Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

What Exactly Pawan Kalyan Says About Allu Arjun Episode1
పవన్‌ ఓపెన్‌ అయితే ఇలా ఉంటుంది పుష్పా!

ఇంతకీ అల్లు అర్జున్‌ అరెస్ట్ ఎపిసో‌డ్‌లో పవన్‌ కల్యాణ్‌ ఎలా స్పందిస్తారో?.. అని ఇంతకాలం అటు రాజకీయ వర్గాలు, ఇటు సినీ వర్గాలు ఒక కుతూహలంతో ఎదురు చూశాయి. తీరా ఆయన ఓపెన్‌ అయ్యేసరికి.. ఆయన తన అభిప్రాయం చెప్పకపోయి ఉంటేనే బాగుండు అనుకుంటున్నాయి. ఈ ఇష్యూపై మీడియా చిట్‌చాట్‌లో పవన్‌ మాట్లాడి.. ఇంకా గంటలు కూడా గడవలేదు. కానీ, ఈ కామెంట్లు ఎంత ఫాస్ట్‌గా ప్రభావం చూపాయంటే.. మెగా వర్సెస్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మళ్లీ తన్నుకుంటూ సోషల్‌ మీడియాలో రచ్చ చేసేంతలా.. !సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌ జైలుకెళ్లి వచ్చాక దాదాపు సినీ పరిశ్రమ మొత్తం ఆయన్ని పరామర్శించింది. పవన్‌ మాత్రం ఇక్కడికైతే రాలేదు. ‘‘వచ్చేస్తున్నారహో..’’ అంటూ థంబ్‌నెయిల్స్‌తో సోషల్‌ మీడియాలో ఊదరగొట్టేశారు. అల్లుడి కోసం కదిలి వస్తున్నాడంటూ ఊహాగానాలు ప్రచారం చేశారు. అయితే అల్లు వారిని కనీసం ఫోన్‌ ద్వారా అయినా ఆయన పరామర్శించినట్లు ఎక్కడా సమాచారం లేదు. ఇది అల్లు అర్జున్‌ అభిమానులతో పాటు పవన్‌ అభిమానులను ఒకింత ఇబ్బందికి గురి చేసింది. వరుసకు మామ బంధుత్వంతోనైనా బన్నీని కలిసి ఉంటేనే.. పెద్దరికం నిలబెట్టుకున్నట్లు ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు.. ఈ ఇష్యూ మొదట్లో రాజకీయంగా తాము ఇబ్బందికి గురవుతున్నామన్న అభద్రతాభావం సినీ పెద్దల్లో కనిపించింది. అలాంటి టైంలో దాదాపు ముప్పై ఏళ్లపాటు సినీ రంగంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ తమకు మద్దతుగా ఒక్క మాట అయినా అంటారేమోనని యావత్‌ సినీ పరిశ్రమ భావించింది. కానీ, ఇవేవీ జరగక.. తనదైన శైలిలో కన్‌ఫ్యూజింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. పవన్‌ ఏమన్నారో యధాతథంగా ఓసారి గమనిస్తే..‘‘ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ, ఆదరణ చూపుతారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు. మేము సినిమా థియేటర్‌కు వెళ్లడం ఎప్పుడో మానేశాం. విజయనగరంలో నన్ను కూడా ముందు వద్దనే చెప్పారు. చిరంజీవి(Chiranjeevi) ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు. నేనూ అలాగే వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో స్టాఫ్ అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన వెళ్లి కూర్చున్నాక... ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది. చట్టం అందరికీ సమానం!. అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదు. కానీ..ఇటువంటి ఘటనల్లో‌ పోలీసులను నేను తప్పు పట్టను. ఎందుకంటే వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు... అర్జున్‌కు చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో. అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేది. అప్పుడు రచ్చ అవకుండా ఉండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది. ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. అభివాదం చేయకపోతే... ఆ నటుడుపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు, బలుపు అని అందరూ చర్చ పెడతారు. ఈ ఘటనలో నా వల్ల చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉంటుంది. వెళ్లి ఆ బిడ్ట కోసం మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి. సినిమా అంటే టీం... అందరూ భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు. ఇది‌ కరెక్ట్ కాదు.ఈ ఘటనలో గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారనేది నా అభిప్రాయంఅల్లు అర్జున్(Allu Arjun Row) విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపీంచింది. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది చేయక‌పోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. రేవంత్ రెడ్టిపై ప్రజలు విమర్శలు చేసే అవకాశం ఉందని.. సీఎం హోదాలో ఆయన స్పందించారు. రేవంత్ రెడ్డికి రాంచరణ్, అల్లు అర్జున్‌లు చిన్ననాటి నుంచీ తెలుసు. అర్జున్ మామ కాంగ్రెస్ నేత కూడా. కొన్నిసార్లు పరిస్థితులు బట్టి నిర్ణయాలు ఉంటాయి.రేవంత్ రెడ్టి చాలా గొప్ప నాయకుడు. కింద నుంచి ఎదిగారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అలా చేశారు అని నేను అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) వీటన్నింటికీ మించిన నాయకుడు. ఆయన వైఎస్సార్‌సీపీ విధానాల తరహాలో అక్కడ(తెలంగాణలో) వ్యవహరించలేదు. అక్కడ బెన్‌ఫిట్ షోలు, టిక్కెట్లు ధర పెంపుకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పుష్ప సినిమాకు బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచారు. ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి. ‘సలార్‌’, ‘పుష్ప2’వంటి సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయి. ‘పుష్ప2’ సినిమాకు సీఎం రేవంత్‌ పూర్తిగా సహకరించారు. టికెట్‌ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుంది. మరి మనం రేవంత్ రెడ్డిను ఎలా తప్పు బడతాము?.రెండ్రోజుల కిందట.. ఇదే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కడప రిమ్స్‌ వద్ద మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ విలేకరి అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌ గురించి ప్రశ్నించారు. ఇది సంబంధం లేని ప్రశ్న అంటూ పవన్‌ దాటవేసే యత్నం చేశారు. ‘‘మీ ఫ్యామిలీ మెంబర్ కదా?’’ అని అదే విలేకరి ప్రశ్నించగా.. ఆవేశంతో ఊగిపోయిన పవన్‌.. ‘‘ఇప్పుడు మనుషులు మరణిస్తుంటే సినిమాల గురించి ఎందుకు? పెద్ద పెద్ద సమస్యలకు సంబంధించిన విషయాలు అడగండి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను.. బియాండ్ సినిమా గురించి డిబేట్ పెట్టండి. ఇక్కడ సమస్యల గురించి మాట్లాడండి. అరాచకాలపై డిబేట్ పెట్టండి'' అని క్లాస్‌ పీకారు.కట్‌ చేస్తే.. దిల్‌ రాజుతో భేటీ అయిన సందర్భంలోనే అల్లు అర్జున్‌ ఇష్యూ.. ఆయనకు పెద్ద సమస్యగా కనిపించిందేమో!. అందుకే ప్రధానంగా భావించి చాలాసేపు మాట్లాడారు. ఒకవైపు తన అల్లుడిదే తప్పనంటూ.. మరోవైపు చంద్రబాబు శిష్యుడనో లేకుంటే తోటి పొలిటీషియన్‌ అనో కాకుంటే ఒక స్టేట్‌కు సీఎం అనో.. రేవంత్‌ చేసిందే కరెక్ట్‌ అంటూ ప్రశంసలు గుప్పించారాయన. అదే సమయంలో.. ఇక్కడ పాపం అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు అంటూ కర్రతో కాల్చి ఆపై బర్నల్‌ రాసినంత పని చేశారు. ఒకప్పుడు పవన్‌ కల్యాణ్‌(P)awan Kalyan) ప్రసంగాలు అంటే.. గజిబిజి గందరగోళంగా ఉండేవన్న పేరు ఉండేది. ఆయన ఎప్పుడు.. ఏం మాట్లాడాతారో అర్థంకాక అభిమానులు తలలు పట్టుకునేవారు. అదృష్టవశాత్తూ.. ఎన్నికల టైంలో ఆయన్నొక తోపుగా సోషల్‌ మీడియా విపరీతమైన హైప్‌ తెచ్చి పెట్టింది. అయితే.. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన వైఖరిలో మార్పు వస్తుందేమోనని భావించిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. పైపెచ్చు.. పబ్లిక్‌గా అభిమానులనే తిడుతూ పబ్లిక్‌గా అసహనం ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అనే చందాన హీరో అల్లు అర్జున్‌ వ్యవహారంపై పవన్‌ మాట్లాడారు. అయితే ఇది ఇటు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తే.. ఇలాగైనా తమ లీడర్‌కు ఎలివేషన్‌ ఇద్దామని భావించిన ఆయన ఫ్యాన్స్‌ను మాత్రం షరామాములుగా అయోమయంలో పడేసింది. ఏది ఏమైనా పవన్‌ తన వ్యాఖ్యలతో మరోసారి ఫ్యాన్స్‌ వార్‌కు మాత్రం ఆజ్యం పోశారు.

KSR Comments On Eenadu and ABN Andhra Jyothy Fake News2
సీన్‌ మారిందని ఎల్లోమీడియాకూ స్పష్టమైనట్లుంది!

అంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల తిరుగుబాటు వేడి బాగానే తగులుతున్నట్లుంది. టీడీపీ జాకీమీడియా ‘ఆంధ్రజ్యోతి’ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై పెడుతున్న శోకండాలే దీనికి నిదర్శనం. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు, ర్యాలీలు విజయవంతం కావడంతో టీడీపీ, దాని తోకమీడియాలిప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. ప్రభుత్వంపై ఆరునెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న అంచనాలను వైఎస్సార్‌సీపీ పిలుపునకు ప్రజలు స్పందించిన తీరు దాన్ని ధ్రువీకరించింది. తమ కోడి కూయనిదే తెల్లవారదనుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతులు ఈ వార్తలను కప్పిపుచ్చేందుకు, గత ప్రభుత్వం పాలనే ఛార్జీల పెంపునకు కారణమంటూ బుకాయించే యత్నం చేసింది. కాకపోతే ప్రజలు తమకు కలిగిన నొప్పిని కూడా మరచిపోతారని అనుకుందీ ఎల్లో మీడియా! చంద్రబాబు మాకిచ్చిన హామీ ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అన్న ఆలోచన, విచక్షణ లేకుండా ప్రజలుంటారా? ప్రజల చెవుల్లో పూలు పెట్టి అధికారమైతే కొట్టేశామని టీడీపీ, జనసేన, బీజేపీలు సంతోషించవచ్చు. తమ వంచన చాతుర్యానికి ఈనాడు, ఆంధ్రజ్యోతులు మురిసి పోతూండవచ్చు. అయితే ఇది ఎంతో కాలం నిలవదన్న విషయం ఈపాటికి వీరికి అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అంతా స్వర్గంగా మారిందన్న భ్రమ కల్పించడానికి కూటమి, ఎల్లో మీడియా తంటాలు పడుతున్నాయి. తమ ఈ తాజా పాచిక పారడం లేదన్న విషయమూ వారికి స్పష్టమవుతోంది. మనసులోని ఆందోళనను మరింత పెంచుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్‌ ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై ఏకంగా రూ. 15 వేల కోట్ల భారం పెట్టింది ప్రభుత్వం. దీంతో సహజంగానే ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తప్పంతా జగన్‌దే అని జాకీ పత్రిక నీచమైన కథనం ఇచ్చింది. ‘‘నాడు షాకులు ..నేడు శోకాలు’’ అంటూ హెడింగ్ పెట్టి, విద్యుత్ చార్జీల బాదుడు జగన్ దే అని నిస్సిగ్గుగా రాసింది. ఇది నిజమే అయితే చంద్రబాబుకు తాను విద్యుత్ చార్జీలు పెంచవలసిన అవసరం ఏమి వస్తుంది. కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదని, వచ్చే ఏడాది సర్దుపోటు ఉందని ఎల్లో మీడియా చెబుతోంది. దానిని ఎవరైనా నమ్ముతారా? ఇది ఏ రకంగా జరుగుతుందో ఎక్కడైనా చెప్పారా? అంటే ఇప్పటికైతే నోరుమూసుకుని ఈ రూ.15 వేల కోట్లు చెల్లించాలని చెప్పడమే కదా? చంద్రబాబు టైమ్ లో పెండింగ్ లో పెట్టిన సుమారు రూ.47 వేల కోట్ల బిల్లులను జగన్ పాలనలో చెల్లించారా?లేదా? అప్పుడు జగన్ ఏమైనా చంద్రబాబు నిర్వాకం గురించి ఏనాడైనా శోకించారా? మరి ఇప్పుడు ఎందుకు ఈ జాకీ మీడియా గుక్కపెట్టి రోదిస్తోంది?విద్యుత్తు సంస్కరణలకు తానే ఆద్యుడినని చెప్పుకునే చంద్రబాబు కాలం నుంచే సర్దుబాటు ఛార్జీల విధానం ఉందన్న విషయాన్ని మరచిపోయింది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలో ఉంటే మరోలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలుసు. ఇందుకు తగ్గట్టుగానే.. అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోనని, 30 శాతం మేర తగ్గిస్తానని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన ఆయన ఆ తరువాత యాభై నుంచి వంద శాతం పెంచేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా ఈ పెంపునూ సమర్థించేందుకు జగన్‌పై నిందలేసే పనిలో పడ్డాయి. ఇచ్చిన హామీ ఎందుకు తప్పుతున్నారని మాత్రం ప్రశ్నించవీ పత్రికలు! ఆర్థిక, రాజకీయ సంబంధాల కారణంగానే ఎల్లో మీడియాకు ప్రజావసరాల కంటే సొంత ప్రయోజనాలే ఇలాంటి కథనాలు రాస్తున్నారని అనుకోవాలి. చంద్రబాబు టైమ్‌లో అధిక రేట్లకు చేసుకున్న సోలార్‌ విద్యుత్తు ఒప్పందాలను సమీక్షించేందుకు జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రయత్నిస్తే... చంద్రబాబు, ఆయన జాకీ మీడియా కాని తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయని యాగీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ద్వారా చౌకగా అంటే యూనిట్‌కు రూ.2.49లకే కొనుగోలు చేసినా దాన్ని ఈ మంద మెచ్చుకోలేదు సరికదా అభాండాలేసింది. అమెరికాలో నమోదైన కేసులో జగన్‌ పేరుందంటూ తప్పుడు కథనాలు రాసింది. కేంద్రం సూచనల మేరకు రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు జగన్‌ చేసిన ప్రయత్నాన్ని ఉరితాళ్లుగా అభివర్ణించిన ఎల్లోమీడియా అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని కొనసాగిస్తూండటం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. మీడియా ఇంత దుర్మార్గంగా మారితే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఆలోచించాలి.విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపునకు స్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉండింది. కొంతమంది వైఎస్సార్‌సీపీ నేతలు ఆరు నెలలకే రోడ్లపైకి రావడమేంటని ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు కూడా. టీడీపీ కూటమి కేసులు పెడుతుందన్న భయం దీనికి ఒక కారణమైంది. కానీ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు మాత్రం ఈ సమస్యపై ప్రజల గొంతుకయ్యారు. పార్టీకి కట్టుబడి ఉన్న నేతలు ధైర్యంగా బయటకు రావడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినట్లయింది.ఆరు నెలలుగా వైఎస్సార్‌సీపీని అణచి వేసేందుకు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీకి ఇది అశనిపాతమే. ఎల్లోమీడియా మాత్రం తనదైన శైలిలో వాస్తవాలను వక్రీకరించేందుకు తన వంతు ప్రయత్నం మానలేదు. ఈ నేపధ్యంలోనే జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వెళ్లి స్వాగతం పలుకుతున్నారు.ఎవరు నిజాయితీగా పాలన చేసింది ప్రజలు అర్దం చేసుకుంటున్నారనిపిస్తుంది. ధర్మవరం మీదుగా బెంగుళూరు వెళుతున్నప్పుడు ఆయా గ్రామాల వద్ద పార్టీ కార్యకర్తలు, ప్రజలు అభివాదం పలికి ఆయనతో సెల్పీలు దిగడానికి పోటీపడిన వైనం, జయ జయ ధ్వానాలు చేసిన తీరు ఆయన క్రేజ్ ను తెలియచేస్తున్నాయి. పార్టీ కార్యకర్తల్లో పెరిగిన విశ్వాసానికి ఇవన్ని దర్పణం పడుతున్నాయని చెప్పవచ్చు. ‘‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’’ అన్న చంద్రబాబు నినాదం అసలు అర్థం కాస్తా.. ‘బాబు ష్యూరిటీబాదుడు గ్యారంటీ’గా మారిపోయిందన్నమాట.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

KTR Comments On Formula-E Car Race Case3
KTR: కేసులకు భయపడేదే లేదు

సాక్షి, తెలంగాణ భవన్: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో విచారణకు రావాలంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో కేసులకు భయపడేది లేదంటూ ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (ktr) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్‌ సోమవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కనిపిస్తోంది. కేసులకు భయపడేది లేదు. ఏసీబీ కేసులో బలం లేదని రేవంత్‌కు కూడా తెలుసు. నేను మాట మార్చలేదు.. చెప్పినదానికే కట్టుబడి ఉన్నా.ఈ కార్‌ రేసుకు మంత్రి హోదాలో నేనే డబ్బులు కట్టమన్నా. ప్రొసీజర్‌ ప్రకారం జరగకపోతే .. ఈసీ,ఆర్‌బీఐ దగ్గరకు ప్రభుత్వం ఎందుకు పోలేదు?.డబ్బులు ముట్టిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు?’అని ప్రశ్నించారు. ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌కు తెలుసుఎప్పుడు బయటకు రావాలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలుసు. 24ఏళ్ళు కేసీఆర్ కష్టపడ్డారు. కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు. తెలంగాణ బిడ్డ పీవీపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ఢిల్లీలో పీవీకి మెమోరియల్ కట్టాలని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరు? మరణంలో కూడా పీవీని కాంగ్రెస్ గౌరవించలేదు. పీవీకి గౌరవం దక్కేవరకు రాజ్యసభలో బీఆర్ఎస్ కొట్లాడుతుంది. రేవంత్‌కు బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా మారారు. అమృత్, సివిల్ సప్లై స్కాంలో కేంద్రం ఎందుకు విచారణ జరపదు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్రం సహకరిస్తుంది. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగత కమిటీ వేస్తాం. లోకల్ బాడీస్‌లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తాం’అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కీలక పరిణామంతెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్‌కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ.. కేటీఆర్‌ సహా అరవింద్ కుమార్‌కు సైతం నోటీసులు ఇచ్చింది.వివరాల ప్రకారం.. ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి తాజాగా కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా వచ్చే నెల ఏడో తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసును ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. FEOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేస్ కేటీఆర్‌.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది.

Bandi Sanjay react to Pawan Kalyan On Praising Revanth Reddy4
‘పవన్‌కు రేవంత్‌ ఏ విషయంలో గొప్పగా కనబడ్డారో?’

సాక్షి,కరీంనగర్‌ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశంసిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌ స్పందించారు.పవన్‌కు రేవంత్‌ ఏ విషయంలో గొప్పగా కనబడ్డారో?. ఆరు గ్యారెంటీలను పక్కదారి పట్టించేందుకే.. అల్లు అర్జున్‌పై పవన్‌ వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్‌, రేవంత్‌రెడ్డికి మధ్య ఎక్కడో చెడింది. 14 శాతం కమిషన్‌ వద్ద చెడిందేమో?’ అని బండి సంజయ్‌ సెటైర్లు వేశారు.కరీంనగర్ జిల్లా మాజీ సర్పంచులతో కలిసి బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘సర్పంచుల బతుకులు నిర్వీర్యం కావాడానికి బీఅర్ఎస్, కాంగ్రెస్ ‌కారణం. బకాయిలు మొత్తం చెల్లిస్తానంటే జెండాలు పక్కనబెట్టి కాంగ్రెస్ ‌పార్టీకి సర్పంచులు మద్దతు ఇచ్చారు. గ్రామాలు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి చెందాయి. సర్పంచులు అప్పులపాలై‌ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మాజీ సర్పంచులు బ్రతుకుదెరువు కొసం దుబాయ్ పోయే పరిస్థితి వచ్చింది. రూ.1300 కోట్ల సర్పంచుల పెండింగ్‌ బిల్లులు విడుదల చెయ్యాలి. గ్రామపంచాయతి ఎన్నికల్లో జెండాలు ప్రక్కన బెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ది వస్తుంది.’‘14% శాతం కమీషన్ల మీద ఈ ప్రభుత్వం నడుస్తోంది. ముగ్గురు మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారు. సచివాలయం, మంత్రుల పేషీలు కమీషన్లకి అడ్డాగా మారాయి. ఇక్కడి కమీషన్లతో ఢిల్లీలో కప్పం కడుతున్నారు. ఇప్పుడున్న మంత్రులందరికి ముఖ్యమంత్రి కావాలని ఉంది. ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లనే సీఎం పదవి నిలబడుతుంది’ అని ఆరోపించారు.

Sangeeta Bijlani About her Wedding Cards with Salman Khan Getting Printed5
పత్రికలు అచ్చువేయించాక ఆగిన పెళ్లి? నిజమేనన్న హీరోయిన్‌

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ఎంతోమంది హీరోయిన్లను ప్రేమించాడు. వారిలో ఓ హీరోయిన్‌తో గాఢ ప్రేమలో ఉన్న అతడు పెళ్లికి సైతం ఒప్పుకున్నాడు. మంచి ముహూర్తం చూసుకుని పెళ్లిపత్రికలు కూడా అచ్చు వేయించాడు.. కానీ చివరకు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారని అప్పట్లో రూమర్స్‌ వచ్చాయి. ఇంతకీ అతడు జీవిత భాగస్వామిగా కోరుకున్న హీరోయిన్‌ మరెవరో కాదు సంగీత బిజ్లానీ (Sangeeta Bijlani).పత్రికలు కొట్టించాక ఆగిన పెళ్లి?సంగీత బిజ్లానీ తాజాగా ఇండియన్‌ ఐడల్‌ 15వ షోకు ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా మానసి ఘోష్‌ అనే కంటెస్టెంట్‌ సంగీతను ఊహించని ప్రశ్న అడిగింది. సల్మాన్‌తో పెళ్లికి సిద్ధమై పత్రికలు కూడా కొట్టించుకున్నాక చివరకు ఆ వివాహమే ఆగిపోయింది. నిజమేనా? అని ప్రశ్నించింది. అది అబద్ధమైతే కాదు అని బదులిచ్చింది. దీంతో అందరూ షాకయ్యారు. ఎందుకు మీ పెళ్లి ఆగిపోయిందో చెప్తారా? అని అడిగాడు. ఇంతటితో ప్రోమో పూర్తయింది. మరి అతడి ప్రశ్నకు సంగీత ఆన్సరిచ్చిందా? లేదా? అనేది ఫుల్‌ ఎపిసోడ్‌లోనే చూడాలి!పదేళ్లకు పైగా డేటింగ్‌కాగా బాలీవుడ్‌ (Bollywood)లో కెరీర్‌ ఆరంభించిన తొలినాళ్లలో సల్మాన్‌ ఖాన్‌, సంగీత ఒకరినొకరు కలుసుకున్నారు. దశాబ్దకాలంపాటు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ చివరకు అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత సంగీత 1996లో మహ్మద్‌ అజారుద్దీన్‌ను పెళ్లి చేసుకుంది. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే సల్మాన్‌తో ఇప్పటికీ ఫ్రెండ్‌షిప్‌ కొనసాగిస్తోంది.చదవండి: మనవరాలి పెళ్లిపై మురళీమోహన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Madhurima Diagnosed With Cancer In Class 6 Cleared NEET In First Attempt6
దటీజ్‌ మధురిమ బైద్య..! మైండ్‌బ్లాక్‌ అయ్యే గెలుపు..

బాల్యమంతా ఆస్పత్రుల చుట్టూనే తిరుగుతూ ఉంది. స్నేహితులను కోల్పోయింది. ఓ పేషెంట్‌లా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నా.. వెరవక చదువుని కొనసాగించింది. అంతటి స్థితిలోనూ మంచి మార్కులతోనే పాసయ్యింది. ఓ పక్కన ఆ మహమ్మారి నుంచి కోలుకుంటూనే నీట్‌కి ప్రిపర్‌ అవ్వడమేగాక తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. కేన్సర్‌ అనంగానే సర్వం కోల్పోయినట్లు కూర్చొనవసరం లేదు. సక్సెస్‌తో చావు దెబ్బతీస్తూ బలంగా బతకాలని చాటి చెప్పింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ అమ్మాయే మధురిమ బైద్య. ఆరవ తరగతిలో ఉండగా అంటే.. 12 ఏళ్ల ప్రాయంలో అరుదైన నాన్-హాడ్కిన్స్ లింఫోమా కేన్సర్‌ బారిన పడింది. అది కూడా స్టేజ్‌ 4లో ఉండగా వైద్యులు ఈ వ్యాధిని గుర్తించారు. దీంతో ఆమె చికిత్స నిమిత్తం ముంబైలోని టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌(Tata Memorial Hospital) చుట్టూ తిరుగడంతోనే బాల్యం అంతా గడిచిపోయింది. కనీసం స్నేహితులు కూడా లేరు మధురిమకు. అయినా సరే చదువుని వదల్లేదు. ఆ ఆస్పత్రి ఓపీడీల్లో చదువుకునేది. ఆఖరికి ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యినప్పుడూ పుస్తకాలను వదలేది కాదు. అలా చదువుతోనే మమేకమయ్యేలా తన బ్రెయిన్‌ని సెట్‌ చేసుకుంది. నిజానికి ఆ దశలో ఉండే కీమోథెరపీలు మోతాదు అంతా ఇంత కాదు. చదివినా బుర్ర ఎక్కదు కూడా. కానీ మధురిమ ఆ బాధని కూడా లెక్కచేయకుండా చదువు మీద ధ్యాసపెట్టి దొరికిన కొద్ది సమయంలోనే చదువుకుంటుండేది. ఆమె కష్టానికి తగ్గట్టు పదోతరగతిలో 96% మార్కులతో పాసై అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఇంటర్‌ కూడా 91% మార్కులతో ఉత్తీర్ణురాలైంది. తను ఇంతలా కష్టపడి చదవడటానికి కారణం.. తనలాంటి కేన్సర్‌ బాధతులందరికీ ఓ ప్రేరణగా ఉండాలనేది ఆమె కోరకట. అందుకోసమే తనను తాను వ్యాధిగ్రస్తురాలిగా లేదా బాధితురాలిగా అస్సలు బావించేదాన్ని కాదని అంటోంది. తన ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు జీవితంపై పోరాడుతున్న యోధురాలిగా అనుకుని ముందుకు సాగానని సగర్వంగా చెబుతోంది మధురిమ. తన కెరీర్‌ అంతా ఆరోగ్యానికి సంబంధించిన సవాళ్లతోనే పోరాడింది. సంవత్సరాల తరబడి సాగిన కీమోథెరపీ(chemotherapy), రేడియేషన్(Radiation), ఎముక మజ్జ మార్పిడి(Bone marrow transplant) వంటి కఠినతరమైన శస్త చికిత్సలతో కేన్సర్‌ని విజయవంతంగా జయించింది. కానీ వాటి కారణగా శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీనమైంది. అందువల్ల తరుచుగా జలుబు, దగ్గు వంటి అంటువ్యాధుల బారినపడుతుండేది. అయినా సరే చదువుని ఆపలేదు. ఎంబీబీఎస్‌ చేయాలన్న కోరికతో ప్రతిష్టాత్మకమైన నీట్‌ ఎగ్జామ్‌(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG 2024)కి కూడా ప్రిపేర్‌ అవ్వడమేగాక తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. ఇక్కడ మధురిమ కేన్సర్‌ చివరిదశలో పోరాడుతున్న నైరాశ్యాన్ని దరిచేరనివ్వలేదు. పైగా తన కలను సాకారం చేసుకునే సమయంలో ఎదురవ్వుతున్న కఠినమైన ఆరోగ్య సవాళ్లన్నింటిని తట్టుకుంటూనే మంచి మార్కులతో పాసయ్యింది. అదీగాక అత్యంత కఠినతరమైన నీట్‌ ఎగ్జామ్‌ని అలవోకగా జయించింది. మధురిమ సక్సస్‌ జర్నీ చూస్తే..దృఢ సంకల్పం, మొక్కవోని పట్టుదల ముందు..కఠినతరమైన కేన్సర్‌ కనుమరుగవుతుందని తేలింది. అంతేగాదు ఇక్కడ తన ఆరోగ్య పరిస్థితులన్నింటిని అంగీకరించిందే తప్ప 'నాకే ఎందుకు ఇలా' అనే ఆలోచన రానీయలేదు. అందుకు తగ్గట్టుగా తన సామార్థ్యాన్నిపెంపొందించటంపై దృష్టిపెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మధురిమ గెలుపు మాములుది కాదని ప్రూవ్‌ చేసింది. (చదవండి: గర్భధారణ సమయంలో ఎటాక్‌ చేసే వ్యాధి..! హాలీవుడ్‌ నటి సైతం..)

Mukesh Ambani New Rolls Royce Spectre7
అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!

భారతీయ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) మరో విలాసవంతమైన ఎలక్ట్రిక్ కారును (Electric Car) కొనుగోలు చేశారు. ఇది అంబానీ బ్యారేజిలో చేరిన 'రోల్స్ రాయిస్' (Rolls Royce) బ్రాండ్ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్. దీని ధర రూ. 7.5 కోట్లు (ఎక్స్ షోరూమ్).అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు పేరు 'స్పెక్టర్' (Spectre). ఈ కారుకు MH 0001 అనే వీఐపీ నెంబర్ ప్లేట్ ఉంది. ఈ నెంబర్ ప్లేట్ కోసం కూడా వారు భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఎంత వెచ్చించారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు కస్టమైజ్డ్ అని తెలుస్తోంది. కాబట్టి దీని ధర ఎక్స్ షోరూమ్ ధర కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ కారు 102 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఒక సింగిల్ ఛార్జితో ఏకంగా 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఇదీ చదవండి: ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న బైకులు ఇవే!స్పెక్టర్ అనేది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారును ఇప్పటికే మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', కేరళకు చెందిన ఒక బిల్డర్ కూడా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.రోల్స్ రాయిస్ స్పెక్టర్ (Rolls Royce Spectre)రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన స్పెక్టర్ కారు ధర రూ. 7 కోట్ల కంటే ఎక్కువ. కాబట్టి దీనిని సామాన్య ప్రజలు కొనుగోలు చేయడం కష్టం. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ కారును 10మంది కంటే తక్కువే.. దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారాం. అయితే ఈ కారు చూడటానికి మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.ఇదీ చదవండి: రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!అంబానీ గ్యారేజిలోని కార్లు (Mukesh Ambani Car Collection)భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గ్యారేజిలో.. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యుబీ, మెర్సిడెస్ బెంజ్ ఎస్660 గార్డ్, మాట్ బ్లాక్ బీఎండబ్ల్యూ 760ఎల్ఐ, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ ఏఎంజీ జీ63, టెస్లా మోడల్ ఎస్ 100డీ, రోల్స్ రాయిస్ కల్లినన్, మెర్సిడెస్ మేబ్యాక్ 62, ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్, ఆస్టన్ మార్టిన్ రాపిడ్, లంబోర్ఘిని ఉరుస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే, ఆర్మర్డ్ బీఎండబ్ల్యూ 760 ఎల్ఐ, బెంట్లీ బెంటయ్గా, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ మొదలైనవి ఉన్నాయి. మొత్తం మీద అంబానీ గ్యారేజిలో సుమారు 170 కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు సమాచారం.

How India Can Still Qualify For WTC 2025 Final After Defeat In MCG Test8
భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే.. అదొక్కటే దారి!

ఆస్ట్రేలియా(Australia) పర్యటనలో ఉన్న భారత జట్టుకు మరోసారి చుక్కెదురైంది. మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో భారత్(India) ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-2 వెనకంజలోకి వెళ్లింది. మరోసారి బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆసీస్ బౌలర్ల దాటికి 155 పరుగులకే కుప్పకూలింది.ఈ మ్యాచ్‌లో యశస్వి జైశ్వాల్‌, నితీశ్ కుమార్‌, వాషింగ్టన్ సుందర్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ జైశ్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు బౌలర్లలో స్కాట్ బోలాండ్‌, కమ్మిన్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్‌, హెడ్ చెరో వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ(WTC) ఫైనల్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి.భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే..డబ్ల్యూటీసీ 2023-25 ఫైన‌ల్ బెర్త్‌ను ఇప్పటికే ద‌క్షిణాఫ్రికా ఖారారు చేసుకుంది. మ‌రో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భార‌త్ మ‌ధ్య పోటీ నెల‌కొంది. మెల్‌బోర్న్ టెస్టు ఓట‌మితో భార‌త్ త‌మ డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆశ‌ల‌ను సంక్లిష్టం చేసుకుంది. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో భార‌త్ మూడో స్ధానంలో కొన‌సాగుతోంది. ఈ ఓట‌మితో టీమిండియా విన్నింగ్ శాతం 55.89 నుంచి 52.77కి ప‌డిపోయింది.మ‌రోవైపు ఆసీస్ మాత్రం ఈ విజ‌యంతో త‌మ విన్నింగ్ శాతాన్ని 58.89 నుంచి 61.46కు మెరుగుప‌రుచుకుంది. ఈ క్ర‌మంలో భార‌త్ ఫైన‌ల్‌కు చేర‌డం కాస్త క‌ష్ట‌మ‌నే చెప్పుకోవాలి. ప్ర‌స్తుత సైకిల్‌లో భార‌త్‌కు ఇంకా కేవ‌లం ఒక్క మ్యాచ్ మాత్ర‌మే మిగిలి ఉంది. కానీ ఆసీస్ మాత్రం ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడ‌నుంది. భార‌త్‌తో ఓ మ్యాచ్ శ్రీలంక‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారులు త‌ల‌ప‌డ‌నున్నారు. అయితే భారత్‌కు ఇంకా దారులు మూసుకుపోలేదు. రోహిత్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే సిడ్నీ వేదికగా జరగనున్న ఆఖరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిందే. అదే సమయంలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో ఆసీస్ కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడిపోవాలి. అప్పుడే భారత్‌కు ఫైనల్‌కు చేరే అవకాశముంటుంది. లేదా రెండు మ్యాచ్‌ల 0-0 డ్రాగా ముగిసిన భారత్‌కు ఫైనల్ చేరే ఛాన్స్ ఉంటుంది.చదవండి: అద్భుతమైన టెస్టు.. ఆఖరికి మాదే పైచేయి.. వాళ్లిద్దరు సూపర్‌: కమిన్స్‌

Telangana Assembly Special Session Live Updates9
మన్మోహన్‌ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ నివాళి

హైదరాబాద్‌, సాక్షి: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ నివాళి అర్పించింది. ఏడు రోజుల సంతాప దినాల నిర్వహణలో భాగంగా.. ఇవాళ(డిసెంబర్‌ 30) ప్రత్యేక సెషన్‌ నిర్వహించింది. సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ తరఫున కేటీఆర్‌ ఆ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. అలాగే మన్మోహన్‌కు దేశఅత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి సైతం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలకు మన్మోహన్‌కు రుణపడి ఉంటారు. 60 ఏళ్ల తెలంగాణ కల సాకారం ఆయనను తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ అంటే మన్మోహన్‌కు ప్రత్యేక అభిమానం ఉండేదని ఆయన సతీమణి తెలిపారు. ఆయన కుటుంబం చాలా నిరాడంబరంగా ఉంటుంది. గొప్ప విలువలతో​ తన కుటుంబాన్ని నడిపించారు. మన్మోహన్‌ పరిపాలనతోనే మనం గొప్ప ఆర్థిక శక్తిగా నిలబడగలిగాం. మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరవలేం. ప్రజలంతా గుర్తు పెట్టుకునే విధంగా మన్మోహన్‌ విగ్రహం ఏర్పాటు చేస్తాం. ప్రజలకు ఉపయోగపడే సంస్కరణల్లో ఆయన వెనకడుగు వేయలేదు. భూసేకరణ చట్ట సవరణ ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూర్చారు. భూసేకరణ చట్టం-2013 ద్వారా చేతి వృత్తులు, కుల వృత్తుల వారు లబ్దిపొందారు. మన్మోహన్‌ చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలి. పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వగలుగుతున్నామంటే అది ఆయన చలువే. అంబేద్కర్‌ స్పూర్తితో పరిపాలన చేశారు. మన్మోహన్‌ గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, మానవతావాది. ఐటీ రంగాన్ని శాసించగలుగుతున్నామంటూ ఆయన సంస్కరణలే కారణం అని చెప్పుకొచ్చారు.ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. పనే ధ్యాసగా పనిచేశారు. బ్యూరోక్రాట్‌గా వివిధ దశల్లో పనిచేసి మన్మోహన్‌ దేశ ప్రధాని అయ్యారు. నీతి, నిజాయితీతో మన్మోహన్‌తో పోటీ పడేవారు లేరు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తన పనే లక్ష్యంగా మన్మోహన్‌ ముందుకు సాగారు. మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి. 👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్‌.. ప్రతీ ఒక్కరి కోసం ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన అందించారు. మన్మోహన్‌ సంస్కరణలతో అనేక కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. సమాచార హక్కు చట్టాన్ని 2005లో​ తీసుకువచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశ గతినే మార్చేసింది. ఆర్థిక మాంద్యం బారినపడకుండా ఉపాధి హామీ పథకం కాపాడింది. దేశ సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకుని చట్టాలు చేశారు. ప్రతీ ఒక్కరి కోసం ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. దశాబ్దాలుగా కొట్లాడుతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. విపక్షాలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా చేశారు. మన్మోహన్‌ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మన్మోహన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. అసామాన్యమైన మహా మనిషి మన్మోహన్‌. దేశం కోసం ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టారు. మన్మోహన్‌ భారత్‌లో పుట్టినందుకు గర్వపడుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాం. 👉 కేటీఆర్‌ కామెంట్స్‌..మన్మోహన్ సింగ్ నిబద్ధతతోనే తెలంగాణ ఏర్పడింది. సీఎం రేవంత్‌ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం. మన్మోహన్‌ తెలివితేటలను గుర్తించింది మన తెలంగాణ బిడ్డ పీవీనే. ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానించినా మౌనంగా భరించారు. అయినా అవన్నీ పంటి కింద బిగబట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి. పీవీ నర్సింహారావు తెలంగాణ బిడ్డ. ఢిల్లీలో మెమోరియల్ లేదు. అక్కడ మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసన సభ తీర్మానం చేయాలి.రాజకీయాలతో సంబంధం లేని ఆర్థిక వేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రపంచం అంతా దేశం వైపు చూసే విధంగా మన్మోహన్ సింగ్ ఆర్థిక నిర్ణయాలు ఉన్నాయి. లాయల్టీకి నిలువుటద్దంగా నిలిచిన గొప్ప మహనీయుడు మన్మోహన్ సింగ్. కేసీఆర్‌కు షిప్పింగ్ పోర్టుపోలియో ఇస్తే డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేయగానే కేసీఆర్ తెలంగాణ కోసం అది త్యాగం చేశారు. తెలంగాణ ఏర్పాటు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో జరిగింది. తెలంగాణ డెలిగేషన్ తీసుకొని మన్మోహన్ సింగ్‌ను కలిశాం. 5 నిమిషాలు కాదు, ఎక్కువ సమయం కావాలని అడిగాం. సమస్య తీవ్రత తెలుసుకొని గంటన్నర సమయం ఇచ్చారు. ఓబీసీ అంశాలపై బలహీన వర్గాల డెలిగేషన్ ఢిల్లీ వెళ్లి కలిసింది.మన్మోహన్ సింగ్‌కు జరిగిన గౌరవ వీడ్కోలు.. మన పీవీ నరసింహారావుకు దక్కలేదు. ఢిల్లీలో అందరి ప్రధాన మంత్రులకు ఘాట్స్ ఉన్నాయి. పీవీకి తప్ప. పీవీకి ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేసేలా సభలో తీర్మానం పెట్టాలని కోరుతున్నాం. మన్మోహన్ సింగ్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేసినా మేమంతా వస్తాం.👉మంత్రి శ్రీధర్‌ బాబు కామెంట్స్‌..దేశాభివృద్ధికి మన్మోహన్‌ సింగ్‌ అనేక గొప్ప విధానాలు తెచ్చారు. సాధారణ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. మన్మోహన్‌సింగ్‌ను ఆర్థికమంత్రిగా పీవీ నరసింహారావు ఎంపిక చేశారు. గ్రామీణ పేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకం తెచ్చారు. బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్‌..పీవీ నరసింహారావు గురించి సభలో గుర్తు చేస్తున్నారు.పీవీని పదేళ్లు పట్టించుకోకపోతే.. బీజేపీ పీవీకి భారతరత్న ఇచ్చింది.పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పీవీకి భారత రత్న ఇవ్వలేదు.మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేంద్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలు ప్రకటిస్తే..రాహుల్ గాంధీ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్ కోసం వియత్నాం వెళ్లారట!రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్‌కు సంతాపం ప్రకటించాలి.మన్మోహన్‌కు దక్కిన గౌరవంతో పాటు అవమానం గుర్తు చేస్తున్నాం.సంతాప సభలో రాజకీయాలు ఎందుకు?. సభలో బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌..ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్‌..సంతాప తీర్మానం రోజు దాని గురించే మాట్లాడాలి.నిజంగా ఆర్ఎస్ఎస్ నేతలు కూడా మహేశ్వర్ రెడ్డి లాగా మాట్లాడరు.మధ్యలో వెళ్లిన మహేష్ రెడ్డి చించుకుంటూ మాట్లాడుతున్నారు.రాహుల్ గాంధీ ఎటు వెళ్లారు అన్నది ఇక్కడ చర్చ కాదు.సంతాప తీర్మానం గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందిఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్‌..కాంగ్రెస్ పార్టీ ఎందుకు మధ్యలో కలగజేసుకుంటుంది.దేశం అంతా మన్మోహన్ సింగ్ గురించి వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటన చేసి జరుపుతుంటే..రాహుల్ గాంధీ వేడుకల కోసం వియత్నం వెళ్లలేదా?కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్‌ను అవమానించినట్లు కాదా ?మన్మోహన్ సింగ్ విగ్రహం గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ.. పీవీకి కూడా విగ్రహం పెడితే బాగుండు.కూనంనేని కామెంట్స్‌..దేశ గతి, గమనాన్ని మన్మోహన్‌ మార్చారు. మన్మోహన్‌కు నివాళి అర్పించే కార్యక్రమంలో రాజకీయాలు తగదు.సంతాప సభల్లో వేరే అంశాలను జోడించడం ఇంతకు ముందెన్నడూ చూడలేదునివాళి కార్యక్రమంలో ఇలా చేయడం వల్ల మన్మోహన్‌ ఆత్మ క్షోభిస్తుందినివాళి కార్యక్రమంలో ఆయన గొప్పతనాన్ని చెప్పాలినిజాయతీ, నిబంద్ధతకు నిలువుటద్దం మన్మోహన్‌ సింగ్‌. హరీష్ రావు కౌంటర్‌..కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయనకు సభ ఏం గౌరవం ఇచ్చింది.సభ సభ లాగా జరగడం లేదుపీఏసీ చైర్మన్‌ మీకు నచ్చినట్లు ఇచ్చుకున్నారు.కేసీఆర్‌ను అడిగి పీఏసీ చైర్మన్‌ ఇచ్చారా?తెలంగాణ కోసం కేసీఆర్ రెండున్నర ఏళ్ల పాటు ఉన్న కేంద్ర పదవిని వదిలేశారు.శాసనసభ్యుల అనర్హత పై మీరు నిర్ణయం తీసుకున్నారా?ఆ లెక్కన వస్తే మేము చాలా మాట్లాడగలుగుతాం.కానీ ఇప్పుడు మన్మోహన్‌కు మాత్రమే పరిమితమవుతున్నాం. స్పీకర్‌ కామెంట్స్‌..కేసీఆర్‌ ప్రస్తావన రాగానే కలగజేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ప్రత్యేక సమావేశాల కోసం కేసీఆర్‌కు స్వయంగా నేనే కాల్ చేశాను.అసెంబ్లీ సమావేశానికి రావాలని కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానించాను.కానీ, ఆయన రాలేదుహరీష్‌ రావు కామెంట్స్‌..మన్మోహన్ సింగ్ పెద్దల సభలో 33 ఏళ్లు ఉన్నారుఈరోజు శాసనసభతో పాటు పెద్దల సభ, మండలి కూడా సమావేశమై నివాళి అర్పిస్తే బాగుండేది.శాసన మండలిలో మన్మోహన్‌కు నివాళి అర్పిస్తే మరింత గౌరవంగా ఉండేదిశాసన మండలి సభ్యులు సైతం సంతాపం తెలిపేందుకు అడుగుతున్నారు.నెక్లెస్‌ రోడ్డుకు పీవీ పేరు పెట్టాం. పీవీ ఘాట్‌ ఏర్పాటు చేశాం.స్కిల్‌ యూనివర్సిటీకి మన్మోహన్‌ పేరు పెట్టాలి.మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలి.దేశం ఆర్థికంగా బలోపేతం కావాడానికి మన్మోహన్‌, పీవీ కృషి ఎంతో ఉంది.కేసీఆర్‌ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం చేశాం.కేంద్రం కూడా స్పందించి పీవీకి భారతరత్న ఇచ్చింది.మన్మోహన్‌ను మౌన ముని అని అంటారుమన్మోహన్‌పై చిన్న అవినీతి మరక కూడా లేదు.ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా చెరగని ముద్ర వేశారు.ఏఐసీసీ మీటింగ్‌లో మన్మోహన్‌ కంట తడి పెట్టారు.కాంగ్రెస్‌ ఓటమికి సంస్కరణలే కారణమని ఏఐసీసీలో చర్చించినా మన్మోహన్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.మన్మోహన్‌ తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్‌ చించేసినా ప్రధానిగా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేసీఆర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫోన్..👉నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని సభకు రావాలని కేసీఆర్‌కు తెలిపిన స్పీకర్. మరోవైపు.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి దూరంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.

Happy New Year 2025: New Year Resolutions for Children10
Happy New Year 2025: ఎందుకు? ఏమిటి? ఎలా?..

ఇవాళ్టి నుంచి.. ఎలాగైనా ఉదయమే లేచి చదువుకోవాలి. .. జిమ్‌కు వెళ్లి బాడీని పెంచాలి.. సరైన డైట్‌ను మెయింటెన్‌ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి. .. ఎలాగైనా డబ్బులను పొదుపు చేసి ఫలానాది కొనాలి. .. ఆఫీస్‌కు టైంకు వెళ్లాలి. ఇలా అన్నీ కూడా ఏడాదిలో తొలిరోజు నుంచే చేస్తూ ఫ్రెష్‌ జీవితం ప్రారంభించాలి. చేస్తారో.. చేయరో.. తెలియదు!. కానీ, కొత్త ఏడాది వచ్చిందంటే.. రెజల్యూషన్స్‌ పేరుతో ఇలాంటి వాటిని తెరపైకి తెచ్చి హడావిడి చేసేవాళ్లు ఎందరో ఉంటారు. ఇందులోనూ హాస్యకోణం వెతుకుతూ.. ఇంటర్నెట్‌లో మీమ్స్‌(Resolutions Memes) వైరల్‌ అవుతున్న పరిస్థితుల్ని ఇప్పుడు చూస్తున్నాం. ఆ లక్ష్యాలను అందుకోవడం మన వల్ల కాదా?..కొత్త ఏడాది కొత్త తీర్మానాలు మనకు కొత్తేం కాదు. ‘‘జీవితంలో ఓ ఏడాది దొర్లిపోయింది. ఇన్ని రోజులు ఏలాగోలా గడిచాయి.కనీసం ఈ కొత్త ఏడాదిలోనైనా మార్పుతో పని చేద్దాం!’.. అని పదిలో తొమ్మిది మంది అనుకుంటారని పలు అధ్యయనాలు తేల్చాయి. ఇది ఏ విద్యార్థులకో, యువతకో మాత్రమే కాదు.. రెజల్యూషన్స్‌ తీసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. దీర్ఘకాలికంగా ప్రయత్నిస్తున్నవాళ్లు లేకపోలేదు. అంటే.. ప్రతీ ఒక్కరికీ ఇది వర్తిస్తుందన్నమాట. అయితే..ప్రతి కొత్త ప్రారంభం ఎంతో గొప్ప శక్తి, సానుకూల భావనలతో వస్తుందని అందరి నమ్మకం. మన భాషలో మంచి పాజిటివ్‌ వైబ్‌ అన్నమాట. చాలా మంది చాలా రకాల లక్ష్యాలను ఈ కొత్త ఏడాదిలో నిర్దేశించుకుంటారు. వాటిలో కొన్నింటిని ఎలాగైనా చేయాలని ప్రయత్నిస్తుంటారు. అవి మాములువి కాదు.. పెద్ద పెద్ద టార్గెట్‌లే ఉండొచ్చు!. అలాంటి వాటిని ఒంటరిగా నెరవేర్చుకోవడం కొంచెం కష్టమే!. అందుకోసమైనా సరే ఈ లక్ష్యాలను నలుగురితో పంచుకుని సాధించుకునే ప్రయత్నం చేయాలి.కొత్త ఏడాది రెజల్యూషన్స్‌ చేసుకోవడంలో.. విద్యార్థులు, యువత ముందుంటారు. ఇక్కడ విద్యార్థులతో పాటు వారు తల్లిదండ్రులు/సంరక్షకులు కూడా ఈ లక్ష్యాల కోసం వారితో కలిసి పనిచేస్తేనే ఫలితం ఉండేది. ఉదయాన్నే లేచి చదువుకోవాలనో, లేదంటే టైంకు హోంవర్క్‌ పూర్తి చేయాలనో, అదికాకుంటే మార్కులు బాగా తెచ్చుకోవాలనో, యూనివర్సిటీలో ర్యాంకు రావాలనో.. ఇలా తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మాట్లాడుకోవాలి. భవిష్యత్‌లో పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడాలంటే చదువు తప్పనిసరని చెబుతూనే వారికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించాలి. అయితే ఇది వాళ్లను ఒత్తిడి, ఆందోళనలకు గురి చేసేదిలా మాత్రం అస్సలు ఉండకూడదు. అలాగే ప్రొగ్రెస్‌ను రివ్యూ చేస్తూ.. వాళ్లకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్ప!.. ఇతరులతో పోల్చి నిందించడం.. ఆశించిన ఫలితం రాలేదని కోప్పడడం, కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. మానసిక ఆరోగ్యమే వాళ్ల విజయానికి తొలి మెట్టు అనేది గుర్తించి ముందుకు వెళ్లాలి.లక్ష్యాలను ఎక్కువగా నిర్దేశించుకునే వర్గం యువతే. అలాగే.. రెజల్యూషన్స్‌ను బ్రేక్‌ చేసేది కూడా ఈ వర్గమే. కెరీర్‌పరంగా స్థిరపడే క్రమంలో.. వీళ్లకు కుటుంబ సభ్యులు, స్నేహితుల తోడ్పాడు కచ్చితంగా అవసరం ఉంటుంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల అన్వేషణ.. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకునేలా వాళ్లను సమాయత్తం చేయాలి. అందుకు అవసరమైన సాధన, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకునేలా వాళ్లను ప్రొత్సహించాలి. ఆ దశలో అన్ని రకాలుగా విశ్లేషణ అనేది అవసరం. అందుకు అవసరమైన సాయమూ అందించినప్పుడే వాళ్లు తమ లక్ష్యాలను చేరుకోగలరని గుర్తించాలి.జీవితంలో ఎదుగుదల పొదుపు(Savings)తోనే ప్రారంభమవుతుంది. అందుకే కొత్త ఏడాదిలో అడుగుపెట్టే ముందైనా.. ఆర్థికంగా పరిపుష్టి సాధించాలకుని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. కొత్తగా ఉద్యోగం సాధించిన వారైతేనేమి, కొత్తగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకునేవారైతేనేమి.. దీన్నొక భవిష్యత్‌ ఆశాకిరణంగా భావిస్తారు కూడా. అలాగే తూచా తప్పకుండా పాటించాల్సిన నియమాలు కూడా ఎక్కువ అవసరం పడేది ఈ లక్ష్య సాధనలోనే!. కాబట్టి.. స్వీయ నియంత్రణతో పాటు కుటుంబ సభ్యుల సహకారం అవసరం. మరీ ముఖ్యంగా భాగ​స్వామి పాత్ర ఇంకాస్త ఎక్కువే!. నెలావారీ ఖర్చులతో పాటు ఏ నెలలో ఎంత మొత్తం అవసరం అవుతుందనే ప్రణాళిక ముందుగానే వేసుకోవడం, ఎమర్జెన్సీ కోసం కొంత డబ్బును పక్కన పెట్టుకోవడం లాంటివి చేయాలి.కొత్త సంవత్సరం తొలిరోజు మాత్రమే కాదు.. వచ్చే ఏడాదిలో ప్రతీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అనుకుంటున్నారా?.. అయితే ఆరోగ్యంగా ఉండడం అవసరం. న్యూఇయర్‌ రెజల్యూషన్స్‌(NewYear's Resolutions)లో.. వయసుతో సంబంధం లేకుండా మంచి ఆరోగ్య ప్రణాళికను చాలామంది నిర్దేశించుకుంటారు. అయితే ఇంత ముఖ్యమైన తీర్మానాన్ని.. ఉల్లంఘించేవాళ్లు కూడా ఎక్కువ స్థాయిలోనే ఉంటారు. ఇందుకు బద్ధకం సహా రకరకరాల కారణాలు ఉండొచ్చు. కానీ, ఈ తీర్మానాన్ని సమిష్టిదిగా ఆ కుటుంబం భావించాలి. తద్వారా మానసిక, శారీరక సమస్యలనూ దూరంగా ఉంచుకోవాలి. అప్పుడే కదా మనం అనుకున్న లక్ష్యాలు కానీ బాధ్యతలు కానీ నేరవేర్చడానికి వీలవుతుంది.న్యూ ఇయర్ రిజల్యూషన్‌లు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ, పక్కాగా అమలు కావాలంటే మాత్రం మనకు గట్టి సపోర్ట్ అవసరం అంటారు నిపుణులు. ఇది ఒంటరి ప్రయాణం ఎంతమాత్రం కాదు. ఒకరకంగా ఇది ఆఫీసుల్లో టీం వర్క్‌ లాంటిదన్నమాట. అందుకే తీసుకునే నిర్ణయాన్ని నలుగురికి చెప్పాలి.. వాళ్ల సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే చర్చ జరగాలి. ఆ ప్రభావం చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అప్పుడే ఏడాది పొడవునా.. అనుకున్న మేర ఫలితాలు అందుకోగలరు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
సందేశ్‌ఖాలీ ఘటన .. విపక్షాలపై దుమ్మెత్తిపోసిన దీదీ

కోల్‌కతా : బీజేపీ,ఇతర ప్రతిపక్ష పార్టీలపై పశ్చిమ బెంగాల్‌ సీ

title
Year Ender 2024: 180 ఐఏఎస్‌లు, 200 ఐపీఎస్‌ల ఎంపిక.. టాప్‌లో ఏ రాష్ట్రం?

2024 మరికొద్ది గంటల్లో ముగియనుంది. వెంటనే 2025 ఆవిష్కృతం కానుంది.

title
Year Ender 2024: జమ్ముకశ్మీర్‌కు మరింత ప్రత్యేకం.. 2025కు ఇలా స్వాగతం

2024 కొద్ది గంటల్లో ముగియనుంది. 2025 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.

title
‘శారీరక సంబంధం’ లైంగిక దాడి కాదు

న్యూఢిల్లీ: పోక్సో కేసులో జీవిత ఖైదు పడిన ఓ వ్యక్తిని ఢిల్లీ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

title
పంజాబ్‌లో రైతుల బంద్‌..దల్లేవాల్‌కు మద్దతుగా

చండీగఢ్‌:కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా(కేఎంఎం),సంయుక్త కిసాన్‌ మోర

NRI View all
title
ఖతార్‌లో తెలుగు ప్రవాసికి ప్రతిష్ఠాత్మక 'సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)' పురస్కారం

ఖతార్‌లో జరిగిన ప్రతిష్టాత్మక "సౌత్ ఇండియన్ గ్లోబల్ టాలెంట్ అచీవర్స్ (SIGTA) అవార్డ్స్ 2024" వేడుకలో ప్రపంచవ్యాప్తంగా సు

title
హెచ్‌1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!

హెచ్‌–1బీ వీసాలపై రగడలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

title
సామాజిక చైతన్య సాహిత్యంపై తానా సదస్సు

ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత

title
రూపాయి పడింది... ఫీజు భారం పెరిగింది!

సాక్షి, హైదరాబాద్‌: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్ర

title
హైదరాబాద్‌లో గెహిస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభం

అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఇమ్మిగ్రేషన్ సర్వీస్ అందిస్తోన్న గెహిస్ ఇమ్మిగ్రేషన్ మరియు ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్..

Advertisement
Advertisement