Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Health Minister Of Telangana Damodara On HPV Virus1
‘ఈ వైరస్‌ ఇప్పటిది కాదు.. 2001లోనే కనుగొన్నారు’

హైదరాబాద్‌: హ్యూమన్‌ మెటా న్యూమోవైరస్‌ (HMPV) వైరస్‌పై పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha). హెచ్‌ఎంపీవీ వైరస్‌ అనేది కొత్త వైరస్‌ కాదని, 2001లోనే ఈ వైరస్‌ ఉనికిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. నాటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ వ్యాప్తిలో ఉందన్నారు. ఈ వైరస్‌ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి ఈ వైరస్‌ వ్యాపిస్తుందన్నారు. చైనాలో ఈ ఏడాది హెచ్‌ఎంపీవీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదుతువున్నట్లు తెలుస్తోందని, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో దీని తీవ్రత ఎలా ఉందనే పరిస్థితిని సమీక్షిస్తున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో మన రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు రెగ్యులర్‌గా కో-ఆర్డినేట్‌ చేసుకుంటున్నారని, ఈ వైరస్‌ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి పరిస్థితిని అయినా ఎదర్కొనేందుకు ప్రభ/త్వం వైద్య పరంగా సంసిద్ధంగా ఉందన్నారు.డిసీజ్ సర్వైలైన్స్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని, అన్నిరకాల వనరులతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, జిల్లా అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. సోషల్‌ మీడియాలో ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసేలా నిరాధార తప్పుడు సమాచారాన్ని ప్రచారం​ చేస్తే ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణిస్తోందని హెచ్చరించారు దామోదర.కాగా, భారత్‌లో HMPV ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. భారత్‌లో ఒక్కరోజే హెచ్‌ఎమ్‌పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఈ వైరస్‌ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్‌కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్‌ వచ్చింది. కర్ణాటక, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ వైరస్‌ను గుర్తించారు.ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్‌ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్‌ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్‌ఎమ్‌పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్‌ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్‌ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Sakshi Guest Column On English medium2
ఇంగ్లిష్‌ మీడియంపై అక్కసు ఎందుకు?

ఇంగ్లిష్‌ భాషా మాధ్యమం ఒక ఉపాధి విప్లవం. ఇంగ్లిష్‌ విద్య ఇప్పటి కచ్చిత అవసరం. అందుకే గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టిన విధానం ఎంతోమంది దళిత బడుగు వర్గాల విద్యార్థుల్లో విద్యాసక్తిని పెంచింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే ఎంతో ఆనందానికి గురయ్యారు. కానీ దళిత బహుజనులు ఆంగ్లం నేర్చుకుంటుంటే, తెలుగు భాషోద్ధరణ పేరుతో వారికి ఆ అవకాశం లేకుండా చేయడం న్యాయం కాదు. తెలుగును అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలన్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల తీర్మానం సామాజిక న్యాయానికి విరుద్ధమైనది, నిజాయితీ లోపించినది.తెలుగు నేలలో ఈ నాలుగు దశాబ్దాల్లో అనేక సామాజిక, సాంస్కృతిక, విద్యా, భాషా పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కొన్ని సామాజిక వర్గాలు హరిత విప్లవం తరువాత సంపన్న వర్గాలుగా మారాయి. ఒకనాడు జమీందారీ విధానం మీద పోరాడిన ఈ వర్గాలు ఆ తరువాత అవకాశ వాదంగా బ్రాహ్మణవాద కులాధిపత్యాన్ని స్వీకరించాయి. భూమి పంపకాన్ని నిరాకరిస్తూ భూస్వామ్య గుత్తాధిపత్యంతో రాజ్యాధి కారాన్ని చేపట్టాయి. అంతకుముందు వీళ్లు తెలుగు భాషకు పట్టం గట్టారు. కానీ తెలుగు విద్య వల్ల తమ పిల్లలకు ఉద్యోగ వసతి రాదనీ, అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపా దించాలంటే ఇంగ్లిష్‌ విద్య అవసరమనీ ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పారు. ప్రభుత్వ విద్యను దెబ్బతీశారు. ఎవరైతే తమ పిల్లలకు, మనవళ్ళకు బుద్ధిపూర్వకంగా తెలుగు రాకుండా చేసి వారి దేశీయత మీద గొడ్డలివేటు వేశారో, వారే మొన్నటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగును అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రధాన మాధ్యమంగా ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. కానీ దీన్ని తెలుగు మీద ప్రేమ అనలేము. ‘భూస్వామ్య ఆధిపత్యానికి కూలీలు ఎవరు దొరుకుతా’రనే భావనతోనే బడుగులకు తెలివిగా ఆంగ్ల మాధ్యమ నిరాకరణ జరుగుతోంది.నిజానికి మహాత్మాగాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, అంబేడ్కర్‌ లాంటివాళ్లు భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన భూమిక వహించడానికి వారి ఇంగ్లిష్‌ విద్యే కారణం. అంబేడ్కర్‌. భారత రాజ్యాంగంతో పాటు, వేలాది పేజీలు వివిధ అంశాలపై రాయడం ఆయన ఆంగ్ల భాషా అధ్యయనం వల్లే జరిగింది. ఆంగ్ల భాషాధ్యయనం వల్లే రాజా రామ్‌మోహన్‌ రాయ్‌ సతీసహగమన దురాచారానికి ఎదురు తిరగగలిగారు. రవీంద్రనాథ్‌ టాగూర్‌ శాంతినికేతనం స్థాపించి, నోబెల్‌ బహుమతి గ్రహీత కాగలిగారు. దీని వెనుక ఇంగ్లిష్‌ పునరుజ్జీవన ఉద్యమ అధ్యయనం ఉంది. ఇంగ్లిష్‌ విద్య ఇప్పటి కచ్చిత అవసరమనే విషయం అందరూ తెలుసుకోవాలి. దాన్ని అందిపుచ్చుకుంటూ దళిత బహుజనులు కూడా ఆంగ్లం నేర్చుకుంటుంటే, తెలుగు భాషోద్ధరణ పేరుతో వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు. నిజానికి పోయిన ఐదేళ్ళలో ఆంధ్ర రాష్ట్రంలోని స్కూళ్ళల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టిన విధానం ఎంతోమంది దళిత బడుగువర్గాల విద్యార్థుల్లో విద్యాసక్తిని పెంచింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే, చదువుతుంటే ఎంతో ఆనందానికి గురయ్యారు. ఒక సబ్జెక్టుగా తెలుగు అన్ని పాఠశాలల్లో ఉంది. తెలుగును ఆ సబ్జెక్టు నుండి అభివృద్ధి చేయవచ్చును. ప్రతి విద్యార్థికి నూరు పద్యాలు కంఠతా వస్తేనే ఆ విద్యార్థికి పదో తరగతి సర్టిఫికెట్‌ ఇవ్వండి అని ‘దళిత మహాసభ’ సలహా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు భాషోద్ధరణకు సభలు పెట్టినవాళ్ళే ప్రైవేట్‌ స్కూళ్ళను, కార్పొరేట్‌ స్కూళ్ళను నెలకొల్పారు. అందులో రెండవ భాషగా సంస్కృతాన్ని పెట్టి అసలు పిల్లలకు తెలుగే రాకుండా చేశారు. తెలుగు పరిశోధన మీద గొడ్డలి వేటు వేసిన ఈ పాలకులే తెలుగు భాషోద్ధరణకు పూనుకుంటున్నామనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దళిత బహుజన వర్గాలు ఆంగ్ల విద్య నేర్చుకుని వారు కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళే అర్హతను సంపా దిస్తారేమో అనే భయం వీరిని వెంటాడుతున్నట్టుంది.ఒకనాటి చంద్రబాబు ప్రభుత్వంలోనే 56 సంస్కృత కళాశాల లను రద్దుచేసి ఆ కళాశాలల్లోని తెలుగు పండితుల పొట్ట కొట్టారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలను నిర్వీర్యం చేసి తెలుగు భాషా సాహితీ కవితా పరిశోధనల వెన్ను విరిచారు. ఆధిపత్య కులాలు ఏ సబ్జెక్టును చదవడం లేదో గుర్తించి వాటన్నింటినీ నిర్వీర్యం చేశారు. ఒక్క తెలుగునే కాకుండా వృక్షశాస్త్రాన్ని, జంతుశాస్త్రాన్ని, భౌగోళిక శాస్త్రాన్ని, భౌతికశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాలను దెబ్బ తీసి ఐటీ సెక్టారుకు ఉపయోగపడే బీటెక్, ఎంటెక్‌లకే ప్రాధాన్యం ఇచ్చారు. మానవ వ్యక్తిత్వంలోని జీవశక్తిని దెబ్బతీశారు. కుటుంబ సంబంధాలన్నీ నాశనం అయినాయి. తమ సామాజిక వ్యవస్థలను గుర్తించ కుండా దేశం అంతా నాశనం అయిపోయిందని గగ్గోలు పెడు తున్నారు. నిజానికి ఇది స్వీయ వ్యక్తిత్వ దహనం నుండి వస్తున్న ఆక్రోశం. దళిత బహుజనుల వికాసంపైన ద్వేషానలం. ఈ హిపో క్రసీని అర్థం చేసుకోలేనంత అవిద్యలో దళిత బహుజనులు లేరు. ఏ పోరాటానికైనా నిజాయితీ ఉండాలి. అన్ని వర్గాల అభివృద్ధిని, సామాజిక న్యాయాన్ని కాంక్షించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కలిగి ఉండాలి. తమ కులాలే పైకి రావాలి అనేవారు సామాజిక సంస్కర్తలు కాలేరు. ఎంత అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినా ఆలో చనల్లో విస్తృతి, సామాజిక విప్లవ భావన లేకపోతే వేదికలు మాత్రమే పెద్దవిగా ఉంటాయి; ఆలోచనలు సంకు చితంగానే కనబడతాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మృతికి అందరూ సంతాపం తెలపడమే కాక ఆయన తీసుకొచ్చిన ‘సరళీకరణ’ దేశాభివృద్ధిని పొగిడారు. ఈ సరళీ కరణలో దేశ ప్రజలు భాగస్వాములు కావాలంటే ‘ఇంగ్లిష్‌ విద్య అందరికీ రావాలి’ అనే భావన అందులో దాగివున్న విషయం మరచిపోయారా? కొన్ని సామాజిక వర్గాల్లో సంస్కర్తలు, సామాజిక విప్లవకారులు తగ్గుతున్నారు. కారణం అట్టడుగు వర్గాల జీవన వ్యవస్థల అభివృద్ధే దేశాభి వృద్ధి అని తెలుసుకోలేక పోతున్నారు. మానవ పరిణామశాస్త్రం అన్ని జీవుల్లో మానవజాతే గొప్పదని నిగ్గుతేల్చింది. మౌఖిక జీవన వ్యవస్థలన్నీ లిఖిత జీవన వ్యవస్థలుగా పరిణామం చెందుతున్న దశ ఇది. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోతోంది. విద్య అనేది జ్ఞానం, సంస్కృతి, నాగరికత, చరిత్ర, ఉత్పత్తి, ఉత్పిత్తి పరికరాలను సృష్టించుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు విస్తరించి ఉన్నారు. ఆయా వృత్తుల్లో ఆ యా జీవన వ్యవస్థల్లో, ఆ యా దేశ పాలనల్లో వీరు భాగస్వాములౌతున్నారు. దానికి ఆంగ్ల విద్య ఎంతో తోడ్పడిందనేది చారిత్రక సత్యం. అందుకే దేశంలో మెజారిటీగా ఉన్న దళిత, బడుగు వర్గాలకు ఆంగ్ల విద్యను నేర్పడం అవసరం. దీనివల్ల వారిలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. అంతిమంగా దేశానికే మేలు కలుగుతుంది. జీడీపీ పెరుగుతుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. దేశీయ ఎగు మతులు పెరుగుతాయి. ఏ ప్రభుత్వానికైనా పోయిన ప్రభుత్వాల విధానాలనన్నింటినీ రద్దు చేయాలనే భావన మంచిది కాదు. పాలకులు మారుతూఉంటారు. కానీ మంచి విధానాలను ముందుకు తీసుకువెళ్లాలి. ప్రజల్లో ఎంతో చైతన్యం ఉన్న కాలం ఇది. ఇంగ్లిష్‌ మీడియంపై ప్రభుత్వం చర్య తీసుకొనే పక్షంలో, అన్ని ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్ళను ఒకే విధానంలోకి తేగలరా? ఒకసారి సామాజిక న్యాయ కోణంలో, దళిత, బహుజనుల మేలును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఇంగ్లిష్‌ భాషా మాధ్యమం ఒక ఉపాధి విప్లవం. తెలుగు భాషాభివృద్ధి ఒక జీవన సంస్కృతి. ఈ రెండింటిని కలిపి తీసుకెళ్ళడమే దళిత బహుజన సామాజిక తాత్విక ఆలోచన క్రమం. ఇది ఫూలే, అంబేడ్కర్‌ బాట. ఆ బాటలో నడుద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695

Trudeau Steps Down As PM, Liberal Party Chief3
కెనడా ప్రధాని ట్రుడో రాజీనామా

ఒట్టావా: కెనడా (canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) రాజీనామా చేశారు. ప్రధాని పదవితో పాటు లిబరల్‌ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. బుధవారం జరిగే కీలక జాతీయ కాకస్ సమావేశానికి ముందు ట్రూడో తన పదవికి రాజీనామా చేయడం గమానార్హం.ఈ ఏడాది అక్టోబర్‌లో కెనడాలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార లిబరల్స్ పార్టీ ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ల చేతిలో ఘోరంగా ఓడిపోనుందంటూ పలు సర్వేలు స్పష్టం చేశాయి. దీనికి తోడు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కెనడాపై కవ్వింపు చర్యలకు దిగారు.ఇటీవల, ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా అవతరించడం గొప్ప ఆలోచనని వ్యాఖ్యానించారు. కెనడాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా చాలా మంది కెనడియన్లు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై ట్రూడోతో ప్రస్తావించారు. కానీ ట్రూడో మాత్రం ట్రంప్‌కు ధీటుగా బదులివ్వలేకపోయారు. ఈ వరుస పరిణామాలు ట్రూడో ఉక్కిరిబిక్కిరి అయ్యారని, ఫలితంగా బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వెలుగు చూశాయి. ట్రుడో రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోచర్చనీయాంశమైంది.

Mp Vijayasaireddy Comments On Enforcement Directorate Enquiry4
కేవీరావుపై పరువు నష్టం దావా వేస్తా: విజయసాయిరెడ్డి

సాక్షి,హైదరాబాద్‌:కాకినాడ సీ పోర్టు అమ్మకం విషయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఈడీ ఆఫీసు నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘నన్ను మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. కర్నాటి వెంకటేశ్వర్ రావు(కేవీరావు) ఫిర్యాదు మీద విచారణ చేశారు. ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ మీద ఈడీ కేసు నమోదు చేసింది. విక్రాంత్ రెడ్డికి కాకినాడ సీ పోర్ట్ గురించి కేవీ రావుతో మాట్లాడాలని నేను చెప్పినట్లు ఆరోపించారు. కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.కానీ కాకినాడ సీ పోర్ట్ విషయంలో నేను ఎవరికి ఫోన్ చేయలేదు. కేవీరావు తిరుమలకు వచ్చి దేవుడి ముందే నిజాలు చెప్పాలి. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కాకినాడ పోర్ట్ షేర్ ట్రాన్స్ఫర్‌కు నాకు సంబంధం లేదు. కేవీరావు మీద సివిల్ డిఫమేషన్ వేస్తాను. నాకు సంబంధం లేని విషయంలో నా పై ఆరోపణలు చేశారు.సండూరు పవర్‌ పెట్టుబడులపై వెరిఫై చేసి మళ్లీ పిలిస్తే సమాధానం చెప్తానని చెప్పను. విక్రాంత్‌రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగానే తెలుసు ఆయనతో నాకేం సంబంధం’అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ విచారించిందినా స్టేట్మెంట్ ఈడి అధికారులు రికార్డ్ చేశారుడిడి అధికారులు నన్ను 25 ప్రశ్నలు అడిగారుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసిందికేవీ రావు నాకు తెలియదు అని చెప్పానుఅతనికి నాకు ఎలాంటి సంబంధం లేదుకాకినాడ సీ పోర్ట్ విషయం లో కేవీ రావు కు ఎక్కడ నేను ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను తిరుమల కు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పానునేను తప్పు చేస్తే ఏ శిక్ష కైనా నేను సిద్ధంమే నెల 2020 లో నేను ఫోన్ చేసానని కేవి రావు చెపుతున్నాడుకాల్ డేటా తీసి నేను కాల్ చేశాను లేదో చూసుకోవచ్చునేను ఎక్కడ కూడా కేవీ రావు కు ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను ఈడీ విచారణ కు పిలవండి అని కోరానురంగనాధ్ కంపెనీ నీ ప్రభుత్వం కి ఎవ్వరు పరిచయం చేసారని ఈడీ ప్రశ్నించిందినాకు సంబంధం లేదు అని చెప్పానునేను ఒక సాధారణ మైన ఎంపీ నీ మాత్రమేశ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవ్వరు ఆపాయింట్ చేసారో నాకు తెలియదు అని చెప్పానుశరత్ చంద్ర రెడ్డి తో ఉన్న సంబంధాలు కూడా అడిగారుకుటుంబ రీలేషన్ అని చెప్పానుకాకినాడ సీ పోర్ట్ విషయం లో నాకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారులుక్ ఔట్ నోటీసుల ఫై నేను ఢిల్లీ హైకోర్టు కు వెళ్ళానుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీ కి చెప్పానువిక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారువిక్రాంత్ రెడ్డి తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుపలేదుసండుర్ పవర్ కంపెనిలో 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారుకొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అని చెప్పాను

rs 50000 loan with Aadhaar card no guarantee needed under PM Svanidhi Yojana How to apply eligibility details5
ఆధార్‌ కార్డు ఉంటే చాలు.. రూ.50 వేల లోన్‌

బ్యాంకులలో రుణాలు పొందడం అంత సులువు కాదు. హామీగా ఆస్తులు తాకట్టు పెట్టాలి.. సవాలక్ష డాక్యుమెంట్లు సమర్పించాలి. అయితే ఇవన్నీ లేకుండా కేవలం ఆధార్‌ కార్డు ఉంటే చాలు.. ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.50 వేలు లోన్‌ పొందే అవకాశం ఉంది. అదే పీఎం స్వనిధి యోజన పథకం.కోవిడ్‌ (COVID-19) మహమ్మారి బారిన పడిన వ్యాపారాలకు మద్దతుగా ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి యోజన (PM Svanidhi Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టింది. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారుల స్వావలంబన కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఈ స్కీమ్‌ కింద లబ్ధిదారులు ఎటువంటి గ్యారెంటీ లేకుండా ఆధార్ కార్డుతో రుణాన్ని పొందవచ్చు.ఇది ఎలా పని చేస్తుందంటే..చిరు వ్యాపారులకు ప్రారంభంలో రూ.10,000 వరకు రుణం ఇస్తారు. వారు ఈ లోన్ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే, తదుపరిసారి రూ.20,000 రుణం పొందవచ్చు. దీన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత రూ.50,000 లోన్‌ అందుకోవచ్చు.ఆధార్ కార్డు తప్పనిసరిపీఎం స్వనిధి పథకం కింద రుణం పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. వ్యాపారులు తమ ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాన్ని 12 నెలల్లో వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలి.ఎలా దరఖాస్తు చేయాలి?పీఎం స్వనిధి వెబ్‌సైట్ ప్రకారం.. రుణగ్రహీతలు తప్పనిసరిగా లోన్ అప్లికేషన్ ఫారమ్ (LAF)ని పూరించడానికి అవసరమైన సమాచార పత్రాలను అర్థం చేసుకోవాలి.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఈ-కేవైసీ/ఆధార్ ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్‌ను ఆధార్ నంబర్‌కు లింక్ చేయడం తప్పనిసరి. దీంతోపాటు రుణగ్రహీతలు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి భవిష్యత్తు ప్రయోజనాల కోసం పట్టణ స్థానిక సంస్థల (ULB) నుండి సిఫార్సు లేఖను పొందవలసి ఉంటుంది.మొబైల్ నంబర్‌లను అప్‌డేట్ చేయడానికి ఫారమ్‌ను తప్పనిసరిగా పూరించాలి. ఇతర పత్రాలు అవసరం లేదు.ఈ పథకంలో రుణం పొందడానికి అర్హులైన నాలుగు రకాల విక్రేతలు ఉన్నారు. అర్హత ప్రమాణాలను సరిచూసుకుని తదనుగుణంగా దరఖాస్తు చేసుకోండి.ఈ మూడు దశలను అనుసరించిన తర్వాత పోర్టల్‌లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. రుణగ్రహీతలు నేరుగా పోర్టల్‌లో లేదా వారి ప్రాంతానికి సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.మరి వడ్డీ రేటు ప్రధాన మంత్రి స్వనిధి యోజన పథకానికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRB), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (SFB), సహకార బ్యాంకుల వడ్డీ రేట్లు ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం ఉంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు (NBFC) వడ్డీ రేట్లు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఉంటాయి. ఎంఎంఫ్‌ఐలు (non NBFC) ఆర్బీఐ మార్గదర్శకాల పరిధిలోకి రాని ఇతర కేటగిరి సంస్థలకు ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పథకం కింద వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

HMPV Virus News Few Cases At Single Day Confirmed In India6
హలో.. హెచ్‌ఎంపీవీ వైరస్‌తో జాగ్రత్త

బెంగళూరు: : భారత్‌లో హ్యూమన్‌ మెటా న్యూమోవైరస్‌ (HMPV) ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. కర్ణాటకలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్‌ సోకడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి కరోనా రూల్స్‌ మాదిరిగానే ఉన్నాయి. నిబంధనలు ఇలా జనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్‌తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలని అందులో తెలిపారు. వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలని కీలక సూచన చేసింది.ఉమ్మివేరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి డిసెంబర్‌లో సాధారణ జలుబు, దగ్గు సులుపెరగలేదన్నారు.మెల్లగా విస్తరిస్తున్న హెచ్‌ఎమ్‌పీవీదేశంలో హెచ్‌ఎమ్‌పీవీ మెల్లగా విస్తరిస్తోంది. భారత్‌లో ఒక్కరోజే హెచ్‌ఎమ్‌పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఈ వైరస్‌ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్‌కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్‌ వచ్చింది.ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్‌ రాగా, అహ్మదాబాద్‌లో ఓ చిన్నారికి ఈ వైరస్‌ సోకింది. దాంతో దేశంలోని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.భయం వద్దు.. జాగ్రత్తగా ఉండండిచిన్నారుల్లో వైరస్‌ వ్యాప్తికి హెచ్‌ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, తమ వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవన్నారు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్‌ గుండూరావుఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్‌ఎంపీవీ వైరస్‌ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు.చైనాలో అధికం..ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్‌ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్‌ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్‌ఎమ్‌పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్‌ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్‌ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Former Minister Ambati Rambabu On Game Changer Episode7
‘పుష్ప’కేనా నీతులు.. గేమ్‌ చేంజర్‌కి పాటించరా?

అమరావతి: ‘పుష్ప’ కేమో నీతులు చెప్తారా!, గేమ్‌ చేంజర్‌కి(Game Changer) పాటించరా! అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు. రామ్‌ చరణ్‌ నటించిన గేమ్‌ ఛేంజర్‌.. ఈ సంక్రాతి బరిలో నిలవడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ఈవెంట్‌ రాజమండ్రిలో శనివారం సాయంత్రం జరిగింది. ఆ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠగా గుర్తించారు. ఇదే విషయంపై అంబటి రాంబాబు(Ambati Rambabu) ‘ ఎక్స్‌’ వేదికగా స్పందించారు. "పుష్ప" కేమో నీతులు చెప్తారా !"గేమ్ చేంజర్' కి పాటించరా !@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 6, 2025 గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు ఇద్దరు యువకులు. ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తాము ఆధారాన్ని కోల్పోయమంటూ బోరున విలపిస్తున్నారు.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తోంది,. తనతో కలిసి పండ్ల వ్యాపారం చేసుకుంటున్న చరణ్‌ను కోల్పోవడంతో తాము అన్నీ కోల్పోయినట్లే ఉందని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.అల్లు అర్జున్‌ టార్గెట్‌గా వ్యవహారం నడిపారా?పుష్ప-2(Pushpa-2) బెనిఫిట్‌ షో సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. ఆ సినిమా బెనిఫిట్‌ షోలో భాగంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందింది. అదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఫలితంగా దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. పుష్ప-2 హీరో అల్లు అర్జున్‌... సంధ్య థియేటర్‌కు బెనిఫిట్‌ షోకు రావడంతోనే ఇదంతా జరిగిందని అతనిపై కేసు కూడా నమోదైంది. ఒకవైపు ఈ కేసులో A-11గా ఉన్న అల్లు అర్జున్‌ విచారణ ఎదుర్కొంటున్నాడు. అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ లభించినా ఈ కేసు వివాదం ఇంకా చల్లారలేదు. ప్రధానంగా అల్లు అర్జున్‌ టార్గెట్‌గా వ్యవహారం అంతా నడిచిందనే విమర్శలు కూడా వినిపించాయి.మరి గేమ్‌ ఛేంజర్‌ సంగతి ఏంటి?పుష్ప సినిమాకు సంబంధించి తెలంగాణలో ఒకరు ప్రాణాలు కోల్పోతే, గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఇంకా రిలీజ్‌ కాకుండానే ఇద్దరు అసువులు బాసారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు ‘పుష్ప’ రచ్చ ఇంకా హాట్‌ హాట్‌గా ఉండగానే, గేమ్‌ ఛేంజర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా జరపడాన్నిప్రశ్నిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌ సాయంత్రం సమయంలో జరగడంతో పాటు దానికి భారీగా ఫ్యాన్స్‌ సేకరణ జరిగిందనే అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు పలువురు విశ్లేషకులు.పుష్ప ఘటన.. పవన్‌ మాటల్లో కొన్ని.. అల్లు అర్జున్‌ విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపించిందన్నాడు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. ఘటన జరిగిన వెంటనే రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది చేయకపోవడం వల్లే ఇంత జరిగింది. ఒకవేళ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించకపోతే ఆయనపై కూడా ప్రజల్లో విమర్శలు వచ్చేవి. సీఎం హోదాలో రేవంత్‌ స్పందించారనే అనుకుంటున్నా. రేవంత్‌ రెడ్డి గొప్ప నాయకుడే కాదు.. కింద స్థాయి నుంచి ఎదిగారు’ అని పవన్‌ అన్నారు.‘‘గేమ్‌ ఛేంజర్‌’ పరామర్శిస్తాడా?ఇ క్కడ కూడా విషాదమే చోటు చేసుకుంది. గేమ్‌ ఛేంజర్‌ ఆయా కుటుంబాల్ని పరామర్శిస్తాడా అనే ప్రశ్న తలెత్తోంది. ఆరోజు పవన్‌ మాటల్ని బట్టి చూస్తే.. రేవతి కుటుంబాన్ని అల్జు అర్జున్‌ పరామర్శించకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ వివాదం పెద్ద అవడానికి కూడా అల్లు అర్జున్‌ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం కూడా ఒక కారణంగా చూపారు. మరి ఇప్పుడు రామ్‌ చరణ్‌ వెళ్లి. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల్సి పరామర్శించాలి కదా. వారి కుటుంబాలకైతే తక్షణ సాయం అయితే అందించారు కానీ వారి కుటుంబాల్ని వెళ్లి పరామర్శించాల్సిన బాధ్యత రామ్‌ చరణ్‌పై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ‘‘ఒరేయ్‌ పిచ్చోడా .. పవనన్న చెప్తాడంతే రా

Spanish woman returns to India in search of biological mother After 20 years8
20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!

ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే...జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లి స్పర్శకోసం మనసు ఆరాట పడుతుంది. అలా చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమైన యువతి ఇపుడు జన్మనిచ్చిన తల్లికోసం అన్వేషిస్తోంది. రెండు దశాబ్దాలక్రితం అనుకోని పరిస్థితుల్లో అమ్మకు దూరమైన, పిల్లల విద్యలో పరిశోధకురాలు స్నేహ భారతదేశానికి తిరిగి వచ్చింది. అసలేంటీ స్నేహ స్టోరీ తెలుసుకుందాం పదండి!స్నేహకు సుమారు ఏడాదిన్నర వయసుండగా ఆమె తల్లి వదిలేసివెళ్లిపోయింది. ఈమెతోపాటు నెలల పసిబిడ్డ సోము కూడా అనాధలైపోయారు. ఇది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇద్దర్నీ స్థానిక అనాథ ఆశ్రమంలో చేర్పించారు. ఐదేళ్లపాటు అక్కడే పెరిగారు.అయితే స్పెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన ఒక జంట వీరి పాలిట దైవాలుగా మారారు. అనాధ ఆశ్రమంలో ఉన్న ఐదేళ్ల స్నేహ , నాలుగేళ్ల సోము ఇద్దర్నీ స్పానిష్‌ జంట జెమా వైదర్, జువాన్ జోష్ 2010లో దత్తత తీసుకుని తమ దేశానికి తీసుకువెళ్లి పోయారు. వీరిని సొంత బిడ్డల్లా పెంచుకుని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం స్నేహ వయసు 21 ఏళ్లు కాగా, చిన్నారుల విద్యలో పరిశోధనలు చేస్తోంది.అయితే, ఇటీవలే వారి మూలాలు ఒడిశాలో ఉన్నాయని జెమా దంపతులు స్నేహకు తెలిపారు. దీంతో తనకు జన్మనిచ్చిన తల్లి ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలని స్నేహ పెంపుడు తల్లి జెమాతో కలిసి గత నెల 19న భారత్ (భువనేశ్వర్)కు చేరుకుంది. స్థానిక హోటల్‌‌లో ఉంటూ నయాపల్లిలోని ఇంటి యజమాని వద్దకు వెళ్లి అక్కడ తల్లిదండ్రుల పేర్లను తెలుసుకుంది. తల్లి పేరు బనలతాదాస్‌, తండ్రి సంతోష్‌ అని తెలిసింది. ఈ వివరాలతో పోలీసుల సాయంతో అమ్మకోసం వెదుకులాట ప్రారంభించింది. అలాగే అనాధాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని దృవీకరించుకుంది. ఈ విషయంలో మహిళా విశ్వవిద్యాలయం రిటైర్డ్ టీచర్ సుధా మిశ్రా ఆమెకు సాయం అందించారు.ఈ విషయాన్ని స్థానిక పోలీస్ కమిషనర్ దేవ్ దత్తా సింగ్‌ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసులు విచారణ చేయగా, బానాలత కటక్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే జనవరి 6న స్నేహ తిరిగి స్పెయిన్ కు వెళ్లాల్సి ఉండటంతో తల్లిని కలుసుకోవడం సాధ్యం కాలేదు. అయితే తాను మార్చిలో తిరిగి ఇండియాకు వచ్చి తల్లి ఆచూకీ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తానని చెప్పింది స్నేహ. స్నేహ తల్లిదండ్రులను గుర్తించడానికి పోలీసులు , పంచాయతీ కార్యకర్తల సహాయం తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ అంజలి ఛోట్రే చెప్పారు.స్నేహ అసలు తల్లిదండ్రులు ఎవరు?ఒడిశాకు చెందిన బనలతా దాస్, సంతోష్‌ స్నేహ తల్లిదండ్రులు. వీరు నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్‌‌లోని నయాపల్లిలో అద్దె ఇంటిలో ఉండేవారు. వంట మనిషిగా పని చేసే ఆమె భర్త, ఏమైందో తెలియదు గానీ పిల్లలు సహా భార్యను వదిలివేసి వెళ్లిపోయాడు. దీంతో బానాలత ఒంటరిదైపోయింది. అటు నలుగురు పిల్లలతో, కుటుంబ పోషణా భారమైంది. దీంతో ఇద్దరి పిల్లల్ని వదిలేసి మరో కొడుకు, కూతుర్ని తీసుకొని ఎటో వెళ్లిపోయింది. స్నేహ మా ఇంటి వెలుగుస్నేహ చాలా బాధ్యతగల కుమార్తె. మంచి విద్యావంతురాలు. ఆమె మా ఇంటి వెలుగు,ఆమెమా జీవితం అంటూ స్నేహ గురించి ప్రేమగా చెప్పుకొచ్చింది దత్తత తల్లి జెమా. అంతేకాదు జీవసంబంధమైన తల్లిని తెలుకోవాలన్న ఆరాటపడుతున్న కుమార్తెతోపాటు ఒడిశాలోని భువనేశ్వర్‌ రావడం విశేషం. ప్రస్తుతం స్నేహ చేస్తున్న ప్రయత్నం నెట్టింట వైరల్‌వుతోంది. త్వరలోనే తల్లీబిడ్డలిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు

Gill To Be Removed Bumrah to be India Vice Captain for CT 2025: Report9
CT 2025: శుబ్‌మన్‌ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్‌?

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది టీమిండియా. ముఖ్యంగా బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగా దాదాపు దశాబ్దం తర్వాత ఈ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి పయనమైంది.బౌలర్‌గా, కెప్టెన్‌గా రాణించిఇక ఆసీస్‌తో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచిందంటే అందుకు కారణం జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah)నే. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) గైర్హాజరీలో ఈ ఫాస్ట్‌బౌలర్‌ భారత జట్టును ముందుకు నడిపించాడు. పేసర్‌గా, కెప్టెన్‌గా రాణించి ఆసీస్‌ గడ్డపై టీమిండియాకు అతిపెద్ద టెస్టు విజయం(295 పరుగుల తేడాతో) అందించాడు.వెన్నునొప్పి వేధించినాఅయితే, ఆ తర్వాత రోహిత్‌ శర్మ తిరిగి వచ్చినా టీమిండియా ఇదే జోరును కొనసాగించలేకపోయింది. బ్యాటర్‌గా, సారథిగా రోహిత్‌ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి అతడు స్వచ్చందంగా తప్పుకోగా.. బుమ్రా మరోసారి పగ్గాలు చేపట్టాడు. వెన్నునొప్పి వేధించినా జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు.కానీ సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ ఓటమిని చవిచూసింది. బుమ్రా లేకపోయి ఉంటే.. టీమిండియా ఆసీస్‌ చేతిలో 5-0తో వైట్‌వాష్‌కు గురయ్యేదని మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ వ్యాఖ్యానించాడంటే.. ఈ సిరీస్‌లో అతడి ప్రాధాన్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా?ఈ నేపథ్యంలో ఇప్పటికే పేస్‌ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. త్వరలోనే పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. వన్డేల్లోనూ రోహిత్‌ వారసుడిగా బుమ్రా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గిల్‌పై వేటు.. బుమ్రాకు ప్రమోషన్‌?ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 సందర్భంగా రోహిత్‌ శర్మకు బుమ్రా డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా శ్రీలంక పర్యటన 2024 సందర్భంగా వన్డే, టీ20లలో యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ). అయితే, ఏదేని కారణాల వల్ల రోహిత్‌ దూరమైతే.. గిల్‌ ఇప్పటికప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించే పరిణతి సాధించలేదని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్‌ శర్మ తప్పుకొన్న తర్వాత.. వన్డే కెప్టెన్సీకి అతడు దూరం కానున్నాడనే వదంతులు వచ్చాయి. అతడి స్థానంలో హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాలు వినిపించాయి.ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లుకాగా చాంపియన్స్‌ ట్రోఫీ కంటే ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా దూరంగా ఉండనున్నట్లు సమాచారం. వెన్నునొప్పి కారణంగా అతడు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్‌ ట్రోఫీ-2025 మొదలుకానుంది. పాకిస్తాన్‌ ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో జరుగుతాయి. హైవోల్టేజీ పోరు భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 23న జరుగనుంది.చదవండి: 13 నిమిషాల్లోనే ఖేల్‌ ఖతం.. రషీద్‌ ఖాన్‌ మాయాజాలం.. అఫ్గన్‌ సరికొత్త చరిత్ర

TV Actress Muskan Nancy James Files FIR Against Her Husband, Sister In Law Hansika Motwani10
నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు

హీరోయిన్‌ హన్సిక (Hansika Motwani) వేధింపులు తాళలేకపోతున్నానంటూ బుల్లితెర నటి ముస్కాన్‌ నాన్సీ పోలీసులను ఆశ్రయించింది. భర్త ప్రశాంత్‌ మోత్వానీ, అత్త జ్యోతి, ఆడపడుచు హన్సిక మోత్వానీలు తనను మానసికంగా హింసిస్తున్నారని వాపోయింది. ఈ మానసిక ఒత్తిడి వల్ల తన ముఖంలో కొంతభాగం పక్షవాతానికి గురైందని పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు గృహ హింస కింద కేసు నమోదు చేసుకున్నారు. డిసెంబర్‌ 18న నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఖరీదైన గిఫ్టులు తెమ్మని..పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముస్కాన్‌ (Muskaan Nancy James), ప్రశాంత్‌ 2020లో పెళ్లి చేసుకున్నారు. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని నటి అత్త, ఆడపడుచు హన్సిక డిమాండ్‌ చేశారట! అంతేకాకుండా ఆస్తిలోనూ ఏవో కుట్రలకు పాల్పడ్డారని నటి ఆరోపించింది. తన వైవాహిక బంధంలోనూ హన్సిక పదేపదే జోక్యం చేసుకుని గొడవలకు కారణమయ్యేదని పేర్కొంది. వీరు పెట్టిన టార్చర్‌ వల్ల తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై హన్సిక, ప్రశాంత్‌ ఇంతవరకు స్పందించలేదు. కాగా ముస్కాన్‌ దంపతులు 2022 నుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. ప్రశాంత్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: అప్పట్లో ఐరన్‌ లెగ్‌ అని పేరొస్తుందని భయపడ్డా: చిరంజీవిపాక్షిక పక్షవాతం2022లో నటి తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైనట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం అస్సలు ఊహించలేం. కొంతకాలంగా నేనేమైపోయానని అనుకుంటున్నారా? నా జీవితంలో ఏం జరుగుతుందనేది కొందరికి మాత్రమే తెలుసు. నేను ముఖ పక్షవాతంతో బాధపడుతున్నాను. అధిక ఒత్తిడి వల్ల నాకీ పరిస్థితి వచ్చింది. గతంలో ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు కోలుకున్నాను. కానీ ఇప్పుడు మరోసారి ఆ వ్యాధి నా జీవితంలోకి ప్రవేశించింది.ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది?గత కొద్ది నెలలనుంచి నేను, నా తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. ముఖం ఉబ్బిపోయి ఆ బాధ భరించరాకుండా ఉంది. ఒక నటికి ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది? నాముందున్న సమస్యలతో పోరాడే శక్తినిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు సపోర్ట్‌గా నిలబడే పేరెంట్స్‌ ఉండటం నా అదృష్టం. జీవితం అంత ఈజీ కాదు.. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా అన్నీ మారిపోతాయి అని రాసుకొచ్చింది.సీరియల్స్‌..ముస్కాన్‌ నాన్సీ.. తొడి ఖుషి తొడె ఘమ్‌ సీరియల్‌లో సహాయక నటిగా యాక్ట్‌ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్‌ ఆఫర్‌ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్‌, ఫియర్‌ ఫైల్స్‌, క్రైమ్‌ పెట్రోల్‌ షోలలో కొన్ని ఎపిసోడ్స్‌లో మెరిసింది. భారత్‌ కా వీర్‌ పుత్ర: మహారాణ ప్రతాప్‌, ఏజెంట్‌ రాఘవ్‌- క్రైమ్‌ బ్రాంచ్‌ షోలలో నటించింది. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది.చదవండి: అన్నీ ఒకేసారి.. నా వల్ల కావట్లేదంటూ ఏడ్చేసిన మాధవీలత

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement