Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Maha Kumbh 2025 Begins Underwater Drones ai Cameras 45 Crore Visitors1
Maha Kumbh-2025: అండర్‌ వాటర్‌ డ్రోన్లు.. ఏఐ కెమెరాలు.. ఫ్లోటింగ్‌ పోలీస్‌ పోస్టులతో నిఘా

ప్రయాగ్‌రాజ్‌: మహాకుంభమేళా.. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు.పటిష్టమైన భద్రతజనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఈ మహా కుంభోత్సవం సుమారు 45 కోట్ల మందికి ఆతిథ్యం ఇస్తుందని అంచనాలున్నాయి. ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలువనుంది. కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మహా కుంభ్ సమయంలో జనానికి పటిష్టమైన భద్రతను కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు నగరం చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.అండర్‌వాటర్‌ డ్రోన్లుతొలిసారిగా త్రివేణి సంగమప్రాంతంలో 24 గంటలూ నిఘా సారించేందుకు నగరం అంతటా 100 మీటర్ల వరకు డైవ్ చేయగల నీటి అడుగున వినియోగించే డ్రోన్‌లను మోహరించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదేవిధంగా 120 మీటర్ల ఎత్తు వరకూ వెళ్లగల టెథర్డ్ డ్రోన్‌లను కూడా మోహరించారు. ఇవి పెరుగుతున్న జనసమూహాన్ని గుర్తించేందుకు వైద్యసాయం లేదా భద్రతా సాయం అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు ఉపకరిస్తాయని భద్రతా అధికారులు తెలిపారు.2,700 ఏఐ కెమెరాలురియల్-టైమ్ పర్యవేక్షణ, ముఖ గుర్తింపు సాంకేతికతను అందించే కృత్రిమ మేధస్సు (ఏఐ) సామర్థ్యం కలిగిన 2,700 కెమెరాలను వివిధ ఎంట్రీ పాయింట్ల వద్ద ఉపయోగిస్తున్నారు. దీనితో పాటు 56 మంది సభ్యుల సైబర్ వారియర్ల బృందం ఆన్‌లైన్ బెదిరింపులను పర్యవేక్షిస్తుంది. దీనికితోడు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. కాగా యాత్రికులకు వసతి కల్పించడానికి అధికారులు 1,50 వేల టెంట్లతో పాటు అదనపు టాయిలెట్లు, పారిశుద్ధ్య సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 4,50 వేల నూతన విద్యుత్ కనెక్షన్‌లను ఏర్పాటు చేశారు. యాత్రికుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేలు కుంభమేళా సందర్భంగా 3,300 ట్రిప్పులు తిరిగే 98 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టాయి. కుంభ్ సహాయాక్ చాట్‌బాట్ అనేది అత్యాధునిక ఏఐ సాధనం. ఇది మహా కుంభమేళాకు హాజరైన భక్తులకు అనేక విధాలుగా సహాయపడనుంది.ఫ్లోటింగ్‌ పోలీస్‌ పోస్టు #WATCH | Uttar Pradesh police built a special floating police chowki to help devotees as the 45-day #Mahakumbh2025 begins with the auspicious Paush Purnima, today pic.twitter.com/1JE2tzQ8mH— ANI (@ANI) January 13, 2025 కుంభమేళాలో పాల్గొనే భక్తులకు మరింతగా సహాయం అందించేందుకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఫ్లోటింగ్‌ పోలీస్‌ పోస్టు ఏర్పాటు చేశారు. ఇదేవిధంగా భక్తులు ప్రయాణించే వాహనాలు సజావుగా ముందుకు కదిలేందుకు ట్రాఫిక్ పోలీసు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. త్రివేణీ సంగమానికి ప్రవేశ మార్గం జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్ (బ్లాక్ రోడ్) ద్వారా ఉంటుంది. నిష్క్రమణ మార్గం త్రివేణి మార్గ్ గుండా ఉంటుంది. కాగా రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలపై ఎంతో శ్రద్ధ తీసుకున్నామని. సాధారణ రైళ్లతో సహా మొత్తం 13,000 రైళ్లను కుంభమేళా కోసం నడుపుతున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాకు 45 కోట్లకు పైగా భక్తులు తరలి వస్తారనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: Mahakumbh 2025: ఇప్పటికే 85 లక్షలమంది పుణ్యస్నానాలు!

Delhi High Court Serious On  AAP Govt CAG Report2
కాగ్‌ రిపోర్టు మంట... ఆప్‌ సర్కార్‌పై హైకోర్టు సీరియస్‌

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగ్‌ రిపోర్టు జాప్యం చేస్తున్నందుకు ఆప్‌ సర్కార్‌పై మండిపడింది. ఈ క్రమంలో ఆప్‌ నిజాయితీపై ప్రశ్నించింది. మద్యం కుంభకోణంపై ఇప్పటికే కాగ్‌ నివేదికను స్పీకర్‌కు పంపించి ఉంటే సభలో చర్చను ప్రారంభించి ఉండాలి అని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో, ఈ విషయంపై సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పూర్తి విచారణ జరుపనుంది.ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్‌ సర్కార్‌కు కాగ్ నివేదిక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో ఆప్ అవకతవకలపై చర్చను కాగ్‌ తెరపైకి తీసుకువచ్చింది. ఢిల్లీ మద్యం విధానం లోపభూయిష్టంగా ఉందని, పాలసీ అమలులో పారదర్శకత లేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం కారణంగా రాష్ట్ర ఖజానాకు 2026 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని కాగ్ అంచనా వేసింది. అయితే, కాగ్ నివేదిక అధికారికంగా ఇంకా బయటకు రాకపోయినప్పటికీ, ఆ నివేదికలోని కొన్ని అంశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.ఈ నేపథ్యంలో కాగ్‌ నివేదికను బహిర్గతం చేయాలని హైకోర్టు ఇప్పటికే ఆప్‌ సర్కార్‌ను ఆదేశించింది. కానీ, హైకోర్టు ఆదేశాలను ఆప్‌ సర్కార్‌ బేఖాతరు చేసింది. ఇప్పటికీ కాగ్‌ నివేదికను బయటకు ఇవ్వలేదు. దీంతో, కోర్టు ఆగ్రహం వ్య​​క్తం చేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాగ్ నివేదిక లీక్ కావడంతో అధికార ఆప్‌ పార్టీ తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులకు చెబుతున్నారు.Delhi High Court criticised the Delhi Government for its delay in addressing the CAG reports, stating, "The way you have dragged your feet raises doubts about your bona fides." The court further emphasized, "You should have promptly forwarded the reports to the Speaker and… pic.twitter.com/CSSALuCV0G— ANI (@ANI) January 13, 2025 కాగ్‌ నివేదికలో ఏముంది? లీక్‌ అయిన కాగ్‌ నివేదిక ప్రకారం.. 2021 నవంబర్‌లో అమల్లోకి తెచ్చిన పాలసీని తొలుత కేబినెట్‌ నుంచి గానీ, ఆ తర్వాత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నుంచిగానీ అనుమతి తీసుకోలేదు. మద్యం విక్రయం లైసెన్సులు పొందిన లిక్కర్‌ సంస్థల ఆర్థిక స్థితిగతులు, గత చరిత్ర, పూర్వాపరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థలకూ లైసెన్సులు మంజూరుచేశారు. కొన్నింటికి లైసెన్సులను ఉద్దేశపూర్వకంగా పునరుద్ధరించారు. కీలక నిబంధనలను మార్చే సందర్భాల్లో ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొందరు రిటైలర్లు ఆ విధానం ముగియకముందే తమ లైసెన్సులను ప్రభుత్వానికి సమర్పించి వెనుతిరిగారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవకపోవడంతో ప్రభుత్వం రూ. 890 కోట్ల ఆదా యం నష్టపోయింది.జోనల్‌ లైసెన్సుల్లో మినహాయింపులు ఇవ్వడంతో మరో రూ.941 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. కోవిడ్‌ను సాకుగా చూపి కొందరికి లైసెన్స్‌ ఫీజులను మాఫీచేయడంతో మరో రూ.144 కోట్ల ఆదాయం కోల్పోయింది. కోవిడ్‌ వంటి అనూహ్య పరిస్థితులు తలెత్తితే ఆ నష్టాలను వ్యాపారులే భరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. నష్టాలను చవిచూసేందుకే మొగ్గుచూపింది అని ఉండటం గమనార్హం.

Minister Ponguleti Srinivasa Reddy Key Comments On Rythu Bharosa3
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. అలాగే, రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు.ఖమ్మంలోని కూసుమంచిలో మంత్రి పొంగులేటి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘పేదవారి కల పది సంవత్సరాల్లో అలాగే నిలిచిపోయింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు. అనేక హామీలు ఇచ్చాము. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు కొల్లగొట్టారు. ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం చిత్త శుద్దితో ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం ఇస్తుంది. డిసెంబర్ 13న మోడల్ హౌస్‌కి శంకుస్థాపన చేసుకుని సంక్రాంతి రోజున ప్రారంభించుకుంటున్నాం.అర్హులైన ప్రతీ పేదవారికి నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళు పూర్తి చేసింది లక్ష లోపు ఇళ్లు మాత్రమే. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. దళారుల పాత్ర ఉండదు.. ఇందిరమ్మ కమిటీ సమక్షంలోనే ఎంపిక జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.రైతులకు రైతు భరోసా నిబంధనలు లేకుండా 12వేలు ఇస్తాం. పది సంవత్సరాల్లో ఆనాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. మీ దీవెనలతో మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది అంటూ కామెంట్స్‌ చేశారు.

YS Jagan Extends Wishes To Sankranti Festival4
తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండుగ అంద‌రి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ తెలిపారు.వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌.. తెలుగువారి సంస్కృతి సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక సంక్రాంతి. ఈ పండుగ అంద‌రి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు చెప్పారు. తెలుగువారి సంస్కృతి సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక సంక్రాంతి. ఈ పండుగ అంద‌రి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 13, 2025

Balakrishna Dance With Urvashi Rautela From Dabidi Dibide Song At Daku Maharaj Succuess Party5
మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు!

‘దబిడి దిబిడి’ పాట స్టెప్పులపై సోషల్‌ మీడియాలో ఏ స్థాయిలో ట్రోలింగ్‌ జరిగిందో అందరికి తెలిసిందే. సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ అలాంటి స్టెప్పులేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అభిమానులు కూడా ఆ స్టేప్పులను తప్పుపట్టారు. అయితే ఇందులో బాలయ్య కంటే ఎక్కువగా కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌నే ఎక్కువగా ట్రోల్‌ చేశారు. ఓ ఎమ్మెల్యే, సీనియర్‌ హీరో అయిన బాలకృష్ణతో అలాంటి అసభ్యకరమైన స్టెప్పులేయించాండంటూ శేఖర్‌ మాస్టర్‌ను ఏకిపారేశారు. మరికొంతమంది నెటిజన్స్‌ అయితే కూతురు వయసు ఉన్న ఊర్వశీ రౌతేలాతో బాలయ్య అలాంటి స్టెప్పులేయడం అసభ్యకరంగా ఉందని కామెంట్‌ చేశారు. అయితే ఈ ట్రోలింగ్‌ని చిత్ర యూనిట్‌తో సహా బాలయ్య కూడా పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఓ పార్టీ ఈవెంట్‌లో ఊర్వశీతో బాలయ్య మళ్లీ అదే స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయింది.సక్సెస్‌ పార్టీతో వికృత స్టెప్పులు!హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్‌’(Daaku Maharaaj). ప్రగ్యా జైశ్వాల్‌, శ్రధ్ధాశ్రీనాథ్‌ హీరోయిన్‌. . శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సంకాంత్రి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో యూనిట్‌ అంతా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఓ హోటల్‌లో జరిగిన ఈ పార్టీకి బాలయ్యతో సహా చిత్రబృందం అంతా హాజరైంది. ఈ సందర్భంగా ఊర్వశీతో బాలయ్య స్టెప్పులేశాడు. ‘దబిడి దిబిడి’ పాటకు డ్యాన్స్‌ చేస్తూ మళ్లీ అసభ్యకరమైన స్టెప్పులేశారు. బాలయ్య ఆ స్టెప్పులేస్తూ ఆమె దగ్గరకు రాగానే.. ఊర్వశీ పక్కకు వెళ్లిపోయింది. అయితే ఈ వీడియోని ఊర్వశీ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో అది కాస్త వైరల్‌ అయింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) ముద్దులతో ముంచేసిన బాలయ్య`డాకు మహారాజ్‌`పార్టీలో యంగ్‌ హీరోలు విశ్వక్‌ సేన్‌, సిద్దు జొన్నలగడ్డ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ముద్దులతో ముంచేశాడు బాలకృష్ణ. సక్సెస్‌ పార్టీని ఎంజాయ్‌ చేస్తూ `కంగ్రాట్చ్యూలేషన్స్ టూ డాకు మహారాజ్‌` అని విశ్వక్‌ సేన్‌ అనగా.. థ్యాంక్యూ ‘లైలా ’అంటూ విశ్వక్‌ సేన్‌కి బాలయ్య ముద్దు పెట్టాడు. విశ్వక్‌ కూడా తిరిగి బాలయ్యకు ముద్దు పెట్టారు. పక్కనే ఉన్న సిద్దు కూడా ‘నాకు పెట్టలేదు(కిస్‌) అనగానే..బాలయ్య లాక్కొని సిద్దుకి కూడా కిస్‌ ఇచ్చాడు. ఈ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు దర్శకుడు బాబీకి కూడా కిస్‌ ఇచ్చాడు బాలయ్య. పార్టీ మూడ్‌లో బాలయ్య ఇలా రెచ్చిపోవడంతో ఆ వీడియోలన్నీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

TDP Leaders Hul Chul In Sankranthi Kodi Pandalu6
‘మనల్ని ఎవడ్రా ఆపేది..’ కోడి పందేల్లో కూటమి నేతల హల్‌చల్‌

సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వీటి నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులే పందెంలను ప్రారంభిస్తున్నారు. ఇక, పందెం రాయుళ్లు.. కోడి పుంజులతో బరులకు చేరుకుంటున్నారు.తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్‌ నైట్‌ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పందెం బరుల దగ్గర ఎల్‌ఈడీ తెరలు సైతం దర్శనమిస్తున్నాయి. పెందెంలా నిర్వహణ కోసం భారీ ఏర్పాటు. మరోవైపు.. స్థానికంగా జరుగున్న కోడి పందెంలను చూసేందుకు ప్రజలు భారీగా బరుల వద్దకు చేరుకుంటున్నారు.ఇదిలా ఉండగా.. కోడి పందేలు నిర్వహించడం నేరమని కలెక్టర్లు ప్రకటిస్తున్నా.. పందేలను కట్టడి చేయాలని హైకోర్టు గట్టిగా ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయస్థానం సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినా ఎక్కడికక్కడ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. పందేలరాయుళ్లు ఇన్‌స్టా వేదికగా కోడి పందేలపై విస్తృత ప్రచారానికి తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్‌ కళాశాల సమీపంలోని వెంకట్రామయ్య బరిలో భారీ పందేలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. భోగి రోజున రూ.9 లక్షల పందేలు 9, రూ.6 లక్షల పందేలు 5, రూ.27 లక్షలు లేదా రూ.25 లక్షల పందెం ఒకటి చొప్పున జరుగుతాయని షెడ్యూల్‌ ప్రకటించుకున్నారు.నిషేధం బేఖాతరు.. కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఈ నెల 7న సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ గేమింగ్‌ యాక్ట్‌–1974­లోని సెక్షన్‌ 9(1), 2 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా పశు సంవర్ధకశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖతో బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులు కోడిపందేల నిషేధంపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా పందేలు జరిగే ప్రాంతాలు, షెడ్యూల్స్, పందేలు వేసే ప్రముఖుల పేర్లతో పోస్టులు ట్రెండింగ్‌ అవుతున్నాయి.దెందులూరు నియోజకవర్గంలో ‘ప్రీమియర్‌ లీగ్‌’ వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో కాకతీయ ప్రీమియర్‌ లీగ్‌ (కోడి పందేల లీగ్‌) పేరుతో పందేలకు రెడీ అంటూ పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. క్రికెట్‌ టోర్నమెంట్స్‌ లీగ్‌ మాదిరిగా కోడి పందేల లీగ్‌ అనే పోస్టర్లు కూడా విడుదల చేశారు. వీటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి మరీ ప్రచారం సాగిస్తున్నారు.

KSR Comment: CBN And Co Cover up Alliance Leaders Mistakes Yellow Media7
అబద్ధాలను అందంగా అల్లటంలో ఆరితేరారే!

ఆంధ్రప్రదేశ్‌లో పాలన రోజు రోజుకూ అధ్వాన్నమవుతోంది. ఈ మాట ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌సీపీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అధికార పక్షానికి వత్తాసుగా నిలుస్తున్న పచ్చమీడియానే అప్పుడప్పుడూ తన కథనాల ద్వారా చెబుతోంది. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రులు కొందరు, కూటమి ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతికి హద్దుల్లేకుండా పోయాయని టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతులు తమ కథనాల ద్వారా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వారు తీసుకుంటున్న జాగ్రత్త ఏమిటంటే.. రింగ్‌ మాస్టర్లు అదేనండి.. చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌కళ్యాణ్‌లకు ఎక్కడ మకిలి అంటకుండా నెపం ఇతరులపైకి నెట్టేయడం!. కిందటేడాది ఆగస్టు 28న చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓ మాట్లాడుతూ ఒక మాటన్నారు.. ‘‘ప్రభుత్వ ప్రతిష్ట పెంచేందుకు తాను ఇటుక ఇటుక పేరుస్తూంటే.. ఎమ్మెల్యేలు కొందరు జేసీబీలతో కూలగొడుతున్నారు. ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నా ఒకరిద్దరి తప్పుల వల్ల పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. బాబుగారి నేర్పరితనం ఏమిటంటే తన వైఫల్యాలు మొత్తాన్ని దారిమళ్లించేందుకు ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులను మందలించినట్లు పోజ్ పెట్టారు. సరే అనుకుందాం కాసేపు. మంత్రులు, ఎమ్మెల్యేలలో మార్పు వచ్చిందా? ఊహూ అదేమీ కనబడదు. చంద్రబాబు కూడా ఏ చర్య తీసకోకుండా కథ నడుపుతూంటారు. ఈ మధ్యకాలంలో కొందరు మంత్రులు అధికారుల బదిలీలు, పొస్టింగ్‌లలో భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు... ఒక మంత్రి హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో మకాం వేసి మరీ ఈ దందా చేస్తున్నారని టీడీపీ పత్రిక తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి తెలియ చేసిందని కూడా ఆ మీడియా పేర్కొంది. బ్లాక్‌మెయిలింగ్‌లో దిట్టగా పేరొందిన ఆ మీడియా బహుశా ఆ మంత్రిని బెదిరించడానికి ఏమైనా రాశారా? లేక నిజంగానే మంత్రి అలా చేశారా? అన్నది ఇంతవరకు అటు ఏపీ ప్రభుత్వం కాని, ఇటు తెలంగాణ ప్రభుత్వం కాని వెల్లడించలేదు. ఈ రెండు రాష్ట్రాల అధినేతల మధ్య పార్టీలకు అతీతంగా సాగుతున్న బంధాన్ని ఈ విషయం తెలియ చెబుతుంది. సదరు మంత్రి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని సోషల్ మీడియాలో ప్రచారమైంది. సీపీఎం నేతలు ఓపెన్‌గానే చెబుతున్నారు. అయినప్పటికీ ఆ మంత్రి ఖండించలేదు. చంద్రబాబు కాని, ఆయన పేషీ కానీ వివరణ కూడా ఇవ్వలేదు. పైగా ఈ మధ్య తిరుపతి సందర్శనలో కూడా చంద్రబాబు ఆ మంత్రిని పక్కన పెట్టుకుని తిరగడం విశేషం. మరో కథనం ప్రకారం.. ఆ మంత్రికి హైదరాబాద్ శివార్లలో ఉన్న భూమి విషయంలో ఏర్పడిన వివాదం రీత్యా తరచు ఇక్కడకు వచ్చి పంచాయతీ చేసుకుంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తున్నది చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరమా?. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో అవినీతి అధికారి అంటూ మరో జాకీ పత్రిక ఈ మధ్య ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే అచ్చెన్నాయుడుకు సంబంధం లేదన్నట్లుగా పిక్చర్ ఇచ్చినట్లు కనిపించినా, కేవలం ఒక అధికారి సొంతంగా అవినీతికి పాల్పడతారా? అలాగైతే ఆ మంత్రి అంత అసమర్థుడా అన్న ప్రశ్న వస్తుంది. ఈ కథనం ఇచ్చినప్పటికి ప్రభుత్వం పెద్దగా స్పందించినట్లు కనబడదు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పీఏపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ పీఏ ని తొలగించానని, తను ప్రైవేటుగా నియమించుకున్న వ్యక్తి అని అనిత వివరణ ఇచ్చినప్పటికీ, ఆ ఆరోపణలకు మంత్రికి సంబంధం లేదని అంటే ఎలా నమ్ముతారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. పవన్ కళ్యాణ్‌ ఈ విషయమై బీజేపీ పెద్దలకు ఢిల్లీలో ఫిర్యాదు చేసి వచ్చారని అంటారు. ఇక లోకేష్ కు అత్యంత సన్నిహితుడునని చెప్పుకుంటూ ఒక ప్రముఖుడు మైనింగ్ కాంట్రాక్టులు, పోస్టింగ్ లలో హవా సాగిస్తున్నారని, తనకు కావల్సింది తనకు ఇచ్చి, మీకు కావల్సింది మీరు తీసుకోండని ఓపెన్ గా చెబుతున్నారంటూ జాకీ పత్రిక చానా ముదురు శీర్షికన కథనాన్ని ఇచ్చింది. 'చానా" అనగానే అది సానా సతీష్ గురించే అని, అతను లోకేష్ తరపున వ్యవహారాలు చక్కదిద్దుతుంటారని టీడీపీలో ప్రచారం అయింది. అది రాజ్యసభ ఎన్నికల సమయం కావడంతో అతనికి టిక్కెట్ రాకుండా ఉండడానికి ఆంధ్రజ్యోతి పత్రిక బ్లాక్ మెయిలింగ్ వార్త రాసిందని కూడా టీడీపీ వర్గాలు భావించాయి. ఈ వార్త లోకేష్ కు తీవ్ర అప్రతిష్ట తెచ్చింది. దాంతో లోకేష్ కు, ఆంధ్రజ్యోతి యజమానికి మధ్య విభేదాలు పెరిగాయని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే లోకేష్ కు టీడీపీని నడిపే శక్తి ఇంకా రాలేదని వ్యాఖ్యానిస్తూ ఆ ఓనర్ తన వ్యాసంలో రాసి ఉంటారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూటమి నుంచి విడిపోతే టీడీపీ పరిస్థితి ఏమిటని కూడా ఆయన ఆందోళన చెందారు. విశేషం ఏమిటంటే ఆంధ్రజ్యోతి సానా సతీష్ పై అంత దారుణమైన కథనం ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు చంద్రబాబు రాజ్యసభ సీటు కేటాయించారు. ఎన్నికల సమయంలో భారీగా ఖర్చు చేసినందునే ఆయనకు ఆ పదవి ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్‌ పేషీ గురించి నేరుగా రాయకపోయినా, అక్కడ జరిగేవి ఇతర మంత్రులకు తెలియవా? అందుకే ఏ మంత్రిని మందలించే పరిస్థితి చంద్రబాబుకు లేదని కొందరి వాదనగా ఉంది. మరికొందరు మంత్రులపై కూడా పలు అభియోగాలు వస్తున్నాయి. చంద్రబాబు స్టైల్ ఏమిటంటే రహస్యంగా ఎవరు ఏమి చేసినా వారి జోలికి పద్దగా వెళ్లరు. అదే మరీ అల్లరైతే, తాను మందలించనట్లు ప్రచారం చేసుకుంటుంటారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు, కూటమి నేతలు మద్యం, ఇసుకలలో ఎలా దండుకుంది బహిరంగమే. నలభై లక్షల టన్నుల ఇసుక మాయమైపోయినా ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పెదవి కదపలేదు. మద్యం వ్యాపారంలో అనేక మంది ఎమ్మెల్యేలు 30 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే తండ్రి, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకరరెడ్డి ఏ మాత్రం భయం లేకుండా తనకు నిర్దిష్ట శాతం కమిషన్ చెల్లించాల్సిందేనని మద్యం షాపులకు హెచ్చరిక పంపించారు. అఅంతేకాదు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, జేసీ మధ్య పవర్ ప్లాంట్ బూడిద రవాణాపై చెలరేగిన గొడవ తెలిసిందే. చంద్రబాబు వారిని పిలిచి రాజీ చేయడానికి యత్నించారు. ఇక ప్రభాకర రెడ్డి కొందరు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయన జోలికి వెళ్లే ధైర్యం ఎవరికి లేదు. కాకపోతే జేసీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మైనింగ్ లీజుల దందాపై సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన చెప్పినట్లు వినాల్సిందేనని టీడీపీ ముఖ్యనేత ఆదేశించడంపై కూడా మైనింగ్ యజమానులు మండిపడుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న అరాచకంపై నిత్యం కథలు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఒక ఎస్టీ కుటుంబాన్ని వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ కుటుంబంలోని మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వార్తలు చెబుతున్నాయి. చిలకలూరి పేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టిన రోజు వేడుకకు పోలీసులు హాజరై కేక్ కట్ చేయించడం పై విమర్శలు వచ్చాయి. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య కూడా పోలీసు అధికారులపై రుసురుసలాడిన తీరు అందరికి బహిరంగ రహస్యమే. మదనపల్లె నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యే ఒకరికి నెలకు 30 లక్షల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఒక మహిళా తహశీల్దార్ మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన విషయం సంచలనమైంది. సదరు ఎమ్మెల్యే ఖండించినా నిప్పు లేకపోతే పొగరాదన్నట్లుగా అంతా భావించారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి దౌర్జన్యాలపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడలో ఒక దళిత ఫ్రొఫెసర్ ను ఆయన తన అనుయాయులతో కలిసి వెళ్లి బెదిరించారు. అలాగే ఒక టీషాపు ను కూల్చి వేయించిన విషయం వివాదాస్పదమైంది. వీటిని పట్టించుకోని పవన్ కళ్యాణ్ కడపలో ఒక మండల అధికారిపై వైసీపీ నేత ఎవరో దౌర్జన్యం చేశారంటూ అక్కడకు వెళ్లి హడావుడి చేసి వచ్చారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తాను చెబితే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లేనని, రేషన్ షాపుల వారిని, మధ్యాహ్న భోజనం ఏజెన్సిల, ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరించారు. ఇక కాంట్రాక్టర్ లను బెదిరించడం వంటివి నిత్య కృత్యమైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఏకంగా అదానీ కంపెనీ సిబ్బందిపైనే దాడి చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక మహిళా టీడీపీ నేత చేసిన లైంగిక వేధింపుల ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. వారి మధ్య టీడీపీ నేతలు రాజీ చేశారు తప్ప ఆయనపై చర్య తీసుకోకపోవడం విశేషం. కృష్ణపట్నం ఓడరేవు సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. మద్యం దుకాణాలలో ఎమ్మెల్యేకి వాటా ఇవ్వలేదని నరసరావుపేటలో ఆయన అనుచరులు రెస్టారెంట్ పై దాడి చేసి వధ్వంసం సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. జనసేన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మట్టి దందాకు పాలపడుతున్నాడని కథనాలు వచ్చాయి. రోజూ ఇలాంటి స్టోరీలు పుంఖానుపుంఖాలు గా వస్తున్నా కూటమి అధినేతలు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. మరో వైపు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కు ఐదువేల ట్రాన్స్ ఫార్మర్లకు ఆర్డర్లు ఇచ్చారంటూ ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. ఆ కంపెనీ యజమాని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ కు సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఆర్డర్ ఇవ్వరాదట. ఆ ఆర్డర్ చంద్రబాబుకు తెలియకుండా ఇచ్చారని ఈ పత్రిక చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. అంత పెద్ద ఆర్డర్ ముఖ్యమంత్రికి తెలియకుండా వెళుతుందా? ఇవన్ని చూశాక ఎవరికైనా ఏమనిపిస్తుంది? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా పాలన సాగిస్తోందన్న అభిప్రాయం రాదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

 Daughter Did Funerals of Her Father In visakhapatnam8
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన తనయ

మల్కాపురం: మృతి చెందిన కన్నతండ్రికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మల్కాపురంలో జరిగింది. గాంధీజివీధికి చెందిన చొప్పా సూరిబాబు (60) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయనకు కుమారులు లేకపోవటం, అల్లుళ్లు ముందుకు రాకపోవడంతో దుఃఖాన్ని దిగమింగుకొని కన్నకూతురే దహన సంస్కరాలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఆర్టీసీ అద్దె బస్సుకు సూరిబాబు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకుంది. చిన్న బాస్‌ క్లాస్‌మేట్‌.. విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను

Sabalenka Busts Out Her Best Dance Moves At Australian Open After 1st Win Video9
వరస్ట్‌ డాన్సర్‌ని అంటూనే అదరగొట్టిన సబలెంక.. వీడియో వైరల్‌

బెలారస్‌ టెన్నిస్‌ స్టార్‌ అరియానా సబలెంకా(Aryna Sabalenka) ఆటతోనే కాదు.. డాన్స్‌తోనూ ఆకట్టుకోగలనని నిరూపించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌(Australian Open)లో శుభారంభం చేసిన అనంతరం తనలోని మరో కోణాన్ని అభిమానులకు చూపించింది. వరస్ట్‌ డాన్సర్‌ని అంటూనే‘నా డాన్స్‌ అస్సలు బాగోదు. ఇకనై నన్నో వరస్ట్‌ డాన్సర్‌గా అందరూ గుర్తు పెట్టుకుంటారేమో’ అంటూనే కాలు కదిపిన సబలెంకా.. క్యూట్‌ మూవ్స్‌తో ప్రేక్షకులను అలరించింది. దీంతో ఫిదా అయిన ఆడియన్స్‌ కరతాళ ధ్వనులతో సబలెంకాను ఉత్సాహపరుస్తూ స్టాండింగ్‌ ఓవియేషన్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.‘హ్యాట్రిక్‌’ టైటిల్‌ గెలవడమే లక్ష్యంగాకాగా ‘హ్యాట్రిక్‌’ టైటిల్‌ గెలవడమే లక్ష్యంగా సబలెంకా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ సబలెంకా 6–3, 6–2తో 2017 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా)పై అలవోకగా గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది.ఇక 2023, 2024లలో చాంపియన్‌గా నిలిచిన సబలెంకా ఈసారీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధిస్తే... మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌; 1997, 1998, 1999) తర్వాత ఈ టోర్నీలో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందుతుంది.శుభారంభం చేసిఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. స్లోన్‌ స్టీఫెన్స్‌తో 71 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 20 విన్నర్స్‌ కొట్టిన ఈ బెలారస్‌ స్టార్‌ 21 అనవసర తప్పిదాలు చేసింది. నెట్‌ వద్దకు 21 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు నెగ్గిన సబలెంకా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. గత ఏడాది రన్నరప్, పారిస్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత కిన్‌వెన్‌ జెంగ్‌ (చైనా), 11వ సీడ్‌ పౌలా బదోసా (స్పెయిన్‌) కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ కిన్‌వెన్‌ 7–6 (7/3), 6–1తో అంకా టొడోని (రొమేనియా)పై, బదోసా 6–3, 7–6 (7/5)తో జిన్‌యు వాంగ్‌ (చైనా)పై గెలిచారు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో 14వ సీడ్‌ మిరా ఆంద్రీవా (రష్యా) 6–3, 6–3తో మేరీ బుజ్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, 18వ సీడ్‌ డొనా వెకిచ్‌ (క్రొయేషియా) 6–4, 6–4తో డియాన్‌ పారీ (ఫ్రాన్స్‌)పై, లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా) 7–5, 6–4తో యులియా (ఉక్రెయిన్‌)పై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.జ్వెరెవ్‌ బోణీ మరోవైపు.. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (alexander zverev- జర్మనీ) సులువుగా రెండో రౌండ్‌కు చేరగా... ఆరో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) ఐదు సెట్‌ల పోరులో గట్టెక్కాడు. జ్వెరెవ్‌ 6,4 6–4, 6–4తో లుకాస్‌ పౌలీ (ఫ్రాన్స్‌)పై నెగ్గగా... రూడ్‌ 6–3, 1–6, 7–5, 2–6, 6–1తో 3 గంటల 21 నిమిషాల్లో మునార్‌ (స్పెయిన్‌)ను ఓడించాడు. వర్షం కారణంగా తొలి రోజు చాలా మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. Aryna Sabalenka dancing for Australian Open crowd after winning her 1st round against Sloane Stephens“Now they have proof that I’m the worst dancer” 😂Give this woman a spotlight and she will shinepic.twitter.com/L5JyfrwcXs— The Tennis Letter (@TheTennisLetter) January 12, 2025

Sankranti 2025: Significance Of Bhogi Festival And Rituals10
భోగభాగ్యాల భోగి పండగ దేనికి సంకేతమంటే.?

'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని శాస్త్ర వచనం. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. మరోక అర్థంలో భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా 'భోగి పండగ' ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. అలాంటి ఈ పండుగను అనాథిగా ఆచారిస్తూ రావడానికి గల కారణం, ఆరోగ్య రహాస్యలు గురించి సవివరంగా చూద్దామా..!భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి…దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయానం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి.. ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెబుతున్నారు.ఆరోగ్య రహస్యం..ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. అందువల్లే భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వచ్చింది. భోగి మంటలు ఎందుకంటే..చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. పురాణాల ప్రకారం, దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటిముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని కోరాడు. అనంతరం రురువు వర గర్వంతో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఈ ధనుర్మాసంలో 30 రోజులపాటు ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టి.. ఆ తర్వాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుడిని అందులో తోస్తారు. అలా రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తోంది.ఈ పండగ సందేశం, అంతరార్థం..చలికాలంలో సూక్ష్మక్రిముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగిపోవడానికి మన పెద్దలు ఇలా భోగి మంటలు వేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారని చెబుతుంటారు. ఇక ఈ పండుగ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే..చెడు అలవాట్లను, అసూయా, ఈర్ఘ, దుర్భద్ధిని ఈ మంటల రూపంలో దగ్ధం చేసుకుని మంచి మనుసుతో జీవితాన్ని ప్రారంభించి సానుకూలా ఆలోచనలతో మంచి విజయాలను అందుకోవాలనే చక్కటి సందేశాన్ని ఇస్తోంది. మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమని ప్రార్థిస్తూ అగ్నిహోత్రాన్ని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలు, అలాగే మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో వేసి దగ్ధం చేసుకోవటమే భోగి. ఇలా మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం.(చదవండి: సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
కాగ్‌ రిపోర్టు మంట... ఆప్‌ సర్కార్‌పై హైకోర్టు సీరియస్‌

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్త

title
Rakesh Sharma Birthday: రాకేష్‌శర్మ అంతరిక్షంలో ఎన్ని రోజులున్నారు?

అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ పుట్టినరోజు నేడు(జనవర

title
Maha Kumbh-2025: అండర్‌ వాటర్‌ డ్రోన్లు.. ఏఐ కెమెరాలు.. ఫ్లోటింగ్‌ పోలీస్‌ పోస్టులతో నిఘా

ప్రయాగ్‌రాజ్‌: మహాకుంభమేళా..

title
ఆర్టికల్‌ రద్దుతో సంబంధమే లేదు.. మోదీకి ఒమర్‌ అబ్దుల్లా ఝలక్‌

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో ​ప్రధాని మోదీ పర్యటన వేళ ముఖ్యమం

title
Delhi Election-2025: అందరి దృష్టి షకూర్‌ బస్తీపైనే.. ఆ పార్టీల మధ్య హోరాహోరీ?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి.

International View all
title
కనీవినీ ఎరగని కార్చిచ్చుతో అల్లాడిపోతోంటే... మారువేషాల్లో దారుణం!

లాస్ ఏంజిల్స్‌లో రగిలిన కార్చిచ్చు  అమెరికాను అతలాకుతలం చేసింది.

title
కెనడా అమ్మకానికేం లేదు!.. ట్రంప్‌కు ఘాటు హెచ్చరిక

న్యూఢిల్లీ: కెనడాను అమెరికాలో విలీనం చేసే ప్రణాళికలో ఉ‍న్న అమెరికా నూతన అధ్

title
పాకిస్తాన్‌లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..

ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలో బంగారం పండింది.

title
అయ్యో.. లాస్ ఏంజెలెస్‌! 24కు చేరిన మృతుల సంఖ్య

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఎంతకీ శాంతించడం లేదు.

title
మహిళల్లో మద్యం అలవాటుకు ఈస్ట్రోజన్‌కు లింకు

న్యూఢిల్లీ: ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్థాయిలు పెరిగిన సందర్భాల్

NRI View all
title
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా

ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్

title
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!

అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్‌ దిగ్గజం యాపిల్‌ 185 మంది ఉద్యోగులను త

title
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి

title
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)

title
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్‌..!అచ్చం భారత్‌లో..

ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్‌ బిజినెస్‌లు.

Advertisement

వీడియోలు

Advertisement