Top Stories
ప్రధాన వార్తలు
సినీ పెద్దలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. చిత్ర పరిశ్రమకు చెందిన సుమారు 50 మంది ప్రముఖులు గురువారం సీఎంను కలిసి ఇండస్ట్రీలోని సమస్యలు పంచుకున్నారు. అయితే, ఈ క్రమంలో సీఎం పలు విషయాలను వారితో చర్చించారు. ప్రభుత్వం ఎప్పటికీ ఇండస్ట్రీతోనే ఉందని సీఎం గుర్తుచేశారు. అయితే, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. సినిమా విడుదల సమయంలో అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సీఎం కోరారు.ఈ అంశాలపై ప్రధాన చర్చడ్రగ్స్కు వ్యతిరేకంగా సినిమా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలి.తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ప్రోత్సహకాలను ప్రచారం చేయాలి.ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు యాడ్ ప్లే చేయాలి.సినిమా విడుదల సమయంలో హీరోల ర్యాలీలకు అనుమతి ఉండదు.సినిమా టికెట్లపై విధించే సెస్సు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి.బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండవని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి.అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టబడి ఉంటామని తేల్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో నటీనటులు అందరూ సహకరించాలి.చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ అండగా ఉంటామని సీఎం భరోసా.ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా కేసులు పెట్టలేదని క్లారిటీ ఇచ్చిన సీఎం.సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించిన పోలీసులు
చంద్రబాబుకు ఒక రూల్.. కేటీఆర్‌కు మరొకటా?
బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌పై ఈ ఫార్ములా రేస్ విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది. కేటీఆర్‌పై కేసు కూడా పెట్టేసిందట. ఇది ఆశ్చర్యంగానే ఉంది. అందులో ఏమైనా మెటీరియల్ ,ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే,ఇది రాజకీయ కేసు అని తెలిసి కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి. పోనీ అన్ని కేసుల్లోను ఇంతే వేగంగా ఈడీ వస్తుంటే ఫర్వాలేదు. కాని కొందరు నేతల విషయంలో అసలు వారి జోలికే వెళ్లదు. అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో, ఎవరిపై పెట్టకూడదో ఈడీ,సీబీఐ వంటి సంస్థలు నిర్ణయించుకుంటాయన్న విమర్శలకు ఈ పరిణామం ఊతం ఇస్తుంది. కేటీఆర్‌పై అనూహ్యమైన రీతిలో స్పందించిన ఈడీ, అదే ఏపీలో గతంలో చంద్రబాబుపై వచ్చిన కేసుల విషయంలో ఎందుకు స్పందించలేదన్నది పలువురి ప్రశ్నగా ఉంది. తెలంగాణలో రాజకీయంగా బలపడాలన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ను వీక్ చేయడానికి చేస్తున్న ప్లాన్ లో ఇవన్ని భాగమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పార్లమెంటులో సైతం ఈడీ,సీబీఐ అనుసరిస్తున్న పద్దతుల గురించి విపక్ష సభ్యులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఈడీ,సీబీఐలను ఆయా నేతలపైకి ఉసికల్పడం, వారు భయపడి బీజేపీలోకి రాగానే కేసులు మూలపడడం జరిగిపోతోందన్నది వారి విమర్శ. దీనినే వాషింగ్ మిషన్ ట్రీట్ మెంట్ అంటే బీజేపీలో చేరగానే పరిశుభ్రం అయిపోతున్నారని ఎద్దేవ చేస్తుంటారు. దానికి తగినట్లుగానే ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరగానే వారిలో ఇద్దరిపై ఉన్న బ్యాంకు రుణాల ఎగవేత కేసులు చప్పబడిపోయాయని అంటారు.మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పై ఈ ఫార్ములా రేస్ విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది.కేటీఆర్ పై కేసు కూడా పెట్టేసిందట. ఇది ఆశ్చర్యంగానే ఉంది. అందులో ఏమైనా మెటీరియల్ ,ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే,ఇది రాజకీయ కేసు అని తెలిసి కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి. పోనీ అన్ని కేసుల్లోను ఇంతే వేగంగా ఈడీ వస్తుంటే ఫర్వాలేదు. కాని కొందరు నేతల విషయంలో అసలు వారి జోలికే వెళ్లదు. అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో, ఎవరిపై పెట్టకూడదో ఈడీ,సీబీఐ వంటి సంస్థలు నిర్ణయించుకుంటాయన్న విమర్శలకు ఈ పరిణామం ఊతం ఇస్తుంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించగానే, ఎన్‌సిపి చీలిక వర్గం నేత అజిత్ పవార్ కు క్లీన్ చిట్ వచ్చేసిందని చెబుతారుఇప్పుడు తెలంగాణలో ఈ ఫార్ములా కేసులో కూడా అలాగే బీజేపీ వ్యవహరిస్తోందా? అన్నదానికి అప్పుడే అవునని చెప్పలేకపోయినా, ఈడీ వాయు వేగంతో వ్యవహరించిన తీరుపై డౌట్లు వస్తాయి.హైదరాబాద్ లో ఈ ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి ఆ సంస్థకు సుమారు 55 కోట్ల మేర నిధులు విడుదల చేయడం తప్పన్నది ప్రభుత్వ వాదన.ఇందులో నిధుల దుర్వినియోగం జరిగిందన్నది ఏసీబీ కేసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసులో ఇంకేదో ఉందని, 600 కోట్ల అవినీతి అని కొత్త విషయం శాసనసభలో చెప్పారు. ఆ విషయం ఫార్ములా రేస్ సంస్థవారే వెల్లడించారని,కేటీఆర్ రహస్య ఒప్పందాలు చేసుకున్నారని,ఆయన చెవిలో చెప్పారట.ఇందులో నిజం ఉందో లేదో కాని,వినడానికి మాత్రం నమ్మశక్యంగా లేదనిపిస్తుంది. ఎందుకంటే తన ఆధ్వర్యంలోని ఏసీబీ 55 కోట్లు నిధుల దుర్వినియోగం అని చెబుతుంటే, ఏకంగా ముఖ్యమంత్రి అది 600 కోట్లు అని అనడం కేవలం ప్రచారం కోసమే అన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లయింది.దీనిపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు.అక్కడ వారు ఈ నెలాఖరువరకు అరెస్టు చేయవద్దని, అయితే కేసు దర్యాప్తు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు.అది వేరే సంగతి. ఈ దశలో ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఏసీబీకి లేఖ రాయడం, కేటీఆర్ ,ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేయడం జరిగిపోయింది.ఇది ఏసీబీ కేసు ఆధారంగానే జరిగింది.ఇదంతా రేవంత్ రెడ్డి, బీజేపీ కుమ్మక్కు వల్లేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.కేటీఆర్ పై కేసు పెట్టడానికి గవర్నర్ ఓకే చేసిన తర్వాత వేగంగా ఈ పరిణామాలు సంభవించాయి.కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి కేటీఆర్ వెళితే ఈ కేసులో గవర్నర్ అనుమతి రాకుండా చేసుకోవడానికే అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. తీరా చూస్తే గవర్నర్ పర్మిషన్ ఇవ్వడమే కాదు.. ఈడీ కూడా వచ్చేసింది.ఇప్పుడు కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసు నేపధ్యం ఇలా ఉంటే గతంలో జరిగిన కొన్ని విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. 2019 లో చంద్రబాబు ప్రభుత్వంఓడిపోయిన తర్వాత కొద్ది నెలలకు ఆదాయపన్ను శాఖ అధికారులు చంద్రబాబు పిఎస్ ఇంటిపై దాడి చేసి పలు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ప్రకటించారు. ఏకంగా రెండువేల కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని సిబిటిడి సాధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పటికి ఐదేళ్లు అయినా ఆ వ్యవహారంపై అతీగతీ లేదు.అంటే ప్రధానమంత్రినో,హోం మంత్రినో, ఆర్ధిక మంత్రినో మేనేజ్ చేసుకుంటే ఎలాంటి కేసు అయినా విచారణ లేకుండా ఆగిపోతుందా అని సామాన్యుడు ఎవరికైనా సందేహం వస్తే ఏమి చెప్పగలం.దేశంలో చట్టాలు కొందరికి చుట్టాలు అన్న నానుడిని నిజం చేసినట్లే కదా? గతంలో జగన్ ప్రభుత్వ టైమ్ లో అమరావతి భూములలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసింది.దానిని పట్టించుకోలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిధులు 350 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, ఈ నిధులలో సింహభాగం షెల్ కంపెనీలకు, చివరికి టిడిపి బ్యాంక్ ఖాతాకు చేరాయని అప్పట్లో సిఐడి ఆధార సహితంగా చూపుతూ ఈడీకి కూడా తెలియచేసింది. నిజానికి తొలుత ఈ కేసును జిఎస్టి అదికారులు గుర్తించారు.దానిని ఈడీ టేకప్ చేసి కొందరిని అరెస్టు కూడా చేసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు అది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది.ఆయన ప్రమేయంతోనే రూల్స్ తో నిమిత్తం లేకుండా నిధులు విడుదల అయ్యాయని అభియోగం చేసింది.ఈ కేసులో చంద్రబాబును సిఐడి రిమాండ్ కు తీసుకుంది.ఏభైమూడు రోజుల పాటు జైలులో ఉండి ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పై బయటకు వచ్చారు.ఆ తర్వాత పరిణామాలలో బీజేపీకి చంద్రబాబు దగ్గరయ్యారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కాగలిగారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.అంతే! ఈడీ ఈ కేసులో వేరే వారి ఆస్తులు జప్తు చేసింది తప్ప , చంద్రబాబు ఊసే ఎత్తలేదు. చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వలేదని కేంద్రం చెబుతున్నా,కేసు ఎందుకు ముందుకు కదలడం లేదన్నదానికి జవాబు దొరకదు.ఇప్పుడు చంద్రబాబు అదికారంలోకి రాగానే ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి అన్ని వ్యూహాలను పన్నుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.ఆ కేసులను నీరుకార్చడానికి ఢిల్లీ నుంచి తమ లాయర్ సిద్దార్ధ్ లూధ్రాను రంగంలోకి తెచ్చి, ఏకంగా పోలీసు ఉన్నతాధికారులనే ఆయన వద్దకు పంపి సమాలోచనలు జరిపించారట.ఈ క్రమంలోనే గతంలో ఈ కేసులు పెట్టిన సిఐడి అదికారులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు.వారిప వేర్వేరు కేసులు పెట్టి , సస్పెండ్ చేస్తున్నారు.ఇది మంచి పరిణామం అవుతుందా?అన్నది చర్చ. ఒకవేళ ఈ ప్రభుత్వం మారి భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగితే, ఇప్పుడు ఈప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహించారని అనేక మంది పోలీసు లేదా,ఇతర శాఖల అధికారులపై చర్యలు ఉండవా?అంటే కచ్చితంగా ఉంటాయని చెప్పాలి. రాజకీయాలలో టిట్ ఫర్ టాట్ అన్నది ఒక నానుడి. కాని ఈలోగా వ్యవస్థకు జరగాల్సి డామేజి జరిగిపోతుంది. అంతేకాదు.ఏకంగా ఏపీలో అయితే చంద్రబాబు కేసులు ఉన్న ఒక న్యాయమూర్తి ఇంటి వద్ద ఇంటెలెజెన్స్ అదికారులు కొందరు నిఘా పెట్టారట.ఈ విషయాన్ని ఆ జడ్జిగారే స్వయంగా కోర్టులో పోలీస అధికారులను ప్రశ్నించారు.ఇది చాలా సంచలన విషయం. అయినా ఎల్లో మీడియా ఇలాంటివాటిని కప్పిపెడుతోంది.గతంలో జయలలితపై కేసులు వచ్చాయి. అంతలో ఆమె ముఖ్యమమంత్రి అయ్యారు.తదుపరి ఆ కేసులను కర్నాటక రాష్ట్ర హైకోర్టుకు బదలీ చేశారు.చంద్రబాబు పై ఉన్న కేసులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్ కూడా పడింది. కాని అది ఇంకా విచారణకు వచ్చినట్లు లేదు.పెద్ద నాయకులపై అవినీతి కేసులు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా వ్యవస్థలు తయారు కాకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతుంది. తమకు ఇష్టం లేని నేతలపై కేసులు పెట్టడం, తమకు సరెండర్ అయిపోతే వాటిని పక్కనవేయడం, లేదా వారి మెడపై కత్తిమాదిరి వేలాడదీసినట్లు ఉంచడం.. ఇవి ఆయా వ్యవస్థల జవాబుదారితనాన్ని దెబ్బతీస్తాయి. గతంలో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారని ఆయనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టింది చూశాం. ఆ విషయాన్ని అప్పటి బీజేపీ నేత సుష్మ స్వరాజ్ పార్లమెంటులోనే వెల్లడించారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే మాదిరి వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు కేసుల విషయంలో ఈడీ,సీబీఐ, ఆదాయపన్ను శాఖ ఎందుకు స్పందించలేదు?కేటీఆర్ కేసులోనే ఈడీ ఎందుకు అతిగా రియాక్ట్ అయింది?తాజాగా కాకినాడ సీపోర్టు షేర్ల బదలాయింపు విషయంలో కూడా ఈడీ ఇలాగే వేగంగా స్పందించడం గమనార్హం. ఈడీ తన బాద్యత నిర్వహిస్తే తప్పుకాదు. కాని కొందరి విషయంలోనే చేస్తే అది సంస్థ నిష్పక్షపాతం పై మరక పడుతుంది. పలుకుబడి ,పరపతితో పాటు, మేనేజ్ మెంట్ స్కిల్ లేకపోతే నేతలకు ఇలాంటి చిక్కులు వస్తాయా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
పులివెందులలో ప్రజాదర్బార్.. వినతులు స్వీకరిస్తున్న వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్బంగా వైఎస్ జగన్ నేడు ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్యాంపు ఆఫీసుకు వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో ఉన్నారు. ఈ సందర్భంగా నేడు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ప్రజాదర్బర్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాలు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు.
ముగిసిన తొలి రోజు ఆట.. పైచేయి సాధించిన ఆస్ట్రేలియా
IND vs AUS 4th Test Live Updates and highlights: ముగిసిన తొలి రోజు ఆట..మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.క్రీజులో స్టీవ్ స్మిత్(68 బ్యాటింగ్), కమ్మిన్స్(8) ఉన్నారు. తొలి రెండు సెషన్స్‌లో ఆస్ట్రేలియా అధిపత్యం చెలాయించగా.. ఆఖరి సెషన్లో భారత బౌలర్లు కమ్‌బ్యాక్ ఇచ్చారు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. విధ్వంసకర ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసి తిరిగి గేమ్‌లోకి తీసుకొచ్చాడు.భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్, సుందర్, జడేజా తలా వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో కాన్స్టాస్(60), ఖావాజా(57), లబుషేన్(72), స్మిత్(68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఆరో వికెట్ డౌన్.. అలెక్స్ క్యారీ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ.. ఆకాష్ దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 84 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 303/6. క్రీజులో కమ్మిన్స్(1), స్మిత్(1) పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న స్మిత్, క్యారీ..ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టీవ్ స్మిత్(65 నాటౌట్), అలెక్స్ క్యారీ(21 నాటౌట్) నిలకడగా ఆడుతున్నారు. 77 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ..ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మరో టెస్టు హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. స్మిత్ 50 పరుగులతో తనం బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 71 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 251/5. క్రీజులో స్మిత్‌తో పాటు అలెక్స్ క్యారీ ఉన్నాడు.ఆసీస్ ఐదో వికెట్ డౌన్..మిచెల్ మార్ష్ రూపంలో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మార్ష్.. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 71 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 251/5బమ్రా సూపర్ బాల్.. హెడ్ క్లీన్ బౌల్డ్ టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో ట్రావిస్ హెడ్‌ను బోల్తా కొట్టించాడు. బుమ్రా దెబ్బకు హెడ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 67 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 241/4ఆసీస్ మూడో వికెట్ డౌన్.. లబుషేన్ ఔట్ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 72 పరుగులు చేసిన లబుషేన్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ట్రావిస్ హెడ్ వచ్చాడు. 66 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 237/3టీ బ్రేక్‌కు ఆసీస్ స్కోరంతంటే?టీ విరామానికి 53 ఓవర్లలో ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్(44), స్టీవ్ స్మిత్(10) పరుగులతో ఉన్నారు.ఆసీస్ రెండో వికెట్ డౌన్..ఉస్మాన్ ఖావాజా రూపంలో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన ఉస్మాన్ ఖావాజా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి స్టీవ్ స్మిత్ వచ్చాడు. 45 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 154/243 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 154/143 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్(33), ఉస్మాన్ ఖావాజా(57) ఉన్నారు.37 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 137/137 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 137 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్(22), ఉస్మాన్ ఖావాజా(51) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న ఆసీస్ బ్యాటర్లు..లంచ్ విరామం అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. 29 ఓవర్ల ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(38), మార్నస్ లబుషేన్(12) పరుగులతో ఉన్నారు.లంచ్ బ్రేక్‌కు ఆసీస్ స్కోర్: 112/1ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(38 బ్యాటింగ్), లబుషేన్(12 బ్యాటింగ్) ఉన్నారు.ఆసీస్ తొలి వికెట్ డౌన్.. కొంటాస్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన కొంటాస్ రవీంద్ర జడేజా ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. క్రీజులోకి మార్నస్ లబుషేన్ వచ్చాడు. 25 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 89/1.సామ్ కొంటాస్ హాఫ్ సెంచరీ..ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొంటాస్ తన అరంగేట్రంలో అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 52 బంతుల్లోనే కొంటాస్ తన తొలి హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఆసీస్ తరపున టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో పిన్నవయష్కుడిగా కొంటాస్ నిలిచాడు. 19 ఏళ్ల 85 రోజుల్లో కొంటాస్ ఈ ఘనత అందుకున్నాడు. 14 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 77/0. క్రీజులో కొంటాస్(55), ఉస్మాన్ ఖావాజా(21) ఉన్నారు.9 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 37/0అసీస్ అరంగేట్ర ఆటగాడు సామ్ కొంటాస్ అద్బుతంగా ఆడుతున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సైతం ఈ యువ ఆటగాడు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. 9 ఓవర్లకు ముగిసే సరికి ఆసీస్ స్కోర్: 37/0. క్రీజులో కొంటాస్(20), ఉస్మాన్ ఖావాజా(16) ఉన్నారు.5 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 6/05 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. క్రీజులో కొంటాస్(2), ఉస్మాన్ ఖావాజా(4) ఉన్నారు.బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. శుబ్‌మన్ గిల్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడు.మరోవైపు ఆసీస్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. మెక్‌స్వీనీ స్ధానంలో యువ సంచలనం సామ్ కొంటాస్ తుది జట్టులోకి రాగా.. గాయం కారణంగా దూరమైన హాజిల్‌వుడ్ స్ధానంలో స్కాట్ బోలాండ్ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, సామ్ కొంటాస్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
కోడిగుడ్లతో బీజేపీ సీనియర్ ఎమ్మెలేపై దాడి
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఆర్ ఆర్ నగర్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడి(Muniratna Naidu)పై కొందరు ఆగంతకులు కోడిగుడ్డు విసిరారు. అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి మునిరత్న బెయిల్ మీద బయటకు వచ్చి రెండు నెలలు అయ్యింది. అయితే అప్పటి నుంచి ఆయనకు ప్రజల్లోకి వచ్చింది ఇదే తొలిసారికాగా.. ఆ టైంలోనే దాడి జరగడం గమనార్హం.బుధవారం లక్ష్మీ నగర్లో నిర్వహించిన వాజ్‌పేయి(Vajpayee) శతజయంతి ఉత్సవాల్లో మునిరత్న పాల్గొన్నారు. తిరిగి తన అనుచరులతో వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపైకి గుడ్డు విసిరారు. ఆపై మంటతో కాసేపు ఆయన విలవిలలాడిపోయారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆయనకు రకరకాల వైద్య పరీక్షలు జరిపారు. చివరకు ఆయన బాగానే ఉన్నారని ప్రకటించి అర్ధరాత్రి పూట వైద్యులు డిశ్చార్జి చేశారు.ఇదిలా ఉంటే.. మునిరత్న నాయుడు రాజకీయాలతోనే కాదు.. సినిమాలతోనూ పేరు సంపాదించుకున్నారు. ఉపేంద్ర, దర్శన్ లాంటి అగ్ర తారాలతో ఆయన చిత్రాలను నిర్మించారు. 2013, 2018, 2020, 2024 ఎన్నికల్లో రాజరాజేశ్వరి నగర్(RR Nagar) నుంచి ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. గతంలో కర్ణాటక కేబినెట్ మినిస్టర్‌గానూ పని చేశారు. అయితే.. In a dramatic incident on Wednesday, #BJP MLA #Munirathna was targeted with an egg during an event marking the birth anniversary of former Prime Minister #AtalBihariVajpayee in #Bengaluru's #NandiniLayout.Police have arrested three individuals in connection with the attack and… pic.twitter.com/TWavEBJADq— Hate Detector 🔍 (@HateDetectors) December 25, 2024ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆయనపై అనూహ్యమైన ఆరోపణలు వచ్చాయి. సోషల్ వర్కర్‌గా పని చేసే ఓ మహిళ(40) ఫిర్యాదుతో ఈ బీజేపీ ఎమ్మెల్యేపై పలు నేరాల కింద కేసు నమోదయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మూడు రోజులుల్లో ఉండి బయటకు వచ్చారాయన. అయితే బయటకు వచ్చి కొన్నినిమిషాలకే.. అత్యాచారం కేసు(Rape Case)లో ఆయన్ని మరోసారి అరెస్ట్ చేశారు.వాపై నెలరోజులపాటు సెంట్రల్ జైల్లో గడిపిన ఆయనకు.. అక్టోబర్ మూడో వారంలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఊరట ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. గుడ్డు దాడిపై రాజకీయం తమ పార్టీ సీనియర్ నేత మునిరత్నపై కోడిగుడ్డు దాడి కాంగ్రెస్ కార్యకర్తల పనేనని బీజేపీ(BJP) ఆరోపిస్తోంది. మునిరత్న మరో అడుగు ముందుకు వేసి.. ఇది తనను చంపేందుకు జరిగిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మరికొందరు కాంగ్రెస్ నేతలు ఈ కుట్రలో భాగమయ్యారని అన్నారాయన. అయితే ఘటనపై నందిని లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది.
కీచకపర్వంపై విజయ్ దిగ్భ్రాంతి.. ఉదయ్‌నిధిపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
చెన్నై: నగరం నడిబొడ్డున జరిగిన దారుణ ఘటన.. తమిళనాడును ఉలిక్కి పడేలా చేసింది. ప్రముఖ ప్రభుత్వ విద్యాసంస్థ వర్సిటీ క్యాంపస్‌లోనే ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. ఆమెతో ఉన్న స్నేహితుడిపై దాడి చేసి మరీ.. దగ్గర్లోని పొదల్లో లాక్కెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కీచకపర్వంతో విద్యార్థి లోకం భగ్గుమంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టింది. మరోవైపు ఈ ఘటనపై అగ్ర నటుడు, టీవీకే అధినేత విజయ్(TVK VIjay) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘చెన్నై అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారనే సమాచారం మాకు అందింది. అయితే ఈ కేసులో ఉన్నవాళ్లు ఎంతటివాళ్లైనా వదలిపెట్టకూడదు. బాధితురాలికి తక్షణ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.. சென்னை அண்ணா பல்கலைக்கழக வளாகத்திற்கு உள்ளேயே, மாணவி ஒருவர் பாலியல் வன்கொடுமைக்கு உள்ளாகி இருக்கும் செய்தி, மிகுந்த அதிர்ச்சியையும் வேதனையையும் அளிக்கிறது.மாணவியைப் பாலியல் வன்கொடுமை செய்தவர் கைது செய்யப்பட்டிருப்பதாகக் காவல் துறை தரப்பில் தெரிவிக்கப்பட்டிருந்தாலும் அவர் மீது…— TVK Vijay (@tvkvijayhq) December 25, 2024.. రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. అఘాయిత్యాలు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతను పెంచాలి. ఉమెన్ సేఫ్టీ కోసం మొబైల్ యాప్స్, స్మార్ట్ పోల్స్, ఎమర్జెన్సీ బటన్స్, సీసీ కెమెరాలు, టెలిఫోన్లను ఏర్పాటు చేయాలి. పబ్లిక్ ప్లేసుల్లో వాళ్ల కోసం కనీస వసతులు ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ-ప్రవేట్ విద్యా సంస్థలను కూడా ఇందులో చేర్చాలి. బాధితులకు అవసరమైన న్యాయ సహాయం ప్రభుత్వమే అందించాలి. మానసికంగా ధైర్యంగా ఉంచేందుకు కౌన్సెలింగ్‌లాంటివి ఇప్పించాలి. వీటన్నింటి కోసం ప్రతీ ఏడాది నిర్భయ ఫండ్ నుంచి ఖర్చు చేయాలి. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం వెనకడుగు ఉండకూడదు. నిరంతరం ఈ వ్యవస్థను సమీక్షిస్తూ ఉండాలి’’ అని విజయ్ (Vijay) తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.మరోవైపు.. ప్రభుత్వ విద్యా సంస్థలో జరిగిన ఈ ఘటనపై ప్రతి పక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి . అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai), డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు వేర్వేరు ప్రకటనలో ఈ ఘటనను ఖండించారు. విద్యా సంస్థలలోనూ విద్యార్దినులకు భద్రత కరువైందన్న ఆందోళనను వ్యక్తంచేశారు. ఈ ఘటన సిగ్గుచేటు అని, నేరగాళ్లకు తప్పా, ఇతరులు ఎవ్వరికి ఈ ప్రభుత్వంలో కనీస భద్రత కరువైందని మండిపడ్డారు.కాగా ఉన్నత విద్యా మంత్రి కోవి చెలియన్ మాట్లాడుతూ, ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం శోచనీయమన్నారు. నిందితులు కఠినంగా శిక్షించ బడుతారన్నారు. ఓ విద్యార్థినిపై జరిగిన ఈ దాడిని కూడా రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.ShameOnYouStalinకాగా ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జ్ఞానశేఖరన్.. క్యాంపస్ దగ్గర్లోనే ఓ బిర్యానీ సెంటర్ నడిపిస్తున్నాడు. అయితే అతనికి నేర చరిత్ర ఉండడంతో పాటు అధికార డీఎంకే పార్టీ కార్యకర్త కావడం ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియాకు ఎక్కించింది. గతంలోనూ డిప్యూటీ సీఎం ఉదయ్‌నిధి స్టాలిన్‌తోపాటు మరికొందరు డీఎంకే పెద్దలతో నిందితుడు దిగిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. అంతేకాదు.. డీఎంకే యువ విభాగం ప్రెసిడెంట్‌గానూ పని చేశాడనతను. నిందితుడు జ్ఞానశేఖరన్ అధికార డీఎంకే కార్యకర్త కావడంతో విషయాన్ని పక్కదోవ పట్టించి నిందితుడ్ని తప్పించే ప్రయత్నం జరుగుతోందని విద్యార్థులు అంటున్నారు. ఘటన తర్వాత బాధితురాలి దగ్గరకు ఎవరినీ వెళ్లనివ్వలేదని.. యూనివర్సిటీ అధికారులు కేసును పక్కదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు తోడు మరోవైపు.. పెరియాకుప్పం సముద్ర తీరంలో పిక్నిక్ వెళ్లిన కొందరు యువతులపై తప్పతాగిన ఆగంతకులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే తమిళనాడులో మహిళలకు భద్రత కరువైందంటూ.. #ShameOnYouStalin హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.It has come to light that the accused in the Sexual Assault of a student at Anna University is a repeat offender and a DMK functionary.A clear pattern emerges from the number of such cases in the past:1. A criminal becomes close to the local DMK functionaries and becomes a… pic.twitter.com/PcGbFqILwk— K.Annamalai (@annamalai_k) December 25, 2024నిందితుడు జ్ఞానశేఖర్ కాళ్లకు, చేతులకు దెబ్బలు తగిలి.. బ్యాండేజ్‌తో ఉన్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. దీంతో డీఎంకే ప్రభుత్వం న్యాయం చేసిందని, గతం పొల్లాచ్చి కేసులో నిందితుడు పారిపోయినప్పుడు అన్నాడీఎంకే ప్రభుత్వం ఉందని.. ఆ సమయంలో బీజేపీ కూడా ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసలు చేయలేదని కొందరు డీఎంకే అనుకూల పోస్టులు పెడుతున్నారు. అయితే విక్షాలు దీన్ని ప్రభుత్వ జిమ్మిక్కుగా కొట్టి పారేస్తున్నాయి.இனி பெண்கள் மேல கை வைக்கனும்னு நினைச்சாலே இந்த ட்ரீட்மெண்ட் தான் நினைவுக்கு வரனும்.சிறப்பு மிகச் சிறப்பு🔥🔥 pic.twitter.com/wyswZSuEg1— ஜீரோ நானே⭕ (@Anti_CAA_23) December 25, 2024 నిఘా నీడలోని క్యాంపస్‌లోనే..చైన్నె నగరంలోని గిండి సమీపంలోని అన్నావర్సిటీ(Anna university) ఉంది. ఇక్కడే యూజీ, పీజీ హాస్టళ్లు సైతం ఉన్నాయి. ఈ పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగానూ ఉంటాయి. ప్రభుత్వ రంగ విద్యా సంస్థ కావడంతో ఈ పరిసరాలన్నీ సీసీ కెమెరాల నిఘాతో ఉంటాయి. దీనికి కూతవేటు దూరంలోనే ఐఐటీ మద్రాసు ఉంది. ఈ పరిసరాలన్నీ విద్యా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉండడంతో ఎల్లప్పుడూ భద్రత నీడలోనే ఉంటాయి. ఈ పరిస్థితులలో బుధవారం ఉదయం ఓ ఘటన కలకలం రేపింది.ఓ యువతి తన స్నేహితుడితో ఉండగా.. దాడి చేసి ఆమెను పొదల్లోకి లాక్కెల్లి అత్యాచారం చేశారు. 19 ఏళ్ల ఆ విద్యార్థిపై ఇద్దరు అగంతకులు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం బయటకు వచ్చింది. దీంతో విద్యార్థులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులను పట్టుకోవాలని నినదిస్తూ ఆందోళనకు దిగారు. అయితే.. மாணவி பலாத்காரத்தை ஏன் போலீசார் மூடி மறைக்க முயல்கிறது.??கற்பழித்த திமுகக்காரனை காப்பாற்ற முயற்சித்த போலீசை வெச்சி செய்த மாணவர்கள்🤮#AnnaUniversity #ShameOnYouStalin pic.twitter.com/ZcAkYB6NWH— Sanghi Prince 🚩 (@SanghiPrince) December 25, 2024బుధవారం ఉదయాన్నే ఈ సమాచారం మీడియా చెవిన పడింది. దీంతో అన్ని మార్గాలను వర్సిటీ అధికారులు మూసి వేశారు. మీడియానూ లోనికి అనుమతించకుండా జాగ్రత్త పడ్డాయి. ఈ విషయం తెలిసి కొందరు విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు వాళ్లను బుజ్జగించారు. బాధితురాలి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వాళ్లు శాంతించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు వేగాన్ని పెంచారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో 30కు పైగా ఉన్న సీసీ కెమెరాలలోని దృశ్యాలను పరిశీలించారు. విధులలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వద్ద విచారించారు. తమకు లభించిన సమాచారం మేరకు ఒకతడ్ని అరెస్ట్ చేశారు.கேடுகெட்ட திராவிட model ஆட்சியில் !!திமுக காரனால் தொடர்ந்து சூறையாடப்பட்ட கல்லூரி பெண்களின் அவல நிலை ??#ShameOnYouStalin pic.twitter.com/LZcrftyckU— Yuvaraj Ramalingam (@YuvarajPollachi) December 26, 2024ఇదీ చదవండి: దుస్తులు మార్చుకుంటుండగా వీడియోలు తీసి..
కజకిస్తాన్ ప్రమాదంపై కొత్త ట్విస్ట్.. రష్యానే కారణమా?
మాస్కో: కజకిస్తాన్‌లో విమాన ప్రయాణం తీవ్ర విషాదం మిగిల్చింది. విమానం కుప్పకూలడంతో మంటలు చెలరేగి దాదాపు 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, విమాన ప్రమాదానికి రష్యానే కారణమంటూ సోషల్ మీడియాతో కామెంట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జే2–8243 విమానం 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో రష్యాకు బయలుదేరగా మధ్యలో ప్రమాదం సంభవించింది. అజర్బైజాన్ రాజధాని బాకూ సిటీ నుంచి విమానం.. రష్యాలోని నార్త్ కాకస్ ఉన్న గ్రాజ్నీ నగరానికి బయలుదేరింది. అయితే, గ్రాజ్నీలో ల్యాండింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో విమానాన్ని దారి మళ్లించారు. ఈ క్రమంలో అక్టౌకు వెళ్తున్న సందర్బంగా విమానం కూలిపోయింది. అయితే, ఈ విమాన ప్రమాదానికి పక్షి ఢీకొనడమే కారణమని పలువురు చెబుతున్నారు. ఇదే సమయంలో రష్యా దాడి కారణంగానే విమాన ప్రమాదం జరిగిందని మరికొందరు కొన్ని వీడియోలను షేర్ చేస్తున్నారు.Unknown holes in Azerbaijan Airlines E190 that might have been shot down over Russia and has crash landed in Kazakhstan on 25 December.#planecrash #AzerbaijanAirlines #russia #Azerbaijan #ei90 pic.twitter.com/YN0wfJlu8C— Wildly Amusing (@Wildly_Amusing) December 26, 2024 సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ప్రమాదానికి గురైన విమానం బాడీపై పలుచోట్ల అనుమానాస్పదంగా రంధ్రాలు ఉన్నాయి. దాడులు జరిగితే రంధ్రాలు ఏర్పడినట్టుగా కనిపించడం గమనార్హం. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న సమయంలోనే ఈ విమానంపై దాడి జరిగిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంజిన్ టెక్నికల్ సమస్యల కారణంగా పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోరి ఉంటారని అంటున్నారు. ఇక, విమానం రాడార్ దిశను చూసినప్పుడు విమానం మొదట రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్ మీదుగా వెళ్తోంది. తర్వాత ట్రాకర్ నుండి అదృశ్యమైందని చెబుతున్నారు.🚨‼️Breaking updates! The plane crash today involved an Azerbaijan Airlines Embraer jet flying from Baku to Russia, which went down near Aktau, Kazakhstan. With 67 passengers and 5 crew members on board, initial reports suggest the plane was shot down. See below for more details.… pic.twitter.com/pIJd3vwIv1— MagaVeteran1969 (@LouisCuneo1) December 25, 2024ఇదిలా ఉండగా.. ప్రమాదానికి ముందు విమాన పరిస్థితిని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో విమానం లోపల ఎంతో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిని చూడవచ్చు. విమానం కూడా కొంత దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.Footage from today’s crash of the Embraer 190 operated by Azerbaijan Airlines. Before the crash, visible damage can be seen on the wing, and afterward, marks on the fuselage suggest it may have been hit by ground fire. pic.twitter.com/jzbooDH9W8— 𝕏 Aliu ™ 𝕏 (@Aliu_312) December 26, 2024
ఎగిరే ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి..
ప్రపంచంలో తొలి ఫ్లయింగ్ ట్యాక్సీలు (flying taxi) అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. 2025 చివరి నాటికి ఈ ఫ్యూచరిస్టిక్ సర్వీస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి (Abu Dhabi) వేదికగా ప్రపంచానికి పరిచయం కానుంది.అంతేకాకుండా అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ కంపెనీ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) ఎయిర్ క్రాఫ్ట్‌ల ఉత్పత్తి కూడా ఇక్కడే ప్రారంభం కానుందది. ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చినట్లయితే, అబుదాబి నగర వ్యాప్తంగా వెర్టిపోర్ట్లు ఏర్పాటవుతాయి. వీటిని కలుపుతూ వినూత్నమైన మిడ్నైట్ ఈవీటోల్లు (eVTOL) ఒక్కో ట్రిప్‌కు నలుగురు ప్రయాణికులను తీసుకువెళతాయి. ప్రయాణ సమయాన్ని 80 శాతం వరకు తగ్గిస్తాయి.ఈవీటోల్ వాహనాలను విస్తృత ప్రయాణ సాధనాలుగా ఉపయోగించాలన్న ఆలోచన 2016లో ఉబెర్ తన ఎలివేట్ కాన్ఫరెన్స్‌లో ఈ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టినప్పుడు విస్తృత దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు కార్ రైడ్లను బుక్చేసుకుంటున్నంత సులభంగా భవిష్యత్తులో ఫ్లయింగ్ ట్యాక్సీలను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు తీసుకురావాలని ఈ భావనకు కంపెనీ రూపకల్పన చేసింది.అప్పటి నుండి ఈవీటోల్ పరిశ్రమ ఆసక్తిని పెంచుతూ వస్తోంది. దీనికి సంబంధించి 300 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఉద్భవించాయి. ఇవి సమిష్టిగా దాదాపు 10 బిలియన్ డాలర్ల నిధులను పొందుతున్నాయి. అయితే పరిశోధనా సంస్థ ఐడీటెక్ఎక్స్ (IDTechEx) మాత్రం ఇటీవలి తన అధ్యయనంలో 5% కంటే తక్కువ కంపెనీలు మాత్రమే దీర్ఘకాలికంగా మనుగడ సాగిస్తాయని అంచనా వేసింది. కాగా వీటిలో ఆర్చర్ ఏవియేషన్ మొదటి మూడు అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది.ఆర్చర్ అబుదాబిలో తన ప్రారంభ వాణిజ్య సేవను ప్రారంభించడం ద్వారా ముందస్తు ప్రయోజనాన్ని పొందాలని భావిస్తోంది. మిడ్నైట్ ఈవీటోల్ గరిష్టంగా గంటకు 240 కి.మీ. వేగాన్ని చేరుకోగలదు. ఆర్చర్ అమెరికా, భారత్, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలలో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ, దాని యూఏఈ కార్యకలాపాలు అత్యంత ముందస్తు దశలో ఉన్నాయి.
ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, నిఖిల్ మృతి.. చెరువు వద్ద ఏం జరిగింది?
కామారెడ్డి క్రైం: భిక్కనూరులో పనిచేస్తున్న ఎస్ఐ సాయికుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. వీరంతా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఎస్ఐ మృతదేహాన్ని వెలికితీశారు. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు అధికారులు భావించారు. బుధవారం సాయంత్రం నుంచి శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. అర్ధరాత్రి 12.30 గంటలకు కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు దొరికాయి. గురువారం ఉదయం ఎస్ఐ మృతేదేహాన్ని వెలికితీశారు. ఇక, ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్‌తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎస్ఐ సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్‌గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది. బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్‌గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటాడని తెలుస్తోంది. పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరి చేసి వెళతాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అన్నది బయటకు వెళ్లడి కావడం లేదు.
భార్యకు మత్తిచ్చి.. ఏకంగా పదేళ్లపాటు పలువురితో సామూహిక అత్యాచారం
ఒక సామూహిక అత్యాచార కేసు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆమె కథలోని భయంకర నిజాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఆమెను జీవచ్ఛంగా మార్చి, స్వయంగా భర్తే పలువురితో (72మంకిపైగా) దాదాపు పదేళ్ల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సభ్యసమాజాన్ని నివ్వెర పర్చింది. ఈ కేసును విచారించిన కోర్టు జెసిల్ మాజీ భర్తకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దోషులుగా తేలిన మరో 51 మందికి కూడా శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులోని షాకింగ్ విషయాలు ఇలా ఉన్నాయిజెసిల్ పెలికో కేసు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడం మాత్రమే కాదు, ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అత్యాచార కేసు కావడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. జెసిల్ ఫెలికో భర్త డొమినిక్ పెలికో. జిసిల్కు ముగ్గురు పిల్లలు, మనవలు మనవరాళ్లు కూడా ఉన్నారు. 57 ఏళ్ల వయసులో ఉండగా భర్త ఎవ్వరూ ఊహించని విధంగా ఆమెపై భయంకరమైన అఘాయిత్యాలకు పాల్పడ్డాడు.తన భార్యపై అత్యాచారానికి రావాల్సిందిగా ఆన్లైన్ చాట్ రూమ్స్ ద్వారా ఆహ్వానం పలికాడు. ఇలా వచ్చిన వాళ్లు 20-72 వయస్సున్నవారున్నారు. ఇలా ఒకటి రెండూ కాదు ఏకంగా పదేళ్ల పాటు, భార్యకు మత్తుమందు ఇచ్చి తన అకృత్యాన్ని కొనసాగించాడు. ఈ విషయాలను చిత్రీకరించి, భద్రపరిచాడు కూడా. ఈ నేరానికి పాల్పడిన వారిలో కొందరు ఒక్కసారి, మరికొందరు ఆరుసార్లు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే బాధితురాలు పూర్తి అచేతనంగా, దాదాపు కోమాలాంటి పరిస్థితిలో ఉండగా జరిగినట్టు పోలీసులు ధృవీకరించుకున్నారు.అయితే ఇంత జరుగుతున్నా, అనేక సార్లు తీవ్ర అనారోగ్యానికి గురైనా ఆమెకు ఏమాత్రం తెలియలేదు. ఆమెకు తనపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి 2020లో పోలీసుల ద్వారా మాత్రమే తెలిసింది.వెలుగులోకి ఎలా వచ్చింది2020లో ఒక షాపింగ్ మాల్లో యువతులపై అభ్యంతరంగా వీడియో చూస్తున్న క్రమంలో పోలీసులు అతగాణ్న అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా పోలీసులు విచారణలో తాను చేసిన మొత్తం దురాగతాల్ని బహిర్గతం చేశాడు. దీంతో విచారణాధికారులే నివ్వెరపోయారు. అతని ల్యాప్‌టాప్‌లో వేల వీడియోలను కనుగొన్నారు, దాదాపు 200 అత్యాచారాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని అంతటినీ ‘అబ్యూజ్’అనే ఫోల్డర్లో స్టోర్ చేసి పెట్టాడు. ఈ వీడియోలను పోలీసులు జెసికా(ఆమె అనుమతి మేరకు) చూపించారు. దీంతో ఆమె కదిలిపోయింది. తనపై అత్యాచారం చేసిన వాళ్లలో తన మనవడు వయస్సున్న వాడు ఉన్నాడంటూ తీరని ఆవేదనకు గురైంది జెసికా. దాదాపు ఇదే తరహాలో కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. అయితే వీటిని డొమినిక్ ఖండించాడు.ఈ కేసు విచారణ సందర్బంగా వందలాదిమంది ఆమెకు మద్దతుగా కోర్టుకు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తీర్పుకోసం ఎదురు చూశారు. అనేకమంది స్త్రీవాద గీతాలను ఆలపించారు. అటు జెసికా ముగ్గురు పిల్లలు కూడా కోర్టు ఆవరణలో తీర్పు వెలువరిస్తున్న సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. యుక్తవయస్సులో ఉన్న ఆమె మనవడు తొలిసారి ఆమె పక్కన నిలబడి, ఆమె మీడియాను ఉద్దేశించి ఆమె భుజంపై చేయి భరోసా ఇచ్చాడు. అయితే దోషులకు విధించిన శిక్షలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.71 ఏళ్ల జెసిల్ పెలికా మీడియాతో ఈ విచారణ సందర్భంగా జెసికా మాటలు ఆమెలోని అంతులేని ఆవేదనతోపాటు, తెగువకు నిదర్శంగా నిలిచాయి. నేరస్తులు సిగ్గుపడాలి తప్ప, తానెందుకు కృంగిపోవాలని అంటూ ధైర్యంగా ముందుకొచ్చింది ఇంతటి ఘోరం సమాజానికి తెలియాలి తన గొంతును వినిపించింది. ఇలాంటివి మరో చోట మరొకరికి జరగకూడదని నినదించింది. అంతేకాదు అత్యాచారాలకు ఆడవాళ్ల వేషధారణే, వారి వ్యవహారమే కారణమన్న వాదనను గట్టిగా తోసిపుచ్చింది. స్త్రీల పట్ల చాలా మంది పురుషుకున్న ఇలాంటి అసహ్యకరమైన వైఖరి మారాలని నినదించింది. దీనిపై చర్చ జరగాలని, ఈ కేసుపై నిజా నిజాలు ప్రపంచానికి తెలియజెప్పాలని కూడా మీడియాను కోరింది. తనపై జరిగిన దుర్మార్గంపై బహిరంగ విచారణ జరగాలని కోరుకున్న ధీర ఆమె.2021లో పోలీసులు తమ ప్రాథమిక విచారణను నిర్వహించినప్పుడు అరెస్టయిన దోషుల్లో చాలా మంది ఇప్పటికే జైలు జీవితం గడిపారు. కనుక కొంతమంది త్వరలో విడుదల కానున్నారు. మరోవైపుతాజా తీర్పుపై అప్పీల్లా? వద్దా? అనేది ఆలోచిస్తున్నానని డొమినిక్ న్యాయవాది తెలిపారు. అప్పీల్‌కు వెళ్లేందుకు 10 రోజుల సమయం ఉంది. గత వారం (డిసెంబరు 19)న తీర్పు వెలువడినప్పటి నుండి, పారిస్ ఆసుపత్రి హెల్ప్‌లైన్ నెంబర్లు కాల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిందట.
సీఎం రేవంత్‌తో భేటీ.. అందుకే చిరంజీవి రాలేదు!
మూడేళ్లలో మూడింతల ఆదాయం
జస్ప్రీత్ బుమ్రా సూపర్ బాల్..హెడ్ మైండ్ బ్లాంక్! వీడియో
సీఎం రేవంత్‌రెడ్డితో ముగిసిన సినీ పెద్దల భేటీ.. కీలక అంశాలు ఇవే
భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలింది!
20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి..
నాగాలాండ్‌లో 99.8 శాతం మాంసాహార ప్రియులు
ఎగిరే ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి..
మౌనం ఒక వరం...!
ఇజ్రాయెల్ దాడులు.. పలువురు జర్నలిస్టులు మృతి
వేకువజామున చనిపోయాడు.. త్రిష పోస్ట్ వైరల్
నిత్య పెళ్లి కూతురు.. ఏడో పెళ్లికి దొరికి పోయిందిలా!
రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం
ఈ రాశి వారి కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.
ఆసీస్‌తో నాలుగో టెస్టు.. గిల్, నితీశ్ రెడ్డిపై వేటు! వారికి ఛాన్స్?
ఢిల్లీలో ఆప్, బీజేపీ పరస్పర విమర్శలు
పుష్ప-2 చూద్దామని థియేటర్‌కు వెళ్లారు.. తీరా పోస్టర్ చూస్తే!
Hyderabad: సొంత తమ్ముడే సూత్రధారి!
చంద్రం కుటుంబానికి కన్నీటి వీడ్కోలు
మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ
సీఎం రేవంత్‌తో భేటీ.. అందుకే చిరంజీవి రాలేదు!
మూడేళ్లలో మూడింతల ఆదాయం
జస్ప్రీత్ బుమ్రా సూపర్ బాల్..హెడ్ మైండ్ బ్లాంక్! వీడియో
సీఎం రేవంత్‌రెడ్డితో ముగిసిన సినీ పెద్దల భేటీ.. కీలక అంశాలు ఇవే
భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలింది!
20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి..
నాగాలాండ్‌లో 99.8 శాతం మాంసాహార ప్రియులు
ఎగిరే ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి..
మౌనం ఒక వరం...!
ఇజ్రాయెల్ దాడులు.. పలువురు జర్నలిస్టులు మృతి
వేకువజామున చనిపోయాడు.. త్రిష పోస్ట్ వైరల్
నిత్య పెళ్లి కూతురు.. ఏడో పెళ్లికి దొరికి పోయిందిలా!
రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం
ఈ రాశి వారి కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.
ఆసీస్‌తో నాలుగో టెస్టు.. గిల్, నితీశ్ రెడ్డిపై వేటు! వారికి ఛాన్స్?
ఢిల్లీలో ఆప్, బీజేపీ పరస్పర విమర్శలు
పుష్ప-2 చూద్దామని థియేటర్‌కు వెళ్లారు.. తీరా పోస్టర్ చూస్తే!
Hyderabad: సొంత తమ్ముడే సూత్రధారి!
చంద్రం కుటుంబానికి కన్నీటి వీడ్కోలు
మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ
సినిమా
పెళ్లై రెండు వారాలే.. కీర్తి సురేష్‌పై అప్పుడే మొదలైన రూమర్స్
కథానాయకిగా మంచి క్రేజ్‌లో ఉన్న నటి నటనకు విరామం ప్రకటించడం జరుగుతుందా..? అదీ పాన్ ఇండియా నటి, జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత అలా చేస్తుందా..? అంటే అది జరిగే పని కాదు. అయితే నటి కీర్తి సురేష్ విషయంలో ఇప్పుడు అలాంటి ప్రచారమే జరుగుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అనతికాలంలోనే అగ్ర కథానాయికి స్థాయికి చేరుకున్న ఈమె, అంతేవేగంగా ఇండియన్ కథానాయకిగా ఎదిగింది . మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రిగా జీవించి జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.కాగా వివాహం విషయంలో చాలా మంది నటీమణుల కంటే ముందుంది.తను 15 ఏళ్లుగా ప్రేమించిన ఆంటోనితో ఈనెల 12వ అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసింది. అయితే భర్తతో హ నీమూన్‌కు కూడా వెళ్లకుండా తాను కథానాయకిగా నటించిన తొలి హిందీ చిత్రం 'మేరీ జాన్' చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ చిత్రం బుధవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. కాగా ప్రస్తుతం ఈ భామ కొత్త చిత్రాలు అంగీకరించడం లేదని ప్రచారం హోరెత్తుతోంది. చేతిలో ఉన్న రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాల షూటింగ్‌ను కూడా పూర్తి చేసింది. కాగా కొత్తగా పెళ్లి చేసుకున్న కీర్తీ సురేష్ కొంత కాలం భర్తతో సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్లు, అందుకని నటనకు విరామం ఇవ్వనున్నట్లు.. తరువాత నటిగా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో అన్నది తెలియాల్సి ఉంది. అయితే కీర్తీ సురేష్‌కు ప్రస్తుతం ఏ భాషలోనూ కొత్తగా అవకాశాలు లేవన్నది నిజం.
చిన్న సినిమా బాగుంటేనే మనం బాగుంటాం – కిరణ్ తిరుమల శెట్టి
‘‘ఇండస్ట్రీలో మనమంతా బతికేది చిన్న చిత్రాల వల్లే. అవి బాగుంటేనే మనం బాగుంటాం. మా ‘డ్రింకర్ సాయి’ నచ్చితే పది మందికి చెప్పండి.. నచ్చకుంటే వంద మందికి చెప్పండి’’ అని డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి అన్నారు. ధర్మ, ఐశ్వర్యా శర్మ జంటగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఇస్మాయిల్ మాట్లాడుతూ– ‘‘డ్రింకర్ సాయి’లో అన్ని భావోద్వేగాలున్నాయి’’ అన్నారు. ‘‘ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన్ని కలవగా.. ‘డ్రింకర్ సాయి’ సక్సెస్ కావాలని కోరడం సంతోషాన్నిచ్చింది’’ అని ధర్మ తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటి.. ముహుర్తం ఫిక్స్!
సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు సిద్ధమయ్యారు. ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్న సినీ పెద్దలు గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. ఈ భేటీకి టాలీవుడ్ తరఫున ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, హీరో వెంకటేశ్ కుడా హాజరు కానున్నారు.గురువారం ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దిల్‌రాజుతో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు కూడా హాజరవుతారని సమాచారం. సంధ్య థియేటర్ ఘటనతో పాటు సినిమా పరిశ్రమ సమస్యలపై కూడా చర్చిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ భేటీలో ప్రభుత్వం తరఫున మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నారు.
జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల ఛార్జ్ షీట్లో కీలక అంశాలు!
జానీ మాస్టర్ (Jani Master) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ మహిళ కొరియోగ్రాఫర్(choreographer) ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల కేసులో ఆయనను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు కావడంతో జానీ విడుదలయ్యారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.లైంగిక వేధింపులకు పాల్పడ్డారు: ఛార్జ్ షీట్లో పోలీసులుపలు ఈవెంట్స్ పేరుతో మహిళ కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధింపులకు గురి చేశాడని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఆమెను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వేధింపులకు గురి చేసినట్లు అందులో ప్రస్తావించారు. కాగా.. తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఓ మహిళ కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్)అసలేం జరిగిందంటే..టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. మధ్యప్రదేశ్‌కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్‌కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం ముంబయికి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని తనని బెదిరించే వాడని, షూటింగ్‌కు సంబంధించిన వాహనంలో కూడా తనని వేధించాడని బాధితురాలు వాపోయింది. దీంతో జానీపై లైంగిక వేధింపుల కేసుతో పాటు పోక్సో కేసు కూడా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
పాకిస్తాన్ X దక్షిణాఫ్రికా
సెంచూరియన్: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ జట్టు నేటి నుంచి టెస్టు సిరీస్ ఆడనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో 63.33 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా... ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్‌ను 2–0తో గెలవాల్సిన అవసరముంది. ఇదే తమ లక్ష్యమని సఫారీ జట్టు సారథి తెంబా బవుమా ఇప్పటికే ప్రకటించగా... వన్డే సిరీస్‌లో కనబర్చిన జోరును కొనసాగిస్తూ సుదీర్ఘ ఫార్మాట్లోనూ సత్తా చాటాలని పాకిస్తాన్ జట్టు ఆశిస్తోంది. పేసర్లకు సహకరించనున్న సెంచూరియన్ పిచ్‌పై దక్షిణాఫ్రికా నలుగురు పేసర్లతో బరిలోకి దిగనుంది. గత ఆరేళ్లలో సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో పేసర్లు 227 వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు కేవలం 16 వికెట్లు మాత్రమే తీశారు. సఫారీ గడ్డపై పాకిస్తాన్ టెస్టు రికార్డు ఏమంత గొప్పగా లేదు. 1995 నుంచి అక్కడ పర్యటిస్తున్న పాక్ జట్టు 15 టెస్టులాడి 12 మ్యాచ్‌ల్లో ఓడింది. పాకిస్తాన్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరు (49) కూడా దక్షిణాఫ్రికా గడ్డపైనే నమోదైంది. వన్డే సిరీస్‌లో సత్తా చాటిన ప్రధాన పేసర్ షాహీన్ షా అఫ్రిది లేకపోవడం పాక్ జట్టుకు ప్రధాన లోటు కాగా... చివరగా ఇంగ్లండ్‌తో ఆడిన టెస్టు మ్యాచ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన నసీమ్ షా, బాబర్ ఆజమ్ తిరిగి జట్టులోకి వచ్చారు. పేస్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ మూడేళ్ల తర్వాత పాక్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరి టెస్టుల్లో నిలకడైన ప్రదర్శన కనబర్చలేకపోతున్న పాకిస్తాన్ జట్టు షాన్ మసూద్ సారథ్యంలో సఫారీ గడ్డపై పేస్ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటుదనేది ఆసక్తికరం.
ముగింపు మెరవాలి!
న్యూయార్క్: ఈ ఏడాది భారత చెస్ క్రీడాకారులు విశ్వవేదికపై అదరగొట్టారు. ప్రతిష్టాత్మక ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో మెరిపించగా... క్లాసికల్ ఫార్మాట్లో దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. క్యాడెట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ చిన్నారి దివిత్ రెడ్డి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పలువురు భారత గ్రాండ్‌మాస్టర్లు టాప్–3లో నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ అయిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ పోటీలకు నేడు తెర లేవనుంది. న్యూయార్క్‌లో ఆరు రోజులపాటు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరగనుంది. భారత్ నుంచి ఓపెన్ విభాగంలో 9 మంది గ్రాండ్‌మాస్టర్లు, మహిళల విభాగంలో 8 మంది క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు మంచి రికార్డే ఉంది. ఫలితంగా ఈ ఏడాది ఆఖరి టోర్నీలోనూ భారత క్రీడాకారులు పతకాలు సాధించి సూపర్ ఫినిషింగ్ ఇవ్వాలని ఆశిద్దాం. 2017లో విశ్వనాథన్ ఆనంద్ ర్యాపిడ్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ అయ్యాక మరో భారత ప్లేయర్ ఈ విభాగంలో టాప్–3లో నిలువలేదు. ఇక ఓపెన్ విభాగంలో ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్నాడు. మహిళల ర్యాపిడ్ విభాగంలో అనస్తాసియా బొడ్నారుక్ (రష్యా), బ్లిట్జ్ విభాగంలో వాలెంటీనా గునీనా (రష్యా) తమ ప్రపంచ టైటిల్స్‌ను కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి. భారత్ నుంచి ఎవరెవరంటే.... ఓపెన్ విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని, సందీపన్ చందా, అరవింద్ చిదంబరం, హర్ష భరతకోటి, ప్రణవ్, దీప్తాయన్ ఘోష్, కార్తీక్ వెంకటరామన్. మహిళల విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, దివ్య, వైశాలి, వంతిక అగర్వాల్, సాహితి వర్షిణి, పద్మిని రౌత్, నూతక్కి ప్రియాంక. ఫార్మాట్ ఎలా అంటే... ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో మొత్తం 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. నిర్ణీత రౌండ్ల తర్వాత రెండు విభాగాల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్లు విజేతగా నిలుస్తారు. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌ను రెండు దశల్లో నిర్వహిస్తారు.ముందుగా ఓపెన్ విభాగంలో 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో ఏర్పాటు చేశారు. నిర్ణీత రౌండ్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు రెండో దశ (నాకౌట్)కు అర్హత పొందుతారు. నాకౌట్ దశలో అజేయంగా నిలిచిన ప్లేయర్లు విజేతలుగా అవతరిస్తారు. టైమ్ కంట్రోల్ ఎంతంటే... ర్యాపిడ్ ఫార్మాట్లో ఒక్కో గేమ్ 15 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 10 సెకన్లు జత కలుస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్లో ఒక్కో గేమ్ 3 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 2 సెకన్లు జత కలుస్తాయి. నిర్ణీత రౌండ్ల తర్వాత ప్లేయర్లు సమంగా పాయింట్లు సాధిస్తే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించి విజేతలను నిర్ణయిస్తారు. ప్రైజ్‌మనీ ఎంతంటే... ర్యాపిడ్ ఫార్మాట్ ఓపెన్ విభాగంలో టాప్–40లో నిలిచిన ప్లేయర్లందరికీ ప్రైజ్‌మనీ ఇస్తారు. విజేతకు 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 56 వేల డాలర్లు (రూ. 47 లక్షలు) అందజేస్తారు. బ్లిట్జ్ ఫారామ్ట్ ఓపెన్ విభాగంలోనూ టాప్–40లో నిలిచిన ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ లభిస్తుంది. చాంపియన్‌గా 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన వారికి 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానం పొందిన ఆటగాడికి 42 వేల డాలర్లు (రూ. 35 లక్షలు) అందజేస్తారు. ర్యాపిడ్ ఫార్మాట్ మహిళల విభాగంలో టాప్–20లో నిలిచిన వారందరికీ ప్రైజ్‌మనీ దక్కుతుంది. విజేతకు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారిణికి 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 28 వేల డాలర్లు (రూ. 23 లక్షలు) లభిస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్ మహిళల విభాగంలోనూ టాప్–20లో నిలిచిన ప్లేయర్ల ఖాతాలో ప్రైజ్‌మనీ చేరుతుంది. చాంపియన్‌కు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానం పొందిన ప్లేయర్‌కు 20 వేల డాలర్లు (రూ. 17 లక్షలు) లభిస్తాయి.4 ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి సాధించిన పతకాలు. ర్యాపిడ్ ఫార్మాట్లో 2012లో కాంస్యం నెగ్గిన హంపి, 2019లో స్వర్ణ పతకాన్ని, 2023లో రజత పతకాన్ని సాధించింది. బ్లిట్జ్ ఫార్మాట్లో హంపి 2022లో రజతం సొంతం చేసుకుంది.
సెమీస్ బెర్త్ ఎవరిదో!
పుణే: గత రెండు నెలలుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ చివరి అంకానికి చేరింది. లీగ్ దశ పోటీలు ముగియగా... ఇక నాకౌట్ సమరాలకు వేళయింది. పాయింట్ల పట్టిక తొలి రెండు స్థానాల్లో నిలిచిన హరియాణా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీ జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించగా... ఆ తర్వాత 3 నుంచి 6వ స్థానం వరకు నిలిచిన జట్ల మధ్య గురువారం ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి.ఇందులో విజయం సాధించిన జట్లు సెమీఫైనల్‌కు చేరనున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న తొలి ఎలిమినేటర్‌లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనుండగా... రాత్రి 9 గంటల నుంచి జరగనున్న రెండో ఎలిమినేటర్‌లో పట్నా పైరేట్స్‌తో యు ముంబా పోటీపడుతుంది. పీకేఎల్‌లో యూపీ యోధాస్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోగా... జైపూర్ పింక్ పాంథర్స్ రెండుసార్లు విజేతగా నిలిచింది. పట్నా పైరేట్స్ మూడుసార్లు చాంపియన్‌గా నిలవగా... యు ముంబా కూడా ఒకసారి విన్నర్స్ ట్రోఫీని ముద్దాడింది. తాజా సీజన్లో యూపీ యోధాస్ 13 విజయాలు సాధించి 79 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలవగా... పింక్ పాంథర్స్ 12 విజయాలతో 70 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. కెపె్టన్ సురేందర్ గిల్‌తో పాటు శివమ్ చౌధరీ యోధాస్‌కు కీలకం కానుండగా... పింక్ పాంథర్స్ జట్టు సారథి అర్జున్ దేశ్వాల్పై ఎక్కువగా ఆధారపడుతోంది. మరి ఈ కీలక పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. లీగ్ చివరి మ్యాచ్ విజయంతో యు ముంబా ముందడుగు వేయగా... పట్నా పైరేట్స్ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి నాకౌట్లో అడుగు పెట్టింది. యు ముంబా జట్టు తరఫున కెప్టెన్ సునీల్ కుమార్, అజిత్ చౌహాన్, మన్జీత్ రాణిస్తుండగా... పైరేట్స్ తరఫున దేవాంక్, దీపక్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఎలిమినేటర్‌లో విజయం సాధించిన జట్లు శుక్రవారం జరగనున్న సెమీఫైనల్స్‌లో తలపడనున్నాయి.
దేశవాళీ టోర్నీలు పెంచాలి
టెన్నిస్ క్రీడకు మరింత ఆదరణ లభించాలంటే... దేశవాళీ టోర్నీలు విరివిగా నిర్వహించాలని భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న అభిప్రాయపడ్డాడు. టెన్నిస్ సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న 44 ఏళ్ల బోపన్న... భారత్‌లో టెన్నిస్ భవిష్యత్తు, యువ ఆటగాళ్ల ముందున్న సవాళ్లు, తన సహచరుడు మాథ్యూ ఎబ్డెన్తో విడిపోయి కొత్త భాగస్వామితో కలిసి ఆడనుండటం తదితర అంశాలపై స్పష్టత ఇచ్చాడు. బోపన్న పంచుకున్న వివరాలు అతడి మాటల్లోనే...» మన దేశంలో టెన్నిస్ భవిష్యత్తు కోసం మొదట అఖిల భారత టెన్నిస్ సంఘాన్ని క్రమబద్దీకరించాలి. దాని ఆధ్వర్యంలో జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా టోర్నమెంట్లు నిర్వహించాలి. దేశవాళీ సర్క్యూట్‌ను బలంగా నిర్మించాలి. ‘ఫ్యూచర్స్’, ‘చాలెంజర్స్’ వంటి టోర్నీలు అవసరమే అయినా... వాటితో పాటు దేశవాళీ టోర్నీలు కూడా చాలా ముఖ్యం. » జూనియర్ స్థాయిలో రాణించిన ఎందరో ప్లేయర్లు 18 ఏళ్ల తర్వాత ఏ టోర్నీల్లో పాల్గొనాలో తెలియక ఆటకు స్వస్తి చెబుతున్నారు. తదుపరి స్థాయిలో పోటీపడేందుకు ప్రతి ఒక్కరికీ ఆర్థిక పరమైన వెసులుబాటు ఉండదు. పెద్ద టోర్నీల కోసం ప్రయాణాలు చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ప్రతిభావంతులు ఆటకు దూరం అవుతున్నారు. దేశవాళీ టోర్నీల్లో పెద్దగా నగదు ప్రోత్సాహకాలు ఉండకపోవడం ఇందుకు కారణం. అందుకే దీన్ని మరింత బలోపేతం చేసి ఒక వ్యవస్థగా మార్చాలి. » గత రెండేళ్లుగా అందరూ నా రిటైర్మెంట్ గురించి అడుగుతున్నారు. అయితే అదే సమయంలో రెండేళ్లుగా నేను అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సీజన్ ముగింపు టోర్నీలకు అర్హత సాధించాను. అంటే, సీజన్ ఆసాంతం బాగా ఆడాననే కదా అర్థం. మరి అలాంటప్పుడు వీడ్కోలు ఆలోచనలు ఎందుకు వస్తాయి. » ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నా.. శారీరకంగా మానసికంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం. ఇలాంటప్పుడు రిటైర్మెంట్ ఆలోచన కూడా దరిచేరనివ్వను. » కెరీర్ చరమాంకంలో ఉన్నాననే విషయాన్ని పట్టించుకోను. గత 12 నెలల కాలంలో మెరుగైన ప్రదర్శన కనబర్చాను. శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. » సహచరుడు మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది. చాన్నాళ్లుగా మేం కలిసి ఆడుతున్నాం. ఎందుకు విడిపోవాలనుకున్నాడో ఎబ్డెన్కే తెలియాలి. అతడి కారణాలు అతడికి ఉంటాయి. గత ఏడాది యూఎస్ ఓపెన్ సమయంలో అతను వేరే ఆటగాడితో కలిసి ఆడనున్నట్లు మొదట చెప్పాడు. ఆ తర్వాత తిరిగి నాతో కలిసి కోర్టులో అడుగుపెట్టాడు. ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదు. » ఎబ్డెన్ తన నిర్ణయం ఆలస్యంగా వెల్లడించడంతో నికోలస్ బారియెంటాస్ (కొలంబియా)తో కలిసి ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడాలని నిర్ణయించుకున్నా. డిఫెండింగ్ చాంపియన్ కావడంతో సీడింగ్ లభించనుంది. గతంలో నికోలస్‌తో ప్రత్యరి్థగా తలపడ్డాను. అతడి బేస్‌లైన్ గేమ్ బలంగా ఉంటుంది. » బారియోంటాస్తో కలిసి ప్రస్తుతానికి రెండు టోర్నీలు ఆడాలని నిర్ణయించుకున్నా. అడిలైడ్ ఓపెన్‌తో పాటు, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కలిసి ఆడుతాం. ఈ రెండు టోర్నీల తర్వాత ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పాయింట్లు కాపాడుకోకపోతే మాస్టర్స్ టోర్నీ ‘డ్రా’లలో అవకాశం లభించదు. అందుకే ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది.
బిజినెస్
డిజిటల్ ఇండియాకు బ్లాక్‌చెయిన్ దన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంస్థ అల్గోరాండ్ భారత్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. డిజిటల్ ఇండియా లక్ష్య సాకారానికి తమ సాంకేతికత ఊతమివ్వగలదని సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఇండియా కంట్రీ హెడ్ అనిల్ కాకాని సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో గణనీయంగా ప్రయోజనాలు చేకూరగలవని వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. దేశీయంగా వివిధ రంగాల్లో పలు సవాళ్లను పరిష్కరించేందుకు అల్గోరాండ్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వాడుతున్నారు. ఉదాహరణకు మహిళల సారథ్యంలోని ఎంఎస్ఎంఈలకు కొత్త ఆర్థిక వనరులను అందుబాటులోకి తెచ్చేందుకు ఒక పెద్ద సహకార బ్యాంకు ప్రత్యామ్నాయ క్రెడిట్ స్కోరుకార్డ్ను రూపొందిస్తోంది. అలాగే, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఉమెన్స్ అసోసియేషన్ (సేవా) తమ సభ్యుల కోసం డిజిటల్ హెల్త్ స్కోర్‌కార్డును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. ఇలాంటివి అందరికీ ఆరి్థక సేవలను, ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడేవే. ఇక సప్లై చెయిన్‌లో పారదర్శకత సాధించేందుకు, పర్యావరణహిత ప్రాజెక్టులకు ఫైనాన్స్ చేసేందుకు, ఇతరత్రా ప్రజలకు మేలు చేకూర్చే పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడగలదు. బ్లాక్‌చెయిన్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ సొల్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ మొదలైన వాటిపై మేము ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. రోడ్ టు ఇంపాక్ట్, స్టార్టప్ ల్యాబ్లాంటి కార్యక్రమాలు స్థానికంగా ప్రతిభావంతులను, ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించే విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ డిజిటల్ ఇండియా లక్ష్య సాకారానికి తోడ్పడతాయి. అల్గోరాండ్ టెక్నాలజీతో ప్రధానంగా ఫైనాన్స్, సప్లై చెయిన్, హెల్త్‌కేర్, సస్టైనబిలిటీ వంటి కీలక రంగాలు లబ్ధి పొందగలవు. ఫైనాన్స్ విషయానికొస్తే అల్గోరాండ్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీవల్ల లావాదేవీలను వేగవంతంగా, సురక్షితంగా నిర్వహించవచ్చు. పారదర్శకత వల్ల సినిమాల నిర్మాణానికి, సీమాంతర వాణిజ్యానికి అవసరమయ్యే నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకునేందుకు మరిన్ని వనరులు అందుబాటులోకి రాగలవు. సప్లై చెయిన్ మేనేజ్మెంట్ను చూస్తే ఏఆర్వీవో, ఎల్‌డబ్ల్యూ3 లాంటి కంపెనీలు మా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. హెల్త్‌కేర్ విభాగంలో ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేర్చడంలో సేవా వంటి సంస్థల కార్యకలాపాలకు ఇది తోడ్పడుతోంది. టెరానోలాంటి సస్టైనబిలిటీ ప్రాజెక్టుల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ దన్నుతో సమ్మిళిత వృద్ధి సాధించే దిశగా టీ–హబ్, మన్ దేశీ ఫౌండేషన్ తదితర సంస్థలతో కలిసి పని చేస్తున్నాం. భారత్‌లో ప్రాజెక్టులు.. టీ–హబ్‌లో మా స్టార్టప్ ల్యాబ్ అనేది టెరానో, ఆ్రస్టిక్స్, ఫిల్మ్ఫైనాన్స్, ఎల్‌డబ్ల్యూ3లాంటి బ్లాక్‌చెయిన్ అంకుర సంస్థలకు తోడ్పాటు అందిస్తోంది. 2024 స్టార్టప్ ల్యాబ్‌లో తొలి బ్యాచ్ కంపెనీల్లో ఇప్పటికే అయిందింటిలో ఇన్వెస్ట్ చేసింది. 2025లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బ్లాక్‌చెయిన్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నాస్కామ్వంటి సంస్థలతో కూడా కలిసి పని చేస్తున్నాం.ప్రణాళికలు.. స్టార్టప్ ల్యాబ్‌లలో మరిన్ని కొత్త బ్యాచ్‌లు ప్రారంభించడం, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ దిగ్గజాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకోవడం తదితర ప్రయత్నాల ద్వారా భారత్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు అల్గోరాండ్ కట్టుబడి ఉంది. రోడ్ టు ఇంపాక్ట్ వంటి కార్యక్రమాలను విస్తరించడం, భారతదేశపు విశిష్టమైన సవాళ్లను పరిష్కరించేందుకు మరిన్ని బ్లాక్‌చెయిన్ ఆధారిత ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించండంపైనా దృష్టి పెడుతున్నాం. డెవలపర్లకు తోడ్పాటు.. రోడ్ టు ఇంపాక్ట్ లాంటి కార్యక్రమాలతో డెవలపర్లు, ఎంట్రప్రెన్యూర్లకు తోడ్పాటు అందించడంపై అల్గోరాండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. 2024లో హైదరాబాద్‌లోని తొలి అల్గోరాండ్ స్టార్టప్ ల్యాబ్‌లో 21 అంకుర సంస్థలు పాల్గొన్నాయి. మరో ఇరవై అంకుర సంస్థలు 2025 నాటికి ప్రోడక్ట్, మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ అంశాలకు సంబంధించి సన్నద్ధంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీ క్యాంపస్‌లలో సుమారు 70 అల్గోరాండ్ బ్లాక్‌చెయిన్ క్లబ్‌లతో యువ డెవలపర్లకు అవసరమైన వనరులు, మెంటార్íÙప్, పోటీపడే అవకాశాలను అందిస్తున్నాం.
EPFO: కొత్తగా 7.50 లక్షల మందికి పీఎఫ్
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో సభ్యలు మరింత మంది పెరిగారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈపీఎఫ్‌వో అక్టోబర్‌లో 13.41 లక్షల మంది సభ్యుల నికర చేరికను నమోదు చేసింది. 2024 అక్టోబర్‌లో కొత్తగా దాదాపు 7.50 లక్షల మంది సభ్యులు చేరారు.పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఉద్యోగి ప్రయోజనాలపై పెరిగిన అవగాహన, ఈపీఎఫ్‌వో విజయవంతమైన ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లు ఈ కొత్త సభ్యత్వాల పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. 2024 అక్టోబరులో జోడించిన మొత్తం కొత్త సభ్యులలో 58.49% మంది 18-25 ఏళ్ల మధ్య ఉన్నవారే కావడం గమనార్హం. వీరు 5.43 లక్షల మంది ఉన్నారు.ఇక దాదాపు 12.90 లక్షల మంది సభ్యులు తిరిగి ఈపీఎఫ్‌వోలో చేరారని పేరోల్ డేటా వెల్లడిస్తోంది. ఇది 2023 అక్టోబర్‌తో పోలిస్తే 16.23% అధికం. కొత్తగా చేరిన సభ్యులలో దాదాపు 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య గతేడాది అక్టోబరుతో పోల్చితే 2.12% ఎక్కువ. రాష్ట్రాలవారీగా చూస్తే నికర సభ్యులలో 22.18% జోడించి మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు అక్టోబర్ నెలలో మొత్తం నికర సభ్యులలో 5% కంటే ఎక్కువ వాటాను అందించాయి.పరిశ్రమల వారీగా నెలవారీ డేటాను పరిశీలిస్తే.. రోడ్డు మోటారు రవాణా, ప్రైవేట్ రంగ ఎలక్ట్రానిక్ మీడియా కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వంటి పరిశ్రమలలో సభ్యత్వంలో గణనీయమైన వృద్ధిని చూపింది. మాన్పవర్ సప్లయర్లు, కాంట్రాక్టర్లు, భద్రతా సేవలుచ ఇతర కార్యకలాపాలను కలిగి ఉన్న నిపుణుల సేవలు, జోడించిన మొత్తం నికర సభ్యత్వంలో 42.29% వాటాను కలిగి ఉన్నాయి.
ఇలాంటి చెక్కు వస్తే డబ్బు డ్రా చేసుకోలేరు..
దాదాపు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. కానీ చెక్కులను పెద్దగా ఉపయోగించరు. వాటిలో చాలా మందికి వివిధ రకాల చెక్కుల గురించి తెలియదు . అటువంటి వాటిలో ఒకటే క్రాస్ చెక్ (Cross Cheque). ఇటాంటి చెక్ పై వైపున ఎడమ మూలలో రెండు గీతలు గీస్తారు. ఈ గీతలు ఎందుకు గీస్తారో తెలుసా? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం క్రాస్ చెక్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 (Negotiable Instruments Act)లోని సెక్షన్ 123 ప్రకారం.. ఇలాంటి చెక్ జారీ చేసిన వ్యక్తి ఇది క్రాస్డ్ చెక్ అని చెక్ ఎగువన ఎడమ మూలలో రెండు లైన్లతో బ్యాంక్‌కి సూచిస్తారు. ఈ రకమైన చెక్కుతో బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకునేందుకు వీలుండదు. చెక్‌ను క్రాస్ చేయడం వలన నేరుగా డబ్బు విత్ డ్రా కాకుండా చెక్ పొందిన వ్యక్తి లేదా సూచించిన ఇతర వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో మాత్రమే జమ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. దీని కోసం చెక్ వెనుక భాగంలోవారి సంతకం అవసరం.క్రాస్ చెక్ రకాలుఅయితే క్రాస్ చెక్లలోనూ అనేక రకాలు ఉన్నాయి. మొదటిది సాధారణ క్రాసింగ్. అంటే ఇప్పటిదాకా చెప్పుకొన్న అంశాలన్నీ ఈ రకం కిందకు వస్తాయి. రెండోది ప్రత్యేక క్రాసింగ్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 124 ప్రకారం.. చెక్ గ్రహీత నిర్దిష్ట బ్యాంక్ ఖాతాలోకి వెళ్లాలని డ్రాయర్ కోరుకున్నప్పుడు ప్రత్యేక క్రాసింగ్ చెక్‌ను జారీ చేస్తారు.ఉదాహరణకు గ్రహీత ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నట్లయితే, చెక్కు దిగువన ఉన్న పంక్తుల మధ్య దాని పేరును వ్రాయడం ద్వారా డ్రాయర్ బ్యాంక్‌ను పేర్కొనవచ్చు.ఇక చెక్‌పై క్రాసింగ్ లైన్ల మధ్య "అకౌంట్ పేయీ" అని రాసినట్లయితే, గ్రహీత మాత్రమే దాని నుండి డబ్బును విత్‌డ్రా చేయగలరని అర్థం. అయితే, ప్రత్యేక క్రాసింగ్‌తో నిర్దిష్ట బ్యాంకును పేర్కొన్నట్లయితే, డబ్బు ఆ బ్యాంకుకు మాత్రమే వెళ్తుంది. ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లో స్పష్టంగా పేర్కొననప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank)తో సహా అనేక బ్యాంకులు దీనిని అనుసరిస్తున్నాయి.క్రాస్డ్ చెక్కులను ఎందుకు జారీ చేస్తారంటే..క్రాస్డ్ చెక్‌ల జారీ వెనుక ఉద్దేశం ఏమిటంటే, ఉద్దేశించిన గ్రహీత ఆ మొత్తాన్ని అందుకున్నారని నిర్ధారించుకోవడం. ఆ చెక్కు తప్పుడు చేతుల్లోకి వెళ్లినా.. అందులో నుంచి డబ్బులు తీసుకోలేరు. తద్వారా దాని భద్రతను (Cheque Security) పెంచుతుంది.
కొత్త సంవత్సరంలో లేటెస్ట్ ఐఫోన్.. బంపర్ డిస్కౌంట్
కొత్త సంవత్సరంలో ఐఫోన్ (iPhone) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారీ డీల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఫ్లి ప్కార్ట్ (Flipkart) ఐఫోన్ 15 (iPhone 15)పై గొప్ప డీల్‌ని తీసుకొచ్చింది. ఈ డీల్‌ని సద్వినియోగం చేసుకుంటే ఐఫోన్ 15 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.ఇలా చేస్తే రూ.50,999కే ఐఫోన్ 15యాపిల్ (Apple) అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 15 అసలు ధర 128జీబీ వేరియంట్‌కు రూ.69,900 లుగా ఉంది. ఇదే ఐఫోన్ 15 గ్రీన్ కలర్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 57,999 ధరతో లిస్ట్ అయింది. అన్ని ఇతర కలర్ వేరియంట్లు రూ. 58,999 వద్ద ఉన్నాయి.అయితే మీరు ఈ ఫోన్‌ను రూ.50,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ టీజర్ చిత్రం ప్రకారం.. ఐఫోన్ 15పై రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాత ఫోన్ ఉన్నట్లయితే ఆ ఫోన్ ద్వారా రూ. 6000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఆఫర్ల తర్వాత, ఫోన్ ప్రభావవంతమైన ధర రూ. 50,999. అయితే ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ ఫోన్ పరిస్థితి, బ్రాండ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.ఐఫోన్ 15 స్పెక్స్ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేతో వస్తుంది. ఫోన్లో యాపిల్ బయోనిక్ ఎ16 (Bionic A16) చిప్సెట్ ఉంటుంది. ఇది 5-కోర్ జీపీయూతో వస్తుంది. ఫోన్లో డైనమిక్ నాచ్ కూడా ఉంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే.. యూఎస్బీ టైప్-సి పోర్ట్ వస్తుంది. ఛార్జింగ్ కేబుల్ ఫోన్ బాక్స్‌లోనే వస్తుంది.
ఫ్యామిలీ
కొత్త ఉత్సాహం..!
కొత్త సంవత్సరం రాబోతోంది.. దీంతో నగర యువత కొత్త ఉత్సాహంతో పార్టీ ఎందుకుండదు పుష్పా.. ఉంటుంది అంటున్నారు. పబ్‌లు, రిసార్ట్లు, ఫామ్ హౌస్‌లు.. ఎక్కడైతేనేం న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు యువత, ఐటీ ఉద్యోగులు సిద్ధమైపోయారు. ఈవెంట్ మేనేజర్లు కూడా కొత్త ఏడాదికి వేడుకలను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పాపులర్ సింగర్స్, డీజేలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమా సెలిబ్రిటీలతో ఈవెంట్లు, విందులు.. వినోదాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అనేక ఏర్పాట్లతో సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైనే ఈ కథనం..ఈసారి డిసెంబర్ 31న ఐటీ నిపుణులు, ఉన్నతోద్యోగులు ఐదారుగురు బృందంగా ఏర్పడి వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి న్యూ ఇయర్ వేడుకలను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు నిర్వహించే పారీ్టల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో పోలీస్ తనిఖీలతో ఇబ్బందులు పడే బదులు.. శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్‌లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలను అద్దెకు తీసుకొని పార్టీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సమస్యలు అసలే ఉండవనేది వారి వాదన. దీంతో పాటు పార్టీ జోష్‌ను మరుసటి రోజు సాయంత్రం వరకూ ఎంజాయ్ చేయొచ్చనే యోచనలో ఉన్నారని సమాచారం.ఈ వెంట్స్‌కి ఫుల్ డిమాండ్.. షామీర్పేట, శంషాబాద్, మెయినాబాద్, మేడ్చల్, కీసర వంటి శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్, రిసార్టులు ఇప్పటికే బుక్ అయ్యాయి. దీంతో మిగిలిన వ్యక్తిగత గృహాలకు సైతం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ఈవెంట్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారని, ఆయా ప్రాంతాల్లోని డిమాండ్ బట్టి పార్టీ వేడుకలకు ఒక్కో టికెట్ కనీసం రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉండొచ్చని అంచనా. సాధారణ రోజుల్లో ఫామ్‌హౌస్, రిసార్ట్‌లలో రోజుకు ఒక్క గది అద్దె రూ.15 వేల నుంచి రూ.30 వేలు ఉండగా.. న్యూ ఇయర్‌కు మాత్రం రూ.50 వేలపైనే చెబుతున్నారు.అద్దెకు విల్లాలు, వ్యక్తిగత గృహాలు.. శివరాంపల్లి, శామీర్‌పేట, భువనగిరి, కొల్లూరు వంటి ఔటర్ రింగ్ రోడ్‌కు చేరువలో నిర్మితమైన విల్లాలు, వ్యక్తిగత గృహాలను యజమానులు అద్దెకు ఇస్తున్నారు. ఈ తరహా ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. గతేడాతితో పోలిస్తే 20–30 శాతం అద్దె ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఓ కస్టమర్ చెబుతున్నాడు. భారీగా అద్దెలు రావడంతో విల్లాలు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలూ భారీగానే ఏర్పాటయ్యాయని, అయినా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజుకు అద్దె రూ.5 వేలుగా చెబుతున్నారని పేర్కొన్నారు. అదనపు చార్జీలతో మద్యం, ఫుడ్ ఇతరత్రా వాటిని కూడా ఫామ్‌హౌస్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. పోలీసు నిబంధనలివే.. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా న్యూ ఇయర్ వేడుకలను చేయకూడదు. వేడుకలకు హాజరయ్యే వారి గుర్తింపు కార్డులు, వివరాలను నమోదు చేయాలి. సీటింగ్ సామర్థ్యానికి మించి టికెట్లను విక్రయించకూడదు. కపుల్స్ కోసం నిర్వహించే పార్టీల్లో మైనర్లను అనుమతించకూడదు. డీజేలు కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధన ప్రకారం 45 డిసెబుల్స్ కంటే తక్కువ సౌండ్స్ ఉన్న పరికరాలును మాత్రమే వినియోగించాలి. ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాలతో పాటు ప్రాంగణం ముందు ఉన్న రహదారిలో 50 అడుగుల దూరాన్ని కవర్ చేసేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అసభ్యకరమైన దుస్తులతో నృత్య ప్రదర్శనలు నిర్వహించకూడదు. పురుషులతో పాటు మహిళా సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలి. మైనర్లకు లిక్కర్ సరఫరా చేసినా లేదా మాదక ద్రవ్యాలను వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.అనుమతులు తప్పనిసరి.. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ట్రై కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. లిక్కర్ సరఫరా చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆబ్కారీ శాఖ అనుమతులు కూడా ఉండాల్సిందేనని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడే ఈవెంటర్స్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Christmas 2024 లోక రక్షకుడు
మానవాళి ముక్తికొరకు మనుజావతారుడైన దైవం...జగతిలో భీతి బాపేందుకు దిగివచ్చిన దైవ తనయుడు...సర్వలోకానికి శాంతి సందేశం..దివిలోనూ భువిలోనూ వేడుక...పరలోక దూతావళి పరవశించి పాడిన వేళప్రతి హృదిలో క్రిస్మస్ ఆనందం...జగతిలో పాపం నిండినప్పుడు ప్రేమతో కలిసి జీవించాల్సిన ధరణి వాసుల హృదయాలు అసూయ, ద్వేషంతో రగులుతున్నప్పుడు చీకటి జలధిలో మునిగిన వారికి, శృంఖలాల్లో మగ్గేవారికి మరణ ఛాయలో బతికే వారికి ఒక ఆశాకిరణంగా... అరుణోదయ కాంతిగా... విమోచకుడిగా... జగద్రక్షకుడిగా రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభువు ఈ భువిపైకి అరుదెంచాడు. అదొక సుమనోహర ఘట్టం.. సర్వలోకాన్ని సంభ్రమాశ్చర్యాలతో విశేషంగా ఆకట్టుకున్న మధుర కావ్యం. తమను రక్షించే మెస్సయ్య కోసం సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న విశ్వాసుల్లో నింపిన అంతులేని ఆనందం వెరసి స్తోత్ర గీతంగా స్తుతి గానంగా మారిన వైనం.. అందుకు యూదా దేశంలోని బెత్లెహేము వేదిక అయింది.ఆ సమయంలో రాజైన హేరోదు యెరూషలేము రాజధానిగా రాజ్యమేలుతున్నాడు. యూదా ప్రజలంతా తమను విమోచించే మెస్సయ్యా కోసం ఎదురు చూస్తున్న తరుణం. ఆ భాగ్యం కన్య అయిన మరియకు లభించింది. అప్పటికే గలిలయలోని నజరేతులో దావీదు వంశస్తుడైన యోసేపునకు మరియ ప్రదానం చేయబడింది. పరమ దేవుని ఆజ్ఞ మేరకు ప్రభువు దూత గబ్రియేలు ద్వారా ఈ శుభ వర్తమానం అందింది. ‘దయా ప్రాంప్తురాలా!’... అంటూ గబ్రియేలు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడే యవ్వన్రపాయంలో అడుగుపెడుతున్న మరియ ఎంతో భయపడింది.ఎందుకంటే ఆ కాలంలో దేవుడు కాని ఆయన దూతల దర్శనం అరుదుగా మారింది. ప్రవక్తలకు ప్రవచనాలు నిలిచి పొయాయి. నిశ్శబ్దకాలంగా చెప్పబడింది. అటువంటి తరుణంలో దేవుని దూత మరియ వద్దకు వచ్చి ‘భయపడకుము నీవు ధన్యురాలవు, దేవుని వలన నీవు కృప ΄పొందావు. నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. ఆయన సర్వోన్నతుని కుమారుడనబడతాడు. అతని రాజ్యము అంతము లేనిదై వుంటుందని’ పేర్కొన్నాడు. దూత మాటలు మరింత విస్మయానికి భయానికి గురిచేశాయి. ఇది దేవాది దేవుని నుంచి వచ్చిన పిలుపుగా మరియ తెలుసుకుంది. ‘అయ్యో నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఏలాగు సాధ్యం?’ అని అడిగింది.‘మరియా! భయపడకు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వస్తుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడతాడని దేవదూత చెప్పిన మాటలను బట్టి ఇది దైవకార్యంగా గ్రహించి ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పి దేవాది దేవుని తన గర్భంలో మోయడానికి సిద్ధపడింది. వాస్తవానికి వివాహం కాకుండా ఆ రోజుల్లో యూదా స్త్రీ గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపే ఆచారం ఉండేది. దేవుని దయ΄పొంది అంతులేని విశ్వాసంతో దేవుని ఆజ్ఞను శిరసావహించడానికి ముందుకు వచ్చింది కాబట్టే మరియ స్త్రీలందరి లో ధన్యురాలిగా కొనియాడబడింది.అయితే మరియ గర్భవతియైన సంగతి తెలుసుకున్న యోసేపు కలత చెందాడు. నీతిమంతుడు కాబట్టి ఆమెను నలుగురిలో నగుబాటు చేయకుండా రహస్యంగా విడనాడాలని నిశ్చయించుకున్నాడు. ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై మరియ గర్భము ధరించింది ఏ పురుషుని వలన కాదని పరిశుద్ధాత్మ వలన జరిగినదని మరియను చేర్చుకొనడానికి ఏమాత్రమూ సందేహపడవద్దని పుట్టబోవు శిశువునకు యేసు అని పేరు పెట్టాలని తన ప్రజలందరి పాపములనుండి ఆయనే రక్షిస్తాడని తెలుపడంతో యోసేపులో ఆవేదన తొలగిపొయింది. అంతేకాదు మరియ యేసుకు జన్మనిచ్చేవరకూ ఆమెను ముట్టకుండా జాగ్రత్త పడ్డాడు.ఇదే సమయంలో ఆరు నెలలకు ముందు మరొక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. మరియ సమీప బంధువు రాలైన ఎలీసబెతు ఆమె భర్త జెకర్యా కురు వృద్ధులు. ఆ వయస్సులో దేవుడు వారికి సంతాన ప్రాంప్తి అనుగ్రహించాడు. దేవుని హస్తం వారికి తోడుగా వుండి ఒక మగ శిశువును దయచేసాడు. ఆ శిశువే తర్వాతి కాలంలో బాప్తీస్మం ఇచ్చు యోహానుగా పిలువబడి యేసు ప్రభు పరిచర్యకు ముందు ఆయన మార్గం సరళం చేసే సాధనమయ్యాడు.లేఖన ప్రవచనాలు నెరవేర్చిన క్రిస్మస్ యేసుక్రీస్తు జననం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినా ఆయన ఆదిసంభూతుడు. ఆల్ఫా ఒమేగా ఆయనే. ఆదియు అంతమునై యున్నాడు. మొదటివాడు కడపటి వాడుగా ఉన్నవాడు. జగత్ పునాది వేయకముందే వున్న యేసు కాలం సంపూర్ణమైనప్పుడు సాతాను చెరలో చిక్కుకున్న మానవుడు పాపానికి బందీగా మారి దేవుని సన్నిధికి దూరంగా వెళుతున్న తరుణంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా పతనమై ఏ నిరీక్షణ లేని సమయంలో నిత్య జీవమిచ్చి తిరిగి దేవునితో ఐక్యపర్చేందుకు భూమి మీద దేవుని కుమారుడిగా క్రీస్తు అవతరించాడు.యేసు పుట్టుకను క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే మీకా, యెషయా ప్రవక్తలు ప్రవచించడం విశేషం. ‘బెత్లెహేము ఎఫ్రాతా యూదా కుటుంబంలో స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏల బోవువాడు నీలో నుండి వచ్చును’ అని మీకా ప్రవచించగా ‘ఆలకించుడి కన్యక గర్భవతియై కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును’ అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థం.యేసు పుట్టుక ఆవశ్యకత గూర్చి యెషయా వివరించాడు. ‘ప్రభువు ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువార్తమానం ప్రకటించుటకు, నలిగిన హృదయం కలవారిని దృఢ పరచుటకు చెరలో నున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు’ అని యెషయా ప్రవక్త చెప్పిన లేఖనాలు తన రాక ద్వారా నిజమయ్యాయని యేసుప్రభు తనపరిచర్యలో చెప్పడం విశేషం.ప్రజా సంఖ్యలో రాయబడటానికి యోసేపు మరియలు నజరేతు నుండి బెత్లెహేముకు రావాల్సి వచ్చింది. రెండింటి మధ్య 90 మైళ్ళ దూరం. రెండు వేల సంవత్సరాల క్రితం ఎలాంటి ప్రయాణ సాధనాలు లేనిరోజుల్లో నిండు చూలాలైన మరియను వెంటబెట్టుకొని బహు ప్రయాస కోర్చి చలికాలంలో బెత్లెహేము చేరుకున్నారు దంపతులు. జన సంఖ్య కోసం ఆ గ్రామం అప్పటికే క్రిక్కిరిసి పొయి ఉండటంతో ఎక్కడా స్థలం లేక ఓ పశువుల కొట్టమే వారికి అశ్రయమైంది. అర్థరాత్రి వేళలో క్రీస్తు జన్మించడంతో పశువుల తొట్టె క్రీస్తు పాన్పుగా మారిపొయింది. పరలోకాన్ని విడచివచ్చి పశువుల కొట్టంలో బాల యేసు పరుండాల్సి వచ్చింది. అతి సామాన్య కుటుంబంలో అతి సామాన్యంగా యేసు జన్మించాడు.యేసు పుట్టుక శుభవార్త మొదట తెలిసింది సామాన్యులకే. ఊరి వెలుపల ΄÷లంలో గొఱె<లను కాచుకుంటున్న పశు కాపరుల వద్దకు ప్రభువు దూత వచ్చి వారి మధ్య నిలచినప్పుడు ప్రభువు మహిమ వారిచుట్టూ ప్రకాశించగా వారెంతో భయపడ్డారు. అందుకు దూత ‘భయపడకుడి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తీసుకు వచ్చాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’ అంటూ శిశువు ఆనవాలు తెలియజేయడం జరిగింది. అప్పుడు పరలోకం నుంచి వచ్చిన దేవదూతల సమూహం ‘సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక’ అంటూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడారు. యేసు పుట్టుక కేవలం యూదా ప్రాంంతానికే పరిమితం కాలేదు. యేసుక్రీస్తు జన్మవిశేషం తెలియజేస్తూ ఆకాశంలో ఓ వింత తార వెలిసింది. దాన్ని చూసిన ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రోజును వెతుక్కుంటూ యెరూషలేము చేరుకున్నారు. తుదకు బెత్లెహేము లో పుట్టాడని తెలుసుకొని శిశువును పూజించి తాము తెచ్చిన బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలను సమర్పించి అత్యానందభరితులై తిరిగి వెళ్లారు. ఈ విధంగా యేసు పుట్టుక ఒక విశ్వ వేడుకగా మారింది.రక్షణ తెచ్చిన క్రిస్మస్ యేసు పుట్టుక సర్వమానవాళికి రక్షణ అందించిది. యేసు పుట్టుక పరమార్థమే అది. పాప పంకిలమైన మానవ జాతిని రక్షించడానికే యేసు జన్మించాడు. దేవుని ఆజ్ఞ మీరడం ద్వారా దేవుడు సృజించిన తొలి మానవుడు ఆదాము, అతని భార్య హవ్వ ఈ లోకానికి పాపాన్ని శాపాన్ని తీసుకు వచ్చారు. ఆ పాపానికి ప్రతిఫలంగా నర జాతి మొత్తానికి మరణం సం్రపాప్తించింది. అయితే ఆ శాపాన్ని పాపాన్ని కొట్టివేసి తద్వారా వచ్చిన మరణభయాన్ని తొలగించేందుకు క్రీస్తు అందించిన శిలువ యాగం ద్వారా రక్షణ ΄పొంది నిత్యజీవానికి వారసులై సదా కాలం క్రీస్తుతో నివసించే భాగ్యాన్ని క్రిస్మస్ మనకు అందించింది. క్రిస్మస్ ద్వారా రక్షకుడు ఈ లోకానికి వచ్చి ప్రజలందరి రక్షణార్థం పాపపరిహారార్థ బలిగా శిలువపై తనను తాను సమర్పించుకున్నాడు. యేసు శిలువలో కార్చిన రక్తం ద్వారా పాప విమోచన. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మానవుడు దేవునితో పరలోకంలో ఉండే భాగ్యం అందించడానికి దేవుడు మానవుడిగా అవతరించాల్సి వచ్చింది. అందుకు క్రీస్తు పుట్టుక వేదికగా మారింది. అప్పుడు ఈ ధరిత్రి మీద మానవునిగా జన్మించిన యేసు ఇప్పుడూ నీవు ఆహ్వానిస్తే నీ హృదిలో ఆత్మరూపుడై వసించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీలో నిత్యసంతోషం నింపుతాడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సంతోషం... సమాధానం తెచ్చిన క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టుకే మానవాళికి గొప్ప శుభవార్త. క్రీస్తు పుట్టుక సమయంలో కురేనియ, సిరియా దేశమునకు అధిపతి అయిన కైసరు ఔగుస్తు మొదటి ప్రజాసంఖ్య ప్రకటించాడు. ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక అంశాలతో తెలియ చేయబడిన క్రీస్తు జననం ఒక కల్పితకథ కాదు ఒక చారిత్రాత్మక సత్యం. ఆయన కారణజన్ముడు. చారిత్రాత్మక పురుషుడు. క్రీస్తుకు ముందు... క్రీస్తు తర్వాతగా కాలం రెండుగా విభజింపబడటయే ఇందుకు ఓ గొప్ప ఉదాహరణ.– బందెల స్టెర్జి రాజన్ సీనియర్ పాత్రికేయులు
Year Ender 2024 భయపెట్టి, నవ్వించి ఏడ్పించిన సిల్వర్ క్వీన్స్
ఓటీటీ, థియేటర్ రిలీజెస్... ఈ రెండింటిలోనూ నటీమణులకు సంబంధించి అద్భుతమైన నటనకు చెప్పుకోదగ్గ సంవత్సరంగా 2024 నిలుస్తుంది. వారి నట ప్రతిభకు మాత్రమే కాకుండా భారతీయ సినిమా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోని వైవిధ్యానికి, అద్భుత కథాకథనాలను హైలైట్ చేసిన సంవత్సరంగా కూడా 2024 గురించి చెప్పవచ్చు...టాప్ టెన్‌లో ఒకటి... దో పట్టీగ్లామర్ పాత్రలు మాత్రమే కాదు నటనకు సవాలు విసిరే పాత్రలలో కూడా మెప్పించగలనని నిరూపించింది కృతీసనన్. సంక్లిష్టమైన సంబంధాలు, గృహహింసను ప్రతిబింబించే గ్రిప్పింగ్ డ్రామా ‘దో పట్టీ’లో సౌమ్య, శైలిగా ద్విపాత్రాభినయం చేసింది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దృఢసంకల్పంతో ఎదుర్కొనే మహిళగా తన నటనతో ప్రేక్షకుల మన్ననలు ΄పొందింది. పాత్రలలో భావోద్వేగాన్ని పండించడం లో కృతీసనన్ తనదైన నటనను ప్రదర్శించింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘దో పట్టీ’ ప్రపంచవ్యాప్తంగా నాన్–ఇంగ్లీష్ సినిమాల టాప్–టెన్ జాబితాలో ఒకటిగా నిలిచింది.నవ్వుతూనే భయపడేలా... భయపడుతూనే నవ్వేలా!చాలా తక్కువ స్క్రీన్ టైమ్‌తో, ఆకట్టుకునే ట్విస్ట్‌లతో ‘స్త్రీ–2’లో మెప్పించింది శ్రద్ధాకపూర్. హాస్యం, హారర్‌ను మేళవించిన ఆమె నటన అదుర్స్ అనిపించింది. ఫ్రెష్ లుక్‌తో, చక్కని టైమింగ్‌తో ఆకట్టుకుంది. ‘సీక్వెల్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కత్తిమీద సాములాంటిది. ఎంటర్టైనింగ్ డైలాగులు ఉన్న‘స్త్రీ–2’లో అద్భుతమైన నటీనటులు ఉన్నారు’ అంటుంది శ్రద్ధా కపూర్.అయితే ఆ అద్భుతమైన నటీనటులలో అందరి కంటే శ్రద్ధాకపూర్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. ‘స్త్రీ–2’ విజయంతో ఇప్పుడు ‘స్త్రీ–3’కు ఉత్సాహంగా రెడీ అవుతోంది.16 కిలోల బరువు పెరిగింది!ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్‌సింగ్ చమ్కీల జీవితం ఆధారం గా తెరకెక్కిన ‘అమర్ సింగ్ చమ్కీల’ అనే బయోగ్రఫీ డ్రామాలో పరిణీతి చోప్రా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ప్రశంసలు అందుకుంది. ప్రతి సన్నివేశంలో పాత్ర పట్ల అంకితభావం కనిపిస్తుంది. ఈ సినిమా కోసం పరిణీతి చోప్రా ఏకంగా 16 కిలోల బరువు పెరిగింది!‘చమ్కీల’ సినిమాలో అమర్ జోత్ కౌర్ పాత్రలో చోప్రాకు నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఇంతియాజ్ అలీ షూటింగ్‌కు ముందు... ‘కానీ మీరు ఆమెలా కనిపించడం లేదు’ అన్నాడు. అంతే.. బరువు పెరగడంపై దృష్టి పెట్టింది పరిణీతి చోప్రా. వర్కవుట్స్ చేస్తూ ఫిట్‌గా ఉన్న అమ్మాయి కాస్తా పాత్ర కోసం ఎడా పెడా తినేసి బరువు పెరిగింది.పరిణీతి చోప్రా ఉత్తమ నటన గురించి చెప్పుకునే చిత్రాలలో ‘చమ్కీల’ అగ్రస్థానంలో నిలుస్తుంది.వెరీ స్ట్రాంగ్ ఉమెన్సంప్రదాయ మహారాష్ట్ర మహిళగా ‘సర్ఫీర’లో రాధిక మదన్ అద్భుత నటన ప్రదర్శించింది. ప్రేమను పంచే భార్యగా, బలమైన వ్యక్తిత్వం, తిరగబడే శక్తి ఉన్న మహిళగా ఆమె పాత్ర ఆకట్టుకుంది.విభిన్నమైన పాత్రలు పొషించడం రాధికకు కొత్త కాకపొయినా ‘సర్ఫీర’లో పాత్ర స్ఫూర్తిని ప్రతిబింబించేలా ప్రాంమాణికమైన నటనతో ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ఎంతోమంది అభిమానులను సంపాదించింది. ‘మరాఠీ భాష, యాసపై రాధికకు ఉన్న పట్టు ఈ సినిమాలో హైలైట్.‘కంటెంట్ డ్రైవెన్ స్క్రిప్ట్‌లు ఎంచుకోవడంలో ముందు ఉంటుంది’ అని తన గురించి వినిపించే మాటను మరోసారి నిజం అని నిరూపించింది రాధికా మదన్.మాటలు కాదు... మాస్టర్ క్లాస్ఈ హసీన్ దిల్రూబా (2021)కి సీక్వెల్‌గా వచ్చిన ‘ఫిర్ ఆయి హసీన్ దిల్రూబా’లో తాప్సీ పన్ను మరోసారి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది. రొమాన్స్, సస్పెన్స్, డ్రామాలను బ్యాలెన్స్ చేయడం లో తన నటనతో మాస్టర్ క్లాస్ అనిపించుకుంది. కుట్రల ఉచ్చులో చిక్కుకుపొయే ‘రాణి కాశ్యప్’ పాత్రను పొషించి చిరస్మరణీయమైన నటనను ప్రదర్శించింది. ఎంతో సంక్లిష్టమైన పాత్రను కూడా అవలీలగా పొషించింది.‘లవ్ అంటే పిచ్చి కాదు’ అంటున్న తాప్సీ ప్రేమ చుట్టూ ఉండే నమ్మకం నుంచి త్యాగం వరకు ఎన్నో అంశాలను ప్రతిఫలించే పాత్రలో నటించి మెప్పించింది.‘రాణి పాత్రను పొషించినందుకు గర్వంగా ఉంది. నా క్యారెక్టర్ ద్వారా ఓపెన్ మైండ్‌తో ఉన్నప్పుడే ప్రతికూల పరిస్థితులతో పొరాడగలమని చెప్పాను’ అంటున్న తాప్సీ పన్ను సీక్వెల్లో లోతైన భావోద్వేగాలను ప్రదర్శించి మొదటి భాగంతో పొల్చితే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది.భయపడింది... భయపెట్టింది!‘భూల్ భులైయా 3’ ఫ్రాంచైజీతో మంజులికగా మెరిసింది విద్యాబాలన్. మంత్రముగ్ధులను చేసే నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘అమీ జే తోమర్’ పాటకు మాధురీ దీక్షిత్ కలిసి చేసిన డ్యాన్స్ ‘వావ్’ అనిపించింది. ‘భూల్ భులైయా 2’లో నటించడానికి ‘సారీ’ చెప్పింది విద్యాబాలన్. ‘భూల్ భులైయా నాకు బాగా నచ్చిన సినిమా. నేను బాగా నటించగలనా అనే సందేహం, రిస్క్ తీసుకోకూడదు అనుకోవడం వల్లే నో చెప్పాల్సి వచ్చింది’ అంటుంది విద్య.అయితే ‘భూల్ భులైయా 3’ కోసం మరోసారి తన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నో చెప్పలేకపొయింది. స్క్రిప్ట్ బాగా నచ్చడమే కారణం. ‘ఈ సినిమాలో నేను నటించాల్సిందే’ అని డిసైడైపొయిన విద్యాబాలన్ తన నటనతో ‘భూల్ భులైయా 3’ని మరో స్థాయికి తీసుకువెళ్లింది.
ప్రకృతి ప్రేమికులకు రా రమ్మని... స్వాగతం
గోదావరికి ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలు, గుట్టలపై ఉండే గిరిజన గూడేలు, ఆకుపచ్చని రంగులో ఆకాశాన్ని తాకేందుకు పోటీ పడుతున్న కొండల అందాలను కనులారా వీక్షించాలని అనుకుంటున్నారా? అయితే, మీరు పాపికొండలు యాత్రకు వెళ్లాల్సిందే. భద్రాచలం సమీపాన పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి నిత్యం బోట్లు నడిపిస్తుండగా.. క్రిస్మస్, కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతి సెలవులు రానున్న నేపథ్యాన పర్యాటకుల రద్దీ పెరగనుంది. ఈ నేపథ్యాన పాపికొండల అందాలు, యాత్ర మిగిల్చే తీయని అనుభవాలపై ప్రత్యేక కథనమిది.రెండు మార్గాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాపికొండల యాత్రను సందర్శించాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటోది.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం వద్ద ఉన్న పోచమ్మ గండి పాయింట్ వద్ద నుంచి బోట్లో ప్రారంభమై.. పేరంటాలపల్లి వరకు వెళ్లి తిరిగి తీసుకొస్తారు. రెండోది.. తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి ప్రారంభమయ్యే మార్గం. ఈ పాయింట్ తెలంగాణలోని భద్రాచలానికి సమీపాన ఉంటుంది. దీంతో పర్యాటకులు ఒకరోజు ముందుగానే చేరుకుని రామయ్యను దర్శించుకుని.. ఆపై పాపికొండలు యాత్రకు బయలుదేరుతారు.భద్రాచలం నుంచి ఇలా.. హైదరాబాద్ నుంచి పాపికొండల యాత్రకు రావాలనుకునే వారు ముందుగా భద్రాచలం చేరుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాచలానికి విరివిగా బస్సులు ఉన్నాయి. రైలు మార్గంలో వచ్చే వారు కొత్తగూడెం (భద్రాచలం రోడ్డు) స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం రావాలి. ఇక్కడ వీలు చూసుకుని సీతారాముల దర్శనం చేసుకున్న తర్వాత.. భద్రాచలం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో బోటింగ్ పాయింట్ ఉన్న పోచవరం గ్రామానికి బయలుదేరవచ్చు. 70 కిలోమీటర్ల జలవిహారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల మధ్యలో ప్రారంభమయ్యే యాత్ర సాయంత్రం 4 గంటల నుంచి లేదా 5 గంటల మధ్యలో ముగుస్తుంది. పోచవరం ఫెర్రీ పాయింట్ వద్ద పర్యాటకులను ఎక్కించుకుని మళ్లీ అక్కడే దింపుతారు. సుమారు ఆరు గంటల పాటు 70 కిలోమీటర్లు గోదావరిలోనే జలవిహారం చేసే అద్భుత అవకాశం ఈ యాత్రలో పర్యాటకులకు కలుగుతుంది. పేరంటాలపల్లి సందర్శన పాపికొండల యాత్రలో పేరంటాల పల్లి వద్ద నున్న ప్రాచీన శివాలయం వద్ద బోటు ఆపుతారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుడిని గిరిజనులే నిర్వహిస్తున్నారు. గుట్ట పైనుంచి జాలువారే నది జలాన్ని తీర్థంగా పుచ్చుకుంటారు. యాత్ర ప్రారంభానికి ముందు లేదా తర్వాతైనా పోచవరానికి సమీపాన వీఆర్ పురం మండలంలోని శ్రీరామగిరి రాముడి క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. షెడ్యూల్, ధరలు ఇలా.. పోచవరం వద్ద నుంచి ప్రారంభమయ్యే పాపికొండల యాత్రకు సంబంధించి పెద్దలకు రూ.950, చిన్నారులకు రూ.750గా ఏపీ పర్యాటక శాఖ నిర్ణయించింది. కళాశాల విద్యార్థులు గ్రూపుగా పర్యటనకు వస్తే.. వారికి రూ.850, ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.750 ప్యాకేజీ ధరగా ప్రకటించారు. అయితే శని, ఆదివారం, సెలవు దినాల్లో.. దీనికి అదనంగా రూ.100 వసూలు చేస్తారు. ఈ ప్యాకేజీలోనే భోజన సౌకర్యాన్ని బోటు నిర్వాహకులు కల్పిస్తారు. భద్రగిరిలోని రామాలయం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బుకింగ్ కౌంటర్ల ద్వారా ఏజెంట్లు టికెట్లు విక్రయిస్తారు. ఇసుక తిన్నెల్లో విడిది.. రాత్రివేళ నిశ్శబ్ద వాతావరణంలో గోదావరి ప్రవాహ శబ్దం, ఇసుక తిన్నెలు, వెన్నెల అందాలను ఆస్వాదించాలంటే వెదురు హట్స్‌ల్లో రాత్రి వేళ బస చేయాల్సిందే. పశ్చిమగోదావరి జిల్లాలోని సిరివాక అనే గ్రామం వద్ద పర్యాటకుల కోసం హట్స్ ఉన్నాయి. గుడారాలలో ఒక్కొక్కరికి రూ.4 వేలు, వెదురు కాటేజీల్లో అయితే రూ.5,500గా ధర నిర్ణయించారు. ఉదయం పోచవరం నుంచి వెళ్లి.. రాత్రికి సిరివాకలో బస చేయిస్తారు. అనంతరం మర్నాడు సాయంత్రానికి పోచవరానికి లాంచీలో చేరుస్తారు. రెండు రోజుల పాటు భోజన వసతి, ఇతర సౌకర్యాలను నిర్వాహకులే చూసుకుంటారు. ఈ టికెట్లు కూడా భద్రాచలంలో అందుబాటులో ఉంటాయి. పటిష్టమైన రక్షణ ఏపీలోని కచ్చలూరు లాంచీ ప్రమాదం అనంతరం పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేశారు. అన్ని బోట్లకు అనుసంధానం చేసిన శాటిలైట్ ఫోన్లు, వాకీటాకీలు, వాటిని నియంత్రించే బోటింగ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు పోలీసు, అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక శాఖ అధికారులు.. పర్యాటకుల ధ్రువీకరణ పత్రాలను సరిపోలి్చన తరువాతే బోటులోకి అనుమతిస్తారు. బోటులో లైఫ్ జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రిని సిద్ధంగా ఉంచుతున్నారు.ఆహారం ఉదయం యాత్ర ప్రారంభమయ్యే సమయంలో అల్పాహారం, టీ అందిస్తారు. మధ్యాహ్న సమయాన బోటులోనే శాఖాహార భోజనంతో ఆతిథ్యాన్ని అందిస్తారు. సాయంత్రం యాత్ర ముగిసిన తరువాత మళ్లీ బోట్ పాయింట్ వద్ద స్నాక్స్, టీ అందజేస్తారు. పాపికొండల ప్రయాణంలో కొల్లూరు, సిరివాక, పోచవరం వద్ద ‘బొంగు చికెన్’ అమ్ముతారు. ఆకట్టుకునే వెదురు బొమ్మలు పేరంటాలపల్లి దగ్గర గిరిజనులు తయారు చేసిన వెదురు బొమ్మలు, వస్తువులు ఆకట్టుకుంటాయి. రూ.50 నుంచి రూ.300 వరకు ధరల్లో ఇవి లభిస్తాయి.👉పర్యాటకుల మనస్సుదోచే పాపికొండల విహార యాత్ర (ఫొటోలు)
ఫొటోలు
National View all
20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి..
సరిగ్గా 20 ఏళ్ల క్రితం తమిళనాడు తీరంలో సముద్రపు రాకాసి అలలు సృష్టించిన బీభత
కోడిగుడ్లతో బీజేపీ సీనియర్ ఎమ్మెలేపై దాడి
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఆర్ ఆర్ నగర్ ఎమ్మెల్యే మున
Veer Bal Diwas: మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానానికి గుర్తుగా..
భారతదేశవ్యాప్తంగా ఈరోజు(డిసెంబర్ 26)న వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నా
లాటరీ టికెట్ల వ్యాపారి ఇంట్లో రూ.2.25 కోట్ల సీజ్
తిరువొత్తియూరు: కోవై కరుమత్తంపట్టి సమీపంలో
Year Ender 2024: దుమ్మురేపిన 100 మంది డిజిటల్ స్టార్స్..
2024లో భారత్ డిజిటల్ విప్లవంలో అనూహ్య పురోగతిని సాధించింది.
International View all
ఇజ్రాయెల్ దాడులు.. పలువురు జర్నలిస్టులు మృతి
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
భార్యకు మత్తిచ్చి.. ఏకంగా పదేళ్లపాటు పలువురితో సామూహిక అత్యాచారం
ఒక సామూహిక అత్యాచార కేసు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆమె కథలోని భయంకర నిజాలు కన్నీళ్లు పెట్టిస్తాయి.
కజకిస్తాన్ ప్రమాదంపై కొత్త ట్విస్ట్.. రష్యానే కారణమా?
మాస్కో: కజకిస్తాన్‌లో విమాన ప్రయాణం తీవ్ర విషాదం మిగిల్చింది
Year Ender 2024: వణికించిన విమాన ప్రమాదాలు
2024 ముగియడానికి ఇక కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉంది.
టార్గెట్ రష్యా.. ఉక్రెయిన్‌కు బైడెన్ బంపరాఫర్
మాస్కో: ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేస
NRI View all
పార్వతీపురంలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ..
చికాగోలో నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్
భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదం తో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..
‘ఎన్నారై’ కుటుంబం వేధింపులకు ఒకరి బలి
అల్వాల్ (సికింద్రాబాద్): ఎన్నారై అల్లుడు, అతని కుటుంబీకుల
సింగపూర్‌లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సింగపూర్ లో ఘనంగా జరిగాయి.
ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-28 ఎన్నికల ఫలితాలు : సరికొత్త చరిత్ర
అమెరికన్ తెలుగు అసోసియేషన్ -బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-2028 పదవీ కాలానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు రికార్డ్ సృష్ట
క్రైమ్
బండ్లగూడలో రూ.50 లక్షల నగలు చోరీ
రాజేంద్రనగర్: ఇంట్లో పనికోసం వచ్చిన ఓ బిహార్ జంట అదును చూసి ఇంట్లోని విలువైన నగలు, నగదుతో ఉడాయించిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పనికి కుదిరిన 55 రోజుల్లోనే ఈ జంట దొంగతనానికి పాల్పడి ఉడాయించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..బండ్లగూడలోని మైఫీల్ టౌన్ విల్లా నంబర్ 20లో డాక్టర్ కొండల్ రెడ్డి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గత నవంబర్ 1వ తేదీన ఏజెంట్ బిట్టు ద్వారా ఇంట్లో పనిచేసేందుకు బిహార్‌కు చెందిన నమీన్ కుమార్ యాదవ్, భారతిలను నెలసరి జీతంపై ఇంట్లో పనికి తీసుకొచ్చారు. తమ విల్లాలోని ఓ గదిని ఇచ్చి వారిని ఇంట్లోనే ఉండనిచ్చారు. ఈ క్రమంలో సోమవారం కొండల్‌రెడ్డి భార్య తన కుమారుల వద్దకు వెళ్లగా... కొండల్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచి్చన ఆయన తన గదిలోకి వెళ్లి నిద్రించాడు. ఉదయం కొండల్ రెడ్డికి కాఫీ ఇచ్చేందుకు నమీన్ కుమార్ రాకపోవడంతో కొండల్‌రెడ్డి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. కిందికి వెళ్లి చూడగా బయటి తలుపులు తెరిచి ఉండటంతోపాటు భార్యభర్తలిద్దరూ గదిలో కనిపించలేదు. ఇంట్లోని సీసీ కెమెరాలు పరిశీలించగా రాత్రి 8.52 గంటలకు భార్యభర్తలిద్దరూ బ్యాగ్‌లతో బయటికి వెళ్లినట్లు రికార్డు అయ్యింది. ఇంట్లోకి వచ్చి బీరువాను పరిశీలించగా..రూ.35 వేల నగదు, డైమండ్ బ్యాంగిల్స్, డైమండ్ రింగులు, రూబీ డైమండ్ నెక్లెస్, మంగళసూత్రం తదితర బంగారు వస్తువులు కనిపించలేదు. వీటి విలువ దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని డాక్టర్ కొండల్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఏజెంటు బిట్టు వద్ద భార్యాభర్తలిద్దరి వివరాలను సేకరించారు. నిందితులిద్దరూ రైలు మార్గం ద్వారా వెళుతున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రత్యేక టీమ్ వీరిని పట్టుకునేందుకు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఏరియా ఆస్పత్రిలో గర్భిణి మృతి
నర్సీపట్నం: నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పురిటి నొప్పులతో ఓ గర్భిణి ప్రాణాలు విడిచింది. దీనికి వైద్యులు, వైద్య సిబ్బందే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. సయ్యద్ మహాగున్నిషా అలియాస్ దేవి(30), నానాజీది ఎస్.రాయవరం మండలంలోని చిన్నగుమ్ములూరు. వీరిద్దరిది మతాంతర వివాహం. వీరికి మూడేళ్ల పాప ఉంది. దేవికి మొదటి కాన్పు సాధారణంగానే జరిగింది. రెండో కాన్పు కోసం ఏరియా ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం చేరింది. రాత్రి 8 గంటలకు డాక్టర్ వచ్చి పరీక్షించి వెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో వైద్య సిబ్బంది వచ్చి టాబ్లెట్ ఇచ్చారు. విపరీతమైన నొప్పులు రావడంతో ఆపరేషన్ చేయాలని గర్భిణీ ఎంత మొత్తుకున్నా వైద్యులు కానీ, సిబ్బంది కానీ పట్టించుకోలేదని మృతురాలి అత్త లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రిపరేషన్ వార్డులో నైట్ డ్యూటీ సిబ్బంది లేరని, మూడు గంటల సమయంలో లేపి తీసుకొచి్చనా.. ఏం పర్లేదు.. డెలివరీ అయిపోతుందని చెప్పి వెళ్లిపోయారని అత్త, బంధువులు కన్నీళ్లపర్యంతమయ్యారు. ఉదయం 7 గంటల సమయంలో కడుపులో బిడ్డతో సహా గర్భిణి మరణించింది. దీంతో భర్త నానాజీ సొమ్మసిల్లి పడిపోయాడు. గర్భిణి మరణానికి వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఇన్చార్జి సూపరింటెండెంట్ సత్యనారాయణ, స్త్రీ వైద్య నిపుణులు లక్ష్మణ్‌రావు బంధువులకు నచ్చజెప్పేందుకు యత్నిoచారు. అయినా ఫలితం లేదు. దీంతో వైద్యులు, బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది.ఎస్ఐ ఉమామహేశ్వరరావు, సిబ్బందితో ఆస్పత్రికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనిపై ఇన్చార్జి సూపరింటెండెంట్ సత్యనారాయణను వివరణ కోరగా వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని చెప్పారు.
కామాంధుడికి 20 ఏళ్ల జైలు
జగిత్యాల జోన్: బాలునిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితునికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జగిత్యాల ప్రధాన న్యాయమూర్తి, జిల్లా పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి నీలిమ సోమవారం తీర్పు చెప్పారు. మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి కథనం ప్రకారం.. 2019 ఏప్రిల్ 4న జిల్లాలోని మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామ శివారులోని మామిడి తోటలో కాయలు తెంపుకొందామంటూ అదే గ్రామానికి చెందిన గోగుల సాయికుమార్.. ఒక బాలుడిని వెంటబెట్టుకుని వెళ్లాడు. అక్కడ బాలునిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితుని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్ఐ పృథీ్వధర్ కేసు నమోదు చేశారు. కేసు విచారణ చేపట్టిన అప్పటి సీఐ రవికుమార్ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి.. నిందితుడు సాయికుమార్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
నీతూబాయి ఆట కట్టిస్తాం..
సాక్షి, హైదరాబాద్: గంజాయి డాన్‌గా పేరొందిన నీతూబాయిని ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టుకుని తీరుతామని ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు.ఆమె పట్ల తాము ఎలాంటి మెతక వైఖరి అవలంభించడం లేదని, కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. నానక్‌రామ్‌గూడ కేంద్రంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న నీతూబాయి ఎక్సైజ్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఎక్సైజ్ శాఖతో పాటు లా ఎన్ ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కూడా సీరియస్‌గా దృష్టి సారించాయన్నారు. ఆమె అక్రమ కార్యకలాపాలపై కేసులు నమోదు చేశామని, గతంలో ఆమె పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అయినా ఆమె వైఖరిలో మార్పురాలేదన్నారు. బయటికి వచ్చిన తర్వాత కూడా యధావిధిగా గంజాయి అమ్మకాలు కొనసాగిస్తుండడంతో బెయిల్‌కు అవకాశం లేకుండా పోలీస్ శాఖ ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేసిందన్నారు. రెండు సార్లు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడమే కాకుండా, గంజాయి అమ్మకాల ద్వారా నీతూబాయి, ఆమె కుటుంబసభ్యులు అక్రమంగా కూడబెట్టిన స్థిర, చర ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. నీతూబాయ్ నుంచి రూ.15.17 లక్షలు, ఆమె కుటుంబ సభ్యులైన మధుబాయి రూ. 25.13 లక్షలు, గౌతమ్‌సింగ్ నుంచి రూ.91.21 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ. 86 లక్షల స్థిరాస్తులను జప్తు చేశామన్నారు. నీతూబాయిపై హిస్టరీ షీట్‌ను ఓపెన్ చేసినట్లు చెప్పారు. శేరిలింగంపల్లి, గోల్కొండ, గచి్చబౌలి, మొయినాబాద్, గౌరారం, నల్లగొండ టూటౌన్లతోపాటు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ధూల్‌పేట్, నారాయణగూడలోనూ ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆమెపై 25 కేసులు ఉన్నాయని, పోలీసులు 7 కేసులు నమోదు చేశారన్నారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. ఆపరేషన్ ధూల్‌పేట్ తరహాలో నానక్‌రాంగూడలోనూ గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.ప్రేమంటూ వేధింపులు.. యువతి బలవన్మరణం