీపీ నేత ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడిచేశారు. ఈ క్రమంలో అడ్డువచ్చిన ఆయన తల్లిని టీడీపీ మూకలు నెట్టడంతో ఆమె కిందపడగా తలకు బలమైన గాయమైంది. వివరాలివీ..ప్రత్తిపాడులో మూకుమ్మడి దాడిపెంచిన విద్యుత్ చార్జీలపై వైఎస్సార్‌సీపీ శుక్రవారం ప్రత్తిపాడులో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి శంఖవరం మండలం ‘మండపం’ గ్రామం నుంచి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. మండపం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత గుండుబిల్లి నానాజీ ప్రత్తిపాడు వెళ్లేందుకు తన పొలం నుంచి ఇంటికి తిరిగొస్తున్నారు. ఇది తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పొలం చిన్నా, పిల్లి రమేష్, సుంకర వెంకటసూరి, చలమశెట్టి మానీలు, సుంకర శివ, ఉటుకూరి రమణ, మరో పాతిక మంది ఆ మార్గంలో కాపు కాశారు. అటుగా వస్తున్న నానాజీపై మూకుమ్మడిగా కత్తులతో దాడికి దిగారు. విచక్షణారహితంగా జరిపిన ఈ దాడిలో నానాజీ తలకు, మెడకు తీవ్రగాయాలు కావడంతో ఆయన అపసార్మక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మండపం గ్రామ సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యం తదితరులు నానాజీని హుటాహుటిన తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు.అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు నక్కా మాణిక్యం, గట్టెం దివాణంపై టీడీపీ నేతలు మారణాయుధాలు, కర్రలతో దాడిచేశారు. వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పల్నాడు జిల్లాలోనూ దాడి..అడ్డుకోబోయిన మహిళకు తీవ్రగాయం..పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు వెంకయ్యపై అదే గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులు దరువూరి వెంకటేశ్వర్లు మరికొంత మంది దాడిచేశారు. అనంతరం సాయంత్రం మరో నేత ఇంటూరి వీరయ్యపై దాడి నిమిత్తం ఆయన ఇంటి మీదకు వెళ్లారు. దాడిచేసే క్రమంలో అడ్డువచ్చిన వీరయ్య తల్లి ఇంటూరి శిరోమణిని నెట్టడంతో ఆమె వెనక్కి సీసీ రోడ్డుపై పడింది. దీంతో ఆమె తలపగిలి తీవ్ర రక్తస్రావమైంది. బాధితురాలిని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ కారుకు నిప్పు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 23వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అర్చన, హరిప్రకాష్ దంపతులకు చెందిన స్కార్పియో వాహనానికి (ఏపీ16బీ2 6066) గుర్తుతెలియని దుండగులు గురువారం అర్థరాత్రి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న కౌన్సిలర్ దంపతులు బయటకు రాగా.. అప్పటికే కారు పూర్తిగా దగ్థమైంది. ఈ ఘటనపై హరిప్రకాష్ టీడీపీకి చెందిన వారిపై పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై కక్ష సాధింపులో భాగంగానే ఈ ఘటనకు ఒడిగట్టినట్లు ఆయన పేర్కొన్నారు. టీడీపీకి చెందిన పూజారి మహేష్, బోయ తిప్పేస్వామిలకు గతంలో రూ.8.50 లక్షలు అప్పుగా ఇచ్చానని.. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వమని ఇటీవల అడిగితే దౌర్జన్యానికి దిగారని తెలిపారు. ఈ క్రమంలోనే తనను భయపెట్టేందుకు ఈ ఘటనకు ఒడిగట్టి ఉంటారనే ఆయన అనుమానం వ్యక్తంచేశారు.
చిన్నారులపై కీచక ప్రిన్సిపాల్ వికృత చేష్టలు
వీరఘట్టం: ‘గురుబ్రహ్మ’... గురువిష్టు.. గురుదేవో మహేశ్వర అని ప్రతి రోజు ఆ బాలికలతో ప్రతిజ్ఞ చేయిస్తున్న వీరఘట్టంలోని ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ వారి పాలిట కామాంధుడిగా మారాడు. గత కొన్ని రోజులుగా 4, 5, 6 తరగతులు చదువుతున్న బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడు. విషయం ఇంటిలో చెబితే తోలు తీసేస్తానని బెదిరించడంతో.. పాపం ఆ చిన్నారులు కొంతకాలంగా ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులను భరించారు. ఆయన వికృత చేష్టలను సమీపంలోని ఓ ఇంటిలో తాపీపని చేస్తున్న మేసీ్త్రలు శుక్రవారం గుర్తించారు. వెంటనే ఫొటోలు తీసి పిల్లల తల్లిదండ్రులకు చూపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు వీరఘట్టంలోని ఆ పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్‌ను నిలదీసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ జి.కళాధర్, పోలీస్ సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు పాఠశాల కు చేరుకుని చిన్నారులను విచారణ చేశారు. ప్రిన్సిపాల్ వారిపై వ్యవహరిస్తున్న తీరును చిన్నారులు చెబుతుంటే చలించిపోయారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువే చీడపురుగుగా మారాడంటూ స్థాని కులు దుమ్మెత్తి పోశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ తెర్లి సింహాచలంపై పోక్సో కేసు నమోదుచేసినట్టు ఎస్ఐ తెలిపారు.ఆ పాఠశాలలో మరి చదివించంప్రిన్సిపాల్ తీరుతో ఆ పాఠశాలలో పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. పోలీసుల ముందే పాఠశాల నుంచి మా పిల్లలను తీసుకెళ్లిపోతామని చెప్పారు. గురుభావంతో పిల్లలను సాకాల్సిన ప్రిన్సిపాల్ తీరును దుమ్మెత్తిపోశారు. ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..!
డిండి: సఖ్యతకు అడ్డొస్తున్నాడని భార్య ప్రియుడితో పాటు మరో వ్యక్తితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం దేవరకొండలోని సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ సురేష్ వెల్లడించారు. మండల పరిధిలోని దేవత్పల్లితండాకు చెందిన రమావత్ కుమార్(27)కు చందంపేట మండలంలోని పోల్యానాయక్‌తండాకు చెందిన లక్ష్మితో 10పంవత్సరాల క్రితం వివాహం జరిగింది. భార్యభర్తలు వ్యవసాయంతో పాటు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి కుమారుడు, కూతురు ఉన్నారు. కుమార్‌కు వ్యవసాయంలో కలిసి రాక పూటగడవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కుమార్ భార్య పిల్లలతో కలిసి రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి కూలీ చేసుకుంటున్నారు. కూలీ పని చేస్తున్న క్రమంలో లక్ష్మీకి మధు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. కాగా 5నెలల క్రితం కుమార్ హైదరాబాద్‌లో ఉండలేక భార్య పిల్లలతో కలిసి స్వగ్రామానికి తిరిగొచ్చి వ్యవసాయం చేస్తున్నాడు.ప్రియుడిని విడిచి ఉండలేక..స్వగ్రామానికి భర్తతో లక్ష్మి రావడంతో మధు ఇటీవల కొన్ని రోజులుగా లక్ష్మి భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి వెళ్తుడేవాడు. వారు ఎడబాటు తట్టుకోలేక వారు కుమార్‌ను అడ్డుతొలగించుకుంటే కలిసి జీవించొచ్చని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కుమార్‌ను హత్య చేసేందుకు భార్య ప్రియుడు మధుతో పాటు హైదరాబాద్‌లోని మెహిదీపట్నంకు చెందిన సాయికిరణ్‌ను ఈనెల 23న గ్రామానికి పిలిపించింది. రోజు మాదిరిగానే కుమార్ తన భార్యతో కలిసి ఈనెల 24న రాత్రి వేరుశెనగ చేనుకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. అర్థరాత్రి తర్వాత మంచంపై పడుకున్న కుమార్‌ను అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న మధు, సాయికిరణతో పాటు లక్ష్మి కర్రలతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అక్కడే ఉన్న వేపచెట్టుకు చీరతో ఉరి వేసుకున్నట్లు మృతదేహాన్ని వేలాడదీసి మధు, సాయికిరణ్ అక్కడి నుంచి పారిపోయారు. లక్ష్మి మాత్రం తెల్లవారుజాము వరకు పొలం వద్దే ఉండి ఉదయం తండాకు వచ్చి తాను నిద్రిస్తున్న సమయంలో తన భర్త కుమార్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని బంధువుల వద్ద నమ్మబలికింది. వెంటనే మృతుడి తల్లి, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని కుమార్ మృతదేహాన్ని ఇంటికి తీసుకవచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుమార్ హత్య విషయం తెలుసుకున్న సీఐ సురేష్, ఎస్ఐ రాజు సిబ్బందితో గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుమార్ ఒంటిపై గాయాలు ఉండడంతో మృతుడి తల్లి సుకి కోడలు లక్ష్మిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. దీంతో కుమార్ హత్యకు గురయ్యాడని కేసు నమోదు చేసుకొని పోలీసులు ఽఽవిచారణ చేపట్టారు. విచారణలో భాగంగా మృతుడి భార్య లక్ష్మి తనతో పాటు మధు, సాయికిరణ్లో కలిసి కుమార్‌ను హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ ఘటనలో నిందితులైన ముగ్గురిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సురేష్ తెలిపారు. హత్య కేసును రెండు రోజులో చేంధించిన డిండి రూరల్ సీఐ సురేష్, ఎస్ఐ రాజు, సిబ్బందిని ఎస్పీ శరత్చంద్ర పవార్, దేవరకొండ డీఎస్పీ గిరిబాబు అభినందించారు.
ఘోర బస్సు ప్రమాదం.. 8 మంది మృతి
పంజాబ్: బఠిండాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనను రెయిలింగ్‌ను ఢీకొట్టిన బస్సు.. కాల్వలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా, మరో 18 మంది గాయపడ్డారు. జీవన్ సింగ్ వాలా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు.క్షతగాత్రులు షహీద్ భాయ్ మణి సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 50 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు సర్దుల్‌గఢ్ నుండి బఠాండాకు వెళ్తుండగా జీవన్ సింగ్ వాలా దగ్గర కాలువలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానికుల సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.2 people have died, while many others have been injured after a bus carrying nearly 50 passengers fell into a drain in Punjab's Bathinda. Rescue operations are underway.#Punjab #Bathinda pic.twitter.com/MwwfJlbhrd— Vani Mehrotra (@vani_mehrotra) December 27, 2024