Top Stories
ప్రధాన వార్తలు
Maha Kumbh-2025: అండర్ వాటర్ డ్రోన్లు.. ఏఐ కెమెరాలు.. ఫ్లోటింగ్ పోలీస్ పోస్టులతో నిఘా
ప్రయాగ్‌రాజ్: మహాకుంభమేళా.. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు.పటిష్టమైన భద్రతజనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఈ మహా కుంభోత్సవం సుమారు 45 కోట్ల మందికి ఆతిథ్యం ఇస్తుందని అంచనాలున్నాయి. ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలువనుంది. కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మహా కుంభ్ సమయంలో జనానికి పటిష్టమైన భద్రతను కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు నగరం చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.అండర్‌వాటర్ డ్రోన్లుతొలిసారిగా త్రివేణి సంగమప్రాంతంలో 24 గంటలూ నిఘా సారించేందుకు నగరం అంతటా 100 మీటర్ల వరకు డైవ్ చేయగల నీటి అడుగున వినియోగించే డ్రోన్లను మోహరించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదేవిధంగా 120 మీటర్ల ఎత్తు వరకూ వెళ్లగల టెథర్డ్ డ్రోన్లను కూడా మోహరించారు. ఇవి పెరుగుతున్న జనసమూహాన్ని గుర్తించేందుకు వైద్యసాయం లేదా భద్రతా సాయం అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు ఉపకరిస్తాయని భద్రతా అధికారులు తెలిపారు.2,700 ఏఐ కెమెరాలురియల్-టైమ్ పర్యవేక్షణ, ముఖ గుర్తింపు సాంకేతికతను అందించే కృత్రిమ మేధస్సు (ఏఐ) సామర్థ్యం కలిగిన 2,700 కెమెరాలను వివిధ ఎంట్రీ పాయింట్ల వద్ద ఉపయోగిస్తున్నారు. దీనితో పాటు 56 మంది సభ్యుల సైబర్ వారియర్ల బృందం ఆన్లైన్ బెదిరింపులను పర్యవేక్షిస్తుంది. దీనికితోడు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. కాగా యాత్రికులకు వసతి కల్పించడానికి అధికారులు 1,50 వేల టెంట్లతో పాటు అదనపు టాయిలెట్లు, పారిశుద్ధ్య సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 4,50 వేల నూతన విద్యుత్ కనెక్షన్లను ఏర్పాటు చేశారు. యాత్రికుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేలు కుంభమేళా సందర్భంగా 3,300 ట్రిప్పులు తిరిగే 98 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టాయి. కుంభ్ సహాయాక్ చాట్‌బాట్ అనేది అత్యాధునిక ఏఐ సాధనం. ఇది మహా కుంభమేళాకు హాజరైన భక్తులకు అనేక విధాలుగా సహాయపడనుంది.ఫ్లోటింగ్ పోలీస్ పోస్టు #WATCH | Uttar Pradesh police built a special floating police chowki to help devotees as the 45-day #Mahakumbh2025 begins with the auspicious Paush Purnima, today pic.twitter.com/1JE2tzQ8mH— ANI (@ANI) January 13, 2025 కుంభమేళాలో పాల్గొనే భక్తులకు మరింతగా సహాయం అందించేందుకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఫ్లోటింగ్ పోలీస్ పోస్టు ఏర్పాటు చేశారు. ఇదేవిధంగా భక్తులు ప్రయాణించే వాహనాలు సజావుగా ముందుకు కదిలేందుకు ట్రాఫిక్ పోలీసు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. త్రివేణీ సంగమానికి ప్రవేశ మార్గం జవహర్లాల్ నెహ్రూ మార్గ్ (బ్లాక్ రోడ్) ద్వారా ఉంటుంది. నిష్క్రమణ మార్గం త్రివేణి మార్గ్ గుండా ఉంటుంది. కాగా రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలపై ఎంతో శ్రద్ధ తీసుకున్నామని. సాధారణ రైళ్లతో సహా మొత్తం 13,000 రైళ్లను కుంభమేళా కోసం నడుపుతున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాకు 45 కోట్లకు పైగా భక్తులు తరలి వస్తారనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: Mahakumbh 2025: ఇప్పటికే 85 లక్షలమంది పుణ్యస్నానాలు!
కోడి పందేల్లో కూటమి నేతల బరితెగింపు
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వీటి నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులే పందెంలను ప్రారంభిస్తున్నారు. ఇక, పందెం రాయుళ్లు.. కోడి పుంజులతో బరులకు చేరుకుంటున్నారు.తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్ నైట్ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పందెం బరుల దగ్గర ఎల్ఈడీ తెరలు సైతం దర్శనమిస్తున్నాయి. పెందెంలా నిర్వహణ కోసం భారీ ఏర్పాటు. మరోవైపు.. స్థానికంగా జరుగున్న కోడి పందెంలను చూసేందుకు ప్రజలు భారీగా బరుల వద్దకు చేరుకుంటున్నారు.ఇదిలా ఉండగా.. కోడి పందేలు నిర్వహించడం నేరమని కలెక్టర్లు ప్రకటిస్తున్నా.. పందేలను కట్టడి చేయాలని హైకోర్టు గట్టిగా ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చినా ఎక్కడికక్కడ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. పందేలరాయుళ్లు ఇన్‌స్టా వేదికగా కోడి పందేలపై విస్తృత ప్రచారానికి తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ కళాశాల సమీపంలోని వెంకట్రామయ్య బరిలో భారీ పందేలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. భోగి రోజున రూ.9 లక్షల పందేలు 9, రూ.6 లక్షల పందేలు 5, రూ.27 లక్షలు లేదా రూ.25 లక్షల పందెం ఒకటి చొప్పున జరుగుతాయని షెడ్యూల్ ప్రకటించుకున్నారు.నిషేధం బేఖాతరు.. కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఈ నెల 7న సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ గేమింగ్ యాక్ట్–1974లోని సెక్షన్ 9(1), 2 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా పశు సంవర్ధకశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖతో బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులు కోడిపందేల నిషేధంపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా పందేలు జరిగే ప్రాంతాలు, షెడ్యూల్స్, పందేలు వేసే ప్రముఖుల పేర్లతో పోస్టులు ట్రెండింగ్ అవుతున్నాయి.దెందులూరు నియోజకవర్గంలో ‘ప్రీమియర్ లీగ్’ వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో కాకతీయ ప్రీమియర్ లీగ్ (కోడి పందేల లీగ్) పేరుతో పందేలకు రెడీ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. క్రికెట్ టోర్నమెంట్స్ లీగ్ మాదిరిగా కోడి పందేల లీగ్ అనే పోస్టర్లు కూడా విడుదల చేశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ ప్రచారం సాగిస్తున్నారు.
కాగ్ రిపోర్టు మంట... ఆప్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగ్ రిపోర్టు జాప్యం చేస్తున్నందుకు ఆప్ సర్కార్‌పై మండిపడింది. ఈ క్రమంలో ఆప్ నిజాయితీపై ప్రశ్నించింది. మద్యం కుంభకోణంపై ఇప్పటికే కాగ్ నివేదికను స్పీకర్‌కు పంపించి ఉంటే సభలో చర్చను ప్రారంభించి ఉండాలి అని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో, ఈ విషయంపై సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పూర్తి విచారణ జరుపనుంది.ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ సర్కార్‌కు కాగ్ నివేదిక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో ఆప్ అవకతవకలపై చర్చను కాగ్ తెరపైకి తీసుకువచ్చింది. ఢిల్లీ మద్యం విధానం లోపభూయిష్టంగా ఉందని, పాలసీ అమలులో పారదర్శకత లేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు 2026 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని కాగ్ అంచనా వేసింది. అయితే, కాగ్ నివేదిక అధికారికంగా ఇంకా బయటకు రాకపోయినప్పటికీ, ఆ నివేదికలోని కొన్ని అంశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.ఈ నేపథ్యంలో కాగ్ నివేదికను బహిర్గతం చేయాలని హైకోర్టు ఇప్పటికే ఆప్ సర్కార్‌ను ఆదేశించింది. కానీ, హైకోర్టు ఆదేశాలను ఆప్ సర్కార్ బేఖాతరు చేసింది. ఇప్పటికీ కాగ్ నివేదికను బయటకు ఇవ్వలేదు. దీంతో, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాగ్ నివేదిక లీక్ కావడంతో అధికార ఆప్ పార్టీ తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులకు చెబుతున్నారు.Delhi High Court criticised the Delhi Government for its delay in addressing the CAG reports, stating, "The way you have dragged your feet raises doubts about your bona fides." The court further emphasized, "You should have promptly forwarded the reports to the Speaker and… pic.twitter.com/CSSALuCV0G— ANI (@ANI) January 13, 2025 కాగ్ నివేదికలో ఏముంది? లీక్ అయిన కాగ్ నివేదిక ప్రకారం.. 2021 నవంబర్‌లో అమల్లోకి తెచ్చిన పాలసీని తొలుత కేబినెట్ నుంచి గానీ, ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ నుంచిగానీ అనుమతి తీసుకోలేదు. మద్యం విక్రయం లైసెన్సులు పొందిన లిక్కర్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, గత చరిత్ర, పూర్వాపరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థలకూ లైసెన్సులు మంజూరుచేశారు. కొన్నింటికి లైసెన్సులను ఉద్దేశపూర్వకంగా పునరుద్ధరించారు. కీలక నిబంధనలను మార్చే సందర్భాల్లో ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొందరు రిటైలర్లు ఆ విధానం ముగియకముందే తమ లైసెన్సులను ప్రభుత్వానికి సమర్పించి వెనుతిరిగారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవకపోవడంతో ప్రభుత్వం రూ. 890 కోట్ల ఆదా యం నష్టపోయింది.జోనల్ లైసెన్సుల్లో మినహాయింపులు ఇవ్వడంతో మరో రూ.941 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. కోవిడ్‌ను సాకుగా చూపి కొందరికి లైసెన్స్ ఫీజులను మాఫీచేయడంతో మరో రూ.144 కోట్ల ఆదాయం కోల్పోయింది. కోవిడ్ వంటి అనూహ్య పరిస్థితులు తలెత్తితే ఆ నష్టాలను వ్యాపారులే భరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. నష్టాలను చవిచూసేందుకే మొగ్గుచూపింది అని ఉండటం గమనార్హం.
BCCI: చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆరోజే
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సమయం సమీపిస్తోంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలుకానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ తదితర బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాత్రం ఇంత వరకు ఈ టోర్నీలో పాల్గొనే సభ్యుల పేర్లు వెల్లడించలేదు.ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక అప్డేట్ అందించారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును ఈనెల 18 లేదా 19వ తేదీల్లో ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా 2017లో టైటిల్ గెలిచిన పాకిస్తాన్.. చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో అనేక చర్చోపచర్చల అనంతరం ఐసీసీ ఆదేశాల మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది. దీని ప్రకారం భారత జట్టు తమ మ్యాచ్‌లను తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడనుంది.ఇక తమ తొలి మ్యాచ్‌లో భాగంగా భారత్ ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. కాగా ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి. ఇక వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా ఈవెంట్లో ఆసీస్‌తో పాటు టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. మరోవైపు.. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో సెమీ ఫైనల్ కూడా చేరలేకపోయిన పాకిస్తాన్.. సొంతగడ్డపై జరిగే చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారీ అంచనాలతో ముందుకు రానుంది. ఆసీన్ వారి స్వదేశంలో వన్డే సిరీస్‌లో ఓడించడంతో పాటు.. సౌతాఫ్రికా గడ్డపై ఇంత వరకూ ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో ప్రొటిస్ జట్టును వన్డే సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్ చేసి జోరు మీదుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025గ్రూప్-‘ఎ’- ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాగ్రూప్-‘బి’- ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్డబ్ల్యూపీఎల్ వేదికలు ఎంపిక చేశాంఇదిలా ఉంటే..వచ్చే నెల 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభం కానుంది. గతేడాది రెండు (లక్నో, బరోడా) వేదికల్లో ఈ లీగ్ నిర్వహించగా... ఈ సారి నాలుగు నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి 2న డబ్ల్యూపీఎల్ ఫైనల్ జరగనుండగా... అదే నెల 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.ఇక మే 25న ఐపీఎల్ తుదిపోరుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఆతిథ్యమివ్వనుంది. 2024 ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ట్రోఫీ చేజిక్కించుకోవడంతో... తొలిపోరు కూడా అక్కడే జరగనుంది.బీసీసీఐ కొత్త కార్యదర్శి అతడేఈ సమావేశంలో బోర్డు కార్యదర్శిగా దేవజిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులకు వీరిద్దరే దరఖాస్తు చేసుకోవడంతో ఎన్నిక అవసరం లేకుండా పోయిందని... ఎన్నికల అధికారి వెల్లడించారు. మరోవైపు.. డబ్ల్యూపీఎల్ వేదికల ఎంపిక గురించి రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. అతి త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగానే చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎప్పుడు ప్రకటిస్తామనే విషయాన్ని కూడా రాజీవ్ శుక్లా తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు.ఖమ్మంలోని కూసుమంచిలో మంత్రి పొంగులేటి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘పేదవారి కల పది సంవత్సరాల్లో అలాగే నిలిచిపోయింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు. అనేక హామీలు ఇచ్చాము. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు కొల్లగొట్టారు. ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం చిత్త శుద్దితో ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం ఇస్తుంది. డిసెంబర్ 13న మోడల్ హౌస్‌కి శంకుస్థాపన చేసుకుని సంక్రాంతి రోజున ప్రారంభించుకుంటున్నాం.అర్హులైన ప్రతీ పేదవారికి నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళు పూర్తి చేసింది లక్ష లోపు ఇళ్లు మాత్రమే. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. దళారుల పాత్ర ఉండదు.. ఇందిరమ్మ కమిటీ సమక్షంలోనే ఎంపిక జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.రైతులకు రైతు భరోసా నిబంధనలు లేకుండా 12వేలు ఇస్తాం. పది సంవత్సరాల్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. మీ దీవెనలతో మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలిపారు.వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్.. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు చెప్పారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 13, 2025
మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు!
‘దబిడి దిబిడి’ పాట స్టెప్పులపై సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో అందరికి తెలిసిందే. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అలాంటి స్టెప్పులేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అభిమానులు కూడా ఆ స్టేప్పులను తప్పుపట్టారు. అయితే ఇందులో బాలయ్య కంటే ఎక్కువగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్నే ఎక్కువగా ట్రోల్ చేశారు. ఓ ఎమ్మెల్యే, సీనియర్ హీరో అయిన బాలకృష్ణతో అలాంటి అసభ్యకరమైన స్టెప్పులేయించాండంటూ శేఖర్ మాస్టర్‌ను ఏకిపారేశారు. మరికొంతమంది నెటిజన్స్ అయితే కూతురు వయసు ఉన్న ఊర్వశీ రౌతేలాతో బాలయ్య అలాంటి స్టెప్పులేయడం అసభ్యకరంగా ఉందని కామెంట్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్‌ని చిత్ర యూనిట్‌తో సహా బాలయ్య కూడా పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఓ పార్టీ ఈవెంట్లో ఊర్వశీతో బాలయ్య మళ్లీ అదే స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.సక్సెస్ పార్టీతో వికృత స్టెప్పులు!హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ప్రగ్యా జైశ్వాల్, శ్రధ్ధాశ్రీనాథ్ హీరోయిన్. . శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సంకాంత్రి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో యూనిట్ అంతా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఓ హోటల్లో జరిగిన ఈ పార్టీకి బాలయ్యతో సహా చిత్రబృందం అంతా హాజరైంది. ఈ సందర్భంగా ఊర్వశీతో బాలయ్య స్టెప్పులేశాడు. ‘దబిడి దిబిడి’ పాటకు డ్యాన్స్ చేస్తూ మళ్లీ అసభ్యకరమైన స్టెప్పులేశారు. బాలయ్య ఆ స్టెప్పులేస్తూ ఆమె దగ్గరకు రాగానే.. ఊర్వశీ పక్కకు వెళ్లిపోయింది. అయితే ఈ వీడియోని ఊర్వశీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) ముద్దులతో ముంచేసిన బాలయ్య`డాకు మహారాజ్`పార్టీలో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ముద్దులతో ముంచేశాడు బాలకృష్ణ. సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేస్తూ `కంగ్రాట్చ్యూలేషన్స్ టూ డాకు మహారాజ్` అని విశ్వక్ సేన్ అనగా.. థ్యాంక్యూ ‘లైలా ’అంటూ విశ్వక్ సేన్‌కి బాలయ్య ముద్దు పెట్టాడు. విశ్వక్ కూడా తిరిగి బాలయ్యకు ముద్దు పెట్టారు. పక్కనే ఉన్న సిద్దు కూడా ‘నాకు పెట్టలేదు(కిస్) అనగానే..బాలయ్య లాక్కొని సిద్దుకి కూడా కిస్ ఇచ్చాడు. ఈ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు దర్శకుడు బాబీకి కూడా కిస్ ఇచ్చాడు బాలయ్య. పార్టీ మూడ్‌లో బాలయ్య ఇలా రెచ్చిపోవడంతో ఆ వీడియోలన్నీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అబద్ధాలను అందంగా అల్లటంలో ఆరితేరారే!
ఆంధ్రప్రదేశ్‌లో పాలన రోజు రోజుకూ అధ్వాన్నమవుతోంది. ఈ మాట ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అధికార పక్షానికి వత్తాసుగా నిలుస్తున్న పచ్చమీడియానే అప్పుడప్పుడూ తన కథనాల ద్వారా చెబుతోంది. చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు కొందరు, కూటమి ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతికి హద్దుల్లేకుండా పోయాయని టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతులు తమ కథనాల ద్వారా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వారు తీసుకుంటున్న జాగ్రత్త ఏమిటంటే.. రింగ్ మాస్టర్లు అదేనండి.. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లకు ఎక్కడ మకిలి అంటకుండా నెపం ఇతరులపైకి నెట్టేయడం!. కిందటేడాది ఆగస్టు 28న చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓ మాట్లాడుతూ ఒక మాటన్నారు.. ‘‘ప్రభుత్వ ప్రతిష్ట పెంచేందుకు తాను ఇటుక ఇటుక పేరుస్తూంటే.. ఎమ్మెల్యేలు కొందరు జేసీబీలతో కూలగొడుతున్నారు. ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నా ఒకరిద్దరి తప్పుల వల్ల పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. బాబుగారి నేర్పరితనం ఏమిటంటే తన వైఫల్యాలు మొత్తాన్ని దారిమళ్లించేందుకు ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులను మందలించినట్లు పోజ్ పెట్టారు. సరే అనుకుందాం కాసేపు. మంత్రులు, ఎమ్మెల్యేలలో మార్పు వచ్చిందా? ఊహూ అదేమీ కనబడదు. చంద్రబాబు కూడా ఏ చర్య తీసకోకుండా కథ నడుపుతూంటారు. ఈ మధ్యకాలంలో కొందరు మంత్రులు అధికారుల బదిలీలు, పొస్టింగ్లలో భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు... ఒక మంత్రి హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో మకాం వేసి మరీ ఈ దందా చేస్తున్నారని టీడీపీ పత్రిక తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి తెలియ చేసిందని కూడా ఆ మీడియా పేర్కొంది. బ్లాక్‌మెయిలింగ్‌లో దిట్టగా పేరొందిన ఆ మీడియా బహుశా ఆ మంత్రిని బెదిరించడానికి ఏమైనా రాశారా? లేక నిజంగానే మంత్రి అలా చేశారా? అన్నది ఇంతవరకు అటు ఏపీ ప్రభుత్వం కాని, ఇటు తెలంగాణ ప్రభుత్వం కాని వెల్లడించలేదు. ఈ రెండు రాష్ట్రాల అధినేతల మధ్య పార్టీలకు అతీతంగా సాగుతున్న బంధాన్ని ఈ విషయం తెలియ చెబుతుంది. సదరు మంత్రి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని సోషల్ మీడియాలో ప్రచారమైంది. సీపీఎం నేతలు ఓపెన్‌గానే చెబుతున్నారు. అయినప్పటికీ ఆ మంత్రి ఖండించలేదు. చంద్రబాబు కాని, ఆయన పేషీ కానీ వివరణ కూడా ఇవ్వలేదు. పైగా ఈ మధ్య తిరుపతి సందర్శనలో కూడా చంద్రబాబు ఆ మంత్రిని పక్కన పెట్టుకుని తిరగడం విశేషం. మరో కథనం ప్రకారం.. ఆ మంత్రికి హైదరాబాద్ శివార్లలో ఉన్న భూమి విషయంలో ఏర్పడిన వివాదం రీత్యా తరచు ఇక్కడకు వచ్చి పంచాయతీ చేసుకుంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తున్నది చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరమా?. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో అవినీతి అధికారి అంటూ మరో జాకీ పత్రిక ఈ మధ్య ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే అచ్చెన్నాయుడుకు సంబంధం లేదన్నట్లుగా పిక్చర్ ఇచ్చినట్లు కనిపించినా, కేవలం ఒక అధికారి సొంతంగా అవినీతికి పాల్పడతారా? అలాగైతే ఆ మంత్రి అంత అసమర్థుడా అన్న ప్రశ్న వస్తుంది. ఈ కథనం ఇచ్చినప్పటికి ప్రభుత్వం పెద్దగా స్పందించినట్లు కనబడదు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పీఏపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ పీఏ ని తొలగించానని, తను ప్రైవేటుగా నియమించుకున్న వ్యక్తి అని అనిత వివరణ ఇచ్చినప్పటికీ, ఆ ఆరోపణలకు మంత్రికి సంబంధం లేదని అంటే ఎలా నమ్ముతారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. పవన్ కళ్యాణ్ ఈ విషయమై బీజేపీ పెద్దలకు ఢిల్లీలో ఫిర్యాదు చేసి వచ్చారని అంటారు. ఇక లోకేష్ కు అత్యంత సన్నిహితుడునని చెప్పుకుంటూ ఒక ప్రముఖుడు మైనింగ్ కాంట్రాక్టులు, పోస్టింగ్ లలో హవా సాగిస్తున్నారని, తనకు కావల్సింది తనకు ఇచ్చి, మీకు కావల్సింది మీరు తీసుకోండని ఓపెన్ గా చెబుతున్నారంటూ జాకీ పత్రిక చానా ముదురు శీర్షికన కథనాన్ని ఇచ్చింది. 'చానా" అనగానే అది సానా సతీష్ గురించే అని, అతను లోకేష్ తరపున వ్యవహారాలు చక్కదిద్దుతుంటారని టీడీపీలో ప్రచారం అయింది. అది రాజ్యసభ ఎన్నికల సమయం కావడంతో అతనికి టిక్కెట్ రాకుండా ఉండడానికి ఆంధ్రజ్యోతి పత్రిక బ్లాక్ మెయిలింగ్ వార్త రాసిందని కూడా టీడీపీ వర్గాలు భావించాయి. ఈ వార్త లోకేష్ కు తీవ్ర అప్రతిష్ట తెచ్చింది. దాంతో లోకేష్ కు, ఆంధ్రజ్యోతి యజమానికి మధ్య విభేదాలు పెరిగాయని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే లోకేష్ కు టీడీపీని నడిపే శక్తి ఇంకా రాలేదని వ్యాఖ్యానిస్తూ ఆ ఓనర్ తన వ్యాసంలో రాసి ఉంటారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూటమి నుంచి విడిపోతే టీడీపీ పరిస్థితి ఏమిటని కూడా ఆయన ఆందోళన చెందారు. విశేషం ఏమిటంటే ఆంధ్రజ్యోతి సానా సతీష్ పై అంత దారుణమైన కథనం ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు చంద్రబాబు రాజ్యసభ సీటు కేటాయించారు. ఎన్నికల సమయంలో భారీగా ఖర్చు చేసినందునే ఆయనకు ఆ పదవి ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్ పేషీ గురించి నేరుగా రాయకపోయినా, అక్కడ జరిగేవి ఇతర మంత్రులకు తెలియవా? అందుకే ఏ మంత్రిని మందలించే పరిస్థితి చంద్రబాబుకు లేదని కొందరి వాదనగా ఉంది. మరికొందరు మంత్రులపై కూడా పలు అభియోగాలు వస్తున్నాయి. చంద్రబాబు స్టైల్ ఏమిటంటే రహస్యంగా ఎవరు ఏమి చేసినా వారి జోలికి పద్దగా వెళ్లరు. అదే మరీ అల్లరైతే, తాను మందలించనట్లు ప్రచారం చేసుకుంటుంటారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు, కూటమి నేతలు మద్యం, ఇసుకలలో ఎలా దండుకుంది బహిరంగమే. నలభై లక్షల టన్నుల ఇసుక మాయమైపోయినా ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పెదవి కదపలేదు. మద్యం వ్యాపారంలో అనేక మంది ఎమ్మెల్యేలు 30 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే తండ్రి, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకరరెడ్డి ఏ మాత్రం భయం లేకుండా తనకు నిర్దిష్ట శాతం కమిషన్ చెల్లించాల్సిందేనని మద్యం షాపులకు హెచ్చరిక పంపించారు. అఅంతేకాదు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, జేసీ మధ్య పవర్ ప్లాంట్ బూడిద రవాణాపై చెలరేగిన గొడవ తెలిసిందే. చంద్రబాబు వారిని పిలిచి రాజీ చేయడానికి యత్నించారు. ఇక ప్రభాకర రెడ్డి కొందరు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయన జోలికి వెళ్లే ధైర్యం ఎవరికి లేదు. కాకపోతే జేసీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మైనింగ్ లీజుల దందాపై సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన చెప్పినట్లు వినాల్సిందేనని టీడీపీ ముఖ్యనేత ఆదేశించడంపై కూడా మైనింగ్ యజమానులు మండిపడుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న అరాచకంపై నిత్యం కథలు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఒక ఎస్టీ కుటుంబాన్ని వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ కుటుంబంలోని మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వార్తలు చెబుతున్నాయి. చిలకలూరి పేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టిన రోజు వేడుకకు పోలీసులు హాజరై కేక్ కట్ చేయించడం పై విమర్శలు వచ్చాయి. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య కూడా పోలీసు అధికారులపై రుసురుసలాడిన తీరు అందరికి బహిరంగ రహస్యమే. మదనపల్లె నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యే ఒకరికి నెలకు 30 లక్షల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఒక మహిళా తహశీల్దార్ మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన విషయం సంచలనమైంది. సదరు ఎమ్మెల్యే ఖండించినా నిప్పు లేకపోతే పొగరాదన్నట్లుగా అంతా భావించారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి దౌర్జన్యాలపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడలో ఒక దళిత ఫ్రొఫెసర్ ను ఆయన తన అనుయాయులతో కలిసి వెళ్లి బెదిరించారు. అలాగే ఒక టీషాపు ను కూల్చి వేయించిన విషయం వివాదాస్పదమైంది. వీటిని పట్టించుకోని పవన్ కళ్యాణ్ కడపలో ఒక మండల అధికారిపై వైసీపీ నేత ఎవరో దౌర్జన్యం చేశారంటూ అక్కడకు వెళ్లి హడావుడి చేసి వచ్చారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తాను చెబితే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లేనని, రేషన్ షాపుల వారిని, మధ్యాహ్న భోజనం ఏజెన్సిల, ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరించారు. ఇక కాంట్రాక్టర్ లను బెదిరించడం వంటివి నిత్య కృత్యమైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఏకంగా అదానీ కంపెనీ సిబ్బందిపైనే దాడి చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక మహిళా టీడీపీ నేత చేసిన లైంగిక వేధింపుల ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. వారి మధ్య టీడీపీ నేతలు రాజీ చేశారు తప్ప ఆయనపై చర్య తీసుకోకపోవడం విశేషం. కృష్ణపట్నం ఓడరేవు సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. మద్యం దుకాణాలలో ఎమ్మెల్యేకి వాటా ఇవ్వలేదని నరసరావుపేటలో ఆయన అనుచరులు రెస్టారెంట్ పై దాడి చేసి వధ్వంసం సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. జనసేన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మట్టి దందాకు పాలపడుతున్నాడని కథనాలు వచ్చాయి. రోజూ ఇలాంటి స్టోరీలు పుంఖానుపుంఖాలు గా వస్తున్నా కూటమి అధినేతలు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. మరో వైపు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కు ఐదువేల ట్రాన్స్ ఫార్మర్లకు ఆర్డర్లు ఇచ్చారంటూ ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. ఆ కంపెనీ యజమాని వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఆర్డర్ ఇవ్వరాదట. ఆ ఆర్డర్ చంద్రబాబుకు తెలియకుండా ఇచ్చారని ఈ పత్రిక చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. అంత పెద్ద ఆర్డర్ ముఖ్యమంత్రికి తెలియకుండా వెళుతుందా? ఇవన్ని చూశాక ఎవరికైనా ఏమనిపిస్తుంది? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా పాలన సాగిస్తోందన్న అభిప్రాయం రాదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన తనయ
మల్కాపురం: మృతి చెందిన కన్నతండ్రికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మల్కాపురంలో జరిగింది. గాంధీజివీధికి చెందిన చొప్పా సూరిబాబు (60) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయనకు కుమారులు లేకపోవటం, అల్లుళ్లు ముందుకు రాకపోవడంతో దుఃఖాన్ని దిగమింగుకొని కన్నకూతురే దహన సంస్కరాలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఆర్టీసీ అద్దె బస్సుకు సూరిబాబు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకుంది. చిన్న బాస్ క్లాస్మేట్.. విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను
భోగభాగ్యాల భోగి పండగ దేనికి సంకేతమంటే.?
'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని శాస్త్ర వచనం. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. మరోక అర్థంలో భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా 'భోగి పండగ' ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. అలాంటి ఈ పండుగను అనాథిగా ఆచారిస్తూ రావడానికి గల కారణం, ఆరోగ్య రహాస్యలు గురించి సవివరంగా చూద్దామా..!భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి…దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయానం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి.. ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెబుతున్నారు.ఆరోగ్య రహస్యం..ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. అందువల్లే భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వచ్చింది. భోగి మంటలు ఎందుకంటే..చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. పురాణాల ప్రకారం, దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటిముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని కోరాడు. అనంతరం రురువు వర గర్వంతో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఈ ధనుర్మాసంలో 30 రోజులపాటు ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టి.. ఆ తర్వాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుడిని అందులో తోస్తారు. అలా రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తోంది.ఈ పండగ సందేశం, అంతరార్థం..చలికాలంలో సూక్ష్మక్రిముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగిపోవడానికి మన పెద్దలు ఇలా భోగి మంటలు వేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారని చెబుతుంటారు. ఇక ఈ పండుగ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే..చెడు అలవాట్లను, అసూయా, ఈర్ఘ, దుర్భద్ధిని ఈ మంటల రూపంలో దగ్ధం చేసుకుని మంచి మనుసుతో జీవితాన్ని ప్రారంభించి సానుకూలా ఆలోచనలతో మంచి విజయాలను అందుకోవాలనే చక్కటి సందేశాన్ని ఇస్తోంది. మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమని ప్రార్థిస్తూ అగ్నిహోత్రాన్ని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలు, అలాగే మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో వేసి దగ్ధం చేసుకోవటమే భోగి. ఇలా మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం.(చదవండి: సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!)
తల్లే కూతురు పెళ్లిని అర్థాంతరంగా ఆపేసింది..!
ట్రంప్ ప్రకటన: గ్రీన్‌ల్యాండ్ రేటెంతో తెలుసా?
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడి రీఎంట్రీ
బాలయ్య డాకు మహారాజ్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
BCCI: చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆరోజే
కాగ్ రిపోర్టు మంట... ఆప్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదు.. వారికోసమే ఇంకా బతికి ఉన్నా: స్టార్ డైరెక్టర్
పచ్చని కాపురంలో చిచ్చురేపిన అనుమానం!
తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం
Sankranti 2025 : అసలు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?
సాక్షి కార్టూన్ 13-01-2025
ఈ రాశి వారికి కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది.
ర్యాంకు ఆధారంగా ఇందిరమ్మ ఇల్లు
నా హృదయంలో ప్రత్యేక స్థానం ఆ సినిమాకే: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు!
IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్
తిరుమలలో ‘లక్ష్మణ’ లీలలు!
26 నుంచి రేషన్ కార్డుల జారీ
మన్మథుడు హీరోయిన్‌పై డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు
'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
తల్లే కూతురు పెళ్లిని అర్థాంతరంగా ఆపేసింది..!
ట్రంప్ ప్రకటన: గ్రీన్‌ల్యాండ్ రేటెంతో తెలుసా?
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడి రీఎంట్రీ
బాలయ్య డాకు మహారాజ్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
BCCI: చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆరోజే
కాగ్ రిపోర్టు మంట... ఆప్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదు.. వారికోసమే ఇంకా బతికి ఉన్నా: స్టార్ డైరెక్టర్
పచ్చని కాపురంలో చిచ్చురేపిన అనుమానం!
తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం
Sankranti 2025 : అసలు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?
సాక్షి కార్టూన్ 13-01-2025
ఈ రాశి వారికి కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది.
ర్యాంకు ఆధారంగా ఇందిరమ్మ ఇల్లు
నా హృదయంలో ప్రత్యేక స్థానం ఆ సినిమాకే: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు!
IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్
తిరుమలలో ‘లక్ష్మణ’ లీలలు!
26 నుంచి రేషన్ కార్డుల జారీ
మన్మథుడు హీరోయిన్‌పై డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు
'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
సినిమా
నా హృదయంలో ప్రత్యేక స్థానం ఆ సినిమాకే: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 2020లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ మూవీ విడుదలైన ఐదేళ్లు పూర్తి కావడంతో అల్లు అర్జున్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని పోస్ట్ చేశారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన త్రివిక్రమ్, చినబాబు, అల్లు అరవింద్, తమన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ అద్భుతమైన చిత్రానికి జీవం పోసిన నటీనటులు, సిబ్బందితో పాటు మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ మూవీ సమయంలో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం బన్నీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 5 years of #AlaVaikunthapurramuloo! This film will always hold a special sweet place in my heart. A heartfelt thank you to #Trivikram Garu, Chinna Babu Garu, Allu Aravind Garu, brother @MusicThaman, @vamsi84 garu and the entire cast and crew for bringing this magical film to… pic.twitter.com/N0w7lsR8Lq— Allu Arjun (@alluarjun) January 12, 2025 AVPL DAYS 💛 THROWBACK MEMORIES 💛 pic.twitter.com/7Nz904BaH2— Allu Arjun (@alluarjun) January 12, 2025
నేను విషం తాగి చస్తే మనశ్శాంతిగా ఉంటుందా? పావలా శ్యామల ఆవేదన
ప్రముఖ నటి పావలా శ్యామల (Pavala Syamala) కొన్నేళ్లుగా అనారోగ్యంతో సతమతమవుతోంది. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు అనారోగ్యం ఆమెను కుంగదీస్తోంది. మొదట్లో అద్దె ఇంట్లో ఉన్న ఆమె తర్వాత అనాథాశ్రమంలోకి షిఫ్ట్ అయింది. దాదాపు 300 సినిమాలు చేసి గొప్ప నటిగా కీర్తి పొందిన ఆమె ఏళ్ల తరబడి సాయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆమె అడిగినప్పుడల్లా ఒకరిద్దరు సాయం చేస్తున్నా అది తన మందులకే సరిపోతోంది.కొన ఊపిరితో ఉన్నా..ఈ క్రమంలో తాజాగా మరోసారి పావలా శ్యామల తనకు సాయం చేయమని అర్థిస్తోంది. 'యాభై ఏళ్లు ఆర్టిస్టుగా బతికాను. ఈ మూడు సంవత్సరాల నుంచి నాకు ఎంత కష్టంగా ఉందో మీ అందరికీ తెలుసు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎవరూ స్పందించలేదు. ఎలాగోలా ఇంతవరకు లాక్కొచ్చాను. ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాను. (చదవండి: పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. అబ్బాయి పేరెంట్స్ అయినా చెప్పాలిగా)నేను చస్తే మనశ్శాంతిగా ఉంటుందా?నా బిడ్డ కోసం బాధగా ఉంది. తను మాట్లాడలేదు. ఒక ఆర్టిస్టు బలవంతంగా విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా? ఎంతోమంది హీరోలతో కలిసి పని చేశాను. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా పెద్దపెద్ద హీరోలతో చేశా.. ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను.శక్తి లేదుకానీ నా బిడ్డను చంపుకోలేకపోతున్నాను. ట్రీట్మెంట్ చేయించుకోలేక చాలా అవస్థ పడుతున్నాను. ఎవరికీ స్పందించే గుణం లేదా? ఇలా అనాథగా చంపేస్తారా? ఎవరి మనసులూ కరగవా? ఎవరికైనా నా దీన పరిస్థితి గురించి తెలుసా, తెలియదా? తెలియకపోతే దయచేసి ఈ వీడియో ద్వారా తెలియజేయమని కోరుకుంటున్నాను. నాకు ఇంక మాట్లాడే శక్తి లేదు' అంటూ సాయం చేయమని వేడుకుంటోంది.సినిమాపావలా శ్యామల.. కర్తవ్యం, అల్లరి రాముడు, మనసంతా నువ్వే, ఖడ్గం, ఇంద్ర, ఠాగూర్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, నిన్నే ఇష్టపడ్డాను, గోలీమార్, శ్రీమన్నారాయణ, డీ ఫర్ దోపిడి, మత్తు వదలరా.. ఇలా వందలాది చిత్రాల్లో నటించింది. తన విచిత్రమైన డైలాగ్ డెలివరీతో అందరినీ అలరించింది. ఎంతోమందికి వినోదాన్ని పంచిన ఆమె ఇప్పుడు చావు కోసం ఎదురుచూస్తుండటం శోచనీయం.చదవండి: దుబాయ్ కారు రేసింగ్.. అజిత్ కుమార్ టీమ్ క్రేజీ రికార్డ్
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ
టైటిల్: డాకు మహారాజ్నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సత్య తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: బాబీ కొల్లిసంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్విడుదల తేది: జనవరి 12, 2025కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..బాలయ్య చేసే మాస్ యాక్షన్ సినిమాల నేపథ్యం దాదాపు ఒకేలా ఉంటుంది. విలన్ చెడు పనులు చేస్తూ జనాలను హింసించడం.. దాన్ని హీరో అడ్డుకోవడం. అన్ని కథలు ఇలానే ఉంటాయి. డాకు మహారాజ్(Daaku Maharaaj Review) కూడా అలాంటి కథే. అయితే పాత కథను కూడా కొత్తగా చెప్పడం కూడా ఓ కళ. అందులో దర్శకుడు బాబీ ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాడు. రొటీన్ కథనే అయినా హీరో ఫ్యాన్స్‌కి నచ్చేలా తెరకెక్కిస్తాడు.బాలయ్య తాలుకు ఇమేజ్‌ని దృష్టిలో ఫక్తు కమర్షియల్ ఫార్మెట్లో డాకు మహారాజ్ కథనాన్ని సాగించాడు. ప్రతి పది నిమిషాలకొక యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ యాక్షన్ సీన్లు కూడా కొత్తగా ఉంటాయి. గత సినిమాల మాదిరి బాలయ్య ఇందులో గట్టిగా అరవడం.. ఒంటి చేత్తో వందమందిని నరకడం లాంటివి ఉండవు. డీసెంట్ యాక్షన్ సీన్లతో బాలయ్యను కొత్తగా చూపించాడు. అయితే కథనం ఊహకందేలా సాగడం.. పాతకాలం నాటి సమస్యనే మళ్లీ తెరపై చూపించడం అంతగా ఆకట్టుకోదు. అలాగే మెయిన్ విలన్ని సెకండాఫ్ వరకు దాచడంతో హీరో, విలన్ల మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా సాగలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఎత్తుగడ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ని ప్రారంభంలోనే చూపించి కథనంపై ఆసక్తిని పెంచేశారు. మొదటి పావుగంట కృష్ణమూర్తి ఫ్యామిలీ, ఎమ్మెల్యే త్రిమూర్తుల చుట్టూనే తిరుగుతుంది. నానాజీగా బాలయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. చిన్నారితో బాలయ్యకు ఏదో సంబంధం ఉంటుందని ఊహించినా.. అదేంటి అనేది సెకండాఫ్ వరకు దాచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. సివిల్ ఇంజనీర్ సీతారాం, డాకు మహారాజ్ కథంతా ద్వితియార్థంలోనే వస్తుంది. చంబల్ ప్రజలకు ఉన్న ఓ ప్రధాన సమస్యను తీర్చేందుకు సీతారాం చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఊచకోత ఉంటుంది. అది బాలయ్య అభిమానులను అలరిస్తుంది. ఎమోషన్ కోసం చిన్న పిల్లల పాత్రలను మరింత హింసాత్మకంగా తీర్చిదిద్దారు. అయితే ద్వితియార్థం ప్రారంభమైన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుందని ఊహించొచ్చు. క్లైమాక్స్‌ని ఇంకాస్త షార్ఫ్ గా కట్ చేస్తే బాగుండేదేమో. బాలయ్య అభిమానులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. బాలయ్యకు యాక్షన్ సినిమాలు కొత్తేమి కాదు. ఇలాంటి సినిమాల్లో మరింత దూకుడుగా నటిస్తాడు. డాకు మహారాజ్లో కూడా అదే స్థాయితో నటించాడు. నానాజీగా, సీతారాంగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి, ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించాడు. యాక్షన్ సీన్లలో ఎప్పటి మాదిరే అదరగొట్టేశాడు. ఇందులో గత సినిమాల మాదిరి పెద్ద పెద్ద డైలాగ్స్, అరవడాలు ఉండవు. బాలయ్య చెప్పే డైలాగ్ తీరు కొత్తగా ఉంటుంది. బల్వంత్ ఠాకూర్‌గా బాబీ డియోల్ తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూనే డిఫరెంట్ విలనిజాన్ని చూపించాడు. ప్రగ్యా జైస్వాల్‌తో పోలిస్తే శ్రధ్ధా శ్రీనాథ్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. అయితే తెరపై మాత్ర ప్రగ్యానే ఎక్కువసేపు కనిపిస్తుంది. ఎమ్మెల్యే త్రిమూర్తులుగా రవికిషన్ చక్కగా నటించాడు. ఫస్టాఫ్‌లో ఆయన విలనిజం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన పాత్ర ఇచ్చే సర్ప్రైజ్ ఆకట్టుకుంటుంది. ఊర్వశీ రౌతేలా పాటకే దబిడిదిబిడి పాటతో ఆకట్టుకోవడమే కాకుండా.. గ్లామర్‌తో యూత్‌ని అలరించింది. సచిన్ ఖేడ్కర్, చాందీనీ చౌదరితో పాటు వైష్ణవి పాత్ర పోషించిన చిన్నారి కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య సినిమా అంటే తమన్ రెచ్చిపోతాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా అదరిపోయే బీజీఎం అందించాడు. కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తాయి. పాటలు పర్వాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బాలయ్యతో కొత్త స్టంట్స్ చేయించారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మన్మథుడు హీరోయిన్‌పై డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు
సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మజాకా (Majaka Movie). రీతూ వర్మ, అన్షు హీరోయిన్లుగా నటించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఆదివారం (జనవరి 12న) ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్ అన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.హీరోయిన్ ఓ రేంజ్లో..ముందుగా త్రినాధ రావు (Trinadha Rao) మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్లో ఉంటుంది. ఆ హీరోయిన్ మజాకాలో హీరోయిన్గా కళ్ల ముందుకు వచ్చేసరికి ఇది నిజమేనా? అని ఆశ్చర్యపోయాం. నేనే చెప్పా..అన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా.. అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. అతడి మాటలకు హీరోయిన్ అసౌకర్యానికి లోనయినట్లు తెలుస్తోంది. హీరోయిన్ శరీరం గురించి డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.కావాలనే..ఇక ఇదే ఈవెంట్లో సెకండ్ హీరోయిన్ పేరు.. అంటూ కావాలనే రీతూ వర్మ పేరు మరిచిపోయినట్లు నాటకం ఆడాడు. కాస్త వాటర్ ఇవ్వమని కొంత గ్యాప్ తీసుకుని గుర్తొచ్చింది రీతూవర్మ అని ఆమె పేరు చెప్పాడు. ఇదంతా చూసిన జనాలు.. డైరెక్టర్ ఓవరాక్షన్ ఎక్కువైందని కామెంట్లు చేస్తున్నారు. ఇక మజాకా మూవీ విషయానికి వస్తే.. ఇది ఫిబ్రవరి 21న విడుదల కానుంది. చదవండి: పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. అబ్బాయి పేరెంట్స్ అయినా ముందే చెప్పాలిగా
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
వారెవ్వా!.. కరుణ్ నాయర్ ఐదో సెంచరీ.. సెమీస్‌లో విదర్భ
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో హరియాణా, విదర్భ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో విదర్భ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించగా... హరియాణా జట్టు 2 వికెట్ల తేడాతో గుజరాత్ జట్టును ఓడించింది.విదర్భతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కార్తీక్ శర్మ (62; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభమ్ గర్వాల్ (59; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలు సాధించగా... దీపక్ హుడా (45; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ చహర్ (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ మహిపాల్ లోమ్రోర్ (32) తలా కొన్ని పరుగులు చేశారు.విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అయితే సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ (82 బంతుల్లో 122 నాటౌట్; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడు ముందు రాజస్తాన్ స్కోరు సరిపోలేదు. ‘శత’క్కొట్టిన ధ్రువ్ షోరేఈ సీజన్లో వరుస సెంచరీలతో రికార్డులు తిరగరాస్తున్న విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ రాజస్తాన్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నాడు. అతడితో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధ్రువ్ షోరే(Dhruv Shorey- 131 బంతుల్లో 118 నాటౌట్, 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ‘శత’క్కొట్టడంతో విదర్భ జట్టు 43.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 292 పరుగులు చేసి గెలిచింది.కరుణ్ నాయర్ ఐదో సెంచరీటీమిండియా ప్లేయర్లు దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ హుడా(Deepak Hooda) బౌలింగ్‌లో ధ్రువ్, కరుణ్ జంట పరుగుల వరద పారించింది. యశ్ రాథోడ్ (39) త్వరగానే అవుటవ్వగా... ధ్రువ్, కరుణ్ అబేధ్యమైన రెండో వికెట్‌కు 200 పరుగులు జోడించారు. తాజా సీజన్లో వరుసగా నాలుగు (ఓవరాల్‌గా 5) శతకాలు బాదిన కరుణ్ నాయర్... విజయ్ హజారే టోర్నీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నారాయణ్ జగదీశన్ (5 శతకాలు; 2022–23లో) సరసన చేరాడు.ఈ టోర్నీలో ఇప్పటి వరకు 664 పరుగులు చేసిన 33 ఏళ్ల కరుణ్ నాయర్ అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గురువారం జరగనున్న రెండో సెమీఫైనల్లో మహారాష్ట్రతో విదర్భ తలపడుతుంది. హరియాణా ఆల్‌రౌండ్ షో గుజరాత్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 45.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. హేమంగ్ పటేల్ (54; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరవగా... చింతన్ గాజా (32; 4 ఫోర్లు), ఉర్విల్ పటేల్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆర్య దేశాయ్ (23; 5 ఫోర్లు), సౌరవ్ చౌహాన్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు.కెప్టెన్ అక్షర్ పటేల్ (3) విఫలమయ్యాడు. హరియాణా బౌలర్లలో అనూజ్ ఠక్రాల్, నిశాంత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో హరియాణా 44.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. హిమాన్షు రాణా (66; 10 ఫోర్లు) టాప్ స్కోరర్. గుజరాత్ బౌలర్లలో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీశాడు. అనూజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో కర్ణాటకతో హరియాణా జట్టు తలపడనుంది. చదవండి: IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్Karun Nair is the No 3 India deserves in ODI cricketThis was the reason Kohli never promoted him in cricket. pic.twitter.com/L9hmVtHGAE— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) January 12, 2025
CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేసినట్లు సోమవారం వెల్లడించింది. అయితే, గాయం కారణంగా దూరమవుతాడనుకున్న ప్యాట్ కమిన్స్(Pat Cummins) సారథ్యంలోనే ఆస్ట్రేలియా ఈ ఈవెంట్లో పాల్గొననుంది.తొలిసారిగా ఆ ఇద్దరికి చోటుఇక బ్యాటర్ మాథ్యూ షార్ట్‌తో పాటు ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ(Aaron Hardie) తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్లో ఆడే అవకాశం దక్కించుకున్నారు. మరోవైపు.. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన నాథన్ ఎల్లిస్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటికే రిటైర్ అయిన డేవిడ్ వార్నర్, గాయం వల్ల జట్టుకు దూరమైన కామెరాన్ గ్రీన్, పేసర్ సీన్ అబాట్ స్థానాల్లో మాథ్యూ, హార్డీ, ఎల్లిస్ ఈ జట్టులోకి వచ్చారు.మోకాలి గాయంకాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కమిన్స్ బృందం 3-1తో గెలిచి పదేళ్ల తర్వాత ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ మెగా సిరీస్ నేపథ్యంలో కెప్టెన్, స్టార్ పేసర్ కమిన్స్ గాయపడినట్లు వార్తలు వచ్చాయి.శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడే జట్టుకు కమిన్స్దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ అతడి గాయాన్ని ధ్రువీకరిస్తూ మోకాలి నొప్పితో కమిన్స్ బాధపడుతున్నట్లు తెలిపాడు. దీంతో అతడు చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాజా ప్రకటనతో అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది.వన్డే ప్రపంచకప్-2023 విజేతఇదిలా ఉంటే.. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాను చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. ఫైనల్లో టీమిండియాను ఓడించి.. కంగారూ జట్టుకు టైటిల్ అందించాడు. ఈ క్రమంలో ఏకంగా ఆరోసారి వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా.. మరో వన్డే మెగా టోర్నీ చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది.వరల్డ్‌కప్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ కూడా ఈ టోర్నమెంట్లో ఆడేందుకు క్వాలిఫై అయ్యాయి. అయితే, 2017లో చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్తాన్ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టింది.గ్రూప్- ‘బి’లోఇదిలా ఉంటే.. వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించగా... దుబాయ్ వేదికగా రోహిత్ సేన తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా.. అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. ఇక గ్రూప్-‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఆడనున్నాయి. కాగా ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న లాహోర్ వేదికగా తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుప్యాట్ కమిన్స్(కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, ఆడం జంపా.చదవండి: IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే?
టాప్ ఫోర్... వైల్డ్ ఫైర్
భారత మహిళల జట్టు సొంతగడ్డలో ఐర్లాండ్‌పై ‘వైల్డ్ ఫైర్’ అయ్యింది. టాప్–4 బ్యాటర్లు గర్జించడంతో మన జట్టు వన్డేల్లో తమ అత్యధిక రికార్డు స్కోరును నమోదు చేసింది. ఓవరాల్‌గా అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్లో మూడో అత్యధిక స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ శతకంతో... ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్, వన్‌డౌన్‌లో హర్లీన్ డియోల్ ‘ఫిఫ్టీ’లతో చెలరేగారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ, ప్రియా మిశ్రాలు ఐర్లాండ్ బ్యాటర్ల పని పట్టారు. దీంతో రెండో వన్డేలో స్మృతి మంధాన బృందం భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు వన్డేల్లో గెలుపుతో ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు ఈనెల 15న జరిగే చివరిదైన మూడో వన్డేలో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాజ్‌కోట్: భారత టాపార్డర్ టాప్ లేపే ప్రదర్శనతో ఐర్లాండ్ మహిళల్ని చితగ్గొట్టింది. రెండో వన్డేలో ఓపెనింగ్ జోడీ సహా తర్వాత వచ్చిన మూడు, నాలుగో వరుస బ్యాటర్లూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రాజ్‌కోట్ వేదిక పరుగుల ‘పొంగల్’ చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 116 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) తన కెరీర్లో తొలి శతకం సాధించగా... హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు), కెప్టెన్ స్మృతి మంధాన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రతీక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీస్కోరు చేసింది. గతంలో భారత జట్టు ‘బెస్ట్’ స్కోరు 358. 2017లో ఐర్లాండ్‌పై 358/2 చేసిన అమ్మాయిల జట్టు గత నెల విండీస్‌పై కూడా 358/5తో ఆ ‘బెస్ట్’ను సమం చేసింది. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులకు పరిమితమైంది. క్రిస్టీనా కూల్టర్ (113 బంతుల్లో 80; 10 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లు తీశారు. తొలి వన్డే గెలిచిన స్మృతి సేన తాజా విజయంతో 2–0తో సిరీస్ వశం చేసుకుంది. 15న చివరి వన్డే జరగనుంది. స్మృతి, ప్రతీక ఫైర్ బ్యాటింగ్‌కు దిగగానే ఓపెనర్లు స్మృతి, ప్రతీక ఐర్లాండ్ బౌలింగ్‌ను తుత్తునీయలు చేస్తూ భారీస్కోరుకు గట్టి పునాది వేశారు. దీంతో 7.2 ఓవర్లలో 50 స్కోరు చేసిన భారత్ 100కు (13 ఓవర్లలో) చేరేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్మృతి 35 బంతుల్లో, ప్రతీక 53 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇలా ఓపెనర్లిద్దరే తొలి 19 ఓవర్లలో 156 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అదే స్కోరు వద్ద వరుస బంతుల్లో ఇద్దరు నిష్క్రమించారు. ఇక్కడ ముగిసింది సినిమాల్లోలాగా ఫస్టాఫే! అంటే విశ్రాంతి. తర్వాత శుభం కార్డు జెమీమా, హర్లీన్‌ల జోరు చూపించింది. దీంతో 28 ఓవర్ల పాటు (19.1 నుంచి 47.1 ఓవర్ వరకు) వాళ్లిద్దరు మూడో వికెట్‌కు జతచేసిన 183 పరుగుల భాగస్వామ్యం స్కోరును కొండంతయ్యేలా చేసింది. హర్లీన్ 58 బంతుల్లో ఫిఫ్టీ కొడితే... జెమీమా 62 బంతుల్లో 50... 90 బంతుల్లో సెంచరీ సాధించింది.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) జార్జినా (బి) ప్రెండెర్‌గాస్ట్ 73; ప్రతీక (ఎల్బీడబ్ల్యూ) (బి) జార్జినా 67; హర్లీన్ (సి) లౌరా (బి) కెల్లీ 89; జెమీమా (బి) కెల్లీ 102; రిచా ఘోష్ (సి) ఫ్రెయా (బి) ప్రెండర్‌గాస్ట్ 10; తేజల్ (నాటౌట్) 2; సయాలీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 370. వికెట్ల పతనం: 1–156, 2–156, 3–339, 4–358, 5–368. బౌలింగ్: వోర్లా ప్రెండర్‌గాస్ట్ 8–0–75–2, అవా క్యానింగ్ 10–0–51–0, అర్లెన్ కెల్లీ 10–0–82–2, ఫ్రెయా సర్జెంట్ 9–0–77–0, అలానా డాల్జెల్ 5–0–41–0, జార్జినా 8–0–42–1. ఐర్లాండ్ ఇన్నింగ్స్: సారా (బి) దీప్తి 38; గాబీ లూయిస్ (సి) రిచా (బి) సయాలీ 12; క్రిస్టీనా (బి) టిటాస్ సాధు 80; వోర్లా (సి) సయాలీ (బి) ప్రియా 3; లౌరా (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 37; లీ పాల్ (నాటౌట్) 27; కెల్లీ (బి) దీప్తి 19; అవ క్యానింగ్ (బి) ప్రియా 11; జార్జినా (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–32, 2–87, 3–101, 4–184, 5–188, 6–218, 7–234. బౌలింగ్: టిటాస్ సాధు 10–0–48–1, సయాలీ 9–1–40–1, సైమా ఠాకూర్ 9–0–50–0, ప్రియా మిశ్రా 10–0–53–2, దీప్తి శర్మ 10–0–37–3, ప్రతీక 2–0–12–0.
పేస్ బౌలర్లని తీర్చి దిద్దడంపై బోర్డు ప్రణాళిక ఏమైంది?
ఇంగ్లాండ్‌తో సొంతగడ్డ పై జరగనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కి వెటరన్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఎంపికయ్యాడు. అయితే ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ లోని చివరి మ్యాచ్ లో గాయమైన కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేకపోయిన మహమ్మద్ సిరాజ్ కి జట్టులో చోటు దొరకలేదు. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సెలెక్టర్లు అతనికి విశ్రాంతి ఇచ్చారని భావించాలి.షమీ చివరిసారిగా నవంబర్ 2023లో క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఆడాడు. ఈ టోర్నమెంట్ తరవాత చీలమండ శస్త్రచికిత్స, మోకాలి సమస్యల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో బుమ్రా విజృభించి ఏకంగా 32 వికెట్లు పడగొట్టగా, షమీ వంటి ఏంటో అనుభవజ్ఞుడైన బౌలర్ నుంచి అతనికి సహకారం లభించినట్లయితే భారత్ ప్రదర్శన భిన్నంగా ఉండేదండంలో సందేహం లేదు.అయితే ఆటగాళ్ల గాయాలకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుని కానీ మరెవరినో కానీ తప్పుబట్టడం సరికాదు. యువ బౌలర్లను తీర్చిదిద్దడం, వారికి సరైన సయమంలో విశ్రాంతి ఇవ్వడం బిసిసిఐ చేతిలో పనే. కానీ ఈ విషయం లో మాత్రం బిసిసిఐ విఫలమైంది. ఇటీవల కాలంలో భువనేశ్వర్‌కుమార్,ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ వరసగా భారత్ జట్టు నుంచి తప్పుకున్నారు. షమీ కూడా ఎక్కువ కాలం భారత్ జట్టులో కొనసాగే అవకాశం తక్కువే. అయితే షమీ తరువాత ఎవరు అంటే బోర్డు వద్ద సమాధానం లేదు. ఈ విషయం ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో తేలిపోయింది.తాజాగా మరో యువ బౌలర్ మయాంక్ యాదవ్ వెన్నునొప్పి సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం బంగ్లాదేశ్‌పై టి20 సిరీస్ లో అరంగేట్రం చేసిన మయాంక్, దేశంలో అత్యంత వేగవంతంగా పేస్ బౌలింగ్ ఆశావహుల్లో ఒకరిగా పేరు గడించాడు. 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయగల అతని సామర్థ్యం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బాగా ఉపయోగపడిండి. " మయాంక్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌కు అతని ఫిట్ నెస్ కష్టమే" అని బోర్డు వర్గాలు తెలిపాయి.అన్ని ఫార్మాట్లలో భారత పేస్ బౌలింగ్ యూనిట్లో అంతర్భాగంగా ఉండే విధంగా మయాంక్ వంటి బౌలర్లని బోర్డు ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయాల్సిన అవసరం ఉందనేది ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో వెల్లడయింది. కానీ బోర్డు ఇప్పటికయినా తగిన రీతిలో ముందుచూపుతో వ్యవహరిస్తుందని ఆశిద్ద్దాం.
బిజినెస్
యాపిల్‌పై జుకర్‌బర్గ్ తీవ్ర వ్యాఖ్యలు
దిగ్గజ పారిశ్రామిక వేత్త, మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg).. 'జో రోగన్ ఎక్స్పీరియన్స్'లో మాట్లాడుతూ యాపిల్ (Apple)ను విమర్శించారు. గ్లోబల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చినందుకు ఐఫోన్లను ప్రశంసిస్తూనే.. కంపెనీ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం లేదని, ఈ విషయంలో యాపిల్ విఫలమైందని అన్నారు.ఐఫోన్ బాగుంది, ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది దగ్గర ఇప్పుడు ఈ ఫోన్ ఉందని చెబుతూనే.. సంస్థ కొంతకాలంగా గొప్పగా ఏమీ కనుగొనలేదని జుకర్‌బర్గ్ వెల్లడించారు. స్టీవ్ జాబ్స్ ఐఫోన్‌ను కనుగొన్నారు. అయితే సంస్థ కేవలం దానిపై 20ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రతి ఏటా కొత్త వెర్షన్స్ లాంచ్ చేస్తోంది. కానీ అవి పాత వెర్షన్ల కంటే మెరుగ్గా లేదు. ఈ కారణంగానే చాలా తక్కువ మంది మాత్రమే కొత్త ఐఫోన్లను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.సంస్థ అందిస్తున్న కొత్త ఐఫోన్ మోడళ్లలో పెద్దగా అప్గ్రేడ్లు లేకపోవడం వల్ల ఫోన్ విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే కంపెనీ కొనుగోలుదారులపై, డెవలపర్లపై ఈ 30 శాతం పన్ను విధిస్తోందని.. ఇలాంటి వాటి వల్లనే యాపిల్ లాభపడుతోందని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.యాపిల్ ఇతర కంపెనీల పరికరాలను iPhoneలతో సజావుగా ఎలా పని చేయనివ్వదు అనే దాని గురించి జుకర్‌బర్గ్ కలత చెందారు. దీనికి ఆయన ఎయిర్పాడ్లను ఉదాహరణగా చూపాడు, అదే కనెక్షన్ టెక్నాలజీని ఉపయోగించకుండా ఇతర కంపెనీలను బ్లాక్ చేస్తుందని వివరించారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాతమ రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ కోసం యాపిల్ కనెక్షన్ ప్రోటోకాల్‌ను ఉపయోగించమని మెటా చేసిన అభ్యర్థనను.. భద్రతా కారణాల వల్ల యాపిల్ తిరస్కరించింది. వినియోగదారు గోప్యత పట్ల నిజమైన ఆందోళన కంటే కూడా వ్యాపార ప్రయోజనాల కారణంగా అభ్యర్థనను తిరస్కరించినట్లు జుకర్‌బర్గ్ చెప్పారు.యూజర్ల గోప్యత, భద్రతపై యాపిల్ వైఖరిని ఆయన విమర్శించారు. యాపిల్ కనిపెట్టిన కొత్త వాటిలో 'విజన్ ప్రో' ఒకటి మాత్రమే అని నేను అనుకుంటున్నానని.. కంపెనీ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ గురించి జుకర్‌బర్గ్ ప్రస్తావించారు. ఇది కూడా సరైన అమ్మకాలు పొందలేదని ఆయన అన్నారు.
మనవడి భవిష్యత్తుకు ఉత్తమ ఫండ్స్
నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారీ నాకు కేటాయించే యూనిట్ల విలువ కొంత తక్కువగా ఉంటుంది. కాకపోతే నా పెట్టుబడులు, నాకు కేటాయించే యూనిట్ల మధ్య వ్యత్యాసం చాలా స్వల్పంగానే ఉంటోంది. ఎందుకు ఇలా? - నంబూద్రి ప్రసాద్మీరు గుర్తించిన ఈ స్వల్ప వ్యత్యాసం అన్నది మీ ప్రతి పెట్టుబడికి సంబంధించి మినహాయించే స్టాంప్ డ్యూటీ. అన్ని మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లకు దీన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పెట్టుబడి విలువపై 0.005 శాతాన్ని స్టాంప్ డ్యూటీ చార్జీ కింద వసూలు చేస్తారు.ప్రతి పెట్టుబడి మొత్తంలో ఈ మేరకు మినహాయించగా, మిగిలిన మొత్తానికి యూనిట్ల కేటాయింపు జరుగుతుంది. ఉదాహరణకు సిప్ రూపంలో రూ.5,000 ఇన్వెస్ట్ చేశారు. ఇందులో 0.005 శాతం అంటే రూ.0.25 అవుతుంది. అప్పుడు రూ.4,999.75 మొత్తం పెట్టుబడి కిందకు వెళుతుంది. సిప్‌లు, ఏక మొత్తంలో పెట్టుబడులు, డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ లావాదేవీలు అన్నింటికీ వర్తిస్తుంది.ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి బదిలీ, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల ఉపసంహరణకు స్టాంప్ డ్యూటీ వర్తించదు. చట్టపరమైన ఈ చార్జీల గురించి పెద్దగా ఆలోచించకుండా, పెట్టుబడుల ప్రణాళిక, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించండి. నా మూడేళ్ల మనవడి భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూలించే ఫండ్స్ ఏవి? వాటి విషయంలో ఎలా వ్యవహరించాలి? - రవిగుప్తాపిల్లల ఉన్నత విద్య కోసం ఈక్విటీ, అగ్రెస్సివ్ ఈక్విటీ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడుల పట్ల సౌకర్యంగా లేకపోతే అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఒకటి లేదా రెండు మిడ్‌క్యాప్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. 15 ఏళ్ల కాలంలో మార్కెట్లు ఎన్నో ఎత్తు పల్లాలు చూసినప్పటికీ డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో (వైవిధ్యమైన పెట్టుబడులతో కూడిన) మెరుగైన రాబడులు ఇస్తుంది. కాకపోతే పెట్టుబడులు అలాగే కొనసాగించి, మధ్య మధ్యలో వచ్చే మార్కెట్ పతనాలను పట్టించుకోకుండా ఉంటే చాలు.మార్కెట్ ఊగిసలాటల్లో పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే దీర్ఘకాలంలో విజయం సాధించగలరు. మనవడు, మనవరాలి భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు రెండు రకాల విధానాలను అనుసరించొచ్చు. చిన్నారి పేరు మీద బ్యాంక్ ఖాతా తెరవాలి. ఈ ఖాతాలోకి నగదు బదిలీ చేయాలి. తర్వాత ఎంపిక చేసిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?మనవడి పేరు మీదే ఖాతా ఉంటుంది కనుక 18 ఏళ్లు నిండిన తర్వాత సంబంధిత ఖాతా యాజమాన్య హక్కులు చిన్నారికి బదిలీ చేయవచ్చు. లేదంటే మీ మనవడికి బదులు మీ పేరు మీదే పెట్టుబడులు పెట్టుకోవడం మరొక ఆప్షన్. మనవడికి 18 ఏళ్లు నిండగానే, ఆ పెట్టుబడులను ఉపహరించుకుని ఆ మొత్తాన్ని మనవడికి గిఫ్ట్ కింద బదిలీ చేయవచ్చు. అప్పటి వరకు ఆ పెట్టుబడులకు నామినీగా మనవడి (మైనర్)ని ప్రతిపాదించొచ్చు.
గణాంకాలు, ఫలితాల ఎఫెక్ట్
దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రధానంగా అక్టోబర్–డిసెంబర్(క్యూ3)ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వీటికితోడు అంతర్జాతీయ అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. డిసెంబర్ నెలకు యూఎస్, చైనా గణాంకాలు వెలువడనున్నాయి. ఇవికాకుండా విదేశీ పెట్టుబడులు, డాలరు ఇండెక్స్ కదలికలు తదితర అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు వివరించారు. వివరాలు చూద్దాం.. ఫలితాలకు రెడీ గత వారం ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ క్యూ3 ఫలితాలతో ఇన్వెస్టర్లను మెప్పించగా.. ఈ వారం మరికొన్ని దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. ఆనంద్‌రాఠీ, ఏంజెల్ వన్, డెల్టా కార్ప్, హిమాద్రి స్పెషాలిటీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 13న, నెట్వర్క్ 18, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ 14న, సియట్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్టీటీఎస్, నెల్కో, ట్రాన్స్‌రైల్ 15న, యాక్సిస్ బ్యాంక్, హాట్సన్, హావెల్స్, ఇన్ఫోసిస్, కేశోరామ్, ఎల్టీఐఎం, మాస్టెక్, ఆర్ఐఎల్ 16న ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ బాటలో 17న అట్లాస్ సైకిల్, ఇండియన్ హోటల్స్, ర్యాలీస్, ఆర్కే ఫోర్జ్, ఎస్బీఐ లైఫ్, శేషసాయి పేపర్, స్టెరిలైట్ టెక్, స్వరాజ్ ఇంజిన్స్, టెక్ మహీంద్రా, విప్రో క్యూ3 ఫలితాలు తెలియజేయనున్నాయి. వారాంతాన(11న) డీమార్ట్ రిటైల్ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్, జస్ట్‌డయల్ అక్టోబర్–డిసెంబర్ ఫలితాలు వెల్లడించాయి. ఈ ప్రభావం సోమవారం(13న) కనిపించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. ధరల వివరాలు డిసెంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు నేడు(సోమవారం) వెల్లడికానున్నాయి. నవంబర్‌లో సీపీఐ 5.48 శాతానికి తగ్గింది. అక్టోబర్‌లో ఇది 6.21 శాతంగా నమోదైంది. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు రేపు(14న) విడుదలకానున్నాయి. నవంబర్‌లో డబ్ల్యూపీఐ 1.89 శాతానికి తగ్గింది. అక్టోబర్‌లో ఇది 2.36 శాతంగా నమోదైంది. ఆహార ధరలు తగ్గడం ప్రభావం చూపింది. బుధవారం(15న) నవంబర్ నెలకు వాణిజ్య గణాంకాలు వెలువడనున్నాయి. నవంబర్‌లో వాణిజ్య లోటు అత్యధికంగా 37.8 బిలియన్ డాలర్లను తాకింది. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 20.6 బిలియన్ డాలర్లు మాత్రమే. ఆర్థిక గణాంకాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. వాణిజ్య మిగులు డిసెంబర్ నెలకు చైనా వాణిజ్య గణాంకాలు 13న విడుదలకానున్నాయి. నవంబర్‌లో వాణిజ్య మిగులు 97.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. డిసెంబర్ నెలకు యూఎస్ ఉత్పాదక ధరల ద్రవ్యో ల్బణ వివరాలు 14న, కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు 15న వెలువడనున్నాయి. నవంబర్‌లో మూడు నెలల గరిష్టం 3.3 శాతానికి చేరింది. రిటైల్ అమ్మకాలు 16న వెల్లడికానున్నాయి. నవంబర్‌లో ఇవి 0.7 శాతం పెరిగాయి. 17న చైనా 2024 క్యూ3 జీడీపీ వివరాలు తెలియనున్నాయి. వార్షికంగా 4.6 శాతం ఎకానమీ వృద్ధిని అంచనా వేస్తున్నారు. క్యూ2లో 4.7 శాతం పురోగతిని సాధించింది. గత వారమిలా శుక్రవారం(11)తో ముగిసిన గత వారం మార్కెట్లు డీలా పడ్డాయి. 2 వారాల తదుపరి తిరిగి నష్టపోయాయి. సెన్సెక్స్ నికరంగా 1,844 పాయింట్లు (2.3 శాతం) పతనమైంది. 77,379 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 573 పాయింట్లు(2.4 శాతం) పడిపోయి 23,432 దిగువన స్థిరపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ మరింత అధికంగా 5.7 శాతం దిగజారగా.. స్మాల్ క్యాప్ 6 శాతంపైగా పడిపోయింది.ఇతర అంశాలు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడుతోంది. దీంతో దేశీ కరెన్సీ రోజురోజుకీ సరికొత్త కనిష్టాలను తాకుతోంది. గత వారం సాంకేతికంగా కీలకమైన 86 స్థాయినీ కోల్పోయింది. మరోపక్క యూఎస్ బాండ్ల ఈల్డ్స్, ముడిచమురు ధరలు సైతం పుంజుకుంటున్నాయి. దీంతో గత వారం మార్కెట్లు పతన బాటలో సాగినట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. అయితే ఈ వారం క్యూ3 ఫలితాల ప్రభావం అధికంగా కనిపించనున్నట్లు తెలియజేశారు. అయితే యూఎస్, చైనా గణాంకాలు, విదేశీ పెట్టుబడులు తదితర అంశాలు సైతం మార్కెట్లలో ఒత్తిడికి కారణమవుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు.ఎఫ్‌పీఐల అమ్మకాలు.. జనవరి 10 వరకు రూ. 22,914 కోట్లు న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మరోసారి నికర అమ్మకందారులుగా నిలుస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ(1–10 మధ్య) రూ. 22,194 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డిసెంబర్లో తొలుత అమ్మకాలు చేపట్టినప్పటికీ చివరి వారాల్లో కొనుగోళ్లకు దిగడంతో నికరంగా రూ. 15,446 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. యూఎస్ డాలర్ ఇండెక్స్ 109కు బలపడటం, కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన ట్రంప్ టారిఫ్‌లకు తెరతీయవచ్చన్న అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటికితోడు యూఎస్ బాండ్ల ఈల్డ్స్ 4.6 శాతానికి పుంజుకోవడం, దేశ జీడీపీ వేగం తగ్గడం వంటి అంశాలు సైతం జత కలుస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. 5 ఐపీవోల లిస్టింగ్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఈ వారం 5 కంపెనీలు లిస్ట్‌కానున్నాయి. గత వారం ఇష్యూలు పూర్తయిన హైదరాబాద్ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ(13న)తోపాటు రైల్వే రక్షణ రంగ కంపెనీ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్ ఇని్వట్(14న) లిస్ట్‌కానున్నాయి. ఈ బాటలో ఎస్ఎంఈలు బీఆర్ గోయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెల్టా ఆటోకార్ప్, అవాక్స్ అపారెల్స్ అండ్ ఆర్నమెంట్స్ 14న లిస్ట్‌కానున్నాయి. మరోవైపు 13న లక్ష్మీ డెంటల్ ఐపీవో ప్రారంభంకానుంది. ఈ బాటలోఎస్ఎంఈలు కాబ్రా జ్యువెల్స్, రిఖావ్ సెక్యూరిటీస్, ల్యాండ్‌మార్క్ ఇమ్మిగ్రేషన్, ఈఎంఏ పార్ట్నర్స్ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. టాప్–5 కంపెనీలకు అమ్మకాల సెగ గత వారం మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)రీత్యా టాప్–5 కంపెనీల మార్కెట్ విలువలో నికరంగా రూ. 1,85,952 కోట్లు ఆవిరైంది. జాబితాలో టాప్–5 కంపెనీల విలువ నష్టపోగా.. మిగిలిన 5 దిగ్గజాల మార్కెట్ క్యాప్ బలపడింది. ప్రధానంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువకు రూ. 70,479 కోట్లు చిల్లు పడింది. ఈ బాటలో ఐటీసీ విలువ రూ. 46,481 కోట్లు, స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) విలువ రూ. 44,935 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ. 12,179 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ విలువ రూ. 11,877 కోట్లు చొప్పున క్షీణించింది. అయితే ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్కెట్ విలువకు రూ. 60,169 కోట్లు జమకావడం గమనార్హం!
బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర విద్యుత్ శాఖ బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు (బీసీఎస్), బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల (బీఎస్ఎస్) ఓనర్లు, మార్చుకోతగిన బ్యాటరీలను చార్జ్ చేసేందుకు ప్రస్తుతమున్న విద్యుత్ కనెక్షన్‌నే ఉపయోగించుకోవచ్చు. కనెక్టెడ్ లోడ్‌ను పెంచుకున్నా, పెంచుకోకపోయినా ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. మెరుగైన స్వాపింగ్, చార్జింగ్ కోసం ట్రక్కులు, బస్సులు లాంటి భారీ వాహనాలు లిక్విడ్–కూల్డ్ స్వాపబుల్ బ్యాటరీలను వినియోగించవచ్చు.
ఫ్యామిలీ
భోగి వైభోగం
సౌరమానాన్ని ఆధారంగా చేసుకున్న పండగ భోగి. తెల్లవారు జామునే భోగి మంట వేస్తారు. కర్రపుల్లలు, పిడకల దండలు, పాత సామాన్లు, కొబ్బరిమట్టలు... లాంటివాటితో పెద్దపెద్ద మంటలు వేస్తారు. పాత వస్తువులతో పాటు, మనుషుల మనసుల్లో దాగి ఉన్న పాత అలవాట్లను సైతం అగ్నిలో దహింపచేసి, ఆరోజు నుంచి కొత్త ఆయనంలోకి, కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచనగా భావిస్తారు. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగిమంట వేస్తారు. అలా అందరూ ఒకచోట చేరటం వలన సమైక్యత ఏర్పడుతుంది. ఈ రోజున భోగి మంట వేసుకోవటం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సరిగ్గా భోగితో దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. చలి కూడా వెనకపడుతుంది. ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారుతుంది. ఆ వేడిని తట్టుకోవడం కోసమే ఈ మంట వేసుకునే సంప్రదాయం వచ్చి ఉండవచ్చునని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. వీటి నుండి వచ్చే పొగ ఆరోగ్యం కలిగించేదే కాని హాని కలిగించేది కాదు. ఈ మంట వేయడానికి పిల్లలందరూ ఇంటింటికీ వెళ్లి తోటి పిల్లల్నందర్నీ నిద్రలేపి పరాచికాలాడుకుంటూ, చలికాచుకుంటూ కోలాహలంగా కనిపిస్తారు. సైన్సుపరంగా చెప్పాలంటే, చలికాలం వాతావరణంలో సూక్ష్మక్రిములు అభివృద్ధి చెందడానికి అనువైన కాలం. అందువల్ల అందరూ ఏకకాలంలో భోగిమంటలు వేయడం వల్ల సూక్ష్మక్రిములన్నీ నశించిపోయి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. అదేవిధంగా ఎప్పటెప్పటి నుంచో మూలన పడి ఉన్న పాత సామానును ఏడాదికోసారి ఈ విధంగా వదిలించుకోవడం వల్ల దుమ్ము, ధూళి, ఎలుకలు, వాటిని తినడానికి పాములు చేరకుండా ఉంటాయనేది పెద్దల మాట. భోగం అంటే పిల్లలకు భోగం చేయడం. పిల్లలకు భోగిపళ్లు పోసేటప్పుడు రేగు పళ్లు, రాగి పైసలు, పువ్వులు మూడిటినీ కలిపి తలచుట్టూ మూడుసార్లు తిప్పి తలమీద పోస్తారు. కొన్ని ప్రాంతాలలో రేగుపళ్లు, చిల్లరడబ్బులు, కొత్తబియ్యం, తేగ ముక్కలు, చెరకు ముక్కలు, పాలకాయలు, పచ్చి శనగ కాయలు, పూలరేకలు అన్నీ కలిపి పోస్తారు. దీనివల్ల దృష్టి దోషం పోతుందని విశ్వాసం. పిల్లలు కూర్చునే పీటకింద ఇంట్లో తయారు చేసుకున్న పిండివంటన్నీ వేస్తారు. వాటిని తరవాత ఇంట్లో నమ్మకంగా పనిచేసే వారికి ఇచ్చేస్తారు. చివర్లో పేరంటాళ్లకి వాయినం ఇస్తారు. ఇందులో ఆరోగ్యానికి ఉపకరించే మొలకెత్తిన శనగలు తమలపాకులు, వక్క ఇస్తారు. మన పండుగల వెనుక సంప్రదాయంతోపాటు ఆరోగ్య కోణమూ దాగి ఉంది. అందుకే ఈ వంటకాలు, వాయినాలు ఆనవాయితీగా వస్తున్నాయి.వస్తు వ్యామోహానికి మంటమనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరూ వినరు కాబట్టి భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. ఇక పోతే, భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదని దాని అర్థం. రేగుపండ్లు శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఆకలి పుట్టిస్తాయి. రేగుపండ్లకున్నప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. మహా భక్తురాలైన గోదాదేవి భోగినాడే రంగనాథుని పతిగా పొందిందని ద్రవిడ వేదం చెబుతోంది. అందువల్ల విష్ణ్వాలయాలలో భోగిరోజు గోదా రంగనాథులకు కల్యాణం జరిపిస్తారు. – డి.వి.ఆర్.
డెలివరీ తర్వాత వీల్‌చైర్‌కు పరిమితం.. జీవితాంతం ఇంజక్షన్స్..!
ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో మెరిసి మంచి పేరు తెచ్చుకుంది షాలిని పాసీ. ఈ రియాలిటీ షోతో ఆమె పేరు దశదిశల మారుమోగిపోయింది. ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న చేదు రోజులను గుర్తు చేసుకుంది. ప్రసవానంతరం వెన్నెముక గాయం బారినపడి స్పర్శ కోల్పోయిన క్లిష్ట పరిస్థితులు గురించి వెల్లడించింది. ఇక జీవితంలో తాను నృత్యం చేయలేదని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా జీవితం తలకిందులైనట్లు అనిపించిందంటూ భావోద్వేగంగా మాట్లాడింది. అంతేగాదు ఆ పరిస్థితులను ఎలా అధిగమించి మాములు స్థితికి రాగలిగిందో కూడా వివరించింది. షాలిని పాసి(Shalini Passi) 20 ఏళ్ల వయసులో తన కొడుకు రాబిన్‌కి జన్మనిచ్చింది. ఆ తర్వాత ఊహించని విధంగా వెనుముక గాయం కారణంగా వెన్ను నుంచి కాళ్ల వరకు స్పర్శ(sensation) కోల్పోయింది. ఇక ఆమె జీవితంలో నడవడం, నృత్యం(dance) చేయడం అస్సలు సాధ్యం కాదని తేల్చి చెప్పారు వైద్యులు (Doctors). దీంతో ఒక్కసారిగా కళ్లముందు జీవితం చీకటిమయం అయ్యినట్లు అనిపించింది. ఇంతేనా తన పరిస్థితి అని తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.జీవితాంతం వెన్నెముక ఇంజెక్షన్లు చేయించుకోవాల్సిందేనని వైద్యులు చెప్పడంతో బాధతో తల్లడిల్లిపోయింది. నిజానినికి షాలినికి హిల్స్ వేసుకోవడం, డ్యాన్స్ చేయడం మహా ఇష్టం. అయితే ఇక్కడ షాలిని దిగులుతో కూర్చొండిపోలేదు. ఎలాగైనా ఆ బాధను అధిగమించాలని సంకల్పించుకుంది. ఈ సమస్యకు ప్రత్యామ్నాయ చికిత్సలను ఎంచుకుంది. యోగా, ఆయుర్వేదం వంటి వాటితో కండరాలను బలోపేతం చేసుకునేలా శిక్షణ తీసుకుంది. అలా ఆమె వెనుముక సమస్యను జయించింది. ఇప్పటికీ తాను ఆయుర్వేద వైద్యుడి దగ్గరకే వెళ్తానని అంటోంది షాలిని. ఆయన తనకు ఎలాంటి మందులు ఇవ్వకుండానే నయం చేశారని చెబుతోంది. అలాగే చెకప్ కోసం ప్రతి ఐదు నెలలకొకసారి ఆ వైద్యుడిని కలుస్తానని అంటోంది. తాను ఇలా పూర్తి స్థాయిలో కోలుకోవడం చూసి తన వైద్య బృందం ఆశ్యర్యపోయినట్లు చెప్పుకొచ్చారు షాలిని. నిజంగా ఇది అద్భుతం. నడవగలగడం, నృత్యం చేయడం చూస్తుంటే నమ్మలేకపోతున్నామని వైద్యులే ఆశ్చర్యపోయారని షాలిని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే తన కొడుకుతో గల అనుబంధం గురించి కూడా చెప్పుకొచ్చింది. తన కొడుకుకి అక్కలా, స్నేహితురాలిలా ఉంటానని, అందువల్లే తన కొడుకు తనతో అన్ని ఫ్రీగా షేర్ చేసుకుంటాడని చెప్పుకొచ్చారు షాలిని. ఎంత పెద్ద సమస్య అయినా ధైర్యంతో ఫేస్చేస్తే తోకముడిచి తీరుతుందని షాలిని అనుభవం చెబుతోంది కదూ..!.(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!)
ఆ ఫ్రాక్చర్ని ఏఐ పసిగట్టింది..కానీ డాక్టర్లు..
ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్ అంటేనే అమ్మో అని హడలిపోతున్నారు జనాలు. దీని వల్ల ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువని చాలమంది విశ్లేషకులు, నిపుణుల అభిప్రాయం. చెప్పాలంటే దీన్ని వ్యతిరేకించేవారి సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా నిరుద్యోగం ఎక్కువవతుందనేది అందరి ఆందోళన. అయితే దీన్ని సరిగా ఉపయోగించుకుంటే మన ఎదుగదలకు దోహదపడుతుందనే ఓ సరికొత్త అంశం వెలుగులోకి వచ్చింది. సవ్యంగా ఉపయోగిస్తే నష్టాన్ని కూడా లాభంగా మార్చుకోవచ్చు. ఏదైనా మనం ఉపయోగించే విధానంలో ఉంటుందన్నా.. పెద్దల నానుడిని గుర్తు చేసేలా ఓ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన ఓ రకంగా ఏఐపై ఉన్న నెగిటివిటీకి స్వస్తి చెప్పేలా జరిగింది. ఏం జరిగిందంటే..ఓ తల్లి సోషల్ మీడియాలో తన ఏఐ అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ నెట్టింట సంచలనంగా మారి చర్చలకు దారితీసింది. ఆమె తన కుమార్తె కారు ప్రమాదంలో చిక్కుకుందని. ఆ సమయంలో ఎలాంటి గాయాలు అవ్వకపోయినా ఆమె మణికట్టు నుంచి మోచేయి భాగం వరకు విపరీతమైన నొప్పిని ఎదుర్కొంది. వైద్యులు వద్దకు తీసుకెళ్తే..ఎముకలు ఫ్రాక్చర్ కాలేదని చెప్పి ఇంటికి పంపించేశారు. కానీ ఆమె నొప్పితోనే విలవిలలాడుతూ ఉండేది. దీంతో అనుమానంతో ఎలాన్ మస్క్(Elon Musk ఫ్లాట్‌ఫామ్ ఏఐ చాట్‌బాట్(AI chatbot) గ్రోక్(Grok)లో తన సందేహం నివృత్తి చేసుకునే యత్నం చేసింది. అందుకోసం తన కుమార్తె ఎక్స్ రేని అప్లోడ్ చేసి ఫ్రాక్చర్(fracture) అయ్యిందో కాలేదా అని ప్రశ్నించింది. అయితే గ్రోక్ డిస్టల్ రేడియస్‌లో స్పష్టమైన ఫ్రాక్చర్ లైన్ ఉందని పేర్కొంది. అయితే ఇదే ఈసందేహం ఆ తల్లికి ముందే తట్టింది. అయితే అప్పుడు ఆ వైద్య బృందాన్ని అడిగితే..అది గ్రోత్ ప్లేట్ అని చెప్పి భయపడాల్సిన పనిలేదని ఆ తల్లికి నమ్మకంగా చెప్ప్పారు. కానీ ఇక్కడ ఏఐ ఆ తల్లి అనుమానమే నిజమని తేల్చింది. దీంతో ఆమె మరో చేతి ఎముకల స్పెషలిస్ట్‌ని కలవగా డోర్సల్ డిస్ప్లేస్మెంట్తో డిస్టల్ రేడియల్ హెడ్ ఫ్రాక్చర్ ఉందని, తక్షణమే సర్జరీ చేయాలని చెప్పడం జరిగిందని పోస్ట్‌లో రాసుకొచ్చింది. త్రుటిలో తన కూతురు ఆ నొప్పి నుంచి బయటపడగలిగింది లేదంటే చేతిని కోల్పోయే ప్రమాదం ఏర్పడేదని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు ఏఐ మానవుడిని మించిపోయిందని ఒకరు, ఆరోగ్య సంరక్షణ వంటి వాటి విషయాల్లో దీన్ని ఎంతవరకు నమ్మగలం అని మరోకరూ అనుమానం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.True story: @Grok diagnosed my daughter’s broken wrist last week. One of my daughters was in a bad car accident last weekend. Car is totaled but she walked away. Everyone involved did, thankfully. It was a best case outcome for a serious, multi-vehicle freeway collision.… pic.twitter.com/fRNh81WX0N— AJ Kay (@AJKayWriter) January 11, 2025 (చదవండి: 'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ)
'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ
‘జెరోదా’ సహ వ్యవస్థాపకుడు(Zerodha co-founder) నిఖిల్ కామత్(Nikhil Kamath)కు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తొలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూలో పలు అంశాలపై విస్తారంగా ముచ్చటించారు. ముఖ్యంగా భోజనం విషయంలో తన ఆహార వ్యవహారంకి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్వూలో కామత్ ఇటలీలో జరిగిన G7 సమ్మిట్(G7 Summit) గురించి మాట్లాడుతూ ఇటలీ గురించి మోదీకి బాగా తెలుసనని ప్రజలు అంటున్నారని నవ్వుతూ అన్నారు. ఇంటర్నెట్లలో ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని పేరుతో వచ్చిన మెలోడి మీమ్‌లు గురించి కూడా ప్రస్తావించారు. వాటన్నింటిని తోసిపుచ్చుతూ..తనకు ఇటలీ నుంచి తనకెంతో ఇష్టమైన పిజ్జా వచ్చిందని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఆహారం విషయంలో తాను ఎలా ఉంటాననే దాని గురించి వివరించారు. తాను స్వతాహాగా ఫుడ్డీని కాదన్నారు. ఏదేశంలోనైనా తనకు ఏది వడ్డించినా సంతోషంగా తింటా. ప్రత్యేకంగా ఇది అని నియమం లేదు. అయితే అది శాకాహారమే అయ్యి ఉండాలనేది షరతు. ఇప్పటికీ తనికి రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మెనూ ఇవ్వగానే ఏం తినాలో తెలియదని, అదసలు తనకు అర్థం కాదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో తన తొలినాళ్ల నాటి కథను గుర్తుచేసుకున్నారు. ఆ టైంలో తనకు దివంగత అరుణ్ జైట్లీ తరచుగా తనకు ఆహారం ఆర్డర్ చేయడంలో ఎలా సహాయం చేశారో చెప్పారు. తనకు కూడా ఫుడ్‌ని ఆర్డర్ చేయమని కోరేవాడిని. అయితే అది శాకాహారమే అయ్యి ఉండాలని షరతు విధించేవాడినని నాటి రోజులని గుర్తు చేసుకున్నారు. ఈ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ శ్రోతలకు ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని మరింతగా పరిచయం చేసింది. (చదవండి: నాడు టెక్కీ ఇవాళ లెహంగాల వ్యాపారవేత్త.. ఏడాదికి రూ. 5 కోట్లు.. )
ఫొటోలు
International View all
ట్రంప్ ప్రకటన: గ్రీన్‌ల్యాండ్ రేటెంతో తెలుసా?
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) డెన్మార్క్‌లోని గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయనున్
కనీవినీ ఎరగని కార్చిచ్చుతో అల్లాడిపోతోంటే... మారువేషాల్లో దారుణం!
లాస్ ఏంజిల్స్‌లో రగిలిన కార్చిచ్చు అమెరికాను అతలాకుతలం చేసింది.
కెనడా అమ్మకానికేం లేదు!.. ట్రంప్‌కు ఘాటు హెచ్చరిక
న్యూఢిల్లీ: కెనడాను అమెరికాలో విలీనం చేసే ప్రణాళికలో ఉన్న అమెరికా నూతన అధ్
పాకిస్తాన్లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..
ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలో బంగారం పండింది.
అయ్యో.. లాస్ ఏంజెలెస్! 24కు చేరిన మృతుల సంఖ్య
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఎంతకీ శాంతించడం లేదు.
National View all
కాగ్ రిపోర్టు మంట... ఆప్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్త
Rakesh Sharma Birthday: రాకేష్‌శర్మ అంతరిక్షంలో ఎన్ని రోజులున్నారు?
అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ పుట్టినరోజు నేడు(జనవర
Maha Kumbh-2025: అండర్ వాటర్ డ్రోన్లు.. ఏఐ కెమెరాలు.. ఫ్లోటింగ్ పోలీస్ పోస్టులతో నిఘా
ప్రయాగ్‌రాజ్: మహాకుంభమేళా..
ఆర్టికల్ రద్దుతో సంబంధమే లేదు.. మోదీకి ఒమర్ అబ్దుల్లా ఝలక్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన వేళ ముఖ్యమం
Delhi Election-2025: అందరి దృష్టి షకూర్ బస్తీపైనే.. ఆ పార్టీల మధ్య హోరాహోరీ?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి.
NRI View all
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను త
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
క్రైమ్
వేడి నీళ్లు మీద పడి బాలుడి మృతి
గచ్చిబౌలి: తల్లి స్నానం కోసం పెట్టుకున్న వేడి నీళ్ల బకెట్‌ను పట్టుకోవడంతో ప్రమాదవశాత్తు నీళ్లు మీదపడి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలం గొడుగోనిపల్లికి చెందిన దంపతులు మైసం రాజు, సోనీ బతుకు దెరువు కోసం వచ్చి మణికొండలోని శివపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజు వాచ్‌మెన్‌గా పని చేస్తూనే కారు డ్రైవింగ్ చేస్తుంటాడు. ఈ నెల 6న సాయంత్రం 4.40 గంటల సమయంలో సోనీ స్నానం చేసేందుకు బకెట్లో హీటర్ పెట్టి నీళ్లను వేడి చేసింది. ఆమె కొడుకు ధీరజ్ (04) ఆడుకుంటూ బకెట్‌ను పట్టుకున్నాడు. బకెట్ కిందపడటతో నీళ్లన్నీ శరీరంపై పడి బాలుడికి 60 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే గమనించిన తల్లి హుటాహుటిని సమీపంలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించింది. అక్కడి నుంచి నిలోఫర్‌కు వెళ్లగా ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ధీరజ్ శుక్రవారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. వేడి నీళ్లు మీదపడి ఒక్కగానొక్క మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గృహిణి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గురువారెడ్డి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరాం కాలనీకి చెందిన సంపంగి గణేష్ ఏడాది క్రితం శిరీష(21) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి శిరీష కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడడం లేదు. తాజాగా ఆమె తల్లితో మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 9న తల్లి వద్దకు వెళ్లొస్తానని చెప్పి శిరీష బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయమై గణేష్ అత్తగారింటిలో వాకబు చేయగా, అక్కడికి రాలేదని తెలిపారు. దీంతో పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లోగాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని తెలిపారు.
సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు
జవహర్‌నగర్: ‘సంక్రాంతికి వస్తా..నీవు ఆరోగ్యంగా ఉండు. నాకు చిన్న పని ఉంది చూసుకుని రేపు ఇంటికి బయలుదేరి వస్తా. పండగ అయ్యాక మనమిద్దరం కలిసి బియ్యం తీసుకుని హైదరాబాద్‌కు వెళ్దాం..’ అని గర్భవతి అయిన భార్యతో ఫోన్లో మాట్లాడి వెళ్లిన కొన్ని గంటలకే ఆ ఇంటి యజమాని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కరెంటు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందాడు. జవహర్‌నగర్ సీఐ సైదయ్య, బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల బంజారా తండాకు చెందిన బానోతు ప్రశాంత్ (26), సరిత దంపతులు. వీరు సంతో నగర్లో నివాసం ఉంటున్నారు. ప్రశాంత్ బాలాజీనగర్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ప్రశాంత్ శుక్రవారం సంతోష్‌నగర్‌లో విద్యుత్ లైన్ల మరమ్మతులకు తోటి కారి్మకులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో ఏఈ సాంబశివరావు, లైన్మెన్ నాగరాజుతో పాటు కాంట్రాక్టర్ రాజేశ్‌లు ఎల్సీ తీసుకున్నామని, మీరు పని పూర్తి చేయాలని చెప్పడంతో ప్రశాంత్ ఉదయం 10.20 నిమిషాల సమయంలో విద్యుత్ స్తంభం ఎక్కి వైర్ కట్‌చేస్తుండగా 11కేవీ తీగలు తగిలాయి. ప్రశాంత్ స్తంభంపైన పనిచేస్తుండగానే అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యుత్ సరఫరాను ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై ప్రశాంత్ మృతిచెందాడు. తోటి కార్మికులు, ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్యతో ఉదయం ఫోన్లో మాట్లాడిన కొద్దిసేపటికే..మృత్యువాత పడిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు అన్ని విధాలా ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కామేపల్లి మండల మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్ నాయక్ డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్మికుని కుటుంబానికి అన్నివిధాల ఆదుకుంటామని విద్యుత్ అధికారులు హమీ ఇచ్చారు. ప్రస్తుతానికి తక్షణ సహాయంగా రూ.10 లక్షలు ఇస్తున్నట్లు అధికారులు, కాంట్రాక్టర్ ప్రకటించారు. పండక్కి ఊరికి వస్తానంటివే.!
మీరట్‌లో దారుణం
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు, వారి 8 ఏళ్లలోపు ముగ్గురు కుమార్తెలు దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. పాత గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇటీవలే మొయిన్ అలియాన్ మోయినుద్దీన్(52), అస్మా(45)దంపతులు అద్దెకు దిగారు. వీరికి ముగ్గురు కుమార్తెలు అఫ్సా(8), అజిజా(4), అడీబా(1)ఉన్నారు. మొయిన్ దంపతులు బుధవారం నుంచి కనిపించకపోవడంతో అస్మా సోదరుడు షమీమ్, మొయిన్ సోదరుడు సలీ వారుండే ఇంటికి వచ్చి చూడగా బయట తాళం వేసి ఉంది. శుక్రవారం అతికష్టమ్మీద ఇంటి పైకప్పును తొలగించి, లోపలికి వెళ్లి చూడగా భయానక దృశ్యాలు కనిపించాయి. పడుకునే మంచానికి ఉన్న అరలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కుక్కి ఉండగా దంపతులను బెడ్‌షీట్‌లో చుట్టి పడేశారు. వీరి కాళ్లు కట్టేసి ఉన్నాయి. షమీమ్, సలీమ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అస్మా చిన్న మరదలు, ఆమె ఇద్దరు సోదరులతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనే కావొచ్చని పోలీసులు తెలిపారు.