Hardik Pandya
-
మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్ధమే.. అంటోన్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య (ఫొటోలు)
-
మళ్లీ ప్రేమకు సిద్ధం: హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాసా స్టాంకోవిక్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాసా స్టాంకోవిక్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హార్దిక్ నుంచి విడిపోయాక మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్దంగా ఉన్నానని అంది. ప్రేమ, మాతృత్వం, కెరీర్ గురించి మాట్లాడుతూ.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో చెప్పుకొచ్చింది. నటి మరియు మోడల్ అయిన నటాసా కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలిపింది. గతేడాది జులైలో హార్దిక్ పాండ్యా నుంచి విడిపోయిన నటాసా.. కెరీర్లో ముందుకు సాగడంపై దృష్టి పెడుతున్నానని చెప్పింది. పెళ్లి తర్వాత నాలుగేళ్లు కలిసి ఉన్న నటాసా, హార్దిక్‌కు అగస్త్య అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. విడిపోయాక వీరిద్దరు అగస్త్యకు కో-పేరెంట్స్‌గా ఉన్నారు. అగస్త్య తల్లి సంరక్షణలో పెరుగుతున్నాడు.ఇంటర్వ్యూ సందర్భంగా నటాసా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఇలా అంది. నేను మళ్లీ ప్రేమలో పడేందుకు వ్యతిరేకం కాదు. జీవితం ఏది ఇచ్చినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నాను. ప్రేమ విషయానికి వస్తే.. ఖచ్చితంగా కొత్త అనుభవాల కోసం ఓపెన్‌గా ఉన్నాను. సరైన సమయం వచ్చినప్పుడు ప్రేమ అదంతట అదే పుడుతుందని నమ్ముతాను. నమ్మకం మరియు పరస్పర అవగాహన కలిగిన అర్థవంతమైన బంధాలకు విలువ ఇస్తానని తెలిపింది.హార్దిక్ నుంచి విడిపోయాక గతేడాది చాలా కఠినంగా గడిచిందని నటాసా పేర్కొంది. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ఎదుగుదల సాధిస్తామని చెప్పింది. గతేడాది చెడుతో పాటు మంచి అనుభవాలు కూడా ఉన్నాయని అంది. వయసుతో కాకుండా అనుభవాలతోనే పరిణతి చెందుతామని చెప్పుకొచ్చింది.కెరీర్ గురించి మాట్లాడుతూ.. హార్దిక్‌తో పెళ్లి తర్వాత ప్రొఫెషన్‌కు ఐదేళ్లు దూరంగా ఉన్నాను. తిరిగి కెరీర్‌ను పునఃప్రారంభించాలని అనుకుంటున్నాను. ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కెరీర్‌ను మొదలు పెట్టడం అంత ఈజీ కాదు. కష్టపడి పని చేస్తూ, నన్ను నేను మెరుగుపర్చుకునేందుకు ఇష్టపడే వ్యక్తిని కాబట్టి నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. ఏదీ వీలు కాకపోతే మరో కెరీర్‌ను ఎంచుకుంటాను.నటాసా మార్చి 4వ తేదీన తన 33వ పుట్టిన రోజు జరుపుకుంది. దీనిపై మాట్లాడుతూ.. ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్. అగస్త్యతో చాలా సరదాగా గడిపాను. నాకు ఇష్టమైన వ్యక్తులతో ఆనందంగా ఉన్నాను. ఈ ఏడాది నాకు కెరీర్‌పరంగా, పర్సనల్‌గా చాలా ప్రత్యేకమైంది.సెర్బియాకు చెందిన నటాసాను హార్దిక్ పాండ్యా 2020లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నటాసాను విడిపోయాక హార్దిక్ క్రికెట్‌తో బిజీ అయిపోయాడు. ఇటీవలే టీమిండియా సభ్యుడిగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన హార్దిక్.. ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. హార్దిక్ గత సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
‘గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది టైటాన్స్ వైఫల్యాలకు అతడు ఏమాత్రం కారణం కాదని పేర్కొన్నాడు. కెప్టెన్ ఒక్కడి ప్రదర్శన మీద జట్టు జయాపజయాలు ఆధారపడి ఉండవని.. ఆటగాళ్లంతా సమిష్టిగా రాణిస్తేనే గెలుపు వరిస్తుందని ఫిలిప్స్ అన్నాడు.అరంగేట్ర సీజన్లోనే చాంపియన్గాకాగా 2022లో గుజరాత్ టైటాన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలో.. తమ అరంగేట్ర సీజన్లోనే చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాతి ఏడాది ఫైనల్ చేరింది. అయితే, 2024లో పాండ్యా టైటాన్స్‌ను వీడి తన సొంతజట్టు ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఫలితంగా టైటాన్స్ పగ్గాలను యాజమాన్యం భారత యువ తార గిల్‌కు అప్పగించింది.పేలవ ప్రదర్శన అయితే, గతేడాది తొలిసారిగా గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచి.. పది పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. పాండ్యా జట్టును వీడటంతో పాటు మహ్మద్ షమీ (అప్పుడు టైటాన్స్ జట్టులో) గాయం వల్ల సీజన్ మొత్తానికి దూరం కావడం టైటాన్స్ ప్రదర్శనపై ప్రభావం చూపింది.అయితే, ఈసారి తాము ఆ ప్రతికూలతలు అధిగమించి అనుకున్న ఫలితాలు రాబడతామని గిల్ స్పష్టం చేశాడు. తమ జట్టు ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో గ్లెన్ ఫిలిప్స్ హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ జట్టుగా ఆడాల్సిన ఆట.గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యంఒక్క ఆటగాడు లేదా కెప్టెన్ జట్టు మొత్తాన్ని గెలిపించలేదు. కాబట్టి శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ వల్లే గతేడాది గుజరాత్ ప్రదర్శన బాలేదని చెప్పడం సరికాదు. టీ20 క్రికెట్ స్వరూపమే వేరు. మ్యాచ్ రోజు ఎవరు ఫామ్‌లో ఉంటారో వారిదే పైచేయి అవుతుంది. గతేడాది సన్‌రైజర్స్, కేకేఆర్ సీజన్ ఆసాంతం ఒకే లయను కొనసాగించి ఫైనల్ వరకు చేరాయి.ఏదేమైనా తమ తొలి రెండు సీజన్లలో గుజరాత్ అద్భుతంగా ఆడింది. మంచి ఫామ్ కనబరిచింది. ఈ ఏడాది అదే ఫలితాన్ని పునరావృతం చేయగలమని నమ్ముతున్నా. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ విషయంలో ఒత్తిడికి గురవుతాడని నేను అస్సలు అనుకోను. అతడు టీమిండియా ప్రధాన ప్లేయర్. జాతీయ జట్టుకు ఆడటం కంటే లీగ్ క్రికెట్లో ఆడటం తేలికే’’ అని గిల్‌కు ఫిలిప్స్ మద్దతు ప్రకటించాడు.రూ. 2 కోట్లకు కొనుగోలుకాగా 2021లో గ్లెన్ ఫిలిప్స్‌ను రాజస్తాన్ రాయల్స్ కొనుక్కోగా.. ఆ మరుసటి ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 1.5 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. కానీ తుదిజట్టులో మాత్రం ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో మెగా వేలం-2025కి ముందు రైజర్స్ అతడిని విడిచిపెట్టింది. దీంతో గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకు అతడిని వేలంపాటలో కొనుక్కుంది.ఇక ఇప్పటి వరకు ఐపీఎల్లో కేవలం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఫిలిప్స్ 65 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మంగళవారం తమ తొలి మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని -
#IPL2025 : ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్లు.. (ఫోటోలు)
-
మానసిక వేదన.. అయినా తట్టుకున్నాడు.. సింహంలా తిరిగొచ్చాడు!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)పై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. అవమానాలను దిగమింగుకుని.. సింహంలా అతడు తిరిగి వచ్చాడని కొనియాడాడు. మానసికంగా తనను వేదనకు గురిచేసినా.. అద్భుత ప్రదర్శనతో తన విలువను చాటుకున్నాడని.. భారత్ రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడని ప్రశంసించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సరికొత్త హార్దిక్ పాండ్యాను చూడబోతున్నారని.. ముంబై ఇండియన్స్‌ను అతడు ఈసారి ప్లే ఆఫ్స్‌లో నిలుపుతాడని కైఫ్ ధీమా వ్యక్తం చేశాడు. అవహేళనలుకాగా గతేడాది హార్దిక్ ముంబై ఇండియన్స్ సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే. ముంబైకి ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)ను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సొంత మైదానం వాంఖడేలోనూ అతడిని దూషిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. హార్దిక్ కనిపిస్తే చాలు అవహేళనలతో అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా ప్రవర్తించారు.ఈ క్రమంలో ముంబై గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై మరోసారి విమర్శలు తీవ్రమయ్యాయి. అయితే, ఈ చేదు అనుభవాల నుంచి త్వరగానే కోలుకున్న హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటాడు. జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు.అంతేకాదు.. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా టైటిల్ గెలవడంలోనూ హార్దిక్‌ది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. హార్దిక్ పాండ్యా బయోపిక్ గనుక తెరకెక్కితే గత ఏడాది కాలం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించాడు.పంటిబిగువన భరిస్తూ.. ‘‘మనసుకైన గాయాలను పంటిబిగువన భరిస్తూ.. అతడు ముందుకు సాగాడు. అభిమానులే అతడిని హేళన చేశారు. కొంతమంది అతడి గురించి చెడుగా ఆర్టికల్స్ రాశారు. ఓ ఆటగాడిగా ఇన్ని బాధలను భరిస్తూ ముందుకు సాగడం అంత తేలికైన విషయం కాదు.అతడు ఆ నొప్పిని మర్చిపోలేడు. జట్టు నుంచి తప్పిస్తే ఆ బాధ కొన్నాళ్లే ఉంటుంది. కానీ.. అభిమానులే ఇంతలా అవమానిస్తే తట్టుకోవడం కష్టం. ఓ ఆటగాడికి ఇంతకంటే మానసిక వేదన మరొకటి ఉండదు. సింహంలా పోరాడి గెలిచాడుఅయితే, అతడు కుంగిపోలేదు. సింహంలా పోరాడి గెలిచాడు. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర వీరుడిని అవుట్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో జంపా బౌలింగ్‌లో సిక్సర్లు బాదాడు.బంతితో, బ్యాట్‌తో రాణించి భారత్ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఒకవేళ అతడి బయోపిక్ తీస్తే.. గత ఏడాది కాలం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. సవాళ్లను, గడ్డు పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు సాగాలో తెలుస్తుంది. పాండ్యా తన బలాన్ని గుర్తించాడు. అందుకే ఇంత గొప్పగా పునరాగమనం చేశాడు. ఐపీఎల్-2025లో అతడు ముంబైని తప్పక ప్లే ఆఫ్స్ చేరుస్తాడు’’ అని కైఫ్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు.కాగా మార్చి 22న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ ప్రారంభం కానుండగా.. ఆ మరుసటి రోజు ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.చదవండి: CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ -
ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా
జట్టులో ‘ముగ్గురు కెప్టెన్ల’ను కలిగి ఉండటం తనకు అదనపు బలమని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. భిన్న ఫార్మాట్లలో టీమిండియాను ముందుకు నడిపించిన వ్యక్తుల నుంచి తాను తప్పక సలహాలు, సూచనలు తీసుకుంటానని పేర్కొన్నాడు. అంతిమంగా జట్టును విజేతగా నిలపడమే తమ లక్ష్యమని హార్దిక పాండ్యా పేర్కొన్నాడు.ఈసారి తాను రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నానన్న హార్దిక్ పాండ్యా... ఈసారి అభిమానుల నుంచి సానుకూల స్పందన మాత్రమే కోరుకుంటున్నానని తెలిపాడు. కెప్టెన్‌గా సూర్యకాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుండగా.. ముంబై మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం పడగా.. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పాండ్యా.. ఈ ఏడాది తాము కచ్చితంగా అనుకున్న ఫలితాన్ని రాబడతామని ధీమా వ్యక్తం చేశాడు.రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గదు‘‘నేను చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. అప్పుడు కూడా గెలుస్తామనే నేను విశ్వసించాను. అయితే, నేను ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీలో ఆడాను. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది, కాన్ఫిడెన్స్ గురించి నన్ను అడిగితే.. రోజురోజుకూ అది పెరుగుతుందే తప్ప తగ్గదు.ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టంఇక మా జట్టులో నాతో పాటు మరో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ఒక రకంగా నా అదృష్టం అని చెప్పాలి. నాకు అవసరమైనపుడు వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటా. టీమిండియాను మూడు ఫార్మాట్లలో భిన్న రీతిలో నడిపించిన వారి అనుభవం నాకు కచ్చితంగా అదనపు బలమే.నాకు వారు ఎల్లవేళలా మద్దతుగా ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో నా భుజం తట్టి నన్ను ముందుకు నడిపిస్తారు. మేమంతా కలిసి అనుకున్న రీతిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాం’’ అని హార్దిక్ పాండ్యా బుధవారం నాటి మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.కాగా టీమిండియా వన్డే, టెస్టు సారథి రోహిత్ శర్మతో పాటు.. టెస్టుల్లో రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దుఇదిలా ఉంటే.. ముంబై అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘నేను టాస్ కోసం వెళ్లినపుడు.. బ్యాటింగ్‌కి వెళ్లినపుడు నన్ను చీర్ చేయండి. సిక్సర్ బాదితే గట్టిగా అరవండి. వాంఖడే స్టేడియంలో నాకు ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను తప్పించి ముంబై ఫ్రాంఛైజీ గతేడాది పాండ్యాకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.అయితే, అతడి రాకతో రోహిత్, బుమ్రా, సూర్య అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ముంబై గతేడాది దారుణంగా విఫలమైన నేపథ్యంలో.. ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. చదవండి: BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ -
IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మార్చి 23న జరుగనుంది. ఆ రోజు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనుండగా.. ఎంఐ, సీఎస్కే మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తమ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సేవలు కోల్పోనుంది. గత సీజన్లో చేసిన తప్పుల కారణంగా హార్దిక్ సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. గత సీజన్లో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది.దీంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముంబై కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. గత సీజన్లో ముంబై గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో హార్దిక్‌పై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లోనే అతను నిషేధం ఎదుర్కొంటున్నాడు.హార్దిక్ గైర్హాజరీలో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారధిగా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇవాళ (మార్చి 19) స్వయంగా ప్రకటించాడు. సూర్యకుమార్‌కు భారత టీ20 జట్టు కెప్టెన్‌గా అనుభవం ఉండటంతో ఎంఐ మేనేజ్మెంట్ అతనికే సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది.కాగా, ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై అయిష్టతతో 2023 సీజన్ తర్వాత తప్పుకున్న విషయం తెలిసిందే. మరో సీనియర్ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్లలో ఒకరైన సూర్యకుమార్‌కే సీఎస్కేతో మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది.టీ20ల్లో సూర్య కుమార్ యాదవ్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. స్కై సారథ్యంలో భారత్ 18 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే ఓడింది. ఓవరాల్‌గా స్కై 39 టీ20 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి 28 మ్యాచ్‌ల్లో తన జట్టును గెలిపించుకున్నాడు. స్కై.. గతంలోనూ ఓ సందర్భంలో (2023 సీజన్లో) ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్కై తన కెప్టెన్సీలో బ్యాటర్‌గానూ విశేషంగా రాణించాడు. 37 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 8 హాఫ్ సెంచరీల సాయంతో 164.56 స్ట్రయిక్‌రేట్‌తో 1068 పరుగులు చేశాడు.కాగా, ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ దేశీయ స్టార్లపై ఆధారపడి ఉంది. మెగా వేలానికి ముందు ఆ జట్టు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను రీటైన్ చేసుకుంది. మెగా వేలంలోనూ ఆ జట్టు పెద్దగా విదేశీ స్టార్ల కోసం పాకులాడలేదు.విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి చేర్చుకుంది. ఈసారి జట్టులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్‌కు గతంలో ముంబై ఇండియన్స్‌తో అనుబంధం ఉంది. మెగా వేలంలో దక్కించుకున్న రీస్ టాప్లే గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. దేశీయ పేసర్ దీపక్ చాహర్‌ను ముంబై సీఎస్కేతో పోటీపడి దక్కించుకుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాజ్ భవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుథుర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, దీపర్ చాహర్, ముజీబ్ రెహ్మాన్ -
‘సిక్సర్’ కొట్టేదెవరో?
ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా గుర్తింపు... హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంచైజీగా రికార్డు... నైపుణ్యాన్ని వలవేసి పట్టే నేర్పరితనం... యువ ఆటగాళ్లకు అండగా నిలిచే యాజమాన్యం... వెరసి ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 ట్రోఫీలు సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు గత కొన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతోంది. రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు అప్పగించడంతో జట్టులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అభిమానుల అసహనం, మాజీల రుసరుసలు, విశ్లేషకులు వెటకారాలతో గత సీజన్ గడిచిపోగా... 2024 ఐపీఎల్ తర్వాత భారత జట్టుకు రోహిత్ శర్మ 2 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఈ రెండింట్లో హార్దిక్ కీలకపాత్ర పోషించడంతో సమస్య సమసిపోయినట్లైంది. మరి ఈ ఏడాదైనా ముంబై సమష్టిగా సత్తాచాటి మునుపటి జోరు సాగిస్తుందా చూడాలి! ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ఏదైనా ఉందంటే... అది ముమ్మాటికీ చెన్నై సూపర్ కింగ్సే! ఇప్పటి వరకు 15 సీజన్లు ఆడిన చెన్నై జట్టు అందులో 10 సార్లు ఫైనల్‌కు చేరి ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ గణాంకాలు చాలు ఐపీఎల్లో చెన్నై జోరు ఏంటో చెప్పేందుకు. వికెట్ల వెనక ధోని మాయాజాలం... కాన్వే, రచిన్ రవీంద్ర బ్యాటింగ్ సామర్థ్యం... శివమ్ దూబే, రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ మెరుపులు, అశ్విన్, పతిరణ బౌలింగ్ నైపుణ్యం ఇలా అన్నీ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్... ఆరో కప్పువేటకు సిద్ధమైంది. –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి నిలకడ కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ఆరోసారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని సీజన్లుగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ముంబై ఇండియన్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా సాగుతోంది. గత సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీకి ఐదు ట్రోఫీలు (2013, 2015, 2017, 2019, 2020) అందించిన ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మను కాదని... గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి సారథ్య బాధ్యతలు అప్పగించడం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని దుమ్మెత్తిపోసిన అభిమానులు... మైదానంలో హార్దిక్‌ను గేలి చేశారు. సొంత మైదానం వాంఖడేతో పాటు... దేశంలో ఎక్కడ మ్యాచ్ ఆడేందుకు వెళ్లినా... పాండ్యాకు ఇదే అనుభవం ఎదురైంది. దీంతో సహజంగానే డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణం దెబ్బతింది. అదే మైదానంలో ప్రస్ఫుటమైంది. గత సీజన్లో 14 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 10 పరాజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచింది. గత నాలుగు సీజన్లలో ఒక్కసారి (2023లో) మాత్రమే ముంబై జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరింది. 2022, 2024లో పట్టికలో కింది స్థానంతో లీగ్‌ను ముగించింది. అయితే అప్పటికీ ఇప్పటికీ జట్టులో ఎంతో తేడా కనిపిస్తోంది. ఏడాది వ్యవధిలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఐసీసీ టి20 ప్రపంచకప్‌తో పాటు, చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ రెండు విజయాల్లోనూ కీలకంగా నిలిచిన హార్దిక్ పాండ్యాను అభిమానులు తిరిగి అక్కున చేర్చుకున్నారు. దీనికి తోడు రోహిత్ వంటి అనుభవజ్ఞుడి సలహాలు, సూచనలు ఉంటే... పాండ్యా జట్టును మరింత ముందుకు తీసుకెళ్లడం ఖాయమే. బుమ్రా ఫిట్నెస్ సాధించేనా! ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా గాయపడ్డ భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ముంబై ఆందోళన చెందుతోంది. వెన్నునొప్పితో చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఈ ఏస్ పేసర్... ఐపీఎల్ తొలి దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండబోడని ఇప్పటికే ఫ్రాంచైజీ వెల్లడించింది. అయితే అతడి సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు. గతేడాది వేలంలో బుమ్రా, రోహిత్, హార్దిక్, సూర్యకుమార్‌తో పాటు హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. అందులో అత్యధికంగా బుమ్రాకు రూ. 18 కోట్లు కట్టబెట్టింది. యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌ను వేలానికి వదిలేసిన ముంబై... ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, సాంట్నర్‌తో బౌలింగ్‌ను మరింత పటిష్టం చేసుకుంది. రోహిత్‌తో కలిసి దక్షిణాఫ్రికా ప్లేయర్ రికెల్టన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. భారత ఆటగాళ్ల విషయంలో పటిష్టంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్... విదేశీ ఆటగాళ్ల ఎంపిక మాత్రం కాస్త అనూహ్యంగా ఉంది. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల విదేశీ పించ్ హిట్టర్ లోటు కనిపిస్తోంది. రూ.5 కోట్ల 25 లక్షలు వెచ్చించి ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి దక్కించుకున్న నమన్ ధీర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బుమ్రా గైర్హాజరీలో బౌల్ట్, సాంట్నర్, దీపక్ చాహర్, కరణ్ శర్మ పై బౌలింగ్ భారం పెరగనుంది. ఆంధ్ర ఆటగాడు పెనుమత్స సత్యనారాయణ రాజు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ జట్టులో ఉన్నా... వారికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కడం కష్టమే. ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), రోహిత్, సూర్యకుమార్, తిలక్, రాబిన్ మిన్జ్, రికెల్టన్, శ్రీజిత్ క్రిష్ణన్, జాకబ్స్, నమన్ ధీర్, జాక్స్, సాంట్నర్, అంగద్ , విఘ్నేశ్, కార్బిన్, బౌల్ట్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, అశ్వని కుమార్, టాప్లీ, వెంకట సత్యనారాయణ, అర్జున్ టెండూల్కర్, ముజీబ్, బుమ్రా. అంచనా: ముంబై ఇండియన్స్ ఆటతీరు పరిశీలిస్తే... ఆడితే అందలం, లేకుంటే అట్టడుగు స్థానం అనేది సుస్పష్టం. గత నాలుగు సీజన్లలో కేవలం ఒక్కసారే ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై... స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఈ సారి కూడా ప్లే ఆఫ్స్ చేరొచ్చు. సాధారణ ఆటగాడు సైతం... అసాధారణ ప్రదర్శన చేయడం... అప్పటి వరకు జట్టులో చోటు దక్కడమే కష్టమనుకున్న ప్లేయర్ సైతం... ‘ఎక్స్’ ఫ్యాక్టర్‌గా మారడం... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నిత్యకృత్యం.అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో చెన్నైని మించిన జట్టు లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు 5 సార్లు (2010, 2011, 2018, 2021, 2023) ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న సూపర్ కింగ్స్ మరో 5 సార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్‌గా నిలిచింది. గతేడాదే రుతురాజ్ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన ఫ్రాంచైజీ... అతడితో పాటు రవీంద్ర జడేజాకు రూ. 18 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది.పతిరణను రూ. 13 కోట్లు, శివమ్ దూబేను రూ. 12 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఐదేళ్లు దాటిపోయిన మహేంద్రసింగ్ ధోనిని రూ. 4 కోట్లకు కొనసాగించింది. వీరితో పాటు రచిన్ రవీంద్రను రూ. 4 కోట్లతో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి సొంతం చేసుకుంది. ఇక సుదీర్ఘ కాలం తర్వాత రవిచంద్రన్ అశ్విన్‌ను తిరిగి కొనుగోలు చేసుకుంది. మరి గత కొంత కాలంగా నిలకడగా రాణించలేకపోతున్న సూపర్ కింగ్స్ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. తలా... అన్నీ తానై! అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని... ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. పేరుకు రుతురాజ్ కెప్టెన్ అయినా... వికెట్ల వెనక నుంచి టీమ్‌కు దిశానిర్దేశం చేసేది ధోనినే అనడంలో సందేహం లేదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్న ధోనీ గతేడాది బ్యాటింగ్ ఆర్డర్లో మరీ కింది స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మరి ఈసారైనా అతని బ్యాట్ నుంచి మెరుపులు వస్తాయోమో చూడాలి. బ్యాటింగ్‌లో కాన్వే, రచిన్, దూబే, రుతురాజ్, జడేజా, ధోని కీలకం కానుండగా... పతిరణ, అశ్విన్, ఖలీల్ అహ్మద్, స్యామ్ కరన్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. రచిన్, జడేజా, దూబే, దీపక్ హూడా, విజయ్ శంకర్, అశ్విన్, జేమీ ఓవర్టన్, సామ్ కరన్ ఇలా లెక్కకు మిక్కిలి ఆల్‌రౌండర్లు ఉండటం చెన్నైకి అదనపు బలం. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ జట్టులో ఉన్నా... అతడికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్ ), మహేంద్రసింగ్ ధోని, కాన్వే, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వన్ష్ బేదీ, సిద్ధార్్థ, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్, స్యామ్ కరన్, అన్షుల్ కంబోజ్, దీపక్ హూడా, జేమీ ఓవర్టన్, కమలేశ్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముకేశ్, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎలీస్, శ్రేయస్ గోపాల్, పతిరణ. అంచనా: ఐపీఎల్లో మిగిలిన జట్లతో పోల్చుకుంటే అత్యధిక మంది ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్న చెన్నై స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఫైనల్ చేరడం పెద్ద కష్టం కాకపోవచ్చు. -
IPL: ‘గతేడాది ముంబై గెలవాల్సింది.. ఈసారీ ఆ జట్టు సూపర్.. కానీ..’
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆటగాళ్లు ఐకమత్యంగా ఉంటే ఆ జట్టును ఎవరూ ఓడించలేరని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. గతం తాలుకు చేదు అనుభవాలు, భేషజాలను వదిలేసి ‘స్టార్లంతా’ ఒకటిగా ముందుడుగు వేయాలని సూచించాడు. యాజమాన్యం సైతం ఈ విషయంలో మరింత చొరవ చూపాలని భజ్జీ విజ్ఞప్తి చేశాడు.కాగా ఐపీఎల్-2024 (IPL)లో ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను అందలమెక్కించింది. తమకు ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటు వేసి.. పాండ్యాను కెప్టెన్‌ను చేసింది. దీంతో అభిమానులు సైతం ముంబై ఓడిపోవాలని కోరుకుంటూ.. పాండ్యాను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.ఇక రోహిత్‌తో పాటు టీమిండియా స్టార్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా పాండ్యాకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారనే వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే మైదానంలో వీరి మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఫలితంగా పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం నాలుగే గెలిచిన ముంబై.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.విభేదాలు పక్కనపెట్టాలిఅయితే, ఈసారి విభేదాలన్నీ పక్కనపెట్టి ముంబై ఆటగాళ్లు గనుక కలిసికట్టుగా ఉంటే విజయం వారిదేనని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘జట్టు ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్ పనితీరును అంచనా వేస్తారు.అతడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నపుడు.. జట్టు మొత్తం రాణించింది. టైటిల్ గెలిచింది. అందుకే అతడు మంచి కెప్టెన్ అయ్యాడు. నిజానికి ముంబై జట్టు గతేడాది పటిష్టంగా ఉంది. ట్రోఫీ గెలవాల్సింది కూడా!బౌలింగ్ విభాగంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా.. బ్యాటింగ్‌లో మాత్రం బలంగా ఉంది. అయినా దారుణంగా ఓడిపోయింది. కలిసికట్టుగా ఉన్న జట్లే విజయం సాధిస్తాయి. గతం గతః.. ఆటగాళ్లు తమ మధ్య ఉన్న విభేదాలు పక్కనపెట్టాలి. ఈసారి ముంబై జట్టు మిగతా జట్ల కంటే పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వారికి అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. సరికొత్తగా ఈ సీజన్‌ను ఆరంభించి సమిష్టిగా రాణిస్తే జట్టుకు ఎదురే ఉండదు’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ జట్టు- వారి ధరజస్ప్రీత్ బుమ్రా (రూ. 18 కోట్లు), హార్దిక్ పాండ్యా (కెప్టెన్- రూ.16.35 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ (రూ. 8 కోట్లు) , ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు), దీపక్ చహర్ (రూ. 9.25 కోట్లు), నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు), విల్ జాక్స్ (రూ.5.25 కోట్లు), ఘజన్ఫర్ (రూ. 4.80 కోట్లు- గాయం వల్ల దూరం- అతడి స్థానంలో ముజీబ్ ఉర్ రెహమాన్)..మిచెల్ సాంట్నర్ (రూ. 2 కోట్లు), ర్యాన్ రికెల్టన్ (రూ. 1 కోటి), రీస్ టోప్లే (రూ. 75 లక్షలు), లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు), రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) , కరణ్ శర్మ (రూ.50 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ.30 లక్షలు), విఘ్నేశ్ (రూ.30 లక్షలు), సత్యనారాయణ (రూ. 30 లక్షలు), రాజ్ అంగద్ (రూ. 30 లక్షలు), శ్రీజిత్ కృష్ణన్ (రూ. 30 లక్షలు), అశ్వని కుమార్ (రూ. 30 లక్షలు), బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు). చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే! -
టీమిండియా స్టార్లు.. హార్డ్ హిట్టర్లు, దిగ్గజ పేసర్లు.. ముంబై ఈసారైనా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన మేటి జట్టుగా ముంబై ఇండియన్స్‌కు పేరుంది. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగానూ ముంబై రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. అయితే, గత కొంతకాలంగా అంబానీల ఫ్రాంఛైజీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. గతేడాది ఏకంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, మెగా వేలంలో తెలివైన కొనుగోళ్లతో మునుపటి వైభవం సాధించేలా ప్రణాళికలు రచించింది.విదేశీ, భారత్ ఆటగాళ్ల తో జట్టుని పునర్నిర్మించే ప్రయత్నం చేసింది. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా న్యూ జిలాండ్ వెటరన్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ. 12.50 కోట్లకు కొనుగోలు చేసి బలమైన బౌలింగ్ ని రూపొందించే ప్రయత్నం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ దీపక్ చాహర్‌ను కూడా జత చేసి తమ బౌలింగ్ యూనిట్‌ను మరింత బలోపేతం చేసుకుంది.మిచెల్ సాంట్నర్, కర్ణ్ శర్మలను చేర్చుకోవడంతో స్పిన్ విభాగం కూడా మరింత బలపడింది. ఇక విల్ జాక్స్, బెవాన్ జాకబ్స్, ర్యాన్ రికెల్టన్ లతో బ్యాటింగ్‌కు మునుపటి పదును సమకూర్చారు. అయితే భారత్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. విదేశీ ఆటగాళ్లతో పాటు, రాబిన్ మింజ్, విఘ్నేష్ పుత్తూర్ మరియు రాజ్ బావా వంటి వారిని కనుగోలు చేసి యువ జట్టుని నిర్మించే దిశగా పావులు కదిపింది. అందువల్ల, ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టు అన్ని స్థావరాలను కవర్ చేసే ఆల్ రౌండ్ జట్టును నిర్మించడానికి తమ పర్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించింది.ముంబై ఇండియన్స్‌లో ప్రధాన ఆటగాళ్లుట్రెంట్ బౌల్ట్ ఈ ఎడమచేతి వాటం సీమర్ మూడు సంవత్సరాల తర్వాత ఐపీఎల్ లో మళ్ళీ ముంబై ఇండియన్స్‌కు తిరిగి ఆడబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో ముంబై ఇండియన్స్‌కు చెందిన జట్ల తరపున ఆడుతూనే ఉన్నాడు. బౌల్ట్ పవర్‌ప్లేలో రాణించడంలో మంచి దిట్ట. బుమ్రాతో పాటు ముంబై బౌలింగ్ ని ప్రారంభించే అవకాశముంది.ర్యాన్ రికెల్టన్దక్షిణాఫ్రికాలో బాగా రాణిస్తున్న స్టార్లలో ఒకరు గా ఖ్యాతి గడించిన రికెల్టన్ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో తన బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించాడు. ఈ 28 ఏళ్ల వికెట్ కీపర్ ను మరో క్వింటన్ డి కాక్ గా నిపుణులు భావిస్తున్నారు.రాబిన్ మింజ్వికెట్ కీపర్ కూడా అయినా రాబిన్ మింజ్ తన అసాధారణ స్ట్రోక్ ప్లే తో విజృభించి ఆడగలడు. దురదృష్టవశాత్తు బైక్ ప్రమాదం కారణంగా గత సీజన్‌కు దూరమైన , మింజ్ ఈ సీజన్లో మళ్ళీ తన సత్తా చూపించాలిని పట్టుదలతో ఉన్నాడు.ముజీబ్ ఉర్ రెహమాన్గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్న తోటి ఆఫ్ఘన్ దేశస్థుడు ఎ ఎం గజన్ఫర్ స్థానంలో ఈ ఆఫ్ స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకున్నారు. రెహమాన్ తన టి 20 కెరీర్లో 18.11 సగటు తో నిలకడగా బౌలింగ్ చేయగల సామర్ధ్యముంది.బెవాన్ జాకబ్స్న్యూజిలాండ్ కి చెందిన 22 ఏళ్ల హార్డ్ హిట్టింగ్ బ్యాటర్. తన అసాధారణ స్ట్రోక్ ప్లే తో ఇటీవల కాలం లో బాగా రాణిస్తున్నాడు. టీ20 కెరీర్లో 148.42 స్ట్రైక్ రేట్ తో ఉన్న జాకబ్స్ ఈ సీజన్లో అనేక మంది బౌలర్లకు తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉంది.ముంబై ఇండియన్స్ జట్టుజస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధిర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహమాన్, విల్ జాక్స్, అశ్వనీ కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టాప్లే, క్రిష్ణన్ శ్రీజిత్, రాజ్ అంగద్ బవా, సత్యనారాయణ రాజు, బెవాన్ జేకబ్స్ అర్జున్ టెండుల్కర్, లిజాడ్ విలియమ్స్, విఘ్నేశ్ పుత్తూరు, కార్బిన్ బాష్.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
IPL 2025: హార్దిక్‌పై నిషేధం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్..?
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మార్చి 23న జరుగనుంది. ఆ రోజు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనుండగా.. ఎంఐ, సీఎస్కే మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ సేవలు కోల్పోనుంది. గత సీజన్లో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. దీంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముంబై కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు రూ.30లక్షల జరిమానా విధించడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. గత సీజన్లో ముంబై గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో హార్దిక్‌పై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 సీజన్లో తొలి మ్యాచ్‌లోనే అతను నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.తొలి మ్యాచ్‌లో హార్దిక్ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ సారధిగా వ్యవహరించే అవకాశం ఉంది. భారత టీ20 జట్టుకు సారధిగా వ్యవహరిస్తుండటంతో ఎంఐ యాజమాన్యం అతనిరే సారథ్య బాధ్యతలు అప్పజెప్పనుందని తెలుస్తుంది. రోహిత్ కెప్టెన్సీపై అయిష్టతను ఇదివరకే తెలియజేశాడు. మరో సీనియర్ బుమ్రా ఆరంభ మ్యాచ్‌లకు దూరమవుతాడని సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్లలో ఒకరైన సూర్యకుమార్‌కే తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావచ్చు.టీ20ల్లో టీమిండియా కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. స్కై సారథ్యంలో భారత్ 18 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే ఓడింది.కాగా, ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ దేశీయ స్టార్లపై ఆధారపడి ఉంది. మెగా వేలానికి ముందు ఆ జట్టు యాజమాన్యం రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను రీటైన్ చేసుకుంది. మెగా వేలంలోనూ ఆ జట్టు పెద్దగా విదేశీ స్టార్ల కోసం పాకులాడలేదు.విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి చేర్చుకుంది. ఈసారి జట్టులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్‌కు గతంలో ముంబై ఇండియన్స్‌తో అనుబంధం ఉంది. మెగా వేలంలో దక్కించుకున్న రీస్ టాప్లే గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. దేశీయ పేసర్ దీపక్ చాహర్‌ను ముంబై సీఎస్కేతో పోటీపడి దక్కించుకుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాజ్ భవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుథుర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, దీపర్ చాహర్, ముజీబ్ రెహ్మాన్ -
IND vs PAK: హార్దిక్ ధరించిన వాచీ ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 23) భారత్, పాకిస్తాన్ మ్యాచ్ (దుబాయ్ వేదికగా) జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) చేసి భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. కోహ్లి శతక్కొట్టడంతో 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించాడు. విరాట్‌తో కలిసి మూడో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేశాడు. అంతకుముందు ఓపెనర్ రోహిత్ శర్మ (20) తన సహజ శైలిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్‌మన్ గిల్ (46) యధావిధిగా క్లాసికల్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.కాగా, ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీతో పాటు మరో నాన్ క్రికెటింగ్ అంశం హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ధరించిన వాచీ అందరి దృష్టిని ఆకర్శించింది. ఈ వాచీ గురించి క్రికెట్ అభిమానులు ఆరా తీయగా కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూశాయి. ఈ వాచీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్‌ల్లో ఒకటైన రిచర్డ్ మిల్లె RM 27-02 టైమ్‌పీస్ అని తెలిసింది. దీని విలువ భారత కరెన్సీలో సుమారు 6.92 కోట్లుంటుంది. ఈ అల్ట్రా లగ్జరీ వాచ్ చాలా అరుదుగా దర్శనమిస్తుంది. అత్యంత సంపన్నులు మాత్రమే ఇలాంటి ఖరీదైన ఈ వాచీలను ధరించగలరు. ఈ వాచీ విలువ తెలిసి క్రికెట్ అభిమానులు షాక్ తిన్నారు.ఈ అరుదైన వాచీని మొదట టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాదల్ కోసం రూపొందించారని తెలుస్తోంది. ఇది విప్లవాత్మక కార్బన్ TPT యూనిబాడీ బేస్‌ప్లేట్‌కు ప్రసిద్ధి చెందింది. ఇలాంటి వాచీలు ఇప్పటివరకు కేవలం 50 మాత్రమే ఉత్పత్తి చేయబడ్డాయని సమాచారం.ఇదిలా ఉంటే, పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ భారత్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ 8 ఓవర్లు వేసి కీలకమైన బాబర్ ఆజమ్, సౌద్ షకీల్ వికెట్లు తీశాడు. అత్యంత పొదుపుగా కూడా బౌలింగ్ చేశాడు. 8 ఓవర్లలో కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం హార్దిక్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. అప్పటికే భారత విజయం ఖరారైపోయింది. మ్యాచ్‌ను తొందరగా ముగించే క్రమంలో హార్దిక్ 6 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో హార్దిక్ ఓ మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో హార్దిక్ 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో ఇప్పటివరకు 216 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హార్దిక్.. 30.76 సగటున 200 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్ల జాబితాలో హార్దిక్ 24వ స్థానంలో నిలిచాడు. -
గిల్ సెంచరీ కోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన రాహుల్.. అదే హార్దిక్ అయ్యుంటే..!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్‌కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్‌మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో గిల్ సెంచరీ అనంతరం సోషల్‌మీడియాలో ఓ టాపిక్ హైలైట్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు. గిల్ సెంచరీ కోసం రాహుల్ చేసిన త్యాగాన్ని నెటిజన్లు ప్రశంశిస్తున్నారు. రాహుల్ స్వలాభం కోసం ఆడే ఆటగాడు కాదని కితాబునిస్తున్నారు. రాహుల్ గతంలో కూడా ఓ సందర్భంలో విరాట్ కోహ్లి సెంచరీ కోసం తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు హార్దిక్ పాండ్యాను విమర్శిస్తున్నారు. రాహుల్ స్థానంలో హార్దిక్ ఉంటే గిల్ సెంచరీ పూర్తయ్యేది కాదని అంటున్నారు. హార్దిక్ చాలా సెల్ఫిష్ ఆటగాడని.. మ్యాచ్ పూర్తి చేసేందుకు అతను తోటి వారి మైలురాళ్ల గురించి పట్టించుకోడని కామెంట్స్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వెస్టిండీస్‌లో తిలక్ వర్మ (49) హాఫ్ సెంచరీని పట్టించుకోకుండా హార్దిక్ సిక్సర్స్‌తో మ్యాచ్‌ను మిగించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో గిల్ సెంచరీకి ముందు రాహుల్ ఎక్కడ ఔటవుతాడో, హార్దిక్ ఎక్కడ క్రీజ్‌లో వస్తాడో అని అని టెన్షన్ పడినట్లు చెబుతున్నారు. మొత్తానికి గిల్ అభిమానులు హార్దిక్‌ను ఏకి పారేసి, రాహుల్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో గిల్ సెంచరీకి సహకరించే క్రమంలో రాహుల్ చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్.. గిల్‌తో కలిసి ఐదో వికెట్‌కు అజేయమైన 87 పరుగులు జోడించి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ ఏమాత్రం తేడాగా ఆడిన ఫలితం వేరేలా ఉండేది. అప్పటికే భారత్.. రోహిత్, కోహ్లి, శ్రేయస్, అక్షర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. పిచ్ నుంచి కూడా బ్యాటర్లకు ఎలాంటి సహకారం లేదు. ఇలాంటి తరుణంలో రాహుల్ చాలా జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వ్యక్తిగత ప్రయోజనాన్ని పక్కన పెట్టి గిల్ సెంచరీకి కూడా సహకరించాడు. రాహుల్ సహకారంతో గిల్ వన్డేల్లో తన ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కూడా చాలా బాధ్యతాయుతంగా ఆడాడు. గిల్ చివరి వరకు క్రీజ్‌లో నిలదొక్కుకోకపోయినా ఫలితం వేరేలా ఉండేది. బంగ్లాదేశ్ బౌలర్లు పిచ్ స్వభావానికి తగట్టుగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఏదిఏమైనా గిల్, రాహుల్ భాగస్వామ్యం భారత్‌ను గెలిపించింది. అంతకుముందు రాహుల్ కీపింగ్‌లోనూ అదరగొట్టాడు. మూడు అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకుని బెస్ట్ ఫీల్డర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. -
డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ తిని బతికాడు.. ఇప్పుడు అతడే..: నీతా అంబానీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా స్టార్లుగా ఎదిగారు హార్దిక్ పాండ్యా(Hardik Pandya), జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah). క్రికెట్ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని సత్తా చాటుతున్నారు. అయితే, ఈ ఇద్దరిలో దాగున్న అద్భుత నైపుణ్యాలను తెరమీదకు తెచ్చింది మాత్రం ముంబై ఇండియన్స్ యాజమాన్యం అని చెప్పవచ్చు.అంతేకాదు పాండ్యా, బుమ్రా సాధారణ ఆటగాళ్ల నుంచి సూపర్స్టార్లుగా ఎదగడంలో ఈ ఐపీఎల్ ఫ్రాంఛైజీదే కీలక పాత్ర. ఇక ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్‌గా వెలుగొందుతుండగా.. హార్దిక్ పాండ్యా సైతం టీమిండియా కీలక ప్లేయర్‌గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించాడు. అంతేకాదు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ స్థాయికీ చేరుకున్నాడు.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమాని, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ(Nita Ambani) పాండ్యా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా, అతడి అన్న కృనాల్ పాండ్యాలో తాము ఆట పట్ల అంకిత భావాన్ని గుర్తించి అవకాశం ఇచ్చామని.. ఈరోజు వాళ్లు ఉన్నతస్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.అరుదైన గౌరవంకాగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. దార్శనిక నాయకత్వం, సమాజానికి చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ఆమెకు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా బోస్టన్‌లో మాట్లాడిన నీతా అంబానీ హార్దిక్ పాండ్యా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.‘‘ఐపీఎల్లో మాకు ఫిక్స్డ్ బడ్జెట్ ఉంటుంది. ఒక్కో ఫ్రాంఛైజీ ఇంతే ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంటుంది. అయితే, మేము ఆ డబ్బును కొత్త మార్గాల్లో ఖర్చుచేయాలనుకున్నాం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెలికితీయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లాం.బక్కపల్చగా, పొడుగ్గా ఉన్న ఇద్దరు యువకులుముఖ్యంగా రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు జరిగినప్పుడు నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్లేదాన్ని. నాతో పాటు మా స్కౌట్ బృందం కూడా ఉండేది. ప్రతి దేశవాళీ మ్యాచ్‌ను నిశితంగా గమనించేవాళ్లం. మా స్కౌట్ క్యాంపులో భాగంగా బక్కపల్చగా, పొడుగ్గా ఉన్న ఇద్దరు యువ ఆటగాళ్లను చూశాం.మ్యాగీ మాత్రమే తిని బతికారునేను వెళ్లి వాళ్లతో మాట్లాడాను. తాము గత మూడేళ్లుగా కేవలం మ్యాగీ మాత్రమే తిని బతుకుతున్నామని అప్పుడు వాళ్లు చెప్పారు. తమ దగ్గర డబ్బు లేదని అందుకే నూడుల్స్‌తో కడుపు నింపుకొంటున్నామని అన్నారు. అయితే, అప్పుడు నాకు వారిలో ఆట పట్ల ఉన్న నిబద్ధత.. ఏదో సాధించాలన్న బలమైన తపన కనిపించాయి.ఆ ఇద్దరు.. సోదరులు.. వారు మరెవరో కాదు.. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా. 2015లో నేను హార్దిక్ పాండ్యా కోసం రూ. 10 లక్షలు ఖర్చుచేసి వేలంలో అతడిని కొనుక్కున్నా. ఇప్పుడు అతడు ముంబై ఇండియన్స్‌కు గర్వకారణమైన కెప్టెన్’’ అని నీతా అంబానీ హార్దిక్ పాండ్యా నైపుణ్యాలపై ప్రశంసలు కురిపించారు.మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్రఇక ఆ మరుసటి ఏడాది.. తమకు మరో ఆణిముత్యం దొరికిందన్న నీతా అంబానీ.. ‘‘ఓ యువ క్రికెటర్. అతడి బాడీ లాంగ్వేజ్ భిన్నంగా ఉంది. అతడు బౌలింగ్ చేస్తే చూడాలని అక్కడ కూర్చున్నాం. తానేంటో అతడు బంతితోనే నిరూపించుకున్నాడు. అతడు బుమ్రా. ఇక ఆ తర్వాత జరిగిందంతా ఓ చరిత్ర’’ అంటూ జస్ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తారు. ఇక తిలక్ వర్మను కూడా తాము ఏరికోరి ఎంచుకున్నామన్న నీతా అంబానీ.. టీమిండియాకు ముంబై ఇండియన్స్ ఓ నర్సరీ లాంటిదంటూ తమ ఫ్రాంఛైజీపై ప్రశంసలు కురిపించారు.ఐపీఎల్ 2025లో పాల్గొనే ముంబై ఇండియన్స్ జట్టుహార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుతుర్, సత్యనారాయణ రాజు, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వని కుమార్, రీస్ టాప్లే, లిజాడ్ విలియమ్స్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.#WATCH | Boston, US: Reliance Foundation Founder-Chairperson Nita Ambani tells how she scouted for new talent for the Mumbai Indians team and included Hardik Pandya, Krunal Pandya, Jasprit Bumrah and Tilak Varma in the teamShe says, "In IPL, we all have a fixed budget, so every… pic.twitter.com/v0HriPJH8T— ANI (@ANI) February 17, 2025 -
IPL 2025: ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే..!
ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ షెడ్యూల్ ఇవాళ (ఫిబ్రవరి 16) విడుదలైంది. ఈ సీజన్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో ముంబై జట్టు తమ లాగే ఫైవ్ టైమ్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) తలపడనుంది. ఈ మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యమివ్వనుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ మొత్తం 14 మ్యాచ్‌లు (ప్లే ఆఫ్స్ కాకుండా) ఆడుతుంది. ఇందులో ఏడు తమ సొంత మైదానంలో ఆడనుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్.. సీఎస్కే, సన్‌రైజర్స్, లక్నో, గుజరాత్, ఢిల్లీతో తలో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. కేకేఆర్, ఆర్సీబీ, రాజస్థాన్, పంజాబ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచ్‌లు..మార్చి 23 (ఆదివారం)- సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ (చెన్నై)మార్చి 29 (శనివారం)- గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (అహ్మదాబాద్)మార్చి 31 (సోమవారం)- కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 4 (శుక్రవారం)- లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ (లక్నో)ఏప్రిల్ 7 (సోమవారం)- ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 13 (ఆదివారం)- ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)ఏప్రిల్ 17 (గురువారం)- సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 20 (ఆదివారం)- సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 23 (బుధవారం)- సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)ఏప్రిల్ 27 (ఆదివారం)- లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)మే 1 (గురువారం)- రాజస్థాన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (జైపూర్)మే 6 (మంగళవారం)- గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)మే 11 (ఆదివారం)- పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ధర్మశాల)మే 15 (గురువారం)- ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టు..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుతుర్, సత్యనారాయణ రాజు, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వని కుమార్, రీస్ టాప్లే, లిజాడ్ విలియమ్స్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
దుబాయ్‌కు పయనమైన టీమిండియా.. రోహిత్, కోహ్లి, గంభీర్లతో పాటు..
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫీవర్ మొదలైపోయింది. ఈ మెగా టోర్నమెంట్లో పాల్గొనేందుకు టీమిండియా దుబాయ్‌కు పయనమైంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)తో పాటు రోహిత్ సేన శనివారం ముంబై నుంచి బయల్దేరింది. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టీమిండియా సభ్యులు కనిపించడంతో అభిమానులు వారి ఫొటోలు తీసుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా 2017లో చివరిసారిగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరిగింది. నాడు ఫైనల్ చేరుకున్న భారత జట్టు అనూహ్య రీతిలో దాయాది పాకిస్తాన్ చేతి(India vs Pakistan)లో ఓటమిపాలై.. టైటిల్‌ను చేజార్చుకుంది. అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పుడు సమయం వచ్చింది.తటస్థ వేదికపైపాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ మొదలుకానుండగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు. అయితే, పాక్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు తమ దేశానికి తప్పక రావాలని పట్టుబట్టగా...బీసీసీఐ అందుకు నిరాకరించింది. ఆఖరికి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) జోక్యంతో తటస్థ వేదికపై టీమిండియా మ్యాచ్‌లు ఆడేందుకు మార్గం సుగమమైంది.ఈ నేపథ్యంలో ఐసీసీ నిర్ణయం మేరకు రోహిత్ సేన తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడనుంది. ఇందుకోసం జనవరి 18న ప్రాథమిక జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఇటీవలే రెండు మార్పులతో తమ జట్టును ఖరారు చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో చాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే పదిహేను మంది సభ్యుల వివరాలు మంగళవారం వెల్లడించింది.రెండు మార్పులుయువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను తప్పించి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటిచ్చిన యాజమాన్యం.. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా హర్షిత్ రాణాకు పిలుపునిచ్చింది. ఇక ఈ టోర్నీలో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.అనంతరం దాయాది పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 23న తలపడనున్న రోహిత్ సేన.. లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌ను మార్చి 2న ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్ ద్వారా ఈ వన్డే టోర్నీకి టీమిండియాకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించింది.మరో సానుకూలాంశంసొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్‌కు.. కెప్టెన్ రోహిత్ శర్మ(సెంచరీ), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(అర్ధ శతకం) ఫామ్‌లోకి రావడం మరో సానుకూలాంశం. ఇక ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే క్రమంలో రోహిత్ సేన శనివారమే దుబాయ్‌కు పయనమైంది. రోహిత్-కోహ్లిలతో పాటు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు.వీరితో పాటు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ సహా సహాయక సిబ్బంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయల్దేరారు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్ #WATCH | Mumbai: The first batch of the Indian Cricket team departs for Dubai to participate in the ICC Champions Trophy.All matches of Team India will be held in Dubai, while the rest will take place in Pakistan. The ICC Champions Trophy will begin on February 19 and will… pic.twitter.com/C4VdRPddyn— ANI (@ANI) February 15, 2025#WATCH | Mumbai: Cricketer Hardik Pandya arrives at the airport as the first batch of the Indian Cricket team departs for Dubai to participate in the ICC Champions Trophy. All matches of Team India will be held in Dubai, while the rest will take place in Pakistan. The ICC… pic.twitter.com/CmIjdDrRtW— ANI (@ANI) February 15, 2025 -
ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ మొదలుకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక 2017లో చివరగా విరాట్ కోహ్లి(Virat Kohli) సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ ఆడిన టీమిండియా.. ఈసారి రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీలో బరిలో దిగనుంది. నాటి జట్టులో భాగమైన కోహ్లి, రోహిత్‌తో పాటు.. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా కూడా ఈసారి చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు.ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నలుగురిలో ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కాబోతుందంటూ జోస్యం చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మీ అంచనా వందశాతం నిజమేనని మనస్ఫూర్తిగా చెబుతున్నా.కచ్చితంగా ఇలా జరిగే అవకాశం అయితే ఉంది. త్వరలోనే చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఆ తర్వాత వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ రూపంలో మరో ఐసీసీ టోర్నీ ఉంది. అయితే, ఈ ఈవెంట్లో టీమిండియా ఫైనల్‌కు చేరలేదు కాబట్టి.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఇందులో ఆడే అవకాశం లేదు.కారణం ఇదేఇక మరుసటి ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనుంది. అయితే, ఇప్పటికే ఈ ముగ్గురు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కాబట్టి ఇందులోనూ వీరు భాగం కాలేరు. ఇక.. మళ్లీ 2027లో వన్డే వరల్డ్‌కప్ జరుగుతుంది. అందుకు ఇంకా చాలా సమయమే ఉంది. అప్పటికి పరిస్థితుల్లో భారీ మార్పులు రావచ్చు. కాబట్టి.. కోహ్లి, రోహిత్, జడేజాలకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందని చెప్పవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.అన్నీ బాగుండి ఆడాలని కోరుకుంటే మాత్రంఅయితే, ఈ ముగ్గురు లేని లోటు తెలియకుండా టీమిండియా ఆడగలిగినపుడే ఇది సాధ్యమవుతుందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఫిట్‌గా ఉండటంతో పాటు ఫామ్ కొనసాగిస్తూ తమకు నచ్చినంత కాలం ఆడాలని ఫిక్సయితే మాత్రం వీరిని ఎవరూ ఆపలేరనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. అయితే, ఐపీఎల్లో మాత్రం ఈ ముగ్గురూ కొనసాగుతున్నారు. ఇక రోహిత్ త్వరలోనే 38వ వసంతంలో అడుగుపెట్టనుండగా.. కోహ్లి, జడేజాలకు ఇప్పుడు 36 ఏళ్లు. చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
BCCI: రోహిత్ సేనకు ప్రత్యేకమైన వజ్రపు ఉంగరాలు.. వీడియో చూశారా?
టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అరుదైన కానుకలు అందించింది. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో విజేతగా నిలిచిన భారత జట్టులోని సభ్యులకు వజ్రపుటుంగరాలు ప్రదానం చేసింది. ఉంగరాల పైభాగంలో అశోక్ చక్ర గుర్తుతో పాటు.. సైడ్‌లో ఆటగాళ్ల జెర్సీ నంబర్ వచ్చేలా ప్రత్యేకంగా వీటిని తీర్చిదిద్దారు.ఈసారి ప్రత్యేకమైన కానుకలుఅంతేకాదు.. ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు అజేయంగా నిలిచిన జట్టు జైత్రయాత్రకు గుర్తుగా విజయాల సంఖ్యను కూడా ఈ డిజైన్‌లో చేర్చారు. ఇటీవల నమన్ అవార్డుల వేడుక సందర్భంగా రోహిత్ సేన(Rohit Sharma&Co)కు ఈ వజ్రపు ఉంగరాలను బోర్డు ఆటగాళ్లకు అందజేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.‘‘టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాళ్లను చాంపియన్స్ రింగ్‌తో సత్కరిస్తున్నాం. వజ్రాలు శాశ్వతమే కావచ్చు. అయితే, కోట్లాది మంది హృదయాల్లో వీరు సంపాదించిన స్థానం మాత్రం ఎన్నటికీ చెక్కుచెదరదు. అలాగే ఈ ఉంగరం కూడా అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అని బీసీసీఐ పేర్కొంది.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికలుగా గతేడాది పొట్టి ప్రపంచకప్ టోర్నీ జరిగిన విషయం తెలిసిందే. లీగ్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచిన రోహిత్ సేన.. సౌతాఫ్రికాతో ఫైనల్లోనూ జయభేరి మోగించింది. ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. ట్రోఫీని దక్కించుకుంది.ఓవరాల్‌గా ఐదోసారితద్వారా దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి టీమిండియా ఖాతాలో ఐసీసీ టైటిల్ చేరింది. అదే విధంగా.. ఓవరాల్‌గా ఐదో ట్రోఫీ భారత్ కైవసమైంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొట్టతొలి ప్రపంచకప్(వన్డే) గెలిచిన టీమిండియా.. 2007లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ధోని నాయకత్వంలోనే 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని భారత్ దక్కించుకుంది. ఇక గతేడాది రోహిత్ శర్మ కూడా ఈ ఐసీసీ విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024లో గెలిచిన అనంతరం బీసీసీఐ రోహిత్ సేనకు అత్యంత భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. కళ్లు చెదిరే రీతిలో ఏకంగా రూ. 125 కోట్ల క్యాష్ ప్రైజ్‌ను కానుకగా ఇచ్చింది. నాడు ఇలా ఆటగాళ్లపై కనకవర్షం కురిపించిన బోర్డు.. తాజాగా వజ్రపు ఉంగరాలతో మరోసారి ఘనంగా సత్కరించింది.టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులోని సభ్యులురోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సంజు శాంసన్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్.చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్Presenting #TeamIndia with their CHAMPIONS RING to honour their flawless campaign in the #T20WorldCup 🏆Diamonds may be forever, but this win certainly is immortalised in a billion hearts. These memories will 'Ring' loud and live with us forever ✨#NamanAwards pic.twitter.com/SKK9gkq4JR— BCCI (@BCCI) February 7, 2025 -
హార్దిక్ లేకపోతే ఏంటి?.. అతడు లేకుండానే వరల్డ్‌కప్ ఆడాం: రోహిత్
హార్దిక్ పాండ్యా(Hardik Pandya) జట్టుతో లేకపోయినా తాము గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అన్నాడు. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సేవలు తమకు ముఖ్యమేనని.. అయితే, అతడి గైర్హాజరీలో కూడా తమవైన వ్యూహాలతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో వైఫల్యం తర్వాత రోహిత్ శర్మ సొంతగడ్డపై టీమిండియా తరఫున పునరాగమనం చేస్తున్నాడు.ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England)లో హిట్‌మ్యాన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్‌లో గురువారం తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా గురించి ప్రశ్న ఎదురైంది. ఒకవేళ పాండ్యా గాయపడితే అతడికి ప్రత్యామ్నాయ ఆటగాడు ఎవరంటూ విలేకరులు అడిగారు.ప్రతిసారీ నెగటివ్‌గానే ఎందుకు?ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ‘‘ప్రతిసారీ ప్రతికూల అంశాల గురించే మనం ఎందుకు మాట్లాడాలి? ‘అతడు గాయపడతాడు.. ఇతడికి గాయమవుతుంది.. అప్పుడెలా? ఇలా జరిగితే జట్టుకు కష్టమే’.. అనే మాటలు ఎందుకు?సెలక్టర్లు, నాయకత్వ దళంలో ఇందుకు సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. కానీ అవన్నీ మీకు చెప్పలేం కదా! కానీ మా వ్యూహాలు మాకుంటాయి. పాండ్యా గాయపడ్డా మేము వరల్డ్‌కప్ సజావుగానే పూర్తిచేశాం.అతడు గాయపడితే ఎలా అన్న ఆలోచన నాకు లేదుటోర్నీ మూడు లేదంటే నాలుగో మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడనుకుంటా. ఆ తర్వాత కూడా మేము టోర్నీ ఆసాంతం మంచి క్రికెట్ ఆడాం. ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. అప్పటి దాకా అజేయంగా నిలిచాం. కాబట్టి ఇప్పుడు అతడు గాయపడితే ఎలా అన్న విషయం గురించి నేను ఆలోచించడం లేదు. ఒకవేళ అతడు గాయపడినా ఏం చేయాలో మాకు తెలుసు. జట్టు మొత్తం సమిష్టిగా రాణిస్తే మాకు ఎలాంటీ సమస్యా ఉండదు’’ అని రోహిత్ శర్మ ఘాటుగా సమాధానమిచ్చాడు. కాగా సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా పాండ్యా గాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటిన పాండ్యాతద్వారా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.బ్యాట్‌తో, బంతితో రాణించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వరల్డ్‌కప్-2024లో 144 పరుగులు చేయడంతో పాటు పదకొండు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో 3/20తో రాణించి టీమిండియాకు విజయం అందించాడు. సౌతాఫ్రికా విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ల వికెట్లు తీసి రోహిత్ సేన చాంపియన్‌గా నిలవడంలో హార్దిక్ పాండ్యా ప్రధాన భూమిక పోషించాడు.ఇక ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లోనూ హార్దిక్ పాండ్యా ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా నాలుగో టీ20లో మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 30 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 53 పరుగులు రాబట్టాడు. ప్రస్తుతం అతడు వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యాడు. కాగా ఫిబ్రవరి 6(గురువారం), ఫిబ్రవరి 9(ఆదివారం), ఫిబ్రవరి 12(బుధవారం)న భారత్- ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియారోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా. చదవండి: CT 2025: ‘నాణ్యమైన బౌలర్.. సిరాజ్‌ను ఎలా పక్కనపెట్టారు?’ -
అభిషేక్ శర్మ విధ్వంసం..భారత్ గెలుపు సిరీస్ కైవసం (ఫొటోలు)
-
ఇంగ్లండ్‌తో ఐదో టీ20.. భారత జట్టులో కీలక మార్పులు! వారికి ఛాన్స్?
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో ఆఖరి టీ20 ఇరు జట్ల మధ్య ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను 4-1తో ముగించాలని భారత జట్టు భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. కాగా ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో సొంతం చేసుకుంది.ఈ క్రమంలో నామమాత్రపు మ్యాచ్ అయితే ఐదో టీ20లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. నాలుగో టీ20కు దూరమైన స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ జట్టుతో వన్డే సిరీస్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం అతడిని ఆడించాలని జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తోంది. ఈ విషయాన్ని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ ధ్రువీకరించాడు.కాగా షమీ తుది జట్టులోకి వస్తే అర్ష్‌దీప్ సింగ్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. మరోవైపు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి స్ధానంలో రమణ్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. కాగా గత కంకషన్‌కు గురైన శివమ్ దూబే ప్రస్తుతం కోలుకోనున్నట్లు సమాచారం. అతడు వాంఖడే టీ20లో కూడా ఆడే సూచనలు కన్పిస్తున్నాయి.సూర్య, సంజూ మెరుస్తారా?ఇక పేలవ ఆట తీరుతో నిరాశపరుస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ సంజూ శాంసన్‌లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ సిరీస్‌కు ముందు వరుస సెంచరీలతో సత్తాచాటిన శాంసన్.. స్వదేశంలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన సంజూ కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కూడా బౌన్సర్ బంతులకే సంజూ ఔట్ కావడం గమనార్హం. మరోవైపు సూర్యది కూడా అదే తీరు. సూర్యకుమార్ నాలుగు మ్యాచ్‌ల్లో 26 పరుగులే చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ రాణించాల్సిన అవసరముంది. కాగా బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారే అవకాశముంది. టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.ఐదో టీ20కు భారత తుది జట్టు(అంచనా): సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, రమణ్‌దీప్ సింగ్, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీచదవండి: నా భార్య లైవ్ చూస్తోంది.. నేను ఆ విషయం చెప్పలేను: రోహిత్ శర్మ -
పాండ్యా, దూబే మెరుపులు.. 3–1తో సిరీస్ టీమిండియా వశం (ఫొటోలు)
-
పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం
టాప్–ఫోర్ పరుగుల్లో వెనుకబడినా... ఓ దశలో జట్టు స్కోరు(12/3) గుబులు రేపినా... మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల మెరుపులతో భారత్ మ్యాచ్ గెలిచి టి20 సిరీస్ కైవసం చేసుకుంది. వరుణ్ మాయాజాలం మలుపుతిప్పగా... రవి బిష్ణోయ్, హర్షిత్ రాణాల బౌలింగ్ భారత్ నాలుగో టి20లో గెలిచేలా చేసింది. పుణే: సమం కాదు... సొంతమే! సిరీస్‌ను ఆఖరి సమరం దాకా లాక్కెళ్ల కుండా భారత్ నాలుగో టి20లోనే తేల్చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన 15 పరుగులతో ఇంగ్లండ్‌పై గెలిచి ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. ఇంగ్లండ్ బౌలర్ సకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగుల వద్ద ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (26 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), డకెట్ (19 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపూ దంచేశారు. అయితే గత మ్యాచ్ మాదిరి వరుణ్ చక్రవర్తి (2/28) స్పిన్ మలుపు మరుగున పడకుండా... దూబే స్థానంలో ‘కన్కషన్’గా వచ్చిన హర్షిత్ రాణా (3/33), రవి బిష్ణోయ్ (3/28) పేస్–స్పిన్‌ల వైవిధ్యం ఇంగ్లండ్‌ను లక్ష్యానికి దూరం చేసింది. దూబే, పాండ్యా ఫిఫ్టీ–ఫిఫ్టీ సంజూ సామ్సన్ (1), తిలక్‌వర్మ (0), కెపె్టన్ సూర్యకుమార్ (0)ల వైఫల్యంతో భారత్ 12/3 స్కోరు వద్ద కష్టాల్లోపడింది. అభిõÙక్ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్)ల జోరు ఎంతోసేపు సాగలేదు. ఈ దశలో దూబే, పాండ్యా ఆరో వికెట్‌కు వేగంగా 87 పరుగులు జోడించారు.27 బంతుల్లో హార్దిక్, 31 బంతుల్లో దూబే అర్ధసెంచరీలు సాధించారు. దీంతో భారత్ పోరాడే లక్ష్యం నిర్దేశించగలిగింది. మరోవైపు డకెట్, సాల్ట్ (23; 4 ఫోర్లు)లు ధాటిగా ఛేదన ఆరంభించారు. ఇంగ్లండ్ స్కోరు 62కు చేరగానే డకెట్, కాసేపటికే సాల్ట్, బట్లర్ (2)... వందకు చేరే క్రమంలో లివింగ్‌స్టోన్ (9) అవుటయ్యారు. అయినా 14 ఓవర్లలో 124/4 స్కోరు వద్ద ఇంగ్లండ్ పటిష్టంగానే కనిపించింది. ఈ దశలో 15వ ఓవర్ వేసిన వరుణ్ క్రీజులో పాతుకుపోయిన బ్రూక్‌తో పాటు బ్రైడన్ కార్స్ (0)లను అవుట్ చేయడంతో 30 బంతుల్లో 49 పరుగుల సమీకరణం విజయానికి ఊపిరిపోసింది. బిష్ణోయ్, రాణాలు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) కార్స్ (బి) సకిబ్ 1; అభిషేక్ (సి) జాకబ్ (బి) రషీద్ 29; తిలక్ (సి) ఆర్చర్ (బి) సకిబ్ 0; సూర్యకుమార్ (సి) కార్స్ (బి) సకిబ్ 0; రింకూసింగ్ (సి) రషీద్ (బి) కార్స్ 30; దూబే రనౌట్ 53; పాండ్యా (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 53; అక్షర్ (సి) జాకబ్ (బి) ఓవర్టన్ 5; అర్ష్ దీప్ రనౌట్ 0; రవిబిష్ణోయ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–12, 4–57, 5–79, 6–166, 7–180, 8–180, 9–181. బౌలింగ్: ఆర్చర్ 4–0–37–0, సకిబ్ 4–1–35–3, బ్రైడన్ కార్స్ 4–0–39–1, ఓవర్టన్ 4–0–32–2, అదిల్ రషీద్ 4–0–35–1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) అక్షర్ 23; డకెట్ (సి) సూర్యకుమార్ (బి) బిష్ణోయ్ 39; బట్లర్ (సి) రాణా (బి) బిష్ణోయ్ 2; బ్రూక్ (సి) అర్ష్ దీప్ (బి) వరుణ్ 51; లివింగ్‌స్టోన్ (సి) సామ్సన్ (బి) రాణా 9; జాకబ్ (సి) సూర్యకుమార్ (బి) రాణా 6; కార్స్ (సి) అర్ష్ దీప్ (బి) వరుణ్ 0; ఓవర్టన్ (బి) రాణా 19; ఆర్చర్ (బి) బిష్ణోయ్ 0; రషీద్ నాటౌట్ 10; సకిబ్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 166. వికెట్ల పతనం: 1–62, 2–65, 3–67, 4–95, 5–129, 6–133, 7–137, 8–146, 9–163, 10–166. బౌలింగ్: అర్ష్ దీప్‌సింగ్ 3.4–0–35–1, హార్దిక్ పాండ్యా 1–0–11–0, వరుణ్ చక్రవర్తి 4–0–28–2, అక్షర్ పటేల్ 3–0–26–1, రవి బిష్ణోయ్ 4–0–28–3, హర్షిత్ రాణా 4–0–33–3. -
IND VS ENG 4th T20: విరాట్ కోహ్లిని అధిగమించిన హార్దిక్ పాండ్యా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా (Team India) మాజీ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు దోహదపడిన పాండ్యా.. భారత్ తరఫున డెత్ ఓవర్లలో (16 నుంచి 20) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. పాండ్యా ఈ రికార్డును సాధించే క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) అధిగమించాడు. విరాట్ డెత్ ఓవర్లలో 192.54 స్ట్రయిక్‌రేట్‌తో 1032 పరుగులు చేయగా.. పాండ్యా 174.24 స్ట్రయిక్‌రేట్‌తో 1068 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో టీ20లో హార్దిక్ పాండ్యా శివాలెత్తిపోయాడు. చాలాకాలం తర్వాత అతని బ్యాట్ నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్ జాలు వారింది. ఈ మ్యాచ్‌లో తొలి 14 పరుగులు చేసేందుకు 17 బంతులు తీసుకున్న హార్దిక్.. ఆతర్వాత చేసిన 39 పరుగులను కేవలం 13 బంతుల్లో రాబట్టాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి హార్దిక్ స్కోర్ 17 బంతుల్లో 14 పరుగులు కాగా.. 18 ఓవర్ ముగిసే సరికి అతని స్కోర్ 30 బంతుల్లో 53 పరుగులుగా ఉండింది. 15-18 ఓవర్ల మధ్యలో హార్దిక్.. శివమ్ దూబేతో కలిసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్, శివమ్ దూబే (Shivam Dube) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. 12 పరుగుల వద్ద ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్‌ను హార్దిక్ పాండ్యా , శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు.వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది.చివరి ఓవర్‌ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 23, బెన్ డకెట్ 39, జోస్ బట్లర్ 2 పరుగులు చేసి ఔట్ కాగా.. హ్యారీ బ్రూక్ (12), లివింగ్‌స్టోన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బిష్ణోయ్ 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 60 బంతుల్లో 96 పరుగులు చేయాలి. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
కెప్టెన్‌గా సూర్యా ఏంటి?.. నేనైతే షాకయ్యా: టీమిండియా మాజీ కోచ్
ఒకప్పుడు టీమిండియాలో చోటు కోసం పరితపించిపోయిన సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఇప్పుడు కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు. ముప్పై ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన అతడు.. పొట్టి ఫార్మాట్లో తనను తాను నిరూపించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. టీ20లో ప్రపంచ నంబర్ వన్(ICC World No.1 Batter) బ్యాటర్‌గా సత్తా చాటిన అతడు.. మూడేళ్ల వ్యవధిలోనే అనూహ్యంగా భారత జట్టు(Team India T20 Captain) నాయకుడిగా పగ్గాలు చేపట్టాడు.కెప్టెన్‌గా వరుస విజయాలుపూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీలంకలో క్లీన్‌స్వీప్ విజయం అందుకున్న సూర్య... బంగ్లాదేశ్‌పై కూడా ఇదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. యువ జట్టుతో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లి అక్కడా టీ20 సిరీస్‌ను 3-1తో గెలిచి తనను తాను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సూర్య సారథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్ గెలవడంలో టీమిండియా బిజీగా ఉంది.ఈ నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్(Sanjay Bangar) సూర్యకుమార్ యాదవ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తక్కువ కాలంలోనే అతడు కెప్టెన్ స్థాయికి చేరుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నియామకం దాదాపు ఖరారైపోయిందన్న తరుణంలో సూర్య సారథిగా ఎంపిక కావడం నిజంగా ఓ షాక్ అన్నాడు.హార్దిక్ పాండ్యాకు బదులు సూర్య.. నేనైతే షాకయ్యాఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ ‘షో’లో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది హార్దిక్ పాండ్యానే కాబోయే కెప్టెన్ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా సూర్య పేరు బయటకు వచ్చింది. నిజంగా కెప్టెన్‌గా అతడి నియామక ప్రకటన రాగానే.. నేనైతే షాకయ్యా. ఏదేమైనా.. నాయకుడిగా అతడు ఎదిగిన తీరు అద్భుతం.రోహిత్, కోహ్లి, జడేజా రిటైర్మెంట్ తర్వాత.. యువకులతో కూడిన జట్టు లభించడం కూడా అతడికి కలిసి వచ్చింది. వాళ్లలో ఒకడిగా ఉంటూనే.. నవతరం నాయకుడిగా సూర్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకునే వీలు కలిగింది.ఇక బ్యాటర్‌గా అతడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. బౌలర్ చేతి నుంచి బంతి వెలువడకముందే.. దానిని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా పర్ఫెక్ట్ షాట్‌తో రెడీ ఉండటం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అందులో సూర్య ఒకడు.అతడో అద్భుత బ్యాటర్ఆసియా కప్ సమయంలో ప్రత్యర్థి జట్టు బౌలర్లు సూర్యను ఎదుర్కొనేందుకు పడ్డ కష్టాలను మేము చూశాం. వాళ్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక కొత్త షాట్‌తో బంతిని ఎదుర్కోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. 360 డిగ్రీలలో షాట్లు బాదగల క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. అయితే, అప్పటికప్పుడు పరిస్థితికి అనుగుణంగా.. తన ప్రణాళికను మార్చుకుని షాట్లు ఆడటంలో దిట్ట. అతడో అద్భుత బ్యాటర్’’ అని సంజయ్ బంగర్ సూర్యను ప్రశంసించాడు.గొప్ప కెప్టెన్ కూడామరోవైపు.. ఇదే షోలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గానూ అతడిలో టెంపర్మెంట్ సూపర్. గొప్ప ఇన్నింగ్స్ ఆడిన ప్రతిసారీ మరింత ప్రశాంతంగా.. నిరాడంబరంగా ఉండటం అతడికే చెల్లింది. అతడి మనసు మంచిది. టెస్టు కెప్టెన్సీకి బుమ్రా సరైనవాడని ఎలా అనుకుంటున్నామో.. టీ20లకు సూర్య అత్యుత్తమ కెప్టెన్ అని ఇప్పటికే రుజువైంది’’ అని సూర్యకుమార్ యాదవ్‌ను కొనియాడాడు. చదవండి: రెండు వరల్డ్‌కప్‌లు ఆడాడు.. ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమే! -
అద్భుత బ్యాటర్.. లోయర్ ఆర్డర్లో పంపిస్తారా?: కెవిన్ పీటర్సన్
రాజ్‌కోట్ టీ20(Rajkot T20I)లో టీమిండియా ఆట తీరును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ విమర్శించాడు. బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేకపోవడం వల్లే ఓటమి ఎదురైందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. కోల్‌కతా, చెన్నైలలో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. తద్వారా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన సూర్యకుమార్ సేనకు పరాజయం ఎదురైంది.బ్యాటర్ల వైఫల్యం వల్లేఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిని చవిచూసింది. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా బ్యాటర్ల వైఫల్యమేనని చెప్పవచ్చు. గత రెండు మ్యాచ్‌లలో టీమిండియా టాపార్డర్ ఒకే విధంగా ఉంది. ఓపెనర్లుగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ.. వన్‌డౌన్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వచ్చారు. ఇక నాలుగో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ చేశాడు.హార్దిక్ ఐదో నంబర్లోమూడో టీ20లోనూ ఈ నలుగురి స్థానాలు మారలేదు. కానీ వరుస విరామాల్లో వికెట్లు పడిన వేళ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మేనేజ్మెంట్ ప్రమోట్ చేసింది. ఐదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు దిగాడు. మరోవైపు.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం ఆ తర్వాతి స్థానాల్లో మరో ఇద్దరు ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్(6), అక్షర్ పటేల్(15)లను రంగంలోకి దించారు.ఎనిమిదో స్థానంలో జురెల్అదే విధంగా.. అచ్చమైన బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. ఇక హార్దిక్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇరవైకి పైగా బంతులు తీసుకుని.. మొత్తంగా 35 బంతుల్లో 40 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే.. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చే సమయానికి.. టీమిండియా విజయలక్ష్యానికి ఓవర్‌కు పదహారు పరుగులు చేయాల్సిన పరిస్థితి.ఇలాంటి తరుణంలో ఒత్తిడిలో చిత్తైన జురెల్ నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయిన టీమిండియా 145 పరుగులకే పరిమితమైంది. తద్వారా ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం పాలైంది.అద్భుత నైపుణ్యాలు ఉన్న బ్యాటర్‌ను పక్కనపెట్టిఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. టీమిండియా అనవసరంగా ఆల్రౌండర్లను ముందు పంపిందని అభిప్రాయపడ్డాడు. వారికి బదులు జురెల్‌ను పంపించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు.ఈ మేరకు.. ‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ నాకు అస్సలు నచ్చలేదు. ఇది సరైంది కానేకాదు. ధ్రువ్ జురెల్ అచ్చమైన, స్వచ్ఛమైన బ్యాటర్. అద్భుత నైపుణ్యాలు ఉన్న ఆటగాడు. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసమని అతడిని లోయర్ ఆర్డర్లో పంపించడం సరికాదు. జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లు కచ్చితంగా కాస్త టాప్ ఆర్డర్‌లోనే రావాలి’’ అని కెవిన్ పీటర్సన్ హిందుస్తాన్ టైమ్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- మూడో టీ20 స్కోర్లు👉టాస్: ఇండియా.. తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సూర్య👉ఇంగ్లండ్ స్కోరు: 171/9 (20)👉ఇండియా స్కోరు: 145/9 (20)👉ఓవరాల్ టాప్ రన్ స్కోరర్: బెన్ డకెట్(28 బంతుల్లో 51)👉టీమిండియా టాప్ రన్ స్కోరర్: హార్దిక్ పాండ్యా(35 బంతుల్లో 40)👉ఫలితం: ఇండియాపై 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(5/24).చదవండి: అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదే: సూర్య -
ICC టీ20 జట్టు ప్రకటన: కెప్టెన్‌గా రోహిత్, నో కోహ్లి! భారత్ నుంచి నలుగురు
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)- 2024(ICC Mens T20I Team of the Year) ఏడాదికి గానూ పురుషుల అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. పొట్టి ఫార్మాట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లను శనివారం వెల్లడించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) ఎంపికయ్యాడు.ఇక హిట్‌మ్యాన్‌తో పాటు మరో ముగ్గురు భారత స్టార్ క్రికెటర్లకు ఈ టీమ్‌లో చోటు దక్కింది. అయితే, ఇందులో విరాట్ కోహ్లి(Virat Kohli) మాత్రం లేకపోవడం గమనార్హం. మరోవైపు.. ఈ జట్టులో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్ ఎంపిక కాగా.. వన్‌డౌన్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ చోటు దక్కించుకున్నాడు.ఇక మిడిలార్డర్లో నాలుగో స్థానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, ఐదో నంబర్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్ కోటాలో వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ స్థానం సంపాదించాడు. ఏడో స్థానంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక కాగా.. అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్, శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. పేస్ దళంలో టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు యువ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ స్థానం సంపాదించుకున్నారు. రోహిత్ రిటైర్మెంట్టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2024లో 11 అంతర్జాతీయ టీ20లు ఆడి 378 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. స్ట్రైక్‌రేటు 160.16. తన అద్భుత నాయకత్వ లక్షణాలతో టీమిండియాను వరల్డ్‌కప్-2024 చాంపియన్‌గా నిలిపాడు. దాదాపు పదమూడేళ్ల తర్వాత మరోసారి టీమిండియాకు ఐసీసీ ట్రోఫీని అందించాడు.నో కోహ్లిఈ మెగా టోర్నీలో భారత్ జగజ్జేతగా నిలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్‌తో పాటు ఈ ఈవెంట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లికి మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. ఇక రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా కూడా వెస్టిండీస్‌లో సౌతాఫ్రికాతో ఫైనల్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు.ఇక గతేడాది ట్రవిస్ హెడ్ 15 టీ20లలో కలిపి 539 పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ 17 మ్యాచ్‌లు ఆడి 467 రన్స్ చేశాడు. బాబర్ ఆజం 24 మ్యాచ్‌లలో కలిపి 734 పరుగులతో రాణించాడు. నికోలస్ పూరన్ 21 మ్యాచ్‌లలో భాగమై 464 పరుగులు చేశాడు. ఇక జింబాబ్వే తరఫున ఎప్పటిలాగానే గతేడాది కూడా సికిందర్ రజా అదరగొట్టాడు. 24 మ్యాచ్‌లు ఆడి 573 పరుగులు చేశాడు.హార్దిక్ పాండ్యాది కీలక పాత్రటీమిండియా ఈసారి వరల్డ్‌కప్ గెలవడంలో భారత పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర. ఇక ఓవరాల్‌గా గతేడాది అతడు 17 మ్యాచ్‌లలో కలిపి 352 పరుగులు చేయడంతో పాటు 16 వికెట్లు తీశాడు.ఇక రషీద్ ఖాన్ 14 మ్యాచ్‌లు ఆడి 31 వికెట్లు తీశాడు. అత్యుత్తమంగా 4/14తో రాణించాడు. వనిందు హసరంగ 20 మ్యాచ్‌లలో కలిపి 179 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడినా 3/7 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి.. 15 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. మరో టీమిండియా స్టార్ అర్ష్‌దీప్ సింగ్ 18 మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/9. ఇతడు సాధించిన 36 వికెట్లలో పదిహేడు వరల్డ్‌కప్-2024 టోర్నీలో తీసినవే. తద్వారా నాటి మెగా ఈవెంట్లో సెకండ్ లీడింగ్వికెట్ టేకర్గానిలిచాడు.ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2024రోహిత్ శర్మ(కెప్టెన్- ఇండియా),ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్), బాబర్ ఆజం(పాకిస్తాన్), నికోలస్ పూరన్(వికెట్ కీపర్- వెస్టిండీస్), సికందర్ రజా(జింబాబ్వే), హార్దిక్ పాండ్యా(ఇండియా), రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రా(ఇండియా), అర్ష్‌దీప్ సింగ్(ఇండియా). -
మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. హార్దిక్ మాత్రం: సూర్య
సౌతాఫ్రికా గడ్డపై విజయం తర్వాత సూర్యకుమార్ సేన స్వదేశంలో మరో పొట్టి ఫార్మాట్ పోరుకు సిద్ధమైంది. ఇంగ్లండ్(India Vs England)తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా బుధవారం తొలి టీ20 ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పరుగుల వరద పారించేందుకు సై అంటున్నాయి.ఇక టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో సెమీస్‌లో తలపడ్డ ఇండియా- ఇంగ్లండ్ ముఖాముఖి పోటీపడటం ఇదే తొలిసారి. నాడు టీమిండియా చేతిలో చిత్తైన ఇంగ్లిష్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుండగా.. ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. దీంతో ఈ పోరు మరింత రసవత్తరంగా మారనుంది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024 సమయంలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో అదరగొట్టిన ఈ ఆల్‌రౌండర్‌ను కాదని.. సూర్యకుమార్ యాదవ్‌ను రోహిత్ శర్మ(Rohit Sharma) వారసుడిగా ప్రకటించింది. సారథిగా సూపర్ హిట్ఈ క్రమంలో గతేడాది శ్రీలంక పర్యటన సందర్భంగా టీ20 పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సూర్య.. 3-0తో క్లీన్స్వీన్ విజయంతో ప్రస్థానం ఆరంభించాడు. అనంతరం సొంతగడ్డపై బంగ్లాదేశ్‌పై కూడా సూర్య ఇదే ఫలితం పునరావృతం చేయగలిగాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో 3-1తో టీమిండియాను గెలిపించాడు. ఇక ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ల నేపథ్యంలో కొత్త వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాతో సూర్య అనుబంధం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశంలో భాగంగా ఈ ప్రస్తావన రాగా సూర్య హుందాగా స్పందించాడు.మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. హార్దిక్ మాత్రం‘‘హార్దిక్ పాండ్యాతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. మా నాయకత్వ బృందంలో అతడు ఎల్లప్పుడూ కీలక భాగమే. భారత జట్టును ఎలా నడిపించాలో మాకందరికీ బాగా తెలుసు. మైదానంలోకి దిగాక జట్టు కోసం అందరం చర్చించే నిర్ణయం తీసుకుంటాం. సరిగ్గా చెప్పాలంటే మా జట్టులో ఒకరికంటే ఎక్కువ మంది కెప్టెన్లు ఉన్నారు. మైదానంలో అవసరమైనపుడు సూచనలు, సలహాలు ఇస్తారు.ఇక హెడ్ కోచ్ గౌతం గంభీర్‌తో కూడా నేను గతంలో కలిసి పని చేశాను. ఆయన ఆటగాళ్లకు మంచి స్వేచ్ఛనిస్తారు. కోచ్ పర్యవేక్షణలో ప్రస్తుతం మా జట్టు సరైన దిశలోనే వెళుతోంది. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ బాగా ఆడుతున్నాడు కాబట్టి మరో ప్లేయర్ గురించి ఆలోచన లేదు.ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్లుటీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ఆలోగా దాదాపు ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడి టీమ్‌ను సిద్ధం చేయడం ముఖ్యం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. జట్టులో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూనే.. తమ భవిష్యత్తు ప్రణాళిక గురించి కూడా వివరించాడు.నేను బాగా ఆడలేదు కాబట్టేఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై కూడా సూర్య ఈ సందర్భంగా స్పందించాడు. వన్డే ఫార్మాట్లో తన ప్రదర్శన బాగా లేనందువల్లే ఎంపిక కాలేదని నిజాయితీగా ఒప్పుకొన్నాడు. ఏదేమైనా వన్డేల్లో బాగా ఆడలేకపోవడమే తనను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని తెలిపాడు.చదవండి: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. కెప్టెన్‌గా సంజూ శాంసన్! నితీశ్‌కు చోటు? -
జాన్వీ కపూర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్..? అసలు ట్విస్ట్ ఏంటంటే..
-
IPL 2025: ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్(Mumbai Indians) గతేడాది ఘోర పరాభవాన్ని చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. స్టార్ ప్లేయర్లు ఉన్నా పేలవ ప్రదర్శనతో చతికిలపడి అవమానభారంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.అయితే, ఈ దుస్థితికి యాజమాన్యమే కారణమని ముంబై ఇండియన్స్ అభిమానులే విమర్శల వర్షం కురిపించారు. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు అంబానీల సారథ్యంలోని ముంబై జట్టు.. తమ కెప్టెన్‌ను మార్చడమే ఇందుకు ప్రధాన కారణం. ముంబై ఫ్రాంఛైజీకి ఘనమైన చరిత్ర ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోక్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా ముంబై నిలిచింది. రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలో ఏకంగా ఐదుసార్లు టైటిల్ సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అయితే, గత సీజన్ ఆరంభానికి ముందు రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించిన మేనేజ్మెంట్..అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరీ.. పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది.పాండ్యాకు అవమానాలురోహిత్ శర్మ ఫ్యాన్స్‌తో పాటు.. ముంబై జట్టు అభిమానులు కూడా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో హార్దిక్ పాండ్యా మైదానంలోకి రాగానే అతడిని కించపరిచేలా పెద్ద ఎత్తున గోల చేశారు. ముంబై సొంత గ్రౌండ్ వాంఖడేలోనూ హార్దిక్‌కు ఇలాంటి చేదు అనుభవాలు తప్పలేదు. రోహిత్ కూడా అభిమానులను వారించకుండా మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిచ్చింది.రోహిత్ టీమ్ వర్సెస్ హార్దిక్ అనేలాహార్దిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేయడం రోహిత్ శర్మకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. రోహిత్‌తో పాటు.. అతడి తర్వాత కెప్టెన్ పదవిని ఆశించిన జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా హార్దిక్‌తో పొసగడం లేదనే వార్తలు గుప్పుమన్నాయి. ఫలితంగా ముంబై ఇండియన్స్ డ్రెసింగ్‌రూమ్‌లో విభేదాలు తలెత్తాయంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, మైదానంలో రోహిత్, బుమ్రా, సూర్య ఒక జట్టుగా కనిపించడం.. హార్దిక్ పాండ్యా ఒంటరిగా ఉండటం వీటికి బలాన్ని చేకూర్చాయి.ఫలితంగా వరుస ఓటముల రూపంలో ముంబై ఇండియన్స్ భారీ మూల్యమే చెల్లించింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి పొరపాటును పునరావృతం చేయకూడదని ముంబై యాజమాన్యం భావిస్తోందట. ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!ఇందుకోసం ఇటీవలే ప్రత్యేకంగా ఓ సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని మనస్ఫూర్తిగా అంగీకరించాలని.. అతడికి అన్ని వేళలా అండగా నిలవాలని జట్టులోని ప్రధాన ఆటగాళ్లతో మేనేజ్మెంట్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.అదే విధంగా.. ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఉండి.. జట్టు ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేయాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. హార్దిక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా అతడిని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.కాగా తనను కెప్టెన్‌గా తప్పించిన ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ బంధం తెంచుకుంటాడనే ప్రచారం జరుగగా.. అతడు మాత్రం అనూహ్య రీతిలో అదే ఫ్రాంఛైజీతో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు.రోహిత్ మళ్లీ ముంబైతోనే..ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రోహిత్ కూడా ఉండటం విశేషం. జస్ప్రీత్ బుమ్రా(రూ. 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ. 16.35 కోట్లు),హార్దిక్ పాండ్యా(రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ(రూ. రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ(రూ. 8 కోట్లు)లను ముంబై అట్టిపెట్టుకుంది. కాగా గత సీజన్ ఆఖరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా.. హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2025లో మొదటి మ్యాచ్ ఆడకుండా అతడిపై నిషేధం పడింది.చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథి?
ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. విశ్రాంతి పేరిట తనంత తానే తుదిజట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు రోహిత్ నిర్ణయం గొప్పదని కొనియాడుతున్నారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కెప్టెన్ బెంచ్‌కే పరిమితం కావడం అతడి పరిణతికి నిదర్శమని పేర్కొంటున్నారు.ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్పై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సిడ్నీ టెస్టు తర్వాత అతడు తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త తెర మీదకు వచ్చింది. టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ(ODI Captaincy) నుంచి వైదొలగనున్నాడనే వదంతులు వస్తున్నాయి.చివరగా లంక పర్యటనలో.. పరాభవంతో ఇంటికికాగా గతేడాది టీమిండియా ఒకే ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడింది. శ్రీలంక పర్యటనలో భాగంగా రోహిత్ సేన ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడి.. 0-2తో సిరీస్‌ను కోల్పోయింది. తద్వారా రెండున్నర దశాబ్దాల తర్వాత లంకకు వన్డే సిరీస్ సమర్పించుకున్న తొలి భారత జట్టుగా నిలిచింది. అంతేకాదు.. 45 ఏళ్ల తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక్క వన్డే కూడా గెలవని జట్టుగానూ అపఖ్యాతి మూటగట్టుకుంది రోహిత్ సేన.రోహిత్‌పై వేటు.. చాంపియన్స్ ట్రోఫీ నాటికి కొత్త సారథిఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) మొదలుకానుంది. ఈ మెగా వన్డే టోర్నీలో టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికైన దుబాయ్‌లో జరుగనున్నాయి. అయితే, ఈ ఐసీసీ ఈవెంట్ కంటే ముందు భారత్ ఒకే ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌లలో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నాయకత్వం వన్డే కెప్టెన్సీ మార్పు అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ బలవంతపు రిటైర్మెంట్కు చేరువైన రోహిత్.. ఇలాంటి మానసిక స్థితిలో ఇక జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధంగా లేడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.రేసులో ముందుంది అతడేశ్రీలంక పర్యటన తాలూకూ చేదు అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని.. వన్డే పగ్గాలను వేరొకరికి అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వన్డే కెప్టెన్సీ రేసులో ప్రధానంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya), శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, పాండ్యా వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు మైఖేల్ సైట్ పేర్కొంది.‘‘గిల్ ఇంకా పూర్తి స్థాయిలో పరిణతి చెందలేదు. అతడు నాయకుడిగా ఎదగడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ వన్డే గణాంకాలు అంత గొప్పగా లేవు.. ఈ టీ20 కెప్టెన్ పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పంత్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే సరైన కెప్టెన్ అనే భావన నాయకత్వంలో ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది.వరుస వైఫల్యాలతో సతమతంకాగా టెస్టుల్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమవుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై 3-0తో రోహిత్ సేన వైట్‌వాష్ కాగా.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరుస్తోంది. పెర్త్‌లో బుమ్రా సారథ్యంలో గెలిచిన భారత జట్టు.. రెండో టెస్టు నుంచి రోహిత్ కెప్టెన్సీలో విఫలమైంది.అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో ఓడి.. బ్రిస్బేన్‌లో వర్షం వల్ల డ్రాతో గట్టెక్కింది. మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడింది. ఈ సిరీస్‌లో రోహిత్ ఐదు ఇన్నింగ్స్ ఆడి మొత్తంగా కేవలం 31 పరుగులే చేశాడు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా ఆసీస్‌తో ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి విశ్రాంతి పేరిట తనంతట తానే స్వయంగా తప్పుకొన్నాడు. చదవండి: IND vs AUS: మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్ -
ఇద్దరం కలిసి ఇలా ఎంజాయ్ చేస్తున్నాం: హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
హార్దిక్ పాండ్యా విఫలం
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముగింపు దశకు చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా శుక్రవారం రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లకు బెంగళూరు ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో తొలి సెమీస్‌లో బరోడాతో ముంబై జట్టు తలపడుతోంది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది.బరోడా నామమాత్రపు స్కోరుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లలో శశ్వత్ రావత్(33) ఫర్వాలేదనిపించినా.. అభిమన్యు రాజ్‌పుత్(9) విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కృనాల్ పాండ్యా 24 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేయగా.. నాలుగో నంబర్ బ్యాటర్ భాను పనియా(2) నిరాశపరిచాడు.ఈ దశలో శివాలిక్ శర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక హార్దిక్ పాండ్యా ఐదు పరుగులకే నిష్క్రమించగా.. ఆల్‌రౌండర్ అతిత్ సేత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 22 పరుగులతో.. శివాలిక్ శర్మకు సహకారం అందించాడు.పాండ్యాను అవుట్ చేసిన దూబేఇక బరోడా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి మహేశ్ పితియా సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో సూర్యాంశ్ షెడ్గే రెండు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ అవస్థి, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను శివం దూబే అవుట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. ఈ ఇద్దరు టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ల మధ్య పోరులో దూబే పైచేయి సాధించాడు. దూబే బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి హార్దిక్ అవుటయ్యాడు. కాగా ఫామ్‌లో ఉన్న ముంబై బరోడా విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని సులువుగానే పూర్తి చేస్తుందని ఆ జట్టు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ముంబై జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదుక్వార్టర్ ఫైనల్లో విదర్భ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ముంబై సెమీస్‌కు చేరితే... బెంగాల్‌పై గెలిచి బరోడా ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ముంబై తరఫున సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే ఫుల్ ఫామ్‌లో ఉండగా... గత మ్యాచ్‌లో ఓపెనర్ పృథ్వీ షా కూడా రాణించాడు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెగ్డె, శార్దూల్ ఠాకూర్ ఇలా ముంబై జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు.ఢిల్లీతో మధ్యప్రదేశ్..మరోవైపు బరోడా జట్టుకు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా రూపంలో కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా బ్యాటింగ్ పరంగా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక రెండో సెమీఫైనల్లో ఆయుశ్ బదోనీ సారథ్యంలోని ఢిల్లీ జట్టు... మధ్యప్రదేశ్‌తో తలపడనుంది. ఢిల్లీకి అనూజ్ రావత్, యశ్ ధుల్ కీలకం కానుండగా... రజత్ పాటిదార్, వెంకటేశ్ అయ్యర్‌పై మధ్యప్రదేశ్ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. pic.twitter.com/DrAAm9Ubd1— Sunil Gavaskar (@gavaskar_theman) December 13, 2024 -
SMAT: టీమిండియా స్టార్ల మెరుపులు.. సెమీస్ చేరిన జట్లు, షెడ్యూల్
ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ తదితరులు ఈ టోర్నీలో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇక ఈ టీ20 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. మధ్యప్రదేశ్, బరోడా, ముంబై, ఢిల్లీ జట్లు టాప్-4లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్స్ తదితర అంశాలను గమనిద్దాం. అంతకంటే ముందు.. ఈ నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన తీరుపై ఓ లుక్కేద్దాం.పృథ్వీ షా, సూర్యాంశ్, శివమ్ దూబే మెరుపులు గ్రూప్ ‘ఇ’ టాపర్‌గా క్వార్టర్స్‌లో అడుగు పెట్టిన ముంబై అదే జోరు కొనసాగిస్తూ విదర్భను మట్టికరిపించింది. ఆలూరులో బుధవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలుపొందింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అథర్వ తైడె (41 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్), అపూర్వ్ వాంఖడె (33 బంతుల్లో 51; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించగా... శుభమ్ దూబే (19 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి గెలిచింది.సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి బంతి నుంచే ఓపెనర్లు విరుచుకుపడటంతో 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 83 పరుగులు చేసింది.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5), సూర్యకుమార్ యాదవ్ (9) విఫలం కాగా... ఆఖర్లో శివమ్ దూబే (37 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), సూర్యాంశ్ (36 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది.వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షోఆలూరు: పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (33 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు; 2/23) ఆకట్టుకోవడంతో... సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట సౌరాష్ట్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసింది. చిరాగ్ జానీ (45 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. అరి్పత్ గౌడ్ (42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ రజత్ పాటిదార్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చివర్లో హర్‌ప్రీత్ సింగ్ (9 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు.హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, 3 క్యాచ్‌లు బెంగళూరు: బెంగాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బరోడా 41 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ చేరింది. బరోడాకు ఆడుతున్న భారత స్టార్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టడంతోపాటు 3 క్యాచ్‌లు తీసుకున్నాడు. మొదట బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.శాశ్వత్ రావత్ (40; 1 ఫోర్, 3 సిక్స్‌లు), అభిమన్యు సింగ్ (37; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బెంగాల్ బౌలర్లలో షమీ, కనిష్క్ సేత్, ప్రతీప్తా ప్రమాణిక్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగాల్ తడబడింది. 18 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, లుక్మన్ మెరివాలా, అతిత్ సేత్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. అనూజ్ అదుర్స్బెంగళూరు: వికెట్ కీపర్ అనూజ్ రావత్ (33 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసకర అర్ధశతకంతో చెలరేగడంతో ఢిల్లీ జట్టు ముస్తాక్ అలీ టోర్నీ సెమీఫైనల్‌కు చేరింది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీ జట్టు 19 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టుపై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసింది.అనూజ్ రావత్‌తో పాటు ఓపెనర్లు యశ్ ధుల్ (42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో ఉత్తరప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు ప్రియం గార్గ్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో పోరాడగా... రింకూ సింగ్ (10), నితీశ్ రాణా (2) విఫలమవడంతో ఉత్తరప్రదేశ్‌కు పరాజయం తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3... ఆయుష్ బదోనీ, సుయాశ్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదిక, టైమింగ్స్తొలి సెమీ ఫైనల్:👉ముంబై వర్సెస్ బరోడా- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం- డిసెంబరు 13(శుక్రవారం)- ఉదయం 11 గంటలకు ఆరంభం.రెండో సెమీ ఫైనల్: 👉మధ్యప్రదేశ్ వర్సెస్ ఢిల్లీ- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం- డిసెంబరు 13(శుక్రవారం)- సాయంత్రం 4.30 నిమిషాలకు ఆరంభం.ఇప్పటి వరకు అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు సాధించింది వీరేసకీబుల్ గనీ ఈ సీజన్లో 353 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్‌గా ఉండగా.. కరణ్ లాల్ 338, అభిషేక్ పోరెల్ 335, అజింక్య రహానే 334, తిలక్ వర్మ 327 పరుగులు సాధించారు.మరోవైపు.. జగ్జీత్ సింగ్ 18 వికెట్లతో టాప్ బౌలర్‌గా ఉండగా.. కుమార్ కార్తికేయ 15, ముకేశ్ చౌదరి 15చ శ్రేయస్ గోపాల్ 14, కేవీ శశికాంత్ 14 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్.. భీకర ఫామ్‌లో ఆర్సీబీ పేసర్ -
షాబాజ్ అహ్మద్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా.. సెమీస్‌లో బరోడా
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో మరో సెమీ ఫైనలిస్టు ఖరారైంది. బెంగాల్‌పై 41 పరుగుల తేడాతో గెలిచిన బరోడా టాప్-4లో అడుగుపెట్టింది. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టుకు కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక అతడి తమ్ముడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం ఈసారి దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు.ప్రపంచ రికార్డుకాగా కృనాల్ సారథ్యంలో బరోడా జట్టు ఈసారి అద్భుతాలు సృష్టించింది. లీగ్ దశలో భాగంగా సిక్కిం జట్టుపై పరుగుల విధ్వంసానికి పాల్పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 349 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది.ఇదే జోరులో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న బరోడా జట్టు.. బుధవారం బెంగాల్ జట్టుతో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.రాణించిన ఓపెనర్లుపాండ్యా బ్రదర్స్ హార్దిక్(10), కృనాల్(7) పూర్తిగా విఫలమైనా.. ఓపెనర్లు శశ్వత్ రావత్(40), అభిమన్యు సింగ్(37) ఆకట్టుకున్నారు. వీరికి తోడు శివాలిక్ శర్మ(24), భాను పనియా(17), విష్ణు సోలంకి(16 నాటౌట్) రాణించారు. ఇక బెంగాల్ బౌలర్లలో మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ తలా రెండు వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ పడగొట్టాడు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన బెంగాల్‌కు ఓపెనర్ అభిషేక్ పోరెల్(13 బంతుల్లో 22) మెరుపు ఆరంభం అందించినా.. మరో ఓపెనర్ కరణ్ లాల్(6), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సుదీప్ కుమార్ ఘరామి(2) పూర్తిగా విఫలమయ్యారు. నాలుగో స్థానంలో వచ్చిన రితిక్ ఛటర్జీ సైతం డకౌట్‌గా వెనుదిరిగాడు.షాబాజ్ మెరుపు హాఫ్ సెంచరీఈ క్రమంలో రిత్విక్ చౌదరి(18 బంతుల్లో 29)తో కలిసి టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 36 బంతుల్లోనే 55 పరుగులతో షాబాజ్ చెలరేగాడు. అయితే, రితిక్‌ను హార్దిక్ పాండ్యా, షాబాజ్‌ను అతిత్ సేత్ అవుట్ చేయడంతో బెంగాల్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. బరోడా బౌలర్ల ధాటికి.. మిగతా వాళ్లలో ప్రదీప్త 3, సాక్షిమ్ చౌదరి 7, షమీ 0, కనిష్క్ 5(నాటౌట్), సయాన్ ఘోష్(0) చేతులెత్తేశారు.ఫలితంగా 18 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయిన బెంగాల్.. 41 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు.. బరోడా సెమీ ఫైనల్స్‌కు దూసుకువెళ్లింది. సెమీస్‌లో బరోడాబరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ లుక్మాన్ మెరివాలా, అతిత్ సేత్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. అభిమన్యు ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతకు ముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ సౌరాష్ట్రను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.చదవండి: అతడికి ఆసీస్ జట్టులో ఉండే అర్హత లేదు: డేవిడ్ వార్నర్ -
హార్దిక్ పాండ్యా విఫలం.. షమీకి రెండు వికెట్లు
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్ ముగింపునకు చేరుకుంది. సెమీ ఫైనల్స్‌కు చేరే క్రమంలో ఎనిమిది జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్, బరోడా- బెంగాల్, ముంబై- విదర్భ, ఢిల్లీ- ఉత్తరప్రదేశ్ మధ్య క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నాయి.ఇందులో భాగంగా తొలుత సౌరాష్ట్ర- మధ్యప్రదేశ్(క్వార్టర్ ఫైనల్-3) మ్యాచ్ ఫలితం వెలువడింది. కర్ణాటకలోని ఆలూర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్రపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ గెలిచింది. తద్వారా సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.బరోడా ఓపెనర్లు భళాఇక క్వార్టర్ ఫైనల్-1లో భాగంగా బరోడా బెంగాల్‌తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు శశ్వత్ రావత్(26 బంతుల్లో 40), అభిమన్యు సింగ్ రాజ్‌పుత్(34 బంతుల్లో 37) రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు.పాండ్యా బ్రదర్స్ విఫలంమొత్తంగా 11 బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేశాడు హార్దిక్ పాండ్యా. ఇక అతడి అన్న, బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా సైతం పూర్తిగా నిరాశపరిచాడు. పదకొండు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులే చేసి నిష్క్రమించాడు. శివాలిక్, విష్ణు మెరుపు ఇన్నింగ్స్మిగతా వాళ్లలో శివాలిక్ శర్మ(17 బంతుల్లో 24), భాను పనియా(11 బంతుల్లో 17), విష్ణు సోలంకి(7 బంతుల్లో 16 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగలిగింది. బెంగాల్ బౌలర్లలో టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, కనిష్క్ సేత్, ప్రదీప్త ప్రమాణిక్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. సాక్షిమ్ చౌదరి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. గెలుపు కోసం నువ్వా- నేనా అన్నట్లు పోటీపడిన ఈ మ్యాచ్‌లో బరోడా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.బ్యాటింగ్‌లో విఫలమైన హార్దిక్ మూడు వికెట్లతో మెరిశాడు.బరోడా వర్సెస్ బెంగాల్ తుదిజట్లుబెంగాల్అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరణ్ లాల్, సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), రిటిక్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, రిత్విక్ చౌదరి, ప్రదీప్త ప్రమాణిక్, కనిష్క్ సేథ్, మహ్మద్ షమీ, సాక్షిమ్ చౌదరి, సయన్ ఘోష్.బరోడాశశ్వత్ రావత్, అభిమన్యు సింగ్ రాజ్‌పుత్, భాను పనియా, శివాలిక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విష్ణు సోలంకి (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా (కెప్టెన్), అతిత్ షేత్, మహేష్ పితియా, లుక్మాన్ మేరీవాలా, ఆకాష్ మహరాజ్ సింగ్చదవండి: SMAT 2024: వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షో.. సెమీస్‌లో మధ్యప్రదేశ్ -
హ్యాట్రిక్ తీసిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. డకౌటైన పాండ్యా బ్రదర్స్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ శ్రేయస్ గోపాల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ గోపాల్ ఈ ఘనత సాధించాడు. గోపాల్ సాధించిన హ్యాట్రిక్‌లో టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వికెట్లు ఉన్నాయి. పాండ్యా సోదరులను గోపాల్ ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్‌కు పంపాడు. వరుస బంతుల్లో గోపాల్.. హార్దిక్, కృనాల్ వికెట్లతో పాటు శాశ్వత్ రావత్ వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో గోపాల్ మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. గోపాల్ బంతితో చెలరేగినప్పటికీ ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఓటమిపాలైంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్ (34 బంతుల్లో 56; 6 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో రాణించాడు. స్మరన్ రవిచంద్రన్ (38), కృష్ణణ్ శ్రీజిత్ (22), శ్రేయస్ గోపాల్ (18), మనీశ్ పాండే (10) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగు మాత్రమే చేసి విఫలమయ్యాడు. బరోడా బౌలర్లలో కృనాల్ పాండ్యా, అతీత్ సేథ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. లుక్మన్ మేరీవాలా, ఆకాశ్ మహారాజ్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా.. శ్రేయస్ గోపాల్ (4-0-19-4) దెబ్బకు మధ్యలో ఇబ్బంది పడింది. 15 పరుగుల వ్యవధిలో గోపాల్ నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు. అయితే శివాలిక్ శర్మ (22), విష్ణు సోలంకి (28 నాటౌట్), అతీత్ సేథ్ (6 నాటౌట్) కలిసి బరోడాను విజయతీరాలకు చేర్చారు. మరో ఏడు బంతులు మిగిలుండగానే బరోడా లక్ష్యాన్ని చేరుకుంది (6 వికెట్లు కోల్పోయి). బరోడా ఇన్నింగ్స్‌లో శాశ్వత్ రావత్ (63), భాను పూనియా (42) రాణించారు.కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ గోపాల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గోపాల్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. గోపాల్‌కు ఐపీఎల్‌లోనూ హ్యాట్రిక్ తీసిన ఘనత ఉంది. -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్ల వర్షం
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న హార్దిక్.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కేవలం 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా గుజరాత్‌పై బరోడా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.🚨 HARDIK PANDYA SMASHED 74* (35) IN SMAT...!!! 🚨- The No.1 T20 All Rounder...!!! 🙇♂️pic.twitter.com/z1Wo4P1p0s— Mufaddal Vohra (@mufaddal_vohra) November 23, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆర్య దేశాయ్ 52 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ 33 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో హేమంగ్ పటేల్ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు), రిపల్ పటేల్ (7 బంతుల్లో 18 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించారు. బరోడా బౌలర్లలో అతీత్ సేథ్ రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, కృనాల్, మహేశ్ పితియా తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడాను హార్దిక్ పాండ్యా ఒంటిచేత్తో గెలిపించాడు. హార్దిక్‌కు జతగా శివాలిక్ శర్మ (43 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. హార్దిక్, శివాలిక్ చెలరేగడంతో బరోడా మరో మూడు బంతులు మిగిలుండగానే (5 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని చేరుకుంది. హార్దిక్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి బరోడాను విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు.. చింతన్ గజా, అర్జన్ నగస్వల్లా, తేజస్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. తొలి మ్యాచ్‌కు ముందే కెప్టెన్‌పై నిషేధం
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్‌టెయిన్ చేసినందుకుగానూ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. గత సీజన్లో అదే చివరి మ్యాచ్ కావడంతో ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్మెంట్ తెలిపింది. నిషేధంతో పాటు హార్దిక్‌కు రూ. 30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పేర్కొంది. తదుపరి మ్యాచ్‌లో హార్దిక్ ఇంపాక్ట్ ప్లేయర్‌గానూ బరిలోకి దిగకూడదు. హార్దిక్‌తో పాటు నాటి మ్యాచ్‌లోని సభ్యులైన ప్రతి ఆటగాడికి రూ. 12 లక్షలు, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా వర్తిస్తుంది.కాగా, గత సీజన్లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తదుపరి సీజన్‌కు కూడా కెప్టెన్‌గా కొనసాగించింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. తదుపరి సీజన్ కోసం ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ ఉన్నారు. ముంబై ఇండియన్స్‌కు ఆర్టీఎం ద్వారా తాము రిలీజ్ చేసిన ఓ ఆటగాడిని తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో జరుగనుంది. కాగా, గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్ గత సీజన్‌ను చివరి స్థానంతో ముగించిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2020లో టైటిల్ సాధించింది. -
శార్దూల్ ఎక్కడ?.. నితీశ్‌ను ఆడిస్తారా? అతడు కూడా గంగూలీలా..
ఆస్ట్రేలియతో టెస్టులకు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ వంటి సీనియర్ పేస్ ఆల్రౌండర్లను ఈ సిరీస్‌లో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించాడు. ఐదు టెస్టులుటీమిండియాకు ఎంతో కీలకమైన ఈ పర్యటనలో యువకుడైన నితీశ్ కుమార్ రెడ్డిపై భారం మోపడం సరైన నిర్ణయం కాదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడనుంది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20లలో మెరుపులు మెరిపిస్తున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేయడం ఖాయమనే సంకేతాలు ఇచ్చాడు.నితీశ్ రెడ్డి ఆట చూడాల్సిందేనితీశ్ గురించి మోర్కెల్ ప్రస్తావిస్తూ.. ‘అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం నితీశ్ సొంతం. ఈ పర్యటనలో అతడి ఆట చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. నితీశ్ కుమార్ రెడ్డిలో ప్రతిభకు కొదవలేదు. అతడు ఆల్‌రౌండ్ సామర్థ్యం గల ఆటగాడు. అతడి బౌలింగ్‌లో పదును ఉంది.మనం ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగా అతడి బంతి బ్యాట్‌ను తాకుతుంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడి బౌలింగ్ బాగా ఉపయోగపడుతుంది. స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలమైన ఆసీస్ పిచ్‌లపై నితీశ్ మరింత ప్రమాదకారి కాగలడు. సరైన దిశలో వినియోగిస్తే అతడు ఉపయుక్త బౌలర్ అవుతాడు. ప్రతి బంతిని వికెట్ లక్ష్యంగా సంధించడం అతడి నైపుణ్యం.పేస్ ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడానికి నితీశ్‌కు ఇది చక్కటి అవకాశం. ప్రపంచంలోని ఏ జట్టయినా మంచి పేస్ ఆల్‌రౌండర్ ఉండాలని కోరుకుంటుంది. తమ పేసర్లకు మరింత విశ్రాంతి నివ్వగల ఆల్‌రౌండర్ లభిస్తే అంతకుమించి ఇంకేం కావాలి’ అని అన్నాడు.మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?ఈ నేపథ్యంలో మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్ అవసరం ఉంది. కానీ.. అతడిని జట్టులోకి తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో ఆప్షన్ వెదుక్కున్నారు. మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?హార్దిక్ పాండ్యా ఏమయ్యాడు? వాళ్లిద్దరిని పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేద్దామనుకుంటున్నారు కదా! గత రెండు, మూడేళ్లుగా శార్దూల్‌పై మీరు నమ్మకం ఉంచారు. అతడికి అవకాశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది? అకస్మాత్తుగా నితీశ్‌ను బౌలింగ్ చేయమంటూ తెరమీదకు తీసుకువచ్చారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.నితీశ్ కూడా గంగూలీలాఇక నితీశ్ రెడ్డికి ఇదొక సువర్ణావకాశమన్న భజ్జీ.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాదిరి పేస్ దళానికి అదనపు బలంగా మారితే బాగుంటుందని సూచించాడు. పేసర్లకు విశ్రాంతినిచ్చేలా బౌలింగ్ చేయడంతో పాటు.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటితే ఉపయుక్తమని పేర్కొన్నాడు. ‘‘గంగూలీ మాదిరి.. కొన్ని ఓవర్లపాటు బౌలింగ్ చేసి.. నితీశ్ 1-2 వికెట్లు తీస్తే.. జట్టుకు అది ఒకరంగా బోనస్‌లా మారుతుంది’’ అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.టెస్టు అరంగేట్రం చేయడం ఖాయంకాగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి... టీ20ల్లో మెరుపుల ద్వారా టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి... ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. షమీ వంటి సీనియర్ పేసర్ లేకపోవడంతో అతడి స్థానంలో సీమ్, బౌన్స్‌ను వినియోగించుకోగలగడంతో పాటు లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నా నితీశ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ గంగూలీ రైటార్మ్ మీడియం పేసర్ కూడా! తన కెరీర్లో గంగూలీ టెస్టుల్లో 32, వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. ఇక హార్దిక్ ఫిట్నెస్ లేమి వల్ల కేవలం వన్డే, టీ20లకు పరిమితం కాగా.. శార్దూల్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని రంజీల్లో ముంబై తరఫున ఆడుతున్నాడు.చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా..
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. టీ20 మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానం సంపాదించాడు. ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న హార్దిక్.. వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించాడు.ఈ మేరకు ఐసీసీ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైసవం చేసుకున్నాడు. ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ, ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్‌స్టోన్‌ను హార్దిక్ పాండ్యా అధిగమించాడు.తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకిమరోవైపు.. టీమిండియా యువ సంచలనం, సెంచరీల వీరుడు తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకి.. టీ20 మెన్స్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంకు సాధించడం విశేషం. అదే విధంగా.. మరో శతకాల వీరుడు సంజూ శాంసన్ కూడా 17 స్థానాలు జంప్ చేసి.. 22వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా ఇటీవల నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించిన విషయం తెలిసిందే.సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సఫారీ గడ్డపై 3-1తో ఈ సిరీస్‌ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఇందులో 31 ఏళ్ల హార్దిక్ పాండ్యా ఇటు బంతితో.. అటు బ్యాట్‌తో రాణించి తన వంతు పాత్ర పోషించాడు.ముఖ్యంగా నిర్ణయాత్మక నాలుగో టీ20లో మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. టీమిండియా గెలుపునకు బాట వేశాడు.సంజూ శాంసన్ సైతంఇక రెండో టీ20లోనూ 39 పరుగులతో అతడు అజేయంగా నిలిచాడు. కాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ప్రథమ స్థానం సంపాదించడం ఇది రెండోసారి. ఇక తిలక్ వర్మ సఫారీలతో సిరీస్‌లో వరుస సెంచరీలతో చెలరేగాడు. మూడో టీ20లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. నాలుగో మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు.. సంజూ శాంసన్ సౌతాఫ్రికాలో తొలి టీ20లో 107, నాలుగో టీ20లో 109(నాటౌట్) పరుగులు సాధించాడు.ఐసీసీ టీ20 మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకులు టాప్-51. హార్దిక్ పాండ్యా(ఇండియా)- 244 రేటింగ్ పాయింట్లు2. దీపేంద్ర సింగ్ ఐరీ(నేపాల్)- 231 రేటింగ్ పాయింట్లు3. లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్)- 230 రేటింగ్ పాయింట్లు4. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 209 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 209 రేటింగ్ పాయింట్లుఐసీసీ టీ20 మెన్స్ బ్యాటర్ల జాబితా టాప్-51. ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా)- 855 రేటింగ్ పాయింట్లు2. ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్)- 828 రేటింగ్ పాయింట్లు3. తిలక్ వర్మ(ఇండియా)- 806 రేటింగ్ పాయింట్లు4. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 788 రేటింగ్ పాయింట్లు5. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 742 రేటింగ్ పాయింట్లు.టాప్-10లో అర్ష్‌దీప్ సింగ్ఇదిలా ఉంటే.. టీ20 బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. వనిందు హసరంగ(శ్రీలంక), ఆడం జంపా(ఆస్ట్రేలియా), అకీల్ హొసేన్(వెస్టిండీస్), మహీశ్ తీక్షణ(శ్రీలంక) టాప్-4లో ఉన్నారు. ఇక టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో ర్యాంకు పొందాడు.చదవండి: కోహ్లి పాకిస్తాన్లో ఆడాలని అనుకుంటున్నాడు: పాక్ దిగ్గజ బౌలర్ షాకింగ్ కామెంట్స్ -
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో పాల్గొననున్న టీమిండియా స్టార్లు వీరే..! (ఫొటోలు)
-
Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ టోర్నీలో హార్దిక్ తన అన్న కృనాల్ పాండ్యా సారథ్యంలో బరోడా జట్టుకు ఆడనున్నాడు. తొలుత ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో హార్దిక్ పేరు లేదు. అయితే హార్దిక్ స్వయంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడేందుకు ఆసక్తి కనబర్చాడని తెలుస్తుంది. జాతీయ జట్టుకు ఆడని సమయంలో దేశవాలీ క్రికెట్లో ఆడతానని హార్దిక్ బీసీసీఐకి చెప్పాడట. దీంతో బరోడా క్రికెట్ అసోసియేషన్ హార్దిక్‌ను తమ జట్టులో చేర్చుకుంది. సహజంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి 18 మంది సభ్యుల జట్టును ప్రకటిస్తారు. తాజాగా హార్దిక్ చేరికతో బరోడా టీమ్ సంఖ్య 18కి పెరిగింది. ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో బరోడాతో పాటు తమిళనాడు, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, సిక్కిం, త్రిపుర జట్లు ఉన్నాయి. హార్దిక్ త్వరలో ఇండోర్‌లో జరిగే ట్రైనింగ్ క్యాంప్‌లో బరోడా జట్టుతో జాయిన్ అవుతాడు. బరోడా తమ టోర్నీ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం (నవంబర్ 23) జరుగుతుంది.కాగా, హార్దిక్ ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత టీ20 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో హార్దిక్ 59 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది.ముంబై ట్రైనింగ్ క్యాంప్లోన కనిపించిన హార్దిక్హార్దిక్ దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే నవీ ముంబైలోని ఏర్పాటు చేసిన ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ సెషన్స్‌లో కనపడ్డాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.బరోడా జట్టుకు బూస్టప్హార్దిక్ చేరికతో బరోడా జట్టు బలపడింది. ఈ టోర్నీలో ఆ జట్టు విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. హార్దిక్ ఎనిమిదేళ్ల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొంటున్నాడు. -
అందర్నీ సంతోషంగా ఉంచాలంటే... నేను వెళ్లి ఐస్ క్రీమ్ అమ్ముకోవాలి!
నటాషా స్టాంకోవిక్, హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జూలై 18న విడిపోయారు. అప్పట్నుంచి నటాషాకు ప్రశ్నలు మొదలయ్యాయి. ‘‘ఏమ్మాయ్, ముచ్చటైన జంట కదా మీది? ఎందుకు విడిపోయారు?’’‘‘భర్త ఏమైనా అంటే సర్దుకు΄ోవాలి కానీ, పెట్టే బేడా సర్దుకుని బయటికి వచ్చేయటమేనా?’’‘‘ఇప్పుడేమిటి? మీ దేశం వెళ్లిపోతావా? ఇక్కడే ఉండిపోతావా?’’. ‘‘కొడుకు పెద్దవాడౌతున్నాడు. వాడి భవిష్యత్తు ఆలోచించకుండా విడాకులకు నువ్వు కూడా ఎందుకు తొందరపడ్డావ్?’’. ‘‘అతనే విడాకులు కావాలని అడిగినా కూడా, కాళ్లా వేళ్లా పడి అతడితోనే ఉండిపోవాలి కానీ, పంతానికి పోతే ఇలా?’’ఇవీ ఆ ప్రశ్నలు! హార్దిక్‌కి మాత్రం సహజంగానే ఎలాంటి ప్రశ్నలూ లేవు. ఎప్పటిలాగే అతడు మిడిల్–ఆర్డర్లో రైట్ హ్యాండ్‌తో బ్యాటింగ్, ఫాస్ట్–మీడియంలో రైట్ ఆర్మ్‌తో బౌలింగ్ చేసుకుంటూ, తన ఆట తను ఆడుకుంటున్నాడు. నాలుగేళ్ల క్రితం 2020 మే 31న నటాషా, హార్ధిక్‌ల పెళ్లి జరిగింది. అదే ఏడాది జూలై 30న వాళ్లకు కొడుకు (అగస్త్య) పుట్టాడు. అప్పటికి ఎంతకాలంగా వాళ్లు డేటింగ్లో ఉన్నారో ఎవరికీ తెలియదు. అసలు వాళ్ల లవ్ స్టోరీనే పెద్ద రహస్యం. పెళ్లి కాగానే నటాషా కెరీర్‌కు బ్రేక్ పడింది. నటాషా చక్కటి డాన్సర్, మంచి నటి, పాపులర్ మోడల్. నటనలో తన కెరీర్‌ను మలుచుకోవటం కోసం 2012లో ఇరవై ఏళ్ల వయసులో సెర్బియా నుండి ఇండియా వచ్చారావిడ. ‘సత్యాగ్రహ’ ఆమె తొలి సినిమా. ఫిలిప్స్, క్యాడ్బరీ, టెట్లీ, జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తులకు మోడలింగ్ కూడా చేశారు. అయితే పెళ్లి తర్వాత ఆమె డాన్స్, యాక్టింగ్, మోడలింగ్ అన్నీ మూలన పడ్డాయి. తిరిగి నాలుగేళ్ల తర్వాత మాత్రమే గత నెలలో ‘తేరే కర్కే’ అనే మ్యూజిక్ వీడియో విడుదలతో ఆమె తన కెరీర్‌ను ప్రారంభించగలిగారు.ఈ పునరాగమనం సందర్భంగా ‘బాంబే టైమ్స్’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో (ఆ ఇంటర్వ్యూ ఎక్కువగా ఆమె విడాకుల మీదే సాగింది) ఆమె ఎంతో దృఢంగా మాట్లాడారు. తను తిరిగి సెర్బియా వెళ్లేది లేదని, ముంబైలోనే ఉండిపోతానని, విడాకులు తీసుకున్నప్పటికీ ఆగస్త్య కోసం హార్దిక్, తను తరచు కలుసుకుంటూనే ఉంటామని చెప్పారు. చివరిగా ఒక ప్రశ్న దగ్గర ఆమె కొన్ని క్షణాలు మౌనం వహించారు. ‘‘మీరు విడాకులు తీసుకున్నందుకు మీ వైపు గానీ, హార్దిక్ వైపు గానీ ఎవరూ సంతోషంగా లేరనే మాట వినిపిస్తోంది?’’ అని అడిగినప్పుడు.. ఆ కొన్ని క్షణాల మౌనం తర్వాత ఆమె నవ్వుతూ ... ‘‘అందర్నీ సంతోషంగా ఉంచాలంటే నేను వెళ్లి ఐస్‌క్రీమ్ బండిని నడుపుకోవాలి..’’ అన్నారు. ఆమె నవ్వుతూనే ఆ మాట అన్నా, ‘విడిపోవటం ఎవరికి మాత్రం సంతోషకరమైన విషయం..’ అని తన మనసులో అనుకునే ఉంటారు. (చదవండి: సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో.. ) -
సౌతాఫ్రికాతో నాలుగో టీ20.. హార్దిక్ పాండ్యాపై వేటు..?
జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో రేపు (నవంబర్ 15) జరుగబోయే నాలుగో టీ20లో టీమిండియా ఓ కీలక మార్పు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సిరీస్ డిసైడ్ కానున్న నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌ను చాలా కీలకంగా తీసుకోనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పక్కకు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో హార్దిక్ బ్యాట్‌తో చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయకపోగా.. బౌలింగ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. తొలి టీ20లో ఆరు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన హార్దిక్.. బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసి వికెట్ లేకుండా 27 పరుగులు సమర్పించుకున్నాడు.ఆతర్వాత రెండో టీ20 బ్యాట్‌తో కాస్త పర్వాలేదనిపించిన హార్దిక్.. బంతితో (3 ఓవర్లలో వికెట్ లేకుండా 22 పరుగులు) ఆకట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాట్‌తో రాణించాడని మాట వరుసకే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్‌లో అతను స్ట్రయిక్ రొటేట్ చేయకుండా ఇన్నింగ్స్ ఆఖర్లో అనవసరంగా బంతులు వేస్ట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న హార్దిక్.. 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బౌలింగ్‌లో హార్దిక్ కీలక సమయంలో వైడ్లు వేసి అభిమానులకు కంపరం పుట్టించాడు.మూడో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాట్‌తోనూ, బంతితోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన హార్దిక్.. ఆతర్వాత బౌలింగ్‌లో దారుణమైన ప్రదర్శన చేశాడు. మొత్తం నాలుగు ఓవర్లు వేసిన హార్దిక్ ఏకంగా 50 పరుగులిచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. మూడు టీ20ల్లో పేలవ ప్రదర్శనల నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20 నుంచి హార్దిక్‌ను తప్పించాలని అభిమానులను నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్ స్థానంలో స్పెషలిస్ట్ పేసర్‌కు తుది జట్టులో చేర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. హార్దిక్ బంతితో ఎలాగూ తేలిపోతున్నాడు కాబట్టి ఆవేశ్ ఖాన్ లేదా యశ్ దయాల్‌కు నాలుగో టీ20లో అవకాశం ఇవ్వడం మంచిదని అంటున్నారు.మరోవైపు ఈ సిరీస్‌లో రింకూ సింగ్ సైతం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగో టీ20లో రింకూను కూడా తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. రింకూ స్థానంలో జితేశ్ శర్మకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ సిరీస్‌లో తొలి మూడు టీ20ల్లో రింకూ స్కోర్లు ఇలా ఉన్నాయి. తొలి టీ20లో 11 పరుగులు చేసిన రింకూ.. రెండో టీ20లో 9, మూడో టీ20 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాలుగో మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ టీమిండియా వశమవుతుంది కాబట్టి మేనేజ్మెంట్ ఈ రెండు మార్పులపై దృష్టి సారించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
IPL 2025: నాకు ఇదే కరెక్ట్.. ముంబై రిటెన్షన్ లిస్టుపై రోహిత్ కామెంట్స్
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) భవితవ్యం విషయంలో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. మెజారిటీ మంది విశ్లేషకులు, కామెంటేటర్లు చెప్పినట్లుగా ‘హిట్‌మ్యాన్’ ముంబై ఇండియన్స్‌ను వీడలేదు. కెరీర్ ఆరంభం నుంచి తనకు అండగా నిలబడ్డ ఫ్రాంఛైజీతో కొనసాగేందుకే అతడు మొగ్గుచూపాడు. రోహిత్ అభిమానులకు కూడా ఇది ఒకరకంగా షాకిచ్చిందనే చెప్పవచ్చు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ విడుదల చేసిన రిటెన్షన్ జాబితాలో రోహిత్ శర్మకు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, టాప్-3లో మాత్రం అతడికి స్థానం ఇవ్వలేదు ముంబై. తమ ప్రాధాన్య ఆటగాళ్లలో రోహిత్‌ను నాలుగో ప్లేయర్‌గా అట్టిపెట్టుకుంది. దీంతో మరోసారి అతడి ఫ్యాన్స్ ఫ్రాంఛైజీపై మండిపడుతున్నారు.అందుకే వారికి పెద్దపీటఈ నేపథ్యంలో తాను నాలుగో ప్లేయర్‌గా ఉండటంపై రోహిత్ శర్మ స్పందించాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి తాను రిటైర్ అయిన కారణంగా తనకు అదే సరైన స్థానమంటూ.. ఫ్రాంఛైజీ నిర్ణయాన్ని సమర్థించాడు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లకే మొదటి ప్రాధాన్యం దక్కుతుందని.. అందుకే ఫ్రాంఛైజీ వాళ్లకు పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చాడు.ఇది సరైన నిర్ణయమని తానూ నమ్ముతున్నానన్న రోహిత్.. కోరుకున్న ఆటగాళ్లను వేలంలోకి వదిలేసి మళ్లీ కొనుక్కోవడం కష్టమని పేర్కొన్నాడు. ఇక గత రెండు- మూడేళ్లుగా తమ జట్టు స్థాయికి తగ్గట్లుగా రాణించలేకోయిందని.. ఈసారి మాత్రం పొరపాట్లు పునరావృతం కానివ్వమని చెప్పాడు. ముంబై ఇండియన్స్‌కు ఘనమైన చరిత్రముంబై తరఫున తాను చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నానని.. సహచర ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ జట్టును మెరుగైన స్థితిలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపాడు.ట్రోఫీలు గెలవడంలో ముంబై ఇండియన్స్‌కు ఘనమైన చరిత్ర ఉందన్న రోహిత్ శర్మ... క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాటపటిమ కనబరిచి గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నాడు. కాగా అంబానీల సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.అనూహ్య రీతిలో రోహిత్‌పై వేటుతద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి సారథిగా చరిత్రకెక్కాడు. అయితే, ఈ ఏడాది అనూహ్య రీతిలో ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుని మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులు ఫ్రాంఛైజీతో పాటు హార్దిక్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఈ ఏడాది అట్టడుగున ముంబైరోహిత్ సైతం చాలాసార్లు మైదానంలోనే తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కనిపించింది. జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందన్న వార్తలకు బలం చేకూరుస్తూ ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024లో వరుస ఓటములు చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ ముంబైని వీడతాడని.. ముంబై సైతం అతడిని విడిచిపెడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ చర్చలకు ఫ్రాంఛైజీ గురువారం చెక్ పెట్టింది. వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో రోహిత్ ఉన్నట్లు ప్రకటించింది. ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు1. జస్ప్రీత్ బుమ్రా(టీమిండియా ప్రధాన పేసర్)- రూ. 18 కోట్లు2. సూర్యకుమార్ యాదవ్(టీమిండియా టీ20 కొత్త కెప్టెన్)- రూ. 16.35 కోట్లు3. హార్దిక్ పాండ్యా(టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్)- రూ. 16.35 కోట్లు4. రోహిత్ శర్మ(టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్)- రూ. రూ. 16.30 కోట్లు5.తిలక్ వర్మ(టీమిండియా రైజింగ్ స్టార్)- రూ. 8 కోట్లు.వరల్డ్‌కప్ జట్టులోటీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024 అందించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ తన పదవి నుంచి వైదొలగడంతో పాటు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక ముంబై తాజాగా రిటైన్ చేసుకున్న బుమ్రా, హార్దిక్, సూర్య అతడి సారథ్యంలోని విన్నింగ్ టీమ్‌లో సభ్యులే.చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
కృనాల్ పాండ్యా సెంచరీ.. హ్యాట్రిక్ విజయాలు.. హార్దిక్ పోస్ట్ వైరల్
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. తాజాగా శతకంతో మెరిశాడు. ఒడిశాతో మ్యాచ్‌లో 143 బంతులు ఎదుర్కొని 119 పరుగులు సాధించాడు. కృనాల్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.ఇక ఈ మ్యాచ్‌లో బరోడా ఒడిషాపై ఏకంగా ఇన్నింగ్స్ 98 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన అన్న కృనాల్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. ‘‘మా అన్నయ్య.. ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. టాప్ సెంచరీ.. నీ శ్రమకు తగ్గ ఫలితం’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా రంజీ తాజా సీజన్లో కృనాల్ పాండ్యా సారథ్యంలోని బరోడా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌లో ముంబైని 84 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఈ జట్టు.. రెండో మ్యాచ్‌లో సర్వీసెస్‌ను 65 రన్స్ తేడాతో ఓడించింది. ఈ క్రమంలో వడోదర వేదికగా ఒడిశా జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బౌలింగ్ చేసింది.అయితే, బరోడా బౌలర్ల ధాటికి ఒడిశా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడాకు ఓపెనర్ శైవిక్ శర్మ(96) శుభారంభం అందించగా.. మిడిలార్డర్లో విష్ణు సోలంకి(98) దుమ్ములేపాడు. ఇక వీరికి తోడుగా కృనాల్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఫలితంగా బరోడా మొదటి ఇన్నింగ్స్‌లో 456 పరుగులు చేసి.. 263 పరుగులు ఆధిక్యంలో నిలిచింది.అయితే, బరోడా బౌలర్లు మరోసారి చెలరేగడంతో ఒడిశా 165 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆటలోనే ఫలితం తేలింది. బరోడా ఒడిశాపై ఇన్నింగ్స్ 98 రన్స్ తేడాతో జయభేరి మోగించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. కాగా హార్దిక్ పాండ్యా సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా పునరాగమనం చేయనున్నాడు.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ View this post on Instagram A post shared by Krunal Himanshu Pandya (@krunalpandya_official) -
బంగ్లాపై భారత్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్ స్వీప్ (ఫోటోలు)
-
భారత కుర్రాళ్ల జోరు.. బంగ్లా పులుల బేజారు (ఫోటోలు)
-
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. సిక్సర్ బాది టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చాడు.విరాట్ కోహ్లి అరుదైన రికార్డు బద్దలుఈ క్రమంలో ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. టీమిండియా తరఫున అత్యధిక సార్లు సిక్సర్‌తో మ్యాచ్ ఫినిష్ చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. కాగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా ఆదివారం గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచిన సూర్యకుమార్ సేన తొలుత బౌలింగ్ చేసింది.ఈ క్రమంలో.. బ్యాటర్లు విఫలం కావడంతో 19.5 ఓవర్లలో 127 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.ధనాధన్ దంచికొట్టారుఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఓపెనర్లు సంజూ శాంసన్(19 బంతుల్లో 29), అభిషేక్ శర్మ(ఏడు బంతుల్లో 16) వేగంగా ఆడగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(14 బంతుల్లో 29) ధనాధన్ దంచికొట్టాడు.ఇక నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి 16(నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఐదో నంబర్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బంతిని చూడకుండానే వికెట్ కీపర్ తల మీదుగా పాండ్యా ఆడిన ర్యాంప్ షాట్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.పాండ్యా మెరుపు ఇన్నింగ్స్.. సిక్సర్‌తో ముగింపుఈ క్రమంలో పాండ్యా కేవలం 16 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 39 పరుగులతో 243కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. పన్నెండవ ఓవర్ ఐదో బంతికి.. టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు.కాగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఛేజింగ్‌లో హార్దిక్ పాండ్యా టీమిండియా తరఫున ఇలా మ్యాచ్ ఫినిష్ చేయడం ఐదోసారి. అంతకు ముందు విరాట్ కోహ్లి నాలుగుసార్లు ఈ ఘనత సాధించాడు. అర్ష్‌దీప్ సింగ్‌ను అధిగమించిఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్న హార్దిక్ పాండ్యా.. భారత్ తరఫున 87 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అర్ష్‌దీప్ సింగ్(86)ను అధిగమించి.. టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కొత్త మైదానంలో తొలుత బంగ్లాను 127 పరుగులకే పరిమితం చేసిన భారత్.. మరో 49 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఇక యువ ఆటగాళ్లతో నిండిపోయిన జట్టు ముందు కూడా చతికిల పడిన బంగ్లాదేశ్ మరోసారి చేతులెత్తేసింది. ఈ గెలుపు ద్వారా భారత టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో నాలుగో విజయం నమోదైంది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే‘‘జట్టు సమావేశమైన సమయంలో మా నైపుణ్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకున్నాం. వాటిని పక్కాగా అమలు చేయడంలో సఫలమయ్యాము. మా వాళ్లు పట్టుదలగా ఆడారు. కొత్త గ్రౌండ్లో మేము బ్యాటింగ్ చేసిన విధానం గొప్పగా అనిపించింది.ఇక ఎవరితో బౌలింగ్ చేయించాలో తెలియనన్ని మంచి ఆప్షన్లు ఉండటం మాకు ఒక రకంగా తలనొప్పి కలిగించేదే. అయితే, అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. ప్రతి మ్యాచ్‌లోనూ మేము కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. అయితే, ఎప్పటికప్పుడు లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగితేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం. తదుపరి మ్యాచ్ కోసం జట్టు సభ్యులతో కూర్చుని చర్చించి వ్యూహాలు సిద్ధం చేసుకుంటాం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.నజ్ముల్ షాంటో బృందం విలవిలకాగా గ్వాలియర్‌లో కొత్తగా ప్రారంభించిన ‘శ్రీమంత్ మాధవ్‌రావ్ సింధియా క్రికెట్ స్టేడియం’లో టాస్ గెలిచిన టీమిండియా.. బంగ్లాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలర్ల దెబ్బకు నజ్ముల్ షాంటో బృందం పరుగులు రాబట్టడానికి ఆపసోపాలు పడింది. 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఓపెనర్లు పర్వేజ్ హొసేన్ ఎమాన్(8), లిటన్ దాస్(4) రూపంలో కీలక వికెట్లతో పాటు.. టెయిలెండర్ ముస్తాఫిజుర్(1) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇతర పేసర్లలో అరంగేట్ర బౌలర్ మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టాడరు. ఇక స్పిన్నర్లలో వరుణ్ చకవర్రి(3/31), వాషింగ్టన్ సుందర్(1/12) కూడా మెరవగా.. అరంగేట్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సైతం రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు.మెరుపు ఇన్నింగ్స్లక్ష్య ఛేదనలో టీమిండియాకు బంగ్లా బౌలర్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. కొత్త ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్(19 బంతుల్లో 29), అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16) సహా వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య(14 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నితీశ్ రెడ్డి 15 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్సర్‌తో టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. ఇక బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఇటీవల టీమిండియాతో టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-0తో క్లీన్‌స్వీప్ అయిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లోనూ 1-0తో వెనుకబడింది. ఇరుజట్ల మధ్య బుధవారం రెండో మ్యాచ్ జరుగనుంది.చదవండి: IND Vs BAN 1st T20I: పాపం బిష్ణోయ్..కావాలనే పక్కన పెట్టారా? కారణం గౌతీనా? 𝙎𝙈𝘼𝘾𝙆𝙀𝘿 with power and timing!@hardikpandya7 dispatches one over deep extra cover 🔥Live - https://t.co/Q8cyP5jXLe#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/kNaZjSl1Tq— BCCI (@BCCI) October 6, 2024 -
వరల్డ్‌కప్ ఫైనల్లో పంత్ మాస్టర్ ప్లాన్.. అలా మేము గెలిచాం: రోహిత్
టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో రిషభ్ పంత్ వేసిన మాస్టర్ ప్లాన్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. మోకాలి గాయం పేరిట పంత్ ఆలస్యం చేయడం వల్ల సౌతాఫ్రికాను దెబ్బకొట్టగలిగామని పేర్కొన్నాడు. అయితే, తాము చాంపియన్లుగా నిలవడానికి ఇదొక్కటే కారణం కాదని.. సమిష్టి ప్రదర్శనతో ట్రోఫీ గెలిచామని తెలిపాడు.ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించికాగా ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు పదకొండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ ఐసీసీ టోర్నీలో జయభేరి మోగించింది. తుదిపోరులో సౌతాఫ్రికాను ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది.అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం టీమిండియా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో గెలిచాడు. తదుపరి న్యూజిలాండ్‌తో టెస్టులతో బిజీ కానున్నాడు.తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడుఈ క్రమంలో రోహిత్ శర్మ కపిల్ శర్మ షోకు హాజరైన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా వరల్డ్‌కప్ ఫైనల్ నాటి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ‘‘అప్పటికి సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సిన పటిష్ట స్థితిలో ఉంది. అంతకంటే కాస్త ముందు మాకు చిన్న విరామం దొరికింది.అప్పుడే పంత్ తన తెలివితేటల్ని చక్కగా అమలు చేశాడు. అతడి మోకాలికి గాయమైనట్లుగా కనిపించాడు. ఫిజియోథెరపిస్టులు వచ్చి అతడి మోకాలికి కట్టుకట్టారు. నిజానికి అప్పుడు సౌతాఫ్రికా మంచి రిథమ్‌లో ఉంది. త్వరత్వరగా బ్యాటింగ్ ముగించేయాలని చూసింది.అయితే, పంత్ చేసిన పనివల్ల సౌతాఫ్రికా మొమెంటమ్ కాస్త నెమ్మదించేలా చేయగలిగాం. వారి ఊపును కాస్త నిలువరించగలిగాం. ఆ సమయంలో బంతిని దబాదబా బాదేయాలని కాచుకుని ఉన్నారు బ్యాటర్లు. అయితే, పంత్ వల్ల వారి రిథమ్‌ను మేము బ్రేక్ చేయగలిగాం.పంత్ అకస్మాత్తుగా కింద పడిపోయాడునేను ఫీల్డింగ్ సెట్.. చేస్తూ బౌలర్లతో మాట్లాడుతున్న సమయంలో పంత్ అకస్మాత్తుగా కింద పడిపోవడం గమనించాను. ఫిజియోథెరపిస్ట్ వచ్చి చికిత్స చేశారు. మ్యాచ్ త్వరగా మొదలుపెట్టాలని క్లాసెన్ చూస్తున్న సమయంలో ఇలాంటి ఘటన వారిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు.అయినా, మేము గెలవడానికి ఇదొక్కటే ప్రధాన కారణం అని చెప్పను. అయితే, విజయానికి దారితీసిన పరిస్థితుల్లో ఇదొకటి. పంత్ సాబ్ మైదానంలో ఇలా తన స్మార్ట్‌నెస్ చూపిస్తూ.. మాకు మేలు చేస్తూ ఉంటాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పంత్ వల్ల జరిగిన ఆలస్యానికి జరిమానా ఎదుర్కోవడానికి కూడా తాము రిస్క్ చేసినట్లు తెలిపాడు.పాండ్యా చేసిన అద్భుతంకాగా సౌతాఫ్రికా విజయానికి 30 పరుగుల దూరంలో ఉన్నపుడు విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. అయితే, హార్దిక్ పాండ్యా పదిహేడో ఓవర్లో తొలి బంతికి క్లాసెన్(52)ను వెనక్కి పంపడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఇక ఆఖరి ఓవర్లోనూ హార్దిక్ అద్భుతం చేశాడు. మిల్లర్(21)తో పాటు టెయిలెండర్లు కగిసో రబడ(3), అన్రిచ్ నోర్జే(1)లను అవుట్ చేసి భారత్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొమ్మిది పరుగులకే పరిమితం కాగా.. పంత్ డకౌట్ అయ్యాడు. కోహ్లి 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.చదవండి: ఐపీఎల్లో ఆ జట్టుకు కెప్టెన్‌గా సూర్య?.. స్పందించిన ‘స్కై’Captain Rohit Sharma revealed the untold story of Rishabh Pant when India needed to defend 30 runs in 30 balls. Two Brothers ! 🥺❤️pic.twitter.com/EmqIrrCFb3— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@IamHydro45_) October 5, 2024 -
ఇదేం బౌలింగ్?.. హార్దిక్ పాండ్యా శైలిపై కోచ్ అసంతృప్తి!
దాదాపు రెండు నెలల విరామం తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయనున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సందర్భంగా ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో యువ పేస్ దళంతో కలిసి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.హార్దిక్ పాండ్యా శైలిపై కోచ్ అసంతృప్తి!అయితే, హార్దిక్ పాండ్యా బౌలింగ్ శైలి పట్ల మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. స్టంప్స్‌నకు మరీ దగ్గరగా బంతిని విసిరే విధానాన్ని మార్చుకోవాలని హార్దిక్‌కు సూచించినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. పరిగెత్తుతూ.. బాల్‌ను రిలీజ్ చేసేటపుడు కూడా ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ ఆల్‌రౌండర్‌తో మోర్కెల్ గట్టిగానే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తన శైలికి భిన్నంగా మోర్కెల్ కాస్త స్వరం హెచ్చించి మరీ.. పాండ్యాకు పదే పదే బౌలింగ్ యాక్షన్ గురించి హితభోద చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. అయితే, ఇందుకు పాండ్యా కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అనంతరం.. యువ ఫాస్ట్‌బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్‌లపై మోర్కెల్ దృష్టి సారించి.. వారి చేత ప్రాక్టీస్ చేయించినట్లు సమాచారం.సూర్యకుమార్ యాదవ్‌కు పెద్దపీటఇదిలా ఉంటే.. పేస్ బ్యాటరీ స్పీడ్ గన్స్‌ను తీసుకువచ్చిందంటూ ఈ బౌలర్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా హార్దిక్ పాండ్యా చివరగా శ్రీలంక పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే, ఈ టూర్ సందర్భంగా భారత పొట్టి క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పేరును ప్రకటిస్తారనుకుంటే.. బీసీసీఐ మాత్రం సూర్యకుమార్ యాదవ్‌కు పెద్దపీట వేసింది. మూడు టీ20లు.. వేదికలు ఇవేఅరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్‌కు గాయాల బెడద పొంచి ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఇక తాజా సిరీస్ విషయానికొస్తే.. ఆదివారం(అక్టోబరు 6) నుంచి టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా జరిగే మూడు మ్యాచ్‌లకు గ్వాలియర్(అక్టోబరు 6), ఢిల్లీ(అక్టోబరు 9), హైదరాబాద్(అక్టోబరు 12) ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ క్రమంలో మొదటి టీ20 కోసం గ్వాలియర్‌కు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఇక బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా యువ స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ తొలిసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు.బంగ్లాతో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.చదవండి: T20 World Cup 2024: 3836 రోజుల తర్వాత దక్కిన విజయం..!Bring out the speed guns, the pace battery has arrived! ⚡️⚡️#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/FM4Sv5E4s3— BCCI (@BCCI) October 4, 2024 -
నాన్న దగ్గరగా లేడు.. పెదనాన్న, తమ్ముడితో అగస్త్య (ఫొటోలు)
-
బాయ్‌ఫ్రెండ్‌తో చిల్ అవుతోన్న హార్ధిక్ పాండ్యా మాజీ భార్య!
ఇటీవలే భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న నటి, మోడల్ నటాసా స్టాంకోవిచ్ ప్రస్తుతం ముంబయిలో చిల్ అవుతోంది. విడాకుల తర్వాత సెర్బియా వెళ్లిపోయిన నటాషా దాదాపు రెండు నెలల తర్వాత ఇండియాకు వచ్చింది. అయితే ఆమెతో పాటు బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ ఇలాక్ కూడా ఉన్నారు. వీరిద్దరు కారులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. అంతకుముందే తాను ముంబయికి వచ్చిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన కుమారుడు అగస్త్యతో పాటు ఇండియాక వచ్చినట్లు తెలిపింది. ఇటీవల తన కొడుకు పుట్టినరోజును సెర్బియాలో తన కుటుంబం, బంధుమిత్రులతో కలిసి జరుపుకుంది. బర్త్ డేకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.కాగా.. నటాసా స్టాంకోవిచ్ మొదట యాడ్స్‌లో నటించడం ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ప్రకాష్ ఝా తెరకెక్కించిన సత్యాగ్రహం మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. అంతేకాకుండా డిష్కియావూన్, యాక్షన్ జాక్సన్, 7 అవర్స్ టు గో, జీరో వంటి చిత్రాల్లో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
గణేశుడి సేవలో పెదనాన్నతో అగస్త్య: హార్దిక్ లేకుండానే (ఫొటోలు)
-
అగస్త్యను హార్దిక్ ఇంటికి పంపిన నటాషా.. ఫొటో వైరల్!
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇప్పట్లో జట్టులోకి వచ్చే అవకాశం లేదు. మరో నెల రోజుల పాటు అతడికి విశ్రాంతి లభించనుంది. దీంతో విరామ సమయాన్ని పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తూ మనోల్లాసం పొందుతున్నాడు హార్దిక్. ఇక ఇప్పుడు కుమారుడు అగస్త్య కూడా తన దగ్గరికి వచ్చేయడంతో మరింత ఖుషీ ఖుషీగా గడుపుతున్నట్లు తెలుస్తోంది.తల్లితో సెర్బియా వెళ్లిన అగస్త్యకాగా హార్దిక్ పాండ్యా ఇటీవలే తన భార్య, సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సామరస్యపూర్వకంగానే తాము విడిపోతున్నామని.. అగస్త్యకు తల్లిదండ్రులుగా మాత్రం కొనసాగుతామని ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం కుమారుడిని తీసుకుని నటాషా పుట్టింటికి వెళ్లిపోయింది.అయితే, తాజాగా అగస్త్య తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. సెర్బియా నుంచి ఈ చిన్నారి ముంబైకి చేరుకున్నాడు. హార్దిక్ వదిన, క్రికెటర్ కృనాల్ పాండ్యా భార్య పాంఖురి శర్మ షేర్ చేసిన ఫొటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. తన కుమారుడు కవిర్‌తో కలిసి అగస్త్యకు కథలు చెప్తున్నానంటూ పాంఖురి ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేసింది.కెరీర్ పరంగానూ ఒడిదొడుకులుకాగా టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా... జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం అతడే సారథి అవుతాడని విశ్లేషకులు భావించారు. అయితే అనూహ్యం అతడిని వైస్ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించింది బీసీసీఐ. శ్రీలంక పర్యటన -2024 సందర్భంగా సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించడంతో పాటు.. శుబ్‌మన్ గిల్‌ను అతడికి డిప్యూటీగా నియమించింది. ఫిట్నెస్ కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో హార్దిక్ పాండ్యా కేవలం వన్డే, టీ20లకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు ఆటకు దూరమయ్యాడు. ఇక రోహిత్ సేన సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఆడనుండగా.. అక్టోబరు 6 నుంచి ఆరంభమయ్యే టీ20 సిరీస్ సందర్భంగా హార్దిక్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. -
మొదటిరోజు హార్దిక్- రోహిత్ మాట్లాడుకోలేదు.. ఆ తర్వాత
‘‘టీమిండియా ప్రాక్టీస్ చేసిన మొదటిరోజు నేను నెట్స్ వద్దకు వెళ్లాను. అప్పుడు హార్దిక్- రోహిత్ దూరదూరంగా ఉండటం గమనించాను. నిజానికి ఆరోజు వారు మాట్లాడుకోలేదు. అయితే, రెండో రోజు నుంచి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాళ్లిద్దరు ఒకరికొకరు చేరువగా వచ్చారు.ఓ మూలన కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. నిజానికి అక్కడ కెమెరా కూడా లేదు. వాళ్లిద్దరినీ అలా చూసి నేను నమ్మలేకపోయాను. జట్టు ప్రయోజనాల కోసం ఆటగాళ్లు తమ మధ్య విభేదాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి కలిసికట్టుగా ముందుకు సాగుతారని అప్పుడే నాకు కళ్లకు కట్టినట్లయింది.ఆ తర్వాత మూడు రోజుల పాటు రోహిత్, హార్దిక్ కలిసే బ్యాటింగ్ చేశారు. హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నపుడు రోహిత్ దగ్గరుండి పర్యవేక్షించాడు. వారిని అలా చూస్తే ముచ్చటేసింది’’ అంటూ స్పోర్ట్స్ జర్నలిస్టు విమల్ కుమార్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అనుబంధం గురించి తెలిపాడు.కారణం అతడేటీ20 ప్రపంచకప్-2024 సమయంలో రోహిత్- హార్దిక్ కలిసిపోయి మునుపటిలా ఉండటానికి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణమని పేర్కొన్నాడు. ఈ విషయంలో ఆయనకే క్రెడిట్ ఇవ్వాలని.. ద్రవిడ్ చొరవ వల్లే డ్రెస్సింగ్ రూం వాతావరణం అంత చక్కగా ఉందన్నాడు. టీమిండియా ఆటగాళ్ల మధ్య విభేదాలంటూ వచ్చే వార్తలు నిజం కావని వారిని దగ్గరగా చూసిన తర్వాతే తనకు అర్థమైందన్నాడు విమల్ కుమార్. టూ స్లాగర్స్ అనే యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.అందుకే విభేదాలు?ఐపీఎల్-2024కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఇండియన్స్.. ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. దీంతో హిట్‌మ్యాన్ అభిమానులు తీవ్రస్థాయిలో హార్దిక్‌పై మండిపడ్డారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. మరోవైపు.. హార్దిక్ సైతం మైదానంలో రోహిత్ ఫీల్డింగ్ పొజిషన్‌ను పదే పదే మారుస్తూ కాస్త అతి చేశాడు. ఈ క్రమంలో రోహిత్ కూడా హార్దిక్ తీరు పట్ల అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి.కలిసిపోయారుఈ నేపథ్యంలో తాజా సీజన్లో ముంబై దారుణంగా ఓడిపోవడంతో ఆటగాళ్ల మధ్య సఖ్యత లోపించడమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో సీన్ మారింది. రోహిత్ కెప్టెన్‌గా.. హార్దిక్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్ సాధించింది. ఇందులో రోహిత్‌తో పాటు ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాత్ర కూడా కీలకం. ఇక అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో టీమిండియాతో పాటే ఉన్న విమల్ కుమార్ తాజాగా రోహిత్- హార్దిక్ జట్టు కోసం కలిసిపోయారంటూ పాజిటివ్ కామెంట్స్ చేశాడు. -
ప్రేమంటే నమ్మకం: హార్దిక్ మాజీ భార్య నటాషా పోస్ట్ వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత విరామం తీసుకున్న ఈ ఆల్‌రౌండర్ సెలవులను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. తనకు తాను సమయం కేటాయించుకుని ప్రకృతి అందాల్లో సేద తీరుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు.సింగర్‌తో ప్రేమలో?ఈ క్రమంలో పాండ్యా ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫొటోల్లోని లొకేషన్.. బ్రిటిష్ సింగర్, నటి జాస్మిన్ వాలియా దిగిన ఫొటోల లొకేషన్ ఒకేలా ఉండటంతో వీరిద్దరు కలిసే అక్కడకు వెళ్లారనే వదంతులు వ్యాపించాయి. దీంతో హార్దిక్ మరోసారి ప్రేమలో పడ్డాడనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్టార్ ప్లేయర్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ప్రేమను నిర్వచిస్తూ పెట్టిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది.ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు‘‘ప్రేమకు సహనం ఎక్కువ. ప్రేమ దయగలది. ప్రేమలో ద్వేషం, అసూయ ఉండవు. గొప్పలు చెప్పుకోవడాలూ ఉండవు. ఇతరులను కించపరచడం, స్వార్థపూరితంగా వ్యవహరించడం ప్రేమకు తెలియదు. ప్రేమ తప్పొప్పులను లెక్కకడుతూ కోపం ప్రదర్శించదు. ప్రేమంటే నిజం.. నమ్మకం.. ఆశ.. రక్షణ.. ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు’’ అంటూ నటాషా స్టాంకోవిక్ ఉద్వేగపూరిత వాక్యాలు షేర్ చేసింది.అందుకే విడాకులు?అయితే, ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి చేసిందేనంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతడి పట్ల నటాషాకు ఇంకా ప్రేమ ఉందని.. కానీ అతడే దానిని నిలబెట్టుకోలేకపోయాడని.. ఏదేమైనా ఎవరి జీవితాల్లో వారు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా హార్దిక్‌కు నచ్చినట్లుగా మారడానికి నటాషా ఎంతో ప్రయత్నించిందని.. అయితే, అతడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో విడాకులు తీసుకుందని ఇటీవల ఆమె సన్నిహితవర్గాలు వెల్లడించాయి.మరోవైపు.. హార్దిక్‌తో విడిపోయిన తర్వాత నటాషాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా సెర్బియాకు చెందిన నటాషా మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ఆమె ఓ పార్టీలో హార్దిక్‌ను కలిసింది. స్నేహం కాస్తా ప్రేమగా మారగా పెళ్లిపీటలెక్కారు. అధికారికంగా ప్రకటించిఈ జంటకు కుమారుడు అగస్త్య సంతానం. అయితే, ఎంతో అన్యోన్యంగా కనిపించే హార్దిక్- నటాషా కొన్నాళ్ల క్రితం తాము విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, అగస్త్యకు మాత్రం తల్లిదండ్రులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇక విడాకుల తర్వాత కొడుకును తీసుకుని నటాషా సెర్బియాకు వెళ్లిపోయింది. అయితే, ఈ మాజీ జంట ఇన్‌స్టాలో తాము కలిసి ఉన్న, తమ పెళ్లి ఫొటోలు డిలీట్ చేయకపోవడం గమనార్హం.చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
IPL 2025: అయ్యర్‌పై వేటు?.. కేకేఆర్ కెప్టెన్‌గా సూర్య?!
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చే ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మారనున్నాడా? ఏకంగా కేకేఆర్ సారథిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడా? ఇలా అయితే.. శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఏమిటి? అంటూ సోషల్ మీడియాలో చర్చకు తెరతీశారు ఈ ఇద్దరు క్రికెటర్ల అభిమానులు. ఓ స్పోర్ట్స్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం.హార్దిక్ రాకతోనే గందరగోళం!ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 2012లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. రెండేళ్ల తర్వాత కేకేఆర్‌లో చేరాడు. టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సారథ్యంలో 2014లో టైటిల్ గెలిచిన కేకేఆర్ జట్టులో అతడు సభ్యుడు. అయితే, తగినన్ని అవకాశాలు రాకపోవడంతో 2017లో కోల్‌కతా ఫ్రాంఛైజీని వీడి.. తిరిగి ముంబై గూటికి చేరాడు సూర్య.అప్పటి నుంచి ముంబై జట్టులో పాతుకుపోయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అంచెలంచెలుగా ఎదిగాడు. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా సత్తా చాటి.. అనూహ్య రీతిలో టీమిండియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో రోహిత్ శర్మపై వేటు వేసి అతడి స్థానంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తన సారథిగా ప్రకటించిన విషయం తెలిసిందే.వాస్తవానికి.. ముంబై జట్టులో రోహిత్ గైర్హాజరీలో సూర్య కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ తర్వాత అతడే ముంబై పగ్గాలు చేపడతాడని విశ్లేషకులు భావించారు. అంతేకాదు.. మరో సీనియర్, టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా కూడా కెప్టెన్సీ అవకాశం ఉందని అంచనా వేశారు.అందుకే ముంబైని వీడాలనుకుంటున్నాడా?అయితే, ముంబై యాజమాన్యం మాత్రం భారీ ధరకు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుని మరీ కెప్టెన్‌ను చేసింది. ఫలితంగా జట్టు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా రోహిత్ శర్మకు మద్దతుగా బుమ్రా, సూర్య నిలవగా.. హార్దిక్ సీనియర్ల సపోర్టు లేక ఒంటరయ్యాడు. ఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తై కెప్టెన్‌గా పూర్తిగా విఫలమయ్యాడు.ఇక హార్దిక్ రాకతో సందిగ్దంలో పడిన సూర్య.. ముంబై జట్టును వీడేందుకు సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేకేఆర్ ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌ను సంప్రదించిందని.. తమ జట్టులోకి వస్తే కెప్టెన్‌గా నియమిస్తామని ఆఫర్ చేసిందని ఓ వ్యక్తి వీడియో విడుదల చేశాడు. అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా.. సూర్య, శ్రేయస్ అయ్యర్ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.కేకేఆర్ సారథి అయితే బాగుంటుంది!సూర్య మళ్లీ కేకేఆర్ గూటికి చేరి కెప్టెన్ అయితే బాగుంటుందని అతడి ఫ్యాన్స్ అంటుండగా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో పదేళ్ల తర్వాత జట్టుకు ట్రోఫీ అందించిన శ్రేయస్‌ను తప్పించడం సరికాదని అతడి మద్దతుదారులు అంటున్నారు. ఇవన్నీ వట్టి వదంతులేనని.. నిరాధార వ్యాఖ్యలను నమ్మాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు. శ్రేయస్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.అయితే, ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్య పట్ల కేకేఆర్ నిజంగా మొగ్గు చూపితే.. శ్రేయస్ వేలంలోకి వస్తాడని.. అతడిని ముంబై కొనుగోలు చేసే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. కాగా సూర్య ఇప్పటి వరకు ఓవరాల్‌గా 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 3594 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 24 అర్ధ శతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలోనూ 4 శతకాలు బాదిన రికార్డు సూర్యకు ఉంది. 🚨𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫 𝐑𝐮𝐦𝐨𝐮𝐫𝐬 🚨👀 KKR management unofficially contacted SKY for KKR captaincy from next year .( Rohit Juglan from Revzsports)pic.twitter.com/ClEVeuqcb4— KKR Vibe (@KnightsVibe) August 24, 2024 -
విడాకుల తర్వాత మళ్లీ ప్రేమలో హార్దిక్ పాండ్యా?.. ఈ బ్యూటీ ఎవరు? (ఫోటోలు)
-
చీటర్.. అలాంటి వాళ్లతో జాగ్రత్త! హార్దిక్ పాండ్యాను ఉద్దేశించేనా?
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. ఆటకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉంటూ క్రికెట్ నుంచి దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. సాగరతీరాన.. స్విమ్మింగ్‌పూల్ ఒడ్డున సేద తీరుతూ.. నీలాకాశాన్ని వీక్షిస్తున్న దృశ్యాలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ‘చీటర్’ అన్న పోస్టుకు లైక్ కొట్టడం నెట్టింట చర్చకు దారితీసింది.నటాషాపై విమర్శలుకాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పూర్తిగా విఫలమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా ఆటగాడిగా తనను తాను నిరూపించుకున్నాడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా మరోసారి ఐసీసీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ భార్య నటాషా హార్దిక్‌తో లేకపోవడంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు రాగా.. కొన్నిరోజులు తర్వాత ఈ అంశంపై స్పష్టత వచ్చింది.తమ దారులు వేరయ్యానని.. తాము విడాకులు తీసుకున్నామని హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ సంయుక్త అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హార్దిక్ అభిమానులు నటాషాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. హార్దిక్ పేరు, డబ్బు ఉపయోగించుకునేందుకే అతడి జీవితంలోకి వచ్చిందని.. భరణం రూపంలోనూ పెద్ద మొత్తమే తీసుకుందని ఇష్టారీతిన కామెంట్లు చేశారు.ఇక కుమారుడు అగస్త్యను తీసుకుని పుట్టినిల్లు సెర్బియాకు వెళ్లిన నటాషా.. అతడితో ట్రిప్‌నకు వెళ్లిన ఫొటోలు పంచుకోగా.. హార్దిక్ వాటికి హార్ట్ సింబల్ జోడిస్తూ లైక్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటాషాను మర్చిపోలేకపోతున్నాడని.. ఆమె వల్ల హార్దిక్ పాండ్యా చాలా బాధపడుతున్నాడంటూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంపై నటాషా పరోక్షంగా స్పందించింది.చీటర్.. ఆ పోస్టులకు నటాషా లైక్‘‘చీటర్.. శారీరకంగా, మానసికంగా హింసించే వాళ్లతో బంధం కొనసాగిస్తే ఇలాగే ఉంటుంది.. కొంతమంది తామే సమస్యను సృష్టించి మళ్లీ వారే బాధితులుగా నటిస్తారు.. అందుకు ఇదే ఉదాహరణ... ఇతరుల ముందు మిమ్మల్ని తప్పుగా చూపించేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి’’ అంటూ బంధాల గురించి చర్చిస్తున్న ఇన్‌స్టా వీడియోలకు నటాషా స్టాంకోవిక్ లైక్ కొట్టింది. ఇందుకు స్పందించిన నెటిజన్లలో మెజారిటీ మంది నటాషాకు మద్దతుగా నిలుస్తున్నారు. హార్దిక్ ఫ్యాన్స్ అని చెప్పుకొనే వాళ్లు ఇప్పటికైనా నటాషాను వేధించడం మానాలని హితవు పలుకుతున్నారు.కాగా ప్రపంచకప్-2024 తర్వాత హార్దిక్ పాండ్యా శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, వన్డే సిరీస్‌కు మాత్రం అతడు ఎంపికకాలేదు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ సిరీస్‌కు అతడు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీలంక టూర్లో 3-0తో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 0-2తో ఆతిథ్య శ్రీలంకకు కోల్పోయింది. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
‘నువ్వెక్కడున్నా నా మనసంతా నీ చుట్టే’.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం! (ఫొటోలు)
-
మాటల్లో వర్ణించలేను.. లవ్ యూ: హార్దిక్ పాండ్యా
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. లంకతో టీ20 సిరీస్ జట్టుకు ఎంపికైన అతడు తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. రెండో టీ20లో మాత్రం అదరగొట్టాడు. రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు.. తొమ్మిది బంతుల్లోనే 22 పరుగులు చేసి దుమ్ములేపాడు.ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించి టీమిండియా లంకపై టీ20 సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు ఈ వరల్డ్‌కప్ చాంపియన్. ఈ క్రమంలో మంగళవారం నాటి నామమాత్రపు టీ20కి పాండ్యా సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈరోజు(జూలై 30)కు హార్దిక్ పాండ్యా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. అతడి కుమారుడు అగస్త్య పుట్టినరోజు నేడు.ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవుఈ నేపథ్యంలో తన ముద్దుల కుమారుడితో ఉన్న వీడియో షేర్ చేసిన హార్దిక్ పాండ్యా.. ‘‘నేను ఇలా ముందుకు సాగుతున్నానంటే అందుకు కారణం నువ్వే. నా పార్ట్నర్ ఇన్ క్రైమ్. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆగూ..! నీపై నాకున్న ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవు’’ అంటూ ఉద్వేగపూరిత క్యాప్షన్ జతచేశాడు. అగస్త్యను ఎంతగానో మిస్సవుతున్నానని చెప్పకనే చెప్పాడు.ముక్కలైన బంధంకాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను హార్దిక్ పాండ్యా ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఏకంగా మూడుసార్లు పెళ్లి చేసుకుంది. అయితే, కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ఇందుకు సంబంధించి హార్దిక్ పాండ్యా- నటాషా అధికారిక ప్రకటన విడుదల చేశారు.కుమారుడిపై ప్రేమఅనంతరం కుమారుడు అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియాలోని తన పుట్టింటికి వెళ్లిపోగా.. హార్దిక్ పాండ్యా టీమిండియాతో పాటు శ్రీలంకలో ఉన్నాడు. ఇక అంతకుముందు టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. స్వదేశానికి వచ్చిన అనంతరం అగస్త్యతో కలిసి తన ఇంట్లో సంబరాలు చేసుకున్నాడు హార్దిక్. ఇక ఇటీవల అగస్త్యతో కలిసి నటాషా విహారయాత్రకు వెళ్లిన ఫొటోలు పంచుకోగా.. హార్దిక్ పాండ్యా హార్ట్ సింబల్స్‌తో తన ప్రేమను తెలిపాడు. చదవండి: Ind vs SL ODIs: ‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’ View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
శివాలెత్తిపోయిన హార్దిక్.. టీమిండియా ఖాతాలో రికార్డు విజయం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో నిన్న (జులై 29) జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (53) అర్ద సెంచరీతో రాణించగా.. పథుమ్ నిస్సంక (32), కమిందు మెండిస్ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక చివరి ఏడు వికెట్లు 31 పరుగుల వ్యవధిలో కోల్పోయి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. రవి బిష్ణోయ్ (4-0-26-3), అర్ష్‌దీప్ సింగ్ (3-0-24-2), అక్షర్ పటేల్ (4-0-30-2), హార్దిక్ పాండ్యా (2-0-23-2) లంకేయులను భారీగా దెబ్బేశారు. అనంతరం భారత్ ఛేదనకు దిగే సమయానికి వర్షం మొదలైంది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు.శివాలెత్తిపోయిన హార్దిక్ఛేదనలో భారత్ ఆదిలోనే సంజూ శాంసన్ (0) వికెట్ కోల్పోయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేసింది. యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26; 4 ఫోర్లు, సిక్స్), హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించారు. ఆఖర్లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలు, సిక్సర్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. బంతితో (2 వికెట్లు) రాణించిన హార్దిక్ బ్యాట్‌తోనూ చెలరేగాడు. ఫలితంగా భారత్ 6.3 ఓవరల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది (3 వికెట్ల నష్టానికి). ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 రేపు (జులై 30) జరుగనుంది.టీమిండియా ఖాతాలో రికార్డు విజయంఈ మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్ రికార్డు విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో ఓ జట్టుపై అత్యధిక విజయాలు (శ్రీలంకపై 21 విజయాలు) సాధించిన జట్టుగా తమ రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. -
రెండో టీ20లో టీమ్ఇండియా ఘనవిజయం..సిరీస్ భారత్‌దే (ఫొటోలు)
-
వెంకటేశ్ అయ్యర్ కీలక నిర్ణయం
టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. లంకాషైర్ జట్టుతో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా!ఐపీఎల్-2024 ఫైనల్లో సత్తా చాటిఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అరంగేట్రం చేసిన వెంకీ.. గత నాలుగు సీజన్లుగా అదే జట్టుతో కొనసాగుతున్నాడు. కీలక సమయాల్లో రాణిస్తూ జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన ఈ ఇండోర్ క్రికెటర్.. ఐపీఎల్-2024 ఫైనల్లో సత్తా చాటాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పదేళ్ల తర్వాత కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు వెంకటేశ్ అయ్యర్.హార్దిక్ పాండ్యా వారసుడంటూ ప్రశంసలు.. కానీఐపీఎల్లో సత్తా చాటుతున్న సమయంలో(2021)నే టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు వెంకీ. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు వెంకటేశ్ అయ్యర్.టీమిండియా తరఫున ఇంత వరకు తొమ్మిది టీ20లు, రెండు వన్డేలు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆయా ఫార్మాట్లలో 133, 24 పరుగులు చేశాడు. టీ20లలో ఐదు వికెట్లు తీశాడు. అయితే, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి రావడంతో వెంకీకి అవకాశాలు కరువయ్యాయి. ఈ క్రమంలో 2022లో చివరిసారిగా అతడు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.రీఎంట్రీపై దృష్టిఐపీఎల్-2024లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్.. రీఎంట్రీపై కన్నేశాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో(ఫస్ట్‌క్లాస్)నూ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐదువారాల పాటు లంకాషైర్‌తో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అనంతరం భారత్‌కు తిరిగి వచ్చి దులిప్ ట్రోఫీలో భాగం కానున్నాడు.కౌంటీల్లో ఆడటం గురించి వెంకటేశ్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘లంకాషైర్ గొప్ప చరిత్ర ఉన్న జట్టు. ఫారూఖ్ ఇంజనీర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వాషింగ్టన్ సుందర్ లంకాషైర్‌కు ఆడారు. ఇప్పుడు నేను కూడా ఆ జాబితాలో చేరబోతున్నా’’ అని హర్షం వ్యక్తం చేశాడు.చదవండి: IND vs SL: గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్‌గా మారిన హార్దిక్ పాండ్యా -
నటాషాను మరిచిపోలేకపోతున్నాడా..?
-
సమరానికి సిద్ధం.. రేపటి నుంచి భారత్-శ్రీలంక టీ20 సిరీస్ (ఫొటోలు)
-
‘అందుకే అప్లై చేయలేదు.. నేను గంభీర్‌లా కాదు’
శ్రీలంక తాజా పర్యటనతో భారత క్రికెట్లో నూతన శకం ఆరంభం కానుంది. ఇంతవరకు కోచ్‌గా అనుభవం లేని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే విధంగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రిటర్మెంట్ తర్వాత భారత్ తొలిసారి టీ20 సిరీస్‌లో పాల్గొననుంది.ఇక ఈ జట్టుకు నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పూర్తిస్థాయికి కెప్టెన్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు టీ20 పగ్గాలు అప్పగించడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా సైతం తన అభిప్రాయం వ్యక్తపరిచాడు.ఆశ్చర్యం కలిగించలేదు‘‘హార్దిక్ పాండ్యా మూడు ఫార్మాట్లు ఆడలేకపోతున్నాడు. టెస్టులకు దూరమైన అతడు యాభై ఓవర్ల క్రికెట్లోనూ పూర్తిస్థాయిలో జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. అలాంటి ఆటగాడి సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనుకోవడం కత్తిమీద సాము లాంటిదే.అయినా క్రికెట్లో ఇవన్నీ సహజం. హార్దిక్‌పై వేటు వేయడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడిని ఇలా అకస్మాత్తుగా రేసు నుంచి తప్పించడం మాత్రం ఆశ్చర్యకరం. అయితే, కొత్త కోచ్ ఆలోచనలేమిటో మనకు తెలియదు. ప్రతి కోచ్, కెప్టెన్ అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి కదా’’ అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఆశిష్ నెహ్రా పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అయితే, తాను మాత్రం ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోలేదని 45 ఏళ్ల నెహ్రా తెలిపాడు. ఇందుకు గల కారణాలు కూడా వెల్లడించాడు.నేను గంభీర్‌లా కాదు‘‘ఈ విషయం గురించి నేను ఎన్నడూ ఆలోచించనేలేదు. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లే. గౌతం గంభీర్ పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అయితే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు.ప్రస్తుతం నా పనులతో నేను బిజీగా, సంతోషంగా ఉన్నాను. జట్టుతో కలిసి తొమ్మిది నెలల పాటు ప్రయాణించే ఓపిక నాకు లేదు’’ అని ఆశిష్ నెహ్రా స్పష్టం చేశాడు. కాగా ఆశిష్ నెహ్రా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌తో కలిసి పనిచేస్తున్నాడు.టైటాన్స్‌తో అనుబంధంఐపీఎల్-2022లో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు నెహ్రా మార్గదర్శనంలోని హార్దిక్ పాండ్యా సారథ్యంలో చాంపియన్‌గా అవతరించింది. మరుసటి ఏడాది కూడా ఫైనల్ చేరింది. అయితే, ఐపీఎల్-2024లో పాండ్యా టైటాన్స్‌తో బంధం తెంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.చదవండి: ‘ప్రేమ’తో నటాషా పోస్ట్.. హార్దిక్ పాండ్యా కామెంట్ వైరల్ -
‘ప్రేమ’తో నటాషా పోస్ట్.. హార్దిక్ పాండ్యా కామెంట్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. లంకతో టీ20 సిరీస్‌లో రాణించేందుకు నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడు. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో భారత జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నాడు.అందుకే వేటుకాగా హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడు.. కెప్టెన్‌గా ప్రమోషన్ పొందుతాడని భావించగా.. బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. హార్దిక్‌ను కాదని టీ20 స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతలు అప్పగించింది.గాయాల సమస్యతో ఇబ్బంది పడే హార్దిక్ పాండ్యాపై తాము నమ్మకం ఉంచలేమని.. ఈ అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. కెప్టెన్‌గా సూర్య సరైన ఆప్షన్ అని పేర్కొన్నాడు.విడాకులు తీసుకున్నాఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్ పాండ్యా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ప్రేమించి పెళ్లాడిన భార్య నటాషా స్టాంకోవిక్‌తో విభేదాల నేపథ్యంలో.. పాండ్యా విడాకులు తీసుకున్నాడు. తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ.. నటాషాతో స్నేహం కొనసాగుతుందని తెలిపాడు.అంతేకాదు.. కుమారుడు అగస్త్య విషయంలో తామిద్దరం తల్లిదండ్రులుగా బాధ్యతను నెరవేరుస్తామని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఇక విడాకుల అనంతరం నటాషా అగస్త్యను తీసుకుని సెర్బియాలోని తన పుట్టినింటికి వెళ్లిపోయింది.సూపర్.. మీకు ఎవరి దిష్టి తగలకూడదుఈ క్రమంలో అగస్త్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన నటాషా ఆ ఫొటోలను ‘లవ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందుకు స్పందించిన హార్దిక్ పాండ్యా.. ‘‘సూపర్.. మీకు ఎవరి దిష్టి తగలకూడదు’’ అంటూ హార్ట్ సింబల్ ఎమోజీలను జతచేశాడు. ఇది చూసిన పాండ్యా అభిమానులు.. ‘‘వదిన, అగస్త్యను మర్చిలేకపోతున్నావా భయ్యా.. మళ్లీ కలిసిపోండి’’ అని కామెంట్లు చేస్తున్నారు.కుమారుడి కోసమేఅయితే, మరికొందరు మాత్రం కుమారుడి కోసమే హార్దిక్ మాజీ భార్యతో సత్సంబంధాలు కోరుకుంటున్నాడని.. అందుకే ఇలా స్పందించాడని అభిప్రాయపడుతున్నారు. కాగా తాము కలిసి ఉన్న ఫొటోలను హార్దిక్, నటాషా ఇంతవరకు డిలీట్ చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా జూలై 27 నుంచి శ్రీలంకతో మొదలుకానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీ బిజీగా గడుపనున్నాడు.చదవండి: టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే!.. నో చెప్పిన ఐసీసీ! -
బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. హార్దిక్ తో డేటింగ్..!
-
నేనే గనుక హార్దిక్ స్థానంలో ఉంటే?.. ఈపాటికి..
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవడమే మంచిదైందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించగా.. అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ప్రకటించారు. ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలోనే హార్దిక్‌ను కాదని, సూర్యకు పగ్గాలు ఇచ్చినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.ఈ విషయంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప స్పందించాడు. తాను గనుక హార్దిక్ పాండ్యా స్థానంలో ఉంటే.. ఈపాటికి సంతోషంతో ఎగిరి గంతేసేవాడినని పేర్కొన్నాడు. కెరీర్ పొడిగించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదని అభిప్రాయపడ్డాడు.‘‘నేను హార్దిక్ పాండ్యా స్థానంలో ఉంటే.. నా గురించి మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని సంతోషించేవాడిని. ఎందుకంటే.. భారత క్రికెట్ ఎకోసిస్టమ్‌లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అత్యంత అరుదుగా లభించే ఆటగాడు.ఒకవేళ నాకు 34- 35 ఏళ్ల వయసు ఉండి.. తరచూ గాయాల బారిన పడుతూ ఉంటే కెరీర్ ప్రమాదంలో పడుతుంది. అదే ముందు నుంచీ జాగ్రత్తగా ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. మరికొంత కాలం ఆటలో కొనసాగవచ్చు.జాతీయ జట్టుకు సేవలు అందించవచ్చు. కాబట్టి కెప్టెన్సీకి దూరంగా ఉండమన్నా ఆనందంగా సరేనంటాను’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. ఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా జూలై 27 నుంచి టీమిండియా- శ్రీలంక మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఈ పర్యటనలో టీమిండియా కొత్త కోచ్‌గా గౌతం గంభీర్ ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. ఇరు జట్ల మధ్య మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు జరుగనున్నాయి. -
హార్దిక్‌తో డేటింగ్ రూమర్స్.. ఖరీదైన కారు కొన్న బ్యూటీ!
సినీతారలకు కార్లపై మక్కువ ఎక్కువ. మార్కెట్లో ఏదైనా కొత్త బ్రాండ్ వచ్చిందంటే గ్యారేజ్‌లోకి రావాల్సిందే. హీరోలైనా, హీరోయిన్లయినా సరే తమ రేంజ్‌కు తగిన కారును కొనేస్తుంటారు. అలా తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఆమె కొన్న రేంజ్ రోవర్ కారు విలువ దాదాపు రూ.3.38 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఇటీవల బ్యాడ్ న్యూజ్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. ఈ మూవీలో విక్కీ కౌశల్, త్రిప్తి డిమ్రీ జంటగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అంతే కాకుండా కాల్ మీ బే అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. హార్దిక్‌తో డేటింగ్!ఇటీవల అనంత్ అంబానీ బారాత్‌లో క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలిసి అనన్య డ్యాన్స్ చేసిన వీడియో వైరలైన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. అంతే కాకుండా ఇన్‌స్టాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో ఆ వార్తలు మరింత వైరలయ్యాయి. కాగా.. తన ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్‌లో ఈ ఏడాది మార్చి బ్రేకప్ చేసుకుంది. మరోవైపు హార్దిక్ ఇటీవలే తన భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. అయితే డేటింగ్ రూమర్స్ పై అనన్య పాండే, హార్దిక్ కానీ ఎవరూ స్పందించలేదు. View this post on Instagram A post shared by Ananya pandey 💫💛 (@ananya__panday__love) -
హార్దిక్‌ను ఎందుకలా పిలుస్తారో?: బరోడా మాజీ కోచ్ విమర్శలు
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవ్ వాట్మోర్ విమర్శలు గుప్పించాడు. అతడిని బరోడా ఆటగాడని సంబోంధించడం సరికాదన్నాడు.హార్దిక్ దేశవాళీ క్రికెట్ ఆడి ఎన్నో ఏళ్లు గడిచిపోయిందని.. అతడికి ఐపీఎల్ వంటి లీగ్‌లపై మాత్రమే శ్రద్ధ ఎక్కువని సెటైర్లు వేశాడు. అయినా తన గురించి ప్రస్తావన వచ్చినపుడు బరోడా ఆల్‌రౌండర్ అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నాడు వాట్మెన్.కాగా భారత వన్డే, టీ20 క్రికెట్ జట్టులో కీలక సభ్యుడైన హార్దిక్ పాండ్యా స్వస్థలం గుజరాత్. తన అన్న కృనాల్ పాండ్యాతో కలిసి బరోడా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన హార్దిక్.. 2018 తర్వాత మళ్లీ అక్కడ కనిపించలేదు.అయితే, ఇటీవల బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ కారణాల వల్ల జట్టుకు దూరమైన ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్లో ఆడిన తర్వాతే టీమిండియా సెలక్షన్ సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.అంతేకాదు.. శ్రీలంక పర్యటనకు జట్టును ప్రకటించినపుడు కూడా ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. దీంతో హార్దిక్ పాండ్యాకు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఇప్పటికే ఫిట్నెస్ సమస్యల వల్ల కెప్టెన్సీకి దూరమైన హార్దిక్.. వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి.ఈ నేపథ్యంలో.. బరోడా జట్టు కోచ్‌గా పనిచేసిన ఆసీస్ మాజీ క్రికెటర్ డేవ్ వాట్మోర్ ఓ పాకిస్తానీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘‘చాలా మంది దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడరు. నేను రెండేళ్ల పాటు బరోడా జట్టుతో ఉన్న సమయంలో పాండ్యా ఒక్కసారి కూడా ఆడలేదు.అయినప్పటికీ తనను బరోడా ఆల్‌రౌండర్ అని పిలుచుకోవడం సరికాదనిస్తుంది. చాలా ఏళ్ల పాటు అతడు ఆ జట్టుకు దూరంగా ఉన్నా ఇంకా అక్కడి ఆటగాడిగా గుర్తించడం ఏమిటో?!ఇటీవల బీసీసీఐ తెచ్చిన నిబంధనలు నాకు నచ్చాయి. రంజీ ట్రోఫీలో అందరూ ఆడాలని.. మిగిలిన రెండు ఫార్మాట్లలో కూడా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని చెప్పింది. 4-డే క్రికెట్‌ను ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లకు కోచ్‌గా వ్యవహరించి విజయవంతమైన శిక్షకుడిగా పేరొందాడు వాట్మోర్. 2021-22, 2022- 23 సీజన్లలో బరోడా కోచ్‌గా సేవలు అందించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో టీమిండియా టీ20 సిరీస్‌కు హార్దిక్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. వన్డేల్లో మొండిచేయి చూపారు. -
అందుకే కెప్టెన్సీ ఇవ్వలేదు: అగార్కర్ ఘాటు వ్యాఖ్యలు
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించకపోవడానికి గల కారణాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. హార్దిక్ మెరుగైన నైపుణ్యాలున్న ఆల్‌రౌండర్ అని.. అయితే, అతడి ఫిట్నెస్ విషయంలో మాత్రం క్లారిటీ లేదన్నాడు.అలాంటి ఆటగాడిని జట్టుకు ఎంపిక చేసేటపుడే కోచ్, సెలక్టర్ ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తుందన్న అగార్కర్.. మరి ఏకంగా కెప్టెన్‌గా ఎలా నియమించగలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఏదేమైనా జట్టులో అతడు కీలక ఆటగాడని.. అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నాడు.పునారగమనంలో సత్తా చాటిన హార్దిక్కాగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా కాలం పాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024లో ఫిట్నెస్ నిరూపించుకున్న ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్.. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.పునారగమనంలో సత్తా చాటిన హార్దిక్.. భారత్ ఈ ఐసీసీ టోర్నీలో చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. టీ20 వరల్డ్‌కప్ జట్టుకు వైస్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా నియామకం ఖరారు అవుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను రోహిత్ వారసుడిగా ప్రకటించింది బీసీసీఐ.శ్రీలంక పర్యటన నుంచి సూర్య పగ్గాలు చేపడతాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో హార్దిక్‌కు అన్యాయం జరిగిందంటూ బీసీసీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై తాజాగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు.కొత్త కోచ్ గౌతం గంభీర్‌తో కలిసి ముంబైలో సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన అగార్కర్.. ‘‘అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండి.. అన్నింటిలోనూ చురుగ్గా ఆడగల కెప్టెన్ కావాలని మేము కోరుకుంటున్నాం.అలాంటి కెప్టెన్ మాత్రమే మాకు కావాలిహార్దిక్ విషయంలో ఈ అంశంపై స్పష్టత లేదు. అతడి విషయంలో ఫిట్నెస్ అతి పెద్ద సవాలు. అదే కోచ్, సెలక్టర్లను ఇబ్బంది పెడుతోంది. తదుపరి టీ20 ప్రపంచకప్ దాకా మాకు సమయం ఉంది.హార్దిక్ విషయంలో ఫిట్నెస్ ఒక్కటే ప్రామాణికం. జట్టుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కెప్టెన్ మాత్రమే మాకు కావాలి. ఇక సూర్య.. కెప్టెన్ కావడానికి గల అన్ని అర్హతలు, నైపుణ్యాలు అతడికి ఉన్నాయి’’ అని పేర్కొన్నాడు. టీమిండియా టీ20 కెప్టెన్‌గా రాణించగల సత్తా సూర్యకు ఉందని అగార్కర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అదే విధంగా.. ఆటగాడిగా హార్దిక్ పాండ్యా అవసరం జట్టుకు ఎంతగానో ఉందని తెలిపాడు. కాగా జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంక టూర్ ఆరంభం కానుంది. చదవండి: రోహిత్, కోహ్లిల భవిష్యత్తుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు.. -
హార్దిక్ పాండ్యాను ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ హీరోయిన్..!
లైగర్ మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టిన బ్యూటీ అనన్య పాండే. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మెప్పించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఇటీవల అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేసింది. బారాత్ వేడుకల్లో రణ్వీర్ సింగ్, హార్దిక్ పాండ్యాలతో కలిసి చిందులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది.అయితే ఈ పెళ్లి తర్వాత అనన్య పాండే సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాను ఫాలో అవుతోంది. హార్దిక్ పాండ్యా సైతం అనన్యను ఫాలో అవుతున్నారు. వీరిద్దరూ కలిసి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారా? అంటూ క్రేజీ పోస్టులు పెడుతున్నారు.ఎందుకంటే ఇటీవల హార్దిక్ పాండ్యా తన భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడిపోయినట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అనన్య పాండే సైతం తన బాయ్‌ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్‌లో బ్రేకప్ చేసుకుంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
అలా అయితేనే వన్డేల్లో రీ ఎంట్రీ.. హార్దిక్‌కు బీసీసీఐ కండిషన్!
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అతడికి కాలం కలిసిరావడం లేదు.భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్నట్లు హార్దిక్ ఇటీవలే అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, కుమారుడు అగస్త్య విషయంలో మాత్రం ఇద్దరం సమానంగా బాధ్యత వహిస్తామని.. కో పేరెంటింగ్ చేస్తామని వెల్లడించాడు.కానీ సంయుక్త విడాకుల ప్రకటన అనంతరం నటాషా అగస్త్యను తీసుకుని తన పుట్టినిల్లు సెర్బియాకు వెళ్లిపోయింది. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి అక్కడికి బయల్దేరుతున్న సమయంలో అగస్త్య ఏడుస్తూ కనిపించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఏడ్చేసిన అగస్త్య!తండ్రిని విడిచి వెళ్లేందుకు సిద్ధంగా లేకపోయినా.. తల్లి బలవంతం చేయడంతోనే అగస్త్య ఆమెతో వెళ్లినట్లుగా ఆ వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో హార్దిక్ సైతం తీవ్రమైన బాధతో కుంగిపోతున్నట్లు సమాచారం.వ్యక్తిగత జీవితంలో ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యాకు.. టీమిండియాలోనూ కష్టకాలం మొదలైనట్లే కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్‌గా సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్‌ను బీసీసీఐ పక్కనపెట్టింది.చేజారిన కెప్టెన్సీకొత్త కోచ్ గౌతం గంభీర్ హయాంలో సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. శ్రీలంక పర్యటన నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్‌గా సూర్యను ప్రకటించి హార్దిక్ పాండ్యాను కేవలం ఆటగాడిగా పేర్కొంది.అయితే, ఈ టూర్లో భాగంగా వన్డే సిరీస్ కూడా జరుగనుంది. కానీ జట్టులో హార్దిక్‌కు చోటు ఇవ్వలేదు సెలక్టర్లు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతం గంభీర్ వల్లే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మూడు ఫార్మాట్లలో ఆడాలికాగా కోచ్‌గా ప్రయాణం మొదలుపెట్టకముందే.. గంభీర్ తన వైఖరేంటో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఫిట్‌గా ఉండే ఆటగాళ్లు కచ్చితంగా మూడు ఫార్మాట్లు ఆడాలని పేర్కొన్నాడు.గాయాల భయంతో ఆటకు దూరంగా ఉంటే తనకు నచ్చదని పేర్కొన్నాడు. హార్దిక్ విషయానికొస్తే.. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తరచూ గాయాల బారిన పడుతూ ఉంటాడన్న విషయం తెలిసిందే.అందుకే ఇప్పటికే అతడు టెస్టు ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు. కేవలం వన్డే, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడిన తర్వాత అతడికి మళ్లీ వన్డే ఆడే అవకాశం రాలేదు.దేశవాళీ క్రికెట్ ఆడితేనే రీఎంట్రీఐపీఎల్-2024లో ఫిట్నెస్ నిరూపించుకోవడం ద్వారా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని గంభీర్ హార్దిక్‌కు కండిషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.విజయ్ హజారే ట్రోఫీ(వన్డే)లో ఆడి.. బౌలింగ్‌లోనూ ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాతే యాభై ఓవర్ల ఫార్మాట్లో పునరాగమనం చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బీసీసీఐ కూడా చెప్పిందిదేఈ మేరకు బీసీసీఐ వర్గాలు.. ‘‘వన్డేల్లో హార్దిక్ పూర్తి కోటా బౌలింగ్ చేస్తే చూడాలని ఉందని గంభీర్ అతడికి ఫోన్ కాల్ ద్వారా తెలిపాడు’’ అని హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాయి.ఇక శ్రీలంక టూర్‌కు జట్ల ప్రకటన సమయంలో బీసీసీఐ సైతం దేశవాళీ క్రికెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్‌కు అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకత ఉందని.. దేశీ టోర్నీల్లో పాల్గొన్నాలన్న నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేసింది. చదవండి: ICC: టీమిండియా మ్యాచ్‌లు అన్నీ లాహోర్‌లోనే?! -
అనుకున్నదే అయ్యింది.. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన హార్దిక్-నటాషా..
-
కెప్టెన్‌గా హార్దిక్ సరైనోడు.. అతడు ఏం తప్పు చేశాడు?
టీమిండియా కెప్టెన్సీ విషయంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు కాకుండా వేరొకరికి పగ్గాలు అప్పజెప్పడం సరికాదని పేర్కొన్నాడు.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో ఫైనల్లో గెలిచి ట్రోఫీని ముద్దాడిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఈ నేపథ్యంలో రోహిత్ వారసుడు ఎవరా అన్న అంశంపై చర్చలు జరిగాయి. భారత టీ20 కెప్టెన్‌గా.. ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నియామకం లాంఛనమే అని అభిమానులు భావించారు.ఆటగాడిగా మాత్రమే హార్దిక్ పాండ్యాఅయితే, అనూహ్యంగా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ పేరు తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో శ్రీలంకతో సిరీస్‌కు జట్టు ప్రకటన సందర్భంగా అతడిని కెప్టెన్‌గా ఖరారు చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. హార్దిక్ పాండ్యాకు జట్టులో ఆటగాడిగా మాత్రమే చోటిచ్చింది.ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ నియామకం విషయంలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా కొనసాగిస్తారని భావించాను.ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను అరంగేట్రంలోనే చాంపియన్‌గా నిలపడంతో పాటు.. మరోసారి కూడా ఫైనల్ చేర్చాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.అంతేకాదు టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా వైస్ కెప్టెన్ కూడా అతడే! అయితే, ఇప్పుడు కొత్త కోచ్ వచ్చాడు. కాబట్టి తన ప్రణాళికలకు అనుగుణంగా అంతా ఉండాలని అనుకుంటున్నాడేమో!అతడి విషయం నాకు తెలియదు కానీ.. హార్దిక్‌ను పక్కనపెట్టడం సరికాదు. ఐపీఎల్లో టైటాన్స్‌ను జీరో నుంచి హీరోను చేసిన ఘనత హార్దిక్‌దే.నిజానికి సూర్య కూడా బాగానే ఆడుతున్నాడు. కెప్టెన్‌గానూ రాణించాలని కోరుకుంటున్నాను. అయితే, హార్దిక్ పాండ్యా సారథిగా ఉంటే బాగుండేది.తనను పక్కనపెట్టేంత తప్పు ఏం చేశాడు? కోచ్‌గా గంభీర్ తన నిర్ణయాలు అమలు చేయాలనుకోవచ్చు. కానీ హార్దిక్ పాండ్యా.. కెప్టెన్ కాకుండా తనను పక్కనపెట్టేంత తప్పు ఏం చేశాడో అర్థం కావడం లేదు’’ అని మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.కాగా ఈ ఏడాది ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వచ్చిన హార్దిక్ పాండ్యా జట్టును విజయపథంలో నిలపలేకపోయాడున. అదే విధంగా తరచూ గాయాల బారిన పడే హార్దిక్ లాంటి ఆటగాళ్లు తనకు కెప్టెన్లుగా వద్దని కొత్త కోచ్ గౌతం గంభీర్ చెప్పినట్లు సమాచారం.అదే విధంగా.. జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా సూర్య వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ హార్దిక్‌కు బదులు సూర్యను కెప్టెన్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. టీ20 సిరీస్‌తో ఈ టూర్ మొదలుకానుంది.చదవండి: నటాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు... స్టార్ ప్లేయర్ అధికారిక ప్రకటన -
హార్దిక్ పాండ్యాకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. కారణమిదే?
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను కాదని స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ నియమించింది. అంతేకాకుండా భారత జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా పాండ్యాను బీసీసీఐ తప్పించింది. అతడి స్ధానంలో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు జట్టు ఎంపిక సందర్భంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మ తర్వాత టీ20ల్లో భారత జట్టు సారథిగా పాండ్యా బాధ్యతలు చేపడతాడని అంతా భావించారు. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం సూర్యకుమార్ యాదవ్ వైపే మొగ్గు చూపింది. టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం సూర్యకుమార్‌కు మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇదే విషయంపై క్రీడా వర్గాల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. అస్సలు ఎందుకు హార్దిక్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయలేదన్న సందేహం అందరిలో నెలకొంది.కారణమిదేనా?ఫిట్నెస్ సమస్య కారణంగానే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించకపోయినట్లు సమాచారం. పాండ్యా ఎప్పటికప్పుడు గాయాల బారిన పడుతుండంతో దీర్ఘకాలిక ప్రణాళికల దృష్ట్యా సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడ్డ పాండ్యా.. దాదాపు 6 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఐపీఎల్-2024తో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్లో కూడా పాండ్యా తన మార్క్‌ను చూపించలేకపోయాడు.గాయాల కారణంగా వర్క్‌లోడ్‌ను పాండ్యా మెనెజ్ చేయలేడని అజిత్ అగర్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ భావించినట్లు తెలుస్తోంది. అదే విధంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం ఆటగాళ్లు అన్ని ఫార్మాట్ల్లో ఆడేందుకు సిద్దంగా ఉండాలని ఇప్పటికే సృష్టం చేశాడు. ఈ క్రమంలోనే హార్దిక్‌కు డిమోషన్ లభించినట్లు వినికిడి.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
నటాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు... స్టార్ ప్లేయర్ అధికారిక ప్రకటన
న్యూఢిల్లీ: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించాడు. తన భార్య నటాషా స్టన్కోవిచ్తో వివాహ బంధం ముగిసినట్లు అతను అధికారికంగా ప్రకటించాడు. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు పాండ్యా పేర్కొన్నాడు. వీరిద్దరికి 2020లో వివాహం కాగా...అగస్త్య అనే నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. సెర్బియాకు చెందిన స్టన్కోవిచ్ మోడలింగ్, సినిమాల్లో నటిస్తూ ముంబైలో స్థిరపడిన సమయంలో పాండ్యాతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. గత కొంత కాలంగా పాండ్యా, స్టన్కోవిచ్ మధ్య విభేదాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇద్దరూ దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. మరోవైపు విడాకుల తర్వాత కూడా కొడుకుతో మాత్రం తల్లిదండ్రులుగా తమ ఇద్దరి బంధం కొనసాగుతుందని, అతని కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటామని పాండ్యా స్పష్టం చేశాడు. -
Ind vs SL: హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
కష్టపడితే తప్పకుండా ఫలితం దక్కుతుందంటున్నాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. అందుకు తానే నిదర్శనం అని.. సంకల్ప బలం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించవచ్చని చెబుతున్నాడు.ఎన్నో ఎత్తుపళ్లాలువన్డే వరల్డ్‌కప్-2023 - టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల మధ్యకాలంలో హార్దిక్ పాండ్యా జీవితంలో చాలా మార్పులే వచ్చాయి. కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఎత్తుపళ్లాలు చవిచూశాడు ఈ బరోడా క్రికెటర్.సొంతడ్డపై వన్డే ప్రపంచకప్ ఈవెంట్లో టీమిండియా జోరు మీదున్న తరుణంలో హార్దిక్ పాండ్యా అనూహ్య రీతిలో గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తున్నపుడు రిటర్న్ క్యాచ్‌కు యత్నించి విఫలమైన ఈ ఆల్‌రౌండర్.. అదుపుతప్పి పడిపోయాడు.ఈ క్రమంలో కాలు మెలిక పడగా చీలమండ నొప్పి ఎక్కువైంది. ఫలితంగా అతడు మైదానం వీడక తప్పలేదు. ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఐసీసీ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం ఐపీఎల్-2024 సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు.అక్కడా చేదు అనుభవమేఅయితే, క్యాష్ రిచ్లీగ్లోనూ అతడికి చేదు అనుభవమే మిగిలింది. సొంత జట్టు అభిమానులే సారథిగా హార్దిక్ ఉండటాన్ని జీర్ణించుకోలేక అతడిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మైదానం లోపలా, వెలుపలా ఆగ్రహం వెళ్లగక్కారు.ఈ క్రమంలో కెప్టెన్సీలో తడబడిన హార్దిక్ పాండ్యా తన నిర్ణయాల కారణంగా భారీ మూల్యమే చెల్లించాడు. ఆటగాడిగా, సారథిగా పూర్తిగా విఫలమయ్యాడు. మొట్టమొదటిసారి ముంబై కెప్టెన్ హోదాలో బరిలోకి దిగిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. జట్టును పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిపాడు.దీంతో విమర్శల పదును పెరగడంతో పాటు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులోనూ చోటు ఇవ్వకూడదనే డిమాండ్లు వచ్చాయి. అయితే, అదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోవడంతో అతడికి స్థానం దక్కింది.ఇక వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భావించిన హార్దిక్ పాండ్యా.. ఫిట్‌నెస్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాడు. మెగా టోర్నీలో తన తాను నిరూపించుకుని.. టీమిండియా ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.ఫైనల్లో అదరగొట్టిముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో ఉత్కంఠతో కూడిన ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీసి జట్టును విజయతీరాలకు చేర్చాడు పాండ్యా. తనను ఎక్కడైతే అవమానించారో అదే ముంబై స్టేడియంలో వరల్డ్‌కప్ హీరోగా నీరాజనాలు అందుకున్నాడు.తాజాగా.. వన్డే వరల్డ్‌కప్ సమయంలో ఎదురైన గడ్డు పరిస్థితులు, ఫిట్నెస్ విషయంలో తాను పడ్డ శ్రమకు సంబంధించిన విషయాల గురించి హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాలో షేర్ చేశాడు.ఫిట్నెస్ ముఖ్యం‘‘2023 వరల్డ్‌కప్.. గాయం కారణంగా అత్యంత కష్టంగా గడిచింది. అయితే, టీ20 ప్రపంచకప్ విజయంతో ఆ బాధను మర్చిపోగలిగాను. ప్రయత్నిస్తే తప్పక ఫలితం దక్కుతుంది. కఠినంగా శ్రమిస్తే తప్పక గుర్తింపు లభిస్తుంది. నా లాగే మీ అందరూ కూడా ఫిట్‌నెస్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వండి’’ అంటూ ఫిట్నెస్ గోల్స్ సెట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో హార్దిక్ పాండ్యా ఆరు ఇన్నింగ్స్ ఆడి 144 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ శతకం ఉంది. అదే విధంగా.. 7.64 ఎకానమీతో 11 వికెట్లు కూడా తీశాడు.ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యాకు భార్య నటాషా స్టాంకోవిక్‌తో విభేదాలు తలెత్తాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట ఇప్పటికే విడాకుల దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని ప్రచారం జరుగుతుండగా.. కుమారుడు అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియా వెళ్లడం గమనార్హం.శ్రీలంక పర్యటనకు వెళ్తాడా?జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. అయితే, కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ వైపు బీసీసీఐ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. తరచూ గాయాల బారిన పడుతున్న పాండ్యా కాకుండా సూర్య జట్టును సమర్థవంతంగా ముందుకు నడపగలడని భావిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ జర్నీ పోస్ట్ పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
Team India Captaincy: రోహిత్ ఓటు సూర్యకే..?
రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాక టీమిండియా కెప్టెన్ పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పదవి రేసులో తొలుత హార్దిక్ పాండ్యా ఒక్కడి పేరే వినిపించినప్పటికీ.. నిన్న మొన్నటి నుంచి సూర్యకుమార్ యాదవ్ కూడా రేసులో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. హార్దిక్ తరుచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటుంటాడన్న విషయాన్ని సాకుగా చూపుతూ బీసీసీఐలోకి కొందరు పెద్దలు సూర్య పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తుంది.తాజాగా ఈ అంశానికి సంబంధించి ఓ బిగ్ అప్డేట్ అందింది. సూర్యకుమార్‌కు బీసీసీఐలోని ఓ వర్గం అండదండలతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే 2026 టీ20 వరల్డ్‌కప్ వరకు భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగే అవకాశం ఉంది. మరి కొద్ది గంటల్లో ఈ అంశం అధికారిక ప్రకటన వెలువడవచ్చు.వాస్తవానికి శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును ఇవాళే ప్రకటించాల్సి ఉండింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సెలెక్షన్ కమిటీ భేటి వాయిదా పడింది. లంకలో పర్యటించే భారత జట్టుతో పాటు కొత్త టీ20 కెప్టెన్ పేరును రేపు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, భారత్.. శ్రీలంక పర్యటన ఈ నెల 27 నుంచి మొదలుకానుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. 27, 28, 30 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది. -
భారత్ నుంచి వెళ్లిపోయిన 'హార్దిక్ పాండ్యా' సతీమణి.. వీడియో వైరల్
హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా స్టాంకోవిచ్ తన సొంత దేశమైన సెర్బియాకు వెళ్లినట్లు సమాచారం. 2013 బాలీవుడ్ సినిమా సత్యాగ్రహంతో భారత్‌లో ఎంట్రీ ఇచ్చిన నటాషా.. బిగ్ బాస్ 8 ద్వారా మరింత పాపులర్ అయింది. దీంతో ఆమెకు భారీగా సినిమా ఛాన్స్‌లు దక్కాయి. అలా సుమారు 15 పైగా చిత్రాల్లో నటించింది. 2020లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాను ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ సమయం నుంచి సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. అయితే, గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేడు తెల్లవారుజామున భారత్ వదిలి తన కుమారుడితో సహా నటాషా వెళ్లిపోయింది.హార్దిక్ పాండ్యాతో విడాకుల పుకార్లు వస్తున్న సమయంలో నటాసా స్టాంకోవిచ్ తన లగేజ్‌ను సర్దుకుని కుమారుడు అగస్త్యతో కలిసి ముంబై నుంచి వెళ్లిపోయింది. వారిద్దరూ సెర్బియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున వీరిద్దరూ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన పలు చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటాసా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కూడా ఫోటోలను పంచుకుంది.మొదటి ఫోటోలో.. నటాషా తన దుస్తులతో ప్యాక్ చేయబడి ఉన్న తన సూట్‌కేస్‌ను చూపింది. ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది అంటూ పలు ఎమోజీలను పంచుకుంది. కన్నీళ్లతో ఉన్న ఎమోజీతో పాటు విమానం, ఇల్లు, లవ్ సింబల్‌ను ఆమె షేర్ చేసింది. మరో ఫోటోలో, ఆమె తన పెంపుడు కుక్క ఇమేజ్ను పంచుకుంది.నటాషా, హార్దిక్‌ల మధ్య విడాకుల పుకార్లు కొన్ని వారాల క్రితం నుంచి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ రూమర్స్‌పై వీరిద్దరూ ఇంకా స్పందించలేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొంతమంది వ్యక్తులు టి 20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా విడిపోయారని చెప్పారు. హార్దిక్ లేదా భారత క్రికెట్ జట్టు విజయం సాధించిన తర్వాత వారికి అభినందనలు తెలుపుతూ నటాషా ఎలాంటి పోస్ట్‌లను పంచుకోలేదు.హార్దిక్ గెలుపు, ఓటమిల వెంట ఎప్పుడూ ఉండే నటాషా.. టి 20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆమె కనిపించలేదు. రీసెంట్గా అంబానీ ఇంటి పెళ్లి వేడుకలకు కూడా హార్తిక్ ఒక్కడే హాజరయ్యాడు. తాజాగా తన లగేజ్‌తో ఆమె ఇండియా వదిలి వెళ్లిపోవడంతో వారిద్దరూ ఇక విడిపోయినట్లే అని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. 2020 ఉదయపూర్‌లో క్రైస్తవ, హిందూ ఆచారాలతో హార్తిక్, నటాషా వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
హార్దిక్ పాండ్యాకు షాక్!.. టీ20 కెప్టెన్‌గా అతడే!
టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో సెమీస్‌లోనే భారత్ నిష్క్రమించిన తర్వాత రోహిత్ శర్మ.. దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ టీ20లకు దూరంగానే ఉన్నాడు. అతడి గైర్హాజరీలో పాండ్యా టీ20లలో టీమిండియాను ముందుకు నడిపించాడు.పాండ్యా గాయపడిన సందర్బాల్లో భారత నంబర్ వన్ టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వీరిద్దరు అందుబాటులో లేని సమయంలో రిషభ్ పంత్ సైతం సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు.శాశ్వత కెప్టెన్ కోసం కసరత్తుఇక టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో తిరిగి పొట్టి ఫార్మాట్ పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. అనంతరం అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ స్థానంలో తాత్కాలిక కెప్టెన్ కాకుండా సుదీర్ఘకాలం పాటు టీ20లలో టీమిండియాను ముందుకు నడిపే ఆటగాడినే ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. తరచూ గాయాలు ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్-2024 జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తరచూ గాయాల బారిన పడే ఆ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను కాదని సూర్యకుమార్ యాదవ్ వైపు బోర్డులోని కొందరు వ్యక్తులు మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే, మరికొందరు మాత్రం హార్దిక్ పాండ్యాకే తమ ఓటు అని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా సున్నితమైన అంశం. టీ20 కెప్టెన్ నియామకం విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.ముఖ్యంగా హార్దిక్ ఫిట్నెస్ విషయంలో సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందించడంలో అతడు కీలక పాత్ర పోషించినప్పటికీ గాయాల బెడద సమస్యగా మారింది.సూర్య సూపర్ అని చెప్పారుమరోవైపు.. సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఇప్పటికే మేము ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం. అతడి కెప్టెన్సీ పట్ల ఆటగాళ్లంతా సానుకూలంగా ఉన్నారు. సూర్య హయాంలో డ్రెసింగ్‌రూం వాతావరణం కూడా చాలా బాగా ఉందని చెప్పారు’’ అని పేర్కొన్నాయి.కాగా ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో హార్దిక్ పాండ్యా ఇప్పటికే చాలా సార్లు గాయపడ్డాడు. గాయాల భయంతోనే అతడు టెస్టు క్రికెట్‌కు కూడా పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే.కెప్టెన్సీ భారం వల్లఫిట్నెస్ విషయంలో తరచూ సమస్యల బారిన పడుతున్న ఇలాంటి ఆటగాడిని పూర్తిస్థాయి కెప్టెన్ చేయడం పట్ల బోర్డు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆల్‌రౌండర్‌పై హార్దిక్ ప్రదర్శనపై కెప్టెన్సీ ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే టీ20లలో సూర్యకుమార్ యాదవ్‌కు పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సూర్య చివరగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెలిచాడు. గంభీర్ ఓటు ఎవరికో?ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ టీమిండియా టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచింది. తదుపరి జూలై 27న మొదలయ్యే సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు భారత్ సిద్ధం కానుంది. ఈ టూర్తోనే గంభీర్ హెడ్‌కోచ్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. టీ20 కెప్టెన్ ఎంపిక విషయంలో అతడి అభిప్రాయం కూడా ప్రధానం కానుంది.చదవండి: నో రెస్ట్: కోహ్లి, రోహిత్, బుమ్రా ఆడాల్సిందే.. గంభీర్ అల్టిమేటం?! -
హార్దిక్ పాండ్యాకు గ్రాండ్ వెల్కమ్
టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం తొలిసారి తన సొంత పట్టణమైన వడోదరకు వచ్చిన టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. హార్దిక్‌ను ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా తీసుకెళ్లేందుకు భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. హార్దిక్ ఓపెన్ టాప్ వాహనంలో వడోదర వీధుల గుండా తన స్వగృహానికి చేరకున్నాడు. హార్దిక్ విజయోత్సవ ర్యాలీకి ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. A HERO'S WELCOME FOR HARDIK PANDYA IN VADODARA. 😍🏆 pic.twitter.com/LFY0g1ZgOX— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024హార్దిక్ నామస్మరణతో వడోదర వీధులు మార్మోగిపోయాయి. హార్దిక్ ఓపెన్ టాప్ వాహనంపై నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. హార్దిక్ విజయోత్సవ ర్యాలీకి చెందిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ర్యాలీ అనంతరం పట్టణంలోని ఓ బహిరంగ ప్రదేశంలో హార్దిక్‌కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హార్దిక్‌తో పాటు అతని సోదరుడు కృనాల్ పాండ్యా కూడా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో "చక్‌దే ఇండియా" పాట ప్లే చేయగా జనాలు ఉర్రూతలూగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది.Hardik Pandya and Krunal Pandya dancing on Chak De India. 🇮🇳 pic.twitter.com/Q2S8OMuCSv— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2024కాగా, హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం ముంబైలో జరిగిన టీమిండియా విజయోత్సవ ర్యాలీలో పాల్గొని అక్కడే ఉండిపోయాడు. అనంతరం హార్దిక్ అనంత అంబానీ వివాహా వేడుకలో సందడి చేసి ఇవాళ (జులై 15) వడోదరకు చేరుకున్నాడు.ఇదిలా ఉంటే.. యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. జూన్ 29న సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్.. ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. -
టీమిండియా టీ20 కెప్టెన్‌గా వాళ్లిద్దరి మధ్యే పోటీ
అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా శకం టీ20 ప్రపంచకప్-2024తో ముగిసింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత ఈ ముగ్గురూ టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.ఈ నేపథ్యంలో టీ20లలో భారత జట్టు కొత్త కెప్టెన్ ఎవరా అన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం తన అభిప్రాయాలు పంచుకున్నాడు.తన దృష్టిలో టీమిండియాకు ముందుకు నడిపే సామర్థ్యం ఇద్దరు స్టార్లకు ఉందన్న ఈ మాజీ వికెట్ కీపర్.. కొత్త కోచ్ గౌతం గంభీర్, సెలక్టర్ల నిర్ణయం పైనే అంతా ఆధారపడి ఉందని పేర్కొన్నాడు.ఈ మేరకు సబా కరీం మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. ఇకపై అతడు టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట ఆడడు.కాబట్టి అతడి వారసుడి ఎంపికపైనే ప్రస్తుతం అందరి దృష్టి పడింది. నా దృష్టిలో ఇద్దరికి ఆ అవకాశం ఉంది. లాజికల్‌గా చూస్తే హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌ను చేయాలి.ఎందుకంటే టీ20 ప్రపంచకప్-2024లో అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించింది బోర్డు. గతంలోనూ రోహిత్ గైర్హాజరీలో అతడు సారథిగా వ్యవహరించాడు.రానున్న రెండేళ్లలో మరోసారి టీమిండియా పొట్టి వరల్డ్‌కప్ ఆడనుంది. అప్పటికి పూర్తి స్థాయిలో జట్టు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా కెప్టెన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అతడు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు.కచ్చితంగా అతడు కూడా టీమిండియా టీ20 కెప్టెన్‌గా సరైన ఆప్షనే అనిపిస్తాడు. వీరిద్దరిలో ఎవరిని సారథిని చేయాలన్న అంశంపై సెలక్టర్లు, కొత్త కోచ్ నిర్ణయం తీసుకుంటారు’’ అని పేర్కొన్నాడు. తానైతే ఇద్దరికీ కెప్టెన్ అయ్యే అర్హత ఉందని చెబుతానంటూ సబా కరీం సోనీ స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. -
అంతా ప్రేమ మయం అంటున్న హార్దిక్ పాండ్యా.. ఆ లాకెట్ స్పెషల్ (ఫొటోలు)
-
Ind vs SL: అగార్కర్‌తో గంభీర్ భేటీ అప్పుడే! ఆ ఇద్దరి రీ ఎంట్రీ!
టీమిండియా కోచ్‌గా గౌతం గంభీర్ ప్రయాణం జూలైలో ఆరంభం కానుంది. ఈనెల చివర్లో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే విడుదల చేసింది.రెండు వేదికల్లో 13 రోజులపాటు జరిగే ఈ సిరీస్‌లో శ్రీలంకతో భారత జట్టు మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడుతుంది. పల్లెకెలో మైదానంలో జూలై 26, 27, 29వ తేదీల్లో వరుసగామూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.అనంతరం ఆగస్టు 1, 4, 7 తేదీల్లో కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో మూడు వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును ఇంకా ప్రకటించలేదు.ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక గురించి హెడ్ కోచ్ గౌతం గంభీర్ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో వచ్చే వారం భేటీ కానున్నట్లు సమాచారం. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, టీ20 జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌లకు కూడా మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో లంకలో పర్యటించే జట్ల ఎంపిక కూర్పుపై.. ముఖ్యంగా కెప్టెన్ల విషయంలో గౌతీ అజిత్‌తో చర్చలు జరుపనున్నట్లు సమాచారం. కాగా కేఎల్ రాహుల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో పునరాగమనం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ లంకతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా.. శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ గురించి కూడా ఈ భేటీలో గంభీర్ అజిత్‌తో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.ఇక ఒకవేళ హార్దిక్ విశ్రాంతి కోరుకోనట్లయితే అతడికి టీ20 పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అతడికి డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేస్తారని బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొన్నాయి.అదే విధంగా సీనియర్ల గైర్హాజరీలో శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్,ఆవేశ్ ఖాన్, అభిషేక్ శర్మ తదితర యువ ఆటగాళ్లు లంకతో టీ20 సిరీస్ ఆడబొయే జట్టులో చోటు దక్కించుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీళ్లంతా జింబాబ్వే పర్యటనలో ఉన్నారు.ఇక ఈసారి టీమిండియా- శ్రీలంక సిరీస్‌కు మరో ప్రత్యేకత ఏర్పడింది. రెండు జట్లూ ఈసారి కొత్త హెడ్ కోచ్‌ల పర్యవేక్షణలో ద్వైపాక్షిక సిరీస్‌లో పోటీపడనున్నాయి. టీమిండియాకు గౌతం గంభీర్... శ్రీలంకకు సనత్ జయసూర్య హెడ్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.గందరగోళంగా శ్రీలంక జట్టు పరిస్థితిగత నెలలో వెస్టిండీస్–అమెరికాలలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో హసరంగ నేతృత్వంలో ఆడిన శ్రీలంక లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. జట్టు పేలవ ప్రదర్శన కారణంగా హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేయగా, కోచ్ బాటనే కెప్టెన్ కూడా అనుసరించాడు. శ్రీలంక టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ వైదొలిగాడు. శ్రీలంక క్రికెట్ మేలు కోరే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు, జట్టులో సభ్యుడిగా కొనసాగుతానని హసరంగ వివరించాడు. హసరంగ రాజీనామా నేపథ్యంలో టీమిండియాతో సిరీస్‌ను శ్రీలంక కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో ఆడనుంది. -
మిస్టరీ గర్ల్ హార్దిక్ పాండ్యా..
-
మూడు ఫార్మాట్లలో ఆడాల్సిందే: గంభీర్ వ్యాఖ్యలు వైరల్
‘‘ఒక ఆటగాడు పూర్తి ఫిట్‌గా ఉంటే మూడు ఫార్మాట్లు తప్పక ఆడాలని నేను విశ్వసిస్తాను. గాయాల బెడద వెంటాడుతుందనే భయంతో ఆటకు దూరంగా ఉండటం నాకు నచ్చదు.గాయపడితే ఏమవుతుంది? తిరిగి కోలుకుంటారు కదా! అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న టాప్ క్రికెటర్లలో ఎవరిని అడిగినా మూడు ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటున్నామనే చెబుతారు.రెడ్ బాల్ బౌలర్లు లేదంటే వైట్ బాల్ బౌలర్లు అని ముద్ర వేసుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు. గాయాలన్నవి ఆటగాళ్ల జీవితంలో భాగం. అంతేగానీ వాటి కారణంగా ఏదో ఒక ఫార్మాట్‌కే పరిమితం కావడం సరికాదు. ఒకవేళ గాయపడ్డా.. పట్టుదలతో కోలుకుని తిరిగి రావడం పెద్ద కష్టమేమీ కాదు.కొంతమందికి విశ్రాంతినిస్తూ ప్రత్యేకంగా చూడటం పట్ల నాకు సదభిప్రాయం లేదు. గాయాలు, పని ఒత్తిడి అంటూ ఆటకు దూరంగా ఉండకూడదు. నిజానికి ప్రొఫెషనల్ క్రికెటర్ల అంతర్జాతీయ కెరీర్ వ్యవధి చాలా తక్కువ. అలాంటపుడు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని భావించాలే గానీ.. తప్పుకోకూడదు.ఏ ఆటగాడైనా ఫామ్‌లో ఉంటే.. మూడు ఫార్మాట్లలో కచ్చితంగా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ముందుకు సాగాలి. నేనైతే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచే ఫలితాల గురించి పట్టించుకోవడం మానేశాను.వంద శాతం ఎఫర్ట్ పెడుతున్నామా లేదా అన్నదే ముఖ్యం. విలువలతో, క్రీడాస్ఫూర్తితో ఆడితే అంతా సజావుగానే సాగిపోతుందని నమ్ముతాను. మనం నిజాయితీగా ఉన్నంత కాలం ప్రపంచం మొత్తం మనల్ని వ్యతిరేకించినా ఏమీ కాదు. జట్టు ప్రయోజనాలు మాత్రమే అంతిమ లక్ష్యంగా ఉండాలి.నేను క్రికెట్ మైదానంలో దూకుడుగానే ఉండేవాడిని. ఒక్కోసారి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో వాదనకు దిగాల్సి వచ్చేది. అదంతా కేవలం జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే.వ్యక్తిగత విజయాలకు నా దృష్టిలో ప్రాధాన్యం లేదు. జట్టే ముందు.. ఆ తర్వాతే మనం. అలాంటపుడే సమష్టిగా రాణించి గెలుపొందగలం. ఇది జట్టుగా ఆడే ఆట కాబట్టి.. జట్టుకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు.ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు కచ్చితంగా టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆడాలని పేర్కొన్నాడు. భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యే కంటే ముందు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ ఈ మేరకు గంభీర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.తాను కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవలంబించబోయే విధానాల గురించి ముందుగానే ఇలా సంకేతాలు ఇచ్చాడు. కాగా గంభీర్ వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పరిస్థితిపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది.గాయాల భయంతో హార్దిక్ ఎన్నో ఏళ్లుగా టెస్టు ఫార్మాట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలంగా అతడు కేవలం వన్డే, టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాడు. మరోవైపు.. గంభీర్ వచ్చే కంటే ముందే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీపై సందేహాలు! గౌతీ ప్లాన్? -
‘మిస్టరీ గర్ల్’తో హార్దిక్ పాండ్యా.. ఇంతకీ ఎవరీమె? (ఫొటోలు)
-
మిస్టరీ గర్ల్‌తో హార్దిక్ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓ అమ్మాయితో అతడు సన్నిహితంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్.. ‘‘ప్రతీదీ ప్రేమకు అర్హమైందే.. కానీ.. దేవుడిపై ఎప్పుడూ నమ్మకం మాత్రం వదులుకోకూడదు’’ అంటూ నర్మగర్భపూరిత పోస్ట్ చేయడం గమనార్హం.ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శల పాలయ్యాడు. రోహిత్ శర్మ స్థానంలో సారథిగా వచ్చినందుకు సొంత జట్టు అభిమానులే అతడిని అవమానకరంగా ట్రోల్ చేశారు.టీ20 ప్రపంచకప్-2024 హీరోగాఅందుకు తగ్గట్లే ముంబై ఇండియన్స్ పద్నాలుగింట కేవలం నాలుగే గెలవడంతో హార్దిక్ కెప్టెన్సీ తీరుపై మాజీ క్రికెటర్లు సైతం పెదవి విరిచారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు అతడు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో బీసీసీఐ అతడికి అవకాశం ఇవ్వగా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. టీమిండియాను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించి విమర్శించిన వారే ప్రశంసించేలా సత్తా చాటాడు.కెరీర్ పరంగా కోలుకున్నా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం హార్దిక్ పాండ్యా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నటాషా స్టాంకోవిక్‌తో అతడికి విభేదాలు తలెత్తాయని వార్తలు రాగా.. వీరిద్దరు దూరదూరంగా ఉండటం ఇందుకు బలాన్నిచ్చింది.అంతేకాదు.. వరల్డ్‌కప్ విజయం సెలబ్రేట్ చేసుకునే సమయంలో తమ కుమారుడు అగస్త్యను మాత్రమే నటాషా హార్దిక్ దగ్గరికి పంపించడం గమనార్హం. ఈ నేపథ్యంలో విడాకులు నిజమేనన్న వార్తలు గుప్పుమన్నాయి.ఆ మిస్టరీ గర్ల్ ఎవరు?ఇలాంటి తరుణంలో ఓ అమ్మాయి హార్దిక్ పాండ్యాతో పాటు అతడి కుటుంబంతో సన్నిహితంగా మెదిలిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆ మిస్టరీ గర్ల్ ఎవరా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఆమె మరెవరో కాదు.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్, మేకప్ ఆర్టిస్ట్ ప్రాచీ సోలంకి. హార్దిక్ పాండ్యా ఇంటికి వచ్చిన ఆమెను బొట్టుపెట్టి ఆహ్వానించారు. ఈ క్రమంలో హార్దిక్‌తో పాటు అతడి అన్న, టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా- పాంఖురి శర్మ దంపతులతో ప్రాచీ ఫొటోలు దిగింది.వరల్డ్‌కప్ హీరోను కలిసానని.. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ ఫొటోలు, వీడియోలను ప్రాచీ షేర్ చేసింది. దీంతో నటాషా స్థానంలోకి రాబోయే అమ్మాయి.. కాబోయే వదిన అంటూ హార్దిక్ అభిమానులు తోచినవిధంగా కామెంట్లు చేస్తున్నారు.మరికొందరేమో ఒక్క ఫొటోతో ఆ అమ్మాయిపై లేనిపోని వదంతులు సృష్టించడం సరికాదని హితవు పలుకుతున్నారు. నిజంగానే ప్రాచీ హార్దిక్ ఫ్యాన్‌గర్ల్ మాత్రమేనా.. లేదంటే అతడి కుటుంబంతో అంతకుమించిన అనుబంధం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే, ప్రాచీతో హార్దిక్ ఫొటోలు వైరల్ అయిన తరుణంలో నటాషా పైవిధంగా పోస్ట్ పెట్టడం గమనార్హం.చదవండి: KKR: ద్రవిడ్ కాదు.. కోల్‌కతా కొత్త మెంటార్‌గా దిగ్గజ బ్యాటర్? View this post on Instagram A post shared by Prachi Solanki (@ps_29) -
‘కోహ్లితో చెప్పలేదట.. హార్దిక్ పాండ్యాకు తెలుసు’
భారత క్రికెట్లో ‘గంభీర్’ శకం ఆరంభం కానుంది. పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో ఉన్న టీమిండియాను తన మార్గదర్శనంలో సమర్థవంతంగా ముందుకు నడపటం ఆషామాషీ కాదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ఆటగాళ్లను కొనసాగిస్తూనే యువకులకు అవకాశం ఇచ్చే విషయంలో గౌతీ ఎలా వ్యవహరిస్తాడనేది కీలకం.రానున్న మూడున్నరేళ్ల కాలం హెడ్ కోచ్‌గా కొనసాగనున్న గంభీర్‌కు తొలుత చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో సవాలు ఎదురుకానుంది. ఆ తర్వాత వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25, టీ20 ప్రపంచకప్-2026, వన్డే వరల్డ్‌కప్-2027.ఈ ఐసీసీ టోర్నీలలో టీమిండియాను టాప్‌లో నిలపడం అంత తేలికేమీ కాదు. రోహిత్- కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ, బ్యాటర్‌గా కోహ్లి కీలకం.కాగా ఐపీఎల్-2023 సందర్భంగా కోహ్లితో గంభీర్‌కు వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఇద్దరూ కలిసిపోయినట్లుగా కనిపించినా.. ఇప్పుడు కోచ్, ఆటగాడి పాత్రల్లో ఏ మేరకు సమన్వయం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.మరోవైపు.. ద్రవిడ్‌నే హెడ్ కోచ్‌గా కొనసాగితేనే బాగుంటుందంటూ రోహిత్ బీసీసీఐ ఎదుట తన మనసులో మాట బయటపెట్టినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో వీరిద్దరితో గంభీర్ ఎలా మెలుగుతాడన్నదే ప్రశ్న. రాహుల్ ద్రవిడ్‌లా పెద్దన్నలా వ్యవహరిస్తాడా? లేదంటే తనదైన సహజశైలిలో దూకుడుగానే ఉంటాడా? చూడాలి.ఇదిలా ఉంటే.. గంభీర్ నియామకం నేపథ్యంలో బీసీసీఐ ఒక్కసారి కూడా రోహిత్- కోహ్లి ద్వయాన్ని సంప్రదించలేదనే వార్త బయటకు వచ్చింది.అదే సమయంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మాత్రం ఈ విషయం గురించి ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘వీరంతా కూర్చుని మాట్లాడుకోవడానికి, జట్టు గురించి చర్చించడానికి చాలా సమయం ఉంది. ఇప్పుడే ఏమీ ముగిసిపోలేదు.సమీప భవిష్యత్తులో యువ ఆటగాళ్లదే కీలక పాత్ర కాబోతున్నందున ఆ దిశగా బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ముందడుగు వేస్తోంది’’ అని పేర్కొన్నాయి.కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విశ్రాంతి కోరుకుంటున్నారని.. ఇద్దరూ లాంగ్ లీవ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో సిరీస్‌తో కోచ్‌గా గంభీర్ అరంగేట్రం చేయనుండగా.. ఆ వన్డే సిరీస్‌కు వీరిద్దరు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. -
టాప్ ర్యాంక్ కోల్పోయిన హార్దిక్.. ఏడో స్థానానికి ఎగబాకిన రుతురాజ్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ సత్తా చాటారు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో సుడిగాలి శతకంతో ఇరగదీసిన అభిషేక్.. ఎంట్రీలోనే అదుర్స్ అనిపించుకోగా.. అదే మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో రాణించిన రుతు.. 13 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకాడు. అభిషేక్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో లిస్ట్ అయిన తొలిసారే 75వ స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్ నుంచి టాప్-10 రుతురాజ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. గత వారమే అగ్రపీఠాన్ని కోల్పోయిన స్కై.. రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్ టీ20 బ్యాటర్‌గా ట్రవిస్ హెడ్ కొనసాగుతున్నాడు. ఫిల్ సాల్ట్, బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, జోస్ బట్లర్, రుతురాజ్, బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్, మార్క్రమ్ వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో ఉన్నారు.బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. ఆదిల్ రషీద్, అన్రిచ్ నోర్జే, హసరంగ టాప్-3 బౌలర్లుగా కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్, హాజిల్‌వుడ్, అకీల్ హొసేన్, ఆడమ్ జంపా, ఫజల్హక్ ఫారూఖీ, అక్షర్ పటేల్, తీక్షణ నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ మినహా టాప్-10లో ఎవరూ లేరు. కుల్దీప్ 11, బుమ్రా 14, భిష్ణోయ్ 16, అర్ష్‌దీప్ 19 స్థానాల్లో ఉన్నారు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. గత వారం ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండిన హార్దిక్ పాండ్యా రెండో స్థానానికి పడిపోయాడు. హసరంగ టాప్ ప్లేస్‌కు ఎగబాకాడు. భారత ఆటగాళ్లలో అక్షర్ పటేల్ 12వ స్థానంలో ఉన్నాడు.టీమ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా టాప్-5లో ఉన్నాయి. -
నన్ను గేలి చేశారు.. అవమానించారు.. కెప్టెన్ వల్లే ఇలా!
‘‘గత ఆరు నెలల కాలం భావోద్వేగేలా సమ్మేళనం. ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. ప్రేక్షకులు నన్ను ఏడిపించారు. నన్ను తమవాడిగా అనుకోలేకపోయారు.ఎన్నో జరిగాయి. వాటన్నింటికీ ఆటతోనే సమాధానం ఇవ్వాలని అనుకున్నాను. కఠినంగా శ్రమిస్తే అనుకున్నది సాధించడం కష్టమేమీ కాదని.. గట్టిగా నమ్మాను.విమర్శలపాలైనపుడు మౌనాన్నే ఆశ్రయించాను. ఇప్పుడు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఏదేమైనా ఆటను వదిలేది అని నిర్ణయించుకున్నాను.గెలిచినా.. ఓడినా.. మనమేంటో మైదానంలోనే నిరూపించాలి. కెప్టెన్, కోచ్, సహచర ఆటగాళ్ల మద్దతు లభించింది. పూర్తిస్థాయిలో టోర్నీ కోసం సన్నద్ధమయ్యాను.అనుకున్నట్లుగానే ఫలితాన్ని రాబట్టాను. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసే అవకాశం రావడం.. అంచనాలు అందుకుని జట్టు విజేతగా నిలవడం సంతోషాన్నిచ్చింది.నిజానికి సూర్య సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అతడు క్యాచ్ పట్టిన తర్వాత అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నా.. నేను మాత్రం సూర్య దానిని ధ్రువీకరించిన తర్వాతే సంబరాలు చేసుకున్నా.మ్యాచ్‌లో గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అదే’’ అంటూ టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉద్వేగానికి లోనయ్యాడు. ప్రధాని నరేంద్ర మోదీతో సంభాషిస్తున్న సమయంలో గత ఆర్నెళ్లుగా తన ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.ఆటతోనే విమర్శకులకు సమాధానం చెప్పాలనుకున్నానని.. టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా తనకు ఆ అవకాశం వచ్చిందని హార్దిక్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024లో రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమితుడైన హార్దిక్ పాండ్యాకు కాలం కలిసి రాలేదు.రోహిత్ స్థానంలో వచ్చినందుకు సొంత జట్టు అభిమానులే అతడిని దారుణంగా అవమానించారు. మైదానం లోపల, వెలుపలా తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ హేళన చేశారు. కెరీర్ పరంగా ఇలా ఉంటే.. వ్యక్తిగతంగానూ భార్య నటాషా స్టాంకోవిక్‌తో విభేదాలంటూ వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో పాండ్యా ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అద్భుత ఆట తీరుతో అందరి మనసులు గెలుచుకున్నాడు. సౌతాఫ్రికాతో ఫైనల్లో ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.ఇక జగజ్జేతగా అవతరించిన టీమిండియా స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మోదీని కలిసింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. #WATCH | During his interaction with PM Modi, Cricketer Hardik Pandya said, "...Last 6 months have been very entertaining for me, there have been a lot of ups and downs and the public booed me. A lot of things happened and I always felt that if I give any answer, it would be… pic.twitter.com/bzti1hNUKu— ANI (@ANI) July 5, 2024 -
ఏడ్చేసిన నీతా అంబానీ.. రోహిత్ ముంబైని వీడటం పక్కా! వీడియో
ఐపీఎల్-2024కు ముందే రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ముంబై ఇండియన్స్. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన హిట్‌మ్యాన్‌ను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించి తగిన మూల్యం చెల్లించింది.పాండ్యా సారథ్యంలో ఘోరంగా విఫలమైన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అడుగున నిలిచింది. రోహిత్- పాండ్యా సైతం ఎడమొహం- పెడమొహంగానే మెదిలారు. ఫలితంగా ఇరువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.అయితే, టీ20 ప్రపంచకప్-2024తో సీన్ రివర్స్ అయింది. ఈ ఇద్దరూ టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి నీరాజనాలు అందుకుంటున్నారు. కెప్టెన్‌గా రోహిత్, ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా తమ బాధ్యతను చక్కగా పూర్తి చేసి ప్రశంసలు దక్కించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. ట్రోఫీ గెలిచిన టీమిండియాలో సభ్యులైన తమ ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతులు ఈ సందర్భంగా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు.కాగా అంబానీ చిన్న కుమారుడు అనంత్- రాధికా మర్చంట్ల ముందస్తు పెళ్లి వేడుకలు ఆర్భాటంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత్ నిర్వహించిన సమయంలోనే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను ఉద్దేశించి నీతా అంబానీ మాట్లాడారు.వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించి ఆత్మీయంగా హత్తుకుని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ అద్భుతం చేశాడంటూ అతడిని హగ్ చేసుకున్న నీతా.. ఆ తర్వాత సూర్య, హార్దిక్‌లను కూడా ఆత్మీయంగా హత్తుకున్నారు.ఈ సందర్భంగా హార్దిక్‌ను ఉద్దేశించి.. ‘‘కష్ట సమయం ఎప్పుడూ ఉండదు.. అయితే, పట్టుదల కలిగిన మనుషులు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటారు’’ అని ప్రశంసించారు. ముఖ్యంగా వరల్డ్‌కప్ ఫైనల్లో ఆఖరి ఓవర్ అద్భుతంగా వేసి జట్టును గెలిపించిన తీరు అమోఘమంటూ కొనియాడారు.మరోవైపు.. 2011 నాటి సంబరాన్ని మళ్లీ తీసుకువచ్చారంటూ ముఖేశ్ అంబానీ ఆటగాళ్లను కితాబులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఇందులో రోహిత్ శర్మ మాత్రం పైకి నవ్వుతూ కనిపించినా కాస్త మనస్ఫూర్తిగా ఆ వేడుకలో భాగం కాలేకపోయాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఇప్పటికే తన మనసు విరిగిపోయిందని.. వచ్చే సీజన్లో అతడు ముంబై ఇండియన్స్ జట్టును వీడటం పక్కా అని ఫిక్సయిపోయారు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.చివరి ఓవర్లో మూడు వికెట్లు తీసి హార్దిక్ పాండ్యా జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా భారత్ ఖాతాలో నాలుగో వరల్డ్‌కప్ టైటిల్ చేరింది.AMBANI FAMILY celebrating the World Cup heroes - Captain Rohit, Hardik & Surya. 🇮🇳- VIDEO OF THE DAY...!!!! ❤️ pic.twitter.com/8XbPo9kkLE— Johns. (@CricCrazyJohns) July 6, 2024 -
విడాకులు నిజమే అనేలా హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచిన జోష్‌లో ఉన్న భారత క్రికెటర్లు ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించారు. కుటుంబాలతో సరదాగా సమయం గడుపుతున్నారు.ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని సహా పలువురు క్రికెటర్లు అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట నెలకొన్న పెళ్లి సందడిలో భాగమయ్యారు.VIDEO | Anant Ambani-Radhika Merchant's sangeet ceremony: Former India cricketer Zaheer Khan and his wife Sagarika Ghatge arrive at Nita Mukesh Ambani Cultural Centre in BKC, Mumbai for the sangeet ceremony. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/W8h0FDcBDB— Press Trust of India (@PTI_News) July 5, 2024 భార్యలతో ఆ క్రికెటర్లునీతా- ముఖేశ్ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్‌లో తళుక్కుమన్నారు. రోహిత్, ధోని, హార్దిక్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, కృనాల్ పాండ్యా, జహీర్ ఖాన్, ఇషాన్ కిషన్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.ధోని, సూర్య, జహీర్, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా తమ భార్యలతో కలిసి ఈ ఈవెంట్లో సందడి చేయగా.. హార్దిక్ పాండ్యా మాత్రం ఒంటరిగా వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.#WATCH | Cricketers Hardik Pandya, Krunal Pandya and Ishan Kishan arrive at Jio World Centre in Mumbai to attend Anant Ambani and Radhika Merchant's 'Sangeet ceremony' pic.twitter.com/bLy33tmZB8— ANI (@ANI) July 5, 2024 కాగా హార్దిక్- నటాషా మధ్య విభేదాలు తలెత్తి విడాకులకు దారితీశాంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హార్దిక్ ఇలా ఒంటరిగా అంబానీ ఇంట సంగీత్‌కు హాజరుకావడం వీటికి మరింత బలాన్నిచ్చింది.అదే సమయంలో అతడి సతీమణి నటాషా స్టాంకోవిక్ తమ కుమారుడు అగస్త్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందని.. ఇందుకు ఎల్లప్పుడూ తాను అన్నింటికి కృతజ్ఞురాలిగా ఉంటానంటూ వేదాంత ధోరణిలో క్యాప్షన్ జతచేసింది.విడాకులు నిజమేనన్న వార్తలు ఈ నేపథ్యంలో హార్దిక్- నటాషా విడాకులు నిజమేనన్న వార్తలు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది.అంబానీల యాజమాన్యంలోని ఈ జట్టు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో హార్దిక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం అద్భుతంగా రాణించిన హార్దిక్.. టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో.. విమర్శలు- ప్రశంసల సమయంలో హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి నటాషా ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. ఇప్పుడిలా హార్దిక్ అంబానీ ఇంట వేడుకలకు ఒక్కడే హాజరుకావడంతో విభేదాలు నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.VIDEO | Anant Ambani-Radhika Merchant's sangeet ceremony: Indian cricketer KL Rahul arrives at Nita Mukesh Ambani Cultural Centre in BKC, Mumbai for the sangeet ceremony. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/es5B8zIfNJ— Press Trust of India (@PTI_News) July 5, 2024 -
అనంత్- రాధిక సంగీత్: జంటగా మెరిసిన క్రికెటర్లు.. హార్దిక్ మాత్రం ఒంటరిగా! (ఫోటోలు)
-
జగజ్జేతలకు జేజేలు.. వాంఖడేలో టీమిండియా జట్టుకు సన్మానం (ఫొటోలు)
-
విశ్వ విజేతలకు ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం (ఫొటోలు)
-
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2024 జట్టు ప్రకటన.. విరాట్‌కు నో ప్లేస్
ఐసీసీ తమ టీ20 వరల్డ్‌కప్ 2024 జట్టును ఇవాళ (జులై 1) ప్రకటించింది. ఇందులో ఏకంగా టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. భారత్ వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టు నుంచి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇందులో నలుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఉండగా.. భారత స్టార్ ఆటగాడు, ఫైనల్ మ్యాచ్ హీరో విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం గమనార్హం.ఐసీసీ జట్టులో భారత క్రికెటర్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభించింది. భారత్ తర్వాత అత్యధికంగా ఆఫ్ఘన్ క్రికెటర్లకు ఐసీసీ జట్టులో చోటు దక్కింది. ఆ జట్టు నుంచి వరల్డ్‌కప్ లీడింగ్ రన్ స్కోరర్ రహ్మానుల్లా గుర్బాజ్, వరల్డ్‌కప్ లీడింగ్ వికెట్ టేకర్ ఫజల్హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్లకు ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా నుంచి స్టోయినిస్.. వెస్టిండీస్ నుంచి పూరన్‌లకు ఛాన్స్ దక్కింది. 12వ ఆటగాడిగా సఫారీ స్పీడ్ గన్ నోర్జే ఎంపికయ్యాడు. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలు ముగిసాక ఐసీసీ జట్టును ప్రకటించడం ఆనవాయితీ.వరల్డ్‌కప్ 2024లో ఐసీసీ జట్టు సభ్యుల ప్రదర్శన..రోహిత్ శర్మ- 257 పరుగులు, సగటు 36.71, స్ట్రయిక్‌రేట్ 156.7, అర్దసెంచరీలు 3రహ్మానుల్లా గుర్బాజ్- 281 పరుగులు, సగటు 35.12, స్ట్రయిక్‌రేట్ 124.33, అర్దసెంచరీలు 3పూరన్- 228 పరుగులు, సగటు 38.0, స్ట్రయిక్‌రేట్ 146.15, అర్దసెంచరీలు 1సూర్యకుమార్ యాదవ్- 199 పరుగులు, సగటు 28.42, స్ట్రయిక్‌రేట్ 135.37, అర్దసెంచరీలు 2స్టోయినిస్- 169 పరుగులు, స్ట్రయిక్‌రేట్ 164.07, వికెట్లు 10, ఎకానమీ 8.88హార్దిక్ పాండ్యా- 144 పరుగులు, స్ట్రయిక్‌రేట్ 151.57, వికెట్లు 11, ఎకానమీ 7.64అక్షర్ పటేల్- 92 పరుగులు, స్ట్రయిక్‌రేట్ 139.39, వికెట్లు 9, ఎకానమీ 7.86రషీద్ ఖాన్- 14 వికెట్లు, సగటు 12.78, ఎకానమీ 6.17, అత్యుత్తమ ప్రదర్శన 4/17బుమ్రా- 15 వికెట్లు, సగటు 8.26, ఎకానమీ 4.17, అత్యుత్తమ ప్రదర్శన 3/7అర్ష్‌దీప్ సింగ్- 17 వికెట్లు, సగటు 12.64, ఎకానమీ 7.16, అత్యుత్తమ ప్రదర్శన 4/9ఫజల్హక్ ఫారూఖీ- 17 వికెట్లు, సగటు 9.41, ఎకానమీ 6.31, అత్యుత్తమ ప్రదర్శన 5/912 ఆటగాడు అన్రిచ్ నోర్జే- 15 వికెట్లు, సగటు 13.4, ఎకానమీ 5.74, అత్యుత్తమ ప్రదర్శన 4/7 -
T20ప్రపంచ కప్ సొంతం.. ఆనంద క్షణాల్లో ఆటగాళ్ల భావోద్వేగం (ఫొటోలు)
-
భారత్‌దే టి20 ప్రపంచకప్ .. విశ్వవిజేతగా రోహిత్ సేన (ఫోటోలు)
-
మూడో స్థానానికి ఎగబాకిన హార్దిక్ పాండ్యా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారీ జంప్ కొట్టాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం హార్దిక్ ఖాతాలో 213 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో లంక కెప్టెన్ వనిందు హసరంగ మొదటి స్థానంలో ఉండగా.. ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ రెండో స్థానంలో ఉన్నాడు. హసరంగ ఖాతాలో 222 రేటింగ్ పాయింట్లు ఉండగా.. నబీ ఖాతాలో 214 పాయింట్లు ఉన్నాయి. వరల్డ్‌కప్ ప్రదర్శనల ఆధారంగా తాజా ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో చాలా మంది ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. హసరంగ ఒక స్థానాన్ని, నబీ రెండు స్థానాలను, మార్క్రమ్ రెండు స్థానాలను (8వ ర్యాంక్), మ్యాక్స్‌వెల్ మూడు స్థానాలను (15వ ర్యాంక్), రసెల్ ఆరు స్థానాలను (16వ ర్యాంక్) మెరుగుపర్చుకున్నారు. టాప్-20 భారత్ నుంచి హార్దిక్‌తో పాటు అక్షర్ పటేల్ ఉన్నారు. అక్షర్ 130 రేటింగ్ పాయింట్లతో 19వ స్థానంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్ అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాడు రోస్టన్ ఛేజ్. ఈ విండీస్ ఆల్‌రౌండర్ ఏకంగా 17 స్థానాలు మెరుగుపర్చుకుని 12వ స్థానానికి చేరుకున్నాడు.టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే..ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. హాజిల్‌వుడ్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి.. ఆడమ్ జంపా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి.. అక్షర్ పటేల్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి ఎగబాకారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఈ వారం అందరి కంటే ఎక్కువ లబ్ది పొందింది బుమ్రా, కుల్దీప్ యాదవ్. బుమ్రా ఏకంగా 44 స్థానాలు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి ఎగబాకగా.. కుల్దీప్ 20 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి జంప్ కొట్టాడు. అలాగే కేశవ్ మహారాజ్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 14 స్థానానికి ఎగబాకాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 17, రవి బిష్ణోయ్ 19 స్థానాల్లో ఉన్నారు. -
T20 World Cup: బంగ్లాపై విజయభేరి.. భారత్ సెమీ ఫైనల్ చేరడం లాంఛనమే!
నార్త్‌సౌండ్: భారత్ ఆల్‌రౌండ్ షోకు బంగ్లాదేశ్ తెల్లమొహం వేసింది. బ్యాటింగ్‌లో కలిపికొట్టి, తర్వాత పేస్, స్పిన్‌తో వికెట్లను చెదరగొట్టింది. టి20 ప్రపంచకప్ సూపర్–8 రెండో మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా ఇక సెమీస్‌కు చేరడం లాంఛనమే. టాస్ నెగ్గిన బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (28 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్‌లు), రిషభ్ పంత్ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (24 బంతుల్లో 34; 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. కెప్టెన్ నజు్మల్ హుస్సేన్ (32 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కొద్దిగా ప్రతిఘటించగలిగాడు. కుల్దీప్ 3, బుమ్రా, అర్ష్ దీప్ చెరో 2 వికెట్లు తీశారు. సూపర్–8 దశలో తమ చివరి మ్యాచ్‌లో సోమవారం ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. కలిసిమెలిసి దంచేసి... కోహ్లితో ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ (11 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో ఓవర్లోనే అవుటయ్యాడు. ఈ కాసేపట్లోనే వేయాల్సినంత వేగవంతమైన పునాదిని వేసి వెళ్లాడు. ఇక కోహ్లి, పంత్ తమ కెపె్టన్ వేగాన్ని అందిపుచ్చుకోవడంతో పవర్‌ప్లేలో భారత్ 53/1 స్కోరు చేసింది. పవర్‌ప్లే ఆఖరి ఓవర్ (6)లో కోహ్లి కొట్టిన సిక్సర్‌తోనే జట్టు స్కోరు 50కి చేరింది. రిషాద్ వేసిన 8వ ఓవర్లో కోహ్లి మరో సిక్స్ బాదాడు. పంత్ కూడా బౌండరీ కొట్టడంతో 8 బంతుల ఈ సుదీర్ఘ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఇది భారత శిబిరాన్ని ఉత్సాహపరిస్తే... మరుసటి 9వ ఓవర్ భారత్‌ను దెబ్బమీద దెబ్బ తీసింది. తొలి బంతికే కోహ్లి, మూడో బంతికి సూర్యకుమార్ (6)లను తన్జీమ్ పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ వికెట్ల ప్రభావం ఇన్నింగ్స్‌పై పడకుండా తర్వాత వచి్చన బ్యాటర్లు చెలరేగారు. హార్దిక్ మెరుపు ఫిఫ్టీ 11వ ఓవర్ నుంచి శివమ్ దూబే అండతో రిషభ్ పంత్ బ్యాట్ ఝుళిపించాడు. ముస్తఫిజుర్ ఓవర్లో 2 బౌండరీలు, ఓ సిక్స్ బాదాడు. మరుసటి ఓవర్లో రిషాద్పై విరుచుకుపడే క్రమంలో 6, 4 కొట్టిన పంత్ అదే జోరులో ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. 14 ఓవర్లలో భారత్ 120/4 స్కోరు చేసింది. ఆ తర్వాత 6 ఓవర్లలోనే (36 బంతులు) 76 పరుగులు చేసింది.ఇంత స్కోరుకు, ఇన్నింగ్స్ జోరుకు హార్దిక్ పాండ్యా కారణమయ్యాడు. 15వ ఓవర్లో 6, 4తో 14 పరుగులు, 16, 17 ఓవర్లలో దూబే ఒక్కో సిక్సర్‌తో వరుసగా 12 పరుగులు, 9 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్లో సిక్స్ కొట్టిన దూబే అవుట్ కాగా, హార్దిక్ మరో భారీ సిక్సర్ బాదడంతో 15 పరుగులొచ్చాయి. తన్జిమ్, ముస్తఫిజుర్ సహా బౌలర్లందరినీ చితకబాదిన హార్దిక్ 27 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. నజు్మల్ ఒక్కడే... టాప్–3 బ్యాటర్లలో లిటన్ దాస్ (13) విఫలమవగా, తన్జీద్ హసన్ (31 బంతుల్లో 29; 4 ఫోర్లు), కెపె్టన్ నజు్మల్ మెరుగ్గానే ఆడారు. ఒక వైపు నజు్మల్ పోరాడినా... మరోవైపు తౌహీద్ హ్రిదయ్ (4), ప్రతీ ప్రపంచకప్ ఆడిన విశేషానుభవజు్ఞడు షకీబ్ (11), మహ్ముదుల్లా (13) చేతులెత్తేయడంతో బంగ్లా పరాజయం తప్పలేదు. ఆఖర్లో రిషాద్ (10 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు . స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) జాకీర్ (బి) షకీబ్ 23; కోహ్లి (బి) తన్జీమ్ హసన్ 37; పంత్ (సి) తన్జీమ్ హసన్ (బి) రిషాద్ 36; సూర్యకుమార్ (సి) లిటన్ దాస్ (బి) తన్జీమ్ హసన్ 6; దూబే (బి) రిషాద్ 34; పాండ్యా నాటౌట్ 50; అక్షర్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–39, 2–71, 3–77, 4–108, 5–161. బౌలింగ్: మెహదీ హసన్ 4–0–28–0, షకీబ్ 3–0–37–1, తన్జీమ్ హసన్ 4–0–32–2, ముస్తఫిజుర్ 4–0–48–0, రిషాద్ హుస్సేన్ 3–0–43–2, మహ్ముదుల్లా 2–0–8–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 13; తన్జీద్ హసన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 29; నజు్మల్ (సి) అర్ష్ దీప్ (బి) బుమ్రా 40; తౌహీద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 4; షకీబ్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 11; మహ్ముదుల్లా (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 13; జాకిర్ అలీ (సి) కోహ్లి (బి) అర్ష్ దీప్ 1; రిషాద్ (సి) రోహిత్ (బి) బుమ్రా 24; మెహిది హసన్ నాటౌట్ 5; తన్జీమ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–35, 2–66, 3–76, 4–98, 5–109, 6–110, 7–138, 8–145. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–30–2, బుమ్రా 4–0–13–2, అక్షర్ 2–0–26–0, హార్దిక్ పాండ్యా 3–0–32–1, జడేజా 3–0–24–0, కుల్దీప్ 4–0–19–3. టి20 ప్రపంచకప్‌లో నేడుఆ్రస్టేలియా X అఫ్గానిస్తాన్ వేదిక: కింగ్స్టౌన్; ఉ.గం.6.00 నుంచి ఇంగ్లండ్ X అమెరికా వేదిక: బ్రిడ్జ్‌టౌన్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
‘సూపర్–8’లో భారత్ విజయారంభం..47 పరుగులతో అఫ్గానిస్తాన్ చిత్తు (ఫొటోలు)
-
హ్యాపీ మూమెంట్స్: హార్దిక్ పాండ్యా అలా.. నటాషా ఇలా! (ఫొటోలు)
-
IND Vs PAK: టీమిండియా గెలుపుకు పునాది వేసిన హార్దిక్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్ 9) జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకోగలిగింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ముఖ్యంగా బుమ్రా (4-0-13-3), హార్దిక్ (4-0-24-2) తమ అనుభవాన్నంత రంగరించి పాక్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు.భారత్‌ను విజయపథాన నడిపించడానికి బుమ్రా ప్రధాన కారకుడైతే.. ఈ గెలుపుకు బీజం పోసింది మాత్రం హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లలో వికెట్ లేకుండా 18 పరుగులు సమర్పించుకున్న హార్దిక్.. ఆతర్వాత రెండు ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత కీలకమైన ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్ల వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు వికెట్లే భారత్‌ను మ్యాచ్‌లోకి తిరిగి తీసుకొచ్చాయి. హార్దిక్ తన తొలి వికెట్ (ఫఖర్ జమాన్) తీసే సమయానికి పాక్ గెలుపు దిశగా సాగుతుండింది. ఈ దశలో హార్దిక్ ఫఖర్ జమాన్ వికెట్‌తో పాటు షాదాబ్ ఖాన్ వికెట్ (17వ ఓవర్) తీసి పాక్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాడు. హార్దిక్ దెబ్బకు కోలుకోలేకపోయిన పాక్ ఆతర్వాత పరుగులు సాధించేందకు ఇబ్బంది పడటంతో పాటు వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్దిక్ తన కోటా ఓవర్లు పూర్తి చేసే సమయానికి 17 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసిన పాక్.. తర్వాత 3 ఓవర్లలో 30 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. చివరి మూడు ఓవర్లలో సిరాజ్ (9 పరుగులు), బుమ్రా (3 పరుగులు), అర్ష్‌దీప్ (11 పరుగులు) అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్‌కు శృంగభంగం కలిగించారు. హార్దిక్ తన మ్యాజిక్ స్పెల్‌తో టీమిండియా గెలుపుకు బీజం వేసిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ అతన్ని ఆనందంతో కౌగిలించుకుని భుజానికెత్తుకున్నాడు. షాదాబ్ ఖాన్ వికెట్ తీసిన అనంతరం హార్దిక్ చేసుకున్న సెలబ్రేషన్స్ వైరలయ్యాయి. మ్యాచ్ అనంతరం హర్దిక్ "నెవర్ గివ్ అప్" అని తన సోషల్‌మీడియా అకౌంట్లలో స్టేటస్ పెట్టుకున్నాడు. మొత్తానికి చేజారిందనుకున్న మ్యాచ్‌ను గెలిపించడంలో కీలకపాత్ర పోషించి హార్దిక్ మరోసారి హీరో అనిపించుకున్నాడు. హార్దిక్‌కు పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో రాణించడం కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో హార్దిక్ పాక్‌కు గెలుపును దూరం చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్ తాలుకా చేదు అనుభవాలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్న హార్దిక్.. ఐర్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో హార్దిక్ 3 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ స్పెల్‌లో ఓ మొయిడిన్ ఓవర్ కూడా ఉంది.కాగా, పాక్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 19 ఓవర్లలో 119 పరుగులకు చాపచుట్టేసింది. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. భారత పేసర్ల ధాటికి లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బుమ్రా, హార్దిక్‌తో పాటు సిరాజ్ (4-0-19-0), అర్ష్‌దీప్ (4-0-31-1), అక్షర్ (2-0-11-1) రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ చేతిలో ఓటమితో పాక్ సూపర్-8 అవకాశాలు గల్లంతు చేసుకుంది. -
T20 World Cup 2024: రాణించిన హార్దిక్, రోహిత్.. ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా విజయంతో బోణీ కొట్టింది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఐర్లాండ్‌ను 96 పరుగులకే కట్టడి చేయగా.. ఛేదనలో రోహిత్ (52 రిటైర్డ్ హర్ట్), పంత్ (36 నాటౌట్) సత్తా చాటి టీమిండియాను గెలిపించారు.వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్ 16 ఓవర్లలో ఐర్లాండ్‌ను 96 పరుగులకు ఆలౌట్ చేసింది. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) రెండంకెల స్కోర్ చేయగా.. ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. ఆదిలోనే ఓపెనర్ విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయింది. రోహిత్‌తో జతగా తొలిసారి ఓపెనింగ్ చేసిన కోహ్లి 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. కోహ్లి.. మార్క్ అదైర్ బౌలింగ్‌లో బెంజమిన్ వైట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.కోహ్లి ఔటైనా ఏమాత్రం తగ్గని భారత్.. రోహిత్ (37 బంతుల్లో 52 రిటైర్డ్ హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 12.2 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పంత్ సిక్సర్‌తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మోచేతికి బంతి బలంగా తాకడంతో రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. -
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన భారత పేసర్లు.. 96 పరుగులకే కుప్పకూలిన ఐర్లాండ్
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా ఐర్లాండ్ ఇన్నింగ్స్ పేక మేడలా కూలింది. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) ధాటికి ఐర్లాండ్ 96 పరుగులకే (16 ఓవర్లలో) కుప్పకూలింది.ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డెలానీ మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు. -
T20 World Cup 2024: హార్దిక్ సూపర్ డెలివరీ.. వైరల్ వీడియో
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పేసర్లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఐర్లాండ్‌కు చుక్కలు చూపిస్తుంది. టీమిండియా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చాలాకాలం తర్వాత బంతితో ఇరగదీస్తున్నాడు. హార్దిక్ ధాటికి ఐర్లాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతుంది. హార్దిక్ 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ ఉంది. హార్దిక్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ (3-0-18-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (2-1-4-1), అక్షర్ పటేల్ (0.2-0-1-1) కూడా విజృంభించడంతో ఐర్లాండ్ 13 ఓవర్లలో 66 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), లోర్కాన్ టక్కర్ (10), హ్యారీ టెక్టార్ (4), కర్టిస్ క్యాంపర్ (12), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు. జాషువ లిటిల్ (8), గారెత్ డెలానీ (9) క్రీజ్‌లో ఉన్నారు.What a ball from Vice Captain Hardik Pandya. 💪 pic.twitter.com/rk76b8Dbdj— Johns. (@CricCrazyJohns) June 5, 2024హార్దిక్ సూపర్ డెలివరీ..చాలాకాలం తర్వాత బంతితో మెరిసిన హార్దిక్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పడగొట్టిన ఓ వికెట్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. హార్దిక్ సూపర్ డెలివరీతో హ్యారీ టెక్టార్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా, న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. -
ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా ఉద్వేగం
‘‘ఏదేమైనా యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత మనం అక్కడే ఉండి పోరాడాలి. ఒక్కోసారి జీవితం మనల్ని విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది.అయితే, నేను మాత్రం ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఆటను వదిలిపెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా. ఒకవేళ యుద్ధ రంగంలో వెన్నుచూపితే మనం అనుకున్న ఫలితాలు రాబట్టలేం కదా!ఇక్కడ కూడా అంతే.. ఆట ద్వారా మనమేం పొందాలనుకుంటున్నామో.. వాటిని సాధించాలంటే కాస్త ఓపికగా ఎదురుచూడాలి. ఒక్కోసారి అది చాలా కష్టంగా ఉంటుందన్న మాట వాస్తవం.అయితే, నేను ఎప్పుటికప్పుడు మా మనసుని తేలిక చేసుకుంటాను. అంతకు ముందు ఎలా ఉన్నానో.. క్లిష్ట పరిస్థితుల్లోనూ అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తాను.జీవితంలో మంచి రోజులు, గడ్డు పరిస్థితులు.. వస్తూ పోతూ ఉంటాయి. నేను ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. వాటిని దాటుకుని విజయవంతంగా ముందడుగు వేశాను.నిజానికి నేను సక్సెస్‌ను అంత సీరియస్‌గా తీసుకోను. నేను బాగా ఆడిన రోజును మర్చిపోతాను. అదే విధంగా.. చేదు అనుభవాలను కూడా!అలా అని పరిస్థితుల నుంచి పారిపోను. ధైర్యంగా వాటిని ఎదుర్కొంటాను. ఏదో ఒకరోజు వాటి నుంచి బయటపడతాను. ఆట, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ.. కఠిన శ్రమకోరుస్తూ ముందుసాగితే తప్పకుండా ఫలితం ఉంటుంది.అలాగే ఎల్లప్పుడూ చిరునవ్వును మాత్రం వీడకూడదు’’ అంటూ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ మధ్యలోనే గాయపడిన పాండ్యా మిగతా మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే.విమర్శల వర్షంఈ క్రమంలో ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ బరోడా క్రికెటర్.. ముంబై కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు చేపట్టాడు. అయితే, రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా రావడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు అతడిపై ఆగ్రహం వెళ్లగక్కారు.స్టేడియంలో, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ హార్దిక్ పాండ్యాపై విరుచుకుపడ్డారు. ఇక కెప్టెన్‌గానూ హార్దిక్ విఫలం కావడంపై అతడిపై విమర్శల వర్షం కురిసింది. అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిపోయింది.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 జట్టులో స్థానమే ప్రశ్నార్థకమైన వేళ.. బీసీసీఐ సెలక్టర్లు హార్దిక్ పాండ్యాపై నమ్మకం ఉంచి ఏకంగా వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని 40 పరుగులతో అజేయంగా నిలిచి ఈ పేస్ ఆల్‌రౌండర్.. తదుపరి ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తాను ఫుల్ ఫామ్‌లోకి వచ్చినట్లేనని పాండ్యా సంకేతాలు ఇచ్చాడు.భార్యతో విభేదాలు.. విడాకులంటూ ప్రచారంకాగా ఐపీఎల్-2024లో చెత్త ప్రదర్శన ద్వారా విమర్శలపాలైన హార్దిక్ పాండ్యా.. వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. భార్య నటాషా స్టాంకోవిక్‌తో అతడికి విభేదాలు తలెత్తాయని.. ఈ క్రమంలో ఆమె విడాకులకు అప్లై చేసిందనే ప్రచారం జరుగుతోంది.అంతేకాదు భరణంగా హార్దిక్ పాండ్యా ఆస్తిలో డెబ్బై శాతం వాటా కూడా నటాషాకు లభించనుందని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. కాగా సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా.ఈ జంటకు కుమారుడు అగస్త్య సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే హార్దిక్- నటాషా విడిపోతున్నారనే వార్తలు అభిమానులను కలవర పెడుతున్నాయి. ఇక వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ షోలో పైవిధంగా ఉద్వేగ పూరితంగా మాట్లాడటం గమనార్హం.చదవండి: రోహిత్, విరాట్ భార్యలను గమనిస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ -
Ind vs Ban: దుమ్ములేపిన పంత్.. దంచికొట్టిన హార్దిక్ పాండ్యా
టీమిండియా తరఫున ‘రీ ఎంట్రీ’లో రిషభ్ పంత్ దుమ్ములేపాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత బ్లూ జెర్సీ ధరించిన పంత్ పొట్టి ఫార్మాట్లో దుమ్ములేపాడు. టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 32 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 53 పరుగులు సాధించాడు. అర్ధ శతకంతో మెరిసి రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు.కాగా న్యూయార్క్ వేదికగా నసావూ కౌంటీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సంజూ శాంసన్ ఓపెనింగ్ చేశాడు.రోహిత్ 19 బంతుల్లో 23 పరుగులు చేసి నిష్క్రమించగా.. సంజూ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రిషభ్ పంత్ 53 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్లలో సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 31 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఇక శివం దూబే మాత్రం 16 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులే చేసి నిరాశపరిచాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా మాత్రం 23 బంతుల్లో 40 పరుగులతో దుమ్ములేపాడు. రవీంద్ర జడేజా(4)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 20 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం, మెహదీ హసన్, మహ్మదుల్లా, తన్వీర్ ఇస్లాం ఒక్కో వికెట్ పడగొట్టారు. -
Rohit Sharma- MI: ఆఖరి మ్యాచ్ ఆడేశాడు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్లోనే 2024 సీజన్‌ను ఓ చేదు జ్ఞాపకంగా చెప్పవచ్చు. 2011లో ముంబై ఇండియన్స్ కుటుంబంలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.ఆ తర్వాత రెండేళ్లకే కెప్టెన్‌గా ప్రమోట్ అయిన హిట్‌మ్యాన్.. సారథిగా తొలి ప్రయత్నంలోనే ముంబై ఇండియన్స్‌కు టైటిల్ అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు సార్లు జట్టును చాంపియన్‌గా నిలిపి.. అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.ఇక గతేడాది ముంబైని ప్లే ఆఫ్స్‌నకు చేర్చిన రోహిత్ శర్మకు.. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే ముంబై మేనేజ్మెంట్ షాకిచ్చింది. కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు వేసి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి పాండ్యాను ట్రేడ్ చేసుకుని మరీ కెప్టెన్‌గా నియమించింది. అయితే, అతడి సారథ్యంలో ముంబై ఈసారి చెత్తగా ఆడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు.. రోహిత్ శర్మ సైతం ఓపెనర్‌గా ఆకట్టుకోలేకపోయాడు.ఆడిన 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 417 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. ముంబై మేనేజ్మెంట్ వైఖరితో విసిగిపోయిన రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ఆ ఫ్రాంఛైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2025 వేలానికి ముందు ముంబై రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.‘‘నాకు తెలిసి వాళ్లు ఇషాన్ కిషన్‌ను వదిలేస్తారు. అతడి కోసం రైట్ టూ మ్యాచ్ కార్డు వాడతారనుకుంటా. ఎందుకంటే ఇషాన్ కోసం 15.5 కోట్లు వెచ్చించడం సరికాదు.కాబట్టి వాళ్లు అతడిని వదిలేస్తారు. ఇక రోహిత్ శర్మ ఇప్పటికే ముంబై ఇండియన్స్ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. తనను ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకోవాలని అతడు కోరుకోవడం లేదు.అదే విధంగా ఫ్రాంఛైజీ కూడా అతడిని అట్టిపెట్టుకోవాలని భావించడం లేదు. ఇప్పటికే ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ దారులు వేరయ్యాయి. రోహిత్‌ను మరోసారి ముంబై జెర్సీలో చూసే అవకాశం లేదు.అయితే, ఇది కేవలం నా అంచనా మాత్రమే. ఒకవేళ ఇది నిజం కావచ్చు. కాకపోవచ్చు. ఏదేమైనా రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ముంబైకి మాత్రం ఆడబోడని నమ్మకంగా చెప్పగలను’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్లో పేర్కొన్నాడు.ఇక ముంబై రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి ఆటగాడిని.. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మను కూడా కొనసాగిస్తుందని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాగా ఐపీఎల్ పదిహేడో సీజన్లో ముంబై ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచింది. -
Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుతో చేరాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం సహచర ఆటగాళ్లతో కలిసి అమెరికాలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కాగా ఈ స్టార్ ఆల్‌రౌండర్ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్-2024 సీజన్లో పగ్గాలు చేపట్టిన పాండ్యాకు ఏదీ కలిసి రాలేదు. రోహిత్ శర్మపై మేనేజ్మెంట్ వేటు వేసి అతడి స్థానంలో పాండ్యాను తీసుకువచ్చినందుకు సొంత జట్టు అభిమానులే జీర్ణించుకోలేకపోయారు.అడుగడుగునా హార్దిక్ పాండ్యా, ముంబై యాజమాన్యాన్ని ట్రోల్ చేస్తూ ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తైన పాండ్యా చెత్త కెప్టెన్సీతో విమర్శలు మూటగట్టుకున్నాడు. అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్.. పదో స్థానంతో ఈ సీజన్‌ను ముగించింది.ఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్ పాండ్యా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అతడి భార్య నటాషా స్టాంకోవిక్‌తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 ముగియగానే హార్దిక్ పాండ్యా ఒంటరిగానే లండన్‌కు వెళ్లి సెలవులను గడిపినట్లు సమాచారం. అనంతరం.. అమెరికాకు వచ్చిన టీమిండియాతో అతడు చేరినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో భారత ఆటగాళ్లంతా ప్రాక్టీస్ షురూ చేసిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఇందులో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘మెగా టోర్నీ కోసం న్యూయార్క్‌లో రావడం ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఎండ కూడా బాగా కాస్తోంది’’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. ‘‘జాతీయ జట్టు తరఫున విధుల్లో ఇలా’’ అంటూ తన ఫొటోలను హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. నటాషాతో విడాకుల ప్రచారం ఊపందుకున్న తర్వాత ఈ పేస్ ఆల్‌రౌండర్ తొలిసారిగా ఇలా తన ఒక్కడి ఫొటోలు షేర్ చేయడం విశేషం.చదవండి: T20 WC: ఓపెనర్‌గా రోహిత్ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!📍 New YorkBright weather ☀️, good vibes 🤗 and some foot volley ⚽️Soham Desai, Strength & Conditioning Coach gives a glimpse of #TeamIndia's light running session 👌👌#T20WorldCup pic.twitter.com/QXWldwL3qu— BCCI (@BCCI) May 29, 2024 View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా.. పొట్టి ప్రపంచకప్పే లక్ష్యంగా..(ఫొటోలు)
-
హార్దిక్ పాండ్యాతో విడాకులంటూ వదంతులు.. ట్రెండింగ్‌లో నటాషా(ఫొటోలు)
-
హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితం గురించి వదంతులు పుట్టుకొస్తున్నాయి. భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌కు విభేదాలు తలెత్తాయని.. వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది.నటాషా తన సోషల్ మీడియా ఖాతాలలో పాండ్యా ఇంటి పేరును తొలగించిందని.. తద్వారా తాము విడిపోయామని పరోక్షంగా హింటిచ్చిందని ‘రెడిట్’ పోస్ట్ ద్వారా నెటిజన్లు ఓ అంచనాకు వచ్చారు.హార్దిక్ పాండ్యాను ఎంకరేజ్ చేసేందుకు ఐపీఎల్-2024 మ్యాచ్‌లకు నటాషా రాలేదని.. అతడితో కలిసి ఉన్న ఫొటోలు కూడా పోస్ట్ చేయడం లేదంటూ ఇందుకు కారణాలు వెతికే ప్రయత్నం చేశారు.వదంతులు మాత్రమేనంటూఅయితే, ఇవన్ని వట్టి పుకార్లేనని హార్దిక్ పాండ్యా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత హార్దిక్ పాండ్యా దారుణమైన ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే.పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడంతో అతడిపై విమర్శలు మరింత పదునెక్కాయి. ఈ నేపథ్యంలో.. ఆ ప్రభావం భార్య నటాషా, కుమారుడు అగస్త్యపై పడకుండా ఉండేందుకు పాండ్యానే స్వయంగా తనతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయవద్దని భార్యకు సూచించినట్లు తెలుస్తోంది.అయితే.. ఇన్నాళ్లూ విభేదాలంటూ వార్తలు రాగా..ఈసారి గాసిప్ రాయుళ్లు మరో ముందుడుగు వేశారు. హార్దిక్ పాండ్యా తీరు నచ్చని నటాషా.. ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసిందని వదంతులు వ్యాప్తి చేస్తున్నారు.భరణం కింద ఆస్తిలో 70 శాతంఈ క్రమంలో భరణం కింద హార్దిక్ పాండ్యా ఆస్తి(స్పోర్ట్స్‌కీడా నివేదిక ప్రకారం సుమారు రూ. 91 కోట్లు)లో 70 శాతం మేర(దాదాపు 63 కోట్లు) ఇవ్వాలని కోరిందని.. ఇందుకు అతడు కూడా సుముఖంగానే ఉన్నట్లు నెట్టింట రూమర్లు సృష్టిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఇటు హార్దిక్ పాండ్యా గానీ.. అటు నటాషా గానీ పెదవి విప్పకపోవడం గమనార్హం.మరోవైపు.. ఇటీవల నటాషా నుదిటిన బొట్టుతో ఉన్న ఫొటో పోస్ట్ చేస్తూ.. ‘‘అతడి ప్రేమ వల్లే ఇలా’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో అభిమానులు పాండ్యాను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ చేసిందని భావిస్తున్నారు.సోషల్ మీడియాలో విష్ చేయని హార్దిక్.. ఒంటరిగానే రీచార్జ్ అవుతున్నట్లుగాఅయితే, వాలంటైన్స్ డే తర్వాత.. నటాషా పుట్టినరోజున సైతం హార్దిక్‌పాండ్యా ఆమెకు విష్ చేస్తూ పోస్ట్ పెట్టకపోవడం గమనార్హం. కేవలం కొడుకుతో ఉన్న ఫొటోలు మాత్రమే ఇటీవల పోస్ట్ చేసిన హార్దిక్.. శుక్రవారం మరో ఫొటోతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రీచార్జ్ అవుతున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే, ఇందులో నటాషా గానీ, అగస్త్య గానీ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తదుపరి ఐసీసీ ఈవెంట్లోమామూలుగా అయితే, ఆట నుంచి విరామం దొరకగానే హార్దిక్ పాండ్యా తన భార్య, కుమారుడితోనే ఎక్కువ సమయం గడుపుతాడు. హార్దిక్- నటాషాలలో ఎవరో ఒకరు అధికారికంగా స్పందిస్తే తప్ప ఈ వదంతులకు చెక్ పడదు. కాగా హార్దిక్ సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి 2020లో పెళ్లాడాడు. పెళ్లికి ముందే తల్లిదండ్రులైన వీరు గతేడాది ఘనంగా మరోసారి వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా తదుపరి జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024కు సిద్ధం కానున్నాడు. చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
హార్దిక్ పాండ్యాతో విడాకులంటూ వార్తలు.. ట్రెండింగ్‌లో నటాషా (ఫొటోలు)
-
భార్యతో హార్దిక్‌కు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గత కొద్ది నెలలుగా ఏదీ కలిసి రావడం లేదు. గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ మధ్యలోనే నిష్క్రమించిన ఈ బరోడా క్రికెటర్.. మళ్లీ ఐపీఎల్-2024 సీజన్‌తో పునరాగమనం చేశాడు.చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకుని క్యాష్ రిచ్ లీగ్ బరిలో నిలిచాడు. కష్టకాలంలో తనపై నమ్మకం ఉంచి.. కెప్టెన్సీ అనుభవం లేకున్నా పగ్గాలు అప్పగించిన గుజరాత్ టైటాన్స్‌ను వీడి తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు.స్టేడియంలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ఈ క్రమంలో ముంబై యాజమాన్యం రోహిత్ శర్మపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించింది. అప్పటి నుంచి హార్దిక్ కష్టాలు మొదలయ్యాయి. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్‌ను కాదని పాండ్యాను కెప్టెన్ చేయడంతో అభిమానులు ముంబై యాజమాన్యంపై ఫైర్ అయ్యారు.స్టేడియంలో, సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇక ఆట తీరుతోనైనా అభిమానుల మనసు గెలవాలని హార్దిక్ పాండ్యా భావించగా.. ఆ ఆశ కూడా నెరవేరలేదు. చెత్త కెప్టెన్సీ కారణంగా ముంబై ఈ సీజన్లో దారుణంగా విఫలమైంది.చెత్త కెప్టెన్సీ వల్ల అట్టడుగున ముంబైలీగ్ దశలో ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆల్‌రౌండర్‌గానూ పాండ్యా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండటంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులోనూ హార్దిక్ పాండ్యా స్థానం ప్రశ్నార్థకం కాగా.. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి అదృష్టవశాత్తూ సెలక్టర్లు అతడిని మెగా టోర్నీకి ఎంపిక చేశారు.భార్య నటాషాతో హార్దిక్‌కు విభేదాలు?ఇక కెరీర్ విషయం ఇలా ఉంటే.. హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త తెరమీదకు వచ్చింది. భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్ బంధం బీటలు వారిందనేది దాని సారాంశం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటాషా గత కొన్ని రోజులుగా హార్దిక్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయకపోవడమే ఇందుకు కారణం అన్నట్లుగా ‘రెడిట్’ ఓ పోస్ట్ పెట్టింది.ఈ క్రమంలో కొంత మంది హార్దిక్- నటాషా విడిపోనున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే, వారి అభిమానులు మాత్రం ఇవన్నీ వట్టి వదంతులే అని కొట్టి పారేస్తున్నారు. హార్దిక్, అతడి కుటుంబంతో నటాషా దిగిన ఫొటోలు ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే ఉండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.మరి ఎందుకు ఇలా?ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హార్దిక్ పాండ్యాపై సోషల్‌మీడియాలో కొంత మంది పనిగట్టుకుని మరీ విద్వేష విషం చిమ్మిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనైన పాండ్యా.. ఈ ప్రభావం తన భార్యాబిడ్డపై కూడా పడుతుందేమోనని భయపడినట్లు సమాచారం.ఆ భయం వల్లే హార్దిక్ వద్దన్నాడు!అందుకే నటాషాను కొద్ది కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని.. ముఖ్యంగా తనతో ఉన్న ఫొటోలు షేర్ చేయవద్దని స్వయంగా చెప్పినట్లు అభిమానులు భావిస్తున్నారు. అందుకే నటాషా స్టేడియానికి కూడా రావడం మానేసిందని.. కుమారుడు అగస్త్యను కూడా బయటకు తీసుకురావడం లేదని తెలుస్తోంది.అతడి ప్రేమ వల్లే ఈ మెరుపుఇక నుదుటిన బొట్టుతో బుధవారం ఓ ఫొటో షేర్ చేసిన నటాషా.. ‘‘అతడి ప్రేమ వల్లే ఈ మెరుపు’’ అంటూ ఫొటోను షేర్ చేసింది. దీంతో హార్దిక్- నటాషా మధ్య విభేదాలు అంటూ వస్తున్న ఊహాగానాలను ఆమె పటాపంచలు చేసినట్లయింది. కాగా నటాషా ఈ మధ్యకాలంలో పెట్టిన ప్రతీ పోస్టుకు హార్దిక్సోదరుడు కృనాల్ పాండ్యా, వదిన పాంఖురి శర్మ లైకులు కొట్టడం గమనార్హం.చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే! -
హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
‘‘ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాళ్లతో కూడిన జట్టు. నేను పదేళ్ల పాటు ఆ జట్టుకు ఆడాను. ముంబై మేనేజ్మెంట్ టీమ్‌ను చాలా బాగా చూసుకుంటుంది. అయితే, ఈసారి వాళ్లు తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వారు కెప్టెన్‌ను మార్చారు. కానీ.. వాళ్లు అనుకున్నట్లుగా ఏదీ జరుగలేదు.జట్టు ఏకతాటిపై ఉన్నట్లు కనిపించలేదు. ఎవరికి వారే అన్నట్లు విడివిడిగా ఉన్నట్లు అనిపించింది. ముంబై లాంటి జట్టు ఇలా పేలవంగా ఆడటం నన్ను బాధించింది.కెప్టెన్‌ను మార్చాలనే నిర్ణయం సరైందే అయినా.. అందుకు మరో ఏడాది వేచి చూడాల్సింది. ఇందులో హార్దిక్ పాండ్యా తప్పేం లేదు. గుజరాత్ టైటాన్స్‌లో ఉన్నపుడు అతడి కెప్టెన్సీ అద్భుతంగా ఉంది.నిజానికి.. కెప్టెన్ ఎవరైనా.. సీనియర్లంతా కలిసి జట్టును ఒక్కటిగా ఉంచాల్సింది. కెప్టెన్లు వస్తారూ.. పోతారు. జట్టు మాత్రం ఒక్కతాటిపై ఉండాలి కదా!ఈసారి వాళ్లు జట్టులా ఆడినట్లు ఏ కోశానా కనిపించలేదు’’ అని టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అన్నాడు. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ వైఫల్యం పట్ల విచారం వ్యక్తం చేశాడు.కాగా ఈ సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. దీంతో సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.అదే విధంగా హార్దిక్ పాండ్యాకు సైతం స్టేడియంలో, సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహ జ్వాలల సెగ తగిలింది. అందుకు తగ్గట్లుగానే ముంబై వరుస మ్యాచ్‌లలో ఓడిపోవడం.. ఆఖరికి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలవడంతో ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోయారు.ఇక ఓవరాల్‌గా ఈ ఎడిషన్‌లో ముంబై ఆడిన పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు.జట్టు రెండు వర్గాలుగా విడిపోవడానికి సీనియర్లే కారణమంటూ పరోక్షంగా రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లను టార్గెట్ చేశాడు. హార్దిక్ పాండ్యాకు మద్దతు తెలిపే క్రమంలో భజ్జీ జట్టు వైఫల్యాలకు సీనియర్లను బాధ్యులుగా చూపే ప్రయత్నం చేశాడు.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్#WATCH | On Hardik Pandya's captaining Mumbai Indians in IPL 2024, former Indian cricketer Harbhajan Singh says "I have played with Mumbai Indians for 10 years. The team management is great but this decision has backfired them. The management was thinking about the future while… pic.twitter.com/pGNW5gIRF5— ANI (@ANI) May 21, 2024 -
MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్-2024 ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గత సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన ఈ జట్టు.. ఈసారి మాత్రం దారుణంగా విఫలమైంది. ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి ఎనిమిది పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచింది.పేలవ ప్రదర్శనతో ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేసినందుకు ముంబై యాజమాన్యం భారీ మూల్యమే చెల్లించిందనే విమర్శలు వస్తున్నాయి.ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ జట్టును ఉద్దేశించి డ్రెస్సింగ్ రూంలో చేసిన ప్రసంగం ఆసక్తికరంగా మారింది. ‘‘ఈ సీజన్ మనందరినీ ఎంతగానో నిరాశ పరిచింది. మనం ఆశించినట్లుగా ఏదీ జరగలేదు.అయినా నేనెప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టుకు వీరాభిమానినే. కేవలం యజమానిగా ఉన్నందుకు మాత్రమే నేను ఈ మాటలు చెప్పడం లేదు. ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించడం.. జట్టుతో ఇలా మమేకం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను.మన ఆట తీరును సమీక్షించుకుందాం. ఓటములకు గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం’’ అని నీతా అంబానీ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపారు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2024 ఆడబోయే భారత జట్టుకు ఎంపికైన ముంబై ఆటగాళ్లకు నీతా అంబానీ ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.‘‘రోహిత్, హార్దిక్, సూర్య, జస్ప్రీత్.. భారతీయులంతా మీ కోసం ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు’’ అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను విష్ చేశారు. కాగా జూన్ 1 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుండగా.. జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.Mrs. Nita Ambani talks to the team about the IPL season and wishes our boys all the very best for the upcoming T20 World Cup 🙌#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 | @hardikpandya7 | @surya_14kumar | @Jaspritbumrah93 pic.twitter.com/uCV2mzNVOw— Mumbai Indians (@mipaltan) May 19, 2024 -
హార్దిక్ అద్భుతమైన ప్లేయర్.. పాక్‌పై కచ్చితంగా చెలరేగతాడు: రైనా
ఐపీఎల్-2024లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దారుణ ప్రదర్శన కనబరిచాడు. కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా సైతం తీవ్ర నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్‌కు ముందు ఆల్-క్యాష్ డీల్‌లో భాగంగా గుజరాత్ నుంచి ముంబై జట్టుకు ట్రేడ్ అయిన హార్దిక్.. కెప్టెన్‌గా తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రం విజయం సాధించింది. అదే విధంగా హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా 18 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్లో హార్దిక్ విఫలమైనప్పటకి టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో మాత్రం చోటు దక్కింది. కేఎల్ రాహుల్, గిల్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు ఇవ్వకుండా హార్దిక్‌ను ఎంపిక చేయడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే వరల్డ్‌కప్‌నకు హార్దిక్‌ను ఎంపిక చేయడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా సపోర్ట్ చేశాడు. వరల్డ్‌కప్‌లో పాండ్యా సత్తాచాటుతాడని రైనా జోస్యం చెప్పాడు."హార్దిక్ పాండ్యా టీమిండియాకు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ తనవంతు న్యాయం చేసేవాడు. ఫామ్ అనేది తాత్కాలికం మాత్రమే. అది శాశ్వతం కాదు. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై హార్దిక్ బాగా రాణిస్తే, అందరూ అతడిని ప్రశంసలతో ముంచెత్తుతారని" క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. ఇక టీ20 వరల్డ్‌కప్-2024 జూన్ 1 నంచి ప్రారంభం కానుంది. భారత్ విషయానికి వస్తే.. జూన్ 5న ఐర్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. -
T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. పదిహేను రోజుల్లోపే అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఈ ఈవెంట్‌కు తెరలేవనుంది.క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్-2024కు మే 26న శుభం కార్డు పడనుండగా.. జూన్ 1 నుంచి ఈ టోర్నమెంట్ రూపంలో మరోసారి పొట్టి క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత మజా దొరకనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కాగా టీమిండియా తమ లీగ్ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడనుంది.ఇక మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా జూన్ 1న బంగ్లాదేశ్‌తో ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడనున్న రోహిత్ సేన.. జూన్ 5న తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ జట్టులో భాగమైన భారత ఆటగాళ్లలో మెజారిటీ మంది మే 25న అమెరికాకు ప్రయాణం కానున్నట్లు సమాచారం.తొలి దఫా బ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సహా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తదితరులతో పాటు సహాయక సిబ్బంది కూడా న్యూయార్క్‌కు బయల్దేరతారని బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.నిజానికి మే 21నే వీరంతా అమెరికాకు పయనం కావాల్సి ఉందని అయితే, ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ ఉంది కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకునేందుకు బోర్డు అనుమతినిచ్చిందని పేర్కొన్నాయి. ఇక మిగిలిన వాళ్లలో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లి తదితరులు ఐపీఎల్-2024 ఫైనల్ పూర్తైన మరుసటి రోజు అంటే మే 27న భారత్‌ను వీడనున్నారు.టీ20 ప్రపంచకప్-2024కు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. -
IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్-2024 చేదు అనుభవాలనే మిగిల్చింది. సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించి.. సారథ్య బాధ్యతలను ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పగించింది.గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి పాండ్యాను ట్రేడ్ చేసుకుని మరీ.. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసింది. ఇదిలా ఉంటే.. బ్యాటర్‌గానూ హిట్‌మ్యాన్ ఈసారి తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.అదొక్కటి హైలైట్తాజా ఎడిషన్‌లో మొత్తంగా ముంబై తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 417 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్‌పై చేసిన సెంచరీ ఒక్కటి హైలైట్‌గా నిలవగా.. లీగ్ దశలో ఆఖరిదైన లక్నో మ్యాచ్‌లోనూ రోహిత్ అర్ధ శతకం(38 బంతుల్లో 68) సత్తా చాటాడు. ఇవి మినహా రోహిత్ నుంచి ఆశించిన మేర మెరుపులు రాలేదు.ఇదిలా ఉంటే.. మేనేజ్మెంట్, హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన కారణంగా రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్‌ను వీడతాడనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేకేఆర్ కోచ్ అభినవ్ ముకుంద్తో మాట్లాడుతూ రోహిత్ వీటికి బలం చేకూర్చాడు.వచ్చే ఏడాది మెగా వేలంఇక ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మార్క్ బౌచర్ సైతం తాజాగా ఈ విషయంపై స్పందించాడు. లక్నోతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఓడిన అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ప్రశ్న ఎదురైంది.ఇందుకు బదులిస్తూ.. ‘‘తనకు సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకోగల సమర్థుడు. వచ్చే ఏడాది మెగా వేలం జరుగబోతోంది. ఏం జరుగనుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు? రోహిత్ శర్మతో నేను గత రాత్రి మాట్లాడాను. ఈ సీజన్లో వైఫల్యాల గురించి చర్చించాం. తదుపరి ఏమిటని అడిగాను.ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ‘వరల్డ్‌కప్’.. అని సమాధానమిచ్చాడు’’ అని మార్క్ బౌచర్ పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలను బట్టి.. రోహిత్ శర్మ వచ్చే ఏడాది ముంబైని వీడటం ఖాయమని ఫిక్సయిపోయారు అతడి అభిమానులు.తగిన శాస్తి జరిగిందంటూపనిలో పనిగా.. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగించినందుకు ముంబై యాజమాన్యానికి తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మొత్తంగా ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. కాగా జూన్ 1 నుంచి ఆరంభమయ్యే టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్. -
BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ షాకిచ్చింది. రూ. 30 లక్షల జరిమానాతో పాటు తదుపరి మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిషేధం విధించింది.కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసిన హార్దిక్ పాండ్యాకు అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రోహిత్ స్థానంలో వచ్చినందుకు సొంత జట్టు అభిమానుల నుంచే ఛీత్కారాలు.. కెప్టెన్‌గా తీసుకున్న నిర్ణయాల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు.ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుఆల్‌రౌండర్‌గానూ తన స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోయాడు హార్దిక్ పాండ్యా. సారథిగానూ సరైన వ్యూహాలు రచించలేక చతికిలపడ్డాడు. ఫలితంగా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై పరాభవం మూటగట్టుకుంది.ఇక లీగ్ దశలో ఆఖరిదై మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ పోరులో లక్నో ముంబైని 18 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ముంబై ఖాతాలో పదో పరాజయం నమోదైంది.ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ హార్దిక్ పాండ్యాకు పనిష్మెంట్ ఇచ్చింది.ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధంఈ మేరకు.. ‘‘ఈ సీజన్లో ముంబై జట్టు చేసిన మూడో తప్పిదం కావున.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా పాండ్యాకు రూ. 30 లక్షల జరిమానా విధించడంతో పాటు.. జట్టు తదుపరి ఆడే మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తున్నాం’’ అని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. అంటే ఐపీఎల్-2025లో పాండ్యా తన తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండాలన్నమాట! ఇక పాండ్యాతో పాటు ముంబై జట్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. ముంబై జట్టు మొత్తానికి జరిమానా‘‘లక్నోతో మ్యాచ్ ఆడిన ముంబై తుదిజట్టులోని ఆటగాళ్లందరికీ.. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్రతి ఒక్కరికి రూ. 12 లక్షల జరిమానా లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం మేర కోత(ఏది తక్కువగా ఉంటే అది) విధిస్తాం’’ అని తెలిపారు. కాగా ఐపీఎల్-2024లో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.చదవండి: Pat Cummins: సన్‌రైజర్స్ కెప్టెన్ చేసిన పనికి అభిమానులు ఫిదా.. వీడియో వైరల్ #LSG wrapped up their season on a winning note and happy faces in Mumbai😃👌🎥 Here's a roundup of the #MIvLSG clash at the Wankhede 🏟️ #TATAIPL pic.twitter.com/FbdT2QQQAk— IndianPremierLeague (@IPL) May 18, 2024 -
MI: రోహిత్, హార్దిక్ వద్దు.. వాళ్లిద్దరినే రిటైన్ చేసుకోండి: సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ‘స్టార్’ క్రికెటర్ల ఆట తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. వచ్చే ఏడాది వేలంలో సోకాల్డ్ ‘స్టార్ల’ను వదిలేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.కాగా ముంబై ఇండియన్స్‌లో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, టీ20 వరల్డ్ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తదితరులు ఉన్నారు.ఇక రోహిత్ శర్మ ఈ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించినా.. ఐపీఎల్-2024 సీజన్లో కెప్టెన్‌గా అతడిని తప్పించింది యాజమాన్యం. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.రెండు వర్గాలుగా విడిపోయిన జట్టు?ఈ నేపథ్యంలో వేదనకు గురైన రోహిత్ శర్మతో పాటు బుమ్రా, సూర్య తదితరులు ఒక బృందంగా.. పాండ్యా, ఇషాన్‌లతో కూడిన మరికొందరు మరో బృందంగా ఏర్పడ్డారని.. జట్టులో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపిస్తున్నాయి.జట్టు ప్రదర్శనపై ఇది ప్రభావం చూపిందని.. అందుకే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలిచిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఎడిషన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా ముంబై శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ముంబై మేనేజ్మెంట్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025 వేలానికి ముందే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లను వదిలేయాలని సూచించాడు.షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఉంటే సరిపోదుఇందుకు సినిమాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఈ మేరకు ‘‘షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి ఒకే సినిమాలో నటించినా.. అది హిట్టవుతుందనే గ్యారెంటీ లేదు. సినిమాలో స్టార్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.మంచి స్క్రిప్టు ఉండాలి. అందరూ బాగా నటించగలగాలి. ఇలా ఇంకెన్నో అంశాలు కలిసిరావాలి. అలాగే జట్టులో పేరున్న ఆటగాళ్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.అసలు రోహిత్ శర్మ ఏం చేశాడు?మైదానంలో వాళ్లు సరిగ్గా ఆడితేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. మరి మిగతా మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన మాటేమిటి?ఇక ఇషాన్ కిషన్.. ఈ సీజన్ మొత్తంలో ఒక్కసారి కూడా కనీసం పవర్ ప్లే ముగిసే వరకైనా ఉన్నాడా?.. నా దృష్టిలో ముంబై ఇండియన్స్ కేవలం జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లనే నమ్ముకోవాలిక! వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోవాలివచ్చే సీజన్ కోసం వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. మిగతా వాళ్లు అసలు అవసరమే లేదు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ సీజన్లో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ 349, ఇషాన్ కిషన్ 306 పరుగులు చేశారు. మరోవైపు గాయం కారణంగా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ 345 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా 20 వికెట్లు తీయగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 11 వికెట్లు తీయడంతో పాటు 200 పరుగులు చేశాడు. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్ -
అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విమర్శకులకు టీమిండియా మాజీ క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పాండ్యా కెప్టెన్సీని తప్పుబట్టిన ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ గూటికి చేరుకున్న హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఆల్‌రౌండర్‌గా, సారథిగా అతడు పూర్తిగా నిరాశపరిచాడు.విమర్శల జల్లుగతేడాది రోహిత్ కెప్టెన్సీలో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై.. ఈసారి పాండ్యా నాయకత్వంలో టాప్-4 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సేవలను సరైన విధంగా ఉపయోగించుకోకపోవడం వల్లే ముంబైకి ఈ దుస్థితి ఎదురైందని విమర్శలు వెల్లువెత్తాయి.హార్దిక్ పాండ్యా అతి విశ్వాసం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో కెవిన్ పీటర్సన్, ఏబీ డివిలియర్స్ కూడా పాండ్యాను విమర్శించారు.వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదుఈ నేపథ్యంలో తాజాగా గౌతం గంభీర్ స్పందిస్తూ.. వీళ్లిద్దరికీ కౌంటర్ ఇస్తూ హార్దిక్ పాండ్యాకు మద్దతునిచ్చాడు. ‘‘వాళ్లు కెప్టెన్‌గా ఉన్నపుడు ఏం సాధించారు? నాకు తెలిసి నాయకులుగా వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదు.వాళ్ల రికార్డులు పరిశీలిస్తే మరే ఇతర కెప్టెన్‌కు కూడా అంతటి చెత్త రికార్డులు ఉండవు. ఇక ఏబీడీ ఐపీఎల్లో ఒక్క మ్యాచ్‌కైనా సారథ్యం వహించాడా?వ్యక్తిగత స్కోర్లు సాధించాడే గానీ.. జట్టు కోసం అతడి చేసిందేమీ లేదు. తను ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్‌ఇక హార్దిక్ పాండ్యా.. ఇప్పటికే తను ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్. కాబట్టి ఇలాంటి వాళ్లతో అతడికి పోలిక కూడా అవసరం లేదు’’ అంటూ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా పీటర్సన్, ఏబీ డివిలియర్స్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించారు. పీటర్సన్ 2009లో ఆరు మ్యాచ్‌లలో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించి కేవలం రెండు విజయాలు అందుకున్నాడు.సారథిగా పీటర్సన్ విఫలంఇక 2014లో ఢిల్లీ ఫ్రాంఛైజీ సారథిగా బాధ్యతలు చేపట్టిన పీటర్సన్ కెప్టెన్సీలో జట్టు కేవలం రెండు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్‌ను 2022లో విజేతగా నిలపడంతో పాటు గతేడాది రన్నరప్‌గా నిలిపిన ఘనత హార్దిక్ పాండ్యా సొంతం. ఈ నేపథ్యంలో గంభీర్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే! -
T20 WC: హార్దిక్‌ను సెలక్ట్ చేయడం రోహిత్‌కు ఇష్టం లేదు.. కానీ!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇవ్వడం కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు ఇష్టం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి అతడిని ఏకంగా వైస్ కెప్టెన్‌గా ప్రకటించడానికి కారణం ఏంటి?..ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యాను ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా ప్రకటించింది. ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి మరీ పగ్గాలు అతడికి అప్పగించింది.అయితే, పాండ్యా యాజమాన్యం అంచనాలు అందుకోలేకపోయాడు. అంతేకాదు జట్టులో సీనియర్లు అయిన రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లతో పాండ్యాకు సఖ్యత లేనట్లు చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ రెండు వర్గాలుగా విడిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన పేలవంగా సాగడం, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలవడం ఇందుకు బలాన్ని చేకూర్చింది. కెప్టెన్‌గా విఫలమైన పాండ్యా ఆల్‌రౌండర్‌గానూ చెప్పుకోగదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి 144.93 స్ట్రైక్‌రేటుతో 200 పరుగులు స్కోరు చేయడంతో పాటు 10.59 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. అయితే, ఆరంభంలో మాత్రం వరుసగా విఫలమయ్యాడు. అయినప్పటికీ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.ఈ నేపథ్యంలో ఫామ్‌లో లేకున్నా పాండ్యాకు చోటు ఇవ్వడం పట్ల బీసీసీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం గురించి ఎదురైన ప్రశ్నకు టీమిండియా ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సమాధానిమిస్తూ.. తమకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో పాండ్యా మాదిరి బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సమర్థవంతమైన పేస్ ఆల్‌రౌండర్ లేనందు వల్లే అతడిని ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.ఈ క్రమంలో దైనిక్ జాగరణ్ ఆసక్తికర కథనం వెలువరించింది. రోహిత్, అగార్కర్‌లకు ఇష్టం లేకపోయినా.. ఒత్తిడిలో కూరుకుపోయినందు వల్లే పాండ్యాను సెలక్ట్ చేసినట్లు తెలిపింది. అదే విధంగా.. ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గానూ ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేనందు వల్లే వైస్ కెప్టెన్‌గా ప్రకటించినట్లు వెల్లడించింది. -
MI: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌బై?.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ యాజమాన్యం వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడా? వచ్చే ఏడాది అతడు జట్టును వీడనున్నాడా? హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తనకు జరిగిన అవమానం పట్ల ఆవేదన చెందుతున్నాడా?తాను నిర్మించిన సామ్రాజ్యం నుంచి తానే బయటకు వెళ్లే సమయం వచ్చిందా? అంటే అవుననే మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శర్మ- కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మధ్య జరిగిన తాజా ‘సంభాషణ’కు సంబంధించిన దృశ్యాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.ఐపీఎల్-2024 కంటే ముందే కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై ఫ్రాంఛైజీ.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అపఖ్యాతిఅయితే, అతడి సారథ్యంలో పేలవ ప్రదర్శనతో చతికిల పడిన ముంబై ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. రోహిత్, హార్దిక్‌లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలోనే ఈ వైఫల్యాలు ఎదురయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే విధంగా.. పాండ్యా వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉన్న రోహిత్ వచ్చే ఏడాది ముంబై జట్టును వీడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ముంబై శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా మైదానంలోకి వెళ్లిన రోహిత్- కేకేఆర్ కోచ్ అభిషేక్ నాయర్‌తో మాట్లాడినట్లుగా ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అది నా ఇల్లు బ్రదర్ఇందులో.. ‘‘ఒక దాని తర్వాత మరొకటి మారిపోతూ ఉన్నాయి. వాళ్లే ఇందుకు కారణం. ఏదేమైనా గానీ.. అది నా ఇల్లు బ్రదర్.. నేను నిర్మించిన గుడి అది. ఇదే నాకు లాస్ట్’’ అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి రోహిత్ ముంబై ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెప్పడం ఖాయమని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ తదుపరి కేకేఆర్‌లో చేరితే బాగుంటుందంటూ పాకిస్తాన్ లెజెండరీ పేసర్, గతంలో కోల్‌కతా ఫ్రాంఛైజీతో పనిచేసిన వసీం అక్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ నాయర్‌తో హిట్‌మ్యాన్ సంభాషణ మరింత హైలైట్ అవుతోంది.చదవండి: KL Rahul- Sanjeev Goenka: జట్టు గెలవాలన్న తపనే అది: బ్రెట్ లీClear audio of Rohit Sharma and Abhishek Nayar's conversation, he didn't said that it's his last IPL.Please don't make any conclusions on half said words.🙏pic.twitter.com/9lbtZRQvQB— Aryan 🇮🇳 (@Iconic_Hitman) May 10, 2024... That chat. Rohit to Nayar "Ek ek cheez change ho rha hai!,, Wo unke upar hai,,, Jo bhi hai wo mera ghar hai bhai, wo temple mene banwaya hai" Last line - "Bhai mera kya mera to ye last hai" And now KKR deleted that chatting video of Rohit Sharma and Nayar#RohitSharma pic.twitter.com/4BiQzutQdH— HitMan 🖤 (@Sachin__i) May 11, 2024 -
రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో!
ఐపీఎల్-2024లో కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి.. హార్దిక్ పాండ్యాను సారథి చేసినందుకు భారీ మూల్యమే చెల్లించింది.తాజా ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. కాగా రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పించిన నాటి నుంచే అభిమానులు మేనేజ్మెంట్పై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను మైదానం లోపల, వెలుపలా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అందుకు తగ్గట్లుగానే అతడు ఏమాత్రం రాణించలేకపోతున్నాడు. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానేపాండ్యా సారథ్యంలో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొంది.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ వాతావరణం అస్సలు బాగా లేదని.. రోహిత్, హార్దిక్‌లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ కన్నీళ్లుస్టార్ ఆటగాళ్ల మధ్య విభేదాల వల్లే ముంబై పరిస్థితి ఇలా మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో వైఫల్యం తర్వాత రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా ఉన్న వీడియో వీటికి మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో హిట్‌మ్యాన్ ముంబై ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ పేస్ లెజెండ్ వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ముంబైని వీడతాడువచ్చే ఏడాది రోహిత్ శర్మ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడితే చూడాలని ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి వచ్చే ఏడాది రోహిత్ శర్మ ముంబైతో కొనసాగకపోవచ్చు.అతడు కేకేఆర్‌లోకి రావాలని కోరుకుంటున్నాను. అక్కడ గౌతీ(గంభీర్) మెంటార్షిప్లో.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది.గొప్ప ఆటగాడుఈడెన్ గార్డెన్స్ పిచ్ మీద రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అతడొక గొప్ప ప్లేయర్. అతడు కేకేఆర్‌లోకి వస్తే చాలా చాలా బాగుంటుంది’’ అని వసీం అక్రం తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటికే పదకొండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కేకేఆర్ ప్రదర్శను ఈ సందర్భంగా కొనియాడాడు కూడా!చదవండి: SRH: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా.. -
Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం మ్యాచ్ ఫలితంతో పాండ్యా సేన టాప్-4 ఆశలు గల్లంతయ్యాయి. లక్నోను సన్‌రైజర్స్ చిత్తు ఓడించడంతో ఈ సీజన్లో ముంబై ప్రయాణం ముగిసినట్లయింది.ఎలా అంటే?ఉప్పల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నోను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కేఎల్ రాహుల్ సేన విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే ఛేదించింది.WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024తద్వారా క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లో ఏడో విజయం(పన్నెండు మ్యాచ్‌లకు గానూ) నమోదు చేసి.. మొత్తంగా 14 పాయింట్లు సాధించింది. నెట్ రన్‌రేటు(0.406) కూడా మెరుగుపరచుకుని పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. టాప్-2లో తిష్ట వేసిన కేకేఆర్, రాజస్తాన్‌మరోవైపు.. కోల్‌కతా నైట్ రైడర్స్(రన్‌రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్(రన్‌రేటు 0.476) పదకొండేసి మ్యాచ్‌లు ఆడి చెరో 16 పాయింట్లతో టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.ఈ నేపథ్యంలో చెరో 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్(రన్‌రేటు -0.316), లక్నో సూపర్ జెయింట్స్(రన్‌రేటు -0.769) వచ్చే వారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా 14 పాయింట్లతో పైకి ఎగబాకుతుంది.పాండ్యా సేనకు తప్పని పరాభవంమరోవైపు.. ఆర్సీబీ(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు- మిగిలినవి 3), పంజాబ్ కింగ్స్(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు- మిగిలినవి 3) ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే, ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పటికే 12 మ్యాచ్‌లు ఆడేసింది. కేవలం నాలుగింట గెలిచి 8 పాయింట్లతో ఉంది.మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా మహా అయితే మొత్తంగా 12 పాయింట్లు వస్తాయి. కాబట్టి టాప్-4లో అడుగుపెట్టేందుకు ముంబైకి దారులు మూసుకపోయినట్లే! ఇక అట్టడుగున ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు ఇంకో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్, రాజస్తాన్, సన్‌రైజర్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయింది.చదవండి: #KL Rahul: కెప్టెన్‌పై కోపంతో ఊగిపోయిన లక్నో ఓనర్.. అందరూ చూస్తుండగానే అలా.. -
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
మైదానంలో ఉన్నంత సేపు ప్రత్యర్థులు.. ఒక్కసారి ఆట ముగియగానే స్నేహితులు.. దాదాపు క్రీడాకారులంతా ఇలాగే ఉంటారు. ముఖ్యంగా లీగ్ క్రికెట్లో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.ఐపీఎల్-2024లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో ముచ్చటించాడు.పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని ముచ్చట్లలో మునిగిపోయిన వేళ.. కమిన్స్ తన వేలి గాయం గురించి పాండ్యా, సూర్యలకు చెప్పాడు. తన కుడిచేతి మధ్యవేలు ముందరి భాగం చిన్నప్పుడే విరిగిపోయిందని కమిన్స్ చెప్పగానే వాళ్లిద్దరు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే.. ‘‘అయ్యె అవునా?’’ అన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. సాటి ఫాస్ట్ బౌలర్‌గా కమిన్స్ కష్టాన్ని తెలుసుకుని సానుభూతి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా రైటార్మ్ పేసర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా.. ‘‘నాకు నాలుగేళ్ల వయసున్నపుడు.. డోర్ మధ్య వేలు ఇరుక్కోవడంతో పైభాగంలో సెంటీమీటర్ మేర విరిగిపోయింది. అయినా.. నా బౌలింగ్ యాక్షన్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు.ఎందుకంటే నా వేళ్లు అన్నీ దాదాపుగా ఒకే లెంగ్త్‌తో ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటికీ నా సోదరి బాధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే తనే డోర్ వేసింది’’ అని కమిన్స్ తెలిపాడు. అదన్న మాట సంగతి!ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై సన్‌రైజర్స్‌ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ వీరోచిత అజేయ శతకం(51 బంతుల్లో 102)తో రాణించి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ బ్యాట్(17 బంతుల్లో 35)తో రాణించడమే గాక ఒక వికెట్ కూడా తీశాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా మూడు కీలక వికెట్లు తీసి సన్‌రైజర్స్ ఓటమిలో సూర్యతో పాటు తానూ కీలక పాత్ర పోషించాడు.చదవండి: T20 WC: ద్రవిడ్, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!Pat Cummins must be telling about how he lost the top of his middle finger on his dominant right hand when his sister accidentally slammed a door on it. Hardik's reaction 😱 pic.twitter.com/oinHeW99mn— 𝗔𝗱𝗶𝘁𝘆𝗔 (@StarkAditya_) May 7, 2024 -
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
ఐపీఎల్-2024 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్దగా కలిసి రావడం లేదు. సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్ పదవిని కోల్పోయిన హిట్‌మ్యాన్.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కానీ బ్యాటర్‌గా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 12 ఇన్నింగ్స్‌లో కలిపి రోహిత్ శర్మ చేసిన పరుగులు 330. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో పదిహేడో స్థానం(మే 7 నాటికి)లో ఉన్నాడు.ఆ సెంచరీ మినహా!ఈ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మీద సాధించిన శతకం(105 నాటౌట్) మినహా మిగతా మ్యాచ్‌లలో రాణించలేకపోయాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో సోమవారం ముగిసిన మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ విఫలమయ్యాడు.భావోద్వేగానికి గురైన రోహిత్!వాంఖడే మైదానంలో ఐదు బంతులు ఎదుర్కొన్న రోహిత్.. కేవలం ఒక్క ఫోర్ కొట్టి అవుటయ్యాడు. రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో నిరాశగా మైదానం వీడిన రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లుగా కనిపించాడు. దుఃఖాన్ని ఆపుకొంటూ రోహిత్ కన్నీళ్లను తుడుచుకుంటున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పాపం రోహిత్ఈ వీడియో చూసిన రోహిత్ శర్మ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ‘‘టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు నిన్నిలా చూడలేకపోతున్నాం హిట్‌మ్యాన్. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ నిర్ణయం వల్లే ఇదంతా. కెప్టెన్సీ నుంచి అవమానకరంగా తప్పించి అతడిని ఒత్తిడిలోకి నెట్టేశారు.ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్‌పై వేటు వేశారు. అందుకు తగిన మూల్యం చెల్లిస్తున్నారు’’ అంటూ ముంబై జట్టు మేనేజ్మెంట్పై మండిపడుతున్నారు. ఏదేమైనా రోహిత్ శర్మ వైఫల్యాలను అధిగమించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో విజయం అందుకుంది. చదవండి: ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్Rohit Sharma crying in the dressing room. pic.twitter.com/GRU5uF3fpc— Gaurav (@Melbourne__82) May 6, 2024💯 & winning runs in styleSuryakumar Yadav hits a maximum to bring up his century 👏Watch the recap on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/RlaOZ8l2i0— IndianPremierLeague (@IPL) May 6, 2024 -
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ నాలుగో విజయం నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ వల్లే ముంబైకి ఈ గెలుపు సాధ్యమైంది.తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకునే ప్రమాదం నుంచి ముంబై తప్పించుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా హర్షం వ్యక్తం చేశాడు.సూర్యలాంటి విధ్వంసకర బ్యాటర్ తమ జట్టులో ఉండటం అదృష్టమంటూ అతడిని కొనియాడాడు. అదే విధంగా.. విజయానంతరం కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ నుంచి ఎదురైన ప్రశ్నకు హార్దిక్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా?ప్లే ఆఫ్స్ రేసు గురించి మంజ్రేకర్ ప్రస్తావించగా.. ‘‘మీరు ఏ సమీకరణల గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. అయితే, మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాలని అనుకుంటున్నాం’’ అని హార్దిక్ బదులిచ్చాడు.ఇక సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘మేము 10- 15 పరుగులు అదనంగా సమర్పించుకున్నాం. ఏదేమైనా మా బ్యాటర్లు అత్యద్భుతంగా ఆడారు. ఇక నేను కూడా ఈరోజు మెరుగ్గా బౌలింగ్ చేయగలిగాను.అత్యుత్తమ బ్యాటర్పరిస్థితులకు అనుగుణంగా నా వ్యూహాలను అమలు చేయగా సత్ఫలితాలు వచ్చాయి. ఇక ‘స్కై’ గురించి చెప్పేదేముంది. తనలోని అత్యుత్తమ బ్యాటర్ మరోసారి బయటకు వచ్చాడు.ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఒత్తిడిలో కూరుకుపోయేలా చేశాడు. ఆత్మవిశ్వాసంతో అతడు బ్యాటింగ్ చేసిన తీరు మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసింది. ఒంటిచేత్తో జట్టును గెలిపించగల సత్తా అతడి సొంతం’’ అని సూర్యకుమార్ యాదవ్‌పై హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు.ముంబై వర్సెస్ హైదరాబాద్ స్కోర్లు:👉వేదిక: వాంఖడే, ముంబై👉టాస్: ముంబై.. బౌలింగ్👉హైదరాబాద్ స్కోరు: 173/8 (20)👉ముంబై స్కోరు: 174/3 (17.2)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ముంబై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 102 రన్స్- నాటౌట్).చదవండి: తండ్రిని ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన జూనియర్ బుమ్రా..!💯 & winning runs in styleSuryakumar Yadav hits a maximum to bring up his century 👏Watch the recap on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/RlaOZ8l2i0— IndianPremierLeague (@IPL) May 6, 2024 -
హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
టీమిండియా భవిష్య కెప్టెన్ గురించి బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు సారథిగా పగ్గాలు చేపట్టగల అర్హత అతడికే ఉందంటూ ఓ ముంబైకర్ పేరు చెప్పాడు.కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్‌ను చేసింది బీసీసీఐ. హిట్‌మ్యాన్ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో ఏక కాలంలో నంబన్ వన్‌గా నిలిచిన టీమిండియా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది.ఫైనల్ వరకూ వచ్చినా టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లోనే నిష్క్రమించిన రోహిత్ సేన.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓడి ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. అదే విధంగా.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లోనూ విజయ లాంఛనం పూర్తి చేయలేక.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఆఖరి మెట్టుపై టైటిల్‌ను చేజార్చుకుంది.ఇక ఇప్పుడు మరో మెగా టోర్నీకి టీమిండియా సిద్ధమవుతోంది. పొట్టి ఫార్మాట్లో వరల్డ్‌కప్ ఈవెంట్‌కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ శర్మ నాయకత్వంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఇందులో మిడిలార్డర్ బ్యాటర్, క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం చోటు దక్కలేదు. అయితే, ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా మాత్రం అయ్యర్ దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో కేకేఆర్ ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్ఎస్కే ప్రసాద్ అయ్యర్ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు. ‘‘హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు.. శ్రేయస్ అయ్యర్‌ను టీమిండియా తదుపరి కెప్టెన్‌గా తీర్చిదిద్దబడ్డాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రమపద్ధతిలో సారథిగా ఎదిగేందుకు బాటలు వేసుకున్నాడు.గత రెండేళ్లలో అతడి గణాంకాలు అద్బుతం. ఇక ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. నాకు తెలిసి ఇండియా- ఏ ఆడిన 10 సిరీస్‌లలో ఎనిమిది గెలిచింది. అందులో ఎక్కువసార్లు భారత జట్టును ముందుకు నడిపింది శ్రేయస్ అయ్యరే!టీమిండియా తదుపరి కెప్టెన్‌గా అతడు తయారుచేయబడ్డాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తర్వాత సారథిగా రిషభ్ పంత్‌తో శ్రేయస్ అయ్యర్ పోటీపడుతున్నాడు. పంత్ కంటే ముందే..నిజానికి పంత్ కంటే కూడా శ్రేయస్ అయ్యర్ ఒక అడుగు ముందే ఉన్నాడని చెప్పవచ్చు’’ అని రెవ్‌స్ట్పోర్ట్స్‌తో ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యానించాడు. అయితే, ఇదంతా గతం. బీసీసీఐతో విభేదాల నేపథ్యంలో అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడంతో ఇప్పుడు జట్టులో స్థానం గురించి పోటీ పడాల్సిన పరిస్థితి.చదవండి: ‘SRH అని ఎవరన్నారు?.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’ -
MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
ఐపీఎల్లో ఇవాళ మరో భారీ మ్యాచ్ జరుగనుంది. స్టార్లతో నిండిన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై హోం గ్రౌండ్ అయిన వాంఖడేలో రాత్రి 7: 30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ముంబై వరుస చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మహాద్భుతం జరిగే తప్ప ఈ సీజన్లో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట మాత్రమే గెలుపొంది ఆరు పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ముంబై ఈ సీజన్లో మరో మూడు మ్యాచ్‌లు (సన్‌రైజర్స్, కేకేఆర్, లక్నో) ఆడాల్సి ఉంది.సన్‌రైజర్స్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ప్రధాన పోటీదారుగా ఉంది. సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌లు గెలిచి 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇంకా నాలుగు మ్యాచ్‌లు (ముంబై, లక్నో, గుజరాత్, పంజాబ్) ఆడాల్సి ఉంది. ఇతర జట్ల జయాపజయాలతో పని లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే సన్‌రైజర్స్ ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.హెడ్ టు హెడ్ రికార్డ్స్: ఐపీఎల్లో ముంబై, సన్‌రైజర్స్ ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. ముంబై 12, సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. చివరిసారిగా ఈ రెండు జట్ల మధ్య తలపడిన మ్యాచ్‌లో అతి భారీ స్కోర్లు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 31 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ట్రవిస్ హెడ్ (62), అభిషేక్ శర్మ (63), మార్క్రమ్ (42 నాటౌట్), క్లాసెన్ (80 నాటౌట్) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ సైతం ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేసి సన్‌రైజర్స్ శిబిరంలో దడ పుట్టించింది. ఈ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (34), నమన్ ధిర్ (30), తిలక్ వర్మ (64), హార్దిక్ పాండ్యా (24), టిమ్ డేవిడ్ (42 నాటౌట్), రొమారియో షెపర్డ్ (15 నాటౌట్) తలో చేయి వేసి సన్‌రైజర్స్‌ను భయపెట్టారు.తుది జట్లు (అంచనా)..ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధిర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార [ఇంపాక్ట్ ప్లేయర్: నేహాల్ వధేరా]సన్‌రైజర్స్: ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ [ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్/ఉమ్రాన్ మాలిక్] -
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడం సందేహాలకు తావిచ్చింది. ఐపీఎల్-2024 ఆరంభం నుంచి ముంబై తరఫున అన్ని మ్యాచ్‌లలోనూ మైదానంలోకి దిగాడు హిట్‌మ్యాన్.అయితే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో మాత్రం అతడు ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో విశ్రాంతి తీసుకున్న రోహిత్.. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చాడు.కానీ ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 12 బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ సాయంతో 11 పరుగులు మాత్రమే చేసి.. సునిల్ నరైన్ బౌలింగ్‌లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఆందోళనలో అభిమానులుఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై సందేహాలు తలెత్తాయి. అసలే టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో కెప్టెన్ సాబ్‌కు ఏమైందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. క్లారిటీ ఇచ్చిన చావ్లాఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘రోహిత్ తేలికపాటి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది’’ అని రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపడానికి గల కారణం వెల్లడించాడు.అదే విధంగా.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస వైఫల్యాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పేరు, ప్రఖ్యాతుల కోసం బరిలోకి దిగినపుడు.. పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధిస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. జట్టు ప్రయోజనాల కోసం ఆడటమే ఆటగాళ్ల ప్రథమ కర్తవ్యం’’ అని పీయూశ్ చావ్లా చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ముంబై ఎనిమిది ఓడిపోయింది.ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు.. ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇటు కెప్టెన్‌గా.. అటు ఆల్‌రౌండర్ పాండ్యా విఫలమవుతున్నా బీసీసీఐ అతడిపై నమ్మకం ఉంచింది. గతేడాది అక్టోబరు తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా.. ఐసీసీ టోర్నీలో ఏకంగా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. -
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అనుసరించిన వ్యూహాలను భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా అంటూ మేనేజ్మెంట్కు చురకలు అంటించాడు.ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా కేకేఆర్‌తో తలపడిన ముంబై ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో 24 పరుగుల తేడాతో ఓటమి ఈ సీజన్లో ఎనిమిదో పరాజయాన్ని నమోదు చేసింది.ఛేదనలో తడ‘బ్యా’టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. కేకేఆర్‌ను 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ చేసి ఫర్వాలేదనిపించింది. కానీ లక్ష్య ఛేదనలో మాత్రం తడ‘బ్యాటు’కు గురైంది. 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది.టాపార్డర్ మొత్తం చేతులెత్తేయగా.. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56) ఒక్కడే రాణించాడు. మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇలాంటి తరుణంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(1) ఏడు, టిమ్ డేవిడ్(24) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. తర్వాత టెయిలెండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ముంబై కథ ముగిసింది.మరీ అంత చెత్తగా ఆడతారా?ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌ను ఎందుకు దాచిపెట్టిందో తెలియదు. అలా చేయడం వల్ల మీకు ఏం ప్రయోజనం చేకూరింది?ఇంకా బంతులు మిగిలే ఉన్నాయి. జట్టు మొత్తం ఆలౌట్ అయింది. నిజానికి హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపాల్సింది.కానీ ఛేజ్ చేస్తున్న సమయంలో వరుసగా వికెట్లు పడుతున్నా హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లను ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఎందుకు ఆడించారో అర్థం కాలేదు.లోయర్ ఆర్డర్లో వీళ్లు ఇంకాస్త ముందుగా వస్తే మరీ అంత చెత్తగా ఆడతారని అనుకున్నారా?’’ అని ముంబై మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఉన్నపుడు పాండ్యా నాలుగో స్థానంలో నిలకడగా రాణించిన విషయాన్ని సెహ్వాగ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.చదవండి: T20 WC: హార్దిక్ బదులు అతడిని సెలక్ట్ చేయాల్సింది: పాక్ దిగ్గజం -
హార్దిక్ బదులు అతడిని ఎంపిక చేయాల్సింది: పాక్ మాజీ స్టార్
టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన జట్టుపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. యశస్వి జైస్వాల్ వంటి యంగ్ స్టార్లకు చోటివ్వడం సరైన నిర్ణయమని.. అయితే, రింకూ సింగ్‌కు మాత్రం అనాయ్యం జరిగిందని పేర్కొన్నాడు.లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ ఆడగల రింకూను పక్కన పెట్టడం సరికాదని టీమిండియా సెలక్టర్ల తీరును కనేరియా విమర్శించాడు. హార్దిక్ పాండ్యా బదులు రింకూను జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.రింకూ సింగ్‌కు అనాయ్యంకాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలయ్యే ప్రపంచకప్‌నకు బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్‌లో రింకూ సింగ్‌కు స్థానం దక్కలేదు. రిజర్వ్ ప్లేయర్‌గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.వీళ్లంతా భేష్‌ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాట్లాడుతూ.. ‘‘నాణ్యమైన క్రికెటర్లను ఉత్పత్తి చేస్తుందనే పేరు భారత్‌కు ఉంది. ఇటీవలి కాలంలో దుమ్ములేపుతున్న యశస్వి జైస్వాల్, అంగ్క్రిష్ రఘువంశీ ఇందుకు చక్కని ఉదాహరణలు.మయాంక్ యాదవ్ సైతం తన పేస్ నైపుణ్యాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పాండ్యాకు ఎందుకు చోటిచ్చారు?రింకూ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఉండాల్సింది. నా అభిప్రాయం ప్రకారం.. ఐపీఎల్ ప్రదర్శనను గనుక పరిగణనలోకి తీసుకుంటే హార్దిక్ పాండ్యాను ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకుండా ఉండాల్సింది.ఇప్పటికే జట్టులో శివం దూబే ఉన్నాడు. అందుకే పాండ్యా బదులు రింకూను ఎంపిక చేస్తే డౌన్ ఆర్డర్లో శక్తిమంతమైన కూర్పు కుదిరి ఉండేది’’ అని స్పోర్ట్స్ నౌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.కాగా ప్రపంచకప్ ఈవెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, డానిష్ కనేరియా మాత్రం వైస్ కెప్టెన్‌నే పక్కనపెట్టాల్సిందని చెప్పడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు.. -
అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌కు ఉన్న అజేయ రికార్డు శుక్రవారం బద్దలైంది. సొంత మైదానం వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి ముంబై కేకేఆర్ ముందు తలవంచింది. శ్రేయస్ అయ్యర్ సేన చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.అంతేకాదు ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు.ఓటమికి కారణం అదే ‘‘మేము భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. టీ20లలో భాగస్వామ్యాలు నిర్మించలేకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.మా ఓటమికి కారణం ఒక్కటనీ చెప్పలేను. చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మా బౌలర్లు ఈరోజు అద్భుతంగా రాణించారు.నిజానికి తొలి ఇన్నింగ్స్ తర్వాత వికెట్ మరింత మెరుగైంది. తేమ కూడా ఉంది. అనుకున్న ఫలితం రాబట్టేందుకు మా వంతు కృషి చేశాం.సవాళ్లంటే ఇష్టంఏదేమైనా చివరి వరకు పోరాడుతూనే ఉండాలని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటా. కఠిన పరిస్థితులు ఎదురవ్వడం సహజం.సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే మనల్ని మనం మరింత మెరుగుపరచుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. కేకేఆర్ చేతిలో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.పూర్తిగా విఫలంకాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు(2/44) తీయగలిగాడు. అయితే, బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక కేకేఆర్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన(4/33)తో దుమ్ములేపాడు.ముంబై వర్సెస్ కేకేఆర్ స్కోర్లు👉టాస్: ముంబై.. తొలుత బౌలింగ్👉కేకేఆర్ స్కోరు: 169 (19.5)👉ముంబై స్కోరు: 145 (18.5)👉ఫలితం: ముంబైపై 24 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్- 52 బంతుల్లో 70 రన్స్)👉ముంబై ఇండియన్స్ టాప్ స్కోరర్: సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56 రన్స్)A memorable win for @KKRiders 🥳They wrap up a solid performance to get past the #MI challenge 💜 💪Scorecard ▶️ https://t.co/iWTqcAsT0O#TATAIPL | #MIvKKR pic.twitter.com/YT6MGSdPkj— IndianPremierLeague (@IPL) May 3, 2024 -
MI vs KKR : ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా విజయం (ఫొటోలు)
-
WC: ఒకవేళ రోహిత్ దూరమైతే: భారత మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా నైపుణ్యాలపై సందేహాలు అక్కర్లేదని.. కెప్టెన్‌గానూ జట్టును ముందుకు నడిపించగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు.ఒకవేళ రోహిత్ శర్మ ఏదేని కారణాల చేత ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లకు దూరమైతే.. సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని పాండ్యాకు సూచించాడు. ఐపీఎల్ వైఫల్యాలు మరిచి వరల్డ్‌కప్‌నకు రెడీగా ఉండాలని ఓజా చెప్పుకొచ్చాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. అప్పటి నుంచి భారత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయం నుంచి కోలుకుని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్-2024 బరిలో దిగాడు.అయితే, ఆశించిన స్థాయిలో రాణించకపోలేతున్న పాండ్యా కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలమవుతున్నాడు. అతడి సారథ్యంలో ముంబై ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు ఆడి కేవలం మూడే గెలిచిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ జట్టులో అతడికి స్థానమే ఇవ్వకూడదనే డిమాండ్లు వినిపించాయి. అయితే, బీసీసీఐ మాత్రం మెగా ఈవెంట్లో ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది.ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘అతడు నిజమైన నాయకుడిగా బరిలోకి దిగాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ రోహిత్‌కు ఏమైనా జరిగితే.. అలా జరగాలని మనం కోరుకోము.కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అతడు జట్టు దూరమైతే హార్దిక్ పాండ్యానే జట్టును ముందుకు నడిపించాలి కదా. కాబట్టి హార్దిక్ అందుకు అన్ని వేళలా సన్నద్ధంగా ఉండాలి.బ్యాటర్‌గానూ మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. నిజానికి అతడు ఉంటేనే జట్టు సమతూకంగా ఉంటుంది. టీమిండియా సెలక్షన్ గురించి ఎవరు మాట్లాడినా తొలుత హార్దిక్ పేరే గుర్తుకువస్తుంది.అవసరమైన వేళ అదనపు బ్యాటర్‌గా.. బౌలర్‌గా తను సేవలు అందించగలడు. ఐపీఎల్లో ఏం జరుగుతుందన్న విషయం గురించి పక్కనపెట్టి వరల్డ్‌కప్ పైన శ్రద్ధ పెట్టాలి. అవసరమైతే కెప్టెన్‌గానూ జట్టును ముందుకు నడిపించడానికి హార్దిక్ పాండ్యా సన్నద్ధంగా ఉండాలి’’ అని సూచించాడు.కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 1న మొదలుకానుంది. టీమిండియా జూన్ ఐదున తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది. -
చేజారిన కెప్టెన్సీ.. ఎట్టకేలకు మౌనం వీడిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ కెప్టెన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నియామకాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు రోహిత్ శర్మ అభిమానులు. రికార్డు స్థాయిలో ముంబైని ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిపిన హిట్‌మ్యాన్‌పై వేటు వేస్తూ ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నారు.స్టేడియంలో లోపలా.. వెలుపలా పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దిగుతున్నారు. హార్దిక్ పాండ్యాకు ప్రేక్షకుల నుంచి ఎదురవుతున్న చేదు అనుభవాలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో గురువారం నాటి మీడియా సమావేశంలో రోహిత్ శర్మ తొలిసారిగా ఈ విషయంపై స్పందించాడు.టీ20 ప్రపంచకప్-2024కు సంబంధించిన జట్టు గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి ముంబైలో రోహిత్ విలేకరులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోవడం గురించి ప్రశ్న ఎదురైంది.నాకు ఇదేమీ కొత్త కాదుఇందుకు బదులిస్తూ.. ‘‘జీవితంలో ఇదంతా భాగమే. అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు. ఏదేమైనా వేరొకరి(హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి) కెప్టెన్సీలో ఆడటం గొప్ప అనుభవం.ఇంతకు ముందు కూడా నేను చాలా మంది కెప్టెన్ల సారథ్యంలో ఆడాను. నాకు ఇదేమీ కొత్త కాదు. ఒక ఆటగాడిగా జట్టు కోసం ఏం చేయగలనో అది చేయడమే నాకు ముఖ్యం. గత నెల రోజులుగా నేను అదే పని చేస్తున్నాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కాగా గతంలో మహేంద్ర సింగ్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, ఆడం గిల్‌క్రిస్ట్(దక్కన్ చార్జర్స్), హర్భజన్ సింగ్(ముంబై ఇండియన్స్, రిక్కీ పాంటింగ్(ముంబై ఇండియన్స్) కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఆడిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా విఫలంఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్‌లో కలిపి రోహిత్ శర్మ 314 పరుగులు చేశాడు. ఇక ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా మాత్రం ఆకట్టులేకపోతున్నాడు. అతడి నాయకత్వంలో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం మూడింట మాత్రమే ముంబై గెలిచింది. అక్కడ రోల్ రివర్స్కాగా క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ తర్వాత వరల్డ్‌కప్ టోర్నీతో రోహిత్ శర్మ బిజీ కానున్నాడు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. తదుపరి జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ ఐసీసీ టోర్నీలో రోహిత్‌కు హార్దిక్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.చదవండి: T20 WC 2024: ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే? -
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
-
కోహ్లి, స్కై కంటే హార్దిక్ బెటర్: టీమిండియా మాజీ బ్యాటర్
టీమిండియా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మద్దతుగా నిలిచాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉన్న హార్దిక్ ప్రపంచకప్-2024లో కీలక పాత్ర పోషించగలడని జోస్యం చెప్పాడు.ఐసీసీ ఈవెంట్లలో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే ఎక్కువ ప్రభావం చూపగలడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన పాండ్యా ఇటు కెప్టెన్‌గా.. అటు ఆల్‌రౌండర్‌గా విఫలమవుతున్నాడు.అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఆడిన పది మ్యాచ్‌లలో మూడు మాత్రమే గెలిచింది. ఇక పేస్ ఆల్‌రౌండర్ పాండ్యా 197 పరుగులు స్కోరు చేయడంతో పాటు.. కేవలం ఆరు వికెట్లు పడగొట్టాడు. అది కూడా ధారాళంగా పరుగులు(ఎకానమీ 11) ఇచ్చి ఈ మాత్రం వికెట్లు తీశాడు.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు ఎంపిక చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన మహ్మద్ కైఫ్.. పాండ్యాకు అండగా నిలిచాడు.‘‘ఐసీసీ ఈవెంట్లలో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే ఎక్కువ ఇంపాక్ట్ చూపగలడని నేను భావిస్తున్నా. పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్‌ల సందర్భంగా ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది.మెల్బోర్న్లో కోహ్లి 82 పరుగులు చేసినపుడు.. హార్దిక్ పాండ్యా 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు మూడు వికెట్లు కూడా తీశాడు.ఆసియా కప్ టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫినిషింగ్ టచ్‌తో ఆకట్టుకున్నాడు. నవాజ్ బౌలింగ్‌లో ఆఖరి ఓవర్లో దుమ్ములేపాడు. దినేశ్ కార్తిక్, జడేజా అవుటైన తర్వాత పట్టుదలగా నిలబడి జట్టును గట్టెక్కించాడు’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో గుర్తుచేశాడు.మేజర్ ఈవెంట్లలో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుతో ఉండటం ఎంత అవసరమో ఈ ఉదాహరణల ద్వారా వివరించాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా వరల్డ్‌కప్ ఆరంభం కానుండగా.. టీమిండియా జూన్ 5న తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతంది. తదుపరి జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. -
వరుస ఓటములు ఎదుర్కొంటున్న హార్దిక్ సేనకు మరో బిగ్ షాక్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వరుస ఓటములు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. నిన్న (ఏప్రిల్ 30) లక్నోతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫీజ్‌లో 24 లక్షల కోత పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టు సభ్యులందరికి 6 లక్షల జరిమానా విధించారు. హార్దిక్ ఈ సీజన్లో రెండో సారి స్లో ఓవర్ రేట్‌కు కారుకుడు కావడంతో అతనికి భారీ జరిమానా పడింది.కాగా, లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. లక్నో బౌలర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది.ఇషాన్ కిషన్ (32), నేహల్ వధేరా (46), టిమ్ డేవిడ్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ (4), సూర్యకుమార్ (10), తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్యా (0), మొహమ్మద్ నబీ (1) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మొహిసిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. ఆపసోపాలు పడి 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్టోయినిస్ (62) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి లక్నోను గెలిపించాడు. రాహుల్ (28), దీపక్ హూడా (18), పూరన్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, గెరాల్డ్ కొయెట్జీ, నబీ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు కాగా.. లక్నో ఈ సీజన్ ఆరో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. -
T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
ఐపీఎల్-2024 తర్వాత పొట్టి క్రికెట్ మజాను మరింత పెంచేందుకు వరల్డ్‌కప్ రూపంలో మెగా ఈవెంట్ ముందుకు రానుంది. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది.ఇందుకోసం జట్లను ప్రకటించేందుకు మే 1 వరకు సమయం ఇచ్చింది ఐసీసీ. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.వికెట్ కీపర్ కోటాలోతన జట్టులో టాపార్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌లకు చోటిచ్చిన జాఫర్.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు స్థానం కల్పించాడు. కేఎల్ రాహుల్‌కు మాత్రం మొండిచేయి చూపాడు.ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజాలను ఎంచుకున్న వసీం జాఫర్.. నయా ఫినిషర్ రింకూ సింగ్‌ను కూడా ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు ఈ టీమిండియా మాజీ క్రికెటర్ చోటిచ్చాడు. కాగా ప్రపంచకప్ ఈవెంట్లో జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2024కువసీం జాఫర్ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.