Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Forbes rich list Elon Musk remains wealthiest billionaire Here is top 101
మళ్లీ మస్కే.. ఫోర్బ్స్ తాజా టాప్‌ 10 బిలియనీర్లు వీళ్లే..

టెక్‌ బిలియనీర్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మళ్లీ ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. ఫోర్బ్స్ (Forbes) తాజా బిలియనీర్ ర్యాంకింగ్‌ల ప్రకారం.. 420 బిలియన్‌ డాలర్లకుపైగా సంపదతో 2025 సంవత్సరాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ప్రారంభించారు. ప్రధానంగా స్పేస్‌ఎక్స్‌ (SpaceX) విలువ 350 బిలియన్‌ డాలర్లకు పెరగడంతో గడిచిన డిసెంబర్ 1 నుండి మస్క్‌ నెట్‌వర్త్‌ 91 బిలియన్‌ డాలర్లు పెరిగింది.గణనీయ పెరుగుదలఫోర్బ్స్ ర్యాంకింగ్ మొదటి 10 మంది సంపన్న వ్యక్తుల నెట్‌వర్త్‌లో గణనీయమైన పెరుగుదలను చూపుతోంది. వారి మొత్తం సంపద డిసెంబర్‌లో 1.8 ట్రిలియన్ డాలర్ల నుండి 1.9 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 సంపన్న వ్యక్తులు.. పెరిగిన వారి సంపద గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..ఎలాన్ మస్క్421.2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ఫోర్బ్స్ జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచారు. 2002లో స్పేస్‌ఎక్స్‌ని స్థాపించి దాని సీఈవోగా (CEO) కొనసాగుతున్న మస్క్.. టెస్లాకు అధిపతిగా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్‌’ (X), ఏఐ (AI) కంపెనీ ‘ఎక్స్‌ఏఐ’ (xAI), టన్నెలింగ్ సంస్థ బోరింగ్ కోలో వాటాలను కలిగి ఉన్నారు. టెస్లాలో ఆయనకు 13% వాటా ఉంది.జెఫ్ బెజోస్అమెజాన్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్ జెఫ్ బెజోస్ (Jeff Bezos) 233.5 బిలియన్‌ డాలర్ల సంపదతో జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు. బెజోస్ 1994లో అమెజాన్‌ను ఆన్‌లైన్ పుస్తక దుకాణంగా స్థాపించారు. తరువాత క్లౌడ్ కంప్యూటింగ్, వినోదం, మరిన్నింటికి విస్తరించారు. ఆయన ప్రైవేట్ స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్‌ను కూడా స్థాపించారు. గత డిసెంబర్ లో అమెజాన్ స్టాక్ 5% పెరిగింది. దీంతో ఆయన సంపదకు దాదాపు 10 బిలియన్‌ డాలర్లు తోడయ్యాయి.లారీ ఎల్లిసన్ఒరాకిల్ సహ-వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ (Larry Ellison) 209.7 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో జాబితాలో మూడవ స్థానంలో నిలిచారు. 1977లో కంపెనీని స్థాపించిన ఆయన 2014 వరకు సీఈవోగా నాయకత్వం వహించారు. ఇప్పుడు ఛైర్మన్, సీటీవో (CTO)గా పనిచేస్తున్నారు. ఒరాకిల్ స్టాక్ డిసెంబర్ లో 9% పైగా పడిపోయింది. ఆయన సంపద నుండి సుమారు 17 బిలియన్‌ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో ఆయన రెండో స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయారు.మార్క్ జుకర్‌బర్గ్మెటా వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఫోర్బ్స్ ప్రకారం 202.5 బిలియన్‌ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు. కంపెనీలో ఆయనకు దాదాపు 13% వాటా ఉంది. మెటా షేర్లు 1.9% పెరగడంతో గత డిసెంబర్ లో ఆయన నెట్‌వర్త్‌ 3.8 బిలియన్ డాలర్లు పెరిగింది. బెర్నార్డ్ ఆర్నాల్ట్లగ్జరీ గూడ్స్ దిగ్గజం ఎల్‌వీఎంహెచ్‌ (LVMH) సీఈవో, ఛైర్మన్ అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ( Bernard Arnault) నికర విలువ $168.8 బిలియన్ డాలర్లు. ఎల్‌వీఎంహెచ్‌ పోర్ట్‌ఫోలియోలో క్రిస్టియన్ డియోర్ కోచర్, గివెన్‌చీ, ఫెండి, సెలిన్, కెంజో, టిఫనీ, బల్గారీ, లోవే, ట్యాగ్‌ హ్యూయర్, మార్క్ జాకబ్స్, సెఫోరా వంటివి ఉన్నాయి. గత నెలలో ఎల్‌వీఎంహెచ్‌ షేర్లలో 7% పెరుగుదలతో ఆర్నాల్డ్‌ నెట్‌వర్త్‌ 8.5 బిలియన్ డాలర్లు పెరిగింది. లిస్ట్‌లో ఐదో స్థానంలో నిలిచారు.లారీ పేజ్‌గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ స్టాక్ ధర 11% పెరగడంతో లారీ పేజ్ (Larry Page) సంపద కూడా 14 బిలియన్ డార్లు పెరిగి 156 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. తాజా లిస్ట్‌లో ఈయనది ఆరో స్థానం. పేజ్ 1998లో సెర్గీ బ్రిన్‌తో కలిసి గూగుల్‌ (Google)ని స్థాపించారు. 2001 వరకు, మళ్లీ 2011 నుండి 2015 మధ్య దానికి సీఈవోగా పనిచేశారు ఇప్పుడాయన ఆల్ఫాబెట్‌లో బోర్డు సభ్యుడుగా ఉంటూ నియంత్రణ వాటాను కలిగి ఉన్నారు.సెర్గీ బ్రిన్ఆల్ఫాబెట్ స్టాక్ ధర పెరుగుదల కారణంగా లారీ పేజ్ లాగే గూగుల్‌ మరో సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ (Sergey Brin) నెట్‌వర్త్‌ కూడా గత నెలలో 14.7 బిలియన్‌ డాలర్లు పెరిగి 149 బిలియన్‌ డాలర్లకు చేరింది.ఈ పెరుగుదల ఆయన్ని ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 8వ ర్యాంక్ నుండి 7వ స్థానానికి నెలబెట్టింది.వారెన్ బఫెట్డిసెంబర్‌లో బెర్క్‌షైర్ హాత్వే స్టాక్ ధర 6% పడిపోవడంతో వారెన్ బఫెట్ (Warren Buffett) సంపద నుండి 8.9 బిలియన్‌ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడాయన నెట్‌వర్త్‌ 141.7 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్‌ లిస్ట్‌లో ఆయన ర్యాంక్ 6 నుండి ర్యాంక్ 8కి పడిపోయింది. వారెన్ బఫ్ఫెట్ బీమా సంస్థ గీకో, బ్యాటరీ కంపెనీ డ్యూరాసెల్, ఫాస్ట్ ఫుడ్ చైన్ డైరీ క్వీన్ వంటి ప్రధాన వ్యాపారాలను కలిగి ఉన్నారు.స్టీవ్ బామర్మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బామర్ (Steve Ballmer) 124.3 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. హార్వర్డ్‌లో బిల్ గేట్స్ మాజీ క్లాస్‌మేట్ అయిన స్టీవ్ బామర్ 2000 నుండి 2014 వరకు మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, బామర్ లాస్ ఏంజిల్స్ క్లిప్పర్స్‌ను 2 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. డిసెంబరులో బామర్ సంపద సుమారు 500 మిలియన్‌ డాలర్లు తగ్గింది.జెన్సన్ హువాంగ్ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సన్ హువాంగ్ (Jensen Huang) 117.2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో 10వ స్థానంలో ఉన్నారు. ఏఐ రంగంలో కంపెనీ చిప్‌లు ప్రజాదరణ పొందడంతో ఆయన సంపద పెరిగింది. డిసెంబరులో ఎన్విడియా షేర్లలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, హువాంగ్ టాప్ 10 సంపన్నులలో స్థానాన్ని పొందారు.

Sakshi Guest Column On Dual Citizenship2
ద్వంద్వ పౌరసత్వం ఇవ్వకూడదా?

భారతీయ పౌరులకు ఒకటే పౌరసత్వం ఎందుకు ఉండాలి? పౌరసత్వం అనేది పుట్టుకతో మాత్రమే సంక్రమించే ప్రత్యేక హక్కు కాదు. అది పౌరుడి సొంత గుర్తింపును వెల్లడించడంతో పాటు బహుళజాతి పూర్వీకుల వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఇండియా ప్రయోజనాలకు విఘాతం కలిగించే శత్రుదేశాల పౌరులను ఇండియా పౌరులుగా ఎలా గుర్తిస్తామన్నది ఒక వాదన. ఇది చాలా చిన్న సమస్య. ఈ సాకుతో మొత్తంగా ద్వంద్వ పౌరసత్వం మీద వేటు వేయడం సరికాదు. ఒక వ్యక్తి బ్రిటిష్‌ లేదా అమెరికా పౌరుడు కూడా అయినంత మాత్రాన అతడి భారతీయత ఎలా తగ్గిపోతుంది? నూతన సంవత్సరంలోనైనా ఈ సంకుచిత వైఖరి మీద పునరాలోచన చేయాలి.2025 వచ్చేసింది. కొత్త సంవత్సరం అనగానే విధిగా కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. నేను ఇది మానేస్తాను, అలా ఉంటాను అంటూ ప్రతిజ్ఞలు చేస్తాం. వాటితో పాటు... ఒక విష్‌ లిస్ట్‌ కూడా పెట్టుకుంటాం. నాకు అది కావాలి, ఇలా జరగాలి అని కోరుకుంటాం. నేనూ ఈ విషయంలో తక్కువేం కాదు. చాలా తీర్మానాలు తయారు చేసుకుంటా! కొద్ది రోజుల తర్వాత షరా మామూలు. ఒట్లన్నీ గట్టున పెట్టేస్తానేమో! అందుకే నా విష్‌ లిస్ట్‌ గురించి మాట్లాడుకుందాం.నాది చాలా సింపుల్‌ కోరికే. కానీ అది నెరవేరితే లబ్ధి పొందేది నేనొక్కడినే కాదు, కొన్ని లక్షల మంది ఉంటారు! భారతీయ పౌరులకు ఒకటే పౌరసత్వం ఎందుకు ఉండాలి? మరో దేశపు జాతీయత కూడా పొందే అవకాశం ఎందుకు కల్పించకూడదు? ప్రభుత్వం ఈ డ్యూయల్‌ నేషనాలిటీ హక్కును మన్నించాలి. తల్లి దండ్రుల మాతృదేశం పరంగా కావచ్చు, నివాసం రీత్యా అవ్వచ్చు... ఒక వ్యక్తి ఇలాంటి హక్కు పొందగలిగినప్పుడు దాన్నెందుకు నిరాకరించాలి? పౌరసత్వం అనేది పుట్టుకతో మాత్రమే సంక్రమించే ప్రత్యేక హక్కు కాదు. అది పౌరుడి సొంత గుర్తింపును వెల్లడించడంతో పాటు బహుళజాతి పూర్వీకుల వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. తల్లిదండ్రులు బ్రిటిష్, ఇండియా దేశాల వారు అనుకోండి. వారి పిల్లలకు ఏకకాలంలో అటు బ్రిటిషర్లు, ఇటు ఇండియన్లు అయ్యే హక్కు ఉంటుంది. అలా కాకుండా, ఇండియా పౌరసత్వం కావాలంటే బ్రిటిష్‌ పౌరసత్వం వదులుకోవాలని పట్టుపట్టడం న్యాయం కాదు. అదేమాదిరిగా విదేశాల్లో నివాసం ఉండేవారికి... స్వదేశంలో హక్కు కోల్పోకుండా నివాస దేశంలో పౌరసత్వం తీసుకునే హక్కు ఉంటుంది. ఇప్పుడు భారతీయ చట్టాల ప్రకారం, ఈ రెండూ నిషిద్ధం.ఉన్నత ప్రజాస్వామ్య దేశాలుగా మన్నన పొందిన చోట్లా ఈ ద్వంద్వ పౌరసత్వ హక్కు లేదు కదా అంటారు. నిజమే. ఆస్ట్రియా, జపాన్, నెదర్లాండ్స్, నార్వేలు ఈ కోవలోకి వస్తాయి. ద్వంద్వ పౌర సత్వ నిరాకరణను వారు అప్రజాస్వామిక విధానంగా పరిగణించరు. కాకపోతే అనుమతించే దేశాల గురించి చెబుతాను. ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, డెన్మార్క్‌ , ఫ్రాన్స్‌, ఐర్లాండ్, స్వీడన్, యుకే, యూఎస్‌ఏ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ అత్యంత గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశాలే! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకునే ఇండియా వీటి సరసన చేరాలని ఎందుకు అనుకోదు? వాస్తవానికి, మన పొరుగున ఉన్న అనేక దేశాలు ద్వంద్వ జాతీయతను అనుమతిస్తున్నాయి. బంగ్లాదేశ్‌కు సమ్మతమే. శ్రీలంకదీ అదే బాట. ఆఖరుకు పాకిస్తాన్‌ కూడా అనుమతిస్తోంది. ఎటొచ్చీ చైనా, బర్మా, నేపాల్‌ ససేమిరా అంటాయి. అయితే, ఈ దేశాలా మనకు ఆదర్శం?ద్వంద్వ పౌరసత్వం అనుమతించక పోవడానికి అడ్డు పడే కారణాలు ఏంటో చూద్దాం. ఇండియా ప్రయోజనాలకు విఘాతం కలిగించే శత్రుదేశాల పౌరులను ఇండియా పౌరులుగా ఎలా గుర్తిస్తామన్నది వీటిలో ఒకటి. ఇది చాలా చిన్న సమస్య. ఈ సాకుతో మొత్తంగా ద్వంద్వ పౌరసత్వం మీద వేటు వేయడం సరికాదు. పాకిస్తాన్‌ పదహారు దేశాలను గుర్తించి వాటికి మాత్రమే ద్వంద్వ పౌరసత్వ విధానం అమలు చేస్తోంది. ఇండియా ఈ జాబితాలో లేదు. ఇలాంటి వ్యతిరేక దేశాల జాబితా రూపొందించుకోవాలి. వాటిని పక్కన పెట్టాలి.ద్వంద్వ పౌరసత్వ నిషేధాన్ని సమర్థించుకునేందుకు చెప్పే మరో ప్రధాన కారణం ఏమిటంటే, అలా అనుమతిస్తే భారతీయ పౌరసత్వ ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇది అర్థం లేనిది. వేరేది తీసుకోగలిగిన వారు ఇండియా పౌరసత్వం అక్కర్లేదు అనుకుంటే, ఎప్పుడు కావా లంటే అప్పుడు వదిలేస్తారు. ఇతర దేశాల్లో పౌరసత్వం ఉండి కూడా భారత జాతీయతను కొనసాగించాలి అనుకునేవారూ ఉంటారు. వారికి ఈ ద్వంద్వ పౌరసత్వం ముఖ్యమైన అంశం అవుతుంది. ఒక వ్యక్తి బ్రిటిష్‌ లేదా అమెరికా పౌరుడు కూడా అయినంత మాత్రాన అతడి భారతీయత ఎలా తగ్గిపోతుంది? అలా అని చెప్పి ఈ హక్కు నిరాకరించడం ఎలా సబబు?ఇలా కోరుకునేవారు అతి కొద్ది మందే ఉంటారు, కేవలం వారి కోసం ప్రత్యేక చట్టం ఉండాలా అన్నది కొందరి వాదన. ఎందుకు ఉండకూడదన్నది నా సమాధానం. ప్రవాస భారతీయులను అన్ని ప్రభుత్వాలూ ఏదో విధంగా దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించాయి. వారికి ‘పర్సన్స్‌ ఆఫ్‌ ఇండి యన్‌ ఆరిజిన్‌’, ‘ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా’ కార్డులు ఇచ్చాయి. వ్యవసాయ భూమిపై యాజమాన్య హక్కు, ఓటు హక్కు, ప్రభుత్వ పదవులు మినహా ఇతరత్రా అన్నిటికీ వారు అర్హులు. అలాంటప్పుడు, ద్వంద్వ పౌరసత్వంతో అదనంగా లభించేది ఏమిటి?సింపుల్‌గా చెప్పాలంటే, విదేశీ ప్రయాణం అత్యంత సులభం అవుతుంది. ఉదాహరణకు, బ్రిటిష్‌ లేదా అమెరికా పౌరసత్వం ఉన్న పాకిస్తానీయులు యూరప్‌ అంతటా వీసాల్లేకుండా పర్యటించవచ్చు. ఇండియా పాస్‌పోర్ట్‌ దారుడికి ఈ సౌలభ్యం లేదు. భారత పౌరులు పర్యటన వీసాలు సంపాదించడానికి నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. చాలామందికి ఇది ప్రధానమైన అంశమే. కాబట్టి, 2025 నూతన సంవత్సరంలోనైనా నరేంద్ర మోదీ గానీ రాహుల్‌ గాంధీ గానీ ఈ ద్వంద్వ పౌరసత్వం విషయంలో తమ పార్టీల సంకుచిత వైఖరి మీద పునరాలోచన చేయాలి. అవకాశం ఉన్న భారత పౌరులు రెండో పౌరసత్వం పొందేందుకు అంగీకరించాలి. ఎవరికీ ఎలాంటి నష్టం లేకుండా వారికి ప్రయోజనం చేకూర్చవచ్చు. ఇది న్యాయం. అర్థవంతం. ఇదే నా న్యూ ఇయర్‌ విష్‌!కరణ్‌ థాపర్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Team India Losing Border Gavaskar Trophy Is Expected3
ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఘోర అవమానం ఊహించిందే..!

సిడ్నీ టెస్ట్‌లో భారత్‌ ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను ఆసీస్‌ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఓటమితో భారత్‌ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలను జారవిడుచుకుంది.డబ్ల్యుటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే సిడ్నీ టెస్టులో భారత్ గెలవాల్సి ఉండింది. అయితే టాపార్డర్ బ్యాటర్ల ఘోర వైఫల్యం కారణంగా భారత్ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.భారత్ ఆధిపత్యానికి తెరపడింది ఈ సిరీస్‌లో భారత్ వైఫల్యం ఊహించిందే. భారత్ పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం బాధాకరం. 2018-19 మరియు 2021-22లో ఆస్ట్రేలియా గడ్డ పై వరుసగా రెండు సార్లు అద్భుతమైన ప్రదర్శనలతో చాలా కాలం పాటు ఈ ట్రోఫీ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం భారత్ క్రికెట్‌కు ఏంతో గర్వకారణం. అయితే ఇలా ఓటమి చెందడం భారత్ క్రికెట్ అభిమానులకి ఒకింత బాధాకరమే.అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 0-3తో ఘోర ఓటమి చవిచూసిన అనంతరం జరిగిన ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతాలు చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. గతంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వరుసగా రెండుసార్లు ఓటమి చవిచూడటం, గత కొంత కాలంగా టెస్టుల్లో భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయి లో లేదనేది వాస్తవం. ఇది భారత్ క్రికెట్ అభిమానులు అంగీకరించక తప్పదు. ఈ నేపథ్యంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ అద్భుతంగా రాణిస్తుందని భావించడం హాస్యాస్పదమే.భారత్ బ్యాటర్ల ఘోర వైఫల్యం క్రికెట్లోని పాత నానుడిని భారత్ అభిమానులు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. " బ్యాటర్లు మ్యాచ్‌లను గెలిపిస్తారు. బౌలర్లు సిరీస్‌లను గెలిపిస్తారు" అనేది ఈ సిరీస్ లో మరో మారు నిజమైంది. హేమాహేమీలైన భారత్ బ్యాటర్లు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమవడంతో భారత్ టాపార్డర్ బ్యాటర్లు చతికిలపడ్డారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అడపా దడపా మెరుపులు మెరిపించినా , ప్రతీసారి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆడతారని భావించడం సరైన పద్దతి కాదు. భారత్ టాపార్డర్ బ్యాటర్లు అదీ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఎడమ చేతి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ భాగస్వామ్యం మినహాయిస్తే, భారత్ బ్యాటర్లు ఏ దశలోనూ నిలకడగా నిలదొక్కుకొని ఆడినట్టు కనిపించ లేదు. ఆస్ట్రేలియా వంటి ఏంతో ప్రతిష్టాత్మకమైన సిరీస్ లో ఈ రీతిలో బ్యాటింగ్ చేస్తే భారత్ జట్టు గెలుస్తుందని ఆశించడం కూడా తప్పే!బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియాఈ సిరీస్ మొత్తం పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అన్న రీతిలో సాగింది. బుమ్రా ఈ సిరీస్ లో ఒంటి చేత్తో భారత్ జట్టుని నడిపించాడు. తన అద్భుత ప్రదర్శన తో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ కి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్ లో మొత్తం 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ సిరీస్ లో అధిగమించడం విశేషం. గాయంతో బుమ్రా చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ముందు వైదొలగడంతో ఈ సిరీస్ ని కనీసం డ్రా చేయాలన్న భారత్ ఆశలు అడుగంటాయి. బుమ్రా లేని భారత్ బౌలింగ్ అనేకమంది హేమాహెమీలున్న ఆస్ట్రేలియా జట్టును సొంత గడ్డపై తక్కువ స్కోరు కి ఆలౌట్ చేస్తుందని భావించడం అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఉండదు!

Two Young People Lost Their Lifes In Road accident Back after Game Changer Event4
విషాదం.. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి..!

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ‍రాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ రేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠ గుర్తించారు.ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మరణంతో రెండు కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రితో కలిపి పళ్ల వ్యాపారం చేస్తున్న చరణ్ మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఇప్పటివరకు బాధిత కుటుంబాలను సినీ ప్రముఖులు కానీ, అధికారులు కానీ పరామర్శించలేదని తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాల సభ్యులు వేడుకుంటున్నారు.

PM Modi calls,Wont tolerate AAPda in Delhi5
‘శీష్‌మహల్‌’ ఖర్చులు చూస్తే మీకు కళ్లు బైర్లు కమ్ముతాయ్‌

ఢిల్లీ : ‘కోవిడ్‌-19 సమయంలో ఢిల్లీ ప్రజలు బాధపడుతుంటే.. కేజ్రీవాల్‌ మాత్రం శీష్‌మహల్‌ను నిర్మించుకునే పనిలో నిమగ్నమయ్యారు. శీష్‌మహల్‌ (Sheeshmahal) కోసం పెట్టిన ఖర్చు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతాయి. ప్రజల సంక్షేమం కంటే ఆయనకు విలాసాలు కావాల్సి వచ్చిందంటూ’ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్‌ నమో భారత్ (Namo Bharat) కారిడార్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్, ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్‌ఆర్‌టీఎస్‌ కారిడార్‌లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్‌ను ప్రారంభించారు. అనంతరం మోదీ ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ..‘ఆప్‌ ప్రభుత్వం 10 ఏళ్లను వృధా చేసింది. భారత్‌ ఆకాంక్షలు నెరవేరాలంటే ఢిల్లీ అభివృద్ధి అవసరం. అది బీజేపీతోనే సాధ్యం. ఢిల్లీ ప్రజలకు ఆపద స్పష్టంగా ఉంది. అందుకే ఇక్కడ మోదీ.. మోదీ అనే పేరు మాత్రమే ప్రతిధ్వనిస్తుంది. ‘ఆప్దా AApada నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే'(మేం ఆపదను సహించం..మార్పు తీసుకొస్తాం)’అని వ్యాఖ్యానించారు. #WATCH | Delhi: At BJP's Parivartan rally, Prime Minister Narendra Modi says "The 'AAP-DA' people have left no stone unturned in destroying Delhi's transport system. These people are not paying any attention to the maintenance of buses. The common citizens of Delhi have suffered… pic.twitter.com/I93IqlMaKz— ANI (@ANI) January 5, 2025 అదే సమయంలో కేజ్రీవాల్‌ అధికారిక నివాసంపై మోదీ ప్రశ్నలు సంధించారు. మీరు కేజ్రీవాల్‌ ఇల్లును చూశారా? తన నివాసం కోసం కళ్లు బైర్లు కమ్మేలా భారీ మొత్తంలో వెచ్చించారు. మోదీ తన కోసం షీష్‌ మహల్‌ని నిర్మించుకోవచ్చు. కానీ అలా చేయలేదు. ఢిల్లీ ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకే మా ప్రాధాన్యమని సూచించారు.అనంతరం, మోదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశిస్తూ..ఆప్ నాయకత్వం దేశ రాజధాని ఢిల్లీని సంక్షోభంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. అవినీతి, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఎత్తి చూపారు. ‘దేశం బీజేపీపై నమ్మకాన్ని చూపుతోంది. ఈశాన్యలో, ఒడిశాలో కమలం వికసించింది. హర్యానాలో మూడోసారి బీజేపీని ఎన్నుకుంది. మహారాష్ట్రలో బీజేపీ ఘనవిజయం సాధించింది. కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసేది బీజేపీయే. ఇప్పుడు ఢిల్లీలో ‘ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే’ అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది బీజేపీతో సాధ్యమనే నమ్మకంతో ఉన్నారని మోదీ నొక్కాణించారు.👉చదవండి : ప్రధాని మోదీపై కేజ్రీవాల్‌ సెటైర్లు

Ramesh Bidhuri Withdraws Controversial Remarks: Take My Words Back6
‘నన్ను క్షమించండి.. ప్రియాంక గురించి అలా మాట్లాడాల్సింది కాదు’

ఢిల్లీ: ‘నన్ను క్షమించండి. ప్రియాంక గాంధీ (priyanka gandhi) గురించి అలా మాట్లాడాల్సింది కాదు. నేను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను’అని ఢిల్లీ కాల్కాజీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్‌ బిదురి (Ramesh Bidhuri) క్షమాపణలు చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (delhi assembly elections) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓ వైపు ముచ్చటగా మూడోసారి హస్తిన పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్‌ కొట్టాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఎలాగైనా దిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.మళ్లీ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని అటు కాంగ్రెస్‌ ఎదురుచూస్తోంది. అందుకు అనుగుణంగా ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.ఈ తరుణంలో కాల్కాజీ నియోజకవర్గంలో ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిశీపై పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్‌ బిదురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ బుగ్గల వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రమేష్‌ బిదూరి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. బిదూరి వ్యాఖ్యలతో బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియాశ్రీనేట్ మండిపడ్డారు.మహిళల పట్ల బిదూరి మనస్తత్వాన్నిఆ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయని, ఇది బీజేపీ నిజ స్వరూపమని పేర్కొన్నారు. బిదూరి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా.. అవును. ప్రియాంక గాంధీ గురించి నేను మాట్లాడింది నిజమే. హేమామాలిని బుగ్గల వంటి రోడ్లు వేయిస్తానని బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ అన్నప్పుడు ఏం చేశారంటూ బుకాయించారు. అయితే నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏం జరిగిందో..ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరుగుతుందనే ఏమో ప్రియాంకకు క్షమాపణలు చెప్పారు. 👉చదవండి: ప్రియాంకగాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు నోటిని అదుపులో పెట్టుకోకపోతేనోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో తన పార్టీ మాజీ ఎంపీలకు తెలిసొచ్చేలా చేసింది బీజేపీ అధినాయకత్వం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 400పై చిలుకు లోక్‌సభ స్థానాల్ని గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది.ఆ క్రమంలో ప్రతి లోక్‌సభ స్థానాన్నీ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ‘టార్గెట్‌ 400’ లక్ష్యసాధనకు అడ్డొస్తారనుకుంటే సొంత పార్టీ నేతలను కూడా క్షమించడం లేదు. ఆ క్రమంలో ఎంతటి సీనియర్లనైనా సరే, సింపుల్‌గా పక్కన పెట్టేసింది. దాని ఫలితమే... వివాదాస్పదులుగా పేరుబడ్డ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్, రమేష్‌‌ బిదురి, అనంత్‌కుమార్‌ హెగ్డే వంటి సిట్టింగ్‌ ఎంపీలకు సీట్లను నిరాకరించింది. వారిలో రమేష్‌ బిదురి ముందు వరసలో ఉన్నారు. రమేష్‌‌ బిదురిఈ సౌత్‌ ఢిల్లీ సిట్టింగ్‌ ఎంపీ ఏకంగా పార్లమెంటులోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. నిండు సభలో బీఎస్పీ ఎంపీ డానిష్‌ అలీని బిదురి అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారానికి దారి తీసింది. ఆయన్నూ సస్పెండ్‌ చేయాల్సిందేనంటూ విపక్షాలు హోరెత్తించాయి. దాంతో రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన బిదురికి టికెట్‌ నిరాకరించింది.అనంత్‌కుమార్‌ హెగ్డేకర్ణాటకలో సీనియర్‌ బీజేపీ నేత. ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడు. కేంద్ర మంత్రిగానూ చేశారు. రాజ్యాంగంలో చాలా అంశాలను మార్చాల్సి ఉందని, అందుకు బీజేపీకి ప్రజలు 400కు పైగా సీట్లు కట్టబెట్టాలని ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. విపక్షాలన్నీ వాటిని అందిపుచ్చుకుని బీజేపీని దుయ్యబట్టాయి. హెగ్డే వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దాంతో ఆయన నాలుగుసార్లు వరుసగా నెగ్గిన ఉత్తర కన్నడ స్థానాన్ని మాజీ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డేకు కేటాయించింది.పర్వేష్‌ సాహిబ్‌సింగ్‌ముస్లిం చిరు వ్యాపారులను పూర్తిగా బాయ్‌కాట్‌ చేయాలంటూ ఏకంగా ఢిల్లీలోనే బహిరంగ సభలో పిలుపునిచ్చి కాక రేపారు. సభికులతోనూ నినాదాలు చేయించారు. దాంతో పశ్చిమ ఢిల్లీ సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ ఆయనకు కూడా టికెట్‌ గల్లంతైంది. వీరేగాక ఇతరేతర కారణాలతో ఈసారి చాలామంది సీనియర్లు, సిట్టింగ్‌ ఎంపీలకు బీజేపీ టికెట్లు నిరాకరించింది.ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించే వారు. కాంగ్రెస్‌ అగ్ర నేత దిగ్విజయ్‌‌సింగ్‌ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 3.5 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో మట్టికరిపించిన చరిత్ర ఆమెది. . కాకపోతే మంటలు రేపే మాటలకు సాధ్వి పెట్టింది పేరు. నాథూరాం గాడ్సేను దేశభక్తునిగా అభివర్ణించినా, ముంబై ఉగ్ర దాడుల్లో అమరుడైన పోలీసు అధికారి హేమంత్‌ కర్కరేకు తన శాపమే తగిలిందంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి ఈసీ నుంచి షోకాజ్‌ నోటీసు అందుకున్నా ఆమెకే చెల్లింది. అందుకే సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నా ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను పక్కన పెట్టేసింది.

Tollywood Lyricist Anantha Sriram Comments On Kalki 2898 AD Movie7
ప్రభాస్‌ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్‌!

టాలీవుడ్ పాటల రచయిత ‍అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాల్లో హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. సినిమాలు వ్యాపారమే అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడం సరికాదని హితవు పలికారు. ఇలా వక్రీకరణకు పాల్పడుతున్నందుకు ఒక సినిమా వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నట్లు శ్రీరామ్ అన్నారు. చిత్రపరిశ్రమ తరపున నేను క్షమాపణలు చెబుతున్నా అని మాట్లాడారు. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలని సూచించారు. విజయవాడలో ఆదివారం జరిగిన హైందవ శంఖారావం సభలో ఆయన మాట్లాడారు.కల్కి చిత్రంపై ఆరోపణలు..సినిమాల్లో హైందవ ధర్మంపై మూడుకోణాల్లో జరుగుతోందని అనంత శ్రీరామ్ ఆరోపించారు. తెరపైన కనిపించే పాత్రలు...వినిపించే పాటల్లో హైందవ ధర్మం దుర్వినియోగం.. కావ్యేతిహాసపురాణాల వక్రీకరణ.. తెరవెనుక మా ముందు అన్యమతస్తుల ప్రవర్తన అని తెలిపారు. వినోదం కోసం వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రకు అనవసర గొప్పతనం ఇచ్చినందుకు సినిమా పరిశ్రమ వ్యక్తిగా సిగ్గుపడుతున్నా అని తెలిపారు. మూడు కోణాల్లో దాడి..అనంత శ్రీరామ్ మాట్లాడుతూ..'సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి మూడు కోణాల్లో జరుగుతోంది. కావ్యేతిహాస పురాణాలను వక్రీకరించడం, తెర మీద కనిపించే పాత్రలు, పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, తెరవెనక, మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం భారత సాహితీ, వాంగ్మయ శరీరానికి రెండు కళ్లలాంటివి. కానీ అదే రామాయణం, మహభారతాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కొకోల్లలు. గత కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాల నుంచి.. నిన్న, మొన్న విడుదలైన కల్కి చిత్రంలో కూడా కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా. ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతున్నా. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డమీదే చెబుతున్నా. అప్పటి చిత్ర దర్శకులు.. ఇప్పటి సినిమా నిర్మాతలు ఇదే జిల్లాకు చెందినవారైనా సరే పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్లు కాదు.. హైందవ ధర్మాన్ని ఆచరించినట్లు కాదు.. హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థమని గంటాపథంగా తెలియేజేస్తున్నా' అని అన్నారు. కృష్ణాజిల్లా గడ్డపై నిలబడి చెబుతున్నా..అనంతరం మాట్లాడుతూ..'కల్కి సినిమాలో అగ్ని దేవుడిచ్చిన ధనుస్సు పట్టిన అర్జునుడి కంటే... సూర్యదేవుడిచ్చిన ధనుస్సు పట్టిన కర్ణుడు వీరుడని చెప్పారు. ఇలాంటి అభూతకల్పనలు... వక్రీకరణలు జరుగుతున్నా మనం చూస్తూ ఊరుకుంటే ఎన్ని సినిమాలైనా వస్తాయి. చిత్రీకరణ,గీతాలాపనలో ఎన్నో రకాలుగా వక్రీకరణ జరుగుతోంది. హైందవ ధర్మాన్ని అవహేళన చేస్తుంటే మనం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే ఎలా? మన హైందవ ధర్మాన్ని అవమానిస్తే నిగ్గదీసి నిలదీద్దాం. ఒక సినిమా పాట రాసేందుకు ఒక సంగీత దర్శకుడి దగ్గరకు వెళ్లా. ఆపాటలో బ్రహ్మాండ నాయకుడు అనే హిందూ పదం ఉందని ఆ పాట చేయనన్నాడు. ఆ పాట చేయనన్నందుకు జీవితాంతం ఆ సంగీత దర్శకుడికి పాటలు రాయనని చెప్పా. 15 ఏళ్లుగా ఒక్క పాట కూడా రాయలేదు. పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు చిత్ర దర్శకనిర్మాతలతో తిరుపతి పవిత్రతను హేళన చేస్తున్నా నిమ్మకనీరెత్తినట్లు ఉంటాం. కారణం వాళ్లకు మార్కెట్ ఉంది కాబట్టి. సినిమా అనేది వ్యాపారాత్మకమైన, కళాత్మకమైన వ్యాపారం. ఆ వ్యాపారాన్ని సినిమాలకు లేకుండా చేయాలంటే...హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రభుత్వం బహిష్కరించాలి. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణ గొప్పమార్గం. మనం తిరస్కరిస్తే వ్యాపారం నడవదు..డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హైందవ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తారో చూద్దాం.' అని ‍అనంత శ్రీరామ్ అన్నారు

South Central Railway Announces 52 Special Trains For Sankranti Rush8
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో మరో 52 అదనపు రైళ్లు (special trains) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్‌, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్‌, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. SCR to run Additional Sankranti Special Trains between various Destinations @drmvijayawada @drmgtl @drmgnt pic.twitter.com/fdoNVWdxSq— South Central Railway (@SCRailwayIndia) January 5, 2025

K Venkata Rami Reddy Comments On Chandrababu Govt9
ఉద్యోగులపై కూటమి సర్కార్‌ కక్ష సాధింపు: వెంకట్రామిరెడ్డి

సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఏపీ గవర్నమెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు రాలేదని ధ్వజమెత్తారు. ‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్‌ ఇస్తామన్నారు. వాలంటీర్లకు నెలకు 10 వేలు జీతం ఇస్తామని చెప్పి విస్మరించారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోలేదు’’ అని వెంకట్రామిరెడ్డి నిలదీశారు.‘‘కూటమి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులను టార్గెట్‌ చేసి వేధిస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. చిన్న ఉద్యోగులపై కూడా ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. కూటమి వేధింపులు తాళలేక ఐదు మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. వందలాది సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులే. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలి’’ అని వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు.‘‘పెండింగ్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. బకాయిలను ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తారో షెడ్యూల్‌ ఇవ్వాలి. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి. వీఆర్‌ఏలకు తక్షణమే జీతాలు పెంచాలి’’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు.ఇదీ చదవండి: చంద్రబాబే సుప్రీం.. రెడ్‌బుక్కే రాజ్యాంగం!చీకట్లో మహిళా ఉద్యోగులతో పెన్షన్లను పంపిణీ చేయమంటున్నారు. ఇదేనా ఉద్యోగులకు ఇచ్చే గౌరవం?. వేరే ఊరులో ఉండే మహిళా ఉద్యోగులు చీకట్లో వచ్చి ఎలా పెన్షన్లు పంచుతారు?. ఇవ్వకపోతే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో మహిళా ఉద్యోగుల గురించి ఎంతో చెప్పారు. కానీ ఆయన శాఖలోనే ఉద్యోగులకు పనిచేసే వాతావరణం లేదు. ఆర్టీసీ ఉద్యోగులను గత ప్రభుత్వం మూడు నెలల్లోనే ప్రభుత్వంలోకి తీసుకుంది. గత ప్రభుత్వం మూడు, నాలుగు నెలలకు ఒకసారి ఉద్యోగ నేతలతో సమావేశాలు నిర్వహించేంది. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు. ఈ ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో ఉద్యోగులను పట్టించుకోలేదు. కనీసం జీతాలు కూడా సరైన సమయంలో వేయటం లేదుట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్ల విషయంలో వేధింపులకు దిగుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చేయటంలేదు. పైగా హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో వెయ్యి మందిని ఉన్నపళంగా తొలగించారు. ఒత్తిడి తట్టుకోలేక నలుగురు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పెద్ద వాలంటీర్లుగా మార్చారు. వందలాది మంది ఉద్యోగులకు షోజాజ్ లు ఇచ్చారు. ఆదివారం కూడా పని చేయమని నోటీసులు ఇచ్చారు’’ అని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు.

Comedian AVS Daughter Shanthi Gets Emotional over Remembering His Father Liver Surgery10
నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్‌ కూతురు

కమెడియన్‌గా తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు ఏవీఎస్‌. ఆయన పూర్తి పేరు ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం. రంగస్థల కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన మిస్టర్‌ పెళ్లాం చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నాడు. మాయలోడు, మా విడాకులు, శుభలగ్నం, ఘటోత్కచుడు, శుభలగ్నం, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, యమగోల మల్లీ మొదలైంది.. ఇలా ఎన్నో చిత్రాలు చేశాడు. దాదాపు 500 చిత్రాల్లో నటించి ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. 2013లో ఏవీఎస్‌ మరణించాడు.ఇటీవలే అమ్మ కూడా..తాజాగా ఏవీఎస్‌ (AVS) కూతురు శాంతి- అల్లుడు చింటూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి (Comedian AVS Daughter Shanthi) మాట్లాడుతూ.. మా నాన్న 57 ఏళ్ల వయసులో మరణించాడు. అమ్మ 62 ఏళ్ల వయసులో (గతేడాది నవంబర్‌లోనే) కన్నుమూసింది. నిరంతరం షూటింగ్‌లోనే ఉంటూ నిద్రను పట్టించుకోకపోవడం వల్లే నాన్న ఆరోగ్యం దెబ్బతింది. కానీ బయటి వారు మాత్రం తాగడం వల్లే ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడని అపోహపడుతుంటారు.మందు అలవాటే లేదుమాది బ్రాహ్మణ కుటుంబం. నాన్న ఎగ్‌ కూడా తినేవారు కాదు. ఎగ్‌ ఉంటుందని కేక్‌ కూడా ముట్టుకోరు. సోడా కూడా పెద్దగా తాగకపోయేవారు. మందు జోలికి వెళ్లిందే లేదు. కానీ 2008లో నాన్న కాలేయం పాడైపోయింది. రక్తపు వాంతులు చేసుకున్నాడు. డాక్టర్స్‌ ఆయన్ను పరీక్షించి కాలేయం మార్పిడి చేయాలన్నారు. నేను కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యా.. కానీ లావుగా ఉన్నానని నాది సెట్టవదన్నారు. (చదవండి: సౌత్‌ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం.. ఇప్పుడు దేశంలోనే టాప్‌!)1% మాత్రమే బతికే ఛాన్స్‌దాత దొరకాలంటే ఏడాది పడుతుందన్నారు. నాకేం అర్థం కాలేదు. ఏం చేయాలో తోచలేదు. ఇంతలో సడన్‌గా ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయారు. మా అమ్మను కూడా గుర్తు పట్టలేదు. కేవలం నా ఒక్క పేరు మాత్రమే గుర్తుంది. నాన్న బతకడానికి ఒక్క శాతమే ఛాన్స్‌ ఉందన్నారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి మమ్మల్ని ఇంటికి వెళ్లిపోమన్నారు. రాత్రంతా నిద్రపోకుండా దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాం. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు నాన్న స్వయంగా కాల్‌ చేశాడు. నా భర్తే ఒప్పించాడుఎవరూ రాలేదేంట్రా? ఇక్కడ నేను ఒక్కడినే ఉన్నాను అని మాట్లాడాడు. ఒక్క రాత్రిలో తనకు పోయిన జ్ఞాపకశక్తి ఎలా తిరిగొచ్చిందో అర్థం కాలేదు. అయితే 20 రోజుల్లో కాలేయం ఆపరేషన్‌ చేయాలన్నారు. దాతల కోసం వెతికేంత సమయం లేదని నేనే రెడీ అయ్యాను. నాకు ఆరోగ్య పరీక్షలు చేసి అంతా బాగుందన్నారు. కానీ, నాన్న ఒప్పుకోలేదు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్‌ వస్తాయమోనని సందేహించాడు. అప్పుడు నా భర్తే దగ్గరుండి తనను ఒప్పించాడు. ఆయన సరే చెప్పేందుకు వారం రోజులు పట్టింది. (చదవండి: ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్‌'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్‌)ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమంటే..అలా నా కాలేయంలో 60 శాతం దానం చేశాను. ఆపరేషన్‌ తర్వాత నా శరీరంలో రక్తకణాల సంఖ్య పడిపోవడంతో ఒకరోజంతా అపస్మారక స్థితిలో ఉన్నాను. ప్లేట్‌లెట్స్‌ ఎక్కించడంతో కోలుకున్నాను. ఆపరేషన్‌ తర్వాత కనీసం ఆరు నెలలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాన్నకు సూచించారు. కానీ ఆయన వింటేగా! ఆపరేషన్‌ అయిన రెండో నెలకే మళ్లీ పనిలో పడిపోయాడు. సరిగా విశ్రాంతి తీసుకోలేదు.నా చేతిలో ప్రాణం పోయిందికాలేయం పెరగడం కోసం దాదాపు నాలుగేళ్లు గ్యాప్‌ ఇచ్చాక పిల్లల్ని ప్లాన్‌ చేసుకున్నాం. నాకు పిల్లలు పుడతారో, లేదోనని నాన్న భయపడిపోయాడు. అలాంటిది నాకు పాప పుట్టగానే నాన్న సంతోషంతో ఏడ్చేశాడు. ఆపరేషన్‌ అయిన ఆరేళ్లకు నాన్న పరిస్థితి విషమించి నా చేతిలోనే రక్తం కక్కుకుని చనిపోయాడు. ఆపరేషన్‌కు రూ.65 లక్షలదాకా ఖర్చయింది. అప్పుడు తెలుగు ఇండస్ట్రీ (Tollywood) చాలా సపోర్ట్‌ చేసింది అని శాంతి చెప్పుకొచ్చింది.చదవండి: క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్‌చరణ్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
భారత్‌లో బంగ్లా న్యాయమూర్తులకు శిక్షణ.. రద్దు చేసిన మహమ్మద్ యూనస్

ఢాకా : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ కీల

title
న్యూజిలాండ్ వీసా కొత్త రూల్స్ ఇవే..

అమెరికా వీసా నిబంధనలలో మార్పులు ప్రకటించిన అనంతరం.. న్యూజిలాండ్ కూడా అదే బాటలో వీసాలో మార్పులు చేసింది.

title
శీతాకాల తుపాను తీవ్రం.. అమెరికా హై అలర్ట్‌

అగ్రరాజ్యం అమెరికాను శీతాకాల తుపాను భయకంపితులను చేస్తోంది.

title
హమాస్‌ వ్యూహాలు..మరో బందీ వీడియో విడుదల

టెల్‌అవీవ్‌:తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్‌ యువ మహిళా జవాను ల

title
గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్‌ దాడులు..70 మంది మృతి

గాజా: పాలస్తీనాలోని గాజాలో తాజాగా ఇజ్రాయెల్‌(Israel) జరిపిన

Advertisement

వీడియోలు

Advertisement