Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Telangana Highcourt Judgement On Ktr Quash Petition On January 7th1
కేటీఆర్‌ పిటిషన్‌..రేపే హైకోర్టు తుది తీర్పు

సాక్షి,హైదరాబాద్‌:ఫార్ములా-ఈ రేసుల కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‍క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం(జనవరి7) ఉదయం తుది తీర్పివ్వనుంది. ఈ కేసులో పూర్తి వాదనలు విన్న కోర్టు తీర్పు ఇప్పటికే రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే. తుది తీర్పు వచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు కూడా కోర్టు జారీ చేసింది. ఈ నేపథ్యంలో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్‌ ఏ1గా ఉన్నారు. హైకోర్టు ఒకవేళ ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేస్తే కేటీఆర్‌కు శాశ్వత ఊరట లభించినట్లవుతుంది.మరోవైపు ఈ కేసులో గురువారం(జనవరి9) విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ సోమవారం మళ్లీ నోటీసులిచ్చింది. సోమవారం కేసు విచారణ కోసం బంజారాహిల్స్‌ ఏసీపీ కార్యాలయానికి కేటీఆర్‌ వెళ్లారు. న్యాయవాదిని విచారణకు అనుమతించమని పోలీసులు చెప్పడంతో కేటీఆర్‌ అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చేశారు. ఈడీ విచారణకు రాలేను.. సమయం కావాలి: కేటీఆర్‌ ఫార్ములా-ఈ కేసులో మంగళవారం(జనవరి7) విచారణకు రావాలని కేటీఆర్‌కు ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు రాలేనని, తనకు సమయం కావాలని ఈడీని కేటీఆర్‌ కోరారు.క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ అయినందున విచారణకు రాలేనని కేటీఆర్‌ సమాధానమిచ్చారు. ఇదీ చదవండి: రేవంత్‌ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా

Mp Vijayasaireddy Comments On Enforcement Directorate Enquiry2
కేవీరావుపై పరువు నష్టం దావా వేస్తా: విజయసాయిరెడ్డి

సాక్షి,హైదరాబాద్‌:కాకినాడ సీ పోర్టు అమ్మకం విషయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఈడీ ఆఫీసు నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘నన్ను మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. కర్నాటి వెంకటేశ్వర్ రావు(కేవీరావు) ఫిర్యాదు మీద విచారణ చేశారు. ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ మీద ఈడీ కేసు నమోదు చేసింది. విక్రాంత్ రెడ్డికి కాకినాడ సీ పోర్ట్ గురించి కేవీ రావుతో మాట్లాడాలని నేను చెప్పినట్లు ఆరోపించారు. కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.కానీ కాకినాడ సీ పోర్ట్ విషయంలో నేను ఎవరికి ఫోన్ చేయలేదు. కేవీరావు తిరుమలకు వచ్చి దేవుడి ముందే నిజాలు చెప్పాలి. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కాకినాడ పోర్ట్ షేర్ ట్రాన్స్ఫర్‌కు నాకు సంబంధం లేదు. కేవీరావు మీద సివిల్ డిఫమేషన్ వేస్తాను. నాకు సంబంధం లేని విషయంలో నా పై ఆరోపణలు చేశారు.సండూరు పవర్‌ పెట్టుబడులపై వెరిఫై చేసి మళ్లీ పిలిస్తే సమాధానం చెప్తానని చెప్పను. విక్రాంత్‌రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగానే తెలుసు ఆయనతో నాకేం సంబంధం’అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ విచారించిందినా స్టేట్మెంట్ ఈడి అధికారులు రికార్డ్ చేశారుడిడి అధికారులు నన్ను 25 ప్రశ్నలు అడిగారుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసిందికేవీ రావు నాకు తెలియదు అని చెప్పానుఅతనికి నాకు ఎలాంటి సంబంధం లేదుకాకినాడ సీ పోర్ట్ విషయం లో కేవీ రావు కు ఎక్కడ నేను ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను తిరుమల కు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పానునేను తప్పు చేస్తే ఏ శిక్ష కైనా నేను సిద్ధంమే నెల 2020 లో నేను ఫోన్ చేసానని కేవి రావు చెపుతున్నాడుకాల్ డేటా తీసి నేను కాల్ చేశాను లేదో చూసుకోవచ్చునేను ఎక్కడ కూడా కేవీ రావు కు ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను ఈడీ విచారణ కు పిలవండి అని కోరానురంగనాధ్ కంపెనీ నీ ప్రభుత్వం కి ఎవ్వరు పరిచయం చేసారని ఈడీ ప్రశ్నించిందినాకు సంబంధం లేదు అని చెప్పానునేను ఒక సాధారణ మైన ఎంపీ నీ మాత్రమేశ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవ్వరు ఆపాయింట్ చేసారో నాకు తెలియదు అని చెప్పానుశరత్ చంద్ర రెడ్డి తో ఉన్న సంబంధాలు కూడా అడిగారుకుటుంబ రీలేషన్ అని చెప్పానుకాకినాడ సీ పోర్ట్ విషయం లో నాకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారులుక్ ఔట్ నోటీసుల ఫై నేను ఢిల్లీ హైకోర్టు కు వెళ్ళానుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీ కి చెప్పానువిక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారువిక్రాంత్ రెడ్డి తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుపలేదుసండుర్ పవర్ కంపెనిలో 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారుకొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అని చెప్పాను

HMPV Virus News Few Cases At Single Day Confirmed In India3
హలో.. హెచ్‌ఎంపీవీ వైరస్‌తో జాగ్రత్త

బెంగళూరు: : భారత్‌లో హ్యూమన్‌ మెటా న్యూమోవైరస్‌ (HMPV) ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. కర్ణాటకలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్‌ సోకడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక(Karnataka) ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి కరోనా రూల్స్‌ మాదిరిగానే ఉన్నాయి. నిబంధనలు ఇలా జనసందడి ప్రదేశాల్లో అనవసరంగా తిరగరాదని, అప్పుడప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్‌తో కడుక్కోవాలని, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి, చికిత్స పొందాలని అందులో తెలిపారు. వారు టవల్, దుస్తులను వేరుగా ఉంచుకోవాలి.బహిరంగ స్థలాల్లో తిరిగేటప్పుడు మాస్క్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలని కీలక సూచన చేసింది.ఉమ్మివేరాదు. జలుబు, దగ్గు ఉంటే సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. ఇల్లు, చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో కార్యాయాల్లో శుభ్రతను కాపాడుకోవాలి.పోషకాహారాన్ని సేవించాలి, పిల్లలు, వయో వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి డిసెంబర్‌లో సాధారణ జలుబు, దగ్గు సులుపెరగలేదన్నారు.మెల్లగా విస్తరిస్తున్న హెచ్‌ఎమ్‌పీవీదేశంలో హెచ్‌ఎమ్‌పీవీ మెల్లగా విస్తరిస్తోంది. భారత్‌లో ఒక్కరోజే హెచ్‌ఎమ్‌పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఈ వైరస్‌ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్‌కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్‌ వచ్చింది.ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్‌ రాగా, అహ్మదాబాద్‌లో ఓ చిన్నారికి ఈ వైరస్‌ సోకింది. దాంతో దేశంలోని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.భయం వద్దు.. జాగ్రత్తగా ఉండండిచిన్నారుల్లో వైరస్‌ వ్యాప్తికి హెచ్‌ఎంపీవీ కొత్త వేరియంట్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ, తమ వద్ద ఇంకా పూర్తి వివరాలు లేవన్నారు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్‌ గుండూరావుఇదే అంశంపై కేంద్రం మరిన్ని వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంగా హెచ్‌ఎంపీవీ వైరస్‌ కొత్తది కాదని గుర్తించాలి. భయపడొద్దు. ఇది సాధారణంగా దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ దానంతట అదే తగ్గుముఖం పడుతుంది’ అని అన్నారు.చైనాలో అధికం..ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్‌ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్‌ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్‌ఎమ్‌పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్‌ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్‌ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Former Minister Ambati Rambabu On Game Changer Episode4
‘పుష్ప’కేనా నీతులు.. గేమ్‌ చేంజర్‌కి పాటించరా?

అమరావతి: ‘పుష్ప’ కేమో నీతులు చెప్తారా!, గేమ్‌ చేంజర్‌కి(Game Changer) పాటించరా! అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు. రామ్‌ చరణ్‌ నటించిన గేమ్‌ ఛేంజర్‌.. ఈ సంక్రాతి బరిలో నిలవడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ఈవెంట్‌ రాజమండ్రిలో శనివారం సాయంత్రం జరిగింది. ఆ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠగా గుర్తించారు. ఇదే విషయంపై అంబటి రాంబాబు(Ambati Rambabu) ‘ ఎక్స్‌’ వేదికగా స్పందించారు. "పుష్ప" కేమో నీతులు చెప్తారా !"గేమ్ చేంజర్' కి పాటించరా !@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 6, 2025 గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు ఇద్దరు యువకులు. ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తాము ఆధారాన్ని కోల్పోయమంటూ బోరున విలపిస్తున్నారు.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తోంది,. తనతో కలిసి పండ్ల వ్యాపారం చేసుకుంటున్న చరణ్‌ను కోల్పోవడంతో తాము అన్నీ కోల్పోయినట్లే ఉందని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.అల్లు అర్జున్‌ టార్గెట్‌గా వ్యవహారం నడిపారా?పుష్ప-2(Pushpa-2) బెనిఫిట్‌ షో సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. ఆ సినిమా బెనిఫిట్‌ షోలో భాగంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందింది. అదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఫలితంగా దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. పుష్ప-2 హీరో అల్లు అర్జున్‌... సంధ్య థియేటర్‌కు బెనిఫిట్‌ షోకు రావడంతోనే ఇదంతా జరిగిందని అతనిపై కేసు కూడా నమోదైంది. ఒకవైపు ఈ కేసులో A-11గా ఉన్న అల్లు అర్జున్‌ విచారణ ఎదుర్కొంటున్నాడు. అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ లభించినా ఈ కేసు వివాదం ఇంకా చల్లారలేదు. ప్రధానంగా అల్లు అర్జున్‌ టార్గెట్‌గా వ్యవహారం అంతా నడిచిందనే విమర్శలు కూడా వినిపించాయి.మరి గేమ్‌ ఛేంజర్‌ సంగతి ఏంటి?పుష్ప సినిమాకు సంబంధించి తెలంగాణలో ఒకరు ప్రాణాలు కోల్పోతే, గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఇంకా రిలీజ్‌ కాకుండానే ఇద్దరు అసువులు బాసారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు ‘పుష్ప’ రచ్చ ఇంకా హాట్‌ హాట్‌గా ఉండగానే, గేమ్‌ ఛేంజర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా జరపడాన్నిప్రశ్నిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌ సాయంత్రం సమయంలో జరగడంతో పాటు దానికి భారీగా ఫ్యాన్స్‌ సేకరణ జరిగిందనే అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు పలువురు విశ్లేషకులు.పుష్ప ఘటన.. పవన్‌ మాటల్లో కొన్ని.. అల్లు అర్జున్‌ విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపించిందన్నాడు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. ఘటన జరిగిన వెంటనే రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది చేయకపోవడం వల్లే ఇంత జరిగింది. ఒకవేళ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించకపోతే ఆయనపై కూడా ప్రజల్లో విమర్శలు వచ్చేవి. సీఎం హోదాలో రేవంత్‌ స్పందించారనే అనుకుంటున్నా. రేవంత్‌ రెడ్డి గొప్ప నాయకుడే కాదు.. కింద స్థాయి నుంచి ఎదిగారు’ అని పవన్‌ అన్నారు.‘‘గేమ్‌ ఛేంజర్‌’ పరామర్శిస్తాడా?ఇ క్కడ కూడా విషాదమే చోటు చేసుకుంది. గేమ్‌ ఛేంజర్‌ ఆయా కుటుంబాల్ని పరామర్శిస్తాడా అనే ప్రశ్న తలెత్తోంది. ఆరోజు పవన్‌ మాటల్ని బట్టి చూస్తే.. రేవతి కుటుంబాన్ని అల్జు అర్జున్‌ పరామర్శించకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ వివాదం పెద్ద అవడానికి కూడా అల్లు అర్జున్‌ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం కూడా ఒక కారణంగా చూపారు. మరి ఇప్పుడు రామ్‌ చరణ్‌ వెళ్లి. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల్సి పరామర్శించాలి కదా. వారి కుటుంబాలకైతే తక్షణ సాయం అయితే అందించారు కానీ వారి కుటుంబాల్ని వెళ్లి పరామర్శించాల్సిన బాధ్యత రామ్‌ చరణ్‌పై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ‘‘ఒరేయ్‌ పిచ్చోడా .. పవనన్న చెప్తాడంతే రా

Spanish woman returns to India in search of biological mother After 20 years5
20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!

ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే...జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లి స్పర్శకోసం మనసు ఆరాట పడుతుంది. అలా చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమైన యువతి ఇపుడు జన్మనిచ్చిన తల్లికోసం అన్వేషిస్తోంది. రెండు దశాబ్దాలక్రితం అనుకోని పరిస్థితుల్లో అమ్మకు దూరమైన, పిల్లల విద్యలో పరిశోధకురాలు స్నేహ భారతదేశానికి తిరిగి వచ్చింది. అసలేంటీ స్నేహ స్టోరీ తెలుసుకుందాం పదండి!స్నేహకు సుమారు ఏడాదిన్నర వయసుండగా ఆమె తల్లి వదిలేసివెళ్లిపోయింది. ఈమెతోపాటు నెలల పసిబిడ్డ సోము కూడా అనాధలైపోయారు. ఇది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇద్దర్నీ స్థానిక అనాథ ఆశ్రమంలో చేర్పించారు. ఐదేళ్లపాటు అక్కడే పెరిగారు.అయితే స్పెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన ఒక జంట వీరి పాలిట దైవాలుగా మారారు. అనాధ ఆశ్రమంలో ఉన్న ఐదేళ్ల స్నేహ , నాలుగేళ్ల సోము ఇద్దర్నీ స్పానిష్‌ జంట జెమా వైదర్, జువాన్ జోష్ 2010లో దత్తత తీసుకుని తమ దేశానికి తీసుకువెళ్లి పోయారు. వీరిని సొంత బిడ్డల్లా పెంచుకుని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం స్నేహ వయసు 21 ఏళ్లు కాగా, చిన్నారుల విద్యలో పరిశోధనలు చేస్తోంది.అయితే, ఇటీవలే వారి మూలాలు ఒడిశాలో ఉన్నాయని జెమా దంపతులు స్నేహకు తెలిపారు. దీంతో తనకు జన్మనిచ్చిన తల్లి ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలని స్నేహ పెంపుడు తల్లి జెమాతో కలిసి గత నెల 19న భారత్ (భువనేశ్వర్)కు చేరుకుంది. స్థానిక హోటల్‌‌లో ఉంటూ నయాపల్లిలోని ఇంటి యజమాని వద్దకు వెళ్లి అక్కడ తల్లిదండ్రుల పేర్లను తెలుసుకుంది. తల్లి పేరు బనలతాదాస్‌, తండ్రి సంతోష్‌ అని తెలిసింది. ఈ వివరాలతో పోలీసుల సాయంతో అమ్మకోసం వెదుకులాట ప్రారంభించింది. అలాగే అనాధాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని దృవీకరించుకుంది. ఈ విషయంలో మహిళా విశ్వవిద్యాలయం రిటైర్డ్ టీచర్ సుధా మిశ్రా ఆమెకు సాయం అందించారు.ఈ విషయాన్ని స్థానిక పోలీస్ కమిషనర్ దేవ్ దత్తా సింగ్‌ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసులు విచారణ చేయగా, బానాలత కటక్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే జనవరి 6న స్నేహ తిరిగి స్పెయిన్ కు వెళ్లాల్సి ఉండటంతో తల్లిని కలుసుకోవడం సాధ్యం కాలేదు. అయితే తాను మార్చిలో తిరిగి ఇండియాకు వచ్చి తల్లి ఆచూకీ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తానని చెప్పింది స్నేహ. స్నేహ తల్లిదండ్రులను గుర్తించడానికి పోలీసులు , పంచాయతీ కార్యకర్తల సహాయం తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ అంజలి ఛోట్రే చెప్పారు.స్నేహ అసలు తల్లిదండ్రులు ఎవరు?ఒడిశాకు చెందిన బనలతా దాస్, సంతోష్‌ స్నేహ తల్లిదండ్రులు. వీరు నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్‌‌లోని నయాపల్లిలో అద్దె ఇంటిలో ఉండేవారు. వంట మనిషిగా పని చేసే ఆమె భర్త, ఏమైందో తెలియదు గానీ పిల్లలు సహా భార్యను వదిలివేసి వెళ్లిపోయాడు. దీంతో బానాలత ఒంటరిదైపోయింది. అటు నలుగురు పిల్లలతో, కుటుంబ పోషణా భారమైంది. దీంతో ఇద్దరి పిల్లల్ని వదిలేసి మరో కొడుకు, కూతుర్ని తీసుకొని ఎటో వెళ్లిపోయింది. స్నేహ మా ఇంటి వెలుగుస్నేహ చాలా బాధ్యతగల కుమార్తె. మంచి విద్యావంతురాలు. ఆమె మా ఇంటి వెలుగు,ఆమెమా జీవితం అంటూ స్నేహ గురించి ప్రేమగా చెప్పుకొచ్చింది దత్తత తల్లి జెమా. అంతేకాదు జీవసంబంధమైన తల్లిని తెలుకోవాలన్న ఆరాటపడుతున్న కుమార్తెతోపాటు ఒడిశాలోని భువనేశ్వర్‌ రావడం విశేషం. ప్రస్తుతం స్నేహ చేస్తున్న ప్రయత్నం నెట్టింట వైరల్‌వుతోంది. త్వరలోనే తల్లీబిడ్డలిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు

Gill To Be Removed Bumrah to be India Vice Captain for CT 2025: Report6
CT 2025: శుబ్‌మన్‌ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్‌?

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది టీమిండియా. ముఖ్యంగా బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగా దాదాపు దశాబ్దం తర్వాత ఈ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి పయనమైంది.బౌలర్‌గా, కెప్టెన్‌గా రాణించిఇక ఆసీస్‌తో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచిందంటే అందుకు కారణం జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah)నే. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) గైర్హాజరీలో ఈ ఫాస్ట్‌బౌలర్‌ భారత జట్టును ముందుకు నడిపించాడు. పేసర్‌గా, కెప్టెన్‌గా రాణించి ఆసీస్‌ గడ్డపై టీమిండియాకు అతిపెద్ద టెస్టు విజయం(295 పరుగుల తేడాతో) అందించాడు.వెన్నునొప్పి వేధించినాఅయితే, ఆ తర్వాత రోహిత్‌ శర్మ తిరిగి వచ్చినా టీమిండియా ఇదే జోరును కొనసాగించలేకపోయింది. బ్యాటర్‌గా, సారథిగా రోహిత్‌ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి అతడు స్వచ్చందంగా తప్పుకోగా.. బుమ్రా మరోసారి పగ్గాలు చేపట్టాడు. వెన్నునొప్పి వేధించినా జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు.కానీ సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ ఓటమిని చవిచూసింది. బుమ్రా లేకపోయి ఉంటే.. టీమిండియా ఆసీస్‌ చేతిలో 5-0తో వైట్‌వాష్‌కు గురయ్యేదని మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ వ్యాఖ్యానించాడంటే.. ఈ సిరీస్‌లో అతడి ప్రాధాన్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా?ఈ నేపథ్యంలో ఇప్పటికే పేస్‌ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. త్వరలోనే పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. వన్డేల్లోనూ రోహిత్‌ వారసుడిగా బుమ్రా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గిల్‌పై వేటు.. బుమ్రాకు ప్రమోషన్‌?ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 సందర్భంగా రోహిత్‌ శర్మకు బుమ్రా డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా శ్రీలంక పర్యటన 2024 సందర్భంగా వన్డే, టీ20లలో యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ). అయితే, ఏదేని కారణాల వల్ల రోహిత్‌ దూరమైతే.. గిల్‌ ఇప్పటికప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించే పరిణతి సాధించలేదని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్‌ శర్మ తప్పుకొన్న తర్వాత.. వన్డే కెప్టెన్సీకి అతడు దూరం కానున్నాడనే వదంతులు వచ్చాయి. అతడి స్థానంలో హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాలు వినిపించాయి.ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లుకాగా చాంపియన్స్‌ ట్రోఫీ కంటే ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా దూరంగా ఉండనున్నట్లు సమాచారం. వెన్నునొప్పి కారణంగా అతడు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్‌ ట్రోఫీ-2025 మొదలుకానుంది. పాకిస్తాన్‌ ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో జరుగుతాయి. హైవోల్టేజీ పోరు భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 23న జరుగనుంది.చదవండి: 13 నిమిషాల్లోనే ఖేల్‌ ఖతం.. రషీద్‌ ఖాన్‌ మాయాజాలం.. అఫ్గన్‌ సరికొత్త చరిత్ర

TV Actress Muskan Nancy James Files FIR Against Her Husband, Sister In Law Hansika Motwani7
నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు

హీరోయిన్‌ హన్సిక (Hansika Motwani) వేధింపులు తాళలేకపోతున్నానంటూ బుల్లితెర నటి ముస్కాన్‌ నాన్సీ పోలీసులను ఆశ్రయించింది. భర్త ప్రశాంత్‌ మోత్వానీ, అత్త జ్యోతి, ఆడపడుచు హన్సిక మోత్వానీలు తనను మానసికంగా హింసిస్తున్నారని వాపోయింది. ఈ మానసిక ఒత్తిడి వల్ల తన ముఖంలో కొంతభాగం పక్షవాతానికి గురైందని పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు గృహ హింస కింద కేసు నమోదు చేసుకున్నారు. డిసెంబర్‌ 18న నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఖరీదైన గిఫ్టులు తెమ్మని..పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముస్కాన్‌ (Muskaan Nancy James), ప్రశాంత్‌ 2020లో పెళ్లి చేసుకున్నారు. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని నటి అత్త, ఆడపడుచు హన్సిక డిమాండ్‌ చేశారట! అంతేకాకుండా ఆస్తిలోనూ ఏవో కుట్రలకు పాల్పడ్డారని నటి ఆరోపించింది. తన వైవాహిక బంధంలోనూ హన్సిక పదేపదే జోక్యం చేసుకుని గొడవలకు కారణమయ్యేదని పేర్కొంది. వీరు పెట్టిన టార్చర్‌ వల్ల తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై హన్సిక, ప్రశాంత్‌ ఇంతవరకు స్పందించలేదు. కాగా ముస్కాన్‌ దంపతులు 2022 నుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. ప్రశాంత్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: అప్పట్లో ఐరన్‌ లెగ్‌ అని పేరొస్తుందని భయపడ్డా: చిరంజీవిపాక్షిక పక్షవాతం2022లో నటి తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైనట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం అస్సలు ఊహించలేం. కొంతకాలంగా నేనేమైపోయానని అనుకుంటున్నారా? నా జీవితంలో ఏం జరుగుతుందనేది కొందరికి మాత్రమే తెలుసు. నేను ముఖ పక్షవాతంతో బాధపడుతున్నాను. అధిక ఒత్తిడి వల్ల నాకీ పరిస్థితి వచ్చింది. గతంలో ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు కోలుకున్నాను. కానీ ఇప్పుడు మరోసారి ఆ వ్యాధి నా జీవితంలోకి ప్రవేశించింది.ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది?గత కొద్ది నెలలనుంచి నేను, నా తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. ముఖం ఉబ్బిపోయి ఆ బాధ భరించరాకుండా ఉంది. ఒక నటికి ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది? నాముందున్న సమస్యలతో పోరాడే శక్తినిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు సపోర్ట్‌గా నిలబడే పేరెంట్స్‌ ఉండటం నా అదృష్టం. జీవితం అంత ఈజీ కాదు.. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా అన్నీ మారిపోతాయి అని రాసుకొచ్చింది.సీరియల్స్‌..ముస్కాన్‌ నాన్సీ.. తొడి ఖుషి తొడె ఘమ్‌ సీరియల్‌లో సహాయక నటిగా యాక్ట్‌ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్‌ ఆఫర్‌ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్‌, ఫియర్‌ ఫైల్స్‌, క్రైమ్‌ పెట్రోల్‌ షోలలో కొన్ని ఎపిసోడ్స్‌లో మెరిసింది. భారత్‌ కా వీర్‌ పుత్ర: మహారాణ ప్రతాప్‌, ఏజెంట్‌ రాఘవ్‌- క్రైమ్‌ బ్రాంచ్‌ షోలలో నటించింది. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది.చదవండి: అన్నీ ఒకేసారి.. నా వల్ల కావట్లేదంటూ ఏడ్చేసిన మాధవీలత

Infosys defers annual wage hikes to the fourth quarter8
ఐటీ ఉద్యోగులకు తీవ్ర నిరాశ.. టాప్‌ 2 కంపెనీ ఝలక్‌

దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) వార్షిక వేతనాల పెంపును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (Q4FY25)వాయిదా వేసింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ చివరిసారిగా 2023 నవంబర్‌లో జీతాల పెంపును అమలు చేసింది.అన్ని ఐటీ కంపెనీలదీ అదే దారిసాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం కావడం ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ సేవల రంగంలో విస్తృత అనిశ్చితిని ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, క్లయింట్ బడ్జెట్ల ఆలస్యం, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితితో ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.ఇటాంటి వాతావరణంలో పోటీ కంపెనీలైన హెచ్‌సీఎల్‌ టెక్‌ (HCLTech), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree), ఎల్‌&టీ (L&T) టెక్ సర్వీసెస్ కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు, లాభదాయకతను కొనసాగించడానికి రెండవ త్రైమాసికంలో జీతం ఇంక్రిమెంట్‌లను దాటవేశాయి.క్యూ4లో అక్టోబర్ 17న దశలవారీగా వేతనాల పెంపుదలకు ప్లాన్‌ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. అందులో కొంత భాగం జనవరిలో అమలులోకి వస్తుందని, మిగిలినది ఏప్రిల్‌లో అమలులోకి వస్తుందని క్యూ2 ఫలితాల తర్వాత విలేకరుల సమావేశంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్‌రాజ్కా తెలిపారు.లాభం మెరుగురెండవ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం త్రైమాసికానికి 2.2 శాతం పెరిగి రూ. 6,506 కోట్లకు చేరుకుంది. తక్కువ ఆన్‌సైట్ ఖర్చులు, మెరుగైన వినియోగ రేట్లు, మెరుగైన కార్యాచరణ సామర్థ్యాల కారణంగా మార్జిన్‌లు 10 బేసిస్ పాయింట్ల మేర మెరుగయ్యాయి.వేతనాల్లో భారీ వ్యత్యాసంసాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్‌ (TCS), ఇన్ఫోసిస్‌ (Infosys), హెచ్‌సీఎల్‌ టెక్‌ (HCLTech), విప్రో (Wipro), టెక్‌ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.ఇదీ చదవండి: అప్పుడు బెంగళూరు.. ఇప్పుడు మరోచోట గూగుల్‌ భారీ ఆఫీస్‌!ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్‌లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్‌దాస్‌ పాయ్ ఎత్తిచూపారు.ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్‌ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే.

Maoists Landmine Explosion In Chattisgarh Sukuma9
ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర.. తొమ్మిది మంది జవాన్ల దుర్మరణం

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెట్టన మందుపాతర పేలి తొమ్మిది మంది జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. మొత్తం పదిహేను మంది జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని అంబోలి వంతెన వద్ద సోమవారం(జనవరి6) మావోయిస్టులు పేల్చివేశారు. గాయపడ్డ జవాన్లను బీజాపూర్‌ జిల్లాలోని ఆస్పత్రిలో చేర్చించి చికిత్సనందిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, సుక్మా జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతోంది. దీంతో ఇక్కడ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఏకంగా భద్రతా బలగాల వాహనాన్ని మందుపాతర పెట్టి పేల్చివేయడం సంచలనంగా మారింది. కాగా, ఆదివారమే ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్‌ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులతో పాటు ఒక జవాను మృతి చెందారు. భద్రతా బలగాలపై పైచేయి సాధించేందుకే..?మావోయిస్టుల దాడుల్లో భద్రతా సిబ్బంది, పౌర మరణాలు 70 శాతం తగ్గాయని, పోలీసుల చేతిలో మావోయిస్టులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. నక్సలిజంపై చివరిదెబ్బ కొట్టడానికి కేంద్ర, రాష్ట్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జమ్ముకశ్మీర్‌ కంటే బస్తర్‌ అందమైన ప్రాంతమని,నక్సలిజం అంతమైతే ఇక్కడికి పర్యాటకులు భారీగా వస్తారని పేర్కొన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ఇంతలోనే భద్రతా బలగాలపై మావోయిస్టులు మందుపాతరతో పెద్ద ఎత్తున దాడి చేయడం గమనార్హం.ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్టు హత్య..హైదరాబాద్‌లో నిందితుడి అరెస్టు

KSR Comments Over Talliki Vandanam Scheme And Yellow Media10
‘తల్లికి వందనం’.. బాబు సర్కార్‌కు ఎల్లో మీడియా జాకీలు!

‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు..’ ఏపీలో ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ వేసుకుని ఇంటింటికి వెళ్లి మరీ మహిళలు, పిల్లలందరికీ ఈ వాగ్ధానమిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లు మాట్లాడారు. యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా.. ‘‘మీకు పద్దెనిమిది వేలు’’ అని, వలంటీర్ల దగ్గరకు వెళ్లి ‘‘మీకు నెలకు పదివేలు ఖాయం’’ అంటూ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు.వైఎస్‌ జగన్‌ విజయవంతంగా అమలు చేసిన ‘అమ్మ ఒడి’కి నకలుగా టీడీపీ ‘తల్లికి వందనం’ పేరుతో ఓ పథకాన్ని ఎన్నికల హామీగా ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్‌ జగన్‌ కుటుంబంలో తల్లికి మాత్రమే నగదు ఇచ్చేవాడని, తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న ప్రతీ బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికింది కూటమి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతోపాటు నిమ్మల రామానాయుడు వంటి టీడీపీ నేతలు ఈ హామీకి విస్తృతంగా ప్రచారం చేశారు.చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఆర్థిక సాయం చేస్తామని ఊదరగొట్టారు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు నలుగురుంటే రూ.60 వేలు అంటూ పేద కుటుంబాలను ఊరించారు. చివరకు కూటమి అధికారంలోకి వచ్చింది కానీ.. పేద, మధ్య తరగతి ప్రజలకు మాత్రం ఎక్కాలు చెప్పుకోవడమే తప్ప, లెక్క (డబ్బు) అందలేదు. ఈ మార్చిలోగా ఇస్తారేమోలే అని పలువురి ఆశలపై నీళ్లు చల్లుతూ చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇప్పుడు తల్లికి వందనం పెట్టడం లేదని తేల్చేసింది. వచ్చే జూన్‌లో చేస్తామని ప్రకటించింది. అంటే జనం అమాయకులు, పిచ్చోళ్లు, వారికి ఏమీ తెలియదు.. తాము ఏ అబద్దం చెబితే దానిని నమ్ముతారన్నది కూటమి పెద్దల విశ్వాసం. అందుకే ధైర్యంగా ఈ ప్రకటన చేశారనుకోవాలి.తల్లికి వందనం స్కీమ్‌ దేని కోసం ప్రకటించారు?. పేద పిల్లలు స్కూల్ మానకుండా, విద్యను ఎంకరేజ్ చేయడం కోసం గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అమ్మ ఒడి స్కీమ్ తెచ్చారు. దీనికి ప్రజలలో విపరీతమైన ఆదరణ లభించింది. స్కూళ్లకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లను బాగా అభివృద్ది చేయడం, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా తీర్చి దిద్దడం, డిజిటల్ విద్య, గోరుముద్ద తదితర కార్యక్రమాలను వైఎస్‌ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. దాంతో ఈ స్కీమ్‌ను కాపీ కొట్టి, తామైతే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సాధారణంగా ప్రతీ ఏడాది జూన్ నెలలో ఈ మొత్తాలను తల్లుల ఖాతాలోకి వేయవలసి ఉంది.వైఎస్‌ జగన్ అమలు చేసిన అమ్మ ఒడి స్కీమ్‌కు సుమారు రూ.6000 కోట్ల వ్యయం అయితే.. టీడీపీ, జనసేనలు చెప్పిన వాగ్దానం ప్రకారం సుమారు రూ.13 వేల కోట్ల వరకు వ్యయం అవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడు నెలలు గడిచినా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయలేదు. ఏదో రకంగా ఈ పథకాన్ని ఎగవేయడమో లేక బాగా కోత పెట్టి అమలు చేయడానికో కసరత్తులు చేస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. కాని అదీ లేదు.. ఇదీ లేదు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ చెప్పినట్లు తాము పలావు పెడుతుంటే, బిర్యానీ తినిపిస్తామని చంద్రబాబు, పవన్ ప్రచారం చేశారు. ఇప్పుడు పలావు పోయే.. బిర్యానీ రాకపోయే.. అని పిల్లలు, తల్లులు ఉసూరుమంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2024 జూన్‌లోనే అమ్మ ఒడి డబ్బులు అందేవి కదా అన్నది ప్రజల భావన.తల్లికి వందనం మాత్రమే కాదు.. మరి కొన్ని స్కీములను కూడా ఇలాగే నీరు కార్చే పనిలో ప్రభుత్వం ఉందని మంత్రివర్గ నిర్ణయాలు తెలియచేస్తున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20వేల చొప్పున ఇస్తామన్నది ఎన్నికల హామీ అయితే, ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.10 వేలకు మరో రూ.10వేలు జత చేసి ఇస్తామని చెబుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఆ ప్రకారం ఏటా అందించింది. నాలుగేళ్లు ఇస్తామని అన్నా, ఐదేళ్లు చెల్లించింది. అప్పట్లో కూడా కేంద్రం ఇచ్చిన ఆరు వేలతో కలిపి ఈ మొత్తాన్ని ఇస్తే ఇదే చంద్రబాబు, పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు మాత్రం కేంద్రం ఇచ్చే పది వేలతో కలిపి ఇస్తామంటున్నారు. అంటే వారు గతంలో చెప్పిన దానిని పరిగణనలోకి తీసుకుంటే రైతులకు పది వేల రూపాయలు ఎగవేస్తున్నారన్నమాట. ఈ పథకాన్ని త్వరలో అమలు చేస్తామని అన్నారే తప్ప స్పష్టంగా నిర్దిష్ట తేదీని చెప్పలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఈ పంటల సీజన్‌లో రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం ఇవ్వలేదు. పైగా ఉన్న ఉచిత బీమా సదుపాయాన్ని కూడా ఎగవేసింది.తల్లికి వందనం, రైతు భరోసా తర్వాతే మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పించనున్నారని కొత్త లింక్ పెడుతున్నారు. అంటే ఆ రెండు స్కీమ్‌లు ఎప్పుడు ఇస్తారో, ఈ బస్ స్కీమ్ ఎప్పటికి అమలు అవుతుందో దేవుడికే ఎరుక. కాకపోతే ఈలోగా ప్రజలను మాయ చేసే పనిలో బిల్డప్ బాబాయిలు, జాకీ మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దూసుకెళ్తోంది. జూన్‌లోగా తల్లికి వందనం అని శీర్షికను ఈనాడు పెడితే, తల్లికే తొలి వందనం అంటూ ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇచ్చింది. అంతే తప్ప ఈ ఏడాదికి ఎగనామం పెట్టారని రాయలేదు. పైగా ఈనాడు వారు ఏం బిల్డప్ ఇచ్చారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నికలలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం మరో రెండు పధకాలను అమలు చేయబోతోందని నిస్సిగ్గుగా రాసింది. ఇప్పటికీ ఒక్క పెన్షన్‌లను వెయ్యి రూపాయలు పెంచడం మినహా మిగిలినవి ఏవీ అమలు చేయలేదని జనం గగ్గోలు పెడుతుంటే, ఈనాడు మీడియా రాతలు ఇలా ఉన్నాయి.ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గందరగోళంలోకి నెడుతోంది. డీఎస్సీని ఆరు నెలల్లో అమలు చేస్తామని గతంలో చెప్పిన చంద్రబాబు నాయుడు తాజాగా వచ్చే జూన్‌కు డీఎస్సీ పూర్తి చేస్తామని అంటున్నారు. నిజానికి అప్పటికి కూడా అది జరగకపోవచ్చని టీడీపీ మీడియానే కథనాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ తదితర సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. మహిళా శక్తి కింద ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ప్రతి నెల ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం దాని జోలికి వెళ్లలేదు. నిరుద్యోగ భృతి అతీగతి లేదు.ఎన్నికల మేనిఫెస్టో దగ్గర పెట్టుకుని జాకీ మీడియా ఏయే హామీలు అమలు చేసింది చెప్పగలిగితే విశ్వసనీయత వస్తుంది. అంతే తప్ప కేవలం చంద్రబాబు ప్రభుత్వాన్ని జాకీ పెట్టి లేపడం కోసం కథనాలు ఇస్తే ప్రజలకు ప్రయోజనం ఏంటి?. ఇప్పటికే జర్నలిజాన్ని భ్రష్టు పట్టించిన ఎల్లో మీడియా రోజురోజుకు అధఃపాతాళానికి పడిపోతోంది. ఆ సంగతి పక్కనబెడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు తల్లికి వందనం గురించి నోరెత్తకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. దీని ద్వారా తల్లిని వారు గౌరవించినట్లా? మోసం చేసినట్లా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement