Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Mahakumbh 2025 how Many Devotees Have Taken Bath at Triveni Sangam1
Mahakumbh 2025: ఇప్పటికే 85 లక్షలమంది పుణ్యస్నానాలు!

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి స్నానాలు చేసే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.కుంభమేళా(Kumbh Mela) నేడు (సోమవారం) ప్రారంభంకాగా దీనికి ముందుగానే అంటే ఆదివారం రాత్రి 10 గంటల వరకు, 85 లక్షల మంది భక్తులు సంగమతీరంలో స్నానాలు చేశారు. జనవరి 11, శనివారం నాడు 35 లక్షల మంది భక్తులు మహా కుంభమేళాలో స్నానం చేశారు. జనవరి 12వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఆ రోజున 50 లక్షల మంది భక్తులు ఇక్కడ స్నానాలు చేశారు. ఈ విధంగా, రెండు రోజుల్లో మొత్తం 85 లక్షల మంది భక్తులు మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు మహా కుంభమేళాకు ముందుగానే భక్తులు చేరుకున్నారు. వారు గంగా, యమున సరస్వతీ నదుల సంగమంలో స్నానమాచరించారు. శనివారం 35 లక్షల మంది భక్తులు సంగమంలో స్నానం చేయడానికి వచ్చారని సమాచార డైరెక్టర్ శిశిర్ తెలిపారు. గత రెండు రోజుల్లో (శని, ఆదివారాలు) సంగంలో 85 లక్షలకు పైగా ప్రజలు స్నానం చేశారని తెలిపారు. ఈ మహా కుంభమేళాకు 45 కోట్లకు పైగా ప్రజలు వస్తారని, ఇది చరిత్ర(History)లో అతిపెద్ద మేళాగా మారనుందని అధికారి తెలిపారు. మహా కుంభమేళాలో మొదటి అమృత స్నానం (రాజ స్నానం) జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా జరగనుంది. ఈ సమయంలో అఖాడాలు తమ సంప్రదాయాల ప్రకారం స్నానాలు ఆచరించనున్నారు.ఇది కూడా చదవండి: Maha Kumbh: పుణ్యస్నానాలు ప్రారంభం

Sankranti 2025: Significance Of Bhogi Festival And Rituals2
భోగభాగ్యాల భోగి పండగ దేనికి సంకేతమంటే.?

'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని శాస్త్ర వచనం. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. మరోక అర్థంలో భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా 'భోగి పండగ' ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. అలాంటి ఈ పండుగను అనాథిగా ఆచారిస్తూ రావడానికి గల కారణం, ఆరోగ్య రహాస్యలు గురించి సవివరంగా చూద్దామా..!భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి…దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయానం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి.. ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెబుతున్నారు.ఆరోగ్యం రహస్యం..ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. అందువల్లే భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వచ్చింది. పైగా దీన్నుంచి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. భోగి మంటలు ఎందుకంటే..చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. పురాణాల ప్రకారం, దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటిముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని కోరాడు. అనంతరం రురువు వర గర్వంతో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఈ ధనుర్మాసంలో 30 రోజులపాటు ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టి.. ఆ తర్వాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుడిని అందులో తోస్తారు. అలా రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తోంది.ఈ పండగ సందేశం, అంతరార్థం..చలికాలంలో సూక్ష్మక్రిముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగిపోవడానికి మన పెద్దలు ఇలా భోగి మంటలు వేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారని చెబుతుంటారు. ఇక ఈ పండుగ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే..చెడు అలవాట్లను, అసూయా, ఈర్ఘ, దుర్భద్ధిని ఈ మంటల రూపంలో దగ్ధం చేసుకుని మంచి మనుసుతో జీవితాన్ని ప్రారంభించి సానుకూలా ఆలోచనలతో మంచి విజయాలను అందుకోవాలనే చక్కటి సందేశాన్ని ఇస్తోంది. మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమని ప్రార్థిస్తూ అగ్నిహోత్రాన్ని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలు, అలాగే మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో వేసి దగ్ధం చేసుకోవటమే భోగి. ఇలా మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం.(చదవండి: సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!)

Meta CEO Mark Zuckerberg Slams Apple3
యాపిల్‌పై జుకర్‌బర్గ్ తీవ్ర వ్యాఖ్యలు

దిగ్గజ పారిశ్రామిక వేత్త, మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg).. 'జో రోగన్ ఎక్స్‌పీరియన్స్'లో మాట్లాడుతూ యాపిల్ (Apple)ను విమర్శించారు. గ్లోబల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చినందుకు ఐఫోన్‌లను ప్రశంసిస్తూనే.. కంపెనీ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం లేదని, ఈ విషయంలో యాపిల్ విఫలమైందని అన్నారు.ఐఫోన్ బాగుంది, ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది దగ్గర ఇప్పుడు ఈ ఫోన్ ఉందని చెబుతూనే.. సంస్థ కొంతకాలంగా గొప్పగా ఏమీ కనుగొనలేదని జుకర్‌బర్గ్ వెల్లడించారు. స్టీవ్ జాబ్స్ ఐఫోన్‌ను కనుగొన్నారు. అయితే సంస్థ కేవలం దానిపై 20ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రతి ఏటా కొత్త వెర్షన్స్ లాంచ్ చేస్తోంది. కానీ అవి పాత వెర్షన్ల కంటే మెరుగ్గా లేదు. ఈ కారణంగానే చాలా తక్కువ మంది మాత్రమే కొత్త ఐఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.సంస్థ అందిస్తున్న కొత్త ఐఫోన్ మోడళ్లలో పెద్దగా అప్‌గ్రేడ్‌లు లేకపోవడం వల్ల ఫోన్ విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే కంపెనీ కొనుగోలుదారులపై, డెవలపర్‌లపై ఈ 30 శాతం పన్ను విధిస్తోందని.. ఇలాంటి వాటి వల్లనే యాపిల్ లాభపడుతోందని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.యాపిల్ ఇతర కంపెనీల పరికరాలను iPhoneలతో సజావుగా ఎలా పని చేయనివ్వదు అనే దాని గురించి జుకర్‌బర్గ్ కలత చెందారు. దీనికి ఆయన ఎయిర్‌పాడ్‌లను ఉదాహరణగా చూపాడు, అదే కనెక్షన్ టెక్నాలజీని ఉపయోగించకుండా ఇతర కంపెనీలను బ్లాక్ చేస్తుందని వివరించారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాతమ రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ కోసం యాపిల్ కనెక్షన్ ప్రోటోకాల్‌ను ఉపయోగించమని మెటా చేసిన అభ్యర్థనను.. భద్రతా కారణాల వల్ల యాపిల్ తిరస్కరించింది. వినియోగదారు గోప్యత పట్ల నిజమైన ఆందోళన కంటే కూడా వ్యాపార ప్రయోజనాల కారణంగా అభ్యర్థనను తిరస్కరించినట్లు జుకర్‌బర్గ్ చెప్పారు.యూజర్ల గోప్యత, భద్రతపై యాపిల్ వైఖరిని ఆయన విమర్శించారు. యాపిల్ కనిపెట్టిన కొత్త వాటిలో 'విజన్ ప్రో' ఒకటి మాత్రమే అని నేను అనుకుంటున్నానని.. కంపెనీ మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్ గురించి జుకర్‌బర్గ్ ప్రస్తావించారు. ఇది కూడా సరైన అమ్మకాలు పొందలేదని ఆయన అన్నారు.

This Pongal Week Ott Release Movies List Here4
సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. నగరాలు వదిలి పల్లె చేరుకున్న ప్రజలు పండుగ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఇవాల్టి నుంచి భోగితో మొదలైన.. కనుమతో ఈ సంక్రాంతి మూడు రోజుల పాటు సాగనుంది. ఇంకేముంది కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసే సినిమాలు కూడా రెడీ అ‍య్యాయి. ఈ సంక్రాంతిని మరింత సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేందుకు థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ ఇప్పటికే విడుదలయ్యాయి. వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వ‍స్తున్నాం పండుగ రోజే బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది.ఈ పండుగ వేళ కుటుంబంతో కలిసి సినిమాలను ఆస్వాదించేందుకు ఓటీటీలే సరైన వేదిక. ఈ సంక్రాంతి వేళ సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ సినిమాలు సిద్ధమైపోయాయి. అయితే ఈ పండుగు ఓటీటీల్లో పెద్ద సినిమాలు లేకపోవడం మైనస్. విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించిన విడుదల పార్ట్‌-2 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ మూవీ. దీంతో బాలీవుడ్‌ ఐ వ్యాంట్ టు టాక్ అనే సినిమాతో పాటు పలు హాలీవుడ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. ఈ వారంలో ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్‌సింగిల్స్ ఇన్‌ఫెర్నో(కొరియన్ రియాలిటీ షో) సీజన్ 4- 14 జనవరివిత్ లవ్ మెగాన్- హాలీవుడ్- జనవరి 15జో కిట్టీ సీజన్-2 - కొరియన్ వెబ్ సిరీస్- 16 జనవరిబ్యాక్ ఇన్ యాక్షన్-(హాలీవుడ్ మూవీ)- 17 జనవరిది రోషన్స్- హిందీ డాక్యుమెంటరీ సిరీస్- 17 జనవరిఅమెజాన్ ప్రైమ్ వీడియోఐ వ్యాంట్ టు టాక్- హిందీ సినిమా- జనవరి 17పాతల్ లోక్ సీజన్-2- 17 జనవరిడిస్నీ ప్లస్ హాట్‌స్టార్పవర్ ఆఫ్ పాంచ్- (హిందీ వెబ్ సిరీస్)- 17 జనవరిజీ5విడుదల పార్ట్-2- తమిళ సినిమా- జనవరి 17 సోని లివ్పణి- మలయాళ సినిమా- 16 జనవరిఅమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్చిడియా ఉద్- హిందీ సిరీస్- జనవరి 15ఎపిక్ ఆన్గృహ లక్ష్మి- హిందీ సిరీస్- జనవరి 16జియో సినిమాస్పీక్ నో ఈవిల్- హాలీవుడ్ సినిమా- జనవరి 13హర్లీ క్వీన్- సీజన్ -5(హాలీవుడ్)- జనవరి 17లయన్స్ గేట్ ప్లేహెల్ బాయ్- ది క్రూక్‌డ్ మ్యాన్-(హాలీవుడ్ మూవీ)- జనవరి 17మనోరమ మ్యాక్స్ఐ యామ్ కథలాన్(మలయాళ సినిమా)- జనవరి 17

IPL 2025 Shreyas Iyer Named As Punjab Kings Captain5
IPL 2025: కెప్టెన్‌ పేరును ప్రకటించిన పంజాబ్‌ కింగ్స్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings) జట్టు తమ కొత్త కెప్టెన్‌ పేరును ప్రకటించింది. ఐపీఎల్‌-2025 సీజన్‌కు గానూ టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer)ను తమ సారథిగా ఎంపిక చేసుకుంది. కాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో కెప్టెన్‌గా ఈ ముంబై బ్యాటర్‌కు మంచి అనుభవం ఉంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లకు అతడు నాయకుడిగా వ్యవహరించాడు.కోల్‌కతాకు టైటిల్‌ అందించిఇక గతేడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన 30 ఏళ్ల శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. అయితే, మెగా వేలం-2025(IPL Mega Auction 2025)కి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ అతడిని రిటైన్‌ చేసుకుంటుందని విశ్లేషకులు భావించగా.. శ్రేయస్‌ మాత్రం జట్టుతో బంధాన్ని తెంచుకునేందుకే ఇష్టపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు రూ. 2 కోట్ల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చాడు.భారీ ధర.. ఈ చాంపియన్‌ కెప్టెన్‌ను దక్కించుకునేందుకు పాత జట్టు కోల్‌కతా తొలుత రంగంలోకి దిగగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తగ్గేదేలే అన్నట్లు ధరను పెంచుకుంటూ పోయాయి. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన వేలం పాటలో ఆఖరికి పంజాబ్‌ నెగ్గింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 26 కోట్ల 75 లక్షలు పెట్టి శ్రేయస్‌ అయ్యర్‌ను కొనుగోలు చేసింది. తాజాగా అతడికి పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.నమ్మకాన్ని నిలబెట్టుకుంటాఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. ‘నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. హెడ్‌ కోచ్‌ రిక్కీ పాంటింగ్‌తో మరోసారి కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా చూస్తున్నా. జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ఇప్పటికే నిరూపించుకున్న ఆటగాళ్లతో పాటు ప్రతిభావంతులు చాలా మంది అందుబాటులో ఉన్నారు.పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు తొలి ఐపీఎల్‌ టైటిల్‌ అందించేందుకు నావంతు కృషి చేస్తా’ అని శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. ఇక.. ప్రధాన కోచ్‌ పాంటింగ్‌ మాట్లాడుతూ ‘శ్రేయస్‌కు ఆటపై మంచి అవగాహన ఉంది. కెప్టెన్‌గా ఇప్పటికే నిరూపించుకున్నాడు. గతంలో అతడితో కలిసి పనిచేశా. సీజన్‌ కోసం ఆతృతగా చూస్తున్నా’ అని అన్నాడు.కాగా ఇటీవల శ్రేయస్‌ అయ్యర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. 2024లో రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలు గెలిచిన ముంబై జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌ సభ్యుడు. అంతేకాదు.. ఇటీవల అతడి కెప్టెన్సీలో ముంబై టీమ్‌ దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నమెంట్‌ టైటిల్‌ గెలిచింది.సూపర్‌ ఫామ్‌లోఅదే విధంగా.. దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలోనూ శ్రేయస్‌ అయ్యర్‌ భారీ శతకాలతో దుమ్ములేపాడు. తదుపరి అతడు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశం ఉంది. అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడే భారత జట్టులో మాత్రం అయ్యర్‌కు చోటు దక్కలేదు. కాగా శ్రేయస్‌ అయ్యర్‌ చివరిసారిగా గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు.గతేడాది ఫ్లాప్‌ షోఇదిలా ఉంటే.. పంజాబ్‌ కింగ్స్‌ ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ గెలవలేదు. ఇక గత సీజన్‌లో శిఖర్‌ ధావన్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా.. గాయం వల్ల అతడు ఆదిలోనే తప్పుకోగా.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ జట్టును ముందుకు నడిపించాడు. అయితే, పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ పంజాబ్‌ కేవలం ఐదే గెలిచి.. తొమ్మిదో స్థానంతో సీజన్‌ను ముగించింది. చదవండి: వన్డేల్లో ట్రిపుల్‌ సెంచరీ.. సంచలనం సృష్టించిన ముంబై బ్యాటర్‌𝐒𝐡𝐫𝐞𝐲𝐚𝐬 𝐈𝐲𝐞𝐫 ➡️ 𝐓𝐡𝐞 𝐜𝐡𝐨𝐬𝐞𝐧 𝐨𝐧𝐞! ©️♥️#CaptainShreyas #SaddaPunjab #PunjabKings pic.twitter.com/EFxxWYc44b— Punjab Kings (@PunjabKingsIPL) January 12, 2025

California Wildfires live Updates: Los Angeles Latest Jan 13 2025 News6
అయ్యో.. లాస్ ఏంజెలెస్‌! 24కు చేరిన మృతుల సంఖ్య

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఎంతకీ శాంతించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమై ప్రాంతంపై వరుసగా ఆరో రోజు కూడా దాని ప్రతాపం చూపించింది. దీనికారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 24కి చేరింది. మరో పాతిక మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. తీవ్రమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి. ‘‘అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యం’’ అని కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌ అభివర్ణించారు. కార్చిచ్చు(Wildfires)తో ఇటిప్పదాకా 24 మంది బలయ్యారు. పాలిసేడ్స్‌లో 8 మంది, ఎటోన్‌లో 16 మంది మరణించారు. చనిపోయినవాళ్లలో ‘కిడ్డీ కాపర్స్‌’ ఫేమ్‌ నటుడు రోరీ సైక్స్‌ కూడా ఉన్నాడు. కార్చిచ్చుతో ఆర్థికంగా వాటిల్లిన నష్టం 150 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. ఇప్పటివరకూ కార్చిచ్చుతో 62 చదరపు మైళ్ల విస్తీర్ణం దగ్ధమైంది. 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇది శాన్‌ ఫ్రాన్సిస్కో వైశాల్యం కన్నా అధికం. ఇక.. పాలిసేడ్స్‌ ఫైర్‌ను 11శాతం, ఎటోన్‌ ఫైర్‌ను 15 శాతం అదుపు చేయగలిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మంటలను ఆర్పివేయడానికి స్థానిక అగ్నిమాపక దళంతో పాటు కెనడా, మెక్సికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తంగా 14 వేల మంది సిబ్బంది, 1,354 అగ్నిమాపక యంత్రాలు, 84 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇందులో పాలుపంచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.మరోవైపు.. లాస్‌ ఏంజెలెస్‌ కౌంటీలో 1.5 లక్షల మందిని నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశించిట్లు తెలిపారు. ఇప్పటికే ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నవారికి నిత్యావసరాలు, దుస్తులు అందించేందకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.సంబంధిత వార్త: ఎందుకీ కార్చిచ్చు!ఇక వినాశం(Disaster movies) ఆధారంగా సినిమాలు తీసే హాలీవుడ్‌లో.. మంటలతో అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలువురు తారలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆంటోనీ హోప్‌కిన్స్‌, పారిస్‌ హిల్టన్‌, మెల్‌ గిబ్సన్‌, బిల్లీ క్రిస్టల్‌ లాంటి తారల ఇళ్లు కార్చిచ్చు ధాటికి బూడిదయ్యాయి. ఇదిలా ఉంటే.. కాలిఫోర్నియా కార్చిచ్చు రాజకీయ రంగు పులుముకుంది. అధికారుల చేతగానితనమేనని కాబోయే అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ విమర్శించగా.. డెమోక్రట్‌ సెనేట్‌, కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌ ఆ విమర్శలను తిప్పి కొట్టారు. అంతేకాదు.. లాస్‌ ఏంజెలెస్‌ పూర్తిగా నాశనం కావడంతో.. ‘‘లాస్‌ ఏంజెలెస్‌ 2.0’’ పేరిట పునర్మిర్మాణ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారాయన. మరోవైపు.. ఫెడరల్‌తో పాటు స్థానిక దర్యాప్తు సంస్థలు కార్చిచ్చు రాజుకోవడానికి గల కారణాలను పసిగట్టే పనిలో ఉన్నాయి. హాలీవుడ్‌ స్టార్ల నిర్వాకంతో..ఇదిలా ఉంటే.. మంటల్ని ఆర్పేందుకు నీటి కోరత అక్కడ ప్రధాన సమస్యగా మారింది. అయితే.. హాలీవుడ్‌ స్టార్ల నిర్వాకం వల్లే లాస్‌ ఏంజెలెస్‌కి ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలాలను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయడంతో.. మంటలను చల్లార్చేందుకు నీటి కొరత ఎదురవుతోందని చెబుతున్నారు. కొందరు స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడుకున్నారంటూ డెయిలీ మెయిల్‌ ఓ కథనం ప్రచురించింది.నటి కిమ్‌ కర్దాషియన్‌ ది ఓక్స్‌లోని తన ఇంటి చుట్టూ తోటను పెంచేందుకు తనకు కేటాయించిన నీటి కంటే అధికంగా నీటిని వాడినట్లు అధికారులు గుర్తించారు. అలాగే.. సిల్వస్టర్‌ స్టాలోన్, కెవిన్‌ హార్ట్‌ వంటి వారు అదనంగా నీరు వాడుకుని జరిమానాలు చెల్లించారు. కొందరు హాలీవుడ్‌ స్టార్లు గంటకు 2,000 డాలర్లు చెల్లించి.. ప్రైవేటు ఫైర్‌ఫైటర్లను నియమించుకున్నారని డెయిలీ మెయిల్‌ పేర్కొంది. ఇక ప్రస్తుతం పసిఫిక్‌ పాలిసేడ్స్‌లో అన్ని హైడ్రెంట్లు పనిచేస్తున్నాయని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ పేర్కొంది. కానీ, 20శాతం హైడ్రెంట్లలో నీటి ప్రెజర్‌ చాలకపోవడంతో.. కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: అందుకే కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలిగా: అనిత

 Minister Amit Shah Slams NCP Sharad Pawar Politics7
46 ఏళ్ల ‘పవార్‌’ రాజకీయానికి బీజేపీ చెక్‌ పెట్టింది: అమిత్‌ షా

ముంబై: ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో 1978 నుంచి శరద్‌ పవార్‌.. అస్థిర, వెన్నుపోటు రాజకీయాలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ విజయంతో పవార్‌ రాజకీయాలకు ముగింపు పలికినట్టు అయ్యిందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) ఆదివారం షిర్డీలో పర్యటించారు. ఈ సందర్బంగా అమిత్‌ షా మాట్లాడుతూ..‘మహారాష్ట్రలో 1978లో శరద్‌ పవార్‌ భిన్నమైన రాజకీయాలను మొదలుపెట్టారు. అస్థిర, వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారు. కానీ, 2024 ఎన్నికల్లో ప్రజలు వాటిని తిరస్కరించారు. అదేవిధంగా ఉద్ధవ్‌ ఠాక్రే కుటుంబ రాజకీయాలకు కూడా ప్రజలకు ముగింపు పలికారు. కుట్రపూరిత రాజకీయాలు కూడా తిరస్కరణకు గురయ్యాయి. వాళ్లిద్దర్నీ మహారాష్ట్ర ప్రజలు ఇంటికి సాగనంపారు. బీజేపీతో పాటు నిజమైన శివసేన, ఎన్సీపీలను గెలిపించారు. వారి ఓటమితో మహారాష్ట్రలో అస్థిర రాజకీయాలకు ముగింపు పడిందన్నారు.ఉద్ధవ్ థాక్రే మమ్మల్ని మోసం చేశాడు. 2019లో ఆయన బాలాసాహెబ్ సిద్ధాంతాన్ని విడిచిపెట్టారు. ఈరోజు మీరు ఆయనకు తన స్థానాన్ని మీరే చూపించారు. ఆయన ద్రోహం ప్రజలకు అర్థమైంది. రాష్ట్రంలో బీజేపీ సాధించిన పెద్ద విజయానికి పార్టీ కార్యకర్తలే కారణం. అందరి శ్రమతోనే ఘన విజయం అందుకున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన శరద్‌ పవార్‌.. అనేక సహకార సంస్థలకు నేతృత్వం వహించారు. కానీ, రైతుల ఆత్మహత్యలను మాత్రం ఆయన ఆపలేకపోయారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. రైతుల సంక్షేమం కోసమే మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది’ అంటూ కీలక కామెంట్స్‌ చేశారు.#WATCH | Maharashtra: Union Home Minister Amit Shah says, "... The victory (of BJP) in Maharashtra ended the politics of instability and backstabbing started by Sharad Pawar in 1978. Uddhav Thackeray betrayed us, he left the ideology of Balasaheb in 2019. Today you have shown him… pic.twitter.com/BzACZ9bOSJ— ANI (@ANI) January 12, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌, శివసేన నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు.

Uttar Pradesh govt proposes no helmet, no fuel rule to put curb on road accidents8
హెల్మెట్‌ లేకపోతే పెట్రోల్‌ పోయొద్దు

లక్నో: ద్విచక్ర వాహనాల ప్రమాదాలు తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్‌ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. హెల్మెట్‌ లేకుండా వచ్చిన వారికి ఇంధనం పోయొద్దని పెట్రోల్‌ బంకు నిర్వాహకులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో 75 జిల్లాల కలెక్టర్లకు రవాణాశాఖ కమిషనర్‌ బ్రజేష్‌ నారాయణ సింగ్‌ లేఖలు పంపారు. వాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు సైతం కచ్చితంగా హెల్మెట్‌ ధరించి ఉండాలని పేర్కొన్నారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు పెట్రోల్‌ బంకుల బయట ‘నో హెల్మెట్, నో ఫ్యూయెల్‌’బోర్డులను ప్రదర్శించాలని సూచించారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో బాధితులు హెల్మెట్‌ ధరించడం లేదన్న గణాంకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాలను కాపాడటం, రోడ్డు భద్రతను నిర్ధారించడమే రవాణా శాఖ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గౌతమ్‌బుద్ధ నగర్‌ జిల్లాలో 2019లో ప్రవేశపెట్టినా అమలులో నిర్లక్ష్యం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా ఆదేశాల అమలుపై పర్యవేక్షణ అవసరమని, దీనికోసం అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ఏటా దాదాపు 26వేల మంది చనిపోతున్నారు. హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే వీరిలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల రవాణాశాఖ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. ప్రమాదాలను నివారించేందుకు చర్యలు పేపట్టాలని ఆదేశించారు.

YS Jagan Mohan Reddy On AP Govt Tirumala Stampede Incident: andhra pradesh9
చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిస­లాట జరిగి, ఆరుగురు మరణించిన ఘటనకు బాధ్యులైన వారిపై చర్యల విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందంటూ ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి(YS Jagan mohan reddy) ఆదివారం మండిపడ్డారు. టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్‌ ఈఓ, కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిస­లాటకు కారణంగా తేలిన నేపథ్యంలో విచారణ చేసి.. వారిని జైల్లో పెట్టాల్సిన ప్రభుత్వం వారిని విడిచి­పెట్టిం­దంటే దానర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు.చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన చైర్మన్, ఈఓ, అడిషనల్‌ ఈఓ, కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వాళ్లందరినీ వెంటనే డిస్మిస్‌ చేసి.. కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవునిపట్ల మీ భక్తిని చాటుకోవాలని సీఎం చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..తొక్కిసలాటను సీరియస్‌గా తీసుకోలేదు..చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ ఆరో తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులను, అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయకపోవడం మొదలు.. టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్, ఈఓ, అడిషనల్‌ ఈఓ సహా, కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలింది. ఈ నేపథ్యంలో.. విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన వీరిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటి? జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోలేదనే కదా అర్థం? తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా? శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్లు? ఈ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్‌ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం.. వెంటనే టీటీడీ చైర్మన్‌ను, ఈఓను, ఏఈఓను, ఎస్పీ, కలెక్టర్‌ను డిస్మిస్‌ చేయకపోవడం.. ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా!డిప్యూటీ సీఎం డిమాండ్లు హాస్యాస్పదం..ప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్ర­బాబుగారు దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మరోవైపు.. డిప్యూటీ సీఎంగారు క్షమాపణ చెబితే అదే చాలన్నట్లుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి­గారే­మో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండన­గా చిత్రీకరిస్తుంటే, డిప్యూటీ సీఎంగారేమో, లేదు క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రా­మా­కు తెరలేపారు.ఇంతకన్నా దిగజారు­డు­తనం ఏమైనా ఉంటుందా? టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట జరిగి ఆరు­గురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయ­శ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీలేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. టీటీ­డీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదు.

Daily Horoscope On 13 January 2025 In Telugu10
ఈ రాశి వారికి కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది.

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: పౌర్ణమి తె.3.59 వరకు (తెల్లవారితే మంగళవారం) తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: ఆరుద్ర ఉ.11.02 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.10.59 నుండి 12.31 వరకు, దుర్ముహూర్తం: ప.12.34 నుండి 1.22 వరకు, తదుపరి ప.2.48 నుండి 3.36 వరకు, అమృతఘడియలు: ఉ.8.25నుండి 10.02 వరకు, భోగి పండగ; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.39. మేషం...కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. అంచనాలు నిజమవుతాయి. అనుకోని ఆహ్వానాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.వృషభం...రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొంత అసంతృప్తి. ఉద్యోగాలలో పనిభారం.మిథునం...ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటì మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.కర్కాటకం...ప్రయాణాలు వాయిదా వేస్తారు. భూవివాదాలు. ఆరోగ్యసమస్యలు. పనుల్లో జాప్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.సింహం.....చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయికన్య...కొత్త పనులు చేపడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.తుల..దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ముఖ్యమైన పనులలో తొందరపాటు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.వృశ్చికం......పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.ధనుస్సు...కొత్త పనులు చేపడతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కొన్ని వివాదాలు పరిష్కారం. వస్తులాభాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.మకరం..చిరకాల మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.కుంభం..ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.మీనం....వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. శ్రమాధిక్యం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
International View all
NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement

వీడియోలు

Advertisement