Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

ఏపీ అసెంబ్లీ గేటు వద్ద వైఎస్సార్‌సీపీ సభ్యులను అడ్డుకుంటున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్‌ జగన్‌
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కూటమి సర్కారు హత్యా రాజకీయాలపై శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నిగ్గదీసింది. ప్రజాస్వామ్యాన్ని పరిర­క్షించాలని సోమవారం అసెంబ్లీ వేదిక నిరసన గళం విప్పింది. ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం­లో శాంతి భద్రతలు క్షీణించాయని ధ్వజమెత్తింది. దౌర్జ­న్యాలు, హత్యా రాజకీయాలు నశించాలని ఎలుగె­త్తింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో యథే­చ్ఛ­గా జరుగుతున్న హత్యలు, అత్యాచా­రాలు, హింసాత్మక ఘట­నలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ­లు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దారుణ వైఫల్యానికి నిరసనగా మెడలో నల్ల కండువాలు ధరించి ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజర­య్యా­రు. టీడీపీ మూకల హింసకు నిరసనగా ప్లకార్డు­ల­ను ప్రదర్శిస్తూ ర్యాలీగా ఉదయం అసెంబ్లీలోకి ప్రవేశించారు. హత్యా రాజకీయాలకు నిరసనగా వాకౌట్‌ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్న క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి స్థానాల్లో నిలుచుని ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని, సేవ్‌ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరి నిరసనల మధ్యనే గవర్నర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లారు. పోడియం ముందు ఫ్లోర్‌ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ హత్యా రాజకీయాలకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేశారు.నల్ల కండువాలు ధరించి వైఎస్సార్‌సీపీ సభ్యులతో కలిసి అసెంబ్లీకి ర్యాలీగా వస్తున్న వైఎస్‌ జగన్‌ రెడ్‌ బుక్‌దే రాజ్యం..వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శించిన ప్లకార్డులు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులకు అద్దం పట్టాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కూల్చివేతలు, హత్యలు, అత్యాచారాలు, వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తుల విధ్వంసం తదితర హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఫోటోలను ప్లకార్డుల్లో ప్రదర్శించారు. వినుకొండలో నడి రోడ్డుమీద వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీకి చెందిన జిలానీ కిరాతకంగా హత్య చేసిన ఘటనకు సీఎం చంద్రబాబుదే బాధ్యతని ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగం కనిపించడం లేదని, రెడ్‌ బుక్‌ రాజ్యమేలుతోందని నినదించారు.వైఎస్సార్‌సీపీ సభ్యులతో కలిసి సభ నుంచి వాకౌట్‌ చేసి వెళుతున్న జగన్‌ పోలీసుల అతిపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహంవైఎస్సార్‌సీపీ సభ్యుల చేతిలోని ప్లకార్డులు చించివేయడంపై ఫైర్‌శాసనసభ గేటు వద్ద సోమవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకుని పోలీసులు ప్లకార్డులు లాక్కుని చించివేయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలని అడ్డుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ప్లకార్డులు లాక్కుని చించేసే అధికారం ఎవరు ఇచ్చారు? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, శాంతి భద్రతలు మచ్చుకైనా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. చట్టప్రకారం పని చేసి శాంతి భద్రతలను పరిరక్షించాలని పోలీసులకు సూచించారు. వైఎస్సార్‌సీపీ సభ్యుల చేతిలోని ప్ల కార్డులు లాక్కుని చించివేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న వైఎస్‌ జగన్‌ పోలీసుల జులుం ఎల్లకాలం చెల్లబోదని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ‘మీ టోపీపై మూడు సింహాలు ఉన్నది అధికారంలో ఉన్న వారికి సెల్యూట్‌ కొట్టడానికి కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి..’ అని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ప్లకార్డులు లాక్కుని చించి వేసిన పోలీసు అధికారినుద్దేశించి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఇంతలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించే సమయం ఆసన్నమవడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులను అసెంబ్లీ ప్రాంగణంలోకి పోలీసులు అనుమతించారు. చివరిలో వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగిస్తున్న హత్యా రాజకీయాలు, అరాచకపాలన, దారుణకాండను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులతో కలిసి మెడలో నల్లకండువా ధరించి అసెంబ్లీ వరకూ వైఎస్‌ జగన్‌ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను వినుకొండలో నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్త హత్య చేసిన ఫోటోలతోపాటు రాష్ట్రంలో టీడీపీ కూటమి అరాచకాలను ప్రతిబింబించే ఫోటోలతో ప్లకార్డులను ప్రదర్శించారు. ‘సేవ్‌ డెమోక్రసీ.. హత్యా రాజకీయాలు నశించాలి.. వియ్‌ వాంట్‌ జస్టిస్‌’ అని నినాదాలు చేస్తూ ర్యాలీగా అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు.వైఎస్సార్‌సీపీ గొంతు నొక్కే ప్రయత్నంరాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫల­మ­య్యాయి. చంద్రబాబు నేతృత్వంలోని కూట­మి ప్రభుత్వంలో రోజుకోహత్య, అత్యాచా­రం జరు­గుతున్నాయి. చంద్రబాబు పథకాలు అమలు చేయలేకే.. ప్రశ్ని­స్తున్న వైఎస్సార్‌సీపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలతో కలసి పోరాటం చేస్తాం. – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ హోం మంత్రి అనిత ఏంచేస్తున్నారు? రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారు. ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఎనిమిదేళ్ల చిన్నారిని రేప్‌చేసి చంపితే.. హోంమంత్రిగా ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత లేదా? దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ కనీసం స్పందించకపోవడం బాధాకరం. – తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బ్లడ్‌గేమ్‌ ఆడుతున్న చంద్రబాబు శాంతిభద్రతల గురించి మాట్లాడితే హోం మంత్రి అనిత లాఠీలు, గన్నులు పట్టుకుని తిరగాలా? అని అడుగుతున్నారు. అలా తిరగాల్సిన పనిలేదు. అవి పట్టుకుని తిరుగుతున్న పోలీసులకు స్వేచ్ఛనిచ్చి, వారిపని వారు చేసుకునే అవకాశం ఇవ్వాలి.చంద్రబాబు బ్లడ్‌గేమ్‌ ఆడుతున్నారు. – డి.సి.గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ గవర్నర్‌ స్పందించకపోతే ఎలా?కూటమి పాలనలో హత్యలు, హత్యాయత్నాలు, దాడుల గురించి ఆదివారం గవర్నర్‌కు వైఎస్‌ జగన్‌ వివరించారు. కానీ అసెంబ్లీ ప్రసంగంలో గవర్నర్‌ కనీసం ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు. గవర్నర్‌ స్పందించకపోతే ఎలా? ఇంకెవరికి చెప్పుకోవాలి. – చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్సీ రాష్ట్రంలో అరాచక, ఆటవికపాలనవైఎస్సార్‌సీపీని అణగదొక్కడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ నెల రోజుల పాలనలో అదే జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఎన్నికల తరవాత అంతులేని దారుణాలు జరిగాయి. కేంద్ర సంస్థలతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. – బొమ్మి ఇజ్రాయేల్, ఎమ్మెల్సీ శాంతిస్థాపనకు గవర్నర్‌ చొరవ చూపాలిగవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌ సత్వరమే జోక్యం చేసుకుని రాష్ట్రంలో అరాచకాలను అంతమొందించాలి. తక్షణమే శాంతి స్థాపనకు చొరవ చూపాలి. లేకపోతే రాష్ట్రంలో ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, ఓటు వేసినవారు జీవించలేని పరిస్థితి నెలకొంటుంది. – మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ ఓటు వేయని వారే లక్ష్యంగా దాడులు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఆ వెంటనే.. ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను వేధించడమే పనిగా పెట్టుకుంది. గవర్నర్, ప్రధాని, కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకుని వీటిని ఆపాలి. – పోతుల సునీత, ఎమ్మెల్సీ ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు, దౌర్జన్యాలు లోకేశ్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే కేవలం మా పార్టీ నాయ­కు­లు, కార్యకర్తల ఇళ్లు, ఆస్తులు, వ్యాపార సంస్థలపై మాత్రమే కాకుండా.. చివరకు ప్రభుత్వ ఆస్తులపై­నా దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. – సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ రక్షణ లేకుండా పోయింది వైఎస్సార్‌సీపీ తరఫున పార్లమెంటు, శాసనసభ­లకు ఎన్నికైనవారికి, పోటీచేసిన వారికి రక్షణ లేకుండా పోయింది. పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డెప్పని పరామర్శించడానికి వెళ్లిన మా పార్టీ లోక్‌సభాపక్ష నాయకుడు, ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నం చేశాయి. – సానేపల్లి మంగమ్మ, ఎమ్మెల్సీ మంత్రులకు బుర్ర పనిచేయడంలేదు నెలన్నర కాలంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దాడులు, ఆస్తుల ధ్వంసం, హత్యలు, మానభంగాలు, లాకప్‌­డెత్‌లు, ఆత్మహత్యలు తప్ప ఏమీ కనిపించడంలేదు. అసమర్థ పాలన వల్ల ప్రజల్లో అప్పుడే చెడ్డపేరు మూటగట్టుకున్నారు. అందుకే మంత్రులంతా మతితప్పి మాట్లాడుతున్నారు. మంత్రులకు బుర్ర పనిచేయటం లేదు. – దాసరి సుధ, ఎమ్మెల్యే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కనిపించడం లేదు. రాజ్యాంగం, చట్టం, పోలీసువ్యవస్థ.. అన్నీ నిర్వీర్యమయ్యాయి. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం 45 రోజులుగా ఇక్కడ పనిచేస్తోంది. – బి.విరూపాక్షి, ఎమ్మెల్యే యంత్రాంగాన్ని రాజకీయమయం చేశారు వివక్ష లేకుండా ప్రజలందరి ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించాల్సింది పోయి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా రాజకీయ­మయం చేశారు. హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు. – మత్స్యరస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే పథకం ప్రకారం చేస్తున్న దుర్మార్గాలురాష్ట్రంలో నెలన్నర రోజులుగా పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీని అణగదొక్కడానికి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఉండకూడదన్న లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నారు. వాటిని అడ్డుకోవద్దని అధికారులను నిర్దేశించారు. దీంతో టీడీపీ గూండాలు రెచ్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు. – రేగం మత్స్యలింగం, ఎమ్మెల్యే

Budget 2024: Nirmala Sitharaman to present Modi 3. 0 government first budget
Union Budget 2024-25: బడ్జెట్‌ మథనంలో అమృతం చిలికేనా!

అమృతకాల బడ్జెట్‌గా మోదీ అభివర్ణిస్తున్న కేంద్ర బడ్జెట్‌–2024 అన్ని వర్గాల ఆశలపైనా నిజంగానే అమృతం చిలికిస్తుందా? పన్ను వాతలు, ఎడాపెడా కోతలతో ఖేదమే మిగులుస్తుందా? 2047కల్లా వికసిత భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా పడుతున్న బలమైన పునాదిగా ప్రధాని చెప్పుకున్న ఈ బడ్జెట్లో మధ్యతరగతిని ఎంతో కొంత మురిపిస్తారా? ముఖ్యంగా ఐటీ మినహాయింపులు పెంచి వేతన జీవులకు కాస్తయినా ఉపశమనం కలిగిస్తారా? కేవలం ప్రగతి పరుగులకే మరింత ఊపునిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొద్ది గంటల్లో జవాబులు లభించనున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలకు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్‌ కావడం విశేషం. మోదీ 3.0 సర్కారు తొలి బడ్జెట్‌ నుంచి ఏ రంగాలు ఏం ఆశిస్తున్నాయంటే... ఐటీ ఊరట.. ఈసారైనా...! ఆదాయ పన్ను చెల్లించే మధ్య తరగతి, వేతన జీవులు ఈ బడ్జెట్లోనన్నా ఎంతో కొంత ఊరట దక్కుతుందని ఆశిస్తున్నారు. ఐటీ శ్లాబులను సవరించాలన్నది వారి ప్రధాన డిమాండ్‌. ఓటాన్‌ అకౌంట్లో నిర్మల దీని జోలికి పోలేదు. నూతన పన్ను విధానంలో పన్ను మినహాయింపును ప్రస్తుత రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని అంచనాలున్నాయి. తద్వారా వేతన జీవుల చేతిలో మరిన్ని డబ్బులు ఆడతాయని, వారి కొనుగోలు సామర్థ్యం పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింతగా కళకళలాడుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలామంది పాత పన్ను విధానానికే మొగ్గుతున్నందున వారిని కొత్త విధానానికి మారేలా ప్రోత్సహించేందుకు మరిన్ని పన్ను మినహాయింపులకు చోటు దక్కవచ్చని అంచనా. 80సీ కింద మినహాయింపు మొత్తం రూ.1.5 లక్షలను 2014 నుంచీ పెంచలేదు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఇంటి రుణాలు, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్‌ పథకాల వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి. 80సీ తో పాటు స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిధిని కూడా పెంచాలన్న డిమాండ్‌ ఎప్పట్నుంచో ఉంది. అది నెరవేరితే రియల్టీ పరిశ్రమకు కూడా మరింత ఊపు వస్తుంది. రియల్టీ డేటా సెంటర్లతో పాటు రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టు (ఆర్‌ఈఐటీ)లకు పలు తాయిలాలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడమే గాక ఉద్యోగావకాశాల సృష్టికి ఇదెంతో దోహదపడుతుందన్నది రియల్టీ పరిశ్రమ ముఖ్యుల అభిప్రాయం. రియల్టర్లకు నగదు అందుబాటును పెంచేందుకు ఆర్‌ఈఐటీలను ఈక్విటీ ఇన్‌స్ట్రుమెంట్లుగా పరిగణించే అవకాశం ఉందంటున్నారు. ఈ రంగానికి జీఎస్టీ చట్టం కింద ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను అనుమతించాలన్న ఆర్‌ఈఐటీ సంఘం డిమాండ్‌ ఏ మేరకు నెరవేరుతుందన్నదీ ఆసక్తికరమే. ఈవీలపై ఏం చేస్తారో...ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) జోరు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశ్రమకు మరింతగా ప్రోత్సాహకాలను అందించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈవీలకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల పథకం తెస్తే బాగుంటుందన్న అభిప్రాయముంది. అన్నిరకాల ఈవీ వాహనాల తయారీ పూర్తిగా భారత్‌లోనే జరిగేందుకు అనువైన వాతావరణాన్ని కలి్పంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అలాగే ఆటో విడి భాగాలన్నింటిపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో పాటు పలు రకాలైన మినహాయింపులను ఆశిస్తున్నాయి. ఈవీ రంగంలో స్టార్టప్‌లకు దన్నుగా నిలిచే దిశగా చర్యలు ఉండవచ్చంటున్నారు. తుక్కు విధానాన్ని కూడా మరింతగా సరళీకరిస్తారేమో చూడాల్సి ఉంది. ఫార్మా కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో మరింత కీలకంగా మారిన ఫార్మా రంగానికి పలు ప్రోత్సాహకాలు నిర్మల బడ్జెట్లో చోటుచేసుకునే అవకాశముంది. ముఖ్యంగా పరిశోధన, ఇన్నొవేషన్‌ కార్యక్రమాలను ప్రోత్సహించే చర్యలు ఉండవచ్చంటున్నారు. ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉన్న పలురకాల అనుమతుల ప్రక్రియలను మరింత సరళతరం చేయవచ్చని చెబుతున్నారు. కీలకమైన ఔఫధాల తయారీ తదితరాలకు ఆర్థిక ప్రోత్సాహకాలకు సంబంధించిన ప్రకటనపై కూడా ఫార్మా దిగ్గజాలు ఆశలు పెట్టుకున్నాయి. ‘స్వదేశీ’ రక్షణ! అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, చైనా దూకుడు తదితర నేపథ్యంలో రక్షణ రంగానికి కేటాయింపులను ఈసారి కూడా ఇతోధికంగా పెంచడం ఖాయంగా కని్పస్తోంది. అదే సమయంలో రక్షణ సంబంధిత ఉత్పత్తి, మౌలిక సదుపాయాల పరిశ్రమల్లో ‘ఆత్మ నిర్భరత’కు మరింత పెద్దపీట వేసేలా మరిన్ని చర్యలు ఉండనున్నాయి. ఇది ఆర్థిక రంగానికి మరింత ఊపునివ్వడమే గాక అపారమైన ఉపాధి అవకాశాలను కలి్పస్తుందని, అంతిమంగా ప్రజల జీవన నాణ్యతనూ పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

YS Jagan Mohan Reddy Comments on Chandrababu Naidu
హామీలపై నిలదీస్తారనే పూర్తిస్థాయి బడ్జెట్‌పై ‘భయం’

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి సర్కారు పాలనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అడుగడుగునా భయంతో సీఎం చంద్రబాబు విలవిలలాడిపోతున్నారని చెప్పారు. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి, ప్రజల్లో భయోత్పాతం సృష్టించేందుకు హింసాకాండను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని చెప్పారు.ప్రజల దృష్టి మళ్లించేందుకు అరాచకాలను ప్రోత్సహిస్తూ భయానక వాతావరణాన్ని కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించేలా కనపడటం లేదన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’లో వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే..హామీలపై నిలదీస్తారనే భయంతో...కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నిటా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోంది. ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోందంటే.. ఈ ఏడాది కనీసం పూర్తి స్థాయి బడ్టెట్‌ కూడా ప్రవేశపెట్టలేకపోతోంది. దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం ఏడాదిలో 7 నెలలు ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌ మీదే నడుస్తుందంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందో అర్థమవుతోంది. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసి మభ్యపుచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.అందుకే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారంటే.. పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే ఆ హామీలను అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుందన్న భయం నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత హామీలను అమలు చేయని పరిస్థితిలో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయం ఆయన్ను ఆవరించింది. అందుకే ప్రజల దృష్టిని మళ్లించి అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితులు కల్పిస్తున్నారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం.. వీటన్నింటి ద్వారా ఎవరూ తనను ప్రశ్నించే సాహసం చేయకూడదనే పరిస్థితి సృష్టిస్తున్నారు. అసెంబ్లీలో హక్కుగా మైక్‌ ఇస్తే..ప్రస్తుతం అసెంబ్లీలో రెండే పక్షాలున్నాయి. ఒకటి అధికార పక్షం. మరొకటి ప్రతిపక్షం. ప్రతిపక్షంగా ఒకే పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీనే విపక్షంగా గుర్తించాలి. ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. అయితే ఆ పని చేస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయంతో చంద్రబాబు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను చట్టబద్ధంగా గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీలో హక్కుగా మైక్‌ ఇస్తే ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్షనేత ఎండగడతారని, వారి నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదు. ఢిల్లీ వేదికగా అరాచకాలను ఎండగడతాం..ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నా చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నాడు. అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబునాయుడి పాపాలు కూడా వేగంగా పండే రోజు దగ్గర్లోనే ఉంది. నాతోపాటు మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఢిల్లీ వేదికగా ఈ అరాచకాలను ఎండగడతాం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని 24వ తేదీన ఫోటో గ్యాలరీ, నిరసన కార్యక్రమాల ద్వారా వివిధ పార్టీ నాయకుల దృష్టికి, దేశం దృష్టికి తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరాన్ని, పరిస్థితులను వివరిస్తాం. ఈ కార్యక్రమంలో మాతో కలసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని పోరాటం కొనసాగిస్తాం.

Daily Horoscope On July 23 2024 In Telugu
Today Horoscope: ఈ రాశి వారికి వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారవచ్చు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి: బ.విదియ ప.12.51 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ధనిష్ఠ రా.11.46 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.13 నుండి 9.05 వరకు,తదుపరి రా.10.59 నుండి 11.43 వరకు, అమృతఘడియలు: ప.1.54 నుండి 3.24 వరకు. మేషం....పరిచయాలు పెరుగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.వృషభం...కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు.మిథునం....రుణాలు సైతం చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.కర్కాటకం...మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు.సింహం...నూతన ఉద్యోగప్రాప్తి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది.కన్య...కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూరతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరించే యత్నాలు సఫలం. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు.తుల....ఇంటాబయటా వ్యతిరేకత. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆథ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగానే ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.వృశ్చికం..వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు.ధనుస్సు.....పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.మకరం......ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.కుంభం... వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.మీనం...వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు అనివార్యం కావచ్చు.

Union Budget 2024-25: Finance Minister Nirmala Sitharaman presents Economic Survey 2023-24
Union Budget 2024-25: ఉపాధికి ఊతం.. ధరలకు కళ్లెం!

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో వృద్ధి రేటు అంచనాలను ప్రభుత్వం అచితూచి నిర్ధేశించింది. స్థూలదేశీయోత్తత్తి (జీడీపీ) వృద్ధి 6.5–7 శాతం స్థాయిలో ఉండొచ్చని ఆర్థిక సర్వేలో లెక్కగట్టింది. ఉపాధి కల్పనను పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కిచెప్పింది. ధరాభారంతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీ లేదా కూపన్ల రూపంలో నిర్ధిష్టంగా ఆర్థిక తోడ్పాటు కల్పించాల్సిఇన అవసరం ఉందని కూడా సర్వే సూచించింది. దేశంలో తయారీ రంగానికి తోడ్పాటు అందించడంతో పాటు ఎగుమతులను పెంచాలంటే చైనా నుంచి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, గతేడాది (2023–24) 8.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే, ఈ ఏడాది వృద్ధి రేటు అంచనాలు చాలా తక్కువగా ఉండటం విశేషం. ఆర్‌బీఐ నిర్దేశించిన 7.2 శాతం వృద్ధి రేటు అంచనాలతో పోలి్చనా సర్వేలో వృద్ధి అంచనా తగ్గింది. అనిశి్చత వర్షపాతం, ప్రైవేటు రంగంలో పెట్టుబడుల మందగమనం వంటివి వృద్ధి అంచనాల తగ్గుదలకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది. ‘భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి బాటలో పయనిస్తోంది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ సవాళ్లన్నింటినీ దీటుగా ఎదుర్కొంటోంది’ అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ సర్వే ముందుమాటలో పేర్కొన్నారు. కాగా, నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా మధ్యకాలం పాటు నిలకడగా 7% వృద్ధి రేటు కొనసాగవచ్చని సర్వే తేల్చిచెప్పింది.కార్మిక సంస్కరణలు వేగవంతం... కేంద్రంలో వరుసగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కారు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడులను పెంచడం, చిన్న–మధ్య తరహా వ్యాపారాలకు చేయూతనందించడం, సాగును లాభసాటిగా మార్చేలా వ్యవసాయ సంస్కరణలు, వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు వనరుల సమీకరణ, ఆర్థిక అసమానాతలను తగ్గించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చాలని కూడా సర్వే నొక్కిచెప్పింది. దేశంలో ఉద్యోగ కల్పనకు మరింత సానుకూల వాతావరణాన్ని సృష్టించాలంటే కార్మిక సంస్కరణల అమలును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది. ‘దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సి ఉంటుంది’ అని సర్వే తెలిపింది. చైనా పెట్టుబడులు పెరగాలి... భారత్‌ ఎగుమతులు, దేశీ తయారీ రంగం మరింత పుంజుకోవాలంటే, చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరగాలని, లేదంటే చైనా సరఫరా వ్యవస్థతో భారత్‌ అనుసంధానం కావాల్సి ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. మరోపక్క, చైనా నుంచి దేశంలోకి దిగుమతులు తగ్గాలని కూడా పేర్కొంది. ‘అమెరికా తదితర కీలక మార్కెట్లకు భారత్‌ ఎగుమతులు భారీగా పెరగాలంటే చైనా పెట్టుబడులపై మనం మరింత దృష్టి సారించాలి. తూర్పు ఆసియా దేశాలు గతంలో ఇదే విధంగా లబ్ధి పొందాయి’ అని సర్వే తెలిపింది. 2020లో గాల్వాన్‌లో చోటు చేసుకున్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా భారత్‌ టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో సహా 200 చైనా మొబైల్‌ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చైనా ఎలక్ట్రిక్‌ వాహన దిగ్గజం బీవైడీ భారీ పెట్టుబడి ప్రతిపాదనలను కూడా తిరస్కరించింది. 2000–2024 మధ్య భారత్‌ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐలలో చైనా కేవలం 0.37% (2.5 బిలియన్‌ డాలర్లు) వాటాతో 22 స్థానంలో ఉంది. కాగా, కీలక ఖనిజాల విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సర్వే స్పష్టం చేసింది.పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీవడ్డీరేట్ల నిర్ణయంలో ఆహార ధరలను పక్కనబెట్టండి... ఆర్‌బీఐకి సర్వే సూచన వడ్డీ రేట్లను నిర్ణయించడంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడటం మానేయాలని ఆర్థిక సర్వే సూచించింది. అధిక ఆహార ధరలను ఎదుర్కోవటానికి పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రభుత్వం అన్వేíÙంచాలని సర్వే పేర్కొంది. ‘‘భారతదేశ ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్‌వర్క్‌.. ఫుడ్‌ ఆరి్టకల్స్‌ను పక్కనబెట్టాలి. అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాలకు సంబంధించిన సమస్యే తప్ప, డిమాండ్‌ ప్రేరితం కాదు’’ అని ఆర్థిక సర్వే పేర్కొంది. మధ్య, దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం అవుట్‌లుక్‌ ధరల యంత్రాంగం పటిష్టత, మార్కెట్‌ అంశాలు, నిత్యావసారాల దేశీయ ఉత్పత్తి, దిగుమతులు వంటి అంశాలపై ఆధారపడుతుందని వివరించింది. అననుకూల వాతావరణం, తక్కువ రిజర్వాయర్‌ స్థాయిలు, పంట నష్టం వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసి, గత రెండేళ్లలో ఆహార ధరలను పెంచడానికి దారితీసిందని కూడా సర్వే పేర్కొంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ఆర్‌బీఐ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణంపై ఆధారపడే సంగతి తెలిసిందే. ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2తో ఇది 4 శాతంగా ఉండాలే చూడాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్ధేశిస్తోంది. ఈ సూచీలో ఫుడ్‌ ఆరి్టకల్స్‌ ఒక భాగం. రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యాన్ని సాధించడంలో ఆహార ధరలు ఒడిదుడుకులు తీవ్ర అడ్డంకిగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్‌బీఐ 2023 ఫిబ్రవరి నుంచి యథాతథ వడ్డీరేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిని పక్కనపెట్టి... రుణ రేట్లను తగ్గిస్తే ఆ నిర్ణయం వృద్ధికి దోహదపడుతుందన్నది సర్వే అభిప్రాయం. ప్రయివేట్‌ రంగ పెట్టుబడులు కీలకం ప్రయివేట్‌ రంగ ఫైనాన్సింగ్, కొత్త వర్గాల నుంచి వనరుల సమీకరణ దేశీయంగా నాణ్యమైన మౌలిక సదుపాయాల(ఇన్‌ఫ్రా) నిర్మాణానికి కీలకమని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పాలసీలు, సంస్థాగత మద్దతుతోపాటు.. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు సైతం ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. మౌలిక రంగంలోని వివిధ విభాగాలకు పెట్టుబడులు సమకూర్చడంలో గణాంకాలు, మార్గదర్శకాలు తదితర నివేదికలు అత్యవసరం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కున్న డిమాండ్‌ను అంచనా వేయడం, ఉపవిభాగాల కల్పనలో సౌకర్యాల వినియోగం వంటి అంశాలకు ప్రస్తుత డేటాబేస్‌ సామర్థ్యం సరిపోదు. ఆర్థికపరమైన ఒత్తిడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకీకృత ప్రణాళికల నేపథ్యంలో ఆచరణసాధ్యమైన ప్రాజెక్టులను చేపట్టి పూర్తిచేయవలసి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యం కీలకమవుతుంది.రైల్వేల సామర్థ్యం పెరగాలి.. సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం, కార్యకలాపాలను ఆధునీకరించుకోవడం, ఇంధన ఆదా తదితర అంశాలపై రైల్వేస్‌ ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎకనమిక్‌ సర్వే సూచించింది. ఇందుకు అనుగుణంగా సరకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్లు, హై స్పీడ్‌ రైళ్లు, వందే భారత్‌.. అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ .. ఆస్థా స్పెషల్‌ ట్రెయిన్స్‌ వంటి ఆధునిక ప్యాసింజర్‌ సరీ్వస్‌ రైళ్లు, అధిక సామర్థ్యం ఉండే రైల్వే కోచ్‌లు, లాస్ట్‌–మైల్‌ రైల్‌ లింకేజీలు మొదలైన వాటిపై ఇన్వెస్ట్‌ చేయాలని పేర్కొంది. లాజిస్టిక్స్‌ వ్యయాలను, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రైల్వేస్‌ 3 ప్రధాన కారిడార్ల రూపకల్పనలో ఉందని వివరించింది. ట్రాఫిక్‌ సాంద్రత అధికంగా ఉండే కారిడార్లు, ఇంధన.. ఖనిజ.. సిమెంట్‌ కారిడార్లు, రైల్‌ సాగర్‌ (పోర్టు కనెక్టివిటీ) కారిడార్లు వీటిలో ఉన్నాయని పేర్కొంది.పర్యాటక రంగంలో అవకాశాలు అపారం..పర్యాటక రంగం కలి్పస్తున్న అవకాశాలను సొంతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది. కరోనా విపత్తు తర్వాత పర్యాటక రంగం వేగంగా కోలుకోవడాన్ని ప్రస్తావించింది. ‘2023లో 92 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించారు. క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 43.5 శాతం ఎక్కువ. భారత పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచంలో 39వ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. పర్యాటకం ద్వారా రూ. 2.3 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది. ఇది క్రితం ఏడాదితో పోలి్చతే 65.7% అధికం’అని సర్వే తెలిపింది. కృత్రిమ మేథ (ఏఐ) భారత సేవల ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందన్న ‘క్యాపిటల్‌ ఎకనమిక్స్‌’ నివేదికను ప్రస్తావిస్తూ.. ఉపాధి కల్పన విషయంలో తక్కువ నైపుణ్యాలపై ఆధారపడిన పర్యాటకం ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తోందని పేర్కొంది. వృద్ధిలో క్యాపిటల్‌ మార్కెట్లు కీలకందేశీ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో క్యాపిటల్‌ మార్కెట్లు కీలకంగా మారుతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. టెక్నాలజీ, ఇన్నొవేషన్, డిజిటైజేషన్‌ దన్నుతో మూలధన నిర్మాణం, పెట్టుబడుల విస్తరణలో క్యాపిటల్‌ మార్కెట్ల వాటా బలపడుతోంది. అంతేకాకుండా దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ రిసు్కలు, వడ్డీ రేట్లుసహా కమోడిటీ ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలోనూ దేశీ క్యాపిటల్‌ మార్కెట్లు గతేడాది(2023–24) ఉత్తమ పనితీరు చూపిన వర్ధమాన మార్కెట్లలో ఒకటిగా నిలిచాయి. ఈ కాలంలో బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇన్వెస్టర్లకు భారీ(25%కిపైగా) రిటర్నులు అందించాయి. ఇందుకు స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వం, దేశీ ఇన్వెస్టర్ల బలిమి తోడ్పాటునిచి్చనట్లు సీతారామన్‌ పేర్కొన్నారు. 2024 మే నెలలో ఈక్విటీ మార్కెట్ల విలువ 5 ట్రిలియన్‌ డాలర్ల(రూ. 415 లక్షల కోట్లు)కు చేరింది. ప్రస్తుతం 9.5 కోట్లమంది రిటైల్‌ ఇన్వెస్టర్లు ప్రత్యక్షంగా 2,500 లిస్టెడ్‌ కంపెనీలలో 10% వాటాను కలిగి ఉన్నారు. గతేడాది ప్రైమరీ మార్కెట్ల ద్వారా రూ. 10.9 లక్షల కోట్ల మూలధన ఏర్పాటుకు సహకారమందింది.వ్యవసాయంలో సత్వర సంస్కరణలు వ్యవసాయ రంగంలో సంస్కరణలను వెంటనే చేపట్టాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. లేదంటే ఈ రంగంలో నెలకొన్న వ్యవస్థీకృత సమస్యలు దేశ వృద్ధికి అడ్డుపడతాయని విధానకర్తలను హెచ్చరించింది. తూర్పు ఆసియా దేశాలు, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలతో పోలి్చతే.. దేశ వ్యవసాయరంగం సామర్థ్యాలను ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి తేవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు వ్యవసాయరంగ సామర్థ్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ రంగంపై దేశవ్యాప్తంగా చర్చలు అవసరమని నాగేశ్వరన్‌ పిలుపునిచ్చారు. ‘‘దేశ వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎలాంటి సంక్షోభంలో లేదు. కాకపోతే నిర్మాణాత్మక మార్పు అవసరం. ఎందుకంటే వాతావరణ మార్పులు, నీటి సమస్య రానున్న రోజుల్లో పెద్దవి కానున్నాయి’’అని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం రైతులకు ఎరువులు, విద్యుత్, ఆదాయపన్ను, మద్దతు ధరల పరంగా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ ప్రస్తుత విధానాలను తిరిగి సమీక్షించా లని అభిప్రాయపడింది. టెక్నాలజీ ఆధునికీకరణ, మార్కెటింగ్‌ మార్గాలను మెరుగుపరచడం, సాగులో ఆవిష్కరణలు, వ్యవసాయం–పరిశ్రమల మధ్య అనుసంధానత పెంపు దిశగా సంస్కరణలను సూచించింది. ఆర్థిక సర్వే హైలైట్స్‌..→ అసాధారణరీతిలో వరుసగా మూడోసారి ప్రజలు మోదీ 3.0 సర్కారుకు పట్టం కట్టడం దేశంలో రాజకీయపరమైన, విధానపరమైన స్థిరత్వాతనికి అద్దం పడుతోంది. → అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయ వృద్ధి చోదకాలు 2023–24లో ఆర్థిక పురోగతికి దన్నుగా నిలిచాయి. → భౌగోళిక, రాజకీయ సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన, స్థిరమైన ప్రగతిని సాధిస్తోంది. → కరోనా మహమ్మారి తదనంతరం దేశీయ వ్యాపార, వాణిజ్య రంగం రికవరీ కోసం ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంది. → వాణిజ్యం, పెట్టుబడులు, వాతావారణ మార్పుల వంటి ప్రపంచ సమస్యల విషయంలో వివిధ దేశాలతో ఒప్పందాలు క్లిష్టతరంగా మారాయి. → స్వల్పకాలానికి ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గుముఖ ధరోణిలోనే ఉన్నప్పటికీ, పప్పుధాన్యాల కొరత , ధరల ఒత్తిడి నిలకడగా కొనసాగుతోంది. → సాధారణ వర్షపాతం, దిగుమతులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ధరలు శాంతించడంతో ఆర్‌బీఐ సానుకూల ద్రవ్యోల్బణం అంచనాలకు దన్నుగా నిలుస్తోంది. → అధిక ఆహార ధరలతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీలు, నిర్దిష్ట కొనుగోళ్లకు కూపన్‌ల రూపంలో కొంతకాలం పాటు ప్రయోజనాలను అందించాలి. → భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానంపై ప్రభావం చూపొచ్చు. → భారతదేశ ఆర్థిక సేవల రంగం పటిష్టమైన అవకాశాలున్నాయి. ఈ రంగంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా, దేశీయంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. → కార్పొరేట్‌ కంపెనీలు, బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లు పటిష్టంగా ఉండటంతో ప్రైవేటు పెట్టుబడులు మరింత పుంజుకోనున్నాయి. → పన్ను నిబంధలనను సరళతరం చేయడం, వ్యయ నియంత్రణ, డిజిటైజేషన్‌ వంటివి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను సాధించేందుకు దోహదం చేస్తున్నాయి. → భారత వృద్ధి పథానికి క్యాపిటల్‌ మార్కెట్లు కీలకంగా నిలుస్తున్నాయి. ప్రపంచ రాజకీయ, ఆర్థిక షాక్‌లకు మన మార్కెట్లు ఎదురొడ్డి నిలుస్తున్నాయి. → చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జోరందుకోవడం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలు మెరుగుపరచడంలో, ఎగుమతులను పెంచుకోవడంలో భారత్‌కు దన్నుగా నిలుస్తుంది. → 2024లో దేశంలోకి వచి్చన రెమిటెన్సులు (ప్రవాసులు స్వదేశానికి పంపిన నిధులు) 3.4 శాతం వృద్ధితో 124 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఈ మొత్తం 129 బిలియన్‌ డాలర్లను తాకనుంది.గ్రీన్‌ ఎనర్జీ @ రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు దేశీయంగా 2024–2030 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన (ఆర్‌ఈ) రంగంలో రూ. 30.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందుకోసం స్థల సమీకరణ సమస్యలను పరిష్కరించుకోవడం, సానుకూల నిబంధనలతో నిధులను సమీకరించుకోవడం కీలకమని పేర్కొంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ లక్ష్యాలను సాధించే క్రమంలో వివిధ విభాగాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరగలదని వివరించింది. మరోవైపు, ఉద్గారాల విషయంలో 2070 నాటికి తటస్థ స్థాయికి చేరుకోవాలంటే భారత్‌కు ఏటా సగటున 28 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని సర్వే తెలిపింది. నిధులను సమకూర్చుకోవడమనేది ఒక అసాధారణ సవాలు కాగలదని వివరించింది.14 శాతం ఐఫోన్ల తయారీ ఇక్కడే ఎల్రక్టానిక్స్‌ తయారీలో అంతర్జాతీయంగా భారత్‌ తన వాటాను పెంచుకుంటున్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. 2023–24లో స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌ 14% ఐఫోన్లను భారత్‌లోనే అసెంబుల్‌ చేసినట్టు వెల్లడించింది. దేశ ఎలక్ట్రానిక్స్‌ తయారీ 2014 తర్వాత నుంచి గణనీయమైన వృద్ధిని చూస్తోందంటూ, 2021–22లో అంతర్జాతీయంగా మన వాటా 3.7%. దేశ జీడీపీలో 4% వాటాను ఆక్రమించింది. ఎల్రక్టానిక్స్‌ ఎగుమతుల్లో మొబైల్‌ ఫోన్ల విభాగం అధిక వృద్ధిని చూస్తోందని, అమెరికాకు మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు 2022–23లో 2.2 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2023–24లో 5.7 బిలియన్‌ డాలర్లకు దూసుకుపోయినట్టు వివరించింది. 2022–23లో దేశీయంగా ఎల్రక్టానిక్స్‌ తయారీ రూ.8.22 లక్షల కోట్లకు చేరితే, ఎగుమతులు రూ.1.9 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపింది.ఏటా 78 లక్షల కొలువులు సృష్టించాలి.. కార్మిక శక్తి పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయేతర రంగాల్లో 2030 నాటికి ఏటా దాదాపు 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ విషయంలో ప్రైవేట్‌ రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి అనేది ఉద్యోగాల కల్పన కన్నా జీవనోపాధి కల్పించడంపై ఆధారపడి ఉంటుందని సర్వే వివరించింది. వ్యవసాయ రంగంలో కార్మిక శక్తి 2023లో 45.8 శాతం స్థాయి నుంచి 2047 నాటికి 25 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఇదంతా వ్యవసాయేతర రంగాల వైపు మళ్లు తుంది కాబట్టి ఆ మేరకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడుతుందని సర్వే పేర్కొంది. పీఎల్‌ఐ స్కీములు, మిత్రా టెక్స్‌టైల్‌ స్కీము మొదలైనవి ఇందుకు కొంత తోడ్పడగలవని తెలిపింది. స్టాఫింగ్‌ కంపెనీల ద్వారా తాత్కాలిక సిబ్బంది నియామకాలు పెరుగుతున్నందున అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు దీన్నొక మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చని వివరించింది. తయారీ రంగ శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి సాధన దిశగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు వ్యాపారసంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పునఃసమీక్షించాలని సూచించింది. వర్కర్ల తొలగింపునకు కాకుండా ఉద్యోగాల కల్పనకు కృత్రిమ మేథ(ఏఐ)రెని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కార్పొరేట్లు మరింతగా దృష్టి పెట్టాలని ముందుమాటలో ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. వికసిత భారత్‌ వైపు పయనంవికసిత భారత్‌ను నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నందున ప్రస్తుత పటిష్టతలతోపాటు మరింత పురోగతికి అవకాశాలు ఉన్న మార్గాలను సర్వే గుర్తించింది. ఆర్థిక సర్వే మన ఆర్థిక వ్యవస్థ ప్రబలమైన పటిష్టతలతను హైలైట్‌ చేస్తోంది. మా ప్రభుత్వం తీసుకువచి్చన వివిధ సంస్కరణల ఫలితాలను కూడా సుస్పష్టం చేస్తోంది. – ఎక్స్‌ పోస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అంచనాలు సుసాధ్యం7 శాతం వృద్ధి రేటు సాధన భారత్‌కు తేలికే. మేము నిరాశావాదులం కాదు. రుతుపవనాల పురోగతి సవాళ్లను కూడా మేము పరిగణనలోకి తీసుకుంటున్నాము. ఫైనాన్షియల్‌ రంగం అవుట్‌లుక్‌ పటిష్టంగా కనబడుతోందని, పొదుపులను ఫైనాన్షియల్‌ మార్కెట్లవైపునకు మళ్లించడాన్ని చూస్తే.. భారత్‌ కుటుంబాలు కష్టాల్లో లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. – వి. అనంత నాగేశ్వరన్, సీఈఏ పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్‌ బృందంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి పంకజ్‌ చౌదరి

Governor Abdul Nazir speech to both Houses of Andhra Pradesh
ఆకాంక్షలు ఆవిరి! చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్‌

సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఎన్డీఏ కూటమికి బలమైన తీర్పునిచ్చారు. కానీ ఇప్పటికిప్పుడు వారి ఆకాంక్షలు (హామీలు) నెరవేర్చే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. ఉద్యోగులు, పింఛన్‌దారులకు బకాయిల చెల్లింపులతో పాటు రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం అందించాలి. లేకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వనరుల సమీకరణ, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం చాలా కష్టం, సంక్లిష్టం. సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను అన్వేషించాల్సి ఉంది. మేధావులు, విద్యావేత్తలతో విస్తృతమైన చర్చలు జరపాలి. అందుకే అర్ధవంతమైన చర్చల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్‌కు వెళ్లాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఆందోళనకరమైన ఆరి్ధక పరిస్థితిని అర్ధం చేసుకొని రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలి’’ అని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. ఓటాన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సోమవారం అసెంబ్లీ హాలులో ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. నాడు 13.5 శాతం సమ్మిళిత వృద్ధి సాధించాం సవాళ్లను అధిగమించి సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ దిశగా 2014–19లో గట్టి పునాది వేశాం. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులలో రాష్ట్రం నెం.1గా అవతరించింది. కాకినాడ సెజ్‌ పోర్ట్, భావనపాడు, రామాయపట్నం ఓడరేవుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. వృద్ధాప్య పింఛన్ల పెంపుదల, రైతు రుణమాఫీ లాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుతో 2014–19 మధ్య 13.5 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు సాధించాం. 2019 జూన్‌లో బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వం ప్రజావేదికను కూల్చడంతో బ్రాండ్‌ ఏపీకి భారీ నష్టం జరిగింది. 2014–19తో పోలిస్తే 2019–24 మధ్య మూలధన వ్యయం 60 శాతం తగ్గిపోయింది. మూడు రాజధానుల ఆలోచనతో ప్రజలను గందరగోళానికి గురిచేసింది. అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా నాశనమైంది. రూ.2 లక్షల కోట్ల సంపద నష్టానికి దారి తీసింది. ఇంధన రంగం రూ.1,29,503 కోట్ల భారీ నష్టానికి గురైంది. సహజ వనరులు దురి్వనియోగమయ్యాయి. రీ–సర్వే, ఏపీ భూ హక్కు చట్టం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఇసుకను కొల్లగొట్టడంతో రూ.­19,000 కోట్ల నష్టం వాటిల్లింది. ఖనిజ రాబడిలో రూ.9,750 కోట్ల నష్టం వాటిల్లింది. ఎర్రచందనం విక్రయాల వల్ల 2014–2019 మధ్య రూ.1,623 కోట్ల ఆదాయం వస్తే 2019–2024 మ«­ద్య కేవలం రూ.441 కోట్లకు ఆదాయం పడిపోయింది. చిన్నారులపై నేరాలు, అత్యాచారాలు పెరిగాయి గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై నేరాలు.. ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాలపై అఘాయిత్యాలు పెరిగాయి. ఎక్సైజ్‌ ఆదాయ మార్గాలను గత ప్రభుత్వం అపహాస్యం పాలు చేసింది. ఎక్సైజ్‌పై వ్యాట్‌ను తగ్గించి ప్రత్యేక మార్జిన్‌గా రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించారు. జీతాలు, పింఛన్ల భారీ బకాయిలతో పాటు సుమారు రూ.10 లక్షల కోట్ల రుణ భారం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై పడింది. ఇప్పటికిప్పుడు హామీలన్నీ అమలు చేయలేంప్రజలు ప్రభుత్వ మార్పును బలంగా కోరుకోవడం వల్లే 93 శాతం స్ట్రయిక్‌ రేట్‌తో ఎన్డీఏకు చారిత్రక తీర్పునిచ్చారు. గాడి తప్పిన పాలనను తిరిగి గాడిలో పెట్టడం సవాలుతో కూడుకున్న పని. ఎన్నికల హామీలను నెరవేర్చడం ప్రారంభించాం. “సూపర్‌ సిక్స్ఙ్‌ వాగ్దానాల అమలుకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించడం, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రత పింఛన్లను రూ.4 వేలకు పెంచడం, నైపుణ్య గణన, ఉచితంగా ఇసుక సరఫరా లాంటివి చేపట్టాం. అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభిస్తున్నాం. మిగిలిన హా­మీల అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్ప­టికిప్పుడు వారి ఆకాంక్షలను నెరవేర్చడం సాధ్యం కాదని తెలియజేస్తున్నా. వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది. నిధుల లేమి కారణంగా అభివృద్ధి ప్రణాళిక చాలా సంక్లిష్టంగా ఉంది. ఇప్పటికే ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ఆరి్ధక పరిస్థితిని వివరించాం. రాష్ట్రానికి ఉదారంగా సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశాం. ప్రస్తుతమున్న ఆందోళనకరమైన ఆరి్ధక పరిస్థితిని అర్ధం చేసుకుని రాష్ట్ర పునరి్నర్మాణంలో ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.

USA Presidential Elections 2024: Kamala Harris as Democratic Party presidential candidate
USA Presidential Elections 2024: అడ్వాంటేజ్‌ హారిస్‌

వాషింగ్టన్‌: జో బైడెన్‌ డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా వైదొలగడంతో భారతీయ అమెరికన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అవకాశాలు మెరుగయ్యాయి. అధ్యక్ష అభ్యర్థిగా కమలకు బైడెన్‌ మద్దతు ప్రకటించారు. ఇది ఆమెను అధ్యక్ష టికెట్‌ రేసులో ముందు వరుసలో నిలుపుతుంది. అయితే బైడెన్‌ మద్దతిచి్చనంత మాత్రాన ఆటోమేటిగ్గా కమల డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి అవ్వలేరు. డెమొక్రాటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో డెలిగేట్ల మద్దతును సంపాదించాల్సి ఉంటుంది. డేలిగేట్ల ఓటింగ్‌లో ఎవరైతే మెజారిటీ సాధిస్తారో వారే డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి అవుతారు. డెమొక్రాటిక్‌ పార్టీ టికెట్‌ కోసం కమలకు గట్టి పోటీదారులుగా మారతారని భావించిన పలు రాష్ట్రాల గవర్నర్లు తమ మద్దతు ఉపాధ్యక్షురాలికేనని బాహటంగా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతానికైతే అధికారికంగా కమల ఒక్కరే రేసులో ఉన్నారు. బైడెన్‌ విరమణ ప్రకటన అనంతరం కమల తక్షణం రంగంలోకి దిగారు. పారీ్టలోని సహచరులకు ఆదివారమే 100 పైగా ఫోన్‌కాల్స్‌ చేసి మద్దతు కూడ గట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు భారతీయ అమెరికన్, ఆఫ్రికన్‌ అమెరికన్‌ చట్టసభ సభ్యులు, బైడెన్‌ అనుచరులు కమలకు మద్దతుగా ముమ్మర లాబీయింగ్‌ మొదలుపెట్టారు. వివిధ రంగాల్లోని మహిళలు కూడా ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. బైడెన్‌ ప్రచార బృందం కూడా సోషల్‌ మీడియాలో తమ అకౌంట్ల పేర్లను హారిస్‌ పేరు మీదకు మార్చేసింది. ప్రచార టీమ్‌లోని 1,000 మంది ఉద్యోగులు తక్షణం ఆమె తరఫున పనిచేయనున్నారు. పెలోసి, క్లింటన్‌ల మద్దతు ప్రతినిధుల సభ మాజీ స్పీకర్, డెమొక్రాటిక్‌ పారీ్టలో కీలక నాయకురాలు నాన్సీ పెలోసి కూడా సోమవారం హారిస్‌కు మద్దతు ప్రకటించారు. శ్రామికవర్గ కుటుంబాల కోసం శ్రమించే, సునిశిత మేధోశక్తి గల రాజకీయ నాయకురాలిగా కమలను అభివరి్ణంచారు. బైడెన్‌ను వైదొలిగేలా ఒప్పించడంలో పెలోసిది కీలకపాత్ర. డజన్ల కొద్ది ప్రతినిధుల సభ సభ్యులు, సెనేటర్లు కూడా కమలకు మద్దతు తెలిపారు. గట్టి పోటీదారులైన పెన్సిల్వేనియా గవర్నర్‌ జోస్‌ షాపిరో, కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ ఆదివారమే ఆమెకు మద్దతు ప్రకటించేశారు. అమెరికాలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు, హయత్‌ హోటల్‌ గ్రూపు వారసుడు, ఇల్లినాయీ గవర్నర్‌ జె.బి.ఫ్రిట్జ్‌కర్, రెండుసార్లు కెంటకీ గవర్నర్‌ అండీ బెషియర్‌ అభ్యరి్థత్వ రేసులో ఉంటారని భావించినా సోమవారం వారిద్దరూ కమలకే జైకొట్టారు. మిషిగన్‌ గవర్నర్‌ గ్రెట్చెన్‌ విట్మర్‌ కూడా ఇదే బాటలో నడిచారు. మేరీలాండ్‌ గవర్నర్‌ వెస్‌ మూర్‌ కూడా కమలకే మద్దతు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్, హిల్లరీ క్లింటన్‌ల మద్దతు కూడా లభించింది. కమలకు ఉదారంగా విరాళాలివ్వాలని హిల్లరీ సోమవారం పిలుపిచ్చారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆమోదముద్ర కూడి పడితే ఆమెకు తిరుగు ఉండదు. కమల ప్రత్యర్థులుగా ప్రస్తుతానికి రాయ్‌ కూపర్‌ (67), అరిజోనా సెనేటర్‌ మార్క్‌ కెల్లీ పేర్లు వినిపిస్తున్నాయి.

Seniors have to play all the matches
సీనియర్లు అన్ని మ్యాచ్‌లు ఆడాల్సిందే

సూటిగా, మొహమాటానికి తావు లేకుండా... భారత క్రికెట్‌ జట్టు కొత్త హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ తనదైన శైలిలో భవిష్యత్తు గురించి తన ఆలోచనలేమిటో చెప్పేశాడు. సీనియర్‌ ఆటగాళ్లయినా సరే తమకు నచ్చినట్లుగా సిరీస్‌లు ఆడతామంటే కుదరదని స్పష్టం చేశాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వచ్చే 2027 వన్డే వరల్డ్‌ కప్‌ ఆడాలని కోరుకుంటున్నాను అని చెబుతూ ఫిట్‌నెస్‌ ఉంటేనే అంటూ అది సాధ్యమవుతుందని పరోక్షంగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చే ఫలితాలు రాబడతానన్న గంభీర్‌... విరాట్‌ కోహ్లితో తనకు ఎలాంటి విభేదాలు లేవని పునరుద్ఘాటించాడు. న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా కొత్త ప్రయాణం మొదలు పెట్టాడు. శనివారం నుంచి శ్రీలంకతో జరిగే సిరీస్‌లో అతను బాధ్యతలు చేపడుతున్నాడు. ఈ నేపథ్యంలో గంభీర్‌ తొలిసారి మీడియాతో అన్ని విషయాలపై మాట్లాడాడు. టీమిండియా భవిష్యత్తు, తన ప్రణాళికల గురించి వివరించాడు. విశేషాలు అతని మాటల్లోనే... కోచ్‌గా తన ఆలోచనలపై... నేను ఒక విజయవంతమైన జట్టు బాధ్యతలు తీసుకుంటున్నాను. టి20 వరల్డ్‌ చాంపియన్, వన్డేలు, టెస్టుల్లో రన్నరప్‌ టీమ్‌ ఇది. అనూహ్య మార్పులతో నేను పరిస్థితిని చెడగొట్టను. ఒక హెడ్‌ కోచ్, ఆటగాడి మధ్య ఉండే బంధం తరహాలో కాకుండా వారికి స్వేచ్ఛనివ్వడం చాలా ముఖ్యం. పరస్పర నమ్మకంతోనే ఫలితాలు వస్తాయి. నేను అన్ని సమయాల్లో ఆటగాళ్లకు అండగా నిలుస్తా. ఏం చేసినా జట్టు గెలుపే లక్ష్యం కావాలి. వేరే మాటకు తావు లేదు. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శించాలి. విజయాలు లభిస్తేనే డ్రెస్సింగ్‌ రూమ్‌ మొత్తం సంతోషంగా ఉంటుంది. నేను అడిగిన సహాయక సిబ్బందిని ఇచి్చన బోర్డుకు కృతజ్ఞతలు. ఆటగాళ్లు సిరీస్‌లు ఎంచుకోవడంపై... నా దృష్టిలో బుమ్రాలాంటి బౌలర్లకు మాత్రమే విశ్రాంతి అవసరం. ప్రతీ ఒక్కరు జట్టులో ఉండాలనుకునే బుమ్రా ఒక అరుదైన బౌలర్‌. కాబట్టి అతడిని, ఇతర పేసర్లకు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే గానీ బ్యాటర్లకు పని భారం అనేది ఉండదు. నిలకడగా ఆడుతూ ఫామ్‌లో ఉంటే అన్ని మ్యాచ్‌లు ఆడవచ్చు. రోహిత్, కోహ్లి ఇప్పుడు రెండు ఫార్మాట్‌లే ఆడుతున్నారు కాబట్టి వారు అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండవచ్చు. ఆటగాళ్లు తమకు నచ్చినట్లుగా ఒక సిరీస్‌లో ఆడతామని, మరో సిరీస్‌లో ఆడమని అంటే కుదరదు. రోహిత్, కోహ్లి వన్డే భవిష్యత్తుపై... వారిద్దరిలో ఇంకా చాలా క్రికెట్‌ మిగిలి ఉందని నా భావన. వారు జట్టుకు ఎంత విలువైన ఆటగాళ్లో అందరికీ తెలుసు. ఏ జట్టయినా తమకు అలాంటి ఆటగాళ్లు కావాలని కోరుకుంటుంది. ఫిట్‌గా ఉంటే మాత్రం రోహిత్, కోహ్లి 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా ఆడవచ్చు. జట్టుకు ఉపయోగపడగలమనే భావన వారిలో ఉంటే ఎప్పటి వరకు ఆడగలరనేది వారి వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే చివరికి ఏదైనా జట్టు కోసమే. కోహ్లితో విభేదాలపై... నాకు, విరాట్‌కు మధ్య ఎలాంటి బంధం ఉందనేది మా ఇద్దరికీ బాగా తెలుసు. ఇది జనం ముందు చూపించేది కాదు. టీఆర్‌పీ రేటింగ్స్‌ కోసం ఏదైనా చెప్పుకోవచ్చు. మైదానంలో తన జట్టు కోసం పోరాడే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ ఇప్పుడు మేం భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోతున్నాం. జట్టు గెలుపు కోసమే ప్రయతి్నస్తాం. అది మా బాధ్యత. నేను కోచ్‌గా ఎంపికయ్యాక, అంతకుముందు కూడా చాలా మాట్లాడుకున్నాం. అత్యుత్తమ ఆట గాడైన కోహ్లి అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ‘సూర్యను అందుకే కెప్టెన్ ను చేశాం’ భారత టి20 కెప్టెన్ గా అయ్యే అర్హత అతనికి అన్ని విధాలా ఉంది. ఈ ఫార్మాట్‌లో ప్రస్తుతం అత్యుత్తమ బ్యాటర్‌. గత ఏడాది కాలంగా అతని గురించి, నాయకత్వ లక్షణాల గురించి డ్రెస్సింగ్‌ రూమ్‌ సహచరులు కూడా గొప్పగా చెప్పారు. జట్టు సారథి అన్ని మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటాం. హార్దిక్‌ పాండ్యా జట్టులో కీలక ఆటగాడే. ఆల్‌రౌండర్‌గా అతని సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఫిట్‌నెస్‌ సమస్యలే ప్రధాన బలహీనత. గత కొంత కాలంగా అతను వీటిని ఎదుర్కొంటున్నాడు. మూడు ఫార్మాట్‌లు ఆడే నైపుణ్యంతో పాటు శుబ్‌మన్‌ గిల్‌కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందుకే వైస్‌కెప్టెన్ ను చేశాం. అతను మరింత నేర్చుకుంటాడు. అక్షర్‌కు వన్డేల్లో మరిన్ని అవకాశాలు ఇవ్వడం కోసమే జడేజాకు విరామం ఇచ్చాం తప్ప అతడిని తప్పించలేదు.పంత్, రాహుల్‌ ఉన్నాక మరో కీపర్‌ అవసరం లేదు కాబట్టి సామ్సన్‌ను పక్కన పెట్టక తప్పలేదు. రెండేళ్ల తర్వాత జరిగే టి20 వరల్డ్‌ కప్‌ కోణంలో కొన్ని ప్రయోగాలతో కొత్తగా ప్రయతి్నస్తున్నాం. ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి. –అజిత్‌ అగార్కర్, సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌

US woman freed after 43 years in prison for murder she did not commit
USA: చేయని తప్పుకు 43 ఏళ్లు కారాగారంలోనే

వాషింగ్టన్‌: చేయని నేరానికి 43 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించిన అమాయకురాలికి ఎట్టకేలకు విముక్తి లభించింది. అమెరికాలోని ఒహాయోకు చెందిన 63 ఏళ్ల సాండ్రా హెమ్మీ కథ ఇది. మిస్సోరీలో 1980లో ఓ లైబ్రరీ వర్కర్‌ను కత్తితో పొడిచి చంపిందని సాండ్రాను అరెస్ట్‌ చేశారు. లాయర్‌తో వాదించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మానసిక చికిత్సకు అధిక మోతాదులో తీసుకున్న ఔషధాల మత్తులో ఆమె చెప్పిన నేరాంగీకార వాంగ్మూలాన్నే పోలీసులు కోర్టుకు సమరి్పంచారు. దాంతో ఆమెకు జీవితఖైదు విధించారు. కానీ అసలు హంతకుడు మైఖేల్‌ హోల్‌మ్యాన్‌ అనే పోలీసు అధికారి. ఈ విషయాన్ని సాండ్రా లాయర్లు ఆధారసహితంగా తాజాగా కోర్టులో నిరూపించారు. దాంతో ఆమె శుక్రవారం విడుదలయ్యారు. కూతురు, మనవరాలిని హత్తుకుని బోరున విలపించారు. అమెరికా చరిత్రలో చేయని నేరానికి అత్యంత ఎక్కువ కాలం శిక్ష అనుభవించిన మహిళగా సాండ్రా పేరు నిలిచిపోనుంది.

Audio Call Viral In Tollywood Hero Raj Tarun and Lavanya Issue
రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్‌.. మరో సంచలన ఆడియో లీక్!

హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్‌ టాలీవుడ్‌ సంచలనంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు పెట్టుకోవడంతో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరి కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇటీవలే రాజ్ తరుణ్‌కు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాను అందుబాటులో లేనని రిప్లై కూడా ఇచ్చారు.ఇదిలా ఉండగా.. తాజాగా మరో ఆడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఆడియో కాల్‌లో లావణ్య.. ఆర్జే శేఖర్‌ భాష అనే వ్యక్తితో మాట్లాడుతున్న ఆడియో సంచలనంగా మారింది. ఇందులో లావణ్యకు, శేఖర్ భాషకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మా గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటూ శేఖర్ భాషను లావణ్య నిలదీసింది. మీరే రాజ్ తరుణ్ ఇల్లు కొట్టేయాలని ఇదంతా చేస్తున్నారని లావణ్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రాజ్ తరుణ్ స్నేహితుడుగా చెప్పుకునే శేఖర్ బాషా అనే ఆర్జే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మస్తాన్ రావ్ అనే వ్యక్తి నుంచి లావణ్య మత్తు పదార్థాలను కొని బయట ఎక్కువ రేటుకు అమ్మేదని.. ఆ పరిచయంతో ఇద్దరూ ఒకటయ్యారని కూడా శేఖర్ భాషా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు.

Advertisement
Advertisement
Advertisement
International View all
title
Bangladesh: పీఎం కార్యాలయం, పోలీస్‌ వెబ్‌సైట్‌ హ్యాక్‌

బంగ్లాదేశ్‌లో ఉద్యోగ రిజర్వేషన్లపై తీవ్రమైన అశాంతి నెలకొంది.

title
USA: చేయని తప్పుకు 43 ఏళ్లు కారాగారంలోనే

వాషింగ్టన్‌: చేయని నేరానికి 43 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించిన

title
USA Presidential Elections 2024: అడ్వాంటేజ్‌ హారిస్‌

వాషింగ్టన్‌: జో బైడెన్‌ డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థ

title
పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. కారణం ఏంటో తెలుసా?

పెళ్లంటే నూరేళ్ల బంధం.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి.. పెళ్లి కొత్త జీవితానికి నాంది..

title
దేశాధినేతల ర్యాంప్‌ వాక్‌! వైరల్‌ వీడియో

ఎ‍ప్పుడూ బిజీగా ఉండే దేశాధినేతలు చిత్ర విచిత్రమైన దుస్తులు ధరించి ర్యాంప్‌ వాక్‌ చేస్తే ఎలా ఉంటుంది?

NRI View all
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all