Top Stories
ప్రధాన వార్తలు
Mahakumbh 2025: ఇప్పటికే 85 లక్షలమంది పుణ్యస్నానాలు!
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి స్నానాలు చేసే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.కుంభమేళా(Kumbh Mela) నేడు (సోమవారం) ప్రారంభంకాగా దీనికి ముందుగానే అంటే ఆదివారం రాత్రి 10 గంటల వరకు, 85 లక్షల మంది భక్తులు సంగమతీరంలో స్నానాలు చేశారు. జనవరి 11, శనివారం నాడు 35 లక్షల మంది భక్తులు మహా కుంభమేళాలో స్నానం చేశారు. జనవరి 12వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఆ రోజున 50 లక్షల మంది భక్తులు ఇక్కడ స్నానాలు చేశారు. ఈ విధంగా, రెండు రోజుల్లో మొత్తం 85 లక్షల మంది భక్తులు మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు మహా కుంభమేళాకు ముందుగానే భక్తులు చేరుకున్నారు. వారు గంగా, యమున సరస్వతీ నదుల సంగమంలో స్నానమాచరించారు. శనివారం 35 లక్షల మంది భక్తులు సంగమంలో స్నానం చేయడానికి వచ్చారని సమాచార డైరెక్టర్ శిశిర్ తెలిపారు. గత రెండు రోజుల్లో (శని, ఆదివారాలు) సంగంలో 85 లక్షలకు పైగా ప్రజలు స్నానం చేశారని తెలిపారు. ఈ మహా కుంభమేళాకు 45 కోట్లకు పైగా ప్రజలు వస్తారని, ఇది చరిత్ర(History)లో అతిపెద్ద మేళాగా మారనుందని అధికారి తెలిపారు. మహా కుంభమేళాలో మొదటి అమృత స్నానం (రాజ స్నానం) జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా జరగనుంది. ఈ సమయంలో అఖాడాలు తమ సంప్రదాయాల ప్రకారం స్నానాలు ఆచరించనున్నారు.ఇది కూడా చదవండి: Maha Kumbh: పుణ్యస్నానాలు ప్రారంభం
భోగభాగ్యాల భోగి పండగ దేనికి సంకేతమంటే.?
'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని శాస్త్ర వచనం. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. మరోక అర్థంలో భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా 'భోగి పండగ' ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. అలాంటి ఈ పండుగను అనాథిగా ఆచారిస్తూ రావడానికి గల కారణం, ఆరోగ్య రహాస్యలు గురించి సవివరంగా చూద్దామా..!భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి…దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయానం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి.. ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెబుతున్నారు.ఆరోగ్యం రహస్యం..ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. అందువల్లే భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వచ్చింది. పైగా దీన్నుంచి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. భోగి మంటలు ఎందుకంటే..చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. పురాణాల ప్రకారం, దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటిముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని కోరాడు. అనంతరం రురువు వర గర్వంతో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఈ ధనుర్మాసంలో 30 రోజులపాటు ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టి.. ఆ తర్వాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుడిని అందులో తోస్తారు. అలా రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తోంది.ఈ పండగ సందేశం, అంతరార్థం..చలికాలంలో సూక్ష్మక్రిముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగిపోవడానికి మన పెద్దలు ఇలా భోగి మంటలు వేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారని చెబుతుంటారు. ఇక ఈ పండుగ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే..చెడు అలవాట్లను, అసూయా, ఈర్ఘ, దుర్భద్ధిని ఈ మంటల రూపంలో దగ్ధం చేసుకుని మంచి మనుసుతో జీవితాన్ని ప్రారంభించి సానుకూలా ఆలోచనలతో మంచి విజయాలను అందుకోవాలనే చక్కటి సందేశాన్ని ఇస్తోంది. మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమని ప్రార్థిస్తూ అగ్నిహోత్రాన్ని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలు, అలాగే మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో వేసి దగ్ధం చేసుకోవటమే భోగి. ఇలా మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం.(చదవండి: సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!)
యాపిల్‌పై జుకర్‌బర్గ్ తీవ్ర వ్యాఖ్యలు
దిగ్గజ పారిశ్రామిక వేత్త, మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg).. 'జో రోగన్ ఎక్స్పీరియన్స్'లో మాట్లాడుతూ యాపిల్ (Apple)ను విమర్శించారు. గ్లోబల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చినందుకు ఐఫోన్లను ప్రశంసిస్తూనే.. కంపెనీ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం లేదని, ఈ విషయంలో యాపిల్ విఫలమైందని అన్నారు.ఐఫోన్ బాగుంది, ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది దగ్గర ఇప్పుడు ఈ ఫోన్ ఉందని చెబుతూనే.. సంస్థ కొంతకాలంగా గొప్పగా ఏమీ కనుగొనలేదని జుకర్‌బర్గ్ వెల్లడించారు. స్టీవ్ జాబ్స్ ఐఫోన్‌ను కనుగొన్నారు. అయితే సంస్థ కేవలం దానిపై 20ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రతి ఏటా కొత్త వెర్షన్స్ లాంచ్ చేస్తోంది. కానీ అవి పాత వెర్షన్ల కంటే మెరుగ్గా లేదు. ఈ కారణంగానే చాలా తక్కువ మంది మాత్రమే కొత్త ఐఫోన్లను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.సంస్థ అందిస్తున్న కొత్త ఐఫోన్ మోడళ్లలో పెద్దగా అప్గ్రేడ్లు లేకపోవడం వల్ల ఫోన్ విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే కంపెనీ కొనుగోలుదారులపై, డెవలపర్లపై ఈ 30 శాతం పన్ను విధిస్తోందని.. ఇలాంటి వాటి వల్లనే యాపిల్ లాభపడుతోందని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.యాపిల్ ఇతర కంపెనీల పరికరాలను iPhoneలతో సజావుగా ఎలా పని చేయనివ్వదు అనే దాని గురించి జుకర్‌బర్గ్ కలత చెందారు. దీనికి ఆయన ఎయిర్పాడ్లను ఉదాహరణగా చూపాడు, అదే కనెక్షన్ టెక్నాలజీని ఉపయోగించకుండా ఇతర కంపెనీలను బ్లాక్ చేస్తుందని వివరించారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాతమ రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ కోసం యాపిల్ కనెక్షన్ ప్రోటోకాల్‌ను ఉపయోగించమని మెటా చేసిన అభ్యర్థనను.. భద్రతా కారణాల వల్ల యాపిల్ తిరస్కరించింది. వినియోగదారు గోప్యత పట్ల నిజమైన ఆందోళన కంటే కూడా వ్యాపార ప్రయోజనాల కారణంగా అభ్యర్థనను తిరస్కరించినట్లు జుకర్‌బర్గ్ చెప్పారు.యూజర్ల గోప్యత, భద్రతపై యాపిల్ వైఖరిని ఆయన విమర్శించారు. యాపిల్ కనిపెట్టిన కొత్త వాటిలో 'విజన్ ప్రో' ఒకటి మాత్రమే అని నేను అనుకుంటున్నానని.. కంపెనీ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ గురించి జుకర్‌బర్గ్ ప్రస్తావించారు. ఇది కూడా సరైన అమ్మకాలు పొందలేదని ఆయన అన్నారు.
సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. నగరాలు వదిలి పల్లె చేరుకున్న ప్రజలు పండుగ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఇవాల్టి నుంచి భోగితో మొదలైన.. కనుమతో ఈ సంక్రాంతి మూడు రోజుల పాటు సాగనుంది. ఇంకేముంది కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంటర్టైన్మెంట్ చేసే సినిమాలు కూడా రెడీ అయ్యాయి. ఈ సంక్రాంతిని మరింత సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేందుకు థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ ఇప్పటికే విడుదలయ్యాయి. వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం పండుగ రోజే బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది.ఈ పండుగ వేళ కుటుంబంతో కలిసి సినిమాలను ఆస్వాదించేందుకు ఓటీటీలే సరైన వేదిక. ఈ సంక్రాంతి వేళ సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ సినిమాలు సిద్ధమైపోయాయి. అయితే ఈ పండుగు ఓటీటీల్లో పెద్ద సినిమాలు లేకపోవడం మైనస్. విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించిన విడుదల పార్ట్-2 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ మూవీ. దీంతో బాలీవుడ్ ఐ వ్యాంట్ టు టాక్ అనే సినిమాతో పాటు పలు హాలీవుడ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఈ వారంలో ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్‌సింగిల్స్ ఇన్ఫెర్నో(కొరియన్ రియాలిటీ షో) సీజన్ 4- 14 జనవరివిత్ లవ్ మెగాన్- హాలీవుడ్- జనవరి 15జో కిట్టీ సీజన్-2 - కొరియన్ వెబ్ సిరీస్- 16 జనవరిబ్యాక్ ఇన్ యాక్షన్-(హాలీవుడ్ మూవీ)- 17 జనవరిది రోషన్స్- హిందీ డాక్యుమెంటరీ సిరీస్- 17 జనవరిఅమెజాన్ ప్రైమ్ వీడియోఐ వ్యాంట్ టు టాక్- హిందీ సినిమా- జనవరి 17పాతల్ లోక్ సీజన్-2- 17 జనవరిడిస్నీ ప్లస్ హాట్‌స్టార్పవర్ ఆఫ్ పాంచ్- (హిందీ వెబ్ సిరీస్)- 17 జనవరిజీ5విడుదల పార్ట్-2- తమిళ సినిమా- జనవరి 17 సోని లివ్పణి- మలయాళ సినిమా- 16 జనవరిఅమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్చిడియా ఉద్- హిందీ సిరీస్- జనవరి 15ఎపిక్ ఆన్గృహ లక్ష్మి- హిందీ సిరీస్- జనవరి 16జియో సినిమాస్పీక్ నో ఈవిల్- హాలీవుడ్ సినిమా- జనవరి 13హర్లీ క్వీన్- సీజన్ -5(హాలీవుడ్)- జనవరి 17లయన్స్ గేట్ ప్లేహెల్ బాయ్- ది క్రూక్డ్ మ్యాన్-(హాలీవుడ్ మూవీ)- జనవరి 17మనోరమ మ్యాక్స్ఐ యామ్ కథలాన్(మలయాళ సినిమా)- జనవరి 17
IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు తమ కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది. ఐపీఎల్-2025 సీజన్‌కు గానూ టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను తమ సారథిగా ఎంపిక చేసుకుంది. కాగా క్యాష్ రిచ్ లీగ్‌లో కెప్టెన్‌గా ఈ ముంబై బ్యాటర్‌కు మంచి అనుభవం ఉంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లకు అతడు నాయకుడిగా వ్యవహరించాడు.కోల్‌కతాకు టైటిల్ అందించిఇక గతేడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన 30 ఏళ్ల శ్రేయస్ అయ్యర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, మెగా వేలం-2025(IPL Mega Auction 2025)కి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ అతడిని రిటైన్ చేసుకుంటుందని విశ్లేషకులు భావించగా.. శ్రేయస్ మాత్రం జట్టుతో బంధాన్ని తెంచుకునేందుకే ఇష్టపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు రూ. 2 కోట్ల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చాడు.భారీ ధర.. ఈ చాంపియన్ కెప్టెన్‌ను దక్కించుకునేందుకు పాత జట్టు కోల్‌కతా తొలుత రంగంలోకి దిగగా.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తగ్గేదేలే అన్నట్లు ధరను పెంచుకుంటూ పోయాయి. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన వేలం పాటలో ఆఖరికి పంజాబ్ నెగ్గింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 26 కోట్ల 75 లక్షలు పెట్టి శ్రేయస్ అయ్యర్‌ను కొనుగోలు చేసింది. తాజాగా అతడికి పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.నమ్మకాన్ని నిలబెట్టుకుంటాఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్‌తో మరోసారి కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా చూస్తున్నా. జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ఇప్పటికే నిరూపించుకున్న ఆటగాళ్లతో పాటు ప్రతిభావంతులు చాలా మంది అందుబాటులో ఉన్నారు.పంజాబ్ కింగ్స్ జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్ అందించేందుకు నావంతు కృషి చేస్తా’ అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక.. ప్రధాన కోచ్ పాంటింగ్ మాట్లాడుతూ ‘శ్రేయస్‌కు ఆటపై మంచి అవగాహన ఉంది. కెప్టెన్‌గా ఇప్పటికే నిరూపించుకున్నాడు. గతంలో అతడితో కలిసి పనిచేశా. సీజన్ కోసం ఆతృతగా చూస్తున్నా’ అని అన్నాడు.కాగా ఇటీవల శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 2024లో రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలు గెలిచిన ముంబై జట్టులో శ్రేయస్ అయ్యర్ సభ్యుడు. అంతేకాదు.. ఇటీవల అతడి కెప్టెన్సీలో ముంబై టీమ్ దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ టైటిల్ గెలిచింది.సూపర్ ఫామ్లోఅదే విధంగా.. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ శ్రేయస్ అయ్యర్ భారీ శతకాలతో దుమ్ములేపాడు. తదుపరి అతడు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశం ఉంది. అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో మాత్రం అయ్యర్‌కు చోటు దక్కలేదు. కాగా శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు.గతేడాది ఫ్లాప్ షోఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్ ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఇక గత సీజన్లో శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. గాయం వల్ల అతడు ఆదిలోనే తప్పుకోగా.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ జట్టును ముందుకు నడిపించాడు. అయితే, పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ పంజాబ్ కేవలం ఐదే గెలిచి.. తొమ్మిదో స్థానంతో సీజన్‌ను ముగించింది. చదవండి: వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. సంచలనం సృష్టించిన ముంబై బ్యాటర్𝐒𝐡𝐫𝐞𝐲𝐚𝐬 𝐈𝐲𝐞𝐫 ➡️ 𝐓𝐡𝐞 𝐜𝐡𝐨𝐬𝐞𝐧 𝐨𝐧𝐞! ©️♥️#CaptainShreyas #SaddaPunjab #PunjabKings pic.twitter.com/EFxxWYc44b— Punjab Kings (@PunjabKingsIPL) January 12, 2025
అయ్యో.. లాస్ ఏంజెలెస్! 24కు చేరిన మృతుల సంఖ్య
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఎంతకీ శాంతించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమై ప్రాంతంపై వరుసగా ఆరో రోజు కూడా దాని ప్రతాపం చూపించింది. దీనికారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 24కి చేరింది. మరో పాతిక మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. తీవ్రమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి. ‘‘అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యం’’ అని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ అభివర్ణించారు. కార్చిచ్చు(Wildfires)తో ఇటిప్పదాకా 24 మంది బలయ్యారు. పాలిసేడ్స్‌లో 8 మంది, ఎటోన్లో 16 మంది మరణించారు. చనిపోయినవాళ్లలో ‘కిడ్డీ కాపర్స్’ ఫేమ్ నటుడు రోరీ సైక్స్ కూడా ఉన్నాడు. కార్చిచ్చుతో ఆర్థికంగా వాటిల్లిన నష్టం 150 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇప్పటివరకూ కార్చిచ్చుతో 62 చదరపు మైళ్ల విస్తీర్ణం దగ్ధమైంది. 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో వైశాల్యం కన్నా అధికం. ఇక.. పాలిసేడ్స్ ఫైర్‌ను 11శాతం, ఎటోన్ ఫైర్‌ను 15 శాతం అదుపు చేయగలిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మంటలను ఆర్పివేయడానికి స్థానిక అగ్నిమాపక దళంతో పాటు కెనడా, మెక్సికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తంగా 14 వేల మంది సిబ్బంది, 1,354 అగ్నిమాపక యంత్రాలు, 84 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇందులో పాలుపంచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.మరోవైపు.. లాస్ ఏంజెలెస్ కౌంటీలో 1.5 లక్షల మందిని నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశించిట్లు తెలిపారు. ఇప్పటికే ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నవారికి నిత్యావసరాలు, దుస్తులు అందించేందకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.సంబంధిత వార్త: ఎందుకీ కార్చిచ్చు!ఇక వినాశం(Disaster movies) ఆధారంగా సినిమాలు తీసే హాలీవుడ్లో.. మంటలతో అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలువురు తారలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆంటోనీ హోప్కిన్స్, పారిస్ హిల్టన్, మెల్ గిబ్సన్, బిల్లీ క్రిస్టల్ లాంటి తారల ఇళ్లు కార్చిచ్చు ధాటికి బూడిదయ్యాయి. ఇదిలా ఉంటే.. కాలిఫోర్నియా కార్చిచ్చు రాజకీయ రంగు పులుముకుంది. అధికారుల చేతగానితనమేనని కాబోయే అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ విమర్శించగా.. డెమోక్రట్ సెనేట్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఆ విమర్శలను తిప్పి కొట్టారు. అంతేకాదు.. లాస్ ఏంజెలెస్ పూర్తిగా నాశనం కావడంతో.. ‘‘లాస్ ఏంజెలెస్ 2.0’’ పేరిట పునర్మిర్మాణ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారాయన. మరోవైపు.. ఫెడరల్‌తో పాటు స్థానిక దర్యాప్తు సంస్థలు కార్చిచ్చు రాజుకోవడానికి గల కారణాలను పసిగట్టే పనిలో ఉన్నాయి. హాలీవుడ్ స్టార్ల నిర్వాకంతో..ఇదిలా ఉంటే.. మంటల్ని ఆర్పేందుకు నీటి కోరత అక్కడ ప్రధాన సమస్యగా మారింది. అయితే.. హాలీవుడ్ స్టార్ల నిర్వాకం వల్లే లాస్ ఏంజెలెస్‌కి ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలాలను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయడంతో.. మంటలను చల్లార్చేందుకు నీటి కొరత ఎదురవుతోందని చెబుతున్నారు. కొందరు స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడుకున్నారంటూ డెయిలీ మెయిల్ ఓ కథనం ప్రచురించింది.నటి కిమ్ కర్దాషియన్ ది ఓక్స్లోని తన ఇంటి చుట్టూ తోటను పెంచేందుకు తనకు కేటాయించిన నీటి కంటే అధికంగా నీటిని వాడినట్లు అధికారులు గుర్తించారు. అలాగే.. సిల్వస్టర్ స్టాలోన్, కెవిన్ హార్ట్ వంటి వారు అదనంగా నీరు వాడుకుని జరిమానాలు చెల్లించారు. కొందరు హాలీవుడ్ స్టార్లు గంటకు 2,000 డాలర్లు చెల్లించి.. ప్రైవేటు ఫైర్ఫైటర్లను నియమించుకున్నారని డెయిలీ మెయిల్ పేర్కొంది. ఇక ప్రస్తుతం పసిఫిక్ పాలిసేడ్స్‌లో అన్ని హైడ్రెంట్లు పనిచేస్తున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ పేర్కొంది. కానీ, 20శాతం హైడ్రెంట్లలో నీటి ప్రెజర్ చాలకపోవడంతో.. కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: అందుకే కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలిగా: అనిత
46 ఏళ్ల ‘పవార్’ రాజకీయానికి బీజేపీ చెక్ పెట్టింది: అమిత్ షా
ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో 1978 నుంచి శరద్ పవార్.. అస్థిర, వెన్నుపోటు రాజకీయాలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ విజయంతో పవార్ రాజకీయాలకు ముగింపు పలికినట్టు అయ్యిందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం షిర్డీలో పర్యటించారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ..‘మహారాష్ట్రలో 1978లో శరద్ పవార్ భిన్నమైన రాజకీయాలను మొదలుపెట్టారు. అస్థిర, వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారు. కానీ, 2024 ఎన్నికల్లో ప్రజలు వాటిని తిరస్కరించారు. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ రాజకీయాలకు కూడా ప్రజలకు ముగింపు పలికారు. కుట్రపూరిత రాజకీయాలు కూడా తిరస్కరణకు గురయ్యాయి. వాళ్లిద్దర్నీ మహారాష్ట్ర ప్రజలు ఇంటికి సాగనంపారు. బీజేపీతో పాటు నిజమైన శివసేన, ఎన్సీపీలను గెలిపించారు. వారి ఓటమితో మహారాష్ట్రలో అస్థిర రాజకీయాలకు ముగింపు పడిందన్నారు.ఉద్ధవ్ థాక్రే మమ్మల్ని మోసం చేశాడు. 2019లో ఆయన బాలాసాహెబ్ సిద్ధాంతాన్ని విడిచిపెట్టారు. ఈరోజు మీరు ఆయనకు తన స్థానాన్ని మీరే చూపించారు. ఆయన ద్రోహం ప్రజలకు అర్థమైంది. రాష్ట్రంలో బీజేపీ సాధించిన పెద్ద విజయానికి పార్టీ కార్యకర్తలే కారణం. అందరి శ్రమతోనే ఘన విజయం అందుకున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన శరద్ పవార్.. అనేక సహకార సంస్థలకు నేతృత్వం వహించారు. కానీ, రైతుల ఆత్మహత్యలను మాత్రం ఆయన ఆపలేకపోయారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. రైతుల సంక్షేమం కోసమే మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది’ అంటూ కీలక కామెంట్స్ చేశారు.#WATCH | Maharashtra: Union Home Minister Amit Shah says, "... The victory (of BJP) in Maharashtra ended the politics of instability and backstabbing started by Sharad Pawar in 1978. Uddhav Thackeray betrayed us, he left the ideology of Balasaheb in 2019. Today you have shown him… pic.twitter.com/BzACZ9bOSJ— ANI (@ANI) January 12, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఎన్సీపీ నేత అజిత్ పవార్, శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు.
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయొద్దు
లక్నో: ద్విచక్ర వాహనాల ప్రమాదాలు తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి ఇంధనం పోయొద్దని పెట్రోల్ బంకు నిర్వాహకులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో 75 జిల్లాల కలెక్టర్లకు రవాణాశాఖ కమిషనర్ బ్రజేష్ నారాయణ సింగ్ లేఖలు పంపారు. వాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు సైతం కచ్చితంగా హెల్మెట్ ధరించి ఉండాలని పేర్కొన్నారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు పెట్రోల్ బంకుల బయట ‘నో హెల్మెట్, నో ఫ్యూయెల్’బోర్డులను ప్రదర్శించాలని సూచించారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో బాధితులు హెల్మెట్ ధరించడం లేదన్న గణాంకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాలను కాపాడటం, రోడ్డు భద్రతను నిర్ధారించడమే రవాణా శాఖ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లాలో 2019లో ప్రవేశపెట్టినా అమలులో నిర్లక్ష్యం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా ఆదేశాల అమలుపై పర్యవేక్షణ అవసరమని, దీనికోసం అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ఏటా దాదాపు 26వేల మంది చనిపోతున్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే వీరిలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల రవాణాశాఖ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ప్రమాదాలను నివారించేందుకు చర్యలు పేపట్టాలని ఆదేశించారు.
చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి, ఆరుగురు మరణించిన ఘటనకు బాధ్యులైన వారిపై చర్యల విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందంటూ ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan mohan reddy) ఆదివారం మండిపడ్డారు. టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలిన నేపథ్యంలో విచారణ చేసి.. వారిని జైల్లో పెట్టాల్సిన ప్రభుత్వం వారిని విడిచిపెట్టిందంటే దానర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు.చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్లందరినీ వెంటనే డిస్మిస్ చేసి.. కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవునిపట్ల మీ భక్తిని చాటుకోవాలని సీఎం చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే..తొక్కిసలాటను సీరియస్‌గా తీసుకోలేదు..చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ ఆరో తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులను, అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయకపోవడం మొదలు.. టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ సహా, కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలింది. ఈ నేపథ్యంలో.. విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన వీరిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటి? జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోలేదనే కదా అర్థం? తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా? శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్లు? ఈ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం.. వెంటనే టీటీడీ చైర్మన్‌ను, ఈఓను, ఏఈఓను, ఎస్పీ, కలెక్టర్‌ను డిస్మిస్ చేయకపోవడం.. ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా!డిప్యూటీ సీఎం డిమాండ్లు హాస్యాస్పదం..ప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబుగారు దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మరోవైపు.. డిప్యూటీ సీఎంగారు క్షమాపణ చెబితే అదే చాలన్నట్లుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగారేమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, డిప్యూటీ సీఎంగారేమో, లేదు క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు.ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉంటుందా? టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీలేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. టీటీడీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదు.
ఈ రాశి వారికి కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది.
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: పౌర్ణమి తె.3.59 వరకు (తెల్లవారితే మంగళవారం) తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: ఆరుద్ర ఉ.11.02 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.10.59 నుండి 12.31 వరకు, దుర్ముహూర్తం: ప.12.34 నుండి 1.22 వరకు, తదుపరి ప.2.48 నుండి 3.36 వరకు, అమృతఘడియలు: ఉ.8.25నుండి 10.02 వరకు, భోగి పండగ; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.39. మేషం...కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. అంచనాలు నిజమవుతాయి. అనుకోని ఆహ్వానాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.వృషభం...రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొంత అసంతృప్తి. ఉద్యోగాలలో పనిభారం.మిథునం...ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటì మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.కర్కాటకం...ప్రయాణాలు వాయిదా వేస్తారు. భూవివాదాలు. ఆరోగ్యసమస్యలు. పనుల్లో జాప్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.సింహం.....చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయికన్య...కొత్త పనులు చేపడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.తుల..దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ముఖ్యమైన పనులలో తొందరపాటు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.వృశ్చికం......పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.ధనుస్సు...కొత్త పనులు చేపడతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కొన్ని వివాదాలు పరిష్కారం. వస్తులాభాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.మకరం..చిరకాల మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.కుంభం..ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.మీనం....వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. శ్రమాధిక్యం.
Delhi Election-2025: అందరి దృష్టి షకూర్ బస్తీపైనే.. ఆ పార్టీల మధ్య హోరాహోరీ?
కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు
అయ్యో.. లాస్ ఏంజెలెస్! 24కు చేరిన మృతుల సంఖ్య
IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్
బ్రహ్మాండం... కృష్ణుడి పాకుండలు
సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు!
46 ఏళ్ల ‘పవార్’ రాజకీయానికి బీజేపీ చెక్ పెట్టింది: అమిత్ షా
26 నుంచి రేషన్ కార్డుల జారీ
పెళ్లి ఖర్చులు - పన్ను భారం
నాలుగేళ్లుగా ప్రేమించాడు.. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు
సాక్షి కార్టూన్ 13-01-2025
ఈ రాశి వారికి కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది.
ర్యాంకు ఆధారంగా ఇందిరమ్మ ఇల్లు
నా హృదయంలో ప్రత్యేక స్థానం ఆ సినిమాకే: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
మన్మథుడు హీరోయిన్‌పై డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు
తిరుమలలో ‘లక్ష్మణ’ లీలలు!
'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు!
TG: రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
ఒక్క రీఛార్జ్‌తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండి
Delhi Election-2025: అందరి దృష్టి షకూర్ బస్తీపైనే.. ఆ పార్టీల మధ్య హోరాహోరీ?
కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు
అయ్యో.. లాస్ ఏంజెలెస్! 24కు చేరిన మృతుల సంఖ్య
IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్
బ్రహ్మాండం... కృష్ణుడి పాకుండలు
సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు!
46 ఏళ్ల ‘పవార్’ రాజకీయానికి బీజేపీ చెక్ పెట్టింది: అమిత్ షా
26 నుంచి రేషన్ కార్డుల జారీ
పెళ్లి ఖర్చులు - పన్ను భారం
నాలుగేళ్లుగా ప్రేమించాడు.. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు
సాక్షి కార్టూన్ 13-01-2025
ఈ రాశి వారికి కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది.
ర్యాంకు ఆధారంగా ఇందిరమ్మ ఇల్లు
నా హృదయంలో ప్రత్యేక స్థానం ఆ సినిమాకే: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
మన్మథుడు హీరోయిన్‌పై డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు
తిరుమలలో ‘లక్ష్మణ’ లీలలు!
'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు!
TG: రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
ఒక్క రీఛార్జ్‌తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండి
సినిమా
మన్మథుడు హీరోయిన్‌పై డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు
సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మజాకా (Majaka Movie). రీతూ వర్మ, అన్షు హీరోయిన్లుగా నటించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఆదివారం (జనవరి 12న) ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్ అన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.హీరోయిన్ ఓ రేంజ్లో..ముందుగా త్రినాధ రావు (Trinadha Rao) మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్లో ఉంటుంది. ఆ హీరోయిన్ మజాకాలో హీరోయిన్గా కళ్ల ముందుకు వచ్చేసరికి ఇది నిజమేనా? అని ఆశ్చర్యపోయాం. నేనే చెప్పా..అన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా.. అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. అతడి మాటలకు హీరోయిన్ అసౌకర్యానికి లోనయినట్లు తెలుస్తోంది. హీరోయిన్ శరీరం గురించి డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.కావాలనే..ఇక ఇదే ఈవెంట్లో సెకండ్ హీరోయిన్ పేరు.. అంటూ కావాలనే రీతూ వర్మ పేరు మరిచిపోయినట్లు నాటకం ఆడాడు. కాస్త వాటర్ ఇవ్వమని కొంత గ్యాప్ తీసుకుని గుర్తొచ్చింది రీతూవర్మ అని ఆమె పేరు చెప్పాడు. ఇదంతా చూసిన జనాలు.. డైరెక్టర్ ఓవరాక్షన్ ఎక్కువైందని కామెంట్లు చేస్తున్నారు. ఇక మజాకా మూవీ విషయానికి వస్తే.. ఇది ఫిబ్రవరి 21న విడుదల కానుంది. చదవండి: పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. అబ్బాయి పేరెంట్స్ అయినా ముందే చెప్పాలిగా
విజయ్ చివరి సినిమా రీమేక్? ఉన్నదంతా కక్కేసిన నటుడు.. అనిల్ అసహనం
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. దీనికంటే ముందు ఆయన భగవంత్ కేసరి సినిమా (Bhagavanth Kesari Movie) చేశాడు. దీనికి అనిల్ రావిపూడి డైరెక్టర్. ఈయన కామెడీని పక్కన పెట్టి మొదటిసారి ఎమోషనల్ డ్రామా పండిచే ప్రయత్నం చేశాడు. తొలి ప్రయత్నంలోనే సక్సెసయ్యాడు. 2023లో వచ్చిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.ఒకే సినిమాను ఐదుసార్లు చూసిన విజయ్‌అయితే ఈ సినిమాపై తమిళ స్టార్ విజయ్ (Vijay) మనసు పారేసుకున్నాడట! ఒకటీరెండు సార్లు కాదు ఏకంగా ఐదుసార్లు చూశాడట! ఈ విషయాన్ని తమిళ నటుడు వీటీవీ గణేశ్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈవెంట్లో వెల్లడించాడు. గతేడాది చెన్నైలో హీరోను విజయ్ను కలిశాను. నాకు అనిల్ రావిపూడి ఫ్రెండ్ అని విజయ్‌కు తెలుసు. తన చివరి సినిమాను అనిల్‌ను డైరెక్ట్ చేయమని అడిగాడు. కానీ అందుకు అనిల్ ఒప్పుకోలేదు. భగవంత్ కేసరి సినిమాను విజయ్ ఐదుసార్లు చూశాడు.పెద్ద డైరెక్టర్లు క్యూలో ఉన్నా..తనకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. తనకోసం తమిళంలో ఈ సినిమా తీస్తావా? అని అనిల్ రావిపూడి (Anil Ravipudi)ని పిలిచి అడిగాడు. కానీ అందుకు అనిల్ ఒప్పుకోలేదు. తాను రీమేక్ చేయనని ముఖం చెప్పి వచ్చేశాడు. నలుగురైదుగురు పెద్ద డైరెక్టర్లు విజయ్ చివరి సినిమా చేసేందుకు లైన్లో నిల్చుంటే అనిల్ మాత్రం చేయనని చెప్పి వచ్చేశాడు అని చెప్పుకొచ్చాడు. ఇంతలో అనిల్ రావిపూడి మధ్యలో కలుగజేసుకుంటూ సినిమానే చేయను అనలేదు, రీమేక్ చేయనన్నాను అని క్లారిటీ ఇచ్చాడు.అప్పుడు నేనూ చూశాగణేశ్ మళ్లీ మాట్లాడుతూ.. విజయ్ ఆ సినిమాను అయిదుసార్లు ఎందుకు చూశాడా? అని నేనూ భగవంత్ కేసరి చూశాను. అప్పుడు నాకు.. అనిల్ బానే తీశాడనిపించింది అని చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ చివరి సినిమా ఏదై ఉంటుందన్న చర్చ మొదలైంది. అనిల్ రావిపూడి వద్దన్నప్పటికీ మరో డైరెక్టర్‌తో భగవంత్ కేసరి రీమేక్ చేస్తాడా? లేదా? ఇంత మంచి ఆఫర్‌ను అనిల్ ఎందుకు వదులుకున్నాడు? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే విజయ్ 69 వ సినిమాయే చివరి చిత్రమని అందరూ భావిస్తున్నారు. దీని తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం కానున్నాడు.చదవండి: గేమ్ ఛేంజర్‌కు ఊహించని కలెక్షన్స్ .. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. 'అబ్బాయి పేరెంట్స్ అయినా చెప్పాలిగా'
కష్టాలు నాకు చుట్టాలని కొందరు అంటూ ఉంటారు. కానీ కీర్తి భట్‌కు కష్టాలు చుట్టాలుగా కాదు ఏకంగా కుటుంబ సభ్యులమే అంటూ తన ఇంట్లో, జీవితంలో తిష్ట వేశాయి. ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉంటున్న సమయంలో విధి కీర్తి జీవితంతో ఆడుకుంది. యాక్సిడెంట్లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. అమ్మానాన్న, అన్నయ్య.. ముగ్గురూ దూరమవడంతో ఎవరూ లేని అనాథగా మారింది.సినిమాల నుంచి సీరియల్స్దురదృష్టవంతురాలినని కుంగిపోయింది. కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే కరెక్ట్ కాదని తనకు తాను సర్ది చెప్పుకుంది. బాధను దిగమింగుకుంటూ జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కోవాలనుకుంది. నచ్చిన ఫీల్డ్‌లో తన సత్తా చూపించాలనుకుంది. అలా కీర్తి భట్ (Keerthi Bhat) నటనవైపు అడుగులు వేసింది. కన్నడలో టీవీ సీరియల్స్ చేసింది. రెండు కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తర్వాత మనసిచ్చి చూడు సీరియల్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కార్తీకదీపం ధారావాహికలోనూ మెరిసింది.ఎప్పటికీ తల్లి కాలేవన్న వైద్యులుఈ సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అయితే బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కు వెళ్లేముందు కూడా మరోసారి కష్టాలు తనను పట్టికుదిపేశాయి. యాక్సిడెంట్ వల్ల కీర్తి ఎప్పటికీ తల్లి కాలేదని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆమె ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆ సంతోషం కూడా ఎంతోకాలం ఉండలేదు. బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాప మరణించింది.(చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!)2023లో ఎంగేజ్మెంట్ఇలా ఎన్నో కష్టాలు దాటి ఇక్కడిదాకా వచ్చింది కీర్తి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానంటూ 2023లో కీర్తి గుడ్‌న్యూస్ చెప్పింది. హీరో, దర్శకుడు విజయ్ కార్తీక్‌ను వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. అదే ఏడాది విజయ్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ మరుసటి ఏడాది నుంచి కాబోయే భర్తతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. నిశ్చితార్థం అయిపోయి రెండేళ్లవుతున్నా ఇంకా పెళ్లి డేట్ చెప్పట్లేదు. తాజాగా కీర్తి.. కాబోయే భర్తతో కలిసి తొలిసారి పూజలో పాల్గొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. భార్యాభర్తల్లా పూజ చేస్తున్నారేంటి?ఇది చూసిన ఓ నెటిజన్.. మిస్ కన్నడ కీర్తి గారు.. పెళ్లికి ముందు ఇలా కలిసి పూజ చేయడం తెలుగు సాంప్రదాయం కాదు. కార్తీక్.. కనీసం మీకు మీ తల్లిదండ్రులైనా చెప్పలేదా? అయినా ఈ జనరేషన్లో పేరెంట్స్ మాట ఎవరూ వినరు. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలోనివాళ్లు అసలే వినరు అని పెదవి విరిచాడు. దీనికి కీర్తి స్పందిస్తూ.. పెళ్లికి ముందే మేము ఇలా పూజ చేస్తే ఏమవుతుందో కాస్త చెప్పగలరా? ఒకరిని నిందించేముందు సరైన కారణాలు చెప్పండి అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.ఎవరీ కార్తీక్?కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన విజయ కార్తీక్ మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశాడు. తర్వాత సినిమా మీదున్న ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు చేశాడు.చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!
దుబాయ్ కారు రేసింగ్.. అజిత్ కుమార్ టీమ్ క్రేజీ రికార్డ్
దుబాయ్ కార్ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్ కుమార్‌కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్‌లో 24హెచ్ కార్ రేసింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా తమిళ స్టార్ శివ కార్తికేయన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు.రేసుకు ముందు ప్రమాదం.. అయితే ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.15 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. కాగా.. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. అతని జట్టు ఈ కారు రేసింగ్‌లో విజయం సాధించింది. రేసింగ్ జట్టు యజమానిగా తాను రేసింగ్‌లో పాల్గొంటానని అజిత్ కుమార్ వీడియోను రిలీజ్ చేశారు. మోటార్‌స్పోర్ట్స్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. అలాగే కుటుంబం, హార్ట్ వర్క్, సక్సెస్, ఫెయిల్యూర్‌ను జీవితంలో సమానంగా చూడాలని అభిమానులకు సూచించారు. కార్ రేసింగ్ గురించి మాట్లాడుతూ.. ' రేసింగ్ అనేది ఇతర క్రీడల మాదిరిగా వ్యక్తిగత క్రీడ కాదు. మీరు స్ప్రింట్ రేసర్లను చూసి ఉండవచ్చు. కానీ ఇందులో నలుగురు, ఐదుగురు డ్రైవర్లు ఒకే కారు నడుపుతారు. కాబట్టి మనమందరం అందరి పనితీరుకు బాధ్యత వహించాలి. మన కారును జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో మనం ల్యాప్ టైమింగ్‌లను సాధించాలి. ఇందులో సిబ్బంది, మెకానిక్స్, లాజిస్టికల్ సపోర్ట్‌తో పాటు డ్రైవర్ల సమష్టి కృషి ఉంటుంది. ఇది సినిమా పరిశ్రమ లాంటిది. ప్రతి ఒక్కరూ తమ పాత్రపై దృష్టి పెడితే ఫలితాలు వస్తాయని' అని అన్నారు.కాగా.. కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్‌తో అజిత్ కుమార్ జతకట్టారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే ద్విభాష చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అనివార్య కారణాలతో వాయిదా వేశారు. ఈ సినిమాను సమ్మర్లో అంటే ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. Big congratulations to you, AK sir, for your perseverance. Proud moment, sir 👏👏 🏆 👍❤️❤️#AjithKumarRacing pic.twitter.com/YQ8HQ7sRW2— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 12, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
మ్యాక్స్‌వెల్ ఊచకోత.. సిక్సర్ల సునామీ
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉగ్రరూపం దాల్చాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (45/4) ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్‌వెల్.. 52 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మ్యాక్సీ.. ఇన్నింగ్స్ 16వ ఓవర్ నుంచి గేర్ మార్చాడు. ఆడమ్ జంపా వేసిన 16వ ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదిన మ్యాక్స్‌వెల్.. కేన్ రిచర్డ్సన్ వేసిన ఆతర్వాతి ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. ఈ ఓవర్లో అతను బౌండరీ, రెండు భారీ సిక్సర్లు బాదాడు. GLENN MAXWELL HITS 122 METER SIX IN BBL. 🤯- Glenn Maxwell, The Big Show..!!! 🔥pic.twitter.com/zcwV3b28Hd— Tanuj Singh (@ImTanujSingh) January 12, 2025ఈ ఓవర్లోని తొలి సిక్సర్ (రెండో బంతి) బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే అతి భారీ సిక్సర్‌గా రికార్డైంది. ఈ సిక్సర్ 122 మీటర్ల దూరం వెళ్లింది. మ్యాకీకి ముందు బీబీఎల్‌లో భారీ సిక్సర్ రికార్డు సహచరుడు హిల్టన్ కార్ట్‌రైట్ పేరిట ఉండింది. ఇదే సీజన్లో కార్ట్‌రైట్ 121 మీటర్ల సిక్సర్ బాదాడు.అనంతరం సదర్‌ల్యాండ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్లో అతను మూడు భారీ సిక్సర్లు సహా ఓ బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో మ్యాక్సీ వరుసగా తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. సెంచరీకి 10 పరుగుల దూరంలో ఉండగా మ్యాక్సీ 20వ ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు. కేన్ రిచర్డ్సన్ మ్యాక్సీని క్లీన్ బౌల్డ్ చేశాడు. మ్యాక్స్‌వెల్ పుణ్యమా అని ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 165 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌కు ఎవరి సహకారం లభించనప్పటికీ ఒక్కడే ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఖాతా కూడా తెరవని ఉసామా మిర్‌తో మ్యాక్స్‌వెల్ ఎనిమిదో వికెట్‌కు 81 పరుగులు జోడించడం విశేషం. ఈ 81 పరుగులను మ్యాక్స్‌వెల్ ఒక్కడే చేశాడు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ స్టార్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఆతర్వాత బెన్ డకెట్ (21), బ్యూ వెబ్‌స్టర్ (15) కొద్దిసేపు క్రీజ్‌లో నిలబడ్డారు. 32 పరుగుల వద్ద బెన్ డకెట్, థామస్ రోజర్స (0) ఔటయ్యారు. అనంతరం 45 పరుగుల వద్ద వెబ్‌స్టర్, 55 పరుగుల వద్ద సోయినిస్ (18), 63 పరుగుల వద్ద కార్ట్‌రైట్ (6), 75 పరుగుల వద్ద జోయల్ పారిస్ (3) పెవిలియన్‌కు చేరారు. 11 ఓవర్లలో మెల్బోర్న్ స్టార్స్ ఏడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు. ఈ దశలో మ్యాక్సీ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రెనెగేడ్స్ బౌలర్లలో టామ్ రోజర్స్, ఫెర్గస్ ఓనీల్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జేకబ్ బేతెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.NOVAK DJOKOVIC AT THE BBL. 🐐- The reaction after Stoinis was out. 😄pic.twitter.com/eruRdky7yL— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2025సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన జకోవిచ్ఈ మ్యాచ్ చూసేందుకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ వచ్చాడు. జకో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో జకో మెల్బోర్న్ స్టార్స్‌కు మద్దతుగా నిలిచాడు. స్టార్స్ కెప్టెన్ స్టోయినిస్ ఔట్ కాగానే జకో నిరాశ చెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.తడబడుతున్న రెనెగేడ్స్166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రెనెగేడ్స్ 13 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. మార్క్ స్టీకిటీ (3-0-14-3) అద్భుతంగా బౌలింగ్ చేసి రెనెగేడ్స్‌ను దెబ్బకొట్టాడు. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో జోష్ బ్రౌన్ 4, మార్కస్ హ్యారిస్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 19, జేకబ్ బేతెల్ 1, విల్ సదర్‌ల్యాండ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. టిమ్ సీఫర్ట్ 26, హ్యారీ డిక్సన్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రెనెగేడ్స్ గెలవాలంటే 42 బంతుల్లో 88 పరుగులు చేయాలి.
వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. సంచలనం సృష్టించిన ముంబై బ్యాటర్
బెంగళూరులోని ఆలుర్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న అండర్-19 మహిళల వన్డే కప్‌లో 14 ఏళ్ల ముంబై అమ్మాయి ట్రిపుల్ సెంచరీ సాధించింది. మేఘాలయాతో జరిగిన మ్యాచ్‌లో ఐరా జాదవ్ 157 బంతుల్లో 42 ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 220.38 స్ట్రయిక్‌రేట్‌తో 346 పరుగులు (నాటౌట్) చేసింది. భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్లో అయినా ఇదే అత్యధిక స్కోర్. ఇరా జాదవ్ వైట్ బాల్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారతీయురాలు.మహిళల అండర్-19 లెవెల్లో ఐరా జదావ్‌కు ముందు నలుగురు డబుల్ సెంచరీలు సాధించారు. ప్రస్తుత టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన 224 నాటౌట్, రాఘ్వి బిస్త్ 219 నాటౌట్, జెమీమా రోడ్రిగెజ్ 202 నాటౌట్, సనికా ఛాల్కే 200 పరుగులు చేశారు. ఛాల్కే త్వరలో జరుగనున్న మహిళల అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించనుంది. రాఘ్వి బిస్ట్ విషయానికొస్తే.. ఈ అమ్మాయి ఇటీవలే భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసింది.ఐరా ట్రిపుల్.. ముంబై రికార్డు స్కోర్మ్యాచ్ విషయానికొస్తే.. ఐరా జాదవ్ ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కడంతో మేఘాలయాపై ముంబై కనీవినీ ఎరుగని స్కోర్ చేసింది. ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 563 పరుగులు చేసింది. అండర్-19 మహిళల వన్డే కప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ముంబై తరఫున ఇదే అత్యధిక స్కోర్. మేఘాలయాతో మ్యాచ్‌లో ఐరాతో పాటు మరో ప్లేయర్ మూడంకెల స్కోర్ చేసింది. హర్లీ గాలా 79 బంతుల్లో 116 పరుగులు సాధించింది.ఐపీఎల్ వేలంలో ఎవరూ పట్టించుకోలేదు..!హిట్టర్‌గా పేరున్న ఐరా జాదవ్‌ను మహిళల ఐపీఎల్-2025 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 10 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో ఐరా మెగా వేలంలో పాల్గొంది.
టీమిండియా బ్యాటర్ల వీరవిహారం.. వన్డేల్లో అత్యధిక స్కోర్
భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో తమ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఐర్లాండ్‌తో ఇవాళ (జనవరి 12) జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. వన్డేల్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్. గతంలో భారత అత్యధిక స్కోర్ 358/2గా ఉండింది. 2017లో ఇదే ఐర్లాండ్‌పై భారత్ 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. గతేడాది డిసెంబర్లో భారత్ విండీస్‌పై కూడా ఇదే స్కోర్ (358/5) నమోదు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ జరిగిన రెండో వన్డేలో భారత్ అతి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. తొలి ముగ్గురు బ్యాటర్లు స్మృతి మంధన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రతిక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, సిక్సర్), హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా ప్రెండర్‌గాస్ట్, అర్లీన్ కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జీనా డెంప్సే ఓ వికెట్ దక్కించకుంది.వన్డేల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోర్లు..370/5 ఐర్లాండ్‌పై (2025)358/2 ఐర్లాండ్‌పై (2017)358/5 వెస్టిండీస్‌పై (2024)333/5 ఇంగ్లండ్‌పై (2022)325/3 సౌతాఫ్రికాపై (2024)317/8 వెస్టిండీస్‌పై (2022)314/9 వెస్టిండీస్‌పై (2024)302/3 సౌతాఫ్రికాపై (2018)కాగా, ఐర్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. కెప్టెన్ గాబీ లెవిన్ (92) ఆ జట్టు తరఫున అత్యధిక స్కోర్ చేసింది. లియా పాల్ (59) అర్ద సెంచరీతో రాణించింది.భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2, టిటాస్ సాధు, సయాలీ సత్గరే, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో భారత్ 34.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. ప్రతిక రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53 నాటౌట్) అర్ద సెంచరీతో సత్తా చాటారు. స్మృతి మంధన (41) ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్ ఏమీ మగూర్ 3 వికెట్లు పడగొట్టింది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా నజ్ముల్ హొస్సేన్ షాంటో నియమితుడయ్యాడు. షాంటో గాయం కారణంగా ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. షాంటో గైర్హాజరీలో విండీస్ పర్యటనలో మెహిది హసన్ మిరాజ్ బంగ్లా కెప్టెన్‌గా వ్యవహరించాడు. విండీస్‌తో సిరీస్‌ను బంగ్లాదేశ్ 0-3 తేడాతో కోల్పోయింది.షాంటోతో పాటు గాయాల బారిన పడ్డ ముష్ఫికర్ రహీం, తౌహిద్ హృదోయ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఛాంపియన్స్ ట్రోఫీతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఆటగాడు లిటన్ దాస్‌కు చోటు దక్కలేదు. విండీస్ పర్యటనలో చెత్త ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో 6 పరుగులు) కారణంగా దాస్ జట్టులో చోటు కోల్పోయాడు. దాస్‌పై వేటు వేసినట్లు బంగ్లా చీఫ్ సెలెక్టర్ ఘాజీ అష్రఫ్ హొస్సేన్ తెలిపాడు. లిటన్ దాస్ గైర్హాజరీలో జాకెర్ అలీ బంగ్లా వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపడతాడని అష్రఫ్ అన్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో లిటన్ దాస్‌తో పాటు షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, అఫీఫ్ హొస్సేన్‌లకు కూడా చోటు దక్కలేదు. షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, అఫీఫ్ హొస్సేన్ కూడా విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యారు.బంగ్లా జట్టు పేస్ విభాగం యువకులు, సీనియర్లతో (నహీద్ రాణా, తంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్) సమతూకంగా ఉంది. స్పిన్ విభాగాన్ని లెగ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ లీడ్ చేస్తాడు. రిషద్‌తో పాటు స్పిన్ విభాగంలో మెహిది హసన్, నసుమ్ అహ్మద్ ఉన్నారు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే.. నజ్ముల్, ముష్ఫికర్, మహ్మదుల్లా, సౌమ్య సర్కార్ లాంటి సీనియర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.గత వారం జరిగిన బౌలింగ్ అసెస్మెంట్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన షకీబ్ అల్ హసన్ చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. సీనియర్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడని తొలుత ప్రచారం జరిగింది. ఇటీవలే తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో బంగ్లా సెలెక్టర్లు ఇతన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్.. భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో కలిసి గ్రూప్-ఏలో ఉంది. బంగ్లా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న టీమిండియాతో ఆడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టు..నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదోయ్, మహ్మదుల్లా, మెహిదీ హసన్, జాకర్ అలీ అనిక్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, నహిద్ రాణా, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
బిజినెస్
బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర విద్యుత్ శాఖ బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు (బీసీఎస్), బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల (బీఎస్ఎస్) ఓనర్లు, మార్చుకోతగిన బ్యాటరీలను చార్జ్ చేసేందుకు ప్రస్తుతమున్న విద్యుత్ కనెక్షన్‌నే ఉపయోగించుకోవచ్చు. కనెక్టెడ్ లోడ్‌ను పెంచుకున్నా, పెంచుకోకపోయినా ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. మెరుగైన స్వాపింగ్, చార్జింగ్ కోసం ట్రక్కులు, బస్సులు లాంటి భారీ వాహనాలు లిక్విడ్–కూల్డ్ స్వాపబుల్ బ్యాటరీలను వినియోగించవచ్చు.
పన్ను ఆదా కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా?
ఉద్యోగులు తమ పెట్టుబడుల వివరాలను యాజమాన్యాలకు సమర్పించాల్సిన సమయం ఆసన్నమైంది. అన్ని ప్రైవేటు సంస్థలూ జనవరి, ఫిబ్రవరిలో ఉద్యోగుల నుంచి పన్ను ఆదా పెట్టుబడుల వివరాలను సమీకరిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ సాధనాల్లో ఎంత పెట్టుబడులు పెట్టారు, వాటికి సంబంధించి వివరాలతో 12బీబీ ఫారమ్ సమర్పించాల్సి ఉంటుంది. ఆధారాలను కూడా జత చేయాలి. ఈ వివరాల ఆధారంగా ఉద్యోగి వార్షిక వేతన ప్రయోజనాలపై ఎంత పన్ను పడుతుందో అంచనాకు వచ్చి, ఆ మేరకు చివరి మూడు నెలల్లో వేతనాల నుంచి మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తాయి. వీటి విషయంలో ఉద్యోగులు అవగాహనతో వ్యవహరించడం వల్ల అనవసర పెట్టుబడులను నివారించొచ్చు. పన్ను ఆదా కోసం ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్ చేయకుండా, తమ లక్ష్యాలకు అనుకూలమైన సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. దీనిపై అవగాహన కల్పించే కథనమిది... కొత్త పన్ను విధానం ఉద్యోగులు నూతన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకుంటే, పెట్టుబడుల ఆధారాలు సమర్పించనక్కర్లేదు. నూతన పన్ను విధానంలో పెద్దగా మినహాయింపుల్లేవు. సెక్షన్ 87ఏ కింద రూ.7 లక్షల వరకు ఆదాయంపై రాయితీ లభిస్తుంది. రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం నేరుగా లభిస్తుంది. వీటితో కలిపితే రూ.7,75,000 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆదాయం ఇంతకు మించితే నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. సెక్షన్ 80సీసీడీ(2) కింద తమ మూలవేతనం, డీఏలో 14 శాతాన్ని పనిచేసే సంస్థ ద్వారా ఎన్పీఎస్ ఖాతాలో జమ చేయించుకుంటే, అంత మేరకు పన్ను లేకుండా చూసుకోవచ్చు. కన్వేయన్స్, ట్రావెల్ అలవెన్స్ ప్రయోజనాలపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఉదాహరణకు ఆఫీస్ పనిపై వేరే ప్రాంతానికి వెళ్లి చేసే ఖర్చును తిరిగి పొందడం ద్వారా ఆ మొత్తంపైనా పన్ను చెల్లించక్కర్లేదు. ఆఫీస్‌కు వచ్చి పోయేందుకు చేసే చెల్లింపులపై ప్రతి నెలా రూ.1,600 మొత్తంపైనా పన్ను లేదు.పాత పన్ను విధానం పాత విధానంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రాయితీ ఉంది. రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, 80డీ కింద రూ.25,000–75,000, 80సీసీడీ(1బి) కింద రూ.50,000, హౌస్ రెంట్ అలవెన్స్‌పై మినహాయింపు పొందొచ్చు. కొత్త విధానంలో మాదిరే కన్వేయన్స్, ట్రావెల్స్ ఎక్స్పెన్స్పై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. గృహ రుణం ఈఎంఐలు చెల్లిస్తున్నట్టు అయితే. ఈఎంఐలో అసలు భాగాన్ని సెక్షన్ 80సీ కింద, వడ్డీ భాగాన్ని సెక్షన్ 24 కింద చూపించుకోవచ్చు. ఇంటిని సొంతానికి వినియోగిస్తుంటే గృహ రుణంపై ఎంత వడ్డీ చెల్లించినా.. గరిష్టంగా రూ.2 లక్షలపైనే పన్ను చెల్లించక్కర్లేదు. అదే ఇంటిని అద్దెకు ఇస్తే.. ఒక ఆర్థిక సంవత్సరంలో గృహ రుణం కోసం చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపై (పరిమితి లేకుండా) పన్ను లేకుండా చూసుకోవచ్చు. కేవలం 80సీ పరిధిలోని పన్ను ప్రయోజనాలకే పరిమితమైతే రూ.7 లక్షల ఆదాయంపై పన్ను పడదు. హెచ్ఆర్ఏ, హెల్త్ ఇన్సూరెన్స్, ఎన్పీఎస్, గృహ రుణంపై ప్రయోజనాలను వినియోగించుకుంటే రూ.10.25 లక్షల ఆదాయం వరకు పన్ను బాధ్యత లేకుండా చూసుకోవచ్చు.ఎంపికలో జాగ్రత్త? వేతన జీవులు (వేతనం రూపంలోనే ఆదాయం ఉన్న వారు) ఏటా పాత, కొత్త విధానంలో ఎందులో అయినా రిటర్నులు సమర్పించొచ్చు. ఒకవేళ పనిచేసే సంస్థకు తన పన్ను విధానం గురించి వెల్లడించని సందర్భంలో.. కొత్త పన్ను విధానంలోనే యాజమాన్యం టీడీఎస్‌ను మినహాయిస్తుంది. పెట్టుబడుల డిక్లరేషన్ సమయంలో యాజమాన్యాలు పన్ను విధానం మార్చుకునేందుకు అనుమతించకపోవచ్చు. అయినప్పటికీ రిటర్నులు సమ ర్పించే తరుణంలో తమకు అనుకూలమైన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. యాజమాన్యం ఉద్యో గి నుంచి పన్ను కోత విధించినప్పటికీ, రిటర్నులు సమర్పించిన అనంతరం రిఫండ్ కోరొచ్చు. ముందస్తు ప్రణాళిక ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పన్ను ఆదాకు సంబంధించి పెట్టుబడుల ప్రణాళిక వేసుకోవడం మెరుగైన మార్గం అవుతుంది. అయినా, ఇప్పటికీ చాలా మంది ఆర్థిక సంవత్సరం చివర్లోనే వీటి గురించి పట్టించుకుంటూ ఉంటారు. ‘‘పన్ను మినహాయింపులను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలంటే ముందుగానే ఈ దిశగా ప్రణాళిక వేసుకోవాలి. కొత్త పన్ను విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ, పాత పన్ను విధానం పొదుపును, లక్ష్యం ఆధారిత పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది’’ అని ట్యాక్స్‌స్పానర్ డాట్ కామ్ కో ఫౌండర్ సుదీర్ కౌశిక్ తెలిపారు. సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం కోసం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం మెరుగైన నిర్ణయం కాబోదు. వీటికి బదులు సెక్షన్ 80సీ పరిధిలో ఇతర సాధనాలను పరిశీలించాలి.సెక్షన్ 80సీ అర్హత సాధనాలు → ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌పై దీర్ఘకాలంలో (పదేళ్లకు మించి) 12–15% మధ్య రాబడులు ఉంటా యని అంచనా. గత చరిత్రను గమనిస్తే ఇవి దీర్ఘకాలంలో 25% వరకు వార్షిక రాబడిని ఇచ్చాయి. → సుకన్య పథకం మెచ్యూరిటీ బాలిక వయసు 21 ఏళ్లు నిండిన వెంటనే ముగుస్తుంది. లేదా బాలిక వయసు 18 ఏళ్లు నిండి, 21 ఏళ్లలోపే వివాహం నిశ్చయమైన సందర్భంలోనూ క్లోజ్ చేసుకోవచ్చు. → ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ పెట్టుబడులపై మూడేళ్లలో వార్షిక సగటు రాబడి వివిధ ఫండ్ మేనేజర్ల మధ్య వేర్వేరుగా ఉంది. 15.80 శాతం నుంచి 17.55 శాతం మధ్య ఉంది. → ఐదేళ్లలో 19 శాతం నుంచి 21.17 శాతం మధ్య ఉంది. ఏడేళ్లలో 14.69 శాతం నుంచి 16.01 శాతం మధ్య ఉంది. ఈక్విటీ, డెట్‌తో కూడిన ఎంపికపై రాబడులు దీర్ఘకాలంలో 9–12 శాతం మధ్య ఉంటాయని అంచనా. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ప్రైవేటు రంగ ఉద్యోగులు తమ మూల వేతనం, డీఏలో 10 శాతాన్ని ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీరు 80సీసీడీ(1) కింద పాత విధానంలో పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. 80సీ రూ.1.5 లక్షల పరిధిలోనే 80సీడీసీ(1) భాగంగా ఉంటుంది. దీనికి అదనంగా 80సీసీడీ(1బి) కింద మరో రూ.50,000 ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపైనా పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ(2) కింద కార్పొరేట్ ఎన్పీఎస్ ప్రయోజనం కూడా ఉంది. పనిచేసే సంస్థ అనుమతిస్తే పాత, కొత్త విధానాల్లో ఈ ప్రయోజనాన్ని వినియోగించుకోవచ్చని కౌశిక్ తెలిపారు. పాత పన్ను విధానంలో మూలవేతనం, డీఏలో 10 శాతం, కొత్త విధానంలో 14 శాతం చొప్పున యాజమాన్యం జమలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చని చెప్పారు. వైద్య వ్యయాలపై మినహాయింపులు ఆరోగ్యం కోసం చేసే వ్యయాలకు సెక్షన్ 80డీ కింద పన్ను ప్రయోజనాలున్నాయి. పన్ను చెల్లింపుదారు, తన జీవిత భాగస్వామి, పిల్లల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ప్రీమియం చెల్లిస్తుంటే.. గరిష్టంగా రూ.25,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ అదే వ్యక్తి తన జీవిత భాగస్వామి, పిల్లలతోపాటు 60 ఏళ్ల వయసు లోపు తన తల్లిదండ్రుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంటే అప్పుడు రూ.50,000 మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక పన్ను చెల్లింపుదారు తన కుటుంబంతోపాటు 60 ఏళ్లు నిండిన తల్లిదండ్రుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంటే అప్పుడు గరిష్టంగా రూ.75 వేల వరకు (తన కుటుంబానికి రూ.25 వేలు, తల్లిదండ్రులకు రూ.50 వేలు) పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ పన్ను చెల్లింపుదారు, జీవిత భాగస్వామి, పిల్లలతో కూడిన కుటుంబంలో ఒకరి వయసు 60 ఏళ్లు నిండి, వీరితోపాటు 60 ఏళ్లు నిండిన తల్లిదండ్రులకు సైతం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంటే అప్పుడు చెరో రూ.50 వేలు చొప్పున మొత్తం రూ.1,00,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం ఈ సెక్షన్ కింద ఉంది. వేతన జీవుల వయసు 60 ఏళ్లలోపే ఉంటుంది కనుక, వీరు తమ కుటుంబం, తమ తల్లిదండ్రుల పేరిట మొత్తంగా రూ.75,000పై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. హెల్త్ చెకప్‌ల కోసం చేసే వ్యయం రూ.5,000 వరకు ఈ సెక్షన్ కింద గరిష్ట పరిమితి లోపు చూపించుకోవచ్చు. పిల్లల ట్యూషన్ ఫీజులు పిల్లల ట్యూషన్ ఫీజుల భారాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకోవడం ద్వారా పన్ను భారాన్ని దింపుకోవచ్చు. ముఖ్యంగా దంపతులు ఇద్దరూ ఉద్యోగులు అయితే, ఇరువురూ ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇద్దరు పిల్లల కోసం ట్యూషన్ ఫీజు రూ.2.5 లక్షలు ఖర్చు చేశారనుకుందాం. అప్పుడు ఒకరు రూ.1.5 లక్షల, మరొకరు రూ.1 లక్ష వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీ రూ.1.5 లక్షల్లో ఇతర పెట్టుబడులు పోగా, మిగిలిన మొత్తానికి దంపతులు ఇద్దరూ ట్యూషన్ ఫీజులో తమకు కావాల్సినంత చూపించుకుని, అంత వరకే క్లెయిమ్ చేసుకోవచ్చు. స్కూల్ డొనేషన్, బస్సు చార్జీలు, స్పోర్ట్స్ తదితర వాటి కోసం చేసే చెల్లింపులపై పన్ను మినహాయింపుల్లేవు. – సాక్షి, బిజినెస్‌డెస్క్
ఒక్క రీఛార్జ్‌తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండి
గతంలో రీఛార్జ్ అయిపోతే ఇన్కమింగ్ కాల్స్ అయినా వచ్చేవి. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. కాబట్టి రీఛార్జ్ ముగిసిన తరువాత తప్పకుండా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అయితే కొందరు ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవాలంటే కొంత కష్టమనుకుంటారు, అలాంటి వారు ఆరు నెలలకు లేదా ఏడాదికి రీఛార్జ్ చేసుకుంటారు. ఈ కథనంలో 84 రోజుల ప్లాన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..జియో (Jio)రిలయన్స్ జియో అందిస్తున్న అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.799 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా (మొత్తం 126 జీబీ), రోజులు 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాలింగ్స్ వంటివి లభిస్తాయి. రోజువారీ డేటా పూర్తయిన తరువాత 64 kbps వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. జియో టీవీ, జిఓ సినిమా, జిఓ క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు.బీఎస్ఎన్ఎల్ (BSNL)బీఎస్ఎన్ఎల్ 84 రోజుల ప్లాన్ ధర రూ. 628 మాత్రమే. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. రోజువారీ డేటా లిమిట్ అయిపోయిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 40 kbpsకు తగ్గుతుంది.ఎయిర్టెల్ (Airtel)ఎయిర్టెల్ 84 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 509. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారుడు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, 6 జీబీ డేటా (84 రోజులకు) లభిస్తుంది. ఈ డేటా పూర్తయిపోతే.. ఒక ఎంబీకి 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారు.. అన్లిమిటెడ్ 5జీ డేటాకు అనర్హులు. ఇందులో ఫ్రీ హలోట్యూన్స్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్, అపోలో 24/7, స్పామ్ కాల్స్ వంటివి ఉన్నాయి.వీఐ (వొడాఫోన్ ఐడియా)వొడాఫోన్ ఐడియా అందించే అతి చౌకైన ప్లాన్‌లో రూ. 509 కూడా ఒకటి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. దీనిని రీఛార్జ్ చేసుకున్న యూజర్లు అన్లిమిటెడ్ కాల్స్, 1000 ఎస్ఎమ్ఎస్లు, 6 జీబీ డేటా వంటివి పొందుతారు. ఎస్ఎమ్ఎస్లు, డేటా అనేది మొత్తం ప్యాక్‌కు అని గుర్తుంచుకోవాలి. కాబట్టి అది ఖాళీ అయితే మళ్ళీ వాటి కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర అదనపు ప్రయోజనాలు కూడా ఏమీ లభించవు.
'నా భార్యకు నన్ను చూస్తూ ఉండటం ఇష్టం'
ప్రస్తుతం దేశం మొత్తం మీద పనిగంటలపై చర్చ జరుగుతోంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెబితే.. వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణ్యన్ అన్నారు. ఈ వ్యాఖ్యపై పలువురు పారిశ్రామిక వేత్తలు స్పందించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనావల్లా' (Adar Poonawalla) కూడా చేరారు.ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నది ముఖ్యం. 10 గంటలు పని చేస్తే ప్రపంచాన్నే మార్చేయొచ్చన్న ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మాటలతో.. అదార్ పూనావల్లా ఏకీభవించారు. నా భార్య కూడా నేను అద్భుతంగా ఉన్నాను అని అనుకుంటుంది. ఆమె ఆదివారాలు నన్ను చూస్తూ ఉండటానికి ఇష్టపడుతుందని ఆయన ట్వీట్ చేశారు.ఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండని చెప్పిన ఎస్ఎన్ సుబ్రమణ్యన్ (Subrahmanyan) వ్యాఖ్యలపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘నా భార్య ఎంతో మంచిది, ఆమెను తదేకంగా చూడటం నాకు చాలా ఇష్టం’ అని అన్నారు. ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలపై కేవలం పారిశ్రామిక దిగ్గజాలు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.Yes @anandmahindra, even my wife @NPoonawalla thinks i am wonderful, she loves staring at me on Sundays. Quality of work over quantity always. #worklifebalance pic.twitter.com/5Lr1IjOB6r— Adar Poonawalla (@adarpoonawalla) January 12, 2025
ఫ్యామిలీ
యువ కథ: అడవి
వసంతం తెచ్చిన చివురులతో అడవిలోని చెట్లు రకరకాల వర్ణాలతో పురుడు పోసుకుని వున్నాయి. పూలు పరిమళాలతో తేనెలూరుతూ వున్నాయి. ఆ అడవి మీదుగా ఆకాశంలో విహరిస్తూ వెళ్తూ వున్న మేఘనా«థుడు తన ప్రేయసి వనదేవతను చూసి మదిలో శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞపకాలను మోసుకొనిపోతూ వున్నాడు. ఊరును దాటి ఆ అడవిలోనే పండు వెన్నెలంత వర్ణంలో ఉన్న ఒక ఆవు ఒంటరిగా గడ్డి మేస్తూ వుంది. అలా ఒంటరిగా గడ్డి మేస్తూ ఆ ఆవు అడవిలో చాలా దూరమే ప్రయాణించింది. ఇంతలో బాగా ఆకలిగా వున్న ఓ పెద్దపులి వేట కోసం వెదుకుతూ అటుగా వచ్చి ఆవును చూసింది. పులి అలికిడి విన్న ఆవు పులి కళ్లలోని ఆకలిని చూసి వెనువెంటనే ‘ఆగు పులిరాజా ఆగు.. ఒక్కమారు నా మాట ఆలకించు’ అంది. ‘నీ మాటలు ఆలకించే స్థితిలో లేను. ఈరోజు నిన్ను తిని నా ఆకలి బాధ తీర్చుకుంటాను’ అంటూ పులి తన పంజా విసిరింది. పులి పంజా నుండి తప్పించుకున్న ఆవు ‘అయితే తినే ముందు నా చివరి కోరిక తీర్చు’ అంది. ‘ఏమిటా కోరిక?’ ‘ఓ పులిరాజా.. నాకు ఓ యజమాని ఉన్నాడు. అతడు లోకం తెలియని వట్టి అమాయకుడు. కడు బీదవాడు. అతనికి నేనే జీవనాధారం. ఒకవేళ నేను ఇంటికి తిరిగిపోని యెడల అతడు నాపై దిగులుతో దుఃఖిస్తూ మరణిస్తాడు. కావున నేను ఇంటికి వెళ్లి నా యజమానికి ౖధైర్యం చెప్పి మరోవిధంగా జీవనాన్ని వెతుక్కోమని చెప్పి తిరిగి వస్తాను.’ ఆవు మాటలు విన్న పులి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ‘నేనేమన్నా వెర్రిదాన్ననుకున్నావా.. నీ కల్లబొల్లి మాటలు విని దొరికిన ఆహారాన్ని విడిచిపెట్టడానికి?’ అంది. ‘అయ్యో రాజా.. ఇవి మాటలు కావు.. పరమ సత్యాలు. పరుల కొరకు జీవించని జన్మ దాహార్తికి పనికి రాని కడలి వంటిది. నీ ఆకలిని తీర్చబోయే నా దేహం నా జన్మకు కలిగిన గొప్ప వరమే. కాని ఈలోపు ఈ విషయం నా యజమానికి చెప్పడం నా బాధ్యత’ అంది.ఆవు పలికిన మాటలకు పులి ఒక్క క్షణం మౌనంగా ఆలోచించి ‘శిశిరం చేసిన గాయాలకు ఓర్చి వసంతం కోసం ఎదురు చూసే వనంలా నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. వెళ్ళి త్వరగా తిరిగి రా’ అంటూ ఆవుకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. పులి మాటలకు సంతోషించిన ఆవు దానికి కృతజ్ఞతలు చెప్పి తన యజమాని వద్దకు బయలుదేరింది.ఇంటి వద్ద గుడిసె ముందు ఒంటిపైన చొక్కా లేకుండా మొలకు చిన్న గుడ్డతో ఒంటరిగా కూర్చొని నులకతాడు పేనుకుంటూ వున్న యజమాని వేళకాని వేళలో దూరంగా వస్తూవున్న ఆవును చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆవు అడవిలో జరిగినదంతా చెప్పాక ఒక్క క్షణం మౌనంగా వుంటూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా తలను నెమ్మదిగా ఊపి ‘నువ్వు వెళ్ళి రా నీకు ఏమీ కాదు!’ అంటూ ఆవుకు ధైర్యం చెప్పాడు. ఆవు తన యజమాని సంయమనానికి సంతోషించి తిరిగి అడవికి బయలుదేరింది.ఇంటి బయట జరుగుతున్నదంతా ఇంటి లోపల నుండి గమనిస్తూ వున్న యజమాని భార్య వేగంగా భర్త వద్దకు వచ్చి ‘నీకేమన్నా మతిగాని పోయిందా? ఎవరైనా ఆవును పులి వద్దకు పంపుతారా సావడానికి! అసలే దానికి పుట్టిన లేగదూడ సచ్చిపోయె. ఇపుడు దాని పాలే మనకు జీవనాధారం’ అంటూ భర్తను కోప్పడింది. ‘ఓసి పిచ్చిదానా! నేనేమన్నా వెర్రివాడిననుకున్నావా? వెనకటికి మా తాతకి కూడా ఇదే విధంగా ఓ ఆవు ఉండేది. అయితే దానికి లేగదూడ కూడా ఉండేది. ఒకరోజు ఆ ఆవు మేత కోసం అడవికి వెళ్ళి పులికి చిక్కింది. అయితే ఆ ఆవు తనకు ఓ బిడ్డ ఉందని, అది మరీ పసిదని దానికి చివరిసారి పాలు ఇచ్చి తిరిగి వస్తానని పులిని బతిమిలాడి తన బిడ్డకు పాలు ఇవ్వడానికి ఇంటికి వచ్చింది. అయితే వేళకాని వేళలో ఇంటికి వచ్చిన ఆవును చూసిన మా తాత ‘ఏమయి ఉంటుందా?’ అని ఆలోచిస్తూ ఆవు వెనకాలే వెళ్ళాడు. అక్కడ ఆ ఆవు నిజాయితీకి మెచ్చి తినకుండా వదిలేసిన పులిని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ ఆవుకు జరిగింది ఇప్పుడు తన మనవరాలుకు జరుగుతుంది. అదే తిరిగి వచ్చేస్తుందిలే’ అంటూ నులక తాడు పేనే పనిలో నిమగ్నమయ్యాడు. యజమాని నుండి శాశ్వతంగా సెలవు తీసుకుని తనకు తానుగా పులికి ఆహారంగా మారడానికి అడవిలోకి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ వుంది ఆవు. ఆ అడవిలోనే ఓ కోయిల అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశిస్తూ తన్మయత్వంలో మధురమైన రాగాలను ఆలపిస్తూ కొమ్మ నుండి కొమ్మకు దూకుతూ విహరిస్తూ ఆవును చూసింది. ‘ఓ అందగాడా.. నడిజాములో ఆ దివి నుండి ఈ భువిపై దిగిన జాబిల్లిలా ఉన్నావు. నన్ను ప్రేమించవూ?!’ అంటూ పలికింది. కోయిల మాటలు విన్న ఆవు మౌనంగా పక్కకు తప్పుకొని ఒంటరిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ వుంది.కోయిల ఎగరకుండా ఆవుతో పాటుగా నడుస్తూ వెళ్తూ వుంది. అలా అడవిలో చాలా దూరం ప్రయాణం చేశాయి. అప్పుడే ఓ నిండైన కారుమబ్బు ఆకాశంలో వెళ్తూ వుండటాన్ని చూసిన కోయిల రివ్వున ఎగురుకుంటూ వెళ్ళి అ మేఘాన్ని తన ఒంటికంతా పులుముకుని వేగంగా వచ్చి ఆవుపై వాలి తన రెండు రెక్కలను వింజామరలను విసిరినట్టు ఆవు మొహం మీద ఊపుతూ వుండగా కోయిల ఒంటికి పులుముకున్న మేఘం ముత్యపు చినుకులుగా ఆవు పై పడుతూ వుండగా ‘నింగీ నేలా సాక్షి.. నన్ను ప్రేమించవూ?!’ అంది కోయిల. ఆవు మారుమాటలాడక కోయిల వంక కనురెప్పయినా వేయకుండా మౌనంగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ వుంది. కోయిల ఎగరటం మరచి ఆవుతోపాటు పక్కనే నడుస్తూ వుంది. ఆ అడవిలో అవి రెండూ వేటికవే ఆలోచనల ప్రవాహంలో ఒంటరిగా సాగిపోతూ వున్నాయి. ఆ అడవిలోనే ఓ సెలయేరు గలగలలతో అడవి గుండె చప్పుడును లయబద్ధం చేస్తూ ప్రవహిస్తూ వుంది. దాని గట్టున ఆవు ఆగి ప్రవహిస్తూ వున్న ఆ సెలయేటిలో ప్రకృతిలోని నిత్య నూతనత్వాన్ని చూస్తూ వుంది. అలా ఆ ఆవును చూసిన కోయిల అలలు అలలుగా కదలిపోతూ వున్న యేటి వయ్యారాన్నంతా ఒంపుగా చేసుకొని నడుస్తూ ‘అలలనేం చూస్తావోయీ.. అలల మాటున దాగిన మనసు ఊసును చూడు. ఆకాశమంతా చినుకయి పోయి అవనిని ముద్దాడిన ప్రేమను చూడు. నా ప్రేమను చూసి నన్ను ప్రేమించవూ!?’ అంది కోయిల.సూర్యుడు పడమటి కొండలను ముద్దాడుతూ దోబూచులాడే పనిలో వున్నాడు. ఇంతలో ఓ పచ్చని చిలుక అటుగా ఎగురుకుంటూ వచ్చి ఓ చెట్టు పై వాలి చుట్టూ చూస్తూ ఉంది. కొంత దూరంలో ఆవుతో పాటు పక్కనే నడుస్తూ వెళ్తూ వున్న కోయిలను చూసి దానికి ఆశ్చర్యం వేసింది ‘ఏమయి ఉంటుంది?!’ అని ఆవు కోయిలకు తెలియకుండా వాటి వెనకాలే ఎగురుకుంటూ వాటిని వెంబడించసాగింది.రాత్రవుతూ ఉండగా పైన చెట్ల కొమ్మల మాటున నల్లని ఆకాశంలో పండు వెన్నెల, మిరుమిట్లు గొలిపే నక్షత్రాలు.. వాటి నుండి వస్తున్న కాంతిలో అడవిలో ముందుకు సాగిపోతూ వున్నాయి ఆవూ కోయిలా. చివరకు కోయిల ఆవుకు ఎదురుగా వచ్చి నిలబడి ‘నేను నల్లగా వున్నాననా నన్ను ప్రేమించడంలేదు!?’అంది.‘లంగరు లేని ఒంటరి పడవ పయనం నా జీవితం. తీరం లేని ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాను. తిరిగి రాలేను. నీవు అందమైన దానవు. కాలం చేసిన గాయాలు మాన్పి కొత్త చిగురులను పూయిస్తావు. ప్రపంచంలోని దుఃఖాన్నంతటినీ ఒంటికి పులుముకొని నూతన రాగాలతో కొత్త ఉషస్సును వెలిగిస్తావు’ అంటూ ఆవు అదే తొలిసారిగా అదే చివరిసారిగా కోయిలపై తనకున్న భావాన్ని చెప్పి, కోయిల నుండి సెలవు తీసుకుని ఒంటరిగా ముందుకు పయనమైంది. కోయిల ఒంటరిగా ఆవుని అలా చూస్తూ ఉండిపోయింది. ఇదంతా చెట్టు పై నుండి గమనిస్తూ వున్న చిలుక ఎగురుకుంటూ కోయిల ముందుకు వచ్చి వాలి ఎక్కడో దూరాన కనుమరుగౌతూ వున్న ఆవును చూస్తూ ‘ప్రేమ అందంగా ఉంటుంది కదూ’ అంటూ పలికింది. కోయిల చిలుక వైపు చూసి ‘ప్రేమ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. కాని ప్రేమ కోసం చేసే నిరీక్షణలో ఆ ప్రేమ మరింత అందంగా ఉంటుంది’ అంది. తన గమ్యానికి చేరే దారిలో అడ్డుపడే బంధాలు, మోహించే కోరికలను దాటుకుని ఆవు.. పులి ఉండే చోటుకు దగ్గరగా వెళ్తూ వుంది. ఇంతలో హఠాత్తుగా ఆకాశంలో పక్షులు భయంతో అరుచుకుంటూ ఎగురుతూ ఆవును దాటుకుని ముందుకు పరుగులు తీయసాగాయి. ఆవు వెళ్ళే దారిలో అడవి అంతా అలజడిగా మారింది. అడవిలోని జంతువులన్నీ ప్రాణభయంతో పరుగులు తీస్తూ, ఆవును దాటుకొని వేగంగా ముందుకు వెళ్తూ వున్నాయి. అక్కడి వాతావరణం వెచ్చగానూ దట్టమైన పొగతోనూ నిండి ఉంది. ఏమి జరుగుతున్నదో ఆవుకు ఏమీ అర్థం కాలేదు. అడవిలోని క్రూర జంతువులన్నీ తమకన్నా బలహీనమైన జంతువులతో ఉండే వైరాన్ని మరచి వాటిపై జాలి చూపుతూ అడవిని దహించి వేస్తూ తరుముకొస్తూ వున్న అగ్నిని చూపుతూ ‘తప్పించుకొని పారిపోండి... తప్పించుకొని పారిపోండి’ అంటూ అరుస్తూ ఉన్నాయి.సరిగ్గా ఆ సమయంలో ఆవు పులికి ఎదురుగా వచ్చి నిల్చుంది. పులి ఆశ్చర్యపోయి ఆవును చూస్తూ ఉంది. ‘పులిరాజా! ఇక వచ్చి నన్ను తిని నీ ఆకలి తీర్చుకో’ అంది ఆవు.‘ఇచ్చిన మాటకు, చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండే నీలాంటి మిత్రుడిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా వుంది. నీలాంటి వారిని చంపి ఆకలి బాధ తీర్చుకునే కన్నా పస్తులతో మరణించడం మంచిది. మిత్రమా ఇక నువ్వు సంతోషంగా నీ యజమాని వద్దకు వెళ్ళి హాయిగా జీవించు’ చెప్పింది పులి. అప్పటికే మంటలు అడవినంతటినీ చుట్టుముట్టాయి. పులికి కొన్ని అడుగుల దూరంలో మంటలు నాలుకలు చాచి తరుముకుంటూ రావడం చూసిన ఆవు ‘రాజా ఏమిటిది? ఎవరు చేశారు ఇదంతా?’ అడిగింది.‘మిత్రమా.. మనిషి! మనిషి చేశాడిదంతా! ఈ అడవిలో నగరాన్ని నిర్మిస్తాడట. అందుకే అగ్గి రాజేశాడు. ఈ అందమైన అడవి.. మన అడవి... ఆకలికి తప్ప అత్యాశకు చోటులేని అడవి.. ప్రేమను కోరే అడవి.. పరవశాల అడవి.. ఈ అడవిలో మనిషికి భాగం ఉండొచ్చుగాని పెత్తనం ఉంటుందా? అడవికి రాజైనా నేను పెత్తనం చేయనే! ఈ మనిషెంత పతనశీలి? మనల్ని ఖాళీ చేయించడానికి నిప్పు పెట్టాడు. త్వరపడు మిత్రమా త్వరపడు! ఇక్కడి నుండి బయటపడు’ అంటూ ఆవును త్వరపెడుతూ చుట్టూతా చూసింది పులి.మంటలు కమ్ముకున్నాయి. ‘అయ్యో.. మంటలు మనల్ని చుట్టుముట్టాయి. ఇక మనం తప్పించుకొని పోలేం. క్షమించు మిత్రమా.. నీ దుస్థితికి కారణం అయినందుకు!’ అంటూ ఆవుని క్షమాపణలు కోరింది పులి. తనకు దగ్గర పడుతున్న మంటలను చూసి ‘నీలాంటి మంచి మిత్రుడిని కలుసుకున్నందుకు సంతోషంగా వుంది’ అంది ఆవు పులితో. ‘నీలాంటి మిత్రుడితో కలసి ఈ క్షణాన్ని పంచుకుంటున్నందుకు గొప్ప సంతోషంగా ఉంది!’ అంది పులి ఆవుతో. మనిషి రాజేసిన అగ్ని అడవిని, అడవిలోని జంతువులతోపాటు ఆ ఇరువురినీ బూడిద చేసింది.ఆకాశంలోని సూర్యుడు దట్టంగా వ్యాపించి వున్న నల్లని పొగ మాటున చావు దుప్పటి కప్పుకుని తెల్లగా పాలిపోయి నిశ్చలంగా వేలాడుతూ ఉన్నాడు.
Mystery: నేరాన్ని దాచే నేరం!
అది అమెరికా, మిషిగన్ రాష్ట్రంలోని సీడర్ స్ప్రింగ్స్ ప్రాంతం. 1996 ఆగస్ట్ 7, అర్ధరాత్రి 12 దాటింది. రేచల్ టిమెర్మన్ (18) అనే అమ్మాయి, మార్విన్ గేబ్రియల్ (43) అనే ఫ్యామిలీ ఫ్రెండ్ కారులో బర్త్‌డే పార్టీ నుంచి ఇంటికి బయలుదేరింది. ఆ కారులో మరో ఇద్దరు సుపరిచితులున్నారు. అయితే మార్విన్ ఉన్నట్టుండి కారు ఆపి, మిగిలిన ఇద్దరితో గొడవపడి, కారు దింపేశాడు. రేచల్‌ను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, తీవ్రంగా హింసించి, అత్యాచారం చేశాడు. ‘ఎవరికైనా చెబితే నిన్నూ నీ కూతుర్నీ చంపేస్తాను’ అని ఆమెను బెదిరించి వదిలిపెట్టాడు. రేచల్కి రెండేళ్ల షానన్ అనే కూతురుంది. ఓ రెస్టరెంట్లో పని చేసుకుంటూ, తల్లిదండ్రులైన వెల్డా, టిమ్‌లకు సమీపంలోనే నివాసముండేది. టిమ్ దంపతులకు తమ కూతురు, మనవరాలంటే ప్రాణం.మార్విన్ చేసిన పనికి రేచల్ మానసికంగా కుంగిపోయింది. ఎవరినీ నమ్మలేని స్థితికి చేరుకుంది. తెలిసినవారిని చూసినా భయపడేది. కొన్ని వారాలు గడిచాయి. ఆమె తీరు గమనించి ఆరా తీస్తూ వస్తున్న తల్లి వెల్డాకు– ఒకరోజు తట్టుకోలేక ఏడ్చుకుంటూ జరిగిందంతా చెప్పింది రేచల్. వెంటనే వెల్డా ధైర్యం చెప్పింది. టిమ్‌ను తోడుగా పంపించి, రేచల్తో మార్విన్ పై పోలీసులకు ఫిర్యాదు ఇప్పించింది. వెంటనే పోలీసులు మార్విన్ ను అదుపులోకి తీసుకుని, విచారణ మొదలుపెట్టారు. తిరిగి రేచల్‌ను మామూలు మనిషిని చేయడానికి టిమ్, వెల్డాలు తీవ్రంగా శ్రమించారు. ‘వాడికి శిక్షపడేలా చేద్దాం. నువ్వు భయపడొద్దు. మనుషులంతా ఒకేలా ఉండరు’ అని ధైర్యం చెబుతూ, సాధారణ జీవితానికి అలవాటు చేశారు.అయితే, విచారణ తేదీ వచ్చిన ప్రతిసారీ మార్విన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని భయపడేది. సుమారు ఆరు నెలల విచారణ తర్వాత మార్విన్ ను జైలుకు పంపారు. తర్వాత రెండు వారాలకే బెయిల్‌పై బయటికి వచ్చిన మార్విన్ – ‘కేసు వెనక్కి తీసుకోకపోతే నిన్నూ నీ కూతుర్నీ చంపేస్తాను’ అని రేచల్‌ను బెదిరించాడు. అయినా భయపడొద్దని టిమ్ ఆమెకు ధైర్యం చెప్పాడు. మరో ఐదు నెలలు గడిచేసరికి రేచల్ పూర్తిగా మామూలు మనిషయింది. ఒకరోజు సంబరంగా తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. నాతో డేటింగ్‌కి ఇష్టపడుతున్నాడు. నా కూతురు షానన్ ని కూడా నాతోనే తీసుకుని రమ్మన్నాడు. నేను వెళ్తున్నాను’ అని కూతుర్ని తీసుకుని వెళ్లింది.మరుసటి రోజు రేచల్ నుంచి టిమ్‌కు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో ‘నేను సెలవుపై వెళ్తున్నాను’ అని రాసింది. కొన్ని రోజుల ముందే కొత్త ఉద్యోగంలో చేరిన రేచల్ సెలవు పెట్టడం ఏంటనే అనుమానంతో పాటు మార్విన్ కోర్టు వాయిదా దగ్గర పడుతుండటంతో టిమ్‌కు భయం మొదలైంది. వాయిదా రోజుకు కూడా రేచల్ రాలేదు. షానన్ ఏమైందో తెలియలేదు. వాయిదా రోజున రేచల్ రాకపోయేసరికి మరో 11 రోజులకు కేసు వాయిదాపడింది. ఆ 11 రోజులు గడిచాక, వాయిదా నాటికి రేచల్ నుంచి మరో లేఖ కోర్టుకు వచ్చింది. ‘నా అంతట నేనే మార్విన్ తో సంబంధాన్ని కోరుకున్నాను. అతడు నిరాకరించేసరికి ఆ కోపంతోనే అతడిపై అత్యాచారం కేసు పెట్టాను’ అని అందులో రాసింది. దాంతో టిమ్‌తో పాటు అధికారులకు రేచల్ కిడ్నాప్ అయ్యి ఉంటుందనే అనుమానం మొదలైంది. దాంతో ఆమె కోసం గాలింపు మొదలైంది. సరిగ్గా రెండు వారాలకు సమీపంలోనే ఆక్స్ఫర్డ్ సరస్సులో రేచల్ శవమై తేలింది. నోటికి, కళ్లకు పెద్దపెద్ద ప్లాస్టర్స్ చుట్టి, చేతులు, కాళ్లకు రెండు సిమెంట్ దిమ్మలు కట్టి సరస్సులో ముంచేశారు. అంటే ఆ లేఖలు బలవంతంగా రాయించారని అధికారులు నమ్మారు. వెంటనే మార్విన్ ఇంటిని తనిఖీ చేయగా పసిపిల్లల పాలసీసా దొరికింది. అది షానన్ ది కావచ్చని నమ్మారు. పైగా రేచల్ కాళ్లు, చేతులకు కట్టిన సిమెంట్ దిమ్మల్లాంటి దిమ్మలు మార్విన్ ఇంటి ముందున్నాయి. అయితే, అప్పటికే మార్విన్ తప్పించుకున్నాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఈ కేసుకు సంబంధించి మార్విన్, షానన్ తో పాటుగా మరో ఇద్దరు కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. మొదటి వ్యక్తి వేన్ డేవిస్. అతడు మార్విన్ స్నేహితుడు. అలాగే రేచల్‌పై అత్యాచారం జరిగిన రాత్రి కారులో ఉన్న ఇద్దరిలో ఒకడైన రెండవ వ్యక్తి జాన్ వీక్స్. అతడు మార్విన్కు పరిచయస్థుడు, రేచల్‌కు స్నేహితుడు. ఆమెను డేట్‌కి పిలిచింది అతడేనని తర్వాత విచారణలో తేలింది. రేచల్ అతడ్ని నమ్మే షానన్ తో పాటు అతడితో వెళ్లిందట! వీళ్లందరినీ మార్విన్నే మాయం చేసి ఉంటాడనే క్లారిటీకి వచ్చారు పోలీసులు.కొన్ని నెలలకు న్యూయార్క్ పోలీసులు– రాబర్ట్ అలెన్ అని చెప్పుకుని తిరిగే వ్యక్తిని అరెస్ట్ చేశారు. రాబర్ట్ అలెన్ అనే వ్యక్తి అప్పటికే కనిపించడం లేదని అతడి ఫ్యామిలీ కంప్లైంట్ ఇచ్చిందట! అయితే అతడి కార్డ్స్ అన్నీ వాడుకలో ఉన్నాయని గుర్తించిన పోలీసులు రాబర్ట్ కోసం నిఘా పెట్టారు. చివరికి న్యూయార్క్‌లో పట్టుకున్నారు. అయితే, అతడు రాబర్ట్ అలెన్ పేరుతో చలామణీ అవుతున్న మార్విన్ అని గుర్తించి, పోలీసులు షాక్ అయ్యారు. ‘రాబర్ట్ ఎక్కడ?’ అని మార్విన్ ని నిలదీస్తే తెలియదన్నాడు. ఇక అరెస్ట్ చేసి, తీసుకొచ్చి రాబర్ట్ మిస్సింగ్ కేసుతో పాటు రేచల్ మర్డర్ కేసులో కూడా మార్విన్ ను విచారించడం మొదలుపెట్టారు. రేచల్ హత్యకు తనకు సంబంధం లేదని మార్విన్ వాదించాడు. రాబర్ట్ మిస్సింగ్ కేసులో కొన్ని కీలక ఆధారాలతో కేసు బిగుసుకుంది. మార్విన్ కు మరణశిక్ష పడింది. తర్వాత మార్విన్ అప్పీలు చేసుకోవడంతో మరణశిక్ష రద్దయి, విచారణ మళ్లీ మొదలైంది. ఆ క్రమంలోనే మార్విన్ తన పక్క ఖైదీకి ఆక్స్ఫర్డ్ సరస్సు మ్యాప్ ఇవ్వగా దానిపై ఒక క్లూ ఉంది. ‘3+ 1, ఒక మృతదేహం దొరికింది’ అని రాసుకున్నాడు మార్విన్ . అతడి దృష్టిలో 3 అంటే పాప షానన్, జాన్ వీక్స్, వేన్ డేవిస్ కాగా, 1 అంటే రేచల్ కావచ్చు అని అధికారులు అంచనా వేశారు. సరిగ్గా రేచల్ మృతదేహం దొరికిన ఐదేళ్లకు అదే సరస్సులో వేన్ డేవిస్ మృతదేహం దొరికింది. రేచల్ చనిపోయినట్లే డేవిస్ కూడా చనిపోయాడని రిపోర్ట్స్ తేల్చాయి. డేవిస్‌ని కూడా రేచల్‌ను కట్టినట్లే సిమెంట్ దిమ్మలతో కట్టి, కళ్లకు, నోటికి ప్లాస్టర్స్ వేసి సరస్సులో పడేశారు. మరోవైపు మార్విన్ తన తోటి ఖైదీలతో బిడ్డ (షానన్ )ను ఎక్కడ దాచాలో తెలియక చంపేశాను’ అని చెప్పాడట! అయితే, ఈ కేసులో మిస్ అయిన పాప షానన్, జాన్ వీక్స్, రాబర్ట్ అలెన్ వీరంతా ఏమయ్యారో తేలలేదు. దాంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన
వాన చినుకులలో వడ్డన..!
ఒకవైపు వాన చినుకులు పడుతుంటే, మరోవైపు పక్కనే వేడి వేడి టీ, పకోడీలాంటివి ఉంటే ఎంత బాగుంటుంది! ‘అయితే, అలా తినాలంటే రోజూ కుదరదు కదా!’ అని బాధపడేవారికి ఒక చక్కని వార్త. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలోని సియోంగ్ ప్రాంతంలో ఉన్న ‘రెయిన్ రిపోర్ట్ క్రాయిసెంట్’ హోటల్లో ప్రతిరోజూ వానాకాలాన్ని ఆస్వాదించొచ్చు. రెస్టారెంట్ ఇంటీరియర్ మొత్తం వాతావరణ వార్తలు, వర్షం పడే దృశ్యాలతో నిండి ఉంటుంది. హోటల్లో మొత్తం నిరంతరం వాన తుంపరలు పడేలా సెట్ చేశారు. వెదురు చెట్ల చుట్టూ కుర్చీలు, బల్లలు వేసి, పాదాలకు నీటి ప్రవాహం తగిలేలా అక్కడి ఫ్లోర్‌ను సెటప్ చేశారు. ఇక పక్కనే ప్రవహించే నీటిలో నేలపై కుర్చునే వీలుంది. అంతేకాదు, కుటుంబమంతా కలసి ఎంజాయ్ చేయడానికి రెండో అంతస్తులో ఒక మినీ సినీ థియేటర్ కూడా ఉంది.సౌకర్యవంతమైన కుషన్స్‌లో పడుకొని సినిమా చూడొచ్చు. అక్కడ దొరికే మెన్యూ ఐటమ్స్‌లోని పానీయాలు, వంటకాల పేర్లన్నీ కూడా రెయిన్ రిపోర్ట్ స్టయిల్లోనే ఉంటాయి. ఉదాహరణకు ‘సన్ షైన్’, ‘క్లౌడ్’, ‘రెయిన్ డ్రాప్’ ఇలా వివిధ వాతవరణ సూచనల పేర్లతో ఉండే క్రాయిసెంట్స్, ‘రెయిన్బో మిల్క్’, ‘సెసేమ్ క్లౌడ్’, ‘వెట్ క్లౌడ్’, ‘వైట్ లాట్టే’ వంటి పానీయాలు ఉన్నాయి. బాగుంది కదా! వానాకాలాన్ని ఆస్వాదించాలంటే వెంటనే ఈ రెయిన్ రిపోర్ట్ రెస్టరెంట్‌కి వెళ్లాల్సిందే మరి. (చదవండి: ఘోస్ట్ కోసం బీస్ట్ పిరమిడ్ వాసం)
దయ్యాల కోసం అద్దె చెల్లించడమా..!
అక్కడ దయ్యాలు, భూతాలు ఉన్నాయంటే ఆ వైపు కూడా వెళ్లరు చాలామంది. అలాంటిది ఓ వ్యక్తి కేవలం దయ్యాల కోసమే అద్దె చెల్లించాడు. ఈజిప్టులోని కైరో వెలుపల అతి పురాతనమైన మూడు పిరమిడ్లు ఉన్నాయి. వీటిని ఈజిప్ట్ ప్రభుత్వం అద్దెకిస్తోంది. వాటిల్లో ఒకటి, అతిపెద్దది, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. అక్కడ దాదాపు మూడువేలకు పైగా దయ్యాలు, భూతాలు ఉన్నాయని చాలామంది అంటుంటారు. ఇప్పుడు ఆ దయ్యాలను చూడటానికే ప్రముఖ యూట్యూబర్ జేమ్స్ డొనాల్డ్సన్ (మిస్టర్ బీస్ట్), వాటిని వంద గంటలకు అద్దెకు తీసుకున్నాడు. ‘బియాండ్ ది రికార్డ్స్’ పేరుతో భయంకర ప్రదేశాల్లోకి వెళ్లి, అక్కడ జరిగే విచిత్రమైన సంఘటనల వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు తన భారీ అన్వేషణ కోసం ఈజిప్ట్‌లోని ఈ పిరమిడ్లను ఎంచుకున్నాడు.మరో వింత..ఈ విమానంలో ప్రయాణించాల్సిన పనిలేదు.. ‘ఈ వంద గంటల్లో స్నేహితులతో కలసి అక్కడ ఉండే అన్ని గదులు, సమాధులను చూసి, అక్కడే నిద్రించాలన్నది నా ప్లాన్. ఇందుకోసం, అవసరమైన అన్ని వస్తువులతో పాటు, పారానార్మల్ యాక్టివిటీ డివైజ్, ఇతర పరికరాలను తీసుకెళ్తున్నా’ అని చెప్పాడు. కొంతమంది ఇది సాధ్యం కాదని కొట్టి పారేస్తుంటే, తను మాత్రం త్వరలోనే వీడియోతో సమాధానం చెబుతానంటున్నాడు. భూమి నుంచి దూరంగా వెళ్లకుండా విమానంలో స్పెండ్ చేయడం గురించి విన్నారా..?. ఆ ఆలోచనే వెరైటీగా ఉంది కదూ..!. అలాంటి కోరిక ఉంటే వెంటనే ఉత్తర అమెరికాలో అలాస్కాకి వచ్చేయండి. శీతాకాలపు మంచు అందాల తోపాటు విమానంలో గడిపే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి అదేంటో తెలుసుకుందామా..!ఆ వీడియోలో 1950ల నాటి విమానం(Airplane) వింటేజ్ డీసీ-6 విమానం విలక్షణమైన విమానహౌస్(Airplane House)గా రూపాంతరం చెందింది. ఇది ఒకప్పుడూ మారుమూల అలాస్కా(Alaska) గ్రామాలకు ఇంధనం, సామాగ్రిని సరఫరా చేసేది. ఇందులో రెండు బెడ్ రూమ్‌లు, ఒక బాత్రూమ్తో కూడిన వెకేషనల్ రెంటల్ హౌస్‌గా మార్చారు. చుట్టూ మంచుతో కప్పబడి ఉండే ప్రకృతి దృశ్యం మధ్యలో ప్రత్యేకమైన విమాన ఇల్లులో అందమైన అనుభూతి.ఇలా సర్వీస్ అయిపోయిన విమానాలను అందమైన టూరిస్ట్ రెంటల్ హౌస్‌లుగా తీర్చిదిద్ది పర్యాటకాన్ని ప్రోత్సహించొచ్చు అనే ఐడియా బాగుంది కదూ..!. చూడటానికి ఇది ప్రయాణించకుండానే విమానంలో గడిపే ఓ గొప్ప అనుభూతిని పర్యాటకులకు అందిస్తోంది. చెప్పాలంటే భూమి నుంచి దూరంగా వెళ్లకుండానే విమానంలో గడిపే ఫీలింగ్ ఇది. (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!)
ఫొటోలు
National View all
Delhi Election-2025: అందరి దృష్టి షకూర్ బస్తీపైనే.. ఆ పార్టీల మధ్య హోరాహోరీ?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి.
46 ఏళ్ల ‘పవార్’ రాజకీయానికి బీజేపీ చెక్ పెట్టింది: అమిత్ షా
ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ లక్ష్యంగా కేంద్ర
Mahakumbh 2025: ఇప్పటికే 85 లక్షలమంది పుణ్యస్నానాలు!
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
పండుగ వేళ భయానక రోడ్డు ప్రమాదాలు.. 14 మంది మృతి
ముంబై/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమ
Maha Kumbh: పుణ్యస్నానాలు ప్రారంభం
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, అదృశ్య సరస్వతి సంగమం ఒడ
International View all
అయ్యో.. లాస్ ఏంజెలెస్! 24కు చేరిన మృతుల సంఖ్య
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఎంతకీ శాంతించడం లేదు.
మహిళల్లో మద్యం అలవాటుకు ఈస్ట్రోజన్‌కు లింకు
న్యూఢిల్లీ: ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు పెరిగిన సందర్భాల్
కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలిగిన అనిత
ఒట్టావా: కెనడా ప్రధాని బరినుంచి భారత సంతతికి చెందిన అనితా ఆన
సరిహద్దుల్లో ఫెన్సింగ్ నిర్మాణం.. భారత హై కమిషనర్‌కు బంగ్లా సమన్లు
ఢాకా: రెండు దేశాల సరిహద్దుల్లోని ఐదు ప్రాంతాల్లో ఫెన్సింగ్
మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో రగిలిన క
NRI View all
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను త
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
క్రైమ్
గృహిణి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గురువారెడ్డి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరాం కాలనీకి చెందిన సంపంగి గణేష్ ఏడాది క్రితం శిరీష(21) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి శిరీష కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడడం లేదు. తాజాగా ఆమె తల్లితో మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 9న తల్లి వద్దకు వెళ్లొస్తానని చెప్పి శిరీష బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయమై గణేష్ అత్తగారింటిలో వాకబు చేయగా, అక్కడికి రాలేదని తెలిపారు. దీంతో పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లోగాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని తెలిపారు.
సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు
జవహర్‌నగర్: ‘సంక్రాంతికి వస్తా..నీవు ఆరోగ్యంగా ఉండు. నాకు చిన్న పని ఉంది చూసుకుని రేపు ఇంటికి బయలుదేరి వస్తా. పండగ అయ్యాక మనమిద్దరం కలిసి బియ్యం తీసుకుని హైదరాబాద్‌కు వెళ్దాం..’ అని గర్భవతి అయిన భార్యతో ఫోన్లో మాట్లాడి వెళ్లిన కొన్ని గంటలకే ఆ ఇంటి యజమాని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కరెంటు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందాడు. జవహర్‌నగర్ సీఐ సైదయ్య, బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల బంజారా తండాకు చెందిన బానోతు ప్రశాంత్ (26), సరిత దంపతులు. వీరు సంతో నగర్లో నివాసం ఉంటున్నారు. ప్రశాంత్ బాలాజీనగర్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ప్రశాంత్ శుక్రవారం సంతోష్‌నగర్‌లో విద్యుత్ లైన్ల మరమ్మతులకు తోటి కారి్మకులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో ఏఈ సాంబశివరావు, లైన్మెన్ నాగరాజుతో పాటు కాంట్రాక్టర్ రాజేశ్‌లు ఎల్సీ తీసుకున్నామని, మీరు పని పూర్తి చేయాలని చెప్పడంతో ప్రశాంత్ ఉదయం 10.20 నిమిషాల సమయంలో విద్యుత్ స్తంభం ఎక్కి వైర్ కట్‌చేస్తుండగా 11కేవీ తీగలు తగిలాయి. ప్రశాంత్ స్తంభంపైన పనిచేస్తుండగానే అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యుత్ సరఫరాను ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై ప్రశాంత్ మృతిచెందాడు. తోటి కార్మికులు, ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్యతో ఉదయం ఫోన్లో మాట్లాడిన కొద్దిసేపటికే..మృత్యువాత పడిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు అన్ని విధాలా ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కామేపల్లి మండల మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్ నాయక్ డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్మికుని కుటుంబానికి అన్నివిధాల ఆదుకుంటామని విద్యుత్ అధికారులు హమీ ఇచ్చారు. ప్రస్తుతానికి తక్షణ సహాయంగా రూ.10 లక్షలు ఇస్తున్నట్లు అధికారులు, కాంట్రాక్టర్ ప్రకటించారు. పండక్కి ఊరికి వస్తానంటివే.!
మీరట్‌లో దారుణం
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు, వారి 8 ఏళ్లలోపు ముగ్గురు కుమార్తెలు దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. పాత గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇటీవలే మొయిన్ అలియాన్ మోయినుద్దీన్(52), అస్మా(45)దంపతులు అద్దెకు దిగారు. వీరికి ముగ్గురు కుమార్తెలు అఫ్సా(8), అజిజా(4), అడీబా(1)ఉన్నారు. మొయిన్ దంపతులు బుధవారం నుంచి కనిపించకపోవడంతో అస్మా సోదరుడు షమీమ్, మొయిన్ సోదరుడు సలీ వారుండే ఇంటికి వచ్చి చూడగా బయట తాళం వేసి ఉంది. శుక్రవారం అతికష్టమ్మీద ఇంటి పైకప్పును తొలగించి, లోపలికి వెళ్లి చూడగా భయానక దృశ్యాలు కనిపించాయి. పడుకునే మంచానికి ఉన్న అరలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కుక్కి ఉండగా దంపతులను బెడ్‌షీట్‌లో చుట్టి పడేశారు. వీరి కాళ్లు కట్టేసి ఉన్నాయి. షమీమ్, సలీమ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అస్మా చిన్న మరదలు, ఆమె ఇద్దరు సోదరులతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనే కావొచ్చని పోలీసులు తెలిపారు.
వైఎస్ అభిషేక్‌రెడ్డి మృతి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి (36) శుక్రవారం మృతి చెందారు. ఇతను వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు(వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి కుమారుడు). కొద్ది రోజులుగా డెంగీ జ్వరంతో బాధ పడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.హైదరాబాద్ నుంచి ఆయన పారి్థవదేహం రాత్రి పొద్దుపోయాక పులివెందుల చేరుకుంది. సౌమ్యుడు, వివాద రహితుడు, ఉన్నత విద్యావంతుడిగా అభిషేక్‌రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. సన్నీగా ఈ ప్రాంత వాసులకు సుపరిచితుడు. ఆర్థోపెడిక్స్ వైద్యుడిగా రాణిస్తూనే రాజకీయాల్లో కూడా చురుగ్గా వ్యవహరించారు. శనివారం మధ్యాహ్నం వరకు కార్యకర్తలు, నాయకుల సందర్శనార్థం పులివెందులలోని స్వగృహంలో అభిషేక్‌రెడ్డి పారి్థవదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం పులివెందులలోని వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. అభిషేక్‌రెడ్డి మృతితో వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాగా, వైఎస్ అభిషేక్‌రెడ్డికి భార్య డాక్టర్ సౌఖ్య, పిల్లలు వైఎస్ అక్షర, వైఎస్ ఆకర్ష ఉన్నారు.