Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Janasena warns its party leaders over comments regarding the Deputy CM post1
భజన బ్యాచ్.. కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండండమ్మా

ఆగండ్రా బాబు.. అసలే అయన తిక్కలోడు.. ఏ క్షణానికి కండువా విసిరేసి వెళ్ళిపోతాడో తెలీదు.. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండండి.. వచ్చి ఏడాది కూడా కాలేదు ఇప్పుడే మీరు చినబాబు డిప్యూటీ సీఎం .. చినబాబు డిప్యూటీ సీఎం అని కేకలు వేయకండి.. కొన్నాళ్ళు ఆగండి .. పరిస్థితులు చిన్నగా సర్దుకున్నాక అన్నీ చేద్దాం.. ముందే గాయిగాత్తర చేయకండి. అసలే తిక్కలోడికి ఢిల్లీ సపోర్ట్ ఉంది.. వాళ్ళ సపోర్ట్ టోన్ మనం గెలిచాం.. అప్పుడే అల్లరల్లరి చేస్తే లేనిపోని బాధలు. కొన్నాళ్ళు సైలెంట్ ఉండండి అని తెలుగుదేశం అధిష్టానం పార్టీ వీరవిధేయులైన ఎమ్మెల్యేలు.. ఇతర నాయకులకు సూచించింది.వాస్తవానికి ఇది అధిష్టానానికి తెలిసి.. చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతోందో..లోకేష్ పట్ల భక్తిభావం పెల్లుబికి.. దాన్ని అణచుకోలేక అంటున్నారో తెలియదు కానీ కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అర్జంట్ గా లోకేష్ ను డిప్యూటీ చీఫ్ మినిష్టర్ గా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఆఖరుకు పవన్ కళ్యాణ్ గెలుపులో కీలకపాత్ర పోషించిన పిఠాపురం వర్మ కూడా అదే రాగం ఎత్తుకున్నారు. ఇది గత రెండు నెలలుగా ఉధృతంగా సాగింది. ఐతే ఇన్నాళ్లుగా ఆ భజనను చూస్తూ ఊరుకున్న జనసైనికులు గత కొద్దిరోజులుగా నోరువిప్పుతూ సోషల్ మీడియాలో టీడీపీ మీద కౌంటర్లు వేస్తున్నారు. లోకేష్ కు డిప్యూటీ ఇవ్వండి ఫర్లేదు కానీ అదే టైములో పవన్‌కు సీఎంగా బాధ్యతలు ఇవ్వండి.. అప్పుడు ఎవరికీ అభ్యంతరం లేదు.. అంతేకానీ పవన్ను డిప్యూటీ సీఎంగా ఉంచుతూ మళ్ళీ లోకేష్‌కు అదే హోదా ఇస్తేమాత్రం గొడవలైపోతాయి అన్నట్లుగా పోస్టింగులు పెడుతున్నారు. ఈ జనసైనికులను పవన్ సైతం నియంత్రించలేదు. మరోవైపు బీజేపీతో పొత్తు.. జనసేనలో సీట్ల సర్దుబాటు వంటివన్నీ పవన్ దగ్గరుండి మరీ కుదిర్చారు. పవన్ లేకపోతె మొన్న తెలుగుదేశం గెలుపు అసాధ్యం అనేది అందరికి తెలిసిందే అలాంటపుడు మా పవన్ను కాదని వేరే వాళ్లకు.. అదే లోకేష్‌కు ఎలా డిప్యూటీ ఇస్తారు అనేది జనసేన వాదన. దీంతోబాటు కేంద్రం సైతం పవన్ తోబాటు ఇంకో డిప్యూటీ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. మొన్న అమిత్ షా వచ్చినపుడు సైతం లోకేష్ కు డిప్యూటీ ఇచ్చే అంశం ప్రస్తావనకు రాగా అయన తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో కేంద్రం దన్ను సంపూర్ణంగా ఉన్న పవన్ తో గొడవ ఎందుకు.. అందాకా సైలెంట్ గా ఉండండి అని తెలుగుదేశం తన క్యాడరుకు ఒక మెసేజ్ పంపింది.ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధికారికంగా పార్టీ శ్రేణులకు ఒక సందేశం పంపింది. ఇకముందు ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ డిమాండ్లు చేయకండి. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టకండి అంటూ గేటు వేసింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే అధికారం రుచి మరిగిన నేపథ్యంలో ఆయన్ను ఇబ్బంది పెట్టి. ఇరిటేట్ చేసేలా ఏదీ చేయొద్దని.. అలాగైతే కూటమిలో చిచ్చు రేగుతుందని చంద్రబాబు గ్రహించి క్యాడర్ను నియంత్రించినట్లు చెబుతున్నారు. నాక్కొంచెం తిక్కుంది.. దానికి ఓ లెక్కుంది అనే పవన్ కు తిక్కరేగకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారన్నమాట. --సిమ్మాదిరప్పన్న

Arunachal to Gujarat: Ambani's Vantara Zoo Elephants Transportation Sparks Debate2
అంబానీ జూకు ఏనుగుల తరలింపుపై విమర్శలా?!

ఎక్కడ అరుణాచల్‌ ప్రదేశ్‌.. ఎక్కడ గుజరాత్‌..? మూడు వేలకు పైగా కిలోమీటర్ల దూరం. అంత దూరం నుంచి.. అదీ ట్రక్కులలో ఏనుగులను తరలించడం ఏంటి?. స్పెషల్‌ ట్రక్కులలో అంబానీ కుటుంబానికి చెందిన జూకు ఏనుగులను తరలించడంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మూగజీవుల కోసం పోరాడే ఉద్యమకారులైతే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూసి.. ‘‘పాపం ఏనుగులు.. డబ్బుంటే ఏమైనా చేయొచ్చా?’’ అని తిట్టుకునేవారు లేకపోలేదు. అయితే..అరుణాచల్‌ ప్రదేశ్‌(Arunachal Pradesh) నుంచి మాత్రమే కాదు.. అసోం(Assam) నుంచి కూడా జామ్‌ నగర్‌లోని అనంత్‌ అంబానీకి చెందిన వంతార జూనకు ఏనుగులను తరలించారట. ఈ తరలింపునకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతులు లేవని.. పైగా వన్యప్రాణులను అలా బంధించడమూ నేరమేనని కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నిజనిర్ధారణలు చేసుకోకుండా పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి తరలింపునకు అసలు అనుమతులు ఉన్నాయా?. వన్యప్రాణులను ఇలా జంతు ప్రదర్శన శాలలో ఉంచొచ్చా?. దారిలో వాటికి ఏదైనా జరగరానిది జరిగితే ఎలా?... ఎవరిది బాధ్యత? సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ప్రచారంలో వాస్తవమెంత?. అయితే ఇవేం అడవుల నుంచి బలవంతంగా తరలిస్తున్న ఏనుగులు కాదని అధికారులు వివరణ ఇస్తున్నారు. జంతు సంరక్షణ చర్యల్లో భాగంగానే వాటిని తరలిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఏనుగులను బంధించి.. వాటితో సొమ్ము చేసుకుంటున్న ముఠాల నుంచి వాటికి విముక్తి కలిగిస్తున్నారు. రిలయన్స్‌ వంతార జూ ‘చైన్‌ ఫ్రీ’ ఉద్యమం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం భాగంగా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే తాజా వీడియోలపై విమర్శల నేపథ్యంలో.. ఇటు వంతారా నిర్వాహకులు కూడా స్పందించారు.ఆరోగ్యకరమైన వాతావరణంలో అవి జీవిస్తాయని మాది గ్యారెంటీ. వాటికి గౌరవప్రదమైన జీవితం అందించడమే మా ఉద్దేశం’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇందుకు అవసరమైన ప్రక్రియ అంతా అధికారికంగానే నిర్వహించినట్లు స్పష్టత ఇచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారమే నడుచుకున్నట్లు, అలాగే.. గుజరాత్‌ , అరుణాచల్‌ ప్రదేశ్‌ అటవీ శాఖల నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు, ఏనుగుల తరలింపు కోసం రవాణా శాఖల నుంచీ ప్రత్యేక అనుమతులు పొందినట్లు పేర్కొంది.అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ఏం చెప్పిందంటే.. అవి అటవీ ఏనుగులు కాదని, ప్రైవేట్‌ ఓనర్ల నుంచి వాటిని వంతారా కొనుగోలు చేసినట్లు తెలిపింది. త్రిపుర హైకోర్టు వేసిన హైపవర్‌ కమిటీతో పాటు సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని స్పష్టం చేసింది. వాటిని తరలించిన ఆంబులెన్స్‌లు కూడా ప్రత్యేకమైన సదుపాయాలతోనే తరలించినట్లు పేర్కొంది.అసోం ప్రభుత్వం మాత్రం.. తమ భూభాగం నుంచి ఏనుగుల తరలింపేదీ జరగలేదని స్పష్టం చేసింది. అసోం నుంచి గుజరాత్‌ ప్రైవేట్‌ జూకు జంతువుల తరలింపు పేరిట అసత్య ప్రచారాలు, కథనాలు ఇస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ వివరణలలేవీ వైల్డ్‌లైఫ్‌(Wild Life) యాక్టవిస్టులను సంతృప్తి పర్చడం లేదు. పైగా వాతావరణ మార్పు వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని, యానిమల్‌ ఆంబులెన్స్‌ పేరిట తరలిస్తున్న వాహనాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారం ఇటు సోషల్‌ మీడియాలో, అటు రాజకీయంగా విమర్శలకు దారి తీసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్‌ వ్యక్తుల కోసం పని చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి.వంతార.. రిలయన్స్‌ సౌజన్యంతో నడిచే అతిపెద్ద జంతు సంరక్షణశాల. దేశంలోనే అతిపెద్దది. ముకేష్‌ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్‌ చిన్నప్పటి నుంచి యానిమల్‌ లవర్‌ అట. అలా.. మూగ జీవుల సంరక్షణ ప్రధాన ఉద్దేశంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ దేశంలో ఎక్కడా లేనన్ని సేవలతో ఈ జూను నడిపిస్తున్నాయి. వేటగాళ్ల చేతిలో బందీ అయిన, గాయపడిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం, కాపాడాటం, వాటికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టింది ఫౌండేషన్. ఈ ప్రాజెక్టు కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు. ఇది గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లోని రిలయన్స్ గ్రీన్ బెల్ట్‌లో సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఏమేం ఉన్నాయంటే..వంతార జూ(Vantara Zoo)లోనే లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్, పరిశోధనా కేంద్రం నిర్మించారు. జంతువుల ట్రీట్‌మెంట్‌ కోసం అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.. లేటెస్ట్ టెక్నాలజీతో ICU, MRI, CT స్కాన్, X-రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డెంటల్ స్కాలార్, లిథోట్రిప్సీ, డయాలసిస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్జరీలకు లైవ్ వీడియో కాన్ఫరెన్సులు ఉన్నాయి. బ్లడ్ ప్లాస్మాను వేరు చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఈ కేంద్రంలో 2 వేలకు పైగా ప్రాణులు, 43 జాతుల వాటిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతరించే జాతులకు సంబంధించిన 7 రకాల వన్యప్రాణులు కూడా ఇక్కడ ఉన్నాయి.. అలాగే విదేశాల్లో అంతరించే దశలో ఉన్న ప్రాణులనూ రక్షిస్తున్నారిక్కడ. రెస్క్యూలో భాగంగా ఇప్పటికే 2వందలకు పైగా ఏనుగులను సేవ్ చేసి.. వంతారలోని ఏనుగుల రక్షణ కేంద్రంలో వదిలేశారు. జూను చూసేందుకు 3వేల-4వేల మంది పనిచేస్తున్నారు. భారత్ తో సహా ప్రపంచంలోని పేరొందిన జంతుశాస్త్ర నిపుణులు.. వైద్య నిపుణులు కొందరు వంతార మిషన్ లో భాగమైయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కూడా వంతార జూకు సహకరిస్తున్నాయి.

Delhi CM Atishi alleges Ramesh Bidhuri's nephew thrashed AAP workers3
‘మా వాళ్లని భయపెడుతున్నారు.. దాడులు చేస్తున్నారు’

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ((Delhi Assembly Election 2025) ాభాగంగా తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ నేతల భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ((AAP) నాయకురాలు, ఢిల్లీ సీఎం అతిషి ఆరోపించారు. ఆప్‌ కార్యకర్తలను భయపెట్టడమే కాకుండా దాడులు సైతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ అధికారికి ఆమె లేఖ రాశారు. ప్రధానంగా బీజేపీ(BJP) ఎంపీ రమేష్‌ బిధురి మేనల్లుడు తమ కార్యకర్తలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాడని ఆమె లేఖ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేశారు.ఇంట్లో కూర్చోకపోతే.. కాళ్లు చేతులు విరిచేస్తారట..!ఢిల్లీ సీఎం అతిషి.. ఈసీకి ఫిర్యాదు చేసిన ాదాని ప్రకారం.. ‘ఇవి తమ ఎన్నికలని, ఇంట్లో కూర్చోకుండా బయటకుస్తే కాళ్లు, చేతులువిరిచేస్తామని ఆప్‌ కార్యకర్తలకు బీజేపీ నేతలు వార్నింగ్‌ ఇచ్చినట్లు అతిషి ేపేర్కొన్నారు. ఫిబ్రవరి 5న ఎన్నికలు.. 8వ తేదీన ఫలితాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 5వ ేతేదీన జరుగనున్నాయి. ఇంకా సుమారు ెరెండు వారాల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మళ్లీ ెగెలిచేందుకు ఆప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠంపై తామే కూర్చోవాలని బీజేపీ సైతం గట్టిగా పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఇరు పార్టీల మధ్య తీవ్ర ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎక్కడా కూడా ఇరు పార్టీలు తగ్గేదేలే అన్నట్లు తమ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.అది కేజ్రీవాల్‌ పనే .. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయండిఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార ఆమ్‌ ఆద్మీపార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో తమదైన రీతిలో దూసుకుపోతున్నారు. తాజాగా ఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్‌ వర్మ.. ఆప్‌ కన్వీనర్‌, మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.డిల్లీలో ఓడిపోతామన్న భయంతో ఆప్‌ ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు దిగుతుందని ఆరోపించారు. దీనిలో భాగంగానే ఆప్‌ నేతలు.. ఢిల్లీ ఓటర్లకు కుర్చీలు పంచి పెడుతున్నారని పర్వేష్‌ వర్మ మండిపడ్డారు. ఈ మేరకు కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌(ఎంసీసీ)ని ఆప్‌ ఉల్లంఘిస్తుందని పోలీసులకు, ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆప్‌ నేతలు స్థానికంగా ఉన్న ఓటర్లకు కుర్చీలు పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పర్వేష్‌వర్మ ఎన్నికల ఏజెంట్‌ సందీప్‌ సింగ్‌ చేత ఫిర్యాదు చేయించారు పర్వేష్‌ వర్మ.

Gambhir Likes Him: R Ashwin Says This All Rounder Surely Play India XI CT 20254
CT 2025: గంభీర్‌కు అతడంటే ఇష్టం.. తుదిజట్టులో చోటు పక్కా: అశ్విన్‌

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో ఆడే భారత తుదిజట్టులో వాషింగ్టన్‌ సుందర్‌కు తప్పక స్థానం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను లోయర్‌ ఆర్డర్‌లో కాకుండా.. టాప్‌-5లో బ్యాటింగ్‌కు పంపించాలని అశూ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.పాకిస్తాన్‌- యూఏఈ వేదికలుగా చాంపియన్స్‌ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20 నుంచి తమ వేట మొదలుపెట్టనుంది. లీగ్‌ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్‌ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌(India vs Pakistan)తో మ్యాచ్‌ ఆడుతుంది. ఆ నలుగురుఆ తర్వాత న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. ఇక టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన జట్టులో స్పిన్‌ విభాగంలో ముగ్గురు ఆల్‌రౌండర్లు, ఒక స్పెషలిస్టు బౌలర్‌కు చోటు దక్కింది. ఆ నాలుగు ఎవరంటే.. రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌.. కుల్దీప్‌ యాదవ్‌.వీరిలో కుల్దీప్‌ లెఫ్టార్మ్‌ రిస్ట్‌ స్పిన్నర్‌ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ కూడా ఎడమచేతి వాటం బౌలర్లే. అయితే, ఇందులో రైటార్మ్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఒక్కడే. అందునా అతడు ఆఫ్‌ స్పిన్నర్‌. ఈ ప్రత్యేకతే అతడికి చాంపియన్స్‌ ట్రోఫీ తుదిజట్టులో చోటు దక్కేలా చేస్తుందని స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు.అంతేకాదు.. టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌కు వాషీ అంటే ఎంతో ఇష్టమని.. అది కూడా అతడికి ప్లస్‌ పాయింట్‌గా మారుతుందని అశూ పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో రైట్‌- లెఫ్ట్‌ కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది.గంభీర్‌కు అతడంటే చాలా ఇష్టం.కానీ మనకు ఎక్కువ మంది ఆఫ్‌ స్పిన్నర్లు లేరు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్లే ఎక్కువ ఉన్నారు. చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో వాషింగ్టన్‌ సుందర్‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు రెండు కారణాలున్నాయి.. నాకు తెలిసినంత వరకు గంభీర్‌కు అతడంటే చాలా ఇష్టం.అతడి ఆటతీరును దగ్గరగా గమనించడంతో పాటు.. కచ్చితంగా అండగా నిలబడతాడు. ఇక వాషీ ఆఫ్‌ స్పిన్నర్‌ కావడం కూడా కలిసి వస్తుంది. అయితే, అతడు ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌ చేస్తే మాత్రం జట్టు సమతూకంగా ఉండకపోవచ్చు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో అతడిని ముందుకు పంపాలి.టాప్‌ 5లో ఉంటేసమర్థవంతంగా బౌలింగ్‌ చేయడంతో పాటు నాలుగు లేదంటే ఐదో స్థానంలో ఆడే ఆల్‌రౌండర్‌ ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగకరం. అదీ ఆఫ్‌ స్పిన్నర్‌ టాప్‌ 5లో ఉంటే ఇంకా బాగుంటుంది’’ అని అశ్విన్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా అశ్విన్‌ మాదిరే వాషీ కూడా తమిళనాడుకు చెందినవాడే. ఈ ఇద్దరూ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో ఆడిన భారత జట్టులో అశూ- వాషీ ఇద్దరికీ చోటు దక్కింది. అయితే, పెర్త్‌ టెస్టులో అనుభవజ్ఞుడైన అశూను కాదని.. మేనేజ్‌మెంట్‌ వాషీని ఆడించింది. అందుకు తగ్గట్లుగానే అతడు రాణించాడు కూడా!అశూ ఆకస్మిక రిటైర్‌మెంట్‌అయితే, ఆ తర్వాత మరో రెండు టెస్టుల్లోనూ అశూకు అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో బ్రిస్బేన్‌లో మూడో టెస్టు డ్రా అయిన తర్వాత అతడు సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మేనేజ్‌మెంట్‌ తీరు నచ్చకే అశూ రిటైర్మెంట్‌ ప్రకటించాడనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గంభీర్‌కు వాషీ ఆట అంటే ఇష్టమంటూ అశూ చేసిన వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయి.కాగా రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌, ఎడమచేతి వాటం బ్యాటర్‌ అయిన వాషింగ్టన్‌ సుందర్‌.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 టెస్టులు, 22 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 468, 315, 161 పరుగులు చేయడంతో పాటు.. 25, 23, 47 వికెట్లు తీశాడు.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’

Urmila Matondkar Breaks Silence On Rumors Fallout With Ram Gopal Varma5
ఆర్జీవీతో విభేదాలు.. స్పందించిన హీరోయిన్‌

చిత్ర పరిశ్రమలో రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma)పై రూమర్స్‌ రావడం చాలా తక్కువ. ఏదైనా ఉంటే ఓపెన్‌గానే మాట్లాడతాడు. అంతేకాని తన ప్రవర్తనతో నటీనటులకు ఇబ్బంది మాత్రం కలగనీయడని సినీ ఇండస్ట్రీ మొత్తం చెబుతుంది. ముఖ్యంగా హీరోయిన్లతో ఎంత చనువుగా ఉన్నప్పటికీ.. హద్దులు దాటి ప్రవర్తించరు. అందుకే అతనితో సినిమా చేసేందుకు చాలా మంది హీరోయిన్లు ఆసక్తి కనబరుస్తారు. అలాంటి ఆర్జీవీపై చాలా కాలంగా ఓ రూమర్‌ వినిపిస్తోంది. అలనాటి అందాల తార ఊర్మిళా మాతోండ్కర్‌(Urmila Matondkar)తో ఆర్జీవీకీ గొడవైందని, వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని బాలీవుడ్‌లో వార్తలు వినిపించాయి.తాజాగా ఈ రూమర్స్‌పై ఊర్మిళ స్పందించింది. ఆర్జీవీతో తనకు ఎలాంటి అభిప్రాయభేదాల్లేవని స్పష్టం చేసింది.ఆర్జీవీ దర్శకత్వంలో నటించినందుకు గర్విస్తున్నాఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘అంతం’, ‘గాయం’, ‘రంగీలా’, ‘సత్య’ సినిమాల్లో ఊర్మిళ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌ వచ్చిన చిత్రాలన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. అయితే ‘ఆగ్’(2007) తర్వాత ఊర్మిళ మళ్లీ ఆర్జీవీ చిత్రాల్లో నటించలేదు. దీంతో బాలీవుడ్‌లో పలు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ‘సత్య’(satya) రీ రిలీజ్‌ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్జీవీతో విభేదాలు వచ్చాయట కదా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఊర్మిళ సమాధానం చెబుతూ..‘మా మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు. ఆయనతో నాకు మంచి స్నేహమే ఉంది. ఆయన తెరకెక్కించిన ‘కంపెనీ’ (2002), ‘రామ్‌గోపాల్‌ వర్మ కీ ఆగ్‌’ (2007) చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లోనూ నటించాను. ఆ తర్వాత మేం మళ్లీ కలిసి పని చేయకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏం లేదు. ఆయన దర్శకత్వంలో నటించినందుకు గర్వపడుతున్నా. అవకాశం వస్తే రామ్‌గోపాల్‌ వర్మ, మనోజ్‌ బాజ్‌పాయ్‌తో కలిసి మళ్లీ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాను’ అని ఊర్మిళ చెప్పుకొచ్చింది.‘రంగీలా’తో ఫేమస్‌ముంబైలో పుట్టి పెరిగిన ఊర్మిళ.. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'కర్మ' మూవీతో పరిచయమైంది. కొన్నాళ్ల తర్వాత హీరోయిన్‌గా మారింది. రాంగోపాల్ వర్మ తీసిన 'రంగీలా'.. ఈమెకు ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీని తర్వాత జుదాయి, సత్య తదితర చిత్రాలతో స్టార్ అయిపోయింది. తెలుగు తమిళంలోనూ అంతం, గాయం, భారతీయుడు, అనగనగా ఒక రోజు లాంటి మూవీస్ చేసింది. 2018లో చివరగా 'బ్లాక్ మెయిల్' సినిమాలో కనిపించిన ఊర్మిళ.. 2019లో రాజకీయాల్లోకి వెళ్లింది. తొలుత కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత ఏడాది శివసేన పార్టీలో చేరిపోయింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ.. మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ట్రై చేస్తోంది.ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు ఊర్మిళ జడ్జిగా వ్యవహరిస్తోంది.

Reddit User Shares How ChatGPT Helped Save His Life6
ప్రాణం కాపాడిన చాట్‌జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ' (ChatGPT) యూజర్లకు చాలా ఉపయోగపడుతోంది. ఏ ప్రశ్న అడిగినా.. దాదాపు ఖచ్చితమైన, వేగవంతమైన జవాబును ఇస్తోంది. ఇప్పటికే ఎన్నెన్నో అద్భుతాలు చేసిన చాట్‌జీపీటీ.. తాజాగా ఓ మనిషికి ఉన్న రోగాన్ని సైతం కనిపెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. కొన్ని రోజుల క్రితం నేను వ్యాయామం చేసాను. ఒళ్ళంతా చాలా నొప్పులుగా.. ఏదో యాక్సిడెంట్ అయిన ఫీలింగ్ కలిగింది. రెండు రోజులైనా ఆరోగ్యం కుదుటపడలేదు. నాకున్న లక్షణాలను చాట్‌జీపీటీకి వివరించాను. లక్షణాల ఆధారంగా రాబ్డోమయోలైసిస్‌ (Rhabdomyolysis) ఉన్నట్లు వెల్లడిస్తూ.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సిపార్సు చేసింది.చాట్‌జీపీటీ చెప్పింది నిజమా? కాదా? అని నిర్దారించుకోవడానికి నేను ఆసుపత్రికి వెళ్ళాను. డాక్టర్లు కూడా టెస్ట్‌లు చేసి రాబ్డోమయోలైసిస్‌ ఉందని నిర్థారించారు. నా ల్యాబ్ ఫలితాలను విశ్లేషించడానికి కూడా.. నేను ChatGPTని ఉపయోగించాను. అది వైద్య బృందం చెప్పిన దానితో సమానంగా చెప్పింది. సరైన సమయానికి చికిత్స తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాను.చాట్‌జీపీటీ సామర్థ్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో కూడా.. చాట్‌జీపీటీ ఇతరుల ప్రాణాలను కాపాడటం సంఘటనల గురించి విన్నాను. ఇప్పుడు చాట్‌జీపీటీ నన్ను కూడా కాపాడింది.ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాట్‌జీపీటీ లక్షణాల ఆధారంగా రోగ నిర్దారణ చేయడం చాలా గొప్పగా ఉందని పలువురు ప్రశంసించారు. వైద్య సలహా కోసం కూడా దీనిని ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు.రాబ్డోమయోలైసిస్‌రాబ్డోమయోలైసిస్‌ అనేది ఓ అరుదైన సమస్య. విశ్రాంతి తీసుకోకుండా ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల.. కండరాలు కలిగిపోతాయి. దీంతో రక్తంలోకి విడుదలయ్యే ప్రోటీన్లు కిడ్నీలలో పేరుకుపోతాయి. ఇది పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఇది ప్రాణాంతకం కూడా.ఇదీ చదవండి: ఆరోగ్యం కోసం నవవిధ మార్గాలు - చాట్‌జీపీటీ సలహాలు

KSR Comments On Nara Lokesh Deputy CM Issue By TDP Leaders7
కూటమిలో ‘లోకేష్‌’ రాగం.. మరోసారి బాబు మైండ్‌​ గేమ్‌?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి రాజకీయం మారుతోందా? టీడీపీ వర్గాల్లో కొందరు మంత్రి లోకేష్‌ భావి సీఎం అంటుంటే.. డిప్యూటీ సీఎం అని మరికొందరు వ్యాఖ్యలు చేయడం దీనికి కారణంగా కనిపిస్తోంది. ఈ రెండు పదవుల్లో ఏది దక్కినా.. ఇప్పటివరకూ కూటమి భాగస్వామి, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ హోదాకు భంగం కలిగినట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. టీడీపీతో కొనసాగితే పవన్‌ ఎప్పటికీ సీఎం కాలేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ నేతను అడ్డుకునేందుకే టీడీపీ లోకేష్‌ను తెరపైకి తెచ్చిందన్న ఆలోచన కూడా జనసేనలో ఉన్నట్లు చెబుతున్నారు.తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పదోన్నతిపై దావోస్‌ పర్యటన సందర్భంగా చర్చ మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అయితే లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే చాలని టీడీపీ నేతలు పలువురు బహిరంగంగా కోరుతూంటే.. వీలైనంత తొందరగా సీఎంను చేయాలని చంద్రబాబు నాయుడిపై ఆయన కుటుంబం నుంచే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. దావోస్‌ పర్యటనలో మంత్రి టీజీ భరత్‌ చాలా స్పష్టంగా భావి ముఖ్యమంత్రి లోకేష్‌ అని ప్రకటించగా టీడీపీ నేతలు మాత్రం ఏదైనా ఉంటే కూటమి పక్షాలతో కలిసి మాట్లాడుకుంటామని అంటున్నారు. భరత్‌ ప్రకటన ఏదో మొక్కుబడి వ్యవహారమని అంటున్నారే కానీ.. లోకేష్‌‌ను ముఖ్యమంత్రిని చేసే ప్రతిపాదన ఏదీ లేదని మాత్రం వారు ఖండించకపోవడం గమనార్హం.కొద్దికాలం క్రితం పవన్‌ కళ్యాణ్‌ ఒక సభలో మాట్లాడుతూ మరో పదేళ్లపాటు చంద్రబాబే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. లోకేష్‌కు చెక్‌ పెట్టేందుకు ఆయన ఆ మాట మాట్లాడారా? లేక చంద్రబాబే కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడిని తగ్గించేందుకు పవన్‌ చేత అలా మాట్లాడించారా? అన్నది చెప్పలేము. ఎందుకంటే.. సీఎం పదవిని ఇప్పుడిప్పుడే వదులుకునే ఆలోచన బాబు చేయరు. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తే జనసేన నుంచి సమస్యలు రావచ్చునని కూడా బాబుకు తెలుసు. అందుకే ఆయన మధ్యే మార్గంగా ప్రస్తుతానికి లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనకు వచ్చి ఉండవచ్చు. కాకపోతే ఈ ప్రతిపాదనకు లోకేష్‌ మద్దతుదారులు, బాబుగారి కుటుంబం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది చూడాలి.నారా లోకేష్‌కు పదోన్నతిపై ప్రచారం మొదలుపెట్టడం ఒక రకంగా రాజకీయ వ్యూహం. ఇతరుల ద్వారా కొన్ని అంశాలను ప్రచారంలో పెట్టడం.. వ్యతిరేకించే వారిని మానసికంగా సిద్ధం చేయడం దీని వెనుక ఉన్న ఉద్దేశం. అంగీకరించేవారు ఉండవచ్చు లేనివారు వారి దోవన వారు వెళ్లవచ్చునని సంకేతం ఇవ్వడం కూడా. ఇలాంటి విషయాలలో చంద్రబాబుది ఘనాపాటే. గతంలో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేయడానికి ముందు కూడా ఇలాంటి వ్యూహాన్నే ఆయన అమలు చేశారు. ఎన్టీఆర్‌ రెండో భార్య లక్ష్మీ పార్వతిపై దుష్ప్రచారం చేయించడం, ఆమె పెత్తనం పెరిగిపోవడం వల్ల పార్టీకి నష్టమంటూ వంత మీడియా ఈనాడులో కథనాలు రాయించడం చేసేవారు. ఆ టైమ్‌లోనే అప్పటి మంత్రి దాడి వీరభద్రరావు రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష్మీపార్వతిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్‌ చేశారు.దీంతో, చంద్రబాబు వర్గం ఈ పాయింట్‌ను అడ్డం పెట్టుకుని కథ నడిపింది. అదే జరిగితే మీ పరిస్థితి ఏమిటన్న ఆందోళనను ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల్లో కల్పించడంతోపాటు వారిని తనవైపు తిప్పుకునేందుకు వరాల జల్లు కురిపించారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశ చూపారు. పార్టీ అధ్యక్ష పదవిని ఎన్టీఆర్‌ పెద్దకుమారుడు హరికృష్ణకు ఎరవేశారు. మొత్తమ్మీద ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేశారు. ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే వర్గపోరు వస్తుందని, కుటుంబ పెత్తనం అంటారని ప్రచారం చేయించారు. దగ్గుబాటికి డిప్యూటీ సీఎం, హరికృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి రెండూ దక్కకుండా చూశారు. హరికృష్ణకు మంత్రి పదవి మాత్రమే విదిల్చారు.అయితే మంత్రి పదవి వచ్చేటప్పటికి హరికృష్ణ ఎమ్మెల్యే కాదు. ఆరునెలల్లోపు ఎన్నికై ఉంటే పదవి దక్కేది కానీ.. కాలేకపోయారు. దీంతో మంత్రి పదవి కూడా పోయింది. తరువాతి కాలంలో జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైనా హరికృష్ణకు మంత్రి పదవి ఇవ్వకపోవడం బాబు మార్కు రాజకీయం. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గాన్ని నడిపిన చంద్రబాబు, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం వర్గాలను సహించనంటూ హెచ్చరికలు చేస్తుండే వారు. ఇప్పటికీ అదే తరహా రాజకీయం చేస్తున్నారు. నిజంగానే లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సుముఖంగా లేకపోతే, ప్రకటనలు చేస్తున్న టీడీపీ నేతలను వారించే వారు. కానీ, పార్టీ నేత శ్రీనివాసరెడ్డి ఆయన సమక్షంలోనే లోకేష్ పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారని, ఎన్నికలలో చాలా కష్టపడ్డారని, అందువల్ల ఆయనను ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. చంద్రబాబు దీన్ని వారించలేదు.ఇదే సమయంలో మరికొందరు టీడీపీ నేతలు దాన్ని ఒక డిమాండ్‌గా మార్చారు. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ లోకేష్ అన్ని విధాలుగా అర్హుడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో టీడీపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేయడం కూడా గమనించాలి. పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య సంబంధాలు అంత సజావుగా లేవని తేలుతుంది. లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గించినట్లవుతుందని తెలిసినా కూడా వీరంతా ఇలా మాట్లాడుతున్నారంటే అందులో మతలబు అర్థమవుతూనే ఉంది.మరోవైపు లోకేష్ కూడా తన పార్టీ నేతల ప్రకటనలను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆయనే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నా, పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో అతిగా వ్యవహరిస్తున్నారన్న భావనతో ఉప ముఖ్యమంత్రి పదవి కోరుకుంటుండవచ్చు. లోకేష్‌, పవన్ ‌కళ్యాణ్‌ల మధ్య ప్రచ్ఛన్న పోటీకి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సందర్భంలోనూ ఇరువురి మధ్య సంబంధాలు గొప్పగా ఏమీ లేవని స్పష్టం చేశాయి. తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఉన్నతాధికారులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ చెబితే లోకేష్‌ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తోసిపుచ్చడం.. ఎన్నికలకు ముందు కూడా సీఎం పదవిని జనసేన అధినేతతో పంచుకోవాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చడం మచ్చుకు రెండు ఉదాహరణలు.ఎన్నికల్లో పొత్తు కావాలని టీడీపీ కోరుకుంటూంటే జనసేనకు యాభై సీట్లు ఇవ్వాలని తమకు పాతికి సీట్లు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. పవన్‌ కళ్యాణ్‌ ఈ మాట అనేందుకు కూడా జంకారు. ఇలాంటి షరతులే పెట్టి ఉంటే రాజకీయం ఇంకోలా ఉండేది. పవన్‌ కళ్యాణ్‌, బీజేపీలకు కూటమిలో ఎంతో కొంత పట్టు దొరికేది. ఎన్నికలకు ముందు తాను, చంద్రబాబు సమానం అనుకుని పవన్ మాట్లాడేవారు. కొంతకాలం అలాగే నడిచింది. చంద్రబాబు కూడా పవన్‌ను అదే భ్రమలో ఉంచుతూ వచ్చారు. కానీ, కాలం మారుతుంది కదా.. ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుతో సమానంగా పవన్ ఎలా ఉంటారన్న ప్రశ్న టీడీపీలో వచ్చింది.ఇక, సీఎం పదవి లోకేష్‌కు ఇవ్వాలన్న వాదన కూడా వస్తుండడంతో లాభం లేదని ఉప ముఖ్యమంత్రి పదవికి ఆయనను తీసుకురావడానికి వ్యూహరచన మొదలైంది. అందులో భాగంగా ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా చంద్రబాబుకు చెరో వైపు పవన్ కళ్యాణ్, లోకేష్‌ల బొమ్మలు కూడా ప్రభుత్వ ప్రచార ప్రకటనలలో ముద్రించారు. నిబంధనలకు విరుద్ధమైనా లోకేష్ ఫోటో వేయడం చంద్రబాబు మనసులో మాటను చెప్పడమే అవుతుంది. ఆ తర్వాత స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ ప్రకటనలో కూడా పవన్, లోకేష్‌ల ఫోటోలు వేశారు. దీని ద్వారా పవన్‌కు స్పష్టమైన సందేశం పంపించారు. తద్వారా చంద్రబాబుతో సమానం అనుకుంటున్న పవన్ స్థాయిని సక్సెస్ ఫుల్‌గా తగ్గించారు. ఇక లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేస్తే, పూర్తి ఆధిపత్యం వచ్చేసినట్లే అవుతుంది. తనకు సీఎం పదవి రాకుండా అడ్డుకుంటున్న పవన్‌కు చెక్‌ పెట్టినట్లు కూడా ఉంటుంది.ఈ వ్యవహారంలో బీజేపీ నేరుగా వేలు పెట్టకుండా వేచి చూస్తోంది. తెలుగుదేశంలో మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్‌ను బహిరంగంగా లేవనెత్తడం గమనార్హం. దానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు, నేతలు పవన్‌ను ముఖ్యమంత్రిని చేసి, లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో రెండు పార్టీల వారు తీవ్ర వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఎవరి వల్ల ఎవరు పవర్‌లోకి వచ్చారన్నదానిపై చర్చిస్తున్నారు. అది శ్రుతి మించి బూతులు తిట్టుకునే దశకు వెళ్లారు. అయినా పవన్, లోకేష్‌లు నోరు విప్పలేదు. ఇది పవన్, లోకేష్‌ల మధ్య రాజకీయ వార్‌గా మారింది. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గం కాపులు ఎక్కువ మంది ఉన్నచోట పోటీచేసి గెలిచారని, లోకేష్ మాత్రం ఇటీవలి కాలంలో ఎన్నడూ గెలవని మంగళగిరి నుంచి విజయం సాధించారని, పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమే ఎక్కువ అని టీడీపీ అభిమాని ఒకరు పోస్టు పెట్టారు. పవన్ లేకపోతే టీడీపీకి అధికారం ఎక్కడ వచ్చేది.. ఇలాగే చేయండి. మళ్లీ జగన్ సీఎం అవుతారు.. అప్పుడు మీ సంగతి చూస్తారు.. అంటూ కొన్ని అభ్యంతర పదాలతో జనసేన కార్యకర్త ఒకరు పోస్టు పెట్టారు.ఇలా ఇరువైపులా పలువురు విమర్శలు, తిట్ల పురాణం సాగిస్తున్నారు. చంద్రబాబుకు వయసు పెద్దదైందని, అందువల్ల పవన్‌ను సీఎంగా చేసి, లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని జనసేన వారు కోరుతున్నారు. విశేషం ఏమిటంటే చంద్రబాబుకు వయసు మళ్లిందని జనసేన అంటుంటే, దానిని టీడీపీ వారు కూడా ధృవీకరిస్తున్నట్లుగా మాట్లాడుతూ లోకేష్‌ను సీఎం చేయాలని చెబుతున్నారు. మంత్రి టీజీ భరత్ సీఎం సమక్షంలోనే లోకేష్ ముఖ్యమంత్రి కావాలని అన్నారంటే అర్ధం అదే అన్న భావన కలుగుతుంది. లోకేష్, పవన్‌ల మధ్య సాగుతున్న ఈ గొడవతో చంద్రబాబు నిస్సహాయంగా మిగిలిపోతున్నట్లుగా ఉంది. అటు కొడుకు ఇటు పవన్ కళ్యాణ్ అయిపోయారు మరి. దానికితోడు ఈ మధ్య కాలంలో ఆయన చేసిన వివిధ వ్యాఖ్యలలో అసంబద్ధత ఎక్కువగా ఉంటుండటంతో అంతా వయసును గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్నది ఒప్పందం అని, దానిని ఎలా కాదంటారన్నది జనసేన బాధగా ఉంది. కానీ అధికారం రుచి చూసిన పవన్ కళ్యాణ్ అవమానాలనైనా భరిస్తారు కానీ ఇప్పటికైతే టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే కొనసాగుతారన్నది ఎక్కువమంది భావన. నిజంగానే లోకేష్ ఈ టర్మ్‌లోనే ముఖ్యమంత్రి అయితే పవన్ తగ్గి ఉంటారా? లేక ఎదిరిస్తారా? అన్నది అప్పుడే చెప్పలేం. ఏది ఏమైనా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవడానికి రంగం సిద్ధం అవుతున్నట్లే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవం వంటి డైలాగుల జోలికి వెళ్లకుండా సర్దుకుపోక తప్పదేమో!. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Actress BJP Leader Madhavi Latha Approaches Hyd Police Over JC Comments8
జేసీ ప్రభాకర్‌పై పోలీసులకు మాధవీలత ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై (Madhavi Latha అనంతపురం జిల్లా టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ( J. C. Prabhakar Reddy) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. తాజాగా, జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాధవీలత సైబరాబాద్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. తనపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం సైబరాబాద్‌ సీపీని కలిసిన మాధవీలత రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ..‘జేసీ మాటలతో నేను, నా కుటుంబం ఇబ్బంది పడ్డాం. క్షమాపణ చెప్పానంటే సరిపోతుందా? నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా’ అంటూ మాధవీలత ప్రశ్నలు కురిపించారు. జేసీ ప్రభాకర్‌ మాటలతో చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా? అని మాధవీలత నిలదీశారు. అంతకుముందు ఆమె ఫిలింఛాంబర్‌లోనూ ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదుజేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌లో నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజికి(Siva Balaji) పిర్యాదు పత్రాన్ని ఆమె అందజేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని తన సోషల్‌మీడియాలో ఆమె పేర్కొన్నారు.లేఖలో మాధవీలత ఏమన్నారంటే?'జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే 'మా'కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతాను. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.' అని ఆమె అన్నారు.అసలు వివాదం ఏంటి?నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్‌ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఆయనతో పాటు టీడీపీకే చెందిన మున్సిపల్‌ కౌన్సిలర్‌ మల్లికార్జున కూడా పరుష పదజాలంతో మాట్లాడారు. మాధవీలతకు సంబంధించిన చిత్రాలను చూపిస్తూ అశ్లీలంగా నటించిందంటూ వ్యాఖ్యానించారు.మీరు థర్డ్‌ జెండర్‌ కంటే అధ్వానం..జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీని, దాని అనుబంధ సంస్థలనూ వదల్లేదు. ‘మాధవీలత బతుకుదెరువు కోసం ఏదో పాట్లు పడుతోంది, పడనివ్వండి. ఆమె మాకు నీతులు చెప్పకూ డ­దు. భజరంగదళ్, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్‌.. ఇలాంటి వాళ్లా నన్ను బెదిరించేది? వాళ్లకంటే థర్డ్‌జెండర్‌ (ట్రాన్స్‌జెండర్‌)లు మేలు’ అని వ్యాఖ్యానించారు.బీజేపీ వాళ్లు నా వెంట్రుక కూడా పీక్కోలేరు.. సిగ్గులేని నా కొ...కల్లారా అంటూ ఫైర్‌ అయ్యారు. తన బస్సును కాల్చిన తర్వాత ఆ వేడికి కరెంటు వైర్లు పడ్డాయని.. కానీ, షార్ట్‌ సర్క్యూట్‌ అని రాసుకున్నారని, అలాగే రాసుకోండని జేసీ అన్నారు. తన వర్గం మహిళలతో మాధవీలత పైనే తాడి­పత్రి పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారు.కేసులకు భయపడను: మాధవీలతజేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్‌మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారా­నికి నిదర్శనమన్నారు. ఇలాగైతే తాడిపత్రి నుంచి తెర మీదకు ఎవరూ రాకూడదన్నట్లు ఉందన్నారు.తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్‌­రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబో­నన్నారు. తనను కిడ్నాప్‌ చేయాలనుకున్నా, మర్డర్‌ చే­యా­లను­కున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసు­లో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాష­ను భరిస్తు­న్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు.

BJP MP Eatala Rajendar And Supporters Issue On Real Estate AT Medchal9
రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌పై ఎంపీ ఈటల, అనుచరుల దాడి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ దాడి చేశారు. పేదల భూములు కబ్జా చేశారనే ఆరోపణల నేపథ్యంలో రియల్‌ వ్యాపారిపై ఈటల చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.పేదలను భూములను కబ్జా చేస్తున్నారని బాధితులు ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈటల నేడు.. మేడ్చల్‌ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో ఉన్న ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పేదల భూములను రియల్‌ వ్యాపారులు ఆక్రమించుకోవడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడే ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు తెలియక కబ్జా స్థలాలను కొంటున్నారు. పేదల భూములకు కబ్జా చేయడం నేరం. పేదల భూములను కబ్జా చేసి వ్యాపారం చేసుకుంటున్న బ్రోకర్లు. పేదల భూములను కబ్జా చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి. బ్రోకర్లకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ. అనేక పేదల కాలనీలకు రూపశిల్పి బీజేపీనే. పేదలు కొనుక్కున్న భూములకు బీజేపీ సంపూర్ణంగా అండగా ఉంటుంది. బీజేపీ తాటాకు చప్పుళ్లకు భయపడదు. అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు.1985లో నారపల్లి, కొర్రెముల గ్రామాల్లో పేదవారు కంచెలు, జంగల్ భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కి, సీపీకి, మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ వివరాలతో ఉత్తరాలు రాస్తాను. తప్పు భూములు కొనుక్కున్న వారిది కాదు.. దొంగ కాగితాలు సృష్టించిన అధికారులది, వాళ్ళని జైల్లో పెట్టాలి. తప్పు బ్రోకర్లది. ఎవరైనా పేదల మీద దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నా. చిన్న జిల్లాలు ఏర్పాటు చెస్తే పాలన సులభం అవుతుంది. కలెక్టర్లు అందుబాటులో ఉంటారు అనుకున్నాం. కానీ కలెక్టర్లు దొరకడం లేదు. పోలీస్ కమిషనర్‌కి మనకు కలవడానికి సమయం ఉండదు కానీ బ్రోకర్లను కలవడానికి మాత్రం సమయం ఉంటుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Home Minister Amit Shah Tweet On Chhattisgarh Encounter10
ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై అమిత్‌ షా ట్వీట్‌

సాక్షి, ఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. నక్సలిజం చివరి దశలో ఉందన్న అమిత్‌.. మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. త్వరలోనే మనం మావోయిస్టులు లేని ఇండియాను చూస్తామంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.మన భద్రతాదళాలు సాధించిన గొప్ప విజయంగా పేర్కొన్న అమిత్‌షా.. నక్సలిజానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అన్నారు. నక్సల్స్‌ లేని భారత్‌ దిశగా ఇది కీలక అడుగని.. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు.ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎదురు కాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల కీలక నేతలు కూడా మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్‌ ఉన్నారు. గతంలో వారిపై ప్రభుత్వం కోటి రూపాయలు రివార్డ్‌ ప్రకటించింది. ఇదీ చదవండి: భారీ ఎన్‌కౌంటర్‌.. మావోయిస్ట్‌ కీలక నేత చలపతి మృతిమావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్‌, నౌపాడలో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. తెల్లవారుజామున జరిపిన గాలింపులో మరో 14 మంది మృతదేహాలు లభ్యం కాగా, ఇవాళ మధ్యా‍హ్నానికి 19కి పెరిగింది. భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది.Another mighty blow to Naxalism. Our security forces achieved major success towards building a Naxal-free Bharat. The CRPF, SoG Odisha, and Chhattisgarh Police neutralised 14 Naxalites in a joint operation along the Odisha-Chhattisgarh border. With our resolve for a Naxal-free…— Amit Shah (@AmitShah) January 21, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీట్ అండ్ గ్రీట్’

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో జనవరి 18న ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం జరిగింది.

title
డుం.. డుం.. డుం..

ప్రేమ‌కు స‌రిహ‌ద్దులు లేవ‌ని నిరూపించింది త‌మిళ‌నాడుకు చెందిన ఓ యువ‌తి.

title
ట్రంప్‌, జేడీ వాన్స్‌ ప్రమాణం.. ప్రత్యేక ఆకర్షణగా ఉషా చిలుకూరి

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప

title
డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడు.. అంతలోనే ఇలా..

దిల్‌సుఖ్‌నగర్‌ (హైదరాబాద్‌)/చౌటుప్పల్‌ రూరల్‌: ఉన్నత చదువు

title
ట్రంప్‌ ఇచ్చిన బాధ్యతల నుంచి వైదొలగిన వివేక్‌ రామస్వామి.. కారణం?

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Tr

International View all
title
డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ వృక్షం: తల్లిదండ్రులు వలసదారులు..

డొనాల్డ్ ట్రంప్ అమెరికా సంయుక్త రాష్ట్రాల 47వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చే

title
టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి

టర్కీలోని ఒక రిసార్ట్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

title
రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపద

ప్రపంచ కుబేరుల సంపద అనూహ్యంగా 2024లో 2 ట్రిలియన్ డాలర్ల(రూ.170 లక్షల కోట్లు)కు పెరిగి 15 లక్షల కోట్ల డాలర్ల (రూ.1275 లక్

title
ట్రంప్‌ నిర్ణయాలు.. అంతర్జాతీయంగా అమెరికాకు దెబ్బ?

అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోమారు అధిరోహించిన ట్రంప్‌ పలు కీలక నిర్ణయాలు తీసు

title
కెనడా, మెక్సికోలపై సుంకాలు.. ప్రభావితమయ్యే వస్తువులు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement

వీడియోలు

Advertisement