Ajinkya Rahane
-
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. అతడిపై వేటు! సూర్యకు చోటు
దేశవాళీ వన్డే టోర్నమెంట్లో విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ టోర్నీ ఆడబోయే పదిహేడు మంది సభ్యుల పేర్ల(తొలి మూడు మ్యాచ్‌లు)ను మంగళవారం వెల్లడించింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ శివం దూబే కూడా ఈ టోర్నీలో పాల్గొనునున్నట్లు తెలిపింది.అతడిపై వేటుఅయితే, ఓపెనర్ పృథ్వీ షాకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. నిలకడలేమి ఫామ్‌తో సతమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌పై సెలక్టర్లు వేటు వేశారు. మరోవైపు.. సూపర్ ఫామ్‌లో ఉన్న అజింక్య రహానే వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలక్షన్‌కు అందుబాటులో లేడని తెలుస్తోంది.గత కొంతకాలంగా పృథ్వీ షా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి తదితర కారణాలతో రంజీ జట్టుకు అతడు కొన్నాళ్లుపాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి వచ్చినా కేవలం 59 పరుగులే చేశాడు.మరోవైపు.. ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ పృథ్వీ షా వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా ఒకప్పటి ఈ స్టార్ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఇక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ పృథ్వీ షా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో 25 ఏళ్ల పృథ్వీ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి.. 197 పరుగులే చేయగలిగాడు. మధ్యప్రదేశ్‌తో ఫైనల్లోనూ పది పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై సెలక్టర్లు వేటు వేశారు.రహానే దూరంమరోవైపు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైని విజేతగా నిలిపిన టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీలోనూ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించి ముంబైని చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన రహానే.. వన్డే టోర్నీలో మాత్రం ఆడటం లేదు. కాగా డిసెంబరు 21 నుంచి విజయ్ హజారే ట్రోఫీ మొదలుకానుంది.తిరుగులేని ముంబైకాగా భారత దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు ఇప్పటికి 63 టైటిల్స్ గెలిచింది. రంజీ ట్రోఫీని 42 సార్లు నెగ్గిన ముంబై జట్టు ఇరానీ కప్‌ను 15 సార్లు దక్కించుకుంది. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో 4 సార్లు విజేతగా నిలిచిన ముంబై.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీ టైటిల్‌ను రెండుసార్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు మరో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.విజయ్ హజారే వన్డే టోర్నీ 2024 -25కి తొలి మూడు మ్యాచ్‌లకు ముంబై జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, అధర్వ అంకోలేకర్, తనూష్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్, జునేద్ ఖాన్, హర్ష్ తనా, వినాయక్ భోయిర్. చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
మధ్యప్రదేశ్ X ముంబై
దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు తుదిపోరుకు దూసుకెళ్లాయి. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే దంచి కొట్టడంతో బరోడాపై ముంబై జట్టు ఘనవిజయం సాధిస్తే.... కెప్టెన్ రజత్ పాటిదార్ మెరుపులతో ఢిల్లీపై మధ్యప్రదేశ్ పైచేయి సాధించింది. బెంగళూరులో ఆదివారం జరగనున్న ఫైనల్లో మధ్యప్రదేశ్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు: సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ముంబై జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో అడుగు పెట్టింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో బరోడాను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శివాలిక్ శర్మ (24 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... కెపె్టన్ కృనాల్ పాండ్యా (30; 4 ఫోర్లు), శాశ్వత్ రావత్ (33; 4 ఫోర్లు) రాణించారు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (5) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ముంబై బౌలర్లలో సుర్యాంశ్ షెగ్డే 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 17.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రహానే త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్ కనబర్చిన రహానే... బరోడా బౌలర్లను కుదురుకోనివ్వకుండా మైదానం నలువైపులా షాట్లతో అలరించాడు. ఓపెనర్ పృథ్వీ షా (8), సూర్యకుమార్ యాదవ్ (1) విఫలమైనా... లక్ష్యం పెద్దది కాకపోవడంతో ముంబై జట్టుకు పెద్దగా ఇబ్బందులు ఎదురవలేదు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అతిత్ సేత్, అభిమన్యు సింగ్, శాశ్వత్ రావత్ తలా ఒక వికెట్ తీశారు. రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 13 ఏళ్ల తర్వాత... ఢిల్లీతో జరిగిన రెండో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ ఢిల్లీని చిత్తుచేసిన మధ్యప్రదేశ్ జట్టు 13 ఏళ్ల తర్వాత ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అనూజ్ రావత్ (33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్‡్ష ఆర్య (29; 3 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ రావత్ (24; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకోవడంతో... ఢిల్లీ జట్టు పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ 2 వికెట్లు పడగొట్టగా... త్రిపురేశ్ సింగ్, అవేశ్ ఖాన్, కుమార్ కార్తికేయ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 152 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ (29 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... హర్‌ప్రీత్ సింగ్ (38 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్‡్ష (18 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముఖ్యంగా రజత్ పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలింగ్‌ను ఏమాత్రం లెక్కచేయని రజత్ భారీ షాట్లతో విజృంభించాడు. హర్‌ప్రీత్‌తో కలిసి రజత్ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 57 బంతుల్లోనే 106 పరుగులు జోడించడంతో... మధ్యప్రదేశ్ జట్టు మరో 26 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2 వికెట్లు, హిమాన్షు చౌహాన్ ఒక వికెట్ తీశారు. రజత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
కేకేఆర్‌కు గుడ్ న్యూస్.. అరివీర భయంకరమైన ఫామ్‌లో రహానే
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు కేకేఆర్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీఫైనల్లో రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ టోర్నీలో రహానే గత ఆరు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.మహారాష్ట్రతో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో రహానే పరుగుల ప్రవాహం మొదలైంది. ఆ మ్యాచ్‌లో అతను 34 బంతుల్లో 52 పరుగుల చేశాడు. ఆతర్వాత కేరళతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అనంతరం సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 22 పరుగులు చేశాడు.రహానే విశ్వరూపం ఆంధ్రతో జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌తో మొదలైంది. ఈ మ్యాచ్‌లో రహానే 53 బంతుల్లో 95 పరుగులు చేశాడు. అనంతరం విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 45 బంతుల్లో 84 పరుగులు చేశాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీస్‌లో 57 బంతుల్లో 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.ప్రస్తుత సీజన్లో (సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ) రహానే లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో రహానే 8 మ్యాచ్‌లు ఆడి 172 స్ట్రయిక్ రేట్‌తో 366 పరుగులు చేశాడు. బరోడాతో జరిగిన సెమీస్‌లో రహానే రఫ్ఫాడించడంతో ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు చేరింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (33), కృనాల్ పాండ్యా (30), శివాలిక్ శర్మ (26 నాటౌట్), అథీత్ సేథ్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హార్దిక్ పాండ్యా 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.159 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రహానేకు జతగా శ్రేయస్ అయ్యర్ (46) కూడా కాసేపు మెరుపు మెరిపించాడు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ మధ్య రెండో సెమీఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు డిసెంబర్ 15న జరిగే అంతిమ పోరులో ముంబైతో తలపడనుంది. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో అజింక్య రహానేను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.1.5 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. -
రఫ్పాడించిన రహానే.. విధ్వంసకర సెంచరీ మిస్.. అయితేనేం..
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై బ్యాటర్ అజింక్య రహానే పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బరోడా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన రహానే సెంచరీ దిశగా పయనించాడు.శతకానికి రెండు పరుగుల దూరంలోఅయితే, దురదృష్టవశాత్తూ శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు రహానే. అయితేనేం తన మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబైకి విజయం అందించి.. ఫైనల్‌కు చేర్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో భాగంగా ముంబై జట్టు బరోడాతో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై.. బరోడాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది.రాణించిన శివాలిక్ శర్మబరోడా ఇన్నింగ్స్‌లో శివాలిక్ శర్మ(36 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ శశ్వత్ రావత్(33), కెప్టెన్ కృనాల్ పాండ్యా(30), ఆల్‌రౌండర్ అతిత్ సేత్(14 బంతుల్లో 22) ఫర్వాలేదనిపించారు. ఇక ముంబై బౌలర్లలో పేసర్లు సూర్యాంశ్ షెడ్గే రెండు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. శివం దూబే, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి ఒక్కో వికెట్ తీశారు. ఇక స్పిన్ బౌలర్లు తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.బరోడా బౌలింగ్‌ను చితక్కొట్టిన రహానేఇక బరోడా విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆదిలో షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఓపెనర్ పృథ్వీ షా(8) అవుటయ్యాడు. అయితే, ఆ ఆనందం బరోడాకు ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ అజింక్య రహానే బరోడా బౌలింగ్‌ను చితక్కొట్టాడు.కేవలం 56 బంతుల్లోనే 11 ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో ఏకంగా 98 పరుగులు రాబట్టాడు. అయితే, అభిమన్యు సింగ్ బౌలింగ్‌లో విష్ణు సోలంకికి క్యాచ్ ఇవ్వడంతో రహానే విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడింది. తృటిలో సెంచరీ అతడి చేజారింది. సూర్య విఫలంమిగతా వాళ్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 30 బంతుల్లో 46 పరుగులతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. ఏడు బంతులు ఆడిన స్కై కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు. శివం దూబే 0, సూర్యాంశ్ షెడ్గే 6 పరుగులతో అజేయంగా నిలిచారు.ఇక రహానే ధనాధన్ బ్యాటింగ్ కారణంగా ముంబై 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో బరోడాను ఓడించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఫైనల్ చేరింది.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
విధ్వంసం సృష్టించిన షా, రహానే, దూబే
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో ముంబై విదర్భపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్‌కు చేరుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. అథర్వ తైడే (66), వాంఖడే (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో శుభమ్ దూబే (43 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.THE SIX HITTING MACHINE - SHIVAM DUBE 🥶 pic.twitter.com/Qy2uhlXKBp— Johns. (@CricCrazyJohns) December 11, 2024అనంతరం బరిలోకి దిగిన ముంబై.. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. ఆఖర్లో శివమ్ దూబే (22 బంతుల్లో 37 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), సూర్యాంశ్ షేడ్గే (12 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృస్టించారు. MUMBAI INTO SEMIS OF SMAT...!!!Suryansh Shedge with another masterclass. 🙇♂️👌 pic.twitter.com/6FxuxENHc4— Mufaddal Vohra (@mufaddal_vohra) December 11, 2024ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపుపై ఆశలు వదులుకున్న తరుణంలో శివమ్ దూబే, సూర్యాంశ్ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై విజయానికి షా, రహానే బీజం వేసినప్పటికీ.. మధ్యలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్ (5), సూర్యకుమార్ యాదవ్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.సూపర్ ఫామ్‌లో రహానేఈ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజింక్య రహానే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రహానే గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 52, 68, 22, 95, 84 పరుగులు స్కోర్ చేశాడు. విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో రహానే కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న రహానే.. 54 బంతుల్లో..!
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు నాకౌట్ దశకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీకర్ భరత్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకోగా.. అశ్విన్ హెబ్బర్ (52), రికీ భుయ్ (68) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై.. అజింక్య రహానే వీరోచిత ఇన్నింగ్స్ ఆడటంతో మరో 3 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రహానే 5 పరుగుల స్వల్ప తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ముంబై ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా (34), శ్రేయస్ అయ్యర్ (25), శివమ్ దూబే (34) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖర్లో సుయాంశ్ షేడ్గే 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 30 పరుగులు చేసి ముంబైని విజయతీరాలు దాటించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024 ఎడిషన్‌లో ఆంధ్రకు ఇది తొలి పరాజయం. -
వేలంలో అమ్ముడుపోలేదు.. ఇక్కడేమో బ్యాటర్లు ఉతికారేశారు! పాపం శార్దూల్..
భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. కాగా ఇండియాలో ప్రస్తుతం దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా.. గ్రూప్-‘ఇ’లో ఉన్న కేరళ- ముంబై జట్లు శుక్రవారం తలపడ్డాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కేరళకు శార్దూల్ ఠాకూర్ ఆరంభంలోనే షాకిచ్చాడు. కెప్టెన్, ఓపెనర్ సంజూ శాంసన్(4)ను ఆదిలోనే పెవిలియన్‌కు పంపాడు.అయితే, ఆ తర్వాత ముంబైకి పెద్దగా ఏదీ కలిసిరాలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీసినా.. ఓపెనర్ రోహన్ కణ్ణుమల్, సల్మాన్ నిజార్ ధాటికి ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. రోహన్ 48 బంతుల్లోనే 87 పరుగులతో చెలరేగగా.. సల్మాన్ 49 బంతుల్లో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేరళ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 234 పరుగులు చేసింది.కాగా ముంబై బౌలర్లలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. ఏకంగా 69 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రమేశ్ రాహుల్ చెత్త రికార్డును సమం చేశాడు. కాగా రమేశ్ అరుణాచల్‌ప్రదేశ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 2 కో ట్ల కనీస ధరతో శార్దూల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నాడు. అయితే, ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడంతో అతడు అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. ప్పుడిలా టీ20మ్యాచ్‌లో చె త్త ప్రదర్శన కనబరిచాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కేరళ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఆఖరి వరకు పోరాడింది. ఓపెనర్లు పృథ్వీ షా(23), అంగ్క్రిష్ రఘువంశీ(16) నిరాశపరచగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(18 బంతుల్లో 32) కాసేపు బ్యాట్ ఝులిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న అజింక్య రహానే 35 బంతుల్లోనే 68 రన్స్ చేశాడు.రహానే ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ హార్దిక్ తామోర్(23) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ముంబై 191 పరుగులు చేయగలిగింది. దీంతో కేరళ 43 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
రాణించిన రహానే.. దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. శ్రేయస్‌తో పాటు వెటరన్ ఆజింక్య రహానే (34 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో మహారాష్ట్రపై ముంబై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ నిఖిల్ నాయక్ (47), అజిమ్ ఖాజీ (32) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. అర్శిన్ కులకర్ణి (19), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (19), త్రిపాఠి (16), రామకృష్ణ ఘోష్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో తనుశ్ కోటియన్ 3, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి తలో 2, రాయ్స్టన్ డయాస్, సూర్యాంశ్ షెడ్గే చెరో వికెట్ పడగొట్టారు.172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. శ్రేయస్, రహానే రాణించడంతో 17.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో అంగ్క్రిష్ రఘువంశీ 21, షమ్స్ ములానీ 14 (నాటౌట్), హార్దిక్ తామోర్ (9 నాటౌట్) పరుగులు చేయగా.. పృథ్వీ షా, సూర్యాంశ్ షెడ్గే డకౌట్ అయ్యారు. మహా బౌలర్లలో ముకేశ్ చౌదరీ 4 వికెట్లు పడగొట్టగా.. అర్శిన్ కులకర్ణి ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో కూడా శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా, నవంబర్ 24న జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ రికార్డు స్థాయిలో 26.75 కోట్లకు అమ్ముడుపోయాడు. అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో భారీ ధర. ఇదే వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. గత 5 ఇన్నింగ్స్‌ల్లో ముంబై తరఫున శ్రేయస్ చేసిన స్కోర్లు..142- రంజీ ట్రోఫీ233- రంజీ ట్రోఫీ47- రంజీ ట్రోఫీ130 నాటౌట్ (57)- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ71 (39)- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ -
వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్‌గా అతడే!?
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. ఈ మెగా వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు తమకు కావల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ముఖ్యంగా కెప్టెన్లు రిటైన్ చేసుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ ఫ్రాంచైజీలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఢిల్లీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టే అవకాశముండగా.. పంజాబ్ కింగ్స్ సారథిగా శ్రేయస్ అయ్యర్ ఎంపిక కావడం దాదాపు ఖారారైంది. అదే విధంగా లక్నో సూపర్ జెయింట్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కానీ కేకేఆర్, ఆర్సీబీ పరిస్థితులు వేరు. తొలుత ఆర్సీబీ రాహుల్‌ను సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలు అప్పగిస్తుందని అంత భావించారు. మరోవైపు కేకేఆర్ రిషబ్ పంత్‌పై కన్నేసిందని వార్తలు వినిపించాయి. కానీ వేలంలో ఈ రెండూ జరగలేదు. దీంతో ఈ రెండు ఫ్రాంచైజీల కెప్టెన్లగా ఎవరు ఎంపిక అవుతారని అభిమానుల ఆతృతగా ఎదురు చూస్తున్నారు.కేకేఆర్ కెప్టెన్‌గా రహానే..!అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా వెటరన్ అజింక్య రహానే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు పగ్గాలను రహానే అప్పగించాలని కేకేఆర్ మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వేలంలో ఆఖరి నిమిషంలో అజింక్య రహానేను కోల్‌కతా కొనుగోలు చేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలి రోజు వేలంలోకి వచ్చిన రహానేను దక్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ రెండో రోజు వేలంలో ఆఖరి రౌండ్లో కనీస ధర రూ.1.75 కోట్లకు నైట్ రైడర్స్ కైవసం చేసుకుంది. కాగా కేకేఆర్ జట్టులో సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ వంటి ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వీరిద్దరూ గత కొన్ని సీజన్లగా కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే వీరిద్దరూ కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటకి కేకేఆర్ ఫ్రాంచైజీ మాత్రం రహానే వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వెంకటేశ్ అయ్యర్‌ను ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి మరి తిరిగి కేకేఆర్ సొంతం చేసుకుంది.దీంతో అతడికే కేకేఆర్ తమ జట్టు పగ్గాలు అప్పగిస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ అతడి కెప్టెన్‌గా అనువభవం లేనుందన కేవలం ఆల్‌రౌండర్‌గానే కొనసాగనున్నట్లు సమాచారం. కాగా రహానే గతంలో కేకేఆర్‌కు కూడా ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: IPL 2025: రిషభ్ పంత్ భావోద్వేగం.. ఎమోషనల్ నోట్ వైరల్ -
IPL 2025: టీమిండియా స్టార్లకు భారీ షాక్.. పట్టించుకోని ఫ్రాంచైజీలు
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్లు అజింక్య రహానే, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శ్రీకర్ భరత్‌లకు భారీ షాక్ తగిలింది. రెండో రోజు వేలంలోకి వచ్చిన ఈ ఆటగాళ్లను కొనుగొలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.ముఖ్యంగా ఐపీఎల్లో స్పెషలిస్ట్ ఓపెనర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ షాను కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే షా ప్రస్తుతం పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు.ఈ కారణంగానే అతడిని ఎవరూ పట్టించుకోలేదన్నది తేట తెల్లమవుతోంది. మరోవైపు గత కొన్ని సీజన్లలో సీఎస్కే తరపున అకట్టుకున్న రహానేకు కూడా మొండి చేయి ఎదురైంది. కోటిన్నర బేస్ ధరతో వేలంలోకి అడుగుపెట్టిన రహానే ఎవరూ కొనుగోలు చేయలేదు. వేలంలో అమ్ముడుపోని మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కనీస ధర కోటిగా ఉంది.శార్ధూల్ది అదే కథ..వీరితో పాటు స్టార్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌కు కూడా నిరాశే ఎదురైంది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్ధూల్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందకు రాలేదు. గాయం కారణంగా గత కొన్ని నెలలకు దూరంగా ఉన్న శార్ధూల్.. ఇటీవలే తిరిగి మైదానంలో అడగుపెట్టాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక పైన పేర్కొన్న ఆటగాళ్లు సెకెండ్ రౌండ్‌లోనైనా అమ్ముడుపోతారో లేదో వేచి చూడాలి.చదవండి: అతడి టెస్టు కెరీర్ గొప్పగా సాగుతోంది.. మాకు ఇంతకంటే ఏం కావాలి: బుమ్రా -
SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు
దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరగనున్న ఈ ట్రోఫీ కోసం ముంబై క్రికెట్ సంఘం ఆదివారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రంజీ ట్రోపీలో ముంబై జట్టుకు సారథ్యం వహించిన అజింక్యా రహానేతో పాటు... ఫిట్నెస్ లేమితో పాటు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడి రంజీ జట్టులో చోటు కోల్పోయిన ఓపెనర్ పృథ్వీ షా కూడా ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం సాధించాలనుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుత రంజీ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు.తాజా సీజన్లో అయ్యర్ 90.40 సగటుతో 452 పరుగులు సాధించాడు. అందులో ఒక డబుల్ సెంచరీ, మరో సెంచరీ ఉంది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా–‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తనుశ్ కోటియాన్, పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, సిద్ధేశ్ లాడ్, యువ ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ ముంబై జట్టులో చోటు దక్కించుకున్నారు. ముంబై జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, అంగ్క్రిష్ రఘువంశీ, జయ్ బిస్తా, అజింక్యా రహానే, సిద్ధేశ్ లాడ్, సూర్యాన్ష్ షెడ్గె, సాయిరాజ్ పాటిల్, హార్దిక్ తమోర్, ఆకాశ్ ఆనంద్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, తనుశ్ కోటియాన్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, రోస్టన్ డియాస్, జునేద్ ఖాన్.చదవండి: కోహ్లిపై ఒత్తిడి పెంచండి! -
కెప్టెన్‌గా అజింక్య రహానే.. మా స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఎడిషన్ నవంబరు 23న మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) తమ కెప్టెన్ పేరును వెల్లడించింది. టీ20 టోర్నమెంట్లోనూ టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానేనే తమ సారథిగా కొనసాగుతాడని స్పష్టం చేసింది.స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!అదే విధంగా.. తమ కీలక పేసర్ తుషార్ దేశ్‌పాండే ఫిట్నెస్ గురించి అప్డేట్ అందించింది. చీలమండ శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న అతడు.. కోలుకున్నాడని.. త్వరలోనే పునరాగమనం చేస్తాడని వెల్లడించింది. కాగా ముంబై జట్టు దేశీ క్రికెట్లో సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.గత రంజీ సీజన్లో చాంపియన్‌గా నిలవడంతో పాటు.. ఇరానీ కప్-2024లో రెస్టాఫ్ ఇండియాను ఓడించి ట్రోఫీ గెలిచింది. ఇక ఈ రెండు సందర్భాల్లోనూ అజింక్య రహానే ముంబై కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ఇక తాజా రంజీ ట్రోఫీ ఎడిషన్‌లోనూ రహానేనే ముంబైని ముందుండి నడిపిస్తున్నాడు.అందుకే అతడే కెప్టెన్ఈ నేపథ్యంలో విజయవంతమైన సారథిగా పేరొందిన రహానేనే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ కెప్టెన్‌గా కొనసాగిస్తామని ఎంసీఏ చెప్పడం విశేషం. ‘‘ఇరానీ కప్‌తో పాటు తాజా రంజీ సీజన్లోనూ అతడి సారథ్యంలో మా జట్టు అద్బుతంగా రాణిస్తోంది. ఈసారి కూడా టీ20 టోర్నీలో అతడే మా కెప్టెన్. ఇక తుషార్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.రంజీ ట్రోఫీ సెకండ్ లెగ్ నుంచి అతడు అందుబాటులోకి వస్తాడు. అతడి సేవలు మా జట్టుకు ఎంతో కీలకం. శార్దూల్, జునేద్, మోహిత్‌తో పాటు తుషార్ కూడా ఉంటే మా పేస్ బౌలింగ్ లైనప్ మరింత పటిష్టంగా తయారవుతుంది’’ అని ఎంసీఏ అధికారులు వార్తా ఏజెన్సీ ఐఏఎన్ఎస్తో పేర్కొన్నారు.పృథ్వీ షా సైతంకాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024తో టీమిండియా మాజీ ఓపెనర్ పృథ్వీ షా సైతం ముంబై జట్టులో తిరిగి చేరనున్నాడు. ఇటీవల.. అనుచిత ప్రవర్తన కారణంగా రంజీ జట్టు నుంచి ఎంసీఏ అతడిని తొలగించింది. అయితే, టీ20 టోర్నీలో మాత్రం పృథ్వీని ఆడించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది సయ్యద్ ముస్తాన్ అలీ ట్రోఫీ నవంబరు 23- డిసెంబరు వరకు జరుగనుంది.ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ 2024-25 తొలి మ్యాచ్‌లో ముంబై బరోడా చేతిలో ఓడింది. తర్వాత మహారాష్ట్రపై విజయం సాధించి.. త్రిపురతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తర్వాత ఒడిషాపై గెలుపొందింది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఎడిషన్‌లో పాల్గొనబోయే ముంబై ప్రాబబుల్ జట్టుపృథ్వీ షా, ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పార్కర్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ చాబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డైస్, యోగేశ్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడీ, శశాంక్ అటార్డే, జునేద్ ఖాన్. చదవండి: బ్యాట్‌తోనూ సత్తా చాటిన షమీ -
స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్!
టీమిండియా ఓపెనర్, తమ స్టార్ క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై క్రికెట్ అసోసియేషన్ శుభవార్త అందించింది. ఇటీవల రంజీ జట్టు నుంచి అతడిని తొలగించిన యాజమాన్యం.. దేశీ టీ20 టోర్నీ కోసం మళ్లీ పిలుపునిచ్చేందుకు సిద్ధమైంది. కాగా దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో టీమిండియాలోకి దూసుకువచ్చిన పృథ్వీ షా.. తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయినిలకడలేని ఆటతీరుతో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్లతో పోటీలో వెనుకబడి టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయాడు. 2018లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన పృథ్వీ.. 2021లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం 5 టెస్టులు, 6 వన్డేలు ఆడిన ఈ ముంబై బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 339, 189 పరుగులు చేశాడు.ముంబై తరఫున ఆడుతూఅదే విధంగా.. టీమిండియా తరఫున ఒకే ఒక్క టీ20 ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మళ్లీ డొమెస్టిక్ క్రికెట్‌పై దృష్టిపెట్టిన పృథ్వీ షా.. ముంబై తరఫున ఆడుతూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు.. విజయ్ హజారే ట్రోఫీ(వన్డే), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(టీ20)లో ఆడుతూనే.. ఐపీఎల్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకంటున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై రాణిస్తూఅలాగే ఇంగ్లండ్ దేశీ టోర్నీల్లోనూ పాల్గొంటున్న పృథ్వీ షా.. అక్కడ నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ 2024-25లో తొలుత పృథ్వీ షాకు అవకాశం ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్.. ఆ తర్వాత అతడిని పక్కనపెట్టింది. ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా పృథ్వీపై వేటు వేసింది.శ్రేయస్ అయ్యర్ కూడాఈ నేపథ్యంలో తాజాగా ముంబై ప్రాబబుల్స్ జట్టులో పృథ్వీ పేరు కనిపించడం విశేషం. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో పాల్గొనే అవకాశం ఉన్న ఆటగాళ్ల పేరును ముంబై క్రికెట్ అసోసియేషన్ తాజాగా విడుదల చేసింది. ఇందులో పృథ్వీ షాతో పాటు టీమిండియా స్టార్, ప్రస్తుతం జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లతో పాటు వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.అతడు మాత్రం మిస్‌అయితే, ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్ మాత్రం ఈ లిస్టులో మిస్సయ్యాడు. ఇటీవల భారత్-‘ఎ’ జట్టుకు ఎంపికైన అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కానీ.. అక్కడ ఆసీస్-‘ఎ’తో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. కాగా నవంబరు 23 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా సీజన్ మొదలుకానుంది. ఇందులో రంజీ సారథి రహానేనే ముంబైకి నాయక త్వం వహించే అవకాశం ఉంది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పాల్గొనబోయే ముంబై ప్రాబబుల్ జట్టుపృథ్వీ షా, ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పార్కర్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ చాబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డైస్, యోగేశ్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడీ, శశాంక్ అటార్డే, జునేద్ ఖాన్. చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే! -
టీమిండియా వైట్ వాష్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. విరాట్, రోహిత్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండిన భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. బెంగళూరు, పుణేల వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ దారుణ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. ఇప్పుడు వాంఖడేలోనే అదే తీరును పునరావతృం చేసింది. కివీస్ స్పిన్నర్ల వలలో చిక్కుకుని భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు. ఒక్క రిషబ్ పంత్ మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. దీంతో స్వదేశంలో తొలిసారి రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై ఘోర ఆ ప్రతిష్టతను రోహిత్ సేన మూటకట్టుకుంది.రహానే పోస్ట్ వైరల్.. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే షేర్ చేసిన ఓ వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్ ఓటమి అనంతరం తను వర్కౌట్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో రహానే షేర్ చేశాడు. అందుకు హద్దులను దాటి ముందుకు వెళ్లండి అంటూ ఆర్ధం వచ్చేలా కాప్షన్ ఇచ్చాడు. కాగా రహానే భారత జట్టులో చోటు కోల్పోయి దాదాపు ఏడాదిపైనే అయింది. రహానే జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటకి తన ఫిట్నెస్ను ఏ మాత్రం కోల్పోలేదు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రహానే బిజీబిజీగా ఉన్నాడు. రంజీ సీజన్ 2024-25లో ముంబై కెప్టెన్‌గా రహానే వ్యవహరిస్తున్నాడు. సారధిగా రహానే గతేడాది ముంబై జట్టును రంజీ చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత ముంబైకు ఇరానీ కప్-2024ను కూడా అందించాడు. రహానే చివరగా భారత్ తరపున గతేడాది వెండీస్పై ఆడాడు.చదవండి: చాలా బాధగా ఉంది.. ఓటములకు నాదే బాధ్యత: రోహిత్ శర్మ -
యశస్విపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడి ఉండేది..!
టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే లీడర్షిప్ క్వాలిటీస్ గురించి అందరికీ తెలుసు. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను ఏరకంగా భారత జట్టును గెలిపించాడో అందరం చూశాం. ప్రస్తుతం రహానే టీమిండియాలో భాగం కానప్పటికీ.. దేశవాలీ టోర్నీల్లో ముంబై జట్టును అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడు. రహానేకు మంచి నాయకుడిగా పేరుండటంతో పాటు నిఖార్సైన జెంటిల్మెన్గానూ గుర్తింపు ఉంది. దేశవాలీ క్రికెట్లో రహానే యువ ఆటగాళ్లకు అత్యుత్తమ గైడ్‌లా ఉంటాడు.కెప్టెన్‌గా వారికి అమూల్యమైన సలహాలు అందిస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో రహానే ఆటగాళ్ల శ్రేయస్సు కొరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రస్తుత టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ విషయంలో రహానే ఓ సందర్భంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. 2022 దులీప్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా యశస్వికి (వెస్ట్ జోన్), సౌత్ జోన్ ఆటగాడు రవితేజకు మధ్య మాటల యుద్దం జరిగింది. ఆ సమయంలో రహానే జైస్వాల్‌ను మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశించాడు.For those who trolled him for sending Jaiswal out of the field, this is for you!Ajinkya Rahane reveals the reason why he sent Jaiswal out of the field. pic.twitter.com/nMzobNkwwc— Riddhima (@RiddhimaVarsh17) October 26, 2024ఒకవేళ ఆ సమయంలో రహానే అలా చేయకపోయుంటే యశస్విపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడి ఉండేది. యశస్వి శ్రేయస్సు కోసమే తాను అలా చేశానని రహానే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ మ్యాచ్‌లో రహానే వెస్ట్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా.. యశస్వి జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి భారీ డబుల్ సెంచరీ (264) చేశాడు. ఇదిలా ఉంటే, యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. యశస్వి ఈ ఏడాది ఫార్మాట్లకతీతంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి రెండో స్థానంలో ఉన్నాడు. యశస్వి ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 1300 పైచిలుకు పరుగులు చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో ముగిసిన రెండో టెస్ట్‌లో (సెకెండ్ ఇన్నింగ్స్‌లో) యశస్వి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: జేడీయూలో చేరిన క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి -
టీమిండియా 46 ఆలౌట్.. రహానే పోస్ట్ వైరల్
టెస్టుల్లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో చేదు అనుభవం ఎదురైంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేనను 46 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వైస్ కెప్టెన్, వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ.. భారత బ్యాటర్ల వైఫల్యానికి, రహానే పోస్ట్‌కి సంబంధం ఏమిటంటారా?!రహానేకు అప్ప ట్లో పిలుపుటీమిండియా టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా వెలుగు వెలిగిన రహానేకు ప్రస్తుతం జట్టులో చోటు కరువైంది. అయితే, ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టడంతో మళ్లీ భారత జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఏకంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఆడిన జట్టులో స్థానం సంపాదించాడు.తన విలువ చాటుకున్నాడుఇంగ్లండ్ గడ్డ మీద ఆస్ట్రేలియాతో జరిగిన నాటి మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విఫలం కాగా రహానే 89, 46 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో ఏకంగా మరోసారి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే, విండీస్‌లో పేలవ ప్రదర్శన కారణంగా రహానేకు మళ్లీ అవకాశాలు రాలేదు.రంజీ, ఇరానీ కప్ గెలిచిన సారథిప్రస్తుతం అతడు దేశవాళీ టోర్నీలతో బిజీగా ఉన్నాడు. ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానే గతేడాది ఆ జట్టును రంజీ చాంపియన్‌గా నిలిపాడు. అంతేకాదు ఇరానీ కప్-2024 ట్రోఫీ కూడా గెలిచాడు. ప్రస్తుతం మళ్లీ రంజీ 2024-25 సీజన్‌తో బిజీగా మారాడు. అతడి సారథ్యంలోని ముంబై తమ మొదటి మ్యాచ్‌లో బరోడా చేతిలో ఓడిపోయింది.స్ట్రైకింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాఈ క్రమంలో అక్టోబరు 18 నుంచి తమ రెండో మ్యాచ్ ఆడనుంది. ఇందులో భాగంగా రహానే సేన మహారాష్ట్ర జట్టును ఢీకొట్టనుంది. ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం రహానే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గురువారం షేర్ చేస్తూ.. ‘‘స్ట్రైకింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అంటూ గ్రీన్‌టిక్ బాక్స్‌లో రైట్ గుర్తు ఉన్న ఎమోజీ పోస్ట్ చేశాడు.‘భయ్యా.. నీ టైమింగ్ సూపర్ఇక అదే సమయంలో టీమిండియా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఈ రెండింటినీ ముడిపెడుతూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘భయ్యా.. నీ టైమింగ్ సూపర్.. ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేయాలో బాగా తెలుసు. నువ్వు టీమిండియా రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నావని సంకేతాలు ఇస్తున్నావు కదా! అసలే ఆస్ట్రేలియా పర్యటన ముందుంది మరి!’’ అని రహానే క్యాప్షన్‌కు తమ భాష్యాలు ఆపాదిస్తున్నారు. కాగా విరాట్ కోహ్లి గైర్హాజరీలో ఆసీస్ గడ్డ మీద టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే నాటి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.చదవండి: Ind vs NZ: తప్పు నాదే.. పిచ్‌ను సరిగా అంచనా వేయలేకపోయా: రోహిత్ View this post on Instagram A post shared by Ajinkya Rahane (@ajinkyarahane) -
ఇరానీ కప్.. రాణించిన రహానే, సర్ఫరాజ్
లక్నో: సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే (197 బంతుల్లో 86 బ్యాటింగ్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా, రంజీ చాంపియన్ ముంబై జట్ల మధ్య మంగళవారం ప్రారంభమైన ఇరానీక కప్ మ్యాచ్‌లో ముంబై సారథి రహానే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రహానేతో పాటు టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్ (84 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (88 బంతుల్లో 54 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా అర్ధ శతకాలతో మెరిశారు.ఫలితంగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన రహానే చక్కటి ఇన్నింగ్స్ ఆడగా... ఓపెనర్ పృథ్వీ షా (4), ఆయుష్ మాత్రే (19), హార్దిక్ తమోర్ (0) విఫలమయ్యారు. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు బౌలర్లలో ముకేశ్ కుమార్ 3 వికెట్లు తీయగా, యశ్ దయాళ్ ఒక వికెట్ పడగొట్టాడు. రహానేతో పాటు సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ అబేధ్యమైన ఐదో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. -
గావస్కర్ ఉపయోగించని ప్లాటు రహానేకు
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌కు గతంలో కేటాయించిన స్థలాన్ని వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేకు బదలాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైలోని ఖరీదైన బాంద్రా ప్రాంతంలో 2000 చదరపు మీటర్ల (2391 గజాలు) స్థలాన్ని రహానేకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రీడాభివృద్ధి కోసం ఈ స్థలాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఈ స్థలాన్ని 1988లో గావస్కర్‌కు కేటాయించారు. ఇండోర్ క్రికెట్ ట్రెయినింగ్ అకాడమీ కోసం లీజుకు ఇచ్చారు. కానీ 30 ఏళ్లకుపైగా గావస్కర్ ఈ స్థలాన్ని సది్వనియోగం చేయలేదు.క్రికెట్ అవసరాలకోసం అభివృద్ధి చేయలేదు. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కేటాయించిన భూమి నిరుపయోగంగా మారడంపై 2021లోనే ఆ రాష్ట్ర మాజీ గృహనిర్మాణ మంత్రి జితేంద్ర అవ్హద్ విమర్శించారు. దీంతో గావాస్కర్ మరుసటి ఏడాదే (2022) ప్రభుత్వానికి అప్పగించారు. తాజాగా ఈ స్థలానే ఇప్పుడు రహానేకు కేటాయించారు. -
కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు!
ఇరానీ కప్-2024కు ముంబై జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. రెస్టాఫ్ ఇండియాపై గెలుపే లక్ష్యంగా ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెడ్‌బాల్ మ్యాచ్‌లో ముంబైకి అజింక్య రహానే సారథ్యం వహించనున్నాడు.ఇక ఈ మ్యాచ్‌కు ఇద్దరు టీమిండియా స్టార్లు కూడా అందుబాటులోకి రావడంతో జట్టు మరింత పటిష్టంగా మారనుందని ముంబై వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా రంజీ ట్రోఫీ గెలిచిన జట్టుకు, రెస్టాఫ్ ఇండియా టీమ్‌కు మధ్య ఇరానీ కప్ పోటీ జరుగుతుంది.రంజీ తాజా ఎడిషన్ విజేత ముంబైఈ ఏడాది రంజీ టోర్నీలో రహానే సారథ్యంలోని ముంబై జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరు 1 నుంచి మొదలయ్యే ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియాతో తలపడనుంది. ఇందుకోసం ఎంసీఏ మంగళవారం తమ జట్టును ప్రకటించనున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది.ఇద్దరు టీమిండియా స్టార్లు అందుబాటులోకిరహానే కెప్టెన్సీలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎంసీఏ అధికారులు నిర్ధారించినట్లు పేర్కొంది. కాగా టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఇటీవల ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. లీసస్టర్షైర్కు ఆడే క్రమంలో అతడు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.అయితే, ఇరానీ కప్ మ్యాచ్ నాటికి రహానే పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. టీమిండియాలో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్.. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు కూడా ఎంపిక కాలేదు. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్‌లతో మిడిలార్డర్లో పోటీలో అతడు వెనుకబడ్డాడు.శ్రేయస్‌కు మరో అవకాశంఇటీవల దులిప్ ట్రోఫీ-2024లోనూ శ్రేయస్ నిరాశపరిచాడు. దీంతో ఇరానీ కప్ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాలని అతడు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. శస్త్ర చికిత్స అనంతరం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన శార్దూల్ ఠాకూర్ సైతం ఈ మ్యాచ్‌కు అందుబాటులోని రానున్నట్లు సమాచారం. కాగా ముంబై చివరగా 1998లో ఇరానీ కప్ గెలిచింది. అయితే, ఈసారి మేటి ఆటగాళ్లు జట్టులో భాగమవడం సానుకూలాంశం. మరోవైపు.. రెస్టాఫ్ ఇండియా జట్టు గత హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదుంది. గత మ్యాచ్‌లలో సౌరాష్ట్రపై రెండుసార్లు, మధ్యప్రదేశ్ జట్టుపై ఒకసారి గెలిచి ఇరానీ కప్ టైటిల్ సొంతం చేసుకుంది. కాగా శ్రేయస్, శార్దూల్ రంజీ గెలిచిన ముంబై జట్టులోనూ సభ్యులేనన్న విషయం తెలిసిందే.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..! -
రూట్‌కు పొంచి ఉన్న గండం.. అరుదైన రికార్డుకు ఎసరు!
టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. బంగ్లాదేశ్‌తో గురువారం నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్‌లో 132 పరుగులు చేస్తే.. ఇంత వరకు ఏ భారత క్రికెటర్‌కూ సాధ్యం కాని ఘనత సాధిస్తాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను ఐసీసీ రెండేళ్లకొకసారి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అజింక్య రహానే పేరిట ఆ రికార్డుఇక 2019-21 నుంచి డబ్ల్యూటీసీ మొదలు కాగా.. ఆ సీజన్లో భారత్ తరఫున టెస్టు స్పెషలిస్టు అజింక్య రహానే 1159 పరుగులు సాధించాడు. తద్వారా ఒక డబ్ల్యూటీసీ సైకిల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా తన పేరిట రికార్డును పదిలం చేసుకున్నాడు. అయితే, ఆ ఘనతను అధిగమించేందుకు జైస్వాల్‌కు ఇప్పుడు అవకాశం వచ్చింది. జైస్వాల్ 132 రన్స్ చేస్తే..ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్(2023-25)లో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు 1028 పరుగులు సాధించాడు. ఈ 22 ఏళ్ల లెఫ్టాండర్ గనుక మరో 132 రన్స్ చేస్తే.. రహానేను వెనక్కినెట్టి డబ్ల్యూటీసీ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా తన పేరును లిఖించుకోగలుగుతాడు.రూట్ రికార్డుకు ఎసరు పెట్టాడుఅంతేకాదు.. మరో 371 పరుగులు చేస్తే ఓవరాల్‌గా ఈ సైకిల్లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ స్టార్ జో రూట్(1398 రన్స్)ను కూడా జైస్వాల్ అధిగమించగలడు. ప్రస్తుతం జైస్వాల్.. మరో ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్(1028 రన్స్)తో కలిసి రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా జట్ల విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్‌లో ఉంది. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో సెప్టెంబరు 19- అక్టోబరు 1 వరకు జరుగనున్న రెండు మ్యాచ్‌ల సిరీస్ గెలిచి.. అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక బంగ్లాదేశ్ తర్వాత రోహిత్ సేన సొంతగడ్డపై న్యూజిలాండ్(మూడు టెస్టులు)తో తలపడనుంది.డబ్ల్యూటీసీ వీరుడిగాఅనంతరం బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఇందులో భాగంగా కంగారూ జట్టుతో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ మెరుగైన ప్రదర్శన కనబరిస్తే బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగానే డబ్ల్యూటీసీ ఇండియా వీరుడిగా నిలిచే అవకాశం ఉంది. లేదంటే.. మరికొన్నాళ్లు అతడు వేచిచూడకతప్పదు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే యశస్వి జైస్వాల్ ఖాతాలో ఇప్పటికే టెస్టుల్లో మూడు శతకాలతో పాటు.. రెండు డబుల్ సెంచరీలు కూడా ఉండటం అతడి సత్తాకు నిదర్శనం.చదవండి: T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్ -
సెంచరీతో కదంతొక్కిన రహానే
ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో టీమిండియా ఆటగాడు అజింక్య రహానే సెంచరీతో (192 బంతుల్లో 102; 13 ఫోర్లు, సిక్స్) కదంతొక్కాడు. ఈ టోర్నీలో లీసెస్టర్‌షైర్‌కు ఆడుతున్న రహానే.. గ్లామోర్గన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన జట్టు కష్టాల్లో (73/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన రహానే.. సహచరుడు పీటర్ హ్యాండ్స్కోంబ్తో (126 నాటౌట్) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. రహానే, హ్యాండ్స్కోంబ్ సెంచరీలతో కదంతొక్కడంతో లీసెస్టర్‌షైర్ 6 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.40వ శతకంఈ మ్యాచ్‌లో రహానే చేసిన సెంచరీ అతనికి ఫస్ట్ కెరీర్లో 40వది. రహానే ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 40 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీల సాయంతో 13,387 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రహానే 1600 ఫస్ట్ క్లాస్ బౌండరీల మార్కును కూడా అందుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లోనూ రాణించిన రహానే ఈ మ్యాచ్‌లో రహానే తొలి ఇన్నింగ్స్‌లోనూ రాణించాడు. 67 బంతుల్లో 6 బౌండరీల సాయంతో 42 పరుగులు చేశాడు. రహానేతో పాటు హ్యాండ్స్కోంబ్ కూడా ఓ మోస్తరు స్కోర్ (46) చేయడంతో లీసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులు చేసింది.ఇంగ్రామ్ భారీ డబుల్అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గ్లామోర్గన్.. కొలిన్ ఇంగ్రామ్ భారీ డబుల్ సెంచరీతో (257 నాటౌట్) విరుచుకుపడటంతో 9 వికెట్ల నష్టానికి 550 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.కాగా, నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి లీసెస్టర్‌షైర్ 45 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. హ్యాండ్స్కోంబ్, లియామ్ ట్రెవస్కిస్ (8) క్రీజ్‌లో ఉన్నారు. లీసెస్టర్‌షైర్ చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్నాయి. -
రాణించిన రహానే.. అరంగేట్రం అదుర్స్
ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సత్తా చాటాడు. ఈ టోర్నీలో లీసెస్టర్‌షైర్ తరఫున అరంగేట్రం చేసిన రహానే.. నిన్న (జులై 24) నాటింగ్హషైర్తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద సెంచరీతో (60 బంతుల్లో 71; 9 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. రహానే క్లాసీ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Can I just shock you? Ajinkya Rahane is in the runs.71 of the finest from the Indian superstar on his Leicestershire debut.Here's every boundary. pic.twitter.com/NIwhARcBiE— Metro Bank One Day Cup (@onedaycup) July 24, 2024ఈ మ్యాచ్‌లో నాటింగ్హమ్షైర్పై లీసెస్టర్‌షైర్ 15 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్.. బుడింగర్ (75), హిల్ (81), రహానే అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది.The moment Ajinkya Rahane reached his first Foxes fifty. 😎🦊#LEIvNOT pic.twitter.com/bHjSpMcpvZ— Leicestershire Foxes 🦊 (@leicsccc) July 24, 2024అనంతరం వరుణుడు అడ్డుతగలడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లీసెస్టర్ లక్ష్యాన్ని 14 ఓవర్లలో 105 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక లీసెస్టర్ ఓటమిపాలైంది. 14 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. టామ్ స్క్రీవెన్ 3 వికెట్లు తీసి లీసెస్టర్‌ను దెబ్బ తీశాడు. -
ధోని ముసలోడే కదా.. అందుకే అలా అన్నాను: సెహ్వాగ్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఛలోక్తులు విసరడంలో దిట్ట అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిటైర్మెంట్ తర్వాత ఈ విధ్వంసకర ఓపెనర్ కామెంటేటర్, విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్-2024 హర్యానా కామెంట్రీతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఉద్దేశించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు సెహ్వాగ్. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే ఫీల్డింగ్‌ను ప్రశంసిస్తూ.. ‘‘క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు కదా. అజింక్య రహానే మంచి క్యాచ్ అందుకున్నాడు. రచిన్ రవీంద్ర కూడా అద్బుతంగా క్యాచ్ పట్టాడు. వయసు మీద పడ్డ ధోని కూడా ఓ క్యాచ్ అందుకున్నాడు’’ అని క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా అక్కడే ఉన్న మరో మాజీ క్రికెటర్ రోహన్ గావస్కర్.. ‘‘రహానే విషయంలో ఆ పదం(ముసలోడు అన్న అర్థంలో) ఎందుకు వాడలేదు’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లిద్దరి వయసు ఒకటి కాదు కదా! ధోని కంటే రహానే ఫిట్‌గా ఉన్నాడు. 35 ఏళ్ల వ్యక్తికి.. 41 ఏళ్లు పైబడిన వ్యక్తికి మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది. ధోనికి వయసు మీద పడుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు కదా’’ అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. రహానే నూటికి నూరు శాతం ధోని కంటే ఎక్కువ ఫిట్‌గా ఉన్నాడు కాబట్టే అతడిని అలా అనలేదని పేర్కొన్నాడు. కాగా గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని అద్బుత రీతిలో డైవ్ చేసి.. గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్‌ను పెవిలియన్‌కు పంపాడు. 𝗩𝗶𝗻𝘁𝗮𝗴𝗲 𝗠𝗦𝗗 😎 An excellent diving grab behind the stumps and the home crowd erupts in joy💛 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #CSKvGT pic.twitter.com/n5AlXAw9Zg — IndianPremierLeague (@IPL) March 26, 2024 పాదరసంలా కదిలి శరీరాన్ని స్ట్రెచ్ చేసి బంతిని ఒడిసిపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్(16 బంతుల్లో 21) ఇచ్చిన క్యాచ్‌ను అజింక్య రహానే, అజ్మతుల్లా ఇచ్చిన క్యాచ్‌ను రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్‌లతో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. Give your hearts to Rahane! He’ll carry it safe! 🧲💛 pic.twitter.com/95k8QD94wz — Chennai Super Kings (@ChennaiIPL) March 26, 2024 ఈ విషయంపై స్పందిస్తూ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సైతం.. ధోని, రహానే, రచిన్లను కొనియాడాడు. ధోని, రహానేను చూస్తుంటే తమ జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లు అనిపిస్తోందంటూ ప్రశంసలు కురిపించాడు. -
అజింక్యా రహానే అద్భుత విన్యాసం.. కోహ్లికి మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు అజింక్యా రహానే అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. బౌండరీ లైన్ వద్ద రహానే ఫీల్డింగ్ విన్యాసానికి అందరూ ఆశ్చర్యపోయారు. బౌండరీ లైన్ వద్ద చాకచాక్యంగా వ్యవహరించిన రహానే.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు. ఏం జరిగిందంటే ఆర్సీబీ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన ముస్త్ఫిజర్ రెహ్మాన్ రెండో బంతిని కోహ్లికి షార్ట్‌పిచ్ డెలివరీగా సంధించాడు. దీంతో కోహ్లి డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అటు వైపు ఫీల్డింగ్ చేస్తున్న రహానే కుడి వైపు పరుగెత్తి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. కానీ బౌండరీ రోప్ దగ్గరలో బ్యాలెన్స్ కోల్పోయిన రహానే.. సమయస్పూర్తిని ప్రదర్శిస్తూ.. తనను ఫాలో అవుతూ స్క్వేర్ లెగ్ నుంచి పరుగెత్తుకొచ్చిన రచిన్ రవీంద్రకు బంతిని అందించాడు. క్యాచ్ రచిన్ ఖాతాలో చేరినప్పటికి.. రహానే ఎఫర్ట్‌కు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఆఖరికి విరాట్ కోహ్లి సైతం ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి (20 బంతుల్లో సిక్స్‌తో 21) పరుగులు చేశాడు. Brilliant relay catch 👌 Timber strike 🎯 Mustafizur Rahman is making merry & so are @ChennaiIPL 🙌 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL | @ajinkyarahane88 pic.twitter.com/0GKADcZleM — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
‘రంజీ’ రారాజు ముంబై... ఆటగాళ్లపై కోట్లాభిషేకం
విదర్భ ఇన్నింగ్స్‌లో 135వ ఓవర్... అప్పటికే 9 వికెట్లు పడ్డాయి... కెరీర్లో చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న ముంబై పేసర్ ధవల్ కులకర్ణి ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లే వేశాడు... ఒక్కసారిగా ధవల్ చేతికి కెప్టెన్ రహానే బంతిని అందించాడు... మూడో బంతికి ఉమేశ్ యాదవ్ క్లీన్‌బౌల్డ్... ముంబై శిబిరంలో సంబరాలు షురూ... వెరసి దేశవాళీ క్రికెట్ దిగ్గజం ఖాతాలో మరో రంజీ ట్రోఫీ చేరింది. ముంబై జట్టు ఏకంగా 42వ సారి రంజీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత టీమ్ ఖాతాలో మరో కప్ చేరగా... ధవల్ ఐదో రంజీ విజయంలో భాగంగా నిలిచి సగర్వంగా ఆటకు వీడ్కోలు పలికాడు. ముంబై: భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీని ముంబై జట్టు సొంతం చేసుకుంది. గురువారం ముగిసిన ఐదు రోజుల ఫైనల్లో ముంబై 169 పరుగుల తేడాతో రెండుసార్లు చాంపియన్ విదర్భపై ఘన విజయం సాధించింది. విదర్భ చివరి రోజు వరకు పోరాడినా అసాధ్యమైన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. 538 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 248/5తో ఆట కొనసాగించిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (199 బంతుల్లో 102; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకోగా... హర్‡్ష దూబే (128 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. అక్షయ్, హర్‡్ష చాలాసేపు ముంబై బౌలర్లకు లొంగకుండా ఇబ్బంది పెట్టారు. అయితే ఎట్టకేలకు తనుష్ బౌలింగ్‌లో అక్షయ్ వికెట్ల ముందు దొరికిపోవడంతో ముంబై గెలుపు బాట పట్టింది. మిగిలిన నాలుగు వికెట్లను 15 పరుగుల వ్యవధిలోనే తీసి ముంబై చాంపియన్‌గా అవతరించింది. సెంచరీ సాధించడంతో పాటు 2 వికెట్లు తీసిన ముషీర్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతనికి రూ. 50 వేలు ప్రైజ్‌మనీ దక్కింది. టోర్నీ మొత్తంలో 502 పరుగులు, 29 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన ముంబై ఆటగాడు తనుష్ కొటియన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. తనుష్ కు రూ. 2 లక్షల 50 వేలు ప్రైజ్‌మనీ లభించింది. 1934–35 సీజన్లో తొలిసారి విజేతగా నిలిచిన ముంబై (బాంబే) జట్టు ఈ టైటిల్‌కు ముందు 2015–16 సీజన్లో చివరిసారి ట్రోఫీని అందుకుంది. ఆటగాళ్లపై కోట్లాభిషేకం... ప్రైజ్‌మనీలో ముంబై డబుల్ ధమాకా కొట్టింది. సీజన్ విజేతకు బీసీసీఐ రూ. 5 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వగా... ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) తమ క్రికెటర్లకు ప్రత్యేకంగా రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది. దీంతో తాజా రంజీ విజేతకు వచ్చిన ప్రైజ్‌మనీ రెట్టింపైంది. ‘ఈ సీజన్లో మా జట్లు బాగా ఆడాయి. బీసీసీఐ నిర్వహించిన వయో విభాగాల టోర్నీలన్నింటిలోనూ ఫైనల్ చేరాయి. దీంతో ఎంసీఏ ప్రోత్సాహకంగా రూ. 5 కోట్ల బహుమతి ఇస్తోంది’ అని కార్యదర్శి అజింక్య నాయక్ తెలిపారు.