Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TTD Stampede Six Devotees Lost Breath For Vaikuntha Ekadashi Tickets1
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం

గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యు ఘోష వినిపించింది.. ఏడుకొండలవాడి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో ఆధ్యాతి్మక నగరి దద్దరిల్లింది.. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో తిరుపతి భీతిల్లింది.. చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు.. మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. కిందపడ్డ వాళ్లను తొక్కుకుంటూ వెళ్తున్న వారు కొందరు.. ప్రాణ భీతితో తోసుకొచ్చేసిన వారు మరికొందరు.. వెరసి కనీవినీ ఎరుగని రీతిలో తొక్కిసలాటకు కారణమైంది.. పడిపోయిన వారిని బతికించు కోవాలని ఆయా కుటుంబాల తాపత్రయం గుండెలు పిండేసింది.. ఆ దృశ్యాలు చూపరుల కంట తడిపెట్టించాయి.గతంలో గోదావరి పుష్కరాలు.. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి..! నాడు పబ్లిసిటీ పిచ్చి.. నేడు అలవిమాలిన అలసత్వం!సందర్భం ఏదైనప్పటికీ ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యానికి అమాయకులు బలి అవుతున్నారు! కోట్లాది మంది తమ జీవిత కాలంలో ఒక్క అవకాశం కోసం ఆరాట పడే వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ ఏర్పాట్లలో సర్కారు వైఫల్యం కారణంగా పెను తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.సాక్షి తిరుపతి నెట్‌వర్క్‌: చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది. పవిత్ర తిరుమల–తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఆరుగురు భక్తుల ప్రాణాలను హరించింది. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడేలా చేసింది. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల ప్రాణాలతో చలగాటమాడింది. చెల్లాచెదురుగా పడిన అమాయక భక్తుల మృతదేహాలు.. తీవ్రగాయాలపాలైన భక్తుల ఆర్తనాదాలు.. వేలాది మంది భక్తుల హాహాకారాలతో తిరుపతి నగరం హృదయ విదారకంగా మారిపోయింది. రాజకీయ ప్రచారం కోసం, నిరాధార ఆరోపణలతో ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం చంద్రబాబు తిరుమల–తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) వ్యవస్థను భ్రష్టు పట్టించడమే ఇంతటి పెను విషాదానికి దారితీసింది. ఏటా భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కనీస మార్గదర్శకాలను గాలికొదిలేయడంతో భక్తులు బలైపోయారు. రోజుకు 75 వేల మందికిపైగా భక్తులు తరలివస్తున్నా.. ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు ఆరేడు లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నా.. ఏనాడూ ఇటువంటి విషాదం సంభవించ లేదు. కేవలం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారహిత్యంతోనే తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట సంభవించి మాటలకందని పెను విషాదానికి దారితీసింది. ముమ్మాటికీ ఇది నిర్లక్ష్యమేవైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించటం ఆనవాయితీ. పది రోజుల పాటు కొనసాగనున్న వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియ ఏర్పాటు చేసింది. తిరుపతిలో తొమ్మిది, తిరుమలలో ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. పది రోజుల పాటు ఈ టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగనుంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం నుంచి 10 రోజుల పాటు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో బైరాగిపట్టెడ ఎంజీఎం స్కూల్, ఎంఆర్‌పల్లి, శ్రీనివాసం, విష్ణునివాసం, రెండో చౌల్ట్రీ, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, సత్యనారాయణపురం (జీవకోన) ప్రాంతాల్లో టీటీడీ టోకన్ల కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయాన్ని భక్తులకు చేరవేయంలో టీటీడీ విఫలమైంది. దీంతో భక్తులు మంగళవారం రాత్రే తిరుపతికి పయనమయ్యారు. బుధవారం ఉదయం నుంచే తండోపతండాలుగా టోకెన్లు జారీ చేసే కేంద్రాలకు చేరుకున్నారు. ముఖ్యంగా తిరుపతి బైరాగిపట్టెడ ప్రాంతంలోని ఎంజీఎం స్కూల్‌కు చేరుకున్న భక్తులను క్యూలైన్‌లోకి అనుమతించలేదు. దీంతో సాయంత్రానికి భారీగా భక్తులు పెరిగిపోయారు. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి పంపమని సూచించినా, డీఎస్పీ ఒకరు నిరాకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. రాత్రి 8.35 గంటల ప్రాంతంలో అందరినీ ఒకేసారి విడిచి పెట్టమని డీఎస్పీ ఆదేశించటంతో పోలీసులు గేట్లు తెరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లోకి ప్రవేశించటంతో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో కింద పడిపోయిన వారిని పైకి లేపే అవకాశం లేక.. ఊపిరి ఆడక ఆరుగురు మృతి చెందారు. కింద పడిపోయిన వారిని బతికించేందుకు భక్తులు, పోలీసులు కొందరు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అదే విధంగా శ్రీనివాసం, ఇందిరా మైదానం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌ కేంద్రాలకు వచ్చిన వారిని వచ్చినట్లే క్యూలైన్లోకి అనుమతించారు. సాయంత్రం అయ్యే సరికి ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట ప్రారంభమైంది. శ్రీనివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. మరి కొందరు గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిని, తీవ్ర గాయాలపాలైన వారిని రుయా, సిమ్స్‌ ఆస్పత్రులకు తరలించారు. మరణించిన వారు, తీవ్ర గాయాలైన వారిలో ఎక్కువ మంది మదనపల్లి, తమిళనాడుకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.అన్ని కౌంటర్ల వద్ద తొక్కిసలాటఅలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌ వద్ద బుధవారం ఉదయం నుంచి భక్తులు పడిగాపులు కాశారు. రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌ వద్ద భక్తులను క్యూలైన్లోకి అనుమతించే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు భక్తులపై లాఠీ చార్జ్‌ చేశారు. క్యూ లైన్‌లోకి వెళ్లే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది భక్తులు కిందపడిపోయారు. ఈ తోపులాటలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నారులు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. తోపులాట చోటు చేసుకోవటంతో భక్తుల అరుపులు, రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. టీటీడీ వైఫల్యం..వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భారీగా భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వం, టీటీడీ పూర్తిగా విఫలమైంది. క్యూలైన్ల వద్ద టాయిలెట్లు లేవు. దీంతో మహిళలు, చిన్నారులు నరకం అనుభవించారు. అనేక ప్రాంతాల్లో కనీసం తాగు నీరు కూడా ఏర్పాటు చేయలేదు. అన్న ప్రసాద వితరణ ఎక్కడా కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మంచి నీరు అందించి చేతులు దులుపుకున్నారు. తిరుపతిలోని రామానాయుడు స్కూల్‌లో ఒకసారిగా గేట్లు తెరవడంతో జనాలు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి 40 మంది స్పృహ తప్పి పడిపోయారు. ఇందులో అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం నరసాపురం నుంచి 360 మంది గోవిందమాల భక్తులు కాలి నడకన తిరుపతికి చేరుకున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. వీరితో పాటు వచ్చిన బంధువులు బాధితులకు ఏమి జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. ఎటు వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక స్కూల్‌కు దగ్గరలో ఉన్న పద్మావతి పార్కులో వేచి చూస్తున్నారు. ఈ స్కూల్‌లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. దారుణం జరిగిపోయాక పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అప్పుడు, ఇప్పుడు ప్రచారార్భాటమే2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచారార్భాటం కోసం చేసిన షూటింగ్‌ గిమ్మిక్కుతో 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చంద్రబాబు తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు టీటీడీ వ్యవస్థను భ్రష్టు పట్టించడం అడుగడుగునా కనిపిస్తోంది. బాబుకు తోడుగా అభినవ సనాతన ధర్మ పరిరక్షకుడిగా బ్రాండ్‌ ఇమేజ్‌ కోసం తిరుపతిలో సినీ తరహాలో గిమ్మిక్కులు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా టీడీడీ వ్యవస్థను దెబ్బ తీయడంలో తానో చేయి వేశారు. దీంతో అధికార టీడీపీ కూటమి సేవలో తరిస్తే చాలు.. సామాన్య భక్తులు ఏమైపోయినా పర్వాలేదన్నట్లుగా టీటీడీ యంత్రాంగం నిర్లిప్తంగా మారిపోయింది. టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల అదనపు జేఈవో వైఖరి భక్తుల పాలిట యమపాశమైంది. వైకుంఠ ఏకాదశినాడు తిరుమలలో శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఆశించిన భక్తుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఈ ఘోరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులను కలచివేస్తోంది. రామానాయుడు స్కూల్‌లో దారుణంఅక్కడే 40 మంది వరకు అపస్మారక స్థితిలోకి.. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంతిరుపతి అర్బన్‌: తిరుపతిలోని రామానాయుడు స్కూల్‌లో బుధవారం రాత్రి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట సంభవించి 40 మంది వరకు స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 360 మంది గోవిందమాల భక్తులు మూడ్రోజులపాటు నడిచి తిరుపతికి చేరుకున్నారు. వీరంతా అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండల నరసాపురం నుంచి వచ్చారు. వీరితో పాటు వచ్చిన బంధువులు తమ వారికి ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. ఎటు వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక స్కూల్‌కు దగ్గరలో ఉన్న పద్మావతి పార్కులో తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా ఈ స్కూల్‌లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారున్నట్లు సమాచారం. భక్తజ నాన్ని అదుపుచేయడంలో అధికార యంత్రాంగం పూర్తి గా విఫలమైంది. అయితే, ఈ చీకట్లోనే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. పెద్దఎత్తున పర్సులు, సెల్‌ఫోన్లు, జేబులు కొల్లగొట్టారు. దారుణం జరిగిపో యాక పోలీసు రావడంతో భక్తులు మండిపడుతున్నారు.నాడు కట్టుదిట్టంగా.. నేడు నిర్లక్ష్యంగా..తిరుపతి సిటీ: వైకుంఠ ఏకాదశి రోజు నుంచి పదిరోజుల పాటు సామాన్య భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో టీటీడీ పటిష్ట ఏర్పాట్లుచేసింది. కానీ, నేడు కూటమి ప్రభుత్వంగానీ, టీటీడీ గానీ సామాన్య భక్తులను పట్టించుకోలేదని శ్రీవారి భక్తులు దుమ్మెత్తిపోస్తూ గత ప్రభుత్వంలో చేపట్టిన చర్యలను గుర్తుచేస్తున్నారు.నాడు2023 డిసెంబరు 23వ తేదీ వైకుంఠ ఏకాదశి, 2024 జనవరి 1వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. 22వ తేదీ వేకువజాము 5 గంటల నుంచి టోకెన్ల జారీ ప్రారంభించారు. తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాల్లో వీటిని జారీచేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 10వేల చొప్పున పంపిణీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. మొత్తం పది రోజుల్లో లక్ష టోకెన్లు జారీచేశారు. ప్రతి కౌంటర్‌ దగ్గర సింగిల్‌ లైన్‌ క్యూలు ఏర్పాటుచేశారు. కౌంటర్‌ వద్ద ఒకే వ్యక్తి టోకెన్‌ తీసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు కౌంటర్ల వద్ద రద్దీలేకుండా చర్యలు చేపట్టారు. అలాగే.. జారీచేసిన టోకెన్లు, మిగిలినవి పారదర్శకంగా తెలిసేలా డిస్‌ప్లే బోర్డులు పెట్టారు. దీంతో భక్తులకు సక్రమంగా సమాచారం అందేది. అలాగే.. ఒక్కో కౌంటర్‌ వద్ద టీటీడీ సెక్యూరిటీతోపాటు పోలీసులు సుమారు 25 మంది భద్రతా విధులు నిర్వర్తించేవారు. గంట గంటకూ టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే వారు.నేడు..వైకుంఠ ద్వార దర్శన టోకెన్లకు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాలు ఏర్పాటుచేశారు. గురువారం వేకువజాము 5 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించాల్సి ఉంది. అయితే, భక్తుల రద్దీ కారణంగా బుధవారం రాత్రి 9 గంటలకే పంపిణీ మొదలుపెట్టారు. దీనికితోడు అపరిమితంగా టోకెన్ల జారీకి టీటీడీ సన్నద్ధం కావడంతో కౌంటర్ల వద్దకు పెద్దసంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అదుపు చేయలేని పరిస్థితుల్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో భక్తుల మధ్య తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. శ్రీనివాసం దగ్గర ఏర్పాటుచేసిన కౌంటర్ల వద్దకు భక్తులను ఒక్కసారి గుంపులుగా వదలడమే తొక్కిసలాటకు కారణంగా భావిస్తున్నారు. ఒక్కో కౌంటర్‌ వద్ద కేవలం ఇద్దరు ముగ్గురు పోలీసులు మాత్రమే విధులు నిర్వర్తించారు. తొక్కిసలాట జరిగాక అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. చనిపోయిన వారు వీరే..లావణ్య స్వాతి(37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం శాంతి (35) కంచరపాలెం, విశాఖపట్నం రజని (47), మద్దెలపాలెం, విశాఖపట్నం మల్లిగ(50), మేచారి గ్రామం. సేలం జిల్లా, తమిళనాడు బాబు నాయుడు(51), రామచంద్రపురం, నరసరావుపేట నిర్మల (45), పొల్లచ్చి, తమిళనాడు వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతా పం తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితు లను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.తిరుపతి ఘటనపై సీఎం రేవంత్‌ విచారం సాక్షి, హైదరాబాద్‌: తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు సాను భూతి ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన సాయం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

Tirupati Stampede Incident Updates
తిరుపతి మహా విషాదం.. ఎప్పుడేం జరిగిందంటే..

నిన్న(బుధవారం) రాత్రి 8:35 గంటలకు ఒక్కసారిగా గేట్లు తెరవడంతో భక్తజనం దూసుకెళ్లారు.క్యూలెన్ల నిర్వహణలో అధికారులు చేతులెత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది

YS Jagan expresses shock over deaths of devotees in Tirupati stampede3
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచి్చన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Daily Horoscope On 09 January 2025 In Telugu4
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి.

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: శు.దశమి ఉ.11.54 వరకు, తదుపరి ఏకాదశి,నక్షత్రం: భరణి ప.3.08 వరకు, తదుపరి కృత్తిక,వర్జ్యం: రా.2.25 నుండి 3.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.16 నుండి 11.02 వరకు, తదుపరి ప.2.42 నుండి 3.26 వరకు,అమృతఘడియలు: ఉ10.40 నుండి 12.10 వరకు.సూర్యోదయం : 6.37సూర్యాస్తమయం : 5.37రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం...ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.వృషభం...వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.మిథునం....కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. చర్చలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన మార్పులు.కర్కాటకం...కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి.సింహం....సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.కన్య....ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.తుల...వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.వృశ్చికం...పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ధనలాభం. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.ధనుస్సు...కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.మకరం....వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు పరిపరివి«ధాలుగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.కుంభం..సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.మీనం..మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

Sakshi Guest Column On USA Donald Trump Elon Musk5
ఒకే ఒరలో రెండు కత్తులు!

అమెరికా రిపబ్లికన్‌ పార్టీలో టెక్‌ మితవాదులు, జాతీయ మితవాదులు వేర్వేరు వర్గాలు. ఇరువురూ ఒక్కటై డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు తోడ్పడ్డారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రంప్‌ విజయం తర్వాత మొదటిసారి ఈ రెండు వర్గాలూ పరస్పరం కత్తులు దూసుకున్నాయి. అమెరికా జనాభాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతేతరులతో భర్తీ చేయడానికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది జాతీయవాద మితవాదుల ఆరోపణ. అందివచ్చే ఎలాంటి అవకాశాలైనా సరే వాడుకుని అమెరికా యావత్‌ ప్రపంచాన్ని జయించాలని టెక్‌ రైటిస్టులు అనుకుంటారు. అయితే ట్రంప్‌ దగ్గర టెక్‌ రైటిస్టులకే ప్రాధాన్యత లభిస్తోంది. కలసికట్టుగా ఎన్నికలు గెలిచినా, ఇప్పుడు ఒక వర్గం ఓడిపోబోతోంది.మొన్న క్రిస్మస్‌ రోజు అమెరికా సోషల్‌ మీడియా భగ్గుమంది. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కేంద్రబిందువుగా సంస్కృతి పరమైన విష పోరాటం మొదలైంది. విమర్శకులు ఆయనపై విద్వేషంతో బుసలు కోట్టారు. అసభ్య వ్యాఖ్యలతో దాడి చేశారు. మస్క్‌ కూడా వారితో ఢీ అంటే ఢీ అన్నాడు. అసలేమిటి ఈ వివాదం? వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ శ్రీరామ్‌ కృష్ణన్‌ను డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఏఐ–పాలసీ సీనియర్‌ సలహాదారుగా నియమించుకోడంతో అమెరికాలో అగ్గి రాజుకుంది. ‘మాగా’ (ఎంఏజీఏ– మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌) వాదానికి గట్టి మద్దతుదారు, ఇంటర్నెట్‌ ట్రోలింగ్‌ సుప్రసిద్ధుడు అయిన లారా లూమర్‌ పెట్టిన పోస్టు తీవ్ర మితవాదులను అట్టుడికించింది. ‘అమెరికా ఫస్ట్‌’ ఉద్యమానికి ట్రంప్‌ వెన్నుపోటు పొడిచాడంటూ రగిలిపోయారు. కృష్ణన్‌ భారతీయ వలసదారు. అమెరికా పౌరుడు. ఆయన భారతీయ మూలాలను ‘మాగా’ మితవాద శిబిరం సహించలేక పోయింది. హెచ్‌–1బి వీసా విధానంపై మండిపడింది. అమెరికన్‌ కంపెనీలు నిపుణులైన వలసదారులను నియమించుకోడానికి ఇది వీలు కల్పిస్తోంది. ఇలా వచ్చి పనిచేస్తున్న వారిలో మూడొంతుల మంది ఇండియన్లే. ఈ నేపథ్యంలో శ్రీరామ్‌ కృష్ణన్‌ నియామకానికి స్పందనగా ఇంటర్నెట్‌లో జాత్యహంకారం జడలు విప్పింది. జాతీయ వాదులు భారతీయ టెక్‌ వర్కర్లపై విద్వేషపూరితమైన మీమ్స్‌తో సోషల్‌ మీడియాను ముంచెత్తారు. వారిని ‘మూడో ప్రపంచ ఆక్రమణ దారులు’గా లూమర్‌ అభివర్ణించాడు. అంతేకాదు, అతడో సిద్ధాంతం లేవనెత్తాడు. దాని పేరు ‘గ్రేట్‌ రీప్లేస్‌మెంట్‌ థియరీ’. అమెరికా జనా భాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతే తరులతో భర్తీ చేయడా నికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది లూమర్‌ సిద్ధాంతం. హెచ్‌–1బి వీసా విధానానికి మస్క్‌ మద్దతునిజానికి శ్వేత ఆధిక్యానికి మస్క్‌ వ్వతిరేకం ఏమీ కాదు. తన సొంతమైన ‘ఎక్స్‌’ వేదిక మీద దాన్ని సమర్థించినట్లే కనిపించేవాడు. అయినా, తనకు విశేషమైన అవకాశాలు అందించిన, అపార సంపద కట్టబెట్టిన ప్రభుత్వ విధానం (హెచ్‌–1బి) మీద ఇప్పుడు జరుగు తున్న దాడిని సహించలేక పోయాడు. అమెరికా పౌరుడిగా మారక ముందు మస్క్‌ కూడా వలస వచ్చినవాడే. దక్షిణాఫ్రికా నుంచి హెచ్‌–1బి వీసా మీద వచ్చి స్థిరపడ్డాడు. ఆయన కూడా తన కంపెనీల్లో అలాంటి వారిని నియమించుకున్నాడు. ఈ హెచ్‌–1బి వీసా విధానానికి మద్దతు ఇస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టాడు. ఈ విధానం వల్ల అమెరికా గొప్ప ప్రతిభావంతులను సమకూర్చుకుంది అని అతడి వాదన. ఐటీ కేంద్రమైన సిలికాన్‌ వ్యాలీకి ఈ దృక్పథం ఇబ్బందికరమైంది కానప్పటికీ, రిపబ్లికన్‌ పార్టీలోని తిరోగమన, జాతీయ వాద వర్గాలకు మస్క్‌ అభిప్రాయం అసంతృప్తి కలిగించింది ‘అమెరికా ప్రజలు ఎప్పటికీ అమెరికాను ఒక స్పోర్ట్స్‌ టీమ్‌ లేదా కంపెనీ అనుకోరు’ అంటూ జాక్‌ పొసొబిక్‌ బదులిచ్చాడు. వీటన్నిటికీ బదు లిస్తూ, ‘ఈ అంశం మీద నేను యుద్ధానికి సిద్ధం, దాని పర్యవ సానాలు మీ ఊహక్కూడా అందవు’ అంటూ మస్క్‌ తన విమర్శకు లను హెచ్చరించాడు. దీంతో ట్రంప్‌ మాజీ సలహాదారు స్టీవ్‌ బానన్‌ రంగంలోకి దిగాడు. హెచ్‌–1బి వీసాలు పెద్ద స్కామ్‌ అనీ, వాటిని సమర్థించి మస్క్‌ తన ‘నిజ స్వరూపం’ బయట పెట్టుకున్నాడని ప్రతి దాడికి దిగాడు.నిజానికి హెచ్‌–1బి వీసాలను వ్యతిరేకించడం ‘మాగా’ పంథా కాదు. ఈ విధానంలో లోపాలు ఉన్నాయి కాబట్టి దీని పట్ల వ్యతిరేకత వచ్చింది. ఇండిపెండెంట్‌ సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ గతంలో మాట్లా డిన ప్రకారం, వ్యాపారవేత్తలు అత్యంత నిపుణులైన వలస ఉద్యోగులను నియమించుకుని సిబ్బంది వ్యయాలు గణనీయంగా తగ్గించు కోడానికి హెచ్‌–1బి పదునైన ఆయుధంలా ఉపకరిస్తుంది. మస్క్‌ సమ్మిళిత వలసవాదంగా పేర్కొంటూ అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులకు ఇప్పుడు మద్దతు ఇస్తున్నాడు. అయితే, ఎక్స్‌ వేదిక మీద జాతివివక్ష అంశంలో దొంగాటలు ఆడాడు. నియో నాజీలతో సంబంధాలు నెరిపే జర్మన్‌ తీవ్ర మితవాద పార్టీకి గట్టి మద్దతు ఇచ్చాడు. సయోధ్య కుదిరేనా?రిపబ్లికన్‌ పార్టీలోని ఈ రెండు మితవాద వర్గాల ఐక్యత ప్రశ్నా ర్థకంగా మారింది. ఏమైనా ఇవి తమ విభేదాలు పరిష్కరించుకున్నా యని ఒక దశలో అనిపించింది. జాతీయ మితవాదులకు, టెక్‌ మిత వాదులకు మధ్య సయోధ్యకు కాబోయే ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ ఒక ఉదాహరణ. పీటర్‌ థియల్‌ అనే మితవాద టెక్‌ బిలియనీర్‌ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న కంపెనీలో వాన్స్‌ పనిచేశాడు. అడ్డూ ఆపూ లేని స్వేచ్ఛావిపణులను ఈ కాబోయే ఉపాధ్యక్షుడు విమర్శించాడు. తద్వారా మంచి పలుకుబడి ఉన్న జాతీయ మితవాద నేతలను ఆకట్టుకున్నాడు. హెచ్‌–1బి వీసా ఉద్యోగులను నియమించుకునే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నప్పటికీ వాన్స్‌ హెచ్‌–1బి వీసాలను వ్యతిరేకించాడు. పార్టీని ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా సమైక్యం చేయడం ఆయన బాధ్యత కావడం ఇందుకు కారణం కావచ్చు. అయితే ఎన్నికల తరువాత దాన్ని పక్కన పెట్టారు.ట్రంప్‌ పదవి చేపట్టిన తర్వాత టెక్‌ రైట్‌–నేషనలిస్ట్‌ రైట్‌ మధ్య ఉద్రిక్తతలు ఎలా ఉండబోతున్నాయన్న దానికి తాజా ఘర్షణ ఒక ప్రివ్యూ లాంటిది. జాతీయవాదులు వారు కోరుకున్నది చాలావరకు సాధించుకుంటారు. మూకుమ్మడి దేశ బహిష్కరణలు ఉంటాయని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించాడు. ఇది వారికి ఆనందం కలిగించి తీరు తుంది. సిలికాన్‌ వ్యాలీతో వారి పోరు విషయాన్ని ప్రస్తుతానికి ఆయన పట్టించుకోడు. ట్రంప్‌ గత హయాంలోనూ ఇదే జరిగింది. బడా కార్పొరేట్ల ప్రయోజనాలు పక్కన పెట్టి సామాన్యులకు మేలు చేసే ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని 2016లో చేసిన వాగ్దానాన్ని ఆయన పూర్తిగా విస్మరించాడు. ఇది జాతీయ మితవాదులు కోరుకున్నదానికి విరుద్ధం. భారీ వ్యాపార సంస్థలకు, ధనికులకు ట్రంప్‌ అప్పట్లో పన్నులు తగ్గించాడు. మరోవంక, ‘ముస్లిం బ్యాన్‌’, అక్రమ వలస దారుల పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం వంటి కఠిన చర్యలను టెక్‌ అధిపతులు, సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకించారు. టెక్‌ రైట్‌కే ప్రాధాన్యం?ఈసారి టెక్‌ మితవాద వర్గానికి పాలనలో ప్రాధాన్యం లభిస్తోంది. మస్క్, టెక్‌ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి కొత్తగా ఏర్పా టైన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్‌–డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్న మెంట్‌ ఎఫిషియన్సీ) నిర్వహించబోతున్నారు. బిలియనీర్‌ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ మార్క్‌ ఆండ్రీసెన్‌ ఈ విభాగం సిబ్బంది నియామకంలో తోడ్పడతాడు. ఇక శ్రీరామ్‌ కృష్ణన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విధాన రూపకల్పనలో అధ్యక్షుడికి సలహాలు ఇస్తాడు. ట్రంప్‌ ఇతర నియా మకాల్లో సైతం ధనికవర్గాలకు, శక్తిమంతులకు ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రభుత్వం వారితో స్నేహపూర్వకంగా ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక జాతీయ మితవాదుల్లోని కొద్దిమంది ముఖ్యులకూ ట్రంప్‌ క్యాబినెట్‌లో చోటు లభించనుంది.ట్రంప్‌ ‘న్యూయార్క్‌ పోస్ట్‌’తో మాట్లాడుతూ, ‘నేనెప్పుడూ వీసా లను ఇష్టపడ్డాను. వీసాలకు నేను ఎప్పుడూ అనుకూలమే. అందుకే వాటిని అమలు చేశాను’’ అన్నాడు. ఈ ప్రకటన ద్వారా మస్క్‌కు ఆయన పూర్తి మద్దతు పలికాడు. చిట్టచివరిగా ఇంకో విషయం ప్రస్తా వించాలి. సంపన్నుల చేతిలో ముఖ్యంగా క్రితంసారి కంటే ఈసారి మరింత ఎక్కువ అధికారం ఉంటుంది. అలీ బ్రెలాండ్‌ వ్యాసకర్త సీనియర్‌ పత్రికా రచయిత(‘ది అట్లాంటిక్‌’ సౌజన్యంతో)

V. Narayanan appointed new Space Secretary and ISRO chief6
చంద్రయాన్‌–4, గగన్‌యాన్‌పై ప్రత్యేక దృష్టి 

తిరువనంతపురం/చెన్నై: చంద్రయాన్‌–4, గగన్‌యాన్‌ వంటి ప్రయోగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ రాకెట్‌ సైంటిస్టు డాక్టర్‌ వి.నారాయణన్‌ చెప్పారు. ఇస్రో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. రాబోయే కాలంలో ఎన్నో ముఖ్యమైన మిషన్లు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను ఇస్రో చైర్మన్‌గా, ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌’ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ఇస్రోకు గతంలో ఎంతోమంది ప్రఖ్యాత సైంటిస్టులు నేతృత్వం వహించారని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో తాను భాగస్వామి కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇదొక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇస్రో చైర్మన్‌గా తన నియామకంపై తొలుత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి తనకు సమాచారం అందిందని తెలిపారు. అన్ని విషయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయిస్తారని, పీఎంఓ సమాచారం చేరవేస్తుందని అన్నారు. ఇటీవలి కాలంలో ఇస్రో చేపడుతున్న ప్రయోగాలన్నీ విజయవంతం అవుతున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇస్రో ముందున్న అతిపెద్ద ప్రయోగం గగన్‌యాన్‌ అని వెల్లడించారు. శ్రీహరికోట నుంచి నావిగేషన్‌ శాటిలైట్‌ ఎన్‌వీఎస్‌–02ను ప్రయోగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అమెరికాకు చెందిన వాణిజ్యపరమైన ఉపగ్రహాన్ని ఇస్రో మార్క్‌–3 రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నామని, అలాగే గగన్‌యాన్‌లో భాగంగా రాకెట్‌ తయారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. చంద్రయాన్‌–4లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి నమూనాలు సేకరించి తీసుకురావాలని సంకల్పించామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ మొదలైందని తెలిపారు. అంతరిక్షంలో సొంతంగా స్పేస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసుకోవడం మన లక్ష్యమని, ఇందుకు ప్రధాని మోదీ ఇప్పటికే అనుమతి మంజూరు చేశారని వి.నారాయణన్‌ చెప్పారు. ఈ స్పేస్‌ స్టేషన్‌లో ఐదు మాడ్యూల్స్‌ ఉంటాయని, ఇందులో మొదటి మాడ్యూల్‌ను 2028లో ప్రయోగించడానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు. నారాయణన్‌కు అభినందనల వెల్లువ ఇస్రో చైర్మన్‌గా నియమితులైన వి.నారాయణన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఆయన నియామకం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్‌ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. తమిళనాడులో సాధారణ కుటుంబంలో జన్మించిన నారాయణన్‌ ఇస్రోకు చైర్మన్‌ కావడం సంతోషంగా ఉందన్నారు. నారాయణన్‌ నేతృత్వంలో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నాలుగు దశాబ్దాల అనుభవం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌ సమీపంలోని మేలకట్టు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో వి.నారాయణన్‌ జన్మించారు. తొమ్మిదో తరగతి వరకు ఆయనకు విద్యుత్‌ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. ఇబ్బందులు ఎదుర్కొంటూనే చదువులో రాణించారు. తమిళనాడులో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. డిప్లొమో ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్‌ సాధించారు. ఏఎంఐఈ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. 1989లో ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో క్రయోజెనిక్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ చదివారు. 2021లో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసి డాక్టరేట్‌ పొందారు. 1984లో ఇస్రోలో అడుగుపెట్టారు. విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌లో సేవలందించారు. ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ అభివృద్ధికి కృషి చేశారు. ఎన్నో రాకెట్‌ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్‌ ప్రొపల్షన్‌ రంగంలో నారాయణన్‌కు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రయాన్‌–3 విజయానికి దోహదపడిన జాతీయస్థాయి నిపుణుల కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. ద్రవ, ఘన ఇంధన మోటార్‌లను రూపొందించడంలో నిపుణుడిగా పేరుగాంచారు. ప్రస్తుతం ఆయన ఇస్రోకు చెందిన లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌(ఎల్‌పీఎస్సీ) డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 14న ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

Public opposition to the coalition government after just six months7
పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం: వైఎస్‌ జగన్‌

చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.72 లక్షల కోట్లు ఇవ్వాలి అని ఆ రోజే చెప్పాను. ఇది అయ్యే పని కాదని, ఆయన చెప్పినవన్నీ మోసాలు, అబద్ధాలు అని చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్ర లేపడమే అని, పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పాను. ఇవాళ ఆ వీడియోలు చూస్తే.. జగన్‌ కరెక్టుగా చెప్పాడనుకునే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబుకూ, జగన్‌కూ మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. మన ప్రభుత్వంలో ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్‌ డెలివరీ జరిగేది. మరి ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదు? తేడా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది.ఇవాళ మనం కేవలం చంద్రబాబుతో మాత్రమే యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి టీవీృ5 లాంటి చెడిపోయి ఉన్న మీడియాతోనూ యుద్ధం చేస్తున్నాం. వీరిని ఎదుర్కోవాలంటే.. సోషల్‌ మీడియా ద్వారానే సాధ్యం. మన దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కమిటీ సభ్యుడు కూడా సోషల్‌ మీడియాను వినియోగించుకోవాలి. ఫోన్‌ ఒక ఆయుధం కావాలి. ప్రతి ఒక్కరికీ వాట్సప్, ఫేస్‌ బుక్, ఇన్‌ స్టా, ఎక్స్, యూట్యూబ్‌ అకౌంట్‌ ఉండాలి. ప్రతి గ్రామంలో ప్రతి కమిటీ సభ్యుడు ఆ గ్రామంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టాలి. ఇలా వైఎస్సార్‌సీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. - వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిసాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇంత వరకు ఒకలా చూశామని, ఇకపై మరోలా చూస్తామని.. గొప్పగా చూస్తామని చెప్పారు. ఈ విషయంలో మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉందన్నారు. ‘అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తు పెట్టుకోండి. వారిని చట్టం ముందు కచ్చితంగా నిలబెడతాం. ఎందుకంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. వాళ్లే కొడుతున్నారు.. మళ్లీ వాళ్లే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఒక మనిషిని పది చోట్ల తిప్పుతున్నారు. ఇవన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నాయి’ అంటూ ఎత్తిచూపారు. కచ్చితంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించి, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..ఆరు నెలలకే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత..కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు. కానీ కేవలం ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ప్రతి ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతోంది. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను 8 నెలల్లో పూర్తిగా గాలికొదిలేశారు. గతంలో మనం ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. అవేవీ అమలు కావడం లేదు.కూటమి నేతలు ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్లి.. చిన్న పిల్లల దగ్గర నుంచి నీకు రూ.15 వేలు అని మొదలు పెట్టి.. అదే ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లులు బయటకు వస్తే నీకు రూ.18 వేలు, ఆ తల్లుల అత్తలు, పెద్దమ్మలు బయటకు వస్తే నీకు రూ.48 వేలు, అదే ఇంట్లో నుంచి 20 ఏళ్ల పిల్లాడు బయటకు వస్తే నీకు రూ.36 వేలు అని, రైతు కండువా వేసుకుని వస్తే నీకు రూ.20 వేలు అని అందరికీ హామీలు ఇస్తూ వచ్చారు. తీరా గద్దెనెక్కాక మాట తప్పారు.మాట అమలు కాకపోతే నాయకుడి విలువ పోతుంది మన వాళ్లు చాలా మంది శ్రేయోభిలాషులు వచ్చి.. చంద్రబాబులా హామీలు ఇవ్వాలని నాతో చెప్పారు. మనం కుటుంబమంతటికీ మంచి చేశాం.. వాళ్లు కుటుంబంలో ప్రతి మనిషికి ఇలా చెప్పు కుంటూ వస్తున్నారు. మనం కూడా చెబుదా మన్నారు. కానీ ఆ రోజు మనం అబద్ధాలు చెప్ప లేదు. కారణం రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలి. అలాంటి వారికే విలువ ఉంటుంది. ఒక నాయకుడిగా మనం ఒక మాట చెప్పినప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారు. ఆ మాట నిబెట్టుకున్నామా? లేదా? అని చూస్తారు. ఆ మాట అమలు కాకపోతే.. ఆ నాయకుడి విలువ పోతుంది. అందుకనే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. ఎన్నికల సమయంలో మన మేనిఫెస్టో సందర్భంగా ఇవీ మన పథకాలు అని ప్రజంటేషన్‌ ఇచ్చాను. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోను మనం అమలు చేశాం. తొలిసారిగా మేనిఫెస్టో అన్న పదానికి కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే అర్థం చెప్పాం. దేశంలో ఎప్పుడూ జరగని విధంగా బడ్జెట్‌ ప్రవేశ పెట్టినప్పుడే సంక్షేమ కేలండర్‌ కూడా విడుదల చేస్తూ.. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామో ముందే చెప్పాం. ఆ మేరకు ఆ నెలలోనే ఆ పథకాన్ని తూచా తప్పకుండా బటన్‌ నొక్కి అమలు చేశాం. తద్వారా అక్క చెల్లెమ్మల మొహాల్లో సంతోషం చూడాలని వైఎ స్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే తాపత్రయపడింది. చంద్రబాబు మోసాలపై ఆ రోజే చెప్పాను చంద్రబాబు చెప్పినవన్నీ మోసాలు, అబద్ధాలు అని నేను ఆరోజే చెప్పాను. ఇవాళ ఆ వీడియోలు చూస్తే.. జగన్‌ కరెక్టుగానే చెప్పాడనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి నెలా ఏదో పథకం ద్వారా ప్రజలకు మేలు చేశాం. జగన్‌ ఉన్నప్పుడు పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానని చెప్పి పెట్టలేదు. ఇప్పుడు జగన్‌ పెడుతున్న పలావూ పోయింది.. చంద్రబాబు పెడతానన్న బిర్యానీ పోయింది. చంద్రబాబుకూ, జగన్‌కూ మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. మన ప్రభుత్వంలో ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్‌ డెలివరీ జరిగేది. మరి ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదు? తేడా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. చంద్రబాబు చెప్పిన హామీలన్నీ గాలికెగిరిపోయాయి. ఎనిమిది నెలలు అయింది.. సంక్రాంతి వచ్చింది. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే.. ప్రతినెలా ఏదో పథకం వచ్చేదని ఇవాళ ప్రతి ఇంట్లో ఒక్కటే చర్చ.విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన గాలికి.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని నెలకు రూ.కోట్లతో.. 1000 ప్రొసీజర్లను 3,300 వరకు పెంచి గొప్పగా అమలు చేశాం. ఆరోగ్య ఆసరా కూడా అమలు చేశాం. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలోనే ఏకంగా రూ.3 వేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిపెట్టారు. పేద వాడు ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి. నెట్‌వర్క్‌ ఆస్ప త్రుల్లో ఉచితంగా వైద్యం అందుకునే పరిస్థితి ఎక్క డా లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరి పోయింది. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఈ–క్రాప్‌ అసలు కనిపించడం లేదు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇస్తానన్న రూ.20 వేలు ఇవ్వలేదు. వాస్తవానికి విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన.. ఈ నాలుగు రంగాలను చూసుకోవడం ప్రభుత్వం బాధ్యత. కానీ ఈ నాలుగు రంగాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అన్నీ గాలికెగిరిపోయి రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. పథకాలన్నింటికీ మంగళం ఐదేళ్లు ప్రతి సంవత్సరం, ప్రతి నెలా షెడ్యూల్‌ ఇచ్చి పథకాలు అమలు చేసి చూపించాం. ఇప్పుడు ఆ పథకాలన్నింటినీ కూటమి ప్రభు త్వం రద్దు చేసింది. కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఇవి ఇప్పుడు జరగడం లేదు. ఇవాళ మన పార్టీలో ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా వెళ్లగలడు. కారణం మనం చెప్పినవి చేసి చూపించాం. వీళ్ల మాది రిగా మనం అబద్ధాలు చెప్పలేదు, మోసాలు చేయలేదు. వీళ్ల మాదిరిగా అధికారం కోసం ఏ గడ్డి అయినా తినడానికి మనం సిద్ధంగా లేము. ఎనిమిది నెలలు అయింది.. ఇప్పుడు కూటమి నాయకులు ఏ ఇంటికీ వెళ్లలేరు. వారికి ఆ ధైర్యం కూడా లేదు. వాళ్లు ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లాడు దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఇస్తామన్న రూ.15 వేలు ఏమైందని చిన్న పిల్లలు, రూ.18 వేలు ఏమైందని తల్లులు, మా రూ.48 వేలు ఏమైందని ఆ తల్లుల అత్తలు, పెద్ద మ్మలు, మా రూ.20 వేలు ఏమైందని రైతులు, మా రూ.36 వేలు ఏమైందని యువత ప్రశ్నించడానికి సిద్ధంగా ఉండడంతో కూటమి నేతలు ప్రజల మధ్యకు పోలేని పరిస్థితి నెలకొంది.బాదుడే బాదుడు ఇవాళ రాష్ట్రంలో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ఆరు నెలలు తిరక్కముందే రూ.15 వేల కోట్ల కరెంటు చార్జీలు భారీగా పెంచారు. రాబోయే రోజుల్లో గ్రామీణ రోడ్లలో టోల్‌గేట్లు పెట్టి టోల్‌ వసూలు చేసే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నాడు. రిజిస్ట్రేషన్‌ ఫీజులు స్థలాల మీదనే కాకుండా పాత ఇళ్ల మీద కూడా వేస్తున్నారు. ఇలా ఏం తీసుకున్నా బాదుడే.చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు చెల్లించడం లేదు. మన హయాంలో ప్రతి మూడు నెలలకొకసారి.. ఏ పిల్లాడి చదువు ఆగిపోకుండా అడుగులు వేశాం. ఇవాళ జనవరి, పిబ్రవరి, మార్చి త్రైమాసికం నుంచి నాలుగు క్వార్టర్స్‌కు సంబంధించిన ఫీజులు రూ.2,800 కోట్లు బకాయిలు పెట్టారు. వసతి దీవెనతో కలుపుకుంటే మొత్తంగా రూ.3,900 కోట్లు బకాయిలున్నాయి. పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి.ఇది ప్రజలకు తోడుగా నిలవాల్సిన సమయంఇంటి వద్దకే డోర్‌ డెలివరీ పరిపాలన నుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు తిరగాల్సిన పాలన సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అందుకే వారికి అండగా నిలబడే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రజల సమస్యలను పట్టించుకుని, వారికి తోడుగా ఉన్న వారే నాయకులుగా ఎదుగుతారు. నాయకులంతా యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం వచ్చేసింది. చంద్రబాబు దుర్మార్గపు పరిపాలన వల్ల మనం ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రతి గ్రామంలో పార్టీ నిర్మాణం ఉంది. దీన్ని వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దాలి. ఈ సంక్రాంతి నాటికి పార్టీ జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల ఏర్పాట్లన్నీ పూర్తి కావాలి. నేను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తాను. అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి వారంలో మూడు రోజులు.. మంగళ, బుధ, గురువారాల్లో ఒక పార్లమెంటు నియోజకవర్గంలో విడిది చేస్తాను. ప్రతి రోజూ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటాను. మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ బలోపేతం కావాలి. గ్రామ స్థాయి కమిటీలు, బూత్‌ కమిటీలు కూడా బలోపేతం కావాలి. సోషల్‌ మీడియాను బలమైన ఆయుధంగా ఉపయోగించుకోవాలి. మీరు, నేను అందరం చర్చించి ఆ దిశగా అడుగులు వేద్దాం. ప్రతి గ్రామంలో అన్యాయాలను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టాలి.పిల్లవాడికివ్వాల్సిన రూ.15 వేలు ఏమయ్యాయని ప్రశ్నించాలి. సూపర్‌ సిక్స్‌ ఏమైందని ప్రశ్నించాలి. తొలగిస్తున్న పెన్షన్ల మీద కూడా ప్రశ్నించాలి. ఇలా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావాలి. అన్యాయాలు, అక్రమాలపై నిలదీయాలి. ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలి.మూడు లక్షల పెన్షన్ల తొలగింపుఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చే నాటికి మన హయాంలో 66,34,742 పెన్షన్లు ఉంటే, ఇవాళ చంద్రబాబు వచ్చిన తర్వాత డిసెంబరు నాటికి ఆ సంఖ్య 62.81 లక్షలకు తగ్గిపోయింది. అంటే 3.53 లక్షల పెన్షన్లు తగ్గించారు. ఇవి కాక ఇక దివ్యాంగుల మీద కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు. వీరి మీద చంద్రబాబు కమిటీ వేసి.. వాళ్ల పెన్షన్లు తగ్గించే కార్యక్రమం మొదలు పెట్టారు. అంటే ఈ మార్చి నాటికి మరో 3 లక్షల పెన్షన్లు తగ్గించడమే వారి ఉద్దేశం. ఇలా పెన్షన్లు, ఊర్లో ఉన్న ఆస్పత్రులు, కాలేజీలు అన్నింటి మీదా గ్రామంలో ఉన్న కార్యకర్త నుంచి నియోజకవర్గంలో ఉన్న నాయకుడు వరకు ప్రతి సమస్య మీద నిలదీయాలి. రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా అడుగులు వేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి.జగనన్న ఉండి ఉంటే.. జనవరి చివరి దఫా రైతు భరోసా, చిరు వ్యాపారులకు జగనన్న తోడు, సంక్రాంతి సమయానికి అక్కచెల్లెమ్మలకు ఆసరా డబ్బులు ఫిబ్రవరి విద్యా దీవెన, జగనన్న చేదోడు ఏప్రిల్‌ వసతి దీవెన, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ మే జగనన్న విద్యా దీవెన, రైతులకు ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకారులకు మత్సకార భరోసా, డీజిల్‌ మీద సబ్సిడీ కార్యక్రమం జూన్‌ అమ్మఒడిజూలై వాహనమిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు ఆగస్టు జగనన్న విద్యా దీవెన, నేతన్న నేస్తం సెప్టెంబర్‌ వైఎస్సార్‌ చేయూత అక్టోబర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత నవంబర్‌ నవంబర్‌లో జగనన్న విద్యా దీవెన, రైతులకు సున్నా వడ్డీ డబ్బులు డిసెంబర్‌ ఈబీసీ నేస్తం, లా నేస్తం, ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలకు ట్యాబుల పంపిణీ

Telangana govt approves increase Ram Charan Game Changer ticket rates8
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. జనవరి 10వ తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్‌కు అనుమతి. మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150 రూపాయలు పెంపుకు అనుమతి. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100రూపాయలు పెంపు. అలానే జనవరి 11 నుంచి 5 షోస్‌కు అనుమతి. జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు. సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు పెంపు. టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణా ప్రభుత్వం బెనిఫిట్ షోస్‌కు మాత్రం అనుమతి నిరాకరించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'గేమ్ చేంజర్' (Game Changer Movie). జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్‌, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. తమన్‌ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో కేవలం ఐదు పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. ఓ నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే గేమ్‌ ఛేంజర్‌ కథ.

KTR at the launch of BRS diary at Telangana Bhavan9
రేవంత్‌ ఒక లొట్టపీసు సీఎం: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా–ఈ రేస్‌ అంశంలో తనపై పెట్టిన కేసు లొట్టపీసు (డొల్ల) అని, రేవంత్‌రెడ్డి ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్‌ తయారుచేసిన సైనికుడిని అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ రక్తం పంచుకొని పుట్టిన తాను రేవంత్‌ సర్కారు పెట్టిన అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ సమయం నాటి పరిస్థితులు, తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు, అమరుల త్యాగాలతో పోలిస్తే తాను పడుతున్నది పెద్ద ఇబ్బందేమీ కాదన్నారు. తెలంగాణభవన్‌లో బుధవారం జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘నాపై పెట్టిన కేసును రేవంత్‌ తీర్చుకుంటున్న ప్రతీకారమని ప్రజలు అనుకుంటున్నారు. తమ భూముల కోసం లగచర్ల గిరిజనులు 40 రోజులపాటు జైలులో గడిపిన దానితో పోలిస్తే నేను పడుతున్నది పెద్ద ఇబ్బందేమీ కాదు. అక్రమ కేసులపై చట్ట ప్రకారం పోరాడుతా. కేసుల గురించి ఆలోచించకుండా రైతులు, మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్‌ మోసగిస్తున్న తీరును ప్రజల్లో ఎండగట్టాలి. కొత్త సంవత్సరంలో తెలంగాణ కోసం కలిసి నడుస్తూ ప్రభుత్వంపై పోరాటం చేద్దాం. ఏడాది కాలంలో పార్టీకి కొత్త కమిటీలు, సభ్యత్వ నమోదు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి’అని కేటీఆర్‌ వెల్లడించారు.కేటీఆర్‌కు ఆపద వస్తే అండగా నిలుస్తాం: మాజీమంత్రి హరీశ్‌రావుప్రశ్నించే గొంతుక కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల్లో రోజురోజుకూ రేవంత్‌ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుండటంతో అక్రమ కేసులతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు. ఆపద సమయంలో కార్యకర్తలు, నాయకులకు అండగా నిలిచిన తరహాలో కేటీఆర్‌కు ఆపద వస్తే పార్టీ మొత్తం అండగా నిలుస్తుందని చెప్పారు. రేవంత్‌ ఏడాది పాలన కోతలు, ఎగవేతలు, కేసులు అన్నట్టుగా తయారైందన్నారు. రేవంత్‌ ప్రభుత్వం హామీలు ఎగవేస్తున్న తీరును ప్రశ్నించిన తనపై మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారన్నారు. లగచర్ల, అల్లు అర్జున్, టీఎస్‌ నుంచి టీజీగా మార్పు, తెలంగాణ రాజముద్ర మార్పు వంటి దృష్టి మళ్లింపు కార్యక్రమాలు మినహా ప్రభుత్వం ఏడాదిలో చేసిందేమీ లేదని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుకు డబ్బు లు లేవని చెబుతున్న సీఎం రేవంత్‌ తన కుటుంబ సభ్యుల భూముల కోసం కల్వకుర్తి వరకు ఆరు లేన్ల రహదారిని వేసుకుంటున్నాడని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో స్వర్ణయుగం రాగా, కాంగ్రెస్‌ పాలనలో కారుచీకట్లు కమ్ముకున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్‌.మధుసూదనాచారి విమర్శించారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ ప్రసంగించారు.

Rupee falls 13 paise to settle at new record low of 85. 87 against dollar10
బాబోయ్‌ రూపాయ్‌

కీలక కరెన్సీగా చలామణీ అవుతున్న డాలర్‌ మారకంలో రూపాయి విలువ నానాటికీ తగ్గిపోతోంది. తాజాగా బుధవారం 17 పైసలు పతనమై మరో కొత్త కనిష్ట స్థాయి 85.91కి క్షీణించి 86 స్థాయికి మరింత చేరువైంది. గతేడాది మొత్తం మీద చూస్తే రూపాయి విలువ 3 శాతం కరిగిపోయింది. అంతర్జాతీయంగా భౌగోళిక .. రాజకీయ అనిశ్చితి, మన మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడుతుండటం, పెరుగుతున్న వాణిజ్య లోటు .. ముడి చమురు రేట్లులాంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. ఇలా రూపాయి రోజురోజుకూ సెంచరీకి దగ్గరవుతుండటం పలు వర్గాలను కలవరపెడుతోంది. రూపాయి పడిపోవడం కొన్ని ఎగుమతుల ఆధారిత రంగాలకు లాభించేదే అయినా.. దిగుమతుల ఆధారిత రంగాలకు మాత్రం బిల్లుల మోత మోగిపోతోంది. విదేశీ విద్య కూడా భారమవుతోంది. ఈ నేపథ్యంలోనే రూపాయి పతనంతో ప్రభావితమయ్యే అంశాలపై ప్రత్యేక కథనం. ఎగుమతి చేసే ఆటో కంపెనీలకు ఓకే.. వాహనాలను ఎగుమతి చేస్తున్న బజాజ్‌ ఆటో, మారుతీ సుజుకీ వంటి దేశీ ఆటోమొబైల్‌ కంపెనీలకు రూపాయి క్షీణత లాభించనుంది. అలాగే, ఆటో విడిభాగాల తయారీ సంస్థల ఆదాయాల్లో కూడా ఎక్కువ భాగం ఎగుమతుల నుంచి వస్తుండటంతో వాటికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. భారత ఆటోమొబైల్‌ విడిభాగాల ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 33 శాతంగా ఉంటోంది. మరోవైపు, దిగుమతుల ఆధారిత లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్‌–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, వోల్వోలాంటి కంపెనీలకు మాత్రం రూపాయి పతనం ప్రతికూలమే అవుతుంది. ఐటీ, ఫార్మా హ్యాపీస్‌... దేశీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగానికి రూపాయి క్షీణత బాగా లాభిస్తుంది. చాలామటుకు సంస్థల ఆదాయాలు డాలర్లలోనే ఉండటం వల్ల రూపాయి 1 శాతం క్షీణిస్తే ఐటీ కంపెనీల ఆదాయం సుమారు 0.5 శాతం, లాభం దాదాపు 1.5 శాతం పెరుగుతుందని అంచనా. మూడో త్రైమాసికంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 125 పైసలు పైగా పతనమైంది. దీంతో ఐటీ సంస్థల మార్జిన్లు 30–50 బేసిస్‌ పాయింట్లు (0.30–0.50 శాతం) వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో చైనా యువాన్, జపనీస్‌ యెన్, మెక్సికన్‌ పెసోలాంటివి కూడా పతనం కావడం వల్ల ఆకర్షణీయమైన రేటుకు సేవలు అందించడంలో మన సంస్థలకు పోటీ పెరిగిపోతోంది. ఇక ఫార్మా విషయానికొస్తే.. మన ఫార్మా ఎగుమతుల్లో మూడో వంతు వాటా అమెరికా మార్కెట్‌దే ఉంటోంది కాబట్టి ఎగుమతి కంపెనీలకు రూపాయి పతనం సానుకూలంగా ఉంటుంది. అయితే, రూపాయి క్షీణత వల్ల.. దేశీ మార్కెట్‌పై ఫోకస్‌ పెట్టే సంస్థలకు వ్యయాలు పెరుగుతాయి.దిగుమతులకు భారం.. చమురు, పసిడి మొదలైన వాటి కోసం భారత్‌ ప్రధానంగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. పెట్రోల్‌తో మొదలెడితే ప్లాస్టిక్, ఎరువుల వరకు మనకు నిత్యం అవసరమయ్యే అనేక ఉత్పత్తులు, సర్వీసుల్లో క్రూడాయిల్‌ కీలకపాత్ర పోషిస్తోంది. ఆయిల్‌ రేటు పెరిగిందంటే.. దానికి సంబంధమున్న వాటన్నింటి రేట్లూ పెరుగుతాయి. రూపాయి మారకం విలువ వచ్చే ఏడాది వ్యవధిలో సగటున ప్రస్తుత స్థాయిలోనే ఉంటే దిగుమతుల బిల్లు భారం ఏకంగా 15 బిలియన్‌ డాలర్లకు పైగా (సుమారు రూ. 1.27 లక్షల కోట్లు) పెరగవచ్చని అంచనా. కరెన్సీ బలహీనపడటం వల్ల వంటనూనెలు, పప్పులు, యూరియా, డీఏపీలు మొదలైన దిగుమతులపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ప్రస్తుతం భారత్‌లో అసెంబుల్‌ చేసే స్మార్ట్‌ఫోన్లలో 80–90 శాతం వరకు దిగుమతి చేసుకున్న విడిభాగాలు ఉంటున్నాయని, ఫలితంగా రూపా యి క్షీణత వల్ల స్మార్ట్‌ఫోన్లతో పాటు ఎల్రక్టానిక్స్‌ ఉత్పత్తులు ప్రియమవుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎల్రక్టానిక్స్‌కు సంబంధించి కరెన్సీ విలువ 5 శాతం క్షీణిస్తే వ్యయాలు 2 శాతం పెరుగుతాయని అంచనా. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును కూడా వాడుతుంటారు. మారకం విలువ ఒక్క రూపాయి మారినా.. దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే పవర్‌ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి చేసే విద్యుత్‌ వ్యయాలు యూనిట్‌కి 4 పైసల మేర మారిపోతాయి. విదేశాల్లో చదువు.. తడిసిమోపెడు.. చాలామటుకు అంతర్జాతీయ యూనివర్సిటీలు విదేశీ కరెన్సీల్లోనే (డాలరు, పౌండ్లు, యూరోల్లాంటివి) ట్యూషన్‌ ఫీజులు వసూలు చేస్తాయి. దీంతో రూపాయి బలహీనపడే కొద్దీ ఫీజుల భారం పెరుగుతుంటుంది. అలాగే విద్యాభ్యాసం కోసం అక్కడ నివసించే భారతీయ విద్యార్థుల రోజువారీ ఖర్చులు (ఇంటద్దె, ఆహారం, రవాణా మొదలైనవి) మన మారకంలో చూసుకుంటే పెరిగిపోతాయి. ఉదాహరణకు సగటున 50,000 డాలర్ల ట్యూషన్‌ ఫీజును పరిగణనలోకి తీసుకుంటే, గతేడాది రూపాయి విలువ 3 శాతం పడిపోవడంతో, జనవరిలో సుమారు రూ. 41.39 లక్షలుగా ఉన్న ట్యూషన్‌ ఫీజు .. డిసెంబర్‌ నాటికి రూ. 42.90 లక్షలకు పెరిగింది. అంటే డాలరు రూపంలో ఫీజు అంతే ఉన్నా.. రూపాయి విలువ పడిపోవడంతో కేవలం పన్నెండు నెలల్లో ఏకంగా రూ. 1.51 లక్షలకు పైగా భారం పెరిగినట్లయింది. సానుకూలం→ ఎగుమతి ఆధారిత రంగాలు → ఫార్మా→ ఐటీ సర్విసులు→ జౌళి→ ఉక్కు → రెమిటెన్సులు ప్రతికూలం → విదేశీ ప్రయాణాలు → విదేశీ చదువులు→ ధరల సెగ: ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు, కార్లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైనవి → వ్యాపారాలు: కంపెనీలకు మార్జిన్ల ఒత్తిళ్లు. విస్తరణ ప్రణాళికలకు బ్రేక్‌. ఉద్యోగావకాశాలపై ప్రభావం, విదేశీ రుణాలు ప్రియం.– సాక్షి, బిజినెస్‌డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

title
అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసా?

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసు ఎలా పెడ

Advertisement

వీడియోలు

Advertisement