Top Stories
ప్రధాన వార్తలు
నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు(Formula E-car Race)లో తన క్వాష్ పిటిషన్ కొట్టివేసినందుకే ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఇదే సమయంలో తనపై ఏసీబీ పెట్టింది అక్రమ కేసు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే, హైకోర్టు విచారణ చేసుకోండని చెప్పింది కానీ.. నేను నేరం చేశానని చెప్పలేదని అన్నారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నాపై కక్ష సాధించాలనే లొట్టపీసు కేసు పెట్టారు. నాపై పెట్టింది అక్రమ కేసు. ఏసీబీ(Telangana ACB)ది తప్పుడు ఎఫ్ఐఆర్. అవినీతి లేదని తెలిసి కూడా నామీద కేసు పెట్టి శునకానందం పొందుతున్నారు. న్యాయ వ్యవస్థపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కొంత మంది మంత్రులైతే వాళ్లే న్యాయమూర్తులుగా మారిపోతున్నారు. వారే తీర్పులు చెబుతున్నారు. మంత్రులకు అంత ఉలికపాటు ఎందుకు?. క్వాష్ పిటిషన్ కొట్టివేసినందుకే నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు. మీలాగా దివాళాకోరు పనిచేసే ఖర్మ నాకు పట్టలేదు. హైకోర్టు(telangana High Court) విచారణ చేసుకోండని చెప్పింది కానీ.. నేను నేరం చేశానని చెప్పలేదు. తెలంగాణ ఇమేజ్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఫార్ములా రేస్ నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీలో చర్చ పెట్టమంటే రేవంత్ పారిపోయారు. రేవంత్ ఇంట్రెస్ట్ ఫార్ములా.. మా ఇంట్రెస్ట్ ఫార్మర్. ఇచ్చిన హామీలపై చిట్టి నాయుడు దృష్టి పెట్టాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీస్తాం. అన్ని పార్టీలకు గ్రీన్కో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో లాయర్లతో విచారణకు వెళ్లాను. రాజ్యాంగపరంగా ప్రతీ హక్కును వినియోగించుకుంటాను. హైకోర్టు అనుమతి ఇస్తే లాయర్ల కలిసి విచారణకు తప్పకుండా వెళ్తాను. సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాడుతాను. నేను ఏ తప్పూ చేయలేదు.. ఏ విచారణకైనా సిద్ధం. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. ఈనెల 16న ఈడీ విచారణకు కూడా హాజరు అవుతాను. అవినీతిలో పట్టుబడిన వారికి ప్రతీ విషయం అవినీతిలాగానే కనబడుతుంది. ఇది.. ఆరంభం మాత్రమే. చివరికి న్యాయమే గెలుస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.
ఢిల్లీలో ఒకే విడతలో ఎన్నికలు.. ఫిబ్రవరి 5న పోలింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. విజ్ఞాన్ భవన్లో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇలా.. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికలకు పోలింగ్.. ఫిబ్రవరి 5ఎన్నికల ఫలితాలు.. ఫిబ్రవరి 8నామినేషన్లకు చివరి తేదీ.. జనవరి 17నామినేషన్ల విత్ డ్రా చివరి తేదీ.. జనవరి 20 #WATCH | Delhi to vote in a single phase on February 5; counting of votes on February 8 #DelhiElections2025 pic.twitter.com/QToVzxxADK— ANI (@ANI) January 7, 2025ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది. గతేడాది ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. ఓట్ల తొలగింపు ఆరోపణలను ఖండిస్తున్నాం. ఎన్నికలను పారదర్శంగా నిర్వహిస్తున్నాం. ఈవీఎంల పనితీరుపై పూర్తి విశ్వాసంగా ఉన్నాం. ఈవీఎంల వాడకంలో పారదర్శకత ఉంది. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగినట్టు ఆధారాలు లేవు. ఈవీఎంల విషయంలో అసత్యాలను నమ్మవద్దు. ఈ ఏడాది తొలి ఎన్నికల్లో ఢిల్లీలో జరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. ఢిల్లీకి స్టేట్ స్టేటస్ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్ పాలన సాగించింది. ఇక..2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో..ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్-కాంగ్రెస్‌లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి.
వీడియో: సౌదీ ‘మక్కా’లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు
జెడ్డా: సౌదీ అరేబియాలో అతి భారీ వర్షం కురిసింది. కుండపోత కారణంగా ముస్లిం పవిత్ర మక్కా నగరం చెరువును తలపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం జలమయమైంది. వర్షం కారణంగా దర్శనానికి వచ్చిన లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సౌదీ అరేబియాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో భారీ నష్టం జరిగింది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. మక్కా, మదీనా, జెడ్దాలో ఎడతెరిపలేని వర్షంతో భారీ వరదలు వచ్చాయి. ఉరుములు, మెరుపులతో సుడిగాలులు విరుచుకుపడ్డాయి. దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో మక్కాలో ఉమ్రా యాత్రకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు.#Breaking: 🇸🇦 Mecca is floating: Torrential rain with hail have led to severe flooding in the holy city for Muslims in Saudi Arabia.😭May Allah protect us from this danger.pic.twitter.com/OgUwGwNhp6— Md.Sakib Ali (@iamsakibali1) January 7, 2025 Scenes of heavy rain falling on Mecca and Jeddah in the Kingdom of #SaudiArabia pic.twitter.com/2EsGyc3IC5— Hamdan News (@HamdanWahe57839) January 6, 2025 SAUDI ARABIA :📹 POWERFUL STORM HIT JEDDAH CITY TODAYScenes from KING ABDULAZIZ International Airport pic.twitter.com/KBta0A0gDD— 𝛎í⸦𝛋𝚼 (@iv1cky) January 7, 2025 మక్కా, మదీన, జెడ్దాలో ఊహించని విధంగా వరదనీరు ముంచెత్తడంతో అనేక కార్లు, టూరిస్ట్ బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక, మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూడు నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో సౌదీలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. #Mecca after rain outside.Haram Shareef pic.twitter.com/XYrR0FNdep— Saeed Hameed (@urdujournosaeed) January 7, 2025 Mecca, Saudi Arabia, experienced heavy rainfall today, leading to significant flooding. The city received an unusually high amount of rain within a short time. Thankfully, emergency teams are working hard, and the situation is under control. Rain is rare in Mecca, but it’s always… pic.twitter.com/KNfJyy16My— مدقق لغوي 👓 (@Lang_checker) January 6, 2025 మక్కాకు సౌత్ సైడ్ ఉన్న అల్-అవాలి పరిసరాల్లో వరదల్లో చాలామంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని, గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం, వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా వర్షాల కారణంగా మరణాల సంఖ్య తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో 2009లో సౌదీ కురిసిన వర్షం, వరదల కారణంగా దాదాపు 100 మంది చనిపోయారు. Heavy rainfall in the outskirts of *Al-Awali* near Mecca, Saudi Arabia, has caused many areas to flood. 🌧️🚗 Several vehicles were submerged in the floodwaters, and citizens faced severe difficult. #Flood #AlAwali #Rain pic.twitter.com/pOSvkaua1m— rebel (@Asifahm07207201) January 7, 2025 Heavy rain in Mecca.. pic.twitter.com/ciZh7odU66— TAJNIMUL (@tajnimul11606) January 6, 2025 Massive flooding due to extreme rainfall in Mecca, Saudi Arabia 🇸🇦 Today #Rain #macca #TodayNews #UPDATE pic.twitter.com/cCIRcbH0oL— ✩𝐒𝐇𝐀𝐇𝐈𝐃 𝐌𝐔𝐒𝐓𝐀𝐅𝐀✩ (@Shahidmustafa_m) January 6, 2025
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court)లో ఆయన సవాల్ చేశారు.ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ కేసును కొట్టేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేం జోక్యం చేసుకోం అని తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు.ఈ కేసులో తాజా పరిణామాలపై ఏసీబీ ఆఫీసులో అధికారులు భేటీ అయ్యారు. ఎఫ్ఈవో, హెచ్‌డీఏతో పాటు రెవెన్యూ అధికారుల పాత్రపై చర్చించడంతో పాటు సుప్రీం కోర్టును కేటీఆర్ ఆశ్రయించడంతో.. అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు.మరో వైపు.. అధికారులు అరవింద్‌కుమార్, బీఎల్ఎన్రెడ్డి నోటీసులపై చర్చతో పాటు, మొదటి రేసు తర్వాత తప్పుకున్న కంపెనీలపై కూడా చర్చించారు. ఏసీబీ ఉన్నతాధికారులతో బంజారాహిల్స్ ఏసీపీ,సీఐతో పాటు కొంతమంది సిబ్బంది సమావేశమయ్యారు. క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. కాగా, తమ వాదన కూడా వినాలని ప్రభుత్వం.. కేవీయట్ వేసింది.ఇదీ చదవండి: కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టు
నాకు ఇల్లు లేకుండా చేశారు: సీఎం అతిషి
న్యూఢిల్లీ:సీఎంగా తనకు కేటాయించిన ఇంటిని కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి రద్దు చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మండిపడ్డారు. మూడు నెలల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారని చెప్పారు. మంగళవారం(జనవరి7) ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంటి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం కూడా నోటీసులు వచ్చాయని తెలిపారు. ఇప్పుడుంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా అందులో కోరారని వివరించారు.తన కుటుంబ సభ్యులను కూడా బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని అతిషి ఆరోపించారు.తాను సీఎంగా ఎన్నికైన తర్వాత మా వస్తువులన్నింటినీ బీజేపీ కార్యకర్తలు రోడ్డుమీదకి విసిరేశారని చెప్పారు. తమ ఇళ్లను బీజేపీ లాక్కోవచ్చేమో గాని ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం పని చేయకుండా తమను ఎవరూ ఆపలేరన్నారు. అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లలోనే ఉంటూవాళ్ల కోసం పని చేస్తానన్నారు.కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం(జనవరి 7) ప్రకటించింది. ఫిబ్రవరి 5వ పోలింగ్ జరగనుంది.అదే నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోరు జరగనున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్యే ఉండనుంది. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు షాక్..‘ఆప్’కు అఖిలేష్ మద్దతు
పుష్ప ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించే న్యూస్.. సంక్రాంతికి రీ లోడ్..!
అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్‌లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.పుష్ప రీ లోడెడ్..తాజాగా పుష్ప-2 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతోన్న పుష్ప-2 మూవీకి అదనంగా మరో 20 నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేయనున్నారు. ఈ అప్డేట్ వర్షన్ సంక్రాంతి కానుకగా ఈనెల 11 నుంచి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 రీ లోడెడ్ పేరుతో మరిన్నీ సన్నివేశాలు యాడ్ చేస్తున్నారు. ది వైల్డ్ ఫైర్ గెట్స్ ఎక్స్ట్రా ఫైరీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పొంగల్‌కు మరోసారి పుష్ప-2 లేటేస్ట్ వర్షన్ చూసి ఎంజాయ్ చేయండి.పుష్ప టీమ్ తన ట్వీట్లో రాస్తూ..' "పుష్ప2: ది రూల్’ 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో రీలోడెడ్ వెర్షన్ సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి మూవీ ప్రదర్శితమయ్యే థియేటర్స్‌లో చూడవచ్చు. వైల్డ్ ఫైర్ ఇప్పుడు మరింత ఫైరీగా" అని పోస్ట్ చేశారు.ఆ రికార్డ్ కోసమేనా..అయితే ఇప్పటికే వసూళ్ల పరంగా దూసుకెళ్తోన్న పుష్ప-2 చిత్రానికి 20 నిమిషాల సీన్స్ అదనంగా జోడించడం చూస్తే ఆ క్రేజీ రికార్డ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ ఈ ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డులు సృష్టించిన పుష్పరాజ్.. మరో అరుదైన ఘనతను సాధించేందుకు సిద్ధమైంది.ఇప్పటికే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది. కేవలం పుష్ప-2 కంటే ముందు అమిర్ ఖాన్ నటించిన దంగల్ మాత్రమే ఉంది. దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో నిలిచింది.తాజాగా మరో 20 నిమిషాల నిడివి గల సీన్స్ యాడ్స్ చేయడం దంగల్ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకే మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సంక్రాంతి పండుగ రావడం ఈ సినిమాకు మరో ప్లస్ కానుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 వసూళ్లు అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది. ఏదేమైనా పుష్పరాజ్.. దంగల్ రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.పెరగనున్న రన్‌టైమ్..ఇప్పటికే 3 గంటల 20 నిమిషాల 38 సెకన్స్గా పుష్ప-2 రన్ టైమ్ మరింత పెరగనుంది. ఈ నిడివికి అదనంగా మరో 20 నిమిషాలతో కలిపి 3 గంటల 40 నిమిషాలకు పైగా ఉండనుంది. #Pushpa2TheRule RELOADED VERSION with 20 minutes of added footage will play in cinemas from 11th January 💥💥The WILDFIRE gets extra FIERY 🔥#Pushpa2Reloaded ❤️🔥#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @resulp… pic.twitter.com/ek3gRsOaVi— Pushpa (@PushpaMovie) January 7, 2025
బ్యాంకుకు వెళ్లకుండానే.. మొబైల్ నెంబర్ అప్డేట్: ఇలా చేస్తే సింపుల్
టెక్నాలజీ విపరీతంగా పెరిగిన తరుణంలో దాదాపు ఏ పని చేయాలన్నా.. ఇంట్లో కూర్చునే చేసేస్తున్నారు. బ్యాంకింగ్ సేవలైతే మరీ సులభమైపోయాయి. కానీ ఇంకా చాలామందికి తెలియని విషయాలు లేకపోలేదు. కాబట్టి ఈ కథనంలో 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ (Mobile Number) ఎలా మార్చుకోవాలి? ఎక్కడ మార్చుకోవాలి? అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking) ద్వారా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్➤ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న యూజర్లు లేదా కస్టమర్లు తమ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే.. ముందు ఎస్బీఐ అధికారిక నెట్ బేకింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤కుడివైపు కనిపించే కంటిన్యూ టూ లాగిన్ మీద క్లిక్ చేసి.. తరువాత యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.➤అక్కడ కనిపించే చేంజ్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి.➤క్లిక్ చేసిన తరువాత మీరు మార్చాలనుకున్న మొబైల్ నెంబర్ లేదా కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.ఏటీఎం (ATM) ద్వారా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్ఏటీఎం కేవలం మీ ఖాతాలోని నగదు విత్‌డ్రా చేసుకోవడానికి, డిపాజిట్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. అవసరమైనప్పుడు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కూడా మార్చుకోవడానికి సహాయపడుతుంది.➢ముందుగా మీ సమీపంలోని ఏటీఎం సెంటర్‌కు వెళ్ళండి.➢మీ దగ్గరున్న డెబిట్ కార్డ్‌ని ఏటీఎం మెషీన్‌లోకి చొప్పించి.. పిన్ నెంబర్ ఎంటర్ చేయండి.➢పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత స్క్రీన్ మీద కనిపించే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ సెలక్ట్ చేసుకోండి.➢తరువాత మొబైల్ నెంబర్ చేంజ్ ఆప్షన్ ఎంచుకోవాలి.➢ఆప్షన్ ఎంచుకున్న తరువాత మీ పాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. తరువాత కొత్త నెంబర్ ఎంటర్ చేయాలి. ఇలా చేసినప్పుడు మీకు ఓటీపీ నెంబర్లు వస్తాయి. వీటిని ఎంటర్ చేయడం ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది.ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా మాత్రమే కాకుండా మీరు బ్యాంకును సంప్రదించి కూడా మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. అయితే దీనికి కావలసిన డాక్యుమెంట్స్ బ్యాంకులో అందించాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంకులు వెళ్లలేని వారు పైన చెప్పిన రెండు పద్దతుల ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: పేదోళ్లను లక్షాధికారి చేసే స్కీమ్: ఇదిగో డీటెయిల్స్మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఎందుకుసాధారణంగా మనం డబ్బు విత్‌డ్రా చేసినా లేదా డిపాజిట్ చేసినా, ఖాతాలో ఎంత ఉండనే విషయం తెలుసుకోవాలంటే తప్పకుండా బ్యాంకుకు వెళ్లాల్సి ఉండేది. కానీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల.. మీ లావాదేవీలకు సంబంధించిన విషయాలు మీకు మెసేజ్ రూపంలో వస్తాయి. కాబట్టి ప్రత్యేకించి మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ద్వారా బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి కూడా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు.
బాబూ.. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదా?: విడదల రజిని
సాక్షి, గుంటూరు: ఏపీలో పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి విడదల రజని(Vidadala Rajini). ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు.మాజీ మంత్రి విడదల రజిని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆరోగ్యశ్రీ(aarogyasri) పేదలకు సంజీవిని లాంటింది. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించటమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రారంభించారు. ఇతర సంక్షేమ పథకాల మాదిరిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చూడకూడదు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన పథకాన్ని వైఎస్ జగన్ మరింత బలోపేతం చేసి పేదలకు అందించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే అని భావించి ఆరోగ్యశ్రీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది.ఈరోజు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు వైద్య సేవలు ఆపేశాయి. ప్రజల ఆరోగ్యం.. ప్రభుత్వ బాధ్యత కాదు అని కూటమి సర్కార్ ఆలోచిస్తోంది. ఇటువంటి పరిస్థితులు మా ప్రభుత్వంలో ఎప్పుడూ రాలేదు. కోవిడ్(covid)ను ఆరోగ్యశ్రీలో చేర్చి మా ప్రభుత్వం వైద్యం అందించింది. గత ప్రభుత్వాలు అమలు చేసిన ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం కొనసాగించాలి. మూడు వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్యశ్రీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఆరోగ్య శ్రీని హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్‌లో అమలు చేస్తామని చెబుతున్నారు. థర్డ్ పార్టీకి బీమా సౌకర్యం అందించే ప్రయత్నం మంచిది కాదు. బీమా కంపెనీలు సేవా దృక్పథంతో వ్యవహరించవు. అలాగే, బీమా సౌకర్యం ఎన్ని ఆసుపత్రుల్లో అమలు చేస్తారో తెలియదు. ఎన్ని రోగాలకు అమలు చేస్తారో తెలియదు. ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్ విధానాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదన్న సందేశాన్ని ఇస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేయలేకపోయాయి. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 637 కోట్ల పాత ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించారు అని చెప్పుకొచ్చారు.
నితీశ్ రెడ్డి ఆ స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!
టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసే అవకాశం రావడమే గొప్ప అనుకుంటే.. తన ఆట తీరుతో అతడు అద్భుతాలు చేశాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2024 ద్వారా వెలుగులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి.బంగ్లాతో సిరీస్ సందర్భంగా..సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డి.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే, తనకున్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాల కారణంగా అనతికాలంలోనే టెస్టు జట్టుకూ ఎంపికయ్యాడు. ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు నితీశ్ రెడ్డి. అంతేకాదు తుదిజట్టులోనూ స్థానం సంపాదించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో బ్యాట్ ఝులిపించి సత్తా చాటాడు.మెల్బోర్న్లో గుర్తుండిపోయే శతకంఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి ఏకంగా శతకంతో చెలరేగాడు. రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి విఫలమైన చోట.. 114 పరుగులతో దుమ్ములేపి.. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి ఆట తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. టీమిండియాకు దొరికిన మరో ఆణిముత్యం అంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు అతడి నైపుణ్యాలను కొనియాడారు.కాగా ఆసీస్‌తో ఐదు టెస్టుల్లో కలిపి తొమ్మిది ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన నితీశ్ రెడ్డి.. 298 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, నితీశ్ రెడ్డి ఈ సిరీస్‌లో ఎక్కువగా ఎనిమిదో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడం మామూలు విషయం కాదు.ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!మనలో చాలా మంది నితీశ్ రెడ్డి సెంచరీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నిజానికి.. అతడు సిరీస్ ఆసాంతం 40 పరుగుల మార్కును అందుకున్నాడు. ఏదేమైనా.. అతడు శతకం బాదిన తర్వాత.. చాలా మంది.. టీమిండియాకు ఎనిమిది లేదంటే ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆల్‌రౌండర్ దొరికాడని సంతోషపడ్డారు.నిజానికి ఒకవేళ ఆరో స్థానంలో గనుక అతడిని ఆడిస్తే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అతడికి ఆ సత్తా ఉంది. టీమిండియా విధ్వంసకర ఆటగాడిగా అతడు ఎదగగలడు. దీర్ఘకాలం పాటు ఆరో నంబర్ బ్యాటర్‌గా సేవలు అందించగల యువ క్రికెటర్ అతడు’’ అని పేర్కొన్నాడు.ఐదో బౌలర్‌గానూఅదే విధంగా.. విదేశీ గడ్డపై పేస్ దళంలో ఐదో బౌలర్‌గానూ నితీశ్ రెడ్డి రాణించగలడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి మూడు ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి బౌలర్‌గా విఫలమయ్యాడు. అయినప్పటికీ.. ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి బౌలింగ్ ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంది. బౌలింగ్ నైపుణ్యాలకు ఇంకాస్త మెరుగులు దిద్దుకుంటే.. ఐదో బౌలర్‌గా అతడు అందుబాటులో ఉండగలడు’’ అని పేర్కొన్నాడు.చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ
Congress Vs BJP: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ ఆఫీసుపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీ మోర్చా నాయకులు, కార్యకర్తలు.. బీజేపీ ఆఫీసు నుంచి గాంధీభవన్ ముట్టడికి బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు.. బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. గాంధీ భవన్ వైపు బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. వారిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో, మరోసారి ఉద్రికత్త చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు.. బీజేపీ పార్టీ ఆఫీస్ వద్దకు కాషాయ పార్టీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. పార్టీ ఆఫీసుపై దాడి నేపథ్యంలో బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. బీజేపీ కార్యాలయంపైన కాంగ్రెస్ దాడి దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ లాగానే వ్యవహరిస్తోంది. తిరగబడి మేము కూడా దాడి చేస్తే ఢిల్లీలో మీ జాతీయ నాయకులు ఎక్కడ దాక్కుంటారు. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలి.కేటీఆర్ తప్పించుకుని ఎన్ని రోజులు తిరుగుతారు. చంచల్గూడా వెళ్లాలా లేక తీహార్ జైలుకు వెళ్లాలా అనేది కేటీఆర్ డిసైడ్ చేసుకోవాలి. కేటీఆర్ జైలుకు వెళితే సానుభూతి రాదు. డబ్బులు ఎక్కువై కోర్టులలో పిటిషన్లు వేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం భయంకరమైన అవినీతికి పాల్పడింది. లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారు. తెలంగాణ అధ్యక్ష పదవిపై ఎలాంటి చర్చ లేదు. దానిపై నన్ను ఎవరూ అడగలేదు. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..‘బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ దుండగులు దాడి చేయడం దారుణం. దాడుల వల్ల హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. తెలంగాణలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. శాంతిభద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. కేటీఆర్ కేసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్ ఇప్పుడు అధికారులను బలి పశువులను చేస్తున్నారు. నాడు కేటీఆర్ అధికారులను భయపెట్టి పని చేయించుకున్నారు. కేటీఆర్ నిర్దోషి అయితే నిలబడి ఎదుర్కోవాలి. అంతేగానీ కోర్టులకి వెళ్లి తప్పించుకోవడానికి చూడకూడదు.కాళేశ్వరంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. దానిపైన ప్రభుత్వం ఏం చేస్తుంది?. ధరణి స్కామ్‌పై ఏం కేసులు పెట్టారు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోంది. వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి చిన్న కేసులు పెడుతున్నారు. పెద్ద కేసుల నుంచి బీఆర్ఎస్ నేతలను తప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల పూర్తి వివరాలు
ఓటీటీకి రజాకార్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
హైడ్రా తొలి పోలీస్‌స్టేషన్ ఏర్పాటు
బ్యాంకుకు వెళ్లకుండానే.. మొబైల్ నెంబర్ అప్డేట్: ఇలా చేస్తే సింపుల్
నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు: కేటీఆర్
ప్రణబ్ స్మారకం..స్థలం కేటాయించిన కేంద్రం
రిబ్బన్ కటింగ్‌కి కత్తెర లేదా?.. ఎమ్మెల్యే గిడ్డి అసహనం
విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే వారికి శుభవార్త
ఇదేం రాజకీయం.. తెలంగాణలో బీజేపీ బలమెంత?: జగ్గారెడ్డి
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్‌కు మరో షాక్
గేమ్ ఛేంజర్ ఈవెంట్: మృతుల కుటుంబాలకు రామ్‌చరణ్ ఆర్థిక సాయం
నేనూ మనిషినే.. ఏడ్చేసిన మాధవీలత
అమెరికాను హడలెత్తిస్తున్న మంచు
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!?
భారత్‌లోకి ప్రవేశించిన చైనా వైరస్
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు.
విశాల్‌కు తీవ్ర అస్వస్థత.. డాక్టర్లు ఏమన్నారంటే?
ప్రత్యేక ఫిబ్రవరి.. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా!
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్ చేసిన స్నేహ రెడ్డి!
నా కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవానికి వెళ్లాలి
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల పూర్తి వివరాలు
ఓటీటీకి రజాకార్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
హైడ్రా తొలి పోలీస్‌స్టేషన్ ఏర్పాటు
బ్యాంకుకు వెళ్లకుండానే.. మొబైల్ నెంబర్ అప్డేట్: ఇలా చేస్తే సింపుల్
నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు: కేటీఆర్
ప్రణబ్ స్మారకం..స్థలం కేటాయించిన కేంద్రం
రిబ్బన్ కటింగ్‌కి కత్తెర లేదా?.. ఎమ్మెల్యే గిడ్డి అసహనం
విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే వారికి శుభవార్త
ఇదేం రాజకీయం.. తెలంగాణలో బీజేపీ బలమెంత?: జగ్గారెడ్డి
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్‌కు మరో షాక్
గేమ్ ఛేంజర్ ఈవెంట్: మృతుల కుటుంబాలకు రామ్‌చరణ్ ఆర్థిక సాయం
నేనూ మనిషినే.. ఏడ్చేసిన మాధవీలత
అమెరికాను హడలెత్తిస్తున్న మంచు
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!?
భారత్‌లోకి ప్రవేశించిన చైనా వైరస్
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు.
విశాల్‌కు తీవ్ర అస్వస్థత.. డాక్టర్లు ఏమన్నారంటే?
ప్రత్యేక ఫిబ్రవరి.. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా!
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్ చేసిన స్నేహ రెడ్డి!
నా కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవానికి వెళ్లాలి
సినిమా
ఆ హీరోయిన్‌తో ప్రేమ.. అసలు విషయం బయటపెట్టిన సురేశ్!
టాలీవుడ్ సీనియర్ నటుడు సురేశ్(Suresh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో ఒక నటుడిగా, విలన్‌గా పలు విభిన్న పాత్రలతో అభిమానులను మెప్పించారు. టాలీవుడ్లో దాదాపు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు.ఒకప్పుడు టాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న నటుడు సురేశ్. మొదట్లో హీరోగా, తర్వాత విలన్‌గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఇతడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసే ఆయన ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. గతంలో.. నాగార్జున, అరవింద్ స్వామి, అజిత్ వంటి పలువురు స్టార్లకు తన గొంతు అరువిచ్చాడు కూడా. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సురేశ్ ఆయన తమిళంలో కూడా సత్తా చాటారు. అటు బుల్లితెరపై సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేశ్ తన కెరీర్లో జరిగిన సంఘటనలపై మాట్లాడారు. ముఖ్యంగా మరో నటి, అత్తారింటికి దారేది చిత్రంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నదియా(Nadiya) గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో హీరోయిన్గా ఉన్న నదియాతో సురేశ్ లవ్‌లో ఉన్నారని వినిపించాయి కదా? దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నంచిగా ఆయన క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: వేరే పెళ్లి చేసుకున్నా అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లోనే ఉంటా!)ఈ విషయంపై సురేశ్ మాట్లాడుతూ..'అలాంటిదేం లేదు. నదియా నా బెస్ట్ ఫ్రెండ్, ఆమెతోనే నేను ఎక్కువ సినిమాలు చేశాను. ఆమె బాయ్‌ఫ్రెండ్ పేరు కూడా దాదాపుగా నా పేరు లాగే ఉండేది. నదియా బాయ్‌ఫ్రెండ్ పేరు శిరీశ్. తను షూటింగ్ సమయంలో ఎక్కువ సమయం శిరీశ్తోనే ఫోన్ మాట్లాడేది. అది చూసి అందరూ నాతోనే మాట్లాడేవారని అనుకునేవారు. కానీ తర్వాత నదియా అతన్ని పెళ్లి చేసుకుంది. నదియా నాకు సిస్టర్‌తో సమానం. తాను సినిమాలో సాఫ్ఠ్గా ఉన్నప్పటికీ.. నాతో మాత్రం కాస్తా గట్టిగానే మాట్లాడుతుంది. తను జీవితంపై ఫుల్ క్లారిటీతో ఉండేది. సినిమాల్లో నటిస్తూనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చెప్పేది. ఆ తర్వాత కూడా మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పింది' అని అన్నారు.తామిద్దరం ఇప్పటికీ స్నేహితులుగానే ఉన్నామని సురేశ్ అన్నారు. మా 1980 నటీనటులకు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని ఆయన అన్నారు. ఆ వాట్సాప్ గ్రూప్‌లో రజనీకాంత్ సర్ కూడా ఉన్నారని సురేశ్ వెల్లడించారు.సురేశ్ సినీప్రస్థానం..ఏపీలోని శ్రీకాళహస్తిలో జన్మించిన సురేశ్ తమిళ చిత్రంతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1981లో పన్నీర్ పుష్పంగల్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో రామదండు అనే చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన కెరీర్లో పలు చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. తెలుగులో జిన్నా, స్పై చిత్రాల్లో కనిపించిన సురేశ్.. చివరిసారిగా రివైండ్ అనే మూవీలో నటించారు. కాగా.. హరితా రెడ్డిని పెళ్లాడిన సురేశ్.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత నరేశ్ రెండో పెళ్లి చేసుకున్నారు. దర్శక రచయిత్రి రాశిని ఆయన పెళ్లాడారు.
తెల్ల కల్లు, మటన్ ముక్క.. దిల్ రాజు కామెంట్స్ వైరల్
ఈ సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే వాటిల్లో డాకు మహారాజ్ మినహా మిగతా రెండు సినిమాలకు దిల్ రాజే(Dil Raju) నిర్మాత. జనవరి 10న గేమ్ ఛేంజర్, 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు వరుస ఇంటర్వ్యూలో ఫుల్ బిజీ అయిపోయారు. ఒక పక్క ఇంటర్వ్యూలు ఇస్తునే మరోపక్క ప్రీరిలీజ్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లను నిర్వహిస్తూ రెండు సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాడు.ఈ ప్రయత్నం దిల్ రాజు ఫూర్తిగా సఫలం అయ్యాడు. తన రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేశాడు.(చదవండి: అలాంటి ప్రశ్నలు అడగొద్దని చెప్పానుగా.. రజనీ అసహనం)ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunam Movie) అనే సినిమా విషయంలో ముందు నుంచి దూకుడుగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఒకపక్క అనిల్ రావిపూడి, మరోపక్క వెంకటేశ్ సినిమా ప్రమోషన్స్‌ని తమ భుజాన వేసుకున్నారు. అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక తాజాగా నిజమాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..ఆంధ్రాలో సినిమాలకు వైబ్ ఉంటే.. తెలంగాణలో కల్లు, మటన్ కు వైబ్ ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అసలేం జరిగిదంటే..సినిమా గురించి మాట్లాడేందుకు దిల్ రాజు స్టేజ్ ఎక్కగానే.. ‘సర్.. స్పీచ్ మాములుగా ఉండొద్దు.. ఒక్క దెబ్బకు వైరల్ అయిపోవాలి’ అంటూ యాంకర్ శ్రీముఖి రిక్వెస్ట్ చేసింది. దిల్ రాజు అదే జోష్‌లో తెలంగాణ యాసలో మాట్లాడుతూ రెచ్చిపోయారు. ‘ఏం దావత్ చేద్దామా..? చెట్లళ్లలకు పోదామా..? అని ఆడియన్స్‌ని అడిగాడు .ఆ తర్వాత స్టేజ్ పైనే ఉన్న వెంకటేశ్(venkatesh)ని చూస్తూ.. ‘సర్ మా నిజమాబాద్‌లో తెల్ల కల్లు ఫేమస్. పొద్దునపూట నీర తాగితే వేరే లెవెల్లో ఉంటుంది. మావోళ్లకు( తెలంగాణ) సినిమా అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు.. ఆంధ్రకు వెళ్తే సినిమాకు ఓ స్ఫెషల్ వైబ్ ఇస్తారు.. తెలంగాణలో మటన్, తెల్లకల్లుకే వైబ్ ఇస్తారు’ అని దిల్ రాజు అనడంతో హీరోతో సహా ఆడియన్స్ అంతా గట్టిగా నవ్వారు.ముచ్చటగా మూడో చిత్రం..విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రమే ‘సంక్రాంతికి వస్తున్నాం’. అంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి. బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ తీసిన తర్వాత అనిల్ నుంచి వస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా రిలీజైన ఈ చిత్రం ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. వెంకీ, అనిల్ తరహా కామెడీతో ట్రైలర్‌ని కట్ చేశారు. ట్విస్ట్‌లు, థ్రిల్స్, యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నిజామాబాద్‌లో పెట్టిన తన సినిమా కార్యక్రమంలో జనాల రెస్పాన్స్ పెద్దగా లేదని తెలంగాణలో సినిమాల కంటే కల్లు, మటన్ అంటే వెంటపడతారని మాట్లాడిన దిల్ రాజు pic.twitter.com/5W2AOhgDWG— Telugu Scribe (@TeluguScribe) January 7, 2025
స్క్విడ్ గేమ్ సిరీస్‌లో మన హీరోలు.. ఈ వీడియో చూశారా?
ఇటీవల విడుదలై ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోన్న వెబ్ సిరీస్ స్క్విడ్‌గేమ్-2(Squid Game-2) . గతంలో వచ్చిన సీజన్-1కు కొనసాగింపుగా ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు స్క్విడ్ గేమ్ -3 కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అది పొరపాటుగా పోస్ట్ చేశామని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఈ కొరియన్ వెబ్ సిరీస్‌కు(web series) ఇండియాలోనూ ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. ఈ సిరీస్ అంతా ఆడియన్స్‌ను ఉత్కంఠకు గురి చేస్తుంది.అంతలా ఆదరణ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్‌లో మన హీరోలు నటిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహా ఎంత బాగుందో కదా? మరి అదే నిజమైతే బాగుండని మీకు అనిపిస్తోంది కదా? అవును.. మన హీరోలు ఆ గేమ్‌ను ఎలా ఆడతారో అనే ఆసక్తి ప్రతి ఒక్క సినీ ప్రియుడికి ఉంటుంది. అందుకే అసాధ్యం కాని వాటిన సుసాధ్యం చేయొచ్చని మరోసారి నిరూపించారు. అదెవరో కాదండి.. అదే మానవాళికి సవాలు విసురుతోన్న ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్). తాజాగా ఏఐ సాయం రూపొందించిన స్క్విడ్ గేమ్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.ఈ వీడియోలో మన స్టార్ హీరోలు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, పవన్ కల్యాణ్, ప్రభాస్ వీరంతా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు హీరోలు, కమెడియన్స్ సైతం ఈ స్క్విడ్‌గేమ్ వెబ్సిరీస్లోని పాత్రలతో వీడియోను రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చేసిన ఈ వీడియో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక అభిమాన హీరోల ఏఐ ఇమేజ్‌ల వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న వెబ్‌సిరీస్‌ల్లో స్క్విడ్ గేమ్ ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన స్క్విడ్‌గేమ్ సీజన్-2 ఓటీటీలో రికార్టులు సృష్టిస్తోంది. మొదటివారంలోనే అత్యధికంగా 68 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 92 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ర్యాకింగ్స్లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.సీజన్-3పై అప్డేట్..స్క్విడ్ గేమ్ సీజన్-2కు (Squid Game Season-2) ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇటీవలే సీజన్-3 అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. కొత్త ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత పొరపాటున డేట్ రివీల్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్‌గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ. This is so good !! AI Generated !! 💥💥💥#SquidGameSeason2 ft #TFI pic.twitter.com/QqAyf3kTQ8— Priyanka Reddy - Rayalaseema 🌬 (@BerrySmile112) January 7, 2025
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్ చేసిన స్నేహ రెడ్డి!
అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్‌లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.సంధ్య థియేటర్ విషాదం..అయితే పుష్ప-2 విడుదలకు ముందు రోజే తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృత్యువాత పడింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం చంచల్ గూడ నుంచి విడుదలయ్యారు. ఇటీవల బన్నీకి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది.అరెస్ట్ తర్వాత బన్నీ భార్య ఎమోషనల్..హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ తీవ్ర భావోద్వేగానికి గురైంది. బన్నీ అరెస్ట్ సమయంలో ఆయనను హత్తుకుంది. ధైర్యంగా ఉండమని భార్యకు అల్లు అర్జున్ భరోసా ఇచ్చి పోలీసుల వెంట వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఈ వివాదం తర్వాత ఆమె తొలిసారి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.(ఇది చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్)అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్..బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలిసారిగా పోస్ట్ చేసింది. డిసెంబర్లో జరిగిన జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుంది. ఆల్ డిసెంబర్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇందులో తన పిల్లలు అయాన్, అర్హతో బన్నీ ఆడుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అరెస్ట్ తర్వాత ఆమె చేసిన తొలి పోస్ట్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. పుష్ప సినిమాకు స్వీక్వెల్‌గా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో 2021లో వచ్చిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. అదే ఉత్సాహంతో పుష్ప-2 ది రూల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ విడుదలైన నెల రోజుల్లోనే ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడు రికార్డులు సృష్టించింది.(ఇది చదవండి: తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. బాహుబలి -2 రికార్డ్ బ్రేక్)బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్..టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది. కేవలం పుష్ప-2 కంటే ముందు అమిర్ ఖాన్ నటించిన దంగల్ మాత్రమే ఉంది. దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో నిలిచింది. అయితే దంగల్ రికార్డ్‌ను పుష్పరాజ్ బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
IPL 2025: ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్(Mumbai Indians) గతేడాది ఘోర పరాభవాన్ని చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. స్టార్ ప్లేయర్లు ఉన్నా పేలవ ప్రదర్శనతో చతికిలపడి అవమానభారంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.అయితే, ఈ దుస్థితికి యాజమాన్యమే కారణమని ముంబై ఇండియన్స్ అభిమానులే విమర్శల వర్షం కురిపించారు. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు అంబానీల సారథ్యంలోని ముంబై జట్టు.. తమ కెప్టెన్‌ను మార్చడమే ఇందుకు ప్రధాన కారణం. ముంబై ఫ్రాంఛైజీకి ఘనమైన చరిత్ర ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోక్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా ముంబై నిలిచింది. రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలో ఏకంగా ఐదుసార్లు టైటిల్ సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అయితే, గత సీజన్ ఆరంభానికి ముందు రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించిన మేనేజ్మెంట్..అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరీ.. పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది.పాండ్యాకు అవమానాలురోహిత్ శర్మ ఫ్యాన్స్‌తో పాటు.. ముంబై జట్టు అభిమానులు కూడా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో హార్దిక్ పాండ్యా మైదానంలోకి రాగానే అతడిని కించపరిచేలా పెద్ద ఎత్తున గోల చేశారు. ముంబై సొంత గ్రౌండ్ వాంఖడేలోనూ హార్దిక్‌కు ఇలాంటి చేదు అనుభవాలు తప్పలేదు. రోహిత్ కూడా అభిమానులను వారించకుండా మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిచ్చింది.రోహిత్ టీమ్ వర్సెస్ హార్దిక్ అనేలాహార్దిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేయడం రోహిత్ శర్మకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. రోహిత్‌తో పాటు.. అతడి తర్వాత కెప్టెన్ పదవిని ఆశించిన జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా హార్దిక్‌తో పొసగడం లేదనే వార్తలు గుప్పుమన్నాయి. ఫలితంగా ముంబై ఇండియన్స్ డ్రెసింగ్‌రూమ్‌లో విభేదాలు తలెత్తాయంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, మైదానంలో రోహిత్, బుమ్రా, సూర్య ఒక జట్టుగా కనిపించడం.. హార్దిక్ పాండ్యా ఒంటరిగా ఉండటం వీటికి బలాన్ని చేకూర్చాయి.ఫలితంగా వరుస ఓటముల రూపంలో ముంబై ఇండియన్స్ భారీ మూల్యమే చెల్లించింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి పొరపాటును పునరావృతం చేయకూడదని ముంబై యాజమాన్యం భావిస్తోందట. ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!ఇందుకోసం ఇటీవలే ప్రత్యేకంగా ఓ సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని మనస్ఫూర్తిగా అంగీకరించాలని.. అతడికి అన్ని వేళలా అండగా నిలవాలని జట్టులోని ప్రధాన ఆటగాళ్లతో మేనేజ్మెంట్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.అదే విధంగా.. ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఉండి.. జట్టు ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేయాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. హార్దిక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా అతడిని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.కాగా తనను కెప్టెన్‌గా తప్పించిన ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ బంధం తెంచుకుంటాడనే ప్రచారం జరుగగా.. అతడు మాత్రం అనూహ్య రీతిలో అదే ఫ్రాంఛైజీతో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు.రోహిత్ మళ్లీ ముంబైతోనే..ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రోహిత్ కూడా ఉండటం విశేషం. జస్ప్రీత్ బుమ్రా(రూ. 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ. 16.35 కోట్లు),హార్దిక్ పాండ్యా(రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ(రూ. రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ(రూ. 8 కోట్లు)లను ముంబై అట్టిపెట్టుకుంది. కాగా గత సీజన్ ఆఖరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా.. హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2025లో మొదటి మ్యాచ్ ఆడకుండా అతడిపై నిషేధం పడింది.చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ
ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయిన పేసు గుర్రం
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. బుమ్రా డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినీగా ఎంపికయ్యాడు. బుమ్రాతో పాటు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, సౌతాఫ్రికా సీమర్ డేన్ పాటర్సన్ కూడా మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. డిసెంబర్ నెలలో ప్రదర్శనల ఆధారంగా ఐసీసీ ఈ ముగ్గురిని నామినేట్ చేసింది. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ కావడం ఇది వరుసగా రెండో సారి. నవంబర్ నెలలోనూ బుమ్రా ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు. నవంబర్ నెలలో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు.మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ (డిసెంబర్) నామినీస్ విషయానికొస్తే.. ఈ అవార్డుకు పురుషుల నామినీస్ లాగానే భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు చెందిన ఆటగాళ్లు ఎంపికయ్యారు. భారత్ నుంచి స్మృతి మంధన, సౌతాఫ్రికా నుంచి నొన్కులులేకో మ్లాబా, ఆస్ట్రేలియా నుంచి అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. డిసెంబర్ నెలలో ఈ ముగ్గురు అద్భుతంగా రాణించారు.జస్ప్రీత్ బుమ్రా: పేసు గుర్రం బుమ్రా డిసెంబర్ నెలలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నెలలో అతనాడిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో (ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో) 22 వికెట్లు తీశాడు. ఇదే నెలలో బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్లు (907) సాధించిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.పాట్ కమిన్స్: ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ డిసెంబర్ నెలలో మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనలు నమోదు చేశాడు. కమిన్స్ ఈ నెలలో 17 వికెట్లు తీయడంతో పాటు అత్యతం కీలకమైన 144 పరుగులు తీశాడు. కమిన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనల కారణంగా డిసెంబర్లో జరిగిన మూడు టెస్ట్‌ల్లో ఆసీస్ భారత్‌ను ఓడించింది.డేన్ పాటర్సన్: ఈ సౌతాఫ్రికన్ పేసర్ తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. డిసెంబర్ నెలలో పాటర్సన్ రెండు టెస్ట్‌ల్లో 13 వికెట్లు తీశాడు. పాటర్సన్ ప్రదర్శనల కారణంగా సౌతాఫ్రికా తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకుంది.స్మృతి మంధన: మంధన డిసెంబర్ నెలలో ఆడిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో సూపర్ ఫామ్‌ను కనబర్చి 463 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన వన్డేలో మంధన సూపర్ సెంచరీ చేసింది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో మంధన వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసింది.మ్లాబా: డిసెంబర్ నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో మ్లాబా చెలరేగిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆమె 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ రికార్డు సృష్టించింది. ఇదే నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేల్లోనూ మ్లాబా రాణించింది.అన్నాబెల్ సదర్‌ల్యాండ్: 23 ఏళ్ల ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ డిసెంబర్ నెలలో బంతితో, బ్యాట్‌తో అద్బుతంగా రాణించింది. ఈ నెలలో సదర్‌ల్యాండ్ ఏడు వికెట్లు తీయడంతో పాటు రెండు సెంచరీలు (భారత్, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేల్లో) చేసింది.
నితీశ్ రెడ్డి ఆ స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!
టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసే అవకాశం రావడమే గొప్ప అనుకుంటే.. తన ఆట తీరుతో అతడు అద్భుతాలు చేశాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2024 ద్వారా వెలుగులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి.బంగ్లాతో సిరీస్ సందర్భంగా..సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డి.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే, తనకున్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాల కారణంగా అనతికాలంలోనే టెస్టు జట్టుకూ ఎంపికయ్యాడు. ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు నితీశ్ రెడ్డి. అంతేకాదు తుదిజట్టులోనూ స్థానం సంపాదించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో బ్యాట్ ఝులిపించి సత్తా చాటాడు.మెల్బోర్న్లో గుర్తుండిపోయే శతకంఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి ఏకంగా శతకంతో చెలరేగాడు. రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి విఫలమైన చోట.. 114 పరుగులతో దుమ్ములేపి.. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి ఆట తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. టీమిండియాకు దొరికిన మరో ఆణిముత్యం అంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు అతడి నైపుణ్యాలను కొనియాడారు.కాగా ఆసీస్‌తో ఐదు టెస్టుల్లో కలిపి తొమ్మిది ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన నితీశ్ రెడ్డి.. 298 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, నితీశ్ రెడ్డి ఈ సిరీస్‌లో ఎక్కువగా ఎనిమిదో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడం మామూలు విషయం కాదు.ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!మనలో చాలా మంది నితీశ్ రెడ్డి సెంచరీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నిజానికి.. అతడు సిరీస్ ఆసాంతం 40 పరుగుల మార్కును అందుకున్నాడు. ఏదేమైనా.. అతడు శతకం బాదిన తర్వాత.. చాలా మంది.. టీమిండియాకు ఎనిమిది లేదంటే ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆల్‌రౌండర్ దొరికాడని సంతోషపడ్డారు.నిజానికి ఒకవేళ ఆరో స్థానంలో గనుక అతడిని ఆడిస్తే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అతడికి ఆ సత్తా ఉంది. టీమిండియా విధ్వంసకర ఆటగాడిగా అతడు ఎదగగలడు. దీర్ఘకాలం పాటు ఆరో నంబర్ బ్యాటర్‌గా సేవలు అందించగల యువ క్రికెటర్ అతడు’’ అని పేర్కొన్నాడు.ఐదో బౌలర్‌గానూఅదే విధంగా.. విదేశీ గడ్డపై పేస్ దళంలో ఐదో బౌలర్‌గానూ నితీశ్ రెడ్డి రాణించగలడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి మూడు ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి బౌలర్‌గా విఫలమయ్యాడు. అయినప్పటికీ.. ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి బౌలింగ్ ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంది. బౌలింగ్ నైపుణ్యాలకు ఇంకాస్త మెరుగులు దిద్దుకుంటే.. ఐదో బౌలర్‌గా అతడు అందుబాటులో ఉండగలడు’’ అని పేర్కొన్నాడు.చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ
బవుమా.. ద రియల్ కెప్టెన్.. ఓటమి ఎరుగని ధీరుడు..!
సౌతాఫ్రికా టెస్ట్ జట్టు సారథి టెంబా బవుమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. బవుమా తన సారథ్యంలో సౌతాఫ్రికాను తొమ్మిదింట ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఓ మ్యాచ్ డ్రా ముగిసింది. జట్టును విజయవంతంగా ముందుండి నడిపించడంతో పాటు బవుమా వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. బవుమా సౌతాఫ్రికా కెప్టెన్‌గా 9 మ్యాచ్‌ల్లో 3 శతకాలు, 4 అర్ద శతకాల సాయంతో 809 పరుగులు (57.78 సగటున) చేశాడు. బవుమా తొలిసారి సౌతాఫ్రికాను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానంలో ఉంది.ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సౌతాఫ్రికా చాలాకాలం తర్వాత సెకెండ్ ప్లేస్‌కు చేరింది. బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. బవుమా కెప్టెన్సీ స్కిల్స్‌కు ముగ్దులవుతున్న అభిమానులు అతన్ని గొప్ప సారధిగా కొనియాడుతున్నారు. బవుమా.. ద రియల్ కెప్టెన్.. ఓటమి ఎరుగని ధీరుడని జేజేలు పలుకుతున్నారు. బ్యాటర్‌గానూ పోరాట యోధుడని కితాబునిస్తున్నారు. బవుమా కెప్టెన్సీ భారాన్ని మోస్తూనే బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు.గత 10 మ్యాచ్‌ల్లో బవుమా ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..పాక్‌పై రెండో టెస్ట్‌లో 106 (179)పాక్‌పై తొలి టెస్ట్‌లో 31 (74), 40 (78)శ్రీలంకపై రెండో టెస్ట్‌లో 78 (109), 66 (116)శ్రీలంకపై తొలి టెస్ట్‌లో 70 (117), 113 (228)వెస్టిండీస్‌పై రెండో టెస్ట్‌లో 0 (2), 4 (18)వెస్టిండీస్‌పై తొలి టెస్ట్‌లో 86 (182), 15 (17)భారత్‌తో తొలి టెస్ట్‌లో 0 (0)వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో 28 (64), 172 (280)వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో 0 (2), 0 (1)ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌లో 35 (74), 17 (42)బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా వరుసగా ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో గెలిచింది. అలాగే వరుసగా మూడు సిరీస్‌ల్లో 2-0 తేడాతో విజయాలు సాధించింది. కెరీర్లో 63 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన బవుమా 38 సగటున 3606 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా తాజాగా పాకిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో (రెండో టెస్ట్) సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా గెలిచిన ప్రొటీస్ పాక్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.పాక్‌తో రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 615 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ భారీ డబుల్ సెంచరీతో (259) అదరగొట్టగా.. టెంబా బవుమా (106), వికెట్ కీపర్ కైల్ వెర్రిన్ (100) సెంచరీలు చేశారు. ఆఖర్లో మార్కో జన్సెన్ (62), కేశవ్ మహారాజ్ (40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేసి పాక్ ఇన్నింగ్స్ నేలకూల్చారు. రబాడ 3, మఫాకా, మహారాజ్ తలో 2, మార్కో జన్సెన్, వియాన్ ముల్దర్ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మొహమ్మద్ రిజ్వాన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కారణంగా పాక్ ఫాలో ఆడింది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ అద్భుతంగా పోరాడింది. ఫాలో ఆడుతూ సౌతాఫ్రికా గడ్డపై రికార్డు స్కోర్ (478) చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (145) సూపర్ సెంచరీతో మెరవడంతో పాక్ ఇన్నింగ్స్ పరాజయం బారి నుంచి తప్పించుకుంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (81), మొహమ్మద్ రిజ్వాన్ (41), సల్మాన్ అఘా (48) ఓ మోస్తరు స్కోర్లు చేసి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాటేలా చేశారు.పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. బెడింగ్హమ్ (47), మార్క్రమ్ (14) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌తో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో మ్యాచ్‌లన్నీ పూర్తి చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.
బిజినెస్
అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది
బెంజ్, ఆడి, పోర్స్చే, లంబోర్ఘిని కార్లు అందుబాటులోకి వచ్చిన తరువాత వింటేజ్ కార్లు కనుమరుగైపోయాయి. దీనికి కారణం.. ఆ కార్లను కంపెనీలు తయారు చేయడం ఆపేయడం, కొత్త ఉద్గార ప్రమాణాలు అమలులోకి రావడం. అయితే కొందరు మాత్రం ఇప్పటికీ వింటేజ్ కార్లు (Vintage Cars) లేదా పాతకాలం కార్లను కొనుగోలు చేయడానికి.. ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు అలాంటి కార్లను కొనుగోలు చేయడం ఓ కలగా పెట్టుకుంటారు. ఇటీవల బెంగళూరు(Bengaluru)కు చెందిన మహిళ ఓ పాతకాలం కారును కొనుగోలు చేసి.. కల నెరవేరిందని సంబరపడిపోయింది.బెంగళూరుకు చెందిన 'రచన మహదిమనే' అనే మహిళ.. 'ప్రీమియర్ పద్మిని' (Premier Padmini) కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. చిన్నప్పటి నుంచి ఈ కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ మహిళ.. ఇటీవలే తన పుట్టిన రోజు సందర్భంగా ఈ అరుదైన కారును కొనుగోలు చేసింది.బెంగళూరు మహిళ కొనుగోలు చేసిన ప్రీమియం పద్మిని కారు చూడటానికి కొత్త కారు మాదిరిగానే ఉంది. దీని కోసం ఈమె ప్రత్యేకంగా కారుకు మరమ్మతులు చేయించింది. ఈ కారణంగానే ఆ కారు కొత్తదాని మాదిరిగా కనిపిస్తోంది. నా పుట్టినరోజు సందర్భంగా.. నేను కారు కొన్నాను. ఇది నా కలల కారు, నేను చిన్నప్పటి నుంచి ఈ కారు గురించి కలలు కన్నాను అని ఆమె వీడియోలో వెల్లడించారు.గతంలో మన చుట్టూ ఉన్న ప్రీమియర్ పద్మిని కార్లు చాలా ఉండేవి. అయితే ఇప్పుడు నేను దీనిని డ్రైవింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని మహదిమనే పేర్కొంది. పాతకాలపు కార్లను ఉపయోగించాలని అందరికీ ఉంటుంది. కానీ బహుశా అది అందరికీ సాధ్యం కాదు. అయితే పాతకాలపు కారును ఎంతో ఇష్టంగా మళ్ళీ పునరుద్ధరించి, డ్రైవ్ చేయడాన్ని చూసి పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలువురు వినియోగదారులు ఈ ఐకానిక్ వాహనం గురించి తమ మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. ఫ్యాన్సీ లగ్జరీ కార్ ఛేజింగ్ ప్రపంచంలో ప్రీమియర్ పద్మిని చెప్పుకోదగ్గ మోడల్ అని ఒకరు పేర్కొన్నారు. మా తాత అంబాసిడర్లో పని చేసేవారు. అంతే కాకుండా పద్మిని పేరు పెట్టడానికి ఆయన కూడా బాద్యుడు. నేను పద్మినిలో డ్రైవింగ్ నేర్చుకున్నాను అని మరొకరు వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Rachana Mahadimane (@rachanamahadimane)ప్రీమియర్ పద్మినిప్రీమియర్ పద్మిని కార్లను.. ఇటాలియన్ కంపెనీ 'ఫియట్' లైసెన్స్‌తో ప్రీమియర్ ఆటోమొబైల్స్ లిమిటెడ్ (PAL) తయారు చేసింది. ఇది ఫియట్ 1100 సిరీస్ ఆధారంగా తయారైంది. 1964లో మొదటిసారిగా మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారుని మొదట ఫియట్ 1100 డిలైట్ అని పిలిచేవారు. ఆ తరువాత దీనిని 1970లలో 'ప్రీమియర్ పద్మిని' పేరుతో పిలిచారు.ప్రీమియర్ పద్మిని కారు.. గుండ్రని అంచులు, క్రోమ్ గ్రిల్ వంటి వాటితో బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో పెద్ద స్టీరింగ్ వీల్, బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్, ఐదుగురు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సీటింగ్‌తో కూడిన ఇంటీరియర్లు అన్నీ ఉన్నాయి. రోజువారీ వినియోగానికి ఈ కారును ఒకప్పుడు విరివిగా ఉపయోగించారు.ఇదీ చదవండి: 'క్రెటా ఈవీ' రేంజ్ ఎంతో తెలిసిపోయింది: సింగిల్ ఛార్జ్‌తో..1970, 1980లలో సినిమాల్లో ఈ కార్లను విరివిగా ఉపయోగించారు. ఆ తరువాత కాలంలో మారుతి 800 భారతదేశంలో అడుగుపెట్టాక.. ప్రీమియర్ పద్మిని కార్లకు ఉన్న డిమాండ్ తగ్గిపోయింది. దీంతో కంపెనీ ఈ కార్ల ఉత్పత్తిని 2000వ సంవత్సరంలో నిలిపివేసింది. అయితే ఇప్పటికి కూడా కొంతమంది సినీతారలు తమ గ్యారేజిలలో ఈ కార్లను కలిగి ఉన్నారు. ఈ జాబితాలో రజనీ కాంత్, మమ్ముట్టి వంటివారు ఉన్నారు.
మడిచే స్క్రీన్.. వాక్ చేయించే షూస్!
టెక్నాలజీ పెరుగుతున్న ఈరోజుల్లో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. వైవిధ్యంగా ఆలోచిస్తూ కంపెనీలు తమ వినియోగదారులకు అవసరాలు తీర్చేందుకు అనువైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇలాంటి ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు, వాటిని ప్రదేర్శించేందుకు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES) వేదికగా మారింది. 2025వ సంవత్సరానికిగా ఇది లాస్‌వెగాస్(Los Vegas)లో జనవరి 7 నుంచి 10 వరకు జరుగుతుంది. గతేడాదిలోని కొన్ని ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం.మడిచే స్క్రీన్, ప్రొజెక్టర్అరోవియా కంపెనీ ‘స్ప్లే’ అనే ఫోల్డబుల్ స్క్రీన్, ప్రొజెక్టర్‌ను ఆవిష్కరించింది. మడిచేందుకు వీలుగా దీన్ని తయారు చేశారు.The world's largest consumer tech event, CES 2025, kicks off this week.While we wait, here the top 10 reveals from last year’s CES:1. Arovia's "SPLAY" is a Mix of a Projector and a Foldable Screenpic.twitter.com/mgThrmbvkG— Angry Tom (@AngryTomtweets) January 5, 2025ట్రాన్స్పరెంట్ ఎల్ఈడీ స్క్రీన్2024 సీఈఎస్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి పారదర్శక మైక్రో ఎల్ఈడీ స్క్రీస్ను శాంసంగ్ కంపెనీ ఆవిష్కరించింది. క్రిస్టల్ క్లియర్ డిస్ ప్లే దీని సొంతం.2. Samsung introduces the world's first transparent MicroLED screenpic.twitter.com/5G3HKKpDaB— Angry Tom (@AngryTomtweets) January 5, 2025బ్లాక్‌బెరీ కీబోర్డ్గతంలో మొబైల్ ఫోన్లను తయారు చేసిన బ్లాక్‌బెరీ కంపెనీ సీఈఎస్ 2024లో వినూత్న ఆవిష్కరణ చేసింది. టచ్ ఫోన్‌ను తాకకుండా టైపింగ్ చేసేందుకు వీలుగా ఫిజికల్ కీబోర్డును ఆవిష్కరించింది. ఫోన్లోని కొన్ని సెన్సార్ల సాయంతో ఇది పని చేస్తుంది.3. Want the old Blackberry physical keyboard back?pic.twitter.com/gedSBWKhwS— Angry Tom (@AngryTomtweets) January 5, 2025వేగంగా వాక్ చేయించే షూస్షిఫ్ట్ రొబోటిక్స్ సంస్థ మూన్‌వాకర్స్ ఎక్స్ పేరుతో వేగంగా వాక్ చేయించేందుకు వీలుగా ఉండే షూస్‌ను ఆవిష్కరించింది. ఈ షూస్‌తో గంటకు 7 మైళ్లు(12 కి.మీ) వాక్ చేసే సదుపాయం ఉంటుంది.4. $1,400 Moonwalkers X by Swift that go 7 mphpic.twitter.com/H4I51qDXok— Angry Tom (@AngryTomtweets) January 5, 2025ఎగిరే కారుచైనాకు చెందిన ఎక్స్‌పెంగ్ ఏరోహెచ్‌టీ అనే కంపెనీ ‘ఫ్లైయింగ్కార్’ను ఆవిష్కరించింది.5. Chinese electric e-car maker XPeng Aeroht unveiled a "flying car"pic.twitter.com/VsnwdQvwlR— Angry Tom (@AngryTomtweets) January 5, 2025స్మార్ట్ టాయిలెట్కోలర్ కంపెనీ సెన్సార్లతో పని చేసే స్మార్ట్ టాయిలెట్‌ను ఆవిష్కరించింది. ఇది వృద్ధులు, అనారోగ్యం బారిన పడినవారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.7. $8,500 smart toilet from Kohlerpic.twitter.com/omGaeB4tM2— Angry Tom (@AngryTomtweets) January 5, 2025
ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సెగ
వంటనూనెలు, కొబ్బరి, పామాయిల్ వంటి కీలక ముడిసరుకుల రేట్లు పెరిగిపోవడం, ధరల పెంపుపరంగా తీసుకున్న చర్యలు మొదలైనవన్నీ ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (FMCG) కంపెనీలకు సవాలుగా మారాయి. వీటి కారణంగా అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు నెమ్మదించడం, స్థూల మార్జిన్లు క్షీణించడంతో పాటు నిర్వహణ లాభాలు ఒక మోస్తరు స్థాయిలోనే ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. పలు ఎఫ్ఎంసీజీ సంస్థల ఆదాయ వృద్ధి కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.డాబర్(Dabur), మారికో తదితర లిస్టెడ్ ఎఫ్ఎంసీజీ కంపెనీలు మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు సంబంధించి ఇచ్చిన అప్డేట్లను బట్టి చూస్తే అమ్మకాల వృద్ధి అదే స్థాయిలో లేదా కనిష్ట సింగిల్–డిజిట్ స్థాయిలోనో ఉండొచ్చని విశ్లేషకులు తెలిపారు. ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణం కారణంగా పట్టణ ప్రాంతాల్లో వినియోగం తగ్గిపోయిందన్నారు. ముడి వస్తువుల ధరల పెరుగుదలవల్ల ఉత్పత్తుల రేట్లను తప్పనిసరిగా పెంచాల్సి రావడం పరిశ్రమకు కాస్త ప్రతికూలం కాగలదని వివరించారు. డిసెంబర్ క్వార్టర్లో కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్‌కు పరిమితం కావచ్చని డాబర్ అంచనా వేస్తోంది. క్యూ3లో కొన్ని సెగ్మెంట్లలో నెలకొన్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను, వ్యయాల తగ్గింపు, ఉత్పత్తుల రేట్లను కొంత మేర పెంచడం ద్వారా ఎదుర్కొన్నట్లు డాబర్ తెలిపింది. మెరుగ్గా గ్రామీణం ..పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం మరింత వేగంగా వృద్ధి చెందినట్లు డాబర్ చ్యవన్‌ప్రాశ, వాటికా తదితర బ్రాండ్లను తయారు చేసే డాబర్ వెల్లడించింది. ఈ–కామర్స్(E-Commerce), క్విక్ కామర్స్ వంటి ప్రత్యామ్నాయ మాధ్యమాలు వృద్ధి చెందుతుండగా, కిరాణా స్టోర్స్ వంటి విభాగాల్లో కొంత ఒత్తిడి నెలకొన్నట్లు వివరించింది. మారికో కూడా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం దన్నుతో డిమాండ్ స్థిరపడుతున్న ధోరణులు కనిపిస్తున్నాయని తెలిపింది. డిసెంబర్ క్వార్టర్లో వార్షిక ప్రాతిపదికన దేశీయంగా అమ్మకాల పరిమాణం వృద్ధి చెందవచ్చని, కానీ ముడి సరుకుల రేట్లు అధికంగా ఉన్నందున సీక్వెన్షియల్ ప్రాతిపదికన నిర్వహణ లాభాల వృద్ధి ఒక మోస్తరు స్థాయిలోనే ఉండొచ్చని వివరించింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్.. తులం ఎంతంటే..ముడిసరుకుల రేట్లు ఊహించిన దాని కన్నా అధికంగా పెరిగిపోవడంతో స్థూల మార్జిన్లు ముందుగా అనుకున్న దానికంటే తక్కువగా ఉండొచ్చని మారికో పేర్కొంది. సఫోలా(Safola), పారాచూట్, హెయిర్ అండ్ కేర్, నిహార్, లివాన్ తదితర ఉత్పత్తులను కంపెనీ విక్రయిస్తోంది. పట్టణాల్లో ఇంకో మూడు క్వార్టర్లు ఇలాగే ..ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వేతనాల వృద్ధి అంతంతమాత్రంగాన ఉండటం, ఇళ్ల అద్దెలు భారీగా పెరిగిపోవడంతో పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని వెల్త్ మేనేజ్మెంట్ సేవల సంస్థ నువామా తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో మందగమనం మరో రెండు, మూడు త్రైమాసికాలపాటు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ క్రమంగా పుంజుకుంటోందని, మెరుగైన వర్షపాతం, ఉచిత పథకాలు మొదలైన అంశాల కారణంగా పట్టణ ప్రాంత డిమాండ్‌ను దాటేయొచ్చని పేర్కొంది.చిన్న ప్యాక్లవైపే మొగ్గుసబ్బులు, స్నాక్స్, టీ మొదలైన వాటి విషయంలో ధరల పెంపు కారణంగా వినియోగదారులు చిన్న ప్యాక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారని నువామా తెలిపింది. కొన్ని ముడి సరుకులకు సంబంధించి వార్షికంగా ద్రవ్యోల్బణం దాదాపు 30 శాతం పెరిగిందని, దీంతో సబ్బులు, టీ, స్నాక్స్ వంటి ఉత్పత్తులకు సంబంధించి మార్జిన్లు గణనీయంగా తగ్గొచ్చని వివరించింది. ఇక చలికాలం రావడం కూడా కాస్త ఆలస్యం కావడంతో బాడీ లోషన్, చ్యవన్‌ప్రాశ్ వంటి నిర్దిష్ట సీజన్ ఉత్పత్తులపై ప్రభావం పడుతోంది. డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్లు, క్విక్ కామర్స్ వేగంగా వృద్ధి చెందుతుండటం వల్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి.
తొలిరోజే ఫుల్ సబ్‌స్క్రైబ్ అయిన ఐపీవో
ఫార్మా రంగానికి ప్రత్యేక ఇంజినీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో(IPO) తొలిరోజు 13.32 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఆఫర్లో 2.08 కోట్ల షేర్లకు గాను 27.75 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. గ్రే మార్కెట్లో షేర్లు రూ.97 ప్రీమియంతో ట్రేడయ్యాయి. సేల్‌ను ప్రారంభించిన నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్(Subscribe) కావడం విశేషం.బిడ్డింగ్ రౌండ్లో ముందున్న నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NII) విభాగం 25.43 రెట్లు, రిటైల్(Retail) ఇన్వెస్టర్స్ 14.46, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారుల (QIB) విభాగం 1.82 రెట్లు సబ్‌స్రైబ్ అయింది. షేర్లను జనవరి 13న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేయనున్నారు. ఇష్యూ జనవరి 8న ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.133–140 మధ్య నిర్ణయించారు. ఐపీవోలో భాగంగా రూ.210 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. 1.42 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. ఇన్వెస్టర్లు కనీసం 107 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.123 కోట్లు అందుకుంది.ఇదీ చదవండి: ఇంటి భోజనం మరింత భారం!క్వాడ్రంట్ ఫ్యూచర్‌కు యాంకర్ నిధులురైల్వే సిగ్నలింగ్, రక్షణ(కవచ్) వ్యవస్థలకు సేవలందించే కంపెనీ క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ యాంకర్ ఇన్వెస్టర్లకు 45 లక్షల షేర్లను విక్రయించింది. తద్వారా దాదాపు రూ.131 కోట్లు అందుకుంది. ఎంఎఫ్ సంస్థలు వైట్ఓక్ క్యాపిటల్, కొటక్, ఎల్ఐసీ, బీవోఐసహా సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్ తదితర 22 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. షేరుకి రూ.290 ధరలో షేర్లను జారీ చేయనుంది. రూ.275–290 ధరల శ్రేణిలో నేడు ప్రారంభంకానున్న ఇష్యూ 9న ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ.290 కోట్ల విలువైన షేర్లను కొత్తగా జారీ చేయనుంది. నిధులను ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ అభివృద్ధి, రుణ చెల్లింపులు తదితరాలకు వినియోగించనుంది.
ఫ్యామిలీ
ప్రకృతి సోయగం.. కన్హా శాంతివనం..
చుట్టూ ప్రకృతి అందాలు, విశాలమైన ఓపెన్ ఎయిర్ మందిరాలు, క్రీడా ప్రాంగణాలు, ఉచిత మెడిటేషన, వసతి సౌకర్యాలు, ప్రశాంతమైన వాతావరణం, అంతరించిపోనున్న మొక్క జాతుల నర్సరీ ఇది.. ప్రకృతి సోయగంగా విరాజిల్లుతున్న కన్హా శాంతి వనం.. 1,600 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన మందిరాల్లో లక్ష మంది ఒకే చోట, ఒకే సారి మెడిటేషన్ చేయడానికి అనువుగా మన హైదరాబాద్ కేంద్రంగా ఇది నిర్మితమైంది. నగర జీవనంలో ప్రతి ఒక్కరూ పలు రకాల ఒత్తిళ్లతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. విద్యార్థి నుంచి ఉద్యోగి, వ్యాపారి, గృహిణి, వృద్ధుల వరకూ ఇలా అన్ని వయసుల వారు ఒత్తిడి బాధితులే. దీనిని అధిగమించేందుకు మెడిటేషన్ ఓ చక్కని పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. మానసిక సమస్యలను తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ మెడిటేషన్ ప్రాధాన్యతను గర్తించాలి..ఈ నేపథ్యంలో కన్హా శాంతి వనం గురించిన మరిన్ని విశేషాలు.. కన్హా శాంతి ఆశ్రమం పర్యావరణం, ఆధ్యాత్మిక ప్రదేశం. సరళమైన జీవనానికి డెస్టినేషన్‌గా నిలుస్తుంది. ఆరోగ్యం, వివిధ అంశాలను ప్రోత్సహించే ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్‌తో పాటు ఆధ్యాతి్మక శిక్షణ అందుబాటులో ఉంటుంది. వృద్ధులకు వెల్నెస్ సెంటర్, ఆయుర్వేద, నేచురోపతి, వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రధానంగా మెడిటేషనకేంద్రం నిర్మాణంలోనే ఓ ప్రత్యేకత ఉంది. వాతావరణ పరిస్థితులను సమతుల్యం చేయడానికి మెడిటేషన్ ఫ్లోర్ కింద నీటిని నిల్వ చేస్తారు. కనీసం మూడు రోజుల నుంచి 15 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో వసతి, భోజనం, అన్నీ ఉచితంగా అందజేస్తారు. వివిధ దేశాల నుంచి.. ఈ మెడిటేషన్ ఆశ్రమానికి ప్రపంచంలోని 162 దేశాల్లో శాఖలు ఉన్నాయి. వివిధ కళాశాల విద్యార్థులు ఇక్కడ వర్క్‌షాప్ నిర్వహించడం, రీ ట్రీట్ ప్రొగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పాటు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచి్చన వారు ఇక్కడి మెడిటేషన్ తరగతుల్లో భాగస్వాములవుతున్నారు.ప్రముఖులు సైతం.. రెండేళ్ల నుంచి నగరంలో ఈ పేరు అందరి నోటా నానుతోంది.. దీంతో పాటు మరెన్నో ప్రత్యేకతలు కన్హా శాంతి వనం సొంతం కావడంతో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు సైతం ఈ వనాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. పోస్టల్ పిన్ కోడ్ ఆధారిత సేవలు.. హార్ట్‌ఫుల్‌గా మెడిటేషన్లో శిక్షణ తీసుకోవాలనుకునే సులువైన పద్ధతిలో శిక్షకులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. హార్ట్ఫుల్నెస్ వెబ్సైట్లో తపాలా శాఖ పిన్‌కోడ్ నమోదు చేయగానే అక్కడ ఉండే శిక్షకుల వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా కన్హా శాంతి వనంలో వారంలో రెండు బ్యాచ్‌లకు మెడిటేషన్ శిక్షణ పొందవచ్చు.అబ్బురపరిచే ఆర్కిటెక్చర్.. కన్హా శాంతి వనం అబ్బురపరిచే ఆర్కిటెక్చర్‌కు అద్దం పడుతోంది. వర్షను నీటిని సైతం ఒడిసి పట్టేలా నిర్మాణాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.. ప్రస్తుత కన్హా వనం ప్రాంతం రెండు దశాబ్దాల క్రితం నెర్రెలు వారిన నేలలు కనిపించేవి. నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ నేడు ఈ వనంలో వర్షపు నీరు చుక్క కూడా వృథా కాకుండా చుట్టూ కృత్రిమ చెరువులు నిర్మించారు. వాటినే గార్డెన్, మొక్కలు, రన్నింగ్ వాటర్, ఇతర అవసరాలకు వినియోగిస్తారు. ఇలా చేరుకోవచ్చు.. నగరంలోని సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్, శంషాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సరీ్వసులు నడిపిస్తోంది. సొంత వాహనాల్లో రావాలనుకునే వాళ్లు హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై తిమ్మాపూర్ వద్ద చేగూరు రోడ్డుకు తిరిగితే ఆశ్రమం చేరుకోవచ్చు. మొదటి సారి వచ్చాను.. నా మిత్రులు శాంతి వనానికి పోదామన్నారు. ఇక్కడి వాతావరణం, మెడిటేషన్ కేంద్రం, అన్నీ బాగున్నాయి. వనంలో వివిధ ప్రాంతాలను సందర్శించడానికి ఉచిత వాహనం ఏర్పాటు చేశారు. – వెంకటేశ్వరరావు, విశ్రాంత ఉద్యోగి, నాగోల్ట్రైనర్గా 24 ఏళ్ల నుంచి.. కనీసం మూడు రోజులు మెడిటేషన్ ట్రై చేయండి. మార్పు మీకే కనిపిస్తుంది. గుండె, మెదడు రెండూ కలసి పనిచేస్తే ఆరోగ్యం. ప్రస్తుతం గుండె మాట మెదడు వినే పరిస్థితి కనిపించడం లేదు. గత 24 ఏళ్లుగా మెడిటేషన్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాను. బెంగళూరులో కొన్నాళ్లు, ఇక్కడ కొన్నాళ్లు శిక్షణ ఇస్తుంటాను. ఆన్‌లైన్‌లోనూ తరగతులు చెబుతాను. – సునీతా ప్రసాద్, మెడిటేషన్ ట్రైనర్ఇది సెక్యులర్ సిటీ.. కన్హా శాంతి వనంలో మెడిటేషన్ కోసం వచ్చే వారికి ఎలాంటి రుసుమూ వసూలు చేయడంలేదు. హైదరాబాద్ సెక్యులర్ సిటీ. సందర్శకుల్లో అన్ని వర్గాలనూ దృష్టిలో ఉంచుకుని ఉచిత శిక్షణ, వసతి సదుపాయం కల్పిస్తున్నాం. కేవలం రూ.10లకు భోజనం లభిస్తుంది. మూడు స్టార్ హోటల్స్ లోనూ భోజనం చేయవచ్చు. – కరుణాకర్, కన్హా శాంతివనం కో–ఆర్డినేటర్
క్యారమ్స్ కాశీమా
పైన లైట్ బల్బు వెలుగుతుండగా... ఆ కాంతిలో...క్యారమ్ బోర్డ్‌పై ‘టప్’ ‘టప్’ అంటూ శబ్దాలు వినిపించేవి. లక్ష్యాన్ని ఛేదించడం నుంచి ఛేదించక పోవడం వరకు ఆ శబ్దాలలో ఎన్నో అర్థాలు ఉండేవి. ఆ అర్థాలను ఔపాసన పట్టింది చెన్నైకి చెందిన కాశీమా. ‘క్యారమ్స్’ కుటుంబ ఆట అంటారు. ఆ ఆటలోని రెడ్, వైట్, బ్లాక్ కాయిన్స్, స్ట్రైకర్... కాశీమాకు కుటుంబ సభ్యులు అయ్యాయి. వాటితో అనుబంధం ఆమెను క్యారమ్స్ ప్లేయర్‌గా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.ఆరు సంవత్సరాల వయసు నుంచి కాశీమా క్యారమ్స్ ఆడడం మొదలుపెట్టింది. కుమార్తె క్యారమ్స్‌లో చూపుతున్న ప్రతిభకు సంబరపడిపోయేవాడు తండ్రి మెహబూబ్ బాషా.ఉత్తరచెన్నై పరిధిలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా కాశీమాను ఆడించే వాడు బాషా. కప్పులు గెలుచుకోవడం సంగతి ఎలా ఉన్నా ఇరుగు, ΄÷రుగు, బంధువులు ‘అమ్మాయిని అలా బయటికి తీసుకువెళ్లవచ్చా? ఇది పద్ధతేనా!’ అనేవారు. అయితే మెహబూబ్ వారి మాటల్ని పట్టించుకునేవాడు కాదు. ‘వారి మాటలు పట్టించుకోవద్దు. క్యారమ్స్‌లో నువ్వు పెద్దపేరు తెచ్చుకోవాలి’ అంటూ కూతుర్నిప్రోత్సహించేవాడు బాషా.గల్లీనుంచి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల వరకు ఎన్నో పతకాలు సొంతం చేసుకున్న కాశీమా జాతీయ స్థాయిలో పదికి పైగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించింది. కాశీమా ప్రతిభ అర్జున అవార్డు గ్రహీత మరియా ఇరుదయం దృష్టిలో పడింది. ఆయన శిక్షణలో తనలోని ప్రతిభను మరింత మెరుగు పరుచుకునే అవకాశం కాశీమాకు వచ్చింది.అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలలో జరిగిన 6వ క్యారమ్ ప్రపంచ కప్ పోటీలలో 18 దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి పాల్గొన్న కాశీమా సింగిల్స్, డబుల్స్, గ్రూప్ పోటీలలో మూడు బంగారు పతకాలు సాధించి క్యారమ్స్‌లో విశ్వవిజేతగా నిలిచింది. అమెరికాకు వెళ్లడానికి ముందు వీసా రెండుసార్లు తిరస్కరణకు గురి కావడంతో కాశీమా పడిన బాధ ఇంతా అంతా కాదు. ‘నేను కచ్చితంగా అమెరికాకు వెళ్లాలి. వెళ్లడమే కాదు పతకాలు సాధించాలి’ అని గట్టిగా అనుకుంది. పట్టువదలకుండా ప్రయత్నించి అమెరికాలో అడుగుపెట్టిన కాశీమా ఏకంగా మూడు స్వర్ణాలతో క్యారమ్స్ విశ్వవిజేతగా చెన్నైలో అడుగు పెట్టింది. ఆటకు అడ్డుపడే విధంగా విమర్శలు చేసిన వారే కాశీమాకు చెన్నైలో బ్రహ్మరథం పట్టడం విశేషం. ఆమె విజయానికి మరింతప్రోత్సాహాన్నిస్తూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే ఆమెకు కోటి రూపాయల చెక్ అందజేశారు. ‘క్యారమ్స్’ అనేది జీవితంలాంటిది. కాయిన్స్ లక్ష్యాలు అనుకుంటే ‘స్టైకర్’ అనేది ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలాంటిది. స్ట్రైకర్ మీద పట్టు ఉన్న కాశీమా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.నాన్న కల సాకారం చేస్తానుక్యారమ్స్ ఆడుతుంటే ఉత్సాహంగా ఉండడమే కాదు కొత్తశక్తి నాలో ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ శక్తే నన్ను చెన్నైలోని న్యూ వాషర్‌మెన్‌పేట మురికివాడ నుంచి అమెరికా వరకు తీసుకువెళ్లింది. ‘క్యారమ్స్ ఆకాడమీ’ ఏర్పాటు చేసి మురికివాడలోని పేద పిల్లలకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాలనేది నాన్న కల. ఆయన కల నెరవేర్చాలని ఉంది.– కాశీమా – అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై
హూప్ హూప్ హుర్రే...ఈ కుట్టీ ఎవరో తెలుసా?
ఆ సన్నటి పెద్ద రింగును ‘హూప్’ అంటారు. పిల్లలు సరదాగా నడుము చుట్టూ దానిని తిప్పుతారు. సర్కస్‌లో హూప్తో చేసే ఫీట్లు ఉండేవి. కాని ఇప్పుడు హూప్ డాన్స్ ఫిట్‌నెస్‌కు ఒక దారిగా ఉంది. సరదాగా ఉంటూనే శరీరాన్ని విపరీతంగా కదిలించే ఈ డాన్స్‌లో దేశంలోనే నంబర్1గా ఉంది ఈష్నా కుట్టి. ఆమె పరిచయం.‘మూవ్మెంట్ థెరపీ గురించి ఇప్పుడు ఎక్కువమంది మాట్లాడుతున్నారు సైకాలజీలో. అంటే శరీర కదలికల వల్ల స్వస్థత పొందడం. హూపింగ్తో మూవ్మెంట్ థెరపీ చేయవచ్చు. హూపింగ్ వల్ల కండరాలు శక్తిమంతమవుతాయి. గుండె బాగవుతుంది. యాంగ్జయిటీ, స్ట్రెస్ మాయమవుతాయి. హూపింగ్లో ఆట ఉంది. వ్యాయామం ఉంది. నృత్యం ఉంది. మూడూ కలగలసిన హూపింగ్ స్త్రీల ఫిట్‌నెస్‌కు బాగా ఉపయోగం’ అంటుంది ఈష్న కుట్టి.ఢిల్లీలో స్థిరపడ్డ మలయాళ కుటుంబంలో జన్మించిన 25 ఏళ్ల ఈష్న కుట్టి ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 హూపర్గా గుర్తింపు పొందింది. హూప్ లేదా హులా హూప్ అని పిలిచే ‘టాయ్ రింగ్’తో విన్యాసాలు చేసేవారిని హూపర్స్ అంటారు. (20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!)మన దేశంలో ఎప్పటినుంచో హూపింగ్ ఉన్నా 1950లలో ఆట వస్తువుగా దీని తయారీ మొదలయ్యాక వ్యాప్తిలోకి వచ్చింది. నడుమును తిప్పుతూ హూప్‌ను నడుము చుట్టూ తిప్పడంతో మొదలెట్టి మెరుపు వేగంతో హూప్‌ను కదిలిస్తూ ఎన్నో విన్యాసాలు చేయొచ్చు. ఇలా చేయడాన్ని ‘ఫ్లో ఆర్ట్’లో భాగంగా చూస్తారు. బంతులు ఎగరేయడం, జగ్లింగ్ చేయడం.. ఇవన్నీ ఫ్లో ఆర్ట్ కిందకే వస్తాయి. హూపింగ్ కూడా.చిన్న వయసులోనే...‘చిన్నప్పుడు మా బంధువు ఒకామె హూప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. కాసేపు ఆడుకోవడానికి ట్రై చేసి మానుకున్నాను. కాని ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు ప్రాక్టీసు చేశాను. మెల్లగా వచ్చేసింది. దాంతో ఎవరూ లేనప్పుడుప్రాక్టీసు కొనసాగించాను. మెల్లమెల్లగా హూప్ నా శరీరంలో భాగమైపోయింది’ అంటుంది ఈష్న. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ చదివిన ఈష్న ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’లో ‘డిప్లమా ఇన్ డాన్స్ మూవ్మెంట్ థెరపీ’ కూడా చేసింది. ‘సైకాలజీ, హూపింగ్ తెలియడం వల్ల మనిషికి ఉత్సాహం, ఆరోగ్యం కలిగించడానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాను’ అంటుంది ఈష్న.తిహార్ జైలులో...తిహార్ మహిళా జైలులో ఖైదీలకు ఆరు నెలల పాటు హూపింగ్ నేర్పించడానికి వెళ్లింది ఈష్న. ‘జైలుకు వెళ్లి ఖైదీలను కలవడం ఎవరికైనా కష్టమే. కాని అక్కడ ముప్పై నుంచి 60 ఏళ్ల వరకూ ఉన్న మహిళా ఖైదీలకు హూపింగ్ నేర్పించాను. వారు హూప్ రింగ్‌తో రేయింబవళ్లు ప్రాక్టీసు చేసేవారు. నేను వెళ్లినప్పుడల్లా ఆ ముందుసారి కన్నా మరింత ఉత్సాహంగా, హుషారుగా కనిపించారు’ అంది ఈష్న.ఇలా చేయాలి‘సౌకర్యవంతమైన బట్టలు, సరైన ఫ్లోర్ ఉంటే హూప్తో మీరు ఎన్ని విన్యాసాలైనా సాధన చేయొచ్చు. మార్కెట్లో హూప్ రింగ్‌లు 28 ఇంచ్‌ల నుంచి 39 ఇంచ్‌ల వరకూ దొరుకుతాయి. వాటితోప్రాక్టీసు చేయడమే. ఈ ఆటలో పోటీలేదు పోలిక లేదు. అందుకే మన ఇష్టం వచ్చినట్టు ఆడవచ్చు. ఒకరకంగా బయటకు రాని స్త్రీలకు బెస్ట్ ఆటవిడుపు’ అంటుంది ఈష్న. మన దేశంలో హూపింగ్ నేర్పించే టీచర్లు తక్కువ కనుక ఆమె తరచూ నగరాలు తిరుగుతూ స్త్రీలకు క్యాంప్స్ నిర్వహిస్తూ నేర్పిస్తూ ఉంటుంది. ‘హూప్ రింగ్ మీ బెస్ట్ ఫ్రెండ్ కాగలదు. మీ మంచి చెడుల్లో అది పక్కనే ఉంటే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి’ అంటున్న ఈష్నకు ఇటీవల కార్పొరేట్ ఈవెంట్స్‌లో షో చేయమని ఆహ్వానాలు అందుతున్నాయి. డబ్బు కూడా బాగా వస్తోంది. షోలలో ఆమె చేసే హూపింగ్ నోరెళ్లబెట్టేలా ఉంటుంది. ఒక్క రింగు ఆమె జీవితాన్నే మార్చేసింది. మీ జీవితాన్ని కూడా మార్చొచ్చు.
20 ఏళ్ల క్రితం అనాథల్నిచేసిన అమ్మ: వెతుక్కుంటూ వచ్చిన కూతురు, కానీ..!
ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే...జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లి స్పర్శకోసం మనసు ఆరాట పడుతుంది. అలా చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమైన యువతి ఇపుడు జన్మనిచ్చిన తల్లికోసం అన్వేషిస్తోంది. రెండు దశాబ్దాలక్రితం అనుకోని పరిస్థితుల్లో అమ్మకు దూరమైన, పిల్లల విద్యలో పరిశోధకురాలు స్నేహ భారతదేశానికి తిరిగి వచ్చింది. అసలేంటీ స్నేహ స్టోరీ తెలుసుకుందాం పదండి!స్నేహకు సుమారు ఏడాదిన్నర వయసుండగా ఆమె తల్లి వదిలేసివెళ్లిపోయింది. ఈమెతోపాటు నెలల పసిబిడ్డ సోము కూడా అనాధలైపోయారు. ఇది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇద్దర్నీ స్థానిక అనాథ ఆశ్రమంలో చేర్పించారు. ఐదేళ్లపాటు అక్కడే పెరిగారు.అయితే స్పెయిన్ నుంచి భారత్‌కు వచ్చిన ఒక జంట వీరి పాలిట దైవాలుగా మారారు. అనాధ ఆశ్రమంలో ఉన్న ఐదేళ్ల స్నేహ , నాలుగేళ్ల సోము ఇద్దర్నీ స్పానిష్ జంట జెమా వైదర్, జువాన్ జోష్ 2010లో దత్తత తీసుకుని తమ దేశానికి తీసుకువెళ్లి పోయారు. వీరిని సొంత బిడ్డల్లా పెంచుకుని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం స్నేహ వయసు 21 ఏళ్లు కాగా, చిన్నారుల విద్యలో పరిశోధనలు చేస్తోంది.అయితే, ఇటీవలే వారి మూలాలు ఒడిశాలో ఉన్నాయని జెమా దంపతులు స్నేహకు తెలిపారు. దీంతో తనకు జన్మనిచ్చిన తల్లి ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలని స్నేహ పెంపుడు తల్లి జెమాతో కలిసి గత నెల 19న భారత్ (భువనేశ్వర్)కు చేరుకుంది. స్థానిక హోటల్లో ఉంటూ నయాపల్లిలోని ఇంటి యజమాని వద్దకు వెళ్లి అక్కడ తల్లిదండ్రుల పేర్లను తెలుసుకుంది. తల్లి పేరు బనలతాదాస్, తండ్రి సంతోష్ అని తెలిసింది. ఈ వివరాలతో పోలీసుల సాయంతో అమ్మకోసం వెదుకులాట ప్రారంభించింది. అలాగే అనాధాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని దృవీకరించుకుంది. ఈ విషయంలో మహిళా విశ్వవిద్యాలయం రిటైర్డ్ టీచర్ సుధా మిశ్రా ఆమెకు సాయం అందించారు.ఈ విషయాన్ని స్థానిక పోలీస్ కమిషనర్ దేవ్ దత్తా సింగ్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసులు విచారణ చేయగా, బానాలత కటక్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే జనవరి 6న స్నేహ తిరిగి స్పెయిన్ కు వెళ్లాల్సి ఉండటంతో తల్లిని కలుసుకోవడం సాధ్యం కాలేదు. అయితే తాను మార్చిలో తిరిగి ఇండియాకు వచ్చి తల్లి ఆచూకీ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తానని చెప్పింది స్నేహ. స్నేహ తల్లిదండ్రులను గుర్తించడానికి పోలీసులు , పంచాయతీ కార్యకర్తల సహాయం తీసుకుంటామని ఇన్స్పెక్టర్ అంజలి ఛోట్రే చెప్పారు.స్నేహ అసలు తల్లిదండ్రులు ఎవరు?ఒడిశాకు చెందిన బనలతా దాస్, సంతోష్ స్నేహ తల్లిదండ్రులు. వీరు నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్‌లోని నయాపల్లిలో అద్దె ఇంటిలో ఉండేవారు. వంట మనిషిగా పని చేసే ఆమె భర్త, ఏమైందో తెలియదు గానీ పిల్లలు సహా భార్యను వదిలివేసి వెళ్లిపోయాడు. దీంతో బానాలత ఒంటరిదైపోయింది. అటు నలుగురు పిల్లలతో, కుటుంబ పోషణా భారమైంది. దీంతో ఇద్దరి పిల్లల్ని వదిలేసి మరో కొడుకు, కూతుర్ని తీసుకొని ఎటో వెళ్లిపోయింది. స్నేహ మా ఇంటి వెలుగుస్నేహ చాలా బాధ్యతగల కుమార్తె. మంచి విద్యావంతురాలు. ఆమె మా ఇంటి వెలుగు,ఆమెమా జీవితం అంటూ స్నేహ గురించి ప్రేమగా చెప్పుకొచ్చింది దత్తత తల్లి జెమా. అంతేకాదు జీవసంబంధమైన తల్లిని తెలుకోవాలన్న ఆరాటపడుతున్న కుమార్తెతోపాటు ఒడిశాలోని భువనేశ్వర్ రావడం విశేషం. ప్రస్తుతం స్నేహ చేస్తున్న ప్రయత్నం నెట్టింట వైరల్‌వుతోంది. త్వరలోనే తల్లీబిడ్డలిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు
ఫొటోలు
National View all
ప్రణబ్ స్మారకం..స్థలం కేటాయించిన కేంద్రం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ప్రణబ్
‘హెచ్ఎంపీవీ’పై కర్ణాటక బీజేపీ హెచ్చరిక
బెంగళూరు:దేశంలో అక్కడక్కడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుత
నాకు ఇల్లు లేకుండా చేశారు: సీఎం అతిషి
న్యూఢిల్లీ:సీఎంగా తనకు కేటాయించిన ఇంటిని కేంద్ర ప్రభుత్వం తా
అలరించిన ‘సుస్వరాల హరివిల్లు’
దాదర్: ఆంధ్ర మహాసభ, స్వరమాధురి సంగీత సంస్థల సంయుక్త ఆధ్వర్
అతుల్ సుభాష్ కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
అతుల్ సుభాష్ కేసులో దాఖలైన ఓ పిటిషన్‌పై దేశసర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర
International View all
వీడియో: సౌదీ ‘మక్కా’లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు
జెడ్డా: సౌదీ అరేబియాలో అతి భారీ వర్షం కురిసింది.
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
ట్రూడో రాజీనామా.. భారత్‌కు అనుకూలమా? ప్రతికూలమా?
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేశారు.
కెనడా ప్రధానిగా పియరీ పొయిలీవ్రే?
ఒట్టావా: జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రి పదవికి, లిబరల్ పా
డీప్‌ఫేక్స్ చేసినా.. షేర్ చేసినా.. జైలుకే!
డీప్‌ఫేక్.. నటి రష్మిక మందన పేరుతో వైరల్ అయిన ఓ వీడియో తర్వాత విస్తృతంగా చర్చ నడిచిన టెక్నాలజీ.
NRI View all
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసా?
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసు ఎలా పెడ
భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనా గానంపై నాట్స్ వెబినార్
క్రైమ్
యువకుడి దారుణ హత్య
నెల్లూరు(క్రైమ్): స్వల్ప వివాదం పెద్దదిగా మారి ఓ యువకుడి దారుణ హత్యకు దారి తీసింది. ఈ ఘటన నెల్లూరు కొండాయపాళెంలో జరిగింది. సోమవారం పోలీసులు వివరాలు వెల్లడించారు.. కొండాయపాళేనికి చెందిన గంట ఉదయ్ కుమార్, అభిషేక్ (23)లు అన్నదమ్ములు. అదే ప్రాంతానికి చెందిన దాసు వారికి దూరపు బంధువు. దాసు మద్యానికి బానిసయ్యాడు. మత్తులో ఇష్టానుసారం ప్రవర్తించేవాడు. అసభ్యకర పదజాలంతో దూషించేవాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాసు తన ఇంటికి సమీపంలో గట్టిగా కేకలు వేస్తుండటంతో ఉదయ్ వారించాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఉదయ్ అతడిపై చేయి చేసుకోవడంతో దాసు వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని పడారుపల్లిలో ఉంటున్న తన భార్య, అత్త, బావమరుదులు శ్రీకాంత్, శ్రీనివాసులు, స్నేహితుడు సూర్యకు చెప్పాడు. అందరూ కలిసి సోమవారం తెల్లవారుజామున కొండాయపాళేనికి చేరుకుని ఉదయ్‌తో ఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న అభిషేక్, ఉదయ్ స్నేహితుడు ప్రవీణ్ అలియాస్ చింటూ అడ్డుకున్నారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన వారు తమ వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో విచక్షణారహితంగా ఈ ముగ్గురిపై దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో అభిషేక్‌కు తీవ్రగాయాలై మృతిచెందగా, ఉదయ్ స్వల్పంగా గాయపడ్డాడు. ప్రవీణ్‌కు తీవ్రగాయాలు కావడంతో ప్రస్తుతం నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, వేదాయపాళెం ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉదయ్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు. మృతుడు ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
పోలీసుల కర్కశం.. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం మాది కాదయ్యా..
భోపాల్ : మానవత్వం చూపించాల్సిన పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోతే.. బాధితుడి భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించాల్సింది పోయి కర్కశాన్ని ప్రదర్శించారు. అచ్చం ‘జై భీమ్’(jai bhim) సినిమాలో పోలీస్ స్టేషన్లో తాము చేసిన దాడిలో గిరిజనుల చనిపోతే.. కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులు బాధితుల మృతదేహాల్ని జిల్లాల సరిహద్దుల్ని ఎలా మార్చారో.. అలాగే ఈ విషాదంలో బాధితుడికి ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ రెండు రాష్ట్రాల పోలీసులు తప్పించుకున్నారు. డెడ్ బాడీని రోడ్డుమీద వదిలేశారు. చివరికి.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ అహిర్వార్ (27) దినసరి కూలి. మధ్యప్రదేశ్ (madhya pradesh) నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడే దొరికిన పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో రాహుల్ మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ ఓ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు. రాహుల్ మరణంపై సమాచారం అందుకున్న రాహుల్ సన్నిహితులు మధ్యప్రదేశ్‌లోని హర్పాల్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సన్నిహితుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన ప్రాంతం ఉత్తరప్రదేశ్(uttarpradesh)లోని మహోబా జిల్లాలోని మహోబ్‌కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.చేసేది లేక రాహుల్ భౌతిక కాయాన్ని అక్కడే ఉంచి ఉత్తర ప్రదేశ్ మహోబ్‌కాంత్ పీఎస్‌కు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. శవ పరీక్ష చేయించేందుకు నిరాకరించారు. ఇది తమ ప్రాంతం పరిధిలోకి రాదంటూ బుకాయించారు.దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రోడ్డును దిగ్బంధించారు. ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. ఆ తర్వాతే గ్రామస్తులు రోడ్డును క్లియర్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.రాహుల్ మరణంతో అతడి కుటుంబ సభ్యులు రోడ్డుపై మృతదేహం పక్కనే రోదిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా యువకుడి బంధువు మాట్లాడుతూ...‘ మా కుటుంబ సభ్యుడు రాహుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మృత దేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉంది. మేం చేసిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసులు.. ఈ ప్రదేశం మా ప్రాంతంలోకి రాదని మమ్మల్ని తిట్టారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించాలని కోరారు.పోలీసుల తీరుతో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగితే..రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాన్ని రోడ్డుపై నుంచి బయటకు తీశారు’అని కన్నీరు మున్నీరయ్యారు.
టీడీపీ కార్యకర్త అరాచకం.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి
సాక్షి, ఆమదాలవలస: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి పచ్చ టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వారే అధికారంలో ఉన్నారనే కారణంగా పలు అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్త ఒకరు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, ఆమె గర్భవతి కాగా.. బెదిరింపులకు దిగాడు.టీడీపీ కార్యకర్త ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగింది. ఈ దారుణ ఘటనపై ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. కోటిపల్లి రాజు అనే యువకుడు 9వ తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాలిక గర్భిణి అని తేలడంతో బాధితురాలి తల్లి ఆదివారం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.అయితే, తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో బాలికకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ బాలికను బెదిరించినట్టు సమాచారం. ఈ విషయమై యువకుడిని ప్రశ్నించగా తాను టీడీపీ కార్యకర్తనని, తనకు పార్టీ నేతల అండదండలున్నాయంటూ బెదిరిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఎంఆర్ హాస్టల్ ఘటనలో ఇద్దరి రిమాండ్
మేడ్చల్‌రూరల్: గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో వీడియోల చిత్రీకరణ ఘటనలో మేడ్చల్ పోలీసులు ఇద్దరిని రిమాండ్ చేశారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సోదరుడు, సీఎంఆర్ గ్రూప్స్ చైర్మన్ గోపాల్‌రెడ్డి సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ కళాశాల గర్ల్స్ హాస్టల్లో డిసెంబర్ 31 రాత్రి బాత్రూంలోకి ఓ విద్యార్థిని వెళ్లగా, ఆ సమయంలో ఎవరో వెంటిలెటర్ నుంచి తొంగి చూస్తున్నట్టు గుర్తించింది. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లగా, సకాలంలో స్పందించలేదు. దీంతో హాస్టల్లోని విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జరిగిన ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి కళాశాలకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపింది. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బిహార్‌కు చెందిన కిశోర్‌కుమార్, గోవింద్కుమార్తో పాటు మరికొందరు మెస్‌లో పనిచేస్తున్నారు. హాస్టల్ వెనుక భాగంలో యాజమాన్యం ఏర్పాటు చేసిన గదుల్లో వారు ఉంటున్నారు. విద్యార్థుల ఆరోపణలు, ఆందోళన నేపథ్యంలో మెస్‌లో పనిచేసే ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా, కిశోర్‌కుమార్, గోవింద్కుమార్లు బాత్రూం వెంటిలేటర్ ద్వారా తొంగి చూసినట్టు నేరం అంగీకరించారు. దీంతో వారిపై పోక్సో కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. విద్యార్థినులు ఫిర్యాదు చేసిన సమయంలో వారిని కించపరుస్తూ మాట్లాడిన హాస్టల్ వార్డెన్లు ప్రీతిరెడ్డి, ధనలక్ష్మిలపై కూడా కేసు నమోదు చేశారు. జరిగిన ఘటనను బయటకు రాకుండా చూడాలని, పోలీసులు, విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం చేరకుండా చూసుకోవాలని హాస్టల్ వార్డెన్లపై ఒత్తిడి తీసుకొచ్చిన సీఎంఆర్ సెట్ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ, సీఎంఆర్ ఐటీ కళాశాల డైరెక్టర్ మాదిరెడ్డి జంగారెడ్డి, సీఎంఆర్ విద్యాసంస్థల చైర్మన్ గోపాల్‌రెడ్డిలపై కూడా కేసు నమోదు చేశారు.