Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Ktr Approach Supreme Court Over Formula E Car Race Case1
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌

సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసు(Formula E Car Race Case)లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court)లో ఆయన సవాల్‌ చేశారు.ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో ఏసీబీ కేసును కొట్టేయాలని కేటీఆర్‌ వేసిన క్వాష్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేం జోక్యం చేసుకోం అని తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్‌ తరఫు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు.ఈ కేసులో తాజా పరిణామాలపై ఏసీబీ ఆఫీసులో అధికారులు భేటీ అయ్యారు. ఎఫ్‌ఈవో, హెచ్‌డీఏతో పాటు రెవెన్యూ అధికారుల పాత్రపై చర్చించడంతో పాటు సుప్రీం కోర్టును కేటీఆర్‌ ఆశ్రయించడంతో.. అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు.మరో వైపు.. అధికారులు అరవింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌రెడ్డి నోటీసులపై చర్చతో పాటు, మొదటి రేసు తర్వాత తప్పుకున్న కంపెనీలపై కూడా చర్చించారు. ఏసీబీ ఉన్నతాధికారులతో​ బంజారాహిల్స్‌ ఏసీపీ,సీఐతో పాటు కొంతమంది సిబ్బంది సమావేశమయ్యారు. క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును కేటీఆర్‌ ఆశ్రయించారు. కాగా, తమ వాదన కూడా వినాలని ప్రభుత్వం.. కేవీయట్‌ వేసింది.ఇదీ చదవండి: కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్‌ క్వాష్‌ అరుదైన నిర్ణయం: హైకోర్టు

EC Announces Delhi Assembly Election Schedule2
ఢిల్లీలో ఒకే విడతలో ఎన్నికలు.. ఫిబ్రవరి 5న పోలింగ్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. విజ్ఞాన్ భవన్‌లో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ ఇలా.. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్‌ ఎన్నికలకు పోలింగ్‌.. ఫిబ్రవరి 5ఎన్నికల ఫలితాలు.. ఫిబ్రవరి 8నామినేషన్లకు చివరి తేదీ.. జనవరి 17నామినేషన్ల విత్‌ డ్రా చివరి తేదీ.. జనవరి 20 #WATCH | Delhi to vote in a single phase on February 5; counting of votes on February 8 #DelhiElections2025 pic.twitter.com/QToVzxxADK— ANI (@ANI) January 7, 2025ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది. గతేడాది ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. ఓట్ల తొలగింపు ఆరోపణలను ఖండిస్తున్నాం. ఎన్నికలను పారదర్శంగా నిర్వహిస్తున్నాం. ఈవీఎంల పనితీరుపై పూర్తి విశ్వాసంగా ఉన్నాం. ఈవీఎంల వాడకంలో పారదర్శకత ఉంది. ఈవీఎంలు ట్యాపరింగ్‌ జరిగినట్టు ఆధారాలు లేవు. ఈవీఎంల విషయంలో అసత్యాలను నమ్మవద్దు. ఈ ఏడాది తొలి ఎన్నికల్లో ఢిల్లీలో జరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. ఢిల్లీకి స్టేట్‌ స్టేటస్‌ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నెగ్గింది. షీలా దీక్షిత్‌ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్‌ పాలన సాగించింది. ఇక..2013 నుంచి ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో..ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్‌ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్‌-కాంగ్రెస్‌లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి.

Saudi Mecca Got Extreme rain Fall Video Viral3
వీడియో: సౌదీ ‘మక్కా’లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు

జెడ్డా: సౌదీ అరేబియాలో అతి భారీ వర్షం కురిసింది. కుండపోత కారణంగా ముస్లిం పవిత్ర మక్కా నగరం చెరువును తలపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం జలమయమైంది. వర్షం కారణంగా దర్శనానికి వచ్చిన లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.సౌదీ అరేబియాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో భారీ నష్టం జరిగింది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. మక్కా, మదీనా, జెడ్దాలో ఎడతెరిపలేని వర్షంతో భారీ వరదలు వచ్చాయి. ఉరుములు, మెరుపులతో సుడిగాలులు విరుచుకుపడ్డాయి. దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో మక్కాలో ఉమ్రా యాత్రకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు.#Breaking: 🇸🇦 Mecca is floating: Torrential rain with hail have led to severe flooding in the holy city for Muslims in Saudi Arabia.😭May Allah protect us from this danger.pic.twitter.com/OgUwGwNhp6— Md.Sakib Ali (@iamsakibali1) January 7, 2025 Scenes of heavy rain falling on Mecca and Jeddah in the Kingdom of #SaudiArabia pic.twitter.com/2EsGyc3IC5— Hamdan News (@HamdanWahe57839) January 6, 2025 SAUDI ARABIA :📹 POWERFUL STORM HIT JEDDAH CITY TODAYScenes from KING ABDULAZIZ International Airport pic.twitter.com/KBta0A0gDD— 𝛎í⸦𝛋𝚼 (@iv1cky) January 7, 2025 మక్కా, మదీన, జెడ్దాలో ఊహించని విధంగా వరదనీరు ముంచెత్తడంతో అనేక కార్లు, టూరిస్ట్ బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక, మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూడు నగరాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో సౌదీలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. #Mecca after rain outside.Haram Shareef pic.twitter.com/XYrR0FNdep— Saeed Hameed (@urdujournosaeed) January 7, 2025 Mecca, Saudi Arabia, experienced heavy rainfall today, leading to significant flooding. The city received an unusually high amount of rain within a short time. Thankfully, emergency teams are working hard, and the situation is under control. Rain is rare in Mecca, but it’s always… pic.twitter.com/KNfJyy16My— مدقق لغوي 👓 (@Lang_checker) January 6, 2025 మక్కాకు సౌత్ సైడ్ ఉన్న అల్-అవాలి పరిసరాల్లో వరదల్లో చాలామంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని, గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం, వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా వర్షాల కారణంగా మరణాల సంఖ్య తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో 2009లో సౌదీ కురిసిన వర్షం, వరదల కారణంగా దాదాపు 100 మంది చనిపోయారు. Heavy rainfall in the outskirts of *Al-Awali* near Mecca, Saudi Arabia, has caused many areas to flood. 🌧️🚗 Several vehicles were submerged in the floodwaters, and citizens faced severe difficult. #Flood #AlAwali #Rain pic.twitter.com/pOSvkaua1m— rebel (@Asifahm07207201) January 7, 2025 Heavy rain in Mecca.. pic.twitter.com/ciZh7odU66— TAJNIMUL (@tajnimul11606) January 6, 2025 Massive flooding due to extreme rainfall in Mecca, Saudi Arabia 🇸🇦 Today #Rain #macca #TodayNews #UPDATE pic.twitter.com/cCIRcbH0oL— ✩𝐒𝐇𝐀𝐇𝐈𝐃 𝐌𝐔𝐒𝐓𝐀𝐅𝐀✩ (@Shahidmustafa_m) January 6, 2025

Delhi Cm Atishi Pressmeet On House Cancellation By Centre4
నాకు ఇల్లు లేకుండా చేశారు: సీఎం అతిషి

న్యూఢిల్లీ:సీఎంగా తనకు కేటాయించిన ఇంటిని కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి రద్దు చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మండిపడ్డారు. మూడు నెలల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారని చెప్పారు. మంగళవారం(జనవరి7) ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంటి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం కూడా నోటీసులు వచ్చాయని తెలిపారు. ఇ‍ప్పుడుంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా అందులో కోరారని వివరించారు.తన కుటుంబ సభ్యులను కూడా బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని అతిషి ఆరోపించారు.తాను సీఎంగా ఎన్నికైన తర్వాత మా వస్తువులన్నింటినీ బీజేపీ కార్యకర్తలు రోడ్డుమీదకి విసిరేశారని చెప్పారు. తమ ఇళ్లను బీజేపీ లాక్కోవచ్చేమో గాని ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం పని చేయకుండా తమను ఎవరూ ఆపలేరన్నారు. అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లలోనే ఉంటూవాళ్ల కోసం పని చేస్తానన్నారు.కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం(జనవరి 7) ప్రకటించింది. ఫిబ్రవరి 5వ పోలింగ్‌ జరగనుంది.అదే నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముక్కోణపు పోరు జరగనున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్‌, బీజేపీ మధ్యే ఉండనుంది. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు షాక్‌..‘ఆప్‌’కు అఖిలేష్‌ మద్దతు

YSRCP Vidadala Rajini Serious Comments On CBN Govt5
బాబూ.. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదా?: విడదల రజిని

సాక్షి, గుంటూరు: ఏపీలో పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి విడదల రజని(Vidadala Rajini). ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు.మాజీ మంత్రి విడదల రజిని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆరోగ్యశ్రీ(aarogyasri) పేదలకు సంజీవిని లాంటింది. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించటమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రారంభించారు. ఇతర సంక్షేమ పథకాల మాదిరిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చూడకూడదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన పథకాన్ని వైఎస్‌ జగన్ మరింత బలోపేతం చేసి పేదలకు అందించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే అని భావించి ఆరోగ్యశ్రీని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసింది.ఈరోజు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు వైద్య సేవలు ఆపేశాయి. ప్రజల ఆరోగ్యం.. ప్రభుత్వ బాధ్యత కాదు అని కూటమి సర్కార్‌ ఆలోచిస్తోంది. ఇటువంటి పరిస్థితులు మా ప్రభుత్వంలో ఎప్పుడూ రాలేదు. కోవిడ్‌(covid)ను ఆరోగ్యశ్రీలో చేర్చి మా ప్రభుత్వం వైద్యం అందించింది. గత ప్రభుత్వాలు అమలు చేసిన ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం కొనసాగించాలి. మూడు వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి‌. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్యశ్రీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఆరోగ్య శ్రీని హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్‌లో అమలు చేస్తామని చెబుతున్నారు. థర్డ్‌ పార్టీకి‌ బీమా సౌకర్యం అందించే ప్రయత్నం మంచిది కాదు. బీమా కంపెనీలు సేవా దృక్పథంతో వ్యవహరించవు. అలాగే, బీమా సౌకర్యం ఎన్ని ఆసుపత్రుల్లో అమలు చేస్తారో తెలియదు. ఎన్ని రోగాలకు అమలు చేస్తారో తెలియదు. ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్ విధానాన్ని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తుంది. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదన్న సందేశాన్ని ఇస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేయలేకపోయాయి. 2019లో వైఎస్‌ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 637 కోట్ల పాత ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించారు అని చెప్పుకొచ్చారు.

Kollywood Star Hero Ajith Kumar Car Accident In Dubai Race6
అజిత్‌ కుమార్‌కు తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!

తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పింది. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. రేసింగ్ ప్రాక్టీస్‌ చేస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంక్రాంతి బరిలో అజిత్..కాగా.. అజిత్‌ కుమార్‌ హీరోగా ప్రస్తుతం ‘విడాముయర్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మగిళ్‌ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా‌ ప్రధాన పాత్ర పోషించారు. లైకా ప్రోడక్షన్స్‌ బ్యానర్‌పై జీకేఎం తమిళ్‌ కుమరన్‌ నేతృత్వంలో సుభాస్కరన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన విడాముయార్చి సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మా మూవీపై అంచ నాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసండ్రా, నిఖిల్‌ నాయర్‌ కీలక పాత్రల్లో నటించారు.మైత్రి మూవీ మేకర్స్‌తో మరో సినిమా..అజిత్ కుమార్‌ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్‌గా నటిస్తోంది . ‘మార్క్‌ ఆంటోని’ ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని‌ నిర్మిస్తున్నారు.వేసవిలో రిలీజ్..ఈ మూవీని వేసవిలో ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. అజిత్‌పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయి. ఇండియన్ మూవీ చరిత్రలోనే గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ ఓ మైలురాయిగా నిలుస్తుందిని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ వీలు కాకపోవడంతో ఏప్రిల్‌కు రిలీజ్‌ కానుంది. Ajith Kumar’s massive crash in practise, but he walks away unscathed.Another day in the office … that’s racing!#ajithkumarracing #ajithkumar pic.twitter.com/dH5rQb18z0— Ajithkumar Racing (@Akracingoffl) January 7, 2025

India Have Got Terrific player: Irfan Pathan lauds Nitish Reddy BGT Success7
నితీశ్‌ రెడ్డి ఆ స్థానంలో బ్యాటింగ్‌ చేశాడంటే.. తిరుగే ఉండదు!

టీమిండియా యువ సంచలనం నితీశ్‌ కుమార్‌ రెడ్డి(Nitish Kumar Reddy)పై భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌(Irfan Pathan) ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసే అవకాశం రావడమే గొప్ప అనుకుంటే.. తన ఆట తీరుతో అతడు అద్భుతాలు చేశాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్‌-2024 ద్వారా వెలుగులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ రెడ్డి.బంగ్లాతో సిరీస్‌ సందర్భంగా..సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున సత్తా చాటిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన 21 ఏళ్ల నితీశ్‌ రెడ్డి.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే, తనకున్న అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యాల కారణంగా అనతికాలంలోనే టెస్టు జట్టుకూ ఎంపికయ్యాడు. ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు నితీశ్‌ రెడ్డి. అంతేకాదు తుదిజట్టులోనూ స్థానం సంపాదించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో బ్యాట్‌ ఝులిపించి సత్తా చాటాడు.మెల్‌బోర్న్‌లో గుర్తుండిపోయే శతకంఇక మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా నితీశ్‌ రెడ్డి ఏకంగా శతకంతో చెలరేగాడు. రోహిత్‌ శర్మ(Rohit Sharma), విరాట్‌ కోహ్లి విఫలమైన చోట.. 114 పరుగులతో దుమ్ములేపి.. తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్‌ రెడ్డి ఆట తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. టీమిండియాకు దొరికిన మరో ఆణిముత్యం అంటూ సునిల్‌ గావస్కర్‌ వంటి దిగ్గజాలు అతడి నైపుణ్యాలను కొనియాడారు.కాగా ఆసీస్‌తో ఐదు టెస్టుల్లో కలిపి తొమ్మిది ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన నితీశ్‌ రెడ్డి.. 298 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, నితీశ్‌ రెడ్డి ఈ సిరీస్‌లో ఎక్కువగా ఎనిమిదో స్థానంలోనే బ్యాటింగ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడం మామూలు విషయం కాదు.ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడంటే.. తిరుగే ఉండదు!మనలో చాలా మంది నితీశ్‌ రెడ్డి సెంచరీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నిజానికి.. అతడు సిరీస్‌ ఆసాంతం 40 పరుగుల మార్కును అందుకున్నాడు. ఏదేమైనా.. అతడు శతకం బాదిన తర్వాత.. చాలా మంది.. టీమిండియాకు ఎనిమిది లేదంటే ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేసే ఆల్‌రౌండర్‌ దొరికాడని సంతోషపడ్డారు.నిజానికి ఒకవేళ ఆరో స్థానంలో గనుక అతడిని ఆడిస్తే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అతడికి ఆ సత్తా ఉంది. టీమిండియా విధ్వంసకర ఆటగాడిగా అతడు ఎదగగలడు. దీర్ఘకాలం పాటు ఆరో నంబర్‌ బ్యాటర్‌గా సేవలు అందించగల యువ క్రికెటర్‌ అతడు’’ అని పేర్కొన్నాడు.ఐదో బౌలర్‌గానూఅదే విధంగా.. విదేశీ గడ్డపై పేస్‌ దళంలో ఐదో బౌలర్‌గానూ నితీశ్‌ రెడ్డి రాణించగలడని ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి మూడు ఇన్నింగ్స్‌లో నితీశ్‌ రెడ్డి బౌలర్‌గా విఫలమయ్యాడు. అయినప్పటికీ.. ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి బౌలింగ్‌ ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంది. బౌలింగ్‌ నైపుణ్యాలకు ఇంకాస్త మెరుగులు దిద్దుకుంటే.. ఐదో బౌలర్‌గా అతడు అందుబాటులో ఉండగలడు’’ అని పేర్కొన్నాడు.చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్‌ ఉన్నంత వరకు.. : భజ్జీ

BJP Leaders Reaction Over Telangana Party Office Incident8
Congress Vs BJP: గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్‌!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ ఆఫీసుపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్‌ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీ మోర్చా నాయకులు, కార్యకర్తలు.. బీజేపీ ఆఫీసు నుంచి గాంధీభవన్‌ ముట్టడికి బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు.. బీజేపీ కార్యకర్తలను అ‍డ్డుకున్నారు. గాంధీ భవన్‌ వైపు బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. వారిపై లాఠీచార్జ్‌ చేశారు. దీంతో, మరోసారి ఉద్రికత్త చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు.. బీజేపీ పార్టీ ఆఫీస్‌ వద్దకు కాషాయ పార్టీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. పార్టీ ఆఫీసుపై దాడి నేపథ్యంలో బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ.. బీజేపీ కార్యాలయంపైన కాంగ్రెస్ దాడి దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ లాగానే వ్యవహరిస్తోంది. తిరగబడి మేము కూడా దాడి చేస్తే ఢిల్లీలో మీ జాతీయ నాయకులు ఎక్కడ దాక్కుంటారు. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలి.కేటీఆర్ తప్పించుకుని ఎన్ని రోజులు తిరుగుతారు. చంచల్‌గూడా వెళ్లాలా లేక తీహార్‌ జైలుకు వెళ్లాలా అనేది కేటీఆర్ డిసైడ్ చేసుకోవాలి. కేటీఆర్ జైలుకు వెళితే సానుభూతి రాదు. డబ్బులు ఎక్కువై కోర్టులలో పిటిషన్లు వేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం భయంకరమైన అవినీతికి పాల్పడింది. లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారు. తెలంగాణ అధ్యక్ష పదవిపై ఎలాంటి చర్చ లేదు. దానిపై నన్ను ఎవరూ అడగలేదు. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అంటూ కామెంట్స్‌ చేశారు.బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ..‘బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ దుండగులు దాడి చేయడం దారుణం. దాడుల వల్ల హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. తెలంగాణలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. శాంతిభద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. కేటీఆర్ కేసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్ ఇప్పుడు అధికారులను బలి పశువులను చేస్తున్నారు. నాడు కేటీఆర్ అధికారులను భయపెట్టి పని చేయించుకున్నారు. కేటీఆర్ నిర్దోషి అయితే నిలబడి ఎదుర్కోవాలి. అంతేగానీ కోర్టులకి వెళ్లి తప్పించుకోవడానికి చూడకూడదు.కాళేశ్వరంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. దానిపైన ప్రభుత్వం ఏం చేస్తుంది?. ధరణి స్కామ్‌పై ఏం కేసులు పెట్టారు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోంది. వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి చిన్న కేసులు పెడుతున్నారు. పెద్ద కేసుల నుంచి బీఆర్ఎస్ నేతలను తప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అంటూ కామెంట్స్‌ చేశారు.

SBI Har Ghar Lakhpati Scheme Eligibility Features And Interest Rates Details9
పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్

భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టలేని వారు లేదా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) హర్ ఘర్ లఖ్‌పతి రికరింగ్ డిపాజిట్ పేరుతో ఓ సరికొత్త స్కీమ్ తీసుకువచ్చింది. ఇందులో ప్రతి ఒక్కరూ సులభమైన పద్ధతిలో పొదుపు చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీని పొందవచ్చు.హర్ ఘర్ లఖ్‌పతి పథకం (Har Ghar Lakhpati Scheme)హర్ ఘర్ లఖ్‌పతి పథకం అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఓ సరికొత్త పొదుపు స్కీమ్. దీని ద్వారా ఒక వ్యక్తి లేదా కుటుంబం ఆర్థికంగా కొంత వృద్ధి చెందవచ్చు. అంతే కాకుండా క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లను పెంపొందించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది పెద్దవారికి మాత్రమే కాకుండా.. మైనర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.హర్ ఘర్ లఖ్‌పతి పథకం కింద ప్రజలు 12 నెలల నుంచి 120 నెలల (1 ఏడాది నుంచి 10 సంవత్సరాలు) వరకు పొదుపు చేసుకోవచ్చు. వివాహాలకు లేదా ఇంటి కొనుగోళ్లు వంటి వాటికి ప్లాన్ చేసుకునేవారికి ఇది కొంత ప్రయోజనకారిగా ఉంటుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఇందులో పొదుపు చేసుకోవచ్చు. అయితే 10 ఏళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలు మాత్రం తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.వడ్డీ రేటు●సాధారణ ప్రజలకు 6.75 శాతం●సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం●స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు 8 శాతం●ఆదాయ పన్నుశాఖ నిబంధనల ప్రకారం.. పన్ను మినహాయింపు వర్తిస్తుందినెలవారీ పెట్టుబడులుహర్ ఘర్ లఖ్‌పతి రికరింగ్ డిపాజిట్ పథకం కింద.. నెలవారీ పెట్టుబడులు చేయడం ద్వారా లక్ష రూపాయలు పొందవచ్చు. సాధారణ పౌరులకు, 6.75 శాతం వడ్డీతో మూడు సంవత్సరాలకు నెలకు రూ. 2,500 లేదా 6.50 శాతం చొప్పున ఐదు సంవత్సరాలకు నెలకు రూ. 1,407 పెట్టుబడి పెట్టడం లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. సీనియర్ సిటిజన్లు 7.25 శాతం చొప్పున మూడేళ్లపాటు నెలవారీ రూ. 2,480 లేదా 7 శాతం చొప్పున ఐదు సంవత్సరాలకు నెలకు రూ. 1,389 పెట్టుబడి పెట్టడం ద్వారా దీనిని పొందవచ్చు.ఇదీ చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. EMI ఆలస్యమైనా పర్లేదు!జరిమానాలువాయిదా ప్రకారం తప్పకుండా డిపాజిట్ చేయాలి. అలా చేయని సమయంలో లేదా ఆలస్యమైతే రూ.100కు రూ.1.50 పైసలు నుంచి 2 రూపాయలు జరిమానా పడుతుంది. అంతే కాకుండా ఆరు నెలల పాటు వాయిదాలు చెల్లించకపోతే మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది. అప్పటికి మీరు పొదుపు చేసిన మొత్తం సేవింగ్ ఖాతాకు బదిలీ అవుతుంది.అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా?●హర్ ఘర్ లఖ్‌పతి రికరింగ్ డిపాజిట్ పథకం కోసం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే.. సమీపంలోని SBI బ్రాంచ్ సందర్సించాలి.●ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ సమర్పించాలి.●ఖాతా ప్రారంభించే సమయంలోనే మెచ్యూరిటీ మొత్తాన్ని, ఈఎంఐ వంటి వాటిని లెక్కించుకోవాలి.

Sufi Singer Bismil Ties The Knot With Shifa Khan Radiates  Royal wedding look10
గతేడాది ప్రేమగీతం : ఇపుడు నిఖా,అదిరిపోయిన రాయల్‌ వెడ్డింగ్‌ లుక్స్‌

పాపులర్‌ సూఫీ సింగర్‌ తన ప్రేయసితో నిఖా చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. పవిత్రమైన ప్రేమ పాటలకు పాపులర్‌ అయిన బిస్మిల్‌, షిఫాఖాన్‌తో జీవితాన్ని పంచుకున్నాడు. డిజైనర్‌ పెళ్లి దస్తులు, విలువైన ఆభరణాలతో వధూవరులిద్దరూ రాయల్‌ లుక్‌లో ఫ్యాన్స్‌ను మురిపించారు. వీరి పెళ్లి ప్రయాణంలో విశేషం ఉంది. అదేంటో తెలుసు కోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.ప్రముఖ సూఫీ గాయకుడు, బిస్మిల్ ఎన్నోపవిత్రమైన ప్రేమ పాటలకి తన గాత్రాన్ని అందించాడని చెప్పుకున్నాం. గత ఏడాది జనవరి 5న, 'పింక్ సిటీ' జైపూర్‌లో, బిస్మిల్ షిఫా ఖాన్‌ (ఇపుడు భార్య)తో కలిసి ఒక యుగళగీతాన్ని పాడాడు. అలా సంవత్సరం గడిచిందో లేదో ఆమెతో కలిసి వివాహం బంధంలోకి అడుగుపెట్టాడు. బంధువుల ద్వారా పరిచయమైన షిఫాతో ప్రేమలో పడిపోయాడు. సరిగ్గా ఏడాదికి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. జీవితంలో మరపురాని రోజు, తన నిఖా ఫోటోలను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నాడు స్టన్నింగ్‌ బ్రైడల్‌ లుక్‌ వధువు షిఫా ఖాన్ డార్క్‌ రెడ్‌ కలర్‌ డిజైనర్‌ లెహెంగా చోలీలో పెళ్లికూతురిలా మెరిసి పోయింది. చేతితో చేసిన డిజైన్‌, విలాసవంతమైన గోల్డెన్‌ ఎంబ్రాయిడరీ ఎలిగెంట్‌ లుక్‌ నిచ్చాయి. లెహెంగాకు మ్యాచింగ్‌, జర్దోజీ దుపట్టా మరింత అందాన్నిచ్చింది. ఇంకా డైమండ్స్‌, పచ్చలు పొదిగిన లేయర్డ్‌ నెక్లెస్‌, చెవిపోగులు, మాంగ్ టీకా, ఉంగరాలు, ఎరుపు, తెలుపు ,బంగారు షేడ్స్‌తో కూడిన గాజులతో అద్భుతంగా కనిపించింది. నేనేం తక్కువ అన్నట్టు బిస్మిల్‌ లుక్‌క్రీమ్-హ్యూడ్ తలపాగా గ్రీన్‌, వైట్‌ షేడ్స్‌లో మెరిసే రాళ్లతో రూపొందించిన బంగారు బ్రూచ్‌తో అందంగా మెరిశాడు బిస్మిల్‌. వజ్రాలు పచ్చలతో కూడిన లేయర్డ్ నెక్లెస్‌తో తన పెళ్లి రోజుకు రింత ఐశ్వర్యాన్ని జోడించాడు. అంతేనా అతని చేతి గోల్డెన్‌ వాచ్‌మరింత విలాసాన్నిచ్చింది. అందమైన ఫోటోలుస్వచ్ఛమైన ప్రేమ, ఆనందంతో నిండిన తమ నిఖా ఫోటోలు అభిమానులను ఆకట్టు కున్నాయి. చుక్కలాంటి వధువు, షిఫా ఖాన్ నుదిటిపై ముద్దు పెట్టడం, నిఖానామాపై వధూవరులిద్దరూ సంతకాలు పెట్టడంతోపాటు, వేలిముద్రలు ఫోటోలను కూడా ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. View this post on Instagram A post shared by Bismil (@bismil.live)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement