Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Bail Granted To MLA Padi kaushik Reddy1
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి బెయిల్‌

హైదరాబాద్‌, సాక్షి: హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు బెయిల్‌ లభించింది. రెండు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్‌ ఇచ్చారు. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.ఆదివారం కరీంనగర్‌(Karimnagar) కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌(Sanjay)ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్‌ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ వచ్చి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. రాత్రంతా ఆయన త్రీటౌన్‌ పోలీస్టేషన్‌లో ఉన్నారు. ఈ ఉదయం వైద్య పరీక్షల అనంతరం పాడి కౌశిక్‌రెడ్డిని (Padi kaushik Reddy) రెండో అదనపు అదనపు మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టారు. రూ.10 వేలప్పున మూడు పూత్తులు ఇవ్వాలని ఆదేశిస్తూ మెజిస్ట్రేట్‌ బెయిల్‌ మంజూరు చేశారు.వాదనలు ఇలా..రెండో అదనపు జ్యూడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ప్రేమ లత ముందు హాజరు పర్చారు. కౌశిక్‌రెడ్డిపై గతంలోనూ పలు కేసులు ఉన్నందున రిమాండ్‌ విధించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. అయితే.. కౌశిక్‌పై నమోదు అయిన సెక్షన్స్ అన్నీ బెయిలేబుల్ కాబట్టి రిమాండ్ రిజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. ఈ క్రమంలో.. అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు(2014) తీర్పు ప్రకారం రిజెక్షన్ కోసం కోరింది. దీంతో బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీం వాదనతో ఏకీభవించిన జడ్జి.. బెయిల్‌ మంజూరు చేశారు.

Farmers Worry About Crop investment assistance in Chandrababu Govt2
అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి

సాక్షి, అమరావతి: తెలుగింట సంక్రాంతి పెద్ద పండుగ.. మరీ ముఖ్యంగా ఇది రైతన్న పండుగ. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు సంబరాలు చేసుకోవలసిన తరుణం. కానీ అన్నదాత లోగిలి కళతప్పింది. పల్లెల్లో సంక్రాంతి సందడి కానరావడం లేదు. అన్ని విధాలుగా మోసపోయిన రైతన్న దిగాలుగా కనిపిస్తున్నాడు. కొత్త సర్కారు వచ్చి ఏడు నెలలు గడిచాయి. ఖరీఫ్, రబీ రెండు సీజన్లు పూర్తయ్యాయి. పెంచి ఇస్తామన్న పెట్టుబడిసాయం ఒక్క విడత కూడా అందలేదు. పంటలబీమా పరిహారం లేదు.. పైగా ప్రీమియం కట్టాల్సిరావడం.. కరువు సాయానికి ఎగనామం.. ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరకలేదు. తుపానులు, వరదలు దారుణంగా దెబ్బతీశాయి. దిగుబడులు ఆశించినట్లులేవు.. వాటికీ కనీస మద్దతు ధర రాలేదు. అన్ని విధాలుగా దగా పడిన రైతన్న ఏడు నెలలుగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తానన్న పెట్టుబడి సాయం లేదు. ఈ సాయం కోసం రాష్ట్రంలోని 54 లక్షల మందికి రూ.10వేల కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇంతమోసం చేస్తారా.. అని అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఖరీఫ్‌–2023 సీజన్‌కు సంబంధించి రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వలన రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్‌లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. ఇలా రైతులకు ఈ ఏడు నెలల్లో అందించాల్సిన రూ.12,563 కోట్లు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. వీటి కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని రైతులు ఎదురు చూస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక ఈసారి పండుగకు దూరమవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. దీంతో విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడ్డారు. రోడ్డునపడిన అన్నదాత..ఇంటికొచ్చే కొత్త పంటతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికే రైతన్నల ఇంట ఈసారి ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు. ప్రభుత్వ నిర్వాకానికి తోడు వరుస వైపరీత్యాల ప్రభావంతో ఓ వైపు పంటలు దెబ్బతినగా, చేతికొచ్చిన అరకొర పంటకు మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గడిచిన ఐదేళ్లుగా విత్తనాలు, ఎరువులకు ఏరోజు ఇబ్బందిపడని రైతులు గడిచిన ఖరీఫ్‌ సీజన్‌లో వాటి కోసం నానా అవస్థలు పడ్డారు. మళ్లీ, మళ్లీ పెట్టుబడులు పెట్టి పండించిన వరి, పత్తి, ఉల్లి, టమోటా, మిర్చి వంటి పంటలకు మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో తుపానులు, వరదలతో అధికారికంగా 6 లక్షల ఎకరాలలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో మరో 2 లక్షల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో 80కి పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారే తప్ప పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. పంటల బీమా రక్షణేది?గతేడాది ఇదే రబీ సీజన్‌లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య అక్షరాల 43.82 లక్షల మంది. మరిప్పుడూ.. కేవలం 7.64 లక్షల మంది. అంటే ఆరో వంతు మందికి కూడా పంటల బీమా రక్షణ దక్కలేదు. గత ఐదేళ్లూ అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. ఈ–క్రాప్‌ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు నూరు శాతం యూనివర్శల్‌ కవరేజ్‌ కల్పిస్తూ పంటల బీమా రక్షణ లభించేది. ఈ బీమాతో ఎలాంటి విపత్తు ఎదురైనా రైతన్నలు నిశ్చింతగా ఉండే వారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో వివిధ విపత్తుల కారణంగా పంటలు దెబ్బతిన్న 54.55 లక్షల మంది రైతులకు రికార్డు స్థాయిలో రూ.7,802.05 కోట్లు పరిహారంగా అందించింది. వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు బుధవారంతో ముగుస్తుంది. మిగతా పంటలకు గత నెల 31వ తేదీనే ముగిసింది. అయినా 50.67 లక్షల ఎకరాలకు రైతులు బీమా చేయించలేదు. చంద్రబాబు ప్రభుత్వం బీమా ప్రీమియం భారాన్ని రైతులపైనే వేయడమే ఇందుకు కారణం. ఈ భారం భరించలేక లక్షలాది రైతులు పంటల బీమా చేయించుకోలేకపో­యారు. పైగా, బీమాకు అవసరమైన సర్టిఫికెట్లు, నమోదు వంటి వాటి కోసం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితి. దీంతో పంటల బీమా అంటేనే రైతులు భయపడిపోయారు.17న విజయవాడలో ధర్నాకు పిలుపుప్రతీ రైతుకు రూ.20వేల పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలన్నీ అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఇచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం. రైతులకు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీ ముఖ్యమంత్రికి గుర్తులేదా? గుర్తు ఉన్నా రైతులకు ఇవ్వటం ఇష్టం లేక అమలు చేయటం లేదా? స్పష్టం చేయాలి. రైతులకు ఇచ్చిన హామీల అమలు, పెండింగ్‌ బకాయిలు చెల్లింపుతోపాటు రైతులపై భారం వేయకుండా ఉచిత పంటల బీమా పథకం కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద మహాధర్నా చేయబోతున్నాం. – కె.ప్రభాకరరెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Sankranthiki Vasthunam Movie Twitter Review3
‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్విటర్‌ రివ్యూ

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్‌ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు కొన్ని చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. సంకాంత్రికి వస్తున్నాం సినిమా కథ ఏంటి..? ఎలా ఉంది..? వెంకీ, అనిల్‌ కాంబో ఖాతాలో హ్యాట్రిక్‌ హిట్ పడిందా లేదా..? తదితర అంశాలను ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో సం‍క్రాంతికి వస్తున్నాం సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. రొటీన్‌ కథ అయినప్పటికీ కామెడీ బాగా వర్కౌట్‌ అయిందని చెబుతున్నారు. #SankranthikiVasthunamDone with my show 💯2nd half is hilarious 🤣 That avakaya episode is too goodAlthought it felt lengthy at parts, @AnilRavipudi handled last 30 minutes very well and ended with a messageMy rating would be 3.5/5Families gonna have a feast in… pic.twitter.com/HtUK07VSmT— INNOCENT EVIL 😈 (@raju_innocentev) January 14, 2025 ఇప్పుడే సినిమా చూశాను. సెకండాఫ్‌ హిలేరియస్‌. అవకాయ ఎపిసోడ్‌ అదిరిపోయింది. అయితే కొన్ని సీన్లు సాగదీతగా ఉన్నాయి. చివరి 30 నిమిషాలు అనిల్‌ రావిపూడి చక్కగా హ్యాండిల్‌ చేశాడు. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఇది అంటూ ఓ నెటిజన్‌ 3.5 రేటింగ్‌ఇచ్చాడు.#SankranthikiVasthunam is a timepass festive family entertainer with the only motive being to entertain. The film flows in a Typical zone that Director Ravipudi follows similar to F2. The comedy works well in parts but is over the top and irritates a bit in others. Production…— Venky Reviews (@venkyreviews) January 13, 2025 సంక్రాంతికి వస్తున్నాం టైంపాస్‌ కామెడీ సినిమా. పండక్కి వినోదాన్ని అందించే చిత్రం. ఎఫ్‌2 మాదిరే హిలేరిస్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు అనిల్‌ రావిపూడి. పార్టులుగా చూస్తే కామెడీ బాగా వర్కౌట్‌ అయింది. ప్రొడక్షన్‌ క్యాలిటీస్‌ అంతగా బాగోలేవు. సినిమాలో పెద్ద కథ కూడా ఉండదు. లాజిక్స్‌ గురించి పట్టించుకోవద్దు. వెంకటేశ్‌ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. క్లైమాక్స్‌ ఆకట్టుకుంటుంది. ఈ పండక్కి ఫ్యామిలీస్‌కి ఈ సినిమా మంచి ఛాయిస్‌ అంటూ మరో నెటిజన్‌ 2.75 రేటింగ్‌ ఇచ్చాడు.#SankranthikiVasthunam Liked it! Baagundi!A hilarious entertainer with mediocre story but makes you laugh out loud❤️The theme itself has a lot of potential to make you chuckle, #Venkatesh & #AnilRavipudi are very successful in it#AishwaryaRajesh is impressive👌FUN GUARANTEED! pic.twitter.com/J8AVr2Nei5— Sanjeev (@edokatile) January 14, 2025CLEAN HIT 🎯 🎯 #SankranthikiVasthunam is a fun family Entertainer with Anil Ravipudi's racyscreenplay and songs.🥵🎶🎶It's a Good Family Entertainer 3.5/5 Rating 🤞🤙#SankranthikiVasthunamreview #makarsankranti2025 #Pongal#HappyLohri #MahaKumbh2025 #MakaraSankranti2025 pic.twitter.com/2tJWwcbzTz— Ashok (@imashok1234) January 14, 2025#SankranthikiVasthunam - Family Entertainer!Anil Ravipudi succeeds in entertaining his target audience with a fun film. Bheems music and songs💥Family audience elaago hit ichestharu🫡#SankranthikiVasthunamReview #SankranthikiVasthunnam#VenkyMama #Venkateshdaggubati https://t.co/SHy9jWy6r4 pic.twitter.com/Vokja82Kdi— IndianCinemaLover (@Vishwa0911) January 14, 2025#Bheemsceciroleo music is very good - foot tapping and BGM is 🔥Except some over the top scenes ( as expected ) everything goes according to @AnilRavipudi 's meter and should score a hit for this pongal too.#SankranthikiVasthunam #SankranthikiVasthunamreview— Shiva Kumar Grandhi (@sivakumargrandh) January 13, 2025#SankranthikiVasthunamReview - For Families!Positives:- Venky Mama 👌❤️ - Bheems' Music and Songs ❤️❤️ - Comedy Scenes 😂 Negatives:- Over-the-top Scenes,Especially in the Second Half - Predictable PlotAn Enjoyable Entertainer for Families! Follow 👉…— Movies4u Reviews (@Movies4uReviews) January 13, 2025

Sakshi Special Interview About Spiritualists and movie celebrities4
సంక్రాంతి వచ్చెనట సందడి తెచ్చెనట!

మంచుకు తడిసిన ముద్దబంతులు... ముగ్గులు... పూలు విచ్చుకున్న గుమ్మడి పాదులు... కళ్లాపిలు.... వంట గదుల్లో తీపీ కారాల ఘుమఘుమలు...కొత్త బట్టలు... కొత్త అల్లుళ్ల దర్పాలు...పిల్లల కేరింతలు... ఓపలేని తెంపరితనాలుసంక్రాంతి అంటే సందడే సందడి.మరి మేమేం తక్కువ అంటున్నారు సినిమా తారలు.మా సంక్రాంతిని వినుమా అని ముందుకొచ్చారు.రచయిత్రులు ఊసుల ముత్యాల మాలలు తెచ్చారు.‘ఫ్యామిలీ’ అంతా సరదాగా ఉండే సంబరవేళ ఇది.ప్రతిరోజూ ఇలాగే పండగలా సాగాలని కోరుకుంటూసంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.ఇన్‌పుట్స్‌ : సాక్షి సినిమా, ఫ్యామిలీ బ్యూరోమన పండుగలను ఎన్నో అంశాలను మిళితం చేసి ప్రయోజనాత్మకంగా రూపొందించారు మన పెద్దలు. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా పండుగ విధులుగా చెప్పి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా వాటిని రూపొందించారు. మన పండుగల్లో ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞానాలు మిళితమై ఉంటాయి. తెలుగువారి ప్రధానమైన పండుగ సంక్రాంతిలో కూడా అంతే! ప్రధానంగా చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు సౌరమానాన్ని పాటించే ముఖ్యమైన సందర్భం ఇది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15 కాని, 16వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14 కాని, 15 వ తేదీ వరకు కాని ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఆ రోజు నుండి సూర్యుడు తన గమన దిశని దక్షిణం నుండి ఉత్తరానికి మార్చుకుంటాడు కనుక మకర సంక్రమణానికిప్రాధాన్యం. ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. బొమ్మల కొలువుపెట్టుకునే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అసలు ప్రధానమైనది సంక్రాంతి. ఈ పుణ్యకాలంలో దానాలు, తర్పణాలుప్రాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం,పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయనివారు ఈ రోజు చేస్తారు. అసలు మూడురోజులు పేరంటం చేసే వారున్నారు. సంక్రాంతి మరునాడు కనుము. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి,పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె పొట్టేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. నాగలి, బండి మొదలైన వాటిని కూడా పూజిస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లకి పూజ చేస్తున్నారు. భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి, వ్యవసాయ పనిముట్లకి కూడా తమ కృతజ్ఞతలని తెలియచేయటం పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవమర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పంటను పాడుచేసే పురుగులని తిని సహాయం చేసినందుకు పక్షులకోసం వరికంకులను తెచ్చి కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’,‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’,‘కనుము నాడు మినుము తినాలి’ అనే సామెతలు కనుముకి పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. మొత్తం నెల రోజులు విస్తరించి, నాలుగు రోజుల ప్రధానంగా ఉన్న పెద్ద పండగ సంక్రాంతి తెలుగువారికి ఎంతో ఇష్టమైన వేడుక. – డా. ఎన్‌.అనంతలక్ష్మిముక్కనుముముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. సంక్రాంతికి అందరూ తమ గ్రామాలకి చేరుకుంటారు. అల్లుళ్లు, ముఖ్యంగా కొత్త అల్లుళ్లు తప్పనిసరి. నెల రోజులు విస్తరించి, నాలుగు రోజులు ప్రధానంగా ఉండే సంక్రాంతి పెద్దపండుగ. పెద్దల పండుగ కూడా. పెద్ద ఎత్తున చేసుకునే పండుగ కూడా.థీమ్‌తో బొమ్మల కొలువుసంక్రాంతికి ప్రతియేటా ఐదు రోజులు బొమ్మలు కొలువు పెడుతుంటాం. చిన్నప్పటి నుంచి నాకున్న సరదా ఇది. నేను, మా అమ్మాయి, మనవరాలు కలిసి రకరకాల బొమ్మలను, వాటి అలంకరణను స్వయంగా చేస్తాం. ప్రతి ఏటా ఒక థీమ్‌ను ఎంచుకుంటాం. అందకు పేపర్, క్లే, అట్టలు, పూసలు, క్లాత్స్‌.. ఎంచుకుంటాం. ఈ సారి ఉమెన్‌ పవర్‌ అనే థీమ్‌తో నవదుర్గలు పెట్టాం. అమ్మ వార్ల బొమ్మలు ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి. గుడిలాగా అలంకారం చేశాం. గుడికి అమ్మాయిలు వస్తున్నట్టు, పేపర్లతో అమ్మాయిల బొమ్మలను చేశాం. తిరుపతి చందనం బొమ్మల సేకరణ కూడా ఉంది. ఆ బొమ్మలతో కైలాసం అనుకుంటే శివపార్వతులుగా, తిరుపతి అనుకుంటే వెంకటేశ్వరస్వామి, పద్మావతి... ఇలా థీమ్‌కు తగ్గట్టు అలంకరణ కూడా మారుస్తాం. ఈ బొమ్మల కొలువుకు మా బంధువులను, స్నేహితులను పిలుస్తుంటాం. ఎవరైనా అడిగితే వాళ్లు వచ్చేవరకు ఉంచుతాం. – శీలా సుభద్రాదేవి, రచయిత్రిపండగ వైభోగం చూతము రారండి– రోహిణితమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న రోహిణి అనకాపల్లి అమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు. అయిదేళ్ల వయసులో చెన్నైకి వెళ్లిపోయినా... అనకాపల్లి ఆమెతోనే ఉంది. అనకాపల్లిలో సంక్రాంతి జ్ఞాపకాలు భద్రంగా ఉన్నాయి. నటి, స్క్రీన్‌ రైటర్, పాటల రచయిత్రి, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రోహిణి మొల్లెటి... ‘సంక్రాంతి ఇష్టమైన పండగ’ అంటుంది, ఆనాటి పండగ వైభోగాన్ని గుర్తు చేసుకుంటుంది.నా చిన్నప్పుడు .. సంక్రాంతికి స్కూల్‌కి సెలవులు ఇచ్చేవారు. అదో ఆనందం. అలాగే కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్లు. ఇంట్లో చక్కగా పిండి వంటలు చేసి పెట్టేవాళ్లు. ఫుల్లుగా తినేవాళ్లం. మాది అనకాపల్లి. నాకు ఐదేళ్లప్పుడు చెన్నై వెళ్లిపోయాం. సో... నాకు ఊహ తెలిశాక జరుపుకున్న పండగలన్నీ చెన్నైకి సంబంధించినవే.సంక్రాంతికి నెల ముందే నెల గంట పడతారు. అప్పట్నుంచి రోజూ ముగ్గులు పెట్టేవాళ్లం. అయితే ఎవరి ముగ్గు వారిది అన్నట్లు కాకుండా మా ముగ్గుకి ఇంకొకరు రంగులు వేయడం, మేం వెళ్లి వాళ్ల ముగ్గులకు రంగులు వేయడం... ఫైనల్లీ ఎవరి ముగ్గు బాగుందో చూసుకోవడం... అవన్నీ బాగుండేది. నేను రథం ముగ్గు వేసేదాన్ని. ఇక సంక్రాంతి అప్పుడు గంగిరెద్దుల సందడి, హరిదాసులను చూడడం భలేగా అనిపించేది. సంక్రాంతి నాకు ఇష్టమైన పండగ. ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతుల పండగ అది. వారికి కృతజ్ఞత తెలపాలనుకుంటాను. రైతుల విలువ పిల్లలకు చెప్పాలి. ఏమీ చెప్పకుండా పండగ చేసుకుంటే ఇది కూడా ఓ వేడుక అనుకుంటారు... అంతే. అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో పిల్లలకి చెప్పాలి. అర్థం తెలిసినప్పుడు ఇంకాస్త ఇన్ వాల్వ్‌ అవుతారు.ఇప్పుడు పండగలు జరుపుకునే తీరు మారింది. వీలైనంత వైభవంగా చేయాలని కొందరు అనుకుంటారు. అయితే ఎంత గ్రాండ్‌గా చేసుకుంటున్నామని కాదు... అర్థం తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా అనేది ముఖ్యం. తాహతుకి మించి ఖర్చుపెట్టి పండగ చేసుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.సంక్రాంతి అంటే నాకు గుర్తొచ్చే మరో విషయం చెరుకులు. చాలా బాగా తినేవాళ్లం. ఇప్పుడూ తింటుంటాను. అయితే ఒకప్పటి చెరుకులు చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పటి జనరేషన్ చెరుకులు తింటున్నారో లేదో తెలియడం లేదు. షుగర్‌ కేన్ జ్యూస్‌ తాగుతున్నారు. అయితే చెరుకు కొరుక్కుని తింటే పళ్లకి కూడా మంచిది. మన పాత వంటకాలు, పాత పద్ధతులన్నీ మంచివే. ఇలా పండగలప్పుడు వాటి గురించి చెప్పడం, ఆ వంటకాలు తినిపించడం చేయాలి.నెల్నాళ్లూ ఊరంతా అరిసెల వాసనపండగ మూడు రోజులు కాదు మాకు నెల రోజులూ ఉండేది. వ్యవసాయం, గోపోషణ సమృద్ధిగా ఉండటం వల్ల నెల ముందు నుంచే ధాన్యం ఇల్లు చేరుతుండేది. నెల గంటు పెట్టగానే పీట ముగ్గులు వేసేవారు. వాటిల్లో గొబ్బిళ్లు పెట్టేవారు. రోజూ గొబ్బిళ్లు పెట్టి, వాటిని పిడకలు కొట్టేవారు. ఆ గొబ్బి పిడకలన్నీ పోగేసి, భోగిరోజున కర్రలు, పిడకలతోనే భోగి మంట వేసేవాళ్లు. మామూలు పిడకల వాసన వేరు, భోగి మంట వాసన వేరు. ప్రధాన సెలబ్రేషన్‌ అంటే ముగ్గు. బొమ్మల కొలువు పెట్టేవాళ్లం. అందరిళ్లకు పేరంటాలకు వెళ్లేవాళ్లం. ఊరంతా అరిసెల వాసన వస్తుండేది. కొత్త అటుకులు కూడా పట్టేవారు. చెరుకు గడలు, రేగుపళ్లు, తేగలు, పిల్లల ఆటలతో సందడిగా ఉండేది. బంతిపూల కోసం అక్టోబర్‌లో మొక్కలు వేసేవాళ్లం. అవి సంక్రాంతికి పూసేవి. కనుమ నాడు గోవులను అలంకరించి, దండం పెట్టుకునే వాళ్లం. చేసుకున్న పిండి వంటలు పంచుకునేవాళ్లం. హరిదాసులకు, గంగిరెద్దుల వాళ్లకు ధాన్యాన్ని ఇచ్చేవాళ్లం. ఇప్పటికీ పండగలను పల్లెలే సజీవంగా ఉంచుతున్నాయి. పట్టణాల్లో మాత్రం కొన్నేళ్లుగా టీవీల్లోనే సంక్రాంతి సంబరాలను చూస్తున్నాం. – రమారావి, కథకురాలు, ఆధ్యాత్మికవేత్తనా జీవితంలో సంక్రాంతి చాలా స్పెషల్‌– మీనాక్షీ చౌదరి‘ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు’ అనేది మన అచ్చ తెలుగు సామెత. తెలుగుతనం ఉట్టిపడే పేరున్న మీనాక్షీ చౌదరి తెలుగు అమ్మాయి కాదు. ఉత్తరాది అమ్మాయి మీనాక్షీ చౌదరి కాస్త బాపు బొమ్మలాంటి తెలుగింటి అమ్మాయిగా మారడానికి మూడు సంవత్సరాల కాలం చాలదా! మీనాక్షీ నటి మాత్రమే కాదు స్విమ్మర్, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి కూడా. ఫెమినా మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ (2018) కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమా తో తెలుగు తెరకు సైలెంట్‌గా పరిచయం అయిన చౌదరి ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’తో హిట్‌ కొట్టింది. సూపర్‌హిట్‌ సినిమా ‘లక్కీభాస్కర్‌’ లో సుమతిగా సుపరిచితురాలైంది. కొందరికి కొన్ని పండగలు ప్రత్యేకమైనవి. సెంటిమెంట్‌తో కూడుకున్నవి. మీనాక్షీ చౌదరికి కూడా సరదాల పండగ సంక్రాంతి ప్రత్యేకమైనది. సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఈ హరియాణ అందాల రాశి చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు ఇవి.మాది హర్యానా రాష్ట్రంలోని పంచకుల. మూడేళ్లుగా నేను హైదరాబాద్‌లో ఉంటూ తెలుగు సినిమాల్లో పని చేస్తున్నాను కాబట్టి సంక్రాంతి పండగ గురించి నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జనవరిలో ఒక సెలబ్రేషన్ (సంక్రాంతి) ఉంది. సంక్రాంతి–సినిమా అనేది ఒక బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్ . సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అన్నది సినిమాల రిలీజ్‌కి, సెలబ్రేషన్స్ కి చాలా మంచి సమయం. కుటుంబమంతా కలిసి సందడిగా పూజలు చేసి సెలబ్రేట్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అది నాక్కూడా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంటుంది. గాలిపటాలంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఎగరేయడంలో నేను చాలా బ్యాడ్‌ (నవ్వుతూ). అయినా, మా ఫ్రెండ్స్‌తో కలిసి మా ఊర్లోనూ, హైదరాబాద్‌లోనూ ఎగరేసేందుకు ప్రయత్నిస్తుంటాను. హైదరాబాద్‌లో ప్రతి ఏటా అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గాలిపటాలు ఎగరేయడం అన్నది కూడా ఒక ఆటే. సంక్రాంతి టు సంక్రాంతి2024 నాకు చాలా సంతోషంగా, గ్రేట్‌ఫుల్‌గా గడిచింది. గత ఏడాది మంచి సినిమాలు, మంచి కథలు, పాత్రలు, మంచి టీమ్‌తో పని చేయడంతో నా కల నిజం అయినట్లు అనిపించింది. 2025 కూడా అలాగే ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను. చూస్తుంటే సంక్రాంతి టు సంక్రాంతి వరకు ఓ సర్కిల్‌లా అనిపిస్తోంది. నా జీవితం లో కూడా సంక్రాంతి చాలా స్పెషల్‌. ఎందుకంటే గత ఏడాది నేను నటించిన ‘గుంటూరు కారం’ వచ్చింది.. ఈ ఏడాది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలవుతోంది! అందుకే చాలా సంతోషంగా... ఎగ్జయిటింగ్‌గా ఉంది.ముగ్గుల లోకంలోకి– దివి వాఢత్యాదివి పదహారు అణాల తెలుగు అమ్మాయి. ఎం.టెక్‌ అమ్మాయి దివి మోడలింగ్‌లోకి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. ‘బిగ్‌బాస్‌4’తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. హీరోయిన్‌గా చేసినా, పెద్ద సినిమాలో చిన్న పాత్ర వేసినా తనదైన మార్కును సొంతం చేసుకుంది. గ్లామర్‌ పాత్రలలో మెరిసినా, నాన్‌–గ్లామరస్‌ పాత్రలలో కనిపించినాతనదైన గ్రామర్‌ ఎక్కడీకి పోదు! మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లుగానే... మహా పండగ సంక్రాంతి కోసం ఎదురు చూడడం దివికి ఇష్టం. సంక్రాంతి వస్తే చాలు... ఆమెకు రెక్కలు వస్తాయి. సరాసరి వెళ్లి విజయవాడలో వాలిపోతుంది. పండగ సంతోషాన్ని సొంతం చేసుకుంటుంది. భోగిమంటల వెలుగు నుంచి గగనసీమలో గాలిపటాల వయ్యారాల వరకు దివి చెప్పే సంక్రాంతి కబుర్లు...మాది హైదరాబాదే అయినా, నేను పుట్టింది విజయవాడలో. ఊహ తెలిసినప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే చాలు, విజయవాడలోని మా అమ్మమ్మగారి ఇంట్లో వాలిపోతా. వారం ముందు నుంచే మా ఇంట్లో పండుగ సందడి మొదలయ్యేది. మా మామయ్యలు, పిన్నులు, చుట్టాలందరితో కలసి గారెలు, అరిసెలు ఇలా ఇతర పిండి వంటలు చేసుకుని, ఇరుగు పొరుగు వారికి ఇచ్చుకుంటాం. పండుగ రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకునేవాళ్లం. తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసి, ముగ్గులు పెడతాం. అమ్మమ్మ పూజ చే స్తే, మేమంతా పక్కనే కూర్చొని, దేవుడికి దండం పెట్టుకునేవాళ్లం. కానీ ఆ రోజుల్ని ఇప్పుడు చాలా మిస్‌ అవుతున్నా. ఏది ఏమైనా సంక్రాంతికి కచ్చితంగా ఊరెళతాను. ఆ మూడు రోజుల పాటు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో కలసి పండుగ చేసుకోవటం నాకు చాలా ఇష్టం. సాయంత్రం స్నేహితులతో కలసి సరదాగా గాలిపటాలు ఎగరేస్తా. ఇప్పుడు నటిగా ఎదుగుతున్న సమయంలో సంక్రాంతి జరుపుకోవటం మరింత ఆనందంగా ఉంది. ఊరెళితే చాలు, అందరూ ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. వారందరినీ చూసినప్పుడు నాపై నాకే తెలియని విశ్వాసం వస్తుంది. చివరగా సంక్రాంతికి ప్రత్యేకించి గోల్స్‌ లేవు కాని, అందరినీ సంతోషంగా ఉంచుతూ, నేను సంతోషంగా ఉంటే చాలు. ఇక నన్ను బాధించే వ్యక్తులకు, విషయాలకు చాలా దూరంగా ఉంటా. ఇంటర్వ్యూ: శిరీష చల్లపల్లిమర్చిపోలేని పండుగ– అంజలి‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో సీత ఎవరండీ? అచ్చం మన పక్కింటి అమ్మాయి. మన బంధువుల అమ్మాయి. తన సహజనటనతో ‘సీత’ పాత్రకు నిండుతనం తెచ్చిన అంజలికి... ‘మాది రాజోలండీ’ అని చెప్పుకోవడం అంటే ఇష్టం. మూలాలు మరవని వారికి జ్ఞాపకాల కొరత ఉంటుందా! కోనసీమ పల్లె ఒడిలో పెరిగిన అంజలి జ్ఞాపకాల దారిలో వెళుతుంటే....మనం కూడా ఆ దారిలో వెళుతున్నట్లుగానే, పల్లె సంక్రాంతిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంటుంది! ఒకటా ... రెండా... పండగకు సంబంధించిన ఎన్నో విషయాలను నాన్‌స్టాప్‌గా చెబుతుంది. అంజలి చెప్పే కోనసీమ సంక్రాంతి ముచ్చట్లు తెలుసుకుందాం...చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే తెలుగమ్మాయిలందరికీ నటి అంజలి ఓ స్ఫూర్తి. మనందరి అమ్మాయి.. తెలుగమ్మాయి.. ఈ పెద్ద పండుగను ఎలా జరుపుకుంటుందంటే...కోనసీమజిల్లా రాజోలు మా ఊరు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.. అందరికీ వారం ముందు నుంచి పండుగ మొదలయితే, మాకు నెల ముందు నుంచే ఇంకా చెప్పాలంటే పండుగయిన తర్వాతి రోజే.. వచ్చే సంక్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తుంటాం. మా తాతయ్య సుబ్బారావుగారు పండుగలంటే అందరూ కలసి చేసుకోవాలని చెప్పేవారు. అందుకే, చిన్నప్పటి నుంచే నాకు అదే అలవాటు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందరూ వస్తే ఇల్లు మొత్తం నిండిపోయేది. అయినా సరే, ఏ పండుగైనా అందరం కలసే జరుపుకుంటాం. ఇంట్లోనూ పొలాల్లోనూ ఘనంగా పూజలు నిర్వహిస్తాం. చిన్నప్పుడు కజిన్స్‌ అందరం కలసి ఉదయాన్నే భోగి మంటలు వేయటానికి, అందులో ఏమేం వేయాలో అనే విషయాల గురించి వారం ముందు నుంచే మాట్లాడుకునేవాళ్లం. తాతయ్య పిండివంటలన్నీ చేయించేవారు. అందుకే, ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూసేదాన్ని. కాని, సిటీకి వచ్చాక అంత ఎంజాయ్‌మెంట్‌ లేదు. చిన్నతనంలో మా పెద్దవాళ్లు ముగ్గు వేస్తే, మేము రంగులు వేసి, ఈ ముగ్గు వేసింది మేమే అని గర్వంగా చెప్పుకుని తిరిగేవాళ్లం. అందుకే, ముగ్గుల పోటీల్లో నేనెప్పుడూ పాల్గొనలేదు. గాలిపటాన్ని కూడా ఎవరైనా పైకి ఎగరేసిన తర్వాత ఆ దారాన్ని తీసుకుని నేనే ఎగరేశా అని చెప్పుకుంటా. అందుకే, సంక్రాంతి నాకు మరచిపోలేని పండుగ.నిండుగా పొంగితే అంతటా సమృద్ధిసంక్రాంతి పండగ అనగానే తెల్లవారకుండానే పెద్దలు పిల్లల్ని నిద్రలేపడం, చలికి వణుకుతూ ముసుగుతన్ని మళ్లీ పడుకోవడం ఇప్పటికీ గుర్తు వస్తుంటుంది. సందడంతా ఆడపిల్లలదే. ముగ్గులు వేయడం, వాటిల్లో గొబ్బెమ్మలు పెట్టి, నవధాన్యాలు, రేగుపళ్లు వేసేవాళ్లం. ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఆవు పిడకల మీద మట్టి గురిగలు పెట్టి, పాలు పొంగించేవాళ్లం. ఎటువైపు పాలు పొంగితే అటువేపు సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. నిండుగా పొంగితే అంతటా సమృద్ధి. మిగిలిన గురుగుల్లోని ప్రసాదాన్ని అలాగే తీసుకెళ్లి లోపలి గదుల్లో మూలకు పెట్టేవారు ఎలుకల కోసం. సాధారణ రోజుల్లో ఎలుకలు గింజలు, బట్టలు కొట్టేస్తున్నాయని వాటిని తరిమేవారు. అలాంటిది సంక్రాంతికి మాత్రం, బయట పక్షులతోపాటు ఇంట్లో ఎలుకలకు కూడా ఇలా ఆహారం పెట్టేవాళ్లు. ముగ్గులు పెట్టడంలో ఇప్పడూ పోటీపడే అమ్మాయిలను చూస్తున్నాను. మేం ఉండేది వనపర్తిలో. అప్పటి మాదిరిగానే ఇప్పడూ జరుపుకుంటున్నాం. – పోల్కంపల్లి శాంతాదేవి, రచయిత్రి

Mahakumbh-2025 Shahi Snan Prayagraj Sangam Paush Purnima Yogi Aditiyanath5
Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుష్య పూర్ణిమ స్నానంతో మహా కుంభమేళా ప్రారంభమైంది. తొలిరోజు సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 1.65 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ నుండి భక్తులపై పూల వర్షం కురిపించారు. ఇందుకోసం 20 క్వింటాళ్ల గులాబీ రేకులను వినియోగించారు. #WATCH | The first Amrit Snan of #MahaKumbh2025 will begin with Mahanirvani Panchayati Akhara taking holy dip in Triveni Sangam on the auspicious occasion of Makar SankrantiSadhus of the 13 akhadas of Sanatan Dharm will take holy dip at Triveni Sangam - a sacred confluence of… pic.twitter.com/xgN3urCEUI— ANI (@ANI) January 14, 2025మహా కుంభమేళా నగరం భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలతో పాటు అమెరికా, రష్యా, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఈక్వెడార్ తదితర దేశాల నుండి వచ్చిన జనం ఇక్కడి సనాతన సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. సంగమంలో స్నానం చేసి, నుదుటిపై తిలకం పూసుకుని ఆధ్యాత్మిక ఆనందంలో మునిగితేలుతున్నారు.#WATCH | Prayagraj, Uttar Pradesh: On former Apple CEO Steve Jobs' wife Laurene Powell Jobs, Spiritual leader Swami Kailashanand Giri says, "She is in my 'shivir'. She has never been to such a crowded place. She has got some allergies. She is very simple...All those people who… pic.twitter.com/1bQXP2lId7— ANI (@ANI) January 14, 2025కుంభమేళాలో మొదటి అమృత స్నానం మకర సంక్రాంతి శుభ సందర్భంగా జరిగింది. ఇది మహానిర్వాణి పంచాయితీ అఖాడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడంతో మొదలయ్యింది. గంగా, యమున, మర్మమైన సరస్వతి నదుల పవిత్ర త్రివేణి సంగమంలో సనాతన ధర్మంలోని 13 అఖాడాలకు చెందిన సాధువులు ఈరోజు పవిత్ర స్నానం ఆచరించనున్నారు.#WATCH | Prayagraj | Preparations are underway for the first Amrit Snan of #MahaKumbh2025 The first Amrit Snan of #MahaKumbh2025 will begin with Mahanirvani Panchayati Akhara taking holy dip in Triveni Sangam on the auspicious occasion of #MakarSankranti pic.twitter.com/fIlzfygkos— ANI (@ANI) January 13, 2025మాజీ ఆపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్‌ ఆధ్యాత్మిక గురువు స్వామి కైలాశానంద గిరి మీడియాతో మాట్లాడుతూ ‘లారెన్ పావెల్ జాబ్స్‌ నా శిబిరంలో ఉన్నారు. ఆమె ఏనాడూ ఇంత రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్లలేదు. ఆమెకు కొన్ని అలెర్జీలున్నాయి. మన సంప్రదాయాన్ని ఎప్పుడూ చూడని వారుకూడా మాతో చేరాలని కోరుకుంటున్నాం’ అన్నారు.#WATCH | Prayagraj | Devotees take holy dip on the first Amrit Snan of #MahaKumbh2025 on the auspicious occasion of #MakarSankranti #MahaKumbh2025 began yesterday with a record gathering of over 1.5 cr devotees on the first day pic.twitter.com/3MAk0yKD8y— ANI (@ANI) January 13, 20252025 మహా కుంభమేళా అమృత స్నానానికి ముందస్తు సన్నాహాలు చేశారు. మహాసంక్రాంతి శుభ సందర్భంగా మొదటి అమృత స్నానం మహానిర్వాణి పంచాయతీ అఖాడాలోని త్రివేణి సంగమంలో జరిగే పవిత్ర స్నానాలతో ప్రారంభమయ్యింది.#WATCH | Gorakhpur | Uttar Pradesh CM Yogi Adityanath says, "I extend my best wishes to all on the occasion of Makar Sankranti - it's a festival and a celebration to express gratitude towards lord Sun. Followers of Sanatan Dharm celebrate this festival with different names in… pic.twitter.com/HJukhqOpWo— ANI (@ANI) January 13, 2025మకర సంక్రాంతి శుభ సందర్భంగా మొదటి అమృత స్నానాన్ని భక్తులు ఆచరించారు. మొదటి రోజు రికార్డు స్థాయిలో 1.5 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు.#WATCH | Prayagraj | Sadhus of Mahanirvani Panchayati Akhara will be the first to take the holy dip at the first Amrit Snan of #MahaKumbh2025 on the auspicious occasion of Makar Sankranti as Sadhus of the 13 akhadas of Sanatan Dharm will take holy dip at Triveni Sangam - a sacred… pic.twitter.com/0lM8c1jbVP— ANI (@ANI) January 13, 2025ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ‘మకర సంక్రాంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది సూర్యభగవానునికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్నంగా జరుపుకుంటారన్నారు.#WATCH | Mahamandleshwar Swami Chidambaranand of Mahanirvani Panchayati Akhara, says, "I extend my best wishes to all on the occasion of #makarsankranti2025. Mahanirvani Panchayati Akhara will be the first to take holy dip on today's Amrit Snan - the first of #MahaKumbh2025..." https://t.co/0deSPAtEEe pic.twitter.com/Wftc0Nz3dO— ANI (@ANI) January 13, 2025మకర సంక్రాంతి శుభ సందర్భంగా సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.#WATCH | #MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: "I come from the US but I live in Lisbon, Portugal. I was travelling in the South. I came here via Varanasi yesterday... I like how the energy is very calm and peaceful, and everyone is very friendly. It feels very good to be… pic.twitter.com/z45G1rGxER— ANI (@ANI) January 13, 2025మహానిర్వాణి పంచాయతీ అఖాడాకు చెందిన మహామండలేశ్వర్ స్వామి చిదంబరానంద మకరసంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.సనాతన ధర్మంలోని 13 అఖాడాల క్రమాన్ని మహా కుంభమేళా పరిపాలన విభాగం ఖరారు చేసింది. ప్రతి అఖాడాకు సమయాన్ని షెడ్యూల్‌ చేశారు.ఇది కూడా చదవండి: Maha Kumbh-2025: ఒక్కో ఘాట్‌కు ఒక్కో ప్రత్యేకత.. విశేష ఫలితం

IPL Reject Kane Williamson Goes Unpicked In PSL 2025 Draft6
కేన్‌ విలియమ్సన్‌కు అవమానం

దిగ్గజ బ్యాటర్‌, న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌కు అవమానం జరిగింది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) డ్రాఫ్ట్‌లో కేన్‌ మామను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ప్లాటినమ్‌ డ్రాఫ్ట్‌లో కేన్‌ మరో 43 మంది స్టార్‌ ఆటగాళ్లతో కలిసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఐపీఎల్‌ 2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన కేన్‌ను పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కూడా ఎవరూ పట్టించుకోలేదు. కేన్‌ బరిలో నిలిచిన ప్లాటినమ్‌ డ్రాఫ్ట్‌ నుంచి 10 మంది ఆటగాళ్లను ఎంపిక చేసున్నాయి ఫ్రాంచైజీలు.అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆసీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను కరాచీ కింగ్స్‌ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వార్నర్‌ రిటైర్మెంట్‌ తర్వాత కూడా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో వార్నర్‌ అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో వార్నర్‌ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 63.20 సగటున 142.34 స్ట్రయిక్‌రేట్‌తో 316 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత ఫామ్‌ కారణంగానే పీఎస్‌ఎల్‌ డ్రాఫ్ట్‌లో వార్నర్‌కు మాంచి గిరాకీ ఉండింది.విలియమ్సన్‌ విషయానికొస్తే.. ఈ కివీస్‌ లెజెండ్‌ ఇటీవలి కాలంలో పెద్దగా టీ20లు ఆడింది లేదు. 2023లో ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడని కేన్‌.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ (2024) కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌లో కేన్‌ ఎంపిక కాకపోవడానికి అతని ఫిట్‌నెస్‌ కూడా ఓ కారణమే. ఇటీవలి కాలంలో కేన్‌ తరుచూ గాయాల బారిన పడుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఉండి కూడా కేన్‌ పొట్టి ఫార్మాట్‌లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో వేగం లేకపోవడం, భారీ షాట్లు ఆడలేకపోవడం కేన్‌కు ప్రధాన సమస్యలు.కేన్‌ ప్రైవేట్‌ లీగ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయినా అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పర్వాలేదనిపించాడు. కేన్‌ తన దేశం తరఫున 93 టీ20లు ఆడి 33.44 సగటున 2575 పరుగులు చేశాడు. కేన్‌ను ప్రైవేట్‌ లీగ్‌ల్లో ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోకపోవడానికి అతని వయసు మరో ప్రధాన కారణం. ప్రస్తుతం కేన్‌ మామ వయసు 34 ఏళ్లు.కేన్‌ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో కేన్‌ డర్బన్‌ జెయింట్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కేన్‌ అదరగొట్టాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్‌ 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.పీఎస్‌ఎల్‌ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్న పలువురు స్టార్‌ ఆటగాళ్లు..డేవిడ్‌ వార్నర్‌ (కరాచీ కింగ్స్)డారిల్‌ మిచెల్‌ (లాహోర్‌ ఖలందర్స్‌)మార్క్‌ చాప్‌మన్‌ (క్వెట్టా గ్లాడియేటర్స్‌)మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (ముల్తాన్‌ సుల్తాన్స్‌)ఆడమ్‌ మిల్నే (కరాచీ కింగ్స్‌)ఫిన్‌ అలెన్‌ (క్వెట్టా గ్లాడియేటర్స్‌)జేసన్‌ హోల్డర్‌ (ఇస్లామాబాద్‌ యునైటెడ్‌)ఆమెర్‌ జమాల్‌ (కరాచీ కింగ్స్‌)

Elon Musk making headlines with reports suggesting he might acquire TikTok US operations7
ఎలాన్ మస్క్ చేతికి టిక్‌టాక్‌..?

టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్‌ ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌(TikTok) అమెరికా కార్యకలాపాల(US operations)ను కొనుగోలు చేయవచ్చనే వార్తలొస్తున్నాయి. అమెరికాలో జాతీయ భద్రత, డేటా గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బైట్‌డ్యాన్స్‌ యూఎస్ కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను స్థానికంగా నిషేధించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు.చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్‌(ByteDance) ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్‌టాక్‌ అమెరికా ఉన్నత​ న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై తుదితీర్పు రావాల్సి ఉంది.అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్‌పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్‌ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది.డేటా భద్రతలొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్‌టాక్‌ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.కంటెంట్ మానిప్యులేషన్అమెరికన్లు చూసే కంటెంట్‌ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్‌ 2025 జనవరి 19 లోగా టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్‌లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. ఈ తరుణంలో ఎలాన్‌మస్క్‌ టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేయబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురిస్తున్నాయి.

South Africa Gold Mine at Least 100 Illegal Miners Died8
South Africa: బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు మృతి

దక్షిణాఫ్రికాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గనిలో చిక్కుకుని, 100 మంది కార్మికులు మృతిచెందారని సమాచారం. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ కార్మికులంతా దక్షిణాఫ్రికాలోని ఒక బంగారు గనిలో అక్రమంగా పనులు చేస్తున్నారు.గనిలో చిక్కుకున్న కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్మికులు నెలల తరబడి భూగర్భ గనిలో చిక్కుకున్నారని తెలిపింది. ఈ నేపధ్యంలోనే వారు మరణించారని పేర్కొంది. కాగా గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ, విజయం సాధించలేకపోయారు.మైనింగ్ ప్రభావిత కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ గ్రూప్ ప్రతినిధి సబెలో మ్ంగుని మీడియాతో మాట్లాడుతూ కొందరు గని కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని, వారి దగ్గర రెండు వీడియోలు లభ్యమయ్యాయన్నారు. ఆ వీడియోల్లో డజన్ల కొద్దీ మృతదేహాలు భూగర్భంలో గనిలో కనిపిస్తున్నాయన్నారు.వాయువ్య ప్రావిన్స్‌లోని ఈ గనిలో 100 మంది వరకూ మృతిచెందారని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటివరకు భూగర్భ గనిలో నుంచి 18 మృతదేహాలను బయటకుతీశారు. వారు ఆకలి, డీహైడ్రేషన్‌ కారణంగా చనిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం

Brahmin couples offered Rs 1 lakh for having 4 children9
నలుగురిని కనండి.. లక్ష పట్టుకెళ్లండి

ఇండోర్‌: సమాజంలో బ్రాహ్మణుల జనాభా తగ్గిపోతోందని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి బ్రాహ్మణ జంట నలుగురిని కనాలని, నలుగురిని కన్న జంటలకు రూ.1 లక్ష బహుమతి ఇస్తానని మధ్యప్రదేశ్‌ పరశురామ్‌ కళ్యాణ్‌ బోర్డు చీఫ్‌ పండిత్‌ విష్ణు రాజోరియా వ్యాఖ్యానించారు. ఆదివారం ఇండోర్‌లో సనాధ్య బ్రాహ్మణ వర్గాల్లో పెళ్లీడు యువతీయువకుల పరిచయ సమ్మేళనం, వివాహ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘బ్రాహ్మణ యువ జంటలు చక్కటి సంపాదన, ఉద్యోగం ఉండి కూడా కేవలం ఒక సంతానంతో సరిపెట్టేస్తున్నారు. ఈ పద్ధతి మంచి కాదు. సమాజంలో బ్రాహ్మణుల జనాభా తగ్గుతోంది. స్వాతంత్య్ర వచ్చినప్పటితో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయింది. హిందూయేతర జనాభా అమాంతం పెరుగుతోంటే మన వర్గీయులు జనాభా వ్యవహారాలపై దృష్టిపెట్టడమే మానేశారు. ఇకనైనా ప్రతి బ్రాహ్మణ జంట కనీసం నలుగురిని కనాలి. అలా నలుగురు సంతానం ఉన్న బ్రాహ్మణ కుటుంబాలకు తలో లక్ష రూపాయలు నగదు బహుమతిగా ఇస్తా. నేను పదవి నుంచి దిగిపోయాక కూడా ఇదే నజరానా కొనసాగేలా చూస్తా’’అని రాజోరియా అన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘పరశురామ్‌ కళ్యాణ్‌ బోర్డ్‌తో దీనికి సంబంధం లేదు. నా స్వంత ఖర్చులతో, సమాజంలోని కొన్ని వర్గాల మద్దతుతో నగదు బహుమతి అందిస్తా. ఇలాంటి పథకంతో మధ్యప్రదేశ్‌ బీజేపీ ప్రభుత్వానికి సంబంధం లేదు’’అని చెప్పారు.

Weather service issues its most severe fire warning for parts of Los Angeles area10
మళ్లీ విజృంభించనున్న కార్చిచ్చు

లాస్‌ ఏంజెలెస్‌: అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ అటవీ ప్రాంతాలను బూడిదచేస్తున్న కార్చిచ్చు మళ్లీ కన్నెర్రజేయనుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. పసిఫిక్‌ పాలిసేడ్స్‌ ప్రాంతంలోని దావాగ్నిని ఇప్పటిదాకా కేవలం 14 శాతం మాత్రమే అదుపులోకి తెచ్చిన నేపథ్యంలో వాతావరణ విభాగ నివేదికలు స్థానికుల్లో భయాందోళనలను మరింత పెంచాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, దీంతో అడవిలో కార్చిచ్చు మరింత విస్తరించే ప్రమాదముందని అమెరికా నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ సోమవారం ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు వీయనున్న శాంటా అనా పెనుగాలులతో ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం సాయంత్రం దాకా ‘రెడ్‌ ఫ్లాగ్‌’ వార్నింగ్‌ అమల్లో ఉంటుంది. మరోవైపు అటవీప్రాంతాల్లో అగ్నికీలల సంబంధ అగ్నిప్రమాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తాజాగా 24కు పెరిగింది. ఇంకా డజన్ల మంది జాడ తెలియాల్సిఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే ఒక్క లాస్‌ ఏంజెలెస్‌ సిటీ, కౌంటీ పరిధుల్లో లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకువెళ్లాలని సూచించగా, మిగతా చోట్ల కలిపి మరో 87,000 మందికి సురక్షిత స్థలాలకు వెళ్లాలని స్థానికయంత్రాంగం హెచ్చరికలుచేసింది. ఆరు చోట్ల కార్చిచ్చు వ్యాపించగా పసిఫిక్‌ పాలిసేడ్స్, ఏటోన్‌ ప్రాంతాల్లోని దావాగ్ని మాత్రమే ఇంకా అత్యంత ప్రమాదకరస్థాయిలో కొనసాగుతు న్నాయి. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నగరంలో 60 శాతం విస్తీర్ణానికి సమానమైన అటవీభూములను పాలిసేడ్స్, ఏటోన్, హర్‌స్ట్‌ కార్చిచ్చులు బూడిదకుప్పలుగా మార్చేశాయి. మొత్తంగా అన్ని కార్చిచ్చుల కారణంగా 40,000కుపైగా ఎకరాల్లో అటవీప్రాంతం పూర్తిగా కాలిపోయింది. 12,000కు పైగా ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు తగలబడ్డాయి. అయితే దుప్పటిలా కమ్మేసిన పొగ, దుమ్ము చాలా వరకు తగ్గడంతో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు తెరిచారు.బాణాసంచా వల్లే: వాషింగ్టన్‌ పోస్ట్‌నూతన సంవత్సర వేడుకల్లో జనం కాల్చిన బాణాసంచా కారణంగానే పసిఫిక్‌ పాలిసేడ్స్‌లో అగ్గిరాజుకుందని వాషింగ్టన్‌ పోస్ట్‌ వార్తాసంస్థ ఒక కథనంలో పేర్కొంది. రేడియో సంప్రదింపులు, ఆ ప్రాంతంలో బాణాసంచా కాల్చడానికి ముందు, ఆ తర్వాత తీసిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు, స్థానికుల ఇంటర్వ్యూలతో ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు తన కథనంలో పేర్కొంది. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చిన ప్రదేశంలో అగ్గిరవ్వలు అడవిలో పడి దావాగ్ని మొదలైందని, అయితే వెంటనే దానిని ఆర్పేశారు. కానీ దావాగ్ని తాలూకు నిప్పుకణికలు కొన్ని అలాగే ఉండిపోయి భీకరగాలుల సాయంతో నెమ్మదిగా మళ్లీ దావాగ్నికి ఆజ్యంపోశాయని వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది. గత మంగళవారం తొలుత పసిఫిక్‌ పాలిసేడ్స్‌లో మంటలు అంటుకున్నప్పుడు స్థానికులు ఫిర్యాదుచేసినా అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడంతో మంటలు అదుపుతప్పి చివరకు లాస్‌ ఏంజెలెస్‌ చరిత్రలోనే మరో అతిపెద్ద దావాగ్నిలా ఎదిగాయని ఆరోపణలున్నాయి. ‘‘ ఆరోజు మేం వెంటనే ఫోన్లుచేశాం. కానీ లాస్‌ఏంజెలెస్‌ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌(ఎల్‌ఏఎఫ్‌డీ) నుంచి స్పందన రాలేదు. 45 నిమిషాలతర్వాత ఒక హెలికాప్టర్‌ వచ్చి నీళ్లు పోసి వెళ్లిపోయింది. మంటలు మాత్రం ఆరలేదు’’ అని స్థానికులు మైఖేల్‌ వాలంటైన్‌ దంపతులు చెప్పారు.ప్రైవేట్‌ నీటిట్యాంక్‌లకు గిరాకీతమ ప్రాంతంలో చెలరేగుతున్న మంటల నుంచి తమ ఇళ్లను కాపాడుకునేందుకు స్థానికులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో ప్రైవేట్‌ నీటిట్యాంక్‌లకు గిరాకీ అమాంతం పెరిగింది. ఇదే అదనుగా ప్రైవేట్‌ వాటర్‌ట్యాంక్‌ సంస్థలుచార్జీలు మోతమో గిస్తున్నాయి. లాస్‌ ఏంజెలెస్‌లోని సంపన్నులు ప్రభుత్వ అగ్నిమాపక సిబ్బంది వచ్చేదాకా ఆగకుండా ప్రైవేట్‌ ఫైర్‌ఫైటర్‌లను రప్పిస్తున్నారు. అయితే ఆ సేవలందించే సంస్థలు గంటకు 2,000 డాలర్లు అంటే రూ.1,73,000 చార్జ్‌ చేస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజాలు రిక్‌ కరుసో, కీత్‌ వాసర్‌మ్యాన్‌ సహా చాలా మంది ఇదే బాటపట్టారు. ‘‘ నా ఫోన్‌ ఆగకుండా మోగుతూనే ఉంది. సంస్థ మొదలైననాటి నుంచి హాలీవుడ్‌లో ఇంతస్థాయి డిమాండ్‌ ఎప్పుడూ లేదు’’ అని కవర్డ్‌6 ఫైర్‌ఫైటింగ్‌ సేవల సంస్థ యజమాని క్రిస్‌ డన్‌ చెప్పారు. ‘‘ నగరపాలకులను నమ్మలేమని ఈవారం ఘటనతో తేలిపోయింది. నా దగ్గర డబ్బుంది. అయితేమాత్రం ఏం లాభం. ఇళ్లు తగలబడ్డాయి’’ అని ఒక హాలీవుడ్‌ ప్రముఖుడు వాపోయాడు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
NRI View all
title
Sankranti 2025 : జపాన్‌లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి వచ్చిందంటే ఊరా వాడా అంతా సంబరంగా జరుపుకుంటారు.

title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

Advertisement

వీడియోలు

Advertisement