Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Minister Payyavula Keshav Comments On Opposition Status For YSRCP
పయ్యావుల వ్యాఖ్యలతో కుట్ర బట్టబయలు

అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుమానించిందే జరుగుతోంది. అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ అణగదొక్కాలని, రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ప్రభుత్వ కుట్ర.. సాక్షాత్తూ మంత్రి పయ్యావుల వ్యాఖ్యలతో బయటపడింది. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష హోదా అంశంపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి మంగళవారం వైఎస్‌ జగన్‌ సుదీర్ఘమైన లేఖ రాశారు. అందులో ఎన్నో కీలకాంశాలను ప్రస్తావించారాయన. అంతేకాదు.. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా గళం వినిపించేందుకు అవకాశం ఉంటుందని, గతంలో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు పలు పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాల్ని సైతం ఆయన ఉటంకించారు. అయినప్పటికీ.. ప్రతిపక్ష హోదాను వైఎస్సార్‌సీపీకి దక్కనివ్వకుండా ప్రభుత్వం బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.ఈ లేఖపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మీడియా స్పందించాలని కోరింది. దానికి పయ్యావుల వివరణ ఇస్తూ.. "అసెంబ్లీలో జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కే అవకాశమే లేదని" అన్నారు. అంతేకాదు ఆయన ఫ్లోర్‌ లీడర్‌గా మాత్రమే ఉంటారని చెబుతున్నారు. పైగా "స్పీకర్ కి లేఖ రాసినంత మాత్రాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని, కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కేందుకు పదేళ్లు పట్టిందంటూ" వెటకారంగా మాట్లాడారు.దేశ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంశాన్ని గనుక పరిశీలిస్తే.. ఏదైనా చట్ట సభలో అధికార పార్టీ/ అధికారంలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి. కానీ, ఏపీ అసెంబ్లీలో ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. శాసనసభలో మేం గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదని, ప్రతిపక్ష హోదా ఉంటేనే అది సాధ్యమవుతుందని స్పీకర్‌కు రాసిన లేఖలో జగన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పేమెంట్‌ ఆఫ్‌ శాలరీస్‌ అండ్‌ పెన్షన్‌ అండ్‌ రిమూవల్‌ ఆఫ్‌ డిస్క్వాలిఫికేషన్‌ యాక్ట్‌ 1953 చట్టం 12-బీ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించిందని లేఖలోనే స్పష్టం చేశారు.ఇక.. ప్రతిపక్ష హోదా ఇవ్వడం స్పీకర్‌ పరిధిలోని అంశం. జగన్‌ రాసిన లేఖపై ఇంకా స్పీకర్‌ నుంచి బదులు రాలేదు. ఈలోపే పయ్యావుల, వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పడం దేనికి సంకేతం? అనే చర్చ మొదలైంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వీలు లేకుండా.. అసలు వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదానే లేకుండా చేయాలన్నది కూటమి ప్రభుత్వ కుట్రగా ఇప్పుడు తేటతెల్లమయ్యింది.

Aap Alleges Bjp Panicked And Got Kejriwal Arrested In A Fake Case By The Cbi
సీబీఐ అదుపులో కేజ్రీవాల్‌.. బీజేపీకి ఆప్‌ చురకలు!

సాక్షి,న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక కోర్టులో నడిచిన హైడ్రామా ఆమ్‌ ఆద్మీ పార్టీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం పాలసీ కేసులో తమ పార్టీ అధినేతకు (కేజ్రీవాల్‌) సుప్రీం కోర్టులో బెయిల్‌ వస్తుందేమోనని బయపడిపోతుందంటూ ఎక్స్‌ వేదికగా స్పందించింది.లిక్కర్‌ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో హైడ్రామా నడిచింది. మంగళవారం తీహార్‌ జైల్లో ఉన్న ఢిల్లీ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. అనంతరం బుధవారం కోర్టుకు హాజరు పరిచింది. కోర్టులో విచారణ జరిగే సమయంలో కేజ్రీవాల్‌ను తమకు ఐదురోజుల పాటు కస్టడీ కావాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో సీబీఐ స్పెషల్‌ కోర్టు జడ్జీ అమితాబ్‌ రావత్‌ అరెస్ట్‌ ఆర్డర్‌ను పాస్‌ చేయడంతో సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేశారు.ఈ వరుస పరిణామలపై ఆప్‌ స్పందించింది. ట్రయిల్‌ కోర్టు తనకు బెయిల్‌ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంపై కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ నేడు విచారణకు రానుంది. అయితే అనూహ్యంగా ఈ కేసు విచారణకు రాకముందే ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై ఆప్‌ మండిపడింది. కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో బెయిల్‌ వస్తుందేమోనని బీజేపీకి బయపట్టుకుంది. అందుకే సీబీఐ కోర్టులో అక్రమంగా అరెస్ట్‌ చేసిందని ట్వీట్‌లో పేర్కొంది.‘నియంత క్రూరత్వం అన్ని హద్దులు దాటింది.ఈ రోజు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ వచ్చే అవకాశం ఉన్నందున బీజేపీ తీవ్ర భయాందోళనకు గురైంది.సీబీఐతో కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయించింది’అని ట్వీట్‌లో ద్వజమెత్తింది.

Prabhas Kalki 2898 AD Specialities And Latest Details
ప్రభాస్ 'కల్కి' సినిమా ప్రత్యేకతలు.. మీకు ఇవి తెలుసా?

డార్లింగ్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ 'కల్కి' రిలీజ్‌కి రెడీ. మరికొన్ని గంటల్లో థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ఎందుకంటే మూవీపై అంచనాలు మామూలుగా లేవు. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తొలిరోజు వసూళ్లలో రికార్డులు బద్దలవ్వొచ్చని మాట్లాడుకుంటున్నారు. అయితే మీకు 'కల్కి' గురించి విశేషాలు ఎన్ని తెలుసు? ఇంతకీ 'కల్కి' ఎప్పుడు మొదలైంది అనేది ఇప్పుడు చూద్దాం.ప్రభాస్ 'కల్కి' విశేషాలుడార్లింగ్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'కల్కి'.జూన్ 27న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు.ప్రపంచవ్యాప్తంగా 10 వేలకు పైగా స్క్రీన్లలో 'కల్కి' రిలీజ్ అవుతోంది.తెలుగులో 1600కి పైగా.. మిగతా భాషలన్నీ కలిపి 4000కి పైగా స్క్రీన్లలో రిలీజ్ఓవర్సీస్‌లో 4500కి పైగా స్క్రీన్స్‌లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.మన దగ్గరతో పాటు ఓవర్సీస్‌లోనూ కనివినీ ఎరుగని రీతిలో టికెట్స్ బుక్.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్లు, అదనపు షోలు భారీ ఎత్తున అనుమతి.'కల్కి'లో ప్రభాస్, అమితాబ్, కమల్, దీపిక, దిశా పటానీ, శోభన లాంటి స్టార్స్ నటించారు.విజయ్ దేవరకొండ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్, ఆర్జీవీ కూడా ఉన్నారని టాక్.వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ రూ.600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.ఫిబ్రవరి 2020న 'ప్రాజెక్ట్ కె' పేరుతో ఈ సినిమాని అనౌన్స్ చేశారు.అదే ఏడాది కరోనా రావడంతో దాదాపు ఏడాది వాయిదా పడింది.2021 జూలై నుంచి మార్చి 2024 వరకు షూటింగ్ జరిగింది.ఈ ఏడాది మే 9నే రిలీజ్ చేస్తామని ప్రకటన. కానీ ఎన్నికల కారణంగా జూన్ 27కి వాయిదా.క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 2898 AD వరకు విస్తరించే కథనే 'కల్కి'మహాభారతం సంఘటనలతో పాటు వర్తమాన, భవిష్యత్‌ని ఇందులో చూపించబోతున్నారు.ఇకపోతే 'కల్కి' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.370 కోట్ల వరకు జరిగిందని సమాచారం.తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.168 కోట్లు కాగా.. కర్ణాటక 25, తమిళనాడు 16, కేరళ 6, హిందీ ప్లస్ నార్త్ కలిపి రూ.85 కోట్లు!ప్రభాస్ గత సినిమా 'సలార్' తొలిరోజు కలెక్షన్స్ రూ.178 కోట్లు.దీన్ని సులభంగా 'కల్కి' అధిగమిస్తుందని ట్రేడ్ పండితులు జోస్యం.

AP Inter 1st Year Supplementary Results 2024 Declared
ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ సప్లమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ ఫలితాలు విడుదల య్యాయి. ఫలితాలను ఇంటర్మీడియట్‌ బోర్డు బుధవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేసింది.విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో చూడొచ్చు.ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్‌ 3 వరకూ జరిగాయి. సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేశారు. ఈసారి ఇంటర్‌ మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలకు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ సప్లమెంటరీ (జనరల్‌) ఫలితాల కోసం క్లిక్‌ చేయండిఇంటర్‌ ఫస్ల్‌ ఇయర్‌ సప్లమెంటరీ(వొకేషనల్‌) ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Ksr Comments On Conduct Of TDP On Implementation Of Promised Schemes And Volunteer System
ఏపీలో ‘పక్కదారి’ పాలన షురూ!

ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు ఎవరైనా టీడీపీ వారిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి ఇచ్చిన హామీలు ఎలా ఆచరణ సాధ్యం? అని ప్రశ్నిస్తే వారు ఠకీమని ఒక సమాధానం ఇచ్చేవారు. మా నాయకుడు అంత తెలివితక్కువవాడు కాదు. అవేమీ అమలు చేసేది ఉండదు. అవసరమైనవి, సాధ్యమైనవి మాత్రమే చేస్తారు అని చెప్పేవారు. మరి అది మోసం కాదా అని ప్రశ్నిస్తే, ఆ సంగతి తర్వాత, ముందు అధికారం రావాలి కదా! అని అనేవారు. సరిగ్గా అదే పంధాలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లుగా ఉంది. కాకపోతే ఈసారి ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు.ఇంతకాలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన వ్యవస్థలను మార్పు లేదా ఖతం చేసే దారిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఉన్నారనిపిస్తుంది. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. ప్రజల అవసరాలను తీర్చడానికి, గడప వద్దకే పాలనను తీసుకువెళ్లడానికి అవి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆ వ్యవస్థలను యధాతధంగా కొనసాగించడం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి అంత ఇష్టం ఉండదు. అందుకే కీలకమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తుంది.ప్రతి నెల మొదటి తేదీన వృద్దాప్య పెన్షన్ లు వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇళ్లవద్ద పంపిణీ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి ఇచ్చే గౌరవ వేతనం ఐదువేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లకు గౌరవవేతనంతో పాటు ఇళ్లవద్దే ఉండి నెలకు ఏభైవేల రూపాయల వరకు సంపాదించుకునేలా తాను చేస్తానని చెప్పేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పది రోజులలోనే వలంటీర్లను వారి విధుల నుంచి పక్కనబెట్టడం విశేషం. దీంతో వీరి మనుగడ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.ఏపీలో తొలుత రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండేవారు. ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ రమేష్ రూపేణ వలంటీర్ల వ్యవస్థను కొంత డిస్టర్బ్ చేయడంలో టీడీపీ సఫలం అయింది. వారి ద్వారా పెన్షన్ లు పంపిణీ కాకుండా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు తెప్పించగలిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడడంతో ఎన్నికల కమిషన్ కూటమికి పూర్తిగా సహకరించిందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం తర్వాత సుమారు ఎనభై వేల మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. అయినా ఇప్పటికీ సుమారు లక్షన్నర మందివరకు వలంటీర్లు కొనసాగుతున్నారు. ఆ వలంటీర్లను వాడుకుంటూ, వలంటీర్లు లేనిచోట సచివాలయ సిబ్బందితో పెన్షన్ లు పంపిణీ చేస్తామని చెప్పి ఉంటే ఎవరికి సందేహం వచ్చేది కాదు.వలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్ధసారథి చెప్పడం విశేషం. అంటే ఇందులో కొత్తగా తీసుకోవలసిన నిర్ణయం ఏమి ఉంటుంది? వలంటీర్ల వ్యవస్థను ఉంచాలా? వద్దా? అన్నదానిపైనే ప్రభుత్వం ఆలోచిస్తుండాలి. ఒకప్పుడు ఈ వలంటీర్లను ఉద్దేశించి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిని ఒక రకంగా అవమానించేలా మాట్లాడారు. సంఘ వ్యతిరేక శక్తులతో పోల్చారు. కానీ ఎన్నికల టైమ్ కు వలంటీర్లను వ్యతిరేకించడం వల్ల తమకు నష్టం వస్తుందని అనుమానించి, వెంటనే ప్లేట్ మార్చి వారికి పదివేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని, వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించారు. ఎన్నికల మానిఫెస్టోలో కూడా ఇదే వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు వలంటీర్లను సస్పెన్స్ లో పెట్టారు.వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం లేదని అనుకుంటే, అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఉండవచ్చు. అలా చేయలేదు. పైగా వారిపట్ల సానుకూలంగా మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉన్న వలంటీర్లను మార్చుతారేమోనన్న ప్రచారం జరిగేది. ప్రస్తుతం ఉన్నవారు వైఎస్సార్‌సీపీకి అనుకూలమైన వారన్నది టీడీపీ భావన. వీరికి బదులు టీడీపీకి సంబంధించినవారిని నియమించుకోవాలన్న ఆలోచన చేయవచ్చని అనుకున్నారు. కానీ అందుకువిరుద్ధంగా ఆ వ్యవస్థపైనే అనుమానాలు సృష్టించారు. వైఎస్సార్‌సీపీకి ఎన్నికలలో వలంటీర్ల వ్యవస్థ వల్ల రాజకీయంగా ఉపయోగం జరగలేదన్న అభిప్రాయం ఏర్పడింది.ఈ నేపథ్యంలో టీడీపీలో కూడా పునరాలోచన ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. ఇదే సమయంలో సచివాలయాల సిబ్బందితో ఇళ్ల వద్ద పెన్షన్ లు పంపిణీ చేయించడం కూడా కొంత వివాదాస్పదం కావచ్చు. తమకు కొత్త బాధ్యత పెడుతున్నారన్న అసంతృప్తి ఏర్పడవచ్చు. అయినా ప్రభుత్వం వారిపైనే ఒత్తిడి పెడుతున్నదంటే ఈ వ్యవస్థలో ఇంకా పలుమార్పులు తీసుకురావాలని ఆలోచిస్తుండవచ్చనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి మార్కు పాలన కనిపించకూడదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన పౌరసేవలు అందిస్తుంటారు. వలంటీర్లు ప్రజల నుంచి ఆయా దరఖాస్తులు తీసుకుని స్కీములలో చేర్చడం, వారికి కావల్సిన సర్టిఫికెట్లను సమకూర్చడం తదితర సేవలు అందించేవారు. ఇప్పుడు వీటన్నిటిని నిలుపుదల చేస్తే ఈ వలంటీర్లకు, సచివాలయాల సిబ్బందికి పని ఉండదు.ప్రస్తుతానికి సచివాలయాల సిబ్బందికి డిప్రమోషన్ ఇచ్చిన రీతిలో వారినే లబ్దిదారుల ఇళ్లచుట్టూ తిప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇష్టం లేనివారు ఉద్యోగాలు మానుకుంటారు. లేదా, భవిష్యత్తులో వేరే రకంగా వాడుకునే ఉద్దేశంతో ఈ బాధ్యత అప్పగించి ఉండవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడంతో మానిఫెస్టోలో చెప్పినవాటికి భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకోకుండా, అంతా పరిశీలనలో ఉందని చెప్పవచ్చు. ప్రజాభిప్రాయం తీసుకుంటున్నామని తెలపవచ్చు. అలాగే అభిప్రాయాలు సేకరించామని, ప్రజలకు వలంటీర్లవల్ల ఉపయోగం లేదని, పేర్కొనవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ఒకవేళ తొలగిస్తే రెండున్నర లక్షల మంది ప్రస్తుతం ఏదో రూపంలో పొందుతున్న ఉపాధిని కోల్పోయినట్లు అవుతుంది. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం చేస్తుందా? అనేది చూడాలి.అలాగే.. ఇన్నివేల సచివాలయాల అవసరం లేదని, సిబ్బందిని వేరే రూపంలో వినియోగించుకోవచ్చని ఏమైనా ఆలోచన జరుగుతుందా అన్న సందేహం కూడా ఉంది.చంద్రబాబు నాయుడుకు ప్రజలలో ఉన్న అభిప్రాయానికి తగినట్లుగానే మాట మార్చుతారా అనే ప్రశ్న వస్తోంది. విశేషం ఏమిటంటే వలంటీర్లకు పదివేల రూపాయల వేతనం ఇస్తారని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా జాగ్రత్తపడడం కూడా గమనించదగ్గ అంశమే. అదే ఇలాంటి నిర్ణయం ఏదైనా వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే.. ఈ మీడియా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేసినా సమర్థించే మీడియా కనుక వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాట తప్పారని ఎక్కడా ఒక్క మాట రాయలేదు. పైగా క్యాబినెట్ కీలక హామీలను నెరవేర్చిందని హెడింగ్ లు పెట్టి మరీ జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేశాయి.చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలనే క్యాబినెట్ లో తీర్మానం చేశారు. మెగా డీఎస్సీ, వృద్దుల పెన్షన్ నాలుగువేల రూపాయలు చేయడం తప్ప మిగిలినవాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. లేని టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయడం మరో ప్రత్యేకత. టీడీపీ మీడియాకు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ లు ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాలు కీలకమైనవిగా కనిపించడం లేదు. స్కూళ్లు తెరిచిన ఈ టైమ్ లో తల్లికి వందనం పేరుతో బడికి వెళ్లే పిల్లలందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం ప్రస్తావనే లేదు.ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ప్రతి రైతుకు ఏటా ఇరవైవేల రూపాయల ఆర్దిక సాయం, నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు, ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు వంటి పలు హామీలు ఎప్పుడు అమలు చేసేది క్యాబినెట్ లో చర్చించలేదు. అదే వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో ఆ ఏడాది కాలానికి అమలు చేయవలసిన స్కీముల గురించి మంత్రివర్గంలో చర్చించి షెడ్యూల్ ఖరారు చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ఒక్కో హామీని ఏ రకంగా ఎగవేయాలా అనేదానిపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. దానిని పక్కదారి పట్టించడానికి వీలుగా గత ప్రభుత్వంపై శ్వేతపత్రాలు విడుదల చేసే కథను నడపడానికి ప్రభుత్వం సిద్దమైందని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

ICC T20 Rankings Suryakumar Yadav Loses His Top Spot new world no 1 is
ICC: టాప్‌ ర్యాంకు కోల్పోయిన సూర్య.. నంబర్‌ వన్‌ ఎవరంటే?

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తన అగ్రస్థానం కోల్పోయాడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా టాప్‌ ర్యాంకులో కొనసాగుతున్న ఈ ముంబై క్రికెటర్‌ రెండో స్థానానికి పడిపోయాడు.గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించాడు. అయితే, ఈ ఇద్దరి మధ్య కేవలం రెండు రేటింగ్‌ పాయింట్ల తేడా మాత్రమే ఉండటం గమనార్హం.ఆరంభంలో తడ‘బ్యా’టు కాగా టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ ఆరంభంలో సూర్యకుమార్‌ యాదవ్‌ పరుగులు రాబట్టలేక సతమతమయ్యాడు. ఆ తర్వాత అమెరికా(50 నాటౌట్‌), అఫ్గనిస్తాన్‌(28 బంతుల్లో 53) జట్లపై వరుసగా హాఫ్‌ సెంచరీలతో మెరిశాడు.ఇక వరల్డ్‌కప్‌ తాజా ఎడిషన్‌లో 33 ఏళ్ల ఈ ముంబై బ్యాటర్‌.. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 139.25 స్ట్రైక్‌రేటుతో 149 పరుగులు చేశాడు.అద్భుత ప్రదర్శనమరోవైపు.. 30 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ టీ20 ప్రపంచకప్‌-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సూపర్‌-8 మ్యాచ్‌లో టీమిండియాపై అర్థ శతకం(43 బంతుల్లో 76)తో దుమ్ములేపాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి ఓవరాల్‌గా సగటు 42.50, స్ట్రైక్‌రేటు 158.38తో 255 పరుగులు సాధించాడు.ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో హెడ్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఈ టోర్నీలో సెమీస్‌ చేరగా.. ఆస్ట్రేలియా సూపర్‌-8 దశలోనే నిష్క్రమించింది.ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ తాజా ర్యాంకింగ్స్‌- టాప్‌-5 బ్యాటర్లు వీరే1. ట్రవిస్‌ హెడ్‌(ఆస్ట్రేలియా)- 844 రేటింగ్‌ పాయింట్లు2. సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా)- 842 రేటింగ్‌ పాయింట్లు3. ఫిల్‌ సాల్ట్‌(ఇంగ్లండ్‌)- 816 రేటింగ్‌ పాయింట్లు4. బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)- 755 రేటింగ్‌ పాయింట్లు5. మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్తాన్‌)- 746 రేటింగ్‌ పాయింట్లు.

Brs Complaint On Mlas Defection To Speaker Through Mail
పోచారం, సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు.. స్పీకర్‌కు మెయిల్‌

సాక్షి,హైదరాబాద్‌: పార్టీ మారుతున్న ఎంఎల్ఏలపై అనర్హతపై దూకుడు బీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్,శాసన సభ సెక్రటరీకి ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి మెయిల్‌లో విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌ సమయమడగడానికి ఫోన్ చేసినా ఆయన ఆఫీస్‌ స్పందించకపోవడంతో ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది.గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం, తెల్లంలపైనా బీఆర్‌ఎస్‌ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా వేసింది.

Lok Sabha Speaker Election June 26 Live Updates
18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ స్పీకర్‌ ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్నికలో.. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్‌ సావంత్‌ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్‌ చేపట్టా.. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు.విపక్ష కూటమి ఓటింగ్‌కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పరస్పర కరచలనం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్‌ చెయిర్‌లో కూర్చోబెట్టారు. #WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభను నడిపించడంలో స్పీకర్‌ పాత్ర ఎంతో కీలకం. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్పీకర్‌ స్ఫూర్తిగా నిలుస్తారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా సభను నడిపించారు. ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్‌సభను నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలోనే కొత్త పార్లమెంట్‌ భవనంలోకి అడుగుపెట్టాం. జీ-20 సమ్మిట్‌ ఆయన సలహాలు, సూచనలు అవసరం. మరో ఐదేళ్లు కూడా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నా. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. సభలో విపక్షాల సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇవ్వలి. మా గొంతు నొక్కితే సభ సజావుగా నిర్వహించినట్లు కాదు. ప్రజల గొంతుక ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యం. ఓం బిర్లాకు వైఎస్సార్‌సీపీ అభినందనలులోక్ సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ అభినందనలు తెలిపింది. లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గడిచిన లోక్‌సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాలి’’ అని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారాయన. స్పీకర్‌గా ఓం బిర్లా ట్రాక్‌ రికార్డు.. లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా(61) రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్‌ పదవి చేపట్టారు. ఇప్పుడు.. తొలి నుంచి జరుగుతున్న ప్రచారం నడుమే రెండోసారి స్పీకర్‌ పదవి చేపట్టబోతున్నారు. లోక్‌సభ స్పీకర్‌ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్‌.ధిల్లాన్, బలరాం ఝాఖడ్‌, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్‌ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు.

What Happens If India VS England T20 World Cup 2024 Semifinal Is Washed Out
T20 World Cup 2024: ఇలా జరిగితే ఫైనల్స్‌కు టీమిండియా..!

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా గయానా వేదికగా రేపు (భారతకాలమానం ప్రకారం​ రాత్రి 8 గంటలకు) జరగాల్సిన భారత్‌-ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్‌ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్‌ ఫోర్‌క్యాస్ట్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌ రద్దైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే పరిస్థితి ఏంటి..?షెడ్యూల్‌ ప్రకారం భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే (ఒ‍క్క బంతి కూడా పడకుండా) సూపర్‌-8 దశలో గ్రూప్‌ (గ్రూప్‌-1) టాపర్‌గా ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్‌ చేరుతుంది.ఒకవేళ భారత్‌-ఇంగ్లండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు వర్షం​ కారణంగా పాక్షికంగా అంతరాయం కలిగితే.. ఫలితం తేలేందుకు 250 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఫలితాన్ని నిర్దారిస్తారు.తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్‌ డేమరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య ట్రినిడాడ్‌ వేదికగా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభంకావాల్సిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉండటంతో వంద శాతం ఫలితం తేలే అవకాశం ఉంది.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement