Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

CM Chandrababu buys Ghee for TTD Only Rs 276 Cheap Price1
Tirupati Laddu Controversy: బాబూ మీరు కొన్నది రూ. 276కే

ఈ లెక్కన రివర్స్‌ టెండరింగ్‌తో రూ.320కే నెయ్యి కొనడం వల్ల కల్తీ జరిగిందని మీరు చెబుతున్నదంతా అబద్దమేగా? కల్తీ అయిన నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశారు.. ఆ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారే చేయలేదు. మరి అపచారం జరిగిందని ఎలా ఆరోపిస్తావు? సున్నితమైన అంశాలపై ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్న మీ దుర్భుద్దితోనే ఈ కుట్రకు తెరతీశావన్నది నిజం కాదా?2015లో కిలో నెయ్యి రూ.276 చొప్పున టీటీడీ కొనుగోలు చేసింది. 2018లో కూడా కిలో నెయ్యి రూ.320 చొప్పున టీటీడీ కొనుగోలు చేసింది. ఇదంతా మీ ప్రభుత్వ హయాంలోనే కదా? అప్పట్లో బహిరంగ మార్కెట్‌లో ఇండియా మార్ట్‌లో కేజీ రూ.1200, బిగ్‌ బాస్కెట్‌ ధర రూ.1100గా ఉందని టీటీడీ తీర్మానంలో కూడా పేర్కొన్న మాట వాస్తవం కాదా? మరి బహిరంగ మార్కెట్‌ కంటే ఇంత తక్కువ ధరకు ఎలా కొన్నారు? అప్పుడు కూడా జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యే సరఫరా చేశారా?సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి కిలో రూ.320కి కొనుగోలు చేయడం వల్లే కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల్లో పసలేదని మరోసారి రుజువవుతోంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనే టీటీడీ కొనుగోలు చేసిన నెయ్యి ధరలను ఒక్కసారి పరిశీలిస్తే చంద్రబాబు బృందం చేస్తున్న ఆరోపణల్లో డొల్లతనం బట్టబయలవుతోంది. 2014లో బాబు సీంఎగా పగ్గాలు చేపట్టిన తర్వాత అక్టోబర్‌లో కిలో రూ.306, రూ.325 చొప్పున కొనుగోలు చేసిన టీటీడీ.. 2015 జూన్‌లో కిలో రూ.276, రూ.279 చొప్పున కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా? బహిరంగ మార్కెట్‌లో రూ.1100 నుంచి రూ.1200 ఉంటే ఏ విధంగా కిలో రూ.320కి సరఫరా చేశారని మీరు ప్రశ్నిస్తున్నారు. అదే వారు రూ. 276కు ఎలా కొన్నారు? మరీ మీ హయాంలో ఇంత తక్కువ ధరకు టీటీడీకి కొనుగోలు చేసిందంటే అప్పట్లో కూడా జంతువుల కొవ్వు కలిపిన నెయ్యినే టీటీడీకి ఆయా కంపెనీలు సరఫరా చేశాయా? సూటిగా సమాధానం చెప్పు చంద్రబాబూ. అంతే కానీ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా రోజుకో స్టేట్‌మెంట్‌ ఇస్తూ అదే పనిగా లేనిపోని బురద చల్లడం సరికాదు. వాస్తవానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెఢ్డి ప్రభుత్వ హయాంలో ఏనాడు టీటీడీ ఇంత తక్కువ ధరలకు నెయ్యి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు.వాస్తవాలకు ముసుగేసి దుష్ప్రచారంకిలో నెయ్యి రూ.320కే టీటీడీకి ఎలా సరఫరా చేశారంటూ ఆరోపించడం ఎంత వరకు సమంజసమో చెప్పాల్సిన బాధ్యత మీది కాదా? వాస్తవాలకు ముసుగేసి పని గట్టుకొని అదే పనిగా బురద జల్లడంలో మిమ్మల్ని మించిన ఘనడు మరొకరు లేరన్నది ప్రజలందరికీ తెలుసు. అసలు నెయ్యి ఎలా తయారవుతుంది? ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారు? కిలో నెయ్యి తయారీకి ఎంత ఖర్చవుతుందో కూడా తెలియకుండా అడ్డగోలుగా వాదించడం చంద్రబాబుకే చెల్లింది. వాస్తవానికి నెయ్యి రెండు రకాలుగా తయారు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.

YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On Atchannaidu2
అచ్చెన్నాయుడు.. ఈ జన్మకి నీ కోరిక తీరదు: ఎంపీ విజయసాయి రెడ్డి

సాక్షి, ఢిల్లీ: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడిపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ అనే కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా? అంటూ ప్రశ్నించారు.ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా.. అచ్చంనాయుడూ! దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి.. కచ్చి.. అని ఆట పట్టించేవారట కదా! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి బోడి గుండుకు లంకె పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు. విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కులపార్టీలో చేరేందుకు ప్రయత్నించానా?.అచ్చెన్నా.. నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా!. భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే, గో.. ఆన్.. నిన్ను ఆపేదెవరు. జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి. మేథో శక్తికి, అడ్డం-నిలువుకు మధ్య ఉండే తేడా తెలియక పోవడం వల్లే మీతో ఈ సమస్యంతా’ అంటూ కామెంట్స్‌ చేశారు. అచ్చంనాయుడూ! దేముడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి... కచ్చి... అని ఆట పట్టించేవారట కదా! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి బోడి గుండుకు… pic.twitter.com/G0UoqnGsQJ— Vijayasai Reddy V (@VSReddy_MP) September 26, 2024ఇది కూడా చదవండి: చంద్రబాబు కుట్రకు పోలీసు వత్తాసు

 Heavy Rain In Mumbai Schools And Colleges Shut Down Updates3
వీడియో: జడివాన ఎఫెక్ట్‌.. ముంబై అతలాకుతలం

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నేడు ముంబై, పూణేలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే, పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు.బుధవారం రాత్రి నుంచి ముంబై, పూణేలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లకు మీదకు భారీగా వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే.. ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్‌ విమాన సంస్థలు పలు విమాన సర్వీసులను దారి మళ్లించినట్టు ఓ ప్రకటనలో తెలిపాయి. పలు సర్వీసులను రద్దు చేశారు. అలాగే, రైల్వే స్టేషన్‌లోకి వరద నీరు చేరడంతో రైల్వే ట్రాక్‌లు నీట మునిగాయి. దీంతో, పలు రద్దు రైళ్లను కూడా రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించినట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.#Ghatkopar Metro station right now on your left and LBS marg near #Vikhroli on your right !! non stop rains since past 3 hours #MumabiRains next #FlightsMumbai pic.twitter.com/J5iOqmU86R— sudhakar (@naidusudhakar) September 25, 2024The Kurla-Harbour line in Mumbai was heavily waterlogged last night due to heavy rain in the city. #MumbaiRain #MumbaiWeather pic.twitter.com/xLMF2kMn7w— Vani Mehrotra (@vani_mehrotra) September 26, 2024Heavy rainfall in mumbai It looks like Tsunami🥺ईश्वर सबकी रक्षा करें। सभी मुंबई वासी घरों में सुरक्षित रहे।#MumbaiRain #Mumbai #MumbaiWeather #MumbaiNews #Courreges #FreeCitizens pic.twitter.com/ziM0LeqTKA— Akshay jangid (@jangirakashay67) September 26, 2024ఇక, వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై పరిధిలో ఈదురుగాలు, పిడుగుపాటుల కలయికగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పాల్ఘర్, నందూర్బర్, ధూలే, జల్గావ్, సోలాపూర్, సతారాలలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బుధవారం రాత్రి వర్షాల కారణంగా మ్యాన్‌హోల్‌లో పడిపోయి ఓ మహిళ మృతిచెందింది. మరోవైపు.. ఈనెల 26 నుంచి 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌ల పరిధిలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని ఐఎండీ అంచనా వేసింది. #WATCH | Mumbai, Maharashtra | Water recedes at the Andheri Railway Station after the city witnessed severe waterlogging and traffic followed by heavy rainfall yesterday. pic.twitter.com/8LtU2pgw0Z— ANI (@ANI) September 26, 2024 #WATCH | Thane, Maharashtra | Torrential rains in Mumbai lead to landslide at the Mumbra by-pass road. pic.twitter.com/SZ1kVUHmz7— ANI (@ANI) September 25, 2024#WATCH | Mumbai, Maharashtra | Railway commuters walked on tracks at the Chunabhatti Railway station as Mumbai faced severe waterlogging followed by torrential rains. (25.09) pic.twitter.com/ewA8caiAIO— ANI (@ANI) September 25, 2024

BCCI likely to allow 5 retentions for IPL 2025 mega auction: Reports4
ఐపీఎల్‌-2025కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం!?

ఐపీఎల్‌-2025 మెగా వేలానికి సంబంధించిన ఆటగాళ్ల రిటెన్షన్‌ పాలసీని బీసీసీఐ దాదాపుగా ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీలకు ఓ గుడ్‌న్యూస్ చెప్పే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల సంఖ్యను ఐదుకు పెంచాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ఛాన్స్ మాత్రమే ఐపీఎల్‌ జట్లకు ఉంటుంది. ఎప్పటి నుంచో రిటెన్షన్‌ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచమని ఫ్రాంచైజీలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ ఏడాది జూలై 31న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లోనూ మరోసారి ఇదే విషయాన్ని ఫ్రాంచైజీలు ప్రస్తావించాయి.అయితే ఈసారి మాత్రం ఐపీఎల్ ఫ్రాంచైజీల డిమాండ్‌కు భారత క్రికెట్‌ బోర్డు ఒకే చెప్పినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఒకవేళ రిటెన్షన్‌ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య ఐదు పెంచితే ఆయా ఫ్రాంచైజీలకు ప్రయోజనం చేకూరనుంది. ఐపీఎల్-2025 రిటెన్షన్ రూల్స్‌ను గవర్నింగ్‌ కౌన్సిల్‌ అధికారికంగా గురువారం(సెప్టెంబర్ 26) ప్రకటించే అవకాశం ఉంది.చదవండి: BAN vs IND: టీమిండియాతో రెండో టెస్టు.. బంగ్లాకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌

 Russia Vladimir Putin Issues Nuclear Warning To West Countries5
న్యూక్లియర్‌ వార్‌కు సిద్ధం.. పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

మాస్కో: ఉక్రెయిన్‌, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో రష్యాపై దాడులను ఉక్రెయిన్‌ తీవ్రతరం చేసింది. రష్యాపై దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు పలు దేశాలు సాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో దేశాలను పుతిన్‌ తీవ్రంగా హెచ్చరించారు. పశ్చిమ దేశాలపై అణ్వాయుధాలతో దాడి చేసేందుకు రెడీ అయినట్టు హింట్‌ ఇచ్చాడు.అమెరికా, యూకే సాయంతో ఉక్రెయిన్‌.. రష్యాపై భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే రష్యాపై బాంబు దాడికి ఉపయోగించే ‘స్టార్మ్ షాడో’ క్రూయిజ్ క్షిపణిని గత వారం యూకే క్లియర్ చేసింది. యూకే పీఎం కైర్ స్టార్మర్.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కలవడానికి వాషింగ్టన్ కూడా వెళ్లారు. రష్యా గడ్డపై ఉక్రెయిన్ ఆయుధాల వినియోగంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు రష్యా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. దీంతో, అప్రమత్తమైన రష్యా.. పశ్చిమ దేశాలకు వార్నింగ్‌ ఇచ్చారు.తాజాగా రష్యా భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన ప్రకటన చేశారు. తమ దేశంపై అణు సామర్థ్యం లేని రాజ్యం, అణు సామర్థ్యం కలిగిన దేశం మద్దతుతో మా దేశంపై దాడి చేసినప్పుడు రష్యా ఫెడరేషన్‌పై సంయుక్త దాడిగా పరిగణిస్తామని పుతిన్ తెలిపారు. ఈ క్రమంలో తాము అణు దాడులు చేసేందుకు వెనుకాడబోమని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. BREAKING:🇷🇺 Vladimir Putin: "We will use NUCLEAR weapons if a mass enemy missile or UAV is launched towards Russia, or when these weapons cross into Russian territory" pic.twitter.com/oDJz1zTTzU— Megatron (@Megatron_ron) September 25, 2024 పుతిన్‌ హెచరిక తర్వాత రష్యా తన అణు ముసాయిదాలో సవరణలు చేసింది. తాజా సవరణలు ప్రకారం ప్రత్యర్థులు విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించినప్పుడు అణ్వస్త్రాలను వినియోగించేందుకు రష్యా నిర్ణయం తీసుకుంటుంది. ఇక పశ్చిమ దేశాలు తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్‌ దాడి చేసేందుకు అనుమతిస్తే కీవ్‌తో జరుగుతున్న యుద్ధంలో నాటో కూడా చేరినట్లవుతుందని పుతిన్‌ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: 1982 to 2024: ఇజ్రాయెల్‌ వర్సెస్‌ హెజ్‌జ్బొల్లా రక్తచరిత్ర

Jio Airtel Vi urge Telecom Minister Scindia to regulate ott apps6
ఓటీటీ యాప్‌ల మినహాయింపు.. టెల్కోల ఆందోళన

న్యూఢిల్లీ: కొత్త లైసెన్సింగ్‌ నిబంధనలపై సిఫార్సుల్లో వాట్సాప్, టెలిగ్రాం వంటి మెసేజింగ్, కాలింగ్‌ యాప్‌లను మినహాయించడంపై టెలికం సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీలో తమ ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపాయి. అలాగే సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) సంబంధిత చెల్లింపుల అంశాల గురించి చర్చించాయి.రిలయన్స్‌ జియో చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ, వొడాఫోన్‌ ఐడియా సీఈవో అక్షయ ముంద్రా, భారతి ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విఠల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ రాబర్ట్‌ జె. రవి ఇందులో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తన సిఫార్సుల్లో సర్వీస్‌ ఆథరైజేషన్‌ నుంచి ఓటీటీ యాప్‌లను మినహాయించడంపై అన్ని టెల్కోలు ఆందోళన వ్యక్తం చేసినట్లు వివరించాయి.వొడాఫోన్‌ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌ సంస్థలు ఏజీఆర్‌ అంశాన్ని ప్రస్తావించినట్లు పేర్కొన్నాయి. ఏజీఆర్‌ లెక్కింపులో గతంలో జరిగిన తప్పిదాలను సవరించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. వొడాఫోన్‌ ఐడియా రూ. 70,320 కోట్ల మేర, భారతి ఎయిర్‌టెల్‌ రూ. 21,500 కోట్లు ఏజీఆర్‌ బకాయీలు కట్టాల్సి ఉంది.

Director C. Prem Kumar Talk About Satyam Sundaram Movie7
ఆ ఇద్దరే ఈ సినిమాకి పెద్ద బలం : డైరెక్టర్‌ సి. ప్రేమ్‌కుమార్‌

‘‘నేను తీసిన ‘96’ సినిమా ప్రేమకథ. కానీ, ‘సత్యం సుందరం’ కుటుంబ కథా చిత్రం. కార్తీ, అరవింద్‌ స్వామిగార్ల పాత్రల మధ్య ఒక రాత్రిలో జరిగే కథ. వాళ్ల మధ్య అనుబంధం ఏంటి? ఆ ఒక్క రాత్రిలో వారి మధ్య ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ ఫ్యామిలీ డ్రామా బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్‌ సి. ప్రేమ్‌కుమార్‌ అన్నారు. కార్తీ, అరవింద్‌ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా సి. ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘సత్యం సుందరం’ నవలని సినిమా స్క్రిప్ట్‌లాగానే రాశాను. కార్తీ, అరవింద్‌ స్వామిగార్లు ముందు నవలని చదివారు... వారికి బాగా నచ్చింది. ఆ నవలని స్క్రిప్ట్‌గా మలచడం సులభంగా అనిపించింది. కార్తీ, అరవింద్‌ స్వామిగార్లలో ఏ ఒక్కరు అంగీకరించకపోయినా ఈ సినిమా చేసేవాడిని కాదు. వాళ్లిద్దరే అలా నటించగలరు. వాళ్ల కెమిస్ట్రీ, కాంబినేషన్‌ ఈ సినిమాకి పెద్ద బలం. సూర్యగారికి సినిమా అంటే చాలా ప్యాషన్‌. ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం నిర్మించారు. గోవింద్‌ వసంత ‘96’కి ఎంత మంచి మ్యూజిక్‌ ఇచ్చారో అందరికీ తెలుసు. ‘సత్యం సుందరం’కి కూడా అంతే అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ డబ్బింగ్‌ అద్భుతంగా వచ్చింది’’ అన్నారు.

Chennai Mayor’s Dafadar alleges she was transferred for not following ‘lipstick rule’8
పెదవుల అందం.. పదవికి చేటు!

ఆడాళ్లు అనుకువగా ఉండడం అసాధ్యమంటారు పెద్దలు.. ఇది అక్షరాలా నిజం అనిపించే ఘటన చెన్నై నడిరోడ్డున కార్పొరేషన్‌ కార్యాలయం సాక్షిగా చోటు చేసుకుంది. ఒక ఒరలో రెండు కత్తులు.. సాధ్యం కాదనేలా.. కార్పొషన్‌ను శాసించే మేయర్‌కు.. ఆమెకు సహాయకారిగా ఉండే మహిళా దఫేదార్‌కు మధ్య ఏర్పడిన చిరు వివాదం.. చిలికిచిలికి గాలివానలా మారి రచ్చకెక్కింది. చివరికి ఒకరి ఉద్యోగానికి ఎసరు తెచ్చింది... అదెలాగో మీరూ చూడండి! సాక్షి, చెన్నై: నగర కార్పొరేషన్‌లో మహిళలు పెదావుల కు వేసుకునే లిప్‌స్టిక్‌ వ్యవహారం బుధవారం పెద్ద చర్చకే దారి తీసింది. మేయర్‌ ప్రియ వెన్నంటి ఉండే మహిళా దఫేదార్‌ మాధవి బదిలీ ఈ లిప్‌స్టిక్‌ గొడవను తెరమీదకు తెచ్చింది. వివరాలు.. చెన్నై కార్పొరేషన్‌లో గత 15 ఏళ్లుగా మాధవి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె డీఎంకే మేయర్‌ ఆర్‌ ప్రియకు దఫేదార్‌గా ఉన్నారు. హఠాత్తుగా మాధవిని మనలి మండలానికి బదిలీ చేశారు. అలాగే ఆమెకు ఓ మెమో జారీ చేయడంతో ఈ వ్యవహారం లిప్‌స్టిక్‌ గొడవను తెరమీదకు వచ్చింది. మేయర్‌ ఆర్‌.ప్రియతో సమానంగా మాధవి లిప్‌స్టిక్‌ వేసుకుని రావడమే ఈ బదిలీకి కారణం అనే చర్చ జోరందుకుంది.మేయర్‌ వేసుకునే రంగులోనే లిప్‌స్టిక్‌ను ఆమె అనేక సందర్భాలలో వేసుకుని రావడాన్ని ప్రియ పీఏలు ఖండించినట్టు సమాచారం. చిన్నతనం నుంచి తాను లిప్‌స్టిక్‌ వాడుతున్నాని, తనకు నచ్చిన రంగు,ఫ్లేవర్‌ వాడుతానని, దీనిని హఠాత్తుగా మార్చుకోమడం సబబు కాదని వారికి మాధవి సూచించిన నేపథ్యంలో ఈ బదిలీ వేటు పడటమే కాకుండా, ఆమె సరిగ్గా పనిచేయడం లే దంటూ మెమో జారీ చేసినట్టు కార్పొరేషన్‌లో చర్చ ఊ పందుకుంది. ఈ విషయంగా మాధవి మీడియాతో మాట్లాడుతూ, తాను వేసుకునే లిప్‌స్టిక్, మేయర్‌ వేసుకునే లిప్‌స్టిక్‌ ఒకే విధంగా ఉందని పేర్కొంటున్నారని వాపోయారు. తనకు నచ్చిన రంగు తాను వాడుతున్నానని, ఇది తన వ్యక్తిగతం అని వ్యాఖ్యలు చేశారు. పురుష దఫేదార్‌ ఇంటికి వెళ్లి పోయినా, తాను మాత్రం కుటుంబాన్ని సైతం వీడి మేయర్‌కు వెన్నంటి రేయింబవళ్లు శ్రమించినందుకు మంచి గుర్తింపునే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా వీరికి మరో రెండేళ్లు పదవి ఉండవచ్చునని, తాను ఓ ఉద్యోగిని అని, తన జర్నీ మరింతగా కార్పొరేషన్‌లో కొనసాగాల్సి ఉంటుందని వ్యాఖ్యనించడం కొనమెరుపు.

YSRCP President YS Jagan call to Puja in Temples in Andhra Pradesh9
చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకు, ఆయన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ఈ నెల 28న (శనివారం) ప్రత్యేక పూజలు చేయాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. తిరుమల పవిత్రతను, వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం విశిష్టతను, స్వామి వారి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారని అన్నారు. కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో శనివారంనాడు ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

Professional Indian women work the most hours in the world10
ఇంట్లో రెస్ట్‌ లేదు... ఆ‘పీస్‌’ లేదు

పూర్వం పురుషుడి సంపాదనకు స్త్రీ సంపాదన తోడైతే ‘ఏదో వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడు’ అనేవారు. రాను రాను స్త్రీ సంపాదన ప్రధానం అయ్యింది. స్త్రీలు ఇంటి పని, ఉద్యోగం చేయాల్సి వస్తోంది. కాని పని గంటలు వారి జీవితాలను కబళిస్తున్నాయా? ప్రయివేటు ఉద్యోగాలు పది గంటలు డిమాండ్‌ చేస్తుంటే సేల్స్‌ విమెన్ గానో, చిన్న ఉద్యోగాల్లోనో ఉండే మహిళలు ఏకంగా 12 గంటలు చేయాల్సి వస్తోంది. కుటుంబ, సాంఘిక, సామాజిక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ పని గంటలపైకార్మిక చట్టాలు ఏమీ చేయడం లేదు. స్త్రీలు ప్రాణాలు ΄ోయేంతగా వొత్తిడి అనుభవించాలా?ఇటీవల పూణెలో అన్నా సెబాస్టియన్‌ అనే యువ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ తను పని చేసే సంస్థలో ఒత్తిడి తట్టుకోలేక మరణించింది. మంగళవారం (సెప్టెంబర్‌ 24) లక్నోలోని ఒక ప్రయివేట్‌ బ్యాంకులో పని చేస్తున్న ఫాతిమా అనే ఉద్యోగిని కుర్చీలోనే కుప్పకూలి మరణించింది. పని ఒత్తిడి వల్లే అని సహోద్యోగుల ఆరోపణ. ఇవి తెలిసి. తెలియనివి ఇంకెన్నో.స్త్రీలకు రెండు ఉద్యోగాలుఉదయం ఎనిమిదన్నర నుంచి రాత్రి ఎనిమిదన్నర వరకూ పని చేస్తే తప్ప జీతం రాని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు మన దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. సేల్స్‌గర్ల్స్, హాస్పిటల్‌ స్టాఫ్, హోటల్‌ రంగం, కాల్‌ సెంటర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫ్యాక్టరీ వర్కర్లు... 12 గంటలు చేయలేం అంటే 10 గంటలు అడుగుతున్నారు. అదీ కాదంటే 9 గంటలకు ఒక్క నిమిషం కూడా తక్కువ కాకుండా పని చేయాలన్నది వాస్తవం. ఈ 9 గంటలతో పాటు రాక΄ోకల సమయం కూడా కలుపుకుంటే స్త్రీలకు ఇంటి పనికీ, పిల్లల పెంపకానికి, విశ్రాంతికీ మిగిలే సమయం ఎంత?జీవితం గడవడానికి సంపాదన చాలా ముఖ్యమయ్యాక, ఆ సంపాదనలో ప్రధాన భాగం పిల్లల చదువుకు, వైద్యానికి, రవాణాకు ఖర్చు చేయకతప్పని పరిస్థితుల్లో భార్యాభర్తలు పని చేయక తప్పడం లేదు. మగాడిగా భర్తకు ఉద్యోగ వొత్తిడి తప్పదు. కాని స్త్రీలకు ఇంటి బాధ్యత కూడా ఉంటుంది. వంట వారే చేయాలి. ఇక పిల్లల పనులు, బట్టలు ఉతకడం, ఇంటి శుభ్రత, ఆతిథ్యం, అత్తమామలు ఉంటే వారి బాగోగులు... ఇవన్నీ భారమే. ఇటు ఈ పని అటు ఆ పని వీటి మధ్య సమన్వయం చేసుకోలేక మౌనంగా వొత్తిడి ఎదుర్కొంటూ అనారోగ్యం తెచ్చుకుంటూ ఒక్కోసారి ప్రాణాల మీదకు వచ్చే స్థితికి చేరువ చేస్తోంది మహిళా ఉపాధి.ఒకప్పుడు గవర్నమెంట్‌ ఉద్యోగాలలో కొంత వెసులుబాటు ఉండేది. కాని ప్రస్తుతం వారి పని ఒత్తిడి కూడా తక్కువగా లేదు. సుఖమైన బ్యాంకు ఉద్యోగం ఇప్పుడు పచ్చి అబద్ధం. చాలా చాకిరి అందులో ఉంటోంది. పెద్ద జీతాల సాఫ్ట్‌వేర్‌ రంగం విషయానికి వస్తే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వచ్చాక ఇరవై నాలుగ్గంటలు పనే అనే భావన కలుగుతోంది. ‘మల్టీ నేషనల్‌ కంపెనీలు భారతీయ ఉద్యోగులను మనుషుల్లా కాకుండా గాడిదలతో సమానంగా చూస్తున్నాయి’...‘లాగిన్‌ చేయడం వరకే మా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని గంటలు పని చేస్తామో మాకే తెలియదు’ అనే మాటలు ఆ రంగంలో సర్వసాధారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో స్త్రీలు తమ ఉద్యోగ, కుటుంబ జీవితాలను నిర్వహించుకోవడానికి సతమతమవుతున్నారు.వారానికి 60 గంటలుఈ మధ్య కాలంలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎవర్ని పలకరించినా చేస్తున్న ఉద్యోగం గురించి గొప్పగా చెప్పుకోవడం కంటే ఆవేదన వ్యక్తం చేసే సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైఫ్‌కు భరోసా ఇవ్వాల్సిన ఉద్యోగాలే ప్రాణాలను హరిస్తున్నాయనడానికి పూణెలో అన్నా సెబాస్టియన్‌ అనే మహిళ పని ఒత్తిడితో మరణించడం ఒక ఉదాహరణ మాత్రమే. 26 ఏళ్ల చార్టెడ్‌ అకౌంటెంట్‌ అన్నా సెబాస్టియన్‌ ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకే దారుణమైన వర్క్‌ కండిషన్స్ కారణంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయింది. భారత్‌లో యువ మహిళా ఉద్యోగులు ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. వారానికి 40 గంటలు పాత మాటగా మారగా 55 నుంచి 60 గంటలు మహిళలతో కార్పోరేట్‌ కంపెనీలు పని చేయించుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్, ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో రోజుకు 18 గంటల పని విధానం సర్వసాధారణంగా మారి΄ోయింది. పని గంటలు ముగిసినా ఇంట్లో ఉన్నా చివరకు వారాంతమైనా సరే టార్గెట్లు పూర్తి చేయించుకోవడానికి ఆయా సంస్థలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. కుటుంబం, వ్యక్తిగత జీవితంతోపాటు ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేస్తే తప్ప ఈ తరహా ఉద్యోగాలు చేయలేని పరిస్థితి.హక్కులు ఏవి? చట్టాలు ఎక్కడ?చట్టాలను కఠినంగా అమలు చేసే దేశాల్లో ఇంత చాకిరి చెల్లుబాటు కాదు. ప్రపంచంలో అతి తక్కువ పని గంటలున్న 20 దేశాల్లో ఇండియా ఊసు కూడా లేదు. మన దేశంలో జీవించడానికి ఉద్యోగం చేస్తున్నామా లేక ఉద్యోగం చేయడమే జీవితమా అన్న స్థాయిలో పని కబళించేస్తోంది. ఒకరకంగా మానవ హక్కుల ఉల్లంఘనే జరుగుతోంది. వర్క్‌ కండిషన్స్ ఎలా ఉండాలి అనే అంశంపై 1948లో ‘యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌’ను మెజార్టీ దేశాలు ఆమోదించాయి. ఉద్యోగుల హక్కులను కాపాడే ఈ డిక్లరేషన్ ను రూ΄÷ందించడంలో భారత్‌ కూడా కీలక పాత్ర ΄ోషించింది. అయితే దానికి కట్టుబడి చట్టాలను అమలు చేయడంలో మాత్రం మన ప్రభుత్వాలు, వ్యవస్థలు విఫలమవుతున్నాయి. అందుకే భారతీయులతో గొడ్డుచాకిరీ చేయించుకునే సంస్థలు పెరిగి΄ోయాయి.స్మార్ట్‌వర్క్‌ను ప్రోత్సహించాలిఎక్కువ గంటలు పని చేయడం ఉద్యోగి డెడికేషన్ కు ఏమాత్రం కొలమానం కాదన్న విషయాన్ని సంస్థలు గుర్తించాలి. వర్కింగ్‌ కండిషన్స్ ఏమాత్రం సానుకూలంగా లేని చోట హార్డ్‌ వర్క్‌ కంటే స్మార్ట్‌ వర్క్‌ చేయడం చాలా అవసరం. ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే ‘నో’ చెప్పడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. ఇన్ని గంటలు ఇంత పనే చేయగలం అని చె΄్పాలి. ఎవరి జీవితం వాళ్ల చేతుల్లోనే ఉండాలంటే మొహమాటాలను పక్కన పెట్టి నో చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.ఫ్యాక్టరీస్‌ చట్టం 1948, మైన్స్ చట్టం, బీడీ– సిగార్‌ కార్మికుల చట్టం మొదలగు చట్టాల కింద ప్రత్యేక సందర్భాలలో తప్ప ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే స్త్రీలు పని చేయాల్సి ఉంటుంది. ఈ పని వేళలు దాటి రాత్రి 10 వరకు పనిచేయాలి అంటే సదరు యాజమాన్యం ప్రత్యేకమైన వసతులు; రక్షణ, రవాణా వంటివి కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ పని వేళలు సాఫ్ట్వేర్‌ రంగానికి కూడా వర్తించినప్పటికీ, కొన్ని వెసులుబాటులను ప్రభుత్వం ఐటీ రంగానికి కల్పించింది. అయినప్పటికీ స్త్రీలను రాత్రి వేళలో పనిచేయాలి అని ఏ యాజమాన్యం కూడా ఒత్తిడి చేయడానికి వీలులేదు. ఒకవేళ అలా పని చేయాల్సి వస్తే రవాణా, చిన్నపిల్లల సౌకర్యార్థం (క్రెచ్‌) సదుపాయాలు కల్పించాల్సి వుంటుంది. – శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాదిస్త్రీలకు పిల్లల పెంపకం, ఇంటి పని భారం, ఉద్యోగ భారం... ట్రిపుల్‌ బర్డన్‌ కలిగిస్తున్నాయి. ఇంటిని చూసుకోవాలి... సంపాదించాలి... అంటే రెండు చోట్లా ఆమె ఉత్పాదనను పరీక్షకు పెడుతున్నట్టే లెక్క. ఈ రెండు పనులు ఆమెకు సౌకర్యంగా లేక΄ోతే శారీరకంగా మానసికంగా చాలా సమస్యలు వస్తున్నాయి. మానసికంగా యాంగ్జయిటీ, డిప్రెషన్‌ చూస్తున్నాం. ఇక ఎముకల బలం క్షీణించడం, బహిష్టు సమస్యలు... కనపడుతున్నాయి. కొందరిలో ఇన్‌ఫెర్టిలిటీ పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య సమన్వయమే ఈ పరిస్థితి నుంచి స్త్రీలను బయటపడేయగలదు.– డాక్టర్‌ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌– ఫణికుమార్‌ అనంతోజు, సాక్షి

Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
NRI View all
title
డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..!

దాదాసాహెబ్ పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నట సామ్రాట్, డా.

title
అమెరికాలో గుండెపోటుతో తెలుగు విద్యార్థి హఠాన్మరణం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు డల్లాస్‌లో గుండెపోటుతో మరణించాడు.

title
న్యూజెర్సీలో విజయవంతంగా నాట్స్ పికిల్‌బాల్ టోర్నీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు న్యూజెర్సీలో తాజాగా పికిల్ బాల్ టోర్న

title
ఎన్‌ఆర్‌ఐలే భారత్‌ అంబాసిడర్లు: ప్రధాని మోదీ

న్యూయార్క్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న

title
అమెరికాలో ఇండియన్‌ ఎంబసీ అధికారి అనుమానాస్పద మృతి

వాషింగ్టన్: అమెరికాలోని ఇండియన్‌ ఎంబసీ (దౌత్య కార్యాలయం)లో వ

Advertisement
Advertisement