Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Lok Sabha Speaker Election June 26 Live Updates
18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

న్యూఢిల్లీ, సాక్షి: పార్లమెంట్‌లో ఉత్కంఠకు తెరపడింది. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అనంతరం మూజువాణీ ఓటుతో స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబా ప్రకటించారు. ఇంకోవైపు ఇండియా కూటమి తరఫున ఎంపీ కే.సురేష్‌ను అభ్యర్థిగా నిలిపిన సంగతి తెలిసిందే. అయితే విపక్ష కూటమి ఓటింగ్‌కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్‌ చెయిర్‌లో కూర్చోబెట్టారు. రాజస్థాన్‌ కోటా నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు ఓం బిర్లా. అలాగే.. వరసగా రెండోసారి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.#WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024

SA vs AFG, T20 WC semis: South Africa out to improve baffling knockout record
స‌ఫారీలకు సెమీస్ గండం.. ఈ సారైనా గ‌ట్టెక్కుతారా?

ఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌లో అత్యంత దురదృష్టకరమైన జ‌ట్టు ఎదైనా ఉందంటే మ‌న‌కు ట‌క్కున గుర్తుచ్చేది దక్షిణాఫ్రికానే. టోర్నీ మొత్తం ఆసాధరణమైన ప్రదర్శన.. వరుసగా విజయాలు. కానీ కీలకమైన సెమీఫైనల్స్‌లో మాత్రం ఒత్తిడికి చిత్తు. ఇప్ప‌టివ‌ర‌కు అటు వ‌న్డే వ‌రల్డ్‌క‌ప్‌లోనూ, ఇటు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ క‌నీసం ఒక్క‌సారి కూడా ఫైన‌ల్లో అడుగుపెట్టలేకపోయింది.ప్రతీసారి సెమీస్ లో ఓడిపోతూ చోకర్స్ గా ముద్రపడ్డ స‌ఫారీలు మ‌రోసారి టైటిల్ రేసులో నిల‌బ‌డ్డారు. పొట్టి వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి సెమీస్‌లో సౌతాఫ్రికా అడుగుపెట్టింది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 తొలి సెమీఫైన‌ల్లో భాగంగా ట్రినడాడ్ వేదిక‌గా శుక్రవారం సంచ‌ల‌నాల అఫ్గానిస్తాన్‌తో ద‌క్షిణాఫ్రికా త‌ల‌ప‌డ‌నుంది.ఈ సారైనా గ‌ట్టుకెక్కుతుందా?ఓవ‌రాల్‌గా వ‌న్డే, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ల నాకౌట్స్‌లో ద‌క్షిణాఫ్రికా 10 సార్లు త‌ల‌ప‌డింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవ‌లం మ్యాచ్‌లో మాత్రం విజ‌యం సాధించింది. అది కూడా క్వార్టర్ ఫైన‌ల్లో కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌ 8 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వ‌గా.. మ‌రో మ్యాచ్ డ్రాగా ముగిసింది.టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రెండు సార్లు సెమీఫైన్సల్ ఆడిన ద‌క్షిణాఫ్రికా ఓసారి పాకిస్తాన్ చేతిలో ఓట‌మి పాలవ్వ‌గా.. మ‌రోసారి ఇండియా చేతిలో ప‌రాజ‌యం పాలైంది. కానీ ఈసారి మాత్రం త‌మ పేరిట ఉన్న చోక‌ర్స్ ముద్ర‌ను ఎలాగైనా చెరేపేయాల‌న్న క‌సితో ద‌క్షిణాఫ్రికా ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు ఆజేయంగా ఉన్న సౌతాఫ్రికా అదే జోరును సెమీస్‌లోనూ కొన‌సాగించి తొలిసారి ఫైన‌ల్లో అడుగుపెట్టాల‌ని ఉవ్విళ్లూరుతోంది.దక్షిణాఫ్రికా బలబలాలు..దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ బౌలింగ్‌ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌లో క్వింటన్‌ డికాక్‌, స్టబ్స్‌, క్లాసెన్‌, మిల్లర్‌ వంటి అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం వారు అంతా మంచి రిథమ్‌లో కూడా ఉన్నారు. అయితే కెప్టెన్‌ మార్‌క్రమ్‌ ఫామ్‌ మాత్రం ప్రోటీస్‌ జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. అదేవిధంగా స్పిన్‌ను కూడా ఎదుర్కొనేందుకు సఫారీ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అఫ్గాన్‌ ప్రధాన బలం స్పిన్నర్లే. మరి అఫ్గాన్‌ స్పిన్నర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సఫారీ బౌలర్లు అదరగొడుతున్నారు. నోర్జే, రబాడ, జానెసన్‌ వంటి పేసర్లు ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ పేస్‌ త్రయం చెలరేగితే అఫ్గాన్‌ బ్యాటర్లకు కష్టాల్లు తప్పవు.అఫ్గాన్‌తో అంత ఈజీ కాదు..అయితే ప్ర‌స్తుత వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తున్న అఫ్గానిస్తాన్‌ను ఓడించ‌డం ద‌క్షిణాఫ్రికాకు అంత ఈజీ కాదు. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలు వంటి ప‌టిష్ట‌మైన జ‌ట్ల‌ను ఓడించి తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టిన అఫ్గాన్‌.. రెట్టింపు ఆత్మ‌విశ్వాసంతో స‌ఫారీల‌ను ఢీ కొట్ట‌నుంది. అఫ్గాన్‌ బ్యాటింగ్‌ పరంగా కాస్త వీక్‌గా కన్పిస్తున్నప్పటకి బౌలింగ్‌లో మాత్రం బలంగా కన్పిస్తోంది. అఫ్గాన్‌ జట్టులో వరల్డ్‌క్లాస్‌ స్పిన్నర్లు ఉన్నారు. అదేవిధంగా పేస్‌ బౌలింగ్‌లోనూ ఫరూఖీ, నవీన్‌ ఉల్‌ హక్‌ సత్తాచాటుతున్నారు. బ్యాటింగ్‌లో ఎక్కువగా ఓపెనర్లపైనే అఫ్గాన్‌ ఆధారపడుతోంది. సెమీస్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అఫ్గాన్‌ అదరగొడితే దక్షిణాఫ్రికాకు ఇబ్బందులు తప్పవు.

Prabhas Kalki 2898 AD Movie Ticket Purchase Precautions
'కల్కి' టికెట్ కొంటున్నారా? ఆ విషయంలో బీ కేర్‌ఫుల్!

ప్రభాస్ 'కల్కి' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుంది. దేశవ్యాప్తంగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామనుకునే చాలామందికి ఇంకా టికెట్స్ దొరకట్లేదు. పోనీ తొలిరోజు ఏ షో అయినా పర్లేదు మూవీ చూద్దామనుకున్నా సరే టికెట్ దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి టైంలో బ్లాక్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కాకపోతే ఈ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి.(ఇదీ చదవండి: 'కల్కి' మిడ్ నైట్ షోలు వేయకపోవడానికి కారణం అదేనా?)ఒకప్పుడు బ్లాక్ టికెట్స్ అంటే థియేటర్ల దగ్గర యాభై, వంద అని చెప్పి అమ్మేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియాలో బ్లాక్ టికెట్ పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు. టికెట్స్ ఉన్నాయని చెప్పి డబ్బులు పంపించమని చెప్తారు. తీరా తీరా పంపిన తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేస్తారు. మీరు వాళ్లని ఏం చేయలేరు.మరోవైపు ఆన్‌లైన్ టికెట్‌ని ఎవరైనా మీకు అమ్మిన సరే కొన్నిసార్లు మీరు మోసపోవచ్చు. ఎందుకంటే బార్ కోడ్ ఉన్న టికెట్‌ని మీకు విక్రయించినట్లే, వేరొకరికి కూడా అమ్మే అవకాశముంది. ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. లేదంటే అటు సినిమా చూడక ఇటు డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు అవుతారు. కాబట్టి సినిమా ఈ రోజు కాకపోతే రేపైనా చూసుకోవచ్చు. కానీ టికెట్ కొనే విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' సరికొత్త రికార్డులు.. ఆ సినిమాల్ని దాటేసి ఏకంగా!)

Delhi Liquor Case: Arvind Kejriwal CBI Case hearing June 26 Updates
Liquor Case: కోర్టులోనే కేజ్రీవాల్‌ అరెస్ట్‌!

న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ ఉదయం తీహార్‌ జైలు అధికారులు ఆయన్ని రౌస్‌ అవెన్యూ కోర్టుకు తీసుకురాగా.. విచారణ అనంతరం ఆయన్ని సీబీఐ అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. దీంతో బెయిల్‌ కోసం ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. లిక్కర్‌ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఆయన్ని సోమవారం సీబీఐ ప్రశ్నించింది. ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు అనుమతి సైతం తీసుకుంది. ఈ క్రమంలో ఆయన్ని సీబీఐ అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.#WATCH | Delhi CM and AAP National Convenor Arvind Kejriwal being produced at the Rouse Avenue Court by CBI for a hearing in the liquor policy case. pic.twitter.com/ruFdQNecu4— ANI (@ANI) June 26, 2024

India’s rising water stress can dent its sovereign credit profile: Moody’s Ratings
నీటి కొరతతో.. ఎకానమీకి కష్టమే

న్యూఢిల్లీ: భారత్‌లో నీటి కొరత ఎకానమీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందని మూడీస్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది. భారతదేశంలో పెరుగుతున్న నీటి కొరత వ్యవసాయ, పరిశ్రమల రంగాలకు అంతరాయం కలిగిస్తుందని అలాగే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు, ఆదాయంలో క్షీణతకు, సామాజిక అశాంతికి దారితీయవచ్చనివిశ్లేషించింది. ఆయా ప్రభావాలు సావరిన్‌ క్రెడిట్‌ రేటింగ్‌పై ప్రభావం చూపుతుందని సూచించింది. బొగ్గు విద్యుత్‌ జనరేటర్లు, ఉక్కు తయారీ వంటి నీటిని అధికంగా వినియోగించే రంగాల ప్రయోజనాలకు సైతం నీటి కొరత విఘాతం కలిగిస్తుందని హెచ్చరించింది. భారత్‌ వేగవంతమైన ఆర్థిక వృద్ధి, వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణతో పాటు ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో నీటి లభ్యత తగ్గుతుండడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. అలాగే వాతావరణ మార్పుల కారణంగా నీటి ఒత్తిడి తీవ్రమవుతోందని కూడా పేర్కొంది. వాతావరణ మార్పులు కరువు, తీవ్ర వేడి, వరదలు వంటి తీవ్రమైన సంఘటనలకు కారణమవుతాయని వివరించింది. భారత్‌ ఎదుర్కొంటున్న వాతావరణ సమస్యలపై మూడీస్‌ రేటింగ్స్‌ వెలువరించిన తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు.. 👉ఢిల్లీ, ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు జూన్‌ 2024లో 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారతదేశంలోని అత్యంత సాధారణ ప్రకృతి వైపరీత్యాలలో వరదలు కూడా కారణం. ఇది నీటి మౌలిక సదుపాయాలకు అంతరాయం కలిగిస్తాయి. ఆకస్మిక భారీ వర్షాల నుండి నీటిని నిలుపుకోవడం సాధ్యమయ్యే పనికాదు. 👉 2023లో ఉత్తర భారతదేశంలోని వరదలు, గుజరాత్‌లోని బిపార్జోయ్‌ తుఫాను కారణంగా 1.2–1.8 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని, మౌలిక సదుపాయాలకు నష్టం జరిగిందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేసిన విషయం ఇక్కడ గమనార్హం.👉 రుతుపవన ఆధారిత వర్షపాతం కూడా తగ్గుతోంది. 1950–2020 సమయంలో హిందూ మహాసముద్రం దశాబ్దానికి 1.2 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున వేడెక్కింది. ఇది 2020–2100 మధ్యకాలంలో 1.7–3.8 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటియోరాలజీ తెలపడం గమనార్హం. 👉 వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో కరువు పరిస్థితులు తరచూ సంభవించే అవకాశాలు ఉత్పన్నమవుతున్నాయి. భారతదేశంలో రుతుపవన వర్షపాతం 2023లో 1971–2020 సగటు కంటే 6 శాతం తక్కువగా ఉంది. అకాల వర్షాలనూ ఇక్కడ ప్రస్తావించుకోవాలి. భారతదేశంలో 70 శాతానికి పైగా వర్షపాతం ప్రతి సంవత్సరం జూన్‌–సెపె్టంబరులో కేంద్రీకృతమై ఉంటోంది. 2023 ఆగస్టులో దేశంలో భారీగా వర్షపాతం నమోదుకావడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. 👉 గతంలో సంభవించి న వ్యవసాయ ఉత్పత్తికి ఆటంకాలు, ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుదల వల్ల ఆహార సబ్సిడీల భారం నెలకొంది. ఇది దేశంలో ద్రవ్యలోటు పరిస్థితులకూ దారితీసింది. ఆహార సబ్సిడీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 4.3 శాతంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. బడ్జెట్‌లోని భారీ కేటాయింపుల్లో ఈ విభాగం ఒకటి. 👉భారత ప్రభుత్వం నీటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతోంది. పునరుత్పాదక ఇంధన అభివృద్ధికి కృషి చేస్తోంది. అదే సమయంలో నీటి భారీ పారిశ్రామిక వినియోగదారులు తమ నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు అటు దేశానికి సంబంధించి సావరిన్‌ రేటింగ్‌ మెరుగుపరచుకోడానికి, కంపెనీలకు సంబంధించి దీర్ఘకా లికంగా నీటి నిర్వహణ ప్రతికూలత రేటింగ్‌లను తగ్గించుకోవడానికి దోహదపడతాయి. 👉భారతదేశంలో ఫైనాన్స్‌ మార్కెట్‌ చిన్నది. కానీ వే గంగా అభివృద్ధి చెందుతోంది. కంపెనీలకు, ప్రాంతీయ ప్రభుత్వాలకు నిధుల సేకరణ విషయంలో ఇది కీలకమైన అంశం. తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న కొన్ని రాష్ట్రాలు నీటి నిర్వహణలో పెట్టుబడి కోసం నిధులను సమీకరించడానికి దేశ ఫైనాన్స్‌ మార్కెట్‌ను ఉపయోగించాయి. 👉పారిశ్రామికీకరణ, పట్టణీకరణ దేశంలో వేగంగా విస్తరిస్తున్నాయి. 2022 లెక్కల ప్రకారం, భారత్‌ స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా 26 శాతం. ఇప్పటికి జీ–20 వర్థమాన దేశాల (ప్రపంచ బ్యాంక్‌ అంచనాల ప్రకారం 32 శాతం) కన్నా ఇది తక్కువ. మున్ముందు పరిశ్రమల రంగం మరింత విస్తరించే వీలుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు దేశ మొత్తం జనాభాలో ప్రస్తుతం 36 శాతం. ప్రపంచ బ్యాంక్‌ అంచనాల ప్రకారం, జీ–20 వర్థమాన దేశాల్లో ఇది 76 శాతం వరకూ ఉంది. పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు –నివాసితుల మధ్య మున్ముందు నీటి కోసం తీవ్ర పోటీ నెలకొనే వీలుంది. 👉ఫిబ్రవరి 2023 నాటి ప్రపంచ బ్యాంక్‌ నివేదిక ప్రకారం, గత దశాబ్దంలో గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీటిని తీసుకురావడానికి భార త ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బహుళజాతి బ్యాంకింగ్‌ (ప్రపంచబ్యాంక్‌) మద్దతు ఇచ్చింది. 1.2 బిలియన్‌ డాలర్ల మొత్తం ఫైనా న్సింగ్‌తో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా దాదాపు 2 కోట్ల మంది ప్రయోజనం పొందారు.జలవనరుల శాఖ డేటాజలవనరుల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారత్‌ సగటు వార్షిక తలసరి నీటి లభ్యత 2021 నాటికి 1,486 క్యూబిక్‌ మీటర్ల నుండి 2031 నాటికి 1,367 క్యూబిక్‌ మీటర్లకు పడిపోవచ్చు. 1,700 క్యూబిక్‌ మీటర్ల కంటే తక్కువ స్థాయి నీటి ఒత్తిడిని సూచిస్తుంది. 1,000 క్యూబిక్‌ మీటర్లకు పడిపోతే అది నీటి కొరతకు కొలమానం.నివేదిక నేపథ్యం ఇదీ..ఇటీవల బెంగళూరు, ఇప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నివాసితులు తీవ్ర నీటి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలు నిరసనలు, రాజకీయ సంఘర్షణకు దారితీస్తోంది. ఈ అంశంపై జూన్‌ 21న నిరాహార దీక్ష ప్రారంభించిన ఢిల్లీ జల వనరుల మంత్రి అతిషి ఆరోగ్యం క్షీణించడంతో తాజాగా ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే మూడీస్‌ తాజా నివేదిక వెలువరించింది.

 I thought Wrong number Sudha Murty  recalls  former president APJ Abdul Kalam call
నన్ను ప్రశంసించడానికి కాల్‌ చేస్తే.. రాంగ్‌ కాల్‌ అని పొరబడ్డా : సుధామూర్తి

‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, రచయిత, రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ రాష్ట్రపతి దివంగత డా. ఏపీజే అబ్దుల్ కలాం నుంచి తనకు పోన్‌ వస్తే రాంగ్‌ కాల్‌ అంటూ ఆపరేటర్‌కి చెప్పిన సంగతిని ప్రస్తావించారు. నిజానికి తన భర్త నారాయణ మూర్తికి ఉద్దేశించిన కాల్‌ ఏమో అనుకుని పొరపాటు పడ్డానని చెప్పారు. ఆ తరువాత విషయం తెలిసి చాలా సంతోషించానని ఆమె పేర్కొన్నారు.Once I received a call from Mr. Abdul Kalam, who told me that he reads my columns and enjoys them. pic.twitter.com/SWEQ6zfeu4— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 25, 2024 విషయం ఏమిటంటే..ఎక్స్ వేదికగా సుధామూర్తి దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఇందులో అబ్దుల్‌ కలామ్‌ నుంచి తనకు ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో వివరించారు. ‘ఐటీ డివైడ్' పేరుతో సుధామూర్తి ఒక కాలమ్‌ నడిపేవారు. దీన్ని అబ్దుల్‌ కలాం క్రమం తప్పకుండా చదివేవారట. అంతేకాదు ఈ రచనను బాగా ఆస్వాదించేవారు కూడా. ఇదే విషయాన్ని స్వయంగా ఆమెకు చెప్పేందుకు అబ్దుల్‌ కలాం ఫోన్‌ చేశారు. అయితే రాష్ట్రపతి భవన్ నుంచి తనకు ఫోన్ కాల్ వస్తే ‘రాంగ్ కాల్’ అని (ఆపరేటర్‌కి) తాను సమాధానం ఇచ్చానని సుధామూర్తి వెల్లడించారు. తన భర్త నారాయణమూర్తికి చేయబోయి తనకు చేశారేమో అనుకున్నానని, అందుకే అలా చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే ‘‘లేదు లేదు.. ఆయన (అబ్దుల్ కలాం) ప్రత్యేకంగా మీ పేరే చెప్పారు’ అని ఆపరేటర్‌ చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. తాను కాలమ్‌ని చదివి ప్రశంసించడానికి అబ్దుల్ కలాం ఫోన్ చేశారని తెలిసి చాలా సంతోషించాననీ, చాలా బావుందంటూ మెచ్చుకున్నారని సుధామూర్తి ప్రస్తావించారు. ఈ సందర్బంగా కలానుంచి పౌరపురస్కారం అందుకుంటున్న ఫోటోని కూడా ఆమె పోస్ట్‌ చేశారు. కాగా రచయితగా పరోపకారిగా సుధామూర్తి అందరికీ సుపరిచితమే. బాల సాహిత్యంపై పలు పుస్తకాలు రాశారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఆమె సాహిత్యానికి పలు అవార్డులు కూడా దక్కాయి. 73 ఏళ్ళ వయసులో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాలు లభించాయి. ఇంకా అత్యున్నత పౌరపురస్కారాలు పద్మశ్రీ (2006), పద్మ భూషణ్ (2023) కూడా ఆమెను వరించాయి. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.

MP Gopinath Taking his Oath in Telugu
ఆ తమిళ ఎంపీకి తెలుగుపై ఎందుకంత ప్రేమ?

తమిళనాడుకు చెందిన ఒక ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం ఆసక్తికరంగా మారింది. పార్ల‌మెంట్ స‌మావేశాల రెండో రోజు లోక్‌స‌భ‌లో ఇది చోటు చేసుకుంది. ఇంతకీ ఆయన తెలుగులో ఎందు ప్రమాణం చేశారు? ఆయనకు తెలుగుతో ఉన్న అనుబంధం ఏమిటి?పార్లమెంట్‌ సమావేశాల రెండవ రోజున కొత్తగా ఎంపీకైన ఎంపీలలోని పలువులు తమ ప్రాంతీయ భాషలలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే త‌మిళ‌నాడులోని కృష్ణ‌గిరి లోక్‌స‌భ నుంచి కాంగ్రెస్ త‌ర‌పున గెలుపొందిన ఎంపీ కే గోపినాథ్ తెలుగులో ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఒక రాష్ట్రానికి చెందిన ఎంపీ మ‌రొక రాష్ట్రపు మాతృ భాష‌లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం ఏమిటా? అని అందరూ అతనిని ఆసక్తిగా గమనించారు. ఎంపీ గోపినాథ్ ఓ చేతితో రాజ్యాంగ ప్ర‌తిని ప‌ట్టుకొని ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే ప్ర‌మాణ స్వీకారం చివ‌రిలో జై త‌మిళ‌నాడు అని త‌మిళంలో నిన‌దిస్తూ మరో ట్విస్ట్‌ ఇచ్చారు. ఆయ‌న ప్ర‌మాణ స్వీకారానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ గోపీనాథ్‌ తెలుగు కుటుంబానికి చెందిన వారు. కృష్ణగిరి జిల్లా హోసూరు ఆయన స్వస్థలం. గోపీనాథ్‌ విద్యాభ్యాసం తెలుగులో కొనసాగింది. 2001, 2006, 2011లలో హోసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. తమిళనాడులో ఏర్పడిన తెలుగు భాషా సమస్యలతో పాటు, అక్కడి తెలుగు వారి కోసం ఎంపీ గోపీనాథ్‌ పోరాడారు. తమిళనాడు అసెంబ్లీలోనూ ఆయన పలుమార్లు తెలుగులో ప్రసంగించారు. మాతృభాషపై ఎనలేని మమకారమున్న గోపీనాథ్‌ మరోమారు పార్లమెంటులోనూ తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు.కృష్ణ‌గిరి జిల్లా త‌మిళ‌నాడు, ఆంధ్రప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌ను క‌లుపుతుంది. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్‌కు అతి స‌మీపంలో ఉంది. దీంతో ఇక్కడి ప్ర‌జ‌లు త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌ను కూడా మాట్లాడుతారు. కాగా గ‌తంలో త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగత జ‌య‌ల‌లిత కూడా అసెంబ్లీలో తెలుగులో ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో వివిధ సంద‌ర్భాల్లో వైర‌ల్ అవుతుంటుంది. .@INCTamilNadu MP K. Gopinath from the Krishnagiri constituency surprised everyone by taking his oath in #Telugu. pic.twitter.com/ooGgVDg4VH— South First (@TheSouthfirst) June 25, 2024

Phone Tapping Case: Prabhakar Rao Visa Period Over May Return Soon India
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ప్రభాకర్‌రావు వచ్చేదెప్పుడు?

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు తెలంగాణ ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేది ఎప్పుడు?. దీనిపై దర్యాప్తు అధికారులు స్పందించారు. నేటితో ఆయన వీసా ముగియనుందట. ఈ నేపథ్యంలో ఈ నెలాఖారున ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టత ఇచ్చారు. అయితే.. అనారోగ్యాన్ని కారణంగా చూపిస్తూ తన వీసా గడువును పెంచుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదని సమాచారం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేయించారనే అభియోగాలు ప్రభాకర్‌రావుపై నమోదు అయ్యాయి. ఈ కేసులో తొలి అరెస్ట్‌ ప్రణీత్‌రావును చేయగా.. అంతకు ముందే అలర్ట్‌ అయిన ప్రభాకర్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్‌ అంటోంది. ఈ లెక్కన.. ఆయన దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్‌ అయ్యే ఛాన్స్‌ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్‌రావుపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. నిందితులపై బెయిల్‌పై.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులు. తిరుపతన్న, భుజంగ రావ్ బెయిల్ పిటిషన్ లపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిర్ణీత గడువు 90 రోజుల్లోగా ఛార్జ్‌షీట్‌ వేయలేదు కాబట్టి మాండేటరీ బెయిల్‌ కోసం ఈ ఇద్దరు కోర్టును అభ్యర్థించారు. ఇక.. ఇప్పటికే ఈ కేసులో రెండుసార్లు పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను కోర్టు వెనక్కి తతిప్పి పంపింది. అయితే.. ఎవిడెన్స్‌ మెటీరియల్‌గా స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్కులు, సీడీలు, పెన్‌డ్రైవ్‌లను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వీటితో మూడోసారి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ ఆధారలను నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, కోర్టును కోరారు.

Gulbadin Naib Faces Ban For Faking Injury In Afghanistan T20 World Cup Thriller?
అఫ్గాన్ ఆల్‌రౌండ‌ర్ చీటింగ్‌.. ఐసీసీ సీరియ‌స్‌!? రూల్స్‌ ఇవే

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌- బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన ఆఖ‌రి సూప‌ర్‌-8 మ్యాచ్ సినిమా థ్రిల్ల‌ర్‌ను త‌లిపించిన సంగ‌తి తెలిసిందే. ఆఖ‌రివ‌ర‌కు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 8 ప‌రుగుల‌తో తేడాతో విజ‌యం సాధించిన అఫ్గానిస్తాన్‌.. తొలి సారి ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్ ఆల్‌రౌండ‌ర్ గుల్బాదిన్ నైబ్ వ్య‌వ‌హ‌రం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.అస‌లేం ఏం జ‌రిగిందంటే?ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి కేవ‌లం 115 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గల్గింది. అయితే బౌలింగ్‌లో మాత్రం అఫ్గానిస్తాన్ స‌త్తాచాటింది. ల‌క్ష్య చేధ‌న‌లో బంగ్లాదేశ్ 11.4 ఓవర్లు ముగిసే సరికి 81/7 పరుగులు చేసింది.అయితే అప్పుడే చినుకులు ప్రారంభం అయ్యాయి. వ‌ర్షం మొద‌లయ్యే స‌మ‌యానికి డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అఫ్గాన్ రెండు పరుగులు ముందు ఉంది. ఒకవేళ వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ఆగిపోతే అఫ్గానిస్తాన్ 2 ప‌రుగుల తేడాతో గెలవ‌నుంది.అయితే వ‌ర్షం మొద‌లైన‌ప్ప‌టికి అంపైర్లు మాత్రం ఆ ఓవ‌ర్‌ను ఫినిష్ చేయాల‌ని భావించారు. ఈ క్ర‌మంలో అప‌ట్టికే నాలుగు బంతులు వేసిన‌ నూర్ ఆహ్మ‌ద్‌ను అంపైర్లు ఓవ‌ర్ పూర్తి చేయ‌మ‌ని ఆదేశించారు.అయితే రెండు బంత‌లు మిగిలుండ‌డంతో బంగ్లా బ్యాట‌ర్ బౌండ‌రీ బాదితే.. డీఎల్ఎస్ ప్ర‌కారం బంగ్లాదేశ్ ముందంజ‌వేస్తోంది. ఈ తరుణంలో అఫ్గాన్ హెడ్‌కోచ్ ట్రాట్‌ ఆలస్యం చేయాలని డగౌట్ నుంచి తమ ప్లేయర్లకు సైగలు చేశాడు. ఈ క్ర‌మంలో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న గుల్బాదిన్ నైబ్ ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయాడు. కండరాలు పట్టేశాయంటూ నొప్పితో విలవిలలాడినట్లు క‌న్పించాడు. సరిగ్గా ఆ స‌మ‌యంలో ఊపందుకోవడంతో మ్యాచ్‌ను అంపైర్‌లు నిలిపివేశాడు. ఫిజియో వ‌చ్చి నైబ్‌ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాడు. అయితే ఇక్కడవరకు అంతబాగానే ఉన్నప్పటకి.. నొప్పితో అంతలా విలవిల్లాడిన నైబ్ 10 నిమిషాల్లో మళ్లీ ఫిట్‍గా కనిపించి బౌలింగ్ చేసేశాడు.దీంతో అతడు చీటింగ్ చేశాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొంతమంది మాజీలు సైతం అతడి తీరును తప్పుబడుతున్నారు. అస్కార్ అవార్డు ఇవ్వాలని పోస్ట్‌లు చేస్తున్నారు.రూల్స్ ఏమి చెబుతున్నాయంటే?కాగా నైబ్ వ్య‌వ‌హరాన్ని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సీరియ‌స్‌గా తీసుకున్నట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఉద్దేశ‌పూర్వ‌కంగా స‌మ‌యం వృదా చేయకూడదు. అలా చేస్తే ఆర్టికల్ 2.10.7 ప్రకారం లెవల్ 1 లేదా 2 నేరంగా మ్యాచ్ రిఫరీ పరిగణిస్తాడు. ఈ క్రమంలో లెవల్ 1 నేరానికి 100 శాతం మ్యాచ్-ఫీజు జరిమానా, రెండు సస్పెన్షన్ పాయింట్లు విధించే ఛాన్స్ ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో 41.9 ప్రకారం.. బౌలర్ లేదా ఫీల్డర్ కావాలనే సమయం వృధా చేస్తే ఆ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించే అధికారం అంపైర్‌లకు ఉంటుంది. కానీ బంగ్లా-అఫ్గాన్ మ్యాచ్‌లో అంపైర్‌లు ఎటువంటి పెనాల్టీ విధించలేదు. ఇక నైబ్ వ్యవహరంపై ఇప్పటివరకు ఐసీసీ నుంచి గానీ మ్యాచ్ రిఫరీ నుంచి ఎటువంటి ఆధికారిక ప్రకటన వెలువడలేదు.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement