rohit sharma
-
రోహిత్‌కు అంతా తెలుసు.. రిలాక్స్డ్గా ఉంటాడు: రహానే
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. భారత్ క్రికెట్ జట్టులోని హేమాహేమీలైన స్టార్ క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల పరిస్థితి చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. గత కొంత కాలం వరకు భారత్ క్రికెట్‌ను శాసించిన ఈ ఇద్దరూ ప్రస్తుతం పేలవమైన ఫామ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చెప్పటింది. ఆటగాళ్లందరికీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత్ జట్టులోని క్రికెటర్లు అందరూ దేశవాళీ పోటీల్లో తప్పనిసరిగా ఆడాలి. ఏదైనా అత్యవసర పరిస్థితులు కారణంగా దేశవాళీ పోటీల్లో ఆడలేనప్పుడు బీసీసీఐ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. రోహిత్ దశాబ్దం తర్వాతగురువారం రంజీ ట్రోఫీ టోర్నమెంట్ రెండో దశ ప్రారంభమైనప్పుడు ఒక అరుదైన సంఘటన జరగనుంది. అంతర్జాతీయ పోటీల్లో ఎప్పుడూ బిజీగా ఉండే స్టార్ క్రికెటలందరు తమ రాష్ట్ర జట్ల తరఫున రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడనున్నారు. ఇందులో రోహిత్ శర్మ, వైస్-కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్, అజయ్ జడేజా, హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు ఉండటం విశేషం.కెప్టెన్ రోహిత్ శర్మ అయితే దాదాపు ఒక దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీ పోటీల్లో ఛాంపియన్స్ ముంబై తరఫున ఆడనున్నాడు. రోహిత్ మాజీ భారత్ ఆటగాడు అజింక్య రహానే నాయకత్వంలో ముంబై తరపున బరిలో దిగనున్నాడు. జమ్మూ కాశ్మీర్ తో జరగనున్న మ్యాచ్ లో రోహిత్ భారత్ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి ముంబై బ్యాటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఎలైట్ గ్రూ-‘ఎ’ లో ముంబై 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ 23 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. అయితే ఫిట్ నెస్ లేని కారణంగా విరాట్ కోహ్లీ ఈ రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడకుండా బీసీసీఐ నుంచి మినహాయింపు పొందాడు. మెడ నొప్పి తో బాధపడుతున్న కోహ్లీ కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు.రహానే కితాబురోహిత్ మళ్ళీ జట్టులోకి రావడం ఆనందం కలిగిస్తోందని రహానే కితాబిచ్చాడు. "రోహిత్ తన ఫామ్ ని తిరిగి సాధించాలని ధృడ నిశ్చయంతో ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నిన్న నెట్ ప్రాక్టీస్ లో రోహిత్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఫామ్ అనేది ఆటగాడి కెరీర్లో భాగం. రోహిత్ పై నాకు అపార నమ్మకముంది. రోహిత్ ఎప్పుడూ రిలాక్స్‌గా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు కూడా అతని వైఖరి అలాగే ఉంటుంది. అతనికి తన ఆట గురించి బాగా తెలుసు కాబట్టి, అతను ఏమి చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు," అని రహానే కితాబిచ్చాడు. కాగా రాజ్‌కోట్‌లో జరగనున్న మరో మ్యాచ్ లో ఢిల్లీ రెండుసార్లు విజేతలైన సౌరాష్ట్రతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ తన భారత సహచరులు రవీంద్ర జడేజా, మరియు చతేశ్వర్ పుజారాతో తలపడతాడు.ఆస్ట్రేలియా కూడా పాఠాలు నేర్చుకోవాలిఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఇయాన్ హీలీ బీసీసీఐ కొత్త విధానాన్ని సమర్థించాడు. పది పాయింట్ల మార్గదర్శకాలను అమలు చేయడంపై మాట్లాడుతూ.. జట్టులో పెరుగుతున్నసూపర్స్టార్ సంస్కృతిని అరికట్టడానికి ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించాడు. భారత క్రికెటర్లలో క్రమశిక్షణ లేకుండా పోయింది.‘‘నిజానికి ఈ సమస్య చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. బీసీసీఐ అధికారులు తీసుకున్న చర్యలు జట్టు క్రమశిక్షణను కాపాడుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నాను. అయితే దీని నుంచి ఆస్ట్రేలియా, ఇతర ప్రధాన జట్లు కూడా పాఠం నేర్చుకోవాలి" అని హీలి అన్నాడు. చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
టాప్‌లో బుమ్రా, జడేజా.. దిగజారిన రోహిత్ శర్మ ర్యాంక్
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(jasprith Bumrah) హవా కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా 904 పాయింట్లతో తన అగ్రస్ధానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్‌లో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.మొత్తం 5 టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా బుమ్రా నిలిచాడు. ఈ క్రమంలోనే తన టెస్టు రేటింగ్ పాయింట్స్‌ను బుమ్రా మెరుగుపరుచుకున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా తర్వాత స్ధానాల్లో వరుసగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(841), సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ(837) కొనసాగుతున్నారు.మరోవైపు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా(Ravindra jadeja) తన అగ్రస్ధానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 400 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో జడేజా పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయర్లతో పోలిస్తే కాస్త మెరుగ్గానే కన్పించాడు.ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 27 సగటుతో 135 పరుగులు చేశాడు. జడేజా తర్వాత స్ధానాల్లో ప్రోటీస్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ (294), బంగ్లా ప్లేయర్ మెహిదీ హసన్ (294) నిలిచారు. ఇక బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) ర్యాంక్ మరింత దిగజారింది.రోహిత్ ఒక స్ధానం దిగజారి 43వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బీజీటీ సిరీస్‌లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. కాగా బీజీటీ సిరీస్‌లో రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. అటు కెప్టెన్సీ, ఇటు బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ పూర్తిగా తేలిపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు పదేళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్నాడు.చదవండి: Ind vs Eng: అతడికి ఇదే చివరి అవకాశం.. ఊపిరి కూడా ఆడనివ్వడు! -
ఇంగ్లండ్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో సూర్య
స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) సారథ్యంలోని భారత జట్టు సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 బుధవారం(జనవరి 22) ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్న ఇంగ్లండ్, భారత జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఇక తొలి టీ20కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ సెంచరీ సాధిస్తే.. ఇంగ్లండ్‌పై టీ20ల్లో రెండు శతకాలు నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కుతాడు. ఇంగ్లండ్‌పై సూర్య ఇప్పటికే ఓ టీ20 సెంచరీని నమోదు చేశాడు.సూర్యతో పాటు భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం సైతం ఇంగ్లండ్‌పై తలా ఓ టీ20 సెంచరీని బాదాడు. ఇప్పుడు కోల్‌కతా టీ20లో మిస్టర్ 360 సెంచరీతో మెరిస్తే ఈ ఇద్దరి దిగ్గజ క్రికెటర్లను అధిగమిస్తాడు. ఒకవేళ తొలి టీ20లో వీలు కాకపోయినా, సిరీస్ మధ్యలోనైనా ఈ రికార్డు బద్దులు అయ్యే అవకాశముంది.అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, రోహిత్ శర్మ రికార్డును సమం చేస్తాడు. మాక్సీ, రోహిత్ ఇద్దరూ ఇప్పటివరకు 5 టీ20 సెంచరీలు నమోదు చేశారు. సూర్యకుమార్ ఖాతాలో ప్రస్తుతం 4 అంతర్జాతీయ టీ20 సెంచరీలు ఉన్నాయి.కాగా గత కొన్నేళ్ల నుంచి సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో భారత బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఇప్పటివరరకు 78 మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబైకర్.. 40.8 సగటుతో 2570 పరుగులు చేశాడు.అతడి కెరీర్లో ఇప్పటివరకు 4 టీ20 సెంచరీలు ఉన్నాయి. అయితే గతేడాది ఆఖరిలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో మాత్రం సూర్యకుమార్ నిరాశపరిచాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో కేవలం 8.67 సగటుతో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌తో తన రిథమ్‌ను తిరిగి పొందాలని సూర్య భావిస్తున్నాడు.కాగా భారత్‌తో తొలి టీ20 కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. నలుగురు పేస్ బౌలర్లతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. అదేవిధంగా ఈ జట్టులో యువ సంచలనం జాకబ్ బెథెల్‌కు చోటు దక్కింది.ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ఇంగ్లండ్తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.చదవండి: ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా యువ క్రికెటర్.. ప్రకటించిన ఈసీబీ -
ముంబై జట్టు ప్రకటన.. రోహిత్ శర్మకు చోటు! కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) రంజీ ట్రోఫీ 2024-25లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈ టోర్నీ సెకెండ్ రౌండ్లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌తో జరగనున్న మ్యాచ్ కోసం 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కింది. 2015లో చివరిసారి రంజీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హిట్‌మ్యాన్.. మళ్లీ పదేళ్ల తర్వాత ఈ ప్రాతిష్టత్మక టోర్నీలో ఆడనున్నాడు.రెడ్ బాల్ ఫార్మాట్లో రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో హిట్‌మ్యాన్ దారుణంగా నిరాశపరిచాడు. అంతకముందు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ అదే తీరును కనబరిచాడు. ఈ క్రమంలో రోహిత్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని పలువురు క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీంతో రోహిత్ తన పూర్వ వైభావాన్ని ఎలాగైనా పొందాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రంజీల్లో ఆడాలని నిశ్చయించుకున్నాడు. అంతేకాకుండా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే.. సీనియర్ ఆటగాళ్లు సైతం దేశీవాళీ క్రికెట్లో ఆడాలని భారత క్రికెట్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే రోహిత్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాడు. ఇక జట్టులో విధ్వంసకర ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌ను కూడా ముంబై సెలక్టర్లు చేర్చారు. ఈ జట్టుకు వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్ జనవరి 23 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానుంది.పదేళ్ల తర్వాత..రోహిత్ శర్మ చివరగా 2015లో ముంబై తరపున రంజీల్లో ఆడాడు. ముంబై వాంఖడే స్టేడియంలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరిగా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్(114) సెంచరీతో మెరిశాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రోహిత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది.ఇప్పటివరకు 128 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబైకర్ 9287 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 29 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్‌తో మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు సన్నద్దం కానున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది.జమ్మూ కాశ్మీర్‌తో మ్యాచ్‌కు ముంబై జట్టు ఇదే..అజింక్య రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, ఆయుష్ మ్హత్రే, శ్రేయాస్ అయ్యర్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), తనుష్ కొటియన్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ ఠాకూర్ , సిల్వెస్టర్ డిసౌజా, రొయిస్టన్ ద్యాస్, కర్ష్ కొఠారిచదవండి: IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ ప్రకటన.. -
చాంపియన్స్ ట్రోఫీ తర్వాతే నిర్ణయం: అగార్కర్
విరాట్ కోహ్లి(Virat Kohli).. రోహిత్ శర్మ(Rohit Sharma).. ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు గత కొంతకాలంగా టెస్టుల్లో తేలిపోతున్నారు. తొలుత న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్‌లో విఫలమైన ‘విరాహిత్’ ద్వయం.. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరిచారు. గత ఎనిమిది టెస్టు మ్యాచ్‌లలో కలిపి రోహిత్ చేసిన పరుగులు 164. తీవ్ర స్థాయిలో విమర్శలు ఇక కోహ్లి విషయానికొస్తే.. గత పది మ్యాచ్‌లలో అతడు 382 పరుగులు చేయగలిగాడు. కివీస్ చేతిలో 3-0తో టెస్టుల్లో వైట్‌వాష్.. ఆస్ట్రేలియా చేతిలో 3-1తో ఓటమి.. ఫలితంగా రోహిత్- కోహ్లి ఇక రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చేసిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.అయితే, తాను ఇప్పట్లో రిటైర్ కానని 37 ఏళ్ల రోహిత్ శర్మ సిడ్నీ టెస్టు సందర్భంగా కుండబద్దలు కొట్టగా.. 36 ఏళ్ల కోహ్లి అసలు ఈ విషయంపై స్పందించాల్సిన అవసరమే లేదన్నట్లుగా మిన్నకుండిపోయాడు. కానీ ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లపై విమర్శలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరి భవితవ్యం ఏమిటన్న అంశం, జట్టులో మార్పులపై టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు విలేకరుల నుంచి ప్రశ్న ఎదురైంది.చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతేఇందుకు బదులిస్తూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) మొదలుకావడానికి నెల రోజులకు పైగా సమయం ఉంది. ఈ ఇద్దరు వన్డే క్రికెట్లో అత్యద్భుతమైన ప్రదర్శన కలిగి ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతే మేము దీనిపై దృష్టి సారిస్తాం. మెగా టోర్నీ పూర్తయిన తర్వాత.. ఆటగాళ్ల ప్రదర్శన, భవితవ్యంపై ఒక అంచనాకు వచ్చే వీలుంటుంది.ఒకరిద్దరు అని కాదు.. ప్రతి ఆటగాడిపై మా దృష్టి ఉంటుంది. ఆ తర్వాతే జట్టులో ఎలాంటి మార్పులు చేయాలో ఆలోచిస్తాం. అయితే, ఇప్పుడు మాత్రం మా ఫోకస్ మొత్తం వన్డే క్రికెట్, చాంపియన్స్ ట్రోఫీపైనే ఉంది’’ అని అగార్కర్ స్పష్టం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్టును ప్రకటించిన సందర్భంగా శనివారం ఈ వ్యాఖ్యలు చేశాడు.పాకిస్తాన్ వేదికగాకాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. అయితే, టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఫిబ్రవరి 23న ఢీకొట్టనుంది. అనంతరం.. లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌తో పోటీ పడనుంది.ఇక ఈ ఐసీసీ టోర్నీలో గనుక కోహ్లి- రోహిత్ విఫలమైతే.. వారికి కష్టాలు తప్పకపోవచ్చు. అదే జరిగితే.. తదుపరి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ జట్టులో ఈ దిగ్గజ ద్వయానికి చోటు దక్కడం కష్టమే. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్అయితే, చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే కోహ్లి- రోహిత్ ఫామ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో గనుక సత్తా చాటితే.. అభిమానులను ఖుషీ చేయడంతో పాటు.. ఐసీసీ ఈవెంట్లో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టేందుకు ఆస్కారం ఉంటుంది.కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదలుకానుంది. అనంతరం ఇరుజట్లు ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌లో పోటీపడతాయి. చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
Ind vs Pak: టికెట్లు కావాలంటే.. ముందుగా చేయాల్సింది ఇదే! ధరల సంగతి?
క్రికెట్ ప్రపంచంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే!.. దాయాదులు పరస్పరం నువ్వా- నేనా అన్నట్లుగా పోటీ పడుతుంటే.. ఇరు దేశాల అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులంతా మ్యాచ్‌కే అతుక్కుపోతారు. ఇరు దేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో నిలిచిపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కేవలం ఆసియా కప్, అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే చిరకాల ప్రత్యర్థులు పోటీపడుతున్నాయి. భారత్- పాకిస్తాన్ చివరగా గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా న్యూయార్క్‌లో ముఖాముఖి తలపడ్డాయి. నాటి మ్యాచ్‌లో రోహిత్ సేన బాబర్ ఆజం బృందాన్ని ఓడించడమే కాకుండా.. లీగ్ దశ ఆసాంతం దుమ్ములేపడంతో పాటు చాంపియన్‌గా నిలిచింది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) సందర్భంగా మరోసారి దాయాదుల సమరం జరుగనుంది. ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ సంపాదించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లడం లేదు. తటస్థ వేదికైన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో రోహిత్ సేన తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 19న ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా.. భారత్ తమ తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.అనంతరం.. ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందుకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్ట్ సేల్ ద్వారా టికెట్లు అందుబాటులో లేవు. ఇందుకోసం ముందుగా ఐసీసీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. అప్పుడే టికెట్లు ఎప్పుడు, ఎక్కడ అందుబాటులోకి వస్తాయన్న విషయం ఐసీసీ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు.ఆ ప్రక్రియ ఎలా ఉంటుందంటే..తొలుత ఐసీసీ అధికారిక రిజిస్ట్రేషన్ పేజీలోకి వెళ్లి.. ఈ కింది వివరాలు పూర్తి చేయాలి.👉పూర్తి పేరు:👉ఈ-మెయిల్ అడ్రస్:👉ఫోన్ నంబర్:👉పుట్టిన తేది:👉ఏ దేశంలో నివాసం ఉంటున్నారు:👉ఏ జట్టుకు మీ మొదటి ప్రాధాన్యం:👉షరతులకు అంగీకరిస్తున్నారా?!:👉అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయనుకుంటే.. సబ్మిట్ చేయండి.ధరల సంగతేంటి?ఇక జనవరి 16, 2025 నాటికి ఎక్స్ఛేంజ్టికెట్స్(xchangetickets) వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. భారత్- పాక్ మ్యాచ్‌ల టికెట్ల రేట్లు చుక్కల్ని తాకుతున్నాయి.👉జనరల్ స్టాండ్- 2386.00 AED(అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్స్- భారత కరెన్సీలో దాదాపు రూ. 56,170)👉ప్రీమియమ్ టికెట్ల ధర- 5032 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 1,18, 461)👉గ్రాండ్ లాంజ్- 12240 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 2,88,150)👉ప్లాటినమ్ టికెట్ల ధర- 17680 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 2,24, 116).పాక్‌లో టికెట్ల ధరలు ఇలాకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 లీగ్ దశ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇక కరాచీ, లాహోర్, రావల్పిండిలో జనరల్ ఎన్‌క్లోజర్ టికెట్ల ధర 1000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో కేవలం రూ. 310). ఇక పాకిస్తాన్లో అత్యధిక ప్రీమియమ్ సీటింగ్ టికెట్ల ధర(లాహోర్ సెమీ ఫైనల్ మ్యాచ్)- 25,000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో దాదాపు రూ. 7764). మరోవైపు.. వీవీఐపీ టికెట్ల ధర 12,000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో దాదాపు రూ. 3726). అయితే, రావల్పిండిలో పాకిస్తాన్- బంగ్లాదేశ్ జనరల్ ఎన్‌క్లోజర్ టికెట్ రేట్లను మాత్రం 2500 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో రూ. 776)కు పెంచినట్లు సమాచారం.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
CT 2025: టీమిండియా మేనేజర్‌గా హెచ్‌సీఏ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కార్యదర్శి ఆర్. దేవ్‌రాజ్ మేనేజర్‌గా ఎంపికయ్యారు. వచ్చే నెల 19 నుంచి జరగనున్న ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నారు.ఇదో గొప్ప గౌరవం‘టీమిండియాకు నన్ను మేనేజర్‌గా నియమించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆఫీస్ బేరర్లకు ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించే అవకాశం హెచ్‌సీఏ అధికారికి లభించింది. ఇదో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని దేవ్‌రాజ్ అన్నారు. టీమిండియా మేనేజర్‌గా ఎంపికైన దేవ్‌రాజ్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతోపాటు ఇతర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, అంతకంటే ముందు రోహిత్ సేన సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఇండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి. ఆ తర్వాత.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు నిర్వహిస్తారు. తద్వారా మెగా టోర్నికి ముందు ఇరుజట్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఇవేగ్రూప్-‘ఎ’: ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికాగ్రూప్-‘బి’: ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా షెడ్యూల్ఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ పాకిస్తాన్మార్చి 2, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్రజతం నెగ్గిన జ్యోతి సురేఖ సాక్షి, హైదరాబాద్: ఇండోర్ వరల్డ్ కప్ సిరీస్‌లో భాగంగా ఫ్రాన్స్‌లో జరిగిన నిమెస్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ వెన్నం జ్యోతి సురేఖ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ 146–147తో అలెజాంద్రా ఉస్కియానో (కొలంబియా) చేతిలో ఓడిపోయింది. క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ 600 పాయింట్లకుగాను 592 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచింది. -
వాంఖడే స్టేడియంలో క్రికెట్ దిగ్గజాల కోలాహలం (ఫోటోలు)
-
చాంపియన్స్ ట్రోఫీతో వాంఖడేలో మరోసారి సంబరాలు
ముంబై: ప్రఖ్యాత వాంఖడే క్రికెట్ మైదానానికి భారత క్రికెట్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం వాంఖడే మైదానంలో జరిగిన వేడుకలను తానెప్పటికీ మరవలేనని... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నెగ్గి మరోసారి అలాంటి సంబరాలు చేసుకోవాలనుందని రోహిత్ శర్మ వెల్లడించాడు. వాంఖడే స్టేడియం నిర్మించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆదివారం ముంబై క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు స్టార్ క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ... ‘2024లో టి20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత తిరిగి ముంబైకి చేరుకున్న రోజు వచ్చిన స్పందన అనూహ్యం. సాగరతీరం మొత్తం అభిమానులతో నిండిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయా. మనవాళ్లతో కలిసి సంబరాలు చేసుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. అది ఎలా ఉంటుందో ఒకటికి రెండుసార్లు చూశాను. 2007లో తొలిసారి టి20 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా వాంఖడే స్టేడియంలో వేడుకలు నిర్వహించారు. అప్పుడు కూడా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా అదే జరిగింది. త్వరలో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నీ ఆడే సమయంలో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు మా మీద ఉంటాయని తెలుసు. మరో ఐసీసీ ట్రోఫీని తీసుకువచ్చి ఇక్కడ సంబరాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నాడు. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడుతూ... వాంఖడేకు వస్తే ఇంటికి వచ్చినట్లే ఉంటుందని అన్నాడు. వాంఖడేలో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... ‘2013లో కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో చివరి టెస్టు వాంఖడేలో ఆడాలని ఉందని చెప్పా. నా అభ్యర్థనను అంగీకరించిన బోర్డు అందుకు అనుమతిచ్చింది. అప్పటి వరకు నేను మైదానంలో ఆడుతున్నప్పుడు మా అమ్మ ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. దీంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఇక్కడ కెరీర్ చివరి మ్యాచ్ ఆడా. ఆరోజు మైదానంలో అడుగు పెట్టినప్పుడు ఎలాంటి భావన కలిగిందో ఇప్పటికీ అదే అనిపిస్తుంది. ఇక నా జీవితంలో అత్యంత మధుర క్షణాలకు కూడా వాంఖడే వేదికగా నిలిచింది. 1983లో కపిల్‌దేవ్ సారథ్యంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు ఎంతో సంతోషించా. ఆ స్ఫూర్తితోనే ఆటపై మరింత దృష్టి పెట్టా. అయితే ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసినా వరల్డ్‌కప్ చేతికి చిక్కలేదు. ఎట్టకేలకు 2011లో నా కల వాంఖడే మైదానంలోనే నెరవేరింది’ అని అన్నాడు. తాను ఇదే మైదానంలో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టిన విషయాన్ని భారత మాజీ ఆటగాడు, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు. వాంఖడే 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. -
రంజీల్లో ఆడనున్న రోహిత్, పంత్.. కోహ్లి, రాహుల్ దూరం
టీమిండియా ఆటగాళ్లంతా దేశవాలీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ బాట పట్టారు. భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (పంజాబ్), స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (ముంబై), రిషబ్ పంత్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్దమయ్యారు. ముంబై రంజీ జట్టు తరఫున తాను తర్వాతి మ్యాచ్ బరిలోకి దిగుతానని రోహిత్ శర్మ స్వయంగా వెల్లడించాడు. ఈ నెల 23నుంచి ముంబైలోనే జమ్ము కశ్మీర్‌తో జరిగే పోరులో అతను ఆడతాడు. గత 6–7 ఏళ్లలో తాము అంతర్జాతీయ క్రికెట్లో బిజీగా ఉండటం వల్ల దేశవాళీ మ్యాచ్‌లు ఆడలేకపోయామని, రంజీ ట్రోఫీ స్థాయిని తక్కువ చేయలేమని రోహిత్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ పదేళ్ల క్రితం తన చివరి రంజీ మ్యాచ్ ఆడాడు. 2015 సీజన్లో ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 113 పరుగులు (తొలి ఇన్నింగ్స్) చేశాడు. గడిచిన 17 ఏళ్లలో రంజీ మ్యాచ్ ఆడనున్న తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు.కోహ్లి, రాహుల్ దూరంమరో వైపు మెడ నొప్పితో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... తాను ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడలేనని స్పష్టం చేయగా... మోచేతి గాయంతో కేఎల్ రాహుల్ (కర్ణాటక) కూడా రంజీ పోరుకు దూరమయ్యాడు.ఢిల్లీ జట్టులో పంత్రంజీ ట్రోఫీ తదుపరి లీగ్ మ్యాచ్‌లు జనవరి 23 నుంచి ప్రారంభమవుతాయి. నెక్స్ట్ లెగ్ మ్యాచ్‌ల కోసం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ 21 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రిషబ్ పంత్ పేరుంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో సౌరాష్ట్రను ఢీకొంటుంది. ఢిల్లీ జట్టుకు ఆయుశ్ బదోని కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.ఢిల్లీ రంజీ జట్టు: ఆయుశ్ బదోని (కెప్టెన్), సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), జాంటీ సిద్ధూ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, శివం శర్మ, ప్రణవ్ రాజ్‌వంశీ (వికెట్‌కీపర్), వైభవ్ కంద్పాల్, మయాంక్ గుస్సేన్ , గగన్ వాట్స్, ఆయుష్ దోసెజా, రౌనక్ వాఘేలా, సుమిత్ మాథుర్, రాహుల్ గహ్లోత్, జితేష్ సింగ్. -
సిరాజ్‌లో పదును తగ్గిందా!
ముంబై: 2023 నుంచి చూస్తే 28 మ్యాచ్‌లలో 22.7 సగటుతో 47 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ కూడా చాలా మెరుగ్గా (5.41) ఉంది. ఎలా చూసినా ఇది చెప్పుకోదగ్గ ప్రదర్శనే. సిరాజ్ చాలా వరకు నిలకడగా రాణించాడు. అతను మరీ ఘోరంగా విఫలమైన మ్యాచ్‌లు కూడా అరుదు. అయినా సరే...నలుగురు స్పిన్నర్లతో ఆడాలనే టీమిండియా ప్రణాళికల కారణంగా అతనికి చోటు దక్కలేదు.కెప్టెన్ రోహిత్ శర్మ మాటల్లో చెప్పాలంటే ఆరంభ ఓవర్లలో కొత్త బంతితో చెలరేగినంతగా సిరాజ్ చివర్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. బంతి పాతబడిన కొద్దీ అతని ప్రభావం తగ్గుతోంది. ఇప్పటికే టి20ల్లో తనను తాను నిరూపించుకోవడంతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్‌పై సెలక్టర్లు నమ్మకముంచారు. ఎడమచేతి వాటం బౌలర్ కావడం అతనికి మరో అదనపు అర్హతగా మారింది. ‘ఆరంభంలో, చివర్లో కూడా బాగా బౌలింగ్ చేయగలిగే ఆటగాడు మాకు కావాలి. కొత్త బంతితో షమీ ఏం చేయగలడో అందరికీ తెలుసు. చివర్లో ఆ బాధ్యతఅర్ష్దీప్ తీసుకోగలడు. సరిగ్గా ఇక్కడే సిరాజ్ ప్రభావం తగ్గుతూ వస్తోంది. అతను కొత్త బంతితో తప్ప చివర్లో ఆశించిన ప్రదర్శన ఇవ్వడం లేదు. దీనిపై మేం చాలా సుదీర్ఘంగా చర్చించాం. ఆల్‌రౌండర్లు కావాలి కాబట్టి ముగ్గురు పేసర్లనే తీసుకున్నాం. సిరాజ్ లేకపోవడం దురదృష్టకరమే కానీ కొన్ని రకాల బాధ్యతల కోసం కొందరిని తీసుకొని మరికొందరిని పక్కన పెట్టక తప్పదు’ అని రోహిత్ వివరించాడు. -
కరుణ్ నాయర్‌ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్
విజయ్ హజారే ట్రోఫీలో దుమ్ములేపుతున్న కరుణ్ నాయర్(Karun Nair)ను టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు. దేశవాళీ వన్డే టోర్నమెంట్లో సత్తా చాటుతున్నప్పటికీ అతడిని కనికరించలేదు. కాగా విదర్భ కెప్టెన్‌గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఐదు శతకాల సాయంతో కరుణ్ నాయర్ ఏకంగా 752 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ఇదొక అసాధారణ ప్రదర్శన అంటూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్(sachin Tendulkar) కూడా కరుణ్ నాయర్‌ను అభినందించాడు.ఇక స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఓ అడుగు ముందుకేసి అతడికి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పాటు... చాంపియన్స్ ట్రోఫీ జట్టు(Champions Trophy Squad)లోనూ చోటివ్వాలని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ అజిత్ అగార్కర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రకటించిన జట్టులో కరుణ్ నాయర్‌కు మాత్రం చోటు దక్కలేదు.కరుణ్ నాయర్‌ను ఎలా సెలక్ట్ చేయగలం?ఈ విషయం గురించి అగార్కర్‌కు మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. నిజంగానే అదొక ప్రత్యేకమైన, అద్భుతమైన ప్రదర్శన. దాని గురించి మా మధ్య చర్చ జరిగింది.అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అతడికి జట్టులో చోటు ఇవ్వడం కష్టం. నలభైలకు దగ్గరపడుతున్న వాళ్లను మళ్లీ తీసుకోలేం. అయినా.. జట్టులో పదిహేను మంది సభ్యులకు మాత్రమే చోటు ఉంది. అలాంటపుడు ప్రతి ఒక్కరిని ఇందులో ఇరికించలేము.అయితే, అలాంటి ప్రదర్శనలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సదరు ఆటగాడి గురించి చర్చ జరుగుతుంది. కొంతమంది ఫామ్‌లేమి, గాయాల వల్ల కూడా చర్చనీయాంశంగా మారతారు’’ అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. కాగా 33 ఏళ్ల కరుణ్ నాయర్ 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాదే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. ఇంత వరకు మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయలేకపోయాడు.ఇక రాజస్తాన్‌లో జన్మించిన కరుణ్ నాయర్.. దేశవాళీ క్రికెట్లో గతంలో కర్ణాటకకు ఆడాడు. గతేడాది నుంచి విదర్భకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో సారథిగా, బ్యాటర్‌గా ఆకట్టుకుంటూ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తొలిసారి ఫైనల్‌కు చేరేలా చేశాడు. అందుకే వాళ్లకు వైస్ కెప్టెన్లుగా అవకాశంఇంగ్లండ్తో టీ20 సిరీస్‌కు అక్షర్ పటేల్, వన్డే సిరీస్‌కు శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్లుగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ విషయంపై శనివారం అగార్కర్ స్పందిస్తూ.. ‘‘డ్రెస్సింగ్ రూమ్ నుంచి మేము ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. అయినా ప్రతి ఒక్కరూ కెప్టెన్ లేదంటే వైస్ కెప్టెన్ ఆప్షన్ కాబోరు. కొద్ది మందికి మాత్రమే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలాంటి వారిపైనే మేము దృష్టి సారిస్తాం’’ అని పేర్కొన్నాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఐదు టీ20, మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం.. చాంపియన్స్ ట్రోఫీతో టీమిండియా బిజీ కానుంది. పాకిస్తాన్- యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగుతుంది.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదు: రోహిత్ శర్మ
అభిమానుల నిరీక్షణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎట్టకేలకు శనివారం తెరదించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా(Champions Trophy India Squad)ను ప్రకటించింది. ఇక మెగా టోర్నీకి రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్‌గా కొనసాగనుండగా.. శుబ్‌మన్ గిల్(Shubman Gill) అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు.బుమ్రా గాయంపై రాని స్పష్టతఅంతేకాదు.. ఈ ఓపెనింగ్ జోడీకి బ్యాకప్‌గా యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులోనూ చోటు సంపాదించుకున్నాడు. అయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం గురించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆఖరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా అతడు వెన్నునొప్పితో బాధపడిన విషయం తెలిసిందే.అయితే, చాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా అందుబాటులోకి వస్తాడని సెలక్టర్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని ఐసీసీ ఈవెంట్‌కు ఎంపిక చేశారు. కానీ హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం ఈ జట్టులో స్థానం దక్కలేదు.వన్డే వరల్డ్‌కప్-2023లో లీడింగ్ వికెట్(24 వికెట్లు) టేకర్‌గా నిలిచిన మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో జట్టును ప్రకటిస్తున్న సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మకు సిరాజ్ గురించి ప్రశ్న ఎదురైంది.అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదుఇందుకు స్పందిస్తూ.. ‘‘బుమ్రా ఈ టోర్నీలో ఆడతాడా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు. కాబట్టి కొత్త బంతితో, పాత బంతితోనూ ఫలితాలు రాబట్టగల పేసర్ల వైపే మొగ్గుచూపాలని భావించాం. బుమ్రా మిస్సవుతాడని కచ్చితంగా చెప్పలేం.కానీ ఏం జరిగినా అందుకు సిద్ధంగా ఉండాలి. అందుకే అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేసుకున్నాం. కొత్త బంతితో షమీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అందరికీ తెలుసు. అయితే, న్యూ బాల్ లేకపోతే సిరాజ్ తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేడు. అందుకే అతడిని ఎంపిక చేయలేదు’’ అని రోహిత్ శర్మ వివరించాడు.సీమ్ ఆల్‌రౌండర్లు లేరుఇక చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండటం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘దురదృష్టవశాత్తూ మనకు ఎక్కువగా సీమ్ ఆల్‌రౌండర్లు లేరు. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ డెప్త్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నంతలో స్పిన్ ఆల్‌రౌండర్లనే ఎంపిక చేసుకున్నాం’’ అని తెలిపాడు.కాగా స్పిన్ విభాగంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. సీమ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు.. అతడికి బ్యాకప్‌గా ట్రావెలింగ్ రిజర్వ్స్లో యువ సంచలనం, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డికి చోటిచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే
ఇంగ్లండ్‌తో స్వదేశంలో మూడు వన్డేల(Ind vs Eng ODI Series)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను శనివారం వెల్లడించింది. ఇదే జట్టు ఒక్క మార్పుతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) బరిలోకి దిగుతుందని వెల్లడించిందిఓపెనర్గా ఎవరు?కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) వైస్ కెప్టెన్‌గా ఎంపికకాగా.. మరో యంగ్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఈ ఇద్దరిలో ఎవరు తుదిజట్టులో ఆడతారనేది ఆసక్తికరంగా మారింది.కాగా వెస్టిండీస్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్ అరంగేట్రంలోనే టెస్టుల్లో భారీ శతకం(171)తో దుమ్ములేపాడు. అనంతరం రెండు ద్విశతకాలు కూడా బాది సత్తా చాటాడు. అదే టూర్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలోనూ జైసూ ఎంట్రీ ఇచ్చాడు.బుమ్రా బదులు హర్షిత్ రాణాఇక ఇప్పటి వరకు ఓవరాల్‌గా టీమిండియా తరఫున 19 టెస్టులు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. టెస్టుల్లో 1798, టీ20లలో 723 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. వెన్నునొప్పితో బాధపడుతున్న పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేనట్లు తెలుస్తోంది.అందుకే ఇంగ్లండ్‌తో వన్డేలకు బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు టీమిండియా సెలక్టర్లు. అయితే, ఫిట్నెస్ ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా జట్టుతో చేరనుండగా.. హర్షిత్ పక్కకు తప్పుకొంటాడు.షమీతో పాటు వారు కూడాఇక ఈ జట్టులో వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ స్థానం సంపాదించగా.. స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఇక పేసర్ల విభాగంలో మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు.కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మొత్తం ఐదు టీ20లు(జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2) జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 6,9, 12 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్లను ప్రకటించింది.ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.ఇంగ్లండ్‌తో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్).భారత్‌తో వన్డేలకు/చాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.భారత్‌తో టీ20లకు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.చదవండి: CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్‌కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్! -
CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్‌కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో భాగమయ్యే ఆటగాళ్ల పేర్ల((India Squad For Champions Trophy 2025)ను శనివారం వెల్లడించింది.సిరాజ్, సంజూకు మొండిచేయిటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో కలిసి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) జట్టు వివరాలను మీడియాకు తెలిపాడు. ఈ టోర్నీలో రోహిత్ శర్మకు డిప్యూటీగా శుబ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు. అయితే, తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి మాత్రం ట్రావెలింగ్ రిజర్వ్స్లో చోటు దక్కింది. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా అతడిని ఎంపిక చేశారు.బుమ్రా ఫిట్నెస్ సాధిస్తాడా? మరోవైపు.. స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు. ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ఆధారంగా ఈ టోర్నీలో ఆడేది లేనిది తేలుతుంది. పేసర్ల విభాగంలో షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్ స్థానం సంపాదించాడు. అయితే, అందరూ ఊహించినట్లుగా సంజూ శాంసన్‌కు మాత్రం ఈసారి ఈ జట్టులో చోటు దక్కలేదు.కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడి వెళ్లకుండా తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందుకు ఐసీసీని బీసీసీఐ ఒప్పించగా.. ఐసీసీ జోక్యంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ మేరకు హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది.ఎనిమిది జట్లుఇక ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఈ ఐసీసీ ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధించగా.. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో అదరగొట్టిన ఏడు జట్లు తమ ప్రదర్శన ఆధారంగా చోటు దక్కించుకున్నాయి. వరల్డ్‌కప్ చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాలతో పాటు.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యాయి.వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఉన్నాయి.ఈ టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది. ఇక చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. జనవరి 22 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టీ20తో మెగా సమరం మొదలుకానుంది. జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ టీమిండియా- ఇంగ్లండ్‌కు ఈ వన్డే సిరీస్ ద్వారా చాంపియన్స్ ట్రోఫీకి ముందు మంచి ప్రాక్టీస్ లభించనుంది. ఇక ఇంగ్లండ్‌తో వన్డేలలో కూడా ఇదే జట్టు ఆడనుండగా.. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా టీమ్‌లోకి వస్తాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనబోయే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదేఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- బంగ్లాదేశ్ vs భారత్ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- పాకిస్తాన్ vs భారత్మార్చి 2, 2025 (దుబాయ్) న్యూజిలాండ్ vs భారత్. -
చాంపియన్స్ ట్రోఫీ: భారత జట్టు ప్రకటన తేదీ ఖరారు!
చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్టును ప్రకటించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్ధమైంది. ఈ ఐసీసీ టోర్నీకి శనివారం టీమిండియాను ప్రకటించనుంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి మీడియా ముఖంగా జట్టు వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.కాగా వన్డే ఫార్మాట్లో నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) చివరగా 2017లో జరిగింది. నాడు ఫైనల్లో టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈసారి ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. దుబాయ్లోఇక మెగా ఈవెంట్‌కు వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై కాగా.. ఆతిథ్య జట్టు హోదాలో పాక్ నేరుగా అర్హత సాధించింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు నిరాకరించిన బీసీసీఐ(BCCI).. హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించింది. ఇందుకు అంగీకరించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ను కూడా ఒప్పించింది. ఈ క్రమంలో టీమిండియా దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఇక ఈ మెగా టోర్నీకి ప్రొవిజనల్ జట్లను ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 13ను డెడ్‌లైన్‌గా విధించగా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ ఇప్పటికే తమ టీమ్‌ల వివరాలు వెల్లడించాయి. అయితే, పాకిస్తాన్, భారత్, ఇంగ్లండ్ మాత్రం గడువు పొడిగించాల్సిందిగా కోరినట్లు సమాచారం.అదే రోజు ఇంగ్లండ్‌తో వన్డేలకు జట్టు ప్రకటనఈ నేపథ్యంలో శనివారం(జనవరి 18)న తమ జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇక అదే రోజు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు కూడా టీమ్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా ఘోర పరాభవం చవిచూసింది.ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో ఓడి దశాబ్ద కాలం తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఇక తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు కాగా.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి.ఇక ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగిసిన తర్వాత టీమిండియా చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుండగా.. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. క్రికెట్ ప్రపంచానికి ఎంతో ఇష్టమైన దాయాదుల పోరు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరుగనుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025 భారత జట్టు (అంచనా)రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ సాధిస్తే), మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం! ఆమె ఎవరంటే? -
CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఓ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్‌ను పంపించాలని సూచించాడు. తద్వారా శుబ్‌మన్ గిల్‌పై వేటు వేయాలని పరోక్షంగా సెలక్టర్లకు సలహా ఇచ్చాడు.దుబాయ్ వేదికగాపాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తటస్థ వేదికైన దుబాయ్(Dubai)లో భారత జట్టు తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 13 డెడ్‌లైన్ విధించగా.. బీసీసీఐ మాత్రం మినహాయింపు కోరింది. జనవరి 17 నాటికి తమ జట్టును ప్రకటిస్తామని పేర్కొన్నప్పటికీ.. ఇంత వరకు ఆ వివరాలు వెల్లడించలేదు.అతడిని సెలక్ట్ చేయండిఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ హిందుస్తాన్ టైమ్స్‌తో ఈ విషయం గురించి మాట్లాడాడు. ‘‘సెలక్టర్లకు నాదో సలహా. యశస్వి జైస్వాల్‌ను 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా ఆడించండి. అంతర్జాతీయ టీ20, వన్డేల్లో అతడు బ్యాటింగ్ చేసే విధానం అద్బుతం. వన్డే ఫార్మాట్‌కు కూడా అతడు సరిగ్గా సరిపోతాడు. కచ్చితంగా అతడిని టీమిండియా వన్డే జట్టులోకి తీసుకోవాలి’’ అని వీరూ భాయ్ పేర్కొన్నాడు.పంత్ వద్దు: భజ్జీమరోవైపు.. టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా తన మొదటి ఓటు సంజూ శాంసన్‌కే వేస్తానని కుండబద్దలు కొట్టాడు. కాగా ఓపెనింగ్ జోడీగా సెహ్వాగ్ రోహిత్- జైస్వాల్‌ల పేర్లను సూచించగా.. భజ్జీ రిషభ్ పంత్‌ను కాదని సంజూ శాంసన్‌కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించడం విశేషం.కాగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ టెస్టు, టీ20లలో టీమిండియా ఓపెనర్‌గా పాతుకుపోయాడు. అరంగేట్రంలోనే టెస్టుల్లో భారీ శతకం(171)తో మెరిసిన జైసూ ఖాతాలో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.ఇక ఇప్పటి వరకు ఓవరాల్‌గా భారత్ తరఫున 19 టెస్టులు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 1798, 723 పరుగులు చేశాడు. అయితే, జైస్వాల్‌కు ఇంత వరకు వన్డేల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. రోహిత్ శర్మతో కలిసి శుబ్‌మన్ గిల్ యాభై ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు.జైసూ భేష్అయితే, ఇటీవలి కాలంలో గిల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ యశస్వి జైస్వాల్ పేరు చెప్పడం గమనార్హం. కాగా లిస్ట్-‘ఎ’ క్రికెట్లో జైసూ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. కేవలం 32 మ్యాచ్‌లలోనే అతడు ఐదు సెంచరీలు, ఏడు అర్ధ శతకాలు, ఓ డబుల్ సెంచరీ సాయంతో 1511 పరుగులు సాధించాడు. చదవండి: ILT20 2025: చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్ -
CT 2025: కరుణ్ నాయర్ ఒక్కడే కాదు.. అతడూ రేసులోకి వచ్చేశాడు!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు సమయం ఆసన్నమవుతోంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. అయితే, ఈ ఐసీసీ టోర్నీకి భారత జట్టు ఎంపిక చేసే విషయంలో అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే టోర్నమెంట్ ముగిసే వరకు వేచి చూడాలని భావిస్తున్నట్టు సమాచారం.నాయర్ ఒక్కడే కాదు.. అతడూ రేసులోకి వచ్చేశాడు!ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు సీనియర్ బ్యాట్స్‌మన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇద్దరూ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ టోర్నమెంట్ కి భారత్ జట్టు ఎంపిక చర్చనీయంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్ తన పరుగుల ప్రవాహం తో సెలెక్టర్ల పై ఒత్తిడి పెంచాడు. తాజాగా 24 ఏళ్ళ ఎడమచేతి వాటం కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా ఈ జాబితా లో చేరాడు. బుధవారం విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో హర్యానాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తన నిలకడైన బ్యాటింగ్ తో పడిక్కల్ కర్ణాటక జట్టుకి ఫైనల్ బెర్త్ ని ఖాయం చేసాడు. పడిక్కల్ లిస్ట్-‘ఎ’ ఫార్మాట్ లో వరుసగా తన ఏడో హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం.కాగా హర్యానాతో 238 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక మొదటి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ వికెట్‌ని కోల్పోయింది. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటన నుండి తిరిగి వచ్చిన పడిక్కల్ 86 పరుగులు సాధించడమే కాక స్మరణ్ రవిచంద్రన్ (76 పరుగులు )తో కలిసి మూడో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో కర్ణాటక ఇంకా 16 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.కోహ్లీ రికార్డుని అధిగమించిన పడిక్కల్ఈ ఇన్నింగ్స్ లో భాగంగా పడిక్కల్ లిస్ట్ ఎ క్రికెట్లో 2000 పరుగుల మైలురాయిని పూర్తి చేశాడు. పడిక్కల్ 82.38 సగటుతో ఈ ఘనతను సాధించాడు. ఈ ఫార్మాట్లో కనీసం 2000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఇదే అత్యధికం. మరో భారత్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (58.16), ఆస్ట్రేలియాకు చెందిన మాజీ బ్యాటర్ మైఖేల్ బెవాన్ (57.86), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (57.05), దక్షిణాఫ్రికాకి చెందిన ఎబి డివిలియర్స్ (53.47) వంటి టాప్ బ్యాటర్‌ని పడిక్కల్ అధిగమించడం విశేషం.రోహిత్, కోహ్లీలకు మరో ఛాన్స్? ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కి ఎంపిక చేయడం ఖాయంగా కనబడుతోంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దుబాయ్ లోని బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ లపై రాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానంగా వీరిద్దరి వైఫల్యం కారణంగానే భారత్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో పరాజయం చవిచూడటమే కాక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నుండి కూడా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి పై భారత్ అభిమానులు తీవ్ర అసంతృప్తి గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దుబాయ్ పిచ్‌లు భారత్ బ్యాటర్లకి అనుకూలంగా ఉండే కారణంగా, ఎంతో అనుభవం ఉన్న రోహిత్, కోహ్లీ లను ఛాంపియన్స్ ట్రోఫీ కి తప్పనిసరిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ లో వీరి ఆటతీరును బోర్డు నిశితంగా పరిశీలిస్తునడంలో సందేహం లేదు. చదవండి: Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు? -
ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు: రోహిత్‌పై టీమిండియా స్టార్ కామెంట్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత పేస్ బౌలర్ ఆకాశ్ దీప్(Akash Deep) ప్రశంసలు కురిపించాడు. తన కెరీర్లో ఇలాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదన్నాడు. అతడి సారథ్యంలో అరంగేట్రం చేయడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియాలో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేనన్న ఆకాశ్ దీప్.. నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపాడు.ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రంబిహార్కు చెందిన ఆకాశ్ దీప్ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆకాశ్.. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లిష్ జట్టుతో నాలుగో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 28 ఏళ్ల ఈ పేస్ బౌలర్.. మూడు వికెట్లు తీశాడు.అనంతరం న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ ఆకాశ్ దీప్ పాల్గొన్నాడు. ఆఖరి రెండు టెస్టులాడి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టుకు ఆకాశ్ దీప్ ఎంపికయ్యాడు. పెర్త్, అడిలైడ్‌లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అతడికి ఆడే అవకాశం రాలేదు.బ్యాట్‌తోనూ రాణించిఅయితే, బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో మాత్రం మేనేజ్మెంట్ ఆకాశ్ దీప్‌నకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 31 పరుగులు చేసి.. ఫాలో ఆన్ గండం నుంచి టీమిండియాను తప్పించాడు.ఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో ఆకాశ్ దీప్.. రెండు వికెట్లతో సరిపెట్టుకున్నాడు. అనంతరం గాయం కారణంగా సిడ్నీలో జరిగిన ఐదో టెస్టుకు దూరమయ్యాడు. కాగా ఈ సిరీస్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో 3-1తో ఓడిపోయి.. ట్రోఫీని చేజార్చుకున్న విషయం తెలిసిందే.ఇందుకు ప్రధాన కారణం బ్యాటర్‌గా విఫలం కావడంతో పాటు కెప్టెన్‌గానూ సరైన వ్యూహాలు అమలుచేయలేకపోవడమే అంటూ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అతడు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగి.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ దీప్ రోహిత్ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు‘‘రోహిత్ శర్మ సారథ్యంలో ఆడే అవకాశం రావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. అతడి నాయకత్వ లక్షణాలు అద్భుతం. ప్రతి విషయాన్ని సరళతరం చేస్తాడు. ఇప్పటి వరకు నేను ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు. ఇక హెడ్‌కోచ్ గౌతం గంభీర్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘గంభీర్ సర్ కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తూనే.. ఆటగాళ్లను మోటివేట్ చేస్తారు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా చేస్తారు’’ అని ఆకాశ్ దీప్ చెప్పుకొచ్చాడు.సంతృప్తిగా లేనుఅదే విధంగా.. ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడుతూ.. ‘‘నేను అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇండియాలో టెస్టు క్రికెట్ ఆడటం వేరు. ఇక్కడ పేసర్ల పాత్ర అంత ఎక్కువగా ఏమీ ఉండదు. కానీ.. ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలర్‌గా మానసికంగా, శారీరకంగా మనం బలంగా ఉంటేనే రాణించగలం. అక్కడ ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ టూర్లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవడంపైనే ప్రస్తుతం నా దృష్టి ఉంది’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు.చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్ -
BCCI: అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!.. వారి మ్యాచ్ ఫీజులలో కోత?!
టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆటగాళ్ల పట్ల కఠిన వైఖరి అవలంబించనున్నట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) ఇచ్చిన నివేదిక మేరకు కఠినమైన నిబంధనలు తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్దమైనట్లు సమాచారం.ముఖ్యంగా ఆటలో భాగంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కుటుంబాన్ని వెంట తీసుకువెళ్లడం, టూర్ ఆసాంతం వారిని అట్టిపెట్టుకుని ఉండటం ఇకపై కుదరదని తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న భారత జట్టు.. వన్డే, టెస్టుల్లో మాత్రం ఇటీవలి కాలంలో ఘోర పరాభవాలు చవిచూసింది.ఘోర ఓటములుశ్రీలంక పర్యటనలో భాగంగా గతేడాది వన్డే సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. అనంతరం.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆసీస్‌కు కోల్పోవడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో ఇంటాబయట టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ టూర్ తర్వాత బీసీసీఐ హెడ్‌కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.క్రమశిక్షణ లేదు.. అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!ఈ రివ్యూ మీటింగ్‌లో చర్చకు వచ్చిన అంశాల గురించి బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం.. ‘‘సమీక్షా సమావేశం(BCCI Review Meeting)లో గౌతం గంభీర్ ప్రధానంగా.. ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యం గురించి ప్రస్తావించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ సమయంలో డ్రెసింగ్‌రూమ్‌లో అసలు సానుకూల వాతావరణం కనిపించలేదు. అందుకే.. ప్రి-కోవిడ్ నిబంధనలను తిరిగి తీసుకురానున్నారు. ఇకపై విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు.. వారితో కేవలం రెండు వారాలు మాత్రమే గడిపే వీలుంటుంది. 45 రోజుల పాటు టూర్ సాగినా వారు రెండు వారాల్లోనే తిరిగి స్వదేశానికి వచ్చేయాలి. ఈ విషయంలో ఆటగాళ్లతో పాటు కోచ్‌లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.వారి మ్యాచ్ ఫీజులలో కోత?ఇక ఓ సీనియర్ ఆటగాడు కూడా గంభీర్, అగార్కర్‌తో కలిసి రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నాడు. మ్యాచ్ ఫీజులను వెంటనే ఆటగాళ్లకు పంచేయకూడదని అతడు ఓ సలహా ఇచ్చాడు. ప్రదర్శన ఆధారంగానే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లించాలని సూచించాడు.కొంతమంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌తో పాటు.. జాతీయ జట్టు విధుల పట్ల కూడా నిబద్ధత కనబరచడం లేదన్న విషయాన్ని తాను గమనించినట్లు తెలిపాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. కాగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు.. ప్రధాన బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా విఫలమయ్యాడు. వీరిద్దరి వరుస వైఫల్యాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో రోహిత్ తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ముంబై తరఫున రంజీ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, కోహ్లి మాత్రం రంజీల్లో ఆడే విషయమై ఇంత వరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌కు సమాచారం ఇవ్వలేదు. మరోవైపు.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై తరఫున, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్ ఆడేందుకు సమాయత్తమవుతున్నారు.చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్ -
ముంబై రంజీ జట్టుతో రోహిత్ శర్మ, యశస్వి ప్రాక్టీస్
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్... ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశారు. ఇటీవల ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో రోహిత్ పేలవ ప్రదర్శన కనబర్చగా... యశస్వి టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆసీస్‌తో ప్రతిష్టాత్మక సిరీస్‌లో భారత జట్టు పరాజయం పాలవగా... ప్లేయర్లందరూ దేశవాళీ టోర్నీ ల్లో ఆడాలనే డిమాండ్ పెరిగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ‘అందుబాటులో ఉన్నవాళ్లందరూ రంజీ ట్రోఫీలో ఆడాలి’ అని ఆటగాళ్లకు చురకలు అంటించాడు. ఈ నేపథ్యంలో రోహిత్, యశస్వి ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ముంబై రంజీ కెపె్టన్ రహానేతో కలిసి రోహిత్ సుదీర్ఘ సమయం నెట్స్‌లో గడపగా... బుధవారం జైస్వాల్ ప్రాక్టీస్ చేశాడు. రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుండగా... జమ్ముకశ్మీర్‌తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 20 వరకు జట్టును ప్రకటించే అవకాశం ఉందని... ఆ సమయంలో ఆటగాళ్లందరినీ అందుబాటులో ఉంటారా లేదా అని అడిగి ఎంపిక చేస్తామని ముంబై క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు. ‘రోహిత్‌ను కూడా అడుగుతాం. అతడు అందుబాటులో ఉంటానంటే జట్టులోకి ఎంపిక చేస్తాం’ అని అన్నారు. -
అందుకే ఐదు సెంచరీలు కొట్టినా అతడిని పక్కన పెడుతున్నారా?
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన టీమిండియాపై క్రికెట్ అభిమానుల విమర్శలు కొనసాగుతున్నాయి. జట్టు ఎంపికలో లోపాలు, ప్రధాన బ్యాటర్ల వైఫల్యం కారణంగానే 3-1తో ఓటమి ఎదురైందనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కనీసం చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకైనా సరైన జట్టును ఎంపిక చేయాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విదర్భ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్(Karun Nair) భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు.ఐదు శతకాలు.. కరుణ్ నాయర్ రికార్డుల మోతదేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ రికార్డుల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఆరు ఇన్నింగ్స్‌లో ఐదు శతకాలు బాదిన ౩౩ ఏళ్ళ ఈ ఆటగాడు సంచలనాత్మక ఫామ్‌తో దుమ్మురేపుతున్నాడు. తన కెరీర్ లోనే అద్భుతమైన ఫామ్‌తో టీమిండియా సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ఈ నేపథ్యంలోనే చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) టోర్నమెంట్లో అతడిని ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.కాగా కరుణ్ నాయర్ చివరగా ఏడేళ్ల క్రితం టీమిండియాకు ఆడాడు. ఇక విజయ్ హజారే టోర్నమెంట్ లో తన చివరి ఆరు ఇన్నింగ్స్‌లలో 122*, 112, 111, 163*, 44* మరియు 112* స్కోర్లతో అతడు ఇటీవల రికార్డు నెలకొల్పాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 పరుగులకు అవుట్ కావడానికి ముందు, నాయర్ వరుసగా ఆరు ఇన్నింగ్స్ లో అజేయంగా నిలిచి 542 పరుగులు సాధించి 'లిస్ట్ ఎ' టోర్నమెంట్లలో రికార్డును సృష్టించాడు.న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ సాధించిన 527 పరుగుల నాటౌట్ రికార్డును నాయర్ తిరగ రాశాడు. కెప్టెన్ నాయర్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో విదర్భ సెమీఫైనల్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.నాయర్ అద్భుతమైన ప్రదర్శన మరోసారి అతని పేరు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాయర్‌ను మళ్ళీ భారత్ జట్టులోకి తీసుకోవాలని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విశేషం.ఇందులో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఉండడం గమనార్హం. ఇంగ్లండ్‌తో 2016లో చెన్నై లో జరిగిన టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత నాయర్.. మరో మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. “నేను నాయర్ గణాంకాలను పరిశీలిస్తున్నాను. 2024-25లో అతడు ఆరు ఇన్నింగ్స్‌లు ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో నాటౌట్‌గా నిలిచాడు, 120 స్ట్రైక్ రేట్‌తో 664 పరుగులు చేశాడు. అయినా నాయర్‌ను సెలెక్టర్లు ఎంపిక చేయడం లేదు. ఇది అన్యాయం” అని తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో వ్యాఖ్యానించాడు. కాగా 2024లో నాయర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో కూడా రాణించాడు. 44.42 సగటుతో 1,466 పరుగులు సాధించాడు. అందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి, వీటిలో 202* అత్యధిక స్కోరు ఉంది. ఇది కాక నాయర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో నార్తాంప్టన్‌షైర్‌తో ఆడి ఏడు మ్యాచ్‌ల్లో 48.70 సగటుతో 487 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. రోహిత్, కోహ్లీలను రంజీలు ఆడమంటున్నారు.. కానీ"చాలా మందిని కేవలం రెండు ఇన్నింగ్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరికొందరిని ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు. కానీ జట్టు ఎంపికలో నాయర్ విషయంలో నియమాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి? రోహిత్(Rohit Sharma), కోహ్లీ ఫామ్‌లో లేని విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఇందుకోసం వారిద్దరూ మళ్ళీ రంజీ ఆడాలని అభిమానులు కోరుతున్నారు. కానీ రంజీ ఆడుతూ పరుగులు చేస్తున్న వారిని ఎందుకు (సెలెక్టర్లు) విస్మరిస్తున్నారు?ట్రిపుల్ సెంచరీ తర్వాత నాయర్ ని ఎలా తొలగించారో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. అతనిలాంటి ఆటగాళ్ల గురించి ఎవరూ మాట్లాడకపోవడం బాధాకరం. ఒకొక్క ఆటగాడికి ఒక్కొక్క నియమాలు" ఉన్నాయని హర్భజన్ వ్యాఖ్యానించాడు. "నాయర్ భారత్ జట్టుతో ఇంగ్లండ్‌కు వెళ్ళాడు కానీ అతనికి తుది జట్టులో చోటు దొరకలేదు. అందుకే మీరు అతడిని పక్కన పెడుతున్నారా?ఐదవ టెస్ట్ కోసం టీం మేనేజిమెంట్ వాస్తవానికి భారత్ నుండి ఒక ఆటగాడిని పిలిపించింది. బహుశా అతను హనుమ విహారి అని అనుకుంటున్నాను. అతను నాయర్‌కు బదులుగా టెస్ట్ ఆడాడు. దీనికి కారణం నాకు చెప్పండి. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు నియమాలు... అలా ఉండకూడదు. ఎవరు పరుగులు చేస్తే మీరు అతన్ని ఆడించాలి. అతని (నాయర్)కి టాటూలు లేవు, ఫ్యాన్సీ బట్టలు వేసుకోడు. అందుకే మీరు అతన్ని ఎంచుకోలేదా? మరి అతను కష్టపడి పరుగులు సాధించడంలేదా?" అని హర్భజన్ ప్రశ్నించాడు. కాగా ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అయిదు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-౩ తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. మరోపక్క పేలవమైన ఫామ్‌తో ఈ పర్యటనలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై రంజీ మ్యాచ్ సన్నాహక క్యాంపు కి హాజరయ్యాడు. అయితే, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఢిల్లీ తరఫున రంజీల్లో బరిలోకి దిగే అంశంపై నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో భజ్జీ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
పాకిస్తాన్‌కు వెళ్లనున్న రోహిత్ శర్మ!.. కారణం?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పాకిస్తాన్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆరంభోత్సవంలో భారత సారథి పాల్గొననున్నట్లు సమాచారం. కాగా 1996 తర్వాత తొలిసారి పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది.వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీని చివరగా 2017లో నిర్వహించగా.. నాడు పాక్ జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించడంతో పాటు నిర్వహణ హక్కులను కూడా దక్కించుకుంది.ఇక ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు.. భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్ ప్రదర్శన ఆధారంగా చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా.. అదే విధంగా టాప్-7లో నిలిచిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ కూడా ఈ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి.తటస్థ వేదికపైఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిరాకరించింది. తటస్థ వేదికపైన తమకు మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం ఆరంభంలో ఇందుకు ససేమిరా అన్నప్పటికీ.. ఐసీసీ జోక్యంతో పట్టువీడింది. తాము కూడా ఇకపై భారత్‌లో ఐసీసీ టోర్నీ జరిగితే అక్కడికి వెళ్లకుండా తటస్థ వేదికపైనే ఆడతామన్న షరతుతో హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది.ఈ నేపథ్యంలో దుబాయ్(Dubai) వేదికగా భారత క్రికెట్ జట్టు తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుండగా.. ఫిబ్రవరి 16 లేదంటే 17వ తేదీన ఈ ఈవెంట్ ఆరంభ వేడుకను నిర్వహించేందుకు పాక్ బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ఆనవాయితీ ప్రకారం ఈ టోర్నీలో పాల్గొనే జట్ల కెప్టెన్లందరూ ఈ వేడుకకు హాజరు కావాల్సి ఉంటుంది.టీమిండియా కెప్టెన్ కూడా వస్తాడుఈ విషయం గురించి పాక్ బోర్డు వర్గాలు వార్తా సంస్థ(IANS)తో మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ వేడుకలను పీసీబీ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. టీమిండియా కెప్టెన్ కూడా ఇందులో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు వస్తాడు. 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో ఐసీసీ ఈవెంట్ జరుగబోతోంది. దీనిని విజయవంతం చేయాలని పీసీబీ పట్టుదలగా ఉంది’’ అని పేర్కొన్నాయి.అయితే, బీసీసీఐ రోహిత్ శర్మను పాకిస్తాన్‌కు పంపిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా జరుగనున్న మ్యాచ్‌తో చాంపియన్స్ ట్రోఫీ-2025కి తెరలేవనుంది. మరోవైపు.. టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్‌లో తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. దాయాదుల సమరం ఆరోజేఇక క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసే భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది. దాయాదుల సమరానికి దుబాయ్ ఆతిథ్యం ఇస్తుంది. కాగా భారత్- పాక్ చివరగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా తలపడగా.. టీమిండియా విజయం సాధించింది.ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ సేన.. చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకున్న తర్వాత.. రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం టెస్టు, వన్డే జట్ల సారథిగా కొనసాగుతున్నాడు.చదవండి: టి20 ప్రపంచకప్.. టీమిండియా ఘన విజయం -
‘రోహిత్ శర్మ ఖేల్ ఖతం.. అందులో మాత్రం భవిష్యత్తు ఉంది’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కెరీర్ గురించి ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్(Brad Hogg) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో హిట్‌మ్యాన్ పనైపోయిందని.. ఇక అతడు రిటైర్మెంట్ ప్రకటించడమే తరువాయి అన్నాడు. గత ఆరేడు నెలలుగా అతడి విఫలమవుతున్న తీరు.. కెరీర్ ముగింపునకు వచ్చిందనడానికి సంకేతం అని పేర్కొన్నాడు.అయితే, వన్డే(ODI Cricket)ల్లో మాత్రం రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉందని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంతకాలంగా భారత సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్టుల్లో దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా అతడికి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.వరుస వైఫల్యాలుతొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో తేలిపోయిన ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ.. తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరిచాడు. గత పదకొండు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆసీస్‌తో తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ.. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు సందర్భంగా మళ్లీ జట్టుతో చేరాడు.అయితే, తొలి టెస్టులో ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్- కేఎల్ రాహుల్ హిట్ కావడంతో.. రోహిత్ తప్పనిసరి పరిస్థితుల్లో మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, అనవసరపు షాట్లకు పోయి వికెట్ పారేసుకున్నాడు. అనంతరం మూడో టెస్టులోనూ అదే స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. తన రెగ్యులర్ స్థానమైన ఓపెనింగ్‌లోనూ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు.ఈ క్రమంలో పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. రోహిత్ శర్మ ఆఖరిదైన సిడ్నీ టెస్టుకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా విశ్రాంతి పేరిట తనంతట తానుగా జట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో ఆరంభంలో అదరగొట్టిన టీమిండియా.. తర్వాత చతికిల పడి ఓటమిపాలైంది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.రోహిత్ ఖేల్ ఖతంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ.. ‘‘టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ పనైపోయిందనే అనుకుంటున్నా. ఇక అతడు ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడమే మంచిది. గత ఆరు- ఏడు నెలలుగా అతడి ఫామ్ అంత గొప్పగా ఏమీ లేదు.వికెట్ పారేసుకున్న తీరు మరీ ఘోరంఅంతేకాదు అతడు బౌల్డ్ అయ్యాడు. లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా వెనుదిరిగాడు. ఒక ఓపెనర్ అయి ఉండి ఇలా అవుట్ కావడం సరికాదు. ముఖ్యంగా అతడు ఎల్బీడబ్ల్యూ కావడం మరీ ఘోరం’’ అని విమర్శలు గుప్పించాడు. అయితే, ఐదో టెస్టు నుంచి రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడాన్ని బ్రాడ్ హాగ్ ప్రశంసించాడు.‘‘రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడం నిరాశాజనకం. అయితే, సిడ్నీలో అతడు తీసుకున్న నిర్ణయం సరైంది. కానీ అంతకంటే ముందే.. అంటే మెల్బోర్న్ టెస్టు సందర్భంగానే అతడు తుదిజట్టు నుంచి తప్పుకొంటే ఇంకా బాగుండేది. తన స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు ఆడించి ఉంటే మేలు జరిగేది’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.వన్డేల్లో రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉందిఇక 37 ఏళ్ల రోహిత్ శర్మ వన్డే కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘టెస్టుల సంగతి ఎలా ఉన్నా.. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉంది. ఈ ఫార్మాట్లో కాస్త దూకుడుగా.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, వయసు మీద పడుతున్న దృష్ట్యా అతడు కాస్త జాగ్రత్తగా ఆడితేనే ఇంకొన్నాళ్లు కొనసాగగలుగుతాడు.ఇప్పటి వరకు అతడి వన్డే కెరీర్ అత్యద్భుతం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని భావిస్తున్నా’’ అని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వరకు రోహిత్ శర్మనే టీమిండియాకు ముందుకు నడిపిస్తాడని అభిప్రాయపడ్డాడు.చదవండి: సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే! -
టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో ఈ రైటార్మ్ బౌలర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడని కొనియాడాడు. కెప్టెన్‌గానూ బుమ్రా జట్టును ముందుకు నడిపించిన తీరు తనను ఆకట్టుకుందన్నాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా పరిణతి గల నాయకుడిగా మెప్పించాడని పేర్కొన్నాడు.ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణించికాగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పితృత్వ సెలవుల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణించి పెర్త్‌లో టీమిండియాకు 295 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం అందించాడు.వెన్నునొప్పి వేధిస్తున్నాఆ తర్వాత మరో మూడు టెస్టులకు సారథిగా వ్యవహరించిన రోహిత్ శర్మ.. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా వైఫల్యం చెందినందున ఆఖరి టెస్టు నుంచి తప్పుకొన్నాడు. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి పేరిట తానే స్వయంగా దూరంగా ఉన్నాడు. ఫలితంగా మరోసారి పగ్గాలు బుమ్రా చేతికి వచ్చాయి. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించేందుకు అతడు గట్టిగానే శ్రమించాడు.పేస్ దళ భారాన్ని మొత్తం తానే మోశాడు. ఈ క్రమంలో వెన్నునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చి మరీ బరిలోకి దిగాడు. అయినప్పటికీ సిడ్నీలో ఓటమిపాలైన టీమిండియా 1-3తో ఓటమిపాలై.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆసీస్‌కు చేజార్చుకుంది. అయితే, జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా బుమ్రాకు మాత్రం ఈ టూర్లో మంచి మార్కులే పడ్డాయి. ఐదు టెస్టుల్లో కలిపి మొత్తం 32 వికెట్లు పడగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.నాయకుడిగా మంచి పేరుఈ పరిణామాల నేపథ్యంలో సునిల్ గావస్కర్ బుమ్రాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!.. నా అభిప్రాయం ప్రకారం కచ్చితంగా అతడే పగ్గాలు చేపడతాడు. జట్టును ముందుండి నడిపించడంలో బుమ్రా తనకంటూ ప్రత్యేకశైలిని ఏర్పరచుకున్నాడు.నాయకుడిగా అతడికి మంచి పేరు వచ్చింది. సారథిగా ఉన్నా సహచర ఆటగాళ్లపై ఒత్తిడి పెంచేరకం కాదు. కొన్నిసార్లు కెప్టెన్లు తామే ఒత్తిడిలో కూరుకుపోయి.. పక్కవాళ్లనూ అందులోకి నెట్టేస్తారు. కానీ బుమ్రా ఏ దశలోనూ అలా చేయలేదు. తనపని తాను చేసుకుంటూనే.. జట్టులో ఎవరి విధి ఏమిటో అర్థమయ్యేలా చక్కగా తెలియజెప్పాడు.నిజంగా అతడొక అద్భుతంఈ క్రమంలో ఎవరిపైనా అతడు ఒత్తిడి పెట్టలేదు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను డీల్ చేసిన విధానం బాగుంది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తూనే.. సహచరులకు అన్ని వేళలా మార్గదర్శనం చేశాడు. నిజంగా అతడొక అద్భుతం. అందుకే టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే అని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని గావస్కర్ 7క్రికెట్‌తో పేర్కొన్నాడు.కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, గాయం కారణంగా బుమ్రా ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.చదవండి: ‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’