News
-
చిత్ర కథలు (ఫొటోలు)
‘ఉద్యోగ’ దీక్షబూని..‘కొడితే కొట్టాలిరా.. సిక్స్ కొట్టాలి.. పడితే పట్టాలిరా.. కొలువు పట్టాలి’ అన్నట్టుగా ఉద్యోగ సాధన దీక్ష చేపట్టారు విజయనగరంలోని నిరుద్యోగులు. ప్రశాంత వాతావరణంలో తదేక దీక్షతో చదువుతూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. విజయనగరం కోటలోను, చుట్టుపక్కల గట్లు, చెట్ల కింద పదుల సంఖ్యలో నిరుద్యోగ యువత ఇలా చదువుతూ కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం రైల్ బస్సు.. ప్రయాణం మిస్సుప్రకృతి అందాల నడుమ విశేష సేవలందించిన రైల్ బస్సు మూలనపడింది. బొబ్బిలి–సాలూరు మధ్య 21 కి.మీ. మేర ఒక ఇంజిన్, రెండు బోగీలతో నడిచే ఈ రైల్ బస్సును 1993లో ప్రారంభించారు. 15 గిరిజన గ్రామాల మధ్య ఇది నడిచేది. ఈ రైలు బస్సును నడపలేక రైల్వే అధికారులు మూలనపెట్టేశారు. ప్రస్తుతం ఇది విశాఖలోని రైల్వే స్విమ్మింగ్ పూల్ ప్రాంతంలో ఇలా ఉండిపోయింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం ఇదేంటన్నా.. పోలీసన్నావాహన చోదకులు రహదారి నిబంధనలను అతిక్రమిస్తే.. అడ్డుకోవాల్సిన పోలీసులే నిబంధనల్ని అతిక్రమిస్తే ఏమనాలి. ఏమైనా అందామంటే.. వాళ్లు ఊరుకుంటారా. హెల్మెట్ ధరించకుండా మోటార్ సైకిల్‌పై నడపడమే కాకుండా.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ కొందరు పోలీసులు ఇలా ముందుకు సాగిపోతున్నారు. నిబంధనల్ని తోసిరాజని నెల్లూరు ఓ కానిస్టేబుల్ మాగుంట లేఅవుట్ ప్రాంతంలో కెమెరా కంటికి చిక్కారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు ఫిలిప్పీన్స్‌ను భీకర తుపాను క్రతోన్ వణికిస్తోంది. ఇలొకొస్ నార్టె ప్రావిన్స్‌లోని బకర్రాలో వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను తరలిస్తున్న సహాయక సిబ్బంది క్రతోన్ తుపానుతో ఓ వైపు వర్షం కురుస్తుండగా ఆకాశంలో ఆహ్లాదం కలిగిస్తున్న ఇంద్రధనుస్సు. తైవాన్ రాజధాని తైపీలోనిదీ దృశ్యం. గ్రీస్‌లో కార్చిచ్చు వ్యాపించింది. ఆదివారం కొరింతియా ప్రాంతంలోని అనో లౌట్రో గ్రామం వైపు దూసుకొస్తున్న మంటల దృశ్యమిది. పితృ పక్షం సందర్భంగా సోమవారం బిహార్ రాష్ట్ర గయలోని దేవ్ఘాట్లో పిండ ప్రదానం చేస్తున్న ఓ విదేశీ భక్తురాలు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో సోమవారం ‘మిస్ యూనివర్స్ కొరియా’ పోటీల్లో హొయలొలికిస్తున్న 81 ఏళ్ల చోయి సూన్ హ్వా. -
భారత విప్లవ ప్రతీక!
భారతదేశం గర్వించే వీర కిశోరం భగత్ సింగ్. నేటి పాకిస్తాన్లో ఉన్నపంజాబ్ రాష్ట్రంలో 1907 సెప్టెంబర్ 27న జన్మించాడు. చిన్నతనంలో తన బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ... పట్టుబడకుండా ఉండేందుకు విదేశాలలో ఉండేవాడు. ఆ సమయంలో కంటనీరు పెట్టుకొనే చిన్నమ్మను చూసి ‘పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లే యులపై ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ ఉండేవాడు.గాంధీ, నెహ్రుల సారథ్యంలో నడుస్తున్న స్వాతంత్రోద్యమంలో చిన్ననాటి నుండే చురుకుగా పాల్గొంటూ వస్తున్న భగత్ సింగ్‌కు స్వాతంత్య్రం యాచిస్తే రాదనీ, శాసిస్తేనే వస్తుందని గ్రహించాడు. రష్యా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, గాంధీ కోరిన స్వాతంత్య్రం అంటే తెల్లదొరలు పోయి నల్లదొరలు రావడమేనని అర్థం చేసుకున్నాడు. అందుకే ముందు సోషలిస్టు సమాజం నిర్మించాలని తలంచి తను పనిచేస్తున్న హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను, హిందు స్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోషియేషన్‌గా మార్చాడు.బ్రిటిష్ వాళ్లు సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా నినదించే గొంతులు ఈ దేశంలో ఉన్నాయని తెలియచేసేందుకు కేంద్ర శాసనసభలో బాంబువేసి పారిపోకుండా ‘సామ్రాజ్యవాదం నశించాలి, విప్లవం వర్ధిల్లా ల’నే నినాదాలను చేశాడు భగత్ సింగ్. జలియన్ వాలాబాగ్, చౌరీచౌరా ఘటనలు భగత్ సింగ్‌లో స్వాతంత్య్ర కాంక్షను రగిలిస్తే; సైమన్ కమిషన్ పర్యటన సమయంలో దెబ్బలు తిన్న కారణంగా లాలా లజపతిరాయ్ మరణించడం ప్రతీకారేచ్ఛను కలిగించింది.భగత్ సింగ్‌ను బ్రిటిష్‌వాళ్లు ఉరితీసే కొద్ది రోజుల ముందు ఆయన తండ్రి క్షమాభిక్ష కోసం బ్రిటిష్ వారికి ఉత్తరం రాశారు. తన మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదనే విశ్వాసం తనదనీ, అందువల్ల బ్రిటిష్ వాళ్లకు చేసిన అభ్యర్థనను వెనక్కి తీసుకోవాలనీ కోరాడు భగత్. అదీ ఆ వీరుని దేశభక్తి! – జి. పవన్ కుమార్, బిజ్వార్ఇవి చదవండి: సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం -
Chakali Ailamma: ఆత్మగౌరవ ప్రతీక!
ఆధిపత్య వర్గాల పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి దొరలను గడీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన వీర వనిత చాకలి ఐలమ్మ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిలో అగ్రగణ్య ఐలమ్మ.ఉమ్మడి నల్లగొండజిల్లా (నేటి జనగాం జిల్లా) పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్య – ఐలమ్మలకు ఆరుగురు సంతానం. వారిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. కులవృత్తే వారికి జీవనాధారం. కులవృత్తితో బతకలేక పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది ఐలమ్మ. అదే విసునూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి కంటగింపు అయింది.అప్పుడే వెట్టి గొట్టాలు చేయవద్దని పిలుపునిచ్చి... 1940–44 మధ్య కాలంలో విసునూరులో దేశ్‌ముఖ్‌లు, రజాకర్ల అరాచకా లపై ఎదురుతిరిగి ఎర్రజెండా పట్టి ఆంధ్రమహాసభ (సంఘం)లో చేరింది ఐలమ్మ. దీంతో రామచంద్రారెడ్డి రగిలిపోయాడు. ఆమె కౌలుకు తీసుకున్న భూమిలో కాపు కొచ్చిన పంటను కాజేయాలని పన్నాగం పన్నాడు. గూండా లను పురమాయించారు. ‘ఈ భూమి నాది. పండించిన పంట నాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు... నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలిగేది’ అంటూ తన పంటను దోచుకోవడానికి వచ్చిన దొరగూండాలతో పలికింది ఐలమ్మ.సంఘం కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా కోర్టులో తీర్పువచ్చింది. ఐలమ్మ భూపోరాటం సామాజికంగా దిగువ ఉన్న జనానికి ప్రేరణ, స్ఫూర్తి నిచ్చింది. పల్లెపల్లెన ఉద్యమం ఎగిసిపడి, దొరల ఆధిపత్యం నేలమట్టమైంది. బడుగులను ఆదుకోవడమే ఆమెకు నిజమైన నివాళి! – ఆలేటి రమేష్, రజక విద్యార్థి సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శిఇవి చదవండి: మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్ -
Acharya Aatreya: అక్షర లక్షలు... ఆ గీతాలు!
‘ఆత్రేయ సాహితి’ సంపాదకులు డా‘‘ జగ్గయ్య – ‘సినిమా పాటకు సాహిత్య మందిరంలో పట్టాభిషేకం చేయించిన అపర శ్రీనాథుడు. మనిషికీ, మనసుకీ కొత్త భాష్యాలు పలికిన అక్షర యోగి...’ అంటూ ఆత్రేయను ప్రశంసించారు.‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ అనే స్వీయ వ్యాస సంపుటిలో వేటూరి ‘శబ్దాడంబరం లేకుండా నిర్మల గంగా ప్రవాహం లాగ చిరు చిరు అలలతో అగాథాల్ని దాస్తూ... ప్రకటిస్తూ సాగిన సాహితీగంగ ఆత్రేయది’ అని మెచ్చుకున్నారు. వెన్నెలకంటి ఆత్రేయను ‘సినీ వేమన’ అన్నారు. శ్రీశ్రీ తెలుగు కవిత్రయంగా తిక్కన, వేమన, గురజాడలను పేర్కొంటే వారి సరసన సినీరంగం నుంచి ఆత్రేయను చేర్చారు వెన్నెలకంటి! ఆత్రేయ మాటలు పాటలు లాగా, పాటలు మాటలు లాగా వుంటాయనీ, ఆత్రేయ పత్రికల్లో వార్తలా వచనం రాసినా, అది మామ మహదేవన్ స్వరకల్పనలో పాటగా ఒదిగేదనీ నిర్మాత మురారి అంటుండేవారు. అటువంటి ఆత్రేయ పాటల్లో పంక్తులు కొన్ని తెలుగునాట నానుడులుగా, నిత్య సత్యాలుగా, హితోక్తులుగా స్థిర పడిపోయాయి కూడా! అలాంటి ఆణిముత్యాలను కొన్నిటిని ఏరుకుందాం.ఆత్రేయకు జనం పెట్టిన పేరు మన‘సు’ కవి. అది జనం మనసుల్లో ఆయనకు పడిన ముద్ర తప్ప, ఏ సన్మాన సభలోనో, సాహితీ సంస్థో, ప్రభుత్వమో ప్రదానం చేసిన బిరుదు కాదు. ఆత్రేయ మనసు పాటల్లో తరళరత్నం ‘ప్రేమనగర్’ చిత్రంలోని ‘మనసు గతి యింతే/ మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికి/ సుఖము లేదంతే...’ అనే పంక్తులు. అవి విని మురిసిపోయిన దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు ఆత్రేయను మెచ్చుకుంటూనే చిన్న సందేహం వచ్చి ‘చివర్లో ‘అదంతే’ ఎందుకు?’ అని అడిగారట. ‘అదంతే’ అని చిరునవ్వుతో బదులిచ్చారట... మాటల్ని ఆచితూచి ప్రయోగించే అక్షరయోగి ఆత్రేయ.‘ప్రేమలు–పెళ్లిళ్లు’ చిత్రంలోని – ‘మనసులేని దేవుడు మనిషి కెందుకో మనసిచ్చాడు/ మనసు మనసును వంచన చేస్తే/ కనుల కెందుకో నీరిచ్చాడు’ అనే పంక్తులు కూడా నిత్యజీవితంలో అంద రికీ గుర్తొచ్చే గొప్ప అభివ్యక్తులు. పద క్రీడలతో సార్వకాలిక సత్యాలను వెల్లడించిన ఆత్రేయ ‘ఉండడం’, ‘లేకపోవడం’ అనే రెండు పదాలను తీసుకొని అమ్మ గొప్పతనం గురించి ఎంతక్లుప్తంగా, ఆప్తంగా చెప్పారో చూడండి – ‘అమ్మ ఉంటే లేనిదేమీ లేదు/ అమ్మ లేక ఏమున్నా ఉన్నది కాదు’ (కలసిన మనసులు)! ప్రేమ గురించి ‘అది’, ‘ఇది’ అంటూ ఆత్రేయ అంత గోప్యంగా చెప్పిన కవులు అరుదు. ‘నువ్వంటే నాకెందుకో ఇంత యిది, ఇంత యిది’ (అంతస్తులు); ‘ఇదే నన్నమాట – ఇది అదే నన్నమాట/ మది మదిలో లేకుంది – మనసేదో లాగుంది/ అంటే ఇదేనన్నమాట – ఇది అదేనన్న మాట’ (కొడుకు–కోడలు).మరో రెండు వాక్చిత్రాలను కూడా పేర్కొనాలి. అందులో మొదటిది అందరికీ తెలిసిన ‘మూగ మనసులు’ చిత్రంలో నూతన వధూవరులు, పెద్దల సమక్షంలో కథానాయకుడు గోపి పాడిన ‘ముద్ద బంతి పూవులో...’ పాటలోని – ‘నవ్వినా ఏడ్చినా... కన్నీళ్లే వస్తాయి.’ ఇది పది వాక్యాల పెట్టు అని డాక్టర్ సి.నా.రె. వ్యాఖ్యానించిన తర్వాత ఇంకే వివరణ కావాలి? ఇలా అక్షర లక్షల విలువైన జీవిత సత్యాలను గమనిస్తే ఆత్రేయ... వేమనలా కవి మాత్రమే కాదు– ఒక యోగి కూడా అనిపిస్తారు. – డా‘‘ పైడిపాల, సినీ గేయ సాహిత్య పరిశోధకులు, 99891 06162ఇవి చదవండి: కాసేపట్లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు -
జనం గొడవే.. ఆయన గొడవ!
వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించి అణచివేత– అన్యాయాలపై ధిక్కార స్వరం వినిపించిన సమరశీలి; సామాజిక స్పర్శతో కవిత్వాన్ని పునీతం చేసిన ప్రజాకవి కాళోజీ! ప్రజా ఉద్య మాల్లో పాల్గొని అన్యాయాన్ని కవిత్వ కరవాలంతో ఎదిరించి ప్రశ్నించి నిలదీసిన ధీశాలి. నిజాం రాజును ఆత్మస్థైర్యంతో ఎదిరించడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరుబాటను నిర్దేశించిన యోధుడాయన. తనను వదిలేసుకొని ఇతరుల మంచి కోసం పోరాడే సామాజిక స్పృహ, నిరంతర తపన కాళోజీలో ఉన్నాయి. పీడిత, తాడిత ప్రజల గుండెల్లో పోరాటపు పుప్పొడిని చల్లి కవిగా నిలిచి పోయారు. మాటల్లో, చేతల్లో, ప్రవ ర్తనలో, వేషభాషల్లో, ఆలోచ నలో, ఆర్తిలో, ఆవేదన – సంవే దనల్లో తెలంగాణ తనాన్ని విని పించి, కనిపింపజేసిన ఆయన అసాధారణ కవి. ప్రజల్లోకి బలంగా తన కవిత్వాన్ని తీసు కెళ్లిన కాళోజీని మహాకవి దాశరథి ‘తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం’ అని అభివర్ణించారు. ఉద్యమ ప«థ నిర్దేశం చేసి చిరకాల కవిత్వాన్ని కాళోజీ ప్రజలకు మిగిల్చారు.సమాజ గొడవను తన గొడవగా మార్చు కొని ‘నా గొడవ’ పేరుతో రాసిన కవితలు సమాజానికి మార్గదర్శకాలుగా మారాయి. దేశీయ దృక్పథం, ప్రాంతీయ çస్పృహ కలిగిన కాళోజీ ఖండాంతర కవి. ప్రజా ఉద్యమాలతో మమేకమైన ఆయన సమాజాన్ని నా గొడవలో అనేక కోణాలలో ఆవిష్కరించి చూపారు. నిజా లను కవిత్వంలో కుండబద్దలు కొట్టి చెప్పిన కాళోజీ ఎవరేమనుకున్నా తన తత్వం ఇదేనని స్పష్టం చేశారు. ‘ఓటేసేటప్పుడు వుండాలి బుద్ధి’ అన్న మాటల్లో వాస్తవాల ఆవిష్కరణ కనిపిస్తుంది. ఆచరణ యోగ్యంగా ఆయన కవిత్వపంక్తులు ఉంటాయి.సామాన్య ప్రజానీకానికి అంత దగ్గరగా కవిత్వాన్ని తీసుకెళ్లిన కవిగా కాళోజీ మిగిలిపోయారు. ‘తిననోచని మాట్లాడ నోచని నోరు, కష్టం చేసి తిననోచని చేతులు, సేవచేసి ప్రేమించనోచని శరీరం...’ వంటివాటి పక్షం వహిస్తాడు కాళోజీ. కచ్చితమైన అభిప్రా యాలు కల్గిన కాళోజీ... పలుకుబడుల వ్యావహా రిక భాషలో రచనలు చేశారు. ‘ప్రాంతేతరులే దోపిడీ చేస్తే పొలిమేర దాకా తరుముతాం... ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతో పాత రేస్తాం’ అంటూ తెలంగాణ వాణిని వినిపించిన కాళోజీ ‘వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది... వేరై కూడా తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి’ అని స్పష్టం చేశారు. స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, ద్వంద్వ ప్రవృత్తులపై, అన్యా యం వంటివాటిపై ఖండనలు చేసిన ఆయన సామాజిక కవి శిఖరంగా కనిపిస్తారు. రాజ కీయ లౌక్యాలు, వ్యంగ్యాస్త్రాలు ప్రస్తావిస్తూనే సాహిత్య విలువ లను నా గొడవలో స్థాపన చేశారు. ప్రహ్లాదుడు అన్యాయాన్ని ఎదిరించినట్టే తనకు ఎదిరించినోడే ఆరాధ్యుడని ఆయన చెప్పారు. ఓటు విలువను సమాజానికి చెప్పిన ఆయన సమాజ అంతరాలను నా గొడవలో బట్ట బయలు చేసి ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ‘తొక్కినొక్కబడ్డప్పుడు ప్రత్యేక రాజ్యం పాలు కోరడం తప్పదు... కాలంబు రాగానె కాటేసి తీరాలే... కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలె’ అన్న కాళోజీ... నిర్భయత్వానికి నిదర్శనం! – డా. తిరునగరి శ్రీనివాస్, కవి, సాహిత్య విశ్లేషకులు, 94414 64764 -
Israel: నెతన్యాహు నెగ్గుకొచ్చేనా?
సాక్షి, నేషనల్ డెస్క్: ఇజ్రాయెలీల ఆక్రోశం, ఆక్రందనలు క్రమంగా ఆగ్రహ జ్వాలలుగా మారాయి. ఇజ్రాయెల్ ప్రధాని పీఠానికి ఎసరు పెట్టేలా కని్పస్తున్నాయి. హమాస్ చెరనుంచి ఇజ్రాయెలీ బందీలను విడిపించడంలో నెతన్యాహు సర్కారు వైఫల్యంపై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. తాజాగా ఆగస్టు 31న ఆరుగురు బందీలను గాజాలో ఉగ్రవాదులు పాశవికంగా హతమార్చడంతో ఇజ్రాయెలీలు భగ్గుమంటున్నారు. సోమవారం లక్షలాదిగా వీధుల్లోకి వచ్చారు. దేశాన్ని స్తంభింపజేశారు. నెతన్యాహూ వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కోర్టు జోక్యం చేసుకుంటే గానీ వెనక్కు తగ్గలేదు. ఈ నిరసనలు చివరికి నెతన్యాహూ రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్ పెడతాయా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి తెగబడ్డ హమాస్ 1,200 మందికి పైగా పొట్టన పెట్టుకోవడమే గాక 250 మందిని బందీలుగా తీసుకెళ్లడం తెలిసిందే. ఖైదీల మారి్పడి కింద 100 మందిని విడిపించారు. 35 మందికి పైగా చనిపోయినట్టు భావిస్తుండగా 100 మందికి పైగా ఇంకా హమాస్ చెరలోనే మగ్గుతున్నారు. వాళ్లను విడిపించేందుకు ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన తాజా ప్రయత్నం వికటించడం, ఆరుగురు బందీలను హమాస్ చంపేయడం తెలిసిందే. దీనిపై ఇజ్రాయేలీల్లో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. బందీలను విడిపించడంలోనే గాక గాజాలో కాల్పుల విరమణలో కూడా ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ఘోరంగా విఫలమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇజ్రాయెల్‌లో అతిపెద్ద కార్మిక సంఘం హిస్ట్రాడుట్ ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపు సోమవారం దేశాన్ని స్తంభింపజేసింది. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలయ్యాక దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ఇదే అతి పెద్దది. దాని దెబ్బకు బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. విశ్వవిద్యాలయాలు, షాపింగ్ మాల్స్, ఓడరేవులనూ మూసివేశారు. నిరసనలు సాయంత్రం దాకా కొనసాగాయి. నిరసనకారులు నెతన్యాహూ నివాసాన్ని కూడా ముట్టించారు. అమెరికా ఎంబసీ ముందు బైఠాయించారు. అయలాన్ హైవేను దిగ్బంధించారు. దాంతో వారిపైకి పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించాల్సి వచ్చింది. విధ్వంసానికి, అధికారులపై దాడికి పాల్పడ్డారంటూ టెల్ అవీవ్‌లో 29 మందిని అరెస్టు చేశారు. చివరికి లేబర్ కోర్టు ఆదేశాలతో సమ్మె ఆగింది. ఇజ్రాయెలీల నిరసనల వెల్లువను తట్టుకుని నిలవడం నెతన్యాహూకు కష్టమేనంటున్నారు.పెరుగుతున్న వ్యతిరేకత.. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలన్న నెతన్యా హు వైఖరిపై విమర్శలు నానాటికీ పెరుగుతున్నా యి. ఇజ్రాయెల్ విపక్ష నేత యైర్ లాపిడ్ కూడా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. యుద్ధ విషయమై నెతన్యాహు తీసుకున్న, తీసుకుంటున్న పలు నిర్ణయాలపై సొంత కేబినెట్లోనే వ్యతిరేకత ప్రబలుతోంది. బందీలను విడిపించే ఒప్పందం కుదు ర్చుకోవడం కంటే కారిడార్ నియంత్రణకే ప్రాధాన్యమిస్తుండటం సరికాదని రక్షణ మంత్రి యెవ్ గాలెంట్ బాహాటంగానే విమర్శించారు. దీన్ని ‘నైతికంగా అవమానం’గా అభివరి్ణంచారు. బందీల ఒ ప్పందంపై గానీ, కాల్పుల విరమణపై గానీ నెత న్యాహుకు ఎలాంటి ఆసక్తి లేదని ఇజ్రాయెల్ మాజీ రాయబారి, ప్రభుత్వ సలహాదారు అలోన్ పింకస్ ఆరోపించారు. ‘‘ఆశ్చర్యంగా అని్పంచినా ఇదే నిజం. ఒప్పందానికి నెతన్యాహూ విముఖత వల్లే బందీలు బలవుతున్నారు’’ అని మండిపడ్డారు.తగ్గుతున్న మద్దతు..మరోవైపు నెతన్యాహుకు మద్దతు కూడా నానాటికీ తగ్గుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదని మెజారిటీ ఇజ్రాయెలీలు భావిస్తున్నట్లు గత శుక్రవారం ఛానెల్ 12 చేసిన సర్వేలో తేలింది. ఆయన మళ్లీ పోటీ చేయొద్దని 69 శాతం పేర్కొనగా కేవలం 22 శాతం మంది మాత్రమే మళ్లీ ఎన్నికల బరిలో దిగాలని కోరుతున్నారు.నిత్యం నిరసనలే..ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత అతివాద సంకీర్ణ సర్కారుకు నెతన్యాహూ నేతృత్వం వహిస్తున్నారు. 2023 జనవరిలో ఆయన గద్దెనెక్కిన నాటినుంచీ దేశంలో తరచూ నిరసనలూ, ఆందోళనలూ కొనసాగుతూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు అధికారాలకు భారీగా కత్తెర వేసేందుకు ఉద్దేశించిన న్యాయ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏడాది కింద జనం భారీగా రోడ్డెక్కారు. చివరికి ఆ ప్రతిపాదనలపై ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇక హమాస్ ఆటవిక దాడి అనంతరం నెతన్యాహూ ప్రభుత్వ స్పందనను నిరసిస్తూ గత అక్టోబర్ నుంచి రాజధాని మొదలుకుని దేశంలో ఏదో ఒక మూల నిత్యం ఆందోళనలు, నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. హమాస్‌తో ఒప్పందానికి అంగీకరిస్తే ప్రభుత్వాన్ని పడగొడతామని కూడా కొన్ని సంకీర్ణ పక్షాలు బెదిరిస్తున్నాయి. దీనికి తోడు నెతన్యాహూపై అవినీతి, మోసం, నమ్మకద్రోహం తదితర అభియోగాలపై విచారణలు కోర్టుల్లో పలు దశల్లో ఉన్నాయి.ఎన్నికలకు మరో రెండేళ్లు..ఇజ్రాయెల్‌లో ఎన్నికలకు మరో రెండేళ్ల గడువుంది. ఆలోపు నెతన్యాహూపై విపక్షం అవిశ్వాసం పెట్టాలన్నా కనీసం ఐదుగురు పాలక సంకీర్ణ సభ్యుల మద్దతు అవసరం.నెతన్యాహు.. తగ్గేదేలే..నెతన్యాహు మాత్రం వెనక్కు తగ్గేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే తన లక్ష్యమని ఆయన కరాఖండిగా చెబుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలన్న నిరసనకారుల డిమాండ్లను, మంత్రివర్గ సహచరుల విజ్ఞప్తులను నెతన్యాహూ తోసిపుచ్చారు. ‘‘ఆరుగురు బందీలను ఉరి తీశారు. అయినా కసి తీరక తల వెనుక భాగంలో కాల్చారు. వాళ్లతో రాయబారాలా?’’ అని ప్రధాని ప్రశి్నస్తున్నారు. కొన్ని మినహాయింపులతోనైనా కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొనాలన్న సూచనకు ససేమిరా అంటున్నారు.దీనిపై ఇటీవల మరింత కఠిన వైఖరి తీసుకున్నారు. గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగాలన్న హమాస్ డిమాండ్‌కు ఒప్పుకునేదే లేదంటున్నారు. బందీలను కాపాడలేకపోయినందుకు క్షమాపణ చెప్పిన నెతన్యాహూ, యుద్ధాన్ని ముగించేందుకు అంతర్జాతీయ సమాజమే హమాస్‌పై మరింత ఒత్తిడి తేవాలంటూ కుండబద్దలు కొట్టారు. బందీల విడుదలకు తాను తగినంత కృషి చేయడం లేదన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ‘‘ఈ విషయంలో నాకంటే నిబద్ధత కలిగిన వారెవరూ లేరు. దీనిపై నాకెవరూ ఉపన్యాసం ఇవ్వనక్కరలేదు’’ అన్నారు! -
రక్తం మరిగిన తోడేళ్లు.. కనిపిస్తే కాల్చివేత!
బహ్రయిచ్: యూపీలోని బహ్రయిచ్ జిల్లాలో తోడేళ్ల భయోత్పాతం కొనసాగుతూనే ఉంది. తాజాగా హర్ది ప్రాంతంలో అవి ఓ పసికందును పొట్టన పెట్టుకున్నాయి. ఇద్దరు వృద్ధురాళ్లపై దాడి చేసి గాయపరిచాయి. దాంతో గత రెండు నెలల్లో తోడేళ్లకు బలైన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వీరిలో ఎనిమిది మంది చిన్నారులే! 34 మంది గాయపడ్డారు. ఆరు తోడేళ్లలో నాలుగింటిని పట్టుకోగా రెండు మాత్రం నిత్యం అధికారులకు చుక్కలు చూపుతున్నాయి. ఆవాసాలు మారుస్తూ, రోజుకో గ్రామాన్ని లక్ష్యం చేసుకుంటూ తప్పించుకుంటున్నాయి. తప్పనిసరైతే వాటిని కాల్చివేయాల్సిందిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆదేశాలిచ్చారు. దాంతో ట్రాంక్విలైజర్లతో షూటర్లను రంగంలోకి దించారు. తోడేళ్లను గుర్తించి పట్టుకునేందుకు, వీలవని పక్షంలో మట్టుపెట్టేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ‘ఆపరేషన్ భేడియా’కీలక దశకు చేరిందని బహ్రయిచ్ డీఎఫ్‌వో అజీత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తోడేళ్ల పీడ విరగడయ్యేదాకా ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.బహ్రయిచ్‌లో మంగళవారం తెల్లవారుజాము 3.35గంటలకు మహసీ సబ్ డివిజన్లోని నౌవన్ గరేతి గ్రామంలో తోడేలు ఓ ఇంట్లో దూరి అంజలి అనే రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లింది. షాక్‌కు గురైన తల్లి అరిచేలోపే పాపను నోట కరుచుని పారిపోయింది. రెండు గంటల తర్వాత కిలోమీటరు దూరంలో చేతుల్లేకుండా చిన్నారి మృతదేహం దొరికింది. అనంతరం ఉదయాన్నే అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని కొటియా గ్రామంలో వరండాలో నిద్రిస్తున్న కమలాదేవి (70) అనే వృద్ధురాలిపై తోడేలు దాడి చేసింది. ఆమె అరుపులతో కుటు ంబీకులు అప్రమత్తమయ్యారు. తీవ్ర గాయాలైన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో అరగంట తరువాత మూడో దాడిలో సుమన్ దేవి (65) అనే మరో వృద్ధురాలు గాయపడింది. సోమవారం రాత్రి పండోహియా గ్రామంలో తోడేళ్ల దాడిలో గాయపడ్డ అఫ్సానా అనే ఐదేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం రాత్రి హర్ది దర్హియా గ్రామంలో తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిపై తోడేలు దాడి చేసింది. మెడను కరిచి లాక్కెళ్లబోయింది. తో డేలుతో తల్లి ధైర్యంగా పోరాడి తన బాబును కాపాడుకోగలిగింది. అదే రాత్రి మరో 50 ఏళ్ల వ్యక్తిపైనా తోడేలు దాడి జరిగింది.శ్మశాన నిశ్శబ్దం... తోడేళ్ల దెబ్బకు బహ్రయిచ్‌లో మార్కెట్లు మూతపడ్డాయి. వీధులు పగలు కూడా నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మహసీ సబ్ డివిజన్లోనైతే జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రభావిత సీతాపూర్, లఖింపూర్ ఖేరి, పిలిభీత్, బిజ్నోర్ డివిజన్లలోనూ తోడేళ్ల భయం నెలకొని ఉంది. ఆ ప్రంతాలకు అదనపు ఫారెస్ట్ గార్డులు, ట్రాప్ బృందాలను పంపుతున్నారు. తోడేళ్లు నిత్యం తమ ఆవాసాలను మారుస్తుండటంతో పట్టుకోవడం కష్టమవుతోందని జిల్లా మేజి్రస్టేట్ మోనికా రాణి తెలిపారు. ‘‘అవి తెలివిగా ప్రతిసారీ కొత్త గ్రామా న్ని లక్ష్యం చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా నాలుగింటిని పట్టుకున్నాం. ఇంకో రెండు దొరకాల్సి ఉంది’’అన్నారు. తమ బృందం నిరంతరం గస్తీ కాస్తోందని, వాటినీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ (సెంట్రల్ జోన్) రేణుసింగ్ చెప్పారు. పిల్లలను ఇళ్ల లోపలే ఉంచాలని, రాత్రిపూట తలుపులకు తాళం వేసుకోవాలని అధికారులు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.వీడియో ఆధారాలడిగారు...తోడేళ్లు తమ ఇళ్ల పక్కనే కనిపిస్తూ వణికిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అటవీ అధికారులకు చెబితే వీడియో ఆధారాలు అడుగుతున్నారని మండిపడుతున్నారు. ‘‘మా ఇంటి పక్కన తోడేలు కనిపిస్తే కుక్కనుకొని తరిమికొట్టాం. పొలాల వైపు పరుగెత్తడంతో తోడేలని గుర్తించాం. దాంతో పిల్లలంతా క్షేమంగా ఉన్నారా, లేరా అని చూసుకున్నాం. అంజలి తోడేలు బారిన పడిందని తేలింది’’అని నౌవన్ గరేతికి చెందిన బాల్కే రామ్ వెల్లడించారు. -
అసోంలో ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ రద్దు..
న్యూఢిల్లీ: ముస్లింల పెళ్లిళ్లు, విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ అసోం అసెంబ్లీ గురువారం బిల్లును ఆమోదించింది. ముస్లిం పెళ్లి, విడాకుల చట్టం–1935 స్థానంలో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆప్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవోర్సెస్ బిల్లు–2024ను తీసుకువచి్చంది. బాల్య వివాహాలకు, బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేయడానికి హిమంత బిశ్వ శర్మ సర్కారు ఈ కొత్త బిల్లును తెచ్చింది.గతంలో ఖాజీలు చేసిన పెళ్లిళ్లు చెల్లుబాటు అవుతాయని, ఇకపై జరిగే వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ తప్పనిసరని సీఎం హిమంత వివరణ ఇచ్చారు. కొత్త చట్టంలో ముస్లిం అమ్మాయిల కనీస వివాహ వయసును 18 ఏళ్లుగా పేర్కొన్నారు. వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే పెళ్లి సమయంలో తమ వైవాహిక స్థితిని ప్రకటించాలి. అవివాహితులా, విడాకులు తీసుకున్నారా లేక వైధవ్యం సంప్రాప్తించిందా? అనే వివరాలను వెల్లడించాలి. ఇరువురి అంగీకారంతోనే వివాహం జరగాలి. ఏ ఒక్కరి సమ్మతి లేకుండా వివాహం జరిగినా అది చెల్లదు. వివాహిత మహిళల, భర్తలను కోల్పోయిన వారి హక్కులను ఈ బిల్లు కాపాడుతుందని అసోం ప్రభుత్వం చెబుతోంది. -
Kolkata Incident: ఏం జరిగిందో చెప్పండి!
కోల్‌కతా: కన్నబిడ్డను కోల్పోయిన విషయం తెలిస్తే పుట్టెడు దుఃఖంలో మునిగిపోయే తల్లిదండ్రులను ఓదార్చుతూ ధైర్యం చెప్పాల్సిందిపోయి వారిని గందరగోళపరుస్తూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్జీ కర్ ఆస్పత్రి యాజమాన్యం వైఖరి తాజాగా బహిర్గతమైంది. కోల్‌కతా జూనియర్ వైద్యురాలి హత్యోదంతం మర్నాడు ఉదయం ఆస్పత్రి యాజమాన్యం ఆమె కుటుంబానికి చేసిన ఫోన్‌కాల్స్ డేటా తాజాగా మీడియాకు వెల్లడైంది. దీంతో సున్నితమైన అంశం పట్ల ఆస్పత్రి యాజమాన్యం ఎంత నిర్దయగా వ్యవహరించిందో అందరికీ అర్థమైంది. ఆగస్ట్ 9న ఉదయం 10 గంటలకు ఆస్పత్రి మహిళా అసిస్టెంట్ సూపరింటెండెంట్ చేసిన మూడు ఫోన్‌కాల్స్ వివరాలు ఇవీ..మొదటి ఫోన్‌కాల్ ఉదయం 10.53 నిమిషాలకు..వైద్యురాలి తండ్రి: అసలేం జరిగింది?అవతలి వ్యక్తి: ఆమె ఆరోగ్య పరిస్థితి ఏం బాలేదు. ఆస్పత్రిలో చేర్పించాం. త్వరగా వచ్చేయండివైద్యురాలి తండ్రి: దయచేసి చెప్పండి. అక్కడేం జరిగింది?అవతలి వ్యక్తి: ఆ వివరాలన్నీ డాక్టర్ చెప్తారు. మీ నంబర్ దొరికితే ఫోన్ చేశాం. ముందు మీరు బయల్దేరండివైద్యురాలి తండ్రి: అసలు మీరెవరు?అవతలి వ్యక్తి: నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను. డాక్టర్‌ను కాదు.వైద్యురాలి తండ్రి: అక్కడ వైద్యులే లేరా?అవతలి వ్యక్తి: మేమే నీ బిడ్డను ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చాం. వచ్చి మమ్మల్ని కలవండివైద్యురాలి తల్లి: ఆమెకు ఏమైంది?. డ్యూటీ లో లేదా? జ్వరం వచ్చిందా?వైద్యురాలి తండ్రి: ఆమెకు సీరియస్‌గా ఉందా?అవతలి వ్యక్తి: అవును. మీరు వీలైనంత త్వరగా వచ్చేయండిఐదు నిమిషాల తర్వాత రెండో ఫోన్‌కాల్.. అవతలి వ్యక్తి: ఆర్జీ కర్ ఆస్పత్రి నుంచి మాట్లాడుతున్నావైద్యురాలి తల్లి: చెప్పండిఅవతలి వ్యక్తి: బయల్దేరారా లేదా?వైద్యురాలి తల్లి: బయల్దేరాం. ఇప్పుడు ఆమె ఎలా ఉంది?అవతలి వ్యక్తి: ముందయితే రండి. వచ్చాక మాట్లాడుకుందాం. ఆస్పత్రిలో ఛాతీ విభాగాధిపతి ఆఫీస్‌కే నేరుగా రండివైద్యురాలి తల్లి: సరేనండిమూడో ఫోన్‌కాల్...వైద్యురాలి తండ్రి: హలో చెప్పండిఅవతలి వ్యక్తి: నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను. చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టుంది. చనిపోయిందని అనుకుంటున్నాం. పోలీసులు కూడా వచ్చేశారు. ఆస్పత్రి వాళ్లం కూడా ఇక్కడే ఉన్నాం. త్వరగా రండి అని చెప్పడానికే మీకు ఫోన్ చేశాంవైద్యురాలి తండ్రి: నేరుగా అక్కడికే వస్తున్నాంవైద్యురాలి తల్లి: నా కూతురు నాకిక లేదు (బోరున విలపిస్తూ). -
స్త్రీ ధనంపై మహిళకే హక్కు : సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తప్పు చేసిన వారికి తగు శిక్ష పడేలా చేయడానికే నేర విచారణ జరుగుతుందని, అంతే తప్ప ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తన కూతురికి వివాహ సమయంలో ఇచ్చిన స్త్రీ ధనాన్ని ఆమె మాజీ అత్తమామలు తిరిగి ఇవ్వడం లేదంటూ తెలంగాణకు చెందిన పడాల వీరభద్రరావు సుప్రీంకోర్టులో నమ్మకద్రోహం కేసు వేశారు. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు, బంధువులు కానుకల రూపంలో ఇచ్చే నగదు, ఆస్తులను స్త్రీ ధనంగా పరిగణిస్తారు. స్త్రీ ధనంపై భార్య లేదా మాజీ భార్యకు మాత్రమే పూర్తి హక్కు ఉంటుందని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సంజయ్ కరోల్ పేర్కొన్నారు. ఇదివరకే న్యాయస్థానాలు దీన్ని స్పష్టం చేశాయన్నారు.వ్యక్తిగత కక్ష్యలు మనసులో పెట్టుకొని.. ప్రతీకారం తీర్చుకోవడానికి న్యాయ విచారణ ప్రక్రియను ఉపయోగించుకోకూడదని వీరభద్ర రావుకు ధర్మాసనం సూచించింది. 1999లో తన కూతురికి పెళ్లి సమయంలో బంగారు నగలు, ఇతర కానుకలు ఇచ్చానని, తర్వాత దంపతులు అమెరికాకు వెళ్లారని రావు కోర్టుకు తెలిపారు. 2016లో అమెరికాలో విడాకులు తీసుకున్నారని, తన కూతురికి ఇచి్చన నగలు ఆమె మాజీ అత్తమామల దగ్గరే ఉన్నాయని వాదించారు. అయితే స్త్రీ ధనంపై భర్తకు గాని, తండ్రికి గాని ఎలాంటి హక్కులు ఉండవని, స్త్రీ ధనాన్ని తిరిగి రాబట్టుకోవడానికి కేసు పెడితే ఆమె పెట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
సమస్యల నడుమ సారథ్య పోరు..
ద్వీప దేశం శ్రీలంక రెండేళ్ల క్రితం కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అన్నం ముద్దకు, నీటి చుక్కకూ దిక్కులేని పరిస్థితి దాపురించడంతో జనం కన్నెర్రజేశారు. ప్రభుత్వంపై మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఎటు చూసినా మొన్నటి బంగ్లాదేశ్ తరహా దృశ్యాలే కని్పంచాయి. దాంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స పదవి వీడి పారిపోయారు. నెలల పాటు సాగిన అనిశ్చితి తర్వాత అన్ని పారీ్టల అంగీకారంతో పగ్గాలు చేపట్టిన రణిల్ విక్రమసింఘె పలు సంస్కరణలకు తెర తీశారు. అయినా దేశం ఆర్థిక ఇక్కట్ల నుంచి ఇప్పుటికీ బయట పడలేదు. నానా సమస్యల నడుమే సెపె్టంబర్ 21న అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది...బరిలో 39 మంది అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. 39 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరిలో మాజీ ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సెకాతో పాటు ఇద్దరు బౌద్ధ సన్యాసులూ ఉండటం విశేషం! అయితే ప్రధాన పోటీ మాత్రం అధ్యక్షుడు రణిల్, శక్తిమంతమైన రాజపక్స కుటుంబ వారసుడు నమల్, విపక్ష నేత సజిత్ ప్రేమదాస మధ్యే కేంద్రీకృతమైంది. మిగతా వారిలో చాలామంది వీళ్ల డమ్మీలేనని చెబుతున్నారు. ఈ ముగ్గురిలోనూ ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టమైన మొగ్గు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో తొలి దశలో ఫలితం తేలడం అనుమానమేనని భావిస్తున్నారు.రణిల్ విక్రమ సింఘె ప్రస్తుత అధ్యక్షుడు. పూర్వాశ్రమంలో పేరుమోసిన లాయర్. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ప్రధానిగా చేసిన రాజకీయ దిగ్గజం. ఆయన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)కి పార్లమెంటులో ఉన్నది ఒక్క స్థానమే. అయినా అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు 2022 జూలైలో అధ్యక్షుడయ్యారు. దేశాన్ని సంక్షోభం నుంచి కాస్త ఒడ్డున పడేయగలిగారు. కానీ 225 మంది ఎంపీలున్న రాజపక్సల శ్రీలంక పొడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) మద్దతుకు బదులుగా ఆ పార్టీ నేతల అవినీతికి కొమ్ము కాస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగారు. ఎస్ఎల్పీపీ సొంత అభ్యర్థిని బరిలో దింపడం పెద్ద ప్రతికూలాంశం. పైగా రణిల్ పారీ్టకి క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. దీనికి తోడు విపక్ష నేత సజిత్ ప్రేమదాస నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. తాజాగా 92 మంది ఎంపీలు మద్దతు ప్రకటించడం 75 ఏళ్ల రణిల్‌కు ఊరటనిచ్చే అంశం.సజిత్ ప్రేమ దాస మాజీ అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కుమారుడు. విపక్ష నేత. 2019లో రణిల్ పార్టీ నుంచి విడిపోయి సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) పేరిట వేరుకుంపటి పెట్టుకున్నారు. వామపక్ష భావజాలమున్న 57 ఏళ్ల సజిత్‌కు యువతలో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. అవినీతినే ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. దానిపై ఉక్కుపాదం మోపుతానన్న హామీతో జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. జనంపై పన్నుల భారాన్ని తక్షణం తగ్గించాల్సిందేనన్న సజిత్ డిమాండ్‌కు భారీ స్పందన లభిస్తోంది. దీనికితోడు శ్రీలంక ముస్లిం కాంగ్రెస్, డెమొక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ వంటి పారీ్టలతో పాటు చిన్న గ్రూపుల మద్దతుతో ఆయన నానాటికీ బలపడుతున్నారు. పలు తమిళ సంఘాల దన్ను సజిత్‌కు మరింతగా కలిసిరానుంది.నమల్ రాజపక్స మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు. 38 ఏళ్ల నమల్ శక్తిమంతమైన రాజపక్స రాజకీయ కుటుంబం నుంచి యువతరం వారసునిగా బరిలో దిగారు. అధ్యక్ష పోరులో తనకే మద్దతివ్వాలన్న రణిల్ విజ్ఞప్తిపై ఎస్ఎల్పీపీ రోజుల తరబడి మల్లగుల్లాలు పడింది. చివరికి సొంతగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి రణిల్ సర్కారుకు మద్దతు ఉపసంహరించింది. అనూహ్యంగా నమల్ను బరిలో దించింది. ఆయన చిన్నాన్న గొటబయ రాజపక్సపై రెండేళ్ల క్రితం వెల్లువెత్తిన జనాగ్రహం ఇంకా తాజాగానే ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించం నమల్ ముందున్న అతిపెద్ద సవాలు. దీనికి తోడు ఎస్ఎల్పీపీకి 225 మంది ఎంపీలున్నా వారిలో పలువురు క్రమంగా రణిల్ వైపు మొగ్గుతున్నారు. మిగతా వారిలోనూ చాలామంది పార్టీ ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు.అనూర కుమార దిస్స నాయకె నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) సంకీర్ణం తరఫున బరిలో ఉన్నారు. పార్లమెంటులో కేవలం 3 సీట్లే ఉన్నా సుపరిపాలన హామీతో ఆకట్టుకుంటున్నారు. జనతా విముక్తి పెరమున (జేవీపీ) వంటి పార్టీల దన్ను కలిసొచ్చే అంశం. ఇక అంతర్యుద్ధ సమయంలో హీరోగా నిలిచిన ఫీల్డ్ మార్షల్ ఫోన్సెకా తనకు మద్దతుగా నిలిచే పారీ్టల కోసం చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏకైక చాయిస్ హారిస్..
షికాగో: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఫక్తు షోమ్యాన్గా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభివర్ణించారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు పూజ్యమన్నారు. బుధవారం డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్‌లో ఆయన ప్రసంగించారు. ‘‘మతం, జాతి, ఒంటి రంగు తదితరాల ఆధారంగా దేశాన్ని విడదీయడం, అందరినీ కించపరచడం, ఎదుటి వారిపై నిందలేయడమే ట్రంప్ నైజం. కుట్రలు, ప్రతీకారాలు, నిత్యం గందరగోళ పరిస్థితులను సృష్టించడం ఆయన స్వభావం. ఎంతసేపూ ‘నేను, నేను, నేను’ అంటూ తన గురించే చెప్పుకునే అత్యంత స్వార్థపరుడు’’ అంటూ దుయ్యబట్టారు. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ను నిత్యం ఇతరుల సంక్షేమం గురించే ఆలోచించే జన నేతగా క్లింటన్ అభివర్ణించారు. ‘‘దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు, అపార అనుభవమున్న హారిసే ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏకైక చాయిస్. అది సుస్పష్టం’’ అన్నారు. సమర్థ పాలకురాలిగా దేశ ప్రజలందరినీ ఆమె మెప్పిస్తారని జోస్యం చెప్పారు.ప్రెసిడెంట్ ఆఫ్ జాయ్..హారిస్‌ను ‘ప్రెసిడెంట్ ఆఫ్ జాయ్’గా బిల్ క్లింటన్ అభివర్ణించారు. ‘‘హారిస్ విద్యార్థి దశలో మెక్‌డొనాల్డ్స్‌లో పార్ట్‌టైమర్‌గా చాలాకాలం పని చేశారు. ‘మీకెలా సాయపడగలను?’ అంటూ ప్రతి కస్టమర్నూ చక్కని చిరునవ్వుతో పలకరించేవారు. ఇప్పుడు అత్యున్నత అధికార హోదాలో కూడా ‘మీకెలా సాయపడగలను?’ అని అదే చిరునవ్వుతో ప్రజలందరినీ అడుగుతున్నారు. హారిస్ ప్రెసిడెంట్‌గా వైట్‌హౌస్‌లో అడుగు పెడితే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషిస్తా. ఎందుకంటే మెక్‌డొనాల్డ్స్‌లో అత్యధిక కాలం పని చేసిన ప్రెసిడెంట్‌గా నా రికార్డును బద్దలు కొడతారు’’ అంటూ ఛలోక్తులు విసిరారు. అనంతరం మాట్లాడిన సీనియర్ డెమొక్రటిక్ నేతలంతా ట్రంప్‌పై ముక్త కంఠంతో విమర్శలు గుప్పించారు. ‘‘అమెరికాకు ట్రంప్ పెను ముప్పు. ఆయన విధానాలన్నీ దేశాన్ని తిరోగమన బాట పట్టించేవే’’ అని ఆక్షేపించారు.అభ్యర్థిత్వం స్వీకరించిన వాల్జ్..హారిస్ రన్నింగ్మేట్గా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ (60) లాంఛనంగా స్వీకరించారు. తనది అతి సాధారణ నేపథ్యమని గుర్తు చేసుకున్నారు. తనకు ఇంతటి అవకాశం కల్పించినందుకు పారీ్టకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కమల చాలా గట్టి నాయకురాలు. అత్యంత అనుభవజ్ఞరాలు. అమెరికాకు నాయకత్వం వహించేందుకు అన్ని అర్హతలతో సన్నద్ధంగా ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజలందరి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం రాజీ లేని పోరును ఆమె కొనసాగిస్తాన్నారు. ‘‘ట్రంప్ స్వయానా కుబేరుడు. కేవలం కుబేరులకు, అతివాద శక్తులకు ఉపయోగపడటమే ఆయన ఏకైక అజెండా’’ అంటూ దుయ్యబట్టారు.ట్రంప్ వయసుపై క్లింటన్ విసుర్లు..ట్రంప్ వయసుపై బిల్ క్లింటన్ చెణుకులు విసిరారు. 78 ఏళ్ల ట్రంప్ కంటే క్లింటన్ వయసులో కేవలం కొద్ది నెలలే చిన్నవాడు. దీన్ని ప్రస్తావిస్తూ, ‘‘రెండ్రోజుల క్రితమే నాకు 78 ఏళ్లు నిండాయి. నా కుటుంబంలో నాలుగు తరాల్లో నేనే అత్యంత పెద్ద వయసు్కణ్ని. ట్రంప్‌కన్నా వయసులో కాస్తంత చిన్నవాడినని గుర్తు చేసుకోవడమే నాకు ఏకైక ఊరట’’ అని క్లింటన్ చెప్పుకొచ్చారు. తద్వారా, వయసుపరంగా అమెరికాకు సారథ్యం వహించేందుకు ట్రంప్ అనర్హుడంటూ సంకేతాలిచ్చారు.హారిస్‌కు ఓప్రా మద్దతు..వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు ప్రఖ్యాత అమెరికా టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే మద్దతు పలికారు. షికాగోలో జరుగుతున్న డెమొక్రటిక్ జాతీయ సదస్సులో బుధవారం మూడో రోజు ఆమె ఉత్సాహపూరిత ప్రసంగం చేశారు. తద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. విన్ప్రే ఓ రాజకీయ వేదికపై మాట్లాడటం ఇదే తొలిసారి. ‘‘పుస్తకాలు ప్రమాదకరమని, రైఫిల్స్ సురక్షితమని, ప్రేమించడం తప్పుడు మార్గమనే విధ్వంసకర భావనలను మనపై రుద్దుతున్నారు. మనల్ని విభజించి, చివరికి జయించడం వారి లక్ష్యం’’అంటూ రిపబ్లికన్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ పేర్లు ప్రస్తావించకుండానే వారిని తూర్పారబట్టారు.‘‘హారిస్‌ను, ఆమె రన్నింగ్‌మేట్ టిమ్ వాల్జ్‌ను గెలిపించాలి. అదే అమెరికా గెలుపు’’అని పిలుపునిచ్చారు. ‘‘ఇల్లు అగి్నకి ఆహుతైతే ఆ ఇంటి యజమాని జాతి, మతం చూడం. భాగస్వామి ఎవరని అడగం. ఎవరికి ఓటేశారో చూడం. వాళ్లను కాపాడేందుకే ప్రయత్నిస్తాం. ఆ ఇల్లు సంతానం లేని పిల్లిదైతే ఆ పిల్లిని కూడా రక్షిస్తాం’’అన్నారు. సంతానం లేని మహిళ అంటూ హారిస్‌ను వాన్స్ గేలి చేయడాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లేని పిల్లుల్లాంటి మహిళల సమూహం అమెరికాను పాలిస్తోందంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. విన్ఫ్రేకూ పిల్లల్లేరు. ‘‘అభ్యర్థులకు విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం. హారిస్, వాల్జ్ మనకు హుందాతనం, గౌరవం అందిస్తారని నా మనస్సాక్షి చెబుతోంది’’ అన్నారు.డెమొక్రాట్ల సదస్సులో వైదిక ప్రార్థనలు..షికాగో: డెమొక్రటిక్ జాతీయ కన్వెన్షన్ (డీఎన్సీ) మూడో రోజు బుధవారం వైదిక ప్రార్థనతో ప్రారంభమైంది. ఇలా జరగడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి. ‘‘మనది వసుదైక కుటుంబం. సత్యమే మనకు పునాది. అదే ఎల్లప్పుడూ గెలుస్తుంది. అసతో మా సద్గమయ.. తమసో మా జ్యోతిర్గమయ.. మృత్యోర్మా అమృతంగమయం (అసత్యం నుంచి సత్యానికి, అంధకారం నుండి వెలుగుకు, మరణం నుండి అమరత్వానికి సాగుదాం). ఓం శాంతిః శాంతిః శాంతిః’’అంటూ భారత సంతతికి చెందిన అమెరికా పూజారి రాకేశ్ భట్ ప్రార్థనలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం విషయానికి వచి్చనప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు.‘’మన మనసులు ఒకేలా ఆలోచించాలి. సమాజ శ్రేయస్సు కోసం మన హృదయాలు ఒక్కటవ్వాలి. అందుకు మనల్ని శక్తిమంతులను చేయాలని, తద్వారా మనం ఐక్యమై, దేశం గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా’’అని చెప్పారు. మేరీలాండ్‌లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న భట్ బెంగళూరుకు చెందిన వ్యక్తి. ఉడిపి అష్ట మఠానికి చెందిన పెజావర్ స్వామీజీ వద్ద ఋగ్వేదం, తంత్రసార (మాధ్వ) ఆగమాలలో శిక్షణ పొందిన మధ్వా పూజారి. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లి‹Ù, తుళు, సంస్కృతం అనర్గళంగా మాట్లాడతారు. సంస్కృతం, ఆంగ్లం, కన్నడ భాషల్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. ఉడిపి అష్ట మఠం, సేలంలోని బద్రీనాథ్, రాఘవేంద్ర స్వామి ఆలయాల్లో పని చేసి 2013లో మేరీలాండ్ శివవిష్ణు ఆలయంలో చేరారు. -
ఈ పోస్ట్‌కార్డు.. జీవితకాలం లేటు!
ఇప్పుడంటే వాట్సప్, మెసెంజర్ల కాలం. కానీ వందేళ్ల కిందట సమాచారం చేరవేతకు ఏకైక మార్గం పోస్టే. ఒక లెటర్ చేరడానికి మూడు నుంచి వారం రోజులు, ఒక్కోసారి పది రోజుల నుంచి నెల దాకా కూడా పట్టేది. కానీ ఒక పోస్ట్‌కార్డు చేరడానికి ఏకంగా 121 ఏళ్లు పట్టింది! 1903లో పోస్ట్ చేసిన ఆ లేఖ శతాబ్దం ఆలస్యంగా చేరుకుంది. బ్రిటన్‌లో స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ అడ్రస్‌తో ఉన్న ఈ క్రిస్మస్ థీమ్ కార్డు క్రాడాక్ స్ట్రీట్ శాఖకు గతవారం చేరింది. ఆ చిరునామాలో గతంలో నివసించిన మిస్ లిడియా డేవిస్ బంధువులను కనిపెట్టి ఈ కార్డు ఎవరికి రాసిందో తెలుసుకుని వాళ్లకు చేర్చాలని సిబ్బంది భావిస్తున్నారు. ఈ పోస్టుకార్డును ఎవార్ట్ అనే వ్యక్తి లిడియాకు రాశారు.స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో 121 ఏళ్ల కిందట ఆండ్రూ డల్లీ తన భార్య మరియాతో కలిసి నివసించారు. వారి ఆరుగురు పిల్లల్లో పెద్ద కూతురు లిడియా. ఈ పోస్టు కార్డు పంపిన సమయంలో ఆమెకు 16 ఏళ్లు. వారి కుటుంబం గురించిన సమాచారం ఆన్లైన్లో చాలా తక్కువగా ఉందని స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ వర్గాలన్నాయి. ఆమెతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారేమో కనుగొని లేఖను అందజేస్తామని చెప్పుకొచ్చాయి.లేఖలో ఏముందంటే..‘డియర్ ‘ఎల్’.. నన్ను క్షమించండి. నేనా జత (ఏదో తెలియని వస్తువు) తీసుకోలేకపోయాను. నువ్వు ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నావని ఆశిస్తున్నా’ అని రాశారు. తన వద్ద 10 షిల్లింగ్లు ఉన్నాయని, రైలు చార్జీలను లెక్కించడం లేదని, తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. ‘గిల్బర్ట్, జాన్‌లను కలవాలి.. గుర్తుంచుకోండి’ అంటూ ముగించారు. ‘అందరికీ ప్రేమతో’అంటూ సంతకం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మేం ఆకలితో చస్తుంటే... మీకు మరో విమానమా?
ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి నైజీరియా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో అధ్యక్షుడు బోలా టినుబు కోసం కొత్త విమానాన్ని కొనడంపై నైజీరియన్లు మండిపడుతున్నారు. ఆకలి, పెరుగుతున్న జీవన వ్యయంపై దేశవ్యాప్తంగా అసంఖ్యాకులు రోడ్లపైకెక్కి నిరసన వ్యక్తం చేసిన రెండు వారాలకే ఈ పరిణామం జరిగింది. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా. గతేడాది అధ్యక్షునిగా ఎన్నికైన టినుబు పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక వృద్ధికి ఊతమివ్వడానికి తప్పదంటూ ఇంధన సబ్సిడీలను తొలగించారు. దాంతో ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. దీంతో తన సొంత పరివారంతో సహా అధికారిక ప్రయాణాలను, ప్రతినిధులను తగ్గిస్తున్నట్లు జనవరిలో ప్రకటించారు. ఉన్నట్టుండి ఇప్పుడిలా ఎయిర్ బస్ ఎ330 విమానాన్ని కొనుగోలు చేశారు. ఆయన సొంత విమానాల శ్రేణిలో ఇది ఏడోది! కొత్త విమానంలోనే గత సోమవారం ఫ్రాన్స్ వెళ్లారు.డబ్బు ఆదా అవుతుందట!తాము ఆకలితో చస్తుంటే అధ్యక్షునికి కొత్త విమానం కావాల్సొచందా అంటూ నైజీరియన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మెరుగైన రేపటి కోసం ఈ రోజు కష్టాలు భరించక తప్పదంటూ అధ్యక్షుడు సుద్దులు చెప్పారు! ఇదేనా ఆ మెరుగైన రేపు?’’అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 150 నైజీరియన్ బిలియన్లు పెట్టి మరీ విమానం కొనుక్కోవడం సగటు నైజీరియన్ల పట్ల అధ్యక్షునికి ఏమాత్రం బాధ్యత లేదనేందుకు రుజువంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారులు మాత్రం విమాన కొనుగోలును సమర్థించుకుంటున్నారు. పాత విమానాలకు కాలం చెల్లడంతో వాటి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. ఆ లెక్కన కొత్త విమానం వల్ల డబ్బు ఆదాయే అవుతుంది’’అంటూ అధ్యక్షుని మీడియా సహాయకుడు సూత్రీకరించడం విశేషం! ప్రస్తుత విమానాలు సురక్షితం కాదంటూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుని కోసం రెండు కొత్త విమానాల కొనుగోలుకు చట్టసభ సభ్యులు గతంలోనే సిఫార్సు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మానవీయ విలువలు వికసించాలి..
ఈనాడు సమాజంలో ఎటుచూసినా అమానవీయం, అరాచకం, అమానుషం రాజ్యమేలుతున్నాయి. మంచి, మర్యాద, మానవీయత మచ్చుకైనా కానరావడం లేదు. మనిషి మానవత్వాన్ని మరిచి మృగంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. తమ పాత్రలో నీళ్ళు తాగాడని, పెళ్ళిలో గుర్రంపై ఊరేగాడని, తమ చెప్పుచేతల్లో ఉండకుండా తమతో సమానంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని బడుగులు, బలహీన వర్గా లపై దాడులు చేయడం, హింసించడం, చంపడం లాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి సంఘటనలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలకడం మానవ విలువల హననానికి పరాకాష్ట. ఆ స్థాయి వ్యక్తుల్లోనే విలువలు లుప్తం కావడం వల్ల సమాజంలో అసహనం, విద్వేష భావజాలం, కుల, మత రాజకీయాలు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ పెద్ద స్థాయిలో మానవీయ పరిమళ వికాసాన్నీ మనం చూశాం. కోవిడ్ సమయంలో ఇలాంటి అనేక దృశ్యాలు మన కంటబడ్డాయి. వలస కూలీల దుఃస్థితికి చలించి మానవతను చాటుకున్న అనేకమందిని మనం దర్శించాం. అనేకమంది మానవతావాదులు దేశ సరిహద్దుల్లో, అననుకూల పరిస్థితుల్లో సైనికుల రూపంలో అసాధారణ సేవలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకోవడం, ప్రకృతి విపత్తులు విరుచుకు పడినప్పుడు ఆపదల్లో చిక్కుకున్న ప్రజలను ఎంతో సాహసోపేతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అన్నిరకాల సహాయక చర్యల్లో పాల్గొనడం మనకు తెలిసిందే. ఇదే మానవత్వం!ఇవ్వాళ ఉగ్రవాదం రూపంలో, ప్రభుత్వాల నిరంకుశ విధానాల రూపంలో, మతం, కులం, జాతి, ప్రాంతీయ విభేదాల రూపంలో అనేక దేశాల్లో మానవత్వానికి తీరని హాని కలుగుతోంది. అడుగంటుతున్న మానవతా విలువలను పరిరక్షించి, మానవ హృదయాల్లో వాటిని మరలా పునః ప్రతిష్ఠించవలసిన అవసరం ఉంది. ఇందుకోసం అన్ని దేశాలూ నడుం బిగించాలి. – ఎమ్‌డి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ -
వైద్యుల దుఃస్థితికి ప్రతీక!
కోల్‌కతా నగరంలో ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో విధుల్లో ఉన్న మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణ సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి, తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దేశంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో, రక్షణ కొరవడిన స్థితిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముఖ్యంగా మహిళలు విధుల్ని నిర్వహించాల్సి వస్తోందో ఇంకోసారి తేటతెల్లం చేసిన ఘటన ఇది. ఆ పీజీ వైద్య విద్యార్థి 36 గంటలుగా విధుల్లో ఉన్నారు. అర్ధరాత్రి దాటాక కాసేపు సెమినార్ రూమ్‌లో విశ్రమించిన సమయంలో దారుణానికి బలయ్యారు. అక్కడ సీసీ కెమెరాలు పని చెయ్యడం లేదట. ఆగంతకులు రాకుండా సరిపడా భద్రత, సరియైన వెలుతురు లేని క్యాంపస్... ఇవన్నీ ఆ కిరాతక చర్యకు దోహద పడ్డాయి.ఇది వ్యవ స్థాగత లోపం. మహిళా ఉద్యోగులకు పూర్తి స్థాయి భద్రత కల్పించలేని నిర్వాకం. ముఖ్యంగా వైద్య రంగంలో పనిచేస్తున్న వారు ఆరోగ్య సేవలు అందించడంలో తీవ్రంగా శ్రమ పడుతున్నారు. అయినా రోగి బంధువుల నుండి భౌతిక దాడులకు గురవ్వడం లాంటి సంఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. వాటిని అరికట్టే కఠిన చట్టాలు, చట్ట ప్రకారం సత్వరం శిక్ష పడేలా ఏర్పాట్లు వ్యవస్థలో అవసరం. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. ప్రాణాలు నిలిపే డాక్టరు, తానే ప్రాణభయంతో చికిత్స అందించాల్సి వస్తే అది రోగికి మాత్రమే కాదు ప్రజారోగ్య వ్యవస్థకే ప్రమాదం. ఇక హత్యోదంతం విషయంలో ఆ వైద్య కళాశాల పెద్దలే కాకుండా, ప్రభుత్వం కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.హత్యాచారం జరిగిన పిమ్మట ఆ కళాశాల ప్రిన్సిపాల్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ఆలస్యం చేస్తే, ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రభుత్వం ఆయనకు వేరే చోట బాధ్యతలు అప్పగించడం ద్వారా గౌరవించింది. సమయానికి హైకోర్టు స్పందించి ఆయన్ని సెలవుపై పంపమని ఆదేశించడం ద్వారా, కేసుని సీబీఐకి అప్పగించడం ద్వారా కొంత న్యాయం చేసింది. ఇలాంటి హీన నేరం జరిగిన తర్వాత కూడా అక్కడి ప్రభుత్వం కోర్టు చెబితే గానీ సరైన విధంగా స్పందించక పోవడం దారుణం. ఈ హత్యోదంతం నుండి పాఠాలు నేర్చుకుని ప్రభుత్వాలు వైద్యుల, ఆరోగ్య సిబ్బంది... రక్షణకు, భద్రతకు పూర్తి బాధ్యత వహించాలి. వారు పనిచేసే స్థలం పూర్తి సేఫ్ జోన్‌గా ఉండాలి. – డా. డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ -
పాత, కొత్తల గందరగోళం..
భారతదేశంలో నేరాల దర్యాప్తులో సుదీర్ఘమైన ఆలస్యం ఒక మహమ్మారిలా పరిణమించింది. ఇందువల్ల నిందితులైన అనేకమంది అమాయకులు అనవసరంగా జైళ్లలో విచారణ ఖైదీలుగా మగ్గ వలసి వస్తోంది. కొందరైతే పది పదిహేనేళ్లు జైల్లో ఉండి చివరకు నిర్దోషిగా విడుదలయినవారూ ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు ఇలాంటి అమాయకుల సంఖ్య పెరగడానికి దోహదపడ తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ చట్టాలు పోలీసులకు అరెస్ట్ చేసి నిర్బంధించేందుకు అపరిమిత అధికారాలను కట్ట బెడుతున్నాయి.నేర విచారణ అత్యంత ఆలస్యంగా జరగడం వల్ల కొందరు డబ్బున్న పెద్దవాళ్లు బెయిలుపై బయటికి వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తున్నారు. అదేసమయంలో అమాయకులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఆ విధంగా కొత్త చట్టాలు ఉన్నవారికి చుట్టాలు కాబోతున్నాయి. చట్టాలలో మార్పులు తెస్తే మంచిదే. ఈనాటి అవసరాలకు అనుగుణంగా వాటిని సవరించాలనే లక్ష్యం ఉంటే సంతోషం. చట్టాల మరింత ఆధునికీకరణ, సరళీ కరణ నేటి సమాజానికి అవసరం. కానీ కొత్త నేరాల చట్టాల వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరిగేలా ఉంది. ఈ చట్టాల ద్వారా జరిమానాలను చాలా పెంచారు.ఇది సరికాదు. పోనీ కనీసం కొత్త చట్టాల అమలు ద్వారా అయినా సత్వర తీర్పులు వచ్చే అవకాశం కలిగితే కొంత సంతోషం కలిగేది. కానీ కనుచూపు మేర అది సాధ్య మయ్యేలా కనిపించడంలేదు. ఎందుకంటే కొత్తగా నమోదయ్యే కేసులను కొత్త చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న లక్షలాది కేసులను పాత క్రిమినల్ చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఒకే సమయంలో పాత, కొత్త చట్టాల కింద విచారించడానికి తగిన సిబ్బంది, వసతులూ భారతీయ న్యాయ వ్యవస్థకు లేకపోవడం ఇక్కడ గమనార్హం.కొత్త మూడు చట్టాల్లో రెండింటిలో కొంచెం మార్పులు చేసినట్లు కనిపించినా మూడోదైన సాక్ష్య చట్టం మక్కీకి మక్కీ పాతదే. ఇండియన్ శిక్షాస్మృతి అనే 1860 నాటి పరమ పాత (లేదా సనాతన) చట్టం... ‘భారతీయ న్యాయ సంహిత– 2023’ పేరుతో మళ్లీ తీసుకురావడం విడ్డూరం. ఏం సాధించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాలను కొత్తగా తీసుకువచ్చిందో అర్థం కావడం లేదు. పార్లమెంట్లో స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితిలో లేని బీజేపీపై... భాగస్వామ్య పక్షాల్లో బలమైన టీడీపీ, జేడీయూ వంటివైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవడం విచారకరం. ఇందువల్ల ఈ కొత్త చట్టాలు నిరా ఘాటంగా కొనసాగేందుకు అడ్డంకీ లేకుండా పోయింది. ఇప్పటికే పౌర హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలను దారుణ నిర్బంధానికి గురి చేస్తున్నారు.రాజకీయ కక్ష సాధింపులకు పాత నేరచట్టాలను ఉపయోగించే ఎన్నో దారుణాలకు పాల్పడింది బీజేపీ సర్కార్. ఇప్పుడు కొత్త చట్టాలను ఉపయోగించి మరెంత అన్యాయంగా వ్యవహరిస్తుందో అనే భయం ఎల్లెడలా కనిపిస్తోంది. వీటిని అడ్డుపెట్టుకొని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి మరింతగా ప్రయత్నించవచ్చు. ఇప్పటికే అనేక కేసులు బనాయించిన ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు తమ పార్టీలో చేరిన తరువాత వారిపై కేసులు ఎత్తివేయడమో, లేక విచారణను వాయిదా వేసేలా చూడడమో బీజేపీ చేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో అమలులోకి వచ్చిన కొత్త చట్టాలు కేంద్ర పాలకు లకు ఇంకెంత మేలు చేకూర్చనున్నాయో! అంతి మంగా సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారనేది సుస్పష్టం.– మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త, మహేంద్ర యూనివర్సిటీ, ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
కాలం చెక్కిలిపై.. చెరగని కన్నీటి చారిక!
శతాబ్దాల బానిస గతానికి స్వతంత్రం అంతం పలికింది. భారత భవితవ్యానికి మాత్రం దేశ విభజన సవాళ్లు విసిరింది. స్వాతంత్య్రం కొరకు పోరాడిన వారు అంటూ చిరకాలంగా కొన్ని కుటుంబాలనే భారతీ యులు ఆరాధించారు. విభజన విషాదంలో అకారణంగా కన్ను మూసి, అందరినీ పోగోట్టుకుని, స్వాతంత్య్రోద్యమ సంబరాలు ఎరుగని వారినీ ఇప్పుడు తలుచుకోవాలని అనుకుంటున్నాం. దేశ విభజన విషాదాల సంస్మరణ దినం (ఆగస్ట్ 14) అందుకు అవకాశం ఇస్తున్నది.స్వాతంత్య్ర సమరంలోని చాలా ఘట్టాలు చరిత్ర పుటలకు చేరనట్టే, విభజన విషాదమూ మరుగున ఉండిపోయింది. కేవలం తేదీలు, కారణాలు, ఫలితాల దృష్టి నుంచి సాగే చరిత్ర రచన కంటే, చరిత్రకు ఛాయ వంటి సృజనాత్మక సాహిత్యమే విభజన విషాదాన్ని గుర్తు చేసే బాధ్యతను ఎక్కువగా స్వీకరించింది. ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదలు నిన్న మొన్నటి జస్వంత్ సింగ్ వరకూ తమ పుస్తకాలలో చరిత్రగా విభజన గాథను విశ్లేషించారు. నవల, కవిత, కథ, నాటక ప్రక్రియలు విభజన విషాదాన్ని ఆవిష్కరించిన తీరూ స్మరణీయమే.భీష్మ సహానీ ‘తమస్’ (అంధ కారం) విభజన కాలాన్ని చర్చించిన నవలా సాహిత్యంలో మకుటాయమానమైనదనిపిస్తుంది. విభజనకు కారణం మతమా? మత రాజకీయమా అన్నది చర్చించారాయన. చల్లారుతున్న మతోద్రిక్తతలు పంది కళే బరం మసీదు మెట్ల మీద కనిపించడం వల్ల తిరిగి భగ్గు మనడం ఇందులో ఇతివృత్తం. ఇంతకీ నాథూ అనే తోళ్ల కార్మికుడికి, పారిశుద్ధ్య కార్మికుడికి మాయమాటలు చెప్పి మురాద్ అలీ అనే వ్యాపారి చేయించిన పని ఇది. భారత జాతీయ కాంగ్రెస్ నాయకుల గిల్లికజ్జాలు, పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న ఆంగ్లేయుడు దేశం వీడు తున్న క్షణంలోనూ ప్రదర్శించిన ‘విభజించి పాలించు’ బుద్ధినీ కూడా ఇందులో పరిచయం చేశారాయన.చివరికి శాంతియాత్రకు మురాద్ అలీ ముందు ఉండడం పెద్ద మలుపు. ఈ నవలను డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెనిగించారు. మహిళల మీద విభజన చేసిన దాడిని చాలామంది వర్ణించారు. అమృతాప్రీతమ్ నవల ‘పింజర్’ (అస్తిపంజరం) వాటిలో ప్రత్యేకమైనది. పెళ్లి నిశ్చయమైన పూరో అనే హిందూ యువతిని రషీద్ అనే ముస్లిం యువకుడు అపహరించడం ఇందులో కీలకం. ఆమె తప్పించుకు వచ్చినా తల్లిదండ్రులు స్వీకరించ డానికి నిరాకరి స్తారు. మతం మారి రషీద్‌నే ఆమె పెళ్లి చేసుకుంటుంది. చివరికి ఆమె అవసరమే పుట్టింటివారికి వస్తుంది.స్వాతంత్య్రోద్యమం, దాని ఫల శ్రుతి వేర్వేరేనని గుర్తించాలన్నట్టు విభజన గాథలను వివరించేందుకు రైలు ప్రయాణాలను పలు వురు తమ ఇతివృత్తాలకు నేప థ్యంగా స్వీకరించారనిపిస్తుంది. వాటిలో ప్రముఖమై నది ‘ట్రెయిన్ టు పాకిస్తాన్’. కుష్వంత్ సింగ్ ఈ నవలను జుగ్గు (సిక్కు), నురాన్ (ముస్లిం)ల ప్రేమ వ్యవహారంతో ముడిపెట్టి అల్లారు. ముస్లిం శరణార్థులతో పాకిస్తాన్ వెళుతున్న రైలును కొందరు హిందువులు, సిక్కులు తగలబెడితే అందులో నుంచి నురాన్ను జుగ్గు రక్షిస్తాడు. భారత్ నుంచి ముస్లింల శవాలతో, వక్షోజాలు నరికిన మహిళల శరీరాలతో పాకిస్తాన్‌కు రైలు రావడం బప్సి సిధ్వా నవల ‘ఐస్‌క్యాండీ మ్యాన్’లో మలుపు.గుల్జార్ రాసిన ‘రావి నదికి ఆవల’ కథ విభజనతో భారత ఉపఖండం ఆత్మను కోల్పోయిన వైనం ఉంది. ఇది కూడా రైలు ప్రయాణం నేపథ్యంగానే సాగుతుంది. ఆయనదే ‘భయం’ (కావూఫ్) కథలో యాసిన్ అనే ముస్లిం యువకుడు లోకల్ ట్రైన్లో పొందిన వింత అనుభవం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఒక స్టేషన్లో మరో యువకుడు ఎక్కాడు. అతడు హిందువులా కనిపించాడు. అతడితో తనకు ప్రాణహాని తప్పదని రైలు భయాందర్ వంతెన మీదకు వచ్చాక గుమ్మం దగ్గర ఆదమరచి ఉన్న ఆగంతకుడిని యాసిన్ బయ టకు నెట్టేశాడు.మరుక్షణం ఒక ఆక్రందన ‘అల్లా’ అంటూ! భీష్మ సహానీ రాసిన ‘రైలు అమృత్సర్ చేరింది’ కథ కూడా పట్టాల మీద నడిచిన అనుభవమే. పాకిస్తాన్ నుంచి భారత్ వస్తున్న ఒక హిందూ శరణార్థిని (బాబు) ముస్లింలు ఏడిపిస్తారు. వాళ్లు మధ్యలో దిగిపోతారు. ఇతడు మాత్రం రైలు భారత్‌లో ప్రవేశించాక అంతదాకా అణచి ఉంచుకున్న కోపాన్ని ఇక్కడ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ముస్లిం మీద చూపిస్తాడు. అంతకు ముందే దాచి పెట్టిన ఇనప రాడ్‌తో తల బద్దలు కొడతాడు. పెషావర్–బొంబాయి మధ్యలో జరి గిన హిందూ ముస్లిం హింసాకాండ దృశ్యాలను కిషన్ చందర్ తన కథ ‘పెషావర్ ఎక్స్‌ప్రెస్’ కథలో అక్షర బద్ధం చేశారు. ఆ దారిలో రైలు ఆగిన ప్రతి స్టేషన్ రక్త పాతంతోనే కనిపిస్తుంది. ఒక చోట స్త్రీలను నగ్నంగా ఊరేగించడం కూడా కనిపిస్తుంది. గతంలోని కక్షలను వెలికి తీసి మరీ పరస్పరం దాడులకు దిగారు. పింజ ర్లో పూరోను రషీద్ ఎత్తుకుపోవడానికి కారణం, రెండు మూడు తరాల క్రితం ఆ ముస్లిం కటుంబం నుంచి ఒక మహిళను రుణం గొడవలో పూరో తాతలు ఎవరో అపహరించారు.ముస్లిం లీగ్ వైఖరి కారణంగానే విభజన జరిగిందన్నది నిజం. కానీ ఆ పరిణామాన్ని జీర్ణించుకోలేక పోయినవారు అన్ని వర్గాలలోను ఉన్నారు. సాదత్ హసన్ మంటో రాసిన ‘టోబా టేక్సింగ్’ కథకు ఇతివృత్తం ఇదే. రెండు మతాల వారిని రెండు దేశాలు పంచుకున్నట్టే మతిస్థిమితం లేనివారిని కూడా పంచు కుంటారు. కానీ లాహోర్ పిచ్చాసుపత్రిలో ఉన్న టోబా టేక్సింగ్ను భారత్‌కు అప్పగిస్తున్నప్పుడు అతడు వాఘా సరిహద్దులో సగం పాక్ వైపు, సగం భారత్ వైపు తన దేహం ఉండేలా పడి మరణిస్తాడు.విభజన నిర్ణయం తరువాత సరిహద్దు రేఖ గీయ డానికి వచ్చినవాడు సెరిల్ రాడ్‌క్లిఫ్. కేవలం ఐదువారా లలో అతడు ఆ పని ముగించాడు. కానీ రేఖ మీద నెత్తుటి తడి ఏడు దశాబ్దాలైనా ఆరలేదు. ఆ పరిణామం ఎంతటి పాశవికతకు దారి ఇచ్చిందో అమెరికా కవి డబ్ల్యూ హెచ్ ఎడెన్ ‘పార్టిషన్’ పేరుతో రాసిన తన కవితలో నిక్షిప్తం చేశాడు. ‘డ్రాయింగ్ ది లైన్’ పేరుతో రాడ్‌క్లిఫ్ చర్యనే నాటకంగా మలిచాడు బ్రిటిష్ రచయిత హోవార్డ్ బెంటన్. దీనిని 2013లోనే ప్రదర్శించారు. భారత విభజన ప్రపంచ చరిత్రలోనే విషాద కరమైనదిగా చెప్పడం సత్యదూరం కాదు. విభజన మూల్యం 20 లక్షల ప్రాణాలు. కోటీ నలభై ల„ý లు లేదా కోటీ ఎనభై లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇది ఇప్పటికి దొరికిన లెక్క. ఇందులో స్త్రీల దుఃఖం మరీ ఘోరమైనది. ఊర్వశీ బుటాలియా విభజన వేళ స్త్రీ పడిన వేదనను, క్షోభను, గుండె కోతను అన్వేషించారు. చాలాకాలం వరకు 75 వేల మంది మహిళలు విభజనకు బాధితులని అనుకున్నారు. కానీ లక్షమంది స్త్రీలను బలి చేశారని, ‘ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్’ పుస్తకంలో రాశారు.ఇన్ని కోట్ల మంది బాధితులలో ప్రతి ఒక్కరికీ ఒక విషాద గాథ ఉంది. ప్రతి కన్నీటి బొట్టుకు ఒక కథ ఉంది. నెలల తరబడి సాగిన ఈ హత్యాకాండలో చలికీ, వానకీ, ఎండకీ, మతోన్మాదానికీ, ఆకలికీ సరిహద్దుల వెంట రాలిపోయిన ప్రతి ప్రాణం ఒక నవలకు ఇతివృత్తం కాగలినదే. ఉన్మాదుల నుంచి రక్షణ కోసం గురుద్వారా వెనుక బావులలో పిల్లలతో సహా దూకేసిన వందలాది మంది మహిళల గుండె ఆక్రోశాన్ని, చావును సమీపంగా చూసిన పసి ఆక్రందనలను ఇప్పుడైనా గమ నించాలి. అందుకే ఆ గ్రంథాల వెల్లువ. మానవతను అతి హీనంగా ఛిద్రం చేస్తూ కాలం కల్పించే దుస్సంఘ టనల్లో దేశ విభజన కూడా ఒకటి!– డా. గోపరాజు నారాయణరావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మన్యం విప్లవ వీరుడు..
బ్రిటిష్ నిరంకుశ పాలనలో గిరిజనులు అనుభవిస్తున్న దయనీయ స్థితిని తొలగించి, వారి జీవితాలలో వికాస అభ్యుదయాలు కలిగించడానికి అల్లూరి సీతా రామరాజు మన్యంలో గొప్ప విప్లవం నడిపారు. దీనిలో పాల్గొన్న అల్లూరి అను చరులలో గంటన్న దొర, మల్లుదొరల తరువాత చెప్పుకోవలసిన వీరుడు బోనంగి పండు పడాల్. నేటి అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం గొందిపాకలులో 1890 ఆగస్టు 13న పడాల్ జన్మించారు. 22 ఏళ్ల వయస్సులో అదే గ్రామానికి చెందిన లింగాయమ్మతో వివాహమైంది. అప్పటికే బ్రిటిష్ పాలకుల దురాగతాలు పెచ్చు మీరిపోయాయి. దీంతో అల్లూరి సీతారామరాజుతో కలిసి సాయుధ పోరాటంలో భాగంగా పోలీస్ స్టేషన్లపై దాడుల్లో పాల్గొన్నారు.ప్రధానంగా 1922 సెప్టెంబరులో కృష్ణాదేవిపేట వద్ద బ్రిటిష్ సైనికాధికారులు హైటర్, క్లవర్ట్‌లను అంతమొందించిన దాడిలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. దీంతో పోలీసుల హిట్‌లిస్ట్‌లో చేరడంతో, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అల్లూరి సీతారామరాజు మరణం అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం పడాల్ వివరాలు, ఆచూకి తెలి పిన వారికి వంద రూపాయలు బహుమానం ప్రకటించింది. ఒక రోజు తన స్వగ్రామం వెళ్ళారు పడాల్. అప్ప టికే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేస్తూ ఉంది. దీంతో పడాల్ సోదరి (ఆక్క) రామయమ్మ భోజనానికి ఇంటికి పిలిచి బ్రిటిష్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు 1924 జూన్‌లో అరెస్టు చేశారు. విశాఖపట్నం సెషన్స్ కోర్టు 1925 మే 11న మరణ శిక్ష విధించింది. ఈ శిక్షను మళ్లీ యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.రాజమండ్రి, కన్నూరు, తిరుచు రాపల్లి, పాయంకోట, మద్రాస్ జైళ్లలో ఉంచి... తర్వాత 1926లో అండమాన్‌లో ప్రవాస శిక్షకు పంపించారు. నాటి నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు శిక్షను అనుభవించారు. జైలు నుంచి విడుదలైన పడాల్ అండమాన్‌లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. విడుదలైన వెంటనే తహసీల్దార్ ద్వారా గొందిపాకలులో ఉన్న భార్య లింగాయమ్మను అండమాన్ రప్పించుకునేందుకు ప్రయత్నించినప్ప టికీ ఆమె నిరాకరించింది. దీంతో అండమాన్‌లో పార్వతి అనే మహిళను వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు 2012 ఫిబ్రవరి 29న గొందిపాకలులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏటా ఆ గ్రామస్థులు పండు పడాల్ జయంతిని ఆగస్టు 13న ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటువంటి ఎందరో అమర వీరుల త్యాగ ఫలితమే ఇవ్వాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు! – ఎన్. సీతారామయ్య, పాడేరు -
ప్రపంచ వైద్యశాస్త్ర రంగంలో.. మందుల మహా మాంత్రికుడు!
ప్రపంచ వైద్యశాస్త్ర రంగంలో మందుల మహా మాంత్రికుడని సుస్థిర స్థానాన్ని పొందిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తెలుగుజాతి గర్వించదగిన ముద్దుబిడ్డ. ఎన్నో రకాల జాడ్యాలకు దివ్యౌషధాలను కనుగొని మనవాళికి మహోపకారం చేసిన మహోన్నత వైద్య శాస్త్రవేత్త.పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వెంకమ్మ, జగన్నాథం పుణ్య దంపతులకు 1895 జనవరి 12న ఆయన జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. తల్లి పెంపకంలో పెరిగారు. పుస్తెలమ్మి సుబ్బారావును చదివించింది తల్లి. రాజమండ్రిలో పాఠశాల విద్య పూర్తిచేసిన సుబ్బారావు పై చదువుల కోసం మద్రాసుకు వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన సోదరులు కొంత కాల వ్యవధిలో ఒకరి తరువాత ఒకరు ‘స్ప్రూ’ వ్యాధితో మరణించారు. మనోవేదనకు గురైన సుబ్బారావు దానికి మందు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. మద్రాస్ వైద్య కళా శాలలో చేరి వైద్య విద్యను పూర్తి చేశాక, పరిశోధన కోసం లండన్ వెళ్లి డాక్టర్ రిచర్డ్ స్ట్రాంగ్ శిష్యరికంలో ఉష్ణ మండల వ్యాధుల చికిత్సలో డిప్లొమా పొందారు. డాక్టర్ స్ట్రాంగ్ సూచన మేరకు అమెరికా వెళ్లి జీవ రసాయన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సుబ్బారావు తన పరిశోధనల వల్ల ఫోలిక్ ఆమ్లపు నిజ స్వరూపాన్ని గుర్తించారు. ఇది స్ప్రూ వ్యాధికీ, మైక్రోసైటిక్ ఎనీమియా వ్యాధికీ తిరుగులేని ఔషధంగా నిలిచింది. అలాగే బోధకాలు నివారణ కోసం మందు కనుక్కున్నారు. కీమోథెరపీ కోసం వాడే మెథోట్రెక్సేట్‌ను కనుక్కున్నారు. ఎల్లప్పుడూ పరిశో ధనలలో నిమగ్నం కావడం వల్ల సుబ్బారావు ఆరోగ్యం నశించింది. 1948 ఆగస్టు 8న అమెరికాలో కన్నుమూశారు. ఆయన సేవలు అందించిన అమెరికాకు చెందిన లీడర్లీ సంస్థ సుబ్బారావు మీద గౌరవంతో సుబ్బారోమెసెస్ ఔషధాన్ని ప్రవేశపెట్టింది. కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ప్రపంచ మానవాళికి తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తెలుగువాడు కావడం మన తెలుగు వారందరి అదృష్టం. – జాధవ్ పుండలిక్ రావు పాటిల్, 94413 33315 -
హరిత భవనాలే రక్ష!
జనాభాతో పాటుగా ఇంటి నిర్మాణాలు పెరిగి పర్యావరణ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూల జీవన శైలిని కొనసాగించడానికి హరిత భవనాలు ఎంతో ఉపయోగపడతాయి. పర్యావరణ అనుకూల మెటీరియల్, డిజైన్‌తో భవనాన్ని నిర్మించి, పర్యావరణ అనుకూలంగా ఏ భవనాలనైతే నిర్వహిస్తారో వాటిని ‘హరిత భవనాలు’ అంటారు.ఈ భవన నిర్మాణంలో స్థలం ఎంపికకూ ప్రాధాన్యం ఉంది. అంటే పర్యావరణ సున్నితమైన ప్రదేశాలలో హరిత భవనాలను నిర్మించరాదు. ఉదాహరణకు అధిక మొత్తంలో వ్యవసాయ దిగుబడిని ఇచ్చే సారవంతమైన వ్యవసాయ భూములను హరిత భవనాల నిర్మాణాల కోసం వాడరాదు. దీని వలన మనం ప్రకృతి సిద్ధంగా లభించిన విలువైన వ్యవసాయ భూమిని కోల్పోతాము. ఇది ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.సహజసిద్ధంగా గాలి, వెలుతురు వచ్చే విధంగా వీటి నిర్మాణాన్ని చేపడతారు. వెలుతురు బాగా ఉండే గదులలో చదివే విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యం, వెలుతురు సరిగ్గా లేని గదిలో చదివే విద్యార్థుల కన్నా 20 నుండి 26 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. హానికర రసాయన పదార్థాలు కలిగిన లెడ్ పెయింట్లు భవనాల లోపల గాలి నాణ్యతను హానికరంగా మారుస్తాయి కావున వాటి స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడతారు. ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు కూడా ఈ భవనాలలో ఉంటుంది. దీనివలన భవనాల లోపల గాలి నాణ్యత పెరుగుతుంది.తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఎల్ఈడీ బల్బ్‌లను, ఇతరత్రా తక్కువ విద్యుత్‌ను వినియోగించుకొనే ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం వలన ఈ భవనాలలో తక్కువగా విద్యుత్ ఖర్చవుతుంది. అదేవిధంగా సోలార్, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్‌ను వాడటం వలన గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో హరిత భవనాలు కీలక పాత్ర వహిస్తాయి. హరిత భవన పైకప్పులో కాంతిని రిఫ్లెక్ట్ చేసే పదార్థాలను వాడటం వల్ల ఇంటి పైకప్పు వేడి తగ్గుతుంది. పైకప్పు భాగంలో చిన్న, చిన్న మొక్కలను పెంచడం వలన వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ వాయువులను ఇవి గ్రహిస్తాయి. అదేవిధంగా ఇంటి పై కప్పు భాగంలో జీవ వైవిధ్యం పెరిగి సీతాకోకచిలుకలు, పక్షులు వంటి వాటిని ఆకర్షించడం వలన భవనం ఆకర్షణీయంగా మారుతుంది.ఈ భవనాలలో సేంద్రియ వ్యర్థ పదార్థాలను బయో గ్యాస్‌గా మార్చడం లేదా సేంద్రియ ఎరువుగా మార్చి ఉపయోగించే ఏర్పాట్లు ఉంటాయి. వాడిన నీటిని శుద్ధిచేసి తిరిగి గార్డెనింగ్, ఇతరత్రా పనులకు వినియోగించడం వలన నీరు వృథా కాదు. ఈ నిర్మాణాలలో వర్షపు నీరును పట్టి భూమిలోకి ఇంకిపోయేలా చేసే ఏర్పాట్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హరిత భవనాలు వాతావరణ మార్పుల నుండి మానవాళిని రక్షించగలుగుతాయి అనడం అతిశయోక్తి కాదు. – డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, హైదరాబాద్ -
తెలంగాణ నెక్కొండ వాసికి అరుదైన అవకాశం..
వరంగల్: అత్యంత ప్రతిష్టాత్మకంగా పారిస్‌లో జరగనున్న 33వ పారా ఒలింపిక్స్ క్రీడా సమరంలో న్యాయనిర్ణేతగా వ్యవహరించే అరుదైన అవకాశం ఉమ్మడి వరంగల్ బిడ్డకు దక్కింది. షటిల్ బ్యాడ్మింటన్ టెక్నికల్ అఫీషియల్‌గా భారతదేశం నుంచి ఇద్దరికి అవకాశం రాగా.. అందులో వరంగల్ వ్యక్తి ఒకరు కావడం విశేషం.ఆగస్టులో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (మలేషియా) పారా ఒలింపిక్స్‌లో న్యాయ నిర్ణేతలుగా పాల్గొనేందుకు భారత్ నుంచి పూణేకు చెందిన ఒకరిని నియమించగా.. ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ కొమ్ము రాజేందర్‌కు అవకాశం కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దశ ఒలింపిక్స్ కొనసాగుతుండగానే.. రెండో దశలో ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.ఈ ఒలింపిక్స్‌లో కొమ్ము రాజేందర్ టెక్నికల్ అఫీషియల్స్‌గా వ్యవహరించనున్నారు. భారత్ నుంచి తనకు అందిన ఈఅవకాశాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నానని చెబుతున్నారు ఫిజికల్ డైరెక్టర్ కొమ్ము రాజేందర్.గురువుల ప్రోత్సాహంతోనే..పాఠశాల స్థాయిలో ఆటల్లో నా ప్రతిభను గుర్తించి నాటి నుంచి ఒలింపిక్స్‌లో టెక్నికల్ అఫీషియల్‌గా ఎంపికవడం వరకు అడుగడుగునా గురువులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. క్రీడా గురువులు రాజశేఖర్, చెన్న కృష్ణ, సాంబయ్య, నిమ్మ మోహన్‌రావు, పి.కుమారస్వామి ఆట నేర్పిస్తే, అంపైర్‌గా రాణించేలా షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎస్.రమేశ్‌కుమార్, డాక్టర్ పి.రమేశ్‌రెడ్డి, రాష్ట్రస్థాయిలో కేసీహెచ్ పున్నయ్య చౌదరి, సుధాకర్ వేమూరి భుజం తట్టారు. – కొమ్ము రాజేందర్, ఒలింపిక్స్ టెక్నికల్ అఫీషియల్ -
బీసీలకు దామాషా ప్రకారం.. పదవులు దక్కాలి!
‘‘అణగారిన జనం సకాలంలో పురోగమించకపోతే కులం అనే విసుర్రాయి కిందపడి నలిగిపోతారని నేను భయపడుతున్నాను. అణగారిన కులాలను బలపరచట మంటే కుల విద్వేషాలను ప్రోత్సహించినట్లు కాదు. మనుషుల్ని వారి పుట్టుకను బట్టి హీనులుగా పరిగణించే పద్ధతి మనలో అంతరించిపోయిన రోజు నా జీవితంలో సంతోషకరమైన రోజు అవుతుంది’’ అన్న ఛత్రపతి సాహూ మహరాజ్... బలహీనవర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ 1902 జులై 26న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు భారత సామాజిక ఉద్యమాల చరిత్రలో బడుగులు మరిచి పోలేని రోజు..వందేళ్ళ క్రితమే సాహూ మహరాజ్ కొల్హాపూర్ సంస్థానంలో దళితులను గ్రామాల్లో పట్వారీలుగా నియమించారు. కానీ స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్ళ తర్వాత కూడా బీసీ కులాల గణన చేసి జనాభా దామాషా ప్రకారం చట్ట సభల సీట్లు కేటాయించమని అడుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారంటే దేశంలో ఆధిపత్య వర్గాలు నేటికినీ పల్లెలను ఎంతగా తమ చేతుల్లో పెట్టుకుని అధికారాల్ని చలాయిస్తున్నారో అవగతమవుతుంది. కులగణన ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయిందంటే పాలకులు ఇప్పటి దాకా ఎంత నిర్లక్ష్యంగా పాలిస్తూ వస్తున్నారో తెలుస్తుంది.బడుగులు బాగుపడకుండా ఈ దేశం బాగుపడ దని తెలిసి కూడా దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. ‘బీసీ సబ్ ప్లాన్’ను పెట్టాలనీ, దానికి అత్యధిక నిధులివ్వాలనీ బీసీలు వూరేగింపులు చేస్తున్నారంటే ఇంతకంటే దేశానికి దరిద్రం మరేముంటుంది! కులగణనను కాంగ్రెస్ తాత్సారం చేస్తుంటే, బీజేపీ కులగణన చేయనని చెబుతోంది. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీల హక్కుల కోసం చట్టసభలు మాట్లాడకుండా దాటవేస్తూ రావటం ప్రజాస్వామ్యాన్ని హననం చేసినట్లుగానే భావించాలి. సగం దేశంగా ఉన్న బీసీ కులాల జీవన విధానం ఎట్లా ఉందో తెలుసుకోకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో ఎట్లా నడిపిస్తారో మన సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య పాలకులే చెప్పాలి.దేశాన్ని మొత్తం ఆవరించి ఉన్న బీసీ ఉత్పత్తి కులాలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో కీలక స్థానాలలోకి, నాయకత్వ దశకు రాకుండా దేశం అభివృద్ధి చెందదు. ఆధిపత్య కులాల పెట్టుబడి దారుల చేతుల్లో అధికార పగ్గాలు ఉన్నంత కాలం బీసీలు దుర్భరమైన పరిస్థితుల్లోనే మగ్గిపోక తప్పదు. దేశం అన్ని రంగాల్లోకి దూసుకు పోవాలంటే దేశాన్ని ప్రభావితం చేయగల బీసీలు అన్నిరంగాల్లో శిరసెత్తుకుని నిలవాలి. ఉత్పత్తి కులాల చేతులు పడకుండా దేశం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.మనం చైనా దేశ జనాభాను దాటి ముందుకొచ్చాం. ఉత్పత్తి శక్తుల చేతుల్లోకి దేశ ప్రగతి రథచక్రాలు వచ్చినప్పుడే చైనా ప్రగతిని మించి ముందుకు సాగుతాం. నేటికినీ బడుగు వర్గాలకు, ఉత్పత్తి కులాలకు పాలించే లక్షణాలు లేవని మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినట్లే అవుతుంది. ఉత్పత్తి కులాలు ఉత్పత్తి శక్తులై పారిశ్రామికవేత్తలుగా తయారైనప్పుడే దేశం అన్ని రంగాల్లో అసలు సిసలు ప్రగతిని సాధిస్తుంది. దేశాన్నీ, రాష్ట్రాన్నీ పాలించే పాలకులు సాహూ మహరాజ్ లాగా ఆలోచించాలి. ఆధిపత్య వర్గాల నాయకులు తమ హ్రస్వదృష్టిని విడిచిపెట్టి బడుగుల భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి. తమ కులం గొప్పదని, బడుగుల కులాలు తక్కువన్న దుర్మార్గపు ఆలోచన నుంచి ఆధిపత్య కులాలు బైట పడాలి.బడుగుల బాగే దేశం బాగు అని ఆలోచించగలిగినవారే సాహూ మహారాజులు కాగలుగుతారు. సమ రాజ్యాన్ని నిర్మించగలుగుతారు. బహుజన హితం కోరి దేశం అభివృద్ధిని కాంక్షించి బడుగులకు పల్లెనుంచి పార్లమెంటు దాకా వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. స్థానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ వాళ్ళ జనాభా ఎంతో అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. కుల గణన చేస్తామని తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీల కుల గణన చేసినాకే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోవాలన్నది బీసీల సామూహిక డిమాండ్. తమ వాటా స్థానాలను కోల్పోయిన బీసీలు తమ హక్కుల సాధనకు వారే గొంతెత్తి గర్జించాలి.– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు (బలహీన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ సాహు మహారాజ్ ఉత్తర్వులు జారీ చేసిన రోజు... జూలై 26) -
అంబేడ్కర్ దారిలో అలుపెరుగక..
‘ఈ ప్రపంచాన్ని జయించడానికి ప్రేమతో మొదలవ్వు. ప్రేమ త్యాగమై, యుద్ధ గీతమై, అదో గొప్ప పోరాటాన్ని విశ్వవ్యాప్తం చేస్తుంది. నిన్ను విజేతగా నిలబెడుతుంది’ అంటారు 71 ఏళ్ల సాహితీ వేత్త, దళితోద్యమ నాయకుడు డా‘‘ కత్తి పద్మారావు. ఆయన జీవితం – సాహిత్యం – ఉద్యమాలు వేర్వేరు కావు. పరిణామ క్రమంలో ప్రవాహ సదృశ్యంగా కొన సాగుతూ వచ్చిన, గుణవాచి అయిన కాల ధర్మం! అంబేడ్కర్ దార్శనికతనూ, తాత్వికతనూ, వివేచనా నిపుణతనూ ఆకళింపు చేసుకున్న ప్రథమ శ్రేణి ఆచరణ శీలుడాయన.అంబేడ్కర్ మార్గంలో పూలే నుండి పెరియార్ మీదగా చార్వాకుడు, బుద్ధుని వరకూ... ఆ తరువాతి నవ్య సిద్ధాంతకర్తలనూ, చరిత్రకారులనూ పరి శీలించి ఆకలింపు చేసుకున్నారు. సంస్కృత పాండిత్యం వల్ల అపా రమైన అధ్యయనం, పరిశీలన, రచనా శక్తి అబ్బింది. జలపాతం సదృశ్యమైన వాక్చాతుర్యం, సమయ స్ఫూర్తి, ఉత్తేజ పరచటం, వాదనా పటిమలతో అత్యుత్తమ రీతిలో ప్రజ లకు చేరువయ్యారు. కారంచేడు, కొత్తకోట, నీరుకొండ, పిప్పర్ల బండ్ల పల్లి, చుండూరు, పదిరి కుప్పం, వేంపెంట, లక్షింపేట వంటి ఉద్యమాలలో నాయకునిగా నిలిచి, ప్రభుత్వాలతో పోరాడి, ప్రజాయుద్ధంతో విజ యాన్ని సాధించారు.కారంచేడు, చుండూరు వంటి ఉద్యమాలలో బాధితుల పక్షాన నిలబడి వారికి వందల ఎకరాల భూములు ఇప్పించి, బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ సహాయం ఏర్పాటు చేసి, ఉద్యోగాలు ఇప్పించి, చిల్లిగవ్వ కూడా ప్రభుత్వ సొమ్ములను ఆశించకుండా నిజాయితీగా, నిబద్ధతతో తమ రచనలను నమ్ముకుని, అమ్ముకుని జీవనం సాగిస్తున్న అక్షర సంపన్ను లాయన. పార్లమెంటు సాక్షిగా 111 మంది ఎంపీలతో ‘1989 ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టా’న్ని తీసుకు రాగలిగారు.‘బౌద్ధ దర్శనం’, ‘చార్వాక దర్శనం’, ‘దళితుల చరిత్ర,’ ‘బ్రాహ్మణవాద మూలాలు’, ‘కులం ప్రత్యామ్నాయ సంస్కృతి’, ‘పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ’, ‘భారత రాజకీయాలు – కులాధిపత్య రాజకీయం – ప్రత్యామ్నాయ వ్యక్తిత్వాలు’, ‘అంబేడ్కర్ చూపు’ వంటి 89 రచనలను అందించారు. ఆయన కుటుంబం అంతా కులాంతర వివాహాలు చేసుకున్నారు. స్వయంగా తన చేతుల మీదుగా కొన్ని వేల కులాంతర వివాహాలు జరిపించడం ద్వారా ఒక సామాజిక మార్పునకు మార్గదర్శిగా నిలిచారు. మొత్తంగా ఆయన రచనల సారాంశం... ఉద్యమ రూపం, ప్రశ్న, ప్రతిఘటన, ప్రగతిగా సాగుతుంది. సమకాలీన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, సామా జిక రంగాల్లో కత్తి పద్మారావు పాత్ర ఎవరూ తిరస్కరింపలేనిది. – శిఖా ఆకాష్, నూజివీడు, 93815 22247 (రేపు డా. కత్తి పద్మారావు 71వ జన్మదినం సందర్భంగా...) -
స్వేచ్ఛ కోసం విప్లవించి...
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విప్లవ పంథాలో పనిచేసి దేశానికి ప్రాణాలు అర్పించినవారిలో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. 1906 జూలై 23న మధ్యప్రదేశ్ లోని బాబానగర్‌లో ఆయన జన్మించారు. అయితే ఆయన పూర్వీకులు ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు కావడంతో తల్లిదండ్రులు కాశీ విద్యా పీఠంలో సంస్కృత విద్యను అభ్యసించడానికి ఆయన్ని చేర్చారు.అప్పటికే స్వాతంత్య్ర ఉద్యమానికి ఆకర్షితుడై 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తాను చదువుకుంటున్న సంస్కృత విద్యాపీఠం ముందే ధర్నా చేశాడు. పోలీ సులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ‘నీ పేరేమిటి?’ అన్న జడ్జి ప్రశ్నకు ఆ 15 ఏళ్ల బాలుడు ‘ఆజాద్’ (స్వేచ్ఛ) అని సమాధానం ఇచ్చాడు. అప్పటి నుంచి అతడి పేరులో ఆజాద్ భాగమయ్యింది. ఇటువంటి సమాధానాలకు అతడికి 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు జడ్జి.పెద్దవాడవుతున్న కొద్దీ అహింసా మార్గంలో దేశా నికి స్వాతంత్య్రం రాదని ఆయన నమ్మాడు. భగత్‌సింగ్, రాంప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లాఖాన్లతో మైత్రి ఏర్పడింది. వీరంతా కలిసి ‘హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్’ అనే విప్లవ సంస్థను స్థాపించారు. వారి పోరాటానికి అవసరమైన వనరులను సమకూర్చు కోవడానికి 1925లో కకోరి వద్ద బ్రిటిష్ ప్రభుత్వ ధనాన్ని తరలిస్తున్న రైలును ఆపి దోపిడీ చేశారు.ఈ కేసులో అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ లాంటివారిని పట్టు కుని ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆజాద్ అజ్ఞాతంలోకి వెళ్లి పనిచేయ సాగాడు. 1931 ఫిబ్రవరి 27 ఉత్తర ప్రదేశ్‌లోని ‘ఆల్ఫ్రెడ్ పార్కు’లో ఆజాద్ ఉన్నాడని తెలిసిన పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్ తన తుపాకితో వీరోచి తంగా పోరాడి చివరి బుల్లెట్‌తో తనను తాను కాల్చుకొని పోలీసులకు ప్రాణా లతో చిక్కకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాడు. అలా స్వతంత్ర భారత యజ్ఞంలోస్వీయ సమిధయ్యాడు. – ఛత్రపతి చౌహాన్, ఏబీవీపీ తెలంగాణ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు