Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Mahakumbh 2025 how Many Devotees Have Taken Bath at Triveni Sangam1
Mahakumbh 2025: ఇప్పటికే 85 లక్షలమంది పుణ్యస్నానాలు!

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి స్నానాలు చేసే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.కుంభమేళా(Kumbh Mela) నేడు (సోమవారం) ప్రారంభంకాగా దీనికి ముందుగానే అంటే ఆదివారం రాత్రి 10 గంటల వరకు, 85 లక్షల మంది భక్తులు సంగమతీరంలో స్నానాలు చేశారు. జనవరి 11, శనివారం నాడు 35 లక్షల మంది భక్తులు మహా కుంభమేళాలో స్నానం చేశారు. జనవరి 12వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఆ రోజున 50 లక్షల మంది భక్తులు ఇక్కడ స్నానాలు చేశారు. ఈ విధంగా, రెండు రోజుల్లో మొత్తం 85 లక్షల మంది భక్తులు మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు మహా కుంభమేళాకు ముందుగానే భక్తులు చేరుకున్నారు. వారు గంగా, యమున సరస్వతీ నదుల సంగమంలో స్నానమాచరించారు. శనివారం 35 లక్షల మంది భక్తులు సంగమంలో స్నానం చేయడానికి వచ్చారని సమాచార డైరెక్టర్ శిశిర్ తెలిపారు. గత రెండు రోజుల్లో (శని, ఆదివారాలు) సంగంలో 85 లక్షలకు పైగా ప్రజలు స్నానం చేశారని తెలిపారు. ఈ మహా కుంభమేళాకు 45 కోట్లకు పైగా ప్రజలు వస్తారని, ఇది చరిత్ర(History)లో అతిపెద్ద మేళాగా మారనుందని అధికారి తెలిపారు. మహా కుంభమేళాలో మొదటి అమృత స్నానం (రాజ స్నానం) జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా జరగనుంది. ఈ సమయంలో అఖాడాలు తమ సంప్రదాయాల ప్రకారం స్నానాలు ఆచరించనున్నారు.ఇది కూడా చదవండి: Maha Kumbh: పుణ్యస్నానాలు ప్రారంభం

YS Jagan Extends Wishes To Sankranti Festival2
తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండుగ అంద‌రి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ తెలిపారు.వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌.. తెలుగువారి సంస్కృతి సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక సంక్రాంతి. ఈ పండుగ అంద‌రి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు చెప్పారు. తెలుగువారి సంస్కృతి సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక సంక్రాంతి. ఈ పండుగ అంద‌రి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 13, 2025

Minister Ponguleti Srinivasa Reddy Key Comments On Rythu Bharosa3
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. అలాగే, రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు.ఖమ్మంలోని కూసుమంచిలో మంత్రి పొంగులేటి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘పేదవారి కల పది సంవత్సరాల్లో అలాగే నిలిచిపోయింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు. అనేక హామీలు ఇచ్చాము. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు కొల్లగొట్టారు. ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం చిత్త శుద్దితో ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం ఇస్తుంది. డిసెంబర్ 13న మోడల్ హౌస్‌కి శంకుస్థాపన చేసుకుని సంక్రాంతి రోజున ప్రారంభించుకుంటున్నాం.అర్హులైన ప్రతీ పేదవారికి నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళు పూర్తి చేసింది లక్ష లోపు ఇళ్లు మాత్రమే. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. దళారుల పాత్ర ఉండదు.. ఇందిరమ్మ కమిటీ సమక్షంలోనే ఎంపిక జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.రైతులకు రైతు భరోసా నిబంధనలు లేకుండా 12వేలు ఇస్తాం. పది సంవత్సరాల్లో ఆనాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. మీ దీవెనలతో మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది అంటూ కామెంట్స్‌ చేశారు.

KSR Comment: CBN And Co Cover up Alliance Leaders Mistakes Yellow Media4
అబద్ధాలను అందంగా అల్లటంలో ఆరితేరారే!

ఆంధ్రప్రదేశ్‌లో పాలన రోజు రోజుకూ అధ్వాన్నమవుతోంది. ఈ మాట ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌సీపీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అధికార పక్షానికి వత్తాసుగా నిలుస్తున్న పచ్చమీడియానే అప్పుడప్పుడూ తన కథనాల ద్వారా చెబుతోంది. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రులు కొందరు, కూటమి ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతికి హద్దుల్లేకుండా పోయాయని టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతులు తమ కథనాల ద్వారా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వారు తీసుకుంటున్న జాగ్రత్త ఏమిటంటే.. రింగ్‌ మాస్టర్లు అదేనండి.. చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌కళ్యాణ్‌లకు ఎక్కడ మకిలి అంటకుండా నెపం ఇతరులపైకి నెట్టేయడం!. కిందటేడాది ఆగస్టు 28న చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓ మాట్లాడుతూ ఒక మాటన్నారు.. ‘‘ప్రభుత్వ ప్రతిష్ట పెంచేందుకు తాను ఇటుక ఇటుక పేరుస్తూంటే.. ఎమ్మెల్యేలు కొందరు జేసీబీలతో కూలగొడుతున్నారు. ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నా ఒకరిద్దరి తప్పుల వల్ల పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. బాబుగారి నేర్పరితనం ఏమిటంటే తన వైఫల్యాలు మొత్తాన్ని దారిమళ్లించేందుకు ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులను మందలించినట్లు పోజ్ పెట్టారు. సరే అనుకుందాం కాసేపు. మంత్రులు, ఎమ్మెల్యేలలో మార్పు వచ్చిందా? ఊహూ అదేమీ కనబడదు. చంద్రబాబు కూడా ఏ చర్య తీసకోకుండా కథ నడుపుతూంటారు. ఈ మధ్యకాలంలో కొందరు మంత్రులు అధికారుల బదిలీలు, పొస్టింగ్‌లలో భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు... ఒక మంత్రి హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో మకాం వేసి మరీ ఈ దందా చేస్తున్నారని టీడీపీ పత్రిక తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి తెలియ చేసిందని కూడా ఆ మీడియా పేర్కొంది. బ్లాక్‌మెయిలింగ్‌లో దిట్టగా పేరొందిన ఆ మీడియా బహుశా ఆ మంత్రిని బెదిరించడానికి ఏమైనా రాశారా? లేక నిజంగానే మంత్రి అలా చేశారా? అన్నది ఇంతవరకు అటు ఏపీ ప్రభుత్వం కాని, ఇటు తెలంగాణ ప్రభుత్వం కాని వెల్లడించలేదు. ఈ రెండు రాష్ట్రాల అధినేతల మధ్య పార్టీలకు అతీతంగా సాగుతున్న బంధాన్ని ఈ విషయం తెలియ చెబుతుంది. సదరు మంత్రి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని సోషల్ మీడియాలో ప్రచారమైంది. సీపీఎం నేతలు ఓపెన్‌గానే చెబుతున్నారు. అయినప్పటికీ ఆ మంత్రి ఖండించలేదు. చంద్రబాబు కాని, ఆయన పేషీ కానీ వివరణ కూడా ఇవ్వలేదు. పైగా ఈ మధ్య తిరుపతి సందర్శనలో కూడా చంద్రబాబు ఆ మంత్రిని పక్కన పెట్టుకుని తిరగడం విశేషం. మరో కథనం ప్రకారం.. ఆ మంత్రికి హైదరాబాద్ శివార్లలో ఉన్న భూమి విషయంలో ఏర్పడిన వివాదం రీత్యా తరచు ఇక్కడకు వచ్చి పంచాయతీ చేసుకుంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తున్నది చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరమా?. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో అవినీతి అధికారి అంటూ మరో జాకీ పత్రిక ఈ మధ్య ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే అచ్చెన్నాయుడుకు సంబంధం లేదన్నట్లుగా పిక్చర్ ఇచ్చినట్లు కనిపించినా, కేవలం ఒక అధికారి సొంతంగా అవినీతికి పాల్పడతారా? అలాగైతే ఆ మంత్రి అంత అసమర్థుడా అన్న ప్రశ్న వస్తుంది. ఈ కథనం ఇచ్చినప్పటికి ప్రభుత్వం పెద్దగా స్పందించినట్లు కనబడదు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పీఏపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ పీఏ ని తొలగించానని, తను ప్రైవేటుగా నియమించుకున్న వ్యక్తి అని అనిత వివరణ ఇచ్చినప్పటికీ, ఆ ఆరోపణలకు మంత్రికి సంబంధం లేదని అంటే ఎలా నమ్ముతారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. పవన్ కళ్యాణ్‌ ఈ విషయమై బీజేపీ పెద్దలకు ఢిల్లీలో ఫిర్యాదు చేసి వచ్చారని అంటారు. ఇక లోకేష్ కు అత్యంత సన్నిహితుడునని చెప్పుకుంటూ ఒక ప్రముఖుడు మైనింగ్ కాంట్రాక్టులు, పోస్టింగ్ లలో హవా సాగిస్తున్నారని, తనకు కావల్సింది తనకు ఇచ్చి, మీకు కావల్సింది మీరు తీసుకోండని ఓపెన్ గా చెబుతున్నారంటూ జాకీ పత్రిక చానా ముదురు శీర్షికన కథనాన్ని ఇచ్చింది. 'చానా" అనగానే అది సానా సతీష్ గురించే అని, అతను లోకేష్ తరపున వ్యవహారాలు చక్కదిద్దుతుంటారని టీడీపీలో ప్రచారం అయింది. అది రాజ్యసభ ఎన్నికల సమయం కావడంతో అతనికి టిక్కెట్ రాకుండా ఉండడానికి ఆంధ్రజ్యోతి పత్రిక బ్లాక్ మెయిలింగ్ వార్త రాసిందని కూడా టీడీపీ వర్గాలు భావించాయి. ఈ వార్త లోకేష్ కు తీవ్ర అప్రతిష్ట తెచ్చింది. దాంతో లోకేష్ కు, ఆంధ్రజ్యోతి యజమానికి మధ్య విభేదాలు పెరిగాయని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే లోకేష్ కు టీడీపీని నడిపే శక్తి ఇంకా రాలేదని వ్యాఖ్యానిస్తూ ఆ ఓనర్ తన వ్యాసంలో రాసి ఉంటారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూటమి నుంచి విడిపోతే టీడీపీ పరిస్థితి ఏమిటని కూడా ఆయన ఆందోళన చెందారు. విశేషం ఏమిటంటే ఆంధ్రజ్యోతి సానా సతీష్ పై అంత దారుణమైన కథనం ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు చంద్రబాబు రాజ్యసభ సీటు కేటాయించారు. ఎన్నికల సమయంలో భారీగా ఖర్చు చేసినందునే ఆయనకు ఆ పదవి ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్‌ పేషీ గురించి నేరుగా రాయకపోయినా, అక్కడ జరిగేవి ఇతర మంత్రులకు తెలియవా? అందుకే ఏ మంత్రిని మందలించే పరిస్థితి చంద్రబాబుకు లేదని కొందరి వాదనగా ఉంది. మరికొందరు మంత్రులపై కూడా పలు అభియోగాలు వస్తున్నాయి. చంద్రబాబు స్టైల్ ఏమిటంటే రహస్యంగా ఎవరు ఏమి చేసినా వారి జోలికి పద్దగా వెళ్లరు. అదే మరీ అల్లరైతే, తాను మందలించనట్లు ప్రచారం చేసుకుంటుంటారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు, కూటమి నేతలు మద్యం, ఇసుకలలో ఎలా దండుకుంది బహిరంగమే. నలభై లక్షల టన్నుల ఇసుక మాయమైపోయినా ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పెదవి కదపలేదు. మద్యం వ్యాపారంలో అనేక మంది ఎమ్మెల్యేలు 30 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే తండ్రి, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకరరెడ్డి ఏ మాత్రం భయం లేకుండా తనకు నిర్దిష్ట శాతం కమిషన్ చెల్లించాల్సిందేనని మద్యం షాపులకు హెచ్చరిక పంపించారు. అఅంతేకాదు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, జేసీ మధ్య పవర్ ప్లాంట్ బూడిద రవాణాపై చెలరేగిన గొడవ తెలిసిందే. చంద్రబాబు వారిని పిలిచి రాజీ చేయడానికి యత్నించారు. ఇక ప్రభాకర రెడ్డి కొందరు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయన జోలికి వెళ్లే ధైర్యం ఎవరికి లేదు. కాకపోతే జేసీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మైనింగ్ లీజుల దందాపై సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన చెప్పినట్లు వినాల్సిందేనని టీడీపీ ముఖ్యనేత ఆదేశించడంపై కూడా మైనింగ్ యజమానులు మండిపడుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న అరాచకంపై నిత్యం కథలు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఒక ఎస్టీ కుటుంబాన్ని వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ కుటుంబంలోని మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వార్తలు చెబుతున్నాయి. చిలకలూరి పేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టిన రోజు వేడుకకు పోలీసులు హాజరై కేక్ కట్ చేయించడం పై విమర్శలు వచ్చాయి. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య కూడా పోలీసు అధికారులపై రుసురుసలాడిన తీరు అందరికి బహిరంగ రహస్యమే. మదనపల్లె నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యే ఒకరికి నెలకు 30 లక్షల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఒక మహిళా తహశీల్దార్ మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన విషయం సంచలనమైంది. సదరు ఎమ్మెల్యే ఖండించినా నిప్పు లేకపోతే పొగరాదన్నట్లుగా అంతా భావించారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి దౌర్జన్యాలపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడలో ఒక దళిత ఫ్రొఫెసర్ ను ఆయన తన అనుయాయులతో కలిసి వెళ్లి బెదిరించారు. అలాగే ఒక టీషాపు ను కూల్చి వేయించిన విషయం వివాదాస్పదమైంది. వీటిని పట్టించుకోని పవన్ కళ్యాణ్ కడపలో ఒక మండల అధికారిపై వైసీపీ నేత ఎవరో దౌర్జన్యం చేశారంటూ అక్కడకు వెళ్లి హడావుడి చేసి వచ్చారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తాను చెబితే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లేనని, రేషన్ షాపుల వారిని, మధ్యాహ్న భోజనం ఏజెన్సిల, ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరించారు. ఇక కాంట్రాక్టర్ లను బెదిరించడం వంటివి నిత్య కృత్యమైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఏకంగా అదానీ కంపెనీ సిబ్బందిపైనే దాడి చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక మహిళా టీడీపీ నేత చేసిన లైంగిక వేధింపుల ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. వారి మధ్య టీడీపీ నేతలు రాజీ చేశారు తప్ప ఆయనపై చర్య తీసుకోకపోవడం విశేషం. కృష్ణపట్నం ఓడరేవు సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. మద్యం దుకాణాలలో ఎమ్మెల్యేకి వాటా ఇవ్వలేదని నరసరావుపేటలో ఆయన అనుచరులు రెస్టారెంట్ పై దాడి చేసి వధ్వంసం సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. జనసేన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మట్టి దందాకు పాలపడుతున్నాడని కథనాలు వచ్చాయి. రోజూ ఇలాంటి స్టోరీలు పుంఖానుపుంఖాలు గా వస్తున్నా కూటమి అధినేతలు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. మరో వైపు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కు ఐదువేల ట్రాన్స్ ఫార్మర్లకు ఆర్డర్లు ఇచ్చారంటూ ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. ఆ కంపెనీ యజమాని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ కు సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఆర్డర్ ఇవ్వరాదట. ఆ ఆర్డర్ చంద్రబాబుకు తెలియకుండా ఇచ్చారని ఈ పత్రిక చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. అంత పెద్ద ఆర్డర్ ముఖ్యమంత్రికి తెలియకుండా వెళుతుందా? ఇవన్ని చూశాక ఎవరికైనా ఏమనిపిస్తుంది? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా పాలన సాగిస్తోందన్న అభిప్రాయం రాదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Sankranti 2025: Significance Of Bhogi Festival And Rituals5
భోగభాగ్యాల భోగి పండగ దేనికి సంకేతమంటే.?

'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని శాస్త్ర వచనం. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. మరోక అర్థంలో భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా 'భోగి పండగ' ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. అలాంటి ఈ పండుగను అనాథిగా ఆచారిస్తూ రావడానికి గల కారణం, ఆరోగ్య రహాస్యలు గురించి సవివరంగా చూద్దామా..!భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి…దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయానం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి.. ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెబుతున్నారు.ఆరోగ్య రహస్యం..ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. అందువల్లే భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వచ్చింది. భోగి మంటలు ఎందుకంటే..చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. పురాణాల ప్రకారం, దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటిముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని కోరాడు. అనంతరం రురువు వర గర్వంతో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఈ ధనుర్మాసంలో 30 రోజులపాటు ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టి.. ఆ తర్వాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుడిని అందులో తోస్తారు. అలా రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తోంది.ఈ పండగ సందేశం, అంతరార్థం..చలికాలంలో సూక్ష్మక్రిముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగిపోవడానికి మన పెద్దలు ఇలా భోగి మంటలు వేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారని చెబుతుంటారు. ఇక ఈ పండుగ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే..చెడు అలవాట్లను, అసూయా, ఈర్ఘ, దుర్భద్ధిని ఈ మంటల రూపంలో దగ్ధం చేసుకుని మంచి మనుసుతో జీవితాన్ని ప్రారంభించి సానుకూలా ఆలోచనలతో మంచి విజయాలను అందుకోవాలనే చక్కటి సందేశాన్ని ఇస్తోంది. మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమని ప్రార్థిస్తూ అగ్నిహోత్రాన్ని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలు, అలాగే మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో వేసి దగ్ధం చేసుకోవటమే భోగి. ఇలా మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం.(చదవండి: సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!)

 Daughter Did Funerals of Her Father In visakhapatnam6
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన తనయ

మల్కాపురం: మృతి చెందిన కన్నతండ్రికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మల్కాపురంలో జరిగింది. గాంధీజివీధికి చెందిన చొప్పా సూరిబాబు (60) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయనకు కుమారులు లేకపోవటం, అల్లుళ్లు ముందుకు రాకపోవడంతో దుఃఖాన్ని దిగమింగుకొని కన్నకూతురే దహన సంస్కరాలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఆర్టీసీ అద్దె బస్సుకు సూరిబాబు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకుంది. చిన్న బాస్‌ క్లాస్‌మేట్‌.. విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను

This Pongal Week Ott Release Movies List Here7
సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. నగరాలు వదిలి పల్లె చేరుకున్న ప్రజలు పండుగ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఇవాల్టి నుంచి భోగితో మొదలైన.. కనుమతో ఈ సంక్రాంతి మూడు రోజుల పాటు సాగనుంది. ఇంకేముంది కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసే సినిమాలు కూడా రెడీ అ‍య్యాయి. ఈ సంక్రాంతిని మరింత సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేందుకు థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ ఇప్పటికే విడుదలయ్యాయి. వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వ‍స్తున్నాం పండుగ రోజే బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది.ఈ పండుగ వేళ కుటుంబంతో కలిసి సినిమాలను ఆస్వాదించేందుకు ఓటీటీలే సరైన వేదిక. ఈ సంక్రాంతి వేళ సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ సినిమాలు సిద్ధమైపోయాయి. అయితే ఈ పండుగు ఓటీటీల్లో పెద్ద సినిమాలు లేకపోవడం మైనస్. విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించిన విడుదల పార్ట్‌-2 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ మూవీ. దీంతో బాలీవుడ్‌ ఐ వ్యాంట్ టు టాక్ అనే సినిమాతో పాటు పలు హాలీవుడ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. ఈ వారంలో ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్‌సింగిల్స్ ఇన్‌ఫెర్నో(కొరియన్ రియాలిటీ షో) సీజన్ 4- 14 జనవరివిత్ లవ్ మెగాన్- హాలీవుడ్- జనవరి 15జో కిట్టీ సీజన్-2 - కొరియన్ వెబ్ సిరీస్- 16 జనవరిబ్యాక్ ఇన్ యాక్షన్-(హాలీవుడ్ మూవీ)- 17 జనవరిది రోషన్స్- హిందీ డాక్యుమెంటరీ సిరీస్- 17 జనవరిఅమెజాన్ ప్రైమ్ వీడియోఐ వ్యాంట్ టు టాక్- హిందీ సినిమా- జనవరి 17పాతల్ లోక్ సీజన్-2- 17 జనవరిడిస్నీ ప్లస్ హాట్‌స్టార్పవర్ ఆఫ్ పాంచ్- (హిందీ వెబ్ సిరీస్)- 17 జనవరిజీ5విడుదల పార్ట్-2- తమిళ సినిమా- జనవరి 17 సోని లివ్పణి- మలయాళ సినిమా- 16 జనవరిఅమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్చిడియా ఉద్- హిందీ సిరీస్- జనవరి 15ఎపిక్ ఆన్గృహ లక్ష్మి- హిందీ సిరీస్- జనవరి 16జియో సినిమాస్పీక్ నో ఈవిల్- హాలీవుడ్ సినిమా- జనవరి 13హర్లీ క్వీన్- సీజన్ -5(హాలీవుడ్)- జనవరి 17లయన్స్ గేట్ ప్లేహెల్ బాయ్- ది క్రూక్‌డ్ మ్యాన్-(హాలీవుడ్ మూవీ)- జనవరి 17మనోరమ మ్యాక్స్ఐ యామ్ కథలాన్(మలయాళ సినిమా)- జనవరి 17

IPL 2025 Shreyas Iyer Named As Punjab Kings Captain8
IPL 2025: కెప్టెన్‌ పేరును ప్రకటించిన పంజాబ్‌ కింగ్స్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings) జట్టు తమ కొత్త కెప్టెన్‌ పేరును ప్రకటించింది. ఐపీఎల్‌-2025 సీజన్‌కు గానూ టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer)ను తమ సారథిగా ఎంపిక చేసుకుంది. కాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో కెప్టెన్‌గా ఈ ముంబై బ్యాటర్‌కు మంచి అనుభవం ఉంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లకు అతడు నాయకుడిగా వ్యవహరించాడు.కోల్‌కతాకు టైటిల్‌ అందించిఇక గతేడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన 30 ఏళ్ల శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. అయితే, మెగా వేలం-2025(IPL Mega Auction 2025)కి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ అతడిని రిటైన్‌ చేసుకుంటుందని విశ్లేషకులు భావించగా.. శ్రేయస్‌ మాత్రం జట్టుతో బంధాన్ని తెంచుకునేందుకే ఇష్టపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు రూ. 2 కోట్ల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చాడు.భారీ ధర.. ఈ చాంపియన్‌ కెప్టెన్‌ను దక్కించుకునేందుకు పాత జట్టు కోల్‌కతా తొలుత రంగంలోకి దిగగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తగ్గేదేలే అన్నట్లు ధరను పెంచుకుంటూ పోయాయి. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన వేలం పాటలో ఆఖరికి పంజాబ్‌ నెగ్గింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 26 కోట్ల 75 లక్షలు పెట్టి శ్రేయస్‌ అయ్యర్‌ను కొనుగోలు చేసింది. తాజాగా అతడికి పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.నమ్మకాన్ని నిలబెట్టుకుంటాఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. ‘నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. హెడ్‌ కోచ్‌ రిక్కీ పాంటింగ్‌తో మరోసారి కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా చూస్తున్నా. జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ఇప్పటికే నిరూపించుకున్న ఆటగాళ్లతో పాటు ప్రతిభావంతులు చాలా మంది అందుబాటులో ఉన్నారు.పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు తొలి ఐపీఎల్‌ టైటిల్‌ అందించేందుకు నావంతు కృషి చేస్తా’ అని శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. ఇక.. ప్రధాన కోచ్‌ పాంటింగ్‌ మాట్లాడుతూ ‘శ్రేయస్‌కు ఆటపై మంచి అవగాహన ఉంది. కెప్టెన్‌గా ఇప్పటికే నిరూపించుకున్నాడు. గతంలో అతడితో కలిసి పనిచేశా. సీజన్‌ కోసం ఆతృతగా చూస్తున్నా’ అని అన్నాడు.కాగా ఇటీవల శ్రేయస్‌ అయ్యర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. 2024లో రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలు గెలిచిన ముంబై జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌ సభ్యుడు. అంతేకాదు.. ఇటీవల అతడి కెప్టెన్సీలో ముంబై టీమ్‌ దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నమెంట్‌ టైటిల్‌ గెలిచింది.సూపర్‌ ఫామ్‌లోఅదే విధంగా.. దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలోనూ శ్రేయస్‌ అయ్యర్‌ భారీ శతకాలతో దుమ్ములేపాడు. తదుపరి అతడు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశం ఉంది. అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడే భారత జట్టులో మాత్రం అయ్యర్‌కు చోటు దక్కలేదు. కాగా శ్రేయస్‌ అయ్యర్‌ చివరిసారిగా గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు.గతేడాది ఫ్లాప్‌ షోఇదిలా ఉంటే.. పంజాబ్‌ కింగ్స్‌ ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ గెలవలేదు. ఇక గత సీజన్‌లో శిఖర్‌ ధావన్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా.. గాయం వల్ల అతడు ఆదిలోనే తప్పుకోగా.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ జట్టును ముందుకు నడిపించాడు. అయితే, పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ పంజాబ్‌ కేవలం ఐదే గెలిచి.. తొమ్మిదో స్థానంతో సీజన్‌ను ముగించింది. చదవండి: వన్డేల్లో ట్రిపుల్‌ సెంచరీ.. సంచలనం సృష్టించిన ముంబై బ్యాటర్‌𝐒𝐡𝐫𝐞𝐲𝐚𝐬 𝐈𝐲𝐞𝐫 ➡️ 𝐓𝐡𝐞 𝐜𝐡𝐨𝐬𝐞𝐧 𝐨𝐧𝐞! ©️♥️#CaptainShreyas #SaddaPunjab #PunjabKings pic.twitter.com/EFxxWYc44b— Punjab Kings (@PunjabKingsIPL) January 12, 2025

California Wildfires live Updates: Los Angeles Latest Jan 13 2025 News9
అయ్యో.. లాస్ ఏంజెలెస్‌! 24కు చేరిన మృతుల సంఖ్య

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఎంతకీ శాంతించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమై ప్రాంతంపై వరుసగా ఆరో రోజు కూడా దాని ప్రతాపం చూపించింది. దీనికారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 24కి చేరింది. మరో పాతిక మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. తీవ్రమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి. ‘‘అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యం’’ అని కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌ అభివర్ణించారు. కార్చిచ్చు(Wildfires)తో ఇటిప్పదాకా 24 మంది బలయ్యారు. పాలిసేడ్స్‌లో 8 మంది, ఎటోన్‌లో 16 మంది మరణించారు. చనిపోయినవాళ్లలో ‘కిడ్డీ కాపర్స్‌’ ఫేమ్‌ నటుడు రోరీ సైక్స్‌ కూడా ఉన్నాడు. కార్చిచ్చుతో ఆర్థికంగా వాటిల్లిన నష్టం 150 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. ఇప్పటివరకూ కార్చిచ్చుతో 62 చదరపు మైళ్ల విస్తీర్ణం దగ్ధమైంది. 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇది శాన్‌ ఫ్రాన్సిస్కో వైశాల్యం కన్నా అధికం. ఇక.. పాలిసేడ్స్‌ ఫైర్‌ను 11శాతం, ఎటోన్‌ ఫైర్‌ను 15 శాతం అదుపు చేయగలిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మంటలను ఆర్పివేయడానికి స్థానిక అగ్నిమాపక దళంతో పాటు కెనడా, మెక్సికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తంగా 14 వేల మంది సిబ్బంది, 1,354 అగ్నిమాపక యంత్రాలు, 84 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇందులో పాలుపంచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.మరోవైపు.. లాస్‌ ఏంజెలెస్‌ కౌంటీలో 1.5 లక్షల మందిని నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశించిట్లు తెలిపారు. ఇప్పటికే ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నవారికి నిత్యావసరాలు, దుస్తులు అందించేందకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.సంబంధిత వార్త: ఎందుకీ కార్చిచ్చు!ఇక వినాశం(Disaster movies) ఆధారంగా సినిమాలు తీసే హాలీవుడ్‌లో.. మంటలతో అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలువురు తారలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆంటోనీ హోప్‌కిన్స్‌, పారిస్‌ హిల్టన్‌, మెల్‌ గిబ్సన్‌, బిల్లీ క్రిస్టల్‌ లాంటి తారల ఇళ్లు కార్చిచ్చు ధాటికి బూడిదయ్యాయి. ఇదిలా ఉంటే.. కాలిఫోర్నియా కార్చిచ్చు రాజకీయ రంగు పులుముకుంది. అధికారుల చేతగానితనమేనని కాబోయే అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ విమర్శించగా.. డెమోక్రట్‌ సెనేట్‌, కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌ ఆ విమర్శలను తిప్పి కొట్టారు. అంతేకాదు.. లాస్‌ ఏంజెలెస్‌ పూర్తిగా నాశనం కావడంతో.. ‘‘లాస్‌ ఏంజెలెస్‌ 2.0’’ పేరిట పునర్మిర్మాణ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారాయన. మరోవైపు.. ఫెడరల్‌తో పాటు స్థానిక దర్యాప్తు సంస్థలు కార్చిచ్చు రాజుకోవడానికి గల కారణాలను పసిగట్టే పనిలో ఉన్నాయి. హాలీవుడ్‌ స్టార్ల నిర్వాకంతో..ఇదిలా ఉంటే.. మంటల్ని ఆర్పేందుకు నీటి కోరత అక్కడ ప్రధాన సమస్యగా మారింది. అయితే.. హాలీవుడ్‌ స్టార్ల నిర్వాకం వల్లే లాస్‌ ఏంజెలెస్‌కి ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలాలను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయడంతో.. మంటలను చల్లార్చేందుకు నీటి కొరత ఎదురవుతోందని చెబుతున్నారు. కొందరు స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడుకున్నారంటూ డెయిలీ మెయిల్‌ ఓ కథనం ప్రచురించింది.నటి కిమ్‌ కర్దాషియన్‌ ది ఓక్స్‌లోని తన ఇంటి చుట్టూ తోటను పెంచేందుకు తనకు కేటాయించిన నీటి కంటే అధికంగా నీటిని వాడినట్లు అధికారులు గుర్తించారు. అలాగే.. సిల్వస్టర్‌ స్టాలోన్, కెవిన్‌ హార్ట్‌ వంటి వారు అదనంగా నీరు వాడుకుని జరిమానాలు చెల్లించారు. కొందరు హాలీవుడ్‌ స్టార్లు గంటకు 2,000 డాలర్లు చెల్లించి.. ప్రైవేటు ఫైర్‌ఫైటర్లను నియమించుకున్నారని డెయిలీ మెయిల్‌ పేర్కొంది. ఇక ప్రస్తుతం పసిఫిక్‌ పాలిసేడ్స్‌లో అన్ని హైడ్రెంట్లు పనిచేస్తున్నాయని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ పేర్కొంది. కానీ, 20శాతం హైడ్రెంట్లలో నీటి ప్రెజర్‌ చాలకపోవడంతో.. కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: అందుకే కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలిగా: అనిత

Meta CEO Mark Zuckerberg Slams Apple10
యాపిల్‌పై జుకర్‌బర్గ్ తీవ్ర వ్యాఖ్యలు

దిగ్గజ పారిశ్రామిక వేత్త, మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg).. 'జో రోగన్ ఎక్స్‌పీరియన్స్'లో మాట్లాడుతూ యాపిల్ (Apple)ను విమర్శించారు. గ్లోబల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చినందుకు ఐఫోన్‌లను ప్రశంసిస్తూనే.. కంపెనీ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం లేదని, ఈ విషయంలో యాపిల్ విఫలమైందని అన్నారు.ఐఫోన్ బాగుంది, ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది దగ్గర ఇప్పుడు ఈ ఫోన్ ఉందని చెబుతూనే.. సంస్థ కొంతకాలంగా గొప్పగా ఏమీ కనుగొనలేదని జుకర్‌బర్గ్ వెల్లడించారు. స్టీవ్ జాబ్స్ ఐఫోన్‌ను కనుగొన్నారు. అయితే సంస్థ కేవలం దానిపై 20ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రతి ఏటా కొత్త వెర్షన్స్ లాంచ్ చేస్తోంది. కానీ అవి పాత వెర్షన్ల కంటే మెరుగ్గా లేదు. ఈ కారణంగానే చాలా తక్కువ మంది మాత్రమే కొత్త ఐఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.సంస్థ అందిస్తున్న కొత్త ఐఫోన్ మోడళ్లలో పెద్దగా అప్‌గ్రేడ్‌లు లేకపోవడం వల్ల ఫోన్ విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే కంపెనీ కొనుగోలుదారులపై, డెవలపర్‌లపై ఈ 30 శాతం పన్ను విధిస్తోందని.. ఇలాంటి వాటి వల్లనే యాపిల్ లాభపడుతోందని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.యాపిల్ ఇతర కంపెనీల పరికరాలను iPhoneలతో సజావుగా ఎలా పని చేయనివ్వదు అనే దాని గురించి జుకర్‌బర్గ్ కలత చెందారు. దీనికి ఆయన ఎయిర్‌పాడ్‌లను ఉదాహరణగా చూపాడు, అదే కనెక్షన్ టెక్నాలజీని ఉపయోగించకుండా ఇతర కంపెనీలను బ్లాక్ చేస్తుందని వివరించారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాతమ రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ కోసం యాపిల్ కనెక్షన్ ప్రోటోకాల్‌ను ఉపయోగించమని మెటా చేసిన అభ్యర్థనను.. భద్రతా కారణాల వల్ల యాపిల్ తిరస్కరించింది. వినియోగదారు గోప్యత పట్ల నిజమైన ఆందోళన కంటే కూడా వ్యాపార ప్రయోజనాల కారణంగా అభ్యర్థనను తిరస్కరించినట్లు జుకర్‌బర్గ్ చెప్పారు.యూజర్ల గోప్యత, భద్రతపై యాపిల్ వైఖరిని ఆయన విమర్శించారు. యాపిల్ కనిపెట్టిన కొత్త వాటిలో 'విజన్ ప్రో' ఒకటి మాత్రమే అని నేను అనుకుంటున్నానని.. కంపెనీ మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్ గురించి జుకర్‌బర్గ్ ప్రస్తావించారు. ఇది కూడా సరైన అమ్మకాలు పొందలేదని ఆయన అన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
Maha Kumbh-2025: అండర్‌ వాటర్‌ డ్రోన్లు.. ఏఐ కెమెరాలు.. ఫ్లోటింగ్‌ పోలీస్‌ పోస్టులతో నిఘా

ప్రయాగ్‌రాజ్‌: మహాకుంభమేళా..

title
ఆర్టికల్‌ రద్దుతో సంబంధమే లేదు.. మోదీకి ఒమర్‌ అబ్దుల్లా ఝలక్‌

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో ​ప్రధాని మోదీ పర్యటన వేళ ముఖ్యమం

title
Delhi Election-2025: అందరి దృష్టి షకూర్‌ బస్తీపైనే.. ఆ పార్టీల మధ్య హోరాహోరీ?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి.

title
46 ఏళ్ల ‘పవార్‌’ రాజకీయానికి బీజేపీ చెక్‌ పెట్టింది: అమిత్‌ షా

ముంబై: ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ లక్ష్యంగా కేంద్ర

title
Mahakumbh 2025: ఇప్పటికే 85 లక్షలమంది పుణ్యస్నానాలు!

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

International View all
title
కెనడా అమ్మకానికేం లేదు!.. ట్రంప్‌కు ఘాటు హెచ్చరిక

న్యూఢిల్లీ: కెనడాను అమెరికాలో విలీనం చేసే ప్రణాళికలో ఉ‍న్న అమెరికా నూతన అధ్

title
పాకిస్తాన్‌లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..

ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలో బంగారం పండింది.

title
అయ్యో.. లాస్ ఏంజెలెస్‌! 24కు చేరిన మృతుల సంఖ్య

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఎంతకీ శాంతించడం లేదు.

title
మహిళల్లో మద్యం అలవాటుకు ఈస్ట్రోజన్‌కు లింకు

న్యూఢిల్లీ: ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్థాయిలు పెరిగిన సందర్భాల్

title
కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలిగిన అనిత

ఒట్టావా: కెనడా ప్రధాని బరినుంచి భారత సంతతికి చెందిన అనితా ఆన

NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement

వీడియోలు

Advertisement