Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Minister Payyavula Keshav Comments On Opposition Status For YSRCP
పయ్యావుల వ్యాఖ్యలతో కుట్ర బట్టబయలు

అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుమానించిందే జరుగుతోంది. అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ అణగదొక్కాలని, రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ప్రభుత్వ కుట్ర.. సాక్షాత్తూ మంత్రి పయ్యావుల వ్యాఖ్యలతో బయటపడింది. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష హోదా అంశంపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి మంగళవారం వైఎస్‌ జగన్‌ సుదీర్ఘమైన లేఖ రాశారు. అందులో ఎన్నో కీలకాంశాలను ప్రస్తావించారాయన. అంతేకాదు.. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా గళం వినిపించేందుకు అవకాశం ఉంటుందని, గతంలో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు పలు పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాల్ని సైతం ఆయన ఉటంకించారు. అయినప్పటికీ.. ప్రతిపక్ష హోదాను వైఎస్సార్‌సీపీకి దక్కనివ్వకుండా ప్రభుత్వం బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.ఈ లేఖపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మీడియా స్పందించాలని కోరింది. దానికి పయ్యావుల వివరణ ఇస్తూ.. "అసెంబ్లీలో జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కే అవకాశమే లేదని" అన్నారు. అంతేకాదు ఆయన ఫ్లోర్‌ లీడర్‌గా మాత్రమే ఉంటారని చెబుతున్నారు. పైగా "స్పీకర్ కి లేఖ రాసినంత మాత్రాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని, కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కేందుకు పదేళ్లు పట్టిందంటూ" వెటకారంగా మాట్లాడారు.దేశ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంశాన్ని గనుక పరిశీలిస్తే.. ఏదైనా చట్ట సభలో అధికార పార్టీ/ అధికారంలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి. కానీ, ఏపీ అసెంబ్లీలో ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. శాసనసభలో మేం గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదని, ప్రతిపక్ష హోదా ఉంటేనే అది సాధ్యమవుతుందని స్పీకర్‌కు రాసిన లేఖలో జగన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పేమెంట్‌ ఆఫ్‌ శాలరీస్‌ అండ్‌ పెన్షన్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ డిస్క్వాలిఫికేషన్‌ యాక్ట్‌ 1953 చట్టం 12-బీ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించిందని లేఖలోనే స్పష్టం చేశారు.ఇక.. ప్రతిపక్ష హోదా ఇవ్వడం స్పీకర్‌ పరిధిలోని అంశం. జగన్‌ రాసిన లేఖపై ఇంకా స్పీకర్‌ నుంచి బదులు రాలేదు. ఈలోపే పయ్యావుల, వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పడం దేనికి సంకేతం? అనే చర్చ మొదలైంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వీలు లేకుండా.. అసలు వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదానే లేకుండా చేయాలన్నది కూటమి ప్రభుత్వ కుట్రగా ఇప్పుడు తేటతెల్లమయ్యింది.

Ap High Court Status Quo On Notices For Demolition Of Ysrcp Offices
వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టేటస్‌ కో

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ రిట్ పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారించింది. వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కూల్చివేతకు నోటీసులపై ఏపీ హైకోర్టు స్టేటస్‌ కో విధించింది. రేపటి వరకు స్టేటస్‌కో విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలుచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రేపు(గురువారం) మరోసారి కోర్టు విచారణ జరపనుంది. మొత్తం 10 జిల్లా కార్యాలయాలపై లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.కాగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలపై టీడీపీ సర్కారు కక్షగట్టింది. గతం మరచిపోయి కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇటీవల చీకటిలో కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ కార్యాలయాలను కూల్చే­యడానికి పావులు కదుపుతోంది.

Macherla Ex Mla Pinnelli Ramakrishna Reddy Arrest
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌

సాక్షి, గుంటూరు: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అంతకు ముందు, పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.మే 13, 2024న ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగగా.. పోలింగ్‌ సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కొందరు తెలుగుదేశం నేతలు ఉన్నారని, ఉద్దేశపూర్వకంగా తనను ఇరికిస్తున్నారంటూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించాడు. మాచర్ల నియోజకవర్గంలో కొన్ని పోలింగ్‌ బూత్‌లను తెలుగుదేశం నేతలు కబ్జా చేసి, రిగ్గింగ్‌ చేశారని, ఆ విషయం తెలిసి పోలింగ్‌ బూత్‌కు తాను వెళ్లానని పిన్నెల్లి హైకోర్టుకు తెలిపాడు. జూన్‌ 4, 2024న ఎన్నికల ఫలితాలు రాగా.. తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం పలు చోట్ల వైఎస్సార్‌సిపి క్యాడర్‌పై విచ్చలవిడిగా దాడులు జరిగాయి. పలువురు కార్యకర్తలు రాష్ట్రం విడిచి పారిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి మిన్నకుండిపోయిన పోలీసులు.. టిడిపి నేతల ప్రోత్సాహంతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని వైఎస్సార్‌సిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇవ్వాళ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం రాగానే పోలీసులు రంగంలోకి దిగి పిన్నెల్లిని అరెస్ట్‌ చేశారు.

Afghanistan Cricket Team Journey: Heroes Behind Afghanistan Cricket Success
భారత్‌కు ధన్యవాదాలు!.. అన్నీ తామై నడిపించిన వీరులు

క్రికెట్‌ వర్గాల్లో ఎక్కడ చూసినా అఫ్గనిస్తాన్‌ జట్టు గురించే చర్చ. అసాధారణ ఆట తీరుతో రషీద్‌ ఖాన్‌ బృందం టీ20 వరల్డ్‌కప్‌-2024లో సెమీస్‌ చేరిన విధానం నిజంగా ఓ అద్భుతం లాంటిదే. న్యూజిలాండ్‌పై భారీ విజయం మొదలు.. ఆస్ట్రేలియాను ఓడించడం దా​కా.. సంచలన ప్రదర్శనతో అఫ్గన్‌ ఇక్కడిదాకా చేరుకున్న తీరు అమోఘం. గత ఎడిషన్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా గెలవని జట్టు ఈసారి ఏకంగా టాప్‌-4లో నిలవడం అంటే మామూలు విషయం కాదు.గత కొన్నేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్లకు రషీద్‌ బృందం సాధించిన విజయం కొత్త ఊపిరిలూదింది. కష్టాలన్నీ మర్చిపోయి వీధుల్లోకి వచ్చి మరీ ప్రజలు తమ సంతోషాన్ని పంచుకోవడం ఇందుకు నిదర్శనం.ఈ క్రమంలో అఅఫ్గన్‌ క్రికెట్‌ ఎదుగుదులలో తోడ్పాడు అందించిన భారత్‌కు తాలిబన్‌ రాజకీయ కార్యాలయ అధినేత సుహైల్‌ ఖాన్‌ ధన్యవాదాలు చెప్పడం విశేషం. ఇక అఫ్గన్‌ ప్రయాణం ఇక్కడి దాకా సాగడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమైన వ్యక్తులకు కూడా తాలిబన్‌ నేతలు, అఫ్గన్‌ ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ ముఖ్యులు ఎవరంటే..రషీద్‌ ఖాన్‌కెప్టెన్‌గా జట్టుకు అన్నీ తానే, అంతటా తానే అయి నడిపిస్తున్నాడు. తన పదునైన లెగ్‌స్పిన్‌తో టోర్నీలో 16 వికెట్లు పడగొట్టిన రషీద్‌... బ్యాటింగ్‌లోనూ మెరుపులతో తన పాత్ర పోషించాడు. బంగ్లాతో మ్యాచ్‌లో అతని మూడు సిక్సర్లే చివరకు కీలకంగా మారాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో బౌలర్లను మార్చిన తీరులో అతని నాయకత్వ సామర్థ్యం కూడా కనిపించింది. 25 ఏళ్ల రషీద్‌ ఇప్పటి వరకు 92 టి20లు ఆడి 152 వికెట్లు తీయడంతోపాటు 452 పరుగుల సాధించాడు. రహ్మనుల్లా గుర్బాజ్‌ఓపెనర్‌గా అతని దూకుడైన ఆట జట్టుకు మంచి ఆరంభాలను అందించి విజయానికి బాటలు వేసింది. 281 పరుగులతో ప్రస్తుతం టోర్నీ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ముఖ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఐపీఎల్‌ అనుభవంతో ఇటీవల అతని బ్యాటింగ్‌ మరింత పదునెక్కింది. 22 ఏళ్ల గుర్బాజ్‌ ఇప్పటి వరకు 62 టి20లు ఆడి 1657 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నవీన్‌ ఉల్‌ హక్‌ప్రధాన పేసర్‌గా జట్టుకు కీలక సమయాల్లో వికెట్లు అందించి పైచేయి సాధించేలా చేశాడు. టోర్నీలో 13 వికెట్లు తీసిన అతను బంగ్లాదేశ్‌పై ఆరంభంలో తీసిన 2 వికెట్లే విజయానికి బాటలు వేశాయి.ట్రవిస్‌ హెడ్‌ను క్లీన్‌»ౌల్డ్‌ చేసిన అతని అవుట్‌స్వింగర్‌ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. 24 ఏళ్ల నవీన్‌ 44 టి20లు ఆడి 59 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు ఫ్రాంచైజీ లీగ్‌లలో రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. ‘మీరు బాగా ఆడితే గెలిస్తే చాలు...అదే నాకు ఫీజు, పారితోషకం’ – అజయ్‌ జడేజా (వన్డే వరల్డ్‌ కప్‌లో టీమ్‌కు మెంటార్‌గా పని చేసిన జడేజా అఫ్గాన్‌ బోర్డునుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు నిరాకరించాడు) డ్వేన్‌ బ్రేవో (బౌలింగ్‌ కన్సల్టెంట్‌): 573 టి20 మ్యాచ్‌లు, 625 వికెట్లతో అపార అనుభవం ఉన్న విండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవోను ఈ టోర్నీ కోసం అఫ్గాన్‌ బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. అతడి నియామకాన్ని జట్టు సమర్థంగా వాడుకుంది. ముఖ్యంగా అఫ్గాన్‌ పేసర్ల బౌలింగ్‌లో ఆ తేడా కనిపించింది. టి20ల్లో స్లో బంతులను వాడే విషయంలో బ్రేవో సూచనలు, వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి. జొనాథన్‌ ట్రాట్‌: ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడైన ట్రాట్‌ హెడ్‌ కోచ్‌గా జట్టు పురోగతిలో కీలక పాత్ర పోషించాడు. జూలై 2022 నుంచి అతను కోచ్‌గా కొనసాగుతున్నాడు. గత ఏడాదే పదవీ కాలం పూర్తయినా మళ్లీ అతడినే అఫ్గాన్‌ కొనసాగించింది. ట్రాట్‌ శిక్షణ, ప్రణాళికలు కొత్త తరహా టీమ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇప్పుడు సరైన ఫలితాలు అందిస్తున్నాయి. మహ్మద్‌ నబీ15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ జట్టు ప్రస్థానం ప్రారంభమైంది. ఆరంభంలో ఐసీసీ వరల్డ్‌ క్రికెట్‌ లీగ్‌–డివిజన్‌–5లో జపాన్, బోట్స్‌వానావంటి జట్లతో తలపడిన టీమ్‌ ఇప్పుడు ఆసీస్, కివీస్, విండీస్, పాక్‌లను దాటి వరల్డ్‌ కప్‌ సెమీస్‌లోకి అడుగు పెట్టడం అసాధారణం. అఫ్గానిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ నబీ 15 ఏళ్లుగా జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. అఫ్గాన్‌ పురోగతికి అతను ప్రత్యక్ష సాక్షి. అఫ్గాన్‌ తరఫున ఏకంగా 45 ప్రత్యర్థి దేశాలపై విజయం సాధించిన టీమ్‌లలో అతను భాగస్వామి. ‘ఆరంభంలో మేం ఎదుర్కొన్న సమస్యలను దాటి ఇక్కడికి రావడం ఎంతో గొప్పగా అనిపిస్తోంది. మా ఘనతల వెనక ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఫలితాన్ని అందించాయి’ అని నబీ చెప్పాడు. ఈ టోర్నీలో అఫ్గాన్‌ టీమ్‌ ప్రదర్శనలతో పలువురు కీలక పాత్ర పోషించారు. కల నిజమైందిసెమీస్‌కు చేరడం కలగా ఉంది. ఇంకా నమ్మలేకపోతున్నాను. న్యూజిలాండ్‌పై గెలుపుతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మేం చేసింది తక్కువ స్కోరని తెలుసు. కానీ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. మా ప్రణాళికలను సమర్థంగా అమలు చేశాం. జట్టులో ప్రతీ ఒక్కరు తమ పాత్ర సమర్థంగా పోషించారు. ఇది పెద్ద ఘనత మా దేశంలో ప్రజలకు సంతోషం పంచాలని కోరుకున్నాం. అక్కడ ఇప్పుడు సంబరాలు జరుగుతున్నాయి. మా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. –రషీద్‌ ఖాన్, అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ -సాక్షి. క్రీడా విభాగం

Brs Mlas Meet Kcr In Erravalli Farmhouse
‘తొందర పడకండి’..బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కేసీఆర్

సాక్షి,హైదరాబాద్‌ : ‘తొందరపడకండి.. పార్టీ మారుతున్న నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌లు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ గూటికి చేరారు.ఈ తరుణంలో కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో వరసు భేటీ అవుతున్నారు. నిన్న పలువురు ఎమ్మెల్యలతో కేసీఆర్‌ మంతనాలు జరపగా.. ఇవాళ హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి,బండారి లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తొందరపడొద్దని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.కాగా మంగళవారం ఎర్ర‌వ‌ల్లిలోని ఫాంహౌజ్‌లో జ‌రిగిన ఈ స‌మావేశంలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్‌, మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌ రెడ్డి, దండె విఠల్‌, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్‌, రావుల శ్రీధర్‌ రెడ్డిలు హాజరైన విషయం తెలిసిందే.

AP Inter 1st Year Supplementary Results 2024 Declared
ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ సప్లమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ ఫలితాలు విడుదల య్యాయి. ఫలితాలను ఇంటర్మీడియట్‌ బోర్డు బుధవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేసింది.విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో చూడొచ్చు.ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్‌ 3 వరకూ జరిగాయి. సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేశారు. ఈసారి ఇంటర్‌ మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలకు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ సప్లమెంటరీ (జనరల్‌) ఫలితాల కోసం క్లిక్‌ చేయండిఇంటర్‌ ఫస్ల్‌ ఇయర్‌ సప్లమెంటరీ(వొకేషనల్‌) ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Nagarjuna Meet Fan, Who Got Pushed By Hero Bodyguard
పొరపాటు దిద్దుకున్న నాగార్జున, వీడియో వైరల్‌

సెలబ్రిటీలు కనిపిస్తే ఫోటోలు తీసుకోవాలని ఎవరికి ఉండదు? అందులోనూ అభిమాన తార కనిపిస్తే ఇంకేమైనా ఉందా? ఒక్క సెల్ఫీ అంటూ వెంటపడతారు. ఫోటో క్లిక్‌మనిపించే అవకాశం ఇస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు. కానీ ఆ తారల పక్కన ఉన్న బాడీగార్డులు అభిమానులను దగ్గరకు కూడా రానివ్వరు. ఇంకా సెల్ఫీలు, వీడియోలని అడిగితే మాత్రం నిర్దాక్షిణ్యంగా అవతలకు నెట్టేస్తారు.ఇటీవల కింగ్‌ నాగార్జున అభిమానికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఎయిర్‌పోర్టులో దిగిన నాగ్‌ను చూసిన ఓ అభిమాని సెల్ఫీ అంటూ ముందుకొచ్చాడు. పెద్దాయన అని కూడా చూడకుండా నాగ్‌ బాడీ గార్డ్‌ ఆయనను గట్టిగా తోసేశాడు. దీంతో కిందపడబోయిన ఆయన తమాయించుకుని నిలబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా నాగ్‌ క్షమాపణలు చెప్పాడు. తాను అదంతా గమనించలేదని, ఇంకోసారి ఇలాంటిది జరగనివ్వనని మాటిచ్చాడు.తాజాగా మరోసారి ఎయిర్‌పోర్టుకు వెళ్లిన నాగ్‌ అక్కడే ఉన్న తన అభిమానిని పలకరించాడు. హగ్గిచ్చి సెల్ఫీ దిగాడు. మొన్న జరిగినదాంట్లో నీ తప్పు లేదు.. మా వాళ్లే తప్పుగా ప్రవర్తించారని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన అభిమానులు.. అక్కడున్నది మా కింగ్‌ అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by TTT (@telugu_troll_talkies) చదవండి: రాజమౌళి దంపతులకు ఆస్కార్‌ నుంచి ఆహ్వానం..

Aap Alleges Bjp Panicked And Got Kejriwal Arrested In A Fake Case By The Cbi
సీబీఐ అదుపులో కేజ్రీవాల్‌.. బీజేపీకి ఆప్‌ చురకలు!

సాక్షి,న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక కోర్టులో నడిచిన హైడ్రామా ఆమ్‌ ఆద్మీ పార్టీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం పాలసీ కేసులో తమ పార్టీ అధినేతకు (కేజ్రీవాల్‌) సుప్రీం కోర్టులో బెయిల్‌ వస్తుందేమోనని బయపడిపోతుందంటూ ఎక్స్‌ వేదికగా స్పందించింది.లిక్కర్‌ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో హైడ్రామా నడిచింది. మంగళవారం తీహార్‌ జైల్లో ఉన్న ఢిల్లీ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. అనంతరం బుధవారం కోర్టుకు హాజరు పరిచింది. కోర్టులో విచారణ జరిగే సమయంలో కేజ్రీవాల్‌ను తమకు ఐదురోజుల పాటు కస్టడీ కావాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో సీబీఐ స్పెషల్‌ కోర్టు జడ్జీ అమితాబ్‌ రావత్‌ అరెస్ట్‌ ఆర్డర్‌ను పాస్‌ చేయడంతో సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేశారు.ఈ వరుస పరిణామలపై ఆప్‌ స్పందించింది. ట్రయిల్‌ కోర్టు తనకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంపై కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ నేడు విచారణకు రానుంది. అయితే అనూహ్యంగా ఈ కేసు విచారణకు రాకముందే ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై ఆప్‌ మండిపడింది. కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో బెయిల్‌ వస్తుందేమోనని బీజేపీకి బయపట్టుకుంది. అందుకే సీబీఐ కోర్టులో అక్రమంగా అరెస్ట్‌ చేసిందని ట్వీట్‌లో పేర్కొంది.‘నియంత క్రూరత్వం అన్ని హద్దులు దాటింది.ఈ రోజు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ వచ్చే అవకాశం ఉన్నందున బీజేపీ తీవ్ర భయాందోళనకు గురైంది.సీబీఐతో కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయించింది’అని ట్వీట్‌లో ద్వజమెత్తింది.

Lok Sabha Speaker Election June 26 Live Updates
18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ స్పీకర్‌ ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్నికలో.. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్‌ సావంత్‌ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్‌ చేపట్టా.. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు.విపక్ష కూటమి ఓటింగ్‌కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పరస్పర కరచలనం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్‌ చెయిర్‌లో కూర్చోబెట్టారు. #WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభను నడిపించడంలో స్పీకర్‌ పాత్ర ఎంతో కీలకం. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్పీకర్‌ స్ఫూర్తిగా నిలుస్తారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా సభను నడిపించారు. ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్‌సభను నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలోనే కొత్త పార్లమెంట్‌ భవనంలోకి అడుగుపెట్టాం. జీ-20 సమ్మిట్‌ ఆయన సలహాలు, సూచనలు అవసరం. మరో ఐదేళ్లు కూడా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నా. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. సభలో విపక్షాల సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇవ్వలి. మా గొంతు నొక్కితే సభ సజావుగా నిర్వహించినట్లు కాదు. ప్రజల గొంతుక ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యం. ఓం బిర్లాకు వైఎస్సార్‌సీపీ అభినందనలులోక్ సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ అభినందనలు తెలిపింది. లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గడిచిన లోక్‌సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాలి’’ అని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారాయన. స్పీకర్‌గా ఓం బిర్లా ట్రాక్‌ రికార్డు.. లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా(61) రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్‌ పదవి చేపట్టారు. ఇప్పుడు.. తొలి నుంచి జరుగుతున్న ప్రచారం నడుమే రెండోసారి స్పీకర్‌ పదవి చేపట్టబోతున్నారు. లోక్‌సభ స్పీకర్‌ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్‌.ధిల్లాన్, బలరాం ఝాఖడ్‌, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్‌ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement